పర్యావరణానికి పెను సవాల్‌ మారుతున్న ప్లాస్టిక్‌

జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులో ఒకటిగా మారిపోయింది. రోజూ అన్నిఅవసరా కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజువిపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. మన అవసరాను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన మర్చిపోతున్నా పరిస్థితి. ఒక ప్లాస్టిక్‌సంచి భూమిలోకవాంటే కొన్నివంద ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. నేనుమొదట ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినప్పుడు శంకరగిరి మన్యంలో ఫ్లాస్టిక్‌ అనేదికన్పించేది కాదు. అయితే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న హాయంలో వారనీవాహినీ సారాఫ్యాకెట్లు ఉండేవి. గిరిజనగ్రామాకు వెళ్ళడానికి అడవిలో తిరిగే సమయంలో కాలిబాట తప్పితే…ఆ ఫ్యాకెట్లే దారిచూపించేవి. వీటిద్వారా గిరిజన గ్రామాకు వెళ్ళే దారిగుర్తిపట్టేవాళ్ళం. అనుమర్తి,ఓండ్రేగు,ఆవేల్తి వంటి అమాయక గిరిజన గ్రామస్థుకు తమభూమి రికార్డు,రేషన్‌కార్డు వంటిమివైన పత్రాు దాచుకోవడం తెలిసేదికాదు. ఆసమయంలో ఏదైనా ఫ్లాస్టిక్‌ కవరులో పెట్టిజాగ్రత్తగా దాచుకొండని సహా ఇచ్చేవాణ్ణి. ఆకాంలో కూడా ఫ్లాస్టిక్‌ అటవీ ప్రాంతాల్లో అంతగా కన్పించేది కాదు. కేవం వారనీవాహినీసారా ఫ్యాకెట్లు మాత్రమేకన్పించేవి. ఈ సారాఫ్యాకెట్లు ద్వారా గిరిజన ప్రాంతాకు ఫ్లాస్టిక్‌ ప్రవేశించింది. నేడు ఏగ్రామానికి వెళ్లిన బస్తాకు…బస్తాుగా కుప్పుకొది పడిఉంటున్నాయి. మంచినీటి వాడకాన్నితగ్గించి వాటర్‌ఫ్యాకెట్ల నీళ్లకుప్రాధాన్యమిస్తున్నారు.ఎక్కడ శుభకార్యాు జరిగినా బస్తాు ముఖ్యంగా ంబసింగి,అనంతగిరి, బొర్రా,అరకు,పాడేరు వంటి పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకు ద్వారా వచ్చే ప్లాస్టిక్‌ కొండలా పేరుకుపోయి, కొండచిువలా మానవజాతిని మింగేస్తోంది.
గిరిజన ప్రాంతాల్లో పర్యాటకరంగం విస్తరించేకొద్దీ పర్యాటకు తీసుకొచ్చే ప్లాస్టిక్‌ విఫరీతంగా పెరిగిపోతుంది. వారపు సంతల్లో కూడా ఈ ప్లాస్టిక్‌ భూతం భయపెడుతోంది. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతివల్లే భూవాతావరణం ధ్వంసమౌతోంది. పర్యావరణానికి భంగం కుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాకు అందించేదృష్టితో, సమకాలీన అవసరాను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాల్సిన అవశ్యకత ఉంది. మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పోటనం కన్నా పెనుఉత్పాతంలా గుండె మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది. ఈనేపధ్యంలో 2001లో సమత కొండ ఆరోగ్యమే ప్లపు ప్రాంతా సౌభాగ్యం! అనే నినాదంతో పాదయాత్ర చేపట్టింది. ప్లాస్టిక్‌ జీవజలాు,నదు,రిజర్వాయర్లులో తిష్టవేయడంవ్ల త్రాగు,సాగునీరంతా కుషితమతోందని అవగాహన చేపట్టడం జరిగింది.


