కష్టం కౌలు రైతుదే..నష్టమూ కౌలు రైతుకే

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. గతసంవత్సరం కంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి సమయానికే వచ్చాయి. కౌలురైతులు అప్పుల కోసం బ్యాంకుల వైపు చూస్తున్నారు. ఏప్రిల్‌, మే నెల నుండే భూ యజమానులు పంటరుణాలు తీసుకుపోతున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తీసుకొని పంట రుణాల కోసం బ్యాంక్‌ కు వెళితే డబల్‌ ఫైనాన్స్‌ అని, బ్యాంకు నిబంధనలు ఒప్పుకోవని, రుణాలు ఇవ్వకుండా తిరిగి పంపిస్తున్నారు. గత సంవత్సరం సైతం మెజారిటీ కౌలు రైతులకు పంట రుణాలు దక్కలేదు. దీనితో వారు అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి పంటలు పండిరచారు. రాష్ట్రంలో సాగు దారుల్లో 80 శాతం, సాగు భూమిలో 70శాతం కౌలు రైతులే పంటలు పండిస్తున్నారు. కాని ప్రభుత్వం సాగు చెయ్యని భూ యజమానులకు పంట రుణాలు ఇచ్చి కౌలు రైతులకు మొండి చేయి చూపిస్తున్నది.

పంట సాగుదారు హక్కు చట్టం (సిసి ఆర్‌సి)విషయంలో ఊహించిందే జరిగింది. నూతనచట్టం కౌలు రైతులకు మేలు చేయదు సరి కదా ఉన్న కొద్ది పాటి సౌకర్యాలను సైతం వారికి దూరం చేస్తుందన్న భయాందోళనలు ఆచరణలో నిజమయ్యాయి. సిసిఆర్‌సి వచ్చాక తొలి ఏడాదిలో కౌలు రైతులకు బ్యాంక్‌ పరపతి దారుణంగా తయారైంది. సిసిఆర్‌సిలపై బ్యాంకులు కేవలం 59వేల మంది కౌలు రైతులకు రూ. 319కోట్ల అప్పులిచ్చాయి. వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు ఇచ్చే రుణ ప్రతిపాదనలకు కత్తెర పడిరది. ప్రాధాన్యత అంతకంతకూ కుచించుకుపోతోంది. దాంతో ప్రభుత్వం సిసిఆర్‌సిలపై పంట రుణాలి ప్పించే అంశానికి స్వస్తి పలికి, ఇంతకు ముందు ఆచరణలో విఫలమైన సంయుక్త భాగస్వామ్య సంఘాల(జెఎల్‌జి)మోడల్‌ను సరికొత్తగా ఎంచు కుంది. ఆ ప్రయోగం కూడా విఫలమైందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బిసి)తాజా గణాం కాలు వెల్లడిరచాయి.
మళ్లీ జెఎల్‌జి వైపు
కౌలు రైతుల దశాబ్దాల ఆందోళనల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ అర్హత కార్డుల (ఎల్‌ఇసి) చట్టాన్ని తెచ్చింది. కొన్ని పరిమితులున్నప్పటికీ కౌలు రైతుల గుర్తింపునకుగా ఆచట్టం బాగానే ఉపయో గపడిరది. రాష్ట్రవిభజన తర్వాత ఐదేళ్లూ ఆ చట్టమే అమల్లో ఉండగా,2019 మేలో అధికారంలో కొచ్చి న వైసిసి ప్రభుత్వం, ఎల్‌ఇసి చట్టాన్ని రద్దు చేసి కొత్తగా సిసిఆర్‌సి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది కౌలు రైతులకు గతంకంటే అధికంగా మేలు చేస్తుం దని పేర్కొంది. కాగా2019 అక్టోబర్‌2 నుండి సిసిఆర్‌ కార్డుల జారీ మొదలు పెట్టగా,ఆఏడాది వాటిపై బ్యాంకులు రుణాలివ్వలేదు.2020 ఖరీఫ్‌ లో అవగాహనా సదస్సుల పేర ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిం చి ఆసంవత్సరంలో 4,87,788 మందికి కార్డులి వ్వాలనుకోగా,4,14,778 కార్డులిచ్చారు. కాగా కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు గతంలో మాదిరిగానే పలు అభ్యంతరాలు లేవనె త్తాయి. సిసిఆర్‌సిలపై బ్యాంకులతో రుణాలిప్పిం చేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, సిసిఆర్‌సి హోల్డర్లతో జెఎల్‌జి గ్రూపులను నెలకొల్పేందుకు ప్రయత్నించింది.వాటికి స్వయం సహాయక సాగు దారుల సంఘాలు (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌)అని పేరు పెట్టింది.
