ఉపాధి ఊసేది?

వైసిపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2020-21 రాష్ట్ర బడ్జెట్‌ నిజాయితీకి దూరంగా ఉంది. వాస్తవాలను పరిగణన లోకి తీసుకోకుండా మసి పూసి, మారేడుకాయ చేసే ప్రయత్నం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం కరోనా సంక్షోభంతో మొదలయింది. పారిశ్రామిక, సర్వీసు రంగాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. గత ఆర్థిక సంవత్సరం లోనే ప్రభుత్వాల ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయి. ఈ ఏడాది మరింత తీవ్రంగా పడిపోతాయనడంలో సందేహం లేదు. ఇటువంటి సమయంలో బడ్జెట్‌ అంచనాలు భారీగా చూపించటం ప్రజలను పక్కదారి పట్టించటానికే.
ఆదాయాలు-ఖర్చులు
ఆదాయాలు, ఖర్చుల అంచనాలే బడ్జెట్‌. అంచనా వేసిన ఆదాయం కంటే అంచనా వేసిన ఖర్చు ఎంత ఎక్కువ ఉంటే దాన్ని ద్రవ్య లోటుగా లేదా డబ్బుల లోటుగా పిలుస్తున్నారు. అప్పు తీసుకొచ్చి ప్రభుత్వం ద్రవ్యలోటును పూడుస్తుంది. అప్పుకు పర్యాయ పదమే ద్రవ్యలోటు. అప్పు తీసుకొచ్చి ఆదాయం-ఖర్చు మధ్య సమతుల్యతను ప్రభుత్వం సాధిస్తుంది. 2019-20లో అంటే మొన్న మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ సైజు రూ.2 లక్షల 27 వేల కోట్లు. ఇదే మొత్తంలో ఆదాయాలు, ఖర్చులు ఉంటాయి. ఆదాయంలో రెవెన్యూ ఆదాయం, పెట్టుబడి ఆదాయం ఉంటాయి. ఖర్చులో రెవెన్యూ ఖర్చు, పెట్టుబడి ఖర్చు, అప్పు ఫాయిదాలు ఉంటాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో అప్పుతో కలిపి రూ. 2లక్షల 2వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన వైసిపి ప్రభుత్వం చివరికి దాన్ని రూ. లక్షా 74 వేల కోట్లకు తగ్గించింది. రెవెన్యూ ఆదాయం రూ.68 వేల కోట్ల మేర తీవ్రంగా తగ్గింది. అంచనా వేసిన దాని కంటే మరో రూ. 15వేల కోట్ల అప్పు తెచ్చి మొత్తం ఆదాయ లోటును రూ.53 వేల కోట్లకు తగ్గించింది. ఆ మేరకు ఖర్చును కూడా రెవెన్యూ ఖర్చులో రూ.43వేల కోట్లు, పెట్టుబడి ఖర్చులో రూ.19 వేల కోట్లు కోత వేసింది. అదే సమ యంలో అప్పు తీర్చే ఫాయిదాలను రూ.9 వేల కోట్లకు పెంచింది. వెరసి అంచనా వేసిన ఖర్చు కంటే పెట్టిన ఖర్చు రూ.53 వేల కోట్లకు తగ్గిం ది. ఆ మేరకు బడ్జెట్‌ సైజు కూడా రూ.53 వేల కోట్లకు తగ్గి, రూ.ఒక లక్షా 74 వేల కోట్లయింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగు నీరు, పరిశ్రమలు, రవాణా వంటి ఆర్థిక సర్వీసులకు పెట్టిన ఖర్చు భారీగా రూ.48 వేల కోట్లు తగ్గింది. సాధారణ విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, పట్టణా భివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం తదితర సామాజిక సర్వీసులకు రూ.9 వేల కోట్ల కోత పెట్టింది. ఈ సర్వీసులలో ఇతర రంగాలకు రూ. 23 వేల కోట్ల కోత పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి రూ.14వేల కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. వెరసి సామాజిక సర్వీసులలో రూ.9 వేల కోట్ల కోత పడిరది. కోర్టులు, జైళ్ళు, పోలీసు, రెవెన్యూ మరియు అప్పులు, వడ్డీల చెల్లింపులు, ఉద్యోగుల పెన్షన్లు వంటి సాధారణ సర్వీసులకు కేటాయించిన దాని కంటే రూ.3 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టింది.
వర్తమాన బడ్జెట్‌
2019-20 బడ్జెట్‌ వాస్తవం తెలిస్తేగాని ప్రస్తుత 2020-21 బడ్జెట్‌ను అవగాహన చేసుకోలేము. ముందుగా గత 2019-20 బడ్జెట్‌ వాస్తవాలను పరిశీలించాం. కరోనా లేని సమయంలో 2019-20 బడ్జెట్‌ అంచనాలు వాస్తవంలో తలకిందులయ్యాయి. కరోనాతో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్‌ అంచనాలు వాస్తవం అయ్యే అవకాశం అసలు లేదు. 2019-20 బడ్జెట్‌ 2018-19 ఆర్థిక సంవత్సరపు స్థాయికి దిగజారింది. 2020-21 బడ్జెట్‌ సైజును రూ. 2 లక్షల 25 వేల కోట్లుగా ప్రతిపాదించి నప్పటికీ వాస్తవంలో అది కూడా 2018-19 స్థాయికి కొద్దో గొప్పో తేడాతో దిగజార బోతోంది. ప్రభుత్వానికే బడ్జెట్‌ మీద నమ్మకం లేదు. ఏకంగా బడ్జెట్‌ సైజునే రూ.3 వేల కోట్ల మేర తగ్గించింది. వ్యవసాయం, గ్రామీణా భివృద్ధి, నీటిపారుదల, సాధారణ విద్య వంటి రంగాలకు కేటాయింపులోనే రూ.30 వేల కోట్లు తగ్గించింది. అదే సమయంలో సంక్షేమానికి దాదాపుగా అదే మొత్తంలో రూ. 28 వేల కోట్ల మేర పెంచింది. వివిధ రంగాలను అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమం మాత్రమే ప్రజలకు మేలు చేయదు. అభివృద్ధికి కేటాయిం పులు తగ్గకుండా అదనంగా సంక్షేమానికి కేటాయింపులు జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం జోడు చక్రాలుగా నడుస్తాయి.
కార్మికులకు కానరాని మేలు
ఉపాధి హామీ పథకానికి పోయిన సంవత్సరం రూ.3626 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ. 2021 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కరోనా వలన పనులు దొరకని పరిస్థితుల్లో ఉపాధి కల్పన పెంచాల్సిన ప్రభుత్వం గతం కంటే రూ. 400 కోట్లు తగ్గించింది. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు కూడా విస్తరించాలన్న డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. వైయస్సార్‌ బీమా పథకం కూడా వట్టిపోయిన గొడ్డులా తయారయింది. పోయిన సారి దీనికి రూ. 400 కోట్లు కేటాయించినా… దాన్ని ఖర్చు చేయకుండా ఈ సంత్సరం రూ.262 కోట్లు మాత్రమే కేటాయించింది. బడ్జెట్‌ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు కూడా స్పష్టమవుతాయి. గత 9 సంవత్సరాలుగా షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ లోని 50 లక్షల మంది కార్మికులకు వేతన సవరణ చేయలేదు. బడ్జెట్‌ ప్రసంగంలో దీని ప్రస్తావనే లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కార్మికులకు పని లేదు. వేతనాలు లేవు. ఇటువంటి సమయంలో కార్మికుల కొనుగోలు శక్తి పెంచ టానికి అవసరమైన చర్యలను కూడా బడ్జెట్‌లో ప్రకటించ లేదు. వృద్ధాప్య పెన్షన్లను ప్రభుత్వం వారికి కానుకగా చూపిస్తు న్నది. ఇతర పెన్షన్లకు అర్హత లేని వారు కూడా తాము పని చేయగలిగిన వయసులో 30, 40 సంవత్సరాల పాటు పని చేసినవారే. వారికి ఒక యజమాని అంటూ ఉండరు కాబట్టి ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తోంది. దానిని కానుకగా చూపించి వైసిపి ప్రభుత్వం వారిని అవమానపరుస్తోంది. ఈ బడ్జెట్‌ కార్మికులకు మేలు చేయదు. పారిశ్రామిక, వ్యవసాయ, సర్వీసు రంగాలలో ఉపాధి పెరగదు. కార్మికులు కొనుగోలు శక్తీ పెరగదు.
