వైజాగ్‌లో జరగనున్న జీ`20 దేశాల సదస్సు

సిటీ ఆఫ్‌ డెస్టినేషన్‌ విశాఖపట్నంలో అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిస్తోంది. ఇప్పటికే మార్చి 3, 4 తేదీల్లో ఏపీ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ అట్టహాతంగా నిర్వహించింది. మళ్ళీ ఇదే నెలాఖరు 28,29 తేదీల్లో జీ-20 సన్నాహక సదస్సుకు విశాఖ వేదిక కాబోతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జీ-20 అధ్యక్ష బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన నాటినుంచి భారత్‌.. పెద్ద ఎత్తున సన్నాహక సదస్సులతోపాటు, పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా.. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించబోతోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు వేదిక కాబోతోంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ జీ20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. 300 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు.సైమన్‌ గునపర్తి
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సుకు జీ-20 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రాయ బారులు,కేంద్ర,రాష్ట్ర మంత్రులు,సీఎం జగన్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సదస్సు నిర్వహణకు విశాఖలో రెండు స్టార్‌ హోటళ్లను గుర్తించారు. అతిథుల కోసం నగరంలోని వివిధ స్టార్‌ హోటళ్లలో 300 గదులను బుక్‌ చేస్తున్నారు.నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.ఈ సమా వేశాలతో విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రాచుర్యం దక్కనుంది. భారతదేశం అధికారికంగా డిసెంబర్‌ 1,2022న G20 అధ్యక్ష పదవిని చేపట్టింది.జీ20 సదస్సు కోసం 56 నగరాల్లో 200 సమావేశాలు నిర్వహిం చేలా ప్లాన్‌ చేస్తోంది.డిజిటల్‌ పరివర్తన,హరిత అభివృద్ధి,మహిళా సాధికారత,యువత, రైతులు లాంటి అంశాలతో సదస్సులు నిర్వహిస్తున్నారు. జీ20 సదస్సులు జరగనున్న నేపధ్యంలో రూ.150కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయిం చింది.12శాఖల ఆధ్వర్యంలో ఈపనులు జరుగుతున్నాయి.నగరంలోని పర్యాటక ప్రదే శాలను సుందరంగా తీర్చిదిద్దడం,రహదా రులను అభివృద్ధిచేయటం,తదితరాల కోసం ఈ నిధులు ఖర్చు చేస్తున్నారు.నగరంలో రూ.74.46కోట్లతో 202.91కిలోమీటర్ల నిడివి రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌, (జీవీ ఎంసీ),విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డవల్‌ పెంట్‌ అథారిటీ సంస్థ (వీఎం ఆర్‌డీఏ),పోర్టు, జాతీయ రహదారుల సంస్థ,ఆర్‌అండ్‌బీశాఖల తరపున ఆయా యప నులు చేపడుతున్నారు. సిగ్నల్స్‌ను మెరుగుపరచ డానికి రూ.9.92 కోట్లు, పచ్చదనం అభివృద్ధికి రూ.3.25కోట్లు, సాధారణ పనులకు రూ.17.67కోట్లు, వేదికల వద్ద వసతుల కల్పనకు రూ.5కోట్లు, ఎగ్జిబిషన్ల నిర్వహణకు రూ.15కోట్లు ప్రతినిధులకు వసతి, ఆహారం,ఇతర సదుపాయాలకు రూ.7కోట్లు, మొబైల్‌ టాయ్‌లెట్ల ఏర్పాటుకు రూ.కోటి, పర్యాటక ప్రదేశాల సందర్శన,సాంస్కృతిక కార్యక్రమాలు, బొర్రా గుహలు,ఇతర పర్యాటక ప్రదేశాల వద్ద వసతుల కల్పనకు రూ.10కోట్లు, ఐటీ,కమ్యూనికేషన్లకు రూ.2కోట్లు,రవాణా వాహనాల కోసం రూ.3కోట్లు, ప్రొటోకాల్‌, భద్రతకు రూ.2కోట్లు,చొప్పున నిధులు అవసర మని అధికారులు అంచనా వేశారు. మార్చి 28,29 తేదీల్లో జరిగే జీ20 సన్నాహక సదస్సుకు 45దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు. వారి కోసం నగరంలో పలు స్టార్‌ హోటళ్లులో గదులు తీసుకున్నారు. సదస్సు ఏర్పాట్లు,వసతుల కల్పనలో 15ప్రభుత్వ శాకలు భాగస్వాములయ్యాయి..
