చూసి కూడా చదవలేకపోతున్న పిల్లలు

పిల్లలకు చదవడం రావట్లేదు, చిన్న పాటి లెక్కలూ చేయట్లేదు. చివరికి మాతృ భాష లోని అక్షరాలనూ గుర్తించటం లేదు. ఇక.. తీసి వేతలు, భాగాహారాల గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే..అంత మంచిది. అంకెలు తెలి యని వాళ్లు కూడా తక్కువేమీ లేరు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా..ప్రతి క్లాస్‌లో ఇలాంటి పిల్లలు ఉన్నారని.. అసర్‌ రిపోర్ట్‌ తేల్చింది. దీంతో.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అంటూ ప్రభు త్వాలు చేస్తున్న ప్రచారమంతా ఉత్తిదేనని తేలి పోయింది. ప్రాథమిక విద్యా ప్రమాణాలు ఇంత దారుణంగా పడిపోవటానికి కారణమేంటి?
దేశంలో..ఈమూల నుంచి ఆ మూలదాకా..ఏప్రభుత్వ పాఠశాలను తీసు కున్నా..ఇదే పరిస్థితులుఉన్నట్లు తేల్చింది అసర్‌ రిపోర్ట్‌. అక్కడో..ఇక్కడో ఎందుకు..మన తెలు గు విద్యార్థుల గురించే తెలుసు కుందాం. అందరి మాతృభాష తెలుగే అయినా.. కొంద రికి తెలుగు చదవడమే రావట్లేదు. ఇంకొం దరు..తెలుగు అక్షరాలను కూడా గుర్తు పట్టడం లేదు. పోనీ.. ఇంగ్లీషే మైనా ఇరగదీస్తున్నారా? అంటే..అదీ లేదు. తెలుగు చదవడంలో.. రెండురాష్ట్రాల విద్యా ర్థులు కొంత వెనుకబడి నట్లు తెలుస్తోంది. ప్రముఖ రీసెర్చ్‌ ఆర్గనై జేషన్‌..యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌..అసర్‌ రిలీజ్‌ చేసిన రిపోర్టులో..ఈ విష యాలు బయటపడ్డాయి. ఆ సర్వే ప్రకారం.. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా చాలా మంది పిల్లలు..చదువులో బాగా వెనుకబడి పోయినట్లు తేలింది. దాదాపు ప్రతి తరగతిలోనూ తెలుగు కంటే ఇంగ్లీషులో విద్యార్థులు కొంత మెరుగ్గా ఉన్నారు.మూడో తరగతి స్టూడెంట్స్‌ విషయానికొస్తే..అక్షరాలు చదవగలుగుతున్నా.. పదాలు చదవలేకపోతున్నారు. పదాలు చదివే వాళ్లు..ఒక మోస్తరు వాక్యాలను, పేరాలను చద వలేని స్థితిలో ఉన్నారు. ఇక.. గణితం విషయాని కొస్తే.. మూడో తరగతి విద్యార్థు ల్లో చాలా మందికి అంకెలు కూడా గుర్తించలేక పోతున్నారు.99 దాకా అంకెలే తెలియడం లేదు. సగానికి సగం పిల్లలు.. తీసివేతలు చేయలేకపోతున్నారు.మెజారిటీ విద్యా ర్థులకు భాగాహారాలు ఎలా చేయాలో కూడా తెలి యడం లేదని.. అసర్‌ రిపోర్ట్‌ తేల్చింది. చివరికి.. ఎనిమిదో తరగతిలోనూ..అంకెలు గుర్తించలేని విద్యార్థులున్నారు.ఇంగ్లీషుపదాలుచదవలేక పోతున్న విద్యార్థులశాతం కూడా భారీగానే ఉంది. సులభ మైన పదాలు గుర్తించడంలోనూ పిల్లలు బాగా వెనుకబడిపోయారు.ఈజీ వర్డ్స్‌తెలిసినా.. సులభ మైన వాక్యాలు తెలియని పిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు. దీంతో.. ప్రభుత్వ పాఠశా లల్లో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం..కొన్ని పాఠశాలలకే పరిమి తమైందని అర్థమవుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని.. ప్రభు త్వాలు చెబుతున్నా.. చాలా మంది ప్రైవేటుగా ట్యూషన్లకు వెళ్తున్నారని తేల్చింది అసర్‌ రిపోర్ట్‌. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా..కనీసం 15 శాతం మంది విద్యార్థులు డబ్బులు చెల్లించి ట్యూషన్లలో పాఠాలు చెప్పించుకుంటున్నారు. ఓవరాల్‌గా.. దేశం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో..30శాతానికి పైగా ప్రైవేట్‌ ట్యూష న్లు చెప్పించుకుంటున్నారని తేల్చారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం.. 2018తో పోల్చుకుంటే 2022లో దారుణంగా పడిపోయింది. దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లో 7లక్షల మంది విద్యార్థులతో సర్వే నిర్వహిం చారు.దాని ప్రకారం.. మూడో తరగతి విద్యా ర్థులు..రెండో తరగతి పాఠాలను తప్పుల్లే కుండా చదవగలిగే వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు తేల్చారు.5,8వ తరగతి విద్యార్థులు కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. మ్యాథ్స్‌ లోనూ చాలా మంది విద్యార్థులు వెనుకబడిపోయా రని తేలింది. సక్రమంగా లెక్కలు చేసే స్టూడెంట్స్‌.. ప్రతి క్లాసులో చాలా తక్కువగా ఉన్నారు. 2012, 2014,2016లో నిర్వహించిన సర్వేలతో పోలిస్తే.. గతేడాది చేసిన సర్వేలో..విద్యార్థులఅభ్యసన ప్రమా ణాలు బాగా పడిపోయాయ్‌. ప్రతిరోజూ పాఠ శాలలకు హాజరైన వారి సంఖ్య కూడా 72 శాతమే. నాలుగో వంతు మంది విద్యార్థులు.. ఏదో ఒక కారణంతో..స్కూళ్లకు వెళ్లడం లేదు. అయితే.. హాజరుశాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక..అతిచిన్న ఇంగ్లీష్‌ వాక్యాలను కూడా విద్యా ర్థులు చదవలేకపోతున్నట్లు సర్వేలో తేలిం ది.ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో..వేర్‌ ఈజ్‌ యువర్‌ హౌజ్‌,ఐ లైక్‌ టు ప్లే లాంటి వాక్యాలను చదివి.. అర్థం చెప్పలేని వారు 37శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 14శాతం బడుల్లో తాగునీటి సౌకర్యం లేదని, 20 శాతం పాఠశాలల్లో సదుపాయం ఉన్నా తాగునీరు లేదని అసర్‌ నివేదిక తెలిపింది. పద్నాలుగున్నరశాతం పాఠశాల్లో మరుగుదొడ్లు ఉన్నా..అవి నిరుపయోగంగా ఉన్నా యని తెలిపింది.20శాతం పాఠశాలల్లో లైబ్రరీ లు లేవని, 76శాతం స్కూళ్లలో కంప్యూటర్లు లేవని.. 19 శాతం బడుల్లో పీఈటీలు లేరని అసర్‌ నివేదిక వివరించింది.
ఉపాధ్యాయులు లేకుండా నాణ్యమైన విద్య ఎలా ?
విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్ధాయి కంటే మెరుగ్గా ఉన్నట్లు ఇటీవల విడుదలైన ‘అసర్‌ నివేదిక-2022’ తెలియజేసింది. పూర్వ ప్రాథమిక స్కూళ్లలో జాతీయ సగటుకు మించి ఎ.పిలో చిన్నారుల చేరిక వుండటం,బాలికల డ్రాపౌట్లు అతి తక్కువగా ఉండటం,ఆంగ్లం సామర్థ్యంలో జాతీయ సగటుకు మించి ఫలితాలుండడం మనం గమనించవచ్చు. జాతీయ సగటును మించి వున్నాం కదా అని సంతోషించేలోగా…ప్రైవేటు ట్యూషన్లకు డిమాండ్‌ పెరగడం కూడా నివేదికలో కన్పిస్తుంది. పైగా అభ్యసనా సామర్ధ్యం తీవ్రంగా ప్రభావిత మైందని ఈ నివేదిక తెలియజేసింది.కరోనా కార ణంగా దాదాపు రెండేళ్లపాటు పాఠశాలలు మూత పడడంతో అభ్యసనంలో గతంలో సాధించిన మెరుగుదల కూడా దెబ్బతిన్నట్టు నివేదిక పేర్కొంది. బాల బాలికల అభ్యసనా సామర్ధ్యం చదవడం లోనూ,గణితం(కూడిక, తీసివేత, గుణించడం, భాగించడం)లోనూ 2012 స్థాయికి దిగజారింది. కచ్చితంగా ఒకదశాబ్ద కాలంపాటు వెనక్కు పోయా మంటే కరోనా మహమ్మారి దెబ్బ తీవ్రత ఎంతలా వుందో విశదమవుతోంది. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఎన్ని అతిశయోక్తులు చెప్పినా, ఈ ప్రమా ణాలు,ప్రాతిపదికలు, గణాంకాలు శాస్త్రీయంగా, హేతుబద్దంగా ఆసమాజ స్థితిని నిర్ధారిస్తాయి. సమాజంలో విద్యారంగం ఎలా ఉందనేది అటు వంటి ప్రమాణాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌ లోనూ అభ్యసన సామర్ధ్యాలు 2012 సంవత్సరం స్ధాయికి పడిపోవడాన్ని నివేదిక స్పష్టం చేసింది.
ప్రభుత్వం మాత్రం వినూత్న పథకాలతో విద్యావిప్లవం వచ్చిందని గొప్పగా ప్రకటించడం మనం చూస్తున్నాం. విద్యా కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఖర్చు చేసిన బడ్జెట్‌ వివరాలను,విద్యా ర్థులకు అందజేసిన సంక్షేమ పథకాలను,వాటి వల్ల బడిలో చేరినపిల్లల గూర్చి,మన బడి,నాడు-నేడు పథకంతో పాఠశాలల కార్పొరేట్‌ రూపాన్ని… గణాంకాలతో సహా ఆర్భాటంగా చెప్తారు. కానీ ఉపాధ్యాయుల నియామకాల గురించి మాత్రం స్పందించరు. ప్రతి సంవత్సరం డియస్సీ నిర్వహిస్తా మన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయరు. ఈ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడిచి పోయినా, ఇప్పటికీ మెగా డియస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారని ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్తు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. భారత పార్లమెంట్‌లో ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 50,277 టీచర్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యా యుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. పైగా ఉన్న ఉపాధ్యాయులనే సర్దుబాటుచేసి, జీవో 117,124 లను అనుసరించి పాఠశాలలను విలీనం చేసి పాఠశాలల సంఖ్యను కుదించడం వేగంగా జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ లో డియస్సీ నియామకాలు జరిగి సుమారు 5 సంవత్సరాలు అయ్యింది. 2018లో అప్పటి ప్రభు త్వం 7000 పోస్టులతో నిర్వహించింది. ఈ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత విలీనం పేరుతో పాఠశా లల కుదింపు,ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తిని పెంచడం ద్వారా ఉపాధ్యాయ పోస్టులను తగ్గిం చింది. గత ప్రభుత్వాల కాలంలో 1996,1998, 1999,2000,2001,2002,2003,2018 సంవత్సరాలలో వరుసగా డియస్సీలు నిర్వహించి లక్షా నలభై అయిదు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. అంటే ఇప్పుడు సర్వీసులో ఉన్న 70శాతం మంది ఉపాధ్యాయులు గత ప్రభుత్వ హయాంలో నియమింపబడినవారే. ఈ ప్రభుత్వ హయాంలో ఈ నాటికీ ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ కాలేదంటే వీరి చిత్తశుద్ధిని శంకించాల్సిందే. విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా అమ్మ ఒడి పథకం అమలు చేయడం, జగనన్న విద్యా కానుక పేరుతో ప్రతి విద్యార్ధికి మూడు జతల యూనిఫాం, స్కూలు బ్యాగ్‌,పాఠ్యపుస్తకాలతో పాటునోట్‌ పుస్తకాలు, బూట్లు,సాక్సులు,బెల్టు,ఇంగ్లీషుడిక్షనరీ,ఈ సంవత్స రం ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వడం, జగనన్న గోరుముద్ద నిజంగా విద్యార్థుల పాలిట వరం లాంటివే. పాఠశాల రూపురేఖల్ని మార్చడం, అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పన నిజంగా మెచ్చుకోదగినవే. కానీ విద్య కోసం బడ్జెట్‌ కేటాయిం పులు చూస్తే మాత్రం ఎక్కడో వుంటాం.ఢల్లీి ప్రభు త్వం 2022-23 సంత్సరానికి తమబడ్జెట్‌లో 23. 50శాతం కేటాయించి ప్రథమస్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో 12.70శాతం కేటా యించి 21వస్థానంలోఉంది.
బడ్జెట్‌ కేటాయింపుల పరంగా చూస్తే మన ప్రభుత్వం విద్యారంగానికి ఎంత తక్కువ కేటాయించిందో మనం గమనించవచ్చు. రూ. వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలకు తగిన సౌకర్యాలు కల్పించి నూతన హంగులు సమకూర్చి నప్పటికీ విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులను నియమించకపోతే విద్యా నాణ్యత పెరిగేనా?విద్యా విప్లవం వచ్చేనా? కేంద్రం తీసు కొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం-2022ను దేశంలోనే అత్యుత్సాహంతో మొట్టమొదట అమలు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.తరగతుల విలీ నంతో గ్రామగ్రామాన ప్రాథమిక పాఠశాలలు అల్లకల్లోలమయ్యాయి. ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న పాఠశాలలను విలీనం చేసిన ప్రభుత్వం, మళ్ళీ పది మందికన్నా తక్కువ విద్యార్థులున్న పాఠ శాలల విలీనానికి పూనుకున్నది.
వ్యాసకర్త : ఎ.పి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి-(జిఎన్‌వి సతీష్‌/ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌)

