ఇండియా మళ్లీ విశ్వగురువు కావాలి

రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత దౌపది ముర్ము డిసెంబర్‌ 4వ తేదీన తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. తెలుగునేలపై మొట్టమొదటి సారి అడుగుపెట్టిన రాష్ట్రపతికి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. విజయవాడలో పౌరసన్మానం నిర్వహించింది. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళలందరికీ రాష్ట్రపతి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఖ్యాతి దేశమంతా వ్యాపించిందన్నారు. మహాకవి గురజాడను, ఆయన రచించిన కన్యాశుల్కాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, దుర్గా బాయి దేశ్‌ముఖ్‌ తదితరుల బాటలో నడవాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం విజయవాడ నుండి విశాఖకు వెళ్లారు. నౌకదళ దినోత్సవం సందర్భంగా ఆర్కేబీచ్‌లో నౌకదళా విన్యాసాలకు ముఖ్యఅతిధిగా హాజరై వీక్షించారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్‌ సింధు వీర్‌ జలాం తర్గామి ద్వారా రాష్ట్రపతికి నౌకదళం త్రివర్ణ బాంబర్లతో స్వాగతం పలికింది. ప్రముఖ గాయకుడు శంకర్‌ మహా దేవన్‌ ఆలపించిన నౌకాదళ గీతం ఆలాపించారు. నౌకదళ విన్యాసాలను తిలకించడానికి భారీ సంఖ్యలో ప్రజానీకం తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి తిరుపతికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రంచంలోనే ఎంతో ప్రతిష్టతగల నేల భారతదేశం. వేద కాలంలో వసుధైక కుటుంబ భావనను ప్రపంచానికి అందిం చింది. మన దేశంలోని వైవిధ్యాన్ని చూసి ప్రపంచ విజ్ఞులు దీన్నొక ఉపఖండమని ఎప్పటి నుంచో కీర్తించారని అన్నారు. ఇంకా ఏమన్నారంటే…! రానున్న 25 ఏళ్లలో భారతదేశం.. విశ్వ గురువుగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి భారతీయుడు నరనరాల్లో సంస్కృతి, సంప్రదా యాలు ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్స రాలు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. వంద సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాలు చేసుకునే సమయంలో ప్రపంచంలో భారత్‌ మొదటి స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రక్షణలో నావికాదళం కీలక పాత్ర పోషిస్తోంది.భారత్‌ రక్షణలో మహిళల పాత్ర ఎంతో ఉంది. భారత నావికాదళంలో వివిధ హోదాల్లో మహిళలు కూడా దేశ రక్షణ లో పాలుపంచుకుంటున్నారు. 1971లో పాకి స్తాన్‌పై జరిగిన యుద్దంలో విజ యానికి గుర్తుగా ఏటా డిసెంబర్‌ 4న నేవీ డే వేడుక లను జరుపుకుంటున్నాం.ఈ యుద్దంలో అసువు లు బాసిన యుద్ద వీరులను మరో సారి గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. వారి త్యాగాలు కీర్తిస్తూ..ప్రతి తరానికి గుర్తు చేయడం మన బాధ్యత.మూడువైపుల సముద్రంం,ఒకవైపు పర్వాతాలు కలిగిన మన దేశం. మొదటి నుంచీ సముద్ర తీర దేశంగా ఉంది. సహజసిద్దంగా ఉన్న ఈ సముద్ర తీరం దేశాభివృద్ధికి ఎంతో కీలకం.తీరరక్షణలో భారత నేవీఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. భారత నావికాదళం ఎంతో శక్తివంతమైనదే కాకుండా ఎటువంటి పరిస్థితు లనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పఉడూ సన్నద్దం గా ఉంటోంది. భారత నూతన అభివృద్ధిలో నావికాదళం పాత్ర కీలకమైనది..త్రివిధ దళాధి పతిగా నాకు ఎంతో నమ్మకం ఉంది. రాష్ట్రం లో ప్రారంభిస్తున్న వివిధ ప్రాజెక్టులు దేశాభి వృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. దేశ ప్రజలం దరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ ప్రాజెక్టులు ఉపయుక్తంగా ఉంటాయి.
గిరిజన విద్యకు దోహదం
దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఏకలవ్య పాఠశాలలు గిరిజనుల్లో విద్యావకాశాలు పెంపొందేందుకు ఎంతగానో ఉపయోగపడు తాయి. రాష్ట్రంలో బుట్టాయగూడెం, చింతూరు, రాజబొమ్మంగి,గుమ్మలక్ష్మీపురంలో ప్రారంబి óస్తున్న ఏకలవ్య పాఠశాలల వల్ల గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధితోపాటు గిరిజన ప్రజల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని భావి స్తున్నా..! దేశంలో ఎవరైనా,వారి ప్రాంతం, కులం,మతంతో సంబంధం లేకుండా విద్య అందించేందుకు మనం కృషి చేయాలి. విద్యను అందరికీ అందుబాటులో ఉంచేం దుకు అన్ని చర్యలూ తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపతి ముర్పు ప్రసంగించారు. తర్వాత భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్ద విన్యాసాల్ని రాష్ట్రపతి ముర్ము తిలకించారు.రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టు లను వర్చువల్‌ విధానంలో నౌకాదళానికి చెందిన అనంతగిరి కేంద్రానికి చేరుకొని నేవీ డే రిసెప్షన్‌కు హజరయ్యారు.
రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఏపీలో ద్రౌపతి ముర్ము పర్యటన.. ఘనంగా పౌరసన్మానం జరిగింది.ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ద్రౌపతి ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ విశ్వభూషన్‌, సీఎం జగన్‌,కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి,ఏపీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా,పలువురు మంత్రులు,ఎంపీలు, ఎమ్మె ల్యేలు,ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ద్రౌపతి ముర్ము పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. ఆ తర్వాత రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తిరుపతి బయలుదేరి అక్కడ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తూర్పు నౌకా దళం ప్రత్యేకత అంశాలివీ
పాకిస్తాన్‌..దాయాది దేశం పేరు వింటనే పౌరుషం పొంగుకొస్తుంది. అలాంటి శత్రు దేశంతో యుద్ధం జరిగితే..ఆయుద్ధంలో మన త్రివర్ణపతాకం రెపరెపలాడితే..ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖే వేదికైతే.. ఇంకెంత గర్వంగా ఉంటుందో కదా. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్‌ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. జాతి గర్వించదగిన గెలుపు నకు గుర్తుగా బీచ్‌రోడ్‌లో ‘విక్టరీ ఆఫ్‌ సీ’ స్థూపం నిర్మించారు. భారత నౌకాదళం ప్రపంచంలోనే అతి పెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం అభివృద్ధి చెందింది. నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నం కావడం మరో విశేషం. దేశానికి తూర్పు తీరం వ్యూహాత్మక రక్షణ ప్రాంతం.సహజ సిద్ధమైన భౌగో ళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూరంగా ఉం డటం తూర్పు నౌకా దళం ప్రత్యేకత. అందుకే రక్షణ అవసరాల దృష్ట్యా బ్రిటిష్‌ పాలకులు ఈ ప్రాంతాన్ని కీలకంగా భావించారు. ఇందులో భాగంగానే తూర్పు నావికా దళం ఏర్పా టైంది.1923 డిసెంబర్‌లో విశాఖను తూర్పు తీరంలో వ్యూహాత్మక కేంద్రంగా గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలమైన 1942-45 మధ్య కాలంలో విశాఖ తీరాన్ని ప్రధానంగా వినియో గించుకున్నారు. ఇక్కడి నుంచే బర్మాకు ఆయుధా లను రవాణా చేశారు. స్వాతంత్య్రా నంతరం 1954లో విశాఖ నేవీ పోస్ట్‌ను కమాండర్‌ హోదాకు పెంచుతూ, బేస్‌ రిపేర్‌ ఆర్గనైజేషన్‌ కార్యక లాపాలను ప్రారంభిం చారు.1962లో ఇండి యన్‌ నేవీ హాస్పిటల్‌ సర్వీసెస్‌ (ఐఎన్‌ హెచ్‌ ఎస్‌) కల్యాణి ప్రారంభ మైంది. అనంత రం1967 జూలై 24న కమాండర్‌ హోదాను రియర్‌ అడ్మిరల్‌ హోదాకు అప్‌గ్రేడ్‌ చేయ డంతో పాటు తూర్పు తీరంలో ఫ్లాగ్‌ ఆఫీసర్స్‌ పోస్టులను కూడా మంజూరు చేశారు. చివరిగా 1968 మార్చి1నవిశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం( ఈఎన్‌సీ) కార్యకలాపాలు ప్రారంభమై చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1971మార్చి1న ఈఎన్‌సీ చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్‌సీ విస్తరించింది.1971 నవంబర్‌ 1 నుంచి ఈఎన్‌సీ ఫ్లీట్‌ కార్య కలాపాలు ప్రారంభ మయ్యాయి. తొలి ఈఎన్‌సీ చీఫ్‌గా రియర్‌ అడ్మిరల్‌ కేఆర్‌ నాయర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం29వ చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌ గుప్తా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు.
రక్షణలో వెన్నెముక
మయన్మార్‌లోని కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహా సముద్రం వరకూ ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ పరిధిలో సురక్షితంగా ఉంది. ఉత్తరాన సుందర్‌బన్‌ నుంచి దక్షిణాన గల్ఫ్‌ఆఫ్‌ మన్నార్‌ వరకూ విస్తరించి ఉంది.2,600కి.మీ నిడివి కలిగిన తూర్పు తీరంలో 30శాతం అంటే 6లక్షలచ.కిమీ పరిధిలో ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ విస్తరించి ఉంది.ఈ తీరంలో 13మేజర్‌ పోర్టులున్నాయి.భారత సర్కారు లుక్‌ ఈస్ట్‌ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తి స్తోంది. దీంతో పాటు డీఆర్‌డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. పలు క్షిపణులు తయారు చేసే నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజికల్‌ లేబొరేటరీస్‌ (ఎన్‌ఎస్‌ టీఎల్‌) కూడా విశాఖలోనే ఏర్పాటైంది.
డిసెంబర్‌ 4 విజయానికి నాంది
ఘాజీ కాలగర్భంలో కలిసిపోవడంతో బంగాళ ఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్‌ నేవీ.. తన ఆధీనంలోకి తెచ్చుకుంది. భారత్‌ ముప్పేట దాడితో పాకిస్తాన్‌ తలవంచక తప్పలేదు. డిసెం బర్‌ 16న పాకిస్తాన్‌ లొంగిపోతున్నట్లు ప్రకటిం చడంతో భారత్‌ కాల్పుల విరమణ ప్రకటిం చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే. ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం లభించింది.డిసెంబర్‌ 16న యుద్ధం ముగిసినా దానికి కారణం డిసెంబర్‌ 4న అతిపెద్ద పాకి స్తానీ నౌకాశ్రయం కరాచీపై చేసిన మెరుపుదా డేనని చెప్పుకోవచ్చు. అందుకే 1971 యుద్ధం లో మన నౌకాదళం ప్రదర్శించిన సాంకేతిక ప్రతిభాపాటవాలు,వ్యూహాలు, ధైర్య సాహసా లకు గుర్తుగా డిసెంబర్‌ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.తీర ప్రాంత రక్షణలో వెన్నెముకగా ఉన్న ఈఎన్‌సీ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతోపాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకల తో ఇండియన్‌ నేవీ ఎప్పటికప్పుడు నౌకా సంప త్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారు తోంది.తూర్పు నౌకాదళం పరిధిలో 52 వరకు యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు, హెలి కాఫ్టర్లు, యుద్ధ విమానాలున్నాయి.యుద్ధ నౌకల పనితీరు, పరిజ్ఞానం బట్టి వాటిని వివిధ తరగ తులుగా విభజించారు.అదే విధంగా సబ్‌ మెరైన్లను కూడా వాటి సామర్థ్యం,పనితీరు బట్టి వివిధ తరగతులుగా విభజించారు.భారత నౌకా దళంలో ఉన్న షిప్స్‌ పేర్లన్నీ ఐఎన్‌ఎస్‌తో మొద లవుతాయి. ఐఎన్‌ఎస్‌ అంటే ఇండియన్‌ నేవల్‌ షిప్‌.యుద్ధ నౌకల్లో ఐఎన్‌ఎస్‌ ఢల్లీి క్లాస్‌, రాజ్‌ పుత్‌,గోదావరి,తల్వార్‌,కోల్‌కతా,శివాలిక్‌, బ్రహ్మ పుత్ర,ఆస్టిన్‌,శార్దూల్‌,దీపక్‌, మగర్‌, కుంభీర్‌, కమోర్తా,కోరా,ఖుక్రీ,అభ్య,వీర్‌, పాండి చ్ఛేరి, అస్త్రధరణి,సరయు,సుకన్య, కార్‌ నికోబార్‌, బం గారం,త్రికర్ట్‌..ఇలా విభిన్న తరగతుల యుద్ధ నౌకలున్నాయి. సబ్‌మెరైన్‌ల విషయాని కొస్తే.. న్యూక్లియర్‌ పవర్డ్‌ సబ్‌మెరైన్‌లను అరిహంత్‌, చక్ర(అకుళ-2)క్లాస్‌లుగా,కన్వెన్షనల్లీ పవర్డ్‌ సబ్‌ మెరైన్‌లను సింధుఘోష్‌,శిశుమార్‌ క్లాస్‌ సబ్‌మె రైన్లుగావిభజించారు.ఇటీవల ఐఎన్‌ ఎస్‌ విశాఖ పట్నం యుద్ధ నౌకతోపాటు పలు హెలికాఫ్టర్లు, అడ్వాన్స్‌డ్‌ యుద్ధ విమానాల రాకతో ఈఎన్‌సీ బలం మరింత పెరిగింది.
సాయుధ సంపత్తికి కీలకం.. రజాలీ
ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌కు అత్యంత వ్యూహాత్మక, కీలకమైన ఎయిర్‌స్టేషన్‌ రజాలీ. ఇది తమిళ నాడులోని అరక్కోణం జిల్లాలో ఉంది. ఇది ఈఎన్‌సీకే కాదు..భారత నౌకాదళానికీ కీలక మైన ఎయిర్‌స్టేషన్‌. 2,320 ఎకరాల విస్తీర్ణంలో అతి పొడవైన, వెడల్పైన రన్‌వే కలిగిన రజాలీ.. ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్‌స్టేషన్‌గా గుర్తిం పు పొందింది. తూర్పు,దక్షిణ తీరాల మధ్యలో భూఉపరితల,సముద్ర మార్గాల ద్వారా దాడి చేసేందుకు వచ్చే శత్రు దేశాల తుదిముట్టేంచేం దుకు కావల్సిన ఆయుధ సంపత్తి అంతా రజాలీ లోనే నిక్షిప్తమై ఉంది.1985లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆధీనంలోకి ఈ ఎయిర్‌స్టేషన్‌ వచ్చింది. ఆతర్వాత భారత నౌకాదళం రజాలీని వ్యూహాత్మక ఎయిర్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దింది.1992 మార్చి 11న అప్పటి రాష్ట్రపతి వెంకటరామన్‌ ఈఎయిర్‌ స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు.ఈఎన్‌సీకి చెందిన స్థావరాలు మొత్తం 15ఉండగా..ఇందులో ఏడు నేవల్‌ బేస్‌లు విశాఖలోనే ఉన్నాయి. నేవల్‌ బేస్‌ ఐఎన్‌ఎస్‌ వర్ష రాంబిల్లిలో నిర్మితమవుతోంది.
నౌకాదళానికి, ప్రజలకు వారధి.. నేవీడే
తూర్పు నౌకాదళం అత్యంత ప్రధానమైన కమాం డ్‌. దేశ రక్షణలో అశువులు బాసిన నావికులు చేసిన సేవలు శ్లాఘనీయం.లుక్‌ ఈస్ట్‌, టేక్‌ ఈస్ట్‌ విధానాలతో తూర్పు నౌకా దళానికి ప్రాధాన్యం పెరిగింది. మిషన్‌ డిప్లా య్స్‌ ఆపరేషన్స్‌ అనే విధానాన్ని ప్రస్తుతం నేవీ అనుసరిస్తోంది.ఈవి ధానంవల్ల అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశంలో అందు బాటులో సిబ్బంది ఉండ గలుగుతున్నారు.హెలి కాఫ్టర్లు,యుద్ధ నౌకల ద్వారా దాయాదిదేశాలకు చెందిన వాటిని గుర్తించి ఎదుర్కొనేందుకు నిత్యం పహారా కాస్తు న్నాం.ఒకవేళ అలాంటివి ఎదురైనా..వాటిని తిప్పికొట్టేందుకు సమర్థంగా ఉన్నాం.- వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌దాస్‌ గుప్తా, తూర్పు నౌకా దళాధిపతి
ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం..ఆ పేరెందుకు పెట్టారంటే..
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్‌ -15బీ పేరుతో నాలుగు స్టెల్త్‌ గైడెడ్‌ మ్కిసైల్‌ డిస్ట్రా యర్‌ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశం లోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం,మోర్ముగావ్‌,ఇంఫాల్‌, సూరత్‌ పేర్లను పెట్టాలని సంకల్పించి తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు.
ముంబైలో తయారీ
2011 జనవరి 28న ఈ ప్రాజెక్ట్‌ ఒప్పందం జరిగింది. డైరెక్టర్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌, ఇండియన్‌ నేవీకి చెందిన అంతర్గత డిజైన్‌ సంస్థలు షిప్‌ డిజైన్లని సిద్ధం చేశాయి. 2013 అక్టోబర్‌లో విశాఖపట్నం యుద్ధనౌక షిప్‌ తయారీకి వై-12704 పేరుతో ముంబైలోని మజ్‌గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) శ్రీకారం చుట్టింది.2015 నాటికి హల్‌తో పాటు ఇతర కీలక భాగాలు పూర్తి చేసింది. తయారు చేసే సమయంలో పలుమార్లు ప్రమాదాలు కూడా సంభవించాయి. 2019 జూన్‌లో షిప్‌లోని ఏసీ గదిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించాడు. అయితే..షిప్‌ తయారీలో మాత్రం ఎక్కువ నష్టం వాటిల్లలేదు. 2020లో రెండుసార్లు విజయవంతంగా సీ ట్రయల్స్‌ పూర్తి చేసిన అనంతరం తూర్పు నౌకాదళానికి ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం నౌకను అక్టోబర్‌ 28న అప్పగించారు. డిసెంబర్‌లో దీనిని జాతికి అంకితం చేయనున్నారు.
శత్రువుల పాలిట సింహస్వప్నమే
ఇది సముద్ర ఉపరితలంపైనే ఉన్నా..ఎక్కడ శత్రువుకు సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ విశాఖను శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు.
యుధాలు :
32 బరాక్‌ ఎయిర్‌ క్షిపణులు,16 బ్రహ్మోస్‌ యాంటీషిప్‌, ల్యాండ్‌ అటాక్‌ క్షిపణులు,76 ఎంఎం సూపర్‌ రాపిడ్‌ గన్‌మౌంట్‌, నాలుగు ఏకే-630 తుపాకులు,533 ఎంఎం టార్పెడో ట్యూబ్‌ లాంచర్స్‌ నాలుగు, రెండు జలాం తర్గామి వ్యతిరేక రాకెట్‌ లాంచర్లు.
నౌకాదళ సేవలు.. తీర ప్రాంతాల సరిహద్దులను రక్షించడం, అంతర్జాతీయ సంబంధాలను విస్తరింపజేయడం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ, ప్రక్రుతి వైపరీ త్యాలు, ఇతర ప్రమాదకర పరిస్థితులను మన నౌకాదళ సేవలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేవీ డే విజయానికి గుర్తుగా నేవీ బ్యాండ్‌ గ్రూప్‌ కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తారు. నేవీ డే సందర్భంగా విశాఖ పట్నంలోని ఆర్కే బీచ్‌ లో ప్రతి ఏటా ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తుంటారు. విశాఖతో పాటు ముంబైలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద బీటింగ్‌ రిట్రీట్‌ వేడుకలను నిర్వహిస్తారు.
రానున్న 25 ఏళ్లలో భారతదేశం.. విశ్వ గురువుగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి భారతీయుడు నరనరాల్లో సంస్కృతి, సంప్రదా యాలు ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్స రాలు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. వంద సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాలు చేసుకునే సమయంలో ప్రపంచంలో భారత్‌ మొదటి స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రక్షణలో నావికాదళం కీలక పాత్ర పోషిస్తోంది.భారత్‌ రక్షణలో మహిళల పాత్ర ఎంతో ఉంది. భారత నావికాదళంలో వివిధ హోదాల్లో మహిళలు కూడా దేశ రక్షణ లో పాలుపంచుకుంటున్నారు. 1971లో పాకి స్తాన్‌పై జరిగిన యుద్దంలో విజ యానికి గుర్తుగా ఏటా డిసెంబర్‌ 4న నేవీ డే వేడుక లను జరుపుకుంటున్నాం.ఈ యుద్దంలో అసువు లు బాసిన యుద్ద వీరులను మరో సారి గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. వారి త్యాగాలు కీర్తిస్తూ..ప్రతి తరానికి గుర్తు చేయడం మన బాధ్యత.మూడువైపుల సముద్రంం,ఒకవైపు పర్వాతాలు కలిగిన మన దేశం. మొదటి నుంచీ సముద్ర తీర దేశంగా ఉంది. సహజసిద్దంగా ఉన్న ఈ సముద్ర తీరం దేశాభివృద్ధికి ఎంతో కీలకం.తీరరక్షణలో భారత నేవీఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. భారత నావికాదళం ఎంతో శక్తివంతమైనదే కాకుండా ఎటువంటి పరిస్థితు లనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పఉడూ సన్నద్దం గా ఉంటోంది. భారత నూతన అభివృద్ధిలో నావికాదళం పాత్ర కీలకమైనది..త్రివిధ దళాధి పతిగా నాకు ఎంతో నమ్మకం ఉంది. రాష్ట్రం లో ప్రారంభిస్తున్న వివిధ ప్రాజెక్టులు దేశాభి వృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. దేశ ప్రజలం దరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ ప్రాజెక్టులు ఉపయుక్తంగా ఉంటాయి.
రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఏపీలో ద్రౌపతి ముర్ము పర్యటన.. ఘనంగా పౌరసన్మానం జరిగింది.ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ద్రౌపతి ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ విశ్వభూషన్‌, సీఎం జగన్‌,కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి,ఏపీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా,పలువురు మంత్రులు,ఎంపీలు, ఎమ్మె ల్యేలు,ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ద్రౌపతి ముర్ము పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. ఆ తర్వాత రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తిరుపతి బయలుదేరి అక్కడ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.- ` సైమన్‌ గునపర్తి

