What is that Tamil Man Swami doing in Jharkhand?

Stan Swami arrested at 83 years of age

What is that Tamil man Swami doing in Jharkhand? That was the question asked by a former agent of the Research and Analysis Wing, RAW, in a debate on one of the national screaming news channels on a Wednesday morning when they were discussing Kashmir, Pakistan’s ISI, India’s Urban Naxals and the women and men arrested by the National Investigation Agency.

The scowling former Lt Colonel’s argument was that anyone working with India’s Adivasis, Dalits and the dispossessed is a foreign agent conspiring to overthrow the government of India’s elected prime minister, Narendrabhai Damodardass Modi.

Read more

Tribal farmers to be given minimum support price for their produce

ITDA Project Officer Venkateswar Salijamula has said that the minimum support price, fixed by the government, will be given to the tribal farmers for the paddy and finger millets (ragulu) produced by them.

He said that the finger millets and paddy would be purchased through Velugu VOs, under the auspices of Markfed at the Rythu Bharosa Kendras (RBKs) from November 2.

He appealed to the tribal farmers not to approach middlemen to sell their produce but to sell them at the RBKs.

At a meeting with officials of the Agriculture, Velugu, Markfed and chairman of Market Committees on Friday, Dr. Venkateswar said that the price of finger millets was fixed at ₹3,295 a quintal and paddy at ₹1,860. He called upon Agricultural Assistants and Village Volunteers to create awareness among tribal farmers on selling their produce at the RBKs.

The government was paying more than the price being paid to tribals by middlemen at the weekly shandies. He said that it was the responsibility of the agricultural officers to ensure that the tribal farmers got Rythu Bharosa.

He said that Forest Right pattas were distributed to 48,000 tribal families and each farmer should be given ₹13,500 as rythu bharosa.

Later, Paderu Agriculture Market Committee Chairperson M. Gayatri Devi, Araku Valley Chairperson K. Anita and Chintapalli Chairperson J. Haliya Rani were felicitated by the Project Officer.

Why India Needs Scheduled Tribes to Educate its Future Judges

The recent five-judge bench Supreme Court judgment in Chebrolu Leela Prasad Rao and Ors v State of AP and Ors, shows us once again how little the 5th Schedule of the Indian constitution which is meant to protect adivasi rights is understood.

The reasoning in the judgment – which struck down an Andhra Pradesh government order from 2000 providing 100% reservation for Scheduled Tribe teachers in Scheduled Areas of the state – moves perilously close to dismantling the entire edifice of the 5th Schedule.

If 100% reservation for teaching jobs is not permissible, the next step will be for someone to argue against the ban on alienation of tribal land, or overturn the Samata judgment prohibiting mining leases being given to non-tribals in 5th Schedule Areas in undivided Andhra Pradesh. After all, both these ‘discriminate’ against non-tribals. As non-adivasis from other districts flood scheduled areas leading to clear demographic change, the clamour to do away with the protective provisions of the 5th Schedule is only getting louder.

Read more

A reform move? Plan to auction 41 coal blocks ‘on behalf of’ powerful business lobbies

Counterview Desk

The National Alliance of People’s Movements (NAPM), India’s major civil society network, has asked the of India to immediately revoke the auction of 41 coal blocks for commercial mining in order to “stop corporate loot in eco-sensitive and Schedule V Adivasi areas of Central and Eastern India”.

Pointing towards objections raised by 3 State s and several people’s movements, NAPM has asked the Prime Minister to “reconsider” the decision to auction the coal blocks, even as urging him to urgently rethink needed on anti-climate ‘coal-centred’ energy economy.

Read more

Coal blocks for tycoons: Rinchi village tribals may be declared forest land encroachers

Sunday, June 28, 2020

By Gladson Dungdung*
On June 18, 2020, the Government of India initiated the process for auctioning 41 coal blocks for commercialisation. These coal blocks are located in different states within India and most of them fall under Fifth Schedule areas. The Indian government claims that their decision to auction these coal areas is a big step towards making the country Atmanirbhar Bharat (self-reliant) in the energy sector.

The government envisages an investment of 33,000 crore, which would create 2.8 lakh jobs including 70,000 direct and 2,10,000 indirect jobs. Presently, India produces 60.40 million tons of coal per annum (2018-19), and the new initiates would be adding 15 percent to it.

