బంజారా సాహితి తొలి దీర్ఘ కవిత బతుకు
ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన…మన ఆదివాసీ సాహిత్యం…అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా ..వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో…వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని…పుస్తకాల వివరాలను “గవాక్షం” శీర్షికన.. “థింసా పాఠకుల” కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రసిద్ద రచయిత ‘ఆచార్య ఎం.గోనా నాయక’ కలం నుంచి జాలువారిన ‘బతుకు’) అనే పుస్తకంపై సమీక్ష – డా. అమ్మిన శ్రీనివాసరాజు
తెలుగు సాహిత్యంలో అంతర్భాగమైన జానపద సాహిత్య శాఖకు చెందిన గిరిజన సాహిత్యం ప్రారంభంలో మౌఖిక విభాగంలో ఉంది.అనంతర కాలంలో లిపిలేని గిరిజనభాషలు తెలుగుభాష సాయంగా వాటివాటి భావాలను సృజనలను ఆవిష్కరిస్తున్నాయి.అందులో భాగంగానే అభివృద్ధి చెందిన ఆదివాసి జాతుల్లో ఒకటైన లంబాడా గిరిజన సమాజానికి చెందిన ఆచార్య ఎం.గోనా నాయక్ తన రచనా పరంపరలో భాగంగా నేటి యువతకు ప్రధానంగా గిరిజన యువతకు ఆదర్శనీ యమైన తన జీవనచిత్రాన్ని‘బతుకు’పేరుతో దీర్ఘ కవిత రాశారు. దీని రచన కాలం జూలై 2022.తెలుగు సాహిత్యంలో దీర్ఘ కవితలు అనేకం ఉన్నాయి.కానీ బంజారా గిరిజన సాహిత్యం అందున అదే జన జాతికి చెందిన కవి వ్రాసిన దీర్ఘకవిత్వం లేదు కనుక ఇది’బంజారా తొలిదీర్ఘ కవిత”గా చరిత్రలో నిలుస్తుంది.మారుమూల లంబాడా తండాలో నిరుపేద కుటుంబంలో పుట్టి మేకల కాపరిగా తన జీవన ప్రస్థానం ప్రారంభించి,విశ్వవిద్యాలయ ఆచార్యులుగా ఎదిగిన ఒకలంబాడా యువకుని జీవితకథనే ఈ‘బతుకు’ దీర్ఘ కవిత సారం.
ఒకకోణంతో చూస్తే అదో వ్యక్తిగత విషయం తనస్వీయ జీవితాన్ని పుస్తకంగా వ్రాసుకున్నాడు లే!! అనుకోవచ్చు కానీ మరోకోణం నుంచి చూస్తే గిరిజనసాహితీ పరిశోధనకు ఇదో పుట్ట బంగా రం.అతిసాధారణ విషయాలను వచ్చిన కవితలుగా ఎలా వ్రాయవచ్చు కళ్ళ కు కట్టినట్టు విడమర్చి చూపిస్తుంది.పాఠకులను సైతం కవులుగా మార్చేసే నైజం ఈదీర్ఘ కవితలో ఆశాంతం అగుపిస్తుంది. ఇకపోతే గోనా నాయక్ చేయి తిరిగిన కవి వరేన్యుడు,తెలుగు భాషా సంపన్నుడు.మీరు మిక్కిలి పాఠాలను విద్యార్థులకు అర్థమయ్యే టట్టు గాక గుర్తుండి పోయేటట్టు బోధించే నైపుణ్యం గల ఆచార్య దిగ్గజం.ఈసలక్షణాల సమ్మే ళనమే‘బతుకు’దీర్ఘ కవితకు అదనపు ఆకర్షణగా నిలిచి దీనికి తెలుగు గిరిజన సాహిత్యంలో సమున్నత స్థానం కలిగింది.ఇకదీనిలో కవిగారు ఉపయోగించిన పదబంధాలు ఆయ న భాషా కండపుష్టికి సాక్షాలుగా నిలుస్తాయి.కవి గోనానాయక్ రాసిన ఈదీర్ఘ కవిత ద్వారా కేవలం నాయక్ జీవితం మాత్రమే కాదు. ఆయనలోని ఆత్మీయత కృతజ్ఞతా భావాలు ఆదర్శవంతంగా ఆవిష్కృతం అవుతున్నాయి. ‘బతుకు’దీర్ఘ కవిత ‘బాల్యంఅమూల్యం’ ఉపశీర్షిక నుంచి మొదలై‘బతుకు’అనే ఉపశీర్షిక వరకు మొత్తం30విభాగాలతో రూపొందించ బడింది. కరువు సీమ రాయలసీమప్రాంతానికి చెందిన‘నాగులగుడ్డం’తండాకు చెందిన నిరుపేద గిరిజన బిడ్డ నిరంతర కృషి,నిస్వార్థ క్రమశిక్షణ, నిండైన కృతజ్ఞతాగుణాలు,సాయంగా విశ్వవిద్యాలయ ఆచార్యుడైన విధానం మనం ఇందులో చదువు తాము.తన బ్రతుకు చిత్రంలో ఎదురైనా ప్రతిముఖ్యమైన విషయాన్ని వడిసి పట్టి అక్షరీ కరించి మన ముందు ఉంచారు.