సంక్షోభవేళ అరకొరగా
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) రూ.40,000 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఇటీవల ప్రకటించారు. మే 17న విలేకరుల సమావేశంలో అదనపు కేటాయింపుల గురించి నొక్కి చెప్తూ ఈ పథకం కింద 2019 మే నెలలో కంటే 40-50 శాతం మంది కార్మికులు అధికంగా నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ బడ్జెట్‌కు ఈ అదనపు రూ.40,000 కోట్లు జోడిరచినప్పటికీ మంత్రిగారు వక్కాణించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపోదు.రూ.40,000 కోట్ల కేటాయింపును గొప్పగా చెప్పుకోవడం మీదే ఆర్థిక మంత్రి దృష్టి కేంద్రీకరించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకం కింద పని కోరే వారి సంఖ్యకు సరిపడేంత బడ్జెట్‌ వుండాలన్నది ఆవిడ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఇదొక సులభమైన మార్గం అంతే. ఇప్పటికే 14 కోట్లకు పైగా వున్న ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు, గ్రామాలకు తిరిగి వస్తున్న కోట్లాది వలస కార్మికులకు ఉపాధి కల్పించాలన్న భారీ లక్ష్య సాధనకు ఈ మొత్తం ఏ మూలకూ సరిపోదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షేత్రస్థాయి వాస్తవాలను నిశితంగా పరిశీలించినట్లయితే ఈ విషయం తేలిగ్గానే తెలుస్తుంది.
ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులలో కార్మికులకు ఏడాదికి 200 పని దినాలకు గ్యారంటీ వుండాలి. అదేవిధంగా వారికి రోజువారీ వేతనం రూ.300 (లేదా ఆయా రాష్ట్రాలలో అమలులో వున్న కనీస వేతనం అంతకంటే ఎక్కువైతే ఆ మొత్తం) ఇవ్వాలి. వ్యవసాయ కార్మిక సంఘాలు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్‌ ఇది. పైగా, అనేకమంది ఆర్థికవేత్తలు కూడా గతంలో ఇటువంటి సూచనలే చేశారు. ఆ విధంగా చేస్తే గ్రామీణ కార్మికులకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అది ప్రధానమైన అడుగు అవుతుంది.
2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కి కేటాయించింది రూ.61,500 కోట్లు. వాస్తవానికి 2019-20 సంవత్సరంలో ఆ పథకం కింద చేసిన ఖర్చు కంటే ఈ కేటాయింపులు 9,500 కోట్లు తక్కువ. పైగా గతేడాది చెల్లించవలసిన బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. ఇప్పుడు అదనంగా ప్రకటించిన రూ.40,000 కోట్లు కలిపితే ఉపాధి హామీ పథకం కింద మొత్తం రూ. 1,01,500 కోట్లు వున్నట్లు లెక్క.
ఈ ఏడాది మే 16వ తేదీన అందుబాటులో వున్న ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పోర్టల్‌ వివరాల ప్రకారం 1435.73 లక్షల మంది జాబ్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, 1374.39 లక్షల మందికి కార్డులు మంజూరు అయ్యాయి. అంటే దరఖాస్తు చేసుకున్న 61,35,751 కుటుంబాలకు జాబ్‌కార్డు మంజూరు కాలేదు. ఇందులో 1166 లక్షల మంది పనిచేసేవారుండగా కార్మికులు వుండగా, అందులో 766.75 లక్షల జాబ్‌కార్డులు మాత్రమే ఉపయోగంలో వున్నాయి. గత మూడేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క రోజు పనిచేసినా జాబ్‌కార్డు ఉపయోగంలో వున్నట్టేనట!
సులభంగా అర్థమయ్యేందుకు ఒక చిన్న లెక్క చూద్దాం. జాబ్‌కార్డులున్న 766.75 లక్షల క్రియాశీల కార్మికులకు రూ. 200 రోజువారీ వేతనం చొప్పున 100 రోజులు పని కల్పించడానికి రూ.1,53,350 కోట్లు అవసరం అవుతుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం తన ధోరణి మార్చుకుని, జాబ్‌కార్డులున్న కుటుంబాలన్నింటికీ 100 రోజుల పని కల్పించాలని భావిస్తే అందుకుగాను రూ.2,87,146 కోట్లు అవసరమవుతాయి. అన్నిటినీ మించి, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఒక్కో ఇంటికి కనీసం 200 రోజుల పని కల్పించాల్సిన అవసరముంది. ఇలా చేస్తే, ఖజానా నుంచి రూ.3,06,700 కోట్లు ఖర్చు అవుతుంది. మరో ముఖ్యమైన అంశాన్ని గమనంలో వుంచుకోవాలి. వేతనం రూ.200 అంటే చాలా తక్కువ. అయినప్పటికీ మనం దాన్నే కనీస వేతనంగా పరిగణిస్తున్నాం. పై లెక్కలన్నీ కేవలం వేతనానికి సంబంధించినవి మాత్రమే. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పనికి సంబంధించి ఇతర ఖర్చులు కూడా వుంటాయి. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఢల్లీి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన వికాస్‌ రావల్‌ ఒక సూచన చేశారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఒక వ్యక్తి పని చేస్తే అందుకు రూ.290 ఖర్చు అవుతుంది. ఈ ఏడాది పెరిగిన వేతనం రూ.20 కూడా జోడిరచినట్లయితే అది రూ.310 అవుతుంది. ఈ లెక్కన, కార్డు వున్న వారందరికీ 100 రోజుల పాటు పని కల్పించాలంటే రూ. 4,26,975 కోట్లు అవసరమవుతాయి (13,77,33,901 జాబ్‌కార్డులకు 2019-20 ప్రకారం అయ్యే ఖర్చునకు (రోజుకు రూ.290) కొత్తగా పెరిగిన వేతనాన్ని (రోజుకు రూ.20) జోడిరచాలి).
ఈ గణాంకాలన్నీ లోగడ గ్రామాలలో వున్న శ్రామికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వేసిన అంచనాలు. ఇప్పుడు, గ్రామాలకు తిరిగి వస్తున్న కోట్లాది మంది వలస కూలీలను కూడా కలిపి అందరికీ పనులు కల్పించాల్సి వుంటుంది. తిరిగివచ్చిన వలస కూలీలను కూడా కలుపుకొని పని అడిగేవారి సంఖ్య పెరిగిన పరిస్థితిని ఈ అరకొర కేటాయింపులతో ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్న నుంచి హాయిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్‌ కొరత ప్రభావం ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకం అమలు మీద తీవ్రంగా వుంటోంది. దీనికితోడు, కేంద్రం విడుదల చేసే నిధులు చాలీచాలకుండా, ఒక పద్ధతిపాడు లేకుండా విడుదల అవుతుంటాయి. ఆర్థికంగా బలహీన స్థితి లోని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను ఇవ్వలేకపోవడం కూడా పథకం అమలుపై ప్రభావం చూపుతోంది. జాబ్‌కార్డులు-పనుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య పెరగడం, ఆర్థిక ప్రతిబంధకాలు, ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నగదు నిల్వలు తక్కువగా వుండడం వల్ల అనేక రాష్ట్రాలు ఈ పథకం కింద పనులు కల్పించలేకపోయాయి. లాక్‌డౌన్‌ అమలులో వున్నప్పటికీ మార్చి 31 తర్వాత జాబ్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 7.1 లక్షలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌లో దరఖాస్తుల సంఖ్య అత్యధికంగా పెరిగింది. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చిన వలస కూలీల సంఖ్య ఈ రాష్ట్రాలన్నిట్లోను ఎక్కువగా వుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ప్రాధాన్యత ఎంతగా వుందనేది దీనిని బట్టే అర్థమౌతోంది.
