అటవీ సంరక్షణ చట్ట సవరణ అటవీ హక్కుల నిరాకరణ

గుండుగుత్తుగా కార్పొరేట్లకు అడవులపై చట్టబద్దత కల్పించడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వంద నుంచి వెయ్యి హెక్టార్లకు పైగా అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గనుంది. అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్ళిం చాలంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అటవీ హక్కులను సంపూర్ణంగా అమలు జరపాలని 2009లో కేంద్ర ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే ఈ అవసరం లేకుండానే ప్రభుత్వ, ప్రయివేట్‌ కంపెనీలకు అటవీ భూమిని మళ్లించేందుకు నూతన అటవీ సంరక్షణ చట్టంలో వీలు కల్పిస్తున్నది. ఈ నియ మాలు అమలైతే అడవి నుండి ఆదివాసీలు నెట్టివేయబడతారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన నూతన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసుల అటవీ హక్కులను దెబ్బతీసే విధంగా వున్నాయి. ఆది వాసుల అటవీ హక్కులను తుంగలో తొక్కి, కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం సవరణ చేస్తున్నది.
అడవిలో లీనియర్‌ ప్రాజెక్టుల నిర్మాణం ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ సంస్థలు,బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి అటవీ చట్టాలు అడ్డంకిగా వున్నాయి. విలువైన సహజ వనరులు, ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు ఆటంకంగా వున్న చట్టాలను వారికి అనుకూలంగా సవరించే పని మోడీ ప్రభుత్వం నెత్తినెత్తుకుంది. అందుకు కొత్త నియమ నిబంధనలు ప్రతిపాదించారు. అటవీ ప్రాంతంలో లీనియర్‌ ప్రాజెక్టులను (జాతీయ రహదారులు, పైపులైన్లు, ట్రాన్స్‌మిషన్‌…) ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. లీనియర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి గిరిజన గ్రామ సభ అనుమతి అక్కర్లేదని 2013లో కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను 2019లో ఎ.పి హైకోర్టు కొట్టేసింది. గిరిజన గ్రామసభకు వున్న విస్తృత అధికారాన్ని న్యాయ స్థానం గుర్తించడంతో, ముసాయిదా బిల్లులో గ్రామసభను సంప్రదించాలని మాత్రమే కేంద్ర బిజెపి ప్రభుత్వం పేర్కొంది.అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం అటవీ భూమిని ఇతర ప్రయోజనాలకు వినియో గించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ కింది నిబంధనలు పాటిం చాలి.1.ముందుస్తు గ్రామసభ అనుమతి తీసుకోవాలి.2. నిర్వా సితులకు నష్టపరిహారం చెల్లించాలి.3.అడవు లు పెంచడానికి ప్రత్యేక భూమి కేటాయించాలి. ఈ నిబంధనలు కార్పొరేట్‌ శక్తులకు అడ్డుగా వుండడంతో వాటిని సవరించబూనుకుంది. మైనింగ్‌ కోసం ఐదు హెక్టార్ల భూమిని డి-రిజర్వ్‌ చేయడానికి, ఆక్ర మణ భూమిని క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వ సలహా కమిటీ సిఫార్సు అవసరమని, 2003లో జారీ చేసిన నియమాలను పక్కనబెట్టి, మోడీ సర్కారు కొత్త నియమాలు తీసుకొస్తోంది. క్లాజ్‌ 9(బి)-1 ప్రకారం గ్రామసభ లేదా హక్కుల పరిష్కార ప్రస్తావన లేదు. క్లాజ్‌ 9(బి)-2 ప్రకారం డి-రిజర్వుడు ఆర్డర్‌ను జారీ చేయడానికి గ్రామసభకు వున్న అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కొన్నది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ఆదివాసుల హక్కులు హరించ బడతాయి. అటవీ హక్కుల చట్టానికి తూట్లు తీవ్రవాద కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో అవుట్‌ పోస్టు నిర్మాణానికి అటవీ భూమి వినియోగ పరిమితి విషయంలో ఒక హెక్టార్‌ భూమిని రిజర్వ్‌ ఫారెస్టు భూమి నుండి మినహాయించడం 2005లో ప్రారంభమైంది. ఈ మినహాయింపు క్రమంగా 40 హెక్టార్లకు పెరిగింది. గుండు గుత్తుగా కార్పొరేట్లకు అడవులపై చట్టబద్దత కల్పించడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వంద నుంచి వెయ్యి హెక్టార్లకు పైగా అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో అటవీ ప్రాంత విస్తీర్ణం తగ్గనుంది. అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్ళించా లంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అటవీ హక్కులను సంపూర్ణంగా అమలు జరపాలని 2009లో కేంద్ర ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే ఈ అవసరం లేకుండానే ప్రభుత్వ, ప్రయివేట్‌ కంపెనీలకు అటవీ భూమిని మళ్లించేందుకు నూతన అటవీ సంరక్షణ చట్టంలో వీలు కల్పిస్తున్నది. ఈ నియ మాలు అమలైతే అడవి నుండి ఆదివాసీలు నెట్టివేయబడతారు.
చట్ట సవరణ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం
ఆదివాసుల సాంప్రదాయ హక్కులతో ముడిపడిన హక్కుల నిర్ధారణ తర్వాతే…అటవీ భూమి మళ్లింపు అనుమతులను పరిశీలించాలని ఒడిశా మైనింగ్‌ కార్పొరేషన్‌కు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ మధ్య నడిచిన కేసులో…2013 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ హక్కుల అమలు విషయంలో గ్రామసభ పాత్రను, అటవీ భూమి మళ్లింపు విషయంలో వాటి అనుమతి అవసరాన్ని తీర్పులో స్పష్టం చేసింది. అయినా మోడీ మొండిగా గ్రామసభ, అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగ శాసనంగా పేర్కొన్న పీసా చట్టానికి భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసినా, నూతన అటవీ సంరక్షణ చట్టసవరణలతో రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లుపొడుస్తున్నది. వనరుల నిర్వహణ, హక్కుల నిర్ధారణ, అమలు చేసే అధికారం గ్రామసభలకు ఉంటుందని 2010 లో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. నూతన అటవీ సంరక్షణ చట్ట నియమాల్లో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పాత్రను కనీసం ప్రస్తావించ లేదంటే ఆదివాసీ లపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో అర్ధమవుతుంది. మైనింగ్‌ యేతర పనులకు భూమి వినియోగానికి వంద రోజుల్లో, మైనింగ్‌ కార్యకలాపాలకు 150 రోజుల్లో అటవీ, పర్యావరణ అనుమతి జారీ చేసేలా స్క్రీనింగ్‌ కమిటీకి అధికారం అప్పగిస్తూ నియమాలు రూపొందించారు. రక్షిత అడవుల్లో లినియర్‌ ప్రాజెక్ట్లు నిర్మాణమవుతాయని, భూమిని పూర్తిగా వినియోగించే అవకాశం వుంటుందని పేర్కొంది. అటవీ పెంపకం కోసం ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొనడం సరికాదు. క్షీణించిన అటవీ భూమిని ప్లాంటేషన్‌ కోసం ప్రైవేట్‌ కంపెనీలకు లీజుకిచ్చే అంశంపై గతంలో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన ఎస్‌.సి సక్సేనా కమిటీ చాలా విలువైన సూచనలు చేసింది. అడవులు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తాయని నిర్ధారించినా… నేడు ఈ లక్షలాది మంది ప్రజలకు ఏమౌతుందో నిబంధనలలో ప్రస్తావించనేలేదు. జాతీయ మోనెటైజేషన్‌ పథకం అమలు రైల్వే శాఖకు అభయారణ్యాలు, నేషనల్‌ పార్క్‌లలో కొన్ని నిబంధనల నుండి 2009 లోనే మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ, సామాజిక ఆస్తులను ప్రైవేటు, కార్పొరేట్‌ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికిగాను జాతీయ మోనెటైజేషన్‌ పథకం 2022-2025 అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. రైల్వే శాఖ, రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖల పరిధిలో సుమారు 18 లక్షల ఎకరాల అటవీ భూమిని మోనెటైజేషన్‌ చేయదగ్గవిగా గుర్తించారు. దానికి వీలుగా అన్ని రకాల నిబంధనల నుంచి మొత్తం మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వ భూములకు ఇచ్చే మినహాయింపులన్నీ, ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు కూడా వర్తింపజేయాలని నిబంధనలలో ప్రతిపాదించారు. కేంద్రం ఆధీనంలోని అనేక గనులను మోనెటైజేషన్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థలకు లీజుకిచ్చి రూ.28,747 కోట్లు ఆర్జించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వరంగ గనులను ప్రవేట్‌ పరం చేసేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడం పభుత్వ లక్ష్యంగా కనబడుతున్నది. ఇది ఆదివాసుల రాజ్యాంగ హామీలకు పూర్తిగా విరుద్ధం. అంతేగాక ఐదవ, ఆరవ షెడ్యూల్డ్‌, పీసా, సవరించిన వన్య ప్రాణుల రక్షణ చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.-పి. అప్పలనర్స

పేదల జీవితాలు ఇంతేనా..?

