అణచివేతలు అంతం కావాలి!

‘‘ఇప్పటికీ కులాంతర వివాహాల‌కు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కుల‌ శక్తులు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు ’’

భారతదేశంలో అందరూ అంగీకరించే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకిక, రిపబ్లిక్‌ భావన ఆధారంగానే రాజ్యాంగాన్ని రచించారు. ఈభావన అములో ఫ్యూడల్‌ సంబంధాు, మనుస్మృతి అడ్డంకిగా మారాయి.
అంటరానితనం – హింస
చట్ట ప్రకారం అంటరానితనం పూర్తిగా నిషేధమని రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 17 చెపుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అంటరానితనం అనేక రూపాల్లో వే గ్రామాల్లో ప్రబలిపోతుంది. దళితు ఈ దుర్మార్గాకు వ్యతిరేకంగా పోరాటం చేసి, తమ హక్కు గురించి పునరుద్ఘాటిస్తే, కులాధిపత్య శక్తు వారిని విపరీతంగా కొట్టి, నరమేధాన్ని సృష్టించి, వారి గుడిసెను తగుబెట్టి, ఆస్తును ధ్వంసం చేసి, మహిళపై అత్యాచారాకు కూడా ప్పాడుతున్నారు. ఇలాంటి హింసాత్మక చర్య కు సంబంధించిన కేసు అనేక కారణా వ్ల, ఒత్తిడివ్ల నమోదు కావడం లేదు. అధికాయి, పాకవర్గ ప్రతినిధు కు పక్షపాతంతో వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం. ‘’నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ ద హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌’’ దళితుకు వ్యతిరేకంగా జరిగిన దాడు, ఆగడాను వివరించే సందర్భంలో మన గుండె వణికి పోతుంది.
కు హింసాత్మక చర్యల‌ ఇప్పటికీ కులాంతర వివాహాకు వ్యతిరేకత ఉంది. సామాజికంగా కఠినమైన షరతును అంగీకరించని వారిని పరువు కోసం హత్య చేస్తున్నారు. ఒక దళితుడు హిందూ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకుంటే, ఆధిపత్య కు శక్తు అతన్ని అనాగరికంగా హత్య చేయడం మనం దేశంలో తరచుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాలో కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిు కూడా హత్యకు గురవుతున్నారు. ఇతర కులాకు చెందిన వారిని పెండ్లి చేసుకుంటున్న దళితులే ఎక్కువ సంఖ్యలో హత్యకు గురవుతున్నారు.

రాజకీయాధికార నిరాకరణ
నేటికి కూడా, దళితుకు ప్రజాస్వామిక హక్కును, రాజకీయ అధికారాన్ని కల్పిస్తే, కులాధిపత్య శక్తు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్‌లుగా స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధుగా ఎన్నుకోబడిన దళితు తమ స్థానంలో (కుర్చీలో) కూర్చునేందుకు అనుమతించని పరిస్థితి. ఆర్థిక,జీవన స్థితిగతులో పెద్దగా తేడాలు లేకపోయినప్పటికీ, కులాధిపత్య శక్తు సృష్టించే వరుస సంఘటనల్లో దళితు, వెనుక బడిన కులాకు చెందిన ప్రజు తగువులాడుకుంటున్నారు. దళితుతో పాటు వెనుకబడిన కులాకు చెందిన వారూ ఆధిపత్య కుల‌ శక్తలు చేత అవమానాకు, వివక్షకు గురవుతున్నారు.వీరికి రిజర్వేషన్‌లు కూడా సంపూర్ణంగా,న్యాయంగా అమలు చేయడం లేదు. నిషేధం ఉన్నప్పటికీ, దళితు, వెనుకబడిన కులా వారికి వ్యతిరేకంగా దుర్మార్గపు చ‌ర్య‌లు,నేరాలు జరగడానికి కారణం ఏమిటి? కుల‌ అణచివేతకు ఒక రూపక్పన చేసి, దానిని సమర్థించి, భారతీయ సమాజం లోకి ప్రవేశపెట్టిన మనుస్మృతి కాదా?

మనుశాస్త్రం – హిందూత్వ ముఖ్యాంశాలు
మనుస్మృతి, హిందూత్వ భావజా ప్రధాన పాఠ్యాంశాల్లో ఒకటి వర్ణాశ్రమధర్మం, రెండు స్త్రీ బానిసత్వం భారతీయ సమాజంలో ప్రధానమైన విధు అని మనుధర్మశాస్త్రం నొక్కి చెప్పింది. వర్ణాశ్రమ ధర్మాన్ని అముచేసే విధానం, శూద్రు జీవితం ఏ విధంగా ఉండాలో కూడా మనువు చెప్పాడు. ‘’శూద్రు ఇతర మూడు వర్ణా వారికి దాస్యం చేయాని దేవుని ఆజ్ఞ. తక్కువ కుంలో పుట్టిన శూద్రుడు ఉన్నత వర్ణా వారినెవరినైనా అవమానకరమైన మాటతో గాయపరిస్తే, అతని నాుకను కోసేయాలి. శూద్రుడు ఏ కులాన్నైనా లేక ఉన్నత కులా పేరును అవమానపరిస్తే, అతని నాుకపై వాతు పెట్టాలి. శూద్రులు పాచిపోయిన ఆహారాన్ని, చిరిగిన బట్టను, పాత ప్లేట్లను వేతనంగా ఇవ్వాలి.’శూద్రుడు డబ్బు, ఆస్తిని సంపాదించుకుంటే, దానిని అతడు అనుభవించేందుకు అనుమతి లేదు. ఎందు కంటే, వారికి అహంకారం పెరిగి, బ్రాహ్మ ణును, ఉన్నత కుస్తును గాయపరుస్తారు. శూద్రు వేదాను నేర్చుకో కూడదు, విన కూడదు. ఒకవేళ పురాణాను చదివితే అతని నాుకను రెండు సార్లు కొయ్యాలి, పురాణాను వింటే, చెవుల్లో సీసం కరిగించి పోయాలి. ఉన్నత కుస్తును గాయపరిస్తే ఏ అవయ వాన్నైనా కోసెయ్యాలి. చేతితో కొడితే చేతిని, కాుతో తంతే కాును తీసెయ్యాలి.’’ ఇలా సమాజంలోని ఆధిపత్య శక్తల‌ తీవ్రమైన అణచివేత, హింసను అమలు చేయడం ద్వారా కు వ్యవస్థను కొనసాగిస్తున్నారనే విషయాన్ని గమనించాలి.మనుధర్మశాస్త్రం – వర్గ దృష్టికోణం
ఈ సందర్భంలో, మనుధర్మ శాస్త్రంపై మార్క్సిస్టు దృష్టికోణం ఏమిటి? మనుస్మతి ప్రతిపాదిస్తున్న సాంప్రదాయ భావాకు వ్యతిరేకంగా చేసే పోరాటాు, ప్రచార యంత్రాంగం ఎలాఉండాలి? అనే అంశాల‌ను పరిశీలిద్దాం. భారతదేశంలో బానిస రైతు, ఫ్యూడల్‌ ఆధిపత్యం ఉన్న కాంలో, 2500సం క్రితం మనుశాస్త్రాన్ని రాశారు. ఆ కాంలోనే వర్గ, కుల‌ అణచివేతు ఉన్నాయి. మిలియన్ల సంఖ్యలో శ్రామిక ప్రజల‌,కులంపేరుతో భయంకరమైన వర్గ,ఆర్థిక అణచివేత కింద లొంగి ఉన్నారు. దీనిలో భాగంగానే స్త్రీల‌పై లైంగిక వేధింపులు చెల‌రేగాయి. కుల‌,వర్గ భేదాలు దేవుని అభీష్టం మేరకు సష్టించినవనీ, కాబట్టి ప్రజందరూ దేవుని అభీష్టాన్ని పాటించాల‌నీ, వాటిని ఉ్లంఘించిన వారిని శిక్షించానీ,ఆ శిక్షించే అధికారం రాజుకు ఇవ్వడమైందనీ మనుస్మతి చెపుతుంది. సంఖ్యాపరంగా చిన్నదైనా, భూస్వాములే పాకవర్గాలుగా ఉంటూ అణచివేత సాగించారు. నాడు రాజు ఫ్యూడల్‌ వ్యవస్థకు ప్రతినిధుగా ఉన్నారు. దోపిడీ వర్గాల‌ ప్రతినిధి అయిన మనువు, ఆ వర్గాన్ని రక్షించేందుకు మనుశాస్త్రాన్ని రాశాడు. ఆ మనుశాస్త్రాన్నే రాజు పానకు అవసరమైన రాజ్యాంగంగా అంగీకరించి, కాక్రమంలో అమల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపు, దాని ప్రభావమే నేడు చోటు చేసుకుంటున్న కు, లైంగిక అణచివేతు. చరిత్రలో ఆ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటా ఫలితంగా అనేక మార్పు జరిగాయి. మానవజాతి చరిత్ర అంతా వర్గపోరాటా చరిత్రే అని కార్ల్‌ మార్క్స్‌ చెప్పాడు. మానవజాతి చరిత్ర నిబంధన విషయంలో భారతదేశానికి ఏ విధమైన మినహాయింపు లేదు. కానీ ఈ చారిత్రాత్మక సంఘటను ఆయా దేశా సామాజిక, ఆర్థిక పరిస్థితును బట్టి ప్రతీ దేశంలోనూ జరిగాయి. భారతదేశంలో వర్ణ (కుల‌)వ్యవస్థ తన ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడ కు వ్యవస్థను చాలా కాం క్రితం సృష్టించారు. ఆ కుల‌, వర్గ అణచి వేతు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.