అందరికీ అందాలి ఆహారం

మానవుని జీవితంలో ఆహారం ప్రాముఖ్యర గురించి అందరికీ తెలిసిందే. ఈ భూమిపై జీవి మనుగడ కొనసాగడానికి ఆహారం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. అలాగే ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించడం సాధ్యం కాదు.. జీవితంలో ఆహారం ప్రాముఖ్యతను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అయితే ఉత్పత్తి తగ్గుదల, ప్రభుత్వ విధానాలు, కోవిడ్‌-19 మహమ్మారి, పరిణామాలు, వాతావరణ మార్పులు, అసమానతలు, పెరుగుతున్న ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలతో సహా అనేక సవాళ్లు ప్రజలకు పౌష్టికాహారాన్ని దూరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు ఈ ప్రతి సవాళ్లను ఎదుర్కొనే దిశగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. – ఉదయ్‌ శంకర్‌ ఆకుల
ఆహారం ప్రాథమిక మానవహక్కుగా పరిగణించబడుతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ తొమ్మిది మందిలో ఒకరు దీర్ఘకాలిక ఆకలిని అనుభవిస్తున్నారు. ఇదే ప్రస్తుతం అందరికీ ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎందుకంటే ఇది భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంచనా. సంపన్నులు మరింత సంపన్నులుగా..పేదలు మరింత పేదలుగా మారుతున్న ఆర్థిక విధా నాలు అమలు జరుగుతున్న నేపథ్యం ఒక ముఖ్య కారణం.ఓ వైపు కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థి తులను తీవ్రంగా దెబ్బతీసింది. అనేక మంది ఉపాధి కోల్పోయి సరైన పోషకాహారం అందని పరిస్థితి. ఇదిలా ఉంటే ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గుదల, పోషకాహారం లోపం నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఆహారాన్ని ఆదా చేయడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవ సాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం మనముందున్న తక్షణ కర్తవ్యం. అయితే ఆహారం విలువ తెలియ జెప్పడంతో పాటు ప్రతి ఒక్కరికీ సరైన పోషకాహారం అందించాలన్న లక్ష్యంతో, భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోపం సమస్యలను నిర్మూలిం చాలనేది కూడా ఈ వరల్డ్‌ ఫుడ్‌ డే ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) 1945లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. 1979 నుండి ఏటా అక్టోబర్‌ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆహారం విలువ ఏంటో చాటి చెప్పటానికే. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్‌ పాల్‌ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
గ్లోబల్‌ సమస్యగా..
గత మూడేళ్లుగా..‘సార్స్‌’..‘కరోనా’..‘మంకీ పాక్స్‌’..వంటి మహమ్మారులను ఎదుర్కొం టున్నాం..కానీ వీటన్నింటికన్నా ‘ఆకలి’ పెద్ద మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే అత్యంత పెద్ద మహమ్మారి ఇదే. మనిషి ఏం చేసినా ఈ ఆకలి తీర్చుకోటానికే. జానెడు పొట్ట నింపుకోవటానికి కాయకష్టం చేసే కూలీల నుంచి కోట్లకు పడగలెత్తినవారు కూడా ఆకలి తీరందే ఏ పనీ చేయలేరు.ఆ కడుపు నింపు కోవటానికే ఇన్ని పాట్లు. ఈ ఆకలి అనేక పేద దేశాల్లోనే కాదు.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం వెంటాడుతోంది.. అయితే అన్నిరకాల ఆహారం, ఇంకా చెప్పాలంటే మితిమీరి తినగలిగే వారు కొందరుంటే.. పట్టెడన్నం లేక ఆకలితో చనిపోయే దారుణ స్థితిలో అత్యధిక పేదలున్నారు. ఈ అసమానత సరికావాల్సి ఉంది. ఎయిడ్స్‌,మలేరియా,క్షయ వ్యాధుల వల్ల జరిగే మరణాల కంటే..ఆకలి వల్ల జరిగే మరణాల రేటే ఎక్కువగా ఉందనే విషయం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఈ మరణాల స్థాయి ఎంతగా ఉందంటే..ప్రతిరోజూ 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. అయితే ఓ పక్క పెరుగుతున్న జనాభా. మరోపక్క తగ్గుతున్న వ్యవసాయం. అసమా నతను పెంచే పాలకుల విధానాలు.. దీంతోనే అధికమవుతున్న ఆకలి చావులు. ఈ క్రమంలో 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలి యన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పరిస్థి తుల్లో ఆహార ఉత్పత్తిని పెంచడం అంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే కొంతలో కొంత ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చు. కానీ వ్యవసాయం చేసే పద్ధతులు ముఖ్యంగా సేంద్రీయ పద్ధతులనే అనుసరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నా అది ఆచరణలో ఫలితాలు ఇవ్వవనేది.. తక్షణ సమస్యను పరిష్కరించలేవనేది శ్రీలంక పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. మెరుగైన పంట,నిల్వ,ప్యాకింగ్‌,రవాణా,మౌలిక సదు పాయాలు, మార్కెట్‌ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యలు అవసరం. వీటితో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ఆహార నష్టాలను తగ్గించే ప్రయత్నాలు చేయాలి.
జిహెచ్‌ఐలో దిగజారిన భారత్‌..
మరోవైపు గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ మరింత దిగజారింది. పోషకాహార లోపం, చిన్నారుల్లో వయసుకు తగిన బరువు, ఎత్తు లేకపోవడం, మరణాలు.. అనే నాలుగు సూచికల ఆధారంగా ఈ జాబితా రూపొం దిస్తారు. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్‌ఐ) 2022లో 121 దేశాల్లో భారత్‌ 107వ స్థానా నికి పడిపోయింది. అంతకు ముందు నివేదిక ప్రకారం 101వ స్థానంలో ఉండగా..ప్రస్తుతం 107కి దిగజారడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన సరిహద్దు దేశాలైన పాకి స్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ కంటే కూడా భారత్‌ వెనుకబడి ఉందని తెలుస్తోంది. బ్రెజిల్‌, చిలీ, చైనా,క్యూబా,కువైట్‌ సహా 18 దేశాలు జీహెచ్‌ఐ స్కోరు తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఈ వివరాలు ఆకలి, పోషకాహార లోపాలను లెక్కించే జిహెచ్‌ఐ వెబ్‌సైట్‌ గతేడాది వెల్లడిరచింది.
ఆహార ధాన్యాల సంక్షోభం..
ప్రపంచవ్యాప్తంగా 852 మిలియన్ల మంది దీర్ఘకాలంగా అతి పేదరికం కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా ప్రభుత్వాలు అనుసరించే విధానాలు అసమానతలను పెంచేలా ఉండటం. విపరీతమైన జనాభా పెరుగుదల,వాతావరణ మార్పు, ఆహార ధాన్యాలను జీవ ఇంధనాల కోసం ఉపయోగిం చడం,మౌలిక ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించి లాభదాయకమైన వాణిజ్య పంటలవైపు మొగ్గుచూపడం…ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, చట్టాలు చేయడం..సరైన ప్రోత్సా హకాలు లేకపోవడం..గిట్టుబాటు ధర లేకపోగా..కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నారు.దీంతో నష్టాలతో కూడిన వ్యవసాయం చేయలేక ప్రతీ ఏటా రైతులు తగ్గిపోతున్నారు.చదువుకున్నవారు వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మరికొద్ది రోజుల్లో ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి తీవ్రం కావొచ్చు. వీటన్నింటి పర్యవసానంగా ఆహారధా న్యాల ధరలు ఆకాశాన్నంటటం మరో సమస్య.
మహిళలపై ఎక్కువ ప్రభావం..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 821 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపంతో బాధపడు తున్నారు. తద్వార వీరు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన ప్రజలే కావటం గమనించాల్సిన విషయం. ఆకలి అంటే అమ్మే గుర్తుకొస్తుంది. అటువంటి అమ్మ తాను ఆకలితో అలమటిస్తున్నా బిడ్డల కడుపు నింపాలనే చూస్తుంది. అటువంటి మహిళలే ఇప్పుడు ఎక్కువగా ఆకలితో బాధపడుతున్నారు. ఏ ఒక్క సమస్య వచ్చినా అది ముందు మహిళలపైనా, వారి ఆరోగ్యాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అలాగే ఆకలి, పోషకాహార సమస్య కూడా మహిళలనే ఎక్కువగా వెంటాడుతోంది. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60 శాతం మంది మహిళలే ఉండటం గమనించాల్సిన విషయం. మహిళలు ఆకలితో ఉంటే ముఖ్యంగా గర్భిణులకు ఇలాంటి సమస్య ఉంటే పుట్టే పిల్లల మీదా ఆ ప్రభావం పడుతుంది. దీంతో అనారోగ్యకరమైన పిల్లలు జన్మిస్తారు. ప్రస్తుతం జరిగేదీ అదే.. ఏటా దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారనే గణాంకాలే దీనికి నిదర్శనం. ఇందులో కూడా 96.5 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండటం గమనార్హం. వీరిలో ప్రతి ఐదు జననాలలో ఒక బిడ్డ సరైన వైద్య సదుపాయం లేకపోవటం వల్లే ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి. దీంతో పిల్లల మరణాలలో 50 శాతం మంది ఐదు సంవత్సరాల లోపు వారే ఉండటం గమనించాల్సిన విషయం.
కారకులు ఎవరు..?
ప్రకృతితో సహజీవనం చేస్తున్నప్పుడు అనూహ్యంగా సమస్యలు వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లోనూ ఆహారం అత్యవసరం. ఆ దిశలో పాలకుల ధ్యాస ఉండాలి. అందుకు తగ్గ ప్రణాళికలు చేయాలి. ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నట్లనిపిస్తున్నా ఎక్కడో ఏదో లోపం ఉందనిపిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ నాటికీ అన్నం లేక విలవిల్లాడు తున్న దేశాలు. కారణం కరువు కావచ్చు. వరదలు కావచ్చు. ఆర్థిక వెనుకబాటుతనమూ కావచ్చు. వీటన్నింటికీ మూలం ప్రభుత్వ విధానాలేనన్న విషయం మరిచిపోకూడదు. ఏదేమైనా ఇది మానవాళి ఎదుర్కొనే తీవ్రమైన బాధ. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. మరి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తు న్నారు. అయితే దేశంలో పౌరులందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వటంలేదనేదీ మరో వాదన.
కలుషిత ఆహార బాధితులు..
తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఏది దొరికితే అది తిని,ఆకలి తీర్చుకోవాల్సిన దుస్థితి ఓ పక్క అయితే.. ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమా ర్కులు ఆహారాన్ని కల్తీ చేయడం వల్ల, అక్రమ నిల్వలు చేసేందుకు క్రిమిసంహారకాలు కల పడం,నిల్వ ఆహారం తినడం వల్ల కూడా ఆహారం కలుషితం అవుతోంది. దీనికితోడు అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత నీరు, మురికి కూపాలుగా మారుతున్న మురికి వాడలు.. వెరసి.. ప్రపంచంలో ప్రతి10 మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితులుగా మారుతున్నారు. పిల్లల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఏటా ఐదేళ్ల లోపు పిల్లలైన 1,25,000 మంది కలుషిత ఆహారం కారణంగా మరణి స్తున్నారు. సురక్షిత, శుభ్రమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, కలుషిత ఆహారం ద్వారా కలిగే అనారోగ్యం తదితర అంశాలపై అవగాహన పెరగాలి.
అడుగంటుతున్న నిల్వలు..
ఆహారకొరత దేశాన్ని కూడా చుట్టుముడు తోంది..తాజా పరిణామాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో బియ్యం నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఏడా ది ఇదే సమయానికి దేశంలో 78.6 మిలి యన్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉండగా, ఈ ఏడాది నిల్వలు 44 మిలియన్‌ టన్నులకు పడిపోయా యి. రానున్న రోజుల్లో ఈ అనను కూల వాతా వరణ పరిస్థితుల్లో ఆహార కొరత ఏస్థాయిలో విరుచుకుపడనుందో ఈ సంఖ్యలే తేటతెల్లం చేస్తున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది ధాన్యం సేకరణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని, నిర్ధేశించిన లక్ష్యాలు అందు కోవడం దాదాపు అసాధ్యమనే అంచనాలు వెలువడుతున్నాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే దేశంలో తిండి గింజలకు సంబం ధించి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టే! అదే జరిగితే సామాన్యుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టే! ఈ ఏడాది ప్రారంభం లో గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అంతకన్నా తీవ్రగానే బియ్యం కొరత రానుందని ‘డౌన్‌ టు ఎర్త్‌’ తాజాగా ఒక కథ నాన్ని ప్రచురించింది.
వృథా అరికట్టడం అవసరం..
ఈ రోజుల్లో అన్నం విలువ కొంతమందికే తెలుస్తుంది. ఎందుకంటే అన్నం తినేవాడికన్నా దానిని పండిరచేవారికే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఆహారం పారేయడానికి ఒక్క నిమిషం చాలు. కానీ ఆ ఆహారాన్ని పండిరచ డానికి కనీసం మూడు నెలలు పడు తుంది. ఆ విషయం తెలియక చాలా మంది దానిని వృథా చేస్తారు.అయితే ఏటా సుమారు 900 మిలియన్‌ టన్నుల (90 కోట్ల టన్నులు) ఆహారం వృథా అవుతోందని ఓగ్లోబల్‌ రిపోర్ట్‌ వెల్లడిరచింది.

రాజ్యాంగమే సర్వోన్నతం

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 73 ఏళ్లు పూర్తయి, 74వ సంవ త్సరంలోకి అడుగు పెడుతున్నది. ఈ సమ యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నవారు, రాజ్యాంగ పదవులలో ఉన్న ఉపరాష్ట్రపతి, గవర్నర్లు వంటి వారు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపం,లక్ష్యాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు.2014లో నరేంద్రమోడీ అధికా రంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు, మూడు వ్యవసాయ చట్టాలు, జాతీయ విద్యావిధానం-2020 మొదలైనవన్నీ రాజ్యాంగవిరుద్ధమే. రాష్ట్రాలతో సంప్రదిం చటంగానీ,చర్చించటంగాని చేయకుం డానే ఈ విధానాలను అమలు చేయటం, చట్టాలు చేయటం వంటి వాటికి కేంద్రం పాల్పడిరది. ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. ప్రాథమిక హక్కులలో ప్రధానమైన స్వాతంత్య్రపు హక్కును హరిస్తూ ‘భావప్రకట నా స్వేచ్ఛ’ను అణచివేస్తున్నది. అనేకమందిని ‘ఉపా’ చట్టం కింద అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఢల్లీిలో గల జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ,ఢల్లీియూనివర్శిటీల్లో జరుగు తున్న సంఘటనలు రాజ్యాంగ హక్కుల హరణ కు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ నేపథ్యంలో సర్వోన్న తమైన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రజాస్వామ్య శక్తులపై ఉన్నది.
ఇటీవల జైపూర్‌లో జరిగిన83వ అఖి ల భారత స్పీకర్ల సమావేశంలో ఉపరాష్ట్రపతి జగ దీప్‌ ధన్‌కర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజ లు ఎన్నుకున్న పార్లమెంట్‌ ఆధిక్యత కలిగి ఉం డాలని,పార్లమెంటరీ సార్వభౌమాధికారం ఉండా లని వాదన చేశారు.ఇదిరాజ్యాంగ సూత్రాలకు పూర్తి విరుద్ధం. ఆధునిక ప్రజాస్వామ్యాలు ప్రారంభ మైన తరువాత ఫ్రెంచ్‌ న్యాయ నిపుణుడు మాంటెస్క్యూ ‘ది స్పిరిట్‌ ఆఫ్‌ లాస్‌’అనే గ్రంథాన్ని రాశారు. ప్రభు త్వ అంగాలైన శాసన వ్యవస్థ (లెజిస్లేచర్‌), కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్‌), న్యాయ వ్యవస్థ (జ్యుడిషియరీ)-మూడు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయించరాదని, ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని విజయ వంతంచేయాలని దానిలో చెప్పారు. అమెరికా రాజ్యాంగంలో మాంటిస్క్యూ ప్రతిపాదించిన ‘అధి కార పృథక్కరణ’ సిద్ధాంతాన్ని ‘చెక్స్‌ అండ్‌ బాలె న్సస్‌’పేరుతో అమలు చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు డాపపఅంబేద్కర్‌ నాయకత్వాన రాజ్యాం గంలో ప్రభుత్వ అంగాలు మూడిరటి మధ్య ఆధిప త్యం ఉండరాదని భావించారు. ఈమూడు వ్యవస్థలు తాను విధించిన పరిధిలోనే పనిచేయాలని రాజ్యాం గం స్పష్టం చేసింది.కేంద్ర న్యాయశాఖా మంత్రి తో సహా అనేకమంది అధికార పార్టీ ప్రముఖు లు న్యాయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవా లనే వాదనలు చేస్తున్నారు.
న్యాయ సమీక్షాధికారం
అమెరికన్‌ సుప్రీంకోర్టు 1803లో తొలిసారిగా మాడిసన్‌ వర్సెస్‌ మార్బరీ కేసులో తొలిసారిగా న్యాయవ్యవస్థకు న్యాయ సమీక్షాది óకారం ఉందని ప్రకటించింది. న్యాయ సమీక్షాధి కారాన్ని ‘జ్యుడిషియల్‌ రివ్యూ’ అంటారు. న్యాయ సమీక్షాధికారం అనగా ‘పార్లమెంట్‌ చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా (అల్ట్రా వైర్స్‌) ఉంటే అవి చెల్లవు (నల్‌ అండ్‌ వాయిడ్‌) అని ప్రకటించటం. న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ పరిరక్షణకు, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు తోడ్పడుతుంది. భారత రాజ్యాంగంలో 13వ నిబంధన భారత న్యాయ వ్యవస్థకుగల న్యాయ సమీక్షాధికారాన్ని వివరిం చింది.గత73ఏళ్లలో పార్లమెంట్‌ చేసిన అనేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను భారత సుప్రీం కోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించు కొని కొట్టివేసింది.1952లో వి.జి.రావు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసులో సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ పతంజలి శాస్త్రి ‘న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం తమపై పెట్టిన బాధ్యతను న్యాయస్థానాలు నెరవేర్చడమే తప్ప పార్ల మెంట్‌పై తమదే పైచేయి అని నిరూపించు కోవడానికి కాదని స్పష్టం చేశారు.న్యాయ సమీక్షాధికారంలో భాగంగా జస్టిస్‌ వి.ఆర్‌. కృష్ణయ్యర్‌, జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి, జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి, జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ మొదలైన న్యాయమూర్తులు అత్యున్నతమైన తీర్పులు ఇచ్చారు.
కేశవానంద భారతి కేసు-మౌలిక స్వరూపం
2023 జనవరి 7వ తేదీన రాజ్యసభ సమావేశాలలోను, ఇటీవల జైపూర్‌లో జరిగిన 83వ భారత శాసనసభల స్పీకర్ల సమావేశంలోను ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌…భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంపై కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 1973లో ఇచ్చిన తీర్పుతో తాను ఏకభ వించడంలేదని విపరీత వాదన చేశారు. పార్లమెం ట్‌ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు, హైకోర్టులు సమీక్షించి ఆచట్టాలనురద్దుచేస్తే ప్రజాభిప్రా యాన్ని, పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని తిరస్కరించి నట్లని ఆయన భాష్యం చెప్పారు.
పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరణచేసే అధికారం లేదని 1967లో గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.దీనికి భిన్నంగా 1973లో కేశవా నంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు…రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చ కుండా సవరణ చేయవచ్చని తీర్పు చెప్పినది. ఈ తీర్పు 368వనిబంధన కింద రాజ్యాంగాన్ని సవరిం చడానికి పార్లమెంట్‌కు గల అధికారాలపై పరిమితి విధించింది.పార్లమెంట్‌లో మెజారిటీ ఉందనే కార ణంతో నిరంకుశంగా రాజ్యాంగాన్ని సవరించే ధోర ణిని అరికట్టడానికి, కీలక రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి ఈ తీర్పు దోహద పడుతుందని ఆనాడు న్యాయ నిపుణులు,రాజకీయ పార్టీలు హర్షం వెలిబుచ్చాయి.
కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో(1973)సుప్రీంకోర్టు తీర్పు చారిత్రా త్మకమైనది.ఆ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ‘మౌలిక స్వరూపాన్ని’ (బేసిక్‌ స్ట్రక్చర్‌) వివరించింది. కేసును విచారించటానికి 13 మంది న్యాయమూర్తు లతో ధర్మాసనం ఏర్పడి విచారణ చేసింది. జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌, జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా, జస్టిస్‌ ఎ.ఎన్‌.రే,జస్టిస్‌ సిక్రి,జస్టిస్‌ గ్రోవర్‌వంటి ఉద్దండులు ధర్మాసనంలో ఉన్నారు.రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని మార్చే, సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు లేదని తీర్పు చెప్పారు.రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని నిర్వచించారు. రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం, న్యాయ సమీక్షాధికారం, లౌకిక విధానం, ప్రాథమిక హక్కులు మొదలైనవాటిని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధి కారం ఉన్నది కాని రాజ్యాంగ మౌలిక స్వభావా నికి భంగం కలగని విధంగా మాత్రమే పార్లమెంట్‌ తన అధికారాన్ని వినియోగించాలని ఈకేసు ద్వారా నిర్ధారణ జరిగింది. 1980లో సుప్రీంకోర్టు మినర్వా మిల్స్‌ కేసులో ప్రాథమిక హక్కులు,ఆదేశిక సూత్రాల మధ్య సమతౌల్యత ఉండాలని స్పష్టంగా పేర్కొన్నది. ఇటీవలఉపరాష్ట్రపతితో సహా అనేక మంది బి.జె.పి నాయకులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిరాక రించి,పార్లమెంట్‌ ఆధిక్యత ఉండాలని ప్రచారం చేయటం పూర్తి రాజ్యాంగ విరుద్ధం.
రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్లు
భారతరాజ్యాంగం పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని ప్రవేశపెట్టింది.దీని ప్రకారం కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వానగల మంత్రి మండలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వానగల మంత్రి మండలి నిజమైన అధికారాలు కలిగి ఉంటాయి. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ నామ మాత్ర అధిపతులుగా ఉంటారు. రాజ్యాంగంలో 163వ నిబంధన ప్రకారం మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్‌ వ్యవహరించాలి. కాని కొన్ని సమ యాల్లో గవర్నర్లు కేంద్రానికి,రాష్ట్రాలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించకుండా,కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో రామ్‌లాల్‌,కుముద్‌ బెన్‌జోషి వంటి గవర్నర్లు ఎన్నో వివాదాలు సృష్టించారు.రాష్ట్ర ప్రభు త్వానికి ఇబ్బందులు కల్పించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ హయాంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో గవర్నర్లు ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇటీవల తమిళనాడు గవర్నర్‌ రవి, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న తీరు ఎన్నో విమర్శలకు గురైంది.గతంలో కొన్ని కమిటీలు గవ ర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని సిఫార్సులు చేయగా, కేంద్ర-రాష్ట్రసంబంధాలపై నియమించిన సర్కారి యా కమిషన్‌…గవర్నర్ల పనితీరుపై కొన్ని పరిమితు లు ఉండాలని కొన్ని సూచనలు చేసినది. పార్లమెం టరీ విధానం కొనసాగుతున్న భారత దేశంలో గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి.
రాజ్యాంగం ఉన్నతమైనది
పార్లమెంట్‌లో పాలక పార్టీలకు మెజారిటీ వస్తూ, పోతూ ఉంటుంది.రాజ్యాంగం,దానిస్ఫూర్తి, రాజ్యాంగ విలువలు శాశ్వతంగా ఉంటాయి. పార్ల మెంటు, ప్రభుత్వం,న్యాయ వ్యవస్థ వీటన్నిటి ఉని కికి రాజ్యాంగమే మూలాధారం.ఈ మూడు వ్య వస్థలు తమ,తమ పరిధిలో పనిచేయాలని రాజ్యాం గం స్పష్టం చేసినది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం గత తొమ్మి దేళ్లుగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు చేస్తున్నది. సమాఖ్య విధానం లో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు విభజిం చబడి ఉంటాయి.రాజ్యాంగ 7వషెడ్యూల్‌లో కేంద్ర జాబితా,రాష్ట్ర జాబితా,ఉమ్మడి జాబితా లుగా అధికార విభజన జరిగింది. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండగా రాష్ట్రాలతో సంప్రదించ కుం డానే కేంద్రం మూడు వ్యవసాయచట్టాలు చేయటం తో లక్షలాదిమంది రైతులు సుమారు 400 రోజుల పాటు ఉద్యమం చేయడంతో ఆచట్టాలు ఉపసం హరించుకోక తప్పలేదు. ఇది రైతాంగ ఉద్యమం ఉమ్మడిగా సాధించిన ఘనవిజయం. అలాగే విద్య ఉమ్మడి జాబితాలో ఉండగా,రాష్ట్రాలతో చర్చించ కుండానే కరోనా సమయంలో కేంద్రం జాతీయ విద్యావిధానం-2020 ఏకపక్షంగా ప్రకటించింది. అందువలన తమిళనాడు, కేరళ వంటి ప్రభుత్వాలు దీనిని అమలు చేయటానికి నిరాకరించాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేయకుండా ఉండటానికి కేంద్రం ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో పేర్కొన్న లౌకిక వాదాన్ని,భిన్నత్వాన్ని,బహుళత్వాన్ని దెబ్బతీసి ప్రజల మధ్య మతపరమైన విభజన తేవటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారతరాజ్యాంగ లక్ష్యా లు,విలువలను కాపాడుకోవటానికి రాజ్యాంగ మౌ లిక స్వరూపాన్ని సంరక్షించుకోవటానికి ప్రజాస్వామ్య వాదులు, అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు, ప్రజాసంఘాలు,దళిత,గిరిజన,వెనుకబడిన తరగ తుల సంఘాలు… అందరూ కృషి చేయ వలసిన అవసరాన్ని గణతంత్ర దినోత్సవం గుర్తు చేస్తున్నది. – కె.ఎస్‌.లక్ష్మణరావు

