విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!

ఇటీవల కాలంలో నిర్వహించిన రోదసి విహార యాత్రలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచ కుబేరులైన జెఫ్‌ బెజోస్‌, రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ తాము రూపొందించిన స్ప్రేస్‌ క్రాఫ్ట్‌ ద్వారా రోదసి విహార పర్యటనకు వెళ్లివచ్చారు. మరో అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా తన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ద్వారా రోదసి విహార యాత్ర నిర్వహించాడు. చూడడానికి సైంటిఫిక్‌ అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ రోదసి విహార యాత్రలు అనే కాన్సెప్ట్‌ పెరిగితే పర్యావరణానికి పెద్ద హాని జరగనుంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఉన్న ఒక్క శాతం ప్రజలు పర్యావర ణానికి తీవ్ర హాని చేస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగం మంది విడుదల చేసే కర్బన ఉద్గారాల కన్నా ఈ ఒక్క శాతం ధనవంతులు విడుదల చేసే కర్బన ఉద్గారా లు రెండిరతలు అధికంగా ఉన్నాయి. తాజా రోదసి విహార యాత్రలు కూడా అత్యంత ధనవంతులు మాత్రమే చేయగలరు. వీరి వినోదం, ఉల్లాసం కోసం జరపబోయే పర్యాటక యాత్రలు ప్రపంచ మానవాళికి ప్రళయంలా మారనున్నాయి.

Read more

ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి

రాజ్యాంగ పరమైన ఆరోగ్య హక్కువల్ల, వెంటనే ఆర్థిక పరమైన రక్షణ లభిస్తుంది. అధికపెట్టు బడివల్ల, కుటుంబ పొదుపు, ఉద్యోగ అవకాశాలు ఒక వైపు,సుదూర భవిష్య త్తులో,ఉద్వేగపూరితమైన, మానసిక పరమైన,సామాజిక పరమైన రక్షణ విషయం లో ప్రజలపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని గమనించ గలం. ప్రపంచంలోని,చిన్న,పెద్ద దేశాలు కూడా మహమ్మారి నుండి కోలుకోవ డానికి,విధాన నిర్ణయాలలో,పెట్టుబడుల విషయంలో ముందు చూపుతో అనేక చర్యలు చేపడు తున్నాయి. భారత దేశం ఈ విషయంలో వెనుకబడరాదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నిర్భంధ విద్య నిస్సందేహంగా విలువైన వారసత్వాలలో ఒకటి. ధైర్యమైన నాయక త్వానికి నిజమైన నిదర్శనం.మానవునికి ఉన్న పరిమితమైన జ్ఞాపక శక్తి, తరచుగా మన సమిష్టిబాధల నుండి ఉపశ మనం పొందడానికి ఉపకరిస్తుంది. కానీ, బాధల నుండి నేర్చుకునే గుణపాఠాలు మరింత కీలకమైనవి. నోవెల్‌ కరోనావైరస్‌ మహమ్మారి ఫలితంగా,మన ప్రజలు వ్యక్తిగతంగా,సమిష్టిగా ఎదుర్కొంటున్న విషాదకరమైన పరిస్థితులను దృష్టిలోఉంచుకుని, ముందు చూపుతో అవసర మైన గుణపాఠాలను తీసు కోవడం మన నాయ కత్వం యొక్క నైతిక బాధ్యతకావాలి. దీని నుండి తీసుకోవాల్సిన గుణపాఠం ఏమంటే ‘అందరికీ ఆరోగ్య హక్కు’ అవసరాన్ని గుర్తిం చడం. కరోనా మహమ్మారి మన ఆరోగ్య రక్షణ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది.ఈ సమస్యను మనం నిర్లక్ష్యం చేయడంగానీ,నేర్చుకో కుండా ఉండడంగానీ చేయలేము.

Read more

నోబెలే గుర్తించింది..
మరి పాలకులు…?