లింగ వివక్షతకు ఆధారం
మానవజాతి చరిత్రలో, ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజం తరువాత బానిస సమాజం, ఆ తర్వాత ఫ్యూడల్‌ సమాజం, ఆ తరువాత ప్రస్తుతం మనం ఉంటున్న బూర్జువా సమాజం ఏర్పడిరది. ఈ మార్పు వర్గపోరాటా ఫలితం గానే ఏర్పడ్డాయనే విషయాన్ని మర్చిపోకూడదు. చివరికి పెట్టుబడిదారీ వ్యవస్థ పతనమై, సోషలిస్టు వ్యవస్థ ఏర్పడడం కూడా కార్మికు వర్గ పోరాటం ద్వారానే జరుగు తుంది. ఆదిమ కమ్యూనిస్ట్‌ సమాజంలో మహిళు చాలా కీకమైన పాత్రను పోషించారు. మానవ సమాజం దోపిడీ చేసే, దోపిడీ చేయబడే వర్గాుగా విభజన జరిగినప్పుడు ఆస్తి యాజమాన్యం ఉద్భవిం చడం, ఆ యాజమాన్యాన్ని పురుష వారసుకు మార్చే క్రమంలో స్త్రీు మగవారి అధీనంలోకి వచ్చారు. ఇది చారిత్రక సత్యం. కాబట్టి స్త్రీ పట్ల ద్వేషభావం కూడా వర్గ అణచివేతతో ముడిపడి ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఇటువంటి చారిత్రక నేపథ్యంలో, ఫ్యూడల్‌ వ్యవస్థలో రాయబడిన మనుస్మతి కుల‌, వర్గ అణచివేతను, స్త్రీపట్ల ద్వేష భావాన్ని సమర్థించింది. మహిళ జీవితాు మగవారిపై ఆధారపడి, వారికి బానిసుగా ఎలా ఉండా నే విషయాన్ని మనుస్మతి నొక్కి చెప్పింది. ‘’మహిళు బ్యాంలో తండ్రి, యవ్వనంలో భర్త, వద్ధాప్యంలో కొడుకు పోషణలో ఉండాలి. ఒక పురుషుడు, తన కూతురు యుక్త వయస్సు లోకి రాక పోయినా కూడా, తన కులానికి చెందిన వ్యక్తికే అప్పగించాలి.’’ ‘’ఆస్తి వారస త్వానికి సంబంధించి, పెద్ద వారికి రెండు భాగాు, ఆ తరువాత వారికి ఒకటిన్నర భాగాలు, మిగిలిన కొడుకుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చొప్పున పొందుతారు. ఇదే సరైన విభజన. (మహిళకు ఆస్తి హక్కు లేదు).’’ ‘’అన్నదమ్ము మధ్య ఇలాంటి విభజన జరిగిన తర్వాత, వారు తమ భాగాల్లో 1/4 వంతు భాగాన్ని వారి అక్కా చెల్లెళ్ళ వివాహా కోసం ఇవ్వాలి.’’ తన భర్త ద్వారా కాకుండా, వేరే వ్యక్తి ద్వారా పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదు’’. ‘’వితం తువు పండ్లు, దుంపు (తనకు ఇష్టం ఉంటే) తినాల్సి ఉంటుంది. ఆమె తన భర్త మరణా నంతరం పరాయి పురుషుని పేరు ఉచ్ఛరిం చేందుకు అనుమతి లేదు’’. ఆ విధంగా మనుస్మతిలో పేర్కొన్న వివిధ స్త్రీ బానిసత్వానికి సంబంధించిన అంశాను గమనించవచ్చు. భారతదేశంలో మహిళ సమానత్వం కోసం జరిగిన పోరాటాు, కుల‌, వర్గ వ్యతిరేక పోరాట చరిత్ర ఫలితంగా స్త్రీ బానిసత్వ రూపాలో కొన్ని మార్పు సంభవించి ఉంటాయి. అయినా నేటికీ స్త్రీ సమానత్వం ఒక కగానే ఉండిపోయిందనే మాటను ఎవరూ కొట్టి పారెయ్యలేరు.

భారతదేశ ప్రత్యేకత
ఇక్కడ మనం భారతదేశం యొక్క సామాజిక పరిస్థితును పరిగణనలోకి తీసుకోవాలి. అనేక అభివద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలో, పశ్చిమ దేశాల్లో ఫ్యూడల్‌ వ్యవస్థ పూర్తిగా నాశనమై, దాని నుండే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. భారతదేశం విషయంలో స్వాతంత్య్ర పోరాట కాంలో ఉద్భవించిన బడా బూర్జువాు, తరువాత బూర్జువా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను రూపొం దించడంలో కీకమైన పాత్రను పోషించారు. తమ స్వలాభం కోసం ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడ్డారు. భూసంస్కరణ చట్టాను సరిగా అము చేయలేదు. భూస్వాము నుంచి స్వాధీనం చేసుకున్న అదనపు భూమును, భూమి లేని నిరుపేదకు, చిన్నరైతుకు ఇవ్వలేదు. అందుకే దానికి ఫ్యూడల్‌ వ్యవస్థ సంబంధాు, భావాు పూర్తిగా నిర్మూలించబడలేదు. ఈపరిస్థితిలో, ఫ్యూడల్‌ కాంలోని మనుస్మతి, దాని భావజాం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశ బడాబూర్జువా నాయకత్వంలో ఉన్న పాకవర్గాు, తమ ఆధిపత్యాన్ని నెక్పొుకొని, శ్రామిక ప్రజను విభజించేందుకు ఎటువంటి సంకోచం లేకుండా కు వ్యవస్థను, ప్రజ మనో భావాను ఉపయోగించుకున్నారు. నేటికీ బూర్జువా పార్టీ పని విధానంలో కు వ్యవస్థ, కు మనోభావా ఉనికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చట్టసభల్లో మహిళకు 33శాతం రిజర్వేషన్ల క్పన ఒక కగానే మిగిలిపోవడం యాదచ్ఛికం కాదు. సాంప్రదాయవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ దష్టికోణంలో మనుధర్మ శాస్త్రం నొక్కి చెప్పిన విధంగా, మహిళకు వ్యతిరేకంగా లైంగిక హింస, కు అణచివేత అంతటా వ్యాపించి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది భారతీయ సమాజంలో బాగా బపడి అంతటా వ్యాపించి ఉంది. సంఫ్‌ు పరివార్‌, హిందూత్వ శక్తు, ప్రజల్లో ఈసాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి చురుకుగా ప్రయత్నాు సాగిస్తున్నాయి. పార్లమెంట్‌లో తగిన బంతో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సాంప్రదాయ భావాను బలోపేతం చేయడానికి అవసరమైన అవకాశాను పెంచుకుంటుంది. వారు హిందూత్వ భావజాంతో కూడిన నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకు ఉన్న భారతదేశ చరిత్రను తిరగ రాయాను కుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం, 12000సం. భారత దేశ చరిత్రను తమకు అనుకూంగా తిరగ రాయడానికి ఒక కమిటీని నియమించింది. పురావస్తు సంబంధమైన వనరును వాస్తవా ను మార్చేందుకు ఉపయోగిస్తున్నారు. హిందూ త్వ జాతి వాదాన్ని సమర్థించడానికి పురాణ కథు రాస్తున్నారు. స్త్రీ బానిసత్వం వాస్తవ చరిత్రగా చిత్రీకరిస్తున్నారు.

హిందూత్వ భావజాం వెనుక మిలియన్ల సంఖ్యలో ప్రజను (తప్పుడు ప్రచారాతో, కల్పిత చారిత్రక సమాచారం ద్వారా) సమీకరించేందుకు సంఫ్‌ు పరివార్‌ చాలా చురుకుగా పని చేస్తున్నది. కు వ్యవస్థతో బాధకు గురవుతున్న దళితును కూడా వారు వదలేదు. వారిలో కు విభజనను పెంచడానికి ప్రయత్నంచేస్తూ, తమ నాయకత్వం కిందకు సమీకరిస్తున్నారు. కొన్ని ప్రయత్నా తర్వాత కొంతమంది దళిత సంఘా నాయకు, మేథావు సంఫ్‌ు పరివార్‌ ఉచ్చులో పడి పోయారు. వారు కూడా దళితును, ఇతర కులాకు చెందిన వారిని ఆకర్షించేందుకు జరిగిన అన్ని అసత్య ప్రచారాలో భాగస్వాముయ్యారు.

పరిష్కారం ఏమిటి?
మనుస్మతి వ్యతిరేక ప్రచారం, ఉద్యమాతో కూడిన సామాజిక సంస్కరణ అవసరాన్ని మనం గుర్తించాలి. సామాజిక సంస్కరణ ఉద్యమంలో జ్యోతీబా ఫూలే, పెరియార్‌ ఈ వీ రామస్వామి, బీఆర్‌ అంబేద్కర్‌, నారాయణ గురు లాంటి కతనిశ్చయం గ వారు అపారమైన సేవందించారు. ఈ పోరాటా ఫలితంగా దళితు, వెనుకబడిన కులా ప్రజు, మహిళు అనేక హక్కుతో పాటు ప్రత్యేక సౌకర్యాను సాధించుకున్నారు. అట్లా సాధించుకున్న కీక మైన హక్కులో రిజర్వేషన్లు ఒకటి. కానీ ఈ పోరాటాు కు, లింగ అణచివేతను అంతం చేయలేదు. అందువన ఈ రెండు అణచివేత వ్యతిరేక పోరాటాు కేవం సామాజిక సంస్కరణ ఉద్యమంతో మాత్రమే ఆపకూడదు. అదే సమయంలో ఈ పోరాటాను, ఫ్యూడల్‌ వ్యవస్థకు మరియు అంతర్లీనంగా సామాజిక అణచివేతలో ఉన్న సంబంధాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో పాటుగా ఫ్యూడల్‌ వ్యవస్థతో రాజీపడిన బడా బూర్జువా నాయకత్వంలోని భారత పాక వర్గాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో కపాలి. సామాజిక సంస్కరణ ఉద్యమాు, వర్గ పోరాటాు జమిలిగా కలిపి చేయాలి.

సామాజిక వివక్షే కట్టుబాటుగా…!

