ఉపాధి ఊసేది?

వైసిపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2020-21 రాష్ట్ర బడ్జెట్‌ నిజాయితీకి దూరంగా ఉంది. వాస్తవాలను పరిగణన లోకి తీసుకోకుండా మసి పూసి, మారేడుకాయ చేసే ప్రయత్నం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం కరోనా సంక్షోభంతో మొదలయింది. పారిశ్రామిక, సర్వీసు రంగాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. గత ఆర్థిక సంవత్సరం లోనే ప్రభుత్వాల ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయి. ఈ ఏడాది మరింత తీవ్రంగా పడిపోతాయనడంలో సందేహం లేదు. ఇటువంటి సమయంలో బడ్జెట్‌ అంచనాలు భారీగా చూపించటం ప్రజలను పక్కదారి పట్టించటానికే.
ఆదాయాలు-ఖర్చులు
ఆదాయాలు, ఖర్చుల అంచనాలే బడ్జెట్‌. అంచనా వేసిన ఆదాయం కంటే అంచనా వేసిన ఖర్చు ఎంత ఎక్కువ ఉంటే దాన్ని ద్రవ్య లోటుగా లేదా డబ్బుల లోటుగా పిలుస్తున్నారు. అప్పు తీసుకొచ్చి ప్రభుత్వం ద్రవ్యలోటును పూడుస్తుంది. అప్పుకు పర్యాయ పదమే ద్రవ్యలోటు. అప్పు తీసుకొచ్చి ఆదాయం-ఖర్చు మధ్య సమతుల్యతను ప్రభుత్వం సాధిస్తుంది. 2019-20లో అంటే మొన్న మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ సైజు రూ.2 లక్షల 27 వేల కోట్లు. ఇదే మొత్తంలో ఆదాయాలు, ఖర్చులు ఉంటాయి. ఆదాయంలో రెవెన్యూ ఆదాయం, పెట్టుబడి ఆదాయం ఉంటాయి. ఖర్చులో రెవెన్యూ ఖర్చు, పెట్టుబడి ఖర్చు, అప్పు ఫాయిదాలు ఉంటాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో అప్పుతో కలిపి రూ. 2లక్షల 2వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన వైసిపి ప్రభుత్వం చివరికి దాన్ని రూ. లక్షా 74 వేల కోట్లకు తగ్గించింది. రెవెన్యూ ఆదాయం రూ.68 వేల కోట్ల మేర తీవ్రంగా తగ్గింది. అంచనా వేసిన దాని కంటే మరో రూ. 15వేల కోట్ల అప్పు తెచ్చి మొత్తం ఆదాయ లోటును రూ.53 వేల కోట్లకు తగ్గించింది. ఆ మేరకు ఖర్చును కూడా రెవెన్యూ ఖర్చులో రూ.43వేల కోట్లు, పెట్టుబడి ఖర్చులో రూ.19 వేల కోట్లు కోత వేసింది. అదే సమ యంలో అప్పు తీర్చే ఫాయిదాలను రూ.9 వేల కోట్లకు పెంచింది. వెరసి అంచనా వేసిన ఖర్చు కంటే పెట్టిన ఖర్చు రూ.53 వేల కోట్లకు తగ్గిం ది. ఆ మేరకు బడ్జెట్‌ సైజు కూడా రూ.53 వేల కోట్లకు తగ్గి, రూ.ఒక లక్షా 74 వేల కోట్లయింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగు నీరు, పరిశ్రమలు, రవాణా వంటి ఆర్థిక సర్వీసులకు పెట్టిన ఖర్చు భారీగా రూ.48 వేల కోట్లు తగ్గింది. సాధారణ విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, పట్టణా భివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం తదితర సామాజిక సర్వీసులకు రూ.9 వేల కోట్ల కోత పెట్టింది. ఈ సర్వీసులలో ఇతర రంగాలకు రూ. 23 వేల కోట్ల కోత పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి రూ.14వేల కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. వెరసి సామాజిక సర్వీసులలో రూ.9 వేల కోట్ల కోత పడిరది. కోర్టులు, జైళ్ళు, పోలీసు, రెవెన్యూ మరియు అప్పులు, వడ్డీల చెల్లింపులు, ఉద్యోగుల పెన్షన్లు వంటి సాధారణ సర్వీసులకు కేటాయించిన దాని కంటే రూ.3 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టింది.
