మేమంటే ఇంత చులకనా?

‘‘ నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏవైనా…ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై చూపడం లేదు. ‘చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలోనే మన ప్రభుత్వం రానుంద’ని జగన్‌ ఎన్నికల ముందు మాట్లాడారు. తానొస్తే పునరావాస ప్యాకేజీ రూ.10 లక్షలి స్తామని… గతంలో ఎకరాకు రూ.1.15 నుండి రూ.1.25 లక్షలు పొందిన భూములకు కుటుం బానికి రూ.5 లక్షలిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తు తం ఆ హామీల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై పదిహేనేళ్లు కావస్తున్నా… నిర్వాసితుల పునరావాస కల్పన చూస్తే ఆశ్చర్యం గానూ, నిరాశాజనకంగానూ వుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేవలం 9 గ్రామాల్లోని 3300 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పిం చింది. ఇది కేవలం 3 శాతం మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వాలకు ప్రాజెక్టు నిర్మాణంపై వున్న శ్రద్ధ పునరావాసంపై లేదనే వెల్లడౌతున్నది.’’

పోలవరంప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 222గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా. ఈ క్రమం లో రెండు లక్షలమంది ప్రజలు నిర్వాసితులు కావొ చ్చు.నిర్వాసితులయ్యే వారిలో అధికశాతం మంది ఆదివాసులే. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు మొదలు పెట్టాక ఇప్పటికి ముంపు ప్రాంతంలోని 3,446 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. వీరినిందరికీ 2010`2011లో సర్వే చేసి అప్పటి భూసేకరణచట్టం కింద పునరావాసం అర కొరగా కల్పించారు. ప్రభుత్వం కల్పించే పునరా వాసం నేటికీ ఆదివాసీలకు సంపూర్ణంగా కల్పిం చలేదు. దీంతో వారంతా ఆందోళనలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసి తులపై చూపడం లేదు.‘చంద్రబాబు ప్రభు త్వం నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలోనే మన ప్రభుత్వం రానుం ద’ని జగన్‌ ఎన్నికల ముందు మాట్లాడారు. తానొస్తే పునరావాస ప్యాకేజీ రూ.10లక్షలిస్తామని.. గతంలో ఎకరాకురూ.1.15నుండి రూ.1.25 లక్షలు పొందిన భూములకు కుటుంబానికి రూ.5 లక్షలిస్తామని హామీఇచ్చారు. ప్రస్తుతం ఆహా మీల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారం భమై పదిహేనేళ్లు కావస్తున్నా…నిర్వాసితుల పునరా వాస కల్పన చూస్తే ఆశ్చర్యంగానూ,నిరాశాజన కంగానూ వుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేవ లం 9గ్రామాల్లోని 3300కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించింది. ఇది కేవలం 3శాతం మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వాలకు ప్రాజెక్టు నిర్మాణంపై వున్న శ్రద్ధ పునరా వాసంపై లేదనే వెల్లడౌతున్నది.

ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇదీ:
ప్రభుత్వం షెడ్యూల్‌ తెగలకు 5 ఎకరా ల వరకు భూ పరిహారం,5ఎకరాల పైనున్న భూమి కి నగదు రూపంలో పరిహారం. ఇతరులకు సాగు లో లేని భూమికి రూ.1.15 లక్షలు,సేద్యపు భూమికి రూ.1.30 లక్షలు.అదే విధంగా18 సంవత్సరాలు పైబడిన ప్రతిగిరిజన కుటుంబ సభ్యుడికి రూ.1. 7లక్షలు,గిరిజనేతర కుటుంబ సభ్యుడికి: రూ.1. 5లక్షలు నగదు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది.