ఉత్తరప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కుల‌ చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుల‌ పక్షపాతం, పితృస్వామిక శక్తు ప్రాబ్యలం బలంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదలు కొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యత నిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి.
నుగురు ఠాకూర్లచే హత్యాచారానికి గురైన బాధితురాలిని, ఆమె తల్లిదండ్రు అభీష్టానికి భిన్నంగా, ఆ రాత్రికి రాత్రే అంత్యక్రియు నిర్వహించారు. ఆమె కుటుంబాన్ని నిఘా నీడలో ఉంచి మరీ ఆ దుశ్చర్యకు ప్పాడ్డారు. పట్టణంలో 144వసెక్షన్‌ విధించడం, వారి కుటుంబ సభ్యును పత్రిక వారితో మాట్లాడడానికి అనుమతించకపోవడం, బాధితు రాలి సోదరుడి మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయించడం, వారి కుటుంబాన్ని ఇంటికే పరిమితం చేయడం వంటివన్నీ జరిగాయి. ఠాకూర్‌ కుటుంబీకు బహిరంగంగా నిరసన తెలియ చేయడానికి అనుమతించారు. బాధితురాలి కుటుంబాన్ని మాత్రం బహిరంగంగా బెదిరిం చారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రశేఖర్‌ రావణ్‌ లాంటి వారికి కూడా హెచ్చరికు చేశారు. బాధిత కుటుంబం భయంతో వణికి పోయింది. హత్రాస్‌ అనేది కులాధిక్యత గ పట్టణం. వారిలో ముఖ్యంగా బ్రాహ్మణు, వైశ్యు వున్నారు. మురికి కాలువ‌లు, బహిరంగంగా పారే ప్రాంతంలో వాల్మీకులు నివసిస్తారు. వారు ప్రధానంగా పారిశుధ్య కార్మికలుగా వుంటూ ఠాకూర్ల పంటపొలాల్లో వ్యవసాయ పను చేస్తారు. ఠాకూర్లకు వారితో పని పడినప్పుడు ఒక మధ్యవర్తిని వారి వద్దకు పంపుతారు. దళితవాడకు వెళ్లి పనికి రమ్మని అడగడం తమ గౌరవానికి భంగకరమని భావిస్తారు. దళితు మార్కెట్‌ నుంచి కొనానుకున్నా, షాపు యజమాను దూరాన్ని పాటిస్తూనే సరుకు ఇస్తారు. కరోనా మహమ్మారి వ‌ల్ల‌ వాడుకలోకి వచ్చిన ‘సామాజిక దూరం’ అనే పదం అంతకు ముందే ఆప్రాంతంలో పాటించబడుతున్నది.ఉత్తరప్రదేశ్‌లో కులా ఆధారంగా అసమానతనేవి స్పష్టంగా కన్పిస్తుంటాయి. హత్రాస్‌ దీనికి మినహాయింపు కాదు. దళితు అగ్రవర్ణా కానీల్లోకి వెళ్లినట్లయితే సామాజిక దూరాన్ని పాటించ వసిన ఉంటుంది. కు కట్టుబాట్లకు అనుగు ణంగా మసుకోవాల్సి వుంటుంది. కులాంతర చర్చగాని, సామాజిక ఐక్యత గాని లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వివేక్‌ కుమార్‌ ఇలా అంటారు. ‘’కుల‌ ఆధిపత్య హిందూ సమాజంలో దళితల‌ ఎప్పుడూ బహిష్కృ తుగానే ఉన్నారు. నేటికీ వారు అగ్రకుల‌స్తు పొలాల్లో పని చేస్తున్నప్పటికీ…వారి దగ్గరకు వెళ్ళడానికి కూడా అనుమతించరు. వారి పశువుల‌ను కూడా అగ్రకుల‌స్తు పొలాల్లో మేత మేయడానికి అనుమతించరు. ఉదయం బహిర్భూమికి కూడా సుదూర ప్రాంతాకు వెళ్ళ వసి ఉంటుంది’’. ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త అవిజిత్‌ పాఠక్‌ ఇలా అంటారు. ‘’నీవు ముస్లిమైనా, దళితుడవైనా,ఆధిపత్య శక్తుల‌ పరిమితు విధిస్తారు. భారతీయ సమాజంలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని సంవత్సరాుగా భారతీయ సమాజం రోజు రోజుకు తిరోగమన దిశలో పయనిస్తోంది. వినిమయతత్వం పట్ల విపరీతమైన మోజుతో పాటు, తిరోగమన భావాు వ్యాపిస్తున్నాయి. మతమనేది ప్రధానమైనదిగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యున్నత స్థాయిలో ఘనీభవించిన కుల చట్రంలో మనుగడ సాగించడం పెద్ద సాహసమే. ఇక్కడ కుల‌పక్షపాతం, పితృ స్వామిక శక్తున‌ ప్రాబ్యం బలంగా వ్యాపించి ఉంది. కులాకు రాజకీయ ప్రతినిధు అండదండుంటాయి. ఉన్నావో మొదల‌కొని హత్రాస్‌ వరకు హింస పునరావృతం కావడం చూశాం. మృగప్రాయమైన అంశాకు ప్రాధాన్యతనిస్తూ, గొప్పగా చెప్పుకోవడం పరిపాటి’’.ఈ పరిస్థితి ఎప్పుడూ ఉన్నదే. అయినా, హత్రాస్‌ విషాదం తరువాత మీడియా దృష్టికి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్న్‌ ప్రారంభం నుంచి క్షత్రియును సమర్థిస్తూ, వారిపై నమ్మకం వుంచుతున్నాయి. దేశ విభజన తరువాత ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో వున్నది కాబట్టి వారు అధికార కుంగానే భావిస్తారు. యు.పిలో కాంగ్రెస్‌ పుకుబడి ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో, మాయావతితో లేని దళిత కులాను తమ సామాజిక కూటమిగా ఎన్నుకున్నారు. వెనుకబడిన తరగతులో మౌర్యాను మొదలుకొని, మల్లాల‌, పాసీ వరకు నూతన కూటమిని ఏర్పరుచుకున్నారు. కళ్యాణ్‌ సింగ్‌, ఉమాభారతి అధికారంలో ఉన్నంత కాం లోథాు వారితోనే వున్నారు. మల్లాు రామునితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. పరుశురాముని శ్వేదం నుంచి తాము ఉద్భవించినట్టు పాసీు చెప్తారు. ఒకవైపున యు.పిలో 9శాతం ఠాకూర్లు, పూర్తిగా వెనుకబడిన తరగతు నుంచి 32 శాతం ఓటర్లు బిజెపి వైపు ఉన్నారు. ప్రధాన మంత్రిని కూడా వెనుకబడిన తరగతు వాడిగా చెప్పుకోవడానికి ఇష్టపడ తారు! 2017 విధానసభ ఎన్నికల్లో 200 చిన్న సమావేశాల‌కు ప్రాతిపదికన జరిగాయి. ఈరోజున కుల‌ సమీకరణు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, పై స్థాయిలో ఉన్న పోలీసు అధికారుల్లో, జిల్లా మెజిస్ట్రేట్‌ కోవిడ్‌ పునరా వాస కేంద్రాలో కూడా ఈ సామాజిక గ్రూపు ప్రాబల్యాన్ని గమనిస్తాం. ఈ నభై ఒక్క శాతమే రాష్ట్రంలో ఆధిపత్య శక్తిగా కనబడుతుంది’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. ఈ కు సమీకరణు…2017 నుంచి ఎన్‌కౌంటర్‌ పేరుతో దళితును, ముస్లింను ఏరిపారేస్తు న్నారనే వాదనకు మినహాయింపు లేని సాక్ష్యంగా వున్నాయి. యు.పి లో హత్రాస్‌ ఒక చిన్ని ప్రాంతం. హత్రాస్‌ ఢల్లీికి అత్యంత సమీపంలో వున్నదనే విషయం మన దృష్టిలో వుండాలి. కాబట్టి హత్రాస్‌లో బిజెపి జరిపే ప్రతి చర్యా ఢల్లీి, రాజస్థాన్‌, బీహార్‌పై ప్రభావం చూపుతుంది. కుల‌, వర్గ అసమానతు, ఆధిక్య తతో కూడిన చైతన్యం మధ్యతరగతిలో గమని స్తామని ప్రొఫెసర్‌ పాఠక్‌ చెప్తారు. తన మాటల్లోనే చూద్దాం.‘’వల‌స కార్మికుల‌ సంక్షోభ సమయంలో, మధ్యతరగతి ఉన్నత వర్గాు ఏ విధం గా ప్రవర్తించాయో మనం గమనించాం. అప్పుడు కూడా వారు అమెజాన్‌ సరుకు, ఆహారం,చేపలు,చికెన్‌ అందుతాయో లేదో అనే దానిపైనే దృష్టి పెట్టారు. అత్యంత నీచమైన అంటరానితనం పాటించారు. పనివారు లిఫ్ట్‌ ఎక్కవచ్చా,కూరగాయు అమ్మేవారు కానీ లోకి ప్రవేశించవచ్చా అనే అంశాలు ముందు కొచ్చాయి. కొన్ని సందర్భాలో బిజెపి శాసన సభ్యు అమ్మకందారును అవమానించటం, వారి ఆధార్‌కార్డు అడగటం గమనిస్తాం’’. గత కొన్ని సంవత్సరాలుగా కు విభేదాలు బాగా పెరిగాయి. కేవలం సాధారణమైన కుల‌లాధిపత్యమే కాదు, దళిత సమాజంలో కూడా కరుడుగట్టిన కు విభేదాు పొడచూపాయి. ప్రతి విషయం తమ రాజకీయ అవసరా ను బట్టి అంచనా వేయబడుతుంది. అధికార యంత్రాంగం లేక రాజకీయ విభాగం చాలా చురుగ్గా కు, ఉపకు అస్తిత్వ మంటను, రాజకీయాను ఏ స్థాయికి తెచ్చిందంటే ద్విజు (బ్రాహ్మణు) కానివారు, బిఎస్‌పి తో కానీ, ఎస్‌పితో గాని కవడానికి మీలేనంతగా జాగ్రత్త పడిరది. ఈ పరిస్థితుల్లో చిన్న కులాలు అవినీతిపై, ఆధిపత్య కులానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయడం చాలా కష్టం అవుతుంది. ‘’వీటి ప్రభావాను గురించి ఆలోచిం చాల్సిన సమయం ఆసన్నమైంది. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వాడే భాషనే బిజెపి యేతర ప్రభుత్వాలు కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి.’’ అంటారు ప్రొఫెసర్‌ పాఠక్‌. సామాజిక పునర్నిర్మాణం ఎజెండాగా పని చేయవసిన అవసరం ఉంది. అన్నిటికంటే అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవసి ఉంది. మనం ఇప్పుడు నేరం ఎవరు చేశారనే దాని ఆధారంగా తీర్పు ఇచ్చే కాంలో జీవిస్తున్నామంటారు బరేలికి చెందిన విశ్రాంత విద్యావేత్త, సామాజిక కార్యకర్త ఇనుమూర్‌ రెహమాన్‌. ఒకవేళ దళిత లేక ముస్లిం యువతిపై అఘాయిత్యం జరిగినట్టయితే మీడియా గాని, అధికార యంత్రాంగంలోని అన్ని విభాగాు గాని కేసు నుంచి పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తాయి. ముంబైలో రాజ్‌పుట్‌ హీరో ఆత్మహత్య చేసుకున్నప్పుడు యు.పి లోని చానళ్లన్నీ నిరంతరాయంగా ప్రసారం చేశాయి. కానీ గోండా జిల్లాలో ముగ్గురు దళిత యువతుపై యాసిడ్‌ దాడి జరిగినప్పుడు అదే మీడియావారికి వార్తగా కనబడలేదు. హత్రాస్‌లో జరిగింది కు దురహంకార హత్యగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రదేశాలో వారి ఆత్మగౌరవంపై, మివపై దూషణతో దాడిచేయడం జరుగుతుంది. సెక్స్‌ వర్కర్‌పై అఘాయిత్యం జరిగినా అది అత్యాచారం కిందికే వస్తుంది కదా? కొన్ని శక్తుకు స్వేచ్ఛగా వ్యవహరించే హక్కును కల్పించినట్టుగా కనిపిస్తుంది. వారి కోసం ప్రత్యేకమైన నియమాు రూపొందించబడ్డాయి. హత్రాస్‌, ఉన్నావో ఇతర ప్రదేశాల్లో జరిగే సంఘటను కతపరిచే విధంగాఉన్నాయి. ఇది అధికారాన్ని దుర్వినియోగ పరచడమే. ఇవన్నీ అనాగరికమైన, ఆధిపత్యంతో కూడిన పురుషాధిక్య క్షణాలే. విషపూరిత భావాను, మనుషు మధ్య నిర్మితమైన అడ్డుగోడను, తొగించటానికి మనకు అనేక సంవత్సరాు పట్టవచ్చు. ఈ విధానాు భారతీయ సంస్కృతికి ఎంతో హాని చేస్తాయి. ఈగాయాన్ని మాన్పడానికి సుదీర్ఘకాం పట్టవచ్చు. ఈ సామాజిక క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సి వుంది. ఎందువ్లనంటే హిందూత్వ శక్తు దూకుడు వ్ల నిన్నటి స్నేహితులే నేటి శత్రువుగా మారిన పరిస్థితిని చూస్తున్నాం. చరిత్ర అదే మార్గం చూపుతుంది. కానీ, చరిత్రే అద్భుతాు సృష్టిస్తుందని, మనం నిస్తేజంగా నిరీక్షించలేం. మనం ఎక్కడో ఒకచోట నుంచి ప్రారంభించాలి. హత్రాస్‌ బాధితురాలికి న్యాయం జరగడమనేది మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కు సంబంధమైన తప్పుడు మార్గాను తొగించే కార్యక్రమాకు ప్రాముఖ్యతను పెంచాలి. (‘ఫ్రంట్‌లైన్‌’ సౌజన్యంతో `వ్యాసకర్త : –జియా -ఉస్ -సలామ్ ,అసోసియేట్‌ ఎడిటర్‌)

వ్యాక్సిన్‌ లాభా కోసమా? ప్రజల‌ కోసమా?

