మా గుండెల్లో చెరగని మీ సింహసనం

ఆయన ఆదివాసీ హృదయాల్లో చెరగని సంతకం. పుట్టింది ఉన్నత కుటుంబంలోనైనా..ఆయన జీవితం ఆదివాసులకే అంకితం. వైవిధ్యం ఆయన జీవన శైలి.ఉద్యమం ఆయన ఊపిరి.ఎన్నో సమస్యలపై పోరాడారు..విజయం సాధించారు. గిరిజనులకు ‘నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చారు. వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఆయనే రెబ్బాప్రగడ రవి. రాజ్యాంగ బద్దంగా షెడ్యూల్‌ ఏరియాలో ఆయన సేవలకుగాను చత్తీష్‌ఘర్‌ రాష్ట్ర ప్రభుత్వం పీసా చట్టం వర్కింగ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసింది. ఈనేపథ్యంలో గిరిపుత్రులు..ఆదివాసుల ముద్దబిడ్డలు.. ఆదివాసీ మిత్ర వెల్ఫేర్‌ సొసైటీ అక్టోబరు 4న రెబ్బాప్రగడ రవిగారిని ఘనంగా సత్కరించింది. ఈ పురస్కార సభలో పరిశోధకుడు సురేష్‌ కుమార్‌ తన స్వీయ రచన నుంచి అందించిన అభినందన పత్రంలోని అంశాలు మన థింసా పాఠకుల కోసం యథావిధిగా ప్రచరిస్తున్నందుకు సంతోషిస్తున్నాం -థింసా సెంట్రల్‌ డెస్క్‌.

Read more

అడవి తల్లికి గర్భశోకం

ప్రభుత్వ రంగంలో ఇంతవరకూ ఉన్న గనులను ప్రైవేటుపరం చేసే కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలూ లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతోంది.‘’ప్రజా ప్రయోజనాల’’ పేరుతో కారుచౌకగా ప్రభుత్వ రంగ కంపెనీల మైన్లను, భూములను ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టడమే ప్రభుత్వ ధ్యేయం. బడా బడా బహుళజాతి మైనింగు కంపెనీల నుండి వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గినట్టు కనపడుతోంది. దీనివలన ఖనిజ సంపద విస్తారంగా ఉన్న మన అటవీ ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతలు బాగా పెరిగే ప్రమాదం ఉంది.

గత నెలలో కేంద్ర ప్రభుత్వం‘’ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించే నిమిత్తం’’ ఒక పత్రాన్ని విడుదల చేసింది.1980 అటవీ సంరక్షణ చట్టంలో కొన్ని సవరణలను కేంద్ర పర్యావరణ, అటవీ సంరక్షణ మంత్రిత్వ శాఖ ఆపత్రంలో ప్రతిపాదించారు. ‘’పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అవసరాలు-వీటికి సంబం ధించి వేగంగా మారుతున్న దేశ అవసరాలు నెరవేర్చే’’ ఉద్దేశ్యంతో అటవీ సంరక్షణ చట్టాన్ని సంస్కరించాలని భావిస్తున్నట్టు కేంద్రం ఆపత్రంలో పేర్కొంది. చాలా అస్ప ష్టంగా చేసిన ప్రతిపాదనలు ఆ పత్రంలోఉన్నాయి. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే జాతీయ మానిటైజేషన్‌ ప్రణాళిక, 2022-25కు అనుగుణంగా ఉండేలా అటవీ అనుమతుల నిబంధనలను, పర్యావరణ సంరక్షణ నిబంధనలను సడలిం చడమే ఈ ప్రతిపాదనల వెనుక అసలు ఉద్దేశ్యం అని మనకు అర్ధమౌ తుంది. అనేక ప్రభుత్వ ఆస్తులు అటవీ ప్రాంతాల్లో వున్నాయి. అవన్నీ ప్రస్తుత అటవీ సంరక్షణ చట్టం విధించిన నిబంధనలకు లోబడి ఉన్నాయి. జాతీయ మాని టైజేషన్‌ పథకం వివిధ ప్రభుత్వ ఆస్తులను లీజుకివ్వాలని ప్రతిపాదించింది. ఆవిధంగా లీజుకివ్వడానికి ఈ అటవీ సంరక్షణ చట్ట నిబంధనలు అడ్డం వస్తున్నాయి. అందుకే ఆ చట్టాన్నే ఏకంగా సవరించాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ వర్గాల ప్రజలు ఈ ప్రతిపాదిత సవరణలను వ్యతిరేకిస్తున్నారు. ఆ సవరణలను అడ్డుకోడానికి పెద్ద ఎత్తున ప్రతిఘటనను నిర్మించే యోచనలో కూడా వారున్నారు. ఐతే ఈ సవరణల వెనుక అసలు ఉద్దేశ్యం మానిటైజేషన్‌ చేయడానికి ఉన్న ఆటంకాలను తొలగించడమేనన్న సంగతిని వారిలో చాలామంది గుర్తించలేకపోతున్నారు.

Read more

వైవిధ్యం వారి జీవనం

‘‘ స్వచ్ఛమైన సెలయేళ్లు. దట్టమైన అడవులు. గంభీరమైన కొండలు. పక్షుల కిలకిలారావాలు. పచ్చని ప్రకృతి అందాలు. వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యంగా.. పాలకుల ఆలనకోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసిస్తోంది. అడవితల్లి బిడ్డలుగా.. ప్రకృతి ఒడే ఆవాసంగా.. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని.. ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోని గూడేలెన్నో కనిపిస్తాయి. దశాబ్దాలుగా గిరిజనులు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వారి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. వారి జీవితాల్లో మార్పు కోసం తాజా సర్కారు నడుం బిగించింది. గిరిజనులకు పాలనలో పెద్దపీట వేసింది. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి సముచిత గౌరవం కల్పించింది. కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలు, తినే ఆహారం ఇలా.. ఆదివాసీలవన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఏళ్ల తరబడి అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అటవీప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. ఎక్కువమంది అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుం టాయి. ఏ పల్లెకు వెళ్లినా గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.’’

Read more

పీసా చట్టం గ్రూపు చైర్‌పర్సన్‌గా రెబ్బాప్రగడ రవి

‘ ఆదివాసీలు భిన్నజాతుల సమాహారమైన భారత ఉపఖండంలో అనేక గిరిజన సముదాయాలు నివసిస్తున్నాయి. ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. దేశంలో ఆదివాసీలు నివసించే 9 రాష్ట్రాల్లో గిరిజనులకు కల్పించ బడిన రాజ్యాంగ హక్కులను అమలు పరచడానికి కృషి చేయడం తోపాటు, షడ్యూల్‌ తెగల సామాజిక సాధి కారత. సమా నత్వం, సంక్షేమం సాధిం చడమే సామాజిక బాధ్యత. ప్రజల జీవన ప్రమా ణాలు పెంచడంలోనూ, స్వయం సంవృద్ది సాధించడం లోనూ పీసా చట్టంలోని మరికొన్ని విశేష అధికారాలు ఉన్నాయి ’’ ` రెబ్బాప్రగడ రవి, సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మరియు పీసా వర్కింగ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌, చత్తీస్‌ఘర్‌,