వర్తమాన బడ్జెట్‌
2019-20 బడ్జెట్‌ వాస్తవం తెలిస్తేగాని ప్రస్తుత 2020-21 బడ్జెట్‌ను అవగాహన చేసుకోలేము. ముందుగా గత 2019-20 బడ్జెట్‌ వాస్తవాలను పరిశీలించాం. కరోనా లేని సమయంలో 2019-20 బడ్జెట్‌ అంచనాలు వాస్తవంలో తలకిందులయ్యాయి. కరోనాతో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్‌ అంచనాలు వాస్తవం అయ్యే అవకాశం అసలు లేదు. 2019-20 బడ్జెట్‌ 2018-19 ఆర్థిక సంవత్సరపు స్థాయికి దిగజారింది. 2020-21 బడ్జెట్‌ సైజును రూ. 2 లక్షల 25 వేల కోట్లుగా ప్రతిపాదించి నప్పటికీ వాస్తవంలో అది కూడా 2018-19 స్థాయికి కొద్దో గొప్పో తేడాతో దిగజార బోతోంది. ప్రభుత్వానికే బడ్జెట్‌ మీద నమ్మకం లేదు. ఏకంగా బడ్జెట్‌ సైజునే రూ.3 వేల కోట్ల మేర తగ్గించింది. వ్యవసాయం, గ్రామీణా భివృద్ధి, నీటిపారుదల, సాధారణ విద్య వంటి రంగాలకు కేటాయింపులోనే రూ.30 వేల కోట్లు తగ్గించింది. అదే సమయంలో సంక్షేమానికి దాదాపుగా అదే మొత్తంలో రూ. 28 వేల కోట్ల మేర పెంచింది. వివిధ రంగాలను అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమం మాత్రమే ప్రజలకు మేలు చేయదు. అభివృద్ధికి కేటాయిం పులు తగ్గకుండా అదనంగా సంక్షేమానికి కేటాయింపులు జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం జోడు చక్రాలుగా నడుస్తాయి.
కార్మికులకు కానరాని మేలు
ఉపాధి హామీ పథకానికి పోయిన సంవత్సరం రూ.3626 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ. 2021 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కరోనా వలన పనులు దొరకని పరిస్థితుల్లో ఉపాధి కల్పన పెంచాల్సిన ప్రభుత్వం గతం కంటే రూ. 400 కోట్లు తగ్గించింది. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు కూడా విస్తరించాలన్న డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. వైయస్సార్‌ బీమా పథకం కూడా వట్టిపోయిన గొడ్డులా తయారయింది. పోయిన సారి దీనికి రూ. 400 కోట్లు కేటాయించినా… దాన్ని ఖర్చు చేయకుండా ఈ సంత్సరం రూ.262 కోట్లు మాత్రమే కేటాయించింది. బడ్జెట్‌ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు కూడా స్పష్టమవుతాయి. గత 9 సంవత్సరాలుగా షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ లోని 50 లక్షల మంది కార్మికులకు వేతన సవరణ చేయలేదు. బడ్జెట్‌ ప్రసంగంలో దీని ప్రస్తావనే లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కార్మికులకు పని లేదు. వేతనాలు లేవు. ఇటువంటి సమయంలో కార్మికుల కొనుగోలు శక్తి పెంచ టానికి అవసరమైన చర్యలను కూడా బడ్జెట్‌లో ప్రకటించ లేదు. వృద్ధాప్య పెన్షన్లను ప్రభుత్వం వారికి కానుకగా చూపిస్తు న్నది. ఇతర పెన్షన్లకు అర్హత లేని వారు కూడా తాము పని చేయగలిగిన వయసులో 30, 40 సంవత్సరాల పాటు పని చేసినవారే. వారికి ఒక యజమాని అంటూ ఉండరు కాబట్టి ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తోంది. దానిని కానుకగా చూపించి వైసిపి ప్రభుత్వం వారిని అవమానపరుస్తోంది. ఈ బడ్జెట్‌ కార్మికులకు మేలు చేయదు. పారిశ్రామిక, వ్యవసాయ, సర్వీసు రంగాలలో ఉపాధి పెరగదు. కార్మికులు కొనుగోలు శక్తీ పెరగదు.
