ఎకో టూరిజంపై సమత శిక్షణ తరగతులు

స్థానిక వనరులపై స్థానికులకే హక్కు కలిగి ఉండాలనే లక్ష్యంతో సమత గిరిజన యువతకు ఏకోటూరిజంపై జూన్‌ 19నుంచి 26వ తేదీ వరకు ఆరురోజుల పాటు గిరిజన యువతకు శిక్షణ తరగతులు నిర్వహించారు.‘‘స్థానిక వనరులపై స్థానిక ఆదివాసులకే హక్కు ఉంది’’అనే అంశంపై శిక్షణ కార్యక్రమం జరిగింది.విశాఖ ఉమ్మడి జిల్లా ఐదువ షెడ్యూల్‌ ప్రాంతానికి చెందిన కటికి, కొల్లా పుట్‌,సరియా,సరుగుడు ఆదివాసీ ప్రాంత జలపా తాల వద్ద జరిగిన శిక్షణకార్యక్రమంలో సుమారు 30మంది యువతీ,యువకులు పాల్గొన్నారు. ఈ యువకులంతా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న స్థానికంగాఉన్న వనరుల సద్విని యోగంపై అడిగి తెలుసుకున్నారు. అనంతిగిరి మండలం బొర్రా పంచా యితీ కటిక జలపాతం వద్ద నుంచి శిక్షణ కార్యక్ర మం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని బొర్రాపంచా యితీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు ప్రారంభించారు. సర్పంచ్‌ మాట్లాడుతూ కటికి వాటర్‌ ఫాల్స్‌ చరిత్ర ను వివరించారు.తర్వాత గ్రామపెద్ద గెమ్మెల దేవ కుమార్‌ మాట్లాడుతూ ఈ జలపాతాలు ద్వారా స్థానిక యువ కులు పొందుతున్న స్వయం ఉపాధి గురించి వివరించారు.వాటర్‌ ఫాల్స్‌ నిర్వహణ కమిటీ తరుపున గెమ్మెల రమేష్‌ మాట్లాడుతూ దీనివల్ల సుమారు 30మంది ఆదివాసీ కుటుంబాలు స్వయం ఉపాధిని పొందుతున్నట్టు చెప్పారు.ఆనాడు సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవిరెబ్బాప్రగడ ఆద్వ ర్యంలో ఆనాటి ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ శివశంకర్‌ ఏర్పాటు చేసిన కటికి వాటర్‌ ఫాల్స్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ నేడు మా ఆకలి తీర్చుతోందని వివరించారు. రెండోవరోజు కటికి,సరియా,సరుగుడు వాటర్‌ పల్స్‌ టీంలు కాటికి వాటర్‌పల్స్‌ పరిసర ప్రాంతాల్లో స్వచ్‌ భారత్‌ నిర్వహించారు.అక్కడ నుంచి మూడవ రోజు కొల్లాపుట్‌ ఎకో రిసార్టుస్‌కు చేరుకున్నారు. ఇక్కడ జరిగిన శిక్షణలోఐ.టి.డి.ఏ.నుంచి ఎకో టూరిజం కో-ఆర్డినేటర్‌ గణపతి నాయుడు రిసోర్స్‌ పెర్సన్‌గా హజరయ్యారు. ఆయన ఎకో టూరిజం ప్రాముఖ్య తను వివరించారు.ఎకో టూరిజం అంటే ప్రకృతిని పాడు చేయకుండా చేసే కార్యక్రమని అన్నారు. దీనిద్వారా స్థానిక యువకులకు స్వయం ఉపాధి లభిస్తోందని,నీరు కలుషితం కాకుండా చెత్త చెదరాలను లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే దీని లక్ష్యమన్నారు. పర్యా వరణాన్ని పరిరక్షించుకోవడానికి స్థానికులను చైతన్య వంతులను చేయాలని కోరారు.చెట్లను నరక కుండా అందంగా తీర్చిదిద్దాలి.ఎకోటూరిజంద్వారా ప్రకృతి సహసిద్దమైన కూరగాయలు,అటవీ ఉత్పు త్తులు లభిస్తాయని వాటి ద్వారా కూడా జీవనో పాధిని పెంపొదించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రీనరీ ని పెంచడం ద్వారా టూరిస్టులు ఆకర్షితులు అవు తారని, వాటర్‌ పల్స్‌ దగ్గర ప్లాస్టిక్‌ కనిపించే కుండా టీం వర్కు చేయాలని పిలపు నిచ్చారు. అలాగే ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిని అలాగే ఉంచి మనం క్రియేటివిటీగా ఆలోచించి అందంగా తీర్చి దిద్దినట్లుయితే అప్పుడు పర్యాటకులు ఇష్టపడ తారని సూచించారు.మొదట స్థానికంగా మనం ప్లాస్టిక్‌ని వాడకం తగ్గించాలని,తరువాత టూరిస్టు లకు చెప్పాలని సూచించారు. స్థానికంగా అటవీ ప్రాంతాల్లో లభించే ఆకులు,వెదురును వస్తువులుగా తయారు చేసి వినియోగించుకొని స్వయం ఉపాధి పొందవచ్చన్నారు.మట్టి కుండల్లో మంచినీటిని నింపి డోకులతో పర్యాటకులకు ఇవ్వడం అలవాటు చేయాలి.ఆదివాసీ సాంప్రదాయాలను,ఆచారా లను,మనం టూరిస్టులకు చూపించాలి.ఈ విధంగా ఉంటే మన ఆదాయం పెరుగుతుంది అని వివరిం చారు.చాపరాయి వాటర్ఫాల్స్‌ టూరిజం మేనేజర్‌ అప్పారావు కూడా పలు సూచనలు చేశారు.ఎకో టూరిజం-ఎకోఫ్రెండ్లీగా ఉండాలి. ఎకో టూరిజం మన ఆదివాసీప్రాంతాల్లో చాలాచక్కగా చేయవచ్చు న్నారు.నేచర్‌ ఎస్‌ టీచర్‌ ట్రైబ్‌ ఎస్‌ గైడ్‌ టీం వర్క్‌కి సొసైటీ కీ చాలా సంబంధం ఉంటుంది, మొదట టీం వర్క్‌ బలపడితే,దాని సొసైటీగా రిజిస్టర్‌ చేయ వచ్చు,ఈ సొసైటీలో ప్రెసిడెంటు, వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ,జాయింట్‌ సెక్రెటరీ, కోశాధికారి మరియు మెంబెర్స్‌ ఉంటారు. దీనికి ఒక బై లా ఉంటుంది. దాని ప్రకారం సొసైటీ ని నడపాలని సూచించారు. ముఖ్యంగా రికార్డ్స్‌ రాయాలి,ప్రతి సంవత్సరం అడిట్‌ చేయించాలి, టూరిజంలో ఎకోటూరిజం, అగ్రికల్చరల్‌ టూరిజం,హోమ్‌ స్టే టూరిజం ఇలా 75 రకాలు ఉన్నాయి. ఆతర్వాత 2016లో కొల్లా పుట్‌ రిసార్ట్‌ పేరుతో నిర్మించిన 8కాటేజీలద్వారా స్థానిక యువతీ, యువ కులు పొందుతున్న స్వయం ఉపాధిపై వివరిం చారు.అక్కడ నుంచి కొత్తపల్లి జలపాతంను సందర్శించారు.ఇక్కడ నవీన్‌ మేనేజర్‌ మాట్లాడుతూ ఇక్కడ 12మంది యువకులు పని చేస్తున్నారు వీరు అంతా ఆదివాసీ తెగ(పీటీజీ) గ్రూప్‌కు చెందిన గిరిజనులని వారు ఇక్కడ స్వయం ఉపాది పొందు తున్నట్టు తెలిపారు.అక్కడ నుంచి చింతపల్లి మండలం,పెదబారడా పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చేరుకున్నారు.ఇక్కడ చింతపల్లి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు ఆధ్వర్యంలో చింతపల్లి అటవీశాఖ సబ్‌ డివిజినల్‌ అధికారి బెర్లాండ్‌రాజు,రేంజ్‌ అధికారిణి చిట్టితల్లి,సెక్షన్‌ ఆఫీసర్‌అప్పారావు బీట్‌ఆఫీసర్‌ వెంకటరావు గార్డులతో కలసి అవగాహన సదస్సు నిర్వహిం చారు.అటవీశాఖ అధికారులకు సమత కోఆర్డినేటర్‌ సతీష్‌ కుమార్‌ సమత నిర్వహిస్తున్న ఏకో టూరిజం శిక్షణపై వారికి వివరించారు. గత మూడు రోజుల నుండి కాటికి జలపాతం, కొల్లాపుట్‌ ఎకో టూరి జం,లంబసింగి టీం అందరు సందర్శించడం, అక్కడ వారు చేస్తున్న పని, ఎకో టూరిజం ద్వారా ఎలా జీవనోపాధి పొందుతు న్నారు, వంటి అంశాలు శిక్షణలో నేర్చుకోవడం జరిగిందన్నారు.షబ్‌ డివిజినల్‌ అధికారి మాట్లా డుతూ కృష్ణాపురం గ్రామం దగ్గరలో ఎకో టూరి జం,మీఅందరి సహకారంతో మొదలు పెడతాం. ఈటూరిజంలో మీ గ్రామస్తులు పని చేసుకొని ఉపాధి పొందడం మన ముఖ్య ఉద్దేశ్యమని వివరిం చారు. దీనికి అందరు సహకరించాలని ఆదివాసీల సహకారం లేకపోతేె ఈ ప్రాజెక్టుని తాము ముందుకు తీసుకెళ్లలేమని సూచించారు.అక్కడ నుంచి నాత వరం మండలం సరుగుడు పంచాయితీ సుందర కోటవాటర్‌ ఫాల్స్‌ సందర్శించారు. ఇక్కడకు కూడా చాలా మంది టూరిస్టులు రావడం జరుగుతుంది. ఇక్కడ గవర్న మెంటు కొంత సుందరంగా తయారు చేశారు ఫారెస్టు డిపార్టుమెంట్‌ కొంత పెన్సింగ్‌ కట్టడం సరుగుడు వాటర్‌ పల్స్‌ అనిబోర్డు పెట్టడం జరిగింది. ఇక్కడ టికెట్‌ కలెక్షన్‌ లాంటివి చేయడం లేదని స్థానికులు తెలియజేశారు.
ఈ శిక్షణ నాకు ఎంతో ఆలోచన ఇచ్చింది..!
మాది సరుగుడు గ్రామం నేను బి.టెక్‌ చదివాను. ఈఐదురోజులు చాలా ప్రాంతాలు సందర్శించడం వల్ల నాకు ఎంతో ఆలోచన వచ్చింది.సరుగుడు వాటర్‌ ఫాల్స్‌వద్ద టోల్‌గేట్‌ ఏర్పా టుచేసి ఇక్కడ నిరుద్యోగ గిరిజన యువకులం స్వ యం ఉపాధి పొందుతాం.అందుకు సమత సహకా రం అవసరం.
చిన్నా.సరుగుడు ఎకో టూరిజం పెట్టవచ్చు అనేది ఆలోచన మాది కాటికి గ్రామం. మేము దాదాపు 15 సంవ త్సరంల నుండి కాటికి వాటర్‌ఫాల్స్‌ని నిర్వహి స్తున్నాము. ఇందులో దాదాపు 20మందికి ఉపాధి దొరుకుతుంది. కొల్లాపుట్‌ రిసార్ట్‌ ద్వారావారు ఉపాధి ఎలాదొరుకుకుతుంది నేర్చు కున్నాము.అలానే ఫారెస్టు డిపార్టుమెంటు ద్వారా కూడా ఎకో టూరిజం పెట్టవచ్చు అనేది ఆలోచన వచ్చింది. తమాల మోహన్‌,కటిక గ్రామం.
ఎక్సపోసర్‌ విజిట్‌లో చాలా నేర్చుకున్నా..
మాది బొర్రా గ్రామం. ఈఎక్సపోసర్‌ విజిట్‌లో చాలా అవసమైన విషయాలు నేర్చుకున్నాము. ఒక ప్రొడక్టుని వేల్యూ ఎడిషన్‌ చేస్తేదాని డిమేండ్‌ ఎలా ఉంటాది అనేది అర్ధమైంది. అలానే ఏదైనా ఒక ప్రాజెక్టు లో టీంవర్క్‌పాత్ర దాని ప్రాముఖ్యత ఎలా ఉంటాది తెలు సుకున్నాం.మనకు ఉన్న వనరులపై హక్కు మనకే ఉంది అనేది అర్ధం అయ్యింది. అలానే స్థానికంగా దొరికే వెదురుతో తయారు చేసిన వస్తువులకు రంగులు పూసి వాల్యూ ఎడిషన్‌ చేస్తే ఆదివాసీ వ్యాపారులకు ఇంకా మెరు గ్గా డబ్బులు వస్తాయి. ముఖ్యంగా మనం టూరిస్టు లకు ఏదీ ఫ్రీగా ఇవ్వ కూడదు అనేది ఈ విజిట్‌ ద్వారా అర్ధం అయ్యింది.
`వంతుల మేరీ,బొర్రా
మహేష్‌ జర్ర: మాది సిరియా వాటర్‌ పల్స్‌, మేము ఒక్క టిక్కెటు కలెక్షన్‌ చేస్తూ 10 మంది ఉపాధి పొందుతున్నాము . మొదటిలో స్థానిక పంచాయతీ నుండి చాలా వత్తిడి వచ్చింది. వాటర్‌ పల్స్‌ పంచాయితీది అని చాలా ఇబ్బంది పెట్టారు. మేము అన్ని తట్టుకొని చేస్తున్నాము సమతా సతీష్‌ గారి ద్వారా కటికి వారు నిర్వహిస్తున్న వాటర్‌ పల్స్‌ ని సందర్శించడం జరిగింది, అలా నే వారిని చూసి మాకు కూడా కొంత దైర్యం వచ్చింది. సర్యా వాటర్‌ పల్స్‌ అనేదిచాలా ప్రమాద కరమైన ప్రదే శం,కాబట్టి మేము చాలా జాగ్రత్త పని చేయా లి, ముఖ్యంగా టూరిస్టులు విశాఖపట్నం నుండి వస్తారు.ఈ విసిట్‌ వలన మాకు కొత్త ఆలోచనలు వచ్చాయి,ఆదివాసీ సాంప్రదాయ పద్ధతులు టూరి స్టులకు చూపిస్తే వారు ఆకర్షితులు అవుతారు. మేము కూడా ఎకోటూరిజం ప్రాజెక్టు నాకు ఆలో చన చేస్తాము.-(కె.సతీష్‌ కుమార్‌)

