కులాల విభజన ఉపాధి హామికే ప్రమాదం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామిలో కులాలవారి సమాచారంపై కేంద్ర గ్రామీణా భివృద్ధిసంస్థ మార్చి 2, 2021న అడ్వయి జరీ ఫైల్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఉపాధి హామిలో దళితు లు,గిరిజనుల వివరాలు, వారి పనిదినాలను ప్రత్యేకంగా పేర్కొనాలని, ఆ ప్రాతిపదికపై 2021-22వేతనాల చెల్లింపు ఉంటుందని ఆ అడ్వయిజరీ ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. 2006లో ఉపాధి హామిని ప్రారం భించిన నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సర్క్యులర్‌లు ఏవీ కేంద్రం నుంచి రాష్ట్రాలకు రాలేదు. మొదటి సారిగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధిలో ఈ కులాల విభజన చేయడాన్ని పైపైన పరిశీలిస్తే హిందుత్వ శక్తుల అసలు ఎజెండా అర్థం కాదు. ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం కలగజేయడానికే ఈ వివరాల సేకరణ అనే ముసుగేసి అంతిమంగా ఉపాధి హామి చట్టం యొక్క మౌలిక లక్ష్యాలనే దెబ్బతి సేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం సిద్ధమైంది.

   దేశంలో అన్ని గ్రామాలకు విస్తరించిన అతి ముఖ్యమైనది ఉపాధి హామి చట్టం. 2004లో ప్రజా సంఘాల ఒత్తిడితో ‘’ఉపాధిహామి’’ పథకంగా కాకుండా చట్టంగా రూపుదిద్దుకున్నది. ఉపాధి హామిలో ఎలాంటి మౌలికమైన మార్పులు చేయా లన్నా పార్లమెంట్‌కే అధికారం ఉన్నది. అలాంటి ఈచట్టాన్ని మోడీ ప్రభుత్వం నీరుగార్చడానికి సర్క్యులర్స్‌,అడ్వయిజరీల పేరుతో దొడ్డిదారిన అనేక మార్పులు చేస్తున్నది. హిందూత్వ శక్తులు ఉపాధి హామిలో తెస్తున్న మార్పులు ఎంత ప్రమాదకరమో అర్థం కావాలంటే చట్టంలో ఉన్న మౌలిక అంశా లను గుర్తుచేసుకోవడం అవసరం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి వయోజనుడికి కులాలు, మతాలు,ప్రాంతాలు అనేదానితో నిమిత్తం లేకుండా సంవత్సరంలో 100రోజులకు తక్కువ కాకుండా పని కల్పించాలి. వారం,పది రోజుల్లో పని చూపిం చకపోతే నిరుద్యోగభృతి ఇవ్వాలి. యంత్రాలు, కాంట్రాక్టర్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమ తించవద్దు. పనిప్రదేశాల్లో అన్ని సౌకర్యాలను కల్పిం చాలి. చివరకు పిల్లలకు చైల్డ్‌కేర్‌ సెంటర్స్‌ను కూడా పెట్టాలి. వారంవారం వేతనాలు చెల్లించాలి. సరళీ కృత ఆర్థిక విధానాలవల్ల వ్యవసాయంలో యాంత్రీ కరణ జరగడం, వృత్తులు దివాళాతీసి వ్యవసాయ కార్మికులుగా మారడం, చిన్న-సన్నకారు రైతులు వ్యవసాయ నష్టాలతో కూలీలుగా మారడంతో వ్యవ సాయ రంగంలో సంవత్సరంలో 70-80రోజు లకు మించి పనిదొరకని నేపథ్యంలో ఉపాధి హామి చట్టం వచ్చింది.
  కానీ,29కోట్ల 42లక్షల మంది ఉపాధి కూలీల్లో ప్రస్తుతం 14కోట్ల31లక్షల మందికే ప్రభు త్వాలు పని కల్పిస్తున్నాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాలు పనులు కల్పించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో గత రెండు, మూడు సంవత్సరాలుగా లక్షల మంది పనికోసం దరఖాస్తులు పెట్టుకుంటే పనులు ఇవ్వకుండా అక్కడి ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. కోర్టులు జోక్యం చేసకున్నా ఫలితం ఉండడం లేదు. ఇన్ని పరిమితుల్లో కూడా2020-21ఆర్థిక సంవ త్సరం లో 389.32 కోట్ల పనిదినాలు ఉపాధిలో దేశ వ్యాపితంగా లభించాయి. కరోనా విపత్తులో కూడా ఉపాధి కూలీలు ప్రాణాలు ఫణంగా పెట్టి పనులు చేసారు. వ్యవసాయంలోనూ కరోనాలో పనులు నిర్వహించడంవల్లనే అన్నిరంగాలు మైనస్‌లో      ఉన్నా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే 4శాతం అభివృద్దిని సాధించింది. ఇలాంటి ఉపాధి హామికి మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలి. కానీ బీజేపీ తీసుకొచ్చిన ఈఅడ్వయిజరీ ఫైల్‌, మొత్తం ఉపాధి హామి లక్ష్యాలనే తలక్రిందులుగా చేస్తోంది.
  ఉపాధిలో ఎస్సీ,ఎస్టీల వివరాలను సేకరిం చేది సబ్‌ప్లాన్‌ ద్వారా నిధులిచ్చి మరింతగా ఈ తరగతులకు లబ్దిచేయడానికేనని బీజేపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం. గత సంవత్సరం కల్పిం చిన పని దినాల్లో ఎస్సీలు 19.86 శాతం, ఎస్టీలు 17.9శాతం పని దినాలు పొందారు.ఎస్సీ, ఎస్టీ లకు కలిపి 37.76శాతం...అంటే 140కోట్లకు పైగా పనిదినాలు లభించాయి. దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభా 24.4 శాతం ఉంటే, జనాభా కంటే 13శాతానికి పైగా అదనంగా ఉపాధి హామి పను లు చేస్తున్నారు. దళిత, గిరిజన ప్రజలకు గ్రామాల్లో ఉపాధి హామి ఒక జీవనాధారం. కానీ ఇప్పుడు సబ్‌ప్లాన్‌ నిధుల్లో జనాభా ప్రాతిపదికపై బడ్జెట్‌లో కేటాయింపులు చూపిస్తున్నారు. ఉపాధి హామికి సబ్‌ప్లాన్‌ నిధులు మరలించాలంటే జనాభా ప్రాతిపదికన 24.4శాతమే ఇస్తారు. మరి అదన మైన 13శాతం పని దినాలకు వేతనాలు ఎక్కడి నుండి వస్తాయి? దేశంలో ఈ స్థితి ఉంటే చాలా రాష్ట్రాల్లో ఉపాధి హామి పనులు 40 నుంచి 60 శాతం వరకు దళితులు, గిరిజనులే చేస్తున్నారు. పంజాబ్‌లో ఉపాధి పనులు 60శాతానికి పైగా ఒక్క దళితులే చేస్తున్నారు. అక్కడి జనాభా రేషియో లో నిధులు ఇస్తే పంజాబ్‌లో ఎస్సీ జనాభా 30 శాతం మాత్రమే. మిగిలిన 30శాతం ఎస్సీ వేత నాల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి పని దినాల్లో 33.38శాతం, ఉత్తరప్రదేశ్‌లో 28.5శాతం, తెలంగాణలో 40శాతం ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. కనుక ఎస్సీ,ఎస్టీ ప్రయోజనాలకే ఈ వివ రాల సేకరణ అనేది పచ్చి బూటకం. ఈ పేరు చెప్పి ఉపాధి హామీలో బీజేపీ ప్రభుత్వ హెడన్‌ ఎజెండాను అమలుచేసే కుట్రలకు బీజేపీ తెగిం చింది. సబ్‌ప్లాన్‌ నిధులంటే రెగ్యులర్‌ పథకాల్లో దళిత, గిరిజనులు పొందే సౌకర్యాలకు అదనంగా వాటిని ఉపయోగించాలి. కానీ,ఏకకాలంలో      ఉపాధిని, సబ్‌ప్లాన్‌ను పాతర పెట్టడానికి నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు.
  నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉపాధిహామిని బలహీన పర్చడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగి స్తున్నారు. వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యుపీఏ ప్రభుత్వం యూనియన్‌ బడ్జెట్‌లో ఈపథకానికి 4శాతానికి తగ్గకుండా నిధులు కేటాయిస్తే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర బడ్జెట్‌లో 2శాతానికి తగ్గించారు. ఒక్కదెబ్బతో ఉపాధి నిధు లకు అడ్డంగా కోతపెట్టారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో గత ప్రభుత్వాలు కేటాయించినట్టు కనీసం 4శాతం కేటాయిస్తే 1,44,000 వేల కోట్లకు తక్కువ కాకుండా ఉపాధి హామికి బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. కానీ ఈ సంవత్సరం బీజేపీ ప్రభుత్వం 71వేల కోట్లే ఇచ్చింది. మోడీప్రధాని అయిన దగ్గర నుంచి ఈ తరహాలోనే కేటాయింపులు సగానికి తగ్గాయి. బడ్జెట్‌ తగ్గిపోవడంతోటే ఉపాధి పనుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సగం మందికే పనులు కల్పిస్తున్నాయి. ఉపాధిహామి నిధుల్లో 10 శాతానికి మించి మెటీరియల్‌కు ఖర్చు పెట్టకుండా గతంలో అమలైతే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40శాతానికి మెటీరియల్‌ను వినియోగిం చుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో యంత్రా లు,కాంట్రాక్టర్లను,మనుష్యులు చేయలేని పనుల పేరుతో ఎంపిక చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు దళిత, గిరిజనుల స్వంత భూముల అభివృద్ధికి ఉపాధిహామి నిధులను ల్యాండ్‌ డెవలప్‌ మెంట్‌ పేరుతో వేలకోట్లు వినియోగించాయి. స్వంత భూమిలోపని చేసుకోవడం వలన భూములు సాగులోకి తెచ్చుకున్నారు. కానీ,నరేంద్రమోడీ ప్రభు త్వం ఉపాధి ద్వారా ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ను అటకెక్కించింది. ప్రజలకు ఉపయోగపడే వాటిని పక్కన పెట్టి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మంత్రుల పర్యటనలకు, పార్కులకు, హెలిప్యాడ్‌ల వినియో గానికి కూడా ఉపాధి హామి నిధులను ఉపయోగిం చే స్థితికి ప్రభుత్వాలు దిగజారాయి. చట్టం యొక్క స్పూర్తికే బీజేపీ తిలోదకాలిచ్చింది.
  కేరళతో పాటు, త్రిపురలో వామపక్ష ప్రభు త్వం ఉన్నప్పుడు ఉపాధిహామి పని దినాలు కల్పిం చడంలో దేశంలో అగ్రభాగాన ఉన్నాయి. త్రిపుర అయితే ప్రతి జాబ్‌కార్డుకు సగటున 89పని దినాలు కల్పించి కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నది. దక్షిణాది రాష్ట్రాలు కూడా ఉపాధి హామిని ఐదారు సంవత్సరాలు బాగా ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు వామపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలు తప్ప, కేంద్రంతో పాటు ప్రాంతీయ పార్టీలన్న తేడా లేకుం డా అని పార్టీల ప్రభుత్వాలూ ఉపాధి హామిని నిర్వీర్యం చేస్తున్నాయి. బీజేపీ పాలక రాష్ట్రాల్లో ప్రారంభం నుండి ఉపాధిహామిపై శ్రధ్ద లేదు. ఉత్తరప్రదేశ్‌లో అయితే ప్రాణాళికాబద్దంగా ఉపాధి హామీనే లేకుండా చేస్తున్నారు.20కోట్ల జనాభా     ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 2.21కోట్ల జాబ్‌కార్డులు, 3. 12కోట్ల ఉపాధి కూలీలను మాత్రమే నమోదు చేసారు. ఉపాధి హామిని బలహీనపరచి దళిత, గిరిజనుల ఆర్థిక మూలాలను దెబ్బతియడానికే బీజేపీ ఈ కుతంత్రాలు చేస్తున్నది. ఉపాధి హామి వల్ల వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, ప్రత్యేకించి దళిత,గిరిజనులు,ఓబీసీలకు కొన్ని పని దినాలు దొరికాయి. రెండు,మూడు నెలలు ఆహా రానికి ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడిరది. కొంత కొనుగోలు శక్తి పెరిగింది. ప్రత్యేకించి గ్రామ పెత్తందారులపై పదిఇరవై రూపాయలకు ఆధా రపడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది.పేదల భూము లు కొంతమేరకైనా సాగులోకి తెచ్చుకున్నారు. గుడ్డిలో మెల్లగా అమలవుతున్న ఉపాధిచట్టం వల్ల కలిగే ఈ మాత్రం ప్రయోజనాలు కూడా గ్రామీణ ధనిక వర్గానికి కంటగింపుగా ఉన్నాయి. ఈ చట్టాన్ని అమలు జరపడం ఏ కోశానా ఇష్టంలేని పెత్తందా రులు, హిందుత్వవాదులు కలిసి ఉపాధి హామి పీక నులమడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వయిజరీ ఫైల్‌లో ఉన్న అంశాలు అమలైతే అందరికంటే నష్టపోయేది దళితులు, గిరిజనులే. సబ్‌ప్లాన్‌ పేరు చెప్పి, జనాభా ప్రాతిపదికమీద నిధులిచ్చి దళిత-గిరిజనులు ఇప్పుడు పొందుతున్న పనులు సగానికి తగ్గిస్తారు. తద్వారా దళితులను పూర్వ స్థితికి, అంటే పెత్తందా రులకు ఊడిగం చేసే స్థితికి నెట్టేస్తారు. ఎస్సీ, ఎస్టీల పేరు చెప్పి ఓబీసీ, బీసీలకు కూడా ఉపాధి హామి పనులు లేకుండా చేస్తారు. దేశ వ్యాపితంగా 35నుంచి40శాతం పనులు ఓబీసీ, బీసీలు చేస్తున్నా రు. భవిష్యత్‌లో వారికీ అవకాశం లేకుండా ఈ చట్టాన్ని తలకిందులుగా మారుస్తారు. పని ప్రదే శాల్లో కుల వైశమ్యాలను పెంచుతారు. సమిష్టిగా చేసే ఉపాధి పనులు కుల ఘర్షణలుగా మారు తాయి. దీనిని పెత్తందారులు అవకాశంగా వినియో గించుకుంటారు. కులాల పేరుతో ఏర్పడే గ్రూపులకు గ్రామ పంచాయతీలు ఇష్టానుసారం పనులు ఇస్తాయి. దళిత, గిరిజనులకు కఠినమైన పనులు, తక్కువ వేతనాలు పడేటట్లుగా ఈ ఆధిపత్య వర్గాలు ప్రయత్నిస్తాయి. బీజేపీ తెచ్చిన ఈ అడ్వయిజరీ అమలైతే కులాల వారీగా వేతనాల్లో వ్యత్యాసా లొస్తాయి. పూర్వ కాలంలో, ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో దళితులకు, ఇతర కులాల కంటే తక్కువ వేతనాలు ఇచ్చిన నేపథ్యం మన దేశంలో ఉన్నది. ఆస్థితి ఉపాధిలో పునరావృతం అవు తుంది. ఇప్పటి వరకు 50శాతం ఉపాధి పనులను మహిళలు చేస్తున్నారు. కులాల విభజన వచ్చిన తర్వాత మహిళలు చేయలేని పనులను ప్రవేశపెట్టి వీరికి పనులు సగానికి సగం తగ్గిస్తారు. అంతిమం గా ఈ అడ్వయిజరీ వల్ల అందరికంటే దళిత, గిరిజనులు, అన్ని కులాల్లో ఉన్న మహిళలకు తీవ్ర నష్టం కలుగుతుంది. రైతు చట్టాలు, విద్యుత్‌ బిల్లు, కార్మిక చట్టాల కోడ్‌ల కోవలోనే ఉపాధి హామిలో కుల విభజనను చూడాలి. దేశ వ్యాపితంగా రైతాం గం,కార్మికులు,వ్యవసాయకార్మికులు చేస్తున్న చట్టాల వ్యతిరేక పోరాటంలో ఉపాధి హామిలో బీజేపీ తెచ్చిన కులవిభజనను జోడిరచాలి. పోరాడి సాధిం చుకున్న ఉపాధి హామిని కాపాడుకోవడానికి మరో పోరాటమే మార్గం. కులాల విభజన రద్దు, 200 రోజుల పని, రోజు వేతనం రూ.600 కోసం దేశ వ్యాపిత సమరశీల సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలి. రైతాంగ పోరాటాల స్ఫూర్తితో ఉపాధి హామి పోరాటం ప్రారంభం కావాలి.-బి.వెంకట్‌