సంక్షోభవేళ అరకొరగా
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) రూ.40,000 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఇటీవల ప్రకటించారు. మే 17న విలేకరుల సమావేశంలో అదనపు కేటాయింపుల గురించి నొక్కి చెప్తూ ఈ పథకం కింద 2019 మే నెలలో కంటే 40-50 శాతం మంది కార్మికులు అధికంగా నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ బడ్జెట్‌కు ఈ అదనపు రూ.40,000 కోట్లు జోడిరచినప్పటికీ మంత్రిగారు వక్కాణించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపోదు.రూ.40,000 కోట్ల కేటాయింపును గొప్పగా చెప్పుకోవడం మీదే ఆర్థిక మంత్రి దృష్టి కేంద్రీకరించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకం కింద పని కోరే వారి సంఖ్యకు సరిపడేంత బడ్జెట్‌ వుండాలన్నది ఆవిడ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఇదొక సులభమైన మార్గం అంతే. ఇప్పటికే 14 కోట్లకు పైగా వున్న ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు, గ్రామాలకు తిరిగి వస్తున్న కోట్లాది వలస కార్మికులకు ఉపాధి కల్పించాలన్న భారీ లక్ష్య సాధనకు ఈ మొత్తం ఏ మూలకూ సరిపోదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షేత్రస్థాయి వాస్తవాలను నిశితంగా పరిశీలించినట్లయితే ఈ విషయం తేలిగ్గానే తెలుస్తుంది.
ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులలో కార్మికులకు ఏడాదికి 200 పని దినాలకు గ్యారంటీ వుండాలి. అదేవిధంగా వారికి రోజువారీ వేతనం రూ.300 (లేదా ఆయా రాష్ట్రాలలో అమలులో వున్న కనీస వేతనం అంతకంటే ఎక్కువైతే ఆ మొత్తం) ఇవ్వాలి. వ్యవసాయ కార్మిక సంఘాలు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్‌ ఇది. పైగా, అనేకమంది ఆర్థికవేత్తలు కూడా గతంలో ఇటువంటి సూచనలే చేశారు. ఆ విధంగా చేస్తే గ్రామీణ కార్మికులకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అది ప్రధానమైన అడుగు అవుతుంది.
2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కి కేటాయించింది రూ.61,500 కోట్లు. వాస్తవానికి 2019-20 సంవత్సరంలో ఆ పథకం కింద చేసిన ఖర్చు కంటే ఈ కేటాయింపులు 9,500 కోట్లు తక్కువ. పైగా గతేడాది చెల్లించవలసిన బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. ఇప్పుడు అదనంగా ప్రకటించిన రూ.40,000 కోట్లు కలిపితే ఉపాధి హామీ పథకం కింద మొత్తం రూ. 1,01,500 కోట్లు వున్నట్లు లెక్క.
ఈ ఏడాది మే 16వ తేదీన అందుబాటులో వున్న ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పోర్టల్‌ వివరాల ప్రకారం 1435.73 లక్షల మంది జాబ్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, 1374.39 లక్షల మందికి కార్డులు మంజూరు అయ్యాయి. అంటే దరఖాస్తు చేసుకున్న 61,35,751 కుటుంబాలకు జాబ్‌కార్డు మంజూరు కాలేదు. ఇందులో 1166 లక్షల మంది పనిచేసేవారుండగా కార్మికులు వుండగా, అందులో 766.75 లక్షల జాబ్‌కార్డులు మాత్రమే ఉపయోగంలో వున్నాయి. గత మూడేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క రోజు పనిచేసినా జాబ్‌కార్డు ఉపయోగంలో వున్నట్టేనట!
