ఏపీలో ఈ భాషల్లోనూ చదువు చేప్తారని మీకు తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో తెలుగు హిందీ, ఇంగ్లీష్‌,భాషల్లో భోదన జరుగు తుంటుంది. అక్కడ క్కడా ఉర్దూలోనూ బోధిస్తారు. ఇప్పుడు మరికొన్ని కొత్తభాషల్లోనూ భోదన జరగనుంది. రాష్ట్రంలోని గిరిజనుల ప్రయోజనం కోసం వారికి అర్ధమయ్యేలా వారి స్థానిక భాషల్లోనే భోదన జర పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆరు గిరిజన భాషల్లో ప్రత్యేకంగా విద్యార్థులకు భోదించాలని నిర్ణయించింది. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోనే ఏజెన్సీప్రాంతాల్లో గిరిజనులు నివాసముంటున్నారు. వీరు మాట్లేడే భాషలకు లిపి ఉండదు. వీటిలో కోయ, సవర, కువి, అదివాసీ, కొండ, సుగాలి భాషలు ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ భాషల్లో విద్యార్థులకు బోధించనున్నారు. గణితం, సన్స్‌, సోషల్‌ వంటి సబ్జెక్టులు కూడా గిరిజన భాషల్లోనే బోధన జరగనుంది. లిపిలేని భాషలను సిలబస్‌ లో చేర్చడం ద్వారా గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది.
ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యా ర్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ఇకపై గిరిజన పాఠ శాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ..లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పిం చింది. కొండకోనల్లో అంతరించిపోతున్న అరుదైన కోయ భాషలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా మూడొం తుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. దీంతో వారు విద్యకు దూర మై వెనుకబడిపోతున్నారు. ఉపాధికి కూడా దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు మాతృ భాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసిం చేలా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుడు తోంది.6 భాషలు..920 పాఠశాలల్లో అమలు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమ లు చేయనున్నారు. ఈ విధానాన్ని‘కోయ భారతి’ పేరిట ఉభయగోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవడంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ),శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో (సవర),విశాఖపట్నం జిల్లాలో (కొండ,కువి,ఆదివాసీ),కర్నూలు, అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసు కొచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1నుంచి3వ తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60 లక్షల వ్యయంతో పాఠ్యాం శాలు రూపొందించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా920పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేని చోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు.
కోయభాష విభిన్నం..
కోయ భాషలో అమ్మను యవ్వ అని..నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా..అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని..కోడి పుంజును గొగ్గోడు అని..పిల్లిని వెరకాడు అని పిలుస్తారు.దోడ తిత్తినే (అన్నం తిన్నావా),బాత్‌ కుసిరి (ఏం కూర),దెమ్ము (పడుకో),ఏరు వాట (నీరు ఇవ్వు, పెట్టు), బెచ్చోటి (ఎంత పరిమాణం), మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి), కూడికేకు (కూడిక), తీసి వేతాకు (తీసివేత), వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి.
గిరిజన విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు
గిరిజన బిడ్డలకు నాణ్యమైన చదువులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఒక్క చదువులోనే కాకుండా ఆటలు, సాంస్కృతిక అంశాల్లోనూ వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ద్వారా గిరిపుత్రుల సమగ్ర వికాసానికి బాటలు వేసింది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను కూడా అందిపుచ్చుకుంటూ గిరిజనుల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది.ఏకలవ్య స్కూళ్ల ద్వారా ప్రతి విద్యార్థిని చదువుల్లో గురి తప్పని ఏకల వ్యులుగా తయారు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు మేలైన ఫలితాలు సాధిస్తుండగా ఏకలవ్య పాఠశాలలు మరింతగా ఊతమివ్వనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 19 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు ఉండగా కొత్తగా మరో 9 మంజూరయ్యాయి. 2021-2022 విద్యా సంవత్సరానికి మంజూరైన వీటిని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు.
ఏకలవ్య పాఠశాలల ప్రత్యేకతలు ఇవే..
?సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆరు నుంచి 12వ తరగతి వరకు ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు ఉంటాయి. మొదటి ఏడాది ఆరో తరగతితో ప్రారంభించి ఆ తర్వాత ఏడాదికొక తరగతి చొప్పున 12వ తరగతి వరకు పెంచుతారు. ప్రతి తరగతికి 60మంది(బాలలు 30, బాలి కలు 30 మంది) ఉంటారు. 11,12 తరగ తుల్లో 90 మంది చొప్పున ప్రవేశాలు కల్పి స్తారు. ఒక్కో పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 ఎకరాల స్థలంలో నిర్మిస్తుంది. విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆట స్థలం ఇలా సమస్త సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 8బాలబాలికల కోసం వేర్వేరుగా ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక డార్మిటరీలు, ఆధునిక వంట గది, విశాలమైన భోజనశాల ఉంటాయి. 8 ఇండోర్‌ స్టేడియం, అవుట్‌డోర్‌ ప్లే ఫీల్డ్‌లను ఏర్పాటు ద్వారా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణ అందిస్తారు. గిరిజన భాషలకు ప్రోత్సాహమేదీ?
ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ విద్యార్థులకు వారి సొంత గిరిజన భాషలో విద్య అందించే ందుకు ఏళ్ల తరబడి కొనసాగుతున్న భాషా వలంటీర్లను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రెన్యువల్‌ చేయలేదు. దీంతో, వేలాది మంది ఆదిమ తెగల విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారింది.ఆదివాసీల్లో సవర,కువి,కొండ, కోయ, ఆదివాసీ ఒరియా తదితర భాషలు మాట్లాడే వారికి ఆ భాషతప్ప మరే భాషారాదు. తెలుగు కూడా తెలియదు. దీంతో,వారికి వారి గిరిజన భాషలోనే చదువు చెప్పడం,ఆట పాటల ద్వారా బమ్మలు చూపించి తెలుగు కూడా నేర్పించడం కోసం భాషా వలంటీర్ల నియామకం జరిగింది. సంబంధిత గిరిజన భాష మాట్లాడేవారు పది మంది ఉంటే,ఆ భాషను రక్షించేందుకు పాఠ శాలలను పెట్టి, ఉపాధ్యాయులను లేదా వలం టీర్లను నియ మించుకోవడానికి అవకాశంఉంది. వలంటీర్లు రెగ్యులర్‌ టీచర్లు మాదిరిగా పనిచేస్తున్నా, వారికి నెలకు రూ.5 వేలు మాత్రమే వేతనం ఇస్తున్నారు. గతేడాదికి సంబంధించి వలం టీర్లకు మూడు నెలల బకాయిలు ఉన్నాయి. తమను రెన్యువల్‌ చేయాలని, బకాయిలు చెల్లిం చాలని భాషా వలంటీర్లు పోరాడుతున్నా పాలకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం,కురుపాం మండ లాల్లో ఆదిమ తెగల గిరిజన విద్యార్థుల కోసం 176 ప్రభుత్వ ప్రత్యామ్నాయ స్కూళ్లు (జిపిఎస్‌) పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1802 మంది విద్యార్థులు ఉన్నారు. 176 మంది సవర భాషా వలంటీర్లు ఉండేవారు. వీరిని రెగ్యువల్‌ చేయక పోవడంతో విద్యార్థుల చదువు సాగడం లేదు. విశాఖ ఏజెన్సీలోని ఆదివాసీల్లో వెనకబడిన కువి,కొండ,ఆదివాసీ ఒరియా భాషలు మాట్లాడే వారి కోసం 708 మంది భాషా వలంటీర్లు ఉండేవారు. వారిని రెన్యువల్‌ చేయకపోవడంతో సుమారు 7,500 మంది పివిటిజి విద్యార్థులు డ్రాప్‌ అవుట్‌ అయ్యే ప్రమాదం ఉంది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఎ పరిధిలో సీతంపేట, కొత్తూరు మండలాల్లోని పాఠశా లల్లో సవర భాష విద్యా బోధన155 స్కూళ్లల్లో జరిగేది.వీటిలో 75ప్రభుత్వ ప్రత్యామ్నాయ స్కూ ళ్లు (జిపిఎస్‌),56 మండల పరిషత్‌ స్కూళ్లు, 16ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, నాలుగు గురుకులాలు,రెండు మినీ గురుకులాలు ఉన్నా యి.వీటిలో వలంటీర్లే విద్యా బోధన చేసేవారు. సుమారు 4,500 మంది విద్యార్థులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు ఐటిడిఎ పరిధిలో కోయభాషవలంటీర్లు గత ఏడాది14 ఉండేవారు. వారందరినీ రెన్యువల్‌ చేయాలని ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు నివేదిం చినా ప్రభుత్వంలో స్పందన లేదు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం, జీలుగు మిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు గిరిజన మండలాల్లో 101 కోయ భారతి పాఠ శాలలు ఉన్నాయి. వీటిల్లో 101 మంది కోయ భాషా వలంటీర్లు రెన్యువల్‌ కోసం ఎదురు చూస్తు న్నారు.గిరిజన ప్రాంతంలోని భాషా వలంటీర్లను రెన్యువల్‌ చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ లేఖ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.-(జి.ఆనంద్‌ సునీల్‌ కుమార్‌)

మహిళల్లో పెరుగుతున్న ఎనీమియా సమస్య

ఐరన్‌లోపం ఉండడంవల్ల ఎనీమియా మొదలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీ స్తుంది. ఐరన్‌ తక్కువగా ఉండటంవల్ల తల నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు,అలసట మొదలైన సమస్యలు కూడా వస్తాయని తెలుస్తోంది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ చెప్పిన దాని ప్రకారం ఐరన్‌ లోపం 33శాతం మహిళల్లో కనబడు తుందని 40శాతం గర్భిణీలలో..42శాతం పిల్లల్లో కన బడుతోందని మనకి తెలుస్తోంది. అందుకనే నిపుణులు ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదా ర్థాలు గురించి తెలియజేశారు. కనుక ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్‌ డైట్‌లో తీసు కుంటే మంచిది. చాలా మంది ఐరన్‌ ఏ కదా అదే వస్తుందిలే అని టెక్‌ ఇట్‌ ఈజీగా తీసుకుం టారు. కానీ అలా చెయ్యడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆరోగ్యం విషయం లో ఎప్పుడు కూడా లైట్‌ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే సమస్య చిన్నగా ఉంటేనే సాల్వ్‌ చెయ్యడానికి కుదురుతుంది. పెద్దది అయితే దాని నుండి బయటకి రావడం నిజంగాకష్టం. ఇది ఇలా ఉంటే ఐరన్‌ లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని తెలుసుకోవాలి. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెప్తున్నా రు. మరి ఆలస్యం ఎందుకు ఐరన్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి, ఐరన్‌ ఎందులో ఉం టుంది అనే దాని గురించి తెలుసుకుందాం.! -జిఎన్‌వి సతీష్‌
ఆహారం కంటే ముఖ్యమైనది మంచి నీళ్లు.నీళ్ళే కదా అని పట్టించుకోవడం మానేయద్దు. నీళ్లు నిజంగా బాడీకి చాలా అవసరం.ఎక్కువగా నీళ్లు తీసుకోవాలిఅని చాలా మంది చెప్తూ ఉం టారు అయితే నిజంగా నీళ్లు అంత ముఖ్యమా అని ఆలోచిస్తున్నారా..? అవునండి మనం తీసుకునే నీళ్లు కూడా మన ఆరోగ్యాన్ని ఎఫెక్ట్‌ చేస్తాయి. సరిగ్గా నీళ్లు తీసుకుని హైడ్రేట్‌గా ఉంటే ఎనిమియా సమస్యకు దూరంగా ఉండ వచ్చు. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ బులెటిన్‌ రీసె ర్చర్లు చెప్పిన దాని ప్రకారం చూస్తే…మంచి నీళ్లు తీసుకోవడం వల్ల ఐరన్‌ లోపం కలగదని అంటున్నారు కాబట్టి హైడ్రేట్‌గా ఉండడం చాలా ముఖ్యం అని తెలుసుకుని..ప్రతి రోజూ ఏడు నుండి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగండి. మీరు కనుక వట్టి మంచి నీళ్లు తాగ లేకపోతే నీటి యొక్క ఫ్లేవర్‌ని మార్చుకోవచ్చు. ఉదాహ రణకు అందులో రెండు తులసి ఆకులు వేసు కుని రుచి మార్చుకోవచ్చు లేదా పుదీనా, నిమ్మ రసం ఇలా ఏదైనా మీరు ట్రై చేయొచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా నీళ్ళని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉం డొచ్చు. పైగా చాలా సమస్యలు మీకు రావు. ముఖ్యంగా ఐరన్‌ సమస్యలు కూడా ఉండవు.
ఆకుకూరలు తీసుకోండి:
చాలా మంది ఆకు కూరలు అంటే ఆమడ దూరం పారిపోతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆకు కూరల్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. పోషక పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు తరిమికొ ట్టొచ్చు. అయితే ఆకు కూరల్లో ఐరన్‌ కూడా ఉంటుంది అని గ్రహించండి. పాలకూర కాలే మొదలైన ఆకు కూరల్లో ఫోలేట్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్య రాకుండా చూసుకుంటుంది.కాబట్టి వీలైనంత వరకు ఆకు కూరలను కూడా మీ డైట్‌ లో చేర్చండి. ఆకుకూరల తో మనం వివిధ రకాల రెసిపీస్‌ని మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు పాల కూర తో పాలక్‌ పన్నీర్‌ వంటివి ఎంతో రుచిగా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కొత్త కొత్త రెసిపీలని కూడా ఆకు కూరలతో ప్రయత్నం చేసి ఏదో రూపం లో తీసుకోవడం ఉత్తమం. కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి. తద్వారా ఆరోగ్యం గా ఉండొచ్చు. అకాడమీ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటటిక్స్‌ ప్రకారం సమతుల్యమైన ఆహారం తీసు కోవడం చాలా ముఖ్యం. అందులో విటమిన్‌ సి కూడా తప్పక ఉండేటట్లు చూసుకోండి. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో పాటు విటమిన్‌ సి కూడా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇలా విటమిన్‌-సి ని తీసుకోవ డంవల్ల ఐరన్‌ లోపం కలగదు అని చెబుతు న్నారు. కాబట్టి విటమిన్‌ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా మీరు డైట్‌లో తీసుకోండి. ఎనిమియా సమస్య లేకుండా వుండండి.
మాంసం మరియు పౌల్ట్రీ
చికెన్‌, మటన్‌ మొదలైన వాటిలో ఐరన్‌ ఎక్కువ గా ఉంటుంది. అదే విధంగా వాటిలో ఫోలేట్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్య రాకుండా చూసుకుంటుంది. అదే విధంగా ఐరన్‌ లోపం కలగకుండా కూడా ఇది జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి వీటిని కూడా తప్పకుండా డైట్‌ లో తీసుకోండి.
ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కాల్షియంతో పాటు తీసుకోకండి
ఈ తప్పు కనుక మీరు చేస్తుంటే సరిదిద్దుకోండి. ఎందుకంటే ఐరన్‌ తో పాటు క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఐరన్‌ తీసుకో వద్దు. అదే ఐరన్‌ ఉండే ఆహార పదార్థా లను తీసుకుంటే కాల్షియం ఉండే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఐరన్‌ ఎక్కువ గా ఉండే ఆహారపదార్థాలను క్యాల్షి యం ఉండే ఆహార పదార్థాలతో కలిపి తీసుకో వడం వల్ల క్యాల్షియం ఐరన్‌ యొక్క అబ్సర్ప్షన్‌ని బ్లాక్‌ చేస్తుంది కాబట్టి ఈ తప్పులు చేయొద్దు. మరి నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను చూశారు కదా మరి ఈ ఆహార పదార్థాలను తప్పక తీసుకోండి ఐరన్‌ వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఐరన్‌ ఉండే ఆహార పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోండి. తద్వారా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉం డచ్చు. ఎనిమియా వంటి సమస్యలకి కూడా దూరంగా ఉండచ్చు.
దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఎనీమియా బాధితులు` ఎన్‌ఐఎన్‌అధ్యయనంలో వెల్లడి
దేశంలోని ప్రజలు తీసుకొనే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయి. పేద, ధనిక తేడాలే కుండా కడుపు నిండేందుకు ఏదో ఒకటి తినేస్తు న్నారు. కానీ, అవి శరీరానికి తగినంత పోష కాలను అందించడం లేదు. సరైనపోషకా హారం లేక అనారోగ్య సమస్యల బారిన పడుతు న్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో లోపిస్తున్న పోషకాలు వారీ జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తేలింది. జాతీయ పోషకాహార అధ్యయన సంస్థ (ఎన్‌ఐఎన్‌) దేశ వ్యాప్తంగా ఉన్న ఆహారపు అలవాట్లు, పోషకా లపై పరిశోధించి దేశంలోని ఆయా ప్రాంతాల వారీగా సమతుల ఆహార విలువను గుర్తిం చింది. ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండగా, మైక్రో న్యూట్రియన్లు లోపించాయని సర్వేలో వెల్లడైంది.
8 రాష్ట్రాల్లో ఐరన్‌ లోపం
ఆహారంలో పోషకాలు లోపిస్తే వచ్చే రుగ్మత లపై అధ్యయనం చేయగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.18ఏండ్లు నిండిన పురుషులకు సగటున ప్రతిరోజు 8.7మిల్లీగ్రాముల ఐరన్‌ అవసరం ఉంటుంది.19-50ఏండ్ల లోపు మహిళలకు 14.8 మిల్లీగ్రాముల ఐరన్‌ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, దేశంలోని 8 రాష్ట్రాల్లో ఐరన్‌తో కూడిన ఆహారం ఉండటం లేదని తేలింది. దీంతో ఎనీమియా(రక్తహీనత) బారిన పడుతుండగా హార్మోనల్‌ సమస్యలు తలెత్తుతున్నట్టు వెల్లడైంది. అస్సాంలో 70శాతం,ఒడిశాలో 55శాతం, మధ్యప్రదేశ్‌లో 45.4,గుజరాత్‌లో 33.8, తమి ళనాడులో 23.9,పశ్చిమ బెంగాల్‌లో 20.2, తెలంగాణలో 16.8, మేఘాలయలో 12.1 శాతం మంది ఎనీమియా బారినపడ్డారని నివే దికలో పేర్కొన్నది. ఇందులో తెలంగాణ ప్రాం తంలో ఎనీమియా సోకిన వారి కంటే బీ12 లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య 24.6 శాతంగా అధికంగా ఉన్నదని గుర్తించారు.
కార్బోహైడ్రేట్లే ఎక్కువ..
జాతీయ పోషకాహార సంస్థ 2020-21లో దేశంలోని ప్రజలు తీసుకొనే ఆహారంలో ఉన్న పోషకాలను నివేదించింది. ఈ రిపోర్టు ప్రకారం పట్టణ ప్రాంతవాసులు 1,943 కిలో క్యాలరీ లను ప్రతిరోజు తీసుకుంటుండగా, ఇందులో 289 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కొవ్వులు 51.6 గ్రాములు, ప్రోటీన్లు 55.4 గ్రాములను ఆహారం లో తీసుకొంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2,081 కిలోక్యాలరీల ఆహారాన్ని తీసుకుంటే ఇందులో కార్బోహైడ్రేట్లు 368గ్రాములు, కొవ్వు లు 36 గ్రాములు, ప్రోటీన్లు 69 గ్రాములుగా ఉన్నట్లుగా తేలింది.
ఈ ఆహారాలు తీసుకోండి చాలు..
విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. ఈ పోషకాలలో ముఖ్యంగా ఐరన్‌ఉండాలి. వివిధ వ్యాధులతో పోరాడటా నికి మన శరీరంలో ఐరన్‌ చాలా ముఖ్యం. ఐరన్‌ లోపం వల్ల హిమోగ్లోబిన్‌ రక్తహీనత వంటి వ్యాధికి దారితీస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది.వాస్తవానికి, శరీరంలో ఇనుము లోపం ఉన్నప్పుడు, శరీరం లో ఎర్రరక్తకణాలు తగ్గి అనేక ఆరోగ్య సమస్య లు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిని నివారించడానికి మీరు మీ ఆహారంలో ఐరన్‌ అధికంగా ఉన్న ఆహారాలను చేర్చాలి. పాలకూ రవల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజ నాలు లభిస్తాయి. పాలకూరలో ఇను ముతో పాటు అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్క లంగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌ వ్యతిరేక, యాంటీ ఓవర్సిటీ లక్షణాలతో రక్తంలో చక్కెర తగ్గించే లక్షణాలను కలిగిఉంది. పాలకూరలో కనిపించే లక్షణాల కారణంగానే చాలా మంది వైద్యులు ఆహారంలో పాలకూరలో చేర్చాలని సిఫారసు చేస్తారు.అదేవిధంగా చిక్కుళ్లు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటి వల్ల గుండె జబ్బులు, హైపర్‌ టెన్షన్‌, టైప్‌ 2 మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమా దాన్ని కొంతవరకు తగ్గుతాయి. చిక్కుల్లో ఫైబర్‌, ప్రోటీన్‌,కార్బోహైడ్రేట్లు, విట మిన్‌ బి,ఐరన్‌, కాపర్‌,మెగ్నీషియం, మాం గనీస్‌, జింక్‌, ఫాస్ఫ రస్‌ వంటి పోషకాలు ఉంటాయి.
ఎండు ద్రాక్ష
మీశరీరంలో ఐరన్‌ లోపం ఉంటే మీరు ఎండు ద్రాక్ష ఆహారంలో చేర్చుకోవాలి. ఎండుద్రాక్షలో తగినంత మొత్తంలో ఇనుము లభిస్తుంది. రక్తం ఏర్పడటానికి విటమిన్‌ బి కాంప్లెక్స్‌ అవసరం. ఎండుద్రాక్షలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌ తగినంత పరిమాణంలో కనిపిస్తుంది. అటువంటి పరిస్థి తిలో రక్తహీనత మరియు ఐరన్‌ లోపం ఉన్న వారు ఎండుద్రాక్ష తీసుకోవడం చాలా ప్రయో జనకరంగా ఉంటుంది.ముఖ్యంగాగుడ్లలో కుడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి దాదాపు అన్ని విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. గుడ్ల లో విటమిన్‌ డి,ఐరన్‌ కూడాచాలా ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్‌ మరియు కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటాయి. అధికంగా గ్రామీణ ప్రాంత రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా 60 నుంచి 69శాతం మంది మహిళల్లో రక్త హీనత సమస్య ఉంది. సాధారణ మహిళల్లో ఈ స్థాయి లో రక్త హీనత సమస్య ఉండడంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణుల్లో ఒక డెసీలీటర్‌ రక్తంలో 11గ్రాముల కంటే తక్కువ గా హిమో గ్లోబిన్‌ ఉంటే రక్తహీనతగా భావి స్తారు. సాధారణ మహిళల్లో 12 గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్‌ ఉంటే, రక్తహీన తగా భావిస్తారు. యువతుల్లో రక్త హీనత సమ స్య ఉంటే, వారు గర్భం దాల్చినప్పుడు పరిస్థితి మరింత సీరియస్‌ అవుతుందని, గర్భ స్రావం వంటి దుష్పరి ణామాలు ఎదుర్కోవలసి వస్తుం దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
న్యూట్రిషన్‌ కిట్లు
రక్త హీనత నుంచి పిల్లలు, గర్భిణులను రక్షిం చేందుకు అంగన్‌వాడీల ద్వారా పోషకాహార పంపిణీ చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపిం చడం లేదు. 2015-16 నాటి నేషనల్‌ ఫ్యామి లీ హెల్త్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలోని మహిళ్లల్లో (ప్రెగ్నెంట్‌, నాన్‌ ప్రెగ్నెంట్‌ కలిపి)48.2 శాతం మందిలో రక్త హీనత సమస్య ఉంటే, 2020 నాటికి 53.2 శాతానికి పెరిగింది.దీన్ని బట్టి పోషకాహార పంపిణీ ఆశించి ఫలితాలను ఇవ్వ డం లేదన్న విషయం స్పష్టమవుతోంది.ఈ నేప థ్యంలోనే ఇప్పుడు అందజేస్తున్న పోషకాహార పథకాన్ని కొనసాగిస్తూనే, ఏటా 1.5లక్షల మం ది గర్భిణు లకు న్యూట్రిషన్‌ కిట్లను అంద జేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. రక్తహీనత సమ స్య ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ కిట్లు పంపిణీ చేయను న్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సైంటిస్టులు తయారు చేసిన ఈ కిట్‌లో హిమోగ్లోబిన్‌ శాతం మెరుగయ్యేందుకు అవసరమైన ఆహార పదార్థాలు ఉంటాయని హెల్త్‌ ఆఫీసర్లు చెప్తున్నారు.