జీ-20 సదస్సు (గ్రూప్‌ ఆఫ్‌ గ్లోబల్‌ )అంటే ఏంటీ ?
అత్యంత శక్తిమంతమైన 17వ జి-20 సదస్సు ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఈ సమావేశాలు వచ్చే ఏడాది భారత్‌లోని ఆంధ్ర ప్రదేశ్‌ విశాఖపట్నంలో నిర్వహించడం ప్రతిష్టా త్మకం.పోటీ పరీక్షల దృష్ట్యా అంతర్జా తీయ సంబంధాల్లో భాగంగా జీ-20 సదస్సుపై ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో జీ-20 ఏర్పాటు,సభ్యదేశాలు,లక్ష్యాల గురించి తెలుసుకుందాం!
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు,అతి వేగం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతల వార్షిక సమావేశమే జీ20 సదస్సు. ఇది అంతర్జాతీయ సంస్థల్లో అత్యంత శక్తిమంతమైంది. ప్రపంచ జనాభాలో మూడిర ట రెండొంతులు, ప్రపంచ జీడీపీలో 85శాతం వాటాను జీ20 కలిగి ఉంది. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలు మొత్తం జీ-20 వేదికపైన కనిపిస్తాయి. అధిక జనాభా కలిగి ఆర్థిక స్థిరత్వం ఉన్న దేశాల కూటమినే గ్రూప్‌ ఆఫ్‌ 20 లేదా జీ20 అంటారు.1997లో తూర్పు ఆసియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం చాలా దేశాలపై ప్రభావం చూపడంతో ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి గ్రూప్‌ ఏర్పాటు చేయాలని భావించాయి. అప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలతో కూడిన గ్రూప్‌ ఆఫ్‌ ఎయిట్‌ (జీ-8) బృందాన్ని విస్తరించి చైనా బ్రెజిల్‌,సౌదీ అరేబియా తదితర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను చేర్చారు. సభ్య దేశాలు 19,యూరోపియన్‌ యూనియన్‌ తో కలిపి జి20గా పేర్కొంటారు. మొదటిసారి 1999లో బెర్లిన్‌లో సమావేశ మయ్యారు. మొదట్లో జీ-20 సదస్సుకు ప్రధా నంగా ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్ర ల్‌ బ్యాంకుల గవర్నర్లు హాజరయ్యేవారు. 2008 లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పరిస్థి తుల్లో మార్పు వచ్చింది. బ్యాంకులు కుప్పకూ లడం,నిరుద్యోగం పెరగడం,వేతనాల్లో మాం ద్యం నెలకొనడంతో జీ20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు ఒక అత్యవసర మండలిగా మారింది.జీ-20 ప్రభుత్వాల అధినేతలు 2008 నుంచి సభ్య దేశాల్లో సమావేశం అవుతున్నారు. తొలి సదస్సు అమెరికా రాజధాని వాషింగ్జన్‌ డి.సి.లో జరి గింది. వాస్తవానికి జి20 ప్రధాన కార్యాలయం వంటిది ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చేస్తుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది.ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జీ20ని ఐదు గ్రూపులుగా విభ జించారు. గ్రూపుల వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. జీ-20 దేశాల అధినేతలు సంవత్సరానికి ఒకసారి సమావేశమైతే, ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు రెండుసార్లు సమావేశమై అనేక అంశాలపై చర్చిస్తారు. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ సంస్థలు వరల్డ్‌ బ్యాంక్‌,ఐరాస, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఓఈసీడీ, డబ్ల్యూహెచ్‌వో,ఐఎంఎఫ్‌,డబ్ల్యూటీవో, ఫైనాన్షి యల్‌ స్టెబిలిటీ బోర్డు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లు పాల్గొంటాయి. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల మొదటి పర్సనల్‌ ప్యానల్‌ సమావేశం ఇండోనేషియా నేతృత్వంలో 2022,ఫిబ్రవరి17,18వ తేదీల్లో జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఫిబ్రవరి 17న భారత ఆర్థిక మంత్రి నిర్మాలా సీతా రామన్‌ ప్రసంగించారు.
డ్రాప్ట్‌ స్టేట్‌మెంట్‌
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండిస్తూ జీ-20 సదస్సులో ఒక ముసాయిదా నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికపై సదస్సులో చర్చించారు. ఉక్రెయిన్‌ నుంచి రష్యా తన సైన్యాన్ని బేషరతుగా పూర్తిస్థాయిలో ఉపసం హరించుకోవాలన్న డిమాండ్‌ను ప్రస్తావించారు. జీ-20 సదస్సుకు రష్యా తరఫున విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌ హాజరయ్యారు.
