మహాద్యోమం మొవలైంది..

“అక్టోబర్ 2న గాంధీ జయంతి అనే చారిత్రాత్మక సందర్భంలో,భారత దేశంలోని రెండు అతిపెద్ద మహానగ రాలైన రాజధాని ఢిల్లీ మరియు ఆర్థిక రాజధాని ముంబై,ఒకఅపూర్వమైన ప్రజాస్వామ్య ఉద్యమంద్వారా చరిత్ర సృష్టించబోతున్నాయి.ఓటర్ల జాబితాల్లోని అక్రమాలు (సర్ వివాదం) మరియు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసన కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు; ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి మరియు నవభారతాన్ని నిర్మించడానికి చేస్తున్న ఒక పిలుపు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే పోరాటానికి యువత మరియు ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరానాయకత్వం వహించనుండగా,ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్‌లో సాయంత్రం 4గంటలకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మరియు శివసేన కలిసి ప్రభుత్వాన్ని సవాలు చేయనున్నాయి.భద్రత మరియు చట్టపరమైన ఆంక్షల కారణంగా రెండు నగరాల యంత్రాంగం మరియు పోలీసులు ఈఉద్యమానికి అనుమతి నిరాకరించినప్పటికీ, నిర్వాహకులు మరియు మద్దతుదారుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు.ముంబైలో ఒకటిన్నర నుండి రెండులక్షల మంది ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తుండగా, ఆంక్షలకు ప్రతిస్పందనగా ‘జైల్‌భరో’ (జైలునింపే) ఉద్యమాన్ని చేపట్టేందుకు వారు సిద్ధమయ్యారు.రోడ్లను దిగ్బంధించవచ్చు మరియు ఆంక్షలు విధించవచ్చు, కానీ యువత మరియు ప్రతిపక్ష శక్తుల ఈ ఉమ్మడి బృందం దేశ రాజకీయాల్లో రేపు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది.”
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి మీVAద్యోమం మొదలైంది.ఈసారి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాత్మగాంధీజీ జయంతిని పురస్కరించుకొని చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది.అఖిల భారత విద్యార్థి సంఘం (ఐసా)జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా,సామాజిక కార్యకర్తలు,విద్యార్థి సంఘాల నేతల పిలుపుతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు జంతర్ మంతర్ వైపు చేరుకున్నారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తీవ్ర అవకత వకలు జరిగాయని,దీనికి బాధ్యత వహిస్తూ సీఈసీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులు పెద్ద ఎత్తున నిరసనకు దిగనున్నారు.ఇండియా గేట్ నుండి జంతర్ మంతర్ వరకు సిటీజన్స్ మార్చ్ నిర్వహించనున్నారు.ఈ నేపథ్యం లో శాంతియుత ర్యాలీని పోలీసులు బలవంతంగా అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.దీనికి కొనసా గింపుగా సిటీజన్స్ మార్చ్ కూడా నిరసన చేపట్టంది.ఈ ఆందోళనల్లో పాల్గొన్న ప్రముఖ సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్,సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ వాది ప్రశాంత్ భూషణ్,ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాతో పాటు సుమారు 150 మంది నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలనిర్వహణలో నిష్పాక్షికతను కోల్పోయిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో అధికార యంత్రాంగం పారదర్శకతను పక్కనబెట్టిందని ఆందోళనకారులు ఆరోపించారు.అర్హులైన లక్షలాది మందిఓటర్ల పేర్లను జాబితాల నుంచిఅక్రమంగా తొలగించారని, ఇది ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే గొడ్డలిపెట్టు అని వారు మండిపడ్డారు. దేశప్రజల ఓటుహక్కుల పరిరక్షణకు, ఎన్నికల సంఘం నిష్పాక్షికతకు భరోసా కల్పించేందుకు ఈ నిరసనలు అత్యంత కీలకమని పౌర సంఘాలు పేర్కొన్నాయి. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే,అటు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎనఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఇండియా గేట్ వద్ద ప్రదర్శనలు జరిగాయి. ఎన్నికల సంఘం పనితీరులో జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.మరోవైపు నిరసనను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు అతిగా ప్రవర్తించారని నేహా బోరా ఆరోపించారు. శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థినులతో విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై కూడా పోలీసులు దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. పోలీసు బలగాలు మహిళలను అసభ్యంగా తాకుతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో పెనుగులాట సందర్భంగా తన ఒంటిపై అయిన గాయాలను ఈ సందర్భంగా ఆమె చూపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ..ఆందోళన
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పునఃపరిశీలన (సర్)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం నిరసనలకు పిలుపునివ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సౌరభ్ భరద్వాజ్, సంజీవ్ ఝాతో పాటు పలువురు నిరసన కారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో పాల్గొ నేందుకు ఆప్ నేతలు జంతర్ మంతర్‌కు చేరుకున్నారు.అక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పలువురు పార్టీ కార్యకర్తలు, ఇతర నిరసనకారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.నిరసనకు అధికారికంగా అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.అయితే శాంతి యుతంగా నిరసన నిర్వహించేందుకు ముందుగానే అనుమతి కోరుతూ దరఖాస్తు చేశామని ఆప్ నేతలు తెలిపారు. నిరసన చేపట్టడం తమ హక్కని వారు పేర్కొన్నారు. నిరసనల నేపథ్యంలో జంతర్ మంతర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.భద్రతా ఏర్పాట్లలో భాగంగా పరిసర ప్రాంతాలను పలు జోన్లుగా విభజించి,ఒక్కో జోన్‌కు సీనియర్ పోలీసు అధికారులను నియమించారు. అంతేకాకుండా డ్రోన్ కెమెరాల ద్వారా ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.సోషల్ మీడియా కార్యకలా పాలపైనా పోలీసులు నిఘా పెట్టినట్లు నివేదికలు వెల్లడించాయి.
11 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేత..
భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన11మెట్రో స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేసింది.అయితే కొన్ని స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ఇంటర్‌చేంజ్ సదుపాయం కొనసాగు తోంది.రాజీవ్ చౌక్,మండీ హౌస్,న్యూఢిల్లీ, సెంట్రల్ సెక్రటేరియట్ తదితర స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.న్యూఢిల్లీ జిల్లాలో నిషేధాజ్ఞలు నిరసనల దృష్ట్యా న్యూఢిల్లీ జిల్లాలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 163కింద నిషేధా జ్ఞలు అమల్లోకి తీసుకొచ్చారు.జంతర్ మంతర్ వద్ద నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు.– జీ ఎన్ వి సతీష్

వర్షం వణికించింది

“ రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం తీరం దాటింది..వర్షం తగ్గుముఖం పట్టింది...కానీ కొన్ని జిల్లాలో వరదల ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది.నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలకు ఉత్తరాంధ్రలో జనజీవనం అస్తవ్యస్థమైంది.ప్రస్తుతం వర్షం లేకపోయినప్పటికీ అల్లూరి సీతారామారాజు జిల్లాలో పలు గిరిజన గ్రామాలకు వర్షపు నీరు చేరింది.మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు,కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఎగువ నుంచి ప్రవహిస్తున్న వర్షపు నీటితో  మన్యంలో వాగులు, గెడ్డలు ఇంకా ఉద్ధృ తంగా ప్రవహిస్తున్నాయి. స్వల్పంగా ఈదురుగాలులతో చెట్లు, అక్కడక్కడ విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని గిరిజన గ్రామాలను అంధకారంలోకి నెట్టేశాయి. సకాలంలో వర్షాలు పడి అన్నదాతను ఆదుకున్నా..రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు, విద్యుత్తు స్తంభాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాగులు, గెడ్డలుఉద్ధృ తంగా ప్రవహిస్తుండటంతో.. కొన్ని గ్రామా లకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు హెచ్చరిస్తున్నా నిత్యావసరాల కోసం,గ్రామాలకు వెళ్లేందుకు కొందరు గిరిజనులు సాహసాలు చేసి ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు.” - గునపర్తి సైమన్  

మన్యంలో..రహదారుల కల నెరవేర తుంది..తమకు డోలి మోతలు తప్పుతా యనుకుని సంబరపడుతున్న తరుణంలో వాయుగుండం గిరిజనుల ఆశలను చిదిమేసింది.అల్లూరి సీతారామారాజు జిల్లాలో నేటికీ చాలా గ్రామాలకు సరైన రహదారులు లేవు.కూటమి ప్రభుత్వం అడవితల్లి బాట పేరుతో మారుమÖల ఆదివాసీ గ్రామాలకు రహదారులు నిర్మిస్తోంది.గూడెంకొత్త వీథి మండలం లోని చాలా ఊర్లకు ప్రస్తుతం రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో నిర్మాణాలు పూర్తవుతా యనుకుంటున్న తరుణంలో భారీ వర్షా నికి ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. గూడెం కొత్త వీథి నుంచి చెరకుంపాకలు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. సప్పర్ల నుంచి ఆకులూరు మధ్య రెండు కల్వర్టులు దెబ్బతిన్నాయి.ఎం.బూసికొండ వద్ద రోడ్డు కూడా దెబ్బతింది.
దారులు ఛిద్రం.. ప్రయాణం నరకం
మండలంపై అధిక ప్రభావం చూపింది. పెద్దసంఖ్యలో కల్వర్టులు,రహదారులు ఛిద్రమయ్యాయి.లంకపాకలు-పనసపల్లి గ్రామాల మధ్య కల్వర్టు పూర్తిగా కొట్టుకు పోయింది.ఈ మార్గంలో అనేక గ్రామా లకు రాక పోకలు నిలిచిపోయాయి. సీలేరు సమీపంలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది.దీంతో సీలేరు -నర్సీపట్నం మార్గంలో రాకపోకలు నిలి చిపోయాయి.లంబసింగి తాజంగి నడు మ అత్యవసర సమయాల్లో అంబులె న్సులను మాత్రమే అనుమతిస్తున్నారు.
మూతపడిన జాతీయరహదారి
జి.మాడుగుల పరిధిలో జాతీయరహదారి కొట్టుకుపోయింది.దీంతోపాటు చింత పల్లి-కృష్ణదేవిపేట నడుమ రాకపోకలను మÖడు రోజుల నుంచి మూసేశారు. రంపుల ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున పెద వలస వద్ద బారికేడ్లు పెట్టారు. గూడెం కొత్తవీధి-సీలేరు ప్రధాన రహదారి ఛిద్రమై వాహనాలు బురదలో కూరుకు పోతున్నాయి. తాజంగి-లంబసింగి మధ్య తాత్కాలికంగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. హుకుంపేట మండలం లోని భీమవరం,సుకూరు రెండు గ్రామ పంచాయతీల పరిధిలోని తోటకూర పాడు, గంగవరం గ్రామాలకు రహదా రుల నిర్మాణం పూర్తికాకముందే ఛిద్రమైంది.ఒక వైపు నిర్మాణం చేపడు తుంటే మరోవైపు గోతులు,పెచ్చులూడి దర్శనమిస్తోంది.దీంతో మట్టిరోడ్డు ఉన్న సమయంలో కంటే ప్రస్తుతం రాకపోక లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన ఎన్నో ఏళ్లకు తోట కూరపాడుకు రోడ్డు నిర్మాణంతో కష్టాలు తీరతాయని ఈప్రాంత గిరిజనులు ఆశపడ్డారు.అయితే రోడ్డు నిర్మాణం చేపడుతున్నా నాణ్యత లేకపోవడంతో వర్షాలకు అధ్వానంగా మారి,రాకపో కలకు మరింత అవస్థలు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.అలాగే గంగవరం గ్రామానికి తొలుత నుంచి రోడ్డు సదుపాయం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకే ఈ గ్రామానికి రోడ్డు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. అయితే గత ఏడాది వచ్చిన భారీ తుఫాన్‌కు రోడ్డు మొత్తం గుంతలు పడి,కోతకు గురై అధ్వానంగా మారింది.దీంతో ఈపంచాయతీకి చెందిన ప్రజలు ఆటవీ ఉత్పత్తులు,పంటలను వారపు సంతకు తీసుకు వెళ్లేందుకు ఇబ్బం దులు పడుతున్నారు.అనారోగ్యం బారిన పడినా,గర్భిణులు,బాలింతలను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు వీలు కావడంలేదు. అధికారులు స్పందించి ఈ రహదారి పునఃనిర్మించాలని గిరిజనులు కోరుతు న్నారు.పెదబయలు మండలంలో జడి గుడచింతలవీథి మధ్య పెద్దగెడ్డ ఉప్పొం గడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల నిర్మించిన రాయగడ వంతెన వద్ద అప్రోచ్‌రోడ్డు పదిఅడుగుల మేర కుంగిపోయింది.అధికారులు అప్రమత్తమై మరమ్మతులు చేపట్టారు. పాడేరు వంతాడపల్లి చెక్ పోస్ట్ సమీపంలో కల్వర్టు రిటైనింగ్ వాల్ కూలిపోయింది. జీకేవీథి మండలంలో ఇటీవల నిర్మించిన జర్రెల కొత్తూరు కల్వర్టు కొట్టుకు పోయింది.సీలేరు ఏరియా దుప్పిలవాడ పంచాయితీ డి.అగ్రహారం వంతెన వరద నీటి ఉధృక్తితకు కొట్టుకుపోయింది. దీంతో సుమారు 14గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. అరకులోయ మండలం గిర్లిగుడ`పరిశీల మధ్య కల్వర్టు కొట్టుకుపోయింది.వరద ఉద్ధృ తికి పలుచోట్ల వంతెనలు,కల్వర్టులు కోతకు గురై కొట్టుకుపోయాయి.దీంతో అనేక గిరిజన గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపో యాయి.ఏజెన్సీ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంత రాయం ఏర్పడింది.పాడేరు, జి. మాడు గుల, చింతపల్లిని కలిపే మార్గం మూసి వేశారు. నిత్యావసర సరుకుల కోసం వారపు సంతలపై ఆధారపడే గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా పాడేరు నుంచి జి.మాడుగుల మీదుగా చింతపల్లి వెళ్లే ప్రధాన రహ దారి వరద నీటిలో పూర్తిగా కొట్టుకు పోయింది.ఈ మార్గం ఏజెన్సీ ప్రజలకు అత్యంత కీలకం.నిత్యం పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు ఈప్రధాన మార్గం ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయి గిరిజనులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.అత్యవసర పనులకు,కనీస అవసరాలకు బయటకు వెళ్లలేక స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. అరకులోయ మండలం బస్కి పంచాయితీ గిర్లిగూడ నుంచి కితలంగి పంచాయితీ మధ్య తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు వర్షానికి కొట్టుకు పోయింది.పెదబయలు మండలంలోని ప్రధాన రహదారిపై కల్వర్టు మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి పాడైన రహదారిని బాగు చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో148.31 హెక్టార్లలో వరి ముంపు
వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 148.31 హెక్టార్లలో వరిపంట ముంపునకు గురై నట్లు వ్యవసా యశాఖ ప్రాథమికంగా నిర్ధారిం చింది.ముంపునకు గురైన పంటల వివరాలను వ్యవసాయశాఖ అధికారి కంగా ప్రకటించింది. ఈ వివరాలను చింతపల్లి వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు తిరుమలరావు వెల్లడిం చారు. జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో వరిసాగు జరుగుతుండగా.. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షా లకు కొన్నిచోట్ల వరిపంట ముంపునకు గురైంది.జి.మాడుగుల,గూడెంకొత్తవీధి, హుకుంపేట,చింత పల్లి,పెదబయలు, కొయ్యూ రు,డుంబ్రి గుడ,అరకులోయ ముంచంగి పుట్టు మండలాల్లోని 94 గ్రామాల్లోని 476 మంది రైతులకు సంబంధించి 148.31హెక్టార్లలో వరి పైరు నీట మునిగిందన్నారు.కేవలం 3.5 హెక్టార్లలో రాజ్మా,16 హెక్టార్లలో మిను ముల పంటలు నీటమునిగాయని పేర్కొ న్నారు.

