భూముల చుట్టూ సమస్యల ముళ్లు

ఏళ్లతరబడి వారే సాగు చేసుకుంటు న్నారు. వారి వద్ద పాత దస్త్రాలున్నాయి. నేటికీ కొత్త పాసుపుస్తకం అందలేదు…తాము సాగు చేసు కుంటున్న భూమికి ఆధీనధ్రువీకరణ పత్రంఉంది. అయినా ఆన్‌లైన్‌లో సర్వే నంబరు కనిపిం చడం లేదు. క్షేత్రస్థాయిలో ఇలాంటి అనేక భూ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.

ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొం దించి ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను ప్రవేశ పెట్టి సులభతర భూ లావాదేవీలకు వీలు కల్పించింది. అయితే కొత్త చట్టంతో ఇన్నాళ్లూ హక్కులు, పాసుపుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్లకు అధికారాలు లేకుండా పోయాయి. ఇటీవల పెం డిరగ్‌ సమస్యల పరిష్కార బాధ్యతలను ప్రభు త్వం కలెక్టర్లకు అప్పగించింది. నెలల తరబడి పరిష్కా రం కాని సమస్యలకు వారం రోజులే గడువు విధిం చింది.దీనివల్ల గందరగోళ పరిస్థి తులు ఏర్పడగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ఐచ్ఛికాలే లేవంటూ నిట్టూరుస్తున్నారు.
కుటుంబంలోని కొందరిని తప్పించి మిగిలినవారికి గతంలో పాసుపుస్తకాలిచ్చారు. దీన్ని సరిచేసే ఐచ్ఛికాన్ని ధరణిలో ఇవ్వలేదు. ఇన్నాళ్లూ ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతూ వచ్చిన అధికారులు ఇప్పుడు రెవెన్యూ కోర్టుల్లో కేసులున్న వారివి మాత్రమే పరిష్కరిస్తా మంటు న్నారు. క్షేత్ర స్థాయి అధికారులు చేసిన పొరపాట్లు అర్హులైన వారికి శాపంగా మారాయి. భూ సేకరణ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న భూమి పోను మిగిలిన దానిని లబ్ధిదారుల ఖాతాలో కలపాల్సిఉండగా ఇంకా పరిష్కరించలేదు. ఒక సర్వే నంబరు లో సగం భూమి తీసుకుంటే ఆ నంబరు మొత్తం ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఐచ్ఛి కాన్ని ఇచ్చింది. అయితే, సర్వే నంబరు ఆన్‌లైన్‌లో కనిపించక పోవడంతో దరఖాస్తును ఆన్‌లైన్‌ తిరస్క రిస్తోంది. గతంలో సాదాబైనామాకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అనువుగా మలుచుకుని పక్కనే ఉన్న సర్వే నంబరులోని భూమిని కూడా కొందరు కలిపేసుకున్నారు. ఈఅంశంపై విచారించిన అనం తరమే క్రమబద్ధీ కరించాల్సి ఉండగా చాలా చోట్ల దస్త్రాల ఆధారంగా మమ అనిపించారు. ఇప్పుడు ఈతప్పును సరిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏజెన్సీ ప్రాంతంలో పాసుపుస్తకాల జారీ సమస్య గిరిజనప్రాంతంలో ఏజెన్సీ చట్టానికి లోబడి అర్హులైన గిరిజనులకు హక్కుపత్రాలు జారీ చేయాల్సి ఉంది. గిరిజనుల నుంచి గిరిజనేతరులు,అర్హత లేని గిరిజనులు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 76వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. గిరిజనులు,గిరిజనులకు మధ్య తెల్ల కాగి తాలపై జరిగిన ఒప్పందాలు సాదాబైనామాలు క్రమబద్ధీకరించాల్సి ఉంది. కలెక్టర్‌ లాగిన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. కానీ, చాలా సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది. కొందరు రైతుల మధ్య విస్తీర్ణం లో వివాదాలు నెలకొన్నాయి. దీనిపై గతంలోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసుకోగా ఇరు వురికి పాసుపుస్తకాలు నిలిపివేశారు. క్షేత్రస్థాయి సర్వే చేస్తే గానీ పరిష్కారం కనిపించడం లేదు. కలెక్టర్‌ లాగిన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. పాసు పుస్తకంతో ఆధార్‌ అనుసంధానం సందర్భంగా వేలిముద్రలు నమోదుకాక ఇన్నాళ్లూ పాసుపుస్తకం రానివాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌ లాగిన్‌లో మరోమారు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వేలిముద్రలు లేకపోతే కనుపాప ఐరిస్‌ తోనూ పాసుపుస్తకం జారీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారికి చాలాచోట్ల పాసు పుస్త కాలు జారీ చేయడం లేదు.ఈ తరహా భూముల సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. ఆన్‌లైన్‌లో ఖాతా నంబరు లేక పాసు పుస్తకాలు రాని రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్నాళ్లూ వీరికి పాసుపుస్తకం జారీ చేస్తామంటూ తహసీల్దారు కార్యాలయ అధికారులు సర్ధిచెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కలెక్టర్లకు పెండిరగ్‌ సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది. అయితే ఖాతా నంబరు లేని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం మీసేవ, ధరణిలో ఐచ్ఛికాలు లేవు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూముల విస్తీర్ణంలో కోత
కొందరు రైతులకు పాసుపుస్తకాల్లో సర్వే సంఖ్యలు నమోదైనప్పటికీ విస్తీర్ణాల్లో కోతలు పెట్టారు. రెవెన్యూ సెటిల్‌మెంట్‌ సర్వే (ఆర్‌ఎస్‌ఆర్‌) ప్రకారం ఒక గ్రామ సేత్వారిలోని మొత్తం విస్తీర్ణం ఆ గ్రామంలోని రైతుల ఖాతాల్లోని విస్తీర్ణానికి మించి ఉంటే ధరణిలోకి అనుమతించదు. ఈకార ణంతోనే మొద ట్లో రెవెన్యూ సిబ్బంది కొందరు రైతుల విస్తీ ర్ణాల్లో కోతపెట్టారు. ఇప్పటికీ ఈ కత్తి రించిన విస్తీర్ణాలను కలిపే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం కలెక్టర ్లకుదర ఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
3 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌.. మ్యుటేషన్‌
ధరణి పోర్టల్‌లో నెల రోజుల వ్యవధి లో 60వేల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరి గాయి. పోర్టల్‌ గతేడాది నవంబరు రెండో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో జనవరి-ఫిబ్రవరి నెలల మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లే అధికం. మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనిష్ఠంగా మూడు నిమిషాలు,సగటున 36నిమిషాల సమ యం పడుతోంది. వ్యవసాయ భూములను వ్యవ సాయేతర భూములుగా మార్పిడికి రెండు నుంచి ఎనిమిది నిమిషాల వ్యవధిపడుతోంది. ఎన్ని రిజిస్ట్రే షన్లు పూర్తవుతున్నాయో అంతే సంఖ్యలో మ్యుటేషన్లు కూడా పూర్తవుతున్నాయి.
పోడు భూముల సమస్యలు తీరాలంటే.. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీర్‌ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెబుతూ వస్తు న్నారు. అయితే ప్రభుత్వం మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల పోడు భూముల సమస్య లకు త్వరితగతిని పరిష్కారం చూపవచ్చంటున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్‌ కుమార్‌. అటవీ భూములకు హక్కు పత్రాలు కావాలని గతంలో 2లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చా యి. ఇందులో 93 వేల మందికి హక్కు పత్రాలు అందాయి. మిగతా వారివి తిరస్కరించామని ప్రభు త్వం చెప్పింది. అయితే అధికారికంగా దర ఖాస్తు చేసుకున్న వారికి సమాచారం లేదు.ఈ క్రమంలో ఎవరి దరఖాస్తులు తిరస్కరించారో వారికి సమా చారం ఇవ్వడంతో పాటు అప్పీల్‌ చేసుకునే అవకా శం ఇవ్వాలని సూచిస్తున్నారు. అదే విధంగా అర్హత ఉండీ ఇంకా హక్కు పత్రాలకు కోసం దరఖాస్తు చేసుకోని వారు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం కల్పించాలంటున్నారు. ఇక అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములను ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి తాత్కాలికంగా హక్కు పత్రాలు ఇవ్వడం దీర్ఘకాలికంగా ఉమ్మడి సర్వే చేసి అది ఏభూమో తేలితే ఆచట్టాల మేరకు హక్కు పత్రాలు కొనసాగించాలని చెబుతున్నారు. ఇక హక్కు పత్రాలను అందుకున్న వారికి అనేక చిక్కుముడులు ఉన్నాయి. కొద్ది మందికి వారు వాస్తవంగా సాగు చేసుకుంటున్న మొత్తం విస్తీర్ణం కాకుండా కొద్దిపాటి భూమికే హక్కు పత్రం వచ్చింది. పూర్తి విస్తీర్ణం కాకుండా ఎవరికైతే తక్కువ విస్తీర్ణం వచ్చిందో వారికి కూడా అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పిం చాలని సునీల్‌ కుమార్‌ సూచిస్తున్నారు. 2008 అటవీ హక్కుల చట్టం అదే చెబుతోందని అంటు న్నారు. 10ఎకరాల లోపు ఎంత భూమి సాగులో ఉంటే అంత భూమికి హక్కు పత్రం ఇవ్వచ్చని అంటున్నారు. ఇక పోడు భూములు సాగు చేసుకునే వారంతా గిరిజనులు కావడం వల్ల గిరిజన సంక్షేమ శాఖ తరపున లీగల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి వారి ద్వారా అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలం టున్నారు. గ్రామస్థాయిలోనే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిం చి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించి విచారణ చేపట్టి పరిష్కారం చూపాలంటున్నారు. అటవీ హక్కు చట్టం కేవలం అటవీ భూములను దున్నుకునే హక్కుకోసం చేసిన చట్టం మాత్రమే కాదు. అడవుల సంరక్షణ కోసమూ చేసిన చట్టం. అడవుల సం రక్షణ కోసం కమ్యూనిటీ టీమ్‌లు కీలకపాత్ర పోషి స్తున్నాయి. ఈ నేపథ్యంలో సామూహిక హక్కుల కోసం ఎక్కడైతే దరఖాస్తులు వచ్చాయో వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయా లంటున్నారు.
