అంతా ఆదివాసీలదే

అక్కడ ఆదివాసీలే ప్రభువులు. ప్రభుత్వ నిర్ణయాల్ని బేఖాతర్‌ చేసే అధికారం కూడా వారికి ఉన్నది. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌ని, వార్డు సభ్యులను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా వారికి సంక్రమించింది. షెడ్యూలు ప్రాంతాలకు పంచాయతీ రాజ్‌ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉన్నా ఏజెన్సీ గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 500 జనాభా కలిగిన ఆదివాసీ గూడేలను గ్రామపంచాయతీలుగా ప్రకటించిన తర్వాత మొదటి సారి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో గ్రామ సభల అధికారాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమల్లో ఉన్నది. రాష్ట్రంలోని పూర్వపు ఆదిలాబాద్‌, ఖమ్మం,వరంగల్‌,మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గతంలో ఉన్న631 గ్రామ పంచాయితీలతో పాటూ ఇటీవల ఏర్పాటు చేసిన మరో 400 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివాసీ తెగల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల్లో భాగంగా ఉన్న స్వయం నిర్ణయాధి కారం, సమస్యలను తగవులను పరిష్కరించుకునే ఆచారాన్ని ద ృష్టిలో పెట్టుకుని 1996లో కేంద్ర ప్రభుత్వం ‘పీసా’చట్టం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం కీలక నిర్ణయాలన్నీ గ్రామసభల్లోనే జరగాలి. గ్రామ పెద్దల సమక్షంలో జరిగే గ్రామసభల నిర్వహణకు సంబం ధించిన మార్గదర్శక సూత్రాలను ఉమ్మడి రాష్ట్రంలో 2011లో జీఓ నంబర్‌ 66 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవే నిబంధనలు కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను ఆమోదించటం లేదా తిరస్కరిం చే అధికారం ఏజెన్సీ గ్రామ సభలకు ఉన్నది.
గ్రామసభల అధికారాలు…
ప్రజావసరాల కోసం కానీ ప్రయివేటు సంస్థల కోసం కానీ భూసేకరణ జరపాలంటే ఏజెన్సీ ప్రాంతంలో గ్రామసభల అనుమతి తీసుకోవాల్సి ఉన్నది. ‘పీసా’ చట్టం ప్రకారం ఇసుక, గ్రావెల్‌ తదితర చిన్న తరహా ఖనిజ సంసదకు ఆదివాసీలే యజమానులు. ఖనిజ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలకి కానీ ప్రయివేటు వ్యక్తులకు కానీ అప్పగించాలంటే గ్రామసభల ఆమోదం అవసరం. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామసభలు ఆమోదిస్తేనే మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వాల్సి ఉన్నది. ఈ లైసెన్సులు కూడా ఆదివాసీల పేరుతోనే జారీ చేయాల్సి ఉన్నది. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, సంతల నిర్వహణ, చిన్న తరహా నీటి వనరుల నిర్వహణ గ్రామసభల ఆమోదంతోనే జరగాలి. వ్యవసాయ ప్రణాళికలు కూడా గ్రామసభ ఆమోదం తర్వాతే అమలు చేయాలి. పంచాయితీ పరిధిలో ఉండే పాఠశాలలు, వైద్య శాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత కూడా గ్రామ సభలకే కట్టబెట్టారు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో పీసా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నీరు కార్చాయనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఇసుక తవ్వకాలు గ్రామపంచాయితీలకే అప్పగించాల్సి ఉండగా చట్టవిర్ధుంగా రాష్ట్ర ఖనిజా భివృద్ధి సంస్థ దక్కించుకుని ప్రయివేటు కాంట్రా క్టర్లకు అప్పగించటంతో గ్రామసంచాయితీలకు ఆదాయం రాకుండా పోయింది. పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా నష్ట నివారణ చర్యల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదు. ప్రస్తుతం జరుగు తున్న గ్రామసంచాయితీ ఎన్నికల తర్వాత పంచాయితీరాజ్‌ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఆదివాసీల స్వయం పాలన కోసం జరిగే గ్రామసభల విషయంలో కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని ఆదివాసీలు కోరుతున్నారు.
సర్పంచ్‌ లేక పోయినా గ్రామసభ…
చట్ట ప్రకారం గ్రామసభను సమావేశపరచిన తర్వాత దీనికి అధ్యక్షత వహించే అధికారం సర్పంచ్‌కి ఉన్నప్పటికీ సర్పంచ్‌ రాక పోయినా గ్రామసభకు అధ్యక్షత వహించటానికి సర్పంచ్‌ అంగీకరించక పోయినా అదివాసీ తెగకు చెందిన పెద్దను గ్రామసభ అధ్యక్షుడిగా ఎన్నుకునే అధికారం ఆదివాసీలకు ఉన్నది. ఒకగ్రామపంచాయితీ పరిధిలో ఒకటి కన్నా ఎక్కువ ఆవాసాలు ఉంటే ప్రతి ఆవాసంలో ఒక గ్రామసభ నిర్వహించుకునే అధికారం ఉన్నది. అక్కడి నివసించే ఆదివాసీ తెగ లేదా గుంపు గ్రామసభ ద్వారా నిర్ణయాలను ప్రకటించే అధికారం సంక్రమించింది. గ్రామసభ తీర్మానాలకు పూర్తి స్థాయి చట్టబద్ధత ఉన్నది. గ్రామసభ వ్యవహారాల్లో తాము కూడా జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు కూడా పలుమార్లు స్పష్టం చేసింది.
వేదాంతను తిప్పికొట్టిన గ్రామసభలు : ఒడిషాలోని బాక్సైట్‌ గనులను వేదాంతకు అప్పగించటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలను గ్రామసభల తీర్మానాల ద్వారా అక్కడి ఆదివాసీలు తిప్పికొట్టారు. గ్రామసభల నిర్వహణలో అధికార యంత్రాంగం మితిమీరిన జోక్యాన్ని కూడా ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అధికారులకు సంబంధం లేకుండా జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణలో నిర్వహించిన 13 గ్రామపంచాయితీలకు సంబంధించిన గ్రామసభలు బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.
నూతన పంచాయతీలకు గ్రామాభివృద్ధే ధ్యేయం కావాలి : పదవి చిన్నదే కావచ్చు, ఐనా తను తలుచుకుంటే గ్రామాన్ని అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉంచగలడు. ఆమేరకు ఆత్మవిశ్వాసం,దీక్ష, పట్టుదల పుష్కలంగా సర్పంచ్‌గా ఎన్నుకోబడే వ్యక్తికి ఉండాలి. కేవలం తమ ప్రాబల్యం చాటుకోవాలనే దుగ్ధ కాకుండా ఊరి బాగోగు లపై శ్రద్ధ కనబరచే దిశగా ఆలోచించి ఉన్నంతలో రిజర్వు స్థానా ల్లో సైతం విద్యావంతులు, ప్రగతి కాముకులు ఎన్ని కవడానికి రాజకీ య పార్టీలు చొరవచూపాలి. గ్రామానికి ఆగ్రామం సొంతంగా అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రణాళికా రచన జరగాలి. గ్రామాబి óవృద్ధి ప్రణాళిక రూపొందించడంలో ‘గ్రామసభ’దే కీలకపాత్ర. గ్రామసభ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం తోపాటు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌, సర్పంచ్‌లు అతి ముఖ్యమైన వాళ్లు. సాధారణంగా ఏ గ్రామానికైనా దాని సుస్థిరత కారకాల్లో మూడు అంగాలు ప్రధాన మైనవి. అవి1.విద్య 2.ఆరోగ్యం 3.మౌలిక సదుపాయాలు. అక్కడి ప్రభుత్వ పాఠశాలను పకడ్బందీగా నడుపుకోవడం ద్వారా బాలబాలిక లకు గుణాత్మక విద్య అందించాల్సిన బాధ్యత పంచాయతీలదే. ప్రజారోగ్యం పారిశుధ్యం పైనేఅధారపడి ఉంది. పారిశుధ్య వ్యవస్థను పటిష్టంగా అమలు పరచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా ఆరోగ్య సిబ్బందిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా పంచాయతీదే. మురుగుకాల్వల నిర్వహణ, సామాజిక మరుగు దొడ్ల నిర్మాణం, ఇంటింటి మరుగు దొడ్ల నిర్మాణం, దోభీ ఘాట్ల నిర్మాణం, గృహవ్యర్థాల సేకరణ వంటి చర్యల ద్వారా జాతీయ స్థాయిలో నిర్మల్‌, స్వచ్ఛ భారత్‌ పురస్కారాలను అందుకోవాలి. వీధి దీపాల ఏర్పాటు, గ్రంథాలయం నిర్వహణ, తాగు నీటి సరఫరా, రోడ్ల మరమ్మతు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం-నిర్వహణ, మెరుగైన సమాచార వ్యవస్థ, తపాలా కార్యాలయం, క్రీడా సాంసృతిక శాలలు, బ్యాంకు, మార్కెట్‌ తదితర ప్రజావసరాల్లో మండలం, జిల్లా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సమన్వయాన్ని ఎప్పటికిప్పుడు వేగిరపరచుకొని అభివృద్ధిలో నమూనాగా గ్రామాన్ని తీర్చిదిద్దాలి ఇందుకు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు రాజకీయ అక్షరాస్యత కంటే అధికంగా స్థానిక సంస్థల విధులు-నిధులు, నిర్వహణ పట్ల అవగాహన సమగ్రంగా ఉండాలి. కొంతకాలంగా గ్రామాలు రాజకీయ కక్షలు కార్పణ్యాలకు నిలయా లుగా మారిపోయాయి. ఊళ్లు ప్రాత:కాలం నుంచే మద్యంమత్తుతో తూలుతున్నాయి. మద్యం దుకాణాల కారణంగా ప్రజా రోగ్యం పూర్తిగా క్షీణించింది. భర్తల అకాల మర ణంతో వితంతువుల సంఖ్య పెరిగి ఇళ్లలో విషాదం అలుముకుంటున్నది. మద్య రహిత గ్రామంగా తమ గ్రామాన్ని నడుపుకోవడంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా పంచా యతీ పనితీరు, నిర్ణయాలు ఉండాలి. వలసలకు నిలయాలుగా కాకుం డా ఉత్పత్తి క్షేత్రాలుగా ఊర్లు విలసిల్లాలంటే స్థానికంగా కుటీర పరిశ్ర మలు, ఉపాధి పనులు, వృత్తి నైపుణ్యాల శిక్షణా సంస్థలు నెలకొనేటట్టు గ్రామపంచాయతీ ఒక మిషన్‌గా పనిచేయాలి. యువజన సంఘాలు, మహిళా పొదుపు గ్రూపులు, ఉద్యోగుల సేవాకేంద్రం, హితైషుల వితరణ కార్యక్రమాలను ప్రోత్సాహిస్తూ కలుపుకొని వెళ్తేనే సర్పంచ్‌ రాణిస్తారు. అధికారం చెలాయించడానికో దర్ప ప్రదర్శన కోసమో పదవి కాదని సర్పంచ్‌ గమనించాలి. గ్రామంలో కుల వ్యవస్థ పునా దులు బలిష్టంగా ఉంటాయి. శాంతి సామరస్య వైఖరులను అవలభిస్తూ సమైక్యతను మరింత అభివృద్ధి పరచాలి. పండుగలు తదితర సంద ర్భాల నిర్వహణలో గ్రామంలోని పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ ఈవెంట్‌ మేనేజ్మెంట్‌ స్ట్రాటజీతో ముందుకెళ్లాలి. నిధులు కేంద్రం నేరుగా ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా, స్థానిక వనరుల ఆధారంగా సమ కూరినా వాటి ఖర్చు, వినియోగంలో పారదర్శకత నిజాయితీ అడుగడు గునా పాటించాలి. ఎంహెచ్‌ఆర్‌డీ వంటి సంస్థలు నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు ఉత్సాహంతో హాజరవ్వాలి. స్ఫూర్తి వంతంగా సర్పంచ్‌ పదవీ నిర్వహణకు అవసరమైన సజనాత్మకతను విభిన్న పద్ధతుల్లో అందిపుచ్చు కోవాలి. పంచాయతీరాజ్‌ చట్టానికి లోబడి సంవత్స రానికి మొక్కుబడిగా కాకుండా, విధిగా విశాల దక్పథంతో ప్రజలందరి సమక్షంలో గ్రామసభ జరిపి తీర్మానాలను తీసుకోవాలి. అంతే గుణవం తంగా తీర్మానాలను అమలు జరపాలి కూడా. అభివృద్ధితో పాటు, ప్రజలకు ప్రశ్నించే శక్తినిచ్చే పంచాయతీయే ఉన్నతమైంది. – కొండూరి రమేశ్‌బాబు

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా..!