ఆత్మహత్యలన్నీ హత్యలే, కాకపోతే.. వీటిలో నిందితులెవరో అప్పటికప్పుడు తెలియదు, వెతికి పట్టడం అంత తేలిక కాదు. స్థూలంగా సమాజమే ముద్దాయి’ అంటాడో సామాజిక వేత్త! ఇదెంత పచ్చి నిజం! వ్యక్తులు, దంపతులు, కుటుంబాలు.. ఇలా లెక్కలేనంత మంది రోజూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరికీ పట్టడం లేదు. ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. చచ్చేంత దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న దీనుల్ని ఆదుకునే వ్యవస్థలే లేవు. ఉన్న వ్యవస్థల్ని కూడా పాలకులు విధ్వంసం చేస్తుంటే దాదాపు అన్ని వయసుల వారూ దిక్కులేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకీ దురవస్థ? అని ఎవరూ ప్రశ్నించడం లేదు. దీని వెనుక బలమైన కారణాలేమై ఉంటాయి? ఓ శాస్త్రీయ పరిశీలన లేదు. లోతైన అధ్యయనమూ లేదు. సర్కార్లకు సమస్య పరిష్కరించే చిత్తశుద్ధి లేదు.
డెబ్బై అయిదు సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత…మన దేశంలోని ఇతర ఏ రంగం కన్నా కూడా…వ్యవసాయ రంగం ఎక్కువ సంక్షోభంలో ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం ఈ పాతిక్ఱేళ్లలో (1995-2020) రైతులు, వ్యవసాయ కూలీలు నాలుగు లక్షల మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో గత ఎనిమిదేళ్లలో మోడీ పాలన లోనే ఒక లక్ష మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. దళితులు, ముస్లింలలో భూమిలేని కుటుం బాల సంఖ్య 60శాతం. ఆదివాసీలు సాధా రణంగా భూమి కలిగినవారై ఉంటారు. కానీ గత 30 ఏళ్లలో భూములు గుంజుకోవడం వల్ల భూమి లేని ఆదివాసీల సంఖ్య పది శాతం పెరిగింది. ఎన్‌ఎప ˜్‌హెచ్‌ఎస్‌ వివ రాల ప్రకారం దేశంలోని భూమిలో 20 శాతం భూమి 75 ఎకరాల పైబడి ఉన్న కుటుంబాల చేతిలోనే ఉంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లెక్కల ప్రకారం చట్టంలో పేర్కొన్న దానికి విరుద్ధంగా 100 రోజుల బదులు వ్యవసాయ కార్మికులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 49 రోజులే పని దొరికింది. జూన్‌ 2022లో గ్రామీణ ఉపాధి 80 లక్షల మందికి పోయిందని సీఎం ఐఈ లెక్క తేల్చింది. మొత్తం గ్రామీణ నిరు ద్యోగం రేటు ఎనిమిది శాతం పెరగటం ఆందోళనకరం. పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాల ప్రకారం 2018-19లో 21-59 ఏళ్ల వయసు వారిలో 10శాతం గ్రామీణ పురుషులు, 72 శాతం గ్రామీణ మహిళలు ఏ ఉపాధి లేకుండా ఉన్నారు. ఇది కోవిడ్‌ ముందు స్థితి, ఆతర్వాత పరిస్థితి ఇంకా దిగజారింది. ఆకలి వల్ల, పోషకాహార లేమి వల్ల లక్షల్లో చనిపోతున్న గిరిజన బిడ్డల సంగతి వర్ణనాతీతం. 2021లో ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 116 దేశాల్లోనూ 101వ స్థానానికి చేరింది. భారతదేశ వ్యవసాయ సంక్షోభానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్వాతంత్య్రానంతరం వరుస కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవలంభించిన వ్యవసాయ విధాన లక్ష్యం, అర్ధ ఫ్యూడల్‌ భూస్వాములను పెట్టుబడిదారీ భూస్వాములుగా మార్చి ధనిక రైతాంగాన్ని సృష్టించడం. ఇది రైతాంగంలో వర్గ విభజనను తీవ్రం చేసింది. 1950లో బి.సి.మహల్‌ నోబిస్‌ అంచనా ప్రకారం దేశంలో పున:పంపిణీకి 6 కోట్ల 30 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉండాలి. కానీ, దీనిలో ఒక్క గుంట భూమి కూడా పేద రైతులకు పంచింది లేదు. దేశంలోని భూకేంద్రీకరణలో ఏ మార్పు లేకపోగా ఇటీవల కాలంలో మరింత పెరిగింది.
మొదటి దశలో వ్యవసాయ విస్తరణకు, విద్యుత్‌కు, శాస్త్ర సాంకేతిక రంగాలకు, ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం పెట్టుబడులు ఇతోధికంగా ఉండేవి. కనీస మద్దతు ధర ద్వారా ఉత్పత్తిదారులకు ప్రభుత్వం సహకరించేది. కొన్ని పంటలను సేకరించడం ద్వారా కూడా ఈ సహకారం ఉండేది. ప్రజా పంపిణీ వ్యవస్థకు కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఉండేవి. బ్యాంకుల జాతీయీకరణ తర్వాత రైతాంగానికి విస్తారంగా పరపతి సౌకర్యం కల్పించబడిరది. దేశీయ మార్కెట్‌ రక్షణకై వ్యవసాయ పనిముట్ల దిగుమతిపై అనేక ఆంక్షలు పెట్టబడ్డాయి. శాస్త్ర సాంకేతిక రంగా ల్లో అధిక పెట్టుబడి వల్ల మంచి దిగుబడి నిచ్చే వంగడాలు సృష్టించబడ్డాయి. ఇదంతా హరిత విప్లవానికి దారితీసింది. ఉత్పత్తి, ఉత్పాదకత మెరుగై ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించింది. అయితే ఇది రెండు రకాల అసమానతలకు దారి తీసింది. మొదటిది ప్రాంతాల మధ్య, రెండోది రైతాం గంలో అసమానత. అయినప్పటికీ 1990 వరకు వ్యవసాయ రంగంలో కొంత పురోభివృద్ధి సాధ్యమైంది. 1991లో కాంగ్రెస్‌ ప్రారంభించిన నయా ఉదారవాద విధానాలు 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఉధృ తంగా కొనసాగుతున్నాయి. సామ్రాజ్యవాద వత్తిడితో ఆ విధానాలు అభివృద్ధి నిరోధకంగా మారాయి. ఈ దశలో ఆర్థిక లావాదేవీల నిర్వహణలో రాజ్యం తన పాత్ర ఉపసం హరించుకుంది. పూర్తి స్థాయిలో పెట్టుబడిదార్ల వత్తిడికి తలొగ్గింది. 1995లో హిస్సార్‌లో జరిగిన ఎఐకెఎస్‌ జాతీయ మహాసభ ఈ విధా నాలను విశ్లేషించి కింది హెచ్చరికలు చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఈ విధానాలు రైతాంగంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి పేద, మధ్యతరగతి రైతాంగాన్ని మరింత నిరుపేదలుగా మారుస్తాయి. పట్టణ, గ్రామీణ నిరుద్యోగం ఎన్నడూ చూడనంతగా పెరిగి పోతున్నది. ఇతర ఎన్నో రైతు సంఘాలు ఈ వ్యవసాయ విధానాలను పొగడ్తలతో ముంచెత్తుంతుండగా ఎఐకెఎస్‌ నయా ఉదార వాద విధానాలను విశ్లేషించగలగడం ప్రత్యేకత. ఎఐకెఎస్‌ హిస్సార్‌ మహాసభ హెచ్చరికలు 30 ఏళ్ల తర్వాత ఏ విధంగా నిజమైనాయో ఇప్పుడు చూస్తున్నాం.
నూతన ఆర్థిక విధానాలు
భూ సంస్కరణలను తిరగదోడటం, భూ పరి మితి చట్టాలను నీరుగార్చటంతో పెద్ద పెద్ద భూఖండాలను భారతదేశపు బడా వ్యాపార వేత్తలకు, విదేశీ బహుళ జాతి కంపెనీలకు అమ్మటానికి లేక లీజుకివ్వటానికి అవకాశమేర్ప డిరది. దున్నేవాడికే భూమి అనే నినాదం స్థానంలో కార్పొరేట్లకే భూమి అనే నినాదం వచ్చింది. విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల సౌకర్యాలు, విద్యుత్తు, ఇంకా ఇతర వ్యవసాయిక అవసరాల మీద ప్రభుత్వ సబ్సిడీలకు కోత పెట్టటంతో వ్యవసాయ సాధనాల మీద ఖర్చు విపరీతంగా పెరిగింది. ఆ ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయి. వ్యవసాయ దిగుమతుల పరిమితి మీదవున్న ఆంక్షలు తొలగించటం, దిగుమతులపై పన్నులు తగ్గించటంతో సబ్సిడీ కలిగిన విదేశీ వ్యవసాయ సరుకులు వరదలాగా దేశంలోకి వచ్చిపడ్డాయి. దానితో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కుప్పకూలాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏఎస్‌) వల్ల కలిగిన దుష్ప్రభావాలు సైతం ఇటువంటివే. వ్యవసాయం, ఇరిగేషన్‌, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నా లజీ, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలమీద ప్రభుత్వం పెట్టే పెట్టుబడులలో భారీగా కోత పెట్టారు. ఆయువుపట్టు లాంటి విద్యుత్తు, నీటి పారుదల సౌకర్యాల ప్రయివేటీకరణతో ఈ రెండిరటికి పెట్టాల్సిన ఖర్చు బాగా పెరిగింది. అంతేగాక, నీటి మీద గుత్తాధిపత్యాలు ఏర్పడ్డాయి సంస్థా గత రుణాలలో అతి పెద్ద భాగం కార్పొరేట్లకు మళ్ళించే విధాన నిర్ణయం మూలంగా రైతులకు, వ్యవసాయ కార్మికులకు అందుబాటులో ఉన్న రుణాలలో భారీ కోత పడ్డది. దానితో రైతాం గం అధిక వడ్డీలు వసూలు చేసే ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారుల మీద ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఆహార సబ్సిడీలలో విపరీతంగా కోత విధించి, గతంలో ఉన్న సార్వత్రిక ప్రజా పంపిణీకి బదులు లక్షిత ప్రజాపంపిణీ విధానాన్ని ప్రారంభించటంతో పేద ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడ్డది. కనీస మద్దతు ధర యంత్రాంగంలో,పంటల సేకరణ వ్యవస్థలలో దేశీయ మార్కెట్టులో జోక్యం చేసు కునే చర్యలనుండి ప్రభుత్వం తప్పుకున్నది. ఎగుమతి ఆధారిత వ్యవసాయం వైపునకు, ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు వైపుకు సాగును మళ్ళించటానికి ఒక విధానప రమైన ఒత్తిడి జరుగుతున్నది. సాగు నిర్వహణ లో యాంత్రీకరణ పెరుగుతున్నది. దీనితో వ్యవసాయ కార్మికుల ఉపాధి, నిజ వేతనాలు తగ్గుముఖం పట్టాయి.- (దిలీప్‌ రెడ్డి)