ఆదివాసీల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వడంతోనే నేను టీఆర్‌ఎస్‌లో చేరాను. అటవీ భూముల నుంచి గిరిజనులను ఖాళీ చేయిస్తున్నారు. వారిని బెదిరి స్తున్నారు. సాగు చేసుకోకుండా అడ్డుప డుతున్నారు. అమీ తుమీతేల్చుకోకుంటే బతుకులు రోడ్డున పడ తాయి.అటవీ అధికారులను నిర్బంధించండి. పోరాటాలు చేసేందుకు గిరిజనులు సిద్ధంగా ఉండాలి.‘‘అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూవివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తాం. ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వారికీ వర్తింపజేస్తాం’ – 2018 శాసన సభ ఎన్నికలకు ముందు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ‘‘గిరిజనులను రక్షించాలి. పోడు భూముల వ్యవహారాన్ని తేల్చేయాలి. అన్ని జిల్లాలు, అన్ని డివిజన్లకూ నేనే స్వయంగా పోతా. నేనొక్కణ్నే కాదు.. మొత్తం మంత్రివర్గాన్ని, అటవీశాఖ ఉన్న తాధికారులను, చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలం దరినీ తీసుకెళ్లి… తాలూకా కేంద్రాల్లో ప్రజాదర్బా ర్లు పెట్టి.. ‘ఇదిగో ఇది పోడు భూమి.. ఇదిగో మీ పట్టా’ అని ఇచ్చేస్తాం. దానిని ఫైనల్‌ చేసేస్తాం. ఆ తర్వాత ఒకఇంచు భూమి కూడా ఆక్రమణల పాలు కానివ్వం. పొరుగు రాష్ట్రం నుంచి గుత్తి కోయలు వచ్చి తమ ఇష్టం వచ్చినట్లు చెట్లను నరికేస్తు న్నారు. దీంతో మన గిరిజనులు నష్టపోయే పరిస్థితు లుంటున్నాయి. అందుకే ఈ పోడు భూములకు ఎక్కడో ఒక దగ్గర భరత వాక్యం పలకాలి. ఆర్‌వో ఎఫఆర్‌ చట్టం ప్రకారం హక్కులు కల్పిస్తాం. ఆ పేద గిరిజనులకు కూడా రైతుబంధు, రైతుబీమా రావాలి. వాళ్లు బతకాలి. వాళ్లూ మన బిడ్డలే ’’ -2019 జూలై నెలలో పోడుభూములపై అసెం బ్లీలో సీఎం కేసీఆర్‌ గిరిజనులకు ఇచ్చిన భరోసా ‘‘రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్క రించాలని కేబినేట్‌ సమావేశంలో చర్చించాం. ఈ చట్టం కేంద్రం పరిధిలో ఉంది. 2005 సంవత్స రం కటాఫతో రాష్ట్రంలో అవకాశం ఉన్న అందరికీ పోడు భముముల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం’’-నల్లగొండ జిల్లా హాలియాలో (ఆగస్టు 2న) జరిగిన నాగార్జునసాగర్‌ నియోజక వర్గ ప్రగతి సమీక్షలో సీఎం.
ఇలా పోడుభూముల సమస్యపై కేసీఆర్‌,టీఆర్‌ఎస్‌ పార్టీ పదేపదే హామీలిస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. దశాబ్దన్నర కాలం నుంచి రావణ కాష్టంలా రగులుతున్న పోడు భూముల వ్యవహారం ఆదివారం నాటి కేబినేట్‌ సమావేశంలో, సోమవారం నాటి హాలియా ప్రగతి సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై పాలకులు ప్రతిసారీ హామీలు,భరోసాలు ఇస్తున్నారే తప్ప,అవి ఆచరణ లోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ భగ్గుమంటున్నాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించేలా ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని తెచ్చినా…తెలంగాణలో అది అమలు కావడం లేదని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఒక్క సెంటు భూమిపై కూడా ఆదివాసీలకు హక్కులు కల్పించలేదని గుర్తుచేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ దీనిపై పలుమార్లు భరోసా ఇస్తున్నా… ఆయన హామీలు ఆచరణలోకి రావట్లేదని గిరిజన, ఆదివాసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో దాదాపు 13లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నాయని, ఇంత భారీ మొత్తంలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కులు లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పిస్తామని సీఎం తాజాగా ప్రకటించి నందున ఇప్పటికైనా ఈసమస్యకు పరిష్కారం లభి స్తుందని ఆదివాసీలు ఆశిస్తున్నారు.
2005లోనే..
పోడు భూములపై ఆదివాసీ బిడ్డలకు సాగు హక్కులు కల్పించాలని దశాబ్దన్నర క్రితమే కేంద్రం నిర్ణయించి..‘రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌ (ఆర్‌వోఎఫఆర్‌) యాక్ట్‌-2006’ను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పోడు భూములపై సర్వే చేసి, న్యాయబద్ధంగా ఉన్న కేసులను గుర్తించి, పొసెషన్‌లో ఉన్న వారికి భూసాగు హక్కులు కల్పిం చాలని ఆదేశించింది. 2005 డిసెంబర్‌ 13 వరకు సాగులో ఉన్న పోడుభూములపై హక్కులు కల్పిం చాలంటూ ప్రకటించింది. తెలంగాణలో.. ఆదిలా బాద్‌, కుమ్రం భీం-ఆసిఫాబాద్‌, భద్రాద్రి-కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, జయశంకర్‌-భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌ వంటి మొత్తం 24 జిల్లాల్లో పోడు భూముల సమస్య ఉంది. రాష్ట్రంలో గోండు,బంజారా,కోయ,చెంచు,తోటి,కొలాం,నాయిక పోడ్‌ వంటి గిరిజన తెగలకు చెందిన ప్రజలు, కొంత మంది గిరిజనేతరులు పోడు భూములను సాగు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు అప్పటి వైఎస్‌ ప్రభుత్వం 2007లో పోడుభూములపై సర్వే చేయించగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 40 లక్షలకు పైగా ఎకరాలు పోడు వ్యవసాయం కింద ఉన్నట్లు తేలింది. ఒక్క తెలంగాణలోనే 13 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములున్నాయని తేల్చారు.
పరిష్కారమేదీ?
వైఎస్‌ హయాంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ద్వారా.. పోడు భూములకు సాగు హక్కులు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా తెలంగాణలోనే 1,86,679 క్లెయిమ్స్‌ వచ్చాయి. ఇందులో వ్యక్తిగత ఆర్జీలు1,83,252 కాగా, సామూహిక(కమ్యూనిటీ-గూడెంలోని ఆదివాసీ లందరూ కలిసి సాగు చేసుకునే భూమి) ఆర్జీలు 3,427.2020 మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన వివరాల ప్రకారం..మొత్తం క్లెయిమ్స్‌లో 94,360 క్లెయిమ్స్‌ను పరిష్కరించారు. దాదాపు 7.54లక్షల ఎకరాలపై గిరిజనులకు సాగు హక్కులు కల్పించామని ప్రభుత్వం అందులో పేర్కొంది. కానీ..గిరిజన సంఘాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక సర్కారు ఒక్క ఎకరంపై కూడా హక్కులు కల్పించ లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రజాదర్బార్లు అంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ప…ఎక్కడా నిర్వ హించిన దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు.
వైఎస్‌ హయాంలో మొదటి దశ కింద 3.16లక్షల ఎక రాలకు హక్కులు కల్పించారని, ఇందులో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద 40వేల ఎక రాలను వెనక్కి తీసుకుందని ఆరోపి స్తున్నారు. ఇంకా 10లక్షలకు పైగా ఎకరా లకు హక్కులు కల్పించాల్సి ఉందని వివరిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఆర్‌వోఎఫఆర్‌ చట్టాన్ని అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. పైగా… వర్ధన్నపేట వంటి ఆర్డీవో కార్యాలయాల్లో అప్పటివరకూ ముద్రించి ఉన్న ఆర్‌వోఎఫఆర్‌ బుక్స్‌ను చెత్తబుట్టలో పారేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన వివ రాల ప్రకారం చూసుకున్నా..ఇంకా92,319 క్లెయిమ్స్‌ పెండిరగ్‌లో ఉన్నాయి. అయితే,అది పాత లెక్క. ఇప్పటి లెక్క ప్రకారం క్లెయిమ్స్‌ లక్షకు పైగానే ఉంటాయని సంఘాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి 10లక్షల ఎకరాలకు పైగా భూమి ఉంటుందని, వీటిపై గిరిజనులకు హక్కులు కల్పించాలని డిమాం డ్‌ చేస్తున్నాయి. పోడుభూముల వ్యవ హారం బయ టకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హామీ ఇవ్వడంతో ఇక తమబతుకుల్లో వెలుగులు నిండుతాయని ఆశిం చామని.. కానీ, ఇప్పటివరకూ ఒక్క ఇంచు భూమి సమస్యను కూడా పరిష్కరించలేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సమ స్య తీవ్రతను గుర్తించిన సీపీఐ బుధవారం (ఆగస్టు 4) నుంచి‘పోడుయాత్ర’ను చేపడుతోంది. ఇప్పటి కైనా కేసీఆర్‌ పోడు భూముల సమస్యను పరిష్క రించాలనిగిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
అస్తిత్వంలో లేని కమిటీలు..
ఆర్‌వోఎఫఆర్‌ కింద సాగు హక్కులు కల్పించడానికి పెద్ద ప్రక్రియే ఉంది. ఇందుకోసం గ్రామ,జిల్లా,రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు కావాలి. అప్పట్లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇవి ఉన్నాయో లేదో అధికారులకే తెలియని పరిస్థితి. కాగా..పోడు భూములకు సంబంధించి ముందుగా గ్రామ స్థాయి కమిటీకి గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ సభలు నిర్వహించి, ఆదరఖాస్తులు వాస్తవమో కాదో గ్రామ కమిటీలు తేలుస్తాయి. అర్హమైన ఆర్జీలను జిల్లా కమిటీలకు పంపుతారు. జిల్లా కమిటీలు వాటిని పరిశీలించి, రాష్ట్ర స్థాయి కమిటీకి పంపు తాయి. రాష్ట్రస్థాయి కమిటీ ఆర్జీలను ఆమో దిస్తుంది. అనంతరం ఫారెస్ట్‌, రెవెన్యూ శాఖలు ఆఆర్జీల్లో పేర్కొన్న భూములపై జాయింట్‌ సర్వే చేసి, నిజమో కాదో నిర్ధారిస్తాయి. సరిహద్దులు కరెక్టే అని తేలితే…భూసాగు హక్కులు కల్పిస్తారు. కానీ. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏ ఒక్క గ్రామంలోనూ గ్రామసభలు జరిగిన సంద ర్భాలు లేవని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు వర్సెస్‌ గిరిజనులు
అధికారులు వర్సెస్‌ గరిజనులు
పోడు భూముల విషయంలో అటవీ అధికారులు,గిరిజనులకు మధ్య తరచూ వివా దాలు నెలకొంటున్నాయి. గిరిజనులు సాగు చేసు కుంటు న్న భూమి తమదేనంటూ అటవీ అధికారులు క్లెయి మ్‌ చేస్తున్నారు.ఎక్కడ చదును భూమి కనిపిస్తే… అక్కడ అటవీ శాఖాధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇదిపోడు వ్యసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో కూడా కొన సాగుతోంది. దీంతో గిరిజనులు తిరగబడు తున్నా రు. తరతరాలుగా తాముసాగు చేస్తున్నా మని, ఆ భూమి తమదేనని చెబుతున్నారు.దీనిపై ఇరు వర్గాల మధ్య తరచూ దాడులు, ప్రతిదాడులు జరుగు తున్నాయి.
-ఆదిలాబాద్‌ నుంచి సునీల్‌ నాయక్‌

