పర్యావరణ పరిరక్షణకు మాలి గిరిజనులు

తెలుగు ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్ప రచుకున్న మన మూలవాసులైన ఆదివాసుల జీవనం గురించి ప్రామాణికమైన పరిశోధనలు చేయిస్తూ భావి పరిశోధనలకు దారులు వేస్తున్న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాల యం గిరిజనజీవన విధానంలో ప్రత్యేక అధ్య యనం చేసేందుకు వీలుగా 1995 జనవరిలో వరంగల్లు వేదికగా గిరిజన విజ్ఞానపీఠం స్థాపిం చింది.-డా. అమ్మిన శ్రీనివాసరాజు 

దీని ఆధ్వర్యంలో “గిరిజన విజ్ఞాన దర్శిని” విశాఖపట్నం జిల్లా ప్రాజెక్టులో భాగంగా 2007-2008 సంవత్సరంలో ఆచార్య బట్టు రమేష్‌గారి నేతృత్వంలో గిరిజన పీఠం బృందం క్షేత్ర పర్యటన చేసి విశాఖ జిల్లాలోని ప్రధాన గిరిజన తెగలు బాగుంది,గదబ,మాలి,ఖోంద్, నూకదొర,కోటియా,గౌడ,కమ్మర,వాల్మీకి, వంటి పదిగిరిజన తెగల సమాచారాన్ని సమ గ్రంగా సేకరించి గ్రంథస్తం చేశారు, అందు లోని మాలి గిరిజన తెగ గురించిన విషయ విశ్లేషణ చేసుకుందాం.
“మాలి” అనే పదం“మాలికర” అనే సంస్కృత పదం నుంచి పుట్టింది మాలికర్ అనగా తోట మాలి,వీరి మూలపురుషుడు బ్రహ్మచర్య ఋషి శివుడికి పూలు అందించేవాడని పురాణాల్లో చెప్పబడింది,అనంతర కాలంలో వీరి వంశీ యులు నాటిరాజులకు పూలుపండ్లు సాగు చేసి అందించే వారిని మొగల్ చక్రవర్తుల కాలం తర్వాత ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం అంతా వ్యాపించిపండ్లు కూరగాయలు సాగుచేస్తూ జీవిస్తున్నారు.ఈ మాలి గిరిజన తెగ ఒరిస్సా రాష్ట్రంలో అధికంగా విస్తరించి ఉన్నారు,అందులోని వారు పొరుగు రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖజిల్లాలో అరకు,అనంతగిరి,హుకుంపేట,తదితర మ న్యం అటవీ ప్రాంతాలకు వలస వచ్చి నివసి స్తున్నారు. వీరికి సంబంధించిన పూర్తి జీవన చిత్రం ఆచార వ్యవహారాలతో కలిపి ప్రామా ణిక పద్ధతిలో పరిశోధనాత్మక దృష్టితో ‘మాలి గిరిజనుల జీవనవిధానం’(మాలిగూడ) అనే పేరుతో జానపదగిరిజన విజ్ఞానపీఠం వారు ఆచార్య భట్టు రమేష్,డాక్టర్ గడ్డం వెంకన్న, గార్ల సంపాదకత్వంలో పుస్తకం వెలు వరించారు.
దీని ఉపోద్ఘాతంలో విశాఖపట్నం జిల్లా పూర్వపరాలు చారిత్రక విషయాలు జోడించి ఉపయుక్త సమాచారం అందించారు పూర్వ పు “విశాఖేశ్వర పురం” నేటి విశాఖపట్నం గా మారిన వైనం గణాంకాలతో వివరించిన తీరు ఆసక్తికరంగా ఉంది.మాలి తెగ గిరిజ నులు నివసించే ప్రాంతాలను ‘మాలి గూడ’ అనే పేరుతో వ్యవహరిస్తారు.1990 ప్రాం తంలో ఒరిస్సా నుంచి ఆంధ్ర ప్రాంతంకు వీరు వలసవచ్చి నివాసాలు ఏర్పాటు చేసు కున్నారనే విషయం ఇందులో పేర్కొన్నారు. గ్రామ నిర్మాణం,మొదలుకొని గ్రామం నీటి సౌకర్యాలు,ఇంటినిర్మాణం,తదితర విషయా లు ఇందులో నేటి ఆధునికవిధానాలను అన్వయించి క్షేత్రపర్యటనల సారాన్ని అం దించారు.వీరిపేర్లు ఇంటి పేర్లు వంశ నామా లతో పాటు పెట్టుకోవడం ఆనవాయితీ. మాలి గిరిజన తెగలో ప్రధానంగా మూడు వంశ నామాలు కనిపిస్తున్నాయి.అవి సూర్యవంశం, నాగవంశం,పులివంశం,పూర్వికులు అచ్చంగా సూర్యవంశస్తులు సూర్యుడిని,నాగావంశం వారు నాగదేవతను,పులివంశం వారు పులి దేవరను పూజించేవారు, కానీ నేటి ఆధునికులు అందరూ గ్రామదేవతలైన సంకుదేవతలని ఆరాధిస్తారు అనే విషయం వీరి పరిశోధనలో వెల్లడించారు. ఉపోద్ఘాతం,గ్రామీణజీవనం, సామాజికజీవనం,ఆర్థికజీవనం,మత జీవనం, రాజకీయ పరిపాలన,ముగింపు,అనే ఏడు ప్రధాన విభాగాలుగా ఈప్రామాణిక రచన రూపొందించబడింది.
గ్రామీణ జీవనంలో గ్రామనిర్మాణం,ఇంటి నిర్మాణంను,వ్యక్తులు ఏర్పాటు చేసుకోవడం లోని ప్రధాన ఉద్దేశంతో పాటు,ప్రధానంగా ఈమాలి తెగగిరిజనులకు పర్యావరణంతో గల సత్సంబంధాలు దైనందిన జీవితాలలో అన్వ యం చేసి చెప్పటం ఇందులోని ప్రత్యేకతలు. మాలి గిరిజనులు ఒరిస్సా ప్రాంతం నుంచి వలస వచ్చారు కనుక వారి పేర్లు అక్కడి పవిత్ర వ్యక్తుల పేర్లు పెట్టుకునే ఆచారం పూర్వికులకు ఉంది.అదేవిధంగా రాశులను బట్టి కూడా పేర్లు పెట్టుకునేవారు, కానీ ప్రస్తుతం టీవీల ప్రభావం సినిమాల ప్రేరణలతో స్త్రీ పురుషుల పేర్లు సుశీల,రమ,తులసి,జగపతి,రాంబాబు, భగవత్,వంటి పేర్లుగా రూపాంతరం చెందా యి,అనే విషయాన్ని ఈపరిశోధనలో వెల్లడి చేశారు.వినూత్నమైన విలక్షణమైన ఆచార సాంప్రదాయాలు అడవిబిడ్డల సొంతం. అందు లో భాగమే మాలి గిరిజనుల్లో గల “దారిపెళ్లి” ఆచారం గురించి ఇందులో పేర్కొన్నారు,చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఆడపిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి చేసే పెళ్లిని వీరు “దారి పెళ్లి” అంటారు అలా దారిపెళ్లి జరగకుండా ఆ అమ్మాయి పుష్పవతి అయితే తన వల్ల కీడు జరుగుతుందని వారు భావిస్తారు.అలాగే ఈ తెగలో గల మూడు రకాలపెళ్లిళ్ల వివరాలు అవి చేసే తీరుతో పాటు ముందు చెప్పిన దారి పెళ్లి దానితో సమాన సంబంధం గల బాల పెళ్లి విశేషాలు అవి చేసే విధానం కూలంక షంగా రెండవ అధ్యాయం సామాజిక జీవనం లో వివరించారు.మూడవ అధ్యాయం అయిన ‘ఆర్థిక జీవనం’లో కూడా అనేక ఆసక్తి దాయ కమైన విషయాలు విశేషాలు పొందుపరచ బడ్డాయి.పర్యావరణ పరిరక్షణలో ప్రధాన పాత్ర వహిస్తూ జీవనం సాగిస్తున్న ఈమాలి తెగ గిరిజనుల ప్రధాన వృత్తి కూరగాయలు పండ్లు పూలు పండించడం,కనుక వాటిని విక్రయించే సంతలతో వీరికి చాలాసత్సంబంధాలు ఉం టాయి, అలాగే పంటలు పండించడంలో వృత్తి విజ్ఞానం పాటిస్తూ ప్రారంభంలో సేంద్రీయ ఎరువులతో పంటలు పండించేవారు,కానీ కాలాలగుణంగా వచ్చిన మార్పులతో ప్రస్తుతం రసాయన ఎరువులు వాడుతూ పంటలు పండిస్తున్నారు. ఈగిరిజనులు వలసవాదులు కనుక ఎక్కువగా స్వంత వ్యవసాయ భూములు కలిగి ఉండరు. స్థానికుల నుంచి భూమిని తన ఖాగా తీసుకుని ఆరునెలలు వరిపంట, మిగి లిన ఆరు నెలలు కూరగాయలు పండిస్తారు, పంటలు పండించడంలో పురుషులు ప్రధాన పాత్ర పోషిస్తే వాటిని సంతల్లో అమ్మడం ఆడ వారు బాధ్యతగా తీసుకుంటారు, అనే అంశాలు వివరించడమే కాక వీరు వ్యవసాయంలో వాడే ఉపకరణాలను రేఖాచిత్రాలతో అందించిన తీరుఈ పరిశోధక బృందం కృషి అభినంద నీయం.
నాలుగు అధ్యాయం‘మతజీవనము’ను పం డుగలు,వేడుకలు, అనే రెండు ఉపవిభాగాలుగా వర్గీకరించి వివరించడం జరిగింది, వీరు చేసు కునే పండుగలు ప్రధానమైనవి సంక్రాంతి, మామిడిపండుగ,కొర్ర కొత్త,బుడమ కొత్త,నెల దోషం,పండుగలను పేర్కొన్నారు.వీరి పండు గలు అన్ని పర్యావరణహితంగా పంటలకు సంబంధించినవిగా సామూహికంగా జరు పుకునే విధంగా ఉంటాయి.
మాలి గిరిజనుల జీవనాధారం వ్యవ సాయం కనుక దానికి అవసరమైన పశువుల ఆరోగ్యం ఆశిస్తూ సుంకు దేవుని ఆరాధించే సామూహిక పండుగ “నెలదోషం పండుగ” దీనిని ప్రతినెలా నెలపొడుపు వచ్చాక ఆది వారం ఒక్కరోజు చేసుకుంటారు.ఇలా వీరి మత విశ్వాసాలను గురించి ఇందులో ప్రామా ణికంగా వివరించారు.
ఇక చివరి విభాగం రాజకీయ పరి పాలనలో గ్రామపరిపాలన పంచాయతీ విధా నాలను పేర్కొనడం జరిగింది గ్రామ పాలనలో మున్సబ్ పాత్ర అతనికి సహకరించే గ్రామ పెద్దల గురించి వారి వారి బాధ్యతలను అన్వ యించి సోదాహరణగా వివరించారు గ్రామా ల్లో పరిష్కారం కానితగలను పంచాయతీ ప్రెసిడెంట్ వార్డు మెంబర్లు కలిసి చేసే అంతిమ తీర్మానాలే అందరూ పాటించాలని కట్టుబాటు వారిలో ఉంది. ముగింపు అనుబంధాలలో మాలి తెగ గిరిజనులు గల విశేషమైన విషయాలు ప్రాంతా ల వారి జనాభా స్త్రీ పురుషుల సంఖ్య విద్యా భ్యాసంలో వారిస్థానం ఇళ్లరకాలు విద్యుత్ వంటి ఆధునిక సదుపాయాలకు సంబంధిం చినసంపూర్ణగణాంకాలు ఇందులో పేర్కొన్నారు ఈ ప్రాథమిక ప్రామాణిక అంశాల సాయంగా భవిష్యత్తులో ఈ మాలి తెగ జీవనం గురించి, అలాగే అందులో పేర్కొనని వారి భాషా, సాహి త్యాల గురించి సవివరమైన పరిశోధనలు చేయడానికి ఇదిమార్గదర్శనం చేస్తుంది.
మాలి గిరిజనుల జీవనవిధానం
పేజీలు :144 వేల: వంద రూపాయలు ప్రజ లకు డైరెక్టర్ ప్రచురణ విభాగం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం హైదరా బాద్,సంపాదకులు:ఆచార్య భట్టురమేష్, సెల్:-94403 56336.
సమీక్షకుడు :-డా:అమ్మిన శ్రీనివాస రాజు తెలుగు సేవకుడు,సెల్:77298 83223.

బంజారా సాహితి తొలి దీర్ఘ కవిత బతుకు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన…మన ఆదివాసీ సాహిత్యం…అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా ..వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో…వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని…పుస్తకాల వివరాలను “గవాక్షం” శీర్షికన.. “థింసా పాఠకుల” కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రసిద్ద రచయిత ‘ఆచార్య ఎం.గోనా నాయక’ కలం నుంచి జాలువారిన ‘బతుకు’) అనే పుస్తకంపై సమీక్ష – డా. అమ్మిన శ్రీనివాసరాజు

