ప్రాంతీయ అసమానతలు` పరిణామాలు

ప్రాంతీయ అసమానతలు,ప్రాంతీయ వాదం విడదీయ లేని కవల పిల్లలు.నాయకులు తమ రాజకీయ ఉనికి లేక అవసరార్థం ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించుతూ మరోవైపు ప్రజ ల్లో తలెత్తుతున్న అసంతృప్తిని భావోద్వేగాలకు ఉపయోగించు కొంటున్నారు.అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగడా నికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్రాధినేత లూ ఇందుకు తీసిపోలేదు. దేశంలో తరచుగా రాష్ట్రాధినేతలు ఇతర అభివద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రం పురోగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు అవసరమని కేంద్రా న్ని కోరుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా… అదే రాష్ట్రానికి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లా లతో సమానంగా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఒక్కపైసా అదనంగా విదల్చక పోవడమే నేటి విషాదం.
మనదేశంలో కొన్ని రాష్ట్రాలు అభి వృద్ధి చెందితే మరికొన్ని వెనకబడి వున్నాయి. ఒకే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది మరికొన్ని వెనకబడిఉన్నాయి.భారతదేశ అభి వృద్ధి సమైక్యతకు మూలాధారం సంతులిత ప్రాం తీయాభివృద్ధి. అందుకే ప్రణాళిక రూపకర్తలు ప్రణాళికాలక్ష్యాల్లో సంతులిత ప్రాంతీయాభి వృద్ధిని ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు.
కారణాలు..
సహజసిద్ధ అంశాలు
చారిత్రక అంశాలు
సహజ వనరులు
ప్రభుత్వ విధానం
కేంద్ర ప్రభుత్వ మూలధన పెట్టుబడి
ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర
పాలనా వ్యవస్థ
హరిత విప్లవం
అసమానతలు-కొలమానాలు
1) రాష్ట్ర తలసరి ఆదాయం 2) పేదరిక స్థాయి 3) మానవ అభివృద్ధి సూచిక 4) పారిశ్రామిక-ఉద్యోగిత 5) సహజ వనరుల లభ్యత, నీటి పారుదల సౌకర్యాలు 6)పట్టణీకరణ,7) విద్యు చ్ఛక్తి వినియోగం 8) బ్యాంకు డిపాజిట్లు
పారిశ్రామికాభివృద్ధి-ఉద్యోగిత మన దేశంలో పారిశ్రామికాభివృద్ధిలో తీవ్రమైన అసమానతలున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం తర్వాత పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. పారిశ్రామిక స్థిర మూలధనంలో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర,గుజరాత్‌ల్లో 34. 60%,పశ్చిమబెంగాల్‌24.65%అనగా 59.25% కలిగి ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు 63.03% ఉద్యోగిత,63.95%పారిశ్రామి కోత్ప త్తి కలిగిఉండటం తీవ్రమైన అసమానత లను తెలియజేస్తుంది. సహజ వనరుల లభ్యత,నీటి పారుదల సౌకర్యాలు పంజాబ్‌,హర్యానామొదలైనరాష్ట్రాల్లో నీటి పారుదల సౌకర్యాలు,సహజ వనరులు ఎక్కువ గా అందు బాటులో ఉండటం వలన వ్యవసా యం అభివృద్ధి చెందింది.ఆంధ్రప్రదేశ్‌,ఉత్తరప్ర దేశ్‌ల్లో కొన్ని ప్రాం తాల్లో కూడా వ్యవసాయం అభివృద్ధి చెందింది.
పట్టణీకరణ
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పట్టణీ కరణ జరిగి పట్టణ జనాభా ఎక్కువగా ఉంటు న్నది.జాతీయస్థాయిపట్టణ జనాభా31.2% కాగాతమిళనాడు(48.4%),మహరాష్ట్ర(45. 2%),గుజరాత్‌(42.6%),కర్ణాటక (38. 6%), పంజాబ్‌ (37.5%)మొదలైన రాష్ట్రాల్లో పట్టణ జనాభా ఎక్కువగా ఉంది.బీహార్‌ (11.3%), అసోం(14.1%)ఒడిశా (16.7%), ఉత్తరప్రదేశ్‌ (22.3%) వంటి రాష్ట్రాల్లో పట్టణజనాభా తక్కువ గా ఉంది.
విద్యుచ్ఛక్తి వినియోగం
తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం ప్రాం తీయ అసమానతలను తెలియ జేస్తుంది. 2009-10 గణాంకాల ప్రకారం జాతీయ స్థాయి తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం121.2కిలో వాట్లుకాగా ఢల్లీి 508.8,పంజాబ్‌257.3,తమిళనాడు 208.5కిలో వాట్లు ఉండగా బీహార్‌లో20.5,ఉత్తరప్రదేశ్‌ 83.4,మధ్యపదేశ్‌73.4కిలోవాట్లు మాత్రమేఉంది.
వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు
జాతీయస్థాయిలో తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు 2011మార్చి నాటికి రూ. 33,174వుండగాఢల్లీి రూ.2,85,400, మహ రాష్ట్ర రూ.82,380 కలిగి ఉండగా బీహార్‌ రూ. 9,667,అసోంరూ.16,393 తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు కలిగి ఉన్నాయి.
ప్రాంతీయ అసమానతలు -ప్రణాళికలు
దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులు మళ్లించడానికి వీలుగా ఆప్రాంతాల్లో సంస్థలు స్థాపించే పెట్టు బడిదారులకు తగిన ప్రోత్సాహకాలను కల్పించ డమే గాకుండా అవస్థాపనా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం,నీటివసతి,నైపుణ్యంగల శ్రామి కుల లభ్యత మొదలైన సౌకర్యాలను అందు బాటులోనికి తేవలసి ఉంటుంది. ఇందుకు ప్రభు త్వం అనేక కార్యక్రమాలను చేపట్టాలి. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతల గురించిన ప్రస్తాన లేనప్పటికీ,రెండో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాంతీయ అసమానతల తగ్గింపు అవస రాన్ని గుర్తించినారు. ఇందులో వెనుకబడిన ప్రాం తాల్లో పెట్టుబడులు కొనసాగించి సంతులిత ప్రాంతీయాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. మూడో పంచవర్ష ప్రణాలికలో సంతులిత ప్రాంతీ యాభివృద్ధి కొరకు 9 వఅధ్యాయాన్ని ప్రత్యేకంగా పేర్కొనారు.నాలుగో పంచవర్ష ప్రణాళికలో గ్రామీ ణ పేదలకు ప్రయోజనం చేకూర్చడానికి వీలుగా మొద లైన కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు.ఐదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగిం చడం కోసం నాలుగో పంచవర్ష ప్రణాళిక లోని కార్యక్రమాలని కొనసాగించినారు. ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగించ డానికి సమగ్ర విధానాన్ని రూపొందించారు. ఇం దులో భాగంగా ప్రాంతీయ ప్రణాళికలు,ఉప ప్రణాళి కలను అమలుచేసి జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానం చేశారు. ఏడో పంచ వర్ష ప్రణాళికలో ప్రాంతీయ అభివృద్ధి స్థాయికి రెండు అంశాలను గుర్తించినారు.1)వ్యవసాయ ఉత్పా దకత,మానవ వనరుల సామర్థ్యం పెంపు2) ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించడం. వీటికి అనుగుణంగా కార్యక్రమాలను రూపకల్పన చేయ డం.ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రణాళికా వ్యూహం సూచనాత్మక ప్రణాళికకు (Iఅసఱషa్‌ఱఙవ ూశ్రీaఅఅఱఅస్త్ర) మారడం మూలాన ప్రాం తీయ అసమానతల తగ్గింపునకు చూపే చొరవ తగ్గిన ప్పటికీ దీని కొరకు కొన్ని ప్రత్యేక కార్యక్రమా లను అమలు చేశారు. తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో ప్రాంతీయ అసమా నతలను తొలగించడానికి ప్రయివేటు పెట్టుబడులు దోహదపడలేదని కనుక తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ పెట్టుబడుల అవసరమని పేర్కొన్నారు. పదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయాభివృద్ధి కోసం రాష్ట్రాలవారీగా వృద్ధి లక్ష్యాలను నిర్ణయిం చారు.పదకొండో పంచవర్ష ప్రణాళికలో వెనుక బడిన ప్రాంతాల కొరకు ఏర్పాటు చేశారు. పన్నెండో పంచవర్ష ప్రణాళికలో నిధుల వినియోగం కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొం దించారు.పారిశ్రామికంగా అభివృద్ధి చెందని ప్రాం తాల్లో,వ్యవసాయం,దాని అనుబంధ పరిశ్ర మలలో, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కార్యక్ర మాల్లో నిధులను వినియోగించాలని పేర్కొన్నారు.
వెనుకబడిన ప్రాంతాలు – అసమానతలు!
ప్రాంతీయ అసమానతలు,ప్రాంతీయ వాదం విడదీయ లేని కవల పిల్లలు.నాయకులు తమ రాజకీయ ఉనికి లేక అవసరార్థం ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించుతూ మరోవైపు ప్రజ ల్లో తలెత్తుతున్న అసంతృప్తిని భావోద్వేగాలకుఉప యోగించుకొంటున్నారు.అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగడా నికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్రాధినేత లూ ఇందుకు తీసిపోలేదు. దేశంలో తరచుగా రాష్ట్రాధినేతలు ఇతర అభివద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రం పురోగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు అవసరమని కేంద్రా న్ని కోరుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా… అదే రాష్ట్రానికి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లా లతో సమానంగా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఒక్కపైసా అదనంగా విదల్చక పోవడమే నేటి విషాదం.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46(3)లో రాయలసీమ ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పొందు పర్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2014ఫిబ్రవరి 20వ తేదీ రాజ్య సభలో మాట్లాడుతూ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లా లకు బోలంగీర్‌ కలహండి తరహాలో ప్రత్యేక ప్యాకే జీ ఇస్తామన్నారు.కాగామధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌లో వ్యాపించివున్న బుందేల్‌ ఖండ్‌ తరహాలో ఈప్యాకేజీ వుంటుందన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభు త్వం రూ.24,350 కోట్లతో ప్రతిపాదన లు కేంద్రా నికి పంపితే ముష్టిగా జిల్లాకు రూ.50 కోట్లుచొప్పున మూడేళ్లు ఇచ్చి తర్వాత ఎగ్గొట్టారు. ఇప్పటికీ సవా లక్ష కొర్రీలు వేస్తున్నారు. విభజన చట్టం సెక్షన్‌ 94 (3)మేరకు వెనుక బడిన జిల్లాల్లో భౌతిక సామాజిక వనరులు అభివృద్ధి చేయాలి.ఈచట్ట బద్దహక్కులు హుష్‌ కాకి అయ్యాయి.ఇక ప్రత్యేక హోదా వుండనే వుంది. నాణేనికి ఇది ఒకవైపు అయితే మరో వైపు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల ఫలితంగా ప్రజల్లో నివురు గప్పిన నిప్పులాగా వున్న అసంతృప్తిని కొందరు నేతలు తమ రాజకీయ అవసరార్థం ఉపయోగించు కొంటున్నారు. వాస్తవంలో ఆయా వెనుకబడిన ప్రాంతాల భౌతిక పరిస్థితులు ప్రజల అవసరాలు వీటితో పాటు వారి వాంఛలు ఆధారం చేసుకొని ప్రత్యేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయా లి.కాని ఆదిశగా చర్యలు లేక పోవడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు గాని రాయలసీమలో కొందరు నేతలే కాకుం డా ప్రత్యేకిం చి ఒకసెక్షన్‌ యువత వేర్పాటు వాదం తెర మీదకు తెస్తున్నది. ఉత్తరాంధ్రలో విస్తారమైన సముద్ర తీరం వున్నందున పైగా విశాఖలో నౌకాదళం కేంద్రం వున్నందున మిగతా జిల్లాలతో పోల్చుకొంటే విశాఖ జిల్లా కొంత మెరుగ్గా వుంది. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా వున్నప్పుడే వైయస్‌ రాజశేఖర రెడ్డి హ యాంలోఉత్తరాంధ్ర సుజల స్రవంతిరూపుద్దు కున్నది. ఈ పథకం అమలు జరిగితే ఉత్తరాంధ్రలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు 30లక్షల మందికి తాగునీటి వసతి ఏర్పడుతుంది. విజయ నగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు శ్రీకాకుళం జిల్లాలో0.85లక్షల ఎకరాలకు సాగునీరు అందు తుంది. ఈ మూడేళ్ల కాలంలో ఎప్పుడైనా మంత్రు లు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావులు ఈ పథకం అమలు జరగలేదని మంత్రి పదవులకు రాజీనామాకు సిద్ధమై వుంటే వీరి చిత్తశుద్ధి శంకించ లేము. కాని భావోద్వేగాలతో ప్రజల్ని రెచ్చగొట్టేం దుకు మంత్రి పదవులు త్యాగం చేస్తామంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి అనుసం ధానం ఏళ్ల కొద్దీ ఎందుకు నానుతుంది? వంశధా రపై నెరెడి బ్యారేజీ నిర్మాణంగుర్తు వుందా? వ్యవ సాయంపై ఆధారపడే లక్షలాది మంది ఉత్తరాంధ్ర రైతులకు సాగునీరు కావాలా?ఇవేవీ లేకుండా పరిపాలన రాజధాని కావాలా?పోలవరం ప్రాజెక్టు నుండి విశాఖ తాగునీటికి23.99 టియం సిలు నీరు కేటాయించారు. పోలవరం గాలిలో దీప మైంది!
రాయలసీమ పరిస్థితి మరీ దుర్భరంగా వుంది.ఈ ప్రాంతంలో విస్తారమైన బీడు భూములు న్నాయి. ఎక్కువ భాగం వర్షాధార పంటలైనందున మొత్తంగా నీళ్లు,నీళ్లు అని ప్రజలు తుదకు తాగు నీటికి తపిస్తుంటారు. ఈ ఏడు విస్తారంగా వర్షాలు పడ్డాయి. కాని గ్రామాల్లో ఉపాధి లేక గ్రామాలకు గ్రామాల ప్రజలు వలసలు పోతున్నారు. మరీ దారుణమేమంటే కెసి కెనాల్‌ కింద ఆయకట్టులో పెట్టిన పంటలకు నీళ్లు అందే అవకాశం లేదని నేడు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాటికే హంద్రీనీవా కింద కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం లో పంటలు ఎండిపోయాయి.
బచావత్‌ ట్రిబ్యునల్‌ కెసి కెనాల్‌కు తుంగభద్ర నుండి39.9టియంసిలు నీరు కేటాయిం చినది. దురదృష్టం ఏమంటే దశాబ్దాలు గడుస్తున్నా 2.65 లక్షల ఎకరాలు ఆయకట్టుగల కెసి కెనాల్‌ కు 1.25 టియంసిలు సామర్థ్యం గల సుంకేసుల బ్యారేజీ తప్ప నీళ్లు నిల్వ చేసే వసతి లేదు.2.965 టియంసిలు నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అలగ నూరు రిజర్వాయర్‌ లో నీరు నిల్వ చేసే అవకాశం లేక పశువుల మేత పొరంబోకుగా వుంది. బచా వత్‌ ట్రిబ్యునల్‌గాని బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గాని సుంకేసులబ్యారేజీ నుండి(21ం10) టియం సిల నీరు మాత్రమే శ్రీశైలం జలాశయం చేరు తుందని తేల్చారు. కాని ఏటా వందల టియంసిలు కలుస్తున్నాయి. ట్రిబ్యునల్‌ కేటాయింపులు అరకొరగా వున్నా చట్టబద్దతగల నీళ్లువర్షపు నీరునిల్వ చేసుకొనే ఏర్పాట్లు జరిగి వుంటే రాయలసీమలో కొంతలో కొంత నీటి కొరత తీరేది.కెసి కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన గుండ్రేవుల రిజర్వాయర్‌ హుళక్కి అయింది. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం న్యాయ రాజధాని రెండు పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి రాయలసీమను కోనసీమ చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం కోర్టు వివాదంలో చిక్కుకున్నది. న్యాయ రాజధాని కాదు కదా తుదకు కృష్ణ యాజ మాన్య బోర్డు కార్యాలయం గతి లేకపోయింది. ఈ మధ్య సీమ రైతులు రోడెక్కి సిద్దేశ్వరం కోసం పోరాటం మొదలు పెట్టారు. దురదృష్టమేమంటే రాయలసీమలో చిన్న కాలువ తవ్వాలన్నా తెలం గాణ ఇంజనీరింగ్‌ చీఫ్‌ యాజమాన్యం బోర్డుకు రేఖరాసి అడ్డుకొంటున్నారు. ఇరువురు ముఖ్య మంత్రులు బాగానే వున్నా (చంద్రబాబుతో పోల్చితే) రెండు రాష్ట్రాల మధ్యగల అంతర్‌ రాష్ట్ర జల వివాదాలు సామరస్యంగా పరిష్కారానికి కృషి జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోం ది. కాగా గత ప్రభుత్వం ఏంచేసింది అనేది పక్కన పెడితే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మూడేళ్ల కాలం లో సాగునీటి రంగంలో 19 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిందంటే ఇందులో వెనుక బడిన ప్రాం తాల భాగం అతి స్వల్పమే. రాష్ట్రంలో వెనుకబడిన ఈ రెండు ప్రాంతాల్లో పరిస్థితులు దుర్భరంగా వున్నాయి. ప్రాంతీయ అసమానతలు నెలకొన్నాయి. అవేవీ పట్టించుకోకుండా పరిష్కార మార్గాలు చూడ కుండా పాలకులు కాలం వెళ్లదీస్తే కుదరదు. -వ్యాసకర్త : విశ్రాంత పాత్రికేయులు- (వి.శంకరయ్య)

ఎస్టీలను అధికారికంగా గుర్తించిన ఆర్టికల్‌ ఏదీ?

