గిరిజన విద్యార్ధుల ఆరోగ్యానికి ఏదీ భరోసా

రాష్ట్రవ్యాప్తంగా గిరిజనప్రాంతాల్లో550 గిరిజన ఆశ్రమ పాఠశాలలు,ప్రీమెట్రిక్,పోస్ట్మెట్రిక్ వసతి గృహాలున్నాయి.ఇందులో ఏజెన్సీ ప్రాంతంలోనే 305ఉన్నాయి.ఒక్కోచోట 100 నుంచి 600 మంది వరకు విద్యార్ధులు.మొత్తంగా దాదాపు 1.20లక్షల మంది గిరిజన బిడ్డలకుజలుబు,జ్వరం,ఇంకేదైనా ఆరోగ్య సమస్య వచ్చినా నాడి పట్టి చూసే వారే లేరు. మారుమÖల ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి,జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే వీటిలో ఏఎనఎంల నియామకం తప్పనిసరి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆశ్రమ పాఠశాలలో ఏఎనఎంల నియామకం చేపట్టాలని గిరిజన సంక్షేమశాఖ అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు నివేదించారు.సీఎంవో దృష్టికి కూడా సమస్య తీవ్రతను తీసుకెళ్లారు.కానీ వారంలో ఒక రోజు (గురువారం)సమీపంలోని సచివాలయ ఏఎనఎంలు ఆశ్రమ పాఠశాలలకు వెళ్లి విద్యార్ధులను పరిశీలించాలని ఆదేశిలిచ్చి వదిలేశారు.- జి ఎన్ వి సతీష్ 

వందల మంది విద్యార్ధులకు ఒక్కరోజు ఒక్క ఏఎనఎంతో సేవలందేనా..?
2014`19 మధ్య తెదేపా హాయంలో ప్రాజెక్టు కింద దాదాపుగా 550మంది ఏఎనఎం లను నియమించి గిరిజన విద్యార్ధుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించారు.వైకాపా ప్రభుత్వం వీరిని తొలగించింది.కూటమి వచ్చాక పాత విధానంలోనే పొరుగు సేవల కింద లేదా ఏదైనా పథకం కింద నియమించుకునేందుకు అనుమతి వ్వాలని గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వాన్ని కోరింది. 550 మందిని పొరుగు సేవల కింద నియమించినా ప్రభుత్వానికయ్యే ఖర్చు ఏడాదికి రూ.15కోట్లకు మించదు.ఇవేవీ కాదని వారంలో ఒక రోజు ఏఎనఎంలు సందర్శించేలా వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.వందల మంది విద్యార్ధులుండే చోట ఒక్క ఏఎనఎం ఉదయం నుంచి సాయంత్రంలోపు విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిని ఏమాత్రం పర్యవేక్షించగలరో పైవారికే తెలియాలి.వచ్చే విద్యాసంస్ధరం నుంచైనా ఏఎనఎంలను నియమించాలని గిరిజన సంఘా లు కోరుతున్నాయి.
గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాల ల్లోని గిరిజన విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్య భరోసా లేదనే వాదన బలంగా వినిపిస్తున్నది. అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మన్యం పార్వతీపురం జిల్లాలోని కురుపాం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో కలు షిత నీరు కారణంగా రెండు వందల మంది బాలి కలు అస్వస్థతకు గురికావడం, వారిలో 37 మంది కేజీహెచ్‌లో, మరో 120 మంది పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న ఘటనతో గిరిజన ప్రాంతంలోని విద్యార్థుల ఆరోగ్య పరి రక్షణపై తాజాగా మరోమారు చర్చకు దారి తీసింది. పాడేరు ఐటీడీఏ పరిధిలో ప్రతి ఏడాది 10 నుంచి 15 మంది గిరిజన విద్యార్థులు వివిధ ఆరోగ్య సమస్యలతో మృతి చెందుతున్నట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.
గతంలో ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీ ర్లుండేవారు. 2019లోఅధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2020లో వారినిఅకారణంగా తొలగించింది. దీంతో ఆశ్రమ విద్యార్థులకు ప్రాథమిక వైద్య సేవలు అందని పరిస్థితి నెల కొంది. దీంతో గిరిజన విద్యార్థులు అనారోగ్యానికి గురికావడం, సకాలంలో వైద్య సేవలు అందక మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో విద్యార్థులు రోగాల బారిన పడడం, పరిస్థితి విషమించి మృతి చెంద డం సర్వసాధారణమైపోయింది.ఏజెన్సీ 11 మం డలాల్లో 121గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశా లలున్నాయి.వాటిలో 38వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. విద్యా సంవత్స రంలో సెలవులు మినహా వారంతా ఆశ్రమ పాఠశాలల్లోనే ఉంటారు. కాగా 2014, 2015 సంవత్సరాల్లో అనారోగ్య సమస్యలతో పదుల సంఖ్యలో గిరిజన విద్యార్థులు మృతి చెందారు. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్ పేరిట వైద్య సిబ్బందిని నియమించాలనే డిమాం డ్ ఉత్పన్నమైంది. దీనికి స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ 121 ఆశ్రమాలకు 2016లో 72 మంది హెల్త్ అసిస్టెంట్‌లను, 49 మంది ఏఎన్ ఎంలను నియమించింది. దీంతో ఆశ్రమాల్లోని విద్యార్థులకు ఆర్యోగ పరీక్షలు నిర్వహించడం, అవసరం మేరకు సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లి వైద్యం అందించడం చేసేశారు. దీంతో విద్యా ర్థుల ఆరోగ్యానికి ఒక ప్రత్యేక భరోసా ఉండేది.