‘‘ రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి పభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు. ఎన్నికలు, విద్య, ఉపాధికి గల అవకాశాలలో కుల,మత,ప్రాంతము,లింగం,శారీరక మానసిక బలహీనత, సైన్యవర్గానికి చెందిన అనే రకరకాల ప్రాతిపదికలపై రిజర్వేషన్లకి సంబంధించి, రాజ్యాంగంలో, చట్టసభలు చేసిన చట్టాలున్నాయి’’ – జి.ఎన్‌.వి.సతీష్‌

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు వర్తింప చేయా లని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్షికఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్న అగ్ర వర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లను అమలు చేసే ప్రతి పాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15,16లను అనుసరించి సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అయితే, గత కొన్నేళ్లుగా అనేక కులాలు తమకూ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ, మరికొన్ని కులాలు తమ రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ ఉద్యమాలు చేస్తున్నాయి. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌ చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాపు, గుజరాత్‌లో పటేళ్లు, మహారాష్ట్రలో మరాఠాలు, రాజస్థాన్‌లో జాట్‌లు ఇలా చాలా రాష్ట్రాల్లోని అగ్రవర్ణాలు రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్నాయి.
అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు: కేంద్ర కేబినెట్‌ ఆమోదం రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్‌ నిజంగానే అన్నారా? రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు దేశంలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం షెడ్యూల్డ్‌ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్‌ తెగలకు 7.5శాతం, ఇతర వెనకబడిన వర్గాలకు 27శాతం మొత్తంగా 49.5శాతం రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 1991లో పీవీ నర్సింహారావు ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్ట్‌ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును అధిగమించి కేంద్రం ఏ విధంగా రిజర్వేషన్లను అమలు చేస్తుందనేది కీలకంగా మారింది.
అమలు ఎలా :
ఇప్పటికే వివిధ వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లలలో కోత విధించి 50 శాతం మించకుండా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా? లేక సుప్రీం తీర్పును అధిగమించి రిజర్వేషన్లను 60 శాతానికి తీసుకెళ్తారా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే మొదట ఆర్టికల్‌ 15, 16లను సవరించాల్సి ఉంటుందని పొలిటికల్‌ సైన్స్‌ నిపుణులు ప్రొఫెసర్‌ ప్రభాకర్‌ రెడ్డి భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ చేసి ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని తెలిపారు. ‘’ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం 50 శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేస్తోంది. అక్కడ 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచరాదని ఇచ్చిన సుప్రీం తీర్పును అధిగమించేందుకు తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్డ్‌లో చేర్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి’’ అని ఆయన వివరించారు.
రాజ్యాంగ సరవణ ఎలా ?
రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన వారిలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తేనే కేంద్రం తీసుకొచ్చే బిల్లు చట్టంగా మారుతుంది. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో సంఖ్యాబలం ఉండటంతో రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది.
9వ షెడ్యూల్‌ ఏమిటి?
1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌ తీసుకొచ్చారు. కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసే చట్టాలను ఈ షెడ్యూల్‌లో చేర్చడానికి అవకాశం కల్పించారు. అంటే ఏదైనా అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా దానిని న్యాయ సమీక్ష నుంచి మినహాయించే అవకాశం కల్పించారు. అందుకే తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని ఈ షెడ్యూల్‌ కిందకు తీసుకొచ్చి రక్షణ కల్పించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉంది. అయితే, సుప్రీం కోర్టు గతంలో అనేక సార్లు 9వ షెడ్యూల్‌ను కూడా న్యాయసమీక్ష పరిధిలోకి తేవాలని పేర్కొంది. మౌలిక సూత్రాలకు భంగకరమని భావిస్తే 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలనూ సమీక్షిస్తామని పలు కేసుల విచారణంలో సుప్రీం పేర్కొంది. ఐఆర్‌ కోయెల్‌హో వర్సెస్‌ తమిళనాడు కేసులో 2007లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైకే సభర్వాల్‌ నేత ృత్వంలోని ధర్మాసనం 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలు న్యాయసమీక్షకతీతం కాదని స్పష్టం చేసింది. ఆ చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగకరంగా ఉంటే సమీక్షించవచ్చని పేర్కొంది. కేశవానంద భారతి వెర్సెస్‌ స్టేట్‌ అఫ్‌ కేరళ కేసులో ‘’ 1950 నుంచి 1973 వరకు 9 వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలకు మాత్రమే న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉందని, దీని తర్వాత చేర్చినా ఏ చట్టమైన న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది’’ అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలపై …. ఎవరేమంటున్నారు?
‘సమానత్వ భావన సాకారం అవుతుంది’
రాజ్యాంగం పేర్కొన్న సమానత్వ భావన సాకారం కావాలంటే కాలానుగుణంగా రిజర్వేషన్లను మార్చాలని ఉస్మానియా యూనివర్సిటీ న్యాయవిభాగం అధిపతి వేంకటేశ్వర్లు చెప్పారు. ‘కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. మొదట ఎస్సీ,ఎస్టీలకే రిజర్వేషన్లు అమలు చేశారు. ఆ తర్వాత 1990లలో బీసీలకు రిజర్వేష్లను వర్తింప చేశారు. కాలానుగుణంగా రిజర్వేష్లను కూడా మారాలి. అప్పుడే రాజ్యాంగం చెప్పిన సమానత్వం అనే భావన నిజం అవుతుంది’ అని ఆయన అన్నారు.
మాకు దక్కేదేమీ లేదు’
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల కాపులకు దక్కేదేమీ లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడూతూ, ‘కాపులను బీసీల జాబితాలో చేర్చి 5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మేం పోరాటం చేస్తున్నాం. కేంద్ర నిర్ణయం వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు. అగ్రకుల రిజర్వేషన్ల జాబితాలో కాపులను చేర్చితే వచ్చే ఉపయోగమూ లేదు ‘ అని పేర్కొన్నారు. అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.
‘’సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యాంగం చెబుతుంటే కేంద్రం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం సరికాదు. సుప్రీం కోర్ట్‌ కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఉల్లఘించి కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే అది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం అవుతుంది. అణగారిన వర్గాల రిజర్వేషన్లను సవరించడం ద్వారా రిజర్వేషన్లను బలహీనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఇది చరిత్రాత్మక నిర్ణయం
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.‘ఈ నిర్ణయం వంద శాతం అమలవుతుందని ఆశిస్తున్నాం. దీని వల్ల దేశంలో ఉన్న కోట్లాది మంది అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరుతుంది. సామాజిక వివక్షే కాదు, ఆర్థిక వెనకబాటును ప్రాతిపాదికను తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లతో పాటతు జాతీయ కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడే రిజర్వేషన్ల ఉద్యమాలు బలహీన పడతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
రిజర్వేషన్లు ఎందుకు.. ఎలా?
దేశంలో రిజర్వేషన్లపై పెద్ద చర్చే జరుగుతోంది. తాజాగా కేంద్రం అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) 10% రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతశాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నాయి? అనేవి ఆసక్తికర పరిణామాలు.
రాజ్యాంగం ఏం చెప్పింది?
అంటరానితనం కారణంగా అనాదిగా నిరాదరణకు, వివక్షకు గురవుతున్న ఎస్సీ,ఎస్టీ, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది.
ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చారు?
అణగారిన వర్గాలుగా భారత ప్రభుత్వం గుర్తించి, నిర్దేశించిన షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ల వారికి రిజర్వేషన్లు కల్పించారు. కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకూ బీసీ(ఎం/ఈ) కింద రిజర్వేషన్లు ఇచ్చారు. భారత రాజ్యాంగం, చట్టాలు, స్థానిక నియమ నిబంధనలు ప్రాతిపదికగా ఇవి అమల్లోకి వచ్చాయి.
స్వాతంత్య్రానికి పూర్వం ఎలా ఉండేది?
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్‌ ఇండియాలో కూడా కొన్ని కులాలు, వర్గాలకు కోటా విధానం ఉండేది. కొల్హాపూర్‌ సంస్థానాధీశుడు సాహూ బ్రాహ్మణేతరులు, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1902లో ఇది అమల్లోకి వచ్చింది. 1932లో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో రిజర్వేషన్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటీష్‌ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ ‘కమ్యూనల్‌ అవార్డ్‌’ను ప్రతిపాదించారు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, భారత క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యురోపియన్లు, అణగారిన వర్గాల వారికి ప్రత్యేక కోటా ప్రాతినిధ్యం కల్పించారు. దీన్ని గాంధీజీ వ్యతిరేకించగా.. అంబేడ్కర్‌ సమర్థించారు.
