జీవ వైధ్యం మనిషి అస్తిత్వం..
మన ఇంటి పక్కన, మన ఊరిలో, మన రాష్ట్రంలో చేసే చిన్న చిన్న పనులు కూడా ప్రపంచ జీవవైవిధ్యాన్ని కాపాడగలవు.. అని ఈ సంవత్సరం థీమ్ చెప్తోంది. మనం తినే ఆహారం దగ్గర నుంచి, పీల్చే గాలి వరకూ ప్రతిదీ ప్రకృతి ప్రసాదించిన వరమే. జూన్ 12న 22 ప్రపంచమంతా ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం’ జరుపుకుంటోంది. ఈ ఏడాది నినాదం స్థానిక కార్యాచరణతోనే ప్రపంచ మార్పు సాధ్యం. కానీ, ‘అభివృద్ధి అనే పరుగులో మనం ఆ ప్రకృతి మూలాలనే దెబ్బతీస్తున్నామా? మన దేశంలో జీవవైవిధ్యం స్థితిగతులు ఎలా ఉన్నాయి? 2026 నాటికి మనం సాధించిన విజయాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. – జి ఎన్ వి సతీష్
ఇంటిపని విలువైనదే…
సంరక్షణ పనులు అనేకం.అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎలఓ)ప్రకారం వంట చేయడం పరోక్ష సంరక్షణ పని.పిల్లల కోసం,వయసు పైబడిన వాళ్లు లేదా వ్యాధు ల బారినపడిన భాగస్వాముల కోసం పోషకా హారం తయారు చేయడం ప్రత్యక్ష సంరక్షణ కిందికి వస్తుంది. మన జీవితాలకు,కుటుంబాలకు,ఎకానమీకి పునాదు లు వేసే ఈ పనులను గుర్తించకపోవడమే కాదు, ఇవి చేయకపోతే విడాకులు ఇవ్వడానికీ సిద్ధమవు తున్నారు కొందరు పురుషులు. అలాంటి వివాదమే ఒకటి ఇటీవల సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. వంట పని,ఇంటిపని వంటి బాధ్యతలను ఒకరిపై మాత్రమే మోపడం సరికాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. భర్త చెప్పినట్టుగా వంట చేయకపోవడం క్రూరత్వంగా పరిగణించలేమని తేల్చారు.
సంరక్షణ పనిలోని విభిన్న కోణాలను గుర్తిస్తూ 2006 లో బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానం హౌస్ ఆఫ్ లార్డ్స్ రెండు కీలకతీర్పులు ఇచ్చింది.గృహిణిశ్రమకు,ఉద్యో గం చేసే భర్త శ్రమకు విలువ పరంగా తేడా లేదని స్పష్టం చేసింది.ఈ కేసులో పెళ్లికి ముందు మెలిస్సా నెల జీతం రూ.70లక్షలు.పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసింది.భర్త అలన్ ఆమెతో ఉన్న మూడేళ్లలోనే తనఆస్తిలో సగభాగం సంపాదించాడు.కోర్టుఈ విష యాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు చెప్పింది. ఇంకో కేసులో, రెండో బిడ్డ తర్వాత అధిక ఆదాయం వచ్చే న్యాయవాద వృత్తిని జూలియా వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆమెకు భృతి నిర్ణయిస్తూ, కుటుంబం కోసం తన కెరీర్‌ను త్యాగం చేయడమే కాక భర్తకు వృత్తి పరంగా అండగా నిలిచిందని ధర్మాసనం పేర్కొంది. ఈ విధమైన భావోద్వేగ, కుటుంబ మద్దతు కూడా సంరక్షణ పనిలో భాగమే.
మాతృత్వం సామాజికాంశం
మాతృత్వం ఒక జీవశాస్త్ర ప్రక్రియ మాత్రమే కాదు. అది మహిళల ఆరోగ్యం, గౌరవం, హక్కులతో ముడిపడి ఉన్న సామాజికాంశం కూడా. ప్రతి మహిళకు సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రసవం హక్కు ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకూ ఒక మహిళ గర్భధారణ లేదా ప్రసవ సంబంధిత కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) చెబుతోంది. ఈ మరణాల్లో చాలావరకూ నివారించగలిగినవే అయినప్పటికీ,అసమాన ఆరోగ్య వ్యవస్థలు, పేదరికం, తగిన వైద్య సేవల లోపం కారణంగా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది.