కష్టం కన్పించింది..కలెక్టర్ మనసు కదిలింది

పిలవలేదు.. అయినా పలకరించారు.గోడు చెప్పకముందే గమ నించి… బాధను అర్థం చేసుకున్నారు.అధికారి కాదు.. ఆపన్న హస్తమయ్యారు!..విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కంటపడిన కష్టం..క్షణాల్లో కదిలిన మానవత్వం చాటుకున్నారు. దిక్కుతోచని తల్లిదండ్రులకు..కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ భరోసాగా నిలిచారు. ఆ ఉన్నతాధికారి కరుణా కటాక్షంతో..ఆ కుటుంబానికి ఆశ చిగురించింది!. అధికారం అంటే ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు..ఆపదలో ఉన్నవారి వద్దకు వెళ్లి వారి గోడు వినడమూ మానవత్వమేనని కలెక్టర్ చూపిన ఈ స్పందన పలువురి ప్రశంసలు అందుకుంది.
విశాఖ జిల్లా కలెక్టర్ మెట్లు ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో కనిపించిన ఆదివ్యాంగుడిని చూసి ఆగిన కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్..ఆప్యాయంగా పలకరించివారి సమస్యను ఆసక్తిగా విన్నారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఆగష్టు 24న ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పీజీఆరఎస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్..తన వాహనం దిగి కార్యాల యానికి వెళ్తున్నారు. అదే సమయంలో రెడ్‌క్రాస్ వాలంటీర్ సహాయంతో లిఫ్ట్ వైపు వెళ్తున్న ఓదివ్యాంగుడు ఆయన కంట పడ్డాడు. వెంటనే అక్కడే ఆగి అతడి వద్దకు వెళ్లిన కలెక్టర్..ఏమైంది..మీ సమస్య ఏమి టి?”.. అంటూ ఆప్యాయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రూ.6 వేల పింఛన్‌తో ఇబ్బందులు..
భీమిలి మండలం చిప్పాడ గ్రామానికి చెందిన జి.రాంబాబు మానసిక దివ్యాం గుడు. ప్రస్తుతం వికలాంగుల కోటాలో నెలకు రూ.6 వేల పింఛన్ అందుతోంది. రాంబాబు తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమా రుడి పోషణకు ప్రస్తుత ఆర్థిక సాయం సరిపోవడం లేదని, బెడ్‌రిడెన్ కేటగిరీలో రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు. వారి సమస్యను సానుకూలంగా విన్న కలెక్టర్..సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా “ఇకపై రాంబాబును ఇక్కడికి తీసుకురావద్దు..కష్ట పెట్టొద్దు. మీ ఇంటికే అధికారులు వస్తారు” అని తల్లిదం డ్రులకు భరోసా కల్పించారు.మా దగ్గరకే వచ్చి గోడు విన్నారు’ సమస్యను చెప్పేందుకు కలెక్టర్‌ను ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేకుండానే..ఆయనే తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించి గోడు విన్నా రని రాంబాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే స్పందించిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.- జి ఎస్ సునీల్ కుమార్ 

అరకులోయలో సంజీవని ప్రాజెక్టు ప్రారంభం

“ గిరిజనుల ఆరోగ్యం కాపాడుటంతోపాటు వారిని అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావడం ప్రభుత్వ బాద్యత. ఆరోగ్యపరంగా,ఆర్దికంగా వారి ఉన్నతికి ప్రాధాన్యమిస్తాం.ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలకు సంజీవని కార్యక్రమం ద్వారా చెక్ పెడతామన్న నమ్మకం గిరిజన తెగల్లో వచ్చింది.సంజీవని రాష్ట్రానికి,దేశానికి ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గం గన్నెలలో సంజీవని నిర్వహించడంతోపాటు ఆరోగ్య రథాలను జెండాడ ఊపీ ప్రారంభించారు. డ్రోన్‌ల ద్వారా రక్త నమÖనాల రవాణా విధానాన్ని పరిశీలించారు. పథకం అమలులో భాగంగా ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం సంజీవని లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు.” మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్యం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా వైద్యం వారి దగ్గరకు రావాలన్న దే ప్రజా ప్రభుత్వం సంకల్పం అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులను రూపోందించేలా చేపట్టిన సంజీవనితో ప్రతీ ఒక్కరి ఆరోగ్యాన్ని సంరక్షిస్తామని సీఎం వివరించారు.ఈప్రాజెక్టును త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణ యించినట్లు తెలిపారు. అరకు లోయ నియోజకవర్గం గన్నెలిలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద ముఖ్యమంత్రి ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబ జీవన ప్రమా ణాలు మెరుగుపడాలని, అదే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు అన్నారు. గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సికిల్‌సెల్, తలసేమియా బాధితులకు నెలకు రూ.10వేల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో తక్కువ ధరకే మందులు అందించే జన ఔషధి కేంద్రాలు ప్రారంభి స్తామని చెప్పారు. అల్లూరి జిల్లాలో సంజీ వని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు.గతంలోనే అల్లూరి సీతారామరాజు గిరిజనులకు ఆయుర్వేద వైద్యాన్ని అందించారని గుర్తుచేశారు. అలాంటి మహనీయుడిని నిత్యం స్మరిం చుకునేందుకు కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టుకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. థింసా నృత్యంతో గిరిజన బిడ్డలు గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించడం అభినందనీయ మన్నారు.యోగా,ధ్యానం వంటి కార్యక్ర మాలను ప్రోత్సహిస్తూ ప్రజారోగ్యానికి ప్రాధా న్యత ఇస్తున్నామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
డ్రోన్లతో అత్యవసర ఔషధాలు,వ్యాక్సీన్లు తరలింపు
ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోగుల రక్త నమూనాలను డ్రోన్ల ద్వారా పెద్ద ఆసుప త్రులకు తరలించి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేలా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా గర్భిణులకు సేవలందిస్తున్నామని, 104 వాహనాల ద్వారా సంచార వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇంటి వద్దే 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసర మైన మందులు అందించేలా చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గం,చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ గేమ్ చేంజర్‌గా మారుతుందని అన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం అల్లూరి జిల్లాలో 150వాహనాలతో ఎమర్జెన్సీ లైఫ్‌లైన్ నెట్‌వర్క్ ఉందని చెప్పారు.గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐదు సూత్రాలతో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు.‘అడవి తల్లి బాట’ పేరుతో రూ.1,000కోట్లతో 905 కిలోమీటర్ల రహదారులు నిర్మించామని చెప్పారు. 1.60 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీరు అందించడంతో పాటు సోలార్ రూఫ్‌టాప్ లను ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి పెంచేందుకు అరకు కాఫీని మరో లక్ష ఎకరాల్లో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అరకు ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరిగిందని, హోమ్‌స్టేల ద్వారా ఆతిథ్యం అందిస్తే గిరిజన కుటుంబాలకు ఆదాయం వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉద్యోగాలు దక్కేలా నైపుణ్యాభివృద్ధి కల్పిస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు.- (జి.ఎ.సునీల్ కుమార్)