Read more

కొత్త కొత్తగా ఎన్నికల్లో సరికొత్త అంశాలు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ఉండే బ్యాలెట్‌ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు, ఇంటిపేర్లు, గుర్తులు మాత్రమే ఉండేవి. అవిఒకే విధంగా ఉండటంతో క్రాస్‌ఓటింగ్‌ పెరిగి విజయావకాశాలు తారుమారవుతాయని పలుపార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలో ఎన్నికలసంఘం ఈసారి బ్యాలెట్‌ పత్రాల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల పక్కనే అభ్యర్థుల ఫొటోలను కొత్తగా ముద్రించింది.
ఓటరు చీటీల్లో పూర్తి సమాచారం
అధికారులు గతంలో పంపిణీ చేసే పోలింగ్‌ చీటీల్లో కేవలం ఓటర్ల పేర్లు, తండ్రి/భర్త పేరు,ఇంటిసంఖ్య, గ్రామం తదితర వివరాలు మాత్రమే ఉండేవి. ఈసారి ఓటరు చీటీలు కొత్త రూపు సంతరించుకున్నాయి. వాటిలో గూగుల్‌ ఎర్త్‌ సహకారంతో పోలింగ్‌ కేంద్రాల చిరునామాను రూట్‌ మ్యాప్‌తో సహా ముద్రించారు. ఓటర్ల అనుమానాల నివ ృత్తికి బూత్‌స్థాయి అధికారుల సెల్‌ నంబర్లను, జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌, టోల్‌ఫ్రీ నంబర్లనూ ముద్రించారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌నూ పేర్కొన్నారు.
మహిళలకు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు
మహిళల పోలింగ్‌ శాతం తగ్గుతుందని గుర్తించిన ఎన్నికల సంఘం ఈసారి కొత్తగా పింక్‌ పోలింగ్‌ కేంద్రాల పేరిట ప్రత్యేకంగా మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒకమహిళా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీటిలో మహిళా ఉద్యోగులే విధులు నిర్వర్తిస్తారు.
దివ్యాంగులకు సదుపాయాలు
వరుసలో ఎక్కువ సమయం నిలబడలేక దివ్యాంగులు ఓటు హక్కుకు దూరమవుతున్నారు. దీంతో వారు ఓటు హక్కును వినియోగించడానికి వీలుగా ఎన్నికల సంఘం ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. గ్రామంలో 70 మంది దివ్యాంగులు ఉంటే వారికి ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. దివ్యాంగులను ఈవాహనాల్లో పోలింగ్‌ కేంద్రం ఆవరణ వరకు తీసుకెళతారు. ఆవరణ నుంచి పోలింగ్‌ గదిలోకి వెళ్లడానికిగాను చక్రాల కుర్చీలు, ట్రైసైకిళ్లను ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకూ ఈ సదుపాయాలు వర్తిస్తాయి.
ఓటు నమోదుపై అవగాహన
అర్హులైన యువకులను ఓటర్లుగా నమోదు చేయడానికి ఎన్నికల సంఘం ఈసారి పలు వినూత్న విధానాలను అనుసరించింది. ప్రధానంగా యువకులు సెల్ఫీలు దిగడానికి ప్రాధాన్యమిస్తారు. యువకులను ఆకర్షించడానికి పట్టణ ప్రాంతాల్లో ‘ఐ ఓట్‌ బికాజ్‌..’ పేరిట పట్టణాల్లో సెల్ఫీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఓటర్లకు చైతన్యం పెంపొందించేలా హోర్డింగులను ఏర్పాటు చేసి గాలి బెలూన్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఓటు హక్కును వినియోగించాలంటూ ఈసారి కళాబృందాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టింది.
అంధుల కోసం బ్రెయిలీ లిపి
ప్రతి ఎన్నికల్లో అంధులు ఓటు హక్కును వినియోగించు కోవడం ఇబ్బందికరంగా మారింది. చాలామంది అంధులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం అంధుల కోసం ఈవీఎంలలో బ్రెయిలీ లిపీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీరికి బెయిలీ లిపితో కూడిన ఓటరు చీటీలను పంపిణీ చేశారు.
రెండు ఓట్లను గుర్తించొచ్చు
రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించి ఏదైనా ఒకే ప్రాంతం లో ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎన్నికల సంఘం ‘ఈఆర్వోనెట్‌.వీ2.0 వర్షన్‌’ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల సంఘం అధికారులు ఈ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఓటర్ల రెండో ఓటును తొలగించారు.
ఫిర్యాదులకు సి-విజిల్‌
అభ్యర్థులు పంపిణీ చేస్తున్న డబ్బు, మద్యం గురించి గతంలో సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉండేది. వీటిపై ఓటర్లు ఫిర్యాదు చేస్తూ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టడానికి ప్రస్తుతం ఎన్నికల సంఘం సీ-విజిల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తుల చిత్రాలు తీసి ఈయాప్‌లో నమోదు చేయగానే.. సంబంధిత అధికారులకు సమాచారం అందుతుంది. ఈఎన్నికల్లో కొత్తగా ప్రవేశపెట్టిన యాప్‌కు ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.
సందేహాల నివ ృత్తికి ‘సమాధాన్‌’..
ఎన్నికల సమయంలో ఓటర్లు తమ సందేహాలను నివ ృత్తి చేసుకోవడానికి గతంలో అధికారులు, ఆర్డీవో, జిల్లా పాలనాధికారి కార్యాలయాల వద్దకు వెళ్లాల్సి వచ్చేంది. ఈసారి ఓటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ‘సమాధాన్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ చరవాణిలో సి`విజిల్‌ యాప్‌ను దిగుమతి చేసుకొని ఆయాప్‌ ద్వారా సందేహాల్ని నివ ృత్తి చేసుకోవచ్చు.
నూతన రాష్ట్రంలో తొలి ఎన్నికలు
ప్రత్యేక హోదా సాధన కోసం ఏర్పాటు చేసిన జనసేనాపార్టీ నేతృత్వంలో బీఎస్పీ, వామపక్షాలు కలసి కూటమిగా ఈఎన్నికల బరిలో ప్రధానపార్టీనేతల్లో దఢ పుట్టిస్తోంది.
నిన్నటి శత్రువులు..నేటి మిత్రులు
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండవన్న అంశాన్ని నిజంచేస్తూ ఈసారి ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్‌, తెదేపాలు ఒకే గొడుగు కిందకు చేరాయి. తెలుగుదేశం పార్టీ గతంలో వివిధ సందర్భాల్లో తెరాస, భాజపాలతో జట్టు కట్టిన ప్పటికీ కాంగ్రెస్‌కు స్నేహ ‘హస్తం’ చాచడం ఆసక్తి కరంగా మారింది.
ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి?
80 కోట్ల మంది ఓటర్లు, 2000కు పైగా రాజకీయ పార్టీలు పాల్గొనే సాధారణ ఎన్నికలను నిర్వహించడం భారత్‌ వంటి దేశంలో ఓ పెద్దసవాలే. ఇంత సంక్లిష్ట ప్రక్రియలోని విశ్వసనీయత అంతా దాని పారదర్శకతపైనే ఆధారపడి ఉంటుంది. రాజకీయ పార్టీలకు చెందిన అల్లరి మూకలు పోలింగ్‌ కేంద్రాలను లూటీ చేయడం, బ్యాలట్‌ బాక్సులను ఎత్తుకెళ్లిపోవడం వంటి చర్యల కారణంగా దశాబ్దాలపాటు ఎన్నికల నిర్వహణ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) ప్రవేశంతో ఈపరిస్థితికి అడ్డుకట్ట పడిరది. కానీ వీటిపై ఎన్నో అనుమానాలు,విమర్శలు. ఈయంత్రాలను హ్యాకింగ్‌ చేయవచ్చని, రిగ్గింగ్‌కు పాల్పడవచ్చంటూ ఎన్నికల్లో పరాజ యం పాలైన పార్టీలు ఆరోపించడం సాధారణమైపోయింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ అనుమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్‌ చేశారని, అందువల్లే నరేంద్ర మోదీ నేత ృత్వంలోని బీజేపీ భారీ ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకుందని అమెరికాలో నివసిస్తున్న భారత సైబర్‌ నిపుణుడు సయ్యద్‌ షుజా చేసిన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం ఖండిరచింది. కానీ, ఈవీఎంల్లో వాడే సాంకేతికతపై అనుమా నాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. కోర్టుల్లో ఈవీఎంల కచ్చిత త్వంపై కనీసం 7కేసులు నడుస్తున్నాయి. అయితే భారత్‌లో వినియో గిస్తున్న ఈవీఎంలను హ్యాకింగ్‌ చేయలేరని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతూనే వస్తున్నాయి.
ఈవీఎంల భద్రత
