గిరిజన విద్యార్ధుల ఆరోగ్యానికి ఏదీ భరోసా

రాష్ట్రవ్యాప్తంగా గిరిజనప్రాంతాల్లో550 గిరిజన ఆశ్రమ పాఠశాలలు,ప్రీమెట్రిక్,పోస్ట్మెట్రిక్ వసతి గృహాలున్నాయి.ఇందులో ఏజెన్సీ ప్రాంతంలోనే 305ఉన్నాయి.ఒక్కోచోట 100 నుంచి 600 మంది వరకు విద్యార్ధులు.మొత్తంగా దాదాపు 1.20లక్షల మంది గిరిజన బిడ్డలకుజలుబు,జ్వరం,ఇంకేదైనా ఆరోగ్య సమస్య వచ్చినా నాడి పట్టి చూసే వారే లేరు. మారుమÖల ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి,జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే వీటిలో ఏఎనఎంల నియామకం తప్పనిసరి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆశ్రమ పాఠశాలలో ఏఎనఎంల నియామకం చేపట్టాలని గిరిజన సంక్షేమశాఖ అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు నివేదించారు.సీఎంవో దృష్టికి కూడా సమస్య తీవ్రతను తీసుకెళ్లారు.కానీ వారంలో ఒక రోజు (గురువారం)సమీపంలోని సచివాలయ ఏఎనఎంలు ఆశ్రమ పాఠశాలలకు వెళ్లి విద్యార్ధులను పరిశీలించాలని ఆదేశిలిచ్చి వదిలేశారు.- జి ఎన్ వి సతీష్ 

వందల మంది విద్యార్ధులకు ఒక్కరోజు ఒక్క ఏఎనఎంతో సేవలందేనా..?
2014`19 మధ్య తెదేపా హాయంలో ప్రాజెక్టు కింద దాదాపుగా 550మంది ఏఎనఎం లను నియమించి గిరిజన విద్యార్ధుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించారు.వైకాపా ప్రభుత్వం వీరిని తొలగించింది.కూటమి వచ్చాక పాత విధానంలోనే పొరుగు సేవల కింద లేదా ఏదైనా పథకం కింద నియమించుకునేందుకు అనుమతి వ్వాలని గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వాన్ని కోరింది. 550 మందిని పొరుగు సేవల కింద నియమించినా ప్రభుత్వానికయ్యే ఖర్చు ఏడాదికి రూ.15కోట్లకు మించదు.ఇవేవీ కాదని వారంలో ఒక రోజు ఏఎనఎంలు సందర్శించేలా వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.వందల మంది విద్యార్ధులుండే చోట ఒక్క ఏఎనఎం ఉదయం నుంచి సాయంత్రంలోపు విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిని ఏమాత్రం పర్యవేక్షించగలరో పైవారికే తెలియాలి.వచ్చే విద్యాసంస్ధరం నుంచైనా ఏఎనఎంలను నియమించాలని గిరిజన సంఘా లు కోరుతున్నాయి.
గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాల ల్లోని గిరిజన విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్య భరోసా లేదనే వాదన బలంగా వినిపిస్తున్నది. అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మన్యం పార్వతీపురం జిల్లాలోని కురుపాం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో కలు షిత నీరు కారణంగా రెండు వందల మంది బాలి కలు అస్వస్థతకు గురికావడం, వారిలో 37 మంది కేజీహెచ్‌లో, మరో 120 మంది పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న ఘటనతో గిరిజన ప్రాంతంలోని విద్యార్థుల ఆరోగ్య పరి రక్షణపై తాజాగా మరోమారు చర్చకు దారి తీసింది. పాడేరు ఐటీడీఏ పరిధిలో ప్రతి ఏడాది 10 నుంచి 15 మంది గిరిజన విద్యార్థులు వివిధ ఆరోగ్య సమస్యలతో మృతి చెందుతున్నట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.
