కుదుపేసిన గులాబ్‌ తుఫాన్‌

గులాబ్‌ తుఫాను గజగజా వణికిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లోను ఆరు జిల్లాలను అతలాకుతలం చేసింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు భయపడేలా చేసింది. లోతట్టు కాలనీలను ముంచేసింది. అక్కడి ప్రజలకు నిలువ నీడ లేకుండా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. చాలాచోట్ల గల్లంతైన వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ వ్యాప్తంగా 1.64 లక్షల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది.

ఆంధ్రప్రదేశ్‌ను గులాబ్‌ తుఫాను వణి కించింది. ఆనాటి1990తుఫాన్‌ను తలపిం చింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. జోరుమని వీచే గాలులు.. హోరుమని జోరు వాన..ఇళ్ల నుంచి జనంబయకు రావాలంటనే భయపెట్టింది. కళింగపట్నానికి సమీపంలో తీరం దాటిన ‘గులాబ్‌’ తుపాను రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఒడిశాతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్‌కు ఎక్కువ నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా దాకా కుండపోతగా కురిసిన వర్షాలకు ఆర్గురు బలయ్యారు. అపార ఆస్తినష్టం సంభవించింది. 1.6 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా. తుపానుధాటికి ఉత్తరాంధ్రలో విద్యుత్‌, కమ్యూ నికేషన్‌ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-85 కి.మీ వేగం తో వీచిన ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు, మొబైల్‌ సిగల్‌ టవర్లు పడిపోయాయి. చెట్లు కూలి పోయాయి. జలమయమైన పలుగ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కరెంటు లేక, ఫోన్లు పనిచేయక, సురక్షితమైన మంచినీరు దొరక్క ప్రజలు పడిన అవస్థలు వర్ణనా తీతం. నాగావళి,వంశధార,వేదావతి నదులు పొంగుతుండడంతో వరదలు పొటెత్తే ప్రమాద ముంది.గులాబ్‌ ధాటికి ఒడిశాను అనుకుని ఉన్న ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంలో వజ్రపు కొత్తూరు, సంత బొమ్మాళి బాగా దెబ్బతి న్నాయి. కోవిడ్‌-19మహమ్మారి నుంచి ఇప్పు డిప్పుడే తేరుకుంటున్న ప్రజలను ఇది కోలుకోలేని దెబ్బతీసింది. లక్షకు పైగా ఎకరాల్లో వరి, వేల ఎకరాల్లో మొక్కజొన్న నీట మునిగింది. వేరు శనగ, మిరప, ఉద్యాన పంటలకు కూడా నష్టం వాటి ల్లింది. విద్యుత్‌ వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు ఈ తుపాను దెబ్బకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. పారిశుధ్యం,నీటి సరఫరా వ్యవస్థస్తంభించి పోయిం ది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. గులాబ్‌ విపత్తు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోనే లేదు, మరో తుపాను పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యధిక జనాభా, అంతంతమాత్రమే మౌలిక సదుపాయాలు కలిగిన మన దేశంలో చిన్న విపత్తు కూడా పెద్ద నష్టం కలిగించే అవకాశముంది. దీనికి తోడు తుపానుల స్వభావంలోనూ పెనుమార్పులు చోటుచేసుకుం టున్నాయి.
భూగోళం వేడెక్కడం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావం భయంకర తుపా నుల రూపంలో వ్యక్తమవుతుందని వాతావరణ మార్పుల సదస్సు (ఐపిసిసి) చేసిన హెచ్చరిక సరైన దేనని తాజా తుపాను నిరూపించింది. 2020లో బెంగాల్‌ను కుదిపేసిన ‘అంఫని’, అంతకుముందు గుజరాత్‌ను కకావికలం చేసిన ‘తౌకే’్టలతో పోల్చితే గులాబ్‌ తీవ్రత తక్కువే కావచ్చు. కానీ,ఈ ఉష్ణ మండల తుపాను లక్షణాలు చాలా ప్రమాదక రమైనవి. తేమ, అధిక పీడనాశక్తి కలిగి వుండడం వల్ల ఇవి ఒక్కసారిగా కుంభవృష్టిని కురిపిస్తాయి. గత 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో కురిసిన కుంభవృష్టి ఇందుకొక ఉదాహరణ. 2019లో ఎనిమిది ప్రమాదకర తుపానులు సంభవిస్తే 2020లో అయిదు ప్రమాదకర తుపానులు చోటుచేసుకున్నాయి. వీటి నుంచి పాఠాలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. విపత్తు సంభవించిన తరువాత అరకొర పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఇటువంటి విపత్తుల సమయంలో ఉదారంగా సాయం అందించాల్సిన కేంద్రం ఇది తన బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరి స్తోంది. గతంలో హుదూద్‌ తుపాను సందర్భంగా వెయ్యి కోట్ల సాయం ప్రకటించిన మోడీ ప్రభుత్వం ఆచరణలో రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గులాబ్‌ తుపాను గురించి ప్రధాని ఆరా తీశారే తప్ప బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణా లను మాఫీ చేయడానికి వెంటనే సిద్ధపడే మోడీ ప్రభుత్వం ప్రజలను ఆదుకునే విషయంలో కనీస మానవత్వ స్పందననైనా కనపరచకపోవడం దుర్మార్గం. తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, శిబిరాల నుంచి ఇళ్లకువచ్చినవారికి వెయ్యి రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం ఏమూలకూ చాలదు. తుపా నులు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఆర్థికంగా, సంస్థాగతంగా గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. అలాగే బీమా వ్యవస్థను పటిష్ట పరచడం,పాలనాపరమైన సన్న ద్ధత పెంచుకో వడం,ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం గావించ డం వంటివి చేపట్టాలి. తక్షణం గులాబ్‌ నష్టాలను సమగ్రంగా అంచనా వేసి బాధితులకు ప్రభుత్వం తగు పరిహారం చెల్లించాలి.
కుదిపేసిన గులాబ్‌ :తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగా ఆ తర్వాత అర్ధరాత్రి నుంచే విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మరుచటి రోజు తెల్లవారుజాము నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణాజిల్లాల్లోనూ పలుచోట్ల కుంభ వృష్టి కురిసింది. ఈతుఫాను కారణంగా 277 మండ లాల్లోనూ వానలు పడ్డాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 98మండలాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గంటకు 79 కిలోమీటర్ల నుంచి100కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపో కలకు,విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. విజయనగరం,విశాఖపట్నం జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. రోడ్లు, వంతె నల మీదుగా నీరు పారడంతో వందలాది గ్రామా లకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లతోపాటు విద్యుత్తు సబ్‌స్టేషన్లు, పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వా సుపత్రుల్లోకి వరద నీరుచేరింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. వరద ముంచెత్తడంతో విశాఖపట్నంలో వాహనాలు నీట మునిగాయి. భారీవర్షాలకు విశాఖ పట్నంలో వేల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. సుమారు 10వేల మంది ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మన్యంలో గెడ్డలు పొంగిపొర్లాయి. జిల్లాలో147విద్యుత్తు సబ్‌స్టేషన్లపై తుపాను ప్రభావం చూపడంతో వందల గ్రామాలు అంధ కారంలో చిక్కుకున్నాయి. రైవాడ, కోనాం మినహా మిగతా అన్ని డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీరు కిందకు విడుదల చేస్తున్నారు. ఈదురుగాలులకు గార, శ్రీకా కుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్య లో వృక్షాలు నేలకొరిగాయి. చాలాచెట్లు విద్యుత్తు తీగల పై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూ లాయి. గిరిజనగ్రామాలు జలది గ్బంధంలో ఉన్నాయి. సాలూరు మండలం మామి డిపల్లి ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా నీట మునిగి మం దులు,పరికరాలుఅన్నీ తడిచి పోయాయి. ఈదురు గాలులకు గార, శ్రీకాకుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్యలోవృక్షాలు నేలకొరిగాయి. చాలా చెట్లు విద్యుత్తు తీగలపై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. విజయనగరం జిల్లా నెల్లి మర్ల,గజపతినగరం,పూసపాటిరేగ ప్రాంతాల్లో గరిష్ఠంగా 23.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. వందలాది వృక్షాలు నేలకూలాయి.
తూర్పుగోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు,కాజులూరు,కడియం,రామచంద్రా పురం, అమలాపురం,పి.గన్నవరం,కాకినాడ, రాజమహేం ద్రవరం,మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10 సెం.మీ నుంచి 16 సెం.మీ వానలు పడ్డాయి. రంపచోడవరం- గోకవరం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీవృక్షం నేలకూలడంతో రాక పోకలు స్తంభించాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ నీటిలో నిలిచి పోయింది. స్థానికులు వాగు దాటించారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు, కాజులూరు, కడియం,రామచంద్రాపురం,అమలాపురం, పి.గన్న వరం,కాకినాడ,రాజమహేంద్రవరం,మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10సెం.మీ నుంచి 16 సెం.మీవానలుపడ్డాయి. రంపచోడవరం- గోకవ రం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలు స్తంభిం చాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృ తంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ నీటిలో నిలిచిపోయింది. స్థానికులు వాగు దాటించారు. భారీ వర్షాల ధాటికి విజయ నగరం జిల్లా బొండపల్లి మండలం గదబపేటలో చెట్టుకూలి ఒకరు,తమటాడలో గోడ కూలి మరొ కరు చనిపోయారు. గుర్ల మండలం కోట గండ్రేడు లో ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృత్యు వాతపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి అప్పల నరసయ్య కాలనీలో ఏళ్ల భావన అనే మహిళ మరుగుదొడ్డిలో ఉండగా మరో ఇంటి గోడ కూలి మరుగుదొడ్డిపై పడటంతో ఆమె అక్కడికక్కడే మర ణించింది. సుజాతనగర్‌లో వర్షంతో విద్యుదాఘా తానికి గురై నక్కా కుశ్వంత్‌ కుమార్‌ అనే ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. తుఫాను కారణంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. భారీ వర్షాలతో చెరువులను తలపిస్తోంది. మోకాళ్ల లోతు నీరులోనే ప్రయాణి కులు ఇబ్బంది పడుతూ ఎయిర్‌ పోర్టులోకి చేరుకోవాల్సి వచ్చింది. విశాఖ పట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 750 కి.మీ. మేర ఆర్‌అండ్‌బీ రహదారులు, 50 కల్వర్టు లు దెబ్బతిన్నాయి. బొర్రా- చిమిడిపల్లి మార్గంలోని కేకేలైన్‌లో రైలు పట్టాలపైకి బురద కొట్టుకొచ్చింది. కొత్తవలసలో రైలు పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఎల్‌కోట సమీపంలో కొత్తవలస-కిరండోల్‌ మార్గంలో ఒక లైన్‌ దెబ్బతింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1.57 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 6,465 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. చాలా మండలల్లో పైర్లు బాగా పండాయి..
ఈ ఏడాది మంచి పంట వస్తుందని ఆశించిన సమయంలో గులాబ్‌ కన్నీరే మిగి ల్చింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజ లకు ఆపన్న హస్తం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుం టామని రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరోసారి నిరూపించింది. ఉత్తరాంధ్ర,ఉభయగో దావరి జిల్లాల్లో సహాయ,పునరావాస కార్యక్రమాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేలకొరి గిన వృక్షాలు తొలగించడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు చేర్చడంలో శక్తివంచన లేకుండా పనిచేశారు. ఉత్తరాంధ్రలో గులాబ్‌ తుపాన్‌ బీభత్సం, ఐదుగురు మృతి,ఇద్దరు గల్లంతు
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు
గులాబ్‌ తుపాను వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల రూపాయల పరిహా రాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆయన అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులను ఆదుకు నేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడ్డ బాధితులకు రూ. 1000, సహాయ శిబిరాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే బాధితులకూ రూ.1000 తక్షణమే ఇవ్వాలని చెప్పారు. బాధితుల పట్ల మాన వతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేయాలని నష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకో వాలని ఆదేశించారు.
పంట నష్ట పరిహారాన్ని కూడా సాధ్య మైనంత త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవా లన్నారు. శ్రీకాకుళం నుంచి సిఎస్‌ ఆదిత్య నాధ్‌ దాస్‌ తుపాను అనంతర పరిస్థితులను సిఎంకు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని మిగిలిన చోట్ల అంత తీవ్రత లేదని చెప్పారు. అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయని వాటిని తొలగిం చామని అన్నారు. విశాఖ నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలో సహయ కార్యక్రమాలు ముమ్మరం చేశామని లోతట్టు ప్రాంతాల్లోని వారిని శిబిరాలకు తరలించామని చెప్పారు. ఈ సమీక్షలో విజయనగరం నుంచి మంత్రి బొత్స,శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్‌, విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్‌ పాల్గొని తుపాను పరిస్థితులను సిఎంకు వివరించారు.
ధూళి తుఫాన్‌ :
వాతావరణ మార్పుల నేపథ్యంలో కొత్తగా రూపొందించుకుంటున్నారు. ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని నిలిచే రీతిలో సదుపాయాల కల్పన ఉండాలనే స్పృహ పెరిగింది. కానీ మన దేశంలోని నగరాలు మాత్రం వాతావరణ మార్పు వల్ల కలిగే బీభత్సాలకు తట్టుకుని నిలిచే విధంగా లేవు. ఇటీవల ఉత్తరాదిని తుఫాను అల్లల్లాడిరచిన సందర్భంగా ఈ విషయం మరింత స్పష్టమైంది. మన విధాన కర్తలు దృష్టి సారించవలసిన మరో ముఖ్యమైన అంశం వ్యవసాయ రంగం. ప్రకృతి బీభత్సం వల్ల పంట చేను దెబ్బ తినడాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు. వాతావరణ మార్పు వల్ల రుతువులు గతి తప్పుతున్నాయి. మన దేశాన్ని వాతావరణ మార్పు వల్ల కలిగే ప్రకృతి బీభత్సాలు వెంటాడుతున్నాయనేది తాజా వైపరీత్యాలను బట్టి వీటిని తట్టుకొనే విధంగా మనం సిద్ధపడి లేమని కూడా స్పష్టమైంది. ఈ నెల మొదటి వారంలోనే ధూళి తుఫాను ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో బీభత్సాన్ని సృష్టించింది. దీని నుంచి దేశం తేరు కోక ముందే మళ్ళా గులాబ్‌ తుఫాన్‌ అకాల వర్షం కకావికలు చేసింది. పిడుగులతో కూడిన రాళ్ళ వాన, పెనుగాలలు కలిసి అనేకమంది ప్రాణాలు బలిగొన్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్యం మూలంగా వివిధ రాష్ట్రాలలో భారీగా ప్రాణనష్టం జరిగింది.
ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే రాళ్ళవాన, పిడు గులు పడి 50మందికి పైగా మరణించారు. ఎనభై మందికిపైగా గాయపడ్డారు. చెట్లు విరిగిపడ్డాయి, ఇండ్లు కూలిపోయాయి. ఢల్లీిలోనైతే ధూళి తుఫా నుకు,భారీవర్షం తోడైంది. రాకపోకలు నిలిచి పోయాయి. ఇద్దరు మరణించారు. డ్బ్భై విమానా లను దారి మళ్ళించవలసివచ్చింది. పశ్చిమ బెంగా ల్‌లో పన్నెండు మంది మరణించారు. ధూళి తుఫాను మూలంగా ఉత్తర, పశ్చిమ భారతమంతా ఉక్కిరిబిక్కిరయింది.ఉత్తరప్రదేశ్‌,రాజస్థాన్‌,ఉత్త రాఖండ్‌,మధ్యప్రదేశ్‌,పంజాబ్‌,హర్యానా రాష్ట్రా లలో వంద మందికిపైగా మరణించారు. వంద లాది మంది గాయపడ్డారు. పెనుగాలులు సృష్టిం చిన విలయానికి ఇళ్లు కూలిపోయాయి, చెట్లు పెకిలించుకుపోయాయి, పంటలు దెబ్బతిన్నాయి. రవాణా, విద్యుత్‌ వ్యవస్థలు ఛిన్నాభిన్నమైనయి.
-జిఎన్‌వి సతీష్‌

సంక్షోభంలో రాజ్యాంగ సంస్థలు

‘‘ అసమ్మతి ప్రకటించే వ్యవస్థలు బలహీనపడినప్పుడు రాజ్యం రాజ్యాంగ విధ్వంసం చేస్తుంది. ఆంబేద్కర్‌ మనుస్మృతిని బహిరంగంగా కాల్చి నిరసన తెలిపారు. సంఫ్న్‌ సర్కారుపైకి పొగుడుతూనే లోలోపల రాజ్యాంగాన్ని కాల్చేస్తోంది.’’