డిక్లరేషన్‌
శాంతి స్థాపన,కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జీ20 దేశాలు పిలుపునిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో అరాచకాలకు, యుద్ధానికి తెరపడాలి. ఈ యుద్ధం కొనసాగితే ఆహార, ఇంధన భద్రతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని డిక్లరేషన్‌ పేర్కొంది.ఘర్షణల శాంతియుత పరిష్కారం,సంక్షోభ నివారణకు కృషి,చర్చలు ఇప్పుడు కీలకం. ఇది యుద్ధాలు చేసుకొనే శకం కాదని సభ్యదేశాలు పేర్కొన్నా యి. ఉగ్రవాదానికి నిధులందించే కార్యక లాపాల కట్టడికి దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చాయి. మనీ లాండరింగ్‌?ను నిరోధించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిం చడంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలని సంయు క్తంగా ప్రకటించారు. మరోవైపు కరోనాతో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చే చర్యలపై కూడా సమావేశం చర్చించింది. లక్ష్యాలు ా సుస్థిరాభివృద్ధిని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడానికి సభ్య దేశాల మధ్య సహకారాలను పెంపొందించడం ా భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలు పునరావృతం కాకుండా ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టడం ా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునికీకరించడం, సభ్య దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడం సభ్యదేశాలు : అర్జెంటీనా,ఆస్ట్రేలియా,బ్రెజిల్‌, కెనడా,చైనా,ఫ్రాన్స్‌,జర్మనీ,ఇండియా,ఇండో నేషియా,ఇటలీ,జపాన్‌,దక్షిణ కొరియా,రష్యా, మెక్సికో,సౌదీఅరేబియా,దక్షిణాఫ్రికా,టర్కీ, గ్రేట్‌? బ్రిటన్‌,అమెరికా,యూరోపియన్‌ యూనియన్‌. 2008 నుంచి స్పెయిన్‌ శాశ్వత ఆహ్వానిత దేశం.జీ20లో పాకిస్థాన్‌ లేదు. అంకురార్పణ ఇలా ... 1999లో బెర్లిన్‌లో తొలి జీ-20 సదస్సు జరిగింది. ఆ సమయంలో తూర్పు ఆసియా ఆర్థిక లోటుతో సతమతమైంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. 2008లో మొదటి సమావేశం జరిగింది. తర్వాత ఏడాదికోసారి భేటీ అవుతుంది. బెర్లిన్‌లో జరిగిన తొలి సమావేశానికి ఆయా దేశాల ఆర్థికమంత్రులు, రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్లు హాజరయ్యారు. అయితే 2008లో ఆర్థికమాంద్యం రావడంతో జీ-20 సదస్సుకు ఆయా దేశాల అధ్యక్షులు హాజరవుతున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ దెబ్బతిని,నిరుద్యోగం పెరగ డంతో ప్రత్యామ్నాయ మార్గాలపై నిర్ణయం తీసుకొనేది అధినేతలే కాబట్టి ..దాంతో అధినేతలు సమావేశమవుతున్నారు. ఆర్థికమే మూలం .. జీ-20 సదస్సులో ఆయా దేశాల అధినేతలు ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తారు.తమ తమ వ్యుహలను సభ్యదేశాల అధినేతలతో పంచు కుంటారు. వాణిజ్యం, వాతావరణ మార్పులపై ఈసారి ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. ట్రంప్‌, జీనీ పింగ్‌,ట్రంప్‌, మోడీ మధ్యయ పన్నులు తదితర అంశాలపై కీలక డిస్కషన్స్‌ జరుగనున్నాయి. ఇంగ్లాండ్‌ ప్రధానిగా రాజీ నామా చేసిన థెరెసా మే కూడా సమావే శానికి హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆమె వివిధ అంశాలపై కూలం కషంగా మాట్లాడ తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కీలకం గా ప్రస్తావన ఉంటుంది. సదస్సులో వివిధ అంశాలపై ఒప్పందం చేసుకొని ..తర్వాత అధినేతలు ఫోటోలు దిగుతారు.ఆ ఫోటోలు వివిధ అంశాలపై చర్చలకు సంబంధించి సాక్షిభూతంగా నిలుస్తాయి.