విశాఖలో అడ్డగోలుగా భూ ఆక్రమణ

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వున్నప్పుడే భూమి ఆక్రమణలకు గురైంది. ల్యాండ్‌ ట్యాంపరింగ్‌ అయింది. ఆ సందర్భంగానే సిట్‌ను వేసి దర్యాప్తు చేశారు. మరలా వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి రాగానే మరో సిట్‌ వేసి దర్యాప్తు చేశారు. ఈ రెండు సిట్‌ ల నివేదికలను నేటికీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? నాడు చంద్రబాబు, నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలు భూ కబ్జాదారులను కాపాడే పనిలో నిమగమ య్యాయనేది జగమెరిగిన సత్యం. ఈ భూముల కుంభకోణంలో అధికార, ప్రతిపక్ష పార్టీ పెద్దలం దరూ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టే నివేదికలు బయటకు రానివ్వకుండా పరస్పరం సహకరించు కుంటున్నారు.
పరిపాలనా రాజధాని ప్రకటనకు ముందు,తరువాత విశాఖలో భూకబ్జాదారుల ఆగ డాలు విపరీతంగా పెరిగాయి. ఇటీవల కాలంలో భూకబ్జాలలో రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల బంధం మరింత పెనవేసుకుంది. అది వైసిపి లేదా టిడిపి ఏపార్టీ అధికారంలో వున్నా భూ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రాజకీయ నాయకుల అవతారం ఎత్తి తమ వ్యాపారాలను మూడు పువ్వులు,ఆరు కాయలుగా అభివృద్ధి చేసుకుం టున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా భూ కుంభకోణా లకు నిలయంగా మారింది. రాజకీయ నాయకులు ప్రజల ఆస్తులను కొల్లగొడుతూ తమ ఆస్తులు, బంధువుల ఆస్తులు పెంచుకొనే పనిలో నిమగమై వున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఉమ్మడి విశాఖలో ఒక్కొక్కటిగా భూ కుంభకోణాలు బయట కొస్తున్నాయి. చివరకు భూ కుంభకోణాలు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి లోకా యుక్త సుమోటోగా తీసుకుందంటేనే భూ కబ్జాలు ఏ స్థాయిలో జరిగాయో మనం అర్ధం చేసుకోవచ్చు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూము లను కాపాడాల్సిన అధికార పార్టీ పెద్దలే కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వరంగ కేంద్రంగా,ఆర్థిక రాజ ధానిగా ఉన్న విశాఖలో భూ కబ్జాదారులు స్వాహా చేసిన భూముల వివరాలు క్లుప్తంగా పరిశీలిద్దాం.
రుషికొండ విధ్వంసం
విశాఖలో రుషికొండ పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతం. గతంలో ఈ కొండ చుట్టూ టూరిజం డిపార్టుమెంట్‌ ఆధ్వర్యం లో అనేక రిసార్టులు నడిచాయి. పచ్చని ప్రకృతి నిలయాలుగా ఉన్న ఈ రిసార్టులు దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని అందించేవి. నేడు ఈపచ్చని కొండలను తవ్వి పర్యా వరణ విధ్వంసానికి కారకులయ్యారు. ఈ కొండల విధ్వంసంపై హైకోర్టు అనేక దఫాలు హెచ్చరించి నా రాష్ట్ర ప్రభుత్వం, భూకబ్జాదారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీనిని పరిశీలించ డానికి వచ్చిన హైకోర్టు ప్రముఖ న్యాయవాది కె.ఎస్‌.మూర్తిపై అక్రమ కేసులు బనాయించారు. కొండల విధ్వంసం కొనసాగుతూనే వుంది. అదే రుషికొండ స్వర్ణభారతి నగర్‌ సర్వే నెంబర్‌ 17/1,2,5లో ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యుఎస్‌ స్కీం కింద400 మందికి 60గజాల చొప్పున లేఅవుట్లు వేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. వీటితో పాటు పార్కులు,రోడ్లు తదితర మౌలిక సదుపాయా లకు కేటాయించిన భూమి సుమారు 1.5 ఎకరాలు కబ్జాకు గురైంది.
దసపల్లా భూములు ప్రభుత్వానివి కావట !
దసపల్లా భూములు ప్రభుత్వ భూములు కావని స్వయానా ఎం.పి విజయసాయిరెడ్డి చెబుతు న్నారు. అత్యంత ఖరీదైన ఈ 15ఎకరాల భూముల విలువ సుమారు రూ.2000కోట్లు.దసపల్లా భూ ముల యజమానులుగా చెప్పుకుంటున్న 64 మంది ఒకే మాటపై వచ్చి తమకు 29శాతం వాటా, బిల్డర్‌కు 71శాతం అని అంగీకరించారు. దసపల్లా భూములు సీలింగ్‌ భూములు. సీలింగ్‌ భూము లంటేనే ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూములు కానప్పుడు దశాబ్దాలుగా ప్రభుత్వం ఎందుకు కోర్టులు చుట్టూ తిరిగింది?ఆ భూములకు 22(ఎ)గా ఎందుకు ప్రకటన చేసింది? సుప్రీం కోర్టు తీర్పు ఆ భూములను భూ యజమానులకు కట్టబెట్టాలని చెప్పిందా? తీర్పు రాకముందే దసపల్లా భూములకు సంబంధించి 22(ఎ)ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎత్తివేసింది? దశాబ్దాలుగా ఈ భూములు కొనుగోలు చేసిన యాజమాన్యాలు ఏదోరకంగా సమస్య పరిష్కారం అయితే మంచిదని భావించిన తరుణం లో ఎష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌సి సంస్థతో ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు? 22 (ఎ) భూముల సమస్య ఒక్కవిశాఖలోనే కాదు, రాష్ట్రంలో అనేకప్రాంతాల్లో వుంది. ఆ ప్రాంతాల్లో 22 (ఎ) ఎత్తివేయకుండా దసపల్లా భూముల విషయంలోనే ఎందుకు ఎత్తివేసి ఇంతప్రేమ చూపించారు? ఇతర భూములలో వున్న వారు ప్రజలు కాదా? దసపల్లా భూముల వ్యవహారం ఇలా వుంటే…విశాఖ ఎం.పి కూర్మన్నపాలెంలో నిర్మిస్తున్న భారీ వెంచరు కథ మరోలా వుంది. భూ యజమానులకు కేవలం 1 శాతం మాత్రమే వాటా ఇచ్చి తమ డెవలప్‌మెంట్‌ వాటాగా 99 శాతం తీసుకున్నారు. ప్రజాసేవకు అంకితం అవ్వాల్సిన ఎంపీలు ప్రజల ఆస్తులను లూటీ చేయడం ఎంతవరకు సమంజసం !
దబ్బంద గ్రామ భూములు స్వాహా
ఆనందపురం మండలం, మామిడి లోవ పంచాయతీ దబ్బంద గ్రామం సర్వే నెంబర్‌ 23లో 1970వ దశకంలో ప్రభుత్వం 120 మంది పేదలకు 80ఎకరాల సాగుకోసం భూమిని కేటా యించింది. 2015లో ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం దళితులు, గిరిజనులైన వీరి నుండి ఈ భూమిని తిరిగి ల్యాండ్‌ పూలింగ్‌ చేసింది. వీటిలో 66 ఎకరాలను టిడ్కో ఇళ్లు మరియు అర్బన్‌ హౌసింగ్‌ కోసం కేటాయించారు. మిగతా 14ఎకరాలను ఒక బడా వ్యక్తి స్వాధీనం చేసుకొని తోటలు వేసుకొని అనుభవిస్తున్నాడు. వీటితోపాటు సర్వేనెంబర్‌ 10లో ఉన్న నరసింహ చెరువును ఆక్రమించి సుమారు 6.8 ఎకరాల్లో జీడి, మామిడి, కొబ్బరి తోటలు వేశాడు.సర్వే నెంబర్‌9/1, 12/4,13/1,13/2,14/2లో సుమారు12.50ఎకరాల భూమి ఈ పెద్ద మనిషికబ్జాÛలోనే ఉన్నది. ఇవి దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన భూములు.
కుసులవాడ భూములపై పెద్దల కన్ను
ఆనందపురం మండలం కుసుల వాడలో 1970వదశకంలో ల్యాండ్‌ సీలింగ్‌ మిగు లు భూమి సుమారు 43 ఎకరాలు సర్వే నంబరు 98,108లో ఎస్‌సి,బిసిలు43కుటుంబాలకు ప్రభు త్వం కేటాయించింది.పద్మనాభం,శొంఠ్యాం ప్రాం తాల మధ్య ఉన్న ఈభూమి విలువ సుమారు రూ. 100కోట్లు ఉంటుంది. వీటిపైఅధికార పార్టీ పెద్దల కన్ను పడిరది. పేదలను బెదిరిస్తూ ల్యాండ్‌ పూలిం గ్‌కు పథకం వేశారు.పేదలను లొంగదీసుకొని ఎక రాకు రూ.13లక్షల చొప్పున చెల్లించి భూములు లాక్కోవాలని చూస్తున్నారు.
బయ్యవరం భూముల బలవంతపు కొనుగోళ్లు
ప్రస్తుత అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్స న్నపేట పరిసర ప్రాంతాల్లో సుమారు500 ఎకరాల డీపట్టా, అసైన్డ్‌ భూములను రైతుల నుండి బలవం తంగా కొనుగోలు చేయడమే కాకుండా ఈ భూము ల చుట్టూ ఉన్న వాగులు, ఇతర ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించారు. అక్కడున్న కొండలను కూడా అక్రమంగా తవ్వేశారు. సర్వే నెంబరు 624లో రెండు కొండల మధ్య ఉన్న వాగును పూడ్చేశారు. ఆ ప్రాంతంలో 403ఎకరాల భూమిలో 230 మౌంట్‌ విల్లాలు పేరుతో రిసార్ట్స్‌ నిర్మించాలనే లక్ష్యంతో భూ వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూముల్లో అనేక అక్రమాలు జరిగాయని నాడు ఆర్డీవో,గనులశాఖఏ.డి,తహశీల్దార్‌, ఇనాం తహ శీల్దార్‌ గుర్తించారు.అందులో నీటి వాగులు, గోర్జీలు వంటివి కూడా కబ్జాకు గురి అయ్యాయని తెలియ జేశారు. అసలు అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం ఆ భూములకు సంబంధించి ఎటువంటి అమ్మకాలు, కొనుగోలు జరపరాదు. దీనికి భిన్నంగా విస్సన్న పేటలో జరిగిందని, రాజకీయ నాయకుల ప్రమే యం వుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోలేదు.
రెండు సిట్‌ నివేదికలు బహిర్గతం చేయాలి
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వున్న ప్పుడే విశాఖఅర్బన్‌,రూరల్‌ మండలాలు, భీమిలి, ఆనందపురం,పెందుర్తి,గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం,పరవాడ,అనకాపల్లి ప్రాంతాల్లో 1 లక్ష 6వేల 239ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది. ల్యాండ్‌ ట్యాంపరింగ్‌ అయింది. మాజీ సైనికుల భూములకు జిల్లా కలెక్టర్లు ఎన్‌ఒసిలు ఇచ్చారనే కథనాలు వచ్చాయి. ఆ సందర్భంగానే సిట్‌ను వేసి దర్యాప్తు చేశారు. మరలా వైఎస్‌ఆర్‌సిపి అధికారం లోకి రాగానే మరో సిట్‌ వేసి దర్యాప్తు చేశారు. ఈ రెండు సిట్‌ల నివేదికలను నేటికీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? నాడు చంద్రబాబు, నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలు భూ కబ్జాదా రులను కాపాడే పనిలో నిమగమయ్యాయనేది జగమెరిగిన సత్యం. ఈ భూముల కుంభకోణంలో అధికార, ప్రతిపక్ష పార్టీ పెద్దలందరూ భాగస్వాము లుగా ఉన్నారు కాబట్టే నివేదికలు బయటకు రానివ్వ కుండా పరస్పరం సహకరించుకుంటున్నారు. డి-ఫామ్‌ పట్టా భూములకు ఎంత రక్షణ ఉందో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు కేటాయించే భూములకు అన్ని నిబంధనలూఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర రెవెన్యూ మంత్రి సిఫార్సుతో ఎన్‌ఓసిలు ఇచ్చి భూములు అమ్మకాలు,కొనుగోళ్ళు జరిగాయని రెవెన్యూ మంత్రి పై ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు. అనేకచోట్ల మంత్రులు,ఎమ్మెల్యేలు బినామీలతో భూములు అక్ర మంగా స్వాధీనం చేసుకుంటున్నారు. కబ్జాలకు గురైన భూముల వివరాలను రెండు సిట్‌ కమిటీలకు సిపిఎం ఆధారాలతో సహా ఇచ్చింది. పారదర్శకత కోసం రోజూ మాట్లాడే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే వెంటనే రెండు సిట్‌ నివేదికలను బహిర్గతం చేస్తే భూకబ్జాదారులెవరో ప్రజలకు అర్ధ మౌతుంది. ఉమ్మడి విశాఖ నగరానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్‌ పూలిం గ్‌లో కూడా అనేక భూబాగోతాలకు పాల్పడ్డారు.
ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న విశాఖ నేడు భూ బకాసురుల కంబంధ హస్తాల్లో చిక్కుకొని వుంది. దాని నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై వుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను పరిరక్షించే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కబ్జాకోరుల చేతుల్లో చిక్కుకు పోయిన పేదల భూములన్నింటినీ తిరిగి పేదలకు అప్పగించాలి.
వందేళ్ల సమస్యకు పరిష్కారం
బ్రిటీష్‌ హయాంలో రీసెటిల్మెంట్‌ ఖాతా పేరుతో భూ కేటాయింపులు యాజమాన్య హక్కులే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే రీ సెటిల్మెంట్‌ బుక్స్‌ నుంచి భూముల డిజిటలైజేషన్‌ భూ సమస్యలకు సీఎం జగన్‌ చరిత్రాత్మక పరిష్కారం చూపించారు. స్వాతంత్య్రం రాక ముందు కేవలం సాగు చేసుకునే తాత్కాలిక హక్కుతో కేటాయించిన భూములు అవి. సదరు భూములపై ఇప్పటికీ రైతన్నలకు యాజ మాన్య హక్కులు లేవు. వందేళ్లు గడిచిపోయినా యాజమాన్య హక్కులకోసం నిత్యం రెవెన్యూ కార్యా లయాల చుట్టూ రైతన్నల పడిగాపులు కాస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. తరాలు మారుతున్నా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్యకు పరిష్కారం మాత్రం చూపలేకపోయాయి. కానీ ఆర్థిక అవసరాలకోసం క్రయవిక్రయాలకు వీలులేని అసైన్డ్‌భూములు (22ఏ) సమస్య పరిష్కా రం కోసం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నడుం బిగిం చింది. సీఎం జగన్‌ దార్శనికతతో చిక్కుల్లేని భూ రికార్డుల కోసం సమగ్ర భూసర్వే పథకాన్ని తీసు కొచ్చారు. దీంతో అసైన్డ్‌ భూముల నిజమైన హక్కు దారులకు యాజమాన్య హక్కుల లభించనున్నాయి.
బ్రిటీష్‌ హయాంలో భూముల కేటాయింపులు
ప్రస్తుతం మార్కెట్‌ లో భూముల క్రయ విక్రయాల ప్రక్రియ 1908 రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకాం మే జరుగుతోంది.బ్రిటీష్‌ పాలనలో రైతులకు సాగు కోసం షరతులతో కూడిన భూమలను కేటాయిం చారు. ఈ భూములు కేవలం సాగు చేసుకునేలా మాత్రమే రికార్డుల్లో నమోదు చేశారు. భూయాజ మాన్య హక్కులను రైతులకు కల్పించలేదు. బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలో 1930 వరకు షరతులతో కూడిన భూ పట్టాల పేరుతో వివిధ వర్గాల రైతులకు భూ కేటాయింపులు జరిగాయి. ఆయా భూములను రకరకాల కేటగిరీల పేరుతో రికార్డుల్లో చేర్చారు. మెట్ట,తరి,డొంక,వంక,వాగు,గ్రామ కంఠం, ప్రభు త్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నా రు1932 నుంచి1934 మధ్యలో రికార్డులన్నీ కూడా రీసెటిల్‌మెంట్‌ బుక్స్‌లో చేర్చారు. పట్టా దారుల భూముల వివరాలను,సర్వే నంబర్లను ఈ పుస్తకాల్లో నమోదు చేశారు. అటువంటి భూములను 1932-34 నుంచి రైతుల తరాలు అనుభవిస్తు న్నారు. ఏళ్ల కొద్దీ సాగు చేస్తున్నా ఈ భూములపై రైతన్నలకు యాజమాన్య హక్కుల లభించడం లేదు.
ప్రత్యేక కమిటీలతో పరిశీలన..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పెండిరగ్‌ లో ఉన్న ప్రతి కేసును కూలంకుషంగా అధ్యయనం చేస్తాయి. వాటికి సంబంధించి ఉన్న అన్ని రికార్డులను అధికారుల సమక్షంలో పరిశీలి స్తాయి. కమిటీలు గుర్తించిన అంశాలతో నివేదికలు రూపొందించి జిల్లా కలెక్టర్లకు సిఫారసు చేస్తాయి. కలెక్టర్‌ స్థాయిలో పరిశీలించి వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించేలా సిఫార్సులు ఉండాలి. ఒకవేళ కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరించలేనివి ఉంటే వాటిని ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అదే విధంగారూ.50కోట్లకు పైగా విలువైన భూ ములుంటే వాటిని సీసీఎల్‌ఏ ద్వారా ప్రభుత్వానికి తెలపాలి. ఈవిధంగా వందేళ్లుగా పెండిరగ్‌లో ఉన్న అసైన్డ్‌ భూముల సమస్యలను పరిష్కరించి, నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిం చాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేస్తోంది. తద్వారా లక్షలాది మంది తమ భూముల క్రయవిక్ర యాల కోసం రిజిస్ట్రేషన్ల విషయంలో ఎదుర్కుం టున్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది. అతి త్వరలో ప్రభుత్వం నియమించిన కమిటీలు సమావేశమై యుద్ధప్రాతిపదికన ఫిర్యాదులను పరిశీలించి నివేదికలు రూపొందించనున్నాయి.
శాశ్వత పరిష్కారమే ధ్యేయం
ప్రభుత్వం మాత్రం అన్ని రకాల అవకా శాలను పరిశీలించి వందేళ్ల చుక్కల భూముల సమస్యకు శాశ్వతపరిష్కారం కల్పించాలని నిర్ణయిం చింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జోన్లవారీగా కమిటీలు నియ మించి,క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశిం చారు. తొలి దశలో విజయవాడ, తిరుపతి, విశాఖ పట్నం కేంద్రాలుగా ఈ కమిటీలు అధ్యయనం చేయనున్నాయి.ఈ కమిటీల్లో విశ్రాంత జిల్లా న్యాయ మూర్తి, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌, భూరికార్డులశాఖ విశ్రాంత ఏడీ, సర్వే విభాగం ఏడీ, సంబంధిత జిల్లాల జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ లేదా ఆర్డీవో, జిల్లాల రిజిస్ట్రార్లు సభ్యులుగా వ్యవహరిస్తారు.ఈ కమిటీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించేలా జీవో 681ని విడుదల చేశారు. ఈ భూముల రీసర్వే కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురుకాదు ఏకంగా15 వేల మందిని సర్వేయ ర్లను రిక్రూట్‌ చేసి, కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశారు. అంతే కాకుండా ఆధునిక టెక్నాలజీ.. కోర్స్‌(కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ సిస్టం) బేస్‌ సిస్టంను తీసుకొచ్చి, విమానాలను, హెలీకాప్టర్‌లను, డ్రోన్లను, రోవర్లను ఉపయోగిస్తున్నారు. రీ-సర్వేలో భాగంగా హద్దు లను మళ్లీ కొత్తగా మార్కు చేసి, రికార్డులన్నింటినీ అప్‌డేట్‌ చేసి,సబ్‌డివిజన్‌లు,మ్యుటేషన్స్‌ పక్కాగా చేపట్టనున్నారు.రాష్ట్రంలో మొత్తం 17వేలకు పైగా గ్రామాలుండగా నవంబరులో 1500 గ్రామాలలో సర్వే పూర్తి చేసి,హద్దులు రీమార్క్‌ చేసి,అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించి అందరికీ భూహక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ పూర్తి చేసి అక్కడే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం కూడా గ్రామాల్లో ఉండేటట్టుగాఅడుగులు వేస్తోంది. నవంబరు నుంచి 1500 గ్రామాల్లో మొదలుపెట్టే ప్రతి నెలా కొన్ని వందల గ్రామాలను చేరుస్తూ వచ్చే ఏడాది(2023) చివరి నాటికి మొత్తం 17 వేల పై చిలుకు గ్రామాల్లో పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది.
2023 చివరికల్లా సంపూర్ణంగా రీ సర్వే..
రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి కానుంది. అనంతరం షరతులు గల పట్టా పేరుతో నిషేధితజాబితాలో అంటే 22(ఏ)1 లో ఉన్న ఈభూముల సమస్యలను పరిష్కరిస్తూ.. రైతు లకు క్లియరెన్స్‌ పత్రాలను జారీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 355గ్రామాలలో 22 (ఏ) నిషేధిత జాబితాలో ఉన్న18,889 సర్వే నం బర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం చూపింది. అవనిగడ్డలో ఆయా భూముల్లో సాగుచేసుకుంటున్న 22,042 మంది రైతులకు తమ భూములపై వారికి హక్కు కల్పించడం జరిగింది. వ్యాసకర్త :సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు-(కె.లోకనాథం)