ఏజెన్సీ ప్రాంతాకే కాకుండా కొండ దిగువన జీవిస్తున్న మైదాన ప్రాంతవాసు జీవన మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. సముద్ర జలాు,ఉప్పు కుషితమవుతున్నాయి. ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్‌గా అవతరించి పుట్టబోయే బిడ్డ కడుపులో ప్లాస్టిక్‌ పుట్టికొస్తోందని ఇటీవ ఆంగ్ల పత్రికు మెవరించాయి. మనంపీల్చే గాలి,తాగేనీరు,తినే ఆహారం ప్లాస్టిక్‌మయంగా మారిపోతుంది. ఉదయం నిద్రలేచింది మొదు మళ్ళీరాత్రి పడుకునే వరకు ఇంటా,బయటాఎన్నో అవసరాకోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌బ్రష్‌ు,వాటర్‌ బాటిల్స్‌,టిఫిన్‌బాక్స్‌ు, ప్లేట్లు,గ్లాసు, షాంపు, పాు, వంటనూనె ప్యాకెట్లు,తనూనె,ఔషధాడబ్బాు,ప్లి పాసీ సాు ఇలాప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే. ఆశ్చర్యమేమంటే ప్రజ ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తం భద్రపరచేసంచు,ఇంజక్షన్‌సీసాు,సిరంజిు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌సంచుల్లో ఆహారపదార్థాు ప్యాకింగ్‌ చేసినపుడు ఇందులోఉండే కాల్షియం,సీసంవంటి ధాతువు ఆహారంలో చేరి ప్రజ ఆనారోగ్యానికి కారణమవుతాయి. ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తును బయట పారేయడంవ్ల చాలాపర్యావరణ సమస్యు తలెత్తుతున్నాయి. ఈప్లాస్టిక్‌ వస్తువును పశువుతింటే వాటికి ప్రాణహానికుగుతుంది. వ్యర్థాు పశువు జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్యసమస్యలొస్తాయి. భారత్‌లోఏడాదికి 65క్షటన్ను ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత50ఏళ్ళలో 20 రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరిగింది. కాని ఇందులో 5శాతం మాత్రమేరీసైకిల్‌ జరుగుతున్నది. ప్యాకింగ్‌రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40శాతం వాడుతున్నారు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాుగా మారుతున్నాయి. ఏటా80క్షటన్ను ప్లాస్టిక్‌వ్యర్థాు సముద్రంలోకిచేరుతున్నాయి. 2030నాటికి సముద్రాలో ప్లాస్టిక్‌ వ్యర్థాు రెట్టింపు అయి 2050 నాటికి నాుగింతు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’సర్వే నివేదికుచెబుతున్నాయి. 2025నాటికి 1టన్ను సముద్రచేపకు 3టన్ను ప్లాస్టిక్‌ పేరుకుపోతుందని ఈసర్వే చెబుతున్నది. సముద్రజీవరాశుపై, మానవుశ్వాసకోశంపై, చర్మంపై ప్రతికూ ప్రభావాు చూపుతాయి. నగరాలో కిలోమీటర్ల కొద్దీ, మహానగరాలో వందకిలోమీటర్ల మేర మురుగు కామంటాయి. ఈకాువ చుట్టుపక్క నివాసంఉండే ప్రజంతా,ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాను దీంట్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్‌ సంచు భారీస్థాయిలో పేరుకు పోయి కాుమ మూసుకుపోతున్నాయి.
మంచినీటి కోసం కార్యాయాల్లో ఒకపుడు గాజు, స్టీు, గ్లాసు వాడేవారు. ఇపుడు ప్లాస్టిక్‌ సీసాల్లో తెచ్చిపెడుతున్నారు. ఈ పద్ధతి సరికాదు. టీు, కాఫీు గాజు, స్టీు, పింగాణీ పాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్లరసాు తాగడానికి కాగితం గ్లాసులే వాడాలి. ఇండ్లల్లో ఆకు కూరగాయాను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి. పాు, పెరుగును ప్లాస్టిక్‌ కవర్లలో విక్రయిస్తుంటారు. ఏరోజుపాు ఆరోజు తెచ్చుకుని పా ప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా,పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాత న్విచేసుకోవాలి.శాస్త్రీయ పద్దతిలో ప్లాస్టిక్‌ను సద్వినియోగం చేయాలి.పర్యాటక రంగంగా విస్తరిస్తున్న ంబసింగి,అనంతగిరి, బొర్రా,అరకు,పాడేరు,పోవరంతదితర ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయా గిరిజన పంచాయితీు పర్యాటకు ద్వారా విస్తరిస్తున్న ప్లాస్టిక్‌ నివారణకు తగు జాగ్రత్తు తీసుకోవాలి. ప్రతీ టూరిస్టు స్థలాల్లోను ప్లాస్టిక్‌ నివారణపైన, పర్యావరణ పరిరక్షణ కాపాడాంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి పర్యాటకును చైతన్యపరచాలి. ఇది నిరంతర ప్రక్రియగా తీసుకొంటే ప్లాస్టిక్‌ నివారణకే కాకుండా గిరిజన పల్లేు ఆకర్షణీయంతో ఆహ్లాదకరంగా అందంగా కన్పిస్తాయి. భవిష్యత్తు తరాకు స్పూర్తివంతంగా ఉంటుంది.-

Justice K Ramaswamy and Samata judgement

Justice K Ramaswamy, former Supreme Court Judge who passed away on March 6, was popularly known for one of his landmark Judgements known as Samata Judgement that upheld the rights of tribals on their lands in tribal areas. The State government, in a befitting manner, conducted his funeral with all respects to the departed soul.

Samata was a non-governmental organisation that worked for the rights of the tribal people as it found them being alienated from their lands and exploited by non-tribal people and the state, in contravention of the Fifth Schedule of the Constitution and various Central and State government laws. After a prolonged struggle, it approached courts. The case it filed in the then Andhra Pradesh High Court in 1993 against the then State government was dismissed. Then, Samata filed a Special Leave Petition in the Supreme Court. After a four-year legal battle, it won.

Read more

Rajasthan’s phosphate mines deprive villagers of land, livelihood, health

Mongabay | October 28, 2020

  • Udaipur’s phosphate mines have been causing miscarriage in women of surrounding villages, have destroyed farming and forests, claims locals.
  • Health officials note that there’s so much dust in the air that residents of villages nearby mines develop diseases such as tuberculosis and lung cancer.
  • However, the government firm operating the mine denies any negative impact.

