ఆదివాసీ సమస్యలపై అలసత్వం

ఆదివాసీ హక్కుల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. వారి సంక్షేమం కోసం రూపొందించిన చట్టాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గిరిజనుల గ్రామసభలకు సర్వాధికారాలు దఖలుపరచే పంచాయతీరాజ్‌-షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం (పీసా చట్టం- 1996) అమలులోకి వచ్చి 22 ఏళ్లు అయింది. గిరిజనులకు అడవిపై గల హక్కుల విషయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే ఉద్దేశంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులోకి వచ్చి 12 ఏళ్లు గడుస్తోంది. గిరిజనుల సంప్రదాయ హక్కులు, జీవనోపాధి, పరిపాలన వంటి కీలకమైన అంశాలతో ముడివడివున్న ఈ చట్టాల అమలులో ప్రభుత్వ వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాన చట్టాలను బలవంతంగా రుద్దడంతో ఆదివాసుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ పరిస్థితిని నివారించేందుకే గిరిజన సంప్రదాయాలను గౌరవించి, వారి పద్ధతులకు సముచిత ప్రాధాన్యమిచ్చేందుకు పీసా చట్టం ద్వారా గ్రామసభలకు అధికారాలు కల్పించారు. వాస్తవంలో అవి ఎండమావుల్ని తలపిస్తున్నాయి.
పసలేని చట్టం… పట్టని ప్రభుత్వంగ్రామసభలకు విశేష అధికారాలు
రెండు దశాబ్దాల క్రితం పీసా చట్టం కోసం దేశవ్యాప్తంగా గిరిజనులు పోరాడారు. 73వ రాజ్యాంగ సవరణతో 1991లో అమలులోకి వచ్చిన పంచాయతీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిలీప్‌సింగ్‌ భూరియా నేత ృత్వంలోని ఓ కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయతీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధికారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటుహక్కు కలిగి ఉన్న నివాసితులంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు. వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వనరులు, అటవీ సంపదపై యాజమాన్య హక్కులు కలిగి ఉంటారు. ఆ వనరులను స్వీయ అవసరాల కోసం వినియోగించుకుంటూ, గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు. ఆయా గ్రామాల్లో, ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు, వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివ ృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నష్ట పరిహారం పంపిణీ, గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులు, సామాజిక, ఆర్ధిక అభివ ృద్ధి కార్యమ్రాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, ఉప ప్రణాళిక నిధుల ఖర్చుకు సైతం గ్రామసభల అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు, మద్యం అమ్మకాలు, వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ, నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ అభివ ృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జమాఖర్చుల ధ్రువపత్రాన్ని జారీ చేసే అధికారం సైతం గ్రామసభలకు ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2011లో చట్టంలో కొత్తగా కొన్ని నిబంధనలు పొందుపరచింది. గ్రామసభలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వైఫల్యం కనపడుతోంది. 2013 సెప్టెంబరులో గిరిజన సంక్షేమ శాఖ జిల్లా, మండల, పంచాయతీల వారీగా గ్రామసభలను గుర్తించి, జాబితాను నోటిఫై చేసింది. అంతేతప్ప పీసా చట్టం అమలు ద్వారా క్షేతస్థాయిలో గిరిజనులకు జరగాల్సిన మేలు, లభించాల్సిన హక్కులపై శ్రద్ద చూపలేదు. అయిదో షెడ్యూలు ప్రాంత పరిధిలోకి వచ్చే పర్వత శ్రేణుల్లో బాక్సైట్‌ ఖనిజం తవ్వకాల విషయంలో అక్కడి డోంగ్రియా ఆదివాసులు ఒడిశా ప్రభుత్వంపై చేసిన న్యాయపోరాటం ఫలించడానికి పీసా గ్రామసభ దిక్సూచిగా నిలిచింది. 2013లో పీసా చట్టం ప్రకారం అక్కడి గ్రామసభల అనుమతులు తీసుకున్నాకే ఖనిజ తవ్వకాలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో గ్రామసభలు కీలకమయ్యాయి.
గడచిన రెండు దశాబ్దాల్లో పీసా అమలు తీరుతెన్నులను విశ్లేషించేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఆదివాసీ ప్రాంతాల్లో చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తే ప్రభుత్వ వ్యవస్థలపై గిరిజనులకు నమ్మకం పెరుగుతుందని ఆ కమిటీలు పేర్కొన్నాయి. భూసేకరణ, గనుల తవ్వకాల లీజులు వంటి విషయాల్లో గ్రామసభలను విస్మరించడం వల్ల ఆదివాసుల్లో అసంత ృప్తి, అశాంతి పెచ్చరిల్లుతాయని హెచ్చరించాయి. 2005నాటి రెండో పాలన సంస్కరణల సంఘం, తీవ్రవాద ప్రాంతాల్లో అభివ ృద్ధి, సవాళ్లపై 2008లో ఏర్పాటైన ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీ, నిర్వాసిత సమస్య, అభివ ృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవచంద్ర కమిటీలతో పాటు, యూపీఏ ప్రభుత్వంలోని జాతీయ సలహా మండలి- పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. అయిదేళ్ల క్రితం అప్పటి జాతీయ సలహా మండలి ‘గ్రామసభ’ నిర్వచనానికి స్పష్టత తీసుకొస్తూ సవరణ బిల్లును సైతం రూపొందించింది. ఆ తరవాత వచ్చిన ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ చూపలేదు. ఆదివాసీ ప్రాంతాల్లో భూములు, గనులు, అడవులు, ఇతర సహజ వనరుల ఇష్టారాజ్య దోపిడిని అడ్డుకునేందుకు గొప్ప ఆయుధంగా పీసా చట్టం దోహదపడుతుందన్న ఆశలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో అడియాశలయ్యాయి. చాలా రాష్ట్రాలు చట్టం అమలుకు సంబంధించి కనీసం కార్యనిర్వాహక యంత్రాంగాలను ఏర్పాటు చేయలేదు. 1996లో కేంద్రం అమలులోకి తీసుకొచ్చిన చట్టంలో తమ రాష్ట్రాల్లోని గిరిజనుల కట్టుబాట్లు, వనరుల యాజమాన్యంలో సంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా మార్పులు చేపట్టవచ్చని పేర్కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాకుగా తీసుకున్నాయి. కేంద్ర చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు చట్టాన్ని అన్వయించు కోవడంతో దాని స్వరూపమే మారిపోయింది. ఉదాహరణకు షెడ్యూలు ప్రాంతాల్లో ఏదైనా అభివ ృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ కోసం ముందు గ్రామసభలను సంప్రతించాలి. ఆ ప్రాజెక్టు వల్ల నష్టం అనర్ధం వాటిల్లక ముందే నష్ట పరిహారం, పునరావాసం కల్పించాలని కేంద్ర చట్టం చెబుతోంది. ఈ నిబంధనను కొన్ని రాష్ట్రాలు మార్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన పీసా చట్టంలో భూసేకరణకు ముందు మండల పరిషత్‌లను సంప్రతించాలని పేర్కొంది. అంతేకాక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళికలు, పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉండేలా మార్పులు చేసింది. రaార?ండ్‌ రాష్ట్రం తీసుకువచ్చిన చట్టంలో అసలు ఈ వెసులుబాటే లేకుండా చేశారు. భూసేకరణకు ముందు తాలూకా పంచాయతీలను సంప్రతించాలని గుజరాత్‌ చట్టం చెబుతోంది. జిల్లా పంచాయతీ, రెవిన్యూ అధికారుల అజమాయిషీలో భూసేకరణ జరిగేలా ఒడిశా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. గనుల లీజులు, నీటి పారుదల నిర్వహణ, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం…ఇలా అనేక అంశాల్లో కేంద్ర చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు తమ చట్టాల్లో మార్పులు చేశాయి. ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ 2022 నాటికి నూతన, శక్తిమంతమైన భారతదేశాన్ని నిర్మించే లక్ష్యంతో వ్యూహ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం అధికంగా గల 115 జిల్లాల సామాజిక, ఆర్థిక, పరిపాలన పరమైన అభివ ృద్ధిపై ద ృష్టి సారిస్తామని వెల్లడిరచారు. ఈ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి హోదాలోని అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడానికి కార్యాచరణ సిద్ధమైంది. గాయం ఒక చోట అయితే మందు మరో చోట పూస్తున్నట్టుగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో అత్యంత వెనకబాటుకు గురవుతున్న జిల్లాలు అన్నీ దాదాపుగా ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదం ఉనికి బలంగా ఉంది. అటవీ వనరులపై హక్కులు కల్పించి, గ్రామసభల స్థాయిలో పరిపాలన పరమైన సామర్థ్యాన్ని పెంచినప్పుడే గిరిజనుల్లో నిజమైన సాధికారత సాధ్యమవుతుంది. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్‌ వంటి మౌలిక సౌకర్యాల కల్పనలో గ్రామసభలను మమేకం చేయాల్సిన అవసరం ఉంది. పంచాయతీ రాజ్‌ చట్టం మాదిరే మున్సిపల్‌ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు విస్తరించాలనే ప్రతిపాదన దశాబ్దకాలంగా కాగితాలకే పరిమితమైంది. దీంతో గిరిజన ప్రాంతాల్లో అధిక జనాభా ఉన్న పంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పీసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు నిబంధనలను అమలు చేయడానికి రాష్ట్రాల్లో వ్యవస్థాగత యంత్రాంగం లేదు. ఈ చట్టాలకు సంబంధించిన నిబంధనలపై అవగాహన కల్పించే, అమలు తీరును పర్యవేక్షించే యంత్రాంగాలూ లేవు. తగినంత మంది సిబ్బంది లేరు. నిధులూ కొరవడ్డాయి. పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా ప్రభుత్వాలు చురుకందుకోవాల్సిన తరుణమిది. క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే చట్టానికి సార్థకత ఉంటుంది!- జి.ఎన్‌.వి.సతీష్‌

వీర జవాన్లకు జాతి నివాళి

‘‘ జమ్మూ- కాశ్మీర్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని దుర్ఘటన. ఉగ్రదాడిలో 46మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోడం దేశ ప్రజలను దిగ్భ్రాంతిలో ముంచింది. జమ్మూ నుంచి ఫిబ్రవరి 14 తెల్లవారుజామున బయలు దేరిన జవాన్ల 78వాహనశ్రేణిని అక్కడకు 241కిలోమీటర్ల దూరంలోని అవంతిపొరా పట్టణ సమీపంలో జేషే మహ్మద్‌ సంస్థకు చెందిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు 350కిలోల అత్యాధునిక పేలుడు పదార్థం (ఐఈడీ)తో నిండిన వాహనంతో ఢకొట్టెడంతో ఈ ఘోరం సంభవించింది. 2000సంవత్సరంలో ఇదే ఉగ్ర సంస్థ జరిపిన దాడిలో 29మంది చనిపోయిన తరువాత జమ్మూ- కాశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద సంఘటన ఇది.’’- గునపర్తి సైమన్‌