రాజ్యాంగం సంక్షేమ సూత్రాల సమాహారం. వీటి ప్రకారం రాజ్య నిర్మాణం,ప్రజాస్వామ్య పాలన సాగుతాయి. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అతిక్రమించరాదు. రాజ్యాంగ,రాజ్యాంగేతర,ప్రజాస్వామ్య, శాసనసంస్థలు ప్రజా సంక్షేమ సంస్థలు. వీటి విధ్వంసం వినాశకారకం. రాజ్యాంగం ఏర్పర్చినవి రాజ్యాంగ సంస్థలు. వివిధ రాజ్యాంగ అధికరణల ద్వారా 20 రాజ్యాంగ సంస్థలు ఏర్పడ్డాయి. అవి: దేశ,రాష్ట్ర ఆర్థిక సంఘాలు (ఎఫ్‌సీ),వస్తుసేవల శిస్తు సంఘం, సమాఖ్య, రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్లు, దేశ,రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఈసీ), కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అటార్నీ జనరల్స్‌, భారత కంట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (సీఏజీ),జిల్లాల, మెట్రొపాలిటన్ల ప్రణాళిక సంఘాలు, అంతర్రాష్ట్ర మండలి,ఎస్సీ,ఎస్టీ,బీసీల జాతీయ కమిషన్లు, ఆదివాసీ ప్రాంతాల, ఎస్టీ, బీసీల అధికార భాష కమిషన్లు, పార్లమెంటు అధికారభాష కమిటి,మైనారిటి భాషల ప్రత్యేక అధికారి. సీఏజీ,ఈసీ,ఎఫ్‌సీ ప్రధాన రాజ్యాంగ సంస్థలు. ప్రభుత్వ కార్యనిర్వాహక తీర్మానాలు, చర్యల ద్వారా రాజ్యాంగేతర సంస్థలు ఏర్పాటవుతాయి. ఇవి:భారత రూపాంతర జాతీయ సంస్థ (నిటి ఆయోగ్‌), జాతీయ అభివృద్ధి మండలి,జాతీయ,రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ),కేంద్ర నిఘా సంస్థ(సివిసి),జాతీయ లోక్పాల్‌,రాష్ట్ర లోకాయత్‌లు,కేంద్ర,రాష్ట్ర సమాచార కమిషన్లు.
శాసన,కార్యనిర్వాహక,న్యాయవ్యవస్థలు ప్రజాస్వామ్య సంస్థలు. మాధ్యమాలను ప్రజాస్వామ్య నాల్గవ స్తంభంగా పరిగణిస్తారు. ఇవి రాజ్యాంగ సూత్రాల అమలులో, ప్రజాస్వామ్య నిర్మాణ, నిర్వహణల్లో కీలక పాత్ర పోషిస్తాయి. శాసనవ్యవస్థ,రాజ్యాంగ పరిధిలో చట్టాలుచేసే అతిశక్తివంతమైన ప్రజాప్రతినిధుల వేదిక. వ్యవహారాలు చట్టబద్దంగా, లావాదేవీల లాభార్జన న్యాయసమ్మతంగా ఉండాలి. పౌరప్రయోజనాలు పరిరక్షించబడాలి. వ్యాపార లాభాలను సమాజ ప్రయోజనానికి వాడాలి. కార్యనిర్వాహక సంస్థ రాజకీయ ప్రతినిధులు సమాజాన్ని శాసించరాదు. సమాజ నిర్మాణాన్ని, పనితీరును నియంత్రించరాదు. రాజ్యాంగం సమాఖ్య సూత్రాలను పొందుపరిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధులను నిర్వచించింది. కార్యనిర్వాహకులు సమాఖ్య పరిధి, పరిమితులు దాటరాదు. చట్టాలు రాజ్యాంగ పరిధిలో ఉండేలా చూడటం న్యాయవ్యవస్థ బాధ్యత. రాజ్యాంగ వ్యతిరేకత, పాలన అక్రమాలను ప్రశ్నించడం, న్యాయవిరుద్ధ చట్టాల నుండి ప్రజారక్షణ, వివాద పరిష్కారం న్యాయవ్యవస్థ రాజ్యాంగ అధికారాలు. వైద్య విజ్ఞాన శాస్త్రాల అఖిల భారత సంస్థ ఎఐఐఎంఎస్‌,భారతీయ వజ్రాల సంస్థ,భారత చలనచిత్ర,దూరదర్శన్‌ సంస్థ(ఎఫ్‌.టి.ఐ.ఐ),జాతీయ అధికార శిక్షణ, బొగ్గు నిర్వహణ భారతీయ సంస్థ, భారత రిజర్వు బ్యాంకు,రైల్వే,పెట్రోలియం సంస్థలు సమాఖ్య ప్రభుత్వ భాగస్వామ్య చట్టబద్ద సంస్థలలో కొన్ని.
ఇప్పుడు ఈ సంస్థలన్నీ సంఫ్న్‌ భావజాల వ్యక్తుల చేతుల్లో బందీలు.గతంలో ప్రగతిశీల కాంగ్రెసీయులు, గాంధీయన్లు, సోషలిస్టులు, వామపక్షవాదుల ఆధ్వర్యంలో నడిచేవి. వారు ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునేవారు. తెరవెనుక ఏంచేసినా వేదికలపై నీతి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడేవారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు జంకేవారు. నేటి సంఫీుయ అధికారులకు సిగ్గు ఎగ్గు లేవు. వైదిక హైందవ ఆర్య బ్రాహ్మణత్వ ఆధిపత్య రూపాలలో సంస్థలను నడుపుతున్నారు. ఆర్థిక సంఘాలు పాలక అనుకూల ప్రతిపాదనలు చేస్తున్నాయి. వస్తుసేవా శిస్తు వ్యవస్థ కరోనా కాలంలోనూ, టీకాలకు కూడా పన్నులు తగ్గించలేదు. రాష్ట్రాల వాటాలను ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్లు పాలక పక్షపాతంగా పనిచేస్తున్నాయి. అటార్నీ జనరల్స్‌ ప్రజా వ్యతిరేకంగా వాదిస్తున్నారు. వలసకార్మికులకు, కోవిడ్‌ చావుల అనాథలకు ఆర్థిక సాయంలో మానవత్వరహిత వాదనలు చేశారు. సీఏజీ ముందస్తు స్పందన, ప్రతిస్పందనల బాధ్యతలను మరిచింది. ప్రభుత్వ న్యాయవాదులు ప్రజాపక్షం కాక ప్రభుపక్షం వహించారు. ప్రణాళిక మండళ్లకు పాలకుల మాటే ప్రణాళిక. అంతర్రాష్ట్ర మండలి సంఫ్న్‌ పాలిత రాష్ట్రాల పక్షపాతిగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఘాలను ప్రభుత్వం పట్టించుకోదు. లక్షద్వీప్‌ పాలనాధికారి చట్టాలు ఉల్లంఘనలకు ఉదాహరణలు. అధికార భాషాసంఘం, మైనారిటి భాషల అధికారి ఉనికి కోల్పోయారు. ప్రతిచోటా సంస్కృతాన్ని రుద్దుతున్నారు. ప్రజల మాతృభాషలను మాతృభాషలు చేస్తున్నారు. నిటి ఆయోగ్‌, అభివృద్ధి మండలి ప్రయివేటీకరణకు మద్దతు ఇస్తున్నాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరెట్‌, మానవ హక్కుల కమిషన్లు, నిఘా, సమాచార సంఘాలు పాలకుల జేబు సంస్థలుగా మారాయి. న్యాయస్థానాల పోరుపడలేక, అధికారం చేపట్టిన ఆరేండ్లకు, కోరలులేని పాములాంటి లోక్పాల్‌ను నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశించినా మోడీ గుజరాత్‌ లోకాయత్‌ను నియమించ లేదు. ఆ పనిచేసిన మహిళా గవర్నర్‌ను ముప్పుతిప్పలుపెట్టి ఇంటికి పంపేదాకా నిద్రపోలేదు. పదుల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి ఆ నియామక రద్దుకు కోర్టుల్లో దావాలు నడిపారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి రక్షకులెవరు? ప్రజాస్వామ్య చట్టబద్ద సంస్థలు కూడా పాలక పక్షానికి వంతలుగా మారాయి. రాజ్యాంగ సంస్థల విచ్ఛిత్తితో ప్రజలకు రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య మానవత్వ హక్కులు నిరాకరించబడుతున్నాయి.
పార్లమెంటు కమిటీలను నియమించ కుండా ప్రతిపక్షాలను బెదిరించి, భ్రమపెట్టి, ఆశపెట్టి, బయటకునెట్టి ఏకపక్షంగా చట్టాలు చేశారు. రాష్ట్రాల జాబితాల్లో చొరబడ్డారు. కరోనా కాలంలో ప్రత్యామ్నాయ పక్షాలు, ప్రజా సంఘాలు నిరసన తెలుపలేని స్థితిలో, అవకాశ వాదంతో రాజ్యాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలు చేశారు. పౌరసత్వ సవరణ, కొత్త విద్య, కార్మిక, వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలు వీటిలో కొన్ని. 40మంది సంఫ్న్‌ గూండాలు 11.8.21న రాజ్యసభలో ప్రవేసించి మహిళా ఎంపీలపై దౌర్జన్యంచేసి బీమా చట్టం ఆమోదించుకున్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ ముందెన్నడూలేనంత పక్షపాతంగా వ్యవహరిస్తోంది. కోర్టు తీర్పులూ సంఫ్న్‌ పాలకులకు అనుకూలంగా ఉన్నాయి. 5, 7 మంది న్యాయమూర్తుల ధర్మపీఠాల్లో కూడా అసమ్మతి నమోదుకాదు. న్యాయం ఏకపక్షంగా మారింది. అయోధ్య, రాఫెల్‌, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల తీర్పులు వాటిలో కొన్ని. ‘’కోర్టుల్లో మా అనుకూల తీర్పులు యాధృచ్ఛికంకాదని’’ బీజేపీ ప్రముఖ నాయకుడే అన్నారు. అనుమాన న్యాయమూర్తులను హత్యచేసే రాజకీయ స్థితి దాపురించింది. పూర్వ ప్రధాన న్యాయమూర్తి బాబ్డే రెండు రోజుల్లో రిటైర్‌ అవుతారనగా న్యాయమూర్తుల తీరు మారింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రమణ వ్యాఖ్యానాలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. కాని కొట్టినవారిని శిక్షించకుండా కొట్టిన విధానం మంచిదికాదు, వాడిన ఆయుధం సరైంది కాదన్నట్లు ఉంది. చట్టాల రద్దు ప్రతిపాదించకుండా వాటి దురుపయోగాన్ని ఎత్తిచూపి లాభం లేదు. 70శాతం మీడియా ప్రభుత్వ రాజకీయ-వాణిజ్య భాగస్వామి ముకేశ్‌ అంబానీ సొంతం. మిగిలిన మీడియా సంఫ్న్‌ సంస్థల యాజమాన్యంలో, ప్రభుత్వ మీడియాగా పనిచేస్తోంది. స్వేచ్ఛా స్వాతంత్రాలు, సమానత్వం, ప్రజాభిప్రాయం, సంక్షేమం, పౌర, మానవ హక్కుల పట్ల ప్రభుత్వ ఉల్లంఘనలను ఈ మీడియా ఎత్తిచూపదు. సమర్థిస్తుంది.
అసమ్మతి ప్రకటించే వ్యవస్థలు బలహీనపడినప్పుడు రాజ్యం రాజ్యాంగ విధ్వంసం చేస్తుంది. ఆంబేద్కర్‌ మనుస్మృతిని బహిరంగంగా కాల్చి నిరసన తెలిపారు. సంఫ్న్‌ సర్కారుపైకి పొగుడుతూనే లోలోపల రాజ్యాంగాన్ని కాల్చేస్తోంది.
-ఎస్‌.హనుమంతరెడ్డి

దిశ చట్టం ఉన్నా..ఆగని అఘాయిత్యాలు

‘‘ దిశ యాప్‌ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు 7రోజుల్లోపే చార్జిషీట్‌ దాఖలు చేశారు. దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ముగ్గురు దోషులకు ఉరి శిక్ష, 25 మందికి జీవిత ఖైదు పడిరది. దిశ కేసుల దర్యా ప్తునకు అవసరమైన సాంకేతిక ఆధారాల కోసం తిరుపతి,విశాఖపట్నం,మంగళగిరి లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.’’

రెండు సంవత్సరాలుగా ప్రేమించి అక్టో బర్‌ నెలలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అను మానంతో విజయనగరం జిల్లాలో తగలబెట్టా డొకడు. అభం శుభం తెలియని దళిత చిన్నారిపై గుంటూరులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు వరుసకు మామ అయిన ప్రబుద్ధుడు. దిశ చట్టం అమలు గురించి ఎంతో ఆర్భాటంగా చెప్పుకునే రాష్ట్రంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అంద రూ చూస్తుండగా ఇంజినీరింగ్‌ చదువుతున్న రమ్య అతిదారుణంగా హత్యకు గురికావడం అందరిని కలచివేసింది. నిర్భయ, దిశ,అశ్లీలతవ్యతిరేక చట్టాలు ఎన్ని వచ్చినా అమ్మాయిలపై అఘాయి త్యాలను, ప్రేమోన్మాదుల దాడులను,యాసిడ్‌,లైంగిక దాడు లను నివారించ లేక పోతున్నాయి. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గ్రహిస్తే మంచిది. రోజు రోజుకు పేట్రేగిపోతున్న అశ్లీల సినిమాలు,సాహిత్యం, ప్రకటనలను ప్రభు త్వాలు కట్టడి చేయలేక పోతు న్నాయి. కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాయి తప్ప చేసిందేమీ లేదు. దిశచట్టం అమలులోకి వచ్చిన సంవత్సరంలోనే దాదాపు ఆరుగురు ఇంజి నీరింగ్‌ చదివే అమ్మా యిలు హత్యకు గురయ్యా రంటే…వార్తల కందని, నిరక్ష రాస్యులైన మహిళలు ఎందరో ?
మహిళలపై హింస అనేది సామాజిక, ఆర్థిక, అభివృద్ధి…విద్య,మానవ హక్కులు,చట్టాలు, ఆరో గ్యానికి సంబంధించిన సమస్య. మహిళలపై హిం సకు మానసిక అనారోగ్యానికి మధ్య గల సంబం ధాన్ని తగినంతగా పరిశోధించలేదు. ఇంట ర్నెట్‌ పుణ్యమా అని పోర్నోగ్రఫీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంది. కరోనా పుణ్యమా అని అన్ని ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న ఈ తరుణంలో సమస్య విపరీతంగా పెరిగిపోయింది.భారతదేశంలో ప్రత్యే కంగా ఏచట్టంలోనూ అసభ్యత, అశ్లీలత నిర్వ చించ బడలేదు. కానీ భారతీయ శిక్షాస్మృతి-1860, సమాచార సాంకేతిక చట్టం-2000 ప్రకారం… అశ్లీలత,అశ్లీలతతో కూడిన వాటిని ప్రచురించడం, ప్రసారం చేయడం…అసభ్యకర, అశ్లీల వస్తువులను విక్రయించడం వంటివి శిక్షార్హమైన నేరాలు. మహి ళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారా లను, లైంగిక దాడులను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం దిశ చట్టాన్ని రూపొందించింది. అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో14రోజుల్లోనే విచా రణ పూర్తి చేసే విధంగా ఈచట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం 21రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా, చుట్టూ ఉన్న సమాజం, మనుషులలో మార్పు రానిది ప్రయోజనం లేదు. ఈ రోజు సామజిక మాధ్యమాల ద్వారా మంచి కంటే చెడును ఎక్కువ ఆకళింపు చేసుకొని ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఉపాధి లేకుండా యువతను నిర్వీర్యం చేసిన ఘనత మన పాలకులది. ఇంజినీరింగ్‌ చదివిన వారిలో తొంభై ఐదుశాతం మందికి ఉద్యోగాలు లేవు. ప్రయివేటు రంగంలో పనిచేసే వారికి అరవై శాతం మందికి జీతాలులేవు. తొంభైశాతం ప్రజలు అభ ద్రతా భావంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న సమయం లో ఇలాంటి దారుణాలకు కొదవ లేకుండా పో యింది. ప్రజలకు నాణ్యమైన విద్య,సంస్కృతి,మాన వ విలువలు,పర్యావరణం,మంచి ఆరోగ్య ఆహార పు అలవాట్ల గురించి చెప్పే విద్యాసంస్థలు కరువ య్యాయి. కేవలం డబ్బే పరమావధిగా కార్పొ రేట్‌ కళాశాలలు, విద్యా సంస్థలు ఏర్పడి నడుస్తు న్నాయి. వీటి మాయాజాలంలో పడిన తల్లిదండ్రులకు సమాజం గురించి పట్టడం లేదు. తమ పిల్లలకు మంచి ప్లేస్‌మెంట్‌ వచ్చి ఎక్కువ డబ్బు సంపాదిస్తే చాలు అనుకునేలా తయారవుతున్నారు. పరిస్థితులు ఈ విధంగా ఉన్నంతవరకు మహిళలపై దాడులను అరికట్టడం అంత సులభం కాదు.
మహిళల రక్షణలో ‘దిశ’ మారదు
మహిళలు, బాలికలకు రక్షణ కవచం లా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ‘దిశ’ నిర్దేశంలో మార్పులేదని మరోసారి రుజువైంది. హైదరాబాద్‌ లో దిశ ఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అటు వంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం2019 డిసెంబర్‌ 13న అసెంబ్లీలో, డిసెంబర్‌ 16నమండలిలో దిశ బిల్లును ఆమో దించి 2020 జనవరి 2నచట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆబిల్లుపై కేంద్రం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటికే దిశ చట్టాన్ని తెచ్చేందుకు రాజీలేని వైఖరితో ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దిశ చట్టం` 2019 (పాతబిల్లు)ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం-2020 (కొత్తబిల్లు)ని శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించింది.ఈ నేప థ్యంలో ఆంధ్రప్రదేశ్‌ దిశ (మహిళలు, బాలలపై జరిగే నేరాలపై విచారణకు ప్రత్యేక న్యాయ స్థానాలు)చట్టం-2020కి ప్రభుత్వం మరింత పదును పెట్టింది. అసెంబ్లీ,మండలి ఆమోద ప్రక్రి య పూర్తి కావడంతో ఈ బిల్లును రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254(2)ప్రకారం గవర్నర్‌ పరిశీలన అనం తరం వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు.
ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు
ా దాదాపు ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ కచ్చితంగా అమలు చేయాలంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడానికి ముందు నుంచే ఏపీలో ఈ విధానం అమల్లో ఉండటం విశేషం. చట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది.
ా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 దిశ పోలీస్‌ స్టేషన్లలో 18 కస్టమైజ్డ్‌ బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లోని ప్రత్యేక పరికరాలతో సాంకేతిక సిబ్బంది నేర స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు.
ా ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు సత్వర సహాయం అందించేలా ఆవిష్కరించిన దిశ యాప్‌ను ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గత 8 నెలల్లో 98,380 మంది ఎస్‌ఓఎస్‌ ద్వారా పోలీసుల సహాయం కోరారు.
ా దిశ యాప్‌ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు 7 రోజుల్లోపే చార్జిషీట్‌ దాఖలు చేశారు. దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ముగ్గురు దోషులకు ఉరి శిక్ష, 25 మందికి జీవిత ఖైదు పడిరది.
ా దిశ కేసుల దర్యాప్తునకు అవసరమైన సాంకేతిక ఆధారాల కోసం తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.
ా రాష్ట్రంలో11 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే 700 పోలీస్‌స్టేషన్లలో ఉమెన్‌ స్పెషల్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. దిశ బిల్లులో ప్రస్తావించిన అనేక విషయాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 4 అవార్డులు వచ్చాయి.
దిశ బిల్లులో ప్రధానాంశాలు..
్చ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)- 1860,క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌(సీపీసీ)- 1973లను ఉపయోగిస్తారు.
్చ ఐపీసీ సెక్షన్‌ 326ఎ,326బి,354,354ఎ, 354బి,354సి,354డి,376,376ఎ, 376బి,376ఎబి,376సి,376డి, 376డిఎ,376డిబి,376ఈ,509లతో పాటు పోక్సో యాక్ట్‌, కేంద్ర చట్టాల్లోని పలు సెక్షన్లపై కేసు నమోదు చేస్తారు.
్చ 18ఏళ్లలోపు బాలబాలికలపై లైంగిక దాడులు,అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్‌ 14న కేంద్రం పోక్సో యాక్ట్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫ్‌న్సెస్‌ యాక్ట్‌ -పీఓసీఎస్‌ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టంపరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది.
్చ జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది.
్చ కేసుల నమోదుకు ఆన్‌లైన్‌ విధానం అమలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడే వారి వివరాలు అపరాధుల రిజిష్టర్‌ (ఆన్‌లైన్‌ విధానం)లో నమోదు చేస్తారు.
్చ వేగంగా దర్యాప్తు పూర్తి చేసేలా ప్రతి జిల్లా స్థాయిలో ఒక డీఎస్పీ నేతృత్వంలో పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు.
్చ బాధిత మహిళకు సత్వర న్యాయం జరిగేలా, దోషులకు వేగంగా శిక్షలు అమలు చేసేలా ఈ కేసుల కోసం ప్రతి జిల్లాలో ఒకటి, అంతకంటే ఎక్కువగా ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీటిలో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)ను కూడా నియమించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం- 2019
నిర్భయ (2012), ఉన్నావ్‌ (2017), దిశ (2019)..నేరాలతో దేశం ఉలిక్కిపడిరది. భవిష్యత్తులో ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలను పకడ్బంధీగా అమ లుచేసే చట్టాలు ఉండాలి. ఆలస్యంగా దొరికిన న్యాయం అన్యాయంతో సమానం అంటారు. ఎందరో నేరస్తులు భారతీయ శిక్షాస్మృతిలోని లొసు గులను అవకాశాలుగా తీసుకుని దర్జాగా తప్పించు కుంటున్నారు. బాధితులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం దొరకని సంద ర్భాలు కోకొల్లలు. వీటన్నింటి దృష్ట్యా న్యాయ విచా రణ ప్రక్రియ వేగవంతం చేయాలని, నేరానికి పాల్ప డ్డ వ్యక్తులకు సత్వర శిక్షను అమలు చేసే ఉద్ధేశ్యంతో రూపొందించిందే దిశ యాక్ట్‌-2019 .
ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే…?
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ డిసెంబర్‌ 13,2019 ఆమోదించింది.డిసెంబర్‌ 16న శాసన మండలిలో దిశ బిల్లును ఆమోదించి.2020 జనవరి2న చట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంప డం జరిగింది.రాష్ట్రపతి ఆమోదముద్రవేస్తే ఆంధ్ర ప్రదేశ్‌ క్రిమినల్‌ లా (సవరణ)చట్టం-2019 (ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌), ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగెనెస్ట్‌ వుమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019 అమలుకు మార్గం సుగమం అవుతుంది. ఈచట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష ఖాయం.
ఈ చట్టం ఎలా వచ్చిందంటే…?
తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్‌ శివార్లలో 2019,నవంబరు 27నజరిగిన వెటర్నరీ డాక్టర్‌ దిశ గ్యాంగ్‌ రేప్‌,హత్య ఘటనతో దేశం షాక్‌కి గురైంది. మహిళల భద్రత మీద మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఆందోళన దేశమంతా మొదలైంది. దేశంలో మిగతా రాష్ట్రాలు స్పందించక పోయినా..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే ‘దిశ’ పేరుతో ఓ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. దిశ దుర్ఘటన వంటి నేరాలు మునుముందు జరగకూడదని, నేరం చేస్తే కఠిన శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని, మహిళలపై, పిల్లలపై అఘా యిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుం దని,బాధితులకు సత్వరన్యాయం చేయాలనే ఉద్ధే శ్యంతో వచ్చిందీ చట్టం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా దేశమంతా ప్రశసంలు పొందిందీ చట్టం.
ఏపీ దిశచట్టం, ప్రత్యే క కోర్టుల ఏర్పాటు చట్టాల్లోని ముఖ్యాంశాలు:
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిర్భయ చట్టం ప్రకారం నిర్భయ కేసులో దోషికి జైలు,మరణ దండ న శిక్షగా విధిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ ‘దిశ’ చట్టం దోషికి కచ్చితంగా మరణదండన విధిస్తోంది. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండునెలల్లో శిక్ష పడాలి. అంటే మొత్తం4నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తి కావాలి. కాని ఏపీ దిశ చట్టంలో దానిని 4 నెలల నుంచి 21రోజులకు కుదించారు. లైంగికదాడి నేరాల్లో స్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించి నట్టయితే.. వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తయి 21 రోజుల్లోపే దోషికి శిక్ష పడుతుంది. ఈచట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా జీరో ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. 18 ఏళ్లలోపు బాల బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్‌ 14న కేంద్రం పోక్సో యాక్ట్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫ్‌న్సెస్‌ యాక్ట్‌ -పీఓసీఎస్‌ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభు త్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టం పరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నా రులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది. జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలకు పాల్పడినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో శిక్ష అవు తుంది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది. లైంగిక దాడి సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘పోక్సో’చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులకు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. మహిళలు,చిన్నారులపై లైంగిక దాడు లు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)-1860, క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌(సీపీసీ)-1973లను ఉపయోగి స్తారు.సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధిం చడం,వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాం టివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. అందుకు ప్రత్యేకంగా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో అదనంగా 354(ఇ),354 (ఎఫ్‌) అనే కొత్త సెక్షన్లను చేర్చారు.