బాలికను బతికిద్దాం

ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతున్నది. బాలికల సంఖ్య తగ్గిపోతున్నది. స్త్రీ, పురుష నిష్పత్తిలో అంతరం పెరుగుతున్నది. గత నెలలో విడు దలైన బాలికల జననాల రేటును పరిశీలిస్తే విస్మయానికి గురి చేస్తుంది. కామారెడ్డి జిల్లాలో ఆడపిల్లల పుట్టుక తగ్గిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది.
గోడలకే పరిమితమైన మోదీ నినాదం
జాతీయ స్థాయిలో ఆడ పిల్లల రక్షణ, సాధికారతతో పాటు జనన రేటు పెంచేందుకు బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పటికీ ఎక్కడా సత్ఫలితాలు రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్భాటంగా పిలుపునిచ్చిన నినాదం కేవలం గోడలకే పరిమితమవుతున్నది. మారుతున్న సమాజంలో చాలా మంది తల్లిదండ్రుల్లో ఆలోచన ధోరణి మారుతు న్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందించడంలో విఫలమ వుతున్నది.తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డలకు సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రాధాన్యత నిస్తున్నారు. ఆడ బిడ్డలు పుట్టిన ఇంటికి ప్రోత్సా హాలు అందిస్తూ వివక్షను రూపుమాపుతున్నారు. అంతే కాకుండా విద్యావకాశాలను భారీగా కల్పిం చారు. ఇందుకోసం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తు న్నారు. తద్వారా తల్లిదండ్రులకు భారం అన్నది లేకుండా చేస్తున్నారు.పెండ్లీడుకు వచ్చిన ఆడ పిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను (రూ.లక్షా 116) అందించి కొం డంత అండగా నిలుస్తున్నారు. మన రాష్ట్రంలో ఆడిపిల్లలకు రక్షణ అన్నది లభిస్తోంది.భారీ డాంబికాలు పలికే బీజేపీ మాత్రం నినాదాలతో ప్రజలను మాయమాట లతో పక్కదారి పట్టిస్తూ నిత్యం మోసంచేస్తోంది.
పురిట్లోనే వదిలించుకుంటున్నారు..
ఆడపిల్ల అని తెలిస్తే పురిట్లోనే వదిలించు కోవడం, బలవంతంగా అబార్షన్లు చేయించు కోవడమే ప్రధానంగా బాలికల జననాల రేటు పడిపోవడానికి కారణం.ఈ పరిస్థితి తండాలు, మారుమూల గ్రామాల్లో ఎక్కువగా ఉంటోంది. ఆడ పిల్లల జనన రేటు పడిపోవడానికి మరో కారణం ఉందన్న అభిప్రాయం ఉంది. అబా ర్షన్లు చేసే దవాఖానలు నిజామాబాద్‌, కామా రెడ్డి జిల్లాలో ఇంకా కొనసాగుతున్నాయని, తరచూ ఆరోపణలు వస్తున్నా వైద్యారోగ్య శాఖ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆడ పిల్లల సంఖ్య మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది.స్కానింగ్‌ కేంద్రాల్లో పెద్ద ఎత్తున లింగ నిర్ధార ణ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధ నలు పాటించని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దవాఖానల్లో కాన్పు జరిగి బిడ్డ పుడితే ఆ వివరాలు పురపాలిక, గ్రామ పంచాయతీ అధికారులకు అందించాలన్న నిబం ధన కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా అమలుకావడం లేదు. దీంతో ఆడ శిశువుల విక్రయాలు, పుట్టిన తర్వాత హత మార్చడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఎప్పుడైనా ముళ్ల పొదలు,బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో ఆడ శిశువులను వదిలి వెళ్తే శిశు గృహకు తరలించి అధికారులు చేతులు దులుపు కొంటున్నారు. శిశువును ఎవరు వదిలి వెళ్లారు. ఎందుకు వదిలి వెళ్లారు. వారికి ఏదవాఖాన సిబ్బంది సహకారం అందించారు?అనే విష యాలపై సమగ్ర విచారణ చేపట్టకపోవడం లోటుపాట్లకు ఊతం ఇస్తోంది.
ఎగరనిద్దాం..ఎదగనిద్దాం..
ప్రపంచ జనాభాలో మూడోవంతు బాలికలే. బాలికల రక్షణ,ఎదుగుదల,ఆరోగ్యం,విద్య, సదు పాయాలన్నింటిలో అత్యంత శ్రద్ధ అవసరం. ఆరోగ్యంగా,సమాజం పట్ల అవగాహన, సమ దృష్టి పరిస్థితులలో ఎదిగినపుడే వారు నేటి సమాజానికి అవసరమైన పౌరులుగా రూపొం దుతారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విషాద కర పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. సమాజ అభివృద్ధికి విద్య చాలా కీలకమైనదని విదితమే. కొన్ని అంశాలలో గతంకంటె కొంత పురోభివృద్ధి ఉన్నప్పటికీ నేటి సమాజంలో సరికొత్త సమస్యలు, బాలారిష్టాలు కొనసాగుతున్నాయి. ప్రపంచీకరణ సంస్కర ణలు, నూతన ఆర్థిక విధానాల అమలు వలన బాలికా విద్య సజావుగా జరిగే పరిస్థితులు లేవని చెప్పవచ్చు. గడిచిన రెండేళ్లలో కోవిడ్‌ ప్రభావం ఒకవైపుఉండగా ఈరెండేళ్లలో విద్యారంగ సంస్కరణల పేరుతో క్లష్టరైజేషన్‌ పేరుతో పాఠశాలల మూత కారణంగా బాలికలు విద్యకు దూరం కానున్నారు. భారత్‌వంటి దేశంలో బేటీ బచావో బేటీ పఢావో లక్ష్యం పూర్తిగా నీరు కారుతుంది. బాలికా శిశువులకు రక్షణ కల్పించి వారికి చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పే ఈ పథకం నూతన విద్యా విధానం-2020 అమలుతో నిర్వీర్యం కానుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12.9 కోట్ల మంది బాలికలు విద్యకు దూరంగా ఉన్నారని యునిసెఫ్‌ ప్రకటించింది. బాలికల విద్యకు అడ్డంకులను తొలగించే బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలదేనని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. మీ దేశాలలో అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాలను గురించి మీ చర్యలను, నిబద్ధతను విస్తరించకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదని ఐరాస హెచ్చరించింది. బాలికలకు ఉచిత నిర్బంధ విద్య, విద్యాహక్కు చట్టాలు సంపూర్ణంగా అమలు చేయాలని అడిగే హక్కు బాలికలకు ఉంది. అందుకే చదువు కోసం వీరోచితంగా పోరాడిన మలాలా బాలికల ఆలోచన కావాలి. వివక్ష అనేక రూపాలలో కనిపిస్తుంది. 2030 నాటికి ప్రపంచంలో 15.8 శాతం బాలికలు పేదరికంలోకి చేరుకుంటారని ఐరాస దక్షిణాసియా ప్రాంతాల ప్రభుత్వాలకు ముందుగానే తెలియచేస్తున్నది. ప్రస్తుతం ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంలో జీవిస్తున్నారు. కరోనా తరువాత పురుషుల కన్నా మహిళల ఉపాధి 19 శాతం అధికంగా ప్రమాదంలో పడిరదని యు.ఎన్‌ విమెన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాంబో అన్నారు. ఇదే బాలికా విద్యకు విఘాతం కానుంది. నీరు, పరిశుభ్రతలలో కూడా లింగ వివక్షత కొనసాగుతున్నది. సంక్షోభాలు, సంఘర్షణలు బాలికలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు 33,000 మంది బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రణాళికలు రూపొం దించుకోవాలని ఐరాస ఆయా దేశాల పాలకులను హెచ్చరిస్తున్నది. భారతదేశంలో పద్దెనిమిదేళ్లు రాకముందే వివాహం అవుతున్న ఆడపిల్లల శాతం జాతీయ స్థాయిలో 1.9 శాతంగా వుందని (కేరళలో బాల్య వివాహాలేవీ జరగలేదని)తాజాగా కేంద్ర హోంశాఖ సర్వేలో వెల్లడైంది. బాల్య వివాహ చట్టాలయితే ఉన్నా యి కాని వాటి అమలులో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. రక్షణ కల్పించాల్సిన పాలకులు నేరాలను అదుపు చేయలేక పోతు న్నారు.4.6కోట్ల మంది బాలికలు, మహిళలు మనదేశం నుండి అదృశ్యం అయ్యారని క్రైమ్‌ రికార్స్డు బ్యూరో స్పష్టం చేసింది.41లక్షలమంది బాలికలు 19రకాల హింసలకు బలైనారని యుఎన్‌ఎఫ్‌పిఎ నివేదిక తెలియచేస్తున్నది. శరీర భాగాలపై వ్యాఖ్యల నుండి కన్యత్వ పరీక్షల వరకు అన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయి. ఈ మధ్యకాలంలో హత్రాస్‌ ఘటన,హిజాబ్‌ ఘటన,బెనారస్‌ యూనివర్సిటి ఘటనలు,ఇరాన్‌లో హిజాబ్‌పై జరుగుతున్న పోరాటాలు, ప్రశ్నిస్తే అణచి వేయడం వంటివి అమ్మాయిల ఆత్మగౌర వాన్ని,జీవితాలను ఏవిధంగా ఛిద్రం చేస్తున్నాయో తెలుపు తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదిమందిలో ఒకరు లేదా ఇద్దరు బాలకార్మికులు ప్రమాదకర పనులలో పనిచేస్తున్నారు. ఎక్కువ వేతనం లేని బాల కార్మికులుగా చేస్తున్నారు.5నుండి 14 సంవ త్సరాల మధ్యఉన్న బాలికలు ఎక్కువ సమయం శ్రమిస్తున్నారు. భారత దేశంలో నేటి పాలకుల పుణ్యమా అని బాల కార్మికులలో బాలికల సంఖ్య పెరగనుంది. నూతన విద్యా విధానంలో వృత్తి విద్యా కోర్సులను చిన్న తరగతులలో ప్రవేశ పెట్టడంతో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లేకుండా పోతున్నది. బాలికలను వెట్టిచాకిరీ నుండి విముక్తి చేయాలనే చట్టాలను విస్మరిస్తున్నాయి. మీకు చదువు అవసరం లేదు. పనిలోకి వెళ్లండి. డబ్బులు సంపాదించండి…అని చెప్పడమంటే ఆర్థిక సంస్కరణల అమలు ఎంత ప్రమాద కరంగా ఉందో అర్ధం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అధిక దేశాలలో విద్యకు, వైద్యానికి, సంక్షేమానికి నిధులు పూర్తిగా తగ్గించడం. లాభాపేక్ష, వ్యాపారాలకు మాత్రమే ప్రోత్స హించడం. ప్రపంచీకరణ, సరళీకరణ విధా నాలు బాలికల సమస్యలకు, సంక్షోభాలకు కారణాలుగా ఉన్నాయి. అటువంటి విధానా లకు వ్యతిరేకంగా బాలికలు,మహిళలను చైతన్యవంతులను చేయాలి. బాలికలు, మహిళలవ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి. చిన్నారుల సంక్షేమంలో మనదేశంలో కేరళ ప్రథమ స్థానంలో ఉంది.చిన్నారుల మనుగడ, పోషకాహారం,తాగునీరు,శానిటేషన్‌, విద్య,ఆరోగ్యం వంటి అంశాలలో 24 సూచికలతో నిర్వహించిన సర్వేలో కేరళ నెంబర్‌1గా ఉంది. ఈస్ఫూర్తితో ఇతర రాష్ట్రాలు, దేశాలు పని చెయ్యవచ్చు.కానీ అవి సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయి.చివరికి ఆడపిల్లలు వాడుకునే శానిటరీ నాప్కిన్లను కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేక పోతున్నాయి. నాప్కిన్లపై జిఎస్టీలను వేయడంతో వారికి అవి మరింత భారం అవుతున్నాయి. సాధికారిత పొందిన బాలికలు సాధికారిత పొందిన మహిళలుగా ఎదుగుతారు. అందుకే వారిహక్కులు,విద్య,ఆరోగ్యం యొక్క సమా నత్వాన్ని డిమాండ్‌ చేయడానికి అవ సరమైన వేదికలను నిర్మించాలి. వారిని బల పరుస్తూ సమానత్వ సాధనకు ఉద్యమిద్దాం-వ్యాసకర్త : యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు- (కె.విజయగౌరి)