సరిహద్దుల్లో ఉగ్రమూకలు మరింత రెచ్చిపోయాయి. స్థానికంగా శిక్షణ ఇచ్చి తయారుచేసిన ముష్కరులే ఈఘాతు కాలకు పాల్పడుతున్నారు.భరతమాత ముద్దుబిడ్డలని చెప్పుకునే వీరసైనికులు ప్రాణత్యాగాలుచేసారు. కుటుంబసభ్యులతో సెలవులు గడిపి జ్ఞాపకాలు నెమరేసు కుంటూ విధుల్లోనికి వస్తున్న సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల వాణాలపై ఉగ్రమూకలు పంజావిసిరి 42 మందిని బలిగొన్నాయి. ఉగ్రమూకలకు, ఉగ్రస్థావరాలకు ఆశ్రయం కల్పించేదేశంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన పాకిస్తాన్‌లోని జైషేముహ్మద్‌ ఉగ్రవాదసంస్థపనే ఇది అని ప్రకటించుకుంది. పైపెచ్చుఎలా ఉంది మా ప్రతీకారం అన్నట్లుగా సంకేతాలు వదులుతూ ఇలాంటివే మరిన్ని చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. జెఎఎం సంస్థకు చెందిన ఒక ముష్కరుని ఆత్మాహుతి దాడితో ఘోరం జరిగి పోయింది. భద్రతాదళాలు త్యాగాలు వృదాగా పోనివ్వమని పాలకులు చెపుతున్నా ఆకుటుంబాల్లోని పుత్రశోకం భరతమాత సైతం తీర్చలేనిది. గురువారం సాయంత్రం 2500 మందికిపైగా సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు 78 వాహనాల్లో జమ్మునుంచి బయలుదేరారు. సూర్యాస్తమయంలోపు వీరంతా శ్రీనగర్‌చేరుకోవాలిస ఉంది అనేక మంది సెలవరలతర్వాత కశ్మీర్‌ విధుల్లో చేరేందుకు వస్తున్నారు. ఇక లక్ష్యానికి చేరువవుతున్న 20 కిలోమీటర్ల దూరంలోనే అఘోరం జరిగిపోయింది. పేలుడుపదార్ధాలతో నిండిన ఒక స్కార్పియో వాహనం వేగంగా దూసు కొచ్చింది. కాన్వ్నాులోని బస్సును ఢీకొట్టింది. దీనితో అక్కడికక్కడే ఆ బస్సు తునాతునకలైంది. వాహనంలో 76వ బెటాలియన్‌కు చెందిన 44మంది జవాన్లు ఉన్నారు. అక్కడకిక్కడే పలువురు మరణిస్తే మరికొందరు ఆసుప్రతిలో చికిత్స పొందుతో మరణించారు. 350 కిలోల పేలుడు పదార్ధాలతో ఉన్న ఈవాహనాన్ని నడిపిన ఉగ్రవాది దాడికి ముందు సైతం కరుడుగట్టిన వ్యాఖ్యలుచేసాడు. ’’మీరుస్వర్గంచూసేటప్పటికీ నేనే స్వర్గంలో ఉంటాఅనిచేసిన వ్యాఖ్యలు మరణానికి సైతం నేను సిద్ధమేనన్నట్లుగా ఉన్నాయి. కేవలం భారత్‌పై ప్రతీకారం తీర్చు కోవాలన్న కుట్ర, కసి, కరుడు గట్టిన ఉగ్రవాదమే ఇందుకు పురిగొలిపిందని చెప్పాలి. సైనికబలగాలకు ఇదే కొత్తకాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగి నెత్తురును ప్రవహింపచేసాయి. అమర సైనికుల ప్రాణత్యాగాలకు భారత్‌ గుణపాఠం చెపుతూనే ఉంది. అయినప్పటికీ ఎక్కడా ఆగిన దాఖలాలులేవు. 2001 తర్వాత కారుబాంబు దాడుల్లో ఈ సంఘటన అతిపెద్దదిగా చెపుతున్నారు.
2017 డిసెంబరులో కూడాదక్షిణ కశ్మీర్‌లోని లేత్‌పరాలో జెఇఎం బిఎస్‌ఎఫ్‌ దళాలకు మధ్యజరిగిన కాల్పుల్లో ఐదుగురు సిబ్బంది, ముగ్గురుపౌరులు మరణించారు. అలాగే 2016 జమ్ములోని సైనికశిబిరంపై ఉగ్రవాదులు మెరుపుదాడికితెగబడ్డారు. ఇద్దరు అధికారులు, ఐదుగురు సైనికులుమ ృతిచెందారు. పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడిజరిపితే ఏడుగురుసిబ్బందితోపాటు నలుగురు మిలిటెంట్లుసైతం చనిపోయారు. అహ్మద్‌నగర్‌, షోపియాన్‌, పుల్వామా ప్రాంతాల్లో ఒకేరోజు వేరువేరుదాడులుజరిగితే ఎనిమిది మంది సైనికులు, ముగ్గురుపోలీసులు, ఇద్దరుపౌరులతోపాటు మిలిటెంట్లుసైతం ఎనిమిది మందిని మన సైనికులు మట్టుపెట్టారు. అక్కడితో ఆగిందా అంటే అదీలేదు. శ్రీనగర్‌శివార్లలోని హైదర్‌పోరా, సర్బాల్‌క్రాసింగ్‌వద్ద సైనికులపై బాంబుదాడులు జరిపితే పదిమంది అమరులయ్యారు. డాల్‌లేక్‌మీదుగా వెళ్లే రాష్ట్రీయరైఫిల్స్‌ వాహనశ్రేణిపై మిలిటెంట్లు విరుచుకుపడితే 30మంది చనిపోయారు. వీరిలో తొమ్మిదిమంది సైనికులే ఉన్నారు. ఇలా 1999 నుంచి ఇప్పటిరకూ వాహన శ్రేణులపై దాడులుచేస్తూనే ఉన్నారు. మెరుపుదాడులు జరిగిన తర్వాత కూడా ఇవేమీ ఎక్కడా ఆగలేదు.పాకిస్తాన్‌లోని కరాచీలో ఏర్పాటుచేసిన జైషేముహమ్మద్‌ సంస్థకు మౌలానా మసూద్‌ అజహర్‌ అధ్యక్షుడు. ఆతనే వ్యవష్తాపకుడు కూడా. భారత్‌ విమానాన్నిహైజాక్‌చేయడంద్వారా మనదేశ జైలునుంచి 1999లో విడుదలయినప్పటినుంచి మసూద్‌ కరుడుగట్టిన కిరాతకాలకు పథకరచనచేస్తున్నాడు. లష్కరే తాయిబాతరహాలోనే జైషేము హమ్మద్‌కూడా ఉగ్రవాదుల సరఫరా, భారత్‌పై దాడులకు తెగబడటం వెనుక పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ నిధులు,విధులు, కుట్రలకు ప్రోత్సాహం పథకరచన అందిస్తున్నదనడంలో ఎలాంటి సందేహంలేదు.ఈ ఉగ్రసంస్థలకు మజ్లిస్‌ ఎ తవాన్‌ ఎ ఇస్లామికి చెందిన ముఫ్తీ నిజాముద్దీన్‌ షంజాయి, దార్‌ ఉల్‌ఇఫ్తా ఎ వల్‌ ఇర్షాద్‌కు చెందిన మౌలానా ముఫ్తీ రషీద్‌ అహ్మద్‌, షేర్‌ ఉల్‌ హడిత్‌దార్‌ ఉల్‌ హకానియా సంస్థల పెద్దలు ఈ కుట్రలకు మద్దతునిస్తున్నట్లు అమెరికాసైతం గుర్తించింది. మసూద్‌ అజర్‌ జైలునుంచి విడుదలయన తర్వాత ఏర్పడిన ఉగ్రసంస్థ ఆవిర్భవించింది. తాజాగాజరిగిన పుల్వామా దాడి 2001 తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా చెపుతున్నారు. పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాల్సిందేనని ముక్తకంఠంతో భారతీయులు నినదిస్తున్నారు.

తగ్గుతున్న విద్యా ప్రమాణాలు

దేశంలో విద్యావ్యవస్థను సంస్కరించి నూతన విద్యావిధానాన్ని రూపొందించి అందరికీ నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గత రెండు మూడు దశాబ్దాలుగా పాలకులు, న్యాయస్థానాలు, మేధావ్ఞలు, పదేపదే చెపుతున్నా.. ఆచరణకు వచ్చేసరికి అవి మాటలకే పరిమితమవు తున్నాయి. ముఖ్యంగా పడిపోతున్న నాణ్యతగూర్చి న్యాయస్థానాలు ఎన్నోసార్లు ఎత్తిచూపాయి. చివరకు ప్రభుత్వం నుండి జీతభత్యాలు తీసుకుంటున్నవారుకూడా సర్కారు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించకపోవడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలంటూ అలహాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ 2015 ఆగస్టు 18న తీర్పు ఇచ్చారు. సర్కారు బడుల్లో ఉపాధ్యాయులను నియమిస్తున్నవారు తమ పిల్లలను మాత్రం వాటిల్లో చదివించకపోవడాన్ని ఆయన ఆనాడే తప్పుపట్టారు.ప్రైవేట్‌ విద్యా వ్యాపారం పెరిగిపోతున్నా నాణ్యత విషయంలోమాత్రం అంతంతమాత్రంగానే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశా లల్లో ప్రధమ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలోని అంశాలను మంగళవారం వెల్లడిరచింది. భారతదేశంలోని 596 జిల్లాల పరిధిలో మూడు నుంచి పదహారేళ్ల వయస్సుఉన్న దాదాపు ఐదున్నర లక్షల మందికిపైగా విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించగా బడిలో చేరని పిల్లల సంఖ్య 2007తో పోలిస్తే మూడు శాతం తగ్గినట్లు వెలుగుచూసింది. ప్రాథమిక స్థాయి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్చేందుకోసమే మొగ్గు చూపుతున్నారు. పై తరగతులకు వెళ్లేకొద్దీ క్రమేణా చదువ్ఞ మానేసేవారి సంఖ్య పెరిగి పోతున్నది. 2018లో ప్రైవేట్‌ పాఠశాలల్లో రెండో తరగతి చదువ్ఞతున్న విద్యార్థులు 54.4 శాతం ఉంటే ఎనిమిదో తరగతి విద్యార్థులు 25 శాతంలోపే ఉన్నారు. ఇక పదాలు, వాక్యాలు చదవగలిగే వారి సంఖ్య గతంలో కంటే మరింత తగ్గిందని యాన్యూవల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ బయటపెట్టింది.ప్రైవేట్‌ పాఠశా లల్లో కూడా ప్రమాణాలు భారీగానే పడిపోతున్నట్లు చెప్పింది. ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల్లో మూడోతరగతిలో కూడా తీసివేతలు రాని విద్యార్థుల సంఖ్య పెరిగిందని 2016లో తీసివేత చేయగలిగిన విద్యార్థులు 4.2శాతం ఉంటే ఇప్పుడు వారి సంఖ్య ముప్పై నాలున్నర శాతానికి పడిపోయింది. గణాంకాలు చేయలేని విద్యార్థులు ఐదో తరగతిలో 2016లో 30.4శాతం ఉంటే, ఇప్పుడువారి శాతం 27.3 శాతానికి తగ్గింది.ఇక ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతిలో లెక్కలు చేయగలిగిన విద్యార్థు లు 2016లో 54.9 శాతం ఉంటే ఇప్పు డు అది 48.7 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రమా ణాలు పడిపోతున్నాయని ఈ సర్వే స్పష్టం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతంలోని ప్రైవేట్‌ పాఠశాలల పరిస్థితి కూడా ఆందోళన కరంగానే ఉంది. ఫీజులు వసూలు చేయడంలో ఉన్న ధ్యాస%ౌౌ% న్యాణమైన విద్య అందించడంలో విఫలమవ్ఞతున్నారు. వాస్తవంగా చూస్తే.. ఒకనాడు ప్రభుత్వ పాఠశాలలే కానీ ప్రైవేట్‌ బడులు లేవ్ఞ. ఎక్కడో పట్టణాల్లో, నగరాల్లో అక్కడక్కడా ప్రైవేట్‌ బడులు నడిచేవి. వాటిల్లో కూడా వ్యాపార ధోరణులు కన్పించేవి కాదు. లాభనష్టాలతో సంబంధం లేకుండా కేవలం సేవా దృక్పథంతో ఆవిద్యా సంస్థలు ప్రజలకు సేవలు అందించేవి. నిర్వాహకులు సామాజిక బాధ్యతగా భావించి బడులు నడిపేవారు. అందువల్ల ఆనాడు వాటిని అరికట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. అందుకే ప్రైవేట్‌ విద్యను అరికట్టేందుకు ఆనాడు చట్టాల అవసరం తలెత్తలేదు. కానీ ఇప్పుడు అవి పూర్తిగా వ్యాపార సంస్థలుగా రూపాంతరం చెందాయి. లాభసాటిగా ఉన్న ఈ వ్యాపా రంలో రాజకీయ నాయకులు, కాంట్రా క్టర్లు, ఒకరేమిటి వ్యాపారాలు చేయాలను కున్నవారంతా ఈ విద్యా వ్యాపారంలో దిగుతున్నారు. దీనికి తోడు ఇంగ్లీషు చదువ్ఞలపై మోజు పెరగడంతో దాన్ని ఆసరాగా తీసుకుని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చివేశారు. బీదా,బిక్కీ జనం కూడా ప్రైవేట్‌ విద్యకోసం ఆరాట పడుతున్నారు. ఏమాత్రం ఆర్థికవసతి లేక, మరోదారి లేనివారే విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల బాటపడుతున్నారు. ఇంతకాలం గ్రామాలకు ప్రైవేట్‌ వ్యాపారం సోకకపోవడంతో పట్టణాలకు పంపించి చదివించే ఆర్థిక స్థోమత లేని మధ్యతరగతి వారుసైతం తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యపై ఆధారపడ్డారు. ఇప్పుడు మండల కేంద్రాలు, చివరకు మారుమూల గ్రామాలకుసైతం ఈ విద్యావ్యాపారం వ్యాపించిపోయింది.ఇక రానురానూ ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్‌ అనేది ప్రశ్నార్థకంగా కన్పిస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తున్నది? కారుకులు ఎవరు? కారణాలు ఏమిటి? అనేది పాలకులకు తెలియంది కాదు. అందరికీ తెలుసు. అయినా ఈ దుర్మార్గపు వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. పాలకులు ఘోరంగా విఫలమవ్ఞతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీచేయడం లేదని చెప్పడం లేదు. ప్రభుత్వ పథకాలు, ఆశయాలు కాగితాల వరకు బాగానే ఉంటాయి.
కానీ ఆచరణ విషయం వచ్చేటప్పటికీ అసలు సమస్య మొదలవ్ఞతుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. బాలబాలికలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యావ్యవస్థను ఇంతటి దారుణ పరిస్థితుల్లోకి నెట్టడం దురదృష్టకరం. మారిన పరిస్థితులకు అనుగుణంగా జీవనోపాధికి ఉపయోగ పడేలా విద్యావిధానాన్ని సంస్కరించాల్సిన అవశ్యకత ఉంది. కోట్లకొద్దిడబ్బు, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా పాఠశాల విద్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈమధ్యనే ప్రథం సంస్థ విడుదల చేసిన సర్వే(అసెర్‌) వివరాలు విద్యా ప్రమాణాలు దిగజారిన విషయాన్ని తేటతెల్లం చేసింది. 2005-2014 వరకు ఆ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రతి సంవత్సరం ప్రథం సంస ్థసర్వే నిర్వహి స్తుంది. ఈ సర్వేలో మన ప్రభు త్వాలు విద్య కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంత వరకు ఫలితాన్ని స్తున్నయో తెలియజేసింది. విద్యా ప్రమ ణాలు పెంచడంలో విద్యావ్యవస్థ విఫల మవుతున్నదని చెప్పడానికి ఈ సర్వే గణాంకాలే నిదర్శనం. ఈసర్వే ప్రకారం 5వ తరగతి చదివే విద్యార్థికి 2వతరగతి స్థాయి భాష, గణితసామర్థ్యాలు లేవని తేల్చిచెప్పింది. వివిధ కార్యక్రమాల రూపకల్పన ద్వారా పాఠశాలలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డా, విద్యా ప్రమాణాలు మాత్రం మెరుగుపడకపోగా ఇంకా తగ్గిపోయాయి. ఈసర్వే వివరాల ప్రకారం రెండవ తరగతి పిల్లల్లో 19.5శాతం పిల్లలు 0 నుంచి 9 అంకెలను గుర్తించలేకపోతున్నారు. ఇది ఇదివరకు 17.6శాతంగా వుండేది. దీన్నిబట్టి చూస్తే విద్యార్థుల విద్యాప్రమాణాలు మెరుగుపడటం అటుంచి అవి మరింత దిగజారిపో తున్నాయి. విద్యా పమాణాల దిగజార డానికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది ఉపాధ్యాయుని పనితీరు, హాజరు. చాలవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నా, ఉన్న ఉపాధ్యాయుల్లో ఎంతమంది అంకిత భావంతో పనిచేస్తున్నారనేది ప్రశ్న? బోధన నిరంతరం జరుగుతున్నది కానీ అభ్యసన ఎంతమేరకు జరిగింది అన్నది ముఖ్యం. అందుకే ఇటీవల మోదీ విదేశీ తరగతి గదుల్లో అభ్యసన మాత్రమే జరుగుతున్నది, కానీ మనతరగతి గదుల్లో బోధన జరుగుతున్నది అన్నారు. మారుతున్న పరిస్థితులకు కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయ విద్యలో మార్పులు ఉండటం లేదు.భావి ఉపాధ్యాయులను తయారుచేసే సంస్థల పనిత నం, వారు పాటిస్తున్న నిబంధనలు ఉపాధ్యాయుల ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలి.ఉపాధ్యా యుల్లో లోపించిన జవాబుదారీతనం, అంకితభావానికి ఉపాధ్యాయ విద్యే బాధ్యత వహించాలి. పాఠశాలలకు ప్రభుత్వం రూపొందిస్తున్న వివిధ కార్యక్రమాలు ఎంతవరకు వాటి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయనేది పర్యవేక్షకుల పనితీరు పైనే ఆధారపడి వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నా వాటిని పర్యవేక్షించే అధికారుల లోటును భర్తీచేయలేకపోతున్నది. పర్యవేక్షక అధికారుల పనితీరు, ఉపాధ్యాయ ఖాళీలు ఇవన్నీ సర్కారీ బడులన్నీ ఖాళీ అవుతున్నాయి. గ్రంథాలయపుస్తకాలు, ప్రయోగపరికరాలు సరఫరా చేసినా వాటిని వినియోగిస్తున్న దాఖలాలు లేవు. ూూA, RవీూA లద్వారా అందచేస్తున్న శిక్షణలు, వసతులపై పర్యవేక్షణ లోపాలున్నాయి.
విద్యాప్రమాణాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయ విద్యను పరిపుష్టం చేయాలి. ఉపాధ్యాయ విద్య ఎంత పటిష్టంగా వుంటే విద్యావ్యవస్థ అంతపటిష్టంగా ఉంటుంది. విద్యాప్రమాణాల పెరగడానికి దోహదం చేస్తుంది. పర్యవేక్షకుల నియామకం చేపట్టి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యా యుల పనితీరు మెరుగు పర్చవచ్చు. వీటన్నిటితో పాటు సంస్థలు, వ్యక్తుల మధ్య సమన్వయం అనేది విద్యాప్రమాణాల పెరుగుదలకు చాలా అవసరం. ఉపాధ్యాయ విద్య, పాఠశాల విద్యల మధ్య సమన్వయం విద్యా ప్రమణాల పెరుగుదలకు దోహదపడుతుంది. తద్వార విద్యా ప్రమాణాలు మెరుగుపడి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాలలపై నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వాలు వీటన్నింటిపైదష్టి సారించాల్సిన అవసరంఎంతైనా వున్నది.- జి.ఎన్‌.వి.సతీష్‌