పోలవరం పోరు కేక

పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఆంధ్ర ప్రదేశ్‌ సస్యశ్యామలంగా ఉంటూ పంటలు సుభిక్షంగా పండు తాయని ఉద్దేశంతో వేల ఎకరాల భూ ములు గ్రామాలు ఖాళీ చేసి కట్టుబట్టలతో బయటికి వెళ్లిన అభాగ్యులు కన్నెర చేశారు.పోలవరం నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేసి ఇచ్చిన హామీలను నెరవేర్చ కుండా,సరైన పునరావాసం కల్పించకుండా కాలం గుడపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పే విధంగా పోరు కేకతో నిర్వాసితులు మమా పాద యాత్రకు కదం తొక్కారు. జూన్‌ 20 అల్లూరి జిల్లా నెల్లిపాక నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర జూలై 4న విజయ వాడలో ముగిసింది.
జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసిన బాధ్యత మొదట తమదేనన్న కేంద్రప్రభ/త్వం నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ విషయంలో ఎందుకు నిర్వక్ష్యం వహి స్తుందని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణాలను అంగ రంగ వైభంగా చూపిస్తున్న ప్రభుత్వం.. నిర్వాసితుల వేదనలను ఎందుకు ప్రజలకు వివరించడం లేదని ప్రశ్నించారు. పునరావాసం పూర్తయ్యాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ మూరు మూరులో పాదయాత్ర కొనసాగుతుంది. కళ్లుండి చూడ లేని,చెవులుండీ వినలేని గుడ్డి,చెవిటి ప్రభు త్వాల్ని మనం ఎన్నుకున్నామని నిర్వాసితులు విమర్శి స్తున్నారు. వరదలోస్తే మురమూరు గ్రామాలు నీటి మునిగే ప్రమాదముందని,41కాంటూరులో కలపా లని కోరుతూ అధికారిక మెమోరాండం సమర్పిం చినట్లు నిర్వాసితుల తరుపున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు ప్రకటించారు. మురు మూరులో మొత్తం 356 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.పాదయాత్రకు వైసీపీ కాచవరం నాయ కులు సంఫీు భావం పలికారు.అనంతరం పల్లూరు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు.
నిర్వాసితుల డిమాండ్లు ఇవే
పోలవరం నిర్వాసితులకు పునరావాసంతోపాటు పూర్తి పరిహారం చెల్లించాకే గ్రామాలను ఖాళీ చేయించాలని మహా పాదయాత్ర డిమాండ్‌ చేస్తోంది. పునరావాసం పూర్తయ్యే వరకు ముంపు గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని,1986,2022నాటి వరద ముంపు ఆధారంగా ముంపు గ్రామాలు రీ సర్వే చేయాలని,మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పునరవాసం పరిహారం అర్హులందరికీ ఇవ్వాలని కోరింది.పునరావాసం ఏకకాలంలో అన్ని గ్రామా ల్లో పూర్తి చేయాలని,ప్రతి ఎకరానికి రూ.20లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. గ్రామాలు ఖాళీ చేయించే నాటికి18ఏళ్లు నిండిన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం ఇవ్వాలని,నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కోరింది.
ఇలా సాగిన పాదయాత్ర
అల్లూరి సీతారామారాజు జిల్లా నెల్లిపాక నుంచి నిర్వాసితుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో 400కిలోమీటర్ల మేర 15రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. జూలై నాలుగో తేదీన విజయవాడలో మహా ధర్నాతో పాదయాత్ర ముగిసింది. పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు,కార్యవర్గ సభ్యులు మంతెన సీతారాం,వీ.వెంకటేశ్వర్లు పాల్గొ న్నారు.
పోలవరం పునరావాసం కోసం…
పోలవరం ప్రాజెక్టు చాలా సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా వుంది. ఇదిబహుళార్థక సాధక ప్రాజెక్టు అని సాగు నీరు,తాగునీరు,విద్యుత్‌ ఉత్పత్తికి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ప్రచారం చేశారు. ప్రాజెక్టుని మాహయాంలో పూర్తిచేస్తా మంటే మాహ యాంలో ప్రారంభిస్తామని గొప్పలకు పోయి మరీ మాట్లాడడం మనంచూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు,ప్రధాన ప్రతిపక్షాలు చెప్పింది చెబు తున్నది….ప్రాజెక్టు ఎత్తు, పొడవు,వాలు,డ్యామ్‌ నిధులు…వీటి గురించే. కానీ నేడు చర్చించాల్సింది సర్వం త్యాగంచేసిన నిర్వాసితుల గురించి. పోల వరం నిర్వాసితులకు న్యాయం చేయా లని సి.పి.యం ఆధ్వర్యంలో జూన్‌ 20వ తేదీ నుండి జులై 4వరకు చేపట్టిన‘మహా పాద యాత్ర’ గ్రామాల సరిహద్దులు దాటుకుంటూ చైతన్య పరుస్తూ జూలై 4న విజయవాడకు చేరికొని మహా సభతో ముగి సింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 8 మండలాలు, 222 పంచాయతీలు, 373గ్రామాలు,1,06, 000 కుటుంబాలు నీట మునుగుతాయి. లక్షల జనాభా నీట మునిగి ఆస్తులు,సంపద పోగొట్టుకుంటున్నా వీరి సంక్షేమాన్ని, పునరావాసాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అత్యంత విషాదం.2018 డి.పి.ఆర్‌. ప్రకారం ప్రాజెక్టుఖర్చు రూ.55.656 కోట్లు. ఇందులో పునరావాసం కోసం ఖర్చు చేయాల్సింది రూ.33,000కోట్లు కానీ ఖర్చుచేసింది రూ. 7000 కోట్లు మాత్రమే. ఎక్కువ శాతం నిర్మాణానికే ఖర్చు చేస్తున్నారు.మరి నిర్వాసితుల సంగతేంటి? సర్వస్వం త్యాగం చేసిన గిరిజనులు,అడవి బిడ్డల పరిస్థితి ఏంటి?అందుకే పునరావాసం పూర్తయిన తరువాతే ప్రాజెక్టు కట్టాలి.పోలవరం ప్రాజెక్టు ద్వారా చాలా ప్రయోజనాలు చేకూరతాయనేది ఎంత వాస్తవమో నిర్వాసితులు నష్టపోతారన్నది అంతే నిజం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 25 రకాల మౌలిక వసతులు కల్పించాలి. కానీ అవెక్కడా నిర్వాసితుల కాలనీల్లో కనిపించవు.ఏనిర్వాసిత కాలనీలో కూడా శ్మశానవాటికలు కనిపించవు.బుట్టాయిగూడెం, జీలు గుమిల్లి,జంగారెడ్డిగూడెంనిర్వాసిత కాలనీల్లో అధ్వా న పరిస్థితులున్నాయి.ఇళ్ళ శ్లాబులు వర్షం వస్తే కారిపోతున్నాయి.నిర్మాణ సంస్థలు కాసుల కక్కుర్తితో నాణ్యత లేకుండా నిర్మించాయి. విద్య, వైద్యం సదుపాయాలు లేవు. గడప గడపకు వైసిపి పేరుతో గత కొంత కాలంగా హడావుడి చేస్తున్నారు. కానీ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు నిర్వాసిత కాలనీల్లో అడుగు పెట్టడం లేదు. ఈ గడపలకు ఎందుకు రావడం లేదు. నిర్వాసితులు నిలదీస్తారని భయమా ?
ప్రతి సంవత్సరం వరద వస్తుంది. 2022 జులైనెలలో వచ్చిన వరద వేరు. ఇది పాలకుల నిర్లక్ష్యం కారణంగా వచ్చిన వరద. కాం టూరు లెక్కలన్నీ తప్పని ఈ వరదలతో తేలిపో యింది. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా వరద ప్రాంతాలను ముంపు ప్రాంతాల జాబితా లోకి చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. వరదలో పశువులు కొట్టుకుపోయాయి.పంటపొలాలు మునిగిపోయాయి.33రోజులు ఎందరో ఇళ్ళు నానిపోయి పడిపోయాయి. విలువైన వస్తువులు పాడైపోయాయి. ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం నుండి అందిన సహాయం రూ.2 వేలు మాత్రమే. ఇళ్ళు కూలిపోయినవారికి రూ.10వేలు అందిం చారు. అదికూడా అరకొరగానే అందించారు. అందులోను రేకులషెడ్డుకి ఇవ్వలేదు.ముంపు గ్రా మాల ప్రజలకష్టాలు ఇలాఉంటే ఊళ్లు ఖాళీ చేసి వచ్చిన నిర్వాసితకాలనీలో బతుకుతున్న గిరిజనుల పరిస్థితి ఘోరంగా తయా రైంది.వారు నిర్వాసిత కాలనీలకు వచ్చి2సంవత్సరాలైంది.రావాల్సిన ప్యాకే జీ డబ్బులు ఇంకారాలేదు.కనీస సౌకర్యాలు కల్పిం చడం లేదు.‘చూస్తాం ప్రభుత్వం ప్యాకేజీ డబ్బులు ఇవ్వకుంటే మరలా తిరిగి మా గ్రామాలకు వెళ్ళి పోతాం.పరిహారం ఇస్తుందో,మమ్మల్ని గోదారిలో ముంచేస్తుందో ప్రభుత్వమే తేల్చుకుంటుంద’ని ఆవేదన చెందుతున్నారు.సాధారణంగా తుఫాన్లు సముద్రాల్లో పుడతాయి.కానీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల ఇదే వైఖరి కొనసాగిస్తే, వదిలేస్తే, ఉదాసీనత ఇలాగే కొనసాగితే తుఫాన్‌ పుట్టేది సముద్రంలో కాదు. గోదారినదిలో.ఆ తుఫాన్‌పేరు నిర్వాసితుల ఉద్య మం.ఈ తుఫాన్‌ ప్రజల్ని ఐక్యం చేసి పాలకులను వణికించి అమరావతి దగ్గర తీరం దాటుతుంది జాగ్రత్త. ఇది హెచ్చరిక కాదు. వాస్తవం. గిరిజనులే కదా అణచివేద్దాం, తొక్కేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే ఇది చరిత్ర. ఇదే గిరిజనులకు ప్రభుత్వ పెత్తందారులకి జరుగుతున్న అసలైన వర్గపోరాటం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వరద సమస్య లపై ఒక్కొక్కరిది ఒక్కో వాదన.
1,నిర్వాసితు లేమో ప్రభుత్వం మా పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తుందని, మేము మాకు పూర్తిగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని,పునరావాస కాలనీల లో అన్ని పూర్తి చేయాలని అడుగుతున్నాం అందుకే ఇలా చేస్తే మేమే వెళ్ళిపోతాం అని అధి కార్లు ఇలా చేస్తున్నారని అన్నారు. 2,ప్రభుత్వం నిర్వాసితులనుగాలికి వదిలేసింది అని, వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ 10లక్షలు, ప్రతీకుటుం బానికి రూ10వేలు,దోమతెరలు మూ డు,నెలలపాటు ఉచితంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని, ప్రతిపక్షరాజకీయ నాయకులు కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.3,కొన్ని సంస్థలు,సంఘాలు ప్రజల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు.4,ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి25 కేజీల బియ్యం,కేజీ కంది పప్పు, కేజీ నూనె,కూరగాయలు ఇస్తున్నారు.అయితే ఇవి అందరికీ అందటం లేదని ప్రజలు కొట్టు కున్నారు. దీనిపై ఏలూరుజిల్లా కలెక్టరు,మండల అధికారులను ప్రజల ముందే హెచ్చరించారు.వెలేరు పాడు ముంపు గ్రామాలను పరిశీలించి వస్తున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీ లను ఎర్ర బోరు గ్రామం వద్ద నిర్వాసితులు అడ్డుకొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అసలు ఈ భారీ వర్షాల గురించి ప్రభుత్వా నికి తెలియదా? సవంవత్సరం ముందుగానే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెటియో రాలాజికల్‌ డిపార్ట్‌ మెంట్‌ మే నెలలో నే చెప్పింది.ఈ శాఖ అధికారులు దేశవ్యాప్తంగా పడే వర్షాల గురించి, రుతు పవనాలు గురించి మే నెలలో నివేదిక విడుదల చేస్తుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలియకుండా పోతుం దా? ఇవన్నీ తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.అంటే ఇది పూర్తిగా నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యధోరణి ప్రభుత్వం కనపరిచినట్లు అర్థమ వుతుంది.ముంపు ప్రాంతాలను అధికారులు ముం దస్తుగా సందర్శించి రాబోయే వరదల గురించి ప్రజలకు చెప్పి వారి వారి సామాన్లను,తరలించు కోవడానికి రవాణా ఏర్పాట్లు చేయ వచ్చు కానీ అలా జరగలేదు.ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. కుకునూరు మండల కేంద్రం ఎత్తు లో వుంటుంది కదా అని ఆ గ్రామ ప్రజలు మన ఊరు మునగదని ధీమాతో ఉన్నారు. రాత్రిపూట చడీ చప్పుడూ లేకుం డా గ్రామం అంతా తెల్ల వారే సరికి నీటి మయ మైంది. అప్పుడు ఆరాత్రిలో గ్రామప్రజలు సొం తంగా ప్రక్క గ్రామాల నుంచి ట్రాక్టర్‌లు 36 (తెలంగాణా గ్రామాలు సరిహద్దులో ఉన్నాయి). తెప్పించి కొంత మందిని సురక్షిత ప్రాంతాల కు తరలించారు. రెవెన్యూ అధికారులు కేవలం 7, ట్రాక్టర్‌లు ఏర్పాటు చేశారు. లేదంటే చాలా ప్రాణ నష్టం జరిగేది. ఇలా చేయడంవల్ల పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు అనేక కష్టాలు పడితేనే రేపు వారికై వారే పునరావాస కాలనీల కు గత్యంతరం లేక వెళతారు.అంటే దానర్ధం పొ మ్మన కుండా పొగ పెట్టడం.ఇంకా ఇక్కడ ఉం డలేము అని విసుగు చెంది వెళ్ళిపోతారు. ప్రభుత్వం వైపున తప్పు లేదని ఇది ప్రకృతి వైపరీత్యం అనీ, ఎవరూ ఏమీ చేయలేరు అని సమర్ధించు కుంటుం ది.కానీ ఇది పూర్తిగా మానవతప్పిదంగానే భావిం చాలి.ఎందుకంటే ప్రతీ ఏడాది జూలై నెలలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాటర్‌ రిసోర్స్‌ డిపార్ట్‌ మెంట్‌ వెబ్‌ సైట్‌ ఓపెన్‌ చేస్తే ఇలా ఉంటుంది.
ముంపు, నిర్వాసిత సమస్యను,తగ్గించటానికి ప్రత్యాయ మ్నాలను గుర్తించాలని,ప్రాజెక్ట్‌ భాధిత కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిం చాలని ఉంటుంది.కానీ వాస్తవానికి కనిపించేది వేరు. పై మాటలు ఆచరణకు నోచుకోవటం లేదు.
1986గోదావరి వరదలకు దీనికి పొంతన లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కు ముందు ఎప్పుడు వరదలు వచ్చినా అవి కొన్నిరోజులుపాటు ఉండి తర్వాత దిగువకునీరు వెళ్ళేది. ఇప్పుడు అలా జరగ లేదు,కాఫ ర్‌ డామ్‌ నిర్మాణం వలన బ్యాక్‌ వాటర్‌ వచ్చి గ్రామాల్లో నిలిచి పోయింది. అందుకే భద్రా చలం కూడా వరద తాకిడికి గురైంది. దీని కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ 100 గ్రామాలు మునిగిపోతాయని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఓ.ఎస్‌.నెంబర్‌బీ1ఆఫ్‌2019.అదే ఇప్పుడు పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతున్నది. మరల ఎటపాక గ్రామాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చి వేయాలని వాదిస్తున్నారు.
ఆస్తి నష్టం అంచనా వేయరు!
సాధారణ పరిస్థితుల్లో అయితే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు,అధికారులు పంటనష్టం, ప్రాణనష్టం, ఆస్తినష్టం అంచనావేసి,పరిహారం ఇస్తారు. కానీ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుముంపు గ్రామాలలో అది సాధ్యంకాదు.ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలంటున్నారు. అప్పుడు మునిగిపోయినా,రోడ్లు తిరిగి వేయరు, కూలిపోయిన స్కూలు బిల్డింగ్స్‌ కట్టరు,ఇండ్లు కూలిపోతే తిరిగి ఐ.ఏ.వై.స్కీమ్‌లో కట్టరు.పంట దెబ్బతిందని వ్యవసాయశాఖఅధికారులు వచ్చిచెక్కులు ఇవ్వరు. (భూములు తీసుకున్నారు) కాబట్టి గత ముంపుకు ఇప్పటి ముంపుకు తేడాను ప్రజలు గ్రహించాలి. 1986 వరద నీరు వస్తుందని అనుకోలేదు. కానీ ఇప్పుడు రాలేదా? ఈ రోజు వచ్చింది రేపు రాదు అని గ్యారంటీ లేదు. ఇంత కంటే ఎక్కువ కూడా రావచ్చు. ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి అయితే, నీరు నిలిచి బ్యాక్‌ వాటర్‌ వస్తుంది.అటువంటప్పుడు మరలా కొన్ని పునరావాస కాలనీల ను అక్కడే కడుతున్నారు. అవి ఇప్పుడు వచ్చిన వరదల కు నీట మునిగిపోయాయి.రేపు ఆ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఉండదు. ఆవిషయం అధికారులు కళ్ళారా చూస్తూనే ఉన్నారు.కాబట్టి దీనిపై ప్రజలూ ఆలోసిం చాలి, సమస్య ను ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ప్రజల మధ్యన పని చేసే అను భవంఉన్న మేధావులు కూడా నిర్వాసితులు ఎదు ర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ఇది ఏఒక్కరి సమస్యకాదు,మానవ సమా జంలోఉన్నఅన్ని వర్గాల ప్రజలదని నమ్ముతు న్నాను.-(వై.రాము/బాబ్జీ)

ప్రభం జనం ఆపుదాం..!