భూమి లేదు ఇల్లు లేదు
అయితే అందులో ప్రతిగ్రామంలో కనీ సం పదికుటుంబాలకైనా ఇస్తామన్న భూమి లేదా ఇల్లురాలేదన్నది గ్రామస్థుల ఆరోపణ. పోల వరం మండలం చేగుంటపల్లి గ్రామానికి చెందిన రమణ అనే మహిళనిర్వాసితులైన మొత్తం 47,000 మంది ఆదివాసులలో ఒకరు. మూడుఎకరాల భూమి వదులుకొని జీవనాధారమైన అడవినీ,పుట్టిన ఊరు వదిలి వచ్చేశారు.ఇప్పటికి ఏడేళ్లు అవుతున్నా రావాల్సిన భూమి ఇంకా రాలేదుఅని ఆమె చెబు తున్నారు.‘‘ఊరు ఖాళీచేసి వచ్చినప్పటి నుంచి నా భర్తకు, పిల్లలకు తెలియకుండా ఏడ్చేదాన్ని. పొలం లేకుండా ఏంతింటాము? ఎలా బతుకుతాం? అన్న బాధ కలిచేస్తోంది. పాతఊర్లో చచ్చిపోయినా బాగుండేది’’ అని రమణ వాపోయారు . అదే ఊరికి చెందిన గీతాంజలి మరో ఆదివాసీ మహిళ మాట్లాడుతూ తమకు కట్టించి ఇస్తామన్న ఇల్లు ఇంకా కట్టించి ఇవ్వలేదు. అద్దె కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదు అని ఆమె చెప్పారు.ఈఒక్క గ్రామమే కాదు పక్క గ్రామాలలో కూడా ఇటువంటి సమస్యలే ఉన్నాయి.
అడవే ఆధారం
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులంతా ముఖ్యంగా అడవి పైనే ఆధార పడి జీవిస్తారు.పుల్లలు ఏరుకోవటం, ఈత కళ్ళు గీసేపని,కుంకుడు కాయలు,తేనే వంటి అటవీ ఉత్పత్తులను సేకరిస్తారు. ఇపుడు అమాం తంగా తీసుకొచ్చి అడవికి దూరంగా కాలనీలు కట్టించినా సుఖం లేదని అంటున్నారు. ప్రాజెక్టుతో నాలాంటి రైతులకు ఏం ఉపయోగమని నర్సిం హులు అనే నిర్వాసితుడు ప్రశ్నిస్తున్నారు
అన్నీ ఇచ్చాం
అధికారులు మాత్రం అన్ని సక్రమంగా చేసేశాము అని అంటున్నారు.‘‘ఏదోఒకటో రెండో కుటుంబాలు మిగిలి పోయి ఉంటాయి. కానీ వీలైనంత వరకు అందరికి ఇవ్వవలసిన పునరావాసం కల్పించాం. మిగిలిన వాళ్లవి కూడా చూస్తాము’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నత అధికారి అన్నారు. కానీ పొలం పనులు చేసి జీవనోపాధి సాగించుకునే రైతులు ఇప్పుడు కూలీలుగా మారారు. రామ య్యపేటకు చెందిన రైతు నర్సింహులు ప్రాజెక్టు సైట్‌లో సిమెంట్‌ పనిలో చేరారు. ‘‘నాగలి పట్టి పొలం దున్నిన చేతులు ఇవి. ప్రాజెక్టు వస్తే నా లాంటి రైతులకి ఏంటి ఉపయోగం? డబ్బులు ఇచ్చారు. కానీ ఐదుగురు ఉన్న కుటుంబానికి జీవి తాంతం ఇవి సరిపోతాయా?’’ అని ప్రశ్నించారు. పోలవరం మండలంలోని వాయువ్య గోదావరి నదీ తీరంలో మొత్తం 15వేల జనాభా ఉన్న 22 గ్రామాలు మరియు కుగ్రామాలలో ఉన్న ప్రజలు కూడా చివరికి స్థానభ్రంశం చెందారు. గోదావరి ఒడ్డున నివాసముంటున్న 462 గ్రామాలు అంతరిం చిపోయే ప్రమాదం వచ్చింది. ఈగ్రామాల్లో కోయా మరియు కొండారెడ్డి ఆదివాసీ వర్గాలకు నిలయంగా ఉన్నాయి. ఈగ్రామాలన్నీ రాజ్యాంగం లోని ఐదవ షెడ్యూల్‌ క్రిందకు వస్తాయి, ఇది ప్రధానంగా గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలకు వారి భూమి, అడవులు,నీరు,వనరులు,సంస్కృతిని కాపాడటానికి ప్రత్యేక హక్కులను ఉల్లంఘన జరుగుతోంది. పర్యావరణ మంత్రిత్వశాఖ నుండి సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టంప్రకారం పొందిన పత్రాల ప్రకారం10,000ఎకరాల అటవీ భూము లు,121, 975 ఎకరాల అటవీభూముల నుండి 300లక్షల మందికిపైగా ప్రజలు నిరాశ్రయుల వుతున్నారు. కాలువలు,పంపిణీదారులు,టౌన్‌షిప్‌లు మరియు ‘గ్రీన్‌ బెల్ట్‌’ కోసం మరో 75,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. స్థానభ్రంశం ఎంత ఉన్నప్పటికీ,చట్టం అమలు కావడం లేదని గ్రామ స్తులు అంటున్నారు.