‘‘ ఎటు పోతున్నావ్‌ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి, ఫ్లూ, జికా, సార్స్‌, ఎయిడ్స్‌,ఆంథ్రాక్స్‌, కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానంలేదు.కాల‌రెగరేసుకొని పోతున్నావు, కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.’’

దేశంలో కరోనావ్యాధి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నా...ఈవ్యాధి ప్రమాదం సమీప భవిష్యత్తులోనే పొంచి వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా దరిదాపుగా ప్రపంచ దేశాన్నింటికీ సోకింది. మనదేశంలో కరోనావ్యాధి మార్చి 30వ తేదీన తన ప్రయాణాన్ని ప్రారంభించి, డిసెంబర్‌ 19వ తేదీ నాటికి కోటి మందికి సోకింది. క్షా 45 వే మందిని తన పొట్టనబెట్టుకున్నది. కరోనా వ్యాధి వస్తే నయం చేసుకోవడానికి స్పష్టమైన మందు లేకపోవడంతో నివారణే ఏకైక మార్గమని, అందులో వ్యాక్సినేషనే అత్యుత్తమ నివారణ మార్గమని ప్రపంచ ప్రజందరూ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్‌ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఈవ్యాధి నుండి బయటపడవచ్చుననే ఆశతో వున్నారు. రష్యా‘స్పుత్నిక్‌’పేరుతో ఆదేశ ప్రజకు కరోనావ్యాక్సిన్‌ను అందుబాటులో వుంచ డంతోపాటు వివిధ దేశాలో ఈ వ్యాక్సిన్‌ అమ్మకానికి సంబంధించిన ఒప్పందాు కూడా చేసుకుంది. అదేవిధంగా అమెరికాలోని ‘ఫైజర్‌’ కంపెనీ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను ప్రపంచం లోనే మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచ దేశాతోవ్యాక్సిన్‌ అమ్మక ఒప్పం దాను చేసుకుంటూ పోతోంది.మనదేశంలోసిఎంఆర్‌,సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జైడస్‌, డా.రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ లాంటి కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీు కూడా వ్యాక్సిన్‌ అందుబాటు లోకి తేవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఇలా ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ ను అందుబాటు లోకి తేవడానికి ఇప్పటికి దరిదాపుగా 200 కంపెనీు తీవ్రమైన ప్రయత్నాు చేస్తున్నాయి. ఇందులో ఏకంపెనీ కూడా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో వున్నటువంటి ప్రయోగ దశలో ముఖ్యమైన మూడో దశ ప్రయోగాను పూర్తి చేయలేదు. పైగా,తమ వ్యాక్సిన్‌ బాగా పని చేస్తుందని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వాు ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతు కూడా మంజూరు చేశాయి. బ్రిటన్‌, అమెరికా, రష్యా లాంటి దేశాలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలైంది. ఇటీవ కరోనా వ్యాక్సిన్‌పై విపరీతమైన ప్రచారాు ఊపం దుకుంటున్నాయి. అవేమిటంటే అమెరికాకు చెందిన ‘ఫైజర్‌’ అనే బహుళజాతి కంపెనీ తను తయారు చేసిన వ్యాక్సిన్‌ కరోనాను 95 శాతం నియంత్రించగదని ప్రకటించు కుంది. ‘ఫైజర్‌’ కంపెనీ ప్రకటించిన రెండో రోజే 92శాతం కరోనాను నియంత్రించ గలిగిన వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు రష్యా మీడి యాకు సమాచారాన్ని విడుద చేసింది. అయితే ఈవ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ సమా చారం హేతుబద్ధంగా లేదని, నియంత్రించే శక్తిని విశదీకరించే విషయా వివరణు పొందుపరచలేదనే విమర్శు వస్తున్నాయి. ఇప్పుడు‘ఫైజర్‌’కంపెనీ వ్యాక్సిన్‌పై స్పందిం చిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడి కల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ ఈ వ్యాక్సిన్‌ ను-70డిగ్రీ సెల్సియస్‌ దగ్గర భద్ర పరచ వసిన అవసరం వుందని చెప్పారు. దీని నిర్వహణ మన దేశంలో కష్టసాధ్యంగాఉంటుందని, ఆర్‌యన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్ల న్నీ చాలా ఖరీదుతో కూడుకున్నవని స్పందిం చారు. ప్రపంచ జనాభా 780కోట్లు ఉంటే వ్యాక్సిన్‌ శీతలీకరణ సామర్థ్యం 300కోట్ల జనాభాకు మించి లేదు. దీనివ్ల ఈ వ్యాక్సి న్‌ వచ్చినా అందరికీ అందుబాటు లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ‘ఫైజర్‌’ కంపెనీ మన దేశంలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించ కుండానే వ్యాక్సిన్‌ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వా ని భారత ఔషధ నియంత్రణ అధికారుకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవ అపోలో హాస్పిటల్‌ కార్పొరేట్‌ యజమాన్యం10క్ష వ్యాక్సిన్లు ఇచ్చేం దుకు మీగా తమ మౌలిక వసతు సమకూర్చు కుంటున్నా మని ప్రకటించింది. ఈవిధంగా వ్యాక్సి న్‌ తయారీ దశలోనే ఒకవ్యాపార దృక్పథం బట్ట బయు అవుతున్నది. ఇదంతా అము కావడానికి రెండు లేదా మూడు సంవత్స రాు పట్టవచ్చని పువురు వైద్య నిపుణు అంచనా వేస్తున్నారు. రేపు వ్యాక్సిన్‌ బయట కు వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా వుంటుందనేది ఈ పరిణా మాు తెలియజేస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ ఒక భాగమైతే ఈవ్యాక్సిన్‌ ప్రజందరికీ అందు బాటు లోకి తీసుకురావడం మరో ముఖ్యమైన అంశం. ప్రపంచ దేశాల్లో కానీ భారత్‌లో గాని కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ప్రధానం గా నిమగమైనవన్నీ బహుళజాతి కంపెనీలే. రాబోయే కాం కరోనా వ్యాధిదేనని గుర్తిం చినఈకంపెనీన్నీ గత ఆరు మాసా నుండి భవిష్యత్తు లాభా కోసం అయ్రి చాస్తు న్నాయి. లాభాలే పరమావధిగా భావించే బహుళజాతి కంపెనీు ఈవ్యాక్సిన్‌ పేరుతో చేసే వ్యాపారం ప్రజకుశాపంగా మార నున్నదా అన్న అనుమానాు కూడా వస్తు న్నాయి.
ఎందుకో తెలియాంటే…
కరోనా విజృంభణ జరిగిన మే తరు వాత చోటు చేసుకున్న ఓఅంశాన్ని ప్రస్తావించు కుందాం. ఎబోలావ్యాధి నివారణకు వాడిన ‘’గిల్లెడ్‌’’కంపెనీ ‘’రెమిడెసి విర్‌’’ఇంజక్షన్‌ కరోనా నివారణకు మందుగా అమెరికాకు చెందిన బహు జాతి కంపెనీ మార్కెట్‌లోకి విడుద చేస్తూ విపరీ తమైన ప్రకటను గుప్పించింది. తద్వారా ఈ మం దుకు కృత్రిమకొరతను సృష్టించి బ్లాక్‌ మార్కె ట్‌లో అమ్మింది. ఈమందు కోర్సు వాస్తవ ఖరీదు రూ.36మే. కానిబ్లాకులో రూ.క్ష వరకు అమ్మ కం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ‘’సాలిడారిటీ ట్రయల్‌’’లో ప్రకటించినంత నియం త్రణ ఈమందుకులేదని,కేవంతాత్కాలిక ఉపశ మనమే ఇచ్చేలా వుందని, దీన్నిమందు ప్రోటో కాల్‌ జాబితా నుంచి తొగించారు. కానీ బహుళ జాతి కంపెనీకు కొమ్ము కాసే అమెరికన్‌ ఫుడ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డి ఏ)ఈ మందును కరోనా నివారణా మందుగా అనుమతిస్తూ ప్రకటిం చింది.ఈ మందును మన దేశంలో విచ్చవిడిగా చాక్లెట్లు, బిస్కెట్లు మాదిరిగా కార్పొరేట్‌ ఆసుపత్రు ఉపయోగించాయి.
భారతదేశంలో కరోనా విజృంభణ జరు గుతున్న తరుణంలో దీని నివారణ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుని రాష్ట్ర ప్రభు త్వాపై వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాు లాక్‌డౌన్‌ సడలిం పును అదునుగా తీసుకుని పూర్తిగా చేతు ఎత్తేశాయి. ఒక వైపు కేసు పెరిగి వ్యాధి సామా జిక వ్యాప్తి చెందిందని, రెండవ విడత కరోనా వచ్చే అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికను సైతం లెక్క చేయ కుండా పూర్తిగా ప్రజ స్వీయ నియంత్రణకే వదిలేశారు. కరోనా పరీక్షు విస్తృతపరిచే కొదీ కేసు తీవ్రత పెరుగుతున్నట్లు గుర్తిం చినా అందరికీ పరీక్షు చేయానే సూచన ను కూడా పక్కకు పెట్టారు. వ్యాక్సిన్‌ రావడంఆస్యం అవుతుందని తెలిసినా… ప్రభుత్వపరంగా ప్రజకు…మాస్కు ధారణ, చేతు శుభ్రత,భౌతిక దూరం వంటి జాగ్రత్త ు కూడా చెప్పడంలేదు. వాటిని ప్రజ విజ్ఞతకే వదిలేశారు. మరోవైపు విద్యార్థుకు వార్షిక పరీక్ష నిర్వహణ, స్కూళ్లు,కాలేజీు తెరవడంతో వచ్చే పరిణామా కు తగ్గట్లు యంత్రాంగాన్ని వినియోగించడం లోనూ అనేక లోపాు మెగు చూశాయి.