స్వాతంత్య్రానంతరం ఏం జరిగింది?
ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి దేశ స్వాతంత్య్రానంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అణగారిన వర్గాల అభ్యున్నతికి భారత ప్రభుత్వం 1950లోనే కార్యాచరణ ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన.. విద్యాసంస్థల్లో 20 శాతం సీట్లను ప్రత్యేకించాలని విద్యా మంత్రిత్వశాఖ అప్పట్లోనే ప్రతిపాదించింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగం, ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థలతో పాటు, ఉద్యోగాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఖాళీలను జనాభా ప్రాతిపదికన రిజర్వ్‌చేశారు.
మండల్‌ కమిషన్‌ ఎందుకొచ్చింది?
దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల స్థితిగతుల్ని అధ్యయనం చేసి, సిఫార్సులు చేయడం కోసం 1979 జనవరి 1వ తేదీన అప్పటి మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతాపార్టీ ప్రభుత్వం బి.పి.మండల్‌ నేత ృత్వంలో కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఓబీసీల జన సంఖ్య ఎంత అన్న గణాంకాలు అప్పటికి కమిషన్‌ వద్ద లేవు. దాంతో అది 1931 నాటి జనాభా లెక్కల్ని వినియోగించుకుని వారి జనాభా 52 శాతంగా నిర్ధారణకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని సేవలు, సంస్థల ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కమిషన్‌ సిఫార్సుచేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఇదే రిజర్వేషన్ల అమలుకూ మార్పులు చేయాలని సూచించింది. దీనివల్ల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 49.5%కి చేరుకున్నాయి. మండల్‌ సిఫార్సుల్ని అమలుచేస్తామని 1990లో వి.పి.సింగ్‌ ప్రభుత్వం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విద్యార్థి ఉద్యమాలు చెలరేగాయి. అప్పటికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చినా.. ఆ తర్వాత రిజర్వేషన్ల అమలు మొదలైంది.
రిజర్వేషన్ల ఉద్దేశం?
అనాదిగా కుల వివక్ష, అసమానతలు, అవమానాల్ని ఎదుర్కొంటున్న వర్గాల వారికి తగిన న్యాయం చేయడం కోసం, సమానత్వ సాధన కోసం రిజర్వేషన్ల వ్యవస్థ మొగ్గతొడిగింది. అణగారిన వర్గాల విద్య, సామాజిక స్థితిగతుల్ని పెంపొందించి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ చర్య చేపట్టారు.
ఎక్కడెక్కడ?
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలకు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, వివిధ చట్టసభల్లో సీట్లకు రిజర్వేషన్లు కల్పించారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు 1992లో తేల్చిచెప్పింది. అలా దాటితే.. రాజ్యాంగం ప్రస్తావించిన సమానత్వ హక్కు ఉల్లంఘన జరిగినట్లేనని వ్యాఖ్యానించింది.
మారుతున్న ఆలోచనలు
ా వివక్ష నుంచి ఆర్థికానికి: రిజర్వేషన్లను రాజ్యాంగ నిర్మాతలు దేశంలో కొన్ని సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక ‘వివక్ష’, ‘నిరాదరణ’లకు విరుగుడుగా ముందుకు తెచ్చారనీ, కానీ కొంతకాలంగా ఈ రిజర్వేషన్లకు వివక్షను (డిస్క్రిమినేషన్‌) ప్రాతిపదికగా కాకుండా వెనకబాటుతనానికి (డిప్రైవేషన్‌) విరుగుడుగా చూడటం ఆరంభమవుతోందన్న వాదన వినపడుతోంది. పేదరికమన్నది రకరకాల వివక్షలకు దారితీసే మాట వాస్తవమే అయినా.. ఆ పేదరిక నిర్మూలనకు కేవలం వ్యవస్థాత్మకమైన రిజర్వేషన్లనే పరిష్కారంగా చూడలేమనీ, లేదా ఇప్పటికే ఉన్న పేదరిక నిర్మూలన విధానాలకూ ఇది ప్రత్యామ్నాయం కాదని పలువురు వాదిస్తున్నారు. వివక్షనూ, ఆర్థిక వెనకబాటునూ ఒక గాటన కట్టకూడదన్నది వీరి సిఫార్సు.
ా మినహాయింపు నుంచి విస్తరణకు: రిజర్వేషన్లన్నవి వాస్తవానికి ప్రాథమిక హక్కు అయిన ‘సమానత్వ హక్కు’కు ఒక ప్రత్యేకమైన మినహాయింపుగా ఆరంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు చిరకాలంగా ఎదుర్కొంటున్న సామాజిక వివక్షలను సరిదిద్దేందుకు, సమానత్వ సాధన కోసం రిజర్వేషన్ల విధానాన్ని ‘సమానత్వ హక్కు’కు ఒక మినహాయింపుగా ప్రతిపాదించారనీ, కానీ క్రమేపీ ఇది విస్తరణకు దారితీస్తోందని అంటున్నారు. దీన్ని ప్రత్యేక మినహాయింపుగా కాకుండా వెనకబాటుతనానికి విరుగుడుగా చూడటం వల్లే వివిధ సామాజిక వర్గాలు రిజర్వేషన్ల కోసం ఆరాటపడుతున్నాయి.
ఏ రాష్ట్రంలో ఎంత శాతం?
రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినటికీ..కొన్ని రాష్ట్రాలు స్థానిక జనాభాను దృష్టిలో ఉంచుకుని అంతకుమించి రిజర్వేషన్లు ఇస్తున్నాయి. కొన్నింటిపై కోర్టులు స్టే ఇచ్చాయి.్చ హరియాణా70శాతం : ఎస్సీ20శాతం, బీసీ ఏ16శాతం,బీసీ బీ11శాతం,ప్రత్యేక వెనుకబడిన తరగతులు 10శాతం, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులు 10శాతం, వికలాంగులు3శాతం ్చ తమిళనాడు69శాతం : ఎస్సీ18శాతం, ఎస్టీలు27శాతం, ఏబీసీలు22శాతం ్చ రాజస్థాన్‌54శాతం : ఎస్సీలు16శాతం, ఎస్టీలు12శాతం, ఏబీసీలు26శాతం
్చ ఆంధ్రప్రదేశ్‌50శాతం :బీసీలు 29శాతం, ఎస్సీలుI15శాతం, ఎస్టీలు 6శాతం, (బీసీల కోటాలోనే ముస్లిం రిజర్వేషన్లు అమలు) ్చ తెలంగాణ50శాతం : బీసీలు 28శాతం, ఎస్సీలు15శాతం, ఎస్టీలు 6శాతం, (బీసీల కోటాలోనే ముస్లిం రిజర్వేషన్ల అమలు)
్చ ఈశాన్య రాష్ట్రాలు(అరుణచల్‌ ప్రదేశ్‌,మేఘాలయ, నాగాలాండ్‌,మిజోరం)(ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీ రిజర్వేషన్లు`80శాతం, ఇతరులకు 20శాతం
రిజర్వేషన్లు కల్పించవచ్చు :
ప్రజాభ్యున్నతి దృష్ట్యా కోటా ఇవ్వొచ్చు.. సమానత్వం ప్రాతిపదిక కావాలి.. విస్పష్టంగా చెప్పిన రాజ్యాంగం. రాజ్యాంగ స్ఫూర్తి సమానత్వమేనని, ఏ వర్గానికైనా అవకాశాల్లో ప్రాతినిధ్యం తగ్గిందని పార్లమెంటు నిరభ్యంతరంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అధికరణాలు 15, 16 ఈ విషయాన్ని విపులీకరించాయి.
ఆర్టికల్‌ 15 : (1) మతం, జాతి, కులం, ప్రాంతం, స్త్రీ-పురుష ప్రాతిపదికన ప్రజలపై వివక్ష చూపరాదు (2) మతం, జాతి, కులం, లింగ, ప్రాంత ప్రాతిపదికన ప్రజలను హోటళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌లోకి ప్రవేశాన్ని అడ్డుకోరాదు. వారిని భారంగా చూడరాదు. ఆంక్షలు పెట్టరాదు. ఊరిలో అందరూ ఉపయోగించే బావులు, చెరువులు, స్నాన ఘట్టాలు, ప్రజా వినోద, విలాస ప్రాంతాల్లోకి అనుమతిని నిషేధించరాదు. (3)ఈ ఆర్డికల్‌లోని అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ప్రభుత్వం మహిళలు, పిల్లలకు పత్య్రేక సదుపాయాలు కల్పించవచ్చు. (4) సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల లేదా ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకొనే ఏ చర్యనైనా ఈ అధికరణ అడ్డుకోరాదు. అంటే ఆయా వర్గాల అభివ ృద్ధి నిమిత్తం ఏచర్యనైనా ప్రభుత్వం చేపట్టవచ్చు. ఆర్టికల్‌ 29 (2)కు కూడా ఇదే వర్తిస్తుంది.
ఆర్టికల్‌ 16 : దీని ప్రకారం ఉద్యోగావకాశాల్లో సమానత్వం పాటించాలి. (1) ప్రభుత్వం చేసే ఏ నియామకంలోనైనా లేక ఉపాధి కల్పనలోనైనా సమాన అవకా శాలు కల్పించాలి.(2) మతం, జాతి, కులం, వర్గం, లైంగిక, ప్రాంతీయ, నివాస ప్రాతిపదికన ఏ వ్యక్తికీ ఉపాధి కల్పనలో వివక్ష చూపరాదు.(3) ఏవర్గానికైనా ఉద్యోగావకాశాల కల్పించాలని పార్లమెంటు భావిస్తే ఈ అధికరణ అడ్డుకాబోదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లేక స్థానిక సంస్థలు…ఎక్కడైనా ఏ వర్గానికైనా ఉపాధి కల్పనకు ఇది అడ్డంకి కాదు. (4) ప్రభుత్వ విభాగాల్లో వెనుకబడ్డ వర్గాలకు నియామకాల్లో సరైన ప్రాతినిథ్యం లేదని ప్రభుత్వం భావించినపుడు నియామకాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు. దానికి ఈ అధికరణ అడ్డుకాదు.
వెనుకబాటుతనం సామాజికమా? ఆర్థికమా? :
రిజర్వేషన్లు సామాజికంగా వెనకబడ్డ వర్గాలకు కల్పించాలా లేక ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకా? అన్న చర్చ దాదాపు 70 ఏళ్లుగా సాగుతూనే ఉంది. 1948లో రాజ్యాంగసభలో దీనిపై ఆసక్తికర చర్చే జరిగింది. అసలు వెనకబడ్డ (బ్యాక్‌వర్డ్‌) అనే పదాన్ని ఎలా నిర్వచించాలి? అన్న అంశంపైనే గంటన్నరకు పైగా చర్చ జరిగింది. రాజ్యాంగంలో ఎక్కడా వెనకబడ్డ అన్న పదాన్నే నిర్వచించలేదని హెచ్‌.ఎన్‌.కుంజ్రూ అసంత ృప్తి వ్యక్తం చేశారు. దీనిపై టీటీ కృష్ణమాచారి లేచి ‘ఈ పదం అస్పష్టం, సందిగ్ధం. దీనికి రక రకాల వ్యాఖ్యానాలు చెప్పుకోవచ్చు. పుట్టుకతో వెనకబాటుతనమా, సామాజికంగానా, ఆర్థికంగానా, నిరక్షరాస్యత వల్లా… ఇలా దేనికని వెనకబాటుతనం?’’ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకొన్న కేఎం మున్షీ స్పందిస్తూ ‘‘ఇది అసలు కులానికి చెందినది కాదు.. వర్గానికి చెందినది. కాబట్టి షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు అనకుండా వెనకబడ్డ వర్గాలు అని సంబోధించాలి. అప్పుడు అధికరణం 16(4)లో పేర్కొన్న దానికి సరైన అర్థం, సార్థకత వస్తాయి’’ అన్నారు. దీనికి అంబేడ్కర్‌ సమాధానమిస్తూ ‘ఉదాహరణకు నిర్దిష్ట పోస్టుల్లో ఓ వర్గానికి లేదా అన్ని వెనకబడ్డ వర్గాలకీ కలుపుకొని 70 శాతం రిజర్వేషన్లు ఇస్తే..జనరల్‌ కేటగిరీలో మిగిలేది 30 శాతమే. ఇది సమానత్వం కిందకు వస్తుందా? అందువల్ల మనం సమానత్వపు హక్కు కల్పించాలి. ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం దొరకని కొన్ని కులాలకు అవకాశాలూ కల్పించాలి. ఏప్రాతిపదికన..? అవి సామాజికంగా, సాంస్క ృతికంగా వెనుకబడి ఉన్నవి. బ్యాక్‌వర్డ్‌ పదాన్ని వాడితే అది అధికరణం మొత్తాన్ని తినేస్తుంది. రిజర్వేషన్లు పరిమితిని మించి ఇస్తే అది మంచిదా కాదా.. అన్నది న్యాయవ్యవస్థే తీర్పిస్తుంది’’ అన్నారు.