యవ్వ మాట..కోయభాష

కంజాతి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. సదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ఇకపై గిరిజన పాఠశాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ.. లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పించింది.నీ పేరు ఏంటి అనడానికి ‘మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి ‘మీ వాది బాత కూసీరి’, ఇటురా అని పిలవడానికి ‘ఇలావా’ అంటారు. ఇవన్నీ కోయ భాష పదాలు. అతి ప్రాచీన భాషలలో ఇది ఒకటి. మన తెలుగు భాషలాగే ద్రావిడ భాష నుంచి పుట్టింది. అందుకే ‘మన కులతూరు భాష సాయిమంతే..’ అని కోయ తెగవారు మురిసిపోతుంటారు. అంటే మన కోయ భాష మంచిది అని అర్థం..
భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన తెగల్లో కోయ తెగ ప్రధాన మైనది. వీరి భాష,సంస్కృతి,సంప్ర దాయ విధానం భిన్నంగా ఉంటుంది.కోయల భాషలో యాస అనేది స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో కోయ తెగ వాసులు ఎక్కువగా చింతూరు, వి.ఆర్‌.పురం,బుట్టాయగూడెం,పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు,జీలుగుమిల్లి మండలాల్లో ఉన్నారు. కోయలను రెండు విధాలుగా చెప్పుకుంటారు.మొదటి వర్గం దొరల సట్టం(కోయ తెగల్లో ఉన్నతులు-దేవుని వర్గం),రెండో వారు పుట్టదొరలు(నిజమైన దేవుళ్లుగా చెప్పుకుంటారు). గోండుల మాదిరి గానే తమను తాము వారి పరిభాషలో ‘‘కోయతూర్లు’గా చెప్పుకుంటారు. అలాగే కోయలు వారి వృత్తులను బట్టి రాచకోయ, గుమ్మకోయ,కమ్మరకోయ,ముసరకోయ, గంపకోయ,పట్టెడకోయ, వడ్డెకోయలు అనే 7వర్గాలుగా ఉన్నారు. అలాగే కోయలుగా గుర్తింపు పొందిన మరో నాలుగు తెగలు ఉన్నట్టు భాషా పరిశోధ కులు చెప్తున్నారు. డోలు కోయలు,కాక కోయలు, మట్ట కోయలు,లింగకోయలు అనే 4 తెగలను గుర్తించారు. అయితే కోయవారు కోయతూర్‌ భాషలో మాట్లాడతారు. కోయ భాషలో అన్నం తిన్నామా అనడానికి ‘‘దూడ తింతినే,నీ పేరు ఏంటి అనడానికి ‘‘మీ పేదేరు బాత’,మీది ఏమి కూర అని అడగడానికి ‘‘మీ వాది బాత కూసీరి’, నీకు జ్వరం వచ్చిందా అనడానికి ‘‘మీకు ఎరికి వత్తే ‘,ఇటురా అని పిలవడానికి ‘‘ఇలావా’ అని వారి భాషలో ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఒక నాడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే కోయలందరూ మాట్లాడ గలిగినా నేడు కొందరు మాత్రమే ఈ భాషలో మాట్లాడు తున్నారు. మరికొందరు భాష వచ్చినా మాట్లాడ టానికి సిగ్గుపడుతున్నారని ఆ తెగకు చెందిన వారే చెప్తున్నారు. దీనికి కారణం అభివృద్ధి పేరుతో పరుగులు పెట్టడమేనని అంటున్నారు. జిల్లాలో గిరిజనులు సుమారు 97,929 వరకూ ఉండగా వీరిలో 70శాతం కోయ భాషమాట్లాడే వారు ఉన్నారంటూ ఆ తెగకు చెందిన పెద్దలు చెప్తున్నారు.వీరిలో ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 60వేల మంది వరకూ గిరిజనులు నివసిస్తున్నారు.
గోండు అనేది సమాజం కోయతూర్‌? అనేది తెగ
ఒక్క తెలంగాణలో తప్ప దేశవ్యాప్తంగా గోండులు కోయలంతా కోయతూర్‌?లు గానే చెప్పుకుంటారు. దీనిని గోండి కోయ పురాణ లలో చూడవచ్చు, మధ్య భారతంలో 1నుండి 12 రకాల గొట్లు (సగా) లుగా నేడు ఆదివాసీ లున్నారు. అందులో తెలంగాణలో 3 నుండి 7 వరకు ఉన్నవి, మిగతావి ఇతర రాష్ట్రాలలో చూడవచ్చు వీరంతా కోయతూర్‌?లు గానే పిలుచుకుంటారు. కొమరం భీమ్‌ పోరాటం తరువాత ఆదిలాబాద్‌లో నిజాం రాజు ఏర్పాటు చేసిన ఆస్ట్రియా దేశస్తుడు అయిన ప్రో.హైమండార్ఫ్‌ కమిషన్‌ హైద్రాబాద్‌ రాష్ట్రంకి ఇచ్చిన నివేదికలో గోండు అని రాయటం మూలంగా తెలంగాణలో గోండు, కోయ వేరు అనే పరిస్థితులు వచ్చాయి. 8వ షెడ్యుల్‌లో గోండు భాషను అధికారికంగా గుర్తించాలి ప్రధానంగా ఈ దేశంలో హిందీ ప్రధాన భాషగా ఎక్కువ రాష్ట్రాలలో ఉండటం తో పూర్తి చేసిన ఈ డిక్షనరి మొదటగా దేవన గరి స్క్రిప్ట్లో ముద్రణలో చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో స్థానిక భాషలలోకి అనువాదం జరుగుతుంది. ఈ ప్రయత్నంతో రాష్ట్రాలు వేరు అయినా,ఈ దేశం ఆదివాసీ లను విభజన చేసినా,విచ్ఛిన్నం చేసినా కోయ భాష మూల పదాలు భద్ర పరచటం కోసం జరిగిన ఒక గొప్ప ప్రయత్నంగా ఈ డిక్షనరీనీ చూడొచ్చు.ఈ డిక్షనరీ ఆదివాసి మేధావులు తయారు చేయటం వెనుక ఉన్న ఆకాంక్ష ఏమిటి అంటే పార్లమెంట్‌లో కోట్లాది కోయతూర్‌? ప్రజల అస్థిత్వానికి సంబంధించిన భాషకు రాజ్యాంగబద్ద ఆమోద ముద్ర 8వ షెడ్యూల్‌లో జరగాలి అని,హోం మంత్రిత్వ శాఖ అధికారిక పత్రం ప్రకారం గోండుభాషతో సహా 38 భాష లను చేర్చాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. 2004లో నాలుగు బాషలకు బోడో,డోగ్రి మైథిలి, సంతాలికి 22 భాషలతో కూడిన 8వ షెడ్యూల్‌?లో జోడిరచబడ్డాయి.కానీ గోండు భాషకు స్థానం కల్పించలేదు. గోండుభాష అంటే కేవలం సంభాషించే మాధ్యమం మాత్రమే కాదు, భౌగోళిక, పాక్నతిక, సామా జిక, చారిత్రక, ఇతిహాసాల సమగ్ర స్వరూపం, పురాతన మౌఖిక సాహిత్యం, ఆదివాసీ అస్థిత్వ మూలాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానంతో ముడి పడి ఉన్నందున రక్షణకు దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం జరగాలి. కోయ భాష విస్తృతికి ఇంకా పరిశోధనలు విస్తృతంగా జరగాలి. ప్రతి రాష్ట్రంలో ఆదివాసి పాఠశాలలో ఈ డిక్షనరీ పదాలు చేర్చి ప్రాధ మిక విద్య అందించాలి. సెకండరీ విద్యా, యూనివర్సిటీ స్థాయిలో కోయ భాషకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి.భాషాశాస్త్ర వేత్తలు,బాషా శాస్త్ర పరిశోధన సంస్థలు,ప్రత్యేక దృష్టి పెట్టాలి. బాష ప్రాధాన్యతను పెంచాలి.కోయ భాష ఆత్మగౌరవంనీ తెలియచేయాలి. అప్పుడే కోయతూర్‌లకి ఈ దేశంలో మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే భవిష్యత్‌లో పరాయి మతాల యొక్క బాషల ప్రభావం పడి కోయ తూర్‌ల అస్తిత్వ మూలాలు ధ్వంసమయి ఆదిమ జాతులు చరిత్ర కాల గర్భంలో కలిసి పోవడం అనేది ఒప్పుకొని తీరాల్సిన నిజం.
అతి ప్రాచీన భాషల్లో ఒకటి
తాము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకోవడమే తప్ప తమ భాష, సంస్కృతి, సంప్రదాయం, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారుతోందని కోయ గిరిజనులు భావించలేక పోతున్నారని పలువురు కోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోయ భాష అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. ద్రావిడ భాష నుంచి కోయ భాష పుట్టిందని చరిత్ర చెబుతోంది. అయితే కోయభాషను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కోయ భాష మీద ప్రధాన భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆతెగకు చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరికత పేరుతో జరుగుతోన్న అభివృద్దిలో భాగంగా భాషలకు ముప్పు వాటిల్లుతుందని, ఆ ప్రభావం కోయభాషపై కనిపిస్తోందని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు.
ఐటీడీఏ ఆధ్వర్యంలో కోయ భారతి విద్య
కోయ భాషకు లిపి లేనప్పటికీ కేఆర్‌పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో 2005లో కోయ భాషలో గిరిజన విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అనుభవజ్ఞులైన గిరిజన ఉపాధ్యాయుల ద్వారా కోయ భాషకు సంబంధించిన తెలుగు పదాలతో కోయ భారతి అనే పుస్తకాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ ప్రధాన భాషలతో పాటు కోయ భాషను కూడా బోధించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ విధానం వల్ల కోయ విద్యార్థులో విద్యపై ఆసక్తి పెరుగుతుందని, ప్రాథమిక విద్యాభ్యాసం సులభతరం అవుతుందని అధికారులు అంటున్నారు. అయితే కోయ భాషకు లిపి లేనందున భాషా సంస్కృతి క్రమంగా తగ్గిపోతోందని ఆదివాసీ కోయతెగల మేధావులు అంటున్నారు. తమ తెగకు ప్రధానమైంది భాషేనని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ గిరిజనులపై ఉందని పేర్కొంటు న్నారు.కొండకోనల్లో అంతరించి పోతున్న అరుదైన కోయ భాషలకు రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిలూదుతోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహజంగా గిరిజన తండాల్లో మూడొంతుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. ఈ కారణంగా వారు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవు తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, వారి జీవితాల్లో విద్యా సుగంధాలు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గిరిజ నులు మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాన్ని చేపట్టింది.
6 భాషలు..920 పాఠశాలల్లో అమలు
రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమలు చేయను న్నారు. ఈ విధానాన్ని ‘కోయ భారతి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవ డంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది.ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ),శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో (సవర),విశాఖపట్నం జిల్లాలో (కొండ,కువి, ఆదివాసీ),కర్నూలు,అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1నుంచి 3వ తరగతి వరకూ తెలుగు,గణితం,పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60లక్షల వ్యయంతో పాఠ్యాంశాలు రూపొందించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 920 పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేనిచోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు.
యవ్వ.. ఇయ్య భాషలోనే..
కోయ భాషలో అమ్మను యవ్వ అని..నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా..అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని..కోడి పుంజును గొగ్గోడు అని..పిల్లిని వెరకాడు అని పిలుస్తారు. కూడికేకు (కూడిక), తీసివేతాకు (తీసివేత), బెచ్చోటి (ఎంత పరిమా ణం), దోడ తిత్తినే (అన్నం తిన్నావా),బాత్‌ కుసిరి (ఏంకూర),దెమ్ము (పడుకో),ఏరు వాట (నీరు ఇవ్వు,పెట్టు),మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి) వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతా ల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి. ప్రాథమిక విద్యార్థులకు వారు మాట్లాడే మాతృ భాషలోనే బోధన చేయడం వల్ల వారిలో అభ్యసన స్థాయిని పెంచడంతో పాటు వారి భాష, సంస్కృతి,సంప్రదాయాలను చెక్కు చెదరకుండా కాపాడాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించడమనేది ఇతర భాషలపై పట్టు సాధించేందుకు ఎంతో దోహదపడుతుంది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను రూపొం దించారు.మాతృభాషలో బోధన వలన డ్రా పౌట్లు కూడా తగ్గుతాయి. మాతృభాషలో బోధనకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసు కుంది. ప్రాథమిక స్థాయిలో గిరిజన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అక్షరం ముక్కలు రాక అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్న గిరిజనులకు ఇది సువర్ణావకాశమనే చెప్పాలి. కొత్తగా పాఠశా లలకు వెళ్లే పిల్లలకు వాడుకలో ఉన్న కోయ భాషలో బోధన ఎంతో అవసరం. ఇతర భాషలు నేర్చుకోవాలంటే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. కోయభాషలో పాఠాలు చెబు తుంటే మా పిల్లలకు సులువుగా అర్థమవు తుంది. కోయభాషతో పాటు తెలుగులో కూడా చెబుతుండటం బాగుంది.
కోయతూర్‌ బాట సాహిత్య కార్యశాల
కోయతూర్‌ల అస్థిత్వ మూలాలు,వారి కోయ భాష క్రమక్రమంగా అంతరించే దశకు చేరుకు న్నాయని ఆ తెగ ను, వారి కోయ భాష ను పరిరక్షించుకోవలసిన అవసరం ఉందని కోయతూర్‌ బాట వ్యవస్థపాకలు జి. యాద య్య పిలుపు నిచ్చారు.చింతూరు మండలం రామన్నపాలెంలో కోయతూర్‌బాట, సమత నిర్వహణలో కోయ బాల సాహిత్యం అనే అంశం పై ఐదు రోజులపాటు ఆదివాసీ యువకులు, పాఠశాలలో ని విద్యార్థులకు నిర్వహించిన కార్యశాల (వర్క్‌ షాప్‌ )నిర్వహించారు.సదస్సులో ఆయన మాట్లాడారు. ఒకే భాషగల ప్రజలు ఒకే మూలం నుండి వచ్చిన ప్రజలు భాష కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.భాషా శాస్త్ర వేత్తలు,బాషా శాస్త్ర పరిశోధన సంస్థలు, ప్రత్యేక దృష్టి పెట్టాలి. బాష ప్రాధాన్యతను పెంచాలి. కోయ భాష ఆత్మగౌరవంనీ తెలియచేయాలి. అప్పుడే కోయతూర్‌లకి ఈ దేశంలో మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు. లేదంటే భవిష్యత్‌లో పరాయి బాషల ప్రభావం పడి కోయతూర్‌ల అస్తిత్వ మూలాలు ధ్వంసమయి ఆదిమ జాతులు చరిత్ర కాల గర్భంలో కలిసి పోవడం అనేది ఒప్పుకొని తీరాల్సిన నిజమని స్పష్టం చేశారు. ఆదివాసీల హక్కులు, వనరులు పరిరక్షణ పై పని చేస్తున్న సమత కో-ఆర్డినేటర్లు గునపర్తి సైమన్‌, కందుకూరి సతీష్‌ కుమార్‌లు మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రాలుగా,ఒరిస్సా,మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌,ఆంధప్రదేశ్‌,మహారాష్ట్ర,ఒరిస్సా,కర్ణాటకలుగా విభజించటంతో ఆయరాష్ట్రాలలో ఈ కోయతుర్‌ భాషకు ప్రాధాన్యత లేక,66ఏళ్ళుగా,కోయ భాషకు మరాఠి,ఒడియ,హింది,కన్నడ తెలుగు భాష ప్రభావం పడి,కోయభాష యాస,ప్రాసలు కూడ మారియన్నారు.దాంతో కోయ పదాలన్ని స్థానిక భాష పదాలు అని చెప్పుకునే క్రమం తగ్గి పోతుందాన్నారు.విచ్ఛిన్నం చేసినా కోయ భాష మూల పదాలు భద్ర పరచటం కోసం ఇది ఒక గొప్ప ప్రయత్నమని తెలిపారు. ఆదివాసీ అస్థిత్వ మూలాలు, సంస్కృతి సాంప్ర దాయాలు, జీవన విధానంతో ముడిపడి ఉన్నం దున రక్షణకు దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం జరగాలన్నారు.కోయ భాష విస్తృతికి ఇంకా పరిశోధనలు విస్తృతం చేయాల్సి న బాధ్యత, ఆవశ్యకత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.ప్రతి రాష్ట్రంలో ఆదివాసి పాఠశాలలో డిక్షనరీ పదాలు చేర్చి ప్రాధమిక విద్య అందించాలి. సెకండరీ విద్యా, యూని వర్సిటీ స్థాయిలో కోయ భాషకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలన్నారు.నాలుగు రోజుల వర్క్‌ షాప్‌లో కోయతూర్‌ బాట అకాడమీక్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పాండు ఆధ్వర్యంలో కోయ భాష పదాలు గుర్తించడం, విద్యార్థులు తో పదాలు పలికించడం వంటి అంశాలపై చర్చగోష్టి ఆసక్తికరంగా సాగింది.ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన కోయుతూర్‌ తెగల ఆనాటి జీవనవిధానం,వారు ధరించే వస్త్రాలు,పనిముట్లు ఇతరాత్ర అంశాలపై ఫోటో ప్రదర్శన ఆకట్టుకుంది.సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న గిరిమిత్ర సంస్థ కార్యదర్శి బండి గంగరాజు,వినియోగదారుల సంఘం కార్యదర్శి చిట్టిబాబు,కృష్ణ,దుమ్మిరి వెంకన్న బాబు,సున్నం ఈశ్వర్‌ కుమార్‌,జి రాఘవ,దుమ్మిరి భీమమ్మా,కట్టం కిరణ్‌ యువతీ యువకలు,గిరిజన పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -గునపర్తి సైమన్‌