ఇటీవబీహార్‌ ఎన్నికల్లో ఆరాష్ట్ర ప్రజ కు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని బిజెపి ఎన్నిక మ్యాని ఫెస్టోలో ప్రకటించడంతో దేశవ్యా ప్తంగా ప్రతిపక్షాు, ప్రజ నుంచి తీవ్రవ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజందరికీ వ్యాక్సిన్‌ అందిస్తా మని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అయితే దీని ధర రూ.750 వుంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కోవిడ్‌ వ్యాక్సి న్‌ తయారీ, తదుపరి పూర్తిస్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయ వంతంగా ముగించుకుని వచ్చిన వ్యాక్సిన్‌ను ప్రభు త్వమే తమ అజమాయిషీలో అందరికీ ఉచితంగా పంపిణీ చేసే బాధ్యతను చేపట్టాలి. దీనికి అనుగు ణంగా ముఖ్యంగా ప్రభుత్వ రంగ వ్యాక్సిన్‌ కంపె నీను,ప్రభుత్వ రంగమందు కంపెనీను అవసర మైతే ప్రైవేటు కంపె నీను కూడా తమ ఆధీనం లోకి తీసు కుని…అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాకు పంపిణీ అయ్యే విధంగా కోల్డ్‌ చైన్‌ను, రవాణా ఏర్పాట్లను చేయాలి. అప్పుడే వ్యాక్సిన్‌ అందరికీ వీలై నంత తొందరగా అందుబాటు లోకి వస్తుం ది.కానీ ప్రభుత్వ చర్యు ఈవిధంగా లేవు. ‘అంద రికీ వ్యాక్సిన్‌’ ప్రకటనకే పరిమిత మయ్యే విధంగా వున్నది. కరోనా వ్యాక్సిన్‌ ప్రజందరికీ ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తిం చాలి. ఈవ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ, నియంత్రణ, అజ మాయిషీ అంతా ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీ చెప్పుచేతల్లోనే వున్నది. ఈవ్యాక్సి న్‌ రావడంతో కరోనా కట్టడికి ఎంతమేర ఉపయోగపడుతుందో తెలియదుగానీ,వ్యాక్సిన్‌ కార్పొరేట్ల కోసమని స్పష్ట మవుతున్నది.
ఎటు పోతున్నావ్‌ కరోనా…?
‘’ఎటు పోతున్నావ్‌ కరోనా?’’ అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి,ఫ్లూ,జికా, సార్స్‌,ఎయిడ్స్‌,ఆంథ్రాక్స్‌,కరా, పోలియో, ఇంకొన్ని వైరసు ప్రశ్నించాయి. సమాధానం రాలేదు. ‘’కారెగరేసుకొని పోతున్నావు,కొత్త బట్టు కుట్టించుకున్నావు ఎక్కడికి?’’ మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.
‘’రెండో దశకు’’ ధీమాగా చెప్పింది.
‘’మానవుడి గురించి నీకు పూర్తిగా తెలీదు. మేమి ప్పుడు ఊరికే బతికున్నామనే కాని… కూచుంది ఎక్కడో చూశావా?’’. ‘’చూశాను, మసూచి సమా ధిపై!!’’‘’ఇంకొన్ని చిన్న చిన్న సమాధు కనిపిస్తు న్నాయా’’ ‘’అవీ చనిపోయిన వైరసులే’’ ‘’నీక్కూడా సమాధి కడతాడు మానవుడు. అది ఎంతో పెద్దగా ఉంటుంది.అప్పుడు నీసమాధిపైకూచొని మాట్లాడు కుంటాం’’మీరు భయప డుతుంది మానవుడి గురించే, కానీ నా ధైర్య మూ మానవుడే’’ గర్వంగా చెప్పింది కరోనా.
‘’ఎలా?’’ ఒక వైరసు ప్రశ్న.
‘’ఎలాఏముంది,మీకాంలో మనిషికి తెలి సిన సైన్సుతక్కువే, కాబట్టి ఎలాగో బతికి బట్ట కట్టారు. కానిఇప్పుడు ఎంతసైన్సు తెలి సినా కామన్‌సెన్సు పూర్తిగా కోల్పోయాడు మానవుడు’’ కోవిడ్‌ సమా ధానం విని వైరసు న్నీ వెలిగిపోతున్న మొహాతో చూడసాగాయి. ‘’ఓసగటు మానవుడి మాటు వినండి మీకే తొస్తుంది. జనాను కూచోబెట్టి కొన్ని విషయాు చెబుతున్నాడు. అతని మాట నుండి ఇతరులేమి నేర్చుకుంటారో తెలీదు కాని, నాకుకొండంత ధైర్యాన్ని స్తున్నా డు. వినండి’’ ఇది ఎవరినీ భయపెట్టడానికి చెప్పడం లేదు. ఉన్నది వున్నట్టు,నిజాన్ని తొసు కొన్ని జాగ్రత్తగా నడచు కొమ్మని, మసుకొమ్మని సందేశం, సమాచార మివ్వ డానికే చెప్పేది. ఈపాటికే అర్ధమై పోయి ఉంటుంది నేను కరోనా గురించి చెబుతు న్నానని. నిజం. ఆమహమ్మారి మ్లెమ్లెగా ప్రపంచమంతా పాక డం, ప్రభు త్వాను పడగొట్టడం, చావుతప్పి కొంద రికి కన్ను లొట్టపోవడం ఈపాటికే చేసింది. దాని పని అది చేసుకుపోతోంది. మనమే మనం చేయ వసినది చేస్తున్నామా లేదా అని, చేస్తుంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో, చేయక పోతే ఇప్పటి నుండైనా మొదు పెట్టాలి. ఇప్పుడు మనం క్రాస్‌ రోడ్డులో వున్నాం, రహదారి కూడలిలో వున్నాం. ఎటు పోవా లో నిర్ణయించుకోవసింది మనమే. మన తరం కోసం, రానున్న తరా కోసం. ఈ మధ్య ఒకరోజు ఉదయాన్నే కూరగాయు ఇంకొన్ని రేషన్‌ సరుకు తెద్దామని మెయిన్‌ రోడ్డెక్కాను. మూతికి మాస్కు లేకుండా ఆటో నిండా జనం పోవడం కంట పడిరది. ఇక అందరినీ గమనిం చడం మొదు పెట్టాను. నేను మాస్కు పెట్టుకొనే పోయా నన్న విషయం మీకు అర్థమై పోయిం టుంది. కూరగాయ దగ్గర నన్ను రాసు కుంటూ నిబడ్డాడో అసామి. భౌతిక దూరం ఊసే లేదు. మూతికి మాస్కు లేదు. కూరగాయు తీసుకు పోవడానికి చేతిలో సంచిలేదు. ప్లాస్టిక్‌ కవర్లు రెండిరటిలో తీసుకు పోయాడు. పోతూ పోతూ ఒక షాపు దగ్గర ఆగి జనా మీదికి పొగ వచ్చే లాగ మరీ సిగరెట్‌ ఊదేసి మరీ పోయాడు. ప్రతి ఐదు గురిలో ముగ్గురికి మాస్కు లేదు. ఇంతకు ముందు ఎరుపు జోన్‌లో ఉన్న మాప్రాంతం తరు వాత ఆకుపచ్చ జోనుగా మారింది. అప్పుడు అందరూ జాగ్రత్తగానే వున్నారు. మరి ఈ మార్పుకు కారణమేమి? కరోనా భయానికి అవాటు పడ్డారా, కరోనా ఇక రాదనే నిర్ణయానికి వచ్చారా, ఎదో ఒకరోజు ధైర్యంగా చచ్చేదానికి బదు భయ పడు తూ రోజూ చస్తూ బతకాలా అన్న నిర్ణయాని కొచ్చా రా ఇలాఆలోచిస్తూ వస్తున్నాను. అఖి భారత వైద్య సంస్థ, ఎయి మ్స్‌ డ్క్కెరెక్టరు కరోనాకు వ్యాక్సిను 2022లో మాత్రమే రాగద న్నారు. ఈలోగా రష్యా నుండి రెడ్డిల్యాబ్స్‌ వారికి వ్యాక్సిన్‌ వచ్చి నట్టు వీడియో కనిపిం చింది. అదిమూడు దశ వరకే పని చేస్తుందని ఒకఫార్మా మిత్రుడు చెప్పాడు. ఫైజర్‌ కంపెనీది కూడా త్వరలో వస్తుందం టున్నా రు. ఇంకొన్ని ప్రయోగ దశలోవున్నా యని సమా చారం.
ఈలోగా బడు తెరిచారు. కొందరు విద్యార్థుకు, ఇంకొంత మంది ఉపాధ్యాయుకు ఒకరి నుండి ఒకరికి వైరసు సోకిందని సమాచారం. దాదాపు వేయి మందికి వచ్చినట్టు వార్తు. ప్రాణం కంటే విద్యా సంవత్సరం ఎక్కువేమీ కాదని అందరూ చెబుతున్నారు. కొందరు టీచర్లు కరోనాతో మరణించారు కూడా. ఇప్పుడే ప్రభుత్వం, ప్రజు, సామాజిక సేవా సంఘాు, సైన్సు సంస్థు, ఇంకా ప్రజకు మేు చేయాన్న ప్రతి ఒక్కరూ కూచొని అసలైన పరిస్థితిని అంచనా వేయాలి. మహ మ్మారిని దీటుగా ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో అవి చేయాలి. శానిటైజర్లు, హ్యాండ్‌ వాషు, హైపోు, మాస్కు, సబ్బు వ్యాపారాు బాగా పెరిగాయి. వైద్యం కూడా చిన్న వ్యాపారం కానట్లు కోట్లు రాబడు తోంది. ఉచితంగా సమాజ సేవ చేసే వారున్నారు కాని మిగతా వారంతా అలా వుండరుకదా. మందు షాపు వద్దన్నా తెరిచారు. పేకాట రాయుళ్ళు తమ వంతు బాధ్యతగా ఈ కరోనాని సమాజం పైకి వెదజ్లు తున్నారు. ఇక బాధ్యతాయుతంగావున్న యువత ఒకలాగ, ఏదీ పట్టని యువత మాస్కు కూడా లేకుండా తిరగడం చూస్తూనే వున్నాం. పెళ్ళిళ్ళు, పుట్టిన రోజు, ఇతర సంబరాుపెరిగి పోతున్నాయి. నగపై, ఖరీదైన వస్త్రాపైఉన్న ధ్యాస మాస్కు వాడడం,శానిటైజర్లు పెట్టడం లాంటి కనీస జాగ్రత్త ు పాటించడంపై లేదు. ఇంకో వైపు మాల్స్‌ తెరిచారు. సినిమా షూటింగు కూడా మొదు పెడుతున్నారు. రాజకీయ వైరసు పూర్తిగా పట్టిన వాళ్ళు ఎన్నికకై ఆరాటపడుతున్నారు. కొన్ని చోట్ల నిర్వహిం చేశారు కూడా. ఎన్నికల్లో గొపు ఓటము పై వున్న ధ్యాస వాళ్ళకి కరోనా కట్టడిపై లేదు. ఆఎన్నికవ్ల పెరిగిన కరోనా గురించి ఒక్క మాటా చెప్పరు. ఇక ఆర్‌.టి.సి బస్సుల్లో,ఆటోలో పరిస్థితి చూస్తే కరోనాను ప్రపంచంలో లేకుండా చేశామ న్నట్లు కనీస భయం కూడా లేకుండా తిరుగుతు న్నారు జనాు. ఇప్పటిదాకా ఒకఎత్తు. ఇకపై రాను న్న రెండవ దశఒక ఎత్తు. అందుకే మనం జాగ్రత్త గా ఉండాలి. అధికాయి, ప్రభు త్వాు, మునిసి పాలిటీు, పోలీసు చేయ వసిన పని మనం చేయాలి.
-టి.కామేశ్వ‌ర‌రావు/జ‌ంధ్యాల ర‌ఘు. 