కాబట్టి శ్రీదేవితో సహా పది కుటుంబాలు పైడిపాక నుండి వెళ్లడానికి నిరాక రించాయి. చట్టం యొక్క ప్రత్యేక నిబంధన- దళితు లకు బలవంతంగా బయటకు పంపబడితే వారికి భూమి ఇవ్వాలి-దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది. కొన్ని కుటుంబాలు మాత్రమే వెనుక బడి పోరాటం కొనసాగిస్తున్నప్పటికీ, తరలి వచ్చిన మరికొందరు కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.ప్రొలవరం ప్రాజెక్టు నిర్వాసితుల దీన గాథ లు ఇంకా ఎన్నో ఉన్నాయి. శతబ్దాల నుంచి నివాస ముంటున్న ఇళ్లను,స్థిరాస్తులను వదిలేసి పరాయి పంచకు బలవంతంగా పింపిస్టుంటే వారి మనోవేద నలు వినేనాధుడు కరవయ్యారు. కనీసం నిర్వాసితు లకు ప్రభుత్వం ప్రకటించి ఇచ్చిన హామీలను నెరవేర లేదు.గిరిజనులకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్బంధంగా గ్రామాలను ఖాళీ చేయిస్తుంది.
భూమి లేకుండా ఏం తింటాం?
ఎలా బతుకుతాం?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారం భమై పదిహేనేళ్లు కావస్తున్నా…నిర్వాసితుల పునరా వాస కల్పన చూస్తే ఆశ్చర్యంగానూ,నిరాశాజనకం గానూ వుంది. ప్రభుత్వ లెక్కలప్రకారమే కేవలం 9గ్రామాల్లోని 3300కుటుంబాలకు మాత్రమే పున రావాసం కల్పించింది. ఇది కేవలం3శాతం మాత్ర మే. దీన్నిబట్టి ప్రభుత్వాలకు ప్రాజెక్టు నిర్మాణంపై వున్న శ్రద్ధ పునరావాసంపై లేదనే వెల్లడౌతున్నది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణమైతే పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరంతోపాటు కుకు నూరు, వేలేరుపాడు మండలాలు,తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నంతో పాటు వి.ఆర్‌పురం,చిం తూరు, కూనవరం మండలాలు ముంపుకు గురి కానున్నాయి. వీటిలో పోలవరం, దేవీపట్నం తప్ప మిగిలినవి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రాలో విలీనమైనవే. ఈమండలాల్లో 275 గ్రామాలు,1.07లక్షల కుటుంబాలు,1.36 లక్షల ఎకరాలు మునగనున్నాయి. పోలవరం మండలం లోని 8 గ్రామాల వారికి పునరావాసం కల్పించారు. ఈ గ్రామాలు ప్రాజెక్టునిర్మాణ ప్రాంతగ్రామాలే. తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం అంగ లూరు గ్రామానికి పునరావాసం కల్పించారు. కల్పించారనేకంటే జలవిద్యుత్‌ ప్రాజెక్టు కోసం బలవంతంగా రాత్రికి రాత్రే తొలగించారు. కాపర్‌ డ్యాం నిర్మాణంలో మూడేళ్ళుగా60గ్రామాలు వరద ముంపునకు గురౌతున్నాయి. కొద్దిపాటి వర్షా నికే ఈ పరిస్థితి దాపురించింది. దీంతో 41.15 కాంటూరు పరిధిలోకి వచ్చే 90గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం హడావుడి పడ్తోంది. ఈ గ్రామాలను ఖాళీచేయిస్తేనేగాని ప్రాజెక్టు నిర్మా ణం పూర్తికాదు. లేదంటే స్పిల్‌వే తలుపులు బిగిం చాక బ్యాక్‌వాటర్‌ నిలిచిపోయి ఆగ్రామాలు శాశ్వ తంగా మునిగిపోతాయి. అందుకే ఈ గ్రామాలను ఖాళీ చేయించేందుకు తొందరపడ్తోంది. 45 కాం టూరు పరిధిలోకి వచ్చే గ్రామాలకు చెందిన కుటుం బాలకు పునరావాసం కల్పించే సంగతి తర్వాత చూద్దామన్న వైఖరిలో ఉంది.