ఇందులో నాయకుడు గోనానాయక్ అయినా అతనికి సహకరించిన కుటుంబీకులను,గురువులను,మిత్రులను, సహచ రులను,ప్రతి ఒక్కరిని మననం చేసుకుంటూ ముం దుకు సాగారు. ఇది కేవలం గోనానాయక్ జీవితం మాత్రమే కాదు,యావత్ బంజారాల జీవితం, జీవ న సంస్కృతి,నాటి పల్లెలు తండాల అందాలు కళ్ళ కు కట్టి సరళమైన భాషతో అలతి అలతి పదా లతో అందానికే అందమైన అంత్యప్రాసల గుభాళిం పులు విడవకుండా చదివించే శైలి సొంతమైన ఈదీర్ఘ కవితను బహుళ ప్రయోజనకారి అనడం లో.. ఇసుమంత కూడా అతిశ యం లేదు. గిరిజన సామాజిక వర్గానికే వన్నె తెచ్చే ఉమ్మడి కుటుంబ వ్యవస్థను నాయక్‌గారి ఆవిష్కరణలో మనం దర్శి స్తాం.‘బాల్యంఅమూల్యం’ అంటూ తనతొలి జీవి తం నుంచి మొదలు పెట్టి తనకు జీవితాన్ని జీవాన్ని ఇచ్చిన అమ్మానాన్నలు గంగమ్మ భావ్యానాయక్‌ల గుణగణాలు అందరికీ ఆదర్శంగా పంచుతూ చెబు తాడు.అంతేకాదు తన తండ్రికి అంతటి సుగు ణాలను అందించిన తనతాతనాయనమ్మ రుప్లా నాయక్,సోమ్లిబాయిల త్యాగనిరతిని తలు స్తారు. కన్న ఊరు కన్నతల్లితో సమానం అని భావించిన కవిగారు తన‘బతుకు’కవనాన్ని ఆరంభిస్తారు. ‘కాలు పెట్టగానే సేద తీర్చే చెట్టు గాలి/బండలని పాషణాలని పిలువబడినా/..అవి మాత్రం తనఊరి బంగారు కొండలు అని అభివర్ణించడంలో తన మాతృభూమి మమకారం ఏమిటో అర్థం అవు తుంది. తన పండు తాను తినదు స్వార్థం లేదు/ రాయితో కొట్టిన కిందకు జార్చినా/నోట కొరికిన అమృత మిచ్చే/ అమ్మ ప్రేమ వరాలు/ నా ఊరి చెట్టు పండ్లు…అంటూ చెట్టు యొక్క నిస్వార్థ గొప్ప గుణాన్ని ఎంత చక్కగా వర్ణించారో..!! అంతే కాదు తన ఊరి చెరువును తన ఊరి పరువుతో అన్వయం చేసి చెప్పడం..కవిలోని సామాజిక స్పృహకు మచ్చు తునక.అలాగే తమ జనజాతి ఆరాధ్య దైవం సేవా లాల్‌కు కవి గోనా..అపర భక్తుడు అన్న విషయం ఈ‘బతుకు’కావ్యపుటల్లో మనకు ఆవిష్కరించ బడుతుంది.
సాధారణంగా గిరిజనుల్లో కుల కట్టుబాట్లు అధికం కులపెద్ద వారికి న్యాయమూర్తి అతను తీర్పే అంతిమం కవితాత రూపాలోని గుణ గణాలు చెబుతూ ఆయన పడ్డ కష్టాలను తమ కుటుంబీ కులను ఆదరించడంలో తన శ్రమను కళ్లకు కడు తూ..తనను వారి ఇంట సింగంగా వారి వంశ గౌరవంగా న్యాయాధినేతగా,సవ్య సాచిగా ధర్మరా జుగా ఉండి, అవమానాలను నష్టాలను ఎదిరించి నిలవడం ఎలాగో నేర్పిన కీర్తి మూర్తి అంటారు,
ఇది కవితాత్మక ఆత్మకథ అయినా ఎక్కడ దాపరి కాలు లేవు అవమానాలు అపజయాలు దాచు కోలేదు తన విద్యా ప్రయాణంలో తనకు సాయం చేసిన ప్రతి సారును మరవక తలుస్తూ చేసిన తలపోతలు గోనాగారి జ్ఞాపకశక్తికే కాదు నిండు కృతజ్ఞతా గుణానికి నిదర్శనంగా నిలుస్తాయి.గోన నాయక్ బాల్యం గురించి చెప్పు కుంటూ ‘పది విజయం సాధించిన నాకు/ భవి త అంతా సులువు కాలేదు/అంటూ పేదరి కంతోపై చదువులు చది వించే స్తోమత లేక తండ్రికి ఇంటి పనుల్లో సాయం చేయక తప్పని పరిస్థితి తనకేమో పెద్ద చదువులు చదవాలనే తపన, చివరికి నాయన అభయంతో తనపై చదువుల పయనంకు దారి దొరికింది.నీవు చదవాల/ బతుకు గెలవాల/..పది పై చదువు నీవు చదువు/ దుడ్డుల సంగతినాకు విడు/..అన్న నాయ న మాటల ద్వారా అతనికి తండ్రి లో ఆర్య పుత్రు డు రాముడు,సేవాలాల్, అం దరూ ఏకమై దర్శన మిచ్చారు. తన ఇంటర్ చదువును తనకు హంటర్ గా దారి చూపిన గురువుగా భావిస్తారు. ఇక తన డిగ్రీ చదువుకు వేదిక అయినా అనంతపురం కళా శాలను అక్కడి గురువులను తాను ఆస్వాదించిన సాహితీ సిరుల మాగాణులను మదినిండా ఆవిష్క రించుకున్నారు. అంతేకాదు అక్కడ తన బతుకు మలుపు నాటకం గురించి చెబుతూ డిగ్రీలో పరీక్ష తప్పిన విషయం అందుకు కారణమైన సంఘట నలను దాపరికం లేక ధైర్యంతో చెప్పారు.