సాతంత్య్ర దినం..అమరుల త్యాగఫలం

‘‘ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు నేడు స్వేచ్ఛా వాయువులు పీలు స్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకు వచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్య్రం కోసం జరిగిన అనేక ఉద్యమా లనన్నిటినీ కలిపి‘‘భారత స్వాతంత్య్రోద్యమం’’గా చెబుతున్నారు. అనేక సాయుధ పోరా టాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్య్రోద్యమంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్‌, ఇతర వలసపాల కుల పాలనను అంత మొందం చటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయ పక్షాలు ఉద్యమించాయి ’’
16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్‌లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్‌లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్‌ గా ఆవిర్భవించింది. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌, (లాల్‌ బాల్‌ పాల్‌) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకు వచ్చా యి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారత స్వాతంత్ర యోధులు ప్రారంభించిన గదర్‌ పార్టీ సహ కారంతో జరిగిన సంఘటిత భారతసిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు. జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్‌ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల లో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్‌ మహాత్మాగాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటా లను అవలంబించారు. సుభాష్‌ చంద్ర బోస్‌ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్ధిక స్వాతంత్రా నికై పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచయుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధ ృతరూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరుతో భారత జాతీయసైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. మహాత్మా గాంధీ నాయక త్వంలోని 1947 ఆగష్టు 15న భారత దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించింది.1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటివరకూ బ్రిటీష్‌ వారి పాక్షిక పాలలోనే సాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వా మ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్బవింపజేసింది.
స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిన మహిళల స్పూర్తి !
బ్రిటీష్‌ వారి బానిన సంకెళ్లను తెంచి భరత మాత దాస్య విముక్తి కోసం జరిగిన స్వతంత్ర పోరాటంలో ఎందరో మహిళలు స్ఫూర్తిదాయ కంగా పాల్గొన్నారు. ఈ చారిత్రక ఉద్యమంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా అద్భుతమైన సాహసాలను ప్రదర్శించారు. మహిళలు బయటికి రావడమే అరుదైన అలనాటి కాలంలో భరతమాత దాస్య సంకెళ్లను తెంచేందుకు స్వతంత్ర పోరాటటం చేస్తూ ఆఉద్యమానికి ఎందరో మహిళలు ఊపిరిగా నిలిచారు. అలనాటి మహిళలలో ప్రధమ వరసలో నిలిచే మహిళా మణి సరోజినీ నాయుడు తమ ప్రసంగాలతో, పాటలతో నాటకాలతో కవి తలతో ఆమె తనదైన రీతిలో స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని రగిలించారు. దేశమాతకోసం స్వతంత్య్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. భయం అంటే ఏమిటో తెలియని స్వాతంత్య్ర సమరయోధు రాలు దుర్గాభాయి దేశ్‌ ముఖ్‌. మహిళా సాధికారత కోసం పాటుపడిన సామాజిక కార్యకర్తగా ఆమె పేరుపొందారు. ముఖ్యంగా సుభాష్‌ చంద్రభోస్‌ చేసిన స్వాతంత్ర పోరాటంలో ఆయనకు అత్యంత సన్నిహితు రాలిగా మెలిగిన కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ భారత స్వతంత్ర పోరాటంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ తరఫున కదంతొక్కిన వీర వనిత. అభినవ రaాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్‌ గురించి అనేక నవలలు సినిమాలు కూడ వచ్చాయి. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలోని రaాన్సీరాణి రెజిమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలిమహిళగా లక్ష్మీ సెహగల్‌ చరిత్రలో నిలిచిపోయారు. ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి అర్థాంగి అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన చైతన్యశీలి కస్తూరిబా గాంధీ. మహాత్మా గాంధీతో సమానంగా అంతేకాదు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్భా గాంధీ. ఇక వీరితో పాటు అరుణ అసఫ్‌ అలీ స్వాతంత్రో ద్యమంలో నిర్వహించన పాత్ర గురించి చెప్పుకోవాలి. గాంధీ నమ్మకాన్ని పొంది అనేక ఉద్యమాలకు ఆమె నాయకత్వం వహించారు. అలనాటి హిందూ స్త్రీలతో సమానంగా అనేక మంది ముస్లిం మహిళలు కూడ భారత స్వాతం త్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారిలో అవధ్‌ రాణి బేగం హజరత్‌ను అగ్రగామిగా చెప్పుకుని తీరాలి. అలనాటి ముస్లిం మహిళామణుల త్యామయ పోరాట కూడా చరిత్రకు సంబంధిం చిన సమాచారాన్ని బ్రిటీష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే ఆనాటి కాలంలో హిందు మహిళలతో సమానంగా ముస్లిం వీరనారీమణుల ఎలాంటి త్యాగాలు చేసారో అర్ధం అవుతుంది. వీరందరితో పాటు వయస్సులో చాల చిన్న అయినా శ్రీమతి ఇందిరాగాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా అలనాటి బ్రిటీష్‌ పోలీసు లాఠీ దెబ్బలను లెక్కచేయకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళా స్పూర్తికి ఆదర్శంగా నిలిచారు. ఈవిధంగా ఎందరో మహిళా మణుల త్యాగ నిరతితో వచ్చిన స్వాతంత్రాన్ని నేడు అనుభవిస్తున్న అనేకమంది చదువుకున్న మహిళలు కూడ అలనాటి స్వాతంత్రోధ్యమంలో పాల్గొన్న అనేకమంది మహిళల పేర్లు కూడా వారికి తెలియదు అన్నది వాస్తవం..
రాణి వేలు నచియార్‌
బ్రిటిష్‌ వారిపై మొదటి పోరాటంగా మనం చెప్పుకునే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే అయిదు దశాబ్దాల ముందే బ్రిటిష్‌ వారిని ధిక్కరించి నిలబడిన ధీర వనితలున్నారు. 1760-1796 మధ్య కాలంలో మొట్ట మొదటగా బ్రిటిష్‌అ ధికారాన్ని ఎదిరించి పోరాడిన మహిళ, బ్రిటిష్‌ వారి నుంచి తమ రాజ్యాన్ని తాము తిరిగి దక్కించుకున్న కొద్ది మంది రాజ్యాధినేతల్లో ఒక యోధురాలిగా ఘనతకెక్కిన మహిళ రాణి వేలు నచియార్‌. తమిళనాడు లోని రామ్‌ నాడ్‌ రాజ్యంలో జనవరి 3, 1730లో మన్నార్‌ సెల్లముత్తు సేతుపతి రాజుకు జన్మించింది వేలు నచియార్‌. ఆమెకు సోదరులెవ్వరూ లేకపోవటం వల్ల రాకుమారుడిలా పెరిగింది. చిన్నతనం నుంచే అనేక రకాల ఆయుధాలను ఉపయోగించటం, గుర్రపు స్వారీ, విలువిద్యతో పాటు అనేక యుద్ధవిద్యల్ని నేటర్చుకుంది. అంతేకాక ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, ఉర్దూ లాంటి అనేక భాషల్లో ధారా ళంగా మాట్లాడగల ప్రావీణ్యం సంపాదిం చింది. వేలు నచియార్‌ భర్త శివగంగై రాజు. వారికి ఒక కూతురు. 1772లో ఆర్కోట్‌ నవాబుతో కలిసి బ్రిటిష్‌ దళాలు శివగంగైను ఆక్రమించటానికి చేసిన కళైయార్‌ కోయిల్‌ యుద్ధంలో వేలు నచియార్‌ భర్తను హత్య చేశారు. విధి లేని పరిస్థితుల్లో వేలు నచియార్‌ తన కూతురుతో కలిసి రాజ్యాన్ని వదలి పారిపోవాల్సి వచ్చింది. శివగంగైకు చెందిన మరుధు సోదరులు, మరికొంత మంది శక్తివం తమైన సన్నిహితుల సాయంతో దిండిగల్‌ లో నివసించింది. ఆ సమయంలో బ్రిటిష్‌ వారిపై పగ తీర్చుకోవాలనే ధృఢ సంకల్పంతో అనేక మందితో కలిసి సంకీర్ణ సేనలు తయారు చేసింది. 1780 లో మైసూర్‌ సుల్తాన్‌ హైదర్‌ అలీ సాయం తీసుకుని, తాను తయారు చేసుకున్న అత్యంత శక్తివంతమైన సైన్యంతో కలిసి శత ృవులపై దాడి చేసింది. అప్పట్లోనే ఆమె సైన్యంలో ప్రాణాలను ఫణంగా పెట్టిన (తమను తాము నూనెతోనో నెయ్యితోనో ముంచుకుని శత ృ ఆయుధాగారంలోకి జొరబడి తమకు తామే నిప్పంటించుకుని ప్రాణాలర్పించే) మానవ బాంబు, కుయిలీ అనే ఆమె ఉండేది. ఆయుద్ధంలో వేలు నచియార్‌ విజయం సాధించి తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకుంది. ఆ రోజుల్లోనే ఆమె తన సైన్యంలో ‘‘ఉదయాళ్‌’’ అనే పేరుతో మహిళలు మాత్రమే గల బృందాన్ని తయారుచేసుకుంది. ఇప్పటికీ తమిళనాడులో జనవరి 3న రాణి వేలు నచియార్‌ జన్మదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకుంటారు.31 డిశంబర్‌, 2008 న భారత ప్రభుత్వం ఆమె శాశ్వత గుర్తుగా పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది.
కిట్టూర్‌ చెన్నమ్మ
భారత పార్లమెంటు ఆవరణలో సెప్టెంబర్‌ 11, 2007 లో మన దేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ గారి చేతుల మీదుగా ఒక వీర వనిత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆమె పేరు రాణి చెన్నమ్మ. కర్నాటక రాష్ట్రంలోని కిట్టూర్‌ రాజ్యానికి రాణి. అందుకే ఆమెను కిట్టూర్‌ చెన్నమ్మ అని కూడా అంటారు. మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధుల్లో మొదటిగా చెప్పుకోదగ్గ మహిళ. అప్పటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ ప్రవేశ పెట్టిన ‘‘డాక్ట్రిన్‌ ఆఫ్‌ లాప్స్‌’’ అనే చట్టానికి వ్యతిరేకంగా పోరాడిరది. బ్రిటిష్‌ సైన్యానికి ధీటుగా గొప్ప విప్లవ దళాన్ని తయారు చేసుకుని సారధ్యం వహించిన మహిళ. బ్రిటిష్‌ వారు భారత పాలకులపై బలవంతంగా విధించే అనేక చట్టాలను పాటించలేమని బలంగా వ్యతిరేకించి అనేక పోరాటాలు చేసింది. చివరకు తన విప్లవ దళంతో కలిసి బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. చివరకు జరిగిన యుద్ధంలో ఓడిపోయి వారికి పట్టుబడిరది రాణి చెన్నమ్మ. కానీ, ఆమె చూపిన తెగువ, పట్టు వదలక తిరుగుబాటు చేసిన తీరు తరువాతి తరం స్వాతంత్య్ర సమర యోధులకు ఎనలేని స్ఫూర్తిని అందించింది. రాణి కిట్టూర్‌ చెన్నమ్మ వీరోచిత శౌర్యాన్ని గుర్తు చేసుకుంటూ నేటికీ కర్నాటక రాష్ట్రంలో అక్టోబర్‌ నెలలో బ్రిటిష్‌ వారిపై ఆమె సాధించిన మొదటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘కిట్టూరు ఉత్సవం’’ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటారు. ఆమె ధైర్యాన్ని, విప్లవ దళం సాయంతో పోరాడిన తీరు ఇప్పటికీ స్ఫూర్తిమంతమైన నాటకాలుగా, జానపద పాటలుగా, కథలు కథలుగా గానం చేయబడుతోంది. ఇండియన్‌ రైల్వేస్‌ రోజూ బెంగుళూరు నుండి కొల్హాపూర్‌ ప్రయాణించే ఒక రైలుకు ఏకంగా ‘‘రాణి చెన్నమ్మ ఎక్స్‌ ప్రెస్‌’’ అని పేరు పెట్టి ఆమెకు నీరాజనాలు అర్పించారు.
రాజ్‌ కుమారి గుప్త
రాజ్‌ కుమారి గుప్త చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆధ్వర్యం లోని తిరుగుబాటు యోధుల బృందా నికి సహకరిస్తూ ఉండేది. వారికి రహస్యంగా సందే శాలను, మారణాయుధాలను చేరవేసేది. అప్పట్లో విప్లవ దళాల మనుగడకై దోపిడీలు చేసేవారు. చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ‘‘కాకోరీ కాన్‌ స్పైరసీ’’ గా పేరొందిన, లక్నోకి దగ్గరగా గల కాకొరీ ప్రాంతంలో చంద్ర శేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో జరిగిన ఒక రైలు దోపిడీలో ప్రముఖ పాత్ర పోషించింది రాజ్‌ కుమారి గుప్త. ఒకసారి తన దుస్తులలోదాచు కుని రహస్యంగా ఆయుధాలు చేరవేస్తుం డగా బ్రిటిష్‌ సైన్యానికి తన మూడేళ్ళ కొడుకుతో సహా పట్టుబడిరది.
లిబేగం హజ్రత్‌ మహల్‌
లక్నోలోని అతిపెద్ద ప్రాంతం అవధ్‌ ని ఏలిన రాణి బేగం హజ్రత్‌ మహల్‌. అందాల సౌందర్య రాశి, అత్యంత విలాస వంతంగా జీవితం గడిపిన ఆమె, బ్రిటిష్‌ వారిపై వ్యతిరేకంగా జరిపిన యుద్ధంలో తాను ప్రత్యక్ష్యంగా యుద్ధరంగంలో నిలబడి తన సైన్యంలో ధైర్యం నింపుతూ పోరాడిరది. ఎప్పటికప్పుడు తన శక్తి మేరకు ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడిరది బేగం హజ్రత్‌ మహల్‌. మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధులలో ఒకరైన నానా సాహెబ్‌ వంటి వారితో కలిసి పని చేసింది. బలవంతంగా తన రాజ్యాన్ని బ్రిటిష్‌ వారు చేజిక్కించుకోగా రిక్తహస్తాలతో, నేపాల్‌ ప్రధాని పిలుపునందుకుని నేపాల్‌ చేరుకుని మనుగడ సాగించాల్సి వచ్చింది. చివరకు ఊరూ పేరూ లేకుండా 1879లో ఖాట్మండులో మరణించింది. అనంతరం ఆమె సాహస పోరాట పటిమకు గుర్తుగా భారత ప్రభుత్వం మే 10, 1984లో బేగం హజ్రత్‌ మహల్‌ ఫోటో ముద్రించిన పోస్టల్‌ స్టాంప్‌ ను విడుదల చేసింది.
రాణి అవంతి బాయి
1831-1858 మధ్య కాలంలోని మరో మొదటి తరం స్వతంత్ర యోధురాలు రాణి అవంతి బాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం అప్పట్లో విధించిన చట్టాలకు అనుగుణంగా, వాటికి తలవంచే అందరు రాజుల్లాగే, తాను కూడా ‘‘వారసులు లేని వారు తమ రాజ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించి భరణం తీసుకోవాలన్న ఆదేశాల’’ ను పాటిస్తూ తన రాజ్యాన్ని అప్పగించి, వారిచ్చే భరణంతో బ్రతకాల్సి వచ్చింది. అది నచ్చని ఆమె రహస్యంగా బృందాలను తయారు చేసి, బ్రిటిష్‌ వారి అరాచకాలను, ఆక ృత్యాలను వారి ద్వారా బహిరంగ పరిచింది. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్‌ దళాలకు వ్యతిరేకంగా ధృఢంగా పోరాడి అనేక ప్రాంతాలలో విజయం చేజిక్కించుకుంది. కానీ ఆ విజయాలు ఎంతో కాలం నిలవలేదు. దీర్ఘకాలం పోరాడిన తరువాత తన అధికారాన్ని కోల్పోయింది. ఐనా ధైర్యం కోల్పోక, సర్వశక్తులూ ఒడ్డి, మరలా సైన్యాన్ని సమీకరించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు బ్రిటిష్‌ సైన్యం చేతికి చిక్కి చావటం ఇష్టంలేక తన కత్తితో తానే పొడుచుకుని సంహరించుకుని ప్రాణ త్యాగం చేసిన ధీరోదాత్త రాణి అవంతీ బాయి.ఇక రaాన్సీ లక్ష్మీబాయి వీరోచిత గాథ చాలావరకు ప్రజలందరికీ చేరువయ్యిందే.
పార్వతి గిరి
పశ్చిమ ఒరిస్సా ప్రాంతంలో మరో మదర్‌ థెరెస్సాగా పేరొందిన మహిళ పార్వతి గిరి. 16 ఏళ్ళ చిన్న వయస్సు లోనే స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితురాలై అనేక పోరాటాలలో ముందుండి నడిచింది. ప్రత్యేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ప్రముఖ పాత్ర పోషించింది. అందుకామె రెండేళ్ళ జైలు జీవితం కూడా గడిపింది. స్వాతంత్య్రం తదుపరి తన జీవితాన్నంతా ప్రజా సేవకు అంకితం చేసిన మహోన్నత మహిళ పార్వతి గిరి.
భోగేశ్వరి ఫుకనాని
మధ్య అస్సాం ప్రాంతానికి చెందిన భోగేశ్వరి ఫుకనాని 60 ఏళ్ళ వయస్సులో ప్రాణాలను ఫణంగా పెట్టి అమరత్వం పొందిన సాహస మహిళగా ప్రసిద్ధి చెందిన వ ృద్ధ యోధురాలు. ఒక సాధారణ గృహిణి ఐన భోగేశ్వరి స్వాతం త్య్ర పోరాటం పట్ల ఆకర్షితురాలై తాను స్వయం గా ఉద్యమంలో పాల్గొనటమే కాక తన ఆరుగురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కూడా పాల్గొనేలా చేసింది. ‘‘భర్భుజ్‌ ’’ అనే పేరుతో చేపట్టిన తిరుగుబాటు కార్యక్రమంలో పాల్గొన్న భోగేశ్వరిని అమానవీయ రీతిలో కాల్చి చంపింది బ్రిటిష్‌ సైన్యం.
కనకలత బారువా
అస్సాంకే చెందిన మరో మహిళ కనకలత బారువా. ఆమెను బీర్బల అని కూడా పిలిచే వారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ‘‘మ ృత్యు వాహిని’’ అనే సేనలో ప్రాణాలను ఫణంగా పెట్టే దళంలో పని చేసింది. సెప్టెం బర్‌ 20, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ బృందం చేపట్టిన, జాతీయ జెండా ధరించి సాగే మార్చ్‌ లో ముందుండి సాగి బ్రిటిష్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టు కుంది కనకలత బారువా.
మాతంగిని హజ్రా
అంతగా ప్రాచుర్యం పొందని వీర వనిత. క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిం చింది. తన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రజలలో జాతీయతా భావాన్ని అత్యంత వేగంగా వ్యాప్తి చేసింది. ఉద్యమ కాంక్షను రగిలించింది. ఇది గ్రహించిన బ్రిటిష్‌ ప్రభు త్వం ఆమెను ఐంతమొందించాలని ఎదురు చూసాయి. జాతీయ జెండా ధరించి ఉద్యమ పథంలో నడుస్తున్న ఆమెను షూట్‌ చేసారు. తూటా తగిలినా, ధైర్యం కోల్పోక, జెండా విడు వక.. ముందుకు నడుస్తూనే, ‘‘వందే మాతరం’’ అంటూనే నేలకొరిగింది మాతంగిని హజ్రా.
అరుణ అసఫ్‌ అలీ
భారత దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ అందుకున్న అరుదైన స్వాతంత్య్ర సమర యోధురాలు అరుణ అసఫ్‌ అలీ. ఉన్నత విద్యా వంతురాలు. 1942 క్విట్‌ ఇండియాఉద్యమ సమయంలో, ముంబైలోని గవాలియా ట్యాంక్‌ మైదానంలో బ్రిటిష్‌ సైన్యం చూస్తుం డగా జాతీ య జెండా ఎగుర వేసిన ధైర్యం ఆమె సొంతం. తన పోరాటాల ఫలితంగా ఎన్నోసార్లు జైలు జీవితం గడిపింది. తీహార్‌ జైల్లో బంధించి నపుడు ఆమె చేపట్టిన నిరాహార దీక్ష స్వాతంత్య్ర పోరాట చరిత్రలో నిలిచిపోయింది.
దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌
చిన్నతనం నుంచే స్వతంత్ర భావాలు గల మరో తెలుగు మహిళ దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌. గాంధీ బోధనలకు ఆకర్షితురాలై ఆభరాణాలు విడిచి ఖాదీ ధరించింది. సత్యాగ్రహంలో పాల్గొని మూడుసార్లు జైలుపాలైంది. తరువాత ఉన్నత విద్యనభ్యసించి న్యాయశాస్త్రంలో పట్టా పొం దింది. స్వాతంత్య్రానంతరం ప్లానింగ్‌ కమీషన్‌ సభ్యురాలిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, కేంద్రంలో ఆర్థిక మంత్రిగా పలు కీలక పద వులు నిర్వహించిన తెలుగు మహిళ దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌. ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగా లు చేసిన వారు, తెగువ, ధైర్య సాహసాలు చూపిన మహిళలు. చరిత్రలో నిలిచిన వారు, వెలుగులోకి రాని వారు అనేక మంది. ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మనం వారందరినీ తలచుకుందాం. అపురూపమైన భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను భావి తరాలకు తెలియ జేసే ప్రయత్నం చేద్దాం. Saiman Gunaparthi