విజయం కోసం ప్రణాళిక అవసరం

జీవితంలో విజయం కోసం దైర్యం కోల్పోకుండా పోరాడాల్సిందే..జీవితంలో భారీ విజయం సాధించడానికి ఈఒక్క చిన్న మాట కూడా పెద్ద సాయం అవుతుంది. ధైర్యం ఉంటే ప్రతి కష్టమూ తేలిక వుతుంది. జీవితంలో గొప్ప విజయాల చరిత్రను లిఖించి న వారందరిలో ధైర్యం పెద్ద పాత్ర పోషించింది. జీవితం అనేది ఒక పోరాటం.. జీవిం చడం కోసం.. విజయం సాధించడం కోసం ప్రతి క్షణం పోరాడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడు వేయకుండా పోరాడాలి.. జీవించడా నికి ప్రతి క్షణం ధైర్యంగా ముందడుగు వేయాలి. కర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు..కొన్నిసార్లు ప్రయాణం తేలికగా సాగుతుంది. కొన్నిసార్లు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంచి సమయం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కోలుకోవడానికి,మీ ధైర్యం లేదా సాహసం ఉపయోగ పడుతుంది.ధైర్యం అనేది ఒక పదం, అది విన్నప్పుడు, వ్యక్తిలో ఉత్సాహం మొదలవు తుంది.ఒక వ్యక్తి జీవితంలో భారీ విజయం సాధించడానికి ఈ ఒక్క చిన్న మాట కూడా పెద్ద సాయం అవుతుంది. ధైర్యం ఉంటే ప్రతి కష్ట మూ తేలికవు తుంది. జీవితంలో గొప్ప విజయాల చరిత్రను లిఖించిన వారందరిలో ధైర్యం పెద్ద పాత్ర పోషించింది. ఒక వ్యక్తి ఎప్పుడూ యుద్ధంలో ఓడిపోని ధైర్యానికి సంబంధించిన 5 అమూల్యమైన పాఠాల గురించి తెలుసుకుందాం..!(డాక్టర్‌.దేవులపల్లి పద్మజ)
జీవితంలో ఏవ్యక్తికైనా ధైర్యం అంటే ముందుకు వెళ్లడానికి ఒక శక్తి..ఎవరైనా సరే శక్తి లేకపోయినా పరిస్థితులను చక్క బెట్టుకుంటూ ముందుకు సాగడాన్నే ధైర్యం అంటారు. జీవితంలో ఎటువంటి సందర్భంలోనైనా ఎటువంటి పరిస్థి తుల్లో నైనా ఎవరు చెప్పిన మాటలను వినడానికి ఎంత ధైర్యం అవసరమో..వాటిని అంగీకరించ డానికి అంతే ధైర్యంకావాలి.జీవితంలో అన్నీ కోల్పో యిన తర్వాత కూడా..మీరు ఇంకా ఏదైనా చేయ గల శక్తినిచ్చేది దైర్యంకలిగి ఉన్నవారికి మాత్రమే.. ధైర్యం కలిగి ఉన్నవారు..తాము జీవితం లో కోల్పో యింది ఏమీ లేదని..ముందు తాము తప్పని సరిగా ఏదోసాధిస్తామని ఖచ్చితంగా ఊహించుకుంటూ ముందుకు సాగుతారు. సగానికి పైగా ప్రజలు జీవితంలో ఏదొక సందర్భంలో విఫలమవు తారు. ఎందుకంటే సరైన సమయంలో ధైర్యాన్ని కోల్పో తారు. భయంతో వెనక్కి అడుగు వేస్తారు.మీరు ఏదైనా చేయగలరని మీకు నమ్మకంకలిగి ఉంటే.. ఆక్షణంలో మీరు సగం విజయాన్ని సొంతం చేసు కున్నట్లే..
లక్ష్యసాధన కోసం సరైన ప్రణాళిక అవసరం
ఇంతకు ముందు మనము చాలా సార్లు చెప్పుకున్న విషయమే అయినా సందర్భం మరియు ప్రస్తుతం ట్రెండ్‌ ని బట్టి చెప్పాల్సి వస్తోంది. మనిషి అన్నాక అదో ఒక లక్ష్యం తోనే బ్రతుకు సాగిస్తాడు. మన ఆకాంక్ష లేదా ద్యేయమే లక్ష్యం అని అనవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. మరి కొందరు బహుళ లక్ష్యాలను కలిగి ఉంటారు. కోరుకున్న లేదా ఎంచుకున్న ఫలితాన్ని చేరుకోవడానికి, సొం తం చేసుకోవడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఒక క్రమ పద్ధతి ప్రకారం అభివృద్ధిని సాధిస్తూ లక్ష్యం లోని చివరి స్థానానికి చేరుకోవ డానికి విజయం పొందటానికి ప్రతి ఒక్కరు ప్రయ త్నిస్తారు. అయితే అందరూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. వ్యక్తి నిర్ణీత సమయానికి తమ లక్ష్యాన్ని చేదించనంత మాత్రాన వారికి దృఢ నిశ్చ యం లేదని వారిలో పట్టుదల తక్కువ అంచనా వేయకూడదు. అలాగే ఆ వ్యక్తి కూడా తన సామర్ధ్యం గురించి తక్కువగా ఆలోచించకూడదు.. ఈ సారి అందలేదు అంటే అందుకు గల కారణాలను అర్దం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి విష యంలో చరిత్రలో జరిగిన ఒక సంఘటన గుర్తించు కోవాలి. గజనీ మహమ్మద్‌ 18సార్లు దండెత్తి చివరికి విజయాన్ని సాధించాడు. ఇక్కడ ఆ 17 సార్లలో ఒకసారైనా తనవల్ల ఇకకాదు అని విసుగు చెంది నిరాశ పడిఉంటే విజయం దక్కేదా…ఎన్ని సార్లు ఓడిపోయినా చివరికి దక్కే విజయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..నలుగురిలో మిమ్మల్ని గొప్పగా నిలబడుతుంది. అందుకే ధ్యేయం యొక్క ఉద్దేశం ఎపుడు స్థిరంగా ఉండాలి చివరి వరకు ప్రయత్నించాలి. ప్రయాణించే మార్గంలో అనుకూల తలతో పాటుగా ప్రతి చర్యలు కూడా ఎదురవు తాయి. కానీ అన్నిటినీ అధిగమించాలి. నిబద్దతతో ముందుకు సాగితే విజయం మిమ్మల్ని వరిస్తుంది. అంతే కానీ ఏ ప్రణాళిక అందుకు తగిన ప్రయత్నం లేకపోతే ఎందులోనూ విజయాన్ని సాధించలేరు ప్రతి వ్యక్తి తాను తలపెట్టే పని విజయ వంతం కావాలనే సంకల్పం చేసుకుని మొదలు పెడతాడు. కానీ విజయం అనేది అంగట్లో లభించే వస్తువు కాదు.విజయం వెనుక,శ్రమ,కృషి, పట్టు దల,ఓర్పు అంతిమంగా అదృష్టం కలిస్తే..విజయం సాధించగలం.ఎంతో శ్రమకోర్చి మానసిక దృఢ త్వంతో ప్రతీ అడుగు పధ్ధతి ప్రకారం వేస్తే విజయం తనంతట తానుగా వర్తిస్తుంది. అపజయాలకి భయ పడకుండా,కృంగిపోకుండా విజయసాధన మార్గా లు అన్వేషించాలి.ఈ గమనంలో అపజయాలు కలిగిన నిరుత్సాహపడకుండా మరల మరల ప్రయ త్నించాలి…ముందు మనం చేసే పనిపై అవ గాహనఉండాలి.లక్ష్యం సరైనదై ఉండాలి. ప్రణాళిక ప్రకారం సాగుతూ ఎదురయ్యే సవాళ్ళను కూడా అంచనా వేసుకోవాలి.సంకల్పబలం పెంచు కోవాలి.విజయం ఎపుడూ ఎవరికీ శాశ్వతం కాదు, తమవద్దే నిక్షిప్తమైపోవడానికి స్థిరమైనదీ కాదు.. మహాభారత యుద్ధంలో అర్జునుడు ధనుర్భాలను జారవిడచి వెనుకంజ వేసినపుడు శ్రీ కృష్ణుడు గీతా బోధన చేసి ధైర్యం కలిగించి యుధ్ధంలో విజయం సంప్రాప్తించేలా చేసిన విషయం మనం తెలుసు కున్నాం. ఆ సమయంలో మార్గనిర్దేశం చేసి అర్జును నకు విజయమార్గం చూపాడు.భర్తృహరి సుభాషితం ఈ విషయంలో మనకి మస్తిష్కంలో మెదలాలి.
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్న విహితా విరమన్తి మధ్యాః
విఘ్నైర్ముహుర్ముహు రపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధ ముత్తమగుణా న పరిత్యజన్తి.
అనుమతులు విఘ్నములు సంభవించిన కార్యము నారంభింపరు.మధ్యములు ఆరంభించి విఘ్నములు వచ్చినపుడు విడిచివేయుదురు.ధీరులెన్ని విఘ్న ములు ఎదురైనప్పటికి విజయము చేపట్టు వరకూ కార్యమును విడువదు. మనము కూడా ఇదే విధ ముగా ఉత్తమ గుణసంపన్నులను అనుసరిం చవ లెను.ఇదే విధంగా అమృతభాండమునకు క్షీరసాగర మధనము జరుగు సందర్భంలో దేవతలు ముం దుగా వచ్చిన అశ్వము,గజము వంటి వాటికి విసుగు చెందలేదు. తరువాత వచ్చిన రత్న లాభము లకు తృప్తి చెంది విరమించలేదు.తుదకు అమృత భాండము లభించువరకూ వస్తున్న చంద్రుడు, రంభ,ఊర్వశి,మేనక,కామధేనువు,కల్పవృక్షం, పారిజాత వృక్షం,కౌస్తుభమణి, శంఖుచక్రాలు, మొద లైన అపురూపమైన వాటితో సంతృప్తి పడి లక్ష్యం మార్చుకోలేదు.. అమృతం లభించువరకూ కృషిచేసి విజయం చేపట్టారు. న్యాయమార్గం వీడక, సత్బుధ్ధితో ఎవరైతే గమనం సాగిస్తారో వారికి విజయము తద్యము.
ఇదేవిధంగా మరొక ఉదాహరణగా శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని తిరిగి పొంద టానికి పడిన కష్టాలు, హనుమంతుడు సీతమ్మ ఆచూకీ కనుగొనుటకు చేసిన కృషి, శ్రమ, వానరులు వారధి బంధన చేయుటలో పడిన భక్తి పూర్వక సేవ,వారి పరిశ్రమ అంతిమంగా విజయానికి దగ్గర చేసింది.ధర్మమార్గమును వీడక పాండవులు వన వాస కాలములోనూ, అ్ఞతవాస కాలంలోను పడిన కష్టం వెనుక వారికి విజయలక్ష్మి ధరించిన విషయం మనం గమనించవచ్చు. ధర్మ పోరాటానికి జయభేరి మ్రోగుతుంది.విద్యార్థులు చదువు విషయంలో వారు నిర్దేశించుకున్న లక్ష్యంకొరకు నిరంతరం ప్రయత్నం చేస్తూ గమ్యం చేరుకోవాలి. ఫలితాలపై ఆకస్మిక నిర్ణయాలు జీవితానికి భంగం కాకూడదు.. సహనముతో సమన్వయం తో జీవితాన్ని చక్కదిద్దు కోవాలి. మనకు స్వాతంత్య్రం అందించిన మహాత్ము డు పడిన,శ్రమ,ఉద్యమస్ఫూర్తి,మరువరానిది. క్రియాశీల కార్యక్రమాలతో,భారతీయులందరినీ ఐక్య మత్యంతో కలిపి ఒక త్రాటిపైకి తెచ్చి,కర్మ సిద్ధాం తాన్ని,ఆచరించడం వలన విజయం సాధించింది. నీతి నియమాలు ఆచరిస్తున్నంత కాలము, ధర్మ మార్గమును,వీడనంతవరకూ అపజయాలకు వెరపు చెందవలసిన పనిలేదు.నీతిపై ఆధారపడినపుడే జీవితంలో అభివృద్ధి గోచరిస్తుంది.నరికివేసిన వృక్షం మరల చిగురిస్తుంది. క్షీణతనొందిన చంద్రు డు తిరిగి ఎదిగి ఎదిగి సంపూర్ణ వెన్నెలను మనకు వెదజల్లుతున్నాడు. ధృడత కలిగిన వ్యక్తికి మేరు పర్వతం చిన్న రాతివలె,సింహము జింకవలె, అగ్ని జలమువలె, విషము అమృతం వలె గోచరి స్తుంది. గురితప్పని ఏకాగ్రత లక్ష్యాన్ని చేధిస్తుంది. కష్టమైన పనికూడా ఇష్టంతో చేస్తే నమ్మకం పెరుగుతుంది. అపనమ్మకం,అయిష్టతతో పనులు ప్రారంభించే కంటే చేయకపోవడం ఉత్తమం. విజ్ఞానం, వివేకం తో ధర్మ వృక్షాన్ని రెండు చేతులారా కాపాడినట్లైతే విజయం వరిస్తుంది అని అంటాడు శ్రీకృష్ణుడు అర్జనునితో.అది మనకు,మన భావితరాలకు ఆచరించమనే హెచ్చరిక.మనం ధైర్యంతో,విశ్వా సంతో,నియమ,నిబద్ధతతో ధర్మసమ్మతంగా,జీవనం సాగించి,చైతన్య వంతమైన విజయాలు చేసుకుం దాం.‘సాధనమున పనులు సమకూరు ధరలోన’అను వేమన పలుకులు స్మరిద్దాం.ప్రపంచవ్యాప్తంగా స్వాస్థ్యసంక్షోభం నుంచి త్వరలో..కోరుకుని సుసం పన్నమైన విశ్వశాంతిని పొందగలము. నిరంతర పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు విజయం లభించి, త్వరలో నేటి సమాజానికి అవసరమైన ఔషధం ఆవిష్కరింపబడాలని కోరుకుందాము. అదే నిస్వార్థమైన సేవ. జయిభవ..విజయీభవ.- , వ్యాసకర్త : ప్రముఖ రచయిత్రి,విశ్వశ్రీ, సాహిత్యశ్రీ విశాఖపట్టణం
ఫోను. 9849692414