ఎన్నికల మూడ్‌లో రాజకీయ పక్షాలు

త్వరలో జరగబోయే 2019 సార్వత్రిక ఎన్నికల కోసం అన్నీ రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. లోక్‌సభతోపాటు, రాష్ట్ర శాసనసభకూ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు రంగం సిద్దమవు తోంది ఫిబ్రవరి చివరి వారం లేదా ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీలో మొత్తం 25లోక్‌సభ స్థానాలతోపాటుగా 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రానికి సంబంధించి తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికా రులు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. రాజకీయ పొత్తులు, మద్దతుదారులను కూడగట్టుకోవడం, కార్యకర్తలను బుజ్జగింపులు వంటి సంఘటనలు జోరందుకున్నాయి. ఓటర్లును ఆకట్టుకునేందుకు ఇప్పటికే టీడీపీ సామాజిక పింఛన్లను రెట్టింపుతోపాటు, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా పేరిట వరాలను ప్రకటించింది. ప్రధానంగా సన్నకారు, కౌలు రైతులను లక్ష్యంగా చేసుకుని భారీ నగదు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకం ఉంటుందని తెలుస్తోంది. దీనిద్వారా రైతాంగాన్ని మచ్చిక చేసు కోవడంతోపాటు, ఎన్నికలలో గెలిచేందుకు సులువు అవుతుం దని టీడీపీ భావిస్తూ వ్యూహాలు చేస్తోంది. అదే విధంగా మరిన్ని పథకాలతో పాటు, రాయితీలు, వెసులబాట్లు అన్నీ కలిపి ఓటాను అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రకటించాలని కూడా టీడీపీ ఆలోచిస్తోంది. బడుగు బలహీనవర్గాల కార్పొరేషన్లు ప్రభుత్వం ప్రకటించి ఆవర్గాల ప్రజలను ఆకట్టుకొంటోంది. ఈ విధంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోజుకో పథకాన్ని ప్రవేశపెడుతూ ఎన్నికల చోరులో ఉన్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు`కుంకమ పథకం పథకం కింద పదివేల రూపాయలు పంపిణీ వంటి పథకాలు ప్రవేశపట్టి ఆకట్టుకుంటున్నారు. అయితే ఇలా ఉండగా ఈ పథకాలన్నీ తమవే నని వైకాపా టీడీపీ పార్టీపై ఆరోపణలు చేయడంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతోపాటు ప్రజల్లో కూడా ఎన్నికల కౌంట్‌డౌన్‌ మొదలైంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికల హామీలకు పదును పెడుతోంది. ఫిబ్రవరి 19న బీసీ గర్జన పెట్టి బీసీ ఓట్లను రాబట్టేందుకు సన్నహాలు చేపట్టారు. ఈవిధంగా ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాలని ఆపార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇంకో వైపు జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా అభ్యర్థలు కసరత్తు చేస్తోంది. ఇప్పటి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కౌంట్‌ డౌన్‌ ప్రకటించాయి. 2019 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా 400 లోకసభ స్థానాల్లో రెండువందల ర్యాలీలు నిర్వహించేందుకు ఇప్పటికే బీజేపీ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించే పనిలో నిమగ్నమైంది.
ఇది ఇలాఉండగా ఈసారి లోక్‌సభ ఎన్నికలతో పాలుగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీల ఎన్నికల కూడా జరిపే అవకాశం ఉంటుదంటున్నారు. మరోపక్క తెలంగాణ లోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయితీ ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్దం చేసేందుకు అన్నీ రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియాను ప్రధాన హస్త్రంగా తీసుకోవడం ప్రధాన అంశం. ప్రజల్ని, కార్యకర్తలను ఎన్నికల మూడ్‌లోకి తీసుకు వచ్చేందు కు ప్రజల వద్ద ఉన్న స్మార్‌ఫోన్లు ప్రచార సాధనాలుగా వినియోగించడం విశేషం. ముఖ్యంగా వాటిని ఎన్నికల ప్రచార సాధనాలుగా వాట్సాప్‌.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇతర సోషల్‌ ప్రచార మాధ్యామాలను వినియోగిస్తూ ఆయా పార్టీల బలోపేతానికి రాజకీయ కార్యకర్తలను సిద్దంచేస్తున్నారు. అధికార పక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ పార్టీలు ఈనాలుగేళ్ల కాలంలో ఏం చేశారో ప్రజలకు చెప్పడానికి సిద్దపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని సాధ్యమైనంత మేర తిప్పికొట్టి, ప్రజలకు ఆలోచించు కోవడానికి సమయం దొరుకుతుందనే భావంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఉవ్వూళూరుతున్నారు. ఇక ప్రతిపక్షనేతలు అధికార పార్టీ నేతలు చేసిన అవినీతి, భూ కుంభకోణాలు వెలికితీసీ నాలుగేళ్లలో పాల్పుడిన అవినీతిని బట్టబయలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రజలు కూడా సార్వత్రిక ఎన్నికల మూడ్‌లోకి చేరిపోయారు. ఎన్నికలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈనేపధ్యంలో ఎన్నికల సంఘం కూడా సూచనప్రాయంగా లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో మరీంత ఊపుందుకుంది.
మార్చి మొదటి వారంలో ఎన్నికల ప్రకటన! :
లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం మార్చి మొదటి వారంలో ప్రకటిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్‌ మూడో తేదీన ముగియనుండడంతో ఆలోగానే ఎన్నికల నిర్వహణపై సన్నా హాలు ఆరంభమయ్యాయి. ఎన్ని దశల్లో పోలింగ్‌ నిర్వహించాలి? ఏయే నెలల్లో జరపాలి? అన్నదానిపై ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. భద్రతా దళాల అందుబాటు, తదితర అంశాల ఆధారంగా ఎన్ని దశల్లో నిర్వహించాలన్నది నిర్ణయిస్తారు. సంప్రదాయాన్ని అనుసరించి లోక్‌సభ ఎన్నికలతో పాటు కాలపరిమితి ముగియనున్న ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీల ఎన్నికలు కూడా జరిపే అవకాశం ఉంది. రద్దయిన జమ్ము-కశ్మీర్‌ అసెంబ్లీకి కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు నిర్వహించే అవకాశాలను పరిశీలించవచ్చు. సంక్ష్లిష్టమైన శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా అక్కడ కాస్త ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. అసెంబ్లీల కాల పరిమితి అయిదేళ్లు కాగా, జమ్ము-కశ్మీర్‌కు మాత్రం ఆరేళ్లు ఉంటుంది. వాస్తవానికి 2021 మార్చి16వరకు గడువు ఉన్నప్పటికీ 2018 నవంబరులోనే రద్దు చేశారు. ఆరునెలల్లోగా అంటే మే నెలలోగా దీనికిఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈవిషయాన్ని ఎన్నికల సంఘం అధికారప్రతినిధి వద్ద ప్రస్తావించగా, ఎన్నికల తేదీలను ఎప్పుడు వెల్లడిరచాలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ఇంతకుముందు ఇలా..
2014లో 9దశల్లో ఎన్నికలు జరిగాయి. మార్చి 5న ప్రకటన వెలువడిరది. తొలిదశ ఏప్రిల్‌ 7న, చివరి దశ పోలింగ్‌ మే 12న జరిగాయి. 2009లో 5 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మార్చి 2న ప్రకటన రాగా, ఏప్రిల్‌ 16న తొలి దశ, మే 13న చివరిదశ ఎన్నికలను జరిపారు.
2004లో 4 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 29న ప్రకటన వెలువడగా, తొలి దశ ఏప్రిల్‌ 20న, ఆఖరి దశ మే 10న నిర్వహించారు. – గునపర్తి సైమన్‌

ఎలెక్షన్లు వస్తున్నాయి..జాగ్రత్త!

మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు కీలకం. స్వాతంత్య్రం వచ్చి 72సంవ్సరాలు అయ్యింది. 1950 నుంచి చాలాసార్లు చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. దేశ్యావ్యాప్తంగా జాతీయ పార్టీలు, ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మారుతూ వస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీలు కొత్తగా పుట్టికొస్తున్నాయి. పార్టీలతో పాటు జెండాలు మారుతూ వస్తున్నాయి. కానీ ప్రజా సంక్షేమం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మనకు కన్పిస్తోంది. ఎలెక్షన్లు వస్తే మార్పులు వస్తాయి, సంక్షేమ ప్రభుత్వం వస్తోంది..తమ బ్రతకులు బాగుపడతాయని, గిరిజన,దళితులైన పేదప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఇప్పటి వరకూ ఓటు వేసుకుంటూ వస్తున్నారు !
ప్రతిసారి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎలెక్షన్‌ గేమ్‌లో ప్రజలే కాదు,చదవర్లు,మేథావులు సమిధులుగా అటవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎలెక్షన్‌లో నెగ్గిన రాజకీయ పార్టీ నాయకులందరికీ ప్రజల నాడి అర్ధమైపోయింది. అధికారం చేజిక్కుంచుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెడుతున్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్పరిస్తూన్నారు. ఈరకంగానే ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగుతున్నారు. ఇది ఆంధ్ర,తెలంగాణ అనే కాకుండా దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోను ఉంది. కేవలం రంగులు మాత్రమే మారుతున్నాయి తప్పా, రాజకీయ దోపిడి మామూళ్లుగానే సాగుతోంది. నెగ్గిన ఐదేళ్లపాటు అధికారమనే లైసెన్స్‌ ఆసరాగా తీసుకొని వారిష్టమోచ్చినట్లుగానే వ్యవహరించే వ్యవస్థ తయారైంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ పరిస్థితుల్లో రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నైనా ప్రజలు అప్రమత్తం కావాలి. దీన్ని ప్రజలు సంపూర్ణంగా అర్ధం చేసుకొని చైతన్యవంతులు కావాలి. రాజకీయ నాయకులు ప్రజల అమయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటర్లకు అర్హతలు సరిగా నిర్ణయించకపోవటం, ఓటర్లు డబ్బులకు ఓట్లు అమ్ముకోవటం, ఓట్ల లెక్కింపు విధానం సరిగా లేకపోవటం,రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటింగు లేకపోవటం, దొంగ ఓట్లు వేయటం, పోలింగు కేంద్రాలను ఆక్రమించి రిగ్గింగు చేయటం, బలహీనవర్గాలను పోలింగు కేంద్రాలకు రానీయకుండా అడ్డుకోవడటం, ఎన్నికల్లో మితిమీరిన హింస, తక్కువశాతం పోలింగు కావటం, నేర చరిత్ర ఉన్నవ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనటం,కుల,మత,ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టటం, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల్లో దుర్వినియోగం చేయటం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, అసంబద్ధమైన వాగ్దానాలు చేయటం, సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉపఎన్నికలతో సంవత్సరం పొడవునా, ఐదు సంవత్సరాలపాటు ఎన్నికల వాతావరణం నెలకొనటం, పార్టీల నియంత్రణ చట్టం లేకపోవటం, ఎన్నికల సంఘానికి ఎక్కువ అధికారాలు లేకపోవటం, ప్రభుత్వ, ప్రైవేటు మీడియాను దుర్వనియోగం చేయటం, పార్టీఫిరాయింపులు మొదలగునవి మన ఎన్నికల విధానంలోని ముఖ్యమైన లోపాలగా పరిగణించ వచ్చాల్సి వస్తోంది.
ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ బలంగా ఉండాలంటే రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం చాలాఅవసరం. రాజకీయ పార్టీల వ్యవహారాన్ని అంతరంగిక వ్యవహారంగా భావించరాదు. అవికూడా ప్రజలకు, న్యాయస్థానాలకు, ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఉండాలి. రాజకీయ పార్టీల ఎన్నికలు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన రాజకీయ పార్టీలను మాత్రమే అనుమతించాలి. సాధారణ ఎన్నికల నిర్వహణ సుదీర్ఘకాలంపాటు ఉంటున్నది. దశలు ఎక్కువగా ఉండటం, ఒక్కొక్క దశకు ఎక్కువ కాలపరిమితి ఉండటం వలన సుదీర్ఘ ప్రక్రియగా మారింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోనే ఎన్నికలను నాలుగు దశలలోనే జరపాలన్న నిబంధన ఉండాలి. ఒక్కొక్క దశకు నాలుగు రోజులవ్యవధి మాత్రమే ఉండాలి. ఎన్నికల ప్రకటన తేదీ నుంచి లెక్కింపు తేదీ మధ్య రెండు నెలలకు మించి ఉండకూడదు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో నాలుగింట మూడువంతుల స్థానాలను అభ్యర్థులను ఎన్నుకోవటం ద్వారాను, స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల నిష్పత్తి ప్రకారం రాజకీయ పార్టీలు సూచించిన అభ్యర్థులను ఎంపిక చేయాలి. సాధారణ ఎన్నికల్లో మెజారిటీ రాని చోట్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, కొద్ది రోజుల్లోనే పార్టీ ఫిరాయింపుల వలన అవి కూలిపోవటం, మళ్లీఎన్నికలు ఎదుర్కొన వలసి రావటం గత 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. చట్టసభల కాలపరిమితి ఐదు సంవత్సరాలని చెప్పినప్పటికీ చాలాసార్లు మధ్యలోనే రద్దవుతున్నాయి. పార్లమెంటరీ విధానంలో ఇదొక పెద్ద లోపం. దేశంలోని అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా రాజ్యాం, చట్ట సవరణలు చేసుకోవాలి. కాలపరిమితి ప్రకారమే సాధారణ ఎన్నికలు జరగాలి. పార్లమెంటు,అసెంబ్లీ ఎన్నికలు పార్టీ చిహ్నాల మీద జరిగితే, స్థానిక సంస్థలు, ఇతర సహకార సంఘాల ఎన్నికలు పార్టీ రహితంగా జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం లేక లాటరీ విధానం అనుకరిస్తే ఇంకా మంచిది.ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు ఓట్లను కొనటానికి తెగబడుతున్నారు. ఓటర్లు కూడా చాలామంది ఓట్లు అమ్ముకోవటం తప్పు కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఓటుకు ఇంత ఇవ్వాలని పట్టుబట్టే స్థితికి ఓటర్లు వచ్చారు. దీన్ని నివారించటానికి రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటు విధానాన్ని ప్రవేశపెట్టాలి. బహి రంగ ఓటింగు విధానం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. ఈ పద్ధతివలన ఓటర్లు బాధ్యత కలిగి ఉంటారు. బాధ్యతతో మెలిగే ఓటర్లుకు విలువ పెరుగుతుంది! – ర‌వి రెబ్బాప్ర‌గ‌డ‌,ఎడిట‌ర్

