పరిశ్రమల్లో ప్రమాదాలు రక్షణ లేని జీవితాలు

పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇల్లు చేరడం కష్టంగా మారింది. ముఖ్యంగా మండలంలోని పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు లేకపోవడం, నైపుణ్యం గల కార్మికులను తీసుకోకపోవడం అధిక ప్రమాదాలకు కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రమాదాలకు అధిక కారణంగా నిలిచే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ నిపుణులైన కార్మికులు పనులు చేయాల్సి ఉండగా కనీస అవగాహన లేని టెంపరరీ, కాంట్రాక్ట్‌ కార్మికుల చేత పనులు చేయిస్తున్నారు. వారు రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్‌ రియాక్షన్‌ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు జరుగుతున్నాయి. ఇక ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమ వర్గాలు చికిత్స కోసం క్షతగాత్రులను తరలించక పోవడంతో పాటు కొన్నిమార్లు వారు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా విధులు నిర్వహించే వారిలో అధికంగా స్థానికేతరులే ఉండడంతో వారి తరఫున పరిశ్రమలపై పోరాటం చేసే వారు లేక కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాగా చాలా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్‌ లాంటి వాహన సౌకర్యాలు లేక నగరానికి చేరేలోపు మరణించిన ఘటనలు కోకొల్లలు. – గునపర్తి సైమన్‌
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో పరిశ్రమాధిపతులకు ప్రభుత్వాలు పలు మినహా యింపులు, రాయితీలు ఇచ్చాయి. దాంతో పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి,లోపాలను గుర్తించి, వాటిని సరిచేయించే సమున్నత ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకే పరిశ్రమల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కార్మిక భద్రత, ప్రమాణాలు పాటించడానికి, ప్రమాద సమయంలో కార్మికులు చనిపో కుండా బయటపడే పరికరాలు సరఫరా చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. చట్టపరంగా పరిశ్రమల్లో కార్మికులభద్రతకు అధికప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యాలు, వాటినిఖర్చుగా చూస్తున్నాయి.తమ లాభాలశాతం తగ్గిపోతున్నట్లుగా భావిస్తు న్నాయి. పరిశ్రమకు విస్తృతార్ధం వుంది.ఓ పరిశ్రమ ఉత్పత్తి ప్రక్రియ మానవుని శ్రమపై ఆధారపడినట్లే,ఓపరిశ్రమ ఏర్పాటులో మానవుని త్యాగాలు ఎన్నో వున్నాయి.ఎంతోమంది రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోతారు.కొన్నేళ్ల నుంచి కలిసిమెలిసి బతికే మనుషులు నిర్వాసితులై చెల్లాచెదురవుతారు. వ్యవసాయాధారిత చేతివృత్తుల కుటుంబాల జీవనోపాధి దెబ్బ తింటోంది. ఎన్నో కుటుంబాలు,ఎంతో మంది జీవితాలు శిథిలమైతే తప్ప,నష్టాన్ని చవిచూస్తే తప్ప పారిశ్రామిక ప్రగతికి పునాదులు పడవు. పారిశ్రామికోత్పత్తి ప్రక్రియ జరగడానికి ముందు,తరువాత మనిషి త్యాగం, శ్రమ వుందన్న విషయం పెట్టుబడిదారీ వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా విస్మరి స్తోంది.లాభం కోసం అమానవీయ అంశాలను ముందుకు తెచ్చి మానవీయ విలువలను, శ్రమను, మనిషి ప్రాణాలను అప్రధానమైనవిగా భావిస్తోంది.ఈ చులకన,హేయమైన భావనలో నుంచి మనిషిని మనిషిగా చూడ్డం, గౌరవిం చడం,ప్రేమించడం అనే నైతికత నశించి…తానెదగడానికి, లాభాలు పోగేసు కోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతున్న పరిస్థితులను తరచూ చూస్తు న్నాం.చట్టపరమైన ఉల్లంఘనలు,యాజమాన్య నిర్లక్ష్యమే పరిశ్ర మల్లో ప్రమా దాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోవడానికి,గాయాల పాలు కావడానికి దారితీస్తున్నదన్న వాస్తవాన్ని అర్ధంచేసుకోవాలి.పారిశ్రామికాభి వృద్ధి పేరుతో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు పరిశ్రమాధిపతులకు కల్పిస్తున్న వెసులుబాట్లు ప్రమాదాలు పెరగడానికి ఒక హేతువుగా మారాయి.ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో పరిశ్రమాధిపతులకు ప్రభుత్వాలు పలు మినహాయింపులు,రాయితీలు ఇచ్చాయి.దాంతో పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి,లోపాలను గుర్తించి,వాటిని సరిచేయించే సమున్నత ప్రభుత్వ పర్యవేక్షణవ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకే పరిశ్రమల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి.కార్మిక భద్రత,ప్రమాణాలు పాటించడానికి, ప్రమాద సమయంలో కార్మికులు చనిపోకుండా బయటపడే పరికరాలు సరఫరా చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావడం లేదు.చట్టపరంగా పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యాలు, వాటిని ఖర్చుగా చూస్తున్నాయి.తమ లాభాల శాతం తగ్గిపోతున్నట్లుగా భావిస్తున్నాయి. తమ లాభాలకు మూలం కార్మికుల శ్రమన్న వాస్తవాన్ని గ్రహించ నిరాకరిస్తున్నాయి.
పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఐదేళ్లలో జరిగిన119 ప్రమాదాల్లో 120 మంది కార్మికులు చనిపోయారు.68మంది గాయపడ్డారు.గతేడాది 24కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో 20మంది మృతి చెందారు.18 మంది వికలాంగులయ్యారు.పరిశ్రమల్లో జరిగిన ప్రమా దాల తీవ్రతకు ఇవి అద్దం పడుతున్నాయి. ప్రమా దాలు జరిగినప్పుడు మృతిచెందిన కార్మిక కుటుం బాలకు పరిహారం చెల్లించే ఒక పద్ధతిని యాజమా న్యాలు అనుసరిస్తున్నాయి గానీ పరిశ్రమల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఖర్చు చేయడానికి ఇష్ట పడ్డంలేదు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు యాజమాన్యాలు విలువ ఇవ్వడంలేదు. విశాఖనగరంలో 2020 మే 7న ఎల్‌.జి పాలిమ ర్స్‌లో జరిగిన ప్రమాదంలో 15మంది మరణిం చారు.దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి సంస్థ ఎల్‌.జి పాలిమర్స్‌ యాజమాన్యం నుంచి మృతుల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషి యో ఇప్పించింది. ఎంత డబ్బు ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగిరావు.ప్రాణాలు కోల్పోయిన కుటుం బాల బాధలు తీరవు. కుటుంబాలకు పెద్దదిక్కుగా వున్న వారు,విద్యార్థులు,ప్రమాదం నుంచి తప్పించు కోలేక ఊపిరాడక చనిపోయిన వృద్ధులు ఇలా వివిధ వయస్సుల వారు చనిపోయారు. ఈ మరణాలకు, అనేక మంది అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలై ఆరో గ్యాలు కోల్పోవడానికి కారణమైన యాజమాన్యంపై చర్యల్లేవు. మనిషి తలకు విలువ కట్టే ఈ వ్యవస్థలో బహుశా ఇంతకంటే మెరుగైన, ప్రగతిదాయక ఆలోచనలు పరిశ్రమాధిపతుల బుర్రల్లో మొలకెత్తు తాయని ఆశించలేము. పరిశ్రమ అనగానే డబ్బులు పోగు చేసుకొనే యంత్రాంగంగా యాజమాన్యం భావించినంత కాలం మనిషి శ్రమకు, ప్రాణాలకు విలువ వుండదు. ప్రమాదాలు ఎల్‌.జి పాలిమర్స్‌, పరవాడ ఫార్మా కంపెనీల్లోనూ, అచ్యుతాపురం సెజ్‌లోని పరిశ్రమలకే పరిమితం కాలేదు. రాష్ట్రం లోని రసాయన, మందుల పరిశ్రమల్లోనూ ప్రమా దాలు చోటు చేసుకుంటున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి.హెచ్‌పిసిఎల్‌లో జరిగిన ప్రమా దంలో 12 మంది, స్టీల్‌ప్లాంట్‌ లోని ఎస్‌ఎంఎస్‌2 లోని ఆక్సిజన్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 12 మంది చనిపోయారు. ప్రమాదం ఏ పరిశ్ర మలో ఎప్పుడు జరిగినా కార్మికులు చనిపోతూనే వున్నారు. ఈ చావులకు కారణం యాజమాన్యాల నిర్లక్ష్యమేనని ప్రమాదనంతరం జరిగిన నివేదికల్లో బట్టబయలవుతున్నాయి.పరిశ్రమలో భద్రత, కార్మి కులకు రక్షణ పరికరాలు ఇవ్వడంలో చూపుతున్న అలసత్వాన్ని నివేదికలు ఎత్తిచూపుతున్నాయి. అయినా పరిశ్రమాధిపతుల వైఖరిలో మార్పు రావడంలేదు.భద్రతను పట్టించుకోవడంలేదు. పైగా ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులపై నెపం నెట్టి తప్పించుకొనే ప్రయత్నాలు యాజమాన్యాలు చేస్తు న్నాయి.తన నిర్లక్ష్యంవల్ల జరిగిన ప్రమాదానికి కార్మి కులు చనిపోయారన్న అసలు విషయాన్ని దాచిపెట్టి, చనిపోయిన కార్మిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో చెల్లించడాన్ని గొప్ప ఉదారతగా యాజమాన్యాలు ప్రచారం చేసుకుంటున్నాయి. నాణ్యమైన రియాక్టర్లు ఏర్పాటు చేయడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు ప్రమాద స్థలం నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు కాపాడుకొనేందుకు అనువైన వాతావరణాన్ని పని ప్రదేశంలో యాజమాన్యాలు కల్పించడంలేదు. పరిశ్రమలో ప్రమాదం ముందు గానే గుర్తించి హెచ్చరించే ఆధునిక అలారం వ్యవస్థ లేదు.ఫైర్‌ సిస్టమ్‌ సరిగాలేదు.విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ లేదు. పరిశ్రమల్లో అంతర్గత ప్రమాదాలకు ఇవి కారణ మౌతుండగా,పర్యావరణ సమస్యలతో పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వరకు సమీప ప్రాంత ప్రజలను సొంత మనుషుల్లా చూసు కుంటామని చెప్పిన యాజమాన్యాలు, హామీ ఇచ్చిన ప్రభుత్వాలు తరువాత ఆప్రజల బాధలు వినడంలేదు.పర వాడ ఫార్మా సిటీకి ఆనుకొనివున్న తాడిని తరలి స్తామని ఎన్నికలహామీ ఇవ్వడం తప్ప తరలించి వారి బాగోగులను పట్టించుకోవడంలేదు. కంపెనీల వల్ల కలుషితమైన భూగర్భ జలాలను తాగలేక… పరవాడ, లంకెలపాలెం నుంచి వాటర్‌ క్యాన్లు కొనుక్కోవాల్సిన దుస్థితి తాడి వాసులకు ఏర్పడిరది. రసాయన, ఔషధ పరిశ్రమ వున్న ప్రతీ చోటా ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. పరిశ్రమలను ప్రోత్సహించే పేరిట మానవ,పర్యావరణ విధ్వం సాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.తనకు కంపె నీలో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్న యాజమాన్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడంతో కనీస వేతనాలు అమలు కావడంలేదు. వారి భద్రతను పట్టించు కోవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు బర్నింగ్‌వార్డు సహా అత్యవసర వైద్య సేవలు అందించేలా పారిశ్రా మిక ప్రాంతంలో సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిం చాలి.కార్మికుల ప్రాణాలు కాపాడే చర్యలు చేప ట్టాలి.గతేడాది అచ్యుతాపురం సెజ్‌ లోని బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీ లోని సీడ్స్‌ వస్త్ర పరిశ్రమలో రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు విషవాయువులు లీక యిన ఘటనలో వందలాది మంది మహిళా కార్మి కులు ఆస్పత్రుల పాలయ్యారు. పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకున్న నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి)…ఆస్పత్రుల్లో చికిత్స పొందిన కార్మికునికి లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, పర్యావరణ పరిరక్షణకు రూ.10కోట్లు కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఇచ్చిన తీర్పును యాజమాన్యం పట్టించు కోని పరిస్థితి వుంది. కోర్టు తీర్పులు అమలు చేయా ల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతులు కట్టుకొని యాజమాన్యం వద్ద నిలబడేలా ప్రభుత్వ విధాన నిర్ణయాలున్నాయి. పరిశ్రమల్లో కార్మికుల భద్రత, సమీప ప్రజల ఆరోగ్య బాధ్యత యాజమాన్యాలు తీసుకొనేలా కార్మికులు, ప్రజలు ఐక్యంగా పోరా డాలి.నిర్వాసిత కుటుంబ సభ్యుల విద్యార్హత ఆధా రంగా ఉపాధి కల్పించేలా ఒత్తిడి తేవాలి. భద్రత పాటించని కంపెనీల జాబితాను బహిర్గత పర్చాలి. నిర్దిష్ట కాలపరిమితిలో లోపాలను సరిచేయని కంపె నీల రిజస్ట్రేషన్‌ రద్దు చేయాలి.
ప్రమాదాల నివారణకు ఇలా..
ఇటీవల కాలంలో పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగా ప్రమాదాలు వాటిల్లుతున్న నేపథ్యంలో.. వాటిని కట్టడి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక నుంచి పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నది లేనిది తనిఖీ చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. పరిశ్ర మలు-భద్రతా ప్రమాణాలపై రాష్ట్రపర్యవేక్షణ కమిటీ సమావేశం అమరావతి సచివాలయంలో జరిగింది.ఈసమావేశంలో రాష్ట్రమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్‌నాథ్‌ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికా రులతో మంత్రులు పరిశ్రమల్లో భద్రతా ప్రమా ణాలపై సమీక్షించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పరిశ్రమల్లో భద్రతా వైఫల్యాల కారణంగా జరుగుతున్న ప్రమా దాలను పూర్తిగా కట్టడిచేయాలని మంత్రులు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో అన్ని పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందు కు మూడునెలల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమ ర్స్‌లో జరిగిన ప్రమాదాన్ని హెచ్చరికగా తీసుకోవా లన్నారు.భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలూ జరగ కుండా కట్టుదిట్టంగా భద్రతా నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు.పరిశ్రమలు,కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక శాఖల అధికారులు సంయుక్తంగా ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు నిర్వహించాలని మంత్రులు సూచించారు. కలెక్టర్లు ఛైర్మన్‌గా ఏర్పడిన జిల్లా కమిటీలు స్వయంగా ఈ తనిఖీలు చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రానున్నట్లు వెల్లడిరచారు. రెడ్‌ కేటగిరీ పరిశ్రమలకు సమీపంలో జనావా సాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పటికే ఉన్నపరిశ్రమల చుట్టూ పట్టణీకరణ పెరిగితే.. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిచ్చి ప్రత్యా మ్నాయ మార్గాలను పరిశీలించాలని మంత్రులు ఆదేశించారు. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమ లపై ప్రత్యేక నిఘా పెట్టి.. పరిశ్రమల చుట్టూపక్కల ప్రజలు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. భవిష్యత్తుల్లో భద్రతా వైఫల్యాల కారణంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడానికి వీలులేదన్నారు. సీఏం జగన్మోహన్‌ రెడ్డి ఈవిషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని మంత్రులు తెలిపారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
దేశవ్యాప్తంగా ఎంత మంది మృతి చెందారు..?
దేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ కు రెండు నెలల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలిం పులతో పరిశ్రమలు తెరుచుకున్నాయి. దీంతో పరిశ్ర మల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్యాస్‌ లీకేజీ, పేలుళ్లు వంటి ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు, కార్మికులు మృతి చెందారు.ఈ రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా ఎన్నిపరిశ్రమల్లో ప్రమాదాలు జరిగా యంటే..?ఈ ఏడాది మే నుండి పరిశ్రమ లలో కనీసం 33 ప్రమాదాలు జరిగాయి.76మంది మృతి చెందారు.195 మంది తీవ్రంగా గాయ పడ్డారు. మే 3 నుంచి జూలై 14మధ్య జరిగిన 33 ప్రమాద ఘటనల్లో ఛత్తీస్‌గఢ్‌ నుండి గరిష్టంగా ఏడు ఘట నలు జరిగాయి. గుజరాత్‌లో ఆరు, మహారాష్ట్రలో నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అన్ని ప్రమాదాలు జరిగిన సంద ర్భాల్లో పరిశ్రమల్లో కార్మికులు, పరిశ్రమలకు సమీప దూరంలో ఉన్న నివాసితులు విషపూరిత రసాయ నాలకు గురయ్యే కనీసం అవకాశం ఉంది.ఈప్రమాదాలవల్ల రాబో యే నెలలు లేదా సంవత్స రాల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయనేది హెచ్చరిక సంకేతం.
చత్తీస్‌గఢ్‌ లోని బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో నాలుగు ప్రమాదాలు జరిగాయి.ఈ కాలంలో ఒకే పరిశ్రమలో అత్యధికంగా ప్రమాదాలు ఇక్కడే జరి గాయి.ఈ ప్రమాదాల్లోఒకవ్యక్తి మృతి చెందగా,మరో ఏడుగురు గాయపడ్డారు.మే,జూన్‌నెలల్లో తమిళ నాడులోని నెవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో జరిగిన రెండు అగ్ని ప్రమాదాలలో 20 మంది కార్మికులు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎల్‌జి పాలిమర్స్‌లోగ్యాస్‌ లీక్‌ కావడం వల్ల కనీసం 11 మంది మృతి చెందగా,100 మంది గాయ పడ్డారు. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద ఘట నలలో ఒకటి నమోదైంది.దీని తరువాత కోవిడ్‌ -19సమయంలోనూ,తరువాత కర్మాగారాలు తిరిగి తెరవడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. మొదటి వారంలోనే ఉత్పత్తిని పెంచ వద్దని,బదులుగా ట్రయల్‌ ప్రాతిపదికన అమలు చేయమని వారికి సలహా ఇస్తుంది. ఉత్పాదక విభా గాలలో గ్యాస్‌లీకేజీల కారణంగా ఐదుసంఘ టన లు జరిగాయి. ఇందులో 17మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 111మంది గాయపడ్డారు. బాయిలర్‌ పేలుడు జరిగిన మూడు సంఘటనలలో 22 మంది ప్రాణాలు కోల్పోగా,49మంది గాయ పడ్డారు.ఈ కాలంలో తయారీ యూనిట్లలో ఎని మిది అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 14 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. మే నుండి లాక్‌ డౌన్‌ సమయంలో పరిమితులతో పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతించింది. జూన్‌ నుండి ప్రభుత్వం‘అన్‌లాక్‌’ప్రక్రియను ప్రారంభ మైనప్పుడు నుంచి పరిశ్రమలకు పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది.గత నెలలోప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ఇండస్ట్రియల్‌ గ్లోబల్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ వాల్టర్‌ సాంచెస్‌ ‘‘భయంకరమైన వాస్తవం ఏమిటంటే..ఈ తీవ్రమైన ప్రమాదాల జరగడానికి పరిశ్రమల వైఫల్య నమూనాను సూచిస్తుంది. ఇంకా ఎక్కువ ప్రమాదాలుసంభవించే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.‘‘భద్రతా నియంత్రణలో ఈ రక మైన నిర్లక్ష్యం గమనించినప్పుడు. 1984 భోపాల్‌ విపత్తు స్థాయిలోపెద్ద విపత్తు సంభవించే అవకా శాన్ని తోసిపుచ్చలేము’’ అని సాంచెస్‌ రాశారు.

అడవే తిండి పెడుతోంది..