హరి వెంకట్‌కి అరుదైన అవకాశం

తిండికి కరువై…చదువుకు దూరమై…ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం ఇలా మొగ్గలోనే వాడిపోతే ఎలా?ఈఆలోచనతోనే గమ్యం తెలియని వీధి బాలల కోసం‘ధరణి’ పేరుతో ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి…వారికి ప్రాథమిక విద్యే కాదు…జీవిత పాఠాలనూ నేర్పిస్తున్న హరివెంకట్‌ రమణ ప్రయాణం ఇది…
విద్య, విజ్ఞానం… రేపటి తరానికి బంగారు భవిష్యత్తును అందించాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ప్రాథమిక విద్యను అందిస్తూనే… నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వాలి. మానవ విలువలు నేర్పించాలి. అప్పుడే వారు జీవితంలో స్థిరపడగలుగుతారు. మనమైతే సరే… మరి వీధిబాలల పరిస్థితి ఏమిటి? ఇలాంటి చదువు ఎవరు చెబుతారు? ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు హరి వెంకట్‌. ఇందులో ఎన్నో వ్యయప్రయాసలు, ఇబ్బం దులు ఉంటాయి. వద్దని వెనక్కి లాగినవారూ ఉన్నారు. కానీ అవేవీ పట్టించు కోకుండా ఆమె అడుగు ముందుకు వేశారు. తన నెలకొల్పిన సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా, విశాఖలోని వీధి బాలలు, బస్తీలు, అట్టడుగు వర్గాల పిల్లల కు నాణ్యమైన చదువు చెప్పిస్తున్నారు. తన కళాత్మక సృజనతో కార్టూన్లు ద్వారా అవగాహన ప్రచార మాధ్యమాలు ద్వారా,వ్యాసాలు రాస్తూ చైతన్య పరు స్తున్నారు. మనుషుల అక్రమరవాణా అన్నది భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్యక్తులను ప్రభావితం చేస్తున్న ఒకనేరం. ఒకసారి రవాణా బారిన పడిన తరువాత బాధితులు బలవంతంగా వ్యభిచారం, వెట్టిచాకిరీ, భిక్షాటన, పళ్లి,మత్తు పదార్ధాల చేరవేత, పిల్ల లను ఉపయో గించి చేసే లైంగిక చిత్రాల వంటి మరెన్నో దారుణ చర్యలకు గురవుతున్నారు. మన దేశంలో మను షూల అక్రమ రవాణాను నియంత్రించే చట్టాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఇవి భారత శిక్షాస్మృతి (ఐపిసి), 1860లోని 370-370ఎ విభాగాలు మనుషూల అక్రమ రవాణాను నిర్వచించి శిక్షారం చేస్తున్నాయి. సెక్షన్‌ 371,ఐపిసి బానిస వ్యాపారాన్ని నేరంగా పరిగణిస్తుంది బీ సెక్షన్‌ 372-373 ఐపిసి ప్రకారం వ్యభిచారం కోసం బాలికల అమ్మకాలు, కొనుగోళ్లను నిర్వహించడం నేరంబీ అనైతిక రవాణా (నియంత్రణ) చట్టం, 1956 ప్రకారం వ్యభిచారాన్ని నేరంగా పరిగణిస్తూ బాధితులను రక్షిం చడం, పునరావాసంతోపాటు వారి నైతిక ప్రవర్తనను సరిదిద్దడం గురించి చెబుతుంది. ఈ అంశాలపై పని చేస్తున్న హరికి అరుదైన అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్షిప్‌ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్‌ ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. అక్కడ లింగ ఆధారిత హింస,మానవ అక్రమ రవాణా అంశాలపై పనిచేస్తున్న కొన్ని సంస్థలు కలసి మానవ అక్రమ రవాణా అరికట్టాడానికి వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై చర్చించారు. ఈనేపథ్యంలో అక్కడ చర్చించిన అంశాలు, అధ్యయన యాత్ర అనుభవాలను ఆయన కలం నుంచి జాలు వారిన వ్యాసమే ఇది..!
అమెరికా వెళ్లాలని చాలామందికిఉంటుంది. నేను నాహైస్కూల్‌,కాలేజిరోజులలో విద్యా ర్థి సంఘంలో పనిచేసాను.ఆ ప్రభావమో,సాహిత్య ప్రభా వమో వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. పెట్టు బడిదారీ,బూర్జువాలాంటి పదాలువల్లెవేసిన వారి పిల్లలంతా అక్కడే ఉండటం, నాతోపాటు హైదరా బాద్‌ రూమ్‌ లోవున్న మాకజిన్స్‌ అమెరికా వెళ్ళాక అయిపూ, అజాలేక పోవడంవలన అమెరికా నాకెప్పు డూఒక ఆశ్చర్యం. డిగ్రీ తరువాత ఒకటి రెండుచిన్న ఉద్యోగాలు చేసి హైద రాబాద్‌లో యాని మేషన్‌ రంగంలో పనిచేసే వాడిని, అయితే సాహిత్యం సామజిక రంగంపై మక్కువతో 2006 సంవత్సరంలో ధరణి స్వచ్ఛంధ సంస్థను స్థాపించి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌తో కలిసి గ్రామాలలో యువజన సంఘాలు ఏర్పాటు చేయడం, గ్రామీణ గ్రంధాలయాలు, యువతకు కెరీర్‌ గైడన్స్‌ అంశాలపై పనిచేశాను.
వీధి బాలలు,బాలకార్మికులను గుర్తించి వారిని ప్రభుత్వ బడులకు పంపడం. బాల్య వివా హాల అనర్ధాలపై ప్రచారం, బాలికల విద్య ఆవశ్య కత,గుడ్‌ టచ్‌ బాడ్‌ టచ్‌ అంశాలపై ప్రభుత్వ పాఠశాలలు,హాస్టళ్లు,అంగన్వాడీల్లో తల్లులకు పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పిం చి ఒక ఉద్యమంలాగ దీనిని కొనసాగించాను. దాదాపు వేలాది మందికి ఈవిషయం చేరవేసే ప్రయత్నం చేసాను.పిల్లలతో, కమ్యూనిటీతో బాల్య వివాహాలనిషేధం,పిల్లలపైలైంగిక వేధింపుల నిరో ధం,బాలల భద్రత వంటి అంశాలపై గోడ పెయిం టింగ్‌లు వేయించాను.బాలికలు అక్రమ రవాణాకు గురికాకుండాపట్టణ మురికివాడలలో, పాఠశాల లలో,కళాశాలల్లో చాలా కాలం నుంచి మానవ అక్రమ రవాణా నిరోధానికి కౌమారులు తీసుకో వలసిన జాగ్రత్తలు వివరిస్తూవొచ్చాను, ఈ అంశం పై యానిమేషన్‌, పోస్టర్లు,పిల్లలకు అర్ధం కావడానికి పోస్టర్లు, పత్రికలలో వ్యాసాలు రాసేను. ఒకానొక రోజు ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్షిప్‌ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్‌ ప్రభుత్వం నుంచివొచ్చింది. ఇంకే ముంది యెగిరి గంతేసి ప్రయాణ ఏర్పాట్లు చేసుకు న్నాను. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్‌3వ తారీఖు వరకు జరిగిన ఈ పర్యటన ఒక మంచి విజ్ఞాన అనుభవం.
అమెరికాలో వివిధ రాష్ట్రాలలో పర్యటన
ఢల్లీి నుంచి ఆమ్స్టర్‌ డాం మీదుగా 13 ఆగస్టు నడల్లాస్‌ చేరుకున్నాము. లింగ ఆధారిత హింస, మానవ అక్రమరవాణా అంశంపై చర్చలు, మేధో మధనాలు,సలహాలు,సూచనల ఆహ్వానాలు అమె రికా రాజధాని వా షింగ్టన్‌ డి.సి.సంయుక్త రాష్ట్రా లయిన నార్త్‌ డకోటా(మైనాట్‌, బిస్మార్క్‌ నగ రాలు)సియాటల్‌(వ్వాషింగ్టన్‌ రాష్ట్రం),పెన్సో కోలా (ఫ్లోరిడారాష్ట్రం)లలో జరిగాయి. ఈ పర్యటనలో భాగంగా అమెరికా ఓవర్‌ సీస్‌ ఎడ్యుకేషన్‌ డిపా ర్ట్మెంట్‌, డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ ఎక్స్టర్నల్‌ అఫైర్స్‌ (విదేశీ వ్యవహారాలు) సందర్శించడం జరిగింది అమెరి కాలో ఫెడరల్‌ వ్యవస్థ పనిచేసే విధానం,అటార్నీ జనరల్‌ అసోసియేషన్‌, గృహహింస అరికట్టడం, బాధితులకు సహాయం చేసే పనిచేసే ఎన్‌జీవోలతో వ్వాషింగ్టన్‌ డీసీలో సమావేశం అయ్యాము. నార్త్‌డ కోటా రాష్ట్రంలోట్రైబల్‌ వ్యవహారాల విభాగాన్ని సందర్శించి ఆదిమతెగలలో లింగ ఆధారిత హింస అందుకు కారణాలు,మానవ అక్రమరవాణా జరుగుతున్న విధానం తెలుసుకున్నాము.సియాటెల్‌ నగరంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఆ రాష్ట్ర సెనేటర్‌ మానవ అక్రమ రవాణా అరికట్టడానికి తీసుకు వొచ్చిన పలు చట్టాలు,బాధితులతోనే (సెక్స్‌ వర్కర్స్‌) నిర్వహిస్తున్న సంస్థలు,పిల్లల కొరకు అక్కడి ప్రభు త్వం ఏర్పాటు చేసిన కార్యాలయాలు,బాలలపై లైంగిక దాడులు జరిగినప్పుడు వారినుంచి వివరా లు రాబట్టడానికి అనుసరించే సృజనాత్మక విధా నాలు తెలుసుకున్నాను.
అమెరికాలో లింగ ఆధారిత హింస
మహిళలు పురుషులపై ఆధారపడటం,ఆర్ధిక స్వేఛ్చ లేకపోవడం.ఆర్ధికంగా పతనమైన వలస కుటుం బాలు,అప్పులు,కుటుంబాలకు మిగిలిన వ్యక్తులతో డ్పాటు లేకపోవడం వలన లింగ ఆధారిత హింస అమెరికాలో ఎక్కువ.ఎక్కువ గృహ హింస కేసులు ఆసియా దేశాలు అందునా భారత్‌ వంటి దేశాల నుంచి వొచ్చిన కుటుంబాల నుంచే నమోదు కావ డం వంటివి అక్కడ గృహ హింసపై పనిచేస్తోన్న ఒకస్వచ్ఛంధ సంస్థ(ఎన్‌.జీ.ఓ)చెప్పగా ఆశ్చర్య పోయాను. చాలా సందర్భాలు,కేసులు ఆర్ధిక అస్థిరత వల్లనే అవుతున్నాయి అని నాకు అనిపించింది. ప్రతీది డబ్బుతో ముడిపడిఉండటం,భద్రత లేనిఉద్యోగాలు,వీకెండ్‌ ఎంజాయిమెంట్‌కి ఎక్కువ ప్రాధా న్యత ఇవ్వటం,పదహారు సంవత్సరాల నుంచి పిల్లలుస్వతంత్రంగాఉండటం (అందువలన తప్పు లేదు గాని,మద్యం,డ్రగ్స్‌ వంటి వాటికి అడిక్ట్‌ అయ్యే వారు ఎక్కువ)కూడా కొన్నికారణాలుగా అనిపిం చింది. మన దేశంలో కుటుంబవ్యవస్థను రక్షించడం కొరకు,మగవాడు చెప్పింది చేయాలి.స్త్రీ ఇలానేఉండాలిఅనే భావాలప్రచారం వలన మనకు మహిళలపై, పిల్లలపై హింస ఎక్కువ. ఇది మన సంస్కృతిలోబాగా వేళ్ళూనుకు పోయివుంది. చిన్న తనం నుంచే మనకు మగ,ఆడ అనే బేధాలు ఎక్కువ. ఇవి మహిళలు పిల్లలపై హింసకు,లైంగిక హింసకు కారణమవుతున్నాయి.అయితే లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి అమెరికాలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సహకారంతో క్రైసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశాయి.వీటికి5శాతం వరకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది.మిగతావి డోనర్‌ ఏజెన్సీ లు,వ్యక్తిగత డోనర్లు ఈక్రైసిస్‌ సెంటర్లలో మహిళ లు రక్షణ పొంద వొచ్చు.శిక్షణ పొందవొచ్చు ,తిరిగి తమ కుటుంబాన్ని కలవాలి అనుకున్నపుడు వెళ్ళవొచ్చు. చాలా సందర్భాలలో తిరిగి మహిళలు కుటుంబం వద్దకే వెళ్లిపోతుంటారు. అయితే ఈ బాధిత కార్యాలయాలు అత్యంత గోప్యతతో నిర్వహిస్తారు. అక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోచట్టం కనుక మనదేశంలోవలే జాతీ యస్థాయి చట్టాలు, అమలు విధానాలు వుండవు. ఇది కేంద్ర స్థాయిలో పనిచేయడానికి వారికి అడ్డంకిగా మారుతుంది. నేను సియాటెల్‌ నగరంలో ఒక రెఫ్యూజీ సెంటర్‌కు వెళ్ళాను..అది పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. అమెరికాను పీడిస్తున్న అక్రమ రవాణా అంశం తగిన లేబర్‌ లేకపోవడం, వ్యవసాయ పనులకు లేబర్‌ కావాల్సిరావడం కూడా ఈ మానవ అక్రమ రవాణాకు కారణం,అలా తీసుకువొచ్చిన వారి పాస్పోర్టుల తీసేసుకొని వారిని సెక్స్‌ ట్రేడ్‌కు వాడు తున్నారు.ఇంకా ఇక్కడప్రాస్టిట్యూట్‌ సర్వైవర్స్‌ నడుపుతున్న ఒక ఎన్‌జీఓను కలవడం జరిగింది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ మీద ఇంటర్లో గాట్‌,డంకెల్‌ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బోలెడు కార్టూన్లు వేసాను. ఇప్పుడు అదే సెంటర్లో వరల్డ్‌ అఫైర్స్‌ ఆఫీసులో మీటింగులో పాల్గొనడం ఒకచిత్రమైన అనుభూతి. ఇక్కడ కింగ్‌ కౌంటీ కౌన్సిల్‌ మెంబెర్‌ని కలిసాము,ఆమె మానవ అక్రమ రవాణా నిరోధా నికి ఎన్నోచట్టాలను గత ఇరవై ఏళ్లుగారూపొం దించి ప్రవేశ పెట్టారు. మానవ అక్రమ రవాణా నిరోధాన్ని కేవలంచట్టాలు ఎంత వరకు తగ్గిస్తా యి? అన్న నా ప్రశ్నకు సమాజంలో మానవ అక్రమ రవాణా పట్ల ఒకసాంస్కృతిక మార్పు రావాల్సి ఉంటుం దని ఆమె చెప్పారు.
ఆదిమ తెగలలో లింగ ఆధారిత హింస
లింగ ఆధారిత హింస ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. సమాన అవకాశాలు లేకపోవడం, కుటుం బాలలో ఆర్ధిక అస్థిరత,మానసిక సమస్యలు, విపరీ తమైన త్రాగుడు,డ్రగ్స్‌ తీసుకోవడం ఒక ప్రధాన కారణంగా ఇక్కడ కలిసిన వ్యక్తుల,సమూహాల చర్చలనుబట్టి అర్ధమయ్యింది. మహిళల ప్రయివసీ కాపాడటం, బహిరంగ ప్రదేశాలలో వారిని గౌరవించే విధానం ఇక్కడ చాలా బాగుంది. కానీ అటువంటి సివిక్‌ సెన్స్‌ అభివృద్ధి చెందినచోట లింగ ఆధారిత కుటుంబహింస ఎక్కువగాఉండటం ఆశ్చర్యకరం.మన దగ్గర తరాలుగా అంది పుచ్చు కున్న ‘‘మనువాద భావాలు’’ మహిళలను రెండో పౌరులుగా చూస్తే ఇక్కడ గిరిజన తెగలలో,వలస దారులలో కూడా లింగ ఆధారిత హింస ఎక్కువ ఉన్నట్లు అర్ధమవుతుంది.ఆదిమ తెగలు స్త్రీ కేంద్రం గా స్త్రీని గౌరవించే ఆచారాలు కలవి,అటువంటి చోట మెయిన్‌ స్ట్రీమ్‌సమాజం ప్రభావం పడి వాటి పై కూడా లింగఆధారిత కుటుంబ హింస పడిర ది. ఇంకా వందల ఆదిమతెగలు ఇక్కడ తమ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నాయి. ట్రైబల్‌ కోర్టులు ఉంటాయి అయితే వాటి కంటేపై స్థాయిలో స్టేట్‌, ఫెడరల్‌ కోర్టులదేపై చేయి. మిగతా సమా జంతో కలిసి అవకాశాలు అందిపుచ్చు కోవడం లో వెనుకంజ, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకొని ముందుకు వెళ్లలేక పోవడం కూడా కుటుంబ,లింగ ఆధారిత హింసకు కారణంగా నాకు అనిపించింది.ఇందుకు ప్రత్యామ్నాయంగా భాషను కాపాడు కోవడం,స్కిల్స్‌ అప్‌ గ్రేడ్‌ చేసుకోవడం ఆయా తెగలు చేస్తున్నాయి. అమెరికా అనేక గిరిజన తెగలను నిర్మూలించివారి పునాదులపై సౌధాలు నిర్మించింది అన్న చరిత్ర అందరికి తెలిసిందే.
పర్యటన స్పూర్తి
ఈపర్యటన ఇచ్చిన స్పూర్తితో మానవ అక్రమ రవాణా నిరోధం అంశంపై మరింతగా పనిచేస్తాను, ముక్యంగా యువతులు,కౌమార బాలికలు, బాలురు ఈకూపంలో ఇరుక్కోకుండా వారికి విభిన్న మాధ్య మాల (మీడియా,కార్టూన్లు, పవర్‌ పాయింట్‌ ప్రెసెం టేషన్‌,యానిమేషన్‌ )ద్వారా తెలియజేస్తాను. అక్రమ రవాణాలో చిక్కుకున్న వారికి ప్రభుత్వంనుంచి సహా యం అందేలాచేయడం,ఇందుకోసం ఏర్పడిన కమి టీలు సమావేశం అయ్యేలా కృషి చేయడం, జాతీయ స్థాయి సంస్థలతో ఈఅంశంపై కలిసి కార్యాచరణ రూపొందించుకోవడం చేస్తాను. ఇటుక బట్టీలలో పనిచేసే పిల్లలను వెట్టి నుంచివిముక్తి చేయడంకోసం ప్రత్యేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఇంటి పని వారల సంఘంతో కలిసి గృహ కార్మి కులు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రచార కార్యక్రమాలు చేస్తాను. జిల్లాన్యాయ సేవాధికార సంస్థతో కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేయ టానికి కోరుతాము.యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్స్‌ ఇంకా పిల్లలు, మహిళల కోసం పనిచేసే సంస్థలతో కలిసి పని చేయడంద్వారా బాల, బాలి కలు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రయత్నించ వొచ్చు. ఇంటి పనివారు, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి, విదేశాలలో వెళ్లే వారికి అవగా హన కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన వుంది.
వ్యాసకర్త : బాలల హక్కుల కార్యకర్త, విశాఖపట్నం-(హరి వెంకట రమణ)

రుణ యాప్‌ల కారకులెవరు?

పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు బ్యాంకు ద్వారా అప్పు పొందాలంటే ఎన్నో నింబంధనలు. అనేక ఆధారాలు చూపాలి. బ్యాంకులు అడిగిన వాటిని తీసుకురాలేని వారికి అప్పు ఇచ్చే అవకాశమే లేదు. వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకింగ్‌ వ్యవస్థను బలహీనం చేయాలనే సరళీకరణ విధానాల వల్ల చిన్న, చిన్న మొత్తాలు బ్యాంకుల్లో ఇచ్చే పరిస్థితి లేదు. లక్షలు, కోట్లు అప్పు తీసుకునే ‘విలువైన విని యోగదారుల’ సేవలో బ్యాంకులు తరిస్తున్నాయి. ఇలాంటి అప్పులు తీసుకున్న వారు వాటిని చెల్లించ కుండా ఎలా దేశాలు దాటిపోతున్నారో, ఎలా ప్రపంచ కోటీశ్వరులు అవుతున్నారో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో అత్యధికమంది వినియోగదారుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఈ రుణయాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.
‘అప్పు అంటే ముప్పే’అన్న మాట రుణ యాప్‌ల దారుణాలు చూస్తుంటే అక్షర సత్యమని పిస్తుంది. పేద,మధ్యతరగతి ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని ఫోన్లద్వారా అప్పులు ఇచ్చేం దుకు నెట్‌లో వందలసంఖ్యలో రుణయాప్‌లు వున్నా యి.ఈయాప్‌లు అప్పుతీసుకునే వారికోసం మొదట వేట ప్రారంభిస్తాయి.ఆవేటలో చిక్కిన రుణగ్రహీత లను దారుణంగా వేధించి వసూళ్ళు చేస్తాయి. ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేనివారు ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. మన రాష్ట్రంలో గత రెండు నెలల్లో పది మందికిపైగా రుణయాప్‌ బాధితులు ఆత్మహ త్యలు చేసుకున్నారు.ఈరుణయాప్‌ల గురించి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు గతనెల లోనే మూడు,నాలుగుసార్లు హెచ్చరికలు,విధాన నిర్ణయాలు చేశాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుంది.
నిత్యావసరాలు,అత్యవసరాలకు డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు మానసిక, శారీరక శ్రమలు చేయడం ద్వారానైనా రావాలి. లేదా ఆ శ్రమలు చేసిన వారిని దోచుకోవడం ద్వారానైనా రావాలి.ఈ వ్యవస్థలో అత్యధికులు శ్రమ చేయడం, అతి కొద్దిమంది శ్రమను దోచుకోవడం జరుగు తుంది. అందువల్ల ఉత్పత్తి, అందుకు అవసరమైన శ్రమఈవ్యవస్థను నడపడంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. యంత్రవిజ్ఞానాన్ని అన్ని రంగాల్లో విని యోగించడంవల్ల శ్రమతేలిక కావాలి. శ్రమ జీవికి విశ్రాంతి కలగాలి.కాని పని చేయగలిగిన వారంద రికి పనులు దొరకని పరిస్థితి ఏర్పడడమే ఈ వ్య వస్థ బలహీనతలన్నింటికీ మూలం. ఉన్న కొద్దిపాటి పనులకు పోటీ పెరుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న యజమానులు వేతనాలు తగ్గిస్తారు. ఇది చివరకు నిత్యావసరమైన వాటిని కూడా కొనలేని స్థితికి ప్రజలను దిగజారుస్తుంది. కోవిడ్‌ సంక్షోభ సమయంలో చేసిన అప్పుల భారం, పనులు తగ్గడం శ్రమజీవుల జీవనాన్ని మరింత వేగంగా దిగజా ర్చింది.ఈ ప్రత్యేక పరిస్థితుల్లో పేదలందరికీ నెలకు రూ.7,500ఇవ్వాలనే కనీస డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అందువల్ల గతంలో చేసే అప్పులకు తోడు కోవిడ్‌ తర్వాత పేద,దిగువ మధ్యతరగతి ప్రజలు రోజువారీ అవస రాలకు కూడా అప్పులు చేయాల్సి వచ్చింది.వీటికి తోడు బిజెపి పాలనా కాలంలో వేగంగా అమలవు తున్న సరళీకరణ విధానాలు ఒకవైపు ఉపాధిని తగ్గించి,మరోవైపు ధరల భారాన్ని పెంచాయి. వీటికితోడు వస్తు వ్యామోహాన్ని విపరీతంగా పెం చేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితితో సంబంధంలేని జీవనాన్ని ఈఆర్థిక విధానాలు అలవాటు చేస్తు న్నాయి. అత్యధిక మందిని ఆధునిక జీవన ఆశల ఊహల్లో పోటీ పడేటట్లు,భౌతికజీవనాన్ని మధ్య యుగాల నాటి మూఢనమ్మకాలు, విశ్వాసాల్లో నిలి చేటట్లు పాలకవర్గాలు ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తు న్నాయి. ఈసరళీకరణ విధానాల కత్తికి రెండు పక్కలా పదును వుంది. ఒకవైపు కార్పొరేట్‌ కంపె నీల సరుకులను ఎగబడి కొనేటట్లు చేయడం, మరోవైపు మతతత్వ శక్తుల భావజాలాన్ని ఆచరించే టట్లు చూడడం. అందుకే ఈ విధానాలను అన్ని వైపుల నుండి పాలక పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఎవరైతే ఉపాధి తగ్గించి, వేత నాలు తగ్గించి ప్రజల కష్టాలకు కారణమవు తున్నా రో వారే తమ సరుకులను అమ్ముకోవడానికి, కొను గోలుదార్లను ఆకర్షించడానికి తీవ్రంగా పోటీ పడు తున్నారు. సీరియళ్లు,సినిమాలు,మీడియా ప్రకట నలు,హోర్డింగులు,అందమైన షాపింగ్‌ మాల్స్‌, ఆకర్షణీయమైన రాయితీలతో పాటు రుణ సదుపా యాలు ఇచ్చి కృత్రిమ కొనుగోలు పెంచి సరుకులు అమ్ముకోవాలని చూస్తున్నారు.-(వి.రాంభూపాల్‌)

ఆర్ధిక నిఘా దాడులు అమానుషం

నా చిన్నప్పుడు, అంటే గత 50సంవత్సరాల క్రితం పలురకాల సామాజిక సమస్యలపై ప్రజాఉద్యమాలు నడిచేవి.తాగు,సాగునీరు,ప్రజల జీవనోపాధి,ప్రజావసరాలు,మౌళిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రజలు ధర్నాలు,ర్యాలీలు,నిరసనప్రదర్శనలు చేసేవారు. ఇలా సమాజంలో ప్రజాజీవన విధానాలపైనే సామాజిక పోరాటాలు సాగేవి.సరళీకరణ,మిశ్రమ ఆర్ధిక విధానాలు పుణ్యమా అని ప్రస్తుతం ఆ ఉద్యమాలు దారిమళ్ళాయి. దళిత,గిరిజనుల భూములు కోల్పోవడం,స్థానిక వనరులు దోపిడి,పర్యావరణసమతుల్యం దెబ్బతినడం వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా చేపడుతున్న పోరాటాలను నిత్యం ప్రచార మాధ్యమాలు ద్వారా తెలుస్తున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ,గిరిజన తెగలు నివాసించే అటవీప్రాంతాల్లో పెద్దపెద్ద పరిశ్రమలు,ప్రాజెక్టులు స్థాపన కోసం స్థానిక గిరిజనుల భూములు, వనరులు దోపిడికి గురికావడం వంటి తీవ్రమైనఅంశాల ఉద్యమాలు జరుగుతున్నాయి.నూతనఆర్ధిక విధానాలు తర్వాత ప్రైవేటీకీకరణ పెత్తనం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటినుంచి ప్రజల సామాజిక ఉద్యమాలు కాస్త పక్కదారి పట్టాయి.ప్రపంచీకరణనేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా చేపట్టినప్రాజెక్టులు,పరిశ్రమలవల్ల నిర్వాసితులైనప్రజలు,దెబ్బతింటున్న పర్యావరణసమతుల్యతపై పోరాటాలు నడుస్తున్నాయి.మిగతా ప్రజామౌళికావసరాలపై చేపట్టే సామాజికఉద్యమాలు తగ్గుతూ వస్తున్నాయి.
దేశంలో1991వరకు సామ్యవాద తరహా అక్కడ అక్కడా పరిశ్రమలు నెలకొల్పారు. కానీ ప్రైవేటీకరణ పెరగడంవల్ల వనరులు,పర్యావరణ సమస్యలతో ప్రజల పడుతున్న వెతలు వర్ణీతీతంగా మారాయి.మిశ్రమఆర్ధిక విధానం,సంక్షేమ రాజ్యం అనే భావనలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ ఆర్ధిక విధానాలు వచ్చాయి. బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కోసం చేసే కేటాయింపులు తగ్గించడంవల్ల పేద,మధ్య తరగతి ప్రజలకు నష్టం వాటిల్లింది. ఫలితంగా ఆర్ధిక సంక్షోభంలో పడిన ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం లేదా పూర్తిగా మూసేవేయడం వంటి విధానాలవల్ల ఆ సంస్థల్లో పనిచేసే శ్రామికులురోడ్డున పడుతున్నారు. దీనికి తోడుగా గత రెండేళ్ళక్రితం ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్‌`19 ఆంక్షలు స్థానిక ప్రభుత్వాలకు జతకట్టాయి.దీని ఆసరాగా తీసుకొని స్థానిక వనరులు,పర్యావరణ సమతుల్యతలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. పెట్టుబడులు ఉపసంహరణవల్ల నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థల(స్టీల్‌ ప్లాంట్‌ వంటి కంపెనీలు) పనితీరు మెరుగైన లాభాల బాట పట్టినప్పటికీ,శ్రామికులకు ఏమాత్రం మేలు చేకూరలేదు.ఫలితంగా బాధితుల ఒత్తిడి మేరకు సామాజిక, పర్యావరణవేత్తలు ఉద్యమాలు చేయాల్సిన అవశ్యకత ఏర్పడుతుంది.
ఈనేపథ్యంలో ఈఅంశాలపై పోరాటంచేసే వారిపై స్థానిక ప్రభుత్వాలు ఉక్కుపాదం ప్రయోగిస్తోంది. వారి నిరసన గళాన్ని అణిచివేసేందుకు కొత్త ఎత్తుగడ వేశాయి. వారిపై ఆర్ధిక నేర ఆరోపణ నెపంతో ఆర్ధిక నిఘా విభాగాలను ప్రయోగిస్తూ సరికొత్త తరహాలో దాడులు ప్రారంభించాయి. ఇలా ఇప్పటి వరకు దేశంలో సుమారుగా 300 మంది సామాజిక,పర్యావరణవేత్తలు,స్వచ్చంధ సంస్థలపై సోదాలు పేరుతో దాడులు చేపట్టాయి. టెర్రరిస్టులు తరహాలో వారిపై దాడులు చేసి భయాంబ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్దకాలంలో సామాజిక,పర్యావరణ పరిరక్షణ,మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలైన 1700మందిని హత్యలకు గురి చేసినట్లు నివేదకలు చెబుతున్నాయి.
ఇదింతా బడాపారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సామాజిక ఉద్యమ కార్యకర్త లను భయాందోళనలకు గురిచేసి అడ్డుతొలగించుకోవడానికి స్థానికప్రభుత్వాలు వ్యవహరిస్తున్న పెద్ద కుట్రలోని ఒక భాగమేనని ప్రజలు,పర్యావరణ,సామాజిక వేత్తలు భావిస్తున్నారు.-రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

మన్యం కాఫీ తోటల కథ..