మార్పు అవసరం..!

నేను 1987లో తూర్పుగోదావరిజిల్లా శంఖవరం మండలం గిరిజనప్రాంతమైన పెదమల్లాపురం వెళ్లినప్పుడు చాలా చోట్ల కరెంట్‌లేదు. రోడ్డుల్లేవు. రవాణా సదుపాయాల్లేవు. సైకిళ్ళు, ఎడ్లబండ్లే అక్కడ..అక్కడా కన్పించేవి. కాలినడకనే కొండెక్కి దిగాల్సి వచ్చేది. ఆఖరికి అగ్గిపుల్ల కావాలన్నా కొండదిగిరావాల్సిందే. ఏ గ్రామానికి వెళ్లిన విద్య,వైద్యం అందక ప్రజలు నానా అవస్థలు పడేవారు. బడులుగాని, ఆసుపత్రులుగాని లేవు. చాలామంది పిల్లలు అస్తవ్యస్థంగా కన్పించేవారు. వైద్యం కూడా ఉండేదికాదు. నిత్యావసరాలు దొరికేవి కాదు. కొన్ని ప్రాంతాల్లో అసలు వారపు సంతలే ఉండేవి కాదు. చాలా వరకు ఉత్తరాలు అందని గ్రామాలు ఉండేవి. ఆసమయంలో వేళింగి సమీపంలో ఉండే స్పందన సంస్థ నిర్వహించే స్వర్గీయ కె.ఎస్‌. తిలక్‌ గారి వద్ద నేను, స్థానిక యువకలు కొంతమంది కలసి కొద్దిరోజులు పనిచేశాం. అక్కడ గిరిజనులకు వాహనాలంటే వేళింగిలో ఉన్న స్పందన సెంటర్‌లో ఉండే మోటర్‌ సైకిల్‌ ఆప్రాంత గిరిజనులకు తెలుసు. హెల్మేట్‌ ధరించి వెళ్తూంటే జనం భయపడేవారు. నక్సలైట్లు, పోలీసులు గోడవలు ఎక్కువగా ఉండేవి. భూవివాదాలు అధికంగా ఉండేవి. ఆరోజుల్లో అక్కడ భూస్వాములైన మల్లుదొర లాంటి వాళ్లు ఉండేవాళ్లు. ఇప్పుడు లేరని కాదు !అక్కడ లోతా సుబ్బారావు గారి నాయకత్వంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులకు తెలయపర్చడం, వాటిని పరిష్కరించడం ..ఇలా ప్రజల్ని చైతన్యపర్చడం, సమస్యలపట్ల అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఆ కాలంలో అధికారులు కూడా ప్రజా సమస్యలు పట్టించుకొని తక్షణమే పరిష్కరించేవారు.
ప్రస్తుతం కొత్తభూస్వాములు వచ్చారు. నూతన ఆర్ధిక విధానంలో ప్రభుత్వం ద్వారా పారిశ్రామిక భూస్వాములు తయార య్యారు. ఆరోజుల్లో ప్రభుత్వం పనిచేసే అధికారులు ప్రజల కోసం పనిచేసేవారు. అక్కడ ప్రజల గోడు, వారి పడే బాధలు స్వయంగా పరిశీలించి సమస్యలు పట్టించుకొనేవారు. రహదారి సదుపాయాలు లేకపోయిన కాలినడకన మారుమూల ప్రాంతాలు నడిచి గ్రామాల్లో ప్రజల బాధలు ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు. అటువంటి ఉన్నతాధికారుల్లో బి.డి.శర్మ, కె.బి.సక్సెనా, హర్షమందార్‌, ఈ.ఏ.ఎస్‌. శర్మ, ఆర్‌.శంకరన్‌, ఎం.వి.పి.సి శాస్త్రీ, డి.విజయకుమార్‌, ఎస్‌.నరసింగరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, డాక్టర్‌. బి.వి.రమేష్‌, డాక్టర్‌ ప్రేమచంద్‌, ముఖేష్‌ కుమార్‌ మీనా, డాక్టర్‌ డి.టి.నాయక్‌, వంటి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలపట్ల శ్రద్ద చూపి పరిష్కరించే వారు.
ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా మారాయి. చాలాచోట్ల కరెంట్‌, రోడ్డులు, ఇతర మౌళికసదుపాయాలు వచ్చాయి. వైద్యం, 108,విద్య, ఐసీడీఎస్‌ సెంటర్లు,కమ్యూనికేషన్‌ సెంటర్లు విస్తరించబడ్డాయి. ఏమూలకు వెళ్లినా మొబైల్‌ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అక్షరాస్యత పెరుగుతోంది. చాలామంది గిరిజన యువత చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. మూరుమూల ప్రాంతాల్లో సహితం సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. అయితే ప్రజల్లో సాంకేతికతను పెంచింది తప్పా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం నాటి కాలంలో ఉండే అభివృద్ధి మాత్రమే కన్నిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి..పట్టణాల వైపు దృష్టి చారిస్తోంది. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వేదికగా నిలిచే గిరిజన సదస్సులు ఎక్కడా కన్పించ లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థపై ఖర్చుపెట్టిన నిధులు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడలేదు. అసలు వారికి న్యాయం చేకూరడం లేదు. అయితే గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు యువ ఐఏఎస్‌ అధికారులైన శివశంకర్‌, ప్రసన్న వెంకటేషన్‌ వంటి అధికారులు గత కాలపు ఐఏఎస్‌ అధికారులైన శంకరన్‌, బి.డి.శర్మ వంటి వారి స్పూర్తిని తీసుకొని మారుమూల గిరిజన ప్రాంతాలపై దృష్టిపెట్టి గిరిజనులకు న్యాయం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ గిరిజన ప్రజల్లో చాలా మార్పులంటే వచ్చాయి గానీ, అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. కాలాను గుణంగా గిరిజన ప్రాంతాల్లో మార్పులు వచ్చినా, శంకరన్‌గారి లాంటి ఐఏఎస్‌ అధికారుల స్పూర్తి తీసుకొని పాలనా యంత్రాంగం ప్రజల్లోకి వెళ్లి, వారి అవసరాలు, మౌళిక వసతులు కల్పనకు దృష్టి కేంద్రీకరిస్తే నాటి ఐఏఎస్‌ అధికారులు ఆకాంక్షలు నెరవేరినట్లు అవుతుంది.- రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌

ఆదర‌ణ ప‌థ‌కం

  • రూ.3 వేల కోట్లతో ఆదరణ కింద 6 లక్షల మందికి లబ్ధి
  • మరో 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా జనవరిలో నాలుగో విడత ఆదరణ పథకం
  • 2022 కల్లా ప్రతి ఒక్కరికి శాశ్వత గృహం
  • 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు
  • ప్రతి ఒక్కరికి సంత ృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు
  • పరిశ్రమల స్థాపనకు 15 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు, 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
  • రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
  • ప్రతి కుటుంబానికి కనీసం నెలకు రూ.10 వేల ఆదాయం సమ కూర్చాలి అన్నది తమప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈలక్ష్యం సాకారం అయ్యేం దుకే పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా మన్నారు. డిసెంబరు 28న అనకాపల్లి ఎన్టీఆర్‌ గ్రౌండ్స్లో నిర్వహించిన మెగా గ్రౌండిరగ్‌ మేళాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారు లకు పనిముట్లు ఆస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ఆర్థిక అసమానతలను రూపుమాపి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని లక్ష్యంతో గత నాలుగేళ్లలో పలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నా మన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆదరణ, ఎస్సీలకు ముందడుగు, ఎస్టీలకు చైతన్యం, వికలాంగులకు చేయూత, ముస్లింలకు రోషిని తదితర పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నా మన్నారు. ఆధునిక పనిముట్లు పంపిణీకి ఒకటి, రెండు విడతల ఆదరణ కార్యక్రమాలను విజయవాడ, తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించామని , ప్రస్తుతం అనకాపల్లిలో మూడు విడత ఆదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. ఈ మూడు విడతల్లో రూ.3 వేలకోట్లను వెచ్చిస్తూ 6 లక్షల మందికి లబ్ధిచేకూర్చడం జరుగుతున్నదన్నారు. మరో2లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా జనవరిలో నాలుగో విడత ఆదరణ కార్యక్రమం నిర్వహి స్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి శాశ్వత గృహ కల్పించేందుకు పెద్ద ఎత్తున గృహనిర్మాణ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. 2022కల్లా ప్రతి ఒక్కరికి శాశ్వత గృహ వసతి కల్పిస్తామని ఆయన తెలిపారు. జనవరిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో గృహాలు కావాల్సిన వారందరి నుండి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 2ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరికి సంత ృప్తికర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామన్నారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు, గ ృహాలు మంజూరు చేస్తున్నామన్నారు. విద్యా వైద్య ఆరోగ్య పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. 24 రకాలవైద్య సేవలను అందు బాటులోకి తెచ్చి వైద్య ఖర్చులను చాలా వరకు తగ్గించా మన్నారు. పరిశ్రమల స్థాపనకు 15లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని, 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని ముఖ్య మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100, 200 ఎకరాల్లో ఎంఎస్‌ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీరి ఉత్పత్తులకు ప్యాకింగ్‌, మార్కెటింగ్‌, వేర్‌ హౌసింగ్‌ సౌకర్యాలను కల్పిస్తామని ఆయన తెలి పారు. కుల వృత్తుల ఉత్పత్తుల కూడా వీటి ద్వారా మార్కెటింగ్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
  • అనకాపల్లి నియోజకవర్గంపై వరాల జల్లు
  • అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరియు శాసన సభ్యులు పీలా గోవిందసత్యనారాయణ చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందిస్తూ పలు వరాల జల్లు కురిపించారు. అనకాపల్లి శ్రీనూకంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి సిజిఎఫ్‌ కింద ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు కాపులకు కులదృవీకరణ పత్రాలను మంజూరు చేస్తా మన్నారు. కసింకోట మండలం వెదురుపర్తి రోడ్డు నిర్మా ణానికి 3 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ముస్లింల పాఠశాల మదర్సా నిర్మాణానికి ఒక ఎకరం భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటిం చారు. అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివ ృద్ధికి సహకరిస్తామన్నారు. రూ.24 కోట్లతో తుంపాల ఆనకట్ట నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఈ సంద ర్భంగా శంకుస్థాపన చేశారు. తుంపాల షుగర్‌ఫ్యాక్టరీని పునఃప్రారం భించారు. గత నాలుగేళ్ల కాలంలో ఒక్కఅనకాపల్లి నియోజ కవర్గం నియోజ కవర్గంలోనే 98 వేల 724 పనులకు రూ.1,985కోట్లు ఖర్చు చేస్తు న్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప,రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రావత్‌, సాంగే సంక్షేమ శాఖ కార్యదర్శి విజయ కుమార్‌, బీసీ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఉదయలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్కుమార్‌, శాసనసభ్యులు పీలా గోవింద్‌ సత్యనారాయణ, పంచకర్ల రమేష్బాబు, బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. – స‌తీష్ కుమార్‌