తెలుగు సాహిత్యంలో అంతర్భాగమైన జానపద సాహిత్య శాఖకు చెందిన గిరిజన సాహిత్యం ప్రారంభంలో మౌఖిక విభాగంలో ఉంది.అనంతర కాలంలో లిపిలేని గిరిజనభాషలు తెలుగుభాష సాయంగా వాటివాటి భావాలను సృజనలను ఆవిష్కరిస్తున్నాయి.అందులో భాగంగానే అభివృద్ధి చెందిన ఆదివాసి జాతుల్లో ఒకటైన లంబాడా గిరిజన సమాజానికి చెందిన ఆచార్య ఎం.గోనా నాయక్ తన రచనా పరంపరలో భాగంగా నేటి యువతకు ప్రధానంగా గిరిజన యువతకు ఆదర్శనీ యమైన తన జీవనచిత్రాన్ని‘బతుకు’పేరుతో దీర్ఘ కవిత రాశారు. దీని రచన కాలం జూలై 2022.తెలుగు సాహిత్యంలో దీర్ఘ కవితలు అనేకం ఉన్నాయి.కానీ బంజారా గిరిజన సాహిత్యం అందున అదే జన జాతికి చెందిన కవి వ్రాసిన దీర్ఘకవిత్వం లేదు కనుక ఇది’బంజారా తొలిదీర్ఘ కవిత”గా చరిత్రలో నిలుస్తుంది.మారుమూల లంబాడా తండాలో నిరుపేద కుటుంబంలో పుట్టి మేకల కాపరిగా తన జీవన ప్రస్థానం ప్రారంభించి,విశ్వవిద్యాలయ ఆచార్యులుగా ఎదిగిన ఒకలంబాడా యువకుని జీవితకథనే ఈ‘బతుకు’ దీర్ఘ కవిత సారం.
ఒకకోణంతో చూస్తే అదో వ్యక్తిగత విషయం తనస్వీయ జీవితాన్ని పుస్తకంగా వ్రాసుకున్నాడు లే!! అనుకోవచ్చు కానీ మరోకోణం నుంచి చూస్తే గిరిజనసాహితీ పరిశోధనకు ఇదో పుట్ట బంగా రం.అతిసాధారణ విషయాలను వచ్చిన కవితలుగా ఎలా వ్రాయవచ్చు కళ్ళ కు కట్టినట్టు విడమర్చి చూపిస్తుంది.పాఠకులను సైతం కవులుగా మార్చేసే నైజం ఈదీర్ఘ కవితలో ఆశాంతం అగుపిస్తుంది. ఇకపోతే గోనా నాయక్ చేయి తిరిగిన కవి వరేన్యుడు,తెలుగు భాషా సంపన్నుడు.మీరు మిక్కిలి పాఠాలను విద్యార్థులకు అర్థమయ్యే టట్టు గాక గుర్తుండి పోయేటట్టు బోధించే నైపుణ్యం గల ఆచార్య దిగ్గజం.ఈసలక్షణాల సమ్మే ళనమే‘బతుకు’దీర్ఘ కవితకు అదనపు ఆకర్షణగా నిలిచి దీనికి తెలుగు గిరిజన సాహిత్యంలో సమున్నత స్థానం కలిగింది.ఇకదీనిలో కవిగారు ఉపయోగించిన పదబంధాలు ఆయ న భాషా కండపుష్టికి సాక్షాలుగా నిలుస్తాయి.కవి గోనానాయక్ రాసిన ఈదీర్ఘ కవిత ద్వారా కేవలం నాయక్ జీవితం మాత్రమే కాదు. ఆయనలోని ఆత్మీయత కృతజ్ఞతా భావాలు ఆదర్శవంతంగా ఆవిష్కృతం అవుతున్నాయి. ‘బతుకు’దీర్ఘ కవిత ‘బాల్యంఅమూల్యం’ ఉపశీర్షిక నుంచి మొదలై‘బతుకు’అనే ఉపశీర్షిక వరకు మొత్తం30విభాగాలతో రూపొందించ బడింది. కరువు సీమ రాయలసీమప్రాంతానికి చెందిన‘నాగులగుడ్డం’తండాకు చెందిన నిరుపేద గిరిజన బిడ్డ నిరంతర కృషి,నిస్వార్థ క్రమశిక్షణ, నిండైన కృతజ్ఞతాగుణాలు,సాయంగా విశ్వవిద్యాలయ ఆచార్యుడైన విధానం మనం ఇందులో చదువు తాము.తన బ్రతుకు చిత్రంలో ఎదురైనా ప్రతిముఖ్యమైన విషయాన్ని వడిసి పట్టి అక్షరీ కరించి మన ముందు ఉంచారు.ఇందులో నాయకుడు గోనానాయక్ అయినా అతనికి సహకరించిన కుటుంబీకులను,గురువులను,మిత్రులను, సహచ రులను,ప్రతి ఒక్కరిని మననం చేసుకుంటూ ముం దుకు సాగారు. ఇది కేవలం గోనానాయక్ జీవితం మాత్రమే కాదు,యావత్ బంజారాల జీవితం, జీవ న సంస్కృతి,నాటి పల్లెలు తండాల అందాలు కళ్ళ కు కట్టి సరళమైన భాషతో అలతి అలతి పదా లతో అందానికే అందమైన అంత్యప్రాసల గుభాళిం పులు విడవకుండా చదివించే శైలి సొంతమైన ఈదీర్ఘ కవితను బహుళ ప్రయోజనకారి అనడం లో.. ఇసుమంత కూడా అతిశ యం లేదు. గిరిజన సామాజిక వర్గానికే వన్నె తెచ్చే ఉమ్మడి కుటుంబ వ్యవస్థను నాయక్‌గారి ఆవిష్కరణలో మనం దర్శి స్తాం.‘బాల్యంఅమూల్యం’ అంటూ తనతొలి జీవి తం నుంచి మొదలు పెట్టి తనకు జీవితాన్ని జీవాన్ని ఇచ్చిన అమ్మానాన్నలు గంగమ్మ భావ్యానాయక్‌ల గుణగణాలు అందరికీ ఆదర్శంగా పంచుతూ చెబు తాడు.అంతేకాదు తన తండ్రికి అంతటి సుగు ణాలను అందించిన తనతాతనాయనమ్మ రుప్లా నాయక్,సోమ్లిబాయిల త్యాగనిరతిని తలు స్తారు. కన్న ఊరు కన్నతల్లితో సమానం అని భావించిన కవిగారు తన‘బతుకు’కవనాన్ని ఆరంభిస్తారు. ‘కాలు పెట్టగానే సేద తీర్చే చెట్టు గాలి/బండలని పాషణాలని పిలువబడినా/..అవి మాత్రం తనఊరి బంగారు కొండలు అని అభివర్ణించడంలో తన మాతృభూమి మమకారం ఏమిటో అర్థం అవు తుంది. తన పండు తాను తినదు స్వార్థం లేదు/ రాయితో కొట్టిన కిందకు జార్చినా/నోట కొరికిన అమృత మిచ్చే/ అమ్మ ప్రేమ వరాలు/ నా ఊరి చెట్టు పండ్లు…అంటూ చెట్టు యొక్క నిస్వార్థ గొప్ప గుణాన్ని ఎంత చక్కగా వర్ణించారో..!! అంతే కాదు తన ఊరి చెరువును తన ఊరి పరువుతో అన్వయం చేసి చెప్పడం..కవిలోని సామాజిక స్పృహకు మచ్చు తునక.అలాగే తమ జనజాతి ఆరాధ్య దైవం సేవా లాల్‌కు కవి గోనా..అపర భక్తుడు అన్న విషయం ఈ‘బతుకు’కావ్యపుటల్లో మనకు ఆవిష్కరించ బడుతుంది.
సాధారణంగా గిరిజనుల్లో కుల కట్టుబాట్లు అధికం కులపెద్ద వారికి న్యాయమూర్తి అతను తీర్పే అంతిమం కవితాత రూపాలోని గుణ గణాలు చెబుతూ ఆయన పడ్డ కష్టాలను తమ కుటుంబీ కులను ఆదరించడంలో తన శ్రమను కళ్లకు కడు తూ..తనను వారి ఇంట సింగంగా వారి వంశ గౌరవంగా న్యాయాధినేతగా,సవ్య సాచిగా ధర్మరా జుగా ఉండి, అవమానాలను నష్టాలను ఎదిరించి నిలవడం ఎలాగో నేర్పిన కీర్తి మూర్తి అంటారు,
ఇది కవితాత్మక ఆత్మకథ అయినా ఎక్కడ దాపరి కాలు లేవు అవమానాలు అపజయాలు దాచు కోలేదు తన విద్యా ప్రయాణంలో తనకు సాయం చేసిన ప్రతి సారును మరవక తలుస్తూ చేసిన తలపోతలు గోనాగారి జ్ఞాపకశక్తికే కాదు నిండు కృతజ్ఞతా గుణానికి నిదర్శనంగా నిలుస్తాయి.గోన నాయక్ బాల్యం గురించి చెప్పు కుంటూ ‘పది విజయం సాధించిన నాకు/ భవి త అంతా సులువు కాలేదు/అంటూ పేదరి కంతోపై చదువులు చది వించే స్తోమత లేక తండ్రికి ఇంటి పనుల్లో సాయం చేయక తప్పని పరిస్థితి తనకేమో పెద్ద చదువులు చదవాలనే తపన, చివరికి నాయన అభయంతో తనపై చదువుల పయనంకు దారి దొరికింది.నీవు చదవాల/ బతుకు గెలవాల/..పది పై చదువు నీవు చదువు/ దుడ్డుల సంగతినాకు విడు/..అన్న నాయ న మాటల ద్వారా అతనికి తండ్రి లో ఆర్య పుత్రు డు రాముడు,సేవాలాల్, అం దరూ ఏకమై దర్శన మిచ్చారు. తన ఇంటర్ చదువును తనకు హంటర్ గా దారి చూపిన గురువుగా భావిస్తారు. ఇక తన డిగ్రీ చదువుకు వేదిక అయినా అనంతపురం కళా శాలను అక్కడి గురువులను తాను ఆస్వాదించిన సాహితీ సిరుల మాగాణులను మదినిండా ఆవిష్క రించుకున్నారు. అంతేకాదు అక్కడ తన బతుకు మలుపు నాటకం గురించి చెబుతూ డిగ్రీలో పరీక్ష తప్పిన విషయం అందుకు కారణమైన సంఘట నలను దాపరికం లేక ధైర్యంతో చెప్పారు.
డిగ్రీ చదివే రోజుల్లో నాటి బళ్లారి జిల్లా సింధ నూరులో మిత్ర బృందంతో కలిసి ఆడిన ‘గయోపా ఖ్యానం’నాటకం అందులో ఆయన ధరించిన అర్జు నుడు పాత్రతన నిజజీవితంలో విజయాలకు ఎలా దోహదపడిందో తెలియాలి అంటే అది చదివితేనే బాగుంటుంది.ఎప్పటికీ తన బతుకు పుస్తకంలో ఆ పుటపదిలమే అంటూ..‘ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్/ఆఫ్ ది విక్టరీ/..అంటూ జీవితాల్లో అపజయాలు సవిచూస్తూ కృంగిపోతున్న యువ తరం భుజం తట్టి భరోసా ఇస్తారు.ఇక కృష్ణదేవ రాయ విశ్వవిద్యాలయ చదువులు అక్కడి గురువు లు వారు బోధించినబోధనల గురించి‘ఫిజీ తెలుగు -దివిటి వెలుగు’లోను అనంతరం ఆయన తన సామాజిక వర్గపు అంశాన్ని ఎంచుకొని ‘సుగాలి చరిత్ర సంస్కృతి’పేరుతో చేసిన పరిశోధన గురించి ‘రిసెర్చి- రీసెర్చి’విభాగంలో అత్యద్భుతంగా అభి వర్ణించుకున్నారు.భావితరం పరిశోధక విద్యార్థు లందరికీ వీరి అంకితభావపు పరిశోధనా కృషి క్షేత్ర పర్యటనలు ఆదర్శంగా నిలుస్తాయి.‘ఆవిష్క రణకు అక్షరం ఆయువైంది/అనంతపురంలో పురు డు పోసుకున్న/పరిశోధన అన్ని వైపులకు నడి పించింది/ కొత్తగూడెం,పాల్వంచ,భద్రాచలం,/ పరుగుల ప్రయాణంలో అన్నీ కూడా/ పదనిసలు కాలేదు/ అంటూ ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని నాటి కాలంలో తాను పడ్డ కష్టాలన్నీ ఏకరువు పెట్టారు.‘నేను-ఆమె-మేము’శీర్షికలో తన వైవా హిక దాంపత్య జీవితం గురించి,తాను ఉద్యోగిం చిన హైదరాబాదు ఉస్మానియాలా చారిత్రక సొగ సులను,‘హై చరిత్రల-హైదరాబాదు’,ఉస్మానియా ఊసులులోను తనదైన కృతజ్ఞతా భావం అంతా రంగరించి అభి వ్యక్తీకరించారు, చివరిగా ‘బతుకు’ లో..‘రేపటి కోసం నేను దాచుకునేది/ డబ్బు కన్నా విలువైన జ్ఞాపకాలు..’అంటారు,నిజమే ప్రతి మని షికి పుట్టుకకు చావుకు మధ్య కొంత జీవితం ఏదో రూపంలో ఉంటుంది. కానీ అది నిరంతరం గుర్తు చేసుకునేదిగా తను పోయాక నలుగురు స్మరించుకు నేదిగా ఉండాలి.అప్పుడే ఆబ్రతుకు విలువకి అర్థం. అచ్చంగా అదే సందేశం అందిస్తుంది ఈ ‘బతుకు’ పొడుగు కవిత.
బతుకు దీర్ఘ కవితరి రచన: ఆచార్య ఎం.గోనా నాయక్,పేజీలు: 120, వెల:90/- రూ, ప్రతులకు: ఆచార్య గోనా నాయక్, సెల్: 98490 93300. సమీక్షకుడు:డా.అమ్మిన శ్రీనివాసరాజు,సెల్: 7729883223.