అడవి బిడ్డలకు స్వయం పాలన మరింత సులువు కానుంది. ఇన్నాళ్లు షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనుల హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగింది. పెసా (పంచాయతీస్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్‌ ఏరియా)1996 చట్టం వచ్చి 25ఏళ్లు పూర్తియిన సమత ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వం పీసా చట్టం వర్కింగ్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ బాగెల్‌ సలహాదారు శ్రీరాజేష్‌తివారీ అధ్యక్షతన‘‘గిరిజన అభివృద్ధి,అటవీ మరియు వన్యప్రాణి నిర్వహణ, మైనర్‌ ఫారెస్ట్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏరియాస్‌ డెవలప్‌మెంట్‌’’పై టాస్క్ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. దానికి అను బంధంగా టాస్క్ఫోర్స్‌ కింద వివిధ సబ్‌-వర్కింగ్‌ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఇందులో సబ్‌-వర్కింగ్‌ గ్రూప్‌ ‘‘ట్రైబల్‌ ఏరియా గవర్నెన్స్‌-పెసా మరియు గవర్నెన్స్‌లో టెక్నాలజీ వాడకం’’ ఛైర్మన్‌గా సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవిని ఆరాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘం ప్రకటించింది.వర్కింగ్‌ గ్రూప్‌ కమిటీ పీసా చట్టంపై ప్రభుత్వానికి తగు సూచనలు సలహాలు ఇస్తోంది.

Read more

విశాఖ ఏజెన్సీలో కాల్సైట్‌ లీజుల కలకలం

‘‘ విశాఖ జిల్లా మన్యప్రాంతం విశాలమైన అడవులతో విస్తరించుకున్న ప్రాంతం. వ్యవసాయం,అటవీ ఉత్పత్తులే ఇక్కడ ఆదివాసీల జీవనాధారం. నిరక్షరాస్యత, అనారోగ్యం,అజ్ఞానం,ఆర్ధికదోపిడి,కనీస సౌకర్యాలలేమి వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు. వీటి కారణంగా గిరిజనులు తమ భూములు,వనరులను కాపాడుకోలేక పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, గిరిజనుల్లో తమ హక్కులపట్ల చైతన్యం కలిగించి ప్రభుత్వం గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘటించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఈనేపథ్యంతోనే గత 30 ఏళ్ళ నుంచి రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పరిధిలోకి వచ్చే ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు, పర్యావరణ పరిరక్షణ,వారి హక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. స్థానికులైన గిరిజనల భూములు, అన్యాక్రాంతం కాకుండా ఈ షెడ్యూలు రక్షణ కల్పిస్తుంది. అయినా రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ జిల్లా ఏజెన్సీలో చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనేతరులు గిరిజన భూములను ఆక్రమించుకోవడం ఆగలేదు ’’

విశాఖ మన్యంలో మైనింగ్‌తవ్వకాలపై మరోమారు కలకలం రేపుతోంది. జిల్లాలోని అనం తగిరి మండలం వలాసీ పంచాయితీ పరిధి మారు మూల లోతట్టు గ్రామాలైన కరకవలస,రాళ్లవలస, నిమ్మలపాడులో కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన లీజులపై అప్రాంత గిరిజన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన లీజులు తక్షణమే రద్దు చేసి స్థానిక గిరిజన సొసైటీలకే మై నింగ్‌ లీజులు అప్పగించాలంటూ గిరిజన ప్రజలు మళ్లీ ఉద్యమానికి తెర లేపనున్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను బాధ్యతాయతం గా అమలు పర్చవలసిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తుతుంది. మైనింగ్‌ లీజులకు గ్రామసభ తీర్మాణం లేదు.సమతజెడ్జిమెంట్‌,పీసాచట్టం, అటవీహక్కుల చట్టం, నియమగిరి జడ్జెమెంట్‌ వంటి గిరిజనులకు రక్షణగా ఉన్న రాజ్యాంగబద్దమైన చట్టా లను వ్యతిరేకించి..మైనింగ్‌ లీజులు ఇవ్వడంపై గిరిజన ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.         ఆదివాసుల హక్కులు,మైనింగ్‌ తవ్వకా లపై పూర్వంనుంచి సమత పలు ఉద్యమాలు చేపట్టి సుప్రీం కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగింది. ఫలితంగా సుప్రీం కోర్టు ఇచ్చిన సమత తీర్పును గౌరవించి అమలు చేయాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగాలు కంచెచేనుమేసే చందంగా వ్యవహరింస్తోంది. ఈప్రాంతంలో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. నేటికీ అన్యాయాలకు,అమయకత్వానికి గురవుతునే ఉన్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మళ్లీ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

సమత ఉద్యమ నేపథ్యం
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాలు రాజ్యాంగంలోని ఐదవషెడ్యూల్‌ పరిధిలోకి వస్తా యి. స్థానికులైన గిరిజనుల భూములు అన్యా క్రాం తం కాకుండా ఈషెడ్యూలు రక్షణ కల్పిస్తుంది. గిరిజనుల భూమిని గిరిజనేతరులు స్వాధీనం చేసుకో కుండా భూమి బదిలీ నిబంధనలు నిరోధిస్తాయి. అయినా రాష్ట్రంలో చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనేతరులు గిరిజన భూములను ఆక్రమించుకోవడం ఆగలేదు. గిరిజనేతర భూస్వా ములు,వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి గిరిజనుల భూమిని విడిపించడానికి సమత, గిరిజ నులు నిరసనవంటి అన్ని ప్రజాస్వామ్య ఆందోళనా పద్దతులను అనుసరించింది. గిరిజనులకు బెయిలు కోసమో,షెడ్యూలు ప్రాంతాల చట్టాలను అమలు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడానికిగాని సమత అనేక సార్లు కోర్టు గడపతొక్కవలసి వచ్చింది.

Read more

మేమంటే ఇంత చులకనా?

‘‘ నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏవైనా…ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై చూపడం లేదు. ‘చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలోనే మన ప్రభుత్వం రానుంద’ని జగన్‌ ఎన్నికల ముందు మాట్లాడారు. తానొస్తే పునరావాస ప్యాకేజీ రూ.10 లక్షలి స్తామని… గతంలో ఎకరాకు రూ.1.15 నుండి రూ.1.25 లక్షలు పొందిన భూములకు కుటుం బానికి రూ.5 లక్షలిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తు తం ఆ హామీల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై పదిహేనేళ్లు కావస్తున్నా… నిర్వాసితుల పునరావాస కల్పన చూస్తే ఆశ్చర్యం గానూ, నిరాశాజనకంగానూ వుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేవలం 9 గ్రామాల్లోని 3300 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పిం చింది. ఇది కేవలం 3 శాతం మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వాలకు ప్రాజెక్టు నిర్మాణంపై వున్న శ్రద్ధ పునరావాసంపై లేదనే వెల్లడౌతున్నది.’’