దేశమంటే మట్టి కాదోయ్‌…దేశమంటే మనుషులోయ్‌…! మహాకవి గేయానికి ఆధునిక కాలంలో మరో మాట కలుపవచ్చు. మనుషులంటే వనరులోయ్‌…!! అని. అధిక జనాభా ఆర్థిక వృద్ధికి అవరోధం అనేది ఒకప్పటి మాట. ఇపుడు మానవ వనరులే చోదకశక్తిగా ప్రగతిశీలత కనబరు స్తున్న దేశం మనది. ప్రగతిఎక్కడుంటే మానవ వనరులు అక్కడికి పరుగులు తీస్తాయి. అక్షరాస్యత, వృత్తి నైపు ణ్యం, గతిశీలత ఉన్న జనాభా విశాఖ అభివృద్ధికి ఆయువుపట్టు. అయితే పెరిగిన జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం అవసరం. జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ కథనం… ప్రపంచ జనాభాదినోత్సవం (జూలై11)సంద ర్భం గా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకా రం భారత్‌వచ్చే ఏడాది1.4బిలియన్ల (140 కోట్లు) జనాభాతో చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినదేశంగా అవతరించ నుం ది.ఈనివేదిక ప్రకారం ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్‌ నాటికి 800 కోట్లకు చేరనుంది. కానీ, ప్రస్తుతం జనాభా పెరుగుదల, గతంలో ఉన్నంత వేగంగా లేదు.1950తర్వాత జనాభా వృద్ధి రేటు ఇప్పుడు అత్యంత తక్కువగాఉన్నప్పటికీ, 2080ల నాటికి 10.4బిలియన్ల(1040కోట్లు)కు చేరుకుం టుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే, కొందరు జనాభాశాస్త్రం నిపుణులు మాత్రం ఇది మరింత తొందరగా జరుగవచ్చని నమ్ముతు న్నారు. కానీ, ప్రపంచ జనాభా పెరుగుదల అసమా నంగా జరుగుతోంది.వచ్చే 30ఏళ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50శాతానికి పైగా కేవలం 8దేశాల్లోనే సంభవిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిరచింది. కాంగో,ఈజిప్ట్‌, ఇథియోపి యా,భారత్‌,నైజీరియా,పాకిస్తాన్‌,ఫిలిప్పీన్స్‌, టాంజా నియా దేశాల్లోనే ఈఅధిక జనాభా రేటు నమోదవు తుందని చెప్పింది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశా లు ఇప్పటికే జనాభా క్షీణతను చూస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తిరేటు ప్రతీ మహిళకు సగటు న 2.1 కంటే తగ్గిపోయింది.61 దేశాల్లో 2050 నాటికి జనాభా కనీసం1శాతం తగ్గుతుందని నివేదిక చెబుతోంది.
ప్రపంచంలోనే అతి తక్కువ సంతానో త్పత్తి రేటు ఉన్న దేశాల్లోచైనా కూడా ఒకటి. చైనా లో ప్రతీ మహిళ సగటున 1.15 మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తమ జనాభా లో క్షీణత ప్రారంభమవుతుందని చైనా ప్రకటిం చింది.దేశంలో ‘ఒకేబిడ్డ’అనే విధానాన్ని విడిచి పెట్టి,ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే జంటలకు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టినప్పటికీ చైనా జనాభా అనుకున్నదానికంటే వేగంగా తగ్గు తోంది.భారత్‌లో జనాభా పెరుగుతూనే ఉన్నందున, కచ్చితంగా చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించ నుంది.జనాభా పెరుగుతోన్న చాలా దేశాల్లోనూ సంతానోత్పత్తి రేట్లు పడిపోతున్నాయి.సైన్స్‌,మెడిసిన్‌ రంగాల్లో వచ్చిన అభివృద్ధి కూడా జనాభా పెరుగు దలకు ఒక కారణం. వీటి కారణంగానే శిశు మరణాలరేటు తగ్గిపోవడంతోపాటు,ఎక్కువ మంది పిల్లలు యుక్త వయస్సు వరకు, చాలా మంది వృద్ధాప్యంలో కూడా మనుగడ కొనసాగిస్తున్నారు. ఇకముందు కూడా ఇదే కొనసాగనున్న నేపథ్యంలో 2050నాటికి ప్రపంచ సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలుగా ఉండనుంది.కానీ, దీని ప్రకారం జనాభాలో 65ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య 2022లో 10శాతంగా ఉండగా,2050 నాటికి16శాతానికి పెరుగు తుంది.ఈ పెరుగుదల కూడా అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు.
జనాభా దినోత్సవం నేపపథ్యం ఇదీ..
ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కులు వంటివాటిపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచ జనాభా దినోత్సవం,2023 ఇతివృత్తం ఏమిటంటే,‘‘హక్కులు,ఎంపిక చేసుకునే అవకాశాలే సమాధానం.జననాలరేటు పెరగడం లేదా తగ్గడం, ప్రజలందరి సంతానోత్పత్తి ఆరోగ్యానికి, హక్కులకు ప్రాధాన్యమివ్వడంలోనే మారుతున్న సంతానోత్పత్తి సామర్థ్య రేట్లకు పరిష్కారం ఉంది.’’యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించింది. ఏ రోజున ప్రపంచ జనాభా 500కోట్లకు చేరుతుందని అంచ నా వేస్తారో,ఆరోజున (1987 జూలై 11న) దీనిని జరపాలని నిర్ణయించింది. దీనిని కొనసాగించాలని 1990లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మా నం చేసింది. అధిక జనాభా ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపింది. కుటుంబ నియంత్రణ, పౌర హక్కులు, పేదరికం, మానవాళిపై అధిక జనాభా చూపే ప్రభావం గురించి ప్రజలకు వివరించడానికి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఉప యోగపడతాయి. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల్లో చైనా తర్వాత భారతదేశం నిలి చింది.అధిక జనాభా కారణంగా కోవిడ్‌-19 మహమ్మారిని నియంత్రించడం పెద్ద సవాలుగా మారింది.సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 2030 ఎజెం డా అనేది ఆరోగ్యవంతమైన భూమండలంపై ప్రజ లందరికీ మెరుగైన భవిష్యత్తుకు ప్రపంచ బ్లూప్రింట్‌ అని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటో నియో గుటెరస్‌ అన్నారు. జనాభా వృద్ధి, వృద్ధాప్యం, వలసలు,పట్టణీకరణ సహా జనాభా ధోరణులతో ఈమిషన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గుర్తిస్తు న్నట్లు తెలిపారు.
జనభాతో పాటు సమస్యలు ఎక్కువే..!
ఇక ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా పెరుగుతున్న జనాభాతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది గత 32 ఏళ్లుగా జరుగుతున్నదే. అయినప్పటికీ ప్రతి ఏటా జనాభా పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. జనాభాతో పాటే తద్వారా వచ్చే సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. భారత్‌నే తీసుకుంటే ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 2100నాటికి మనదేశంలో జనాభా 1450 మిలియన్‌ తాకుతుందని అంచనా వే సింది.1950లో ఉన్న జనాభా 2100 నాటికి చైనా జనాభాను కూడా భారత్‌ దాటుతుందని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తన నివేదికలో వెల్లడిరచింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాభా ఉన్న 10దేశాల్లో ఒక్క ఆఫ్రికా దేశాలే ఐదుగా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. ప్రపంచ జనాభాలో 16శాతం భారత్‌లోనే ఇక ప్రపంచ జనాభాపై ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి ఏటా దాదాపు 83 మిలియన్‌ పెరుగుతోంది. ఇక 2030 నాటికి ప్రపంచ జనాభా 8.6బిలియన్‌ మార్కును తాకుతుందని చెప్పడంలో ఎలాంటి సం దేహం లేదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అయితే ప్రపంచ భూభాగంలో కేవలం 2శాతం భూమిని మాత్రమే కలిగి ఉండే భారత దేశం… ప్రపంచ జనాభా విషయానికొచ్చేసరికి దాదాపు 16 శాతం జనాభా మనదేశమే అకామొడేట్‌ చేయడం విశేషం. ఇక భారత్‌లో 35శాతం జనాభాబీహార్‌,ఉత్తర్‌ ప్రదేశ్‌,మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఉన్నట్లు సమాచారం. అత్యధిక జనాభా ఉండటం వల్ల సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో ప్రధానమైన సమస్య పేదరికం అని వెల్లడిస్తున్నారు.
2050 నాటికి స్త్రీ, పురుషుల జనాభా సమానం
2050 నాటికి స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యకు సమానంగా ఉంటుందని అంచనా.2020లో, 1950 తర్వాత మొదటిసారిగా,జనాభా పెరుగు దల రేటు సంవత్సరానికి 1శాతం కంటే తక్కువగా పడిపోయింది. ఇది రాబోయే కొన్ని దశాబ్దాల్లో, ఈ శతాబ్దం చివరి వరకు మందగించడం కొనసా గుతుందని అంచనా వేసింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో,అంతర్జాతీయ వలసలు జనాభా మార్పులో ప్రధాన అంశంగా మారాయి. 2010, 2021మధ్య పది దేశాలు1మిలియన్‌ కంటే ఎక్కువ వలసదారుల నికర ప్రవాహాన్ని అనుభవించాయని అంచనా వేయబడిరది.ఈదేశాలలోచాలా వరకు,ఈ ప్రవాహాలు తాత్కాలిక శ్రామిక కదలికల కారణం గా ఉన్నాయి, అవి పాకిస్థాన్‌ (2010-2021లో -16.5 మిలియన్ల నికర ప్రవాహం), భారతదేశం (-3.5 మిలియన్లు),బంగ్లాదేశ్‌(-2.9 మిలియన్లు), నేపాల్‌ (-1.6మిలియన్లు),శ్రీలంక(-1 మిలియన్‌). జనాభా రెట్టింపుతో వనరులపై తీవ్ర ప్రభావం46 అతితక్కువ అభివృద్ధి చెందిన దేశాలు (ూణజు) ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న దేశాలలో ఉండనున్నాయి.అనేక మంది 2023,2050 మధ్య జనాభాలో రెట్టింపు అవు తుందని అంచనా వేయబడిరది, వనరులపై ఇది అదనపు ఒత్తిడిని, సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ూణGం) సాధనకు సవాళ్లను విసిరింది.జనాభా, స్థిరమైన అభివృద్ధి మధ్య సంబంధాన్ని వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఇతర ప్రపంచ పర్యావరణ సవాళ్ల నేపథ్యం లో పరిగణించాలని యూఎన్‌ నివేదిక పేర్కొంది. జనాభా పెరుగుదల పర్యావరణ నష్టానికి ప్రత్యక్ష కారణం కాకపోవచ్చుబీ అయితే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు లేదా పరిగణించ బడిన కాలపరిమితి, అందుబాటులో ఉన్న సాంకేతి కత,జనాభా,సామాజిక,ఆర్థిక సందర్భాలపై ఆధార పడిదాని ఆవిర్భావ సమయాన్ని వేగవంతం చేయ వచ్చు.-జిఎన్‌వి సతీష్‌

అంతర్ధానమవుతున్న మాతృభాషలు

మనిషి తన తల్లికి ఎంత దగ్గరగా ఉంటాడో మాతృ భాషకు కూడా అంత దగ్గరగా ఉంటాడు. పిల్ల వాడు, తన భాషా సామర్ధ్యాన్ని తల్లి నుండి నేర్చుకుం టాడు. ఏతల్లీ కూడా అప్పుడే పుట్టిన పిల్లాడికి ఎలాంటి వ్యాకరణ నిబంధనల్ని బోధించదు. అయినా,తన తల్లి పెదాల కదలికలు, ఆమె అభినయా లను గమనించడం ద్వారా,ఆమె మాటల ధ్వని, ఆమాటల కూర్పును గ్రహిం చడం ద్వారా ఆపిల్లాడు అంత సంక్లిష్టమైన నిబంధనల్ని వంట బట్టించుకుంటాడు.పిల్లలు భాషలను పాఠశాలలో నేర్చుకుంటారనే ఒక విస్తృతమైన తప్పుడు అభిప్రా యం ఉంది.అది మాతృభాషేతర భాషల విషయం లో వాస్తవం కావచ్చు.ద్వితీయ, తృతీయ లేక ఇతర భాషల్ని వ్యాకర ణం,అనువాదంద్వారా నేర్చు కోవా ల్సి ఉంటుంది. కానీ పిల్లవాడు మూడు సంవత్స రాల వయసొచ్చే సమయా నికి మాతృభాష లోని దాదాపు అన్ని సంక్లిష్టతలను నేర్చుకోవడానికి అను గుణంగా మెదడు నిర్మితమై ఉంటుంది. లేఖనం (రాత) అనేది వేరే అంశం. కొన్ని లక్షల సంవత్స రాల మానవ జాతి చరిత్రలో, లేఖనం అనేది ఏడు వేల సంవత్సరాల క్రితమే వ్యక్తీకరణకు, సమా చారాన్ని అందించే,జ్ఞాపకాలను నిల్వ చేసే సాధనం గా మారింది. భాష అంటే ప్రాథమికంగా మాట్లాడ టం.లేఖనం ద్వారా తరాల మధ్య సుదీర్ఘ కాలం పాటు భాషాపరమైన సంబంధ బాంధ వ్యాలకు అవకాశం ఇవ్వడం భాషకుండే అదనపు లక్షణం.
నాబాల్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మాతృభాష కాని ఇతర అనేక భాషలను వారాంతపు సంతల్లో జనసమూహాలు మాట్లాడడం స్వయంగా విన్నాను. అప్పట్లో రేడియో అనేది మా గ్రామంలో ఓకొత్త యంత్ర పరికరం. ఇంట్లోకి కొత్త రేడియో సెట్‌ రావడంతో నేను ఎంతో ఆసక్తిగా స్టేషన్లను కదిలిస్తుండేవాడ్ని.వారాంతపు సంతల్లో వినని అనేక భాషల్ని రేడియోలో విన్నాను. దీంతో అసలు ఈ ప్రపంచంలో ఇంకా ఎన్ని భాషలు ఉన్నాయో తెలు సుకోవాలనే ఆసక్తి నాలో పెరిగింది.1970లో ఒక విశ్వవిద్యాలయం విద్యార్థిగా భారతీయ భాషలపై జనగణనకు సంబంధించిన చిన్న పుస్తకాన్ని చూశా ను.దానిలో 109భాషల జాబితా ఉంది. ఆ జాబి తాలో చివరన ఃఃఅన్ని ఇతర భాషలు అని ఉంది. అంటే 108భాషల కన్నా ఎక్కువ భాషలు ఉన్నా యనే దానికి ఇదొక సూచిక. ఇంతకన్నా ముందుగా జనాభా లెక్కల్లో మరికొన్ని వివరాలు తెలుసు కోవాలనే ఉద్దేశంతోయూనివర్సిటీ లైబ్రరీలో 1961 జనాభా గణాంకాల కోసం వెతికాను. ఆ గణాం కాలలో నేను దిమ్మతిరిగే విషయాలను గమనిం చాను.ఆజాబితాలో 1652 భాషల్ని తమ మాతృ భాషగా భారతీయులు పేర్కొన్నారు. పైన ఉదాహ రించిన భాషల గణాంకాలకు సంబంధించి రెండు రకాల సంఖ్యల్ని పోల్చితే 10 సంవత్సరాల కాలం లో (అంటే 1961-1971మధ్య కాలంలో) భారత దేశం మొత్తం 1544 భాషల్ని కోల్పోయింది. భాషా గణనను మామూలు అంక గణితం ద్వారా విభజిం చలేం.దానికి శిక్షణ పొందిన భాషా పండితుల పరిశీలన అవసరం ఉంటుంది. అందువలన భారతీ య జనగణన రిజిస్ట్రార్‌ దగ్గర పని చేస్తున్న భాషా పండితులు, విద్యావిషయక నిష్ణాతుల సాహిత్యం లో నమోదుచేయబడిన మాతృభాషల పేర్లు (జనా భా లెక్కల సమయంలో ప్రజలు చెప్పినవి) ఏమైనా ఉన్నాయేమోనని అందుబాటులో ఉన్న గ్రంథాల యాలలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. అందువల్ల సాధారణంగా భాషకు సంబంధించిన గణాంకా లను చివరగా ప్రకటిస్తారు.
1971 భాషా గణనకు, భాషా గణాం కాల ప్రకటన మధ్య కాలంలో బంగ్లాదేశ్‌ యుద్ధం జరిగింది.తరువాత కాలంలో బంగ్లాదేశ్‌గా మారి న తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ నుండి భాషా సమస్య పైనే విభజనను కోరింది. భారత ప్రభుత్వం భాషా వైవిధ్యం గురించి ఆందోళన చెంది,భాషల సంఖ్యను తగ్గించే మార్గాలను వెతికే నిర్ణయం చేసి వున్నట్లైతే, అది సహజమేనని భావిం చాలి.అందుకుగాను ప్రభుత్వం ఃఃపది వేల (భాషను మాట్లాడే వారి సంఖ్య) సంఖ్యఃః పరిమితిని విధిం చింది.ఈసంఖ్యా పరిమితికి ఎలాంటి శాస్త్రీయమైన పునాది లేదు. ఒక భాషను భాషగా పరిగణించా లంటే ఆ భాషను మాట్లాడేవారు కేవలం ఇద్దరుంటే చాలు.1970 ప్రాంతంలో 1544మాతృ భాషలు ఆకస్మికంగా మౌనం వహించాయా? కచ్చితంగా కాదు.అవికొద్ది జనాభా ఉన్న భౌగోళిక ప్రాంతాల్లో కొనసాగాయి.
ప్రభుత్వం కృత్రిమంగా విధించిన సీలింగ్‌ కారణంగా వాస్తవానికి ఎన్నిభాషలు అంత ర్ధానయ్యాయో తెలుసుకోవాలంటే1971 జనగణ నను 2011జనగణనతో పోల్చి చూడాలి. ప్రజలు తమ మాతృభాషగా పేర్కొన్న భాషల్ని లెక్కించ డానికి అదే జనగణన పద్ధతిని అనుసరించగా భారతదేశంలో ప్రజలు 1369 భాషలను మాట్లా డుతున్నట్లు 2011జనగణన నిర్ధారించింది. రెండు సంఖ్యలను పోల్చి చూడడం ద్వారా 1961 నుండి 2011వరకు…అంటే50 సంవత్సరాల్లో (1,652 -1,369¸283)283 భాషలు అంతరించి పొయ్యా యనే నిర్ధారణకు ఎవరైనా రావచ్చు. అంటే సంవ త్సరానికి సగటున నాలుగు లేక ఐదు భాషలు లేదా ప్రతీ రెండు లేక మూడు నెలలకొక భాష అంతరించినట్టు అర్థం చేసుకోవాలి. గతంలో ఓ వెయ్యి సంవత్సరాల పాటు అంతర్ధానమైనఃః భాషలు ఉనికిలో ఉన్నాయనే విషయాన్ని పరిగణన లోకి తీసుకుంటే, భారత దేశంలో భాషల అంత ర్ధానరేటు గుండెలు అదిరిపోయే విధంగా ఉంది. జనగణనమాతృభాషలనే మాటను ఉపయోగించి నప్పుడు,వాటిలో చిన్న లేదా అల్ప సంఖ్యాక భాష లు మాత్రమే కాక అధిక సంఖ్యాక భాషలు కూడా ఉన్నాయనే విషయం ఎవరికైనా అంత తేలిగ్గా స్ఫురణకు వస్తుందనుకోలేం.
భారతదేశ ప్రజలు మాట్లాడిన వివిధ భాషల వివరాలు దశాబ్దాలవారీగా చూస్తే, 1961 లో బంగ్లా మాట్లాడేవారు మొత్తంజనాభాలో 8.17 శాతం ఉండగా అర్ధశతాబ్దం తరువాత వారి సంఖ్య8.03శాతానికి తగ్గింది. మొత్తం జనాభాలో మరాఠీ భాష మాట్లాడేవారి సంఖ్య 7.62 శాతం నుండి 6.86శాతానికి, తెలుగు మాట్లాడేవారు 8.16 శాతం నుండి 6.70 కి, తమిళం మాట్లాడే వారి సంఖ్య మరీ దారుణంగా6.88శాతం నుండి 5.70శాతానికి దిగజారింది. వాస్తవానికి హిందీ భాష తరువాత ఎక్కువగా మాట్లాడే మొదటి ఎని మిది భాషలు-బంగ్లా,మరాఠీ, తెలుగు,తమిళం, గుజరాతీ,ఉర్దూ,కన్నడం,ఒడియా మొత్తం జనాభా లో 2011జనగణన ప్రకారం 42.37శాతం కాగా హిందీ ఒక్కటే 43.63శాతంగా నమోదైంది. హిందీ మాట్లాడేవారి సంఖ్య ఎప్పుడూ పెరుగు తూనే ఉంది.1961లో36.99శాతంగా నమోదైన హిందీ మాట్లాడే వారిసంఖ్య 2011నాటికి మొత్తం జనాభాలో 43.63శాతానికి పెరిగింది. హిందీ, సంస్కృతం,గుజరాతీ భాషలను మినహాయిస్తే మిగి లిన గుర్తించబడిన అన్ని భాషల అంతర్ధానం కొన సాగుతూనే ఉందని 2011జనగణన తెలియ జేస్తుంది.196లో సంస్కృత భాషను మాతృభాషగా పేర్కొన్న వారిసంఖ్య 2,212 మంది కాగా 2011 లెక్కల్లో ఆ సంఖ్య 11రెట్లు పెరిగింది. అంటే ఆ సంఖ్య 24,821కి పెరిగింది. 2011లో జరిగిన భాషా గణన వివరాలను 2018లో ప్రకటించారు. తమిళ భాష ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవభాషగా ఉంది.కన్నడం,మరాఠీ భాషలు సుమా రు రెండు వేల సంవత్సరాలుగా,మలయాళం, బంగ్లా, ఒడియా భాషలు కూడా దాదాపు 1000 సంవత్సరాలుగా జీవభాషలుగా ఉంటున్నాయి. సంస్కృతం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా జీవభాషగా లేకుండా నిలిచిపోయింది.దీనికి భిన్నంగా 17వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ఇంగ్లీష్‌ భాష అందరి అంగీకారం పొందింది. దీనిని మాట్లాడే వారిసంఖ్య జనగణనలో 2,59, 878గా చూపబడిరది.ఇంగ్లీష్‌ దినపత్రికల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. భారతదేశంలో ఏడులక్షల గ్రామాల్లో, రెండు వేలనగరాలు, పట్ట ణాల్లో ఇంగ్లీష్‌ మాధ్యమ పాఠశాలలు నిర్వహించ బడుతున్నాయి.ఇంగ్లీష్‌ టీవీఛానళ్ల రేటింగ్‌ పాయిం ట్లు కూడా పెరిగిపోతున్నాయి. అసలు ఇంగ్లీష్‌ మాట్లాడే వారి సంఖ్య (సంస్కృతం మాట్లాడే వారి సంఖ్యకు భిన్నంగా) పెరుగుతుండడం నిజమే అని తెలుస్తుంది.
విచారకరమైన నిర్ధారణ ఏమంటే భారతీయులు మాట్లాడే అల్పసంఖ్యాక, అధిక సంఖ్యాక భాషలన్నీ (హిందూత్వ భావజాలాన్ని అనుసరించేవారు ఇష్టపడే భాషలను మినహాయిస్తే) నేడు వాటి ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.మన రాజ్యాంగంలో పేర్కొన్న ట్లుగా బహు భాషలు మాట్లాడే వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న భారత దేశానికి ఇది మంచిది కాదు.(ఫ్రంట్‌లైన్‌ సౌజన్యంతో).
` వ్యాసకర్త:ఒబైడ్‌ సిద్ధిఖీ చైర్‌ ప్రొఫెసర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌,బయోలాజికల్‌ సైన్సెస్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌, బెంగళూరు
-గణేష్‌ దేవీ