కొవిడ్ తరువాత వైద్య సిబ్బంది నియామకాల్లేవు
2016 నుంచి ఆశ్రమాల్లో పని చేస్తున్న ఆరోగ్య సిబ్బందిని కొవిడ్ తరువాత పాఠశాలల పునః ప్రారంభంలో నియమించకుండా తొలగించారు. కొవిడ్ కారణంగా 2019,2020లో విద్యాల యాలు మూతపడడం, 2021లో పాఠశాలలు తెరచుకున్నప్పటికీ,ఆశ్రమాలో హెల్త్ అసిస్టెంట్‌లు, ఏఎనఎంల నియామకానికి వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.వారిని తొలగించినట్టు ప్రక టించింది. దీంతో స్థానిక అధికారులు సైతం ఏమి చేయలేక మిన్నకున్నారు.అలాగే 2021లో పాఠ శాలలు అంతంతమాత్రంగా తెరచుకోవడం, 2022 విద్యా సంవత్సరం జూలై ఐదో తేదీ నుంచి ప్రారంభమైనప్పటికీ ఆశ్రమాల్లోని విద్యార్థుల ఆరోగ్య రక్షణ సందిగ్ధంలో పడింది. అలాగే అప్పుడప్పుడు విద్యార్థులు రోగాల బారినప డడంతో ఉపాధ్యాయులే ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. పరిస్థితి విషమిస్తే విద్యా ర్థులు తమ ప్రాణాలు కోల్పోయేవారు.
మొక్కుబడిగా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన స్కూల్ హెల్త్ కార్యక్రమం ఏజెన్సీలో మొక్కుబడిగా అమల వుతున్నది. విద్యార్థులకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యం అందిస్తున్నారే గాని, వైద్యులు విద్యాలయాలకు వెళ్లి సేవలు అందిస్తున్న వైనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకున్న నా?థుడే లేని దుస్థితి కొనసాగు తున్నది. దీంతో గిరిజన విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైపోయాయి. అలాగే వైద్యారోగ్య శాఖ నిబంధనల ప్రకారం ఏడాదిలో రెండు మార్లు మాత్రమే పాఠశాలలో విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తారు. ఇందులో భాగంగా వైద్యులు,సిబ్బంది తమకు అందుబాటులో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు వైద్యసేవలు అంది స్తున్నారు.దీంతో మిలిగిన సమయాల్లో విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోని పరిస్థితి ఏర్ప డింది.అలాగే ఏజెన్సీలో కస్తూర్బా బాలికల విద్యా లయాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేకంగా వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ, గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో అందుకు భిన్నంగా కనీస వైద్య సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితి కొనసాగుతున్నది.
హెల్త్ సిబ్బంది నియామకంపై నెరవేరని మంత్రి హామీ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ల్లోని గిరిజన విద్యార్థులకు వైద్య సేవలు అందిం చేందుకు వైద్య సిబ్బందిని నియమిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి గతేడాది జూలైలోనే ప్రకటించారు.కానీ నేటికీ మంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదు. వాస్త వానికి ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది ఎంతో అవసరం. అలాగే వారికి నాణ్యమైన పోషకాహారం,శుద్ధి చేసిన తాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆశ్రమ పాఠ శాలల్లోని గిరిజన విద్యార్థులకు సామూహికంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎం తైనా ఉందని విద్యార్థి సంఘాలు భావిస్తు న్నాయి.
గిరిజన విద్యార్థుల మరణాలు ఆందోళనకరం
పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థుల వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిసు ్తన్నాయని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర నాయకులు టి. కామేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక ఆరోగ్య విభాగం కో కన్వీనర్ డాక్టర్ ఎం. రమేష్‌కుమార్ అన్నారు.ప్రజా ఆరోగ్యవేదిక, జనవిజ్ఞన వేదిక, యుటిఎఫ్ నేతలు, పలువురు సభ్యులతో కూడిన పరిశీలన బృందం విశ్వనాథపురం గ్రామంలో పర్యటించింది. గిరిజన విద్యార్థుల మరణాలపై స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకుల నుంచి బృందం సమాచారం సేకరిం చింది. సమయానికి వైద్య సేవలు అందక పోవడం, పోషకాహార లోపం, ఆశ్రమ పాఠశాల ల్లో సరైన ఆరోగ్య పర్యవేక్షణ లేకపోవడం వంటి సమస్యలతో విద్యార్థులు చనిపోయినట్లు వారు పేర్కొన్నారు.ఏప్రిల్‌లో మర్రిమానుగూడకు చెంది న బిడ్డిక రాహుల్,విశ్వనాథపురానికి చెందిన దుడ్డుకల్లు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థి గుమ్మడాల అఖిల్,మే ఎనిమిదిన పాము లుగీశాడ గ్రామానికి చెందిన అసిరయ్య, మే 17న మూలిగూడ గ్రామానికి చెందిన సుస్మిత మృతి చెందారని తెలిపారు. ఈ మరణాలకు కచ్చితమైన కారణాలు,అధికారిక వైద్య, పోస్టుమార్టం నివే దికలు,జిల్లా వైద్యశాఖ ప్రకటనల ద్వారానే నిర్ధా రణ కావాలని బృంద సభ్యులు తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో నిరంతర ఆరోగ్య పరీక్షలు నిర్వహిం చడం,ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, మలేరియా,డెంగీ పరీక్షలు వేగవంతం చేయడం, తక్షణ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచడం, పోషకాహార పథకా లను బలోపేతం చేయడం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పార్వతీపురం పట్టణంలో నిర్మాణం నత్తనడకన సాగుతున్న జిల్లా ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలని,గిరిజన మండ లాల్లో మొబైల్ ఆస్పత్రులు నడపాలని,గిరిజన హాస్టళ్లలో నిర్మాణం పూర్తికాని భవనాలను కొత్త విద్యాసంవత్సరానికి ముందే పూర్తి చేయాలని కోరారు. మూఢనమ్మకాల నిర్మూలనపై ప్రభుత్వం, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జనవిజ్ఞాన వేదిక విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ పి.లక్ష్మణస్వామి కోరారు. ఈ బృందంలో కామే శ్వరరావు, రమేష్‌కుమార్, యుటిఎఫ్ నాయకులు కూర్మారావు,జనవిజ్ఞాన వేదిక విశాఖ జిల్లా నాయ కులు ప్రసాద్,డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు, ప్రతి నిధులు బాలు,నాని తదితరులు ఉన్నారు.