బి.ఆర్‌.అంబేద్కర్‌ మహోన్నత వ్యక్తి

దేశ ప్రజలందరికీ సామాజిక, రాజకీ య న్యాయాన్ని చేరువ చేసే సదాశయంతో లిఖించు కున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి నిన్నటికి డెబ్భై ఏళ్లు దాటాయి.! నిబంధనలు,విధినిషేధాలు, దిశా నిర్దేశాలు,ఆశయాలు,ఆదర్శాలు,హితోక్తుల సమా హారమైన రాజ్యాంగం చూపిన బాటలో ఏడు దశా బ్దాల భారతావని ప్రస్థానాన్ని సమీక్షించు కోవడం నేటి అవసరం. ఒక దేశంగా ఏడు పదుల భారతా వని ప్రస్థానంలో విజయాలను, వైఫల్యాలను,కీలక మైలురాళ్లను,పాఠాలను,గుణపాఠాలను తరచి చూసుకోవడం తప్పనిసరి.రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలు,ఆకాంక్షల నేపథ్యంలో రాజ్యాంగ పని తీరు మదింపు కీలకం. భారతరాజ్యాంగం ఎదు ర్కొన్న టువంటి సమస్యలు,సవాళ్లుబహుశా ప్రపం చంలో మరేదేశరాజ్యాంగానికీ ఎదురెఉండవు. అమల్లోకి వచ్చిన తొలిఏడాదే రాజ్యాం గానికి సవరణలు అవసరపడ్డాయి. ఆ తరవాత క్రమంగా వందకుపైగా సవరణలతో రాజ్యాంగాన్ని ఎప్పటి కప్పుడు మార్చుకుంటూ వచ్చారు. భూసంస్క రణలు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల పునర్వ్యవస్థీక రణ ప్రాంతీయ అసమానతలను సరి దిద్దడంబీ ఆదేశిక సూత్రాల్లో ప్రవచించిన లక్ష్యాలను సాకారం చేసు కోవడం,కొన్నిరాష్ట్రాల్లో రాష్ట్రపతిపాలన విధిం చడం, ఎస్సీ,ఎస్టీ,బీసీ జాతీయ కమిషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడం, ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితానుంచి తొలగించి దానిని చట్టబద్ధ హక్కుగా గుర్తించడం, పౌరుల ప్రాథమిక విధులకు సంబం ధించి కొత్త అధ్యాయాన్ని జతపరచడం, ఫిరాయిం పుల నిరోధకచట్టం,జాతీయ జుడిషియల్‌ నియా మక కమిషన్‌ ఏర్పాటు, జీఎస్‌టీ అమలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10శాతం రిజర్వే షన్లు కల్పించడం వంటి అనేక కీలక సవరణలకు కాలానుగుణంగా రాజ్యాం గం వేదికగా మారింది.
అంబేడ్కర్‌ సూచనలు శిరోధార్యం
రాజకీయ ప్రజాస్వామ్య సాధనకోసం మాత్రమే కాకుండా సామాజిక ప్రజాస్వామిక సంస్కృతిని పాదుకొల్పడం కోసం కృషి చేయాలనిబీ వ్యక్తి పూజ కు తిలోదకాలు వదలాలని1949, నవంబరు 25న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పిలుపిచ్చారు. దేశ పురోగతి సాధనలో అసమాన త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం సహేతుకమే అయినప్పటికీ- ఆ ఆరాధన ఒక స్థాయిని దాటితే మూఢభక్తిగా పరిణమించే ప్రమాదం ఉంది. దాని వల్ల అంతిమంగా వ్యవస్థలు పతనమై నియం తృత్వం కోరసాచే ప్రమాదం కొట్టిపారేయలేనిది. సామాజిక ప్రజాస్వామ్యమే పునాదిగా రాజకీయ ప్రజాస్వామ్యం శాఖోపశాఖలుగా విచ్చుకోవాలని ఆయన అభిలషించారు. కులాలు అన్న భావనే జాతి వ్యతిరేకమని స్పష్టం చేసిన అంబేడ్కర్‌, అంత రాలను అధిగమిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ భారతావని ఒక పరిపూర్ణ దేశంగా రూపుదాల్చాల్సి ఉందని ఆకాంక్షించారు. ఆ మహనీయుడి పలుకులే శిరోధార్యంగా భారతావని భవిష్యత్తును తీర్చిదిద్దు కోవాల్సి ఉంది. గడచిన ఏడు దశాబ్దాల రాజ్యాంగ పరిణామ క్రమంలో రాజకీయనేతలు అప్పు డప్పుడూ కట్టుతప్పిన ఉదాహరణలు కనిపిస్తాయి. ఏడో దశాబ్దం తొలినాళ్లనుంచి దేశంలో రాజకీయ నాయకత్వం అడపాదడపా నియంతృత్వం బాట తొక్కిన ఆనవాళ్లు పొడగడతాయి. గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ (1967) కేసులో పార్ల మెంటుకు రాజ్యాంగాన్ని సవరించే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులు సహా రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్ల మెంటు సమున్నతాధికారాన్ని చాటిచెప్పేందుకు (1971లో తీసుకువచ్చిన 24వరాజ్యాంగ సవరణ) ప్రయత్నించింది. అయితే మెజారిటీ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు ధర్మాసనం ఒకవైపు ఆరాజ్యాంగ సవరణకు మద్దతు పలుకుతూనే మరోవంక రాజ్యాం గ మౌలిక స్వరూపం, ప్రాథమిక హక్కులపై రాజ్యాంగ సవరణల ప్రభావం ఉండబోదని విస్ప ష్టంగా తేల్చిచెప్పింది. ఫలితంగా 1973నుంచీ తలపెట్టిన ఏరాజ్యాంగ సవరణకైనా ‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదు’ అన్న సూత్రమే ప్రాతిపదికగా నిలుస్తోంది. ప్రధానమంత్రితోపాటు రాజ్యాంగ బద్ధ పదవుల్లోని వ్యక్తుల ఎన్నికలను న్యాయ సమీక్షకు అతీతంగా తీర్మానిస్తూ 39వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. ఇందిరాగాంధీ వర్సెస్‌ రాజ్‌ నారాయణ్‌ (1975) కేసులో న్యాయ స్థానం ఆ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉందని, స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే వాతావరణాన్నిదెబ్బతీస్తోందని వ్యాఖ్యానించి దాన్ని కొట్టివేసింది. 42వ సవరణ ద్వారా కీలక మైన ప్రాథమిక విధులకు చేటు కల్పించడంతో పాటు, చట్టాల రూపకల్పనలో ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకే అధికప్రాధాన్యం ఇవ్వ డం, సామ్యవాద, లౌకికవాద పదాలను చేరు స్తూ రాజ్యాంగ పీఠికను సవరించడం వంటి మార్పు లు తీసుకువచ్చారు.
జనతా ప్రభుత్వ జమానాలో 43,44 రాజ్యాంగ సవరణల రూపంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చిన కొన్ని నిబంధనలు సవరించారు. మినర్వా మిల్స్‌ వర్సెస్‌ భారత ప్రభు త్వం(1980)కేసులో రాజ్యాంగాన్ని సవరించ డానికి పార్లమెంటుకు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు- ప్రాథమిక హక్కులు,ఆదేశిక సూత్రాల మధ్య సామ రస్యాన్ని రాజ్యాంగ మౌలిక స్వభావంగా వ్యాఖ్యా నించింది. మనేకా గాంధీ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో న్యాయస్థానం పౌర స్వేచ్ఛకు మరింత విశాలమైన పరిధులు గీస్తూ తీర్పు చెప్పింది. దేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని మరింత నిర్మాణాత్మకంగా తీర్చిదిద్ది సహకార సమాఖ్య విధా నానికి పెద్దపీట వేసే క్రమంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు లాకులెత్తుతూ 101వ రాజ్యాంగ సవ రణ తీసుకువచ్చారు. 103వ సవరణ ద్వారా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేష న్లు తెరపైకి తీసుకువచ్చారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని ఎత్తివేయ డంతోపాటు- లద్దాఖ్‌, జమ్ము కశ్మీర్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ రాజ్యాంగాన్ని సవరించడం ఇటీవలి పరిణామం.
కదలాలిక క్రియాశీలకంగా…
భారత రాజ్యాంగానికి ఏడు దశాబ్దాల కాలంలో వందకుపైగా సవరణలు జరిగాయి. అమెరికన్‌ రాజ్యాంగాన్ని 1789నుంచి ఇప్పటివరకు కేవలం 27 సందర్భాల్లో మాత్రమే సవరించారు. మరోవంక 1900సంవత్సరంలో అమలులోకొచ్చిన ఆస్ట్రేలియా రాజ్యాంగానికి ఇప్పటివరకూ ఎనిమిది సవరణలు జరిగాయి. మనదేశ రాజ్యాంగానికి మాత్రమే ఎందుకిన్ని సవరణలు తీసుకువచ్చారు అన్న ప్రశ్నకు జవాబు వెదకడం అంత సులభం కాదు. చైతన్య భరితమైన రాజ్యాంగ స్వభావానికి ఈ సవరణలు దర్పణం పడుతున్నాయా లేక రాజకీయ అవసరాల మేరకు దఖలుపడిన అనివార్యతలకు ఇవి సూచికలా అన్న విషయంలో లోతైన చర్చ తప్ప నిసరి. దేశ ప్రజాస్వామ్య గమనాన్ని, పాలన వ్యవ స్థలను కాలానుగుణంగా తీర్చిదిద్దుకునే క్రమంలో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిఫలిస్తూ చేయాల్సిన మార్పు చేర్పులు మరెన్నో ఉన్నాయి. పార్టీఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రభావశీలంగా మార్చడంబీ సంకీర్ణ ప్రభుత్వాల ప్రక్రియను కట్టుదిట్టంగా రూపు దిద్దడం, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కట్ట బెట్టడం, ఆదేశిక సూత్రాలకు అగ్రాసనమేస్తూ ఉమ్మడి పౌరస్మృతిని సాకారం చేయడం, న్యాయ వ్యవస్థకు జవాబుదారీతనాన్ని మప్పే నిబంధనలకు బాటలు పరవడం,అవినీతి కట్టడికి పటుతర వ్యవస్థలను రూపొందించడం వంటి క్రియాశీల చర్యలన్నీ రాజ్యాంగం ప్రాతిపదికగా అమలులోకి రావాల్సి ఉంది. రాజ్యాంగానికి మేలిమి భాష్యాలు చెబుతూ చురుకైన పాత్ర నిర్వహించడం ద్వారా న్యాయస్థానాలు ఈఏడు దశాబ్దాల కాలంలో క్రియా శీలకంగా వ్యవహరించాయి. రాజ్యాంగ మౌలిక స్వభావం అనే భావనను వెలుగులోకి తీసుకు రావడం, రాష్ట్రపతిపాలన దుర్వినియోగం కాకుం డా నియంత్రణలు విధించడం, సహజ వనరులను విచ్చలవిడిగా తవ్వితీయకుండా గనుల లైసెన్సుల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం, మానవహక్కుల ఉల్లంఘనలను సాధ్యమైనంత మేర అడ్డుకోవడం వంటివన్నీ మన దేశంలో న్యాయ వ్యవస్థ చైతన్యవంతమైన చొరవకు దాఖలాలుగా ప్రస్తావించుకోవచ్ఛు ఏడు దశాబ్దాలనాటితో పోలిస్తే నేడు సమాజం మరింతగా చీలికలు పేలికలై ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబే డ్కర్‌ పరితపించిన సమానత్వం,సౌభ్రాతృత్వ సిద్ధాం తాలు ఆచరణలో కనుమరుగవుతున్న చేదు వాస్త వాలు ఎల్లెడలా దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కేందుకుపాలకులే నిర్లజ్జగా సిద్ధపడుతున్న తరుణమిది. దీర్ఘకాలంలో దేశ గమనాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే పరిణామాలివి.‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమర్థు లు, నిజాయతీపరులైతే రాజ్యాంగంలో లోపాలు ఉన్నప్పటికీ వారి చర్యలవల్ల మెరుగైన ఫలితాలే సాకారమవుతాయి. కానీ పాలకులు సమర్థులు కాక పోతే రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఉపయోగమే లేదు’-డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలివి. జాతి గమనాన్ని శాసించే పాలకులు ఈ మాటలను ప్రతిక్షణం మననం చేసుకొంటూ అడుగు ముందుకు వేసినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి ఆచరణలో ప్రతిఫలి స్తుంది.
రాజ్యాంగ విలువలు – శాస్త్రియ దృక్పథం
అఖండ భారతదేశంలోకోట్లాది ప్రజల అధిశాసన గ్రంథంగా‘భాÛరతరాజ్యాంగం’ అమల్లోక ిరావడంతో సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించడం జరిగింది. రాజ్యాంగం అనే గ్రంథంలో భారతీయ పరిపాలన వ్యవస్థను స్పష్టం గా లిఖింపచేసి స్వేచ్ఛ, సమాన త్వం,సోదరభావం అనే గొప్పవిలువలను భారతీయ పౌరులకు అందిం చడం జరిగింది. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్క ర్గారు రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షులుగా వ్యవహ రించి ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయ నంచేసి భారతీయుల ఆర్థిక,సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ మైన విలువల కలయికతో రాయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశాలలో భారత రాజ్యాంగం వైవిధ్య మైన వ్యవస్థల సమాహారంతో విశిష్టలక్షణాల కలయికతో ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాం గంగా గ్రంథస్థం కాబడిన ఒకసమున్నత గ్రంథం. రాజ్యాంగం అనేగ్రంథం చారిత్రకంగా సృష్టించిన మానవ నిర్మిత అడ్డుగోడలైన కుల, మత, భాష, ప్రాంతం మరియు లింగ బేధాలను కూకటివేళ్ళతో పెకలించి కోట్లాది ప్రజలకు విముక్తి కల్పించింది. దేశతలరాతనుమార్చే ‘ఓటుహక్కు’అనే ఆయుధం ద్వారా దేశంలోని పౌరు లందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలతోపాటు దేశ సంపదను సమానంగా పంచాలని ఆదేశిస్తూ, హక్కులను, బాధ్యతలను సమపాళ్ళలో పంచిన సమున్నత గ్రంథం. పార్లమెంటరీ వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థల మధ్య అధికార విభజనతో భారత రాజ్యాంగాన్ని నిర్మిం చడం జరిగినది.తద్వారా రాజ్యాంగంఅనే గ్రంథం ‘‘నవమాసాలు మోసిన తల్లి ప్రసవించిన వెంటనే మనల్ని నమోదుచేసుకుని 90ఏళ్లపాటు తన భుజాలకెత్తుకొని రక్షణకల్పిస్తున్న అదిశాసన గ్రం థం’’గా వ్యవహరించడం జరుగుతుంది.
42వ రాజ్యాంగ సవరణ-1976 ద్వారా చేర్చిన పదాలు
ా సార్వభౌమాధికారం : భారతదేశం ఏఇతర దేశానికి లొబడి ఉండదు. ఎవరి ఆజ్ఞలను పాటించదు,అంటే దేశం యొక్క నిర్ణయాలు దేశం మాత్రమే తీసుకొంటుంది. భారత దేశంలో ఉన్న సంస్దలు మీద, పౌరులమీద భారత దేశానికికి మాత్రమే హక్కు ఉంటుంది.భూభాగాన్ని ఏవిదేశీ రాజ్యానికైనా ఇవ్వవచ్చు. వదులుకోవచ్చు..ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకోవడాన్ని సార్వభౌ మాధికారం అంటారు.
ా సామ్యవాదం : భారత దేశంలో ఉన్న వనరులు అన్నీ ఉత్పత్తి, పంపిణీ అన్నీ కూడా రాజ్యమే చేపట్టడం., అంటే ప్రయివేటీజేషన్‌ ఉండదు. అంతా ప్రభుత్వమే చేపడుతుంది కానీ భారత దేశం అనుసరించేది ప్రజా సామ్య సామ్యవాదాన్ని అనుసరిస్తుంది. ఇందులో ప్రభుత్వం మరియు ప్రయివేటు కూడా ఉంటాయి. దీనికి కారణం ఆర్ధిక సంస్కరణలు రావడం.
ా లౌకిక వాదం : భారతదేశం ఏ అధికార మతం కలిగి లేకపోవడం, అన్ని మతాలకు సమాన ఆధారణ ఇస్తుంది ఏమతానికి ప్రత్యేకమైన విలువ ఇవ్వదు,అన్ని మతాలూ సమానంగా అనుసరిస్తుంది.
ా ప్రజాస్వామ్యం : భారతదేశం ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరి స్తుంది. ప్రాతిధ్యం అంటే ప్రజలు ప్రత్యక్షంగా ప్రతినిధులను ఎన్నుకొంటారు, వారు పార్లమెంటులో ఉంటూ వారు శాసనాలు చేసి మనల్ని పరిపాలిస్తారు. ఇందులో మనం ఎన్నికల్లో పాల్గొంటాం ఓట్లు వేస్తాము. మనం కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాము.దీన్నేప్రజాస్వామ్యం అంటారు.
ా గణతంత్ర రాజ్యము : చాలా దేశాల్లో రాజ్యానికి రాజులు కానీ రాణులు కానీ ఉంటారు, వీరు వంశ పారంపర్యంగా కొనసాగుతారు. కానీ మన దేశంలో మనమే రాజ్యా అధ్యక్షుడుని ఎన్నుకుంటాము. అంటే మనం ప్రతినిధులను ఎన్నుకుంటాము, మన ప్రతినిధులు రాజ్య అధ్యక్షుడుని ఎన్నుకుంటారు అలా ప్రజలే రాజ్యాధ్యక్షుడుని ఎన్నుకొంటే ఆరాజ్యాన్ని గణతంత్ర రాజ్యము అంటారు.
ా సాంఘికన్యాయం: కులం,మతం,జాతి,జన్మ లింగవివక్షత లేకుండా ఉండడం, రాజ్యాంగం ముందు అందరూ సమానులే కానీ కొన్ని ప్రత్యేక సదుపాయాలు కొన్ని వర్గాలకు కేటాయించడం ద్వారా వారిని మిగతా వారితో సమానంగా తీసుకు రావడా నికి ప్రోత్సాహకాలను ఇస్తుంది, ఇది కూడా సామాజిక న్యాయం కిందికి వస్తుంది. అలాగే రాజకీయ న్యాయం అంటే భారతదేశ పౌరులు అందరూ రాజకీయంలో పాల్గొన డం,ఓట్లు వేయడం18సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కును కలిగి ఉంటారు. ఇది అంతా రాజకీయ న్యాయ కిందకు వస్తుంది. అంతస్తుల్లోను అవకాశాల్లోను సమాన హక్కులు కల్పించారు ఆలోచన, భావప్రకటన,విస్వాసం,ధర్మం,ఆరాధన ఇవి అన్నీ కూడా స్వేచ్ఛను పొంపొందిస్తాయి. వీటన్నిటిని భారత రాజ్యంగంలో హక్కులుగా కల్పించారు.స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రా త్రుత్వం అనే భావనలు ఫ్రాన్సు దేశం నుండి గ్రహించారు. అలాగే స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉన్నాయి. జాతీయ సమగ్రత సమైక్యతా అంటే మనం ఒకచోట గమనించవచ్చు, మన అందరికి ఒకటే సిటిజన్‌ షిప్‌ ఉంటుంది. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వేరుగా ఉండదు. అంటే భారత దేశంలోఉన్న పౌరులు అందరికి ఒకే గుర్తింపు ఉంటుంది, ఇదే భారతదేశ సమైక్యత అనవచ్చు .
ా సౌబ్రాత్రత్వం : సౌబ్రాత్రత్వం అంటే పౌరుల మధ్యసోదరభావాన్ని పెంపొందిం చడం.భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ సోదరి భావంతో మెలగాలి
భారత రాజ్యాంగం – ముఖ్య లక్షణాలు
భారత రాజ్యాంగ పరిషత్‌ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది.1949 నవంబర్‌ 16న ఆమో దం పొందిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మా ణంలో రాజ్యాంగ నిర్మాతలు ఆధునిక ప్రపంచం లోని తాత్విక పునాదులను అనుసరించారు. ఉదారవాదం, ప్రజాస్వామ్య సామ్యవాదం, లౌకిక వాదం, గాంధీవాదం మొదలైన మూల సూత్రాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. సమన్యాయ పాలన, ప్రాథమిక స్వేచ్ఛలు ప్రజలకు ఉండాలని భావించారు. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగాలని ప్రతిపాదించారు. వీటన్నింటి ఆధారంగా రాజ్యాంగ మౌలిక లక్షణా లు రూపొందాయి, కానీ అవి నేడు దేశభక్తి పేరుతో పెను ప్రమాదంలో చిక్కు కున్నాయి. ప్రపంచంలో భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగ రచనకు రెండు సంవ త్సరాల 11 నెలల 18 రోజుల పాటు తీసుకుంది. భారతదేశంలోని భిన్నత్వం, అన్ని తరగతుల ప్రయోజనాలు రక్షించాలనే దక్పథం రాజ్యాంగంలో కనిపిస్తుంది. భారత రాజ్యాంగ లక్ష్యాలను పీఠికలో పొందుపర్చారు. పీఠికలో ‘సర్వసత్తాక, ప్రజా స్వామ్య, గణతంత్ర రాజ్యంగా’ పేర్కొన్నారు. 1976లో42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్య వాద,లౌకిక, సమగ్రత అనే పదాలను నూత నంగా చేర్చారు. దీంతో పీఠిక ‘సర్వసత్తాక, సామ్య వాద, లౌకిక,ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా’ రూపొం దింది. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేకూరాలని పీఠిక చెప్పింది. ప్రజ లకు స్వేచ్ఛ కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. ప్రజలకు సమానత్వం కల్పించ డానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందు పర్చారు. భారతదేశంలో రాజ్యాధినేత ఎన్నుకో బడట ంతో దేశం గణతంత్ర రాజ్యంగా రూపొం దింది. పౌరులకు మత స్వేచ్ఛను కల్పించ డంతో లౌకిక రాజ్యంగా ఉంది. భారతదేశంలో అధికా రానికి మూలాధారం ప్రజలు అని పీఠిక తెలిపింది. భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూ పం గురించి పేర్కొనలేదు. కానీ 1973లో కేశవా నంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరించి, దాన్ని కాపాడుకోవాలని చెప్పింది. వివిధ కేసుల్లో జస్టిస్‌ సిక్రి, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ హెగ్డే మొదలైనవారి తీర్పులను పరిశీలిస్తే రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలు తెలుస్తాయి.
రాజ్యాంగ ఆధిక్యత, ప్రజా స్వామ్య, సమాఖ్య విధానం,లౌకిక విధానం, సమ న్యాయం ,సార్వభౌమాధికారం మొదలైనవాటిని మౌలిక లక్షణాలుగా పేర్కొన్నారు. మినర్వామిల్స్‌ కేసు (1980), వామన్‌రావ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1981)కేసుల్లోనూ సుప్రీంకోర్టు రాజ్యాం గ మౌలికస్వరూప ప్రాధాన్యతను తెలి పింది. రాజ్యాంగం మూడో భాగంలో 12 నుంచి 35 వరకూ ఉన్న నిబంధనల్లో ప్రాథమిక హక్కులను పొందుపర్చారు. భారత పౌరులకు స్వేచ్ఛ కల్పిం చడానికి ఈహక్కులు దోహదపడతాయి. సుప్రీంకోర్టు 32వ నిబంధన ద్వారా హైకోర్టు 226వ నిబంధన ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి ఐదురకాల రిట్‌లు జారీ చేస్తాయి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-ఎనిబంధన చేర్చి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పొందుపర్చారు.అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులు తాత్కా లికంగా సస్పెండ్‌ అవుతాయి. రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకూ ఉన్న నిబంధనల్లో ఆదేశిక సూత్రాలను పొందుపర్చారు. ఆదేశిక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొందించడానికి తోడ్పడ తాయి. భారత ప్రజల ఆర్థిక, సామాజిక, జీవన ప్ర మాణాలు పెంపొందిం చడానికి ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిం చింది. వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉండదు. సంపద పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను ఆదేశిక సూత్రాల్లో పొందుపర్చారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు, తమ రాజకీయ సిద్ధాం తాలతో నిమిత్తం లేకుండా ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజ్యాం గంలో 11ప్రాథమిక విధులు న్నాయి. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవిం చడం, హింసను విడనాడటం, ప్రభు త్వ ఆస్తులను కాపాడడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెం పొందించు కోవడం వంటి అంశాలు ప్రాథమిక విధు ల్లో ఉన్నాయి. భారత పౌరుల్లో బాధ్యతాయిత ప్రవర్తనను పెంపొందించే ఆశయంతో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు. భారత రాజ్యాం గం దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పార్ల మెంటరీ తరహా ప్రభుత్వం కొనసాగుతుంది. సమిష్టి బాధ్యత, కార్యానిర్వాహక వర్గం,శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించడం పార్లమెంటరీ విధానం ముఖ్య లక్షణాలు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాష్ట్రాల హక్కులను హరించి జమ్మూ కాశ్మీర్‌ ప్రజల, రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకో కుండానే ఆరాష్ట్ర ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. భారత రాజ్యాంగం దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసింది. న్యాయవ్యవస్థ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. ఐదు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా కొనసాగుతోంది.
దేశంలో పౌరుల ప్రాథమిక హక్కుల ను కాపాడడంలో న్యాయవ్యవస్థ క్రియా శీలక పాత్ర వహిస్తోంది. ఇటీవల కాలంలో ప్రజా ప్రయో జనాల వ్యాజ్యం ప్రాధాన్యత తగ్గిపోయింది. కొన్ని తీర్పులను అధికారవర్గాలు ప్రభావితం చేస్తున్నాయన్న అభిప్రాయాలకు ప్రజలు రాక తప్పడంలేదు. డాక్టర్‌ బిఆర్‌అంబేద్కర్‌ భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో పనిచేస్తున్న సమాఖ్య రాజ్యంగా వర్ణించారు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కె.సి.వేర్‌ భారతదేశాన్ని ‘అర్ధసమాఖ్య’ అనివర్ణించాడు. ఏకకేంద్ర లక్షణాలైన ఒకే పౌరత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, అఖిలభారత సర్వీసుల పాత్ర, కేంద్ర ఆధిక్యత మొదలైనవి కూడా రాజ్యాంగంలోఉన్నాయి.
భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వ జనీన ఓటు హక్కు ప్రసాదించింది. స్త్రీ, పురుషులందరికీకుల,మత,వర్గ,లింగ,జాతి బేధాలు లేకుండా1988లో61వ రాజ్యాంగ సవరణద్వారా ఓటు హక్కు వయస్సును21 నుంచి18 ఏండ్లకు తగ్గించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయం సాధించడంలో ఓటు హక్కు ముఖ్యపాత్ర పోషిం స్తుంది అని, రాజ్యాంగ నిర్మాతలు ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ప్రజా సార్వభౌమాధి కారంకొనసాగుతుందని విశ్వసించారు.
కానీ డబ్బున్న వారే రాజ్యాన్ని చేజిక్కిం చుకొని తమ పెట్టుబడులను విస్తరించు కుంటూ ప్రజలు నిరు ద్యోగులుగా, పేదవారిగా..ఉపాధి కోసం, ఎన్నికల సమయంలో నాయకులు విసిరే ఎంగిలి మెతుకుల కోసం అమలు కాకపోయినా ఉచిత హామీల కోసం ఎదురు చూసే నిర్భాగ్యులుగా మార్చివేయబడ్డారు. రైతు గిట్టుబాటు కోసం కాకుండా,నిరుద్యోగి ఉపాధి కోసం కాకుండా, కార్మి కుడు కనీస వేతనం కోసం కాకుండా అణిచివేయ బడ్డ వర్గ ఆత్మగౌరవం కోసం కాకుండా ఎన్నికల సమయంలో అభ్యర్థులు పంచే నోట్ల కోసం ఎదురు చూసే దుస్థితి ఏర్పడిరది. గతంలో లేనంతగా భారత్‌లో ప్రజాస్వామ్య విలువలు పతనమ య్యాయి. నిరసన ప్రదర్శనలపై కాల్పులు, లాఠీ ఛార్జీలు, పోలీసుల అక్రమ అరెస్టులు సర్వసాధారణ మయ్యాయి. -(జి.ఆనంద్‌ సునీల్‌ కుమార్‌ )