పోలవరంప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 222గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా. ఈ క్రమం లో రెండు లక్షలమంది ప్రజలు నిర్వాసితులు కావొ చ్చు.నిర్వాసితులయ్యే వారిలో అధికశాతం మంది ఆదివాసులే. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు మొదలు పెట్టాక ఇప్పటికి ముంపు ప్రాంతంలోని 3,446 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. వీరినిందరికీ 2010`2011లో సర్వే చేసి అప్పటి భూసేకరణచట్టం కింద పునరావాసం అర కొరగా కల్పించారు. ప్రభుత్వం కల్పించే పునరా వాసం నేటికీ ఆదివాసీలకు సంపూర్ణంగా కల్పిం చలేదు. దీంతో వారంతా ఆందోళనలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసి తులపై చూపడం లేదు.‘చంద్రబాబు ప్రభు త్వం నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలోనే మన ప్రభుత్వం రానుం ద’ని జగన్‌ ఎన్నికల ముందు మాట్లాడారు. తానొస్తే పునరావాస ప్యాకేజీ రూ.10లక్షలిస్తామని.. గతంలో ఎకరాకురూ.1.15నుండి రూ.1.25 లక్షలు పొందిన భూములకు కుటుంబానికి రూ.5 లక్షలిస్తామని హామీఇచ్చారు. ప్రస్తుతం ఆహా మీల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారం భమై పదిహేనేళ్లు కావస్తున్నా…నిర్వాసితుల పునరా వాస కల్పన చూస్తే ఆశ్చర్యంగానూ,నిరాశాజన కంగానూ వుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేవ లం 9గ్రామాల్లోని 3300కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించింది. ఇది కేవలం 3శాతం మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వాలకు ప్రాజెక్టు నిర్మాణంపై వున్న శ్రద్ధ పునరా వాసంపై లేదనే వెల్లడౌతున్నది.

Read more

కులాల విభజన ఉపాధి హామికే ప్రమాదం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామిలో కులాలవారి సమాచారంపై కేంద్ర గ్రామీణా భివృద్ధిసంస్థ మార్చి 2, 2021న అడ్వయి జరీ ఫైల్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఉపాధి హామిలో దళితు లు,గిరిజనుల వివరాలు, వారి పనిదినాలను ప్రత్యేకంగా పేర్కొనాలని, ఆ ప్రాతిపదికపై 2021-22వేతనాల చెల్లింపు ఉంటుందని ఆ అడ్వయిజరీ ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. 2006లో ఉపాధి హామిని ప్రారం భించిన నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సర్క్యులర్‌లు ఏవీ కేంద్రం నుంచి రాష్ట్రాలకు రాలేదు. మొదటి సారిగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధిలో ఈ కులాల విభజన చేయడాన్ని పైపైన పరిశీలిస్తే హిందుత్వ శక్తుల అసలు ఎజెండా అర్థం కాదు. ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం కలగజేయడానికే ఈ వివరాల సేకరణ అనే ముసుగేసి అంతిమంగా ఉపాధి హామి చట్టం యొక్క మౌలిక లక్ష్యాలనే దెబ్బతి సేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం సిద్ధమైంది.