విశాఖ ఉత్సవ్‌

పర్యాటక అభివృద్ధిలో విశాఖను ప్రధమశ్రేణిలో తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ప్రభుత్వం నాలుగు ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ‘విశాఖ ఉత్సవ్‌’’ ఈసంవత్సరం కూడా అంగరంగ వైభంగా నిర్వహించారు. డిసెంబరు 28,29,30 తేదీల్లో ఏర్పాటు చేసిన ఉత్సవాలు అంతర్జాతీయ ఖ్యాతిని ఇనుముడిరప చేశాయి. రామకృష్ణాబీచ్‌లో నిర్వహించిన ఉత్సవాలను రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలను విశాఖనగరం ఆకర్షించే విధంగా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖను మించిన పర్యాటకనగరం దేశంలో మరొకటి లేదన్నారు. ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి పర్యాటక రంగం దోహదపడు తుంద న్నారు. సేవల రంగంలో పర్యాటక రంగం ముఖ్యమని చెప్పారు. వ్యవసాయ అనుబంధరంగాల కంటే పర్యాటకరంగంలో ఉపాధి అవకా శాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
విశాఖనగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్తుతామని పేర్కొన్నారు. రానున్న కాలంలో విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నాలుగుయేళ్లలో 20వేల రూమ్‌లు నిర్మించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతినెల నగరంలో ఒక ఉత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. విశాఖపట్నంలో ఏమ్యూజిమెంట్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. స్కూభా డైవింగ్‌ ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. వచ్చే జూన్‌ నాటికి విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను అందిస్తామన్నారు. తొందరలో భోగాపురం ఎయిర్‌ పోర్టుకు టెండర్లు పిలుస్తామన్నారు. కాకినాడకు బీచ్‌లను ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని తెలిపారు. విశాఖనగరం ప్రశాంత నగరమని, భూకబ్జాలకు, నేరాలకు అవకాశం ఉండకూడదన్నారు. బుద్దిజం అభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి లేపాక్షిలను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామన్నారు. అరకువేలి, లంబసింగిలో సమ్మర్‌ రిసార్ట్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నంలో పారిశుద్ద్యం బాగుందని జీవీఎంసీ కమిషన్‌ను అభినందించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి, నగరావాయిద్యాన్ని వాయించి ఉత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ విశాఖ ఉత్సవ్‌ నిర్వహణపై ప్రారంభోపన్యాసం చేశారు. విశాఖ ఉత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివా సరావు, కార్మికశాఖ మంత్రి కె.అచ్చెయ్య నాయుడు, ఎంపీఎం. శ్రీనివా సరావు, ఈస్ట్రన్‌ నేవిల్‌ కమెండ్‌ చీఫ్‌ కరంభీర్‌సింగ్‌, శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ బసంత్‌ కుమార్‌, జీవీఎంసీ కమిషనర్‌ ఎం.హరి నారాయణన్‌,జాయింట్‌ కలెక్టర్‌ జి. సృజన,సిపీ మహేంద్ర లడ్డా తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు సందర్భంగా నగరంలోని సిటీ సెంట్రల్‌ పార్కు లోను, వుడా పార్కులోఏర్పాటు చేసిన పుష్పప్రదర్శనలు, ఆర్కేబీచ్‌కు కేంద్రంగా నిర్వహించిన పలుసాంస్కృతిక కార్యక్రమాలు మూడు రోజుల పాటు నగరప్రజల్ని మైమరిపించాయి.
ఆకట్టుకున్న పుష్పప్రదర్శన :
విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డవలప్‌మెంట్‌ ఆధారిటీ (వీఎం ఆర్‌డీఏ) ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ రకాల పూల ఆకృతులతో సుమారు 130 ఆకుల పుష్పాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రజను ఆకట్టుకునేలా థాయలాండ్‌, కోల్‌కొత్తా, బెంగళూరు, కడియం నుంచి ఆకర్షణీయమైన పుష్పాలను తెప్పించి ప్రదర్శనలో ఉంచారు. పుష్పఆకృతులతోపాటు డ్రై ప్లవర్స్‌, వెజిటబుల్‌ కార్వింగ్‌ తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి -స‌తీష్‌.

మెరిసిన మొద‌టి అక్ష‌రం

స్త్రీ సాధికారత కోసం, వారి హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి జీవితం ఆదర్శప్రాయం. వారు చూపిన మార్గాన్ని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి. సావిత్రిబాయి పూలే దేశంలో సామాజిక చైతన్యాన్ని, స్త్రీ చైతన్యాన్ని కలిగించిన వారిలో ముఖ్యలు. ఆరోజుల్లో అణగారిన వర్గాలకు, స్త్రీలకు చదువుకోవడానికి పాఠశాలలు ఉండేవి కావు. అందుకే సావిత్రిబాయి పెళ్లికి ముందు మూడవ తరగతి వరకే చదివారు. పెళ్లి తర్వాత జ్యోతిబా పూలే చొరవతో తిరిగి చదువుకొనసాగించారు. అంతేకాదు. పూలే ఆమె చదువుకునే అవకాశం కల్పిండమే కాదు ఆమె చదువు పదిమందికి ఉపయోగపడేలా టీచర్‌ ట్రైనింగ్‌ కూడా ఇచ్చారు. అలా సావిత్రిబాయి తాను విద్య నేర్చుకుని, పదిమందికి నేర్పించారు. ఈ విధంగా సావిత్రిబాయి ఈ దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని, స్త్రీలు చదవగలరు, రాయగలరు, పోరాటం చేయగలరని నిరూపించిన దార్శనికురాలు సావిత్రిబాయి పూలే. అట్టడుగు వర్గాలకు చదువు చెప్పడానికి వెళ్లేటప్పుడు ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. – గునపర్తి సైమన్‌
పూలే దంపతులు మహారాష్ట్రలో బలమైన సామాజిక ఉద్యమాలను నిర్మించారు. మహారాష్ట్రంలో అణగారిన వర్గాల వారు నివసించే ప్రాంతాల్లో మొదట పాఠశాలు ప్రారంభించారు. తర్వాత ఆడపిల్లల కోసం కూడా ప్రత్యేక పాఠశాలలను పూలే దంపతులు ఏర్పాటు చేశారు. వారు స్థాపించిన పాఠశాలలో నాడు విద్యకు నోచుకోని స్త్రీలు, అణగారిన వర్గాల విద్యార్థులు ఎంతో మంది చదువుకున్నారు. సావిత్రిబాయి అట్టడుగు వర్గాలకు విద్య నేర్పించడానికి అగ్రకులాల వారు సహించలేకపోయారు. ఆమెను అనేక అవమానాలకు గురిచేశారు. ఆమెపై కోడిగుడ్లు, టమాటాలు, బురద, రాళ్లు విసిరేవారు. వారి చర్యలతో విసుగు చెందిన సావిత్రి ఉద్యోగం మానాలని భావించారు. అయితే భర్త ఇచ్చిన ప్రోత్సహంతో సావిత్రిబాయి పోరాటాన్ని వదిలిపెట్టలేదు. ఏ సమాజం సంకెళ్లు విధించిందో వాటిని తెంపి స్త్రీ విద్య, వారి హక్కుల కోసం నిరంతరం ఉద్యమించారు. సావిత్రి బాయి అణగారిని వర్గాల వారినేకాకుండా బ్రహ్మణ స్త్రీలకు కూడా ఆదరించారు. అగ్రవర్ణాల్లోని వితంతువలను చేరదీశారు. వారికి కొత్త జీవితాలను ప్రసాదించారు. వితంతువుల కోసం, వారి పిల్లల కోసం జ్యోతిరావు శరణాలయాలను స్థాపించారు. ఇందులో కూడా సావిత్రిబాయి తన సేవలను అందించారు. జ్యోతిరావు పూలే 1837లో సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారు. అందులో భర్తతోపాటు సావిత్రిబాయి క్రీయాశీలయంగా పాల్గొన్నారు.187677,189697లో మహారాష్ట్రంలో కరువు కాటకాలు సంభవించాయి. అప్పుడు ఉచిత భోజన వసతి హాస్టళ్లను ఏర్పాటు చేయాలని, కరువు నివారణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆసమయంలో సత్యశోధక సమాజ్‌ చేసిన సేవ, ముఖ్యంగా సావిత్రిబాయి చేసిన సేవ చిరస్మరణీయం.
బాల్యం :
శ్రీమతి సావిత్రి బాయి పూలే మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3న జన్మించింది. ఆమెది రైతుకుటుంబం. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధు త్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్‌ జిల్లాలో బోధన్‌ నాందేడ్‌ కొండల్‌ వాడి ప్రాంతంలో , అదిలాబాద్‌ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్‌ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి బంధువులు. శ్రీమతి సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడారు. ఆదంపతులకు పిల్లలు లేరు. వీరు యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు)ను దత్తత తీసుకున్నారు. ‘‘జ్యోతీరావు ఫూలె’’ ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్‌ నగర్‌లోఉపాధ్యాయునిగా శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. అట్టడుగువర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మ్నెట్టమ్నెదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశా లలను ప్రారంభించి ఉచితవిద్యనం దించారు. 1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మ్నెదటి మహిళ ఉపాద్యాయురాలు, దళితుల, స్త్రీల విద్యా ్య్ష వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులు గృహ బహిష్కారానికి గురిచేశారు.
సామాజిక విప్లవకారిణి :
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో ‘‘సత్యాన్ని’’ శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి ‘‘సత్యశోధక్‌ సమాజ్‌ ‘‘ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మనిజ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.యశ్వంత్‌ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేత ృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన క ృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాటశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా ంసపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించారు. ప్రతీ భారతీయ మహిళ మూడాచారాలకు,మూఢనమ్మకాలు వ్యతిరేకంగా శ్రీమతి సావిత్రి బాయి పూలే స్ఫూర్తితో ప్రజలలో చైతన్యం తీసుకురావాలి.
యుద్ధ వితంతువు పిల్లలతో జీవనం.
హిందూ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీని వితంతువు అంటారు. వీరిని వ్యవహారంలో ముండమోపి , విధవ అని కూడా వ్యవహరిస్తారు. గతంలో వీరు సమాజంలో అనేక అవమానాలను ఎదుర్కొనేవారు. ఇప్పటికీ అక్కడక్కడా వీరికి ఇలాంటి అనుభవాలు ఎదురు అవుతూనే ఉంటాయి. కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహనరాయ్‌ వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రస్తుతము వీరు గౌరవ ప్రథమైన జీవితమును గడుపుతున్నారు. వితంతు కుమార్తె ,విడాకులు పొందిన కూతురూ కుటుంబ పింఛనుకు అర్హులే పింఛను పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయనపై ఆధారపడిన వితంతు, విడాకులు పొందిన కుమార్తె కుటుంబ పింఛను పొందవచ్చు. ఈవిషయంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి.గతంలో ఉద్యోగి బతికి ఉండగానే కూతురు వితంతువై లేదా విడాకులు పొంది ఉంటేనే పింఛను అందేది. 25 ఏళ్ల వయోపరిమితి వరకే వర్తింపజేయాలనే నిబంధన ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం వితంతు, విడాకులు పొందిన కూతురు మళ్లీ వివాహం చేసుకున్నా, మరణించినా ,ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి లేదా స్వయంఉపాధి ద్వారా నెలకు రూ.2440 పొందుతున్నా పింఛను ఆగిపోతుంది. మానవ హక్కులు అనేవి ‘‘మానవులకు సంక్రమించే హక్కులు మరియు స్వేచ్ఛలు.’’ ఈ భావనను ప్రతిపాదించిన వారు సాధారణంగా ప్రతి ఒక్కరు వారు కేవలం మానవులు అయిన కారణంగానే కొన్ని హక్కులకు అర్హులని పేర్కొన్నారు. కాబట్టి మానవ హక్కులు అనేవి ఒక సార్వత్రిక మరియు సమసమాజ శైలికి చెందినవి. వాస్తవ మానవ నైతికత యొక్క భాగంగా మాత్రమే అటువంటి హక్కులు ఉంటాయి, ఎందుకంటే న్యాయబద్ధ నైతిక సూత్రాలు లేదా సహజ హక్కులు బలమైన కారణాలచే లభిస్తాయి, లేదా అంతర్జాతీయ చట్టం పరిధిలో లేదా జాతీయ స్థాయిలో చట్టబద్ధమైన హక్కులుగానో లభిస్తాయి. కానీ, పైన చెప్పిన భావనలలో ఎందులోనూ దేనిని మానవహక్కుగా పరిగణించాలో, పరిగణించ కూడదో అనే విషయంపై ఏకాభిప్రాయం లేదు మరియు మానవ హక్కుల అమూర్త భావన అనేది ఎప్పుడూ తీవ్ర వేదాంత చర్చ మరియు విమర్శకు దారితీస్తూనే ఉంది.