అంతరించిపోతున్న భాషల సంరక్షణ

శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మాతృభాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రపంచీకరణ, సరళీకృత, ఆర్థిక విధానాలు, మరో ప్రక్క అమెరికన్‌ సామ్రాజ్య వాద సంస్కృతి తాకిడికి బలవుతున్న మాతృభాషల ఉనికి, మనుగడ కనుమరుగవక తప్పని పరిస్థితి దాపురించింది. ఆంగ్ల భాష నేడు అంతర్జాతీయంగా రూపాంతరం చెందడం కూడా వారి చలువే నన్నది జగమెరిగిన సత్యం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో మాతృభాషలు అంతరించి పోతున్నాయి. అందుకు నిలువెత్తు సాక్షంగా ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలల్లో తెలుగు భాషను ఆంగ్ల భాష అధిక మించినట్లు, తెలుగు కూడా అదే రీతిలో ఇతర భాషలను గిరిజన భాషలను సైతం అధిక మిస్తున్నాయి. ఆదిమ గిరిజన భాషలకు నేటికీ గుర్తింపు లేదు. లిపి లేదు. వీరు మాట్లాడే భాషలు మౌఖికంగా నోటికే పరిమితం కావడం మూలాన అత్యంత నిరాదరణకు గురవుతు న్నాయి. పర్యవసానంగా ఆదివాసీ తెగల ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి.
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలు ఆస్ట్రేలియా (అబోరి జన్లు), న్యూజిలాండ్‌ (మావోరీలు),జపాన్‌ (అయినీలరు),ఉత్తర దక్షిణ అమెరికా (రెడ్‌ ఇండియన్‌) ఉత్తర యూరప్‌ (సామీలు), ఆఫ్రికా (బుష్‌మెన్‌), ధృవ ప్రాంతాలు (ఇన్‌ విత్‌), అండమాన్‌, నికోబార్‌ (జారువా),ఇండియా (ఆదివాసీ గిరిజనులు),అరేబియా,మలేసియా, సూడాన్‌,అమెజాన్‌,రొడీసియా,ఇండోనేసియా, లక్షద్వీప్‌ మొదలైన 70దేశాలలో5వేల తెగలకు చెందిన 37కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 6700భాషలను మాట్లాడుతున్నారు. ఆఫ్రికా,ఇండోనేసియా,అండమాన్‌,నికోబార్‌ వంటి దీవుల్లో నివసించే బుష్‌మెన్‌, జారువా వంటి ఆదిమ తెగల వారి సంస్కృతితో పాటు భాషలు, ఉనికి అంతరించిపోతున్నాయి.భారత రాజ్యాంగంలోని 5,6 షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన రాష్ట్రాల్లో 698 తెగలకు చెందిన 10 కోట్ల మంది జనాభా వుంది. మన దేశంలో మొత్తం 1652 భాషలుండగా, గిరిజనులు మాట్లాడే భాషలే సుమారుగా 600 దాకా ఉన్నాయి.భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్‌లో ఇప్పటికి 22 భాషలు అధికా రికంగా గుర్తించబడగా, అందులో గిరిజనులు మాట్లాడే మణిపురి, డోంగ్రీ, బోడో, కొంకిణి, సంథాలీ భాషలకు మాత్రమే చోటు దక్కింది. మిగిలిన ఆదిమ భాషలు అంతరించే దశలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలతో పాటు అటవీ సమీపాల్లో, కొండకోనల్లో నివసించే సవర,గదబ,జాతపు, గోండు,కోలాం,పర్ధాన్‌,తోటి,కోయ,కొండ, రెడ్లు, చెంచు,నాయక్‌ పోడు,యానాది మైదాన ప్రాంతాల్లో బంజార,ఎరుకల,నక్కల,కుర్వికరన్‌, పైకో పుతియా వంటి 35 తెగలు,మరో 30ఉప తెగలకు చెందిన 59,64,680 మంది (2011 జనాభా లెక్కల ప్రకారం) గిరిజనులు ఉన్నారు. వీటిలో చాలా గిరిజనతెగలకు వారి వారి మాతృభాలున్నాయి.కొన్ని భాషలకు (సవర, గోండీ, ఆదివాసీ,ఒరియా) అరుదుగా లిపి ఉన్నాయి.భాషకు,సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది.కాని వారి మాతృ భాషలకు లిపికి ఎటువంటి సంబంధం లేదు. అయినా ప్రపంచంలో సంస్కృతీ సాంప్రదాయాలు పాటి స్తున్నది కేవలం ఆదివాసీలేనన్నది ఆది(మ) సత్యం. భాష ద్వారానే సంస్కృతీ సాంప్రదా యాలు ఆచారాలతో ఆదివాసులు అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. కాని పాలక వర్గాలు ఆదిమ జతుల భాషలకు లిపి లేదన్న సాకుతోనే ఇతర భాషలను వారిపై రుద్దడంతో విద్యా భివృద్ధికి, సమగ్రాభివృద్ధికి దూరమవుతున్నారు. ప్రపంచీకరణ పేరుతో పాలక వర్గాలు ఆదిమ జాతుల ఉనికిని ఆటంక పరుస్తూ ఒకే స్థాయి సంస్కృతిని స్థాపించడానికి నిరంతరం ప్రయత్ని స్తున్నారు. అందువల్ల మాతృభాషల,ఆదిమ భాషల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒక భాషను, మరొక లిపిలోనూ రాయవచ్చు. ఆ భాషా భివృద్ధి నిర్దిష్ట ప్రణాళిక, చిత్తశుద్ధితో అమలు పరచడం అవసరం. మాతృభాషల సంరక్షణలో భాగంగా నిజాంరాజు ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆదివాసీల ప్రత్యేక సంస్కృతిని గుర్తించి పాఠశాల స్థాయిలో తెలుగు లిపిలోనే శిక్షణ నిప్పించి మొదట గోండు భాషను పరిచయం చేశాడు. అప్పటి నిజాం ప్రభుత్వంలో మానవ పరిణామ శాస్త్రవేత్త హైమండార్ప్‌ పరిశోధనా కృషి ఫలితంగా గోండు భాష శిక్షణ కోసం ఆదిలాబాద్‌ జిల్లా జైనూరు మండలంలోని మార్లవాయిలో ‘టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌’’ స్థాపించబడినది.1956 హైదరాబాద్‌ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన తరువాత ఆదివాసీ గిరిజన పిల్లల మీద తెలుగు బలవంతంగా ‘రుద్ద’బడిరది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ల క్రితం రాజీవ్‌ విద్యామిషన్‌ (ఆర్‌.వి.ఎం)ద్వారా గోండు, కోయ,సవర,చెంచు,ఒరియా,కొలామి,కొండరెడ్డి, బంజార వంటి భాషలలో తెలుగు లిపితో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు వాచకాలను ముద్రించి ప్రత్యేక పాఠశాలను నెలకొల్పింది. ఆయా భాషా సంబంధ బోధకు లను కూడా నియమించింది. కాని కొన్ని సాంకే తిక లోపాల వల్ల నేడు పాఠశాలలు పని చేయడం లేదు.
గోండీ భాష లిపి
గోండు గిరిజనులు మాట్లాడే భాషగోడీ.గోండు అంటే జంతువును కాపాడేవాడు అని అర్థం. మధ్య భారత దేశంలో గోండ్వానా రాజ్యాన్ని ఏలిన గోండు గిరిజనుల జనాభా సుమారు 20 లక్షలు. మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, రాష్ట్రాల్లో సగం మంది గోండులు నేటికీ గోండి భాషలోనే సంభాషి స్తున్నారు. ఇది వారికి అమ్మ భాష. లిఖిత భాషను గర్భ భాష అంటారు. వీరి సాంస్కృతిక నృత్యం గుస్సాడీ గిరిజన గోండి భాషపై అలనాడు ప్రాకృతం, ఆ తర్వాత సంస్కృతం, అరబీ, పారసీకం, ఉర్దూ, హిందీ, మరాఠీ, తెలుగు భాషలు పెత్తనం చెలాయించాయి. అందుకు సాక్షమే.. గోండీకి లిపి ఉందనే అక్షర సత్యం. 2014 మార్చి నెలలో ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నూరు మండలం గుంజాల గ్రామంలో 12 పురాతన గోండీ లిపి రాత ప్రతులు అభ్యమయ్యాయి. దాదాపు పది వేల సంవత్సరాల క్రితం సింధూ నది పరివాహక ప్రాంతంలో విలసిల్లిన హరప్పా, మొహంజ దారో కాలం నాటి నుంచి గోండులకు లిపి, ప్రత్యేక సంస్కృతి ఉన్నట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఈ రాత ప్రతులలో ఆదిమ గిరిజనుల సంస్కృతీ,సాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు,చరిత్ర,గణితం,జ్యోతిష్యం,కథలు, గోండు రాజుల పాలన,గోండీ సాహిత్యం, దేశంలో ఆంగ్లేయుల పాలన,రాంజీ గోండు పోరాటం వంటి వివరాలున్నాయి. ఈరాతలను చదివే పెద్ద మనుషులు ప్రస్తుతం ముగ్గురు (కొట్నాత్‌ జంగు, అర్క జయవంతరావు, పెంథోల్‌ భీం రావు) మాత్రమే ఉన్నారు. గోండీ భాషాధ్యయన కేంద్రాన్ని రాష్ట్ర రాత ప్రతుల సంస్థ పూర్వ సంచాలకులు ఆచార్య జయధీర్‌ తిరుమల రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కోయ భాష లిపి
కోయ గిరిజనులు అనగానే తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర గుర్తుకొస్తుంది. ఇది ఆసియాలోనే కోయ గిరిజనులు జరుపుకొనే అతి పెద్ద జాతర. కాకతీయుల కాలం (13 శతాబ్దం)లో కోయ గిరిజనులు వారికి కప్పం కట్టలేని పరిస్థితుల్లో సమ్మక్క సారక్కలు కాకతీయ సైన్యాన్ని ఎదిరించారు. ఆ పోరులో వీరత్వం పొందిన తరువాత సమ్మక్క సారక్క, జంపన్నలు దైవత్వం పొందారని కోయ గిరిజనుల ప్రగాఢ నమ్మ కంతో జాతర నిర్వహిస్తున్నారు. కోయ గిరిజ నులు ఒక నిర్దిష్టమైన తెగ.చరిత్రకారులు చెబుతున్నట్టు కోయ జాతి మూలాలు క్రీ.పూ. 25,000 నుండి 10,000 లోపల, మధ్య శిలా యుగంలోనే ఉన్నట్లు శిలా యుగపు అవశేషాలు కొన్ని ఖమ్మం జిల్లాల్లో (200708 మధ్య) లభించాయి. దీని ద్వారా ఆస్ట్రలాయిడ్‌ జాతికి చెందిన కోయ, సవరలకు చెందిన ఆదివాసీలు గిరిజన జాతులుగా పరిణమించాయి.గోదావరి నదికి అనుసంధానమైన శబరి,కిన్నెరసాని, మున్నేరు,పాలేరు వైరా వంటి ఉప నదులు గల సారవంతమైన ప్రాంతాల్లో కోయ,కొండరెడ్ల తెగలు స్థిరపడినవి.వీరి మాతృభాష కోయ భాష. రేలా అనేది వీరి సాంస్కృతిక నృత్యం. వరంగల్‌,ఖమ్మం,కరీంనగర్‌ దండకారణ్యంలో నివసించే వీరి జనాభా 20లక్షలదాకా ఉం టుంది. ప్రస్తుతం వీరి భద్రాచలం,చింతూరు, కూనవరం,పోచారం,బూర్గుంపాడు,పినపాక, అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో వున్న కొందరు మాత్రం (20శాతం)కోయ భాష మాట్లాడుతున్నారు. కాకతీయుల కాలంలో సాగు భూములకు శిస్తులు కట్టలేకపోవడంతో ఇతరులకు తెలియని కోయ భాషను అంతరింప జేశారనేది ఒక వాదన. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర పెత్తందార్ల వలసలు పెరిగిపోవ డంతో అర్థం కాని కోయ భాషపై దాడి జరిగిం దనేది మరొక వాదన. ఏదేమైనా ఈ మౌఖిక భాషకు లిపిగాని, ముద్రణగాని లేకపోవడంతో ఆదివాసీ భాషలు అంతరించిపోతున్నాయి అనే భాషావేత్తల అభిప్రాయంతో ఏకీభవించక తప్పదు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం తెలుగు నేల మీద ప్రభుత్వం గుర్తించిన 34 ఆదివాసీ తెగల భాషలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఈ భాషలకు లిఖిత రూపం లేకపోవడం వల్ల నోటి భాషలుగా మిగిలి పోతున్నాయి. వీటికి తోడు ముద్రణ, నిరంతర భాషణం ఉంటేనే భాషకు సజీవత్వం ఉం టుంది. ప్రభుత్వం గాని, భాషా పండితులు గాని,రాష్ట్ర రాత ప్రతుల సంస్థగాని ఈ పురా తన ఆదిమ భాషల పరిరక్షణఖు అధ్యయనం జరపటం లేదు. 2013 తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల ఫలితంగా ప్రభుత్వం తెలుగు భాషకు ప్రత్యేక సాంస్కృతిక, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం శుభ పరిణామం. కాని ప్రాంతీయ భాషలు, మాతృభాషల లిపి గురించిన ప్రస్తావన రాలేదు. తక్షణావసరంగా వాంఛనీయమైన ప్రాంతీయ భాషలను మాతృభాషలుగా, అధికార భాషలుగా గుర్తించాల్సిన అవసరమున్నది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మాతృభాషల్లోనే ముఖ్య పరిపాలనా వ్యవహారాలు కొనసాగాలి. న్యాయ స్థానాల్లోనూ కోర్టు తీర్పులు వారివారి మాతృభాషల్లో వెలువడినట్లయితే గ్రామీణులు, ఆదిమ తెగల గిరిజనులు సైతం న్యాయం పొందుతారు. నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అంత రించిపోతున్న కోయ, గోండీ, రోలాం,సవర, చెంచు, గడబ, కొండరెడ్ల భాషల లిపి, భాషా భివృద్ధిపై పరిశోధన చేసే వారికి ప్రభు త్వం చేయూత నివ్వాలి. కనీసం ప్రాథమిక స్థాయి నుండి మాధ్యమిక స్థాయి వరకు విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగించుటకు తగిన నిధులు కేటాయించాలి. ఆయా భాషలకు చెంది న బోధకులను నియమించి,ప్రత్యేక ఆశ్రమ పాఠ శాలలు నెలకొల్పితే ప్రయోజనం ఉంటుంది.
సవరి భాషలిపి భారతావనిలో ఆదిమ జాతుల పేరు చెప్పగానే గుర్తుచ్చేది ఆది తెగ సవర.ఆర్యుల మన దేశా నికి రావడానికి పూర్వమే ఈ గిరిజన తెగ మధ్య భారతదేశంలో నివసించేరని చారిత్రక, పురావస్తు ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో సుమారు ఐదులక్షల మంది సవరల జనాభా ఉంది నేడు సవరలు ఇతర గిరిజన తెగలతో కలసి మిశ్ర జాతిగా ఏర్పడ్డారు. సవరల నృత్యంను,థింసా అని,చిత్రకళను ఎడిసింగ్‌/తింగోర్‌ అని అంటారు. ఆదిమ సవరల భాష అతి ప్రాచీన భాష. సవరభాషకు లిపి నిఘంటువుని రూపొం దించిన గిడుగు రామ్మూర్తి పంతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సవరలకు అక్షర బ్రహ్మగా వెలుగొందారు. బాహ్య సమాజం అంటే ఏమిటో తెలియని ఆదిమ ప్రపంచం సవరలది. వీరు ఆధునిక సమాజంలో జీవింమచాలంటే వీరి భాషలనే బోధించాల్సి ఉంటుందని గిడుగు సవర భాషను నేర్చుకున్నారు. సవర వాచకా లను,కథలపుస్తకాలను,పాటల పుస్తకాలను, తెలుగుసవర,సవర`తెలుగు నిఘంటవులను తయారు చేశారు. 1911లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం ఈ పుస్తకాలకు పారితోషికం ఇవ్వజూపితే ఆడబ్బుతో ఒక మంచి బడిపెట్ట మని ప్రభత్వాన్ని కోరారు. ఆయన కోరిక ప్రకారమే ప్రభుత్వం ప్రత్యేక సవర శిక్షణా పాఠశాలలను ప్రారంభించింది.సవర గిరిజ నులు, గిరిజనేతరులు కలిసి నివసిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని పర్లాకిమిడి పట్టణానికి 200 గ్రామా లను 1935లో తెలుగు రాష్ట్రం నుంచి ఒడిషా రాష్ట్రంలో చేర్చడాన్ని గిడుగు నిరసించారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం తెలుగు నేల మీద ప్రభుత్వం గుర్తించిన 34 ఆదివాసీ తెగల భాషలు అంతరించే దకు చేరుకున్నాయి.ఈ భాషలకు లికిత రూపం లేకపోవడంవల్ల నోటి భాషలుగా మిగిలిపోతున్నాయి. ప్రభుత్వంగానీ, భాషా పండితులుగాని,రాష్ట్రరాత ప్రతుల సంస్థగాని,ఈ పురాతన ఆదిమ భాషల పరిరక్షణకు అధ్యయన జరపట లేదు. తక్షణా వసరాలుగా వాంఛనీ యమైన ప్రాంతీయ భాషలను మాతృభాషలుగా, అధికారభాషలుగా గుర్తించాల్సిన అవసర ముంది. నేడు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలోని ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అంతరించిపోతున్న కోయ,గోండీ, కోలాం, సవర,చెంచు, గదబ, కొండరెడ్ల భాషల లిపి,భాషాభివృద్ధిపై పరిశోధన చేసేవారికి ప్రభుత్వం చేయూత నివ్వాలి.ఆయా భాషలకు చెందిన బోధకులను నియమించి ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు నెల కొల్పతే ఆదిమ భాషలు సజీవంగా ఉంటాయి.
భాషను రక్షించుకునే సామాన్యులు
అయితే, అంతరించిపోతున్న తమ భాషలను సంరక్షించుకునేందుకు కొన్ని కమ్యూనిటీలు కూడా బాధ్యత తీసుకుంటాయి. అలాంటి ఒక ప్రయత్నాన్ని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఓ గ్రామానికి చెందిన రైతు వాంగ్లంగ్‌ మొసాంగ్‌ చేపట్టారు. మొసాంగ్‌ ఈశాన్య భారతదేశంలోని అనే సినో-టిబెటన్‌ భాష కుటుంబానికి టాంగ్సా అనే భాషను మాట్లాడే తెగకు చెందిన వారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని టాంగ్సా తెగ 40 ఉపజాతులుగా కనిపిస్తుంది. ప్రతి ఉపజాతికి దాని సొంత యాస ఉంటుం ది.టాంగ్సా కమ్యూనిటీ జనాభా దాదాపు 100,000.అయితే విభిన్న మాండలికాల కార ణంగా భాషా అంతరించిపోయే ప్రమాదంలో పడిరది.కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2013 లో అంతరించిపోతున్న భాషల రక్షణ, సంరక్షణ పథకం (ఎస్‌పిపిఇఎల్‌)ను ప్రారంభించింది. అంతరించి పోతున్న, భవిష్యత్తులో అంతరించి పోయే ప్రమాదం ఉన్న భాషలను డాక్యుమెంట్‌ చేయడం దీని లక్ష్యం.అంతరించిపోతున్న భాష లను డాక్యుమెంట్‌ చేయడానికి అలాంటిదే ఒక ప్రోగ్రామ్‌ను సిక్కిం యూనివర్సిటీలోని అంత రించిపోతున్న భాషల కేంద్రం తీసుకుంది. ఈ కేంద్రాన్ని 2016లో స్థాపించారు.
-జిఎన్‌వి సతీష్‌