డిగ్రీ చదివే రోజుల్లో నాటి బళ్లారి జిల్లా సింధ నూరులో మిత్ర బృందంతో కలిసి ఆడిన ‘గయోపా ఖ్యానం’నాటకం అందులో ఆయన ధరించిన అర్జు నుడు పాత్రతన నిజజీవితంలో విజయాలకు ఎలా దోహదపడిందో తెలియాలి అంటే అది చదివితేనే బాగుంటుంది.ఎప్పటికీ తన బతుకు పుస్తకంలో ఆ పుటపదిలమే అంటూ..‘ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్/ఆఫ్ ది విక్టరీ/..అంటూ జీవితాల్లో అపజయాలు సవిచూస్తూ కృంగిపోతున్న యువ తరం భుజం తట్టి భరోసా ఇస్తారు.ఇక కృష్ణదేవ రాయ విశ్వవిద్యాలయ చదువులు అక్కడి గురువు లు వారు బోధించినబోధనల గురించి‘ఫిజీ తెలుగు -దివిటి వెలుగు’లోను అనంతరం ఆయన తన సామాజిక వర్గపు అంశాన్ని ఎంచుకొని ‘సుగాలి చరిత్ర సంస్కృతి’పేరుతో చేసిన పరిశోధన గురించి ‘రిసెర్చి- రీసెర్చి’విభాగంలో అత్యద్భుతంగా అభి వర్ణించుకున్నారు.భావితరం పరిశోధక విద్యార్థు లందరికీ వీరి అంకితభావపు పరిశోధనా కృషి క్షేత్ర పర్యటనలు ఆదర్శంగా నిలుస్తాయి.‘ఆవిష్క రణకు అక్షరం ఆయువైంది/అనంతపురంలో పురు డు పోసుకున్న/పరిశోధన అన్ని వైపులకు నడి పించింది/ కొత్తగూడెం,పాల్వంచ,భద్రాచలం,/ పరుగుల ప్రయాణంలో అన్నీ కూడా/ పదనిసలు కాలేదు/ అంటూ ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని నాటి కాలంలో తాను పడ్డ కష్టాలన్నీ ఏకరువు పెట్టారు.‘నేను-ఆమె-మేము’శీర్షికలో తన వైవా హిక దాంపత్య జీవితం గురించి,తాను ఉద్యోగిం చిన హైదరాబాదు ఉస్మానియాలా చారిత్రక సొగ సులను,‘హై చరిత్రల-హైదరాబాదు’,ఉస్మానియా ఊసులులోను తనదైన కృతజ్ఞతా భావం అంతా రంగరించి అభి వ్యక్తీకరించారు, చివరిగా ‘బతుకు’ లో..‘రేపటి కోసం నేను దాచుకునేది/ డబ్బు కన్నా విలువైన జ్ఞాపకాలు..’అంటారు,నిజమే ప్రతి మని షికి పుట్టుకకు చావుకు మధ్య కొంత జీవితం ఏదో రూపంలో ఉంటుంది. కానీ అది నిరంతరం గుర్తు చేసుకునేదిగా తను పోయాక నలుగురు స్మరించుకు నేదిగా ఉండాలి.అప్పుడే ఆబ్రతుకు విలువకి అర్థం. అచ్చంగా అదే సందేశం అందిస్తుంది ఈ ‘బతుకు’ పొడుగు కవిత.
బతుకు దీర్ఘ కవితరి రచన: ఆచార్య ఎం.గోనా నాయక్,పేజీలు: 120, వెల:90/- రూ, ప్రతులకు: ఆచార్య గోనా నాయక్, సెల్: 98490 93300. సమీక్షకుడు:డా.అమ్మిన శ్రీనివాసరాజు,సెల్: 7729883223.