మనమే సూపర్ పవర్!
జీవవైవిధ్య విషయంలో భారతదేశం ప్రపంచానికి సూపర్ పవర్! ప్రపంచ భూవైశాల్యంలో కేవలం 2.4% మాత్రమే ఉన్నా, ప్రపంచ జీవవైవిధ్యంలో 7-8% మన దేశంలోనే ఉంది. సుమారు 45,000 మొక్కల జాతులు, 91,000 జంతు జాతులు, వేలాది పక్షులు,చేపలు,కీటకాలు… ఇది మన సంపద, మన గర్వం. మన దేశంలో హిమాలయాలు, పశ్చిమ ఘాట్లు, ఇండో-బర్మా ప్రాంతం, సుందాలాండ్ వంటి నాలుగు ప్రధాన బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి. వీటిల్లో ప్రపంచంలో ఎక్కడా లేని ఎండమిక్ స్పీసీస్ (స్థానిక జాతులు) ఉన్నాయి. మనదేశపువేదాలు, ఆయుర్వేదం, సంస్కృతి ప్రకృతిని దైవంగా భావించాయి. పువ్వులు, జంతువులు,నదులు,చెట్లు అన్నీ పూజ నీయాలు. పువ్వులను,జంతువులను పూజించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం వాటిని కాపాడుకోవడమే. కానీ వాతా వరణ మార్పు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, ఆక్రమణలు వంటి సవాళ్లు ఈ సంపదను తగ్గిస్తున్నా యి. జీవవైవిధ్యం లేకుండా ఆర్థికవ్యవస్థ కూడా నిలబడదు.
పంటల వెనుక కనిపించని కార్మికులు
మనకు మార్కెట్లో కనిపించేది బియ్యం, పండ్లు, కూరగాయలు మాత్రమే. కానీ వాటి వెనుక లక్షలాది చిన్నజీవుల పాత్ర ఉంటుంది. తేనెటీగలు, సీతాకోకచిలుకలు, పక్షులు వంటి పరాగసంపర్క జీవులు లేకపోతే అనేక పంటలు పండవు. నేలలో ఉండే సూక్ష్మజీవులు భూమిని సారవంతం చేస్తాయి. వర్షాలను సమతుల్యం చేసేది అడవులే. అంటే ఒక చిన్న జీవజాతి తగ్గినా ఆ ప్రభావం నేరుగా వ్యవసాయంపై పడుతుంది. వ్యవసాయం బలహీనపడితే రైతు ఆదాయం తగ్గుతుంది. ఆ తర్వాత ఆహార ధరలు పెరుగుతాయి. చివరకు మొత్తం ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుంది.
అడవులను చాలామంది కేవలం చెట్ల సమూహంగా చూస్తారు.కానీ నిజానికి అవికోట్ల రూపాయల విలు వైన సహజ సంపద నిల్వలు.ఒక అడవి నాశనం అయితే అక్కడి జీవవైవిధ్యం మాత్రమే కాదు,ఆ ప్రాంత ఆర్థికవ్యవస్థ కూడా బలహీనపడుతుంది. వరదలు, కరువులు,భూకంపనలు పెరిగితే ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే జీవవైవిధ్య నష్టం చివరికి ఆర్థిక నష్టంగానే మారుతుంది. సము ద్రాల్లోని చేపలు,పగడపు దిబ్బలు,తాబేళ్లు,సూక్ష్మ జీవులు.. ఇవన్నీ సముద్ర జీవవ్యవస్థలో భాగాలు. ఈజీవ వైవి ధ్యం సమతుల్యం కోల్పోతే చేపల ఉత్పత్తి తగ్గు తుంది. దీంతో మత్స్యకారుల జీవనం ప్రమాదంలో పడుతుంది. ఆహార భద్రత దెబ్బతింటుంది.. సముద్ర ఆర్థికవ్యవస్థ బలహీనపడుతుంది. ప్రస్తుతం సముద్ర కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, అధిక మత్స్య వేట వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోంది.