లాక్‌డౌన్‌ వేళ గ్రామీణ కార్మికులకు కొంత ఉపశమనం కల్గించడానికి, తిరిగి వచ్చిన వలస కార్మికుల కారణంగా పడిన భారాన్ని తగ్గించడానికి ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాన్ని మనం చేజార్చుకున్నాం. సాధారణంగా ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) లోనే ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పని ఎక్కువగా జరుగుతుంది. పని డిమాండ్‌ కూడా అధికంగా వుంటుంది. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ‘పూర్తయిన పని’లో సుమారు 37 శాతం ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లోనే జరుగుతుంది. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ మొదటి దశ సందర్భంగా పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు ప్రణాళిక, ఆలోచన లేకుండా గుడ్డిగా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పనులను నెల రోజుల పాటు రద్దు చేసేసింది. ఒక ప్రకటన ద్వారా ఏప్రిల్‌ 15 నుంచి ఈ నిబంధనలను ఎత్తివేసినప్పటికీ అవి ఏప్రిల్‌ 20 నుంచి అమలు లోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ నుంచి ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ను మినహాయించినప్పటికీ ఈ పథకం కింద పనులు చాలా నిదానంగా నడుస్తున్నాయి.
ఏప్రిల్‌ మాసంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద కేవలం 30 లక్షల మంది మాత్రమే పని చేశారని (మామూలుగా పనిలో వుండేవారిలో కేవలం 17 శాతమే) అందుబాటులో వున్న ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తున్నాయి. అదే గతేడాది 1.7 కోట్ల మంది కార్మికులు పనిలో వున్నారు. అంటే ఈ ఏడాది 82 శాతం కార్మికులు తగ్గారన్నమాట. అయితే ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఏప్రిల్‌ 2020లో 26.2 కోట్ల పని దినాలను సృష్టించవచ్చని గొప్పగా చెప్పారు. కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి ప్రధానంగా పట్టణాలకే పరిమితమై వుంది. గ్రామాలలో దాని ప్రభావం తక్కువగా వుంది. అవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ పని దినాలను అనవసరంగా పోగొట్టుకున్నామన్నమాట.
కరోనాకు ముందు, సాధారణ పరిస్థితులు వున్నప్పుడు కూడా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు ఎటువంటి నిరుద్యోగ భృతిని చెల్లించేవారు కాదు. అయితే దేశంలో 2019-20లో నిరుద్యోగ భృతి చెల్లించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద కార్మికులకు ఎలాంటి నిరుద్యోగ భృతిని ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఈ లాక్‌డౌన్‌ కాలంలో వేతనాలను చెల్లించాల్సిందిగా ప్రయివేటు రంగానికి విజ్ఞప్తి చేయడం విస్తుగొల్పుతోంది.
అనేక పరిమితులు వున్నప్పటికీ, గత పదేళ్ల కాలంలో ఆర్థిక-వ్యవసాయ విపత్తు లలో సైతం గ్రామీణ భారతంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ఎంత ప్రయోజనకరమైనదో నిరూపణ అయ్యింది. గ్రామీణ నిరుపేదలు, అణచివేతకు గురవుతున్న వారు మనుగడ సాగించేందుకు ఈ పథకం తోడ్పడిరది. ఈ వాస్తవాన్ని గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ అంగీకరించడమే గాక ఇలా పేర్కొంది. ‘’ఈ పథకం కింద పనిచేసే కార్మికులలో షెడ్యూల్డ్‌ కులానికి చెందినవారు 20 శాతం, షెడ్యూల్డ్‌ తెగ కార్మికులు 17 శాతం ఈ పథకం కింద స్థిరంగా వుంటున్నది’’. అదేవిధంగా పనిదొరికే మహిళా కార్మికుల సంఖ్య కూడా ప్రోత్సాహకరంగానే వుంది. వీరికి పని దొరకడం మాత్రమే కాదు, సమాన వేతనాలు గ్యారంటీ అయ్యేలా కూడా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ సహాయపడిరది.
లాక్‌డౌన్‌ సమయంలో నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. భారత్‌లో ఇప్పటికే 14 కోట్ల ఉద్యోగాలు పోయాయని సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎమ్‌ఐఆ) పేర్కొంది. లాక్‌డౌన్‌ అనంతరం భారత్‌లో 40 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్రమైన పేదరికం, ఆకలి సమస్యను ఎదుర్కోనున్నారని ఐక్యరాజ్య సమితి చెప్తోంది. ఈ పరిస్థితిలో గామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం వేతన కార్మికుల మీద దృష్టి సారించి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలి.
ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం : వ్యవ’సాయమే’ ప్రధానం!
కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్‌ భారత్‌ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులుబాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు.కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్‌ భారత్‌ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులు బాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు. వాటి వివరాలివే..పాడి పరిశ్రమకు పాలు పోశారు.. దేశంలో సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న పాడి పరిశ్రమకు ఇప్పటికే ‘ఫసల్‌ బీమా యోజన’ కింద ?6,400 కోట్లు పరిహారం ఇచ్చామనీ, ?74,300 కోట్లు మేర కనీస మద్దతు ధరల ప్రకారం కొనుగోళ్లు చేశామనీ నిర్మలా సీతరామన్‌ వెల్లడిరచారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించి తద్వారా ?4,100 కోట్ల రూపాయలను రైతులకు ప్రయోజనం చేకూర్చమని వివరించారు. ఇక భవిష్యత్తులో పాడి పరిశ్రమకు ఇవ్వబోయే చేయూత ఇదే.. పశువుల మూతి, కాళ్లకు వచ్చే వ్యాధుల నివారణకు టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. దీని కోసం ?13,343 కోట్లు కేటాయించారు. పశు సంవర్థక రంగంలో మౌలిక సదుపాయాలకు ?15 వేల కోట్లు కేటాయించారు. పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. మత్స్యరంగానికి చేదోడుగా.. మత్స్య సంపద యోజనకు ?20 వేల కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇంకా ఆర్ధిక మంత్రి మత్స్యరంగానికి ప్రకటించిన ప్రత్యేక వెసులుబాట్లు..దేశంలో మత్స్యకార రంగంలో ఉపాధి పొందుతున్న55 లక్షల మంది. వీరందరికీ వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం. రానున్న అయిదేళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి సాధిస్తామని అంచనా. మౌలిక సదుపాయాలు, సామర్థ్యాల పెంపు ద్వారా ప్రతి ఒక్కరూ స్వావలంబన సాధించాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఫిషింగ్‌ హార్బర్‌, శీతల గోదాములు, మార్కెట్ల కోసం ?9 వేల కోట్లు కేటాయింపు. గడువు తీరిన ఆక్వా హేచరీలకు రిజిస్ట్రేషన్‌ గడువు మూడు నెలలు పొడిగింపు. రైతుల కోసం మరిన్ని.. నిన్న (మే 14) రైతులకు ఇస్తున్నాట్టు చెప్పిన ఆర్ధిక సహకారంతో పాటు ఈరోజు మరిన్ని రైతు సంక్షేమ విధానాలను ఆర్ధిక మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉత్పత్తి అయిన వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులైనా ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు రైతులకు కల్పిస్తారు. ఇంతకు ముందు ఈ విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించే ఏర్పాట్లు చేస్తారు. ు అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై పరిమితులను తొలగిస్తారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకుని వస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్‌ విధానం బలోపేతం చేస్తారు. లైసెన్స్‌ పొందిన వ్యాపారులకు రైతులు అమ్మాల్సిన అవసరం లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చు. – ప్రతి సీజన్‌కు ముందే ఏ పంట ఎంతకు కొంటారో చెప్పేలా చట్టపరమైన ఏర్పాటు చేస్తారు. మొత్తమ్మీద ప్రధాని ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. – (వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త కార్యదర్శి)-పి.అజయకుమార్‌/విక్రమ్‌ సింగ్‌

మేమంటే ఇంత చులకనా?

‘‘ నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏవైనా…ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై చూపడం లేదు. ‘చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలోనే మన ప్రభుత్వం రానుంద’ని జగన్‌ ఎన్నికల ముందు మాట్లాడారు. తానొస్తే పునరావాస ప్యాకేజీ రూ.10 లక్షలి స్తామని… గతంలో ఎకరాకు రూ.1.15 నుండి రూ.1.25 లక్షలు పొందిన భూములకు కుటుం బానికి రూ.5 లక్షలిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తు తం ఆ హామీల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై పదిహేనేళ్లు కావస్తున్నా… నిర్వాసితుల పునరావాస కల్పన చూస్తే ఆశ్చర్యం గానూ, నిరాశాజనకంగానూ వుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేవలం 9 గ్రామాల్లోని 3300 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పిం చింది. ఇది కేవలం 3 శాతం మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వాలకు ప్రాజెక్టు నిర్మాణంపై వున్న శ్రద్ధ పునరావాసంపై లేదనే వెల్లడౌతున్నది.’’