చల్లటి సాయంత్రానా..వేడి వేడి కాఫీని తాగుతూ..ఓ మంచి పుస్తకాన్ని చదువు తుంటే… ప్రపంచానే మైమరిచిపోతారు అనటంలో అతిశయోక్తి లేదు. ఎంతటి ఒత్తిడినైన ఓకప్పు కాఫీ అలవోకగా దూరం చేస్తుంది. మిత్రులతో కబుర్లు చెబుతూ..పొగలు కక్కే కాఫీని ఆస్వాదిస్తూ కాలాన్నే మరిచి పోతుంటారు. ఇంతటి విశిష్ట కలిగిన కాఫీ పంట మన ఆంధ్రాలోను పండుతుం దండోయ్‌?.అంతేనా అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలను అందుకోవటంతో పాటు… కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. మరి ఈ కాఫీ కథేంటో కాస్త చూద్దామా…
ఓ మంచి కాఫీ… తీయ్యని అనుభూతిని కలిగిస్తుంది. మనస్సుకు నచ్చిన వారితో కబుర్లు చెబుతూ… కాఫీని ఆస్వాదించటం ఓ మధుర జ్ఞాపకం. అలాంటి విశిష్టత కలిగిన కాఫీ తయారీలో కీలక పాత్ర వహిస్తోంది విశాఖ నర్సీపట్నంలోని కాఫీ శుద్ధీకరణ కేంద్రం. ఇందులో శుద్ధి చేస్తున్న కాఫీ గింజల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థకు ఏటా కోట్ల ఆదాయం వస్తోంది. విశాఖ మన్యంలోని ప్రత్యేకమైన వాతావరణంలో పండే ఈ కాఫీ గింజలకు దేశంలోనే విశిష్ట స్థానం ఉంది. అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో ఏన్నో పురస్కారాలు దక్కాయి. నర్సీపట్నం కాఫీ క్యూరింగ్‌ సెంటర్‌ ప్రస్థానం…మన్యం కాఫీ గింజల గుర్తింపు వెనుక నర్సీపట్నంలోని కాఫీ క్యూరింగ్‌ సెంటర్‌ కృషి ఎంతో విలువైనది. ఈ కేంద్రం ఏపీఎఫ్‌ డీసీ ఆధ్వర్యంలో 1959లో ఏర్పడిరది. అప్పట్లో శ్రీలంక కాందిశీకులకు (వలసదారులు) ,ఉపాధి కల్పించాల్సిన ఒప్పందం మేరకు … ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటల పెంపకాన్ని ప్రారంభించింది. తోటలోని గింజలను శుద్ధి చేసేందుకు మన్యానికి సమీపంలో ఉన్న… నర్సీపట్నంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మకం, రవాణాకు తగిన సదుపాయాలు ఉండటం వల్ల లాభదాయ కంగా ఉండేది. దీని ద్వారా కోట్లరూపాయల ఆదాయం రావడంతో పాటు.. మన్యం కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. మహిళా ఉపాధి…ఇక్కడి కేంద్రంలో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వందలాది మంది మహిళలు…దశాబ్దాలుగా కాఫీ శుద్ధీకరణ పనులతో ఉపాధి పొందుతున్నారు. వీరంతా గింజల్లోని నల్లటి పప్పును వేరు చేయడం వంటి పనులు చేపడుతుంటారు. తొలిరోజుల్లో 15 మంది మాత్రమే సగటున 40రూపాయల వేతనంతో పనిచేసేవారు. క్రమేపి వీటి సాగు విస్తరించటం… దిగుబడులు పెరగటం ద్వారా ఇక్కడ ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కాఫీ శుద్ధీకరణ పనులకు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేశారు.
లాభ, నష్టాల బేరీజు…ఈ ఏజెన్సీ ప్రాంతంలో పదివేల ఎకరాల్లో కాఫీ తోటలు ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగు చేస్తున్నారు. గతంలో స్థానిక గిరిజనుల సహాయంతో బెంగ ళూరు వంటి పట్టణాల్లో ఈ గింజల విక్రయాలు జరిపేవారు. ప్రస్తుతం ఆన్‌?లైన్‌? లో వేలం వేస్తున్నారు. ఈ పంట వల్ల ప్రతి ఏటా 18 కోట్లు ఆదాయం వచ్చేది. ఏజెన్సీలో వీటి సేకరణపై మావోయిస్టుల ఆంక్షలు, పంట దిగుబడి తగ్గడం…వంటి కారణాలతో ఈ వ్యాపారానికి నష్టాలు తప్పటం లేదు. గత ఏడాది శుద్ధిచేసిన 234 టన్నుల గింజలు మాత్రమే విక్రయించగలిగారు . దీంతో 4.5 కోట్ల ఆదాయం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ సీజన్‌ ప్రారంభం కావడంతో కాఫీ శుద్ధి పనులకు అధికారులు సన్నద్ధమవు తున్నారు. ఈ సంవత్సరం మన్యంలో కాఫీ పంట విస్తారంగా పెరిగిన నేపథ్యంలో ఆదా యం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.నాలుగేళ్లుగా కొత్త వ్యాపారం. నాలుగేళ్లుగా ఈ కేంద్రం నీలగిరి వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది.మునుపు విశాఖ డివిజన్‌ లో దీనిని చేపట్టేవారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా ఆ డివిజన్‌ మూసి వేసి నర్సీపట్నంలో విలీనం చేశారు. దీంతో జిల్లాలోని కసింకోట మండలం , కన్నూరు పాలెం…వంటి ప్రాంతా ల్లో ఏపీఎఫ్‌?డీసీకి చెందిన నీలగిరి తోటలను టెండర్ల ద్వారా అమ్మకాలు చేపడుతున్నారు. వీటి ద్వారా సుమారు 10కోట్ల ఆదాయం లభిస్తోంది. ఈ ఏడాది కరోనా వైరస్‌ కు తోడు టన్ను ధర 8వేల నుంచి 4వేల దిగిపోవడంతో అమ్మకాలు ముందుకు సాగడం లేదు.
అరకు కాఫీ’కి వందేళ్లు..
భారతదేశంలో అరకు కాఫీ టాప్‌ బ్రాండ్స్‌లో ఒకటి. వందేళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఇది కాఫీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసు కుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అరకు కాఫీ గురించి తెలియని తెలుగు వారు ఉండకపోవచ్చు. అసలు ఇంతకీ ఈ కాఫీ ప్రయాణం అరకు మన్యంలోకి ఎలా సాగింది.
చెట్ల మధ్య తోటల పెంపకం…
విశాఖ ఏజెన్సీకి అసలు కాఫీ ఏలా వచ్చిందనే విషయాన్ని జీసీసీ (గిరిజన కోపరేటివ్‌ కార్పో రేషన్‌) మాజీ ఎండీ రవి ప్రకాష్‌ గతంలో వివరించారు.‘‘1898లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో ఆంగ్లేయులు కాఫీ పంట వేశారు. అక్కడ్నించి కొద్ది కాలానికి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతా ల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920కి కాఫీ అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలకు చేరుకుంది. అయితే అది ఎక్కువ గా సాగవలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10వేల ఎక రాలలో అభివృద్ధి చేసింది. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పగిం చింది. 1975 నుంచి 1985 వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం ఏర్పాటైంది. సుమారు 4000 హెక్టార్లలో సేంద్రీయ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి ‘అరకు కాఫీ’ అనే పేరు స్థిర పడిరది’’ అని చెప్పారు.
పోడు వ్యవసాయం వదిలి కాఫీ తోటల్లోకి…
గిరిజన కుటుంబాలలో ఎక్కువమంది రైతులు కాఫీ పంట ద్వారా ఆర్థికంగా నిలదొక్కు కుంటున్నారు. తాము సంప్రదాయ పద్ధతులోల చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయిం చారు.వందేళ్ల కిందట నుంచే విశాఖ ఏజెన్సీలోని అరకు,అనంతగిరి,జీకే వీధి, చింతపల్లి, పెదబయలు,ఆర్వీనగర్‌, మిను మలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలను ఆంగ్లేయులు పెంచడం ప్రారంభించారు. అయితే స్వాతంత్య్రం అనంతరం ఏర్పాటైన గిరిజన కోపరేటివ్‌ కార్పో రేషన్‌ ఆధ్వర్యంలో 1960 నుంచి ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం మొదలైంది. మొదట్లో పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు క్రమక్రమంగా… ఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు విస్తరిం చాయి. ఇంతలా విస్తరించడానికి ఇక్కడి వాతావరణమే ప్రధాన కారణం.
అరకు కాఫీ రుచికి కారణం అదే…
అరకు కాఫీ రుచికి ప్రధాన కారణం మన్యం లోని వాతావరణమేనని ఆంధ్ర విశ్వవిద్యా లయం మెటరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రామకృష్ణ తెలిపారు. ‘‘సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ…పొడవాటి మిరియాలు,సిల్వర్‌ ఓక్‌ చెట్ల మధ్యలో సాగవు తాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు. దీని వలన చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం కూడా కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది’’ అని తెలిపారు.
అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి
ప్రపంచంలో కాఫీని అధికంగా పండిరచే దేశాల్లో భారతదేశానిది ఏడో స్థానం.బ్రెజిల్‌ 25 లక్షల మెట్రిక్‌ టన్నుల కాఫీ ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. ఇండియా మూడున్నర లక్షల మెట్రిక్‌ టన్నులతో ఏడవ స్థానంలో ఉంది. భారతదేశంలో…12 రాష్ట్రా లు కాఫీని పండిస్తుండగా…అందులో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమి ళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అరబికా రకం కాఫీని పండిస్తారు.ప్యారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్‌ పేరుతో 2017లో కాఫీ షాప్‌ తెరి చారు. భారతదేశం వెలుపల ఏర్పాటైన మొట్ట మొదటి ‘అరకు కాఫీ’ షాప్‌ ఇది. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌ నకు చెందిన అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ దీన్ని ప్యారిస్‌ లో ఏర్పాటు చేసింది. ఆతర్వాత అరకు కాఫీ రుచులు జపాన్‌, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌ దేశాలకూ పాకాయి. 2018లో పారిస్‌ లో జరిగిన ప్రిక్స్‌ ఎపిక్యూర్స్‌-2018 పోటీలో (ూతీఱఞ జుజూఱషబతీవం) అరకు కాఫీ గోల్డ్‌ మోడల్‌ గెల్చుకుంది. రుచికరమైన కాఫీ బ్రాం డులకి పేరుపొందిన బ్రెజిల్‌, సుమత్రా, కొలం బోతో పాటు ఇతర దేశాలను వెనక్కి నెట్టి అరకు కాఫీ బంగారు పతకాన్ని పొందడం విశేషం.-(కిల్లో సురేంద్ర)