“Yeh toh bhagwan ki marzi hai, sahab. Pichhle janam ke kuch paap honge jo iss janam main saamne aa rahe hain (It’s all god’s will. Maybe we had sinned in our past lives, for which we are suffering now),” said Lohari Meena, a resident of Jhamarkotra village, 22 kilometres from Udaipur in Rajasthan, while explaining her two miscarriages.

Read more

Illegal mica mining continues unabated in Jharkhand, causing deaths and diseases

  • Years ago mica mines were abandoned in Jharkhand but neither the mines were restored nor the local inhabitants were rehabilitated. As a result, villagers over the years continued visiting them to extract mica.
  • From sudden death owing to mines caving in or slow death because of lung ailments, the illegal mines provide for villagers’ livelihood as well as cost them dearly.
  • Local activists and human right workers believe that villagers merely collect mica flakes for their livelihood whereas private contractors have been illegally mining it on a large scale in forests.

In Tisra village of Jharkhand’s mineral-rich Giridih district, about 180 kilometres north of state capital Ranchi, Shyam (name changed), a Dalit boy in his early adolescence, hustles his way through the forest area to a makeshift shop. He buys a handful of chickpeas, enough to satiate his and his older brother’s hunger after a day spent in an abandoned mica mine, which as per official records is non-operational.

Read more

EAS seeks probe into illegal bauxite mining

It may be noted bauxite mining is restricted to the public sector and to tribal cooperatives as directed by the Supreme Court in the Samata judgement years ago.

VISAKHAPATNAM: Former union energy secretary EAS Sarma has sought an independent investigation by Anti-Corruption Bureau (ACB) and Special Enforcement Bureau (SEB) into the alleged illegal mining of bauxite in East Godavari and Visakhapatnam districts.

In a letter addressed to principal secretary of Karikal Valiven on Sunday, he said he has been cautioning the State government about private individuals and companies extracting bauxite in the guise of laterite r. It may be noted bauxite mining is restricted to the public sector and to tribal cooperatives as directed by the Supreme Court in the Samata judgement years ago. He said to circumvent this restriction, the private miners in collusion with the local mining officials have been producing false analysis certificates to show that the bauxite they are extracting and exporting to alumina refineries is indeed laterite. He said as per Indian Bureau of Mines (IBM) report, any aluminous mineral ore containing more than 30 per cent aluminium is defined as bauxite.

However, the State Mines department has been granting leases for “laterite” mining, thus allowing the miners to go scot-free. He said there are many mining leases granted in both in Visakhapatnam and East Godavari, which actually involve illegal bauxite extraction.

Why India Needs Scheduled Tribes to Educate its Future Judges

The recent five-judge bench Supreme Court judgment in Chebrolu Leela Prasad Rao and Ors v State of AP and Ors, shows us once again how little the 5th Schedule of the Indian constitution which is meant to protect adivasi rights is understood.

The reasoning in the judgment – which struck down an Andhra Pradesh government order from 2000 providing 100% reservation for Scheduled Tribe teachers in Scheduled Areas of the state – moves perilously close to dismantling the entire edifice of the 5th Schedule.

If 100% reservation for teaching jobs is not permissible, the next step will be for someone to argue against the ban on alienation of tribal land, or overturn the Samata judgment prohibiting mining leases being given to non-tribals in 5th Schedule Areas in undivided Andhra Pradesh. After all, both these ‘discriminate’ against non-tribals. As non-adivasis from other districts flood scheduled areas leading to clear demographic change, the clamour to do away with the protective provisions of the 5th Schedule is only getting louder.

Read more

ఓటు విలువ తెలుసుకో..!

దేశవ్యాప్తంగా జరగనున్న ఈసార్వత్రిక ఎన్నికలు`2019చర్చినీయాంశంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా డబ్బుకు, ఇతర ప్రలోభాలకు లోబడి ఓటు వేసే పరిస్థితులు దాపురించాయి. సోషల్‌ మీడియా హవ్వా కూడా ఓటరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ఎన్నికలు నాటికీ నేటికీ భిన్నంగా కన్పిస్తున్నాయి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చఉన్న చోట ఇవేచర్చలు. ప్రస్తుతం17వ సారి లోకసభ, 14వ సారి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పట్లో ఓటరు స్వచ్చంధంగా వచ్చి స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకొనేవారు. ఆ పరిస్థితులకు విరుద్దంగా మారింది. దేశవ్యాప్తంగా రాజకీయం ఒక వ్యాపార సంస్థగా మారిపోయింది. నేడు కులం, డబ్బు, మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలు చాలా నీచమైన స్థాయి లోకి దిగజారిపోయాయి. ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టగల వ్యక్తులను మాత్రమే పార్టీ అభ్యర్ధులుగా బరిలో దిగారు. అవినీతి కూడా కొలమానంలో లేదు. సామాన్యుడితో ఐదునిమిషాలు ముచ్చటించి ఓటు అడిగే రోజులు పోయాయి. సమాజంలో విలువలకు, విశ్వసనీయత లేని రాజకీయ వ్యవస్థగా మారుతోంది. అంతా ప్రలోభాలు, డబ్బుమయంగా మారింది. అన్యాయాన్ని ఎదురించడానికి, అవినీతిని పారదోలడానికి మనిషి సృష్టించిన బలమైన ఆయుధమే ఓటునే విషయాన్ని విస్మరించి అమ్ముడుపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఐదేళ్లకు ఒక్కసారివచ్చి, మన జీవితాలను, తలరాతను మార్చేది ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే నవసమాజం నిర్మితమౌతుంది. అందుక నుగుణంగా ఓటు అవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్ర గురించి యువ ఓటర్లను చైతన్యం చేయాలి. ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ప్రజలే పరిపాలకులు. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడ నిర్ణయిస్తాయి. కానీ మన దేశంలో ఎన్నికల పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నికల సమయంలో దేశం మొత్తంలో 60శాతం పోలింగ్‌ కూడా నమోదు కావడం లేదు. 125కోట్ల జనాభా కలిగిన మన దేశంలో సమారు 100 కోట్ల మంది ఓటర్లు ఉంటే, కేవలం 50కోట్ల లోపు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకొనేలా ప్రతి పౌరున్ని మేల్కోల్పాలి. ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వ పెద్దలు ఈ బాధ్యతను నిర్వర్తించాలి. అప్పుడే మనదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. ప్రస్తుత ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. బ్యాలెట్‌ పోయి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు(ఈవీఎం) వచ్చాయి ఈవీఎంలపై అపోహలను తొలగించడం, వినియోగంపై ప్రజలకు అవగాహన అవసరం. ఈవీఎం పనితీరు, వీవీ ప్యాట్‌, ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై ఓటర్లను చైతన్యం చేయాలి.
ఇకపోతే ఈ ఎన్నికల్లో ఫోకస్‌ అంతా సోషల్‌ మీడియాదే హవ్వా. ఇప్పుడంతా యాప్‌ ఏజ్‌. సోషల్‌ మీడియాదే హవా. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలాంటి ఆన్‌లైన్‌ సైట్లు అన్నీ ఓటరు ఆకర్షక వేదికలుగా మారాయి. ఒకప్పుడు ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావానికి లోను చేసిన వాటిల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా పాత్ర మాత్రం ఎనలేని ఆదరణ చూరగొన్నది. ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు.. తమ ఎన్నికల ఎజెండాను, ప్రణాళికలను..ఇలా అన్నిఅంశాలను సోషల్‌ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఆయుధాలుగా మారాయి. అవి ఓటర్లను ఆకర్షించే శక్తులుగా ఎదిగాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌ కూడా పొలిటికల్‌ యాడ్స్‌ను మానిటర్‌ చేయాలని ఆదేశించింది. కానీ చాలా సున్నితంగా మారిన సోషల్‌ మీడియా..లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నది.
మరో విషయం..ఈఎన్నికలు బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఉపాధి కల్పనగా మారింది. ఎన్నికల ప్రచారానికి తరలించేందుకు ఒక మహిళరోజులో అరపూట జెండా పట్టుకొని తిరిగేందుకు రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఆయా రాజకీయ పార్టీలు చెల్లిస్తున్నారు. ఇలా పూటగడవని నిరుపేదలు పది రోజుల పాటు ఉపాధి కల్గడం హర్షనీయమే. ఇకఆటోవాలా రోజుకు రూ.3వేల నుంచి ఐదువేల రూపాయలు సంపాదించుకొవడానికి ఎన్నికలు వరంగా మారాయి. అయితే ఈ పద్దతి ప్రజాస్వామ్యంలో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తోందో అనేది ప్రజలు అర్ధం చేసుకోవాలి. సమాజంలో డబ్బే ప్రామాణికంగా తీసుకోవడం భావ్యమా? అలాగైతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడుకోగలమనేది ప్రశ్నించుకోవాల్సిన అవశ్యకత ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటునేది ఓఆయుధం. ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు బాధ్యతగా ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటును వినియోగించుకుని మంచి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలి. భవిష్యత్తులో భావితరాలకు ఈవ్యవస్థను సరిదిద్దాలి. రాజకీయ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. నవతరాన్ని ప్రోత్సహించాలి. రాజకీయ కురువృద్దుల స్థానంలో యువతరానికి చోటనివ్వాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థ పెఢరిల్లుతోంది. వ్యక్తి అస్థిత్వాన్ని గుర్తించి వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. మంచి నాయకత్వం లేకుండా మంచి సమాజం ఏర్పడదు. రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా.. సాంఫీుక, ఆర్ధిక, సమానత్వాన్ని సాధించాన్నా, భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే యువతరాన్ని ప్రొత్సహించి వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది!- రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడ‌టిర్

ఆదివాసీల అన్యాయంపై..ఊరాటనిచ్చిన సుప్రీం కోర్టు స్టే’

ఆదివాసీలు తరతరాలుగా అడవులపై గిరిజనులు వారసత్వపు హక్కు సహజంగానే అనుభవిస్తూ వస్తున్నారు. అడవులను ఆదాయ వనరులుగా ప్రభుత్వాలు గుర్తించడం ప్రారంభించనప్పటి నుంచి అటవీ వినియోగం నుండి గిరిజనులను దూరం చేయడం మొదలైంది. వారి సాంప్రదాయక హక్కులు హరింపజేస్తూ ఎన్నో చట్టాలు రూపొందించడం జరిగింది. అటవీ సంరక్షణ, క్రమబద్దీకరణ పేరుతో వారి హక్కులు కాలరాసి రాయితీలు కల్పిస్తూ నియమాలు రూపొందించారు. దేశవ్యాప్తంగా అటవీ భూవనరులపై హక్కుకోసం ఆదివాసీల పోరాటం సలిపారు. ఫోరాట ఫలితంగా ది షెడ్యూల్‌ ట్రైబ్స్‌ ఇతర సాంప్రదాయక అటవీ నివాసుల అటవీహక్కుల గుర్తింపు చట్టం`2006 నెం.2/2007ను భారత పార్లమెంట్‌లో 2006, డిసెంబరు 15న ఆమోదం పొందింది. అయినా సరే దీని అమల్లో ఆదివాసీ ప్రజలకు అన్యాయం జరుగుతూనే వస్తోంది. ఈ చట్టం ఆదివాసీలకు అటవీ భూములపై వ్యక్తిగత, కమ్యూనిటీ హక్కులతోపాటు అటవీ వనరులపై కూడా హక్కును కల్పిస్తుంది. చట్టం తీసుకువచ్చినప్పటికీ ఇది సక్రమైన రీతిలో అమలుకు నోచుకోవడం లేదు. దీనిఅమలుపట్ల పర్యావరణ పరిరక్షణ, అటవీశాఖ విభాగం సవితితల్లి ప్రేమగా చూపుతున్నారు. ఈనేపధ్యంలో చట్టం అమలుపై మరో ఘోరమైన పిడుగు పడిరది.
ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆదివాసీలు ఆందోళనకు గురయ్యారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని..అడవుల్లో అక్రమంగా నివసిస్తున్నవారి కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రమాదంలో పడుతోందని వైల్డ్‌ లైఫ్‌ యాక్టివిస్ట్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించిన కారణంగా11.8లక్షల ఆదివాసీలను తొలగించాలని సుప్రీం కోర్టు మధ్యంతరఉత్తర్వులిచ్చింది. అటవీ హక్కుల చట్టం అనేది అనాదిగా అరణ్యాల్లో నివసిస్తున్నవారికి భూమిపై హక్కు కల్పించడానికి ఉద్దేశించిందే కానీ..భూపంపిణీ, వితరణకు ఉద్దేశించింది కాదని పిటిషనర్లలో ఒకరైన వైల్డ్‌ లైఫ్‌ ట్రస్ట్‌కు చెందిన ప్రవీణ్‌ భార్గవ్‌ నివేదించారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని కాపాడలేకపోవడమేనని వారు పలువురు మేధావులు అభియోగాలు. ఏజెన్సీలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా అటవీశాఖ అధికారులు తూట్లు పొడిచి నిర్వీర్యం చేశారు. ఇది అటవీశాఖ అధికారులు, రాష్ట్ర,కేంద్రప్రభుత్వాల వైఫల్యమేనని పలువురు భావిస్తున్నారు. గతంలో 2002, 2004 మధ్య అటవీ ఆక్రమణలను నిరోధించేందుకుగాను సుమారు 3 లక్షల మందిని అడవుల నుంచి ఖాళీ చేయించారని ఈ వ్యవహారాలపై అధ్యయనం చేసే సీఆర్‌ బిజోయ్‌ ప్రకటించారు. ఆసమయంలో అకృత్యాలు జరిగాయని.. ఇళ్లను తగలబెట్టారని, పంటలను ధ్వంసం చేశారని, పోలీసుల కాల్పుల్లో ఎంతోమంది మరణించారని బిజోయ్‌ వెల్లడిరచారు. అడవుల్లో నివసించేవారికి మొదటి నుంచి యాజ మాన్య హక్కులు పత్రసహితంగా లేకపోవడం, చట్టప్రకారం కల్పించాలన్నా కూడా అది అధికారులపై ఆధారపడి ఉండడంతో చాలామంది అనాదిగా అరణ్యాల్లోనే నివశిస్తూ, ఆక్రమణదారులుగా మిగిలిపోతున్నారని బిజోయ్‌ నివేదిక వెల్లడిస్తోంది. దీంతో గిరిజనులు ఎంత దుర్బల జీవితం గడుపుతున్నారో అర్ధమవుతుంది. దేశవ్యాప్తంగా దట్టమైన అడవుల్లో పరవళ్లు తొక్కే నదులు..ఇనుము, బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాల మధ్య బతికే గిరిజనులు ఇప్పటికే గనులు, ఆనకట్టలు, కర్మాగారాల కోసం తమ ఇళ్లను, భూములను కోల్పోయారు. ఇప్పుడు కోర్టు తీర్పు మేరకు ఇల్లూపొల్లూ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలు వారు ఎంత దుర్బల, దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పడానికి.
అడవి బిడ్డలకు ఊరటనిచ్చిన సుప్రీం స్టే
అటవీప్రాంతాల నుండి ఆదివాసీలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 21న (గురువారం) స్టే ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు అడవి బిడ్డలకు ఊరటనిచ్చింది. ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు ఈ రోజు నిలిపేసింది. అడవి బిడ్డల వాదనలను తోసిపుచ్చుతూ అవలంబించిన కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరంగా అఫిడవిట్‌లో దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆదివాసీలను అడవుల నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇన్నేళ్లుగా నిద్ర పోతున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున జాప్యం జరిగిందని సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అంగీకరించడంతో మీరు ఇప్పుడే నిద్ర లేచారా..అని కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం..షెడ్యూల్డ్‌ తెగలు, అటవీ హక్కుల చట్టం కింద ఇతర సంప్రదాయ అటవీ నివాసులతో సుమారు 11,72,931 (1.17 మిలియన్‌) ఎకరాల భూమి, భూ యాజమాన్యం హక్కుల వాదనలు, వివిధ కారణాలపై తిరస్కరించబడ్డాయి. ఈ భూమి కనీసం మూడు తరాల నుండి వారి స్వాధీనంలో ఉన్నట్టు నిరూపించలేక పోయినవారు ఉన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంతచట్టాల ప్రకారం..ఆ భూములను ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల బెంచ్‌ ఆదేశించిన విషయం విధేతమే. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసులకు అన్యాయాలు జరగకుండా షెడ్యూల్లో పొందుపరిచిన రాజ్యాంగపరమైన చట్టాలను సమర్ధవంతంగా అమలు పర్చడానికి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఆదివాసీ అన్యాయాలు జరగకుండా వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవశ్యకత ఉంది !- ర‌వి రెబ్బాప్ర‌గ‌డ‌,ఎడిట‌ర్‌