అయితే మొదట్లో పునరావస కల్పన తీరు చూసిన నిర్వాసితులు చిగురుటాకులా వణికిపోతు న్నారు.నాడు పునరావసం అరకొరగానే కల్పించారు. దళారులతో నమ్మబలికించి ప్రలోభాలతో తరలిం చారు.నాటి ప్రభుత్వాన్ని, అధికారుల్ని నమ్మి మోస పోయామని తెల్సుకున్నారు. నేటికీ చాలామంది యువతీయువకులకు 18 ఏళ్ళు నిండిన వారికిచ్చే ప్యాకేజీ అందలేదు. గిరిజనుల ప్రధాన ఆస్తి అయిన పోడు భూములకు పట్టాల్లేవనే సాకుతో ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. నిర్వాసిత కాలనీ భవనాల నిర్మాణం నాసిరకంగా వుండడంతో ఇళ్ళలో వర్షపు నీళ్ళు కారిపోతున్నాయి. మిగిలిన వసతుల సంగ తెలా ఉన్నా శ్మశానవాటిక లేనందున…మృతులకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు చేసేందుకు వారు పడ్డ యాతన వర్ణనాతీతం.షెడ్యూల్‌ ప్రాంతం లోని గిరిజనులకు షెడ్యూల్‌ ప్రాంతంలోనే పునరా వాసం కల్పించాలి. కానీ చట్టవిరుద్ధంగా షెడ్యూల్‌ ప్రాంతమైన దేవరగొంది గిరిజనుల్ని నాన్‌షెడ్యూల్‌ ప్రాంతమైన పోలవరం తాలూకా ఆఫీస్‌ వద్ద పునరావాసం కల్పించారు. అప్పటి జిల్లా కలెక్టర్‌ గిరిజనుల్ని నమ్మబలికి తరలించారు. షెడ్యూల్‌ ప్రాంతంగా గుర్తిస్తామని హామీఇచ్చారు. అది జరిగే పనికాదని కొంతకాలానికే వారికి అర్థమైంది. గిరి జనులకు భూమికి భూమిగా ఇచ్చిన భూములు పలు గ్రామాల్లో నేటికీ వివాదాల్లోనే ఉన్నాయి.