 1. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354(ఇ)
  మెయిల్స్‌, సోషల్‌మీడియా, డిజిటల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్ల జైలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష
 2. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354 (ఎఫ్‌)
  పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే పదేళ్ల నుంచి నుంచి 14ఏళ్ల వరకూ శిక్ష. నేరం తీవ్రతను బట్టి 14ఏళ్ల నుంచి జీవిత ఖైదువిధిస్తారు. పోస్కో చట్టం కింద ఇంతవరకూ 3 నుంచి 5ఏళ్ల వరకు జైలుశిక్ష అమలౌతుంది.ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రం లోనూ మహిళలు,పిల్లలపై నేరాల సత్వర విచార ణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేవు. కొద్ది రాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. కాని, దేశ చరిత్రలోనే తొలి సారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు అదికూడా వేగంగా విచారణ ముగించడానికి వీలుగా 13జిల్లాల్లో ప్రతిజిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కోర్టుకూ ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని నియమించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు. అత్యాచారం, సామూ హిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, సోషల్‌ మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధిం చడం వంటి నేరాలు,పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి వస్తాయి. నింది తులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా లేదా స్పష్టమైన ఆధారా లున్నా తక్షణమే మరణశిక్ష విధించేలా చట్టం చేశారు. అందుకనుగుణంగా సెక్షన్‌ 376 (రేప్‌)కి సవరణ చేశారు. జడ్జిమెంట్‌ పీరియడ్‌ను కూడా 4 నెలల నుంచి 21 రోజులకు కుదించి, విచారణ 7 రోజుల్లో,ట్రయల్‌ 14రోజుల్లో పూర్తి చేసి 21 రోజుల్లో నిందితులకు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటారు. క్రిమినల్‌ ప్రొసీజరల్‌ యాక్ట్‌ 173, 309కి మార్పులు చేశారు. చిన్నారుల మీద దాడులు,లైంగిక వేధింపుల విషయంలోనూ కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు… దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవ రణ చేశారు. పోస్కో యాక్టు ప్రకారం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. దానిని కూడా మార్చి జీవితఖైదు విధించేలా చట్టం చేయడం జరిగింది. ఇక ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ఆరునెలల కాలాన్ని, ఏపీ పరిధిలో 3 నెలలకు తగ్గించారు. మహిళలు, పిల్లలపై నేరాలను నమోదుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్‌ రిజిస్ట్రీని పెట్టింది. అయితే, ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్‌ పద్దతిలో డేటా బేస్‌ ఉన్నప్పటికీ జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తులపేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే,ఏనేరగాడు,ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాని, అటువంటి డిజిటిల్‌ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరా లకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలం దరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు.చట్టం ముందే కాకుండా సమాజం ముందు వారిని నిలబెడతారు.
  దిశ మొబైల్‌ యాప్‌
  మహిళా భద్రత కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం తేవడంతోపాటు దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. మహిళలపై వేధింపులకు పాల్పడితే దోషులను సత్వరం శిక్షించేందుకు క్రిమినల్‌ జస్టిస్‌ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసింది.విశాఖపట్నం,విజయవాడ, తిరు పతిల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా విపత్కర పరిస్థితులు ఎదురైతే తక్షణ పోలీసు సహాయం పొందేందుకు‘దిశ మొబైల్‌ అప్లికేషన్‌’ను ప్లే స్టోర్‌లో అందుబాటలోకి తెచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ యాప్‌ను ఫిబ్రవరి8,2021న అధికారికంగా ప్రారంభించించారు.
  ఎందుకు?
  విద్యార్థినులు, యువతులు, మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఎలా బయట పడాలి? ఎవరికి ఫోన్‌ చేయాలి? ఫోన్‌ చేసినప్పుడు అవతలి వారు లిఫ్ట్‌ చేయకపోతే పరిస్థితి ఏమిటి? ఆపదలో ఉన్న మహిళ కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే ఏం చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఏపీ ప్రభుత్వం‘దిశ’యాప్‌ను ప్రారంభించింది
  డౌన్‌ లోడ్‌.. ఉపయోగించడం ఇలా..
  ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ మొబైల్‌ ఫోన్లలో గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో మొబైల్‌ నంబర్‌తో రిజిస్ట్రే షన్‌ చేసుకోవాలి.యాప్‌లోఎస్‌వోఎస్‌ బటన్‌ ఉం టుంది. ఆపదలో ఉన్నప్పుడు యాప్‌ను ఓపెన్‌ చేసి,అందులో ఉన్న ఎస్‌వోఎస్‌ (పుష్‌ బటన్‌ మెస్సే జ్‌ ఆప్షన్‌) బటన్‌ నొక్కాలి. ఆవెంటనే వారి ఫోన్‌ నంబర్‌,చిరునామా,వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్‌)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. ఆ వెంటనే కంట్రోల్‌ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమ వుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు క్షణాల్లోనే సమాచారం పంపిస్తారు. ఈఆప్షన్‌ ద్వార పోలీసు లు యాప్‌ వినియోగదారులకు ఏకకాలంలో సూచనలు,సలహాలుఅందించి, వారిని జరగ బోయే ప్రమాదాల గురించి అప్రమత్తం చేస్తారు. పోలీసు లతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు,స్నేహితు లకు కూడా సమాచారం ఇచ్చే వెసులుబాటు ఉం టుంది.విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్‌ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్‌ వెంటనే దిశకమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. ప్రయాణ సమయాల్లో రక్షణ, మార్గ నిర్దేశం కోసం ట్రాక్‌ మై ట్రావెల్‌ ఆప్షన్‌ ఏర్పటు
  తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని అందులో నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్‌ ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాం డ్‌ కంట్రోల్‌ రూమ్‌కు, వారి బంధువులకు చేరవేసే రక్షణ కల్పించే వెసులుబాటు
  దిశ యాప్‌లో డయల్‌ 100. 112 నంబర్లతో పాటు పోలీసు అధికారుల నంబర్లు, సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లు, ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, ట్రామా కేర్‌ సెంటర్లు, బ్లడ్‌ బ్యాంకులు, మందుల దుకాణాల వివరాలు కూడా తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఈయాప్‌లో ఉంటాయి. ఏపీ ప్రభుత్వం దిశ మొబైల్‌ యాప్‌ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు,ఎక్కువ మం దికి ఈయాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం కూడా అందిస్తోంది.
  ఇతర దేశాల్లో శిక్షలు ఇలా..
  అత్యాచార నిందితుల్ని నేరుగా ఉరికం బం ఎక్కిస్తారు. కొన్ని కేసుల్లో దోషుల పురు షాంగాన్ని తొలగించి నపుంసకులుగా కూడా మారు స్తారు. ఇదంతా నేరం జరిగిన రోజుల వ్యవధిలో జరిగిపోతుంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేక పోయినా ఉరిశిక్ష విధించడం విమర్శలకు దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఉరి తీశాక వారు నిర్ధోషులని తేలడం గమనార్హం.
  ఇరాన్‌: అత్యాచార దోషుల్ని కాల్చి చంపుతారు. లేదంటే ఉరితీస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితు రాలు క్షమించడానికి అంగీకరిస్తే, ఉరి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
  ఆష్గానిస్తాన్‌: రేపిస్టులకు శిక్ష పడిన నాలుగు రోజుల్లోనే ఉరి తియ్యడమో, లేదంటే కాల్చి చంపడమో చేస్తారు.
  యూఏఈ: రేప్‌ చేసిన ఏడు రోజుల్లో ఉరికంబం ఎక్కిస్తారు.
  సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో అత్యాచార నేరం రుజువైతే బహిరంగంగా తలనరికి చంపు తారు.
  నెదర్లాండ్స్‌: మహిళలపై జరిగే లైంగిక వేధింపు లన్నింటినీ అత్యాచారం కిందే పరిగణిస్తారు. అమ్మా యి అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నా అక్కడ నేరుగా జైలుకి పంపిస్తారు. నేర తీవ్రత ఆధారంగా 4 నుంచి 5 సంవత్సరాలు శిక్ష ఉంటుంది.
  ఫ్రాన్స్‌: అత్యాచార చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అత్యాచార కేసుల్లో 15ఏళ్లు కారాగార శిక్ష విధిస్తారు. జైల్లో ఉన్నన్ని రోజులు వారిని చిత్రహింసలకు గురి చేస్తారు. నేర తీవ్రతని బట్టి దానిని 30 ఏళ్లకు పెంచుతారు.
  గణాంకాల ప్రకారం..
  దేశం దశ దిశలా.. నలుమూలలా.. ప్రతిరోజూ మహిళల అక్రందనలు వినిపిస్తునే ఉన్నాయి. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ తాజాగా విడుదల చేసిన (2020,సెప్టెంబర్‌ 29) గణాం కాల ప్రకారం సగటున దేశవ్యాప్తంగా రోజుకు 87 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. 2012 నిర్భయ ఘటనకు ముందు 25 వేల కంటే తక్కువ, 2013లో 33,707,2016లో 38,947 కేసులు నమోదు కాగా 6,289 కేసుల్లో శిక్షలు పడ్డాయి. 2017లో32,559,2018లో33,356, 2019లో 32,033 నమోదయ్యాయి. కానీ శిక్షలుపడ్డ దాఖ లాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఈ కేసుల్ని విచారించడానికి కోర్టుల్లో తగిన సిబ్బంది లేక పోవడంతో పెండిరగ్‌ కేసుల సంఖ్య తడిసి మోపె డవుతోంది. ఇకఅత్యాచార కేసుల్లో దోషులుగా తేలేవారి సంఖ్య కూడా అత్యంతస్వల్పంగా ఉంది. చాలా ఏళ్లపాటు 25నుంచి 30శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. కానీ 2014లో మాత్రం శిక్షల రేటు 27 నుంచి 38 శాతానికి పెరిగింది. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో సత్వర న్యాయానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్ని 2019నాటికి దేశంలో 664 ఉంటే, అవి కూడా సరిగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. మన దేశంలో ఉరి శిక్ష పడాలంటే కనీసం5ఏళ్లు పడు తుంది. ఎందుకంటే ప్రత్యేక కోర్టుల్లో శిక్ష పడితే పై కోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు.. అక్కడ శిక్ష ఖరారు చేసినీ అమలౌతుందన్న గ్యారెంటీ లేదు. మరణ శిక్ష పడిన దోషులకు రాష్ట్రపతిని క్షమాభిక్ష అడిగే హక్కు కూడా ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి కొన్ని కేసుల్లో ఉరిశిక్ష అమలుకే 20 ఏళ్లు దోషులు జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అందుకే సత్వర న్యాయం మన దేశంలో సాధ్య పడటం లేదు. 1991 నుంచి 2017 డిసెంబర్‌ చివరి నాటికి 371మందికి ఉరిశిక్ష పడిరది. కానీ గత 15 ఏళ్లలో ఎనిమిది మందికి (నిర్భయ దోషులతో సహా) మాత్రమే ఉరిశిక్ష అమలు జరిగిందంటే న్యాయం జరగడంలో ఎంత అన్యాయం జరుగు తుందో అర్థమవుతోంది.
  ఈ పరిస్థితి మరాలంటే..
  గర్భస్థ పిండాలుగా ఉన్నప్పటి నుంచి కడ శ్వాస వరకు మహిళలపై గౌరవ భావం కలిగేలా మన సమాజానికి అవగాహన పెంచాలి. కటుంబం, బడి,పనిప్రదేశం, బహిరంగ స్థలం.. ఇలా అన్ని చోట్ల, ప్రతిస్థాయిలో వివక్ష పోవాలి. మనిషి తప్ప సృష్టిలోమరే జీవి పాల్పడని అతి హీనమైన నేరం అత్యాచారం. అది సామూహికంగా జరిగి, ఘాతు కమైన హత్యతో ముడిపడటం భూమ్మీద అతిపెద్ద నేరం. దీనికి సమాజం నుంచే పరిష్కారం లభిం చాలి. దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని విధా లుగా,అన్ని స్థాయిల్లో సమాజం సమాయత్తం కావాలి. ఇది సమష్టి బాధ్యత.
  -డా.యం.సురేష్‌ బాబు

గిరిజ‌నుల గోడు వినేదెవ‌రు?

‘’దట్టమైన అడవుల్లో పరవళ్లు తొక్కే నదులు.. ఇనుము, బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాల మధ్య బతికే గిరిజనులు ఇప్పటికే గనులు, ఆనకట్టలు, కర్మాగారాల కోసం తమ ఇళ్లను, భూములను కోల్పోయారు. ఇప్పుడు కోర్టు తీర్పు మేరకు ఇల్లూపొల్లూ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలు వారు ఎంత దుర్బల, దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పడానికి’’.