అనేక ఔషధాలు అడవుల్లోని మొక్కలు, సూక్ష్మజీవుల నుంచే తయారయ్యాయి. ఇంకా వేలాది జీవజాతులపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగలేదు. ఒక అరుదైన మొక్క లేదా సూక్ష్మజీవి అంతరించిపోతే, భవిష్యత్తులో ప్రాణాలను కాపాడే మందును మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే జీవవైవిధ్యాన్ని కాపాడటం అంటే వైద్యరంగ భవిష్యత్తును కాపాడటమే. ఇప్పటి వరకు అభివృద్ధి పేరుతో ప్రకృతిని దెబ్బతీశాం. కానీ జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తూ ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు.అందుకే జీవవైవిధ్య సంరక్షణ అనేది పర్యావరణ సమస్య మాత్రమే కాదు. అదిఆర్థిక,సామాజిక, మానవ భవిష్యత్తుకు సంబంధించిన అంశం.జంతువుల రిపో ర్టులు మారాయి!గడిచిన కొన్నేళ్లుగా భారత్ చేపట్టిన సంరక్షణ చర్యలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నా యి.తాజా గణాంకాల ప్రకారం మన‘వైల్డ్ లైఫ’ రిపోర్ట్ కార్డ్ ఇలా ఉంది.
గర్జించిన పులులు
ప్రపంచవ్యాప్తంగా పులుల జనాభా తగ్గుతుంటే, భారత్ మాత్రం వాటి సంఖ్యను పెంచి ప్రపంచానికి మన సత్తా చూపించింది.1973లో మొదలైన ప్రాజెక్ట్ టైగర్ ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శం.ఒక్కప్పుడు 1,800 కంటే తక్కువ ఉన్న బెంగాల్ టైగర్లు ఇప్పుడు 3,682కి పెరిగాయి. టైగర్ రిజర్వుల సంఖ్య 58కి పెరగడమే కాకుండా, గ్రామస్తులను ఈ సంరక్షణలో భాగస్వా ములను చేయడం వల్ల వేట గణనీయంగా తగ్గింది.
ఫలించిన ప్రాజెక్ట్ చీతా ప్రయోగం
దశాబ్దాల క్రితం అంతరించిపోయిన చీతాలను 20 22లో నమీబియా, సౌత్ ఆఫ్రికా నుండి తీసుకువచ్చి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ లో ప్రవేశపెట్టడం మనదేశం చేసిన అతిపెద్ద ప్రయోగం. 2026 నాటికి భారత్ లో మొత్తం 57చీతాలు ఉన్నాయి.వీటిలో 37 భారత్ లోనే పుట్టినవి! ఇటీవల కునోలో భారతీయ చీతా సహజంగా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇది ప్రపంచ స్థాయి విజయం. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీకి కూడా చీతాలను తరలించారు. 2032 నాటికి 60-70చీతాల స్వయం సమృద్ధి జనాభాను సాధించాలన్నది లక్ష్యం.
లెక్క తేలిన మంచు చిరుతలు
హిమాలయాల్లోని గడ్డకట్టే చలిలో జీవిస్తూ,అంత సుల భంగా ఎవరికీ కనిపించని ‘హిమాలయాల దెయ్యాలు’ అని పిలువబడే మంచు చిరుతల జనాభాను తొలి సారిగా శాస్త్రీయంగా లెక్కించారు. మన దగ్గర దాదా పు 718 మంచు చిరుతలు ఉన్నాయని తేలింది.
నీటి వనరులు బాగుంటేనే పక్షులు, చేపలు బతుకు తాయి. భారత్ ఇప్పుడు 98 రామ్సర్ సైట్లను కలిగి ఉంది. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం. చెరువులు, కుంటలను కాపాడుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా వేల సంఖ్యలో వలస పక్షులకు ఆశ్రయం లభిస్తోంది.
ఆకాశమంత సవాళ్లు.. అయినా చిగురంత ఆశ..