కోటాలో ఇతరులు
అటు సిసిఆర్‌సి ఇటు ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రెండూ కలిపినా కౌలు రైతులకు నిరుడు ఇచ్చిన రుణాలు చాలా తక్కువ. 2020-21లో బ్యాంకు లు కేవలం59,709 సిసిఆర్‌సి హోల్డర్లకు రూ. 319.68కోట్లు ఇవ్వడం గగనమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన 4,020 ‘ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌’ గ్రూపు ల్లోని 20,100 మంది రైతులకు బ్యాంకులిచ్చిన రుణం కేవలంరూ.75.16కోట్లు మాత్రమే. రాష్ట్రం లో 30లక్షలకుపైగా కౌలు రైతులున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుండగా, మొత్తమ్మీద బ్యాంకులు నిరుడు79,809 మందికి రూ.394.84కోట్లి చ్చాయి. మొదటి,రెండు సంవత్సరాల్లో ఎంత మం ది కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిందో ఇంచుమించు అదే సంఖ్యలో పంట రుణాలచ్చాయి. నిరుడు మొత్తంగా కౌలు రైతుల కోటాలో 1,90, 824 మందికి రూ.765.98 కోట్లిచ్చామంటున్నా, పాత జెఎల్‌జి, ఆర్‌ఎంజిలలో అందరూ కౌలు రైతులే లేరు. ఇచ్చామంటున్న రుణాల్లో చాలా వరకు పునరుద్ధరించిన రుణాలే. సిసిఆర్‌సి వచ్చాక కౌలు రైతులకు రుణ ప్రణాళికలో ప్రతిపాదనలు, ప్రాధాన్యత తగ్గుతోంది. అప్పటివరకు వార్షిక రుణ ప్రణాళిలో స్వల్పకాలికపంట రుణాలకు చేసిన కేటా యింపుల్లో పది శాతం కౌలు రైతులకు ఇవ్వాలని కనీసం టార్గెట్‌ అయినా ఉండేది.
పది శాతానికి తూచ్‌
2018-19లో పంట రుణాల లక్ష్యం రూ.75వేలకోట్లు కాగా కౌలు రైతులకు రూ.7,500 కోట్లివ్వాలని అధికారికంగా క్రెడిట్‌ ప్లాన్‌లో చెప్పారు. సిసిఆర్‌సి వచ్చిన2019-20లోసైతం పాత సంప్ర దాయాన్నే కొనసాగించారు. అప్పుడు ప్లాన్‌లో పంట రుణాలు రూ.84వేల కోట్లుకాగా,కౌల్దార్లకు రూ.8, 400 కోట్లు చూపించారు. 2020-21 కొచ్చేసరికి ప్లాన్‌లో పంట రుణాలటార్గెట్‌ రూ.94,629 కోట్లు కాగా కౌలు రైతులకు రూ.6,500కోట్లు మాత్ర మేనని తెలిపారు. పాత సంప్రదాయం ప్రకారమైతే పదిశాతం అంటే రూ.9,462 కోట్లు కౌలు రైతు లకు ఇవ్వాలి. పోనీ టార్గెట్‌ మేరకు ఇచ్చారా అంటే అదీ లేదు. సిసిఆర్‌సి, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌, మిగతా అన్ని పాత గ్రూపులకూ కలిపి ఇచ్చింది రూ.765 కోట్లు మాత్రమే. ప్రస్తుతం 2021-22లో పరిస్థితి మరింత దిగజారింది. వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాల లక్ష్యం రూ.1,10,422 కోట్లు కాగా రూ.4,100కోట్లనుకౌలురైతులకు ప్రతిపాదించారు. మనం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 9,35,123 మంది కౌలు రైతులకు రూ.8400 కోట్ల రుణాలు అందించాలని నిర్దేశించుకున్నారు. కాని రూ.1800కోట్లను 1,73,736 మందికి పంట రుణాలు ఇచ్చినట్లుగా 2020జనవరిలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈ అంకె ల్లో కుడా చాలా గారడీ ఉంది. ఇందు లో బినామీ ఖాతాలు కూడా ఉన్నాయి. ఇదంతా పుస్తకాల సర్దుబాటు తప్ప వాస్తవంగా రుణాలు ఇచ్చింది చాలా తక్కు వేనని బ్యాంకు అధికారులే అంటు న్నారు. రబీ ప్రారంభంలో జగన్‌ ప్రభుత్వం నూతన కౌలు రైతులచట్టం తీసుకు రావటం చేత ఏ ఒక్కరి కి కూడా పంట రుణాలు దక్కలేదు. ‘‘కౌలు రైతుల చట్టం-2011’’ కౌలు రైతులకు కొంత మేరకు అనుకూలంగా ఉంది. ఈచట్టాన్ని రద్దు చేసి ‘ఆంధ్ర ప్రదేశ్‌ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని’ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. భూ యజమాని కౌలు ఒప్పంద పత్రం రాసి ఇస్తేనే కౌలు గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. భూ యజమానులు కౌలు ఒప్పంద పత్రం రాసి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కౌలుదారులకు గుర్తింపు కార్డులు రాలేదు. దీనితో కౌలురైతుల నోట్లో మట్టి కొట్టారు. సాగు చేయ కుండా, శ్రమ చేయకుండా, పెట్టుబడి పెట్టకుండా బ్యాంకుల ద్వారా పొందిన పంట రుణాలను వడ్డీకి ఇచ్చి లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందుతు న్నారు. ఇది పెద్ద మోసం.