అనుకున్నంతగా..వానల్లేవు

వేసవిలో పంట చేతికొచ్చే సమయానికి వద్దన్నా రెండు దఫాలుగా రోజులతరబడి కురిసిన భారీ వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. చేతికొచ్చిన వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. అయితే వానాకాలం సీజన్‌ నెలన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవకపోవడం గమనార్హం. ఎండాకాలం యాసంగిలో వద్దన్నా కురిసిన బారీ వర్షాలు అదే వానాకాలం వచ్చే ముఖం చాటేయడంతో ఆరుతడి పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల రాక కోసం తెలుగు రాష్ట్రాల రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
స్తారు నుంచి భారీవర్షాలు లేక కంది,సోయా, మిర్చి,వేరుశనగ మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు రెండాకుల దశలోనే ఉన్నాయి. ఆశిం చిన స్థాయిలో వర్షాలు లేక మొలకదశలోనే పత్తి ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈఏడాది రాష్ట్రంలోదాదాపు50లక్షలకు పైగా ఎకరాల్లో పత్తిసాగవుతుందని వ్యవసా యశాఖ అంచనా వేసింది.కాని వర్షాలు ముఖం చాయే టడంతో అడపదడపావాన లకు కొన్ని జిల్లాల్లో రైతులు విత్తనాలు వేశారు. ఇప్పటికీ దాదాపు 20లక్షల ఎకరాల్లో వర్షాలు పడితే పత్తినాటేం దుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.సాధారణం గా ఏటావర్షాకాలం ఆరంభంలో కురిసే వర్షా లతోనే రైతులు ఆతరుడి పంట విత్తనాలు వేస్తారు.వర్షాలు కురుస్తాయోమోనన్న ఆశతో ఈసారి కూడా రోహిణిలోనే పత్తివిత్తనాలు నాటారు. అయితే జూన్‌ నెలలో ఆరుతడి పంటలకు కావాల్సి నంతగా వర్షాలు కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తం గా చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. చెదురు ముదురు చినుకులకే విత్తనాలు విత్తినా అవి మొలకె త్తేందుకు, మొలకెత్తినా ప్రాణం పోసుకుని ఎ దిగేందుకు సరిపడా వర్షాలు లేక రైతులు తీవ్ర అవస్థులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం జులై మొదటి వారం గడిచిపోయినా కూడా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వానాకాలం పంట లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గతే డాది ఇదే సమయానికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైంది. కాని ఈ ఏడాది జులై రెండో వారంవచ్చినా వరుణుడు కరుణించడం లేదు. సాధారణంగా జూన్‌ నెలతలో 144.1మీమీ. వర్షపాతం కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌లో కేవలం 66.9 మి.మీ. వర్ష పాతం అది కూడా మూడు, నాలుగు జిల్లాల్లోనే కురిసింది.దాదాపు 77.2మి.మీ లోటు వర్షపాతం జులైలో నమోదయింది. వర్షాలు పడక పత్తి మొక్క లు ఎండిపోతుండడంతో రైతులు కూలీలను పెట్టి మరి బిందెలు, ట్యాంకర్లతో మొక్కమొక్కకూ నీటిని పోస్తున్నారు.సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయని ఆవదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందడం లేదు. దీంతో కనీసం బోరు, బావినీటితోనైనా ఆరుతడి పంటలను కాపాడుకు నేందుకు రైతులకు అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏటా మాదిరిగా జూన్‌ నెలలో వర్షాలు కురిస్తే పత్తి మొక్కలు జులై రెండో వారంకల్లా మొక్క ఎదగడంతోపాటు కొమ్మలు పెట్టే దశలో ఒక అడుగు కంటే ఎక్కువ ఎత్తు పెరగాల్సి ఉంది.కాని ఈ సారి నెలన్నర వానాకాలం సీజన్‌ గడుస్తున్నా పత్తి మొక్కలు ఇంకా రెండాకుల దశ లోనే ఉన్నాయి. మొక్క ఎదుగుదల ఆశించిన స్థాయి లో లేకపోతే కొమ్మలు రాకపోతే కాత తగ్గి దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. మరో రెండు వారాలు వర్షాలు కురవకపోతే ఆత ర్వాత కురిసినా పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతు లు చెబుతున్నారు.
ఏ పంట..ఎప్పుడు వేసుకోవాలంటే!
వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవు తున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధ మవు తున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవా లో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒకరకమే సాగు చేస్తూ అన్న దాతలు నష్టపోతు న్నారు. అయితే అదును చూసి సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవ డంతో పాటు పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బతుకుతుంది. ఈ నేపథ్యంలో ఏ పంటలను ఎప్పుడుసాగు చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? అనే అంశాలపై నిపుణుల
సూచనలు, సలహాలు.
మొక్కజొన్న : మొక్కజొన్న పంటకాలం 110 నుంచి 120 రోజులు ఉంటుంది.జూన్‌ 15 నుంచి జూలై 15లోపు విత్తనాలు విత్తుకోవాలి.మొక్కజొన్న సున్నితమైన పంట. నీరు ఎక్కువ ఉన్నా, తక్కువున్నా తట్టుకోదు.కాండం తొలుచు పురుగుతో తీవ్ర నష్టం జరుగుతుంది. పంటసాగు చేసిన 30రోజుల లోపు కాండం తొలుచు పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.30రోజులు గడిచిన తర్వాత దాని ప్రభా వం పంటపై అంతగా ఉండదు. కాండం తొలుచు పురుగు ఉధృతికి జూలై చివరివారం నుంచి ఆగస్ట్‌ లో వాతావరణ అనుకూలంగా ఉంటుంది.జూన్‌ లో మొక్కజొన్న సాగు చేయడంవల్ల పంటకాలం 30రోజులుదాటి పురుగు ప్రభావం అంతగా ఉండదు.ఆలస్యంగా సాగు చేస్తే కాండం తొలుచు పురుగుతో నష్టపోవాల్సి వస్తుంది.రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 15 లోపు విత్తనాలు వేయాలి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపు పంట చేతికొస్తుంది.
పెసర :పెసర పంట కాలం 60నుంచి 75 రోజులు ఉంటుంది.జూన్‌ 15నుంచి జూలై 15లోపు సాగు చేయాలి. ఆగస్టు 25 వరకు పంట చేతికొస్తుంది. ఆగస్టులో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉండ డంతో పెసర పంట నష్టపోయే ప్రమాదం ఉం టుంది.జూన్‌ 20లోపు సాగు చేస్తే ఆగస్టు 10లోపు పంట చేతికి వస్తుంది.రబీలో సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 30లోపు సాగు చేయాలి నవంబర్‌ 20 నుంచి జనవరి 15వరకు పంట చేతికొస్తుంది. పత్తి : పత్తి సాగును వీలైనంత వరకు తగ్గించాలి. పత్తి సాగుకు పెట్టుబడి ఎక్కువగా ఉండడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ధర లేకపోవ డంతో పత్తి సాగు రైతులకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నల్ల రేగడి భూమిలో పత్తి సాగు చేసే రైతులు 60 నుంచి 70మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వా త పత్తి గింజలు విత్తుకోవాలి. జూన్‌ 20 నుంచి జూలై 20వరకు పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల రసం పీల్చుపురుగులు ఉధృతితక్కువగా ఉంటుంది.
కంది : కంది పంట కాలం 6 నెలలు. జూన్‌ 20 నుంచి జూలై చివరి వారం వరకు సాగు చేసు కోవాలి. డిసెంబర్‌ 31 నుంచి జనవరి 15 వరకు పంట చేతికొస్తుంది. సకాలంలో కంది సాగు చేయ డం వల్ల జనవరిలో రెండో పంటగా పెసర సాగు చేసుకొవచ్చు.నీటి వసతి ఉన్న రైతులు కందిలో అంతర పంటగా సోయాబీన్‌, మొక్కజొన్న సాగు చేయడంవల్ల అధికలాభాలు సాధించవచ్చు. సోయాచిక్కుడు : సోయా చిక్కుడు పంట కాలం నాలుగు నెలలు ఉంటుంది. పెసరతో పోలిస్తే సోయా చిక్కుడు వర్షాలను తట్టుకునే అవకాశం ఉంటుంది. నీటి వనరు ఉన్న రైతులు జూన్‌ 20 నుంచి జూలై 10వరకు సాగు చేయాలి. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 20 వరకు పంట చేతికొస్తుంది. సోయాచిక్కుడు సకాలంలో సాగు చేయడం వల్ల రెండో పంటగా వేరుశెనగ,మూడో పంటగా వేసవి లో పెసరను సాగు చేసుకోవచ్చు.
మిరప : మిరప పంట కాలం ఏడు నెలలు ఆగస్టు మొదటి వారంలో నారు పోసుకుని సెప్టెంబర్‌లో నాటు వేసుకోవాలి. నకిలీ విత్తనాలు ఖరీదు చేసి మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు. గుర్తింపు పొందిన డీలరు వద్ద విత్తనాలతో పాటు తప్పనిసరి గా రశీదు తీసుకోవాలి. మిరప సాగుచేసే రైతులు తొలకరి వర్షాలు కురియగానే తక్కువ కాలంలో చేతికొచ్చే పెసర రకాలను సాగు చేసి దాని తర్వాత మిరప సాగు చేసుకొవచ్చు.
వరి : దీర్ఘకాలిక వరి రకాలకు సంబంధించి జూన్‌ మొదటి వారం నుంచి చివరి లోపు నారు పోసు కోవాలి. పంటకాలం 135 నుంచి 150 రోజులు ఉంటుంది.అక్టోబర్‌ 31నుంచి నవంబర్‌ 20 లోపు పంట చేతికొస్తుంది. మధ్యకాలిక రకాల నారును జూన్‌ 20 నుంచి జులై 10లోపు పోసుకోవాలి. పంటకాలం125 నుంచి 135 రోజులు. నవంబర్‌ 5నుంచి 25లోపు పంట చేతికొస్తుంది. వానకా లంలో సాగుచేసిన పంటసకాలంలో చేతికి రావ డంతో నవంబర్‌లో వేసవి వరి సాగు చేయడానికి వీలుంటుంది. వానకాలం ఆలస్యం చేయడం వల్ల యాసంగి కూడా ఆలస్యమౌతున్నది.ఏప్రిల్‌లో వడ గండ్ల వర్షాలకు వేసవిలో సాగుచేసిన వరి నష్టపో వాల్సి వస్తున్నది. మార్చి చివరి వరకు యాసంగి పంట చేతికొస్తే వడగండ్ల వానతో వచ్చే నష్టాలను అధిగమించొచ్చు. నేరుగా పొడి దుక్కిలో వరి సాగు చేసే రైతులు స్వల్పకాలిక రకాలను జూన్‌ 20 నుంచి అక్టోబర్‌15లోపు సాగుచేయాలి.మధ్య కాలిక రకాలను జూన్‌ 20నుంచి జూలై 10లోపు సాగు చేయాలి. అక్టోబర్‌ చివరి వారం నుంచి నవంబర్‌ మొదటి వారంలో పంట చేతికొస్తుంది.
కాలానుగుణంగా పంటలు సాగు చేసుకోవాలి
రైతులు పంటలను కాలానుగుణంగా ఎంపిక చేసుకోవాలి.ఏపంటలను ఎప్పుడు సాగు చేయాల నేది పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతే వేసుకో వాలి.కాలానుగుణంగా సాగుచేయడం వల్ల మంచి దిగుబడులు పొందడమే కాకుండా రోగాల ప్రభావం తగ్గుతుంది.ఏ పంటలను సాగు చేయా లన్న విత్తనాలను ఎక్కడ పడితే అక్కడ కొనకుండా గుర్తిం పు పొందిన డీలర్‌ వద్దే కొనుగోలు చేసి రశీదును తప్పక తీసుకోవాలి.
ఖరీఫ్‌ సన్నద్ధత ఏదీ?
ఈమారు తొలకరి పలకరింపు ఆలస్య మైంది. జూన్‌ మూడవవారానికీ వర్షాల్లేక ఏరు వాక కదల్లేదు. ఖరీఫ్‌ సేద్యానికి అదను పదును తప్పేలా ఉంది.తుపాన్లు,వరదలు,అకాల వానలు, వర్షాభావం నిరుడు ఖరీఫ్‌ రైతుల ఉసురు తీశా యి. పంటలకు ధర సమస్య తిష్ట వేసింది. ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం ఉండనే ఉన్నాయి. ఈ తడవైనా ఖరీఫ్‌ పంటలు వేయబోతే ఆదిలో హంసపాదులా నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. సీజన్‌లో 21 రోజులు గడిచినా మబ్బు జాడలేదు. ఆ ప్రాం తం ఈ ప్రాంతం అని లేకుండా అధిక ఉష్ణోగ్రత లు, వడగాలులు, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికి పడాల్సిన సాధారణ వర్షంలో 61శాతానికిపైన తక్కువ పడిరది. చిత్తూరు మినహా అన్ని జిల్లాలూ 50-80 శాతం వర్షపు లోటు ఎదుర్కొంటున్నాయి.ఎ.పి.లో 679 మండ లాలుండగా 527 చోట్ల తక్కువ వర్షం పడిరది. 11 మండలాల్లో చినుకు లేదు.
మో91మండలాల్లో మాత్రమే నార్మల్‌, అంతకంటే కొంచెం వర్షం కురిసింది.ఈగణాం కాలు ప్రభుత్వానివి.క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. వ్యవసాయ రాష్ట్రం ఎ.పి.కి ఖరీఫ్‌ కీలకమైనది కాగా రానురా ను రైతులకు సీజన్‌ భారంగా కష్టం గా తయారైం దని సాగు లెక్కలు తెలుపుతున్నాయి. గతేడాది నిర్ణయించుకున్న సాధారణ సాగు విస్తీర్ణంలో ఐదు న్నర లక్షలఎకరాల్లో విత్తనం పడక బీడు పడ్డాయి. రబీలోనూ పది లక్షల -ఎకరాల్లో పంట ల్లేక ఖాళీ పడ్డాయి. క్రమేపి సాగు తగ్గుతుండ టంతో నిర్ణయించుకునే నార్మల్‌ సాగు అంచనాలూ తగ్గిపోతున్నాయి.ఉదాహరణకు నిరుడు ఖరీఫ్‌ కంటే ఈ సారి ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలు పడిపోయింది. ఒక్క సంవత్స రంలో అన్నేసి లక్షల ఎకరాల తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది. రాయలసీమలో వేరుశనగ విస్తీర్ణం తగ్గి పత్తి, ఇతర వాణిజ్య పంటలు పెరుగుతున్నా యి. ధాన్యాగారాలైన గోదావరి,కృష్ణా,పెన్నా డెల్టా లలో వరి కుదించుకుపోయి ఆక్వా, ఇతర కమర్షి యల్‌ క్రాప్స్‌ వేస్తున్నారు. ఈ ధోరణులు ప్రభుత్వాల విధానాల పర్యవసానాలు. ఏపంట వేసినా పెట్టు బడులకు కనీస గ్యారంటీ లేనందున సేద్యం రైతు లకు జూదాన్ని తలపిస్తోంది. అందుకే తలో దిక్కు పోయి చేతులు కాల్చుకొని నష్టపోతున్నారు. చివరికి చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులతో స్వంత వ్యవసాయం మాన్పించి కార్పొరేట్ల చెప్పుచేతల్లోకి చేర్చే కుట్ర జరుగుతోంది. ఇది రైతాంగానికి ప్రజల ఆహార భద్రతకు ప్రమాదం.
ఖరీఫ్‌ సన్నద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం అంతగా ప్రాధాన్యత ఇవ్వనట్లే కనిపిస్తోంది. పంటలేయా లంటే రైతులకు కావాల్సినవి అదనకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరపతి, సాగు నీరు. వర్షాలు పడలేదు కాబట్టికానీ, లేకపోతే విత్తనాల కోసం వెదుకులాటే. రాయితీ వేరుశనగ విత్తన పంపిణీని మమ అనిపించారు. ఇండెంట్‌ బాగా తగ్గించారు. వరి, ఇతర పంటలదీ అదే తీరు.నిరుడు నకిలీ, కల్తీ మిర్చి విత్తనాలు, నారుతో రైతులు భారీగా నష్టపోయారు. పత్తి విత్తనాలూ అంతే. ఇప్పటి వరకు రైతులకు నష్ట పరిహారం అందలేదు. కాగా ఈ ఏడాది ఖరీఫ్‌ మొదలుకాక ముందే చాలాచోట్ల నకిలీ విత్తనాలను సీజ్‌ చేశారు. పట్టుకున్నది గోరంత, పట్టుకోకుండా చెలామణి అవుతున్నది కొండంత.పురుగు మందుల అక్ర మాలు చెప్పనలవికావు. నాణ్యత విషయంలో రాజీ లేదని ప్రభుత్వం హూంకరిస్తుండగా జరిగేది జరిగి పోతోంది. నిరుడు ఎరువుల సరఫ రాలో అస్తవ్య స్తత వలన అదనుకు ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్‌ రుణాల లక్ష్యాలు వందకు వంద శాతం చేరాయంటున్నా కౌలు రైతుల పరపతి అధమస్తంగా ఉంది. కేంద్ర బీమా పథకంలో చేరడంతో ఖరీఫ్‌ బీమా ఇంకా అంద లేదు. అకాలవర్షాల బారిన పడ్డ రైతుల్లో చాలా మందికి పరిహారం దక్కలేదు. రైతు భరోసా చాలా మందికి పడలేదు.పి.ఎంకిసాన్‌ జాడ లేదు. కేలం డర్‌ ప్రకారం కాల్వలకు నీళ్లొదులుతు న్నామం టున్నా చివరి భూములకు అందట్లేదు. మరమ్మ తుల్లేక కాల్వల్లో తగినంత నీరు పారట్లేదు. రిపేర్లు లేక చిన్న వానలకే డ్రైన్లు పొంగి పొలాలపై పడుతు న్నాయి. శ్రీశైలం దగ్గరే రిపేర్లు లేవు. ప్రభుత్వం మాత్రం ఆర్‌బికెల జపం చేస్తోంది.ఏర్పాట్లు లేకుం డా ఖరీఫ్‌ సజావుగా సాగదు. ప్రభుత్వం ఖరీఫ్‌ సన్నద్ధతపై దృష్టి నిలపాలి.
వ్యాసకర్త : కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి-(దొంగరి నరేశ్‌)