ఏసేవకైనా,శ్రమకైనా ప్రపంచ గుర్తింపులో అత్యంత ప్రసిద్ధి గాంచినది నోబెల్‌ బహుమతి. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో ప్రకటించిన నోబెల్‌ బహుమతులో ఆర్థిక శాస్త్రం మరియు శాంతికి ప్రకటించిన నోబెల్‌ బహుమతి ఇటు కార్మిక వర్గానికి అటు భావవ్యక్తీ కరణకు పరిత పించే అభ్యుదయ వాదులకు ఒకఊరట నిచ్చింది. లాభాలు పెంచుకోవడం కోసం వేతనాల కోతనే మరమౌష ధంగా భావించే పెట్టు బడిదారీవర్గానికి ఈసారి ప్రసాదించిన నోబెల్‌ బహుమతి యొక్క అంత రార్థం ఒక సమా ధానం. కనీస వేతనాల పెరు గుదల కొత్త ఉపాధి అవకాశాలను తగ్గించదని నిరూపిస్తూ చేసిన రీసెర్చ్‌కుగానూ ఈ ఏడు అర్థశాస్త్ర నోబెల్‌ బహుమతి ఇవ్వడం జరిగింది. తక్కువ వేతనా లను ఇవ్వడం ఎక్కువ పనిగం టలు పని చేయించు కోవడం వంటివే అధిక లాభాలకు ఆధా రాలుగా భావించే యాజమా న్యాలకు ఇది ఒక కనుపిప్పు కలిగించాలి. ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఈఏడాది ముగ్గురిని వరించింది. అమె రికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డి. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించగానే అనేకులకు ఆశ్చర్యమేసింది.అయితే ఇందులో సగం పురస్కా రాన్ని డేవిడ్‌ కార్డ్‌కు ఇవ్వగా..మిగతాసగాన్ని జాషువా,గైడో పంచుకోనున్నారు. కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకు గానూ డేవిడ్‌ కార్డ్‌కు నోబెల్‌ అందించారు. ఇక ఆర్థిక శాస్త్రానికి సంబం ధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇచ్చారు. సామాజిక శాస్త్రాల్లో ఒక్కోసారి చాలా పెద్దపెద్ద ప్రశ్నలు ఎదురవు తుంటాయి.ఉపాధి,ఉద్యోగుల వేతనంపై వలస విధానం ఎలాంటి ప్రభావం చూపుతుంది?ఓవ్యక్తి సుదీర్ఘ విద్య అతని భవిష్యత్తుపై ఏ మేరకు పనిచేస్తుంది? వలసవిధానం తగ్గడం,వ్యక్తి సుదీర్ఘకాలం చదువుకోకపోవడం ఎలాంటి పరిణామలకు దారితీస్తుంది?ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం.అయితే ఈ ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాధాన మివ్వొచ్చని శాస్త్రవేత్తలు డేవిడ్‌, జాషువా,గైడో రుజువు చేశారు.అయితే ఏ దేశ ప్రభుత్వాలైనా, ఏ రంగంలోనైనా ఇలాంటి పరిశోధనలను గుర్తించడమే కాక వాటిని తమ విధానాల్లో భాగం చేసుకున్నప్పుడే ఆర్థిక అసమానతల తొలగింపు సులభమౌతుంది. భారత దేశంలో కనీస వేతనాల చట్టం1948 లోనే తయారు చేయబడిరది. కానీ ఇది చట్టపరమైన బైండిరగ్‌ ఏమీ కాదు. కనీస వేతనాలు చెల్లించనందుకు ఇంత వరకు ఎవరినీ చట్టం శిక్షించడం లేదు. అయితే ఈ చట్టం ప్రకారం కార్మిక సంఘాలు పోరాటం చేయడం మూలాన రాష్ట్రాలు కంపెనీల యాజమాన్యాలు కొంతవరకు కనీస వేతనాలు చెల్లించడానికి చర్చలు మాత్రం జరిపుతాయి కానీ అమలుకు చిత్తశుద్ది లేదు. కనీస వేతనాలు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మరియు ఒక రంగానికి మరో రంగానికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. షెడ్యూల్డ్‌ కంపెనీలకు, రిజిస్టర్డ్‌ కంపెనీలకు మరియు రిజిష్ట్రేషన్‌ చేయబడని కంపెనీలలో కూడా కనీస వేతనాలు వ్యత్యాసాలతో కొనసాగు తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రిజిస్ట్రేషన్‌ పొందిన కంపెనీల్లో కూడా కింది స్థాయిలోని ఎక్కువ శాతం ఉద్యోగులు ఎలాంటి మస్టర్‌ లేకుండా డైలీ వేజ్‌ వర్కర్లుగా పని చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ అదే కంపెనీలో పని చేస్తున్న వారి కన్నా తక్కువ వేతనం చెల్లించబడుతుంది. ఇది అనేక సందర్భాలలో కార్మిక సంఘాల సర్వేలలో బయట పడిరది. ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. అయితే భారతదేశంలో రిజిస్ట్రేషన్‌ చేయబడినవి, షెడ్యూల్లో లేని సూక్ష్మ, మధ్య తరగతి మరియు సీజనల్‌ ఇండస్ట్రీ లే ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి చోట దోపిడీ మరింత ఎక్కువగా ఉన్నది. మన దేశంలో అత్యంత ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఈ రకమైన దోపిడీయే. కనీస వేతనాల చెల్లింపు నుండి సంఘటిత రంగం కూడా చాలా తెలివిగా తప్పించుకుంటున్నది. కాంట్రాక్టీకరణల ద్వారా నియమించుకున్న ఉద్యోగులకు సదరు కాంట్రాక్టర్‌ ఎంత వేతనాలు చెల్లిస్తున్నారో విధిగా తెలుసుకోవలసిన బాధ్యత పని తీసుకుంటున్న సంస్థకు ఉన్నది. ప్రావిడెంట్‌ ఫండ్‌, ఈ.ఎ.ఐ వంటివి చెల్లిస్తున్నాడా లేదా చెక్‌ చేయవలసింది కూడా కంపెనీయే. కాంట్రాక్టర్‌ కూడా తను ఏ ఏ హెడ్స్‌ కింద ఇస్తున్నాడో తెలుపవలసిన బాధ్యత ఉన్నది. అయితే ఇవన్నీ పేపర్‌ వరకే పరిమితమై బ్యాంకు క్రెడిట్‌ మరోలా ఉన్నదని కాంట్రాక్టీ కరణల ద్వారా నియమించబడుతున్న ఉద్యోగు లందరూ వాపోతుంటారు. దీనికి కాంట్రాక్టర్‌ ఇచ్చే సమాధానం ఏమంటే- ట్రైనింగు, యూని ఫామ్‌,రిఫ్రెషర్‌ ట్రైనింగ్‌ మరియు ఇతర మెయింటేనెన్సులు వంటివన్నీ మినహాయించు కున్న తర్వాత ఆ విధంగా చెల్లించవలసి వస్తుందని. దీనిలో నిజానిజాలు ఎంత ఉన్నా నష్టపోయేది కార్మికుడే. కనీస వేతనాలు అమలు కోసం రాష్ట్రాల పరిధిలో వేజ్‌ బోర్డులు అని నామకరణం చేయబడ్డాయి కానీ ఇవి నామ మాత్రంగానే ఉన్నాయి. నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి- కూడు,గూడు,గుడ్డతో పాటు విద్య, వైద్యం, మరియు ఎంటర్టైన్మెంట్‌ సదుపాయాల కోసం లెక్కించి,ఆస్థానిక పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించడం అవి అమలు జరిగేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. కానీ ఇది ఈ దేశమంతా అందని ద్రాక్షే. 2020లో భారత రిజర్వు బ్యాంకు జారీ చేసిన వివరాల ప్రకారం జాతీయ సగటు కనీస వేతనం కేవలం 293 రూపా యలే! కేరళ రాష్ట్రం 670రూపాయలతో మొదటి స్థానంలో వుండగా 453రూపయలతో జమ్ముకాశ్మీర్‌,438 రూపాయలతో తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో వున్నవి. అత్యల్పం మధ్యప్రధేశ్‌ రాష్ట్రంలో 205రూపాయలు చెల్లించబడగా గుజరాత్‌ బీహారుల్లో వరుసగా 233 మరియు267 గా వున్నవి.భారత దేశ టెలికాం రంగంలో సంస్కరణలను ప్రతిపాధించి నప్పుడు శ్యాంపిట్రోడా గారు కంపెనీ సి.ఈ.ఓ జీతాన్ని కంపెనీలోని అత్యధిక జీతానికన్నా మూడిరతలు చేయడం ద్వారా క్రింది స్థాయి వుద్యోగులను మరింత పిండగలరని చెప్పారు. ఈ సూత్రం వంటబట్టించుకున్న రిలయన్స్‌ జియో క్రింది స్థాయి వర్కర్లకు చాలీచాలని భృతి ఇస్తూ లాభాలు గడిస్తున్నది!. అయితే ఉద్యోగు లను పిండుకోవడం కాదు, క్రింది స్థాయి వేతనాల్లో పెరుగుదల మార్కెట్‌నూ పరుగులు పెట్టించగలదనీ ఆర్థిక మాంద్యానికి సమాధా నాలుగా సూచించినప్పుడు కీన్స్‌ అనే ఆర్థిక వేత్త కూడా అభిప్రాయపడ్డారు. కనీస వేతనాల పెరుగుదల ఉపాధి లేమికీ లాభాల్లో తగ్గుద లకూ దారి తీయదని సాక్షాత్తు ప్రపంచ ప్రసిద్ది నోబెల్‌ నిర్వహాకులే గుర్తించినందుకు మన పాలకులూ ఆ దిశగా ముందడుగు వేయాలి.

Read more

మ‌హానీయ స్వామి వివేకానంద‌

ఉన్నతమైన ఆశయాలు ఏదో ఒక రోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయి. కారణం ఆ భావన, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ, ప్రతీ ఆలోచనా విధానంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషా యాం బరాలు ధరించి, పద్మాసనస్థుల్కె, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకుని, అర్థని మీనేత్రుల్కె ధ్యానమగ్నుల్కె వివేకమంతమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒక జగద్గురువు. సామాజిక సృహతో కూడిన ఆధ్యాత్మి కతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విషయా లను వివేకించటం ద్వారా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మిం చడం, ఆసౌధంలో చ్కెతన్యమూర్తులుగా జనులను విరాజిల్లింప చేయటం స్వామి వివేకానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంతరాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృతమైన కొత్త విషయాలను అనుభవిస్తూ, క్రొంగొత్త శక్తుల వశీకరింపచేసుకుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివేకానంద.