పోలవరంప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 222గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా. ఈ క్రమం లో రెండు లక్షలమంది ప్రజలు నిర్వాసితులు కావొ చ్చు.నిర్వాసితులయ్యే వారిలో అధికశాతం మంది ఆదివాసులే. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు మొదలు పెట్టాక ఇప్పటికి ముంపు ప్రాంతంలోని 3,446 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. వీరినిందరికీ 2010`2011లో సర్వే చేసి అప్పటి భూసేకరణచట్టం కింద పునరావాసం అర కొరగా కల్పించారు. ప్రభుత్వం కల్పించే పునరా వాసం నేటికీ ఆదివాసీలకు సంపూర్ణంగా కల్పిం చలేదు. దీంతో వారంతా ఆందోళనలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసి తులపై చూపడం లేదు.‘చంద్రబాబు ప్రభు త్వం నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలోనే మన ప్రభుత్వం రానుం ద’ని జగన్‌ ఎన్నికల ముందు మాట్లాడారు. తానొస్తే పునరావాస ప్యాకేజీ రూ.10లక్షలిస్తామని.. గతంలో ఎకరాకురూ.1.15నుండి రూ.1.25 లక్షలు పొందిన భూములకు కుటుంబానికి రూ.5 లక్షలిస్తామని హామీఇచ్చారు. ప్రస్తుతం ఆహా మీల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారం భమై పదిహేనేళ్లు కావస్తున్నా…నిర్వాసితుల పునరా వాస కల్పన చూస్తే ఆశ్చర్యంగానూ,నిరాశాజన కంగానూ వుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేవ లం 9గ్రామాల్లోని 3300కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించింది. ఇది కేవలం 3శాతం మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వాలకు ప్రాజెక్టు నిర్మాణంపై వున్న శ్రద్ధ పునరా వాసంపై లేదనే వెల్లడౌతున్నది.

Read more

విప్లవ సింహం…అల్లూరి సీతారామారాజు

మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురల వాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరా టానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.

బ్రిటిష్‌ వారి నిరంకుశ పాలన నుండి భారతీయులకు దాస్యవిముక్తి కలిగించటానికి జీవన బలిదానం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు క్రీ.శ.1897లో జూలై 4వ తేదీన విశాఖ జిల్లాలోని పాండ్రంకి గ్రామంలో నారాయణమ్మ, వెంకట్రామరాజు దంపతులకు జన్మించాడు. 1909లో భీమవరంలో 6వ తరగతిని, కాకినాడ పి.ఆర్‌.కళాశాలలో 8వతరగతి, ఎ.వి.యస్‌. కళాశాలలో 9వ తరగతి పూర్తి చేశాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సీతారామరాజు అనేక కష్టాలను చవిచూశాడు.పేదరికం అనుభవించాడు. పినతండ్రి పెంపకంలో కొంత వరకు విధ్యాభ్యాసం చేయగలిగాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిషం, వాస్తు, హఠయోగం వంటివి నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. అపారమైన దైవభక్తి కలిగిన సీతారామరాజు కొంతకాలం రామలింగేశ్వరస్వామి ఆలయంలో తపస్సు చేశాడు. సీతారామరాజు బాల్యం నుండి దేశభక్తి ఉత్తేజ పూరితమైన వాతావరణంపెరిగాడు. బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రాలో ఇచ్చిన ఉపన్యాసంతో ప్రభావితుడైన సీతారామరాజు, విధ్యార్థి దశ పూర్తికాగానే దేశమంతటా పర్యటించి దేశ స్వాతంత్త్రోధ్యమ స్థితి గతులను తెలుసుకున్నాడు. ఆపర్యటనలోనే విశాపట్టణంలోని మన్యం ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు తెలుసుకుని వారికి అండగా నిలవాలని అనుకున్నాడు.
మన్యం ప్రజలు పూర్తిగా అడువులపై ఆధారపడి, వాటినుండి లభించే తేనె, సీకాయ, కట్టెలు మొదలైనవి పట్టణ ప్రజలకు ఇచ్చి వాటి బదులుగా తమకు కావలసినవి తెచ్చుకునేవారు. బ్రిటిష్‌ వారి పాలనలో ప్రభుత్వం అడవుల చట్టాన్ని ప్రవేశపెట్టినది. దీని ప్రకారం కొండజాతివారు కట్టెలను కొట్టకూడదు, పోడు వ్యవసాయం చేయరాదు. అంతే కాకుండా అనేక ఆంక్షలు ప్రవేశపెట్టినది. వారి పరిపాలన కార ణంగా అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారు రౌలత్‌ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం నిందితులను ఎటువంటి విచారణ చేయకుండా నిర్భంధించవచ్చును, శిక్షింపవచ్చును. దేశ రాజకీయ నాయకులందరూ దీనిని ప్రతిఘటించారు. సహాయనిరాకరణోధ్యమాన్ని ప్రారంభించారు. విధ్యార్థులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
ఇటువంటి ఉద్యమ పరిస్థితులలో సీతారామరాజు మన్య నాయకులైన గంటందొర, మల్లు దొరలతో సంభాషణలు జరిపాడు. సీతారామరాజు అనేక యుద్ధవిధ్యలలోను,ఆయుర్వేదంలో నైపుణ్యం కలవాడగుటచే, మన్యం ప్రజలు వీరిని అమితంగా గౌరవించేవారు. వివిధ గ్రామాల ప్రజలను సమావేశ పరచి వారికి అన్ని విద్యలు నేర్పించాడు. విలు విద్యలో నిపుణులుగా తయారుచేసి, కొండదళం తయారుచేసి, దానికి తానే స్వయంగా నాయకత్వం వహించాడు. కొండ ప్రజలకు అనేక యుద్దపద్ధతులు, గెరిల్లా విద్య మొదలైనవి నేర్పాడు. కొండజాతివారిని చైతన్య వంతులుగా చేయటం గమనించిన బ్రిటిష్‌ వారు రాజు కొంత కాలం దూర ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ ప్రవాశ శిక్ష నచ్చని సీతారామరాజు అక్కడినుండి తప్పించుకుని తిరిగి మన్యం చేరుకున్నాడు. 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీసు స్థేషన్‌ పై మెరుపుదాడి చేసి తూటాలను, కత్తులను, మందుగుండు సామాన్లను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్లను కొల్లగొట్టి,జైల్లో మగ్గుతున్న వీరయ్యదొరను విడి పించాడు. ఈకొండదళం ఆచూకీ తెలుప వలసి నదిగా బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజ లను అనేక బాధలకు గురిచేసింది. చింతపల్లి, కృష్ణదేవి పేట, నర్సీపట్నం మధ్య ప్రభత్వం కల్పిం చిన టెలి ఫోన్‌ సౌకర్యాలను, స్తంభాలను ఈదళం ధ్వంసం చేసిం ది. పోలీసు లను ముప్పుతిప్పలు పెట్టే వారు, ఆహార ధాన్యాలను కొల్లగొట్టేవారు.విప్లవానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని వీరు శిక్షించేవారు. ఈదళం వారిని పట్టి చ్చిన వారికి వెయ్యిరూ పాయల బహుమానం కూడా ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ కొండదళం అనేక భీకర పోరులను సల్పింది. ఈ దళాన్ని ఏమీ చేయలేక ప్రభుత్వం సైన్యాన్ని తీసుకుని వచ్చింది. వారి సోధనలో మల్లుదొర పట్టుబడ్డాడు. సీతారామరాజు మన్యం ప్రజల గుండెలలో తిరుగులేని నాయకుడుగా నిలచిపో యాడని తెలుసుకుని బ్రిటిష్‌ వారు, సీతారామరాజు ఆచూకీకై మన్యం ప్రజలను అనేక చిత్రహింసలకు గురిచేసారు. వారి బాధలను చూడలేక సీతారామ రాజు, బ్రిటిష్‌ వారితో సంధి చేసుకునేందుకు స్వయంగా పాలకుల వద్దకు వెళ్ళాడు. తమ ఎదుట పడిన సీతారామరాజును బ్రిటిష్‌ వారు నిర్ధాక్ష్యింగా కాల్చిచంపారు. వారు తుపాకీ కాలుస్తున్నప్పటికీ బెదురు చెందక సీతారామరాజు, తన వంటి సీతా రామరాజులు వేలకొలది పుట్టుకొస్తారని, వారి బ్రిటిష్‌ వారిని భారతదేశం నుండి పారద్రోలుతారని నిర్భయంగా ప్రకటించాడు. వందేమాతరం అంటూ 1924 మే 7వ తేదీన సీతారామరాడు తుదిశ్వాస విడిచాడు. రామరాజు మరణంతో మన్యం ప్రజ లలో మరింత పట్టుదల పెరిగి, ఉద్యమాన్ని ఉధృతం చేశారు. బ్రిటిష్‌వారు నిరంకుశంగా కొండ దళం నాయకులందరినీ పట్టి చెరసాలలో వేశారు. సీతారామరాజు పూరించిన విప్లవశంఖం దేశ మంతటా సంచలనం కలిగించింది. కొండదళం నాయకుడుగా సీతారామ రాజు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయాడు.సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సిద్దిస్తుందని నమ్మిన పోరాట యోధుడు. మహాత్మాగాంధి ఆంధ్రదేశంలో పర్య టించే సమయంలో అల్లూరిసీతారామరాజు అనేక విధాలుగా కొనియాడారు. సాయుధ పోరాటం పట్ల తనకు సదుద్ధేశ్యం లేదని, అయినప్పటికీ సీతా రామరాజు వంటి త్యాగశీలని, ధైర్యవంతుని కొని యాడకుండా ఉండలేమని చెప్పారు. తదనంతరం జరిగిన అనేక పోరాటాలకు ఆయన మార్గదర్శ కుడయ్యాడు.