కార్పోరేట్ల కోసమే..బ్లూ ఎకానమీ పాలసీ

సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేవు.అనేక పోర్టులు, విమా నాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉందనే సత్యాన్ని దాచి ‘బ్లూఎకానమీ’ ద్వారా ఆర్థిక కార్యక లాపాలను అభివృద్ధి చేస్తామనడం అతిశయోక్తి అవుతుంది. లాభాల కోసం పని చేసే సంస్థలకు సముద్ర ప్రాంతాల్ని అప్పగించడం ద్వారా మత్స్య కారులు జీవనోపాధిని కోల్పోతారు. విపరీతమైన పర్యావరణ నష్టం వాటిల్లుతుంది.అభివృద్ధి ప్రధానాశయంగా పేర్కొంటున్న ‘బ్లూ ఎకానమీ పాలసీ’ అందమైన అబద్ధం. అత్యంత పేదవర్గాలైన మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తీయడంతో పాటు వారిని వారి నివాసాలకు దూరం చేసే కుట్ర. ఇప్పటికే ‘సాగరమాల’ పేరుతో చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన కార్యకలాపా లతో మత్య్సకారుల జీవన విధానంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్న లక్షలాదిమంది మత్య్సకార కుటుంబాలను వారి జీవనోపాధికి దూరం చేసి,వారి ఆవాసాలను బడా కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘బ్లూ ఎకానమీ పాలసీ’ని ముందుకు తెచ్చింది. సముద్ర జలాల పరిరక్షణ,పర్యావరణం, సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న ప్రజల రక్షణకు సంబంధించిన అంశాలేవీ లేకుండానే దేశంలోని సముద్ర తీరాన్ని, సముద్ర సంపదల్ని స్వదేశీ,విదేశీ కార్పొరేట్‌లకు అప్పగించేందుకు కేంద్రం పావులు కదుపు తోంది.కార్పొరేట్ల సేవే లక్ష్యంగా పని చేస్తోంది.
ప్రపంచ వాణిజ్యంలో 80శాతం సముద్రాల నుంచే జరుగుతుంది. ప్రపంచ జనాభాలో 40శాతం మంది ప్రజలు తీర ప్రాంతాలకు సమీపంలోనే నివసిస్తున్నారు. భారతదేశం విస్తారమైన,వైవిధ్యమైన సముద్ర భూభాగాన్ని కలిగి ఉంది.అరేబియా సముద్రం,బంగాళాఖాతం వెంబడి కీలకమైన వివిధ ఓడరేవు నగరాలున్నాయి.మొత్తం 8,118కి.మీ పొడవైన తీరప్రాంతం ఉంది. ప్రతి ఏటా దాదాపు4.412మెట్రిక్‌టన్నుల చేపలు సముద్రం నుంచి ఉత్పత్తి అవుతున్నా యనే అంచనాలున్నాయి.దాదాపు4కోట్ల మంది ప్రజలు సముద్ర చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు.ప్రతిఏటారూ.65వేలకోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని ఎగుమతుల విషయానికి వస్తే మత్య్స సంపద వాటా గణనీయమైనది.
వీటన్నిటిని గమనంలోకి తీసుకున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇంతటి ఆర్థిక పరిపుష్టి కలిగిన సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్ర సంపదల్ని తన అనుంగు కార్పోరేట్లకు కట్టబెట్టడానికి కావలసిన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగానే ‘సాగరమాల’ప్రాజెక్ట్‌ రూపకల్పన జరిగింది. ఇది చాలదన్నట్టు తాజాగా‘బ్లూఎకానమీ పాలసీ’ని ముందుకు తెచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద తీరప్రాంత దేశమైన భారత్‌లో అందమైన బీచ్‌లు,తీర ప్రాంతాలకు రవాణా సౌకర్యాల మెరుగు, ఓడరేవుల ఆధునీ కరణ, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, సముద్ర కాలుష్య నివారణ, సముద్ర వనరుల సక్రమ వినియోగం వంటి అందమైన, మోసపూరితమైన అంశాలను ముందు పెట్టి ‘బ్లూ ఎకానమీ పాలసీ’ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంటోంది.దేశంలోని తొమ్మిది తీర ప్రాంత రాష్ట్రాల్లోని12మేజర్‌ పోర్టులు,200 చిన్న పోర్టులకు రవాణా సౌకర్యాల కల్పనద్వారా వ్యాపారాన్ని పెంచాలనేది ఇందులో ప్రధానాంశం. షిప్పింగ్‌ పరిశ్రమ విస్తరణద్వారా కార్పోరేట్‌ శక్తులకు మరిం త లాభం చేకూర్చాలని చూస్తోంది.ఆఫ్‌ షోర్‌ ఎనర్జీ ప్రొడక్షన్‌ను ప్రోత్సహించడం, ఇంధన అవసరాలను తీర్చడం అనే పేరుతో ఆయా విభాగాల్ని పూర్తిగా ప్రైవేటు శక్తులకు కట్టబెట్టాలని చూడడం మరో అంశంగా కనిపిస్తోంది. మెరైన్‌ బయో టెక్నాలజీ, మైనింగ్‌ల పేరుతో సముద్రం లోని ఇసుక, ఇతర ఖనిజ సంపదలపై కార్పొరేట్‌ శక్తులకు గుత్తాధి పత్యం కట్టబెట్టడం ఇంకో అంశం.
అయితే ప్రభుత్వం మాత్రం ఈ పాలసీ మొత్తం అభివృద్ధి కోసమే అంటోంది. ఇందుకోసం ఆ పాలసీ ముసాయిదాలో చెబుతున్న అంశాలేవీ ఆచరణకు నిలుస్తాయనడానికి తగిన చర్యలు ఉండడం లేదు. సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేవు. అనేక పోర్టులు, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉందనే సత్యాన్ని దాచి‘బ్లూ ఎకానమీ’ ద్వారా ఆర్థిక కార్యకలాపాలను అభివృద్ధి చేస్తామనడం అతిశ యోక్తి అవుతుంది. లాభాల కోసం పని చేసే సంస్థ లకు సముద్ర ప్రాంతాల్ని అప్పగించడం ద్వారా మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతారు. విపరీత మైన పర్యావరణ నష్టం వాటిల్లుతుంది. సముద్రం తో ఇప్పటికే ఓవర్‌ ఫిషింగ్‌ అనేది ఒక పెద్ద సవాలు గా ఉంది. సాంప్రదాయ మత్య్సకారుల పాలిట ఇది శాపంగా మారుతోంది. హై సీస్‌ లో అంతర్జాతీ య సంస్థలకు చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించడంతోక్రమంగా ప్రపంచానికి ఫుడ్‌ బాస్కెట్‌ గా పిలువబడే సముద్ర జలాల్లో చేపల నిల్వలు క్షీణించి సముద్ర పర్యావరణ వ్యవస్థకే పెనుముప్పు గా పరిణమిస్తున్నాయి. ఇది తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సముద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారడంతో విపరీతమైన ఎగుమతు లు, దిగుమతుల కారణంగా,సముద్రంపై ఇంధన రవాణా మూలంగా చమురు చిందటం,ప్లాస్టిక్‌ వ్యర్థాలు,పారిశ్రామిక వ్యర్థాలతో కాలుష్యం పెరుగు తుంది.ఇక డీప్‌శాండ్‌ మైనింగ్‌ కారణంగా సముద్ర పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగిస్తుంది. వాతావ రణంలో విపరీతమైన మార్పులు పెరిగి తీరప్రాం తాల్లో తీవ్ర నష్టం జరుగుతుంది.
మరో కీలకమైన అంశం విషయానికి వస్తే ఎంతో కాలంగా భారతదేశం,శ్రీలంకల మధ్య ఫిషింగ్‌ వివాదం నడుస్తూనే ఉంది. ఇరు దేశాల సముద్ర జలాల మధ్య సరిహద్దు స్పష్టంగా విభ జించబడలేదు. ఇది రెండు దేశాల మత్స్యకారుల మధ్య గందరగోళానికి, సంఘర్షణకు దారితీస్తూనే ఉంది. దీనికి ‘బ్లూఎకానమీ పాలసీ’పరిష్కారం చూపించలేదు. సస్టైనబిలిటీ సైన్స్‌ జర్నల్‌ తన సంపాదకీయంలో బ్లూఎకానమీపై కీలకమైన వ్యాఖ్య చేసింది. బ్లూ ఎకానమీకి సరైన నిర్వచనం లేదని పేర్కొంది. ఈ అసంబద్ధత కారణంగా ఈ పాలసీని రూపొందించి అమలు చేసే వారి అభిరుచులను బట్టి ఎంపిక చేసుకున్న లక్ష్యాలు తారుమారవుతా యని హెచ్చరించింది. మరో అంతర్జాతీయ పరిశో ధన సంస్థ దీన్ని మత్య్సకారుల పాలిట విషాదకర మైన పాలసీగా పేర్కొంది. మత్స్యకారులు సముద్రా న్ని చాలా స్థిరమైన పద్ధతుల్లో ఉపయోగిస్తారని, అయితే బ్లూఎకానమీ పాలసీ ఇందుకు విరుద్ధమైన దని తెలిపింది.ఈ పాలసీ సముద్రాన్ని లాభదాయక మైన వనరుగానే పరిగణిస్తుందని పేర్కొంది. తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలు విధ్వంసం అవుతా యని వెల్లడిరచింది.
ఈ నేపథ్యంలో ఏ దేశమైనా తన సముద్ర సంపదను కేవలం ఆర్థిక వనరుగానే చూడకూడదని గ్రహించాలి. సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ కోణంలోనూ చూడాల్సి ఉంటుంది. కేవలం కార్పొ రేట్ల కోసం వ్యాపార కాంక్షతో…లక్షలాది మంది మత్య్సకారుల కడుపు కొట్టేలా రూపొందించిన బ్లూ ఎకానమీ పాలసీనిరద్దు చేయాలి. సముద్ర తీరప్రాం తాల్లో పర్యావరణానికి హాని కలుగకుండా స్థిరమైన అభివృద్ధి కోసం అన్నిరంగాల నిపుణులతో సంప్ర దింపులు జరిపి సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి.
‘బ్లూ ఎకానమీ’ అంటే ఏమిటి
బ్లూ ఎకానమీ అనేది తప్పనిసరిగా దేశంలో అందుబాటులో ఉన్న అనేక సముద్ర వన రులను సూచిస్తుంది,ఇది ఆర్థిక వృద్ధి, పర్యావరణ స్థిరత్వం మరియు జాతీయభద్రతతో అనుసం ధానం కారణంగా వస్తువులు,సేవల ఉత్పత్తికి సహా యం చేయడానికి ఉపయోగపడు తుంది. భారత దేశం వంటి తీరప్రాంత దేశాలకు సముద్ర వనరు లను సామాజిక ప్రయోజనం కోసం బాధ్యతాయు తంగా వినియోగించుకోవడానికి నీలి ఆర్థిక వ్యవస్థ ఒక విస్తారమైన సామాజిక-ఆర్థిక అవకాశం. భారతదేశంబ్లూ ఎకానమీ ఎంత ముఖ్యమైనది?
భారతదేశం నీలి ఆర్థిక వ్యవస్థ మొత్తం సముద్ర వనరుల వ్యవస్థ, దేశం యొక్క చట్టపరమైన అధికార పరిధిలోని సముద్ర,సముద్ర మరియు సముద్ర తీరప్రాంతాలలో మానవ నిర్మిత ఆర్థిక మౌలిక సదుపాయాలతో కూడిన జాతీయ ఆర్థిక వ్యవస్థ ఉపసమితి. దాదాపు 7,500 కిలోమీటర్లతో, భారతదేశం ఒక ప్రత్యేకమైన సముద్ర స్థానాన్ని కలిగి ఉంది.దాని 29రాష్ట్రాలలోతొమ్మిది తీర ప్రాం తం దాని భౌగోళికంలో1,382 ద్వీపాలు ఉన్నా యి. దాదాపు199 ఓడరేవులుఉన్నాయి. వీటిలో 12 ప్రధాన ఓడరేవులు ప్రతి సంవత్సరం సుమారు 1,400 మిలియన్‌ టన్నుల సరుకును నిర్వహిస్తాయి. అంతేకాకుండా, 2 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలం ముడి చమురు, సహజ వాయువు వంటి ముఖ్యమైన పునరుద్ధరణ వనరులతో జీవన మరియు నిర్జీవ వనరులను కలిగి ఉంది. అలాగే, తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ 4మిలియన్లకు పైగా మత్స్యకారులు మరియు తీర ప్రాంత వర్గాలను కలిగి ఉంది.
ప్రభుత్వం ముసాయిదా బ్లూ ఎకానమీ పాలసీని ఎందుకు రూపొందించింది?
భారతదేశం విస్తారమైన సముద్ర ప్రయోజనాల దృష్ట్యా, భారతదేశ ఆర్థిక వృద్ధిలో నీలి ఆర్థిక వ్యవస్థ కీలకమైన సంభావ్య స్థానాన్ని ఆక్రమించింది.స్థిరత్వం మరియు సామాజిక-ఆర్థిక సంక్షేమం కేంద్రీకృతమై ఉంటే, ఇదిGణూ మరియు శ్రేయస్సు యొక్క తదుపరి శక్తి గుణకం కావచ్చు. అందువల్ల, భారతదేశం యొక్క డ్రాఫ్ట్‌ బ్లూ ఎకానమీ పాలసీ ఆర్థికవృద్ధి,సంక్షేమం కోసం దేశం సామ ర్థ్యాన్ని అన్‌లాక్‌ చేయడానికి కీలకమైన ఫ్రేమ్‌వర్క్‌గా పరిగణించబడుతుంది.
ఈ విధానంలోని ముఖ్య మైన అంశాలు ఏమిటి?
ముసాయిదా విధానం ప్రకారం,జాతీ య వృద్ధికి పదిప్రధాన కోణాలలో నీలిఆర్థిక వ్యవస్థ ఒకటి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర అభివృద్ధిని సాధించడానికి అనేక కీలక రంగాల లోని విధానాలపై ఆధారపడి ఉంటుంది. డ్రాఫ్ట్‌ డాక్యుమెంట్‌ బ్లూ ఎకానమీ మరియు ఓషన్‌ గవర్నె న్స్‌ కోసం నేషనల్‌ అకౌంటింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ వంటి ఏడు నేపథ్య రంగాలపై దృష్టి పెడుతుందిబీ తీర సముద్ర ప్రాదేశిక ప్రణాళిక మరియు పర్యాటకంబీ సముద్ర చేపల పెంపకం,ఆక్వాకల్చర్‌ మరియు చేపల ప్రాసెసింగ్‌ తయారీ, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు,వాణిజ్యం,సాంకేతికత,సేవలు మరియు నైపుణ్యాభివృద్ధి ట్రాన్స్‌షిప్‌మెంట్‌తో సహా లాజిస్టిక్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మరియు షిప్పింగ్‌బీ తీర మరియు లోతైన సముద్ర మైనింగ్‌ మరియు ఆఫ్‌షోర్‌ శక్తిబీ భద్రత,వ్యూహాత్మక కొలతలు.
దేశం ఆర్థిక వ్యవస్థలో ఈభాగాన్ని పూర్తిగా ప్రభా వితం చేసిందా?
వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి నౌకాశ్రయాలు మరియు ఇతర షిప్పింగ్‌ ఆస్తులను నిర్మించడానికి భారతదేశం తన విస్తారమైన తీర ప్రాంతాన్ని నొక్కింది.అయితే దాని సముద్ర వనరుల మొత్తంస్పెక్ట్రమ్‌ ఇంకాపూర్తిగా ఉపయోగించ బడ లేదు. అనేక దేశాలు తమ బ్లూ ఎకానమీని ఉప యోగించుకోవడానికి కార్యక్రమాలు చేపట్టాయి. ఉదాహరణకు,ఆస్ట్రేలియా,బ్రెజిల్‌,యునైటెడ్‌ కింగ్‌ డమ్‌,యునైటెడ్‌ స్టేట్స్‌, రష్యా మరియు నార్వేలు కొలవగల ఫలితాలు మరియు బడ్జెట్‌ కేటాయింపు లతో అంకితమైన జాతీయ సముద్ర విధానాలను అభివృద్ధి చేశాయి.కెనడా,ఆస్ట్రేలియా తమ బ్లూ ఎకానమీ లక్ష్యాల పురోగతి మరియు పర్యవేక్షణను నిర్ధారించడానికి ఫెడరల్‌ మరియు రాష్ట్ర స్థాయి లలో చట్టాన్ని రూపొందించాయి సంస్థ లను స్థాపిం చాయి. డ్రాఫ్ట్‌ బ్లూ ఎకానమీ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌తో, భారతదేశం ఇప్పుడు తన సముద్ర వనరుల యొక్క విస్తారమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది.
నీలి ఆర్థిక వ్యవస్థ
నీలి ఆర్థికవ్యవస్థ అనేది మహా సముద్రా లలో వనరులు,ఆస్తుల స్థిరమైన అభివృద్ధి,నదులు, నీటి వనరులు,తీర ప్రాంతాలను అను సంధానం చేయడం,ఈక్విటీ,చేరిక,ఆవిష్కరణ,ఆధునిక సాంకేతి కతపై దృష్టి సారించే విస్తృత శ్రేణి ఆర్థిక కార్యక లాపాలను సూచిస్తుంది. భారతదేశం నీలి ఆర్థిక వ్యవస్థ ఆహార భద్రత,పేదరిక నిర్మూలన,వాతా వరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం మరియు స్థితిస్థాపకత, వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంపొందించడం, సముద్ర కనెక్టివిటీని మెరుగుపర చడం, వైవిధ్యతను పెంచడం, ఉద్యోగ కల్పన మరియు సామాజిక-ఆర్థికవృద్ధికి దోహదం చేస్తుం ది.కోవిడ్‌-19 మహమ్మారి సవాళ్లను ఎదుర్కొన్న ప్పటికీ ఈ రంగం వృద్ధి చెందింది మరియు ఏప్రిల్‌ 2021-ఫిబ్రవరి2022 నుండి వి7.2బిలియన్ల విలు వైన ఎగుమతులను నమోదు చేసింది. భారత తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ నాలుగు మిలియన్లకు పైగా మత్స్యకారులను,తీరప్రాంత పట్టణాలను ఆదుకుంటుంది.250,000ఫిషింగ్‌ బోట్‌ల సముదా యంతో భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద చేపలను ఉత్పత్తి చేసే దేశం.భారతదేశంలో, నౌకా నిర్మాణం,షిప్పింగ్‌ కూడా నీలిఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన అంశాలు.కోస్టల్‌ షిప్పింగ్‌ యొక్క ఆర్కిటి పాల్‌ ప్రస్తుతం 6శాతం నుండి 2035 నాటికి 33శాతానికి పెరిగే అవకాశం ఉంది.
నీలి విప్లవం
హిందూ మహాసముద్రం నీలి ఆర్థిక వ్యవస్థ గ్లోబల్‌ఎకానమీ కారిడార్‌గా మారింది. ఎందుకంటే భారతదేశం వ్యూహాత్మ కంగా హార్ముజ్‌ జలసంధి మరియు మలక్కా జలసంధి అని పిలువ బడే రెండు ముఖ్యమైన ప్లగ్‌ పాయింట్ల మధ్య ఉంది.దీని ద్వారావాణిజ్య షిప్పింగ్‌లో ఎక్కువ వాణి జ్యం హిందూ మహాసముద్రంలో కదులుతుంది. నీలి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, ఓడరేవు ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు, తీరప్రాంత షిప్పింగ్‌లోవృద్ధి,ట్రేడ్‌ ప్రోటోకాల్‌ మార్గాలు, క్రూయిజ్‌ టూరిజం, ఓడరేవు-నేతృత్వంలోని అభి వృద్ధి కోసం ‘సాగర్‌మాల ప్రాజెక్ట్‌’ వంటి వాటిపై దృష్టి సారించడంతో,సముద్ర ట్రాఫిక్‌ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. దేశంలోని మత్స్య రంగం స్థిరమైన,బాధ్యతాయుతమైనఅభివృద్ధి ద్వారా ‘నీలి విప్లవం’ తీసుకురావడానికి భారత ప్రభుత్వం మే 2020లో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (ూవీవ్‌ీూ)నిరూ.20,050 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకారం,2023-24 కేంద్ర బడ్జెట్‌లో, మత్స్యకారుల కార్యకలాపాలను మరింత ప్రారం భించడానికి ూవీవ్‌ీూ కింద ఉప-పథకాన్ని ప్రారంభించడానికి 6,000 కోట్లు కేటాయించారు.
సముద్ర శిధిలాల ముప్పు
అబాండన్డ్‌, లాస్ట్‌ లేదా డిస్కార్డ్‌ ఫిషింగ్‌ గేర్‌ (AూణఖీG) అనేది ప్రపంచవ్యాప్తంగా తగి నంత డేటా లభ్యత కారణంగా తీవ్రమైన ముప్పు. చేపలుపట్టడం లేదాచేపలు పట్టే ప్రమాదాలు చెడు వాతావరణం కారణంగా, భారీ మొత్తంలో ఫిషింగ్‌ నెట్‌ మరియు గేర్లు కోల్పోయి వ్యర్థాలు (ఘోస్ట్‌ నెట్‌) సముద్రంలో ఉంటాయి. వారి జీవితకాల మంతా, వారు సముద్ర జాతులను చంపుతూనే ఉంటారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రకారం మహాసముద్రాలలో20శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలు AూణఖీG రూపంలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా,ఏటా 640,000 టన్నుల ఘోస్ట్‌ గేర్లు మహాసముద్రాలలో పారవేయబడతాయి. భారత దేశంలో174,000 యూనిట్లు ఫిషింగ్‌ గేర్‌లు పని చేస్తున్నాయి. వీటిలో154,008యూనిట్లు గిల్‌నెట్‌లు / డ్రిఫ్ట్‌నెట్‌లు,7,285 యూనిట్లు ట్రాప్‌లు మరియు మిగిలినవి ఫిషింగ్‌ లైన్‌లు.వీటిలో,భారతదేశం ఏటా 15,276 టన్నుల గిల్‌నెట్‌లను కోల్పోతుందని ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ తెలిపింది.
సముద్రపు చెత్తాచెదారం యొక్క ప్రతి కూల ప్రభావం నుండి నీటి దిగువన మరియు సముద్రం పైన ఉన్న జీవితాన్ని రక్షించడానికి, కేంద్ర భూమి మరియు సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ 2022లో ‘‘స్వచ్ఛ్‌ సాగర్‌ సురక్షిత్‌ సాగర్‌’’ ప్రచారం క్రింద తీరప్రాంతక్లీన్‌-అప్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. భారతదేశం ఏటా అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవంలో చురుకుగా పాల్గొంటుంది మరియు తీరప్రాంతాలకు సమీపంలో ఉన్న స్థానిక సంస్థల సహాయంతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.ఇంకా,భారతదేశం ఇప్పటికే ‘‘నేషనల్‌ మెరైన్‌ లిట్టర్‌ పాలసీ’’ని రూపొందించే మార్గంలో ఉంది.ఇది ‘జీరో వేస్ట్‌’ విధానాలతో స్వచ్ఛమైన నీలిరంగు బీచ్‌లను ఇష్టపడే పర్యాటకం కోసం బ్లూ బీచ్‌ అభివృద్ధిలో నిమగ్నమై ఉంది.-(డా.సి.ఎన్‌.క్షేత్రపాల్‌ రెడ్డి)