Read more

డెల్టాన్ దాటి దుసుకుపోతున్న‌ ఒమిక్రాన్

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వ్యాప్తిపై జనాల్లో ముమ్మరంగా చర్చలు కొనసాగుతున్నాయి.డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ నాలుగైదు రెట్లు స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతోందని డబ్ల్యూ హెచ్‌వో దగ్గర్నుంచి రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ వరకూ అందరూ చెప్తున్నప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం అలాంటి సూచనలే కనిపించట్లేదు. కెన్యాలో, సోమాలియాలో ఒమిక్రాన్‌ బారినపడి ఇక్కడికి వచ్చినోళ్లు వందల మందిని కాంటాక్ట్‌ అయినప్పటికీ అందులో ఒక్కరికే కొత్త వేరియంట్‌ అంటుకుంది. యూకే నుంచి హన్మకొండకు వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆమెతో కలిసి ఇంట్లోనే ఉన్న ఆమె భర్తకు, బిడ్డకు వైరస్‌ అంటలేదు. ఆమెను కలిసిన 30 మంది ప్రైమరీ కాంటా క్టులలో కనీసం ఒక్కరికీ వైరస్‌ సోకలేదు. జూబ్లీహిల్స్‌లో ఒమిక్రాన్‌ పేషెంట్‌కు 3రోజుల పాటు ఫుడ్‌ సర్వ్‌ చేసిన హోటల్‌ సిబ్బంది లోనూ ఎవరికీ ఈ వేరియంట్‌ అంటలేదు. ఇలా చెప్తూపోతే చాలా ఎగ్జాంపుల్సే ఉన్నయి. సౌత్‌ ఆఫ్రికా, యూకే, అమెరికా తదితర దేశాల్లో పరిస్థితి చూస్తే డబ్ల్యూహెచ్‌వో చెబుతున్నట్టు ఒమిక్రాన్‌కు స్పీడ్‌ ఎక్కువేనన్న విషయం స్పష్టం అవుతోంది. కానీ,మన దగ్గరకు వచ్చేసరికి ఒమిక్రాన్‌ స్పీడ్‌ తగ్గిపోయిన సూచ నలు కన్పిస్తున్నయి.హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ చెబు తున్న లెక్క ప్రకారం ఆదివారం నాటికి రాష్ట్రంలో ఇప్పటి వరకు 44 ఒమిక్రాన్‌ కేసులు నమోద య్యాయి. ఇందులో 40 మంది విదే శాల నుంచి వచ్చినవాళ్లు అని, ఇంకో ఇద్దరికి లోకల్‌గా స్ప్రెడ్‌ అయిందని ప్రకటించారు. ఈ ఇద్దరికీ తప్ప లోకల్‌?గా ఇంకెవరికీ స్ప్రెడ్‌ కాలే దని చెప్తోంది.

Read more

రైతు కంట క‌న్నీరు

సంక్రాంతి వచ్చేస్తోంది. అన్నదాత చేతిలో చిల్లిగవ్వ లేదు. పంట విక్రయించి పిల్లాపాపలకు కొత్త బట్టలు కొందా మంటే పండిరచిన ధాన్యం ఇంకా కొనేవారు కనిపిం చడం లేదు. ఆర్‌బికెలకు వెళ్తే తమ శాతం పేరుతో తిప్పి పంపిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టాలంటే కళ్లాలు లేవు. తక్కువకు దళారులకు అమ్మలేక సతమతమవుతున్నారు. ఈ ఏడాది వరిసాగుచేస్తే వారిలో 30 శాతం మంది రైతుల పేర్లు వెబ్‌సైట్‌లో కనిపిం చడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసమస్య సరిదిద్దే ప్రయత్నంలో రెవెన్యూ, వ్యవ సాయశాఖలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంది. ఈ రెండు శాఖల్లో పని ఒత్తిడి కారణంగా వెబ్‌సైట్‌ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. మరోవైపు ఈ-క్రాప్‌ నమోదు జిల్లాలో శతశాతం పూర్తికాలేదు. దీంతో ధాన్యం విక్రయాలకు ఈ సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. మరోపక్క తేమ శాతం ఎక్కువగా ఉండటంతో సాగుదారులు పలుమార్లు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిర గాల్సి వస్తోంది. దీంతో చేసేది లేక రైతులు దళారు లను ఆశ్రయించి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొం టోంది. జిల్లాలో గోనె సంచుల కొరత వేదిస్తోంది. పౌరసరఫరా సంస్థనుంచి సకాలంలో గోనె సంచు లు రాక పోవడంతో ఈ సమస్య తలెత్తు తోంది.

Read more

ప‌చ్చ‌ని పొలాల్లో కాల్సైట్ చిచ్చు

‘‘ గిరిజనులకు ప్రధాన జీవనాధారం భూమి.ఇప్పటికీ అత్యధిక గిరిజన కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో ప్రతీ గిరిజను కుటుంబానికి సరిపోయనంత భూమి ఉండేది. అనేక కారణాలువల్ల గిరిజనులు తమ భూమిని కోల్పోతూ వస్తున్నారు. నిరక్షరాస్యత, అనారోగ్యం,అజ్ఞానం,ఆర్ధికదోపిడి,కనీస సౌకర్యాలలేమి వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు. వీటి కారణంగా గిరిజనులు తమ భూములు,వనరులను కాపాడుకోలేక పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, గిరిజనుల్లో తమ హక్కులపట్ల చైతన్యం కలిగించి ప్రభుత్వం గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘటించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పరిధిలోకి వచ్చే ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు, పర్యావరణ పరిరక్షణ,వారి హక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. స్థానికులైన గిరిజనల భూములు, అన్యాక్రాంతం కాకుండా ఈ షెడ్యూలు రక్షణ కల్పిస్తుంది. అయినా రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ జిల్లా ఏజెన్సీలో చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజనేతరులు గిరిజన భూములను ఆక్రమించుకోవడం ఆగలేదు ’’పచ్చని పొలాలపై కాల్సైట్‌ చిచ్చు రగులు తోంది. అగ్ని ఆరదూ..పురుగు చావదు చందంగా ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ,మైనింగ్‌ కాంట్రాక్టర్ల(ఏపీఎం డీసీ)కాల్సైట్‌ మైనింగ్‌ ప్రభావిత గ్రామ రైతుల మధ్య ప్రచ్ఛన్నయుద్దం జరుగుతోంది. రాజ్యాంగానికి విరుద్దంగా,పీసా చట్టం,సమత జడ్జిమెంట్‌లను ఉల్లంఘించి మైనింగ్‌ తవ్వకాలు చేపడితే సహించమని గిరిజన రైతులు ప్రతిఘటి స్తున్నారు. మరోపక్క మైనింగ్‌ కాంట్రాక్టర్ల మైనింగ్‌ ప్రభావిత గ్రామాల్లోని గిరిజనుల మధ్య విభేదాలు సృష్టించి వారిలో వారికి వివాదాలు పెట్టి కాల్సైట్‌ తవ్వకాలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ వివాదంపై ఇటీవల మూడు గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసిన గ్రామసభ దీనికి తార్కాణం. విశాఖ జిల్లాలోని అనంతగిరి మం డలం కరకవలస,రాళ్లవలస,నిమ్మలపాడు మూడు గ్రామా ల గిరిజన ప్రజల మధ్య కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన లీజులపై అప్రాంత గిరిజన ప్రజలు వ్యతిరేకిస్తు న్నారు. ప్రభు త్వం ఇచ్చిన లీజులు తక్షణమే రద్దుచేసి స్థానిక గిరిజన సొసైటీలకే మైనింగ్‌ లీజులు అప్పగించాలంటూ గిరిజన ప్రజలు గ్రామసభలో ప్రతిఘటించారు. తమకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను బాధ్యతాయతంగా అమలు చేయాలని గ్రామసభ సాక్షిగా కోరారు. మైనింగ్‌ లీజులకు గ్రామసభ తీర్మాణం లేదు. సమతజెడ్జిమెంట్‌, పీసా చట్టం,అటవీహక్కులచట్టం, నియమగిరి జడ్జెమెంట్‌ వంటి గిరిజనులకు రక్షణగా ఉన్న రాజ్యాంగ బద్దమైన చట్టా లను వ్యతిరేకించి.. మైనింగ్‌ లీజులు ఇవ్వడంపై గిరిజన ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసుల హక్కులు, మైనింగ్‌ తవ్వకాలపై పూర్వంనుంచి సమత పలు ఉద్య మాలు చేపట్టి సుప్రీం కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగింది. ఫలితంగా సుప్రీం కోర్టు ఇచ్చిన సమత తీర్పును గౌరవించి అమలు చేయాల్సిన ప్రభుత్వం,అధికార యంత్రాంగాలు కంచెచేను మేసే చందంగా వ్యవహరింస్తోందని గ్రామసభ లో గిరిజనరైతులు ధ్వజమెత్తారు. ఈప్రాంతం లో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. నేటికీ అన్యాయాలకు, అమయక త్వానికి గురవుతునే ఉన్నారు. వారి అమాయ కత్వాన్ని ఆసరాగా తీసుకొని మళ్లీ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Read more