పర్యావరణం..కరోనా

చిన్న పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువ గా ఉంటుంది. ఏవిషయాన్నైనా ఇట్టే పట్టేసి జ్ఞాపకం ఉంచుకుంటారు. బాల్యంలో విద్యార్ధుల ప్రతిభను గమనించి ప్రోత్సహిం చేది తలిదండ్రులు. తరు వాత గురువులు, స్నేహితులు. ఈ విధమైన ప్రతిభ అనేక విష యాల్లో చూస్తుంటాం. వయసుకు మించి న శక్తి సామర్ధ్యాల్ని కనబరచటం. ఈ ప్రతిభ ను వెలికి తీయటం అనేది కత్తి మీదసామే! చదువు తో పాటు విద్యార్ధిలో నిగూఢమైవున్న కళను బయ టకు తీసుకురావటంలో ఉపాధ్యాయులు ముం దుండాలి. అలా చేయగలిగితే ఆవిద్యార్ధిలో పరి పూర్ణ పరిమళత్వం చూడ గల్గుతుంది. ఈనేపథ్యం లో ఉపాధ్యాయుని ప్రోత్సాహంతో విద్యార్ధి సాధించిన విజయమే ఈనెల బాల వినోదంలో చదవండి. (జన విజ్ఞాన వేదిక ఏప్రి యల్‌ 2021 లో ‘‘పర్యావరణం-కరోనా’’ అనే అంశంపై ఆంధ్రా-తెలంగాణాలలో నిర్వహించిన పోటీలలో పాఠశా లల విభాగంలో తృతీయ బహుమతి పొందిన వ్యాసం )

‘‘ ఆధునిక కాలంలో మన పర్యావరణం ఎక్కువ భాగం,కాలుష్యానికి గురవుతోంది. ప్రపంచ జనాభా పెరుగుతూ ఉండగా,మనుషుల అవసరాలు,వారి కోరికలు పెరుగుతున్నాయి. దీనివల్ల భూమి మీద ఉండే ప్రకృతి వనరులని, మనం ఎక్కువగా వాడటమే కాకుండా భూమిని,దానిమీద ఉండే జీవరాశులన్నీంటినీ కూడా పెద్ద ప్రమాదంలో పడేస్తున్నాము. కర్మాగారాలు బయటకు వదిలే వ్యర్ధపదార్ధాలు, ప్రమాదకరమైన రసాయనాలు,బొగ్గును కాల్చడం ద్వారా వచ్చే కార్బన్‌ డైయాక్సైడ్‌,సముద్రాలలోకి విడుదలయిన ప్లాస్టిక్‌,నేలని ఆక్రమించుకోవటానికి చెట్లు కొట్టి వేయడం ఇవన్నీ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్‌, మన జీవనవిధానాన్ని మార్చే సింది. ఈ ప్రభావంవల్ల కొంత మంచి మరియు కొంత చెడు జరుగుతోంది.. జరిగింది. అవి పెద్దవైన చిన్నవైన,చాలా సంవత్సరాల తర్వాత పర్యావరణంలో ఒక మార్పు కలుగుతుంది ’’
ఆధునిక సమాజం సాంకేతికంగాబాగా అభివృద్ధి చెందినప్పటికీ మానసికంగా మాత్రం ప్రకృతితో ఇతర జీవరాసులతో ఒకసంబంధాన్ని అభివృద్ధి చేసుకోలేక పోయింది. మనుషులు ఒకరికొకరు సంబంధం లేకుండా యాంత్రికంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు కంటికి కనబడని ఈవైరస్‌ రోజురోజుకి వేలల్లో, లక్షల్లో మనుషులకు సోకుతోంది. ఇకపై మనందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రకృతితో మమేకమైతేనే మనం బ్రతకగలమని అర్ధమైంది. ఈపరిణామంవల్ల మన సమాజంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.
కరోనావ్యాధి ప్రపంచ వ్యాప్తంగా మను షులకి సోకటంవల్ల వ్యాపారాలు,చదువులు,ఉద్యో గాలు,దేశాలఆర్ధిక వ్యవస్థలు వీటన్నీటిపై ప్రతికూల ప్రభావం చూపించినా, పర్యావరణంపై మాత్రం అనుకూల ప్రభావమే చూపించింది. కరోనావల్ల అందరూ ఇంట్లోనే నిర్బంధమయ్యారు. ఈసమ యంలో ఎవరూ ప్రయాణాలు చేయక పోయేసరికి కార్లు, విమానాలు, రైళ్లు మరియు ఇతర రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. దీనివల్ల అవి విడుదలచేసే కార్బన్‌ డైయాక్సైడ్‌ ఎమిషన్లు, గాలిలో సుమారుగా17 శాతం తగ్గాయి. మనుషులు ఎవరూ బయటకు రాకపోవటంవల్ల సముద్రాలలో, నదు లలో ఉన్న నీళ్ళు ఇప్పుడు పరిశుభ్రంగా ఉన్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలు మరియు రసాయనాలు, అవి మూతబడటంవల్ల సముద్రా లలోకి నదులలోకి వెళ్ళట్లేదు. ప్రస్తుతం మనభారత దేశానికి చెందిన గంగా నదిలో కూడా, నీళ్ళస్వచ్చత దాదాపుగా50శాతం పెరిగింది. చాలాతక్కువగా కనిపించే పక్షులు,అడవి జంతువులు కూడా బయట ఉన్న వాహనాల రద్దీ,ధ్వనికాలుష్యం తగ్గటంవల్ల అవిరోడ్ల మీద సంచరిస్తున్నాయి. చాలా సంవత్స రాల తర్వాత వాటికి స్వేచ్చ మళ్ళీ వచ్చింది. ఈ విధంగా కరోనావల్ల కొన్ని పర్యావరణ లాభాలు ఉన్నాయి. కరోనా పర్యావరణంపై చూపించిన ప్రభావాలలో చాలానష్టాలు కూడా ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత,అందరూ ప్రాముఖ్యత నిచ్చింది మాస్కులకే. మాస్కు ధరిస్తే మనల్ని మనము కాపాడుకోవచ్చు అనేది తెలిసిన విషయమే. కానీ ఒక్కసారే వాడిపడేసే ఈమాస్కులవల్ల చెత్త పెరిగి పోతోంది. అవి కూడా ప్లాస్టిక్‌ తోనే చేయబడ్డాయి కాబట్టి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ చెత్త సముద్రాలకు చేరి వాటిలో ఉన్నటువంటి జల చరాలకు హాని చేస్తాయి. చాలామంది మామూ లు చెత్తలాగా వీటిని కూడా ఎలా కావాలంటే అలా రోడ్ల మీద పడేస్తున్నారు. ఈమాస్కుల్లో వైరస్‌ ఉండటంవల్ల జంతువులకు తర్వాత మనుషులకు కూడా కరోనా వీటి నుంచి సోకుతుంది. ఆన్లైన్‌ షాపింగ్‌ కూడా కరోనా కారణంగా బాగా పెరిగిం ది. షాపులకి వెళ్లలేని మనము,ప్రతిదానికి ఆన్లైన్‌ ఆర్డర్లు చేస్తున్నాము. దీనివల్ల కూడా చాలా ప్లాస్టిక్‌ చెత్త మిగులుతుంది. ఈసమయంలో మాస్కులు లాగానే చేతితొడుగులు (గ్లవ్స్‌) మరియు ఆసుప త్రులనుంచి వచ్చే వ్యర్ధాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇవికూడా మాస్కుల లాగా చెత్త అయ్యి ఇతర జీవులకు హాని కల్గిస్తున్నాయి.
ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరగటం వలన,చాలామంది మరణిస్తున్నారు. రోజు రోజుకి మరణాల రేటు పెరుగుతోంది. అంతకుముందు రోజుకు ఐదు-ఆరు శవాలని కాల్చి వేయాల్సి వచ్చేది,కానీ ఇప్పుడు రోజుకి వేల శవాలను కాల్చే యాల్సి వస్తోంది. వీటిని కాల్చటంవల్ల కూడా పర్యావరణం కలుషితం అవుతుంది. ఎందుకంటే శవాల్ని కాల్చటంవల్ల వచ్చే పొగంతాగాలిలో కలు స్తుంది. కరోనాబయటివాళ్లకు సోక కుండా ఉండ టానికి శవాలని ప్లాస్టిక్‌ కంటైనర్లలో పెట్టినప్పుడు, శవాలతో పాటు ప్లాస్టిక్‌ కూడా కాలుతుంది. ఇందు వల్ల కూడా గాలిలోకి హానికరమైన విషవాయు వులు విడుదలవుతాయి. కరోనా కేసులు పెరగటం వల్ల కృత్రిమ ఆక్సిజన్‌ వాడకం పెరిగింది. ఆక్సిజన్‌ సరిపోక ఆసుపత్రులలో చాలామంది చనిపోతు న్నారు కూడా. ఒకఆసుపత్రిలో ఆక్సిజన్‌ లీక్‌ అవ్వ టంవల్ల 20మంది మృతి చెందారు. కృత్రిమ ఆక్సిజన్‌ రోగులకు అందటానికి దేశంలో రోజుకి చాలా ఆక్సిజన్‌ తయారు చేయాల్సి వస్తుంది. ఇది కూడా సరిపోక ఇతర దేశాలనుంచి విమానాలలో తీసుకురావాల్సి వస్తోంది. ముందే మనం కరోనా కేసులు ఇలా పెరగనివ్వకుండా ఉంటే, ఈపరిస్థితి వచ్చేది కాదు. ఈవిధంగా కరోనా పర్యావరణంపై చెడు ప్రభావాన్ని చూపించింది.
కరోనా వల్ల పర్యావరణానికి కల్గిన లాభాలు,నష్టాలు చూస్తుంటే అది మనుషులకు ఒక మంచి గుణపాఠం నేర్పింది. అయినప్పటికీ పర్యా వరణాన్ని ఇంకా కలుషితం చేస్తున్నాము. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం పర్యా వరణాన్ని కాపాడితే, అదే మనల్ని కాపాడుతుంది.-జతిన్‌ జూలకంటి

గమ్యం తెలియని బాలల ప్రయాణం

బంగారు భవిష్యత్తుకు పునాదిపడేది బాల్య దశ. ఇలాంటి కీలకదశలో బాలలు చదువు,ఆటలకు దూరమై శ్రామికులుగా మారడాన్ని బాలకార్మికులంటారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాలకార్మిక వ్యవస్థ ఒకటి. బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతిబిడ్డ జన్మహక్కు. అయితే కుటుంబాల సామాజిక,ఆర్థికపరిస్థితులు కారణంగా అత్యధికబాలలు వ్యవసాయ రంగం లో…మిగతావారు ఇళ్లలో,హౌటళ్లలో,కర్మాగారాల్లో,దుకాణాల్లో పనిచేస్తున్నారు. వీరంతా కూడా అధిక పనిగంటలు తక్కువ వేతనంతో శ్రమదోపిడీకి గురవడంతోపాటు అక్రమ రవాణా, వేశ్యావత్తి, డ్రగ్‌ మాఫియాకి బలవుతు న్నారు. ఫలితంగా వారి భవిష్యత్‌ అంధకారంగా మారింది. ..`