జీవో నెం.3పై రాష్ట్రప్రభుత్వం కసరత్తు

జీవోనెం.3పై ఇటీవల అల్లూరిజిల్లాలో ఆది వాసీలు చేపట్టిన భారీ నిరసన,ఆందోళనపై ఏపీ ప్రభు త్వం స్పందించింది.గిరిజనుల డిమాండ్‌ల పరిష్కారం పై అధ్యాయనం చేయడానికి కసరత్తు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నంబర్ 3 (100% ఎస్టీ రిజర్వేషన్లు) పునరుద్ధరణ మరియు 1/70 చట్టం అమలుపై గిరిజన సంఘాల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం హైపర్/ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.అయితే ఈ కమిటీని పలు గిరిజన సంఘాలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు, బంద్‌లకు పిలుపునిచ్చాయి.జీవో 3 పునరుద్ధరణ మరియు గిరిజన డిమాండ్లుసు ప్రీంకోర్టు తీర్పు: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల వంద శాతం రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన జీవో 3ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో గిరిజనుల్లో ఆందో ళన నెలకొంది.చట్టాల పరిరక్షణ: 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల హక్కులను నిరోధించాలని డిమాండ్ చేస్తున్నారు.ఉద్యోగాలు & నిధులు: స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా జోన్ల కేటాయింపులు ఉండాలని, గిరిజన అభివృద్ధి నిధుల మళ్లింపును నిలిపివేయా లని కోరుతున్నారు.ప్రభుత్వ చర్యలు-ప్రత్యామ్నాయ మార్గాలుచర్చలు మరియు కమిటీ: గిరిజన సంఘా ల నేతలు, మంత్రులు,న్యాయ నిపుణులతో చర్చించి న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తు న్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.హైపర్ కమిటీ ఏర్పాటు: సమస్యల పరిష్కారానికి అధికారులు, గిరిజన ప్రతినిధులతో హైపర్ కమిటీని ఏర్పాటు చేసేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా యం త్రాంగం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిం చింది. గిరిజన సంఘాల స్పందన: ప్రభుత్వ కమిటీ ఏర్పాటు కాలయాపన చర్య మాత్రమేనని భావి స్తున్న గిరిజన సంఘాలు, ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతూ ఏజెన్సీ బంద్‌లకు పిలుపునిచ్చాయి. సీం చంద్రబాబు నాయుడు జీవో నం.3కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని హామీ ఇచ్చి రెండేళ్లయ్యిందని,నేటికీ అమలు చేయలేదని గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓనం.3ను చట్టం రూపంలో తీసుకురా వాలని మెజారిటీ సంఘాలు అభిప్రాయపడ్డాయి.జాతీయ గిరిజన పాలసీ,పెసా చట్టం,కేంద్ర న్యాయ చట్టాన్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త చట్టాన్ని రూపొందించాలని ఆదివాసీ ప్రజా సంఘాల నేతలు కోరారు.
ఆనేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం స్పందించింది. ఆది వాసీల ఆందోళనలపై ప్రజా సంఘాలను సమ న్వయ పరచడానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణి,రాష్ట్ర ీVAం శాఖ మంత్రి అనిత ఆధ్వర్యంలో పాడేరులో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా గిరిజన సంఘాల ప్రతినిధులు జీవో నం.3,1/70చట్టం అమలుపై సూచనలు,పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసు కొచ్చారు.న్యాయ నిపుణులతో చర్చించి, గిరిజను లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు.గిరిజనుల అభిప్రాయాలు, న్యాయ నిపుణుల సూచనలను పరిశీలించి ప్రభు త్వానికి నివేదిక సమర్పించేందుకు మంత్రులు, న్యాయ సలహాదారులు,గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, అల్లూరి,పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు, ప్రజాసంఘాల నేతలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు వెల్లడించారు.ఆప్రకారమే కమిటీ నియమించ డానికి ప్రభుత్వ అధికారులు గిరిజన సంఘాలతో చర్చలు జరిపారు.తర్వాత అమరావతిలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జీవో3పై సమీక్ష నిర్వహించడం జరిగింది.ఆసమీక్షలో సీఎం చంద్రబాబు నాయు డు పలు కీలకమైన అంశాలను వెల్లడించారు.
చట్టపరమైన అడ్డంకులపై అధ్యయనం
ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వో ద్యోగాల్లో నూరుశాతం రిజర్వేషన్లు కల్పిం చేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రకటించారు.ప్రభుత్వోద్యోగాల్లో స్థానిక గిరిజ నులకు 100శాతం రిజర్వేషన్లు కల్పించేం దుకు ఉమ్మడి రాష్ట్రంలో 2000 ఏడాదిలో జీవో 3 తెచ్చా మని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరు ద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శ కాలు పాటిస్తూనే…2020లో రద్దయిన జీవో 3 పునరుద్ధ రణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను సీపం ఆదేశించారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు సమీక్ష జరిపారు. సమీక్షలో గిరిజన సంక్షేమశాఖ న్యాయశాఖ అధికా రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లా డుతూ “1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్ పోస్టుల్లో 100శాతం రిజర్వేషన్లు తెచ్చాం.దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో మళ్లీ పెరిగిన మహిళా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని 2000లో జీవోఎంఎస్ నంబర్ 3తెచ్చాం.దీన్ని అమలు చేయ డంద్వారా సుమారు 4,626 టీచర్ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయి. అయితే జీవో నెంబర్ 3పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా…వివిధ స్థాయిల్లో విచారణ అనం తరం 2020లో ఈఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే గత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం పాటించింది. దీంతో రివ్యూ పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు కొట్టేసింది.ఈకారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా లభించే లబ్దిని కోల్పోయారు” అని సీఎం స్పష్టం చేశారు. జీవో నెంబర్ 3పునరుద్దణ లేదా అదే తరహా న్యాయం చేసేందుకు గిరిజనులకు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు జీ.వోనె.3రద్దు అనంతర పరిణా మాలపై అధికారులతో సీఎంచర్చించారు. గిరిజన ప్రాంతాల్లో జీవో 3ద్వారా నాడు గిరిజను లకు కలిగిన లబ్దిని పునరుద్దరించేందుకు తీసుకో వాల్సిన చర్యలపై చర్చించారు.ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగా ల్లో స్థానిక గిరిజనులకు నూరుశాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్నఅవకాశాల గురిం చి,చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డం కుల గురించి చర్చించారు.జీ.వో నెం.3పున రుద్దరి చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజన సంఘా ల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తిరిగి ఈ ఉత్తర్వులద్వారా లభించే లబ్దిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకా శాలను పరిశీలించాలని,ఇందులో భాగంగా న్యాయపర మైన అంశాలు,సుప్రీంకోర్టు తీర్పు, గిరిజన హక్కు ల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.
ముఖ్యమంత్రి ముందు మూడు ఆప్షన్లు
జీవో నెంబర్ 3పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న మూడు అవకాశాల గురించి అధికారులు ముఖ్య మంత్రికి వివరించారు. మొదటి ఆప్షన్‌గా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో 100శాతం రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం, రెండవ ఆప్షన్‌గా స్థానిక గిరిజనులకు వారి యెక్క జనాభా దామాషా ప్రకా రం రిజర్వేషన్లు ఇవ్వడం,మూడవ ఆప్షన్‌గా సుప్రీం కోర్టు సూచించినట్టు 50శాతం మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించివారి హక్కులను పరిక్షించడం వంటి అవకాశాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ“గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థా యిలో గిరిజనుల హక్కులకు కట్టుబడి ఉన్నామ ని,ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీ.వో నె.3 పునరుద్దరించడం లేదా…అదేస్థాయిలో గిరిజను లకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామ న్నారు. ఈవిషయంలో జాతీయస్థాయిలో రాజ్యాం గ,న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జర పాలి” అని సీఎం సూచించారు. వారికి న్యాయం చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అసలు జీవో నెంబర్ 3 అంటే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో నెంబర్ 3జనవరి 10,2000న వెలువడింది.ఇదిషెడ్యూల్డ్ (ఏజెన్సీ) ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను స్థానిక షెడ్యూల్డ్ తెగల(ఎస్‌టీ) అభ్యర్థులకు మాత్రమే 100 శాతం రిజర్వేషన్ కల్పించడం గురించి చెబుతుంది.
జీవో నెంబర్ 3ప్రధాన ముఖ్యాంశాలు పూర్తి రిజర్వేషన్ : షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు అన్నీస్థానిక గిరిజనులకే వంద శాతం కేటాయించ బడతాయి.ఆ వంద శాతం పోస్టులలో 33.1/3శాతం స్థానిక ఎస్టీ మహిళలకు సబ్-రిజర్వేషన్ కింద కేటాయించ బడుతుంది.
ఉద్దేశం : గిరిజన ప్రాంతాల్లో విద్యను అభివృద్ధి చేయడం,గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు సమస్యను నివారించడం మరియు స్థానిక నిరుద్యోగ గిరిజనులకు ఉపాధి కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.ప్రస్తుత స్థితిఈ జీవోను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 22,2020న కొట్టివేసింది. 50శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటి 100శాతం కేటాయించడం రాజ్యాంబరం కల్పించిన సమాన హక్కులకు విరుద్ధమని, ఇది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో గిరిజన సంఘాల డిమాండ్ మేరకు దీని పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరుగుతున్నాయి.– గునపర్తి సైమన్ 

నిర్జీవమవుతున్న కుటుంబ వ్యవస్థ

సామాజిక వ్యవస్థగా కుటుంబాల పాత్ర అత్యంత ప్రధానమైనది.మానవుల ప్రాథమిక అవసరాలను తీర్చ డంతో పాటుగా, సమస్యల్లో వ్యక్తులకు కుటుంబం అండగా ఉంటూ వారి అభివృద్ధికి చోదక శక్తిగా పని చేస్తోంది. ప్రాథమిక సామాజీకరణ ఏజెంట్గా సమాజ కట్టుబాట్లకు అనుగుణంగా మానవుడి సామాజిక, సాంస్కృతిక జీవన విధానాన్ని కుటుంబాలు ప్రభావితం చేస్తాయి. కరోనా విపత్తు మానవుని మనుగడలో కుటుం బాల పాత్ర ఎంతటి కీలకమైనదో మరొక్కసారి స్పష్టంగా సమాజానికి అర్థం అయ్యేలా చేసింది.కానీ, కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా కుటుంబ వ్యవస్థ క్రమంగా తన పటు త్వాన్ని కోల్పోతుంది. పాశ్చాత్య ధోరణుల ప్రభావం సమాజం మీద తీవ్రంగా పడింది.అది కుటుంబ వ్య వస్థలో మార్పులకు కూడా కారణమైంది. మొదట కేవలం నగరాలకే పరిమితమైన విచ్ఛిన్న కుటుంబాలు నేడు గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు సైతం విస్తరిం చాయి. ఇందుకు జీవన విధానంలో వస్తున్న మార్పులు ప్రధాన కారణం.