ఇటీవల కాలంలో ఆర్‌.బి.ఐ రూ.1. 60 లక్షలవరకు ఎటువంటి హామీ లేకుండా వ్యవ సాయ రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇటీవల నాబార్డు నూతన చైర్మన్‌ గా బాధ్యతలు చేపెట్టిన చింతల గోవిందరాజులు కిసాన్‌క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలకు ఎటువంటి వడ్డీ చెల్లించ వలసిన అవసరం లేదని ప్రకటించారు. సంయుక్త భాగస్వామి సంఘం (జె.యల్‌.జి) పేరుతో పంటరుణాలు కౌలురైతులకు ఉమ్మడి పూచీకత్తుపై ఇచ్చే పథకాన్ని అమలు చేస్తు న్నామని చెప్పారు. ఈ సంఘాల ఏర్పాటుకు, రుణా లు పంపిణీ చేసే బ్యాంకులకు ప్రత్యేకంగా ప్రోత్సా హకాలు నాబార్డు అందిస్తుందని దీని కోసం 105 బ్యాంకులతో నాబార్డు ఒప్పందం చేసుకుందని, ఈరుణాల పంపిణీ సొమ్మంతా నాబార్డు సమ కూర్చుతుందని చెప్పారు. ఇది వాస్తవమేనా? ఆంధ్ర ప్రదేశ్‌లో జె.యల్‌.జి రుణాలు ఇచ్చేటపుడు కౌలు రైతు ఏభూమి సాగు చేస్తున్నాడో పరిశీలించి భూ యజమానిఆ భూమిపై ముందుగానే పంట పేరు చెప్పి రుణం తీసుకెళితే కౌలు రైతులకు ఇవ్వటం లేదు. పంటలు పండిరచడానికి పంట రుణాలు ఇవ్వమంటే అనేక కారణాలు చెబుతారు. కొర్పొరేట్లకు, ఎగవేతదారులకు మాత్రం క్షణంలోనే ఇస్తారు. మనరాష్ట్రంలో ఆబ్సెంట్‌ ల్యాండ్‌లార్డ్స్‌ ఎక్కువ. ఆసాములు విదేశాల్లో ఉంటారు. భూము లు మన రాష్ట్రంలో ఉంటాయి. బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో దుబారులో ఉద్యోగం చేసేవారు స్థానిక బ్యాంకుల్లో పంట రుణాలు పొందుతున్నారు. ఆ భూములు సాగు చేసే కౌలు రైతులు పంట రుణా లు అడిగితే భూ యజమాని తీసుకెళ్ళాడని చెప్పారు. విచారణ జరిపితే అందరికంటే ముందే రుణాలు తీసుకొని భూ యజమాని విదేశాలకు చెక్కేశాడని తేలింది. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా వచ్చేలా చట్టాన్ని మార్చడమే పరిష్కా రం. చట్టాలు చేయడంతో పాటు కౌలు రైతులకు గ్యారంటీగా పంట రుణాలు దక్కే పద్ధతిని రూపొం దించుకుని అమలు చేయాలి. సాగు చేయని వారికి పంట రుణాలు మంజూరు చేయకూడదు. విచారణ జరప కుండా పంట రుణాలు ఇచ్చిన బ్యాంకుల పైన,రుణాలు తీసుకున్న వారి పైన క్రిమినల్‌ కేసులు పెట్టాలి. వాస్తవ సాగుదారులకు పంట రుణాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం కషి చేయాలి. ఇవన్నీ అమలు జరగాలంటే బలమైన ఉద్యమం తప్ప మరో మార్గం లేదని అనుభవం చెప్తోంది- జిఎన్‌వి సతీష్‌