భారత్‌లో వినియోగిస్తున్న 1.6 కోట్ల ఓటింగ్‌ యంత్రాల్లో ఒక్కోదానిలో 2000 ఓట్లు నమోదు చేయవచ్చు (ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1500 మందికి మించి ఓటర్లు ఉండరాదు). 64 మంది అభ్యర్థుల పేర్లను చూపించవచ్చు. భారత్‌లోనే తయారయ్యే ఈ మెషీన్లను బ్యాటరీ పవర్‌తో కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల కరెంటు సౌకర్యం సరిగా లేని మారుమూల గ్రామాల్లో సైతం వీటితో ఎన్నికలు నిర్వహించవచ్చు. దీనిలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఈసీఐఎల్‌ ఇంజనీర్ల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందానికి తప్ప వేరెవరికీ ఈ సాఫ్ట్‌వేర్‌ గురించి గానీ, ఈవీఎంలకు సంబంధిం చిన ఇతర వివరాల గురించి గానీ తెలిసే అవకాశం లేదని ఈసీఐఎల్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ఎవరైనా బలవంతంగా, నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు వేయాలని ప్రయత్నిస్తే, మెషీన్‌ పనిచేయకుండా చేసేలా ఈవీఎంపై ఓబటన్‌ కూడా ఉంది. పోలింగ్‌ స్టేషన్‌లోని సిబ్బంది అవసరమైన సమయంలో దీన్ని నొక్కవచ్చు. పోలింగ్‌ ముగి సిన తర్వాత దీనికి పాతపద్ధతిలోనే లక్కతో సీల్‌ వేసి, దానిపై ఓ స్టిక్కర్‌ అతికించి, స్టాంప్‌ వేస్తారు. దీంతోఎలాంటి మార్పులకూ అవకా శం ఉండదు. ఇప్పటి వరకూ మూడు సాధారణ ఎన్నికలు, 113 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించారు. బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరిగినప్పుడు ఒక్కో పార్లమెంటరీ నియోజక వర్గంలో ఫలితం తేలాలంటే కనీసం 40 గంటలు పట్టేది. ఈవీఎంల వినియోగంతో అది 5 గంటలకు తగ్గిపోయింది. ఎలాంటి అవకతవ కలకు, మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహిం చేందుకు వీలు కలిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈవీఎంల ప్రభావం అనే అంశంపై పరిశోధనలు చేసిన శిశిర్‌ దేవ్‌నాథ్‌, ముదిత్‌ కపూర్‌, షమికా రవి తమ పరిశీలనలను 2017లో సమర్పించారు. ఈవీఎంల ప్రవేశం కారణంగా అందరూ తమ ఓటు హక్కు నిర్భ యంగా వినియోగించుకునే అవకాశం కలిగిందని, ఎన్నికల్లో అక్రమా లకు అడ్డుకట్ట పడిరదని, ఎన్నికలను మరింత సమర్థంగా నిర్వహించే వెసులుబాటు కలిగిందని తమ నివేదికలో వీరు పేర్కొన్నారు.
వీఎంల హ్యాకింగ్‌ సాధ్యమేనా?
ఈవీఎంలకు ఓ చిన్న పరికరం అమర్చి, మొబైల్‌ ద్వారా ఎస్‌ఎంఎస్‌ పంపించడం ద్వారా ఓట్లను తారుమారు చేయవచ్చని ఎనిమిదేళ్ల క్రితం మిచిగాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కానీ ఈసీ అధికారులు ఇదిఅసాధ్యమంటూ ఆఆరోపణలను కొట్టి పారేశారు. ఇన్నివేల ఈవీఎంలను హ్యాక్‌ చేయాలంటే చాలా డబ్బు అవసరమని, ఒకవేళ చేయాలనుకున్నా దానికి ఈవీఎంల తయారీలో భాగమైన ఇంజినీర్ల సాయం అవసరమని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కు చెందిన నిపుణుడు ధీరజ్‌ సిన్హా అభిప్రాయ పడ్డారు. దీనికి ఓ చిన్న రిసీవర్‌ సర్క్యూట్‌, మానవ కంటికి కనబడని ఓ యాంటెన్నా అవసరమని ఆయన అన్నారు. అయితే భారత్‌లో వినియోగిస్తున్న ఈవీఎంలకు ఎలాంటి యాంటెన్నాలు, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లు లేవని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. ఇంత భారీస్థాయిలో హ్యాకింగ్‌ అసాధ్యమని అన్నారు.
ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?
దాదాపు 33దేశాల్లో ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ జరుగు తోంది. కొన్ని దేశాల్లో వీటి విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈవీఎంల ద్వారా జరిగిన 2017 వెనెజ్వేలా ఎన్నికల్లో నమోదైన ఓట్లకన్నా దాదాపు 10 లక్షల అదనపు ఓట్లు ఎక్కువ పడ్డాయని వచ్చిన ఆరోపణలను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చింది. బ్యాలట్ల గోప్యత, ఫలితాల తారుమారు వంటి సమస్యలను ప్రస్తావిస్తూ అర్జెంటీనా కూడా 2017లో ఈ-ఓటింగ్‌ ప్రతిపాదనలను తిరస్కరిం చింది. 2018 ఇరాక్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయంటూ కొన్ని చోట్ల రీకౌంటింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో గత డిసెంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికలు పెద్ద వివాదాన్నే రేపాయి. ఈవీఎంలను సరిగ్గా పరీక్షించకుండానే పోలింగ్‌లో వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో 15 ఏళ్ల క్రితం ఓటింగ్‌ యంత్రాల వినియోగం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ దాదాపు 35 వేల మెషీన్లు ఉన్నాయి. అయితే అక్కడా కొన్ని ఆరోపణలున్నాయి.
వీవీప్యాట్లతో సందేహాలు తొలగుతాయా?
‘‘టెక్నాలజీ వినియోగాన్ని ఎంతగా వీలైతే అంతగా తగ్గిం చాలి. ఏ ఓటరు ఏఅభ్యర్థికి ఓటేశాడో తెలియకూడదని అంటు న్నారు, అసలు సాఫ్ట్‌వేర్‌ అనుకున్న విధంగానే పనిచేస్తోందో లేదో తెలుసుకు నేందుకు కూడా సరైన మార్గం లేదు’’ అని ఈ-ఓటింగ్‌పై అధ్యయనం చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కరోలినా ప్రొఫెసర్‌ డంకన్‌ బ్యూల్‌ వ్యాఖ్యానించారు. భారత్‌లో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిం చేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్‌లను ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒక ఓటు నమోదుకాగానే, సీరియల్‌ నంబరు, పోటీలో ఉన్న అభ్యర్థి పేరు, పార్టీ గుర్తుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. 7 సెకండ్ల తర్వాత ఈవివరాలతో ప్రింట్‌ అయిన రసీదు ఓసీల్డు బాక్సులో పడిపోతుంది. వీవీప్యాట్ల ద్వారా వచ్చే పేపర్‌ స్లిప్‌లను మెషీన్లలో నమోద య్యే ఓట్ల సంఖ్యతో పోల్చి చూడాలని అధికారులు నిర్ణయిం చారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో కనీసం 5%కేంద్రాల్లో ఇలా చేయాలని భావిస్తు న్నారు. ఓటర్ల మనసుల్లో ఉన్న అనుమానాలు వీవీప్యాట్‌ల ద్వారా తొలగవచ్చని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ అభిప్రాయపడ్డారు.‘‘2015 నుంచి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో వీవీ ప్యాట్లను ఉపయోగిస్తున్నారు. వీటిలో దాదాపు1500 మెషీన్లకు ఉన్న పేపర్‌ స్లిప్‌లను పోలైన ఓట్లతో కలిపి లెక్కించారు. ఒక్కటి కూడా తేడా రాలేదు’’ అని ఆయన అన్నారు. ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు? వీవీ ప్యాట్‌లు అంటే ఏంటి? ఈవీఎం మెషీన్లలో నిక్షిప్తమై ఉన్న ఓట్లు ఎవరికి అధికారం కట్టబెడ తాయో అన్న ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయపార్టీలు, ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. ప్రతి రౌండ్‌లోనూ వారు సంతృప్తి చెందిన తర్వాతే ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. ఈనేపథ్యంలో అసలు ఈవీఎం మెషీన్లలో ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుం దో చూద్దాం. ఆసమయంలో లెక్కింపు సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూద్దాం. ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్‌ను తొలగిస్తారు. ఈవీఎం బయటి కప్పు మాత్రమే తెరుస్తారు. లోపలి భాగాన్ని తెరవకుండా అలాగే ఉంచు తారు. తర్వాత ఈవీఎం పవర్‌ ఆన్‌ చేస్తారు. బ్యాటరీలో ఛార్జింగ్‌ తక్కువగా ఉంటే ఆ మెషీన్‌కి ఉండే డిజిటల్‌ తెర మిణుకు మిణుకుమని వెలుగుతుంది. లేదంటే ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు కొత్త బ్యాటరీ అమర్చాలి. అనంతరం లోపల బటన్‌ మాదిరిగా కనిపిం చే సీల్‌ను తొలగిస్తే లోపల రిజల్ట్స్‌ మీట కనిపిస్తుంది. ఆమీట నొక్కగానే ఏఅభ్యర్థికి ఎన్నిఓట్లు పోలయ్యాయో తెరపై కనిపిస్తుంది.ఆ వివరాలను జాగ్రత్తగా నోట్‌ చేసుకుంటారు.
వీవీపాట్‌ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?
ఎన్నికల సంఘం ఓటింగ్‌ విషయంలో అనేక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఉంది. బ్యాలెట్‌ బాక్స్‌ల నుంచి ఈవీఎంల వరకు కొత్త సాంకేతికతను వినియోగిస్తూనే ఉంది. అయితే, ఓటింగ్‌లో మరింత పాదర్శకతకు పేపర్‌ బ్యాలెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 16 రాజకీయ పార్టీలు గతంలో ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వీవీపాట్‌ను తీసుకొచ్చింది. వీవీపా ట్‌.. ఇకమై మీ ఓటును ప్రింట్‌ తీసుకోవచ్చు. ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ అడిట్‌ ట్రయిల్‌కు సంక్షిప్త రూపమే వీవీపాట్‌. ఇది ఒక చిన్న ప్రింటిర్‌ లాంటిది. వీవీపాట్‌ను ఈవీఎంలకు అనుసంధానిస్తారు. తాము వేసిన ఓటు ఎవరికి పడిరదో ఓటర్లు చూసుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం దీన్ని తీసుకొచ్చింది. మనంఏపార్టీకి ఓటు వేశామనదే వీవీ పాట్‌లద్వారా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. ఈవీఎంలో మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత వీవీపాట్‌ ఒక స్లిప్‌లో ఆఅభ్యర్థి పేరు, గుర్తు వచ్చేలా ప్రింట్‌ తీసి సీల్డ్‌ బాక్స్‌లో పడేస్తుంది. ఓటు వేసిన ఏడు సెకన్ల తర్వాత వీవీపాట్‌ బీప్‌ శబ్దం చేస్తూ ప్రింట్‌ను చూపిస్తుంది. 2013లో నాగాలాండ్‌లోని నొక్సెన్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో తొలిసారి వీవీపాట్‌లను ఎన్నికల సంఘం ఉపయోగించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2014 సాధారణ ఎన్నికల్లో కొన్ని పోలింగ్‌ బూత్‌లలో వీవీపాట్‌లను ఎన్నికల సంఘం ఉపయోగించింది.-కందుకూరి సతీష్‌కుమార్‌