నిర్వాసితుల నిర్వేదం

‘మా అందరికీ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే, ప్రాజెక్టు కడతామని అన్నారు. కానీ ఇప్పుడు మాకు ఏమీ ఇవ్వకుండానే ప్రాజెక్టు కట్టేస్తున్నారు. అంటే మమ్మల్ని మోసం చేస్తున్నట్టే కదా.మా ఊరికి 30 కిలోమీటర్ల అవతల జీలుగుమిల్లిలో కాలనీ కడతారంట. మాతరతరాలు అక్కడే బతకాలి. కానీ అక్కడికెళ్లి ఎలా బతకాలి. మొత్తం మాకివ్వాల్సింది ఇచ్చేస్తే మేమే వెళ్లిపోతాం’’ భూమికి భూమి ఇస్తామన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా రాలేదు. ఇక్కడ పొలాలు, చెట్టూ అన్నీ వదిలేసి వెళ్లి ఏం తినాలి.అని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన భీంపల్లి వాసి ఎం.అబ్బులు ఆవేదన.
పేరుకే కాలనీ.. ఉన్నవన్నీ మొండి గోడలే

‘‘అధికారుల మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాం. కానీ అక్కడ మంచినీరు, కరెంటు కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. బాత్రూములు లేవు. కుళాయిలు ఇప్పుడు తవ్వుతున్నారు. గోదావరి ఒడ్డున ఉండలేక ఇక్కడికి వచ్చేశాం. ఈసారి వరద మూడు నాలుగు నెలలు ఉంటుందని అంటున్నారు. అందుకే పిల్లలతో అక్కడ ఉండలేక వచ్చేశాం. కానీ మాకు కరెంటు మీటర్లు వేసి, బాత్రూమ్‌ లు కట్టాలి . లేదంటే వరదలు, వర్షాల సమయంలో కష్టమే’’ అని పునరావాస కాలనీకి తరలివెళ్లిన కె.వెంకటలక్ష్మి రోదన.