రాక్షసత్వాన్ని మించిన ఉన్మాదమిది

‘‘ అమ్మకడుపులో దాచాలంటే ఆడపిల్లకు కష్టంగా మారింది. ఇక పుట్టాక అడుగు వేస్తే ఆపద. గడియగడియకో గండం నిమిషానికోసారి తనని తాను చూసుకొని బతికున్నానని నిర్ధారించుకునే పరిస్థితులు దాపురించాయి. చదువుకుందామని కాలేజీకి వెళ్తే అక్కడ కామాంధుల చూపు వారిపైనే వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే ఒంట్లో ఉన్న రోగాన్ని చూడాల్సిన కొంతమంది డాక్టర్లు వారి ఒంటిని చూస్తున్న దాఖలాలు మనకు తెలిసిందే. కళాశాలల్లో కొంతమంది విద్యార్థుల వల్ల, ఉద్యోగం చేసే చోట కొంతమంది తోటి ఉద్యోగుల వల్ల ఏదో ఒకరకంగా లైంగిక వేధింపులకు, ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మరికొందరు ప్రేమ పేరుతో వంచన చేస్తున్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రం వరంగల్‌ హన్ముకొండ రాంగనర్‌లో చోటు చేసుకున్న దారుణం కారణంగా ఓ యువతి ఒక ఉన్మాది చేతికి గురైన విషయం సంచలనం సృష్టించిన విషయం విధేతమే. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీకి సమాజంలో రక్షణ ఎక్కడిది..? అందుకే వారి కోసం ప్రత్యేక చట్టాలు పుట్టాయి. లైంగిక దాడికి గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారా..? ఒక వేళ నిందితుడు ఏ బడాబాబు కొడుకైతే కొన్ని సందర్భాల్లో సులభంగా తప్పించుకుంటున్నారు.’’-(దామోదర సాయిబాబా)
చదువు సంధ్యలు పెరిగే కొద్దీ మనుషుల ప్రవర్తనలో మార్పులు రావాలి. సభ్యతా సంస్కారాలు పెరగాలి. సాంకేతికంగా అభివృద్ధి చెంది విజ్ఞానం ఆర్జించేకొద్దీ మంచి ఏదో, చెడు ఏదో గ్రహించే విచక్షణా జ్ఞానం పెరగాలి. దురదృష్టవశాత్తు అందుకు విరుద్ధంగా తిరోగమిస్తున్నామే మోననిపిస్తున్నది. జరిగిన, జరుగుతున్న సంఘ టనలు ఆవేదనే కాదు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థినిలపై జరుగుతున్న దాడులు కొందరు ఉన్మాదులు చేస్తున్న విన్యాసాలు సభ్యసమాజం తలవంచుకునేలా ఉన్నాయి. ఫిబ్రవరి 27న తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌జిల్లా హన్మకొండలో జరిగిన సంఘటన మళ్లీ ఒక్కసారి ఉల్లికిపరిచింది. ఏమిటిది? ఈదారుణాలను నిరోధించలేరా? ఇది నిరాటంకంగా జరగాల్సిందేనా? తదితర ప్రశ్నలు జవాబులు లేకుండా మిగిలిపోతున్నాయి. హన్మకొండ రాంనగర్‌లో దారుణం చోటుచేసుకున్నది. తనప్రేమను నిరాకరించిందన్న కారణంగా ఒకఉన్మాది మానవత్వం మరిచి అందరు చూస్తుండగా పట్టపగలు నడిరోడ్డులో తోటి విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పుఅంటించాడు. వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువ్ఞతున్న రవళి అనే విద్యార్థిని బుధవారం కాలేజీకి వెళ్తున్న సమయంలో అదే కాలేజీలో, అదే తరగతి చదువ్ఞతున్న సాయిఅన్వేష్‌ అనే యువకుడు పెట్రోలు పోసి దాడికి తెగబడ్డాడు. దాదాపు అరవైశాతంపైగా కాలిన గాయాలతో రోడ్డుపై కొట్టుకుమిట్లాడుతున్న ఆమెను వరంగల్‌ ఎంజిఎమ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రవళి చికిత్స పొందుతూ మార్చి 4న మృతి చెందింది వరంగల్‌లో గతంలో కూడా ఇద్దరు యువతులపై ఆసిడ్‌ దాడి జరిగింది. అందులో ఒకయువతి మరణించగా మరో యువతి కోలుకోగలిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దేశవ్యాప్తంగా విద్యార్థినిలపై ఈఅఘాయిత్యాలు, దాడులు అంతకంతకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. చట్టాలు ఎన్ని చేసినా, ఎంతమంది అధికారులను నియమించినా ఈచట్టాలు కానీ, ఆ అధికారుల కానీ వీటిని నియంత్రించలేకపోతున్నారు.పైగా అంతకంతకు పెరిగిపోతున్నాయి.
ఢల్లీిలోనిర్భయ కేసు అనంతరం చెలరేగిన ఆందోళనలతో కేంద్ర పాలకులు పకడ్బందీ చట్టం తీసుకువచ్చారు. కానీ ఆ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇవి ఆగడం లేదు. అలాని పోలీసులు ఏమి చేయడం లేదని చెప్పడం లేదు. కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తు న్నారు. జైళ్లకు పంపిస్తున్నారు. కొన్నింటిలో శిక్షలు కూడా వేయించగలుగుతున్నారు. కానీ అధికశాతం కేసులు వీగిపోతున్నాయి. ఈ కామాంధులకు పోలీసులన్నా, చట్టాలన్నా భయభక్తులు సన్న గిల్లుతుండటమే ఇందుకు కారణమనేది కాదనలేని వాస్తవం. అసలు ఈ సంఘటలన్నీ చూస్తుంటే సమాజం ఎటువైపు పయనిస్తుందనే అనుమానం రాకతప్పదు. ఇవి మొదలు కాదు. చివర కూడా కాదు. కొన్ని కేసుల్లో పోలీసుల అసమర్థత, చేతకానితనాన్ని నేరస్తులు తెలివిగా వాడుకోగలుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. హాస్టల్‌లోనే మానభంగం చేసి హత్యచేశారు. పోలీసుశాఖ సవాల్‌గా పరిగణించిన కేసులో పెద్దల హస్తం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఏదిఏమైతేనేం పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు నిర్వర్తించలేక నేరం ఎవరు చేశారో రుజువ్ఞ చేయలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుడు నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. అంతేకాదు దర్యాప్తు ఎంత డొల్లగా ఉందో న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇప్పుడు ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారు. సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తుంటే రికార్డులే మాయమైపోతున్నాయి. ఇలా ఎందరో విద్యార్థినిలు బలైపోతున్నారు. కొందరు తీవ్ర గాయాలతో బయటపడి జీవనం సాగిస్తున్నారు. అంతకుముందు విజయవాడలో ఎంసిఎ విద్యార్థి శ్రీలక్ష్మీని అదే కాలేజీకి చెందిన మనోహర్‌ అనే విద్యార్థి తనను ప్రేమించలేదని దారుణంగా హత్యచేశాడు. అంతకుముందు గుంటూరులో ఇంటర్‌ చదువ్ఞతున్న మరొక విద్యార్థినిని ఒక మేకానిక్‌ విద్యార్థులందరూ చూస్తుండగా ఏకంగా తరగతి గదిలోనే నరికిచంపాడు. ఇలా ఒకటి కాదు,రెండు కాదు. ఎన్నో సంఘటనల్లో విద్యార్థినులు బలైపోతున్నారు. రక్తాన్ని పంచిపెంచిన బిడ్డ ఇలా అర్థరహితంగా ఉన్మాదానికి బలైతే ఆతల్లి గర్భశోకాన్ని తీర్చేది ఎవరు? ఏమిచ్చి ఓదార్చగలరు? ఈవిషసంస్కృతి పెరిగిపోతున్న దనేందుకు జరుగుతున్న సంఘటనలు అద్దంపడుతున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయనే విషయం పోలీసు రికార్డులు కూడా వెల్లడి స్తున్నాయి. విద్యార్థినిలపై వేధింపులకు అంతేలే కుండాపోతున్నది. చాలా వరకు ఇవి పోలీసు రికార్డుల్లోకి ఎక్కే అవకాశం తక్కువ. సంఘ టనలు జరిగినప్పుడో, గాయపడినప్పుడో, ప్రాణాలు పోయినప్పుడో తప్ప పోలీసు దృష్టికి వెళ్లడం లేదు. ఏయువతీ తాను వేధిం పులకు గురి అవ్ఞతున్నానని పోలీసు స్టేషన్ల మెట్లెక్కి ఫిర్యాదు చేయడానికి సాహసించడం లేదు. పోలీసులు వేసే సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పడం అయ్యేపని కాదని ఒకవేళ అన్నీసమకూర్చిన వారు తీసుకునే చర్యలకు ఈ వేధింపులు ఆగిపోతాయని ఏఆడపిల్ల నమ్మే స్థితిలో లేదు. అలా నమ్మి పోలీసుల దృష్టికి తీసుకువచ్చిన కేసుల్లో కూడా ఏదో కౌన్సిలింగ్‌ పేరుతో కాలం గడిపి పంపుతున్నారే తప్ప నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేక పోతున్నారు.మొన్న హైదరాబాద్‌ నడిబొడ్డులో జరిగిన సంఘటనలు ఇందుకు ఉదహరించవచ్చు. పాలకులు ఉక్కుపాదం మోపితే తప్ప ఈ దారుణాలు ఆగదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు తగు న్యాయం చేసి, భవిష్యత్తులో మహిళలు, యువతలపై ఇటువంటి అగత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.!