   దేశంలో అన్ని గ్రామాలకు విస్తరించిన అతి ముఖ్యమైనది ఉపాధి హామి చట్టం. 2004లో ప్రజా సంఘాల ఒత్తిడితో ‘’ఉపాధిహామి’’ పథకంగా కాకుండా చట్టంగా రూపుదిద్దుకున్నది. ఉపాధి హామిలో ఎలాంటి మౌలికమైన మార్పులు చేయా లన్నా పార్లమెంట్‌కే అధికారం ఉన్నది. అలాంటి ఈచట్టాన్ని మోడీ ప్రభుత్వం నీరుగార్చడానికి సర్క్యులర్స్‌,అడ్వయిజరీల పేరుతో దొడ్డిదారిన అనేక మార్పులు చేస్తున్నది. హిందూత్వ శక్తులు ఉపాధి హామిలో తెస్తున్న మార్పులు ఎంత ప్రమాదకరమో అర్థం కావాలంటే చట్టంలో ఉన్న మౌలిక అంశా లను గుర్తుచేసుకోవడం అవసరం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి వయోజనుడికి కులాలు, మతాలు,ప్రాంతాలు అనేదానితో నిమిత్తం లేకుండా సంవత్సరంలో 100రోజులకు తక్కువ కాకుండా పని కల్పించాలి. వారం,పది రోజుల్లో పని చూపిం చకపోతే నిరుద్యోగభృతి ఇవ్వాలి. యంత్రాలు, కాంట్రాక్టర్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమ తించవద్దు. పనిప్రదేశాల్లో అన్ని సౌకర్యాలను కల్పిం చాలి. చివరకు పిల్లలకు చైల్డ్‌కేర్‌ సెంటర్స్‌ను కూడా పెట్టాలి. వారంవారం వేతనాలు చెల్లించాలి. సరళీ కృత ఆర్థిక విధానాలవల్ల వ్యవసాయంలో యాంత్రీ కరణ జరగడం, వృత్తులు దివాళాతీసి వ్యవసాయ కార్మికులుగా మారడం, చిన్న-సన్నకారు రైతులు వ్యవసాయ నష్టాలతో కూలీలుగా మారడంతో వ్యవ సాయ రంగంలో సంవత్సరంలో 70-80రోజు లకు మించి పనిదొరకని నేపథ్యంలో ఉపాధి హామి చట్టం వచ్చింది.
  కానీ,29కోట్ల 42లక్షల మంది ఉపాధి కూలీల్లో ప్రస్తుతం 14కోట్ల31లక్షల మందికే ప్రభు త్వాలు పని కల్పిస్తున్నాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాలు పనులు కల్పించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో గత రెండు, మూడు సంవత్సరాలుగా లక్షల మంది పనికోసం దరఖాస్తులు పెట్టుకుంటే పనులు ఇవ్వకుండా అక్కడి ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. కోర్టులు జోక్యం చేసకున్నా ఫలితం ఉండడం లేదు. ఇన్ని పరిమితుల్లో కూడా2020-21ఆర్థిక సంవ త్సరం లో 389.32 కోట్ల పనిదినాలు ఉపాధిలో దేశ వ్యాపితంగా లభించాయి. కరోనా విపత్తులో కూడా ఉపాధి కూలీలు ప్రాణాలు ఫణంగా పెట్టి పనులు చేసారు. వ్యవసాయంలోనూ కరోనాలో పనులు నిర్వహించడంవల్లనే అన్నిరంగాలు మైనస్‌లో      ఉన్నా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే 4శాతం అభివృద్దిని సాధించింది. ఇలాంటి ఉపాధి హామికి మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలి. కానీ బీజేపీ తీసుకొచ్చిన ఈఅడ్వయిజరీ ఫైల్‌, మొత్తం ఉపాధి హామి లక్ష్యాలనే తలక్రిందులుగా చేస్తోంది.
  ఉపాధిలో ఎస్సీ,ఎస్టీల వివరాలను సేకరిం చేది సబ్‌ప్లాన్‌ ద్వారా నిధులిచ్చి మరింతగా ఈ తరగతులకు లబ్దిచేయడానికేనని బీజేపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం. గత సంవత్సరం కల్పిం చిన పని దినాల్లో ఎస్సీలు 19.86 శాతం, ఎస్టీలు 17.9శాతం పని దినాలు పొందారు.ఎస్సీ, ఎస్టీ లకు కలిపి 37.76శాతం...అంటే 140కోట్లకు పైగా పనిదినాలు లభించాయి. దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభా 24.4 శాతం ఉంటే, జనాభా కంటే 13శాతానికి పైగా అదనంగా ఉపాధి హామి పను లు చేస్తున్నారు. దళిత, గిరిజన ప్రజలకు గ్రామాల్లో ఉపాధి హామి ఒక జీవనాధారం. కానీ ఇప్పుడు సబ్‌ప్లాన్‌ నిధుల్లో జనాభా ప్రాతిపదికపై బడ్జెట్‌లో కేటాయింపులు చూపిస్తున్నారు. ఉపాధి హామికి సబ్‌ప్లాన్‌ నిధులు మరలించాలంటే జనాభా ప్రాతిపదికన 24.4శాతమే ఇస్తారు. మరి అదన మైన 13శాతం పని దినాలకు వేతనాలు ఎక్కడి నుండి వస్తాయి? దేశంలో ఈ స్థితి ఉంటే చాలా రాష్ట్రాల్లో ఉపాధి హామి పనులు 40 నుంచి 60 శాతం వరకు దళితులు, గిరిజనులే చేస్తున్నారు. పంజాబ్‌లో ఉపాధి పనులు 60శాతానికి పైగా ఒక్క దళితులే చేస్తున్నారు. అక్కడి జనాభా రేషియో లో నిధులు ఇస్తే పంజాబ్‌లో ఎస్సీ జనాభా 30 శాతం మాత్రమే. మిగిలిన 30శాతం ఎస్సీ వేత నాల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి పని దినాల్లో 33.38శాతం, ఉత్తరప్రదేశ్‌లో 28.5శాతం, తెలంగాణలో 40శాతం ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. కనుక ఎస్సీ,ఎస్టీ ప్రయోజనాలకే ఈ వివ రాల సేకరణ అనేది పచ్చి బూటకం. ఈ పేరు చెప్పి ఉపాధి హామీలో బీజేపీ ప్రభుత్వ హెడన్‌ ఎజెండాను అమలుచేసే కుట్రలకు బీజేపీ తెగిం చింది. సబ్‌ప్లాన్‌ నిధులంటే రెగ్యులర్‌ పథకాల్లో దళిత, గిరిజనులు పొందే సౌకర్యాలకు అదనంగా వాటిని ఉపయోగించాలి. కానీ,ఏకకాలంలో      ఉపాధిని, సబ్‌ప్లాన్‌ను పాతర పెట్టడానికి నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు.
  నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉపాధిహామిని బలహీన పర్చడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగి స్తున్నారు. వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యుపీఏ ప్రభుత్వం యూనియన్‌ బడ్జెట్‌లో ఈపథకానికి 4శాతానికి తగ్గకుండా నిధులు కేటాయిస్తే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర బడ్జెట్‌లో 2శాతానికి తగ్గించారు. ఒక్కదెబ్బతో ఉపాధి నిధు లకు అడ్డంగా కోతపెట్టారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో గత ప్రభుత్వాలు కేటాయించినట్టు కనీసం 4శాతం కేటాయిస్తే 1,44,000 వేల కోట్లకు తక్కువ కాకుండా ఉపాధి హామికి బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. కానీ ఈ సంవత్సరం బీజేపీ ప్రభుత్వం 71వేల కోట్లే ఇచ్చింది. మోడీప్రధాని అయిన దగ్గర నుంచి ఈ తరహాలోనే కేటాయింపులు