ఎలెక్షన్లు వస్తున్నాయి..జాగ్రత్త!

మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు కీలకం. స్వాతంత్య్రం వచ్చి 72సంవ్సరాలు అయ్యింది. 1950 నుంచి చాలాసార్లు చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. దేశ్యావ్యాప్తంగా జాతీయ పార్టీలు, ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మారుతూ వస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీలు కొత్తగా పుట్టికొస్తున్నాయి. పార్టీలతో పాటు జెండాలు మారుతూ వస్తున్నాయి. కానీ ప్రజా సంక్షేమం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మనకు కన్పిస్తోంది. ఎలెక్షన్లు వస్తే మార్పులు వస్తాయి, సంక్షేమ ప్రభుత్వం వస్తోంది..తమ బ్రతకులు బాగుపడతాయని, గిరిజన,దళితులైన పేదప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఇప్పటి వరకూ ఓటు వేసుకుంటూ వస్తున్నారు !
ప్రతిసారి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎలెక్షన్‌ గేమ్‌లో ప్రజలే కాదు,చదవర్లు,మేథావులు సమిధులుగా అటవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎలెక్షన్‌లో నెగ్గిన రాజకీయ పార్టీ నాయకులందరికీ ప్రజల నాడి అర్ధమైపోయింది. అధికారం చేజిక్కుంచుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెడుతున్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్పరిస్తూన్నారు. ఈరకంగానే ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగుతున్నారు. ఇది ఆంధ్ర,తెలంగాణ అనే కాకుండా దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోను ఉంది. కేవలం రంగులు మాత్రమే మారుతున్నాయి తప్పా, రాజకీయ దోపిడి మామూళ్లుగానే సాగుతోంది. నెగ్గిన ఐదేళ్లపాటు అధికారమనే లైసెన్స్‌ ఆసరాగా తీసుకొని వారిష్టమోచ్చినట్లుగానే వ్యవహరించే వ్యవస్థ తయారైంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ పరిస్థితుల్లో రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నైనా ప్రజలు అప్రమత్తం కావాలి. దీన్ని ప్రజలు సంపూర్ణంగా అర్ధం చేసుకొని చైతన్యవంతులు కావాలి. రాజకీయ నాయకులు ప్రజల అమయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటర్లకు అర్హతలు సరిగా నిర్ణయించకపోవటం, ఓటర్లు డబ్బులకు ఓట్లు అమ్ముకోవటం, ఓట్ల లెక్కింపు విధానం సరిగా లేకపోవటం,రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటింగు లేకపోవటం, దొంగ ఓట్లు వేయటం, పోలింగు కేంద్రాలను ఆక్రమించి రిగ్గింగు చేయటం, బలహీనవర్గాలను పోలింగు కేంద్రాలకు రానీయకుండా అడ్డుకోవడటం, ఎన్నికల్లో మితిమీరిన హింస, తక్కువశాతం పోలింగు కావటం, నేర చరిత్ర ఉన్నవ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనటం,కుల,మత,ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టటం, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల్లో దుర్వినియోగం చేయటం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం, అసంబద్ధమైన వాగ్దానాలు చేయటం, సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉపఎన్నికలతో సంవత్సరం పొడవునా, ఐదు సంవత్సరాలపాటు ఎన్నికల వాతావరణం నెలకొనటం, పార్టీల నియంత్రణ చట్టం లేకపోవటం, ఎన్నికల సంఘానికి ఎక్కువ అధికారాలు లేకపోవటం, ప్రభుత్వ, ప్రైవేటు మీడియాను దుర్వనియోగం చేయటం, పార్టీఫిరాయింపులు మొదలగునవి మన ఎన్నికల విధానంలోని ముఖ్యమైన లోపాలగా పరిగణించ వచ్చాల్సి వస్తోంది.
ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ బలంగా ఉండాలంటే రాజకీయ పార్టీల నియంత్రణ చట్టం చాలాఅవసరం. రాజకీయ పార్టీల వ్యవహారాన్ని అంతరంగిక వ్యవహారంగా భావించరాదు. అవికూడా ప్రజలకు, న్యాయస్థానాలకు, ఎన్నికల సంఘానికి జవాబుదారీగా ఉండాలి. రాజకీయ పార్టీల ఎన్నికలు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన రాజకీయ పార్టీలను మాత్రమే అనుమతించాలి. సాధారణ ఎన్నికల నిర్వహణ సుదీర్ఘకాలంపాటు ఉంటున్నది. దశలు ఎక్కువగా ఉండటం, ఒక్కొక్క దశకు ఎక్కువ కాలపరిమితి ఉండటం వలన సుదీర్ఘ ప్రక్రియగా మారింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోనే ఎన్నికలను నాలుగు దశలలోనే జరపాలన్న నిబంధన ఉండాలి. ఒక్కొక్క దశకు నాలుగు రోజులవ్యవధి మాత్రమే ఉండాలి. ఎన్నికల ప్రకటన తేదీ నుంచి లెక్కింపు తేదీ మధ్య రెండు నెలలకు మించి ఉండకూడదు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో నాలుగింట మూడువంతుల స్థానాలను అభ్యర్థులను ఎన్నుకోవటం ద్వారాను, స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల నిష్పత్తి ప్రకారం రాజకీయ పార్టీలు సూచించిన అభ్యర్థులను ఎంపిక చేయాలి. సాధారణ ఎన్నికల్లో మెజారిటీ రాని చోట్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, కొద్ది రోజుల్లోనే పార్టీ ఫిరాయింపుల వలన అవి కూలిపోవటం, మళ్లీఎన్నికలు ఎదుర్కొన వలసి రావటం గత 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. చట్టసభల కాలపరిమితి ఐదు సంవత్సరాలని చెప్పినప్పటికీ చాలాసార్లు మధ్యలోనే రద్దవుతున్నాయి. పార్లమెంటరీ విధానంలో ఇదొక పెద్ద లోపం. దేశంలోని అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా రాజ్యాం, చట్ట సవరణలు చేసుకోవాలి. కాలపరిమితి ప్రకారమే సాధారణ ఎన్నికలు జరగాలి. పార్లమెంటు,అసెంబ్లీ ఎన్నికలు పార్టీ చిహ్నాల మీద జరిగితే, స్థానిక సంస్థలు, ఇతర సహకార సంఘాల ఎన్నికలు పార్టీ రహితంగా జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం లేక లాటరీ విధానం అనుకరిస్తే ఇంకా మంచిది.ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. పోటీ చేసే అభ్యర్థులు ఓట్లను కొనటానికి తెగబడుతున్నారు. ఓటర్లు కూడా చాలామంది ఓట్లు అమ్ముకోవటం తప్పు కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఓటుకు ఇంత ఇవ్వాలని పట్టుబట్టే స్థితికి ఓటర్లు వచ్చారు. దీన్ని నివారించటానికి రహస్య ఓటింగుతో పాటు బహిరంగ ఓటు విధానాన్ని ప్రవేశపెట్టాలి. బహి రంగ ఓటింగు విధానం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. ఈ పద్ధతివలన ఓటర్లు బాధ్యత కలిగి ఉంటారు. బాధ్యతతో మెలిగే ఓటర్లుకు విలువ పెరుగుతుంది! – ర‌వి రెబ్బాప్ర‌గ‌డ‌,ఎడిట‌ర్

మార్పు అవసరం..!