దేశంలో ఎస్టీలు ఆర్థికంగా దోపిడీకి గురైన వర్గం. అందువల్ల వీరి సంక్షేమంలో ఆర్థిక పరమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుం ది.2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా…షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం.సమాజం విసిరే సవాళ్లను అధిగమించడానికిగాను ప్రభుత్వం అవలంబించే విధానాన్ని సామాజిక విధానం అంటారు. ప్రభుత్వాల అంతిమ లక్ష్యం అణగారిన వర్గాల అభ్యున్నతి. అందువల్ల ప్రభుత్వాలు అణగారిన వర్గాల కోసం ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలుచేస్తున్నాయి. చారిత్రకంగా పరిశీలిస్తే యూరప్‌లో సంభవించిన పారిశ్రామిక, ఫ్రెంచ్‌ విప్లవం,అమెరికాలో ఏర్పడిన మహా ఆర్థిక మాంద్యం ఫలితంగా దేశ ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వాలు బలమైన శక్తిగా అవతరించాయి. ప్రభుత్వాలు ఆర్థిక లక్ష్యాలతోపాటు సామాజిక న్యాయం,సమానత్వం, సాధికారత వంటి సామాజిక లక్ష్యాలను రూపొందించుకొని అమలుచేస్తున్నాయి. 1834లో ఇంగ్లండ్‌లో రూపొందించిన పూర్‌ లా సంక్షేమ యంత్రాంగానికి ఆధారంగా నిలిచింది. ఐరోపాలో ఉదయించిన సంక్షేమ రాజ్య భావన క్రమంగా భారత్‌తో సహా అన్ని దేశాలకు విస్తరించింది. 1950వ దశాబ్దంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ప్రాంతాల్లో ఏర్పడిన తృతీయ ప్రపంచ దేశాలు సంక్షేమ రాజ్యాన్ని నిర్మించుకున్నాయి. ఇందులో భారతదేశం కూడా ఒకటి కావడం విశేషం. దేశంలో సంక్షేమ యంత్రాంగానికి మూలం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలుషెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం భారతీయ సామాజిక చరిత్రలో సామాజిక దోపిడీకి గురైన షెడ్యూల్డ్‌ కులాలను స్వాతంత్య్రానంతరం సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రక్షించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో 16.6 శాతం జనాభాను కలిగి ఉన్న షెడ్యూల్డ్‌ కులాలను 1108 రకాల పేర్లతో పిలుస్తున్నారు. భారత ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమాన్ని మూడు మార్గాల ద్వారా కొనసాగిస్తున్నది.

  1. రాజ్యాంగ రక్షణలు
  2. విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు
  3. ఆర్థిక సహాయం అందించడం
    రాజ్యాంగ రక్షణలు
    ఆర్టికల్‌-14: చట్టం ముందు అందరూ సమానులే. సమన్యాయ పాలన అంటే షెడ్యూల్డ్‌ కులాలపరంగా సమాజం, ప్రభు త్వం సామాజిక సమానత్వం, భాగస్వామ్యం కల్పించాలి. ఆర్టికల్‌-15(4): ప్రభుత్వ అవకాశాలపరంగా ముఖ్యంగా సామాజిక, విద్య, ఆర్థికాంశాల పరంగా షెడ్యూల్డ్‌ కులాలకు ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించవచ్చు. ఆర్టికల్‌-16 (4): ఉద్యోగాలు, ఇతర సర్వీసులలో షెడ్యూల్డ్‌ కులాలకు సరైన భాగస్వామ్యం లేనప్పుడు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు.
    ఆర్టికల్‌-17: అంటరానితనం నిషేధం
    ఆర్టికల్‌-23: వెట్టిచాకిరీ, కట్టు బానిసత్వం, జోగిని, దేవదాసీ మనుషుల అక్రమ రవాణా నిషేధం
    ఆర్టికల్‌-24: బాలకార్మిక వ్యవస్థ నిషేధం
    ఆర్టికల్‌-46: షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర బలహీనవర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఆర్టికల్‌-330: లోక్‌సభలో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్‌ ఆర్టికల్‌-332: శాసనసభల్లో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్‌ ఆర్టికల్‌-338: ఎస్సీ,ఎస్టీల రాజ్యాంగ రక్షణల అమలుతీరును, వారి సంక్షేమాన్ని సమీక్షించేందుకుగాను ప్రత్యేక కమిషన్ల ఏర్పాటు్ఆర్టికల్‌-341: 1950లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల గుర్తింపు
    షెడ్యూల్డ్‌ కులాలకు విద్య,ఉపాధిపరంగా రిజర్వేషన్లను కల్పించటం,వారి విద్యా భివృద్ధికి ఉపకారవేతనాలు,హాస్టల్‌ వసతులు,పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణను అందిస్తున్నారు.
    ఎస్సీలకు ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో ఆరో పంచవర్ష ప్రణాళికలో స్పెషల్‌ కంటెంట్‌ ప్లాన్‌ను ప్రారంభించారు. చిన్న,సన్నకారు దళిత రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఆదాయ మార్గాలను పెంచుతారు.
    ఎస్సీలకు ఆర్థిక సహాయాన్ని అందించి వారు స్వయం ఉపాధిమార్గాలను ఎంచుకొనే ఉద్దేశంతో 1989లో జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.
    ప్రస్తుతం ఎస్సీలకు సంబంధించిన పరిపాలన,యంత్రాంగం సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్నది.
    స్వాతంత్య్రానంతరం భారతదేశంలో సంక్షేమ కార్యక్రమా లు 1952 నుంచి 1985 వరకు హోంశాఖ ఆధ్వర్యంలో కొనసాగాయి.
    1985లో సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు.
    1998లో దాని పేరును సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వ శాఖగా మార్చారు.
    గిరిజన సంక్షేమం
    దేశంలో ఎస్టీలు ఆర్థికంగా దోపిడీకి గురైన వర్గం. అందువల్ల వీరి సంక్షేమంలో ఆర్థికప రమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. 2011జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా 8.6 శాతం.
    -దేశంలో అధికారికంగా 744 తెగలను గుర్తించారు. వీటిలో భిల్లులు,గోండ్‌, సంతాల్‌ తెగలకు చెందినవారు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నారు. దేశంలో ఎస్టీల సంక్షేమానికి మూడు మార్గాలను అవలం బిస్తున్నారు.
  4. రాజ్యాంగ రక్షణలు
  5. విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు
  6. ఆర్థిక సహాయం అందించడం
    । ఎస్సీల సంక్షేమానికి సంబంధించిరాజ్యాంగ రక్షణలోని 17,341 ఆర్టికల్స్‌ తప్ప మిగ తావి ఎస్టీలకూ రక్షణగాఉంటాయి.
    । ఆర్టికల్‌-19(5): గిరిజనుల ఆస్తుల రక్షణ
    । ఆర్టికల్‌-164: జార్ఖండ్‌, ఒడిశా, మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమానికి సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
    । ఆర్టికల్‌-244: ప్రత్యేక ప్రాంతాల పరి పాలన కోసం5,6 షెడ్యూళ్లను ఏర్పాటు చేశారు.
    । ఆరో షెడ్యూల్‌ ప్రకారం అసోం, మేఘాలయ,మిజోరం,త్రిపుర రాష్ట్రాల్లో గిరిజన పరిపాలన వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఆరో షెడ్యూల్‌లోని రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అంశాలను ఐదో షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
    । ఐదో షెడ్యూల్‌ పరిపాలనను గవర్నర్‌ నియంత్రణలో ఉంచుతుంది.
    । ఆర్టికల్‌-342: షెడ్యూల్డ్‌ తెగలను అధికారికంగా గుర్తించారు.
    । 1999లో కేంద్రంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు.
    । ఐదో ప్రణాళికలో గిరిజన ఉప ప్రణాళికను రూపొందించారు.
    । గిరిజన ఉప ప్రణాళిక ప్రకారం గిరిజన ప్రాంతాల పరిపాలన,అభివృద్ధికి నాలుగు మార్గాలను ఎంచుకున్నారు.
    । నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉన్న మొత్తం జనాభాలో గిరిజన జనాభా 50శాతం. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 194.
    । 10 వేలు లేదా అంతకంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో మాడా ప్రాజెక్టులనుఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 259.
    । 5 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో గిరిజన జనాభా 50శాతంపైబడి ఉన్న ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య-82
    । గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన తెగలను గుర్తించి వాటిని అభివృద్ధి చెందించే ఉద్దేశంతో ప్రాచీన గిరిజన సముదాయ ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రస్తుతం వీటి సంఖ్య 75.
    । గిరిజనులకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థ ఉన్నందువల్ల వాటిస్థానంలో స్థానిక ప్రభు త్వాలను ఏర్పాటుచేసే ఉద్దే శంతో 1996లో పెసా (ూaఅషష్ట్రa వa్‌ష్ట్రఱ జుఞ్‌వఅంఱశీఅ ూషష్ట్రవసబశ్రీవస Aష్‌)ను రూపొందించారు.
    । గిరిజనుల అటవీ ఉత్పత్తులకు సరైన ధర, మార్కెటింగ్‌ సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 1987లో గిరిజన సహకార మార్కెటింగ్‌ అభివృద్ధి సమాఖ్యను ఏర్పాటుచేశారు.
    । ఎస్టీలకు ఆర్థిక సహాయాన్ని అందించి స్వయం ఉపాధి ద్వారా వారి ఆదాయమార్గాలను పెంచే లక్ష్యంతో 2001లో జాతీయ షెడ్యూల్డ్‌ తెగల ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.
    వెనుకబడిన తరగతుల సంక్షేమం
    । భారతీయ సామాజిక నిర్మాణంలో అగ్ర వర్ణాలకు, అస్పృశ్యులకు మధ్యస్థంగా ఉన్న మధ్య తరగతి వర్గాలను వెనుకబడిన తరగతులుగా గుర్తిస్తారు.
    । ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలు కూడా ప్రాచీన కాలం నుంచి సామాజికంగా, ఆర్థికంగా దోపిడీకి గురయ్యారు.
    । భారత రాజ్యాంగ రూపకల్పన దశలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని వీరికోసం ప్రత్యేకంగా రాజ్యాంగ నిబంధనలను రూపొందించారు.
    । రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 340లో వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన చర్యలను
    । సమీక్షించేందుకుగాను రాష్ట్రపతి ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది.
    । దీని ప్రకారం జాతీయస్థాయిలో రెండు కమిషన్లను ఏర్పాటుచేశారు.
    । 1.1953లో కాకా సాహెబ్‌ కాలేల్కర్‌ కమిషన్‌
    । 2.1978లో బీపీ మండల్‌ కమిషన్‌
    । కాలేల్కర్‌ కమిషన్‌: ఇది 1953 జనవరిలో ఏర్పాటయ్యింది.
    । కమిషన్‌ ప్రధాన విధి ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర వర్గాలకు చెందిన ప్రజల విద్యాపరమైన, సామాజికపరమైన వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రమాణాలను నిర్ణయించడం.
    । వీటి ఆధారంగా వెనుకబడిన తరగతుల జాబితాను గుర్తించడం
    । ఈ కమిషన్‌ సామాజిక అంతస్తు, కుల క్రమశ్రేణి ఆధారంగా 2700 కులాలతో కూడిన జాబితాను తయారుచేసి 1955లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
    । ఈ కమిషన్‌ మహిళలను కూడా బీసీలుగా గుర్తించింది.
    । ఈ కమిషన్‌ తన నివేదికను 1956లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే వివిధ కారణాల వల్ల ఇది ఆమోదం పొందలేదు. -జిఎన్‌వి సతీష్‌