సులభంగా అర్థమయ్యేందుకు ఒక చిన్న లెక్క చూద్దాం. జాబ్‌కార్డులున్న 766.75 లక్షల క్రియాశీల కార్మికులకు రూ. 200 రోజువారీ వేతనం చొప్పున 100 రోజులు పని కల్పించడానికి రూ.1,53,350 కోట్లు అవసరం అవుతుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం తన ధోరణి మార్చుకుని, జాబ్‌కార్డులున్న కుటుంబాలన్నింటికీ 100 రోజుల పని కల్పించాలని భావిస్తే అందుకుగాను రూ.2,87,146 కోట్లు అవసరమవుతాయి. అన్నిటినీ మించి, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఒక్కో ఇంటికి కనీసం 200 రోజుల పని కల్పించాల్సిన అవసరముంది. ఇలా చేస్తే, ఖజానా నుంచి రూ.3,06,700 కోట్లు ఖర్చు అవుతుంది. మరో ముఖ్యమైన అంశాన్ని గమనంలో వుంచుకోవాలి. వేతనం రూ.200 అంటే చాలా తక్కువ. అయినప్పటికీ మనం దాన్నే కనీస వేతనంగా పరిగణిస్తున్నాం. పై లెక్కలన్నీ కేవలం వేతనానికి సంబంధించినవి మాత్రమే. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పనికి సంబంధించి ఇతర ఖర్చులు కూడా వుంటాయి. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఢల్లీి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన వికాస్‌ రావల్‌ ఒక సూచన చేశారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఒక వ్యక్తి పని చేస్తే అందుకు రూ.290 ఖర్చు అవుతుంది. ఈ ఏడాది పెరిగిన వేతనం రూ.20 కూడా జోడిరచినట్లయితే అది రూ.310 అవుతుంది. ఈ లెక్కన, కార్డు వున్న వారందరికీ 100 రోజుల పాటు పని కల్పించాలంటే రూ. 4,26,975 కోట్లు అవసరమవుతాయి (13,77,33,901 జాబ్‌కార్డులకు 2019-20 ప్రకారం అయ్యే ఖర్చునకు (రోజుకు రూ.290) కొత్తగా పెరిగిన వేతనాన్ని (రోజుకు రూ.20) జోడిరచాలి).
ఈ గణాంకాలన్నీ లోగడ గ్రామాలలో వున్న శ్రామికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వేసిన అంచనాలు. ఇప్పుడు, గ్రామాలకు తిరిగి వస్తున్న కోట్లాది మంది వలస కూలీలను కూడా కలిపి అందరికీ పనులు కల్పించాల్సి వుంటుంది. తిరిగివచ్చిన వలస కూలీలను కూడా కలుపుకొని పని అడిగేవారి సంఖ్య పెరిగిన పరిస్థితిని ఈ అరకొర కేటాయింపులతో ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్న నుంచి హాయిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్‌ కొరత ప్రభావం ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకం అమలు మీద తీవ్రంగా వుంటోంది. దీనికితోడు, కేంద్రం విడుదల చేసే నిధులు చాలీచాలకుండా, ఒక పద్ధతిపాడు లేకుండా విడుదల అవుతుంటాయి. ఆర్థికంగా బలహీన స్థితి లోని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను ఇవ్వలేకపోవడం కూడా పథకం అమలుపై ప్రభావం చూపుతోంది. జాబ్‌కార్డులు-పనుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య పెరగడం, ఆర్థిక ప్రతిబంధకాలు, ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నగదు నిల్వలు తక్కువగా వుండడం వల్ల అనేక రాష్ట్రాలు ఈ పథకం కింద పనులు కల్పించలేకపోయాయి. లాక్‌డౌన్‌ అమలులో వున్నప్పటికీ మార్చి 31 తర్వాత జాబ్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 7.1 లక్షలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌లో దరఖాస్తుల సంఖ్య అత్యధికంగా పెరిగింది. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చిన వలస కూలీల సంఖ్య ఈ రాష్ట్రాలన్నిట్లోను ఎక్కువగా వుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ప్రాధాన్యత ఎంతగా వుందనేది దీనిని బట్టే అర్థమౌతోంది.