భారత్‌ రైతు పోరాటానికి పెరుగుతున్న మద్దతు..!

ప్రాధేయపడే గొంతు పైకి ఉరి విసిరివేయబడుతున్నపుడు కంఠాల ఢంకాధ్వానం చేస్తున్నవి అర్థించే చేతును నిర్బంధించినపుడు పిడికిళ్ళను బిస్తున్నవి. మౌన శ్రమకారు భవితపై ద్రోహపు చట్టా ఖడ్గాు దింపు తున్నపుడు, పాదాు ప్రశ్నలై ముంచెత్తుతున్నవి. పొలా తల్లి కడుపుకోతను భరించలేని నేనేంతా కాంక్రీటు వీధుపై కవాతు చేస్తున్నవి. పచ్చని పైరు హౌరెత్తుతూ యుద్ధ సంగీతాన్ని మోగిస్తున్నవి ఈ దేశ కృషీమ పోరాటం అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నది సమస్త ప్రజ సంఫీుభావమూ బలాన్ని పెంచుతున్నది. ఇది కేవం రైతు సమస్య మాత్రమే కాదు. అన్నము తినే ప్రతి మనిషన్న వాడి సమస్య. దోపిడీదారుకు దోచిపెట్టడాన్ని నివారించేందుకు చేస్తున్న శ్రామికు సమస్య. మెతుకుపై బడాబాబు పెత్తనాన్ని ధిక్కరించే సమస్య. రైతు వ్యతిరేక చట్టాను, మేు చేస్తాయని అబద్ధా ప్రచారాన్ని తిప్పి కొట్టి వాస్తవాను వ్లెడిరచే సమస్య. అందుకే ప్రభుత్వానికి కంటగింపుగా వున్నది. దోపడి దారుకు, వారి ప్రచారకుకు అసహనంగా వున్నది. ఎవరేమి అనుకున్నా న్యాయమైన సమస్యపై నిజాయితీగా సామాన్య రైతు అసామాన్య పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వానేవి ప్రజ భావాను అర్థం చేసుకుని తమ విధానాల్ని మార్చుకోవాలి. లేకుంటే ప్రభుత్వానే ప్రజు మార్చుకుంటారు.

సుమారు 45రోజుగా క్షలాది మంది రైతు ఢల్లీలో ముట్ట‌డించి కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాను,పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన విద్యుత్‌ సవరణ బిల్లులు ఉపసంహరించాని ఆందోళను కొనసాగిస్తున్నారు. నవంబర్‌ 26న ప్రారంభమైన ఢల్లీి పోరాటం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. జూన్‌ 3వతేదీన 3ఆర్డినెన్స్‌ను కేంద్ర క్యాబినేట్‌ ఆమోదించింది. 1.నిత్యావసర వస్తువు నియంత్ర సవరణ చట్టం,2.ఫార్మర్స్‌ ప్రొడ్యూసెస్‌డకామర్స్‌(ప్రమోషన్‌డప్రొటక్షన్‌) ఆగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ ఆస్యూరెన్స్‌ డఫార్మ్‌ సర్వీస్‌యాక్ట్‌,3.ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌డకామర్స్‌ (ప్రమోషన్‌ డఫెసిలిటేషన్‌ యాక్ట్‌) 2020.జూన్‌ 5వతేదీన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఈచట్టాల‌ను మ‌న  రైతు ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరను కోల్పోతారు. మధ్య ధళారీు కార్పొరేట్‌ సంస్థ కలిసి రైతు ఆస్తును కాజేస్తాయి. అభ్యంతరాల‌ వుంటే రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. రాష్ట్రాు ఈచట్టాకు రూల్‌ తయారు చేయాలి. కార్పొరేట్‌ సంస్థు కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ పేరుతో ఎగుమతి ఆధారిత పంటను పండిస్తారు. ఆహార ధాన్యాు దిగుమతు చేసు కోవాల్సి వస్తుంది. చిన్న కమతాను భారీ కమతా ుగా మార్చి యాంత్రీకరణ ద్వారా సాగు చేస్తారు. చివరకు తమ భూములో సన్న,చిన్న కారు రైతు కూలీకి కూడ పనికి రారు. దేశంలో14.57కోట్ల మంది రైతు కుటుంబాలో 85శాతంగా ఉన్న సన్న,చిన్నకారు రైతు భూమి కోల్పోయి ఆస్తులేని వారవుతారు.నైపుణ్యం లేకపోవడంతో పూర్తి ఆదా యాన్ని కోల్పోతారు. ఇప్పటికే 20శాతం సాగు భూమి కార్పొరేట్‌ సంస్థ చేతులోకి వెళ్ళింది. ఈప్రమాదకర చట్టాు50 కోట్ల మంది ఉపాధిని కాజేస్తాయి. అమెరికాలో1.2శాతం ప్రజు, ఇంగ్లాండ్‌లో0.3శాతం ప్రజు మాత్రమే వ్యవ సాయంపై ఆధారపడి ఉన్నారు. కానీభారత దేశం లో48శాతం మంది ప్రజు వ్యవసాయంపై ఆధా రపడి ఉన్నారు. యాంత్రీకరణ వన, భారీ కమ తా వన భారతదేశంలో కూడా వ్యవసా యంపై ఆధారపడిన వారిసంఖ్య సగానికి సగం తగ్గుతుంది. జూన్‌10వతేదీ నుండి ఆర్డినెన్స్‌ కాపీ దగ్దంతో పాటు రాస్తారోకోు, ధర్నాు ప్రతిరాష్ట్రంలో జరి గాయి. ఆగస్టు 12న రాష్ట్రపతికి రైతు ఉత్తరాు వ్రాశారు. డిసెంబర్‌1న మరియు 3వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి రైతు ప్రతినిధుకు మధ్య జరిగిన చర్చు విఫలం కావడంతో వెంటనే నిరసన కార్యక్రమాలు జరిగాయి. తిరిగి 5వ తేదీన మరియు డిసెంబర్‌8న,9న జరిగిన చర్చు కూడా విఫల‌మైనాయి. కేంద్ర ప్రభుత్వం చర్చ కొరకు పంపిన ఎజెండాలో ముఖ్యఅంశాు ఇవి. 

ా వ్యవసాయోత్పత్తు మార్కెట్‌ కమిటీని పునరుద్దరించడం,
ా రాష్ట్ర ప్రభుత్వాు వ్యాపారుకు లైసెన్స్‌ు ఇచ్చే బాధ్యత,
ా అభ్యంతరాపై రైతు సివిల్‌ కోర్టుకు వెళ్ళడం.
ా కాంట్రాక్టు పార్మింగ్‌ ఒప్పందం జరిగిన 30 రోజు లోపు ఆగ్రిమెంట్‌ను యస్‌బియం వద్ద డిపాజిట్‌ చేయడం.
ా కాంట్రాక్టు భూముపై జరిగిన నిర్మాణాను రైతుకు అప్పగించడం.
ా కాంట్రాక్టు ఫార్మింగ్‌ భూముపై కార్పొరేట్లకు హక్కు లేకుండా చేయడం.
ా కనీస మద్దతు ధర మరియు సేకరణ అము జరపడం.
ా ప్రస్తుతం విద్యుత్‌ చెల్లింపు విధానంలో రైతుకు ఎలాంటి మార్పు చేయకపోవడం,

ఢిల్లీ పరిసర ప్రాంతాలో గాలి కాుష్యంపై రైతు కోరిక మేరకు పాటించడంపై 9 సమ స్యను వ్రాతపూర్వకంగా హామీ ఇస్తామని తెలిపారు. చట్టంలో ఉన్నవాటినే అము చేయని ప్రభుత్వం చట్టేతరంగా వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీు అమలు జరుగుతాయా అన్నది రైతు ప్రతినిధు అనుమానించాల్సి వచ్చింది. చట్టాల‌ను అమలు చేయని ప్రభుత్వాలు ఉత్తి హామీతో రైతాంగ ఉద్యమాన్ని విరమింప జేయటానికి చేసే మోసాన్ని గ్రహించిన రైతు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.ఉద్యమం కొనసాగింపుకే నిర్ణయిం చుకున్నారు. ఎన్ని నెలు గడిచినా తాము పోరా టం కొనసాగిస్తామని ప్రకటించడం జరిగింది. డిసెంబర్‌ 12 మరియు 14వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాు జరపాని ఈపోరాట కమిటీ పిుపునిచ్చింది. అందుకు అన్ని రాష్ట్రాలో అన్ని సంఘాు సమాయత్తం అవుతున్నాయి. ఈఉద్య మానికి దేశంలోని 25ప్రధాన పార్టీు దాదాపు 500 రైతు సంఘాు, వ్యవసాయ కార్మిక సంఘాలు,మహిళ,యువజన,ఉద్యోగ,ఉపాధ్యాయ, సామా జిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉద్యమం తో క్రమంగా బిజెపి ఒంటరి అయిపోయింది. బిజెపిని బపర్చిన శిరోమణి ఆకాలిదల్‌ శివసేన, హర్యానలోచి చౌతాపార్టీ, పార్లమెం ట్‌లో చట్టాల‌ను బల‌పర్చిన వైసిపి, తొగు దేశం పార్టీ రైతు కూడా ఉద్యమాన్ని బపరుస్తున్నారు. మేధావులు, కవులు సమావేశాలు జరిపి తమ నిరసనను తెలియ జేస్తున్నారు. ఇప్పటికే కార్మిక వర్గం దేశ వ్యాప్తంగా సంఫీుభావంగా ఆందోళన చేసింది. రానున్న పోరాటాల‌కు కూడా మద్దతు తెలుపుతుంన్నది. చివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడాతో పాటు ఐక్య రాజ్య సమితి ఈ ఉద్యమాన్ని బల‌పరుస్తూ తీర్మానాలు పంపించింది. ఈ మద్దతుతో ప్రపంచంలో మోడీ ప్రభుత్వం ఏకాకీగా మారే పరిస్థితి ఏర్పడుతున్నది. చివరకు అమెరికాలోని రాష్ట్రాలో కూడా ఈ పోరాటానికి మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టకుపోయి చట్టాల‌ను ఉప సంహరించుకోటానికి, విద్యుత్ బిల్లులు ప్రవేశ పెట్టకుండా నిలుపుదల‌ చేయటానికి అంగీకరిస్తూ ప్రకటించలేదు. పోరాటం చేస్తున్న రైతు సంఘాలు అంబాని,ఆదాని ఉత్పత్తల‌ను బహిష్కరించాని పిలుపు ఇచ్చారు. ఇప్పటికే ఈ పిలుపు అమల‌లోకి వచ్చింది. కార్పొరేట్‌ సంస్థల‌కు లాభాల‌ కట్టబెట్టడానికి తెచ్చిన ఈచట్టాల‌కు ప్రతి చోట నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాల వల్ల‌ ఏటా దేశంలో12,600మంది రైతుల‌ ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. తాను ప్రకటించని పంట భీమా,వడ్డీమాఫీ,కిసాన్‌ సమ్మాన్‌,కృషి సించాయి యోజన పథకాతోబాటు మార్కెట్‌ జోక్యం పథకం విఫమైంది. మార్కెట్‌ జోక్యం పథకం కింద దేశ వ్యాప్తంగా రైతుకు మద్దతు కల్పించటానికి 20 20-21సంవత్సరానికి రూ.2,000కోట్లు కెటాయిం చడం గమనిస్తే ఈ ప్రభుత్వానికి రైతుపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా వ్యవసాయ రంగాన్ని ప్రత్యక్షంగా కార్పొరేట్‌ సంస్థల‌కు అప్పగించేదిశగా విధానాు కొనసాగి స్తున్నారు.