మహిళ నీకో వందనం

మహిళా సాధికారితతోనే మార్పు వస్తుంది అని భావిస్తున్న వర్తమాన సమాజంలో ఇప్పటికీ పురుషాధిక్యత మధ్యనే మహిళలు నలిగిపోతున్నారు అన్నది వాస్తవం. స్త్రీలను దేవతలతో పోల్చి చూస్తారు కానీ ఇప్పటికీ మహిళలపట్ల సమాజంలోనే కాదు కుటుంబాలలో కూడ చిన్న చూపు కొనసాగుతోంది అన్నది వాస్తవం. ఈక్రమంలో మహిళాభ్యుదయం జరగాలి మహిళల అభివ ృద్ధి జరగాలి అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఎన్ని జరిగినా స్త్రీల సామాజిక ఆర్ధిక రాజకీయ అభివ ృద్ధి ఇంకా కేవలం నామమాత్రంగానే ఉంది అన్నది వాస్తవం. మనదేశంలో పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనాలు ఉపాది ఆహారబద్రత లేకపోవడంతో పాటు స్త్రీల పై లైంగిక హింస ఇంటా బయటా వయస్సుతో నిమిత్తం లేకుండా పెరిగి పోవడం చూస్తూ ఉంటే ఇంకా ఎన్ని మహిళా దినోత్సవాలు జరిగితే మహిళల అభివ ృద్ధి జరుగుతుంది అని అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు.
మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివ ృద్ధి చెందదు అన్నది నిజం. ఈవాస్తవాన్ని గుర్తించి స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అనే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగితే మహిళా అభ్యుదయం దానంతట అదే జరుగుతుంది. ఇప్పటికీ మన దేశంలో ఆడపిల్ల పుడితే దురద ృష్టంగా భావిస్తున్న సగటు మనిషి ఆలోచనల నేపధ్యంలో ఎన్ని ఉద్యమాలు జరిగినా మహిళల అభివృద్ధి సంక్షేమం కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవుతోంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న జనాభా లెక్కల గణాంకాల ప్రకారం ఉత్తారాది రాష్ట్రాలలో ప్రతి వెయ్యి మంది పురుషు లకు 879 మాత్రమే అమ్మాయిలు ఉన్నారని గణాంకాలు చెపుతున్న నేపధ్యంలో మరో 100 సంవత్సరాలు గడిచేసరికి ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఐదువందలకు పడిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇప్పటికీ మనదేశంలోని మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలలో స్త్రీని ఒక పనిచేసే యంత్రంగా బావిస్తున్న నేపధ్యంలో ఇంటిపని పిల్లల పని ఉద్యోగ బాధ్యతలు నిర్వహించ గలిగే ఒక ‘రోబోలా’ మాత్రమే స్త్రీలను చూస్తున్నారు అన్నది వాస్తవం. ఈపరిస్థుతులకు ఎవరో పరిష్కారాలు చెపుతారని ఆశించకుండా స్త్రీలు తమని తాము తెలుసుకుని తమ శక్తియుక్తులు మెరుగు పరుచుకునే వరకు ఎన్ని మహిళా ఉద్యమాలు మహిళా దినోత్సవాలు జరిగినా స్త్రీల పై వేదింపులు స్త్రీలను చిన్న చూపు చూడటం కొనసాగుతూనే ఉంటుంది అన్నది వాస్తవం.
‘ఒక పని గురించి చెప్పాలి అంటే పురుషులకు చెప్పండి అదే ఆపని పూర్తి అవ్వాలి అంటే మాత్రం మహిళకు చెప్పండి’ అని ఉక్కు మహిళగా పేరుగాంచిన బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌ చెప్పిన మాటలను బట్టి మహిళా ఏదైనా సాధించాలి అనుకుంటే ఏ శక్తి ఆపలేదు అన్నది వాస్తవం. ఐస్‌ ల్యాండ్‌ లాంటి చిన్నదేశంలో మహిళను అసభ్యకరంగా చూపించే సినిమాలు వీడియాలు తీసినవారికి ఎటువంటి వాదన ప్రతివాదనలు లేకుండా వెంటనే కఠిన శిక్షలు విధించే చట్టాలు ఉన్నాయి. అంతేకాదు ఆదేశ పార్లమెంట్‌ లో మహిళలకు సంబంధించిన ఆదేశ మహిళలే రూపొందిస్తారు. అటువంటి పరిస్థుతులు మన భారతదేశంలో వచ్చిన నప్పుడు మాత్రమే నిజమైన మహిళా సాధికారిత :
వేదాలకాలం నుంచే భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం ఉంది. మనదేశాన్నే ఒకస్త్రీ మూర్తిగా భావించి భారత మాతగా కొలుస్తున్నాం. మన దేశంలో నదులను సరస్వతి, గంగ, యమున, గోదావరి, కావేరీలను స్త్రీ మూర్తులుగా, మాతలుగా వ్యవ హరిస్తూ పూజిస్తున్నాం. స్త్రీలపట్ల ఆరాధనా భావం ఉన్నందువల్లే మనం పుట్టిన దేశాన్ని మాతృభూమిగా పిలుచుకుంటున్నాం. ప్రస్తుత భారతీయ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న సామాజిక వివక్షకు కారణం హిందూ సాంప్రదాయాలేనని చాలా మంది అజ్ఞానంగా వాదిస్తుంటారు. కానీఅనాది నుంచి భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందూ పురాణాల్లో సంపదకు అధిదేవతగా లక్ష్మిని, విద్యాధిదేవతగా సరస్వతిని, శక్తికి ప్రతిరూపంగా దుర్గను ఆరాధించారు. పురాతన హిందూ గ్రంథాల్లో కొన్ని మహిళా పాత్రలను బలంగా తీర్చిదిద్దారు. వారిలో సీత,సావిత్రి, మండోదరి, గంగ లాంటి పాత్రలు నేటితరం మహిళలకు ఎంతో ఆదర్శం. ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవం, ఆరాధన ఆధునిక సమాజంలో లేకుండా పోతోంది. మహిళలను పురుషులతో సమానంగా చూడడం లేదు. ఇది ఆందోళనకరం. స్త్రీలపట్ల మన ఆలోచనాధోరణి మారాలి. నేడు స్త్రీలపరిస్థితులు మారాయి. వంటిల్లే స్వర్గంగా భావించే మహిళలు ఇప్పుడు సమాజంలో ఒక విశిష్టమైన శక్తిగా అంచెలంచెలుగా ఎదుగు తున్నారు. వైద్య,విద్య,విజ్ఞాన,రాజకీయ,క్రీడా,రక్షణ.. ఇలా రంగం ఏదైనా స్త్రీలు దూసుకు పోతున్నారు.
విద్యార్థినిగా, గృహిణిగా,ఉద్యోగినిగా, రాజకీయవేత్తగా ఇలా ఎన్నో విధాలుగా సమాజంలో భాగంగా మారినా స్త్రీ స్వయం నిర్ణయం అనేది ఇంకా పురుషుల చేతులలోనే ఉన్నది. స్త్రీ,పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలసి నడవాలి. కాని ప్రస్తుతం అలా లేదు. అడుగడుగునా ఆటంకాలు.. అలుపెరుగని పోరాటాలు.. అత్మాభిమాన అణచి వేతలు ఇవన్నీ మహిళల అభ్యున్నతికి అడ్డుపడు తున్నాయి. తరతరాల నుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థలో కాలక్రమేణా మార్పులు చోటు చేసు కున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మారేందుకు కాస్త సమయం పడుతుంది. ఇప్పటికే పురుషుల ఆలోచనా దృక్పథంలో కాస్త మార్పు వచ్చింది. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా, ఉద్యోగినిగా ఆర్థిక సేవలం దించి, మాతృత్వంతో సంసా రాన్ని పెంచే త్రిపాత్ర ధారిణి అనే విషయాన్ని తెలుసు కుంటు న్నారు. సమాజంలో నేటికీ బాలికా శిశు గర్భవిచ్ఛిత్తి వంటి హేయమైన పనులు జరుగుతున్నాయి. పురుషులతోపాటు స్త్రీలకు విద్య,సాది óకారిత, హక్కులు,అభివృద్ధిలో భాగస్వా మ్యం సమానంగా లభించి నప్పుడే సమాజం అన్ని విధాలా అభ్యున్నతి సాధి స్తుంది. గృహహింస, విడాకుల చట్టం.. ఇలా ఇంకా ఎన్నో చట్టాలు నేడు స్త్రీలకు రక్షణ కవచాలుగా మారాయి. మహిళలే స్వయంగా రాజకీయ చక్రం తిప్పుతున్న నేటి సమాజంలో, మహిళా బిల్లు ప్రవేశ పెట్టటానికి ఎన్ని అవస్థలు పడ్డారో, ఎన్ని ఆటంకాలు ఎదురవుతు న్నాయో తెలిసిన విషయమే.
మహిళా సాధికారిత లేకుండా మానవ జాతి అభ్యున్నతి సాధించలేదు. ఇది జరగాలంటే పురుషుల ఆలోచనా విధానంలో పూర్తిగా మార్పులు రావడం తప్పనిసరి. ప్రపంచ జనాభాలో మహిళలు సగ భాగం. ఈ సగభాగం కృషి లేకుండా అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించడం సాధ్యం కాదు. కనుక తమకంటే స్త్రీలు తక్కువ అన్న దృక్ప థాన్ని పురుషులు విడిచిపెడితేనే సమాజం, దేశం, ప్రపంచం అభివృద్ధి చెందుతాయి.
వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని స్త్రీలు నిరూపి స్తున్నారు. సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించ డానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్బు Ûతమైన కృషి చేశారు. మహిళలు ఇప్పుడు మన సాయుధ దళాలలో చేరి యుద్ధరంగంలో కూడా దిగారు. ఇటీవలే మన యుద్ధ విమానా లను నడిపేందుకు ముగ్గురు మహిళలు వైమానిక దళంలో చేరి దేశం గర్వపడేలా చేశారు. వివిధ కార్పోరేట్‌ సంస్థల బోర్డుల్లో మహిళలు బోర్డు డైరెక్టర్లుగా ప్రవేశించిన తర్వాత చెప్పుకోదగ్గ ఆర్థిక ఫలితాలు వచ్చాయని ఓనివేదిక పేర్కొంది. ఒకస్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతం అయినట్లు లెక్క. అప్పుడు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుంది. స్త్రీ,పురుషుల మధ్య సమా నత్వం,లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేత నాలు, సమాన ఆస్తి కల్పించాలి.-డా. దేవులపల్లి పద్మజ

అటవీ హక్కుల చట్టం..ఆదివాసీలకు అన్యాయం

‘‘ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అడవుల్లో నివసిస్తున్న ఇలాంటి 10 లక్షల కుటుంబాలు అక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే దానిపై తానే స్టే తెచ్చుకుంది. అటవీ హక్కుల కోసం వచ్చిన 40 లక్షల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 17 రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా సుప్రీం ఈ ఆదేశాలు జారీచేసింది. మూడు తరాలుగా అడవిలోనే నివిసిస్తున్న ఆధారాలుచూపుతూ వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తరువాత ఈ రాష్ట్రాల్లో సుమారు 18 లక్షల దరఖాస్తులను ఆమోదించారు. వారికి భూపత్రాలు కూడా అందించారు. ఇదే సమయంలో 10 లక్షలకు పైగా కుటుంబాల నుంచి వచ్చిన దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో వారంతా అడవులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సుప్రీం ఆదేశించింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున గిరిజనులను తరలించాల్సి రావడం అనేది ఇదే ప్రథమమని ఎన్విరాన మెంటల్‌ జర్నలిస్ట్‌ నితిన్‌ శేఠీ అన్నారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని.. అడవుల్లో అక్రమంగా నివసిస్తున్నవారి కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రమాదంలో పడుతోందని వైల్డ్‌ లైఫ్‌ యాక్టివిస్ట్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అటవీ హక్కుల చట్టం అనేది అనాదిగా అరణ్యాల్లో నివసిస్తున్నవారికి భూమిపై హక్కు కల్పించడానికి ఉద్దేశించిందే కానీ భూపంపిణీ, వితరణకు ఉద్దేశించింది కాదని పిటిషన్‌దారులు అంటున్నారు. గిరిజనానికి మద్దతుగా మాట్లాడుతున్న వారు మాత్రం ఈ చట్టం అమలు లోపభూయిష్ఠంగా ఉందంటున్నారు. ..’- గునపర్తి సైమన్‌

భారత్‌ 10కోట్ల మంది గిరిజనులకు ఆవాసం.. ఓచరిత్రకారుడి మాటల్లో చెప్పాలంటే వారు అణగారిన అల్పసంఖ్యాకులు. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న రాష్ట్రాల్లోని దట్టమైన అడవుల్లో వీరు మనుగడ కోసం పోరాడుతూ దుర్భర జీవనం గడుపుతున్నారు. దేశంలోని మొత్తం గిరిజన జనాభాలో 40 లక్షల మంది రక్షిత అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశంలో సుమారు 500 వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యురీలు, 90జాతీయ పార్కులు ఉన్నాయి. ఇది భారతదేశ మొత్తం విస్తీర్ణంలో సుమారు 5శాతం ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం 2005డిసెంబర్‌13కి పూర్వం నుంచి అడవిలో నివిసిస్తున్న గిరిజనులకు వారి అనుభవంలో ఉన్న భూమిలో నివసించే హక్కు ఉంటుంది. అడవుల్లోని ఇతర సంప్రదాయ తెగలు ఎవరైనా నివాసం ఉంటే వారు 2005 డిసెంబరు 13కి పూర్వం నుంచి మూడు తరాలు అక్కడ నివసిస్తున్నట్లు ఆధారాలు చూపించాలి. అప్పుడే వారి ఆక్రమణలో ఉన్న అటవీ భూమిపై వారికి హక్కు ఉంటుంది. ఇక్కడ తరం అంటే చట్టంలో 25ఏళ్లుగా తీసుకున్నారు. అంటే.. 2005 డిసెంబరు 13కి ముందు 75 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నవారై ఉండాలి. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అడవుల్లో నివసిస్తున్న ఇలాంటి 10లక్షల కుటుంబాలు త్వరలో అక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించింది. అటవీ హక్కుల కోసం వచ్చిన 40లక్షల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 17రాష్ట్రాలు ఇచ్చిన సమా చారం ఆధారంగా సుప్రీం ఈఆదేశాలు జారీచేసింది. మూడు తరాలుగా అడవిలోనే నివిసిస్తున్న ఆధారాలుచూపుతూ వచ్చిన దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించిన తరువాత ఈరాష్ట్రాల్లో సుమారు 18లక్షలదరఖాస్తులను ఆమోదించారు. వారికి భూపత్రాలు కూడా అందించారు. ఇదే సమయంలో10 లక్షలకు పైగా కుటుంబాల నుంచి వచ్చిన దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో వారంతా అడవులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సుప్రీం ఆదేశిం చింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున గిరిజనులను తరలించాల్సి రావడం అనేది ఇదే ప్రథమమని పర్యావరణం, అటవీ సామాజికవేత్తలు అభిప్రాయపడు తున్నారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని..