గిరిజన ఉద్యమం

  • భారతదేశంలో బ్రిటిషర్ల కాలంలో వివిధ కారణాలతో ప్రారంభమైన గిరిజనోద్యమాలు స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగాయి. బ్రిటిషర్ల పాలనలో జరిగిన తిరుగుబాట్లను మూడు దశలుగా విభజించవచ్చు.
  • 1795-1860 మధ్య కాలం: బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపన, విస్తరణ జరుగుతున్న కాలంలో చెలరేగిన తిరుగుబాట్లు.
  • 1861-1920 మధ్య కాలం: వలస పాలన, ఆర్థిక మూలధనం గిరిజనుల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల జరిగిన తిరుగుబాట్లు.
  • 1921-1947 మధ్య కాలం: స్వాతంత్య్ర పోరాటం కొనసాగుతున్న కాలంలో జరిగిన తిరుగుబాట్లు.
  • బ్రిటిష్‌ కాలంలో జరిగిన ప్రముఖ గిరిజన తిరుగుబాట్లు
  • రంపా తిరుగుబాటు (ఆంధ్రా)
  • 1766లో నిజాం రాజు రంపా ప్రాంతాన్ని తూర్పు ఇండి యా కంపెనీకి ఇచ్చాడు. కంపెనీ అధికారుల మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా 1802-03లో రామభూపతి నాయకత్వంలో కోయలు, కొండరెడ్లు తదితర గిరిజన తెగలు పోరాటం సాగించాయి. 1813లో బ్రిటిషర్లు రామభూపతిని ఈ ప్రాంతానికి అధిపతిగా అంగీకరిం చడంతో పోరాటాన్ని నిలిపేశారు. కానీ, ఆతర్వాత రామభూపతి కుమారుడు బ్రిటిష్‌ అధికారుల ప్రోద్బలంతో గిరిజనులపై అనేక రకాల పన్నులు విధించడంతో వారు తమ్మన్నదొర నాయకత్వంలో 1879లో మళ్లీ తిరుగుబాటు చేశారు. ఇదివిశాఖ, భద్రాచలం, రేకపల్లి, చోడ వరం మొదలైన ప్రాంతాలకు విస్తరించింది. 1880లో సైనిక బలంతో ఈ తిరుగుబాటు బలవంతంగా అణచివేశారు.
  • ఖోండుల తిరుగుబాటు (ఒడిశా)
  • ఖోండులు మొదటిసారిగా 1817లో తిరుగుబాటు లేవదీ శారు. తర్వాత 1830లో చినోయిదొర, 1850లో చక్రబోయి దొర, 1857లో సురేంద్రసాయి నాయకత్వంలో కంపెనీ అధికారులకు వ్యతి రేకంగా పోరాటం సాగించారు. 1894లో కొండసవరలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లన్నింటినీ సైనికబలంతో అణచివేశారు.
  • కోల్‌ తిరుగుబాటు
  • ఛోటా నాగపూర్‌ ప్రాంతంలో కోల్‌ గిరిజన తెగకు చెందిన వారు నివసించేవారు. బ్రిటిష్‌ పాలకులు గిరిజనేతర రైతులను గిరిజన ప్రాంతాల్లో స్థిరపడేలా ప్రోత్సహించడంతో భూ యజమానులతో కౌలు సంబంధాలు మొదలయ్యాయి. దీంతో ద్రవ్య విధానం కూడా ప్రారంభ మైంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, దోపిడీలు మొదలయ్యాయి. కోల్‌ గిరిజన ప్రముఖులు హిందువులుగా మారడంతో గిరిజనుల్లో అశాంతి అధికమైంది. గిరిజనులు వారిభూముల్లో వారే కట్టు బానిసలుగా మారారు. ప్రభుత్వ, గ ృహ అవసరాల్లోనూ శ్రమ దోపిడీ ఎక్కువైంది. వీటికి నిరసనగా కోల్‌లు 1831-32లో తిరుగుబాటు చేశారు.
  • సంతాల్‌ల తిరుగుబాటు
  • ఈ తిరుగుబాటు బిహార్‌,బెంగాల్‌,ఒడిశా ప్రాంతాల్లో సంభ వించింది. దీన్ని గొప్ప తిరుగుబాటుగా పేర్కొంటారు. దీనికి ప్రముఖ కారణం కార్‌నవాలీస్‌ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తువిధానం. దీనికి వ్యతి రేకంగా సంతాల్‌లు 1811,1823,1829లో తిరుగుబాట్లు చేశారు. 1854లో కన్హూ,సిద్ధుఅనే గిరిజన సోదరుల నాయకత్వంలో ఈ తిరుగు బాటు మరోసారి చెలరేగింది. వీరు జమీందార్ల భూముల ఆక్రమణకు ప్రయత్నించారు. 1855జూన్‌లో ఈ సోదరుల నాయకత్వంలో సంతా ల్‌ల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు ర్యాలీనిర్వహించారు. ఈ పోరాటంలో 15,000 నుంచి 25,000 సంతాల్‌లు బ్రిటిష్‌ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు.1856 ఫిబ్రవరిలో కన్హూ కూడా సైన్యం చేతిలో మరణించాడు. 1885 జూలైలో బ్రిటిష్‌ ప్రభుత్వం మార్షల్‌ లా విధించి ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసింది.
  • బస్తర్‌ తిరుగుబాటు (ఛత్తీస్‌గఢ్‌)
  • బస్తర్‌ ప్రాంతంలో మురియా, మరియా, హాల్భా మొదలైన గోండు తెగలు జీవించేవారు. బ్రిటిషర్ల రాకతో బనియాలు, రోహిల్లాలు మొదలైన వడ్డీ వ్యాపారులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు గోండుల భూములు ఆక్రమించుకోవడం, వెట్టిచాకిరీ చేయించడం, స్త్రీలను వేధించడం మొదలైన ఆక ృత్యాలకు ఒడిగట్టారు. దీంతో గిరిజనులు 1880లో తిరుగుబాటు చేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం1891 నాటికి ఈ తిరుగుబాటును అణచివేసింది.
  • ముండాల తిరుగుబాటు (బిహార్‌)
  • ఛోటా నాగపూర్‌ ప్రాంతంలో నివసించే మరోగిరిజన తెగ ముండాలు. తెగలో అంతర్యుద్ధాల కారణంగా వీరి భూమిలో కొంత భాగం సమీప హిందూ రాజుల పాలనలోకి వెళ్లింది. దీంతో అనేక మంది గిరిజన నాయకులు హిందూ మతం స్వీకరించారు. క్రమంగా అధికసంఖ్యలో గిరిజనేతరులు స్థిరపడటంతో వీళ్ల పరిస్థితి దిగజా రింది. క్రైస్తవ మిషనరీల ప్రచారంతో ఆమతాన్ని స్వీకరిస్తే తమ పరిస్థితి మెరుగవుతుందని భావించి ముండాలు అధిక సంఖ్యలో మతమార్పిడి చేసుకున్నారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. చివరకు 1895లో బిర్సా ముండా నాయకత్వంలో తమ ప్రాంతాల్లో స్థిరపడ్డ గిరిజనేతరు లందరినీ తరిమివేయాలని తిరుగుబాటు ప్రారంభించారు. బిర్సా ముండాను 1895లో నిర్బంధించగా తెగ ప్రజలు విడిపించుకున్నారు. 1899 నాటికి తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరింది. 1900లో బిర్సా ముండాను మళ్లీ నిర్బంధించారు. కారాగారంలో హింసించడంతో ఇతడు మరణించాడు. దీంతో క్రమంగా ఈ ఉద్యమం బలహీనమైంది.
  • గోండుల తిరుగుబాటు (తెలంగాణ)
  • తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ‘కొమరం భీం’ నాయక త్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. ఈయన 1901 అక్టోబర్‌ 22న ఆదిలాబాద్‌ జిల్లాలో ‘జోడెఘాట్‌’ ప్రాంతంలో జన్మించారు. నిరక్షరాస్యుడైనప్పటికీ ఆప్రాంతంలో గోండు, కొలాం మొదలైన గిరిజన తెగలను ఏకం చేసి నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపారు. జోడెఘాట్‌పై దాడికి ప్రయత్నించిన నిజాం సైన్యాన్ని సంప్రదాయ ఆయుధాలతోనే ఎదుర్కొన్నారు. ‘జల్‌, జంగల్‌, జమీన్‌ (నీరు, అటవీ, భూమి) మనవే’ అనే నినాదంతో గిరిజనులను చైతన్యపరిచారు. భగత్‌సింగ్‌, అల్లూరి సీతారామరాజు ప్రభావంతో ఈ ఉద్యమాన్ని నడిపించారు. నిజాం ప్రభుత్వం ఈయణ్ని బంధించ డానికి స్థానిక తాలుక్‌దార్‌ ‘అబ్దుల్‌ సత్తార్‌’ను నియమించింది. ఆయన విఫలం చెందడంతో నిజాం సైన్యమే ప్రత్యక్ష దాడికి దిగింది.
  • 1940 అక్టోబర్‌ 8న జరిగిన దాడిలో ‘కొమరం భీం’ వీర మరణం పొందారు. ఈయణ్ని సైన్యానికి కుర్థం పటేల్‌ చూపించాడు. ‘కొమరం భీం’ను నిజాం పాలకుల నుంచి తెలంగాణ ప్రజల స్వాతంత్య్రానికి ప్రయత్నిం చిన మొదటి వ్యక్తిగా అభివర్ణిస్తారు. కమ్యూనిస్ట్‌ నాయకులు ‘పుచ్చలపల్లి సుందరయ్య’ ఈయన జీవిత చరిత్రను రచించారు. గోండులు ఈయణ్ని దేవుడిగా ఆరాధిస్తారు.
  • తానాభగత్‌ ఉద్యమం (బిహార్‌, 1914)
  • ఛోటా నాగపూర్‌ ప్రాంతంలో ఓర్గాన్‌ అనే ఆదిమవాసులు నివసించేవారు. వీరు పెద్ద ఎత్తున హిందూ సంస్క ృతీకరణ కోసం పేరు చివరన భగత్‌ అనే పదాన్ని చేర్చుకొని తమ స్థాయి మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇతరప్రాంతాల గిరిజనేతరులు అక్కడ చేరి తమకు అన్యాయం చేస్తున్నారని వారిని తరిమేసేందుకు ఉద్యమించారు.
  • మన్యం తిరుగుబాటు (ఆంధ్ర,1922-24)
  • మద్రాసు రెసిడెన్సీలో ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతం 19,287 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉండేది. ఇందులో గంజాం, విశాఖపట్నం, గోదావరి ప్రాంతాలు ఉండేవి. బ్రిటిష్‌ ప్రభుత్వం 1882లో మద్రాస్‌ అటవీ చట్టం చేసి పోడు వ్యవసాయంపై అనేక ఆంక్షలు విధించింది. ఇక్కడి గిరిజన తెగల్లో కోయలు, కొండరెడ్లు అధిక సంఖ్యలో ఉండే వారు. బ్రిటిష్‌ అధికారుల సహాయంతో స్థానిక నేతలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. దీంతో విసిగిపోయిన గిరిజనులను అల్లూరి సీతారామ రాజు సమైక్యపరిచి తిరుగుబాటు లేవదీశారు. గెరిల్లా పోరాట పద్ధతి లో ఈ తిరుగుబాటు సాగింది. పోలీస్‌ స్టేషన్లపై దాడి చేసి ఆయు ధాలను సేకరించేవారు. సీతారామరాజు అనుచరులతో మొదట చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. తర్వాత అడ్డతీగల, రాజ ఒమ్మంగి, కృష్ణదేవిపేట మొదలైన పోలీసు స్టేషన్లపై దాడి చేశారు.ఈ తిరుగుబాటును అణచివేసేందుకు మద్రాసు ప్రభుత్వం ‘రూథర్‌ ఫర్డ్‌’ను పంపించింది. సీతారామరాజు ముఖ్య అనుచరుడైన గొంముల్లు దొరను 1923 సెప్టెంబర్‌లో నిర్బంధించారు. మరో అనుచరుడు ‘అగ్గిరాజు’ను కాల్చి చంపారు.
  • దీంతో ఈ ఉద్యమం ముఖ్య నాయకు లను కోల్పోయింది. చివరకు 1924 మే7న సీతారామరాజును కాల్చి చంపడంతో ఈ ఉద్యమం అంతరించిపోయింది.
  • కొండ సవరలు తిరుగుబాటు (1943, ఒడిశా)
  • కోరాపుట్‌ జిల్లాలో గిరిజనులు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా లక్ష్మణ్‌ నాయక్‌ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం అతణ్ని నిర్బంధించి 1943లో బెరంపూర్‌ జైలులోఉరి తీసింది. దీంతో ఈ తిరుగుబాటు ఆగి పోయింది.
  • వర్లీ తిరుగుబాటు (1944) (మహారాష్ట్ర)
  • మహారాష్ట్రలోని థానే జిల్లాలో వర్లీ ఆదిమ తెగలు నివసిం చేవి. పంటకోతల సమయంలో కూలీ రోజుకు 12 అణాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ తిరుగుబాటు మొదలైంది. 1945లో కిసాన్‌సభ ఇచ్చిన పిలుపుతో భూస్వాముల భూములు దున్నవద్దని, వెట్టిచాకిరీ చేయొద్దని, అత్యాచారాలను ప్రతిఘటించాలనే లక్ష్యాలతో వీరు తిరుగుబాటును కొనసాగించారు. 1946లో వర్లీ మహాసభ జరిగింది. చివరకు వ్యాపారులు, భూస్వాములు రాజీకి వచ్చారు. వర్లీ గిరిజనులు డిమాండ్‌ చేసినదాని కంటే ఎక్కువ కూలీ సాధించుకున్నారు. ఈ తిరుగుబాటు ఘన విజయం సాధించింది.
  • ఛోటా నాగపూర్‌ పీఠభూమి ప్రాంతాలు
  • ా జార్ఖండ్‌ (అధిక భాగం)
  • ా ఒడిశా
  • ా పశ్చిమ బెంగాల్‌
  • ా ఛత్తీస్‌గఢ్‌
  • ా బిహార్‌
  • గిరిజనోద్యమాలకు కారణాలు
  • । గిరిజన ప్రాంతాలను బ్రిటిష్‌ సామ్రాజ్యంలో కలిపేందుకు ప్రయత్నించడం. దీనివల్ల తరతరాలుగా అనుభవిస్తున్న అటవీ సంపద, భూములపై గిరిజనులకు అధికారంకోల్పోయే పరిస్థితి తలెత్తింది. గిరిజనుల భూములను ఆక్రమించి, వారిని కట్టుబానిసలుగా మార్చడం.
  • । గిరిజనుల సంస్కృతి, ఆచారాల్లో జోక్యం చేసుకోవడం.
  • । వస్తు మార్పిడి స్థానంలో ద్రవ్య మార్పిడి విధానం చోటు చేసుకోవటంతో వడ్డీ వ్యాపారుల అక్రమాలు.
  • । గిరిజనుల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కులను హరించడం.
  • । అటవీ నియంత్రణ చట్టం-1865, భారత అటవీ చట్టం- 1878, భారత అటవీ చట్టం-1927 మొదలైన వాటిలో గిరిజనుల హక్కులను గుర్తించకపోవడం.
  • । స్వాతంత్య్రానంతరం అభివ ృద్ధి పేరుతో పరిశ్రమలు, ఆనకట్టల నిర్మాణం చేపట్టడంతో గిరిజనులు తమ ఆవాసాలు కోల్పోవడం. వారికి సరైన పునరావాసం కల్పించకపోవడం.- సకరణ : థింసా రీసెర్చ్‌ టీమ్‌