మాతృభాషల రక్షణతోనే గిరిజన విద్యాభివృద్ధి

సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలలను కొనసాగించటం, గిరిజన స్థానిక భాష, లిపిని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం, వృత్తి విద్యా కోర్సులను రూపొందించి, వాటికి అనుగుణంగా ఉపాధి కల్పించడం, మాతృభాషా వాలంటీర్లను కొనసాగించటం, ఐఏపి, సబ్‌ప్లాన్‌ నిధులను చిత్తశుద్ధితో కొనసాగించటం పట్ల పాలకులు దృష్టి పెడితే గిరిజనుల ఆలోచన విద్య వైపు మళ్లుతుంది.
గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల జీవన విధానం ఉన్నత స్థితికి చేరాలంటే అక్షరాస్యత చాలా కీలకం. అటువంటి విద్యనందించడంలో పాలకుల వైఫల్యాలు కోకొల్లలు. గిరిజన పిల్లల చదువుల్లో ఆంధ్రప్రదేశ్‌ 48.8 శాతంతో 31వ స్థానం అంటే చివరి స్థానంలో వుంది. ఇప్పటికైనా మేలుకోకపోతే అక్షరాసత్యతా శాతం పడిపోతుంది. రాజ్యాంగంలో షెడ్యూల్‌ తెగలకు ప్రత్యేకమైన రక్షణలు, సదుపాయాలు కల్పించబడ్డాయి. ఆర్టికల్‌ 46 ప్రకారం విద్య, ఆర్థిక వృద్ధి చేపడుతూ వారిని అన్ని విధాలైన సామాజిక అన్యాయాల నుంచి, దోపిడీ నుంచి రక్షించాలి. 5వ షెడ్యూల్‌ ద్వారా గిరిజన ప్రాంతాల పరిపాలన గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఇచ్చింది. 275(1) ప్రకారం షెడ్యూల్‌ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నోడల్‌ ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని సూచించింది. రాజ్యాంగంలో పొందుపరచబడిన గిరిజన హక్కులను కాలరాసే విధానాలను పాలకులు అనుసరిస్తున్న నేపథ్యంలో భాష, తెగలు సమస్య, పేదరికం, నిరక్షరాస్యత, దోపిడీ, మౌలిక సౌకర్యాల లేమి వెంటాడుతున్నాయి. మాతృభాష (స్థానిక భాష) లోనే విద్యాబోధనకు ప్రాధాన్యతనిస్తే గిరిజన పిల్లలు విద్యకు చేరువ అవుతారని గిరిజన ప్రజానీకమే అనేక ప్రయత్నాలు చేసింది. చదువు కోసం తపన పడిన బడులు ఆ ప్రాంతాలలో అప్పటికి లేవు. కొద్దిపాటి చైతన్యంతో ‘మా బడులు’ వెలిసాయి. ‘అక్షర దేవుళ్ళు, అక్షర బ్రహ్మ’ వంటివి ఆవిష్కరించుకుని అక్షరాలకే పూజలు చేసేవారు. స్థానిక భాషల రక్షణ కోసం ఆ భాషలో బోధించేందుకు గిరిజనులు కృషి చేశారు. 1985 నుండి 1990 వరకు విద్య కోసం గిరిజనులు పడ్డ తాపత్రయం పరిశీలించ దగ్గదే. ఈ ప్రాంతాలలో గిరిజనులు విగ్రహాలను పూజించరు, లిపినే నమ్ముతారు. ఆ తెగల అవసరాలను గుర్తించి భాష, లిపి, సంస్కృతిని పరిశీలించాలి. తెలుగు రాష్ట్రాలలో 33 తెగలకు చెందిన గిరిజనులు వున్నారు. అక్షరాస్యత లో వెనుకబడి, విద్యకు దూరంగా ఉన్న ప్రాంతాలుగా గుర్తించి 2005లో స్థానిక భాషలో విద్యాబోధనకు విద్యాశాఖ ప్రయోగాలు మొదలుపెట్టింది. భాషా సమస్య ప్రధాన కారణంగా గుర్తించి లిపి గల భాషలు అన్నింటికీ పాఠ్య పుస్తకాలను ముద్రించారు. నిర్దేశించుకున్న కొన్ని లక్ష్యాల సాధన దిశగా గిరిజన విద్యార్థులలో విద్యపై ఆసక్తి పెంచి బడి మానేసే శాతాన్ని తగ్గించడం, గిరిజన భాష, సంస్కృతులను పరిరక్షించటం కోసం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో బోధించే భాషతో తెగలను అనుసంధానం చేయాలి. దాంతో వారు విద్య పట్ల ఆకర్షితులౌతారని గిరిజన సాంస్కృతిక పరిశోధనా సంస్థ, ప్రాథమిక విద్యా పథకం సంయుక్తంగా 2006 నుంచి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రత్యేక మాడ్యూల్స్‌, వాచకాలతో అమలు చేయడం మొదలు పెట్టింది. మంచి ఫలితాలను సాధించింది. ప్రస్తుత పాలకుల విధానాల వలన వాలంటీర్ల వ్యవస్థ నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. మన రాష్ట్రంలో 8 జిల్లాలలో 920 పాఠశాలలలో, స్థానిక లిపి గల భాషలను 811 మంది వాలంటీర్లు బోధిస్తునారు. ఆగస్టు నెలలో పాఠశాలలు తెరిచినా ఇంతవరకూ స్థానిక భాషలకు చెందిన వాలంటీర్ల నియామకం లేదు. కరోనాకు ముందు కూడా ఇటువంటి పరిస్థితి ఉన్న కారణంగా పిల్లలు పూర్తిగా బడులకు దూరం అయ్యారు. పిల్లలు లేరని, తక్కువ సంఖ్యలో ఉన్నారని ఈ లోపల వందల సంఖ్యలో బడులను మూసేస్తున్నారు. కోయ, కొండ, కోలామి, కుయి, ఆదివాసీ ఒరియా, సవర, గోండి భాషలకు లిపి ఉంది. ఇవి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. పెద్ద తెగగా ఉన్న జాతాపు భాషకు లిపి లేదు. లిపి లేకపోవడం కూడా వెనుకబాటుకు ఒక కారణం. లిపి ఉన్న భాషలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. స్వాతంత్య్రం రాకమునుపు పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన గిడుగు వెంకట రామమూర్తి గిరిజన జాతుల విద్యాభివృద్ధి అభ్యుదయానికి, ఐక్యతకు సుమారు వంద సంవత్సరాల క్రితమే సవర సంస్కృతి, భాషలపై నిఘంటువును తయారు చేసి వర్ణమాల రూప కర్త అయ్యారు. అన్నిటికంటే ముఖ్యమైనది గిరిజన మాతృభాష బోధన తెలుగు లిపిలో జరుగుతున్నది. కాబట్టి తెలుగు భాష నేర్చు కోవడం సులభం అవుతుంది. విద్యార్థి ఆలోచనా సరళిని అభివృద్ధి చేస్తుంది. ఈనాటికీ 33 తెగలుగా గల ఆదివాసులు స్థానిక భాషలకు లిపిని సమకూర్చే బాధ్యత ప్రభు త్వాలదే. అంతేకాక జన గణన తెగల వారీగా చేపట్టకపోతే అంతరిస్తున్న ఆదిమ తెగలు గురించి తెలిసే అవకాశం లేదు. గిరిజనులు ఐటీడీఏ లక్ష్యాలను ఎలా నెరవే స్తారు? ఈ పరిణామాలన్నీ గిరిజనుల హక్కులు, ఉనికిని నిర్వచిస్తున్న రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్‌ స్ఫూర్తిని నీరుగార్చేలా ఉన్నాయి. లిపి గల గిరిజన మాతృభాషలను బోధించే వాలంటీర్లను కొనసాగించడం లేదు. అన్ని ఐటీడీఏ లలో ఇదే పరిస్థితి ఉంది.3,4,5 తరగతుల విద్యార్థులను ఆశ్రమ పాఠశాలలకు తరలించడం వలన స్థానిక మాతృభాషతో తెలుగు నేర్చుకునే పరిస్థితులు లేవు. ఈ బోధన కేవలం ప్రాథమిక పాఠశాల లోనే జరుగుతుంది. ఆశ్రమ పాఠశాలలోనే ఈ భాషలను బోధించే వాలంటీర్లు ఉండరు. టీచర్ల నియామకాలు లేకపోవడంతో, ఆశ్రమ పాఠశాలలో వారి ఆలనా పాలనా చూసే ప్రత్యేక టీచర్లు లేరు. సమగ్ర సర్వే లేకపోవడం, ప్రత్యామ్నాయ పాఠశాలల రద్దు చేయటం, నేటికి గిరి శిఖరాలకు రవాణా,విద్యుత్తు, వైద్య, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు లేకపోవడం, పాలకుల విధానాలతో మాతృభాష విద్యా బోధనపై దాడి మరింత వెనుకబాటుకు దారితీస్తున్నది. ప్రత్యామ్నాయాలు లేకపోలేదు. సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలలను కొనసాగించటం, గిరిజన స్థానిక భాష, లిపిని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం, వృత్తి విద్యా కోర్సులను రూపొందించి, వాటికి అనుగుణంగా ఉపాధి కల్పించడం, మాతృభాషా వాలంటీర్లను కొనసాగించటం, ఐఏపి, సబ్‌ప్లాన్‌ నిధులను చిత్తశుద్ధితో కొనసాగించటం పట్ల పాలకులు దృష్టి పెడితే గిరిజనుల ఆలోచన విద్య వైపు మళ్లుతుంది. ఆ ప్రాంతాలకు గల ప్రత్యేక పరిస్థితులను బట్టి ఎన్ని అవకాశాలు ఉంటే అన్నింటినీ అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది. కనుకనే భాష, సంస్కృతి, లిపి, విద్య వంటి అంశాల ప్రాధాన్యతను గుర్తించే ప్రతి ఒక్కరు రాజ్యాంగ పరమైన హక్కులకు భంగం కలగకుండా, భంగం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఓకే భాష మాట్లాడే తెగలన్నీ తమ తమ ప్రాంతాలలో ఐక్యతను సాధించాయి. స్వాతంత్య్ర పోరాటంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడాయి. అన్నింటికి మూలమైన చారిత్రక అంశం భాష. అటువంటి గిరిజన మాతృభాషల పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు అనివార్యం.
మౌళిక వసతులు కల్పించాలి
మాతృభాషతోపాటు గిరిజన విద్యాలయాల్లో మౌళిక వసతులు కల్పించాలి. నాడు నేడు కార్యక్రమంలో కొన్ని పాఠశాలలను మాత్రమే అభివృద్ధి చేశారు. మారుమూల లోతట్టు ప్రాంతాల్లో చాలా పాఠశాలలు అధ్వానంగా పడి ఉన్నాయి. వాటికి యుద్ద ప్రాతిపదన నిధులు మంజూరు చేయించి ఆధునీకరిం చాలి.ఉపాధ్యాయులు లేని పాఠశాల్లో ఉపాధ్యాయులను నియమించాలి. -కె.విజయ గౌరి