‘‘అడవిలో ఉంటే ఏదోటి తిని బతికేస్తాం.అక్కడ ఎలా గడపాలి. మాకు జరుగుతున్న అన్యాయం చూస్తామన్న వాళ్లే లేరు. గోదావరి వచ్చేస్తోంది. అందుకే అడవుల్లో ఏవో ఇళ్లు కట్టుకుని చీకట్లోనే గడపాలి ఇక’’ అని చెదల పార్వతి నిర్వేదన
పోలవరంలో ముంపు శాపం…18,622 కుటుంబాలను ముంచేస్తున్నది ప్రవాహమా, ప్రభుత్వమా? చేసిన వెళ్లినవాళ్లను ఇంకా తిప్పుతున్నారు. అందుకే వరదొచ్చినా, వానొచ్చినా ఇక్కడే ఉంటాం. ఈసారి పెద్ద వరద వస్తుందని చెబుతున్నారు. అయినా మేం కదలం. ఇక్కడే కొండలపై ఇళ్లు కట్టుకుని ఉంటాం’’ గిరిజనులు అంటు న్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మీదుగా గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించారు.కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేశారు. దాంతో సాధారణ నీటి ప్రవాహానికే వరద తాకిడి మొదలైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరద ముప్పు తప్పదని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దాంతో పోలవరం ముంపు గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పునరావాస ప్యాకేజీ చెల్లించాలని ముంపు ప్రాంత వాసులు పట్టుపడుతున్నారు.దాంతో పోలవరం నీళ్లు గిరిజన ప్రాంత ఊళ్లను ముంచేస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలుఉత్పన్నమవు తాయోనన్న ఆందో ళన పెరుగుతోంది.
పెరిగిన పరిహారపు ఖర్చు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పునరావాసం చెల్లించాల్సిన బాధితుల సంఖ్య కూడా పెరిగింది. దానికి తోడు 2013 భూసేకరణ చట్టంలో మారిన నిబంధనలు అమలులోకి రావడంతో చెల్లించాల్సిన పరిహారం కూడా పెరిగింది.విపక్ష నేతగా ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ జగన్‌ ఇచ్చిన హామీలు కూడా పునరావాసం కోసం వెచ్చించాల్సిన వ్యయం మరింత పెరగడానికి కారణమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్సార్‌ హయంలో శంకుస్థాపన జరిగిన నాటికి 2005-06లో బాధితుల సంఖ్య 44,500 మంది అని ప్రకటించారు. వారికి పరిహారంగా రూ.8వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ ఆ తర్వాత 2011-12 నాటి లెక్కల ప్రకారం పరిహారం కోసం అర్హుల సంఖ్య 80 వేలకు చేరింది. ఆ సమయంలో 18 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హుల జాబితాలో లెక్కించడం, కొత్తగా వచ్చిన కుటుంబాలు కలుపుకొని నిర్వాసితుల సంఖ్య పెరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ పదేళ్ల కాలంలో వారి సంఖ్య లక్ష దాటిందని చెబుతున్నారు. ప్రాజెక్టు కోసం 2005-06లో 95,700 ఎకరాలు భూసేకరణ చేయాలని లెక్కలు వేశారు. కానీ, 2017-18లో దానిని 1,55,465 ఎకరాలుగా సవరించారు. దాంతో తొలి అంచనాల కన్నా 55,335 ఎకరాలు అదనంగా సేకరించాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ముంపు ప్రాంతంలో ఫీల్డ్‌ సర్వే చేయడం వల్ల భూసేకరణ పెరిగిం దని అధికారికంగా ప్రకటించారు. కానీ పోలవరం విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తర్వాత ముంపు ప్రాంతం ఎక్కువగా లెక్కిస్తున్నారన్నది నిర్వాసితుల వాదన. నిర్వాసితుల సంఖ్య, సేకరించాల్సిన భూమి కూడా పెరగడంతో పునరావాసానికి వెచ్చించాల్సిన ఖర్చు పెరిగింది. దాంతో తాజాగా ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం సుమారు రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
నీళ్ల నడుమ నిర్వాసితులు-చోద్యం చూస్తున్నపాలకులు
ఉగాది నాటికే కాంటూరు 41.15 మేరకు నిర్వాసితులందరికీ ప్యాకేజీ చెల్లించి, కాలనీలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ పూడ్చివేశారు కానీ నిర్వాసితులకు ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆర్‌ ఆండ్‌ ఆర్‌ అమలు చేయకుండా అది పూడ్చడానికి అనుమతించేది లేదని చెప్పిన పి.పి.ఎ మాట తప్పిందా..లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ప్యాకేజీ ఇవ్వకుండానే నిర్వాసితుల ఇళ్లను ముంచేసేందుకు పి.పి.ఎ అనుమతి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరి అవలంబి óస్తున్నారు. మాట తప్పిన కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
పునరావాస ప్యాకేజీ ఇస్తే ఖాళీ చేయాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అనుకుంటున్నారు. ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయకూడదని ఎ.పి హైకోర్టు కూడా ఆదేశిం చింది. ప్రభుత్వం మాత్రం ఆగష్టు నాటికే 48 గ్రామాలను ఖాళీ చేస్తామని చెబుతోంది. దానికి అవసరమైన నిధుల సంగతి తమకు సంబంధం లేదని కేంద్రం అంటోంది. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పెద్ద ప్రహస నంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి యత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని నిలదీసి, నిధులు రాబట్టడంలో విఫలమవుతోంది. బాధితులు మాత్రం నిలువు నీళ్లలో, ఇప్పుడు వరదల సమయంలో చీకట్లో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సంగతి ఆ తర్వాత ప్రస్తుతం వరదల సమయంలో సహాయక చర్యలు చేపడదామనే ఆలోచన కూడా ప్రభుత్వాలకు రావడం లేదు.
వరద బాధితులతో ఆటలు…
దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అనేక పార్టీలకు ఎన్నికల హామీగా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా 2019 నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. కానీ దానికి తగ్గట్టుగా పనులు చేయలేకపోయింది. రెండేళ్లు దాటిన వైసిపి ప్రభుత్వం కూడా 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు దానిని మరో ఏడాదికి పొడిగించింది. స్పిల్‌ వే పూర్తయిన నేపథ్యంలో జూన్‌ నెల మొదటి వారంలోనే నదీ ప్రవాహాన్ని మళ్లించారు. అందుకోసం కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసే శారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం జరగడంతోనే పోలవరం నిర్వాసిత గ్రామాలకు వరద బెడద ఏర్పడిరది. మూడేళ్లుగా కొద్దిపాటి వరదలకే ఊళ్లన్నీ జలమయమవుతున్నాయి. ఈ ఏడాది కాఫర్‌ డ్యామ్‌ మూసేశాక బ్యాక్‌ వాటర్‌ మూలంగా వంద గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కున్నాయి.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటినా వరద చూడని గ్రామాలు కూడా ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీటిమయమయ్యాయి. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ఇలాంటి ముప్పు ఉంటుందని ప్రభుత్వాలకు తెలిసినా స్పందించలేదు. వామపక్షాలు, ఇతర నేతలు వరద బాధలను, నిర్వాసితులను ఆదుకోవాల్సిన అవసరం గురించి మొత్తు కుంటున్నా పాలకులు మిన్నకున్నారు. గత ఏడాది వరదల్లో ఆహారం, కిరోసిన్‌ వంటివి కూడా అందించడానికి ఏర్పాట్లు చేయలేదు. అంతకుముందు 2019 వరదల సమయంలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరద సహాయం 2020 వరదలు వెళ్లిన తర్వాత చెల్లించారంటే బాధితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి స్పష్టమవుతోంది. ఈసారి కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేసిన తర్వాత వరద తాకిడి మరింత ఎక్కువ ఉంటుందని అధికారికంగానే వెల్లడిరచారు. అందుకు అనుగుణంగా సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదు. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళు వదిలిపోయేలా చేసే పన్నాగంలో ఉన్నట్టు ఇట్టే అర్థమవుతోంది. ప్యాకేజీ చెల్లించి, నిర్వాసిత కాలనీలు సిద్ధం చేసి బాధితులందరినీ తరలించాల్సి ఉండగా దానికి భిన్నంగా ఏ దారి లేని నిర్వాసితులంతా ఊళ్లు వదిలిపోయేలా చేస్తున్నారు. చట్టాన్ని ప్రభుత్వమే యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం సర్వం వదిలిపోతున్న వారి జీవితాలతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈసారి వరదలను ఊహించిన నిర్వాసితులు కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నా అడ్డుకునే యత్నం చేశారు. వరదలు వస్తే తినడానికి అవసరమైన నిత్యావసర సరుకుల కోసం సంతకు వస్తే తిరిగి వెళ్లేందుకు పడవలను కూడా అనుమతించ కుండా అమానుషంగా ప్రవర్తించారు.
మాట తప్పిన ప్రభుత్వాలు
కాఫర్‌ డ్యామ్‌ సిద్ధం చేసిన నేపథ్యంలో దానిని పూర్తిగా మూసేయాలంటే ముందుగా పునరా వాసం చెల్లించాలని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఆదేశించింది. గత డిసెంబర్‌ నెలలో ప్రాజెక్ట్‌ ప్రాంతాన్ని సందర్శించిన డిజైన్‌ రివ్యూ కమిటీ కూడా ఇదే విషయం తేల్చిచెప్పింది. అప్పటి వరకూ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీని పూడ్చేసేందుకు అనుమతించేది లేదని కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అంగీకరించింది. ఉగాది నాటికే కాంటూరు 41.15 మేరకు నిర్వాసితులందరికీ ప్యాకేజీ చెల్లించి, కాలనీలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ పూడ్చివేశారు కానీ నిర్వాసితులకు ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆర్‌ ఆండ్‌ ఆర్‌ అమలు చేయకుండా అది పూడ్చడానికి అనుమతించేది లేదని చెప్పిన పి.పి.ఎ మాట తప్పిందా.. లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ప్యాకేజీ ఇవ్వకుండానే నిర్వాసితుల ఇళ్లను ముంచేసేందుకు పి.పి.ఎ అనుమతి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నారు. మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
పోలవరం పూర్తి చేసే ఉద్దేశం ఉందా ?
దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుకి విభజన చట్టం ప్రకారం జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు చిగురించాయి. గోదావరి నదీ జలాలను కృష్ణా డెల్టాకు తరలించి, అక్కడి నుంచి ఎగువన ప్రకాశం, గుంటూరు జిల్లాకు కూడా వినియోగించుకుంటామని, తద్వారా రాయల సీమలో నీటి కొరతను అధిగమిస్తామని ముఖ్య మంత్రులు భారీ ఆశలే కల్పించారు. కానీ చట్టం ప్రకారం జాతీయ హోదా అమలు చేయాల్సిన కేంద్రం ఇప్పుడు కొర్రీలు వేస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 8 బడ్జెట్లలో పోలవరం నిర్మాణం కోసం వెచ్చించిన మొత్తం రూ.11,182 కోట్లు. ఇప్పటి వరకూ పునరావాసానికి రూ.6900 కోట్లు వెచ్చించగా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం మరో రూ.20వేల కోట్లు అవసరం అవుతాయి. టెక్నికల్‌ కమిటీ ఆమోదం పొందిన డి.పి.ఆర్‌ 2 ప్రకారమే 1.05లక్షల కుటుంబాలకు గానూ రూ.27వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. దాంతో పాటుగా కాలువల నిర్మాణం పూర్తి చేయడం, ఇప్పటికే 15ఏళ్ల క్రితం నిర్మించిన కాలువల్లో శిథిలమవుతున్న వాటిని సిద్ధం చేసేందుకు కనీసంగా మరో రూ. 5వేల కోట్లు కావాల్సి ఉం టుంది. ఇక ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ డిజైన్లను మార్చడం వల్ల ఖర్చు పెరిగిందని కేంద్రమే పార్లమెంట్‌ లో చెప్పింది. దాని ప్రకారం రూ. 5535కోట్ల నుంచి రూ. 7192 కోట్లకు పెరిగింది. ఇక బహుళార్థక ప్రాజెక్టులో భాగంగా పవర్‌ హౌస్‌ అందు బాటులోకి తెచ్చేందుకు మరో ఐదారు వేల కోట్లు కావాలి. అంటే మొత్తంగా ఇప్పుడున్న స్థితిలో పోలవరం పూర్తి కావాలంటే కనీసం రూ. 35వేల కోట్లు ఖర్చు చేస్తే తప్ప అవకాశం లేదు. కానీ కేంద్రం మాత్రం 2014 నాటి అంచనాలకు మించి పైసా కూడా చెల్లించ బోనంటోంది. రాజ్యసభలో జలశక్తి మంత్రి ప్రకటన తాజా తార్కాణం. మరో 9వేల కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది. అదే సమ యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు రీయంబర్స్‌ చేయడంలోనూ కొర్రీలు వేస్తోంది. కేంద్రం నుంచి రూ. 2300కోట్లు రావాల్సి ఉందని జులై 19న సి.ఎం ప్రకటిస్తే, తాము ఇంకా ఇవ్వాల్సింది రూ.1900 కోట్ల లోపు మాత్రమేనని పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసింది. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాట మూలంగా ప్రస్తుతం అన్యాయమవుతున్న నిర్వాసితులతో పాటుగా ప్రాజెక్టు మీద ఆశలు పెట్టుకున్న రైతాంగం కూడా చేరుతున్నట్టు కనిపిస్తోంది. విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. దానిని ప్రశ్నించి, రాష్ట్ర హక్కులను కాపాడడంలో వైసిపి నీళ్లునములుతోంది. కనీసం విపక్ష టిడిపి కూడా ప్రశ్నించ లేకపోవడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేలా ఉంది. పోలవరం తామే పూర్తి చేస్తున్నామని ఎ.పి లో బిజెపి నేతలు ప్రకటన లు గుప్పిస్తుంటే కేంద్రంలో అదే పార్టీ మంత్రు లు తాము ఎనిమిదేళ్ల క్రితం నాటి అంచనాలకు మించి పైసా కూడా ఇచ్చేది లేదని ఫ్లేటు ఫిరాయిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తన్నాయి.
వరదలు పెరిగితే వాళ్లంతా ఏం కావాలి ?
సహజంగా జులై మధ్య నుంచి ఆగస్టు ఆఖరు వరకూ గోదావరికి ఉధృతంగా వరద తాకిడి ఉంటుంది. ఈసారి సీజన్‌ ప్రారంభంలోనే వరదల ప్రభావం కనిపిస్తోంది. ఇది రాబోయే నెల రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. అదే జరిగితే నిర్వాసితులు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. గతంలో గోదావరికి పెద్ద వరదలన్నీ ఆగస్టులోనే వచ్చాయి. కాబట్టి వచ్చే నెల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యంత కష్టకాలం. ఇప్పటికే అవకాశం ఉన్నవారంతా ఒడ్డుకు చేరారు. కానీ గిరిజనలకు మాత్రం కాలనీలు సిద్ధం చేయక, ప్యాకేజీ అందక వరదల్లోనే గడపాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పుడు వరదల్లో వారికి రవాణా సదుపాయాలు కూడా లేవు. నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచలేదు. గత ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏర్పడిన సమస్యలపై ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో అధికారులు తప్పిదాన్ని అంగీకరించారు. ఈసారి కూడా గత ఏడాది అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. ఉద్దేశపూర్వ కంగానే ఇలా వ్యవహరిస్తున్నారు. ఆహార పదార్థాలు, కిరోసిన్‌ వంటివి అందుబాటులో ఉంచడం మీద శ్రద్ధ పెట్టలేదు. ఇప్పటికైనా యంత్రాంగం కదలాలి. డి.ఆర్‌ డిపోల ద్వారా నిర్వాసితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలి. పడవలు ఏర్పాటు చేసి రవాణా సదు పాయం కల్పించాలి. వరద సహాయక చర్యలు సమగ్రంగా చేపట్టాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాస ప్యాకేజీ అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి భిన్నంగా సాగితే పోలవరం నిర్వాసితుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రమే భరించాలి. చట్ట ప్రకారం జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుని నిర్మాణ వ్యయంపై పరిమితులు విధించడం మానుకోవాలి. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.-వెన్నెల / జిఎన్‌వి సతీష్‌

కష్టం కౌలు రైతుదే..నష్టమూ కౌలు రైతుకే

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. గతసంవత్సరం కంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి సమయానికే వచ్చాయి. కౌలురైతులు అప్పుల కోసం బ్యాంకుల వైపు చూస్తున్నారు. ఏప్రిల్‌, మే నెల నుండే భూ యజమానులు పంటరుణాలు తీసుకుపోతున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తీసుకొని పంట రుణాల కోసం బ్యాంక్‌ కు వెళితే డబల్‌ ఫైనాన్స్‌ అని, బ్యాంకు నిబంధనలు ఒప్పుకోవని, రుణాలు ఇవ్వకుండా తిరిగి పంపిస్తున్నారు. గత సంవత్సరం సైతం మెజారిటీ కౌలు రైతులకు పంట రుణాలు దక్కలేదు. దీనితో వారు అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి పంటలు పండిరచారు. రాష్ట్రంలో సాగు దారుల్లో 80 శాతం, సాగు భూమిలో 70శాతం కౌలు రైతులే పంటలు పండిస్తున్నారు. కాని ప్రభుత్వం సాగు చెయ్యని భూ యజమానులకు పంట రుణాలు ఇచ్చి కౌలు రైతులకు మొండి చేయి చూపిస్తున్నది.