ఎన్నికల శాసనుడు..శేష జీవితంలో సేవకుడు

ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ సులువుగా జరుగుతున్నదంటే మాజీ భారతఎన్నికల అధికారి టి.ఎన్‌.శేషన్‌ చలువే అని ఒప్పుకోక తప్పదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లోని ఎన్నికల వ్యవస్థలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి ఆయన. దేశం లో10వ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా, గొప్ప పరిపాలనాధ్యక్షుడిగా టి.ఎన్‌.శేషన్‌ పేరు గడిర చారు. కేరళలో పుట్టిన శేషన్‌ ఐఏఎస్‌ హోదాతో వివిధశాఖల్లో పదవులు నిర్వహించారు. తమిళ నాడులోనే ఎక్కువగా ప్రజాసేవలందించిన శేషన్‌ అక్కడే స్థిర పడ్డారు. భారత ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న సందర్భంలో ఓటు హక్కు కలిగిన భారతీయులందరూ చైతన్యం తో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందుకోసం భారత ప్రభుత్వం ఓటర్లను చైతన్య పరచాలనే 2016 నుంచి ‘జనవరి 25’ను జాతీయ ఓటర్ల దినోత్సవం’గా నిర్వహిస్తోంది. శేషన్‌ చేసిన ఎన్నికల సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం పదోతరగతి సాంఫీుక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠంలో చేర్చారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ జిల్లా తిరునెల్లు గ్రామంలో జన్మించిన తిరునెల్లు నారాయణ అయ్యర్‌ శేషన్‌ ఐఏఎస్‌ సర్వీసులో తమిళనాడులోని కోయంబత్తూరు, దిండి గల్‌ జిల్లాల్లో సహాయ కలెక్టర్‌గా, మధురై కలెక్టర్‌గా, రవాణా శాఖ డైరెక్టర్‌గా, వ్యవసాయ, కార్మికశాఖల కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. 10వ ఎన్ని కల ప్రధానాధికారిగా 1990 నుంచి 1996 వరకు పని చేశారు. దక్షిణ భారతదేశం నుంచి ఆర్థిక సంస్కరణలతో ప్రధానమంత్రి పి.వి. నరసిం హారావు పేరు ప్రఖ్యాతలు గడిరచగా, మరో ప్రక్క ఎన్నికల సంస్కరణలతో తనదైన శైలిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వ్యక్తి శేషన్‌. శేషన్‌ తన విధులలో ముఖ్యంగా ఎన్నికల సంఘం నిర్ణయాలలో నిక్కచ్చి గా వ్యవహిరిస్తూ, మీడియాను సైతం దూరంలో ఉంచేవారు. శేషన్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలతోనే ఎన్నికల వ్యవస్థలో పలుమార్పులు చోటు చేసుకు న్నాయి. 1991 మధ్య జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ‘ఓటరు గుర్తింపు కార్డు’ ప్రవేశ పెట్టారు. ఓటరు కనీస అర్హత వయస్సు 21 సంవ త్సరాల నుంచి 18 సంవత్సరాలకు కుదించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చును పరిమితం చేశారు. ఒక అభ్యర్థి రెండు నియోజక వర్గాల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయరాదు. కులం పేరుతో ఓట్లను అభ్యర్థించడం నిషేధం. పోలింగ్‌ కేంద్రాల్లోకి ఓటర్లను తరలిం చడం, ప్రభుత్వ యంత్రాంగం సాయం పొందటం చట్ట విరుద్ధం. పోలింగ్‌ సమయంలో ఇతరులు పోలింగ్‌ బూతుకు 200 మీటర్ల దూరంలో ఉండాలి. గుమిగూడి ఉండటం నేరం. పోలీసులు 144 సెక్షన్‌ విధించాలి. ఒక వ్యక్తి ఏదైనా నేరంలో కనీసం 2 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తే ఆరు సంవత్సరాల పాటు పోటీకి అనర్హులు.
పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదా వేయాలి. కాని రద్దు చేయకూడదు. ప్రచా రం పూర్తి అయిన తర్వాత 48గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలి.ఎన్నికల సంఘం చరిత్రలో శేషన్‌ హయాం ఓస్వర్ణయుగం. ఎన్నికల్లో పారదర్శకత కోసం చేసిన క ృషికిగానూ, 1996లో ఆయన ‘రామన్‌మెగ్‌సేసే’ అవార్డు అందుకున్నారు. సీఈసీగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్‌ నారాయణ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన వార్తల్లో కనిపించని అజ్ఞాత వ్యక్తిగా మిగిలారు. శేషన్‌ పుట్ట పర్తి సాయిబాబాకు వీరభక్తుడు. సాయిబాబా శివై క్యం పొందినప్పటి నుండి తీవ్ర విచారానికి గుర య్యారు తన స్వగ్రామంలో సొంత ఇల్లు ఉన్నప్ప టికీ తమను సంరక్షించే వారసులు (పిల్లలు) లేక పోవడంతో తన ఆలోచనా ద ృక్పధం సేవా గుణంపై కదిలింది. తన శేషజీవితంలోనూ పేదల, అనాధల, వృద్ధుల బాధలు తిలకిస్తూ, వారికి తోచిన సహాయం చేస్తున్నారు. అందుకోసం సహచరిణి జయలక్ష్మీశేషన్‌తో కలిసి చెన్నైలోని ‘గురుకులం’ అనే వ ృద్ధాశ్రమంలో గడుపుతున్నారు. అసాధారణ ప్రతిభ కలిగిన శేషన్‌ సామాన్య వ్యక్తిగా ఆశ్రమం లోని తోటివారి కష్టాలను వింటూ, వారికి చేతనైన సాయం అందిస్తున్నారు, ఆదుకుంటున్నారు. శేషన్‌ తన పింఛను డబ్బుల్లో కొంత ఇతర సామాజిక సేవలకు వెచ్చించడం విశేషం.
7989134271

1 71 72 73 74 75