వీటన్నింటికీ మించి పునరావాస ప్రాంతంలో ఉపాధి ప్రశ్నార్ధకమైంది. ఓపక్క వ్యవసాయపు పనులు క్రమీణా తగ్గిపోతున్నాయి. ఈ ప్రాంతంలో చెప్పుకోదగ్గ వ్యవసాయేతర పనులూ లేవు. స్థాని కులకూ ఇదే పరిస్థితి. నిర్వాసితులూ ఉపాధి దొరక్క అల్లాడుతున్నారు. దీంతోపాటు స్థానికులు తమకున్న కొద్దిపాటి ఉపాధికి నిర్వాసితులు కారణమని భావి స్తుండడంతో సుహృద్భావ వాతావరణం దెబ్బ తిం టోంది. కేవలం 9 గ్రామాల ప్రజలకు పునరావాస కల్పన ఇలా ఉంటే రేపు తమ పరిస్థితి ఏమిటని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. వీటిపై తొలి దశ నిర్వాసితులు రోడ్డెక్కి దీక్షలు, ప్రాజెక్టు పనులఅడ్డగింతతో స్వల్పంగా పరిష్కారమయ్యాయి. ప్రస్తుతం పునరావాస కల్పన తీరు గతం కంటే మెరుగ్గా గానీ నిర్వాసితులకు విశ్వాసం కల్పించేలా గానీ లేదు. పోలవరం,వేలేరుపాడు మండల్లా లోని గిరిజన నిర్వాసితులకు…బుచ్చాయిగూడెం,జీలు గుమిల్లి మండల్లాల్లోను, కుకునూరు మండలం లోని గిరిజనులకు ఆమండలంలోనే ముంపులో లేని (అని ప్రభుత్వం చెబుతోంది) గ్రామాల్లో పునరా వాసం కల్పిస్తున్నారు. మూడు మండల్లాలోని గిరిజ నేతరులకు జంగారెడ్డి గూడెం మండలం చల్లావారి గూడెంలో మెగా కాలనీ నిర్మించనున్నారు. భూమికి భూమిగా సేకరణ గతంలానే సాగుతోంది. మూ డేళ్ళుగా ప్యాకేజీ రేపోమాపో వచ్చేస్తుందని, కాలనీ లకు తరలించేస్తారంటూ హడావుడి సాగుతూనే ఉంది.కానీ కాలనీలనిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లుంది. మొత్తం నిర్వాసితుల కాలనీల నిర్మాణం మాటెలాఉన్నా 41.15 కాంటూరు పరిధి లోని నిర్వాసితులకాలనీలనిర్మాణంకొలిక్కి రాలేదు. గిరిజనుల కాలనీల్లో కొన్ని ఇళ్ళ నిర్మాణం పూర్తైనా రోడ్లు,మంచి నీళ్ళు,విద్యుత్‌వంటి మౌలిక సదు పాయాల జాడలేదు. గిరిజనేతరుల కాలనీల్లో ఇంకా పునాది దశలోనే వందల ఇళ్ళు దర్శనమిస్తు న్నాయి. భూసేకరణ చట్టం-2013 ప్రకారం రోడ్డు, మంచి నీళ్ళు,విద్యుత్‌,గుడి,బడి,శ్మశానం,పశువుల దొడ్లు వంటి 39సౌకర్యాలు కల్పించాల్సి వుంది. సమగ్ర నిర్మాణం సందేహమే. జీఓనెం 641 ప్రకా రం గిరిజనుల ఇళ్ళకు రూ.4.55 లక్షలు కేటాయిం చాలి. అయితే ప్రభుత్వం రూ.2.84లక్షలతో సరి పెడుతున్నది. ఫలితంగా ఇళ్ళనిర్మాణ నాణ్యత ప్రశ్నార్థకంగా ఉంది.