అమ్మ ఉన్న చోట ఆకలి ఉండదనేది ఎంత నిజమో! అడవి తల్లి ఉన్నచోట ఆకలి ఉండదనేది కూడా అంతే నిజం. కరువు కాటేసినా అడవి తల్లి చేరదీస్తుంది. తిండి ఇచ్చి ఆదుకుంటుంది. సాగు చేయకుండానే పంటనిస్తుంది. అందుకే దండకారణ్యంలో ఉంటున్న అడవి బిడ్డలకు తిండి ఎప్పుడూ దొరుకుతుంది.
ఆదివాసులకు అడవే ఆహార భద్రత ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌,చత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎంతోమంది ఆదివాసులు బతుకుతున్నారు. వాళ్లందరికీ అడవే ఆధారం. సాగు చేయ కుండానే అనేక రకాల ఆకుకూరలు,దుంపలు పండుతాయి. అడవిలో ఎటు వెళ్లినా ఒక పండో,దుంపో దొరుకుతుంది.సంతల్లో 21 రకాల ఆకుకూరలు,పండ్లు, కాయలు, దుంపలు, చిన్న చేపలు,చిన్న రొయ్యలు,కొక్కులు అమ్ము తుంటారు ఆదివాసులు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని కుంట(ఛత్తీస్‌గఢ్‌),చింతూరు (ఆంధ్ర ప్రదేశ్‌), చర్ల(తెలంగాణ),మోటు (ఒడిశా) సంతలకు కాలాల వారీగా దొరికే కాయలు,ఆకుకూరలు తెస్తారు. వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో వాళ్లకు కావాల్సినవి కొనుక్కుంటారు. ప్రకృతిని ప్రేమించాలి. దండ కారణ్యంలో సాగు చేయకుండా దొరుకుతున్న వాటిపై జన వికాస్‌ సొసైటీ స్టడీ చేసింది. ఆ రిపోర్టు ప్రకారం…కొన్నేండ్ల నుంచి అడవులు నాశనం అవుతు న్నాయి. ముందు ముందు తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. పరిశ్రమలు, ఆర్గనైజేషన్‌, డిస్‌ప్లేస్‌మెంట్‌, క్లైమేట్‌? ఛేంజ్‌, అభివృద్ధి పేరిట ఆదివాసులను అడవులకు దూరం చేస్తే..వాళ్ల మనుగడకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతిని ప్రేమించడం, పూజించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. వ్యవసాయంలో సింథటిక్‌ రసాయనాల వాడకం వల్ల తేనెటీగల క్షీణత పెరిగింది. ఇలాగే మరి కొన్నేండ్లు కొనసాగితే ఎక్కడా తిండి దొరకదు.
ఇవి దొరుకుతున్నయ్‌
మిర్చిలో బొబాయి,బోరాయి,చిన్ని కోర్‌ మిడియా పెద్దకోర్‌ మిడియా,నల్ల మిర్చి రకాలు దొరుకుతాయి.వీటితోపాటు తపిడి చిక్కుడు, పెర్మ, తెల్ల చిక్కుడు, కిసీర్‌జాట,బామ్‌జాట, కిసీర్‌ జాట-2,లుగ్గి జాటా తెల్ల వంకాయ, పెద్ద రాముల్క,చిన్న రాముల్క, బుడమ కాయలు, వెదురు కొమ్ములు, పుట్టకొక్కులు, తమిర్‌?మీట,నారదుంప,అడవి ఎలేరి దుంప, నాగేల్‌మాటి దుంప,నోస్కా మాటి దుంప, అడ్డపిక్కలు, ఆకు కూరల్లో తొండుకుసీర్‌?, ఇత్తోడ్‌కుసీర్‌, కుక్కాళ్‌ కుసీర్‌,దోబకుసీర్‌, పండ్లలో తోలె,పరిగి,ఎర్క,వెలగ,పుసుగు.. సీజన్‌ బట్టి దొరుకుతాయి.
ఆహార భద్రతకు ముప్పు
ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పిఎంజికెవై) పథకాన్ని ఆహార భద్రత చట్టం (ఎఫ్‌ఎస్‌ఎ)-2013లో విలీనం చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ‘ఉచిత రేషన్‌’ నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పిట్టలు వ్యూ హంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ జనాభాలో మూడిరట రెండొంతుల ప్రజానీకానికి (81.35 కోట్ల మంది) ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని ప్రకటించి సబ్సిడీ ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగించబోమని ప్రకటించడంతో నిరుపేదలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ప్రపంచ ఆహార సూచీలో భారత్‌ అట్టడుగున నిలిచిన నేపథ్యంలోనూ ఆహార ధాన్యాలను కుదించడం ఒక ఎత్తుగడ కాగా, రెండోది ‘ఉచితం’ ప్రచార హోరుతో సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లకు గాలం వేయవచ్చున్నది సర్కారు ఎత్తుగడ. 81.35కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున మాత్రమే ఇక నుంచి ఉచిత ఆహార ధాన్యాలు అందుతాయి. ఇదే సమయంలో ఆహార భద్రత చట్టం కింద ఒంటరి మహిళలు, వికలాంగులు, నిరాశ్ర యులు,వితంతు ఫించను పొందేవారు, ఏ ఆస రా లేని నిరుపేదలు, నిరుద్యోగులు,వయో వృద్ధులు వంటి లక్షిత కుటుంబాలకు రాయితీ ధరకు లభించే బియ్యం (కిలోరూ.3), గోధు మలు (కిలో రూ.2), ఇతర తృణ ధాన్యాలు (కిలో రూ.1) ఇక అందవు. కేవలం ఉచితంగా ఇచ్చే 5 కిలోల బియ్యం మాత్రమే అందుతాయి. పర్యవసానంగా ఈ నిరుపేదలంతా పౌష్టికా హారం కోసం ప్రయివేటు మార్కెట్‌పై ఆధార పడాల్సివస్తుంది. బయట మార్కెట్లో తక్కువలో తక్కువ కిలో గోధుమల ధర రూ.30గాను, కిలో బియ్యం ధర రూ.40గాను ఉంటోంది. రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమ జీవులకే నోటి ముద్ద గగనమైపోతున్న ధరాఘాత సమయంలో ఏ ఆసరా, ఏ పని చేయలేని నిస్సహాయ జీవితా లకు రాయితీ తిండి గింజలు నిరాకరించడం దుర్మార్గం. ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించేందుకు ప్రజలందరికీ అన్ని వేళలా అవసరమైన ఆహార ధాన్యాలను తగిన మోతాదులో అందుబాటులో ఉండేలా చూడటం, పౌష్టికాహారం తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం, సహకరించడం ప్రభుత్వాల బాధ్యత. తద్వారా ఆహార సుస్థిరతను సాధించడమనేది ఆహార భద్రతకు విశ్వ వ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనం. ఆహార భద్రత హక్కును మన రాజ్యాంగంలో నేరుగా ప్రస్తావించలేదు. కానీ రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం కల్పించిన ‘జీవించే హక్కు’ అర్థంలోనే హుందాగా జీవించడమని స్పష్టతనిచ్చింది. హుందాగా జీవించడమంటే అర్థాకలితో అనికాదు కదా. అందుకనే ఆహారం, మనిషి జీవనానికి అవసరమైన ప్రాథమిక అవసరాలు అనేవి కూడా రాజ్యాంగ కల్పించిన హక్కులే. 2013లో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ఈ నేపథ్యంలోనే. కానీ ప్రపంచ ఆహార సూచీలో దేశం ఏటికేడూ దిగజారిపోతోంది. పాలకుల ‘అమృతోత్సవ భారతావని’ గొప్పలు ఎంత ఘోరమైనవో.. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో తరుచూ వెలుగుచూస్తున్న ఆకలి చావులు స్పష్టం చేస్తు న్నాయి. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆహార భద్రత హక్కు, ఉపాధి హామీ వంటి పేదలకు సంబంధించినవాటిపైనే కన్నేసి వాటిని నీరుగార్చే కుట్రలు సాగిస్తూనే వుంది. ఇప్పుడు ఉచిత ఆహారధాన్యాల ఎత్తుగడ కూడా అలాంటిదేనన్న విమర్శకుల విశ్లేషణ సమంజసంగానే కనిపిస్తోంది.కోవిడ్‌ సంక్షోభం, లాక్‌డౌన్‌ నిర్బంధాల నేపథ్యంలో 2020 మార్చి లో పిఎంజికెవైని మోడీ సర్కార్‌ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకానికి ముందు ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ కింద ఆహార ధాన్యాల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం 2021-22లో రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సబ్సిడీ ఆహార ధాన్యాల్ని నిలిపివేయడం అంటే ఈ మేరకు పేదలందరిపై భారం వేయడమేన్న మాట. గర్భిణీలకు, తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహరం అందించే ఐసిడిఎస్‌లకు, మధ్యాహ్న భోజన పథకాలకు కూడా కేంద్రం నిధులను తెగ్గోస్తోంది.ఆ మేరకు రాష్ట్రాలపై భారాలు పెరిగి ఆ పథకాలు క్రమంగా నీరుగారిపోతున్నాయి. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి పేదరికం కోరలు చాచిన నేపథ్యంలో పాలకులు ఆహార ధాన్యాల సబ్సిడీ కవరేజీని విస్తృతం చేయాల్సిన అవసరముంది. అలాంటి సమయంలో కోటాకు కోత పెట్టడం అమానుషం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున్ణ పరిశీలించడం అవసరం. ఉచిత ధాన్యా లతో పాటు సబ్సిడీ ఆహార ధాన్యాలను కూడా కొనసాగించాలి.
ఆహార భద్రత అందరి బాధ్యత
ప్రతి మనిషి మనుగడకు ఆహారం ఎంతో ముఖ్యం. కానీ నేడు ఆహారం అందరికీ అందుబాటులో లేకపోవడం, ఆకలి కేకలు మిన్నంటడం ఆందోళన కలిగిస్తున్నది. ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు ముఖ్య కారణమైతే, ఆహార వృథా మరొక కారణం. ఆహారం వృథా చేయకపోతే సంపదను సృష్టించి నట్లే! ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహార ధాన్యాలలో 35శాతం వరకు వృథా అవుతు న్నాయి. భారత్‌లో ఏటా సుమారు రూ.58 వేల కోట్ల విలువైన ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 82.2 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.ఈ లోపంవల్ల ప్రతి ఐదు నిమిషాలకు ఒక పసి బిడ్డ పొత్తిళ్లల్లోనే చనిపోతున్నాడు. బడి మానేసే పిల్లల సంఖ్య పెరుగుతున్నది.భారత్‌లో 5కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. వీటిని అవసరమైన వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంచితే ఆకలి కేకలు, పోషకా హార లోపాలు తగ్గుతాయి. ప్రపంచ జనాభాకు సరిపడా ఆహారం అందుబాటులో లేకపో వడానికి అనేక కారణాలు ఉన్నాయి. పంటలు పండిరచే భూమి విస్తీర్ణం తగ్గడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం, వ్యవ సాయ రంగంపై ఆశించిన పరిశోధనలు జరగకపోవడం, ఆహార ధాన్యాలు, పదార్థాలు సరిగా నిల్వ చేయకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ పెరగడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం ప్రధానమైనవి. 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పటికే 750 కోట్ల ప్రపంచ జనాభాలో ఒక్క పూట తిండికి కూడా నోచుకుని వారి సంఖ్య 150కోట్ల పైమాటే. దీంతో కొన్ని దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) 2030 నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నది. ఆహార కొరతను తీర్చాలంటే చాలా కాలంపాటు ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు పాడైపోకుండా ఉండేలా నిల్వ సదుపాయాలు పెంచాలి. ప్రజలకు ఆహార వృథావల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. సరైన ప్యాకింగ్‌ పద్ధతులు పాటించాలి. ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలి. నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలపై రైతులకు 90% రుణాలు ఇవ్వాలి. వ్యవసాయాన్ని, వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహించాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. అప్పుడే ఆహార భద్రత సాధ్యమై అందరికీ ఆహారాన్ని అందించగలం.
ఆహార భద్రతా చట్టం అమలయ్యేనా?
గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పౌరసమాజం, ప్రజాసంఘాలు ఆహార హక్కు అమలు జరిపించడానికి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తేనే ప్రభుత్వాలు కదిలి ఆయా చట్టాలను, పథకాలను రాజకీయ సంకల్పంతో అమలు జరపడానికి అవకాశం ఉంటుంది. ఆకలి వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలిచినందుకు ఈ బహుమతి ఇవ్వ బడిరది. తద్వారా ప్రపంచ పటంపై ఆకలిని అంత మొందించే బృహత్‌ కార్యక్రమం ప్రాధాన్యాన్ని నోబెల్‌ కమిటీ మొత్తం మాన వాళి ముందుం చింది.ఉత్పత్తి జరిగినప్పటికీ పంపిణీ వ్యవ స్థలు సమాజంలోని బాధిత కుటుంబాలకు అను కూలంగా లేవనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత పోషణపై ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఏ.ఒ) ఇచ్చిన నివేదిక 2019 నాటికి దాదాపు 200 కోట్ల మంది ప్రజలు సురక్షితమైన, పుష్టికర, సరిపోయేంత ఆహారం అందుబాటులో లేదని తెలిపింది.పూర్తిగా ఆకలితో అలమటించే పేదలు 2030 నాటికి 84 కోట్లను మించిపోతారని చెప్పింది. ఈ సంవత్సరం కరోనా కాలంలో 13 కోట్ల మంది అదనంగా చేరతారని అంచనా వేసింది. వీరిలో అత్యధి కులు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మి కులు, మురికివాడల్లో నివసించేవారు, ఉపాధి కోల్పోయిన వలస కూలీలు అని పేర్కొంది. మనదేశంలో లాక్‌డౌన్‌ అనంతరం కనబడని ఆకలిచావ్ఞలు కరోనా మృతుల కంటే ఎక్కువగా ఉంటా యనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. పౌష్టికాహారలేమితో ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వాళ్లే ఎక్కువగా అంటువ్యాధులకు, మరణాలకు గురవడానికి ఆస్కారం ఉంది.
ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాల్లో ఈ సంఖ్య ఎక్కువ. యూనిసెఫ్‌ సంస్థ ఈ ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 12లక్షల మంది పిల్లలు చనిపోవడానికి ఆస్కారం ఉంటే అందులో మూడు లక్షల మంది భారత దేశంలోనే ఉంటారని హెచ్చరించింది. 2019లో విడుదల చేసిన భౌగోళిక ఆకలి సూచిక ప్రకారం భారతదేశం 117దేశాల్లో 102వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌,నేపాల్‌లు మన కంటే మెరుగ్గా ఉన్నాయి. మన పొరుగు దేశమైన చైనా 25వ స్థానంలో ఉంది. 2017 జాతీయ ఆరోగ్య సర్వే మనదేశంలో 19కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు ఆకలితో అలమ టిస్తున్నారని, 4,500 మంది ఐదు సంవత్స రాలలోపు పిల్లలు ఆకలి పోషకాహార లోపం వలన మరణిస్తున్నారని తెలిపింది. ఆహారభద్రత చట్టం ఆవిర్భావం, అమలు ఆహార హక్కు ఐక్యరాజ్యసమితి 1948లో వెలువరించిన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో గుర్తించబడి, 1966లో ఆమోదించబడిన ఆర్థికసామాజిక సాంస్కృతిక హక్కుల అంతర్జాతీయ ఒప్పందంలో స్పష్టపరచబడిరది. ఈ ఒప్పందం అమలు కమిటీ 1999లో ప్రతి ఒక్కరికి ఆకలి నుండి విముక్తి పొందే హక్కును గుర్తించాలని ఆయా దేశాలను ఆదేశించింది. 2000 సంవత్సరంలో భారతదేశం ఆమోదిం చిన ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ధి ప్రకటనలో 2015 నాటికి ఆకలి,దారిద్య్రాన్ని తగ్గిం చాలని పేర్కొనబడిరది. తదనంతరం 2015లో ఆమోదించబడిన ప్రకటనలో 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఆకలి దారిద్య్రాలను గణనీయంగా తగ్గించాలని ఆదేశించబడిరది. మన దేశం రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగానే ఆహార హక్కు గుర్తించబడిరది. అలాగే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 47 ప్రకారం ప్రజలందరికీ పౌష్టికా హారాన్ని అందచేయడం,జీవన, ఆర్థిక,ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరుచుటకు రాజ్యం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పబడిరది.
2001లో దేశంలో ఒకవైపు ఆహార నిల్వలు పేరుకు పోయి మరొకవైపు ఆకలి అంతటా అలుముకున్న సందర్భంలో పిపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పియు.సి.యల్‌) స్వచ్ఛంద సంస్థ భారత ప్రభుత్వం, భారత ఆహార కార్పొరేషన్‌, ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలపై తక్షణం ప్రజలకు ఆహార సహాయాన్ని అందించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయో జనాల వ్యాజ్యాన్ని వేసింది.ఆ వ్యా జ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు చొరవ, ప్రజాఉద్యమాల ఒత్తిడి కార ణంగా భారత ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకా లను, కొన్ని చట్టా లను తీసుకువచ్చింది. అందులో ముఖ్యమైనవి.2005లో తీసుకొ చ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం.ఈ కొవిడ్‌ సందర్భంగా గ్రామాలకు తరలివచ్చిన వలస కార్మికులకు ఈ పథకం సంజీవనిగా పనిచేసింది. తదనం తరం 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం తీసుకురాబడిరది. ఈ చట్టంలోని నాలుగు ప్రధాన అంశాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ,6-14 సంవ త్సరాల మధ్య వయసు బాలలకు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం, ఆరు నెలలు-ఆరు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు అంగన్‌ వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం,నేటికి కూడా కోట్లాది వలస కూలీ లను, ఇల్లులేని వారిని, అనాధలను, గిరిజనులను గుర్తించడంలో ప్రభుత్వాలు సఫలీకృతం కాలేదు. బయోమెట్రిక్‌ విధానంలోచాలా మంది అర్హతను కోల్పోయారు. -జి ఏ సునీల్ కుమార్ 