విప్లవం రెండవదశ
డిసెంబర్‌ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్‌ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరా టం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయోగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీ సుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవ వీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒకగంట పైగా సాగిన భీకరమైన పోరు లో మరొక 8మంది విప్లవకారులు మరణిం చారు.
ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపో యాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామ రాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్‌, హ్యూమ్‌ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.
1923 ఏప్రిల్‌ 17నరాజు కొద్దిమంది అనుచరు లతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరు వాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923ఆంధ్ర పత్రికలో ప్రచు రింపబడిరది. 10గంటలకు బయలుదేరి శంఖ వరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించి నందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరి మానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈవిషయం తెలిసి ‘‘నేను సాయం కాలం 6గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది’’ అని కలెక్టరుకు రాజు ‘‘మిరప కాయ టపా’’ పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.) క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టు కోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారు లను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షిం చడం జరుగసాగింది. ప్రజలలో ఇరువర్గాల మను షులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సి.యు.స్వినీ అనే అధికారి ఏజన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్‌లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్‌ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూ ర్తం పెట్టి జూన్‌ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు. జూన్‌ 17నరాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యా యడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాబీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామం లోను ఆహార పదార్ధాలు సేకరించారు. 2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్‌వుడ్‌ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్‌ లో రాజు ముఖ్య అనుచ రుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికి పోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపిం చింది. అతనిని దళం విడచి పొమ్మని రాజు ఆనతి చ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి అతనిని సైనికులు నిర్బంధిం చారు. తరువాత శిక్షించి అండమాన్‌ జైలుకు పంపారు(1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యు నిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నిక య్యాడు.1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురి చేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు. సెప్టెంబరు 22న విప్లవకా రులు పాడేరు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయ కత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకా యించి కాల్పులు జరిపారు. ఒకగ్రామ మునసబు ఆపోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగ లిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించు కోలేక పోయారు.17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్‌కమిషనర్‌)గా రూథర్‌ఫర్డ్‌ నియ మితు డయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపు ణుడని పేరుగలిగిన వాడు. విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక ‘‘అగ్గిరాజు’’ అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరుపొందాడు. ప్రభు త్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టే వాడు. ఆహారధాన్యాలు కొల్ల గొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు.1924 మే 6వతారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజుకాలికి గాయమైంది. శత్రు వులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణిం చాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పం పారు. అక్కడే మరణించాడు. ఆరాత్రి రాజు మంపగ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్‌ ఫర్డ్‌ నిర్వహించిన కృష్ణదేవు పేట సభకు మంప మునసబు కూడా హాజర య్యాడు. వారం రోజు లలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్‌ ఫర్డ్‌ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివ రించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించ డానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు.తరువాత,1924 మే 7న కొయ్యూ రు గ్రామ సమీపంలో ఒకఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసు లకు కబురు పంపాడట.ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధిం చారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్‌ గుడాల్‌ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజు ను (ఒక చెట్టుకు కట్టివేసి) ఏవిచారణ లేకుండా గుడాల్‌ కాల్చి చంపాడు.27ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారా మరాజు అమరవీరుడయ్యాడు.- డా,దేవులపల్లి పద్మజ

కష్టం కౌలు రైతుదే..నష్టమూ కౌలు రైతుకే

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. గతసంవత్సరం కంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి సమయానికే వచ్చాయి. కౌలురైతులు అప్పుల కోసం బ్యాంకుల వైపు చూస్తున్నారు. ఏప్రిల్‌, మే నెల నుండే భూ యజమానులు పంటరుణాలు తీసుకుపోతున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తీసుకొని పంట రుణాల కోసం బ్యాంక్‌ కు వెళితే డబల్‌ ఫైనాన్స్‌ అని, బ్యాంకు నిబంధనలు ఒప్పుకోవని, రుణాలు ఇవ్వకుండా తిరిగి పంపిస్తున్నారు. గత సంవత్సరం సైతం మెజారిటీ కౌలు రైతులకు పంట రుణాలు దక్కలేదు. దీనితో వారు అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి పంటలు పండిరచారు. రాష్ట్రంలో సాగు దారుల్లో 80 శాతం, సాగు భూమిలో 70శాతం కౌలు రైతులే పంటలు పండిస్తున్నారు. కాని ప్రభుత్వం సాగు చెయ్యని భూ యజమానులకు పంట రుణాలు ఇచ్చి కౌలు రైతులకు మొండి చేయి చూపిస్తున్నది.

పంట సాగుదారు హక్కు చట్టం (సిసి ఆర్‌సి)విషయంలో ఊహించిందే జరిగింది. నూతనచట్టం కౌలు రైతులకు మేలు చేయదు సరి కదా ఉన్న కొద్ది పాటి సౌకర్యాలను సైతం వారికి దూరం చేస్తుందన్న భయాందోళనలు ఆచరణలో నిజమయ్యాయి. సిసిఆర్‌సి వచ్చాక తొలి ఏడాదిలో కౌలు రైతులకు బ్యాంక్‌ పరపతి దారుణంగా తయారైంది. సిసిఆర్‌సిలపై బ్యాంకులు కేవలం 59వేల మంది కౌలు రైతులకు రూ. 319కోట్ల అప్పులిచ్చాయి. వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు ఇచ్చే రుణ ప్రతిపాదనలకు కత్తెర పడిరది. ప్రాధాన్యత అంతకంతకూ కుచించుకుపోతోంది. దాంతో ప్రభుత్వం సిసిఆర్‌సిలపై పంట రుణాలి ప్పించే అంశానికి స్వస్తి పలికి, ఇంతకు ముందు ఆచరణలో విఫలమైన సంయుక్త భాగస్వామ్య సంఘాల(జెఎల్‌జి)మోడల్‌ను సరికొత్తగా ఎంచు కుంది. ఆ ప్రయోగం కూడా విఫలమైందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బిసి)తాజా గణాం కాలు వెల్లడిరచాయి.
మళ్లీ జెఎల్‌జి వైపు
కౌలు రైతుల దశాబ్దాల ఆందోళనల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ అర్హత కార్డుల (ఎల్‌ఇసి) చట్టాన్ని తెచ్చింది. కొన్ని పరిమితులున్నప్పటికీ కౌలు రైతుల గుర్తింపునకుగా ఆచట్టం బాగానే ఉపయో గపడిరది. రాష్ట్రవిభజన తర్వాత ఐదేళ్లూ ఆ చట్టమే అమల్లో ఉండగా,2019 మేలో అధికారంలో కొచ్చి న వైసిసి ప్రభుత్వం, ఎల్‌ఇసి చట్టాన్ని రద్దు చేసి కొత్తగా సిసిఆర్‌సి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది కౌలు రైతులకు గతంకంటే అధికంగా మేలు చేస్తుం దని పేర్కొంది. కాగా2019 అక్టోబర్‌2 నుండి సిసిఆర్‌ కార్డుల జారీ మొదలు పెట్టగా,ఆఏడాది వాటిపై బ్యాంకులు రుణాలివ్వలేదు.2020 ఖరీఫ్‌ లో అవగాహనా సదస్సుల పేర ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిం చి ఆసంవత్సరంలో 4,87,788 మందికి కార్డులి వ్వాలనుకోగా,4,14,778 కార్డులిచ్చారు. కాగా కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు గతంలో మాదిరిగానే పలు అభ్యంతరాలు లేవనె త్తాయి. సిసిఆర్‌సిలపై బ్యాంకులతో రుణాలిప్పిం చేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, సిసిఆర్‌సి హోల్డర్లతో జెఎల్‌జి గ్రూపులను నెలకొల్పేందుకు ప్రయత్నించింది.వాటికి స్వయం సహాయక సాగు దారుల సంఘాలు (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌)అని పేరు పెట్టింది.
కోటాలో ఇతరులు
అటు సిసిఆర్‌సి ఇటు ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రెండూ కలిపినా కౌలు రైతులకు నిరుడు ఇచ్చిన రుణాలు చాలా తక్కువ. 2020-21లో బ్యాంకు లు కేవలం59,709 సిసిఆర్‌సి హోల్డర్లకు రూ. 319.68కోట్లు ఇవ్వడం గగనమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన 4,020 ‘ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌’ గ్రూపు ల్లోని 20,100 మంది రైతులకు బ్యాంకులిచ్చిన రుణం కేవలంరూ.75.16కోట్లు మాత్రమే. రాష్ట్రం లో 30లక్షలకుపైగా కౌలు రైతులున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుండగా, మొత్తమ్మీద బ్యాంకులు నిరుడు79,809 మందికి రూ.394.84కోట్లి చ్చాయి. మొదటి,రెండు సంవత్సరాల్లో ఎంత మం ది కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిందో ఇంచుమించు అదే సంఖ్యలో పంట రుణాలచ్చాయి. నిరుడు మొత్తంగా కౌలు రైతుల కోటాలో 1,90, 824 మందికి రూ.765.98 కోట్లిచ్చామంటున్నా, పాత జెఎల్‌జి, ఆర్‌ఎంజిలలో అందరూ కౌలు రైతులే లేరు. ఇచ్చామంటున్న రుణాల్లో చాలా వరకు పునరుద్ధరించిన రుణాలే. సిసిఆర్‌సి వచ్చాక కౌలు రైతులకు రుణ ప్రణాళికలో ప్రతిపాదనలు, ప్రాధాన్యత తగ్గుతోంది. అప్పటివరకు వార్షిక రుణ ప్రణాళిలో స్వల్పకాలికపంట రుణాలకు చేసిన కేటా యింపుల్లో పది శాతం కౌలు రైతులకు ఇవ్వాలని కనీసం టార్గెట్‌ అయినా ఉండేది.
పది శాతానికి తూచ్‌
2018-19లో పంట రుణాల లక్ష్యం రూ.75వేలకోట్లు కాగా కౌలు రైతులకు రూ.7,500 కోట్లివ్వాలని అధికారికంగా క్రెడిట్‌ ప్లాన్‌లో చెప్పారు. సిసిఆర్‌సి వచ్చిన2019-20లోసైతం పాత సంప్ర దాయాన్నే కొనసాగించారు. అప్పుడు ప్లాన్‌లో పంట రుణాలు రూ.84వేల కోట్లుకాగా,కౌల్దార్లకు రూ.8, 400 కోట్లు చూపించారు. 2020-21 కొచ్చేసరికి ప్లాన్‌లో పంట రుణాలటార్గెట్‌ రూ.94,629 కోట్లు కాగా కౌలు రైతులకు రూ.6,500కోట్లు మాత్ర మేనని తెలిపారు. పాత సంప్రదాయం ప్రకారమైతే పదిశాతం అంటే రూ.9,462 కోట్లు కౌలు రైతు లకు ఇవ్వాలి. పోనీ టార్గెట్‌ మేరకు ఇచ్చారా అంటే అదీ లేదు. సిసిఆర్‌సి, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌, మిగతా అన్ని పాత గ్రూపులకూ కలిపి ఇచ్చింది రూ.765 కోట్లు మాత్రమే. ప్రస్తుతం 2021-22లో పరిస్థితి మరింత దిగజారింది. వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాల లక్ష్యం రూ.1,10,422 కోట్లు కాగా రూ.4,100కోట్లనుకౌలురైతులకు ప్రతిపాదించారు. మనం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 9,35,123 మంది కౌలు రైతులకు రూ.8400 కోట్ల రుణాలు అందించాలని నిర్దేశించుకున్నారు. కాని రూ.1800కోట్లను 1,73,736 మందికి పంట రుణాలు ఇచ్చినట్లుగా 2020జనవరిలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈ అంకె ల్లో కుడా చాలా గారడీ ఉంది. ఇందు లో బినామీ ఖాతాలు కూడా ఉన్నాయి. ఇదంతా పుస్తకాల సర్దుబాటు తప్ప వాస్తవంగా రుణాలు ఇచ్చింది చాలా తక్కు వేనని బ్యాంకు అధికారులే అంటు న్నారు. రబీ ప్రారంభంలో జగన్‌ ప్రభుత్వం నూతన కౌలు రైతులచట్టం తీసుకు రావటం చేత ఏ ఒక్కరి కి కూడా పంట రుణాలు దక్కలేదు. ‘‘కౌలు రైతుల చట్టం-2011’’ కౌలు రైతులకు కొంత మేరకు అనుకూలంగా ఉంది. ఈచట్టాన్ని రద్దు చేసి ‘ఆంధ్ర ప్రదేశ్‌ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని’ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. భూ యజమాని కౌలు ఒప్పంద పత్రం రాసి ఇస్తేనే కౌలు గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. భూ యజమానులు కౌలు ఒప్పంద పత్రం రాసి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కౌలుదారులకు గుర్తింపు కార్డులు రాలేదు. దీనితో కౌలురైతుల నోట్లో మట్టి కొట్టారు. సాగు చేయ కుండా, శ్రమ చేయకుండా, పెట్టుబడి పెట్టకుండా బ్యాంకుల ద్వారా పొందిన పంట రుణాలను వడ్డీకి ఇచ్చి లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందుతు న్నారు. ఇది పెద్ద మోసం.