తుఫాన్లు..కష్టాలు

తీర ప్రాంత ప్రజానీకానికి తుపాన్లు, వాటి వల్ల వచ్చే కష్టాలు కొత్త కాదు. కానీ, ఆ కష్టాలను పూర్తి స్థాయిలో నివారించలేక పోవడమే బాధాకరం. తాజాగా విరుచు కుపడిన మాండూస్‌ తుపాన్‌ కూడా తీర ప్రాంత ప్రజానీకానికి తరగని కష్టాలను మిగిల్చింది. తుపాన్‌ ప్రాంతానికి పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా నష్టతీవ్రతను ఇంకా ప్రకటించలేదు. ఎన్యూ మరేషన్‌ ఇంకా ప్రారంభమే కాకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తయి, బాధితులకు నష్ట పరిహారం అందడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోగా అరకొర సాయంతోనే బాధితులు నెట్టుకురావాల్సి ఉంటుంది. తుపాన్లు వంటి ప్రకృతి వైప రీత్యాలు చోటు చేసుకున్నప్పుడు గతంలో మరణాల సంఖ్య భారీగా ఉండేది. పెరి గిన సాంకేతికతతో పాటు అధికార యం త్రాంగం అప్రమత్తత కారణంగా ఇటీవల కాలంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.-సైమన్‌ గునపర్తి
మాండూస్‌ తుపాన్‌ సమయంలోనూ ఈ విష యాన్ని గమనించవచ్చు. మూడు,నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసినప్పటికీ,దక్షిణ కోస్తా జిల్లాలో నదులు,వాగులు పొంగి ప్రవహించినప్పటికీ మన రాష్ట్రంలో ఒక్కరే మరణించారు. అది కూడా వర్షాలకు నానిన గోడ కూలడం కారణంగా సంభవించింది. సకాలంలో సహాయ చర్యలు చేపట్టినందున మరణాల సంఖ్యను నలుగురికి పరిమితం చేయగలిగామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడులోనూ సంభవించిన ఆస్తి, పంట నష్టం మాత్రం అపారం. రాష్ట్రాలు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే! తక్షణ సాయం ప్రకటించడంతో పాటు, పూర్తిస్థాయి నష్టం అంచనా వేయడానికి బృందాన్ని పంపడం, ఆ బృందం ఇచ్చే నివేదికను, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మరిన్ని నిధులను మంజూరు చేయడం వంటి పనులు కేంద్ర ప్రభుత్వం సాధారణంగా చేస్తుంది. ఈ తరహా స్పందన ఎంత త్వరగా వ్యక్తమైతే బాధిత ప్రజానీకానికి అంత త్వరగా ఊరడిరపు లభిస్తుంది. అయితే,తాజా తుపాన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఇటువంటి స్పందన నామమాత్రంగా కూడా వ్యక్తం కాలేదు. సాయం సంగతి అలా ఉంచి,కనీసం బాధిత ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలనుండి ఊరడిరపు మాటలు కూడా వ్యక్తం కాకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.తమ సొంత ప్రభుత్వాలు ఉన్నచోటో,ఎన్నికలు వచ్చినప్పుడో దీనికి భిన్నంగా ఉరుకులు, పరుగుల మీద సాయం అందడం ప్రజానీకం గమనిస్తున్న విషయమే. ఈ తరహా వివక్షా పూరిత వైఖరిని కేంద్ర ప్రభుత్వం తక్షణం మానుకోవాలి. మాం డూస్‌ తుపాన్‌ కారణంగా చిత్తూరు, తిరుపతి,కర్నూలు నెల్లూరు,ప్రకాశం, బాపట్ల,గుంటూరు,కృష్ణ,ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట దెబ్బ తింది. రేపో,మాపోమార్కెట్‌కు చేరాల్సిన ధాన్యపు కళ్ళాల్లోకి వర్షపు నీరు చేరింది. పండ్ల తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరద నీరు చేరడంతో కొన్ని చోట్ల ఇళ్లకు దెబ్బతిన్నాయి. వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ! అది జరగాలంటే ముందుగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సోమవారం నిర్వహిం చిన సమీక్షా సమావేశంలో నష్టం అంచనాల ప్రక్రియను వెంటనే ప్రారంభించి, వారం రోజుల్లోపు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఉదారంగా నిర్వహించాలి. రంగుమారినా, తడిసినా ముందుగా ప్రకటించిన రేటుకే కొనుగోలు చేయాలి. ముఖ్యమంత్రి కూడా ఇదే విధమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలి.దీంతో పాటు అన్ని విధాల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే రైతులకు కొంతమేరకైనా ఊరట లభిస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలోని అధికార పక్షంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం కూడా సాయం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. అవసరమైతే ఇతర ప్రతిపక్షాలను, శక్తులను కూడా కలుపుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి.
ఆంధ్రప్రదేశ్‌కు పదే పదే ఎందుకీ వరద కష్టాలు….
భౌగోళికంగా గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి ప్రధాన నదులకు చివరలో ఉండే ఆంధ్ర ప్రదేశ్‌కు అనేక ముప్పులు పొంచివున్నాయి. నీటి కొరత ఏర్పడినా, నదికి వరదలు వచ్చినా తొలి ప్రభావం ఏపీ మీదనే ఉంటుంది. గడిచిన రెండు మూడు సీజన్లలో ఏటా వరదలతో అపార నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ చవిచూస్తోంది. రైతులు, తీర ప్రాంత ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత రీతిలో జులైలో అతి పెద్ద వరదలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి వరదల తాకిడి తగ్గినా వరద ముప్పు మాత్రం ఇంకా పోలేదు. సహజంగా ఆగష్టులో ఎక్కువగా వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో.. గోదావరి తీరం ఇంకా ప్రమాదం ముంగిట్లో ఉన్నట్టుగానే భావించాలి.సెప్టెంబర్‌ మాసంలో ఎక్కువగా వరదల ప్రమాదం ఎదుర్కొనే కృష్ణా నదీ తీరం కూడా రాబోయే రెండు నెలల పాటు దినదినగండంగా గడపాల్సిందే. అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో పెన్నా తీరంలో ప్రమాదం పొంచి ఉంటుంది. గత నవంబర్‌లో ఎగువన కురిసిన భారీ వర్షాలకు పెన్నా నదీ తీరం పొడవునా అవస్థలు ఎదురయ్యాయి. ఏటా వరుసగా నాలుగైదు నెలల పాటు ఏదో నదికి వరదల ప్రమాదం అంచున ఆంధ్రప్రదేశ్‌ ఉంటుంది. అయితే, దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ..తగిన పరిష్కారం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కరకట్టల పరిస్థితిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరాన్ని ఇది చాటుతోంది.ఈ నేపథ్యంలో గోదావరి ఏటిగట్లు, కృష్ణా కరకట్ట, పెన్నా సహా పలు నదీ తీరాల్లో పరిస్థితిపై బీబీసీ పరిశీలన చేసింది.
గోదావరి ముప్పు నుంచి గట్టెక్కినట్టేనా
1986 తర్వాత 2006లో గోదావరికి ప్రమా దకర స్థాయిని మించి వరదలు వచ్చాయి. అపార నష్టానికి కారణమయ్యాయి. అధికా రికంగా 1986లో 300 మందికి పైగా ప్రాణా లు కోల్పోయారు. 2006లో 70మంది మర ణించారు. ఆతర్వాత 2022 జులై16న అత్యధి కంగా నీటిమట్టం నమోదయ్యింది. ఈసారి మాత్రం స్వల్ప సంఖ్యలోనే ప్రాణనష్టంతో గోదా వరి తీరం ఊపిరిపీల్చుకునే అవకాశం దక్కింది. ఇంత పెద్ద వరదల్లో గతానికి, ఇప్పటికీ ఉన్న ఏకైక తేడా ఏటిగట్లు బలోపేతం కావడం. ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీకి ఎగువన అఖండ గోదావరిగా పిలుస్తారు.ఆ ప్రాంతం లో ఏటి గట్ల పొడవు 81.80కి.మీ.ఉం టుం ది.నదికి ఎడమ వైపు కొంత భాగాన్ని అంగు ళూరు ఫ్లడ్‌ బ్యాంకు అంటారు. దాని పరిధి 1.93 కి.మీ..ఇక బ్యారేజీ దిగువన గౌతమి ఏటి గట్లు 204.70కి.మీ.పరిధిలో ఉన్నాయి. వశిష్ఠ గోదావరి గట్లు 246.30 కి.మీ.పొడవు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వైనతేయ సహా ఇతర నదీపాయల గట్లు కూడా కలిపితే దాదాపుగా 700 కిలోమీటర్లు ఉంటా యి. భద్రాచలం వద్ద 71 అడుగులకు చేరిన నీటి మట్టం కారణంగా,ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద సుమారుగా 27లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలాల్సి రావడంతో గోదావరి నదీ ప్రవాహం నిండుకుండను తలపించింది. అయినప్పటికీ పెద్ద ముప్పు రాకుండా నివారిం చేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.రాత్రి, పగలూ వివిధ శాఖల సిబ్బంది పలు చోట్ల పహారా కాయాల్సి వచ్చింది. స్థానికుల సహకారంతో గట్లు పరిరక్షించాల్సి వచ్చింది. ఈ ప్రయత్నాలే గోదావరి వాసులను ముప్పుల నుంచి తప్పించాయని చెప్పాలి. 2006 వరదల సమయంలో అయినవిల్లి మండలం శానపల్లి లంక,పి గన్నవరం మండలం మొండెపులంక వద్ద గట్లు తెగిపోయాయి. వరద ప్రవాహంతో ఊళ్లన్నీ జలమయమయ్యాయి. ఊరూ, ఏరూ ఏకం కావడంతో అపారనష్టం సంభవించింది. ఆ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో పాటుగా యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ కూడా పర్యటించారు. ఆ సమయంలో గోదావరి గట్లు ఆధునికీకరిస్తామని శానపల్లిలంకలోనే సీఎం వైఎస్సార్‌ ప్రకటించారు. దానికి తగ్గట్టుగా 1983 వరదల తీవ్రతను ప్రామాణికంగా తీసుకున్నారు. అప్పట్లో దాదాపు 35 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించిన నేపథ్యంలో అలాంటి వరదలు మళ్లీ వచ్చినా ఎదుర్కోగల సామర్థ్యంతో గట్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2006 వరదల నుంచి నేర్చుకున్న పాఠంతో సుమారుగా రూ.600 కోట్ల వ్యయంతో 535 కిలోమీటర్లు మేర ఆధునికీకరణ పనులు జరిగా యి.గట్లు ఎత్తు అందుకు తగ్గట్టుగా పెం చారు. ఆనాటి నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునికీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక ఆధారంగా ఈ పనులు చేశారు. ఇటీవల వరదల నుంచి కూడా కోన సీమ, పశ్చిమ గోదావరిలతో పాటు ప్రస్తుతం 5 జిల్లాల పరిధిలో ప్రజలకు ఉపశమనం దక్కేం దుకు ఆనాటి పనులు తోడ్పడ్డాయి. కానీ రాను రాను గట్ల పరిస్థితికి నానాటికీ తీసికట్టు చందంగా మారుతోంది. అప్పట్లో పనులు పూర్తికాని చోట ఈసారి ప్రమాద సంకేతాలు వెలువడ్డాయి. వశిష్ఠ కుడి గట్టు నరసాపురం, వశిష్ఠ ఎడమ గట్టు పరిధిలో 48వ కిలోమీ టరు నుంచి 90వ కిలో మీటరు వరకు మూడు ప్యాకేజీలు ఆనాటి నుంచి అసంపూర్ణంగా వదిలేశారు.
ఇసుక తవ్వకాలతోనే తలనొప్పులు..
గోదావరి ఏటిగట్లు పటిష్ట పరిచినప్పటికీ వాటి లక్ష్యం దెబ్బతింటోందని ఇటీవలి వరదలు చాటుతున్నాయి. ముఖ్యంగా ఇసుక తవ్వకాలతో నదీ ప్రవాహం, ఒడి పెరగడమే కాకుండా ఏటిగట్లు బలహీన మవుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇసుక తవ్వకాల విషయంలో నిబంధనలు అనుసరించకపోతే అనేక అనర్థాలు చవి చూడాల్సి వస్తుందని ఇరిగేషన్‌ నిఫునులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గోదావరి ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. యంత్రాలు వినియోగించ కూడ దనే నిబంధన కేవలం పేపర్లకే పరిమితం. పైగా గట్లుని ఆనుకుని తవ్వేస్తుండడంతో గ్రోయిన్లు దెబ్బతింటున్నాయి. ఏటిగట్లు బలంగా ఉండేందుకు వాటిని నిర్మిస్తే ఇసుక తవ్వకందా రులు వాటిని కొల్లగొట్టేస్తు న్నారు. గట్లకి రక్షణ లేకుండా పోతోంది. ఏటిగట్లు మీద భారీ వాహనాల రాకపోకల కోసం బాటల పేరుతో గట్లు దెబ్బతీస్తున్నారు. ఫలితంగా వరదలు వచ్చిన ప్పుడు ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో ఎక్కువగా భయాందోళనలు ఎదుర్కోవాల్సి వస్తోందని’’ భావిస్తున్నారు.
కృష్ణా తీరంలోనూ అదే కథ..
గోదావరి వరదల తాకిడికి కోనసీమ వాసులు ఎక్కువగా కలత చెందుతుంటే కృష్ణా వరదల వల్ల అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్‌ దిగువ ప్రాంతాలు వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది. విజయవాడ నగరంలోని పలు ప్రాంంతాలు కూడా వరద తాకిడికి తల్లడిల్లిపోవాల్సిన దుస్థితి నేటికీ ఉంది.కృష్ణా నదికి 2009లో భారీవరదలు వచ్చాయి. ఆ వరదల మూలంగా కృష్ణా తీర మంతా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. 2020లో కూడా వరద తాకిడి ఎక్కువగా నమోదయ్యింది. కానీ అంత పెద్ద ముప్పు లేకుండానే ప్రజలు బయటపడ్డారు. 2009 తర్వాత కృష్ణా నది కరకట్ల విషయంలో కూడా కొంత దృష్టి పెట్టారు. కానీ ఇసుక తవ్వకం దారుల తీరుతో నదీగర్భం కొల్లగొట్టడం, కరకట్ట దెబ్బతినడం వంటివి ఎదురవుతున్నాయి. ‘‘రాష్ట్రంలో గోదావరి, కృష్ణా వంటి నదులకు వరదలు తప్పవు. ఒక ఏడాది తప్పినా,ఎప్పటికయినా ముప్పు ఉంటుంది.దానికి మనం సన్నద్ధంగా ఉండాలి. కానీ అనేక అనుభవాల తర్వాత కూడా పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. ఏటా వరదలు వస్తున్నాయనగానే వందల గ్రామాలు వణికిపోవాల్సి వస్తోంది. ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం చూడాలి. అసాధా రణంగా ఎప్పుడయినా వరద వస్తే తప్ప, సాధారణ వరదలకు పెద్దగా భయపడాల్సిన పరిస్థితి లేకుండా చేయాలి. అందుకు కరకట్టలు బలోపేతం చేయడం,వాటిని పరిరక్షించడమే మార్గం.కోట్లు వెచ్చించి పనులు చేసిన తర్వాత ఇసుక కాంట్రాక్టర్ల వ్యాపారం కోసం భారీ వాహనాలతో వాటిని బలహీనపరిస్తే ఏమి ఉపయోగం ఉంటుంది. కాబట్టి యంత్రాంగం అటువైపు దృష్టి సారించాలి’’అన్నారు ఇరిగేషన్‌ రిటైర్డ్‌ ఎస్‌ ఈ పీవీ రామారావు. దేశంలో వరద తాకిడి నుంచి గట్టెక్కడానికి వివిధ రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నాలను మనం పాఠంగా తీసుకొవచ్చని ఆయన బీబీసీతో అన్నారు. తమి ళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వరద నియం త్రణ చర్యలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రమాదం అంచున పెన్నా తీరం…
గోదావరి, కృష్ణా నదులతో పాటుగా వంశధార, నాగవళి సహా వివిధ నదుల మూలంగానూ వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది.వాటిలో పెన్నా ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో 2021 నవంబర్‌లో వచ్చిన వరదలు చాటిచెప్పాయి. ఏకంగా అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయే దశ నుంచి, సోమశిల ప్రాజెక్టు పరిస్థితి గురించి ప్రశ్నలు ఎదురయ్యే వరకూ వచ్చింది. భవిష్యత్తులో మరింత ముప్పు తప్ప దనే అంచనాలు ఉన్నాయి. దాంతో దానికి అనుగుణంగా చర్యలు అవసరమనే వాదన ఉంది. ‘‘అన్ని నదులకు కొన్ని సహజ లక్షణా లుంటాయి.20,30ఏళ్లలో ఓసారి అసాధా రణంగా ప్రవాహం వస్తుంది. వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటికి అనుగుణంగా మనం అప్రమత్తం కావాలి. వరద వచ్చినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత దానిని వదిలేయడంవల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. నిరుడు పెన్నా వరదలు, ఈ ఏడాది గోదావరి వరదలు వంటివి మనకు మేలుకొలుపు కావాలి. భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా అన్ని నదీ తీరాలను ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయాలి. వాటిని ఎప్పటి కప్పుడు పరిరక్షణ జరగాలి’’ అంటూ పర్యా వరణ వేత్త సీహెచ్‌ శ్రీనివాసరావు అన్నారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంది. ఓవైపు వరద నీరు వెల్లువలా వచ్చి పడుతుంటే అప్పటికప్పుడు 2 మీటర్లు ఎత్తు పెంచినట్టు చెప్పడం విస్మయకరంగా కనిపించిందని,వరద నివారణ విషయంలో ప్రభుత్వ సన్నద్ధతను ఈ పరిణామం చాటుతుంది.ఆధునికీకరణలో భాగంగా వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని ఇటీవల సీఎం జగన్‌ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాం తాలలో పర్యటనలో భాగంగా రాజమహేం ద్రవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులను ఆదేశించారు. శాశ్వత చర్యలపై దృష్టిపెడతాం. నవంబర్‌ కల్లా మనం టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలు పెడదాం’’ అంటూ ఆయన అధికారులను ఉద్దే శించి వ్యాఖ్యానించారు.సీఎం ఆదేశా లకు అనుగు ణంగా శాశ్వత వరద నివారణ చర్యలకు సర్కారు సిద్ధమయితే గోదావరి తీర వాసుల భయాందోళనలు తగ్గుతాయి. అదే సమయంలో ఇతర ప్రధాన నదుల వెంబడి కరకట్టల తీరు మీద కూడా దృష్టి పెట్టాలనే అభిప్రాయం వినిపిస్తోంది.