జీవ వైధ్యం మనిషి అస్తిత్వం..

మన ఇంటి పక్కన, మన ఊరిలో, మన రాష్ట్రంలో చేసే చిన్న చిన్న పనులు కూడా ప్రపంచ జీవవైవిధ్యాన్ని కాపాడగలవు.. అని ఈ సంవత్సరం థీమ్ చెప్తోంది. మనం తినే ఆహారం దగ్గర నుంచి, పీల్చే గాలి వరకూ ప్రతిదీ ప్రకృతి ప్రసాదించిన వరమే. జూన్ 12న 22 ప్రపంచమంతా ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం’ జరుపుకుంటోంది. ఈ ఏడాది నినాదం స్థానిక కార్యాచరణతోనే ప్రపంచ మార్పు సాధ్యం. కానీ, ‘అభివృద్ధి అనే పరుగులో మనం ఆ ప్రకృతి మూలాలనే దెబ్బతీస్తున్నామా? మన దేశంలో జీవవైవిధ్యం స్థితిగతులు ఎలా ఉన్నాయి? 2026 నాటికి మనం సాధించిన విజయాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. – జి ఎన్ వి సతీష్ 
ఇంటిపని విలువైనదే…
సంరక్షణ పనులు అనేకం.అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎలఓ)ప్రకారం వంట చేయడం పరోక్ష సంరక్షణ పని.పిల్లల కోసం,వయసు పైబడిన వాళ్లు లేదా వ్యాధు ల బారినపడిన భాగస్వాముల కోసం పోషకా హారం తయారు చేయడం ప్రత్యక్ష సంరక్షణ కిందికి వస్తుంది. మన జీవితాలకు,కుటుంబాలకు,ఎకానమీకి పునాదు లు వేసే ఈ పనులను గుర్తించకపోవడమే కాదు, ఇవి చేయకపోతే విడాకులు ఇవ్వడానికీ సిద్ధమవు తున్నారు కొందరు పురుషులు. అలాంటి వివాదమే ఒకటి ఇటీవల సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. వంట పని,ఇంటిపని వంటి బాధ్యతలను ఒకరిపై మాత్రమే మోపడం సరికాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. భర్త చెప్పినట్టుగా వంట చేయకపోవడం క్రూరత్వంగా పరిగణించలేమని తేల్చారు.
సంరక్షణ పనిలోని విభిన్న కోణాలను గుర్తిస్తూ 2006 లో బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానం హౌస్ ఆఫ్ లార్డ్స్ రెండు కీలకతీర్పులు ఇచ్చింది.గృహిణిశ్రమకు,ఉద్యో గం చేసే భర్త శ్రమకు విలువ పరంగా తేడా లేదని స్పష్టం చేసింది.ఈ కేసులో పెళ్లికి ముందు మెలిస్సా నెల జీతం రూ.70లక్షలు.పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసింది.భర్త అలన్ ఆమెతో ఉన్న మూడేళ్లలోనే తనఆస్తిలో సగభాగం సంపాదించాడు.కోర్టుఈ విష యాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు చెప్పింది. ఇంకో కేసులో, రెండో బిడ్డ తర్వాత అధిక ఆదాయం వచ్చే న్యాయవాద వృత్తిని జూలియా వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆమెకు భృతి నిర్ణయిస్తూ, కుటుంబం కోసం తన కెరీర్‌ను త్యాగం చేయడమే కాక భర్తకు వృత్తి పరంగా అండగా నిలిచిందని ధర్మాసనం పేర్కొంది. ఈ విధమైన భావోద్వేగ, కుటుంబ మద్దతు కూడా సంరక్షణ పనిలో భాగమే.
మాతృత్వం సామాజికాంశం
మాతృత్వం ఒక జీవశాస్త్ర ప్రక్రియ మాత్రమే కాదు. అది మహిళల ఆరోగ్యం, గౌరవం, హక్కులతో ముడిపడి ఉన్న సామాజికాంశం కూడా. ప్రతి మహిళకు సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రసవం హక్కు ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకూ ఒక మహిళ గర్భధారణ లేదా ప్రసవ సంబంధిత కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) చెబుతోంది. ఈ మరణాల్లో చాలావరకూ నివారించగలిగినవే అయినప్పటికీ,అసమాన ఆరోగ్య వ్యవస్థలు, పేదరికం, తగిన వైద్య సేవల లోపం కారణంగా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది.
మనమే సూపర్ పవర్!
జీవవైవిధ్య విషయంలో భారతదేశం ప్రపంచానికి సూపర్ పవర్! ప్రపంచ భూవైశాల్యంలో కేవలం 2.4% మాత్రమే ఉన్నా, ప్రపంచ జీవవైవిధ్యంలో 7-8% మన దేశంలోనే ఉంది. సుమారు 45,000 మొక్కల జాతులు, 91,000 జంతు జాతులు, వేలాది పక్షులు,చేపలు,కీటకాలు… ఇది మన సంపద, మన గర్వం. మన దేశంలో హిమాలయాలు, పశ్చిమ ఘాట్లు, ఇండో-బర్మా ప్రాంతం, సుందాలాండ్ వంటి నాలుగు ప్రధాన బయోడైవర్సిటీ హాట్‌స్పాట్లు ఉన్నాయి. వీటిల్లో ప్రపంచంలో ఎక్కడా లేని ఎండమిక్ స్పీసీస్ (స్థానిక జాతులు) ఉన్నాయి. మనదేశపువేదాలు, ఆయుర్వేదం, సంస్కృతి ప్రకృతిని దైవంగా భావించాయి. పువ్వులు, జంతువులు,నదులు,చెట్లు అన్నీ పూజ నీయాలు. పువ్వులను,జంతువులను పూజించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం వాటిని కాపాడుకోవడమే. కానీ వాతా వరణ మార్పు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, ఆక్రమణలు వంటి సవాళ్లు ఈ సంపదను తగ్గిస్తున్నా యి. జీవవైవిధ్యం లేకుండా ఆర్థికవ్యవస్థ కూడా నిలబడదు.