గృహ హింస బాధితులకు రక్షణ నిచ్చే చట్టాలు

మన దేశంలో స్త్రీల పైన హింస రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. న్యాయ వ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా.. హింసకు గురయ్యే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. చాలామందికి తమకు చట్టం సహాయం చేస్తుందన్న విషయం కూడా తెలీదు. అందుకే దాన్ని భరిస్తూ ఉండిపోతారు. ఇలాంటి వారిలో గృహ హింస బాధితులు ఎక్కువ మంది ఉంటారు. కొందరు కుటుంబ గౌరవం కోసం, మరికొందరు బయటకు వస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటి అని ఇలా రకరకాల కారణాలతో వారు గృహ హింస ను భరిస్తుంటారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. హింసను భరించిన కొద్దీ అది పెరుగుతూ పోతుంది. ఒక రోజు మన జీవితాన్నే నాశనం చేస్తుంది. అందుకే మొదటిసారి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే చట్టాల సాయంతో మీ కుటుంబ సభ్యులను మార్చుకునే ప్రయత్నం చేయాలి. గృహ హింస బాధితులకు చట్టం ఎలాంటి సహకారం అందిస్తుందో తెలుసుకుందాం..!- (రుచిరా గోస్వామి)
మహిళలకు వ్యతిరేకంగా అన్ని రూపా ల్లో జరుగుతున్న హింసను నిర్మూలించడానికి ఏర్పడిన అంతర్జాతీయ దినోత్సవానికి (నవంబర్‌, 25) కొన్ని రోజుల ముందు ఒక యువతిని తన జీవిత భాగస్వామి అనాగరికంగా హత్య చేసి, అవయవ విహీనురాలిని చేశాడు. ఈ సంఘటన, ‘ఆప్తుడైన భాగస్వామి హింస’వైపు దృష్టిని మర ల్చింది.‘ప్రొటెక్షన్‌ ఆఫ్‌ విమన్‌ ఫ్రమ్‌ డొమెస్టిక్‌ వయోలెన్స్‌ యాక్ట్‌ 2005’ (పీడబ్ల్యూడీవీఏ)చట్టం వర్తించే గృహ హింసగా కూడా దీనిని గుర్తించారు. ఆమె అతడ్ని ఎందుకు ఎంపిక చేసుకుంది? అతడ్ని ఎందుకు వదిలేయలేదు?లాంటి అనేకరకాల ప్రశ్న లు తలెత్తుతున్నాయి.భారతీయ చట్టాల నిబంధనల ప్రకారం గృహహింస శిక్షార్హమైననేరం.ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా. అయిన ప్పటికీ,18-49 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 32శాతం మంది వివాహిత మహిళలకు వ్యతిరేకంగా హింస కొనసాగుతున్న సమాజంలో మనం బతుకుతున్నా మని ఇటీవల జరిగిన ‘నేషనల్‌ ఫ్యామిలీహెల్త్‌ సర్వే-5’ నివేదిక తెలియజేస్తుంది. ఈ మహిళలు, వారి భర్తలు పాల్పడుతున్న భావోద్వేగపూరితమైన, భౌతిక,లైంగిక హింసలకు గురవుతున్నారు.ఈ గృహ హింసలను అనుభవిస్తున్న వారిలో పట్టణ ప్రాంత మహిళలకంటే గ్రామీణ ప్రాంత మహిళలే ఎక్కువ గా ఉన్నారు.ఈసర్వే ఇతర కుటుంబ సభ్యులు పాల్ప డే హింసపైదృష్టిని కేంద్రీకరించడంలేదు. పదిహేడు సంవత్సరాల క్రితం,ప్రగతిశీల చట్టమైన పీడబ్ల్యూ డీవీఏను ఆమోదించారు.భర్తల నుండి మాత్రమేకాక ఇతర కుటుంబ సభ్యుల హింసనుంచి కూడా మహి ళలకు మద్దతుగా,రక్షణగాఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఈచట్టం హామీ ఇచ్చిం ది. కానీ,ఈ చట్టం కాగితాలపై ఉన్నప్పటికీ, ఇప్పటికీ మహిళలు ఆచట్టం అమలుకు చేరువలో ఉండలేక పోతు న్నారు. దాని హామీలు,నిబంధనలు అసమానం గా అమలవుతూ,భారతీయ మహిళలకు అందు బాటులో లేకుండా పోతున్నాయి.అత్యంత నిరుత్సా హమైన వాస్తవమేమంటే,మూడిరట ఒకవంతు మహిళలు గృహహింస కారణంగా ఇబ్బంది పడు తున్నప్పటికీ, గృహహింసను అనుభవిస్తున్న వారిలో కేవలం 14శాతం మంది మాత్రమే సహాయాన్ని కోరుతున్నారు.ఈసంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా తక్కువగా ఉంటుందని నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేనివేదిక తెలుపుతుంది.
గృహ హింస అంటే..
ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే లేదా గాయపరిచే ప్రమాదానికి గురి చేసే ఎలాంటి చర్య అయినా గృహహింస కిందకే వస్తుంది. అవతలి వ్యక్తి మిమ్మల్ని శారీరక, మానసిక,ఆర్థిక, లైంగిక దాడుల్లో దేనికి గురి చేసినా అది గృహహింస కిందకే వస్తుంది.ఇలాంటి హింసకు గురవుతున్న వారు ముఖ్యంగా మహిళలకు చట్టం చాలా రక్షణ కల్పిస్తుంది.
కేసు ఎలా ఫైల్‌ చేయాలంటే..
గృహహింసకి గురైన మహిళ స్థానిక మహిళా కోర్టు,మహిళా పోలీస్‌ స్టేషన్‌ లేదా ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వద్ద తనపై జరిగిన హింస గురించి వివరిస్తూ కేసుఫైల్‌ చేయవచ్చు.నిందితులపై కేవలం క్రిమినల్‌ కేసులు మాత్రమే కాదు..సివిల్‌ కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది.
ఇన్సిడెంట్‌ రిపోర్ట్‌ అంటే..
గృహ హింస బాధితులు కేసు ఫైల్‌ చేయగానే ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఎంక్వైరీ ప్రారంభిస్తారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి దగ్గర సమాచారం సేకరించి..ఆ తర్వాత జరిగిన సంఘ టనల గురించి సాక్షులను ప్రశ్నించి రిపోర్ట్‌ తయారు చేస్తారు. ఈ రిపోర్ట్‌ నే ఇన్సిడెంట్‌ రిపోర్ట్‌ అంటారు.
గృహ హింస బాధితులకు సాయం చేసే చట్టాలు..
గృహ హింస బారిన పడిన మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం 2005లో గృహ హింస నిరోధక చట్టం తీసుకొచ్చింది.అంతేకాదు.. సెక్షన్‌ 498ఎ,406,323,354 ల ప్రకారం గృహ హింస కేసులో నిందితులకు శిక్ష పడుతుంది.ఈ నిందితుల్లో ఆడవారు ఉంటే వారిపై కూడా ఈ చట్టం ద్వారా శిక్ష అమలు చేసే వీలుంటుంది.
ఎవరికి రక్షణ ఉంటుంది?
కేవలం వివాహం అయిన మహిళలకే కాకుండా లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉండేవారికి కూడా గృహహింసచట్టం రక్షణకల్పిస్తోంది. పెళ్ల యిన లేదా లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్న స్త్రీని ఇల్లు వదిలి వెళ్లిపోవాలని హింసించడం కూడా గృహహింస కిందకే వస్తుంది.ఈచట్టం కింద ఎల్‌ జీబీటీ లకు కూడా రక్షణ ఉంటుంది.
ఎలాంటి సాక్ష్యాలు అవసరం..
గృహ హింస జరిగిందని నిర్ధారించేందుకు దాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి వాంగ్మూలం,డాక్యు మెం టరీ ప్రూఫ్‌,ఆడియో,వీడియోప్రూఫ్‌వంటివి సాక్ష్యా లుగా పనికొస్తాయి.
మగవారు గృహ హింసకి గురైతే ఏం చేయాలి?
మగవారిపై కూడా గృహ హింస జర గొచ్చు.ఇలాంటప్పుడు వారు వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసి %ఖీIR% కాపీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మెడికల్‌ డాక్యుమెంట్స్‌ వంటి ఆధారాలు కూడా సమర్పిం చాల్సి ఉంటుంది.
498ఎకి గృహహింస చట్టానికి మధ్య తేడా ఏంటి?
గృహహింసచట్టం అనేది కేవలం వరక ట్నం కోసమే కాకుండా ఎలాంటి సందర్భాల్లో అయినా..ఎందుకోసమైన ఒకవ్యక్తి తన కుటుంబం లోని మరోవ్యక్తి ముఖ్యంగా స్త్రీలను హింసిస్తే వారికి వర్తించే చట్టం.మానసికంగా,శారీరకంగా,ఆర్థికం గా, సామాజికంగా ఎలా హింసించినా అది గృహ హింస కిందకే వస్తుంది.ఒక స్త్రీవరకట్నం తీసుకురా వాలని డిమాండ్‌ చేస్తూ అది తీసుకురానప్పుడు హింసిస్తే దానికి 498ఎ కింద కేసు నమోదు చేస్తారు.
గృహహింస వెంటాడుతూనే వుంది…
పరిస్థితులు మారతాయి. ఆ పరిస్థితులు తమ భర్తల ప్రవర్తనను మార్చుతాయని మహిళలు ఆశించారు.ఇతరులకు, ముఖ్యంగా తమ కుటుం బాలకు ‘భారం’ కావడానికి మహిళలు ఇష్టపడలేదు. ‘మా అమ్మకుచాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆమె కంటూ స్వంతజీవితం ఉంటుంది.అందువల్ల ఆమె ఇబ్బందులకు నా ఇబ్బందులు తోడవడం నాకిష్టం లేదు’వంటి సమాధానాలు వారి నోటెంట వచ్చాయి. తామెదుర్కొన్న హింసనునిర్దిష్టంగా చెప్పడం ద్వారా, వారి కుటుంబాలకు ఒక ‘సమస్య’గా లేదా ‘మానసిక వ్యధ’కు కారణంగా మారకూడదని…వారి కుటుం బాలకు తలవంపులు, అగౌరవం తేకూడదని… గృహహింస నుండి బయటపడిన మహిళలు విద్యా స్థాయి,కులం,వర్గంతోనిమిత్తం లేకుండా భావిస్తు న్నారు.భారతీయ చట్టాలు, నిబంధనల ప్రకారం గృహహింస శిక్షార్హమైన నేరం.ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా.అయినప్పటికీ,18-49 సంవత్స రాల మధ్య వయసులో ఉన్న 32శాతం మంది వివాహిత మహిళలపై హింస కొనసాగుతున్న సమాజంలో మనం బతుకుతున్నామని ఇటీవల జరిగిన‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5’ నివేదిక తెలియజేస్తుంది.
సహాయం కోరడానికి సంబంధించి ….
గృహహింసకు గురైన మహిళలు సహా యం కోరే విషయంలో రెండు రకాలుగా స్పందిస్తు న్నారు. మొదటిది,హింస జరిగిన ఆరు నెలల్లోపు చెప్పేవారు. రెండవది హింస జరిగిన ఐదు సంవ త్సరాలు లేదా ఆతర్వాత చెప్పేవారు.మొదటి సమూహానికి చెందిన మహిళలు సహాయం కోసం తమ తల్లిదండ్రుల దగ్గరకెటళ్ళారు. భర్తతో సర్దుకుని పోవడం ద్వారా కుటుంబాన్ని/సంసారాన్ని కాపాడా ల్సిందిగా తమ కుమార్తెలను ఒత్తిడి చేసిన కేసులు అనేకం.‘కుటుంబసంతోషం’కంటే కూతురు క్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిన కేసులు తక్కువగా నమోద య్యాయి. అలాంటి కేసుల్లో మధ్యవర్తిత్వం వహించే చర్యలు చేపట్టడం లేదా తెగతెంపులు చేసుకోవడం జరిగాయి.సమస్య పరిష్కారానికి పోలీసులు, లాయ ర్లను కలవడంలాంటివి చాలాఅరుదుగా జరిగాయి.
గృహహింసకుగురై దాని నుండి బయట పడిన చాలా కాలానికి సహాయంకోరే వారి విష యానికి వస్తే…హింసకు సాక్షులుగా ఉన్న బంధు వులు, ఇరుగు పొరుగు వారి (పరిస్థితులను మార్చ డంలో) ప్రాధాన్యత చాలానే వుంది. బాధితురాలి పిల్లల సంరక్షణ, భర్త వివాహేతర సంబంధాన్ని గుర్తించడం,హింస తీవ్ర స్థాయిలో వున్నప్పుడు వైద్య సహాయం అందించడంలో వారి పాత్ర చాలా కీలకంగా వుంది. స్తి యాజమాన్యానికి సంబంధిం చిన పితృస్వామిక నిబంధనలు, ఆర్థిక అభద్రత కారణంగా తెగతెంపులు చేసుకునే విషయమై ఎదురైన మానసిక సంఘర్షణల కారణంగానే… బాధితురాలు సహాయం కోరడానికి అంతకాలం ఎదురుచూసి ఉంటుంది. స్త్రీపురుష అసమానతల విషయంలో సామాజిక నియమాలు ఎంత లోతుగా పాతుకుపోయాయంటే భార్యను కొట్టే విషయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సమర్థిస్తారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదిక తెలియ జేస్తున్నది.‘మామీద పెట్టేషరతులు ఎలా వుంటా యంటే… మేము ఎలాంటి బాధను గురించైనా ఫిర్యాదు చెయ్యలేనంత కష్టంగా ఉంటాయ’ని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహిళ చెప్పింది. బాధిత మహిళలు తాము ఎదుర్కొన్న గృహహింస గురించి మిత్రులు, బంధువులకు చెప్పుకున్న తర్వాత ‘ఉపశమనం పొందినట్లు,భారమంతా తగ్గినట్లు, పరిస్థి తులు మారిపోతాయానే ఒకకొత్త ఆశకలిగిన భావన పొందినట్లు చెప్పారు. మహిళలుగృహహింస గురించి ఇతరులతో పంచుకోవాలని అనుకోవడమే వారు తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. సాయం,మద్దతు పొందడంలో వారు అనిశ్చితి, భయం,నిరాశ,నిస్పృహలకు లోనుకావాల్సి వచ్చింది. భారతదేశంలో ఉన్న వాస్తవపరిస్థితి ఏమంటే అనేక మంది మహిళలు తమ గోడును వెళ్ళబోసుకోడానికి ఎటువంటి వేదిక లేదు. కేవలం ధనవంతులైన కొందరు మహిళలు, స్వచ్ఛంద సంస్థలతో సంబంధా లు కలిగి ఉన్న కొద్దిమంది మహిళలు మాత్రమే కోర్టుల ద్వారా న్యాయం కోసం ప్రయత్నం చేశారు. కొత్త నైపుణ్యాలను, జీవనాధార అవకాశాలను సాధించడం ద్వారా ఆర్థిక స్వావలంబన పొంద డంతో గృహహింస బాధితు లు కొంతవరకు తమ పరిస్థితులను మార్చుకోగలుగుతారు. పోలీసుల పాత్ర
తాము ఎదుర్కొన్న గృహహింస గురిం చి పోలీసులకు చెప్పినప్పుడు వారు స్పందించిన తీరు పట్ల మహిళలు పెదవివిరిచారు.ఏదో కొద్ది మంది అనుకూలమైన ఫలితాలు పొందినప్పటికీ…’ హింసకు పరిష్కారం చూపడం కంటే కూడా అసలు సమస్యలో పోలీసుల పాత్ర ఎక్కువైంద’ని మేము ఇంటర్వ్యూ చేసిన మెజారిటీ మహిళలు చెప్పారు. పోలీసులే బాధిత మహిళలను హింసకు పాల్పడిన వారితో రాజీ చేశారు. వారిని తిరిగి అదే ఇళ్లకు పంపించారు. అధికారికంగా ఫిర్యాదు నమోదు చెయ్యకుండా లేదా పిడబ్ల్యుడివిఎ మార్గదర్శకాల ప్రకారం సంరక్షణ అధికారులకు అప్పజెప్పకుండా హింసకు పాల్పడిన వారిపై హింసను ప్రయోగించి నట్లు మేము అనేక రాష్ట్రాల్లో విన్నాం.సిబ్బంది కొరత కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పితృస్వా మిక భావజాల ప్రయోజనాలనే ప్రభుత్వం నెరవేరు స్తుందన్న విషయం మహిళలకు తెలుసు. చట్టాలు వున్నప్పటికీ…బాధితలను తిరిగి గృహహింసకు కారణమైన కుటుంబాలకే అప్పజెప్తున్నారు. ఇది నేడు మహిళలపై జరుగుతున్న అతి పెద్ద నేరం.
భారత్‌లో 29శాతం మహిళలకు తప్పని హింస
భారత్‌లోస్త్రీలపై హింస రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఎన్ని చట్టాలు వస్తున్నా వారిపై దాడులు మాత్రం తగ్గడం లేదు. చాలా మందికి తమకు చట్టం సహాయం చేస్తుందని తెలియక ఆ హింసను భరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహిళలపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఓ నివేదికను వెల్లడిరచింది. ఆ నివేదిక ప్రకారం, భారతదేశంలో 29శాతం మహిళలు (18-49 ఏళ్ల మధ్య) గృహ హింసను ఎదుర్కొంటున్నారు. దీని ప్రకారం కర్ణాటకలో 44.4శాతం,బీహార్‌లో 40%, మణిపూర్‌లో39.6శాతం,తమిళనాడులో 38 శాతం,తెలంగాణలో36.9శాతంమంది మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నట్లు నివే దించింది.అయితే లక్షద్వీప్‌(1.3శాతం),గోవా (8.3శాతం), కేరళ(9.9శాతం),సిక్కిం (12శాతం) , మేఘాలయ (16శాతం) మహిళలపై అతితక్కువ గృహ హింస ను ఎదుర్కొంటున్నట్లు తేలింది.
పురుషులూ వేధింపులకు గురవుతారు…
గృహహింసకు సంబంధించిన కేసులో కొన్ని నెలల క్రితం మద్రాస్‌ హైకోర్టు పురుషులు కూడా గృహహింసకు గురవుతారా అనేప్రశ్న లేవ నెత్తింది. ఇటీవల,దీనికి ఒక ఉదాహరణ కూడా కనిపించింది. హర్యానాలోని హిసార్‌కు చెందిన ఒకవ్యక్తి తనభార్యను హింసించిన కారణంగా 21 కిలోల బరువు తగ్గాడు. దీనిఆధారంగా, అతను హైకోర్టు నుండి విడాకుల ఆమోదం పొందాడు. ఇలాంటి కేసులుఇటీవల పెరుగుతున్నాయి. పురు షులపై హింస జరుగుతుందని చాలామంది అను కోవడం కూడా నమ్మశక్యం కాదు.కారణం,పురు షులుఎప్పుడూ బలంగా,శక్తివంతంగా భావి స్తారు. కానీ,కుటుంబ వివాదాలను పరిష్కరించ డానికి అన్ని కౌన్సెలింగ్‌ కేంద్రాల గణాంకాలు పురుషులు కూడా మహిళలపై వేధింపులకు గురవుతున్నారన డానికి నిదర్శనం. గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులలో40శాతం పురుషుల నుండి వచ్చినవే. విడాకులు మాత్రమే మహిళలకు ఏకైక ఎంపిక అని కూడా తెరపైకి వచ్చింది. అయితే పురుషులు కౌన్సెలింగ్‌కి ప్రాధాన్యతనిస్తారు. అంటే, కౌన్సెలింగ్‌ ద్వారా లేదాఏవిధంగానైనా పురుషులు సంబం ధాన్ని కొనసాగించాలనుకుంటున్నారు.
గృహహింస చట్టం నుండి రక్షణ పురుషులకు ఉండదా?
నేషనల్‌ క్రైమ్‌రికార్డ్స్‌ బ్యూరో (చీజRదీ) నివేదిక ప్రకారం, మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి కుటుంబంలో కొనసాగు తున్న విభేదాలు, సంబంధాలవల్ల తలెత్తే డిప్రెషన్‌ కూడా. అదే సమయంలో, 2019 సంవత్సరంలో ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ కమ్యూనిటీ మెడిసిన్‌’ పరిశోధన ప్రకారం, హర్యానా గ్రామీణ ప్రాంతాల్లో 21-49 సంవత్సరాల వయస్సు గల1000 మంది వివాహిత పురుషులలో,52.4 శాతం మంది లింగ ఆధారిత హింసను అనుభవించారు. ఈగణాంకాలను చూస్తే,లింగం, కులం,మతం ఆధారంగాఎలాంటి వివక్షను రాజ్యాం గం అంగీకరించనప్పుడు, గృహహింస నుండి రక్షణ చట్టం పురు షులకు ఎందుకు రక్షణ కల్పించదు? అభివృద్ధి చెందిన దేశాలలో లింగరహిత చట్టం మహిళల వంటి గృహ హింస నుండి పురుషులను రక్షించడమే కాకుండా,పురుషులు కూడా వేధిం పులకు గురవుతున్నారని గుర్తించిచట్టపరమైన రక్షణ కల్పిం చాయి. (‘ద హిందూ’ సౌజన్యంతో) (వ్యాసకర్తలు ‘సర్వైవింగ్‌ వయొలెన్స్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌’లో సభ్యులు),ఫిలిప్పా విలియమ్స్‌,స్వర్ణ రాజగోపాలన్‌ గిరిజా గాడ్బోలే, .)