చిన్న రైతులు సతమతం

దేశంలో వ్యవసాయ కమతాలు నానాటికీ చిక్కిపోతున్నాయి. సాగు రంగానికి ఆలంబనగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు అన్ని విధాలుగా చితికిపోతున్నారు. వ్యవసాయాన్ని ఏకంగా బడాసంస్థల పాలుచేసే ప్రభుత్వ ప్రయత్నాలు వారిని మరింత కుంగదీసేవే. కష్టనష్టాల కడలిలో చిక్కిన చిన్న రైతులను ఒడ్డున పడేసేందుకు సర్కారు సమగ్ర చర్యలు చేపడితేనే ప్రణాళిక లక్ష్యాలను చేరుకోగలం.దేశంలో సగానికి పైగా కమతాలు చిన్న, సన్నకారు రైతుల చేతిలోనే ఉన్నాయి. వీరి సంఖ్య పదికోట్లకు పైమాటే. వ్యవసాయమే వీరికి ప్రధాన ఆదాయ వనరు. ఏటా దాదాపు 15నుంచి 20లక్షలమంది చిన్న, సన్నకారు రైతులు అదనంగా చేరుతున్నారు.
వీరి కమతాల ఉత్పాదకత, నికర లాభాలు పెంచటానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న దాఖలా లేదు. ఆహారభద్రత వంటి భారీ లక్ష్యాలు పెట్టుకొన్న ప్రభుత్వం,చిన్న,సన్నకారు రైతులను విస్మరిస్తే భంగపాటు తప్పదని గ్రహించాలి. వాస్తవంలో, కమతాల విస్తీర్ణం ఆధారంగానే రైతులను వర్గీకరిస్తారు. ఒకటి నుంచి రెండు హెక్టార్ల కమతమున్నవారిని చిన్న రైతులని, అర హెక్టారు నుంచి ఒక హెక్టారు కమతం విస్తీర్ణమున్న రైతులను సన్నకారు రైతులని అంటారు. దేశంలో నేడు రైతంటే చిన్న, సన్నకారు రైతులే. మొత్తం రైతుల్లో 80శాతానికి పైగా వీరే. వీరితలసరి కమతం పరిమాణం అయిదు ఎకరాలు. మనరాష్ట్రంలోనూ కమతాల విస్తీర్ణం తగ్గిపోతోంది. 2005-06లో రాష్ట్రంలో మొత్తం 1.44కోట్ల హెక్టార్ల సాగు భూమి ఉండేది. అయిదేళ్లలో అది 1.42కోట్ల హెక్టార్లకు పడిపోయింది. చిన్న కమతాల సంఖ్య పెరగటంతో కొంత భూమి సాగుకు అందకుండా పోయింది. రాష్ట్రంలో చిన్నకారు రైతుల తలసరి కమతం విస్తీర్ణం 0.7హెక్టార్లు. మొత్తం కమతాల్లో 84శాతం వీరివే. సగానికి పైగా సాగు విస్తీర్ణం ఈ రైతులదే. అధిక దిగుబడులతో ఆహార భద్రతకు వూతమిస్తున్నది చిన్న రైతాంగమే. పండ్లు, కూరగాయల సాగులో అధిక వాటా వీరిదే. 70శాతం కూరగాయలు, 55శాతం పండ్లు, 52శాతం ధాన్యపు గింజలు, 69శాతం పాల ఉత్పత్తి వీరి కృషి ఫలితమే.
అందని విస్తరణ సేవలు
పంట సాగులో రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గాలన్నా, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలన్నా, వ్యవసాయ విస్తరణ సేవలు కీలకం. జాతీయ నమూనా సర్వే ప్రకారం రైతుకు అందుతున్న ప్రభుత్వ విస్తరణ సేవలు తొమ్మిది శాతమే. ప్రైవేటురంగమే నయం. వారినుంచి 19శాతం సలహాలు అందుతున్నాయి. కానీ, వారి సేవలవల్ల పంటల ఉత్పాదకత పెరగటం లేదన్నది నిజం. ఏటా దాదాపు లక్షకోట్ల రూపాయలకు పైగా వ్యవసాయ విస్తరణ, పరి శోధనపై ఖర్చుపెడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఆపరిశోధన ఫలాలు రైతులకు అందడం లేదు. పంట రుణాల విషయంలోనూ అదే పరిస్థితి. సకాలంలో పంటల ఉత్పత్తికి కావలసిన కారకాల కొనుగోలుకు పరపతి ముఖ్యం. ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్న పంట రుణాలు చిన్న రైతుకు అందటంలేదు. బ్యాంకుల నుంచి రైతులకు అందుతున్న పరపతి కేవలం 15శాతమే. చిన్న, సన్నకారు రైతుల్లో అత్యధికులు పరపతి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. పంటల మార్కెటింగ్‌లోనూ చిన్న రైతు చిత్తవుతున్నాడు. వీరి ఉత్పత్తుల పరిమాణం తక్కువగా ఉండటంవల్ల కనీస మద్దతు ధర పొందుతున్న సందర్భాలు చాలా తక్కువ. మార్కెట్ల అందుబాటూ అంతంతే. దేశంలో 30శాతం చిన్న, సన్నకారు రైతులకు నియంత్రిత మార్కెట్‌ సేవలు అందుబాటులో లేవు. వారు నేరుగా సంఘటిత మార్కెట్లోకి అడుగుమోపే అవకాశం లేదు. మార్కెటింగ్‌లో చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు ‘రైతు ఉత్పత్తి సమాఖ్యలు’ ఏర్పాటు చేయాలని జాతీయ సలహా మండలి ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు సమాఖ్యగా ఏర్పడి, తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకుని, గిట్టుబాటు ధర పొందేం దుకు వీలవుతుంది. ఉత్పత్తి కారకాలు, ఆర్థిక పరపతీ ఈ సమాఖ్య నుంచే చిన్న, సన్నకారు రైతులకు అందుతాయి. ప్రస్తుత ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు తగినంత పరపతి అందటం లేదు. ఈ సంఘాల్లో సభ్యత్వం పొందటానికి సొంత భూమి ఉన్న రైతులే అర్హులు. ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులు చిన్న కమతాలతో కౌలుదారులుగా సాగు చేస్తున్నారు. పరపతి సంఘాల్లోని సభ్యుల్లో 20శాతం లోపే చిన్న, సన్నకారు రైతులున్నారు. ఈసమాఖ్యల్లో భూమితో సంబంధం లేకుండా వారికి సభ్యత్వం ఉంటుంది. దేశమంతటా ఈతరహా సమా ఖ్యలు స్థాపించి, అమలు చేయడానికి పన్నెండో పంచవర్ష ప్రణాళికలో మొత్తం రూ.3,600కోట్లు అవసరమని అంచనా. 15నుంచి 20 గ్రామాలకు కలిపి 1000 నుంచి 1200 మందితో ఒక్కో సమాఖ్య ఉంటుంది. ఒక్కో రైతుకు షేర్ల రూపంలో వాటా ఉండి-ఆ ప్రకారం ఆదాయం వస్తుంది. వీటి స్థాపన కోసం కంపెనీల చట్టంతోపాటు మార్కెట్‌ యార్డు చట్టంలోనూ మార్పులు చేయాలని సలహామండలి సిఫార్సు చేసింది. ఆ దిశలో ప్రభుత్వం ఎంత త్వరగా ముందడుగు వేస్తుందో చూడాలి!
సంస్కరణల దుష్ప్రభావం
ప్రపంచీకరణ, వాణిజ్య సరళీకరణా చిన్న రైతులపై దుష్ప్ర భావం చూపుతున్నాయి. ముఖ్యంగా పత్తి, నూనెగింజల సాగు, ధరల వంటివి విదేశీ వాణిజ్య ధోరణులపై ఆధారపడుతున్నాయి. ఈ పంట లను చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా సాగుచేస్తున్నారు. విదేశాల్లో ఎక్కువ సబ్సిడీలవల్ల ఆ ఉత్పత్తులు దేశంలోకి సులభంగా ప్రవేశించి
చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంపొం దించడానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి.ఆ ఉత్పత్తులు ప్రకృతి సహజమైనవి. ఎక్కువ సేంద్రీయ ఉత్పత్తులు. అందువల్ల వాటిని ప్రత్యేకంగా అమ్ముకోనివ్వాలి. ప్రతినియంత్రిత మార్కెట్లో మొత్తం ఉత్పత్తుల్లో 15నుంచి 20శాతం వరకు చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులు ఉండేలా ఆదేశించాలి. మారుమూల గ్రామాల్లో సైతం తక్కువ మోతాదు ఉత్పత్తులను కనీస మద్దతుధరకు కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. చిన్న రైతుల కమతాలు, ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని వారికోసం ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలు చేపట్టాలి. స్వయంసహాయక బృందాల మాదిరిగా ‘చిన్న రైతు సహాయక బ ృందాలు’ ఏర్పాటు చేసి, వారితోనే ఉత్పత్తులను కొనుగోలు చేయించి, ప్రభుత్వం ధర చెల్లించాలి. పన్నెండో పంచవర్ష ప్రణాళికలో సమ్మిళిత వ ృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ వృద్ధిరేటు నాలుగు శాతంగా నిర్ణయించారు. ముఖ్యంగా చిన్న రైతుల అభివ ృద్ధితోనే అవి సాధ్యం. అందువల్ల వ్యవసాయ పరిశోధన, విస్తరణ కార్యక్రమాలను, వ్యవసాయ విధి విధానాలను చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించాలి. చిన్న రైతుల చింత తీరేది అప్పుడే!-(రచయిత – డాక్టర్‌ పిడిగెం సైదయ్య)