ఆదివాసీ జీవనం విధ్వంసం

సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులుగా, అడవుల సంరక్షకులుగా వాసికెక్కిన వనవాసుల జీవనం ఆధునికులకు ఆశ్చర్యంగా ఉన్న అసలైన మానవ సంస్కృతి వారి వద్దేఉంది అన్నది వంద శాతం నిజం.అటువంటి అడవి బిడ్డల జీవన సంస్కృతుల గురించి ఇంతకాలం వారిని పరిశీలించిన దగ్గరగా జీవించిన వారే వ్రాయడం చూసాం చదివాం కానీ 20వ శతాబ్దంలో వచ్చిన ఆధునిక మార్పుల్లో భాగంగా అడవి బిడ్డల్లో అక్షరాస్యత విరివిగా పెరగడంతో వీధి బడి చదువులో నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి ఆదివాసుల చదువులు ఎదిగాయి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడువాయి మండలం కామారం గిరిజన గ్రామానికి చెందిన మైపతిఅరుణ్‌ కుమార్‌ అనే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థి తన గిరిజన జన జాతికి చెందిన జీవనం గురించి,దాని విధ్వంసం గురించి కూలం కశమైన గ్రంథం వ్రాశారు. ఒక గిరిజన యువకుడు అందున పోరాట నాయకుడు, అయిన అరుణ్‌ కుమార్‌ ఈ రచన చేయడానికి 2012లో సుమారు నెలరోజుల పాటు 5848 కిలోమీటర్ల దూరం పర్యటించి తెలుగు ప్రాంతాలే కాక పక్క రాష్ట్రాల్లోని గిరిజన గ్రామాలను సందర్శించి స్థానిక చరిత్రలతో పాటు అక్కడి భౌగోళికత, గిరిజనజీవన స్థితి గతులు, ఆధునిక ప్రపంచీకరణ ద్వారా ఆదివాసులకు జరుగుతున్న నష్టాలు, భావితరం తీసుకోవలసిన జాగ్రత్తలు, గురించి, సవివరంగా సచిత్రంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.502 పేజీలు గల ఈ బృహత్తర రచనను 30 అధ్యాయాలుగా విభజించారు, ఆదివాసి స్వయం పాలన ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ బియ్యాల జనార్దన్‌ రావు గారికి అంకితం ఇవ్వబడ్డ ఈ గ్రంథం నాటి వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యం, మొదలుకొని దేవాదుల ప్రాజెక్టు, కమలాపురం కాగిత పరిశ్రమ, అశ్వాపురంభార జల కర్మాగారం, భద్రాచలం పేపర్‌ బోర్డు, మొదలుకొని.. రంప రాజ్యం రంప పితూరి శ్రీకాకుళం గిరిజన ఉద్యమం దాని కారకుడు సత్యం మాస్టారు వాకపల్లి అమాను షత్వం, బొండా,భగత,గిరిజన జీవన విధానాలు మర్రి కొమరయ్య పోరాటం ఇలా అనేక విషయాలు ఇందులో వివరించబడ్డాయి. అలాగే నల్లమల చెంచుల జీవితాలు, చెంచుల చెరవిడిన శ్రీశైల క్షేత్రం, చెంచుల జీవావరణ వ్యవస్థ, ప్రమాదంలో చెంచుల మనుగడ, గురించి కూడా ఇందులో హెచ్చరించారు రచయిత, ఇక ఆదిలాబాద్‌ గుండులు తొలి పోరాటయోధుడు రాంజీ గోండు,కేస్లాపూర్‌ నాగోబా జాతర,బాసర క్షేత్రం,గోండ్వానా రాజ్య పాలన చరిత్రతో పాటు గోండుల ఆరాధ్య దైవం హైమన్‌ డార్ప్‌,గుస్సాడి నృత్యం, తదితర జగద్వితమైన విషయాలను భిన్నకోణాల్లో క్షేత్ర పర్యటనల అనుభవసారం జోడిరచి, అనేక ప్రామాణిక విషయాలు, విశేషాలతో ఈరచన చేయబడిరది,
గిరిజన ప్రాంతాలలోని వాస్తవాలతో పాటు, చరిత్ర, గణాంకాలు, చిత్రపటాలతో ఈ బృహత్తర గ్రంథం పరిపూర్ణ ప్రామాణికత సాధించింది అనడంలో అతిశయం అనిపించదు.
రచన శైలి కూడా సరళమైన బాణీలో ఉండి పాఠకులకు అనుకూలంగా చదివించే విధంగా ఉంది.
అచ్చమైన ఆదివాసి జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర పూర్వకథ తోపాటు పూజా విధానాలు వారి ఆచారాల ప్రకారం ఎలా చేస్తారు వివరిస్తూ నీటి ఆధునిక సమాజం గిరిజన ఇతరులు జాతరను హస్తగతం చేసుకుని అసలు సాంప్రదాయాన్ని ఎలా కనుమరుగు చేస్తున్నారో చెబుతూ రచయిత అరుణ్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు.
పాల్వంచ అటవీ ప్రాం తానికి చెందిన గిరిజన పోరాట యోధుడు, చరిత్ర విస్మరించిన వీరుడు, అయిన ‘‘సోయం గంగులు’’ పోరాటతీరు అమరుడైన వైనం, గురించి ఇందులో పేర్కొనడం ద్వారా రచయిత అరుణ్‌ లోని సూక్ష్మ పరిశీలన, పరిశోధన దృష్టి అర్థమవుతుంది, ఇలా వ్యక్తులే కాకుండా ప్రాంతాలు ఆచారాలు, ఆహారాలు, పండుగలు, మొదలైన అనేక విషయాలు, విశేషాలు, గురించి భిన్నకోణంలో ఇందులో వ్యక్తీకరించబడి తద్వారా అనేక నూతన విషయాలు సంఘటనలు ఆవిష్క రించ బడ్డాయి.కేవలం గిరిజన ప్రాంతాల్లో ప్రపంచీకరణ సాయంగా జరుగుతున్న యుద్ధం, గురించి విమర్శించి వదిలేయలేదు, కానీ నిలుపుదలకు తీసుకోవలసిన చర్యలు చట్టాలు అమలుకు తీసుకోవలసిన తక్షణ చర్యల గురించి కూడా నిర్మొహమాటంగా వివరించి జాగృతంతో కూడిన హెచ్చరికలు చేశారు రచయిత.
ఒక గ్రామాన్ని షెడ్యూల్‌ ఏరియాగా గుర్తించడానికి ఉండాల్సిన అర్హతలు గురించి చెబుతూ ప్రధాన లక్షణాలైనా అధిక శాతం ఆదివాసీలు ఉండటం,
ఆ గ్రామ అభివృద్ధి స్థాయి,ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటందుకు గల విస్తీర్ణం,వంటి ప్రాథమిక మార్గదర్శకాలు ఇందులో చెప్పారు, అలాగే చాలా గిరిజన గ్రామాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా షెడ్యూల్‌ గ్రామాలుగా ఎంపిక చేయబడక, అక్కడ గిరిజనులు అయిదవ షెడ్యూల్‌ హక్కులు ఎలా కోల్పోయి నష్టపోతున్నారో కూడా ఇందులో వివరించారు.
వాకపల్లి అడవితల్లి ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం, భూపతిపాలెం ప్రాజెక్టు, కన్నెధార గ్రానైట్‌ పరిశ్రమ వల్ల అక్కడి ఆదివాసీల జీవనానికి వాటిల్లుతున్న ముప్పు,
గుర్తు చేస్తూనే శ్రీకాకుళం ప్రాంత సవర గిరిజనుల నృత్యాలు, ఆచారాలు, తో పాటు వారి ఉన్నతికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి గురించి కూడా గుర్తు చేశారు.
అలాగే ఆదిలాబాద్‌ ప్రాంతానికే వన్నెతెస్తున్న ‘‘కుంటాల జలపాతం’’ ఎలా కనుమరుగు కాబోతున్నదో కూడా చెబుతూ ఇది శకుంతల దుష్యంతుల విహార కేంద్రమని, మొదట దీనిని ‘‘శకుంతల జలపాతం’’గా పిలిచేవారని కాలక్రమంలో ‘కుంటాల’గా రూపాంతరం చెందిందనే చారిత్రిక విషయాలను కూడా ఇందులో వివరించారు.
అదేవిధంగా కొమరం భీమ్‌ పోరాట క్షేత్రం జోడేఘాట్‌ గురించి, పోరాటం యొక్క నేపథ్యం గురించి కూడా ఆసక్తికర విషయాలు విశేషాలు ఇందులో పొందుపరిచారు.
గోండుల గుస్సాడి గురించి, నాగోబా జాతర నేపథ్యం వివరాలు ఇలా… ప్రసిద్ధ, అప్రసిద్ధ అనే తేడా లేకుండా సంపూర్ణ గిరిజన సమాచారం వెలికి తీసి అక్షరీకరణ చేయడమే లక్ష్యంగా అరుణ్‌ కుమార్‌ అక్షర కృషి కొన సాగింది అనడానికి నిండు నిదర్శనం ఈ బృహత్తర పుస్తకం.
ఆదివాసి జీవనం గురించి తెలుసుకోవాలి అనుకునే పాఠకులే కాదు, గిరిజన విజ్ఞాన పరిశోధకులు విధిగా చదివి తీరాల్సిన ఉత్తమ పొత్తం ఇది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

