విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జూన్ 8న జరిగిన ఘోర ప్రమాదం దేశ కార్మిక రంగాన్ని కుదిపేసింది.అన్నం పెట్టే పనే..వారికి మృత్యుపాశమైంది.ఉక్కు తయారీలో ఆరితేరిన ఆ చేతులు..అదే ఉక్కు ధాటికి అచేతనమైపోయాయి.నిప్పుల కొలిమిలాంటి పనిలో నిపుణులైన ఆ శ్రామికులు సలసల మరిగే ద్రావణ పడి విగత జీవులై పోయారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల మని గర్వంగా చెప్పుకొనే ఆశ్రామికులు ఇప్పుడు అదే స్టీల్‌కు ఆహుతైపోయారు.-
జి.ఆనంద్ సునీల్ కుమార్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన వేళ..నిర్వహణలోపం.. భద్రతా వైలఫల్యాలు కొట్టిచ్చినట్టు కనిపిస్తున్నా యన్న వాదన తెరపైకి వచ్చింది.నిపుణులైన మానవ వనరులను తగ్గించుకుంటూ..నిర్వహణను గాలికొదిలేస్తే భారీ ప్రమాదాలు జరుగుతాయని చెప్పినా య్పుామాన్యం పట్టించుకోలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.కేంద్రం సాయం కింద రూ.11400కోట్లు అందించినా అందులో నిర్వహణకు,విడిభాగాల కొనుగోలుకు నిధులు కేటాయించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల తరబడి యంత్రాలు మరమ్మతులకు నోచుకోలేదని చెబుతున్నారు.
జూన్ 8న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో సుమారుగా 9మంది దుర్మ రణం చేందారు.భారీ పేలుడులో ఎగసిపడిన 150 టన్నుల ఉక్కు ద్రావణం కారణంగా మరో ఆరు గురు తీవ్ర గాయాలకు గురయ్యారు. సుమారుగా 1,540డిగ్రీల వేడితో ఉన్న ద్రవ ఉక్కు పడటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులు బొగ్గయ్యి పోయారు.స్టీల్‌ప్లాంట్‌లోని ఎసఎంస్-2, ఎస్టీసీ-3 హీట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ఒక్కసారిగా పేలడంతో ఉక్కుద్రవం లీకైంది.దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా పలు వురు క్షతగాత్రులయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ఘటనతో స్టీల్‌ప్లాంట్ కార్మికులు,ఉద్యోగులు భయాం దోళనలతో బయటకు పరుగులు తీశారు. సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఘటనాస్థలిని పరిశీలించిన కుమారస్వామి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదంపై కేంద్ర భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖమంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఘటనాస్థలిని మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలసి పరిశీలిం చారు.సంబంధిత అధికారులతో మాట్లాడూ పరిస్థితిని సమీక్షించారు.ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను అధికారులు పరిశీలి స్తున్నారని,బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నట్లు పేర్కోన్నారు. ఈవిషాద సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు పవన్,లోకేష్ భరోసా
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు.గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబం ధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసు కున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని,అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.రాష్ట్ర పౌరసs Áఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌లు ఆయన వెంట ఉన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు: పవన్ కల్యాణ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనాస్థలిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ప్రమాదానికి ముందే.. మరో ఘటన జరిగిందని కార్మికులు చెప్పారన్నారు. ఇలాంటి ఘటన గత 33 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకూడదన్నదే తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర నిఘా ఉండాలన్నారు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకోనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతకు ముందు,స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ పరామర్శించారు.
ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది :` మంత్రి నారా లోకేష్.
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉం టుందని రాష్ట్ర ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు..కేజిహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను,వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న బాధితులను ఆయన పరామర్శిం చారు. అనంతరం స్డీల్ ప్లాంట్‌లో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు….ఈ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ,హోంమంత్రి వంగలపూడి అనిత,విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌లు వున్నారు…అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేష్, ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించిందన్నారు. ఘటన జరిగిన కొద్ది సేపటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సమాచారం అందిం చడంతో పాటు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమార స్వా మి ప్రకటించిన రూ.25లక్షల ఆర్థికసాయాన్ని త్వరితగతిన అందించే చర్యలు జరుగు తున్నా యని వెల్లడించారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం సంక్షోభంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభు త్వంతో నిరంతర చర్చలు జరిపి కర్మాగారానికి ఊరట కల్పించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గుర్తుచేశారు. కర్మాగార పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి గతంలోనూ, ప్రస్తుతం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలను నిర్ధారించేందుకు నిపుణుల కమిటీ సమగ్ర విచారణ నిర్వహిస్తోందని,కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయాలు,వ్యాఖ్యలు చేయడం సముచితమని చెప్పారు.
ఇప్పటికే కేంద్రం సహకారంతో భారీఆర్థిక ప్యాకేజీ, బకాయిల చెల్లింపులు, కార్యక లాపాల పునర్వ్యవస్థీ కరణ వంటి చర్యల ద్వారా కర్మాగారం స్థిరీ కరణ దిశగా ముందుకు సాగుతోందని వివరించారు. భవిష్యత్తులో ఇటు వంటి ఘటనలు పున రావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,బాధిత కుటుం బాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహిం చేందుకు ముగ్గురు సీనియర్ నిపుణులతో కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిందన్నారు. కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించి,కార్మి కులతో మాట్లాడి,సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరా వృతం కాకుండా అవసరమైన చర్యలు తీసు కుంటామని తెలిపారు.