జానపద దర్శనంలో గిరిజన సాహిత్య జాడలు

గిరులు అనబడే కొండకోనల్లో ఉండే గిరిజ నులకు,జనపదాలు అనబడే పల్లెల్లో నివ సించే జానపదలకు, అవినా భావ సంబం ధం ఉన్నట్టే , ఇరువురి సాహిత్యం కూడా ఒకప్పుడు మౌఖిక సాహిత్యమే..!!,భాషల్లో వచ్చినఅభివృద్ధి మార్పు లు దృష్ట్యా, ప్రస్తుతం రెండిటికీ లిఖిత సాహిత్యం వచ్చి అనేక పరిశోధనలు,గ్రంథాలు, వెలు వడ్డాయి.. వెలువడుతున్నాయి. తద్వారా అయా సాహిత్యాలలోని అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి అందులో భాగంగానే,రచయిత్రి ‘‘చామర్తి అరుణ’’ వ్రాసిన చక్కని పరిశోధక పూర్వ రచన ‘‘జానపద దర్శనం’’వ్యాస సంపుటి. ఇందులోని మొత్తం 24వ్యాసాల్లో అధిక శాతం, గిరిజన జాతులకు చెందిన సంస్కృతి సాంప్రదాయాలు ఆసక్తికరంగా తెలియజేసే వ్యాసాలే,!!
అడవి బిడ్డల సంస్కృతి అంటేనే విభిన్నమైన,విశిష్టమైన, మేలికలయికల సంగమం,రచయిత్రి అరుణ కూడా చక్కని పరిశీలన,ఎంచక్కని సృజనా త్మకత,జోడిరచి వ్యాసాలకు నిండుదనం చేకూర్చారు. నల్లమల అడవులకే తల మానికంగా ఉంటూ అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యాలు గల చెంచు జాతి గిరిజనులకు సంబంధించిన విశేషాలతో పాటు బాల్యవివాహాలు నిషేధించుకున్న గిరిజన తెగ ఒరాన్లు, ఏకపత్నితత్వం గల భిల్లులు, నిజమైన మాతృస్వామ్య వ్యవస్థకు కారకులైన ఖాశీలు,వారు అభివృద్ధికి చేస్తున్న ఆరోగ్య పర్యాటకం,చాలా అరుదైన గిరిజన తెగైన బిరహరు,గురించి కూడా రచయిత్రి ‘‘అరుణ’’ పరిశీలించడం ఆమెలోని అత్యుత్తమ పరిశీలన పరిశోధన కృషికి నిదర్శనం. కేవలం సంస్కృతి సాంప్రదాయాలకు పరిరక్షకులుగానే కాక, జాతిని జాగృతం చేసే పోరాట పటిమకు చిరునామా దారులుగా కూడా గిరిజనులను ఇందులో అభివర్ణించారు. ‘‘సంతాల్‌’’ గిరిజనుల గురించి ఇందులో వివరిస్తూ ఛోటానాగపూర్‌ వారి మాతృ స్థానంగా, స్థిరమైన గ్రామ జీవనం గల జాతిగా చెబుతారు,వారిలోని ఏకపత్ని త్వాన్ని కూడా అభివర్ణించారు,వారు 12 పద్ధతుల్లో తమ తమ జీవిత భాగస్వాములను ఎంచుకుంటారనే సంగతి కూడా చెబుతారు. గ్రామపెద్ద నాయకత్వంలో వారసత్వంగా వీరి రాజకీయ వ్యవస్థ, పాలన సాగుతుంది. ఒకనాటి సంచార జాతి అయిన సంతాల్‌లు నేడు వ్యవసాయం సాయంగా చేస్తున్న స్థిర నివాసపు అభివృద్ధి గురించి ఇందులో పేర్కొన్నారు. గిరిజన తెగల్లో ప్రాచీన కాలం నుంచి ఉన్న ‘‘నిద్రాశాలల’’ వ్యవస్థ గురించి రచయిత్రి తాను చదివిన పరిశోధన గ్రంథాల సాయంగా భిన్న కోణాల్లో వివరించారు. సాధారణంగా నిద్రాశాలలు, కీడుపాకలు, వంటి వ్యవస్థను మూఢనమ్మకంలో భాగమని, అవి స్త్రీ వివక్షతకు చిరునామాలని, నేటి ఆధునిక తరం అభిప్రాయ పడుతూ,వాటి నిర్మూలనకు ఏకీభవిస్తుండగా, రచయిత్రి అరుణ మరో కోణం నుంచి వీటిని ‘‘సామాజిక, ఆర్థిక,విద్యా,రంగాల్లో తమ పాత్రను నిర్వహించే సారథులు’’ అని అభిప్రాయ పడి రుజువు చేశారు. అలాగే మంచుకొండల్లో మన ఆదివాసుల ఉనికి గురించి తెలిపే క్రమంలో రాహుల్‌ సాంకృత్యాయన్‌ చే నామీకరణ చేయబడ్డ ‘‘భో టాంతిక్‌’’గిరిజనుల మనుగడ,వారి నివాస సంప్రదాయాల్లోని విశేషాలు, కులంకషంగా వివరించడంలో రచ యిత్రి స్థూల పరిశీలన శక్తి వెల్లడవుతుంది. గిరిజనులు అనగానే ‘‘శారీరక శ్రమ భాండా గారాలు’’గా గుర్తు పెట్టుకుంటాం, కానీ వారిలో కూడా చక్కటి సృజనాత్మకత శక్తి దాగి ఉండి,తద్వారా చేతివృత్తుల వల్ల అలంకార సామాగ్రి తయారు చేసి,ఉపాధి కూడా పొందుతున్నారు అనే అంశాన్ని విశ్లేషణ చేసిన వ్యాసం ‘‘గిరిజనుల అనుబంధ చేతివృత్తులు పరిశీలన’’ గిరిజనులు ఎంతటి మానసికపరమైన సృజనాత్మక శక్తి దాగివున్న వారు శారీరక శక్తికే అధిక ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని చెప్పి, తద్వారా గిరిజన కళలు ఎందుకు ప్రాచు ర్యం చెంద లేదో సహేతుకంగా చెప్తారు రచయిత్రి.దీని ద్వారా వివిధ ప్రాంతా లలో నివసించే ఆయా గిరిజన జాతుల వారు ఎలాంటి హస్తకళ వస్తువులు తయారు చేస్తారో సవివరంగా తెలుస్తుంది. సృజనాత్మతోపాటు వైద్య పరమైన విజ్ఞానంలో కూడా అడవిబిడ్డలు ఆరి తేరారు అన్న విషయం మనం మర్చి పోరాదు. సహజ సిద్ధంగా అడవుల్లో పెరిగే వనమూ లికలు,వాటి స్థావరాలు, నివారణ కార కాలు, పరిజ్ఞానంగల గిరిజనుల వివరాలు,పొందుపర్చడంతో పాటు,అభివృద్ధి చెందిన తెగల్లో ఒకటైన ఖాసీ తెగవారు నివసించే ‘‘ఖాసీ కొండలు’’ ప్రపంచ ఆరోగ్య పర్యాటక ప్రాంతంగా ఎలా ప్రాచుర్యం పొందాయో కూడా రచయిత్రి ఇందులో సవివ రంగా పొందుపరిచారు. ప్రతి వ్యాసంలో ప్రధాన వస్తు వివరణ చేస్తూనే అంతర్గతంగా ఆయా గిరిజన సామాజిక వర్గాల వారి సంస్కృతి, సాంప్రదాయాల వివరణ కూడా అందించడంలో వ్యాసాల కర్త ముందుచూపు, బాధ్యతలు, అర్థమవుతాయి. సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారని గిరిజనుల ఆచారాలు కొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి ముఖ్యంగా వారి కుటుంబ వ్యవస్థకు ప్రధాన భూమికైనా వివాహ వ్యవస్థలో గిరిజనులు పాటించే బహు భార్యత్వం, బహు భతృ త్వం, బైగమి (ఒకరే అక్క’చెల్లెలి ని వివాహం చేసుకోవడం) మొదలైన వివాహ పద్ధతులు, బహిర్గతంగా చూసే వారికి గిరిజనులకు, లైంగిక స్వేచ్ఛ ఉందనిపిస్తుంది, దీనిని కొందరు కుహనా మేధావులు‘‘లైంగిక కమ్యునిజం’’గా కూడా అభివర్ణిస్తారు.
కానీ గిరిజనుల ఆలోచనల్లో విశ్రుంఖలత కనిపించదు, కేవలం వారి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కుల ఆమోదం మేరకే, ఆయా పద్ధతులు పాటిస్తారనే నగ్నసత్యం వ్యాసకర్త చామర్తి అరుణ నిర్మొహమాటంగ, వివరించారు. ఈ ‘‘జానపద దర్శనం’’లో గిరిజన ఆచార వ్యవహారాలకు చెందిన ప్రతి వ్యాసం ఎంతో విలువైన విజ్ఞాన సమాచారం సంతరించుకుని ఉంటుంది, ప్రామాణిక పత్రికల్లో ప్రచురించబడ్డ ఈ వ్యాసాలు ఏర్చి కూర్చోడంలో, వ్యాస శీర్షికల ఎంపికలో రచయిత్రి అపరిపక్వత పాఠకులకు కాస్త నిరుత్సాహం కలిగించిన, దాని మోతాదు అత్యల్పం, మొత్తానికి వ్యాసకర్త అరుణ పరిశోధనాత్మక అక్షర కృషి పుస్తకం నిండా ఆగుపిస్తుంది, గిరిజన సాహితీ పరిశోధక విద్యార్థులకు ఈ ‘‘జానపద దర్శనం’’ మంచి మార్గదర్శి అనడంలో అక్షర సత్యంనిండి ఉంది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

ఉపాధి హక్కుల లక్ష్యంగా మహిళా ఉద్యమం

పనితో బతకాలన్నది యువత ఆకాంక్ష. పంతులమ్మలు కూరగాయలు, పల్లీలు అమ్ముకుని బతికే దుస్థితి. వ్యవసాయ భూములు లాక్కుంటూ, పరిశ్రమలను ప్రైవేటు వాళ్ళకు అమ్ముతూ ఉపాధి, ఉద్యోగాలను హరిస్తున్న ప్రభుత్వాలు మన నెత్తినెక్కాయి. పనులు, ఉద్యోగాలు కాపాడబడాలంటే విద్య, వైద్యం, పరిశ్రమలు, రైల్వేలు వీటన్నింటిని ప్రైవేటు వారికి అమ్మడాన్ని ప్రతిఘటించాలి. ఉద్యోగం, ఉపాధి ప్రాథమిక హక్కుగా మారాలి. ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి పథకానికి నిధులు పెంచాలి. వారికి వేతనాలు పెంచడమే కాదు, 100 రోజులు పని ఇచ్చే వరకు పోరాడాలి. పట్టణ ప్రాంతాలలో కూడా ఉపాధి చట్టం రావాలి.
ధరల మోతతో,ఇంటా బయటా సాగు తున్న హింసతో బతకడమే సవాలుగామారిన నేప థ్యంలో రాష్ట్ర మహిళల వేదనకు ప్రతిబింబంగా నెల్లూరులో రాష్ట్ర మహిళా వజ్రోత్సవ మహాసభలు జరిగాయి.ఐద్వా15వ రాష్ట్ర మహాసభలు జయ ప్రదంగా జరిగాయి. హింస నుండి,దోపిడి నుండి, భద్రతతో,గౌరవంగాజీవించే హక్కు అమలు,ఉపాధి లక్ష్యాలుగా మహాసభ పిలుపునిచ్చింది.ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజలను,కష్టజీవులను అందులోనూ మహి ళలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. మద్యం మహ మ్మారి మను షులను రాక్షసులను చేస్తుంది. బిడ్డలు మృగాలుగా మారి తల్లిదండ్రులను చంపుతున్న ఘోరా లను చూస్తున్నాము. మహిళల నిస్సహాయ తను ఆసరా చేసుకుని అత్యాచారాలు పెరుగుతు న్నాయి.వ్యాపార లాభాపేక్షతో విశ్రాంతి లేని జీవితా లు.రిక్రియేషన్‌ పేరిట బూతు.పనిచేసేచోట ఉద్యో గినులపై,పాఠశాలల్లో విద్యార్థినులపై ఎందెందు వెదికినా వేధిం పులే! మరి మార్గం ఏమిటి? ఈ దుస్థితికి కారణం ప్రభుత్వవిధానాలే! వీటిని ప్రశ్నిం చాలి! ప్రతిపక్ష పాలక పార్టీలుకూడా మహిళలపై హింసను నివా రించటానికి, అరికట్టడానికి ఏం చేస్తాయో నిలదీ యాల్సిందే! ఇందుకోసం నవం బరు 25నుండి డిసెంబరు 10వరకు సాగే హింసా వ్యతిరేక పక్షోత్సవం ప్రచారంగా మాత్రమేగాక కర్ర సాము,కరాటేలాంటి ఆత్మరక్షణ శిబిరాల నిర్వ హణకు పూనుకోవాలి.ఉన్నఉద్యోగాలు పోవడం,పని దొరకక పోవడం, అన్ని ఖర్చులు పెరగడం…ఇంటి పనికి పరిమితమైన మహిళలనుకూడా వీధుల్లోకి తెచ్చిం ది.పనులు దొరక్క గంటల కూలీకి పచారీ షాపుల్లోనో మరోచోటో వెతుక్కుంటున్నారు. సుదూర ప్రాంతాలకు మాత్రమే కాదు,దేశ దేశాలకు ప్రయాణి స్తున్నారు. ఒళ్ళమ్ముకుని బతకాల్సిన స్థితిలో కూడా నెట్టుకొస్తున్నారు.పని దొరికితే బతకొచ్చు. పథకా లతో కాదు. పనితో బతకాలన్నది యువత ఆకాంక్ష. పంతులమ్మలు కూరగాయలు, పల్లీలు అమ్ముకుని బతికే దుస్థితి. వ్యవసాయ భూములు లాక్కుంటూ, పరిశ్రమలను ప్రైవేటు వాళ్ళకు అమ్ముతూ ఉపాధి, ఉద్యోగాలను హరిస్తున్న ప్రభుత్వాలు మన నెత్తినె క్కాయి. పనులు,ఉద్యోగాలుకాపాడబడాలంటే విద్య, వైద్యం,పరిశ్రమలు,రైల్వేలు వీటన్నింటిని ప్రైవేటు వారికి అమ్మడాన్ని ప్రతిఘటించాలి.
ఉద్యోగం,ఉపాధి ప్రాథమిక హక్కుగా మారాలి.ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి పథకానికి నిధులుపెంచాలి.వారికి వేతనాలు పెంచడమే కాదు,100రోజులు పని ఇచ్చే వరకు పోరాడాలి. పట్టణప్రాంతాలలోకూడా ఉపాధి చట్టంరావాలి. సాంప్రదాయాల పేర సంకెళ్ళు! వర కట్నం, బాల్య వివాహాలు, ఆడపిల్లను గర్భంలోనే చిదిమి వేసే వారసత్వపు వాసనలు. ఋతుస్రావాన్ని అంటరా నిదిగాముట్టరానిదన్న ఆచారాలు, వితంతు దురా చారం లాంటి దుస్సాంప్రదాయాలను అంత మొం దించాలన్న స్ఫూర్తిని ప్రజలకు,యువతకు అందిం చేందుకు పూనుకోవాలి.నేడు యువత, మహి ళలు విద్య,వైద్యం,మత్తుమందులు,మౌలిక సదు పాయాలు లాంటి అనేక సమస్యలను ఎదుర్కొం టున్నారు. చదువులలో,ఆటపాటలలో సమస్త రంగాలలో పట్టుదలతో సమర్ధవంతంగా పని చేస్తున్న యువ తుల సంఖ్య బాగా పెరుగుతున్నది.కానీ అదే సమ యంలో పెట్టుబడిదారీ క్షీణ విలువల ప్రభా వంలో యువత శలభాల్లా మాడిపోతున్నది. వీటి నుండి రక్షించుకోవాలి. యువత శక్తి సామర్ధ్యాలను ఉపయోగించుకోవాలి.వారిని సామాజిక,రాజకీయ ఉద్యమాలలో సమీకరిం చాలి. అందుకు సాంస్కృతిక కార్యక్రమాలను విస్తృతపరచాలి.సమానతకు ఆటం కంగా ఉన్న మనువాద భావజాలాన్ని అడుగడు గునా ఎదిరిం చాలి. స్వాతంత్య్రోద్యమ చరిత్రను, సమానత్వం కోసం సాగిన త్యాగాలను రంగరించి శిక్షణా తరగ తులను ముమ్మరంగా నిర్వహించాలి.
ఇవన్నీ తీర్మానాలతో, సంకల్పాలతో మాత్రమే అమలు జరుగవు.ఈరోజు కనీసం మనిషి మాదిరి బతకాలంటే ఉపాధి ఉండాలి.ఇంటా బయ టా రక్షణ, భద్రతఉండాలి. ఇది మహిళా సంఘం లో ఉన్నవారు మాత్రమే సాధించ గలిగేది కాదు. అన్ని రంగాలలో పని చేస్తున్న మహిళ లందరూ ఏకం కావాలి. మనతోపాటు కష్టంలో ఉన్న రైతు కూలీలు, కార్మికులు, ఉద్యోగులు భుజం కలపాలి. యువత ముందు పీఠిన నిలవాలి.సంస్థలతో, వ్యక్తులతో ఐక్య వేదికలను ఏర్పాటు చేసు కోవాలి. వర్తమాన కాలంలో మహిళలు అన్ని రకాల పోరా టాలలో వేలసంఖ్యలో పాల్గొంటున్నారు. తక్షణ వేతనాలు, భద్రత కోసమేగాక ప్రభుత్వ విధానాల మార్పు కోసం ఉద్యమించాలి.అందుకు అందరం కలవాలి,కలుపుకోవాలి.అందుకు మహిళా సంఘం ఉత్ప్రేరకంగా మారాలి. వేలాది మంది పాల్గొనడ మేకాదు, అనుసరించే అనుయాయులుగా మాత్రమే కాదు,ఊయలలూపే చేతులు,ఇంటిని నిర్వహణ చేసే సమర్థత ఉన్నమహిళలు ఉద్యమా లలో ముం దుడి దానికి నాయకత్వంవహించే నైపు ణ్యాన్ని సముపార్జించుకోవాలి.అందుకోసం అధ్య యనం-ఆచరణను మహాసభలక్ష్యాలుగానిర్ణ యించుకున్నది.
పైలక్ష్యాల సాధనకు ప్రతి సందర్భాన్ని సాధనంగా మలచాలి. స్త్రీలశక్తి సామర్ధ్యాలకు చిహ్నంగా ప్రజలు జరుపుకునే దసరా సంబరాలు సంబరాలుగా మాత్రమే కాదు, సంకల్ప వేదికలుగా మారాలి.మార్చుకోవాలి. నవంబరు 14 బాలల పండుగ.బాలలకు బంగారు ప్రపంచాన్ని ఉత్సా హంగా,ఆనందంగా జీవించగలిగే సమాజాన్ని అందించేందుకు కార్యాచరణకు అడుగు వెయ్యాలి. ఇవి తక్షణ కర్తవ్యాలుగా అమలుకు పూనుకోవాలి. దిగ్విజయంగా, ఫలప్రదంగా జరిగిన ఈ మహా సభలు75సంవత్సరాల వజ్రోత్సవాల సభగా జరగ డం మరో ప్రత్యేకత. అన్ని జిల్లాల నుండి ప్రాతి నిధ్యంతో 55 మందితో రాష్ట్ర కమిటీని మహాసభలు ఎన్నుకున్నాయి. ఎన్నికైన రాష్ట్ర మహిళా సంఘం నూతన కమిటీ పైలక్ష్యాల సాధనలో నాయకత్వం వహించనున్నదివ్యాసకర్త : ఐద్వా రాష్ట్ర కార్యదర్శి – (డి.రమాదేవి)