ప్రకృతి రణం

సీజన్‌తో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్న ప్రకృతి మనిషిని అల్లకల్లోలం చేస్తోంది. నిజానికి భూమ్మీద ప్రతిజీవి ప్రకృతి మీదే ఆధారపడి బతుకుతుంది. మూడు కాలాలు, ఆరు రుతువులు టైం టు టైం ఉంటేనే ?జీవన చక్రం కరెక్ట్‌గా ఉంటుంది. అలాకాకుండా ఎండా కాలంలో వానలు,చలికాలంలో ఎండలు కాస్తే! వాతావరణంలో వచ్చే మార్పులకు మనిషితో సహా భూమ్మీద ఉన్న ఏప్రాణీ తట్టు కోలేదు. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అయితే, అంతటి విపత్తుల వెనక బోలెడన్ని కారణాలు?ఉండొచ్చు. వాటన్నింటికి ముఖ్య కారణం మాత్రం మనిషే. పెరుగుతున్న టెక్నాలజీ మనిషి లైఫ్‌స్టైల్‌లో మార్పులు తెస్తోంది. దాంతో వాతావరణంలో విషవా యువులు పెరిగిపోతున్నాయి. ఆ ప్రభావం ప్రకృతి మీద తీవ్రంగా ఉంటోంది. కొంత కాలంగా వాతావరణంలో వస్తున్న మార్పులు గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. అకాల వర్షాలు, వరదలు,భూకంపాలు,కరువు..ఇవి సహజంగా వచ్చే మార్పులు కావు. అసహజం గా ముంచుకొస్తున్న ప్రకృతి విలయాలు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రకృతి ప్రకోపానికి బలవ్వాల్సిందే.
ఇది మింగుడుపడని విషయమే.అయితే ఇప్పటికైనా ఒంటిమీదకు కాస్త తెలివి తెచ్చుకుని నడుచుకోకపోతే పర్యావరణాన్ని కాపాడుకోవడం కష్టం. అంతెందుకు మనల్ని మనమే రక్షించుకోలేం. జీవనానికి సరిపడా వనరులు ఉంటే చాలు. కానీ, అవసరమైనదానికంటే ఎక్కువైతేనే విపరీత పరిణామాలు ఎదురవు తుంటాయి. ఇక్కడా అదే జరిగింది. నిజానికి వానలు లేకపోతే తాగు, సాగు నీరు ఉండదు. కానీ, ప్రకృతి లైఫ్‌?సైకిల్‌?లో మార్పులు వచ్చి ఏకధాటిగా వానలు కురిస్తే మాత్రం ఇలాంటి నష్టాలే జరుగుతాయి. వానల్ని కంట్రోల్‌? చేయడం సాధ్యం కాదు కదా? మన చేతుల్లో ఏముంది? అనొచ్చు. కానీ, వాతావరణంలో వచ్చే మార్పులకు పరోక్షంగా మనమే కారకులవుతున్నాం అన్నది అక్షర సత్యం. అసలు వాతావరణ మార్పులకు కారణాలేంటి? వాటి వల్ల ఏం జరుగుతుంది?
వాయు కాలుష్యం..
శిలాజ ఇంధనాల(ఫాజిల్‌ ఫ్యూయల్స్‌)ను కాల్చడం ద్వారా వచ్చే పొగ వల్ల భూగ్రహం వేడెక్కింది. దాంతో గ్లేసియర్స్‌ ఐస్‌?క్రీంలా కరిగిపోతున్నాయి. అంతేకాకుండా వాటి నుంచి నల్లని మసి, రేణువులను విడుదల చేస్తాయి. ఆ రేణువులు గాలి ద్వారా పైకి వెళ్లి మంచుపై పడతాయి. అక్కడ అవి మంచు కంటే ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీనివల్ల మంచు వేగంగా వేడెక్కి కరిగిపోతోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడం వల్ల గ్లేసియర్స్‌ను రక్షించొచ్చని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. ఇటుక బట్టీలు, కలప నుండి వచ్చే పదార్థం ఈప్రాంతంలో మూడిరట రెండు వంతుల బ్లాక్‌ కార్బన్‌ను కలిగి ఉం టుంది. రెండవ అతిపెద్ద కాలుష్య కారకాలు డీజిల్‌ వాహనాలు.ఇవి 7-18 మధ్య కాలు ష్యానికి కారణమవుతున్నాయి.
2021 రిపోర్ట్‌ చెప్పే నిజాలివి
2021లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగాయని స్టేట్‌ ఆఫ్‌ ది క్లైమెట్‌ రిపోర్ట్‌ చెప్తోంది. వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఎమిషన్స్‌ సాంద్రత రికార్డు స్థాయికి చేరుకుంది. దాంతో గత ఏడేండ్లుగా టెంపరేచర్‌ పెరుగు తోందని ఈ స్టడీలో తెలిసింది. అదే విధంగా గ్రీన్‌ల్యాండ్‌లో మంచుకు బదులు మొదటిసారి వాన కురిసింది. కెనడా, అమెరికా రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు చెలరేగాయి. వాటి వల్ల కొన్నిచోట్ల టెంపరేచర్‌ అమాంతం పెరిగింది. చైనాలోని ఒక ప్రాంతంలో నెలలో కురవాల్సిన వాన కొన్ని గంటల్లో కురిసింది. యూరప్‌?లో వచ్చిన వరదల కారణంగా ప్రాణ,ఆర్థిక నష్టాలు చాలా జరిగాయి. దక్షిణ అమెరికాలో వరుసగా రెండో ఏడాది కరువు వచ్చింది.దాంతో నదుల్లో నీటిమట్టం తగ్గింది. అగ్రికల్చర్‌,ట్రాన్స్‌పోర్ట్‌, ఫ్యూ యల్‌ ప్రొడక్షన్స్‌ బాగా దెబ్బతిన్నాయి.1990లో శాటిలైట్‌ బేస్డ్‌ సిస్టంతో సముద్ర మట్టాన్ని కొల వడం మొదలైంది.1993 నుంచి 2002మధ్య సముద్ర మట్టాలు ఏడాదికి 2.1మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. కానీ, 2013 నుంచి 2021 మధ్యలో ఈ లెక్క రెట్టింపయింది. ఏడాదికి 4.4 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. ముఖ్యంగా మంచు కరిగిపోవడంతో సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి.‘‘గత రెండు వేల ఏండ్లలో ఇలా పెరిగింది లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 కల్లా సముద్ర మట్టాలు 2 మీటర్లు దాటిపోవచ్చు. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా 63కోట్ల జనాభా ఇండ్లు కోల్పోతారు. ఇంకెలాంటి పరిస్థితులు వస్తాయో ఊహిం చలేం’’ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌
ముందే పసిగట్టారు
పాకిస్తాన్‌లోని పర్వత ప్రాంతంలో 70 లక్షల మంది ప్రజలు మరింత వరదల బారిన పడే ప్రమాదం ఉందని సైంటిస్ట్‌ల అంచనా. కానీ, భూమి వేడెక్కకుండా చేయగల శక్తి మనలో లేదు. పాకిస్తాన్‌లో విడుదలయ్యే వాయువులు కేవలం1% వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. అఫ్గానిస్తాన్‌, నేపాల్‌ వంటి దేశాలు కూడా అందుకు తక్కువే కారణమవుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆ దేశాలే వాతావరణ మార్పులకు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనదేశమే కాదు.. ప్రపంచం మొత్తం ప్రమా దం అంచున ఉన్నట్లే అనిపిస్తోంది. వాతా వరణ మార్పులు వల్ల జీవరాశులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మనుషులకు శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిలో మొదటిది వేడి వాతావరణం.
వేడి పెరిగితే కష్టమే
ఓమాదిరి వేడి వరకు మాత్రమే శరీరం తట్టుకోగలుగుతుంది. అంతకంటే ఎక్కువైతే తట్టుకోలేదు. వేడి తీవ్రత పెరిగిపోతే ఆ వేడికి కండరాలను బ్రేక్‌ చేసేంత శక్తి ఉంటుంది. అందుకనే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటకి వెళ్లకూడదు అంటారు. ఎందుకంటే ఆ వేడికి గుండె కండరాలు, కణాలు చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే వేడి ఎక్కువైతే ఒత్తిడికి కూడా లోనవుతారు. అప్పుడు గుండె.. రక్తాన్ని వేగంగా సరఫరా చేస్తుంది. అదే టైంలో చెమట రూపంలో సోడియం, పొటాషియం శరీరం నుండి బయటకు వచ్చేస్తాయి. ఇలాంటప్పుడు హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎండ ఎక్కువగా ఉంటే డీహైడ్రేషన్‌ బారిన పడతాం అనే విషయం తెలిసిందే. దానివల్ల కిడ్నీలు డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంది. అప్పటికే కిడ్నీల కండిషన్‌ సరిగా లేకపోతే వేడి తీవ్రతవల్ల ప్రాణం పోయే అవకాశంఉంది. ఈ విషయంలో వృద్ధులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. భూమి వేడెక్కేకొద్దీ, దోమలు వాటికి అనుకూలమైన ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో చేరి…జికా వైరస్‌,డెంగీ,మలేరియా వంటి వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. ఇవేకాకుండా కలరా,టైఫాయిడ్‌,పారాసైట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి.
తిండి కూడా దొరకదు
వాతావరణంలో మార్పులవల్ల ఫుడ్‌ ప్రొడక్షన్‌ తగ్గుతుంది. సరఫరాపై ప్రభావం పడుతుంది. దానివల్ల మనిషికి అవసరమైన పోషకాలు కూడా తగ్గిపోతాయి. ఇంటర్‌ గవర్నమెంటల్‌ పానెల్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ (ఐపిసిసి) స్పెషల్‌ రిపోర్ట్‌ ప్రకారం..ఉష్ణోగ్రతలు పెరగడంవల్లే పంటలు సరిగా పండడం లేదు. అంతేకా కుండా వాతావరణంలో ఉన్న కార్బన్‌%-డై -ఆక్సైడ్‌ పెరగడంవల్ల మొక్కల్లో ఉన్న జింక్‌, ఐరన్‌, ప్రొటీన్‌ వంటి న్యూట్రియెంట్లు నాశనం అవుతున్నాయి.పోషకాలు లేని ఫుడ్‌ ఎంత తిన్నా వేస్టే. పోషకాలు తగ్గితే అనారోగ్యాలు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఉంది. అలాగైతే నీళ్లలో పెరిగే జలచరాల్ని తిందాంలే అనుకుంటున్నారా అదికూడా లాభంలేదు. ఎందుకంటే వేడి వాతావరణాన్ని తట్టుకోలేక అవి ధృవ ప్రాంతాలకు వలసపోతున్నాయి. దాంతో చేపలు, రొయ్యల వంటి వాటి నుంచి వచ్చే పోషకాలు కూడా మనిషికి అందకుండా పోతాయి.
ఆరోగ్యం మీద పెద్ద దెబ్బ
అడవులు కాలిపోవడం, సునామీల వంటి ప్రకృతి విపత్తులు ఈ మధ్య ఎక్కువ కావడం వల్ల ఊహించని నష్టాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాతావరణ మార్పులు మనుషుల ఆరోగ్యానికి పెద్ద ముప్పు తెస్తాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఆగస్ట్‌లో అమెరికా యూరప్‌, సైబీరియా దేశాల్లో అడవులు కాలిపోయాయి. దాంతో గాలిలో కాలుష్యం పెరిగి పోయింది. ఆగాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, రక్తంలోకి కలుషితాలు చేరిపోతాయి. శరీరంలోని అవయ వాల మీద నేరుగా ప్రభావం చూపకపోయినా, ఇమ్యూనిటీ సిస్టమ్‌ మీద దాని తాలూకా ప్రభావం తప్పక పడుతుంది. దీనివల్ల ఏటా3.6 నుంచి 90లక్షల వరకు అకాల మరణాలు జరుగుతున్నాయని అంచనా. అంతేకాకుండా 65ఏండ్లు పైబడిన వాళ్లకు కాలుష్యం వల్ల ఇన్ఫెక్షన్‌ కలిగించే వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి.
మానసికంగా కూడా…
ప్రకృతి విపత్తులవల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఉదాహరణకు విదేశాల్లో అడవులు తగలబడ టాన్నే తీసుకుందాం.అప్పుడు అక్కడ నివసించే వాళ్లలో కొందరు తమ ఇండ్లు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కొందరైతే సొంతవాళ్లను కోల్పోయారు. మనదేశంలో వరదలు వచ్చిన ప్పుడు కూడా ఇదే పరిస్థితి.సునామీలవల్ల స్ట్రెస్‌,యాంగ్జైటీ పెరిగి పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌కి దారితీస్తుంది.దీన్నే ‘సొలా స్టాల్జియా’ అంటారు. ఈ జబ్బు పోను పోను సూసైడ్‌ చేసుకునే వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ఏం చేయాలి?
భౌగోళికంగానే కాకుండా శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న ఇన్ని అనర్థాలను ఎలా ఆపాలి? అందుకేం చేయాలని ఎవరిని వాళ్లు ప్రశ్నించుకోవాల్సిన టైం వచ్చేసింది. అలాగే ప్రకృతికి మనం చేస్తున్న నష్టాల గురించి అవగాహన పెంచుకోవాలి కూడా. చెట్లు నరికితే వర్షాలు పడవు. భూములు ఎండిపో తాయి. పంటలు పండవు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వీటన్నింటి వల్ల తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కరువు అవుతాయి. ఇవన్నీ తెలిసి కూడా చెట్లు నరకడం మనిషి అజ్ఞానానికి నిదర్శనం. అలాగే వాహనాలు.. వాటి నుంచి వెలువడే పొగ గాలిని కలుషితం చేస్తుంది. మనిషి తెలివితేటల్ని ఉపయోగించి లైఫ్‌?ని ఈజీ చేయాలన్న ఆలోచనతో ఏసీలు, ఫ్రిజ్‌?లు కనిపెట్టాడు. కానీ, వాటి నుంచి విడుదలయ్యే గాలి చాలా ప్రమాదకరం. నిజానికి వీటినుంచి వెలువడే విషగాలులవల్లే ఓజోన్‌ పొరకు రంధ్రం పడిరది. కానీ, అవి లేకుండా బతకలేనంతగా ఆ వస్తువులకి అలవాటు పడిపోయాం.ఆ అలవాటుకు దూరమవ్వాలంటే….ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచాలి. ఇంటికి మంచి వెంటిలేషన్‌ ఉం డాలి. ఇంటినుంచి బయటకు అడుగుపెడితే టూవీలర్‌ లేదా కార్‌ ఎక్కకుండా.. ఎక్కువ దూరాలు జర్నీ చేయాలంటేనే వెహికల్స్‌ వాడాలి. వీలైనంత వరకు నడిచి వెళ్లాలి. నడిచి వెళ్లే దూరం కాదంటే సైకిల్‌ మీద వెళ్లడం మంచిది. ఇప్పటికే కొన్ని దేశాలు, మనదేశంలో కొన్ని రాష్ట్రాలు సైకిల్‌ వాడకాన్ని పెంచాయి. దీనివల్లగాలి కాలుష్యంతో పాటు సౌండ్‌ పొల్యూషన్‌ కూడా తగ్గుతుంది.
సముద్రాలు పొంగితే అంతా నాశనమే
మధ్య ఆసియా పర్వత ప్రాంతాన్ని-‘హై-మౌం టైన్‌ ఆసియా’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాం తంలో హిమాలయన్‌, కారకోరం,హిందూ కుష్‌ పర్వతాలు ఉన్నాయి. చైనా నుండి అఫ్గానిస్తాన్‌ వరకు విస్తరించి ఉన్నాయి. మధ్య ఆసియా పర్వత ప్రాంతంలో 55,000 గ్లేసియర్‌లు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ధృవాల బయట మరెక్కడా లేని విధంగా ఎక్కువ మంచి నీటి నిల్వలు ఉన్నాయి. ఇక్కడ కరిగే నీరు ఆసియాలోని10 అతిపెద్ద నదులకు ఆధారం. దీని బేసిన్లలో దాదాపు రెండొందల కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. 2015 ప్రపంచ బ్యాంకు రిపోర్ట్‌? ప్రకారం75 కోట్ల ప్రజల జీవనోపాధికి గంగా,సింధు,బ్రహ్మపుత్ర నదులు మాత్రమే నీటి వనరులు. చైనాలోని యాంగ్జీ నది ఖండంలోనే అతిపెద్దది-ఆగ్నేయాసి యాలోని మెకాంగ్‌ కూడా హిమాలయ జలాలపై ఆధారపడిరది. కానీ,వేడి ఉష్ణోగ్రతలు వాటిని ప్రమాదంలో పడేస్తాయి. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం,హిమాలయాల్లో ఉష్ణో గ్రతలు ప్రపంచ సగటు కంటే రెండిరతలు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో మంచు కరుగుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ను అదుపు చేయడంలో విఫలమైతే, మధ్య ఆసియాలోని పర్వతాల్లోని మంచు కరిగి, వందేండ్లు పూర్తయ్యేనాటికి మూడిరట రెండు వంతుల భాగం కనుమరుగైపోతుంది. జర్మన్‌ క్లైమెట్‌ రిస్క్‌ ఇండెక్స్‌ ప్రకారం-వాతావరణ మార్పుల వల్ల అత్యంత ప్రమాదకరమైన పది దేశాల్లో నేపాల్‌, పాకిస్తాన్‌ ఉన్నాయి. అయితే మొదటి ఇరవై దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. ‘హిమానీనదాలు కచ్చితంగా కరిగిపోతాయి. ప్రస్తుతానికి సరిపడా మంచినీరు ఉంది. కానీ, ముందుముందు ఎంత నీరు ఉంటుందో తెలి యని పరిస్థితి. మన దగ్గర ప్రజలకు వ్యవసా యం ప్రధాన ఆదాయవనరు. మెరుగైన నీటి నిర్వహణ, నీటి శుద్ధిలో పెట్టుబడి పెట్టకపోతే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే’ అని కోల్‌కతా, జెఐ ఎస్‌ యూనివర్సిటీ సైంటిస్ట్‌ భట్టాచార్య హెచ్చరించారు.
చల్లటి దేశాల్లో వేడి!
చల్లటి వాతావరణం ఉండే అమెరికా, యూరప్‌లోని దేశాల వాతావరణంలో కూడా కొన్నేండ్లుగా మార్పులొచ్చాయి. ఇవి సంపన్న దేశాలు కావడంతో అక్కడ ఫ్యాక్టరీలతోపాటు వెహికల్స్‌, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఎక్కువ. దాంతో కార్బన్‌ ఎమిషన్స్‌ గాల్లో ఎక్కువగా కలుస్తాయి. దానివల్ల గాలిలో కాలుష్యం, టెంపరేచర్స్‌ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల వల్లే రెండుమూడేండ్లుగా అమెరికా,యూరప్‌ దేశాల్లో వేడి తీవ్రత ఎక్కువై అడవులు కార్చిచ్చులతో మండిపోతున్నాయి. అలాగే అక్కడి మంచు కూడా కరిగిపోతోంది.చలి కాలంలోనూ టెంపరేచర్స్‌ బాగా పెరిగి,ప్రజలు ఏసీలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది.
మనదేశంలో..
తూర్పు పసిఫిక్‌ గాలులు బలంగా ఉంటే, అప్పుడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో వీచే గాలులు బలహీన పడతాయి. ఇలాంటప్పుడు నార్మల్‌గా కాకుండా ‘లా నినా’ లేదా ‘ఎల్‌ నినో’ కండిషన్స్‌ ఏర్పడతాయి. తూర్పు పసిఫిక్‌లో వేడి వాతావరణం ఉంటే, ఎల్‌ నినో కండిషన్‌,చల్లగా ఉన్నప్పుడు లా నినా కండిషన్‌ ఏర్పడుతుంది. అంటే ఎక్కువ వాల్యూ వస్తే ఎల్‌ నినో,తక్కువ వస్తే లా నినా వస్తుంది. ఇవి ఐదారేండ్లకు ఒకసారి వస్తాయి. ఇలా వచ్చినప్పుడు గాలి దిశలో మార్పులు వస్తాయి. పసిఫిక్‌? సముద్రం మీద వీచే గాలుల్లో తేడా వచ్చినప్పుడు అవి బలహీనంగా ఉండి, మన దేశాన్ని తాకకపోతే ఎల్‌? నినో కండిషన్‌ ఏర్పడి వర్షాలు తగ్గిపోతాయి. అన్ని ఎల్‌ నినో సంవత్సరాలు కరువు తీసుకురావు. కానీ.. నార్మల్‌ రోజుల కంటే తక్కువ ఉన్న సంవత్స రాలు కూడా ఉన్నాయి. అది ఎల్‌ నినో లక్షణం. చాలావరకు ఎల్‌? నినో ఇయర్స్‌ కరువు తీసుకొస్తాయి. అప్పుడు మన దేశంలో వర్షాలు పడాల్సిన ప్రాంతాల్లో వర్షాలు పడవు.లా నినా కండిషన్‌లో తీవ్రమైన గాలులు వీస్తాయి. దాంతో సముద్రం నుంచి తేమ ఎక్కువగా వాతావరణంలోకి రావడంతో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. అన్ని లా నినా కండిషన్స్‌?లో వరదలు వచ్చే సూచన ఉండదు. కానీ.. లా నినా కండిషన్‌లో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులు లోకల్‌గా ఎఫెక్ట్‌ చూపిస్తాయి. ప్రస్తుతం లా నినా కండిషన్‌ మనదేశం మీద ఇంకా ఉంది.ఈపరిస్థితి ప్రపంచమంతటా ఇలాగే ఉంటుంది. యూరప్‌ వంటి దేశాల్లో వాతావరణం వేరేగా ఉంటుంది.కానీ..లా నినా కండిషన్‌ ఎక్కువ అవ్వడంవల్ల గ్లోబల్‌ సర్క్యులేషన్‌లో మార్పులు వచ్చాయి. దాంతో టెంపరేచర్స్‌ ఆపోజిట్‌గా పనిచేశాయి. మన రాష్ట్రం విషయానికొస్తే..రెండేండ్ల నుంచే లా నినా కండిషన్స్‌ వల్ల వర్షాలు ఎక్కువగా వస్తు న్నాయి. మిగతా టైంలో వర్షాకాలంబాగానే ఉంది.ఎంత వర్షపాతం ఉండాలో అంతే ఉంది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
ప్రకృతి విపత్తులు అకస్మాత్తుగా వచ్చినవి కాదు. కొన్నేండ్ల నుంచి ఉన్నవే. మొదటి సారిగా1992లో జర్మనీలోని రియో డి జెనిరోలో ‘వరల్డ్‌ ఎర్త్‌ సమ్మిట్‌’ జరిగినప్పుడే దీన్ని డిక్లేర్‌ చేశారు. అది డిక్లేర్‌ చేసి,ఇప్పటికే 30 ఏండ్లు అయింది. అప్పటి నుంచి ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ (ఐపీసీసీ) రిపోర్ట్స్‌రావడం మొదలైంది. దీన్ని మొదలుపెట్టడానికి కారణం…ప్రాంతీయంగా పర్యావరణ అంశాలను పట్టించుకోకుండా ప్రవర్తించడం, డెవలప్‌మెంట్‌ చేస్తున్నామంటూ గుడ్డిగా వెళ్లడం, నేచర్‌ని నిర్లక్ష్యం చేయడం. వీటివల్లే ఇలాంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మనదగ్గరే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉంది. స్థానికంగా వాతావరణ పరిస్థితులు కూడా మారాయి. ఉదాహరణకు హైదరాబాద్‌నే చూస్తే…ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. బిల్డింగ్‌లు, ఫ్యాక్టరీలు,వెహికల్స్‌ పెరిగిపోయాయి. కాలుష్యం కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షం గుర్తుందా ఏ ప్రభావం వల్ల అలా జరిగిందనేది తెలుసుకోవాలి. కానీ, 20 ఏండ్లుగా దాని సంగతే పట్టించుకోలేదు ప్రభుత్వాలు.ఆ తర్వాత 2005లో,2016లో ఇలాంటి విపత్తులే వచ్చాయి. గత ఐదేండ్ల నుంచి ఏటా వానలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే, విపత్తు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేస్తున్నారు. తర్వాత దాని ఊసే ఉండదు. దీనికి ముఖ్య కారణం వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(నీటి మౌలిక సదుపాయం) సరిగా లేకపోవడం. వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంటే.. మంచి నీటి సరఫరా ఎలా జరగాలి వాన నీళ్లు, మురికి నీళ్లు ఎలా వెళ్లాలి అనే వాటి గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో వరద, మురికి నీళ్లు రెండూ కలిసి ప్రవహిస్తున్నాయి. -జిఎన్‌వి సతీష్‌

మన్యం విప్లవం..మహోద్యమం..!