పునరావాస ప్యాకేజీ 9గ్రామాలకు మినహా ఏ ఒక్క నిర్వాసితునికి అందలేదు. చట్ట ప్రకారం రూ.9.50లక్షలివ్వాలి. జగన్‌ఎన్నికల హామీగా రూ. 10లక్షలిస్తామన్నారు. అయితే ఇటీవల నిర్వాసితు లు ఖాళీ చేసేటప్పుడు రూ.6.50లక్షలిస్తా మని, మిగిలినది కాలనీలకు వెళ్ళాక ఇస్తామని ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్రత్యేకాధికారి పత్రికలకు తెల్పారు. గతం లోనూ నిర్వాసితులకు ఇలాఇచ్చిన వాగ్ధానం అమలు కాలేదు. ఇప్పుడు అలాగే అవుతుందే మోనన్న అను మానాలు తలెత్తుతున్నాయి. ఇకలబ్ధిదారుల జాబితా పై గందరగోళం సాగుతోంది.2016-17లో అర్హు ల జాబితాతయారు చేశారు. ఇందులో తమ పేర్లు లేవని వందలాది దరఖాస్తులువచ్చాయి. తన వాట్సాప్‌కు తెలపాలని నాటి పి.ఓబహిరంగ ప్రకటనచేశారు. దీంతో రాజకీయ, వ్యక్తిగత విభేదా లతో అర్హుల పేర్లను అధికారులకు అందించారన్న విమర్శలున్నాయి.వీటికితోడు దళా రుల జోక్యంతో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకా రంతో వేల రూపాయల లంచాలతో నకిలీ రేషన్‌, ఆధార్‌ కార్డులు పుట్టించారు. వారు కూడా అర్హుల జాబితాలో చేరిపోయారు. జాబితాలో గందర గోళానికి తెరవేయాలని నిర్వాసితులు కోరుతూనే ఉన్నారు. కుకునూరు,వేలేరుపాడు మండ ల్లాల్లో ఎఫ్‌.ఆర్‌.ఎల్‌ (వరద నీటి మట్టం) గుర్తింపు కూడా అసంబద్ధంగా ఉందంటున్నారు. ఇవే ఆరోప ణలు తూర్పు గోదావరి జిల్లా మండలాల్లోనూ ఉన్నాయి. 1986 వరదల్లోనూ,తర్వాత వచ్చిన అన్ని వరద ల్లోనూ ఇళ్ళు,పొలాలు మునిగినా ఎఫ్‌. ఆర్‌. ఎల్‌ పరిధిలోకి రాకపోవడమేమిటో అర్థంకావడం లేదు. దీంతో ప్రతీసారీ వరదల్లో చిక్కుకునే వ్యవ సాయపు భూములు,వందలాది ఎకరాలు పరిహారా నికి నోచు కోవడంలేదు. కుకునూరుమండలం గొమ్ము గూడెంలో గోదావరికి చేర్చివున్న పొలాలను సైతం ముంపు ప్రాంతంగా గుర్తించలేదు. కొన్ని గ్రామా లను ముంపుగాగుర్తించారు. కానీ ఆ గ్రామాల్లోని పొలాలను గుర్తించలేదు. మరికొన్ని చోట్ల పొలాలు గుర్తిస్తే గ్రామాన్ని ముంపుగా గుర్తించలేదు. ఈ సమస్య పోలవరం మండలం తప్ప అన్ని మండ లాల్లో ఉంది. అందుకే మండలాన్ని యూనిట్‌గా గుర్తిస్తే ఈసమస్య పరిష్కారం అవుతుంది. పద్దెనిమిదేళ్ళు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చేందుకు 2017ను నిర్ణీత కాలంగా గుర్తించారు. కానీ 2017నాటికి పునరావాసం కల్పించలేదు. 2021 లో ఖాళీ చేయాలని సన్నాహాలు చేస్తున్నందున ఖాళీ చేయించే నాటికి 18 సంవత్సరాల యువతీ, యువకులందరికీ వర్తింప చేయాలంటున్నారు. పశ్చి మ గోదావరి జిల్లాలోవున్న ఈసమస్యలన్నీ.. రెట్టిం పు గ్రామాలు,నిర్వాసిత కుటుంబాలున్న తూర్పు గోదావరి జిల్లాలో రెట్టింపుస్థాయిలో ఉన్నాయి. నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభు త్వాలు ఏవైనా ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై చూపడంలేదు.‘చంద్రబాబు ప్రభు త్వం నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలోనే మన ప్రభుత్వం రానుం ద’ని జగన్‌ ఎన్నికల ముందు మాట్లాడారు. తానొస్తే పునరావాస ప్యాకేజీ రూ.10లక్షలిస్తా మని…గతంలోఎకరాకు రూ.1.15 నుండి రూ.1. 25లక్షలు పొందిన భూములకు కుటుంబానికి రూ.5 లక్షలిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ హామీల ఊసే లేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డాక కేంద్ర ప్రభుత్వంపైనే ప్రధాన బాధ్యత ఉంటుంది. కానీ నేటికీ ప్రాజెక్టు అంచనా వ్యయంపై కేంద్రం గందరగోళం కొనసాగిస్తోంది. పైగా, పునరావాసం బాధ్యత తనదికాదని నిండు పార్లమెంట్‌లో మంత్రి తోమర్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో 70శాతం నిధులకు తనకు సంబంధం లేదనడం ఓఎత్తైతే …ప్రాజెక్టు పునాదులైన నిర్వాసి తుల్ని విస్మరించడం మరోఎత్తు. నిర్వాసితుల్లో అత్య ధికులైన గిరిజనులపట్ల వ్యవహరించే తీరుకు ఇది అద్దం పడుతుంది. తమ త్యాగాలను విస్మరించి తమ పునరావాసంపట్ల పాలకులు వహిస్తున్న నిర్లక్ష్యంపై నిర్వాసితుల ఆగ్రహం న్యాయమైనది. పునరావాసం భిక్ష కాదు. వారి న్యాయమైన హక్కు. సమగ్ర ప్యాకేజీకి పోరాటమే మార్గం. వీరికి అండ గా నిలవడం రాష్ట్ర ప్రజల బాధ్యత.