మొకం మల్లచ్చింది సారు

మానవతా దృక్పథం… సామాజిక స్పృహతో తన ఉద్యోగ ధర్మం నిర్వ ర్తించి గిరిజనుల గుండెల్లోనే కాదు.. తనలోని సృజనాత్మకత ఆసరాగా తెలుగు సాహితీ క్షేత్రంలో కథారచయితగా స్థానం సంపాదించారు. గిరిజన జీవితాలపట్ల సంపూర్ణ అవగాహన కలిగిన అధికారి గుర్తింపు పొందారు. ఆనేపథ్యంలో తన అనుభవాలు ఆలోచనలకు తనదైన సృజనాత్మకత జోడిరచి శాశ్వతత్వం తెచ్చే లక్ష్యంతో రాసిన 20కథలను ఏకం చేసి ‘భద్రాచలం మన్యం కథలు’ పేరుతో ప్రచురిం చారు . అందులోని కథే ‘నామొకంమల్లోచ్చింది సార్‌’ తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలు అనగానే గుర్తుకు వచ్చే ఒకవిశిష్టమైన రచయిత ఎ. విద్యాసాగర్‌. వృత్తిరీత్యా ఆయన ఐఏఎస్‌ అధికారి,1988 నుంచి రెండేళ్ల పాటు పూర్వక ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పనిచేసి దాని పరిధిలో గోదావరికి ఆవల ఈవల గిరిజనగూడేలతో,గిరిజనులతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకున్నారు. పాలన అధికారిగా మొక్కుబడిగా గిరిజనుల అభివృద్ధి గురించి పనిచేయలేదు. మానవతా దృక్పథంతో సామాజికస్పృహతో తన ఉద్యోగధర్మం నిర్వ ర్తించి గిరిజనుల గుండెల్లోనే కాదు..తనలోని సృజనాత్మకత ఆసరాగా తెలుగు సాహితీ క్షేత్రం లో కథారచయితగా స్థానం సంపాదించారు. ఎ.విద్యాసాగర్‌గా సుపరిచితుడైన ‘అంగల కుర్తి విద్యాసాగర్‌’ పుట్టి పెరిగింది ప్రకాశంజిల్లా. స్వతహాగా తెలుగువాడు కావడం తెలుగు భాష మీద పట్టు ఉండటం గ్రూప్‌ వన్‌ పోటీ పరీక్ష ల్లో తెలుగు సాహిత్యం ప్రధానాంశంగా తీసు కోవడం,ఉద్యోగరీత్యా గిరిజన ప్రాంతాల్లో పని చేయడం ద్వారా గిరిజన జీవితాలపట్ల సం పూర్ణ అవగాహన కలిగింది ఆయనకు. ఆ నేపథ్యంలో తన అనుభవాలు ఆలోచనలకు తనదైన సృజనాత్మకత జోడిరచి శాశ్వతత్వం తెచ్చే లక్ష్యంతో రాసిన 20కథలను ఏకం చేసి ‘భద్రాచలం మన్యం కథలు’ పేరుతో ప్రచురిం చారు అందులోని కథే ‘నామొకంమల్లోచ్చింది సార్‌’.గిరిజనులు నిత్యం అడవుల్లో తిరగడం వల్ల అక్కడ ఉండేపెద్ద పులులు,ఎలుగు బంట్లు, బారినపడి గాయాలపాలవడం,ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోవడం సర్వసాధారణం. ఇక కథ విషయానికొస్తే రచయిత పాల్వంచలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్న కాలం, అక్కడికి సమీపంలోని ‘‘యానం బయలు’’ వద్ద గల గిరిజన గ్రామంకు చెందిన ఒక గిరిజనుడు తన అల్లుడుతో కలిసి అడవికి వెళ్లగా, అక్కడ అతని పై ఎలుగుబంటి దాడి చేయగా మొహం అంతాగాయమై, ఒకకన్ను కూడా పోగొట్టుకొని, రెండు రోజులపాటు వారికి తెలిసిన పసరు వైద్యం చేసుకుని గాయం నయం కాక ముంబై లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోగా ప్రాథమిక చికిత్స చేసిన డాక్టరు ఖమ్మం పెద్ద ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇవ్వడంతో, దిక్కుతోచక నడిచి పాల్వంచరావడం, వీరి దీనస్థితి చూసిన కానిస్టేబుల్‌ అర్ధరాత్రి పూట దగ్గర్లోని ఐటీడిఎకి వాళ్ళని చేర్చి క్షతగాత్రుని భార్య సీతమ్మద్వారా పూర్తి వివరాలు తెలుసు కున్న కానిస్టేబుల్‌ ఆరాత్రి వేళప్రాజెక్టు అధి కారికి విషయం తెలియజేసి,అక్కడ గిరిజనుల సహాయార్థం ఏర్పాటు చేయబడిఉండే జీపు సాయం అడుగుతాడు.కార్యాలయం బయట వరండాలో జుగుత్సా కరమైన స్థితిలో పడుకొని ఉన్నా ఆముసలి గిరిజనుడి దయనీయ స్థితి చూసిన ప్రాజెక్టు అధికారి చలించిపోతాడు. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్లీ కట్టు కట్టించి తెల్లవారాక ఒకవ్యక్తిని సాయం ఇచ్చి ఖమ్మం కాకుండా సరాసరి హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి పంపిస్తారు. అతడితో వచ్చిన అల్లుడు పెద్దాసుపత్రిలో ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవడానికి సొంత గ్రామం వెళ్లిపోతాడు. క్షతగాత్రునితో అతని భార్య ఒక్కతే వెడుతుంది.హైదరాబాద్‌ ఆసుప త్రికి పంపించిన నాలుగు రోజులు కూడా పూర్తి కాకుండానే పాల్వంచ ఐటీడీఏవరండాలో ప్రాజెక్టు అధికారి ముందు ప్రత్యక్షం అవుతారు ఆముగ్గురు.ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ ముసలాడి పరిస్థితిలో ఏమార్పు లేదు.అదే జుగు త్సాకరమైన రూపం. చీము నెత్తురుతో చివికి పోయి వాసన వస్తున్న బ్యాండేజీ కట్టు. ఆదృశ్యం చూసిన ప్రాజెక్ట్‌ అధికారికి కోపం విసుగు ఒక్కసారిగా వచ్చిన,గిరిజనుల్లో ఉండే అమాయకత్వం, నిస్సహాయతలకు ఆచేతనుడవు తాడు. చివరికి అతని భార్య ద్వారా అసలు విషయం తెలుస్తుంది.‘ఆపెద్దపట్నం పెద్దాసు పత్రిలో తన ముఖంనయంఅయి మళ్ళీ వస్తదో రాదో కానీ ఒకవేళ ఇక్కడే చచ్చిపోతే..!! దేశం కాని దేశంలో అసలుచావ, నన్ను మన ఊరికి తీసుకుపోండి అనే ముసలోడు ఒకటే గోల చేసిండు.’అని చెబుతూనే ఆదావత్‌ దవాఖా నాల్లో బిట్లు లేక కిందనే పడుకోబెట్టి వైద్యం చేశారని ఒకసారి డాక్టర్‌ వచ్చి చూసి పోతే మళ్ళీ పొద్దుట ఆయన వచ్చి చూసే దాకా ఎవరూ రారని అడిగిన ఏది చెప్పరని,అక్కడి దయనీయ స్థితి సీతద్వారా తెలుసుకున్న ప్రాజెక్టు అధికారి.