‘‘ బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంతఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. ఆ మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4,1897-మే7,1924). భారత స్వాతంత్య్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఈ విప్లవ యోధుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.’’– గునపర్తి సైమన్‌
భారతీయ చరిత్రలో ఆయన మహో జ్వల శక్తి.మన్యం విప్లవం.. మహోద్యమ శీలి. అడవి నుంచి ఆకాశానికి ఎగిసిన విప్లవ కెరటం అల్లూరి సీతారామారాజు. సమర నాదానికి ప్రతిరూపం..విప్లవ నినాదానికి ఆయువు. బ్రిటీషర్ల పాలిట సింహస్వప్నం. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి. కేవలం 27ఏళ్ళ వయసులోనే నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచిన అల్లూరి సీతారామరాజు అమాయ కులు,విద్యా విహీ నులైన కొండజాతి ప్రజలను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్‌ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజ పరచి,వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికికృషి చేయడమే తన విద్యుక్త ధర్మమని భావించాడు. భారతదేశ చరిత్రలో సన్యసించి, విప్లవ కారునిగా మారిన వారు అరుదు. అరవింద్‌ ఘోష్‌,అల్లూరి సీతా రామరాజు మాత్రమే మనకు కనిపిస్తారు.మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు అసలు చరిత్ర చూస్తే..ఆయన 1897వ సంవత్సరం జూలై 4వ తేదీన విజయనగరం జిల్లా పాం డ్రంగి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకట రామరాజు,తల్లి సూర్యనారాయణమ్మ. పశ్చిమ గోదావరిజిల్లాలోని మోగల్లు వారి స్వగ్రామం. అయితే, తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట సీతారామరాజు జన్మించాడు. గోదావరి పుష్కరాల సమయంలో ప్రబలిన కలరా వ్యాధి తో సీతారామరాజు తండ్రి 1908లో మరణిం చాడు.అప్పుడు రామరాజు ఆరోతరగతి చదువు తున్నాడు. తండ్రి మరణంతో కుటుంబం చాలా కష్టాలు పడిరది. స్థిరంగా ఒకచోట ఉండలేక నివాసం పలు ప్రాంతాలకు మార్చాల్సి వచ్చింది. చివరికి 1909వ సంవత్సరంలో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి సీతారామరాజు తమ కుటుంబం నివాసం మార్చారు. భీమవరంలో మిషన్‌ ఉన్నత పాఠ శాలలో చేరినా..తొలియేడాదే పరీక్ష తప్పాడు. ఆ తర్వాత కూడా చదువు విషయంలో సీతారామరాజు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొ న్నాడు. తండ్రి లేకపోవడం, పేదరికం, నివా సం తరచూ మార్చడం వంటి పరిస్థితులు సీతా రామరాజు చదువుపై చాలా ప్రభావం చూపిం చాయి. 1918 వరకు సీతారామరాజు కుటుం బం తునిలోనే నివాసం ఉంది. ఆ కాలంలో చుట్టుపక్కల కొండలు,అడవులు తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండే వాడు. వత్సవాయి నీలాద్రిరాజు దగ్గర జ్యోతి ష్యం,వాస్తు శాస్త్రం,హఠయోగం,కవిత్వం నేర్చు కున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి దగ్గర సంస్కృ తం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. పసితనం నుంచే రామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు,దానగుణం ఎక్కువగా ఉండేవి. తుని సమీపంలోని గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు కూడా చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యంలో పర్యటించాడు. దేవాలయాల్లో, కొండలపై, శ్మశానాలలో రాత్రిపూట ధ్యానం చేసేవాడు. సీతారామరాజు అంటేనే ఓ మహో జ్వల శక్తి అనే విషయం అతి తక్కువ కాలం లోనే స్థానికులకు,బ్రిటిష్‌వాళ్లకు బోధపడిరది. ఆయన బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఢీకొన్నాడు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సాధ్యమని నమ్మాడు. ఆ సమయంలో నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులైన తన అను చరులు, అతి తక్కువ వనరులతోనే సంగ్రామం లోకి దూకాడు. ఇలా..భారత స్వాతంత్య్ర సాయుధ పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఓప్రత్యేక అధ్యాయం. రెండు సార్లు ఉత్తర భారతదేశ యాత్ర సాగించాడు సీతారా మరాజు. తొలిసారి 1916 ఏప్రిల్‌ 26వ తేదీన బెంగాల్‌ వెళ్లారు. ఆతర్వాత లక్నోలో కాంగ్రె సు మహాసభకు హాజరయ్యాడు.కొంతకాలం కాశీలో ఉండి సంస్కృతం నేర్చుకున్నాడు. తొలి సారి యాత్రలో బరోడా,ఉజ్జయిని,అమృత్‌సర్‌, హరిద్వార్‌,బదరీనాథ్‌,బ్రహ్మకపాలం వంటి ప్రముఖ ప్రదేశాలు చూశాడు.బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు సీతారామరాజు.తొలియాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా నేర్చుకున్నాడు.గృహవైద్య గ్రంథము,మంత్రపుష్పమాల,అశ్వశాస్త్రము, గజశాస్త్రము, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను అధ్యయనం చేశాడు. 1918లో రెండోసారి ఉత్తరభారతయాత్రకు వెళ్లిన సీతారామరాజు బస్తర్‌,నాసిక్‌,పూనా, బొం బాయి, మైసూరు వంటి ప్రాంతాలు పర్యటిం చాడు. తిరిగొచ్చిన తర్వాత కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష నిర్వహిం చాడు. దీంతో రాజుకు అతీంద్రియ శక్తులు న్నాయని స్థానికులు భావించేవారు. అలూరి సీతారామరాజుకు తల్లి అంటే అపారమైన భక్తి. ఎక్కడికి వెళ్లాలన్నా ఆమెకు పాదాభివందనం చేసి బయలుదేరేవాడు. ఆ సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్‌ వాళ్ల దురాగతాలు, దోపిడీ లు, అన్యాయాలు ఎక్కువగా చోటుచేసుకునేవి. స్త్రీలపై అకృత్యాలు నిత్యకృత్యంగా ఉండేవి. పోడు వ్యవసాయం,అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగించే తెల్లదొరలు ఘోరాలకు పాల్ప డేవారు. తోటి గిరిజనుల కష్టాలు చూడలేక వాళ్లకు అండగా నిలవాలని సీతారామరాజు నిర్ణయించుకున్నాడు వాళ్లలో చైతన్యం తీసు కొచ్చాడు. సమయం దొరికనప్పుడల్లా హక్కుల గురించి చెబుతూ ధైర్యం నూరిపోసేవాడు. దీంతో,గిరిజనులు సలహాలు,వివాద పరిష్కా రాలకు సీతారామరాజును ఆశ్రయించే వారు. క్రమంగా దాదాపు 40గ్రామాల గిరిజనులకు రాజు నాయకుడైపోయాడు. యువకులకు యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ తంత్రాలు నేర్పి పోరా టానికి సిద్ధం చేశాడు. ఆక్రమంలో గంటందొర, మల్లుదొర,కంకిపాటి ఎండు పడాలు సీతారామ రాజుకు ముఖ్య అనుచరులైపోయారు. అంతేకాదు..దాదాపు 150మందిని మెరికల్లా తయారుచేశాడు సీతారామరాజు.1922 ఆగస్టు 19వ తేదీన మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి ప్లాన్‌ చేశాడు.1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపి వేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11తుపాకులు,5 కత్తు లు,1390 తుపాకీ గుళ్ళు,14బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి,రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. మరుసటిరోజే అంటే ఆగష్టు 23న కృష్ణదేవు పేట పోలీసు స్టేషన్‌ను ముట్టడిరచి, ఆయుధాలు తీసుకెళ్ళారు. అక్కడ 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు లభించాయి. వరుసగా మూడోరోజు అంటే.. ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అక్కడ పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయినా పోలీసు లను ఎదుర్కొని బందీగా ఉన్న వీరయ్య దొరను విడిపించారు. ఈ మూడు దాడులలో మొత్తం 26 తుపాకులు, 2వేల 500కు పైగా మందు గుండు సామాగ్రి సీతారామరాజు బృందానికి లభించాయి.వరుసదాడులతో ఉక్కిరి బిక్కిరైన బ్రిటీషు అధికారులు రాజు నేతృత్వంలోని విప్లవ దళాన్ని మట్టుబెట్టడానికి కబార్డు,హైటర్‌ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియ మించింది. సెప్టెంబర్‌ 24వ తేదీన సీతా రామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో దాడి చేసి, ఆ అధికారులిద్దరినీ హతమార్చింది. అది చూసి మిగిలిన పోలీసులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలను అధికారులు తీసుకువెళ్ళడానికి స్థానికులు మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చింది.1922 అక్టోబర్‌ 15వ తేదీన సీతారామరాజు దళం అడ్డతీగల పోలీసు స్టేషన్‌పై చేసిన దాడి చారిత్రాత్మకమైనది. ఇంతకుముందు చేసిన దాడులకు భిన్నంగా ముందే సమాచారం ఇచ్చి మరీ దాడి చేశారు. కానీ, అప్పటి అధికారులు ముందు జాగ్రత్తగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నా.. ఈ దళాన్ని ఎదుర్కోలేకపోయారు. కేవలం ఆయుధాలు వీరికి చిక్కకుండా దాచిపెట్టడం మినహా ఏమీ చేయలేకపోయారు. ఇక,అక్టోబర్‌ 19వ తేదీన రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌ను పట్టపగలే ముట్టడిరచినా ఆయుధాలు దాచి పెట్టడంతో దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రాన్ని నమ్మిన సీతారామరాజు..తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిరచి విజయం సాధించడంతో ఆయన సాహసాల గురించి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. కొన్ని సార్లు తను ఫలానా చోట ఉంటానని, కావా లంటే యుద్ధం చేయమని కూడా సీతారామ రాజు సవాలు విసిరేవాడు. ఈ పరిణామాలతో సీతారామరాజును వాంటెడ్‌ లిస్టులో చేర్చిన బ్రిటిషు ప్రభుత్వం అక్టోబర్‌ 23న సాండర్స్‌ సేవాని అనే అధికారి నేతృత్వంలో ప్రత్యేక సైనిక దళాలను పంపింది. సాండర్స్‌ దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థి తులు అనుకూలంగా లేవని సాండర్స్‌ వెనుదిరి గాడు. తమకు పట్టుబడిన బ్రిటిష్‌ పోలీసుల్లో భారతీయులు ఉంటే సీతారామరాజు దళం మందలించి వదిలేసేవారు. అదే ఏడాది డిసెంబర్‌ 6వ తేదీన అల్లూరి విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. సీతారామరాజు దళానికి, బ్రిటిష్‌ సైనికులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బ్రిటిష్‌ వాళ్లు శక్తివంతమైన ఫిరంగులు ప్రయోగించారు.ఆరోజు జరిగిన పోరాటంలో మొత్తం 12 మంది అల్లూరి దళ సభ్యులు మరణించారు. ఆ పరిణామం తర్వాత దాదాపు 4నెలలపాటు దళం కార్యకలాపాలు తగ్గిపోయాయి. సీతారామరాజు ఆ పోరులో చనిపోయాడని,విప్లవం ఆగిపోయిందని పుకార్లు పుట్టాయి. అయినప్పటికీ బ్రిటిష్‌ ప్రభుత్వం మాత్రం అల్లూరి సీతారామరాజును, ఆయన అనుచరులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. సరిగ్గా ఐదు నెలల తర్వాత 1923ఏప్రిల్‌ 17వ తేదీన ఒక్కసారిగా సీతారామరాజు కొద్దిమంది అనుచరులతో అన్న వరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఆయుధాలేమీ దొరకలేదు. అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. అక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడారు. ఆ సంభాషణ 1923 ఏప్రిల్‌ 21వ తేదీన ఆంధ్రపత్రికలో ప్రచురించారు. అప్పటినుంచి సీతారామరాజును ఎలాగైనా పట్టుకోవాలని బ్రిటిష్‌ ప్రభుత్వం గూఢచారుల ద్వారా ప్రయ త్నాలు సాగించింది. సీతారామరాజు దళం టార్గెట్‌గా బ్రిటిష్‌ ప్రభుత్వం మన్యానికి రూథర్‌ఫర్డ్‌ను కలెక్టర్‌గా నియమించింది. కృష్ణదేవుపేటలో సభ నిర్వహించిన రూథర్‌ ఫర్డ్‌..విప్లవకారుల ఆచూకీ వారం రోజుల్లో చెప్పకపోతే..ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కాల్చివేస్తామని హెచ్చరించాడు. ఇది తెలిసిన సీతారామరాజు..తాను లొంగిపోయి మన్యం ప్రజలకు విముక్తి కల్పించాలని భావించాడు. కానీ,స్థానిక మునసబు అందుకు ఒప్పుకోలేదు. దీంతో,1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా సీతారామరాజు తాను ఉన్న చోటు గురించి పోలీసులకు కబురు పంపాడని చెబుతారు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూండగా పోలీసులు సీతారామరాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసిన మేజర్‌ గుడాల్‌ వద్దకు సీతారామరాజును తీసుకెళ్లగా.. ఆయ నను ఓ చెట్టుకు కట్టేసి గుడాల్‌ కాల్చి చంపాడు. మే 8వ తేదీన సీతారామరాజు దేహాన్ని ఫోటో తీయించి దహనం చేశారు. ఆయన చితా భస్మాన్ని సమీపంలోని వరాహనదిలో కలిపేశారు. అలా..కేవలం 27 ఏళ్ళ వయసు లోనే అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడు. 1922 ఆగస్టు 22వ తేదీన ఆరంభమైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ పోరా టం 1924 జూలై మొదటివారంలో అంతమైంది.
ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు
శ్రీరామరాజు ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1745 నాటి చౌర్స్‌ (బెంగాల్‌) తిరుగు బాటు భారతభూమిలో తొలి గిరిజ నోద్యమం. 1922-24 మధ్య విశాఖ మన్యం లో జరిగినది తుది గిరిజన పోరాటం. కానీ మిగిలిన ఉద్యమాల చరిత్ర మీద ప్రసరించిన వెలుగు రామరాజు పోరు మీద కానరాదు. చోటానాగ్‌పూర్‌, రాంచీ పరిసరాలలో ముండా గిరిజన తెగ బ్రిటిష్‌ ప్రభుత్వం మీద తిరుగు బాటు చేసింది. దీనినే ఉల్‌గులాన్‌ అంటారు. బీర్సా ముండా ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఇది 1899-1900 మధ్య కొన్ని నెలలు జరిగింది.బీర్సా జీవితం,ఉద్యమం అద్భు తమైన విషయాలు. కానీ ఆయన ఉద్యమం పది నెలలు మాత్రమే సాగింది. రెండు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని సమీకరించి ఆ ఉద్య మాన్ని బ్రిటిషర్లు అణచివేశారు. కానీ రామ రాజు ఉద్యమం ఆగస్ట్‌ 22,1922న చింతపల్లి (విశాఖ మన్యం) పోలీసు స్టేషన్‌ మీద దాడితో మొదలై, మే 7,1924 వరకు ఉదృతంగా సాగింది.ఆ తరువాత కూడా మరో నెలపాటు రామరాజు ప్రధాన అనుచరుడు గాము గంతన్న ఉద్యమాన్ని నడిపించాడు. కానీ, దీనిని గుర్తించ డానికి గొప్ప ప్రయత్నమేదీ జరగలేదు.విశాఖ మన్య విప్లవం తెలుగువారి చరిత్రలో, ఆమాట కొస్తే భారత గిరిజనోద్యమ చరిత్రలోనే అద్భుత ఘట్టం. రామరాజు చరిత్ర, ఉద్యమం తనకు ప్రేరణ ఇచ్చిందని ఆదిలాబాద్‌ ప్రాంత గోండు ఆదివాసీ ఉద్యమనేత కొమురం భీం (1940) కూడా ప్రకటించాడు. మరణానంతరం రామ రాజు ఔన్నత్యాన్ని గాంధీజీ, సుభాశ్‌బోస్‌, భోగ రాజు పట్టాభిసీతారామయ్య, మద్దూరి అన్న పూర్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి వారంతా గుర్తించి నివాళులర్పించారు.నిజానికి సాంప్రదాయిక ఆయుధాలను వాడుతూ బ్రిటిష్‌ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడడం విశాఖ మన్యానికి కొత్త కాదు. అక్కడ 1790 తరువాత అలాంటి పరిణామాలు జరిగాయి. పోలీసు స్టేషన్లను దగ్ధం చేయడం కూడా ఉండేది. ద్వారబంధాల చంద్రారెడ్డి (1875 ప్రాంతం) ఇందుకు ప్రసిద్ధుడు. మన్యంలో పాత పద్ధతు లను రామరాజు యథా తథంగా తీసుకోక పోయినా కొన్నింటిని అనుసరించారు. ఆగస్టు 19, 1922న శబరి కొండ మీద అమ్మ వారికి అభిషేకం చేయించి రామరాజు ఉద్యమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఆగస్టు 22న చింతపల్లి స్టేషన్‌ మీద దాడి చేసి తుపాకులు ఎత్తుకు రావడంతో ఉద్యమం వాస్తవంగా మొదలైంది. 23వ తేదీన కృష్ణదేవిపేట, 24వ తేదీన రాజవొమ్మంగి స్టేషన్‌ను రామరాజు లక్ష్యంగా చేసుకున్నారు. మొత్తం 21 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే మద్రాస్‌ ప్రెసిడెన్సీని గడగడలాడిరచింది. ఇరవై ఒక్క తుపాకులు కలిగి ఉండడమంటే దాదాపు ఒక ఆధునిక పోలీసు పటాలం తయారైనట్టే.