భారత్ జీవవైవిధ్య పరిరక్షణలో కొన్ని గొప్ప విజయా లు సాధించినప్పటికీ,ముందున్న సవాళ్లు మాత్రం చిన్నవి కావు. ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీసే మార్పు లు వేగంగా జరుగుతున్నాయి. అడవులు తగ్గడం, కాలుష్యం పెరగడం, వాతావరణ మార్పులు, పట్టణాల విస్తరణ..ఇవన్నీ జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో దాదాపు 30 శాతం భూభాగం “ల్యాండ్ డీగ్రేడేషన” సమస్యను ఎదుర్కొంటోంది. అంటే భూమి తన సహజ సారాన్ని, జీవశక్తిని కోల్పో తోంది. అధిక రసాయన వినియోగం, అడవుల నరికివేత,గనుల తవ్వకాలు, నీటి దుర్వినియోగం వల్ల నేల బలహీనపడుతోంది.దీని ప్రభావం కేవలం వ్యవసాయంపైనే కాదు..ఆ నేలలో జీవించే సూక్ష్మ జీవుల నుంచి అడవిజీవుల వరకు అందరిపైనా పడు తోంది. ఇంకో పెద్ద ప్రమాదం “ఇన్వేసివ్ స్పీసీస” లేదా పరకాయ జీవజాతులు. ఇవి స్థానిక జీవవ్యవస్థ లోకి ప్రవేశించి,అక్కడి సహజ జీవజాతులను బలహీనపరుస్తాయి. కొన్ని విదేశీ మొక్కలు, చేపలు, పురుగులు ఇప్పుడు భారతీయ జీవవైవిధ్యానికి ముప్పు గా మారుతున్నాయి. ఇవి స్థానిక మొక్కల పెరుగుద లను అడ్డుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి వనరుల పైనా ప్రభావం చూపుతున్నాయి. శాస్త్రవేత్తలు దీన్ని “నిశ్శబ్ద జీవవైవిధ్య సంక్షోభం”గా అభివర్ణిస్తున్నారు. తీరప్రాంతాల్లో పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.తుపాన్లు, సముద్ర అలల నుంచి సహజ రక్షణ గా పనిచేసే మాంగ్రోవ్ అడవులు కొన్ని ప్రాంతాల్లో తగ్గిపోతున్నాయి.పోర్టులు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ నిర్మాణాలవల్ల ఈ జీవవ్యవస్థలు ఒత్తిడికి గురవుతు న్నాయి.మాంగ్రోవ్స్ తగ్గితే కేవలం సముద్ర జీవజాతులే కాదు,తీరప్రాంత గ్రామాల భద్రత కూడా ప్రమా దంలో పడుతుంది.
ప్రకృతి సేవలో చట్టాలు మరియు టెక్నాలజీ
జీవవైవిధ్యాన్ని కాపాడడం కేవలం మొక్కలు నాటడం లేదా పులులను రక్షించడం మాత్రమే కాదు. దానికి బలమైన చట్టాలు,ఆధునిక టెక్నాలజీలతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ఇక్కడే భారత ప్రభుత్వం చాలా ముఖ్యమైన మార్పులు తెచ్చింది.చట్టాలతో పాటు టెక్నాలజీ కూడా ప్రకృతిని కాపాడ డంలో బలమైన ఆయుధంగా మారింది.ఎఐ, డ్రోన్లు మరియు సాటిలైట్ సర్వైలెన్స్ అడవుల్లో అగ్ని ప్రమా దాలు ఎక్కడ మొదలయ్యాయో నిమిషాల్లో గుర్తిం చడానికి-ఆధారిత కెమెరాలు, సాటిలైట్ ఇమేజెస్ ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఎఐ ఆధారిత సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. డ్రోన్లు అక్రమ వేటగాళ్లను, మరగు మాఫియాను, అక్రమ కట్టడాలను పట్టుకోవడంలో సూపర్ హీరోలుగా మారాయి. థర్మల్ డ్రోన్లు రాత్రి సమయంలో కూడా జంతువులను ట్రాక్ చేస్తాయి. భితార్కానిక, కునో వన్యప్రాణి అభయారణ్యాల్లో ఇలాంటి డ్రోన్లు ఇప్పటికే విజయవంతంగా ఉపయోగపడుతున్నాయి. బార్ కోడింగ్ ఒక అద్భుతమైన టెక్నాలజీ. వన్యప్రా ణుల మాంసం,ఎముకలు,చర్మం,రక్తం వంటి అవశే షాలు దొరికితే, బార్ కోడింగ్ ద్వారా కేవలం కొన్ని గంటల్లోనే ఆజంతువు ఏజాతికి చెందినదో,ఏ ప్రాం తం నుంచి వచ్చిందో తేల్చేస్తారు. ఇది అక్రమ వేట, వైల్డ్ లైఫ్ ట్రేడ్‌ను అరికట్టడంలో చాలా ప్రభావవంతం గా ఉపయోగపడుతోంది.కెమెరా ట్రాప్స్‌తో ఎఐ ద్వారా జంతువులను గుర్తించడం, మ్యాపింగ్ ద్వారా నివాసా లు మ్యాప్ చేయడం,రియల్-టైమ్ మానిటరింగ్ సిస్ట మ్స్ వంటిఇతర ఆధునిక సాంకేతికతలు జీవవై విధ్య పరిరక్షణలో చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి.అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం కేవలం సదస్సు లు, సెమినార్ల కోసం కాదు. ‘గ్లోబల్‌గా ఆలోచిస్తూ ‘లోకల్‌గా పని చేయవలసిన సమయం.