పంటల వెనుక కనిపించని కార్మికులు
మనకు మార్కెట్లో కనిపించేది బియ్యం, పండ్లు, కూరగాయలు మాత్రమే. కానీ వాటి వెనుక లక్షలాది చిన్నజీవుల పాత్ర ఉంటుంది. తేనెటీగలు, సీతాకోకచిలుకలు, పక్షులు వంటి పరాగసంపర్క జీవులు లేకపోతే అనేక పంటలు పండవు. నేలలో ఉండే సూక్ష్మజీవులు భూమిని సారవంతం చేస్తాయి. వర్షాలను సమతుల్యం చేసేది అడవులే. అంటే ఒక చిన్న జీవజాతి తగ్గినా ఆ ప్రభావం నేరుగా వ్యవసాయంపై పడుతుంది. వ్యవసాయం బలహీనపడితే రైతు ఆదాయం తగ్గుతుంది. ఆ తర్వాత ఆహార ధరలు పెరుగుతాయి. చివరకు మొత్తం ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుంది.
అడవులను చాలామంది కేవలం చెట్ల సమూహంగా చూస్తారు.కానీ నిజానికి అవికోట్ల రూపాయల విలు వైన సహజ సంపద నిల్వలు.ఒక అడవి నాశనం అయితే అక్కడి జీవవైవిధ్యం మాత్రమే కాదు,ఆ ప్రాంత ఆర్థికవ్యవస్థ కూడా బలహీనపడుతుంది. వరదలు, కరువులు,భూకంపనలు పెరిగితే ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే జీవవైవిధ్య నష్టం చివరికి ఆర్థిక నష్టంగానే మారుతుంది. సము ద్రాల్లోని చేపలు,పగడపు దిబ్బలు,తాబేళ్లు,సూక్ష్మ జీవులు.. ఇవన్నీ సముద్ర జీవవ్యవస్థలో భాగాలు. ఈజీవ వైవి ధ్యం సమతుల్యం కోల్పోతే చేపల ఉత్పత్తి తగ్గు తుంది. దీంతో మత్స్యకారుల జీవనం ప్రమాదంలో పడుతుంది. ఆహార భద్రత దెబ్బతింటుంది.. సముద్ర ఆర్థికవ్యవస్థ బలహీనపడుతుంది. ప్రస్తుతం సముద్ర కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, అధిక మత్స్య వేట వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోంది.
అనేక ఔషధాలు అడవుల్లోని మొక్కలు, సూక్ష్మజీవుల నుంచే తయారయ్యాయి. ఇంకా వేలాది జీవజాతులపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగలేదు. ఒక అరుదైన మొక్క లేదా సూక్ష్మజీవి అంతరించిపోతే, భవిష్యత్తులో ప్రాణాలను కాపాడే మందును మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే జీవవైవిధ్యాన్ని కాపాడటం అంటే వైద్యరంగ భవిష్యత్తును కాపాడటమే. ఇప్పటి వరకు అభివృద్ధి పేరుతో ప్రకృతిని దెబ్బతీశాం. కానీ జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తూ ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు.అందుకే జీవవైవిధ్య సంరక్షణ అనేది పర్యావరణ సమస్య మాత్రమే కాదు. అదిఆర్థిక,సామాజిక, మానవ భవిష్యత్తుకు సంబంధించిన అంశం.జంతువుల రిపో ర్టులు మారాయి!గడిచిన కొన్నేళ్లుగా భారత్ చేపట్టిన సంరక్షణ చర్యలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నా యి.తాజా గణాంకాల ప్రకారం మన‘వైల్డ్ లైఫ’ రిపోర్ట్ కార్డ్ ఇలా ఉంది.
గర్జించిన పులులు
ప్రపంచవ్యాప్తంగా పులుల జనాభా తగ్గుతుంటే, భారత్ మాత్రం వాటి సంఖ్యను పెంచి ప్రపంచానికి మన సత్తా చూపించింది.1973లో మొదలైన ప్రాజెక్ట్ టైగర్ ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శం.ఒక్కప్పుడు 1,800 కంటే తక్కువ ఉన్న బెంగాల్ టైగర్లు ఇప్పుడు 3,682కి పెరిగాయి. టైగర్ రిజర్వుల సంఖ్య 58కి పెరగడమే కాకుండా, గ్రామస్తులను ఈ సంరక్షణలో భాగస్వా ములను చేయడం వల్ల వేట గణనీయంగా తగ్గింది.
ఫలించిన ప్రాజెక్ట్ చీతా ప్రయోగం
దశాబ్దాల క్రితం అంతరించిపోయిన చీతాలను 20 22లో నమీబియా, సౌత్ ఆఫ్రికా నుండి తీసుకువచ్చి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ లో ప్రవేశపెట్టడం మనదేశం చేసిన అతిపెద్ద ప్రయోగం. 2026 నాటికి భారత్ లో మొత్తం 57చీతాలు ఉన్నాయి.వీటిలో 37 భారత్ లోనే పుట్టినవి! ఇటీవల కునోలో భారతీయ చీతా సహజంగా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇది ప్రపంచ స్థాయి విజయం. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీకి కూడా చీతాలను తరలించారు. 2032 నాటికి 60-70చీతాల స్వయం సమృద్ధి జనాభాను సాధించాలన్నది లక్ష్యం.
లెక్క తేలిన మంచు చిరుతలు
హిమాలయాల్లోని గడ్డకట్టే చలిలో జీవిస్తూ,అంత సుల భంగా ఎవరికీ కనిపించని ‘హిమాలయాల దెయ్యాలు’ అని పిలువబడే మంచు చిరుతల జనాభాను తొలి సారిగా శాస్త్రీయంగా లెక్కించారు. మన దగ్గర దాదా పు 718 మంచు చిరుతలు ఉన్నాయని తేలింది.
నీటి వనరులు బాగుంటేనే పక్షులు, చేపలు బతుకు తాయి. భారత్ ఇప్పుడు 98 రామ్సర్ సైట్లను కలిగి ఉంది. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం. చెరువులు, కుంటలను కాపాడుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా వేల సంఖ్యలో వలస పక్షులకు ఆశ్రయం లభిస్తోంది.
ఆకాశమంత సవాళ్లు.. అయినా చిగురంత ఆశ..
భారత్ జీవవైవిధ్య పరిరక్షణలో కొన్ని గొప్ప విజయా లు సాధించినప్పటికీ,ముందున్న సవాళ్లు మాత్రం చిన్నవి కావు. ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీసే మార్పు లు వేగంగా జరుగుతున్నాయి. అడవులు తగ్గడం, కాలుష్యం పెరగడం, వాతావరణ మార్పులు, పట్టణాల విస్తరణ..ఇవన్నీ జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో దాదాపు 30 శాతం భూభాగం “ల్యాండ్ డీగ్రేడేషన” సమస్యను ఎదుర్కొంటోంది. అంటే భూమి తన సహజ సారాన్ని, జీవశక్తిని కోల్పో తోంది. అధిక రసాయన వినియోగం, అడవుల నరికివేత,గనుల తవ్వకాలు, నీటి దుర్వినియోగం వల్ల నేల బలహీనపడుతోంది.దీని ప్రభావం కేవలం వ్యవసాయంపైనే కాదు..ఆ నేలలో జీవించే సూక్ష్మ జీవుల నుంచి అడవిజీవుల వరకు అందరిపైనా పడు తోంది. ఇంకో పెద్ద ప్రమాదం “ఇన్వేసివ్ స్పీసీస” లేదా పరకాయ జీవజాతులు. ఇవి స్థానిక జీవవ్యవస్థ లోకి ప్రవేశించి,అక్కడి సహజ జీవజాతులను బలహీనపరుస్తాయి. కొన్ని విదేశీ మొక్కలు, చేపలు, పురుగులు ఇప్పుడు భారతీయ జీవవైవిధ్యానికి ముప్పు గా మారుతున్నాయి. ఇవి స్థానిక మొక్కల పెరుగుద లను అడ్డుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి వనరుల పైనా ప్రభావం చూపుతున్నాయి. శాస్త్రవేత్తలు దీన్ని “నిశ్శబ్ద జీవవైవిధ్య సంక్షోభం”గా అభివర్ణిస్తున్నారు. తీరప్రాంతాల్లో పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.తుపాన్లు, సముద్ర అలల నుంచి సహజ రక్షణ గా పనిచేసే మాంగ్రోవ్ అడవులు కొన్ని ప్రాంతాల్లో తగ్గిపోతున్నాయి.పోర్టులు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ నిర్మాణాలవల్ల ఈ జీవవ్యవస్థలు ఒత్తిడికి గురవుతు న్నాయి.మాంగ్రోవ్స్ తగ్గితే కేవలం సముద్ర జీవజాతులే కాదు,తీరప్రాంత గ్రామాల భద్రత కూడా ప్రమా దంలో పడుతుంది.
ప్రకృతి సేవలో చట్టాలు మరియు టెక్నాలజీ
జీవవైవిధ్యాన్ని కాపాడడం కేవలం మొక్కలు నాటడం లేదా పులులను రక్షించడం మాత్రమే కాదు. దానికి బలమైన చట్టాలు,ఆధునిక టెక్నాలజీలతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ఇక్కడే భారత ప్రభుత్వం చాలా ముఖ్యమైన మార్పులు తెచ్చింది.చట్టాలతో పాటు టెక్నాలజీ కూడా ప్రకృతిని కాపాడ డంలో బలమైన ఆయుధంగా మారింది.ఎఐ, డ్రోన్లు మరియు సాటిలైట్ సర్వైలెన్స్ అడవుల్లో అగ్ని ప్రమా దాలు ఎక్కడ మొదలయ్యాయో నిమిషాల్లో గుర్తిం చడానికి-ఆధారిత కెమెరాలు, సాటిలైట్ ఇమేజెస్ ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఎఐ ఆధారిత సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. డ్రోన్లు అక్రమ వేటగాళ్లను, మరగు మాఫియాను, అక్రమ కట్టడాలను పట్టుకోవడంలో సూపర్ హీరోలుగా మారాయి. థర్మల్ డ్రోన్లు రాత్రి సమయంలో కూడా జంతువులను ట్రాక్ చేస్తాయి. భితార్కానిక, కునో వన్యప్రాణి అభయారణ్యాల్లో ఇలాంటి డ్రోన్లు ఇప్పటికే విజయవంతంగా ఉపయోగపడుతున్నాయి. బార్ కోడింగ్ ఒక అద్భుతమైన టెక్నాలజీ. వన్యప్రా ణుల మాంసం,ఎముకలు,చర్మం,రక్తం వంటి అవశే షాలు దొరికితే, బార్ కోడింగ్ ద్వారా కేవలం కొన్ని గంటల్లోనే ఆజంతువు ఏజాతికి చెందినదో,ఏ ప్రాం తం నుంచి వచ్చిందో తేల్చేస్తారు. ఇది అక్రమ వేట, వైల్డ్ లైఫ్ ట్రేడ్‌ను అరికట్టడంలో చాలా ప్రభావవంతం గా ఉపయోగపడుతోంది.కెమెరా ట్రాప్స్‌తో ఎఐ ద్వారా జంతువులను గుర్తించడం, మ్యాపింగ్ ద్వారా నివాసా లు మ్యాప్ చేయడం,రియల్-టైమ్ మానిటరింగ్ సిస్ట మ్స్ వంటిఇతర ఆధునిక సాంకేతికతలు జీవవై విధ్య పరిరక్షణలో చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి.అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం కేవలం సదస్సు లు, సెమినార్ల కోసం కాదు. ‘గ్లోబల్‌గా ఆలోచిస్తూ ‘లోకల్‌గా పని చేయవలసిన సమయం.
మనం చేయగలిగే చిన్న చిన్న పనులు:
1.దేశీ మొక్కలే ముద్దు: మన వాతావరణానికి అల వాటుపడని విదేశీ మొక్కల కంటే, వేప, రావి, చింత వంటి మన దేశీ మొక్కలు నాటాలి.అవి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా పక్షులకు మంచి ఆశ్ర యం ఇస్తాయి.
2.విత్తన భాండాగారాలు: గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న దేశీ విత్తనాలను సేకరించి దాచు కోవాలి. రసాయన ఎరువుల కంటే సేంద్రీయ పద్ధ తులు పాటించాలి.నీటి సంరక్షణ: వర్షపు నీటిని ఒడిసి పట్టడం ద్వారా మన చుట్టూ ఉన్న చిన్నచిన్న జీవరాశుల దాహా న్ని తీర్చవచ్చు.

ప్లాస్టిక్ మహమ్మారిని తరిమేద్దాం: సముద్రాల్లో, అడవుల్లో ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల ఏటా లక్షలాది జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా దూరం పెట్టడం ముఖ్యం. ఈ ప్రకృతి మనకు పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి అనడం కంటే మనం మన పిల్లల దగ్గర తీసుకున్న ‘అప్పు అనడం మెరుగు. ఆ అప్పును మనం తీర్చాలంటే జీవవైవిధ్యాన్ని గౌరవించాలి. ఒక్క జీవి అంతరించి పోయినా ఆ ప్రభావం గొలుసుకట్టులా మన మీద పడుతుంది. ?
బయలాజికల్ డైవర్సిటీ (సవరణ) చట్టం, 2023
2002లో వచ్చిన బయోడైవర్సిటీ చట్టాన్ని 2023లో సవరించి,2024 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు.
ప్రధాన మార్పులు: ఆయుష్ రంగానికి పెద్ద బూస్ట్: నమోదైన ఆయుష్ (ఆయుర్వేద,యోగ,యూనానీ, సిద్ధ,హోమియోపతి) వైద్యులు,హకీములు,స్థానిక వైద్య నిపుణులు వీరందరూ ముందస్తు వివరణ ఇవ్వ కుండానే స్థానిక ఔషధ మొక్కలను ఉపయోగించు కోవచ్చు. కలివిక్త సాంప్రదాయ జ్ఞానం,సాగు చేసిన ఔషధ మొక్కలు కూడా ఈ చట్టం నుంచి మినహా యింపు పొందాయి. దీంతో మన సాంప్రదాయ వైద్యం మరింత బలపడుతుంది.
బెనిఫిట్ షేరింగ్ (లాభాల్లో వాటా): ఏదైనా కంపెనీ (ముఖ్యంగా విదేశీ కంపెనీలు) మన దేశంలోని జీవవైవిధ్య వనరులను లేదా స్థానిక గిరిజనుల సాంప్ర దాయ జ్ఞానాన్ని వాడుకుని వ్యాపారం చేస్తే, వచ్చిన లాభాల్లో న్యాయమైన వాటా స్థానిక సమాజాలకు, గిరిజన తెగలకు, ఆప్రాంత అభివృద్ధికి ఇవ్వాలి. ఇది ఆర్థికంగా కాకుండా,నాన్-ఫైనాన్షియల్ బెనిఫిట్స్ (శిక్షణ,టెక్నాలజీ బదలాయింపు, సామగ్రి) కూడా ఉంటాయి. ఈ సవరణలు విదేశీ కంపెనీలు మన జీవవైవిధ్యాన్ని “బయో-పైరసీ”(దోపిడీ) చేయకుండా అడ్డుకట్ట వేస్తూనే,మన దేశీయ కంపెనీలు, పరిశోధ కులు, ఆయుష్ డాక్టర్లు సులభంగా పని చేసుకోవ డానికి దారి చూపుతాయి.

    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం

    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జూన్ 8న జరిగిన ఘోర ప్రమాదం దేశ కార్మిక రంగాన్ని కుదిపేసింది.అన్నం పెట్టే పనే..వారికి మృత్యుపాశమైంది.ఉక్కు తయారీలో ఆరితేరిన ఆ చేతులు..అదే ఉక్కు ధాటికి అచేతనమైపోయాయి.నిప్పుల కొలిమిలాంటి పనిలో నిపుణులైన ఆ శ్రామికులు సలసల మరిగే ద్రావణ పడి విగత జీవులై పోయారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల మని గర్వంగా చెప్పుకొనే ఆశ్రామికులు ఇప్పుడు అదే స్టీల్‌కు ఆహుతైపోయారు.-
    జి.ఆనంద్ సునీల్ కుమార్ 

    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన వేళ..నిర్వహణలోపం.. భద్రతా వైలఫల్యాలు కొట్టిచ్చినట్టు కనిపిస్తున్నా యన్న వాదన తెరపైకి వచ్చింది.నిపుణులైన మానవ వనరులను తగ్గించుకుంటూ..నిర్వహణను గాలికొదిలేస్తే భారీ ప్రమాదాలు జరుగుతాయని చెప్పినా య్పుామాన్యం పట్టించుకోలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.కేంద్రం సాయం కింద రూ.11400కోట్లు అందించినా అందులో నిర్వహణకు,విడిభాగాల కొనుగోలుకు నిధులు కేటాయించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల తరబడి యంత్రాలు మరమ్మతులకు నోచుకోలేదని చెబుతున్నారు.
    జూన్ 8న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో సుమారుగా 9మంది దుర్మ రణం చేందారు.భారీ పేలుడులో ఎగసిపడిన 150 టన్నుల ఉక్కు ద్రావణం కారణంగా మరో ఆరు గురు తీవ్ర గాయాలకు గురయ్యారు. సుమారుగా 1,540డిగ్రీల వేడితో ఉన్న ద్రవ ఉక్కు పడటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులు బొగ్గయ్యి పోయారు.స్టీల్‌ప్లాంట్‌లోని ఎసఎంస్-2, ఎస్‌టీసీ-3 హీట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ఒక్కసారిగా పేలడంతో ఉక్కుద్రవం లీకైంది.దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా పలు వురు క్షతగాత్రులయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ఘటనతో స్టీల్‌ప్లాంట్ కార్మికులు,ఉద్యోగులు భయాం దోళనలతో బయటకు పరుగులు తీశారు. సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
    ఘటనాస్థలిని పరిశీలించిన కుమారస్వామి
    విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదంపై కేంద్ర భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఘటనాస్థలిని మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలసి పరిశీలిం చారు.సంబంధిత అధికారులతో మాట్లాడూ పరిస్థితిని సమీక్షించారు.ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను అధికారులు పరిశీలి స్తున్నారని,బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నట్లు పేర్కోన్నారు. ఈవిషాద సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
    స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు పవన్,లోకేష్ భరోసా
    రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు.గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబం ధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసు కున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని,అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.రాష్ట్ర పౌరసs Áఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌లు ఆయన వెంట ఉన్నారు.
    స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు: పవన్ కల్యాణ్
    విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనాస్థలిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ప్రమాదానికి ముందే.. మరో ఘటన జరిగిందని కార్మికులు చెప్పారన్నారు. ఇలాంటి ఘటన గత 33 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకూడదన్నదే తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర నిఘా ఉండాలన్నారు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకోనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతకు ముందు,స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ పరామర్శించారు.
    ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది :` మంత్రి నారా లోకేష్.
    విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉం టుందని రాష్ట్ర ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు..కేజిహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను,వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న బాధితులను ఆయన పరామర్శిం చారు. అనంతరం స్డీల్ ప్లాంట్‌లో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు….ఈ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ,హోంమంత్రి వంగలపూడి అనిత,విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌లు వున్నారు…అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేష్, ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించిందన్నారు. ఘటన జరిగిన కొద్ది సేపటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సమాచారం అందిం చడంతో పాటు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమార స్వా మి ప్రకటించిన రూ.25లక్షల ఆర్థికసాయాన్ని త్వరితగతిన అందించే చర్యలు జరుగు తున్నా యని వెల్లడించారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం సంక్షోభంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభు త్వంతో నిరంతర చర్చలు జరిపి కర్మాగారానికి ఊరట కల్పించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గుర్తుచేశారు. కర్మాగార పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి గతంలోనూ, ప్రస్తుతం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలను నిర్ధారించేందుకు నిపుణుల కమిటీ సమగ్ర విచారణ నిర్వహిస్తోందని,కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయాలు,వ్యాఖ్యలు చేయడం సముచితమని చెప్పారు.
    ఇప్పటికే కేంద్రం సహకారంతో భారీఆర్థిక ప్యాకేజీ, బకాయిల చెల్లింపులు, కార్యక లాపాల పునర్వ్యవస్థీ కరణ వంటి చర్యల ద్వారా కర్మాగారం స్థిరీ కరణ దిశగా ముందుకు సాగుతోందని వివరించారు. భవిష్యత్తులో ఇటు వంటి ఘటనలు పున రావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,బాధిత కుటుం బాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహిం చేందుకు ముగ్గురు సీనియర్ నిపుణులతో కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిందన్నారు. కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించి,కార్మి కులతో మాట్లాడి,సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరా వృతం కాకుండా అవసరమైన చర్యలు తీసు కుంటామని తెలిపారు.

    అభివృద్ధి పేరుతో అడవుల విధ్వంసమా?

    విశాఖ మహానగరం వేగంగా విస్తరిస్తోంది.సమాచార సాంకేతికత,కృత్రిమ మేధస్సు,డిజిటల్ ఆర్థిక వ్యవస్థల యుగంలో డేటాసెంటర్లకు ప్రాధాన్యం పెరుగుతోంది.ప్రభుత్వాలు కూడా పెట్టుబడులు,ఉపాధి అవకా శాలు,సాంకేతిక పురోగతి పేరుతో భారీ ప్రాజెక్టులను స్వాగతిస్తున్నాయి.అయితే అభివృద్ధి అనే లక్ష్యం ప్రకృతి పరిరక్షణను పక్కనపెడితే,ఆ అభివృద్ధి నిజంగా సమాజానికి మేలు చేస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు విశాఖలో మరోసారి ముందుకొచ్చింది.
    అడవివరం-ముడసర్లొవ ప్రాంతాల్లో ప్రతిపాదిత “వైజాగ్ హైపర్‌స్కేల్ డేటా సెంటర” ప్రాజెక్టు చుట్టూ వివాదం నెలకొంది.సున్నితమైన ప్రాంతంలో ఈ భారీప్రాజెక్టు అభివృద్ధి,పర్యావరణ పరిరక్షణ,ప్రజాస్వామ్య హక్కులు,చట్టాల అమలు వంటి అంశాల మధ్య జరుగుతున్న ఒక కీలకమైన చర్చ.ఈప్రతిపాదిత 512 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ ప్రాజెక్టు సింహాచలం కొండల దిగువన,కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యానికి అత్యంత సమీపంలో ప్రతిపాదించబడింది.ప్రాజెక్టు స్థలం అభయారణ్య సరిహద్దుకు కేవలం 0.86కిలోమీటర్ల దూరంలో ఉండగా,ఎకో సెన్సిటివ్ జోన్‌కు మరింత సమీపంలో ఉంది.ఇలాంటి ప్రాంతాలు సాధారణ భూములు జీవవైవిధ్యాన్ని సంరక్షించే సహజ వ్యవస్థలు.అడవులు,వన్యప్రాణులు,పక్షులు,జలవనరులు,భూగర్భజలాలు పరస్పరం అనుసంధానమై ఉండే పర్యావరణ సమతుల్యతకు ఇవి కేంద్రబిందువులు.
    అయితే,ఈప్రాజెక్టుకు పూర్తిస్థాయి పర్యావరణ అనుమతులు లభించకముందే భూసమతలీకరణ,చెట్ల తొలగింపు,తాత్కాలిక రహదారుల నిర్మాణం జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పర్యావరణ ప్రభావ అంచనా (జుIA)వ్యవస్థ ఉద్దేశం ఏమిటంటే,ఒక ప్రాజెక్టువల్ల ప్రకృతిపై,నీటి వనరులపై, జీవవైవిధ్యంపై,స్థానిక ప్రజల జీవితాలపై కలిగే ప్రభావాలను ముందుగానే అధ్యయనం చేయాలి.కానీ,అనుమతుల ప్రక్రియ పూర్తికాకముందే భూమి స్వరూపాన్ని మార్చడం ప్రారంభిస్తే,ఆ అంచనా ప్రక్రియ సారాన్ని కోల్పోతుంది. చట్టాల ఉద్దేశాన్ని దెబ్బతీసే ఇటువంటి చర్యలు ప్రజలలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.అలాగే ‘బీ-2’వర్గీకరణపై కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈప్రాజెక్టును రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ“కేటగిరీ బీ-2”గా పరిగణించడం వివాదానికి ప్రధాన కారణంగా మారింది.పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రాజెక్టులు సాధారణంగా విస్తృతమైన పర్యావరణ ప్రభావ అధ్యయనం,ప్రజా విచారణ,కేంద్రస్థాయి పరిశీలనకు లోబడి ఉండాలి.ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం.అందుకే ఈ అంశంపై స్పష్టత అవసరం.
    కాగా,విశాఖనగరానికి తాగునీటిని అందించే ప్రధాన వనరులలో ముడసర్లొవ జలాశయం ఒకటి. ప్రతిపాదిత డేటా సెంటర్ దీనికి అత్యంత సమీపంలో ఉండటం మరోకీలక ఆందోళన.డేటా సెంటర్లు భారీస్థాయిలో విద్యుత్ వినియోగిస్తాయి.శీతలీకరణ వ్యవస్థలకు కూడా గణనీయమైన నీటి అవసరం ఉంటుంది.భవిష్యత్తులో నీటి వినియోగం,వ్యర్థాల నిర్వహణ,ఉష్ణ ప్రభావాలు,భూగర్భ జలాలపై ప్రభావం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అంటే కేవలం పెట్టుబడులు,భవనాలు,పారిశ్రామిక వృద్ధి మాత్రమేనా? లేక ప్రకృతి సంపదలను సంరక్షిస్తూ భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయాలా? ప్రపంచవ్యాప్తంగా “సస్టైనబుల్ డెవలప్‌మెంట” అనే భావన ప్రాధాన్యం పొందుతోంది. అంటే ప్రకృతి వనరులను నాశనం చేయకుండా అభివృద్ధిని సాధించడం.ఆర్థికాభివృద్ధి,పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధాలు కావు.సరైన ప్రణాళిక, పారదర్శకత,శాస్త్రీయ అధ్యయనం ఉంటే రెండింటినీ సమన్వయం చేయవచ్చు.
    ప్రస్తుతంప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సమగ్ర పర్యావరణ ప్రభావ అధ్యయనం నిర్వహించాలి.స్వతంత్ర నిపుణులతో పరిశీలన జరగాలి.స్థానిక ప్రజలు,పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.అభివృద్ధి ప్రాజెక్టులు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే అవి చట్టబద్ధంగా,పారదర్శకంగా,పర్యావరణ బాధ్యతతో ముందుకు సాగాలి. సింహాచలం-కంబాలకొండ అటవీ ప్రాంతం విశాఖనగరానికి పర్యావరణ సమతుల్యతకు ఆధారం.జీవవైవిధ్యానికి నిలయం.భవిష్యత్‌తరాలకు అందించాల్సిన సహజవారసత్వం.డేటా సెంటర్లు,సాంకేతిక అభివృద్ధి కూడా అవసరమే.కానీ ప్రపంచంలో పలు దేశాలు ఈ డేటా సెంటర్ల నిర్మాణాలను వ్యతిరేకిస్తుంటే భారత్‌లో మాత్రం నెలకొల్పడం గమనార్హం.అయితే అడవులను కోల్పోయిన తర్వాత డేటాను నిల్వ చేయడానికి భవనాలు ఉండవచ్చు.కానీ కోల్పోయిన ప్రకృతిని తిరిగి నిర్మించలేం అనే నగ్న సత్యాన్ని గ్రహించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

    1 2