కరోనాతో బాలకార్మికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చాటు తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవ స్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకురా వడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ సంవత్సరం ‘’బాల కార్మిక వ్యవస్థ ముగింపునకు ఇప్పుడే చర్యలు’’ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈదినోత్సవం ప్రధానంగా ఐరాస 2021 సంవ త్సరాన్ని ‘’అంతర్జాతీయ బాల కార్మిక నిర్మూలన సంవత్సరం’’గా ప్రకటించిన నేపథ్యంలో తీసుకో వాల్సిన చర్యలపై దృష్టి సారించనుంది. గతేడాది బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశంలో ప్రపంచదేశాలు సార్వ త్రిక ఆమోదం తెలిపాయి. కరోనా విసిరిన సవాళ్ళ అనంతరం ఇది మొదటి ప్రపంచ దినం. ఇప్పటికే 2025 నాటికి బాలకార్మిక వ్యవస్థకు ముగింపు పలకాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో (లక్ష్యం8.7) నిర్దేశించుకోవడం జరిగింది. ఈ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ బాల కార్మికుల లెక్కిం పునకు సంబంధించిన నూతన అంచనాలు, పోకడ లను విడుదల చేయనుంది. ఇందులో అందరిని భాగస్వామ్యం చేయడానికి వారంపాటు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా గత ఏప్రిల్‌ మాసంలో అయాప్రాంతాలు, దేశాలు, సంస్థ వాటాదారులు, వ్యక్తులు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసిన ‘’2021కార్యాచరణ ప్రతిజ్ఞల’’ పురోగతిని ప్రదర్శిం చడం జరుగుతుంది.ఈఏడాది పొడవునా తీసు కున్న చర్యలు, తదుపరి 2022లో బాల కార్మికులపై సౌత్‌ ఆఫ్రికాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి మైలురాయిగా నిలువనున్నాయి.
కరోనాతో పెరిగిన బాలకార్మికులు…
అనేక రూపాల్లో కొనసాగుతున్న బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. కుటుంబ ఆర్థిక పరిస్థితికి,బాలల జీవనానికి అవినాభావ సంబంధం ఉంది. దీంతో వారు చదువుకోవాల్సిన వయసులో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు నిరక్షరా స్యత,ఉపాధి నిమిత్తం కుటుంబ వలసలు,జనాభా పెరుగుదల,ప్రపంచీకరణ తదితరకారణాలు కూడా బాలకార్మిక వ్యవస్థకు ఆజ్యం పోస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరన్నర కాలంగా కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో కుటుంబ ఆదా యం పడిపోయి, సామాజిక జీవనం దెబ్బతిన్నది. దీని ప్రభావంపిల్లలపై పడిరది. దీంతో వారు విద్య,వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరమ య్యారు. బడులు మూతపడడం, ఆన్‌లైన్‌ చదువు లతో మెజారిటిపిల్లలు విద్యను పొందలేక పోయా రు. ఫలితంగా బాల్య వివాహాలు,బాలకార్మిక వ్యవస్థలాంటి దుర్లక్షణాలు పెరిగాయని అనేక అధ్య యనాలు చాటుతున్నాయి. గతేడాది ‘’కోవిడ్‌-19, బాలకార్మిక వ్యవస్థ’’ పై అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూనిసెఫ్‌ అధ్యయనం బాలకార్మిక వ్యవస్థ పై గత ఇరవై సంవత్సరాల కాలంలో సాధించిన పురోగతి వెనక్కి నెట్టబడిరదని తెలిపింది. ఈ సంక్షో భం కన్నా ముందుతో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర పేదరికంలోకి జారుకున్న వారి సంఖ్య 4నుంచి 6 కోట్లు పెరిగిందని,ఒక శాతం పేదరికం పెరి గితే 0.7శాతం బాలకార్మికులు పెరుగుతారని పేర్కొన్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల ప్రకారం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15.2కోట్ల మంది బాల కార్మికులు ఉండగా…అందులో 7.2 పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో నిమగమయ్యారు. అధికంగా బాలకార్మికులున్నా భారతదేశంలో కరోనా అనంతరం వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కైలాష్‌ సత్యార్థి చిల్డ్రన్స్‌ ఫౌండే షన్‌ సర్వే పేర్కొన్నది. పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందని, కార్మిక చట్టాలు దుర్వినియోగం అయ్యేప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు…
దేశ సంపద అయిన బాలలు బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవు తుంది. సంఘ విద్రోహ కార్యకలాపాలు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి బాలలకు తగిన విద్యా భ్యాసం,శిక్షణ అందించి విలువైన మానవ వనరులు గా తీర్చిదిద్దాలి. కార్మికులుగా పనిచేస్తున్న బాలల పూర్తివివరాలు సేకరించాలి. ఇందులో ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా భాగస్వామ్యం కా వాలి. బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాలి. బడిబయట ఉన్న విద్యార్థులపై సమగ్ర సర్వే నిర్వహించి పాఠశాలలో నమోదు చేయాలి. వ్యవ సాయ సంస్కరణలు,ఉపాధికల్పన పథకాలు, సాం కతిక నైపుణ్యాలు పెంపొందించటం,అవ్యవస్థీ కత రంగాలను ప్రోత్సహించటం, సహకారసంఘాల ఏర్పాటు,సాంఘిక భద్రతా పథకాల రూపకల్ప న వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూ లనకు దోహదపడతాయి. ప్రభుత్వాలు వీటిపై ప్రత్యే కంగా దృష్టిసారించాలి. అందుకు దీర్ఘకాల కషి, బహుముఖ వ్యూహం అవసరం. భారతదేశంలో కరోనా మహమ్మారితో చాలా మంది బాలలు అనాధలయ్యారు. వీరి సంరక్షణకై క్షేత్రస్థాయి చర్యలు చేపట్టాలి. విద్యఅంతరాలను తొలగించడానికి డిజి టల్‌ సాధనాలు అందించాలి. నేటి కోవిడ్‌ విపత్కర పరిస్థితులో బాలల హక్కులు సంక్షోభాన్ని ఎదుర్కో వడానికి ప్రపంచదేశాలు సమన్వయం కోసం యూనిసెఫ్‌ ఎజెండా రూపొందించింది. ఇందులో బాలల ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారం అందివ్వాలని, తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. పిల్లల విద్యను కొనసాగిస్తూ,వారి సంరక్షణ కోసం కుటుం బాలకు సామాజిక మద్దతు ఇవ్వాలి. బాలలను హింస,దోపిడి,దుర్వినియోగం నుంచి రక్షించాలి. అంతర్యుద్ధాలు,హింస సంఘటనలతో వలస వచ్చిన,శరణార్థులుపిల్లలను రక్షించాలి. ఈ చర్యలు బాల కార్మిక వ్యవస్థకు చమరగీతం పాడి, వారి వికాసానికి దోహద పడతాయి.– డాక్టర్‌ పెంట కృష్ణ

పంటల వైవిధ్యమే పోషకాహారానికి మూలం

ప్రజాస్వామ్య సౌధానికి మూలం వైవిధ్యం. సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా వివిధ ప్రజా సమూహాలు ఈ వైవిధ్యానికి ప్రాణం పోస్తాయి. అందుకే పాలనలోనూ ఈ ప్రజాస్వామిక స్వభావాన్ని ప్రభుత్వాలు సంతరించుకోవాలి. సాధారణంగా లాభాల కోసం పని చేసే పెట్టుబడి వైవిధ్యానికి వ్యతిరేకం. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేసే పాలకులు కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అందుకే అన్ని ప్రజాస్వామిక, నాగరిక విలువలనూ తుంగలో తొక్కి, ఏకస్వామ్య పాలన సాగిస్తుంటారు. పాలకుల సంస్కృతి ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది కనుక ప్రజలు తమ నిత్య జీవితంలోనూ అలాగే వ్యవహరిస్తుంటారు.


తెలంగాణలో పంటల వైవిధ్యం పడిపోవడం చూస్తుంటే పాలకులలోనూ, గ్రామీణ ప్రజలలోనూ ఈ మోనో కల్చర్ ధోరణులు ఎంత బలంగా పని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ గడ్డ మొదటి నుంచి, ప్రధానంగా వర్షాధార ప్రాంతమే. ప్రత్యేక భౌగోళిక స్వభావం కలిగి ఉన్నది. కానీ ఎప్పుడూ వైవిధ్యమైన పంటలకు ఈ నేల కేంద్రంగా ఉండేది. ఫలితంగా వైవిధ్యమైన ఆహారం ప్రజల అలవాటులో భాగంగా ఉండేది. నేల సారాన్ని బట్టి, సాగునీరు అందుబాటును బట్టి ప్రజలు పంటలు వేసేవారు.
కానీ ఇప్పుడు అదంతా గడిచిపోయిన చరిత్ర. ప్రస్తుతం తెలంగాణలో కేవలం 3 లేదా 4 పంటలే 95 శాతం భూములను ఆక్రమించాయి. కాలక్రమంలో కొన్ని పంటలు కనుమరుగవుతున్నాయి. 2020 ఖరీఫ్‌లో రైతులు వరి 53,33,477, పత్తి 60,53,890, కంది 10,84,557 సోయాబీన్ 4,00,998 ఎకరాలలో సాగు చేశారు. మొత్తం 1,35,63,492 ఎకరాలలో పంటలు సాగయితే ఈ నాలుగు పంటలే 1,28,72,922 ఎకరాలలో సాగయ్యాయి. యాసంగిలో కూడా వరిని 50,58,128 ఎకరాలలో సాగు చేశారు. ఫలితంగా రెండు సీజన్లలోనూ మిగిలిన పంటల విస్తీర్ణం బాగా పడిపోయింది.
ఈ ధోరణి వల్ల, సాగునీటిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నది. అన్ని పంటల సగటు దిగుబడులు పడిపోతున్నాయి. కొన్ని పంటల విస్తీర్ణం గణనీయంగా పెరగడం వల్ల, మార్కెట్ సమస్య కూడా ఎదురవుతున్నది. నిల్వ కోసం అవసరమైన గిడ్డంగుల కొరత కూడా ఏర్పడుతున్నది. ఒకేసారి వ్యవసాయ కార్యకలాపాలు జరగడం వల్ల కూలీల కొరత సైతం ఏర్పడుతున్నది. యంత్రాల కిరాయిలతో సహా అన్ని రకాల సాగుఖర్చులు పెరిగి రైతులకు నికర ఆదాయాలు పడిపోతున్నాయి. కొన్ని వాణిజ్య పంటలకే డిమాండ్ పెరిగి, భూముల కౌలు ధరలు కూడా పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు మార్కెట్ మాత్రమే రాష్ట్ర పంటల ప్రణాళికను శాసిస్తున్నది. వాతావరణంలో వస్తున్న మార్పులను ఏ మాత్రం పట్టించుకోకుండా పంటలను ప్రోత్సహించే ధోరణి తెలంగాణ పాలకులలో ఎక్కువగా ఉంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా భూగర్భ జలాలను అడుగంటి పోయేటట్లు చేస్తున్నా, ఫలితంగా యాసంగి సీజన్‌లో పంటలు ఎండిపోతున్నా, ప్రభుత్వానికి పట్టడం లేదు.
వాస్తవానికి రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలు, పశువుల ఆహార అవసరాలు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ముడిసరుకు అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఏ ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్న సాగుభూములను ఉత్పత్తికి ఉపయోగించుకోవాలి. అందుకు అనుగుణంగా రైతులతో కలసి గ్రామ, మండల స్థాయిలో ప్రణాళికలు రచించుకోవాలి. బఫర్ స్టాక్, ప్రకృతి వైపరీత్యాలు దృష్టిలో ఉంచుకుని కొంత అదనంగా ఉత్పత్తి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈ అవసరాలు తీరాక అంతగా భూములు మిగిలితే, అప్పుడు ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖతో కేంద్రం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, కంపెనీలు చేసుకునే ముందస్తు ఒప్పందాల ప్రాతిపదికన ఇతర రాష్ట్రాల కోసం, దేశాల కోసం కూడా పంటలు పండించవచ్చు.
ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర వాతావరణం, సాగు భూముల స్వభావం, సాగునీరు అందుబాటు, దానికోసం రైతులు తవ్వుకునే బావులు, బోర్లు, ప్రభుత్వాలు అప్పు తెచ్చి నిర్మించే ఎత్తిపోతల పథకాలు, వాటి నిర్మాణ, నిర్వహణ వ్యయం, వాటి విద్యుత్ అవసరాలకు చెల్లింపులు, ఫలితంగా పెరిగే పంటల ఉత్పత్తి ఖర్చు పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్రం ప్రతి సంవత్సరం పంటల మద్దతుధరల విషయంలో అనుసరించే అపసవ్య ధోరణులు, ప్రభుత్వ సంస్థలకు పంటల సేకరణలో ఉన్న పరిమితులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అమెరికా, యూరప్, చైనా దేశాలు అక్కడి రైతులకు వివిధ పేర్లతో ఇస్తున్న భారీ సబ్సిడీలు, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులను కూడా ఇక్కడ పంటల ప్రణాళిక సమయంలో దృష్టిలో ఉంచుకోవాలి.
వీటిపై రైతులందరికీ అవగాహన ఉండకపోవచ్చు కానీ ప్రభుత్వానికి తప్పకుండా ఉండాలి. ఈ సందర్భంలో ప్రజాపక్షంగా ఆలోచించి సూచనలు చేసే వ్యవసాయ ఆర్థిక నిపుణుల అభిప్రాయాలూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల పొందికపై వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చేసే సూచనలూ ప్రభుత్వాలు ఆలకించాలి. ప్రగతి భవన్లో తీసుకునే నిర్ణయాలన్నీ పారదర్శకమైనవి, శాస్త్రీయమైనవి కావని గత 7 సంవత్సరాల పాలన నిరూపించింది.
భారత వైద్య పరిశోధనా సంస్థ (ICMR), ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 400 గ్రాముల ఆహారధాన్యాలు, 60 గ్రాముల పప్పుధాన్యాలు, 60 గ్రాముల నూనెలు, 25 గ్రాముల సుగంధ ద్రవ్యాలు, 325 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు ఆహారంగా తీసుకోవాలని సిఫార్సు చేసింది. అంటే ఆహార అవసరాల కోసం ఏ గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం అయినా వీటి ఉత్పత్తికి స్థానికంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. అందుకు అనుగుణంగా భూములను కేటాయించుకోవాలి. ఇంకా సాగు భూములు మిగిలితే పశుగ్రాసం కోసం, పరిశ్రమల అవసరాల కోసం, ఇతర ఆహార అవసరాల కోసం సాగు భూముల కేటాయింపు జరగాలి. అప్పటికీ భూములు మిగిలితే అప్పుడు మార్కెట్ ఆధారిత, ముందస్తు ఒప్పంద ఆధారిత పంటల ఉత్పత్తి కోసం కేటాయించుకోవాలి. స్థానికంగానే ఉత్పత్తి, నిల్వ, ప్రాసెసింగ్, పంపిణీ, మార్కెటింగ్ జరిగితే రైతులకు ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. వినియోగదారులకు స్థానికంగా నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు దొరుకుతాయి. ప్రజలు ఇప్పటిలా, కేవలం తెల్ల వరి బియ్యం మాత్రమే ప్రధాన ఆహారంగా తీసుకోకుండా జొన్నలు, ఇతర చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, వివిధ రకాల నూనెలు, కూరగాయలు, పండ్లు, సుగంధద్రవ్యాలు ఆహారంలోకి తీసుకోవడం వల్ల ప్రజలకు పౌష్టికాహారం అందుతుంది. ఆరోగ్యాలు మెరుగవుతాయి. అన్నిటికీ మించి రైతులకు స్థానికంగానే అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధరలు లభిస్తాయి. పశువులకు కూడా వైవిధ్యమైన పశుగ్రాసం దొరికి ఆరోగ్యకరమైన పాలు, మాంసం, గుడ్ల దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. ఈ మొత్తం వ్యవసాయ, పశు ఆధారిత ఉత్పత్తుల ప్రక్రియలో ఎరువుల ధరలు పెరుగుతూ, పంటల ఉత్పత్తి ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున విష రసాయనాలను వదిలేసి సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తే ప్రజల ఆరోగ్యాలూ ,పర్యావరణమూ బాగుపడతాయి. రాష్ట్రంలో సాగునీటిపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఎందుకంటే వరి, పత్తి, పామాయిల్ లాంటి పంటలకు నీటి అవసరం ఎక్కువ. మిగిలిన పంటలు ప్రధానంగా మెట్ట పంటలు. ఇప్పటి వరకూ వీటిని అశ్రద్ధ చేయడం వల్ల రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. కేంద్రం తెచ్చిన మూడు చట్టాల నేపథ్యంలో మార్కెట్ ధరలు రైతులకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు. రాష్ట్రంలో రెండు మూడు పంటల విస్తీర్ణాన్నే ప్రోత్సహిస్తే వాటి మార్కెటింగ్ కష్టం అవుతుంది. ప్రభుత్వం కూడా చివరి గింజ వరకూ ఎప్పుడూ కొనే అవకాశం ఉండదు.
అందువల్ల ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట చర్యలు వెంటనే ప్రారంభించాలి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ దృష్టితో కాకుండా తెలంగాణ రాష్ట్ర అవసరాల ప్రాతిపదికన పంటల ప్రణాళిక చేపట్టాలి. రాష్ట్రస్థాయిలో చర్చించడం కాకుండా, రైతులకు అవగాహన కల్పించడం ద్వారా, గ్రామ, మండల స్థాయిలో ఈ ప్రణాళికలు రూపొందాలి. ఈ చర్చలలో స్థానికంగా ఉండే రైతు సహకార సంఘాలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను, గ్రామీణ మహిళా సహకార సంఘాలను, పశు పోషకులను, కోళ్ళ పెంపకందారులను భాగస్వాములను చేయాలి. ఈ సహకార సంఘాల ఆధ్వర్యంలోనే ప్రాసెసింగ్ యూనిట్లు, గిడ్డంగుల కోసం నిధులు కేటాయించవచ్చు. కస్టమ్ హైరింగ్ సెంటర్లు నిర్వహించవచ్చు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు నడుపుతున్న పారిశ్రామికవేత్తలతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమావేశాలు జరిపి వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి. ఇతర రాష్ట్రాలను, బడా వ్యాపారసంస్థలను సంప్రదించి, వాళ్ళకు రాష్ట్రం నుంచి అవసరమైన వ్యవసాయ, ఇతర గ్రామీణ ఉత్పత్తుల గురించి చర్చలు జరిపి, కనీస మద్దతుధరల చెల్లింపు ప్రాతిపదికన వారితో ముందస్తు ఒప్పందాలు చేసుకోవాలి. వాటిని కూడా గ్రామ, మండల స్థాయిలో పంటల ఉత్పత్తి ప్రణాళికలలోకి తీసుకురావాలి. పంటల ఉత్పత్తి ఖర్చులు, దిగుబడుల మధ్య వ్యత్యాసం వల్ల, రైతులకు వచ్చే ఆదాయాల మధ్య వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది కనుక, వారు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరానికి కనీస ఆదాయం గ్యారంటీ ఇవ్వాలి. అప్పుడే రైతులు భరోసాతో అన్ని పంటలను సాగు చేస్తారు. అడవి జంతువులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు తట్టుకోవడానికి సమగ్ర బీమా పథకాలను అమలు చేయాలి.
రాష్ట్రప్రభుత్వం ఈ వానాకాలం సీజన్‌కు ముందే, పాత తప్పులు పునరావృతం కాకుండా చర్చలు ప్రారంభించి నిర్దిష్ట విధానాలను అమలు చేయాలి.(ఆంధ్ర‌జ్యోతి సౌజ‌న్యంతో..)
కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక

ఆస్తుల అమ్మకంలో ఆంతర్యమేమి?

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విశాఖ నగరం లోని భూములను వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. దీని కనుగుణంగా ‘నేషనల్‌ బిల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ వారు మార్చి 30వ తేదీన నగరంలోని ఐదు ప్రదేశాలలో ఉన్న 17.48 ఎకరాల భూమిని వున్నది వున్నట్లుగా అమ్మాలని ‘ఇ టెండర్ల’ను ఆహ్వానించారు. నగరం నడిబొడ్డున ఆర్కే బీచ్‌ను ఆనుకుని ఉన్న 13. 59 ఎకరాల భూమి కూడా ఇందులో ఉంది. ప్రభుత్వం భూములు ఎందుకు అమ్ముతోంది అన్నది ఒక అంశం కాగా, అలా అమ్మడం సహేతుకమేనా అన్నది మరొక అంశం. వాస్తవానికి గత సంవత్సరమే ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేసినా హైకోర్టు ఆర్డర్‌ వల్ల నిలిచిపోయింది.

అధికారంలోనికి వఛ్చిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్‌ ఎ.పి మిషన్‌’ అమలుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక స్టేట్‌ లెవెల్‌ మోనిటరింగ్‌ కమిటీని (ఎస్‌ఎల్‌ఎంసి) జీఓ నెం. 447 (తేదీ 5.11.02019) ద్వారా ఏర్పాటు చేసింది. అందులో మూడు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ‘నవరత్నాలు, నాడు-నేడు’ వంటి పథకాల అమలుకు నిధులు సమకూర్చుకోవడం, రెండవది రాష్టంలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను అమ్మడం ద్వారా ఆ నిధులు రాబట్టడం, మూడవది ఈ పనిని సమర్ధవంతంగా చేయడానికి నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బిసిసి) అనే కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమతో ఒప్పందం చేసుకోవడం. ఇప్పుడు ఈ సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వ అమ్మకాల జాబితాలో ఉండడం గమనార్హం.

గత సంవత్సరం మార్చి 2వ తేదీన జరిగిన ఎస్‌ఎల్‌ఎంసి సమావేశంలో సుమారు పది వేల కోట్ల రూపాయల విలువచేసే 1400 ఎకరాల భూమి 250 ప్రాంతాలలో ఉందని గుర్తించారు. ఈ భూమిని వివిధ దశలలో అమ్మాలని ప్రతిపాదించారు. మొదటి దశలో విశాఖపట్నం జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 7 మొత్తం 40 స్థలాలను అమ్మవచ్చని ఎన్‌బిసిసి ఎంపిక చేసింది. ఈ స్థలాల నుండి అత్యధిక రాబడి సాధించేందుకు అవసరమైన సహకారానికి కెనడా రాజధాని టోరొంటో ప్రధాన కేంద్రంగా ఉన్న ‘కొలియర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌’, అమెరికా లోని చికాగో ప్రధాన కేంద్రంగా ఉన్న ‘జెఎల్‌ఎల్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌’ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండూ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రపంచం లోనే అతి పెద్ద కంపెనీలు.

ఇలా అమ్మకానికి పెడుతున్న స్థలాలు ఎపిఐఐసి, ఇరిగేషన్‌, మునిసిపల్‌, రెవిన్యూ, ఆరోగ్య, జైళ్ల శాఖలకు చెందినవి ఉండడంతో, ఎలాంటి వివాదాలకు తావులేకుండా అమ్మకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షులుగా, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కన్వీనరుగా డిస్ట్రిక్ట్‌ ప్లానింగ్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ కమిటీని అన్ని జిల్లాలలో ఏర్పాటు చేశారు.

అసలు ఇలా భూములు అమ్మడం వివేకమేనా అనే ప్రశ్న అలా ఉండగా ఇంకా విచిత్రమైన రెండు విశేషాలు ఇందులో ఉన్నాయి. ఒకటి స్థలాల విలువ కట్టడమైతే, రెండోది ఈ స్థలాలలో ప్రస్తుతం ఏమున్నాయనేది. మార్కెట్‌ విలువ కంటే అన్ని స్థలాలలోనూ తక్కువే వస్తుందని వారు పేర్కొన్నారు. అదే సందర్భంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ రేట్ల కంటే కూడా వీరు తక్కువ మార్కెట్‌ రేటును పొందుపరిచారు. దీనర్ధమేమిటంటే భూములను చవకగా అమ్మడం. వీరు అమ్మాలనుకున్న కొన్ని స్థలాలలో ప్రధానమైన ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు పని చేస్తున్నాయి. ఉదాహరణకు గుంటూరు నగరంలోని అరండల్‌ పేటలో వున్న తహసీల్దార్‌ ఆఫీసు, జైలును ఖాళీ చేయించి ఆ స్థలాన్ని అమ్మేయాలని నిర్ణయించారు. అలాగే విశాఖ నగరం లోని సీతమ్మధారలో ఉన్న తహసీల్దార్‌ ఆఫీసు, రెవిన్యూ ఉద్యోగుల క్వార్టర్లను ఖాళీ చేయించి అమ్మకానికి పెడుతున్నారు. ఇంకా విచిత్రంగా, అక్కడే ఉన్న ప్రభుత్వ కంటి ఆసుపత్రిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని కూడా తరలించి, ఆ పదకొండు ఎకరాల స్థలాన్ని కూడా వేలానికి పెట్టాలని నిర్ణయించారు.

ఇంకో విశేషమేమిటంటే గత ప్రభుత్వం విశాఖ నగరంలోని 13.59 ఎకరాల భూమిని ‘లులు మాల్‌’ కు కేటాయించింది. ఈ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఆ కేటాయింపును రద్దు చేసింది. ప్రభుత్వం దీనిని ప్రజావసరాలకు వినియోగిస్తుందని భావించి ప్రజలు ఈ రద్దును హర్షించారు. కానీ వారికి దిమ్మదిరిగేలా ప్రభుత్వం నేడు ఆ భూమిని కూడా అమ్మకానికి పెట్టింది. ఆ కాడికి పాత కేటాయింపును రద్దు చేయడమెందుకు? ‘లులు మాల్‌’ కే వదిలేస్తే పోయేది కదా అనే భావనతో ఇప్పుడు ఆ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ‘బిల్డ్‌ ఎ.పి” అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడం కాకుండా అమ్మకానికి పెట్టడంలా ఉంది. ఒక పక్క అమ్మేస్తూ, ఇదెలా నిర్మించడం అవుతుందో ఆ పేరు పెట్టిన వారికే తెలియాలి.

ఈ మొత్తం వ్యవహారం అనేక సందేహాలకు తావిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వివేచనను ప్రశ్నించేలా చేస్తోంది. ఇలా అమ్ముకుంటూ పోతే ఆస్తులు తరుగుతాయే కానీ పెరగడానికి ఇదేమీ ఊరే జల కాదు కదా! ఈ అమ్మకాలలో విదేశీ బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను భాగస్వామ్యం చేయడం వెనుక ఏమైనా మతలబుందా అనే సందేహం కూడా సామాన్యులకు కలగడం సహజం. ప్రభుత్వ ఆఫీసులను కూడా ఖాళీ చేయించి మరీ అమ్మకానికి పెట్టడంలో ఆంతర్యమేంటనే సందేహం కూడా కలుగుతుంది. ఇటువంటి సందేహాలను కొట్టిపారేయకుండా నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంటి రోజువారీ ఖర్చులకు ఆదాయ మార్గాలను వెతుక్కోకుండా ఇంట్లో సామాన్లన్నీ అమ్ముకుంటూ పోతే, ఆ ఇల్లు ఎలా దివాళా తీస్తుందో మన రాష్ట్ర పరిస్థితి కూడా అక్కడికే చేరుకుంటుందనడం అతిశయోక్తి కాదు.

సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదే కానీ, ఆ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం వివేకవంతమైన ఆలోచనేనా? అలా అమ్ముకుంటూ పోతే కొన్నాళ్ళకు ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోతే అప్పుడు ఏం చేస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేయడమే తమ విధానమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ బాట లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనిస్తోందా అనే భావం కూడా ప్రజలకు కలుగుతుంది. ఇప్పుడు విశాఖ భూములతో ప్రారంభించి అనేక ప్రాంతాలలో భూములను అమ్మడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా అవగతమవుతోంది.

ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో పునరాలోచించి స్థిరంగా వచ్చే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించాలి. కేంద్రం నుండి రావలసిన మన వాటా నిధులకై అవసరమైతే అందరినీ కలుపుకుని ఒత్తిడి తేవాలి. అంతేకాని ఇలా ఆస్తులను అమ్ముకోవడం రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. విజ్ఞత అంతకంటే అనిపించుకోదు.
ఎ. అజ శర్మ /వ్యాసకర్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి

సెకండ్‌వేవ్‌..పెద్ద పీడకల

తొలిదశ కరోనాలో తీసుకున్నంత ముందుస్తు జాగ్రత్తలు,సెకండ్‌వేవ్‌లో తీసుకోకపోవడంవల్ల ఎందరో కుటుంబాల్లో ఆత్మీ యులు,బంధువులు,అభాగ్యుల ప్రాణాలు విడిచారు. నిజానికి ఒక యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాం.ఆస్పత్రికి వచ్చే కేసులన్నీ సీరియస్‌ కేటగిరీలే…అంతా ఆక్సిజన్‌తో అంబులెన్సుల్లో వచ్చేవారే. పడకలన్నీ ఫుల్‌.. బయట అంబులెన్సుల వరస..ఎన్నో ఒత్తిళ్లు.. మరెన్నో నిద్రలేని రాత్రులు ప్రజలు గడిపారు. ఇలా కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఒక పెద్ద పీడకల లాంటిది. ఫస్ట్‌వేవ్‌లో కేసులు తగ్గిపోవడంతో.. దేశ ప్రజలంతా తప్పట్లు కొట్టి పంపిస్తూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సెకండ్‌వేవ్‌ పంజా విసిరింది.ఫస్ట్‌వేవ్‌లో ఆక్సిజన్‌, ఐసీయూ అవసరం ఉండే రోగుల సంఖ్య తక్కువ. మైల్డ్‌,మోడరేట్‌ కేసులే ఎక్కువగా వచ్చేవి. అలాంటి వారికి నిర్ణీత సమయంలో చికిత్స అందిస్తే కోలుకునేవారు. సెకండ్‌వేవ్‌లో వచ్చేవారంతా ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ రోగులే అధికమయ్యారు. విశాలమైన భారత దేశంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగు పరచాలి. సెకెండ్‌ వేవ్‌లో ప్రభుత్వాలు ముందుస్తు ప్రణాళికలు, హెచ్చరికలు చేయక పోవడం వల్ల కరోనా మహమ్మారి లక్షలాది మందిని బలితీసుకుంది.

మన దేశంలో ప్రజా ఆరోగ్యవ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఆరోగ్య సంరక్షణ అనేది దేశంలో ముఖ్య విభాగం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చందుతుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అనేది కేవలం వ్యాధి నివారణ,పరీక్షలు,చికిత్సలకే కాదు. ప్రజల ఆరోగ్యం మెరుగుపడే విధంగా పనిచేయాలి.కానీ సెకెండ్‌వేవ్‌ కరోనా వ్యవహారంలో ప్రభుత్వాలు తగిన సమయంలో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించలేక పోవడం వల్లే అధికంగా ప్రాణనష్టానకి గురయ్యాం. భారత దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్లు విదేశాలకు ధారదత్తం చేశాం. ప్రమాదఘటికలు మన దేశానికి సంబంధించినప్పడు వాక్సిన్లు పూర్తిస్థాయిలో దేశ ప్రజలకు వేయించలేని దుస్థితి దాపురించింది. ప్రజల నుంచి పన్నుల రూపంలో తీసుకున్న డబ్బునే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఖర్చు చేస్తుంది. ముందుస్తు ప్రణాళికలు లేక పోవడం,వ్యాక్సినేషన్‌ క్షేత్రస్థాయిలో వేయక పోవడం వల్ల కరోనా సెకెండ్‌ వేవ్‌ విస్తరించింది. పైకి మాత్రం ప్రభుత్వాలు కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కేంద్రమే చెబుతోంది. కానీ,విధాన నిర్ణేతలు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో వినడంగానీ,తెలుసుకోవడంగానీ చేయక పోవడం బాధాకరం.కరోనాపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ‘ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి తాత్కాలికంగా, రోజువారీ పోరాటం కుదరదని.. స్పష్టమైన విధానం ఉండాలని స్పష్టం చేసింది. గ్రామీణ భారతంలో పరిస్థితి డిజిటల్‌ ఇండియా నినాదానికి పూర్తి విరుద్ధంగా ఉంది. జార్ఖండ్‌లో నిరక్షరాస్యుడైన ఓ కూలీ.. రాజస్థాన్‌లో టీకా వేయించుకోవడానికి ఎలా రిజిస్టర్‌ చేయించుకోగలడు? దేశంలో ఏం జరుగుతోందో, క్షేత్ర స్థాయి పరిస్థితేంటో ప్రభుత్వం తెలుసుకోవాలి. తదనుగుణంగా విధానం మార్చుకోవాలి’ అని వ్యాఖ్యానించింది.’

