జీవనదులు..విలవిల!

భూమి వేడేక్కుతోంది.పర్యావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి.ప్రకృతి విఫత్తులు పేట్రేగి పోతున్నాయి.హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతుంది. కర్ణాటక,పాకిస్తాన్‌లో వరద భీభత్సం, అడుగుంటితున్నజీవనదులు,చైనాలో కరువకాటకాలు. దీనికి కారణం వాతావరణంలో కనీవినీ ఎరుగని మార్పులు.ఇదికేవలం ఒక్క దేశానికే పరిమితం అయన అంశం కాదు.విశ్వవ్యాప్తంగా ప్రళయాన్ని సృష్టించగల సమతుల్యత లేని పర్యావరణమే ఇందుకు ప్రధమ కారణం.ఈపెనుమార్పులుపై ఐక్య రాజ్యసమితి హెచ్చరిస్తున్నా..దేశంలో అనేకప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుమతులు యధేచ్ఛగా మంజూరు చేసేస్తోంది.
మరోపక్క హిమాలయాల్లో మంచుపర్వాతాలు కరిగిపోయి సముద్రమట్టం పెరిగిపోతుంది.ఆల్ఫ్స్‌ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పోనది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది.యూరఫ్‌ పరిధి పది దేశాల గుండాపారే అతిపొడవైన నది డాన్యూబ్‌ కూడా చిక్కిపోతుంది. జర్మనీ,నెదర్లాండ్‌,స్విట్జర్లాండ్‌ దేశాలకు ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్‌నది పరిస్థితి ఎంతో ధైన్యంగా ఉంది. అమెరికాలో డెన్వర్‌ నుంచి లాస్‌ఏంజెలెస్‌ దాకా కోట్లాది మందినీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి. ఇక ప్రపంచ ప్రసిద్ద ఫ్రెంచ్‌ వైన్‌ తయారీకి ఆధారమైన లోయోర్‌ నదిలో కూడా నీరు అతివేగంగా అడుగంటుతోంది.చైనా,అమెరికా,ఇరాక్‌ వంటి దేశాల్లో నిత్యంనిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతోవాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడాగుడ్లు తేలేస్తున్నాయి.ఫలితంగాకోట్లాది మంది తాగు,సాగునీటికి అల్లాడుతున్నారు.నిత్యంఉధృతంగా ప్రవహించే చైనాలోనియాంగ్జీనది మరింత దుస్థితిలో ఉంది. ఇదిప్రపంచంలోనే అతిపెద్దనదిగా గుర్తింపు ఉంది. ఇదిలాంటే..స్పెయిన్‌,పోర్చుగల్‌ దేశాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలవల్ల అక్కడ దట్టమైన అడవులు కాలిపోతున్నాయి.అడవులు నశించి పచ్చదనం పరిఢవిల్లక పోవడంవల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని కర్భన్‌ఉద్గారాలు పేరుకు పోంతోంది. ఫలితంగా ప్రకృతి సహజసిద్దమైనగుణాన్నికోల్పోయి భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది.ఇదింతా పర్యా వరణంలో సంభవిస్తున్న పెనుమార్పులని తెలుస్తోంది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఉత్తరాంధ్రాజిల్లాల్లో నిక్షేపమైన నదీజలాలు ఇదేపరిస్థితి దాపురిం చనున్నట్లు సాంకేతాలుచవిచూస్తున్నాయి. దీనికికారణం ఇబ్బుడిముబ్బుడిగా ఇక్క పరిశ్రమలకు అను మతులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి సీతారామారాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్యం ప్రవహించే జీవనదులపై హైడ్రల్‌ ప్రాజెక్టులనిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.దీని నిర్మాణమంటూ జరిగితే భవిష్యుత్తులో ఇటు గిరిజనలు,అటు మైదాన ప్రాంతానికి తాగు,సాగునీటికి తీవ్రమైన విఘాతం ఏర్పడనుంది. పర్యావరణ పరిరక్షణ..నీటివనరుల సంరక్షణఅనే అంశంపై2005లో సమత ఉత్త రాంధ్రజిల్లాలో(శ్రీకాకుళం, విశాఖ పట్నం,విజయనగరం,తూర్పుగోదావరి)ల్లో ‘కొండల ఆరోగ్యమే.. పల్లపుప్రాంతాల సౌభాగ్యం’’అనే నినాదంతో చైతన్యయాత్ర చేపట్టాం.చెట్లు నరికేయడం,వెసులబాటు లేకుండాఖనిజాలు వెలికితీ స్తూపోతుంటే, భవిష్యత్‌ తరాలకు మన సంపదలు మిగలవని,పచ్చదనంతో పరిఢవిల్లే అటవీ సంపదనుకోల్పోతే,వాటిని తిరిగి రాబట్టేందుకు కొన్ని సంవత్సరాలుతరబడి ఎదురుచూడాల్సి ఉంటుందనిఅనే ఈ యాత్ర ద్వారా ఆనాడే అవగాహన కల్పించాం. ఇది తెలిసినా స్వార్ధచింతనతో అటవీవృక్షాలను తెగనరికి ధ్వంసం రచనకు పూనుకుంటున్నారు.
ఇప్పటికైనా అడవులుఆరోగ్యంగా ఉంటేనేగిరిజన,మైదానప్రాంత రైతాంగానికి,ప్రజలకి సంపూర్ణ మైన ఆరోగ్యం లభిస్తోంది. ఈవాస్తవాలు గ్రహించి సహజవనరుల పరిరక్షణ,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.! రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌-