కష్టం కన్పించింది..కలెక్టర్ మనసు కదిలింది
పిలవలేదు.. అయినా పలకరించారు.గోడు చెప్పకముందే గమ నించి… బాధను అర్థం చేసుకున్నారు.అధికారి కాదు.. ఆపన్న హస్తమయ్యారు!..విశాఖ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కంటపడిన కష్టం..క్షణాల్లో కదిలిన మానవత్వం చాటుకున్నారు. దిక్కుతోచని తల్లిదండ్రులకు..కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ భరోసాగా నిలిచారు. ఆ ఉన్నతాధికారి కరుణా కటాక్షంతో..ఆ కుటుంబానికి ఆశ చిగురించింది!. అధికారం అంటే ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు..ఆపదలో ఉన్నవారి వద్దకు వెళ్లి వారి గోడు వినడమూ మానవత్వమేనని కలెక్టర్ చూపిన ఈ స్పందన పలువురి ప్రశంసలు అందుకుంది.
విశాఖ జిల్లా కలెక్టర్ మెట్లు ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో కనిపించిన ఆదివ్యాంగుడిని చూసి ఆగిన కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్..ఆప్యాయంగా పలకరించివారి సమస్యను ఆసక్తిగా విన్నారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఆగష్టు 24న ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పీజీఆరఎస్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్..తన వాహనం దిగి కార్యాల యానికి వెళ్తున్నారు. అదే సమయంలో రెడ్‌క్రాస్ వాలంటీర్ సహాయంతో లిఫ్ట్ వైపు వెళ్తున్న ఓదివ్యాంగుడు ఆయన కంట పడ్డాడు. వెంటనే అక్కడే ఆగి అతడి వద్దకు వెళ్లిన కలెక్టర్..ఏమైంది..మీ సమస్య ఏమి టి?”.. అంటూ ఆప్యాయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రూ.6 వేల పింఛన్‌తో ఇబ్బందులు..
భీమిలి మండలం చిప్పాడ గ్రామానికి చెందిన జి.రాంబాబు మానసిక దివ్యాం గుడు. ప్రస్తుతం వికలాంగుల కోటాలో నెలకు రూ.6 వేల పింఛన్ అందుతోంది. రాంబాబు తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమా రుడి పోషణకు ప్రస్తుత ఆర్థిక సాయం సరిపోవడం లేదని, బెడ్‌రిడెన్ కేటగిరీలో రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు. వారి సమస్యను సానుకూలంగా విన్న కలెక్టర్..సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా “ఇకపై రాంబాబును ఇక్కడికి తీసుకురావద్దు..కష్ట పెట్టొద్దు. మీ ఇంటికే అధికారులు వస్తారు” అని తల్లిదం డ్రులకు భరోసా కల్పించారు.మా దగ్గరకే వచ్చి గోడు విన్నారు’ సమస్యను చెప్పేందుకు కలెక్టర్‌ను ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేకుండానే..ఆయనే తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించి గోడు విన్నా రని రాంబాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే స్పందించిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.- జి ఎస్ సునీల్ కుమార్