ఆదివాసీ పోరాట నేపథ్యం అడవి

భారత స్వాతంత్య్ర అనంతరం “మరో జలియన్వాలాబాగ” సంఘటనగా సాక్షాత్తు బిబిసి (బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్) వార్తా సంస్థ ద్వారా చెప్పబడ్డ ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లి ఆదివాసుల మారణ హోమం సంఘటన,నేపథ్యంలో ఆదిలాబాద్‌కు చెందిన ప్రముఖ రచయిత వసంతరావు దేశ పాండే వ్రాసిన ప్రజాధరణ నవల అడవి.1981 ఏప్రిల్ 20న జరిగిన “ఆదిలాబాద్ అడవి బిడ్డల ఊచకోత చర్య” ఆనాడు దేశవ్యాప్తంగా సంచలన వార్తగా నాటి పత్రికల్లో నిండి పోయింది. నాటి అక్కడి పోలీసుల కీచక చర్య పట్టణాలు నగరాల నుంచి వచ్చిన పత్రికార చయితల ద్వారా వార్తలు ఇంటర్వ్యూలు,ద్వారా సమాజానికి తెలిసింది.కానీ దాని వెనుక జరిగిన కథ ఏమిటి?అక్కడి గిరిజనులు అంతటి తిరుగుబాటుకు వీరత్వానికి కారణం తెలిపే ప్రయత్నం జరగలేదు.
స్థానికంగా పుట్టి పెరిగిన సామాజిక దృష్టి గల అధ్యాపక.వార్త రచయిత అయిన వసంత రావు గారిని ఇంద్రవెల్లి ఆదివాసీల అమరత్వం వెంటాడింది.ఏడాది పాటు ఎదురుచూశారు ఎవరైనా తనకన్నా పెద్ద రచయితలు ఇంద్రవెల్లి సంఘటన నేపథ్యంలో కథ గాని, నవల గాని, వ్రాస్తారని. ఏడాది గడిచిన తను అనుకున్న రచన రాలేదు. తన మనసులో వసంత కాలంగా రగులుతున్న ఆవేదన తీర్చుకునే ప్రయత్నం చేసి కేవలం 13రోజుల్లో నవల వ్రాసి ప్రముఖ పత్రిక వారి నవలల పోటీకి పంపారు.నవల ఆసాంతం తనకు ఇష్టమైన తన ఆదిలాబాద్ మాండలికంలో రాసు కున్నారు. కారణాలు ఏవో కానీ తాను పంపిన “అడివంటుకుంది” నవలకు సాధారణ ప్రచురణకు కూడా స్థానం దక్కలేదు. అనం తరం ఆరేళ్ల పాటు పట్టు వదలని విక్రమా ర్కుడిన పత్రికలకు పంపుతూనే ఉన్నాడు అది తిరుగుట పాలు ఇల్లు చేరుతూనే ఉంది తాను ఎంతో ఇష్టంగా మనసుపెట్టి వ్రాసుకున్న నవల, దాన్ని తన మానస పుత్రికగా అపురూపంగా భావించేవారు వసంతరావు. ఆఖరికి ఆయన స్వప్నం ఫలించి ప్రముఖ మాసపత్రిక “చతుర” వారి ఆదరణ లభిం చింది. దాని సంపాదకులు చలసాని ప్రసాదరావు గారి సూచనల మేరకు “అడవి” అనే పేరు మార్చి పాత్రల సంభాషణలకే మాండలికం పరిమితం చేసి పునః వ్రాతతో ఈ నవల పురుడు పోసుకొని 1988లో ప్రచురించబడి, లక్షలాదిమంది పాఠకుల మనసు దోచి రచయితకు మంచి పేరుతో కూడిన సంతృప్తి సొంతం చేసింది.
ఆదివాసుల జీవితాలను వారి వెతలను కళ్ళకు కట్టినట్టు అక్షర వాక్య చిత్రాలుగా ఆవిష్కరిం చిన ఈ నవలకు అదనపు ఆకర్షణ చక్కని రీడబిలిటీ, ఆగకుండా చదివించే శైలితో నవల ఉంది. దీన్ని ఆసాంతం చదవంది మరేమి చదివిన వంట పట్టదు అనడంలో అతిశయం లేదు.
1981 నాటి ఇంద్రవెల్లి మారణ హోమానికి కారణం ఏమిటి? అక్కడ అడవి బిడ్డల్లో అంతటి తెగువ రావడానికి కారకులెవరు? అంతకుముందు 40ఏళ్ల పూర్వం ఆదిలాబాద్ అడవుల్లో పరిస్థితి.కొమరం భీమ్ అమరత్వం, హైమన్ డార్ప్ నివేదికలు,స్వాతంత్ర దేశంలో ప్రజా ప్రభుత్వాల పాలన సాక్షిగా దుర్భర జీవితాలనుభవిస్తున్న అడవి బిడ్డల జీవన ముఖచిత్రమే ఈ “అడవి” నవల,
మొత్తం తొమ్మిది భాగాలుగా విభజించబడిన ఈ నవల ఆదిలాబాద్ అడవుల్లో నక్సలైట్ల కోసం ప్రత్యేక బలగాలు గాలింపు చేపడుతున్న సంఘటనతో ప్రారంభమవుతుంది. ఆ ప్రాంత గిరిజనులకు నక్సలబరీ ప్రాంతంలో ప్రారంభమైన ఉద్యమం దాని నాయకులు కనుక వారిని నక్సలైట్లు అని పిలవాలనే భాషా పరిజ్ఞానం లేదు, తమ కష్టాలు పంచుకుని సాయం చేసేవారు కనుక ఆత్మీయంగా “అన్నలు” అని పిలుచుకుంటారు.
అన్నలకు సహకరించిన, సమాచారం తెలిసిన, ఆహారం అందించిన,పోలీసుల దృష్టిలో నేరస్తులే!! అందుకు ప్రతిఫలంగా పోలీసులు వేసే శిక్షలు భరించాలి కేసులు ఎదుర్కోవాలి నిజంగా కార్యకలాపాలు చేసేవారు గాక, పోలీసులు అనుమానించిన వారు సైతం పోలీసులు వేసే దుర్మార్గపు శిక్షలు అనుభవించాలి. అందులో భాగంగా గిరిజన గ్రామాల్లో ఉచితంగా వైద్య సేవలు చేస్తున్న డాక్టర్ సిద్ధార్థను నక్సల్స్ సానుభూతిపరునిగా తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడం మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది, అదే సమయంలో రైతు కూలీ గిరిజనులు ప్రజాస్వామ్యంగా ఇంద్రవెల్లి గిరిజన గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోరుతూ అర్జీ పెట్టుకోవడం, దానికి పోలీసు అధికారులు సమావేశం ముందు రోజు వరకు అనుమతి ఉందా? లేదా! అనే విషయం కూడా చెప్పకుండా గిరిజనుల జన బలం అంచనా వేసుకుంటూ సభ జరిగే ప్రాంతాన్ని పోలీసులు మోహరించి అటువైపు వచ్చే గిరిజనులను అడ్డగించే ప్రయత్నం చేయగా చీమల బారుల్లా ఇంద్రవెల్లికి చేరిన గిరిజన జన సముద్రం ధాటికి పోలీసులు నివ్వెర పోవడంతో… మొదటి అధ్యాయం ముగుస్తుంది.
ఈ గిరిజన విప్లవ వాహిని కి కారణం అయిన మూడు తరాల గోండు గిరిజనుల వెతలతో మిగిలిన ఏడు అధ్యాయాలు కొనసాగుతాయి.
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పోలీసు పైశాచిక చర్యగా అభివర్ణించబడ్డ “1981 ఏప్రిల్ 20 ఎదురు కాల్పులు” ఇంద్రవెల్లి గిరిజన గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే రీతిలో అమాయకపు ఆదివాసులను అమానుషంగా తుపాకుల కాల్పులతో కాల్చి చంపడం,లెక్కకు అందని శవాలతో ఇంద్రవెల్లి పరిసరాలు శవాల గుట్టలుతో..హృదయ విధారకంగా మారడం,అమాయకపు గిరిజనులు అనాధ శవాలలా పడి ఉండటం, పోలీసుల భయంతో కనీసం ఈశవం నా భర్తది,ఈ శవం నాకొడుకుది భార్యది బిడ్డది, అని చెప్పడానికి కూడా ముందుకు రాలేని మూగ రోదనలతో ఇంద్రవెల్లి భూమి, అడవి రక్తసిక్తంగా మారడం, మనం ఆఖరి అధ్యాయంలో చదువుతాం.
కోసమెరుపుగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డు వద్ద రైలు పట్టాల పక్కన ఇంద్రవెల్లి కాల్పుల్లో మరణించిన కేవలం 13 మంది గిరిజనుల శవాలు మరుసటి రోజు లారీలో తీసుకువచ్చి సామూహిక పోస్టుమార్టం చేసి శవ సంస్కారం చేయడం కనిపిస్తుంది, అంటే పోలీసుల అధికార లెక్కల ప్రకారం అంతటి మారణ హోమంలో చనిపోయింది కేవలం 13మంది మాత్రమే..!!
ఇక మూడు తరాలుగా ఆదిలాబాద్ అడవుల్లోని గిరిజనులు అనుభవించిన కష్టాలు,కారణాలు వివరించిన మిగిలిన ఏడు అధ్యాయాలు ఆసక్తికర సంఘటనలతో కొనసాగుతాయి. నవల మొత్తంలో నాయకుడు గానీ నాయకి గానీ ప్రత్యేకంగా కనిపించరు, నవల మొత్తం సంభాషణలతో సాగుతున్న ఒక ప్రత్యేక ప్రాంతానికి జాతికి సంబంధించిన విషయ విశేషాలను రచయిత అక్షరాల్లో బంధిస్తూ భావితరాల కోసం భద్రపరుస్తున్న తీరు కనిపిస్తుంది,
ఆదిలాబాద్ అడవుల్లో ప్రధానంగా గోండు, కోలాం,పరదానులు,అనే గిరిజన తెగలు జీవనం సాగిస్తున్నాయి.వీరు వాస్తవానికి భూమి జాగాలేని నిరుపేదలు కాదు, వందల సంవ త్సరాల క్రితం గోండు రాజ్యం పాలించిన పాలకులు, వందల ఎకరాల సాగుభూములు గల భూస్వాములు,కాలక్రమంలో వచ్చిన మార్పులు వారిలోని అతి మంచితనం, అనే అమాయకత్వంతో మారిన పాలకుల అఘాయిత్యాలతో, నేటితరం ఆదిలాబాద్ గిరిజనులు అంతా సాగుభూములు కోల్పోయి, కష్టపడి కొట్టుకున్న పోడు భూముల్లో ఆరకొర పంటలు పండించుకుంటూ…గిరిజనేతరులు చేస్తున్న అరాచకాలతో.. వారి భూముల్లోనే కూలీలుగా మారి పొట్టకూటి కోసం పడరాని పాట్లు పడ్డ విచిత్ర పరిస్థితి ఆ అడవి బిడ్డలది.
నిత్యం నిజాయితీతో అడవులను ఆశరా చేసుకొని మాయా మర్మం తెలియక కాయ కష్టం నమ్ముకుని అతి సాధారణ జీవనం సాగిస్తున్న ఈ గిరిజనుల్లో ఇంతటి చైతన్యం, సంఘటితత్వం,పోరాటపటిమ,ఎలా కలిగింది? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ “అడవి” నవల.
“ఎప్పుడైతే వ్యక్తికి గానీ వ్యవస్థకు గాని పీడన, అణచివేతలు, ఎదురవుతాయో అప్పుడే అక్కడ చైతన్యం, పోరాటం పుట్టుకొస్తాయి” అన్న చారిత్రక సత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ నవల.
ఈ ప్రాంత అడవి బిడ్డలను ఒకవైపు రెవిన్యూ అధికారులు,మరోవైపు అటవీ అధికారులు ఇంకోవైపు పోలీసులు ఆప్కారి అధికారులు, తమ తమ అధికారాలు అడ్డుపెట్టుకుని వారి ఆస్తులు మానప్రాణాలు కొల్లగొడుతుంటే… మరోపక్క ఆహార పదార్థాలు అమ్మే నెపంతో వ్యాపారులు ఆదివాసుల రెక్కల కష్టాన్ని వాళ్లలోని నిరక్షరాస్యత వల్ల ఆర్థిక దోపిడీ చేస్తూంటారు. పేదలను నిరుపేదలుగా మారుస్తూ… కట్టుబట్టలతో గిరిజన గుడాల్లో వ్యాపారాలు ప్రారంభించిన విఠల్,రాఘవులు, వంటి వ్యాపారులు కొద్ది రోజుల్లోనే లక్షాధి కారులుగా మారిన సంఘటనలు ఈ నవలలో మనం చదువుతాం.
అమాయకపు ఆదివాసులు చేయని తప్పులకు ఎలాంటి వేధింపులు శిక్షలు అనుభవించేవారో చెప్పడానికి రచయిత కథానుగుణంగా కొన్ని సంఘటనలు తెలియజేశారు.
నిరుపేద కోలాం గిరిజనుడైన బాజీరావు బిడ్డ పెళ్లి కోసం ఇంటి ముందు వేసిన పందిరికి గాను అటవీ అధికారి చౌకీదారు అడిగిన “పందిరి మామూలు” చెల్లించలేక చౌకీదారి చేతిలో చావు దెబ్బలు తిని అవమానం పాలు కావడమే కాక…చివరికి పందిరి మామూలు కోసం తరతరాలుగా తమ ఆచారం ప్రకారం నడుముకు ధరించే వెండి మొలతాడును చౌకీదారి తెంపుకోవడం భరించలేక పోతాడు, కోలాం గిరిజనుల్లో చనిపోయినప్పుడే మొల తాడు తెంపుతారు అది వారి ఆచారం, కానీ పేదరికం వల్ల బాజీరావు బ్రతికుండగానే మొలతాడు తెంపించుకొని తన సంప్రదాయం తప్పి తల్లడిల్లుతాడు.
ఈ సంఘటన గిరిజనులు పేదరికంలో సైతం ఆత్మాభిమానంతో తమ అస్తిత్వం కోసం ఎలా తపిస్తారో సాంప్రదాయాలు ఎంతగా గౌర విస్తారో అర్థమవుతుంది.
గోండు తెగకు చెందిన జంగు,అతని బావమరిది సోములను తమకు సంబంధం లేని గంజాయి పంటకు బాధ్యులను చేస్తూ ఆబ్కారి అధికారులు, పోలీసులు, కలిసి చేసిన చిత్రహింసలు, చదువుతుంటే గుండెలు ఆర్థత చెంది కళ్ళు చెమరుస్తాయి. కాలికి దెబ్బ తగిలి నడవలేని స్థితిలో జ్వరంతో బాధపడుతున్న సోము ను అడవిలో గంజాయి పంటలు చూపించాలనే నెపంతో గుర్రానికి తాడుతో కట్టి ఈడ్చుకుంటూ వెళ్లడం,జంగు సోములతో గంజాయిపంటల ఆచూకీ చెప్పించడం కోసం చేసిన అమానుష పోలీస్ చర్యలను చెబుతూ….ప్రాణాలు పోయినా గిరిజనులు నీతి తప్పి అబద్ధం చెప్పరు అనే నిండు నిజాన్ని రచయిత ఆవిష్కరించారు.
కోలాం జాతికి చెందిన ముక్కుపచ్చలారని “మోతి”అనే చిన్నారిని రెవెన్యూ ఉద్యోగులు ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారం చేసి,అనుభవించి,చిన్నారి చావుకు కారణం కావడం,లాంటి చర్యలు ఆనాటి ఆదివాసీ సమాజంలో పాలకులు చేసిన ఆకృత్యాలకు అద్దం పడతాయి.
సహనానికి ఒక హద్దు ఉంటుంది సహనన్న సిస్తే జరిగే పరిణామాల గురించి రచయిత పేర్కొన్నారు.శ్యామ్ కోలాం,సేర్ దార్ ను ఎదు ర్కొని కిందకు తోసి వేయడం,జంగు తన భార్య దేవు బాయ్ చేయి పట్టి చెరచ బోతుండగా ఆవేశంతో ఠానేదార్ తల మీద కర్రతో కొట్టి చంపడం,వంటి చర్యలు గిరిజనులకు ఉండే ఆగ్రహం స్థాయి ఎలాంటిదో ఆవిష్కరిస్తాయి.
ప్రాణ భయంతో జంగు అజ్ఞాతంలోకి వెళ్లడం, చివరికి అప్పటి గోండుజాతి దైవంగా పోరాట సేవలు చేస్తున్న కొమరం భీముని కలవడం భీమ్ జోడేఘాట్ పోరాటంలో అమరత్వం చెందటం ఏడవ అధ్యాయంలోనూ…భీమ్ మరణం తర్వాత జరిగిన పరిణామాలు స్వరాజ్యదేశంలోనూ అడవి బిడ్డలకు తప్పని తిప్పల గురించి ఎనిమిదవ అధ్యాయంలోనూ రచయిత వివరించారు.
ఒకవైపు తిరుగుబాటులకు గల కారణాలు ఆవిష్కరిస్తూ…మరోవైపు స్వరాజ్యం ముందు తర్వాత గిరిజనుల స్థితిగతులు వివరిస్తూనే స్థానిక గిరిజన గుడేలు అక్కడ మనుషుల ఆచారాలు ఆహారాలు,జీవన విధానాలు దృశ్యరూపం చేసి ఆవిష్కరించడంలో రచయిత వసంతరావు దేశ పాండె శతశాతం విజయం సాధించారు అనడంలో అక్షర సత్యం ఉంది.
నేటి ఆధునిక కాలానికి చెందిన ఒక ప్రాంతపు గిరిజన పోరాటాన్ని తిరుగుబాటును వాస్తవ రూపంలో సహజసిద్ధంగా ఆవిష్కరించిన తొలి తెలుగు గిరిజన నవలగా “అడవి” తెలుగు నవలా చరిత్రలో నిలిచిపోతుంది.
నవల చివర్లో మూడు అక్షరాల అడవి యొక్క ఔదార్యం గురించి రచయిత చెప్పిన మాటలు చదివితే నాస్తికులు సైతం అడవి తల్లికి మోకరిల్లి నమస్కరిస్తారు.
అడవి (నవల)
రచన : వసంతరావు దేశపాండె,
పేజీలు : 256,
వెల : 150/- ,
ప్రతులకు : రచయిత
సెల్ : 94400 01166,
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు,
సెల్ : 77298 83223.

ఎన్నెల నవ్వు..