పంట సాగుదారు హక్కు చట్టం (సిసి ఆర్‌సి)విషయంలో ఊహించిందే జరిగింది. నూతనచట్టం కౌలు రైతులకు మేలు చేయదు సరి కదా ఉన్న కొద్ది పాటి సౌకర్యాలను సైతం వారికి దూరం చేస్తుందన్న భయాందోళనలు ఆచరణలో నిజమయ్యాయి. సిసిఆర్‌సి వచ్చాక తొలి ఏడాదిలో కౌలు రైతులకు బ్యాంక్‌ పరపతి దారుణంగా తయారైంది. సిసిఆర్‌సిలపై బ్యాంకులు కేవలం 59వేల మంది కౌలు రైతులకు రూ. 319కోట్ల అప్పులిచ్చాయి. వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు ఇచ్చే రుణ ప్రతిపాదనలకు కత్తెర పడిరది. ప్రాధాన్యత అంతకంతకూ కుచించుకుపోతోంది. దాంతో ప్రభుత్వం సిసిఆర్‌సిలపై పంట రుణాలి ప్పించే అంశానికి స్వస్తి పలికి, ఇంతకు ముందు ఆచరణలో విఫలమైన సంయుక్త భాగస్వామ్య సంఘాల(జెఎల్‌జి)మోడల్‌ను సరికొత్తగా ఎంచు కుంది. ఆ ప్రయోగం కూడా విఫలమైందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బిసి)తాజా గణాం కాలు వెల్లడిరచాయి.
మళ్లీ జెఎల్‌జి వైపు
కౌలు రైతుల దశాబ్దాల ఆందోళనల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ అర్హత కార్డుల (ఎల్‌ఇసి) చట్టాన్ని తెచ్చింది. కొన్ని పరిమితులున్నప్పటికీ కౌలు రైతుల గుర్తింపునకుగా ఆచట్టం బాగానే ఉపయో గపడిరది. రాష్ట్రవిభజన తర్వాత ఐదేళ్లూ ఆ చట్టమే అమల్లో ఉండగా,2019 మేలో అధికారంలో కొచ్చి న వైసిసి ప్రభుత్వం, ఎల్‌ఇసి చట్టాన్ని రద్దు చేసి కొత్తగా సిసిఆర్‌సి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది కౌలు రైతులకు గతంకంటే అధికంగా మేలు చేస్తుం దని పేర్కొంది. కాగా2019 అక్టోబర్‌2 నుండి సిసిఆర్‌ కార్డుల జారీ మొదలు పెట్టగా,ఆఏడాది వాటిపై బ్యాంకులు రుణాలివ్వలేదు.2020 ఖరీఫ్‌ లో అవగాహనా సదస్సుల పేర ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిం చి ఆసంవత్సరంలో 4,87,788 మందికి కార్డులి వ్వాలనుకోగా,4,14,778 కార్డులిచ్చారు. కాగా కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు గతంలో మాదిరిగానే పలు అభ్యంతరాలు లేవనె త్తాయి. సిసిఆర్‌సిలపై బ్యాంకులతో రుణాలిప్పిం చేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, సిసిఆర్‌సి హోల్డర్లతో జెఎల్‌జి గ్రూపులను నెలకొల్పేందుకు ప్రయత్నించింది.వాటికి స్వయం సహాయక సాగు దారుల సంఘాలు (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌)అని పేరు పెట్టింది.
కోటాలో ఇతరులు
అటు సిసిఆర్‌సి ఇటు ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రెండూ కలిపినా కౌలు రైతులకు నిరుడు ఇచ్చిన రుణాలు చాలా తక్కువ. 2020-21లో బ్యాంకు లు కేవలం59,709 సిసిఆర్‌సి హోల్డర్లకు రూ. 319.68కోట్లు ఇవ్వడం గగనమైంది. కొత్తగా ఏర్పాటు చేసిన 4,020 ‘ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌’ గ్రూపు ల్లోని 20,100 మంది రైతులకు బ్యాంకులిచ్చిన రుణం కేవలంరూ.75.16కోట్లు మాత్రమే. రాష్ట్రం లో 30లక్షలకుపైగా కౌలు రైతులున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుండగా, మొత్తమ్మీద బ్యాంకులు నిరుడు79,809 మందికి రూ.394.84కోట్లి చ్చాయి. మొదటి,రెండు సంవత్సరాల్లో ఎంత మం ది కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిందో ఇంచుమించు అదే సంఖ్యలో పంట రుణాలచ్చాయి. నిరుడు మొత్తంగా కౌలు రైతుల కోటాలో 1,90, 824 మందికి రూ.765.98 కోట్లిచ్చామంటున్నా, పాత జెఎల్‌జి, ఆర్‌ఎంజిలలో అందరూ కౌలు రైతులే లేరు. ఇచ్చామంటున్న రుణాల్లో చాలా వరకు పునరుద్ధరించిన రుణాలే. సిసిఆర్‌సి వచ్చాక కౌలు రైతులకు రుణ ప్రణాళికలో ప్రతిపాదనలు, ప్రాధాన్యత తగ్గుతోంది. అప్పటివరకు వార్షిక రుణ ప్రణాళిలో స్వల్పకాలికపంట రుణాలకు చేసిన కేటా యింపుల్లో పది శాతం కౌలు రైతులకు ఇవ్వాలని కనీసం టార్గెట్‌ అయినా ఉండేది.
పది శాతానికి తూచ్‌
2018-19లో పంట రుణాల లక్ష్యం రూ.75వేలకోట్లు కాగా కౌలు రైతులకు రూ.7,500 కోట్లివ్వాలని అధికారికంగా క్రెడిట్‌ ప్లాన్‌లో చెప్పారు. సిసిఆర్‌సి వచ్చిన2019-20లోసైతం పాత సంప్ర దాయాన్నే కొనసాగించారు. అప్పుడు ప్లాన్‌లో పంట రుణాలు రూ.84వేల కోట్లుకాగా,కౌల్దార్లకు రూ.8, 400 కోట్లు చూపించారు. 2020-21 కొచ్చేసరికి ప్లాన్‌లో పంట రుణాలటార్గెట్‌ రూ.94,629 కోట్లు కాగా కౌలు రైతులకు రూ.6,500కోట్లు మాత్ర మేనని తెలిపారు. పాత సంప్రదాయం ప్రకారమైతే పదిశాతం అంటే రూ.9,462 కోట్లు కౌలు రైతు లకు ఇవ్వాలి. పోనీ టార్గెట్‌ మేరకు ఇచ్చారా అంటే అదీ లేదు. సిసిఆర్‌సి, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌, మిగతా అన్ని పాత గ్రూపులకూ కలిపి ఇచ్చింది రూ.765 కోట్లు మాత్రమే. ప్రస్తుతం 2021-22లో పరిస్థితి మరింత దిగజారింది. వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాల లక్ష్యం రూ.1,10,422 కోట్లు కాగా రూ.4,100కోట్లనుకౌలురైతులకు ప్రతిపాదించారు. మనం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 9,35,123 మంది కౌలు రైతులకు రూ.8400 కోట్ల రుణాలు అందించాలని నిర్దేశించుకున్నారు. కాని రూ.1800కోట్లను 1,73,736 మందికి పంట రుణాలు ఇచ్చినట్లుగా 2020జనవరిలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈ అంకె ల్లో కుడా చాలా గారడీ ఉంది. ఇందు లో బినామీ ఖాతాలు కూడా ఉన్నాయి. ఇదంతా పుస్తకాల సర్దుబాటు తప్ప వాస్తవంగా రుణాలు ఇచ్చింది చాలా తక్కు వేనని బ్యాంకు అధికారులే అంటు న్నారు. రబీ ప్రారంభంలో జగన్‌ ప్రభుత్వం నూతన కౌలు రైతులచట్టం తీసుకు రావటం చేత ఏ ఒక్కరి కి కూడా పంట రుణాలు దక్కలేదు. ‘‘కౌలు రైతుల చట్టం-2011’’ కౌలు రైతులకు కొంత మేరకు అనుకూలంగా ఉంది. ఈచట్టాన్ని రద్దు చేసి ‘ఆంధ్ర ప్రదేశ్‌ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని’ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. భూ యజమాని కౌలు ఒప్పంద పత్రం రాసి ఇస్తేనే కౌలు గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. భూ యజమానులు కౌలు ఒప్పంద పత్రం రాసి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కౌలుదారులకు గుర్తింపు కార్డులు రాలేదు. దీనితో కౌలురైతుల నోట్లో మట్టి కొట్టారు. సాగు చేయ కుండా, శ్రమ చేయకుండా, పెట్టుబడి పెట్టకుండా బ్యాంకుల ద్వారా పొందిన పంట రుణాలను వడ్డీకి ఇచ్చి లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందుతు న్నారు. ఇది పెద్ద మోసం.
ఇటీవల కాలంలో ఆర్‌.బి.ఐ రూ.1. 60 లక్షలవరకు ఎటువంటి హామీ లేకుండా వ్యవ సాయ రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇటీవల నాబార్డు నూతన చైర్మన్‌ గా బాధ్యతలు చేపెట్టిన చింతల గోవిందరాజులు కిసాన్‌క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలకు ఎటువంటి వడ్డీ చెల్లించ వలసిన అవసరం లేదని ప్రకటించారు. సంయుక్త భాగస్వామి సంఘం (జె.యల్‌.జి) పేరుతో పంటరుణాలు కౌలురైతులకు ఉమ్మడి పూచీకత్తుపై ఇచ్చే పథకాన్ని అమలు చేస్తు న్నామని చెప్పారు. ఈ సంఘాల ఏర్పాటుకు, రుణా లు పంపిణీ చేసే బ్యాంకులకు ప్రత్యేకంగా ప్రోత్సా హకాలు నాబార్డు అందిస్తుందని దీని కోసం 105 బ్యాంకులతో నాబార్డు ఒప్పందం చేసుకుందని, ఈరుణాల పంపిణీ సొమ్మంతా నాబార్డు సమ కూర్చుతుందని చెప్పారు. ఇది వాస్తవమేనా? ఆంధ్ర ప్రదేశ్‌లో జె.యల్‌.జి రుణాలు ఇచ్చేటపుడు కౌలు రైతు ఏభూమి సాగు చేస్తున్నాడో పరిశీలించి భూ యజమానిఆ భూమిపై ముందుగానే పంట పేరు చెప్పి రుణం తీసుకెళితే కౌలు రైతులకు ఇవ్వటం లేదు. పంటలు పండిరచడానికి పంట రుణాలు ఇవ్వమంటే అనేక కారణాలు చెబుతారు. కొర్పొరేట్లకు, ఎగవేతదారులకు మాత్రం క్షణంలోనే ఇస్తారు. మనరాష్ట్రంలో ఆబ్సెంట్‌ ల్యాండ్‌లార్డ్స్‌ ఎక్కువ. ఆసాములు విదేశాల్లో ఉంటారు. భూము లు మన రాష్ట్రంలో ఉంటాయి. బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో దుబారులో ఉద్యోగం చేసేవారు స్థానిక బ్యాంకుల్లో పంట రుణాలు పొందుతున్నారు. ఆ భూములు సాగు చేసే కౌలు రైతులు పంట రుణా లు అడిగితే భూ యజమాని తీసుకెళ్ళాడని చెప్పారు. విచారణ జరిపితే అందరికంటే ముందే రుణాలు తీసుకొని భూ యజమాని విదేశాలకు చెక్కేశాడని తేలింది. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా వచ్చేలా చట్టాన్ని మార్చడమే పరిష్కా రం. చట్టాలు చేయడంతో పాటు కౌలు రైతులకు గ్యారంటీగా పంట రుణాలు దక్కే పద్ధతిని రూపొం దించుకుని అమలు చేయాలి. సాగు చేయని వారికి పంట రుణాలు మంజూరు చేయకూడదు. విచారణ జరప కుండా పంట రుణాలు ఇచ్చిన బ్యాంకుల పైన,రుణాలు తీసుకున్న వారి పైన క్రిమినల్‌ కేసులు పెట్టాలి. వాస్తవ సాగుదారులకు పంట రుణాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం కషి చేయాలి. ఇవన్నీ అమలు జరగాలంటే బలమైన ఉద్యమం తప్ప మరో మార్గం లేదని అనుభవం చెప్తోంది- జిఎన్‌వి సతీష్‌