రిజర్వేషన్లు అభివృద్ధికి గొడ్డలి పెట్టు అన్న వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు పాలక వర్గాలు తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా గిరిజనులకు కల్పించిన భూ హక్కు చట్టం నుంచి రిజర్వేషన్ల వరకూ దేని అమలు పైనా ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేదు. ఎస్టీ రిజర్వేషన్లలో ఇతరులనూ చొప్పించాలని పాలకులు చూస్తుంటే.. కోర్టుల తీర్పులు వాటికి బలాన్నివ్వడం మరింత బాధాకరం. ఉమ్మడి ఏపీలో ఏజెన్సీల్లోని స్కూల్‌ టీచర్ల నియామకాల్లో గిరిజనులకే 100%రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన జీవోను ఏజెన్సీల్లోని ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందనే పేరుతో సుప్రీం కోర్టు రద్దు చేసి ఏడాది కావస్తున్నా, దాని పునరుద్ధరణకు రాష్ట్ర సర్కారు సీరియస్గా ప్రయత్నించకపోవడం దారుణం. మన దేశంలో అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్లకు పాలకులు తూట్లు పొడుస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం ఏవో లొసుగులను అడ్డం పెట్టుకుని ఉల్లంఘిస్తున్నారు. ఏపార్టీ పాలనా పగ్గాలు చేపట్టినా సరే వాటిలో అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్గాలే పెత్తనం చేయడం వల్ల వారికి ఈ రిజర్వేషన్లపై సానుకూల దృక్పథం కొర వడిరది. రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులపై సదభిప్రాయం లేకపోవడంతో రాజకీయ అవసరాల కోసం పైపై ప్రచారాలు చేసుకోవడం తప్ప నిజంగా మేలు చేసే ఆలోచన కనిపించడం లేదు.
ఒక వైపే ప్రచారం
మన దేశంలో అధికారంతోపాటు ప్రసార సాధనాలను గుప్పిట పెట్టుకున్న ఉన్నత సామాజిక వర్గాలు పీడిత, బాధిత వర్గాలకు రాజ్యాంగపరంగా కల్పించిన వెసులుబాట్లను ప్రచారం చేసినంతగా వాటి అమల్లో లొసుగులపై చర్చ పెట్టవు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ దుర్వినియోగం గురించి జరిగే ప్రచారం ఆచట్టాన్ని వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నవారి గురించి చెప్పే విషయంలో జరగదు. ఈచట్టానికి అపప్రద తెచ్చిపెట్టడమే వారి ఉద్దేశం కనుక అణచివేతకు గురవుతున్న బాధితులను వదిలేసి, చట్టం దుర్వినియోగం గురించి పెద్దగా చర్చలు పెడుతారు. కానీ ఏ శక్తుల కారణంగా ఇది జరుగుతుందో విశ్లేషించేందుకు మాత్రం మనసు రాదు.
ఏజెన్సీల్లో యువతకు చేదోడైన జీవో అది
బయటి ప్రపంచం పోకడలకు చాలా దూరంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో జనం జీవన శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లకు చదువులు, ఇతర మౌలిక సదుపాయాలు నేటికీ అంతంత మాత్రంగానే అందుతున్నాయి. పైగా ఏజెన్సీ ప్రాంతాల్లో హాస్పిటల్స్‌, స్కూళ్లలో పని చేయాలన్నా కూడా ఇప్పటికీ మైదాన ప్రాంత వాసులు అంతగా సుముఖత చూపడం లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవం. దీంతో 1986లో జీవో నంబర్‌ 275 ద్వారా ఉమ్మడి ఏపీలో నాటి సర్కారు ఏజెన్సీల్లో టీచర్‌ ఉద్యోగాలకు గిరిజనులకే 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1989లో ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులు, 1998లో సుప్రీం కోర్టు తీర్పుతో ఆ రిజర్వేషన్లు నిలిచిపోయాయి. అయితే 2000 సంవత్సరంలో నాటి ప్రభుత్వం మళ్లీ జీవో నంబర్‌ 3ద్వారా మళ్లీ 100శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మళ్లీ కొంత మంది కోర్టుకు వెళ్లారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనేతరులకు అన్యా యం జరుగుతోందంటూ వాదనలు వినిపించారు. అయితే గిరిజన యువతలో చదువుకున్న వాళ్లు తమ ప్రాంతాల్లోని స్కూళ్లలో టీచర్లుగా ఉద్యోగాలు పొంది తమ తర్వాత జనరేషన్‌ పిల్లలకు చదువులు చెబుతూ వస్తున్నారు. వారికి ఉపాధి కల్పించడంతో పాటు తమ ప్రాంతానికి మేలు చేయడంలో ఈ జీవో చేదోడుగా ఉండేది. గతఏడాది ఏప్రిల్లో సుప్రీం కోర్టు ఈ జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ జీవో అత్యంత వివాదాస్పద ఉత్త ర్వుగా జడ్జిలు పేర్కొన్నారు. జీవో నంబర్‌3 రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చారు. అది చెల్లదంటూ తాము ఇచ్చిన ఉత్తర్వును ఉల్లంఘి స్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా నియామకాలు, పదోన్నతులు చేపట్టినట్టయితే 1986 నుంచి జరిగిన నియామకాలన్నీ తిరగదోడతామని హెచ్చరించడం బాధాకరం. వాస్తవానికి ఆ జీవో రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5 ప్రకారం ఇచ్చారని, ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, దీనిపై జుడిషియల్‌ రివ్యూ చేసే హక్కు కూడా ఉండద ని వాదించి గిరిజన హక్కులను కాపాడ డంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్‌ అయింది. ఏజెన్సీల్లో ఇతరుల జనాభా ఎట్ల పెరిగింది?
జీవో నంబర్‌ 3ని మొదటి నుంచి వ్యతిరేకి స్తోంది ఏజెన్సీల్లోని గిరిజనేతర వర్గాలే. ఈ జీవో వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతోందని వాదిస్తున్నారు. అసలు పరిశీలించాల్సిన విషయం ఏజెన్సీల్లో ఇతర వర్గాల జనాభా ఎలా పెరిగిందన్నది. వాస్తవానికి 1950 నుంచి 80 దశకం వరకు ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనుల జనాభా 90 శాతం ఉంటే 90ల్లోకి వచ్చేసరికి వారు మైనారిటీలుగా మారిపోయారు. మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన భూస్వామ్య, వ్యాపార, గిరిజనేతర వర్గాలు అక్కడి భూమి, ఆర్ధిక వ్యవస్థను తమ గుప్పిట పెట్టుకున్నాయి. జనాభా పరంగానూ మెజారిటీలుగా మారి పోయారు. ఒక్క ఆదిలాబాద్‌ అనే కాకుండా ఏజెన్సీ విస్తరించిన అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. నిజానికి గిరిజన ప్రాంతాల్లో ఇతరులు భూములు కొనడానికి లేదు.ఆ భూపరి రక్షణ హక్కు చట్టాలకు సైతం ఈ వర్గాలు తూట్లు పొడిచాయి. రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నా సరే గిరిజన చట్టాలను ఆధిపత్య వర్గాలు నీరు గార్చేశాయి. పెసాచట్టం నిబంధనలకు నీళ్లు వదిలి పెట్రోలు పంపులు, కర్మాగారాలు, సినిమా హాళ్లు, పిండి మిల్లులు ధాన్యం మిల్లులు, ఐస్‌ ఫ్యాక్టరీలు, మద్యం దుకాణాలు.. ఇలా ఒకటేంటి ఏజెన్సీలో అన్నీ బినామీల పేరుతో నడిపిస్తున్నారు. పేరు గిరిజనులది.. పెత్తనం అగ్రవర్ణాల పెద్దలది. గిరిజనుల వనరులను అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించేస్తున్నారు. పైగా చట్టానికి తూట్లు పెట్టేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు కాబట్టి చాపకింద నీరులా పనుల్ని చక్కబెడుతున్నారు. కానీ జీవో 3 ద్వారా గిరిజనులకు దక్కే గుప్పెడు ఉద్యోగాలపై గిరిజనేతరులంతా ఏకమై పోరాటం చేయడం ఘోరం.
అడుగడుగునా ఉల్లంఘనలే
నిజానికి బ్రిటిష్‌ కాలం నుంచి ఊపిరి పోసు కున్న ఏజెన్సీ చట్టాలన్నీ గిరిజన తెగలను గిరిజ నేతరులు, మైదాన ప్రాంత దోపిడీ నుంచి రక్షిం చేందుకు ఉద్దేశించినవే. స్వాతంత్య్ర అనం తరం రూపొందిన 1/70చట్టం ఇందులో కీలక మైంది. రాజ్యాంగ పరిధిలో 1/70చట్టాన్ని నిర్వ చించినా జీవో నంబరు 3దాన్ని బలోపేతం చేసేందుకు తోడ్పడేదే తప్ప ఎంతమాత్ర మూ ఆ చట్రానికి బాహ్యంగా లేదు.కానీ1/70లో భాగమైన అన్ని చట్టాలు ఏండ్లకు తరబడి అడు గడుగునా ఉల్లంఘనకు గురవుతూ వచ్చాయి.
రివ్యూ పిటిషన్‌ వేసి వదిలేస్తరా?
ఏజెన్సీలో ఎస్టీల రిజర్వేషన్లను వ్యతిరేకించే అగ్రవర్ణ, బీసీ వర్గాలు మైదాన ప్రాంతం వచ్చేసరికి రెండుగా విడిపోతాయి. గిరిజనుల జీవన విధానమేంటి? వారి వెనుకబాటు ఏంటి? వారికున్న ఆర్థిక వనరులేంటి? ఆహార భద్రత ఎంత? మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలను పరిగణనలోకి తీసుకుంటే జీవో 3 వారి త్యాగా లకు పెద్ద తులాభారమేం కాదు. గిరిజన సంస్కృతి,సంప్రదాయాలను రక్షించాలన్న ఆశయంతో తెచ్చిన రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు కూడా ఏనాడూ వారికి భద్రత కల్పించింది లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు అంతో ఇంతో ఉపాధి కల్పిస్తున్న జీవో నంబర్‌ 3 విషయంలోనూ తెలంగాణ సర్కారు గిరిజనుల కోసం చేసిందేమీ లేదు. ఏడాది క్రితం జీవో రద్దు చేస్తూ సుప్రీం తీర్పు వచ్చింది. అయితే దాని పునరుద్ధరణ కోసం కోర్టులో ఒక రివ్యూ పిటిషన్‌ వేసి గిరిజన సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని కంటితుడుపుగా ప్రకటన చేయడం మినహా చేసిందేమీ లేదు. దాదాపు ఈఏడాది సమయంలో సీరియస్గా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.
గిరిజన భూములు ఆక్రమించేదెవరు?
షెడ్యూల్డ్‌ తరగతులు, ఇతర అటవీ వాసుల (అటవీ హక్కుల చట్టం), 2006 చారిత్రకంగా బాధలు పడ్డ వారి హక్కులను పరిరక్షించడానికి ఉద్దేశించింది. దీనినే అటవీ హక్కుల చట్టం అంటున్నారు. అడవుల్లో ఉంటూ భూముల హక్కుల తిరస్కరణకు గురైనవారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు గిరిజనుల హక్కులను హరించేదిగా ఉంది. ఈ తీర్పువల్ల 16 రాష్ట్రాలలోని 10లక్షలమంది గిరిజనులకు నష్టం కలిగే పరిస్థితి తలెత్తింది. సుప్రీం కోర్టుకు తమ పరిస్థితి ఇంకా నివేదించాల్సిన వారు అనేక మంది ఉన్నారు కనక వీరి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. అటవీ హక్కుల చట్టం న్యాయబద్ధతను ప్రశ్నిస్తూ వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌ అన్న స్వచ్ఛంద సంస్థ, ఉద్యోగ విరమణ చేసిన కొందరు అటవీ శాఖ అధికారులు పిటిషన్‌ పెట్టుకున్నందువల్ల ఈ అంశం సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది. అయితే సుప్రీంకోర్టు తాము వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అటవీ హక్కుల సం రక్షణ చట్టం కింద కొందరి వాద నను తిరస్కరించడానికి గల ప్రక్రియను వివరించాలని రాష్ట్రాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలగజేస్తుంది. సాంప్రదాయికంగా అడవుల్లో జీవనం కొనసాగిస్తున్న వారిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు ఇలాంటి అర్జీ దాఖలైనప్పుడు సుప్రీం కోర్టు ఉత్తర్వువల్ల 2002,2004 మధ్య అనేకమంది అటవీ వాసులు నిర్వాసితులయ్యారు. ఇది హింసకు, మరణాలకు, నిరసనలకు దాదాపు మూడు లక్షల కుటుంబాలు నిర్వాసితులు కావడానికి దారి తీసింది. తాజా ఉత్తర్వు ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులపట్ల అనుసరిస్తున్న విధానానికి అనువుగానే ఉంది. గిరిజనుల ప్రయోజనాలను ప్రభుత్వ న్యాయవాదులు కనక సమర్థించి ఉంటే ఈ ఉత్తర్వు మరోలా ఉండేది. అడవులు తగ్గిపోవడానికి, అటవీ భూములు ఆక్రమణకు గురికావడానికి గిరిజనులే కారణం అని ఈ పిటిషన్‌లో వాదించారు. గిరిజనులు, అడవుల్లో నివాసం ఉంటున్న వారు అటవీ భూములను ఆక్రమిస్తున్నారన్న వాదన ఎంతవరకు నిలబడగలుగుతుంది? వలసవాద ప్రభుత్వం వారి హక్కులకు భంగం కలిగించింది. అప్పుడు కొన్ని నిబంధనలున్నా గిరిజనులు తమ హక్కులను అనుభవించ గలిగారు. అయితే స్వాతంత్య్రం తర్వాత నూతన అటవీ విధానంవల్ల గిరిజనులకు చాలాకాలంగా ఉన్న హక్కులకు భంగం కలిగింది. దీనికి తోడు దేశంలోని భూభాగంలో మూడిరట ఒక వంతు అడవులు ఉండాలన్న విధానంవల్ల గిరిజనుల హక్కులు హరించుకు పోయాయి. అసలు చెట్లే లేని భూభాగాలు కూడా అటవీ శాఖ అధీనంలోకి వచ్చి ఇవి అమాంతం అటవీ భూములైపోయాయి. అటవీ శాఖ వేలాది కిలోమీటర్ల మేర గిరిజనుల భూములను ఆక్రమించింది. 1980నాటి అటవీ (సంరక్షణ) చట్టం,1972 నాటి వన్యప్రాణి (సంరక్షణ) చట్టం కూడా గిరిజనుల హక్కులకు భంగం కలిగించాయి. అంటే నిజానికి అటవీ భూములను ఆక్రమిస్తున్నది ప్రభుత్వమే. అటవీ భూములు తగ్గిపోవడానికి ప్రధాన బాధ్యత గిరిజనులదా, అడవుల్లో ఉండే వారిదా అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గనుల తవ్వకానాకి, పరిశ్రమలు నెలకొల్పడానికి అటవీ భూములను వాడుకున్నారు. గిరిజనులను నిర్వాసితులను చేశారు. ఉదారవాద ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నప్పటి నుంచి మునుపెన్నడూ లేని రీతిలో బడా కంపెనీలు, బహుళజాతి గుత్త కంపెనీలు గిరిజన ప్రాంతాలలో ఉన్న వనరులను కొల్లగొట్టడానికి అడవుల్లో తిష్ఠ వేశాయి. కాని అడవులు క్షీణించడానికి నెపం గిరిజనుల మీద తోస్తున్నారు. ప్రైవేటు ప్రయోజనాలకోసం అడవులను కొల్లగొట్టే వారి మీద ఏ నిందా లేదు. అడవుల్లో పర్యావరణాన్ని, వన్య జీవుల్ని నాశనం చేస్తున్నది ఈ కంపెనీలే. అడవులు క్షీణించిపోవడానికి గిరిజనులే కారణం అని వాదిస్తున్నప్పటికీ ఇప్పటికీ దట్టమైన అడవులున్నది గిరిజనులు ఉండే చోటే ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం అనుసరిస్తున్న అటవీ పరిరక్షణ విధానాలు సక్రమమైనవేనా అని ఆలొచించాలి.అటవీ శాఖ, అధికారులు, అడవులను పరిరక్షించడానికి పాటుపడ్తున్నామని చెప్పుకునే కులీన, పట్టణ ప్రాంత వాసులు అటవీ హక్కుల చట్టాన్ని వ్యక్తిరేకిస్తూనే ఉన్నారు. ఈ చట్టానికి నిబంధనలు తయారు చేసినప్పటి నుంచీ ఇదే ధోరణి. ఈ చట్టం అమలుపై నిరంతరం విమర్శలు వస్తూనే ఉన్నాయి. అటవీ భూములపై హక్కులను గుర్తించడం మూడు దశల్లో జరుగుతుంది. గ్రామసభ ఈ హక్కుల పరిరక్షణకు సిఫార్సు చేస్తుంది. ఆ తరవాత ఈ అభ్యర్థన సబ్‌ డివిజన్‌ వ్యవస్థ స్థాయికి వెళ్తుంది. ఆ తరవాత పరిశీలనకోసం జిల్లా స్థాయి అధికారులకు పంపుతారు. ఇందులో కేవలం అధికారులు మాత్రమే ఉంటారు. ఇందులో అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు. హక్కులు కోరే వారి వాదనను తిరస్కరించడం ఎప్పుడూ అందులోని మంచి చెడ్డలపై ఆధారపడుతుందని కాదు. ఈ తిరస్కరణ చాలావరకు ఏకపక్షంగా ఉంటుంది. గ్రామసభ సిఫార్సును వ్యతిరేకించే వర్గాలు ఉంటాయి. ఈ వర్గాలు అటవీ భూములను ప్రైవేటు రంగం వారికి, వ్యాపరస్థులకు అప్పగించాలని చూస్తాయి. చిన్నా చితక కారణాల ఆధారంగానే గిరిజనుల హక్కులను తిరస్కరించిన సందర్భాలున్నాయని గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖే అంగీకరించింది. ఈ తిరస్కరణను సవాలు చేస్తూ కోర్టుల్లో దాఖలైన లక్షలాది పిటీషన్లు విచారణకే నోచుకోవడం లేదు. తగిన విధానం అనుసరించకుండా ఎవరినీ నిర్వాసితులను చేయకూడదని అటవీ హక్కుల చట్టంలోని 4 (5) సెక్షన్‌ చెప్తోంది. కానీ అధికారులే దీన్ని ఉల్లంఘిస్తుంటారు. చట్టం నిబంధనలను ఖాతరు చేయకుండా తిరస్కరించిన సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తిరస్కరిస్తున్న ఉదంతాలెన్నో! నిబంధనల ప్రకారం అయితే క్షేత్ర స్థాయిలో సర్వే చేసి కాని నిర్ణయించకూడదు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ కేసును సుప్రీంకోర్టు పరిష్కరించిన తీరు కూడా ఏ మాత్రం నమ్మకం కలిగించేదిగా లేదు. గిరిజనులకు సంబంధించిన అంశాల మీద న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అవగాహన ఉన్నట్టు లేదు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంది. –మన్నారం నాగరాజు

వైవిద్య జీవ‌నం..అడ‌వులే జీవ‌నాధారం

అడవి మార్గంలో రైలులో ప్రయాణిస్తుండగా దేవులపల్లి భావోద్వేగానికి గురయ్యారట. అందులోంచి పుట్టిన పాట..
‘ఆకులో ఆకునై.. పువ్వులో పుప్వునై.. కొమ్మలో కొమ్మనై.. నునులేత రెమ్మనై.. ఈ అడవి దాగిపోనా.. నేనెటులైనా ఇచటనే ఆగిపోనా..’ అన్నది. అడవి అందాలను ఆస్వాదించాలని ఎవరికి మాత్రం ఇలా అనిపించదు..? పచ్చని చెట్ల నీడన సేదదీరాలని, గలగల పారే సెలయేటి నీటిని దోసిటపట్టి తాగాలని, పక్షుల కిలకిలా రావాలను, పూల సుంగధాలను ఆస్వా దించాలని, చెట్టుపై మాగిన పండ్లను కోసి తినాలని.. ఇలాంటి అనుభవం జీవితంలో ఒక్కటైనా ఉండాలని ఎవ్వరనుకోరు..! ఇంతటి స్వచ్ఛమైన జీవితం అనుభవించే తెగ.. ఆదివాసీ. వారి మనుగడకు ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా, అభివృద్ధికి దూరంగా ఉంటున్నా.. అడవినే నమ్ముకుని అక్కడే ఉండిపోతున్నారు. వారి జీవనం, సంస్కృతి, సంప్రదాయాలలో వైవిధ్యం ఉంటుంది. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఈ నేపథ్యంలో నల్లమల గిరిజనుల జీవనంపై ప్రత్యేక కథనం.