ఎకో టూరిజం తగ్గేదెలా 

నగరవాసుల మధ్య (స్వచ్ఛసర్వేక్షణ్‌2023) పరిశుభ్రతను పెంపొందించడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది.స్వచ్ఛ సర్వేక్షణ్‌2023 లో టాప్‌ ర్యాంక్‌ సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ దృష్టి కేంద్రీకరించింది. దీని కోసం నగర ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏకో వైజాగ్‌ పేరుతో ప్రపంచ పర్యావరణ దినోత్స వం సందర్భంగా గతనెల 5న ప్రచారాన్ని ప్రారంభించింది.గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి) పౌరులలో పరిశుభ్రతను పెంపొందించడానికి,నగరంలో కాలు ష్యంతో పాటు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పోరా టాన్ని కొనసాగించడానికి ‘ఈ ఎకో-వైజాగ్‌’అనే కొత్త ప్రచారాన్ని ఆర్‌కే బీచ్‌లో మున్సిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌శాఖ మంత్రిఎ.సురేష్‌, జిల్లాఇన్‌ ఛార్జి మంత్రి వి.రజినితోపాటు మేయర్‌ జి.హరివెంకట కుమారి, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిశుభ్రత,పచ్చదనం,నీటి సంరక్షణ,ప్లాస్టిక్‌ నిషేధం, కాలుష్యాన్ని తగ్గించ డం వంటి ఐదు అంశాలపై జీవీఎంసీ కమిష నర్‌ సాయి కాంత్‌ వర్మ దృష్టి సారించారు.ఎకో క్లీనింగ్‌లో భాగంగా వ్యర్థ పదార్థాల నిర్వహణ, వేరు చేయడాన్ని ప్రోత్సహిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జివిఎంసి బహిరంగ డంపింగ్‌,పరిశుభ్రతను నిర్వహించ డంవల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగా హన కల్పిస్తుంది. డ్రైవ్‌లో భాగంగా కార్పొరేషన్‌ పరిధిలో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు.నీటి సంరక్షణలో భాగంగా బీచ్‌ క్లీనింగ్‌ కార్యకలాపాలు,రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ మెళుకువలు భారీస్థాయిలో కొనసాగుతాయి. దీంతోపాటు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఉత్పత్తులను తీసుకు రావడానికి కార్పొరేషన్‌ కృషి చేస్తుంది.దీనికి సంబంధించి ఎకోమేళా కూడా నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికీ జీవీఎంసీ 10ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ బృందాలను సిద్ధం చేసి ఆ బృందాలకు ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేసి అందజేశారు. ప్రతి బృందంలో ఇద్దరు అధికారులు నియమించారు.వారు తనిఖీలు, ఆలోచనలు,ఫిర్యాదుల పరిష్కారం, కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు. నగర ప్రజల అలవాట్లను మార్చడం,పచ్చదనాన్ని పెంపొందించడం,నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు,సింగిల్‌ యూ జ్‌ ప్లాస్టిక్‌పై కఠినమైన నిషేధం వంటి అంశాలపై ఈ టాస్క్‌ స్క్వాడ్‌లు చర్యలు తీసుకుంటారు.అవసరమైతే ఈఎన్‌ఫో ర్స్‌మెంట్‌ బృందాలు జరిమానాలు కూడా విధిస్తాయి. 56 కిలోమీటర్ల బీచ్‌ తీరప్రాంతంలోని నగర పరిమితుల్లో కాలు ష్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నగర ప్రజలు మద్దతు ప్రకటిస్తూ ఉత్సహంగా భాగస్వామ్యం అవుతున్నారు.బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ అనే నినాదంతో ప్లాస్టిక్‌ కాలుష్యానికి పరిష్కారాలపై దృష్టి పెడుతూ విస్త్రత ప్రచారం చేస్తోంది.
స్వచ్ఛ సర్వేక్షణ్‌2023లో టాప్‌ ర్యాంకే లక్ష్యం గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023-మేరా షెహర్‌,మేరీ పెహచాన్‌ (ఎస్‌ఎస్‌-2023) ఎనిమిది ఎడిషన్‌ కోసం సిద్ధమవుతోంది.దీని కోసం దేశవ్యాప్తంగా 3,000మంది మదింపు దారులతో జూలై ఒకటి నుండి ఫీల్డ్‌ అసెస్‌ మెంట్‌ ప్రారంభించారు.ఈనెల రెండోవారంలో వైజాగ్‌కు అసెస్సర్‌లు రానున్నారు. విశాఖ పట్నంతో సహా4,500ప్లస్‌ నగరాల పనితీరును 46సూచికలపై ఒక నెలలోపు మదింపుదారులు అధ్యయనం చేస్తారు. అంచనా నివేదిక ప్రతి పారామీటర్‌లో స్కోర్‌ల రూపంలో విడుదల చేయబడుతుంది.మొత్తం మార్కులు9,500. ఇందులో పౌర సేవలకు 4,525మార్కులు, సర్టిఫికెట్లు,అవార్డులకు 2,500,ప్రజల అభిప్రాయానికి 2,475మార్కులు ఉన్నాయి. ఎస్‌ఎస్‌2023 పౌరుల నుండి టెలిఫోనిక్‌ ఫీడ్‌బ్యాక్‌తో 2022లో మే 24న ప్రారంభి చింది. మూల్యాంకనం నాలుగు త్రైమాసికాల్లో నిర్వహించబడుతుంది. మొదటి మూడు త్రై మాసికాలు పూర్తయ్యాయి. బృందాలు సాక్ష్యం కోసం రెండు స్థాయిల నాణ్యత తనిఖీలు, ప్రత్యేక క్షేత్ర సందర్శనలను ఉంటాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 సర్వేలో విశాఖపట్నం నాలుగో స్థానంలో నిలిచింది.2021లో నగరం తొమ్మిదో స్థానం నుండి పైకి ఎగబాకింది. ఇది2017లో మూడవ పరిశుభ్రమైన నగరంగా ప్రకటించ బడిరది.ఇది ఇప్పటివరకు అత్యుత్తమ ర్యాంకింగ్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 ర్యాంకింగ్స్‌ ప్రకారం విశాఖపట్నం దేశంలో నాల్గవ పరిశుభ్రమైన నగరంగా (10లక్షలకు పైగా జనాభా విభాగం లో) ఎంపికైంది. నగరం 2021సంవత్సరంలో తొమ్మిదవ స్థానం నుండి 2022లో నాల్గవ స్థానానికి తన ర్యాంకింగ్‌లను మెరుగుపరిచింది. మొదటి నాలుగు స్థానాల్లో నగరానికి స్థానం దక్కడం ఇదిరెండోసారి.స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2017లో,నగరం మూడవ పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇది ఇప్పటి వరకు అత్యుత్తమ ర్యాంకింగ్‌గా ఉంది. ఇదికాకుండా,జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో మరో రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ఒక అవార్డు చెత్త రహితనగరాల్లో (జిఎఫ్‌సి)ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ను పొందినందు కుగాను, మరోకటి 10నుండి 40 కేటగిరీలో ‘క్లీన్‌ బిగ్‌ సిటీ’ అవార్డును పొందడం విశేషం.
స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాల్లో విశాఖ టాప్‌
దేశ వ్యాప్తం గా 73లక్షల 95 వేల 680 మంది ఆన్‌లైన్‌లో ఫీడ్‌ బ్యాక్‌ సేకరించారు. 2701 మంది క్షేత్ర స్థాయిలో పర్యటించి 17,030 వాణిజ్య ప్రాం తాలు,24,744 నివాస ప్రాంతాలు, 16,501 చెత్త శుద్ధి కేంద్రాలు, 1496 రెమిడియేషన్‌ సైట్లను సందర్శించి క్షేత్ర స్థాయిలో తీసిన 22.26లక్షల ఫోటోలను విశ్లేషించి ర్యాంకుల్ని ఖరారు చేశారు.లక్షకు పైబడిన నగరాల్లో విశాఖ పట్నం7500మార్కులకు 6701మార్కు లతో నాలుగో స్థానంలో,6699 మార్కులతో విజయవాడ 5స్థానంలో,6584 మార్కులతో తిరుపతి ఏడో స్థానంలో,4810మార్కులతో 75వ ర్యాంకుతో కర్నూలు,4688 మార్కులతో 81వ స్థానంలో నెల్లూరు పట్టణాలు స్వచ్ఛ భారత్‌ ర్యాంకుల్ని దక్కించుకున్నాయి.జాతీయ స్థాయిలో స్థానిక సంస్థల విభాగంలో పెద్దనగ రాల జాబితాలో 10నుంచి 40లక్షల జనాభా కింద ఈసారి పలు నగరాలను అవార్డు కోసం ఎంపిక చేయగా,మధ్యస్థాయి నగరాల జాబితా లో,3 నుంచి 10లక్షల జనాభా విభాగంలో మరికొన్ని నగరాలు, పట్టణాలను చేర్చారు.స్టేట్‌ క్యాపిటల్‌ జాబితాలో మరికొన్ని నగరాలకు అవార్డులు ప్రకటించగా,విజయవాడ మొదటి స్థానంలో నిలిచింది.అంశాలవారీ స్కోరింగ్‌.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు సంబంధించి మొత్తం వివిధ విభాగాల కింద 7,500 మార్కులు కేటా యించారు. అందులో విజయవాడ 6,699 మార్కులు మాత్రమే సాధించింది.
వాలంటీర్లకు టార్గెట్లు
గత ఏడాది చెత్త రహిత శుభ్రమైన నగరంగా మూడో స్థానాన్ని దక్కించుకున్న విజయవాడకు వాటర్‌ ప్లస్‌ సిటీస్‌ క్యాటగిరీలో కూడాఅవార్డులు దక్కాయి. చెత్తసేకరణ, నిర్వహణ, రిసైక్లింగ్‌, తడిపొడిచెత్తల వేర్వేరు సేకరణ,నిర్మాణ వ్యర్థాల వినియోగంలలో నగరానికి మంచి ఫీడ్‌ బ్యాక్‌ లభించింది. కొన్నేళ్లుగా నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు విజయవాడ తీవ్రంగా శ్రమిస్తోంది.అందుకే ఈసారి స్వచ్ఛ్‌ భారత్‌ అవార్డుల్లో నంబర్‌ వన్‌ స్థానం పొందడానికి ఓ ప్లాన్‌ వేశారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు అదనంగా పాయింట్లు పొందేందుకు ఉద్యోగులు, ాలంటీర్లకు టార్గెట్లు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ప్రతి వార్డులో క్లస్టర్ల వారీగా వాలంటీర్ల ద్వారా పౌరసేవలు అందిస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ బాధ్యతల్ని కూడా విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికా రులు వాలంటీర్లకు అప్పగించారు. ప్రతి వాలంటీర్‌ తన పరిధిలో ఉన్న కుటుంబాల తరపున సర్వే పూర్తి చేసేస్తున్నారు. వాలంటీర్ల వద్ద తన పరిధిలో ఉండే కుటుంబాల మొబైల్‌ ఫోన్‌ నంబర్లు ఉండటంతో వాటి ద్వారా సర్వే పూర్తి చేస్తున్నారు. మొబైల్‌ రిజిస్టర్‌ చేసి ఆ ˜ోన్లకు వచ్చే టీపీలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా కనీసం 100మంది తరపున సర్వే పూర్తి చేయాలని ఒక్కోక్కరికి టార్గెట్‌ పెట్టారు.
ప్రచారం ఎక్కువ ఫలితం తక్కువ…
స్వచ్ఛ్‌ భారత్‌ ద్వారా ప్రజోపయోగ కార్యక్ర మాలు విస్తృతంగా చేపడుతున్నా వాటి ఫలి తాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. విజయవాడ వంటి నగరాల్లో పబ్లిక్‌ టాయిలెట్లు పేరుకే ఉంటున్నాయి. నిర్వహణాలోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయినా సర్వేలలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌గా నివాస్‌ ఉన్న సమయంలో సర్వేలో పాల్గొనేం దుకు కన్సల్టెంట్లకు బాధ్యతలు అప్పగించారని వార్తలు రావడంతో విజయవాడ నగరాన్ని ర్యాంకుల నుంచి మినహాయించారు. ఆ తర్వాత మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు వాలం టీర్లే ప్రజల తరపున సర్వేలు పూర్తి చేసే బాధ్యత అప్పగించారు. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్ర మాల కోసం కేంద్రం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. కేంద్ర బృందాలు పర్యటించే సమయంలో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పెద్ద ఎత్తున హోర్డింగులు, ప్రచార కార్యక్రమాలు కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ బృందాలు నగరాల్లో పర్యటించకుండానే ఈ హంగామా చూసి బాగా పనిచేస్తున్నాయనుకుని వెనుదిరిగిపోతాయి. మొత్తంమ్మీద ఏపీలో స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ అవార్డుల కోసం నగరపాలక సంస్థలు పడుతున్న పాట్లు ప్రచారాలకు పనికొస్తున్నాయి. ఈ ఏడాది విశాఖకు ర్యాంకు రావడానికి రాజకీ య కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
టాప్‌ వన్‌ ర్యాంక్‌ సాధనే లక్ష్యం..
ఈ సంవత్సరం ప్రారంభంలో నగరంలో జరిగిన జీ-20సమ్మిట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ కమిటీ సమావేశానికి, జీవీఎంసీ మౌలిక సదు పాయాల అభివృద్ధి పనుల కోసం సుమారు 110కోట్లు ఖర్చు చేసింది మరియు సుమారు 1.5లక్షల మెట్రిక్‌ టన్నుల లెగసీ వేస్ట్‌ల బయో మైనింగ్‌ను కూడా పూర్తిచేసింది.మూల్యాంకనంలో మంచి స్కోర్‌ కోసం అవసరమైన అన్ని రంగాలను మేము కవర్‌ చేసాం.ఈ సంవత్సరం టాప్‌ 1ర్యాంక్‌ సాధిస్తామనేది మా ఆకాంక్ష.
` సాయి క్రాంత్‌ వర్మ,కమిషనర్‌,జీవీఎంసీ-గునపర్తి సైమన్‌

ప్రైవేట్‌ ఫీజులం తగ్గేనా?

రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. వామ్మో ఇంత ఫీజులా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. కొన్ని స్కూళ్లల్లో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష మధ్యలో వసూళ్లు చేస్తున్నాయి. పాఠ శాలల ప్రారంభానికి ఇంకా ఎనిమిది రోజులే ఉం డడంతో ప్రైవేట్‌ స్కూళ్లు అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లో నైతే అప్పుడే అడ్మిషన్లు అయి పోయినట్లు సమాచారం. తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం, కార్పొరేట్‌ చదువులు చెప్పించాలనే ఉద్ధేశ్యంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా తమ రూల్‌ తమదే అనేలా ప్రవర్తిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టం రూపకల్పనకు ఐదు నెలల క్రితమే కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగానూ మంత్రులతో సబ్‌ కమిటీని కూడా నియమించారు. అందులో భాగంగానే ఫీజుల నియంత్రణపై ఇప్పటికే ఈ కమిటీ పలుమార్లు సమావేశమైంది. ఈ సమావేశాల్లో గతంలో ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికపై, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులపై చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు.

ప్రతి ఏటా 10శాతం ఫీజు పెంచుకో వచ్చనే ప్రతిపాదన చేసింది. ఫీజుల వివరాలను ప్రజ లకు తెలిసేలా చర్యలు చేపట్టాలని సూచిం చింది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం కావొ స్తున్నా ఇంతవరకూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఫీజుల నియంత్రణ చట్ట్కంట స్పష్టతే లేదు. ఫీజులు ఎంత వసూలు చేయాలో? లేదో? అనేదానిపై స్పష్టమైన మార్గ దర్శకాలు ఏవని పలు విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్‌ అసోసియేషన్స్‌, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.గతేడాది ఆన్‌లైన్‌ క్లాసులకు రూ. వేలు, లక్షల్లో ఫీజులు కట్టించుకున్న కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు..ప్రస్తుతం జూన్‌ 13 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభంకావొస్తుండటంతో ఆ నష్టాన్ని ఈసారి రాబట్టాలనే నయా దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫీజులను కడితెనే ఈ ఏడాదికి తరగతు లకు అనుమతిస్తామనే నిబంధనలు కూడా పెడుతు న్నట్లు తెలుస్తోంది.కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం ఫీజు కట్టాలనే నిభంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడంలేదు. ప్రైవేటు స్కూల్స్‌ అధిక ఫీజులకు అడ్డు కట్టవేస్తాం.. అని రెండేళ్ల క్రితం జీవోతెచ్చిన ప్రభుత్వం చతి కలపడిరది.ఫీజుల నియంత్రణ నిబంధన ప్రచా రానికే తప్ప ఆచరణకు నోచుకోలేదు.వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజుల నియంత్రణపై రెవెన్యూ శాఖ దృష్టి పెట్టడంపై తల్లిదండ్రుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే అమలు ఎలా ఉంటుం దనేదానిపై లెక్కకు మిక్కిలి అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి దాదాపు 62,063 పాఠశాల లున్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రీ-ప్రైమరీ, ఎలిమెంటరీ,సెకండరీ, సీనియర్‌ సెకండరీ పాఠ శాలలు ఉన్నాయి. భారతదేశంలోని గ్రామీణ ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిన పిల్లల వాటా గురిం చి 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం…7 నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలోదాదాపు 39.5శాతం మంది గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరారు. అలాగే 11నుండి 16 సంవత్సరాల వయసున్న పిల్లలు 32శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. పైలెక్కలను చూస్తే ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ప్రైవేటు పాఠశాలల పాత్ర గణనీయమైనదని అర్థమవు తుంది. ఇంత ప్రాముఖ్యత గలిగిన ప్రైవేటు పాఠశా లలు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ప్రైవేటు పాఠశాలల నిర్వహణపట్ల ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరి స్తున్నది.ఈప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని బాహాటంగానే ఉల్లంఘిస్తున్నాయనేది జగ మెరిగిన సత్యం.పోయిన సంవత్సరం మొదటి సారిగా,రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠ శాలల్లో నర్సరీ నుండి పదో తరగతి వరకు, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలలో ఇంటర్మీడియట్‌ కోర్సుల కోసం 2023-24వరకు ఫీజులను నిర్ణయిం చింది. ప్రభుత్వం ప్రాథమిక విద్య అయిన నర్సరీ నుండి 5వ తరగతి వరకు పంచాయతీలలో రూ. 10,000, మునిసిపాలిటీలలో రూ. 11000, మునిసిపల్‌ కార్పోరేషన్లలో రూ.12000గా నిర్ణయిం చింది. అలాగే మాధ్యమిక విద్య అయిన 6 నుండి 10వ తరగతులకు పంచాయితీలలో రూ.12000, మునిసిపాలిటీలలో రూ.15000,మునిసిపల్‌ కార్పోరేషన్లలో రూ.18000గా నిర్ణయించింది. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బాహా టంగానే ఈ ఫీజు నియమాలను ఉల్లంఘిస్తున్నాయి. పంచాయితీలలో సాధారణంగా ప్రైవేటు పాఠశా లలు తక్కువగా ఉంటాయి, మండల కేంద్రాలలోనే ప్రైవేటు పాఠశాలలు కేంద్రీకృతం అయ్యి విద్యార్థులను బస్సుల ద్వారా పాఠశాలలకు రవాణా చేస్తూ ఉంటాయి. మండల కేంద్రాలలో సరాసరి ప్రతి ప్రైవేటు పాఠశాల నర్సరీ,5వ తరగతి విద్యా ర్థుల నుండి రూ.10,000 వేల నుండి రూ.25, 000 వరకు వసూలు చేస్తున్నాయి. అలాగే మాధ్య మిక విద్య అయిన 6 నుండి పదవ తరగతులకు రూ. 20,000 నుండి రూ.60,000 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దీనికి అదనంగా ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు బహిరంగంగానే అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రాథమిక తరగతుల విద్యార్థుల నుండి రూ.3వేల నుండి రూ.5 వేల వరకు, అలాగే మాధ్యమిక విద్యార్థుల నుండి రూ.5 వేల నుండి రూ.10వేల వరకు పుస్తకాలు అమ్ముతున్నాయి. వేల రూపాయల పుస్తకాలను అంత చిన్న వయసులోనే ఎందుకు కొనిపిస్తున్నారో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. డిగ్రీ వంటి పైచదువులకు కూడా పుస్తకాల ఖర్చు సంవత్సరానికి రూ.3000కు మించదు. అలాంటిది పాఠశాల స్థాయిలోనే తల్లిదండ్రుల నుండి ఈ ప్రైవేటు యాజ మాన్యం ఫీజులకు అదనంగా వేలకు వేల రూపాయలను పుస్తకాల పేరుతో దోచుకుం టున్నాయి.
ఇలా బాహాటంగా చట్టాలను ఉల్లంఘి స్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా విద్యార్థి సంఘం నాయకులు విషయాలను గుర్తించి ఆందోళన చేసి నట్లైతే అధికారులకు రాజకీయ నాయకుల నుండి వత్తిళ్లు వస్తాయి. అధికారుల ఉదాసీనతపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదోరకమయిన రాజీ కుదురుస్తున్నారు.విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుండి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రైవేటు పాఠశాలలు 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య చెప్పాలని చట్టం చెబుతున్నాగానీ ఎక్కడా అమలు చేయటం లేదు. నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను కూడా ప్రభుత్వం దుర్మార్గంగా దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠాశాలల్లో కలిపి పేదపిల్లలు బడికి దూరం అయ్యేలా చేస్తున్నది. విద్యార్థులను ఆటోలలో తరలించకూడదని చట్టం చెబుతున్నా సెవెన్‌ సీటర్‌ ఆటోలలో పాఠశాలలకు తీసుకువెళ్తున్నారు. ఇలా ప్రయాణ సమయాలలో ప్రమాదాలు జరిగిన ఉదంతాలు ఎన్నో వున్నాయి. ప్రమాదం జరిగిన పుడు కొంత హడావుడి చేసే అధికారులు చివరగా యాజమాన్యానికే మద్దతు తెలిపి ఏ చర్యా తీసుకోకపోవటమో లేదా నామమాత్రపు చర్యలు తీసుకోవటమో పరిపాటిగా మారింది.- (జి.ఎ.సునీల్‌ కుమార్‌)

అంతర్గత వలసరాజ్యాన్ని మిగిల్చిన..