ఉమ్మడి కుటుంబాల్లో ప్రేమానురాగాలు
కుటుంబ సంబంధాలు ‘మేం, మా అనే భావన నుంచి నేను,నాఅనే భావనకు’ వచ్చాయి.గతంలో ఉమ్మడి కుటుంబాలలో కనిపించినసాన్నిహిత్యం, ప్రేమాను రాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయత ప్రస్తుత విచ్ఛిన్న కుటుంబాలలో కనబడటం లేదు. దీంతో కుటుంబ వ్యవస్థ క్రమంగా నిర్జీవమవుతున్నది. మానవ మను గడలో, మెరుగైన సమాజ నిర్మాణంలో కుటుంబాల పాత్రను గ్రహించిన ఐక్యరాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏటా మే15నఅంతర్జాతీయ కుటుంబాల దినోత్సవంగా జరుపుతోంది.
ఆధునిక సమాజంలో కుటుంబ సభ్యుల మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. వయో వృద్ధుల ఆత్మహత్యలు, ఆస్తి తగాదాలతో ర సంబంధీ కులపైనే దాడులు చేయడం, కన్న వారు చనిపోతే కనీసం ఖననం చేయడానికి కూడా రాకపోవడం, రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన పాఠశాల స్థాయి పిల్లల్లో మాదక ద్రవ్యాల వినియోగం వంటి ఘటనలు చూస్తూంటే ఆధునిక సమాజంలో కుటుంబ సభ్యుల మధ్య ఎంతటి అగాధం ఏర్పడిందో స్పష్టంగా అర్థం అవుతుంది.కారల్ మార్క్స్ మానవ సంబంధాల గురిం చి ప్రస్తావిస్తూ ‘మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే’ అన్నారు.
ఇవాళ ఆర్థికపరమైన అంశాలకు ఉన్న విలువ,మానవ సంబంధాలకు ఉన్నట్టు కనిపించడం లేదు.కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు అన్నీ ఆర్థికపరమైన అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇవి కుటుంబాలలో అశాంతికి,కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
వయోవృద్ధుల సంరక్షణ నైతిక బాధ్యత
ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్య లలో వయోవృద్ధుల సంక్షేమం అతి ప్రధాన సమస్యగా మారింది.ఇవాళ సమాజంలో వయోవృద్ధులు ఆనం దంగా జీవించే పరిస్థితులు కనిపించడం లేదు. వృద్ధా ప్యం సమీపిస్తున్న కొద్దీ మానవులలో మానసిక ఆందో ళనలు మొదలవుతున్నాయి. ఇందుకు కుటుంబ సభ్యు లు వయో వృద్ధులను భారంగా భావించడం ప్రధాన కారణం వయోవృద్ధుల సంరక్షణ కుటుంబ’ వ్యవస్థ నైతిక బాధ్యత, కానీ, నేడుకుటుంబాలు ఆ బాధ్యత నుంచి సులభంగా తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జీవితాంతం కుటుంబ అభివృద్ధి కోసం కష్టపడి చివరి దశలో కుటుంబాలతో కలిసి సంతోషంగా ఉందా మనుకుంటున్న వృద్ధులకు ఆ అవకాశమే ఇవ్వడం లేదు. వారి కనీస అవసరాలను కూడా తీర్చకుండా, ప్రతి చిన్న విషయానికి చీదరించుకోవడంతో వృద్ధులు తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. కొందరు వారి బాగోగులు చూసుకోలేమని వృద్ధాశ్ర మాలలో వదిలేస్తున్నారు.
ఇది వారిని మానసికంగా మరింతగా కుంగ దీస్తున్నది.ఇటువంటిపరిస్థితుల్లో కుటుంబాలకు తాము భారం అవుతున్నామని కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అమానవీయ ప్రవర్తనతో కుటుంబ వ్యవస్థ పతనమవుతున్నది. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు మాత్రమే మానవత్వం పరిఢవిల్లుతుంది. సమాజంలో అసాంఘిక, అమావీయ ఘటనలు తగ్గు తాయి.కాలానుగుణంగా అన్ని వ్యవస్థల్లో మార్పులు రావడం అనేది అనివార్యం. అయితే ఆమార్పు భవిష్య త్తులో ఆవ్యవస్థ బలోపేతానికి తోడ్పడేదిగా ఉండాలి తప్పితే నిర్వీర్యం చేసేదిగా ఉండకూడదు. దానిని ప్రతి ఒక్కర గ్రహించాల్సిన అవసరం ఉంది. కుటుంబం ఒక విశిష్ట సంస్థ.వివిధ పరిస్థితులు, సందర్భాఆలకు అనుగుణంగా అది వ్యక్తిగతమైందిగా లేదా ప్రజలకు సంబంధించిందిగా మారుతూ ఉంటుంది.వ్యక్తి జీవితంలో అధిక భాగం దీంతోనే గడుస్తుంది.అన్ని రకాల మానవ సమÖహాల్లో అతి ప్రధానమైన ప్రాథమిక సమÖహమే కుటుంబం. మానవ సామాజిక జీవితానికి పునాది ఈవ్యవస్థ. వివాహంలాగే కుటుంబ వ్యవస్థ విశ్వజనీన మైంది. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు. వ్యక్తి,సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సాంఘీక సమÖహం.ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు.కుటుంబం ఒక కేంద్ర బిందువు.దీన్ని చుట్టూనే మొత్తం జీవితం తిరుగుతూ ఉంటుంది.
వ్యక్తులు దినచర్యను కుటుంబ సభ్యులతో ప్రారంభిస్తారు.సమాజాల్లోని సాంస్కృతిక వైరుధ్యాల కారణంగా కుటుంబ సంబంధాలు కూడా వివిధ రూపాల్లో ఉన్నాయి.సాధారణంగా దంపతులు,వారి పిల్లలు కలసి జీవిస్తే దాన్ని కుటుంబంగా పిలుస్తుం టారు.ఆదిమ సమాజాల కుటుంబం కూడా ఇదే రకంగా ఉంటుంది.అయితే 19వశతాబ్దం తొలి రోజుల్లో ఆదిమ సమాజాల్లో కుటుంబవ్యవస్థ ఉందా అన్న చర్చ బలంగా వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికైనా సగటు మానవునిఆలోచనల్లో మార్పులు వచ్చి కుటుంబ ప్రాధాన్యతను, కుటుంబాల్లో తమ బాధ్యతను గుర్తించాలి. అప్పుడే నిర్జీవమవుతున్న కుటుంబ వ్యవస్థ తిరిగి జీవం పోసుకుంటుంది. లేక పోతే భవిష్యత్లో కుటుంబ వ్యవస్థ పూర్తిగా కనుమ రుగయ్యే ప్రమాదం ఉంది. అది మానవ జాతి మనుగ డకే ప్రమాదంగా మారుతుంది.
కుటుంబ వ్యవస్థ -పరివర్తన
మానవ సమాజంలో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ,సమాజ నిర్మాణంలో ఒక ప్రాథమిక యÖనిట్. మానవ సంబంధాల నిర్మాణం, పరస్పర ఆధారం,ప్రాథమిక,ద్వితీయ అవసరాలు తీర్చుకోవడం, తన అవసరాలు తీర్చుకోవడంతోపాటు ఇతరుల అవసరాలు తీరుస్తూ, ప్రేమ,వాత్సల్యం, తదానుభూతి వంటి మానసిక అవసరాలు,కూడు, గుడ్డ,విద్య,సామాజీకరణ వంటి భౌతిక,భౌతికేతర అవ సరాలు పరస్పరం నిర్ధారణ అయిన,అనుమతి పొం దిన విలువలు,కట్టుబాట్ల ద్వారా తీర్చుకోవడం అనేది కుటుంబ జీవనం నుంచి లేదా కుటుంబ వ్యవస్థ నుంచి ప్రారంభమవుతుంది. కుటుంబం శాశ్వతం, విశ్వవ్యాప్తం కానీ ఆయా సంస్కృతులను బట్టి కుటుంబ నిర్మాణం,విధులు వేర్వేరుగా ఉండవచ్చు. కానీ కుటుం బం అనే ప్రాథమిక సామాజిక సంస్థ సమాజంలో వచ్చిన మార్పులను బట్టి మార్పులకు లోనవుతుంది. ప్రస్తుతకాలంలో ఈ మార్పులు అనివార్యమయ్యాయి. అయితే కుటుంబ నిర్మాణంలో, ప్రకార్యాల్లో వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయి, వాటి రుణాత్మక, ధనాత్మక పర్యవసానాలు ఎలా ఉన్నాయి, ఆయా మార్పులకు దారితీసిన కారణాలు వంటి అనేక అంశాలపై అభ్య ర్థులు అవగాహన పెంచుకోవాలి.
ఆర్ధిక ప్రకార్యం : కుటుంబానికి సుఖాన్ని ఇచ్చేవి ఆస్తిపాస్తులు.పూర్వకాలంలో కుటుంబం తనకు కావాల్సిన వివిధ వస్తువులు ఉత్పత్తి చేసి వినియో గించుకునేది.భారతీయ సమిష్టి కుటుంబంలో వ్యక్తులంతా కలిసి పనిచేసి పరస్పర సహకారంతో ఆనందాన్ని పంచుకునేవారు.
ధార్మిక ప్రకార్యం : సభ్యులకు మత సంబంధమైన శిక్షణ కుటుంబం ఇస్తుంది.పెద్దల నుంచి పిల్లలు సద్గుణాలు నేర్చుకోవడానికి,మత సంబంధమైన శిక్షణ అవసరం.దైవారాధన,యజ్ఞయాగాదులు,మత ఉపదేశాలు మొదలైనవి పూర్వం ఎక్కువగా ఉడేవి.నేడు లౌకిక రాజ్యం కావడంతో వ్యక్తుల్లో మత భావాల గాఢత తగ్గింది.నాడు కుటుంబాల్లో ప్రార్ధనా సమావేశాలు నిత్యం సంప్రదాయంగా జరిగేవి.ప్రస్తు తం అవి చాలా వరకు తగ్గిపోయాయి.
విద్యా ప్రకార్యం : ఒకప్పుడు పిల్లలకు విద్యాబోధన కుటుంబాల్లోనే అధికంగా జరిగేది.పిల్లలకు వ్యక్తిగత శిక్షణ ఇచ్చే అవకాశం ఎక్కువగా తల్లికే ఉండేది.కానీ నేడు విద్యాసంస్థలను ప్రభుత్వం,ఇతర సంస్థలు ఏర్పాటు చేయడంతో ఈ బాధ్యత కుటుంబానికి చాలా వరకు తగ్గిపోయింది.నాటి వృత్తుల కులం మీద ఆధారపడటంతో వృత్తి శిక్షణ కుటుంబ సభ్యులకు అవసరమైయ్యేది.ఇప్పుడు ఆబాధ్యతను అనేక సాం స్కృతిక,వైజ్ఞానిక,విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి.
ఆరోగ్య ప్రకార్యం :పూర్వం ఆరోగ్య,వైద్య సంబంధమైన విధులను కుటుంబం నిర్వహించేది.సభ్యుల అనా రోగ్యం,ఇతర అస్వస్థతలను నివారించే బాధ్యత కుటుంబంపై ఉండేది.కానీ నేడు ఆస్పత్రులు,ఆరోగ్య సదుపాయాలు అధికం కావడంతో ఆ విధులను ఆయా సంస్థలు నిర్వహిస్తున్నాయి.అప్పట్లో సభ్యులకు వినోదావకాశాలను కుటుంబమే కల్పించేది.నేడు ఆవిధులను చలన చిత్రాలు,క్లబ్బులు,క్రీడా సంఘాలు మొదలైనవి నిర్వహిస్తున్నాయి.
నిర్వహణ:ప్రతి కుటుంబం కొంత ఆర్ధిక ఉపాధితో ఉంటుంది.కుటుంబంలో సభ్యులను పోషించడానికి భార్యభర్తలు కృషి చేస్తూ,వీలైన సౌకర్యాలు కల్పించి తమ సంతానాన్ని పెంచి పెద్ద చేస్తారు.
సంక్రమణ : తల్లిదండ్రుల అనంతరం వారి ఆర్ధిక, సామాజిక ీVAదా పిల్లలకు సంక్రమిస్తుంది. వారు తమ కుటుంబ స్థాయికి అనుగుణంగా సమాజంలో స్థానం పొందుతారు.
కుటుంబ వ్యవస్థ ప్రధాన లక్షణాలు
మానవజాతి క్రమాభివృద్ధిలో అన్ని దశల్లోనూ కుటుం బం ఉంటుంది.ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబానికి చెంది ఉంటాడు.పక్షలు,జంతువుల సమాజాల్లో కూడా కుటుంబాలు ఉన్నాయనేందుకు ఆధారాలున్నాయి. కుటుంబ సంస్తలో ప్రధాన లక్షణం స్త్రీ,పురుష సాంగత్యం. జీవిత భాగస్వాములైన భార్యబకర్తలిద్దరూ అనుబంధంతో జీవితకాలమంతా కలసి ఉండవచ్చు. లేదా కారణాంతరాల వల్ల పరిమిత కాలం వరకే దంపతులుగా ఉండవచ్చు.ప్రతి కుటుం బానికి గుర్తు పట్టడానికి వీలుగా దానికి ఒక పేరు ఉంటుంది.కలిగే సంతానానికి పేర్లు పెట్టడం కూడా ఒక పద్దతిని అనుసరించి జరుగుతుంది.పిల్లలకు పేర్లు పెట్టడంలో తల్లిదండ్రులు,మత,రాజకీయ నమ్మకాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వంశపారంపర్యాన్ని గణనలోకి తీసుకునే విషయంలో కూడా తేడాలు న్నాయి. కొన్నిచోట్ల మాతృవంశీయ విధానం ఉంటే, మరికొన్ని చోట్ల పితృవంశీయ విధానం ఉంటుంది.భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి కుటుంబానికి ఆర్ధిక వన రులంటాయి.భూవసతి, వ్యాపారం/ఉద్యోగం ఉం టాయి.ఆర్ధిక స్థితిగతుల్లో కుటుంబాల మధ్య తేడాలు ఉంటాయి. ప్రతి కుటుం బానికి విశ్రాంతి తీసుకోవ డానికి,నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి, పిల్లలు,పెద్దలు నివసించడానికి ఒక నివాసం అవసరం.మానవుడి భౌతికావసరాలు, సుఖాలు,కోరికలు లాంటివాటిపై కుటుంబం ఆధార పడి ఉంటుంది.స్త్రీ పురుషుల సంగమం,సంతానాన్ని పొందడం,ప్రేమతో పెంచడం, భార్యభర్తలు ప్రేమతో గడపడం,ఆర్ధిక,సామాజిక పరంగా రక్షణ కల్పించు కోవడం మొదలైనవన్నీ కుటుంబ వ్యవస్థలో ప్రధానం.వ్యక్తులను,వారి ప్రవర్తన లను కుటుంబం ప్రభావితం చేస్తుంది.నాగరిక సమాజసంస్థలన్నీంట్లో కుటుంబ పరిమాణంలో చిన్నది.కుటుంబం తన సభ్యులను వివిధదశల్లో నియంత్రిస్తుంది.ప్రవర్తన నేర్పుతుంది.పిల్లలను నియం త్రించడమే కాకుండా తల్లిదండ్రులను కూడా హద్దులో ఉంచుతుంది.తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే విధంగా చేస్తుంది.– (వి.శంకరరావు)