కవి కోకిల గుర్రం జాషువా సాహిత్య విశ్లేషణ

‘‘వినుకొండన్‌ జనియించితిన్‌ సుకవితావేశంబు చిన్నప్పుడే నను పెండ్లాడె, మదీయ కావ్యములు నానారాష్ట్ర సత్కారముల్‌ గొని కూర్చెన్‌, సుయశస్సు, కల్గుదురు నాకున్‌ భక్తులై నేనెఱుంగనివా రాంధ్రధ రాతలాన బహు సంఖ్యల్‌, సాహితీ బాంధవుల్‌ ! ’’
‘నేను’ అనే కవితాఖండికలో జాషువాగారి జీవి తాంశాలు మొత్తం వారు ఒకే పద్యంలో ఎంతో అద్భుతంగా వివరించారు. కవితా విశారద, కవి కోకిల,కవిదిగ్గజ,నవయుగకవి చక్రవర్తి మధుర శ్రీనాథ,విశ్వకవి సామ్రాట్‌,కళాప్రపూర్ణ, పద్మ భూషణ్‌ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత గుర్రం జాషువా 1895 సెప్టెంబరు`28 సంవత్సరం గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. 1971జులై 24పరమ పదించిన జాషువా…. అణు వణువున మన కణనిర్మితమైన చాతుర్వర్ణ వ్యవస్థలో పశువు కన్నాహీనంగా, ఘోరాతిఘోరంగా, అడుగ డుగునా అవమానాలతో అవహేళనలతో, తినడానికి తిండిలేక,ఉండటానికి కొంప లేక ఊరికి దూరంగా, బ్రతుకు భారంగా దిష్టితీసి పారేసిన వస్తువుల్లా, అస్తవ్యస్త జీవుల్లా,చెల్లా చెదు రుగా, చిల్లర పైసల్లాపడి సనానతన సవర్ణ హిందూ సంప్రదాయ నిరంకుశ కర్కష రక్కసి విషపు కోరల నుండి తప్పించు కోలేక బిక్కు బిక్కు మంటూదిక్కులు చూస్తున్న అస్ప ృశ్య దళిత జాతి నుండి అశాజ్యోతిలా అరుదెంచిన సంస్కరణ యశోర వికిరణం గుర్రం జాషువా ఆయన సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం…. – (డా॥ఆర్‌.కుసుమ కుమారి)
‘‘ కవిని గన్నతల్లి గర్భంబు ధన్యంబు కృతిని జెందునాడు మృత్యుడు గాడు పెరుగు దొటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థజీవిగా దలంత్రు.’’
పిరదౌసితోపాటు,షానామా కావ్యా న్ని అందుకున్న సుల్తాను కూడా నేటికి జీవిస్తూనే ఉన్నాడు.సమాజమే పాఠశాలగా,వివక్షతే ఉగ్గు పాలుగా ఆరగించి అంటరానితనం వెంటాడి నాఒంటరిగానే పోరాటంచేసి,అవమానాలుగా భావించి,ఛీత్కారాలనుశిరోభూషణాలుగా స్వీక రించి దళిత జాతికి ప్రతినిధిగా నిలిచి పూ జారి లేని వేళ తన సందేశాన్ని వినిపించ మని గబ్బి లాన్ని పంపిన ఆధునిక దళిత కవితా, వైతాళి కుడు,పంచమస్వరంలో గానమాలపించిన కవి కోకిల,ఖండకావ్య ప్రక్రియలో అగ్రగణ్యుడు,సీనపద్యరచనలు, మధు ర శ్రీనాథుడు,విమల మనస్కుడు వినుకొండ, మగధీరుడు గుర్రం జాషువా. వీరి రచనల్లో ఎన్నో సామాజికాంశాలు, మహిళా భ్యుదయ ధోరణులు, ప్రజాసమస్యలు,రుగ్మతలు, మూఢ నమ్మకాలు ఇలా ఎన్నో విషయాలు నిక్షిప్తమై ఉంటాయి.
‘ఫిరదౌసి’ కావ్యంలో ‘‘రాజు మరణించె నొక తార రాలిపోయే కవియు మరణించె నొక తార గగనమెక్కెరాజు జీవించె రాతి విగ్రహములందు సుకవి జీవించె ప్రజల నాల్కలయందు’’ రాజాధిరాజుల కన్నా కవి గొప్పవాడని, శాస్వితుడని చెప్పడం కవికుల పక్షం వహిం చడమే జాషువా కవిత్వంలో ఇలాంటి విలక్షణాంశాలు కోకొల్లలు. తన పూర్వ కవులతో పోల్చినా సమకాలీన కవిత్వంతో తులనాత్మీకరించినా జాషువా కవిత్వానికి ప్రత్యేకస్థానం ఉంది.
‘‘ బంగారు నాణెముల్‌ బస్తాల కెత్తించి మదపుట్టెన్గుల మీద పదిల పఱిచి లేత పచ్చలు నేఱి గోతాలతో కుట్టించి లోట్టి పిట్టల మీద దిట్టపరచి…’’
గజనిమహ్మద్‌ మనదేశం మీద దండెత్తి వచ్చి ఏ విధంగా సంపదను దోచుకున్నాడో ఈ కవి త్వం తెలియజేస్తుంది, ఇంకోక చోట మత తత్వం గురించి ‘‘ పామునకు పాలు, చీమకు పంచదార మేపు కొనుచున్న కర్మభూమి జనించు ప్రాక్తంబైన ధర్మదేవతకు గూడి నులికిపడు జబ్బుగలదు వీడున్నచోట!’’ అంటాడు. జాషువా ఈపద్యంలో మూఢభక్తికి నిశితంగా విమర్శిస్తారు. విష సర్పాన్ని కండ చీమను దైవంగా భావించి కొలిచే వాళ్ళు ఎంత విచిత్రమైన వాళ్లు కదా అంటాడు. మనిషి స్వభావాన్ని గురించి చెప్తూ ‘ముసాఫిర్‌ కథ’లో ….. ‘‘మంచి వాడొక్క తెగకు దుర్మార్గుడగును దుష్టుడొక వర్గమున మహాశిష్టుడగును ఒక్కడౌనన్న కాదను నొక్కరుండు బుఱ్ఱ లన్నియు నొకమారు వెఱివగును’’! అంటే ఒక వర్గానికి మంచి వాడైనవాడు వేరొక వర్గానికి దుర్మార్గుడవుతాడు. ఒక వర్గంలోని దుష్టుడు మరొక వర్గానికి మిక్కిలి మంచి వాడవుతాడు.ఒకడు ఔనంటే మరొకడు కాదంటాడు. బుద్ధులన్నీ ఒక్కసారిగా పిచ్చివైపోతాయి. ‘‘హృదయములేని లోకము సుమీయిది మాపుల ( బశ్చిమంబుగా నుదయము తూర్పుగా నడుచుచుండు సనాతన దర్మధేవుల్‌ పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవాని యాజ్ఞలా )( బెదవి గదల్ప ) జారలర రవింద భవ ప్రముఖమృతాంథసుల్‌ ’’
ధర్మానికి కీడు కల్గినపుడు బ్రహ్మాది దేవతలు వచ్చి ధర్మసంస్థాపన చేస్తారని మన పురణాలు పలుకుతుంటే దళితులపట్ల జరిగే అధర్మానికి, అన్యాయానికి దేవతలెవరూ పెదవి విప్పలేదని మన పురణాలని ప్రశ్నిస్తున్నాడు కవి.
‘‘ స్త్రీ కంటెంబురుషుండు శ్రేష్ఠుడనుచున్‌ సిద్ధాంతముల్‌ చేసి తాకుల్‌ కంఠములెత్తి స్త్రీ జగతి కన్యాయంబు గావించెనో యేకాలంబున పుట్టినింటయిన లేవ నాటి స్వతంత్య్రముల్‌ వే స్త్రీకిన్‌ మారు సమాన గౌరవ విబూతిన్‌ గాంతకుం గూర్చుమా’’ ఈ పద్యంలో జాషువా మహిళాభ్యుదయాన్ని కాంక్షిస్తూ సమాన స్వేచ్ఛ కావలంటారు. యుగ యుగాలుగా అణచివేతకు గురౌతున్న స్త్రీ పై పురుష అహంకారం తగదని అటువంటి సిద్ధాం తాలు మంటగలిసిపోతాయని చెప్పారు.జాషువా గారి కవిత్వంలో వాస్తవికాంశాలను సరళమైన శైలిలో సుభోధకంగా సందేశాన్ని అందించడమే కాకుండా వాస్తవానికి దగ్గరగాను ఆలోచించే విధంగాను కనిపిస్తాయి.‘గబ్బిలం’లో….. ‘‘వాని రెక్కల కష్టంబులేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి భుక్తి లేదు’’ అంటూ అస్పృశ్యతను సమాజానికి బహిర్గతం చేస్తారు జాషువా. అస్పృశ్యుడై పేదరికాన్ని అనుభవించిన జాషువా ఆకలి మంటలతో అల్లాడిపోతూ, బుక్కెడు బువ్వకోసం తాను అనుభవిస్తున్న సమస్త కష్టాలు మరిచిపోయే అల్పసంతోషి అంటాడు. మరోచోట ‘‘ధర్మమునకు బిరికితనం మెన్నడును లేదు సత్యవాక్యమునకు చావులేదు వెరపనేల నీకు విశ్వనాథుని మ్రోల సృష్టికర్త తాను సృష్టినీవు ’’ జాషువా నిరసనలు తెలుసుకోవాలంటే ఒక ‘గబ్బిలం’ కావ్యంచాలు.ఈ కావ్యం ఎంతో హేతువాద ధోరణితో రాయబడిరది. అంటరాని తనాన్ని, సమాజంలో మొత్తం కుళ్ళుని ఎండ గట్టాడు,కర్మ సిద్ధాంతం పేరుతో పేదల నోరు కట్టేసి వారు అనుభవిస్తున్న స్వార్ధపరుల గురించి పరమేశ్వరుని దగ్గర నిరసన వ్యక్తం చేసే విధం గా గబ్బిలాన్ని ప్రోత్సహించాడు. ‘పశ్చాత్తాపము’ అనే ఖండ కావ్యంలో…. ‘‘ పడుచు బిల్లల ముసలికి ముడి బెట్టితి, పసుపు కుంకుములకు నెవ్వలిjైు గడియించిన నా పాపము వడుపున నిపుడా యనాథ పుత్యక్షమగున్‌’’ చిన్న పిల్లలను ముసలి వారికి ఇచ్చి పెళ్ళి చేస్తూ, భర్త చనిపోగానే ఆమె విధవరాలని దూషిస్తారు. ఆమె పసుపు కుంకుములకు దూరంగా వెలి వేయబడుతుంది. ఆమె అనాథగా మారుతుంది. ఈ మూఢత్వం నుండి సమాజం బయటకు రావాలని జాషువా కోరారు.‘ సూర్యోదయం’ అనే ఖండికలో…. ‘‘కాకి పిల్పుల గీతి కారవ మాలించి సమయంపు నిదుర మంచంబు డిగ్గి మల యాచలము మీది యలతి వాయువులచే నిఖిలి లోకంబును నిద్రలేపి’’ ఈ పద్యంలో కాకుల పాటలతో సమయం నిదుర మంచం నుండి దిగిందనీ,కొండలు మీద నుండి వచ్చే పిల్లగాలులు సమస్త లోకాన్ని నిద్ర లేపాయనీ నెలరాజు పడమటి కొండలపైకి నెట్ట బడ్డాడని ప్రకృతి సౌందర్యాన్ని గురించి వర్ణించాడు. జాషువా‘ లేఖిని’లో … ‘‘ సకల దేశ మహిత సౌభాగ్య సంపత్తి మనకు గిట్ట దనుచు మధ్య పరచి కులమతాలు దొడ్డ గుండాలు ద్రవ్వించు స్వార్ధ పరులు దాడి నరిగట్టి దేశంబు పరువు నిలుపు కొమ్ముబీ భరతపుత్ర! ’’
జాషువా కోరిన జాతి సమైక్యతలో జీవనరాగం కనిపిస్తుంది. ప్రపంచం సర్వ సుభిక్షం కావా లన్నది ఆయనమతం ఎల్లసోదరులు ఏకోదరులై నిరంతర ఆనంద జీవనం గడపాలన్నది ఆయన కోరిక. ‘చదువు’ ఖండికలో.. ‘‘గుళ్ళు గోపురాలు కోసరంబై నీవు ధారవో యుచున్న ధనము జూచి కటికి పేదవాని కడుపులో నర్తించు కత్తులెన్నో లెక్క గట్టగలవె!’’
డబ్బున్నవారు గుడికి,గోపురాలకు పెట్టే ఖర్చులో కొంతైనా కడుపులో ఆకలితో బాధపడుతున్న వారిని గూర్చి ఆలోచన చేయవలసిందిగా సూచిస్తున్న ఈ పద్యం చిరస్మరణీయం. ఈవిధం గా జాషువాగారి కవిత్వంలోవాస్తవికాంశాలను సరళమైన శైలిలో సుబోధకంగా సందేశా న్ని అందించడమే కాకుండా వాస్తవానికి దగ్గర గాను, ఆలోచించే విధంగాను కనిపిస్తాయి. జాషువా కొన్ని సందర్భాల్లో నాస్తికుడుగా కొన్ని సందర్భాల్లో ఆస్తికుడుగా కనిపిస్తాడు. అన్నింటికీ మించి జాషువా మానవ తావాదిగా కన్పిస్తాడు. ఆయన రచనల్లో ఎక్కువగా సమాజంలోని అసమానతలు, రుగ్మతలు, నిరసన,ఆవేదన కనిపి స్తాయి. తెలుగు సాహిత్య లోకంలో జాషువా వంటి కవి మరొ కరు లేరు.దీనికి కారణం ఆయన హేతువాద రచనలే నిదర్శనం,కాబట్టే ప్రస్తుత సమాజంలో ఇటువంటి ఎందరో కవులకు జాషువా ఆదర్శమయ్యాడు.-వ్యాసకర్త : తెలుగు విభాగాధిపతి,
డా॥వి.యస్‌.కృష్ణా ప్రభుత్వ డిగ్రీÊ పి.జి.
కళాశాల(ఎ),విశాఖపట్నం.
సెల్‌ : 9963625639.