క్షీణిస్తున్న వలస కార్మికుల హక్కులు

అత్యధిక మంది వలస కార్మికులు వ్యవసాయం, పరిశ్రమలు, నిర్మాణ రంగాలలో కనిపిస్తారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 10 శాతం వలస కార్మికుల శ్రమ నుండే వస్తోంది. అయితే,వలస కార్మికులు ఎంత మంది వున్నారు?వారు ఏ రంగంలో పని చేస్తున్నారు? ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్తున్నారు? తెలుసు కునే వ్యవస్థ లేదు. పర్మినెంట్‌ వర్కర్ల కంటే ఏడు రెట్లు అధికంగా వలస కార్మికులు వున్నట్లు జాతీయ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దుర్బలమైన, ప్రమాదకరమైన, ఎటువంటి భద్రత లేని పరిస్థితులు ఈ రంగంలో నెలకొన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 45 కోట్ల 60 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో 41 శాతం మంది తమంతట తాముగా వలస కార్మికులుగా మారలేదు. తమ ప్రాంతాలలో నెలకొన్న నిరుద్యోగం వలస వెళ్ళాల్సిన పరిస్థితికి నెట్టింది. వీరి జనాభా లెక్కలు సరిగా వుండవు. వాటి మీద ఆధార పడలేం. ఐక్యరాజ్యసమితిలో భాగంగా ఉన్న విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ 2013లో దేశంలో అంతర్గతంగా తిరిగే వలస కార్మికులు కోటిన్నర నుండి 10 కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఏరకంగా చూసినా భారతదేశంలో వలస కార్మికులు అసంఘటిత రంగంలో అత్యధికంగా ఉన్నట్లు తేలుతుంది. అందుకని వీరి పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా పేదరికం,దుర్బలత,అభద్రత, ఉద్యోగంలో పెట్టుకునే పద్ధతికి…ఈ కార్మి కుల సామాజిక స్థాయికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోవాలి.ఈ కార ణంగా వీరు ప్రమాదకరమైన,అతి తక్కువ వేతనాలున్న పనులను చేయాల్సి వస్తోంది. కుల,లింగ వివక్షలను ఎదుర్కొం టున్నారు. కీలక రంగాలైన వ్యవసాయం,పరిశ్రమలు, నిర్మాణ రంగాల కార్యకలా పాలు వీరు లేనిదే నడవవు. కానీ వీరి కనీసభద్రత, న్యాయమైన వేతనాలను పట్టించుకునే దిక్కులేదు. వలస కార్మికులకు వర్తించే ప్రస్తుత చట్టాలు లేబర్‌ కోడ్లలో భాగం కాను న్నాయి. లేబర్‌ కోడ్‌లు అమలులోకి వచ్చే లోపు ‘అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల (పని మరియు సర్వీసు కండిషన్ల క్రమబద్ధీకరణ) చట్టం-1996, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం-2008 అమలులో వుంటాయి.కోవిడ్‌ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న విషాదకర పరిస్థితులను, ఆరోగ్య-సామాజిక భద్రతా వైఫల్యాలను గమనించిన అత్యున్నత న్యాయస్థానం తనంత తానుగా వీరితరపున కేసు తీసుకొని అనేక నిర్ధారణలకు వచ్చింది. అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌కు ‘ఈ-శ్రమ’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. 2021 డిసెంబర్‌ ఆఖరు లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు/వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ‘ఈ-శ్రమ’ రిజిస్ట్రేషన్‌కు కార్మికుల నుండి స్పందన చాలా పరిమితంగా వుంది. అందులో వారికి ఎలాంటి ప్రయెజనం కనపడకపోవడం అందుకు కారణం. పైగా ‘ఈ-శ్రమ’ నెట్‌ సౌకర్యంతో కూడుకున్నది కావడంతో కార్మికులు దీనిలో తమంత తాముగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు. ఇప్పటికే నిర్మాణ (సెస్సు-సంక్షేమ పథకాలు), వ్యవసాయ రంగాలలో (రైతు బంధు పథకం) పరిమితమైన ఇతర పథకాలు ఉన్నాయి. 140 రకాల వృత్తులలో కార్మికులు పనిచేస్తున్నట్లుగా గుర్తించామని మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ తాము ఏ రకమైన సామాజిక భద్రతను ప్రవేశపెట్టేదీ ఇంత వరకు నిర్ణయించలేదు. ‘ఈ-శ్రమ’ లో రిజిస్ట్రేషన్‌కు ఇ.పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ ఉన్న వారు అర్హులు కారు. సంఘటిత రంగంలో పని చేసే లక్షలాది మంది కాంట్రాక్టు వర్కర్లు, చిన్న మధ్యతరహా సంస్థల్లో పని చేసే కార్మికులకు ఈ రెండూ ఇప్పటికే ఉంటాయి. కాబట్టి వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు. వలస కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ‘వలస కార్మికుల చట్టం-1979’ రద్దును ప్రకటించింది. దీనికి బదులుగా వచ్చేటటువంటి కోడ్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల కష్టాలను పెంచుతుంది. 1979 చట్టం యజమానులకు, కాంట్రాక్టర్లకు, సబ్‌ కాంట్రాక్టర్లకు నిర్ద్ఱేశిత ఆదేశాలు ఇచ్చింది. కాంట్రాక్టు కార్మికులను పెట్టుకోవాలంటే ముందుగా వీరు రిజిస్టరై ఉండాలి. ప్రతి వలస కార్మికుని సమాచారాన్ని, వారికి చెల్లించే వేతనాల వివరాల నమోదును స్పష్టీకరించింది. ఇవన్నీ ఇప్పుడు కోడ్‌లో లేవు. ఇటీవల అగ్ని ప్రమాదాలలో కార్మికులు చనిపోయినప్పుడు వారి గుర్తింపుకు వ్యక్తిగత రికార్డులు లేకపో వటం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. వారు పలానా వారు అని గుర్తించటానికి వంశీకుల డిఎన్‌ఎ లను పరీక్షించాల్సి వచ్చింది. యజమానులు తమ దగ్గర ఉన్న వలస కార్మికుల నియామకం,నమోదు,రవాణా, నివా సం,కనీస వేతనం, కాలనుగుణ వేతనాలు తదితర సమాచారాన్ని తప్పకుండా నిర్వహిం చాలని 1979 చట్టం నిర్దేశించింది.వేతనాల చెల్లింపు, ఆరోగ్య సౌకర్యాల కల్పన, పని ప్రదే శంలో రక్షణ కల్పించే డ్రస్సులు, మంచినీటి సౌకర్యం, క్యాంటిన్‌, మరుగుదొడ్లు, విశ్రాంతి గదుల ఏర్పాటు, ప్రయాణ ఖర్చులను గ్యారంటీ చెయ్యటానికి-అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా లైసెన్సింగ్‌ అధికారి తీసుకుంటారు. కాంట్రాక్టర్లుగానీ, ముఖ్య యజమాని గానీ వేతనాలు చెల్లించక పోతే ఈ నిధి నుండి చెల్లిస్తారు.ఈ హామీలను లేబర్‌ కోడ్‌లో ఉపసంహరించారు.1979 చట్టంలో ఇంకొక ముఖ్యమైన నిబంధన ప్రకారం వలస కార్మికులు పారిశ్రామిక వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని…తాము పనిచేసే ప్రాంతాలు, స్వస్థలాలు రెంటిలోనూ వినియో గించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా వలస కార్మికులకు వర్తించే ఇటువంటి 4చట్టా లను కూడా కోడ్‌ ఒక్క కలం పోటుతో స్వాహా చేసింది. వీధి వ్యాపారులతో సహా అందరికీ సామాజిక భద్రత కల్పించబడు తుందని కేంద్ర కార్మిక మంత్రి ప్రకటిం చారు. ఇంత వరకు దానికి సంబంధించిన ఎటువంటి పథకం తయారు కాలేదు. కానీ వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ పరిమితి 5 నెలల నుండి 10నెలల వరకు పొడిగించారు. రిజిస్ట్రేషన్‌ వలన వలస కార్మికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పెద్ద సంఖ్యలో వలస కార్మికుల హక్కులు నిరాకరించ బడ్డాయి. అంతకు ముందున్న అనేక సౌకర్యా లను వలస కార్మికులు కోల్పోతారు.
కార్మికుల చట్టాలు ఇవీ…

  1. పనిగంటలు ఎనిమిదికి తగ్గింపు
  2. లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం
  3. వేతన చెల్లింపు చట్టం
  4. కనీస వేతనాల చట్టం
  5. ఉద్యోగుల వేతన సవరణ చట్టం
  6. భారత కర్మాగారాల చట్టం
  7. భారత కార్మిక సంఘ చట్టం
  8. కార్మికుల పరిహార చట్టం
  9. కార్మికుల రక్షణ చట్టం
  10. ప్రసూతి ప్రయోజనాల చట్టం
  11. కార్మిక రాజ్య బీమా(ఈఎస్‌ఐ) చట్టం
  12. మహిళలు,బాల కార్మికుల రక్షణ చట్టం
  13. బొగ్గు గనుల కార్మికుల భవిష్య నిధి, బోనస్‌ చట్టం
  14. మహిళా కార్మికుల సంక్షేమ నిధి
  15. బొగ్గు గనుల్లో భూగర్భ పనుల్లో మహిళల నియామకంపై నిషేధం పునరుద్ధరణ
  16. వేతనంతో కూడిన సెలవులు
  17. సామాజిక భద్రత
    పనిగంటలు ఎందుకు తగ్గించారంటే…
    పనిగంటలను 12 నుంచి ఎనిమిదికి తగ్గించాలని 1942 నవంబరు 27న దిల్లీలో తన అధ్యక్షతన నిర్వహించిన నాలుగో భారత కార్మిక సదస్సులో అంబేడ్కర్‌ తొలిసారిగా ప్రతిపాదించారు.1945 నవంబరు 27,28 తేదీల్లో జరిగిన ఏడో సదస్సు కర్మారాగాల్లో వారానికి 48 గంటల పని విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సదస్సు లో కేంద్ర, ప్రావిన్షియల్‌ ప్రభుత్వాలు, యాజ మాన్య సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అధిక పనిగంటలతో కార్మికుడికి తగినంత వ్యక్తిగత సమయం లేకుండా చేయడం సరికాదని కార్మిక శాఖ తన మెమోరాండంలో చెప్పింది. వ్యక్తిగత ఎదుగుదలకు, శారీరక సామర్థ్యం పెంపునకు కార్మికులకు వ్యక్తిగత సమయం అవసరమని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కార్మికులు తీవ్రమైన పని ఒత్తిడికి లోనయ్యారని, వారికి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉందని, పనిగంటల తగ్గింపునకు ఇది సరైన సమయమని ఆ సందర్భంగా వివరించింది. తక్కువ పనిగం టలతో ఉపాధి పెరుగుతుందని కూడా చెప్పింది. పనిగంటల తగ్గింపునకు అను గుణంగా వేతనాల తగ్గింపునకు, డీఏ తగ్గింపు నకు(ధరలు పడిపోతే తప్ప) వీల్లేదని మెమో రాండం స్పష్టం చేసింది. పనిగంటలు, సామాజిక భద్రత ఇప్పుడెలా ఉన్నాయి? పనిగంటలు, కార్మికుల సంక్షేమం ఇప్పుడెలా ఉన్నాయనేదానిపై ‘ఫోరమ్‌ ఆఫ్‌ ఐటీ ప్రొఫెష నల్స్‌(ఫర్‌ఐటీ)’ అధ్యక్షుడు కిరణ్‌ చంద్రను సంప్రదించగా- నేటి తరం పరిశ్రమలతో ‘ఎని మిది గంటల పని, ఎనిమిది గంటల నిద్ర, ఎనిమిది గంటల సామాజిక జీవనం’ అనే విధానం గందరగోళంలో పడిపోయిందని విచారం వ్యక్తంచేశారు. ఇప్పడు ఉద్యోగుల్లో అత్యధికులకు పని ప్రదేశానికి వెళ్లి వచ్చేందుకే కనీసం నాలుగు గంటలు పడుతోందని, ఇలా పనిగంటలు 12కు పెరిగాయని చెప్పారు.
    ‘వెట్టిచాకిరీగా మారింది’
    గృహవసతి,ఆరోగ్యం, విద్య విషయాల్లో సామాజిక భద్రత కొరవడటంతో ఉద్యోగమనేది వెట్టిచాకిరీగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.ఐటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఆధ్వర్యంలో రెండేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలితాలిస్తోందని, పరిస్థితిలో మార్పు వస్తోందని కిరణ్‌ ఆశా భావం వ్యక్తంచేశారు. నేటి తరం కార్మిక వర్గం సంఘటితమవుతోందని, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తోందని తెలిపారు.
    కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయుడు అంబేడ్కరే
    విధాన స్థాయిలోనే కాకుండా రాజకీయ స్థాయిలోనూ అంబేడ్కర్‌ కార్మిక సంక్షేమానికి కృషి చేశారు. కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయ నాయకుడు ఆయనే.1936 ఆగస్టులో అంబేడ్కర్‌ ‘ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ(ఐఎల్‌పీ)’ని స్థాపించారు. తమది కార్మి కుల పార్టీ అని ఐఎల్‌పీ ప్రకటించుకొంది. కార్మిక వర్గాల సంక్షేమమే పరమావధిగా కలిగిన కార్మిక సంస్థగా ఐఎల్‌పీ 1937లో వెలువరించిన విధానపత్రంలో తనను తాను అభివర్ణించుకొంది. 1937లో జరిగిన ప్రావిన్సి యల్‌ ఎన్నికల్లో ఐఎల్‌పీ 17స్థానాల్లో పోటీచేసి,14 చోట్ల విజయం సాధించింది. పోటీచేసిన 13 రిజర్వుడు స్థానాల్లో 11చోట్ల, పోటీచేసిన నాలుగు జనరల్‌ సీట్లలో మూడు చోట్ల గెలిచింది.
    కోణార్క్‌ ఎక్స్‌ ప్రెస్‌
    ‘‘బతుకు తెరువు కోసం తమిళనాడు, కేరళ, కర్ణాటక,ఒడిశా,గుజరాత్‌,మహారాష్ట్ర వంటి చోట్లకు వెళ్తాం.నేనే కాదు,మా ఊళ్లో చాలా మందిమి వెళతాం.ఇంకే చేయాలి? ఇక్కడ చేపల పట్టే వసతుల్లేవు. ఇక్కడుంటే బతకలేం. మేం వలస వెళ్లాల్సిందే’’ అని శ్రీకాకుళం జిల్లా వాసి చెప్పారు. మత్స్యకారులే కాదు,చాలా కులాల వారు ఇలా వలస వెళ్తుంటారు. 2021-22 ప్రభుత్వ లెక్కల ప్రకారం వ్యవసాయం, పరిశ్రమలు, రెండిరటిలోనూ శ్రీకాకుళం, విజయనగరం బాగా వెనుకబడి ఉన్నాయి. ఈ రెండు జిల్లాలనూ ఆర్థికంగా వెనుకబడ్డ జిల్లాలుగా నీతి ఆయోగ్‌ గుర్తిం చింది.కానీ,ఈ జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులు కేంద్ర రాష్ట్ర రాజకీయాల మధ్య ఇరుక్కుపోయాయి. బతుకుదెరువు కోసం మన దేశ, విదేశాలకు వెళ్లిపోతున్న శ్రీకాకుళం జిల్లా లోని లొడ్డపుట్టి గ్రామస్తులను కలవడానికి వెళ్లాము. తమ గ్రామస్తులు ప్రపంచంలోని ప్రతిదేశంలోనూ ఉన్నారని చెప్పారు. విదేశాలకు వలసవెళ్లి అక్కడ పనులు చేస్తున్న కొంత మందితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడిర చారు. ఇక్కడి వారు భవన నిర్మాణంలో నైపు ణ్యం కలిగిన వాళ్ళు. మన దేశంలో కన్నా ఇతరదేశాలలో తమ పనికి ఆదాయం మెరుగ్గా ఉండటంతో వీరంతా తమ కుటుంబానికి దూరంగా విదేశాలకు వెళ్లి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.33 ఏళ్ల శేఖర్‌ సింగ పూర్‌,దుబాయ్‌,అజర్‌ బైజాన్‌,రష్యా దేశాల్లో వెల్డర్‌గా పనిచేసి తిరిగొచ్చి సొంతూరిలో ఇల్లు కట్టుకున్నారు. (అమితవ్‌ గుహ)- వ్యాసకర్త : ఆలిండియా సిఐటియు సెక్రటరీ

గోండు రాజుల పాలనకు నిదర్శనాలు

ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనుల సంఖ్య ఎక్కువ. అందులో గోండు జాతీయుల సంఖ్య మరీ ఎక్కువ.. ఈ జిల్లాలో వివిధ రాజవంశీయుల పాలనా కొనసాగింది. అయితే గోండు జాతి ప్రజలు ఎవరి పాలనలోఉన్నా వారి సంప్ర దాయాలను, కట్టు బాట్లను, ఆచార వ్యవహారాలను కాపాడు కున్నారు. సిర్పూర్‌(టి) కేంద్రంగా ప్రారంభమైన వారి పాలన, వివిధ ప్రాంతాల్లో విస్తరించింది. క్రీ.శ.870 నుండి 1750 శతాబ్దము వరకు గోండ్వానా రాజ్యాన్ని గోండు రాజులు పరిపాలించారు.వీళ్ళు1350 శతా బ్దము నుండి 1600 శతాబ్దము వరకు స్వతంత్ర రాజులుగాను, ఆ తరు వాత1751శతాబ్దము వరకు సామంతరాజులుగాను,గోండ్వానా ప్రాంతాన్ని పరిపాలించారు. ఈభూభాగంలో దట్టమైన అడవి సంపద, విస్తారమైన ఖనిజ సంపద, సారవంతమైన నల్లరేగడి భూములు, అనేక రకాల చిరుధాన్యాలు , వాణిజ్య పంటలకు నిలయాలు.గోండ్వానా ప్రాం తము దక్షిణాన గోదావరి,పెన్‌గంగా వరకు ప్రాణహిత నదుల పరి వాహక ప్రాంతము నుండి ఉత్తరాన నర్మదా నది పరివా హక ప్రాంతము వరకు విస్తరించిన భూ భాగము. ఇది గోండు రాజులకు గుండెకాయ లాం టిది. క్రీ.శ.1895 కాలములోనే రాజ భీమ్‌బల్లాల్‌ సింగ్‌ గోండుల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారవ్యవహారాలకు పెద్దపీఠ వేసి వారిని సమీ కరించి ‘ సిర్‌పూర్‌’ కేంద్రముగా తన రాజ్య స్థాపన చేసాడు. ఆయన తర్వాత పరిపాలించిన గోండురాజులు హీరాసింగ్‌, కేసరిసింగ్‌, ధిన్కర్‌ షా,రామ్‌సింగ్‌,సూరజ్‌ భల్లాల్‌షా వీరిలో రాజ సూరజ్‌ భల్లాల్‌షా ‘‘ఢల్లీి’’ చక్రవర్తుల మెప్పు పొంది ‘‘శేర్‌షా’’ అనే బిరుదు పొందా డు.దక్షిణ మాండ్లాలోని గోండ్వానా ప్రాం తాన్ని కూడా బహుమతిగా పొందాడు. ఈయన కుమారుడు రాజా ఖాంద్యా భల్లాల్‌ షా సిర్‌పూర్‌ రాజధానిని ప్రస్తుత భల్లా ర్‌షాకు,ఆతర్వాత చాందాకు మార్చాడు (ప్రస్తుత చంద్రాపూర్‌).చాందా రాజధానిగా రాజా ఖాం ద్యా భల్లాల్‌షా10,000 గుఱ్ఱాలు,40,000 సైన్యం,వైరాగర్‌లో వజ్రాలగనులు కలిగి16 వ శతాబ్ద ప్రారంభము వరకు పరిపాలించాడు. కాకతీయ రాజుల పతనానంతరము గోండు రాజులు పెన్‌గంగా నది పరివాహక ప్రాంతానికి ఉత్తరాణ రాంటెక్‌,నాగపూర్‌ వరకు విస్తరిం చారు. క్రీ.శ.1412లో గోండ్వానా,బేతూల్‌ ప్రాం తంలోని ఖేరళా రాజ్యాన్ని పరిపాలించిన గోండు రాజు రాజనర్సింగు పై ఫిరోజ్‌షా బహ్మని దాడి చేసి మూడువందల (300) ఏనుగులను స్వాధీన పర్చుకొని తనకు సామంతరాజుగా చేసుకు న్నాడు.క్రీ.శ.1421లోఅహ్మద్‌షా బహ్మని గోం డ్వానాలో భాగమైన మహోర్‌ కోటపై ఐదువేల (5000) మంది సైనికులతో దాడిచేసి కలామ్‌ నగరాన్నిఅక్కడి ముత్యాలగనులను వశపర్చు కున్నాడు.బహ్మని సుల్తాన్‌ల కంటే ముందు ఉట్నూర్‌,బోథ్‌, కిన్వట్‌,ఆదిలాబాద్‌,రాజురా తాలుకాలు బీదర్‌లో భాగంగా గోండురాజులచే పరిపాలిం చబడినవి.నిర్మల్‌,లక్షెటిపేట,చెన్నూర్‌ తాలుకాలు మొదట కాకతీయరాజులు తర్వాతి బహ్మని సుల్తానులు ఆతర్వాత గోల్కొండ రాజులచే పరిపాలించబడినవి. సిర్‌పూర్‌, ఆసిఫాబాద్‌ తాలుకలు చాందా కేంద్రముగా గోండురాజుల పరిపాలనలో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నవి. క్రీ.శ.16051627 శతాబ్దములోనే మొగల్‌ చక్రవర్తి అయిన జహంగీర్‌ గోండురాజులకు వారి సరిహద్దు ప్రాంత గ్రామాలపై వారికి గల హక్కులు అధికారాలకు సంబంధించిన రాజపత్రాలు పేర సనద్‌లు జారీచేసారు. క్రీ.శ.1750లో జనగామ (ప్రస్తుత ఆసిఫాబాద్‌) గవర్నర్‌గా కొనసాగిన గోండురాజు రాజాచంద్ర అక్బర్‌షా కాలములోనే కొన్ని మోఖాసీ మరియు రాజుల కుటుంబాలు మధ్య భారత్‌ నుండి ఆదిలాబాద్‌ ప్రాంతానికి వలస వచ్చాయి. అటువంటి వారిలో ముఖ్యులు ఉట్నూర్‌ తాలుకా లక్కారం లోని ఆత్రం రాజావారి కుటుంబము, చాందా నుండి ఆసిఫాబాద్‌ తాలుకా తిర్యాణిలోని మడావి మోఖాసి వారి కుటుంబము, దేవ్‌గడ్‌ నుండి రొంపల్లిలోని పంద్ర మోఖాసీ వారి కుటుంబం నాగ్‌పూర్‌ నుండి వలస వచ్చారు. బోథ్‌ తాలుకా ఖరాత్వాడలోని దుర్వ మోఖాసీ కుటుంబము, మోవడ్‌లోమ ప్రాంతము నుండి కిన్వట్‌ తాలుకాలోని గేడాం మోఖాసీవారి కుటుంబము,మానిక్‌గడ్‌ నుండి లక్షెటిపేట్‌ తాలుకా వెంకట్రావ్‌పేటలోని ఆత్రం రాజావారి కుటుంబము,సీతాగొంది నుండి ఇంద్రవెల్లిలోని చహ్కటి రాజావారి కుటుంబము, అంకోలి నుండి అదేవిధంగా సిర్‌పూర్‌ తాలుకా తాండూర్‌కు బ్రహ్మణదేశ్‌ముఖ్‌లు మహోర్‌ ప్రాంతము నుండి వలస వచ్చి గోండుల వతన్లను స్వాదీనము చేసుకున్నారు. కాలక్రమేన గోండ్వానా ప్రాంతము 1751 నుండి 1773 వరకు మరాఠాలు ఆ తర్వాత నిజాం రాజుల ఆదీనములోనికి వచ్చాయి. గోండు రాజుల మధ్య ఐకమత్యము లేకపోవుట వారి నాయకత్వ లోపము వలన మొగలుల,మరాఠాల సైన్యము చేతిలో ఓడిపోయినారు. తర్వాత గోండు రాజులు వారి సామాజిక మరియు సాంస్కృతిక వ్యవహారాలకు సంబంధించిన సమస్యల పరిష్కా రానికి సరిపోయె మోఖాసీ గ్రామ పటేల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాని రాజకీయ వ్యవహారాలను అంతగా పట్టించు కోలేదు. దీనికితోడు 18వ శతాబ్ద చివరన మరియు 19వ శతాబ్ద ప్రారంభములో ఏర్పాటు చేసిన దేశ్‌పాండే, దేశ్‌ముఖ్‌ల వ్యవస్థ వలన గోండురాజులకు, మోఖాసీలకు తీరని అన్యా యం జరిగినది. ప్రభుత్వ వ్యవస్థలోకాని పరిపాలనలోకాని భాగం కాకుండా వారి సామాజిక మరియు మతపరమైన గ్రామ పెద్దలుగా గోండుల సమస్యలను పరిష్కరించే బాధ్యతలకు మాత్రమే పరిమితమైనారు. అందుకుగాను వ్వవసాయము చేసే ప్రతి కుటుంబము నుండి సంవత్సరానికి చిన్న మొత్తంలో ధనం, ధాన్యం రూపంలో కొంత రుసుము వసూలు చేసేవారు.మొగలుల మరాఠాల కాలములో కొన్ని గ్రామాల సమూ హాన్ని ‘పరిగణ’గా గుర్తించి రెవెన్యూ వసూలు చేసే బాధ్యతను దేశ్‌ముఖ్‌లకు మరియు రెవెన్యూ పద్దులను నిర్వహించే బాధ్యతలను దేశ్‌పాండేకు అప్పగించారు. వీరికి అదనపు పారితోషికాలుగా ఆయా గ్రామాలపై పటేల్‌, సట్వారీలుగా వతన్‌ గిరి కూడా అప్పగించారు. అదే గోండురాజు లకు, మోఖాసీలకు ఎటువంటి ప్రాధాన్యము ఇవ్వకుండా వారు చెయ్యవలసిన రెవెన్యూ వసూలును మోఖాసీల ద్వారా చేపించేవారు. ఎందుకంటే దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండేలు గిరజనేతర వతన్‌దార్లు, జాగిర్‌దార్లు. తమ అధికారాన్ని అమలుపర్చుటకు మోఖాసీలను గ్రామ పట్టేళ్లను ఉపయోగించేవారు. చాందా రాజధానిగా పరిపాలించిన గోండు రాజుల కాలంలో మోఖా సీలు ప్రముఖ పాత్ర పోషించారు. వారి పరిది లోని గ్రామాలలో సామాజిక, రాజకీయ, సంస్కృతి సాంప్రదాయాలలో ఆచార వ్యవహా రాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలుగుకుండా చూసేవారు. శాంతిభద్రతలను సామరస్యంగా నిర్వహించేవారు. ఎవరైనా మోఖాసీ తీర్పు న్యాయ సమ్మతంగా లేదనుకుంటే నేరుగా రాజదర్బారుకు వెళ్ళి న్యాయము కోరే సౌకర్యము కూడా గోండు ప్రజలకు ఉండేది. రాజు తర్వాత రాజులాగ మోఖాసీలు కూడా ప్రజల ఆదరాభిమానాన్ని, గౌరవాన్ని పొందే వారు. గ్రామ స్థాయిలోని వ్యవస్థను గ్రామ పెద్దలైన పటేల్‌, మహజన్‌, దేవారి మరియు హవల్దార్‌ నిర్వహిస్తారు. కుటుంబ సమస్యలు ముఖ్యముగా భార్యాభర్తల మధ్య వచ్చే తగా దాలు, అన్నదమ్ముల మధ్య ఏర్పడే భూమి పంపకాల సమస్యలు గ్రామ పటేల్‌ ఆధ్వర్య ములో గ్రామస్తులంతా చర్చించి పరిష్కరిస్తారు. పున్నమి, అమావాస్యలప్పుడు వచ్చే గ్రామదేవ తల పండుగలు, పెండ్లిలకు సంబంధించిన తంతు జరపడానికి గ్రామదేవరి సహకారముతో పటేల్‌ నిర్వహిస్తాడు. గ్రామపెద్ద అయిన పటేల్‌ ఆదేశాలను గ్రామస్తులందరికి తెలియపర్చే బాద్యత హవల్దార్‌ది. గ్రామాల మధ్య తగా దాలు వచ్చినప్పుడు ఏ కుటుంబమైన కుల బహిష్కరణకు గురైనప్పుడు ఆ ప్రాంత మోఖాసీ ప్రవేశించి కులపెద్దల సమ్మతితో సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తాడు.ప్రొఫెసర్‌ వాన్‌ప్యూరర్‌ హెమండార్ప్‌ ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త నిజాం ప్రభుత్వ వెనుక బడిన కులాల అభివృద్ధి సలహాదారు వ్రాసిన ‘ట్రైబల్‌ హైదరాబాద్‌’ ప్రకారము ఉట్నూర్‌ కేంద్రముగా పరిపాలించిన గోండురాజులు ఆత్రం కుటుంబానికి చెందిన రాజా ఇస్రాయి జంగుబాపు, రాజా లింగాయి హన్మంతరావు, రాజా జగపతిరావు 1862 వరకు మఖ్తా, వతన్‌, జాగీరు మరియు జమీందారు హక్కులు కూడా కల్గి ఉన్నారు. రాజు నివసించే కోటకు దగ్గరి పరిసర గ్రామాలను తానే స్వయంగా తన దర్బార్‌ సిబ్బందితో వెళ్ళి అక్కడి ప్రజల సాదక బాదకాలను పర్యవేక్షించేవారు. దూరముగా ఉన్న గ్రామాలను అక్కడి గ్రామ పెద్దలైన మోఖాసీ, గ్రామపటేల్‌ల ద్వార పర్యవేక్షించే వారు. అలాంటి గ్రామాల రాజులు, మోఖాసీలు ,పటేల్లను తాలుగాల వారిగా ఇక్కడ ఉదహ రించడమైనది. ఉట్నూరు తాలుకా : ఆత్రం కుంటుంబానికి చెందిన రాజా జగపత్‌రావు, రాజాదేవుషా లక్కారాం,రాజా భీమ్‌రావుపం గిడి సిర్‌పూర్‌,రాజాభగవంతరావు కంచ నపల్లి.కుమ్ర కుటుంబానికి చెందిన లాల్‌షా మోఖాసీ పరిదిలోని గ్రామాలుఆద్మీయాన్‌, శివనార,కొత్తపల్లి, కొలామా,అర్జుని, గాదిగూడ, పిప్రీ,చిత్తగూడ,కుమ్ర జంగు మోఖాసీ పరిది లోని గ్రామాలుమాన్కపూర్‌,నాగల్‌కుండ, యేంపల్లి,బాబెజరి,గణేశ్‌పూర్‌,సాంగ్వి, ఖైర్‌ దాట్వా,లోకారీ,నర్సాపూర్‌,గుంజాల,నార్నూర్‌, గుండాల. బోథ్‌ తాలుకా : దుపార్‌పేటలోని శిడాం కుటుంబానికి చెందిన మోఖాసీ పరిది, ఇచ్చోడ నుండి కడం నది పరివాహక ప్రాంత గ్రామాలు, ఖరత్వాడలోని దుర్వ యెశ్వంత రావు మోఖాసీ అక్కడి 20 గ్రామాలకు దేశ్‌ముఖ్‌ కూడ ఈయన పూర్వీకులు ఆసిఫాబాద్‌ తాలుకాలోని మోవడ్‌ లోమ ప్రాంతానికి చెందినవారు. ఆదిలాబాద్‌ తాలుకా : మర్సుకోల కుటుంబానికి చెందిన పీప్రి లచ్చు మోఖాసీ పరిది ఆదిలాబాద్‌ పట్టణంతోపాటు పెన్‌గంగా నది పరివాహక ప్రాంత గ్రామాలు.చహ్కటి కుటుంబానికి చెందిన రాజా హన్మంతరావు పరిదిలో అంకోలి,మావాల,యాపలగూడతో పాటు ఉట్నూరు తాలుకాలోని ఇంద్రవెళ్లి, తోషం,పీప్రి,దేవాపూర్‌,ముత్నూర్‌ మరియు గిన్నెర గ్రామాలు. కొరెంగ కుటుంబానికి చెందిన యెశ్వంతరావు మోఖాసీ పరిదిలో చాంద్‌పల్లి,సర్ధాపూర్‌,ఖడ్కి,చాప్రి,సోనార్‌, రుంకుమ్‌,పాఠన్‌,సోన్‌కసా,పత్తెగామ్‌, జనోలి, కరోని మరియు వడూర్‌. భాదిలోని జుంగనక కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలో సైద్‌ పూర్‌,బోరెగామ్‌,పాటగూడ,సాంగ్వి,గార్క గూడ మరియు జామ్ని. జైనథ్‌లోని కోవ కుటుంబానికి చెందిన పోయ్‌పటేల్‌ మోఖాసీ వీరి పూర్వికులు మానిక్‌గాడ్‌ నుండి ఆదిలా బాద్‌కు వచ్చారు. కారకాన్పలోని పెందూర్‌ కుటుంబానికి చెందిన రాజా హన్మంతరావు పరిదిలో రాజురాతాలు కాలోని యేషాపూర్‌ భరిషావతన్‌, కిన్వట్‌ తాలుకాలోని పిప్పల్‌గావ్‌కోట మరియు బోథ్‌ తాలుకాలోని రaరి ప్రాంత గ్రామాలు. లక్షెటిపేట తాలుకా : వెంకట్రావుపేటలోని ఆత్రం కుటుంబానికి చెందిన సీతాగొంది ఆత్రం రాజుగారి పరిదిలో లక్షెటిపేట నుండి రాలి గడ పూర్‌ బ్లాక్‌ వరకు గల గ్రామాలు. తాళ్లపేట లోని కోవ కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలో గోదావరినది సరిహద్దు నుండి ఉట్నూర్‌ వెళ్ళెదారిలోని ఉడుంపూర్‌ వరకు గల గ్రామాలు. ముర్రిమడ్గులోని కుమ్ర కుటుంబానికి చెందిన రాజుకు కవ్వాల్‌ పట్టీ మరియు జన్నారం ప్రాంత గ్రామాలు. యాపల్‌గూడలోని చక్రం కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలోని గ్రామాలు కూడా లక్షెటిపేటలోనివే.
చెన్నూర్‌ తాలుగా : మర్సుకోల కుటుంబానికి చెందిన పటేల్‌కు యేంపల్లి పరిదిలోని గ్రామాలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ తాలుగా : కొరెంగ కుటుంబానికి చెందిన మోఖాసీకి మోవడ్‌, కోట్నాక కుటుంబానికి చెందిన మోఖాసీకి సాంగ్వి మరియు ఇందాని. మడావి కుటుంబానికి చెందిన మోఖాసీకి తిర్యాణి, పంద్ర కుటుంబానికి చెందిన మోఖాసీకి రొంపల్లి మరియు రాయిశిడాం కుటుంబానికి చెందిన పోయ్‌ పటేల్‌కు మంగి ప్రాంత గ్రామాలు ఉండేవి.
కిన్వట్‌ తాలుకా : గేడాం కుటుంబానికి చెందిన దేశ్‌ముఖ్‌కి కిన్వట్‌, పెందూర్‌ కుటుంబానికి చెందిన మోఖాసీకి రaరి,భిల్‌గామ్‌, కనక మోఖాసీకి పల్సి, వెడ్మ మోఖాసీకి మిన్కి ప్రాంతాలు వీరి ఏలుబడిలో ఉండేవి. రాజురా తాలుకా : సలాం,కుమ్ర,కుర్సెంగ,కనక కుటుంబాలకు చెందిన మోఖాసీలక పరిదిలో ఇంజాపూర్‌,చినై,టెంబర్‌వాయి,శేవ్‌గామ్‌ గ్రామాలు వీరి పరిదిలో ఉండెను. సుర్పమ్‌, కోట్నాక మరియు పెందూర్‌ కుటుంబాలకు చెందిన మోఖాసీల పరిదిలో మాల్ని, బంబార, మర్కల్‌ మెట్ట గ్రామాలు వీరి ఆదీనములో ఉండెను. నిర్మల్‌ మరియు సిర్‌పూర్‌ తాలుకాల పరిదిలో మోఖాసీలు లేరు. మోఖాసీల, గ్రామపటేల్‌ల బాధ్యతలలో ప్రధానముగా వారి గ్రామాల పరిదిలోని ప్రజలకు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడటము, కొత్తవారెవరైన ఆ ప్రాంతానికి వస్తే వారి ఆస్తిపాస్తులను కాపాడటం, వీరు ముఖ్య మైన గ్రామపెద్దలుగా నాయకత్వము వహించి సామాజిక సాంస్కృతిక వ్యవహారాలను చక్క దిద్దటం. దసరా, దీపావళి`దండారీ లాంటి పండుగలను గొప్పగా నిర్వహిస్తూ ప్రజల గౌరవమర్యాదలు పొందటం. తమ పరిదిలో పరిష్కరించలేని క్లిష్టమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మోఖాసీ ద్వారా తమ పరిది లోని రాజా కుటుంబము వారి ద్వారా పరిష్క రించటం. ఈ విధముగా గోండురాజుల పరి పాలన అనేక ప్రాంతాలకు విస్తరించింది. పటిష్ట మైన పరిపాలన జరిగింది. -డాక్టర్‌. తొడసం చందూ విశ్రాంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సెల్‌ : 9440902142,