రాజ్యాంగమే సర్వోన్నతం

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 73 ఏళ్లు పూర్తయి, 74వ సంవ త్సరంలోకి అడుగు పెడుతున్నది. ఈ సమ యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నవారు, రాజ్యాంగ పదవులలో ఉన్న ఉపరాష్ట్రపతి, గవర్నర్లు వంటి వారు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపం,లక్ష్యాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు.2014లో నరేంద్రమోడీ అధికా రంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు, మూడు వ్యవసాయ చట్టాలు, జాతీయ విద్యావిధానం-2020 మొదలైనవన్నీ రాజ్యాంగవిరుద్ధమే. రాష్ట్రాలతో సంప్రదిం చటంగానీ,చర్చించటంగాని చేయకుం డానే ఈ విధానాలను అమలు చేయటం, చట్టాలు చేయటం వంటి వాటికి కేంద్రం పాల్పడిరది. ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. ప్రాథమిక హక్కులలో ప్రధానమైన స్వాతంత్య్రపు హక్కును హరిస్తూ ‘భావప్రకట నా స్వేచ్ఛ’ను అణచివేస్తున్నది. అనేకమందిని ‘ఉపా’ చట్టం కింద అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఢల్లీిలో గల జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ,ఢల్లీియూనివర్శిటీల్లో జరుగు తున్న సంఘటనలు రాజ్యాంగ హక్కుల హరణ కు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ నేపథ్యంలో సర్వోన్న తమైన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రజాస్వామ్య శక్తులపై ఉన్నది.
ఇటీవల జైపూర్‌లో జరిగిన83వ అఖి ల భారత స్పీకర్ల సమావేశంలో ఉపరాష్ట్రపతి జగ దీప్‌ ధన్‌కర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజ లు ఎన్నుకున్న పార్లమెంట్‌ ఆధిక్యత కలిగి ఉం డాలని,పార్లమెంటరీ సార్వభౌమాధికారం ఉండా లని వాదన చేశారు.ఇదిరాజ్యాంగ సూత్రాలకు పూర్తి విరుద్ధం. ఆధునిక ప్రజాస్వామ్యాలు ప్రారంభ మైన తరువాత ఫ్రెంచ్‌ న్యాయ నిపుణుడు మాంటెస్క్యూ ‘ది స్పిరిట్‌ ఆఫ్‌ లాస్‌’అనే గ్రంథాన్ని రాశారు. ప్రభు త్వ అంగాలైన శాసన వ్యవస్థ (లెజిస్లేచర్‌), కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్‌), న్యాయ వ్యవస్థ (జ్యుడిషియరీ)-మూడు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయించరాదని, ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని విజయ వంతంచేయాలని దానిలో చెప్పారు. అమెరికా రాజ్యాంగంలో మాంటిస్క్యూ ప్రతిపాదించిన ‘అధి కార పృథక్కరణ’ సిద్ధాంతాన్ని ‘చెక్స్‌ అండ్‌ బాలె న్సస్‌’పేరుతో అమలు చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు డాపపఅంబేద్కర్‌ నాయకత్వాన రాజ్యాం గంలో ప్రభుత్వ అంగాలు మూడిరటి మధ్య ఆధిప త్యం ఉండరాదని భావించారు. ఈమూడు వ్యవస్థలు తాను విధించిన పరిధిలోనే పనిచేయాలని రాజ్యాం గం స్పష్టం చేసింది.కేంద్ర న్యాయశాఖా మంత్రి తో సహా అనేకమంది అధికార పార్టీ ప్రముఖు లు న్యాయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవా లనే వాదనలు చేస్తున్నారు.
న్యాయ సమీక్షాధికారం
అమెరికన్‌ సుప్రీంకోర్టు 1803లో తొలిసారిగా మాడిసన్‌ వర్సెస్‌ మార్బరీ కేసులో తొలిసారిగా న్యాయవ్యవస్థకు న్యాయ సమీక్షాది óకారం ఉందని ప్రకటించింది. న్యాయ సమీక్షాధి కారాన్ని ‘జ్యుడిషియల్‌ రివ్యూ’ అంటారు. న్యాయ సమీక్షాధికారం అనగా ‘పార్లమెంట్‌ చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా (అల్ట్రా వైర్స్‌) ఉంటే అవి చెల్లవు (నల్‌ అండ్‌ వాయిడ్‌) అని ప్రకటించటం. న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ పరిరక్షణకు, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు తోడ్పడుతుంది. భారత రాజ్యాంగంలో 13వ నిబంధన భారత న్యాయ వ్యవస్థకుగల న్యాయ సమీక్షాధికారాన్ని వివరిం చింది.గత73ఏళ్లలో పార్లమెంట్‌ చేసిన అనేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను భారత సుప్రీం కోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించు కొని కొట్టివేసింది.1952లో వి.జి.రావు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసులో సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ పతంజలి శాస్త్రి ‘న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం తమపై పెట్టిన బాధ్యతను న్యాయస్థానాలు నెరవేర్చడమే తప్ప పార్ల మెంట్‌పై తమదే పైచేయి అని నిరూపించు కోవడానికి కాదని స్పష్టం చేశారు.న్యాయ సమీక్షాధికారంలో భాగంగా జస్టిస్‌ వి.ఆర్‌. కృష్ణయ్యర్‌, జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి, జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి, జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ మొదలైన న్యాయమూర్తులు అత్యున్నతమైన తీర్పులు ఇచ్చారు.
కేశవానంద భారతి కేసు-మౌలిక స్వరూపం
2023 జనవరి 7వ తేదీన రాజ్యసభ సమావేశాలలోను, ఇటీవల జైపూర్‌లో జరిగిన 83వ భారత శాసనసభల స్పీకర్ల సమావేశంలోను ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌…భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంపై కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 1973లో ఇచ్చిన తీర్పుతో తాను ఏకభ వించడంలేదని విపరీత వాదన చేశారు. పార్లమెం ట్‌ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు, హైకోర్టులు సమీక్షించి ఆచట్టాలనురద్దుచేస్తే ప్రజాభిప్రా యాన్ని, పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని తిరస్కరించి నట్లని ఆయన భాష్యం చెప్పారు.
పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరణచేసే అధికారం లేదని 1967లో గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.దీనికి భిన్నంగా 1973లో కేశవా నంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు…రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చ కుండా సవరణ చేయవచ్చని తీర్పు చెప్పినది. ఈ తీర్పు 368వనిబంధన కింద రాజ్యాంగాన్ని సవరిం చడానికి పార్లమెంట్‌కు గల అధికారాలపై పరిమితి విధించింది.పార్లమెంట్‌లో మెజారిటీ ఉందనే కార ణంతో నిరంకుశంగా రాజ్యాంగాన్ని సవరించే ధోర ణిని అరికట్టడానికి, కీలక రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి ఈ తీర్పు దోహద పడుతుందని ఆనాడు న్యాయ నిపుణులు,రాజకీయ పార్టీలు హర్షం వెలిబుచ్చాయి.
కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో(1973)సుప్రీంకోర్టు తీర్పు చారిత్రా త్మకమైనది.ఆ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ‘మౌలిక స్వరూపాన్ని’ (బేసిక్‌ స్ట్రక్చర్‌) వివరించింది. కేసును విచారించటానికి 13 మంది న్యాయమూర్తు లతో ధర్మాసనం ఏర్పడి విచారణ చేసింది. జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌, జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా, జస్టిస్‌ ఎ.ఎన్‌.రే,జస్టిస్‌ సిక్రి,జస్టిస్‌ గ్రోవర్‌వంటి ఉద్దండులు ధర్మాసనంలో ఉన్నారు.రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని మార్చే, సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు లేదని తీర్పు చెప్పారు.రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని నిర్వచించారు. రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం, న్యాయ సమీక్షాధికారం, లౌకిక విధానం, ప్రాథమిక హక్కులు మొదలైనవాటిని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధి కారం ఉన్నది కాని రాజ్యాంగ మౌలిక స్వభావా నికి భంగం కలగని విధంగా మాత్రమే పార్లమెంట్‌ తన అధికారాన్ని వినియోగించాలని ఈకేసు ద్వారా నిర్ధారణ జరిగింది. 1980లో సుప్రీంకోర్టు మినర్వా మిల్స్‌ కేసులో ప్రాథమిక హక్కులు,ఆదేశిక సూత్రాల మధ్య సమతౌల్యత ఉండాలని స్పష్టంగా పేర్కొన్నది. ఇటీవలఉపరాష్ట్రపతితో సహా అనేక మంది బి.జె.పి నాయకులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిరాక రించి,పార్లమెంట్‌ ఆధిక్యత ఉండాలని ప్రచారం చేయటం పూర్తి రాజ్యాంగ విరుద్ధం.
రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్లు
భారతరాజ్యాంగం పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని ప్రవేశపెట్టింది.దీని ప్రకారం కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వానగల మంత్రి మండలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వానగల మంత్రి మండలి నిజమైన అధికారాలు కలిగి ఉంటాయి. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ నామ మాత్ర అధిపతులుగా ఉంటారు. రాజ్యాంగంలో 163వ నిబంధన ప్రకారం మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్‌ వ్యవహరించాలి. కాని కొన్ని సమ యాల్లో గవర్నర్లు కేంద్రానికి,రాష్ట్రాలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించకుండా,కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో రామ్‌లాల్‌,కుముద్‌ బెన్‌జోషి వంటి గవర్నర్లు ఎన్నో వివాదాలు సృష్టించారు.రాష్ట్ర ప్రభు త్వానికి ఇబ్బందులు కల్పించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ హయాంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో గవర్నర్లు ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇటీవల తమిళనాడు గవర్నర్‌ రవి, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న తీరు ఎన్నో విమర్శలకు గురైంది.గతంలో కొన్ని కమిటీలు గవ ర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని సిఫార్సులు చేయగా, కేంద్ర-రాష్ట్రసంబంధాలపై నియమించిన సర్కారి యా కమిషన్‌…గవర్నర్ల పనితీరుపై కొన్ని పరిమితు లు ఉండాలని కొన్ని సూచనలు చేసినది. పార్లమెం టరీ విధానం కొనసాగుతున్న భారత దేశంలో గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి.
రాజ్యాంగం ఉన్నతమైనది
పార్లమెంట్‌లో పాలక పార్టీలకు మెజారిటీ వస్తూ, పోతూ ఉంటుంది.రాజ్యాంగం,దానిస్ఫూర్తి, రాజ్యాంగ విలువలు శాశ్వతంగా ఉంటాయి. పార్ల మెంటు, ప్రభుత్వం,న్యాయ వ్యవస్థ వీటన్నిటి ఉని కికి రాజ్యాంగమే మూలాధారం.ఈ మూడు వ్య వస్థలు తమ,తమ పరిధిలో పనిచేయాలని రాజ్యాం గం స్పష్టం చేసినది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం గత తొమ్మి దేళ్లుగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు చేస్తున్నది. సమాఖ్య విధానం లో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు విభజిం చబడి ఉంటాయి.రాజ్యాంగ 7వషెడ్యూల్‌లో కేంద్ర జాబితా,రాష్ట్ర జాబితా,ఉమ్మడి జాబితా లుగా అధికార విభజన జరిగింది. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండగా రాష్ట్రాలతో సంప్రదించ కుం డానే కేంద్రం మూడు వ్యవసాయచట్టాలు చేయటం తో లక్షలాదిమంది రైతులు సుమారు 400 రోజుల పాటు ఉద్యమం చేయడంతో ఆచట్టాలు ఉపసం హరించుకోక తప్పలేదు. ఇది రైతాంగ ఉద్యమం ఉమ్మడిగా సాధించిన ఘనవిజయం. అలాగే విద్య ఉమ్మడి జాబితాలో ఉండగా,రాష్ట్రాలతో చర్చించ కుండానే కరోనా సమయంలో కేంద్రం జాతీయ విద్యావిధానం-2020 ఏకపక్షంగా ప్రకటించింది. అందువలన తమిళనాడు, కేరళ వంటి ప్రభుత్వాలు దీనిని అమలు చేయటానికి నిరాకరించాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేయకుండా ఉండటానికి కేంద్రం ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో పేర్కొన్న లౌకిక వాదాన్ని,భిన్నత్వాన్ని,బహుళత్వాన్ని దెబ్బతీసి ప్రజల మధ్య మతపరమైన విభజన తేవటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారతరాజ్యాంగ లక్ష్యా లు,విలువలను కాపాడుకోవటానికి రాజ్యాంగ మౌ లిక స్వరూపాన్ని సంరక్షించుకోవటానికి ప్రజాస్వామ్య వాదులు, అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు, ప్రజాసంఘాలు,దళిత,గిరిజన,వెనుకబడిన తరగ తుల సంఘాలు… అందరూ కృషి చేయ వలసిన అవసరాన్ని గణతంత్ర దినోత్సవం గుర్తు చేస్తున్నది. – కె.ఎస్‌.లక్ష్మణరావు