మళ్లీ కరోనా టెన్షన్‌

జన జీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నది. మొన్నటి దాకా స్తబ్ధుగా ఉన్న కొవిడ్‌.. కొద్దిరోజులుగా విస్తరిస్తున్నది. ఫలితంగా పాజిటివ్‌ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి తగ్గడం, వ్యాక్సిన్‌ తీసుకున్నామన్న భరోసాతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడం మానేశారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటిం చాలన్న సోయి మరిచారు. ఫలితంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసు కోవాలని సూచిస్తున్నది. వైరస్‌ వల్ల తీవ్ర ఇబ్బందు లు పడిన ప్రజలు ఇక నుంచైనా జాగ్రత్తలు తీసు కోవాలి. అందరూ నిబంధనలు పాటిస్తేనే కొవిడ్‌ వ్యాప్తిని నిలువరించడం సాధ్యమవుతుంది. – జిఎన్‌వి సతీష్‌
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుం డటంతో అనేక దేశాలు మళ్లీ ఆంక్షలను విధిస్తున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మన దేశంలోనూ వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాయడం ఆహ్వానించదగిన పరిణామం. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించింది. అయితే లేఖతో పాటు సమావేశంలోనూ రాష్ట్రాలకు సూచనలు చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టే నిర్దిష్ట చర్యల ఊసు లేదు. గతాను భవాల దృష్ట్యా ఈ తరహా ధోరణి ఏమాత్రం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబు తున్న సమాచారం ప్రకారమే కరోనా వైరస్‌ తాజా విజృంభణకు కారణమైన ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బిఎఫ్‌-7 కూడా మన దేశంలో వెలుగులోకి వచ్చింది. దేశంలో ఈ రకం వైరస్‌ ముగ్గురికి సోకింది. ఇది బలంగా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుందని, ఇంక్యుబేషన్‌ వ్యవధి తక్కువగా ఉండటంతో పాటు ఒకరి నుండి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్ల సామర్ధ్యాన్ని సైతం అధిగమిస్తుందని అంత ర్జాతీయ నిర్ధారణ. అయితే, మన దేశంలో బిఎఫ్‌-7 రకం తొలి కేసును అక్టోబర్‌లోనే గుజరాత్‌లో గుర్తించారు.ఆ తరువాత ఇప్పటి వరకు మరో మూడు కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వీటిలో రెండు గుజ రాత్‌ లోనే నమోదుకాగా, మరొ కటి ఒడిశా లో వెలుగులోకి వచ్చింది. జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ ట్రాకర్‌ తాజా గణాంకాల ప్రకారం గడిచిన 28రోజుల్లో (డిసెంబర్‌ 21నాటికి) జపాన్‌లో అత్యధికంగా 34లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరి యాలో16 లక్షల కొత్త కేసులు,1,385 మరణాలు సంభవించాయి. అమెరికాలో గత 28 రోజుల్లో 15,89,284 మందికి వైరస్‌ సోకింది.కోవిడ్‌ 19 వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఆ దేశంలో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 100 మిలియన్లకు చేరింది. ఫ్రాన్స్‌లో 15,26,427 మంది ఈ కాలంలో కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. బ్రెజిల్‌లో 9, 45,568 మందికి వైరస్‌ సోకగా, 3,125 మంది మరణించారు. చైనాలో 9,17,308 కేసులు నమోదుకాగా, 646 మరణాలు సంభవించాయి. జీరో కోవిడ్‌ పాలసీని సడ లించిన తరువాత చైనాలో వైరస్‌ ఉధృతంగా వ్యాపిస్తోంది. జీరో కోవిడ్‌ విధానాన్ని కార్పొరేట్‌ మీడియా తీవ్రంగా విమర్శించిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఈ సమయంలోనే మన దేశంలో 6,482 మంది వైరస్‌ బారిన పడగా 86 మంది మృతి చెందినట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ ట్రాకర్‌ నమోదు చేసింది.
కరోనా వ్యాప్తితో గత మూడేళ్ల కాలంలో దేశంలో కోట్లాది మంది ఆప్తులను కోల్పో యారు. ఆకస్మిక లాక్‌డౌన్‌ సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తిస్థాయి లో పునరుద్ధరణ జరగలేదు. ఆర్థిక సంక్షోభం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టడంతో పాటు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్య, ఆరోగ్య వ్యవస్థలను తక్షణమే బలోపేతం చేసుకోవాలి. దానికవసరమైన నిధులను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాలి. మందులకు కొరత రాకుండా చూడాలి. వ్యాక్సినేషన్‌ గురించి కేంద్ర ప్రభు త్వం ఎంత గొప్పగా చెబుతున్నప్పటికీ దాదా పుగా 27శాతం మంది ఇంకా మొదటి విడత వ్యాక్సినే అందలేదు. రెండు డోసులు వేసుకోని వారి సంఖ్య 32 శాతం దాకా ఉంది. ఇక బూస్టర్‌ డోస్‌ లెక్కల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందించడానికి కేంద్రం ఇప్పటికైనా సిద్ధపడాలి. వైరస్‌ను అడ్డుపెట్టుకుని కార్పొరేట్‌ మిత్రులకు కోట్లు కట్టబెట్టే విధానానికి స్వస్తి పలికి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాలతో కలిసి కార్యాచరణకు కదలాలి. అటువంటి చర్యలే ప్రజలకు ధైర్యాన్నిస్తాయి. మహమ్మారిని నియంత్రించడంలో వారందరినీ భాగస్వామలను చేస్తాయి.
అకస్మాత్తుగా అలజడి..
కొవిడ్‌ తగ్గడంతో 2020 మార్చి నెలకు ముందు నాటి సాధారణ పరిస్థితులు వచ్చాయనే భావనలో ప్రజలు ఉన్నారు. సాధారణ జీవితానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. మొదటి, సెకండ్‌ వేవ్‌లతో తీవ్ర ఇబ్బందులకు గురి కాగా, థర్డ్‌ వేవ్‌ ఇలా వచ్చి అలా వెళ్లడంతో ప్రజల్లో భయమే కనిపించలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్నందున తమకేమీ కాదులే అనే ధీమాతో ప్రజలు చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్నారు. ఫలితంగా వైరస్‌ జాడ మళ్లీ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మాస్కు తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నది.
జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..
కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా గణాంకాలను చూస్తుంటే అర్థం అవుతున్నది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బయటికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలను పాటించాలి. మాస్కులు వాడడం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా చేతులు శుభ్రం చేసుకోవడం అలవర్చుకోవాలి. వైరస్‌ సోకిన వారికి తగిన వైద్యం అందించేందుకు దవాఖాన ల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు చాలా మంది ప్రికాషన్‌ డోసు తీసుకోలేదు. వారంతా మూడో డోసును తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు

అడవి బిడ్డల చదువులకు సహకారం ఇలాగేనా?

98 శాతం జిపిఎస్‌ పాఠశాలలు ఒక ఉపా ధ్యాయునితోనే నడుస్తున్నాయి. ఒక ఉపాధ్యా యునితో గిరిజన బాలబాలికలకు నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రభుత్వం,అధికారులు చెప్పాలి.ఉపాధ్యా యుడు ఎప్పుడైన అత్యవసర పని ఉండి సెలవు పెడితే, ఆరోజు మధ్యాహ్న భోజనం కోసం మాత్రమే బడి నడు స్తుంది. విద్యారంగ సంస్కరణలను అమలు చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందుల గురించి యుటిఎఫ్‌ చెప్పినా అధి కారులు చెవికెక్కించు కోలేదు. కొన్ని గ్రామాల్లో బడి ఈడు కలిగిన బాలబాలికలు ఆడుకుంటున్నారు. లేదా తల్లిదం డ్రుల పనిలో నిమగమవు తున్నారు. బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉంటే గిరి జన అభివృద్ధి సాధ్యమేనా ?— (ఎన్‌.వెంకటేశ్వర్లు)
చదువు చైతన్యాన్ని ఇస్తుంది.నాగరికత ను నేర్పుతుంది.జీవన ప్రమాణాలను పెంచు తుం ది.అలాంటి చదువును ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని అందరికీ నేర్పాలి.నేర్చుకోవడానికి కావలసిన పరిస్థి తులను కల్పించాలన్న సంకల్పంతో గిరిజన ప్రాం తాలలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను స్థాపిం చారు. 1976 నుండి ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ఈబాధ్యతను చూస్తున్నది.గిరిజన విద్యారంగ సంస్క రణలలో భాగంగా 2006లో ప్రాథమిక పాఠశా లలను విభజించి ఒకటిరెండు తరగతులతో జిపి ఎస్‌ పాఠశాలలు,3-10తరగతులతో ఆశ్రమ పాఠ శాలలు ఏర్పరిచారు. ప్రాథమిక పాఠశాలల విభ జన వద్దని పోరాటం చేసిన చోట కొన్నిపాఠశా లలు1నుంచి5వరకు యథాతథంగా కొనసాగుతు న్నాయి. జిపిఎస్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కువ శాతం ఒకఉపాధ్యాయునితోనే నడుస్తు న్నాయి. గిరిజన విద్యారంగ సమస్యలను గుర్తించి అధికారులకు, ప్రభుత్వానికి యుటిఎఫ్‌ విన్నవిం చినా,పోరాటాలు చేసినా ఎలాంటి పరిష్కారాలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో గిరిజన విద్యారంగ సమ స్యల పరిష్కారానికి యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వ ర్యంలో అన్ని ఐటిడిఎలలోని ఆశ్రమ,జిపిఎస్‌ పాఠ శాలలను జీపు జాతాద్వారా సందర్శించడం జరి గింది.ఈజాతాలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలతో పాటు యుటిఎఫ్‌నాయకులు పాల్గొన్నారు.గతంలో గుర్తిం చిన సమస్యలతోపాటు,గిరిజన పాఠశాలల చుట్టూ అనేక సమస్యలను జాతా బృందం గుర్తించింది.
పాఠశాలల పరిస్థితి
ఆశ్రమ పాఠశాలలు,3-10తరగతుల పాఠశాలలు, పోస్ట్‌మెట్రిక్‌, గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు అన్నీకలిపి 748 పాఠశాలలు ఉన్నా యి.వీటితోపాటుజిపిఎస్‌1-2తరగతి పాఠశాలలు 1933ఉన్నాయి.98శాతం జిపిఎస్‌ పాఠశాలలు ఒకఉపాధ్యాయునితోనే నడుస్తున్నాయి. ఒక ఉపాధ్యా యునితో గిరిజన బాలబాలికలకు నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రభుత్వం,అధికారులు చెప్పాలి. ఎవరైనా ఉపాధ్యాయుడు అత్య వసర పనిఉండి సెలవు పెడితే,ఆరోజు మధ్యా హ్నం భోజనంకోసం మాత్రమే బడి నడుస్తుంది.విద్యారంగ సంస్కరణ లను అమలు చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందుల గురించి యుటిఎఫ్‌ చెప్పినా అధికారులు చెవికెక్కిం చుకోలేదు.కొన్ని గ్రామాల్లో బడిఈడు కలిగిన బాల బాలికలు ఆడుకుంటున్నారు లేదా తల్లిదండ్రుల పనిలోనిమగమవుతున్నారు.బడిలోఉండాల్సిన పిల్ల లు పనిలోఉంటే గిరిజన అభివృద్ధి సాధ్యమేనా ?
విద్యార్థుల సమస్యలు
ఇప్పటికీ 2019 నాటి మెస్‌ చార్జీలనే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు కడుపు నిండా భోజనం అందుతున్న పరిస్థితులు లేవు.రోజుకు మూడు-నాలుగు తరగతుల వారికి33.34 పైసలు, 5-10 తరగతుల వారికి 41.66 పైసలు, ఇంటర్‌ వారికి 46.67 పైసలు మాత్రమే మెనూ ఛార్జీలు ఇస్తున్నారు. ఈరోజుకిపెరిగిన రేట్లు ప్రకారం కాకుం డా మూడుసంవత్సరాల క్రితం మెనూచార్జీల ద్వారా ఎలాంటి నాణ్యమైన పోషక పదార్థాలు అందు తాయో కళ్లారాచూశాక మనసు ద్రవించి పోయింది. అర్థాకలితో గిరిజనబిడ్డలు చదువు నేర్చుకుంటారా? ప్రభుత్వం ఎందుకని ఈమెస్‌ చార్జీల పెంపు వైపు ఆలోచించటం లేదు? 2019కి ముందు నాలుగు జతల యూనిఫామ్‌లు,ఒక జతవైట్‌ బట్టలు ఇచ్చే వారు. ఇప్పుడు మూడు జతల బట్టలు మాత్రమే ఇస్తున్నారు.గతంలో 22నోట్‌ పుస్తకాలు ఇస్తే, ప్రస్తు తం 9లేక 12నోటు పుస్తకాలు ఇస్తున్నారు. కాస్మొ టిక్‌ వస్తువుల సరఫరా లేదు. అనారోగ్యం వస్తే హాస్టల్‌లో ఎఎన్‌ఎం లేరు. ప్రాథమిక ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి వాహన సదుపాయాలు లేవు. విద్యార్థుల్ని ఉపాధ్యాయుల సొంతఖర్చుతోనే ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. హాస్టల్‌కి కావలసిన వస్తువులను పాఠశాల కేంద్రానికి సరఫరా చేయడానికి ఏర్పాట్లు లేవు.సెలవులకి ఇంటికి వెళితే మరల పాఠశాలకు రావడానికి బస్సు ఛార్జీలులేక సకాలంలో బడికి రాని విద్యార్థుల సంఖ్య తక్కువేమీ లేదు.ఇలాంటి పరిస్థితుల్లో చదువు సాగించడం సాధ్యమా? మెనూఛార్జీలను నేటి రేట్ల ఆధారంగా సవరించాలి.గతంలో లాగా ఐదు జత ల బట్టలు,కాస్మొటిక్‌ చార్జీలు చెల్లించాలి.
ఉపాధ్యాయుల సమస్యలు
నియమించబడిరది విద్యార్థులకు నాణ్య మైన విద్య అందించడానికి. చేస్తున్నది అటెండర్‌ నుంచి ప్లంబర్‌ పనివరకు అన్నీ. బోధనేతర కార్య క్రమాలతో వేదనకు గురవుతున్నారు. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకునే దానికోసం వార్డెన్ల డ్యూటీ చేస్తున్నారు.98 శాతం ఆశ్రమ పాఠశాలలో వార్డెన్లు లేరు.ఉపాధ్యాయులే డిప్యూటీవార్డెన్‌గా పని చేస్తు న్నారు. కొన్ని ఐటిడిలలో ఒకటి లేదామూడు సంవ త్సరాల చొప్పున రొటీన్‌ పద్ధతిలో ఒక్కొక్కరు, కొన్ని ఐటిడిఎ లలో మూడు నెలలకు ఒకరు చొప్పున ఉపాధ్యాయులే డిప్యూటీ వార్డెన్‌గా ఉంటున్నారు.ఈ కాలంలో విద్యార్థులకు ఇబ్బందివస్తే తన ఉద్యోగం ఎక్కడ పోతుందోననే భయంతో ఏఎన్‌ఎంలను కుక్‌ లను,కమాటీలను సొంత డబ్బులుఇచ్చి నియామ కం చేసుకుంటున్నారు. పొరపాటున ఎక్కడైనా విద్యా ర్థికి ఇబ్బందివస్తే వీరినిదోషులుగా చేసిశిక్షిస్తు న్నారు. కొన్నిచోట్ల ఎలక్ట్రీషియన్‌ డ్యూటీ కూడా ఉపాధ్యా యులే చేస్తున్నారు.రాత్రిబసఉండటానికి ఉపాధ్యా యులకు ప్రత్యేక గదులు, క్వార్టర్లు లేవు. అయినా రాత్రి బస చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీం కోర్టు జీవో3రద్దు చేశాక ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. దానితోపాటు గిరిజన సంఘంవారు కోర్టుకు వెళ్లా రు.ఇంకా పరిష్కారం కాలేదు. దీని వల్ల ప్రమోషన్ల ప్రక్రియ ఆగిపోయింది. అక్కడక్కడ అధికారులు జీవో నెంబర్‌ 3కి భిన్నంగా ప్రమోషన్‌ ఇస్తామని చెబుతున్నారు. మూడు డివైఇవో పోస్టులు, రెండు డిఈవో,పూర్తి ఏజెన్సీ మండలాల్లో ఎంఈవో పోస్టు లు గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన ఉపాధ్యాయులతో పూరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది. 524పైగా పండిట్‌,పిఇటి పోస్టుల అప్‌గ్రెడేషన్‌ ఆర్థిక శాఖ కొర్రీవల్ల ఆగిపోయింది.ప్రధానోపాధ్యాయుల ప్రమో షన్లు లేవు. అర్హత కలిగిన వారికి జూనియర్‌ కళా శాల అధ్యాపకుల ప్రమోషన్లు ఇవ్వడం లేదు. జీవో నెంబర్‌ 3ని యథాతథంగా అమలు చేయడానికి కావలసిన చర్యలు తీసుకొని ప్రమోషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంది. ఆర్థికశాఖ అవాంత రాలను అధిగమించి అప్‌గ్రేడ్‌ ప్రక్రియను పూర్తి చేయాలి.వార్డెన్‌ పోస్టులను భర్తీ చేయాలి. ఎఎన్‌ఎం నియామకాలను చేపట్టాలి. ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్ల తో పాటు పాఠశాలలో బోధనేతర సిబ్బంది, కంప్యూ టర్‌ ఆపరేటర్‌,వాచ్‌మెన్‌,అవసరం ఉన్న చోట కమా టి,కుక్‌ లను నియమించాలి. సి.ఆర్‌.టి వ్యవస్థ గిరిజన పాఠశాలల్లో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతాలలో అర్హత కలిగిన వారిని సిఆర్‌టి లుగా నియమించారు. రాష్ట్రంలో 1798 మంది సిఆర్‌టిలుగా పనిచేస్తున్నారు. గతంలో పది రోజుల గ్యాప్‌తో 12 నెలల జీతం చెల్లించేవారు. గడిచిన సంవత్సరంగా పది నెలల జీతం మాత్రమే చెల్లిస్తు న్నారు. 12 సెలవులు మాత్రమే ఇస్తున్నారు. రెగ్యు లర్‌ ఉపాధ్యాయుల్లా పనిచేస్తున్నా సదుపాయాలు సక్రమంగా ఇవ్వడం లేదు. అత్యంత దుర్భర పరిస్థి తుల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి, క్వాలిఫై అయిన వారికి ఇంత తక్కువ జీతం ఇవ్వటం న్యాయం కాదు. ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయించుకోవ డానికి పోరాటం చేయాల్సి వస్తున్నది. కొన్ని పోస్టు లు అవసరం లేదనే పేరుతో 186 మంది సిఆర్‌టి లను స్కూల్‌ అసిస్టెంట్ల నుండి ఎస్‌జిటి లుగా డీగ్రేడ్‌ చేశారు. సిఆర్‌టి వ్యవస్థ మొత్తాన్ని రెగ్యులర్‌ చేయాలి.
భాషా వాలంటీర్లు
గిరిజన భాషాభివృద్ధి కోసం జిపిఎస్‌ పాఠశాలల్లో భాషా వాలంటీర్లను సమగ్ర శిక్షా అభియాన్‌ నిధుల సహకారంతో ప్రభుత్వం నియ మిస్తుంది. సుమారు 1242మంది వివిధ భాషా వాలంటీర్లను ప్రభుత్వ ఈసంవత్సరం నియ మించాల్సి ఉంది. పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా భాషా వాలంటీర్లను ఇంతవరకు నియమించలేదు. పాత బకాయిలు చెల్లించాలని, ఈ సంవత్సరం తిరిగి రెన్యువల్‌ చేయాలనే డిమాం డ్‌తో72గంటల నిరాహార దీక్షలు చేసినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. సమగ్ర శిక్షా అభియాన్‌ నిధులు కేటాయించినా ఏదో ఒక కొర్రీతో కొద్దిచోట్ల వాలం టీర్లను నియమించడం లేదు. కేవలం రూ.5000 జీతంతో నియమించే భాషా వాలంటీర్లు పాఠశా లలకు విద్యార్థులు రావడానికి, వారి భాషాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వాలంటీర్లు లేకపోతే ఆ పాఠశాల మూత వేయా ల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి వాలం టీర్ల వ్యవస్థను ఏదో ఒక కారణంతో రెన్యువల్‌ చేయకపోవడం గిరిజన విద్యార్థులకు విద్యను అందించడానికా లేక గిరిజన భాషాభివృద్ధి చెంద కుండా చేయడానికా అన్న అనుమానం కలుగు తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే భాషా వాలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలి.
చదువు.. చైతన్యం..
2011 జనాభా లెక్కల ప్రకారం గిరి జన అక్షరాస్యత 58.96 శాతం. మహిళ అక్షరాస్యత 38 శాతం. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈగణాంకాలు ఎలాం టి సంకేతాలు ఇస్తున్నాయి? దేశంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందిం దని…చెందుతోందని ఎలా చెప్పగలం? విద్యకు కావలసిన నిధులు సక్రమంగా కేటాయించకుండా, విద్య నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థికి సదుపాయాలు కల్పించకుండా, గిరిజనుల విద్యాభివృద్ధి సాధ్యమా? చదువు నాగరికతను,నైపుణ్యాన్ని నేర్పాలి.ఆ నైపు ణ్యం గౌరవప్రదమైన జీవనాన్ని సాగించడానికి కావలసిన చైతన్యాన్ని ఇవ్వాలి.చదువుకోడానికే ఇన్ని ఆటంకాలు ఏర్పడితే గిరిజనులు సంపూర్ణ మానవు లుగా ఎలా తయారవుతారు? పీసాచట్టం,1/70 యాక్ట్‌,అటవీ హక్కుల చట్టం అమలు కోసం కృషి చేసే గిరిజన సంఘాలకు సంఫీుభావం తెలపాలి. జీవో నెంబర్‌ 3,అప్‌గ్రెడేషన్‌,మెనూచార్జీల పెంపు, ఏఎన్‌ఎం, వార్డెన్‌ నియామకం, ప్రమోషన్‌ లాంటి సమస్యలపరిష్కారానికి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ చేసే పోరాటాలతో కలిసి పనిచేయడానికి సిద్ధం కావాలి. గిరిజన సంక్షేమం మాలక్ష్యం అని చెప్పే పాలకులు చిత్తశుద్ధితో గిరిజన సంక్షేమానికి బడ్జెట్‌ లో నిధులను కేటాయించడం, ఖర్చు చేయడంతో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలి. తద్వారా గిరిజన విద్యాభివృద్ధికి తోడ్పా టు అందించాలి. (వ్యాసకర్త : యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు)