గడ్డు కాలం

పెరుగుతున్న నిత్యావసర ధరలతో రాష్ట్రప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఆదాయం పెరగడం లేదు కాని బియ్యం,నూనెలు,పప్పులు,కూరగాయలు ఇలా..అన్నింటి ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతుండటంతో జీతం సరిపోక..కుటుంబ బడ్జెట్ దాటిపోయి ఎలా సర్దుబాటు చేయాలో తెలియక మధ్యతరగతివారు,పేదలు సతమత మవుతున్నారు. వీటికి తోడు వైద్య ఖర్చులు విపరీతమై ఇబ్బంది పడుతు న్నారు.ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం అదుపులోకి తెచ్చామని ప్రకటనలు చేస్తున్నా మార్కెట్‌లో ఆపరిస్థితి కనపడటం లేదు.నిత్యావసరాల సరకుల ధరలు పెరగడమే తప్ప దిగి రావడం లేదు.అటు కంపెనీలు..ఇటు స్థానికంగా వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి.సీజన్‌ను బట్టీ ఆయా సరకులను కొందరు వ్యాపారులు క్షేత్రస్తాయిలో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.పైగా వ్యాపారులంతా ఒకేతాటిపై ఉంటుం డటంతో వారు చెప్పిన ధరలే అమలువుతున్నాయి. మార్కె ట్‌లో ధరల హెచ్చుతగ్గులపై జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రతి మÖడు నెలలకొమారు ధరల నియంత్రణ కమిటీ సమా వేశాలు జరపాల్సి ఉన్నా ఆ ఊసే మరిచారు.దీంతో వ్యాపా రులు ఆడిందే ఆటగా మారింది.
ఆచితూచి ఖర్చు..
ఎంత సాధారణ కుటుంబమైనా అద్దె ఇంట్లో పట్టణాల్లో నెలకుకే రూ.25వేల వరకు ఖర్చు వస్తుండగా..వైద్యం లాంటి అత్యవసరాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది.ఇటీవల కాలంలో జ్వరాలతో ఒక్కో కుటుంబానికి రూ.వేలలో ఖర్చవుతోంది.ఇక పిల్లల తినుబండారాలు,ఆహ్లాదం కోసం నెలకు ఓ సినిమాకు వెళ్లడం,నాన్‌వెజ్,ప్రయాణ ఖర్చులు లెక్కేస్తే మరో రూ.3నుంచి రూ.5వేల వరకు ఖర్చు వస్తుంది.దీంతో తమ బడ్జెట్‌కు ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా ఖర్చు పెడదామనుకున్నా సాధ్యం కావడం లేదు.
పెంపుతో భారమిలా..
గడిచిన ఏడాది కాలంగా అన్ని సరకుల ధరలు పెరిగి ప్రజలపై అదనపు భారం పడుతోంది.ముఖ్యంగా నూనెల ధరలు విపరీతమయ్యాయి.గృహ,వాణిజ్య అవసరాల కోసం ప్రతి నెల 3500మెట్రిక్ టన్నుల నూనె వినియోగం ఉంటుంది.వీటి కోసం వినియో గదారులు ఏడాది కిందట రూ.39కోట్లు వెచ్చించగా.. పెరిగిన ధరలకనుగుణంగా ప్రస్తుతం రూ.46`50 కోట్ల వరకు ఖర్చువుతోంది.కూరగాయల విషయంలో జిల్లాలో పంటల సాగు తగ్గింది.దిగుమతి భారం వల్ల ధరలు పెరిగి గతేడాదితో పోలిస్తే జిల్లా వాసులు రోజుకు రూ.2కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తోం ది.ఈనేపధ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నె ముకగా నిలిచిన మధ్యతరగతి నేడు కొనుగోలు తగ్గించుకుంటు న్నది. గత అనేక దశాబ్దాలుగా ప్రభుత్వ విధాన నిర్ణ యాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఈవర్గం నేడు ఆప్రభు త్వాల విధానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. పెరుగుతున్న ఖర్చులు-తరుగుతున్న ఆదాయాలతో ఆందోళన చెందుతున్నది. తమ గురించి, తమ పిల్లల భవిష్యత్ గురించి వేదనకు గురౌతున్నది. తమ దగ్గర వున్న కొద్దిపాటి డబ్బును ఖర్చు చేయడానికి భయ పడుతున్నది.వీటన్నిటి ప్రభావం రియల్ ఎస్టేట్ వ్యాపారం, సరుకులు, వాహనాల కొనుగోలు రూపాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరగతితో శక్తికి మించి అప్పులు చేయించి లాభపడిన వ్యాపార సంస్థ లు నేడువ్యాపార లావాదేవీలు తగ్గిపోయాయని గగ్గోలు పెడుతున్నాయి.ఈ స్థితి నుండి తమను పాల కులు బయట వేస్తారనే విశ్వాసం కోల్పోయి, అతీత శక్తులను ఆరాధించడం పెరిగింది. గత మÖడు దశా బ్దాల్లో ప్రపంచీకరణ విధానాలతో వేగంగా విస్తరించిన మధ్య తరగతి నేడు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీ య పరిస్థితుల వల్ల తీవ్ర ఆందోళనకు గురౌతున్నది. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా ప్రకారం, రాబోయే పది సంవత్సరాల్లో మన దేశంలో మధ్యతరగతి కుటుంబాలు రెట్టింపు అవుతాయి.2024లో 35 కోట్లుగా వున్న ఈ తరగతి 2034 నాటికి 69 కోట్లకు పెరుగుతుందని తెలిపింది. అందుకే దేశాభివృద్ధిలో ఈ తరగతి వినిమయం చాలా కీలకమవుతుంది. కార్పొరేట్ వ్యాపార సంస్థలు వీరిని ఆకర్షించి వ్యాపా రాన్ని పెంచుకోవడానికి, ఊహల పల్లకిలో పెట్టి పాల కులు లాభపడడానికి, అసత్యాలు, అర్ధసత్యాలతో సంచలనాత్మక ప్రసారాలతో రేటింగ్ పెంచుకోవడా నికి మీడియా నిత్యం అనేక ప్రయత్నాలు చేస్తుంటుం ది. తమ అభివృద్ధికి అమెరికా డాలర్లను కొలమా నంగా భావించే కొద్దిమంది మధ్యతరగతి వారు తమ పిల్లల భవిష్యత్ గురించి నేడు ట్రంప్ విధానాలతో భయాందోళన చెందుతున్నారు.దేశంలో 11 సంవత్స రాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్ల ఉద్యోగ భద్రత లేకపోవడం, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ధరలు పెరగడంతో మధ్యతరగతి ఖర్చు చేయడానికి భయపడుతుంది.తమ ఆదా యం లో ఎక్కువ భాగం అప్పుల వడ్డీలు, ఇఎంఐ లు చెల్లించ డానికే సరిపోయే స్థితికి చేరింది. గత 25 సంవత్స రాల్లో వస్తువుల వాడకం, గృహ నిర్మాణం ద్వారా విస్తరించిన వినిమయ మార్కెట్ నేడు మందగించింది. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని మొత్తం కుటుంబాల్లో 67 శాతం మంది వ్యక్తిగత రుణాలు తీసుకున్నారని, వీరిలో 53 శాతం మంది 30 ఏళ్ళ లోపు వారని తెలిపింది. ఇందులో అత్యధికులు ఐటి ఉద్యోగులు. వీరే నయా మధ్య తరగతివారు. రేపు లేదన్నట్లు ఖర్చు చేయగల ఖరీదైన వినిమయదారులు. రిజర్వుబ్యాంకు రిపోర్టు ప్రకారం 2018లో మధ్యతరగతి వారు తమ ఆదాయంలో 30.4 శాతం అప్పుల చెల్లింపులకు ఖర్చు చేస్తుండగా, నేడు సుమారు 41శాతం ఖర్చు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున అప్పుల చెల్లింపులు వుండడంతో కొత్త సరుకులను కొనడం పట్ల ఆసక్తి చూపడంలేదు. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా ఉంది. తయారీ రంగం విస్తరించకపోవడం,కొత్త ఉపాధి అవకాశాలు తగ్గడం,మధ్యతరహా వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ లాంటి రంగాలు కష్టాల్లో కూరుకుపోయాయి. హిందుస్తాన్ యÖనిలీవర్, నెస్లే ఇండియా సంస్థలు పట్టణాల్లో కొనుగోలు తమ అంచనాల కంటే ఎక్కువ గా తగ్గిందని ప్రకటించాయి.దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ పట్టణాల్లో తమ అమ్మకాలు 2శాతం తగ్గాయని ప్రకటించింది. ఈ సంవత్సరం జనవరి నుండి,ద్విచక్ర వాహనాల అమ్మ కాలు 9శాతం తగ్గాయి. మోటార్ సైకిల్ అమ్మకాలు 13శాతం, మోపెడ్ అమ్మకాలు 18 శాతం తగ్గాయి. నెస్లే ఇండియా ప్రతినిధి సురేష్ నారాయణన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమ్మకాలు మందగించడం వెనుక ‘తగ్గుతున్న మధ్యతరగతి’ ఒకముఖ్య కారణంగా చెప్పారు.‘ఒకప్పుడు రెండంకెలుగా ఉన్న ఆహార, పానీ యాల రంగంలో వృద్ధి ఇప్పుడు 1.5నుండి 2 శా తానికి పడిపోయింది’అని ఆయన పేర్కొన్నారు. నెలకు రూ.40,000 నుండి రూ.55,000 వరకు సంపాదిం చే వారు ఒక్కొక్కరు 5-6రకాల రుణాలు రూ.6 లక్షల నుండి రూ.30లక్షల వరకు తీసుకుంటున్నట్లు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నివేదిక తెలిపింది. వీరు పొందుతున్న ఆదాయంలో సుమారు 50 శాతం పైగా వడ్డీల చెల్లింపులకే సరిపోతుందట! దిగువ మధ్య తరగతి తమ దగ్గర వున్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం పెరిగింది. ఈ తరహా రుణాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 71శాతం పెరిగాయి. అంతకు ముందు సంవత్స రంలో 17శాతం పెరిగాయి.మార్చి 2020లో అప్పు ల్లో వున్న కుటుంబాలు దేశ జాతీయోత్పత్తిలో 35 శాతం వుండగా, జూన్ 2024 నాటికి 43 శాతానికి పెరిగాయని రిజర్వుబ్యాంకు తెలిపింది. ఒకవైపు మధ్యతరగతి వాస్తవ పరిస్థితి దిగజారుతుంటే దేశ తలసరి ఆదాయం 2,841డాలర్లు (సుమారు రూ. 2,52,000)కు చేరుకుందని, 2047 నాటికి రూ.15 లక్షలకు చేరుకుంటుందని ప్రధాని ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్ ప్రకటిస్తున్నారు.– జీ ఎన్ వి సతీష్ 