మనం చేయగలిగే చిన్న చిన్న పనులు:
1.దేశీ మొక్కలే ముద్దు: మన వాతావరణానికి అల వాటుపడని విదేశీ మొక్కల కంటే, వేప, రావి, చింత వంటి మన దేశీ మొక్కలు నాటాలి.అవి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా పక్షులకు మంచి ఆశ్ర యం ఇస్తాయి.
2.విత్తన భాండాగారాలు: గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న దేశీ విత్తనాలను సేకరించి దాచు కోవాలి. రసాయన ఎరువుల కంటే సేంద్రీయ పద్ధ తులు పాటించాలి.నీటి సంరక్షణ: వర్షపు నీటిని ఒడిసి పట్టడం ద్వారా మన చుట్టూ ఉన్న చిన్నచిన్న జీవరాశుల దాహా న్ని తీర్చవచ్చు.
ప్లాస్టిక్ మహమ్మారిని తరిమేద్దాం: సముద్రాల్లో, అడవుల్లో ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల ఏటా లక్షలాది జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా దూరం పెట్టడం ముఖ్యం. ఈ ప్రకృతి మనకు పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి అనడం కంటే మనం మన పిల్లల దగ్గర తీసుకున్న ‘అప్పు అనడం మెరుగు. ఆ అప్పును మనం తీర్చాలంటే జీవవైవిధ్యాన్ని గౌరవించాలి. ఒక్క జీవి అంతరించి పోయినా ఆ ప్రభావం గొలుసుకట్టులా మన మీద పడుతుంది. ?
బయలాజికల్ డైవర్సిటీ (సవరణ) చట్టం, 2023
2002లో వచ్చిన బయోడైవర్సిటీ చట్టాన్ని 2023లో సవరించి,2024 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు.
ప్రధాన మార్పులు: ఆయుష్ రంగానికి పెద్ద బూస్ట్: నమోదైన ఆయుష్ (ఆయుర్వేద,యోగ,యూనానీ, సిద్ధ,హోమియోపతి) వైద్యులు,హకీములు,స్థానిక వైద్య నిపుణులు వీరందరూ ముందస్తు వివరణ ఇవ్వ కుండానే స్థానిక ఔషధ మొక్కలను ఉపయోగించు కోవచ్చు. కలివిక్త సాంప్రదాయ జ్ఞానం,సాగు చేసిన ఔషధ మొక్కలు కూడా ఈ చట్టం నుంచి మినహా యింపు పొందాయి. దీంతో మన సాంప్రదాయ వైద్యం మరింత బలపడుతుంది.
బెనిఫిట్ షేరింగ్ (లాభాల్లో వాటా): ఏదైనా కంపెనీ (ముఖ్యంగా విదేశీ కంపెనీలు) మన దేశంలోని జీవవైవిధ్య వనరులను లేదా స్థానిక గిరిజనుల సాంప్ర దాయ జ్ఞానాన్ని వాడుకుని వ్యాపారం చేస్తే, వచ్చిన లాభాల్లో న్యాయమైన వాటా స్థానిక సమాజాలకు, గిరిజన తెగలకు, ఆప్రాంత అభివృద్ధికి ఇవ్వాలి. ఇది ఆర్థికంగా కాకుండా,నాన్-ఫైనాన్షియల్ బెనిఫిట్స్ (శిక్షణ,టెక్నాలజీ బదలాయింపు, సామగ్రి) కూడా ఉంటాయి. ఈ సవరణలు విదేశీ కంపెనీలు మన జీవవైవిధ్యాన్ని “బయో-పైరసీ”(దోపిడీ) చేయకుండా అడ్డుకట్ట వేస్తూనే,మన దేశీయ కంపెనీలు, పరిశోధ కులు, ఆయుష్ డాక్టర్లు సులభంగా పని చేసుకోవ డానికి దారి చూపుతాయి.