సగానికి తగ్గాయి. బడ్జెట్‌ తగ్గిపోవడంతోటే ఉపాధి పనుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సగం మందికే పనులు కల్పిస్తున్నాయి. ఉపాధిహామి నిధుల్లో 10 శాతానికి మించి మెటీరియల్‌కు ఖర్చు పెట్టకుండా గతంలో అమలైతే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40శాతానికి మెటీరియల్‌ను వినియోగిం చుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో యంత్రా లు,కాంట్రాక్టర్లను,మనుష్యులు చేయలేని పనుల పేరుతో ఎంపిక చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు దళిత, గిరిజనుల స్వంత భూముల అభివృద్ధికి ఉపాధిహామి నిధులను ల్యాండ్‌ డెవలప్‌ మెంట్‌ పేరుతో వేలకోట్లు వినియోగించాయి. స్వంత భూమిలోపని చేసుకోవడం వలన భూములు సాగులోకి తెచ్చుకున్నారు. కానీ,నరేంద్రమోడీ ప్రభు త్వం ఉపాధి ద్వారా ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ను అటకెక్కించింది. ప్రజలకు ఉపయోగపడే వాటిని పక్కన పెట్టి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మంత్రుల పర్యటనలకు, పార్కులకు, హెలిప్యాడ్‌ల వినియో గానికి కూడా ఉపాధి హామి నిధులను ఉపయోగిం చే స్థితికి ప్రభుత్వాలు దిగజారాయి. చట్టం యొక్క స్పూర్తికే బీజేపీ తిలోదకాలిచ్చింది.
  కేరళతో పాటు, త్రిపురలో వామపక్ష ప్రభు త్వం ఉన్నప్పుడు ఉపాధిహామి పని దినాలు కల్పిం చడంలో దేశంలో అగ్రభాగాన ఉన్నాయి. త్రిపుర అయితే ప్రతి జాబ్‌కార్డుకు సగటున 89పని దినాలు కల్పించి కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నది. దక్షిణాది రాష్ట్రాలు కూడా ఉపాధి హామిని ఐదారు సంవత్సరాలు బాగా ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు వామపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలు తప్ప, కేంద్రంతో పాటు ప్రాంతీయ పార్టీలన్న తేడా లేకుం డా అని పార్టీల ప్రభుత్వాలూ ఉపాధి హామిని నిర్వీర్యం చేస్తున్నాయి. బీజేపీ పాలక రాష్ట్రాల్లో ప్రారంభం నుండి ఉపాధిహామిపై శ్రధ్ద లేదు. ఉత్తరప్రదేశ్‌లో అయితే ప్రాణాళికాబద్దంగా ఉపాధి హామీనే లేకుండా చేస్తున్నారు.20కోట్ల జనాభా     ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 2.21కోట్ల జాబ్‌కార్డులు, 3. 12కోట్ల ఉపాధి కూలీలను మాత్రమే నమోదు చేసారు. ఉపాధి హామిని బలహీనపరచి దళిత, గిరిజనుల ఆర్థిక మూలాలను దెబ్బతియడానికే బీజేపీ ఈ కుతంత్రాలు చేస్తున్నది. ఉపాధి హామి వల్ల వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, ప్రత్యేకించి దళిత,గిరిజనులు,ఓబీసీలకు కొన్ని పని దినాలు దొరికాయి. రెండు,మూడు నెలలు ఆహా రానికి ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడిరది. కొంత కొనుగోలు శక్తి పెరిగింది. ప్రత్యేకించి గ్రామ పెత్తందారులపై పదిఇరవై రూపాయలకు ఆధా రపడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది.పేదల భూము లు కొంతమేరకైనా సాగులోకి తెచ్చుకున్నారు. గుడ్డిలో మెల్లగా అమలవుతున్న ఉపాధిచట్టం వల్ల కలిగే ఈ మాత్రం ప్రయోజనాలు కూడా గ్రామీణ ధనిక వర్గానికి కంటగింపుగా ఉన్నాయి. ఈ చట్టాన్ని అమలు జరపడం ఏ కోశానా ఇష్టంలేని పెత్తందా రులు, హిందుత్వవాదులు కలిసి ఉపాధి హామి పీక నులమడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వయిజరీ ఫైల్‌లో ఉన్న అంశాలు అమలైతే అందరికంటే నష్టపోయేది దళితులు, గిరిజనులే. సబ్‌ప్లాన్‌ పేరు చెప్పి, జనాభా ప్రాతిపదికమీద నిధులిచ్చి దళిత-గిరిజనులు ఇప్పుడు పొందుతున్న పనులు సగానికి తగ్గిస్తారు. తద్వారా దళితులను పూర్వ స్థితికి, అంటే పెత్తందా రులకు ఊడిగం చేసే స్థితికి నెట్టేస్తారు. ఎస్సీ, ఎస్టీల పేరు చెప్పి ఓబీసీ, బీసీలకు కూడా ఉపాధి హామి పనులు లేకుండా చేస్తారు. దేశ వ్యాపితంగా 35నుంచి40శాతం పనులు ఓబీసీ, బీసీలు చేస్తున్నా రు. భవిష్యత్‌లో వారికీ అవకాశం లేకుండా ఈ చట్టాన్ని తలకిందులుగా మారుస్తారు. పని ప్రదే శాల్లో కుల వైశమ్యాలను పెంచుతారు. సమిష్టిగా చేసే ఉపాధి పనులు కుల ఘర్షణలుగా మారు తాయి. దీనిని పెత్తందారులు అవకాశంగా వినియో గించుకుంటారు. కులాల పేరుతో ఏర్పడే గ్రూపులకు గ్రామ పంచాయతీలు ఇష్టానుసారం పనులు ఇస్తాయి. దళిత, గిరిజనులకు కఠినమైన పనులు, తక్కువ వేతనాలు పడేటట్లుగా ఈ ఆధిపత్య వర్గాలు ప్రయత్నిస్తాయి. బీజేపీ తెచ్చిన ఈ అడ్వయిజరీ అమలైతే కులాల వారీగా వేతనాల్లో వ్యత్యాసా లొస్తాయి. పూర్వ కాలంలో, ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో దళితులకు, ఇతర కులాల కంటే తక్కువ వేతనాలు ఇచ్చిన నేపథ్యం మన దేశంలో ఉన్నది. ఆస్థితి ఉపాధిలో పునరావృతం అవు తుంది. ఇప్పటి వరకు 50శాతం ఉపాధి పనులను మహిళలు చేస్తున్నారు. కులాల విభజన వచ్చిన తర్వాత మహిళలు చేయలేని పనులను ప్రవేశపెట్టి వీరికి పనులు సగానికి సగం తగ్గిస్తారు. అంతిమం గా ఈ అడ్వయిజరీ వల్ల అందరికంటే దళిత, గిరిజనులు, అన్ని కులాల్లో ఉన్న మహిళలకు తీవ్ర నష్టం కలుగుతుంది. రైతు చట్టాలు, విద్యుత్‌ బిల్లు, కార్మిక చట్టాల కోడ్‌ల కోవలోనే ఉపాధి హామిలో కుల విభజనను చూడాలి. దేశ వ్యాపితంగా రైతాం గం,కార్మికులు,వ్యవసాయకార్మికులు చేస్తున్న చట్టాల వ్యతిరేక పోరాటంలో ఉపాధి హామిలో బీజేపీ తెచ్చిన కులవిభజనను జోడిరచాలి. పోరాడి సాధిం చుకున్న ఉపాధి హామిని కాపాడుకోవడానికి మరో పోరాటమే మార్గం. కులాల విభజన రద్దు, 200 రోజుల పని, రోజు వేతనం రూ.600 కోసం దేశ వ్యాపిత సమరశీల సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలి. రైతాంగ పోరాటాల స్ఫూర్తితో ఉపాధి హామి పోరాటం ప్రారంభం కావాలి.-బి.వెంకట్‌

బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏమిటీ?

ఒకపక్క కోవిడ్‌ భయపెడుతుంట్టే… కొన్నాళ్లుగా బ్లాక్‌ ఫంగస్‌ మరీ ఆందోళన కలిగిస్తోంది. అసలు బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏమిటి? ఇది ఎందుకు సోకుతుంది? దీని పట్ల తీసు కోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇత్యాది విషయాలపై ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రమణయ్య అందించిన సమాచారం మన పాఠకుల అవగాహన పెంచటానికి ఈ సమాచారం ఉపయోగపడు తుందని ఆశిస్తున్నాం. – ఎడిటర్

బ్లాక్‌ ఫంగస్‌ కోవిడ్‌ కంటే ప్రమాదకరమైనదని, కోవిడ్‌ వచ్చిన వారికందరికి బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందని, దీనికి వైద్యం లేదని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవం కాదు. నిజానికి ఎప్పటి నుంచో ఉన్న జబ్బు. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన కూరగాయలు,బ్రెడ్‌లు చెడిపోయి బూజు పట్టినట్టుగా కనిపించడం ఈ ఫంగస్‌ వల్లనే. కోవిడ్‌ రోగులకు ఎక్కువగా వస్తుండడంతో కోవిడ్‌ వ్యాధికి వచ్చినంత ప్రచారం దీనికి కూడా వచ్చి కోవిడ్‌ కంటే ఎక్కువగా భయపెడు తుంది. ఆ పేరు ఎలా వచ్చింది?

బ్లాక్‌ ఫంగస్‌ …శాస్త్రీయ నామం మ్యూకార్‌ మైకోసిస్‌. నిజానికి ఇది నల్ల రంగులో ఉండదు. ఈ ఫంగస్‌ సోకిన కణజాలం రక్తప్రసరణ సరిగా అందక నల్లగా మారిపోతుంది. కాబట్టి దీనిని బ్లాక్‌ ఫంగస్‌ అని పిలుస్తున్నాం.

Read more

మార‌ని రాత‌…త‌ప్ప‌ని డోలీ మోత !

‘‘ కొండ కోనల్లో జీవనం.. నిండైన అమాయకత్వం.. మరమం ఎరుగని మనస్త త్వం.. ఇదీ మన్యంలో గిరిపుత్రు జీవన విధానం. ప్రకృతి ఒడిలో ఊయలూగుతూ… అడవితో పెనవేసుకుని సాగుతున్న వారి బతుకుల్లో వెలుగు మాత్రం కరువయ్యాయి. కనీసం విద్యా, వైద్యం అందక ఆ గిరిజన బతుకు తెల్లారుతున్నాయి. దశాబ్దాల‌ గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడటం లేదు. పిల్ల‌బాట‌లే ఆ గూడాకు రహదారులు. నిత్యావసరం, అత్యవసరం ఏదైనా సరే…. కాలినడకనే వారి ప్రయాణం. డోలీలే వారికి అంబులెన్సలు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రు ఎదుర్కొంటున్న కష్టాలివి. కొండ కోనల్లో ప్రకృతి పెనవేసు కున్న గూడాల్లో బతుకు మాత్రం నేటికీ వెలుగు రావటంలేదు. యాభై ఏళ్ల క్రితం నాటి పరిస్థితులే గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి…’’

ప్రపంచాన్ని కుగ్రామం చేసే పరిజ్ఞాన మొచ్చినా...అక్కడ ఊరు దాటేందుకు దారలుండ‌వు. సమస్త సమాచారం క్షణాల్లో చేర్చే సాంకేతికత... ఏళ్లు గడిచినా ఆప్రాంతాల‌కు చేరలేదు. గంటల్లో గుండెను సైతం మార్చే నైపుణ్యమున్నా...మందు గోలీలైనా వారికి అందవు. ఒక్క క్లిక్‌తో ఆహారం ఇంటికొచ్చే రోజుల్లోనూ... రేషన్‌ కోసం మైళ్లదూరం నడవక తప్పదు. మార్గమధ్యలోనే ప్రసవాలు.. గమ్యం చేరక ముందే మరణాలు..ఇలా బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకులీడుస్తున్న గిరిజను గోడుపై ప్రత్యేక కథనం.