హామీల ఉల్లంఘనలు సరికొత్త వాగ్దానాలు

గత ఎన్నికల సందర్భంగా రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తానని, చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు. ఇప్పుడు పసుపు కుంకుమల వల వేశారు. దాన్ని కూడా నమ్మరన్న అనుమానం వచ్చింది కాబోలు! మళ్లీ అధికారంలోకి వస్తే మరోసారి పసుపు కుంకుమ ఇస్తానని కొత్త వాగ్దానం ప్రకటించారు. జగన్‌ కూడా డ్వాక్రా రుణ మాఫీ అంటున్నారు.
రూ.16 వేల కోట్లు రుణమాఫీ చేశామంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఈ కాలమంతా ప్రచారం చేశారు. 2014 డిసెంబరు 31నాటికి డ్వాక్రా సభ్యులు రూ.13 వేల 844 కోట్లు బ్యాంకులకు బకాయి ఉన్నారు. రూ.2 వేల 174కోట్లు ఓవర్‌ డ్యూఅయ్యాయి. రూ.888 కోట్లు ఎన్‌పిఎ గా ప్రకటించబడ్డాయి. రుణాలు ప్రభుత్వం జమ చేసినట్లయితే మహిళలు వడ్డీల మీద వడ్డీలు కట్టాల్సిన దుస్థితి వచ్చేది కాదు. 2018లో సెప్టెంబరులో జరిగిన శాసనసభ సమావే శాల్లో డ్వాక్రా రుణ మాఫీ వాగ్దానం ప్రకారం ఎంత రుణమాఫీ చేశా రని ప్రశ్నించగా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్న కఠోర వాస్తవం సంబంధిత శాఖామంత్రి ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది. గత ఎన్నికలలో హామి ఇచ్చిన ప్రకారం రుణ మాఫీ చెయ్యలేదనేది కఠోర వాస్తవం. మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన ఎన్‌టిఆర్‌ స్థానంలో చంద్రబాబు నాయుడు అర్ధంతరంగా అధికారంలోకి వచ్చిన కాలంలోనూ అంతే. మద్య నిషేధ హామీకి తూట్లు పొడిచారు. కల్తీ మద్యం నిరోధం పేరిట మద్యం షాపులకు లైసెన్స్‌ ఇవ్వడం ప్రారంభించి, డ్వాక్రా పేరిట మహిళలకు వల వేశారు. 1000 రూపాయలు పొదుపు చేసుకొంటే రూ.1000 జమ చేస్తానని పెద్ద ఎత్తున స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేశారు. లక్షల మంది మహిళలను సమీకరించేందుకు డ్వాక్రాను ఒక సాధనంగా మార్చుకున్నారు.
నిరంకుశ పెత్తనం
మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టబడిరది డ్వాక్రాపథకం. గ్రూపు పొదుపు చేసుకున్న డబ్బులకు నాలుగు రెట్ల నుండి 10 రెట్ల వరకు అదనంగా బ్యాంకు రుణ సౌకర్యాన్ని కల్పిం చాలని రిజర్వుబ్యాంక్‌ ఆదేశించింది. అయితే ప్రారంభం నుంచే ఈ స్వయం సహాయక గ్రూపులు రాజకీయ ప్రయోజనాలకు అను గుణంగా తీర్చిదిద్దబడ్డాయి. ఎమ్‌ఎల్‌ఎలు, మంత్రులు, ముఖ్య మంత్రుల సభలు జయప్రదం చెయ్యడానికి వీరిని వాడుకోవడం మొదలుపెట్టారు. డిఆర్‌డిఎ ఉద్యోగులకు గ్రామ సేవికలకు అధికారా లను కట్టబెట్టారు. రుణం మంజూరు కావాలంటే సభలకు హాజరు కావలసిందేనని నమ్మబలికారు. గ్రూపుల తీర్మానాలను నామ మాత్రం చేసి అధికారుల ఇష్టారాజ్యంగా, అధికార పార్టీ ప్రయోజనాలకు అను గుణంగా గ్రూపులు నిర్వహించబడుతూ వచ్చాయి. మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించబడిన స్వయం సహాయక గ్రూపులు, పొదుపు రుణాల గ్రూపులుగా మార్చబడ్డాయి. మహిళల చొరవ, నిర్ణయాధికారం, చైతన్యవంతమైన కృషి, ఆర్థిక స్వావలంబన అణచి వేయబడ్డాయి. మహిళలు నాయకులుగా ఎదిగే క్రమాన్ని నీరు గార్చాయి.
గోరంత లబ్ధి, కొండంత భారం
స్వప్రయోజనాల సాధనే లక్ష్యంగా, ఆంధ్ర ప్రదేశ్‌లో అధికార పార్టీలు పొదుపు గ్రూపు లను ప్రోత్సహించాయి. ఫలితంగా గోరంత లబ్ధి, కొండంత భారంగా గ్రూపులు నడుస్తు న్నాయి. మహిళల శ్రమను కారు చౌకగా బ్యాంకులు, ప్రభుత్వం వినియోగించు కొంటున్నాయి. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న వేలకోట్ల రూపాయలను వడ్డీ లేకుం డానే బ్యాంకులు ఉపయోగించు కుంటు న్నాయి. పొదుపు డబ్బులను బ్యాంకుల నుండి తీసుకోవడానికి ఆంక్షలు పెడుతున్నాయి. గ్రూపుల నిర్వహణ ఖర్చులు, గ్రామసేవికల వేతనాలు డ్వాక్రా మహిళలే చెల్లించుకుం టున్నారు. బలవంతపు డిపాజిట్లు, ఇన్సూ రెన్సులు కట్టించి వడ్డీ రేట్ల భారాన్ని మహిళల మీద మోపారు. వీటితో పాటు అధికార పార్టీ సభలకు బలవంతపు ప్రేక్షకులుగా మార్చ బడ్డారు. 2008లో సెస్‌ అంచనాల మెరకు 2004-5, 2010-11 మధ్య బ్యాంకుల నుండి డ్వాక్రా గ్రూపులకు రూ.1200 కోట్లు నుంచి 8,600 కోట్లు రుణాలు మంజూరు పెరిగింది. 2012నాటికి రాష్ట్రంలో12.5 లక్షల గ్రూపుల్లో1.36 కోట్ల మంది మహి ళలు ఉన్నారు. ఈ మొత్తం గ్రూపులకు వడ్డీల మొత్తం జమ చేయాల్సివస్తే రూ.1,400 కోట్లువడ్డీల కింద చెల్లించాల్సి వస్తుందని లెక్కించబడిరది. అంటే డ్వాక్రా గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చెయ్యడం ద్వారాప్రభుత్వం,బ్యాంకులు లబ్ధిపొందాయి.
పసుపు కుంకుమల మాయ
2014లో రుణ మాఫీ హామీ ద్వారా టిడిపి ఓట్లు వేయించుకుని అధికారాన్ని పొందింది. మహిళలు మాత్రం పెనాల్టీలు కట్టారు. ముక్కు పోగులు, చెవి కమ్మలు, అమ్ముకుని అప్పులు చెల్లించారు. అవి కూడా లేని వాళ్ళ గ్రూపులు రద్దయ్యాయి. అప్పటికి గ్రూపులు చెల్లించవలసిన మొత్తం రూ.2,514 కోట్లు మాత్రమే. ఈ మొత్తం కూడా చెల్లించనందున డ్వాక్రా గ్రూపులు రుణగ్రస్త గ్రూపులుగా మారి పోయాయి. అధిక వడ్డీలకు అప్పులు చేసి, లేక సొంతంగా అప్పులు చెల్లించగలిగిన వాళ్ళు చెల్లించగా, మిగిలిన వాళ్ళు బ్యాంకుల నుండి నోటీసులను అందుకున్నారు. ఇప్పుడు పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బులు కొన్ని చోట్ల పాత బకాయిలకు చెల్లవేశారు. పసుపు, కుంకుమ చెక్కుల పంపిణీ చేస్తూ తెలుగు దేశానికి ఓట్లు వేస్తామని, బాబు మళ్ళీ రావా లని ప్రమాణాలు చేయించుకున్నారు.
వడ్డీ లేని రుణాలు
2012లో డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణా లు ఇస్తామని జీవో జారీ చేసింది. ఆ మేరకు సంవత్సరానికి రెండున్నర వేలకోట్ల రుపా యలు వడ్డీ కింద మంజూరు చేయాలి. సకాలంలో వడ్డీలు చెల్లించినట్లయితే గ్రూపు లకు అదనపు వడ్డీ భారం పడదు. కాని ఆ ప్రకారం టిడిపి ప్రభుత్వం వడ్డీ చెల్లించ నందున, అదనపువడ్డీల భారం గ్రూపుల మీద పడుతుంది.
ఐక్యతతో అధిగమించాలి
టిడిపి ప్రభుత్వం ఇచ్చిన రుణ మాఫీ హామీతో సుమారుగా మూడున్నర లక్షల గ్రూపులు రుణాల ఊబిలో కురుకుపోయి రద్దయ్యాయి. ప్రభుత్వం చేసిన తొలి సంతకానికి విలువ ఇచ్చి కనీసం రెండున్నర వేల కోట్ల రూపా యలు జమ చేస్తే అన్ని గ్రూపులు సజీవంగా ఉండటమే కాక, వారి ఆర్థిక కార్యక్రమాలు పెరిగేందుకు దోహద పడేది. ఇప్పుడు ఎన్ని కల ముందు ఆర్భాటంగా ప్రకటించిన పసు పు, కుంకుమ ఆనాడే రుణ మాఫీకి జమ చేస్తే రాష్ట్రానికి, మహిళలకు, బ్యాంకులకు ఎంతో లబ్ధి చేకూరేది. ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్‌ (నేష నల్‌, రూరల్‌ లైవ్లో హడ్‌ మిషన్‌) పథకం కింద రూ.10 లక్షల వరకూ 7 శాతం వడ్డీకే లింకేజి లోన్‌ ఇవ్వగలిగే అవకాశం వుంది. కాని దానిని అమలు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రయత్నమే లేదు. నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి యూనిట్లు, మార్కెటింగ్‌ సదుపా యాలు కాగితాలకే పరిమితమయ్యాయి. స్త్రీ నిధి రుణాల పై కూడా వడ్డీ జమ చేయాలి. ప్రభుత్వం ఈ రుణాలకు ముక్కు పిండి మరీ వడ్డీ వసూలు చేస్తోంది.
పసుపు కుంకుమలు, రుణ మాఫీ వాగ్దానాలు ఓట్ల కోసం వేసే వల మాత్రమే. స్వయం సహాయక గ్రూపులు స్వయం నిర్ణయాధి కారంతో నడవాలి. అందుకు ప్రభుత్వం సహా యం ఇవ్వాలి. నిర్వహణకోసం అయ్యే ఖర్చు లు, ఫెసిలిటేటర్లు (ఏనిమేటర్లు) జీతాల ఖర్చు లు ప్రభుత్వమే భరించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ వడ్డీ రాయితీని ఏనెలకా నెల జమ చేయాలి. నైపుణ్య శిక్షణ,మార్కెటింగ్‌ సదు పాయాల కోసం బహుళ జాతి కంపెనీల మీద ఆధారపడడంగాక ప్రత్యామ్నాయ పద్ధ తులు రూపొందించాలి. సామాజిక చైతన్యం తో సమస్యల పరిష్కారంలో డ్వాక్రా మహిళలు భాగస్వాములైతే పాలక వర్గాల వంచనలు సాగవు. సాగబోవు.-డి.రమాదేవి