మెస్రంల ఇలువేల్పు నాగోబా

‘‘ఆదివాసీల సంస్కృతి, వారసత్వ సంపదకు ప్రతిరూపంగా నిలిచే కెస్లాపూర్‌ నాగోబా జాతరకు తెలంగాణ ఆదివాసీ ప్రాంతంలో విశేషమైన ఆదరణ లభిస్తోంది.జాతరకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి చేరుకున్న మెస్రం వంశస్థులు నాగోబాకు మొక్కులు చెల్లించు కున్నారు. 1946లో కెస్లాపూర్‌ జాతరను సందర్శించిన మానవ పరిణామ శాస్తవ్రేత్త హెమన్‌డార్ప్‌ సూచనతో అప్పటి నిజాం ప్రభుత్వం గిరిజనుల సమస్యల పరిష్కార వేదిక కోసం ప్రత్యేకంగా దర్బార్‌ను ప్రారంభించింది. గిరిజనుల చెంతకు అధికారులు,ప్రజా ప్రతినిధులే వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని అప్పటి ప్రభుత్వం సూచించింది.యధావిధిగా 72 ఏళ్ళ నుంచీ ఏటా గిరిదర్బార్‌ జరుగుతూ ఉంటుంది’’
తెలంగాణాలోని ప్రసిద్ధ ఆదివాసీ యుల క్షేత్రాలలో కేస్లాపూర్‌ ఒకటి.చరిత్ర రిత్యా, పౌరాణిక రిత్యా కూడా ఇదొక పవిత్ర క్షేత్రం. ఇది ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండలం లోని కేస్లాపూర్‌ గ్రామంలో ఉన్న మెస్రం వంశానికి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇచ్చట ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయం.ఆదివాసీలు పుష్యమాసాన్ని పరమ పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ పుష్య మాసంలోఇచ్చట ప్రతి సంవత్సరం అతి పెద్ద జాతర జరుగుతుంది. ఈజాతర అమావాస్య రోజున ప్రారంభమవు తుంది.ఇది తెలంగాణ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతరగా చెప్ప వచ్చు. లక్షల మంది జనసం దోహం మద్య అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు జరిగే ఈ ఆదివాసీల కుంభ మేళాకు భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అదివాసీ భక్తులు,మెస్రం వంశీయులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.
రూ.ఐదు కోట్లతో ఆలయం కట్టించారు
మెస్రం వంశస్తులు నాగోబాను తమ ఆరాధ్యదైవంగా భావిస్తారు. నాగోబాను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని వీరి నమ్మకము. భారత దేశానికి స్వాతంత్య్రం రాకంటే పూర్వం నిజాం ప్రభుత్వకాలంలో తొలి సారిగా కేస్లాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న ఒక పుట్ట వద్ద 1942లో ఒక గుడిసెను నిర్మించి నాగోబా పూజలు చేయడం ప్రారంభిచారు.1956లో తొలి సారిగా నాగోబా దేవుడికి చిన్నగా గుడి కట్టారు.1995 లో సిమెంట్‌ ఇటుకలతో ఒక ఆలయాన్ని నిర్మించారు. కాలానికి అనుగు ణంగా ఆలయాన్ని భక్తుల తాకిడి,పెరిగే కొద్ది ప్రజాప్రతినిధులు,అధికారులు ప్రభుత్వ సహాకా రంతో 2000 లో ఆలయనిర్మాణం చేశారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌,మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌ గడ్‌,ఒడిషా మొదలగు రాష్ట్రల నుండి మెస్రం వంశస్తులతో పాటు ఆదివాసీలు,భక్తులు భారీ సంఖ్యలో నాగోభాను దర్శించు కోవడం జరుగు తుంది. మెస్రం వంశీ యుల కుటుంబాల సంఖ్య పెరగడం,వీరు ప్రతిసంవత్సరం సభలు సమా వేశాలు నిర్వహించి దేవాలయానికి సంబంధిం చిన ఆలయ నిర్మాణం గురించి 2011లో సంకల్పం పన్నారు.ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులను ఆలయ పీఠాధిపతి గ్రామ పటేల్‌ మెస్రం వేంకట్‌ రావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా సరికొత్త ఆలోచనతో ఒక విశాలమైన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయా నికి వచ్చారు. ఇందుకోసంప్రతి మెస్రం ఇంటి నుండి ప్రతి సంవత్సరం ఐదు వేలు చోప్పున, ప్రభుత్వ ఉద్యోగులనుండి పది నుండి పదిహేను వేలు, సర్పంచులు జడ్పీటీసిలు, యంపీ టీసిలు, మండల అధ్యక్షులు ఇలా ప్రజా ప్రతినిధుల నుండి ఏడు వేలు చోప్పున ఇలా ఐదు సంవత్సరాలు చందాలు వసూలు చేసి నిధులు సమకూర్చారు. దాదాపు రూ.5 కోట్ల డబ్బులు జమచేసి 2017లో నాగోబా, సతీదేవత ఆలయ నిర్మాణం ప్రారంభించారు.
ప్రణాళికాబధ్ధంగా పనులు ప్రారంభం
దేశ చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణం ఉండాలని కలలు కన్నారు సాకారం చేశారు.ఆధునిక సౌకర్యాలు,ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. నగరాల నుండి గ్రానైట్‌ రాళ్ళు తీసుకోవచ్చారు.నాగోబా ఆలయల నిర్మాణానికి, ఇంజినీర్లతో, తయారీ దారులతో సమావేశమై వారి సలహాలు సూచనలను పాటించారు. ఆలయానికి రాయిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి తెప్పించారు. ఆలయం చుట్టూ ప్రాకారం నాలుగు దిక్కులా గుడి రాజగోపురాల నిర్మాణం చేశారు. మండపం లోని ప్రతి రాతిస్థంభాలపై గోండ్వానా రాజ ముద్రను చెక్కిం చారు.ఆదివాసీల,ఆచార వ్వవహారాలను అబ్బుర పరిచే రితీలో అద్భుతమైన శైలిలో రాతి స్థంభాలను చెక్కించారు.నాగోబా విగ్రహాన్ని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ప్రాంతంలో లభించే ప్రత్యేకమైన శిలతో తయారు చేయించారు. ఆలయ గర్భగుడి ప్రధాన ముఖద్వారానికి ఇరువైపులా రెండు పాములు కలిసి ఏడు తలలు ఉండేలా చెక్కారు.
ఇలా ఆధునాతున హాంగులతో ఆలయాన్ని నిర్మించారు.ఆలయప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తిర్చిదిద్ది ఆలయం గోడలపై‘‘జై లింగో జై జంగో,’’జై గోండ్వానా’’ జై సేవా’’జై పెర్సాపేన్‌’’ చిహ్నాంతో అందంగా చెక్కిదిద్దారు, ప్రాంగణంలో ధ్వజస్థంభం,కోనేరు ఏర్పాటు చేశారు.గర్భగుడి ముఖ ద్వారానికి ఆంగ్ల అక్షరాలతో గోండిభాషలో దీనఖ్‌Gూుజు ునAవీఖచీ జుణపIR ూAణI్‌ఖRA హూునఖచీ దీన్‌ూఖR వీAజనహూ ఆని రాయించారు.తమ సంస్క్రతి సంప్రాదాయాలు చరిత్రను ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మాణం గావించారు. టేకు కట్టెలతో నాగోబా ప్రచార రథం చాలా అందంగా అద్భతంగా తయారు చేసి ప్రచారం ప్రారంభించారు.భక్తుల సౌకర్యం కోరకు మరుగుదొడ్లు,స్నానపు గదులు నిర్మాణం చేశారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది.
నూతన ఆలయ ప్రారంభోత్సవం,విగ్రహ పునః ప్రతిష్ఠాపన
ఆదివాసీలు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన నాగోబా ఆలయం ప్రారంభోత్సవ వేడుకకు ముస్తాబైంది.సర్వాంగ సుందరంగా తయారైన ఆలయంలో నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని 2022 డిసెంబర్‌ నెల 12 నుండి 18 వరకు మొత్తం ఏడు రోజులు పాటు వేడుకలు తమ ఆచారా సాంప్రదాయం ప్రకారం ఆదివాసీ వేద పండితులు అయిన కొడప వినాయిక్‌ రావు మహారాజ్‌,పురుషోత్తం మహారాజ్‌ సమక్షంలో మంత్రోచ్చారణలతో నవగ్రహ పూజలు చేసి గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కలశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు సోయం బాపూరావు,జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌,కలెక్టర్‌ సిక్తా పట్నాయిక్‌ ఐఎఎస్‌,ఐటీడీఏ ప్రాజెక్టు ఆధికారి వరుణ్‌ రెడ్డి ఐఎఎస్‌,ఆసిఫాబాద్‌ శాసన సభ్యులు ఆత్రం సక్కు,చైర్మన్‌ కోవాలక్ష్మీ,మాజీ మంత్రి గోడం నగేష్‌,ఐటీడీఏ చైర్మన్‌ కనక కల్కేరావుతోపాటు మెస్రం వంశీయులు, జిల్లా ప్రజాప్రతినిదులు,ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధానకార్యదక్షులు,ఆదివాసీలు పాల్గొన్నారు. ఎందరెందరో దేశ విదేశ చరిత్రాకారులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది.ఏడు రోజులు కూడా భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి విజయ వంతంగా పూర్తి చేశారు.
జాతర ప్రారంభం
ఈ జాతర పుష్యమాసంలో ప్రారంభమై నెలవంక కనిపించే రెండో రోజున మెస్రం వంశానికి చెందినవారు కేస్లాపూర్‌ గ్రామంలో సమావేశం నిర్వహించి నాగోబా దేవుని మొక్కి ఆ తర్వాత సిరికొండ మండలంలోని ఎన్నో తరతరాల నుంచి అంటే తాత ముత్తాతల కాలం నుండి కుండలు తయారు చేసి ఇచ్చే కుమ్మరి వద్దనుండి కుండలు తయారు చేసుకొని రావడం వీరి ఆచారం.వారు కూడా నియమ నిష్ఠలతో ఒకే ఆకారం గల మట్టి కుండలు తయారు చెయ్యడం విశేషం.ఆ తర్వాత మెస్రం వంశస్తులు పూజ కలశంతో పవిత్రమైన గోదావరి జలాలను నియమ నిష్ఠలు పాటిస్తూ క్రమశిక్షణతో కాలినడకన జన్నారం మండలం లోని కలమడుగు సమీపంలోని అస్తీన మడుగు లో పూజ చేసి పూజ నీరు తీసుకొని ప్రయాణం సాగిస్తారు.
ప్రత్యేక నైవేద్యం
కేస్లాపూర్‌ గ్రామానికి చేరి మహా వటవృక్షము వద్ద భాజాబజంత్రీలతో వారి పూర్వీకులకు ఖర్మకాండలు నిర్వహించి నాగోబాదేవునికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు.మెస్రం వంశ ఆడపడుచులు,మహిళలు,అల్లుళ్ళు అందరు ఆలయాన్ని శుబ్రపరిచి పూజ నిర్వహించి పెళ్లిఅయిన వధువును పరిచయ కార్యక్రమం నిర్వహిస్తారు.దినినే భేటింగ్‌ అంటారు.
వంద కిలోమీటర్లు కాలినడక
మెస్రం తెగకు చెందిన కోడళ్ళు ఎడ్లబండి వెనుకాల కాలినడకన బయలుదేరుతూ వెదు రుతో తయారుచేసిన కొత్త గుల్లలో పూజా సామాగ్రి తీసుకుని బండి వెనుకాల కాలినడకన కేస్లాపూర్‌ చేరుకుంటారు.వీరు ముఖం నిండా తెల్లని వస్త్రాలతో ముసుగు ధరించి నాగోబా పూజలో పాల్గొంటారు. కలశంలో తీసుకువచ్చిన శుద్ధమైన గంగాజలంతో నాగోబా దేవుని, మరియు ఆలయాన్ని శుభ్రపరిచి సంగీత వాయిద్యా పరీకరాలైన డోలు, తుడుం,పిప్రే, కాలికోమ్‌,మొదలగు భాజాబజంత్రీలు వాయిస్తూ దేవుని ప్రత్యేక పూజలు చేసి నవధాన్యాలు, పాలు, బెల్లం మరియు కొత్త తెల్లటి వస్త్రాన్ని పుట్టపైన ఉంచి గ్రామ పటేల్‌,కటోడా, దేవారి, మరియు కోత్వాల్‌ మొదలైన వారు పూజ నిర్వహిస్తారు.అదే రోజు సాక్షాత్తూ నాగోబా దేవుడు ప్రత్యేక్షమవుతాడు అని ఆదివాసుల నమ్మకం.ఈ కార్యక్రమంలో మెస్రం వంశస్తుల తో పాటు,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్గఢ్‌,కర్నాటక, జార్ఖం డ్‌,మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మొద లగు రాష్ట్రాలకు చెందిన గిరిజనులు, గిరిజనే తరులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
స్థల పురాణం
ఈ ఆలయ నిర్మాణం,నాగోబా విగ్రహానికి సంబందించిన కథ,పూర్వం మెస్రం వంశానికి చెందిన నాగాయి మోతి అనే ఒక రాణికి కలలో ఒక పాము వచ్చినీ కడపున జన్మిస్తానని చేప్పి అదృశ్యం అయ్యాడట.ఆమె గర్భం దాల్చి కొన్ని నేలల తర్వాత ఆమె కడపున నిజంగా పాము (నాగోబా దేవుడు) జన్మించడంతో ఆపాముకు తన తమ్ముడి కూతురు గౌరిదేవితో వివాహం జరిపించి ఆ తర్వాత అందరు కలిసి తీర్థ యాత్రకు గోదావరి వెళ్ళగా ఆ పాము మనిషి రూపంలో మారిందట. ఆశ్చర్య పోయిన గౌరి దేవి అచటి నుండి కేస్లాపూర్‌ చేరుకుందట. అంతలోనే మళ్ళి ఆ మనిషి పాము రూపంలో గౌరి దేవిని వెతుక్కుంటూ కేస్లాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న పుట్టలో వెళ్ళిపోగా ఆ గ్రామ స్థులు ఆపుట్టకు పూజలు చేయడం మొదలు పెట్టారట, అలా మెస్రం వంశస్తులే అప్పటి నుండి ఆలయానికి ధర్మకర్తలుగా వుంటూ ఆలయాన్ని అభివృధ్ధి పరిచి పూజలు నిర్వహి స్తున్నారు.
కేస్లాపూర్‌లో దర్బార్‌
1941 సంవత్సరం నిజాం నవాబు కాలం నుండి ఆదివాసుల సమస్యలు-వాటి పరి ష్కారాల మీద కేస్లాపూర్‌ లో దర్బార్‌ నిర్వహిస్తు వస్తున్నారు, కాని గత 2019 సంవత్సరం నుండి కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండడంతో గిరిజన దర్బార్‌కు కళ తప్పింది. నిజాంనవాబు 1941లో ఆదివాసుల స్థితిగ తులు వారి సమస్యలను పరిష్కరించాలని ఇంగ్లాండ్‌ కు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌ డార్ఫ్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించింది. ఆదివాసుల చారిత్రక విశేషాలను అధ్యయనం చెయ్యా లనుకున్న పరిశోధకులు,చరిత్ర నిపుణులు, ఉన్నతస్థాయి అధికారులు, విదేశీయులు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి నాగోబా దేవుని పూజా నిర్వహిస్తారు.శతాబ్దం నాటి పౌరాణిక ప్రమాణాలను బట్టి కేస్లాపూర్‌ నాగోబా దేవుని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తున్నది.కేస్లాపూర్‌ నాగేంద్రుడి పూజ అనంతరం మెస్రం తెగవారు ఉట్నూర్‌ మండలంలోని శ్యాంపూర్‌ కు చేరుకొని నందిశ్వరుని(బోడుందేవుడు) పూజ నిర్వహించి, తిరిగి కేస్లాపూర్‌ చెరుకోని అక్కడి నుండి వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు.ఈ ఆదివాసుల జాతరతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నార్నూర్‌ మండలోని ఖాందేవుని జాతర,బేల మండలం సదల్‌పూర్‌లోని భైరం దేవుని జాతర,తిర్యాని మండలంలోని దంతన్‌ పల్లి భీమ్యక్‌ జాతర, మందమర్రి మండలంలోని బొక్కలగూడ కోవామొకాషీ జాతర,సిర్పూర్‌ (యు) మండలంలోని మహాదేవుని జాతర , కెరామెరి జాతర మొదలగు జాతరలకు నిలం మన ఉమ్మడి ఆదిలాబాదు.
ఎలా చేరుకోవచ్చు
ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ జిల్లా నుండి గుడిహత్నూర్‌ మీదుగా బస్సులో లేదా ప్రయివేటు వాహానాలలో ముత్నూర్‌ చేరుకోవాలి. మంచిర్యాల,ఆసిఫాబాద్‌ జిల్లా వాసులు బస్సులో గాని ప్రయివేటు వెహీకిల్‌ లోగాని ఇంద్రవెల్లి మీదుగా ముత్నూర్‌ చేరుకోవాలి ముత్నూర్‌ నుండి కేస్లాపూర్‌ నాగోబా దేవాలయం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
(వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక, ఉపన్యాసకులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇంద్రవెల్లి ఆదిలాబాద్‌)`9491467715.-రాథోడ్‌ శ్రావణ్‌

5వ షెడ్యూల్‌లో నాన్‌ షెడ్యూల్డ్‌ ఆదివాసీలకు దిక్కేది?