 • ా సంస్కృతికి ప్రాణమిచ్చే ఆదివాసులు
 • ా అభివృద్ధి దరిచేరని జీవితాలు
 • ా అందని ప్రభుత్వ పథకాల ఫలాలు
 • ా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఆదర్శంగా నిలుస్తున్న గిరిజనులు
 • ఆదివాసీలు,గిరిజనులు ఏ దేశానికైనా మూలవాసులన్నది మానవ శాస్త్రవేత్తల భావన. సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమూహాలు గిరిజన తెగలు. వీటికి సామా జికంగా, సాంస్కృతి కంగా ప్రత్యేకతలున్నాయి. వీటితో పాటు వైవిధ్య చరిత్ర,సంస్కృతులున్నాయి. జన జీవన స్రవంతిలో భాగంగా కొందరు..దూరంగా ఇంకొందరు జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతా ల్లోనూ భిన్న తెగలకు చెందిన గిరిజ నులున్నారు. ప్రస్తుతం భారత జనాభాలో దాదాపు 8`9శాతం ప్రజలు వివిధ గిరిజన సమూహాలకు చెందినవారే. ఆంథ్రోపాలజీకల్‌ సర్వే ఆఫ్‌ ఇండి యా అధ్యయనం ప్రకారం ఒక్కో గిరిజన తెగ ఒక నిర్ధిష్టమైన భౌగో ళిక ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. ఒక గిరి జన తెగ విభిన్నరాష్ట్రాల్లో విస్తరించి ఉండటం అరుదు. ప్రతి గిరిజన సమూహానికి ఒక నిర్ధిష్టమైన పేరుంటుంది. ఒకేరకమైనభాష,సంస్కృతిఉంటాయి. ఒకేరకమైన ఆచార వ్యవహారాలు కలిగి ఉంటారు. ఒకే న్యాయం,ఒకేచట్టం ఉంటాయి. అంతర్వివాహ పద్దతిని ఆచరిస్తారు. గిరిజన సమూహాలకు ప్రత్యే కమైన మతవిశ్వాసాలు,ఆరాధన పద్దతులు ఉం టాయి. ముఖ్యంగా ప్రకృతి శక్తులను ఆరా ధిస్తారు. వీటితోపాటు ప్రతిగిరిజన సముదాయా నికి ఒక స్వయం ప్రతిపత్తిగల రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఈనాటికీ చాలా తెగలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ప్రవేశించినా,తమను తాము నియంత్రిం చుకునే స్వీయ రాజకీయ వ్యవస్థను(ఆదివాసీ మండలి) కొనసాగిస్తున్నాయి. ఆయా తెగల పెద్దలు ఇందులో సభ్యులుగా ఉంటారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ కార్యకలాపాలను వీరే నియంత్రి స్తుం టారు. అన్నింటికీ మించి ఇవి ఏకరూపత కలిగిన సమూహాలు. వీటన్నింటిలోనూ గోత్ర వ్యవస్థ అంత స్సూత్రంగా పనిచేస్తుంది. గిరిజన సమాజంలోని సభ్యుల ప్రవర్తనను గోత్రవ్యవస్థ నియంత్రిస్తుంది. స్వగోత్రికలు రక్తబంధవులనే భావన కలిగి ఉంటా రు. అందుకే స్వగోత్రీకులు పెళ్లిళ్లు చేసుకోరు. ప్రతి గోత్రానికి ఓటోటెమ్‌ ఉంటుంది. టోటెమ్‌ అంటే మతపరమైన చిహ్నం. గోత్ర సభ్యులంతా ఆ మత పరమైన చిహ్నం నుంచి ఉద్భవించామనే భావనతో దాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆరాధాస్తారు. ఈ చిహ్నం ఒక వ్యక్తి కావోచ్చు.. జంతువు,చెట్టు లేదా ప్రకృతిలోని ఏదైనా కావోచ్చు. అది వారి తెగకు గుర్తు.
 • దేశంలో మూడు రకాల తెగలు : భారత్‌లో మనకు మూడు రకాల గిరిజన తెగలు కనిపిస్తాయి
 • 1) దట్టమైన అటవీ ప్రాంతాల్లో,పర్వత ప్రాంతా ల్లో జీవించేవారు. వీరు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. అడవులు, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తారు. ఆర్ధికం గా,రాజకీయంగా స్వతంత్రంగా జీవించినప్ప టికీ ఆర్ధికంగా వెనకబడిన తెగలివి.
 • 2) అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నా,వ్యవసాయం ప్రధానంగా చేసే ఆదిమ తెగలు. వీరికి పాక్షికంగా గిరిజనేతరులతో సంబంధా లుంటాయి. సామా జిక,వ్యాపార సంబంధా లుండే అవకాశముంది.
 • 3) మైదాన ప్రాంతాల్లోని గిరిజన సమూహాలు. జనజీవన స్రవంతిలో భాగంగా ఉండి ఆధునిక జీవన విధానానికి దగ్గరగా ఉంటారు. ప్రభుత్వం కల్పించే చాలా అభివృద్ధి పథకాలు ఈమైదాన ప్రాంతాల్లో స్థిరపడిన,గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు దగ్గరగా ఉన్న తెగలు ఎక్కువగా ఉపయోగించు కుంటాయి. అందుకే వారిలో విద్య,ఆర్ధిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేంలో తీసుకుంటే బిల్లులు,సంతాల్‌(మధ్యప్రదేశ్‌)లు, ముండాలు (బీహార్‌),మహారాష్ట్ర,తెలంగాణలోని రాజ్‌ గోండులు,లంబాడీలు జనజీవన స్రవంతికి చాలా దగ్గరగా ఉండే సమూహాలు. అందుకనే వీరిలో రాజకీయ,ఆర్ధిక,విద్యాపరమైన అభివృద్ధి కనిపిస్తుంది. అదే చెంచు లాంటి తెగలను చూస్తే వారింకా జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు.
 • ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలు అంత రించిపోతున్న తరుణంలో వారి సంరక్షణ దిశగా ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టింది. ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని 1994లో ప్రకటించింది. 1997లో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు, హక్కులను కల్పిస్తూ.. ప్రపంచ దేశాల ప్రతినిధులను తీర్మానానికి ఆహ్వానించింది. 143 ఐరాస సభ్యుదేశాలు ఓటింగ్‌లో పాల్గొనగా 125దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదిం చారు. 14 మంది తటస్థ వైఖరి తెలపగా, కేవలం నలుగురు వ్యతిరేకించారు. అప్పటి నుంచి గిరిజన హక్కులు, వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 5వేల ఆదివాసీ తెగలున్నాయి. 6, 700 భాషలు మాట్లాడుతున్న వీరి జనాభా 40 కోట్ల పైమాటే. ఆదివాసీ తెగలు,భాషలు పలు కారణాలతో అంతరించిపోతున్న నేపథ్యంలో ఆది వాసుల సాంస్కృతిక జీవనాన్ని, వారిహక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఆదివాసీ దినోత్సవం జరపాలని ఐక్య రాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానం అమలులోకి తెచ్చింది.
 • ఆదివాసీ ప్రపంచం అభివృద్ధి ముసుగులో : మన దేశ పార్లమెంటులో ఎంతో మంది ఆదివాసీ ఎంపీలు ఉన్నా ఆదివాసీ సమ స్యలపై వారేనాడూ నోరు విప్పింది లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసులపై నరమేథం కొనసాగు తోంది. అంతర్యుద్ధం వంటి పరిస్థితుల మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు. ఆదివాసులను పూర్తిగా అంతరింపజేసి వారి సమాధులపై సామ్రా జ్యాల నిర్మాణం జరుగుతున్న ఆధునిక చరిత్ర నేటికాలంలోనూ సాగుతోంది. రెడ్‌ ఇండియన్‌లను నిర్మూలించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల పంథా లో ఆదివాసుల అంతానికి అన్ని దేశాలూ నడుం కట్టిన పరిణామాలను ఇప్పుడు ప్రతి దేశంలోనూ చూడవచ్చు. ఈచరిత్రను మనదేశ పాలకులు కూడా అందిపుచ్చుకున్నారు. మరోవైపున ఆదివాసుల రక్షణకు ఐరాస తీర్మానించిన విధానాలను వివిధ దేశాల ప్రభు త్వాలు పూర్తిగా పక్కనబెడుతున్నాయి. ఈ క్రమం లో ఆదివాసుల ఉమ్మడి జీవన వ్యవస్థ వార సత్వం ధ్వంసమైపోతోంది. మన దేశంలోనూ ఆదివాసీల హక్కులు, రాజ్యాంగ పరమైన రిజర్వే షన్లను అమలు చేయడంలో మన పాలకవర్గాలు తీవ్రంగా విఫలమ య్యాయి. ఆనకట్టలు, ప్రాజెక్టు లు, మైనింగ్‌..ఇలా దేశంలో ఏ భారీ నిర్మాణాలకు పూనుకున్నా బలవు తున్నది ఆదివాసీలే. నిత్యం వీరు ఎదుర్కొంటున్న ప్రాణాంతక వ్యాధులకు చికిత్స లేదు. వీరిభాషకు గుర్తింపు లేదు. ప్రాణా లకు విలువ లేదు. వారి చరిత్రకు గౌరవం లేదు. ఈ విధ్వంసకర అభివృద్ధి నుంచి తమ రక్షణకు ఆదివాసీ తెగలు ఏకమ వ్వాలి. మన దేశ మైనింగ్‌ మాఫియా దోపిడీలో ప్రతి ఆదివాసీ అనాథ అయితే ఓపెన్‌ కాస్టులు వారి శ్మశాన వాటికలు. ఈశ్మశాన వాటికల్లో ఆది వాసులను తగులబె డుతున్న బహుళజాతి కంపె నీలకూ,వారికి వత్తాసుగా నిలుస్తున్న దళారీ పాల కవర్గాలకూ వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తున్న పోరాటాలకు సకలవర్గాల ప్రజలూ అండగా నిల వాలి. ఆదివాసులు తమ అస్తిత్వాన్ని, మను గడను కోల్పోతే, ఈసమాజానికీ,చరిత్రకీ,సంస్కృతికీ, సంప్ర దాయాలకూ చాలా ప్రమాదమని భావించక తప్పదు.
 • షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన చట్టాల ఉల్లంఘన
 • రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్‌లో గిరిజనుల స్వయం ప్రతిపత్తి, గ్రామస్వరాజ్యం గిరిజనులను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనీ, నీళ్లు, అడవి, భూమి వనరుల మీద గిరిజనులకు సంపూర్ణ హక్కు ఉండాలని చెప్పింది. గిరిజన భాషా, సంస్కృతి, వేష ధారణ, గిరిజన ఆవాసాలు అభివృద్ధి చెందాలంటే 5వషెడ్యూల్‌ చట్టాలు పకడ్బందీగా అమలు కావాలి. అందుకు రాష్ట్ర గవర్నర్‌ ఎప్పటికప్పుడు గిరిజనుల స్థితిగతులపై పర్యవేక్షించాలి. గిరిజనులను సమా జంలో భాగస్వాములు చేయడానికి విధానాలు సవరించుకోవడం కోసం ప్రత్యేక ప్రొవిజన్లు ఏజెన్సీ లో కల్పించబడ్డాయి. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాజకీయ ప్రాతినిధ్యం గిరిజను లకు కల్పించినా సంపూర్ణంగా అమలు కావడం లేదు.
 • పండుగలంటే ప్రాణం : గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో పండుగలు జరుపుకుంటారు. హిందు వులు జరు పుకునే సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలతో పాటు గోండులు ప్రతి నెలా ఒకపండుగ చేసు కుంటారు. దసరా అనంతరం గిరిజన గ్రామాల్లో దీపావళి వేడుకలు ప్రారం భమవుతాయి. దీపావళి సందర్భంగా గిరిజన గ్రామాల్లో దండారి నృత్యం చేస్తారు.పక్క గ్రామా లవారితో సంబంధాలు పెంచు కోవడం కోసం దండారి బృందాలు పక్క గ్రామా లకు అతిథులుగా వెళ్లివారి ఐక్యతను చాటిచెబు తారు. చైత్రమాసంలో చెంతు భీమన్న పండుగ జరిపి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. మేలో పెర్సాపేన్‌ పూజలు, జూన్‌ లో మెహతుక్‌ పండుగ, జూలైలో అకోపేన్‌ పూజలు, ఆగస్టులో పొలాల,సెప్టెంబర్‌లో పెత్రమాస (పెద్దలపండుగ) చేసుకుంటారు. అక్టోబర్‌లో దసరా, దీపావళి, డిసెంబర్‌లో సెట్టి పండుగ చేసు కుంటా రు. జనవరిలో సం క్రాంతి,ఉగాది చేసుకుంటారు. గిరిజన జీవన విధా నంలో పండుగలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరిం చుకుంటాయి.
 • గూడేల్లో కనీస సౌకర్యాలు కరువు : రెండు తెలుగు రాష్ట్రాల గిరిజన గ్రామా ల్లో వర్షాకాలంలో పొంగిపొర్లే వాగులు ఆది వాసీ గ్రామాలను బాహ్య ప్రపంచంతో వేరు చేస్తున్నాయి. వ్యాధులతో బాధ పడుతున్న ఆదివాసులు వాగులు దాటుకొని ఆసుపత్రులకు రావడం కూడా గగనమే. రోడ్డు సౌకర్యం సరిగాలేక గ్రామాల్లో అభివృద్ధి కనిపిం చడం లేదు. కనీసవతసతులైన రోడ్లు,రవాణా, తాగు,సాగునీరు,విద్యుత్‌,విద్యా వైద్యం తదితర వసతులకు ఆదివాసీ గ్రామాలు నోచు కోవడం లేదు.104,108అంబులెన్స్‌లు కూడా వెళ్ల లేని గ్రామాలు ఏజెన్సీలో అనేకంగా ఉన్నాయి. వాగుపై వంతెనలు నిర్మించకపోవడంతో వర్షా కాలంలో వాగులు ప్రవహిస్తే గిరిజనులు బాహ్య ప్రపంచాకి దూరంగా ఉండిపోతున్నారు. ఫలితంగా అంటు వ్యాధులు ప్రబలితే వైద్యం అందక గ్రామా ల్లోనే తనువు చాలిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో మంచినీటి వనరులున్నా విద్యుత్‌ సమస్యలతో పథకాలు పని చేయక కలుషిత నీరు తాగుతూ అనారోగ్యానికి గురవుతున్నారు.
 • మారని జీవితాలు :పాలకులు, అధికారులు మారుతున్నా ఆదివాసుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఐటిడిఎ ఏర్పాటు చేసి కోట్లాది రూపా యలు విడుదల చేస్తున్నా అవి వారిదరి చేరడం లేదు. ఐటిడిఎలో కీలక అధికారుల పోస్టులు కూడా ఖాళీగా ఉంటుండడంతో అభివృద్ధి పథకాల అమ లులో తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. ఆదివాసీల సంక్షేమంకోసం ఐటిడిఎ ద్వారా ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు.ప్రతి ఏడాది ఆదివాసులను జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వందల సంఖ్యలో గిరిజనులు మరణిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం కరు ణించడం లేదు. శాశ్వత పరిష్కారాలను కను గొన డానికి ప్రయత్నించడం లేదు. ఏజెన్సీ ప్రాంతం లోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చాలాపోస్టు లు ఖాళీగా ఉన్నాయి.
 • రైతులపై కరువు ఛాయలు : అటవీ హక్కు చట్టంతో కొంతమంది ఆది వాసులకు ప్రయోజనం చేకూరినా వాటి ఫలాలు పూర్తిగా పొందలేకపోతున్నారు. గిరిజనుల భూ సమస్య పరిష్కరించడంలో ఐటిడిఏ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శ లున్నాయి. వారు పండిరచే పంటకు సరైన మార్కెట్‌ సౌకర్యం కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫల మైంది. పంటలు నష్టపోతే నష్టపరిహారం సైతం పొంద లేకపోతున్నారు. గిరిజనుల భూముల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ స్థానంలో కూడా రెగ్యులర్‌ అధికారి కరువై పోవడంతో ఇన్‌ఛార్జీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరిత హారం పథకం కూడా గిరిజనులకు కష్టాలను తెచ్చి పెడుతోంది. కొన్ని చోట్ల గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వక పోగా, హరితహారం పేరుతో పొలాల్లో గుంతలు తవ్వడం తో గిరిజనులు ఆందోళన చెందు తున్నారు. –గునపర్తి సైమన్‌

వలస కార్మికుల కోసం సామాజిక వంటశాలలు

‘‘ వలస కార్మికులకు తిండిగింజలు సరఫరా చేయ డానికి అవసరమైన పథకాన్ని రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేయాలి. రాష్ట్రప్రభుత్వాలు తమ సొంత పథకాలను జూలై31లోపు మొదలు పెట్టి కరోనా కొనసాగినంత కాలం అమలు చేయాలి. ఒకే దేశం ఒకే రేషన్‌ పథకాన్ని అమలు చేయాలి. రాష్ట్రాలు జూలై31లోపు దాన్ని అమల్లోకి తీసుకు రావాలి అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. వలసకార్మికులకు రెండుపూటల తిండి కోసం కార్మి కులు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే అక్కడ సామూహిక వంటశాలలు కొన సాగించాలని జస్టీస్‌ అశోక్‌ భూషణ్‌,జస్టీస్‌ ఎం.ఆర్‌. షాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఒక కేంద్రీకృత పోర్టల్‌ను ఏర్పాటు చేసి అందు లో దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటితరంగ కార్మికులు, వలసకూలీల వివరాల నమోదు ప్రక్రియను జూలై31 లోపు మొదలు పెట్టాలని ఆదేశించింది. కార్మికుల వివరాల నమోదు కోసం నేషనల్‌ డెటాబేస్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయడంలో కేంద్ర కార్మికశాఖ చేసిన జాప్యాన్ని సుఫ్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కార్మికులు ప్రభుత్వాల నుంచి వివిధసంక్షేమ పథకాలు అందు కోవడం కోసం వేచిచూస్తున్న తరుణంలో కేంద్ర కార్మికశాఖ ఉదాసీనంగా,నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం క్షమార్హం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం . ఇప్పటికైనా పోర్టల్‌ను తక్షణం ఏర్పాటు చేసి అమల్లో కి తీసుకురావాలి’ అని ధర్మాసనం పేర్కొంది. అసం ఘటితరంగ కార్మికులు,వలసకూలీల వివ రాల నమో దుకు కేంద్రప్రభుత్వం నేషనల్‌ ఇన్ఫర్మేటి క్స్‌ సెంటర్‌తో కలసి ఒక పోర్టల్‌ను రూపొందించాలి. ఇదే సమ యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘ టిత రంగ కార్మికుల వివరాలను నేషనల్‌ డేటాబేస్‌లో నమోదు చేసే ప్రక్రియను జూలై31లోపు మొదలు పెట్టి డిసెంబరు31నాటికి పూర్తిచేయాలి’ అని సుప్రీంకోర్టు తెలిపింది.

రేషన్‌ కార్డు లేదన్న సాకుతో ఏ ఒక్క వలస కార్మికునికి అందునా ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో రేషన్‌ నిరాకరించడం ఎంతమాత్రమూ తగదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని సుప్రీం కోర్టు జూన్‌ 29న ఒక తీర్పులో ఘాటుగా హెచ్చరించింది.‘‘వలస కార్మికుల్లో ఎక్కువ మంది పేదరికంతో చదువుకు దూరమైనవారే.వారి వద్ద ఏ విధమైన కార్డులు ఉండవు.అంతమాత్రం చేత వారికి ఈకరోనా సమయంలో రేషన్‌ను ప్రభు త్వం ఎలా నిరాకరిస్తుంది.వీరిలో చాలామందికి ఎలాంటి స్థిరమైన ఉపాధి ఉండదు. అయినా కనీస అవసరాలు తీరితే చాలు అనుకుంటారు వీరు’’ అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌,జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన ధర్మాసనం తమ 80పేజీలతీర్పులో పేర్కొం ది. దేశ జనాభాలో నాలుగింట ఒక వంతు అంటే 38కోట్లుగా వలసకార్మికులు ఉన్నారని,దేశ పురోగా భివృద్ధికి, ఆర్ధికాభివృద్దికి వలసకార్మికుల కంట్రిబ్యూ షన్‌ చాలా గొప్పదని అన్నారు. వలస కార్మికుల్లో ప్రతి ఒక్కరికీ రేషన్‌ అందేలా చూడా ల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని,వలసకార్మికులకు డ్రై రేషన్‌ ఇచ్చేందుకు అనుగుణమైన పథకాలను జూలై31 లోగా రూపొందించాలని కేంద్ర,రాష్ట్రప్రభుత్వా లకు గడవుఇచ్చింది.రెండు పూటలా భోజనం ఏఒక్క వలసకార్మికుడికి నిరాకరించకుండా చూడా లని రాష్ట్రప్రభుత్వాలను కోరింది. వలస కార్మికు లను చేరుకునేందుకు అన్నీ రాష్ట్రాలు, కేందప్రాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కోరింది. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన అదనపు తిండిగింజలను కేంద్రం సరఫరా చేయాలని, కరో నా కాలమంతటా కీలకమైన ప్రాంతాల్లో సామా జిక వంటశాలలను నడపాలని కోరింది. ఆహార హక్కు జీవించేందుకు తప్పనిసరి అని చెప్పింది. హుందాగా జీవించే హక్కులో ఇదోక భాగమని కోర్టు ప్రభుత్వానికి హితబోధ చేసింది. జూలై31 నుంచి ఒకదేశం ఒకే రేషన్‌ కార్డు విధానాన్ని అన్ని రాష్ట్రాలుపూర్తిగా అమలు చేయనున్నందున, అప్పటి లోగా వలస కార్మికులందరినీ జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఈ పథకంలోకి తీసుకురావాలని కోర్టు ఆదేశించింది.
వలస కార్మికుల ఆందోళనలపై కేంద్ర కార్మిక,ఉపాధి మంత్రిత్వశాఖ ఉదాసీనవైఖరిపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వలస కార్మికులు డేటాను పోర్టల్లో ఉంచడంలో ఆలస్యం జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై31లోగా వలస కార్మికుల కోసం పోర్టల్‌ అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. ‘‘అసం ఘటిత,వలసకార్మికుల వివరాలు నమోదు చేయ డానికి కేంద్రప్రభుత్వం జూలై 31లోపు పోర్టల్‌ని అభివృద్ధి చేసి..అందుబాటులోకి తీసుకురావాలి. జూలై 31లోపు ఈ ప్రక్రియను ప్రారంభించాలి’’ అని పేర్కోంది.
ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న లాక్‌డౌన్‌ తరహా పరిస్థితుల వల్ల ఉపాధిని కోల్పో యిన వలస కార్మికులకోసం దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక ఆదేశాలను జారీచేసింది. కేంద్ర ప్రభు త్వం అమలు చేయదలిచిన వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకానికి సంబంధించిన ఆదేశాలు అవి. రాష్ట్రాలతో సంబంధం లేకుండా వలస కార్మి కులకు ఉన్నచోటే చౌక దుకాణాల ద్వారా నిత్యా వసర సరుకులను అందజేయాలని సుప్రీం కోర్టు తాజాగా సూచనలు ఇచ్చింది. జులై31వతేదీ నాటికి..ఈ వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకాన్ని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాం తాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనికి డెడ్‌ లైన్‌ కూడా విధించింది. జులై 31వ తేదీ నాటికి ఈపథకాన్ని అమలు చేసి తీరాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనితోపాటు-వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్‌లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాలనిసూచిం చింది.
పోర్టల్‌ ద్వారా నమోదు..
అసంఘటిత రంగానికి చెందిన కార్మి కులు,వసల కూలీల వివరాలను నమోదు చేయ డానికి ప్రత్యేకంగా ఓపోర్టల్‌ను రూపొందిం చాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. జులై31వతేదీ నాటికి ఈపోర్టల్‌ను అందు బాటులోకి తీసుకుని రావాలని, దీనికోసం నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ సహకారాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. డిమాండ్లకు అను గుణంగా..ఆహారధాన్యాలు, నిత్యావసర సరుకులను రాష్ట్రాలకు సమకూర్చి పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కాంట్రాక్టర్ల వివరాలు కూడా..
జులై31వ తేదీనాటికి డ్రై రేషన్‌ను చేపట్టాలని,కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా సమసిపోయేంత వరకూ దాన్ని కొనసాగించాలని రాష్ట్రాలకు ఆదేశించింది. వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకాన్ని ఇప్పటిదాకా అమలు చేయని రాష్ట్రాలు తాము విధించిన డెడ్‌లైన్‌ నాటికి అందుబాటులోకి తీసుకుని రావాలని పేర్కొం ది. అంతర్రాష్ట్ర వలస కార్మికులు (రెగ్యు లేషన్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ యాక్ట్‌)-1979 కింద కాంట్రాక్టర్లు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కంపెనీల వివరాలన్నింటినీ నమో దు చేయాలని సుప్రీంకోర్టురాష్ట్రాలకు సూచిం చింది.
కమ్యూనిటీ కిచెన్లు సైతం
వలసకార్మికుల సంక్షేమం కోసం కమ్మూ నిటీ కిచెన్లను అందుబాటులోకి తీసుకుని రావాలని, కరోనా సంక్షోభం ముగిసేంత వరకూ వాటిని కొనసాగించాలని ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నివారించడానికి రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడం వల్ల వలస కార్మికులు ఉపాధిని కోల్పోయిన విష యం తెలిసిందే. ఫలితంగా-వారు వందలాది కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుకున్నారు.
సుమోటోగా స్వీకరణ
దీన్ని గతఏడాది మేలో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టింది. తాజాగా ఈఆదేశాలను జారీ చేసింది. వలస కార్మికులకు ఉన్నచోటే ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి ఉద్దేశించిన వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు పథకం ఇప్పటికే జాప్య మైందని న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యా నిం చింది.
ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు
ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు పథకం జూలై 31కల్లా దేశవ్యాప్తంగా అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలసకార్మికుల డాటా బేస్‌ నిమి త్తం జాతీయ స్థాయిలో వర్కర్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశిం చింది. ‘వలసకార్మికుల సమస్యలు,కష్టాలు’పై సుమో టో కేసును విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం ఈ మేరకు 80పేజీల తీర్పు వెలువరించింది. ప్రతివారికీ ఆహారంతోపాటు కనీస అవసరాలను పొందే హక్కుతోపాటు,రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. అసంఘటితరంగ కార్మికులకోసం జాతీయస్థాయి డేటాబేస్‌ ఏర్పాటు చేయాలని 2018లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని ఈసందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. ఈ విష యంలో కేంద్ర కార్మికశాఖ కనబరుస్తున్న ఉదాసీ నత,నిర్లక్ష్య వైఖరి క్షమించరాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వలస కార్మికులకు రేషన్‌ సరు కుల పంపిణీకి తగిన పథకం తీసుకు రావాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా రాష్ట్రాల పథకా లన్నీ జూలై 31కల్లా అమలులోకి రావాలని, అదే రోజుకల్లా వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ అమలులోకి తీసుకురావాలని పేర్కొంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కాంట్రాక్టర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి కార్మికుల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలంది.రెండు పూటలా ఆహారం దొరకని వలస కార్మికులకు సామూహిక వంట శాలలు ఏర్పాటు చేయాలని, ఆయా పథకాలన్నీ కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ కొనసాగిం చాలని పేర్కొంది.వలస కార్మికు లకు రేషన్‌ సరఫరానిమిత్తం తగిన పథకం రాష్ట్రాలు తీసుకు రావాలి.ఆమేరకు కేంద్రం అదనపు ఆహార ధాన్యాలను రాష్ట్రా లు కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి సంబంధించి తగినపథకాన్ని జూలై 31లోగా తీసుకొచ్చి అమలు చేయాలని తెలిపింది.
దేశంలో వలస కార్మికుల తరలింపుపై ఏకీకృత విధానం అవసరమని సుప్రీంకోర్టు కేంద్రా నికి సూచించింది. వారిని వారి స్వస్థలాలకు తరలిం చే విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వ యం ఉండాలని, ప్రతి కార్మికుడూక్షేమంగా తన ఇల్లు చేరేలా చూడాలని కోరింది. వీరి దుస్థితిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం.. కేంద్రానికి మొత్తం 50 ప్రశ్న లను వేసింది.లాక్‌ డౌన్‌ అమల్లో ఉండగా ప్రధా నంగా వలస జీవుల తరలింపు పైనే దృష్టి పెట్టింది. వారికి షెల్టర్‌,ఫుడ్‌, వారిట్రాన్స్‌ పోర్టేషన్‌ తదిత రాలపై కేంద్రం చేపట్టిన చర్యలను వివరంగా తెలుసుకుంది. ప్రతివారినీ ఒకేసారి వారి ఇళ్లకు పంపడం సాధ్యంకాదని, కానీ వారికి రవాణా సౌకర్యం కల్పించేంతవరకు తగిన వసతి, ఆహారం సమకూర్చవలసిన అవసరం ఉందని కోర్టు పేర్కొం ది. కాగాకేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ..
గతేడాది మే1న శ్రామిక్‌ రైళ్లను ప్రారం భించినప్పటి నుంచి ఇప్పటి వరకు 91లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించినట్టు వెల్లడిరచారు. వలస కార్మికుల అంశంపై రాజకీయ ప్రసంగాలతో కూడిన పిటిషన్లను అనుమతిం చరాదని, అలాంటి వారు కావాలంటేఅఫిడవిట్లు దాఖలు చేసుకోవాలని ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. వలస జీవులకు రైల్వే శాఖ 84లక్షల ఆహార పాకె ట్లను అందించిందని తుషార్‌ మెహతా తెలిపారు. ఈ సదుపాయం మరికొన్ని రోజులు కొనసాగుతుం దన్నారు. కాగా-తమ పేర్ల నమోదు లోను, టికెటింగ్‌ సిస్టంలోను జాప్యం జరుగు తుండ డంతో..ఇంకా వేలాది కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు చట్టవిరుధ్ధంగా తిరుగుతున్న వాహనా లను ఆశ్రయి స్తున్నారు.మరికొందరు కాలి నడకనే సాగుతున్నారు. Saiman Gunaparthi