గిరిజన ఉద్యమాల దర్పణం

ఆదివాసీలు అంటే అడవుల్లో నివశించే శారీరకశక్తి వనరులు మాత్రమేకాదు. కృషి,త్యాగం,బలిదానం,మొదలైన పరోపకార బుద్ధి నిలయాలు, కూడా అని నేటి ఆధునిక నగరవాసులు గుర్తించాలి, అన్న లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ ‘‘వనవాసి కళ్యాణ పరిషత్‌’’ భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా ఆదివాసీ స్వాతంత్ర సమర యోధులు,సంస్కర్తలు,గురించి ప్రామాణిక సమాచారం అందించాలనే సత్సంకల్పంతో వెలువరించిన అపూర్వ పుస్తకం ‘తెలంగాణ – గిరిజన స్వాతంత్ర సమరయోధులు సంస్కర్తలు.’ దీని రచయిత డా:ద్యావనపల్లి సత్యనారాయణ, నిత్యం గిరిజన ఆవాసాల పర్యటనలు, అందుబాటులోని అన్ని భాషల గిరిజన సాహిత్యాలను ఆధ్యయనం చేసిన అనుభవం సారంతో,‘కొండ అద్దం ముందు కొంచమైనట్టు’ అన్న చందంగా ఈచిరు పుస్తకాన్ని పాఠక లోకానికి అందించారు రచయిత. ఈ పుస్తకం పరిధి కేవలం తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి పరిమితమైన, ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. రచయిత తన ముందుమాటలో పేర్కొన్నట్టు ఈ చిరు సమాచారం ప్రామాణికంగా భావి తరాల విజ్ఞులకు,పరిశోధకులకు,ఎంతో ఉప యోగంగా ఉంటుంది.ఈ పుస్తకాన్ని ‘స్వాతంత్ర సమరయోధులు`సంస్కర్తలు’ అని రెండు భాగా లుగా విభజించి వ్రాశారు,అనుబంధంగా బీర్సా ముండా పోరాటం వివరణ ఇచ్చారు.ఈ విభ జన లోనే రచయిత పరిశో ధనా దృష్టి,పటిమ, కనిపిస్తున్నాయి. స్వాతం త్ర సమరయోధులు విభాగంలో రాంజీ గోండ్‌,కొమరం భీమ్‌,రౌంట కొండల్‌, కొమరం సూరు,వెడ్మ రాములను పేర్కొ న్నారు.సంస్కర్తలుగా సమ్మక్క, సేవాలాల్‌, పులాజిబాబా,హైమండార్ప్‌, ఎస్సార్‌ శంకరన్‌లను చెప్పడంలోనే రచయిత పారదర్శకత సుస్పష్ట మవుతుంది. ఇకవ్యాసాల తీరును పరిశీలిస్తే అనేక ప్రామాణిక విషయాలు అర్థమవుతాయి. తెలంగాణ గిరిజన పోరాట యోధులు అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ‘కొమ రంభీమ్‌,’కానీ అతనిలోని శక్తి సామర్థ్యాలు గుర్తించి ప్రోత్స హించి అతడిని అంతటి నాయకుడిని చేసింది అతని అనుచరుడు మొదటి నుంచి చివరి వరకు అతనితో కలిసి నడిచిన వాడు ‘రౌట్‌ కొండ’అని చాలా మందికి తెలియని సత్యం. ఉద్యమానికి నాయకుడు ఎంత అవసరమో! నాయకునికి అనుచరులు అంతే అవసరం !! అన్న నిండు నిజాన్ని రచయిత డా:సత్యనారాయణ ఎంతోచక్కగా విశ్లేషించి వివరిస్తూ నేటి తరానికి తెలియని నాటి గిరిజన సమర యోధుడు ‘‘రౌట కొండను’’ పరిచయం చేశారు. అదేవిధంగా కొమరం భీమ్‌ పోరాటంలో వార్త హరుడుగా సహకరించిన మరో యోధుడు కుమరం సూరు. జీవిత విశేషాలు, గెలిచిన పోరాటంలో అతని పాత్ర గురించిన వివరణ కూడా కూలంకషంగా వివరించారు మరో వ్యాసంలో.‘జోడే ఘాట్‌’పోరాటంలో విరోచిత పోరాటం చేసి అమరుడై అందరికీ తెలిసిన ‘‘భీమ్‌’’ పోరాటంలో సంపూర్ణ సహకారం అందిం చినవారు అనేకమంది ఉన్న అందులో అతనికి కుడి భుజంగా ‘‘కుమ్రం సూరు’’ తుడుం దెబ్బ మోగిస్తే, ఆయనకు ఎడమ భుజంగా ఉన్న ‘‘వెడ్వ రాము’’ తూత కొమ్ము ఊది చుట్టు పక్కల12గ్రామాల గిరిజనులను యుద్ధానికి సిద్ధం చేసేవాడు, అతని పరిచయం కూడా వ్యాస రచయిత ఇందులో పొందు పరిచారు. అలా ఆదిలాబాద్‌ కేంద్రంగా సాగిన ఆదివాసీ పోరాటం ద్వారా గిరిజనుల త్యాగం,వీరోచి తత్వాన్ని, ప్రపంచానికి చాటిన జోడేఘాట్‌ పోరాటయోధుడు,కొమరంభీమ్‌ కు సాయపడిన వ్యక్తుల సంక్షిప్త జీవిత చరిత్రల వ్యాసాలు ఇందులో పొందుపరచడం ద్వారా వ్యాస రచయిత సత్యనారాయణ గారి నిశిత పరిశీలన, పరిశోధనా పఠిమ,ప్రతిపాటకుడికి ఆవగతం అవుతాయి. ఇక ప్రధాన యోధుడు భీమ్‌కు సంబంధించిన ప్రథమ వ్యాసంలో జల్‌,జంగల్‌,జమీన్‌ల సాధనలో గిరిజనుల ఐకమత్య పోరాటం,నాయకుడు చేసిన కృషి, ఐక్యత యొక్క విలువ,చాటమే కాక వందల సంవత్సరాల క్రితం గిరిజనుల స్థితిగతులను కళ్ళకు కడుతుంది. భీమ్‌ వ్యాసంలో రచయిత వ్రాసిన ప్రతి వాక్యంలో ప్రామాణికత కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధాన ఘట్టాలకు సంబంధించిన విషయాలు అలాంటి సంఘ టనలు ప్రత్యక్షంగా చూసిన వారి అనుభవాలు, ప్రభుత్వం చూపిన అధికారులు లెక్కలు, అప్పటి పత్రికలో వచ్చిన వార్తలు సాయంగా రాయడం వల్ల సంపూర్ణ ప్రామాణికత కనిపిస్తుంది. జోడెన్‌ ఘాట్‌ గిరిజన పోరాటంలో అమరులైన వారి సంఖ్యలోగల సందిగ్ధత కూడా రచయిత సహేతుకంగా వివరించారు, అలాగే కుమ్రం భీమ్‌ మరణించిన రోజులోని వివాదం కూడా వివరించే ప్రయత్నం చేశారు,ఇక భీమ్‌కు ఆదర్శనీయుడు,భారత ప్రధమ గిరిజన స్వాతం త్య్ర సమరయోధుడు రాంజీ గోండు వీరోచిత త్వాన్ని వివరించిన తొలి వ్యాసంతో మొదలై, వెడ్మ రాముతో మొదటివిభాగ మైన సమరయో ధులు ముగుస్తుంది. ఇక రెండవ భాగంను గిరిజన సంస్కర్తలుగా పేర్కొని, ఇందులో మా’’నవ’’దేవతలు సమ్మక్క- సారక్కలు, సేవాలాల్‌,పులాజీ బాబా,హైమన్‌ డార్ప్‌, ఎస్‌.ఆర్‌,శంకరన్‌ల సేవా సంస్కరణలు వివరిం చారు.సమ్మక్క వంశ చరిత్ర, చారిత్రక విషయా లతో,పాటు సమ్మక్క వీరోచిత పోరాటం తది తర విషయాలతో, సమ్మక్కను చారిత్రక సంస్కర్త గా చిత్రిస్తు నాటి గాధలకు సాక్ష్యంగా నిలిచే నేటి గ్రామాలను ఆధారంగా చూపిస్తూ ఈ వ్యా సం కొనసాగించారు. లంబాడి సామాజిక వర్గ గిరిజనులు ఆరాధ్య దైవంగా పూజించే ‘సేవ లాల్‌’ జన్మించింది అనంతపురం వద్ద గల గుత్తి,సమీప గ్రామం గొల్లలదొడ్డి,అయినా అతని సేవా తత్పరత ఎక్కువగా సాగింది తెలంగాణ ప్రాంతంలోనే, కనుక అతడిని తెలంగాణ గిరిజన జాతి సంస్కర్త గానే రచయిత పేర్కొన డం అతని సహృదయతకు చిహ్నం. విగ్రహారా ధన, జంతు బలి, మూఢనమ్మకాలకు, వ్యతిరేకి అయిన సేవాలాల్‌ లంబాడాలకు ఎలా ఆరాధనీ యుడు అయ్యాడో ఈ వ్యాసం వివరణఇచ్చింది. పూర్తి మాంసాహారులైన గిరిజనుల్లో శాఖాహార తత్వాన్ని అలవర్చిన గొప్ప శాఖాహార సంస్కర్త ‘‘పులాజి బాబా’’ అతని తపస్సు, ధ్యానం, వివ రాలు వెల్లడిరచడంతోపాటు అతడు గిరిజ నులను తన బోధనల ద్వారా తీర్చిదిద్దిన తీరు ఇందులో గమనించవచ్చు. ఇక గిరిజనుల జీవితాలకి వెలుగులు అద్ది వారి జీవితాలు విద్యా ఉద్యోగాలకు ఆర్థిక ఎదుగు దలకు సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేయడమే కాక ,అమలుకు కృషి చేసిన ఆదివాసులు ఆత్మబం ధువు ‘‘హైమన్‌ డార్ప్‌’’ కృషి గురించిన వ్యాసం. గిరిజన వికాసానికి పాటుపడే వారందరికీ ఉపయుక్తం.అడవి బిడ్డల సంక్షేమానికి పర్యాయ పదంగా నిలిచే మరో ఐ.ఏ.ఎస్‌ అధికారి ఎస్‌.ఆర్‌. శంకర్‌,కృషిని వివరించే వ్యాసం కూడా ఇందులో చదవవచ్చు. అనుబంధంగా ‘‘బిర్సా ముండా’’ పోరాటం గురించిన వ్యాసం లో అతని జీవితం,కృషి,సూక్ష్మంలో మోక్షంగా సరళంగా, సూటిగా,వివరించబడిరది, కేవలం వ్యాసాలే గాక ఆయా యోధుల, సంస్కర్తల, ఫోటోలు కూడా ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి, తెలంగాణ ప్రాంత గిరిజన సమరయోధులు, సంస్కర్తలపై భావి తరంలో జరగాల్సిన సంపూర్ణ పరిశోధనలకు ఈచిరు పుస్తకం చక్కని దారి దీపం కాగలదు. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

అందరికీ న్యాయం అందేదెలా?