జీవ వైవిధ్యం కొన్ని జాతుల కవచం

మనిషి విచక్షణారాహిత్యం వల్ల రోజురోజుకూ జీవవైవిధ్యం దెబ్బ తింటోంది. ప్రకృతి విధ్వంసకర పనుల వల్ల జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. నానాటికి కాలుష్యం పెరిగిపోవడం, విస్తరించాల్సిన జీవజాతుల శాతం తగ్గిపోవడం జీవ వైవిధ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవాళికి భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాయి ప్రపంచ పర్యావరణ, జీవవైవిధ్య సదస్సుల నివేదికలు. డిసెంబర్‌ 29న ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.! `
జీవవైవిధ్యం.. ఆవశ్యకత
అవనిపై జీవించే సకల జీవరాశిని కలిపి జీవవైవిధ్యం అంటున్నారు. సరళంగా చెప్పాలంటే వివిధ రకాల జీవజాతుల సముదాయాన్నే జీవ వైవిధ్యం అంటాం. సూక్ష్మరూపంలోని తొలిజీవి ప్లాజిల్ల్లెటా అనే ఏక కణ జీవి ప్రీ బయాటిక్‌ సూప్‌ అనే సముద్ర అడుగు నీటిలో పుట్టిందని శాస్త్రవేత్తలు నిర్ధారిం చారు. తొలుత వృక్షాలు, జంతుజాలం అవతరించాయి. క్రమక్రమంగా ఉభయచరాలు, పక్షులు పుట్టు కొచ్చాయి.ప్రస్తుతం నేలమీద ఎన్నో రకాల వృక్షాలు, పండ్లు, జంతు జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరం.కుందేళ్లు,గేదేలు,జీబ్రాలు వంటివి పచ్చని గడ్డి తింటాయి. ఈజంతువులను మాంసాహారులైన సింహం,పులి,చిరుతపులులు ఆరగిస్తాయి. గొల్ల భామలు గడ్డిని తింటే వాటిని కప్పలు భక్షిస్తాయి. ఈ చక్రంలో ఒకబంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తాయి. పాములు నాశనమైతే ఎలుకల సంతతి అనుహ్యంగా పెరిగి పోతుంది. దానితో ఎలుకలు పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయి. మానవుడు తన మనుగడ కోసం చుట్టూ ఉన్న పరిసరాలపై ఆధార పడి జీవిస్తాడు.ఆహారం,గాలి,నీరు రక్షణ,ఆశ్రయం నిత్యావసర వస్తువులు అన్నీ ప్రకృతి ఉత్పత్తులే. కంటికి కనబడని ఎన్నో జీవులు సైతం పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. ఇలా ఒక జీవి మనుగడ మరో జీవి మనుగడకుప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తు న్నాయి. పెరుగుతున్న జనాభా..వనరులను మితిమీరి వినియోగించడం..ఫలితం జీవవైవిధ్య పరిరక్షణ సంక్లిష్టంగా మారుతోంది. అడవుల దహనం..భారీ ప్రాజెక్టుల నిర్మాణం.. ఇష్టా రాజ్యంగా పరిశ్రమల ఏర్పాటు..యథేచ్ఛగా గనుల తవ్వకం..నగరీకరణ..అణు విద్యుత్‌ కేంద్రాలు..విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం.. వ్యవసాయంలో రసాయనాల వాడకం..తదిత రాలు జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితం గా భూమిపై ఉన్న కోట్లాది జీవరాశుల్లో మూడిరట రెండొంతులు అంతరించే ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించు కోవడంతో పాటు పేదరిక నిర్మూలన..సుస్థిర జీవనోపాధి..అభివృద్ధిలో సమానత వంటి అంశాలతో జీవవైవిధ్యం ముడిపడి ఉంది. జీవిత భవిష్యత్తును నిర్మించడానికి ఆశ,సంఫీుభావం,అన్ని స్థాయిల్లో కలిసి పనిచేయాల్సిన ప్రాముఖ్యత కలిగి వుంది. భూమిపై ఒకేజాతి జీవుల మధ్య భేదాన్నే ‘జీవ వైవిధ్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల జాతుల జీవ వైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణా మం. మానవ జీవనశైలితో పర్యావరణం కలుషితమై, భూగోళం వేడెక్కిపోతుంది.దీంతో జీవ వైవిధ్యమూ దెబ్బతింటోంది. ఫలితంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. దాదాపు 20 ఏళ్లలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా కలిగే నష్టాలు 150శాతం మేర పెరిగాయి. వాతావరణ భూ భౌతిక వైపరీ త్యాల వల్ల ఏకంగా 13 లక్షల మంది చనిపో యారు.పేద, మధ్యతరగతి దేశాల్లోనే మర ణాలు మరింత ఎక్కువ. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదికలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆందోళనకర అంశాలు వెల్లడిరచింది. సముద్ర మట్టాలు, సాగరాల ఆమ్లత పెరుగుతుందనీ..గత నాలుగేళ్లలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. దాదాపు 10లక్షల మొక్కలు, జీవ జాతులు కనుమరుగయ్యే ప్రమాదం ముంచు కొచ్చిందని స్పష్టం చేసింది. ఈ భూమి ఏర్పడి, 350 కోట్ల సంవత్సరాలు. ప్రపంచ వ్యాప్తంగా కోటి 40 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటిల్లో 80 లక్షలు మాత్రమే గుర్తించాం. అందులో మన దేశంలో కేవలం 17లక్షల జీవరాశుల సమాచారం మాత్రమే ఉంది. ప్రపంచ వ్యాప్తం గా అత్యధిక వన, జల, జీవ రాశులున్న దేశా ల్లో భారత్‌ 12వ స్థానంలో ఉంది. మొత్తం మీద 12శాతం అడవులు మనదేశంలోనే ఉన్నా యి. ఇప్పటికీ మన దేశంలో జీవ వైవిధ్యంపై 60 శాతం మంది ఆధారపడి బతుకుతున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు తగ్గిపోయాయి. – ఉదయ్‌ శంకర్‌ ఆకుల

వాతావరణానికి ఏమైంది?

వాతావరణం మారిపోయింది. ప్రతి నోటా ఇప్పుడు ఇదేమాట. ఆకస్మిక వరదలతో మహానగరాలు అతలాకుతలం అవుతున్నాయి. అనావృష్టితో ఎడారిని తలపించే అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో ఉన్నఫళంగా భారీ వర్షాలు దంచికొడతాయి. చలికాలంలో రోళ్లు పగిలే ఎండలు.. వర్షాకాలంలో ఎముకలు కొరికే చలి.. కాలాలకతీతంగా వాతావరణంలో వైపరీత్యాలు చూస్తున్నాం. శిశిరం, గ్రీష్మం, హేమంత రుతువులన్నీ ఏక మవుతున్న పరిస్థితి. ధ్రువ ప్రాంతాల్లో మంచు మేటలు కరిగిపోతున్నాయి. సముద్ర జలాలు తీరం దాటి ముంచు కొస్తున్నాయి. ప్రపంచమంతటా ప్రకృతి విపత్తులే. భూమం డలంలో సంభవిస్తున్న ఈ వైపరీత్యాలకు భూతాపం పెరిగిపోవడమే ప్రధాన కారణం. మానవాళి కొనితెచ్చు కున్న ఈ విపత్తును నివారించకపోతే వాతావరణ మార్పుల ప్రభావం మానవ మనుగడకే ముప్పు తెస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించు కోవాలి. పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌ లాంటి సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలకంటే ముందే కర్బన ఉద్గారాలు యథేచ్ఛగా వెదజల్లి పర్యావరణాన్ని పాడు చేశాయి. కర్బన ఉద్గారాల్లో ఇప్పటికీ పెట్టుబడిదారీ దేశాలదే మెజార్టీ వాటా. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్ప వంటూ … ఆ త్యాగం పేద దేశాలు, వర్ధమాన దేశాలు చేయాలన్నదే అమెరికా, దాని అనుంగు దేశాల వాదన. ప్రపంచ దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని రగిలిస్తూ ఐక్యతను దెబ్బతీస్తున్న ఈ పెట్టుబడిదారీ దేశాలు ఇటు ప్రజలకే కాకుండా పర్యావరణానికి కూడా ప్రధాన శత్రువులే అనేందుకు వారు చేస్తున్న ఈ వాదనే నిదర్శనం.
భూమండలంపై పెరుగుతున్న ఉష్ణో గ్రతలను1.5సెంటిగ్రేడ్‌ డిగ్రీలకు పరిమితం చేయాలన్నది 2015లో పారిస్‌ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన ప్రధాన కర్తవ్యం. కానీ అమెరికా లాంటి దేశాలు ఈ ఒప్పందం నుంచి వైదొలిగి నేలతల్లికి ద్రోహం చేశాయి. జీవా వరణాన్ని ధ్వంసం చేసిన పెట్టుబడిదారీ దేశాలే మిన్నకుండిపోతే ఇక పేద,వర్ధమాన దేశాలు చేసే దేముంది? భూతాపం అందుకే పెను ప్రమాదంగా మారుతోంది. భూతాపాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఏ మూ లకూ చాలవని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూమండలం వాతావరణ సంబంధిత తుపానులు, వడగాలులు, వరదలతో ఇబ్బందులు పడుతోందని, ఉష్ణోగ్రతలు కూడా పారిశ్రామిక యుగానికి ముందు నాటి స్థాయిల కన్నా ఎక్కువగా 1.2 డిగ్రీల సెల్సి యస్‌కు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పెట్రోలు, డీజిలు వంటి శిలాజ ఇంధనాల వినియోగంవల్ల గాల్లోకి వెదజల్లే గ్రీన్‌హౌస్‌ వాయువులే భూతాపానికి కారణం. భూమండలానికి రక్షణగా ఉన్న ఓజోన్‌ పొరను ఈ గ్రీన్‌హౌస్‌ వాయువులు ధ్వంసం చేయడం వల్ల సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకడంతో భూతాపం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలను పరిమితం చేసేందుకు అనుసరించాల్సిన పంథాకు కనీసం దగ్గరలో కూడా లేమన్నది ఐక్యరాజ్య సమితి వాతా వరణ మార్పుల విభాగం ఆందోళన. 2010 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి కాలుష్య వాయు వులు43శాతం తగ్గాల్సిన అవసరం వుంది. అప్పుడే పారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని సాధించగలం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే 2030 నాటికి కాలుష్యాలు 10.6శాతం పెరిగాయని ఐరాస నివేదిక పేర్కొన డం మానవాళి ముందున్న ప్రమాదాన్ని తెలియ జేస్తోంది.శిలాజ ఇంధనాల వినియోగంతో పెరిగి పోతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలనూ తోడే స్తోంది. భారత్‌లో 2021లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ‘ద లాన్సెట్‌’ మెడిక ల్‌ జర్నల్‌ నివేదించింది. ప్రతి రెండు నిమిషాలకు ఒకరు కాలుష్య కాటుకు బలైపోతున్నారన్నమాట. పర్యావరణ, వైద్యారోగ్య నిపుణుల హెచ్చరికలు పారిశ్రామిక యుగంలో తెగబలిసిన పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాధినేతలకు తలకెక్కడం లేదు. ఈజిప్టులో నవంబరు 6 నుంచి 18 వరకూ కాన్ఫ రెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌) 27 సదస్సు జరగనుంది. వాతావరణ మార్పుల సమస్యను చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశం. బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఈసదస్సుకు హాజరుకాబోరని కథనాలు వెలువడ్డాయి. పర్యావరణ పరిరక్షణకు తమ మద్ద తు ఉంటుందని సుభాషితాలు వల్లించే ఆధిపత్య దేశాల అధినేతలు కాప్‌ వంటి సదస్సులకు డుమ్మా కొట్టడం వారి అసలు నైజాన్ని చాటుతోంది. పర్యా వరణం అంటే మన చుట్టూ ఉండే జీవావరణమే. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత.
ఎందుకీ అధిక వర్షాలు.. అసలు కారణాలేంటి?
కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఒకటేవర్షాలు. అదికూడా రోజుల తరబడి. గతం లో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు. వాగులు పొంగుతున్నాయి. వంకలు పొర్లుతున్నా యి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. పట్టణాలు నీట మునుగుతు న్నాయి. నగరాలు కాకావికలమవుతున్నాయి. కాలం కాని కాలంలో వర్షాలు కురుస్తుండడంతో మనిషి జీవితం అస్తవ్యస్తమవుతోంది. పంటలన్నీ చేతికొచ్చే సమయంలో జలార్పణమవుతున్నాయి.రోడ్లు కొట్టుకుపోతుండటంతో ప్రభుత్వానికి ?కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. గతంలో ఒకటి లేదా రెండు మహా అయితే మూడు రోజుల వరకే వర్షం పరిమి తమయ్యేది. తర్వాత కొంచెం గ్యాప్‌ ఇచ్చి కురిసేది. కానీ కొన్నేళ్ల నుంచి వర్షం కురిస్తే రోజుల తరబడి ఉంటున్నది.
ఎందుకు ఈ అకాల వర్షాలు
వాతావరణంలో ఆకస్మాత్తుగా చోటు చేసుకుంటున్న మార్పులకు అసలు కారణం భూమి వేడెక్కడం..సైన్స్‌ పరిభాషలో చెప్పాలంటే గ్లోబల్‌ వార్మింగ్‌. భూమి మీద వాతావరణం సూర్యరశ్మీని గ్రహించి వేడెక్కుతుంది. ఆ వేడిని చుట్టూ వ్యాపింప చేస్తుంది. ఇదే లేకపోతే భూమిచల్లగా ఉండి అసలు జీవించడానికి పనికొచ్చేది కాదు. అయితే సహజం గా ఏర్పడే ఈగ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌కు మనుషులు చేసే పనులు మరింత వేడిని పెంచుతున్నాయి. ఆధునిక వ్యవసాయం, పురుగు మందుల వాడకం పెరగటం,కాలుష్యంవల్ల మరిన్ని ఉద్ఘారాలు విడు దలై వాతావరణంలో వేడిని మరింత ఎక్కువ చేస్తు న్నాయి. వాస్తవానికి వాతావరణంలో కార్బన్‌ డై యాక్సైడ్‌ సహజంగా ఉంటే ప్రకృతి సమతుల్యం అసలు చెడిపోదు.కానీ పెట్రోలు ఉత్పత్తుల వాడకం పెంచడంతోపాటు వాటి నుంచి వెలువడే కార్బన్డ యాక్సైడ్‌ ను గ్రహించే చెట్లను ఇష్టానుసారంగా కొట్టేస్తుండటంతో కర్బన సంబంధ,సల్ఫర్‌ సంబంధ ఉద్గరాలు పెరిగిపోతున్నాయి.పారిశ్రామిక అభివృద్ధి తర్వాత గాలిలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు 30 శాతం,వాయువులు 140శాతంపెరిగాయని పర్యా వరణవేత్తలు చెబుతున్నారు. పైన మండే సూర్యుడు కింద చల్లని సముద్రాలు ఉండగా పర్యావరణానికి మనం కలిగించగల నష్టం ఏపాటిదిలే అనుకున్న మనిషిదాన్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. గనుల్ని ఇష్టానుసారంగా తవ్వడం, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఘన, ద్రవ, వాయు వ్యర్థాలను ఇష్టాను సారంగా గాలిలోకి, నీటిలోకి వదలడం వల్ల పర్యా వరణ చక్రం గతి తప్పుతోంది. విద్యుత్‌ అవసరా లకు బొగ్గును మండిచడం, వ్యవసాయ అవసరా లకు,గృహఅవసరాలకు అడవులను ఇష్టాను సారం గా కొట్టేయడం,సముద్రాలను డంపింగ్‌ యార్డ్‌ లుగా మార్చడంవల్ల జరగాల్సిన నష్టంజరిగి పోతోంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
మనిషి శరీర ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితేనే తట్టుకోలేడు. కొంతకాలంగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. మనిషి చేస్తున్న విధ్వంస పనులే భూమి వేడిని అంతకంతకు పెంచు తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. అక్కడ మంచు కరిగితే మనకొచ్చే ముప్పు చాలా తీవ్రంగా ఉంటుంది. అదే తీరిన కరుగుతూ ఉంటే ఈ శతాబ్దం అంతానికి సముద్ర నీటిమట్టం ఒక మీటర్‌ వరకు పెరుగొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తు న్నారు. అదే జరిగితే మాల్దీవులు,సీ షెల్స్‌ వంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దీవులన్నీ మునిగిపోతా యి. లండన్‌, వియత్నాం నెదర్లాండ్స్‌ బంగ్లాదేశ్‌ లాంటి దేశాల్లో చాలా భాగం ముంపునకు గురవు తుంది. అధికంగా సముద్రతీరం ఉన్న మనదేశం లోనూ నష్టం అపారంగా ఉంటుంది. కలకత్తా, చెన్నై,ముంబాయి, కేరళ వంటి వాటిపై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది.-జిఎన్‌వి సతీష్‌