అజాగ్రత్త వద్దు

కరోనాపై ప్రజల్లో అవగాహన మరింతగా పెరిగాలి. వ్యాక్సిన్లు వచ్చాయన్న ధైర్యం కావొచ్చు.. మన దాకా వైరస్‌? రాదన్న ఓవర్‌? కాన్ఫిడెన్స్‌? కావొచ్చు..చాలా మంది మాస్కులే పెట్టుకోవట్లేదు. భూతిక దూరాన్ని పాటించట్లేదు. కరోనా వ్యాక్సిన్లు వచ్చినా ఇప్పుడే అందరికీ అందవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరిదాకా అది చేరాలంటే ఇంకో ఏడాదైనా పట్టొచ్చు. అప్పటిదాకా కరోనాను ఎదుర్కొనే మందు, ఆయుధాలు మాస్క్‌?, సోషల్‌? డిస్టెన్స్‌?లే. ఈ బేసిక్‌? కరోనా రూల్స్‌?పై చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా సెకండ్‌? వేవ్‌? జోరుమీదుంది. కాబట్టి అంతా మాస్క్‌? పెట్టుకుంటూ, కనీస దూరం పాటిస్తేనే మనల్ని మనం కాపాడుకోగలమని నిపుణులు చెప్తున్నారు. చివరిగా..శానిటైజర్‌? లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం కూడా మరచిపోవద్దు! ప్రభుత్వాలు కూడా కేవలం వీటిపైనే కాకుండా కాలుష్యాన్ని నివారించే చర్యలపై దృష్టి సారించాలి. వ్యవసాయరంగంలో రసాయనిక ఎరువులు తగ్గిస్తూ సేంద్రియ ఎరువులపట్ల రైతులకు అవగాహన కల్పించాలి. అదే విధంగా నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి

ఆ విషయంలో నిర్లక్ష్యం వద్దూ

కిశోర బాలికలో మొదటిసారి సంభవించే రుతుక్రమం సుమారు తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు మధ్య జరుగుతుంది. కొన్నిసార్లు తొందరగా ఎనిమిది సంవత్సరాలకు లేదా చాలా ఆలస్యంగా పందొమ్మిది సంవత్సరాల వరకు అవుతుంది. దేశంలో 70శాతం తల్లులు బహిష్టును మలినముగా భావిస్తున్నారు. బహిష్టు అంటే సిగ్గుపడే అంశమని, దాని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదనే సంస్కతి ప్రజల్లో వుంది. మనదేశంలో 6కోట్ల 30 లక్షలమంది కిశోర బాలికలు మరుగు దొడ్డి సౌకర్యంలేని ఇళ్లల్లో నివసిస్తున్నారు.


ఋతుస్రావం అనేది నూతన శిశువులకు జన్మనిచ్చే అత్యంత కీలకమైన మానవ ప్రత్యుత్పత్తికి చెందిన అంశం, ప్రపంచ వ్యాపితంగా మే 28వ తారీఖుని బహిష్టు ఆరోగ్య,పరిశుభ్రతా దినోత్సవంగా జరుపు తున్నారు. 2021 సంవత్సరాన్ని బహిష్టు ఆరోగ్యం, పరిశుభ్రతపై కార్యాచరణ, నిధుల వెచ్చింపు అనే అంశంగా ప్రకటించారు, 2014 సంవత్సరంలో జర్మనీకి చెందిన ‘వాష్‌ యునైటెడ్‌’ సంస్థ ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా జరిపింది. ఈ కొవిడ్‌ సంక్షోభ కాలంలో బాలికలు,మహిళలు శానిటరీ నాప్కిన్లపై పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని స్వచ్ఛంద సంస్థల సర్వేలు చెబుతున్నాయి.
బాలికలలో బహిష్టుపై మూఢనమ్మకాలు,అపోహలు ప్రజల్లో బహిష్టుపై మూఢనమ్మకాలు ప్రచారంలో ఉండడంతో నిశ్శబ్ద వాతావరణం ఆవహించి ఉంది. అందువల్ల బాలికలు బహిష్టు పరిశుభ్రతపై తెలుసుకోవడం గాని చర్చగాని జరగకుండా మూఢనమ్మకాలు అవరోధంగా ఉన్నాయి.మనదేశంలో అవగాహన లేక డబ్బయిశాతం తల్లులు బహిష్టును మలినంగా భావిస్తున్నారు. పాలు, పెరుగు, మాంసాహారము, పచ్చళ్ళు,పండ్లను బహిష్టు సమయంలో తినకూడదని ఇంకా నమ్ముతున్నారు. భారతదేశంలో నలభైకోట్ల మంది మహిళల్లో కేవలం ఇరవై శాతం మంది మాత్రమే నాప్కిన్లని వాడుతున్నారు. అందు లోనూ పట్టణ ప్రజలే ఎక్కువగా శానిటరీ నాప్కిన్లను ఉపయోగిస్తున్నారు, గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ ఇది చర్చించదగని విషయంగానే భావిస్తున్నారు. ఇంకా డబ్బయి ఒక్క శాతం బాలికలకు రజస్వల అయ్యేంతవరకూ తమ శరీరంలో జరిగే మార్పుల గురించి కానీ, నెలసరి గురించి కానీ అవగాహన లేదు.
కౌమార ప్రాయం అయోమయపు సందేహాల దశ. బాలకల శారీరక, మానసిక పెరుగుదలలో కీలకమైన మార్పులు ఈ దశలోనే ఏర్పడతాయి.పిల్లలు శారీరకంగా, మానసికంగా,భావోద్వేగపరంగా, సామాజికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త సామర్ధ్యాలను పెంపొందించుకొనే దశ కౌమారదశ. ఈ దశలో ఉన్నవారిని కౌమార బాలికలు అంటారు. మొదట ఋతుస్రావం యవ్వన ప్రారంభానికి సూచిక. ఈ మార్పుల్లో చాలాభాగం లైంగిక, పునరుత్పత్తి, ఆరోగ్యం,పోషణ మొదలైనవి. ఈ దశలో పాఠశాలలు, కళాశాలల్లో వారికి సరైన కౌస్సిలర్ల అవసరం పడుతుంది. బాలికలకు పాఠశాల స్థాయిలో ఈ అంశాలపట్ల సక్రమంగా అవగాహన కలిపించకపోవడం వలన పెద్దలు చెప్పిన మాటలే ఆచరిస్తూ బహిష్టు అపరిశుభ్రత వల్ల ఎదురయ్యే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
బహిష్టు కు సంబంధించిన సాధారణ ఆరోగ్యం లోపించి శారీరక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. రక్తహీనత, యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. తరచుగా రక్తస్రావం వల్ల పునరుత్పత్తి నాళ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అసాధారణ రుతుక్రమం వల్ల చాల వరకు రక్తస్రావం ఉండడంతో దీర్ఘకాలంలో గర్భాశయ ముఖద్వారా కాన్సర్‌ వచ్చే అవకాశమూ ఉంది. చిన్న వయసులో బాలికలకు వివాహం, క్రమంలో లేని బహిష్టుతో గర్భం దాల్చడం వలన దుర్భలమైన సమస్యలు తలెత్తుతాయి. బాలికలలో భయము,ఆందోళన,సిగ్గు,బిడియం, ఆత్మన్యూనతకు గురై మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది.
కౌమార ప్రాయంలోని వారు తరచుగా వివిధ సమస్యలు, అలజడులు, తిరుగుబాటు ధోరణులతో ఉంటారు. వాని బెంగ అంతా ‘అన్ని తప్పులను ఒప్పుగా చేయడం’ ‘న్యాయం కోసం పోరాటం’ సరైనదే చేయడం పైనే సమాజానికి ఉపయోగ పడే,సమాజ ఉత్పాదకతకు దోహదం చేసి, భాగస్వామ్య పౌరులుగా గుర్తింపు పడాలనే కోరిక వారిలో ఉంటుంది.
నివ్వెరపరిచే వాస్తవాలు, సవాళ్లు. బాలికలు, మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య వంతమైన భవిష్యత్తరాన్ని ఈ సమాజానికి అందించవచ్చని వైద్య నిపుణుల అభిప్రాయం. బాలికల,మహిళారోగ్యంలో ప్రధానంగా చెప్పుకోవలసినది బహిష్టు పరిశుభ్రత. ఇది కేవలం బాలికల,స్త్రీల సమస్యేకాదు, దేశసుస్థిర ఆదాయం,దేశ సర్వతో ముఖాభివృద్ధితో ముడిపడిన సమస్య. కనుక ఈ సమస్యను ఎటువంటి లింగ వివక్ష లేకుండా బాలికలందరికీ విద్య, ఆరోగ్యము,పోషకాహారము, స్వచ్ఛమైన త్రాగు నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత,మౌలిక సదుపాయాల కల్పన,నిరంతర అవగాహన కార్యక్రమాలతో అధిగమించవచ్చు. దీనిలో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల మేరకు మే 28 న అంతర్జాతీయ బహిష్టు పరిశుభ్రత దినోత్సవంగా ప్రతి సంవత్సరము జరుపుతున్నారు. అయితే మన ముందున్న వాస్తవాలు,సవాళ్లు ఇలా వున్నాయి.
ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కల్గిన మన దేశంలో సుమారు 355 మిలియన్ల మహిళల్లో నెలసరి రుతుక్రమం జరుగుతున్నది. కిశోర బాలికలలో సుమారు 23% బాలికలు తను మొదటిసారి ఋతుస్రావం కాగానే బడికి వెళ్ళడం మానివేస్తున్నారు.
కిశోర బాలికలో మొదటిసారి సంభవించే రుతుక్రమం సుమారు తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు మధ్య జరుగుతుంది. కొన్నిసార్లు తొందరగా ఎనిమిది సంవత్సరాలకు లేదా చాలా ఆలస్యంగా పందొమ్మిది సంవత్సరాల వరకు అవుతుంది. దేశంలో 70శాతం తల్లులు బహిష్టును మలినముగా భావిస్తున్నారు. బహిష్టు అంటే సిగ్గుపడే అంశమని, దాని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదనే సంస్కతి ప్రజల్లో వుంది. మనదేశంలో 6కోట్ల 30 లక్షలమంది కిశోర బాలికలు మరుగు దొడ్డి సౌకర్యంలేని ఇళ్లల్లో నివసిస్తున్నారు.
ఒక సంవత్సరంలో పాఠశాలలు పనిచేసే రోలలో 20శాతం దినాలు బాలికలు మొదటి కారణమైన ఇంటిపని,రెండవ కారణమైన బహిష్టు వలన పాఠశాలకు గైర్హాజరవు తున్నారు.బహిష్టు సమయంలో పరిశుభ్రతను సరిగ్గా పాటించక పోవడం వలన మహిళల్లో మరియు బాలికల్లో పునరుత్పత్తి నాళ ఇన్ఫెక్షన్స్‌ 70శాతం పెరిగిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార కాన్సర్లలో 27శాతం మన దేశంలో ఉండటం ఇంకో విషాదం.
సంస్థల, ప్రభుత్వాల పరిష్కారాలు
యాక్షన్‌ఎయిడ్‌ అనే స్వచ్ఛంద సంస్థ మురికివాడలలోని కౌమారబాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ అందజేస్తోంది.ఇంకా ఇతర అంతర్జాతీయ సంస్థలు సయితం ఈ అంశంపై పనిచేయవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలల్లో నాడు ` నేడు కార్యక్రమం చేపట్టి మౌలిక సదుపాయాల కల్పనను చేపట్టింది ఇందువల్ల బాలికలు బడిమానివేసే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్‌ను అందజేస్తున్నారు అయితే ఇవి అన్ని గ్రామీణ, గిరిజన పాఠశాలలకూ అందజేయాలి. ‘గర్ల్స్‌ ఫ్రెండ్లీ టాయ్‌లెట్‌’లను నిర్మించాలి, బాలికల కోసం శానిటరీ ప్యాడ్స్‌, సబ్బు, నీటివసతితో ఒక గది ప్రత్యేకంగా కేటాయించాలి. పనిచేసే ప్రదేశాలలో కాలేజీలలో కూడా ఈ సదుపాయాలు కల్పించాలి. పర్యావరణానికి హాని కల్గించని విధంగా తయారచేసిన శానిటరీ నాప్కిన్‌లను మాత్రమే వాడాలి. కౌమార బాలికల కోసం పాఠశాల, కళాశాలల్లో మహిళా కౌస్సిలర్లను నియమించాలి. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు చేయాలి.
-హరి వెంకట రమణ