రాజ్యాంగం మనకు వివిధ చట్టాల ద్వారా చాలా హక్కుల్ని కల్పించింది. అయితే పొద్దున్న లేచించి మొదలు..రాత్రి పడుకునే వర కూ ఎక్కడో ఒకచోట ఏదోఒక సమస్య తలెత్తు తూనే ఉంది.మన చుట్టూ జరిగే అనేక మోసా లు,దోపిడీలు,నేరాలు-ఘోరాలు వంటివి నిత్యం మీడియాలో చూస్తూనే ఉన్నాం.. మరీ ముఖ్యం గా దళితులు,గిరిజనులు,మైనారిటీలు, మహి ళలపై అనేక రకాలుగా హింస పెరిగి పోతోంది. ఈవిషయాన్ని ఇటీవల ఎన్‌సి ఆర్‌బి విడుదల చేసిన గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. అయితే వీరిలో చాలామందికి న్యాయం అంద డంలేదు.అవగాహన లేక కొందరు మిన్న కుం డిపోతే.. అక్రమార్కులు, అరాచక శక్తుల ఆగడా లకు భయపడి మరికొందరు బాధితులు గానే మిగిలిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసు స్టేషన్లు,కోర్టుల్లోనూ అన్యాయం జరు గుతున్న దుస్థితి..ఈక్రమంలో రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులను ఎలా పొం దాలి..? తగిన న్యాయం..రక్షణకోసం ఎవరిని సంప్రదించాలి? ఇలాంటి పరిమితమైన అంశా లపైనే అంశాలపై ప్రత్యేక కథనం.. (సురేష్‌ కుమార్‌ పొత్తూరి)

సుప్రీం తీర్పులు….: అనితకుశవహ వర్సెస్‌ పుషవ్‌ నుండాని14-21లోపొందుపరచబడినహక్కు,చట్టం ముందు అందరూ సమానమే.పౌరులందరికీ సామాజిక,రాజకీయ,ఆర్థిక న్యాయం జరగాలి. ఈ ప్రాథమిక సూత్రాలు రాజ్యాంగం యొక్క ఆదేశాలు. అనేక చోట్ల రాజ్యాంగంలో వీటిగురించి ప్రస్తావించ బడిరది. సమాజంలోపేద,బలహీనవర్గాలకు న్యాయ సహాయం అందించబడాలి.అదిఉచితంగా జరగా లని 39ఎ అధికరణ నిర్దేశిస్తుంది.
అందే సేవలు..: న్యాయవాది సేవలు అందుతాయి. అనగా కోర్టులో కక్షిదారుని తరపున వాదనలు విని పించబడతాయి.న్యాయ సలహాలు ఇవ్వబడ తాయి. సముచిత కేసులలో కోర్టులో చెల్లించవలసిన ప్రాసెస్‌ రుసుము,సాక్షికి అయ్యే ఖర్చులు,కోర్టు వ్యవహారంలో ఆకేసుకు అయ్యే ఇతర ఖర్చులు చెల్లించబడతాయి. కేసులో వాదనలు తయారుచేయడం. అప్పీలు దాఖలు చేయడం. కేసు కాగితాలు కోర్టులో దాఖలు చేసే విధంగా ఫైలు, పుస్తకాలు తయారు చేయడం. కాగితాలను అనువాదం చేయడం. వాదనలు లిఖితపూర్వకంగా తయారు చేయడం (డ్రాఫ్టింగ్‌) ధృవపరచబడిన తప్పులు,ఉత్తర్వులు,సాక్ష్యా లు చట్టపరమైన కాగితాలు అందించడం. మహిళా బాధితులకు నష్టపరిహారం..: అత్యా చారాలు,యాసిడ్‌ దాడులువంటి విషయాలలో మహిళలపైదాడులు జరిగినప్పుడు వారికిగాని, వారివారసులకుగాని నష్టపరిహారం చెల్లిం చేందు కు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘మహిళా బాధి తుల నష్టపరిహార నిధి’ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. న్యాయ సేవా సంస్థల సూచన మేరకు తగిన మొత్తాన్ని ప్రభుత్వం మహిళా బాధితులకు చెల్లిస్తుంది. ఈ విధానంతో చెల్లించే నష్టపరిహారం ఇతర నష్టపరిహారాలకు సంబంధంలేదు.ఈ నష్ట పరిహారం కోసం జిల్లాలో లేదా న్యాయసేవ సంస్థ లకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసంస్థలలో దరఖా స్తుల నమూనాలు లభ్యమవుతాయి. లైంగిక దాడు లు జరిగినప్పుడు కూడా ఈ నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ సేవా పథకాలు..: ఈ న్యాయ సేవా సంస్థల ద్వారా సమాజంలో వివిధ రకాలైన నిస్సహాయ వ్యక్తులు అనగా విభిన్న ప్రతిభావంతులు, బాలలు, వృద్ధులు,గిరిజనులు,ప్రకృతి వైపరీత్యాల బాధితు లు, అసంఘటిత బాధితులు, నిరుపేదలు, మత్తు పదార్థాల బాధితులు మొదలైనవారి కోసం పథ కాలు ఏర్పాటు చేయబడ్డాయి.
న్యాయ సహాయం ఏ దశ నుండి లభిస్తుంది?..:
న్యాయ సహాయం కేసుల ప్రారంభం నుంచి అనగా సివిల్‌ కేసుల్లో దాఖలుఅయిన దగ్గర నుంచి సహా యం పొందవచ్చు.క్రిమినల్‌ కేసులలో ఎఫ్‌ఐ ఆర్‌ దాఖలు అయిన దగ్గర నుంచి అనగా అరెస్టు కు ముందు నుంచి పొందవచ్చు. అలాగే కేసు యొక్క అన్ని దశలలోను అనగా అప్పీలు, రివిజన్‌ దశ లలో కూడా పొందవచ్చు.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?..: సమస్య ఉన్న ప్రాంతాన్ని బట్టి, సమస్యలో ఉన్న విషయాన్ని బట్టి ఆయా (తమకు దగ్గర) తాలూకా / మండల స్థాయి న్యాయ సేవా అధికార సంస్థల వద్ద ప్రథమంగా దాఖలు చేసుకోవాలి.ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్య వలన ఆ సంస్థకు పరిధి లేకపోతే వారి సూచన మేరకు తగిన సంస్థలో దాఖలు చేయాలి. ప్రతి స్థాయిలోను అనగా తాలూకా,జిల్లా స్థాయి న్యాయ సేవా సంస్థలు తాలూకా, జిల్లా కోర్టులలోనే స్థాపించబడి ఉంటాయి. కాబట్టి తమకు దగ్గరలో ఉన్న మండలంలో ఉన్న సంస్థను సంప్రదించడం ప్రథమ కర్తవ్యం.రాష్ట్ర స్థాయి సమస్యలు రాష్ట్ర న్యాయ సేవా సంస్థల వద్ద పేర్కొనాలి. ఇవికాక రాష్ట్ర హైకోర్టులో న్యాయ సహాయం కావలసి వస్తే హైకోర్టు స్థాయిలో ప్రత్యేక సేవా సంస్థ ఉంటుంది. దానిని సంప్రదించవచ్చు. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి సంస్థఉంటుంది. కనుక అక్కడా సంప్రదించవచ్చు.
లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లు..: ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు గ్రామీణస్థాయిలో ఏవిధంగా వైద్య సహాయం అందిస్తాయో ఆవిధంగా గ్రామీణ ప్రజలకు, నిరక్ష రాస్య,నిరుపేద ప్రజలకు న్యాయ సహాయం అందా లనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడిన పథకం లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌.ఈ విధానంలో సాధారణంగా ప్రతి ఆదివారం,బుధవారాలలో గ్రామాలలోని పంచాయి తీలు లేక స్థానిక సంస్థల కార్యాలయాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేయబడతాయి. ఈక్లినిక్‌లకు పారా లీగల్‌ వాలంటీర్లు,లీగల్‌ ఎయిడ్‌న్యాయవాదులు హాజర వుతారు.ఈక్లినిక్‌లలో గ్రామీణప్రాంతాలలో ఉన్న న్యాయ సమస్యలు కాక, వీధి దీపాలు,రహదారులు, ఇళ్ళ స్థలాలు వంటి సమస్యలు..వాటినిఎలా పరి ష్కరించుకోవాలో కూడా సలహాలు ఇస్తారు. అక్కడే ఏవైనానోటీసులు,జవాబులు,పిటీషన్లతయారీ, దర ఖాస్తులు మొదలైన విషయాలలో సలహాలు, సహా యం చేస్తారు.ఎక్కువ సహాయం అవసరమైతే న్యాయసేవా అధికార సంస్థకు ఆ కేసును పంపిస్తారు. ఈ విధంగా సహాయం చేయడం ద్వారా కేసులు కోర్టుల దాకా రాకుండానే పరిష్కరించేందుకు ప్రయ త్నం చేస్తారు.
కుటుంబ హింస ఎదుర్కోవాలంటే..: ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కుటుంబ హింస 20-50 శాతం వరకూ ఉంది.1946లో ఐరాస స్త్రీల స్థితిగ తుల అధ్యయనం కోసం ఏర్పరచిన కమిషన్‌ నివేదిక ఆధారంగా 1979 డిశంబరు 18న ఐరాస ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. దీనిని ‘కన్వెన్షన్‌ ఆన్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఫామ్స్‌ ఆఫ్‌ డిస్‌ ఇంటిగ్రేషన్‌ ఎగైనెస్ట్‌ ఉమెన్‌’ అంటారు. ఈ ఒప్పందం అమలు కొరకు ఏర్పరిచిన కమిటి 1992లో కొన్ని సిఫార సులు చేస్తూ మహిళలపై హింస, వివక్ష ఉన్నాయనీ వాటిని అరికట్టాలనీ తనసిఫార్సు నెం.19లో పేర్కొంది. మహిళలకు వ్యతిరేకంగా జరిగే హింస అంతమొందించేందుకు ఐరాస ప్రకటన 1993లో మొదటిసారిగా కుటుంబ హింసను నిర్వచించింది. ఈనిర్వచనం మహిళలపై కుటుంబంలో జరిగే హింసను అన్ని కోణాల నుంచి నిషేధించింది. 1994లో మానవహక్కుల కమిషన్‌ ఏర్పాటు చేసిన కమిటి,1995బీజింగ్‌ అంతర్జాతీయ మహిళా సమా వేశం రూపొందించిన ఉద్దేశ్యాలలో కూడా కుటుం బ హింస అరికట్టడం ప్రధానమైనది. అంతర్జాతీయ కుటుంబ హింసకు వ్యతిరేకంగా వచ్చిన ప్రకట నలు,ఒప్పందాలు, ప్రచారం ఫలితంగా44 దేశా లలో కుటుంబ హింసకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి.మనదేశంలో కూడా మహిళా సంఘాలు, ప్రజాతంత్ర వాదుల ఒత్తిడి ఫలితంగా కుటుంబ హింస నుంచిమహిళల రక్షణచట్టం-2005 వచ్చిం ది. ఒక మహిళను ఆమె భర్తగానీ, అతని బంధువు లుగానీ హింసిస్తే అది భారత శిక్షాస్మృతి 498ఎ కింద నేరం.ఈచట్టంలో భాగ స్వామి కావటానికి స్వచ్ఛంద సంస్థలకు,రిజిస్టరు సొసైటీలకు అవకాశం ఉంది.
రక్షణ.. ఆర్థిక సహాయం..: ఈచట్టం కేవలం చట ్టబద్ధమైన వివాహితే కాక,వివాహాన్నిపోలి ఉన్న సం బంధాన్ని కలిగియున్న మహిళలకూ రక్షణ కల్పిం చింది. బాధితురాలు ఏవిధమైన సంబంధం అనగా ఉమ్మడి కుటుంబం ద్వారా ఏర్పడిన,రక్త సంబం ధం ద్వారా ఏర్పడిన సోదరి,తల్లి,ఒంటరి మహి ళలు ఎవరైనా రక్షణ పొందవచ్చు. వీరున్యాయ సేవల అథారిటీల చట్టం 1987 ప్రకారం ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. కుటుంబ హింస వల్ల బాధితురాలికి అయిన ఖర్చులు, నష్టపరిహా రంగా ఆమెకు లేదా ఆమె పిల్లలకు తగినంత మొత్తాన్ని చెల్లించాలని హింసకు పాల్పడిన వ్యక్తిని మెజిస్ట్రేట్‌ ఆదేశించవచ్చు.
సహాయం ఎలా?..: బాధితురాలు ఈచట్టం ద్వారా సహాయం పొందుటకు మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి.ఈదరఖాస్తును బాధితురాలు స్వయం గాగానీ,రక్షణ అధికారుల ద్వారాగానీ లేదా ఆమె తరఫున మరి ఎవరైనాగానీ దాఖలు చేయొచ్చు. ఈదరఖాస్తులో తనకు కలిగిన బాధను వివరిస్తూ తనకు కావాల్సిన సహాయాన్ని అర్థించాలి.ఈ దర ఖాస్తు ద్వారా తనపై కుటుంబ వ్యక్తి నుంచి తగిన పరిహారం ఇప్పించమనీ కోరవచ్చు.
ఎన్నిరోజుల్లో పూర్తవుతుంది..: దరఖాస్తు అయిన తేదీ నుంచి సాధారణంగా మూడు రోజుల లోపల మేజిస్ట్రేట్‌ దరఖాస్తుల విచారణ ప్రారంభిస్తారు. విచారణ ప్రారంభమైన తేదీ నుంచి60రోజుల లోపల పూర్తిచేసేందుకు మేజిస్ట్రేట్‌ ప్రయత్నిస్తారు.
ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం నేరం..: ఐపిసికి 2013లో వచ్చిన సవరణల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం సెక్షన్‌ 166 (ఎ) ప్రకా రం నేరంగా పరిగణించబడుతుంది.నిర్ధిష్టంగా 354,354ఎ,345బి,345సి(2),345డి,376 (ఎ),376బి,376సి,376డి,376ఇ సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించబడే సమాచారం అందినప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే నేరంగా పరిగణిం చడుతుంది. మహిళలపై జరుగుతున్న అత్యాచా రాల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఉద్దేశంతో ఈ సవరణ తీసుకురావడం జరిగింది.
సంక్షేమ పథకాలు పొందడంలో..:కేవలం న్యాయ పరమైన విషయాలు మాత్రమే కాక, ఏదైనా సంక్షేమ చట్టాలు ఉంటే వాటి ప్రకారం లబ్దిదారులకు రావా ల్సిన ప్రయోజనాలను పొందే విషయంలో సలహా లు,సహాయాలు అందిస్తారు.అలాగే ప్రభుత్వ పథకాలు పొందడంలో కూడా సలహాలు, సహా యాన్ని అందజేస్తారు.ఆవిధంగా న్యాయాన్ని పొంద డంలో కావాల్సిన సహాయాన్ని అందిస్తారు.
ఫ్రంట్‌ ఆఫీస్‌ అంటే ఏంటి?..: న్యాయసేవలు అందుబాటులో ఉండేందుకు న్యాయసంస్థల్లో ఏర్పర చిన గదిని ‘ఫ్రంట్‌ ఆఫీసు’ అంటారు. అన్ని న్యాయ సేవా సంస్థలు ఈగదిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ గదిలోనే న్యాయవాదులు, పారాలీగల్‌ వాలం టీర్లు అందుబాటులో ఉంటారు.ఈగది సమర్థ వం తంగా,నాణ్యతతో కూడి ఉండాలి. (వ్యాసకర్త: సుప్రీంకోర్టు న్యాయవాది)

భారతీయ అటవీ చట్టం`1927 సవరణలు ఎవరి కోసం?

అడవిలో సంస్కరణల అలజడి..చట్టంలో కీలక మార్పులు మొదలువుతున్నాయి. భారతీయ అటవీ చట్టంలోని నిబంధనలు పాతబడిపోయిన కారణంగా ఈ చట్టాన్ని సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర పర్యావరణ,అటవీ మంత్రిత్వశాఖ 2019 ఫిబ్రవరిలో ఐఎఫ్‌ఏ ముసాయిదా సవరణను విడుదల చేసింది.దీనిపై గిరిజనుల హక్కుల బృందాలు,పర్యావరణ కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైంది.ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలతో అటవీ అధికా రులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టి నట్ల అవుతుందని,ఆయుధాల వినియో గానికి సైతం అనుమతులున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
వలస కాలంలోనే ప్రభుత్వాలు అడవిని లాభదాయక వనరుగా పరిగణించాయి. భారతీయ అటవీ చట్టం – 1927 అడవిని స్థిరీకరించి, అటవీ ఉత్పత్తుల రవాణా కలప, ఇతర ఉత్పత్తులపై పన్ను విధించేందుకు చట్టం రూపొందించింది. రక్షణా, రవాణా, రాబడి ఈ మూడు అంశాలే శాసన పీఠికలో పేర్కొన్నారు.
గత మార్చిలో అటవీ పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ ఫారెస్టు పాలసీ డివిజన్‌ వారు ఈచట్టానికి పలు సవర ణలు ప్రతిపాదిస్తూ చర్చకు ముసాయిదా విడు దల చేశారు.రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌జీఓల తోనూ,అడవితో సంబంధ మున్న వారందరినీ పిలిచి ఈ సవరణలపై చర్చించి సూచనలు పంపాలని కేంద్రం కోరింది.
సవరించదలచిన ‘పీఠిక’ ఏం చెపుతోంది?
ఉపోద్ఘాతంలో పైమూడు లక్ష్యాలతోపాటు మరికొన్ని జోడిరచారు.అవి 1.అడవుల పరిరక్షణ, అటవీ వనరులను క్రమబద్ధంగా నిర్వహించటం వాటికి పరిపుష్టి కలిగించటం, 2.పర్యావరణ సమతుల్యం (స్థిరత్వం) కాపాడటం, వాతావరణ మార్పులకు సంబం ధించిన అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టు బడివుంటూ పర్యావరణ వ్యవస్థల సేవలను నిరంతరాయంగా కొనసాగించటం,3.ప్రజలు, ప్రత్యేకంగా అడవిపై ఆధారపడిన ప్రజా సంక్షేమం,4.జాతీయ అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చటం,5.అటవీ ఆధారిత సాంప్రదాయ జ్ఞానం బలపర్చటం మద్దతు తెలపటం. పర్యా వరణ సమస్యలకు విశ్వవ్యాపిత స్వభావం ఉంటుంది. అందుకే దేశంలో అడవులను వాటి తోని జీవావరణాన్ని కాపాడే చట్టాలున్నాయి. వన్యమృఘ సంరక్షణా చట్టం1972, అటవీ పర్యావరణ పరిరక్షణాచట్టం-1980,విపత్తుల నిర్వహణాచట్టం లాంటివి.ఈ చట్టాలను అమలుచేసి అడవిని రక్షించవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు.అలా చేయకుండా వలసకాలం నాటి చట్టాన్ని సవరణల పేరుతో ఎందుకు ప్రభుత్వం మార్చాలంటుందో అర్థం కాదు.ఈ చట్టాలు పుట్టకముందే అడవులలో ప్రజలు నివసిం చేవారు. అడవులను వర్గీకరించే టప్పుడు వారి నివాస ప్రాంతాలను మినహాయించి మిగతా ప్రాంతాన్ని రక్షిత (ప్రభుత్వ) అడవులుగా ప్రకటించేవారు. మన దేశానికి ఆక్రమ ణదారులుగా వచ్చిన బ్రిటిష్‌ వారు ఆదివా సుల్ని ఆక్రమణదారులన్నారు. నేటి మన పాలకులు అడవిని నమ్ముకుని బతుకు తున్నవారిని ఆక్రమణదారు లంటున్నారు. చూడండి సెక్షన్‌.2 (41) నిర్వచనాలు. అలాగే సెక్షన్‌ 2 (3), సెక్షన్‌2 (4)లలో నిర్వచించిన ‘’కమ్యూనిటీ’’ ‘’విలేజ్‌ ఫారెస్టు’’ ఆశ్చర్యకరంగా, గత చట్టాలు చెప్పిన వాటికి విరుద్ధంగా వున్నాయి. కమ్యూనిటీ అంటే జాతి, మతం కులం, భాషా సంస్కృతితో సంబంధం లేనిదట! విలేజ్‌ ఫారెస్టు ప్రభుత్వానిదట! గత చట్టాలతో లేని ఒక కొత్త వర్గీకరణ ఈ సవరణ చట్టం ప్రతిపాదిస్తోంది. అదే ‘’ఉత్పత్తి అడవులు’’ సెక్షన్‌ 2 (10),సెక్షన్‌ 34సి (1) చెప్పేదేమంటే దేశంలో అటవీ ఉత్పత్తులను పెంచాలంటే (నాణ్యత ఉత్పాదకత) ఉత్పత్తిదారులైన కార్పొరేట్‌ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టాలి. సెక్షన్‌ 80(ఎ) ప్రయివేటు అడవు లను ప్రోత్సహిస్తోంది. ప్రకృతి ఆధారిత టూరిజం పేరుతో ప్రయివేటు కంపెనీలను ఆహ్వానించటం ఎవరి అభివృద్ధికి? ఆదివాసుల హక్కులను హరించి, మరో చారిత్రక అన్యా యానికి తెరతీస్తోంది.అటవీ అభివృద్ధి పేరుతో నడుస్తున్న రకరకాల పథకాలు, కార్యాచరణ ప్రణాళికలు గిరిజనులున్న అటవీ ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఇవన్నీ ఉదారవాద ఆర్ధిక విధానాలతో, విదేశీ అప్పులతో మొదలయ్యాయి. వన సంరక్షణ సమితి, జాయింట్‌ ఫారెస్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (జేఎఫ్‌ఆర్‌సీ) (వీఎస్‌ఎస్‌) లాభాలు పంచి ఆదాయాలు పెంచలేదు. అవినీ తికి నిలువెత్తు నిదర్శనాలు సెక్షన్‌ 28 1 (ఎ), (బి), (సి), (ఇ), (ఎఫ్‌) ప్రకారం వాటిని స్థానిక సంస్థలతో సమానగుర్తింపు ఇస్తారట. పీసా చట్టం ప్రకారం ఏర్పడిన గ్రామ సభలను కేవలం సంప్రదిస్తారట. ప్రతిపాదించబడిన సవరణచట్టం పీసాచట్టాన్ని కాని, అటవీ హక్కుల చట్టం 2006ని గాని గుర్తించి నట్టులేదు. అటవీ హక్కుల చట్టం ఎఫ్‌ఆర్‌ఏ గిరిజన తెగలకు ఇతర అటవీ నివాసులకు జరిగిన చారిత్ర అన్యాయాన్ని సరిచేస్తూ భారత పార్లమెంట్‌ చేసిన చట్టం ఇది. ఏమిటా చారిత్రక అన్యాయం? అది గిరిజనుల హక్కు లకు సంబంధించింది.వలస చట్టాలు, స్వాతం త్య్రం తర్వాత చట్టాలు`1967 ఏ.పీ.అటవీ చట్టం సెటిల్‌మెంట్‌ అధికారులను నియమిం చాలని, వారి హక్కులను గుర్తించాలని చెప్పాయి. అయినా పాలకులు పట్టించుకోలేదు. పోడు చేసి బతకటం ఒకఅటవీ నేరంగా పరిగణించబడి జైలు శిక్షలూ జరిమానాలతో నానా ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఏపీలో పోడు పునరావాసం పేరుతో సాగుదారుడికి రూ.25 వేలు ఇస్తామని భూమి లాక్కున్నారు. డబ్బులివ్వలేదు. ఈ స్థితిలో 2006లో యూపీఏ -1 వామపక్షాల మద్దతుతో గడిచిన ప్రభుత్వం ఈ చట్టం చేసింది. పోడుహక్కు గుర్తించి కుటుంబానికి 10 ఎకరాల వరకు పట్టా ఇవ్వడం గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించటం,ఉమ్మడి హక్కులుగా రోడ్డు, మేపుభూమి,స్మశాన భూములు కేటాయిం చాలంది. పర్యావరణ పరిరక్షణకు గిరిజనులను అడవుల నుంచి నెట్టేయరాదని చట్టం చెప్పినా, దీన్ని అమలు చేయలేదు. ఈ సవరణ చట్టం సెక్షన్‌10 ఇప్పుడు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లను నియమించమంటోంది. అంటే ఏమిటి? 2006 అటవీ హక్కుల చట్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించలేదని ధృవపడుతోంది. ఎఫ్‌ఆర్‌ఏ చట్టంలో లబ్దిదారుల గుర్తింపు, పట్టాల పంపిణీకి ఎఫ్‌ఆర్‌ఏ కమిటీ ద్వారా జరగాలి. కానీ ఈచట్టం మళ్ళీ ఫారెస్టు సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లకు అప్పగించటం దేన్ని సూచిస్తోంది? డిపార్టుమెంట్‌ పెత్తనాన్ని కాదా? 2013 ఎల్‌ఏఆర్‌ఆర్‌ చట్టం అమలులో వుండగా ఈ పాత చట్టంలో (అంటే1894 చట్టం) సవరణలు అవసరమా? సెక్షన్‌ 11(1), (2), (3)Ê(4) ప్రతిపాదిత సవరణలు చాలా అసందర్భంగా వున్నాయి. అటవీ భూములను అటవీయేతర పనులకు (ప్రాజెక్టులు, మైనింగ్‌ కార్యకలాపాలు) బదిలీ చేయటానికి సంబం ధించి 1980 అటవీ పర్యావరణ చట్టం, తదనంతర గైడ్‌లైన్స్‌ చాల నిర్దిష్టంగా ఉన్నాయి. వాటిని అమలుచేయకుండా పాత చట్టాలకు సవరణలు ఎవరి ప్రయోజనాల కోసం? కార్పొరేట్‌ కంపెనీలకు అటవీ భూములను కట్టబెట్టటానికా ఈ తాపత్రయం?
ఈ సవరణకు అర్ధం ఏమిటి?
పోడుసాగు ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చిన ఐదేండ్లలో అంతం కావాలట. సెక్షన్‌ 10 (3) (ఎ), సెక్షన్‌ 20(1)(సి) ప్రకారం పోడుసాగు ఐదేండ్ల తర్వాత యథావిధిగా అటవీ నేరంగా పరిగణిస్తారన్నమాట. ఉన్న చట్టాన్ని అమలు చేసి భూములు ఇవ్వనిరా కరిస్తున్న ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మరో చారిత్రక అన్యాయానికి సిద్ధపడటం కాదా?
అటవీ నేరాలు – శిక్షలు
1927 చట్టంలో అటవీ నేరాలపై కేసులు పెట్టే అధికారం కేవలం ఫారెస్టు-పోలీసు అధికారికే వుండేది. ఇప్పుడు సవరణ చట్టంలో రెవిన్యూ అధికారికి కూడా సెక్షన్‌ 52(1) ద్వారా సంక్ర మిస్తుంది. కేవలం అనుమానం ప్రాతిపదికగా వారెంట్‌ లేదా నోటీసు లేకుండానే ఏ వ్యక్తినైనా అరెస్టు చేయొచ్చు.సెక్షన్‌ 64(1)(ఎ)(బి)(సి)(2) అధికారం ఇస్తున్నాయి. ఫారెస్టు రేంజర్‌కే నేరాలు పరిశోధించే అధికారం,సెక్షన్‌ 190 సి.ఆర్‌.పి.సి ప్రొసీజర్‌ 1973 వినియోగించే అధికారం సెక్షన్‌ 64(బి),(సి) ఇస్తున్నాయి. అటవీ నేరాలను మైనర్‌-మేజర్‌ నేరాలుగా విభజించటం సెక్షన్‌64(4)ద్వారా లభిస్తుంది. అటవీభూమికి సంబంధించినవి మేజర్‌ నేరా లుగా పరిగణిస్తారు. అటవీ హక్కులచట్టం- 2006 సెక్షన్‌ 3,సబ్‌ సెక్షన్‌(1)క్లాజు (సి) ప్రకారం ఆదివాసులు, ఇతర అటవీ నివాసులు తేలికపాటి అటవీ ఉత్పత్తులు సేకరించు కోవటానికి,కలిగి ఉండటానికి,రవాణా చేసుకోవటానికి, అమ్ముకోవటానికి హక్కు కలిగివున్నారు. కాని ప్రస్తుత సవరణ చట్టం సెక్షన్‌ 2(3),(ఎ) ప్రకారం అడవీ ఉత్పత్తులు సేకరించటం, కలిగి ఉండటం, రవాణా, అమ్మ టం అటవీ నేరాలుగా పరిగణిస్తారు. అంటే ఇప్పటి దాకా గిరిజనులు ఉచితంగా సేకరించిన పలు ఉత్పత్తులు, ఇప్పుడు అటవీ నేరాలవు తాయి. విశాఖ ఏజన్సీలో అడ్డాకుల సేకరణ, తునికాకు సేకరణ,కొండరెడ్లు సేకరించిన తేనె ఎవరైనా కలిగి వుంటే అటవీ నేరమౌతుంది. ఈ సవరణచట్టం సెక్షన్‌ 78(1) ప్రకారం 6నెలల జైలుశిక్ష, రూ.10వేల జుల్మానా విధి స్తారు. ఇది1927 చట్టంలో ఒకనెల జైలు, రూ.500 జరిమానాగా ఉంది. ఈ చట్టం సెక్షన్‌ 78(1)(ఎ) ప్రకారం,సెక్షన్‌ 26లో పేర్కొన్న నేరాలు అంటే తాజాగా పోడుకోసం చెట్లు నరకడం,అడవిలో అగ్ని రాజేయటం, పశువులు మేపటం, చేపలు పట్టటం లాంటి నిషేధిత పనులు చేస్తే మొదటి దఫా శిక్షగా మూడేండ్లు జైలు శిక్ష లేదా రూ.5-50 వేలు జరిమానా లేదా రెండు కలిపి కూడా విధించ వచ్చు. ఇదే నేరాలు రెండోసారి చేస్తే ఒక ఏడాది కఠిన జైలు శిక్ష, జరిమానా గరిష్టంగా రూ.2 లక్షల వరకు విధించవచ్చు.
ప్రయివేటు అడవులకు అనుమతి
ఈ సవరణ చట్టం సెక్షన్‌ 80, 80(ఎ) ప్రకారం ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు, కంపెనీలకు పనికిరాని అటవీ భూములనిచ్చి మేలైన అటవీ ముడిసరుకులు తయారు చేసుకునే అవకాశం ఇస్తారట. ఇవి సంయుక్తంగా కూడా నిర్వహించ వచ్చునట. ఇందుకు జాతీయ ఫారెస్టు రీబోర్డు (సెక్షన్‌ (1), (2), (3), (4)) ఏర్పాటు చేస్తారట. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. భారతీయ అడవుల చట్టం- 2019కి ప్రతిపాదించిన సవరణలు అడవి మీద ఆధారపడి జీవించే ప్రజలకు వ్యతిరేకంగా వున్నాయి. చట్టం పీఠికలో వారి సంక్షేమం కోసం సవరణ చేస్తున్నట్టు చెప్పి, వారి ఉనికినే ప్రశ్నార్ధకంచేసే సవరణలు ప్రతిపాదించారు. వీటిని పూర్తిగా పునఃపరిశీలన చేయాలని, ఉపసంహరించాలని కోరుతూ ఉద్యమించాల్సిన తక్షణ కర్తవ్యం మనమందు ఉన్నది.
అటవీ చట్టం నిర్వీర్యం
దేశీయ పాలకులు వలస పాలకుల అటవీ విధానాన్నే అమలుచేస్తున్నారు.1952లో ప్రకటించిన అటవీ విధానమే అందుకు నిదర్శనం. ఈ విధానం ద్వారా రిజర్వ్‌, రక్షిత, గ్రామ అడవులుగా అటవీ ప్రాంతాన్ని విభజించారు. దాని ఫలితంగా అడవిపై గిరిజనుల హక్కు పరిమితమైంది.1973లో ‘టైగర్‌ ప్రాజెక్టు’ పేరుతో గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టేందుకు పూనుకున్నది. 1980లో కేంద్రం తెచ్చిన మరో గిరిజన వ్యతిరేక చట్టం ద్వారా గిరిజనులను అడవి నుంచి ఖాళీ చేయించే చర్యలు చేపట్టింది.1996లో సుప్రీం కోర్టు తీర్పు లో యాజమాన్యం,గుర్తింపు, వర్గీక రణతో సం బంధం లేకుండా ప్రభుత్వ రికార్డు ల్లో నమోదైన అన్ని ప్రాంతాలకు చట్టాన్ని వర్తింపజేయడం వల్ల గిరిజనుల హక్కు లకు తీవ్ర అన్యాయం జరిగింది. అడవిపై గిరిజనుల హక్కులను హరించే చట్టాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి.1830లో బీహార్‌, బెంగాల్‌లలో కోల్‌ తిరుగుబాటు, 1855-56 లో సంతాల్‌ తిరుగుబాటు,1802-03లో రంప తిరుగుబాటు, 1922-24లో అల్లూరి సీతారా మరాజు నాయకత్వంలో జరిగిన మన్యం తిరు గుబాటు, కుమ్రం భీం నాయకత్వంలో 1940 లో గోండుల తిరుగుబాటు, 1967 నక్సల్బరీ గిరిజన రైతాంగ పోరాటం, 1968-70లో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ముఖ్యమైన గిరిజన పోరాటాలు. గిరిజన పోరాట ఫలి తంగా కొన్ని చట్టాలు తప్పలేదు. 1917లో చేసిన భూ బదలాయింపు క్రమ బద్ధీకరణ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు భూములు కలిగి ఉండవచ్చు. ఏజెన్సీ ప్రాంతం లో చాలాకాలంగా నివసిస్తున్నవారిని గిరిజను లుగా గుర్తించడం ద్వారా గిరిజనేతరుల భూములకు రక్షణ ఏర్పడిరది. అలాగే గిరిజ నుల భూములు అన్యాక్రాంతం కాకుండా చట్టం అవకాశం కల్పించినట్లయింది. గిరిజన ప్రాంతాల్లో భూములు ఉం డటాన్ని నిషేధించింది. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా 1970 లో 1/70 చట్టం వచ్చింది.ఈచట్టం ప్రకారం గిరిజన ప్రాంతా లలో భూములు అమ్మకూడదు, కొనకూడదు. కానీ ఈ చట్టంలో అనేక మార్పులు జరుగడం వల్ల గిరిజన ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగు తున్నది. అటవీ చట్టాలను పాలకులు నీరుగా ర్చారు. కోర్టులు సైతం గిరిజన హక్కులపై పరస్పర విరుద్ధ తీర్పులిచ్చాయి. ఒకే న్యాయ మూర్తి గిరిజనులకు అనుకూలంగా,వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన సందర్భాలు న్నాయి. ఇలా చట్టంలోని లొసుగుల వల్ల గిరిజనులకు చెందాల్సిన వేల ఎకరాల భూములు గిరిజనేతరుల పాలయ్యాయి. అడవి నుంచి గిరిజనులను వెళ్లగొట్టేందుకు పాలకులు తీవ్ర నిర్బంధం ప్రయోగించినా వారు పోరాటం ఆపలేదు. దీంతో తామే భూములు పంచు తా మని యూపీఏ ప్రభుత్వం 2005లో అటవీ హక్కుల బిల్లును విడుదల చేసి 2006 పార్ల మెంట్‌ ఆమోదంతో చట్టంగా మార్చింది. ఈ బిల్లులో 1980కి పూర్వం గిరిజనుల ఆక్రమ ణలో ఉన్న భూములనే క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పటంతో గిరిజ నులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. తిరిగి బిల్లులో మార్పులు చేసి 2005కు పూర్వం వారి అధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరిస్తామని చెప్పి 2006 డిసెంబర్‌లో బిల్లును చట్టసభల్లో ఆమోదిం పజేసి చట్టంగా ప్రకటించారు. మోదీ ప్రభుత్వం అటవీహక్కుల చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చట్టంలో అనేక సవరణలు ప్రతిపా దించింది. వివిధ రకాల రక్షిత భూము లను చట్ట పరిధి నుంచి తప్పించింది. అటవీ ప్రైవేట్‌ భూములను చట్టపరిధి నుంచి తొలగిం చింది. 1980కి పూర్వం ఇతర సంస్థలు పొందిన భూ ముల ను మినహాయించాయి. ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్‌ చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాలను చట్ట పరిధి నుంచి తప్పించాలి. నివాస, ఈ ప్రతిపాదనల ఆమోదం కోసం ప్రయత్నించి తీవ్ర వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గడం కొసమెరుపు.- (డా.మిడియం బాబురావు),వ్యాసకర్త : మాజీ పార్లమెంటు సభ్యులు