వజ్రోత్సవ భారతావనిలో సమస్త ప్రజా నీకం అభివృద్ధి పేరుతో ముందుకు సాగు తుంటే రాజ్యాంగ రక్షణలు ఉండి అమలుకు నోచుకోని ఆదివాసీలు మరోపక్క అటవీ ఫలసాయంపై నిర్బం ధాన్ని ఎదుర్కొంటూ దుర్భర జీవితాన్ని గడుపుతు న్నారు. స్వాతంత్య్ర ఫలాలకు సుదూరంలో 5వ షెడ్యూల్డు హోదా పొందని ఆదివాసీ గూడేలు ఉమ్మడి రాష్ట్రంలో 805 దాకా ఉన్నాయి. అసలు వీరి జీవనానికి భరోసా ఏది? వీరికి కనీస హక్కు లేమిటి?వీరిపై పాలకులు వైఖరేమిటి ? ప్రజాస్వా మిక పాలనలో వీరికి ఏపాటి న్యాయం జరుగు తోంది? అనేవి సమాధానం లేని ప్రశ్నలు.- గుమ్మడి లక్ష్మీ నారాయణ
వాళ్లంతా గిరిజనులు.రాజ్యాంగపరం గా గుర్తింపుపొందినాసరే..వాళ్లకు ఏజెన్సీలోఉన్న రాయితీలు అందడంలేదు.కనీసంరిజర్వేషన్లు కూడా వర్తించడంలేదు. అభివృద్ధి విస్తరణలో తమ హక్కు ల్ని కోల్పోతున్న గిరిపుత్రుల దుస్థితి ఇది.గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా,కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికా ర్డులలో నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉం డటమే దీనికి కారణం.రాజ్యాంగంలో ప్రత్యేక హక్కు లున్నా,ఇలా ప్రభుత్వ రికార్డుల కారణంగా గిరిజ నులు ఆహక్కులను,చట్టాల నుంచి రక్షణను కోల్పో తున్నారు.మరి,కొన్ని గ్రామాలు ఏజెన్సీ ఏరియా రికార్డుల్లో ఎందుకు లేవు ?ఎవరు తొలగించారు, ఎందుకు తొలగించారు?
ఏజెన్సీ, షెడ్యూల్డ్‌ ఏరియా అంటే…
బ్రిటిష్‌ పాలనలో…గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు,ఆచారా లు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామా లను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత,ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొన్నారు.అందుకోసం ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌-1874 అమల్లోకి తెచ్చారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమితులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్యవేక్ష ణలో ఈ ప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్‌ పరిపాలనలో ఉన్న ప్రాంతాలు కావడంతో ఏజెన్సీ గా పిలవడం మొదలైంది. ఇప్పటికీ అదే పేరు కొనసాగుతోంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజనగ్రామాలను అయిదో షెడ్యూ ల్‌లో చేర్చారు. అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఇలా రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌లో చేరని గిరిజనులు నివాసం ఉండే గ్రామాలను నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలు అం టారు.
2011జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 59,18,073 మంది గిరిజనులు ఉన్నారు.రాష్ట్ర జనాభాలో 6.6శాతం.షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసించే తెగలు 30.మైదాన ప్రాం తాలలో నివసించే తెగలు 5కలిపి మొత్తంగా 35 ఉన్నాయి. గిరిజనులలో 70శాతం మంది షెడ్యూ ల్డ్‌ ఏరియా ప్రాంతంలో నివసిస్తుండగా,మరో 30 శాతంమైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు. రాష్ట్రం లోని షెడ్యూల్డు ప్రాంతం31,485చ.కి.మీ. రాష్ట్రా లల్లోని ఉమ్మడి జిల్లాలపరిధిలో ఆదిలాబాద్‌, విజ యనగరం,వరంగల్‌,ఖమ్మం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,విశాఖపట్నం,శ్రీకాకుళం, మహ బూబ్‌ నగర్‌ (9)జిల్లాల్లోని 107మండలాల్లో షెడ్యూల్డ్‌ ప్రాంతము విస్తరించి యున్నది. వీటిలో 46మండలాల్లో పూర్తిగాను,61మండలాల్లో పాక్షి కంగాను ఆదివాసీలు నివసిస్తున్నారు. ఇందులో 5,948 గ్రామాలు రాష్ట్రపతి గెజిట్‌ లో గుర్తించబ డినవి. ఇంకా నాన్‌-షెడ్యూల్డు గ్రామాలుగా మిగిలి నవి 805. వీటికి షెడ్యూల్డ్‌ గుర్తింపు లేదు.1950 రాజ్యాంగ గెజిట్లో షెడ్యూల్డు గ్రామాలను గుర్తించే ప్రభుత్వ అధికారులు దట్టమైన అటవీ ప్రాంతా లలోకి వెళ్ళేమార్గం లేక గుర్తించలేదు. అది ఒక కారణమైతే, సాంకేతికలోపంగా భావించిన ప్రభు త్వం1980 దశకంలో అప్పటి ప్రభుత్వం గిరిజన జిల్లాల్లో సర్వేచేయించింది. ఆసర్వే ప్రకారం మిగిలిన గ్రామాలు
జిల్లాలు నాన్‌-షెడ్యూల్డు గ్రామాలు
ఆదిలాబాద్‌ 164
విజయనగం 170
వరంగల్‌ 87
ఖమ్మం 18
తూ.గోదావరి 44
ప.గోదావరి 10
విశాఖపట్నం 55
మహబూబ్‌ నగర్‌ 18
శ్రీకాకుళం 240
మొత్తం 805
ఈ 805 గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చమని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఫైలు పంపిం చినప్పటికీ ఆమోదం పొందలేదు. ఇలా 72 ఏళ్ల నిరీక్షణలో..రాష్ట్రంలో 78.24శాతం గ్రామాలకు నేటికి కరెంటు సౌకర్యం లేదు.68.8 శాతం గిరిజన విద్యార్థులు ప్రాధమిక విద్యలోను, ఉన్నత విద్యలోను వెనుకబడి ఉన్నారు. షెడ్యూల్డు ఏరియా విద్యార్థుల అక్షరాస్యత శాతం పురుషులది 17% మహిళలది 8.68% గా వున్నది. నేటికి 90శాతం గిరిజనులు కనీస వసతి సౌకర్యాలు లేక జీవిస్తున్నారు. 49 శాతం గిరిజనులు పౌష్టికాహార లోపంతో జీవిస్తు న్నారు.65% గిరిజనులు దారిద్య్రపు రేఖకు దిగువన జీవిస్తున్నారు. ఆదివాసీ మహిళలలో ప్రతి 1000 మందికి 80మంది ప్రసవ సమయంలో బిడ్డతో సహాతల్లి కూడా మృత్యువాత పడుతున్నారు. రాష్ట్రం లో ప్రసవ సమయంలో చనిపోయో మహిళల సగటు 3.65%గా వుంది. శిశు మరణాల రేటు రాష్ట్రంలో53శాతంగా వుండగా,ఒక్క ఆదిలా బాద్‌ ఏజెన్సీలోనే 63శాతంగా వుంది. రాష్ట్రంలో 90 శాతం మంది ఆదివాసీ గిరిజనులు రక్తహీన తతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో 9జిల్లాల్లో ఆదివాసీల అభివృద్ధికై సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐ.టి. డి.ఏ) లు పనిచేస్తున్నా నేటికీ నాన్‌-షెడ్యూల్డు గూడే లకు ఐ.టి.డి.ఏ.ల నుండి ఆర్థిక ఫలాలు అందక సతమత మౌతున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాణంలో దేశం లోని ఆదివాసీల సామాజిక పరిస్థితిని మెరుగు పరుచుటకు ప్రత్యేక పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో గిరిజనులు కోసం నిర్దేశించిన 5వషెడ్యూల్‌లో ప్రత్యేక విధివిధా నాలు, షెడ్యూల్డు ప్రాంతాల పరిపాలన విధానం రాజ్యాం గంలో షెడ్యూల్డు క్రింద పేర్కొనబడిన రాజ్యాంగ అధికరణం 244 వివరిస్తుంది. గిరిజన సంక్షేమం మరియు అభివృద్ధి విషయాలపై సలహా లు ఇచ్చేం దుకు గిరిజన శాసన సభ్యులతో కూడిన సలహా మండలి ఏర్పాటు జరుగుతుంది.పార్లమెంటు లేదా శాసనసభ్యులు చేసే చట్టాలు ఏజెన్సీ ప్రాంతాలలో అమలు చేసే విషయంలో రాష్ట్ర గవర్నర్‌కు అధి కారం ఉంటుంది.గవర్నర్‌ ఆమో దించిన నిబంధ నలు రాష్ట్రపతి ఆమోదంపై అమ లులోకి వస్తాయి. గవర్నరును సంప్రదించిన తరు వాత ఏప్రాంతా న్నైనా షెడ్యూల్డు ప్రాంతాలుగా ప్రకటించవచ్చు. అలా ప్రకటించక పోవడం వలన సుమారుగా రెండు లక్షలమంది ఆదివాసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ,సంక్షేమ అభివృద్ధి ఫలాలను పొందలేక పోతున్నారు.1939 సంవత్సరాల ముందు షెడ్యూ ల్డు ప్రాంత ఆదివాసీ గిరిజనులు ఎలాంటి పరిస్థితు లలో ఉండే వారో స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లకు కూడా నాన్‌-షెడ్యూల్డు ఆదివాసీలు అదే స్థితిలో వున్నారు.నాన్‌ షెడ్యూల్డు ఆదివాసీ గిరిజనులకు స్వాతంత్య్రం ఇంకా రాలేదేమో?వారికి రాజ్యాం గం ఇంకా అమలు కావలసి వుంది. షెడ్యూల్డు ఏరియాలలో గత31సం.లుగా 805 గ్రామాలలో రెండులక్షల మంది ఆదివాసీలు తమ హక్కుల గురించి పాలకుల దృష్టికి తెచ్చినా ఫలించడం లేదు. 2005లో ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు కమిటీ సూచనలు (74)ఆమోదిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జి.ఓ.నెం.1049సహితం నాన్‌-షెడ్యూల్డు గ్రామాలను షెడ్యూల్డు ప్రాంతంలో కలపాలనే చూపుతున్నాయి. ఇన్నాళ్ళుగా 5వ షెడ్యుల్డు సాధన కమిటి మరియు వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు,సంస్థలు ఒత్తిడి తేగా కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మేల్కొంది. 2001 జనాభా వివరాలు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఫైలును తిరిగి రాష్ట్రగిరిజన సంక్షేమశాఖకు తిరిగి పం పింది. ఈలోగా ఎన్నోసార్లు మంత్రి మండలి సమా వేశాలు జరిగాయి. కానీ మన ప్రతిపాదన మాత్రం కేబినెట్‌ మంత్రిమండలి ఆమోదానికి పెట్టడం లేదు. ఎందుకంటే 5వషెడ్యుల్డులోని నాన్‌ -షెడ్యూ ల్డు గూడెంలలో అపారమైన ఖనిజ సంపద బొగ్గు నిక్షేపాలు, అల్యూమినియం బాక్సైట్‌, సున్నపురాయి గ్రానైట్స్‌, ఇసుక మొదలగు ఖనిజ సంపదతో నిండి వున్నాయి. అందువలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదివాసీ గూడేలను షెడ్యూల్డు ప్రాంతంగా గుర్తించినట్లయితే 5వషెడ్యూల్డు ఏరియాలోని ఆది వాసులకు సర్వహక్కులు ఉంటాయి గనుక అక్కడి ఖనిజ సంపదను వెలికి తీయాలంటే ఫెసా చట్టం ప్రకారం ఆదివాసీలతో గ్రామసభ నిర్వహించి ఆ సభల తీర్మానం పొందిన తరువాతనే ఖనిజాలను వెలికి తీసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ రాజ్యం నాన్‌-షెడ్యూల్డు ప్రాంతాలను షెడ్యూల్డు ప్రాంతంగా గుర్తించడంలేదని అనుకోవచ్చు. ఆదివా సీల సంక్షేమం కోసం పాటుపడవలసిన ఈ రాజ్యం ఆదివాసీల మనుగడను పూర్తిగా అంతం చేసే విధంగా వ్యవహరిస్తుంది. అంటే ఆదివాసీ ప్రజా నీకం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంకాదా? వారి పట్ల ఈ రాజ్యాంగానికి ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు ? 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ప్రధానంగా భూమి సమస్య షెడ్యూల్డు ఏరియాలో అమలయ్యే 1/70 వంటి చట్టాలు ఉన్నప్పటికి ఈ ప్రాంతాలలో 7.50 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమై ఉన్నది.
షెడ్యూల్డు హోదాలేని ప్రాంతాలలో ఆదివాసీ భూముల పరిస్థితి అగమ్యగోచరం. ఈ చట్టం అమలులో లేనందున ఆదివాసీలు నష్టపో తున్నారు. కొన్ని వేల ఎకరాల భూములు భూస్వా ముల చేతులలోకి వెళ్ళినవి. భూవివాదాలు సివిల్‌ కోర్టు పరిధిలోకి వస్తున్నందున భూస్వాములు, ధనికులు, గిరిజనేతరులు అమాయక ఆదివాసీలను కోర్టుల చుట్టూ తిప్పుతూ ఆర్ధికంగా దివాళా తీయి స్తున్నారు. ఇక రెవెన్యూ, పోలీసుల గురించి చెప్పన వసరం లేదు.నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోని భూమి సమస్యలు ఈ విధంగా ఉన్నాయి.
‘ముఖ్యమంత్రులే ఉల్లంఘిస్తున్నారు’
రాజ్యాంగంలో ఆర్టికల్‌244(1) ఆర్టికల్‌, అయిదవ షెడ్యూల్‌ ద్వారా ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులున్నాయని, అయితే వీటిని అమలు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు విఫలమయ్యారని ఉమ్మడిరాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శిగా పని చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌శర్మ అభిప్రాయపడుతున్నారు.గిరిజనుల హక్కులు,సంక్షేమం,నాన్‌షెడ్యూల్డ్‌ ఏరియాల అంశా లను ప్రస్తావిస్తూ…తెలంగాణా సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌లకు ఆయన లేఖలు రాశారు. ‘‘ప్రాజెక్టుల విషయంలో పీసా,అటవీ హక్కుల చట్టాల కింద గ్రామసభలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని రెండు ప్రభు త్వాలు గిరిజనులకు ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా రెండు రాష్ట్రాలలో ప్రైవేట్‌ వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నారు. ప్రభుత్వాలు గిరిజనేతరులతో కుమ్మక్కు అవుతున్నట్లు కనిపిస్తున్నది.ఈ విష యా లను గుర్తించి,మీరు తగినచర్యలను తక్షణమే తీసు కుంటారని ఆశిస్తున్నాను’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

  1. నిరుపేదలకు చెందవలసిన‘డి’పట్టాలు, ధనికులు భూస్వాములు పొందుతున్నారు.
  2. బంజరు భూములను ధనికులే ఆక్రమించు కుంటున్నారు.
  3. గిరిజనుల నుండి గిరిజనేతరుల చేతుల్లోకి పోతున్న క్రమం తనాఖా-స్వాధీనం ‘‘డి’’ పట్టా భూములు
  4. ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్నా పట్టాలు రాని భూములు.
  5. గిరిజనులకు పట్టాలు మంజూరైనా భూములు అప్పగించని కేసులు.
  6. గిరిజనుల పేరున ఇతరులు అనుభవిస్తున్న (సీలింగ్‌ బంజరు) భూములు.
  7. ఒక గిరిజనుడు సాగు చేస్తుండగా వేరొకరికి పట్టాలు మంజూరైన కేసులు.
  8. గిరిజనేతరుల భూములను సాగు చేస్తున్నా వర్తించని సాగు కౌలు హక్కులు.
  9. జిరాయితి భూమి సాగు చేస్తున్న రెవెన్యూ రికార్డులకు ఎక్కని గిరిజనులు.
  10. గిరిజనేతరులు తప్పుడు ఇంజక్షన్‌ డిక్రీలు తెచ్చి భూముల నుండి గిరిజనులను దౌర్జన్యంగా వెళ్లగొట్టేసే కేసులు.
  11. సర్వే స్టేట్మెంట్‌ వివాదాలు
    ఇలా చాలాభూవివాదాలు,నాన్‌-షె డ్యూల్డు గ్రామాలలో ఉన్నాయి. వీటిని పరిష్కరిం చుకోవాలంటే కోర్టు, రెవెన్యూ, పోలీస్‌ శాఖలపై అవగాహన ఉండాలి. ఇవేవి ఆదివాసీలకు తెలియ నందున గిరిజనేతరుల ఆధిపత్యం కొనసాగు తున్నది. భారత రాజ్యాంగంలో 5వషెడ్యూల్డు (1) పేరా ప్రకారం విద్య, ఉద్యోగ అవకాశాలన్నీ స్థానిక ఆదివాసీలచే భర్తీ చేయాలనిజి.ఓ.నెం.275 ను 1986లో తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవరిస్తూ 2000లో జనవరి 10న జి.ఓ.నెం.03 ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగా లన్నీ స్థానికఆదివాసీలకే రిజర్వు చేయబడుతు న్నాయి. కానీ నాన్‌-షెడ్యూల్డు ఏరియా ఆదివాసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో అన్యాయం జరుగు తోంది. విద్య,ఉద్యోగ అవకాశాలు లేక ఆదివా సీలు నిరాశ్ర యులవుతున్నారు.కాగాఈ జీవో 3 గిరిజనేత రుల కారణంగా 2020ఏప్రిల్‌ 20నుంచి సుప్రీం కోర్టులో స్టే విధించ బడిరది.
    అధికరణలు330,332,334 ప్రకారం పార్లమెంటు నుండి క్రింది స్థాయి వార్డు సభ్యుల వరకు షెడ్యూల్డు ఏరియాలో ఆదివాసీలకే చెందు తాయి. కానీ, నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోని వీరు పరుల పాలనలో మగ్గుతున్నారు. వీరు ప్రత్యేకమైన సంస్కృతి,ఆచార,సంప్రదాయాలు, జీవన విధానం కలిగినను స్థానికేతరుల పాలనలో దోపిడికి గురౌ తున్నారు. కేవలం అటవీ ఫలసాయం, పరస్పర వస్తు మార్పిడితో సహజీవనం సాగించే ఆదివా సీలు నేటికి నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోఉండడం, సవరించిన చట్టాల వల్ల అటవీ అధికారుల దౌర్జ న్యాలు పెరుగుతున్నాయి. అటవితల్లి గుండెల్లో జీవించే ఆదివాసులకు బతుకు భారం అవుతుంది. వారు షెడ్యూల్డు ఏరియా హక్కులకు నోచుకొనేది ఎప్పుడు?కనీసం ప్రజా సమస్యలపై పోరాడే ప్రజా సంఘాలు, మానవ హక్కుల, పౌరహక్కుల సంఘా లు, ప్రధాన ప్రతిపక్ష, రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు దీనినిగూర్చి మాట్లాడే పరిస్థితి లేదు. షెడ్యూల్డు హోదాకోసం నాన్‌-షెడ్యూల్డు ఏరియా గ్రామాల ఆదివాసీలు సంఘటితమై మరో చారిత్రక పోరాటానికి సన్నద్ధంకాకపోతే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకమే!-
    వ్యాసకర్త : ఆదివాసీ రచయితల వేదిక,సెల్‌ : 9491318409

ఈ పాపం ఎవరిదీ..?

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానొకటి ఢీకొన్న ఘటన యావత్‌ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమా దాల్లో ఒకటిగా నిలిచిన ఈ దుర్ఘటన.!ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటి వరకు కచ్చితమైన కారణాలు తెలియ రాలేదు. అయితే సిగ్నల్‌ లోపం కారణంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మరో ట్రాక్‌లోకి ప్రవేశించడంవల్లే ఈపెను విషా దం సంభవించినట్లు రైల్వేశాఖ ప్రాధమిక దర్యాప్తు లో తేలింది.ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.ఈ ప్రమాదంలో 280కి పైగా ప్రయాణికులు మరణించగా మరో 1000 మంది వరకు గాపడ్డారు. రైలు ప్రమాదాలకు సంబంధించి దేశ చరిత్రలోనే భారీగా ప్రాణ నష్టాన్ని కలిగించిన ఈ ఘటనలో పలు అనుమానాలు తలెత్తున్నాయి.
ఒక్క ప్రమాదం..అనేకప్రశ్నలు.. మరె న్నో అనుమానాలు..ఒడిశాలో ఘోర రైళ్ల ప్రమా దం యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మూ డు రైళ్లు ప్రమాదానికి గురికావడం, భారీగా ప్రాణ నష్టం సంభవించడం దేశ ప్రజలకు షాక్‌కి గురి చేసింది.అంతా నిమిషాల్లోనే ఘోరం జరిగి పో యింది.ఏం జరిగిందో తెలుసుకునేలోపే వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంతటి ఘోర రైలు ప్రమాదానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? తప్పు ఎవరిది?కవచ్‌ వ్యవస్థ ఉంటే ఇంతటి ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదా? రైల్వే శాఖ ఏమంటోంది..కవచ్‌ వ్యవస్థ ఉండి ఉంటే ఒడిశా రైలు ప్రమాదం జరిగేది కాదని ప్రతిపక్షాలు అంటుంటే,కవచ్‌ సిస్టమ్‌ ఉన్నా ఈ ప్రమాదాన్ని ఆపేది కాదని రైల్వేశాఖ అధికారులు అంటున్నారు. అసలు ఒడిశారైలు ప్రమాదానికి కారణాలు ఏంటి? ఒక్క ప్రమాదంలో మూడు రైళ్లు ఇన్వాల్స్‌ అయి ఉండటం ఏంటి?అన్న ప్రశ్నకు సమాధానం దొర కడం లేదు. అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్న ఇండియన్‌ రైల్వేస్‌ కూడా ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడం లేదు. సిగ్నలింగ్‌ ఫెయిల్యూల్‌ అని ఒకసారి,ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ లో మార్పువల్ల ప్రమాదం జరిగిందని మరోసారి చెబుతున్నారు.సిగ్నలింగ్‌ ఫెయిల్యూర్‌ అని ప్రాథమిక దర్యాఫ్తులో తేల్చారు. ఇంకా పూర్తి స్థాయి దర్యాఫ్తు కొనసాగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. ఇలా అనేక రకాల ఊహాగానాలు, ఎన్నో అంతు చిక్కని అనుమానాలకు కేరాఫ్‌ గా మారింది ఒడిశా రైలు ప్రమాదం.ఒడిశా ఘోరరైలు ప్రమాదం విష యంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. రైలు ప్రమాదాల నివారణ కోసం కవచ్‌ వ్యవస్థ తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకున్న కేంద్రం.. రైలు ప్రమాదాలు జరక్కుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని ప్రశ్నిస్తున్నారు. బాలాసోర్‌ ప్రాంతంలో కవచ్‌ సిస్టమ్‌ లేదని, ఒకవేళ కవచ్‌ ఉంటే ప్రమాదమే జరిగి ఉండేది కాదంటున్నారు. వందలమంది ప్రాణాలుకోల్పోయే పరిస్థితి ఉండేది కాదంటున్నారు ప్రతిపక్షాల నేతలు. అయితే, ఒడిశా రైలు ప్రమాదానికి,కవచ్‌ వ్యవస్థకు సంబంధమే లేదని కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌. కవచ్‌ ఉన్నా ఒడిశారైలు ప్రమాదం జరిగేది ఆయన తేల్చి చెప్పారు. సిగ్నలింగ్‌ సిస్టమ్‌ ఫెయిల్యూర్‌ తో పాటు ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ కారణంగా ప్రమాదం జరిగిందంటున్నారు.ఈ రెండిరటికి కవచ్‌ వర్తించదని ఆయన స్పష్టం చేశారు.
అసలు కవచ్‌ ఏంటి? కవచ్‌ సిస్టమ్‌ రైల్వే ప్రమాదా లను ఎలా అరికడుతుంది?
ఇప్పుడు ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ఈ కవచ్‌ సిస్టమ్‌ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఉన్నప్పుడు అవి ఢీకొనకుండా ఆపేందుకు రైల్వే శాఖ కవచ్‌ టెక్నాలజీని 2022లో తీసుకొచ్చింది. కవచ్‌ టెక్నాలజీ ఆటోమేటిక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్రం రూ.400కోట్లుఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని తీసుకొ చ్చింది. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది.అలాగే రైళ్లను ఈ టెక్నాలజీ వెనక్కి నడిపి స్తుంది. అందువల్ల రైళ్లు ఢీకొనవు.రెడ్‌ సిగ్నల్‌ పడినా లోకోపైలెట్‌ పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళితే ఎదురుగా ఇంకో రైలు వచ్చినప్పుడు ఆటో మేటిక్‌గా రెండు రైళ్ల స్పీడ్‌ని తగ్గించి ప్రమాదం జరక్కుండా చూస్తుంది ఈకవచ్‌ సిస్టమ్‌.ట్రాక్‌ బాగో లేకపోయినా,టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ ఉన్నా ఆటో మేటిక్‌గా బ్రేకులేస్తుంది ఈకవచ్‌ సిస్టమ్‌.వంతెనలు,మలుపుల దగ్గర రైలు స్పీడ్‌ని తగ్గిస్తుంది.
కవచ్‌..ఓహై టెక్నాలజీ.అందులో డౌట్‌ లేదు. రైలు ప్రమాదాలను అరికడుతుందని చెప్పడంలో సందే హమే లేదు.అయితే,ఒడిశా రైలు ప్రమాదం మాత్రం ఈ కవచ్‌ సిస్టమ్‌ పరిధిలో జరగలేదని చెబుతోంది రైల్వేశాఖ. కవచ్‌ సిస్టమ్‌..ఒకే ట్రాక్‌ పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు మాత్రమే పని చేస్తుందని వివరి స్తున్నారు. కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు.. సిగ్నలింగ్‌ వ్యవస్థ ఫెయిల్యూర్‌ కారణంగా లూప్‌ లైన్‌ లోకి వెళ్లిందని..అప్పటికే లూప్‌ లైన్‌లో గూడ్స్‌ రైలు ఆగి ఉంది.120కిలోమీటర్ల స్పీడ్‌తో ఉన్న కోరమాం డల్‌ ఎక్స్‌ప్రెస్‌..గూడ్స్‌ రైలుని ఢీకొట్టి పట్టాలు తప్పింది. కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు బోగీలు గాల్లోకి ఎగిరి అవతలి పట్టాలపై వస్తున్న బెంగళూ రు ఎక్స్‌ప్రెస్‌ బోగీలపై పడ్డాయి. దాంతో బెంగ ళూరు ఎక్స్‌ ప్రెస్‌ రైలులోని మూడు బోగీలో బోల్తా పడ్డాయి. ఆ ట్రైన్‌లో ఉన్న వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదం..కవచ్‌ సిస్టమ్‌ ఉన్నా జరిగేదని,కవచ్‌ సిస్టమ్‌ ఒకే ట్రాక్‌ పై రెండు రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే పని చేస్తుందని రైల్వేశాఖ చెబుతోంది.
వ్యవస్థాగత లోపమే
దేశంలో రైలు ప్రమాదాలు జరిగిన ప్పుడల్లా అందుకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షిస్తామనిప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేస్తుంటారు. ఒడిశా ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ కూడాఅదే ప్రకటన చేశారు. కానీ,‘పట్టాలు తప్పిన రైల్వే’ పేరుతో కాగ్‌ ప్రచురించిన నివేదికలో దేశంలోని 90శాతం ప్రమాదాలకు వ్యవస్థాగత వైఫల్యాలే కారణమని కుండబద్దలు కొట్టింది. రైల్వేల్లో కీలకమైన భద్రత విభాగంలో ఉద్యోగ ఖాళీల భర్తీని ప్రభుత్వం నిలిపేసిందని,ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్నదని కాగ్‌ తెలి పింది. ఉద్యోగుల సంఖ్య తగినంత లేకపోవటంతో భద్రత విషయంలో రైల్వేశాఖ నాణ్యమైన సేవలు అందించలేకపోతున్నదని విమర్శించింది.- (సైమన్‌/దవరసింగి రాంబాబు)