ఆదివాసీ పండగలు..ఐక్యతకు ప్రతీకలు

భిన్న జాతుల సమాహారం ఆదివాసీ గిరిజనులు. వారి ఆచార సంప్రదాయ, సంస్కృతికి ప్రతి రూపాలు. పండగలేదైనా ఐక్యతరాగంతో ఆచరించే వారిది ప్రత్యేక సంస్కృతి, ముఖ్యంగా గోదావరి ఉత్తర తీరాన ఉండే గిరిజన ప్రాంతం విభిన్నమైన సంస్కృతీ, ఆచా రాలకు ప్రసిద్ధి చెందింది. అడవితల్లి ఒడిలో గిరిజనులు జరుపుకొనే అందమైన పండగలు వారి సాంస్కృతికి ప్రతి రూపాలు. దాంట్లో భాగంగా తెలంగణా ప్రాంత ఆది వాసీల ఆచా రాలు, సంప్రదాయాల కళలు, పండగలు వారి ఐక్యతకు చిహ్నాలు. ఆది వాసీల సంస్కృతిని ప్రతిబింబించే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వారం పాటు ఘనంగా సాగే ఈ పండుగ నృత్య గానాలతో హోరె త్తుతుంది. గోండులు, తోటీలు, పర్దాన్లు, కోలములు ఈ పండుగను ఎక్కువ గా జరుపు కొంటారు. ఆదివాసీ సంస్కృ తిలో దీపా వళి పండుగ ‘దండారి’కి ప్రత్యేక స్థానం ఉన్నది. ఆటపాటలతో ఐక్యతగా జరుపుకొనే ఈ పండగపై థింసా అందిస్తున్న ప్రత్యేక కథనం…!- (సుమనస్పతి రెడ్డి)
ఈ పండగ సందర్భంగా జరిపే దండారి పండగలో గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన అమ్మమ్మ పద్మల్‌ పురి కాకో దేవాలయానికి భారీగా తరలివస్తారు.ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా గిరిజనులు ఈ ఆలయానికి వస్తారు. దండారి వేడుకలో గుస్సాడి వేషధారణ,రేలారే రేలా ఆటపాటలు,కొమ్ముల విన్యాసాలు, ఆది వాసీ మహిళల ప్రత్యేక పూజలు అందరినీ ఆకట్టుకుంటాయి.చుట్టూ దట్టమైన అడవి, పక్షుల కిలకిల రావాలతో అడవి వారం పాటు హోరెత్తుతుంది. దండారి పండుగ జరిగే వారం రోజులపాటు ఆదివాసీ గూడేలు,పల్లెలు గుస్సాడీ నాట్యాలతో శోభాయ మానంగా కనిపిస్తాయి. గోండులు ప్రత్యేక నృత్యాలు చేస్తారు. ఈ పండగ ఆదివాసుల్లో ఐక్యతను, ఆప్యాయతను మరింత బలోపేతం చేస్తుంది. దండారి బృందాలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి అక్కడివారితో కలిసి ఆడిపాడ తాయి. విందు,వినోదాల్లో పాలుపంచు కుంటా యి. దండారిలో ఆట పాటలకు డప్పు,రడ మేళా,డోల్‌ వెట్టి,కర్ర,పెప్రి,తుడుం సంగీత పరికరాలు ఉపయో గిస్తారు. నెమలీకలతో పేర్చిన గుస్సాడి కిరీటాలను,ముఖానికి ధరించే పువ్వులను గ్రామం మధ్యన గుట్టపైన పేర్చి సంప్రదా య రీతిలో పూజలు జరిపి గొర్లు, మేకలు,కోళ్లను బలివ్వడం ఆచా రం.దేవతల అనుగ్రహం పొందామని సంతృప్తి చెందిన తర్వాతనే గిరిజనులు నృత్యాలు ప్రారంభిస్తారు. పురుషులు గుస్సాడి,చచ్చాయి,చాహోయి నృత్యాలు చేస్తారు. శరీరం నిండా బూడిద పూసుకుంటారు. ముఖానికి మసి పూసు కుంటారు.ఎడమ భుజంపై మేక చర్మం లేదా జింక చర్మం వేలాడదీసుకుంటారు.కుడిచేతిలో మంత్ర దండం లాంటి రోకలి పట్టుకుంటారు. లయబద్ధంగా సాగే గుస్సాడి నృత్యానికి వాయిద్యాల చప్పుడు తప్ప పాట నేపథ్యం ఉండదు. దండారి సందర్భంగా నృత్య బృం దాలు కాలినడకనే ఊరూరూ తిరుగుతాయి. ఈ పండగ సందర్భంగా యువకులు తమకు సరైన జోడి కోసం వెతుక్కుంటారు. పండగ తర్వాత పెళ్లి సంబంధాల గురించి మాట్లాడు కుంటారు. దీపావళి అమావాస్య తర్వాత ఒకట్రెండు రోజులు జరిపే కోలబోడితో దండారి ఉత్సవాలు ముగుస్తాయి. ఊరు బయటినుంచి చెంచి భీమన్న దేవుడు ఉండే ఇప్పచెట్టు దగ్గర దండారి వాయిద్యాలు, దుస్తులు తీసేసి వాటి ముందు జంతువులను బలిచ్చి పూజలు చేస్తారు. విందు భోజనం తర్వాత అన్ని వస్తువులనూ ఇళ్లకు తీసుకెళ్తారు. చివర్లో గుస్సాడీల దగ్గర్లో ఉన్న చెరువు, కాలువకు వెళ్లి స్నానం చేసి దీక్ష విరమిస్తారు. ఈ పండగ ప్రాధా న్యం గుర్తించిన రాష్ట్ర ప్రభు త్వం ఏటా ఈ పండగ నిర్వహణకు తగినన్ని నిధులను కేటాయిస్తున్నది. వం దల ఏండ్ల నుంచి గిరిజను లు ఈ దండారి పండుగను జరుపుకొంటున్నారు. తమ సంస్కృతీ సంప్రదాయాల ను కాపాడుకుంటూ భావి తరాలకు అందిస్తున్నారు. ప్రతిరూపం దండారీ ఉత్సవాలు గిరికోనలో సందడి మొదలైంది. డప్పుల మోతతో అడవితల్లి ప్రతిధ్వనిస్తున్నది. దీపావళి సందర్భంగా ఆదివాసీ గూడెంలో దండారి వేడుకలు సంప్రదాయ బద్ధంగా సాగుతాయి. గుస్సాడీ నృత్యాలు, కోలాటాలు, కోలాహలాలతో గూడాలన్నీ సందడిగా మారాయి. దీపావళికి వారం ముందు నుంచే దండారి సందడి మొదలవుతుంది. పండుగ తర్వాత కోలాబొడితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇందులో భాగంగా తమ ఆరాధ్యదైవం అయిన ఏత్మాసుర్‌ను భక్తితో కొలుస్తారు. ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే దండారి వేడుకలో గుస్సాడీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఒళ్లంతా బూడిద రాసుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, జంతు చర్మం భుజాన వేసుకొని, నెమలి పింఛాలు ధరించి వాద్యఘోషకు అనుగుణంగా చేసే నృత్యం చూడముచ్చటగా ఉంటుంది. లయా త్మకంగా కదలాడుతూ, భక్తిపారవశ్యంలో హావ భావాలు పలికిస్తూ భక్తులను అలరిస్తారు కళా కారులు. ఉత్సవాల్లో భాగంగా ఒక గూడెం నుంచి మరొక గూడానికి వెళ్తూ బంధుత్వాలు కలుపుకొనే ప్రయత్నం చేస్తారు ఆదివాసీలు. అనుబంధాలు పెంచుకోవడానికి దండారి పండుగను ఆలంబనగా చేసుకుంటారు. ఆదిలాబాదు గోండు ఆదివాసీలంటే వెంటనే తలం పుకు వచ్చేది తలపైన నెమలిఈకల పెద్దటోపీలు ధరించి విచిత్రమైన వేషధారణతో లయబద్ధంగా నృత్యం చేస్తూ కదిలే ‘గుసాడి’ నృత్యకారులు.అయితే రంగస్థలం (స్టేజి) పైనో, సభలూ, సమావేశాల్లో ప్రముఖులను ఆహ్వానిస్తూనో చేసే గుసాడి నృత్యాన్ని మాత్రమే చూసినవాళ్లకు గోండు, ఇంకా కొలాం ఆదివా సీల అతిముఖ్యమైన సామాజిక ఉత్సవం ‘దండారి’లో గుసాడిలు ఒక భాగమని గాని, దండారి వంటి అతిమనోహరమైన, నృత్య, సంగీతమయమైన ‘సోవ పండుగ (శోభా యమైనపండుగ) ఏ సంస్కృతిలో నైనా అరుదనిగాని ఊహించడం కొద్దిగా కష్టమే. ఇందులో కోలాటం (దండారి అంటేనే కోలాటం) వేసేవాళ్ళు (యువకులు, మగ పిల్లలు)బీ గుమేల,పర్ర, వెట్టె ఈ ప్రత్యేకమైన దండారి వాయిద్యాలు,చాలా పెద ్దతోలుడప్పులు (10,20 నుండి 50,60 దాకా ఉండొచ్చు), తుడుం, పేప్రె (సన్నాయి), కాలికొం (కొమ్ము) ఈ వాయి ద్యాలు వాయించేవాళ్లుబీ ‘పోరిక్‌’ అంటే ఆడపిల్లల వేషాలు వేసిన పోర గాల్లుబీ గుసాడివేషగాళ్లుబీ తోడుగా వెళ్లేవాళ్లూ ఉం టారు. ఆతిథ్యం ఇచ్చే ఊరిలోకి చీకటి పడే వేళకు ప్రవేశించడం,వాళ్ల అతి స్నేహ పూర్వ కమైన ఆతిథ్యాన్ని, మర్యాదలను (ఆడ పెళ్లి వారే వచ్చినట్టుగా! గోండు సంప్రదాయంలో వరుడి ఇంట్లోనే పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగు తుంటాయి.) అందుకోవడం, అక్కడి డప్పులబృం దంతో కలిసీ, విడిగాకూడా జోరుగా డప్పులూ, తుడుమూ వాయించడం పలురకాల (గుసాడి లవి, కోలాటాలవి, రెండూ కలిసినవి) నృత్యాలు చేయడం గుమేలా,ఢోల్కీ (చిన్న డోలు) పాటలు పాడడం మధ్య మధ్య గొప్ప వినోదాత్మకమైన చిన్న, చిన్న హాస్య, వ్యంగ్య నాటికా సన్నివే శాలను ప్రదర్శించడం (వీటిని ‘ఖేల్‌’ అంటారు) విందులు ఆరగించడం,హాస్యాలు,ముచ్చట్లాడు కోవడం ఒక రాత్రి విశ్రమించి,మరునాడు మళ్లీ ఆటలాడి, పాటలుపాడి, ‘ఖేల్‌’ప్రదర్శనలతో కడుపారా నవ్వుకొని,డప్పులు మ్రోగించుకొని, సాదరంగా వీడ్కోలు చెప్పిరావడం,స్థూలంగా ఇదీ దండారి స్వరూపం.సొంత ఊరి నుండి బయలుదేరి వెళ్లడం,తిరిగి రావడం కూడా చెప్పుకోదగ్గ తంతులే! ఆడవాళ్ల దండారి సంప్ర దాయం కూడా ఉన్నది!బృందంలోని పెళ్లికాని యువకులు ఈ ఊళ్లో పెళ్లీడుకొచ్చిన అమ్మా యిల్లో తమకు తగినవారె వరైనా ఉన్నారా అని వెతుక్కోవడం కూడా దండారి ప్రయోజనాల్లో ఒకటి. ఇంతవిపులమైన దండారి పండుగలో ఉండే ఆచారాలు,పూజలు,మర్యాదలు,చిన్నా పెద్దా ఇతర తంతులూ,సరదాలూ,వాటి అం దాలూ,విశేషాలూ అన్నీ వర్ణించి చెప్పాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది.దండారి పర్వం వివిధ దశల్లోని కొన్ని విశేషాంశాలను ప్రస్తావించుకోవడానికి మాత్రమే ఇక్కడ వీలవుతుంది. తెల్లని ధోవతులు, అంగీలు ధరించి, నడుముకూ,తలకూ తెల్లని లేక రంగు రుమాళ్లూ కట్టుకొని, చేతుల్లో సన్నని కోలలు ధరించి వచ్చిన దండారి ఆటగాళ్లబృందం వారు వెట్టె, పర్ర వాయిద్యాల దరువుల మీద చేసే ‘మాన్కోలా’ (గౌరవ అభివాదక సూచకమైన కోలాటం), ‘చచ్చోయ్‌’ నృత్యాలు, మెత్తని గుమేలా, పర్ర దరువుల మీద పాడే మెల్లని, మధురమైన పాటలకు అనువుగా చేసే అత్యంత లయాత్మకమైన కోలాటాలు, వారితో కలిసి ‘పోరిక్‌’లు (అమ్మాయిల వేషంలో వచ్చిన యువకులు) కూడా కోలాటం ఆడటం చూడ ముచ్చటగా ఉంటుంది.గజ్జెలు,అందెల రణగొణ సవ్వడులతో,బరువైన లయాత్మకమైన అడుగులు వేస్తూ, ఎడమ చేతితో జింకతోలును వెడల్పుగా కదిలిస్తూ, చాచిన కుడిచేతిలో పట్టుకున్న దండంతో శాసనం చేస్తున్నట్టు, మహత్తరమైన గాంభీర్యంతో,అతిలోకమైన శివసౌందర్యంతో, రెండు ఊళ్ల గుసాడిలు కలగలిసి కోలాటం ఆడేవాళ్లతోనూ,విడిగా కూడా చేసే తిరుగోల నర్తనాలుబీ కుర్రవాళ్లు, యువకులూ నిలబడి పాడే జోరైన ఢోల్కీ పాటలు, భుజాల మీదుగా చేతులు కలుపుకొని, ఏవాద్యమూ తోడు లేకుం డా తమ శృతిదేలిన సన్నని గొంతుకలతో దేవుండ్ల పాటలు పాడుతూ మెల్లని తిరుగోలలా ఈ ఊరి ఆడవాళ్ళు ఆడుతూ ఉంటే, వాళ్లను రక్షిస్తున్నట్టు వాళ్ల చుట్టూ మరో వలయంగా గుసాడిలు ఆడుతుంటారు. కనికట్టులా సాగే ఈ ఆటలు, పాటల మధ్య నిత్యజీవితపు వాస్తవానికి తీసుకు వచ్చి గొప్ప హాస్యమూ, వ్యంగ్యదృష్టీ కల బోసి, పనికొచ్చే సందేశాలు కూడా ఇచ్చే ‘ఖేల్‌’ అనే లఘు వీధి నాటికలు, ఇలా ఎన్నో ఘట్టాలతో సకలేంద్రియాలను, మనస్సును గొప్ప ఉత్సవానందాను భూతితో నింపుతుంది అమావాస్య తరువాతి ఒకటి రెండు రోజుల్లో జరిపే ‘కోలబోడి’తో దండారి పండుగను ముగిస్తారు. ఆనాడు ఏ ఊరికాఊరి దండారి, గుసాడిలబృందం ప్రతి ఇంటికీవెళ్లి, పూజలందు కొని, పరాచ కాలాడి, ఊరవతల ‘చెంచిభీమన్న’ దేవుడుండే ఇప్పచెట్టుదగ్గర దండారి వాయి ద్యాలు, దుస్తులు, ఆభరణాలు అన్నీ తీసిపెట్టి, బలులిచ్చి, పూజలు, తాపీగా విందు భోజనమూ చేసి, అన్ని వస్తువులనూ ఇళ్లకు తీసుకువెళ్తారు. గుసాడిలు దగ్గరలో ఉన్న చెరువో, కాల్వకో వెళ్లి, ఒళ్లు కడుక్కొని,స్నానం చేసి, దీక్ష విరమిస్తారు. గుమేల,పర్ర,వెట్టె, ఈ దండారి వాయిద్యాలు మళ్లీవచ్చే ‘అకాడి’ పండుగ వరకు బయట కురావు,వినిపించవు!
గోండుల పౌరాణిక గాథలు
సంస్కృతీ పెద్దగా తెలియని వారికే ఒక్కసారి చూస్తే చాలు, గొప్ప అనుభూతిగా మిగిలిపోయే దండారి ఉత్సవం,ఆగాథల వారసత్వంగానే ఏర్పడిన మతాచార సంస్కృతీ సంప్రదాయాల్లో నిత్యం జీవిస్తున్న ఆ జాతి జను లకు ఎంతో ప్రాణ ప్రదంగా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అయితే రాజ్‌గోండుల్లో ఉన్న నాలుగు శాఖలు లేకగట్ల (‘నాల్వేన్సగ’, ‘సియివేన్సగ’, ‘సార్వేన్సగ’, ‘యేడ్వేన్సగ’ – అంటే నాలుగు, అయిదు, ఆరు, ఏడు(ఆదిగోండు) దేవతల గుంపులు లేక గట్ల – గోత్రాల నుండి జనించినవారు) వాండ్లల్లో వారివారి సగల పౌరాణిక గాథల్లో ఉన్న అపారమైన వైవిధ్యం కారణంగా దండారి ఉత్సవం పుట్టుక గురించి చాలాకథలే ఉన్నాయి. రాజ్‌గోండుల గురించి, విఖ్యాత మానవశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ క్రిస్తోప్‌వాన్‌ ఫ్యూరర్‌ హైమండాఫ్‌ రాసిన ప్రామాణిక గ్రంథంలో రెండు మూడు కథలు లభిస్తున్నాయి. ఈ కథలన్నీ కూడా గోండుల తొలితరంతోనే ముడివడిఉండటం విశేషం. ఆది గోండులు పంటలు,సమృద్ధి బాగా ఉన్న ఒక తరుణంలో, ఆ ఆనందపు రోజులు ఉండగానే పండుగగా చేసుకునే గొప్ప సంబురాన్ని రూపొందించమని అడిగినప్పుడు హీరాసుక్‌ అనే తొలి పరధాన్‌ (‘పరధాన్‌’లు, ‘తోటి’లు గోండుల పురాణాలను, వంశ చరిత్రలను ఆలపించే ఆశ్రిత జాతుల వారు) దండారి వాయిద్యాలను, ప్రక్రియ మొత్తా న్ని రూపొందించి ఇచ్చినాడని ఒక కథ. ఈ కలి యుగం చడీ,చప్పుడు లేకుండా నీరసంగా ఉం దని ఆది గోండులు దుఃఖిస్తుంటే కోట్కపిట్టె జుంగాల్‌ రావుడ్‌ అనే సాహసికుడు సమస్య పరిష్కారం కోసం వెదుకుతూ సుదూర ప్రయా ణం చేసి, సముద్రం మీద వెదుకుతూ ఉంటే ‘యేత్మ సూర్‌’ అనే దేవ జలకన్య గుసాడి రూపంలో మనోహరమైన నృత్యం చేస్తుంటే చూసి ఆమెతో ప్రేమలో పడితే, ఆమె తన వేషభూషణాలను అతనికిచ్చి, గోండులు ప్రతి యేడాదీ యేత్మసూర్‌ (యేర్‌ అంటే నీరు, సుర్‌ అంటే స్వరము అని వింగడిరచవచ్చు) దేవత రూపం వేసుకొని నృత్య, సంగీతాలతో దండారి చేసుకొమ్మని ఆనతి ఇస్తుంది. ఇటువంటిదే మరో కథలో దేవుడు తన మనుమరాలైన యేత్మసూర్‌ ను గోండు యువకుడు పెండ్లి చేసుకుంటానంటే ఒప్పుకొని, కాని ప్రతి యేడాదీ తమ లాగే రూపం వేసుకొని, ఆమె చుట్టూ నృత్యమాడి జాగ్రత్తగా కాపాడుకోవాలని నిర్దేశిస్తాడు. ఇంకొక కథా భేదం ప్రకారం అదృష్టాన్ని, సంపదలనిచ్చే లక్ష్మీ సమానమైన యేత్మసూర్‌ దైవత చిహ్నాలుగా దండారి వాయిద్యాలు, అలంకారాలు అన్నింటినీ పూజించి, ధరించి పండుగ చేసుకోవడం జరుగుతున్నది. సృష్టికర్తjైున ‘జటాశంకర్‌ విలాస్‌ గురు’ సృష్టి చేయడానికి తపోదీక్ష పూనినప్పుడు సరీమ్‌ మీదకు చెట్లూ పుట్టలు పెరిగి పోయిన ఆయన రూపం వంటిది గుసాడి వేషం అని చెప్పు కోవడం కూడా ఉన్నది. ఆత్మ అనగా ఆత్మ స్వరూపుడైన ఈశ్వరుని రూపమే గుసాడి అని భావం. మరొక కథలో ఆది గోండులు తమకు భార్యలు కావాలి కదా అని అడిగినప్పుడు గోండుల సగలు, సామాజిక వ్యవస్థలు, మతా చారాలన్నింటినీ ఏర్పరిచిన ప్రవక్త వంటి ‘పహండి కుపార్‌ లింగు’ అభ్యర్థన మీద ‘సొంఖస్తాడ్‌’ గురువు, ‘షేకు’ సోదరుల కూతుళ్లను ఈ యువకులు ఆకర్షించడానికి తగినట్టుగా దండారి ఆటపాటలను రూపొం దించినట్టు ఇంకొక కథ ఉన్నది. ఇలా ఒకే అంశం మీద పలు కథలు, తేడాలు ఉండటం జాన పద, పౌరాణికేతిహాసాల్లో మామూలే!
దండారి-గుసాడి పర్వంలో, ఈ కథలన్నీ నిర్దేశించే, సూచించే అంశాలూ, గూఢార్థాలూ, వ్యక్తిపరమైన, సామాజిక ప్రయోజనాలూ పెనవేసినట్టుగా కలగలిసి ఉన్నాయి. దండారిలో పాల్గొన్న వారికీ,చూసిన వారికి కూడా ఆ భావానుభవాలు అన్నీ ఎంతోకొంత అంది తీరుతాయి. ఉదాహరణకు వయసొచ్చిన మగ పిల్లలు ‘పోరిక్‌’ ల వేషాలు వేసుకొని రావడం అనేది, అన్ని మంచి గుణాలు, సామర్థ్యం ఉండి కూడా అణకువగా, అనుకూలంగా ఉండే ఆడపిల్లను ఎంత ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవాలో అన్న విషయం అనుభవపూర్వకంగా తెలుసుకో వాలనే కదా? ఎన్నో ఊళ్ల నుండి వచ్చి దర్శించి పోయే గుసాడి దండారిబృందాలను చూడాలను కుంటే మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండ లంలో గోదావరీ నదీ తీరాన ఉన్న ‘పద్మాల్‌ పురి కాకో’ అమ్మవారి పుణ్య క్షేత్రానికి వెళ్లాలి.
గుసాడి వేషం
సుద్ద మన్నులేక బూడిద ను బురదగా చేసి శరీరమంతా పూసి, వేళ్లతో గాని, పల్చటి లోహపు గొలుసుతో గాని రుద్దుతూ గీతల అందమైన విన్యాసాలు వచ్చేలా ముందుగా గుసాడి వేషగాన్ని దిద్దుతారు. ముఖానికి ఎక్కువగా పెంక మసిని, కొన్ని సార్లు తెల్ల సుద్ద రంగును దట్టంగా పూస్తారు. నడుముకు మోకాళ్ల కింది వరకు వచ్చేలా తెల్లని లేక రంగు వస్త్రం (ఒకప్పుడు మేక తోలు ధరించే వారు), దానిపై నుండి పెద్ద ఇత్తడి,కంచు గజ్జెలు, గంటల వడ్డాణము,అరచేతికి,మోచేతికి, చేతిదండాలకు పూసలు,రుద్రాక్షలు,రంగు గుడ్డలు లేక ప్లాస్టిక్‌ పూలతో అలంకరంచిన కంకణాలు,కాలి మడమల పైన బరువుగా ఇత్తడి గజ్జెల వరుసలు,ఎడమ భుజం నుండి వేలాడే చిన్న జోలె,ఒక వెడల్పైన జింక తోలు, మెడ నుండి పెద్ద రుద్రాక్షలు, ఎండిన మేడి, ఇతర అడవి కాయలు, పెద్ద ఫూసలతో చేసిన మాలలు,గంటలు,కుడి చేతిలో ‘గంగారాం సోట’ అని పిలిచే, కర్రతో అందంగా తణెం పట్టిన అలంకరించిన రోకలి కర్ర, తలపై భవ్యమైన ‘కంకాలి’టోపిబీ ముఖం పైన గోగు నార పోగులతో చేసి కట్టిన గుబురు మీసాలూ, గడ్డాలూ -ఇది గుసాడి రూపం.దీక్ష తీసుకున్న తరువాత దండారి పండుగ పూర్తయ్యే దాకా వారం, పది రోజులు గుసాడిలు స్నానం చేయకూడదు..
వేషాధరణకు ప్రత్యేకం..గుసాడి పండుగ
గుసాడి టోపి 10,15దండారి పండుగల దాకా నిలిచే అతి పవిత్రమైన గుసాడి టోపీలను కొం దరు నిపుణులైన గోండులు, కొలాంలే చేయ గలరు. పదిహేను వందల కన్న ఎక్కువే నెమలి ఈకలను సేకరించి వాటి తెల్లని కాడలను అల్లికగా మెలివేసి తలకు పట్టే ఒక చిన్న వెదురు బుట్ట అంచు చుట్టూ గట్టిగా కుట్టేసి, నెమలి పింఛాలు పై వైపు అందంగా బయటకు గుండ్రని బుట్టలాగా విస్తరిస్తూ, కదిలినప్పుడు విలాసంగా ఊగేలా ఏర్పాటు చేస్తారు.టోపీకి చుట్టూ,ముఖ్యంగా ముందరి వైపు,పలు వరుసల్లో,పెద్ద అద్దాలతో,రంగు,జరీ దారాలు, చక్కటి డిజైన్లున్న గుడ్ద పట్టీలతో,పలు ఆకారాల రంగు రంగు చెమ్కీ బిళ్లలు, చిన్ని గంటల మాలలతో, కొన్ని సార్లు రెండు పక్కల జింక కొమ్ములతోనూ అలంకరిస్తారు. ఆదివాసి గిరిజన గూడాల్లో గుస్సాడి డ్యాన్స్‌ .. ఎందుకు చేస్తారో తెలుసా ..?
జిల్లాలోని ఆదివాసి గిరిజనులు దీపావళి పండుగ రోజుల్లో దండారి సంబురాల పేరుతో వేడుకలు జరుపుకుంటారు. అందులో భాగమే ఈ విచిత్రమైన వేషాధారణ. ఆదివాసి గిరిజ నుల మాటల్లో చెప్పాలంటే ఇది కూడా ఓ దీక్ష లాంటిదే. తలపై నెమలి పించాలతో తయారు చేసిన కిరీటాన్ని పోలి ఉండిన టోపి. శరీరానికి నల్లటి రంగు. దానిపై బూడిద చారలు. భుజాన జింక తోలు. మెడలో గవ్వల హారాలు. చేతిలో మంత్రదండాన్ని పోలినటు వంటి కర్ర. కాళ్లకు గజ్జెలు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసి గిరిజనులు పండుగ వేళ ధరించే ప్రత్యేక వేషా దారణ ఇది.జిల్లాలోని ఆదివాసి గిరిజనులు దీపావళి పండుగ రోజుల్లో దండారి సంబురాల పేరుతో వేడుకలు జరుపుకుంటారు. అందులో భాగమే ఈ విచిత్రమైన వేషాధారణ. ఆదివాసి గిరిజనుల మాటల్లో చెప్పాలంటే ఇది కూడా ఓ దీక్ష లాంటిదే. ఆ విధంగా ప్రత్యేక వేషదారణలో వారు చేసే నృత్యం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ నృత్యం విడిగా చేసేది కాదు. గిరిజన బిడ్డలు ఓ గుంపుగా చేరి నృత్యం చేస్తుంటారు. సొంతగా తయారు చేసిన సంగీత పరికరాల ధ్వనుల మధ్యే డ్యాన్స్‌ చేస్తారు. గోండులు, కొలాంలు ప్రతి గిరిజన గూడెంలో చేసుకునే వేడుకల్లో ఒక భాగం. డప్పుల దరువు రకరకాల గిరిజన సంప్రదాయ వాయిద్యాల సంగీతం మధ్య చచోయ్‌ నృత్యంతో పాటు రేల పాటల నడుమ డ్యాన్సులు చేయడం కనువిందుగా ఉంటుంది. లయబద్దంగా సాగే ఈ గుస్సాడి నృత్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా వాళ్లను ఆదివాసి గిరిజనుల సంప్రదాయనృత్యానికి ముగ్దులుగా మార్చేస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన గూడాలు గోండుల దండారి, గుస్సాడి నృత్య ధ్వనులతో మారు మ్రోగి పోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలోని రాజ్‌ గోండులకు మాత్రమే పరిమితమైన సంప్రదాయం ఇది. ఈ గుస్సాడి, దండారికి సంబంధించి చాలా తక్కువ మంది గోండులకు తెలిసిన ఒక ప్రాచీన కథ కూడా ప్రాచూర్యంలో ఉంది. రాజ్‌ గోండుల్లో ఏడు దేవతల గోండులు,ఆరు దేవతల గోండులు, ఐదు దేవతల గోండులు, నాలుగు దేవతల గోండులు అనే నాలుగు ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. ఈ దండారి పుట్టుక కథ ముఖ్యంగా ఐదు దేవతల రాజ్‌ గోండుల కథకు చెందినది. ఒక ఊరికి చెందిన గుస్సాడి నృత్యం చేసే పురుషులు, పిల్లలు, ఆడవాళ్ల బృందం, డప్పు, పర్ర, తుడుం, తప్పల్‌, వెట్టె, గుమేలా మొదలైన వాయిద్య కారులు, అమ్మాయిల వేషం వేసుకున్న పోరికలు ఇంకో ఊరికి వెళ్లడం ఆనవాయితీ. అలా వచ్చిన తమ గ్రామానికి వచ్చిన దండారి బృందానికి ఆతిథ్యం ఇచ్చె గిరిజన గూడెం వాసులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికి వారికి సకల సదుపాయాలు కల్పిస్తారు. అలా ఒక్కో యేడాది ఒక్కో బృందం ఒక్కో ఊరికి అతి థులుగా వెళుతుంటారు. దండారిలో భాగంగా నృత్యాలు, సంగీతం, పాటలే కాకుండా అనేక రకాల క్రతువులు ఉంటాయి. తాము దైవంగా భావించే ఏత్మసూర్‌ దేవతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. సామూహిక భోజనాలు కూడా చేస్తారు. గుస్సాడి నృత్యంతో పాటు పలు సామాజిక అంశాలు, ఇతర సమకాలిన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ప్రదర్శించే ఖేల్‌ ఈ దండారి వేడుకలకు ప్రత్యేక ఆకర్శణగా ఉంటుంది. గుస్సాడి వేషం ధరించిన వారిని దేవతలు ఆవహిస్తారని, వారి చేతిలోని దండం వంటి కర్రతో తాకితో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని గిరిజనుల విశ్వాసం. అయితే గుస్సాడి వేషధారణలో ఉన్న పురుషులు దీక్ష పూర్తయ్యే వరకు స్నానం కూడా చేయకపోవడం మరోవిశేషం.ఏదిఏమైనప్పటికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని రాజ్‌ గోండులు, కొలాంలు తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచార్య వ్యవహారాలను తూ.చ తప్పకుండా పాటించడంతోపాటు వారి సంస్కృతి సంప్రదా యాలను పరిరక్షించుకుంటూ వాటిని భావిత రాలకు అందజేయడంలో ముందున్నారని చెప్పవచ్చు. `(తెలంగణా మాస పత్రిక సౌజన్యంతో..)