మారుమూల‌ గిరిజన గ్రామాల‌కు రహదారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో రోగుల‌ను ఆసుపత్రికి తరలించేందుకు డోలీమోత తప్పడంలేదు. వందు,వేల‌కోట్ల రూపాయు ఖర్చు చేస్తున్నామనే ప్రభుత్వాలు గిరిజనల‌కు కనీస రవాణా కల్పించడంలో విఫమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌,ఒరిస్సా,ఛత్తీష్‌ఘర్‌ రాష్ట్రాల్లోని అనేక మారుమూల‌ గిరిజన గ్రామాల‌కు నేటికి రహదారి సౌకర్యం అందని ద్రాక్షలా వుంది. ప్రసవ సమయం దగ్గరపడినా గర్భిణల‌ను ఆసుపత్రుల్లో చేర్పించక పోవడం వ‌ల్ల అనేక ప్రసవాలు గ్రామాల్లోనో, అంబు లెన్సుల్లోనో,ఒక్కోసారి రహదారుల‌ పక్కనే జరుగు తున్నా అధికార యంత్రాంగంలో కదలిక రావడం లేదు.  108వాహనాలు సక్రమంగా పని చేయడం లేదు. బైక్‌ ఆంబులెన్సులు రావడానికి దారి ఉండదు. చీకటిపడితే గిరిజన ప్రాంత పీహెచ్‌సీల్లో వైద్యం అందుబాటులోఉండదు. ఆసుపత్రు ఒకవేళ తెరిచినా డాక్టర్లు  స్థానికంగా  అందుబాటులో లేని పరిస్థితున్నాయి.  ఆసుపత్రికి వెళ్లాంటే 12`20 కిలోమీటర్ల దూరం కాలినడకన కొండ దిగుతూ ఎక్కుతూ రోగిని/గర్భణీస్త్రీల‌ను డోలికట్టి మోసుకుపోవాల్సిందే. మరోవైపు క్షేత్రస్థాయిలో ఉండే ఎఎన్‌ఎంలు, సూపర్‌ వైజర్లు గర్భిణిల్ని ప్రసవ తేదీకి కనీసం వారం ముందుగానే ఆసుపత్రికి చేర్చాల్సి ఉన్నా ఈమారు మూల‌ ప్రాంతంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా హైరిస్క్‌ గర్భిణలు నమోదు, వారిని ఎప్పటి కప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షు చేయించడం లోను వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరి స్తున్నారు. ఈ కారణంగానే పురిటినొప్పు వచ్చాక అప్పటి కప్పుడు ఆసుపత్రికి చేర్చాల్సి రావడం,కొన్ని సార్లు స్థానికులే పురుడు పోయడం జరుగుతోందని స్ధానిక ప్రజంటున్నారు. ఇలాంటి సంఘటను మన్యంలో సర్వ సాధారణం..ప్రతీరోజు చూడవచ్చు...కొండ మీద బతుకుతున్న గిరిజను ఆనారోగ్యం పాలై నపుడు నానాకష్టాలు పడి కిందికి చేరుకుంటారు.

గర్భిణీ స్త్రీకు ఇక్కట్లు
గడిచిన ఒక్క నెల‌లోనే పది డోలీ మోత ఘటను వెలుగులోకి వచ్చాయి. సుదూరంలోని కొండ కొనల్లోని పల్లె నుంచి పట్టణాల్లో ఆసుపత్రుకు వృద్ధలు,గర్భిణీ స్త్రీల‌ను తీసుకొచ్చేందుకు నరకయాతన అనుభవిస్తున్న వారికి రహదారి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫమవుతున్నాయి. ఒరిస్సా నుండి ఆంధ్రా వరకు కొండప్రాంతాల్లో గిరిజన రోగల‌ను డోలీలో మోసు కురావడం అందరికీ తెలిసిందే. ‘ప్రసవ సమయం దగ్గరపడినా గర్భిణల‌ను ఆసుపత్రుల్లో చేర్పించక పోవడంవ్ల అనేక ప్రసవాలు గ్రామాల్లోనో, అంబు లెన్సుల్లోనో, ఒక్కోసారి రహదారు పక్కనే జరుగుతున్నా అధికారయంత్రాంగంలో కదలిక రావడం లేదు. ఆఖరికి108 వాహనాు సక్రమంగా పని చేయడం లేదు.<br>అడవి బిడ్డకు పురిటి కష్టాలు<br>ఇప్పటికీ ఈ ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడటంలేదు. గర్భిణీల‌ను తరలించేందుకు వాహనాలు, రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉండక కొండ ప్రాంతాల్లో పడే కష్టాలు అంతాకాదు. ఎడ్లబండ్లపై లేదంటే డోలీలు కట్టుకుని గుట్టు, అటవీ మార్గం దాటుకుంటూ కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. సమయానికి ఆస్పత్రికి చేర్చక ఈ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవటం సర్వసాధారణంగా మారింది. చివరకు ఇక్కడి పిల్ల‌ల‌కు పోలియో చుక్కు వేసే నర్సులు కూడా కొండలు, గుట్టల‌పైనుంచి నడక సాగించే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. పొంగిపొర్లే వాగు,వంకను దాటుకుని గిరిజను బయటికి రాలేరు. అత్యవసరం ఉంటే డోలీల్లో తీసుకు రావా ల్సిందే.కగానే సౌకర్యా క్పన.. ప్రభుత్వా ు గిరిజను కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా….అవి వీరిదరికి చేరేందుకు మాత్రం సౌక ర్యాలు ఉండవు. గూడాకు రావాంటే అధికారులే వెనకంజ వేస్తుండగా మారిపోతోంది. పిల్ల బాటను బీటీ రోడ్లుగా మార్చేందుకు అటవీ శాఖ అభ్యంతరాలు అడవిబిడ్డల పాలిట శాపంగా మారుతున్నాయి. అభివృద్ధి పను సైతం అర్ధాం తరంగా నిలిచిపోతున్నాయి. తాడ్వాయి మండం కొండపర్తి గేటు నుంచి బీటీరోడ్డు నిర్మాణానికి నిధు మం జూరైనా… అటవీశాఖ అడ్డుచెప్ప టంతో రెండేళ్ల కిందట పను నిలిచిపోయాయి. గోవిందరావు పేట మండం రాఘవపట్నం గేటు నుంచి కొత్త ఇప్పగడ్డకు రోడ్డు నిర్మాణానికి రూ.50క్షు మం జూరైనా అదీ పూర్తికాలేదు. నూగురు వెంకటా పురం మండంలోరోడ్ల కోసం మూడున్నర కోట్లు మంజూరైనా ప్రారంభానికి నోచుకోలేదు. కొన్ని స్థవివాదాు, మరికొన్నిచోట్ల అటవీశాఖ అభ్యంత రాతో ఎన్ని మంజూరైనా చివరకు పరి స్థితి మొదటికే వస్తోంది.మౌలిక వసతు కల్పి స్తేనే.. కారణాలెన్ని ఉన్నా….దశాబ్దాుగా గిరిజన ప్రాంతాల్లో అడవిబిడ్డు పేదరికంలోనే కొట్టు మిట్టాడుతున్నారు. అప్పుడప్పుడు హడావిడి చేసే అధికాయి, పాకు వీరికి శాశ్వతపరిష్కా రం మాత్రం చూపలేకపోతున్నారు. ప్రత్యేక కార్యా చరణతో మౌలిక వసతు కల్పిస్తేనే గిరిపుత్రు ఆధునిక ప్రపంచంతో పోటీపడే అవకాశం ఉం టుంది. గర్భిణీ అవస్థలైతే వర్ణనాతీతం. చర్ల మండలంలోని ఎర్రంపాడు గ్రామం చత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉంది. ఆ గ్రామంలోని కొవ్వాసి ఐతఅనే మహిళకు పురిటి నొప్పు మొదయ్యాయి. ఊరి నుంచి బయటకు రావాంటే రహదారిలేదు. దీంతోభర్త మూస స్థానిక ఆశాకార్యకర్త సోమమ్మ, ఆమెభర్త సోమయ్య సహకారంతో జెట్టీకట్టి పక్కనే ఉన్న చెన్నాపురానికి మూడు కిలో మీటర్లు నడుచుకుంటూ బయలు దేరారు. దారిలోనే ఐత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈఊరికి బత్తినపల్లి మీదుగా రహదారి నిర్మాణానికి నిధు మంజూరైనా ఇప్పటికీ పను మొదలు కాలేదు. దీంతో ఎంతకష్టం వచ్చినా గ్రామస్థుల‌కు కాలినడకే దిక్కవుతోంది. వర్షాకాలంలో వాగు దాటలేక తీవ్రఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణలు ప్రసవం కోసం వాగు దాటలేక ప్రాణాల‌ను అరచేతిలో పెట్టుకుని నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు.