గతంలో ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీ ర్లుండేవారు. 2019లోఅధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2020లో వారినిఅకారణంగా తొలగించింది. దీంతో ఆశ్రమ విద్యార్థులకు ప్రాథమిక వైద్య సేవలు అందని పరిస్థితి నెల కొంది. దీంతో గిరిజన విద్యార్థులు అనారోగ్యానికి గురికావడం, సకాలంలో వైద్య సేవలు అందక మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో విద్యార్థులు రోగాల బారిన పడడం, పరిస్థితి విషమించి మృతి చెంద డం సర్వసాధారణమైపోయింది.ఏజెన్సీ 11 మం డలాల్లో 121గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశా లలున్నాయి.వాటిలో 38వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. విద్యా సంవత్స రంలో సెలవులు మినహా వారంతా ఆశ్రమ పాఠశాలల్లోనే ఉంటారు. కాగా 2014, 2015 సంవత్సరాల్లో అనారోగ్య సమస్యలతో పదుల సంఖ్యలో గిరిజన విద్యార్థులు మృతి చెందారు. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్ పేరిట వైద్య సిబ్బందిని నియమించాలనే డిమాం డ్ ఉత్పన్నమైంది. దీనికి స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ 121 ఆశ్రమాలకు 2016లో 72 మంది హెల్త్ అసిస్టెంట్‌లను, 49 మంది ఏఎన్ ఎంలను నియమించింది. దీంతో ఆశ్రమాల్లోని విద్యార్థులకు ఆర్యోగ పరీక్షలు నిర్వహించడం, అవసరం మేరకు సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లి వైద్యం అందించడం చేసేశారు. దీంతో విద్యా ర్థుల ఆరోగ్యానికి ఒక ప్రత్యేక భరోసా ఉండేది.
కొవిడ్ తరువాత వైద్య సిబ్బంది నియామకాల్లేవు
2016 నుంచి ఆశ్రమాల్లో పని చేస్తున్న ఆరోగ్య సిబ్బందిని కొవిడ్ తరువాత పాఠశాలల పునః ప్రారంభంలో నియమించకుండా తొలగించారు. కొవిడ్ కారణంగా 2019,2020లో విద్యాల యాలు మూతపడడం, 2021లో పాఠశాలలు తెరచుకున్నప్పటికీ,ఆశ్రమాలో హెల్త్ అసిస్టెంట్‌లు, ఏఎనఎంల నియామకానికి వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.వారిని తొలగించినట్టు ప్రక టించింది. దీంతో స్థానిక అధికారులు సైతం ఏమి చేయలేక మిన్నకున్నారు.అలాగే 2021లో పాఠ శాలలు అంతంతమాత్రంగా తెరచుకోవడం, 2022 విద్యా సంవత్సరం జూలై ఐదో తేదీ నుంచి ప్రారంభమైనప్పటికీ ఆశ్రమాల్లోని విద్యార్థుల ఆరోగ్య రక్షణ సందిగ్ధంలో పడింది. అలాగే అప్పుడప్పుడు విద్యార్థులు రోగాల బారినప డడంతో ఉపాధ్యాయులే ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. పరిస్థితి విషమిస్తే విద్యా ర్థులు తమ ప్రాణాలు కోల్పోయేవారు.
మొక్కుబడిగా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన స్కూల్ హెల్త్ కార్యక్రమం ఏజెన్సీలో మొక్కుబడిగా అమల వుతున్నది. విద్యార్థులకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యం అందిస్తున్నారే గాని, వైద్యులు విద్యాలయాలకు వెళ్లి సేవలు అందిస్తున్న వైనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకున్న నా?థుడే లేని దుస్థితి కొనసాగు తున్నది. దీంతో గిరిజన విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైపోయాయి. అలాగే వైద్యారోగ్య శాఖ నిబంధనల ప్రకారం ఏడాదిలో రెండు మార్లు మాత్రమే పాఠశాలలో విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తారు. ఇందులో భాగంగా వైద్యులు,సిబ్బంది తమకు అందుబాటులో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు వైద్యసేవలు అంది స్తున్నారు.దీంతో మిలిగిన సమయాల్లో విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోని పరిస్థితి ఏర్ప డింది.అలాగే ఏజెన్సీలో కస్తూర్బా బాలికల విద్యా లయాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేకంగా వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ, గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో అందుకు భిన్నంగా కనీస వైద్య సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితి కొనసాగుతున్నది.