మన మూల వాసులు

‘‘మనిషి మనుగడకు మూలం ప్రకృతి నుంచే మొదలయ్యింది. నాగరికతకు దూరంగా, ప్రక ృతిలో భాగంగా ఉండే అడవులు, కొండలు, కోనలు, వాగులు, వంకల్ని అంటిపెట్టుకొని ఇప్పటికీ కొందరు మనుషులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారే దేశీయతెగలు, ఆదివాసీలైన మూలవాసులు. మనదేశంలో ఒక్కో మూల ఒక్కో ఆది వాసులకు సంబంధించిన మూలాలు కనిపిస్తాయి. మన దేశ కథ చెప్పాలంటే ముందుగా వీరి ఘట్టంతోనే మొదలుపెట్టాలి. మూలవాసులతోనే అసలైన భారతీయ సంస్క ృతిని ప్రపంచానికి చూపించాలి. అడవితో అను బంధాన్ని ఇంకా సజీవంగా మిగులుస్తోన్న ప్రకృతి బిడ్డల జీవనాన్నే ‘అబౌట్‌ ఇండియా’లో ముందుగా వివరించాలి. వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఆతెగల ఆచారాలు, సాంప్రదాయాలకు సంబంధించిన విశేషాల సమాహారం ’’
ఆఫ్రికాలోని ఇథియోపియా, బ్రెజిల్‌లోని అమెజాన్‌ అటవీ ప్రాంతం పురాతన ఆటవిక తెగలకు స్థావరం అని ఎక్కువమందికి తెలుసు. మరి మనదేశంలోనూ అలాంటి తెగలు దాదాపు500పైగా తెగలుగా ఉన్నవారి గురించి తెలిసింది మాత్రం అతితక్కువమందికే. ఆహార్యం,భాష,నృత్యం, ఆచారాలు ఇలా ఈతెగల్లో ఎన్నోవైవిధ్యాలు ప్రత్యేకతలు కనిపిస్తాయి. అలాంటి తెగల్లో గోండ్‌తెగ ఒకటి. ఈతెగకు చెందినవారు చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాతోపాటు, మహారాష్ట్ర, అంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నా అత్యధికó సంఖ్యలో గోండ్లు నివసిస్తోంది మధ్యప్రదేశ్‌లోని చింద్‌వారా జిల్లాలోనే. అడవికి దగ్గరలోని ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో వీరు మట్టి ఇళ్ళను ఏర్పాటుచేసుకుని నివసిస్తుంటారు. ఇలా అధిక సంఖ్యలో గోండ్లు నివసించే కొన్ని ఆవాసాల్ని గోండ్ల గ్రామం అని పిలుస్తారు. ఇలాంటి మహారాష్ట్రలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. గోండ్ల గ్రామంలో ఒకగ్రామ పెద్దఉంటాడు. ఆయన్ని మాహజి/పటేల్‌ అనిపిలుస్తారు. ప్రతిగోండు గ్రామంలో గ్రామపెద్దతో పాటు ఒక మహిళ కూడా ఆ ఊరికి పెద్దదిక్కుగా ఉంటారు. వీళ్ళు జరుపుకునే పండుగల్లో వీరిరువురినీ ప్రత్యేకంగా అంలంకరించి సత్కరిస్తుంటారు. ఇక ఈతెగలో పేద ధనికలాంటి అసమానతలేవీ ఉండవు. ఈతెగ మహిళలు స్వయంగా ఎంపిక చేసుకున్న వ్యక్తులతోనే వారి వివాహాన్ని జరిపించే ఆచారం కూడా ఉంది. మహిళలు చీరల్ని మాత్రమే ధరిస్తారు. ఇక ఈతెగ మహిళల ఆహార్యం సాదాసీదాగానే ఉన్నా వృత్తాకారంలో సత్తుతో తయారుచేసిన కంఠాభరణాలతోపాటు, చెవిభాగంలో ధరించే పెద్ద రింగులతో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. మధ్యప్రదేశ్‌లో జరిగే మదాయి జాతర లో సాంప్రదాయ వస్త్రాలతో ఈతెగకు చెందిన స్త్రీ,పురుషులిరువురూ కలిసి చేసే నృత్యం కన్నుల పండుగగా ఉంటుంది. తెలంగాణలో నాగోబా జాతర గోండు తెగలు విశేషంగా జరుపుకునే పండుగ. ఈ తెగ ఎక్కువగా తీసుకునేది మాంసాహారమే అయినా, కొడొ, కుట్కి చిరుధాన్యాలతో చేసే వంటకాలను వీళ్ళు ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. గోండీ వీరిప్రధాన భాషే అయినా, మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో సంచార జీవనం కొనసాగించే ఈ తెగలో చాలా మందికి తెలుగు, హిందీ, మరాఠీ, పారీభాషలతోపాటు ఇతర ద్రవిడ భాషలూ తెలుసు. కమ్మరి, పశువుల కాపరి, డప్పు వాద్యంలాంటి వృత్తుల్లో ఈ తెగకు చెందిన పురుషులు కొనసాగుతున్నారు.
గూమర్‌ పుట్టిందిక్కడే…రాజస్థాన్‌కు చెందిన ఒక ప్రధాన తెగ భిల్‌. దుంగార్‌పూర్‌, బన్స్‌వారా జిల్లాలతోపాటు ఉదరుపూర్‌లోని సిరోహి ప్రాంతంలో ఈ తెగ నివాసాలు కనిపిస్తాయి. వీళ్ళ వస్త్రధారణ దాదాపు రాజస్థానీ సాంప్రదాయ దుస్తులని పోలుంటుంది. ఈ తెగ మహిళలు కంచుతో చేసిన వివిధ రకాల ఆభరణాల్ని ధరిస్తారు. సంగీతం, నృత్యానికి ఈతెగలో ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. భిల్‌ తెగలో జరిగే పండుగలను గ్రామ పెద్ద నిర్వహిస్తుంటారు. వారిని భగత్‌ అని పిలుస్తారు. ఈతెగ జరుపుకునే పండుగల్లో బనేశ్వర్‌ జాతర ప్రధాన పండుగ. ఈపండుగ సమయంలోనే మహిళలు గూమర్‌ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అంటే..రాజస్థాన్‌ సాంస్క ృతిక ప్రతీకగా చెప్పుకునే గూమర్‌ న ృత్యానికి ఊపిరి పోసింది ఈ తెగ మహిళలేనన్న మాట. ఈ తెగలో ప్రదర్శించే మరో ప్రధాన నృత్యం గైర్‌జ. ఇక ఈ తెగలో దేవతారాధన ఉన్నా వాటికి సంబంధించి ఎలాంటి గుళ్ళూ కనిపించవు. స్థానికంగా ఉండే మిగతావాళ్ల ఆలయాల వద్దే వీరి పండుగలకు సంబంధించిన వేడుకలు జరుగుతుంటాయి. వేటతెగలో ప్రధాన లక్షణంగా ఉన్నా ప్రస్తుతం జీవనోపాధి కోసం ఎక్కువ మంది వ్యవసాయం, పశుపోషణలో కొనసాగుతున్నారు. ఇక తెగలో మహిళలు ఎక్కువ ధైర్య సాహసాల్ని కలిగుంటారు.
తిరుగుబాటు తెగ
బాంగ్లాకు చెందిన పురాతన తెగ సంతల్‌. బెంగాల్‌లోని బంకుర, పురులియా జిల్లాల్లో తెగకు చెందిన వారు కనిపిస్తారు. బాంగ్లాతోపాటు జార్ఘండ్‌్‌,ఒడిశా,అస్సోంరాష్ట్రాల్లో నివసిస్తున్న ఈ తెగ మొత్తం జనాభా 49 వేలు. వీరిప్రధాన భాష సంతలితోపాటు బెంగాలీ, ఒరియా, హిందీ భాషలను కూడా మాట్లాడుతుంటారు. వేటతోపాటు అరణ్య ప్రాంతాల్లో లభించే పళ్ళు, కాయల్ని ఈ తెగ ప్రధాన ఆహారం గా ఉంటుంది. వీరు నిర్వహించే ప్రతి చిన్న వేడుకలో నృత్యం తప్పని సరిగా ఉంటుంది. ఈ తెగలో పురుషులు ఫ్లూట్‌తోపాటు తుండక్‌, తమక్‌,జున్కొ,సింగా ఇలా రకరకాల వాద్యపరికరాలను తయారు చేస్తుంటారు. వీరునిర్వహించే పండుగల్లో కరమ్‌ ఒక ప్రధాన పండుగ. సెప్టెంబర్‌ అక్టోబర్‌ నెలల మధ్య జరపుకునే ఈ పండుగలో మహిళలు తలపై ఒక కూజాను ఉంచుకొని చేసే నృత్యం కన్నుల పండుగగా ఉంటుంది. బ్రిటీష్‌ తిరుగుబాటు ఉద్యమాల్లోనూ ప్రధాన పాత్ర పోషిం చిందీ తెగ.
మాతృస్వామిక తెగ
మిజోరాంకు చెందిన గారొ తెగ మాతృస్వామ్య వ్యవస్థ కలిగుంటుంది. ఇక్కడ అన్ని పనులకూ నాయకత్వం వహించేది మహిళలే. కుటుంబ పోషణతోపాటు, ఆర్థిక విషయాలనీ గారొ తెగలో మహిళలే చూసు కుంటారు. అలా మనదేశంలోమాతృస్వామిక వ్యవస్థ కొనసాగుతున్న తెగల్లో గారొ ప్రముఖ స్థానాన్ని దక్కించు కుంది. మిజోరాంతోపాటు మేఘాలయ, అస్సోం, త్రిపుర, నాగాల్యాండ్‌ రాష్ట్రాల్లో ఈ తెగ మనుగడ సాగిస్తోంది. గారొ తెగ వారిని చిక్‌ మంన్డే అని పిలుస్తారు. చిక్‌ మంన్డే అంటే కొండ ప్రజలు అని అర్థం. మేఘాలయాలోని ఘరో కొండ ప్రాంతంలో ఎక్కువగా నివసించే ఈ తెగ ద్వారా వారికి ఆ పేరొచ్చింది. బర్మా, టిబెట్‌ దేశాల్లో కూడా ఈ తెగ విస్తరించింది. ఈతెగలో మహిళలు వివిధ లోహాలతో తయారుచేసే ఆభరణాలను ఎక్కువగా ధరిస్తుంటారు. వంగ్ల వీళ్ళ ప్రధాన పండుగ. పండుగ సమయంలో అంద మైన వస్త్రధారణతోపాటు వీరి నృత్యాలు కన్నులపండువగా ఉంటాయి. పంచెకట్టుతోపాటు తలపాగ ఈ తెగ పురుషుల ప్రధాన వస్త్రధారణ. ఈ తెగలో ఆడ మగ ఇరువురూ కొప్పుభాగంలో ఈకల్ని తప్పనిసరిగా ధరిస్తారు. గారో తెగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే వీళ్ళు ఇళ్ళు కట్టడంలో ఆరి తేరినవారు. వెదురు వాసాలు, రెల్లు గడ్డిని ఉపయోగించి వీరు నిర్మించుకునే ఇళ్ళలో బహుళ అంతస్తులతోపాటు, గదులు గదులుగా ఈ ఇళ్ళని నిర్మించే తీరు ఆకట్టుకుంటుంది. ఈ ఇళ్ళను ఎంతో అందంగా అలంకరించుకుంటారు.
జిప్సీస్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌…
తెలుగు రాష్రాల్లో ప్రధాన తెగలుగా చెంచులు, గడబలు, గోండ్లు, అన్ధ్‌, బొండ పురజలు, కోయ, లంబాడీలు, సవరలు ఇలా కొన్ని తెగల పేర్లు వినిపిస్తాయి. చెంచులు శ్రీశైలం పర్వత ప్రాంతాలకు చెందినవారైతే, గడబ, కోయ తెగలు భద్రాచలం స్థానికత కలిగిన వారిగా చరిత్రకారులు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ తెగల్లో అత్యధిక జనాభా ఉంది సవరలు, లంబాడీ తెగల్లోనే. విజయనగం, విశాఖ పట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో స్థానిక తెగలుగా ఉన్న సవరల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లోని అన్ని తెగల జనాభా కంటే ఐదు శాతం ఎక్కువ. సవరలు ఎక్కువగా ఒకబృందంగా ఉంటారు. ఒక వరుసలో వీరి ఇళ్లను ఏర్పరుచుకుంటారు. ఈతెగలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ. ఈ తెగకు చెందిన వారు ఎక్కువగా వ్యవసాయం, కమ్మరి, మేదరి, కుమ్మరి వృత్తుల్లో కొనసాగుతున్నారు. ఇలా వీరు నిర్వహించే వృత్తుల్ని బట్టి జాతి సవర, అర్సి, ములి, కిందల్‌, కంబి సవరల్లో ఉపతెగలుగా ఉన్నాయి. ఈతెగలో మహిళలు ఎక్కువగా ముక్కు బులాకీ లతో కనిపిస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా కనిపించే తెగ లంబాడీలు. వీరినే గోర్‌ బొయలి, బంజారా ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు. భారత్‌లో వివిధ రాష్ట్రాలో లంబాడీ తెగను బంజారాలుగా పిలుస్తారు. వ్యవసాయం, పశుపోషణలో ఎక్కువగా ఈతెగ ప్రజలు కొనసాగుతున్నారు. లంబాడీ తెగలు నివసించే ప్రాంతాల్ని తాండ అని పిలుస్తారు. అన్ని తెగల కంటే వీరి వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మహిళలు గాగ్రాచోళీలో బాటు తలపై ఒక వస్త్రాన్ని ధరిస్తారు. కంచు, ఇతర లోహాలతో చేసిన వివిధ రకాల ఆభరణాల్ని మహిళలు ధరిస్తారు. ఇక తెగలో మహిళలు భుజాల వరకు సత్తు, కంచుతో చేసిన గాజుల్ని ధరించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆధునిక సమాజానికి దగ్గరగా ఉండే ఈ తెగను ‘జిప్సీస్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా ఒకప్పుడు బ్రిటిషర్లు పిలిచేవారు. ఎక్కువగా అలంకరణ వస్తువుల్ని ధరించి నిండుగా కనిపించే ఈ తెగమహిళల ద్వారా లంబాడీ తెగకు ఆ పేరొచ్చింది.
వీరు మాత్రమే కాదు, ఆఫ్రికా మూలాల్ని ఇప్పటికి పదిలపరుచుకున్న సిద్దీస్‌, భారత్‌లోనే ఉంటూ ఒంటరిగా కనిపించే అండమాన్‌ జార్వాలు, సెంటినల్స్‌, ఇంకా ఆదీవాసీ వైవిధ్య ఛాయల్ని మిగుల్చుకున్న ఈశాన్య రాష్ట్రాల కాసీ, ఆగామీలతో పాటు మూన్ద్‌, భూటియా, కొడవ, టోటో, ఇరులాస్‌, నైషి, వార్లి, తోడ, కురుంబన్‌, సొలుగ, లాంటి భారతీయ స్థానికతను కలిగున్న తెగలన్నీ సంస్క ృతి, సాంప్రదాయలు, ఆచారాల్లో తమ ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.-అద్దేపల్లి శర్వాణి