క‌రోనా క‌ట్ట‌డిలో ఆచార సంప్ర‌దాయాలు మేలే

భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి.
మన దేశం సంస్కృతి,సంప్రదాయాలు, ఆచా రాలకు పుట్టినిల్లు. పూర్వం నుంచి మన వాళ్లు పాటించిన ఆచార సంప్రదాయాల వెనుక మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యా లున్నాయి. పూర్వీకులు ఆచరించిన సాంప్ర దాయక, ఆధ్యాత్మిక ఆచారాల చాటున వెనుకటి మర్యాద మన్ననలే కాదు అవి ఆరోగ్యంతో కూడుకున్నవి. భారతీయ సంప్రదాయాచారాలను కొందరు మూఢ నమ్మకంగా కొట్టి పారేస్తారు. దాని మాటున శాస్త్రీయ విజ్ఞానం ఉందని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. తీరిక లేని యువతతో పాటు పెద్దలు కూడా నాటి ఆహారపు అలవాట్లు అతిథి మర్యాదలు వంటి పురాతనాచారాలను అవలంబించడంపై శ్రద్ధపెట్టకపోవడంతో అవి కనుమరు గవుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారులు సృష్టిస్తున్న కల్లోల సందర్భాల నేపథ్యంలో పూర్వాచారాల అమలుపై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఆచారాలలో దాగున్న శాస్త్రీయత ఆధారంగా పునరాలోచించి తిరిగి ఆచరిస్తే ఫలితముంటుందని ఆయుర్వేద వైద్యులు, ఆధ్యాత్మిక గురువులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు,వేడుకలు, పండుగలు, వాస్తు సంబంధ విషయాలలో తరచుగా కొన్ని పూర్వాచారాలు గోచరిస్తుంటాయి.
సంప్రదాయక ఆరోగ్య సూత్రాలు
వెనకటి పెద్దలు మార్గనిర్దేశం చేసిన మాటలమాటున దాగున్న ఆరోగ్య సూత్రాలు మాత్రమే నేడు అనుసరిస్తున్నాం. నికార్సయిన కొన్నింటిని విస్మరిస్తున్నాం. భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి. సహజంగా స్త్రీలు వంటపాత్రలు శుభ్రం చేసే సందర్భంలో ఎక్కువసేపు నీళ్లలోనే కాళ్లు తడపాల్సి వస్తోంది కాబట్టి కాళ్లకు పసుపు రుద్దుకునేవారు. బ్యాక్టీ రియా సోకకుండా యాంటీ సెప్టిక్‌, యాంటీ బయాటిక్‌ గా పసుపు పనిచేస్తుంది. పెళ్ళిళ్ల లోనూ వధూవరులకు నలుగు పెట్టి పసుపు నీళ్ల స్నానం చేయించడం తెలిసిందే. సాధారణంగా శరీరం నలతగా ఉన్నప్పుడు- వేడినీళ్లలో వాయిలాకు వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేస్తే…ఎలాంటి నొప్పులున్నా కాస్తంత ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్లలో సున్నిపిండితో స్నానం మంచిదని చెబుతారు. అమ్మవారు (వైరల్‌ ఇన్ఫెక్షన్‌) సోకితే పిల్లలకు క్రిమికీటకాల పీడ వదలడానికి వేపాకుల్ని రోగి చుట్టూ రక్షణ కవచంలా పేర్చడం వంటి ఎన్నో పూర్వాచారాల్ని మరచిపోతున్నాం. మన ఇంటికి అతిథులైనా, బంధువులైనా వచ్చారంటే వెంటనే చెంబుతో నీళ్లు ఇచ్చి స్వాగతించడం ఆనవాయితీ. బయటి నుంచి వస్తారు గనుక కాళ్లు కడుక్కుని లోపలికి రావాలని చెప్పేవారు. చెప్పులు కూడా ఆరుబయట వదిలేయడం అప్పటివారి తప్పనిసరి అలవాటు. తద్వారా క్రిములు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాగే వండిన భోజనం వెంటనే తినమని పెద్దలు సూచించేవారు. చల్లారిన పదార్ధంలో క్రిములు చేరతాయని. అప్పట్లో ఆహార పదార్థాల తయారీకి మట్టి,ఇత్తడి,రాగి పాత్రలను ఉపయోగించిన తీరు అద్భుతం. వాటివల్ల పోషకాల నిల్వ పుష్కలంగా సమకూరుతుంది. కాలుష్యం బారిన పడే అవకాశమే లేదు. పర్వదినాల్లో ఇంటి గుమ్మాలకు తప్పనిసరిగా తోరణాలు కట్టేవారు. గతంలో ఇళ్లలో సూక్ష్మ క్రిముల తాకిడికి నివారణగా సాంబ్రాణి పొగ వేసేవారు. హిందూ సంప్రదాయ పండుగల్లో దర్శనమిచ్చే రకరకాల పిండి వంటకాల ప్రత్యేకతల వెనక కొన్ని ఆరోగ్య రహస్యాలు న్నాయి. తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ రోజున పచ్చడిలో, శ్రీరామనవమి నాటి బెల్లం పానకం లోనూ శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే దసరా, సంక్రాంతి పండుగ ప్రత్యేక వంటకాల్లో వాడే బెల్లం, నువ్వులు, వాము వంటివి దీని ప్రత్యేకత కలిగి ఉన్నాయి. బతికుంటే బలుసాకు తినొచ్చు నన్న సామెత ఊరకే పుట్టలేదు. పొలాల గట్లమీద, చిత్తడినేలల్లో బలుసాకు అరుదుగా లభిస్తుంది. దీన్ని పల్లెల్లో కొందరు వినాయక చవితి సమయంలో పులుసుగా, పప్పుతోనో వండుకుని తినడం అలవాటు. దీన్ని పచ్చడిగా తింటే అతిసారం తగ్గించడానికి, ఆకలిని పెంచడానికి తోడ్పడుతుంది. ఆషాఢమాసంలో పెట్టుకునే గోరింటాకు శరీరంలో వేడిని తొలగించి ఒత్తిడిని జయిస్తుంది. పూర్వం ఆదివాసులలో సామాజిక దూరం కాస్త కఠినంగా ఉండేది. ఆడపిల్లలు రజస్వల అయితే ఇంటికి దూరంగా ఉంచేవారు. ఏ పద్ధతి పాటిం చిన మానవతా దృక్పథంతో కూడి ఉండేవి. ఆ కాలంలో జనసమూహంలో ఎవరైనా తుమ్మినా అపచారంగా భావించేవారు. దాని చెడు ప్రభావం దృష్ట్యా కొన్ని సామాజిక దూరాలు పాటించేవారు. అలాగే అశుభాలకు సంబంధించిన ఆచారాల్లోనూ అదే జాగ్రత్త కనిపించేది. క్షౌరశాలకు, అంత్య క్రియలకు వెళ్లి వస్తే దేన్నీ తాకకుండా స్నానం చేశాకే ఇంట్లోకి వెళ్లడం అప్పటి సంప్రదాయం. వ్యాధులు సంక్రమించకుండా ఓ జాగ్రత్తగా ఇది సూచించేవారు. పురుళ్ల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలు ఉండేవి. మైల, అంటు వంటివి పాటించడంతో ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. వాటిని మూఢాచారాలుగా మార్చేసిన కొందరి వల్ల అటువంటి పద్ధతులపై విరక్తి, అనాసక్తి ఏర్పడ్డాయి. అందులోని శాస్త్రీయతను ఆరోగ్య సూత్రాలను కొట్టిపారేయలేం. మానవత్వానికి మచ్చలేని విధంగా ఆనాటి సంప్రదాయాలను పాటించడం, అనుసరించడం నేడు చాలా అవసరం.
ఇవీ ఆరోగ్యకారకాలే
వేకువ జామునే ‘సూర్యనమస్కారాలు’ చేయడం వల్ల శారీరక దృఢత్వం చేకూరటమే గాక శరీరానికి కాంతి కిరణాలు సోకి విటమిన్‌ ‘డి’ సమకూరుతుంది. వ్యక్తులు తారసపడితే చేతులు జోడిరచి నమస్కరించడం ఎంతో ఆరోగ్యకరం. నమస్కరించడంలో రెండు చేతుల వేళ్లు కలిసిపోయి ఆక్యుప్రెషర్‌ జరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరూ మెరుగవుతుంది. నుదుటన కుంకుమ బొట్టు ధరించడం హైందవ ఆధ్యాత్మికతకు ప్రతీకనే గాక నుదురులోని నాడులు ఉత్తేజితమై ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రతతో కూడిన మానసికోల్లాసం ఉట్టిపడుతుంది. పీయూష గ్రంథి ప్రేరేపించబడుతుంది. దీంతో రక్తపోటు, ఒత్తిడి, ఆందోళన వంటివి క్రమంగా తగ్గుతాయి. గుడిలో దైవాన్ని ప్రసన్నం చేసుకునే ముందు గంటలు కొట్టడం ఆధ్యాత్మి కాచారం. గంట మోగించడంతో ఆ ప్రాంతం లో ఓంకార ధ్వని విస్తరించి గాలిలో ఉండే (సూక్ష్మ) క్రిములు నశిస్తాయి. సద్దుల బతుకమ్మ సంస్కృతిలో ఆడపడుచులు సత్తుపిండి పంచిపెట్టడం వెనుక పోషకాల లేమి ఉండ కూడదనే ఆచారం వాడుకలో ఉంది. వీటిని మనం మరిచిపోయాం.ఇంటిలోకి విస్తారంగా గాలి, ధారాళంగా వెలుతురు ప్రవేశించేందుకు వాస్తు పండితులు తగు ప్రణాళికను సూచిస్తుంటారు. కిటికీల ద్వారా చల్లని గాలి (ఆమ్లజని) ప్రవేశిస్తూ, వెంటిలేటర్ల ద్వారా వేడి గాలి (బొగ్గు పులుసు వాయువు) బయటికి వెళ్ళడం వల్ల చల్లటి ఆహ్లాద వాతావరణం. చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్య కిరణాలు గదులలోకి ప్రసరిస్తే క్రిమి కీటకాలు నశిస్తాయి. పెద్దలు సూచించిన ‘చద్దన్నం’ శరీరానికి చలువ కలిగించడమే గాక కడుపులో అల్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. నేలపై చాప పరిచి కూర్చోని భోంచేయడం’ మన సదాచారం. ఇలా చేయడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరిగి, అజీర్తి సమస్యలు సమసిపోతాయి. భోంచేసేటప్పుడు కూర్చోవడానికి బాసుపీటలు ఉపయోగిస్తే కాళ్ల నొప్పులు రావు. అరిటాకు భోజనం చాలా శ్రేష్టమైనది. అరిటాకు ద్వారా ఆహారంలోని పోషకాలు యధాతధంగా శరీరానికి చేరతాయి. ఇది కాలుష్యరహితమైనదిగా గుర్తించాలి. పూర్వం రోజుల్లో భోజనం చేయడానికి మోదుగాకులు లేదా పారెటాకులతో చేసిన విస్తరాకులను వాడేవారు. అప్పట్లో మట్టి, రాగి, కంచు పాత్రల్లో భోజనం చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా కంచు పళ్ళెంలో ఆహారం భుజిస్తే జీర్ణశక్తి, మేధోశక్తి పెరుగుతుంది. ఉదరంలో ఆమ్లత్వం గాఢత తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. కరోనా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఆ తరం అలవాట్లను కొంతమేరకైనా ఒంటపట్టించుకోవాల్సిందే. విలువలతో, శాస్త్రీయతతో కూడిన మరిన్ని ఆచారాలపై భవిష్యత్తరాలకు తెలిసేలా ‘పాఠ్యాంశం’ గా ప్రవేశ పెడితే సమాజ ఆరోగ్యం, నైతిక విలువలు పెంపొందుతాయి.-గుమ్మడి లక్ష్మినారాయణ

ఖరీఫ్‌ సాగు`మెలకవలు

రోహిణిలో రోళ్ళ పగిలే అన్న సామెతను నిజం చేస్తూ, వేసవి (ఎండాకాలం) వెళ్ళిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో భానుడు భగ్గుమని 48 డిగ్రీల ఉష్ణవ్రతాపాన్ని చూపాడు. వర్యావరణం అతలాకుతలమై భూతాపం ఏ స్థాయికి చేరిందో మనం అనుభవించాం. అంతలోనే ప్రతీ చినుకు ముత్యంగా మెరుస్తూ కొంగొత్త ఆశల ఊసులను మోసుకొచ్చింది. ప్రకృతి మాత పచ్చని పచ్చిక బయళ్ళ చీరలో సింగారించుకొని రైతుల ముగింట్లో దర్శనమిచ్చింది. వేసవి ముగిసీ ముగియగానే కాస్త కునుకుపాటు తీస్తున్న రైతన్న ఒక్కసారి మళ్ళీ భూమాతకు భూరి దండాలు పెట్టుకొని వానాకాలం పంటల సాగుకు సర్వసన్నద్దమయ్యాడు. వేసవి దుక్కుల వలన చేలల్లో, చెలకల్లో నీరు ఇంకి తేమ నిలువ ఉండి విత్తనం విత్తడానికి, మొలకెత్తడానికి అనువుగా మారింది.