తెలుగు సాహిత్యంలో గిరిజనజీవితాల నేపథ్యంలోకొన్ని నవలలు వెలువడ్డాయి.కానీ అవి అన్ని గిరిజ నేతర రచయితలు రాసినవి.ఒంగోలు గద్దర్‌గా పేరు పొందిన ప్రజావాగ్గేయకారుడు.ఇ.విగా జనం ఎరిగిన అరుణ పతాక ప్రేమికుడు ఏకుల వెంకటేశ్వర్లు తన స్వీయ జనజాతి ‘యానాది గిరిజ నులు’ అనుభవిస్తున్న స్థితిగతులకు చేసిన అక్షర రూప చిత్రమే “ఎన్నెలనవ్వు”నవల.భూస్వాములు అగ్రవర్ణాల వారి ఆధిపత్యాలకు తోడు బ్రిటిష్ కాలం నాటి“క్రిమినల్ ట్రైబల్‌యాక్టు”వంటి రాక్షస చట్టాలను పోలీసులు నేటికీ అమలు పరుస్తూ యానాదులను అక్రమ అరెస్టులు చేస్తూ,యానాదులు అంటేనే అగ్రకులాల వారికి చాకిరీ చేసే నిత్య సేవకులు,అనే భావన నేటికీ ఉండటం శోచనీయం. ఈనవల ప్రథమ ప్రచురణ కాలం 2011,అశేష పాఠ కాదరణ పొంది 2018లో ద్వితీయ ముద్రణ పొందటంలోనే ఈ నవల యొక్క ప్రత్యేకత చెప్పకనే చెబుతుంది.రచయిత ఇ.వి స్వతహాగా గాయకుడు కళాకారుడు.“సాయుధ పోరాటమే సర్వరోగ నివారిణి”అని నమ్మిన అనుభవైక్య సృజన కారుడు. చాలా సంవత్సరాలుగా తన యానాది జనజీవులు అనుభవిస్తున్న దుర్భర జీవితాల తాలూకు కన్నీళ్లను తనలో దాచుకోగా కలిగిన ఆవేదనల సముద్రం నుంచి వెల్లువెత్తిన అక్షర అల్పపీడనమే ఈ యానాది బతుకుల చారిత్రక నవల “ఎన్నెల నవ్వు”.
ఇది అక్షరాలతో పేర్చిన సాధారణ నవల కాదు..అనేక శబ్దాలు, జీవితాల, రూపాలకు చిత్రరూపం ఇచ్చిన నవల. దీనిలో ఆడంబరపు వర్ణనలు కనిపించకపోయినా సహజసిద్ధమైన నాటకీయతతో నెల్లూరు ప్రాంత మాండలికపు పాత్రోచిత సంభాషణలతో సాగిన ఈ నవలా చదువుతుంటే ప్రతి వాక్యం దృశ్య రూపమై ఆయా పాత్రలు మన కళ్ళముందే కదు లుతూ సంభాషించుకుంటున్న అనుభూతి కలుగు తుంది,పాఠకులుకాస్త ప్రేక్షకావతారాలు ఎత్తా ల్సిందే..!! యానాది గిరిజనుల బ్రతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన ఈ నవల విషయానికి వస్తే దీనిలో మొత్తం 20అధ్యాయాలు ఉన్నాయి, మంగమ్మ అలివేలు అనే యానాది గిరిజన మహిళల నేప థ్యంలో సాగిన ఈనవలలో అలివేలు కొడుకు “చెంచులు” అమ్మమ్మ ప్రోద్బలంతో పదవ తరగతి వరకు చదివిన అతడు వాళ్ళ యానాది కుటుంబా లలోనే ఏకైక చదువరిగా నిలిచిన పాత్ర.ఈ నవల యావత్తు యానాది గిరిజన ప్రజలు అనుభవిస్తున్న పేదరికం వివక్షత ఆవిష్కరిస్తుంది.భావితరాల కోసం యానాది ప్రజలబ్రతుకు చిత్రాన్ని భద్ర పరచినచారిత్రక నవలగా కూడా దీనిని చెప్ప వచ్చు. యానాదులు అంటేనే శారీరక శ్రమకు చిరునామాదారులుగా నిలిచి మగవారు తమ జాతికి గల నేరస్తులు అనే అనాది ఆచారానికి బలి అవుతుండగా కొందరు యానాది మహిళలు వయసు రీత్యా కలిగిన అందంతో గిరిజనేతర పురుషుల వలలోచిక్కి తమ మానప్రాణాలు అర్పిం చుకుంటున్న త్యాగజీవులుగా మిగిలి పోతు న్నారు.దేశానికి స్వాతంత్రం రాజ్యాంగం అమలు అవుతూ దేశ ప్రజలందరికీ సమానత్వం స్వాతం త్రం అందాయని సంబరపడుతున్న....ఇది భౌతిక మార్పు మాత్రమే కానీ ఆలోచనపరమైన మానసిక మార్పు రావాలి అనే ఆశయం ధర్మగ్రహం రచయిత దృక్పథం లో కనిపిస్తుంది.సమాజం ఎంత ఆధునీకరించబడ్డ, ఎన్ని కొత్తచట్టాలు వచ్చినా, అగ్రవర్ణ ధనవంతులలో మానవత్వపు సమ భావనఅనే ఆలోచనఆచరణా త్మకంగా రానప్పుడు,బాధితవర్గాల వారిలో విద్యాపర మైన ఎదుగుదల వ్యసన రాహిత్య సంస్కారం పెర గాలి.అప్పుడే మన దేశనాయకులు ఆశించిన సమ సమాజ భావన ఆవిష్కృతం అవుతుందనే హెచ్చరికతో కూడిన సందేశం అందించారు రచయిత ఇ.వి. ఇక ‘ఎన్నెలనవ్వు’నవల కథాంశానికి వస్తే అక్కడి యానా దులంతా తమ గుడిసెల సముదా యానికి హుందాగా పెట్టుకున్నపేరు‘సింతతోపు సంగం’,దానికి కొద్ది దూరంలోగల మరో యానాది పల్లె ‘దొరపుసంగం’కథ ఈరెండు పల్లెలకు పరిమితం కాగా..ప్రధాన పాత్ర లుగా మంగమ్మ,అలివేలు,పోలయ్య,మునెయ్య, చెంచులు,కోటిరెడ్డి,చిటికెలోడు కనిపిస్తారు.వీరికి అను బంధంగా నరసయ్య,పర్వతాలు,పెంచలమ్మ,వెంకా యమ్మ,పక్కిలోడు,బుర్రమ్మ,కన్నయ్య,నాయుడు, మొద లైన పాత్రలు నవలలో ఆయా సందర్భాలను బట్టి ఆగు పిస్తాయి.సింతతోపు సంగానికి చెందిన యానాది మహిళ మంగమ్మ యవ్వనంలో తెలియని తనంతో భావనారాయణద్వారా తల్లిఅయి‘అలివేలు’అనే అమ్మా యికి జన్మనిచ్చి తనతప్పు తెలుసుకొని భార్య చని పోయిన ఇద్దరు పిల్లల తండ్రి‘పోలయ్య’తో కలిసి జీవ నం సాగిస్తూ ఇద్దరూ పిల్లలను సొంత బిడ్డల్లా సాకు తూ తమ అన్యోన్య దాంపత్యం సాగిస్తుండగా.. అలి వేలు వయసుకు వచ్చి కూలిపనులకు వెళుతూ కోటిరెడ్డి అనే మృగాడి మాయలో పడుతుంది.విషయాన్ని పసిగట్టిన మంగమ్మ తన బతుకుల తనబిడ్డ బ్రతుకు చీకటిమయం కారాదని తమదగ్గరి బంధువుల పిల్లాడు ‘మునె య్య’తో అలివేలు పెళ్లి తనయానాది కుటుంబ సాంప్రదాయం ప్రకారం జరిపించి సంతృప్తి చెందు తుంది. అలివేలు మునెయ్యల దాంపత్య జీవితానికి ప్రతిఫలంగా ‘చెంచులు’అనే పిల్లాడు పుడతాడు. పిల్లాడు పుట్టకముందే మునెయ్య అత్తవారి ఊరిలో అగ్రవర్ణ కుటుంబంలో జరిగిన బంగారు నగ దొంగ తనం నేరంకు వారి ద్వారా దెబ్బలు తిని అవమానాలు ఎదుర్కొని,తమ జాతివారి మీదగల‘చిటాకు’ (క్రిమినల్ ట్రైబల్ యాక్ట్) వల్ల జైలుజీవితం తప్పదనే భయంతో ఇంటి నుండి పారిపోయి అదృశ్యం అవుతాడు.అలా భర్తను కోల్పోయి మగబిడ్డతో కలిసి తల్లితోనేఉంటుంది అలివేలు.అలివేలు కొడుకు చెంచులు అమ్మమ్మ మంగ మ్మ పెంపకంలో పెరుగుతో తనదైన ప్రతిభతో ఎదు గుతూ..చదువుకుంటూ తనసమాజంలో తనకు ఎదు రవుతున్న అవమానాలు,ముఖ్యంగా కులంవల్ల జరుగు తున్న అసమానతలు,సంఘటనలు ప్రత్యక్షంగా గమ నిస్తూ మార్పుకోసం తన పేదరికం సాయంగా సాహస యాత్ర సాగిస్తూ ఉన్నత పాఠశాల దశకు చేరు కుం టాడు.అక్కడ అనసూయ అనే అగ్రవర్ణపు అమ్మాయితో స్నేహించబడి చివరికికులం కారణంగా ఆమె స్నేహం కోల్పోయి ఆవేదనపడతాడు.మనుషులను దూరం చేస్తు న్న కులదుర్మార్గం మీద కోపగించుకుంటాడు. చెంచు లు తల్లి అలివేలు కొడుకు కన్నా తనసౌఖ్యం తాను చూసుకుని,ఇల్లు విడిచిపోవడంతో తను తోటి పిల్లల వద్ద అనాధగా అవమానాలు ఎదుర్కొంటూ అమ్మమ్మ అందిస్తున్న ఆదరణతో ఎదుగుతున్న క్రమంలో, కులం కుళ్ళు పోగొట్టి సమాజంలో సమత మమత ప్రేమాను రాగాలు పంచే లక్ష్యంతో సాగుతున్న కమ్యూనిస్టు సంఘంతో తనకు సాన్నిహిత్యం కలుగుతుంది. దరి మిల సంఘం కార్యాచరణలో భాగంగా దళ సభ్యులతో కలిసి గిరిజన గుడాలు తిరిగిన చెంచులకు చెంచులు కి తమజాతి వారి కన్నా దుర్భరమైన జీవితాలు అను భవిస్తున్న అడవుల్లోని గిరిజనుల జీవితాలు ప్రత్యక్షం గా చూస్తాడు, దానితో సమాజ చైతన్యం మీద మరింత బాధ్యత పెరుగుతుంది చివరికి చెంచులు బృందం పోలీసుల కంటపడటం వారు తొలి తప్పుగా భావించి కాలేజీ విద్యార్థులు అనే సానుభూతితో వదలడంతో, పోలీసుల చెరనుంచి క్షేమంగా ఇల్లు చేరతాడు చెంచులు.తను గిరిజన గుడాలకు వెళ్లే ముందు రోజు రాత్రి అతని తల్లి అలివేలు చెడు తిరుగుళ్లు తిరిగి రోగాల పాలై చావుకు చేరువై ఇల్లు చేరుతుంది.కడుపు తీపితో కన్న బిడ్డను కాపాడుకోవడానికి తపిస్తుంది మంగమ్మ,యవ్వనపు పొంగుతో చేసిన తప్పులకు శిక్షగా చావు తెచ్చుకొని కొడుకు చివరి చూపు కోసం పరితపించిన అలివేలు అతి కష్టం మీద కొడుకును చూసుకుని కన్నుమూస్తుంది.

సమాజంలోని కులం కుళ్ళు పోయే రోజుల కోసం చెంచులు ఆలోచనలతో….“ఎన్నెలనవ్వు”నవల ముగుస్తుంది. ఈనవల యానాది ప్రజల దుర్భర జీవి తాలను ఆవిష్కరించడమే కాక వారి జీవన పద్ధతు లను,సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కడుతూ ఆ జన జాతి చైతన్యానికి దోహదపడుతుంది.
అలివేలు మునెయ్యల పెళ్లి సందర్భంగా వారి ఆచారాలకు సంబంధించిన అనేక విషయాలు ఆవిష్క రించారు రచయిత,సీతారాముల కళ్యాణం జరిగే అభిజిత్ లగ్నాన్నే యానాదులు ‘గడ్డపారం ముహూ ర్తం’గా భావించి తమ పెళ్లిళ్లు చేసుకునే ఆచారం నేటికీ పాటిస్తారు.పేదరికంతో వారు తినే ఆహార పదార్థాలకు ఉన్నతమైన పేర్లు పెట్టుకుని పిలుచు కుంటూ తమ ఆత్మాభిమానం గౌరవాలు కాపాడు కుంటున్న వైనం కూడా ఈనవలలో మనం చదవ వచ్చు.యానాదులు పెళ్లిళ్లు వారిజాతికి చెందిన వ్యక్తు లే వారికి తోచిన మంత్రాల వంటి మాటల సాయంతో చేస్తారనే విషయం ‘పక్కెలోడు’ అలివేలు పెళ్లి తంతు చేసిన సందర్భంగా రచయిత చెబుతూ… మనుధర్మ వ్యతిరేకి అయిన రచయిత యానాదుల వంటి కడ జాతుల వారి ఇళ్లకు వచ్చి పెళ్లిళ్లు చేయడానికి బ్రాహ్మ ణులు రారు అనే భావం వ్యక్తపరుస్తారు. యానాది జాతి స్త్రీ పురుషులు తమ జీవితాలను అగ్రకులాల వారికి అర్పించుకోవడానికే పుట్టారా?అన్న భావనను రచయిత అలివేలు,మునెయ్య,పక్కెలోడు,పాత్రల ద్వారా వ్యక్తపరిచారు.
ఇలా యానాది గిరిజనజాతి నేపథ్యం చుట్టూ సాగిన ఈనవల అన్నివర్గాల పాఠకుల చేత ఆగకుండా చదివిస్తుంది, నిరాడంబర శైలితో నిజజీవితాలను ఆవిష్కరించిన ‘ఎన్నెలనవ్వు’ తెలుగు నవలా సాహి త్యంలో ఉత్తమోత్తమ సంపూర్ణ స్వానుభవ తొలి గిరిజన నవల అనడంలో సందేహం లేదు.
ఎన్నెల నవ్వు యానాది నవల
పేజీలు : 200, ధర :100/-,ప్రతులకు : పల్నాటి శ్రీరాములు, ఒంగోలు, సెల్:98499 44170,
సమీక్షకుడు :డా అమ్మిన శ్రీనివాసరాజు, సెల్:77298 83223.

ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాధలు

మానవజాతికి మూలాలుగా చెప్పే మూలవాసుల్లోని ఒక అటవిక తెగగా,మహాభారత గాథలో తిరుగులేని బాణవిద్యలో సవ్యసాచి అర్జునుడికి సాటిగా ప్రతిభ చూపటమే గాక,అనిర్వచనీయమైన గురుభక్తి, అంతులేని త్యాగనిరతి,చాటిన ఏకలవ్యుడు వారసులైన ఎరుకల జాతి జీవన వేదన పొది, ఈ “ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు”కథా సంపుటి,రచయిత పలమనేరు బాలాజి. ఈ కథ రచయిత ప్రకటించినట్టు తెలుగు సాహిత్యములో తొలి ఎరుకల కథా సంపుటి ఇదే! అంతేగాక రచయిత తన జనజాతి ఈతి బాధలను అనుభవించిన స్వానుభవంతో వ్రాసిన కథా సంపుటి,అచ్చంగా ఇది నేటి ఆధునిక స్వానుభవ గిరిజన సాహితీ శ్రేణిలో కలుస్తుంది, రచయిత ఆశించినట్టు ఏకలవ్యుడు వారసులుగా మరి కొంతమంది సృజన కారులు వెలుగొందాలని కోరుకుంటూ…ఈ కథా సంపుటిలోకి నడుద్దాం…!! – డా. అమ్మిన శ్రీనివాసరాజు
కథా రచయిత బాలాజి గారు ఉన్నతమైన ప్రభుత్వ అధికారిగా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే… ప్రవృత్తిగా మూడు దశాబ్దాలుగా తెలుగు కథాక్షేత్రంలో వీరవిహారం చేస్తూ వచ్చి,ఇటీవలే సొంత జన జాతీయుల ఆస్తిత్వం,అవమానాలు,కష్టాలు,సంస్కృతి,బాహ్య ప్రపంచానికి తెలిపే క్రమంలో తాను నేర్చిన కథాప్రక్రియ సాయంగా అక్షర కృషి చేస్తున్నారు. ఇక ఏకలవ్య కాలనీ విషయానికి వస్తే ఇది 18కథలతో వెలువరించిన కథా సంపుటి.ఈ కథలన్నీ రచయిత అనుభవాల నుంచి ఆవిష్కరించబడ్డ అక్షర దొంతర్లు,అన్ని కథలకు కేంద్రం ఏకలవ్య కాలనీనే! రచయిత జీవితంలో జరిగిన సంఘటనలే కథలుగా జీవం పోసుకున్న జీవితగాధలు, కథకు కథకు సంబంధం లేకుండా సమ్మిళితం చేసినా బాహ్యంగా చూస్తే ఇది ఒకకథా సంపుటిలా గాక, ఒక ఎరుకల కుటుంబం తన జన జాతి వారి కోసం చేసిన త్యాగం సాయం చేయూతల తాలూ కా చిరు నవల,లా ఆగుపిస్తుంది.ఈనవలా నాయకుడు కూడా బాలాజి అనబడే ఏకలవ్యుని వారసుడే…పుట్టిన గ్రామం పేరే ఇంటిపేరుగా మార్చుకున్న జన్మభూమి ప్రేమికుడు.అంత పేదరికంలో తోటి వారి అవమానాలు, హేళనలు లెక్కచేయకుండా జాతి వికాసానికి విద్య ఒక్కటే సాధనం ఆయుధం అని నమ్మిన బాలాజి తల్లిదండ్రులు,బాలాజి,తన భార్య పిల్లలు చదువుల సాయంగా ఎదిగిన వైనం,ఇందులో మనం ప్రత్య క్షంగా పరిశీలించవచ్చు.
విద్యా కుటుంబానికి చెందిన‘జయమ్మ’ చదువుకుని ఉద్యోగం చేయకపోయినా చక్కని సంస్కారంతో తన పిల్లలను సాకి తద్వారా తన కాలనీ వాసులందరికీ ఆదర్శంగా నిలిచింది.ఆసరాగా ఉండింది. పొరుగు వారికి సాయం చేయడంలో ఆమె మన కాలపు మదర్ థెరీసా గా నిలిచింది.చిన్న చదువుతో అదృష్టంగా తనదైన సేవాభావం పుణ్యంకొద్దీ అటవీశాఖలో చిరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన జయమ్మ భర్త నాగయ్య ఏనాడూ ఇతరులను కష్టపెట్టని సౌశీల్య పరుడు.ముఖ్యంగా తన ఎరుకలజాతి యావత్ కష్టా లను తన కష్టాలుగా భావించి అన్నివిధాల సాయం చేస్తూ ఉద్యోగ జీవితం కొనసాగించి,11నెలల జీత గాడుగా పేరు పడ్డ నాగయ్య ఉద్యోగ జీవితం నేటి తరానికి ఆదర్శం.ఈ ఇద్దరు రచయిత అమ్మ అయ్యలు కావడం ఒక విశేషం!
ఈసంఘటనల కథనాలు తొలి కథ‘11 నెల ల జీతగాడి కథ’.మలికథ ‘ఆయమ్మ అంతే ఆమె ఒక మదర్ థెరిసా’కథల్లో మనం ప్రత్యక్షంగా మరి కాస్త వివరంగా గమనించవచ్చు.11నెలల జీతగాడి కథ మొదలు‘ఏకలవ్య కాలనీ’ వరకు సాగిన ఈకథల బండిలోని ప్రతికథఆధునికకాలంలో ఎరుకలవాళ్ళు ఎదుర్కొంటున్న సామాజిక అవమానాలు, నష్టాలు, కష్టాలు,కళ్ళకు కట్టినట్టుఆవిష్కరించబడ్డాయి.కథా వస్తువులు అన్నీ ఎరుకుల వారి కష్టాలే! కానీ ఎత్తు గడ,ముగింపు,కథనం,అన్ని ఆసక్తిదాయ కంగా నవ్య నూతనంగా సాగి ఒకవైపు కథా రచయిత ప్రతి భాపా ఠవం ఆవిష్కృతం అవుతూనే…మరో వైపు ఎరుకల సామాజిక వర్గానికి స్ఫూర్తిని, భరోసాను, అందిస్తూ జాతి అస్తిత్వాన్ని పారద్రోలే మార్గంలో నడుస్తూ… గతంలో తమ జాతీయలు చేసిన సేవ,పోరాటాల గాథలు,అందిస్తూ మార్పు వెనువెంటనే రాదని, నిరు త్సాహపడకుండా…లక్ష్యం వీడకుండా ముందుకు సాగాలని,ఫలితాలు మన తర్వాతతరం వారికైనా అందుతాయి అనే సత్యం చాటుతూ, చేయూతలోని సఫలతను ఎంతో చక్కగా ఆవిష్క రించారు బాలాజి తన జాతిజీవన గాథల్లో. అమర జీవి మా కాంతమ్మత్త, ఉడుకోడు,అనే ఈ రెండు కథలు ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సామాజిక యోధులు చేసిన త్యాగాల తాలూకు వ్యధలు ఆవిష్క రించిన అద్భుత కథలు. చదువు విలువచాటుతూ నిజాయితీ గొప్పతనం చెబుతూ,మనం ఇతరులకుచేసిన సేవతాలూకు సేవా ఫలం మన మరణం అనంతరం మనలను సజీవు లుగా నిలుపుతుందనే గొప్పవిషయం చెబుతూ.,నిజా న్ని నిజంగా చెబుతూ చివరికి తన ప్రభుత్వ ఉద్యోగం కూడా వదులు కొని తనకంటూ ఏమీ ఆశించకుండా తన కాలనీ అభివృద్ధి,తమ ఎరుకలజాతి యువత ఉన్నతి కోసం నిర్విరామంగా కృషిచేసి,అధర్మంపై ఆగ్ర హం చూపిస్తూనెత్తురు ఉడికిపోయే ఆవేశంతో ఊగి పోతూ…ఊరందరిచేత ఉడుకోడు అని ముద్దుగా పిలి పించుకునే ఎరుకల నరసింహులు చనిపోయాక అత ని సేవాగుణం అభిమానంగా ఎలా రూపాంతరం చెందిందో! వివరంగా తెలియాలి అంటే‘ఉడుకోడు’ కథ ఆసాంతం చదవాలి.ఎరుకల జాతిస్త్రీలలో చైత న్యం కలిగించిన స్వజాతి స్త్రీమూర్తి కాంతమ్మ,చైతన్యపు వైనం ఆమెచేసిన సేవలకు అద్దం పట్టిన కరుణ రసా త్మక కథ ‘అమరజీవి మా కాంతమ్మత్త’.కాలాలు ఎన్ని మారి నా ఆధునికత ఎంత తరుముకు వచ్చిన,కాలా లకు తగ్గట్టుగానే అణచివేతలు,అవమానాలు, దోపి డీలు,రూపాంతరం చెంది వెనుకబడ్డ కులాల వారు ఎప్పుడు వెనకే ఉంటున్నారు.ఎవరో ఒకరిద్దరు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించిన,అక్కడ ఉండే వివ క్షత అక్కడ పుష్కలంగా ఉంటుంది.ఆర్థికభౌతిక రూపా ల్లో అభివృద్ధి సాధిం చిన న్యాయస్థానాలు రాజ్యాంగం సాయంగా ఎన్ని రక్షణ చట్టాలు చేసినా,ఉన్నత కులాలు వర్గాల వారి మనసుల్లో మార్పులురాక, ఆచర ణ లేక,అణగారిన వర్గాల వారిబ్రతుకులు సదా అణగ దొ క్కబడుతూనే ఉన్నాయి అనే ఆత్మాభిమానపు అస్తిత్వ వేదనను రచయిత పలమనేరు బాలాజి ఈకథల్లో ఆవిష్కరించే ప్రయత్నం చేసి శతశాతం సఫలం చెం దారు.ఉన్నత వర్గాల వారు నిమ్నవర్గాల వారిని అణగ తొక్కడం సాధారణం.కానీ ఒకేజాతి వారు తమలో తామే అణగదొక్కుకునే అనాగరికస్థితి ఈ సమాజం నుంచి పోవాలన్న ఆశ ఆశయం ఈరచయిత తన కథల్లో చూపించారు, పేరుకే గిరిజనులకు రిజర్వేషన్లు కానీ పెత్తనం మొత్తం ధనికులైన గిరిజనేతరులదే అన్న బాధను‘చప్పుడు’కథలో గొప్పగా ఆవిష్కరించారు, శ్రీను అనే ఎరుకల జాతిగిరిజన సర్పంచ్‌రెడ్డిగారి చెప్పు చేతల్లో తన సర్పంచ్ హోదాను ఎలా నిర్వీర్యం చేసుకున్నాడు?చివరికి తనలోఎలాంటి చైతన్యం కలి గింది ఈ కథలో చదవవచ్చు.అగ్రకులాల వాళ్ళు పేరు చివర కులం పేరు తగిలించుకుని ఊరేగు తుంటే, కొన్నినిమ్న కులాల వారు తమకులం పేరు చెప్పు కోవడానికే భయపడుతున్న నేటికాలంలో అతి త్వరలో కులాల అసమానతలు సమసి పోవాలని, సమ భావన కోసం ఆశిస్తాడు రచయిత.మనుషుల పేర్లకే కాదు చివరికి కాలనీ పేరుకు కూడా కులంపేరు పెట్టుకో వడానికి భయపడ్డ నేటి తరం యువత మనోవేదన కూడా మనం ఇందులో చదువుతాము.
ఎరుకల సామాజికవర్గం వారిని అణగదొ క్కడంలో భూస్వాములు ఎలాంటి కుట్రలు పన్నుతు న్నారు? కళ్ళకు కడుతూ వారు చేసిన అకృత్యాలను మూగజీవాలైన ఏనుగుల మీదనెడుతూ చేస్తున్న మోసా లు,సాయం చేస్తున్నట్టు నటిస్తూసాయం ముసు గులో చేస్తున్న మోసం,దగా,వంచనలను,తెలుసుకొని తెలి విగా బ్రతకాలని ధైర్యం అందిస్తూ…మద్యపానం లాంటి అనారోగ్య అలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలని,తాగిన మత్తులో భార్యలను బాదడం మగత నం కాదనే హెచ్చరిక చేస్తూ…తన పిల్లల బాగు కోరి భార్య మాటలకు విలువ నిస్తూ…తన జీవితాంతం ఇంట్లో బీడీ కాల్చకుండా నిగ్రహించుకున్న ఎరుకల నాగయ్య ఆదర్శ గుణాన్ని ఉన్నతంగా ఆవిష్కరిస్తూ… వ్యసనాలతో తమ జీవితాలను కోల్పోతున్న ఎరుకల పురుషుల ను ఎద్దేవా చేస్తారు రచయిత ఈ కథల్లో. ఎరుకల స్త్రీలకు కావలసిన ధైర్యం, చదువు, చైతన్యం, గురించి వివరిస్తూ రాసిన ‘వెదుర్లు’ ‘ఏనుగుల రాజ్యం’ కథల్లో ఎరుకుల దొర స్వామి భార్య నీలమ్మ, సందర్భో చిత గుణం,ఆదెమ్మలోని ధైర్యగుణం, ఆవిష్కరించి యావత్ ఎరుకల స్త్రీ సమాజానికి స్ఫూర్తిని పంచారు రచయిత.కేవలం ఎరుకల జాతి ఈతి బాధలకే పరి మితం కాకుండా,తమ కుటుంబాలలో విధిగా చేసు కునే ‘మునిదేవర పండుగ’కు పాటించే సంస్కృతి కట్టుబాట్లను కళ్ళకు కడుతూ ఎరుకల లోని సంస్కృతి పరిరక్షణ తత్వాన్ని ఆవిష్కరించారు.ఆర్థిక అసమానత లను దాటిన నేటిజనం కులంకట్టుబాట్లు అంటే లేని భయం దేవుడి ద్వారా కలిగి భయంతో అయినా అంద రూ…పండుగలు జాతర్లరూపంలో కలిసి ఒకటి అవ్వ డాన్ని రచయిత సంతోషిస్తాడు,బ్రిటిష్ పాలకుల చేత చోరుల కులంగా ముద్ర వేయించుకున్న ఈజాతికి నేటి స్వరాజ్య ప్రజా స్వామ్యంలో కూడా ..కొందరు పోలీసుల దృష్టిలో పాత ముద్ర తొలగిపోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తంచేస్తారు ‘మా తప్పు ఏందిసారు?’ కథలో,ధర్నా,అదే ప్రశ్న,గురి,ప్రయత్నం,ఆకలేస్తున్న ప్పుడు,ఎర్రమన్ను ముగ్గు పిండి,మొదలైన కథలన్నీ ఎరుకల జాతి వ్యధలుగా ఆవిష్కరించబడ్డ ఈకథల సంపుటి ఆద్యంతంఆసక్తిగా కుతుహలంగా చది విస్తుంది.
ఏకలవ్య కాలనీ (కథాసంపుటి),రచయిత: పలమనేరు బాలాజి,పేజీలు: 165,వెల: 250, ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, హైదరా బాద్, సెల్: 83329 34548.సమీక్షకుడు: డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, చరవాణి: 77298 83223.

మేడారం కీర్తిక పతాక సమ్మక్క

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పిలిచే మేడారం జాతర గురించిన విశేషాలు పూర్వాపరాలు వివరిస్తూ జాతర నేపథ్యం జరిగే తీరు గురించి రెండు దశాబ్దాల అనుభవాల సమ్మేళనంతో రూపొందించిన పుస్తకం “సమ్మక్క” ది గ్లోరీ ఆఫ్ మేడారం…
20 సంవత్సరాలపాటు పూర్వ వరంగల్ జిల్లా సహాయ పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన సందర్భంలో ఉద్యోగ విధుల్లో భాగంగా మేడారం జాతర నిర్వహణ బాధ్యతలు చూసే వేళ మేడారంలో ఈ జన జాతర జరిగే విధానం ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో ఈ పుస్తక రచయిత కన్నెకంటి వెంకటరమణ గారు అందించిన వివరాలు ద్వారా పాఠకులకు జాతర దగ్గరగా చూసిన అనుభూతి కలుగుతుంది.అందుకు ప్రధాన కారణం పుస్తకంలో గల నిండుగా సజీవత్వాన్ని తలపించే రంగురంగుల ఛాయా చిత్రాలే…!!
ప్రకృతిఒడిలో జరిగే పచ్చటి ఆదివాసి జన జాతరకు సంబంధించి రచయిత వెంకటరమణ అనేక అనుభ వాలతో పాటు బోలెడు ఆశయాలు వ్యక్తం చేశారు. మొత్తం 40అంశాలుగా విభజించబడ్డాయి వ్యాస సంపుటిలో ప్రతి అంశంలో మేడారం జాతర పూర్వపరాలు లోతుగా వివరించే ప్రయత్నం జరిగింది.
మేడారం జాతర నాడు నేడు,జాతరలో అమ్మవార్లకు సమర్పించే బంగారం రహస్యం.సమ్మక్క గద్దెల చెంత గల రావిచెట్టు,సమ్మక్క ప్రతిరూపం అయిన వెదురు కంక విషయం గుడి మిలిగే రోజు నుంచి సమ్మక్క గద్దె పైకి ఆగమనుచిందే అద్వితీయ క్షణాలు వంటి విలువైన ఆకర్షణ ఏమైనా సమాచారాలు మనం ఇందులో విపులంగా చదవవచ్చు.
వీటితోపాటు సమ్మక్క సారలమ్మలను ప్రతాపరుద్రుడు చంపించాడా? వంటి ప్రశ్నలకు వివరణ ఇచ్చే ప్రయ త్నం కూడా రచయిత చేశారు.మేడారం జాతరలో గుడికాని,విగ్రహాలు కానీ,పూజలు మంత్రాలు అభి షేకాలు నైవేద్యాలు వంటి హిందూ దేవాలయపు ఆచార సంప్రదాయాలు మచ్చుకు కూడా కనిపించవు. మÖల వాసుల జీవితం సంస్కృతి ఆచారాలు లాగే వైవిధ్య మైన సంపూర్ణ గిరిజన ఆచారాలే అడగడుగునా ఆగు పిస్తాయి.వీటిల్లోని అంతరార్థాలను ఆవిష్కరించే ప్రయ త్నం జరిగింది‘మేడారంగద్దెల పరి ణామ క్రమం ఎట్టిదనిన..?’ వ్యాసంలో..
గిరిజన జాతికి చెందిన సమ్మక్క సారక్క అనే తల్లి కూతురు తమ వారి రక్షణ తమ ఆత్మాభిమాన పరి రక్షణలో భాగంగా కాకతీయ సైనికుల చేతిలో వీర మరణం చెందారు.ఆయుద్ధ భూమి ఎక్కడ? యుద్ధం జరిగింది ఎప్పుడు?అన్న తేదీలు ఆలభ్యం. ఇది కేవ లం కోయ గిరిజనుల ఆశ్రిత కులం వారు అయిన ‘డోలి’వారు చెప్పే మౌఖిక గేయ కథల ఆధారపు జాన పద వీర గాధ మాత్రమే..!
కాకతీయ చరిత్రలోగాని వారి శిలా శాసనా ల్లో గాని ఒక్క వాక్యం కూడా లేని అంశం మేడారం సమ్మక్క సారక్కల వీరమరణం సంఘటన కారణాలు కుట్రలు, కుతంత్రాలు.ఏమైనా ఉండవచ్చు. ఆనాడు భూస్థా పితమైన ఈ వీరుల త్యాగాలకు గుర్తింపు లేకుండా పోయి ఉండవచ్చు కానీ సత్యం ఎప్పటికైనా బయట పడుతుంది అన్న చందంగా సంఘటన జరిగిన వందల సంవత్సరాల పాటు ఈ అమరత్వం బాహ్య ప్రపంచానికి తెలియకపోయినా కోయ గిరిజనులలో నిండుగా ఉండే కృతజ్ఞతా గుణం సాయంగా…
ఆవంశీయుల కుటుంబ వీరులుగా ముందు తలుచు కుని పూజింపబడి కొన్నాళ్లకు ఆ గ్రామస్తుల పూజలు అందుకుని అనంతర కాలంలో చుట్టుపక్క గ్రామాలకు వ్యాపించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తమై మహా జాతరగా రూపాంతరం చెంది సత్యాన్ని ఎవరు అడ్డుకోలేరు అణచలేరు అని సమాజానికి పాలకులకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది ఈ మేడారం జాతర.
మరణించిన వారికి గుర్తుగా కరస్తంభం నేలలో పాతి దాని చుట్టూ మట్టిని గద్దెగా వృత్తాకారంలో నిర్మించి ఆకర్రస్తంభాన్ని పూజించుకుంటూ ముక్కులు సమర్పి స్తూ తమదైన భక్తి పారవశంతో వారివైన సాంప్రదాయ వాయిద్యాల మోతలతో నృత్యాలు చేయడం ఇందులో భాగంగానే చనిపోయిన వారి ఆత్మలు వారికి అత్యంత ఇష్టమైన మనుషుల మీద ఆవహించి తమ భావాలు పలుకుతారని ఈసందర్భంగానే పూనకాలతో ఊగి పోతుంటారు అనేది అడవి బిడ్డల అనంత విశ్వాసం.
మేడారం జాతర యావత్తు ఇదే తీరుగా జరుగుతుంది. ప్రధాన వీరులైన సమ్మక్క సారక్కలతో పాటు వారి ఇతర కుటుంబ సభ్యులను కూడా ఈ సందర్భంగా పూజించి గౌరవించుకోవడం ఈ జాతరలో మరో కృతజ్ఞతాఘట్టం.
1990 ముందు నుంచి నేటి వరకు మేడారం దగ్గరలో జరిగిన పరిణామక్రమం తెలుసుకోవాలి అంటే ఈ11వవ్యాసం విధిగా చదవాలి.ఏడు దశా బ్దాల క్రితమే గ్రామాలకు వ్యాపించిన ఈ మేడారం జాతర నిర్వహణకు ఆర్థిక వవెసులుబాటు లేక నిరు పేద గిరిజనులు అందుబాటులో గల వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బులు అప్పులు తెచ్చి జాతర నిర్వహించు కునేవారు.
జాతరకు జనం వచ్చిన అప్పటి పేద పరిస్థి తిల దృష్ట్యా భక్తులు నగదు రూప కానుకలు చెల్లించక పోవడంతో ఆశించిన నగదు రాక, వడ్డీ వ్యాపారులకు బాకీలు చెల్లించలేని ఆర్థిక భారంతో జాతర నిర్వహణ ఖర్చులు లేక నాటి గిరిజనులు రెండు ఏడాదులకు ఒకసారి జాతర నిర్వహించే పరిస్థితికి చేరుకున్నారు. ఇప్పటికీ అదే ఆచారం గా రావడం విశేషం..!
ప్రస్తుత పాలక ప్రభుత్వాలు కారణాలు ఏమైనా పోటీలు ఏవైనా కావచ్చుగాని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్కడ ఆదివాసీ సంప్రదాయాలకు భంగం కలగ కుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టి,తెలంగాణ రాష్ట్రా నికే తలమానికమైన గిరిజన జాతర ప్రాంతంగా మేడారం కుగ్రామాన్ని తీర్చిదిద్దటం అభినందనీయం అన్న సచిత్ర వ్యాసాలు ఇందులో మనం చదవవచ్చు.
పూర్వం మేడారం జాతరకు పోవాలంటే కాలినడక గుంపు ప్రయాణాలు, కలిగిన వారి గూడు ఎడ్లబండ్ల వరుసలు ప్రధాన ఆకర్షణలు ఈ నేపథ్యాన్ని వివరిస్తూ… “ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ వరకు” విస్తరించిన మేడారం జాతర ప్రయాణపు పరిణామ క్రమాన్ని గణాంకాలతో వివరించిన వ్యాసకర్త కృషి అభినందనీయం.
2012 నుంచి మేడారం జాతర ప్రయా ణంకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయంతో పాటు, జంపన్న వాగు పై బ్రిడ్జి నిర్మాణ విశేషాలు కూడా ఇందులో ఆసక్తిదాయకంగా చదువు కోవచ్చు.
మేడారం జాతరకు మరో ప్రత్యేక ఆకర్షణ అయిన “గుర్రం తలతో ఉండే లక్ష్మీదేవర” విశేషాలు ఆమె ఆవిర్భావ నేపథ్యంతో పాటు లక్ష్మీ దేవరకు సమ్మ క్కకు గల సంబంధం బంధుత్వం గురించి సచిత్ర వివరణ తెలుసుకోవాలి అంటే సంబంధిత వ్యాసం చదవడం అత్యవసరం.
ఇలా ఈ జాతరకు సంబంధించిన సమా చారం అంతా ఒకసమాచార పౌర సంబంధాల అధికారిగా సేకరించి ఒకచోట పేర్చి పుస్తక రూపంలో అందించిన వెంకటరమణ గారి ఈ అక్షర కృషి భావి తరం రచయితలకు, పరిశోధక విద్యార్థులకు, ఊత కర్రగా సహాయపడుతుంది అనడంలో నిండు నిజం ఉంది.
చరిత్రలో చోటు దక్కని ఈనిరుపేద గిరిజన వీరు ల త్యాగానికి ఆలస్యంగా నైనా ప్రజాధరణ అసం ఖ్యాకంగా లభించటం ఆనందదాయకమే ఇప్పటికైనా మన విశ్వవిద్యాలయాలు గిరిజన అధ్య యన సంస్థలు ముందుకు వచ్చి మరింత ప్రామా ణికమైన పరిశోధ నలు చేసి వాస్తవాలను వాస్తవంగా భావితరాలకు భద్రపరచాల్సిన తక్షణ కర్తవ్యం నేటి తరం పరిశో ధకుల అత్యవసర విధి. పరిశోధనలన్నీ ఒక క్రమంలో సాగాలి తప్ప ఎవరి మేధస్సులు వారు ప్రదర్శిస్తూ మాకు తెలిసింది చరిత్ర మేము పక్కవారి అభిప్రా యాలు స్వీకరించం అనే మొండి వాదనలు పక్కన పెట్టి, సమిష్టి పరిశోధనా కృషితో ‘వాస్తవ మేడారం చరిత్ర’ వెలుగు చూడాలి.‘వాదాల మకిలి’తో వాస్తవా లను అంతం చేసే తీరు మారి మన మేడారం జన జాతర వెలుగు చూడాలన్న రచయిత ఆశయం అతి త్వరలో కార్యరూపం కావాలని ఆశిద్దాం.
పరిశోధకులతో పాటు మేడారం పర్యాటక ప్రేమికులకు ఎంతో అవసరమైన అమÖల్య విషయాల సచిత్ర వ్యాసాల సమ్మేళమైన ఈ సమ్మక్క వ్యాసా వళి ప్రతి ఒక్కరు దాచు”కొని” చదవాల్సిన పుస్తకం ఇది.