గ్రామీణ ఉపాధి హామీకి తూట్లు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రావటానికి కారణమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకవిలక్షణ స్వభావం ఉంది. కావాలని అడిగిన తరువాత ఒకపక్షం రోజుల్లోఉపాధి అందించాలని చట్టం చెబుతోంది. అలా ఉపాధి అందించలేనప్పుడు నిరుద్యోగ భృతి చెల్లించాలని కూడా ఈచట్టం చెబుతోంది. ఈచట్టం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైందనేది నిజం. అయితే ఇది ఉపాధిని హక్కుగా మార్చింది. బాగా చర్చించిన తరువాత పార్లమెంటు ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత రాజ్యాంగం సామాజిక, రాజకీయ హక్కులకు మాత్రమే హామీ ఇచ్చి ఆర్థిక హక్కులను విస్మరించిందనే లోపాన్ని…ఈ చట్టాన్ని రూపొందించి ఆచరణలో పార్లమెంట్‌ సరిదిద్దింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో ఒక నూతన పరిస్థితి ఏర్పడిరది. గతంలో కూడా పేదరికం నిర్మూలనకు ఉద్దేశించిన పనికి ఆహారం వంటి పథకాలున్నాయి. అయితే వాటిలో హామీలు ఏమీ లేవు. వాటికి బడ్జెట్‌ కేటాయింపులు ఉండేవి. అవి ప్రతి సంవత్సరం మారుతూ ఉండేవి. ఆకేటాయింపులు ఒక్కోసారి పెరగటం, మరోసారి తరగటం జరిగేది. అయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీటికి పూర్తిగా భిన్నమైంది. ఈచట్టం ఉపాధికి హామీని ఇచ్చింది. ఆ క్రమంలో ఆర్థిక హక్కును స ృష్టించటమే కాకుండా పౌరసత్వ భావనకు లోతైన అర్థాన్ని ఇచ్చింది. బిచ్చగాళ్ళతో సహా ప్రతి పౌరుడు తాను కొన్న సరుకులపై పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి పన్ను కడతాడు. కానీగతంలో రాజ్యం అందుకు బదులుగా ఆచరణలో పౌరులకు ఏమీ చేసేదికాదు. అది పౌరులకు ‘భద్రత’ను కల్పించిందని ఎవరైనా చెబితే అదిచాలా చిన్న విషయం అవుతుంది. ఎందుకంటే పేదలకు ‘భద్రత’ కల్పించటం అర్థరహితం అవుతుంది. అందుకు భిన్నంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక నూతన శకానికి తెర లేపుతున్నానని వాగ్దానం చేసింది. ఈ పథకం ద్వారా రాజ్యం తన పౌరులకు కొంతవరకు ఆర్థిక భద్రతను కల్పించటానికి ముందుకు వచ్చింది. అంటే పేదలకు అది ఎంతోకొంత మేలు చేస్తుంది.
ఈపథకం కింద ఉపాధిని పొందుతున్నవారిలో 40శాతం దళిత, ఆదివాసీ కుటుంబాలకు చెందినవారే. పాలక వర్గాలకుండే కుల వివక్ష,వర్గవైషమ్యాల కారణంగాను ఈవాగ్దానం అమలులో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. యుపిఏ-2 పాలనలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చేయవలసిన వాస్తవ బడ్జెట్‌ కేటాయింపులలో కోతను విధించటం ద్వారా ఈ పథకానికి తూట్లు పొడవటం మొదలయింది. ‘ఈ పథకం డిమాండ్‌ ను అనుసరించి అమలు చేసేది. కనక అవసరమైతే అదనపు కేటాయిం పులు చేయటం జరుగుతుంది. బడ్జెట్‌లో చేసిన కేటాయింపులనుబట్టి అభిప్రా యానికి రాకూడదు’ అంటూ ఈపథక కేటాయింపులకు కోత పెట్టడాన్ని ఆయన సమర్థించుకున్నారు. అయితే అలాచేయటంవల్ల కేటాయింపులకు మించి డిమాండ్‌ ఏర్పడినప్పుడు వేతన బకాయిలు పోగుపడ్డాయి. కేటాయింపుల కంటే డిమాండ్‌ నిరంతరం పెరుగుతుం డగా ఒకవేళ కేటాయింపులను పెంచకపోతే కాలక్రమంలో వేతన బకాయిలు పెరిగి పోతాయి. ప్రస్తుతం ఈవిషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. వేతన బకాయిలు నిరంతరం పెరిగి పోతున్నాయి. అంటే సంవత్సరకాలంలో అనేక మంది కార్మికులకు వేతనాలు అందవు. అంతే కాకుండా వేతనాలను అందుకోవటానికి పట్టే సగటు కాలం కూడా నిరంతరం పెరుగుతూ ఉంటుంది. వేతనాలు సకాలంలో అందని స్థితిలో కార్మికులు ఈపథకం నుంచి నిష్క్రమించటం మొదలెడ తారు. తత్ఫలితంగా ఈ పథకంకింద పనికి వుండే డిమాండ్‌ ఏదో ఒక స్థితిలో దెబ్బ తింటుంది. అదే సమయంలో చట్టప్రకారం నిరుద్యో గానికి చేయవలసిన చెల్లింపులు చెల్లించకుండా, కనీసం తగిన సమయంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి కూడా పని ఇవ్వకుండా, దరఖాస్తు దారులను రిజిస్టరు చేయకుండా డిమాండ్‌ను తగ్గించే ధోరణి కనపడుతోంది. ఒక ఆర్థిక హక్కుగా ఉండవలసిన హక్కును నిర్వీర్యం చేయటం జరుగుతోంది. రాజ్యం దయాదాక్షిణ్యాలతో పేదలకు ఎంతోకొంత ఉపశమనం అందించే మరో పేదరిక వ్యతిరేక కార్యక్ర మంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చటం జరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేదరిక వ్యతిరేక కార్యక్రమంగా కూడా గణనీయమైన విస్త ృతి ఉంది. ఈకార్యక్రమం మొదలయినప్పటి నుంచి దేశం లోని ప్రతి మూడు గ్రామీణ కుటుంబాలలో ఒకదానికి ఎప్పుడో ఒకప్పుడు పని దొరికింది. 2017-18లోనే ఈ కార్యక్రమం కింద ఎనిమిది కోట్ల మంది ప్రజలకు పనిదొరికింది. ఆసంవత్సరంలో ప్రతి కుటుం బానికి సగటున 46 రోజులపాటు పని దొరికింది. ప్రపంచంలోనే అత్యంత ఉద్యోగితను స ృష్టించే పథకం ఇది. అయితే రానురాను ఈ కార్యక్రమానికి చేసే కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. నిజానికి ఇది ఉపాధి హామీ పథకం అవటం అటుంచి ఉపాధిని సృష్టించే కార్యక్రమంగా కూడా దీని విస్తృతి కుచించుకు పోతున్నది. ఇంతకు ముందే చెప్పినట్టు ఒకవేళ ఈపథకానికి చేస్తున్న కేటాయింపులు నిలకడగా ఉన్నట్టయితే లేక ప్రతిసంవత్సరం కావలసిన దానికంటే కేటాయింపులు తక్కువగా వుంటే కాలక్రమంలో వేతన బకాయిలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితులలో నికర కేటాయింపులు, నికర వేతన బకాయిలు తగ్గుతాయి. అయితే వాస్తవంలో జరుగుతున్న దేమంటే చేస్తున్న కేటాయింపు లలో నిలకడ ఉండటం లేదు. నికర కేటాయింపులు తగ్గటం వలన నికర వేతన బకాయిలు కూడా గణనీ యంగా తగ్గాయి. ఉదాహరణకు 2017-18 సంవత్సరంలో ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన తరువాత జరిగిన కేటాయింపు 2010-11సంవత్సరంలో జరిగిన కేటాయింపు కంటే తక్కువగా ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2012-13లో కాలయాపనతో జరిగిన వేతన చెల్లింపులు 39 శాతం ఉండగా 2016-17లో కాలయాపనతో జరిగిన వేతన చెల్లింపులు 56 శాతంగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
వేతన బకాయిలను కూడా లెక్క లోకి తీసుకోకుండా చేసే స్థూల కేటాయింపులో తగ్గుదల స్థూల జాతీయోత్పత్తితో పోల్చి చూసిన ప్పుడు చాలా తీవ్రంగా ఉంది. ఈ కార్యక్రమం సరిjైున రీతిలో నడవాలంటే స్థూల జాతీయోత్పత్తిలో 1.7శాతం కేటాయించాలని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసింది. అందుకు భిన్నంగా 2017-18 సంవత్సరంలో జరిగిన కేటాయింపు (వాస్తవంలో చేసిన వ్యయం కాదు) కేవలం 0.28 శాతం మాత్రమే. 2010-11సంవత్సరంలో 0.58 శాతంగాను, 2011-12 సంవత్స రంలో 0.34 శాతంగాను ఉన్న కేటాయింపుల కంటే 2017-18 సంవత్సరంలో చేసిన కేటా యింపు తక్కువగా ఉంది. వాస్తవ వ్యయాలను, అంతకు ముందటి సంవత్సరాల నికర రుణాలను చూసినప్పుడు స్థూల జాతీయోత్పత్తిలో అటువంటి నికర వ్యయం వాటా 2012-13వ సంవత్సరంలో 0.36 శాతంఉంటే 2016-17సంవత్సరం కల్లా అది 0.30 శాతం కంటే కిందకు దిగ జారింది. కాబట్టి మనం ఏవిధంగా చూసినప్పటికీ స్థూల జాతీయోత్పత్తిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయిస్తున్న నిధుల శాతం సాపేక్షంగా చూసినప్పుడు కాలక్రమంలో తగ్గిపోతున్నది. అయితే వేతనాల చెల్లింపులు సకాలంలో జరగటం లేదనే వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించటం లేదు. నిజానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే వేతనాల చెల్లింపులలో 90శాతం15రోజులలోపు జరుగుతున్నా యని ప్రభుత్వం అంటోంది. అయితే ఇది పూర్తిగా అబద్దం. 3500 గ్రామ పంచాయతీలను ఒకశాంపిల్‌గా తీసుకుని ఒక పరిశోధకుల బృందం సవివరంగా చేసిన అధ్యయనాన్ని జనవరి 4న కొత్త ఢల్లీిలో ఏర్పాటు చేసిన ఒకపత్రికా సమావేశంలో విడుదల చేశారు. ఈఅధ్య యనం ప్రకారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనికి చేయవలసిన వేతన చెల్లింపులు సగటున 50 రోజులు ఆలస్యంగా జరుగు తున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికులకు ఎదురవు తున్న ఇతర ప్రతిబంధకాలకు అదనంగా సకాలంలో అందవలసిన వేతనాలను ఆధార్‌తో లింకు చేయాలని అంటున్నారు. తత్ఫలితంగా ఈ కార్యక్రమం కింద లభిస్తున్న పనికిగల డిమాండ్‌ మందగిస్తుంది. వాస్తవంలో డిమాండ్‌ చేసిన పనిని కూడా ఇవ్వటంలేదు. అటువంటి పరిస్థితిలో చట్ట ప్రకారం చెల్లించవలసిన నిరుద్యోగ భృతి కూడా చెల్లించటం లేదు. నిజానికి మహాత్మా గాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమంగా పని చేయటం లేదనేది సుస్పష్టం. అందుకోసం అందుబాటులో ఉంచే వనరులపై దాని విస్తృతి ఆధారపడి ఉంటుంది. ఒకడిమాండ్‌ ఆధారిత కార్యక్రమానికి వనరులు అందుబాటులో లేకపో వటమనే పరిస్థితిలో వైరుధ్యం ఉంది. అటువంటి కార్యక్రమానికి ముందుగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలి. నిధులు అందుబాటులోఉండటాన్ని బట్టి ప్రజల ఆర్థికహక్కును ప్రతిబింబించే అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటం జరగ కూడదు. ఇటువంటి పథకానికి నిధులను కేటాయించటం కోసం ప్రజల హక్కును ప్రతిబింబించని కార్యక్రమాలపై ప్రభుత్వం చేసే వ్యయాన్ని తగ్గించుకోవాలి. అయితే ఆచరణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని మనం గమనిస్తాం. అంటే ఇతర వ్యయాలకు ప్రాధాన్యతను ఇచ్చిన తరువాత మిగిలిందే ఈ పథకానికి కేటాయింపులు జరుగుతున్నాయి. పర్యవసానంగా పనికిగల డిమాండ్‌ ను అనుసరించి చేయవలసిన వ్యయానికి సరిపడా నిధులు అందుబాటు లో ఉండటం లేదు. పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం పని కోసం వస్తున్న డిమాండ్‌లో భాగంగా అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న వారిలో కూడా 68శాతం కంటే ఎక్కువ మందికి వాస్తవంలో పని కల్పించటం లేదు. అధికారికంగా రిజిష్టర్‌ చేసుకున్న పని డిమాండ్‌లో వాస్తవంలో సగం మందికి కూడా అందుబాటులోకి రావటం లేదు. ఈనిష్పత్తి పెరుగుతూ ఉంది. ఆవిధంగా ప్రజల ఆర్థిక హక్కు రద్దవు తోంది. ఇది ఈచట్టాన్ని చేసిన పార్లమెంటుపై దాడితో సమానం అవుతుంది. ఈపథకాన్ని ఉద్యోగితను సృష్టించే సామాన్యమైన కార్యక్ర మంగా తీసుకున్నా దీని విస్తృతి కాలక్రమంలో తగ్గిపోయింది. ఇదో విపరీత స్థితి. దేశంలో వేగంగా పెరుగుతున్న నిరుద్యోగితపై చాలా కాలం తరువాత దృష్టిని కేంద్రీకరించారు. అటువంటి నిరుద్యోగంపై అన్ని ప్రభుత్వ వ్యయాలకంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక బ్రహ్మాండమైన ఆయుధంగా పని చేయగలదు. ఒకవేళ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని అనుకుంటే ఈపథకాన్ని నిర్వీర్యం చేయటానికి బదులుగా దానిపై మరింతగా వ్యయం చేయాలి. అయితే ప్రస్తుత ధోరణి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదిగానే ఉంది.- కందుకూరి సతీష్‌కుమార్‌