నాణ్యమైన విత్తనం విత్తి,నమ్మకమైన దిగుబడి సాధించే దిశగా రాష్ట్ర వ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. వరి,మొక్కజొన్న జొన్న పెసర, కంది,సోయాచిక్కుడు విత్తనాలను సుమారు 6 లక్షల క్వింటాళ్ళు రాయితీపై పంపిణీ చేసింది.
సేంద్రీయ ఎరువులు
నారుమడులు పోయాలనుకున్న భుములకు వేసవి దుక్కికి ముందుగానే హెక్టారుకు 5-10 టన్నుల పశువుల ఎరువును వేయాలి, నారు మడులను పోయడానికి పొలంలో 10వ భాగాన్ని ఎంపిక చేసుకోవాలి.ఎ0పిక చేసుకున్న పొలానికి 5-10 సె0.మీ.నీళ్ళు పెట్టిబాగా కలియ దున్నాలి.తరువాత మట్టెగడ్డలన్ని మెత్తగయ్య్లోలా బాగా దమ్ము చేయాలి. బాగా దమ్ము చేసిన తరువాత పొలం నుండి కలుపు మొక్కలు లేకుందా జాగ్రత్త పడాలి.
విత్తన మోతాదు
నాటే పద్ధతికి 20-25 కిలోలు,వెదజల్లటానికి (గరువు) భూముల్లో) 24-30 కిలోలు, వెద జల్లటానికి (గోదావరి జిల్లాల్లో) 16-20 కిలోలు,గొర్రుతో విత్తటావికి (వర్షాధారపు వరి) 30-36 కిలోలు, శ్రి పద్ధతిలో 2 కిలోలు సరి పోతుంది.
విత్తన శుద్ది
కిలో విత్తనానికి 2.5గ్రాముల కార్చండజిమ్‌ కలిపి 24గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్ళ కైతే లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్‌ కలిపి, ఆ ద్రావణంలో విత్తనాలను 24 గ0టలు నానబెట్టీ ,24 గంటలు మ0డెకట్టీ మొలకలను ద0ప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్త నాలు నానబెట్టడానికి లిటరు మందు నీరు సరిపోతుంది. పది లిటర్ల నీటికి 1.5 కిలోల ఉప్పు కలుపగా వచ్చిన ద్రావంలో ఎ0పిక చేసు కున్న విత్తనాన్ని పోసి పైకి తేలిన తాలు విత్తనా లను తీసివేయాలి. ఉప్పునీటిలో మునిగిన గట్టీ విత్తనాలను నారు పోయడానికి వాడుకోవాలి. మడిలో చల్లే ము0దు 24గంటల పాటు మంచి నీటిలో విత్తనాలను నానబెట్ఠాలి. విత్తనాల ద్వారా సంక్రమి0చే లెగుళ్ళ నివారణ కోస0 కిలో విత్తనానికి 3 గ్రా. దైరమ్‌ లేదా కాప్టాన్‌ మందును కలిపి విత్తన శుద్ది చేయాలి. నారు మడిలో చల్లేము0దు మొలకెత్తిన విత్తనాన్ని 0.2 శాత0 క్లోరిప్రేరిఫాస్‌ ద్రావణంలో నాసబెట్టీ చల్లుకోవాలి. దీనివల్ల నారుమడిలో ఆకు తినే పురుగులు,ఉల్లికోడు,మొవ్వపురుగు ఆశించకుండా ఉంటాయి.
నారుమడి
దమ్ము చేసిన నేలను 10మీ.పోడవు ఒకమీ. వెడల్పుతో నారుమడిని చేసుకోవాలి. నారు మడిలోని నీరు పోషకాలు బయటపోకుండా ఉండేలా గట్లు వేసుకోవాలి. గట్ట్లును సమంగాను గట్టిగాను పోయాలి.మడిలో చెతాచెదారం లేకుండా జాగ్రత్తపడాలి. నారుమడి బురద పదునులో ఉండాలి.నారుమడులు ఎత్తుగా ఉండేలా జాగ్రత్తపడాలి. రెండు మడుల మధ్యలో 20సెం.మీ వెడల్పులో కాలువ తీయాలి.కాలువలోని మట్టిని తీసి మడిలో వేసి నారుమడిని ఎత్తుగా చేసుకోవాలి. నారుమడి మొత్తం చదునుగా ఉండాలి.
సస్యరక్షణ
విత్తిన 10రోజులకు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళి కలు సెంటు నారుమడికి 160గ్రా చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6మి.లి లేక క్లోరిఫైరిఫాన్‌ 2.0మి.లి.లీటరు నీటికి కలిపి విత్తిన 10రోజులకు మరియు 17రోజులకు పిచి కారి చేయాలి లేదా నారు తీయటానికి 7 రోజు ల ముందు సెంటు నారుమడికి 160 గ్రా కార్బోఫ్యూరాన్‌ గుళికలు తక్కువ నీటిలో వేయా లి జింకు లోపాన్ని గమని లీటరు నీటికి 2గ్రా జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారి చేయాలి. చలిఎక్కువగా ఉండే దాళ్వా వరి సాగులో జింకులోప లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి.
నాటు
నారు తీసేటపుడు మొక్కలు లేతాకుపచ్చగా వుంటీనే మూన త్వరగా తిరుగుతుంది. నాలుగు నుండి ఆరుఆకులున్ను నారును ఉపమోగిం చాలి.ముదురు నారును నటితే దిగుబడి తగ్గు తుంది. నాటు నాటితే పిలకలు ఎక్కువగతొడిగే అవకాశముంది. నట్టువేసేతప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీప్‌లోచ/మీ/కు 33 మూనలు, రబీలో 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండుమీటర్లకు 20సెం.మీ.బాటలు తీయటం వలన ఫైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడిపిడాల ఉదృతి కొంతవరకు అదుపుచేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు,కలుపు మందులు వెయ టానికి ఇంకా ఫైరు పరిస్ధితిని గమనించటానికి ఈ బాటలు బాగా ఉపమోగపడతాయి. వరిరకాల కలపరిమితిని బట్టి కుదుళ్ళు సంఖ్య ను నిర్దారించాలి. భూసారం ఎక్కువ ఉన్న పోలాల్లో తక్కువ కుదుళ్ళు ,భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేటట్లు నాటాలి. ముదురు నారు నా టిన పుడు కుదుళ్ళు సాంఖ్యను పెంచి,దగ్గర దగ్గరగా,కుదురుకు 4,5 మొక్కలు చొప్పున నాటు వేయాలి. అలా ముదురు నారు నాటి నాపుడు నత్రజని ఎరువును మూడు దఫాలుగా గాక,రెండు దఫాలుగా-అంటే 70శాతం దమ్ము లోను మిగితా30 శాతం అంకురం దశలోనూవాడాలి.
పచ్చిరోట్టి పైర్లు
వరి మగాణుల్లో అపరాలు,జిలుగు ,జను ము,పిల్లిపెసర లాంటి ప్చ్చిరోట్టి పైర్లను వంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరుగుడమే కాక సుమారు 20-25శాతం నత్రజని, భాస్వీ రం,పొటాష్లను కూడాఅదా చేయవచ్చు.
సేంద్రియ ఎరువులు
పశువుల ఎరువు,కంపోషు,కోళ్ళు ఎరువులను ,రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25 శాతం వరకు నత్రజనిని అదా చేయవచ్చు.
రసాయనిక ఎరువులు
భూసారాన్ని బట్టీ రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయంచి నత్రజని, భాస్వరం, ఫొటాష్‌, జి0కు నిచ్చే ఎరువులను సమతు ల్యంగా వాడాలి. నత్రజనిని కాంప్లేక్సు ఎరువుల రూపలలోగాని, యూరియా రూపలలో గాని వాడపచ్చు. నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి, నాటుటకు ముందు దమ్మలోను దుబ్బుచేసే దశలోను, అంకురం దశలోను, బురదపదనులో మాత్రమే సమాన0గా వెదజలల్లి 36-48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్ఠాలి. 50 కిలోల యూరియాకి 10కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి, 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లీతే సత్రజని విని యోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరు వును దమ్ములోనే వేయాలి. పొటొష్‌ ఎరువులను రేగడి నేల్లలో ఆఖరి దమ్ములో పూర్తీగా ఒకేసారి వేయాలి-చల్క (తేలిక) భూముల్లో ఆఖరి దమ్ములో సగం. అకురం ఏరఎడు దశలో మిగతా సగాన్ని వేయాలి.కాంప్లేక్స ఎరువులను ఫైపాటుగా దుబ్బు చేసే సమయంలలో గాని, అంకురం ఏర్చడే దశలోగాని వేయకూడదు. దమ్ములోనే వేయటం మంచిది.
వేప పిండి
50కిలోల యూరియాకి10 కిలోల వేపపిండి లేక 250కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి,2రోజులు నిల్వ ఉంచివెదజల్లితే నత్రజ నిన వినియోగం పెరుగుతుంది.
నీలి ఆకుపచ్చ శైవలాలు – నాచు
వీటిని వరి పొలంలో వేసి ఎకరాకు 10కిలోల నత్రజని పైరుకురు అందుతుంది. నాచు నేలలో కలిపి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. నాచును పొడి చేసి వరినాట్లు వేసిన 10-20 రోజుల మధ్య మడిలో పలుచగా నీరు నిలువ గట్టీ ఎకరాకు 4కిలోల నాచుపొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమాసంగా పడేటట్టు చల్లాలి.
సామగ్ర పోషక యాజమాన్యం
భూసార వరిరక్షణకు, ఉత్పత్తి స్తబ్దతను అధిగమమించటానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ లేదా జీవన ఎరువులను వాడి, ప్తెరుకు సమతుల్యంగా పోషక పదార్దాలను అందజేయాలి. పశువుల ఎరువు, కంపోషు. కోళ్ళ ఎరువులను,రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25శాతం వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు. వరి మాగాణురల్లో అపరాలు,జీలుగు,జనుము, పిల్లెపెసర లాంటి పచ్చిరొట్ట ప్తెర్లను పెంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరగడమే కాక షుమారు 20-25శాతం నత్రజని, భాస్వర,పొటొష్‌లను కూడా ఆదా చేయ వచ్చు.
-గునపర్తి సైమన్‌

సెకండ్‌ వేవ్‌..కరోనా చెబుతున్న నిజం

కరోనా సృష్టిస్తున్న విలయానికి నేడు పేదోడికి అరవై గజాల ఇంటి స్థలం కాదు, స్మశానంలో ఆరడుగుల నేల ఓకలగా మారింది. దేశంలో రెండోదశ కరోనా వ్యాప్తి ప్రకంపనలు సృష్టిస్తున్నది….. ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. అదే సందర్భంలో మన ప్రభుత్వ పెద్దల పగటి వేషాలనూ,ప్రచార వ్యామోహా లనూ,ఉత్తరకుమార ప్రగల్భాలనూ పట్టి చూపిస్తున్నది.‘వట్టి మాటలు కట్టిపెట్టోరు గట్టిమేల్‌ తలపెట్టవోరు’ అన్నాడు మహాకవి గురజాడ. కానీ ఇప్పుడు గట్టిమేలును కట్టిపెట్టి వట్టిమాటలు పలుకుతున్న పాలక నేతల బండారాన్ని నిట్ట నిలువునా బట్టబయలు చేస్తున్నది కరోనా.

దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు,వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనాపై పోరు సాగిస్తున్న వైద్యులు ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నారు. కోవిడ్‌పై పోరు సాగిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు ముందుండి సేవలందిస్తున్నారు. అయితే.. కరోనా బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడుతున్న క్రమంలో వైద్యు లు కూడా ఈమహమ్మారి కాటుకు బలవు తున్నారు. కరోనా కారణంగా గతేడాది దేశ వ్యాప్తంగా 730 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పో యారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వెల్లడిర చింది. సెకండ్‌ వేవ్‌లోనూ ఈమహమ్మారి వైద్యులపై పంజా విసురుతోందని పేర్కొంది.అయితే.. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని ఐఎంఏ ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క రోజులో 50 మంది వైద్యులు మరణించారని మెడికల్‌ అసోసియేషన్‌ ఆవేదన వ్యక్తంచేసింది. సెకండ్‌ వేవ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 244 మంది వైద్యులు కరోనా కారణంగా మరణించినట్లు భారత వైద్య సంఘం వెల్లడిరచింది.
కరోనా సెకండ్‌ వేవ్‌ లక్షణాలేంటో తెలుసా?
భారతదేశంలో కోవిడ్‌-19తీవ్రంగా చాలా మం దిని ప్రభావితం చేస్తోంది. మొదటి వచ్చిన వైరస్‌తో పోల్చుకుంటే ఈవైరస్‌ చాలా ప్రమాదమని నిపు ణులు కూడా చెబుతున్నారు. వైరస్‌లో కొత్త వేరియంట్స్‌ కూడా మనం చూస్తు న్నాం. అనుకోని లక్షణాలు కూడా చాలా మందిలో వేధిస్తున్నాయి. సాధారణంగా శ్వాస ఆడకపోవడం,కొద్దిగా జ్వరం ఉండడం,దగ్గు,తలనొప్పి,ఒళ్లునొప్పులు,గొంతు బాగా లేకపోవడం,రుచి తెలియక పోవడం,వాసన తెలియకపోవడం,నాసల్‌ కాంజిషన్‌,నీరసం, అల సట వంటి లక్షణాలు కన బడుతున్నాయి.
శ్వాస ఆడకపోవడం
శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం చాలా మందిలో కనుగొనడం జరిగింది. చాలా మంది కరోనా బారిన పడిన వాళ్ళు శ్వాస సంబం ధిత సమస్యలకు గురవుతున్నారు. నిజంగా దీని వల్ల చాలా మంది మరణిస్తున్నారు కూడా. ఒక పక్క చూస్తే అక్సిజన్‌ కొరత కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. దీంతో నిజంగా ఈ సమస్య నుండి బయట పడటం కష్టమని అనిపిస్తోంది. అలాగే శ్వాస అందకపోవడంతో పాటు గుండెల్లో గట్టిగా పట్టేసినట్టు వంటివి కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు.దీనితో ఊపిరితిత్తుల సమస్యలు కూడా అధికమవుతున్నాయని రోగులు అంటు న్నారు.
గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌
కరోనా వైరస్‌ బారిన పడిన వాళ్ళలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ కూడా వస్తున్నాయి ముఖ్యంగా అరుగుదల,నోరు,ఫుడ్‌ పైప్‌, కడుపు నొప్పి, పెద్ద పేగులో ఇబ్బందులు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం మరియు పూర్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడం లాంటివి వస్తున్నాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ కారణంగా వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది.
వినబడక పోవడం
కొంతమందిలో వినబడడం లేదట. కొంత మందికి అసలు వినబడకపోవడం మరికొందరిలో కొద్దిగా మాత్రమే వినపడడం లాంటి సమస్యలు వస్తున్నాయి. కరోనా వైరస్‌ సోకిన మొదటి వారంలో ఈలక్ష ణాలు చూడొచ్చు. ఆతర్వాత ఇన్ఫెక్షన్ని బట్టి ఈ సమస్య ఎదురవుతోంది. ఇలా ఈ లక్షణాలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
చాలా నీరసంగా ఉండడం
కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో నీరసం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అదే విధంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, అలసటగా అనిపించడం, నీరసంగా అనిపించడం లాంటివి కనబడుతున్నాయి. ఇవి కూడా కరోనా వైరస్‌ సోకినట్లు లక్షణాలు అని గుర్తించాలి.
కళ్లు ఎర్రబడటం
కరోనా వైరస్‌ సోకిన వాళ్లలో కళ్లు ఎర్రబడటం, వాపు ఉండడం లాంటి లక్షణాలు కూడా కనబడు తున్నాయి. కళ్ళు దురద పెట్టడం, ఎర్రగా అయి పోవడం, కళ్ళల్లో నుండి నీరు కారడం లాంటివి కూడా కరోనా లక్షణాలు అంటున్నారు. అయితే ఈ రెండిటికీ మధ్య కనెక్షన్‌ ఏమిటి అనేది చూస్తే… మామూలుగా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారాకానీ డ్రాప్లెట్స్‌ద్వారాకానీ ఎవరైనా మాట్లా డినా,తుమ్మినా,దగ్గినావ్యాపిస్తుంది అని తెలుసు. అయితే ఇన్ఫెక్షన్‌ ఎవరికైనా సోకితే వాళ్ళు చేతులు కళ్ల మీద పెట్టుకోవడం వల్ల కంటి ఇన్ఫెక్షన్స్‌ కూడా వస్తాయని అదే విధంగా ముక్కు నోరు కూడా ఇన్ఫెక్ట్‌ అవుతాయని అంటున్నారు. కాబట్టి కళ్ళల్లో ఇరిటేషన్‌, ఐసెన్సిటివిటీ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
నోరు ఆరిపోవడం
నోరు ఎక్కువగా ఆరి పోవడం లాంటివి కూడా కరోనా కి కొత్త లక్షణాలు అని చెప్తున్నారు. జీర్ణానికి నోరు సహాయ పడుతుంది అదే విధంగా పళ్ళు కూడా జీర్ణానికి అవసరం. అయితే ఒక వేళ కనుక సరైన సలైవా ప్రొడ్యూస్‌ అవ్వక పోతే అప్పుడు నోరు ఆరి పోతుంది దీని కారణంగా పంటి సమస్యలు మరియు దంతాల సమస్యలు వస్తాయి.
కరోనా వైరస్‌ సోకిన వాళ్ళకి నోరు ఆరి పోవడం కూడా కొత్త లక్షణంగా గుర్తించారు. అది మ్యూకస్‌ లైనింగ్‌ ఏర్పాటు చేస్తుంది దీని కారణంగా ఇది ప్రొడ్యూస్‌ అవ్వదు దీంతో నోరు ఆరిపోతు ఉం టుంది. గొంతు కూడా ఆరిపోయినట్లు ఉంటుంది కాబట్టి కరోనాకి ఇవి కూడా కొత్త లక్షణాలను గుర్తించాలి.కరోనా వైరస్‌ సోకిన వాళ్ళల్లో డయేరియా సమస్య కూడా వేధిస్తోంది. ఇది ఒకటి నుంచి 14రోజుల వరకు ఉంటుంది. అజీర్తి సమ స్యల కారణంగా డయేరియా సమస్య కూడా రావచ్చు. కాబట్టి కరోనా పాజిటివ్‌ వచ్చిన వాళ్ళల్లో డయేరియా వస్తుంది గుర్తించండి.
తల నొప్పి
తలనొప్పి కూడా కరోనా వైరస్‌ వచ్చినట్టు లక్షణం. మామూలుగా వచ్చే తల నొప్పి కంటే ఇది ఎక్కువ సేపు ఉంటుంది. కరోనా వైరస్‌ వచ్చిన వాళ్లకి తల నొప్పి కూడా తీవ్రంగా వేధిస్తున్నట్లు గుర్తిం చారు. కరోనా వైరస్‌ వచ్చిన వాళ్లకి చర్మ సమస్యలు కూడా ఉంటున్నట్లు గుర్తించారు.
యువతనూ వదలట్లే
మంచి ఆరోగ్యంతో ఉన్నవారు,యువకులకూ కరోనా సోకడం సెకండ్‌ వేవ్‌ లో ఎక్కువగా జరుగుతోంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారినీ కరోనా వదలట్లేదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. కొత్త మ్యూటెంట్ల మీద వ్యాక్సిన్‌లు అంతగా పని చేయక పోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయినా సరే టీకా వేయించుకోవాలని డాక్టర్లు సూచి స్తున్నారు. దీని వల్ల వైరల్‌ లోడ్‌ తగ్గడంతో పాటు ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా ఉండొచ్చని చెబుతు న్నారు. దీంతోపాటు మాస్కులను కట్టుకుంటూ.. చేతులను, ముట్టుకున్న వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకుంటూ ఉండాలని సలహాలు ఇస్తున్నారు.
పాలకుల అస్త్రసన్యాసం – ప్రజలకు ప్రాణసంకటం
దేశవ్యాప్తంగా కోవిడ్‌ రెండో దశ వ్యాప్తి గురించి ఆందోళనకరమైన వార్తలు వినపడుతున్నాయి. ఆదివారం ప్రధాన పత్రికలన్నీ కనీసం నాలుగు పేజీలకు తక్కువగాకుండా కోవిడ్‌ వ్యాప్తి గురించిన వార్తలు ప్రచురించాయి. శనివారం సాయంత్రం ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య అవసరాలకు వినియోగించే ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా గురించి సమీక్షించినట్టు టీవీలు వార్త ప్రసారం చేశాయి. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో ప్రధాన కార్పొరేట్‌ ఆస్పత్రులు తమవద్ద ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు కరిగిపోయాయనీ, రోగులు వేరే ఆస్పత్రుల్లో భర్తీ కావాలని హెచ్చరిస్తున్నాయి. తాజాగా ఢల్లీి రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్‌ లేనందున అత్యవసర లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు రాజస్థాన్‌ ప్రభుత్వంకూడా 15రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లలో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిద్‌ నియంత్రణ విషయంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆయా రాష్ట్ర హైకోర్టులు చివాట్లుపెట్టాయి. కోవిడ్‌ కారణంగా ఎంతమంది చనిపోతున్నారో వివరాలు కూడా ఇవ్వకుండా మూకుమ్మడి దహన సంస్కారాలు స్వయంగా ప్రధాని ప్రాతినిధ్యం వహించే వారణాసితో సహా ఉత్తరప్రదేశ్‌ అంతటా నిత్యకృత్యంగా మారాయి. స్మశానాల్లో శవాలు కాల్చే స్థలం లేక వచ్చిన శవాలను కుప్పలు పోసి కాలుస్తున్న వీడియోలు వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్నాయి. అయినా గత ఏడాది ఇదే సమయంలో రోజువారీ విలేకరుల సమావేశాలు నిర్వహించిన కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇప్పుడేమి చేస్తుందో ఎవ్వరికీ అంతుచిక్కటం లేదు. పోయిన ఏడాది కనీసం వందకుపైగా జీఓలు, సర్కులర్‌లు జారీ చేసిన కేంద్ర హౌంశాఖ చేష్టలుడిగి చూస్తోంది. ప్రధానంగా దేశంలో వాక్సిన్‌ కొరతకు మూడు కారణాలున్నాయి. గతంలోనే ఫైజర్‌, స్పుత్నిక్‌లు తమ వాక్సిన్‌ భారతదేశంలో సరఫరా చేయటానికి వీలుగా అత్యవసర అనుమతులు కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి. కానీ అప్పటికే భారత్‌ బయోటెక్‌తో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్న కేంద్రం దేశంలోకి మరే ఇతర వాక్సిన్‌ దిగుమతి కానీయకుండా అడ్డుకుంది. ఇది మొదటి కారణం. కేంద్రం రూపొందించిన వ్యాక్సిన్‌ పంపిణీ ప్రణాళిక రెండో కారణం. ఈ ప్రణాళికకు మూడు లక్ష్యాలున్నాయి. మొదటిది దేశంలో కోవిడ్‌ నియంత్రణ, రెండోది విదేశాలకు ఎగుమతి. ఈ రెండూ మౌలిక లక్ష్యాలు. ఈ రెండిరటి పర్యవసానంగా విదేశాలకు వ్యాక్సిన్‌ అవసరాలు తీర్చటం ద్వారా దౌత్య సంబంధాల్లో పై చేయి సాధించాలన్నది మూడో లక్ష్యంగా ఉంది. సోకాల్డ్‌ సంపన్న దేశాలు దీనికి భిన్నంగా ఏకైక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అమెరికా, రష్యాలు ముందుగా తమ దేశంలోని పౌరులందరికీ కావల్సినంత వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో వ్యవహరించాయి. మచ్చుకు ఓ ఉదాహరణ. దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి కెనడా ప్రధాని, పార్లమెంట్‌ మద్దతు ప్రకటించాయి. నాలుగు నెల్ల తర్వాత భారతదేశం నుంచి కోవ్యాక్సిన్‌ దిగుమతి చేసుకున్న కెనడా ప్రభుత్వం రైతు ఉద్యమం పట్ల తన వైఖరిని మార్చుకుంది. దీన్నే దౌత్య విజయంగా బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తూ సంబరం చేసుకున్నాయి. విదేశాల్లో అమ్ముకోవటానికి భారత్‌ బయోటెక్‌కు అనుమతించేందుకు వీలుగా దేశంలో వ్యాక్సిన్‌ వితరణ కార్యక్రమాన్ని దశలవారీ కార్యక్రమంగా మార్చారు. తొలుత మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య మూడు వారాల వ్యవధి అని నిర్ణయించారు. కానీ కావల్సినంత వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవటంతో ఈ వ్యవధికి పెంచారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువశక్తి కలలిగిన దేశమని గొప్పలు చెప్పుకుంటూనే దేశంలో యువతకు వ్యాక్సిన్‌ అందించే విషయంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. వ్యాక్సిన్‌ కొరత ఏ స్థాయిలో ఉందంటే ఒక్క శనివారం నాడు తెలంగాణలో లక్షన్నర డోసుల అవసరం ఉంటే కేవలం ఐదువేల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అందువలన వ్యాక్సిన్‌ వితరణ కార్యక్రమాన్ని నిలిపి వేస్తున్నట్లు తెలంగాణ వైద్యశాఖాధికారులు ప్రకటించారు. మార్చి 24 నాటికి భారతదేశం విదేశాలకు ఆరు కోట్ల డోసులు ఎగుమతి చేస్తే స్వదేశంలో ప్రజలకు ఇచ్చింది మాత్రం ఐదు కోట్ల డోసులే. అంటే దేశంలో ప్రజల ప్రాణరక్షణ కంటటే విదేశీ వ్యాపారమే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన పనైంది. కూతవేటు దూరంలో వ్యాక్సిన్‌ తయారవుతున్న తెలంగాణ పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన రాష్ట్రాల దుస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దేశ ప్రజల ప్రాణ రక్షణ కంటే విదేశాల్లో మోడీ ఫ్లెక్సీలు కట్టించుకోవటానికి వ్యాక్సిన్‌ ఎగుమతి చేసిన ఫలితమే నేడు దేశంలో వ్యాక్సిన్‌ కొరత ప్రదాదకర స్థాయికి చేరింది. చివరి కారణం వ్యాక్సిన్‌ తయారీ పూర్తిగా ప్రైయివేటు రంగానికి వదిలేయటం. దేశంలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలు నాలుగు. చెన్నైలోని కింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌, బీసీజీ వ్యాక్సిన్‌ లాబ్‌లు, కసౌలిలోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, కూనూర్‌లోని పాశ్చర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా. కేంద్రం అనుసరిస్తూ వచ్చిన ప్రయివేటీకరణ విధానాలతో ఈ సంస్థలు మూతపడ్డాయి. 2012లో ప్రజా ప్రయోజన వాజ్యం ద్వారా మూడు సంస్థలు పున్ణప్రా రంభించినా వాటిని పని చేయించటానికి కావల్సినన్ని నిధులు కేంద్రం సమకూర్చక పోవటంతో కుదేలయ్యాయి. కానీ కోవాక్సిన్‌ తయారు చేయటానికి ప్రయివేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో సమకూర్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యాక్సిన్‌ తయారీ వంటి ప్రాణరక్షణ సేవలను సైతం ప్రయివేటీకరించటం నేటి వ్యాక్సిన్‌ కొరతకు మూడో కారణం. ఇక ఆక్సిజన్‌ కొరత గురించి. కేంద్రం శాసనసభ ఎన్నికల పర్వంలోనో పాండిచ్చేరి ప్రభుత్వాన్ని కూల్చే పనిలోనో లేక గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు తనవంతు సహకారాన్ని అందించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్‌ అరోరాను గోవా గవర్నర్‌గా నియించే పనిలోనో తీరుబడిలేనంతగా తలమునకలై ఉంది. దాంతో దేశాన్ని చట్టుముడుతున్న కోవిడ్‌ రెండో ఉప్పెన ప్రభుత్వం కంటికి కనిపించలేదు. కేవలం 150కోట్ల రూపాయల ఖర్చయ్యే ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ నిర్మాణానికి కావల్సిన టెండర్లు పిలవటానికి అమాత్యులు ఆర్నెల్ల పాటు ఫైలు నడిపారంటే ఇక్కడ ప్లాంట్‌ నిర్మాణం లక్ష్యం ఏమిటో అర్థమవుతుంది. మార్చి 24, 2020న ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటిస్తూ దేశాన్ని లాక్డౌన్‌లోకి నెట్టిన కేంద్రం గత సంవత్సరం అక్టోబరు 21వరకూ కోవిడ్‌ చికిత్సకు కీలకమైన ఆక్సిజన్‌ సరఫరా మీద దృష్టి పెట్టలేదు. టెండర్లు ప్రకటించిన తర్వాత కూడా కాంట్రాక్టు ఖరారు చేసి ప్లాంట్‌ నిర్మాణం మొదలు పెట్టలేదు. ఈ వైఫల్యాలన్నీ కప్పిపెట్టుకోవటానికి ఓ వంద ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లకు అనుమతిస్తున్నట్టు ప్రధాని గత వారం ప్రకటించారు. గత ఏడాదే దేశంలో వైద్య సేవలకుపయోగించే ఆక్సిజన్‌ తయారీ కొరతను గమనించిన ప్రభుత్వం రెండో ఉప్పెన సమయానికి కూడా తగినంత ఆక్సిజన్‌ నిల్వలు సిద్ధం చేసుకనేందుకు ప్రయత్నం చేయకపోవటం క్షమించరాని నిర్లక్ష్యం. కోవిడ్‌ నియంత్రణలో పాలకుల అస్త్ర సన్యాసం కారణంగా భారతదేశం కోవిడ్‌ నియంత్రణలో ఘోరంగా విఫలం కావటం ఓవైపు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తుంటే మరోవైపున ప్రజలకు ప్రాణగండంగా మారింది.- సైమన్‌ గునపర్తి