గిరిజన సంప్రదాల్ని గుర్తించిన పీసా చట్టం

గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల్లో ముఖ్యమైనది స్వయం పరిపాలన. ఎప్పుడో హిందు రాజులు, మొగల్‌ సామ్రాజ్యం, దాని తరువాత బ్రిటిష్‌ నైజాం నవాబుల పాలనలో స్వయం పరిపాలన అధికారాలు కోల్పోయిన గిరిజనులు నిర్విరామంగా పోరాటాలు చేస్తోనే ఉన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం అయితే గిరిజన ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా 1874లోనే గుర్తించి సామాన్య పరిపాలన నుండి తప్పించారు. గిరిజనుల సార్వ భౌమధికారాన్ని కాలరాసేయడం వల్ల అలజడులు వస్తున్నాయని గుర్తించకపోగా హిందు రాజుల ప్రోద్భలంతో వీరు తిరుగుబాట్లు చేస్తున్నారని బ్రిటిష్‌ వారు అభిప్రాయపడ్డారు. సుమారు 150 సంవత్సరాలుగా అదే అభిప్రాయం కొనసాగుతోంది. అయితే అప్పుడప్పుడు అలజడులకు కారణాలు తెలుసుకునేందుకు కమీటీలను వేసి వాటి ద్వారా విషయాలు సేకరించేవారు. అయినా గిరిజన ప్రాంతాలను చీకట్లో ప్రాంతాలుగా చిత్రీకరించడం మానలేదు. అందువల్ల శాంతిని నెలకొల్పేందుకు పోలీసు బలగాల ఉపయోగం పెరిగింది. కాని మొదట షెడ్యూలు ప్రకారం శాంతి, సుపరి పాలన జరిగేందుకు ప్రయత్నాల చేయడం యాదృచ్చికమే! ఒకానొక సమయంలో ఐదవ షెడ్యూలు ప్రాంతంలో చాలా భాగం కల్లోలిత ప్రాంతంగా కేంద్రహోంశాఖ గుర్తించింది. మరోపక్క రాజ్యాంగం 46వ ఆర్టికల్‌ ప్రకారం గిరిజనులకు రక్షణ కల్పిస్తూ విద్య, అర్థికా భివృద్ధిని చేపట్టాలని ఉన్నా ఆచరణ మాత్రం అంతంతే. రాజ్యాంగం ఐదవ షెడ్యూలులో ప్రభుత్వ అధికారుల (గవర్నరు) ద్వారా శాంతి, సుపరిపాలన సాధించాలని నిర్దేశించినా అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం తమ స్వార్థం కోసమే పనిచేసింది. అక్కడకు బదిలీ అయినవాళ్ళు చాలామంది వెళ్ళకుండా ప్రయత్నం చేసుకుంటే, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న సంసారాన్ని చెడగొట్టేరు. ఫలితంగా గిరిజనులకే శిక్షపడిరది. ఇదంతా వివరంగా చర్చించిన తరువాత పంచాయితీ రాజ్‌ వ్యవస్థలో గిరిజన ప్రాంతాలలోని పంచాయితీలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని 1992 లో నిర్ణయం జరిగింది.
వారి ప్రపంచం వేరు
73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీ రాజ్‌ చట్టం, 1992 తీసుకు వచ్చేటప్పుడు ఈ చట్టం షెడ్యూలు ప్రాంతాలకు యధాతధంగా అమలు చేయరాదని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలలో స్వయం పాలనా వ్యవస్థ, ముఖ్యంగా సామాజిక వ్వవహారాల్లో ఇంకా పటిష్టంగానే ఉందనే విషయాన్ని గుర్తించారు. అయితే బయటి ప్రపంచంతో సంబంధాలు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఉత్పన్నమౌతున్న సవాళ్ళను మాత్రం సాంప్రదాయక వ్యవస్థ ఎదుర్కోలేక పోతోంది. అందువల్ల షెడ్యూల్‌ ప్రాంతాలలో ఎన్నుకోబడిన పంచాయితీలకు అధికార వికేంద్రీకరణతో పాటు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని కూడా ఆలోచించారు. షెడ్యూలు ప్రాంతంలోని పంచాయితీలకు ఏ ఏ ప్రత్యేక అధికారాలు ఇవ్వాలో నిర్ణయించేందుకు దిలీప్‌ సింఫ్న్‌ ఛూరియా నాయకత్వంలో ఒక కమీటీని నియమించారు. ఈ కమీటీలో గిరిజన ప్రాంతాలలో చాలా కాలం పనిచేసిన నిష్ణాతులు ఉన్నారు.షెడ్యూలు ప్రాంతాలలో పంచాయితీలకు ప్రత్యేక అధికారాలపై ఎన్నో సూచనలు ఇచ్చేరు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు వీటిలో కొన్నింటినే ప్రభుత్వం ఆమోదించి 1996లో కేంద్ర పీసాచట్టం (40వ ఏక్టు 1996)రూపంలో పార్లమెంటు ఆమోదం పొందింది. కేంద్రచట్టం అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ (సవరణ) చట్టం 1998లో వచ్చింది. ఈ చట్టం అమలుకు కావలసిన రూల్సు 2011 సంవత్సరంలో అంటే 13 సంవత్సరాల తరువాత వచ్చాయి. రాజ్యాంగ సవరణ 1992లో జరిగితే పీసాచట్టం అమలుకు కావలసిన మార్గదర్శకాలు (రూల్సు) వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో 19సంవత్సరాలు పట్టింది. డిల్లీ నుండి హైదరాబాదుకు అంతదూరమా? 2011లో రూల్సు వచ్చేసరికి పంచాయతీలు గడువు కాలం తీరింది. 2014లో పంచా యితీ ఎన్నికలు అయినా కనే పీసా పంచాయ తీలు పనిచేసే అవకాశం కలిగింది. పీసా పంచాయతీలను రూల్సు ప్రకారం ప్రకటించవలసిన భాద్యత గిరిజన సంక్షేమశాఖది. దీనికి జిల్లా కలెక్టరు దగ్గరనుండి ప్రతిపాదనలు రావాలి. దీనికోసం మరింత జాప్యం జరిగింది. ప్రభుత్వంలో కొంత మంది విజ్ఞులు ఉంటారు. ఏదైనా పనిచేయకూడదు. అని వారు అనుకుంటే జాప్యం చేస్తే సరి అనే విధానం పాటిస్తారు. పంచాయితీలకు ఇవ్వవలసిన అధికారాలు అన్నీ ఇప్పటికే కొన్ని డిపార్టుమెంటు అధికారులు అనుభవిస్తున్నారు. లాభడుతున్నారు. కూడా. అందువల్ల అధికారాలు బదలాంచడాన్ని ఇష్టపడరు. అలాగని చట్టం అమలు చేయకపోతే ఇబ్బందుల్లో పడతారు. కాలయాపనే మార్గంగా ఎంచుకుంది అధికార వ్యవస్థ. సరే, చట్టం ప్రకారం పంచాయతీలకు సంక్రమిస్తున్న అధికారాలు ఏమిటి? అనేది క్లుప్తంగా తెలుసుకుందాం.
ఆదివాసీ పంచాయితీ అధికారాలేమిటి?
అన్నిటికంటే ముఖ్యమైనది ‘పీసా గ్రామం’ నిర్వచనం. గిరిజనుల ఆచారాల ప్రకారం గుర్తించబడి, వారే పాలన చేసుకునే ప్రాంతాలు: ఆవాసం/శివారు గ్రామాలు/ సముదాయాల పీసా గ్రామాలుగా గుర్తించాలి. అంటే ప్రతి ఆవాసానికి గ్రామ సభ ఉంటుంది. ఇంతకు ముందు గ్రామసభ పంచాయితీ ముఖ్య గ్రామానికే పరిమితం అవుతోంది. ఆ పంచా యితీలో నున్న శివారు గ్రామాలకు ప్రాతినిధ్యం కాగితాలకే పరిమితం రెండవది, అంతే ముఖ్యమైనది పాలనా వ్యవస్థ. గ్రామపంచాయితీ పాలన వారి ఆచార వ్యవహారాలను, సాంస్కృతిక ప్రత్యేకతను రక్షిస్తూ తదనుగుణంగా పరిపాలన చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా ఈ పాలన ఉండకూడదు. గిరిజన సంస్కృతికి, చట్టాలకు మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు చట్టాలదే పైచేయి అవుతుంది. అటువంటప్పుడు గిరిజన సంప్రదాయక చట్టాలు పనికిరావు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గిరిజన సంప్రదాయక పరిపాలనా వ్యవస్థను క్రోడీకరించలేదు. అందువల్ల న్యాయవ్యవస్థ గుర్తించదు. ఒడిసా రాష్ట్రంలో నియామ్‌గిరి కొండల్లో బాక్సైటు గనులకు వేదాంతా (బహుళదేశ) కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే డోంగ్రియా ఖోండులు అనే చాలా వెనుకబడిన గిరిజన తెగవారు అభ్యంతరం తెలిపారు. ఆ కొండల్లో తమ ఆరాధ్య దైవమైన నియామ్‌గిరి రాజు నివసిస్తాడని, బాక్సైటు గనులు త్రవ్వటం వల్ల గిరిజన వ్యవస్థ దెబ్బతింటుందని గ్రామ సభ తీర్మానం ద్వారా తెలిపేరు. దాంతో బాక్సైటు గనుల త్రవ్వకం ఆపేసింది సుప్రీంకోర్టు. అందువల్ల పీసా చట్టం వల్ల గిరిజన సంప్ర దాయాలను కాపాడుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవాలి. షెడ్యూలు ప్రాంతాలలో గ్రామసర్పంచులు మండల అధ్యక్షులు గిరిజనులే ఉండాలని, పీసా చట్టంలో ఉందికాని ఎం.పి.టి.సి, జెడ్‌.పి.టిసి వ్యవస్థ దీన్ని దెబ్బతీస్తోంది. గ్రామ ప్రణాళిక తయారు, అమలు, పర్యవేక్షణ, లబ్దిదారుల ఎన్నిక గ్రామ సభదే. అయితే బయటి వారి ప్రమేయం ఎక్కువగానే కనిపిస్తుంది. దీనికి తోడు అధికారుల దొంగ లెక్కలు కలుస్తే అబ్దిదారులు జాబితా తప్పులు తడకలే. షెడ్యూలు ప్రాంతాలలో భూసేకరణ, పునరావాస ప్రణాళిక, అమలులో గ్రామసభ, ఆ పై పంచాయితీ రాజ్‌ వ్యవస్థల ఆమోదం ద్వారానే జరగాలి. అసలు సంప్రదింపులు కూడా జరగని సందర్భాలు చాలా ఉన్నాయని గిరిజన ప్రజాసంఘాలు చెబుతాయి. షెడ్యూలు ప్రాంతంలో భూమి అన్యాక్రాంతం కాకుండా చూడడం, ఇంతకుముందు అన్యాక్రాంతం అయిన భూమిని గిరిజనులకు తిరిగి ఇప్పించటం లాంటివి చేపట్టేందుకు గ్రామసభకు అధికారాలు ఉన్నాయి. అయితే చట్టం అమలు పరిచే స్థోమత గ్రామసభలకు కల్పించలేదు, చాలాచోట్ల అవగాహనేలేదు. చిన్నతరహా అటవీసంపదపై ఆస్థిహక్కు, మార్కెట్టుపై అజమాయిషీ కూడా గ్రామ సభకు ఉన్నాయి. కాని జి.సి.సి అటవీశాఖలకు కూడా ఈ హక్కులు ఇంకా ఉన్నాయి. గ్రామ సభలకు ఈ వ్యవస్థలను వ్యతిరేకించే స్థోమత లేదు. వడ్డీ వ్యాపారం నియంత్రణకు కూడా గ్రామసభకు అధికారం ఉంది. కాని బ్యాంకులు పనిచేయని చోట్ల వడ్డీ వ్యాపారులే దిక్కు అయినప్పుడు ఈ అధికారం చలాయించడం కష్టమే. ఇక స్థానిక సంస్థలు అధికారులపై అజమాయిషీ హక్కులు ఉన్నా వారిని నియంత్రించే స్థోమత గ్రామ పంచాయితీలకు లేదు. ఉద్యోగులకు బలమైన సంఘాలు ఉన్నాయి. గిరజన పంచాయితీ గ్రామసభలను చైతన్య పరిస్తేనే స్వపరిపాలన సాధ్యం. ఆలోచించండి.
స్వపరిపాలన వారి సంస్కృతికి మూలం
వాడుక భాషలో గిరిజనులు అని పిలువబడే వారిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు. వనవాశి, గిరిజన్‌, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయోగించేవారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనుల గురించి ముఖ్యంగా దండకారణ్యం గురించి వివరాలు ఉన్నాయి. గిరిజనుల నాగరికత చాలా పురాతనమైనది. వారికి రాజ్యాలు ఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది. సంఖ్యా పరిజ్ఞానం, మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. సాహిత్యం, సంగీతం, వాయిద్య సహకారం అత్యున్నత స్థాయికి చేరుకుంది. స్వపరిపాలన వారి సంస్కృతికి మూలాలు చాలా గిరిజన సంస్కృతి లో కనిపిస్తాయి. అయితే కాలక్రమేణా వారి రాజ్యాలు, హిందూ రాజులు, మొగలులు, నిజాములు, బ్రిటిష్‌వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వారి జీవన విధానానికి తీవ్రమైన ఇబ్బందులు కలిగాయి.1901 జనాభా లెక్కల నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం గిరిజనుల్ని ‘ఏనిమిస్ట్‌’ లుగా పిలిచేవారు. కాని అప్పటి జనాభా కమిషనర్‌ అయిన శ్రీ హట్టన్‌, ఏనిమిస్ట్‌లను హిందువుల నుంచి నేరుగా పరిగణించటం కష్టం అవుతోందని వర్ణించారు. అయితే గిరిజన ప్రాంతాలు మాత్రం మిగిలిన ప్రాంతాలకంటే భిన్నంగా ఉంటాయని, వాటి పరిపాలన సామాన్య పరిపాలనతోటి కలపరాదని భావించి, బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయా ప్రాంతాలను షెడ్యూలు జిల్లాలుగా 1874లోనే ప్రకటిం చారు. అలాగే హైదరాబాద్‌ ప్రభుత్వం 1949 లో నోటిఫైడ్‌ ప్రాంతాలుగా గుర్తించింది. బ్రిటిష్‌వారు వీరిని హిల్‌ట్రెబ్స్‌ అనిపిలిస్తే, హైదరాబాద్‌ ప్రభుత్వం నోటిఫైడ్‌ ట్రెబ్స్‌గా పిలిచారు. వారి భూమి రక్షణకై చట్టాలు కూడా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ముఖ్యంగా 1960నుంచి గిరిజనులు నివసించే మారుమూల కొండ ప్రాంతాలు రోడ్లతో కలుపబడ్డాయి. బయటి ప్రాంతాల ప్రజలు మొదటి వ్యాపారానికి వచ్చి, తరువాత వ్యవసాయానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకు న్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు అమ ల్లోకి వచ్చాయి. గిరిజన సంతలు- బయటి మార్కెట్టు ప్రభావానికి లోనయ్యాయి. భారత రాజ్యాంగంలో 366 ఆర్టికల్‌లో షెడ్యూలు తెగల గురించి నిర్వచించడం జరిగింది. రాజ్యాంగంలో 342 ఆర్టికల్‌ ప్రకారం రాష్టప్రతి ప్రకటించిన గిరిజన తెగలు కాని, సమాజాలు కాని, వాటిలో భాగాలు కాని, గిరిజన తెగలు గుంపులను షెడ్యూలు తెగలుగా గుర్తిస్తారు. కొన్ని తెగలను ఈ లిస్టులో చేర్చడానికి కానీ, తీసివేయడానికి కాని పార్లమెంట్‌కు అధికారం ఉంది. వీరిని రాజ్యాంగపరంగా షెడ్యూలు తెగలు అంటారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖ వారి లెక్కల ప్రకారం దేశంలో 50 షెడ్యూలు తెగలు వున్నాయి. వారిలో 75 షెడ్యూలు తెగలు, ఇంకా పురాతన సాంకేతిక స్థాయిలో ఉండి ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి వున్నాయి. వారిని పి.టి.జి. (ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్సు)గా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 10.42 కోట్ల షెడ్యూలు తెగల జనాభా ఉంది. అది దేశ జనాభాలో 8.6 శాతం. మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య భారతదేశంలో షెడ్యూలు తెగల జనాభా సాంద్రత ఎక్కువగా వుంది. దేశంలోని గిరిజన జనాభాలో 89.96 శాతం గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు.ఏదైనా తెగను కాని, భాగాన్ని కాని, సముహల్ని కాని షెడ్యూలు తెగలుగా గుర్తించేందుకు లోకూర్‌ కమిటీవారు కొన్ని ప్రామాణికాల్ని నిర్ధేశించారు. అవి (1) అతి పురాతన సాంకేతిక విధానం (ఆహార సేకరణ, పోడు వ్యవసాయం), (2) ప్రత్యేక సంస్కృతి (్భష, ఆచారాలు, నమ్మకాలు, కళలు లాంటివి), (3) ప్రత్యేక నైవాశిక ప్రాంతం (అడవి, కొండలు లాంటివి), (4) బయటివారితో కలవడానికి ఇష్టపడకపోవడం, (5) బాగా వెనుకబడి వుండటం (మానవా భివృద్ధి సూచికలు- విద్య, ఆరోగ్యం, ఆదాయం లాంటి వాటివి) ఆర్టికల్‌ 244 (1) ప్రకారం రాష్టప్రతి షెడ్యూలు ప్రాంతాలను ప్రకటిస్తారు. గిరిజనుల సాంద్రత ఎక్కువగా వున్న ప్రాంతా లు, పరిపాలన సౌలభ్యం ఉండే ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాలను షెడ్యూలు ప్రాంతాలుగా గుర్తిస్తారు. అయితే భారత రాజ్యాంగం రాకముందే ఉన్న ఏజెన్సీ ప్రాంతాలే రాజ్యాంగం తరువాత ఇంచుమించుగా షెడ్యూ లు ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది.- తేజావత్‌ నందకుమార్‌ నాయక్‌