చేయవలసినదింకెంతో..

ఒక వ్యక్తిని మరో వ్యక్తి కాదు, యావత్‌ సమాజమే అతను ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా గౌరవించి గుర్తుంచుకొని తన మనసుల్లో నింపు కుంది అంటే అది సామాన్య విషయం కాదు. ఆ వ్యక్తి కూడా అసమాన్యుడే అయి ఉంటాడు. ఆ అసమాన్య వ్యక్తి మరి ఎవరో కాదు మానవ శాస్త్రవేత్తగా ఆంగ్లేయ ప్రభుత్వం ద్వారా పంపబడిన నైజాం సర్కార్‌ ఉద్యోగి ‘హైమన్‌ డార్ప్‌’.కేవలం ఉద్యోగి గా గిరిజన ప్రాంతాలు సందర్శించి మొక్కుబడి కృషిచేసి తాత్కాలిక రిపోర్టులు అందించి ఉంటే అతను అనేకమంది సర్కారు ఉద్యోగుల్లో ఒకడిగా మిగిలిపోయి ఉండేవాడు. కానీ ఈ ‘మానవ శాస్త్ర ప్రొఫెసర్‌’ ఆదిలా బాద్‌ గోండు గిరిజనుల సమీకృత అభ్యున్నతి కోసం బలమైన పునాదులు వేయడమే కాక వారి సమగ్ర అభివృద్ధి కోసం అనేక భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసిన క్రాంతదర్శి వారికోసం ఆయన జీవితమే త్యాగం చేసి వారితో కలిసి వారిలో ఒకడిగా జీవించి, ఆదిలాబాద్‌ అడవి బిడ్డల ఆత్మ బంధువుగా నిలిచిపోయాడు. ఒకసామాన్య ఉద్యోగి ఆదివాసులకు అంత ఆప్తుడుగా ఎలా మారి పోయాడు? అతడు చేసిన కృషి వెనుక గల అంతరార్థం ఏమిటి? తెలుసుకోవాలి అంటే ఆయన చేసిన క్షేత్రస్థాయి అధ్యయనం, రూపొందించిన పథకాలు, తదితర విషయాల గురించి కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ఆదిలాబాద్‌ ఆదివాసుల జీవితాలను గొప్ప మలుపు తిప్పిన మొత్తం కథనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే రెండు చారిత్రక నివేదికల చిరు పుస్తకమే ‘చేయ్యవలసిన దింకెంతో…’ వ్యాస సంపుటి, సంపూర్ణ ఆంగ్ల భాషలో వ్రాయబడ్డ, తెలుగు ఆంగ్ల భాషల్లో సమర్ధులైన ‘‘సుమనస్పతి రెడ్డి’’ సంపాదకత్వంలో అనువాదకురాలు ల.లి.త సరళమైన తెలుగులోఅను వదించారు. 1944,1946 సంవత్సరాల్లో ‘హైమన్‌ డార్ప్‌‘ ఆదిలాబాద్‌ గోండుల జీవన సరళి గురించి నాటి నైజాం సర్కారుకు, రాసి ఇచ్చిన రెండు చారిత్రిక నివేదికల సంక్షిప్త రూపం మనం ఇందులో చదవవచ్చు. ‘మర్లవాయి’ గోండు గ్రామం కేంద్రంగా ‘డార్ప్‌’చేసిన ఈ క్షేత్రస్థాయి కృషి గురించి, అతని శాస్త్రీయమైన ప్రణాళికల గురించి నేటితరం అధికారులు తెలుసుకొని ఆచరణాత్మకంగా కృషి చేసిననాడు యావత్‌ వెనుక బాటు సమాజ శాఖలన్ని అభివృద్ధి పథంలో మును ముందుకు దూసుకుపోగలవు అనే లక్ష్యంతో సంపాదకులు,అనువాద రచయిత్రి,ఈఅక్షర యజ్ఞానికి పూనుకున్నారు అనిపిస్తుంది. యావత్‌ సమాజానికి అభివృద్ధి కారకం ‘విద్య’ ఒక్కటే అనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలి,విద్య ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఆ సమాజం కూడా అంతే ఘనంగా అభివృద్ధి సాధించి తీరుతుంది, అంటే అభివృద్ధి అనే బండికి విద్య అనే చక్రాలు అవసరం ఏమిటో అవి ఎంత పటిష్టంగా ఉండా లో వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిరు పుస్తకంలో 1944సం: నివేదికలో హైదరాబాద్‌ సంస్థానంలో ఆదివాసుల విద్య గురించి, 1946 సం: నివేదికలో ఆదిలాబాద్‌ జిల్లా మూలవాసుల పున రావాసం సాధించిన ప్రగతి సమస్యలు, గురించి వివరణ చదవ వచ్చును.1941లో గోండు సామాజిక వర్గంలో 6,78,149 మందిలో కేవలం 4,486మంది మాత్రమే అక్షరాస్యులు,అంటే 1000కి ఆరుగురే అక్షరాస్యులు, లంబా డాల్లో తప్ప కోయ జాతి వారిలో ఈ అక్షరాస్యత మరీ తక్కువ అని ‘‘డార్ప్‌’’ నివేదికలో వెల్లడి చేశారు.అలాంటి అల్పస్థాయి నుంచి వారి సంస్కృతి సాయంగానే గోండుల అక్షరాస్యత పెంచవచ్చని,అలాగే వారి అక్షరాస్యత తొలి అడుగులు గోండి భాషలో పడాలని, అక్షరాలు నేర్పే వారు సైతం గోండులై ఉండాలని ఆయన పేర్కొన్నారు.కానీ ఈ రెండు పరిస్థితులు సాధించటం నాడు కష్టతరంగా ఉంది హైదరాబాద్‌ సంస్థానంలో మాట్లాడే గోండు భాషకు లిపి లేదు రాయడం వీలు కాదు, అలాగే చదువుకున్న కొద్దిమందిలో నేర్పే శక్తి గల వారు ఎవరూ లేరు. కేవలం మౌఖిక సాహిత్య రూపంలో గల అమూల్యమైన గోండు సాహిత్యం అంతా తన క్షేత్ర పర్యటన ద్వారా సేకరించి భద్రపరిచి దానిని ఉపయోగించినట్టు ‘డార్ప్‌’ పేర్కొన్నారు.చివరికి లిపిలేని గోండు భాషకు ఏలిపిని అందించాలి అని తర్జనభర్జనల పిదప గోండుభాష ద్రావిడ భాష కనుక దీనికి చెందిన తెలుగు లిపిని అన్వయం చేయాలని కొందరుఅన్నా, నాటి అధికారభాషలుగా గల ఉర్దూ, మరాఠా భాషలు ప్రజల నోళ్ళల్లో అధికంగా ఉన్నా యి కనుక ప్రజలకు త్వరగా అర్థం అయ్యే ఉర్దూ, మరాఠా, భాష లిపుల్లో వ్రాయాలని తద్వారా విద్య త్వరగా అందుతుందని డార్ప్‌ అభిప్రాయపడ్డారు.ఈ మొదటి నివేదికలో కేవలం గోండుల సామాజిక పరిస్థితులు, అక్షరాస్యత, వెనుకబడటానికి కారణాలు చెప్పి ఊరుకోకుండా అభివృద్ధికి కావలసిన సలహాలు, సూచనలు, కూడా ఇవ్వడం వల్ల ఈ నివేదిక విలువ మరింతగా పెరిగింది.డార్ప్‌ స్థానిక గోల్డ్‌ యువకుల సాయంతో ఎలాంటి శిక్షణలు ఇచ్చారు, ఎటువంటి పుస్తకాలు ప్రచురించారు. ఈ తొలి నివేదికలో కూలంకషంగా వివరించారు.1945సం:లో రెండు నెలల పాటు ఆదిలాబాద్‌ ప్రాంతంలో పర్యటించిన హైమన్‌ డార్ప్‌ ఆదిలాబాద్‌ ఆదివాసులు సాధించిన ప్రగతి, సమస్యలు, గురించి ఏకరువు పెట్టారు.దాని రెండవ నివేదికగా అందించారు. గోండులు చదువుకోవడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరగడంతోపాటు, సామాజిక అంశాలు, రాజ్యాంగం, హక్కులు,గురించిన అవగాహన కలుగుతుంది.కేవలం చదువుతూనే గిరిజన జాతి అభివృద్ధి సాధించగలదని డార్ప్‌ తన రెండవ నివేదిక ద్వారా వివరించారు.అటవీ విధానం, అటవీ ఉత్పత్తులు, గ్రామ పున: నిర్మాణం, కవులు దారు చట్టం, గిరిజన ప్రాంతాల పరిపాలన సమస్యలు, గురించి కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.ఇలా ముందుచూపుతో తయారు చేయించిన నివేదికలు ప్రణాళికల ద్వారా అనంతర కాలంలో గిరిజనులు అభివృద్ధి సాధించారు అనడంలో ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.ఈ సరళమైన నివేదికలలో కేవలం గణాంకాలు మాత్రమే కాదు, అపురూపమైన అలనాటి పాత చిత్రాలు కూడా ఇందులో పొందు పరచడం అదనపు ఆకర్షణ. గిరిజనుల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసే వారు మాత్రమే కాక, మూలవాసుల్లోని అభివృద్ధి కారకం తదితర విషయాల గురించి అవగాహన పెంచుకోవలసిన వారు సైతం విధిగా ఈ ‘‘నివేదికల పుస్తకం’’ చదవాల్సిన అవసరం ఎంతో కనిపిస్తుంది.
పుస్తకం పేరు :- ‘చెయ్య వలసిన దింకెంతో..’ సంపాదకులు :- అర్‌. సుమనస్పతి రెడ్డి. పుటలు:64, వెల:70/-, ప్రతులకు:- 9676180802- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