యవ్వ మాట..కోయభాష

కంజాతి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. సదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ఇకపై గిరిజన పాఠశాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ.. లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పించింది.నీ పేరు ఏంటి అనడానికి ‘మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి ‘మీ వాది బాత కూసీరి’, ఇటురా అని పిలవడానికి ‘ఇలావా’ అంటారు. ఇవన్నీ కోయ భాష పదాలు. అతి ప్రాచీన భాషలలో ఇది ఒకటి. మన తెలుగు భాషలాగే ద్రావిడ భాష నుంచి పుట్టింది. అందుకే ‘మన కులతూరు భాష సాయిమంతే..’ అని కోయ తెగవారు మురిసిపోతుంటారు. అంటే మన కోయ భాష మంచిది అని అర్థం..
భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన తెగల్లో కోయ తెగ ప్రధాన మైనది. వీరి భాష,సంస్కృతి,సంప్ర దాయ విధానం భిన్నంగా ఉంటుంది.కోయల భాషలో యాస అనేది స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో కోయ తెగ వాసులు ఎక్కువగా చింతూరు, వి.ఆర్‌.పురం,బుట్టాయగూడెం,పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు,జీలుగుమిల్లి మండలాల్లో ఉన్నారు. కోయలను రెండు విధాలుగా చెప్పుకుంటారు.మొదటి వర్గం దొరల సట్టం(కోయ తెగల్లో ఉన్నతులు-దేవుని వర్గం),రెండో వారు పుట్టదొరలు(నిజమైన దేవుళ్లుగా చెప్పుకుంటారు). గోండుల మాదిరి గానే తమను తాము వారి పరిభాషలో ‘‘కోయతూర్లు’గా చెప్పుకుంటారు. అలాగే కోయలు వారి వృత్తులను బట్టి రాచకోయ, గుమ్మకోయ,కమ్మరకోయ,ముసరకోయ, గంపకోయ,పట్టెడకోయ, వడ్డెకోయలు అనే 7వర్గాలుగా ఉన్నారు. అలాగే కోయలుగా గుర్తింపు పొందిన మరో నాలుగు తెగలు ఉన్నట్టు భాషా పరిశోధ కులు చెప్తున్నారు. డోలు కోయలు,కాక కోయలు, మట్ట కోయలు,లింగకోయలు అనే 4 తెగలను గుర్తించారు. అయితే కోయవారు కోయతూర్‌ భాషలో మాట్లాడతారు. కోయ భాషలో అన్నం తిన్నామా అనడానికి ‘‘దూడ తింతినే,నీ పేరు ఏంటి అనడానికి ‘‘మీ పేదేరు బాత’,మీది ఏమి కూర అని అడగడానికి ‘‘మీ వాది బాత కూసీరి’, నీకు జ్వరం వచ్చిందా అనడానికి ‘‘మీకు ఎరికి వత్తే ‘,ఇటురా అని పిలవడానికి ‘‘ఇలావా’ అని వారి భాషలో ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఒక నాడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే కోయలందరూ మాట్లాడ గలిగినా నేడు కొందరు మాత్రమే ఈ భాషలో మాట్లాడు తున్నారు. మరికొందరు భాష వచ్చినా మాట్లాడ టానికి సిగ్గుపడుతున్నారని ఆ తెగకు చెందిన వారే చెప్తున్నారు. దీనికి కారణం అభివృద్ధి పేరుతో పరుగులు పెట్టడమేనని అంటున్నారు. జిల్లాలో గిరిజనులు సుమారు 97,929 వరకూ ఉండగా వీరిలో 70శాతం కోయ భాషమాట్లాడే వారు ఉన్నారంటూ ఆ తెగకు చెందిన పెద్దలు చెప్తున్నారు.వీరిలో ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 60వేల మంది వరకూ గిరిజనులు నివసిస్తున్నారు.
గోండు అనేది సమాజం కోయతూర్‌? అనేది తెగ
ఒక్క తెలంగాణలో తప్ప దేశవ్యాప్తంగా గోండులు కోయలంతా కోయతూర్‌?లు గానే చెప్పుకుంటారు. దీనిని గోండి కోయ పురాణ లలో చూడవచ్చు, మధ్య భారతంలో 1నుండి 12 రకాల గొట్లు (సగా) లుగా నేడు ఆదివాసీ లున్నారు. అందులో తెలంగాణలో 3 నుండి 7 వరకు ఉన్నవి, మిగతావి ఇతర రాష్ట్రాలలో చూడవచ్చు వీరంతా కోయతూర్‌?లు గానే పిలుచుకుంటారు. కొమరం భీమ్‌ పోరాటం తరువాత ఆదిలాబాద్‌లో నిజాం రాజు ఏర్పాటు చేసిన ఆస్ట్రియా దేశస్తుడు అయిన ప్రో.హైమండార్ఫ్‌ కమిషన్‌ హైద్రాబాద్‌ రాష్ట్రంకి ఇచ్చిన నివేదికలో గోండు అని రాయటం మూలంగా తెలంగాణలో గోండు, కోయ వేరు అనే పరిస్థితులు వచ్చాయి. 8వ షెడ్యుల్‌లో గోండు భాషను అధికారికంగా గుర్తించాలి ప్రధానంగా ఈ దేశంలో హిందీ ప్రధాన భాషగా ఎక్కువ రాష్ట్రాలలో ఉండటం తో పూర్తి చేసిన ఈ డిక్షనరి మొదటగా దేవన గరి స్క్రిప్ట్లో ముద్రణలో చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో స్థానిక భాషలలోకి అనువాదం జరుగుతుంది. ఈ ప్రయత్నంతో రాష్ట్రాలు వేరు అయినా,ఈ దేశం ఆదివాసీ లను విభజన చేసినా,విచ్ఛిన్నం చేసినా కోయ భాష మూల పదాలు భద్ర పరచటం కోసం జరిగిన ఒక గొప్ప ప్రయత్నంగా ఈ డిక్షనరీనీ చూడొచ్చు.ఈ డిక్షనరీ ఆదివాసి మేధావులు తయారు చేయటం వెనుక ఉన్న ఆకాంక్ష ఏమిటి అంటే పార్లమెంట్‌లో కోట్లాది కోయతూర్‌? ప్రజల అస్థిత్వానికి సంబంధించిన భాషకు రాజ్యాంగబద్ద ఆమోద ముద్ర 8వ షెడ్యూల్‌లో జరగాలి అని,హోం మంత్రిత్వ శాఖ అధికారిక పత్రం ప్రకారం గోండుభాషతో సహా 38 భాష లను చేర్చాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. 2004లో నాలుగు బాషలకు బోడో,డోగ్రి మైథిలి, సంతాలికి 22 భాషలతో కూడిన 8వ షెడ్యూల్‌?లో జోడిరచబడ్డాయి.కానీ గోండు భాషకు స్థానం కల్పించలేదు. గోండుభాష అంటే కేవలం సంభాషించే మాధ్యమం మాత్రమే కాదు, భౌగోళిక, పాక్నతిక, సామా జిక, చారిత్రక, ఇతిహాసాల సమగ్ర స్వరూపం, పురాతన మౌఖిక సాహిత్యం, ఆదివాసీ అస్థిత్వ మూలాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానంతో ముడి పడి ఉన్నందున రక్షణకు దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం జరగాలి. కోయ భాష విస్తృతికి ఇంకా పరిశోధనలు విస్తృతంగా జరగాలి. ప్రతి రాష్ట్రంలో ఆదివాసి పాఠశాలలో ఈ డిక్షనరీ పదాలు చేర్చి ప్రాధ మిక విద్య అందించాలి. సెకండరీ విద్యా, యూనివర్సిటీ స్థాయిలో కోయ భాషకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి.భాషాశాస్త్ర వేత్తలు,బాషా శాస్త్ర పరిశోధన సంస్థలు,ప్రత్యేక దృష్టి పెట్టాలి. బాష ప్రాధాన్యతను పెంచాలి.కోయ భాష ఆత్మగౌరవంనీ తెలియచేయాలి. అప్పుడే కోయతూర్‌లకి ఈ దేశంలో మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే భవిష్యత్‌లో పరాయి మతాల యొక్క బాషల ప్రభావం పడి కోయ తూర్‌ల అస్తిత్వ మూలాలు ధ్వంసమయి ఆదిమ జాతులు చరిత్ర కాల గర్భంలో కలిసి పోవడం అనేది ఒప్పుకొని తీరాల్సిన నిజం.
అతి ప్రాచీన భాషల్లో ఒకటి
తాము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకోవడమే తప్ప తమ భాష, సంస్కృతి, సంప్రదాయం, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారుతోందని కోయ గిరిజనులు భావించలేక పోతున్నారని పలువురు కోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోయ భాష అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. ద్రావిడ భాష నుంచి కోయ భాష పుట్టిందని చరిత్ర చెబుతోంది. అయితే కోయభాషను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కోయ భాష మీద ప్రధాన భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆతెగకు చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరికత పేరుతో జరుగుతోన్న అభివృద్దిలో భాగంగా భాషలకు ముప్పు వాటిల్లుతుందని, ఆ ప్రభావం కోయభాషపై కనిపిస్తోందని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు.
ఐటీడీఏ ఆధ్వర్యంలో కోయ భారతి విద్య
కోయ భాషకు లిపి లేనప్పటికీ కేఆర్‌పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో 2005లో కోయ భాషలో గిరిజన విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అనుభవజ్ఞులైన గిరిజన ఉపాధ్యాయుల ద్వారా కోయ భాషకు సంబంధించిన తెలుగు పదాలతో కోయ భారతి అనే పుస్తకాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ ప్రధాన భాషలతో పాటు కోయ భాషను కూడా బోధించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ విధానం వల్ల కోయ విద్యార్థులో విద్యపై ఆసక్తి పెరుగుతుందని, ప్రాథమిక విద్యాభ్యాసం సులభతరం అవుతుందని అధికారులు అంటున్నారు. అయితే కోయ భాషకు లిపి లేనందున భాషా సంస్కృతి క్రమంగా తగ్గిపోతోందని ఆదివాసీ కోయతెగల మేధావులు అంటున్నారు. తమ తెగకు ప్రధానమైంది భాషేనని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ గిరిజనులపై ఉందని పేర్కొంటు న్నారు.కొండకోనల్లో అంతరించి పోతున్న అరుదైన కోయ భాషలకు రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిలూదుతోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహజంగా గిరిజన తండాల్లో మూడొంతుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. ఈ కారణంగా వారు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవు తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, వారి జీవితాల్లో విద్యా సుగంధాలు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గిరిజ నులు మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాన్ని చేపట్టింది.
6 భాషలు..920 పాఠశాలల్లో అమలు
రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమలు చేయను న్నారు. ఈ విధానాన్ని ‘కోయ భారతి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవ డంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది.ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ),శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో (సవర),విశాఖపట్నం జిల్లాలో (కొండ,కువి, ఆదివాసీ),కర్నూలు,అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1నుంచి 3వ తరగతి వరకూ తెలుగు,గణితం,పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60లక్షల వ్యయంతో పాఠ్యాంశాలు రూపొందించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 920 పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేనిచోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు.
యవ్వ.. ఇయ్య భాషలోనే..
కోయ భాషలో అమ్మను యవ్వ అని..నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా..అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని..కోడి పుంజును గొగ్గోడు అని..పిల్లిని వెరకాడు అని పిలుస్తారు. కూడికేకు (కూడిక), తీసివేతాకు (తీసివేత), బెచ్చోటి (ఎంత పరిమా ణం), దోడ తిత్తినే (అన్నం తిన్నావా),బాత్‌ కుసిరి (ఏంకూర),దెమ్ము (పడుకో),ఏరు వాట (నీరు ఇవ్వు,పెట్టు),మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి) వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతా ల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి. ప్రాథమిక విద్యార్థులకు వారు మాట్లాడే మాతృ భాషలోనే బోధన చేయడం వల్ల వారిలో అభ్యసన స్థాయిని పెంచడంతో పాటు వారి భాష, సంస్కృతి,సంప్రదాయాలను చెక్కు చెదరకుండా కాపాడాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించడమనేది ఇతర భాషలపై పట్టు సాధించేందుకు ఎంతో దోహదపడుతుంది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను రూపొం దించారు.మాతృభాషలో బోధన వలన డ్రా పౌట్లు కూడా తగ్గుతాయి. మాతృభాషలో బోధనకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసు కుంది. ప్రాథమిక స్థాయిలో గిరిజన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అక్షరం ముక్కలు రాక అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్న గిరిజనులకు ఇది సువర్ణావకాశమనే చెప్పాలి. కొత్తగా పాఠశా లలకు వెళ్లే పిల్లలకు వాడుకలో ఉన్న కోయ భాషలో బోధన ఎంతో అవసరం. ఇతర భాషలు నేర్చుకోవాలంటే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. కోయభాషలో పాఠాలు చెబు తుంటే మా పిల్లలకు సులువుగా అర్థమవు తుంది. కోయభాషతో పాటు తెలుగులో కూడా చెబుతుండటం బాగుంది.
కోయతూర్‌ బాట సాహిత్య కార్యశాల
కోయతూర్‌ల అస్థిత్వ మూలాలు,వారి కోయ భాష క్రమక్రమంగా అంతరించే దశకు చేరుకు న్నాయని ఆ తెగ ను, వారి కోయ భాష ను పరిరక్షించుకోవలసిన అవసరం ఉందని కోయతూర్‌ బాట వ్యవస్థపాకలు జి. యాద య్య పిలుపు నిచ్చారు.చింతూరు మండలం రామన్నపాలెంలో కోయతూర్‌బాట, సమత నిర్వహణలో కోయ బాల సాహిత్యం అనే అంశం పై ఐదు రోజులపాటు ఆదివాసీ యువకులు, పాఠశాలలో ని విద్యార్థులకు నిర్వహించిన కార్యశాల (వర్క్‌ షాప్‌ )నిర్వహించారు.సదస్సులో ఆయన మాట్లాడారు. ఒకే భాషగల ప్రజలు ఒకే మూలం నుండి వచ్చిన ప్రజలు భాష కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.భాషా శాస్త్ర వేత్తలు,బాషా శాస్త్ర పరిశోధన సంస్థలు, ప్రత్యేక దృష్టి పెట్టాలి. బాష ప్రాధాన్యతను పెంచాలి. కోయ భాష ఆత్మగౌరవంనీ తెలియచేయాలి. అప్పుడే కోయతూర్‌లకి ఈ దేశంలో మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు. లేదంటే భవిష్యత్‌లో పరాయి బాషల ప్రభావం పడి కోయతూర్‌ల అస్తిత్వ మూలాలు ధ్వంసమయి ఆదిమ జాతులు చరిత్ర కాల గర్భంలో కలిసి పోవడం అనేది ఒప్పుకొని తీరాల్సిన నిజమని స్పష్టం చేశారు. ఆదివాసీల హక్కులు, వనరులు పరిరక్షణ పై పని చేస్తున్న సమత కో-ఆర్డినేటర్లు గునపర్తి సైమన్‌, కందుకూరి సతీష్‌ కుమార్‌లు మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రాలుగా,ఒరిస్సా,మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌,ఆంధప్రదేశ్‌,మహారాష్ట్ర,ఒరిస్సా,కర్ణాటకలుగా విభజించటంతో ఆయరాష్ట్రాలలో ఈ కోయతుర్‌ భాషకు ప్రాధాన్యత లేక,66ఏళ్ళుగా,కోయ భాషకు మరాఠి,ఒడియ,హింది,కన్నడ తెలుగు భాష ప్రభావం పడి,కోయభాష యాస,ప్రాసలు కూడ మారియన్నారు.దాంతో కోయ పదాలన్ని స్థానిక భాష పదాలు అని చెప్పుకునే క్రమం తగ్గి పోతుందాన్నారు.విచ్ఛిన్నం చేసినా కోయ భాష మూల పదాలు భద్ర పరచటం కోసం ఇది ఒక గొప్ప ప్రయత్నమని తెలిపారు. ఆదివాసీ అస్థిత్వ మూలాలు, సంస్కృతి సాంప్ర దాయాలు, జీవన విధానంతో ముడిపడి ఉన్నం దున రక్షణకు దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం జరగాలన్నారు.కోయ భాష విస్తృతికి ఇంకా పరిశోధనలు విస్తృతం చేయాల్సి న బాధ్యత, ఆవశ్యకత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.ప్రతి రాష్ట్రంలో ఆదివాసి పాఠశాలలో డిక్షనరీ పదాలు చేర్చి ప్రాధమిక విద్య అందించాలి. సెకండరీ విద్యా, యూని వర్సిటీ స్థాయిలో కోయ భాషకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలన్నారు.నాలుగు రోజుల వర్క్‌ షాప్‌లో కోయతూర్‌ బాట అకాడమీక్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పాండు ఆధ్వర్యంలో కోయ భాష పదాలు గుర్తించడం, విద్యార్థులు తో పదాలు పలికించడం వంటి అంశాలపై చర్చగోష్టి ఆసక్తికరంగా సాగింది.ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన కోయుతూర్‌ తెగల ఆనాటి జీవనవిధానం,వారు ధరించే వస్త్రాలు,పనిముట్లు ఇతరాత్ర అంశాలపై ఫోటో ప్రదర్శన ఆకట్టుకుంది.సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న గిరిమిత్ర సంస్థ కార్యదర్శి బండి గంగరాజు,వినియోగదారుల సంఘం కార్యదర్శి చిట్టిబాబు,కృష్ణ,దుమ్మిరి వెంకన్న బాబు,సున్నం ఈశ్వర్‌ కుమార్‌,జి రాఘవ,దుమ్మిరి భీమమ్మా,కట్టం కిరణ్‌ యువతీ యువకలు,గిరిజన పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -గునపర్తి సైమన్‌

ప్లాస్టిక్‌ ముప్పు..ఎప్పుడో కనువిప్పు..!

రోజూ అన్ని అవసరాల కోసం ఓచిన్న గిరిజన గ్రామం నుంచి నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు.జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉదయం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవసరాలకోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం.ఆశ్చర్యమేమంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తంభద్రపరచే సంచులు,ఇంజక్షన్‌సీసాలు,సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహనఉన్నాకూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూ అదుపు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని కుగ్రామాలే కాకుండా టూరిజం,సందర్శన, కాఫీతోటలు,విహారయాత్రి స్థలాలు ప్లాస్టిక్‌మయంగా మారుతున్నాయి. ఇలా నింగి,నేల,నీరులోరేణువులుగా మారుతూ ఆరోగ్యానికి పెనుసవాల్‌ విసురుతున్నాయి.
నేను ఏజెన్సీప్రాంతానికి వచ్చినప్పుడు ప్లాస్టిక్‌గ్రామాల్లో గిరిజనులు తమ అవసరాల కోసం దాచుకొనే నగదును పూర్వం వెదురు బొంగుల్లో దాచుకునేవారు.నేడు ఆపరిస్థితి భిన్నంగా మారింది. ప్లాస్టిక్‌ సంచుల్లో చుట్టుకొని నగదును దాచుకుంటున్నారు.ఆనాడు ప్లాస్టిక్‌ అంటే సారా ప్యాకెట్లులే కన్పించేవి.ఇప్పుడు విచ్చలవిడిగా అన్నీరకాల నిత్యావసర సరకులు,ఆఖరికి టీ,ఆహారపదార్ధాలు ప్లాస్టిక్‌ సంచులనే దర్శనమిస్తున్నాయి.ప్లాస్టిక్‌లేనిదే జీవితం నడవడం లేదనే స్థాయికి పేరుకు పోయింది. పాస్టిక్‌తో పాటు చెత్త పేరుకుపోతోంది. నేను1997వరకు పాడేరులో నివాసము ఉన్నప్పుడు చెత్త,ప్లాస్టిక్‌ ఎక్కడబడితే అక్కడ డంప్‌ చేసేవారు. అయితే డపింగ్‌ చేసే చెత్త,ప్లాస్టిక్‌ విషయంలో శాస్త్రీయపద్దతిని పాటించడం లేదు.శాస్త్రీయపద్దతిలో చెత్తను వినియోగించడమనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవశ్యకత ఉంది.ఇది పర్యావరణానికి,మానజీవితానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.లేకపోతే చెత్త విస్తరించి వర్షకాలంలో వాగులు,గెడ్డలు,డ్రైయినేజీల్లో పొంగి ప్రవహించినప్పుడు ఆ చెత్త జలాశాయాల్లోకి చేరి త్రాగు,సాగునీటిని కలుషితం చేస్తుంటాయి.దీనిద్వారా కేవలం గిరిజనప్రాంతాలే కాకుండా మైదాన ప్రాంతాల్లో తాగునీటి వనరులు కలుషితంగా మారే ప్రమాదం పొంచిఉంది.ఇప్పటికే తాటిపూడి, మేగాద్రిగెడ్డ,రైవాడ,ఏలేరు కాలువ,వంటి జలాశాయల నుంచి నగరానికి,మైదాన ప్రాంతానికి తరలిస్తున్న త్రాగు,సాగునీటివనరుల్లో చెత్త,ప్లాస్టిక్‌ చేరి కలుషితమవుతున్నాయి.ఈ నీటినే నగర/పట్టణ ప్రాంతాల ప్రజలు మంచినీళ్లుగా తాగుతున్నారు.
మైదాన ప్రాంతాల నుంచి ఈ మిగుల జలాలు సముద్రంలోకి చేరుతున్నాయి. ఆ జలాలతో ప్లాస్టిక్‌,చెత్తచెదారాలు సముద్రంలోకి చేరి జీవరాశులు కాలుష్యానికి గురవుతున్నాయి.ఇటీవల ఓ పరిశోధనలో తిమింగలం కడుపులో ప్లాస్టిక్‌ సంచులు కన్పించినట్లు తెలిపింది.కేవలం ప్లాస్టిక్‌ మాత్రమే కాదు..చెత్త కూడా ప్రజల జీవిన విధానానికి హానికలిగిస్తోంది.వీటి నియంత్రణకు ప్రభుత్వం సరిjైున శాస్త్రీయ పద్దతులు అవలంబించాలి.మన అవసరాలను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన లేదు. పర్యావరణానికి భంగం కలుగకుండా ఈభూగోళాన్ని తర్వాత తరాలకు అందించే దృష్టితో,సమకాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాలనే ఆలోచనాలేదు.
ప్రభుత్వం వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి అనేక చట్టాలను ప్రవేశపెట్టింది. అనేక సంస్కరణలు తీసుకొచ్చింది.వీటిలో ఏప్రిల్‌ 2022లో ప్రవేశపెట్టబడిన ప్లాస్టిక్‌ పన్ను ప్రతిపాదన కూడా ఉంది. ఈపన్ను కింద ప్లాస్టిక్‌లో వస్తువులను ప్యాకింగ్‌ చేస్తే దానికి పన్ను విధించబడుతుంది. దీంతోపాటు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. రీసైక్లింగ్‌ ఆధారిత పరిష్కారాలు ఈ కార్పొరేట్‌,శాసనవిధానాలపై విశ్లేషణ ఈకంపెనీలు రీసైక్లింగ్‌ ఆధారిత పరిష్కారాలను ఇష్టపడ తాయని నిర్ధారించింది. అయినప్పటికీ పరిస్థితులు షరామామూలే.చెత్తలో పలురకాలు ఉన్నాయి. వాటిని విభజించి రీసైక్లింగ్‌ చేయడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.! – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