ఈవిషయాల గురించి తాను ముందు గా తెలుసుకోనందుకు తనలో తానే సిగ్గు పడ తారు.‘సరే అయిందేదో అయింది కానీ రేపు మీతో ఉండటానికి ఒక మనిషిని ఇచ్చి రెండు వారాలపాటు అక్కడ ఉండటానికి మీకు ఏర్పాటు చేస్తామని’ అంటారు. కానీ మళ్లీ పట్నం పోవడానికి,వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు, సరే ఈరాత్రి ఇక్కడే ఉండి తెల్లవారాక చేయా ల్సిన దాని గురించి ఆలోచిద్దామని నచ్చచెప్తారు, కానీ తెల్లవారి వాళ్ళు అక్కడ కనిపించడం లేదని వాచ్‌ మెన్‌ చెప్పిన మాటలతో, కథకు డైన ప్రాజెక్టు అధికారిలో తను ఓడిపోయాననే భావం ఆవరిస్తుంది, పాపం అమాయకపు గిరిజనుడు ఏమవుతాడో!? అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆరు నెలలయ్యాక ఒక రోజు పాల్వంచ మండలం లోని‘ఉలవనూరు’గిరిజన సదస్సులో పాల్గొన్న ప్రాజెక్టు అధికారి వద్దకు ముఖంపై కొంచెం మొర్రి ఉన్న ముసలాడు వచ్చి ‘‘నన్ను గుర్తుపట్టలేదా సారు నా మొకం మల్ల చ్చింది సారు’’ అంటూ తనను తాను పరిచయం చేసుకోవడమే కాదు….ఆస్పత్రిలో వైద్యం చేసిన డాక్టర్లు,తనకు సేవలు చేసిన తన భార్య సీతను, గుర్తుచేసుకుంటూ మీలాంటి గవర్నమెంట్‌ పెద్ద సార్లు మాలాంటి పేదలను ఆపదలో వున్నప్పు డు అట్ల ఆదుకుంటారని,డబ్బులు ఖర్చు పెడ తారని, నాకు అప్పుడు తెలియదు,మీ అందరి దయవల్లే బతికి మీ ముందు ఈరోజు ఇలా ఉన్నాను అంటూ అత్యున్నతమైన పశ్చాత్తాప గుణంతో ప్రాజెక్టు అధికారి ముందు కృతజ్ఞతా భావంతో నిలబడతాడు ఆగిరిజనవృద్ధుడు. ఆ గిరిజన ముసలాడి మాటలతో చలించిన ప్రాజెక్టు అధికారి ఆలోచనల సింహా వలోకనం తో ఈ కథ ప్రారంభమవుతుంది. కథ మొత్తం జ్ఞాపకాలు దారిలో నడిచిన, వాస్తవ సంఘట నల సమాహారంలా కనిపిస్తుంది. ప్రతి సంఘ టనలో సమకాలీన పరిస్థితులు, గిరిజనుల్లో ఉండే దయనీయ స్థితి, కష్టకాలంలో వారిలో ఉండే సహకారం, మానవ సంబంధాల గురించి, కథా రచయిత స్పష్టపరిచారు. ప్రస్తుత రోజు గడుపుకోవడానికే సతమతమయ్యే అరణ్య వాసులను భవిష్యత్తు గురించి ఆలోచించ మనడం,సబబు కాదనే భావన రచయిత ఇందులో వ్యక్తం చేస్తారు. తన కష్టాలకు తాను బాధపడుతున్న తన కర్తవ్యాన్ని, భార్యాభర్తల బంధాన్ని,మర్చిపోని గిరిజన స్త్రీ వ్యక్తిత్వం గురించి సీతమ్మ పాత్ర ద్వారా రచయిత చక్కగా ఆవిష్కరిస్తారు. తాను పూర్తిగా ప్రభుత్వం వారు అందించే వైద్య సాయం పొందక పోయినా, జన్మనిచ్చిన భూమి మీదే చనిపోవాలని కోరిక, పట్టణవాసపు వాసనలు,అక్కడి అసౌకర్యాలు, పడక వైద్యం చేయించుకోకుండా మధ్యలో పారిపోయి వచ్చితమదైన పసరు వైద్యంతో తన గాయం మాన్పుకున్నా…కొద్దిపాటి సాయాన్ని కూడా మరవ కుండా కృతజ్ఞతలు చెప్పిన గిరిజనవృద్దుడి లోని గొప్పదైన కృతజ్ఞతాభావం తన అనుభవసారం జోడిరచి చెప్పడంలో కథారచయిత పరిశీలనాశక్తి అర్థమవుతుంది. నిజానికి ఆగిరిజన వృద్ధుడికి చేయగలిగినంత సాయం చేయలేకపోయామని,పెద్దగా సాయం చేసింది ఏమీ లేదని,అవమానపడటంలో రచయిత పారదర్శకత స్పష్టమవుతోంది. చేసిన కొద్దిపాటి సాయాన్ని తమజీవితాంతం గుర్తు పెట్టుకునే కల్మషం ఎరుగని ఉన్నత వ్యక్తిత్వం అడవిబిడ్డల సొంతం,అనే గొప్ప విషయాన్ని రచయిత విద్యాసాగర్‌ ఇందులో అద్భుతంగా, అనుభవపూర్వకంగా,ఆవిష్కరించిన వైనం అభి నందనీయం.ఈ కథలో ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ గిరిజన వృద్ధుడి స్థితి హృదయ విదారకంగా చెప్పబడి కరుణరస భరితంగా సాగిన,కష్టాల్లో సైతం ధైర్యంగా వాటిని ఎదు ర్కునే ధీరగుణం గిరిజనుల్లో ఎలా ఉంటుందో కళ్లకు కట్టింది. ప్రభుత్వాలు గిరిజనుల సమగ్రా భివృద్ధికి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఐటీడీఏ లు ఏర్పాటు చేసిన దాని ఫలితాలు అందుకోవడంలో గిరిజనులు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు అని దీనికి తెలియని అజ్ఞానం గిరిజనులది అయితే, వృత్తి పట్ల పూర్తి నిర్లక్ష్యం అధికారులది కావడం అని, నిర్మొహమాటంగా రచయిత చెబుతారు. తాను ఒకగిరిజన అభివృద్ధి అధికారి కూడా తమ శాఖల లోపాలను ఖచ్చితంగా తన రచన లో వెల్లడిరచడం ద్వారా ఈకథా రచయిత, ఉత్తమరచయిత గుణాలు సొంతం చేసుకుని ఆదర్శ రచయితగా నిలిచారు, ఇది రచయితలు అందరూ ఆచరించదగ్గ గొప్ప విషయం.కథ మొత్తం రచయిత తన జ్ఞాపకాల సాయంతో నడిపిన, సంబంధిత సంఘటనలు, పాత్రోచిత సంభాషణలు,రచయిత కథన శైలి, వెరచి పాఠకులకు మంచి కథ చదివామనే సంతృప్తి మిగులుతుంది. రచయిత తెలుగు భాషా నైపు ణ్యం కూడా కథమొత్తం విస్తరించింది.వాస్తవ సంఘటనలను కాకా చెబుతూనే భవిష్యత్తులో అడవిబిడ్డల మనుగడ కోసం మనం ఏంచే యాలో కూడా చెప్పిన ఈకథలో సంపూర్ణ కథా లక్షణాలు సలక్షణంగా కనిపిస్తాయి
-(వచ్చే మాసం మీకోసం స్వర్ణ ముఖి కథ ‘‘గోరపిట’’) -డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, ఫోను: 77298 83223