క్షమించరాని..నిర్లక్ష్యం

‘శ్రీకాకుళం జిల్లాకు ఇతర ప్రాంతాల నుండి వలసలు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. కిడ్నీల వ్యాధిని నిర్మూలించడానికి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మించే బాధ్యత నాది’ అని ఇటీవల శ్రీకాకుళం ఎన్నికల బహిరంగ సభలో పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. ‘ఇలాంటి అమలు కాని వాగ్ధానాలు చేస్తే మాదేశంలో ఉరి వేస్తార’ని హైదరాబాదులో జరిగిన సెమినార్‌లో ఓ విదేశీ ప్రతినిధి అన్నారు. ఇది జరిగినప్పుడు చంద్రబాబు వేదిక పైనే ఉన్నారు. రెండూ వేర్వేరు సందర్భాలలో అన్నమాటలే అయినప్పటికీ నేతలు అలా నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తూనే వున్నారు. సోంపేట, కాకరాపల్లిలో ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు సంబంధించిన ప్రతిపాదనలు వైఎస్సార్‌ హయాం లోనే వచ్చాయి. మొత్తంమీద ఇటు చంద్రబాబు…అటు వైఎస్సార్‌… వీరిద్దరి పాలనలోనూ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది. జగన్‌ సైతం ఆ ప్రాంత అభివృద్ధికి ఎన్నో శుష్క వాగ్దానాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖల నుంచి వలసలు వెళ్తున్నవారు హిమాలయ పర్వతాల నుంచి అండమాను దీవుల వరకు విస్తరించి వున్నారు. ఎక్కడో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఒక చిన్నపరిశ్రమ పెడితే అక్కడికీ శ్రీకాకుళం వాళ్లు కార్మికులుగా వెళ్తున్నారు. దీన్నిబట్టే ఉత్తర కోస్తా నుంచి వెళ్లే వలసలు ఎంత ప్రమాదకరంగా వున్నాయో అర్థమౌతోంది. వాస్తవానికి ఉత్తర కోస్తా జిల్లాలలో దేశంలోనే అత్యధిక వర్షపాతం 1150 మి.మీ నమోదవుతోంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే ఆజిల్లాల నుంచి ప్రజలు వలసలు పోయే పరిస్థితే రాదు. కానిఆదిశగా ప్రభుత్వాలు పని చేయవు. పైగా పరిశ్రమల కోసం పేదల నుంచి భూములు లాక్కున్నాయి. పోలీసుల నిర్బంధం ప్రయోగించి, అక్రమ కేసులు బనాయించి, జైళ్లలో పెట్టి, లాఠీ ఛార్జీలు చేసి, బలవంతంగా భూముల నుండి పేదలను వెళ్లగొట్టారు. చివరికి అణువిద్యుత్‌ కేంద్రానికి కూడా శ్రీకాకు ళంనే ఎంచుకున్నారు.మూడు జిల్లాల్లో దాదాపుగా 30లక్షల ఎకరాల సాగుభూమి లో 3లక్షల ఎకరాలకు మాత్ర మే నీటి వనరులు న్నాయి. చెరువులు వున్నప్పటికీ మరమ్మతులు లేక పెద్దగా వినియోగంలో లేవు. తాగునీటి కోసం విజయనగరం నుంచి తాడిపూడి ప్రాజెక్టును విశాఖపట్నం కార్పొరేషన్‌ నిర్మాణం చేసి నీటిని వినియోగిం చుకున్నది. నిర్ణీత 25 సంవత్సరాల గడువు పూర్తి అయిన తర్వాత స్థానిక జిల్లాకు ఆ ప్రాజెక్టును అప్పగించారు. కానీ,నేటికీ విశాఖపట్నానికే నీరు వెళుతోంది. దీంతో ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీరు లేని పరిస్థితి. 2009లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని రూ.7214 కోట్లతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీకాకుళంలో 0.85 లక్షల ఎకరాలు, విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు, విశాఖపట్నంలో 3.21 లక్షల ఎకరాలు మొత్తం 8 లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పారు. కానీ, 2016-17లో రూ.రెండు కోట్లు, 2017-18లో రూ.రెండు కోట్లు కేటాయించారు. 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో మొత్తం ఇరిగేషన్‌కు రూ.14,229 కోట్లు కేటాయించారు. అందులో రూ.420 కోట్లు మాత్రమే మూడు జిల్లాల ప్రాజెక్టుకు కేటాయించినా వ్యయం చేయలేదు. వంశధార-2 ప్రారంభించి దశాబ్దం గడుస్తున్నా పూర్తి కాలేదు. ఇలా ఉత్తరాంధ్ర లోని ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి తీవ్ర నిర్లక్షానికి గురౌతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కావలసినన్ని వాగులు, వంకలు, నదులు ఉన్నా, ఈ నీరంతా సముద్రం పాలవు తూనే వుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 2003 వరకు 9సంవత్స రాల పాటు ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రిగా,2014-19ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ15 సంవత్సరాలలోను గుర్తించని అంశాన్ని కొత్తగా గుర్తించినట్లు ప్రకటించడం హాస్యాస్పదం. వలసలను నిరోధించాలంటే ఆ జిల్లాల జీవనాదాయం పెరగాలి. ప్రతిసారీ ‘అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను’ అంటూ చేస్తున్న ప్రచారం చెవిలో మోగుతూనే ఉంది. పాలకుల దృష్టి అంతా ఉత్తరాంధ్రలో వున్న ఖనిజ సంప దను, బహుళ జాతి సంస్థల ద్వారా అమ్మించాలన్న ప్రయత్నమే తప్ప ఆ ప్రాంతాన్ని బాగు చేయాలన్న దృష్టి కాదు. బంగాళఖాతంలో వచ్చిన ప్రతి తుపాను ఉత్తర కోస్తాను నష్టపరుస్తూనే ఉంది. హుదూద్‌, పైతాన్‌ లాంటి తుపానుల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇంత వరకు పరిహారం ఇవ్వ లేదు. పైగా నష్టం ఇస్తున్నట్లు విపరీతమైన ప్రచారం చేసింది. ఈ పరిహా రాన్ని కూడా ఉద్యోగుల సహకారంతో పాలక వర్గాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఈ జిల్లా లు విద్యకు బహు దూరంలో వున్నాయి. ప్రతిపక్షంలో వున్న వైఎస్సార్‌ పార్టీ ఈ అంశాలపై గట్టిగా ఒత్తిడి చేయనూ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా అక్షరాస్యత గురించి పట్టించుకోలేదు. వైద్య సౌకర్యం ఆమడ దూరంలో వుంది. అక్కడ లేని జబ్బులు లేవు. పైగా, ఫార్మా సంస్థలు గిరిజనులపై తమ మందులను ప్రయో గించి పరీక్షలు చేస్తాయి.దీంతో వారి బతుకులు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. ఫార్మా కంపెనీలకు దాసోహంగా ఉండే ప్రభుత్వాలు పేద, దళిత గిరిజనుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పిహెచ్‌సీ సెంటర్లు వున్నా వైద్యులు, మందులు ఉండవు. కిడ్నీలకు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం ప్రారంభిస్తామన్న ఏలికలకు ఈ ప్రాంతంలో మలేరియాతో ఏటా 3వేల మంది చనిపోతున్న విషయం తెలుసా? మొబైల్‌ వ్యాను ద్వారా మెడికల్‌ సహాయం చేయడానికి ఆటంకాలేంటి? మరణిస్తున్న గర్భిణీలు, నవజాత శిశువుల గణాంకాలు ఈ పాలకులు ఎప్పుడైనా గమనించారా? రవాణా సౌకర్యాలు పరిశీలిస్తే ఎన్‌హెచ్‌-5 (చెన్నై-కోల్‌ కతా), రైల్వే లైన్‌ మినహా గిరిజన పల్లెలకు కల్పించిన రహదారి సౌకర్యం నామ మాత్రమే. ఒక వైపున ఈ మూడు జిల్లాలలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య ఏటేటా పెరుగుతుండగా అక్కడ ఎంపికైన శాసన సభ్యులు, మంత్రులు మాత్రం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రజలకు ఆదామా షాలో ఆదాయం పెరిగిందా? ఈమూడు జిల్లాల్లో 2014 నుండి 2019 వరకు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదలకు ఎంత కేటాయించి వ్యయం చేశారో ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించాలి. కిడ్నీ బాధితు లకు పాలక వర్గాల నాయకులు సానుభూతులు మాత్రమే ప్రకటించి వచ్చారు తప్ప, నివారణకు ఏ చర్యలూ తీసుకోలేదు. ఫ్లోరైడ్‌ నీటి వినియోగం వల్ల కిడ్నీ వ్యాధులు దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులన్నీ వైద్యులు లేక, మందుల కొరత వల్ల కునారిల్లుతున్నాయి. ఈ సంగతి పాలకు లకు తెలియదా? సాగునీటి వనరులను ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి, వారికి పౌష్టికాహారం అందించడం, జీవనాదాయం పెంచడం, విద్యా వైద్య సౌకర్యం కల్పించడంతో పాటు కాలుష్య నివారణా చర్యలు చేపట్టినప్పుడు ఉత్తర కోస్తాను ‘కోస్తా’గా గుర్తించవచ్చు. అంతేగానీ, కోస్తా పేరు చెప్పి ఇంతకాలం చేస్తున్న నిర్లక్ష్యం క్షంతవ్యం కాదు. శ్రీకాకుళం జిల్లాకు బయటి నుండి వలసలు రావటం కాదు, ఇక్కడి నుంచి వెళ్లే వలసలను నివారించగలిగితేనే పాలక పార్టీ లక్ష్యం నెరవేరుతుంది- వ్యాసకర్త : వ్యవసాయ రంగ నిపుణులు -సారంపల్లి మల్లారెడ్డి

అస్థిత్వం కోల్పోతున్న సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ

‘‘ ప్రశాంతమైన మన్యసీమలో గిరిజనేతరలు, దోపిడీ దారులు పెరిగిపోయి ఆరాచకాలు సృష్టిస్తున్నారు. దళారీ వ్యవస్థ విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో గిరిజనప్రజలు స్వేచ్ఛగా జీవించే విధానం కనుమరుగువుతోంది. వందల ఎకరాలున్న గిరిజన భూస్వాములు నేడు భూములు కోల్పోయి బికారులా వలస బాట పట్టే పరిస్థితికి దిగజారుతున్నారు. ఇక్కడ ఉన్న వనరులు దోపిడికి గురవుతున్నాయి ’’- లోత సుబ్బారావు
ఉద్యమాల గెడ్డగా పేరుగాంచిన సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ పెదమల్లాపురం ఏరియా గిరిజనులు అస్థిత్వం కోల్పోతున్నారు. తరాలు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1957 నుంచి చట్టసభలకు ఎన్నికవుతున్న శాసనసభ్యులకు తమ ఓట్లు వేసినా నేటికీ తమ బతుకులు మారడం లేదు. ఆదునిక సాంకేతిక యుగం వచ్చినప్పటికీ ఈ ప్రాంత గిరిజనుల జీవన సరళీలో మార్పు లేని దుస్థితి. స్వతంత్ర భారతంలో ఆదివా సీలకూ రాజ్యాంగ రక్షణలు, రాజ్యాంగ ఫలాలు అందని ద్రాక్షలుగానే మిగిలాయి. ప్రత్యేకమైన, విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగి, ఎంతో విలువైన సహజ వనరులు, ఖనిజసంపదలు ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులూ నేడు పరాయికరణకు గురవుతున్నారు. సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ ప్రాంతాలు నేడు ఆదివాసులకు తీరని శాపంలా పరిణమించాయి.
తూర్పు గోదావరి జిల్లా సబ్‌ప్లాన్‌ ఏజెన్సీలో నివాసముంటున్న గిరిజనులు దుస్థతి అగమ్యగోచరంగా మారింది. వారి సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. జిల్లాలో ఐదు మైదాన ప్రాంతంలో ఉన్న శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండ ల్లాలో 59 గిరిజన గ్రామాలున్నాయి. సుమారుగా 1.18వేల మంది కొండకాపు, కొండరెడ్డి, కోయి, వాల్మికీ భగత వంటి గిరిజన తెగలు నివాసముంటున్నారు. గ్రామాల్లో అనేక సమస్యలతో గిరిజనులు సతమతమౌతున్నారు. ఎలాంటి పనులేక ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందక ప్రతి ఏడాది తీవ్రమైన కరువు ఏర్పడడంతో గిరిజనులు వలస బాట పడుతున్నారు. తరతరాలుగా వివిధ దురాక్రమణదారుల దోపిడికి గురవుతున్నారు. అలాంటి అణగారిన ప్రజలు నేడు తమ అస్థిత్వం, మనుగడ కోసం ఉద్యమిస్తున్నారు. రాజకీయ దళారీలు గిరిజన తండాలను ఆక్రమించి ఇక్కడ నివసించే గిరిజనుల జీవన విధానాలను నిర్వీర్యం చేస్తున్నారు. గిరిజన భూములు దురాక్రామణకు గురవుతూ రియల్‌ ఎస్టేట్‌గా మార్చేస్తున్నారు. స్థానిక గిరిజనులను అడ్డంపెట్టుకొని విలువైన వనరులు దోచుకొంటున్నారు. ప్రశాంతమైన మన్యసీమలో గిరిజనేతరలు, దోపిడీ దారులు పెరిగిపోయి ఆరాచకాలు సృష్టిస్తున్నారు. దళారీ వ్యవస్థ విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో గిరిజనప్రజలు స్వేచ్ఛగా జీవించే విధానం కనుమరుగువుతోంది. వందల ఎకరాలున్న గిరిజన భూస్వాములు నేడు భూములు కోల్పోయి బికారులా వలస బాట పట్టే పరిస్థితికి దిగజారుతున్నారు. ఇక్కడ ఉన్న వనరులు దోపిడికి గురవుతున్నాయి. కొండలపై ఉన్న ఆవేల్తి, అనుమర్తి, పెద్దూరు, కిత్తమూరిపేట, ధార మల్లా పురం, జల్దాం వంటి గిరిజన గ్రామాలకు ఇప్పటికీ సరిjైున మౌలిక సదుపాయాలు లేవు. ఆగ్రామాలకు నేటికీ సంపూర్ణమైన వైద్య సదుపాయాలు దక్కలేదు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత :
ఎంతో మంది గిరిజన చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహార లోపంతోనే కొట్టిమిట్టులాడుతున్నారు. ఏజెన్సీలో రోడ్లు లేక, బస్సులు రాక గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. రేషన్‌ దుకాణాల్లో ఇచ్చేదే చాలీచాలని బియ్యం. ఆదుకాణాల్లో సబ్బులు కొనుక్కుంటేనే బియ్యం ఇస్తారట! ఇదెక్కడి న్యాయం? గిరిజన సహకార సంఘాల్లో పనిచేసే పౌష్టికాహారం లేకచిన్నపిల్లల్లో రక్తహీనత పెరిగిపోతోంది. పెదమల్లాపురం ఆసు పత్రిలో సరిjైున వైద్యం అందడం లేదు. ఆసుపత్రికి అంబులెన్స్‌ లేదు. అత్యవసరం అయితే డోలు మోసుకోవాల్సిన దుస్థితి. వందలామంది చిన్నారులు రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నారు. రోగులు ఆసుపత్రులకు వెళితే అక్కడ వైద్యులు ఉండడం లేదు. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు ఎలా బతుకుతారో ప్రభుత్వమే చెప్పాలి. లోతట్టు ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టమే… ఐదు మండలంలో కొన్ని లోతట్టు గిరిజన గ్రామాలకు వెళ్లడానికి అసలు రహదారులు లేవు. పోలవరం నుంచి జల్ధాంకు ఏర్పాటు చేసిన రహదారి అస్తవ్యస్థంగా ఉంది. రాఘపట్నం నుంచి మండల కేంద్రమైన రౌతులపూడికి వెళ్లాలంటే రోడ్డుంతా గతుకుల మయంగా మారింది. పెదమల్లారం నుంచి శంఖవరం చేరాలంటే రోడ్డుంతా అస్తవ్యస్థంగా మారింది. దీంతో కనీసం బస్సు ఆర్టీసీ బస్సులు తిరగని పరిస్థితి. మాతయ్యపాలెం నుంచి రాఘపట్నం, సార్లంక చేరాలంటే కాలిమాటే గతి. కనీసం ద్విచక్ర వాహనాలు ఈ దారిలో వెళ్లే పరిస్థితి కన్పించట్లేదు. ఈ గ్రామాలకు రహదారి నిర్మించాలని దశాబ్దలుగా కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గిరిజన ప్రాంతా లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుంది. ఏళ్లు గడుస్తున్న గిరిజన ప్రాంతాల రహదారుల నిర్మాణాలు మాత్రం కలగానే మిగిలింది. ఎన్నోసార్లు రహదారుల కోసం దరఖాస్తులు చేసుకున్నా అవి బుట్ట దాఖలయ్యాయి. గతంలో తమ గ్రామాలు అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికలు బహిష్కరించడం కూడా జరిగింది. ఐదు మండలాలలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు ఇంత వరకు పాలకులుగాని, ప్రభుత్వ అధికారులు గాని పట్టించుకోక పోవడంపై ఈ ప్రాంత వాసులు సందిగ్ధ పరిస్థితుల్లో నాయకులను ప్రశ్నంచలేక ఎవరికి ఓటువేయాల లేదా ఓటును బహిష్కరించాల అనే మీమాసంలో ప్రజలల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు తమ సమస్యలపై స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
దీర్ఘకాలిక సమస్యలు ఇవి :
ె పెదమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక గిరిజన మండలం ఏర్పాటు చేయాలి
ె ఉపప్రణాళిక ప్రాంతంలో ఉన్న 59 గిరిజనగ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలి
ె జీవో నెంబరు 3ని సవరించి సబ్‌ప్లాన్‌ గిరిజన విద్యార్ధినీ, విద్యార్థులకు న్యాయం చేయాలి.
ె అన్నీ రకాల ఉద్యోగాలు సబ్‌ప్లాన్‌ ప్రాంతంలో స్థానిక గిరిజన విద్యార్థులకు మంజూరు చేయాలి
ె నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉన్న 59 గిరిజన గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలి. ఐటీడీఏ ద్వారా మంజూరయ్యే సంక్షేమ పథకాలను సబ్‌ప్లాన్‌ ఏరియా ప్రజలకు వర్తింప చేయాలి
ె ఎస్‌.టీ గిరిజన విద్యార్ధినీ, విద్యార్థులకు ఆటంకం లేకుండా ఎస్‌టీ కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలి
ె గిరిజన గ్రామాలలో రవాణా సౌకర్యం మెరుగు పరిచి, మెరుగైన వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ె నైపుణ్యమైన విద్యను అందించడానికి జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలి.
ె ప్రతి గిరిజన గ్రామంలోనూ సురక్షతమైన రక్షిత మంచినీటి ట్యాంక్‌ నిర్మించాలి.
ె ఫారెస్టు పోడు భూములకు అర్హులైన గిరిజనులకు పట్టాలిచ్చి హక్కును కల్పించాలి.
ె పెదమల్లాపురం వేళంగి, రాఘపట్నం, బురదకోట, జల్దాం గ్రామ పంచాయితీలో కమ్యూనికేషన్‌ కోసం సెల్‌టవర్లు నిర్మించాలి.