డోలీలోగర్భిణి.. అడవిలో ప్రసవం..రాయితో బొడ్డుతాడు కోత
‘మా ఊరికి రోడ్డు లేదు. రోగును, గర్భిణును ఆస్పత్రికి తీసుకెళ్లాంటే 6కిలోమీటర్ల దూరం భుజాపై మోసుకెళ్లాల్సిందే. మేం ఇన్ని ఇబ్బం దు పడుతున్నా మా సమస్యను ఎవరూ పట్టించు కోవడంలేదు. మా జీవితాను బాగు చేసే రోడ్డు కోసం ఎదురుచూస్తున్నాం. అధికాయి స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం’’<br>కొద్దిరోజుగా వాట్సాప్‌లోవైరల్‌గా మారిన ఓ వీడియోలో ఉత్తరాంధ్రకు చెందిన ఓగిరిజన యువ కుడి ఆవేదన ఇది. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన ప్రతిసారీ ప్రాణాపై ఆశలొదుకుని కొండు గుట్టు దాటుతున్న అడవి బిడ్డ అరణ్య రోదన ఇది. ఈవీడియో చిత్రీకరించిన యువకుడిది విజయనగరంజిల్లా సాూరు మండంలోని కొదమపంచాయతీ యం.చింతవస అనే గిరిజన గ్రామం. కొండల్లోఉన్న ఈగ్రామానికి రోడ్డు లేదు. ఇక్కడ ఎవరికైనా జబ్బు చేసినా, పురిటి నొప్పుతో బాధపడుతున్నా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాంటే ఆరేడు కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లడం తప్ప మరోదారి లేదు.<br>తాజాగా మార్చి24న ఈఊరికి చెందిన ఒక గర్భిణిని అలానే తీసుకెళ్లారు. కానీ 3కిలోమీటర్ల దూరం వెళ్లగానే దారిలోనే ఆమె ప్రసవించారు. దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమెను తిరిగి వాళ్ల గ్రామానికే తీసుకెళ్లారు. ఆమె కాన్పు సమయంలో దూరం నుంచి ఓ యువకుడు వీడియో తీశాడు. రోడ్డు లేకపోవడంతో గ్రామస్తు ఎలాంటి కష్టాు పడుతున్నారో ఈవీడియోలో వివరిం చాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ప్రసవిం చడంతో వారి వద్ద కాన్పు చేయడానికి అవసరమైన సామగ్రి కూడాలేదు. దీంతో అక్కడే దొరికన ఒక పదునైన రాయితో శిశువు బొడ్డుతాడును కోయడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. రోడ్డు లేకపో వడంతో గిరిజన మహిళు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రసవించాల్సి వస్తోందో ఈ వీడియో కళ్లకు కట్టింది. ఊరికి రోడ్డులేక తాము పడుతున్న ఇబ్బందు గురించి అనేకసార్లు అధికారుకు మొరపెట్టుకున్నామని ఇంటర్‌ చదువుతున్న సూరయ్య అనే యువకుడు తో చెప్పారు.<br>‘‘మా గ్రామంలో ఎవరు అనారోగ్యం పాలైనా డోలీలో మోసుకొని తీసుకెళ్లాల్సిందే. కొన్నిసార్లు గర్భిణు దారిలోనే చనిపోతుంటారు. అప్పుడప్పుడు పసిప్లిు ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాు కోల్పోతుంటారు’’ అని చెప్పారు సూరయ్య. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ కష్టాను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టి అధికారు దృష్టికి తీసుకెళ్లాని అనుకున్నామని సూరయ్య తెలిపారు. ‘‘మార్చి24న పురిటి నొప్పుతో బాధప డుతున్న ముతాయమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మేము ఎలాంటిదారిలో వెళ్లాల్సి ఉంటుందో, రోడ్డు లేకపోవడం వ్ల మేం ఎన్ని కష్టాు పడుతున్నామో అందరికీ తెలియజెప్పాని అనుకున్నాం. అందు కోసం మా ప్రయాణం ప్రారంభం అయినప్పటి నుంచి వీడియో చిత్రీకరించాం. అయితే మార్గం మధ్యలోనే కాన్పు అవుతుంది అని అనుకోలేదు’’ అని చెప్పారు. తమ గ్రామానికి రోడ్డు వేయాని విజ్ఞప్తి చేస్తూ అధికారుకు తాను లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాజు అనే మరో యువకుడు తెలిపారు.‘మేము ఇక్కడ కొండపై బతుకుతాము. ఇక్కడ చుట్టుపక్క మరికొన్ని గ్రామాకు కూడా రోడ్లు లేవు. రోడ్డు వేస్తే కొండ మీదనుంచి కిందకి దిగటానికి పట్టే సమయం తగ్గుతుంది. మాకు కష్టాు దూరమవుతాయి. నేను రాసిన లేఖకు అధికారు నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు’’ అని రాజు అన్నారు. మార్గం మధ్యలో గిరిజన మహిళ ప్రసవించిన ఘటనపై జిల్లా అధికారును సంప్రదించగా ప్రస్తుతం తల్లీబిడ్డు క్షేమంగా ఉన్నారని,శిశువుకు టీకాు ఇచ్చినట్టు వారు తెలిపారు.‘‘ఆమహిళ ప్రసవం గురించి తెలియగానే ఆకొండపైకి ఏఎన్‌ఎంని పంపించాం. పాపకు అవ సరమైన టీకాు ఇచ్చారు. తల్లిఆరోగ్య పరిస్థి తిని పరీక్షించారు.శిశువు 3కిలో బరువు ఉంది. ఆరో గ్యంగా ఉంది’’ అని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య ఉపఅధికారి రవి కుమార్‌ రెడ్డి చెప్పారు. కొండ మీద ఉన్న ఈ గ్రామానికి రోడ్డు లేకపోవడం వ్ల రోగును ఇక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని కొండ మొదు వరకూ మోసుకెళ్తారు. అక్కడ ఓబైక్‌ అంబులెన్స్‌ ఉంటుంది. అక్కడికి 17కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి ఐదుసార్లు టెండర్లు పిలిచినట్టు జిల్లా వైద్య శాఖ అధికారి కొర్రావిజయక్ష్మి తెలిపారు. ‘‘అక్కడ రోడ్డు కోసం ఐటీడీఏ ఐదుసార్లు టెండర్లు పిలిచింది. అది మారుమూ ప్రాంతం కావడంతో గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. మేం చేయగలిగిందంతా చేశాం’’ అన్నారు ఇదే ఏడాది జులైలో యం.చింత వస కు సమీపంలోని సిరివర గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామరకొండ జిందామని తనబిడ్డని కోల్పోయారు. అయిదో నెలో నొప్పు రావటంతో ఆమెకు గర్భస్రావమైంది. ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే గర్భస్రావం కావటం తో శిశువు బతకలేదు.తన బిడ్డకి కూడా అలాగే జరుగుతుందేమో అని భయపడ్డానని ముతాయమ్మ భర్త చోడిపల్లి జుంబి చెప్పారు.ఆయన మాట్లా డుతూ ‘‘నాభార్యకి ఉదయం నొప్పు మొదలైనాయి. మేము వెంటనే డోలీలో ఆమెను కూర్చోబెట్టి కిందకి బయుదేరాం. దారి మొత్తం భయపడుతూనే ఉన్నా.కొంతదూరం వెళ్లగానే కాన్పు అనగానే నాకు ఇంకా భయమేసింది. కానీ అపాయం ఏమీ జరగలేదు. ఆ రోజు నా భార్య చాలా ఇబ్బంది పడిరది’’ అనిజుంబి గుర్తుచేసుకున్నారు. కాగా సిరివర ఘటనను జాతీయ మానవ హక్కు కమిషన్‌ సుమోటోగా తీసుకుని ఏపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఇక్కడి కొండ ప్రాంతాల్లోని పదిశాతం ఆవాసాకు రోడ్డు సౌకర్యం లేదని విజయనగరం జిల్లా అధి కాయి తెలిపారు. రోడ్లు లేకపోవడంవ్ల అత్యవసర పరిస్థి తుల్లో ఆస్పత్రికి వెళ్లడం కష్టమవుతున్నందున గర్భిణును ప్రసవానికి రెండు నెల ముందే కొండ మీద నుంచి కిందకు తీసుకురావాని అనుకుం టున్నట్టు ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి క్ష్మీషా వ్లె డిరచారు.‘గర్భిణును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాకు దగ్గరగా ఉంచానుకుంటున్నాం. అలా చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటను జరగకుండా చూడవచ్చు. ప్రస్తుతం 50-60 మహిళకు సరిపడా స్థం కోసం చూస్తున్నాం’’ అని చెప్పారు రవికుమార్‌ రెడ్డి.ఈగ్రామానికి రూ.5.5కోట్ల బడ్జెట్‌ తో రోడ్డు మంజూరైనట్టు ఐటీడీఏ అధికారి క్ష్మీషా తెలిపారు.‘9.8 కి.మీ.రోడ్డు మంజూరైంది. కానీమేం ఐదుసార్లు టెండర్‌ పివాల్సి వచ్చింది.టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని క్ష్మీషా చెప్పారు. కొండ ప్రాంతం కావడం, కఠిన పరిస్థితు మధ్య పనిచేయాల్సి రావడంతో పెద్దగా లాభాు రావనీ, అందుకే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. ‘‘తక్కువ లాభాుండడం వల్లే కాంట్రాక్టర్లు ముం దుకు రావడం లేదని అనుకుంటున్నాం. కొండ ప్రాంతాల్లోని గ్రామాను కలిపే మరో ఐదు రోడ్లు ఇలాంటివే పెండిరగ్‌లో ఉన్నాయి’’ అని క్ష్మీషా తెలిపారు. కొండ కోనల్లో జీవనం.నిండైన అమాయకత్వం.. మ‌ర‌మం ఎరుగని మనస్త త్వం..ఇదీ మన్యంలో గిరిపుత్రు జీవన విధానం. ప్రకృతి ఒడిలో ఊయ ూగుతూ… అడవితో పెనవేసు కుని సాగుతున్న వారి బతుకుల్లో మెగు మాత్రం కరువయ్యాయి. కనీసం విద్యా, వైద్యం అందక ఆ గిరిజన బతుకు తెల్లారుతున్నాయి. ఏడు దశాబ్దాు గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాు వీడటం లేదు. ప్లిబాటలే ఆ గూడాకు రహదాయి.నిత్యావసరం, అత్యవ సరం ఏదై నాసరే…. కాలినడకనే వారి ప్రయాణం. డోలీ లే వారికి అంబులెన్సు. ముగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రు ఎదుర్కొంటున్న కష్టాలివి.కొండాకోనల్లో ప్రకృతి పెనవేసుకున్న గూడాల్లో బతుకు మాత్రం నేటికీ మెగు లోకి రావటంలేదు.యాభైఏళ్ల క్రితం నాటి పరిస్థి తులే గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి..ఆయా రాష్ట్రా ల్లో మారుమూ అమాయక జీవనం సాగిస్తున్న ఆదివాసీబిడ్డ పురిటి కష్టాు కడతెర్చేం దుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాు కృషి చేయాలి. మారు మూ గిరిజన తండాకు అనుసంధాన రహదా యి నిర్మించాలి. వైద్య,విద్య, మౌలిక సదు పాయా ు కల్పించడంలో చిత్తశుద్ది ప్రదర్శించాలి. ఐటి డీఏ సంస్థను బలోపేతం చేసి రహదాయి నిర్మా ణాతోపాటు వాగు మధ్యవంతెను, చెక్‌ డామ్‌లు నిర్మించాలి. ఆపద్భంధులా ఆదుకుంటున్న 108,104..ఆశవర్కర్లపై సర్కారు వివక్ష విడనా డాలి. ఏజెన్సీలోని ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత అధిగమించాలి. వసతల‌ లేమి పాల‌కు చిత్తశుద్దిని ప్రశ్నిస్తోంది. ఏటా రోగాబారిన పడి గర్భిణీ స్త్రీలు పురిటి నొప్పుల‌తో మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోకుండా నివారించాలి.
-సైమన్‌ గునపర్తి

విశాఖ ఉక్కు ఈ నెల 25 తర్వాత సమ్మె

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసులిచ్చారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గేవరకు పోరాడతామని కార్మికులు స్పష్టం చేశారు. ఈ నెల 25 తర్వాత సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌-కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చాయి.

1 2 3 4 5