జీవో నెం.3పై రాష్ట్రప్రభుత్వం కసరత్తు

జీవోనెం.3పై ఇటీవల అల్లూరిజిల్లాలో ఆది వాసీలు చేపట్టిన భారీ నిరసన,ఆందోళనపై ఏపీ ప్రభు త్వం స్పందించింది.గిరిజనుల డిమాండ్‌ల పరిష్కారం పై అధ్యాయనం చేయడానికి కసరత్తు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నంబర్ 3 (100% ఎస్టీ రిజర్వేషన్లు) పునరుద్ధరణ మరియు 1/70 చట్టం అమలుపై గిరిజన సంఘాల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం హైపర్/ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.అయితే ఈ కమిటీని పలు గిరిజన సంఘాలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు, బంద్‌లకు పిలుపునిచ్చాయి.జీవో 3 పునరుద్ధరణ మరియు గిరిజన డిమాండ్లుసు ప్రీంకోర్టు తీర్పు: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల వంద శాతం రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన జీవో 3ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో గిరిజనుల్లో ఆందో ళన నెలకొంది.చట్టాల పరిరక్షణ: 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల హక్కులను నిరోధించాలని డిమాండ్ చేస్తున్నారు.ఉద్యోగాలు & నిధులు: స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా జోన్ల కేటాయింపులు ఉండాలని, గిరిజన అభివృద్ధి నిధుల మళ్లింపును నిలిపివేయా లని కోరుతున్నారు.ప్రభుత్వ చర్యలు-ప్రత్యామ్నాయ మార్గాలుచర్చలు మరియు కమిటీ: గిరిజన సంఘా ల నేతలు, మంత్రులు,న్యాయ నిపుణులతో చర్చించి న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తు న్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.హైపర్ కమిటీ ఏర్పాటు: సమస్యల పరిష్కారానికి అధికారులు, గిరిజన ప్రతినిధులతో హైపర్ కమిటీని ఏర్పాటు చేసేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా యం త్రాంగం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిం చింది. గిరిజన సంఘాల స్పందన: ప్రభుత్వ కమిటీ ఏర్పాటు కాలయాపన చర్య మాత్రమేనని భావి స్తున్న గిరిజన సంఘాలు, ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతూ ఏజెన్సీ బంద్‌లకు పిలుపునిచ్చాయి. సీం చంద్రబాబు నాయుడు జీవో నం.3కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని హామీ ఇచ్చి రెండేళ్లయ్యిందని,నేటికీ అమలు చేయలేదని గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓనం.3ను చట్టం రూపంలో తీసుకురా వాలని మెజారిటీ సంఘాలు అభిప్రాయపడ్డాయి.జాతీయ గిరిజన పాలసీ,పెసా చట్టం,కేంద్ర న్యాయ చట్టాన్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త చట్టాన్ని రూపొందించాలని ఆదివాసీ ప్రజా సంఘాల నేతలు కోరారు.
ఆనేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం స్పందించింది. ఆది వాసీల ఆందోళనలపై ప్రజా సంఘాలను సమ న్వయ పరచడానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణి,రాష్ట్ర ీVAం శాఖ మంత్రి అనిత ఆధ్వర్యంలో పాడేరులో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా గిరిజన సంఘాల ప్రతినిధులు జీవో నం.3,1/70చట్టం అమలుపై సూచనలు,పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసు కొచ్చారు.న్యాయ నిపుణులతో చర్చించి, గిరిజను లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు.గిరిజనుల అభిప్రాయాలు, న్యాయ నిపుణుల సూచనలను పరిశీలించి ప్రభు త్వానికి నివేదిక సమర్పించేందుకు మంత్రులు, న్యాయ సలహాదారులు,గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, అల్లూరి,పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు, ప్రజాసంఘాల నేతలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు వెల్లడించారు.ఆప్రకారమే కమిటీ నియమించ డానికి ప్రభుత్వ అధికారులు గిరిజన సంఘాలతో చర్చలు జరిపారు.తర్వాత అమరావతిలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జీవో3పై సమీక్ష నిర్వహించడం జరిగింది.ఆసమీక్షలో సీఎం చంద్రబాబు నాయు డు పలు కీలకమైన అంశాలను వెల్లడించారు.