దేశ చరిత్రను తిరగరాస్తున్న జన్యు శాస్త్రం

ఈ భూమి మీద ఆధునిక మాన వుడి కథ సుమారు రెండు లక్షల సంవత్స రాలకు ముందు ప్రారంభమైంది. చీకటి ఖండం అని పిలువబడ్డ ఆఫ్రికాలో తొలి మానవుడు వెలుగు చూశాడు. అక్కడి నుండి ప్రయాణమై ఆఫ్రికా ఖండం బయటికి వచ్చాడు. అక్కడ నియాండర్‌తల్‌ మ్యాన్‌ జాతితో లైంగిక సంపర్కం జరిగింది. సుమారు అరవై వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా బయటి ప్రాంతాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. మొదట మిడిల్‌ ఈస్ట్‌ చేరుకున్న మానవ సమూహాలు తర్వాత మధ్య ఆసియా ప్రాంతం చేరాయి. క్రమంగా భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. ఒక అంచనా ప్రకారం ఈ మానవ సమూహాలు తొలిసారిగా సుమారు నలభై వేల ఏళ్ల క్రితం భారత భూభాగం చేరాయి. ఇవి రెండు శాఖలుగా విడిపోయాయి. ఉత్తర భారత దేశానికి పరిమితమైన వారు-ఉత్తర భారత పూర్వీకులు అయ్యారు. దక్షిణ భారత దేశానికి పరిమితమైన వారు-దక్షిణ భారత పూర్వీకులు అయ్యారు. దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారత దేశంలో వలసలు ఎక్కువగా జరిగాయి. దక్షిణాన మూడు వైపులా సముద్రం ఉండడం మూలాన అక్కడికి వలసలు తగ్గి ఉండొచ్చు. అందుకే దక్షిణ భారతీయులను మూల వాసులుగా పరిగణించారు. ఈ దేశంలో క్రీ.పూ 1500 నుంచి క్రీ.శ 200 మధ్య కాలంలో మనుస్మృతి కుల వ్యవస్థను ద ృఢ పరిచింది. అంతకు ముందు రెండు వేల మూడు వందల ఏళ్లు మిశ్రమ జనాభా కొనసాగిన తర్వాత, మనుస్మ ృతి ప్రభావంతో కులగోత్రాల ఆధారంగా పెళ్లిళ్లు జరుగుతూ వచ్చాయి. మనుస్మ ృతి ప్రకారం శూద్రులు, క్షత్రియులు అంతా సమానమే. కాని, సామాజికంగా బలవంతులైన క్షత్రియులు బ్రాహ్మణులకు గౌరవ స్థానాలిచ్చి రాజ్యాలేలారు. రాజ్యాలేలిన ఇతర కులాల వారు కూడా చేసిన పని అదే. కొలోనియల్‌ రూలర్స్‌ కూడా దేశంలోని కుల వ్యవస్థను దెబ్బ తీయకుండా తెలివిగా వారి పబ్బం గడుపుకున్నారు. భారతీయ సంప్రదాయ వాదులు చెప్పుకుంటున్నట్టు కులగోత్రాలకు ఆధారాలేవీ లేవు. అవిమధ్యలో కొన్ని సమూహాలు తమ ఆధిపత్యం నిలుపుకోవ డానికి కల్పించి ప్రచారం చేసినవే. వేల వేల ఏళ్లుగా దేశంలో ఒక మిశ్రమ జనాభా కొనసాగుతూ వచ్చిన విషయాన్ని వారు కప్పి పుచ్చారు. మరొక పరిశోధకుల బృందం చెపుతున్న దాని ప్రకారం-భారతేదశంలో మిశ్రమ జనాభా తయారు కావడానికి 65 వేల ఏళ్ళ క్రితమే బీజాలు పడ్డాయి. ఆఫ్రికా మూలాలున్న సమూహాలు కొన్ని ఇతర ప్రాంతాల గుండా భారత్‌లో ప్రవేశించాయి. క్రీ.పూ ఏడు వేల ఏళ్ల క్రితం జగ్రోసియన్‌ హెడ్డర్స్‌ బెలూచిస్థాన్‌ చేరి తొలి భారతీయులతో సంబంధాలు ఏర్పరచు కున్నారు. ఈ రెండూ కలిసి ఒక మిశ్రమ జాతిగా హరప్పా నాగరికతను ఏర్పరిచాయి. ఆ తర్వాత రెండు వేల ఏళ్లకు ఆర్యులు వలస వచ్చారు. అంటే ఇక్కడ జరిగిందేంటి? సంస్క ృతీ నాగరికతలు ఏక మార్గంగా అభివృద్ధి కాలేదు. బహు ముఖాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఇది వాస్తవం! అందుకే ఈ దేశంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మత విశ్వాసాలు ఒకదానికొకటి సమాంతరంగా విస్తరిస్తూ వచ్చాయి. ఇదే విషయం సమకాలీనంలో కూడా చూస్తున్నాం. మనమంతా భారతీయులమే అయితే ఎప్పుడో ఒకప్పుడు మన పూర్వీకుల పూర్వీకులు వలస వచ్చినవారే. అంటే మనమంతా వలస వచ్చిన వారికి వారసులమే. మనదంతా మిశ్రమ జనాభానే. ఏమయితేనేం మానవ జాతి అంతా ఒక్కటే. ఇందులో ఎక్కువ తక్కువలు. ఎగుడు దిగుళ్లూ లేవు. పవిత్రులమని, ఉన్నతులమని జబ్బలు చరుచుకునే వారు కూడా ఈ మిశ్రమ జనాభా నుంచి వచ్చినవారే…ఇంగితజ్ఞానం, వివేచన పెరిగినందు వల్లనే మనిషి పనిముట్లు, ఆయుధాలు తయారు చేసుకున్నాడు. దాని వల్లనే విజ్ఞాన శాస్త్రం పెరుగుతూ వచ్చింది. ఫలితంగా మనిషి జంతువుల నుంచి విడివడి పరిణామం చెందుతూ వచ్చాడు. ఏ మత విశ్వాసాల వల్లనో మనిషి మనిషిగా ఎదగలేదు. సైన్సు వల్లనే ఎదిగాడు. ఇప్పుడు మళ్లీ సైన్సు సహాయంతోనే తన గతాన్ని తవ్వి తీస్తున్నాడు. జర్మనీలో దొరికిన రెండు వందల వేల ఏళ్ల నాటి ఒక మానవుడి అస్థిపంజరం పరిశోధనలను ఆకాలానికి తీసుకుపోయి కొత్త సత్యాల్ని వెల్లడిరచింది.
