విజయవంతంగా గ్లోబల్‌ సమ్మిట్‌ `2023

విశాఖ ఆంధ్ర యూనివర్శిటీ క్రీడా మైదానంలో మార్చి 3,4వ తేదీల్లో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల సమ్మిట్‌లో 378 ఎంవోయూలు జరిగాయని సీఎం జగన్‌ ప్రకటించారు. మొత్తం రూ.13 లక్షల41వేల 734కోట్ల పెట్టుబడులు పెట్టేం దుకు పరిశ్రమలు ఆసక్తి చూపినట్టు పేర్కొ న్నారు. దీని వల్ల 6లక్షల 9వేల 868 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ 2023కి పరిశ్రమల నుంచి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో దేశ విదేశశాల నుంచి ప్రపంచస్థాయి సంస్థలు తరలివచ్చారు.
పరస్పర ప్రయోజనాల దిశగా….
రాష్ట్రంలో పెట్టుబడులను సాకారం చేయడం, మరియు పెట్టుబడులు పెట్టేవారికి సహకారం అందించడంలో మా ప్రభుత్వం ఆలోచనా దృక్పథానికి ఇవాళ ప్రారంభం అవుతున్న యూనిట్లు ప్రతిబింబంలా నిలుస్తాయి. ఇవాళ యూనిట్లు ప్రారంభిస్తున్న వారంతా మీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెట్టబడిదారులకు ఆహ్వానం పలకడమే కాదు, వారికి మార్గనిర్దేశం చేయడంలో, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలో, నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించే చక్కటి వాతావరణం ఇక్కడ లభిస్తుంది. వ్యాపారాల్లో ఉండే నష్టతరమైన క్లిష్టతలను తగ్గించడంలో మరియు, మీ పెట్టుబడులను సమర్థవంతంగా అమలు చేయడంలో ఇది తోడ్పడుతుంది. దీనివల్ల పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా మీకేకాదు, రాష్ట్రానికి కూడా పరస్పర ప్రయోజనకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై మీరు నమ్మకాన్ని ఉంచి, ఈ సదస్సు ను అద్భుతంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పారిశ్రామికవేత్తల పెట్టుబడులుతో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుం దన్నారు. అనుకూలమైన వాతావరణం ఏర్పాటుకు ఇది దోహదపడు తుందన్నారు. తన పాలనలో ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుందని చెప్పారు జగన్‌. అనేక రంగాలకు తాము ఇచ్చిన ప్రధాన్యత ఆర్థిక వ్యవస్థను కాపాడాయి అన్నారు. వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పాటు చేశామ న్నారు. బ్రాడ్‌ బాండ్‌, ఇంటర్నెట్‌ అందరికీ అందించామన్నారు. పదిహేను రంగాను ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నట్టు చెప్పారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముంద డుగు వేస్తోందన్నారు సీఎం జగన్‌ తెలిపారు. కీలక సమయంలో ఈ సమ్మిట్‌ నిర్వహించా మన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్యలు జరిగాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం పథకాలు ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులేస్తోందని వివరించారు.‘‘అపారమైన సానుకూల దృక్పథంలో ప్రారంభించిన సమిట్‌లో రూ.13,41,734 కోట్లకుపైగా పెట్టుబడు పెట్టేందుకు 6,09,868 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 378 ఎంవోయూలు చేసుకున్నాం. ఒక్క ఎనర్జీ సెక్టార్‌లోనే 1,90,268 మందికి ఉపాధి కల్పించే రూ.8,84,823 కోట్ల పెట్టుబడులకు 40 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌ సెక్టార్‌లో రూ.25,587 కోట్ల పెట్టుబడితో 56 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇవి 1,04,442 మందికి ఉపాధిని కల్పిస్తాయి. పర్యాటక రంగంలో 30,787 మందికి ఉపాధి కల్పించే రూ.22,096 కోట్ల పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.’’ గణనీయమైన పెట్టుబడులకు అవకాశశం ఉన్న రంగాల్లో పునరుత్పాదక ఇంధన రంగం ఒకటి అని గట్టిగా చెప్పగలను. నిబద్ధత గ్రీన్‌ ఎనర్జీ కోసం ప్రయత్నిస్తూ భారత్‌కు గణనీయమైన సహకా రాన్ని అందిస్తాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.14 ఇండస్ట్రీయల్‌ ఫెసిలిటీస్‌ను రిమోట్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. రూ.3, 841 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లు 9,108 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తాయి. ఈ సమ్మిట్‌ సందర్భంగా 100 మందితో 15 సెక్టార్లపై సెషన్‌లు నిర్వహించారు. ఏపీలో ఉన్న అడ్వాంటేజ్‌లను తెలియజేశారు. ఇందులో ఆటోమొబైల్‌ సెక్టార్‌,హెల్త్‌కేర్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా,అగ్రి ప్రాసెసింగ్‌ టూరిజం మొదలైనవి ఉన్నాయి. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌తో సహకారం కోసం అవకాశాలను అన్వేషించడానికి నెదర్లాండ్స్‌, వియత్నాం, ఆస్ట్రేలియాతో సమావేశాలు నిర్వహించారు. రిలయన్స్‌ గ్రూపు, ఆదానీ గ్రూప్‌,ఆదిత్య బిర్లా గ్రూప్‌, రెన్యూ పవర్‌, అరబిందో గ్రూప్‌, డైకిన్‌, ఎన్టీపీసీ,ఐఓసీఎల్‌, జిందాల్‌ గ్రూప్‌, మోండలీస్‌,పార్లీ, శ్రీ సిమెం ట్స్‌ వంటి కంపనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.ఈ సందర్భంగా వారికి ధన్యవా దములు. మిమ్మల్ని అందర్నీ కలుసుకునే ఈ సదస్సు ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులందరికీ మేం ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. మీరు మాకు చాలా చాలా ముఖ్యమైన వారు. మా రాష్ట్రం బలాలు, మేము కల్పించే విభిన్న అవకా శాలను, వ్యాపార రంగంలో స్నేహపూర్వక వాతావరణం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన పోటీ, ఆవిష్కరణల విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను మీకు తెలియ జేయాలనుకుంటున్నాను. మీ భాగస్వామ్యం ద్వారా స్థిరమైన, దీర్ఘకాలిక వృద్ధి సాధించడం పట్ల మేం సంకల్పంతోనే ఉన్నాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ యూనిట్లు, పోర్ట్‌ ఆధారిత మౌలిక సదుపాయాలు,మెడ్‌టెక్‌ జోన్‌, టూరిస్ట్‌ హాట్‌ స్పాట్‌లతో విశాఖపట్నం అత్యంత బలమైన బలమైన ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు సీఎం జగన్‌. విశాఖపట్నం కేవలం పారిశ్రా మిక రంగంలో బలమైన నగరమే కాకుండా, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిందనని.. ఇక్కడ ఈ సదస్సును నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది మన దేశానికి చాలా ముఖ్యమైన సంవత్సరం అని.. ఈ ఏడాది సెప్టెంబరులో ఒన్‌ఎర్త్‌, ఒన్‌ ఫ్యా మిలీ, ఒన్‌ ఫ్యూచర్‌ ‘‘ఒకే భూమి, ఒక కుటుం బం, ఒక భవిష్యత్తు’’ అనే థీమ్‌తో జీ-20 సదస్సును నిర్వహిస్తోందన్నారు. మార్చి చివరి వారంలో జరిగే జీ-20 వర్కింగ్‌ కమిటీ సమా వేశాలకు విశాఖ నగరం కూడా ఆతిథ్యం ఇస్తోందని తెలిపారు. రెండు రోజుల సదస్సులో కనిపించిన అద్భుతమైన ఆశావాదం రాష్ట్రంలో వ్యాపార వాతావరణాన్ని మరింత అను కూలం గా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘‘ఎంఒయు దశ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో పెట్టుబడులను త్వరితగతిన గ్రౌండిరగ్‌ చేయాలని పారిశ్రామికవేత్తలకకు సీఎం అభ్యర్థించారు. దీనికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. రెండ్రోజుల సమ్మిట్‌ ద్వారా రాష్ట్రంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు 353 ఎంవోయూలు కుదిరాయి. దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తల్ని సదస్సుకు హాజరయ్యేలా చేయడంలో ప్రభుత్వం విజయవంతమైంది. ముఖ్యంగా అంబానీ,కరణ్‌ అదానీ, జిఎమ్మార్‌, పునీత్‌ దాల్మియా,ప్రీతారెడ్డి,సజ్జన్‌ భజాంక్‌, హరిమో హన్‌ బంగూర్‌,జిందాల్‌,నవీన్‌ మిట్టల్‌, మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ కృష్ణా ఎల్లా,కుమార మంగళంబిర్లా వంటివారు స్వయంగా తరలివచ్చారు. ఇంత మంది ప్రముఖులు ఒకేరోజు ఒకేసారి ఒకే వేదిక పంచుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానేకాదు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు 50 వేల కోట్ల పెట్టుబడుల్ని స్వయంగా ముకేష్‌ అంబానీ ప్రకటించడమే కాకుండా..ప్రధాని నరేంద్రమోదీ, సీఎం వైఎస్‌ జగన్‌లపై ప్రశంసలు కురిపించడం సమ్మిట్‌కు హైలైట్‌ అయింది. ముకేష్‌ అంబానీ స్వయంగా విశాఖ సదస్సుకు హాజరు కావడమే కాకుండా..తన సంస్థలో కీలక స్థానాల్లో ఉన్న 15 మంది సభ్యులతో ప్రత్యేక విమానంలో చేరుకోవడం మరో విశేషం.– జిఎన్‌వి సతీష్‌