అవంతరాల వలయంలో..విశాఖ స్మార్ట్‌సిటీ

భారతదేశం 2015లో స్మార్ట్‌ సిటీ మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 100 నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం,ఆర్థికవృద్ధిని పెంచడం దీని లక్ష్యం.నగర/పట్టణ ప్రాంతాల్లోని సామాజిక-ఆర్థిక,పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో స్మార్ట్‌ సిటీ మిషన్‌ సొసైటీలకు సహాయపడుతుంది.2016లో,20 నగరాల మొదటి జాబితాను ప్రకటించారు దేశ్యాప్తంగా అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌,పూణే,కోయంబత్తూర్‌,జబల్‌పూర్‌, జైపూర్‌, సూరత్‌, గౌహతి,చెన్నై, కొచ్చి, విశాఖపట్నం, ఇండోర్‌,భోపాల్‌,ఉదయపూర్‌,లూథియానా,కాకినాడ,బెల్గాం,షోలాపూం,భువనగిరి మొత్తం20 నగరాలున్నాయి.
ఇవి సిటీ పౌరులకు సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటాయి. డేటాను సేకరించేందుకు వివిధ ఎలక్ట్రానిక్‌ పద్ధతులు,సెన్సార్లు ఉపయోగించబడతాయి. అందుకున్న డేటా అంతర్భాగం చెత్త సేకరణ,వినియోగ సరఫరా,ట్రాఫిక్‌ కదలిక,పర్యావరణ నిర్వహణ,సామాజిక సేవల నిర్వహణలో కార్యాచరణ మెరుగుదలకు సహాయపడతాయి. అలాగే కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ సిస్టమ్‌,గవర్నెన్స్‌,రవాణావ్యవస్థ,భద్రత కోసం మెరుగైన నిఘా,స్మార్ట్‌ మౌలిక సదుపాయాలు,మెరుగైన ఉద్యోగావకాశాలు,సౌకర్యవంతంగా జీవించే ప్రతి ఇతర సౌకర్యాలు కల్పిస్తాయి.
వాస్తవానికి స్మార్ట్‌ సిటీ అంటే ప్లానింగ్‌ పక్కాగా ఉండాలి.కానీ ఎక్కడ ఏం జరుగుతుందో..ఏ పని ఎటు వెళ్తుందో తెలియక తికమకపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మరెక్కడో కాదు ఏపీలో కీలక నగరమైన విశాఖపట్నంలోనే.స్మార్ట్‌సిటీలో నిరుపేదలు జీవించే పరిస్థితులు లేకుండా పోతుంది. నగరానికి జీవనోపాధి పొట్టకూటి కోసం వచ్చే వలసవాదులు,బీక్షాటన చేసే బిక్షగాళ్లకు సరిjైున సదుపాయాలు లేక రోడ్డుజంక్షన్లవద్దనే భిక్షాటన చేయడం శోచనీయం.వీటికి చట్టాలున్నా శూన్యంగానే ఉంది. మరోపక్క చెత్త,చెదారం,ఆహార వ్యర్ధాలు విచ్చలవిడిగా పడేయడంవల్ల నగరమంతా అస్తవ్యస్థంగా మారుతోంది. స్మార్ట్‌సిటీ అంటే చెత్తరీసైక్లింగ్‌కు అధిక ప్రాధాన్యత కల్పించాలి.కానీ ఆపరిస్థితి విశాఖలో కన్పించడం లేదు.స్మార్ట్‌సిటీ అంటే కేవలం మెయిన్‌ రోడ్లుకు మరమ్మతులు,డివైడర్ల మధ్య పూల మొక్కలు,ప్రగహారీగోడలకు రంగులు వేయడమేనా?నగరాన్ని ఆనుకొని ఉన్న మురికివాడలు,గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ లింక్‌ రోడ్డు నిర్మిణాలు ఎక్కడ జరుగుతున్నాయి? పచ్చని చెట్లు నరికేసి మొదళ్లు,మోడులకు రంగులు వేయడం అవసరమా?.అలాగే ప్లాస్టిక్‌ నియంత్రణ ప్రకటనలకే పరిమితమైయ్యింది.నగర నడిబొడ్డునఉన్న ఎన్నో షాపింగ్‌ మాల్స్‌,దుకాణాల్లోను ప్లాస్టిక్‌ తాండవి స్తోంది.దీంతో నగరపరిసరాలన్నీ ప్లాస్టిక్‌మయంగా మారింది.పరిశ్రమల నుంచి వెలువడే కాలు ష్యకారకాలు,వాహన శబ్దకాలుష్యాలు నగరాన్ని రాజ్యమేలు తున్నాయి.

జగనన్న ఇళ్లు స్థలం పేరుతో నగరంలో జీవిస్ను నిరుపేదలను3040కిలోమీటర్ల దూరంలో అభయారణ్యాల మధ్య నగరం నుంచి గెంటేశారు. వీరంతా నగరంలో చిన్నచితక పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నిరుపేదలే.ఇప్పుడంతా వారు నిర్వాసితులయ్యారు. ఉన్నచోటనే నిరుపేదలకు ఉపాధి,ఇతర మౌళిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వాలు స్మార్ట్‌సిటీ పేరుతో పేదలను నగరం నుంచి గెంటేయడం ఎంతవరకు సమాంజసం. ఇక ఇంటర్నెట్‌ ఆఫ్‌థింగ్స్‌,పబ్లిక్‌ సేఫ్టీ,స్మార్ట్‌ మొబిలిటీ,పెరిగిన టూరిజం,సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,ఫిజికల్‌ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నగరాన్ని స్మార్ట్‌ సిటీలుగా మార్చడాన్ని సులభతరం చేస్తాయి.కానీ నగరాన్ని ఆనుకొని స్మార్ట్‌సిటీలో విలీనమైన దబ్బంద గ్రామంలో ఇప్పటికీ సెల్‌ఫోన్‌ సిగ్నిల్‌ రావడం లేదు.దీనివల్ల అనేక మంది నిరుపేద ప్రజలు ప్రభుత్వం కల్పించే సంక్షేమ ఫలాలు సక్రమంగా పొందలేకపోతున్నారు.

ఈనెల 28,29,30తేదీల్లో జరిగే జీ20సదస్సుకు కోసం జీవీఎంసీ రూ.150కోట్లతో నగరాన్ని సుందరీకరణ చేస్తుంది కానీ అస్తవ్యస్థంగా పడి ఉన్న చెత్త,ప్లాస్టిక్‌ సేకరణలో మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తోంది.సేకరించిన చెత్త,ప్లాస్టిక్‌ నియంత్రణ కోసం శాస్త్రీయమైన రీసైక్లింగ్‌ పద్దతులను పాటించి పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాల్సిన అవశ్యకత ఎంతైనాఉంది.అప్పుడే స్మార్ట్‌సిటీ ప్రయోజనాలు ప్రజలకు సమకూరుతాయి. – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్