పుస్తకం పేరు : సమ్మక్క
పేజీలు : 80
వెల : రూ.250/-
ప్రతుల కోసం : కన్నె కంటి పబ్లికేషన్స్ హైదరాబాద్ – 74
సెల్ : 98499 05900.
సమీక్షకుడు : డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు,
సెల్ : 77298 83223.

పరిశోధన దివిటీ తెలగాణా గిరిజనుల సంస్కృతి

నేలతల్లి ముద్దుబిడ్డలు! అడవి తల్లి వరపుత్రులు!! ఈ నేలకు తొలి హక్కుదారులు!!! పంచభూతాలకు ఆది సాక్షులు!!!! అడవి బిడ్డలు అనబడే గిరిజనులు.వీరి జీవనం,సంస్కృతులు,ఎలా విలక్షణమైనవో వీరిపై వస్తున్న పరిశోధనలు అంతే ప్రత్యేకమైనవి… అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతిక శాఖ వారు వెలువరించిన “తెలంగాణ గిరిజనుల సంస్కృతి…”పుస్తకం,డా:మామిడి హరికృష్ణ సంపాదకత్వంలో పరిశోధక రచయిత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు వాచస్పతి ఆచార్య కె.కుసుమారెడ్డి దీనిని వ్రాసారు,ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో గుర్తించబడిన 32గిరిజన తెగల లోని ప్రసిద్ధమైన తెగలను ఎంపిక చేసుకుని సాధికారికంగా, సోదాహరణంగా,సశాస్త్రీయంగా ఈ పుస్తకంలోపొందుపరిచారు,ఎరుకలి,చెంచు, లంబాడి,కోయ,కొండరెడ్లు,నాయకపోడు,గోండు, కోలామీ,తోటి,ప్రధాన్‌ల యొక్క జీవన సంస్కృతుల గురించి ఇందులో క్షుణ్ణంగా వివరించబడింది.
ప్రాచీన చారిత్రక ప్రదేశాలలో గిరిజనుల స్థానంతో పాటు,తెలుగు సాహిత్యంలో గిరిజనుల ప్రస్తావనలు… మహాభారతం నుంచి శశాంక విజయం, వరకు గల కావ్యాలలో గిరిజనుల గురించిన వివరాలు ఆయా రచయితలు పేర్కొన్న తీరు సహేతుకంగా వివరిం చడంలో రచయిత్రి కుసుమగారి కృషి అభినంద నీయం.తెలంగాణ గిరిజనులు-భౌగోళిక, చారిత్రక,సాహిత్య పరిచయం,తెలంగాణలోని వివిధ రకాల గిరిజనులు, అని రెండు విభాగాలుగా విభజించి,తిరిగి మొదటి విభాగంలో ఐదు ఉపవిభాగాలు, రెండవ విభాగంలో 11ఉప విభాగాలుగా విభజించి విషయ వివరణ చేయడం జరిగింది.
గిరిజనుల మÖలాలను పరిశీలించినప్పుడు వీరందరూ హిందూ సాంప్రదాయానికి చెందినవారు అని| ¾స్తుంది.వారి పుట్టుకకు మÖలం లక్ష్మీదేవి,పార్వతి, ఆది శక్తి,కాళికా దేవతలని,వారివారి పురాణాల్లో చెప్పుకుం టున్నప్పటికీ అందరి మÖలం ఒకటే అని అర్థం అవుతుంది.లక్ష్మీదేవికి జన్మించిన ఐదుగురు కొడుకుల్లో ముగ్గురు శాపగ్రస్తులై, చెంచులు, కోయలు, యానాది, గిరిజన జాతులుగా మారినట్టు నాయకపోడు పురాణ గాథలో పేర్కొన్న విషయం ఇందులో చెప్పబడింది. ఇక ఎరుకలు దక్షిణ దేశము నుంచి లంబాడాలు ఉత్తర దేశం నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడినట్టు చెబుతూ..చారిత్రక పరిశీలనలో గిరిజనులు రాజ్య పాలకులుగా ఉన్న విషయం గుర్తు చేశారు.శాత వాహన రాజులు అంత గిరిజన జాతికి చెందిన వారు కాగా హనుమకొండ ప్రాంతాన్ని ఎరుకలు పాలిం చినట్లు శాసనాలవల్ల తెలుస్తున్నట్లు,గోండ్వానా ప్రాం తాన్ని గోండులు పాలించిన విషయం.నాయక పోడులు పద్మనాయకులుగా ప్రోలయ నాయకుని నాయకత్వంలో పరిపాలన చేసిన విషయం కూడా ఇందులో పేర్కొన్నారు, ఉత్తరదేశంలో రాజపుత్రులుగా పరిపాలన చేసి ముస్లింల దండయాత్రలతో పాలన కోల్పోయి వలస వచ్చి తెలంగాణ ప్రాంతంలో లంబా డాలుగా నివసిస్తున్నట్టు పేర్కొంటూ.. గిరిజన తెగల్లో భేదాలకు గల ప్రధాన కారణాలు మత విశ్వాసం, సంగీత, నృత్యాలు, సంగీత వాద్యాలు, అని ఇందులో తెలియజేయడం జరిగింది.
వివిధ గిరిజన తెగలకు చెందిన వారు అంతా కలిగి ఉండే విశిష్టతలను సైతం వివరించి అందుకు గల కారణాలను అందించారు.ప్రకృతిని ఆరాధించటం సమిష్టి కృషి ఐకమత్యం జీవితంలో ప్రతి విషయాన్ని సామÖహిక పండగలుగా నిర్వహించుకోవడం అడవి బిడ్డల విశిష్టతలలో ప్రధానంగా చెప్పడం జరిగింది. రెండవ విభాగంలో తెలంగాణలోని గిరిజనుల రకాలు జీవన విధానం మొదలు… ఆహారం, ఆభరణాలు, వస్త్రధారణ, ఆర్థిక న్యాయవ్యవస్థలు, మత విశ్వాసాలు, జాతరలు, పండుగలు, నృత్యాలు, సంగీత వాద్యాలు, వివాహం, చావు, తదితర అంశాలను సచిత్రంగా విభాగాలు వారీగా సమగ్రంగా అందించారు. సాధార ణంగా గిరిజనులు కొన్ని కొన్ని ప్రత్యేక ప్రాంతాలకే పరిమితమై విభిన్న పేర్లతో జీవనం సాగిస్తుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్న ఏకైక గిరిజన జాతి‘ఎరుకల’ ‘కుర్రు’ జాతికి చెందిన వీరిలో స్త్రీలు త్రికాల విషయాలు ‘సోది’ లేదా ‘ఎరుక’గా చెప్పే ప్రతిభ కలిగి ఉండటం వల్ల వారిని ఎరుక చెప్పేవారు…ఎరుకల వారు, అని పిలవడం పరిపాటయింది.
వీరి భాష ప్రత్యేక మాండలికంగా ఉంటుంది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ఈ లిపిలేని ఎరుకల భాష తెలుగు,తమిళ,కన్నడ,భాషల మిళితంగా ఉం టుంది.కానీ తెలంగాణ ఎరుకల జాతి గిరిజనులు అందరూ అచ్చమైన తెలుగులోనే మాట్లాడుకుంటారు. వీరు వంశపారంపర్యంగా అనేక తెగలు వృత్తుల ఆధా రంగా వేరుపడ్డారు.
తట్టలు బుట్టలు తడికలు తయారు చేసేవారు ‘దబ్బ ఎరుకలు’ ముగ్గు అమ్మేవారు‘ముగ్గు ఎరుకలు’ గరిసెలు గాదెలు తయారు చేసేవారు‘కూటు ఎరుకలు’ పంట చేలు కాపలా కాసేవారు‘కావలిఎరుకలు’పాము లాడిం చేవారు‘పాములఎరుకలు’పిట్టలు కుందేళ్ళు ఉడుములు పట్టేవారు‘పిట్టల ఎరుకలు’అనే పేర్లతో పిలిచే ఎరుకల జాతి రకాలను తెలుపుతూ వారి జీవనవిధానం కట్టు బాట్లు చెప్పటం జరిగింది.
ఎరుకలి సామాజిక వర్గంలో ఎక్కువగా జరిగే మేనరి కపు వివాహాలు ‘రూకమాడ’అని ప్రత్యేకంగా పిలిచే నిశ్చితార్థం తంతులో మేనమామ తన నిరభ్యంతరం తెలపడం పెళ్లి ఖర్చులు మగ పెళ్ళి వారే భరించటం పెళ్లి సమయంలో వేసే పందిరి రాటలకు పుట్టమన్ను వేయడం వంటి ప్రత్యేక పనులు ఎరుకుల వారి పెళ్లి తంతుల్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఎరుకలలో విడాకుల సాంప్రదాయం ఉంది కుల పెద్దలు బంధు మిత్రులు సమక్షంలో పురుషుడు మర్రి లేదా వేప చెట్టుకు మÖడుసార్లు కసిగా గాట్లు వేయడంతో ఆభార్యాభర్తలకు ఎలాంటి సంబంధం ఉండదఅని తెలియజేయడం జరిగింది.వీరిలోని కురువంజి, కురువ,కోలాటం,నృత్యాలు ప్రధాన భూమిక వహిస్తా యి.అలాగే వీరు పాడుకునే పాటల గురించిన వివర ణలో పాటలతో పాటు వాటి అర్థ వివరణలు కూడా అందించారు.ఎరుకలవారి పాటల్లో భక్తి,మానవ సంబంధం,సామాజిక అంశాలు గల పాటలు అధికం గా ఉంటాయి. ఈపాటల్లో త్యాగయుతమైన స్త్రీ జీవి తం గమనించవచ్చు. తెలంగాణలోని నల్లమల అడవి ప్రాంతంలో జీవించే చెంచుజాతి గిరిజన జీవన తీరు గురించి చెబుతూ..వీరి సంతానంలో లింగ బేధం చూపించని వైనం, పగటిపూట మాత్రమే పెళ్లి చేసు కునే సంప్రదాయం,బహుభార్య విధానంతో పాటు అక్రమ సంబంధాలకు ఉండే కఠిన శిక్షల వివరాలు, చెంచులు మరణాన్ని సాధారణ ప్రక్రియ గా భావించే పద్ధతి, ఆ విభాగంలో సవివరంగా పొందుపరిచారు. తండాలుగా నివాసాలను ఏర్పాటు చేసుకొని జీవించే లంబాడీల గురించిన విభాగంలో సాధారణ అంశా లతో పాటు వారి నృత్యాలు,సంగీత వాద్యాల గురించి ప్రధానంగా పేర్కొన్నారు,వీటిలో నగారా,సారంగి, రబాబ్, వంటి ప్రత్యేక సంగీత పరికరాల వివరణలు అందించారు.తెలంగాణ రాష్ట్రంలోనే ప్రధానమైన “కోయ” జాతి గిరిజనుల గురించిన వివరణలో కోయ సంస్కృతి మÖలాలను తెలిపే కోయ పురాణ కథ ఇందులో ప్రత్యేకతను సంతరించుకుంది, వీరి కొమ్ముకోయ నృత్యం,రేల నృత్యంతో పాటు, పురుషులు మాత్రమే చేసే కుర్రె నృత్యం గురించి. వీరి ప్రధాన సంగీత వాద్యాలు అయిన తూతకొమ్ము, డోలీ,డోలు కొమ్ము,ల వివరణలు సచిత్రంగా అందించారు. కొండ ప్రాంతాల్లో పోడువ్యవసాయం జీవన వృత్తిగా చేసుకునే కొండ రెడ్డి గిరిజనుల గురించిన వివరణ విభాగంలో పంటల ఆధారిత పండుగలు,పండుగలు జాతర్ల సందర్భంగా చేసే మామిడికోత నృత్యం,సంగీత వాద్యాలైన గిల్ల,జౌజం,మొదలైన వాటి విశేషాలు మనం ఈవిభాగంలో చదవవచ్చు.గిరిజన సామాజిక వర్గాలకే ప్రముఖమైన ఘనమైన పాలనా చరితగల గోండులు వారి ఆశ్రిత కులం వారైనా ప్రధాన్‌లు గురించి చెబుతూ…అదే ఆదిలాబాద్ అడవుల్లో జీవిం చే కోలామీలు,ఆంధ్‌లు,తోటీలు,గురించిన జీవన చిత్రాలు సామాజిక కట్టుబాట్లు గురించిన వివరణలు మిగతా గిరిజన జాతులకు ఇచ్చినట్టే ఇచ్చారు.
పాండవులను కులదైవాలుగా భావించి పూజించే నాయకుడు గిరిజనుల సంస్కృతి వివరణలు సైతం అందించిన ఈ పరిశోధక విశ్లేషణ పుస్తకం ఆసాంతం అన్ని గిరిజన జాతులు నిక్కచ్చిగా హిందూ మతానికి లేదా హిందూ సమాజానికి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి ఆదివాసులు అక్షరాలా హిందూ బంధువులే అన్న నగ్న సత్యాలను ఆవిష్కరించింది.
తెలంగాణ గిరిజనుల సంస్కృతి (వ్యాస సంపుటి), సంపాదకులు: డా:మామిడి హరికృష్ణ, రచన: ఆచార్య కె .కుసుమారెడ్డి, పేజీలు: 178, వెల:250/-రూ, ప్రతులకు: రవీంద్ర భారతి, హైదరాబాద్ -4, ఫోను: 040- 29703142,