కులం సంకెళ్లు.. ఇంకెన్నాళ్లు ?

తరాలు మారుతున్నా కులం పేరుతో జరుగుతున్న హత్యలు మాత్రం ఆగడం లేదు. కులం మారి పెండ్లిళ్లు చేసుకుంటే అయినోళ్లే బొందవెడు తున్నారు. నిన్నగాక ఇటీవల వరంగల్‌ లో కులాం తర పెండ్లి చేసుకుందని కన్నతల్లే కూతుర్ని కడ తేర్చింది. నిన్న మహారాష్ట్ర ఔరంగాబాద్‌ జిల్లాలో అక్క వేరే కులపుటోణ్ని పెండ్లి చేసుకుంది.. అంతే కడుపుతో ఉందని కూడా చూడకుండా నరికి చంపిండు ఓ తమ్ముడు. దాన్ని సెల్ఫీ తీసి అందరికీ చూపిండు. సాంకేతికంగా ఎంతో ఎదిగిపోయాం అంటూ జబ్బలు చరుచుకుంటున్నాం.. కానీ ఇలా పరువుప్రతిష్ట అంటూ అయినోళ్లనే నిర్థాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంటున్న వారిని మాత్రం ఏమీ చేయలేక పోతున్నాం. ఎన్ని చట్టాలు తెచ్చినా వారిలో మార్పు తేలేకపోతున్నాం. మరి ఈ కులాల కార్చిచ్చు ఆగేదెన్నడు? ప్రేమకు నీడ దొరికేదెన్నడు? పచ్చని జంటలు తమ బతుకులు పండిరచుకునేదెప్పుడు? మన సమాజాన్నిపట్టి పీడిస్తున్న భయం కరమైన జబ్బు కులవ్యవస్థే. కుల ప్రభావం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి కారణం కుల వ్యవస్థే అని మనదేశాన్ని లోతుగా పరిశీలిం చిన సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశం లోని ప్రతి మనిషికి ఏమున్నా లేకున్నా కులం మాత్రం గ్యారంటీ. వేల కులాలున్న ఈ సమాజంలో ఏ కులం కూడా ఇంకో కులంతో సమానం కాదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ దాదాపు 30 కోట్ల మంది అంటరానితనం, కులవివక్షతో అణచివేయబడుతున్నారు. మనదేశంలో కులం కొందరికి వరమైతే.. ఎందరికో శాపంగా మారు తోంది. కులాల చిచ్చుతో రగులుతున్న మన సమా జానికి శస్త్రచికిత్స తక్షణ అవసరం. ఆరోజు రావా లంటే ప్రజల్లో సామాజిక చైతన్యం రావాలి.. కుల రహిత సమాజం ఆవిర్భవించాలి. అనునిత్యం దాడులు.. దౌర్జన్యాలు
రెండు వేల సంవత్సరాలకు పైగా మన సమాజాన్ని అంధకారం,అజ్ఞానంలో ఉంచటంలో కులవ్యవస్థ పాత్ర ఎంతో ఉంది. శ్రమచేసే వారికిచదువు లేకుం డా చేసింది కులమే. మనుషుల మధ్య ఐక్యత, సాన్నిహిత్యం లేకుండా చేస్తోంది కులమే. ప్రేమిం చడాన్ని సహించదు సరికదా ద్వేషించడాన్నే ప్రేమి స్తుంది. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారు సైతం.. తిరిగి మన దేశానికొచ్చి తన కులమెక్కడుందో వెతుక్కొని, సొంత కులంలోనే పెండ్లి చేసుకుంటున్నారంటే కులమెంతగా ప్రభావం చూపుతుందో అర్థమవు తోంది. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై, చేసుకోవాలి అనుకునే వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరగడం మన సమాజంలో మామూలై పోయింది. గత నెలలో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఎస్సీ కులానికి చెందిన యువతి ఎస్టీ యువకుడిని ప్రేమించింది. అది నచ్చని ఆమె తల్లి,అమ్మమ్మ కలిసి దారుణంగా చంపేశారు. తమ కుల కట్టుబాట్లు దాటినందుకే హత్య చేశామని, మా కులం కాని వాడితో పెళ్లి వద్దన్నా వినలేదు అందుకే చంపాల్సి వచ్చిందని వారు సమర్థించు కున్నారు. కులాంతర వివాహాల పట్ల కర్కశత్వంగా వ్యవహరించడం ఇదేమీ మొదటిసారి కాదు, అలాగని చివరిదీ కాదు. గతంలో ఇలాంటి ఘట నలు అనేకం మన ముందున్నాయి.