గతేడాది కొందరు అధినేతలు సౌదీ రాజుతో కరచాలనం చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా56 నగరాల్లో 200 సమావే శాలు నిర్వహించేలా కేంద్రం ప్రణాళిక రూపొందించింది. అందులో ఏపీ నుంచి విశాఖకు అవకాశం దక్కింది. అతిధుల కోసం స్టార్‌ హోటళ్లలో 300 గదులను బుక్‌ చేస్తున్నారు. మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ ఈ సదస్సు కు సంబంధించి అధికారుల బృందంకు నాయకత్వం వహిస్తు న్నారు. సదస్సులె సీఎం జగన్‌ తో సహా కేంద్ర మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులు,ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. డిజిటల్‌ ఇండియా..హరిత అభివృద్ధితో పాటుగా మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, రైతు అంశాలతో సదస్సులు నిర్వహణకు నిర్ణయించారు. వివిధ దేశాల నుంచి జీ-20 సదస్సుకు కోసం వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణకు నిర్ణయించారు. ఇప్పటికే మార్చి 3,4 తేదీల్లో నిర్వహించిన విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ గ్రాండ్‌ సెక్సెస్‌ అయ్యింది. విశ్వనగరిగా విశాఖ సుందరీకరణ సహజ అందాల ప్రకృతి నిలయం తీరప్రాంత నగరం విశాఖపట్నానికి రాజధాని కళ సంత రించుకుంటోంది.విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చబోతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి విశాఖ విశ్వనగరిగా అదనపు హంగులు సమకూర్చు తున్నారు. అంతర్జాతీయ బ్రాండిరగ్‌ కల్పిం చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. దీనికి తోడుగా వరుసగా అంతర్జాతీయ కార్య క్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలోనే అత్యధిక కార్యక్రమాలు జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన మెట్రో సిటీ (మోస్ట్‌ హ్యాపె నింగ్‌ సిటీ) విశాఖ ఖ్యాతి జాతీయ,అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది.జీ.20సమావేశాలు రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈ సమావేశాలతో విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రాచుర్యం దక్కనుంది. ఈ సదస్సుకు విచ్చేసే జాతీయ,అంతర్జాతీయ ప్రతినిధులకు విశాఖ బ్రాండ్‌ ఉట్టిపడేలా వారికి అతిథి మర్యాదులు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లిఖార్జున,జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజుబాబు,నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ పర్యవేక్షణలో నగర సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయా పనులు తుదిదశకు చేరుకుం టున్నాయి.ఈనేపథ్యంలో విశాఖనగరం అంతర్జాతీయ వేడుకలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుం టోంది. సాగర్‌తీరం,ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌, విశాలమైన రోడ్లు,విమానసర్వీసులు అందుబాటులోఉండ టంతో విశాఖ ప్రపంచదేశాలను ఆకట్టుకునే విధంగా ముస్తాబువుతోంది. ప్రభుత్వాధినేతలు విశాఖపైనే ఫోకస్‌ పెట్టడంతో వైజాగ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ రోజురోజుకీ రెట్టింపవుతోంది. ఇప్పటికే గతనెల జనవరి 68వరకు గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ సమ్మిట్‌,20,21న ఇన్ఫినిటీ ఐటీ సమ్మిట్‌, ఈనెల16,17తేదీల్లో గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ జరిగిన జాతీయ,అంతర్జాతీయ సమావేశాలకు విశాఖ వేదిక కావడం దీనికి నిదర్శనం.