కళింగ వనకవనం శతర

ప్రకృతి వరప్రసాదం అడవులు అటవీ సంపద దాని నిజమైన హక్కుదారులు అడవుల రక్షకులు అడవి బిడ్డలైన ఆదివాసులు అనబడే మÖలవాసులే!! వారి జీవితాలు లాగే వారి సం స్క ృతులు విభిన్నం మానవజాతికి మÖలంగా నిర్ణ యించబడ్డ ఈ మÖలవాసి మనుగడ ప్రపంచీకరణ తుఫాను ీVAరుగాలికి తల్లడిల్లుతూ తన అస్తిత్వా న్ని కాపాడుకుంటూ నిరంతరం నిశ్శబ్దంగా మౌన పోరాటం చేస్తూనే ఉంది.

ఏ జనజాతి అయిన తమతమ అస్తిత్వాలను చాటుకోవడానికి తమ బాధల గూడు సభ్య సమా జానికి తద్వారా పాలకులకు అందించడానికిఉపక రించే ఉన్నతమైన సాధనం సాహిత్యం,దీని సాయం గానే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది అనడంలో సందేహం లేదు.ఈసందర్భంగా మన మÖల వాసులైన ఆదివాసుల సాహిత్యం గురించి తెలుసు కోవాలి.ఇది మొత్తం మÖడు రకాలుగా విభజించ బడింది పూర్వకాలంలో తమలో తాము పాటలు కథలు రూపంలో పాడి,చెప్పుకున్న మౌఖిక సాహి త్యం అనబడే నోటి సాహిత్యం,మధ్యకాలంలో అక్షర జ్ఞానం పెరిగిన తర్వాత నిత్యం గిరిజనులతో మమే కమై జీవించిన అక్షరాస్యులు అయిన గిరిజ నేతరు లు రాసిన అనుభూతి గిరిజన సాహిత్యం,అనం తరం ఆధునిక కాలంలో గిరిజనులు సైతం విద్యా బుద్ధులు నేర్చి ఆవిజ్ఞానం సాయంగా తమ స్వాను భవాలను తామే వ్రాసుకున్న స్వానుభవ గిరిజన సాహిత్యం. మనలో చాలామంది గిరిజనే తరులు ఉద్యోగ,వ్యవసాయ,కారణాల రీత్యా..కొన్ని సం దర్భంల్లో గిరిజన జనవాసాల్లోనే జన్మించడం వల్ల, అక్కడి వారి ఈతి బాధలు సంస్క ృతి సాంప్రదాయ విధానాలకు ప్రభావితమై వారిలోని స ృజనాత్మకత స్పందనల సాయంగా వివిధ ప్రక్రియల్లో గిరిజన జీవన ఇతివ ృత్తాలతో అనేక గిరిజన రచనలు చేసిన గిరిజనేతరులు ఎందరో మన తెలుగు సాహితీ వేత్తలు. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర ఉపా ధ్యాయ కవి‘వనవాసి’కాకపోయినా ‘వనని వాసి’ అయిన ‘సిరికిస్వామి నాయుడు’ వ్రాసిన అచ్చమైన గిరిజన కవితా సంపుటి ‘శతర’.
గతంలో అనేకమంది గిరిజన కవితలు రాసిన అవి వారివారి కవిత సంపుటాలలో మిళితమై ఉన్నాయి.కానీ స్వామి నాయుడు రాసిన‘శతర’ కవితా సంపుటిలోని మొత్తం 56కవితలు గిరిజన జీవన సంస్క ృతులే వస్తువులుగా ఉండి సంపూర్ణ గిరిజన కవితా సంపుటికి అర్హత పొందడంతో పాటు.. .గిరిజనేతరుడు వ్రాసిన తొలి గిరిజన కవి తా సంపుటిగా తెలుగు కవన చరిత్రలో చోటు పొం దింది అనవచ్చు.స్వామినాయుడు ఈశతర ఆవిష్క రించడానికి నిత్యం తాను చూసిన అడవి బిడ్డల ఆవేదనలే కారణం,తోటి వారి కష్టాలను తన కష్టాలుగా స్వీకరించి స్పందించేవాడే అచ్చ మైన కవి అన్న చందంగా నాయుడు చేసిన అక్షర కృషి ఈకవితా సంపుటి అక్షరాక్షరాన ఆగు పిస్తుంది.కవికి అంటూ ఒక ప్రత్యేక కవితా భాష అవసరం దాని సాయంగానే పాటక హృదయాలను దగ్గరగా ప్రభా వితం చేయగలడు,స్వామి సైతం తన కవనానికి అందమైన కవితా భాషను అద్ది, అక్కడక్కడ అచ్చం గా అడవి బిడ్డల మాత ృభాష అయిన స్థానిక భాషా పదాలను ఉపయోగించారు, పాఠక ప్రపంచాన్ని ద ృష్టిలో ఉంచుకొని ఆయా గిరిజన పదాలకు కవిత దిగువన అర్థాలను అందించారు,
ఇక స్వామినాయుడు అందించిన‘శతర’ విష యానికి వస్తే ఇది గిరిజనులు కొత్తల పండుగ సందర్భంగా గూడెంలో ఊరేగించే వెదురుగడ, తెల్లని వస్త్రం చుట్టి పైన గొబ్బి కింద జిబ్బి కట్టి మధ్యలో నెమలి పించాలు పెట్టి పరమ పవిత్రంగా పూజించే గిరిజనుల పవిత్ర వస్తువు శతర. ఈకవితలో ఆధునికత ముసుగులో గిరిజన గుడాలను కమ్మేస్తున్న అన్య మతం మబ్బుల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ….అనాదికాలంగా ఆదివాసి బిడ్డలు తమ సంస్కృతి సాంప్రదాయాలను ప్రాణ ప్రదంగా కాపాడుకుంటూ వస్తే, నేటి ఆధునిక కాలం లో అన్య మతాలు అడవి బిడ్డలను తమ సొంత సంస్క ృతికి ఎలా దూరం చేస్తున్నాయో కళ్ళకు కడుతూ తనదైన ధర్మ అక్షరాగ్రహం వ్యక్తం చేశారు కవి స్వామి నాయుడు.
‘నాగరికత మాటున మతం మెల్లగా అడు గుపె ట్టాక/ ఆదివాసి ఆత్మగౌరవ పతాక చిన్న పో తుంది/ శతర గుబ్బిని మింగేస్తుంది శిలువ కోర/ కొత్తల్ని… కొండ జాతర్లని…/ పుట్టి ముంచేస్తున్నాయి పునర్జీవన పండుగలు,/నుదుట…బొట్టు చెరిపేసుకొని/ తెల్లని ఆకాశాన్ని ముసుగేసుకుని../ పరిశుద్ధాత్మ ముందు మోకరిల్లింది జాకరమ్మ!..’అంటూ నేటి గిరిజన గుడాలలో మొలుస్తున్న శిలువచెట్ల వైనాన్ని కళ్ళకు కడుతూ రాబోయే ప్రమాదాన్ని హెచ్చరిస్తూ అడవి బిడ్డలకు కర్తవ్య బోధన చేశారు..,
“మెరుపుల మేఘాల్నిజూసి/నెత్తి మీద నీల కడవల్ని నేల పారబోసుకుంటుంది/ ఇన్నేళ్లు ఆకుపచ్చని వేకువ పొద్దుల్ని చూసిన గూడ/ ఈయాల వలస కావుళ్ళు మోస్తోంది పల్లం దారుల్లో….”అంటూ సనాతన సంస్క ృతిని తలదించు కోనీయకుండా అందరం కాపాడుకోవాలి అని విలువైన సూచన చేశారు కవి.
నాడు గిరిజన సమాజం అంటే స్వచóమైన కల్మషం లేని వాతావరణం, మాయా మోసం కుట్ర లు కుతంత్రాలకు తావులేని అమాయక జీవితాలు, రాజకీయ నీడలు వర్గ విభేదాలు లేని కులం కట్టుబాట్లకు విలువ ఇస్తూ ఐకమత్యానికి మÖలా లుగా ఉండే గిరిజన కుటుంబాలు,
కానీ నేడు ప్రపంచీకరణ ద్వారం గుండా ఆధునికత గొడుగుతో గిరిజన పల్లెల ముఖచిత్రాలే మారి పోయాయి, ప్రమాదకర కూడలిలో భయంకర జీవన పోరాటం చేస్తుంది నేటి ఆధునిక గిరిజన సమాజం.
ఒకవైపు సమాజ రక్షణ దళాలు, మరోవైపు అడవుల సంపద పరిరక్షణే ధ్యేయంగా ఆయుధాలు చేబూనిన నక్సలైట్లు ఇరుపక్షాల మధ్య పోరు సమిదలై అమరులవుతున్న అడవి బిడ్డల గోస వినే వారే నేడు లేరు.
‘ జంట దీపాలు’ కవితలు అన్యోన్యతలకు చిరునామాలైన ఆదివాసి ఆలుమగల జీవితాన్ని చిత్రిస్తూ ఆయుధాల సంఘర్షణలో అమాయకపు భర్త బలైన తీరును ఆర్థత తో ఆవిష్కరించిన వైనం హ ృదయాన్ని తడిచేస్తుంది.
మరోపక్క ఆకర్షణకు లోనైనా అడవి బిడ్డలు గిరిజనేతరుల కబంధహస్తాలకు బలైపోతున్న తీరును “శకుంతల” కవిత ద్వారా ఆవిష్కరిస్తూ… ఆధునిక గిరిజన యువతులను జాగ ృతం చేసారు,
“వాడెవడో విసిరిన చూపుల ఎరకి చేపలా చిక్కి పోతుంది/కొండ మేక కసాయి నక్కను నమ్మినట్టు/వాడిని నమ్మి మోహపు తెరల మాటున/తన దేహపు తాళాల గుత్తి నందించే శకుంతల అవుతుంది/…..
పురిటి వాగు నీదలేక/ పుట్టిన బిడ్డకు బీజం వేసిం దెవడో చూపలేక/కడుపులో పిండాన్ని కత్తుల కప్ప గించి/నెత్తురోడుతున్న మోదుగ మొజ్జయి/తిరిగి గూడానికి చేరుకుంటుంది/….అంటూ,
నేటి ఆధునిక ఆదివాసి వనితా లోకం యవ్వనాన్ని బలి చేసుకుంటూ మాత ృత్వాన్ని మంటగలు పుకుంటున్న వైనం ఈ కవిత ద్వారా మనం అర్థం చేసుకోవాలి.
అడవి బిడ్డల జీవితాలకు అతి ముఖ్యమైన సంతల గురించి, ఎదురు కాల్పుల్లో బిడ్డలను కోల్పో యిన గరĝశోకపు తల్లుల గురించి “నెత్తుటి పిట్టలు” కవితలో మనం చదవవచ్చు.
స్వార్థంతో అడవి మీద, ఆదివాసి బతుకుల మీద, అభివ ృద్ధి పేరుతో కప్పిన దేవతా వస్త్రంగా గిరిజన అభివ ృద్ధిని పోలుస్తూ తన ఆవేదన వ్యక్తం చేస్తారు కవి స్వామి నాయుడు,తాను నిత్యం చూసిన స్వానుభవం సాయంగా ‘దారమండ’ కవితలో…
అడవి బిడ్డల అగచాట్లకు అద్దం పడు తూ రాసిన ఈ కవన పొదిలో అన్ని కష్టాలు కన్నీళ్లే కాదు… ప్రస్తుత ప్రమాద జీవన పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో చెబుతూ కర్తవ్య బోధన చేస్తూ చైతన్యపు ఊపిరులు ఊదుతూ… సామÖహికస్వప్న, నెగళ్ళు, నడిరేయి సూరీడ, వంటి కవనాల ద్వారా జమిడి,తుడుం,కలిపి మోగించాడు కవి స్వామి నాయుడు.
కవితల్లోని పదబంధాలు,భాష, వెంటాడే వాక్యా లు, మాదిరిగానే కవితా శీర్షికలు పెట్టడంలో కూడా అంతే బాధ్యత జాగ్రత్త వహించి శతశాతం గిరిజన కవన పరిమళాలు పంచడంలో సఫలీకృతు డయ్యా డు కవి, “జంగిడి” నుండి “ఎర్ర మల్లెల వనాలు” వరకూ సాగిన ఈ కవన దారిలో మట్టిదుప్పటి, తడి మంటల్లో, తడారని గీతం, రాతికొయ్యలు, నిత్యగాయాల నెలవంక, మొదలైన కవన సుమాలు పాఠకులకు ఆకర్షణతో కూడిన అక్షరానందం అందిస్తూ కర్తవ్య బోధన చేస్తాయి,
“అడవి” అంటే ఒకప్పుడు అందాలకు నిలయం,
నేడు అది ఒక“పొగులుతున్న పచ్చిగాయం” అంటూ తన రెండు దశాబ్దాల అటవీజీవితంను అక్షరీకరిస్తూ తన జన్మస్థలం ఉత్తరాంధ్ర ఆదివాసి జీవనాన్ని ప్రపంచానికి చాటుతూ కర్తవ్యం నిండిన చరిత్ర పుటల్లో ఆధునిక ఆదివాసి బ్రతుకుచిత్రం చిత్రించిన నాయుడు అక్షరాభినందనీయుడు,
శతర (కవిత్వం),పేజీలు:150, ధర:200/- రూ,ప్రతులకు:స్నేహకళా సాహితి,అరసం, పార్వ తీపురం, సెల్: 9494010330.సమీక్ష కుడు: డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్:77298 83223.