అటవీ ఉత్పత్తులు తగ్గుతున్నాయ్

ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాలైన అల్లూరి జిల్లా, పార్వతీ పురం మన్యం ప్రాంతాల్లో గిరిజనులకు జీవనా ధారమైన అటవీ ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అడవిలో సహజంగా పండే ఉత్పత్తులు వాతావరణ మార్పుల్లో చోటు చేసుకున్న నేపథ్యంలో తుఫాన్ల సమ యంలో నేలకొరిగిన చెట్లు కారణంగా ఉత్పత్తి సేకరణ తగ్గిపోయాయి.పడిపోయిన చెట్లు స్థానంలో విత్తనాలు లభించక గత ఐదేళ్లగా మొక్కలు నాటక పోవడంవల్ల ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని గిరిజనులు వాపోతున్నారు.– జి.ఎన్.వి.సతీష్
పార్వతీపురం మన్యం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఒకప్పుడు అధికంగా ఉండే నరమా మిడి చెట్లు ఇప్పడు కనుమరుగయ్యాయి. పదేళ్ల కిందట అధికంగా కుడ్డబ, దీనబందుపురం, నాయుడు పోలూ రు తదితర గ్రామాల సమీపాన కొండల్లో ఏటా 50క్వింటాళ్ల వరకూ నరమామిడి చెక్కను జీసీసీ సిబ్బంది కొనుగోలు చేసేవారు. 2018లో సంభవిం చిన తితలీ తుఫాన్ ప్రభా వంతో చెట్లన్నీ నెలకొరి గాయి.గతఐదేళ్లుగా అటవీ శాఖద్వారా కొండల్లో మొక్క లు నాటడం లేదు. దీంతో నరమామిడి చెట్లు కనుమరుగయ్యాయని గిరిజనులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
అడవుల్లో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఉత్పత్తులు తగ్గుతున్నాయి. జిల్లాలోని మెళియాపుట్టి, నందిగాం,టెక్కలి,పాతపట్నం,మందస,కొత్తూరు, హిర మండలం, మండలాల పరిధిలో అధికంగా అటవీ ఉత్పతుల సేకరణ జరిగేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఔషధ మొక్కలు నాటి వాటి ద్వారా గిరిజనులకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టేవారు.జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు సేకరించేవారు. అయితే అడవుల్లో గతంలో ఉన్న ఔషధ మొక్కలు, చెట్లు ప్రస్తుతం కనిపించటం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో చాలా చెట్లు నేలకొరిగాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లూ అటవీశాఖ అధికారలుఉ కనీస స్థాయిలో మొక్కలు నాటలేదు. మరోవైపు కొంతమంది గిరిజనులు పోడు వ్యవసాయం చేసేందుకు చెట్లను నరికేస్తున్నారు. దీంతో విప్ప, నరమామిడి చెక్క, ఉసిరి, అడ్డాకులు, కొండ తామర జిగురు తదితర చెట్లు కనుమరుగ య్యాయి. ప్రస్తుతం అధికంగా కుంకుళ్లు, చింతపండు, కొండచీపుర్లు మాత్రమే గిరిజనుల నుంచి జీసీసీ అధికారులు సేకరిస్తున్నారు. విప్ప పంట ద్వారా గిరిజనులకు అధికంగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం విప్ప పంట లేక..జీసీసీ అధికా రులు కొనుగోలు చేయడం లేదు. అలాగే అటవీ ప్రాంతాల్లోని చెట్లకు ఉన్న తేనె పట్టుల నుంచి తేనె సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. తుఫాన్ల కారణంగా చెట్లు నేలకొరగడంతో తేనెతీగల పట్లు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో తేనె సేకరణ తగ్గింది. అలాగే పదేళ్ల కిందట జిల్లా నుంచి 5వేల క్వింటాళ్ల వరకూ జీసీసీ ద్వారా నరమామిడి చెక్కను గిరిజనులు సేకరించేవారు. ప్రస్తుతం నరమామిడి చెట్లు లేక 50 క్వింటాళ్లు కూడా రావడం లేదని జీసీసీ అధికారులు చెబుతున్నారు. గిరిజనులు సేకరిస్తామన్నా..చెట్లు లేని పరిస్థితి నెలకొందన్నారు.అడవుల్లో సహజంగా లభించే ఉసిరికాయల చెట్లు కూడా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు నరికి ఉసిరి కాయలు సేకరిస్తున్నారు. దీంతో చెట్లు మళ్లీ చిగురించక.. ఉసిరి పంట కూడా కరువవుతోంది. గతంలో గిరిజనులు సేకరించే అడ్డాకులకు భలే గిరాకీ ఉండేది. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో అడ్డాకులకు డిమాండ్ తగ్గింది. దీంతో అడ్డాకుల సేకరణపై గిరిజనుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. అలాగే అధికంగా ఔషధాలకు వినియోగించే కొండతామర జిగురు కూడా ఎక్కడా కనిపించడం లేదు. మందస, మెళియాపుట్టి, నందిగాం తదితర ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా ఉన్న ఈ చెట్లు.. ప్రస్తుతం కనుమరుగయ్యాయి. చింత, కుంకుడు చెట్లు కూడా ముదిరిపోవడంతో ఉత్పత్తులు తగ్గుతు న్నాయి. ఒకప్పుడు లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ప్రస్తుతం ఏడాదికి జీసీసీ ద్వారా 500 క్వింటాళ్ల కుంకుడు కాయలు, 2,500 క్వింటాళ్ల చింతపండు మాత్రమే సేకరిస్తున్నారు. కొండచీపుర్లు కూడా ఏడాదికి పదివేల కట్టలు మాత్రమే సేకరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.కూటమి ప్రభుత్వం స్పందించి అటవీశాఖ ద్వారా ఔషధాలకు వినియోగించే మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఒకప్పుడు సుమారు 20రకాల అటవీ ఉత్పత్తులు పుష్కలంగా లభించేవి. ప్రధానంగా తేనె, మైనం,చింతపండు, ఇండిగపిక్కలు, ముసి డిక పిక్కలు,మారేడు గడ్డలు,వెప్ప పువ్వు, కాగు పుప్వు,కరక్కాయలు,గచ్చకాయలు,నరమా మిడిచెక్క,కొండచీపుర్లు, కుంకుడుకాయలు,ఎండ ఉసిరిపప్పు,నల్లజీడిపిక్కలు తదితర వాటిని విక్రయిస్తూ గిరిజనులు జీవనం సాగించేవారు. అయితే కాలక్రమంలో అటవీ ప్రాంతం తగ్గడం, తదితర కారణాలవల్ల గిరిజనులు అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రకాల అటవీ ఉత్పత్తులు మాత్రమే లభిస్తుండగా..వాటికి కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు.వివిధ కారణాలతో జీసీసీ అధికారులు పూర్తిస్థాయిలో అటవీ ఉత్పత్తు లను కొనుగోలు చేయడం లేదు.గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదు. దీంతో గిరిజనులు తమ అటవీ ఉత్పత్తులను నష్టానికే మైదాన ప్రాంతాల వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది.
రెగ్యులర్ సిబ్బంది లేక ..
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ప్రత్యేక సేవలు అందించాల్సిన జీసీసీ డిపోలను రెగ్యులర్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.దీంతో అవి ఉత్సవ విగ్రహాలుగా మారాయి. గుమ్మలక్ష్మీపురం పరిధిలో 46, సాలూరులో 38,పార్వతీపురంలో 17 డిపో లు ఉన్నాయి. మొత్తం 101డిపోల పరిధిలో 14 మంది రెగ్యులర్ సేల్స్‌మెన్ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.18 డిపో లకు ఎటువంటి సిబ్బంది లేరు.కాగా మిగితా వాటిని కాంట్రాక్ట్ సేల్స్ మెన్, మహిళా సంఘాల, డీలర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఇన్‌చార్జిల నేతృత్వంలోనే డిపోలను నిర్వహించాల్సిన పరిస్థితి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉంది. సీతంపేట ఐటీడీఏ పరిధిలోనూ పూర్తిస్థాయిలో సేల్స్‌మెన్‌లు లేరు.దీంతో డిపోల ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.
శిథిలావస్థలో డిపోలు…
పార్వతీపురం జీసీసీ పరిధిలో ఉన్న అనేక డిపోలు శిథిలావస్థలో ఉన్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. దీంతో సిబ్బంది బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.భవ నాల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపినా మోక్షం కలగలేదు. గోదాముల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.
కోల్డ్ స్టోరేజీలు ఎక్కడ…
జీసీసీకి జిల్లాలో ఎక్కడా కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో ఏటా లక్షలాది రూపాయలను ప్రైవేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు తప్ప సొంతంగా ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఉన్న వేములవలస వద్ద కోల్ట్‌స్టోరేజ్ నిర్మాణాన్ని చేపట్టారు. కానీ అవసరమైన యంత్రాలు రాకపోవడంతో ఆ పను లు పూర్తికాలేదు. సుమారు రూ.మÖడు నుంచి నాలుగు కోట్లు వెచ్చిస్తే..మÖడు జిల్లాల పరిధిలో గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేసిన చింతపండును జీసీసీ కోల్డ్‌స్టోరేజ్‌లో నిల్వ చేసు కోవచ్చు.కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.ఇప్పటికైనా జీసీసీకి కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేస్తే..ఏటా లక్షల రూపాయలు ఆదా చేసుకో వచ్చు. ప్రైవేట్ వ్యాపారులకు అద్దె ప్రాతిపదికన భారీగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.గిరిజన రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉం టుంది.నిరూపయోగంగా విలువైన స్థలాలు గిరిజన సహకార సంస్థకు ఉమ్మడి జిల్లాలోని గుమ్మల క్ష్మీపురం ఎస్.కోటతో పాటు విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాం తాల్లో షాపింగ్ కాంప్లెక్స్ తదితర కమర్షియల్ గొడౌన్లు నిర్మిస్తే జీసీసీకి ఆదాయం ఎంతో వస్తుంది. కానీ దీనిపై అధికార యంత్రాంగం దృష్టి కేం ద్రీకరించడం లేదు.ఈ విషయాన్ని పాలకులకు చెప్పినా పట్టించుకునే వారే కరువ య్యారు.దీంతో జీసీసీకి చెందిన విలువైన స్థలాలు నిరుపయోగంగా మారాయి.
గిరిజనులకు ఊరట
గిరిజనుల నుంచి నేరుగా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి.. వారికి గిట్టుబాటు ధర కల్పిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.సర్కారు ఆదేశాలు జారీ చేయండంతో గిరిజన కార్పొరేషన్ సంస్థ (జీసీసీ) అటవీ ఉత్పత్తుల ధరలను పెం చింది. గత ఏడాది కంటే ధరలు పెరగడంతో గిరిజనులకు కాస్త ఊరట కలగుతుందని చెప్పొచ్చు.ఇకపై వారు దళారులను ఆశ్రయిం చాల్సిన అవసరం ఉండదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గత ఏడాది ఇలా..
గత ఏడాది పిక్కతో కూడిన కిలో చింతపండు ధర రూ.32-40పైసలు, పిక్కతీసిన చింతపండు రూ.63,కాగుపప్పు రూ.22, విప్పపప్పు రూ.29, కొండతామర జిగురు రూ.114,ముసిడిక పిక్కలు రూ.90, కరక్కాయలు రూ.18,ఎండు ఉసిరిక పప్పు రూ.80, ఇండికా పిక్కలు రూ.50, కానీ కాయలు రూ. 17,కుంకుడుకాయలు రూ.35, సీకా కాయి రూ.40,అడవి తేనె రూ. 250, పుట్ట తేనె రూ.160, తేనె మైనం రూ.160,కొండ చీపుర్లు గ్రేడ్-1 రూ.45
తాజాగా పెరిగిన రేట్లు ప్రకారం…
పిక్కతో ఉన్న కిలో చింతపండు రూ.34,పిక్కతీసిన చింతపండు రూ.67,కాగుపప్పు రూ.25, విప్ప పప్పు రూ.32,ముసిడిక పిక్కలు రూ.వంద, నల్లజీడి పిక్కలు రూ.22,కరక్కాయలు రూ.20, ఎండు ఉసిరిక పప్పు రూ.90, కానీ కాయలు రూ.18కు పెంచారు. మిగిలిన అటవీ ఉత్పత్తుల రేట్లలో ఎలాంటి మార్పు లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే చింతపండుకు పిక్కతో ఉన్న దానికి రూ.రెండు, పక్కి తీసిన దానికి రూ.నాలుగు పెం చారు.చింతపండు, మిగిలిన అటవీ ఉత్పత్తులను గిరిజనుల నుంచి నేరుగా జీసీసీ కొనుగోలు చేస్తేనే లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంది.గిరిజన రైతులకు కూడా ఎంతోకొంత గిట్టుబాటు అవు తుంది.దీనిపై జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
ధరలపై అవగాహన
గిరిజనులకు జీసీసీ ధరలు, అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై అవగాహన కల్పించారు. దళారులకు విక్రయిస్తే నష్టపోతారని,జీసీసీకి అమ్మితే గిట్టుబాటు ధర లభిస్తుందని వివరించారు. అనం తరం ధరల పట్టికను ప్రదర్శించారు. ఈ కార్య క్రమంలో జీసీసీ బ్రాంచి డైరెక్టర్ నూకమ్మ, సర్పంచ్ గంగమ్మ, సేల్స్‌మన్ ఎస్.రమణారావు తదితరులు పాల్గొన్నారు.