పర్యావరణ విధ్వంసంతోనే ప్రకృతి విఫత్తులు

‘‘ పర్యావరణ విధ్వంసం.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కీలక అంశం. మొన్నటి కరోనా.. నిన్నటి ఉత్తరాఖండ్‌ విలయం ఇవన్నీ మనుషుల ప్రాణాలను తీస్తున్నవే. అభివృద్ధి పాట పాడే ప్రభుత్వాలు, అవినీతి, అక్రమాలకు అలవాటుపడ్డ రాజకీయ నాయకులు, కార్పొరేట్లకు పర్యావరణం గురించి పట్టడం లేదు. దీంతో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. గత అనుభవాల నుంచి మనిషి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.!’
ప్రకృతి సహజంగా ఇచ్చిన అందా లను మనుషులు చేతులారా నాశనం చేస్తున్నా డు.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నించ కుండా దాని చేదు ఫలితాలను, పర్యవసానా లను చవిచూస్తున్నాడు. ఇక అభివృద్ధి పేరు మీద చేస్తున్న విధ్వంసం గురించి చెప్పడానికే వీలు లేకుండా ఉంది. ఉత్తరాఖండ్‌లోని చమో లి జిల్లాలో జరిగిన జల విలయం ఇదే విష యాన్ని వేలెత్తి చూపుతున్నది. రిషి గంగ వద్ద నిర్మాణంపూర్తి చేసుకున్న11మెగా వాట్ల హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ తనతోపాటు అందులో పని చేస్తున్న ఉద్యోగులను తీసుకుని మునిగింది. ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దీని కింద నిర్మాణంలో ఉన్న 530 మెగావాట్ల ఎన్టీపీసీకి చెందిన పవర్‌ ప్రాజెక్ట్‌ కూడా ధ్వం సం అయింది. ఈ ప్రమాదం రిషి గంగలో మంచు శిఖరం పగలడం వల్ల జరిగింది. ఐస్‌ లాగ గడ్డకట్టిన నదిలో వాతావరణంలో వేడి పెరిగి ఈ విలయం జరిగిందని ఎన్విరాన్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. మొత్తం250మీటర్ల టన్నెల్‌ అంటే పొడవైన సొరంగాల్లో200మంది ఉద్యో గులు ఇరుక్కుపోయారు.16మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి.16వరకు శవాలను వెలికితీశాయి. మరో 175 మంది ఆచూకీ తెలియ లేదు. ఇంకా రెస్క్యూ పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు..గాయపడ్డ వారికి రూ.50వేల నష్ట పరిహారం ప్రకటించింది.
2013లోనూ ఇదే తరహాలో
2013లో ఇదే ఉత్తరాఖండ్‌లో జరిగిన కేదార్‌నాథ్‌ సంఘటన నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమి నేర్చుకుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అప్పుడు కూడా మెరుపు వరదలు వచ్చి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.వేలకోట్ల రూపా యల ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగడం, అప్పటి కప్పుడు ఏవో చర్యలను ప్రభు త్వాలు ప్రకటించడం కామన్‌గా మారింది. ఆ తర్వాత వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనేది తాజా ఘటన చెబుతున్న సత్యం. ఎప్పటి కప్పుడు ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా తీసుకునే చర్యల గురించి ప్రభుత్వాలు, అధికారులు చర్చిస్తారు. అయితే వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం ఉండదు.
గుట్టలను, అడవిని నాశనం చేస్తున్నరు
ధౌలీనదిపైన నిర్మించిన హైడల్‌ ప్రాజెక్ట్‌ కింద ఎన్టీపీసీ తన ప్రాజెక్టు కడుతున్నది. దీన్ని తపోవన్‌గా పిలుస్తున్నారు. ఈడిజాస్టర్‌ వల్ల 15 గ్రామాల్లో ఆందోళన చెలరేగింది. గ్రామాలకు గ్రామాలు నదిలో మునిగిపోయా యి. ఏడు వరకు బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. వాస్తవానికి బఫర్‌ జోన్‌లో ఈప్రాజెక్టుల నిర్మా ణం చేపట్టారు. రేణిగావ్‌ గ్రామవాసులు హైడల్‌ ప్రాజెక్ట్‌ ను వ్యతిరేకిస్తూ ఎన్నోరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే వాటిని పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొన సాగించారు.పర్యావరణ పరిరక్షణ సంస్థలు.. పర్యా వరణ ప్రేమికులు కూడా దీనిని వ్యతిరే కించారు. అయినా ప్రాజెక్టు పని మాత్రం ఆగలేదు. 2013 లో ఈప్రాజెక్ట్‌ నిర్మాణదా రుడు సొరంగంలో ఇరు క్కుని మరణించాడు. కొద్దికాలంపాటు ఆగిన పనులు, మరో కొత్త వారికి కేటాయించడంతో తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈప్రాజెక్టు కోసం వేలాదిగా చెట్లను నరికి వేశారు. పదుల సంఖ్యలో అంద మైన గుట్టలను ధ్వంసం చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే పర్యావరణాన్ని కాపాడుతున్న గుట్టలను, అడవిని నాశనం చేసి ప్రాజెక్టులు కడుతున్నారు.
గతం నుంచి ఏమీ నేర్చుకోవడం లేదు
కేదార్‌నాథ్‌ ట్రాజెడీ నుంచి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఏమీ నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో గతంలో కలపతో ఇండ్ల నిర్మాణం చేపట్టేవారు. కానీ ఇటీవల కాలంలో కలప ఇండ్ల స్థానంలో కాంక్రీట్‌ ఇండ్ల నిర్మాణం పెరిగింది. మరోవైపు స్థానిక అవసరాలకోసం గుట్టల బ్లాస్టిం గ్‌లు విపరీతంగా పెరిగాయి. పర్యావరణ మార్పుల కారణంగా స్నో ఫాల్‌ సైతం తగ్గింది. హిమాచల్‌ ప్రదేశ్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఇలాగే ప్రాజెక్టులు కడుతు న్నారు. 2013లో కేదార్‌నాథ్‌ సంఘటన తర్వాత ఒక కమిటీ వేయగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్‌పర్ట్స్‌ 25 అంశాలపై సిఫారసులు అందజేశారు. ఇందులో గ్రేసియర్‌ బర్న్‌కు సంబంధించి మ్యాప్‌.. ట్రాకింగ్‌.. అంశాలు తెలుసుకునేలా సూచనలు చేశారు. స్నో ఫాల్‌ ఎంత..ఎన్ని లేయర్ల గ్రేసియర్‌ ఉంది.ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి లాంటి అంశా లు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ చేసిన కొన్ని సూచనలను అమలు చేసినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో మానిటరింగ్‌ చేయలేదు. అసలు వీటన్నింటినీ పక్కన పెట్టిన కారణం వల్లే కావచ్చు ప్రమాదాలు నిరంతరంగా జరగడం మాత్రం తగ్గడం లేదు.
అడవుల నరికివేత ఆపాలి
అభివృద్ధిపేరిట అడవిని నరికేసి గుట్ట లను ధ్వంసం చేసే విధానానికి ఇకనైనా స్వస్తి చెప్పాలి. అడవులను,గుట్టలను ధ్వంసం చేయడం మానేసివాటిని మరింత విస్తరించేప్రయత్నం చేయా లి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే దీని కోసం వేర్లలోతువరకు వెళ్లాల్సిందే. ఒక ఆపద వచ్చిన తర్వాత దానిపై యాగీచేసే బదులు ప్రత్యా మ్నాయ మార్గాలను అన్వేషించి ఆపదలు రాకుండా చూసేలా నిర్ణయాలు తీసుకోవాలి.పర్యావరణ విధ్వం సంవల్ల కలిగేఆపద కూడా అంతే.. హిమా లయా ల్లోని మధ్య భూభాగంలో ఉత్తరా ఖండ్‌ ఉంది. ఇక్కడి నుంచే పర్యావరణ పరిరక్షణ మొద లు కావాలి. గుట్టలను చెట్లను కొల్లగొట్టడంపై నిషేధం ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. అప్పుడే అడవు లకే కాదు మనుషుల ప్రాణాలకూ రక్షణ దొరుకు తుంది.
బఫర్‌ జోన్లలో ప్రాజెక్టులు కడుతున్నరు
తమ రాజకీయ అస్థిత్వం కోసం.. అధి కారాన్ని నిలబెట్టుకోవడం కోసం బఫర్‌ జోన్లలో ప్రాజెక్టులు కడుతున్నారు.మానవ వినాశనం జరుగు తున్నప్పటికీ ఇవి అవసరమా? అనే విషయాన్ని ఆలోచించకపోతే.. మానవుడి మీద ప్రకృతి పగ తీర్చుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉంటుంది. మన దేశంలోని పొలిటికల్‌ సిస్టమ్‌, అభివృద్ధి విలువ మనులు ఫ్రాణాలుగా మారింది. ఉత్తరాఖండ్‌ లో తాజా డిజాస్టర్‌ ఇదే విషయాన్ని చెప్పకనే చెబు తోంది.ఈవిలయంలో ఎంత మంది చనిపోయారనే దానికి సంబంధించి పక్కా సమాచారం కూడా అధికారుల వద్ద లేదు.రికార్డులు కూడా మునిగి పోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంటికిరాని, చేరని వారు, డ్యూటీకి వెళ్లి తిరిగి రాని వారి కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ విలయం వల్ల ప్రాజెక్టుల చుట్టూ నివసిస్తున్న వారి గోస వర్ణనాతీతంగా ఉంది.
పర్యావరణ విధ్వంసం ఇకనైనా ఆపాలి
పర్యావరణ కాలుష్యంతో ప్రకృతి జీవ నాడులు పట్టుదప్పుతున్నాయి. పల్లెలకు జీవకళ తప్పింది. ప్రకృతిని చూసే విధానంలో మార్పు రావొచ్చు కానీప్రకృతి మాత్రం మారదు. అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసం ఆపసకపోతే పల్లెల స్వరూపమే మారుతుంది.ఈవిధ్వంసక ప్రయ త్నాలు శతాబ్దాలుగా జరుగుతూనే వున్నా ఇటీవల కాలంలో మరింత ఊపందుకున్నాయి.ఈ నేపథ్యం లోనే పర్యావరణ సమస్య తీవ్రరూపం దాల్చింది. మానవాళి ప్రశాంతంగా జీవించాలంటే ప్రకృతి, పర్యావరణం సజావుగా ఉండాలి. దీనికి విరుద్ధం గా సాగించే ప్రయాణం మనిషి మనుగడకు, అస్తి త్వానికి పెనుసవాలుగా మారనుంది. అభివృద్ధి పేరిట ప్రకృతి గుండెల్లో చిచ్చు పెట్టే ధోరణిని అడ్డుకోవాలి.అభివృద్ధిపేరుతో పచ్చని చెట్లను, అడ వులను నిర్మూలిస్తున్నారు. తద్వారా పర్యావర ణం ముప్పుకు భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితిని పాలకులే కల్పిస్తున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌తో పాటు ఇతర నిపుణుల సూచనలను కాదని యథే చ్ఛగా కొనసాగుతోన్న పర్యావరణ విచ్ఛిత్తిని అడ్డుకో వాల్సింది ప్రజలే. ఇబ్బడిముబ్బడిగా ఎరువుల వాడకం వల్ల చినుకు రాలంగానే పరవశించాల్సిన భూమి మనిషి వినాశకర విధానాలవల్ల ఉష్ణతా పంతో వేడెక్కిపోతోంది.అందుకే భూమి వేడెక్కింది. సారాన్ని కోల్పోయింది.సముద్రాల,నదుల, పర్వ తాల,అడవుల ఉనికికి ముప్పుగా పరిణమించే విధా నాల్ని అనుసరించడం వల్ల మనం ముప్పును ఎదు ర్కోవడమే గాకుండా భవిష్యత్‌ తరాలకు వారస త్వంగా అందిస్తున్నాం. భూతాపం పెరగడానికి కారణమైన ఈ విధానాల పర్యవసానాలు రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. రసాయన ఎరువులు, విమానాలు విడుదల చేసే వాయువులు, అంతరిస్తున్న అడవులు- వెరసి ఓజోన్‌ పొరను బలహీనం చేస్తున్నాయి. ప్రకృతికీ, మానవాళికీ క్షేమకరంగా ఉండే ప్రత్యామ్నాయాల వైపు ప్రయాణించడం మన తక్షణావసరం. వర్త మాన తరాలకే కాదు భవిష్యత్‌ తరాలకు ఉపక రించే విధానాలు ప్రకృతి సమ్మతంగా ఉండాలి. ప్రకృతి సహజ వనరుల్ని దోచుకోడమే పురోగతి కాదు. ప్రకృతిఒడిలో మనుషులు హాయిగా ఉం డాలంటే ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ప్రకృతిని పరిరక్షించడమంటే మనల్ని మనం రక్షించుకోవడమే కాదు భావితరాలకు ఆరోగ్యకరమైన, సుందర సహజ ప్రకృతి గమనాన్ని అందించడం అవసరం. అందుకు అనుగుణంగా మన విధానాలను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చుకోవాలి. చెరువులను కాపాడు కోవడం,పశువుల సంతతిని పెంచడం,రసాయన ఎరువులను దూరం చేయడం అలవర్చుకోవాలి. పాతపద్దతుల్లోనే వ్యవసాయాన్ని సాధించాలి. సేంద్రియ ఎరువులను ప్రభుత్వమే పంపిణీ చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. చెరువులను కాపాడుకుంటూ బలోపేతం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొన్ని పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేయ బోతున్నాయి.గొర్లు, మేకల పెంపకం, పాడి అభి వృద్ది,చెరువులపునరుద్దరణ,చేపలపెంపకం వంటి వన్నీ పర్యా వరణ హితంతో కూడుకున్నవే. అలాగే గ్రావిరీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేవే. దేశం లోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న చెరువు లన్నింటి లోనూ ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసారు. ఇక గొర్రెలు, మేకల పెంపకం, హరిత హారం వంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు కారణంగా పర్యావరణం పరిఢవిల్లడంతో పాటుగ్రావిరీణ ఆర్థికరంగం పుంజుకోవడం ఖా యంగా ఉంది. ఇవి దేశానికి దిశానిర్దేశం చేసేలా లబ్దిదారులు పాటుపడాలి.రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడితే పల్లె స్వరూపం మారి పచ్చ గా స్వాగతిస్తుంది.
పర్యావరణ విధ్వంసాలపై సీఎంకి లేఖ
పర్యావరణ పరిరక్షణ,ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై మాజీ ఐఏఎస్‌ అధికారి,కేంద్ర ఇంధన వనరులశాఖ ముఖ్య కార్యదర్శి ఈ.ఎ.ఎస్‌.శర్మ నవంబరు 3న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశారు.ఆలేఖ పూర్తి సారాం శం ఇదీ..
ఎన్నో విషయాలలో ప్రభుత్వాధికారులు, వారి మీద అధికారం చెలాయించే రాజకీయ నాయ కులు,చట్టాలను,నిబంధనలను ఉల్లంఘిస్తూ,కార్పొ రేటు సంస్థలతో, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి, పర్యావ రణను ధ్వంసం చేసి,ప్రజలకు నష్టం కలిగించి, ఆవిషయాలలో ప్రజలు కోర్టులను ఆశ్రయించి నప్పుడు,చేసిన తప్పులు ఒప్పుకోకుండా కోట్ల రూపా యల ఖర్చు తో ఢల్లీి నుంచి పెద్ద న్యాయవాదులను రప్పించి,ఆ ఖర్చులను కూడా రాష్ట్ర ప్రజలమీద రుద్దుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకు అయినఖర్చులను,బాధ్యులైననాయకులు, అధికారులు ఎందుకు భరించడం లేదు?
ఉదాహరణకు, ముందున్న ప్రభుత్వాలు శ్రీకాకుళంజిల్లాలో,సోంపేట ప్రాంతంలో, పర్యావ రణ పరిరక్షణ చట్టాన్ని, రాష్ట్రం ప్రవేశపెట్టిన వాల్టా చట్టాన్ని, ఇతర నిబంధనలను ఖాతరు చేయకుండా, ఉల్లంఘించి, 2008 సెప్టెంబరులో మంచి బీల భూములు ధ్వంసం చేస్తూ, వెయ్యికి పైగా ఎకరాల భూమిని ఒకకార్పొరేట్‌ సంస్థకు,థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు అప్పగించడం జరిగింది. బీలభూముల మీద ఆధారపడే మత్స్యకారుల, చిన్న కారు రైతుల ఉపాధులకు నష్టం కలుగుతుందనే విషయాన్ని,బొగ్గుమీద పనిచేసే పవర్‌ ప్లాంట్‌ కార ణంగా వచ్చే కాలుష్యంవలన,ప్రజల ఆరోగ్యం క్షీణి స్తుంది అనే విషయాన్ని, ప్రజలు ప్రభుత్వం దృష్టికి పదేపదే తెచ్చినా,అప్పటి నాయకులు, అధికారులు కార్పొరేట్‌ సంస్థ మీద ఉన్న వ్యామోహంతో గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవడం,ప్రజలు అడ్డుకుంటే, వారిని పోలీసు బలగాల సహాయంతో అణిచివేసి, కొంత మందికిప్రాణనష్టం కూడా కలిగించడం, దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. ప్రభుత్వం స్పందించక పోవడంవలన, ప్రజాసంఘాలు కోర్టు లను ఆశ్రయించడం జరిగింది.పదేళ్లకి పైగా వ్యా జ్యాలు నడిచాయి. జాతీయ పర్యావరణ పరిరక్షణ ట్రిబ్యునల్‌ ప్రజల తరఫున తీర్పు ఇచ్చినా,అధికా రులు,నాయకులు, కార్పొరేట్‌ సంస్థ పక్షంలో పనిచే శారు.సలీంఅలీ సెంటర్‌ వంటి ప్రఖ్యాతమైన పర్యా వరణ పరిరక్షణ సంస్థ, కోర్టు ఆదేశాలకు అనుగు ణంగా సోంపేట బీలభూములు మీదఇచ్చిన రిపో ర్టు మీదకూడా,ప్రభుత్వంచర్యలు తీసుకోక పోవడం వలన, ప్రజాసంఘాలు చెన్నైలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవలసి వచ్చింది. ఆ కేసులో ఇచ్చినా,ఈరోజు వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకోకపోవడం, నాయకులకు,అధి కారులకు కార్పొరేటు సంస్ధమీద ఉన్న ఆప్యాయతకు నిదర్శనం.ఈ కేసులలో, గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం వ్యర్థంగా చేసిన ఖర్చులు, ముఖ్యంగా న్యాయవాదులకు ఇచ్చిన ఫీజులే, కోట్లాది రూపా యలు ఉంటాయి.సోంపేట కేసులలో చట్ట ఉల్లం ఘనలకు బాధ్యులైన నాయకులనుంచి, అధికారు లనుంచి ఆ ఖర్చులకు అయిన మొత్తాన్ని సేకరించ డమే కాకుండా,బీల భూములకు కలిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకునివారి మీద పెనాల్టీలు వేసి, Iూజ క్రింద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అలాగే విశాఖపట్నంలో రుషికొండ మీద, ప్రభుత్వ పర్యా వరణాభివృద్ధి సంస్థ, మున్సిపాలిటీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా,విశాఖమాస్టర్‌ ప్లాన్‌ను ఉల్లం ఘిస్తూ,విస్తృతంగా పర్యావరణను ధ్వంసం చేసే కట్టడాలనుచేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ నేను ప్రభు త్వానికి ఎన్నోమార్లు రాయడం జరిగింది. అటు వంటి కట్టడాలు కాంట్రాక్టర్లకు లాభం కలిగించేవే కాని,ప్రజలకు కావలసింది కావు.
అయినా ఆ సంస్థ రాజకీయ నాయకుల మద్దతుతో,ప్రజాసంఘాల వ్యతిరేకతను ఖాతరు చేయకుండా,గుడ్డిగా పనులు చేపట్టింది.ఇక ఎటు వంటి పత్యామ్నాయం కనిపిం చక పోవడం వలన, కొంతమంది,ప్రజల తరఫున హైకోర్టులో వ్యాజ్యా లను వేయవలసి వచ్చింది. ప్రజల ఉద్దేశాలను గౌరవించకుండా,ప్రభుత్వం ఢల్లీి నుంచి కోట్లాది రూపాయల ఖర్చుతో పెద్ద న్యాయ వాదులను రప్పించి కేసును నడిపిస్తున్నారని వార్తలు చదివాను. అటువంటి ఖర్చులను ప్రజలు ఎందుకు భరించాలి?అందుకు ఖర్చయిన మొత్తాన్ని బాధ్యులైన రాజకీయ నాయకుల నుంచి,అధికారుల నుంచి ఎందుకు వసూలు చేయడం లేదు?విశాఖపట్నం నగరం మధ్యలో ఉన్న దసపల్లా ప్రభుత్వ భూముల విషయంలోకూడా ప్రభుత్వంవైఖరి అలాగే ఉండ టం బాధాకరం. ఈవిషయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోర్టులను ఆశ్రయించినప్పుడు, కంచే చేను మేసినట్లు, ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ నాయకులు, వారికి దాసోహం అయిన అధికారులు,పూర్తివివరాలనుకోర్టు ముందు పెట్ట కుండా,ప్రభుత్వం తరఫు కేసును బలహీన పరచి, ఆ కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు ఇచ్చిన ఆదేశాలను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు లాభం కలిగించే విధంగాఅమలు చేస్తున్నారు. వారు ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో పనిచేసే దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేయడం దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది.
ఈ కేసులో కూడా, ప్రభుత్వం చేసిన ఖర్చుల వివరాలను, ముఖ్యంగా న్యాయస్థానాలలో వ్యాజ్యాల మీద చేసిన ఖర్చుల వివరాలను,ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాను. ఆఖర్చులను ప్రజలమీద రుద్దే హక్కు ప్రభుత్వానికి లేదు. దసపల్లా కేసులో వేలాది కోట్ల విలువ ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవ్వడమే కాకుండా,ఎనిమిది దశాబ్దాల నుంచి ప్రభుత్వం ఉపయోగిస్తున్న సర్క్యూట్‌ హౌస్‌ భూమి కూడా చేయి జారే అవకాశం ఉంది. ప్రభుత్వాధి కారులు ప్రజల తరఫున పని చేయకుండా, ప్రైవేట్‌ వ్యక్తుల కోసం పని చేసి, కేసును బలహీనపరిచి, భూము లను అన్యాక్రాంతం చేసినందుకు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?ఈ కేసు మీద ప్రభుత్వం వ్యర్ధంగా న్యాయస్థానాల ముందు చేసిన ఖర్చును ప్రజలు ఎందుకు భరించాలి? ఈ మొత్తా న్ని వారి జీతాల నుంచి ఎందుకు వసూలు చేయడం లేదు? దసపల్లా భూముల ఆక్రమణ నేపథ్యంలో, ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు,ప్రైవేటు వ్యక్తు లతో,రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులతో,కుమ్మక్క యి, రెండు మూడు ప్రైవేటు కంపెనీలను ప్రారంభించి న వార్తలు వస్తున్నాయి.ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయిస్తే కాని అసలు విషయాలు బయటకు రావు.
ఈ విషయాలను మీ ముందు పెట్టడమే కాకుండా, ప్రజల దృష్టికి కూడా తీసుకువస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని, ఈ విషయాల మీద ప్రశ్నిస్తారు అని ఆశిస్తున్నాను. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులు, అధికారులు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి ఉందని గుర్తిం చాలని లేఖ రాశారు.- (ఎండీ మునీర్‌), ` వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌,న్యూఢలీి