గిరిజన సంప్రదాయాల్లో పురాణగాథలు

ప్రకృతి ఆరాధకులు అచ్చమైన హిందూజాతి పద్ధతులు ఆచరించే మన అడవి బిడ్డల జీవన శైలితో పాటు పురాణ గాధలతో ముడిపడి ఉన్న వారి సాంప్రదాయాల గురించి చక్కని చారిత్రక స్థానిక, ఇతిహాస కథనాలను, కలగలిపి విలువైన వ్యాసాలు పొదిగి అందించిన మంచి పుస్తకం “తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు పురాగాధలు”- సమీక్షకుడు: డా: అమ్మిన శ్రీనివాసరాజు
అనేక దశాబ్దాలుగా గిరిజనుల జీవనశైలి పై పరిశోధనాత్మక అధ్యయనం చేయడంతో పాటు వారి సమస్యల గురించి పలు పోరాటాలు చేసి అనేక రచనలు చేసిన ఉద్యమ రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ గారి కలం నుంచి వెలువడిన ఈ పుస్తకంలో పలు పరిశోధక అంశాలు వెలువడ్డాయి.
ఈ ప్రామాణిక పరిశోధక పుస్తకమును పట్టికలు, కథలు, అని రెండు విభాగాలుగా విభజించి రచయిత తన భావవ్యక్తీకరణ గావించారు.మొదటి విభాగం పట్టికలో వ్యవస్థలు, వర్ణ వివక్ష, దృక్పథాలతో పాటు గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక, చారి త్రక, స్థలాలు నెలలు, పండు గలు, ప్రణాళికలు, పంచాయ తీలు తోపాటు ప్రత్యేకంగా చెంచుల మనో ప్రపంచం, గ్రామపటం, ఉత్పత్తి, సంబంధా లు న్యాయాలు తదితర అంశా లు చిత్రపటాల సాయంగా సవివరంగా తెలిపారు రచయిత శివరా మకృష్ణ.గిరిజన ప్రాంత పర్యాటక చారిత్రక పట్టికలో, శ్రీకాకుళం విజయనగరం, విశాఖపట్నం,తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, కర్నూలు, మహబూబ్ నగర్, జిల్లాలలోని మండలాల వారీగా విస్తరించి ఉన్న చారిత్రక పర్యా టక ప్రాంతాల వివరాలు వివరించారు, దీని ద్వారా పర్యాటకులకే గాక పరిశోధకు లకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంది. విశాఖ జిల్లా పడ్డది మండలంలో గల చారిత్రక ప్రాంతం మత్స్య రాజుల రాజ ధాని, గూడెం కొత్త వీధిలో గల శ్రీకృష్ణ పాండవ దేవాల యం, చింతపల్లి మండలంలోని లంబసింగి పాండవుల విగ్ర హాలు, కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు దగ్గర భీముని కొలను, ఆళ్లగడ్డ వద్ద అీVAబిలం లోని చెంచులక్ష్మి నరసింహస్వామి ఆలయ వివరాలు, ఇలా గిరిజన ప్రాంతాల్లో విస్తరించి ఉన్న చారిత్రక, పురాణ ప్రాంతాల, గురించి పట్టికలో పేర్కొనడం వల్ల ఎంతో దర్శనీయ సమాచారం అందుతుంది.
అలాగే సంబంధిత నెలల్లో గిరిజనులు జరుపుకునే ప్రధాన పండుగలు వివరాలు కూడా పొందు పరిచారు.పట్టికలతో పాటు పటాల ద్వారా కూడా సమాచారాన్ని “కొండ అద్దమందు” అన్న చందం గా చక్కగా అందించారు రచయిత, వీటిల్లో దండకారణ్యం, చెంచుల మనో ప్రపంచం, చెంచు గ్రామ పటం, విశాఖ గిరిజనుల మనో ప్రపంచం, తదితర పటాలు రేఖా చిత్రాల సాయంగా విస్తృత సమాచారం క్రోడీక రించి విలువైన గిరిజన చరిత్ర సంస్కృతి, వంశ నామావళి, భావితరాల కోసం అందించిన వైనం ఎంతో ప్రయోజన కరంగా ఉంది.
రెండవ భాగంగా పేర్కొన్న “కథలు” విభాగంలో అనేక ఆసక్తి దయకమైన విలువైన విషయాలు అందించారు, వీటిల్లో కొన్ని జానపద గాథలు గాక మరికొన్ని స్థానిక చరిత్రలుగా చెప్పబడ్డాయి.
గిరిజన పురాణ గాథల్లో “మత్స్యతీర్థ స్థల పురాణం” మొదలు “నాయకపోడుల పద్మనాయక వృత్తాంతం” వరకు ప్రధానమైన పది గాథలు ఇందులో పేర్కొన్నారు.
సవర గిరిజనుల ఆరాధ్య దైవం అయిన “పూరీ జగన్నాధుడుకు చెందిన పురాణంలో పూరీకి చెందిన రాజులు సవర్లతో వేటకు వెళ్లి వారిలోనే సహజ శక్తి సామర్థ్యాలకు అబ్బురపడి అందుకు కారణమైన వారి ఆరాధ్య దైవం జగన్నాథుడిని మోసపూరితంగా సొంతం చేసుకుని ఆశక్తి సామర్థ్యాలు పూరి రాజులు కైవసం చేసుకోవడం అందుకు ఆగ్రహించిన సవరణలు జగన్నాథుడు నిలదీసి అసలు విషయం తెలుసుకుని దైవ దైవాన్ని వదిలే ప్రసక్తి లేదని పట్టు పట్టడం అందుకుగాను తిరిగి జగన్నాథుడు అక్షర బ్రహ్మగా అదే సమరదేశంలో అవతరించడం అతని అనుగ్రహంతో నిరక్షరాశులయిన సవర గిరిజనులు అక్షరాస్యులుగా మారి శుద్ధ సవర్లుగా పిలవబడుతున్నారు. ఈతెగ గిరిజనలు ప్రస్తుతం మునిగడ రాయగడ శ్రీకాకుళం ప్రాంతాల్లో విస్తరించి సొంతంగా పాఠశాలలు ఏర్పాటు చేసుకొని అక్షర బ్రహ్మను నిత్యం ఆరాధించుకుంటున్నారు ఈ జన జాతికి చెందిన “మంగయ్య సవర” సవర భాషకు నిఘంటువును సైతం వ్రాసినట్టు ఇందులో పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రకృతిలో సాధు జంతువులకు కృరీర జంతువులకు గల సహజ వైరం, చేపలు మనుగడకు కావలసిన జల ప్రవాహం కోసం అవి చేసిన పోరాటం చిత్రించే విశాఖ మన్యంలో గల మత్స్య తీర్థ స్థల పురాణం గురించి కూడా ఇందులో పేర్కొనబడింది.
శతాబ్దాలుగా మధ్య భారతాన్ని పాలించిన గోండులు ఇతర తెగల మధ్య సామరస్యాన్ని బలపరిచే పురాగాథలు, పండుగలు, వివరించ డంలో భాగంగా గోండు గిరిజన జన జాతికి చెందిన అనేక విలువైన విషయాలు సహేతుకంగా చారిత్రక ఆధారాలతో వివరించి చెప్పారు రచయిత డాక్టర్ పిరాట్ల,
గోండు జాతిలో గల,కోలాము,గోండు,పరదార్, మన్నే,తోటి,నాయకపోళ్లు,గురించిన జన్మ వృత్తాంతాలు ఆసక్తి దాయకంగా వివరిస్తూ పాండవులకు వీరికి గల అవినాభావ సంబంధాలు వివరించారు, కోలాములు భీముని సాయంతో జన్మించినట్టు తెలియజేస్తూ…భీముడిని వీరు ఆరాధ్య దైవంగా పూజించడంలోనిఅంతరార్థం ఇందులో వివరించారు.
అలాగే లక్ష్మీదేవి విష్ణు మÖర్తుల సంతానంగా పేర్కొనే పద్మనాయక గిరిజనులైన నాయక పోడు గిరిజనుల జన్మ వృత్తాంతం,మరియు విశాఖ మన్యప్రాంత ఆరాధ్య దేవత మోదకొండమ్మ గేయ గాథ, కోయల మీద దాడి చేసిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పశ్చాత్తాపంతో తన కొడుకును డోలిగా దత్తత ఇచ్చిన సమ్మక్క సారక్క జాతర చరిత్రను తెలిపే “మేడారం డోలి గానం ఇందులో మనం చదవవచ్చు.ఇలా అనేక ఆసక్తికరమైన గిరిజన విజ్ఞాన సమాచార వేదిక ఆయన ఈ చిరు పుస్తకం విలువ మాత్రం చాలా పెద్దది అని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు (పురాగాథలు)
రచయిత: డా: పిరాట్ల శివరామకృష్ణ, పేజీలు:76, వెల:100/- రూ, ప్రతులకు: సాహిత్య నికేతన్, 3-4-852, బర్కత్ పురా, హైదరాబాద్-27, ఫోను: 040-27563236.

సమగ్ర గిరిజన దీపిక`కోయ సంస్కృతి

గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటైన సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ- భద్రాచలం వారి సారధ్యంలో నిర్వహించబడుతున్న గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణా సంస్థ పక్షాన రూపొం దించబడిన సచిత్ర వర్ణ పుస్తకం ‘‘కోయతెగ సంస్కృతి’’ఇరవై ఒక్క అధ్యాయాల ఈ సమగ్ర వర్ణ చిత్రాల పుస్తకంలో గిరిజన తెగకు సంబంధించిన సంస్కృతి సంబంధపు అనేక విషయాలు విశేషాలు పొందుపరచబడ్డాయి.
శిక్షణా సంస్థ పర్యవేక్షకులు వీసం వసంత రావు పర్యవేక్షణలో కె.సీతారాములు,ఎన్‌. జగన్మో హన్‌ రావు గార్ల నేతృత్వంలో సోడే మురళి, మడకం లక్ష్మణరావు,మడకం చినరత్తయ్య, సోడె శివరామకృష్ణ, సోడె సత్యనారాయణ,తదితర ఆంథ్రో పాలజీ విద్యార్థుల రచనా సహకారంతో వెలువడిన ఈపుస్తకానికి,కొండవీటి గోపి వరప్రసాద్‌ అందించిన ఛాయాచిత్రాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
తొలి అధ్యాయంలో పురాణ గాథల ఆధారంగా కోయతెగ పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తూ… చందా,నాగుల,తాటి,జలరేల,వంశ చరిత్రలను సంబంధిత కుటుంబాల పెద్దలను సంప్రదించి వారు చెప్పిన పురాణాల ప్రకారంగా కథల ద్వారా వారి సమగ్ర సమాచారం భద్రపరిచి అందించే ప్రయత్నం చేశారు.
కోయ తెగ యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ‘‘చందా వీరయ్య’’మాటల గాధను పొందుపరిచారు సృష్టి ఆవిర్భావానికి చెందిన ఆసక్తిదాయకమైన విషయాలు కథలుగా ఇందులో చెప్పారు.
రెండవ అధ్యాయంలో గట్లు,గోత్రాలు,గురించి పురాణాలుగా చెబుతూ ఒకటి నుంచి ఏడవ గట్టు వరకు ఏర్పడ్డ విధానాలు చెబుతూ అవి కోయ జాతి వంశవృక్షం ద్వారా నిర్దేశించిన తీరు, వివాహాలు బంధుత్వాలు దేవుళ్లను పూజించే సమయంలో ఏ విధంగా వాటి ప్రాధాన్యత ఉంటుందో ఇందులో సవివరంగా సహేతుకంగా వివరించారు.
ఆయా గట్లు గోత్రాలు ఏర్పాటుకు జానపద బాణీలోని పురాణ గాథలు అన్వయం చేసి చెప్పారు, వీటికి అంకెలతో పాటు పేర్లు కూడా ఉండే తీరు చెబుతూ వివాహాల విషయంలో ఏ గోత్రం/గట్టువారికి వియ్యం కుదురుతుందో
ఆవివరాలు కూడా పట్టిక రూపంలో వివరించడం ఎంతో ఉపయోగకరంగా ఉంది.
మూడవ విభాగం మొత్తం కుటుంబం, బంధుత్వాలతో చెప్పబడిరది.దీనిలో వీరు బంధువులను పిలుచుకునే విధానం,తెలుగు లిపితో చెప్పబడ్డ కోయ భాషలో ఉంటుంది,తెలుగు భాషకు కాస్త దగ్గర సంబంధంగల ఈకోయ భాష అర్థం చేసుకోవడం పెద్దకష్టం ఏమీ కాదు.
ఉదా: అమ్మను యవ్వఅని,అక్కను యక్క,మామ ను,మామాల్‌,అని సంబోధించడం వీరికి పరి పాటిగా ఇందులో పేర్కొన్నారు.
లిపిలేని కోయ భాషకు లిపిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి సహేతుకంగా సూచన ప్రాయంగా నాలుగవ అధ్యాయంలో ‘‘భాషా – లిపి’’ పేరుతో వివరించడం జరిగింది.
5,6 అధ్యాయాలుగా కొలుపులు,వేల్పులు, పండుగలు,గా పేర్కొనడంజరిగింది. సాధార ణంగా గిరిజనులు తమ కొలుపులుగా ముత్యా లమ్మ, నాగులమ్మ, సమ్మక్క సారక్క,లను పేర్కొం టారు. వీరిని కొలవడంలోని అంతరార్థం చెప్పడంతో పాటు ఆయా జాతరలు చేసే తీరు కూడా కూలంకషంగా వివరించారు.వీటితోపాటు గుంజేడు ముసలమ్మ,డాలుగడ్డ డోలీలు,వంటి జాతర్ల గురించి అవి కోయలు నిర్వహించే విధానాలు ఆసక్తిదాయకంగా అందమైన శైలిలో చక్కగా కొనసాగాయి.
ఇక ఆరవదైన ‘‘పండుగలు’’ విభాగంలో కూడా అనేక ఆసక్తికరమైన వివరాలు ఆవిష్కరణలు చేయడం జరిగింది.
అవి ఇంటి పండుగ, వేల్పుల పండుగ, విత్తనాల పండుగ,తో పాటు భూమి పండుగ, పచ్చ పండుగ, వంటి సాధారణ పండుగలతో పాటు లేలే పండుగ ,కొత్తల పండుగ, చిక్కుడు పండుగ, ఇప్పపూల పండుగ, తాటి చెట్ల పండుగ, చీడపీడల పండుగ, కప్పల పండుగ, తదితర పండుగల వివరాలు విశ్లేషణతో పాటు ఆయా పండుగలు చేసే విధానం. తదితరాలతో పాటు ఆయా పండుగలు చేసుకునే సందర్భంలో సామూహికంగా పాడుకునే పాటలు సైతం ఇందులో వివరించారు. ఓకే ఇంటి పేరు వాళ్ళు అంతా తొలకరి ఆరంభంలో ఒకే చోట ప్రకృతిని ఆరాధిస్తూ చేసుకునే పండుగ ‘‘ఇంటి పండుగ’’ దీని ద్వారా అందరిలో ఐక్యత భావం కలగడంతో పాటు సౌబ్రాతృత్వం వెల్లివిరుస్తుంది.
వస్త్రధారణ అలంకరణలు విభాగంలో కోయవారు ధరించే ఆభరణాల్లో ఖరీదు విషయం పక్కనపెడితే సహజసిద్ధంగా దొరికే లోహాలు వెండి ఇత్తడి మొదలైన వాటితో తయారు అయిన ఆభరణాలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరి ఆభరణాల్లో అందం కన్నా సాంప్రదాయం అధికంగా ఉండ టం విశేషం. ఇక అడవి బిడ్డల ఆహారపు అల వాట్లు, వివాహా లు,చావు,మొదలైన విషయాల గురించి సుదీర్ఘంగా సహేతుకంగా ఇందులో వివరించ బడ్డాయి,వీటి ద్వారా అనేక ఆసక్తిదాయక విషయాలు విశేషాలు తెలుసుకోవచ్చు.
కోయల సంస్కృతిలో అత్యంత ప్రముఖ పాత్ర వహించేది ‘‘వెజ్జు’’, ఆరోగ్య విషయాల్లో ఎంతో సహకరించే ఈ వెజ్జు గురించి చాలా వివరంగా ఇందులో చెప్పారు, దీనిలో అంతర్భాగంగా మూలిక వైద్యం గురించిన వివరణలో వ్యాధులు వాటి నివారణ కోసం ఉపయోగించే మొక్కల పేర్లు పట్టిక రూపంలో వివరించడం చాలా ఉప యోగకరంగా ఉంది.
ఇక 14,15,అధ్యాయాలు ఇంటి నిర్మాణం, గృహోపకరణాలు,పనిముట్లు,గురించి చాలా చక్కగా వివరించి ఛాయాచిత్రసహితంగా అందిం చారు.అదేవిధంగా కళలు, జంతువులు, వేట, వ్యవసాయం,అటవీ ఉత్పత్తులతో పాటు,కోయ జాతిలో గల సామాజిక వ్యవస్థ, కట్టుబాట్లు, గురిం చి ఎంతో వివరణాత్మకంగా వ్రాయబడ్డాయి. భావి తరాలకు అడవిబిడ్డల సంస్కృతిని సచిత్రంగా భద్ర పరచబడిన ఈవిలువైన పుస్తకం పరిశోధకుల పాలిట కల్పవృక్షం,అనడంలో అసలైనసత్యంఉంది.
కోయతెగ-సంస్కృతి (వ్యాస సంకలనం)
పేజీలు: 226, ధర: 200/-రూ, ప్రతులకు: గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణ సంస్థ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ – భద్రాచలం,507111, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా, తెలంగాణ. సమీక్షకుడు : డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, చరవాణి : 77298 83223.- డా. అమ్మిన శ్రీనివాసరాజు

1 2 3