జీవించే హక్కుకు ప్రాధాన్యత ఇవ్వండి

స్వాతంత్య్ర భారతదేశంలో ఏ ఇతర సమస్యల కన్నా కూడా భయంకరమైన హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితులు, పెద్ద సంఖ్యలో కోల్పోయిన ఉద్యోగాలు, ఒక్కసారిగా క్షీణించిన ప్రజల ఆదాయాలు, బాగా పెరిగిన ఆకలి దప్పులు, ఘోరమైన పౌష్టికాహార విధానం లాంటి అనేక సంక్షోభాలతో మెజారిటీగా ఉన్న కష్టజీవులు నేడు భయంతో వణికి పోతున్నారు.
వైఫల్యాలు
మే 13వ తేదీన సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు (పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌) వలస కార్మికులకు గుర్తింపు కార్డుల గురించి ఒత్తిడి చేయకుండా ఉచిత రేషన్‌ సమకూర్చాలని, రోజుకు రెండు పూటలా ఉచిత ఆహారాన్ని అందించడానికి వంటశాలలు నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసింది. గత సంవత్సరం మార్చిలో విధించిన జాతీయ లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఈ తీర్పుకు ప్రాధాన్యత ఏర్పడిరది. దేశంలో ఆకలి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వ తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు గుర్తించింది. కానీ ఆ తీర్పు మూడు కారణాల వల్ల ఒక మార్గాన్ని చూపడంలో విఫలమైంది : అది(తీర్పు) ఆ సౌకర్యాన్ని దేశంలో మొత్తంగా విస్తరించలేదు. ప్రభుత్వం అందించే ఉచిత ఆహారం, రేషన్‌తో పాటుగా నగదు బదిలీ కూడా చేసేందుకు ఆ సౌకర్యాన్ని విస్తరించలేదు. ఆ సౌకర్యాన్ని ఒక హక్కుగా పొందడం కన్నా, ఔదార్యంతో ఇస్తే పొందే సహాయంగా మార్చింది. ఆ తీర్పుకు సార్వత్రికంగా జీవించే హక్కును ప్రాతిపదికగా తీసుకొనివుండి వుంటే, ఆ మూడు లోపాలను అధిగమించి ఉండెడిది. కేంద్ర ప్రభుత్వం తన వ్యాక్సిన్‌ పాలసీ ద్వారా జీవించే హక్కును నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నది. ప్రతీ వ్యక్తి తన జీవించే హక్కును రక్షించుకోవడానికి కోవిడ్‌-19ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ వేయించుకోవడం అవసరం. ప్రతీ ఒక్కరి జీవించే హక్కును ప్రభుత్వం గౌరవించాలి కాబట్టి, వ్యాక్సిన్‌ వేయించుకునే వారి ఆర్థిక స్థోమతతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వమే అందరికీ సమానంగా వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలి. అది కూడా వ్యాక్సిన్‌లను ఉచితంగా అందిస్తేనే సాధ్యమవుతుంది. ప్రయివేటు వైద్య విధానం బాగా అమలవుతున్న అమెరికా లాంటి అనేక దేశాల్లో కూడా ప్రజలందరికీ వ్యాక్సిన్‌లు ఉచితంగానే వేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం 18-45ఏండ్ల మధ్య వయసుల వారు ప్రయివేటు ఆసుపత్రులలో డబ్బు చెల్లించి వ్యాక్సిన్‌ వేయించుకునే ఏర్పాట్లు చేస్తుంది. ఇది కరోనా మహమ్మారిని నిరోధించాడానికి ప్రభుత్వం తీసుకుంటున్న దారుణమైన, ప్రతికూలమైన వ్యూహం.
ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వం యొక్క తీవ్రమైన తప్పిదాల ఫలితమే. ప్రభుత్వం (ఎక్కువ మంది ఉత్పత్తిదారులకు తప్పని సరి లైసెన్స్‌లు ఇవ్వడం ద్వారా) తగినన్ని వ్యాక్సిన్‌ల ఉత్పత్తికి హామీ ఇవ్వలేదు. సరిపడా వ్యాక్సిన్‌ల సరఫరా కావాలని అడగలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్‌లను సమకూర్చాల్సిన బాధ్యతా ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. వ్యాక్సిన్‌ ధరలలో తారతమ్యం ఉండే విధానాన్ని ప్రవేశపెట్టి, రాష్ట్రాలు ఒకదానితో ఒకటి, రాష్ట్రాలు ప్రయివేట్‌ క్లీనిక్‌లతో పోటీ పడి వ్యాక్సిన్‌లను కొనే విధంగా ఒత్తిడి చేసి, భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌లు ఎక్కువ ధరలు చెల్లించాలని ఒత్తిడి చేసే విధంగా అనుమతించింది. కరోనా రెండవ వేవ్‌లో ప్రభుత్వం ప్రజల జీవితాలు, వారి బాధల గురించి ఆలోచించడంలేదు. ఫలితంగా ప్రజలు తాము జీవనాధారాలను కోల్పోయి భారీగా నష్టపోతున్నారు. కనీసం 90శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పని చేస్తుండగా, వారికి ఏ విధమైన సామాజిక, చట్టపరమైన రక్షణ లేకుండా, గడచిన సంవత్సర కాలంలో విధించిన లాక్‌డౌన్‌లకు వారికి నష్టపరిహారాన్ని ఇవ్వకుండా నిరాకరించారు. వారిపై అనేక ఆంక్షలు విధించి, ఆర్థిక బాధలకు గురిచేశారు. కానీ అసంఘటితరంగ కార్యకలాపాలపైన ఆధారపడి పని చేస్తున్న ఒక బిలియన్‌ ప్రజల గురించి ఎటువంటి బహిరంగ నిరసనలు వ్యక్తం కాలేదు. విధాన నిర్ణేతలు ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉన్న వారు వీరిని పూర్తిగా వదిలి వేశారు. ఈ అలక్ష్యం యొక్క పరిణామాలు చాలా తీవ్రంగానూ, దీర్ఘకాలం పాటు కేవలం చెప్పలేని బాధలు అనుభవిస్తున్న ప్రజల పైన మాత్రమే కాక, దేశంపైన, భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ నడిచే మార్గంపైన కూడా ప్రభావాన్ని చూపుతాయి.
ఇటీవల కాలంలో ఒక సమిష్టి సామాజిక సమూహాల నిర్వహణలో ‘హంగర్‌ వాచ్‌’ అని పిలువబడే ఒక అధ్యయనం, గత సంవత్సరం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన రెండు నెలల తరువాత కూడా మూడిరట రెండొంతుల కుటుంబాలు లాక్‌డౌన్‌ కంటే ముందు తీసుకున్న ఆహారం కంటే తక్కువే తీసుకున్నారనీ, ఆరోగ్యాన్ని రక్షించే ఆహారంలో కూడా తగ్గుదల ఉందని తేల్చింది. సర్వే చేయబడిన కుటుంబాలలో పావు వంతు కుటుంబాల ఆదాయాలు సగానికి పడిపో యాయి. గ్రామీణ భారతంతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఆకలి ఎక్కువగా ఉందని ఆ సర్వేలో తేలింది. అనాలోచితంగా విధించిన లాక్‌డౌన్‌ల వలన కలిగే పరిణామాలు ఆర్థిక పునరుద్ధరణ కోసం జరిగే ప్రయత్నాలను అడ్డుకుంటాయి.
ఆర్థిక ప్యాకేజీ
ఒక అర్ధశతాబ్ద కాలంలో దేశం పెద్ద మానవ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే, కరోనా మహమ్మారి వలన కలిగిన ఆరోగ్య, ఆర్థిక ప్రభావాలను ఎదుర్కొనేందుకు, చెప్పు కోదగిన ఆర్థిక ప్యాకేజీ పొందని అతి కొన్ని దేశాల్లో భారతదేశం ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు జీడీపీలో కేవలం 2.1శాతం వడ్డీలేని ఖర్చును మాత్రమే పెంచింది. ఇది, మొదటి కరోనా వేవ్‌లో నలిగిపోయిన ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఎందుకు ఇంత దయనీయంగా ఉందో తెలియజేస్తుంది. ఇతర అనేక దేశాల్లో ప్రజలకు ఆదాయాలను సమకూర్చే దిశగా పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించారు.
ఆర్థిక వ్యవస్థ స్వస్థతకు సాధనంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లో వెనుకబడిన పనుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అంటున్నారు. దానికి బదులుగా ఆమె మిలియన్ల సంఖ్యలో ఉన్న పేద కార్మికులకు నగదును బదిలీ చేసే విధానంపై ఆధారపడి ఉంటే, అది ప్రజలను ఆకలి, నిరుద్యోగంలోకి నెట్టివేయకుండా రక్షించి, వద్ధి రేటును ప్రోత్సహించి ఉండేది. నగదు బదిలీ వలన ప్రజలు దేశీయంగా ఉత్పత్తి చేయబడే సాధారణ వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అందువలన ఈ నగదు బదిలీ ద్వారా ప్రజలపై చేసే ఖర్చు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లపై చేసే ఖర్చు (ఒకవేళ ఖర్చు చేసిఉంటే)కన్నా రెట్టింపు ప్రభావాలను చూపించి ఉండెడిది.
ఎక్కువ మొత్తంలో అవసరమైన సరుకులను, ఇప్పటికే పోగుపడిన ఆహార ధాన్యాల నుండే పంపిస్తారు కాబట్టి, సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఉచిత రేషన్‌, ఉచిత భోజనాల వలన కొంత మేలు జరుగుతున్నప్పటికీ, అవి ఆర్థిక వ్యవస్థపై కొద్దిపాటి విస్తరణా ప్రభావాన్నే చూపుతాయి. అందువల్ల ఉచిత రేషన్‌, ఉచిత భోజనాలను అందించడంతో పాటుగా ప్రజలకు సహాయార్ధంగా నెలకు రూ.7000 నగదును బదిలీ చేసి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా జీవించే హక్కుకు ప్రాధాన్యతనిచ్చే చర్యలను చేపట్టాలి. ఆ చర్యలు మాత్రమే నేడు ఆర్థిక స్వస్థతను చేకూర్చే సరైన మార్గాలు. వాటిలో ప్రధానంగా, ఉత్పత్తిని విస్తరించడానికి అనుమతించడం, కేంద్ర ప్రభుత్వమే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ లను సేకరించి అందరికీ ఉచితంగా రోగనిరోధక శక్తిని పెంచేందుకు రాష్ట్రాలకు వాటిని పంపిణీ చేయడం, అవసరం ఉన్న ప్రతీ ఒక్కరికీ నెలకు 5కిలోల ఆహార ధాన్యాలను ఆరు నెలల పాటు అందించడం, ప్రతీ కుటుంబానికి, ఏ ఉద్యోగం లేని వారికి నెలకు కనీసం రూ.7000 చొప్పున మూడు నెలల పాటు నగదు బదిలీ చేయడం, ‘ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్మెంట్‌ సర్వీసెస్‌’ తన కార్యక్రమాలను పునరుద్ధరించి, విసృతపరచడానికి తగిన వనరులను పెంచడం.
‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ డిమాండ్‌కు తగిన విధంగా పని రోజులలో, కుటుంబంలో లబ్దిదారుల సంఖ్యలో ఎటువంటి పరిమితులు విధించకుండా అమలుచేయడం,అదే పథకాన్ని దేశంలోని పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులైన నిరుద్యోగులకు కూడా వర్తింపజేయడం చేయాలి. వీటికి వనరులు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నిస్తారు. పెద్ద ఎత్తున నిరుద్యోగం, ఉపయోగించబడని సామర్థ్యం, ఉపయోగించని ఆహార ధాన్యాల నిల్వల (ప్రస్తుతం సుమారు 80 మిలియన్‌ టన్నులు)తో ఉన్న ఒక ఆర్థిక వ్యవస్థలో వనరుల సమీకరణ కోసం ఏ ఒక్కరి వినియోగాన్ని తగ్గించవలసిన అవసరం లేదు. ద్రవ్యలోటును పెంచడం వలన, అనవసరమైన సంపద అసమానతలు పెంచడం, ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ ద్రవ్య పెట్టుబడిని భయపెట్టడం తప్ప, వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. ఈ రెండిరటినీ అడ్డుకోవాలంటే, సంపద పన్నును(పెద్ద మొత్తంలో లాభాల పన్ను కూడా తగినంత ఉన్నప్పటికీ కూడా) ప్రవేశ పెట్టే మార్గాలను అనుసరించాలి. ఒక్క శాతం కుటుంబాలపై విధించే 1.5శాతం సంపద పన్నుతో, వనరులకు అవసర మైన డబ్బు సరిపోతుంది.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, అమెరికా కోశాగార కార్యదర్శి జాన్నెట్‌ ఎలెన్‌లు మరింత నూతనత్వంతో కూడిన చర్యల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మన రాజ్యాంగంలోని ‘జీవించే హక్కు’, ‘సమానత్వం’, ‘సౌభ్రాతత్వం’ అనే మాటలకు ప్రాముఖ్యతను, అర్థాన్నిచ్చే చర్యలను భారతదేశం చేపట్టకుండా తప్పించుకోకూడదు.
‘ద హిందూ’ సౌజన్యంతో..అనువాదం:
-బోడపట్ల రవీందర్‌