పుడమి తల్లికి ఆత్మఘోష

సమస్త జీవకోటి భారాన్ని మోసేది ఈ పుడమి తల్లి. ఇది అందరికి తెలిసిన .. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఆ తల్లి దేహానికి గాయాలు చేస్తుంటారు. ఓ వైపు కాలుష్యం పెరుగు తున్నా.. అవేం పట్టించుకోకుండా.. మరో వైపు వనరులను తగ్గించేస్తూన్నారు. మనిషి అవస రాల కోసం జంతువులను చంపడం.. అడవు లను నాశనం చేసి.. ఇప్పుడు మారణీVA మంలో పడి కోట్టుమిట్టాడుతున్నాము. ఇష్టం వచ్చినట్లుగా సహజ వనరులను తగ్గించి.. ఇప్పుడు ప్రాణ వాయువు కోసం అల్లాడు తున్నారు. అభివృద్ధి పేరుతో జరిగే మితిమీరిన చేష్టలు భూమాతను నిలువునా దహించి వేస్తున్నాయి. తాగే నీరు.. పీల్చే గాలి.. నివసించే నేల ఇలా పంచభూతాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. పచ్చదనంతో పరిఢవిల్లాల్సిన భూతల్లి ఎదపై ప్రకృతి అందాలను కోల్పోయి మÖగ రోదనతో కన్నీరు కార్చుతోంది. మన భూమిని కాపాడుకుందాం అనే నినాదాలు కేవలం పుస్తకాల్లో రాతాలుగా మారి పోయాయి – గునపర్తి సైమన్
మనిషి స్వార్థపరుడు..చెట్లను నరికేసి పక్షులకు గూళ్లు లేకుండా చేశాడు. అడవుల్ని మాయంచేసి జంతువులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. అనాగరికులకు..అడవుల్లో బ్రతికే వారు తమ చుట్టూ ఉన్న ప్రకృతితో జీవనం చేస్తుంటే..అన్నీ తెలిసిన నాగ రికుడు..అభివృద్ధి, ప్రగతి పేరుతో పరిశ్రమలు స్థాపిం చి అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరుల్నిదో చేస్తున్నాడు. నేల,నదులు,సముద్రాలు ఒకటేమిటి ఆఖరికి ఆకాశాన్ని సైతం తన అదుపులోనే ఉంచుకో వాలన్న అత్యాశతో మొత్తంగా భూమండలాన్ని కలు షితం చేశాడు. అలా తాను సృష్టించుకున్న కాలుష్యా నికి ఇప్పుడు తానే బలవుతున్నాడు. ఏప్రిల్ 22, ధరిత్రీ దినోత్సవం మనకు ఈ విషయాలను గుర్తుచేస్తోంది.. మిగతా దేశాలకంటే భారతీయులకు భూమితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. మన సంస్కృతి మనకు నేర్పింది పర్యావరణ పరిరక్షణే. మన భూగోళాన్ని కాపాడుకోవడం కోసం చర్యలు చేపడదాం. వాహానాల వాడకం తగ్గిద్దాం. 2. అనవసర విద్యుత్ వాడకాన్ని తగ్గిద్దాం. 3. అడవులను నాశనం చేయకుండా.. చెట్లను పెంచడం అలవరచుకుందాం. 4. భూమికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదిద్దాం.
మనిషి మనుగడకు నష్టం చేసిన కరోనా మాత్రం పుడమి తల్లికి మంచి చేస్తుందనే చెప్పుకోవాలి. మనిషి సృష్టించిన కాలుష్యం నుంచి ధరణి బయటపడేలా చేస్తుంది. మనిషిని నాలుగు గోడల మధ్య బందించి.. పక్షులూ జంతువులూ స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కల్పించింది. అలాగే వ్యర్థాలతో నిండిపోయిన నదులు మళ్లీ స్వచ్చంగా కనిపిస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ఏటా కోటి హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో అడవులు కనుమరు గవుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన వ్యర్థ జలాలను సైతం సముద్రాలు, నదుల్లోకి విడిచిపెడు తున్నాం. గతశతాబ్ది కాలంలో సగందాకా చిత్తడి నేలలు,పగడపు దిబ్బలు అంతర్థానమయ్యాయి. ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడంతో వాయుకాలుష్యం పెరిగి పోయింది. వాతావరణ మార్పుల ప్రభావంతో భూతా పం ఎక్కువై అధిక ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, తుపాన్లు, వరదలు, కరవు కాటకాలు వంటి విపత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇటీవలి కొన్ని దశాబ్దాల కాలంలో భూతాపంలో వృద్ధి-పరిస్థితి తీవ్రతకు అద్దం పడు తోంది. భూతాపం మరింతగా పెచ్చరిల్లితే ప్రకృతి వైపరీత్యాల దుష్ప్రభావాలు ప్రమాదకరంగా ఉంటా యని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మానవాళి స్వయంకృతాపరాధమే ఈదుస్థితికి కారణమని తెలిసి నా ప్రపంచ దేశాలు తాత్సార వైఖరిని అవలంబిస్తుం డటం ఆందోళనకరం.
తరిగిపోతున్న అడవులు
భూతాపాన్ని నిలువరించి, పర్యావరణ సమ తౌల్యాన్ని కాపాడే లక్ష్యంతో ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి సమీక్షలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాలు పర్యావరణ చట్టాలకు పదును పెడుతూ సహజ వన రుల వినియోగాన్ని నియంత్రించే లక్ష్యంతో విధానాలు రూపొందిస్తున్నాయి.వాటి కార్యాచరణ మాత్రం చురుకందుకోవడం లేదు. భూతాపాన్ని నియంత్రించేం దుకు 2015లో పారిస్ వేదికగా ప్రప దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలులో అనిశ్చితి ఇంకా కొన సాగుతోంది.కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం పర్యావరణహితకరమైన విధానాలు అమలు చేస్తామని దేశాలు ప్రతినపూనాయి.అందుకుగాను ప్రజల ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అవసరాల కోసం నిరుపేద, వర్ధమా న దేశాలకు నిధులు ఇస్తామని సంపన్న దేశాలు పేర్కొ న్నాయి.ఈ ఒప్పందం జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా నిధుల విడుదలలో జాప్యంచేస్తున్నాయి. నార్వే, జర్మనీ, స్వీడన్ వంటి దేశాలు స్వల్పంగా నిధులు విడుదల చేసినా అగ్రదేశాలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు.భూతాపాన్ని నియంత్రించడంలో అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. వనాలు జీవవైవిధ్య పరిరక్షణకు, జీవనోపాధుల కల్పన,ఆహార భద్రతకు విశేషంగా తోడ్పడతాయి. అయితే, అడవుల విస్తీర్ణం పెరగడం సంగతి అటుంచి, ప్రస్తుతమున్న దట్టమైన అడవుల విధ్వసం విచ్చలవిడిగా సాగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆహార సంస్థ నివేదికల ప్రకారం వ్యవసాయ భూములు, నగరాల విస్తరణ, మౌలిక సదుపాయాలు,ఖనిజ తవ్వకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం అడవులపై పడు తోంది. మÖడు దశాబ్దాల కాలంలో సుమారు 42 కోట్ల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలోని అడవులు అంతరిం చాయన్న అంచనా దిగ్భ్రాంతపరుస్తోంది.
లక్ష్యాలకు తూట్లు
పర్యావరణ పరిరక్షణలో భారత్ అనుసరి స్తున్న అనేక లోపభూయిష్ట విధానాల మÖలంగా భూగోళ పరిరక్షణ లక్ష్యాలకు తూట్లు పడుతున్నాయి. భూతాపం నియంత్రణకుగాను భారత్ వివిధ విధాన పరమైన చర్చల్లో అమెరికా వంటి అగ్ర దేశాలతో తలపడుతోంది.అయితే, వివిధ పర్యావరణ విధా నాలు,చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడంలో ఇండియా విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రకృతి వ్యవస్థలకు నష్టం వాటిల్లకుండా, పర్యావరణ న్యాయం అమలు చేసేలక్ష్యంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ చట్టం-2010 తీసుకొచ్చారు.ఈచట్టం అమలు మొదలై 13 ఏళ్లు గడుస్తున్నా అన్ని రాష్ట్రాల్లో హరిత న్యాయస్థానాలు అందుబాటులోకి రాలేదు. తీర ప్రాంత పరిరక్షణకు ఉద్దేశించిన సి. ఆర్.జెడ్. నిబంధనలు-2019 అమలులో రాష్ట్రాలు ప్రదర్శి స్తున్న అలసత్వం,తీరప్రాంతాల్లోని మడ అడవులు వంటి సున్నిత వ్యవస్థల విధ్వంసం వంటి అంశాలపై ఇటీవల కాగ్ వివిధ రాష్ట్రాలను తీవ్రంగా ఆక్షేపిం చింది. మన దేశంలో గడచిన ముప్ఫై ఏళ్ల కాలంలో లక్షలఎకరాలకు పైగా అడవులను అటవీయేతర కార్య క్రమాలకు బదలాయించినట్లు అంచనా. వీటికి ప్రత్యా మ్నాయంగా అడవుల పెంపకంలో అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్ఠంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.నష్టపరిహారంగా వచ్చే నిధులతో వనాల పెంపు కోసం 2016లోనే ప్రత్యామ్నాయ అటవీకరణ నిధి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చినా ఆశించిన ప్రయోజనం చేకూరలేదు.
ప్లాస్టిక్తో ముప్పు
ప్రజల జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన పెనుమార్పుల మÖలంగా ప్లాస్టిక్ వాడకం అనూహ్యంగా పెరిగింది. మితిమీరిన ప్లాస్టిక్ విని యోగం ప్రకృతి వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. తీరప్రాంతాల్ని కలిగి ఉన్న దేశాల నుంచి ఏటా లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మహాసముద్రాల్లో పోగుపడు తున్నాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థలో చేరే వ్యర్థాల్లో దాదాపు 90శాతం ప్లాస్టిక్ ఉంటోంది. భారత్లోని ప్రధాన నదులు సైతం ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర పర్యావరణంలోకి తీసుకెళ్ళే మార్గాలుగా మారడం ఆందోళనకరం. ప్రస్తుత ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం,పునర్ వినియోగ విధానాల్లో మార్పు రాకపోతే 2040నాటికి కోట్లాది టన్నుల ప్లాస్టిక్ వ్యర్థా లు సముద్రాల్లో పేరుకుపోయే ముప్పుంది. దీనివల్ల సాగర జీవుల మనుగడ ఇక్కట్లలో పడుతుంది.తీర ప్రాంత ప్రజల ఆరోగ్యమÖ దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
భూమి దినం చరిత్ర
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమం మొదలైన సమయం దృష్టిలో పెట్టుకుంటే, అది 1970 ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఆరోజున సెనేటర్ గేలార్డ్ నెల్సన్ మరియు కార్యకర్త డెనిస్ హేస్ వారు తొలి సమావేశాన్ని ప్రేరేపించారు.వారు దేశవ్యా ప్తంగా 20మిలియన్ మందిని గాలి కాలుష్యం, నూనె పారులు మరియు జాతి విభిన్నత నష్టాలపై ప్రతిరోధం చేయమని విజయవంతంగా ప్రేరేపించారు.ఈ చరిత్రాత్మక ఘటన స్థాపనకు,అలాగే క్లీన్ ఎయిర్ యాక్ట్ మరియు ఎండేంజరడ్ స్పీషీస్ యాక్ట్ వంటి కీలక చట్టాల ఏర్పాటు కొరకు మార్గం సృష్టించింది. ఏప్రిల్ 22 ఏసంవత్సరం నాటికి పడ్డా,ప్రజలు ఎప్పు డూ ఆరోజున భూమి దినాన్ని జ్ఞాపకం చేసుకుం టారు. ఈ మసలేని నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు వారి షెడ్యూల్‌లను సరిపోల్చుకోవడానికి సమయం ఇస్తుంది. భూమి దినం 2025 ఒక గ్లోబల్ రోజు,అందరూ కలిసి మన భూమిని నివసించ దగినదిగా ఉంచేందుకు మనం భాగస్వామ్యం అయిన బాధ్యతను గౌరవించేందుకు ఇది ఒక అవసరం.
ఏప్రిల్ 22 ప్రత్యేకత ఏమిటి?
సెనేటర్ నెల్సన్ మరియు ఆయన సిబ్బంది ఈరోజు ప్రత్యేకంగా ఎంచుకున్నప్పుడు, యువతను ఆకర్షించి, వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల ఉత్సాహాన్ని ఉపయోగించుకోవాలని ఆశించారు. ఈ ఘటనను వసంత విరామం మరియు ఫైనల్ పరీక్షల మధ్య అంగీకరించడానికి వ్యూహాత్మకంగా షెడ్యూల్ చేశారు, తద్వారా మాక్సిమమ్ విద్యార్థి భాగస్వామ్యాన్ని ప్రేరేపించడానికి,పర్యావరణ ఉద్యమ యువత ఉత్సా హం శక్తిని తీసుకురావడాన్ని ప్రోత్సహించవచ్చని ఉద్దేశ్యించారు. ఈఏడాది 2025లో భూమి దినం వేడుకను 192 దేశాల నుండి ఒక బిలియన్ మందికి పైగా జరుపుకుంటారని అంచనా. ఇది ఈ ఘటన 55వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఇది భూమి దినం ఉద్యమం,వివిధత,సమాజం మేలు కోసం ప్రజలను ఐక్యంగా చేయడంలో నిబద్ధత.1970లో లాగా ఇప్పటికీ బలంగా ఉందని చూపిస్తుంది. భూమి దిన సారాంశం ఎప్పటికీ ప్రజల శక్తి, మరియు ఈ శక్తి విప్లవాత్మక మార్పును తీసుకురావడానికీ సామర్థ్యం కలిగి ఉంది. ప్రజలు ఒక సామాన్య లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐక్యంగా వచ్చేటప్పుడు, వారు పాత వ్యవస్థలను,పరిశ్రమలను అధిగమించ గలుగుతారు! పుడమి తల్లి పుట్టిన రోజునమనం అందరికీ మంచిగా ఉండే భవిష్యత్తును సృష్టించడానికి పునరుత్పత్తి శక్తి వనరులను ఉపయోగించేందుకు ఒకవాగ్దానాన్ని ఇవ్వు దాం.అది ఆరోగ్యకరమైన, స్థిరమైన, సమానమైన, మరియు ధనికమైనది.
ఈఏడాది నినాదం..“శక్తి..ప్రజలు..గ్రహం”
శక్తి:మన గ్రహం సమృద్ధిగా ఉన్న పునరుత్పత్తి శక్తి వనరులను 2030నాటికి వాటి ఉత్పత్తిని మÖడు రెట్లు పెంచడం ద్వారా ఎక్కువగా ఉపయోగించాలి. ఈ జాబితాలో సౌరశక్తి, గాలిశక్తి, జల విద్యుత్తు, భూపర్యవేక్షణ శక్తి,జలధార శక్తి ఉన్నాయి.
ప్రజలు:ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం,ఉద్యోగాలను సృష్టించడం, సమానత్వాన్ని ప్రోత్సహించడం.. అంగీ కరించేస్థాయిలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడం,శుభ్ర మైన,అంగీకరించిన పునరుత్పత్తిశక్తితో ప్రపంచ కమÖ్యనిటీలను శక్తివంతం చేయడం ద్వారా బిలియన్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచగలుగుతాం. గ్రహం:మేము పునరుత్పత్తి శక్తి వ్యవస్థలను త్వరగా అమలు చేయడంద్వారా వాతావరణ మార్పును ఆప వచ్చు,పర్యావరణ వ్యవస్థలు మరియు జాతి విభిన్న తను కాపాడవచ్చు, మరియు మనం గోచారం వంటివి మీద ఆధారపడటం తగ్గించగలుగుతాం.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి:..
శుభ్రపరచే కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ భూమితో మీ సంబంధాన్ని బలపరచవచ్చు. గ్యారేజీ బ్యాగ్‌తో తిరుగుతూ ఎదురయ్యే ప్రతి ప్లాస్టిక్‌ను సేకరించండి.సమీపంలో ఉన్న కసాయి కాలువ లేదా గుంటను మీరు తెలుసుకోవచ్చు! గృహపరికరాలు వంటగదిలోని పాత్రలను కప్పు మరియు సిరామిక్‌తో మార్చండి,ప్లాస్టిక్ కట్టర్లను వేయకుండా వాటిని పునః ప్రయోగించండి!
చెట్లు నాటుదాం..
మన చెట్లు అద్భుతంగా ఉంటాయి. కార్బన్ ను సేకరిస్తాయి.వేడి ప్రాంతాలను చల్లబరు స్తాయి, పురాణాన్ని ప్రోత్సహిస్తాయి, రోగాల యొక్క ప్రసారం ప్రమాదాన్ని తగ్గిస్తాయి,స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంపొందిస్తాయి.ఒకేఒక చెట్టు మొత్తం యార్డ్‌లోని మొక్కల కంటే ఎక్కువ వన్యప్రాణులను ఆకర్షిస్తుందని మీరు ఊహించలేము! మీరు మీస్థానిక అధికారులుతో సంభాషించి పబ్లిక్ ప్రదేశాలలో చెట్లు మరియు స్థానిక తోటల బడ్‌లను నాటడం గురించి చర్చించండి. మీస్వంత భూమిలో కూడా వాటిని నాటవచ్చు!