చిరు ధాన్యాలు కాదు..సిరి ధాన్యాలు

చిరు ధాన్యాలు ఎక్కువ ఉష్ణోగ్రతలను, బెట్టను తట్టుకొనే పంటలు కనుక కరువు పీడిత ప్రాంతాలలో కూడా పండిరచటానికి వీలుంటుంది. చిరుధాన్యాలలో పీచు పదార్థం, ఇనుము, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. గడిచిన మూడు నాలుగు దశాబ్థాల కాలంలో జీవన శైలిలో వచ్చిన మార్పులు వల్ల మన ఆహార విధానంలోనూ మార్పులు వచ్చాయి. తద్వారా ప్రబలుతున్న దీర్ఘకాలిక వ్యాధుల ద ృష్ట్యా తిరిగి చిరుధాన్యాల వాడకంపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో వ్యవసాయాభివ ృద్ధికి తోడ్పడే గ ృహవిజ్ఞాన విభాగం నుంచి చిరుధాన్యాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించే ప్రచారం పెరిగింది. ఇందులో భాగంగా గ ృహవిజ్ఞానంలో పరిశోధకురాలిగా ఉన్న డాక్టర్‌ కీర్తి చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటితో చేసుకోదగిన వంటల గురించి వివరిస్తున్నారు.- కె.కీర్తి
చిరుధాన్యాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల చిరుధాన్యాల వాడకం పెరుగుతుంది. తద్వారా రైతులు అధికంగా చిరుధాన్యాలను పండిరచడానికి మొగ్గు చూపుతారు. దీనితోపాటు రైతులకు అధిక ఆదాయం పెరిగే చిన్న కుటీర పరిశ్రమలనూ అభివ ృద్ధి చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో ఫాస్ట్‌ఫుడ్స్‌ వాడకం మూలంగా మార్కెట్‌లో చిరుధాన్యాలు లభించినప్పటికి చాలా మందికి వాటిని ఎలావినియోగించాలో తెలియక చిరుధాన్యాల వాడకాన్ని తగ్గించారు. చిరు ధాన్యాల పోషక విలువలను, చిరుధాన్యాలతో వివిధఆహార పదార్థాలను త్వరితగతిని చేసుకునే పద్ధతులపై అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నారు గృహ విజ్ఞాన పరిశోధకులు. ఈప్రయత్నంలో భాగంగా చిరుధాన్యాలతో పౌష్టిక విలువలతో కూడిన సంప్రదాయ వంటలు ఎలా చేసుకోవాలో తెలియ జేస్తున్నారు.
చిరుధాన్యాలతో ఆరోగ్యం
మనం రోజూ తీసుకునే వరిఅన్నం, గోధుమల కంటే చిరు ధాన్యాలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. రోజుతీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను కూడా చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు. చిరుధాన్యాల సాగుతో వీటి వినియోగ సామర్థాన్ని పెంచడానికి వీలుకలుగుతుంది. చిరుధాన్యాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో, మహిళల్లో ఎముకల పుష్టికి అవకాశం ఏర్పడుతుంది. చిరుధాన్యాలలో పీచుపదార్థం,మాసంకృత్తులు, అమైనోయాసిడ్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి కనుక సులభంగా, నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అంతేకాదు చిరుధాన్యాలను రోజువారి ఆహారంలో చేర్చ డం ద్వారా గుండె సమస్యలు, మధుమేహం, ఉబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
రాగులు – ఆరోగ్య లాభాలు : రాగులు వాడితే ఎముకల పెరుగుదల, దృఢత్వం మెరుగవుతుంది. ఇవి అధిక బరువు నియంత్రణ, మధుమేహ వ్యాధి నియంత్రణ, రక్తహీనత నివారిస్తాయి. గ్లూటెన్‌ ఎలర్జీ, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు రాగులు అనువైన ఆహారం. రాగిచేదు,కారం,వగరు, తీపిరుచులు కలిగి ఉంటుంది. రాగుల్లో ప్రోటీన్లు,అమినోయాసీడ్లు ఎక్కువగాఉంటాయి. లేలైన్‌,ధియోనైన్‌, ఐసో ల్యూసిన్‌, మిథియోనైన్‌, థైమీన్‌, ట్రిఫ్టోఫైన్‌ వంటి ముఖ్య అమినో యాసిడ్లు ఉండటం వల్ల కండరాలు పనిచేయటానికి, రక్తం ఏర్పడ టానికి, డిప్రెషన్‌లపై పోరాటానికి, శరీర పెరు గుదల హార్మోన్లు విడుదల అవ్వడానికి, మల బద్ధకం,ఊబకాయం, వ్రణాలకి మంచి ఆహా రం. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. బాలిం త స్త్రీలలో పాలఉత్పత్తిని పెంచుతుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. పేగుక్యాన్సర్‌ బారిన పడకుండా ఉండటానికి ఇది చక్కని ఆహారం. రాగికి చలవ చేసే గుణం ఉండటంవల్ల వేసవి కాలంలో ఎండతాపాన్ని తట్టుకోవడానికి రాగిజావ, అంబరిని ఎక్కువగా తీసుకుంటారు. విటమిన్‌-ఎ, బి-1,బి-2, ఇనుము, కాల్షియం వంటి ఖని జాలు అధికంగా ఉండటంవల్ల రాగులను ‘పోషక ధాన్యంగా’ పిలుస్తారు. ఈ రాగులతో రాగిజావ, సేమ్యా,ఇడ్లి,వడ,పుల్లటి పునుగు లు,చెక్కపకోడి, పూరి,బూంది, మురుకులు, పొగడాలు, మిక్స్‌డ్‌ అటుకులు,లడ్డు, సంకటి, బొబ్బట్లు వంటి సంప్ర దాయ వంటకాలు చేసుకోవచ్చు.
జొన్నలు-ఆరోగ్య లాభాలు: జొన్నలతో అధిక శక్తి, పెరుగుదల సాధ్యమవుతుంది. అంతేకాక మలబద్ధకం నియంత్రణ, మధుమేహ వ్యాధి నియంత్రణ, కొలెస్ట్రాల్‌ నియంత్రణతో పాటు గ్లూటెన్‌ ఎలర్జీ, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అను వైన ఆహారం. జొన్నలు ఆరోగ్యవంతమైన జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగాఉంటాయి. ఇది రక్తహీనతకు, మలబద్ధకానికి చక్కని ఆహారం. కండపుష్ఠికి,ఎముకల పటుత్వాన్ని పెంచు తుంది.కాల్షియం స్థాయిలను క్రమ బద్ధీకరిస్తుంది.రోగనిరోధక వ్యవస్థను పెం పొందిస్తుంది.ఇందులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. క్యాన్సర్‌ బారినపడ కుండా కాపాడుతుంది. ఇది గ్లూటెన్‌ లేని ఆహారం. ధయామిన్‌, రైబోప్లేరిన్‌ పుష్కలంగా ఉండటంతో నరాల బలహీనతలు, మానసిక రుగ్మతలు, కాళ్లు చేతులు మంటలు, నోటి పుండ్లు, వార్థక్య రుగ్మతల నుంచి కాపాడతాయి. ఇలాంటి జొన్నలతో స్వీట్‌ దోశ, హాట్‌బాల్స్‌, జొన్న పాయసం, జొన్నబజ్జీ, జొన్నసేమ్యా, పాల తాలికలు, ఉప్మా, పొంగలి, జొన్న రవ్వ బిర్యాని, జొన్నరవ్వ, కిచిడి, బూంది, జొన్న వడ, అరటికాయ బజ్జీ, చెక్కలు, జంతి కలు, చెక్క పకోడి, జొన్న అటుకులతో చుడువా, మురిపి, గవ్వలు,లడ్డు, బర్ఫీ, అటుకుల పాయసం, వడియాలు మొదలైన వంటకాలు చేసుకోవచ్చు.
సజ్జలు-ఆరోగ్య లాభాలు: సజ్జలు అధిక శక్తి, శరీర పెరుగుదలకు తోడ్పడతాయి. ఇవి మల బద్ధకాన్ని నియంత్రిస్తాయి. రక్తహీనత నివారణ, కడుపులో పుళ్లను (అల్సర్‌) తగ్గించడం, గ్లూటెన్‌ ఎలర్జీ, సిలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం. సజ్జలు వగరు, తీపి రుచులు కలిగి ఉంటాయి. సజ్జలలో పిండి పదార్థం అధికం, వీటిలో ప్రోటీన్లు, పీచు పదార్థం అధికంగా ఉంటాయి. సజ్జలలో ఉండే అమినోయాసిడ్లు గోధుమలో ఉండే అమినో యాసిడ్లు కంటే తేలికగా జీర్ణమవుతాయి. బి-కాంప్లెక్స్‌ మిటమిన్లు (నియాసిన్‌, మిథియోనైన్‌, థయామిన్‌, రైబోప్లైవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, లెసిథిన్‌) పోటాషియం, మాంగనీస్‌, జింక్‌ వంటి అవసరమైన అనేక పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. నియాసిన్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. సజ్జలలో అధికంగా ఉండే భాస్వరం శరీరకణ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషి స్తుంది. జెనిటిక్‌ కోడ్‌ నిర్మాణంలో ముఖ్యమైన న్యూక్లిక్‌ యాసిడ్స్‌లో ఫాస్పరస్‌ ముఖ్యభాగం. కణాల పొరలు, నరాల నిర్మాణంలో పాత్ర పోషించే లిపిడ్స్‌లో కూడా భాస్వరం ఒక భాగం. సజ్జలతో తయారుచేసిన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటే స్త్రీలకు మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ల సమస్య ఉండదు. శరీరంలో ట్రైగ్లీనరైడ్స్‌ స్థాయిని కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు సజ్జ ఆహరాన్ని తీసుకోవటం వల్ల స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌, పిల్లలో ఆస్తమా సమస్యలు తగ్గుతాయి. సజ్జలలో ఉండే అవసరమైన పోషకం లగ్నిన్‌ శరీరానికి చాలా ప్రయోజనకారి. ఇది క్యాన్సర్‌, గుండె ఆగిపోవటం వంటి ప్రమాదాలను అరికడు తుంది. సజ్జల ఆహారం డయోబెటిక్‌ టైపు-2ను కూడా తగ్గిస్తుంది. సజ్జలతో మసాలా రొట్టె, అప్పాలు, స్వీట్‌ పూరి,సేమ్యా, బిర్యాని, బూంది, వాంగీబాత్‌, నమక్‌ ఏరా, సజ్జ పకోడి, చెక్క పకోడి, మంచూరియా, బూంది లడ్డు, బొబ్బట్లు, మిఠాయి, బాదుషా, లడ్డు.
కొర్రలు ఆరోగ్య లాభాలు : శరీర పెరుగుదల, శరీర నిర్మాణంలో కొర్రలు తోడ్పడతాయి. సిలియాక్‌ జబ్బుకు అనువైన ఆహారమిది. కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, రక్త హీనత నివారణలో ఇది మంచి ఆహారం. శరీరంలో కొలస్ట్రాల్‌ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచుపదార్థం, మాంసక ృత్తులు, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి. కనుక చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం. ఇవి ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. కడుపు నొప్పి, మూత్రం పొసేటప్పుడు మంటగా ఉండటం, ఆకలిమాంద్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఔషధాహారం. మాంసకృత్తులు, ఇనుము ఆధికంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు చక్కటి ఔషదం. పీచు పదార్థం అధికంగా ఉండటంవల్ల మలబద్ధకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినప్పుడు కొర్ర గంజి తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దల అనుభవం చెబుతుంది. గుండె జబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గుటకు కొర్రలు తినడం మంచిది. కొర్రలతో కొర్ర పాయసం, కొర్ర లడ్డు చేసుకోవచ్చు.
సామాలు-ఆరోగ్య సూత్రాలు : సామాలతో అధిక శక్తి, శరీర పెరుగుదల ఉంటుంది. రక్తహీనత నివారణ, మలబద్ధకం నియంత్రణలో సహకరిస్తుంది. గ్లూటెన్‌ ఎలర్జీ వారికి, సీలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం.
వరి గడలు-ఆరోగ్య సూత్రాలు : వీటితో మధుమేహ వ్యాధి, కొలెస్ట్రాల్‌, మలబద్ధకం నియంత్రణలో ఉంటాయి. గ్లూటెన్‌ ఎలర్జీ వారికి, సిలియాక్‌ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం.
అరికలు-ఆరోగ్య సూత్రాలు : అరికలు అధిక శక్తి, శరీర పెరుగుదలను ఇస్తాయి. వీటితో మధుమేహ వ్యాధి, మలబద్ధకం నియంత్రణలో ఉంటాయి. ఇవి అధిక బరువును నియంత్రి స్తాయి. ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్ప ృహ పెరుగుతోంది. అందుకు తగినట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రీయ పద్ధతిలో పండిరచిన పంటలతో చేసిన వంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన’ అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్‌ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్‌లో పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్‌ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు రూ.80 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 70 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 20 వేల కుటుంబాలు ఆర్గానిక్‌ రుచులను మాత్రమే ఆస్వాధిస్తున్నాయి. ఏటా ‘ఆర్గానిక్‌’ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండిపదార్థాలు ఉండే బియ్యం కంటే.. పోషక విలువలు, పీచు పదార్థాలు సమ ృద్ధిగా ఉండే మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.
పాత వైపు కొత్త చూపు..
ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ ఫెస్టివళ్లు, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియానీ ఘుమఘు మలు, వెరైటీ వెజ్‌, నాన్‌ వెజ్‌తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరానికి పయనమవు తున్నారు. అలనాటి ఆహార పదార్థాల వైపు దృష్టి సారించారు. జీవనశైలి వ్యాధులకు దూరంగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బతికిన నిన్నటి తరం ఆహారపు అలవాట్లను నేటి తరం ఎంతో ఆసక్తిగా పరిశీస్తోంది. ఒకప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యమైన డిమాండ్‌ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పిండంలో దోహదం చేసే రాగులకు, స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇంటికి.. వంటికీ కూడా..
సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకు కూరలు, సబ్బులు, షాంపూలు, వంట నూనెలు, కాస్మోటిక్స్‌ కూడా చేరాయి. మొరార్కో, ఫ్యాబ్‌ ఇండియా, 24 లెటర్‌ మంత్ర, ఈకోఫుడ్స్‌, కాన్షియస్‌ ఫుడ్‌, నేచర్‌ బాస్కెట్‌ వంటి వ్యాపార దిగ్గజాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్‌ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్‌, గ్రామీణ్‌ మాల్‌ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రియ ఎరువులతో పడిరచిన పంటలతో మహానగరానికి పల్లెకు మధ్య బాటలు వేశాయి. సూపర్‌మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్‌రైస్‌, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్‌లైన్‌ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి.
సహజ ఆహారమే ఎందుకు..
ప్రస్తుతం కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 34 ఏళ్ల క్రితమే నిషేధించిన ఇతియాన్‌, డీడీటీ, బీహెచ్‌సీ వంటి ప్రమాద కరమైన పురుగుమందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు రాజధానిగా మారిన హైదరాబాద్‌లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయసులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది. వైద్యనిపుణుల అంచనా మేరకు నగరంలో సుమారు 20 లక్షల మంది మధు మేహంతో బాధపడుతుండగా..మరో 25 లక్షల మందికి పైగా అధికరక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్‌, మిల్లెట్స్‌ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై, రకరకాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే..సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటా యనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచు పదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడి బియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు.. అన్ని ఆహార ఉత్పత్తులూ రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. మహారాష్ట్ర లోని వార్ధా నుంచి సహజమైన గోధుమలు, యావత్‌మాల్‌ నుంచి సోయాబీన్స్‌, తమిళనాడు నుంచి స్వచ్ఛమైన నువ్వులు, నువ్వుల నూనె, కేరళ నుంచి సహజమైన సుగంధ ద్రవ్యాలు సైతం ప్రస్తుతం నగర మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలామంది అటువైపే చూస్తున్నారు.- రిసెర్చ్‌ అసోసియేట్‌,
గృహ విజ్ఞాన విభాగం, కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు, కృష్ణాజిల్లా.

1 69 70 71 72 73 75