సామాజిక విప్లవకారిణి సావిత్రిభాయి ఫూలే

తలపై ముసుగు ధరించిన ఓ యువతి బడిలో పాఠాలు చెప్పడానికని వడివడిగా నడిచి వెళ్తోంది. ఆమెను చూసిన ఒక బ్రాహ్మణ స్త్రీ ఆగ్రహంతో అసలిదేంపని? అంటూ అవమానిస్తూ… పేడ ముద్దలు విసిరారు. కుల ప్రసక్తి లేని – ఒక బాలికల పాఠశాలను ప్రారంభించేందుకు వెళుతున్న సందర్భంగా 1851వ సంవత్స రంలో సావిత్రిబాయికి ఎదురైన అనుభవం ఇది. అయినా ఆమె భయపడలేదు. తన లక్ష్యసాధన కోసం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనడానికైనా సిద్ధపడిరది. సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి 186వ జన్మదినం సందర్భంగా జనవరి 3న ‘గూగుల్‌ ’ ఆమెకోసం ప్రత్యేకంగా నివాళి అర్పించటం ఆమెకే కాదు.. మన దేశానికే గర్వకారణం.
పశ్చిమ మహారాష్ట్రలోని సతారా జిల్లా నయ్‌గావ్‌ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో 1831 జనవరి 3వతేదీన సావిత్రీబాయి జన్మిం చారు.ఆనాటి సంప్ర దాయం ప్రకారం ఆమెకు తొమ్మిదోవ ఏటనే జ్యోతీరావుతో వివాహమైంది. భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె పూర్తి విద్యావం తురాలైంది. సామాజిక పరివర్తనను సాధిం చింది. తన భార్య జ్ఞానం కుటుంబానికే పరిమితం కారాదనీ, ప్రజలందరికీ విద్యనం దించగల శక్తిగా ఆమె అవతరించాలనీ జ్యోతీరావుపూలే ఆశించారు.1848లో జ్యోతీరావుపూలే ‘పూనే’లో తొలి బాలికా పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలకు సావితత్రీబాయి ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. ఈ పాఠశాలను నిర్వహి స్తున్నందుకు అన్ని సామాజిక వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీ బాయి దంపతులను గృహ బహిష్కారానికి గురి చేశారు.1852వ సంవత్సరంలో ‘మహిళా సేవామండల్‌’ అనే మహిళా సంఘాన్ని సావిత్రీబాయి స్థాపించారు. అనంతరం 1853లో అనాధలుగా మారుతున్న శిశువుల కోసం ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ స్థాపన శరణా లయాన్ని స్థాపించారు. దిక్కులేని స్త్రీలకు, పిల్ల లకు సావిత్రీబాయి ఇల్లే ఒక పునరావాస కేంద్రంగా మారిపోయింది. బాల్యంలోనే వైధ వ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్ల లకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవ తులైన వారికి పురుళ్లు పోసివారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకు న్నారు.యశ్వంత్‌గా నామకరణం చేసి తమ ఆశ యాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేశారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచి,క్షురకులను చైతన్యపర్చి,వితంతువులకు శిరోముండనం చేయ బోమంటూ క్షురకుల చేత1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి.తరువాత 1873 సెప్టెంబరు 24న‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక,ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావి త్రీబాయి నేతృత్వంలో నడిచేది.వివాహాలు వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపిం చారు. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తిని మించిన ధనాన్ని ఖర్చుచేస్తూ కుటుంబా లను నెడుతాయో, కుటుంబాలను ఎంతగా నాశనం చేస్తాయో తెలియజేస్తూ ఆమె రాసిన వ్యాసాలు 21వ శతాబ్ధానికి కూడా నిత్య నూతనంగానే కనపడతాయి. కరువు బారిన పడిన కుటుంబాలలోని అనాథ బాలల కోసం 52 పాఠశాలలను వాళ్లు నిర్వహించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతి రేకంగా పోరాడారు. జ్యోతీరావుపూలే.1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు.తన భర్త పూలే చితికితానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది.1897లో ప్లేగు వ్యాధి,పూణే నగరాన్ని వణికించింది. నగర మంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్‌ తోకల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.చివరికి ఆప్లేగు వ్యాధే ఆమెను మార్చి10,1897లో కబళిం చింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రి యలు జరిపించారు. ఆనాటి ప్రజల స్థితిగతు లు,అవిద్య,సాంఘిక దురాచారాలు,సతీ సహగ మనం,బాల్యవివాహలు సావిత్రీబాయిని కదిపే శాయి. వీటిని నిర్మూలించడానికి అవసరమైన చైతన్యం పెరగాలంటే విద్య అందరికి అందు బాటులోకి రావాలని విశ్వసించారామె. బాలి కల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడం మొదలెట్టారు. తద్వారా సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం కృషి చేశారు. తన దగ్గర చదువుకున్న పిల్లలు,పెద్దలు స్వేచ్ఛ కోసం స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమించారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో విద్యా వ్యాప్తికి చేపట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అక్షరాస్యతను సాధించలేక పోయినా,విద్య బలోపేతానికి ప్రభుత్వమే బాధ్యత పడిరది. కాని ప్రస్తుత సమాజంలో ఫూలే ఆశించిన లక్ష్యా లకు తూట్లు పొడుస్తున్నారు. రెండు దశాబ్దాలు గా చేపడుతున్న విద్యా సంస్కరణలు వ్యాపార వర్గాలకు లాభాలు చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలుతో పాఠశాలల మూత,క్లస్టరైజేషన్‌, మతతత్వ ధోరణులు సిలబస్‌లో జొప్పించడం,విద్యా హక్కు చట్టాలను నిర్వీర్యం చేయడం,రాష్ట్రాలవిద్యాహక్కు చట్టాలపై పెత్తనం వంటి వాటికి పూను కుంటున్నది. నేటి విద్యారంగ సంస్కరణలు బడుగు, బలహీన సామాజిక వర్గాల వారికి మరలా విద్యను దూరం చేసేవిగా ఉన్నాయి. మాతృభాషలో శూద్ర కులాల వారికి పాఠ శాలలు పెట్టించిన ఫూలే ఆశయానికి భిన్నంగా నేడు పాఠశాలలు మూసివేస్తున్నారు. వెరసి బాలికలు పెద్ద సంఖ్యలో చదువుకు దూరం అవుతున్నారు. అవిద్య, బాల్య వివాహాలపై పోరాటం,సతీ సహగమనం వంటి వాటిపై చైతన్య పరిచి, నిషేధించడం వంటివి సమా జానికి మేలు చేసిన సంఘటనలు. సామాజిక దురాచారాలను తిప్పి కొట్టాలంటే చదువే కీలకమని నిరూపించింది సావిత్రీబాయి ఫూలే. నేడు నూతన రూపాల్లో మతం,కులం, సంప్ర దాయాల పేరుతో స్త్రీలపై, బాలికలపై జరుగు తున్న దాడులు చూస్తున్నాం. దుస్తులు, హిజాబ్‌, సంప్రదాయాలు, ఆహారం పరంగా ఆంక్షలను గమనించినట్లయితే ఇవన్నీ సమాజాన్ని మను వాదం లోకి తీసుకెళ్తున్నాయి. మరలా ఇటు వంటి ఘటనలు ప్రజాస్వామ్య భారత దేశంలో పునరావృతం అవుతున్నాయంటే స్త్రీలకు వ్యతి రేకంగా నిర్ణయాలు చేస్తున్నారనే అర్థం.ఫూలే స్ఫూర్తితో ఇటువంటి విధానాలపై పోరాటాలకు సిద్ధపడాలి.సమకాలీన సమాజంలో సామాజిక అంతరాలను పెంచే విధానాలపై కళారూపాల ద్వారా చైతన్యపరచాలని,సాంస్కృతిక,జానపద అంశాలలో మహిళా టీచర్లజోక్యం పెరగాలని, మూఢ విశ్వాసాలను పారదోలడానికి జానపదాలను ఎంచుకోవాలని, సాంఘిక దురాచారాలపై నిరంతరం పోరాడాలని ఆచరణలో చూపించారు సావిత్రీ బాయి ఫూలే. కాని ప్రస్తుత బిజెపి ప్రభుత్వ విధానాలు పాఠ్యపుస్తకాలలో మతతత్వాన్ని చొప్పిస్తున్నాయి. లౌకిక, రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నాయి. బాలికా విద్య కోసం, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు, కుల మత తత్వాలకు వ్యతిరేకంగా సావిత్రీ బాయి పోరాడారు.
సామాజిక వైతాళికురాలు ప్రపంచవ్యాప్తంగా జాతి విముక్తి పోరాటాలు జరుగుతున్న రోజులవి.మన దేశం కూడా బ్రిటీష్‌ పరాయిపాలనలో ఉన్నప్పుడు ఎక్కడి కక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఉద్యమాలు ఊపందు కున్నాయి.ఆ కాలంలోనే అనేకమంది సంస్కరణల కోసం ప్రాణాలుఅర్పించారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయినిగా, సామాజిక వైతాళికురాలిగా…బాలికావిద్య కోసం,బడులు పెట్టడం కోసం సావిత్రీబాయి ఫూలే చేసినత్యాగాలు,కనబరచిన పట్టుదల మనందరికీ ఆదర్శనీయం.విద్యా వ్యవస్థపట్ల, విద్య సమాజానికి దారి చూపే తీరుపట్ల ఆమెకు ఎంతోస్పష్టత ఉంది. 1881లో లార్డ్‌ రిప్పన్‌, హంటర్‌ అధ్యక్షతన విద్యాకమిషన్‌ను నియ మించేటప్పుడు మాతృభాషలో విద్య అందిం చాలని, శూద్ర,అతిశూద్ర కులాల వారికి పాఠశాలలు పెట్టాలని,పేదరికం వలన దిగువ కులాల పిల్లలకు 12సంవత్సరాల వయసు వరకు ఉపకార వేతనం మంజూరు చేయాలని మహర్‌,మాంగ్‌ (గిరిజన తెగ) కులస్థులకు ప్రత్యేక పాఠశాలలు పెట్టాలని ప్రతిపాదనలు పెట్టారు ఫూలే. సమాన హక్కులు నినాదంతో అట్టడుగు వర్గాలవారికి బడులు పెట్టి విద్యనం దించేందుకు కృషి చేశారు. స్వాతంత్య్రం రాక మునుపు బ్రిటిష్‌ పాలకుల ఎజెండాలో, స్వాతం త్య్రం వచ్చాక మన రాజ్యాంగంలో పైఅంశాల న్నింటికీ చట్టబద్దత కల్పించాలని,సమసమాజం స్థాపించాలని సావిత్రీ బాయి ఫూలే ఆశిం చారు.ఆకృషి ఫలితమే నాటి సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బాలికల పాఠశాలలు. కాని నేటికీ విద్యాభివృద్ధికి కుల వ్యవస్థ ఆటంకంగానే ఉంది. కులతత్వాన్ని, మతత త్వాన్ని పెంచి పోషించే విధానాలను ప్రస్తుతం చూస్తున్నాము. ఇప్పటికీ బడుగు వర్గాల పిల్లలు చదువుకి దూరంగా ఉన్నారు. మొత్తం అక్షరాస్యతలో మహిళల అక్షరాస్యత 64 శాతం మాత్రమే. ఇటువంటి గణాంకాలు దేశ అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడవు. విద్యకు దూరంగా ఉండే ప్రాంతాలు, వర్గాల వారు నిరంతరం దోపిడికి గురవుతారని అనేక అంశాలు సూచిస్తున్నాయి. బాల్య వివాహాలు, అత్యా చారాలు, లైంగిక వేధింపులు, ఉపాధి, కార్మిక శక్తిలో 34 దేశాలతో పోల్చుకుంటే 24వ స్థానంలో ఉన్నాం. సరికొత్త సమస్యలు విద్యారం గంలో మొదలయ్యాయి. ఈ అవశేషా లను రూపుమాపాలంటే సావిత్రీబాయి సూచించిన సామాజిక ఉద్యమాలను నిర్మించాలి. అది మనందరి కర్తవ్యం.స్త్రీలు చదువు నేర్చుకోవడమే అరుదైన కాలంలో బాలికలకు పాఠశాలలో విద్య నేర్పడానికి తన భార్య సావిత్రిని విద్యా వంతురాలిని చేసి దేశానికి తొలి ఉపాధ్యా యురాలిని అందించారు జ్యోతిరావు ఫూలే. విద్యపై, ఉపాధ్యాయులపై, విద్యార్థులపై ఎంతో ప్రభావితం చేయగలిగిన ఆమె స్ఫూర్తిదాయక చరిత్ర మన దేశానికి ఎంతైనా అవసరం. సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ పెద్దలు ఆమె విగ్రహాలకు పూలమా లలు వేసి సరిపెట్టుకుంటే సరిపోదు. ఆమె ఆశ యాలకు కార్యరూపం ఇవ్వవలసిన బాధ్యత చేపట్టాలి. అలాగే ఆమె జయంతి రోజును జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి.-(కె.విజయగౌరి)

సబ్‌ప్లాన్‌ ఆశశ్యకత !