స్వీయ అనుభూతి గురి

నేటితరం గిరిజనసాహిత్యంకు ప్రామాణికతను పెంపొందించే దిశగా జరుగుతున్న కృషిలో భాగంగా…’’వర్తమాన గిరిజన సమాజానికి కావలసింది సానుభూతి సాహిత్యం కాదు సహను భూతి సాహిత్యం’’ అని ఘంటాపధం గా చెప్పడమే కాదు ఆచరించి చూపిస్తున్న నేటి కాలపు బంగారు భవిత కలిగిన రచయిత నేటి తరం యువతరానికి ఆదర్శనీయుడు ‘‘మల్లిపురం జగదీశ్‌’’ మలి కథా సంపుటి ‘‘గురి’’,2013 నుంచి 2018సం: మధ్యకాలంలో రాయబడ్డ ఈ 13 కథల్లో.. ఉత్తరాంధ్ర ప్రాంతపు గిరిజన సమాజం ప్రపంచీకరణ పడగ నీడన ఎలా విలవిలలాడుతుందో కళ్ళకు కట్టినట్టు అక్షర బద్ధం చేశారు.
అయితే ఈ వ్యధలు కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదు యావత్తుదేశానిదికూడ…!! రచయిత తను స్వయంగా సవిచూసిన విషయాలను అక్షరబద్ధం చేసే బాధ్యతలో భాగంగా తనదైన కథా శైలిలో అభివ్యక్తీకరించారు, దీనిలో ప్రతి కథ తన గిరిజన సామాజిక కుటుంబాల చుట్టూ పరిభ్రమిస్తుంది.
మానవ సంబంధాలు అన్ని ‘‘మనీ సంబంధాలు’’గా రూపాంతరం చెందుతున్న క్లిష్ట పరిస్థితుల్లో.. అడవి బిడ్డల మునుగుట ప్రశ్నార్థకం అయిపోతున్న కాలంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం గురించి వివరిస్తూ జాగృతం చేసే లక్ష్యంతో వ్రాయబడ్డ కథలుగా కనిపిస్తాయి ఇవన్నీ.
అన్ని మార్గాల ద్వారా దాడికి గురి అవుతున్న అడవి బిడ్డల దయనీయ స్థితిని అద్దం పడుతున్న ఈ ‘‘గురి’’ కథాగుచ్చంలోని పతాక శీర్షిక అయిన కథ విషయానికొస్తే తరతరాలుగా ఆదివాసి బిడ్డలపై జరుగుతున్న అరాచకాలు దరిమిలా అడవి బిడ్డల్లో వస్తున్న తిరుగుబాటు తత్వం గురించి అక్షరీకరించిన కథ ‘‘గురి’’ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆదివాసి బిడ్డల జీవితాలపై పెట్టుబడిదారీ వ్యవస్థ సాగిస్తున్న అణచివేత ధోరణి తీరు ఆధునిక పాఠక లోకానికి ఆశ్చర్యం కలిగించక మానదు, ఆధునిక కాలంతో పాటు అడవి బిడ్డల బ్రతుకు చిత్రాల్లో ఆధునిక జీవన సరళి అగుపిస్తున్న అణచివేత కూడా అదే స్థాయిలో ఆధునిక పంథాల్లో సాగటం పట్ల రచయితతో పాటు పాఠకులు ఆగ్రహించి నివారణోపాయాలు గురించి ఆలోచించాల్సిన తరుణమిది.గురి కథలు మంగులు అతని కొడుకు సత్యం ఏవిధంగా పెత్తందారులైన భూస్వాముల అరాచకాలకు బలి అయ్యారో మల్లిపురం జగదీశ్‌ తనదైన కథన శైలిలో కళ్లకు కట్టారు. మంగులు,సత్యం తండ్రి కొడుకులు ఇద్దరి కథనాల్లోనూ సంఘవిద్రోహక శక్తులుగా భావించబడుతున్న నక్సలైట్ల పాత్రను కథా రచయిత భావ గర్భితంగా సూచించారు, వారివల్ల అడవి బిడ్డలకు మేలా? కీడా?? అనే విషయాన్ని కాలానికి వదిలివేసిన, తల్లి తండ్రి అన్యాయాలకు బలై అనాధ అయిన సత్యం బ్రతుకుతెరువు కోసం పట్టణం తరలి పోయిన అతని పోరాట దృక్పథంలో మార్పు రాలేదు సరి కదా అది వారసత్వంగా తన కూతురు గీతకు ఆపాదించిన వైనం పోరాటస్ఫూర్తి, అందులోని సజీవత్వం ఆవిష్కరించబడతాయి. మహానటి సమాజంలో అక్రమాలను ఎదిరించిన తండ్రి మంగులు మంత్రగాడి నేరంతో సమా జానికి దూరం చేయబడితే నీటి కాలానికి చెందిన అతడి కొడుకు సత్యం తండ్రిలో ధనవంతులు అన్యాయాన్ని ఎదిరించి ఇన్ఫార్మర్‌ గా నేరం మోపబడతాడు అక్కడ సత్యం తప్పించుకుని నగరం బాట పడితే ఇక్కడ అతని కూతురు గీత తండ్రికి జరిగిన అన్యాయానికి ఎదురునిలిచి గురి పెట్టడం ద్వారా రచయిత గిరిజన సమాజానికి స్ఫూర్తిని ధైర్యాన్ని అందిస్తూ కథను ఉత్తమ కథా లక్షణాలతో ముగిస్తారు. బిడ్డల కష్టాల గురించి కథా రచయిత పరిశీ లించిన తీరు కోణాలు ఔరా అనిపిస్తాయి.’’ నిత్య నిర్వాసితులు’’ కథలో ప్రభుత్వ అధికారులు వారికి గల నియమాలను బూచిగా చూపిస్తూ అమాయకులైన ఆదివాసి జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో వివరిస్తారు. ముఖ్యంగా ప్రాజెక్టులవంటి బహుళార్థక కట్టడాలకు మొదట బలయ్యేది అడవి బిడ్డలే !! పాలకులు ప్రాజెక్టుల ద్వారా పంట భూములు విస్తీర్ణం పెంచుకొని నీటి సౌకర్యం పెంచుతు న్నామని ఏక కోణం ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప ఎప్పటినుంచో ఆ గ్రామాల మీద ఆధారపడి జీవిస్తున్న అడవి బిడ్డల జీవి తాలు నిత్యనిర్వాసితం అయిపోతున్నాయనే మానవత్వపు ఆలోచనలు మన అధికారులకు కానీ పాలకులకు కానీరాకపోవడంపై రచయిత తీవ్ర విముఖత వ్యక్తం చేశారు ఈ కథలో. పెల్లివలస అనే గిరిజన గ్రామం ప్రాజెక్ట్‌ ముంపు ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వలసరాగ దురదృష్టవశాత్తు ఆ గ్రామం అగ్ని ప్రమాదంలో కాలి బూడిద అయింది దానికి కేవలం తత్కాలిక తిండిగిం జలు పంపిణీ సాయంతో సరిపెట్టారు అధికా రులు,అది రెవెన్యూ గ్రామంగా గుర్తింపు కాలేదు కనుక పక్కా గృహాలు మంజూరు చేయలేమన్న అధికారుల అలసత్వం ఈ కథలో చూపించారు రచయిత. నిర్వాసిత గ్రామంలో ప్రకటించ డంలో అధికారులు చేసిన అలసత్వంవల్ల అమాయకులైన ఆదివాసీలు ఎలా నష్టపోయారో ఉదాహరిస్తూ ఇలాంటి చేయని నేరాలకు ఎలా శిక్షలు అనుభవిస్తున్నారో రచయిత ఇందులో వివరించిన వైనం హృద్యంగా సాగుతుంది, ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు గారు అన్నట్టు ఇవి కతలు కావు ఆదివాసి వెతలు, అడవుల్లో జరుగుతున్న అభివృద్ధి ఆధునీకరణల వల్ల అడవి బిడ్డలకు దక్కే ఫలా లు గోరంత అయితే పెట్టుబడిదారులకు కొం డంత ఆదాయం దక్కుతుంది అనే వాస్తవ విష యాలు చెప్పడంలో రచయిత మల్లిపురం గారు విజయం సాధించారు. యుగయుగాలుగా అభి వృద్ధి యజ్ఞంలో మొదట బలయ్యే’’బలిపశువు’’ ఆదివాసినినే అన్న రచయిత భావనలో నిండు నిజాం దాగి ఉంది. అలాగే ఆదివాసీ లకు ఆరోగ్య రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు నగరా లను ఎంత అభివృద్ధి చేస్తే ఏమిటి అని ‘‘డోలి’’ కథలో రచయిత ప్రశ్నిస్తారు, అడవి బిడ్డల్లో వస్తువ్యామోహం పెంచి అధిక లాభాలతో వారిని అప్పుల పాలు చేస్తున్న నాగరిక వ్యాపా రుల తీరును ఎండగట్టిన తార్రోడ్డు కథ, భూ విముక్తి పోరాటంలో పాల్గొన్న ఆదివాసీలు చివరికి భూమిని పోగొట్టు కున్న వైనాన్ని ధైన్యం గా చూపించిన కథ ‘‘తాండ్ర చుట్ట’’. సభ్య సమాజానికి తెలియని అడవి బిడ్డల ఆగచాట్లు ఎన్నో ఈ ‘‘గురి’’ కథా సంపుటిలో కనిపిస్తాయి, ఈ కథల్లో ఇంత ఘాడతకు కారణం రచయిత ఓగిరి పుత్రుడు కావడమే, అతడు గిరిజనుల ను చూసి రాసిన కథలుకావు, వారితో మమేకమై వ్రాసిన కథలు నిజమైన గిరిజన కథలకు నిల యమైన మన మల్లి పురం జగదీశ్‌ కథలు ప్రతి ఒక్కరికి అవసరం, గిరిజన జీవితాల పరిశో ధకులు ప్రత్యేకించి చదవదగ్గది –డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

పొగ మహామ్మారిని తరిమెద్దాం..!

సిగరెట్‌ తాగడం వల్ల 12 రకాల క్యాన్సర్‌లు వస్తాయని తేలింది. సరదాగానో, మిగిలిన వారిని చూసిన ఉత్సా హంలోనో పొగతాగడాన్ని అలవాటు చేసుకున్న వారు ఆ మత్తు నుండి బయటపడలేకపోతున్నారు. ఏం చేయాలన్నా ‘ఒకసారి పొగతాగాల్సిందే’ అన్నట్టు వారి వ్యవహార శైలి మారిపోతుంది. చాలామంది వైద్యులు పొగతాగేవారిని ప్రశ్నిస్తే- తాము చిన్నతనంలో పదేళ్ల ప్రాయంలోనే సరాదాగా స్నేహితులతో పందెం కాసి పొగతాగడం మొదలుపెట్టానని చెబుతుంటారు. కాని పొగతాగేవారి వల్ల వారికే కాదు, వారి చుట్టూ ఉన్న వారు కూడా ప్రమాదంలో పడుతున్నారు. వ్యక్తులకు, ఆరోగ్యానికి, సమాజానికి కూడా నష్టాన్ని కలిగిస్తున్నారు. ‘ పొగతా గడం మానేయండి, పొగాకు వదిలి వేయండి’ అనే నినాదం అంతా పాటిస్తే అంతా సుఖమయంగా జీవిస్తారు. పొగతాగడం ద్వారా ఎన్నో హాని కరమైన, విషతుల్యమైన వాయువుతో ఊపిరితిత్తులను ఉదయం నుండి రాత్రి దాకా నిర్వి రామంగా కాలు స్తూనే ఉంటే మన జీవితం వెలుగు తున్న కొవ్వొత్తి మారిది కరిగి వెలుగులేకుండా ఆరిపో వడం ఖాయం. పొగతాగడం మానాలి అంటే మీ నేర్పు, మీ మనో ధైర్యం, పోరాట శక్తి, పొగమానాలనే బలమైన కోరిక తో దానిని జయించాలి. హానికరమైన వ్యస నాన్ని కలిగించే పదార్థాలే క్యాన్సర్‌ కరకాలు అని గుర్తించాలని… గత 20 ఏళ్లగా పొగాకు నియంత్రణపై ప్రచార ఉద్యమం చేపడుతున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఓ డిప్యూటీ తాహశీల్దార్‌ ‘‘ మాచన రఘునందన్‌’’ మే 31న పోగాకు నియంత్రణ దినోత్సవం సందర్భంగా ‘థింసా’కి ఇచ్చిన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇదీ!
మేడ్చల్‌ జిల్లా కేశవరంకు చెందిన ‘‘మాచన’’.. రంగారెడ్డి జిల్లాలో ఆంగ్లభాషా పండితుడిగా పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారాన్నందుకున్న అభిమన్యు కుమారుడు. సాధారణంగా పండిత పుత్ర పరమశుంఠ అని నానుడి. కానీ..మాచన అందుకు భిన్నం. ఇప్పుడు తన కుటుంబం మొత్తం గర్వించదగ్గ రీతిలో తన ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే…పొగాకుపై ఉద్యమం చేస్తున్న పోరాటశీలి. అందుకే జాతీయస్థాయిలో పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టుబాకో కంట్రోల్‌ రఘునందన్‌ని ‘‘టుబాకో కంట్రోల్‌ స్టాల్‌ వర్ట్‌’’గా గుర్తించింది. అమెరికాకు చెందిన హెల్త్‌ మ్యాగజీన్‌ పల్మనరీ మెడిసిన్‌ కూడా రఘునందన్‌ విజయగాధను వావ్‌..వెల్డన్‌. అని కొనియాడిరది. ఈమధ్యే రఘునందన్‌ విధి నిర్వహణలో కనబరుస్తున్న చొరవతో పాటే…ఆయన ఆశయాలు..వాటికై ‘‘మాచన’’ పోరాటం గురించి తెలుసుకున్న పలు వురు రఘునందన్‌ను అభినందించడంతో తన బాధ్యత మరింత పెరిగిందంటారు ‘‘మాచన’’. రఘునందనంటే ఓనిబద్ధత గల ఉద్యోగి…తన విధులను బాధ్యతగా నిర్వహిస్తూనే…తమ హక్కులకై పాత పింఛన్‌ విధానంపై పోరాడే ప్రచార కార్యదర్శి…పొగాకును కూకటివేళ్లతో పెకిలించే చైతన్యం సమాజం నుంచే రావాలని పోరాడుతున్న ఉద్యమశీలి.. వీటన్నింటినీ మించి సామాన్యుల పాలిట సాటి మనిషిగా స్పందించే మానవీయకోణం..మొత్తంగా మన రాష్ట్రం వాడు..మనవాడు…నిత్యం అందరిలో ఒకడు.
పొగాకు పై ఇరవయ్యేళ్ల పోరాటం
సిగరెట్‌ తాగకు..పొగాకు మంచిది కాదు అని వైద్యులు చెప్పడం సాధారణం. అదే ఓ వైద్యే తర రంగానికి చెందిన వ్యక్తికి మాత్రం జీవితమే పొగాకు పై రణం. ఇది ఓనమ్మ లేనినిజం. మాచన రఘునందన్‌ది పౌర సరఫరాలశాఖలో ఎన్ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తాసిల్దార్‌ ఉద్యోగం. అందరు ఉద్యోగుల్లా డ్యూటీ అయిపోగానే ఇంటికి, లేదా కాలక్షేపం కోసం క్లబ్బుకు చేరే రకం కాదు మనం చెప్పుకుంటున్న మాచన రఘునందన్‌.తన జీవితంతో మారాలి ఎన్నో జీవితాలు అని పొగాకు నియంత్రణ పథంలో ప్రయాణిస్తూ..మేం సిగరెట్‌,బీడీ,తంబాకు మానేస్తాం అని ప్రమాణం చేయిస్తున్నారు. సమాజ సేవ ఎలా చేయాలో స్ఫూర్తినిస్తున్నారు. ఎందరి జీవితాలనొ పొగాకు నుంచి విముక్తి చేస్తున్న ఓ అసాధారణ ఉద్యమం తన జీవితం అని చెప్పకనే చెబుతున్నారు. రఘునందన్‌ నగరంలో నివసించే తన ద్విచక్ర వాహనంపై పర్యటిస్తారు. ఎక్కడ ఎవరు దమ్ము కొట్టినా.. ఒక్క క్షణం ఆగి కంఠంలో ప్రాణాన్ని పొగాకు కు బలి చేయొద్దు అని తన కంఠ శోషగా హితవు చెబుతున్నారు. ప్రజారోగ్యం కాంక్షించే వైద్యులకు, ఆసుపత్రులకు వరల్డ్‌ క్యాన్సర్‌ డే, నో స్మోకింగ్‌ డే, వరల్డ్‌ నో టబాకో డేలు ఓ అవగా హన కలిగించే సందర్భాలు మాత్రమే. నగరం లో నివసించే, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తాసిల్దార్‌ మాచన రఘునందన్‌ గత ఇరవై ఏళ్ల నుంచి పొగాకు నియంత్రణ కోసం కృషి చేస్తున్నారు. ఆయన ఇలా తన వాహనం పై స్మోకింగ్‌ కిల్స్‌,క్విట్‌ టుబాకో ఆన్న సందేశం తో రాష్ట్ర వ్యాప్తంగా 5000 కిలో మీటర్లు ప్రయాణించి,500 గ్రామాల్లో వేలాది మంది ని పొగాకు, ధూమపానం మానేస్తాం అని ప్రతీణ చేయించారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. శుక్రవారం నాడు ఆయన నగరంలో పలు ప్రాంతాలలో ఇలా బైక్‌పై తిరుగుతూ పొగాకు కాన్సర్‌ కారకం అని అవగాహన కలిగించారు. ఎంతో నిస్వార్థ సేవ చేస్తున్నా..ఎటువంటి అవా ర్డులు ఆశించరు. పరిమాణం ముఖ్యం కాదు పరిణామం ప్రధానం అంటారు మాచన రఘునందన్‌.
సామాజిక ఉద్యమశీలి
వాస్తవానికి నా వృత్తి డిప్యూటీ తహశీల్దార్‌ హోదా ఉన్న వ్యక్తికి…ప్రవృత్తిగా సమాజం కోసం ఏదో సాధించాలన్న తపన..ఆ తపనకు తగ్గ కమిట్మెంట్‌ ఉండట మంటే కాస్తా అరుదే. అలా ..అని ఎవరూ ఉండరని కారు. అలాంటి వారిలో ఒకరే మనమిప్పుడు చెప్పుకునే రఘు నందన్‌ మాచన. పౌరసరఫరాలశాఖలో ఓ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా ఎక్కడో ఓచోట నిత్యం దాడులు,తనిఖీలు నిర్వహించే క్రమంలో… ఎందరో అధికారుల్లాగే లంచాలకు మరిగి తానూ ఆర్థికంగా అందలమెక్కొచ్చు. కానీ అలా అయితే రఘునందన్‌ గురించి చెప్పుకోవడ మెందుకు..? తన సర్వీస్‌లో మాచన రఘు నందన్‌కు ఉద్యోగ బాధ్యతే కావచ్చు..కానీ అందులో మానవత్వం ఉంది. సమాజాన్ని మార్చాలన్న తపన కనిపిస్తుంది. అందుకే ఈ అరుదైన అధికారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. పొగాకు నియంత్రణలో రఘు నందన్‌ డెడికేషన్‌ జర్మనీ దేశాన్నీ టచ్‌ చేసింది. ఇప్పుడు రఘునందన్‌ ను ఆ దేశ ప్రతినిధులు తమ వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నారు. సామా జిక మాధ్యమాల ద్వారా పుకార్లు, ఫార్వర్డ్లు, తమకు గిట్టనివారిని ఉతికారేసే ఇష్టారీతి ద్వేషపు రాతలురాసే వాళ్లేకనిపించే రోజుల్లో… పొగాకు నియంత్రణపై రఘునందన్‌ అదే సామాజిక మధ్యమాలనుపయోగించుకుని కల్పిస్తున్న అవగాహన అంతర్జాతీయ సమాజాన్నీ చేరుతోంది. వైద్యుడు కానప్పటికీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌..తన కార్యక్రమా లకు రఘునందన్‌ ను ఆహ్వానిస్తోంది. అయితే ఇంతేనా.. మాచన అంటే…? పంజాబ్‌ ఛండీ గడ్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జా తీయ సదస్సులోనూ ‘‘మాచన’’నే భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ గౌరవ ప్రతినిధిగా పాల్గొనడమంటే దానివెనుక ఆయన అవిరళ కృషే కారణం. పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికీ, ఐశ్వర్యానికీ ముప్పు కలగక ముందే.. టుబాకో కు గుడ్‌ బై చెప్పే అవగా హన ప్రతి ఒక్కరిలో కల్గాలని ఆశిస్తున్న వ్యక్తి మాచన. మాచన రఘునందన్‌ సుమారుగా రెండు దశాబ్దాల కృషి. అయితే ఆఫలాలు ఇప్పుడు అందుతున్నాయి. ఆయన ఆశించిన మార్పు ఆయనెంచుకున్న లక్ష్యాల్లో కనిపిస్తోంది. ఆయన పేరూ హైదరాబాద్‌ జిల్లా దాటి..రాష్ట్ర వ్యాప్తమై.. దేశం గుర్తించి…అంతర్జాతీయ సమాజానికీ వినిపిస్తోంది. ఇలా రఘునందన్‌ అటు వృత్తిలోను ఇటూ ప్రవృత్తిలోనూ తనకంటూ ఓ ప్రత్యే’కథను’ సంతరించు కుంటున్నవారు.
ప్రతిభకు పట్టాభిషేకం
రఘునందన్‌ విద్యదశలో ఉన్న సమయంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలపై తనదైన ప్రతిభను చాటుకున్నారు. ఉత్తమ జర్నిలిస్టుగా,సామాజిక కార్యకర్తగా తెలంగాణా రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారు. ఈనేపధ్యంలోనే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ (2009)లో కేంద్ర ప్రజా సంబంధాల సమాచార బోర్డు కాష్టింగ్‌,మంత్రిత్వశాఖ ఏపీ తరుపున ఉత్తమ సామాజిక/పాత్రికేయడుగా ఎంపిక చేసింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో మొత్తం 15మంది టీమ్‌ను దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అరుణచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మేఘా లయ,త్రిపుర,మిజోరాం,వంటి రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఆదివాసీ గిరిజన ఆచార వ్యవహారాలపై పరిశోధన చేశారు.ఆ బృం దంలో రఘునందన్‌ ప్రత్యేక గుర్తింపు పొం దాడం విశేషం. స్థానికంగా రఘునందన్‌ చేస్తున్న సామాజిక కృషిని రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఉన్నతాధికారులు సైతం తన ప్రతిభకు పట్టాభిషేకం కడుతూ ప్రశంసలు కురిపిస్తూన్నారు. రఘునందన్‌ చేస్తున్న ఈ జర్నీ మరింత ముందు కెళ్లాలని…మరెందరో అధికారులకు,సామాన్యులకు ఈయన స్ఫూర్తి ఓప్రేరణ కావాలనీ ఆశిద్దాం.! – గునపర్తి సైమన్‌