పసి దివ్వెలు వసివాడనొద్దు

బలపం పట్టాల్సిన చేతులు బండెడు చాకిరీ చేస్తున్నాయి.పేదరికంతో చదువులు చతికిల పడుతున్నాయి. కుటుంబ పోషణలో సమిధులవు తున్నారు. చదువులు, ఆటలతో గడపాల్సిన బాల్యం బజారున పడుతోంది. పేపర్బాయ్స్గా, హోటళ్లలో సర్వర్లుగా,సర్వెంట్లుగా, చెత్త ఏరుకునే వారిగా పసి హృదయాలు హృద్యమైపోతున్నాయి. అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో బాలకార్మిక చట్టం అలంకారప్రాయంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు,యువత, రాజకీయ నాయకులు అంతా సహకరిస్తే ఎంతో మంది బాలకార్మికులకు ఉజ్వల భవిష్యత్తు అందించవచ్చనడంలో సందే హంలేదు. జూన్‌ 12న ప్రంపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
పేదరికమే ప్రధాన కారణం
బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. జాతీయ,అంతర్జాతీయ సంస్థలు కూడా సర్వేల ద్వారా తేల్చిన విషయాలివే.. తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. వారు చదువుకోవాల్సిన వయుసులో పనిచేస్తున్నారు. వ్యవసాయంలోనూ,ఇతరత్రా పనుల్లో తల్లిదండ్రు లకు సాయంగా వెళ్ళేవారు కొందరయితే, కర్మాగా రాల్లో, దుకాణాల్లో, ఇతరత్రా పనుల్లోకి వెళ్ళి తల్లి దండ్రులకుఆర్థికసాయాన్ని అందించేవారు మరికొందరు. తల్లిదండ్రుల అవగాహనా రాహి త్యంతో చట్టాలు అమలు కావడం లేదనే వాదన కూడా మరో వైపు వినిపిస్తోంది.ముఖ్యంగా విజయ నగరం,విశాఖపట్నం,శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు,మంగళగిరి తదితర పట్టణాల్లో మురికి వాడల్లోని తల్లిదండ్రులు పిల్లల తాత్కాలిక సంపా దన ఆశిస్తున్నారు. అలాంటి వారు తాత్కాలిక ప్రయోజనం ఆశించకూడదు. చదువు కోవాలని పిల్లలను వాళ్ల తల్లిదండ్రులు ప్రోత్సహిం చిన నాడే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనవుతుంది.
తూతూ మంత్రం చర్యలు..
ఏటా ఏదో సందర్భోచితంగా బాలకా ర్మికులను పట్టుకొని బడిలో పడేసి చేతులు దులి పేసుకుంటున్న చర్యలు పెద్దగా ప్రయోజనం ఇవ్వ డం లేదు. ఏటా పాఠశాలలు తెరచే సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.కొన్నేళ్లుగా ఈతంతు నడుస్తున్నా ఫలితం పెద్దగా కానరా వడంలేదు. లెక్కలు చూపడంతో సరిపుచ్చడంవల్ల బాలకార్మికులు ఎక్కడకక్కడే దర్శనమిస్తున్నారు. బడిలో పేరున్నా బయటే పిల్లలు ఉంటున్నారు. ఈపరిస్థితిలో మార్పు తీసుకు వచ్చేందుకు యం త్రాంగం అంతా బాధ్యత వహించాలి. బాల కార్మి కుల లెక్కలు కూడా లోపభూయిష్టంగాఉంటు న్నాయి. ఏపట్టణంలో తీసుకున్నా వందలాది మంది కన్పిస్తున్నారు. పల్లెలో అయితే పది మంది వరకు దర్శణ మిస్తున్నారు. అధికారుల లెక్కలు మాత్రం వందలోపే కన్పిస్తున్నాయి.
బోలెడు అవకాశాలు..
పల్లెల కంటే పట్టణాల్లోని మురికి వాడ ల్లో బాలకార్మికులు ఎక్కువ కన్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విద్యాభ్యాసానికి అవకాశాలు కూడా ఎక్కువే. కేజీబీవీలు, వసతిగృహాలు, ఇతర సౌక ర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సద్విని యోగం చేసుకొనేలా యంత్రాంగం మురికివాడల్లోని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పైసా ఖర్చులేకుండా ఒకటి నుంచి డిగ్రీవరకు చదువు కోవచ్చన్న నమ్మకం కల్పించాలి. ఉపకార వేతనాలు, ఉచిత పుస్తకాలు, ఇతర సౌకర్యాలపై అవగాహన పర్చాలి.తల్లిదండ్రులకు ఉపాధి మార్గాలు వివరిం చాలి. రుణాలు మంజూరు చేయించి చిల్లర వ్యాపా రాలు చేసుకొనేలా చూడాలి.అంచనాగా ఒక్క విజయనగరం జిల్లాలో15ఏళ్ల మధ్య పిల్లలు: 6.20లక్షలు బాలకార్మికుల 7,400 మంది. కేజీబీవీలు 33.అన్ని విభాగాల వసతిగృహాలు: 155.
అవగాహన కార్యక్రమాలు
జిల్లాలోబాలకార్మిక వ్యతిరేక దినోత్స వం ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సన్నద్దమవుతున్నారు. కార్మికశాఖతో పాటు బాల కార్మిక నిర్మూలనా సంస్థ, స్వచ్ఛంద సంస్థలు బాల కార్మికులను బడికి పంపించాలని అవగాహన పరచ నున్నట్లు ఆశాఖ ప్రతినిధులు తెలిపారు.ప్రకృతి విప త్తులు,యుద్ధాలు ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తా యి. మరణాలు,అంగవ్కెకల్యాలతో పాటు. నిలువ నీడను,జీవనోపాధిని దెబ్బతీస్తాయి. బాధితుల బతు కులను ఛిన్నాభిన్నం చేస్తాయి. ఏటా20 కోట్ల మంది ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాయి. ఇందులో మూడో వంతు బాలలే ఉంటున్నారు. వీరికి తోడు పేదరికంలో మరెందరో మగ్గుతు న్నారు. వీరంతా పొట్ట కూటికోసం బాలకార్మికులుగా మారుతు న్నాయి. పద్నాలుగేళ్లలోపు పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని చట్టాలు చెబుతున్నా…అవి సక్రమంగా అమలు కాని పరిస్థితులు వెక్కిరి స్తున్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాన్న ఆశయంతో ఏటా జూన్‌ 12న అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినంగా ఐక్యరాజ్య సమితి,అంతర్జాతీయ కార్మిక సంస్థలు పాటిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులు బాల లను దైన్యంలోకి నెడుతున్నాయన్నదే ఈ ఏడాది నినాదం.
బాలకార్మికులెంతమంది?
1998జాతీయ గణంకాల ప్రకారం 5నుంచి14సంవత్సరాలున్నవారు 253 మిలియ న్లుంటే,వారిలో12.6మిలియన్ల మంది చిన్నారులలు బాలకార్మికులే.2009-10 గణాంకాలు పరిశీలిస్తే కొంత మార్పు ఉంది.4.98 మిలియన్లకు ఈ సంఖ్య తగ్గింది. 5నుంచి 14 సంవత్సరాల లోపు మొత్తం పిల్లలజనాభా 259.64 మిలియన్లు. వీరి సంఖ్య తాజా గణాంకాల ప్రకారం చూస్తే మరింత తగ్గిందనే చెప్పాలి.
చట్టాలెన్నో..
భారతదేశంలోనే కాదు ప్రపంచ మొత్తం మీద బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎన్నో చట్టాలున్నాయి. అయినా ఆసియా దేశాలలో ఇప్పటికీ బాలకార్మికుల సంఖ్య ఎక్కువే. భారత రాజ్యాంగంలోని24వ ఆర్టికల్తో పాటు, ద ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1948,ద ఛైల్డ్‌ లేబర్‌ యాక్ట్‌ 1986, ద జువ్కెనల్‌ జస్టిస్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2000, ద రైట్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఆటు ఫ్రీ అండ్‌ కంపల్సరీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2009 వంటి చట్టాలెన్నో ఉన్నాయి.
నిర్బంధ విద్య చట్టం కూడా నీరుగారుతోంది.
పైన పేర్కొన్న చట్టాలన్నీ అమలు కాక పోవడం,విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలో బాలకార్మిక సంఖ్య అధికంగా ఉండటం మనం చూస్తున్నాం.2009లో వచ్చిన నిర్బంద విద్య చట్టం పరిశీలించినా కూడా ఇదేపరిస్థితి. ఈచట్టం ప్రకా రం ప్రాథమిక విద్యను తప్పనిసరి చేశారు. అంతేనా కార్పొరేట్‌ పాఠశాలల హవా కొనసాగుతున్న నేప థ్యంలో ప్రతీ ప్రైవేటు పాఠశాలలో25శాతం సీట్ల ను పేద విద్యార్థులకు అందివ్వాలని సూచిం చారు. అయినా ఈనిబంధనలను ఎక్కడా అమలు చేయడం లేదు.
ఇలా నిర్మూలించవచ్చు…
ె బాలకార్మిక వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
ె ఎదుటి వారికీ అవగాహన కల్పించాలి.
ె సమాజంలో మార్పు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ ఎంతోకొంత కృషిచేయాలి.
ె సంస్థలు వారి కార్యకలాపాల్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ఒక భాగంగా చేయాలి.
ె సమస్య తీవ్రతను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి.
ె ముందుగా మన ఇళ్లల్లో పిల్లలు పనిచేయకుండా చూడాలి.
ె ఉపాధి చూపించే వారికి పిల్లలకు పనులు ఇవ్వొద్దని తెలియజేయాలి.
ె మన చుట్టూ ఉండే చిన్నారులు పాఠశాలలకు వెళ్లేలా చూడాలి.
ె పిల్లలను పనికి పంపేవారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపాలి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
విజయనగరం జిల్లాలో బాలకార్మికుల సంఖ్య గతంతో పోల్చితే తగ్గిందని చెప్పాలి. వెనుక బడిన జిల్లా కావడంతో ఇక్కడకు ఇతర జిల్లాల నుంచికానీ, ఒడిశా నుంచి కానీ వలసలు వచ్చేవారు లేరు. ఈ సంఖ్య అటు శ్రీకాకుళంలోనూ,ఇటు విశాఖలోనూ కనిపిస్తుంది. ఇటుకబట్టీల్లో గతంలో కొంతమంది చిన్నారులు పనిచేస్తుండేవారు. ఇప్పుడా ఆ పరిస్థితి మారిందనే చెప్పాలి. అయినా ఉన్న కార్మికుల సంఖ్య మరింత తగ్గించే ప్రయత్నాలు జరగలేదు. గత ఏడాది మొత్తం కేవలం 9 కేసులు మాత్రమే నమోదు చేశారు. ఒక్కటంటే ఒక్క అవగాహన సదస్సును కూడా కార్మిక శాఖ నిర్వహించలేదు. ఈ బాధ్యత అడపాదడపా ఒకటి రెండు స్వచ్ఛందసేవా సంస్థలు చేపడుతున్నాయి.
1098కి ఫోన్చేస్తే..
ఎవరైనా బాలకార్మికులను చూసినా.. లేదా ఒక చోట పనిచేస్తున్నట్టు సమాచారం ఉన్నా 1098కి ఫోన్చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇది చ్కెల్డ్లైన్‌ టోల్ఫ్రీ నెంబరు. వెంటనే సంబంధిత చ్కెల్లైన్‌ సిబ్బం ది వచ్చి ఆపిల్లాడిని జిల్లాచ్కెల్డ్వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరుపరుస్తారు. వారు కౌన్సెలింగ్‌ ఇచ్చి జిల్లా లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చిల్డ్రన్‌ హోమ్‌ తరలిస్తారు.అక్కడ ఆచిన్నారి నుంచి తగిన వివరాలు సేకరిస్తారు. తల్లిదండ్రులు ఉంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పిల్లాడిని పాఠశాలకు పంపేలా తగిన చర్యలు తీసుకుంటారు. ఒక వేళ వారికి ఎవరూ లేరనుకుంటే వారిని సరిపడే వసతిగృహానికి పంపి విద్యాభ్యాసం కొనసాగేలా చర్యలు తీసుకుంటారు.
ఎన్సీఎల్పీని నీరుగార్చారు..
నేషనల్‌ చ్కెల్డ్లైన్‌ ప్రాజెక్టు మూడేళ్ల కిందట వరకూ బాగానే నడిచింది. దీని కింద స్వచ్చంద సేవాసంస్థలు బాలకార్మిక పాఠశాలలు నడిపేవారు. ఇప్పుడు ప్రభుత్వం వాటిని నడపడం లేదు. దేశంమొత్తం మీద 800కుపైగా జిల్లా లుంటే 273జిల్లాల్లో ఇప్పటికీ ఎన్‌ఎసీఎల్పీఉన్నట్టు రికార్డులు చూపుతున్నారు. అందులో విజయ నగరం,విశాఖ,శ్రీకాకుళం ఉండటం విశేషం. అయితే ఇక్కడ ఎటువంటి పనులు జరగడం లేదు. పేరుకే ప్రాజెక్టు ఉంది. దీనికి కారణం నిర్భంద విద్య చట్టం. ఈచట్టం వచ్చిన తరువాత ఇంకా బాలకార్మిక పాఠశాలలతో పనేముందని వాటిని ప్రభుత్వం మూసేంది.ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అసలు నిర్భంధ విద్య క్షేత్రస్థాయిలో అమలువుతున్నదీ లేనిదీ మాత్రం చూడటం లేదు.
ఒక్క కార్యక్రమమూ లేదు..
363 రోజులు గుర్తురాకున్నా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని అధికారులు పూర్తిగా మర్చిపోయింది. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఏదో ఓ చిన్న కార్యక్రమాన్ని నిర్వహించడం రివాజు. కానీఈసారి తదను గుణంగా ఎలాంటి కార్యక్రమూ చేపట్టడం లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్‌ కానీ ఎటువంటి ఆదేశాలు జారీచేయలేదు.
చాలా వరకూ నిర్మూలించాం…
గతంలో చేసిన కార్యక్రమాలతో చాలా వరకూ బాలకార్మిక వ్యవస్థ తగ్గుముఖం పట్టింది. కొద్దిమంది ఎక్కడ్కెనా ఉన్నా వారికి పునరావాసం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. చ్కెల్డ్లైన్‌ ద్వారా వారికి తగిన పునరావాసం కల్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రణాళికలు కొత్తగా రూపొందిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయమై మరింత వృద్ధి సాధించేందుకు ఇటీవలే జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదనలు కోరారు. వీటిని కూడా అమలు చేసి త్వరలోనే బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం.

  • డీవీఎస్‌ ప్రసాద్‌, ఎన్సీఎల్పీ ప్రాజెక్టు డ్కెరెక్టర్‌
    ప్రతి ఏడాది జూన్‌ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్స వంను ప్రారంభించింది.
    లక్ష్యాలు
    అన్ని వయస్సుల బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందజేయడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకార్మికులను గర్తించి, వారికి అన్ని వసతులను కల్పించి సంపూర్ణ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం. బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా సర్వేల ద్వారా తేల్చిన విషయాలివే. తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. వారు చదువుకోవాల్సిన వయుసులో పనిచేస్తున్నారు.- సైమన్‌ గునపర్తి

ఆహరం అందితేనే ఆరోగ్యం

‘‘ తిండి కలిగితే కండ కలదోయ్‌ అని మహా కవి గురుజాడ అప్పారావు చాలా తేలికగా చెప్పేశారు గానీ.. ఈకాలంలో తిండి ఒక్కదానితోనే కండలు వచ్చేయవు. ఆ కండ లతో కలిసి ఆరోగ్యమూ సమకూ రాలంటే.. ఏం తింటున్నాం? ఎలాతింటున్నాం? ఎప్పుడు.. ఎక్కడ తింటున్నామన్నదీ ముఖ్యం. అవగాహన లోపం కొంత.. కాలుష్యం మరి కొంత కలిసి.. ఆహారం కార ణంగా కొన్ని అనారోగ్య సమస్యలను తెలి యకుండానే చవిచూస్తున్నాం. నేడు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా కొన్ని సంగతులు..’’