చట్టపరమైన అడ్డంకులపై అధ్యయనం
ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వో ద్యోగాల్లో నూరుశాతం రిజర్వేషన్లు కల్పిం చేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రకటించారు.ప్రభుత్వోద్యోగాల్లో స్థానిక గిరిజ నులకు 100శాతం రిజర్వేషన్లు కల్పించేం దుకు ఉమ్మడి రాష్ట్రంలో 2000 ఏడాదిలో జీవో 3 తెచ్చా మని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరు ద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శ కాలు పాటిస్తూనే…2020లో రద్దయిన జీవో 3 పునరుద్ధ రణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను సీపం ఆదేశించారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు సమీక్ష జరిపారు. సమీక్షలో గిరిజన సంక్షేమశాఖ న్యాయశాఖ అధికా రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లా డుతూ “1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్ పోస్టుల్లో 100శాతం రిజర్వేషన్లు తెచ్చాం.దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో మళ్లీ పెరిగిన మహిళా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని 2000లో జీవోఎంఎస్ నంబర్ 3తెచ్చాం.దీన్ని అమలు చేయ డంద్వారా సుమారు 4,626 టీచర్ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయి. అయితే జీవో నెంబర్ 3పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా…వివిధ స్థాయిల్లో విచారణ అనం తరం 2020లో ఈఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే గత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం పాటించింది. దీంతో రివ్యూ పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు కొట్టేసింది.ఈకారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా లభించే లబ్దిని కోల్పోయారు” అని సీఎం స్పష్టం చేశారు. జీవో నెంబర్ 3పునరుద్దణ లేదా అదే తరహా న్యాయం చేసేందుకు గిరిజనులకు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు జీ.వోనె.3రద్దు అనంతర పరిణా మాలపై అధికారులతో సీఎంచర్చించారు. గిరిజన ప్రాంతాల్లో జీవో 3ద్వారా నాడు గిరిజను లకు కలిగిన లబ్దిని పునరుద్దరించేందుకు తీసుకో వాల్సిన చర్యలపై చర్చించారు.ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగా ల్లో స్థానిక గిరిజనులకు నూరుశాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్నఅవకాశాల గురిం చి,చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డం కుల గురించి చర్చించారు.జీ.వో నెం.3పున రుద్దరి చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజన సంఘా ల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తిరిగి ఈ ఉత్తర్వులద్వారా లభించే లబ్దిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకా శాలను పరిశీలించాలని,ఇందులో భాగంగా న్యాయపర మైన అంశాలు,సుప్రీంకోర్టు తీర్పు, గిరిజన హక్కు ల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.
ముఖ్యమంత్రి ముందు మూడు ఆప్షన్లు
జీవో నెంబర్ 3పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న మూడు అవకాశాల గురించి అధికారులు ముఖ్య మంత్రికి వివరించారు. మొదటి ఆప్షన్‌గా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో 100శాతం రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం, రెండవ ఆప్షన్‌గా స్థానిక గిరిజనులకు వారి యెక్క జనాభా దామాషా ప్రకా రం రిజర్వేషన్లు ఇవ్వడం,మూడవ ఆప్షన్‌గా సుప్రీం కోర్టు సూచించినట్టు 50శాతం మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించివారి హక్కులను పరిక్షించడం వంటి అవకాశాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ“గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థా యిలో గిరిజనుల హక్కులకు కట్టుబడి ఉన్నామ ని,ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీ.వో నె.3 పునరుద్దరించడం లేదా…అదేస్థాయిలో గిరిజను లకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామ న్నారు. ఈవిషయంలో జాతీయస్థాయిలో రాజ్యాం గ,న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జర పాలి” అని సీఎం సూచించారు. వారికి న్యాయం చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అసలు జీవో నెంబర్ 3 అంటే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో నెంబర్ 3జనవరి 10,2000న వెలువడింది.ఇదిషెడ్యూల్డ్ (ఏజెన్సీ) ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను స్థానిక షెడ్యూల్డ్ తెగల(ఎస్‌టీ) అభ్యర్థులకు మాత్రమే 100 శాతం రిజర్వేషన్ కల్పించడం గురించి చెబుతుంది.
జీవో నెంబర్ 3ప్రధాన ముఖ్యాంశాలు పూర్తి రిజర్వేషన్ : షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు అన్నీస్థానిక గిరిజనులకే వంద శాతం కేటాయించ బడతాయి.ఆ వంద శాతం పోస్టులలో 33.1/3శాతం స్థానిక ఎస్టీ మహిళలకు సబ్-రిజర్వేషన్ కింద కేటాయించ బడుతుంది.
ఉద్దేశం : గిరిజన ప్రాంతాల్లో విద్యను అభివృద్ధి చేయడం,గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు సమస్యను నివారించడం మరియు స్థానిక నిరుద్యోగ గిరిజనులకు ఉపాధి కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.ప్రస్తుత స్థితిఈ జీవోను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 22,2020న కొట్టివేసింది. 50శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటి 100శాతం కేటాయించడం రాజ్యాంబరం కల్పించిన సమాన హక్కులకు విరుద్ధమని, ఇది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో గిరిజన సంఘాల డిమాండ్ మేరకు దీని పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరుగుతున్నాయి.– గునపర్తి సైమన్