నేను 1987లో తూర్పుగోదావరిజిల్లా శంఖవరం మండలం గిరిజనప్రాంతమైన పెదమల్లాపురం వెళ్లినప్పుడు చాలా చోట్ల కరెంట్‌లేదు. రోడ్డుల్లేవు. రవాణా సదుపాయాల్లేవు. సైకిళ్ళు, ఎడ్లబండ్లే అక్కడ..అక్కడా కన్పించేవి. కాలినడకనే కొండెక్కి దిగాల్సి వచ్చేది. ఆఖరికి అగ్గిపుల్ల కావాలన్నా కొండదిగిరావాల్సిందే. ఏ గ్రామానికి వెళ్లిన విద్య,వైద్యం అందక ప్రజలు నానా అవస్థలు పడేవారు. బడులుగాని, ఆసుపత్రులుగాని లేవు. చాలామంది పిల్లలు అస్తవ్యస్థంగా కన్పించేవారు. వైద్యం కూడా ఉండేదికాదు. నిత్యావసరాలు దొరికేవి కాదు. కొన్ని ప్రాంతాల్లో అసలు వారపు సంతలే ఉండేవి కాదు. చాలా వరకు ఉత్తరాలు అందని గ్రామాలు ఉండేవి. ఆసమయంలో వేళింగి సమీపంలో ఉండే స్పందన సంస్థ నిర్వహించే స్వర్గీయ కె.ఎస్‌. తిలక్‌ గారి వద్ద నేను, స్థానిక యువకలు కొంతమంది కలసి కొద్దిరోజులు పనిచేశాం. అక్కడ గిరిజనులకు వాహనాలంటే వేళింగిలో ఉన్న స్పందన సెంటర్‌లో ఉండే మోటర్‌ సైకిల్‌ ఆప్రాంత గిరిజనులకు తెలుసు. హెల్మేట్‌ ధరించి వెళ్తూంటే జనం భయపడేవారు. నక్సలైట్లు, పోలీసులు గోడవలు ఎక్కువగా ఉండేవి. భూవివాదాలు అధికంగా ఉండేవి. ఆరోజుల్లో అక్కడ భూస్వాములైన మల్లుదొర లాంటి వాళ్లు ఉండేవాళ్లు. ఇప్పుడు లేరని కాదు !అక్కడ లోతా సుబ్బారావు గారి నాయకత్వంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులకు తెలయపర్చడం, వాటిని పరిష్కరించడం ..ఇలా ప్రజల్ని చైతన్యపర్చడం, సమస్యలపట్ల అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఆ కాలంలో అధికారులు కూడా ప్రజా సమస్యలు పట్టించుకొని తక్షణమే పరిష్కరించేవారు.
ప్రస్తుతం కొత్తభూస్వాములు వచ్చారు. నూతన ఆర్ధిక విధానంలో ప్రభుత్వం ద్వారా పారిశ్రామిక భూస్వాములు తయార య్యారు. ఆరోజుల్లో ప్రభుత్వం పనిచేసే అధికారులు ప్రజల కోసం పనిచేసేవారు. అక్కడ ప్రజల గోడు, వారి పడే బాధలు స్వయంగా పరిశీలించి సమస్యలు పట్టించుకొనేవారు. రహదారి సదుపాయాలు లేకపోయిన కాలినడకన మారుమూల ప్రాంతాలు నడిచి గ్రామాల్లో ప్రజల బాధలు ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు. అటువంటి ఉన్నతాధికారుల్లో బి.డి.శర్మ, కె.బి.సక్సెనా, హర్షమందార్‌, ఈ.ఏ.ఎస్‌. శర్మ, ఆర్‌.శంకరన్‌, ఎం.వి.పి.సి శాస్త్రీ, డి.విజయకుమార్‌, ఎస్‌.నరసింగరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, డాక్టర్‌. బి.వి.రమేష్‌, డాక్టర్‌ ప్రేమచంద్‌, ముఖేష్‌ కుమార్‌ మీనా, డాక్టర్‌ డి.టి.నాయక్‌, వంటి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలపట్ల శ్రద్ద చూపి పరిష్కరించే వారు.
ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా మారాయి. చాలాచోట్ల కరెంట్‌, రోడ్డులు, ఇతర మౌళికసదుపాయాలు వచ్చాయి. వైద్యం, 108,విద్య, ఐసీడీఎస్‌ సెంటర్లు,కమ్యూనికేషన్‌ సెంటర్లు విస్తరించబడ్డాయి. ఏమూలకు వెళ్లినా మొబైల్‌ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అక్షరాస్యత పెరుగుతోంది. చాలామంది గిరిజన యువత చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. మూరుమూల ప్రాంతాల్లో సహితం సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. అయితే ప్రజల్లో సాంకేతికతను పెంచింది తప్పా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం నాటి కాలంలో ఉండే అభివృద్ధి మాత్రమే కన్నిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి..పట్టణాల వైపు దృష్టి చారిస్తోంది. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వేదికగా నిలిచే గిరిజన సదస్సులు ఎక్కడా కన్పించ లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థపై ఖర్చుపెట్టిన నిధులు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడలేదు. అసలు వారికి న్యాయం చేకూరడం లేదు. అయితే గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు యువ ఐఏఎస్‌ అధికారులైన శివశంకర్‌, ప్రసన్న వెంకటేషన్‌ వంటి అధికారులు గత కాలపు ఐఏఎస్‌ అధికారులైన శంకరన్‌, బి.డి.శర్మ వంటి వారి స్పూర్తిని తీసుకొని మారుమూల గిరిజన ప్రాంతాలపై దృష్టిపెట్టి గిరిజనులకు న్యాయం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ గిరిజన ప్రజల్లో చాలా మార్పులంటే వచ్చాయి గానీ, అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. కాలాను గుణంగా గిరిజన ప్రాంతాల్లో మార్పులు వచ్చినా, శంకరన్‌గారి లాంటి ఐఏఎస్‌ అధికారుల స్పూర్తి తీసుకొని పాలనా యంత్రాంగం ప్రజల్లోకి వెళ్లి, వారి అవసరాలు, మౌళిక వసతులు కల్పనకు దృష్టి కేంద్రీకరిస్తే నాటి ఐఏఎస్‌ అధికారులు ఆకాంక్షలు నెరవేరినట్లు అవుతుంది.- రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌

1 2 3