తెలుగు భాష తీయ్యనది

మనం ఒక వ్యక్తితో మన భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ సమా చారం కేవలం మెదడుకు మాత్రమే చేరుతుంది. అదే మన మాతృభాష, అతని మాతృభాష ఒకటే అయినప్పుడు ఆ సమాచారం హృదయానికి చేరుతుందంటారు నెల్సన్‌ మండేలా. ప్రతి ఒక్కరూ తమ జన్మభూమిని, సంస్కృతిని, మాతృభాషను గౌరవించాలి. నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుందని డబ్ల్యూ.బి.యేట్స్‌ అంటాడు. భాష మన భావాలను ఎదుటివారికి వ్యక్తపరిచే ఒక సాధనం. భూగ్రహంపై ఉన్న లక్షలాది జీవరాశుల్లో ఒక్క మానవుడికి మాత్రమే భావాలను రాత, కూత రూపంలో వ్యక్తపరిచే అవకాశం ఉంది. మన మనసులో ఏ భావాలు ఉంటాయో, ఏ అనుభవాలు ఉంటాయో వాటిని సమర్థవంతంగా భాష తెలుపుతుంది. మాట్లాడే అలవాటుతో కూడిన వ్యవస్థ భాష. బుద్ధి జీవులు తమ అనుభ వాలను భాష ద్వారానే వ్యక్తం చేస్తారు. మొదట చిన్న చిన్న శబ్దాల రూపంలో ప్రారంభమైన భాష, అమ్మ నోటి నుండి వెలువడే పదాలతో సుసంపన్నమ వుతుంది. అమ్మ మాటను శిశువు అనుకరిస్తాడు.. అనుభవిస్తాడు.. ఆనందిస్తాడు.. జత కలుపుతాడు.. కొనసాగిస్తాడు. అమ్మ మాటే మాతృభాషగా కొనసాగుతుంది. తెలుగు నేల మీద అమ్మ భాషకు క్రమంగా వెలుగులు తగ్గుతున్నాయి. మూలమైన ఈ భాషను చేతులారా మనమే మూలకు నెట్టేస్తున్నాం. తల్లిని ప్రేమించినట్టే..తల్లిని రక్షించుకున్నట్టే భాషను రక్షించు కోవాల్సిన బాధ్యత ఈ తరం మీద ఉంది.
భావ వ్యక్తీకరణకు,భావ గ్రహణానికి మాతృభాష కీలకమైనది. మనం వేరే భాష మాట్లాడే ప్రాంతంలో ఉన్నప్పుడు,మన భాషకు సంబంధించిన ఒక్కమాట వినబడినా ఉప్పొంగిపోతాం. మాతృభాషను మాట్లాడగలిగిన వ్యక్తి ప్రపంచంలోనే ఇతర ఏ భాషనైనా సులభంగా నేర్చుకుం టాడనడానికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మన బాధను,ఆనందాన్ని,కోపాన్ని,అనుభూతిని మాతృభాషలో వ్యక్తీకరించినంత శక్తివంతంగా ఇతర ఏ భాషలోనూ వ్యక్తీకరించలేము.ఇవాళ మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్న ఒక తరాన్ని మనమే తయారు చేసుకున్నాం. విద్య వ్యాపారం అయ్యాక, మనిషి సరుకు వెంటపడ్డాక, కేవలం డబ్బులు సంపాదిం చడమే విద్యగా మనం మార్చేశాం. ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమే కానీ పరాయిభాషను నాలుక మీద ఎక్కించుకొని,మాతృభాషను పాదాల కిందకు తొక్కేయడం క్షమించరాని నేరం.
చదివితే ప్రయోజనాలు..
మాతృభాషలో విద్యాబోధన వల్ల గ్రహణ సామర్థ్యం పెరుగుతుంది.విద్యార్థుల్లో సృజనాత్మకత వికసి స్తుంది. మనుషులు నిజమైన భావ ప్రేరణ, ప్రగతి మాతృభాష వల్లే కలుగుతుంది.అసలు స్వభాషలో విద్య ఉంటే మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చి ఉం డేదని గాంధీ అభిప్రాయపడ్డారు. మాతృభాషలో విద్య మనసును చురుగ్గా చేస్తుంది.భాష కేవలం వ్యక్తీకరణ కోసమే కాక,అది ఒక జాతి మొత్తానికి వారి ఉనికిని,వారి సంస్క ృతిని,సాంప్రదాయా లను, స్థానిక వాతావరణ పరిస్థితులను ఆ తర్వాత తరానికి అందించే వారధిగా ఉంటుంది. భాష ఒక జాతి అస్తిత్వం. పరాయి భాష కేవలం జీతం కోసమే. మాతృభాష జీవితాన్ని తెలుపుతుంది. మాతృభాషలో మన ఆలోచన అత్యంత వేగంగా ఉంటుంది. ఒక వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి మాతృభాష సోపానం వంటిది. మన మాతృభాషని అర్థం చేసుకుంటే అందులోని జాతీయాలు,పదబంధాలు,మెరుపులు,ఛలోక్తులు వాటి తాలూకు పరిమళం మనకు తెలుస్తాయి. పరాయి భాష ఎంత నేర్చుకున్నా అందులోని ప్రాణశక్తిని మనం పట్టుకోలేం.మాతృభాషలో విద్యను నేర్చుకున్న విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి తొందరగా అలవాటుపడతారు. ఏదైనా ఒక విషయం మీద మాట్లాడమని చెప్పిన ప్పుడు మాట్లాడగలరు, స్పందించగలరు.ఇతర భాషల్లో ఆ స్పందన ఉండదు. కేవలం బట్టీపట్టి మాత్రమే వాళ్ళు మాట్లాడగలరు. పసివారి మెదడుకు మాతృభాష సహజమైన పోషణ. పిల్లలు ఈ నేల మీద పుడతారు, ఈ నీళ్లు తాగుతారు. కానీ విదేశీ భాషను ఆ పసికందుల నెత్తిన రుద్దడం అంటే వారి మేధాశక్తిని, సృజనాత్మకతను హత్య చేయడమే అవుతుంది.
భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి..
ఆంధ్రప్రదేశ్‌ తొలి భాషా ప్రయుక్తగా ఏర్పడిరది. కానీ ఇవాళ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ప్రభుత్వం జీవోలు తెలుగులో ఇవ్వాలనే ఒక ప్రకటన విడుదల చేసింది. జీవోలు తెలుగులో ఇచ్చినంతమాత్రాన భాషను పరిరక్షించినట్టు కాదు. పాలనా భాషగా,బోధనా భాషగా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చకపోవడానికి పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలు కారణం. ఈనాటి బాల బాలికలలో,యువతరంలో తీవ్రమైన మానసిక ఉద్వేగాలకి కారణం వాళ్లు తమ భాషలోని మాధుర్యాన్ని, ఆ భాషకు సంబంధించిన సాహిత్యాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకోలేని స్థితిలో ఉండటమే! మనది కాని సాహిత్యాన్ని వాళ్ళ నెత్తిన రుద్దుతున్నాం. పరభాషా వ్యామోహంతో అమ్మ భాషను నిర్లక్ష్యం చేయడం క్షమించరానిది. అమ్మ భాషను పరిరక్షించుకోవడం సామాజిక అవసరం. ‘దేశ క్షేమానికి భాషా క్షేమమే పునాది’ అని గిడుగు అప్పుడెప్పుడో ఉద్ఘాటించారు.‘పర భాష బోధన సోపానాలు లేని సౌధంలా ఉంటుంది’ అని ఠాగూర్‌ అంటారు.విద్య గ్రామీణుల అవసరాలు తీర్చేదిగా ఉండాలి.‘విద్యా బోధన మాతృభాషలో జరగాలి. కొల్లగొట్టుకునే సామ్రాజ్యవాదులకు సహాయకారిగా ఉండకూడదు!’ అని మహాత్ముడు పిలుపునిచ్చాడు.
నూతన విద్యా విధానంలో..
నూతన జాతీయ విద్యా విధానంలో కూడా ప్రాంతీయ భాషలకు పట్టం కట్టారు. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన మాతృభాషలో ఉండాలని చెప్పారు.అయినా సరే అట్లాంటి చట్టాల్ని, నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోవు. ఏదో ఒకసారి కోర్టులో తీర్పు తెలుగులో వెలువడితే చంకలు గుద్దుకుని ఆనందించిన వాళ్ళం మనమే. పిల్లలకు పునాది సరిగా లేకపోతే ఏభాష అయినా ఎలా వస్తుంది. సృజనాత్మకత మొలకెత్తాలంటే మాతృభాష మార్గం.శిక్షణల ద్వారా భాష రాదు. మనం కొన్నాళ్లుగా ఇంగ్లీష్‌ మీడియం పేరు మీద ఇస్తున్నది శిక్షణ.కానీ అది పిల్లలకు రక్షణ కాదు. అది విద్యావిధానం లక్షణం కాదు. మాతృభాషను ఎట్లా ఉత్సవం చేసుకోవాలో ఈజాతి ఇంకా తెలుసుకోలేదు. ‘మాతృభాష కంటిచూపు వంటిది. మిగతా భాషలు కళ్ళజోళ్లు వంటివి. కంటిచూపు లేకుండా కళ్ళజోళ్ళు ఎన్ని పెట్టుకున్నా ప్రయోజ నం ఉండదు’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతంలో చెప్పారు. తనకు మాతృ భాషలోనే విద్య నేర్పమని ఔరంగజేబు తన గురువుకు ఉత్తరం రాసిన సంగతి చరిత్రలో ఉంది.ఆనాటి విద్యావ్యవస్థపై ఔరంగజేబు చేసిన ఫిర్యాదు అది.
ఏ భాష నేర్వాలన్నా..
ప్రపంచవ్యాప్తంగా జరిపిన జరుగుతున్న పరిశోధనల ద్వారా విద్యార్థులు ఏ శాస్త్రమైనా ఏ ఇతర భాషలు నేర్చుకోవడానికైనా మాతృభాష మాధ్యమమే సరైనదని తేల్చారు. జపాన్‌, ఐర్లాండ్‌, ఫిన్లాండ్‌, చైనా లాంటి దేశాల్లో ఆ ఫలితాలను మనం చూస్తూనే ఉన్నాం. బహుళ భాషల సమాజాల మనుగడ నేడు వాస్తవంగా ఉన్నప్పటికీ మాతృభాష పరిరక్షణ తప్పనిసరి అవుతుందని యునెస్కో తెలుపుతుంది. ‘నేను నా మాతృభాష లోనే మాట్లాడుతాను. ఎందుకంటే నా ఉనికికి నా భాష కారణం. మా అభిమాన మాతృభాషనే మా బిడ్డలకు నేర్పుతాం. వారెవరో వారికి తెలియాలి!’ ఇలాంటి నినాదాలు యునెస్కో ఎప్పటినుంచో గుర్తుచేస్తూ ఉంది.
భాషను వ్యాపార వస్తువు చేయడం మన రాష్ట్రం లో మరీ మితిమీరినట్టుగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కాన్వెంట్ల మోజు విపరీతంగా పెరిగింది. ప్రభుత్వాలు కూడా భాషను బ్యాలెట్‌ పేపర్‌గా చూడడం మొదలుపెట్టాయి. తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో చేర్పించి, పిల్లవాడు చాలా త్వరగా ఇంగ్లీష్‌ నేర్చుకుంటున్నాడంటూ మురిసిపోతున్నారు. అందులో వారి తప్పేమీ లేదు. ఆంగ్లం కేవలం 26 అక్షరాలతో కూడిన భాష. తొలి 100 పదాలను సులభంగా నేర్చుకుంటారు. ’’మమ్మీ డాడీ’’ అని పిలుస్తూ తిరుగుతూంటే ఇంగ్లీష్‌ అంతా వచ్చేసిందనే భ్రమలో తల్లిదండ్రులు ఉండిపోతారు. తెలుగులో అచ్చులు, హల్లులు, గుణింతాలు, వాటి ఒత్తులు మొత్తంగా సుమారు 15 వందలకు పైగా అక్షరాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఒక్కసారి అక్షరాలను నేర్చుకుంటే ఏ వాక్యాలనైనా, ఏ కావ్యాలనైనా సులభంగా చదివేయొచ్చు. కానీ ఆంగ్ల భాష అలాకాదు.. జీవితాంతం ప్రతి పదానికీ కొత్తగా ఉచ్చారణ, రాసే విధానం నేర్చుకుంటూ పోవాల్సిందే.
పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టే తెలుగు బాగానే వస్తుందనే భ్రమలో మనం ఉండిపోయాం. తల్లిదండ్రులు రోజూ పిల్లలతో కొద్దిసేపు తెలుగు కథలను చెప్పడం వల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలను, మన సాహిత్య ఇతిహాసాలు వంటివి పిల్లలకు సులభంగా చేరతాయి. పిల్లలు కథలను చదవడం ద్వారా వారి మీద వికాసం చాలా బాగుంటుంది. మాతృభాషలో కథలను చదువుతున్నప్పుడు అవి వారి మనసుల్లో దృశ్య రూపంలోకి సులభంగా మారుతూంటాయి. అవి అలా గుర్తుండిపోతాయి. అందువల్ల పిల్లల్లో సృజనాత్మకత మెరుగుపడుతుంది. కథలను టీవీలోనూ యూట్యూబ్‌ ఛానల్‌లోనూ చూస్తున్నప్పటి కంటే చదువుతూ ఉన్నప్పుడు పిల్లలే దృశ్యకరణ చేసుకోగలరు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి.
ప్రస్తుతానికి సురక్షితం..
ప్రస్తుతానికి తెలుగు భాష యునెస్కో లెక్కల ప్రకారం 65 సురక్షిత భాషలలో ఒకటిగా ఉంది. మన దేశంలో గానీ మన రాష్ట్రంలో గానీ ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులను పరిశీలిస్తే.. వారికి బోధించే ఉపాధ్యాయులు కేవలం పాఠాన్ని చెప్పడానికి సాంకేతిక పదాలు మాత్రమే ఆంగ్ల భాషలో ఉపయోగిసూ,్త మిగిలినదంతా మాతృ భాషలోనే చెప్తారు. బోధించే వారికి కూడా ఆ భాషలో సరైన భావ ప్రసారం ఉండదు. ఏది ఏమైనప్పటికీ కాస్తో కూస్తో సినిమా పరిశ్రమల వాళ్ళు మాతృభాషలో సినిమాలు తీసి సేవ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్లు కూడా ఆంగ్ల మాధ్యమంలో సినిమాలు తీయడం మొదలుపెడితే మన భాష పరిస్థితి ఇక అంతే. కేవలం మాట్లాడే వాళ్ళు ఉంటే భాష బతికేస్తుంది అనే మాట తప్పు. ఆ భాషలో రచనలు రావాలి. వాటిని చదివే వాళ్ళు ఉండాలి. ఈ తరంలో సొంతంగా ఐదారు వాక్యాలు కూడా తెలుగులో సరిగా రాయలేని వాళ్ళు గణనీయమైన శాతంలో ఉన్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. మాతృభాషలో విద్యాబోధన లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. దీన్ని మార్చా ల్సిన అవసరం ఉంది. మాతృభాషలో చదువుని ప్రారంభించిన విద్యార్థి ఒత్తిడిని సులభంగా అధిగమించగలడు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు వారి వారి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడానికి, వారు రాజకీయ కిరీటాలు ధరించడానికి, వాళ్లు ప్రజలలోకి చొచ్చుక ుపోవడానికి చేసింది వారికి మాతృభాషలో ఉన్న పట్టు మాత్రమే అనే విషయాన్ని కూడా గుర్తించాలి.-(గొడవర్తి సూర్యనారాయణ)

1 2 3 … 12