ఇటీవల కాలంలో ఆర్‌.బి.ఐ రూ.1. 60 లక్షలవరకు ఎటువంటి హామీ లేకుండా వ్యవ సాయ రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇటీవల నాబార్డు నూతన చైర్మన్‌ గా బాధ్యతలు చేపెట్టిన చింతల గోవిందరాజులు కిసాన్‌క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలకు ఎటువంటి వడ్డీ చెల్లించ వలసిన అవసరం లేదని ప్రకటించారు. సంయుక్త భాగస్వామి సంఘం (జె.యల్‌.జి) పేరుతో పంటరుణాలు కౌలురైతులకు ఉమ్మడి పూచీకత్తుపై ఇచ్చే పథకాన్ని అమలు చేస్తు న్నామని చెప్పారు. ఈ సంఘాల ఏర్పాటుకు, రుణా లు పంపిణీ చేసే బ్యాంకులకు ప్రత్యేకంగా ప్రోత్సా హకాలు నాబార్డు అందిస్తుందని దీని కోసం 105 బ్యాంకులతో నాబార్డు ఒప్పందం చేసుకుందని, ఈరుణాల పంపిణీ సొమ్మంతా నాబార్డు సమ కూర్చుతుందని చెప్పారు. ఇది వాస్తవమేనా? ఆంధ్ర ప్రదేశ్‌లో జె.యల్‌.జి రుణాలు ఇచ్చేటపుడు కౌలు రైతు ఏభూమి సాగు చేస్తున్నాడో పరిశీలించి భూ యజమానిఆ భూమిపై ముందుగానే పంట పేరు చెప్పి రుణం తీసుకెళితే కౌలు రైతులకు ఇవ్వటం లేదు. పంటలు పండిరచడానికి పంట రుణాలు ఇవ్వమంటే అనేక కారణాలు చెబుతారు. కొర్పొరేట్లకు, ఎగవేతదారులకు మాత్రం క్షణంలోనే ఇస్తారు. మనరాష్ట్రంలో ఆబ్సెంట్‌ ల్యాండ్‌లార్డ్స్‌ ఎక్కువ. ఆసాములు విదేశాల్లో ఉంటారు. భూము లు మన రాష్ట్రంలో ఉంటాయి. బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో దుబారులో ఉద్యోగం చేసేవారు స్థానిక బ్యాంకుల్లో పంట రుణాలు పొందుతున్నారు. ఆ భూములు సాగు చేసే కౌలు రైతులు పంట రుణా లు అడిగితే భూ యజమాని తీసుకెళ్ళాడని చెప్పారు. విచారణ జరిపితే అందరికంటే ముందే రుణాలు తీసుకొని భూ యజమాని విదేశాలకు చెక్కేశాడని తేలింది. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా వచ్చేలా చట్టాన్ని మార్చడమే పరిష్కా రం. చట్టాలు చేయడంతో పాటు కౌలు రైతులకు గ్యారంటీగా పంట రుణాలు దక్కే పద్ధతిని రూపొం దించుకుని అమలు చేయాలి. సాగు చేయని వారికి పంట రుణాలు మంజూరు చేయకూడదు. విచారణ జరప కుండా పంట రుణాలు ఇచ్చిన బ్యాంకుల పైన,రుణాలు తీసుకున్న వారి పైన క్రిమినల్‌ కేసులు పెట్టాలి. వాస్తవ సాగుదారులకు పంట రుణాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం కషి చేయాలి. ఇవన్నీ అమలు జరగాలంటే బలమైన ఉద్యమం తప్ప మరో మార్గం లేదని అనుభవం చెప్తోంది- జిఎన్‌వి సతీష్‌

వలస కార్మికుల కోసం సామాజిక వంటశాలలు

‘‘ వలస కార్మికులకు తిండిగింజలు సరఫరా చేయ డానికి అవసరమైన పథకాన్ని రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేయాలి. రాష్ట్రప్రభుత్వాలు తమ సొంత పథకాలను జూలై31లోపు మొదలు పెట్టి కరోనా కొనసాగినంత కాలం అమలు చేయాలి. ఒకే దేశం ఒకే రేషన్‌ పథకాన్ని అమలు చేయాలి. రాష్ట్రాలు జూలై31లోపు దాన్ని అమల్లోకి తీసుకు రావాలి అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. వలసకార్మికులకు రెండుపూటల తిండి కోసం కార్మి కులు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే అక్కడ సామూహిక వంటశాలలు కొన సాగించాలని జస్టీస్‌ అశోక్‌ భూషణ్‌,జస్టీస్‌ ఎం.ఆర్‌. షాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఒక కేంద్రీకృత పోర్టల్‌ను ఏర్పాటు చేసి అందు లో దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటితరంగ కార్మికులు, వలసకూలీల వివరాల నమోదు ప్రక్రియను జూలై31 లోపు మొదలు పెట్టాలని ఆదేశించింది. కార్మికుల వివరాల నమోదు కోసం నేషనల్‌ డెటాబేస్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయడంలో కేంద్ర కార్మికశాఖ చేసిన జాప్యాన్ని సుఫ్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కార్మికులు ప్రభుత్వాల నుంచి వివిధసంక్షేమ పథకాలు అందు కోవడం కోసం వేచిచూస్తున్న తరుణంలో కేంద్ర కార్మికశాఖ ఉదాసీనంగా,నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం క్షమార్హం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం . ఇప్పటికైనా పోర్టల్‌ను తక్షణం ఏర్పాటు చేసి అమల్లో కి తీసుకురావాలి’ అని ధర్మాసనం పేర్కొంది. అసం ఘటితరంగ కార్మికులు,వలసకూలీల వివ రాల నమో దుకు కేంద్రప్రభుత్వం నేషనల్‌ ఇన్ఫర్మేటి క్స్‌ సెంటర్‌తో కలసి ఒక పోర్టల్‌ను రూపొందించాలి. ఇదే సమ యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘ టిత రంగ కార్మికుల వివరాలను నేషనల్‌ డేటాబేస్‌లో నమోదు చేసే ప్రక్రియను జూలై31లోపు మొదలు పెట్టి డిసెంబరు31నాటికి పూర్తిచేయాలి’ అని సుప్రీంకోర్టు తెలిపింది.

రేషన్‌ కార్డు లేదన్న సాకుతో ఏ ఒక్క వలస కార్మికునికి అందునా ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో రేషన్‌ నిరాకరించడం ఎంతమాత్రమూ తగదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని సుప్రీం కోర్టు జూన్‌ 29న ఒక తీర్పులో ఘాటుగా హెచ్చరించింది.‘‘వలస కార్మికుల్లో ఎక్కువ మంది పేదరికంతో చదువుకు దూరమైనవారే.వారి వద్ద ఏ విధమైన కార్డులు ఉండవు.అంతమాత్రం చేత వారికి ఈకరోనా సమయంలో రేషన్‌ను ప్రభు త్వం ఎలా నిరాకరిస్తుంది.వీరిలో చాలామందికి ఎలాంటి స్థిరమైన ఉపాధి ఉండదు. అయినా కనీస అవసరాలు తీరితే చాలు అనుకుంటారు వీరు’’ అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌,జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన ధర్మాసనం తమ 80పేజీలతీర్పులో పేర్కొం ది. దేశ జనాభాలో నాలుగింట ఒక వంతు అంటే 38కోట్లుగా వలసకార్మికులు ఉన్నారని,దేశ పురోగా భివృద్ధికి, ఆర్ధికాభివృద్దికి వలసకార్మికుల కంట్రిబ్యూ షన్‌ చాలా గొప్పదని అన్నారు. వలస కార్మికుల్లో ప్రతి ఒక్కరికీ రేషన్‌ అందేలా చూడా ల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని,వలసకార్మికులకు డ్రై రేషన్‌ ఇచ్చేందుకు అనుగుణమైన పథకాలను జూలై31 లోగా రూపొందించాలని కేంద్ర,రాష్ట్రప్రభుత్వా లకు గడవుఇచ్చింది.రెండు పూటలా భోజనం ఏఒక్క వలసకార్మికుడికి నిరాకరించకుండా చూడా లని రాష్ట్రప్రభుత్వాలను కోరింది. వలస కార్మికు లను చేరుకునేందుకు అన్నీ రాష్ట్రాలు, కేందప్రాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కోరింది. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన అదనపు తిండిగింజలను కేంద్రం సరఫరా చేయాలని, కరో నా కాలమంతటా కీలకమైన ప్రాంతాల్లో సామా జిక వంటశాలలను నడపాలని కోరింది. ఆహార హక్కు జీవించేందుకు తప్పనిసరి అని చెప్పింది. హుందాగా జీవించే హక్కులో ఇదోక భాగమని కోర్టు ప్రభుత్వానికి హితబోధ చేసింది. జూలై31 నుంచి ఒకదేశం ఒకే రేషన్‌ కార్డు విధానాన్ని అన్ని రాష్ట్రాలుపూర్తిగా అమలు చేయనున్నందున, అప్పటి లోగా వలస కార్మికులందరినీ జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఈ పథకంలోకి తీసుకురావాలని కోర్టు ఆదేశించింది.
