సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టిద్దాం..!

దశాబ్దాల పోరాటం..అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రస్థానంఈ ఏడాది మహిళలందరం.. ఈక్విటీని స్వీకరించ గలగాలి. ఇది మనం చెప్పేది..రాసేది మాత్రమే కాదు. మనం ఆలోచించవలసిన, తెలుసుకోవలసిన, విలువైన స్వీకరించవలసిన విషయం. ఈక్విటీ అంటే… సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడం. మనలో ప్రతి ఒక్కరూ మన స్వంత ప్రభావ పరిధిలో ఈక్విటీకి చురుకుగా మద్దతు ఇవ్వవచ్చు మరియు స్వీకరించవచ్చు.ఈక్విటీని స్వీకరించడానికి మీ స్నేహితులు, కుటుంబం,సహ చరులు మరియు సంఘాన్ని ప్రోత్సహించండి.. ర్యాలీ చేయండి… సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి మనం కలిసి పని చేద్దాం..! మనమందరం కలిసి సమాన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడగలము. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఎల్లప్పుడూ ఈక్విటీని కలిగి ఉండేలా అందరం ఆలింగనం చేద్దాం! ఈనెల 8నఅంత ర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. డాక్టర్‌.దేవులపల్లి పద్మజ
ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధిం చు కున్న విజయమిది.రాజకీయంగా, ఆర్ధికం గా,సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిల బడిన మహిళకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగ తాలు తప్పడం లేదు. నిజమే..మహిళా దినోత్స వం సాధించుకోవ డానికి పలు దేశాల్లోని మహి ళలు దశాబ్దాలుగా పోరాటాలు చేయాల్సి వచ్చింది. పోరాడి అంరిక్షం నుంచి కుటుంబం దాకా సాధించిన ప్రగతి ఒక్క రోజుల్లో సాధ్యం కాలేదు.ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించు కున్న విజయమిది. ఆకాశంలో సగం..అన్నింటా సగం అనే మహిళలకు అన్నిచోట్ల ఇబ్బందులే ఎదురవు తున్నాయి. పురుషాధ్యికత నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్ధిక,రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా ఇంకా పోరాటాలు చేయక తప్పడం లేదు. నాడు చికాగోలో ప్రారంభమైన మహిళా దినోత్సవం ఇప్పుడు అంర్జాతీయ మహిళాది నోత్సవంగా మారిపోయింది. వివిధ దేశాల్లో ప్రభు త్వాలు ఈరోజును ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. రాజకీయాల్లో రిజర్వేషన్‌,ఆస్తిహక్కుకల్పించినా లైంగిక దాడులు మాత్రం పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి.
ప్రత్యేక దినంగా మహిళలు తమ బాధలు,సమస్యలను చర్చించు కోవడానికి,నలుగురితో పంచుకోవడానికి ఒకరోజు ఉండాలని నిర్ణయించారు.ఆరోజును మహిళా దినో త్సవంగా ప్రకటించారు. తొలిసారి అమెరికాలోని చికాగోలో 1908 మే 3న సమావేశం నిర్వహిం చారు.1910ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్‌హాగన్‌లో జరిగింది.
ఇది నాంది
అమెరికాలోని కొంతమందితో ప్రేరణ పొందిన జర్మన్‌ సామ్యవాద లూయీస్‌ జియట్జ్‌ మహిళలు ఏటా మహిళా దినోత్సవం నిర్వహించాలని తీర్మానం చేశారు. దీనిని జర్మన్‌ సామ్యవాద క్లారాజెట్కిన్‌ సమర్ధించారు.17 దేశాల నుంచి హాజరైన 100మంది మహిళలు ఓటు, సమాన హక్కు,సాధించడానికి ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని భావించారు. 1911మార్చి 19న పదిలక్షల మందికిపైగా ఆస్ట్రియా, డెన్మా ర్క్‌, స్విట్జర్లాండ్‌ దేశ మహిళలు ఉత్సవాన్ని నిర్వ హించారు. ఇందులో ఓటుహక్కు..ప్రభుత్వ పద వులు కావాలని డిమాండ్‌ చేశారు. ఉపాధిలో లింగ వివక్షను వ్యతిరేకించారు.
1914 మార్చి 8 నుంచి
మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను ఒక్కో దేశంలో ఒక్కో రీతిలో చేశారు.1914నుంచి చాలా దేశాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మహిళా దినోత్సవాల తీరుతెన్నులు,ఉత్యమాలపై 1980 ప్రాంతంలో చరిత్రకారిణి రినీ కోట్‌ పరిశోధన చేశారు.
మహిళలు పోరాటాలు..విజయాలు
1814లో జర్మనీలో మహిళా దినోత్సవం నిర్వ హించి ఓటు హక్కు కావాలని తీర్మానం చేశారు. 1918లోగాని మహిళలకు అక్కడ ఓటు హక్కు లభించలేదు.1917లో (గ్రెగెరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం మార్చి8)సెయింట్‌ పీటర్‌ బర్గ్‌ మహిళలు మొదటి ప్రపంచ యుద్దం,రష్యాలో ఆహార కొరత నివారించాలని కోరారు. ఆ రోజే వస్త్ర పరిశ్రమ లోని మహిళా శ్రామికులు అధికారుల హెచ్చరిక లను లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చారు. తమ హక్కుల కోసం నినదించారు.మార్చి8న అధికారిక సెలవుగా ప్రకటించడానికి బోల్షెనిక్‌, అలెగ్జాండర్‌, కొలెవ్టైల్‌లు వ్లాదిమిర్‌ లెనిన్‌ను ఒప్పించారు. కానీ అది 1965 నాటికదాకా అమల్లోకి రాలేదు. చైనా లో 1922 నుంచి మహిళా దినోత్సవాన్ని ప్రక టించినా సగం సెలవు రోజుగా పేర్కొన్నారు. 1977 తర్వాత ప్రాచ్య దేశాల్లో మహిళా దినోత్స వానికి ప్రత్యేకత వచ్చింది. మహిళల హక్కులు, ప్రపంచశాంతి దినంగా మార్చి 8ని ప్రకటించాలని పిలుపు నిచ్చింది. అమెరికా 1994లో అంతర్జా తీయ మహిళా దినోత్సవం బిల్లును తయారు చేసింది.