అన్నీ కుల దురహంకార హత్యలే..
మిర్యాలగూడలో వైశ్య కులానికి చెందిన అమృత భర్త ప్రణయ్‌ను ఆమె తండ్రి, బాబాయిలే కిరాయి గూండాలతో హత్య చేయించారు. ప్రణయ్‌ దళిత మధ్యతరగతి కుటుంబంలో పుట్టడమే దానికి కారణం. ఇదే విధంగా కర్నూల్‌లో కులాంతర వివాహం చేసుకున్నందుకు ఆదాం స్మిత్‌ను గొడ్డళ్లతో నరికి చంపారు. హైదరాబాద్‌లో అవంతిరెడ్డి కులాం తర వివాహం చేసుకున్నందుకు వైశ్య కులానికి చెందిన హేమంత్‌ కుమార్‌ను అవంతి తండ్రి, మామ కిరాయి గూండాల సహకారంతో చంపించారు. భువనగిరిలో స్వాతిరెడ్డి భర్త నరేశ్‌ రజకుడని ఆమె తండ్రి,బంధువులు కలిసి నిర్ధాక్షి ణ్యంగా హత్య చేశారు. పొరుగు రాష్ట్రమైన తమిళ నాడులో సంచలనం సృష్టించిన కౌసల్య భర్త శంకర్‌ హత్య ఈకోవకు చెందిందే. శంకర్‌ దళి తుడైన కారణంగా అతణ్ని కౌసల్య తండ్రి, బంధు వులు కలిసిహత్య చేశారు. పంజాబ్‌కు చెందిన కావ్య భర్త అభిషేక్‌ను కూడా కులాంతర వివాహం చేసుకున్నందుకు చంపేశారు. అక్కడా ఇక్కడా అని లేదు దేశం నలుమూలలా తమ కులం కాని వారిని పెండ్లి చేసుకున్నందుకు అమానుషంగా హత్యలు చేస్తున్నారు. ఇవన్నీ నూటికి నూరుపాళ్లు కుల దురహంకార హత్యలే. ఈ హత్యలన్నీ సమీప రక్త సంబంధీకులు చేస్తున్నవే. కానీ, ఇవి అరుదుగా, అప్పుడప్పుడు జరుగుతున్న ఘటనలుగా, ప్రాధాన్యతలేని వార్తలుగా చూస్తున్నారు. తరతరాల చరిత్రలో ఇలాంటివి ఎన్నెన్నో. ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడం వల్ల ఇవి వెలుగులోకి వస్తున్నాయంతే.

వేరే కులం వారిని పెండ్లి చేసుకుంటే..
పిల్లలు కులాంతర వివాహాలు చేసుకుని తమ కుటుంబం పరువు తీశారని తల్లితండ్రులు, తోబు ట్టువులు, బంధువులు వాదిస్తున్నారు. ఆధిపత్య కులాల వారు తమకులం పరువుపోతోందని ఇలాం టి ఘోరాలకు పాల్పడుతున్నారు. రెండు వేర్వేరు కులాల వాళ్లు పెండ్లి చేసుకుంటే ఒకరు పైకులం గా,ఇంకొకరు కింది కులంగా భావిం చడమే ఇందు కు కారణం. తమకులం కంటే తక్కువ కులమని భావించిన ప్రతి ఒక్కరూ దాడులకు, దౌర్జన్యాలకు, హత్యలకు తెగబడు తున్నారు. కులాంతర వివాహాన్ని వ్యతిరేకించని తల్లిదండ్రు లను కూడా మిగతా బంధువులు వెలి వేస్తున్నారు. వారి పిల్లల్ని ఆదరించకుండా వాళ్లను శిక్షించాలని కులమంతా వేధిస్తోంది. ఎవరైనా కులాంతర వివాహాలు చేస్తు న్నా, ప్రోత్సహిస్తున్నా వారిని ధర్మం తప్పినట్లు కుల సమాజం చూస్తోంది.హంతకులుగా మారుతున్న రక్తసంబంధికులెవరూ తాము చేసింది తప్పని అను కోవడం లేదు. కులధర్మాన్ని కాపాడ టానికే ఈ పని చేశామని ఫీల్‌ అవుతున్నారు.

కుల రహిత సమాజం రావాలంటే..
కులం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయం కరమైన వ్యాధిగా మారింది.21వ శతాబ్దంలో కూడా అంటరానితనం, వివక్షలు కుల సంస్కృతిలో భాగమైపోయాయి. ఈ అమానుష కులవ్యవస్థను అంతం చేయడానికి ఎన్ని పథకాలు పెట్టినా కొత్త కొత్త రూపాల్లో అదిప్రత్యక్షమవుతునే ఉంది. ప్రస్తుతం సమాజానికి ఇదో సవాల్‌గా మారింది. ఈ సంస్కృతి సమాజ పురోగమనానికి ఆటంకంగా మారుతోంది. కుల వ్యవస్థ ఇంతకాలం సజీవంగా మిగలడానికి, భవిష్యత్తులో కూడా కొనసాగేది స్వకుల వివాహల ద్వారానే. కులాంతర వివాహాలు ఎంత ఎక్కువగా, ఎంత వేగంగా జరిగితే అంత త్వరగా కులరహిత సమాజం ఏర్పడుతుంది. బాహ్య వివాహాలు(తమ కులాలు కాకుండా బయటి కులాల నుంచి) ఒక నియమమైతే కుల వ్యవస్థే మిగలదన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెచ్‌? అంబేద్కర్‌. ఈ దిశలో కుల వ్యవస్థను నిర్మూలించడానికి మహోద్యమం చేయాల్సిన అవసరం ఉంది.

సాంస్కృతిక విప్లవం రావాలె..
సొంత కులం వారినే వివాహాలు చేసుకోవాలని, అదే ధర్మమని, ఆ ధర్మాన్ని ఉల్లంఘించి కులాంతర వివాహాలు చేసుకుంటే మరణ శిక్ష విధించాలని మన ధర్మ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇవి ఆనాటి సమకాలీన పరిస్థితులను అనుసరించి రాసినవి. కానీ ‘సంఘం శరణం గచ్చామి.. ధర్మం శరణం గచ్చామి’ అన్న బుద్ధుని ప్రబోధనలను అనుసరిస్తే.. మారుతున్న పరిస్థితులతోపాటు జనమూ మారక తప్పదు. కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలిం చడం మనందరి బాధ్యత. వందలాది కులాలున్న సమాజంలో ఒక్క మన కులం కాక మరే కులంలో వివాహం చేసుకున్నా అది కుల రహిత సమాజానికై జరుగుతున్న పోరాటంలో ఒక భాగమే. పెండ్లిలకు ‘ఒక్క నీకులంతప్ప, ఏ కుల మైనా ఫర్వాలేదు’ అన్న నినాదం కావాలి. అందు కోసం దేశంలో అతిపెద్ద సాంస్కృతిక విప్లవం రావాలి. -కందుకూరి సతీష్‌ కుమార్‌

1 2