వలస కార్మికుల ఆందోళనలపై కేంద్ర కార్మిక,ఉపాధి మంత్రిత్వశాఖ ఉదాసీనవైఖరిపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వలస కార్మికులు డేటాను పోర్టల్లో ఉంచడంలో ఆలస్యం జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై31లోగా వలస కార్మికుల కోసం పోర్టల్‌ అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. ‘‘అసం ఘటిత,వలసకార్మికుల వివరాలు నమోదు చేయ డానికి కేంద్రప్రభుత్వం జూలై 31లోపు పోర్టల్‌ని అభివృద్ధి చేసి..అందుబాటులోకి తీసుకురావాలి. జూలై 31లోపు ఈ ప్రక్రియను ప్రారంభించాలి’’ అని పేర్కోంది.
ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న లాక్‌డౌన్‌ తరహా పరిస్థితుల వల్ల ఉపాధిని కోల్పో యిన వలస కార్మికులకోసం దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక ఆదేశాలను జారీచేసింది. కేంద్ర ప్రభు త్వం అమలు చేయదలిచిన వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకానికి సంబంధించిన ఆదేశాలు అవి. రాష్ట్రాలతో సంబంధం లేకుండా వలస కార్మి కులకు ఉన్నచోటే చౌక దుకాణాల ద్వారా నిత్యా వసర సరుకులను అందజేయాలని సుప్రీం కోర్టు తాజాగా సూచనలు ఇచ్చింది. జులై31వతేదీ నాటికి..ఈ వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకాన్ని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాం తాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనికి డెడ్‌ లైన్‌ కూడా విధించింది. జులై 31వ తేదీ నాటికి ఈపథకాన్ని అమలు చేసి తీరాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనితోపాటు-వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్‌లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాలనిసూచిం చింది.
పోర్టల్‌ ద్వారా నమోదు..
అసంఘటిత రంగానికి చెందిన కార్మి కులు,వసల కూలీల వివరాలను నమోదు చేయ డానికి ప్రత్యేకంగా ఓపోర్టల్‌ను రూపొందిం చాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. జులై31వతేదీ నాటికి ఈపోర్టల్‌ను అందు బాటులోకి తీసుకుని రావాలని, దీనికోసం నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ సహకారాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. డిమాండ్లకు అను గుణంగా..ఆహారధాన్యాలు, నిత్యావసర సరుకులను రాష్ట్రాలకు సమకూర్చి పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కాంట్రాక్టర్ల వివరాలు కూడా..
జులై31వ తేదీనాటికి డ్రై రేషన్‌ను చేపట్టాలని,కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా సమసిపోయేంత వరకూ దాన్ని కొనసాగించాలని రాష్ట్రాలకు ఆదేశించింది. వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకాన్ని ఇప్పటిదాకా అమలు చేయని రాష్ట్రాలు తాము విధించిన డెడ్‌లైన్‌ నాటికి అందుబాటులోకి తీసుకుని రావాలని పేర్కొం ది. అంతర్రాష్ట్ర వలస కార్మికులు (రెగ్యు లేషన్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ యాక్ట్‌)-1979 కింద కాంట్రాక్టర్లు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కంపెనీల వివరాలన్నింటినీ నమో దు చేయాలని సుప్రీంకోర్టురాష్ట్రాలకు సూచిం చింది.
కమ్యూనిటీ కిచెన్లు సైతం
వలసకార్మికుల సంక్షేమం కోసం కమ్మూ నిటీ కిచెన్లను అందుబాటులోకి తీసుకుని రావాలని, కరోనా సంక్షోభం ముగిసేంత వరకూ వాటిని కొనసాగించాలని ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నివారించడానికి రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడం వల్ల వలస కార్మికులు ఉపాధిని కోల్పోయిన విష యం తెలిసిందే. ఫలితంగా-వారు వందలాది కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుకున్నారు.
సుమోటోగా స్వీకరణ
దీన్ని గతఏడాది మేలో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టింది. తాజాగా ఈఆదేశాలను జారీ చేసింది. వలస కార్మికులకు ఉన్నచోటే ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి ఉద్దేశించిన వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు పథకం ఇప్పటికే జాప్య మైందని న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యా నిం చింది.
ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు
ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు పథకం జూలై 31కల్లా దేశవ్యాప్తంగా అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలసకార్మికుల డాటా బేస్‌ నిమి త్తం జాతీయ స్థాయిలో వర్కర్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశిం చింది. ‘వలసకార్మికుల సమస్యలు,కష్టాలు’పై సుమో టో కేసును విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం ఈ మేరకు 80పేజీల తీర్పు వెలువరించింది. ప్రతివారికీ ఆహారంతోపాటు కనీస అవసరాలను పొందే హక్కుతోపాటు,రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. అసంఘటితరంగ కార్మికులకోసం జాతీయస్థాయి డేటాబేస్‌ ఏర్పాటు చేయాలని 2018లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని ఈసందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. ఈ విష యంలో కేంద్ర కార్మికశాఖ కనబరుస్తున్న ఉదాసీ నత,నిర్లక్ష్య వైఖరి క్షమించరాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వలస కార్మికులకు రేషన్‌ సరు కుల పంపిణీకి తగిన పథకం తీసుకు రావాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా రాష్ట్రాల పథకా లన్నీ జూలై 31కల్లా అమలులోకి రావాలని, అదే రోజుకల్లా వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ అమలులోకి తీసుకురావాలని పేర్కొంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కాంట్రాక్టర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి కార్మికుల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలంది.రెండు పూటలా ఆహారం దొరకని వలస కార్మికులకు సామూహిక వంట శాలలు ఏర్పాటు చేయాలని, ఆయా పథకాలన్నీ కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ కొనసాగిం చాలని పేర్కొంది.వలస కార్మికు లకు రేషన్‌ సరఫరానిమిత్తం తగిన పథకం రాష్ట్రాలు తీసుకు రావాలి.ఆమేరకు కేంద్రం అదనపు ఆహార ధాన్యాలను రాష్ట్రా లు కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి సంబంధించి తగినపథకాన్ని జూలై 31లోగా తీసుకొచ్చి అమలు చేయాలని తెలిపింది.
దేశంలో వలస కార్మికుల తరలింపుపై ఏకీకృత విధానం అవసరమని సుప్రీంకోర్టు కేంద్రా నికి సూచించింది. వారిని వారి స్వస్థలాలకు తరలిం చే విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వ యం ఉండాలని, ప్రతి కార్మికుడూక్షేమంగా తన ఇల్లు చేరేలా చూడాలని కోరింది. వీరి దుస్థితిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం.. కేంద్రానికి మొత్తం 50 ప్రశ్న లను వేసింది.లాక్‌ డౌన్‌ అమల్లో ఉండగా ప్రధా నంగా వలస జీవుల తరలింపు పైనే దృష్టి పెట్టింది. వారికి షెల్టర్‌,ఫుడ్‌, వారిట్రాన్స్‌ పోర్టేషన్‌ తదిత రాలపై కేంద్రం చేపట్టిన చర్యలను వివరంగా తెలుసుకుంది. ప్రతివారినీ ఒకేసారి వారి ఇళ్లకు పంపడం సాధ్యంకాదని, కానీ వారికి రవాణా సౌకర్యం కల్పించేంతవరకు తగిన వసతి, ఆహారం సమకూర్చవలసిన అవసరం ఉందని కోర్టు పేర్కొం ది. కాగాకేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ..
గతేడాది మే1న శ్రామిక్‌ రైళ్లను ప్రారం భించినప్పటి నుంచి ఇప్పటి వరకు 91లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించినట్టు వెల్లడిరచారు. వలస కార్మికుల అంశంపై రాజకీయ ప్రసంగాలతో కూడిన పిటిషన్లను అనుమతిం చరాదని, అలాంటి వారు కావాలంటేఅఫిడవిట్లు దాఖలు చేసుకోవాలని ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. వలస జీవులకు రైల్వే శాఖ 84లక్షల ఆహార పాకె ట్లను అందించిందని తుషార్‌ మెహతా తెలిపారు. ఈ సదుపాయం మరికొన్ని రోజులు కొనసాగుతుం దన్నారు. కాగా-తమ పేర్ల నమోదు లోను, టికెటింగ్‌ సిస్టంలోను జాప్యం జరుగు తుండ డంతో..ఇంకా వేలాది కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు చట్టవిరుధ్ధంగా తిరుగుతున్న వాహనా లను ఆశ్రయి స్తున్నారు.మరికొందరు కాలి నడకనే సాగుతున్నారు. Saiman Gunaparthi