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం 

పార్లమెంట్‌ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌ భవనాన్ని జాతికి నేడు అంకితం చేసే కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీని మీద అనేక వర్గాలు ఆందోళన చేయటం, ఈ వేడుకకు విపక్షాలు వెళ్లగూడదని నిర్ణయించటమూ తెలిసిందే. భిన్న భాషలు, భావజాలం, సంస్కృతి, సంప్రదాయాలతో విలసిల్లుతున్న ఈ సువిశాల భరతభూమిలో.. వీటన్నిటినీ ఒకే తాటి మీదకు తెచ్చి ఐక్యత రాగాన్ని ఆలపించే వేదికగా భాసిల్లుతున్నది మన పార్లమెంటు. అటువంటి పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం అన్ని పక్షాలూ కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన వేడుక. కానీ, అది వివాదాస్పదమవటం దురదృష్టకరం!
నూతన పార్లమెంటు భవన ప్రారంభ వేడుకకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఆహ్వానాలు పంపించింది. అయితే, ఇంతటి మహత్తర కార్యక్ర మంలో రాజ్యసభ ప్రమేయం లేకపోవటం ఆశ్చ ర్యం.ఈ నూతన పార్లమెంటు భవనంలో రాజ్య సభ చాంబరు, రాజ్యసభ చైర్మన్‌ కార్యాలయం ఉంటాయిగదా!మరి రాజ్యసభను ఎందుకు భాగ స్వామిని చెయ్యలేదో అర్థం కావడం లేదు. రాజ్యాం గంలోని 79వ అధికరణం నిర్దేశించినట్లు, మన పార్లమెంటు మూడు విభాగాలుగా ఉంటుంది. అది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభలతో కూడినది. అంటే రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం అన్నమాట.అందువల్లనే, ఉభయ సభలు ఓ బిల్లును ఆమోదించినా రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే అది చట్టంగా రూపుదిద్దుకుంటుంది.ఆబిల్లు పార్ల మెంటు ఆమోదం పొందింది అని అప్పుడు అను కోవాలి. అయితే, చాలామందికి పెద్దగా తెలియని విషయమేమిటంటే పార్లమెంటు ప్రాంగణంలో ప్రధానికి ప్రత్యేక స్థానం అంటూ ఏమీ లేదు. అందరు పార్లమెంటు సభ్యులలాగే ప్రధాని గూడా ఒక సభ్యుడు (సభ్యుడు కాకుండాగూడా ఓఆరు నెలలు మంత్రిగానో, ప్రధానిగానో కొనసాగే వెసులు బాటు మన రాజ్యాంగం కల్పించింది. అది వేరే విషయం). అందరు మంత్రుల్లాగే ప్రధానికి ఒక గది ఉంటుంది. సభ్యుడైతే తాను సభ్యుడైన సభకి నాయకుడు (శ్రీవaసవతీ శీట ్‌ష్ట్రవ ష్ట్రశీబంవ)గా వ్యవహ రిస్తారు. అంతకు మించి ప్రధానికి పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేకత ఏమీ లేదు. పార్లమెంటు ప్రాంగణం అంతా లోక్‌సభ స్పీకరు ఆధ్వర్యంలో ఉంటుంది. స్పీకరుని పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని కలవాలంటే, ప్రధానే స్పీకరు గదికి వెళ్తారు గానీ స్పీకరు ప్రధాని గదికి రారు. అది స్పీకరుకి పార్లమెంటులో అత్యున్నత గౌరవం యిచ్చే ఒక మంచి పార్లమెంటరీ సంప్రదాయం. దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే, పార్లమెంటరీ వ్యవస్థలోగానీ, పార్లమెంటు ప్రాంగణంలోగానీ ప్రధానికి ప్రత్యేక స్థానం ఏదీ లేదని. నూతన పార్లమెంటు భవన ప్రారంభ వేడుకకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఆహ్వానాలు పంపించింది. అయితే, ఇంతటి మహ త్తర కార్యక్రమంలో రాజ్యసభ ప్రమేయం లేకపో వటం ఆశ్చర్యం. ఈ నూతన పార్లమెంటు భవనం లో రాజ్యసభ చాంబరు, రాజ్యసభ చైర్మన్‌ కార్యాల యం ఉంటాయిగదా! మరి రాజ్యసభను ఎందుకు భాగస్వామిని చెయ్యలేదో అర్థం కావడం లేదు. పార్లమెంటు అంటే లోక్‌సభ ఒక్కటే కాదు గదా! పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రెండు సభలూ. అటువంటప్పుడు నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం ప్రధాని చేతుల మీదగా జరగటం ఏమిటన్న ప్రశ్న అందరి మదినీ తొలుస్తున్నది. పార్లమెంటులో అంతర్భాగమైన రాష్ట్రపతిని విస్మరించి ప్రధాని చేతుల మీదగా ఈ వేడుక జరగటం రాజకీయాలతో సంబంధం లేని చాలామంది దేశ పౌరులు జీర్ణించుకోలేకపోతు న్నారు.పైగా,ఈ నూతన భవన నిర్మాణానికి శంకు స్థాపన గూడా ప్రధాని చేతుల మీదగానే జరిగింది. ఇదే ఒక విడ్డూరమైతే నూతన భవనం ప్రారంభో త్సవంకూడా ఆయన చేతుల మీదే జరగటం మరో విడ్డూరం.
రాష్ట్రపతిని విస్మరించి రాజదండ ప్రతిష్ట
దేశ ప్రతిష్టకు ప్రతీకగా నిలవాల్సిన పార్లమెంటు భవన సముదాయం ప్రారంభోత్స వాన్ని ఏకపక్ష వ్యవహారంగా మార్చడం ప్రధాని నరేంద్రమోడీకే చెల్లింది. ఇరవైకి పైగా ప్రతిపక్షాలు హాజరు కాబోమని ప్రకటిస్తే కనీసం సంప్రదిం పులకు కూడా ప్రయత్నించని అప్రజాస్వామిక పోకడలు దేశం ఎప్పుడూ చూసివుండదు. ఈ మధ్యనే లోక్‌సభ మాజీ కార్యదర్శి పిడిటి ఆచారి ప్రసంగాన్ని అనువాదం చేసినప్పుడు ఆయనో మాట చెప్పారు. నెహ్రూ హయాంలోనూ తర్వాత చాలా కాలం కూడా పార్లమెంటులో ఉద్రిక్తత వస్తే ప్రతిపక్ష నాయకులను పిలిచి చర్చించి ఏదో ఒక పరిష్కారం చేసేవారట. ఎందుకంటే సభ జరిగేలా చూడటం ప్రభుత్వాధినేత అయిన ప్రధాని బాధ్యత.కర్తవ్యం కూడా. మోడీ హయాంలో పార్లమెంటును ఒక తంతులాగా మార్చి పెత్తనం చేయడమే గాని ఎన్నడూ రాజ్యాంగం, సంప్రదాయం రీత్యా వ్యవహరించింది లేదు. కీలకమైన కాశ్మీర్‌ అంశం లాటిదాన్ని కూడా హఠాత్తుగా తెచ్చి మమ అనిపించడం తప్ప ముందుగా చర్చించే సాహసం ప్రజాస్వామ్య స్పృహ లేవు. నోట్ల రద్దు, ఎన్‌ఆర్‌సి వంటివాటిపై చర్చలకే అవకాశమివ్వని నిరంకు శత్వం ఈ సర్కారుది. అదే ఇప్పుడూ ప్రత్యక్షమవు తున్నది. అసలు న్యూ విస్తా పేరుతో నూతన భవన సముదాయాన్ని కట్టాలన్న నిర్ణయమే ఏకపక్షమైంది. దేశమంతా కరోనా మహమ్మారితో కలవరపడుతు న్నప్పుడు తీసుకున్నది. చారిత్రకంగా కొనసాగుతున్న గొప్ప నిర్మాణాల స్థానంలో తన ముద్ర కోసమే అవసరం లేకున్నా లూట్యాన్స్‌ ఢల్లీిని మోడీస్‌ ఢల్లీిగా మార్చడమే ఏకైక లక్ష్యంగా ఈతతంగం తల పెట్టారు. కోర్టులలో కేసులూ నడిచాయి. సాంకేతిక కారణాలతో అనుమతి సంపాదించి పూర్తి చేశారు. నూతన భవనంపై జాతీయ చిహ్నమైన మూడు సింహాల ప్రతిష్టాపన కూడా ఇలాగే హఠాత్తుగా ఒంటరిగా కానిచ్చేశారు. ఆ సింహాలు గతంలో వలె గంభీర ప్రసన్నంగా గాక క్రోధంగా వుండటం మరో చర్చకు దారితీసింది. దానిపై విమర్శల తర్వాత పూర్తిస్థాయి ప్రారంభోత్సవానికైనా పునరా లోచించుకొని అందరినీ కలుపుకుపోయే బదులు దీనికీ తనే ఏకైక కర్త కర్మ క్రియగా కానిచ్చేయడం మోడీకే చెల్లింది!
రాష్ట్రపతి రాజ్యాంగ పాత్ర
పార్లమెంటు అంటే అన్నిపార్టీల సభ్యు లూ వుండే వేదిక. రాజ్యసభ అయితే రాజ్యాంగ పరంగా రాష్ట్రాల సభ.కాని మోడీ సర్కారు దీనిని కేవలం ప్రభుత్వ వ్యవహారంగా మార్చేసింది. కాని ఇప్పుదీ ప్రారంభోత్సవ కార్యక్రమంపై విమర్శ వచ్చింది ప్రతిపక్షాల గురించి కాదు. రాష్ట్రపతి గురించి. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం పార్లమెంటు ఉభయ సభల ఏర్పాటుకు, ప్రారం భానికి, ప్రోరోగ్‌ (నిరవధికవాయిదా) కు ఎన్ని కలకూ కర్త రాష్ట్రపతి.రాజ్యాంగంలో 3,111,274 అధికరణాలు రాష్ట్రపతి అధికారా లను స్పష్టంగా పేర్కొంటున్నాయి. 79వ అధికర ణం ప్రకారం రాష్ట్రపతి, సభ్యులు కలిస్తేనే పార్లమెం టు.పార్లమెం టు ఏర్పాటు,గడువు ముగిసిన తర్వాత లేదా ప్రభు త్వం కోరితే పడిపోతే మళ్లీ కొత్త సభ ఏర్పాటుకు ఎన్నికల కమిషన్‌కు అనుమతి నివ్వడం రాష్ట్రపతి ద్వారానే జరుగుతుంది. ఎన్నికైన సభ్యుల జాబితాను తనకే అందజేస్తారు.78వ అధికరణం మేరకు పార్ల మెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకం చేస్తేనే శాసనాలవుతాయి.కనక రాష్ట్రపతికీ పార్లమెం టుకూ మధ్య సంబంధం విడదీయరానిది. అలాటి రాష్ట్రపతి లేకుండా, కనీసం ఆహ్వానించకుండా పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించాలను కోవడం ఎలాటి ప్రజాస్వామ్య సంప్రదాయం? ఎలాటి రాజ్యాంగ గౌరవం? పైగా ప్రస్తుత రాష్ట్ర పతి ద్రౌపది ముర్మును తొలి ఆదివాసి మహిళ ఎన్నికగా గొప్పగా ప్రచారం చేసుకున్న మోడీ ప్రభు త్వం ఎందుకు ఆమెను గౌరవించడం లేదు? ఈ మాట అనగానే అయితే ప్రతిపక్షాలు ఎందుకు ఆమెపై అభ్యర్థిని పెట్టాయని కొందరు ఎదురు దాడి చేయడం మరీ విడ్డూరం.
ఆ స్థానంలో ఎవరుంటే వారు రాజ్యాం గ రీత్యా ఆగౌరవానికి అర్హులు తప్ప ఎన్నికల్లో పోటీ పెట్టడం ఇక్కడ సమస్య కానేకాదు. ఇంకా కొంతమంది ఉదాహరణకు తెలంగాణ పాండిచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌గా వున్న తమిళిసై సౌందరరాజన్‌ వంటివారు సచివాలయ ప్రారంభోత్సవానికి ముఖ్మమంత్రి కెసిఆర్‌ తనను ఆహ్వానించలేదని పోటీ వాదన తెస్తున్నారు.సచివాలయానికి గవర్నర్‌కు మధ్య అలాటి పాత్ర వున్నట్టు రాజ్యాంగం ఎక్కడైనా చెప్పిందా?తలాతోక లేని వాదన తప్ప! ఢల్లీి లెఫ్టి నెంట్‌ గవర్నర్‌, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ల నిర్వా కాలను సుప్రీం కోర్టు తప్పు పట్టిన తర్వాత కూడా బిజెపి నియమిత వ్యక్తుల తీరు మారలేదనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
ఎక్కడిదీ రాజదండం?
మిగిలిన అనేక మతతత్వ పోకడలు నిర్ణయాలు పక్కన పెట్టి ఈ ప్రారంభోత్సవంలోనూ మోడీ ప్రభుత్వం మతరాజకీయాలనే ప్రదర్శిస్తు న్నది. హిందూత్వ సిద్ధాంత కర్త గాడ్సే గురువు సావర్కర్‌ జయంతినాడు ఈప్రారంభోత్సవం పెట్ట డం వ్యూహాత్మక సంకేతమే. రాజదండం (సెం గోల్‌) ఉదంతం ఇందుకు మరో ఉదాహరణ. గతంలో ఎన్నడూ పెద్దగా చెప్పుకోని ఈ రాజడండం కథను తవ్వి తీయడం ద్వారా బిజెపి హిందూత్వ సిద్ధాంతానికి పెద్దపీట వేస్తున్నది.1947ఆగష్టు 15న బ్రిటిష్‌ వారి నుంచి భారతీయులకు అధికార మార్పిడిజరిగేప్పుడు తమిళనాడులోని తిరువాదుతరై అధీనం అనే మఠం నుంచి ఈరాజదండం కాను కగా సమర్పించబడిరది. దాన్ని ఆఆశ్రమ ప్రతి నిధులు ప్రధాని నెహ్రూకు అందిస్తున్న చిత్రాలు కూడా ఆనాడు వచ్చాయి. అయితే అదేదో స్వా తంత్ర సాధనకు అధికార మార్పిడికి సంకేతం గా ఇచ్చినట్టు పేర్కొనే ఆధారాలే లేవు.అలా చూసిన చెప్పిన సందర్భాలూ లేవు. హోంమంత్రి అమిత్‌ షా అకస్మాత్తుగా దీన్ని ప్రస్తావించినపుడు నాయ కులూ పాత్రికేయులూ కూడా ఆశ్చర్యపోయారు. అధికార మార్పిడికి ఏదైనా లాంఛనప్రాయమైన సంకేతం వుంటుందా అని మౌంట్‌ బాటన్‌అడిగితే నెహ్రూ మొదటి గవర్నర్‌ జనరల్‌ రాజాజీని సంప్ర దించినట్టు ఆయన తమ స్వరాష్ట్రమైన మద్రాసు నుంచి దాన్ని తెప్పించినట్టు అమిత్‌షా కథచెబు తున్నారు. ఈ రాజదండాన్ని మొదట మౌంట్‌ బాటన్‌కు ఇచ్చి తర్వాత నెహ్రూకు అందజేశారని కథ చెబుతున్నారు. దాన్ని పార్లమెంటు భవనంపై శాశ్వతంగా ప్రతిష్టించుతామని కూడా కేంద్రం ప్రకటించింది. బ్రిటిష్‌ చక్రవర్తితో సహా దేశదేశాల రాజులు పట్టాభిషేకాల సమయంలో ఈ తరహా దండం ఒకటి రాజగురువు నుంచి తీసుకునే పద్ధతి వుంది. కాని అది ప్రజాస్వామంలో ప్రజల ఆమో దం తప్ప అలాటి ఆచారాలేమీ వుండవు. పైగా లౌకిక విధానం తీసుకున్న భారతదేశంలో అసలే అవకాశం లేదు.భిన్న మతాలతో కూడిన ఈ దేశం లో ఒక మతానికి సంబంధించిన చిహ్నమే ఎలా ప్రభుత్వ చిహ్నమవుతుంది? అంటే ఇది కూడా బిజెపి మార్కు మత రాజకీయాలలోనూ తమిళ నాడును సంతోషపెట్టే వ్యూహంలోనూ భాగమను కోవాలి. కర్ణాటక దెబ్బ తర్వాత దక్షిణాదిలో పూర్తి గా ఖాళీ అయిన బిజెపి ఆ కోణంలోనూ ఈ పని చేస్తుండవచ్చు. దీనికి ఆధారాలేమంటే ఆనాడు వెలులవడిన ప్రత్యేక సంచికలలో వుందంటున్నారు. తీరా చూస్తే వాటిలోనూ ఆ మఠం ప్రతినిధులు చెప్పిందే వుంది. కనక ఇది కల్పితమనేది సుస్పష్టం. రాజ్యాంగం పార్లమెంటుకు ఇచ్చిన ప్రాతినిధ్య స్వభావాన్ని, దానిలో భాగంగానూ రాజ్యాధినేత గానూ రాష్ట్రపతి స్థానాన్ని మోడీ సర్కారు అగౌరవం పాలు చేసింది.రాజ్యాంగంలో ఏప్రస్తాన లేని ఒక రాజదండాన్ని ఆస్థానంలో ప్రతిష్టించడం దాని రాజరిక స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.మోడీ ఏకపక్ష నిరంకుశత్వానికి నిదర్శనమవుతుంది.(ప్రజాశక్తి సౌజన్యంతో..)- (గుమ్మడిదల రంగారావు/తెలకపల్లి రవి) (వ్యాసకర్తలు : లోక్‌సభ సచివాలయం పరిశోధన మరియు సమాచార విభాగంలో మాజీడైరెక్టరు,మరియు సీనియర్‌ పాత్రీకేయులు)

1 2