అతి ధనవంతులు అవన్నీ ఇతరుల నుండి దూరంగా తీసుకున్నారు..భారతదేశంలోని ధనవంతు లైన 70లక్షల మంది పేదవారు 80 కోట్లకు సమానం. మరో మాటలో చెప్పాలంటే, ఎగువ 0.5 శాతం మంది భారతీయులు దిగువన ఉన్న 57శాతం మందితో సమానంగా సంపాది స్తారు. ఈ సంఖ్యలు వివాదాస్ప దంగా ఉండవచ్చు. ప్రపంచ అసమానత ల్యాబ్‌లోని ప్రముఖ అసమా నత ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ మరియు అతని సహచరుల అంచనాల ఆధారంగా నేను వాటిని రూపొందించాను. వివాదాస్ప దమైన విషయం ఏమిటంటే, భారతదేశం చాలా అసమాన దేశం…
కానీ అసమానత అనేది సాపేక్ష పదం. వెయ్యి మంది జనాభా ఉన్న ఊహాజనిత గ్రామం గురించి ఆలోచించండి. ప్రతిఒక్కరూ కొంత మొత్తం లో ఆదాయం ఉన్న పెద్దలు అని మేము అనుకుం టాము. ఈ గ్రామంలో ఐదుగురు అత్యంత ధనిక రైతులు ఉన్నారు, వారు సంవత్సరానికి రూ.25 లక్షలు సంపాదిస్తారు.మరో చివరలో, 570 మంది పేద రైతులు ఏటా కేవలం రూ.22,000 సంపాది స్తున్నారు. సమిష్టిగా,ధనిక రైతులు రూ.1.25 కోట్లు ఆర్జించవచ్చు, ఇది పేద రైతుల మొత్తం సంపాదన తో సమానం. ఇది నేను ప్రారంభించిన నిష్పత్తికి సరిగ్గా అద్దం పడుతుంది. ఎగువ 0.5శాతం దిగు వన ఉన్న 57శాతంతో సమానం.
ఈ గ్రామం పెద్ద నగరానికి సమీపంలో ఉందని కూడా అనుకుందాం.ఈ నగరంలో ధన వంతులైన 10శాతం మంది సగటు వార్షిక ఆదా యం రూ.ఈసూపర్‌ రిచ్‌ నగర ప్రజలతో పోల్చి నప్పుడు, గ్రామంలోని ధనిక రైతులు వేరుశెనగను సంపాదిస్తారు.అంటే గ్రామంలో విపరీతమైన అస మానతలు ఉన్నప్పటికీ,నగరంలోని అత్యంత ధనవం తులు సంపాదించినంత సంపాదనకు అక్కడి ధనవంతులురారు.అభివృద్ధి చెందిన పెట్టుబడి దారీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులతో పోల్చిన ప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులు ఎలా ఉంటారు? మేము సగటు ఆదాయాలను డాలర్లలో మార్చవచ్చు మరియు వాటిని పోల్చవచ్చు. అయితే, ఇది సరికాని మరియు అన్యాయమైన పోలిక. ఒక యుఎస్‌ డాలర్‌ ప్రతిచోటా ఒకే బుట్ట వస్తువులను కొనుగోలు చేయదు. యుఎస్‌లో ఒకడాలర్‌తో కొను గోలు చేయగల అదే వస్తువులను స్థానిక కరెన్సీలో కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చవుతుందో చూడ డానికి సరైన పోలిక అవసరం. దీనిని కొనుగోలు శక్తి సమానత్వం(పీపీపీ)అంటారు. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ)ప్రకారం ప్రస్తుతం యూఎస్‌లో ఒక డాలర్‌ కొనుగోలు చేయగలిగిన దాని ధర భారత దేశంలో కేవలం రూ.24మాత్రమే. మరో మాట లో చెప్పాలంటే,మీ బ్యాంకులో డాలర్‌ కొనడానికి మీరు దాదాపు రూ.82 చెల్లించాల్సి ఉంటుంది. పీపీపీ పరంగా,డాలర్‌ విలువ కేవలం రూ.24. మరోవైపు నుండి చూస్తే,యుఎస్‌లో ఎవరైనా నెలకు వి30,000సంపాదిస్తే, అతను నెలకు రూ. 7.2లక్షలు సంపాదించే భారతీయుడు ఇక్కడ కొనుగోలు చేయగలిగిన వస్తువులనే విస్తృతంగా కొనుగోలు చేయగలరు.
నేను ఈ సంఖ్యలను ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నాను.ధనవంతులైన 10శాతం అమెరి కన్‌ పెద్దలు నెలకు సుమారు వి30,000శాతం సంపాదిస్తారు. భారతదేశంలోని 0.5 శాతం ధన వంతులైన పెద్దలు పీపీపీ పరంగా సంపాది స్తున్న దానికి సరిగ్గా ఇదే. అందువల్ల,కొనుగోలు శక్తి సమానత్వ పరంగా,భారతీయులలో అత్యంత ధనవంతులైన 0.5 శాతం మంది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అగ్రశ్రేణి 10శాతం మంది వ్యక్తులతో సమానం. ఊహాత్మక గ్రామం మరియు పెద్ద నగరం యొక్క మా ఉదాహరణతో దీనిని పోల్చండి.ఆ సందర్భంలో, గ్రామంలోని 0.5శాతం ధనవంతులు నగరంలో నివసిస్తున్న 10శాతం సంపన్నులలో కొంత భాగాన్ని సంపా దించారు. మేము ఇదే సంపాదన థ్రెషోల్డ్‌ని తీసుకుంటే,యూకే,జర్మనీల ఉమ్మడి వయోజన జనా భాలో అగ్ర 4శాతంమంది ఈసూపర్‌ రిచ్‌ కేటగిరీ లోకి వస్తారు. సంపూర్ణ సంఖ్యలో, భారతదేశంలో నెలకు వి30,000శాతం సంపాదించే దాదాపు 50 లక్షల మంది పెద్దలు ఉన్నారు, ఇది యూకె, జర్మనీలలో కలిపి అటువంటి పేదల సంఖ్యకు సమానం. అంటే యూరప్‌లోని రెండు పేదల ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నంత మంది అతి సంపన్నులు భారతదేశంలో ఉన్నారు.ఈ పెద్దలపై ఆధార పడిన పిల్లలను కూడా చేర్చినట్లయితే, అభివృద్ధి చెందిన ప్రపంచంలో అత్యంత సంపన్నులు సంపా దించినంత మాత్రాన 70లక్షల మంది భారతీ యులు సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.
పేద భారతీయుల సంగతేంటీ?
పేద భారతీయుల సంగతేంటి? వారు భూమిలోని దౌర్భాగ్యులతో-ప్రపంచంలోని అత్యం త పేదప్రజలతో ఎలాపోలుస్తారు? నేను ప్రపంచం లోని అత్యంత పేద ఐదు దేశాలలో రెండిరటిని చూస్తాను-అత్యంత పేదగా పరిగణించబడే బురుండి మరియు నాల్గవ పేద దేశమైన మడ గాస్కర్‌. డేటా పరిమితుల కారణంగా నేను ఈ రెండు దేశాలను ఎంచుకున్నాను. నేను ఉపయోగిం చిన మొత్తం డేటా ప్రపంచ అసమానత డేటాబేస్‌ నుండి వచ్చింది.నేను భారతదేశంలోని పేద ప్రజల యొక్క వివిధ జనాభా విభాగాల సగటు ఆదాయాన్ని పోల్చి చూడవలసి వచ్చింది మరియు యూకె డాలర్‌ పరంగా అదే ఆదాయానికి దగ్గరగా వచ్చే పేద దేశాలను కనుగొనవలసి వచ్చింది. బురుండి మరియు మడగాస్కర్‌ సగటు ఆదాయాలు భారతదేశంలోని రెండు జనాభా విభాగాల సగటు ఆదాయాలతో దాదాపు సమానంగా ఉంటాయి. 2022లో బురుండిలో సగటు ఆదాయం సుమారు వి1,750శాతం భారతదేశంలో దిగువన ఉన్న 42 శాతం మంది పేదలు దాని కంటే తక్కువ సంపాదించారు. దాదాపు వి1,720శాతం. అదే సంవత్సరంలో మడగాస్కర్‌లో సగటు ఆదాయం సుమారు వి3,065శాతం.భారతదేశంలో దిగువన ఉన్న 52శాతం మంది పెద్దలు దాని కంటే తక్కువ సంపాదించారు ు దాదాపు వి3,060శాతం. దీనర్థం దాదాపు 58 కోట్ల మంది భారతీయులు (ఈపేద్దలపై ఆధారపడిన పిల్లలతో సహా) ప్రపం చంలోని అత్యంత పేదదేశమైన బురుండిలో సగటు వ్యక్తి వలె పేదలు.మడగాస్కర్‌లోని ప్రజల సగటు స్థాయికి ఆదాయ పరిమితిని పెంచితే,73కోట్ల మంది భారతీయులు అంతకంటే దిగువన ఉన్నారు. ఇప్పుడు, రెండు సంఖ్యలను కలపండి. 70లక్షల మంది భారతీయులు మొదటి ప్రపం చంలో అత్యంత ధనవంతుల వలె ధనవంతులు కాగా,70కోట్ల మంది భారతీయులు మూడవ ప్రపంచంలోని పేద ప్రజల కంటే పేదవారు. ఇది కేవలం అంతర్గత ఆదాయ అసమానత సమస్య మాత్రమేకాదు. ఆర్థికాభివృద్ధి స్థాయితో సంబంధం లేకుండా ప్రపంచంలోని ధనిక మరియు పేదల మధ్య సంపూర్ణ వ్యత్యాసంతో పోల్చినప్పుడు మన అసమానత అపారమైనది.మూడు దశాబ్దాల సరళీ కరణ,ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ ఎల్‌పీజీ నుండి భారత దేశం పొందింది ఇదే. నెహ్రూ వియన్‌ ‘సామ్య వాదం’దాని అన్ని తప్పులకు, రెండు శతాబ్దాల దోపిడీని మన వలస ప్రభువులు మనకు బహుమతిగా అందించిన తీవ్రమైన ఆకలి మరి యు నిరుపేదలను తగ్గించడంలో భారీ పురోగతి సాధించింది.ఎల్‌పీజీ సంస్కరణలు మనకు అంత ర్గత వలసరాజ్యాన్ని మిగిల్చాయి, ఇక్కడ మైనస్‌ క్యూల్‌ సూపర్‌-రిచ్‌ జనాభా మిగిలిన వాటి నుండి అన్నింటినీ దూరం చేసింది. అసమానత: ఎగువ 0.5 శాతం భారతీయులు దిగువ 57శాతంతో సమానం.
సరళీకరణ, ప్రైవేటీకరణ,ప్రపంచీకరణ అంటే ఏమిటీ?(ఎల్‌పీజీ)
1991లో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త ఆర్థిక సంస్కరణల్లో సరళీకరణ, ప్రపం చీకరణ మరియు ప్రైవేటీకరణ ఒక భాగం. ఈ సంస్కరణలు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను తెరవ డం మరియు దేశానికి ఆర్థిక సంస్కరణలను తీసుకు రావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశ ఆర్థికాభి వృద్ధికి అవరోధంగా మారిన కొన్ని పరిమితులను తొలగించేందుకు ఇదిదోహదపడిరది. ఇది దేశం లో ప్రైవేట్‌ రంగం విస్తరించడానికి మరియు ఆర్థిక వృద్ధికి దోహదం చేసింది.సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ (లిబరేజేషన్‌,ప్రైవేటేజేషన్‌ అండ్‌ గ్లోబులైజేషన్‌(ఎల్‌పీజీ)దేశ నూతన ఆర్థిక నమూనాలో మూడు అంశాలు. సరళీకరణ అనేది ప్రభుత్వం యొక్క కొన్ని నియమాలు మరియు నిబంధనలను కలిగి ఉండే కఠినమైన చట్టాలు మరియు అభిప్రాయాల నుండి సడలింపును నిర్ధారి స్తుంది. ప్రైవేటీకరణ అనేది పబ్లిక్‌ యాజ మాన్యంలోని పాత్రలు మరియు కార్యకలాపాలను ప్రైవేట్‌ యాజమాన్యానికి పూర్తిగా బదిలీ చేయ డం.దీనర్థం,ప్రభుత్వం యొక్క ఆస్తి లేదా వ్యాపారం బాగా పని చేయడానికి మరియు క్రమశిక్షణగా ఉండాలనే లక్ష్యంతో ప్రైవేట్‌ యజమాని ద్వారా తీసుకోబడుతుంది. ప్రపంచం మొత్తాన్ని పరస్పరం అనుసంధానించే వాణిజ్యం మరియు సంస్కృతి యొక్క నెట్‌వర్క్‌ను పెంచడానికి ప్రపంచీకరణ తదుపరి దశ. ఇది ఏవాణిజ్యం,సేవలు లేదా సాంకేతికత సరిహద్దులచే పరిమితం చేయబడదని నిర్ధారిస్తుంది, తద్వారా ప్రపంచం మొత్తాన్ని కలుపు తుంది మరియు ఏకీకృతం చేస్తుంది. వారు తరచుగా కలిసి ఎల్‌పీజీగా సూచిస్తారు. వారు దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, తద్వారా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పోటీగా మరియు పూర్తి చేయ గలదు.ఎల్‌పీజీ అనేది సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణను సూచిస్తుంది. భారత దేశం తన నూతన ఆర్థిక విధానం ప్రకారం దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం అంతర్జాతీయ బ్యాం కులను సంప్రదించినప్పుడు, భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య ఎక్కువగా ప్రైవేట్‌ రంగాలు చేసే వాణిజ్యంపై ఆంక్షలవైపు ప్రభు త్వం తెర వాలని వారు సూచించారు. అంతరా ్జతీయ బ్యాం కుల సూచన మేరకు భారతప్రభుత్వం కొత్త ఆర్థిక విధానం లేదా ఎన్‌ఇపిని ప్రకటించింది. ఈ విధానంలో విస్తృతమైన సంస్కరణలు ఉన్నాయి. ఈ చర్యలు విస్తృతంగా రెండు గ్రూపులుగా వర్గీకరించబడ్డాయి- నిర్మాణాత్మక సంస్కరణలు మరియు స్థిరీకరణ చర్యలు. అంతర్జాతీయ పోటీత త్వాన్ని పెంపొందించడమే నిర్మాణాత్మక చర్యల లక్ష్యం. అంతేకాకుండా,దేశ ఆర్థికవ్యవస్థలోని వివిధ విభాగాలలోని దృఢత్వాన్ని తొలగించేందుకు చర్య లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్థిరీకరణ చర్యలలో, ద్రవ్యోల్బణం మరియు చెల్లింపుల బ్యాలెన్స్‌ని నియం త్రించడంలో అభివృద్ధి చెందిన బలహీనతను సరిదిద్దడం మరియు సరిదిద్దడం లక్ష్యం. రెండు సెట్ల చర్యలు స్వల్పకాలిక వ్యవధి కోసం తీసుకో బడ్డాయి.
స్థిరీకరణ చర్యలో సరళీకరణ, ప్రైవేటీ కరణ మరియు ప్రపంచీకరణ ఉన్నాయి.ఈ ప్రమా ణం ప్రకారం,ఒక సంవత్సరంలో మిగిలిన ప్రపం చంతో దేశం యొక్క అన్ని రకాల ఆర్థిక లావాదేవీ లను రికార్డ్‌ చేయడానికి చెల్లింపు బ్యాలెన్స్‌ ప్రారం భించబడిరది. అటువంటి దృష్టాంతంలో, ద్రవ్యోల్బ ణం అనేది ఒక నిర్దిష్ట కాలంలో వస్తువులు మరియు సేవలలో ధరల పెరుగుదలను సూచిస్తుంది.
సరళీకరణ
దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న కఠినత్వాలు మరియు ఆంక్షలకు ముగింపు పలకడ మే సరళీకరణ లక్ష్యం.ఇంకా,ఈ విధానంలో, ప్రభు త్వం దేశంలో తననియంత్రణకు అనువై నదిగా ఉంటుందని భావిస్తున్నారు.ఈవిధానం యొక్క లక్ష్యాలు దేశీయ పరిశ్రమల మధ్య పోటీని పెంచ డం మరియు ప్రణాళికాబద్ధమైన దిగుమతులు మరి యు ఎగుమతులతో అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. అంతేకాకుండా, ఇది అంతర్జాతీ య సాంకేతికత మరియు మూలధనాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఈ విధానం దేశం యొక్క అంతర్జాతీయ మార్కెట్‌ సరిహద్దును విస్తరి స్తుంది మరియు దేశంలో రుణ భారాన్ని తగ్గిస్తుంది.
ప్రైవేటీకరణ
స్థిరీకరణ చర్య యొక్క రెండవ విధానం ప్రైవేటీకరణ.ఈ విధానం ప్రైవేట్‌ రంగ సంస్థల ఆధిపత్యాన్ని విస్తరించడం మరియు ప్రభుత్వ రంగా లపై నియంత్రణను తగ్గించడం లక్ష్యంగా పెట్టు కుంది. అందువలన, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ తక్కువ యాజమాన్యాన్ని కలిగి ఉంటుంది. ఇవి కాకుండా ప్రభుత్వ కంపెనీలను రెండు విధానాలతో ప్రైవేట్‌ రంగ కంపెనీలుగా మార్చ వచ్చు.ఈవిధానాలు ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభు త్వ నియంత్రణను ఉపసంహరించుకోవడం మరి యు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా. ప్రైవేటీక రణ యొక్క మూడు రూపాలు ఉన్నాయి, అవి వ్యూహాత్మక విక్రయం, పాక్షిక విక్రయం మరియు టోకెన్‌ ప్రైవేటీకరణ. వ్యూహాత్మక విక్రయం లేదా జాతీయీకరణలో, ప్రభుత్వం 100%ఉత్పాదక వనరుల యాజమాన్యాన్ని ప్రైవేట్‌ కంపెనీల యజ మానులకు అందించాలి. పాక్షిక విక్రయం లేదా పాక్షిక ప్రైవేటీకరణ వాటాల బదిలీ సహాయంతో కనీసం 50% యాజమాన్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల,వారు మెజారిటీ షేర్లను కలిగి ఉంటారు మరియు సంస్థ యొక్క స్వయంప్రతిపత్తి మరియు పనితీరుపై నియంత్రణను కలిగి ఉంటారు. టోకెన్‌ లేదా లోటు ప్రైవేటీకరణలో,బడ్జెట్‌లో కొరతను తీర్చడానికి ప్రభుత్వం వాటా మూలధనాన్ని 5-10%వరకు డిజిన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. కాబట్టి,ఈవిధానం దేశంలో ఆర్థికపరిస్థితిని మెరుగు పరచడం మరియు ప్రభుత్వ రంగ సంస్థల పని ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకా కుండా,డిజిన్వెస్ట్‌మెంట్‌ నుండి నిధులు సేకరించ వచ్చు. తగ్గిన పని ఒత్తిడితో ప్రభుత్వ రంగం యొక్క సామర్థ్యం స్వయంచాలకంగా పెరుగుతుంది మరి యు వినియోగదారుల ఉపయోగం కోసం మంచి నాణ్యతగల వస్తువులు మరియు సేవలను అంది స్తుంది.
ప్రపంచీకరణ
ఈ విధానంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సహాయంతో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.దీని అర్థం విదేశీ వాణిజ్యం మరియు సంస్థాగత మరియు ప్రైవేట్‌ పెట్టుబడులపై ప్రాథమి క దృష్టి ఉంటుంది. ఇది మూడవ మరియు చివరి విధానం అమలు చేయవలసి ఉంది. ఈ దృగ్విష యం యొక్క లక్ష్యం తగిన వ్యూహాల సూచనలతో ప్రపంచాన్ని అభివృద్ధి చేయడం మరియు స్వతంత్రం చేయడం.ఇది ఒక దేశం యొక్క అవసరాలు నడిచే మరియు ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చగల ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం. గ్లోబలైజేషన్‌ యొక్క ప్రధాన ఫలితాలలో ఒకటి అవుట్‌సోర్సింగ్‌. అవుట్‌ సోర్సింగ్‌ అంటే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇతర దేశాల నిపుణులను ఒక సంస్థ నియమిం చుకోగలదు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో దాని అభివృద్ధికి దారితీసే కాంట్రాక్టు పనులు చాలా ఉన్నాయి. ఇది చాలా ప్రైవేట్‌ రంగాలకు కొత్త మార్గా లను తెరిచింది మరియు భారతీయ నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైనవి మరియుశక్తివంతమైనవిగా పరిగణించబడుతు న్నాయి. తక్కువ వేతన రేటు మరియు అంకితభావం కలిగిన ఉద్యోగులు భారతదేశాన్ని అంతర్జాతీయ ఔట్‌సోర్సింగ్‌కు అనువైన నిర్మాణాత్మక దేశాలలో ఒకటిగా మార్చారు.` వ్యాసకర్త : సీనియర్‌ ఎకనామిక్‌ అనలిస్ట్‌, –(ఔనింద్యో చక్రవర్తి)

1 2