సమాజంలో అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్న షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందిన ప్రజానీకానికి, ఇతర ప్రజానీకానికి మధ్యనున్న అభివృద్ధి అసమాన తలను, ఈ వర్గాల ప్రజల్లోనే అంతర్గతంగా ఉన్న అసమానతలను తొలగించాలన్న లక్ష్యంతో రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు ఉప ప్రణాళికను ఆమోదించింది. అణగారిన తరగతులైన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 1980వ దశకంలోనే చట్టపరంగా తీసు కొచ్చిన ఈ సబ్‌ప్లాన్‌ విధానం నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చాక క్రమంగా నీరుగారుతూ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఉద్యమం సాగిన ఫలితంగానే ప్రభుత్వం 2013లో చట్టం చేసింది.అయితే,దాని కాలపరిమితి పదేళ్లుగా నిర్ణయించడంతో రానున్న జనవరి 24వ తేదీతో గడువు ముగుస్తుంది.
సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని కొన సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలని దళితులు, గిరిజనులు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేయవలసిరావడం విచారకరం. అట్టడుగు వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా మని చెబుతున్న ప్రభుత్వం ఇలాంటి కీలకమైన అంశంపై మీనమేషాలు లెక్కించడం మాని కార్యాచరణకు ఉపక్రమించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రంలో సబ్‌ప్లానును క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకు రావడమే పరమ తిరోగమన చర్య. అసలు ప్లానే లేకపోతే ఇక సబ్‌ప్లాన్‌ ఇంకెక్కడ అనే స్థితి తెచ్చారు. కాని దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబకడంతో బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటా యింపులు చేస్తున్నారు. కాని, అదంతా ఖర్చు చేయకుండా కోతలు పెట్టడం, ఇంకొన్ని నిధులను దారి మళ్లించడం షరా మామూలే! కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీ లిస్తున్న మోడీ సర్కారు ఎస్‌సి,ఎస్‌టిల సంక్షే మానికి కనీస కేటాయింపులను కూడా ఖర్చు చేయకపోవడం సంఘపరివార్‌ నైజానికి నిదర్శనం.కాని,కేరళలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఆరాష్ట్రంలోని ఎస్‌సి,ఎస్‌టిల జనాభాశాతం కన్నా ఎక్కువ శాతం నిధుల్ని ప్రణాళికా వ్యయంలో కేటాయించడం శ్లాఘనీయం. దేశం లో అలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకేదీ లేదు.రాష్ట్రంలో సబ్‌ప్లాను చట్టం చేయడంతో నిధుల కేటాయింపు,ఖర్చునకు కొంత గ్యారంటీ వచ్చింది. కాని,2018 నుండి రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు క్రమంగా తగ్గిస్తున్నారు. నిధుల మళ్లింపు యథేచ్ఛగా సాగిపోతోంది. జనాభా ప్రాతిపదికగా సబ్‌ప్లాన్‌ నిధులు కేటా యించాలి.ఆ ప్రకారం చూస్తే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో 20వేలకోట్ల రూపాయలు కేటాయిం చాలి కానీ అది కేవలం రూ.17,403 కోట్లు మాత్రమే. ఇందులోనూ ఎస్‌సి ఎస్‌టిల అభి వృద్ధికి ఖర్చు చేసింది సుమారు ఐదు వేలకోట్లు మాత్రమేననీ మిగతా 12వేల కోట్లను ఇతర పథకాలకు మళ్లిం చారన్న ఆరోపణ సత్య దూరం కాకపోవచ్చు. సబ్‌ప్లాన్‌ నిధులను ఆ తరగతులవారు నివసించే ప్రాంతాలుఅంటే దళిత వాడలు,గిరిజనగూడేలు,తండాల అభివృద్ధికి, ప్రత్యేకించి మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. చట్టం స్పష్టంగా చెబుతున్నా, గతంలోనూ, ఇప్పుడూ ప్రభుత్వాలు ఆ రీతిలో ఖర్చు చేయడంలేదు.రోడ్లు వేయ డానికి,సాగు నీటి ప్రాజెక్టులకూ సబ్‌ ప్లాన్‌ నిధులనే వాడేయడం దారుణం. ఎవరైనా ప్రశ్నిస్తే వారూ వాడుకుంటారు కదా అన్న ఏలినవారి సమాధానం పేదలను, సబ్‌ప్లాన్‌ చట్టాన్ని వెక్కిరించడమే! ఆయా తరగతుల అభివృద్ధికి ప్రత్యేకించి ఖర్చు చేయవలసిన నిధులను నవరత్నాల్లో భాగంగా సాధారణ పథకాలకు వెచ్చించడం ధర్మం కాదు. ప్రభుత్వ రంగాన్ని పాలకులు క్రమంగా కుదించి వేయ డంతో సామాజిక న్యాయం చతికిలపడు తోంది.ఎస్‌సి,ఎస్‌టి లకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్ల కోసం ఉద్యమించ వలసిన పరిస్థితి. అణగారిన వర్గాలపట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కనుక ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు వెచ్చించేలా సబ్‌ప్లాన్‌ చట్టం కొనసాగాల్సిందే. కేటాయిం పులు అణగారిన తరగతులవారి అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. కేటాయించిన సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లించే వీలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి న్యాయమైన డిమాండ్లతో వివిధ సామాజిక సంఘాలు, సంస్థలు విశాల ఐక్య ఉద్యమం సాగించాలి. దానికి అభివృద్ధి కాముకుల,ప్రగతిశీల శక్తుల మద్దతు తప్పక లభిస్తుంది. ప్రభుత్వాలు ప్రజా ఒత్తిడికి తలొగ్గక తప్పదు.
ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలని..
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాలానుగు ణంగా గతంతో పోలిస్తే ఈ వర్గాల ప్రజానీకం అభివృద్ధి చెందినా, ప్రధాన జీవన స్రవంతి కంటే ఇంకా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలితాలు అందాలని పన్నెండో పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. అందుకే వేగవంతమైన, సుస్థిరమైన, మరింత సమ్మిళితమైన అభివృద్ధిని సాధించడమే పన్నెండో ప్రణాళిక ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశిం చారు. రాజ్యాంగంలోని అనేక అధికరణలు అన్యాయం, అణచివేత నుంచి సమాజానికి రక్షణ కల్పిస్తున్నాయి. ఈ అధికర ణలు:46,14, 15(1),17,15(2),15 (4) (5), 16(4), 16(4ఎ), 16(4బి),335,243డి,340టి. అదేవిధంగా షెడ్యూల్డ్‌ తెగల రక్షణకు రాజ్యాం గంలో అనేక అధికరణలున్నాయి. వివిధ రాజ్యాంగ అధికరణలతోపాటు పార్లమెంట్‌ ఈ వర్గాల ప్రజల రక్షణకు అనేక చట్టాలను కూడా చేసింది.ఉదాహరణకు, 1955లో అంట రానితనంపై చట్టం రూపొందించారు. దీన్ని తర్వాతి కాలంలో (1976లో) పౌరహక్కుల రక్షణ చట్టంగా పునఃనామకరణం చేశారు. సామాజిక అణచివేతకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలపై జరుగుతున్న అత్యాచారాలను నివారిం చేందుకు 1989లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగల (అత్యాచారాల నివారణ చట్టం) వచ్చింది.
ఎస్సీ జనాభా వివరాలు
రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాల జనాభా పెరుగు తూ వస్తోంది. ఇప్పటికీ ఎస్సీ జనాభాలో అధిక భాగం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఎస్సీ జనాభా 1.06కోట్లు. మొత్తం జనాభాలో ఇది15.9శాతంగా ఉండేది.2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా మొత్తం జనా భాలో16.2 శాతానికి పెరిగింది. 2001 జనా భా లెక్కల ప్రకారంరాష్ట్రం మొత్తం మీద చూస్తే నెల్లూరు జిల్లాలో ఈ వర్గం జనసాంద్రత అత్య ధికం.ఈ జిల్లాలో మొత్తం జనాభాలో 22.5 శాతం ఉన్నారు. తర్వాతి స్థానంలో ప్రకాశం (21 శాతం), చిత్తూరు (18.7) జిల్లాలున్నాయి.
అక్షరాస్యత తీరుతెన్నులు
జనాభా లెక్కల వివరాలను పరిశీలిస్తే రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతోందని అర్థమవుతుంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో 1981లో అక్షరాస్యతా రేటు 29.9 శాతం. 2001లో ఇది 60.5 శాతానికి పెరిగింది. అదేవిధంగా ఎస్సీలలో కూడా అక్షరాస్యత పెరుగుతోంది. రాష్ట్రంలో ఎస్సీ జనాభాలో అక్షరాస్యతా రేటు 1981లో 17.7 శాతం ఉండగా, ఇది 2001లో 53.6 శాతానికి పెరిగింది. అంటే 2001 జనాభా లెక్కల ప్రకారం చూసినా మొత్తం జనాభా అక్షరాస్యతా రేటుతో పోలిస్తే ఎస్సీ ప్రజానీకంలో అక్షరాస్యతా రేటు తక్కువగా ఉంది. మానవాభివృద్ధి, సామాజికాభివృద్ధిలో కీలకాంశంగా ఉన్న అక్షరాస్యతా రేటు విషయంలో ఇతర వర్గాల ప్రజానీకానికి, ఎస్సీలకు మధ్యనున్న తేడాను అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ మహిళల్లో అక్షరాస్యతా రేటులో పెరుగుదల వేగం తక్కువగా ఉంది. ఉదాహరణకు 2001లో మొత్తం మీద చూస్తే మహిళా అక్షరాస్యతా రేటు 50.4శాతంగా ఉంటే ఎస్సీలలో మహిళా అక్షరాస్యతా రేటు 43.4 శాతంగా ఉంది. విద్యారంగంలో ప్రమాణాలకు మరో కీలక కొలమానం మధ్యలో బడి మానేసే వారి సంఖ్య. భారత విద్యావిధానంలో చూస్తే, బడిలో చేర్పించే విషయంలో దాదాపు పూర్తి స్థాయిలో విజయం సాధించాం. కానీ మధ్యలో బడి మానేసే వారి సంఖ్యను తగ్గించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాం. కొంత కాలంగా విద్యారంగ ధోరణులను పరిశీ లిస్తే ఎస్సీ బాలబాలికల్లో కూడా మధ్యలో బడి మానేసే వారి శాతం తగ్గుతోంది. కానీ, ఇప్పటికీ ఇదిచాలా అధికంగా ఉండటం ఆందోళనకరం. ఉదాహరణకు 2007-08లో ఎస్సీ బాలబాలికల విషయంలో మధ్యలో బడి మానేసే వారి శాతం ఇంకా 69 శాతంగా ఉంది. ఎస్సీ బాలురతో పోలిస్తే బాలికల్లో ఈ శాతం సహజంగానే మరింత ఎక్కువగా ఉంది. అందుకే అంబేద్కర్‌ పేర్కొన్నట్లు అణగారిన వర్గాలలోని మహిళలు రెండు రకాల వివక్షకు గురవుతారు. కులపరమైన వివక్షతో పాటు లింగ వివక్షకు కూడా బలవుతున్నారు.
జీవనోపాధి ధోరణులు
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వ్యవసాయేతర స్వయం ఉపాధిపై ఆధారపడు తున్న వారి శాతం పెరుగుతోంది. మరోవ్కెపు మొత్తం ఎస్సీ జనాభాలో వ్యవసాయం, స్వయం ఉపాధి, వ్యవసాయ కూలీలుగా ఆధారపడి జీవిస్తున్న వారి శాతం తగ్గుతోంది. అయితే ఇప్పటికీ ఎస్సీలలో 63శాతం ప్రజల జీవనో పాధి వ్యవసాయమే. ఎస్సీ ప్రజానీకం అత్యధికంగా గ్రామాల్లో జీవిస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా గడుపుతున్నారు.ఉప ప్రణాళిక అమలులో భాగంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రణాళికా కేటాయింపులలో జనాభా దామాషా ప్రాతిపదికపై ఎస్సీలకు నిధులను కేటాయి స్తున్నారు. ప్రతీ ప్రభుత్వ శాఖ తమ ప్రణాళికా కేటాయింపులలో ఇలాగే నిధులు కేటాయిస్తే ఇక్కడో సమస్య ఉంది. అత్యధిక ఎస్సీ జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో ఆ మేరకు వ్యవసా యానికి అంత ప్రాధాన్యం ఉండదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు లభిస్తున్న ప్రాధాన్యానికి, ఎస్సీ ప్రజల జీవితాల్లో ఆయా రంగాల ప్రజల జీవనాధారానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇటీవల ఆమోదించిన చట్టం అమలులో భాగంగా పథకాలు,కార్యక్ర మాలను రచించేటప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. కొంత కాలంగా రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో దాదాపు సగం మేరకు జలయజ్ఞానికి కేటాయిస్తున్నారు. అందులో భారీ నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఉంటోంది. కానీ, ఎస్సీల్లో అత్యధి కులు భూమిలేని వ్యవసాయ కూలీలు. వీరికి భూమే లేనప్పుడు భారీ ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనం పరిమితంగానే ఉంటుంది. అందుకే నిధులను వెచ్చించేందుకు ప్రణాళికలను రూపొందించేటప్పుడు ఉప ప్రణాళిక అమలు మండలి, నోడల్‌ ఏజెన్సీలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
పేదరికం తేడాలు
పేదరికాన్ని అంచనా వేసేందుకు ఇటీవల లక్డావాలా కమిటీ, టెండుల్కర్‌ కమిటీ పద్ధతులు వచ్చాయి. లక్డావాలా కమిటీ అంచనాల ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికం తగ్గుతూ వస్తోంది. అలాగే పట్టణ ప్రాంతంలో ఇదే కాలంలో ఎస్సీలలో పేదరికం 50.6 శాతం నుంచి 37.4శాతానికి తగ్గింది. టెండుల్కర్‌ కమిటీ తాజా అధికారిక అంచనాల ప్రకారం 2009-10లో గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీలలో పేదరికం 23.5శాతం ఉండగా, పట్టణ ప్రాంతంలో 17.4 శాతంగా ఉంది. లక్డావాలా కమిటీ, టెండుల్కర్‌ కమిటీల ప్రకారం గ్రామీణ, పట్టణ పేదరికం అంచ నాల్లో చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఈ ఉప ప్రణాళిక అమలును సాంకేతిక దృక్పథంతో కాకుండా సామాజిక, ఆర్థిక దృక్పథంతో పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న వేగవంతమైన మార్పులలో ఎస్సీ ప్రజానీకాన్ని కూడా భాగస్వాములను చేయాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. గిరిజనుల విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. జాతీ యాదాయంలోనే కాదు, రాష్ట్ర ఆదాయంలో కూడా అధిక భాగం సేవలరంగం నుంచే వస్తోంది. కానీ,ఈ నూతన సంపదలో ఎస్సీ, ఎస్టీ ప్రజానీకానికి సరైన భాగస్వామ్యం లేదు.అందుకే చట్టం చేయ డంతో సరిపోదు. ఆ చట్టం అమలులో నవీ నత్వం,సృజనాత్మకత కీలకమవుతాయి. ‘సబ్‌ప్లాన్‌’ కాలపరిమితి పెంచండి
దళిత, గిరిజనులకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడానికి పదేళ్ల కాలపరిమితితో 2013లో తీసుకువచ్చిన ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌చట్టం గడువు 2023 మార్చితో ముగుస్తున్నందున ఈ కాలపరిమితిని పొడిగించడానికి వీలుగా చట్ట సవరణ చేయా లని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యా ది కోరారు. ఈ మేరకు గుంటూరులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగా ర్జునను ఆయన క్యాంపు కార్యాల యంలో కలిసి వినతిపత్రం అంద జేశారు.ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమించడం వల్ల సబ్‌ ప్లాన్‌ చట్టాం2013 వచ్చిందన్నారు. అయితే సరైన నిబంధనలు లేకపోవటంవల్ల 2015 వరకూ ఈ చట్టం అమలులో పలు సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ చట్టానికి లోబడి జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తూ వచ్చాయని, మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటం వల్ల దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన ప్రాంతా లకు అపార నష్టం జరిగిందని అన్నారు. ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎస్‌సి,ఎస్‌టిలకు రక్షణ అవసరమని, అందుకోసం చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని, సబ్‌ప్లాన్‌చట్టం 2013చాప్టర్‌ 1క్లాజ్‌4ను సవరించి, కాలపరిమితిని పొడగించేందుకు రానున్న అసెంబ్లీ సమావే శాల్లోనే నిర్ణయం చేయాలని మంత్రిని కోరారు.
జిఎన్‌వి సతీష్‌