ఫెడరల్‌ రాజ్యంగ విధానానికి విరుద్దం
భారత రాజ్యాంగం ‘’ఫెడరల్‌ రాజ్యాంగంగా’’ రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ,దేశ రక్షణ ఎగుమతి, దిగుమతు, విదే శాంగ విధానంకే పరిమితం కావాలి. అడవు, వ్యవసాయం,విద్య తదితర కొన్ని అంశాను కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పెట్టినప్పటికీ ప్రధాన నిర్ణయం రాష్ట్రాలే విధానాు రూపొందించి అమలు చేయాలి. ఇప్పటికే ఫెడరల్‌ రాజ్యాంగానికి విరుద్దంగా పన్ను విధానాన్ని మార్చి ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టీ తెచ్చి రాష్ట్రాను ఆదా యాన్ని దెబ్బకొట్టింది. రిజర్వేషన్‌ ఉన్నటువంటి అంశాను తొగించే ప్రయత్నం చేసింది. విద్యా రంగాన్ని తన చేతుల్లోకి తీసుకోటానికి జాతీయ విద్య విధానం రూపొందించింది. ప్రస్తుతం విద్యుత్‌ శక్తిని కేంద్రం అధీనంలోకి తేవటానికి బిల్లిలు సిద్దంగా చేసింది. వ్యవసాయ రంగం నుండి పూర్తిగా రాష్ట్రా హక్కును తొగించడానికి 3వ్యవసాయ చట్టాల‌ను తెచ్చింది. ఒకేభాషా, ఒకేమతం,ఒకేసంస్కృతి పేరు తో ఫెడరల్‌ వ్యవస్థను విచ్ఛిన్నం చేయపూనుకుంది. అందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని కార్పొరే ట్లకు తాకట్టు పెట్టడానికి సిద్ధ పడిరది.గత6 సంవ త్సరా వ్యవసాయ విధానం వ్ల స్వయం పోషక త్వంగా ఉన్న భారత వ్యవసాయ ఉత్పత్తు రంగం నేడు దిగుమతుపై ఆధారపడిరది.1.40కోట్ల టన్ను వంటనూనొ, 50క్ష టన్ను పప్పు, 40క్ష టన్ను పంచధార,35క్ష బేళ్ళ పత్తి, ముతక ధాన్యా ఉత్పత్తు జీడి పప్పు తది తర వ్యవసాయోత్పత్తును రూ.3క్షకోట్ల మివ గవి ఏటా దిగుమతి చేసుకుం టున్నాం. చివరకు ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకునే దిశకు దేశాన్ని మార్చడానికి ఆహార ధాన్యాల‌కు బదులు ఎగుమతి ఆధారిత పంటు పండిరచటానికి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేయబూను కుంది. ధనిక దేశాల‌ భారత ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి దిగుమతుపై భారత దేశాన్ని ‘’మార్కెట్‌గా’’ చేయబూను కున్నారు. తమపథకంలో 30% విజ యం సాధించడం జరిగింది. దిగుమతు ఏటా 35క్షకోట్లు కాగా ఎగమతు 25క్ష కోట్లు వద్దనే ఉన్నాం. విదేశీ అప్పు భారం పెరగడానికి ఈ దిగుమతు తోడ్పడుతు న్నాయి. 1991లో దేశంలో వ్యవసాయోత్పత్తు స్వయం సమృ ద్దంగా ఉండడమే గాక ఎగుమతు చేసిన పరిస్థితి ఉంది. ఉదాహరణగా 365 క్ష టన్ను పంచాధార ఉత్పత్తి నుండి నేడు 250 క్ష టన్నుల‌కు ఉత్పత్తి తగ్గింది. ఈ విధంగా అన్ని పంట ఉత్పత్తి జరిగింది. అన్నిదేశాలో గిట్టుబాటు ధరు ప్రకటించి రైతు ప్రయోజనాన్ని కాపాడు తున్న విధానానికి విరుద్దంగా కనీస మద్దతు ధర ను ప్రకటించి వాటిని కూడా అము జరపడం లేదు. ఆశాస్త్రీ యంగా నిర్ణయించిన కనీస మద్దతు ధరు రైతుకు పెట్ట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిరది. ఇలాంటి విపత్కర పరిస్థితు లో 3చట్టాను తేవడంతో ప్రభుత్వ‘’కార్పొ రేటీ కరణ నగత్వం’’ బట్ట బయు అయ్యింది. టాటా, బిర్లా,అంబాని,అదాని,ఐటిసి,బేయర్‌ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు అను కూమైన విధానాకు చట్టాను చేయిస్తున్నారు. ఒకవైపున ప్రజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున ప్పటికీ ప్రజ బాగు కొరకే చట్టాను చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. అలాంటప్పుడు ప్రభుత్వం అన్ని పక్షాతో సంప్రదించి చేయవచ్చుగదా? బ్లిుు ఆమోదించేటప్పుడు కూడా మూజు వాణి ఓటుతో బపర్చుకోవడం గమనిస్తే ప్రభుత్వం నియంతృత్వంగా చట్టాను చేస్తున్నది. దీనివ్ల ప్రజ యొక్క కోర్కెను అణగదొక్కడమే తప్ప మరొకటి కాదు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజ ఆకాంక్షకు అనుగుణంగా మూడు చట్టాను ఉపసంహ రించుకోవడంతోబాటు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబోయే విద్యుత్‌బ్లిును ఉపసం హరించు కోవాలి. ప్రతిపక్షాతో, రైతు సంఘా తో మరియు మేధావుతో చర్చు జరిపి వారిఅభిప్రాయం మేరకు విధానాు రూపొందించాలి. కేంద్ర ప్రభు త్వం గతంలో ప్రకటించిన విధానం 2020-22 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి తగు విధానాు రూపొం దించాలి. కనీస మద్దతు ధరు కాకుండా గిట్టుబాటు ధరు కల్పించాలి. ఆహార ధాన్యాను పేదకు సబ్సిడీపై అందించాలి తప్ప,రైతు ఆదాయాన్ని దెబ్బకొట్టరాదు. అన్ని పంటకు మద్దతు ధరు నిర్ణయించాలి. భీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వమే అన్ని పంట ప్రీమియంను చెల్లించాలి.దేశప్రజకు అవస రమైన ఉత్పత్తునుపండిరచే విధంగా ప్రణాళికు రూ పొందించాలి. ఉత్పాదకతను పెంచటానికి పరి శోధన కేంద్రాను అప్‌డేట్‌ చేయాలి. పైకార్య క్రమాను అము జరపటానికి తగు విధానాు రూపొం దించాలి. నిర్భందంతో ప్రజా ఉద్యమా ను అణచడం ప్రభుత్వ ఉనికికే ప్రమాదం.