జన విస్పోటనం

ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరడం మానవాళి చరిత్రలో ఓ మైలురాయి. భూగోళం మీద జీవం ఉనికి ప్రారంభ మైనప్పటి నుండి ఈ స్థాయిలో పురోగతి సాధించిన మరో జీవి లేదనడం అతిశయోక్తి కాదు. జంతువుల్లో జంతువుగా మనుగడ కోసం పోరాడిన స్థితి నుండి బుద్ధిజీవిగా మారేంత వరకు మానవజాతి సాగించిన ఈ ప్రయాణం అనితర సాధ్యం! ఈ క్రమంలోనే భూగోళమంతా మనుషులు విస్తరించారు. భిన్న వాతావరణ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాలను ఎదర్కుని నిలిచారు. అయితే, ఈ విస్తరణ భూగోళమంతా ఒకే మాదిరి జరగలేదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరిగింది. మనుగడ పోరాటంలో భాగంగా మనిషి సాగించిన వలసలూ జనాభా సంఖ్యను ప్రభావితం చేశాయి. నాగరికత పెరిగిన తరువాత, మానవ జీవితంలో లాభ, నష్టాల లెక్కలు అడుగుపెట్టిన తరువాత పేదరికం కూడా కుటుంబాలలో సభ్యుల సంఖ్యను ప్రభావితం చేసింది. సంతానం ఎక్కువుంటే సంపాదించే వారి సంఖ్య పెరుగుతుందని అనుకోవడం ఇప్పటికీ వింటూనే ఉం టాం. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. పేద దేశాల్లో జనాభా గరిష్ట స్థాయిలో పెరుగుతూ ఉంటే, ధనిక దేశాల్లో దీనికి భిన్నమైన స్థితి! 800 కోట్ల జనాభాలో ఆసియా, ఆఫ్రికా దేశాలదే సింహభాగం. దానిలోనూ మన దేశానిదే పైచేయి. గడిచిన పన్నెండేళ్లలో భారత్‌లో 17.7 కోట్ల మంది పెరగగా, చైనాలో 7.3 కోట్ల మంది పెరిగా రని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇదే ఊపులో మరో ఏడాదికి జనాభాలో చైనాను అధిగమించి మన దేశం మొదటి స్థానంలో నిలవనుంది. 2050 నాటికి 170 కోట్ల జనాభాతో భారత్‌ తొలి స్థానానికి,అదే సమయంలో చైనా జనాభా 130 కోట్లకు పరిమితం కానుందని అంచనా! ప్రపంచ జనాభా 2037 నాటికి 900 కోట్లకు, 2058 నాటికి వెయ్యి కోట్లకు, 2080 నాటికి 1400 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.సైమన్‌ గునపర్తి
జనాభా ఈ స్థాయికి చేరుకోవడం మానవాళికి వరమా..శాపమా? ప్రభుత్వాలు ఎటువంటి విధానాలు అవలంభించాలన్నది చర్చనీ యాంశంగా మారింది. జనాభా విస్ఫోటనం ఒకప్పుడు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడూ ఆ పరిస్థితి ఉందా అంటే జవాబు చెప్పడం కష్టం. భూగోళాన్ని యూనిట్‌గా తీసుకుని చూస్తే జనాభా పెరగుతోందన్నది ఒక వాస్తవం! అయితే, అన్ని దేశాలకూ ఇది ఒకేమాదిరి వర్తించదు. పొరుగు దేశమైన చైనానే దీనికి ఉదాహరణ! ఒకప్పుడు వన్‌ ఆర్‌ నన్‌ నినాదం ఇచ్చిన ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు ఒకరు, లేదా ఇద్దరు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని దేశాల్లో పిల్లలను ఎక్కువగా కనేవారికి అక్కడి ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన దేశంలో యువకుల సంఖ్య అత్యధికంగాఉంది. మరో యాభై ఏళ్ళ తరువాత ఇదే స్థితి ఉం టుందన్న గ్యారంటీ లేదు. మనదేశంలో ఒకప్పుడు సంతానోత్పత్తి రేటు 5కు పైగా ఉండగా, ఇప్పుడది 2.2కు తగ్గింది. చైనాలో ఇది 1.7గా ఉంది. భారత్‌, చైనాలలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే విధమైన ధోరణి కనపడుతోంది. 1963లో సగటున 5.3గా సంతానోత్పత్తి రేటు ఉండగా 1990కి 3.3కు 2020కి 2.3కు తగ్గింది. ‘ప్రపంచం మన అవసరాలకు సరిపడినంతా ఉంది. కానీ, మన అత్యాశకు సరిపడినంత కాదు’ అన్న మహాత్మాగాంధీ మాటలు ఇక్కడ ప్రస్తావనార్హం. పెట్టుబడిదారీ విధానం అని వార్యంగా పెంచి పోషించే అసమానతలు పేదరికంలోనే కాదు, జనాభా విస్తరణలోనూ ప్రస్ఫుటమౌతాయి. దేశాల వలస విధానాలు వారి ప్రయోజనాల కోసమే రూపొందుతాయి. పేద దేశాల్లో పెరుగుతున్న జనాభానే పెట్టుబడిదారులు ముడిసరుకుగా మార్చు కుంటారు. సమస్త భూగోళాన్ని, ప్రకృతిని దోచుకుంటూ లాభాల పంట పండిస్తారు. హద్దుల్లేని ఈ దోపిడి మానవాళితో పాటు సమస్త జీవరాశి ఉనికినే ప్రమాదంలో పడే స్తున్నా వారి వైఖరిలో మార్పేమీ ఉండదు. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా వచ్చే సోషలిస్టు సమాజంలో దోపిడి ఉండదు. అంతరాలు మాయమవుతాయి కాబట్టి బతుకు భయం ఉండదు. పిల్లలను కనాలా..వద్దా అన్నది భార్యాభర్తలే నిర్ణయించుకుంటారు. అటువంటి సమాజమే జనాభా సమస్యకు స్థిరమైన పరిష్కారాన్ని చూపుతుంది.
భారత్‌ వాటానే ఎక్కువ
800 కోట్లకు ప్రపంచ జనాభా చేరిన నేపథ్యంలో ఇందుకు భారత్‌ ప్రధానంగా దోహదపడిరదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. గత 12ఏళ్లలో భారత్‌లో 17.7కోట్ల మంది పెరగగా,చైనాలో 7.3 కోట్ల మందే పెరిగారు. వచ్చే ఏడాది కల్లా అత్యంత జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్‌ అధిగమించేస్తుందని భావిస్తున్నారు. 2037కల్లా కొత్తగా చేరే వంద కోట్ల జనాభాలో కూడా ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచే ఎక్కువ శాతం వుండగలదని, మరోవైపు యూరప్‌ వాటా ప్రతికూలంగా వుండగలదని యుఎన్‌ జనాభా నిధి పేర్కొంది. భారత్‌సహా ఎనిమిది దేశాల్లోనే జనాభా వృద్ధి అధికం. ప్రధానంగా తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో జనాభా వృద్ధి ఎక్కువగా కేంద్రీకృత మవుతోందని పేర్కొంది. 2050 వరకు అంచనా వేసిన పెరుగుదలలో మెజారిటీ భాగం ప్రధానంగా ఎనిమిది దేశాలకే పరిమిత మవుతుందని పేర్కొంది. ఆ దేశాల్లో భారత్‌, పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌ వంటి వర్ధమాన దేశాలు, నైజీరియా, ఇథియోపియా వంటి సబ్‌ సహారా ఆఫ్రికా దేశాలు వున్నాయి. ఈ పరిస్థితులు ఈ దేశాలకు సవాళ్లు విసురుతున్నాయి. పెరుగు తున్న యువత చాలా పరిమితమైన వనరు లపైనే ఆధారపడాల్సి వస్తోంది.
సవాళ్లు తప్పవు : ఐరాస
తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో జననాల రేటు పెరుగుదల వల్ల మరింత ముప్పు తలెత్తే ప్రమాదం వుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిం చింది. పర్యావరణ పరంగా మరింత నష్టం జరుగుతుందని, గ్లోబల్‌ వార్మింగ్‌ పెరుగు తుందని, అడవుల నరికివేత ఎక్కువవుతుందని హెచ్చరించింది. ఇటు ప్రజలను, అటు భూగోళాన్ని కాపాడుకునే చర్యలు మరింత పెరగాలని పిలుపునిచ్చింది.
జనాభా పెరుగుదల ఇలా…
1927లో ఈ భూ మండలం మీద జనాభా కేవలం 200కోట్లుగా వుంది,1998నాటికి ఆ సంఖ్య 600కోట్లకు చేరుకుంది. ఇప్పటికీ, ఈ పెరుగుదల చాలా మందగమనంతో వుందనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. 1950 నుంచి వార్షిక జనాభా పెరుగుదల రేటు చాలా తక్కువ స్థాయిలో వుంది. ప్రపంచ జనాభా మరో వంద కోట్లు దాటడానికి ప్రస్తుతం 12 సంవత్సరాలు పట్టింది. ఆతదు పరి మైలురాయిని చేరడానికి 15ఏళ్లు పట్ట వచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఆతర్వాత మరో మైలురాయికి చేరేసరికి దాదాపు రెండు న్నర దశాబ్దాలు పడుతుందని ఐక్యరాజ్య సమితి గణాంకాలు పేర్కొంటున్నాయి. 2037 నాటికి 900 కోట్లకు, 2058నాటికి వెయ్యి కోట్లకు జనాభా చేరుతుందని అంచనా వేశారు.
సంపన్న దేశాల్లో మందగమనం
జననాల్లో మందగమనమనేది ప్రధానంగా సంపన్న దేశాల్లో కనిపిస్తోంది. ఆ దేశాల్లో పిల్లలను పెంచేందుకు అయ్యే వ్యయం అధికంగా వుండడం, పైగా వివాహాలు చేసుకునే రేటు తగ్గిపోవడం ఇందుకు కారణంగా వుంది. దక్షిణ కొరియా నుంచి ఫ్రాన్స్‌ వరకు గల దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా వుంది. ఇక్కడ జనాభా క్షీణిస్తోంది. వృద్ధుల స్థానంలో తగినంతమంది పిల్లలు జన్మించడం లేదు. మరింతమంది పిల్లలను కనాలంటూ కుటుంబాలకు మెరుగైన చెల్లింపులు జరపడం వంటి చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటున్నా పెద్దగా మార్పేమీ లేదని ఐక్య రాజ్యసమితి పేర్కొంటోంది. అధిక ఆదాయ, ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాల్లో రాబోయే మూడు దశాబ్దాల్లో 65 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారి సంఖ్య తగ్గుతుందని, 65ఏళ్ల కన్నా పైబడిన వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
12 ఏళ్లలో వంద కోట్లు..
ప్రపంచ జనాభా 700 కోట్ల నుంచి 800 కోట్లకు(8పఱశ్రీశ్రీఱశీఅ) చేరడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? కేవలం12 సంవత్సరాలు. ప్రపంచ జనాభా 2011లో 700కోట్ల మైలు రాయికి చేరుకోగా,12 ఏళ్ల తరువాత 2022లో 800 కోట్ల మార్క్‌ ను అందుకుంది.ఈ జనాభా పెరుగుదలలో భారత్‌ గణనీయ పాత్ర పోషిం చింది. అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న దేశాల్లే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది.
చైనాను దాటేయనున్న భారత్‌
2011 నుంచి 2022 మధ్య 700కోట్ల నుంచి 800 కోట్లకు పెరిగిన జనాభా (జూశీజూబశ్రీa్‌ఱశీఅ) లో అత్యధిక శాతం భారత్‌ లో జన్మించిన వారే.ఈ విషయంలో భారత్‌ చైనాను రెండో స్థానంలోకి నెట్టేసింది. కాగా,ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా,ఆతరు వాత స్థానంలో భారత్‌ ఉన్న విషయం తెలి సిందే. అయితే, త్వరలో ఈ రెండు అగ్ర స్థానా లు తారుమారవనున్నాయి. అత్యధిక జనాభా ఉన్న దేశంగా 2023 లోనే భారత్‌ అవతరించ బోతోంది. చైనా కట్టుదిట్టంగా చేపట్టిన జనభా నియంత్రణ పద్ధతుల వల్ల ప్రస్తుతం అక్కడ జనాభా వృద్ధి రేటు నెగటివ్‌ గా నమోదవు తోంది.కాగా,భారత్‌ జనాభా 2050 నాటికి 170 కోట్లు చేరుతుందని, అదే సమయంలో చైనా జనాభా 130కోట్లకు తగ్గుతుందని అంచనా.
ఐరాస నివేదికలోని కీలకాంశాలు..
జనాభా అత్యధికంగా పెరుగుతున్న దేశాల్లో భారత్‌ తొలిస్థానంలో ఉన్నది. 2023లో జనాభా పరంగా చైనాను భారత్‌ అధిగ మిస్తుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుంది.2030 నాటికి ప్రపంచ జనాభా 850కోట్లకు,2050 నాటికి 970కోట్లకు,2080 నాటికి 1000 కోట్లకు చేరుతుంది.2100 వరకు అదే స్థాయిలో కొనసాగొచ్చు. ఈ అంచనాలో సగానికిపైగా పెరుగుదల కేవలం 8 దేశాల్లోనే (భారత్‌, పాకిస్థాన్‌, కాంగో,ఈజిప్టు, ఇథియో పియా, నైజీరియా,ఫిలిప్పీన్స్‌,టాంజానియా) నమోదవుతుంది.700కోట్ల నుంచి 800కోట్లకి చేరుకోవడంలో సగానికిపైగా (60కోట్ల మంది) జనాభా ఆసియా దేశాల నుంచే ఉన్నది. మిగి లిన 40కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల నుంచే ఉన్నది.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పనిచేసే జనాభా(25-64 ఏళ్ల వారు) క్రమంగా పెరుగుతున్నది. స్త్రీకి జీవితకాల సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గింది.ప్రస్తుతం ప్రపంచ సగటు ఆయా ప్రమాణం 72.8 సంవత్సరాలు. 1990తో పోల్చితే తొమ్మిదేళ్లు పెరిగింది. 2050 నాటికి సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలకు చేరుతుంది. 2021లో తక్కువ అభివృద్ధి చెందిన దేశాల ఆయుర్ధాయంప్రపంచ సగటు కంటే 7ఏళ్లు తక్కువ.ప్రపంచజనాభాలో బంగ్లాదేశ్‌ వాటా 2.2శాతంగా ఉంది. జనాభా పరంగా 8వ అతిపెద్ద దేశం. ప్రస్తుతం 17 కోట్లుగా ఉన్న జనాభా 2050 నాటికి 20.4 కోట్లకు చేరు తుంది.65ఏళ్లు పైబడిన జనాభా ప్రస్తుతం 10శాతంగా ఉంది. 2050 నాటికి ఇది16 శాతానికి పెరుగుతుంది. అంటే వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ సంఖ్య ఐదేళ్ల పిల్లలకు రెట్టింపు.

1 2