ప్రమాద అంచుల్లో ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండడం ఎంతైనా అవసరం..పాలక పక్షం ఎలా గైతే ప్రజల పనుపున ఏలుబడి సాగిస్తుందని అను కుంటామో ప్రతిపక్షం అలాగే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా వ్యవహరిస్తుంది.ఈ రెండూ సజావుగా నడిస్తేనే పాలన..దానిని అనుసరించి అభివృద్ధి..ప్రజాసంక్షేమం తదితరాలు సక్రమంగా సాగుతాయి.అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం కేంద్రంలో,రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం నామ మాత్రంగా మిగిలిపోవడంతో పాలన ఏకపక్షంగా మారిపోయి ఇంచుమించు నియంతృత్వ పోకడలో ఏలుబడి సాగిపోతోంది.కేంద్రంలో ఈ తరహా పరిస్థితులు 2014 నాటి నుంచే కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొన్న 2019 ఎన్నికలలో చోటుచేసుకున్న పరిణామాలు గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరగని క్రొంగొత్త పోకడలకు తలుపులు తెరిచాయి..
మన దేశంలో జవహర్‌ లాల్‌ నెహ్రూ,లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఏలుబడి తర్వాత ఇందిరా గాంధీ శకం మొదలైన పిదప తొలిసారిగా ఏకపక్ష విధా నాలు..ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడలు ఊపిరి పోసుకున్నాయి.శాస్త్రీజీ అకాల మరణం తర్వాత పగ్గాలు అందుకున్న ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రోజుల వరకు తాను చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అనే రీతిలో ఏలుబడి సాగించారు. ప్రజల్లో తనకుగల అసాధారణమైన ఆకర్షణ కారణంగా ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం, తాను అనుకున్న రీతిలో పాలన సాగించడం ఇది వరకు పరిపాటిగా మారిపోయింది.అయితే అంతటి ఇందిరాగాంధీ కూడా ప్రతిపక్ష నాయకు లను విశ్వాసంలోకి తీసుకుని వారికి సముచిత రీతిన గౌరవం ఇస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసు కునే సందర్భాల్లో వారితో సలహా సంప్రదిం పులు జరుపుతుండే వారు..ఒకరకంగా ఎమర్జెన్సీ దేశానికి కొంతమేలుచేసింది.అదేమిటంటేఎమర్జెన్సీ చీకటి రోజుల తర్వాత దేశంలో ఏకపక్ష విజయాలకు.. ఏలుబడులకు తెరపడిరది…అత్య వసర పరిస్థితుల అనంతరం దేశంలో తొలిసారిగా కాంగ్రేసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.అటు తర్వాత కూడా కాంగ్రెస్‌ ఆధిపత్యం తగ్గి ఇతర పక్షాలు, కూటములు అధికారంలోకి రావడం మొదలైంది. ఇక రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు ఆగమనం.. స్వరాష్ట్రంలో సంచలనాల తర్వాత జాతీయ రాజకీ యాల్లోకి ప్రవేశం అనంతరం కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దిగజారింది.అప్పటినుంచి కేంద్రంలో ఏపార్టీ కైనాగాని ఇంచుమించు పరిపూర్ణ ఆధిక్యత రావ డం.. ఏకపక్షంగా ఏలుబడిసాగడం అనేరోజులు చెల్లిపోయాయి. ఇదిగో..మళ్లీ ఆపరిణామాలు కేంద్రంలో 2014ఎన్నికల నుండి మొదల య్యాయి. వరస రెండు ఎన్నికల్లో తిరుగులేని ఆధిప త్యంతో గెలిచిన భారతీయ జనతా పార్టీ దేశంలో మరో సారి ఏకపక్ష పాలనకు,ఒంటెత్తు పోకడలకు తెర ఎత్తింది. పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం..ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్నివ్యవస్థల నిర్వీర్యం,అస్మదీయులకు అవాం చిత ఉపకారాలు..రాష్ట్రాలకు కల్పించే ప్రయో జనాల విషయంలో అసమానతలు, పారద ర్శకత లోపం.. ఇలాంటి ఎన్నో కీలక అంశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ఏకపక్ష ధోరణులపై ప్రశ్నించే గొంతులు కరవయ్యాయి.. చట్టసభల్లో, బయటా కూడా నిలదీసే విపక్షాల గొంతుకలను ప్రభుత్వంలోని పెద్దలు మెజారిటీ ఇచ్చిన బలంతో పట్టించు కునే పరిస్థితి గడచిన ఏడు సంవత్సరాల కాలంలో ఏదశలోనూ కనిపించలేదు..చేసిన తప్పుల వల్లనైతె నేమి..అధికారంలోఉన్న రోజుల్లో అవలంబించిన ఇదే తరహా ఏకపక్ష ధోరణుల ఫలితం అయితేనేమి కాంగ్రెస్‌ పూర్తిగా చచ్చుబడిపోయింది.ఇక కమ్యూ నిస్టుల సంగతి సరేసరి..ఎప్పుడూ వారి పోరాటాలు సరాసరే..పార్టీల కేడర్లు,శ్రేణులు బలంగానే ఉన్నా ఏ దశలోనూ చట్టసభల్లో తగినంత బలం లేకపోవ డంతో వామపక్షాలది స్వతంత్ర భారతంలో ఆది నుంచి అరణ్యరోదనే..ప్రభుత్వాలను నిలదీసే వారి గొంతు సమ్మెలు,బందులు..ఇత్యాదులకే పరిమితం అయిపోయింది. నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కమ్యూనిస్టులు.. ఇతర రెగ్యులర్‌ ప్రతిపక్షాలతో సహా మొన్నటి వరకు దేశంలోనే మహాశక్తిగా విరాజిల్లిన కాంగ్రెస్‌ పరిస్థితి కూడా నానాటికీ తీసికట్టు అయిపోయింది..ఇక ఆంధ్రప్రదేశ్‌ సంగతి..ఇక్కడ ఏంజ రిగినా అడిగే నాథుడులేని పరిస్థితి దాపురిం చింది. ఈ రాష్ట్రం లో గతంలో అయితే కాంగ్రెస్‌, లేదంటే తెలుగు దేశం ప్రభుత్వాలు పెద్దశక్తులుగా అసెంబ్లీలో ఆవి ర్భవించి అధికారం చెలాయించిన సందర్భా ల్లో ప్రతిపక్షాల పరిస్థితి ఇప్పుడున్నట్టు లేదు.ఒకనాడు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు వెంగళరావు, చెన్నారెడ్డి.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటివారు ఎదురులేని సంఖ్యాబలంతో అధికారం చేసినా ప్రతిపక్షాలకు తగిన గౌరవం ఉండేది.అదే పరిస్థితి ఎన్టీ రామా రావు.నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా సాగింది.ప్రతిపక్షానికి దక్కే గౌరవాన్ని మొన్న టి వరకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కూడా అనుభవించిన వారే. ఇక వర్తమానానికి వస్తే.2019ఎన్నికల్లో రాష్ట్రంలోని175సీట్లకుగాను 151 సీట్లు గెలుచుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార పగ్గాలు అందుకున్న నాటి నుంచి పూర్తిగా అధికార పక్షం పెత్తనం లో ఏలుబడి సాగుతోంది. నంది అంటే నంది. తీరులో..ఏనిర్ణయం అయినా..అది ఎలాంటిదైనా మారు మాటాడే పరిస్థితి లేదు..వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వస్తూనే గత తెలుగు దేశం ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను రద్దు చేసి..కొన్ని కట్టడాలను కూల్చి వేసి గందర గోళం సృష్టించింది. పరా కాష్టగా మూడు రాజధా నుల నిర్ణయం..ఆపై ఉచి తాలు.. ఇంచు మించు రాష్ట్రప్రభుత్వం దివాలాతీసే పరిస్థితి.. వీటిపై ప్రధానప్రతిపక్షం తెలుగుదేశం ప్రశ్నిస్తూ.. నిలదీ స్తూ.. ఆందోళనలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నా సంఖ్యాబలం లేకపోవడం సైకిల్‌ పార్టీకి అతి పెద్ద మైనస్‌ పాయింట్‌!ఒక దశలో కేవలం ప్రతిపక్షం మీద దుగ్ధతో ప్రభుత్వం అకార ణంగా కౌన్సిల్‌ను కాన్సిల్‌ చేయాలని చూసినా అడిగే దిక్కు లేకుండా పోయింది.అఫ్కోర్స్‌..అది జరగ లేదు..ప్రభుత్వం ఏం చేస్తున్నా రాష్ట్రంలో ప్రతిపక్షం అడ్డుకునే పరిస్థితి ఎటూ లేకపోయినా కేంద్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాన రావడం లేదు..దీంతో వైసిపి ప్రభుత్వం ఎదురే లేని రీతిలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుం టున్న పరిస్థితి..కోర్టు కేసులను సైతం లెక్క చేయని విధం గా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అటు తర్వాత జరిగిన పంచాయతి.. మునిసి పల్‌ ఎన్నికల్లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసా గిస్తూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిం చింది..అదే రీతిలోప్రశ్నించే నాథుడే ఉండని స్థాయి లో ఏలుబడి సాగిస్తోంది.దానివల్ల రాష్ట్రంఎటు పోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది..అసలు ఇంచుమించు రెండు సంవత్సరాలకు పైగా రాష్ట్ర రాజధాని ఏదో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రాక పోగా ఉన్నవి చేజారిపోతున్న దుస్థితి.అలాగే కేంద్రం నుంచి పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులకు నిధులు తీసుకువచ్చే పరిస్థితి లేదు.అంతేకాకుండా రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కు కర్మా గారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నా అటు పార్లమెం టులో కూడా మంచి బలం ఉన్న వైసిపి అడ్డుకో లేకపోవడం విచారించదగ్గ మరో విషయం. ఇలాం టి అంశాల్లో రాష్ట్రంలోని అన్నిపార్టీలు కలిసి పోరా టాలు చేయాల్సిన అవసరం ఉంటుంది.కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు.అసలు ప్రతిపక్షాన్ని కలుపుకుపోయే ధోరణి అధికార పక్షానికి కిమ్మ న్నాస్తి..ఇక పోతే పంపిణీలపేరిట ఖజానాఖాళీ అవుతూ జీతాలు కూడా సరిగ్గా ఇచ్చుకోలేని..పెన్షన్లు సకాలంలో చెల్లించలేని దుస్థితిఏర్పడి ప్రభుత్వ ఆస్తు లు తాకట్టుపెట్టే దారుణచర్యకు సర్కారు తెగబడినా అడిగేనాథుడు లేడు..ఇది గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దయనీయ పరిస్థితి. నిజానికి మోడీ ప్రభు త్వం ప్రతిపక్ష మంటేనే లెక్కలేని విధంగా వ్యవ హరిస్తోంది. ప్రతిపక్షం లేవనెత్తే ఏ అంశాన్ని కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. తీర్మానాల అంశం లోనూ ఇదే ధోరణి. పార్లమెం టులో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే నిబం ధనలను సైతం అమలు చేయడానికి అంగీ కరిం చదు, ఖరారైన సభా కార్య క్రమాలను సస్పెండ్‌ చేసి సభ్యుడు లేదా సభ్యులు లేవనెత్తిన అంశాలను చర్చకు పెట్టే కీలకమైన అధికారాన్ని 267వ నిబంధన సభాధ్యక్షుడికి కట్టబెట్టింది.
రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో వెంకయ్య నాయుడు ఒక్కసారి కూడా ఈనిబంధన కింద చర్చకు అవకా శం ఇవ్వనేలేదు.రాజ్యసభ రికార్డుల ప్రకారం 2016 నవంబర్‌16నఈ నిబంధన ప్రకా రం రాజ్య సభలో చివరి సారిచర్చ జరిగింది. ఆగస్టు 10వ తేదికి వెంకయ్య నాయుడి పదవీకాలం ముగుస్తున్న సంగతి తెలిసిందే! ప్రతిపక్షం గొంతు ఈ స్థాయిలో నొక్కిన తరువాత ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధ మంటూ చేసే సవాళ్లకు అర్ధమేమిటి? మోడీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ స్థాయికి పడిపోయింది కాబట్టే జోక్యం చేసు కోవాలంటూ ప్రతి పక్ష పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాయాల్సి వచ్చింది. 15వ రాష్ట్రపతి గా ఎన్నికైనం దుకు శుభాకాంక్షలు తెలిపిన లేఖలోనే ఈ విష యాన్ని విపక్షాలు ప్రస్తావించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.ముర్ముఈ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ప్రజా సమస్యలు కూడా చర్చకు రాకుండా మోడీ ప్రభుత్వం వ్యవ హరిస్తున్న ఈ తీరు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఒకవ్యూహం ప్రకారం,మంద బలం తో ప్రజాస్వామ్యంపై చేస్తున్న ఈదాడిని ఐక్య పోరాటాలతోనే నిలువరించగలం.ఆ దిశలో విస్తృత ప్రజానీకాన్ని సమీకరించాలి. దీనికోసం ప్రజాస్వా మ్యవాదులు, లౌకిక,అభ్యుదయ,పురోగామి శక్తులు ఏకతాటిపై కదలాలి.ప్రజాస్వామ్య పరిరక్షణకోసం జరిగే పోరాటంలో ప్రతిఒక్కరూ భాగస్వా ముల వ్వాలి. ఇలా కేంద్రంలో,రాష్ట్రంలోఅధికార పార్టీ లుపూర్తి మెజారిటీతో ఏకపక్ష ధోరణిలో పాలన సాగిస్తుంటే ప్రజాస్వామ్యం ఉనికి ప్రమాదంలో పడుతోందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవు తున్న పరిస్దితుల్లో కొన్ని రకాలైన ప్రమాదాల అంచున మన దేశంలో వ్యవస్థలు నడుస్తున్నాయనేది నిస్సందేహం..!!-(ఇ.సురేష్‌ కుమార్‌)