నిరుద్యోగంతో..ఆకలి కేకలు

ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత నానాటికీ పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార పరిస్థితి నివేదిక-2019’ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. దీని ప్రకారం ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నవారు 82 కోట్ల మంది (దాదాపు 11శాతం) ఉన్నారు. అయితే భారత్‌లో కూడా ఆకలి చావులు నమోదవు తున్న నేపథ్యంలో..
దేశంలో ఏటేటా పెరగుతున్న నిరుద్యోగ సమస్యే దీనికి ప్రధాన కారణమని ఐరాస నొక్కి చెప్పడం గమనార్హం.‘2017-18 నుంచి భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగం, దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటం ఆకలి బాధలకు కారణమవుతున్నది’ అని యూఎన్‌ పేర్కొన్నది. భారత్‌లో నిరుద్యోగ సమస్య ఇప్పటిది కాకపోయినా గడిచిన మూడేం డ్లుగా అది మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోతున్నది. తాము అధికారం లోకి వస్తే ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని గద్దె నెక్కినమోడీ సర్కారు. తద నంతర కాలంలో ఆహామీని తుంగలోతొక్కింది.ఉపాధి దొరక్క, తిండి లభించక కోట్లాది మంది పస్తులుంటున్నారు. ఈఏడాది జనవరిలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫ్‌ ఆర్గనై జేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) గణాంకాల ప్రకారం..దేశంలో నిరుద్యోగిత రేటు 45ఏండ్ల గరిష్టానికి (6.1శాతం)చేరుకున్నది. 2017-18కి సం బంధించిన ఆ నివేదికను తొలుత దాచిపెట్టిన మోడీ సర్కారు..ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదల చేయడం గమ నార్హం.2016 నవంబర్‌లో ప్రధాని మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో వేలాదిమంది నిరుద్యో గులుగా మారారని జాతీయ,అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు గొంతెత్తి మొత్తుకున్నా మోడీ సర్కారు దానిని పెడచెవిన పెడు తున్నది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే ఉద్యోగాలు కోల్పో యి ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజలపై బీజేపీ సర్కారు జీఎస్టీ పేరిట మరో మోయలేని భారం మోపింది.‘ఒకే దేశం-ఒకే పన్ను’ అంటూ తీసుకొచ్చిన జీఎస్టీ..చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను కోలుకోలేని దెబ్బ తీసిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు…! దీంతో ఆయా రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పెద్దనోట్ల రద్దు,జీఎస్టీ వంటి ఆర్థిక పరమైన నిర్ణయాలే గాక దేశంలో వ్యవ సాయం మీద మోడీ సర్కారు చూపుతున్న అశ్రద్ద కూడా గ్రామీణ పేదల ఆకలికి కారణమవుతున్నదనేది విశ్లేషకుల వాదన. ఒవైపు వర్షాలు కురవక, వరుస కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు రైతాంగంపై అప్పుల భారం వారిని ఆత్మ హత్య లకు ఉసిగొల్పు తున్నది. గిట్టుబాటు ధరల్లేక ఆర్థికంగా చితికి పోయిన రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే మోడీ సర్కారు మాత్రం వ్యవసాయా న్ని కార్పొరేట్‌లకు అప్పగించి రైతు ఆదా యాన్ని పెంచుతామని చెబుతుండటం విడ్డూరం.
వేలెత్తి చూపిస్తున్న ఆకలిచావులు
ప్రపంచ ఆరోగ్య సూచీ నివేదిక ప్రకారం భారత్‌లో 2016-18 నాటికి 19.44కోట్ల (దేశ జనాభాలో సుమారు 14.5శాతం) మంది ఆకలితో అలమటిస్తున్నారు. గతంతో పోల్చు కుంటే 2015 వరకు ఆకలి సమస్య కొంతమేర తగ్గినా ఆ ఏడాది నుంచి మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఆహార అభద్రత కారణం గా జార్ఖండ్‌లో నమోదవుతున్న ఆకలి చావులు విశ్వ యవనికపై భారత్‌ను వేలెత్తి చూపుతు న్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం.. గడిచిన రెండేండ్లలో జార?ండ్‌లో సుమారు 20 మంది ఆకలి బాధలు తట్టుకోలేక మరణించారు. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు పేదలకు రేషన్‌కార్డు లివ్వకపోవడం దీనికి ఒక సమస్యైతే, రేషన్‌ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం కూడా ఈ చావులకు కారణమైందని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆకలితో అలమ టించేవారే గాక పోషకాహార లోపం కూడా దేశంలో ప్రధాన సమస్యగా ఉన్నది. అధికారిక లెక్కల ప్రకారం..దేశంలో పదిశాతం పిల్లలు మాత్రమే సమతుల్య ఆహారాన్ని తీసుకుంటు న్నారు. ఆర్నెళ్లలోపు ఉన్న చిన్నారుల్లో 54 శాతం మంది మాత్రమే తల్లిపాలు తాగుతు న్నారు. దీనిని 2025 నాటికి 25శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదని న్యూట్రీషన్‌ నిపుణుడు డాక్టర్‌ అంత ర్యామి దాస్‌ తెలిపారు.
ప్రపంచ ఆకలి సూచిక లో దిగజారిన భారత్‌
పాక్‌, బంగ్లాదేశ్‌ కన్నా వెనుకబడ్డ ఇండియా
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌,2022లో 121 దేశా లలో భారతదేశం ఆరు స్థానాలు దిగజారి 101 నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది. యుద్ధంతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్‌ మినహా దక్షిణాసియాలోని చాలా దేశాల కంటే వెనుక బడి ఉంది. 29.1స్కోర్‌తో,గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రచురణకర్తలు,యూరోపియన్‌ ఎన్‌జి ఓలు కన్సర్న్‌ వరల్డ్‌వైడ్‌ మరియు వెల్తుంగర్‌ హిల్ఫ్‌, ఆకలి స్థాయిని తీవ్రమైనదిగా ట్యాగ్‌ చేశారు.121 దేశాలGనIలో ఎనిమిది స్థానాలు దిగజారి 84వ ర్యాంక్‌కు చేరుకున్న బంగ్లాదేశ్‌, గతేడాది 76వర్యాంక్‌తో పోలిస్తే చాలా మెరుగు పడిరది. దాదాపు అన్ని పొరుగు దేశాలు బాగా మండిపడ్డాయి. పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ మరియు మయ న్మార్‌ వరుసగా 99, 64,84,81మరియు 71స్థానాల్లో నిలిచాయి. ఐదు కంటే తక్కువ స్కోర్‌తో మొత్తం 17 దేశా లు సమిష్టిగా1మరియు 17మధ్య ర్యాంక్‌ పొందాయి.
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా అలాగే ప్రాంతాల వారీగా మరియు దేశం వారీగా ఆకలిని కొలిచే మరియు ట్రాక్‌ చేసే సాధనం. 2022 గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనేక దేశాలలో భయంకరమైన ఆకలి కుంభకోణాన్ని ప్రతిబింబిస్తుంది, అలాగే ఆకలిని ఎదుర్కోవడంలో దశాబ్దాల పురోగతి క్షీణిస్తున్న దేశాలలో మారుతున్న పథం రెండిరటినీ ప్రతి బింబిస్తుంది. ఆకలిసూచిక స్కోర్‌లు నాలుగు కాంపోనెంట్‌ ఇండికేటర్‌ల విలువలపై ఆధారపడి ఉంటాయి: పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల,పిల్లల వృధా మరియు పిల్లల మరణాలు. పోషకాహార లోపం తగినంత కేలరీల తీసుకోవడంతో జనాభాలో వాటాను సూచిస్తుంది. ఇండెక్స్‌లో ఎక్కువ స్కోర్‌ అంటే ఆకలి పరిస్థితి మరింత దిగజారడం. సున్నా అనేది ఉత్తమ స్కోర్‌..ఆకలి లేదని సూచిస్తుంది.
ప్రతిపక్షాల విమర్శలు ఆకలిసూచీలో భారత్‌ ర్యాంక్‌ పడిపోవడంపై తెలంగాణ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి కెటి రామారావు ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు. ఇంకో రోజు చీూA ప్రభుత్వం సాధించిన మరో అద్భుతమైన విజయం. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ 101వ స్థానం నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది. వైఫల్యాన్ని అంగీకరించే బదులు, బీజేపీ జోకర్లు ఈ నివేదికను ఇప్పుడు భారత వ్యతిరేక నివేదిక గా కొట్టిపారేస్తారని నేను ఖచ్చితంగా అనుకుం టున్నాను.
కరోనాతో సమస్య..
ఈ సూచీలో భారత్‌ స్థానం 101కాగా, పాకి స్తాన్‌ 92వ స్థానంలో, నేపాల్‌, బంగ్లాదేశ్‌ 76వ స్థానంలో, మయన్మార్‌ 71వ స్థానంలో నిలిచాయి. ఇవి భారత్‌ కన్నా మెరుగ్గా ఉన్నప్ప టికీ.. ఇవి కూడా తమ దేశ ప్రజల ఆకలిని తీర్చడంలో ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయని నివేదిక తెలిపింది. కరోనా కారణంగా చాలా దేశాల హంగర్‌ ఇండెక్స్‌ దిగజారిందని వెల్ల డిరచింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆకలిపై పోరాటం సరైన మార్గంలో సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల విషయంలో భారత్‌ మెరుగైన ఫలితాలను సాధించింది. కరోనా సంబంధిత ఆర్థిక, ఆరోగ్య సవాళ్లు,వాతావరణ మార్పు, ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు.. ఆహార భద్రతను దెబ్బతీస్తున్నాయని ఈ నివేదిక వెల్లడిరచింది. దేశాలు,ప్రాంతాలు,వర్గాల మధ్య అసమానతలు తొలగనంతవరకు సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించలేమని స్పష్టం చేసింది.
ఆకలి సూచికలపై కాషాయ దళాల మండిపాటు
తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగ జారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పు పడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్ధతే తప్పు, పరిగణన లోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఓ) చెప్పే వాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడు వేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింపచేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే ఇలాంటి వాదన లను ప్రభుత్వం కూడా చేస్తున్నది,ఖండి స్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121 మాత్రమే. అది స్వచ్ఛందం తప్ప ఇవ్వక పోతే తల తీసేదేమీ ఉండదు.ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్‌ లేదా దాని మద్దతుదార్లు అంగీక రించారా? లేదు, ఎందుకంటే అన్నింటా అథమ స్థానాలే. ఆకలి సూచికలను రూపొందిం చేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింప చేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. అయితే అన్ని దేశాలకూ ఒకటే పద్ధతిని అనుసరించారు కదా! పోషకాహార లేమికి గాను కేవలం మూడు వేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశా లకూ ఒకటే పద్ధతి. నివేదికను రూపొం దించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడు వేల మందిని సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ).అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. ఆ సమాచారాన్నే నివేదికను రూపొందించిన ‘వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌, కన్సర్న్‌ వరల్డ్‌ వైడ్‌’ తీసుకున్నాయి. అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకు న్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అశ్వనీ మహాజన్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌గా పని చేస్తున్నారు.-సైమన్‌ గునపర్తి

1 2 3 4 7