పెరుగుతున్న అసమానతలు

ఆదాయం,సంపద పంపిణీలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష్మ, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. కొవిడ్‌ విలయంతో ఈ సంక్షోభం మరింత జటిలం అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా చేపట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వినాశకర క్రమం గురించి చర్చించటాన్ని అభావం చేయడంతోపాటు సంపద సృజన, కేంద్రీకరణ, కుబేరుల సంఖ్య, సంపదలో పెరుగుదలే ముఖ్యం అన్న భావజాలాన్ని కూడా బలంగా ప్రచారం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఆర్థిక నిర్మాణాలే, వాటిని పెంచి పోషించిన ధోరణులే ఈ స్థాయిలో అసమానతలు తీవ్రం కావడానికి కారణం అన్నది అందరికీ తెలిసిందే. మన దేశ స్వాతంత్రోద్యమం బ్రిటన్‌లో వలే భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రభవించిన ఉద్యమం వంటిది కాదు. వలస పాలనపై పోరుతో 1947 ఆగష్టు 15న దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్ణాలకు అధికార బదిలీ జరిగింది. భారత్‌లో ప్రజాతంత్ర విప్లవం జరుగలేదు కనుకనే భూ సంస్కరణలు అమలు కాలేదు. విదేశీ ఆస్తులు జాతీయం కాలేదు సరికదా, బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పెట్టుబడులకు తోడు వివిధ సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడులు దేశంలోకి చొర బడ్డాయి. సామ్రాజ్యవాద పెట్టుబడి దేశీయ స్వతంత్ర పెట్టుబడిని ఎదుగనివ్వదు. దేశీయ పెట్టుబడిని తనకు తొత్తుగా మార్చుకుంటుంది. అందువల్లనే ఏడున్నర దశాబ్దాలు గడిచినా భూస్వామ్య మత విలువలు, విదేశీ పెట్టుబడి దోపిడీ అంతం కాలేదు. అది మరింత పెరిగింది. ఫలితంగా ప్రజాస్వామ్యం పేరుతో ధనస్వామ్యం అధికారం చెలాయిస్తోంది. 1947 ఆగష్టు 15న నెహ్రూ ప్రసంగంలో పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అవకాశాలలో అసమానతలను రూపుమాపడమే దేశం ముందున్న కర్తవ్యమని ఉద్దాటించారు. మన ప్రభుత్వాలు అమలు చేసిన ప్రణాళికబద్ధ అభివృద్ధి బడా బూర్జువా,బడా భూస్వామ్య వర్గాల పురోగతికి తోడ్పడిరది తప్ప ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడలేదన్నది ఏడు దశాబ్దాల అనుభవం రుజువు చేస్తోంది,
1990వ దశకం నుంచి సామ్రాజ్య వాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల అమలు పేరుతో సాగుతున్న విధ్వంసం దేశ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తున్నది. పెట్టుబడిదారీ, సామ్రాజ్య వాద ధోరణులు జొరబడి మౌలికరంగాలపై గుత్తాధి వత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఇప్పుడు సామ్రాజ్యవాద దేశాలన్ని భారత్‌వైపే చూస్తున్నాయి. ఇక్కడి మార్కెట్‌ను,సహజ వనరులను కొల్లగొట్టడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అంతకు కొన్ని వందల రెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. దేశ సంపదను పరోక్షంగా దోచుకుంటున్నాయి. ఇవాళ ప్రపంచ బహుళజాతిసంస్థలు,ద్రవ్యసంస్థలు భారత ప్రభుత్వంతో పలుఒప్పందాలు చేసుకుంటు న్నాయి. ప్రపంచీకరణవల్ల కార్పొరేట్‌ దిగ్గజాలకు తప్ప సామాన్యుడికి ఒరుగుతున్న లాభం ఏమీలేదు. శ్రమ దోపిడీ,పర్యావరణ విధ్వంసం మరింతగా పెరిగిపో తున్నది. దేశం అనుసరిస్తున్న విధానాలు ఈ శక్తు లను పెంచి పోషించేవిగా ఉండడం దురదృష్ట కరం. ఏడు దశాబ్దాలపైగా దేశీయ పాలనలో దేశం ఎంతో పురోగమించిందని దోపిడీ పాలకులు తొణక్కుండా ప్రకటిస్తున్నారు.కానీనానాటికీ దిగ జారుతున్న జీవన ప్రమాణాలతో శ్రామిక ప్రజానీ కం దిక్కుతోచకున్నారు. నిజానికి కరోనా సృష్టించిన సంక్షోభం కంటే మనపాలకులు,ముఖ్యంగా ఎనిమి దేళ్లుగా మోడీప్రభుత్వం అమలు చేస్తోన్న రాజకీ యార్థిక విధానాలతో ప్రజాజీవనం కకావికలౌ తున్నది. కరోనా ఆంక్షల నడుమ ప్రజా ప్రతిఘటన ఇబ్బందిని ఎదుర్కొనకుండానే ప్రజా వ్యతిరేక విధా నాలను నల్లేరు మీద నడకలా అమలు చేస్తూ పోతు న్న నేపథ్యమిది. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలైన జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు, కార్మిక చట్టాల సవరణ వంటి విధానాలన్నీ సామ్రాజ్యవాద, బడా కార్పొరేట్లకే తోడ్బ్చడ్డాయి.
చిన్న మధ్య తరహ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. చిల్లర వర్తకం లోకి 100 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతిం చడం, దేశానికి స్వావలంబనకు వెన్నెముకలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వంటి విధానాలతో పాటు ప్రజా ఉద్యమాలపై, మేధావు లపై, జర్నలిస్టులపై, కళాకారులపై, ప్రజాసంఘా లపై దేశద్రోహ చట్టాన్ని,ఉపా చట్టాన్ని విచ్చల విడిగా ప్రయోగిస్తున్నారు.దేశంలో భావ వ్యక్తీకర తణ స్వేచ్ఛ తీవ్ర సంక్షోభంలో ఉంది. మీడియా, ముఖ్యంగా స్వతంత్ర జర్నలిస్టులపై అప్రకటిత ఎమర్జెన్సీని దేశంలోని నేటి పరిస్థితులు రుజువు చేస్తున్నాయి.భిన్నాభిప్రాయాలను నేరంగా పరిగ ణించి,విద్యార్థులు,సామాజికకార్యకర్తలు, జర్నలి స్టులపై క్రిమినల్‌, టెర్రరిస్టు వ్యతిరేక చట్టాల కింద నేరాలు ఆరోపించి కేసులు నమోదు చేస్తున్నది. పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభం 2008 నుంచి ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అన్ని ఖండాల్లోని పెట్టుబడిదారీ దేశాలన్నిటా ఆకలి కేకలు వినిపిస్తు న్నాయి. నిరుద్యోగం ప్రబలింది. ఆర్థిక అసమాన తలు పెరిగాయి. భారతదేశ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆర్థిక సంక్షోభానికి తోడు కరోనా మహమ్మారి కాలంలో పెట్టుబడిదారీ సానుకూల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలు శ్రామిక ప్రజల జీవనాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. 1980వ దశకంలో అట్టహాసంగా ప్రకటించిన ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు పెట్టు బడిదారీ వ్యవస్థలోని అన్ని సమస్యలకూ సర్వరోగ నివారిణిగా ప్రచారం చేసుకున్నారు. కానీ మూడు దశాబ్దాలు గడిచేసరికి ఆవిధానాల డొల్లతనం ప్రస్తుత ఆర్థిక సంక్షోభ రూపంలో వ్యక్తమవుతోంది. భూములు, గనులు, అడవులు, అంతరి క్షంలోని టెలికాంస్పెక్టమ్‌లు అన్నిం టినీ కార్పొరేట్లకు అర్చించేస్తున్నారు.అందుకు చట్టాలు ఆటంకంగా ఉంటే ఆ చట్టాలనే మార్చేస్తు న్నారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తున్నారు. ఇవాళ దేశంలో పాలకవర్గ పార్టీలన్నీ తమ కండబలం, ధనబలంతో పాటు వివిధ ప్రజాకర్షక పథకాలపై ఆధారపడుతూ ప్రజ లను పరాధీనులుగా చేస్తున్నారు. దేశంలో ప్రపంచీ కరణ విధానాల దుష్ఫలితాలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో వైపున రైతుల,కార్మికుల ఇతర(శ్రమ జీవులహక్కులు హరించబడు తున్నా యి. మొత్తంగా ప్రజాతంత్ర, పౌరహక్కులే ప్రమా దంలో పడిపోయాయి. ప్రభుత్వం నుండి ఏక కాలంలో తీవ్రతరమైన ఈ దాడు లు దేశంలోని కార్మిక,రైతాంగ ఇతర శ్రామిక వర్గా లన్నీ ఏకమై ఎదిరించాల్సిన అనివార్య పరిస్థితులను కూడా కల్పిస్తున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల గురించి ఈ మధ్య కథనాలు చాలా వచ్చాయి.‘‘చంపుతున్న అస మానతలు’’అన్న పేరుతో ఇటీవలే ఆక్స్‌ ఫామ్‌ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2021లో84శాతం కుటుంబాల ఆదాయం పడి పోయింది. అయితే అదే సంవత్సరంలో బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలో 100 మంది కుబేరుల సంపద అదే సంవత్సరంలో 57.3 లక్షల కోట్లకు పెరిగింది. దిగువ 50 శాతం కుటుంబాల సంపద జాతీయఆదాయంలో 6శాతం మాత్రమే కలిగి ఉన్నారు.భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశం. ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. అదే సమయంలో నిరు ద్యోగం,పేదరికంపెరుగుతోంది. మన ఆర్థిక వ్యవస్థ ఉపాధి రహిత వృద్ధికి తోద్బడుతుంది. మోడీప్ర భుత్వం కార్మికులు,రైతాంగం,గిరిజనులు, యువ కులు,మహిళలు, దళితులు, మైనారిటీలు ఎదుర్కొం టున్న ఏఒక్క సమస్యను పరిష్కరించడం లేదు. రాష్ట్రంలో, కేంద్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చి నా ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావడం అసాధ్యమని గతఏడున్నర దశాబ్దాల పైగా సాగిన పాలన అనుభవం రుజువు చేస్తోంది. అందువల్ల భారత పాలక వర్గాల ప్రజా వ్యతిరేక భూస్వామ్య, స్వదేశీ,విదేశీ పెట్టుబడి అనుకూల విధానాలకు, హిందూత్వ ఫాసిస్టు పాల నకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటిత కావాలి. దోపిడీ,పీడన,సామ్రాజ్యవాద ఆధిపత్యాలకు వ్యతి రేకంగా పోరాడటం తప్ప మరో మార్గం లేదు. బడా బూర్జువా,భూస్వామ్య పార్లమెంటరీ రాజకీయాలను నమ్మడం ఇకపై సాధ్యం కాదు. భారతదేశ ప్రజలందరికి స్వాతం త్య్రం నూతన పొందికతో ఆవిర్భవించాలి. ప్రజా తంత్ర ప్రత్యామ్నాయంగా కార్యక్రమం రూపొందిం చుకోవాలి. అది ప్రజల రాజకీయ, ఆర్థిక, సామా జిక విముక్తి లక్ష్యాలను కలిగి ఉండాలి. ఆ కార్య క్రమం, కార్మిక, కర్షక, యువత సంఘటిత ప్రతి ఘటన ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తుంది. ప్రజా స్వామ్య,లౌకిక,అభ్యుదయ శ్రేణులు ప్రజా ఉద్య మానికి దన్నుగా నిలువాలి. – -` ఎ.నర్సింహారెడ్డి,(వ్యాసకర్త:సీనియర్‌ పాత్రికేయులు, హైదరాబాద్‌)

ఆదివాసీల హీరో బిర్సా ముండా

తెల్లవారి పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసిన విప్లవ కారుడు..బిర్సా ముండా..స్వాతంత్య్ర సమరయోధుడు.. గిరిజిన నాయకుడు అయిన ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..కొందరు ప్రముఖుల పేర్లు తప్ప ఈయన పేరును ఈ తరం యువత పెద్దగా విని ఉండరు.. దేశం కోసం నెత్తురు చిందించిన మహానుభావులలో ఒకరు.ఈయన గురించి తెలుసుకోవడం మన భాధ్యత. ఈసందర్భంగా బిర్సా జీవితంలోని పలు కీలక ఘట్టాలను తెలుసుకుందాం..!
ఆదివాసీ పోరాటాల వారసత్వానికి ప్రతీకగా ఆవిర్భవించిన యోధుడు బిర్సా ముండా. ఆదివా సీలపై జరుగుతున్న అణచివేతను చిన్నతనం నుంచీ చూసిన బిర్సాముండా అగ్రవర్ణాల దోపిడీపై గళం విప్పాడు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై సమరశం ఖం పూరించాడు. ఆదివాసీల ప్రాథమిక హక్కుల కోసం, జల్‌, జంగ్‌, జమీన్‌ కోసం విల్లంబులు అందుకుని పోరుబాట పట్టాడు. ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నమైన ఆదివాసీ రాజ్యాలను చూసి తట్టుకోలేకపోయిన బిర్సాముండా నల్ల దొరలతోపాటు, తెల్ల దొరలపైనా ఆయుధాలు ఎక్కుపెట్టాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ ప్రాంతా ల్లో సాగిన ‘మిలినేరియన్‌’ ఉద్యమానికి నాయ కత్వం వహించాడు. బిర్సాను దొంగ చాటుగా బంధించిన తెల్ల దొరలు 1900 జూన్‌ 9న రాంచీ జైలులో హత మార్చారు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో బిర్సాముండా పోరాటం ఒక ప్రధాన ఘట్టం. నేటి పాలకవర్గ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా ఆదివాసీ సమాజాన్ని అంతం చేస్తోంది. పరి శ్రమలు, ప్రాజెక్ట్‌ల పేరు మీదు లక్షలాది ఆదివాసీ కుటుంబాల వారు నిర్వాసితుల య్యారు. దేశం లోని 570 గిరిజన తెగలలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ లెక్కల ప్రకా రం 75వరకు తెగలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వీటిలో 19 తెగల ఆదివాసీ జనాభా వెయ్యికంటే తక్కువ. ఈ తెగలు కనుమరు గయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో అగ్రకులాలను ఎస్టీ జాబితాలో కల పాలని ప్రభుత్వం యత్నిస్తోంది. ఇప్పటికే లంబా డీలు ఆదివాసీల రిజర్వేషన్లను దోచుకున్నారు. ఇందుకు దళారీ పాలకవర్గ విధానాలే కారణం. ఈ నేపథ్యంలో బిర్సాముండా పోరాట స్ఫూర్తిని అందిపు చ్చుకుని, ఆదివాసీలను చైతన్యపరిచి, వారి ప్రజాస్వా మిక హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత మేధా వులు, విద్యావంతులపై ఉంది…..!
భూమికోసం, భుక్తి కోసం గిరిపు త్రుల స్వేచ్ఛా, స్వతంత్రాల కోసం సమరశం ఖాన్ని పూరించి, శతాబ్దాల బ్రిటిష్‌ ఆరాచక పాలనపై ఉక్కు పిడికిలి బిగించిన సాయుధ విప్లవ కొదమ సింహం,మన్యం వీరుడు అల్లూరి కంటే ఐదు దశాబ్దాల ముందే ఆయుధం పట్టిన ధీరుడు బిర్సా ముండా. బ్రిటిష్‌ దొరల అండదండలతో గిరిజన ప్రాంతాలను భూస్వాములు, జాగీర్‌ దారులు ఆక్రమించి గిరిజనుల భూమిపై ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులవి. బ్రిటీష్‌ ప్రభుత్వ అరాచక పాలనలో ఆదివాసులకు అడవిపై హక్కు ఉండేది కాదు.19వ శతాబ్దం చివరలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని ఈ క్రూర మైన దోపిడీకి, ఆధిపత్యానికి, దురాగ తాలకు వ్యతిరేకంగా గిరిపుత్రులు మారణ యుద్ధం చేశారు. ఇటు వంటి ఎన్నో అణిచి వేతలకు గురికాబడిన చోటానాగ్‌పూర్‌ ప్రాంత ప్రజలకు బిర్సా ఆరా ధ్యుడు. నిత్యం పేదరికం, బాధలతో ఉండే చోటానాగ్‌పూర్‌ ప్రాంతం, ఒకవైపు ఆకలి, మరోవైపు భూస్వాములు,బ్రిటీష్‌ పాలకుల దోపిడీ,అణిచివేతలతో కారు చీకట్లతో కప్పబడి ఉండేది.ఈ ప్రాంతంలోని ఉలిహాటు అనే గ్రామంలో నవంబర్‌ 15,1875లో సుగు ణా ముండా, కార్మిహటు అనే దంపతులకు బిర్సా జన్మించాడు. తన బాల్యం మొత్తం తీవ్ర మైన పేదరికం, ఆకలితో గడిపాడు. తన తల్లి దండ్రుల అతి పేదరికం కారణంగా బిర్సా కొన్నిరోజులు తన మేనత్త దగ్గర, మరికొన్ని రోజులు తన మేనమామ దగ్గర ఉండాల్సి వచ్చింది. తన మేనమామ దగ్గర ఉండే రోజు లలో జయపాల్‌నాగ్‌ అనే ఉపా ధ్యాయుడి సహకారంతో బిర్సా ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఆతరువాత ప్రాథమికోన్నత విద్యాభ్యాసం కోసం మిషనరీ పాఠశాలలో ప్రవేశం పొందాడు. ఆరోజులలో చదువుతో పాటు,మత మార్పిడి కూడా జరిగేది.తన చదువు కోసం బిర్సా అతని తండ్రి బాప్తిజం స్వీకరించారు. పాఠశాలలో బిర్సా చురుకుద నాన్ని,మేధస్సుని గుర్తించిన ఉపా ధ్యాయులు, చారుభాషా పట్టణంలోని జెర్మన్‌ లూథరన్‌ మిషనరీ స్కూల్‌కు ఉన్నత చదువుల కోసం పంపించారు. అయితే బ్రిటిష్‌ వారు భారతీ యులకు చదువు నేర్పించడానికి ప్రధాన కారణం,వారి ఆజ్ఞ ప్రకారం పని చేసే సేవకు లను తయారు చేసుకోవడానికి మాత్రమే. ఏదే మైనప్పటికీ ఆ విద్య వలన ప్రజలతో నూతన ఆలోచనల వ్యాప్తి పెరిగింది. ఆచదువు ప్రజా హక్కులను వారిపై జరుగుతున్న అన్యాయాలను, అణిచి నేతలను తెలుసుకునేలా చేసింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అధికారుల సహకారంతో మిషనరీలు గిరిజనుల భూములను ఆక్రమించు కునే పనిని మొదలు పెట్టాయి. ఈ యుక్తులకు వ్యతిరేకంగా ముండా తెగ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. బిర్సా తనఉపాధ్యాయుల ద్వారా యూనియన్‌ ప్రజలు తమ భూమి మీద అతి తక్కువ శిస్తులు చెల్లిస్తారని తెలుసుకొని, శిస్తులను బహిష్కరించాలని తన ప్రజలకు పిలుపునిచ్చాడు. ఒక రోజు మిషనరీ మతపెద్ద బిర్సా తరగతి గదిలో ముండాల పోరాటాన్ని తీవ్రంగా ఖండిస్తుండగా,బిర్సా ఒక్క ఉదుటున లేచి నిరసన వ్యక్తం చేశాడు. తన బాల్యంలో చదువుకోవాలనే తపనతో మిషనరీ పాఠశాలో చేరిన బిర్సా,చట్టబద్దమైన ముండా తెగ ప్రజల పోరాటాన్ని మిషనరీలు ధిక్కరించడాన్ని జీర్ణిం చుకోలేక అక్కడి నుండి బయటకొచ్చాడు. 1894లో బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కు చట్టం-8(1882), భూస్వాములకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాలమూ,మన్‌భమ్‌, చోటానాగ్‌పూర్‌ ప్రాంతాలలోని గిరిజన భూము లను బలవంతంగా స్వాధీనపర్చుకొని వారిని ఇండ్ల నుండి తరిమికొట్టారు.ఈ దురా గతాలకు వ్యతిరేకంగా బిర్సా ఆరు గ్రామాల ప్రజలను ఐక్యం చేసి ప్రభుత్వానికి మెమో రాండం అందించారు. కానీ ప్రభుత్వం వారి డిమాం డ్లను పూర్తిగా తిరస్కరించింది.ఈ పరి ణామా లను గమనిస్తున్న బిర్సా కేవలం,భూస్వా ములు,జాగీర్‌దారుల మీద పోరాటం చేస్తే సరిపోదని, ఈ పోరాటం వలసవాద బ్రిటిష్‌ ప్రభుత్వం మీద కూడా చేయాలని నిర్ణయించు కున్నాడు. ఆధునిక విద్యా,శాస్త్రీయ విద్య అభ్య సించిన కారణంగా బిర్సా మూఢ నమ్మకాలను ఎప్పుడు వ్యతిరేకించేవాడు.తన జాతిలోని వివిధ సంఘాలను,మత విశ్వాసా లను ఏకం చేయాలని,తన ప్రజలకు ఆధునిక విద్య అందకపోవడం వలనే ప్రకృతి వైపరి త్యాలను, వ్యాధులను ఎదుర్కోలేక పోతున్నారని భావించాడు. మూఢ నమ్మకాలు,క్షుద్ర పూజలను,అసంఖ్యాకంగా ఉన్న దేవుళ్లని అరాధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అత్యంత తక్కువ వ్యవధిలో ఈ ఉద్యమం ముండా తెగ ప్రజలలో నూతన విశ్వాసం నింపడంతోపాటు ఉద్యమ సైద్ధాంతిక శక్తిని కూడా పెంచింది. చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలతో చల్‌కాడ్‌ ప్రాంతం జనసంద్రం కాగా, 20ఏండ్ల ఆ యువకుడిని ప్రజలు వారి నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రజా ఐక్యతను పెను ముప్పుగా భావించిన భూస్వాములు, మిషనరీలు బిర్సా మీద వ్యతిరేక ప్రచారం చేశాయి. ఈనేపథ్యంలో బిర్సాను, తన అను చరులను 24 సెప్టెంబర్‌ 1895లో అరెస్ట్‌ చేయించారు. రెండేండ్ల తర్వాత జైలు నుండి విడుదలైన బిర్సా సాయుధ బలగాన్ని నిర్మిం చాల్సిన ఆవశ్యకతను గుర్తించాడు. రాత్రి పగలు తేడా లేకుండా తీవ్రమైన కరువు, వ్యాధుల మీద ఆయన చేసిన పోరాటం అక్కడి ప్రజలను ఎంతో ఆలోచింపజేసింది. పీడిత ప్రజలు బిర్సా పోరాట పటిమను గుర్తించారు. ఆయన అనుచరులు చాలా గోప్యంగా బిర్సా సిద్ధాం తాలను జనంలోకి తీసుకెళ్లారు. జన సంచారం లేని దట్టమైన అడవుల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేవారు. సంఘం పని బాధ్యతలను విభజించి తన ప్రధాన శిష్యులైన డొంక, గయాముండా, డిరకాముండా, తైత్రౌం ముండా, రిషిముండాలకు అప్పగించారు. అనవసరంగా ఎవరినీ చంపకూడదని, తన అనుచరులకు ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయుధ తిరుగుబాటు చేసి, దోపిడీకి గురికాబడే పీడిత వర్గాలను ఏకం చేసి దీర్ఘకాలిక ఉద్య మాన్ని నడపాలని పిలుపునిచ్చాడు. డిసెంబర్‌ 24,1899న రాంచీ, చారుభాషా ప్రాంతాలలో మొదలైన తిరుగుబాటు అత్యంత తక్కువ వ్యవధి లో చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిం చింది. పోలీసులను, భూస్వాములను, వ్యాపారు లను తనను హింసించిన వారినందరినీ కసి తీరా కడతేర్చారు. జనవరి 7,1900నాడు రెండు కంపెనీల మిలటరీ బలగాలతో బ్రిటీష్‌ ప్రభుత్వం గిరిపుత్రుల మీద తూటాల వర్షం కురిపించింది. అక్కడితో ఆగకుండా గ్రామాల మీద దాడులు చేశారు. లైంగికదాడులు, హత్యలు, దోపిడీ… ఒక విధంగా చెప్పాలంటే ఊళ్లను వళ్లకాడులా మార్చేశారు. బిర్సా ముండాను పట్టుకోవడానికి ఎంతోమంది అమాయక గిరిజనులను హింసించారు. అంతిమంగా డబ్బుకు అమ్ముడుపోయిన ఒక ద్రోహి ద్వారా బిర్సాను పట్టుకోగలిగారు. 3మార్చి 1990 నాడు తమ ప్రియతమ నాయకుడిని చూసేందుకు వేలాది మంది గిరిజనులు చారుభాషా జైలుకు తరలివెళ్లారు. బిర్సాను ఉరితీస్తే పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన అధికారులు, కేసు కోర్టులో ఉండ గానే ఆహారంలో విషం కలిపి చంపేశారు. బయటి ప్రపంచానికి మాత్రం కలరా వ్యాధితో చనిపోయాడని నమ్మించారు. ఆనాడు దురాగ తాలకు, దోపిడీకి, అన్యాయానికి, హింసకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన ఆ అమ రుడి త్యాగం,గొప్పతనం,నేడు దోపిడీకీ,అణివేతలకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. ఆయన మరణం కేవలం ఒక తెగ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసమే కాదు. బాధిత, పీడిత వర్గాల ఐక్యత కోసం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దోపిడీ మాత్రం కొనసాగుతూ ఉంది. జనాభా ప్రాతిపాదికన మా రిజర్వేషన్లు మాకివ్వం డయ్యా..అని అడిగిన గిరిజనులపై లాఠీలు రaలిపించారు. మన వెలమ దొర పాలనలో దళిత, గిరిజన, బహుజనులపై జరుగుతున్న దురాగతాలు కోకోల్లలు. బిర్సా స్ఫూర్తితో అధిక సంఖ్యలో ఉన్న బాధిత, పీడిత ప్రజానీకం ఏకమై మన రాజ్యాన్ని మనమే పాలించుకోవాలి. –(మూడ్‌ శోభన్‌నాయక్‌)

1 2