గూడేలకు చెరగని గురుతు`బీడీ శర్మ

స్వతంత్య్ర దేశంలో ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక పరిపాలన కావాలని జీవితకాలం శ్రమించిన మహనీయుడు డా.బి.డి.శర్మ.తను బ్రహ్మణ కులంలో పుట్టినా అడవిలో తినటానికి తిండిలేక, కట్టుకోవడానికి బట్ట కరువై కేవలం అడవిపై, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే ఆదిమ తెగల పక్షాన నిలిచి ఆకలితో అలమటించే వాడికి ఆహారం దరిచేర్చి జీవించే హక్కును కల్పించడానికి కృషి చేస్తూ మానవత్వం చాటిన ఆదివాసీల ఆత్మీయ బంధువు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో 1929లో పుట్టిన బి.డి.శర్మ కష్టపడి చదివి ఐ.ఎ.ఎస్‌గా వివిధశాఖలలో పనిచేసిన ఆయనఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గా రిటైర్‌ అయ్యారు. 1996లో షెడ్యూల్డ్‌ ప్రాంతాల విస్తరణచట్టం (ఫెసా)రావటానికి, దాని నియమాలు రూపొందించిందీ శర్మనే. దిలీప్‌ సింగ్‌ భూరియా కమిటికి అసలు ఆదివాసీ ప్రాంతాలలో పెసాఅంటే ‘మావనాటే మావ సర్కార్‌’అంటే ‘మావూళ్లో మా రాజ్యం’,‘మా గూడెంలో మాపరిపాలన’ అంటే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలతో సహజీవనం చేసిన అనుభవంతో దీనిని గ్రహించారు. కనుకనే ఆదివాసీల జీవన విధానానికి, మైదాన ప్రాంతాల జీవన విధానానికి వ్యత్యా సం ఉంది. ఏజెన్సీ గూడేలలో ప్రత్యేక జీవన విధానం, ఆచార వ్యవహారాలు..సంస్కృతి సాంప్రదాయాలను విడిచి వారు బ్రతకలేరు. ఆదివాసీలకు నీరు,అడవి,భూమి(జల్‌ జంగల్‌-జమీన్‌)వారి నివాస ప్రాంతంపై స్వయం నిర్ణయం హక్కు కావాలని పరిత పించి దిలీప్‌ సింగ్‌ భూరియా కమిటికి తాను స్వయంగా రిపోర్టు తయారు చేసి, ఆదివాసి స్వయం పాలన హక్కుకై పార్ల మెంటులో ప్రయివేట్‌ బిల్లు పెట్టించి పాస్‌ చేయించటంలో బి.డి.శర్మ కృషి కీలకం. 1953 మొదటి బ్యాచ్‌లో ఐ.ఏ.ఎస్‌గా బి.డి. శర్మకు అనేక అవకాశాలు వచ్చినా తన ఉన్నతిని వెతుక్కోలేదు. సమాజ ఉన్నతికై కలగన్నారు. 1958లో బస్తర్‌ కలెక్టర్‌గా వెళ్ళిన శర్మకు నాటి బస్తర్‌ అనుభవం ఆదివాసీలను చేరదీ సింది. నాడు బస్తర్‌ నేడు7జిల్లాలుగా అంటే సూక్ష్మబీజాపూర్‌,సుక్మా,దంతెవాడ,ఉత్తర,దక్షిణ బస్తర్‌, బైలాడిల్లా,కాంకీర్లుగా విడిపోయింది. అంత పెద్ద ఆదివాసీ జిల్లాకు తొలిసారి కలెక్టర్‌ గా వెళ్ళిన శర్మకు ఆదివాసీల ఆటవిక జీవనం, కడుదారిద్య్రం స్వాగతం పలికింది. బస్తర్‌ పూర్తిగా ఆదిమతెగలు గలకొండ ప్రాంతం. ఆకలితో అలమటించే ఆదిమ తెగలకు ఆహారం, కట్టుకోవటానికి బట్టలు,గూడేలకు విద్యుత్‌ వెలుగులు లేక విషజ్వరాలతో మృత్యువు బారినపడుతున్నారు. బడిలోకి చేరే ఆదివాసీకి కనీస వైద్యం,రోడ్డు సౌకర్యం,మంచినీరు అందించి వారి అభివృద్ధికి తోడ్పాలని ఒక కలెక్టర్‌ గా కలలుగన్నాడు.అబూజ్‌ మాడ్‌ (కనిపించని కొండలు)లను సైతం కాలినడకన పగలనక రేయనక తిరిగారు. ఆదివాసీ జీవ నాన్ని చక్కదిద్దాలని అభివృద్ధి నమూనాలు తయారు చేసి, కలలుగన్న శర్మకు అభివృద్ధి స్థానంలో విధ్వంసం అనే ప్రగతి నమూనా రావడంతో కలలన్నీ నిర్వీర్యమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టటంతో పాటు ఆకలెక్టర్‌ కే అధి కారికంగా ఉక్కు పరిశ్రమ చేపట్టాలని సూచిం చింది. కలగన్నది అభివృద్ధి నమూనా ఉక్కు పరిశ్రమతో విధ్వంస నమూనాగా మారింది. ఇనుప ఖనిజం త్రవ్వకం మొదలయితే ఆదిమ తెగలు తమ అస్థిత్వాన్ని కోల్పోతారని దీని నుంచి వచ్చే విషతుల్యం వలన అనేక మంది ఆదివాసీలు రోగాల బారినపడి మృత్యువాత పడతారని,దీంతో అమాయకులైన వారి మను గడ ఇక ప్రశ్నార్ధకమేనని గ్రహించారు.ప్రభుత్వ ఏజెంట్‌గా ప్రభుత్వం తరపునే నిలబడి ఉక్కు త్రవ్వకాలు చేపట్టాలి. కానీ ఒకకలెక్టర్‌గా తన అధికారాన్ని రాజ్యాంగబద్ధ నిబంధనలతో ఇది మానవహక్కులు, నిబంధనలకు వ్యతిరేకం అని, జీవించే హక్కుకు భంగకరమని అని,ఉక్కు పరి శ్రమ అనుమతులు రద్దు చేపించాడు.రాజ్యం తననేం చేస్తుందోనని ఆలోచించకుండా అన్నిం టికీ సిద్ధపడి రాజ్యాంగబద్ధంగా మానవత్వాన్ని చాటుకున్నారు. తదుపరి బి.డి.శర్మకు జరిగిన అవమానానికి ఆదివాసీలు ఏం చేసినా తీర్చు కోలేనిది.ఉక్కు పరిశ్రమ అనుమతులు రద్దు చేశాడనే నెపంతో బి.డి.శర్మను బస్తర్‌ వీధుల్లో బిజెపి పార్టీ నాయకులు అధికారికంగా..అదీ అర్ధ నగ్నంగా చెప్పులు మెడలో వేసి ఊరేగిం చారు.ఒక కలెక్టర్‌గా తనఅధికారాలను కూడా స్వేచ్ఛగా, రాజ్యాంగబద్ధంగా ఉపయో గించుకునే హక్కు లేదని సామ్రాజ్యవాదులు కాళ్ళ కింద భారతరాజ్యాంగాన్ని తాకట్టు పెట్టే సార్వభౌమ, సార్వత్రిక, లౌకిక, గణతంత్ర అనే మాటలు విలువలు లేకుండా చేసిన,అదీ స్వయాన ప్రభు త్వమే అధి కారికంగా చేసిన దుర్మార్గపు సంఘ టన.అంత అవమానం జరిగినా బి.డి.శర్మ కృంగ లేదు. కృశించలేదు. ముఖంపై చిరు నవ్వుతో నేడు సామ్రాజ్యవాదులు వీరి కబం దహస్తాల క్రింద కుళ్ళుపట్టే రాజకీయ పెద్దలు పతనం అయి ప్రజల చేత,ప్రజల కొరకు పాలిం చబడే వ్యవస్థ ముందు భవిష్యత్‌ సమాజ రక్షణ కు చైతన్యంగా నా ఊరేగింపు నిలుస్తుందని, నేటి సమాజంలో ఆదివాసీల రక్షణకు ఇంత నిస్వార్థంగా త్యాగాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు! వాస్తవంగా బి.డి.శర్మ అబూజ్‌ మడ్‌ లో మావోయిస్టుల కంటే ముందు కాలు పెట్టాడు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా. కానీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలే అతని ఆశయానికి అడ్డు అయినవి. ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న బి.డి.శర్మ ఒక అంశాన్ని మాత్రం నిస్సం కోచంగా మాట్లాడాడు. భారత స్వాతంత్య్య్ర సంగ్రామంలో మనదేశం స్వాతంత్య్ర దేశం 1947)గా ఏర్పడిరది. భారత ప్రజల మను గడను సుస్థిరం చేసుకుంది. కానీ అప్పటి నుండి ఆదివాసిల మనుగడ ఈ దేశంలో ప్రశ్నార్థకంగా మారిందని,ఆదివాసీలు భవిష్యత్తులో విధ్వంసకర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పిన మాటలు నేటికీ నిజమవుతున్నవి. దేశ విభజన నేపథ్యంలో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న నాగా, మిజోరంలలో వున్న సంతాల్‌, గోండు ప్రాంతాలను బర్మా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఖాట్మండ్లుగా, విభజించారు.మధ్య భారతం లోని గోండులను ఒరిస్సా, చత్తీస్గఢ్‌,మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్రలుగా విభజించారు. విభజించిన అనంతరం నర్మద,సర్దార్‌ సరోవర్‌, గోదావరి పోల వరం, హీరాకుడ్‌,కంతనపల్లి లాంటి భారీ ప్రాజెక్టులను కట్టి అభివృద్ధి పేరిట ఆది వాసీలను జలసమాధి చేస్తున్నారు. పోస్కో, టాటా,మిట్టల్‌, జిందాల్లకు బాక్సైట్‌ ఎక్కు లాటరైట్‌, గ్రానైట్‌ లాంటివి కట్టబెట్టి తెగల జీవనాన్ని విధ్వంసం చేస్తున్నారు. టైగర్‌ జోన్‌ల పేరిట అడవుల నుండి గెంటేస్తున్నారు.అడవిలో స్వేచ్చగా జీవించే ఆదివాసీలను మావోయిస్టుల పేరిట ఇబ్బంది పెడుతున్నారు.1956 సైనిక అధికారాలు చట్టం లాంటివి అమలు చేసి ఈశాన్య భారతంలో పౌరులని చంపి వేర్పాటువాదులుగా ముద్ర వేస్తున్నారు. ఆదివాసి మహిళలపై పాశవిక అత్యాచారం, హత్యలను సైన్యం జరిపి ప్రజాస్వామ్య రక్షణ కోసమని ప్రకటిస్తున్నారు. ఇటువంటి దురాగతాలను బి.డి.శర్మ ముందుగానే గ్రహించి తన జీవితాన్ని ఆదివాసీల కోసం ధారపోశారు. మావో యిస్టులు బస్తర్‌ కలెక్టర్‌ వినీల్‌ కృష్ణను కిడ్నాప్‌ చేసి 18రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు,అనాటి ప్రభుత్వం తరపున మధ్యవర్తిగా.. పోలవరం లాంటి ప్రాజెక్టు అయిన ఆగకపోతుందా అనే ఆశతో మావోయిస్టులతో మాట్లాడి ఒప్పించి,కలెక్టరును విడిపించటానికి దండకారణ్యానికి బయల్దే రాడు.కానీ,ప్రభుత్వం తన నీతిలేని బుద్ధిని నిరూపించుకుంది. కలెక్టర్‌ విడుదలయ్యాక ఏకంగా పార్లమెంట్‌ బిల్లు పెట్టి 5వ షెడ్యూల్‌, 1/70,ఎల్‌.టి.ఆర్‌ లాంటి చట్టా లకు విరుద్ధం గా పోలవరంని కట్టే ప్రక్రియను చట్టబద్దంగా పూర్తి చేసుకుంది. ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ లాంటి దుర్మార్గాలను సైతం ఆపటానికి బి.డి.శర్మ చేసిన కృషి ఎనలేనిది.భారత దేశంలో బి.డి.శర్మ అనేక ఆదివాసీ ప్రాం తాలు పర్యటించి 76పుస్తకాలు రాశారు. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణాలతో బి.డి.శర్మ అనుబంధం మరువలేనిది.1996 ఆగస్టు 6న ఆదివాసి స్వయంపాలన,ఎ,బి,సి,డి వర్గీకరణ కోసం ఏర్పడ్డ ‘తుడుందెబ్బ’గూడూరులో మొదటి బహిరంగసభ ఏర్పాటు చేస్తే ప్రొ.బియ్యాల జనార్ధనరావు పిలుపు మేరకు బి.డి.శర్మ ఉద్యమ దిశా నిర్దేశాన్ని ప్రకటించారు.నిత్యం ఆదివాసీల సంక్షేమం కోసం పరితపించిన బి.డి.శర్మగారు 2015 డిసెంబర్‌ 8న కాల గమనం చెందారు.20ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో విద్యా, ఉద్యోగ, రాజకీయ చైతన్యంలో దేశ వ్యాప్తంగా విద్యా, సామా జికంగా చైతన్యమై ఆదివాసీ అభివృద్ధి సమూ నాను సుస్థిరం చేసుకున్న రోజు,ఆదివాసి స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను రక్షించుకున్న రోజు బి.డి.శర్మకు ఘనమైన నివాళి అవుతుంది.వ్యాసకర్త : – గుమ్మడి లక్ష్మీ నారాయణ,ఆదివాసీ రచయితల వేదిక, వ్యవస్థాపక కార్యదర్శి, సెల్‌ : 9491318409

మహానీయ స్వామి వివేకానంద

మహనీయ స్వామి వివేకానంద ఉన్నతమైన ఆశయాలు ఏదోఒకరోజు సర్వజనాంగీ కారాన్ని పొందుతాయి. కారణం ఆభావన, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ,ప్రతీ ఆలోచనా విధా నంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషాయాంబరాలు ధరించి,పద్మాసనస్థుల్కె, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచు కుని,అర్థనిమీనేత్రుల్కె ధ్యానమగ్నుల్కె వివేక మం తమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒక జగద్గురువు. సామాజిక సృహతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విషయాలను వివేకించటం ద్వారా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించడం, ఆ సౌధంలో చ్కెతన్యమూర్తులుగా జనులను విరాజిల్లింపచేయటం స్వామి వివేకానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంత రాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృ తమైన కొత్త విషయాలను అనుభ విస్తూ, క్రొంగొత్త శక్తుల వశీకరింపచేసు కుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివేకానంద. 1863వ సం.లో కలకత్తా నగరంలో జన్మించిన స్వామి వివేకానంద ఆరేళ్ళ ప్రాయంనుంచే అంతర్ముఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నుడ్కె ఉండేవారు.జ్యోతిర్మయ ప్రకా శంలో జీవిస్తూ చిరుప్రాయంలోనే సృజనా త్మకత, ఆత్మ ప్రతిష్ట, ఆత్మ ప్రేరణలో దివ్యదర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆచ్కెతన్యంలో విరాజిల్లే అంతర్ముఖ చ్కెతన్య స్వరూపుడు.‘‘నేను భగవంతుడిని నిన్ను చూస్తు నంత స్పష్టంగా చూశాను,మతం అనేది అను భూతి పొందవలసిన సత్యం,లోకాన్ని మనం అర్దం చేసుకోవటంకన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’’అని ప్రవచించే శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో న,కర్మ,భక్తి,యోగ మార్గాలో కానరాని మెరు గులు ఆస్వాదించి వారి వచనాలను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగచేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధరించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసం గం బాహ్యంగా ఎగసిన ఉత్సాహపు టలలోనే కాక, ఉద్వేగ ప్రవాహాలోనే కాక, నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూతన కాంతి పుంజం. దానిని గురించి ఒక్క మాటలో చెప్పటానికో, వ్రాయటానికో కుదిరేది కాదు. చికాగో ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడమే కాదు, సాక్షాత్తు భారతదేశం కూడా గర్వించేలా చేసింది. అమెరికాలో ఎగసిన ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది.‘‘నేను ఎవరిని?ఆసియా వాసినా? ఐరోపా వాసినా?అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను’’ అనేవారు స్వామి. మనుషులు ఎలా జీవించాలో స్వామి మాటల్లో…‘‘అందాన్ని పెంచుకుంటే నిన్ను కెమేరాలో బంధించి ఆనందిస్తారు అస్తిని పెంచుకుంటే నిన్ను గంధపు చెక్కలలో తగులబెడతారు పేరును పెంచుకుంటే నిన్ను సన్మాన పత్రాలతో సన్మానిస్తారు హోదాను పెంచుకుంటే నిన్ను హోర్డింగులలో నిల బెడతారు అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే నిన్ను జనం గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు’’
ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహించి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మ జ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వాన్ని దర్శించవచ్చని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి శ్రీవివేకానంద. హిందూమతాన్ని కించపరిస్తే సహించేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘ టించి హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పే వారు.జీవితంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పేవారు. ‘‘ఆహార నియంత్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియంత్రణ లేకుండా మనస్సుని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారితీస్తుంది.మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి’’ అనేవారు. ప్రేమతత్వాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదిం చేవాడు.మతం అనేది సిద్ధాంత రాద్ధాంత ములతో లేదు అదిఆచరణలే ఆధ్యాత్మికంగా పరిణతి చెందడంలో మాత్రమే వుంది అని విశ్వసించేవారు. వివేకానందను విదేశాలలో అనేకులు కుమారునిగా, సోదరునిగా భావిం చారని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆయన పరిణతి కనిపిస్తుంది. భారతదేశంలో ఇటు వంటి బాంధవ్యాలు కొత్త కాదు. విదేశాలలో ఇటువంటివి ఉత్పన్నమైనప్పుడు ఆయన వైఖరి విశిష్టత అర్థం అవుతుంది. జాతి మౌఢ్య, వర్ణ మౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసు లను దోచుకోవడం గమనార్హం. అహింసలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలకు చోటులేదు. సత్యనిష్టుని సాన్ని హిత్యంలో అసత్యం నశించిపోతుంది. అందుకే అన్ని ఎల్లలను అతిక్రమించిన స్వామి వివేకా నంద ఆత్మ్ఞనంలో సుప్రతిష్టుల్కె ఉండగా ఎలాంటి వివక్షత తలెత్తడం సాధ్యంకాదు. వివేకానంద ఆధ్యాత్మిక శక్తి గురించి విన్న విదేశీయులు ఆయనతో సన్నిహితంగా మెలగటానికి మక్కువ చూపేవారు. తాను జన్మించిన కుటుంబాన్ని పరిత్యజించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరించారు. భారతదేశం కూడా తక్కిన దేశాలతో పాటు అభివృద్ధి పొందగోరితే పేదలు, పామరులు పురోగనమం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కి వక్కాణించారు. భారతదేశపు గౌరవ మర్యాదలను విదేశాలలో ఇనుమ డిరపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పటికే ప్రచారంలోవున్న భారత వ్యతిరేకతను తొలగించటానికి నడుం బిగిం చారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామాలు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయిన ప్పటికి,ప్రతి ప్రసంగంలోనూ మన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించేవారు. మతాల మధ్య వ్యత్యాసాలు ఉండపచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికతను గుర్తించమని చెప్పేవారు. హైందవుల శాంతి కాముకత్వాన్ని తన అహింసా తత్వంతో వెల్లడిచేసేవారు. శక్తివంతమైన ఈ భారతదేశం ప్రపంచాన్ని జయిస్తుంది. అందుకే ‘‘ఓభారతమా! నీఆధ్యా త్మికతతో ప్రపంచాన్ని జయించు!’’ అంటూ స్వామి సింహనాదం చేసేవారు. ప్రశాంతత, పవిత్రత,త్యాగశీలత,సౌభ్రాతృత్వాల సందేశా లను వివరించి సహన రహిత చెవిటి చెవులలో ప్రతిధ్యనులు ఉద్భవింపచేయటంలో విజయం సాధించారు.దుస్తరమైన అద్వ్కెతాన్ని కళాత్మ కమైనదిగానూ,సజీవమైనదిగానూ వర్ణించారు. భయం కలిగించే యోగ సంప్రదాయాలను అత్యంత శాస్త్రీయంగానూ,ఆచరణ యోగ్యం గానూ వివరించే మానసిక శాస్త్రంగా వివరిం చేవారు. సత్యమనేది మతానికి ఆపాదించటం మూర్ఖత్వం అని చెప్పేవారు. విదేశాలలో ధీర గంభీరత్వంతో ఎన్నో ఆటుపోటు లను ఎదుర్కొని సత్యంవైపు అడుగులు వేసారు. మనలో నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు.‘‘మన జాతీయ ఆత్మన్యూన తాభావ జాఢ్యాన్ని వదిలించుకునేలా చేసిన వ్యక్తి వివేకానంద’’అని రాజాజీ పేర్కొన్నారు. వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి.లేఖ మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని ప్రారంభించారు. భగవదనుగ్రహం వలన పావనత సంతరించు కున్న మనస్సులో ఉద్భవించిన చింతనలే లోకాన్ని కదిలించి వేస్తాయనటంలో అతిశ యోక్తిలేదు. ‘అక్కడ సూర్యుడు ప్రకాశించ డు.చంద్రతారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు.ఇక ఈఅగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి.దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడుతున్నది.’ ‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచలను నేను క్షుణ్ణంగా చదివాను,ఆతరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచన చదవాల్సిందిగా మిమ్మల్ని కోరు కుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు,వెనుకబడ్డ వారికిసేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘అని ఉద్భో దించి భారతీయ యువతకుదిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమ యంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురి చేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేతస్వామి.తన 33ఏళ్ళ వయసులోనే మరణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాధలుగా మార్చివేశారు. మనలో ధ్కెర్యంసడలి,దౌర్భ్యం ఆవహిస్తే ‘‘నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామ కృష్ణు శిష్యుణ్ణి నేను’’అనే భావనలు మనసులో నింపుకుంటే సమస్తదౌర్భ ల్యాలు,అధ్కెర్యము మటుమాయమయుతాయి అని సర్వులకు ప్రభోదించేవారు. శ్రీవివేకానందుని జన్మదినం పురస్కరించుకుని భారతప్రభుత్వం ‘‘జాతీయ యువజనది నోత్సవం’’గా ప్రకటించింది.‘‘జనన మరణాలు సహజం,కాని నాభావనలు మావ వాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను’’ అన్న స్వామి వివేకానందుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం,సర్వదా ఆచరణీయం.- (డాక్టర్‌.దేవులపల్లి పద్మజ), వ్యాసకర్త : ప్రముఖ రచయిత్రి, విశ్వశ్రీ, సాహిత్యశ్రీ విశాఖపట్టణం,ఫోను. 9849692414

1 8 9 10 11 12 48