మా గ్రామాలను షెడ్యూల్డు ప్రాంతాలుగా గుర్తించాలి

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలంలోని ఉప ప్రణాళికా ప్రాంతం పెదమల్లాపురం గిరిజన గ్రామంలో ఆది వాసీల సదస్సును జూలై 25న నిర్వహించారు. స్థానిక సామాజిక భవనం నుంచి రామాలయం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అల్లూరి విగ్రహా నికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పిం చారు. అల్లారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంత రం గిరిజన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు 5వ షెడ్యూల్‌ సాధన సమితి సమన్వయకర్త పీ.ఎస్‌. అజయ్‌ కమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిం చారు.1950లో భారతదేశంలోని షెడ్యూల్డ్‌ ప్రాం తాలను నాటిరాష్ట్రపతి ప్రకటించినపుడు అందులో చాలా ఆదీవాసీ గ్రామాలను చేర్చలేదని, ఆ కార ణంగా నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామాల ఆదివాసీలు సుమా రు 73సంవత్సరాలుగ వివక్షతకు, దోపిడీకి గురౌతు న్నారని అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.ఈ అన్యాయా న్ని1976లోని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని 805 గ్రామాల్నీ కలపి షెడ్యూ ల్డు ప్రాంతాలుగా గుర్తించమని తీర్మానించి, ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలికి నివేదిం చిందని అజయ్‌ కుమార్‌ వెల్లడిరచారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి నాన్‌ షెడ్యూల్డు గిరిజన గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తామని శాసన సభలో హామినిచ్చి ఇప్పటికి 16 సంవత్సరాలు గడుస్తున్నాయని అజయ్‌ కుమార్‌ గుర్తు చేసారు. తండ్రి రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని ఆయన తనయుడైన ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికైనా సరే నెరవేర్చాలని అజయ్‌ కుమార్‌ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
జూలై 30న శంఖవరం తహాసిల్దార్‌ కార్యాలయం వద్ద ధర్న
గిరిజన సమస్యలకూ పరిష్కారాన్ని కోరుతూ జూలై30న శంఖవరం తహాసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ధర్నాలో అఖిల భారత ఆదివాసీ సంఘం గౌరవ అధ్యక్షులు రేచుకట్ల సింహాచలం రంప చోడవరంలోని సమగ్ర గిరిజనా భివృద్ధి సంస్థ తన సేవలను కాకినాడ జిల్లాలోని ఉపప్రణాళికా ప్రాంత గిరిజన సమాఖ్య ప్రతినిధి బాలరాజు,జర్తా ముసలయ్య తదితర్లు పాల్గొన్నారు. పెదమల్లాపురం కేంద్రంగా గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయా లని, గిరిజన గ్రామాల ప్రజల సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలనే అజెండాతో అధికారులకు మెమోరాండం అందజేశారు.
ఆగస్టు 14న విజయవాడలో ధర్నా
విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద ఆగస్టు 14 న ఒక్క రోజు నిరసన ధర్నా చేపడుతున్నామని ఘాట్స్‌ సంస్థ డైరెక్టర్‌ జర్తా ముసలయ్య తెల్పారు. కాకినాడ జిల్లాతో బాటు మన్యం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లా నాన్‌- షెడ్యుల్డు ఆదివాసీలు పాల్గొంటారని ఆయన తెల్పారు. కాగా నేటి గిరిజన సదస్సులో మహిళా సంఘాల ప్రతినిధి కించి అప్పలకొండ, అలాగే గిరిజన సంఘాల ప్రతినిధులు బూసరి బాలరాజు, ధారజగన్నాధపురం, జల్దాం పంచాయతీ ఉప సర్పంచ్‌ కాకూరి రాము, గిరిజన పెద్దలు, ఆమూరి చంద్రయ్య, కొపూరు చిన్నప్ప, కించి తమ్మారావు, ముద్ర దొంగబ్బాయి తోపాటు శంఖవరం మండలంలోని ఆరు ఆదివాసీ పంచా యితీల నుంచి గిరిజనులు హాజరయ్యారు.-(జనాస)