హెల్త్ సిబ్బంది నియామకంపై నెరవేరని మంత్రి హామీ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ల్లోని గిరిజన విద్యార్థులకు వైద్య సేవలు అందిం చేందుకు వైద్య సిబ్బందిని నియమిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి గతేడాది జూలైలోనే ప్రకటించారు.కానీ నేటికీ మంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదు. వాస్త వానికి ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది ఎంతో అవసరం. అలాగే వారికి నాణ్యమైన పోషకాహారం,శుద్ధి చేసిన తాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆశ్రమ పాఠ శాలల్లోని గిరిజన విద్యార్థులకు సామూహికంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎం తైనా ఉందని విద్యార్థి సంఘాలు భావిస్తు న్నాయి.
గిరిజన విద్యార్థుల మరణాలు ఆందోళనకరం
పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థుల వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిసు ్తన్నాయని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర నాయకులు టి. కామేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక ఆరోగ్య విభాగం కో కన్వీనర్ డాక్టర్ ఎం. రమేష్‌కుమార్ అన్నారు.ప్రజా ఆరోగ్యవేదిక, జనవిజ్ఞన వేదిక, యుటిఎఫ్ నేతలు, పలువురు సభ్యులతో కూడిన పరిశీలన బృందం విశ్వనాథపురం గ్రామంలో పర్యటించింది. గిరిజన విద్యార్థుల మరణాలపై స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకుల నుంచి బృందం సమాచారం సేకరిం చింది. సమయానికి వైద్య సేవలు అందక పోవడం, పోషకాహార లోపం, ఆశ్రమ పాఠశాల ల్లో సరైన ఆరోగ్య పర్యవేక్షణ లేకపోవడం వంటి సమస్యలతో విద్యార్థులు చనిపోయినట్లు వారు పేర్కొన్నారు.ఏప్రిల్‌లో మర్రిమానుగూడకు చెంది న బిడ్డిక రాహుల్,విశ్వనాథపురానికి చెందిన దుడ్డుకల్లు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థి గుమ్మడాల అఖిల్,మే ఎనిమిదిన పాము లుగీశాడ గ్రామానికి చెందిన అసిరయ్య, మే 17న మూలిగూడ గ్రామానికి చెందిన సుస్మిత మృతి చెందారని తెలిపారు. ఈ మరణాలకు కచ్చితమైన కారణాలు,అధికారిక వైద్య, పోస్టుమార్టం నివే దికలు,జిల్లా వైద్యశాఖ ప్రకటనల ద్వారానే నిర్ధా రణ కావాలని బృంద సభ్యులు తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో నిరంతర ఆరోగ్య పరీక్షలు నిర్వహిం చడం,ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, మలేరియా,డెంగీ పరీక్షలు వేగవంతం చేయడం, తక్షణ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచడం, పోషకాహార పథకా లను బలోపేతం చేయడం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పార్వతీపురం పట్టణంలో నిర్మాణం నత్తనడకన సాగుతున్న జిల్లా ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలని,గిరిజన మండ లాల్లో మొబైల్ ఆస్పత్రులు నడపాలని,గిరిజన హాస్టళ్లలో నిర్మాణం పూర్తికాని భవనాలను కొత్త విద్యాసంవత్సరానికి ముందే పూర్తి చేయాలని కోరారు. మూఢనమ్మకాల నిర్మూలనపై ప్రభుత్వం, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జనవిజ్ఞాన వేదిక విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ పి.లక్ష్మణస్వామి కోరారు. ఈ బృందంలో కామే శ్వరరావు, రమేష్‌కుమార్, యుటిఎఫ్ నాయకులు కూర్మారావు,జనవిజ్ఞాన వేదిక విశాఖ జిల్లా నాయ కులు ప్రసాద్,డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు, ప్రతి నిధులు బాలు,నాని తదితరులు ఉన్నారు.