పరిహారమిచ్చాకే ప్రాజెక్టు కట్టుకోండి’
2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈప్రాజెక్టు కింద భూములు కోల్పో యే రైతులకు పెద్దఎత్తున పరిహారం చెల్లిస్తా మని చెప్పి.. ఎకరాకు రూ.లక్షా 15 వేల నుంచి లక్షా 45వేల వరకూ చెల్లించారు. 2019 ఎన్నికలకు ముందు నాటి విపక్షనేత, ప్రస్తుత సీఎం జగన్మో హన్‌రెడ్డి నిర్వాసితులకు అనేక వరాలిచ్చారు. తాను గద్దెనెక్కితే ఎకరాకు రూ.5లక్షలు పరిహారంగా ఇస్తానని పదేపదే చెప్పారు. అలాగే వ్యక్తిగత పరి హారం కింద రూ.పదిలక్షలు చెల్లిస్తానన్నారు. స్థానిక వైసీపీ నేతలు కూడా ఊరూరా ఆయన హామీలను ప్రచారం చేశారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు గానీ.. ఇచ్చిన హామీలు మాత్రం ఆచర ణలోకి రాలేదు. తమకు ఆశ చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందారని.. అధికారం లోకి వచ్చాక నోరు మెదపడం లేదని నిర్వాసితులు ఆగ్రహంతో ఉన్నారు. ఇదెక్కడి న్యాయమని నిలదీ స్తున్నారు. వాస్త వానికి ప్రాజెక్టు ద్వారా సర్వం కోల్పో తున్న కుటుం బాలకు వ్యక్తిగత పరిహారాన్ని గతంలోనే నిర్దేశిం చారు. భూములు కోల్పోయిన గిరిజనులకు ఒక్కో కుటుంబానికి రూ.5.85లక్షలు, గిరిజనేత రులకు 5.35లక్షల చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. వాటి కోసం పదేపదే నిర్వాసితులు రోడ్డెక్కు తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం నిర్వాసి తుల జాబితాలను కూడా బహిర్గతం చేయడం లేదు. అధికారులు ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్ల బుచ్చుతున్నారు. ప్రాజెక్టు కోసం సర్వంత్యాగం చేసిన తామంటే ఇంత చులక నా అని ప్రశ్నిస్తున్నారు. తమకు పరిహారం చెల్లించాకే ప్రాజెక్టుకట్టుకోవాలని తేల్చిచెబుతున్నారు. వీరికి గిరిజనసంఘాలు, స్వచ్ఛం ద సంస్థలు బాసటగా నిలిచాయి. ప్రభుత్వం మాత్రం ఈవిష యంలో నోరు మెదపడంలేదు. సంబంధిత అధికారులు సైతం పరి హారం సంగతి ప్రస్తావించడానికి సిద్ధపడడం లేదు.- సైమన్‌ గునపర్తి