విశాఖ బీచ్‌లకు అదనపు హంగులు
రామకృష్ణా బీచ్‌ నుంచి భీమిలీకి వెళ్లే మార్గాన్ని మరింత సుందరంగా మార్చబోతున్నారు. ఈబీచ్‌రోడ్డు వెంట అదనపు హంగులను సమకూర్చారు.రుషికొండ,జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌,మధురవాడ,వుడా కాలనీ, సీతమ్మధార, బుచ్చిరాజుపాలెం, మద్దిళ్లపాలెం, బీఆర్‌టీఎస్‌ రోడ్డు,మహారాణి పేట సహా పలు ప్రాంతాల్లో సుందీరకరణ పనులు చేపట్టారు. మార్చి నెలలో జరగనున్న జి-20 సదస్సునకు జరుగుతున్న అభివృద్ధి,సుందరీకరణ పనులు త్వరితగతిపై ఇప్పటికే రాష్ట్ర మునిసిపల్‌ శాఖ కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి,సముద్ర తీర ప్రాంతాలలో రెండు సార్లు పర్యటించి నగర సుందరీకరణపై పలు సూచనలు,సలహాలు ఇచ్చారు.జీ-20 సదస్సు నకు దేశ విదేశాల నుండి అధిక సంఖ్యలో అతిధులు,ప్రతినిధులు నగరానికి విచ్చేయనున్న నేపథ్యంలో విశాఖఖ్యాతి,సంస్కృతిని ప్రతిబింబించేలా అద్భు తంగా వివిధఆకృ తులతో కూడినబొమ్మలు ఏర్పాటు,ఉన్న ప్రతిమలకు రంగులు అద్దిఅలంక రించడం, విద్యుత్‌ దీపాలం కరణలు,రంగు రంగుల మోడరన్‌ పెయింటింగలు, కల్చర్‌ఆర్ట్‌లతో వివిధ ఆకృ తులతో కూడిన మొక్కలు -చెట్ల్లు కటింగ్‌,వాటికి ఆకర్షణీయమైన రంగులు అద్దడం,పరిశుభ్రంగా రోడ్డులు నిర్వహణ, ఫుట్‌పాత్‌ ఆధునీ కరణ,నిరంతరం పారిశుధ్య పనులు పర్యవేక్షణ వంటి పనులపై నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుతం కొన్ని ప్రదేశాల్లో లాండ్‌ స్కేప్స్‌,వాటర్‌ ఫౌంటైన్స్‌, పార్కింగ్‌,వాల్‌ పెయింటింగ్స్‌,పబ్లిక్‌ టాయిలెట్స్‌, ఏర్పాటు చేస్తున్నారు.దీంతో పాటు ఉద్యాన వనాలు, బీచ్‌లు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దు తున్నారు.విదేశాల నుండి వస్తున్న అతిధులకు నగరం అందాలతో అబ్బుర పరచేటట్లు ఆకర్షితంగా ఈ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాడానికి అన్నీ హంగులతో సుందరీ కరిస్తున్నారు. రూ.150కోట్లతో నగర సుందరీకరణ పనులు
జీ`20 సదస్సులు జరగనున్న నేపధ్యంలో రూ.150కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయిం చింది. నగరంలో రూ.74.46కోట్లతో 202.91కిలోమీటర్ల నిడివి రహదారులను అభివృద్ధిచేస్తున్నారు.సిగ్నల్స్‌ను మెరుగుపరచ డానికి రూ.9.92కోట్లు,పచ్చదనం అభివృద్ధికి రూ.3.25కోట్లు,సాధారణ పనులకురూ.17.67 కోట్లు,వేదికల వద్ద వసతుల కల్పనకు రూ.5కోట్లు,ఎగ్జిబిషన్ల నిర్వహణకు రూ.15కోట్లు ప్రతినిధులకు వసతి,ఆహారం,ఇతర సదుపా యాలకు రూ.7కోట్లు,మొబైల్‌ టాయ్‌లెట్ల ఏర్పాటుకు రూ.కోటి,పర్యాటక ప్రదేశాల సందర్శన,సాంస్కృతిక కార్యక్రమాలు,బొర్రా గుహలు,ఇతర పర్యాటక ప్రదేశాల వద్ద వసతుల కల్పనకు రూ.10కోట్లు,ఐటీ, కమ్యూనికేషన్లకు రూ.2కోట్లు,రవాణావాహనాల కోసంరూ.3కోట్లు,ప్రొటోకాల్‌,భద్రతకు రూ.2కోట్లు,చొప్పున నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. నగరంలోని పలు ప్రధానమార్గాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న ప్రహారీ గోడలకు అందమైన బొమ్మలను చిత్రీ కరించారు. నగరంలో ముందుజాగ్రత్త చర్య లను సీపీ శ్రీకాంత్‌ నేతృత్వంలో కొత్తగా 20 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చ నున్నారు. ఇంటర్నేషల్‌ ఈవెంట్స్‌తో విశాఖ నగరం కొత్త అందాలు జీ20 సమావేశాలతో విశాఖ నగరం ప్రపంచస్థాయి గుర్తింపు పొందడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ విశ్వప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకా శాలు కన్పిస్తున్నాయి. రాజధాని అంశం కోర్టులో ఉన్నప్పటికీ సీఎం జగన్‌ విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా తీర్చి దిద్దాలని పట్టుదలతో ఉన్నారు. అంతర్జాతీయ సమావేశాలతో విశాఖలోనే రాష్ట్రస్థాయి,జిల్లా స్థాయి అధికార యంత్రాంగం బిజీబిజీగా గడపబోతున్నారు.