మహిళల లక్ష్యాలు
– నాయకత్వం,రాజకీయాల్లో అవకాశాలు్చ ఆర్ధిక స్వాలంబన
– మహిళలపై హింస నివారణ
– శాంతి,భద్రత
– మానత్వం
– జాతీయ ప్రణాళిక,పరిపాలనలో సమానత్వం
– యువతకు ప్రాధాన్యం
– దివ్యాంగులైన మహిళలు,బాలికలకు అవకాశాలు
భారత్‌లో మహిళా హక్కుల ఉద్యమం
భారతదేశంలో తొలిసారిగా అహ్మదాబాద్‌లో అన సూయ సారాబాయ్‌ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. మహిళలను సంగటితం చేసిన వారిలో సుశీలా గోపాలన్‌,విమలా రణదివే,కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌,అహల్య రంగ్నేకర్‌,పార్వతీకృష్ణన్‌ ఉన్నారు. మహిళల ఉద్యంతో కార్మికుల పనివేళలు, వేతనాలపై చట్టాలను చేశారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 13న సరోజిని నాయుడు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవం ప్రకటనలు
-1996మహిళాల గతం గుర్తించడం,భవిష్యత్తుకు ప్రణాళిక తయారు చేయడం -1997మహిళలుశాంతి

-1998మహిళలు,మానవహక్కులు
– 1999మహిళలపై హింసలేని ప్రపంచం -2000శాంతికి మహిళలను సమన్వయ పర్చడం
– 2001మహిళలు,శాంతి,పోరాటాల నిర్వహణ -2002నేటిఆఫ్గన్‌ మహిళ,నిజాలు,అవకా శాలు
– 2003లింగ సమానత్వం -2004మహిళలు,హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌
– 2005లింగ సమానత,భద్రమైన భవిష్యత్తు నిర్మాణం -2006మహిళలు,నిర్ణయాలు
– 2007మహిళలు,బాలికలపై హింసలో శిక్ష తప్పించుకోకుండా చూడడం -2008మహిళలు,అమ్మాయిలు,పరిశోధన
– 2009మహిళలపై హింసకు వ్యతిరేకం -2010సమాన హక్కులు,సమాన అవకాశాలు
– 2011మహిళలు పనిచేసేందుకు అవకా శాలు,విద్య,శిక్షణ,శాస్త్రసాంకేతిక రంగాల్లోకి ప్రవేశం -2012గ్రామీణ మహిళల సాధికారత, పేదరికం ఆకలి నిర్మూలన
– 2013మహిళలపై హింస నివారణకు కార్యాచరణ -2014అన్నింటా మహిళల పురోగతి
– 2015మహిళలను శక్తిమంతులుగా తయారు చేయడం -20162030నాటికి అంతరిక్షంలో 5050,లింగ సమానత్వం -2017పని ప్రదేశంలో మహిళలు,2030కి సమానత్వం
– 2018గ్రామీణ,పట్టణ ప్రాంత మహిళల్లో మార్పు -2019మార్పు సాధించేందుకు ప్రయత్నం
– 2020పురుషులతో సమానంగా హక్కులు -2021కోవిడ్‌19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం -2022మహిళల సమానత్వం,కార్యచరణ
– 2023`సమ్మిళిత ప్రపంచాన్ని స్వీకరించడం మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏపక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు’అన్న స్వామి వివేకానంద మాటలు మరో సారి స్మరిస్తూ..‘జయహో… జనయిత్రి’ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తు లకు శుభాకాంక్షలు.‘అన్నీ మారుతున్నాయి. మహిళలపట్ల మనఆలోచనా ధోరణి తప్ప’. అవును ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అని ఆర్యోక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలం దుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కాని దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మనప్రగతికి మూలం.ఇదే నినా దంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయం గా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటోప్రపంచానికి తెలియజెప్పుతూనే ఉన్నా రు.విద్య,వైద్యం,వ్యాపారాలు,రాజకీయాలు,క్రీడలు, బ్యాంకింగ్‌,అంతరిక్షం,టెక్నాలజీ వంటిపలు రంగా ల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకం.రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది స్త్రీ శక్తి. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. ‘కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభా’ అని కవి చెప్పినట్టుగా ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు.
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగ మన దేశంలోని మహిళలకు కాస్తంత చేదు గుళికలనే మింగించింది. ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురి అవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. ఇందుకు కారణాలలేమిటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకేయాలి. జయహో… జనయిత్రీ.అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 2022 మార్చి 8న ఈ దినోత్సవ వేడుకలు 111 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. లింగ సమాన ప్రపంచాన్ని ఊహించుకోండనే థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహిళా దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, హక్కుల కోసం ప్రారంభమైంది.