దేశమంటే? కార్పొరేట్లా-ప్రజలా?
ప్రస్తుతం సాగుతున్న రైతాంగ పోరా టం కేవం వ్యవసాయాన్ని కార్పొరేటీకరించ వద్దన్న డిమాండ్‌కో, కనీస మద్దతు ధర గ్యారంటీ కోసమో పరిమితం కాలేదు. అంతకుమించి నయా ఉదార వాదం ముందుకు తెచ్చిన ఆధిపత్య వాదానికి వ్యతి రేకంగా అది విస్తరించింది. ఈ పోరాటం వెనుక ఏవేవో ‘’కుట్రు’’ వున్నాయంటూ నరేంద్ర మోడీ వినిపి స్తున్న ‘కహానీలు మరింత వేగం పుంజు కుంటున్నకొద్దీ ఈ ఉద్యమం మరింత సమగ్రతను, స్పష్టతను, ప్రతిఘటనను పెంచుకుంటూ సాగుతోంది. ఈ సందర్భంగా ‘’జాతి’’ భావనపై జరుగుతున్న చర్చను నేను వివరిస్తాను. 17వశతాబ్దంలో యూరప్‌లో బూర్జువా వర్గం ఆవిర్భవించిన తర్వా త’జాతి’భావనస్పష్టతను సంతరించు కుంది.19వ శతాబ్దం రెండవ భాగంలో ఫైనాన్సు పెట్టుబడి పైచేయి సాధించాక ఈభావన ఒకప్రత్యేక ప్రాధాన్య తను పొందింది. రుడాల్ఫ్‌ హ్ఫిÛర్‌డిరగ్‌ చెప్పినట్టు ఫైనాన్సు పెట్టుబడి సిద్ధాంతం ‘’జాతి’’ భావనను ఒక గొప్ప ఆదర్శంగా ముందుకు తెచ్చింది. అదే సమయంలో ‘’జాతి’’ అంటే మరో అర్ధంలో ఫైనాన్సు పెట్టుబడిఅని, జాతి ప్రయోజనాల‌ అంటే ఫైనాన్సు పెట్టుబడి ప్రయోజనాు తప్ప వేరేమీ కావని చెప్పింది. వివిధ సామ్రాజ్యవాద దేశాల‌ తమలో తాము పోటీ పడిన సమయంలో ఆయా దేశా లోని ఫైనాన్సు పెట్టు బడు మధ్య పోటీని కాస్తా ఆయా జాతు ప్రయో జనాల‌ మధ్య పోటీగా చిత్రీకరించింది. ఈ విధంగా జాతి అంటే ఫైనాన్సు పెట్టుబడి అనే సిద్ధాంతం పర్యవసానంగా ఆజాతికి ప్రజకు మధ్య సంబం ధాన్ని తెగ్గొట్టింది. ప్రజ కంటే జాతి ఎంతో మిన్న అని, అందుచేత జాతి కోసం ప్రజు త్యాగాు చేయాని, ప్రజకు ఆరోగ్యం కల్పించడం, పౌష్టికాహారం గ్యారంటీ చేయడం వంటి అ్పమైన దైనందిన విషయాను ముందుకు తెచ్చి జాతి యొక్క ఔన్నత్యాన్ని, ఘనతను కించపర చకూడదని, జాతి ప్రయోజనాు ఎంతో ఉన్నతమైనవని ఈ సిద్ధాంతం చెప్పింది. మూడవ ప్రపంచ దేశాలో సామ్రాజ్యవాద వస పానకు వ్యతిరేకంగా విముక్తి కోసం సాగిన పోరాటాలో తలెత్తిన ‘’జాతి’’ భావన ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ సామ్రాజ్యవాదం జాతి వ్యతిరేకమైనదిగా పరిగ ణించబడిరది. అది ప్రజను అణచివేస్తుంది కనుక జాతి వ్యతిరేకమైంది. అంటే ఇక్కడ జాతి అంటే ప్రజు. యూరప్‌లో ఫైనాన్సు పెట్టుబడి ముందుకు తెచ్చిన అర్ధానికి ఇదిపూర్తి విరు ద్ధం.1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో ఆమోదించిన తీర్మానంలో గాని, ఇతర దేశాలోని అదేతరహా పత్రాల్లో గాని ప్రజ జీవన పరిస్థితును మెరుగు పరచడమెలా అన్న దానిపైనే ప్రధా నంగా చర్చ చేశారు. ప్రస్తుతం సాగుతున్న నయాఉదారవాదం ఒకవిధంగా ప్రతీ ఘాత విప్లవం వంటిది. ఇది మూడవ ప్రపంచ దేశాలో యూరో పియన్‌ తరహా ‘’జాతి’’భావనను ముందుకు తేవడమే గాక దానికి ఒకదైవత్వ క్ష ణాన్ని కూడా ఆపా దించింది. ప్రజ కన్నా జాతి ఎంతో గొప్పదని చెప్పింది.కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి ప్రయో జనాలే జాతి ప్రయోజ నాని చెప్పింది. భారత దేశంలో కూడా ఇదే జరిగింది. గతంలో సామ్రా జ్యవాదు మధ్య ఉండిన పోటీ ఇప్పుడు సద్దు మణిగింది కాని ఆనాడు ముందుకు తెచ్చిన జాతిభావన నేడుకూడా ఫైనాన్సు పెట్టుబడికి ఉపయోగ పడుతోంది. కార్పొరేట్లు-ఫైనాన్సు పెట్టుబడి చేతు ల్లో గనుక పెత్తనం పెడితే తద్వారా దేశంలో యావన్మందికీ ఉపయోగపడేలా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నయా ఉదారవాద విధానపు తొలి రోజుల్లో ప్రచారం చేసి చాలామందిని నమ్మించారు. కాని క్రమేణా నయా ఉదారవాద విధానాల‌ సంక్షోభానికి దారితీయ సాగాయి. ఈ పరిస్థితుల్లో పాత పద్ధతిలో నమ్మించడం సాధ్యప డడం లేదు.

ప్రస్తుతం కొనసాగుతున్న రైతు పోరాటం కార్పొరేట్‌-ఫైనాన్సు పెట్టుబడి శక్తు ‘’జాతి’’ భావనను సవాు చేస్తోంది. జాతి అంటే ఆ దేశం లోని శ్రమజీవులేనన్న ప్రత్యామ్నాయ భావనను ముందుకు తెచ్చింది. ఆ మూడు చట్టాూ రైతుకు మేు చేస్తాయని మోడీ చెప్పిన వాదనను పోరాటం తిరస్కరించింది. తద్వారా నాయకుడికి ఏది మంచో బాగా తెసునన్న కార్పొరేట్‌-హిందూత్వ శక్తు కీక వాదనను దెబ్బతీసింది. రైతు ఏం చెప్తు న్నారో వినిపించుకోకుండా, వారితో అర్ధవం తమైన సంప్రదింపు చేపట్టకుండా ఉన్నందుకు చాలా మంది కేంద్రాన్ని విమర్శిస్తున్నారు.
నిరసనపై నిర్బంధం
కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికా రంలోకి వచ్చాక ప్రజావ్యతిరేక విధానాకు తెగ బడిరది. ఎక్కడికక్కడ నిరసనల్ని అణచివేసే కుటి వ్యూహాల్ని అము చేస్తున్నది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కాశ్మీర్‌ని జైుగా మార్చింది. నిరసనకారు చూపుని హరించే బుల్లెట్లని ప్రయోగించింది. ప్లిు,యువకు ఎంతోమంది పోలీసు దాష్టీకం వ్ల కళ్ళు లేని వారయ్యారు. కాశ్మీర్‌లో మానవ హక్కు ఉ్లంఘన మీద ఐక్యరాజ్యసమితి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆందోళన వ్యక్తం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని హరించే వ్యవహార సరళి అంతటితోనే ఆగలేదు. ఈమధ్యన అక్కడి భూముల్ని కొనుగోు చేయడానికి బయటివారిని అనుమతిస్తూ ఉత్తర్వు జారీచేశారు. ఆర్టికల్‌ 370 అములో ఉన్న కాలాన జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని భూముల్ని బయటివారు కొనడానికి వీల్లేకుండా ఉండేది. ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తికి ఆర్టికల్‌ 370అండగా ఉండేది. ఇపుడు ఆనిబంధన లేకపోవడంతో జమ్మూకాశ్మీర్‌లోని అందమైన నేలపై కార్పోరేట్ల కన్నుబడిరది. ఈదుర్మార్గాన్ని నిరసించడానికి వీల్లేకుండా ఎక్కడికక్కడ అరెస్టు, నిర్బంధాల‌, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపా పేరిట అణచి వేతకు ప్పాడటం నిత్యకృత్యమయింది. ప్లినీ, మహిళనీ, వృద్ధునీ సైతం పాశవిక నిర్బంధానికి గురి చేస్తున్నారు. ఈ దారుణాల్ని ప్రశ్నించిన కాశ్మీర్‌ రాజకీయ నాయకుల్ని, కార్యకర్తల్ని జైళ్ళలో పెట్టారు. అయినా కాశ్మీర్‌లో రోజూ ఎక్కడోచోట ఏదో ఒక రూపంలో నిరసనప్రదర్శను జరగడం సాధారణ మైంది. వీటి మీదఅణచివేత అమానుషంగా పరిణ మించిన నేపథ్యంలోనే హక్కు సంఘా వారు, ప్రజాస్వామికవాదు బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యల్ని అభిశంసించారు.
కొనసాగుతున్న ఆందోళను-మహారాష్ట్ర లాంగ్‌
మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి వేలాది మంది రైతుతో కూడిన వాహన జాతా డిసెంబర్‌ 25 నుంచి పోరాటం సాగుతున్న రైతు పోరాట స్థలి షాజహాపూర్‌కు చేరుకుంది. అంతకుముందు జాతాగా వస్తున్న రైతుకు ఎఐకెఎస్‌తో పాటు అనేక ప్రజా సంఘా నేతు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల మేర వాహన జాతా, రెండు కిలోమీటర్ల భారీ ర్యాలీ తర్వాత షాజాహాపూర్‌ వద్దకు చేరుకున్న మహారాష్ట్ర రైతుకు అక్కడి రైతు ఘనస్వాగతం పలికారు. అయితే ఇదే సమయంలో మహారాష్ట్ర రైతుకు పోలీసు అడ్డంకు సృష్టించారు. భారీస్థాయిలో హర్యానా పోలీసు,రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ మోహ రించాయి. పెద్దఎత్తున బారీకేడ్లును ఏర్పాటు చేశా రు. భారీట్రక్కుల్లో మట్టినింపిరోడ్లకు అడ్డంగా పెట్టారు. పెద్దపెద్దరాతి బండను, సిమెంట్‌ దిమ్మ ను ఏర్పాటు చేశారు. (ఎఐఎడబ్ల్యుయు), విపి సాను,నితీష్‌ నారాయన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), ప్రతిభా షిండే (మహారాష్ట్ర)తదితయిఉన్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతు పోరాటం మరింత ఉధఅతమవుతోంది. వేలాది మంది రైతు కొత్తగా వచ్చి ఉద్యమంలో భాగ స్వామ్యం అవుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రా నుంచి వేలాది మంది రైతు వచ్చి ఉద్యమంలో చేరారు. సుమారు 45రోజు నుంచి ఉద్యమం కొనసాగింది. రైతు రిలే నిరా హార దీక్షు కూడా కొనసాగుతున్నాయి.-సాగర్/గుడిపాటి 

Justice K Ramaswamy and Samata judgement

Justice K Ramaswamy, former Supreme Court Judge who passed away on March 6, was popularly known for one of his landmark Judgements known as Samata Judgement that upheld the rights of tribals on their lands in tribal areas. The State government, in a befitting manner, conducted his funeral with all respects to the departed soul.

Samata was a non-governmental organisation that worked for the rights of the tribal people as it found them being alienated from their lands and exploited by non-tribal people and the state, in contravention of the Fifth Schedule of the Constitution and various Central and State government laws. After a prolonged struggle, it approached courts. The case it filed in the then Andhra Pradesh High Court in 1993 against the then State government was dismissed. Then, Samata filed a Special Leave Petition in the Supreme Court. After a four-year legal battle, it won.

Read more

Why India Needs Scheduled Tribes to Educate its Future Judges

The recent five-judge bench Supreme Court judgment in Chebrolu Leela Prasad Rao and Ors v State of AP and Ors, shows us once again how little the 5th Schedule of the Indian constitution which is meant to protect adivasi rights is understood.

The reasoning in the judgment – which struck down an Andhra Pradesh government order from 2000 providing 100% reservation for Scheduled Tribe teachers in Scheduled Areas of the state – moves perilously close to dismantling the entire edifice of the 5th Schedule.

If 100% reservation for teaching jobs is not permissible, the next step will be for someone to argue against the ban on alienation of tribal land, or overturn the Samata judgment prohibiting mining leases being given to non-tribals in 5th Schedule Areas in undivided Andhra Pradesh. After all, both these ‘discriminate’ against non-tribals. As non-adivasis from other districts flood scheduled areas leading to clear demographic change, the clamour to do away with the protective provisions of the 5th Schedule is only getting louder.

Read more
1 2 3