ఎన్నాళ్ళీ…మండేకాలం…..?

కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే. అంతెకాకుండా మండుతున్న మండువేస‌వి సాక్షిగా ధ‌ర‌లు పెంచేసి ప్ర‌జ‌ల న‌డ్డి విరిస్తున్నారు.

ఇది ”మంటలకాలం”. ఒకవైపు ఎండలు మండుతున్నాయి. ఈ మంటలకు ముందునుండే ధరలు మండుతున్నాయి. ఆకలితో ప్రజల కడుపులూ మండుతున్నాయి. ఇరుగున సీతమ్మ పుట్టిల్లని చెప్పుకునే నేపాల్‌లో, పొరుగున రావణరాజ్యం అని భావించే శ్రీలంకలోనూ లేని మంటలు… మోడీగారి రామరాజ్యంలో మాత్రం ప్రజలను మలమల మాడుస్తున్నాయి. అందుకని ఇది ఎండాకాలం మాత్రమే కాదు, మండేకాలం. అంతేకాదు, కడుపు మండి మిడతలు కూడా దండయాత్రలు చేస్తున్న కాలం. మరి బతుకులే మండుతుంటే మనుషులేం చేయాలో తేల్చుకోవాల్సిన కాలం…
తాజాగా మోడీ సర్కార్‌ వంటగ్యాస్‌ ధర పెంచి ఈ మంటలను మరింత ఎగదోస్తోంది.. ఫలితంగా గ్యాస్‌బండ కాస్తా గుదిబండగా మారింది. వేయికి చేరువలో మోయలేని భారమై కూర్చుంది. ఎట్లా బతుకాలో అర్థం కాక ప్రజలుంటే.. అధికారపార్టీ నేతలేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరో మాట వల్లిస్తూ ప్రజలను మాయజేస్తున్నారు. నాడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పెరిగిన చమురు ధరలపై మోడీ ఏమన్నారు? ”ఇది ముమ్మాటికీ యూపీఏ ప్రభుత్వ వైఫల్యం మాత్రమే” అన్నారు. అది నూటికి నూరుపాళ్లూ నిజం కూడా. మరిప్పుడు పెట్రోల్‌ వాత, గ్యాస్‌ మోత లేకుండా దినం గడవని స్థితికి చేరింది మోడీ పాలన..! దీనికి ప్రధానిగా, ప్రభుత్వాధినేతగా ఏం సమాధానమిస్తారు? విచిత్రమేమిటంటే ఇప్పుడు కూడా ఆయన, ఆయన భక్తబృందం ఇది గత ప్రభుత్వ వైఫల్యమేనని సెలవిస్తారు..! ప్రజలు ఎంత అమాయకులని భావిస్తే ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడగలరు..!? ఆయన మొదటిసారి ఢిల్లీ పీఠంపై కొలువుదీరే నాటికి (2014) 14.2కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 414. అదిప్పుడు అక్షరాలా ఎనిమిదివందల డెబ్బయ్యొక్క రూపాయల యాభై పైసలు. అంటే ఈ ఏడేండ్ల మోడీ పాలనలో అది ఏకంగా రూ.457.50 పెరిగింది. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరల సంగతి చెప్పనవసరం లేదు, వాటిది విరామమెరుగని పరుగు… మరి ఇది ఎవరి వైఫల్యం..? ప్రజలు నిజం తెలుసుకోవాలి?
”స్వేచ్ఛా విపణి” కోసం మోడీ సర్కార్‌ వెంపర్లాటను 2017 జూన్‌ మధ్య నుంచి దినసరి ధరల యంత్రాంగం (డైలీ ప్రైస్‌ మెకానిజం)తో లింక్‌ చేసారు. అంతర్జాతీయ ధరల 15రోజుల సగటుపై ఇది నిర్ణయమవుతుంది. మన దేశంలో క్రూడ్‌ ఆయిల్‌ విస్తృతంగా లభిస్తుంది. సహజవాయువూ దొరుకుతుంది. వాటిని బయటికి తీసే ఖర్చు, శుద్ధి చేయడానికయ్యే ఖర్చు, ఆ కంపెనీ లాభం, రిటైల్‌ రవాణా ఖర్చుతో కలుపుకున్నా రూ.40 దాటదు. నేడు మనం చెల్లిస్తున్న ధరలో 60శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులే కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దేశంలోనూ పెరుగుతాయి, తగ్గితే తగ్గుతాయి అన్నారు. కానీ అంతర్జాతీయంగా ముడి చమురు ధర పీపా 25డాలర్లకు తగ్గినప్పుడు కూడా మన దేశంలో నయా పైసా తగ్గలేదు. ఈ పాపం మోడీ సర్కారుది కాదా..?!

చమురు ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాటి వినియోగదారుల మీద మాత్రమే ఉండదు. అది మొత్తం రవాణా వ్యవస్థనే ఖరీదైనదిగా మార్చడంతో పాటు, ఆ రవాణా మీద ఆధారపడిన సకల సరుకుల ధరలనూ మండిస్తుంది. ఫలితంగా ప్రజారవాణే కాదు, సమస్త వస్తువులూ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. ప్రత్యేకించి నిత్యావసరాలు భగ్గుమంటాయి. ఇప్పటికే ఈ నిరంతర పెరుగుదల పరంపరలో నింగినంటిన నిత్యావసరాలు పేదల కడుపుల్లో అగ్గిరాజేస్తున్నాయి. ఒకవైపు ఆర్థికమాంద్యం, మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఉపాధికోల్పోయి, ఆదాయాలు క్షీణించి కనీస అవసరాలకు కూడా అల్లాడుతున్న జనంపై ఇది పెనుభారం. ప్రపంచ ఆకలి సూచిలో దేశం అట్టడుగు స్థానంలో ఉండటమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. అయినా ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కనికరమన్నదే లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా కేవలం ఏడు నెలల్లో (2020 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు) కేంద్ర ఎక్సయిజ్‌ పన్ను ద్వారా చమురు ఖాతా నుంచి రూ.1,96,342కోట్లు పిండుకున్నారు. అంతకు ముందు సంవత్సరం అదే వ్యవధిలో దండుకున్న మొత్తం రూ.1,32,899కోట్లు కావడం గమనార్హం. అంటే కరోనా కాలంలో కూడా జనాన్ని మరింత పీల్చి పిప్పి చేసిన ఘరానా ప్రభుత్వమిది.
జీవితావసరాల నుంచి నిత్యం భావోద్వేగాల వైపు దృష్టి మళ్లిస్తూ ప్రజలను దొంగదెబ్బ తీయడంలో ”మహాగొప్ప నైపుణ్యం” ఈ ప్రభుత్వానిది. నొప్పి తెలియకుండా కడుపులో కత్తులు దించగల ”నేర్పు” ఈ ప్రభుత్వాధినేతలది. ఎంతటి భారాలూ ఘోరాలనైనా అతి సహజమైన విషయాలుగా చెప్పి ప్రజలను వంచించగల తెలివితేటలు వారివి..! లేదంటే మండుతున్న ధరలు తగ్గించమంటుంటే మందిర నిర్మాణానికి చందాలు అడుగడాన్ని ఏమనాలి..?! ఉద్యోగాలు కావాలని జనమడుగుతుంటే ఉపాధిరంగాన్నంతా ధనవంతులకు తెగనమ్మడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి..?! తాము ఏం చేసినా దేశం కోసమేనంటూ ‘దేశభక్తి’ ముసుగులో జనాన్ని నమ్మించి గొంతుకోయడం వారికి ఓ అలవాటుగా మారింది. అందుకే ”ఏ మాటల వెనుక ఏ వర్గప్రయోజనాలున్నాయో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు” అంటారు లెనిన్‌.
అంగట్లో దేశం..
కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్‌ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో. ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు. ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే.
సామ్రాజ్యవాదులపై రెండు శతాబ్దాలుగా పోరాటంలో పాల్గొన్నవారికి ఆనాటి స్థితిగతుల్లో మార్పు కోసం ఎన్నో స్వప్నాలు, మరెన్నో ఆకాంక్షలు. అవే స్వాతంత్య్రానంతరం ప్రభుత్వరంగమై వెలిసాయి. ఇది సంపన్నదేశాల ప్రభుత్వరంగం వంటిది కాదు. 1947నాటికి ఒక అత్యంత వెనుకబడిన, వ్యవసాయక దేశంలో ఆవిర్భవించిన ప్రభుత్వరంగం. ఇది రెండు కర్తవ్యాలను నిర్వర్తించాల్సి ఉంది. మొదటిదీ కీలకమైనదీ, దెబ్బతిన్న పెద్దపులిలాంటి సామ్రాజ్యవాదం తిరిగి పంజా విసరకుండా దేశాన్నీ, దేశ సార్వభౌమత్వాన్నీ కాపాడటం. రెండవది భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం. అయితే సహజంగానే స్వాతంత్య్రానంతర భారత పాలకులకుండే ”వర్గ”నైజం రీత్యా భారత పెట్టుబడిదారులకవసరమైన మౌలిక సరుకులు, గనులు, భారీ యంత్రాలు, విద్యుత్‌, నౌకా నిర్మాణం, చమురు తవ్వకం, శుద్ధి చేయడం మొదలైనవన్నీ ప్రభుత్వరంగంలో చేస్తూ, వినిమయ సరుకుల ఉత్పత్తి మాత్రం పెట్టుబడిదారులకే వదిలేసారు. మొదట్లో పాలకులు దీన్ని మిశ్రమార్థిక వ్యవస్థంటూ ముద్దుగా పిలుచుకున్నా దేశంలో నిర్మితమైంది ఫక్తు పెట్టుబడిదారీ విధానమే! అయితే జాతీయోద్యమ ఆకాంక్షల ఫలితంగా నిర్మితమైన ప్రభుత్వరంగానికి లాభనష్టాలు ప్రాతిపదిక కానే కాదు. సామాజిక న్యాయం, ప్రజల ప్రయోజనాలు, దేశ శ్రేయస్సు మాత్రమే ప్రాతిపదిక. ప్రయివేటు సంస్థలకు సొంత ప్రయోజనాలూ, లాభాలవేటే ఏకైక లక్ష్యం అన్నదాంట్లో ఎవరికీ ఏ సందేహమూ లేదు. కానీ ప్రభుత్వసంస్థలకు ఉత్పత్తితో పాటు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ సంపదను పెంచడమే లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మన ప్రభుత్వరంగం విజయవంతమైంది కూడా. కానీ ఈ సంపద సృష్టికి ప్రభుత్వరంగం వేసిన దారులు, కార్మికవర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలనే విస్మరిస్తోంది నేటి ప్రభుత్వం. పైగా పెట్టుబదిదారులే సంపద సృష్టికర్తలంటూ వారికి సాగిలపడుతోంది. సర్కారువారి అంతరంగమేంటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?
పారిశ్రామికరంగాన్నే కాదు, దేశానికి జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని కూడా అమ్మకానికి పెడుతూ మూడు వ్యవసాయ చట్టాలనూ, నూతన విద్యుత్‌ సవరణ చట్టాన్నీ తెచ్చిందీ ప్రభుత్వం. రైతును భూమినుండి తరిమేసి విదేశీ స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసగా నిలబెట్టే కుట్ర చేస్తున్న సర్కారు, ఉద్యోగ, కార్మికవర్గాలను బజారుకీడ్చే కుతాంత్రాన్ని కూడా ఇప్పుడు మరింత వేగవంతం చేసింది. ఇది పసిగట్టిన రైతాంగం మూడున్నర నెలలుగా ఢిల్లీ సరిహరుద్దుల్లో పోరాడుతున్నారు. ఇప్పుడీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికసంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి. అయినా తాము దేశాన్ని అమ్మేయడానికే కట్టుబడివున్నామని నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది మోడీ ప్రభుత్వం. ఈ దేశానికి ఉరి బిగించడానికి పాలకులు అమ్ముడు పోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
ఇలా ప్రభుత్వరంగమన్నదే లేకుండా పోతే ప్రజాసంక్షేమానికి దిక్కెవరు? అన్నీ ప్రయివేటు పరం చేసేవాడు ప్రజలకు ఎలా బాధ్యత వహించగలడు? కంపెనీలన్నీ అమ్మేసేవాడు వారికి ఉద్యోగాలేమివ్వగలడు? ప్రభుత్వాల కనీస బాధ్యతైన విద్యా వైద్యరంగాలను కూడా పెట్టుబడికే అప్పచెప్పేవాడు రేపు పిల్లలకు చదువులు చెప్పగలడా? ప్రజల ఆరోగ్యాల్ని కాపాడగలడా? బ్యాంకుల్ని తెగనమ్మేవాడు ప్రజల డబ్బుకు హామీ ఇవ్వగలడా? రైళ్లూ, బస్సులతోపాటు రోడ్లు, విమానాశ్రయాలను కూడా అమ్ముకునేవాడు ప్రజలకు చౌక రవాణా ఇవ్వగలడా? వ్యవసాయాన్ని కూడా వ్యాపారానికి ముట్టజెప్పాలనుకునేవాడు ప్రజల ఆకలి ఎలా తీర్చగలడు? చివరికి రక్షణ రంగాన్ని సైతం పెట్టుబడికి తాకట్టు పెట్టేవాడు దేశాన్ని మాత్రం ఎలా రక్షించగలడు? సమస్త ప్రకృతి వనరులతోపాటు మానవ వనరులను కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే ఇక ప్రజల మౌలిక అవసరాలు తీర్చెదెవరు? భారత రాజ్యాంగం ఈ దేశానికి సంక్షేమరాజ్యాన్ని వాగ్దానం చేసింది. ప్రభుత్వరంగమన్నదేలేనప్పుడు ఈ సంక్షేమానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు బాధ్యత వహించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత మాత్రం ఉంటుందా..?! దేశంలో మేడిపండు స్వాతంత్య్రమే వర్థిల్లు తోంది…! కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశానికి తీరని ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడాన్ని మించిన దేశభక్తి మరొకటి లేదిప్పుడంలో సందేహం లేదు!
సైమ‌న్ గున‌ప‌ర్తి

1 3 4 5 6 7