లాక్‌డౌన్‌ వేళ గ్రామీణ కార్మికులకు కొంత ఉపశమనం కల్గించడానికి, తిరిగి వచ్చిన వలస కార్మికుల కారణంగా పడిన భారాన్ని తగ్గించడానికి ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాన్ని మనం చేజార్చుకున్నాం. సాధారణంగా ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) లోనే ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పని ఎక్కువగా జరుగుతుంది. పని డిమాండ్‌ కూడా అధికంగా వుంటుంది. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ‘పూర్తయిన పని’లో సుమారు 37 శాతం ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లోనే జరుగుతుంది. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ మొదటి దశ సందర్భంగా పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు ప్రణాళిక, ఆలోచన లేకుండా గుడ్డిగా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పనులను నెల రోజుల పాటు రద్దు చేసేసింది. ఒక ప్రకటన ద్వారా ఏప్రిల్‌ 15 నుంచి ఈ నిబంధనలను ఎత్తివేసినప్పటికీ అవి ఏప్రిల్‌ 20 నుంచి అమలు లోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ నుంచి ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ను మినహాయించినప్పటికీ ఈ పథకం కింద పనులు చాలా నిదానంగా నడుస్తున్నాయి.
ఏప్రిల్‌ మాసంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద కేవలం 30 లక్షల మంది మాత్రమే పని చేశారని (మామూలుగా పనిలో వుండేవారిలో కేవలం 17 శాతమే) అందుబాటులో వున్న ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తున్నాయి. అదే గతేడాది 1.7 కోట్ల మంది కార్మికులు పనిలో వున్నారు. అంటే ఈ ఏడాది 82 శాతం కార్మికులు తగ్గారన్నమాట. అయితే ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఏప్రిల్‌ 2020లో 26.2 కోట్ల పని దినాలను సృష్టించవచ్చని గొప్పగా చెప్పారు. కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి ప్రధానంగా పట్టణాలకే పరిమితమై వుంది. గ్రామాలలో దాని ప్రభావం తక్కువగా వుంది. అవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ పని దినాలను అనవసరంగా పోగొట్టుకున్నామన్నమాట.
కరోనాకు ముందు, సాధారణ పరిస్థితులు వున్నప్పుడు కూడా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు ఎటువంటి నిరుద్యోగ భృతిని చెల్లించేవారు కాదు. అయితే దేశంలో 2019-20లో నిరుద్యోగ భృతి చెల్లించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద కార్మికులకు ఎలాంటి నిరుద్యోగ భృతిని ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఈ లాక్‌డౌన్‌ కాలంలో వేతనాలను చెల్లించాల్సిందిగా ప్రయివేటు రంగానికి విజ్ఞప్తి చేయడం విస్తుగొల్పుతోంది.
అనేక పరిమితులు వున్నప్పటికీ, గత పదేళ్ల కాలంలో ఆర్థిక-వ్యవసాయ విపత్తు లలో సైతం గ్రామీణ భారతంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ఎంత ప్రయోజనకరమైనదో నిరూపణ అయ్యింది. గ్రామీణ నిరుపేదలు, అణచివేతకు గురవుతున్న వారు మనుగడ సాగించేందుకు ఈ పథకం తోడ్పడిరది. ఈ వాస్తవాన్ని గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ అంగీకరించడమే గాక ఇలా పేర్కొంది. ‘’ఈ పథకం కింద పనిచేసే కార్మికులలో షెడ్యూల్డ్‌ కులానికి చెందినవారు 20 శాతం, షెడ్యూల్డ్‌ తెగ కార్మికులు 17 శాతం ఈ పథకం కింద స్థిరంగా వుంటున్నది’’. అదేవిధంగా పనిదొరికే మహిళా కార్మికుల సంఖ్య కూడా ప్రోత్సాహకరంగానే వుంది. వీరికి పని దొరకడం మాత్రమే కాదు, సమాన వేతనాలు గ్యారంటీ అయ్యేలా కూడా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ సహాయపడిరది.