ఆహారం..మనిషి మనుగడకు ప్రధా నం..ఆరోగ్యానికి ఎంతో అవసరం.. రుచులు.. రకాలను పక్కనబెడితే..శరీరానికి మంచి పోష కాలనిచ్చే పదార్థాలు ఎంతో ముఖ్యం..ఆహార లేమితో అనేక జబ్బులు తప్పవు. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) వ్యవస్థాపక దినమైన 1945 అక్టోబరు 16వ తేదీని ప్రతియేటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయిం చింది. ప్రపంచ ఆహార దినోత్సవం సంద ర్భంగా ప్రత్యేక కథనం..
బియ్యంతోనే సరిపెట్టుకోగలమా..
రాష్ట్ర ప్రభుత్వం 2015జనవరి జనవరి ఒకటో తేదీ నుంచి ఆహార భద్రత చట్టాన్ని మార్పు లు చేసి అమలు చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇప్పటి వరకు ఉన్న 4 కిలోల బియ్యానికి బదులు 6 కిలోలు ఇస్తోంది. అయితే కేవలం బియ్యంతో ఆహార భద్రతను ఊహించుకోవడం కష్టమే. రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే అది సామాన్యులు భరించడం కష్టంగా మారు తోంది. రేషన్‌ దుకాణాల్లో గతంలో ఇచ్చిన తొమ్మి ది సరుకులు ప్రస్తుతం ఇవ్వడం లేదు. జగిత్యాల జిల్లా జనాభా 9,88,913ఉంది. ఇందులో ఆహార భద్రత కార్డులు 44,187,అంత్యోదయ కార్డులు 2497మాతమ్రే ఉన్నాయి. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని1981లో మొదటిసారిగా జరుపుకు న్నారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక్కో సందేశాన్ని ఇది ముందుకు తెస్తుంది. తొలిఆహార దినోత్సవం నాడు ఆహారానికి తొలి ప్రాధాన్యత అన్నది ప్రధాన లక్ష్యంగా నిర్దేశిం చారు. మరోసారి ఆహార భద్రత అన్న దానిని ప్రధాన అంశంగా తీసుకున్నారు. మరోసారి ఆకలిపై సమిష్టి పోరు జరపాలని ఎఫ్‌ఏఓ పిలుపు నిచ్చింది. ఆకలిని భూమ్మీద నుంచి సాధ్యమైనంత త్వరగా తుడిచి పెట్టాలని సూచించారు. ప్రస్త్తుతం ప్రపం చాన్ని కలవరపెడుతున్న ప్రధాన సమస్య ఆహార భద్రత. ఆరోగ్యకరమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు లభించడం, వాటిని కొనుగోలు చేయగల ఆర్థికశక్తి ప్రజలకు ఉండడమే ఆహారభద్రత.‘ఆరోగ్యకరంగా జీవిం చేందుకు అవసరమైన ఆహారాన్ని అన్ని వేళలా, అన్ని వర్గాల ప్రజలకు లభింపచేయటమే ఆహార భద్రత కు అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ ఇచ్చిన నిర్వచనం. ఇందుకు అవసరమైన భతి, కొనుగోలు శక్తిప్రతి కుటుంబానికి లభిం చాలి. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌’ 1945 అక్టో బర్‌ 16న కెనడాలో నెలకొల్పారు. దాని శాశ్వత ప్రధాన కార్యాలయం రోమ్‌లో ఉంది.
వ్యవసాయరంగంపై తగ్గుతున్నప్రభుత్వ పెట్టుబడులు
70 శాతం మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. వాతావరణ మార్పులు, వ్యవ సాయ రంగంపై చూపుతున్న ప్రతికూల ప్రభావాలు ఆహార భద్రతను మరింత సంక్షోభంలోకి నెడుతు న్నాయి. ఆకలి,పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతా ల్లో వ్యవసాయ రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహిం చేందుకు ఈ రంగంలో పెట్టుబడులు పెంచాల్సిన అవసరముంది.
మూడు పూటలు తినలేని వారెందరో..
ఆహారం లేనిదే జీవంలేదు.కానీ తగి నంత ఆహారం లేకుండా ఎంతోమంది ఉన్నారు. నాగరిక సమాజంలో మానవులు తమకు అవసర మైన ఆహారాన్ని సంపాదించుకునే వీలుకూడా లేని ప్రదేశాలు ఇంకా ఉండడం మన అభివద్ధికి అవ మానం. ప్రకతితో సహజీవనం చేస్తున్నప్పుడు సమ స్యలు తరచూ అనూహ్యంగా వస్తుంటాయి. అటు వంటి సందర్భాల్లో కూడా ఆహారం లభించడం ముఖ్యం. ఆదిశలో ‘పాలకుల’ధ్యాస ఉండాలి. ప్రణాళికలు తయారవ్వాలి. ప్రయత్నాలు ము మ్మరం చేయాలి. ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నట్టనిపిస్తున్నా ఎక్కడో ఏదోలోపం ఉందనిపి స్తుంది. కారణం కరువుకావచ్చు. వరదలు కావచ్చు. ఆర్థికంగా వెనుకబాటుతనమూ కావచ్చు.
రోజురోజుకు పెరుగుతున్న జనాభా
రాబోయే కాలంలో ఆహారోత్పత్తి కంటే జనాభా పెరిగిపోయే ప్రమాదముంది. మారుతున్న వాతావరణ,సామాజిక, ఆర్థిక సమతుల్యతల వల్ల అనూహ్యరీతిలో ఆహార సమస్య ఎదురయ్యే ప్రమాద ముందని నిపుణులు అంటున్నారు. ఆదిశలో సంప్ర దాయేతర ఆహారాన్ని అలవాటు చేసుకోవలసిన అవసరం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. సముద్రాల్లోని ఆల్గే నుంచి పౌష్టికాహారం తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘స్పిర్సులీనా’ అనేది రూపొందింది. కానీ ప్రజలం దరూ తినగలిగినం త మోతాదులోనూ, ఇష్టపడే రుచిలోనూ ఇంకా రావలసిఉంది. మాంస కత్తుల నిధిగా ప్రచారం చేసిన సోయా చిక్కుళ్లు అనుకు న్నంత ప్రాచుర్యం పొందలేదు. ఉన్న వరి పొలాలు నీరు లేక కొంతా,నీరు ఎక్కువై కొంతా నష్టపోతు న్నాయి. లాభాలు కనిపించక రైతులు వ్యవసాయం మానుతున్నారు. ఇటు జనాభా ఏమాత్రమూ తగ్గే దిశలో లేదు. ఆహార సమస్య (డబ్బున్న వాళ్లకి లేకపోతే పోవుగాక) మాత్రం తీవ్రమయ్యే ప్రమా దం కనిపిస్తోంది. ఆహారంలో అంతగా ఉపయోగ పడని టమాటాలూ,ఉల్లిపాయలూ ధరలు పెరిగితే వాటిని మానేయలేనంతగా అలవాటుపడ్డ మనం నిజంగా ఆహార సమస్య వస్తే తట్టుకోగలమా?
పథకాల అమలు అంతంతే..
అందరికి పోషకాహారాన్ని అందించ డానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడు తున్నా..ఆతర్వాత వాటిఅమలుపై శ్రద్ధ పెట్టకపోవడంతో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.ఆహార భద్రతచట్టం ప్రకారం కేవలం బియ్యం, ఇతర కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే ఇవ్వడంతో అవి ఎటూ సరిపోవడం లేదు. పాఠ శాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నా.. నాణ్యత లోపిస్తూ సరైన పోషకాలు వారికి అందడం లేదు. అంగన్‌ వాడీ కేంద్రాలకు సరుకులు సక్రమంగా సరఫరా చేయకపో వడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చిన్నారు లు,బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అంద డం లేదు.
ఆహారం అందకపోవడానికి అనేక కారణాలు
మూడు పూటలా తిండి.. పోషకాలున్న ఆహారం అందకపోవడానికి ముఖ్యమైన కారణం పేదరికం.. పేదరికానికి కూడా అనేక కారణాలు న్నాయి.. వ్యవసాయం అధ్వాన్నంగా ఉండడం, చిన్న కమతాలు అధికంగా ఉండడం, వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడటం,మార్కెట్‌ సౌక ర్యాలు సన్నగిల్లడం, ఆహార ధాన్యాలు అంతర్జా తీయంగా జీవ ఇంధన తయారీకి మరలటం, ప్రకతి వైపరీత్యాలు, ఉత్పత్తి తరుగుదల, ఆహార ధాన్యాల నిల్వలు తగ్గడం,డిమాండ్‌ పెరగటం,ముడి చమురు పెరిగి దాని ప్రభావంతో అన్ని వస్తువుల ధరలు పెరగటం,ప్రజాపంపిణీ వ్యవస్థలో లోపాలు, వ్యవ సాయంలో పెట్టుబడులు పెట్టకపోవటం, సెజ్‌లకు వ్యవసాయ భూములు మళ్లించడం,గహ నిర్మాణం, రహదారుల వెడల్పు, పరిశ్రమలకు పంట భూము లు మళ్లించడం వంటి అనేక కారణాలవల్ల ఉత్పాదకతతగ్గి ప్రజలకు ఆహార సమస్య ఉత్పన్నమ వుతున్నది.
దృష్టి పెడితేనే పరిష్కారం..
ఆహార భద్రతకు వ్యవసాయ పెట్టు బడులు భారీగా పెంచడం ఒక్కటే పరిష్కారమని పరిశీలకులు చెబుతున్నారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దష్టిపెట్టి అధికంగా నిధులు కేటాయించని పక్షంలో ఆహారంకోసం అలమటించేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుందని నిపుణులు సూచి స్తున్నారు. వ్యవసాయ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయేతర కార్యకలాపాలకు ఉపయోగించ కూడదు. వ్యవసాయ రంగానికి అదనపు పెట్టుబడు లతోపాటు పరిశోధక, మౌలిక సదుపాయాల కల్పన నీటిపారుదల,నిర్వహణ,మార్కెటింగ్‌ సదుపా యాలు, ఆహార ధాన్యాల నిల్వలకు సరిపడ గిడ్డం గులు, కూరగాయలు, పండ్ల నిల్వలకు శీతల గిడ్డం గులను ఏర్పాటుచేయాలి. వ్యవసాయదారులకు, వినియోగదారులకు లబ్ధి కలిగించడానికి మధ్య వర్తుల ప్రమేయం తొలగించాలి. భూగర్భ నీటి నిల్వను పెంచడానికి వర్షపు నీటిని నిల్వచేయడానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు సబ్సిడీలు ఇవ్వడం ద్వారా భూగర్భజలాల పరిరక్షణను ప్రోత్స హించాలి. వ్యవసాయ గిట్టుబాటుధర లభించేలా చర్యలు తీసుకోవాలి. కత్రిమ కొరతలను నివారిం చాలి. వ్యవసాయ బడ్జెటు రూపకల్పన చేయాలి. మేలి విత్తనాలు,కొత్త పద్ధతులు, యాంత్రీకరణ ఉపయోగాలు,పంటల భీమాపథకం మొదలైన చర్యలతో వ్యవసాయాన్ని పునరుద్దీప్తం చేయాలి. జనాభా స్థిరీకరణ,భూ వనరుల పెంపు, నీటి భద్రత, సామాజిక అడవుల పెంపకం,జీవ వైవిధ్యం పెంపు తదితర చర్యలు చేపట్టాలి. తిండి గింజల లభ్యత తోనే సరిపోదు. ఆరోగ్యంగా జీవించడానికి, దేహాని కవసరమయ్యే అన్ని పోషకాలను అందివ్వగల సంపూర్ణాహారం లభ్యమైనప్పుడే ఆహార భద్రత చేకూరినట్టవుతుంది.
ఆహార భద్రత… అందరి వ్యవహారం
తినే తిండి వల్ల కలిగే నష్టాలపై, రాగల ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, తద్వారా మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయానికి, పర్యాటకానికి సాయపడటం లక్ష్యం. మనం తినే ఆహారం సురక్షి తంగా ఉండేందుకు, మన ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఉండేందుకు పొలంలోని రైతు మొదలు కొని,విధానాలు రూపొందించే ప్రభుత్వాధినేతల వరకూ ప్రతి ఒక్కరు తమదైన పాత్ర పోషించాలని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఫలితంగా కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల భారం తగ్గి సమాజం అభివృద్ధి చెందుతుందని అంచనా.
వీటితో ఆరోగ్యానికి చేటు
ఆహారం కలుషితమయ్యేందుకు, తద్వా రా అనారోగ్యం కలిగేందుకు బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్న జీవులు కారణం. అధిక మోతాదులో వాడే రసాయనిక ఎరువులు, నిల్వ చేసేందుకు, రుచి కల్పించేందుకు ఉపయోగించే రసాయనాలు కూడా చేటు చేసేవే. సాల్మనెల్లా,కాంపీలోబ్యాక్టర్‌, ఈ –కోలీ వంటి బ్యాక్టీరియా ఏటా కొన్ని కోట్ల మందిని అస్వస్థులుగా చేస్తోంది. ఈబ్యాక్టీరియా కారణంగా తలనొప్పి,వాంతులు, తల తిరగడం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. గుడ్లు, కోళ్లు, జంతు సంబంధిత ఆహారం ద్వారా సాల్మనెల్లా బ్యాక్టీరి యా వ్యాపిస్తుంది. కాంపీలోబ్యాక్టర్‌, ఈ-కోలి పచ్చి పాలు, సక్రమంగా వండని కోళ్ల ఉత్పత్తులు, నీటి ద్వారా వ్యాపిస్తాయి. పూర్తిగా ఉడికించని సముద్రపు ఉత్పత్తుల ఆహారం ద్వారా హెపటైటిస్‌-ఏవైరస్‌ వేగంగా వ్యాపించడమే కాకుండా.. కాలేయ వ్యాది óకి కారణమవుతుంది. కొన్ని రకాల పరాన్నజీవులు చేపల ద్వారా,మరికొన్ని ఇతర ఆహార పదార్థాల ద్వారా వ్యాపిస్తాయి. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడంవల్ల లేదా తేమ ఎక్కువ ఉన్న చోటనిల్వ చేయడం వల్ల వచ్చే బూజు (ఆఫ్లా టాక్సిన్‌)తోపాటు అనేక ఇతర సహజసిద్ధమైన రసా యనాలు కూడా మన ఆహారాన్ని కలుషితం చేస్తా యి. ఈవిషపదార్థాలు దీర్ఘకాలం శరీరంలోకి పోతే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలో పోగుపడే వాతావరణంలోని కాలుష్యాలు పాలీ క్లోరినేటెడ్‌ బైఫినైల్స్‌,డయాక్సిన్స్‌లు జంతువుల ద్వారా మన శరీరాల్లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇవి పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. సీసం,కాడ్మియం,పాదరసం వంటి విష తుల్యమైన రసాయనాలు కూడా ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి మూత్రపిండాలు దెబ్బతినేం దుకు కారణమవుతున్నాయి.
ఇలా చేస్తే ఆరోగ్యానికి మేలు
ఊ మీ ఇంట్లో ఫ్రిడ్జ్‌ ఉందా? మీ ఆహారం మీకు సమస్యలు సృష్టించకుండా ఉండేందుకు దీన్ని తగిన రీతిలో వాడుకోవడం చాలా అవసరమని చెబుతోంది జాతీయ పోషకాహార సంస్థ. ఇంకా ఏం సూచిస్తోందంటే..
ఊ వండిన, వండని ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో వేర్వేరుగా ఉంచాలి.
ఊ ఆకుకూరలను నిల్వచేసే ముం దే.. వాటి వేళ్లను తొలగించి శుభ్రంగా కడిగి ఉంచడం మేలు.
ఊ కోడిగుడ్లను మూత ఉన్న కాగితపు అట్ట డబ్బాలో ఉంచి నిల్వ చేయాలి.
ఊ వండిన ఆహార పదార్థాలను నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉంచరాదు.
ఊ మూతతో కూడిన చిన్నచిన్న పాత్రల్లోనే వండిన ఆహారాన్ని ఉంచాలి.
ఊ వండిన ఆహార పదార్థాలను కూడా గది ఉ ష్ణోగ్రతలో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు.
ఊ ఫ్రిడ్జ్‌లో నిల్వచేసిన పదార్థాలను తినే ముందు వేడి చేసుకోవడం అవసరం.
ఊ ఆహారం వండే క్రమంలో ఇతర కాలుష్యాలేవీ అందులోకి చేరకుండా చూడాలి.
ఊ అన్నింటికంటే ముఖ్యం.. ఆహా రం వండే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నిల్వ ఉన్న నీటితో కాకుండా.. నల్లా కింద చేతులు పెట్టి సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
ఊ కాయగూరలు, పండ్లను తినేముందు కూడా శుభ్రంగా నీటితో కడుక్కోవాలి.
ఊ ఆహారం వండేటప్పుడు వీలైనంత మేరకు శు భ్రమైన నీటినే వాడాలి. ా సురక్షితమైన మంచినీటి వ్యవస్థ లేనప్పుడు ఆ నీటిని మరిగించి వాడొచ్చు.
ఊ వంటపాత్రలోకి నీరు పోసేందుకు విడిగా గ్లాసుల్లాంటివి వాడటం మేలు.
ఇల్లు, వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి.
జి.ఎన్‌.వి.సతీష్‌

1 32 33 34 35 36 48