లభించిన పురాతన డిఎన్‌ఎ ప్రకారం తెల్ల చర్మం వారు ఎక్కువని, నల్ల చర్మం వారు తక్కువని విదేశాలలో ఉన్న భావన తప్పు. ఒక కులం వాడు ఎక్కువనీ, మరో కులం వాడు తక్కువనే భారతీయుల భావనా తప్పే. ఓగోత్రం వాడు పవిత్రుడని మరో గోత్రం వాడు అపవిత్రుడని భావించే వారంతా మూరు?లు. కొంత సైన్సు, మరికొంత చరిత్ర తెలుసుకుంటే కళ్లకున్న అహంకారపు పొరలు తొలగి పోతాయి. తమని తాము మోసగించుకుంటూ, ఇతరులను మోసం చేసే వారికి జ్ఞానోదయం కావాలంటే మత గ్రంథాలు పక్కన పెట్టి వివేచనను నిద్ర లేపాలి. హేతుబద్ధంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని సమకూర్చు కోవాలి. పరిణతి చెందని వారంతా పరిణామ దశలోని తొలి మానవుడి దశలో వున్నారన్నమాట! ఆకారాలు మారాయి కాని, వారి మెదళ్లు ఇంకా మూడు వేల ఏళ్ల కిందటి భావజాలంతోనే ఉన్నాయన్నది నిజం. బలవంతుడు నిర్బలుడికి సహాయపడ్డట్టు- మేధోపరంగా ఎదిగిన వారు, ఎదగని వారికి చెపుతూనే ఉండాలి. అందుకే సమాజంలో హేతుబద్ధంగా ఆలోచించే వారిపై ఎక్కువ బాధ్యత ఉంది. ఆలోచన లేనివాడు ఎలాగూ మూర?ంగా ప్రవర్తిస్తూ ఉంటాడన్నది తెలిసిన విషయమే. ఒకప్పుడు ఆర్కియాలజీ శాఖ వారి తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలతో చరిత్రకారులు చరిత్ర రాశారు. దానికి ఇప్పుడు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం తోడయ్యింది. ఊహలకు, భావనలకు పరిమితం కాకుండా జన్యు శాస్త్రంతో మానవ పరిణామ చరిత్ర మరింత స్పష్టమౌతూ వుంది. దాంతో నేటి భారతీయ సంప్రదాయవాదులకు గుండెలు ఆగిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ భారత ఖండంలోని గొప్ప సంస్కృతిలోని భాగంగా సంస్క ృత భాషని మన వాళ్లు నెత్తికెత్తుకొని ఊరేగారు. నిజానికి ఆ భాషకు మూలాలు మొదట సిరియాలో బయట పడ్డాయి. పురాతత్వ పరిశోధకులు, జీవ శాస్త్రవేత్తలు చేస్తున్న పని ఏమిటంటే-వారు ప్రస్తుతంలో నిలబడి గతంలోకి మెట్టు దిగుతున్నారు. పురాతన మానవ అస్థి పంజరాల నుంచి డిఎన్‌ఎ సేకరించి మరింత కచ్చితమైన సమాచారం అందిస్తున్నారు. నేటి పాకిస్తాన్‌ ప్రాంతంలో జరిపిన తవ్వకాల వల్ల ఐదు వేల ఏళ్ల నాటి నాగరికత బయటపడిరది. అలాగే ఉత్తర భారతం నుంచి దక్షిణాన మహారాష్ట్ర వరకు ఇండస్‌ వ్యాలీకి సంబంధించిన సమాచారం లభించింది. ఈ ప్రాంతమంతా వ్యాపించిన వారు హరప్పన్లు. నేడు మన హిందూ సంప్రదాయవాదులు వాదిస్తున్నట్టుగా వీరికీ వేద సంస్క ృతికీ సంబంధమే లేదు. ఆర్యులు ఎక్కడి నుంచో వలస రాలేదని, మొదటి నుంచీ వారు ఈ పావన భారతావని లోనే విరాజిల్లారని, వేదాలు ఇక్కడే ఉద్భవించాయని చెప్పే వాదనలను పరిశోధనలు ఏమాత్రం బలపరచలేదు. హార్యానాలోని రాఖిగర్హి తవ్వకాలలో లభించిన పురాతన డిఎన్‌ఎ, ఇండస్‌ వ్యాలీ గూర్చి స్పష్టమైన సమాచార మిచ్చింది. ఆర్యులు వలస రావడం నిజమేనని ధృవపర్చింది. పైగా దక్షిణాసియా మూల వాసులు-ఇరాన్‌ దేశపు వ్యవసాయదారుల కలయిక వల్లే హరప్పన్లు ఏర్పడ్డారని తెలిసింది. అంటే, వేల వేల ఏళ్ల క్రితమే మిశ్రమ మానవ జాతి ఏర్పడిరది. ఇంక పవిత్రులు, శుద్ధమైన వారు, సంకరజాతి లాంటి పదాలకు అర్థమే లేదు కదా! మిశ్రమ జాతి నిజమైనప్పుడు మధ్య ఏర్పరుచుకున్న కుల, గోత్రాలకు విలువ వుంటుందా? జాత్యహంకారానికి అర్థం ఉంటుందా? జీవశాస్త్ర ప్రకారం ప్రాణుల మధ్య లైంగిక సంపర్కం జరుగుతూ ఉందంటే అవి ఒకే జాతికి చెందిన ప్రాణులని అర్థం ఈ అత్యాధునిక కాలంలో కూడా అదే చూస్తున్నాం. కులాంతర, మతాంతర వివాహాలే కాదు, వివిధ దేశాల, వివిధ జాతుల ప్రజల మధ్య కూడా చూస్తున్నాం. అంటే మానవ జాతి అంతా ఒక్కటే అని అర్థం. – డా.దేవరాజు మహారాజు

1 67 68 69 70 71 75