లాక్‌డౌన్‌ సమయంలో నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. భారత్‌లో ఇప్పటికే 14 కోట్ల ఉద్యోగాలు పోయాయని సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎమ్‌ఐఆ) పేర్కొంది. లాక్‌డౌన్‌ అనంతరం భారత్‌లో 40 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్రమైన పేదరికం, ఆకలి సమస్యను ఎదుర్కోనున్నారని ఐక్యరాజ్య సమితి చెప్తోంది. ఈ పరిస్థితిలో గామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం వేతన కార్మికుల మీద దృష్టి సారించి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలి.
ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం : వ్యవ’సాయమే’ ప్రధానం!
కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్‌ భారత్‌ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులుబాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు.కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్‌ భారత్‌ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులు బాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు. వాటి వివరాలివే..పాడి పరిశ్రమకు పాలు పోశారు.. దేశంలో సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న పాడి పరిశ్రమకు ఇప్పటికే ‘ఫసల్‌ బీమా యోజన’ కింద ?6,400 కోట్లు పరిహారం ఇచ్చామనీ, ?74,300 కోట్లు మేర కనీస మద్దతు ధరల ప్రకారం కొనుగోళ్లు చేశామనీ నిర్మలా సీతరామన్‌ వెల్లడిరచారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించి తద్వారా ?4,100 కోట్ల రూపాయలను రైతులకు ప్రయోజనం చేకూర్చమని వివరించారు. ఇక భవిష్యత్తులో పాడి పరిశ్రమకు ఇవ్వబోయే చేయూత ఇదే.. పశువుల మూతి, కాళ్లకు వచ్చే వ్యాధుల నివారణకు టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. దీని కోసం ?13,343 కోట్లు కేటాయించారు. పశు సంవర్థక రంగంలో మౌలిక సదుపాయాలకు ?15 వేల కోట్లు కేటాయించారు. పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. మత్స్యరంగానికి చేదోడుగా.. మత్స్య సంపద యోజనకు ?20 వేల కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇంకా ఆర్ధిక మంత్రి మత్స్యరంగానికి ప్రకటించిన ప్రత్యేక వెసులుబాట్లు..దేశంలో మత్స్యకార రంగంలో ఉపాధి పొందుతున్న55 లక్షల మంది. వీరందరికీ వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం. రానున్న అయిదేళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి సాధిస్తామని అంచనా. మౌలిక సదుపాయాలు, సామర్థ్యాల పెంపు ద్వారా ప్రతి ఒక్కరూ స్వావలంబన సాధించాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఫిషింగ్‌ హార్బర్‌, శీతల గోదాములు, మార్కెట్ల కోసం ?9 వేల కోట్లు కేటాయింపు. గడువు తీరిన ఆక్వా హేచరీలకు రిజిస్ట్రేషన్‌ గడువు మూడు నెలలు పొడిగింపు. రైతుల కోసం మరిన్ని.. నిన్న (మే 14) రైతులకు ఇస్తున్నాట్టు చెప్పిన ఆర్ధిక సహకారంతో పాటు ఈరోజు మరిన్ని రైతు సంక్షేమ విధానాలను ఆర్ధిక మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉత్పత్తి అయిన వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులైనా ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు రైతులకు కల్పిస్తారు. ఇంతకు ముందు ఈ విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించే ఏర్పాట్లు చేస్తారు. ు అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై పరిమితులను తొలగిస్తారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకుని వస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్‌ విధానం బలోపేతం చేస్తారు. లైసెన్స్‌ పొందిన వ్యాపారులకు రైతులు అమ్మాల్సిన అవసరం లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చు. – ప్రతి సీజన్‌కు ముందే ఏ పంట ఎంతకు కొంటారో చెప్పేలా చట్టపరమైన ఏర్పాటు చేస్తారు. మొత్తమ్మీద ప్రధాని ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. – (వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త కార్యదర్శి)-పి.అజయకుమార్‌/విక్రమ్‌ సింగ్‌