మన్యంలో కాసులు కురిపిస్తున్న మిరియాల సాగు

సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన మిరియాలకు ప్రపంచ దేశాల్లో గిరాకీ ఉంది. కాఫీలో అంతరపంటగా విశాఖ మన్యానికి పరిచయమైన ఈ మిరియాలు గిరిజనులకు లాభాలను ఆర్జించిపెడుతున్నాయి. ప్రధాన పంట అయిన కాఫీకంటే రెట్టింపు లాభాలను ఈ పంట ద్వారా పొందుతుండటంతో రైతులు మిరియాల సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏలు కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాల సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగామిరియాల సాగు, విస్తీర్ణం,వినియోగం,ఎగుమతుల్లో భారతదేశం మొదటిస్థానంలోఉంది.సంప్రదాయ సాగు ప్రాం తాలైన కేరళ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో వీటి ఉత్పత్తి అధికంగా ఉంది. సంప్రదాయేతర ప్రాంతం అయినా అల్లూరిజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు,నేల,శీతలవాతావరణం వం టివి అనుకూలంగా ఉన్నాయి.ఈపరిస్థితుల్లో చింత పల్లి,గూడెంకొత్తవీధి,పాడేరు,అరకు,అనంతగిరి వంటిప్రాంతాల్లోకాఫీలోఅంతరపంటగా మిరి యాల సాగు జరుగుతోంది.ప్రస్తుతంమన్యం వ్యాప్తం గా1.56లక్షలఎకరాల్లో కాఫీసాగు జరుగు తుండ గా అందులో అంతరపంటగా మిరియాలు50 వేల ఎకరాల్లో వేస్తున్నారు.ఏటా 3,300 మెట్రిక్‌ టన్నుల మిరియాల ఉత్పత్తిజరుగుతోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏటాఉద్యాన నర్సీరీల ద్వారా 9లక్షల మిరియాల మొక్కలను సిద్ధం చేసి గిరిజన రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.లి కేజీ కాఫీ గింజల ధర మార్కెట్‌లో రూ.100వరకూఉంటే అదే కేజీ మిరియాల ధర రూ.500 వరకూ ఉంది. ప్రధాన పంట అయిన కాఫీ కంటే నాలుగైదు రెట్లు ధరలు పలుకుతుండటంతో రైతులూ క్రమేణా మిరియాల సాగుపట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఎకరా విస్తీర్ణంలో కాఫీతోటల ద్వారా150కేజీల కాఫీని ఉత్పత్తి చేస్తు న్నారు. అదే తోటల్లో అంతరపంటగా వేసిన మిరి యాలవల్ల వంద కేజీల దిగుబడి వస్తోంది. అంటే సగటున ఎకరాకు ఒక్కో రైతుకు కాఫీ వల్ల ఏడాదికి రూ.15,000,మిరియాలవల్ల రూ.50వేల వరకూ ఆదాయం వస్తోంది. కాఫీ తోటల్లో అంతర పంట లుగామిరియాలతోపాటుకమలా,నేరేడు,సీతా ఫలం,జాఫ్రా,అనాసపనస వంటివి పండిస్తు న్నారు. ఇవి కాఫీతోటలకు ఇటు నీడనిస్తూనే రైతులకు ఉద్యానఫలాలను అందిస్తున్నాయి.ప్రభుత్వ ప్రోత్సా హం..మన్యంలో కాఫీ సాగుకు సంబంధించి గత ప్రభుత్వం పదేళ్లకాలవ్యవధితో కూడిన భారీ ప్రాజె క్టుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం గిరిజన ఉప ప్రణాళికద్వారారూ.526.160కోట్ల భారీ వ్య యంతోఈప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. 2015-2016లో మొదలైన ఈప్రాజెక్టు కాలపరిమితి 2024-2025వరకూ అమల్లో ఉంటుంది. ప్రస్తు తంఉన్న1.50లక్షల ఎకరాల్లో కాఫీ సాగుకు అదనంగావచ్చే ఐదేళ్లలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణ లక్ష్యంగా ప్రాజెక్టు అమలవుతోంది. కాఫీతోపాటు అనుసంధానంగా అంతరపంట అయి న మిరియాలసాగునూ ప్రోత్సహిస్తున్నారు. ఇందు లో భాగంగా ఏడాదికి పదివేల ఎకరాల చొప్పున కాఫీ తోటలను విస్తరించుకుంటూ వెళుతున్నారు.
జాతీయ ఉద్యాన మిషన్‌ సహకారంతో..
కేరళలోని కాలికట్‌లో అఖిల భారత సుగంధ ద్రవ్య పరిశోధనా కేంద్రం ఉంది. చింత పల్లి కేంద్రంగా ప్రత్యేకంగా సుగంధ ద్రవ్య పంట లపై పరిశోధనల నిమిత్తం ఉద్యాన పరిశోధనా స్థానం పనిచేస్తోంది. దీని పరిధిలో సుగంధ ద్రవ్య సమన్వయ పరిశోధనా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందులోభాగంగా మిరియాల్లో కొన్ని మేలు రకా లను గుర్తించివాటిని అభివృద్ధిపర్చి రైతులకు అంది స్తున్నాం.మిరియాల్లో17రకాలు అల్లూరి సీతా రామ రాజు జిల్లాలోని మన్యానికి అనుకూలమని అధిక దిగుబడిని ఇచ్చేవిగా గుర్తించి వాటిని సిఫార్సు చేస్తున్నాం. పన్నియూర్‌-1, 2, 3, 5, 6, 7, 8, 9రకాలతోపాటుశ్రీకర,శుభకర,పంచమి,పౌర్ణమి, మలబారు ఎక్సెల్‌,శక్తి,గిరిముండా,ఐఐఎస్‌ఆర్‌ దీపమ్‌, ఐఐఎస్‌ఆర్‌ శక్తి వంటి రకాలను మేలైనవిగా గుర్తించాం.
అదాయవనరుగా సాగు
మిరియాలుపంట కొండవాలు ప్రాంతా లు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనా భివృద్ధిసంస్ధ గిరిజనరైతులను మిరియాల సాగువైపు మిరయాల సాగుకు పెట్టింది పేరు కేరళ..ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖ మన్యంలో మిరియాలు పంట సాగవుతుంది. మన్యంలో పండుతున్న మిరియాలు కేరళ మిరి యాలకు ఏమాత్రం తీసిపోవటంలేదు. దిగుబడితో పాటు నాణ్యత విషయంలోను మన్యం మిరియాలు ప్రముఖ స్ధానాన్ని ఆక్రమించాయి. ఎలాంటి క్రిమి సంహార మందులు వినియోగించకుండానే కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు సాగు చేస్తు న్నారు. కాఫీ తోటలతో ఎకరానికి 25వేల నుండి 40వేల వరకు అదాయంసమకూరుతుండగా, దానిలో అంతరపంటగా వేస్తున్న మిరియాల పంట తో40వేల నుండి60వేల వరకు అదనంగా అదా యం సమకూరుతుంది.ఈ ఏడాది ఒక్క మిరి యాల పంట ద్వారానే 150కోట్ల రూపాయల అదాయంన్ని మన్యంలోని గిరిజనరైతులు ఆర్జించారు. మిరియాల సాగుకు మన్యం ప్రాంతంబాగా అనుకూలంగా ఉండటంతో ఇక్కడి గిరిజన రైతులకు మంచి అవకా శంగా మారింది. పస్తుతం 98వేల ఎకరాల కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు పంట సాగవుతుంది. కొండవాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనాబివృద్ధి సంస్ధ గిరిజన రైతులను మిరియాల సాగువైపు ప్రోత్స హిస్తోంది. కాఫీతోటల్లో నీడనిచ్చే సిల్వర్‌ ఓక్‌ చెట్ల వద్ద మిరియాల మొక్కలు నాటుతున్నారు. ఎకరాకు 60 నుండి 70కిలోల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో మిరియాల ధర 500 నుండి 600 రూపాయలు పలుకుతుంది.ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దాదాపు4వేల మెట్రిక్‌ టన్నుల మిరి యాల దిగుబడి వచ్చింది.3.2 కిలోల పచ్చి మిరి యాలను ఎండబెడితే ఒక కిలో ఎండు మిరియాలు వస్తాయి. ఈ లెక్కన గిరిజన రైతులకు దాదాపు రూ.150కోట్ల వరకూ అదనపు ఆదాయం మిరి యాలతో సమకూరింది. అనే మిరియాల రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. కోజికోడ్‌ లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ నుంచి వేర్వేరు రకాల మొక్కలను తెచ్చి చింతపల్లి నర్సరీల్లో అభివృద్ధి చేస్తుండటం గమనార్హం.- గునపర్తి సైమన్‌

1 2