గమ్యం తెలియని బాలల ప్రయాణం

బంగారు భవిష్యత్తుకు పునాదిపడేది బాల్య దశ. ఇలాంటి కీలకదశలో బాలలు చదువు,ఆటలకు దూరమై శ్రామికులుగా మారడాన్ని బాలకార్మికులంటారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాలకార్మిక వ్యవస్థ ఒకటి. బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతిబిడ్డ జన్మహక్కు. అయితే కుటుంబాల సామాజిక,ఆర్థికపరిస్థితులు కారణంగా అత్యధికబాలలు వ్యవసాయ రంగం లో…మిగతావారు ఇళ్లలో,హౌటళ్లలో,కర్మాగారాల్లో,దుకాణాల్లో పనిచేస్తున్నారు. వీరంతా కూడా అధిక పనిగంటలు తక్కువ వేతనంతో శ్రమదోపిడీకి గురవడంతోపాటు అక్రమ రవాణా, వేశ్యావత్తి, డ్రగ్‌ మాఫియాకి బలవుతు న్నారు. ఫలితంగా వారి భవిష్యత్‌ అంధకారంగా మారింది. ..`

కరోనాతో బాలకార్మికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చాటు తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవ స్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకురా వడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ సంవత్సరం ‘’బాల కార్మిక వ్యవస్థ ముగింపునకు ఇప్పుడే చర్యలు’’ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈదినోత్సవం ప్రధానంగా ఐరాస 2021 సంవ త్సరాన్ని ‘’అంతర్జాతీయ బాల కార్మిక నిర్మూలన సంవత్సరం’’గా ప్రకటించిన నేపథ్యంలో తీసుకో వాల్సిన చర్యలపై దృష్టి సారించనుంది. గతేడాది బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశంలో ప్రపంచదేశాలు సార్వ త్రిక ఆమోదం తెలిపాయి. కరోనా విసిరిన సవాళ్ళ అనంతరం ఇది మొదటి ప్రపంచ దినం. ఇప్పటికే 2025 నాటికి బాలకార్మిక వ్యవస్థకు ముగింపు పలకాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో (లక్ష్యం8.7) నిర్దేశించుకోవడం జరిగింది. ఈ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ బాల కార్మికుల లెక్కిం పునకు సంబంధించిన నూతన అంచనాలు, పోకడ లను విడుదల చేయనుంది. ఇందులో అందరిని భాగస్వామ్యం చేయడానికి వారంపాటు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా గత ఏప్రిల్‌ మాసంలో అయాప్రాంతాలు, దేశాలు, సంస్థ వాటాదారులు, వ్యక్తులు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసిన ‘’2021కార్యాచరణ ప్రతిజ్ఞల’’ పురోగతిని ప్రదర్శిం చడం జరుగుతుంది.ఈఏడాది పొడవునా తీసు కున్న చర్యలు, తదుపరి 2022లో బాల కార్మికులపై సౌత్‌ ఆఫ్రికాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి మైలురాయిగా నిలువనున్నాయి.
కరోనాతో పెరిగిన బాలకార్మికులు…
అనేక రూపాల్లో కొనసాగుతున్న బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. కుటుంబ ఆర్థిక పరిస్థితికి,బాలల జీవనానికి అవినాభావ సంబంధం ఉంది. దీంతో వారు చదువుకోవాల్సిన వయసులో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు నిరక్షరా స్యత,ఉపాధి నిమిత్తం కుటుంబ వలసలు,జనాభా పెరుగుదల,ప్రపంచీకరణ తదితరకారణాలు కూడా బాలకార్మిక వ్యవస్థకు ఆజ్యం పోస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరన్నర కాలంగా కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో కుటుంబ ఆదా యం పడిపోయి, సామాజిక జీవనం దెబ్బతిన్నది. దీని ప్రభావంపిల్లలపై పడిరది. దీంతో వారు విద్య,వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరమ య్యారు. బడులు మూతపడడం, ఆన్‌లైన్‌ చదువు లతో మెజారిటిపిల్లలు విద్యను పొందలేక పోయా రు. ఫలితంగా బాల్య వివాహాలు,బాలకార్మిక వ్యవస్థలాంటి దుర్లక్షణాలు పెరిగాయని అనేక అధ్య యనాలు చాటుతున్నాయి. గతేడాది ‘’కోవిడ్‌-19, బాలకార్మిక వ్యవస్థ’’ పై అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూనిసెఫ్‌ అధ్యయనం బాలకార్మిక వ్యవస్థ పై గత ఇరవై సంవత్సరాల కాలంలో సాధించిన పురోగతి వెనక్కి నెట్టబడిరదని తెలిపింది. ఈ సంక్షో భం కన్నా ముందుతో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర పేదరికంలోకి జారుకున్న వారి సంఖ్య 4నుంచి 6 కోట్లు పెరిగిందని,ఒక శాతం పేదరికం పెరి గితే 0.7శాతం బాలకార్మికులు పెరుగుతారని పేర్కొన్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల ప్రకారం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15.2కోట్ల మంది బాల కార్మికులు ఉండగా…అందులో 7.2 పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో నిమగమయ్యారు. అధికంగా బాలకార్మికులున్నా భారతదేశంలో కరోనా అనంతరం వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కైలాష్‌ సత్యార్థి చిల్డ్రన్స్‌ ఫౌండే షన్‌ సర్వే పేర్కొన్నది. పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందని, కార్మిక చట్టాలు దుర్వినియోగం అయ్యేప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు…
దేశ సంపద అయిన బాలలు బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవు తుంది. సంఘ విద్రోహ కార్యకలాపాలు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి బాలలకు తగిన విద్యా భ్యాసం,శిక్షణ అందించి విలువైన మానవ వనరులు గా తీర్చిదిద్దాలి. కార్మికులుగా పనిచేస్తున్న బాలల పూర్తివివరాలు సేకరించాలి. ఇందులో ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా భాగస్వామ్యం కా వాలి. బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాలి. బడిబయట ఉన్న విద్యార్థులపై సమగ్ర సర్వే నిర్వహించి పాఠశాలలో నమోదు చేయాలి. వ్యవ సాయ సంస్కరణలు,ఉపాధికల్పన పథకాలు, సాం కతిక నైపుణ్యాలు పెంపొందించటం,అవ్యవస్థీ కత రంగాలను ప్రోత్సహించటం, సహకారసంఘాల ఏర్పాటు,సాంఘిక భద్రతా పథకాల రూపకల్ప న వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూ లనకు దోహదపడతాయి. ప్రభుత్వాలు వీటిపై ప్రత్యే కంగా దృష్టిసారించాలి. అందుకు దీర్ఘకాల కషి, బహుముఖ వ్యూహం అవసరం. భారతదేశంలో కరోనా మహమ్మారితో చాలా మంది బాలలు అనాధలయ్యారు. వీరి సంరక్షణకై క్షేత్రస్థాయి చర్యలు చేపట్టాలి. విద్యఅంతరాలను తొలగించడానికి డిజి టల్‌ సాధనాలు అందించాలి. నేటి కోవిడ్‌ విపత్కర పరిస్థితులో బాలల హక్కులు సంక్షోభాన్ని ఎదుర్కో వడానికి ప్రపంచదేశాలు సమన్వయం కోసం యూనిసెఫ్‌ ఎజెండా రూపొందించింది. ఇందులో బాలల ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారం అందివ్వాలని, తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. పిల్లల విద్యను కొనసాగిస్తూ,వారి సంరక్షణ కోసం కుటుం బాలకు సామాజిక మద్దతు ఇవ్వాలి. బాలలను హింస,దోపిడి,దుర్వినియోగం నుంచి రక్షించాలి. అంతర్యుద్ధాలు,హింస సంఘటనలతో వలస వచ్చిన,శరణార్థులుపిల్లలను రక్షించాలి. ఈ చర్యలు బాల కార్మిక వ్యవస్థకు చమరగీతం పాడి, వారి వికాసానికి దోహద పడతాయి.– డాక్టర్‌ పెంట కృష్ణ

ఆహారం దక్కక ఆకలి కేక

అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంపూర్ణ పోషణ పథకం నిర్విర్యమౌతోంది. రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండ లాల పరిధిలోని 8ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో25రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు,కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్‌ హోమ్‌ న్యూట్రి షన్‌ కిట్‌ కింద నెలకు 2కిలోల మల్టీ గ్రెయి న్‌ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకి లో రాగిపిండి,అరకిలో బెల్లం,అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయాలి. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తంరూ.87.12 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ఈ పథకం77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47, 287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేస్తు న్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాల్లో ఈ పథకం అరకొరగా కొనసాగుతోంది. పథకానికి సంబంధించిన పోషకాలు అర్హులైన లబ్దిదారులకు అందడం లేదు. కనీసం ఈ కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనైనా లబ్దిదారులకు సక్రమంగా అమలు చేసే నాధుడు కరవయ్యారు.

మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల అభివృద్ధిని ఆనాటి ఆంధ్రపాలకుల నుంచి నేటి తెలంగాణ పాలకుల వరకు పట్టించు కునే వారు లేక వారి బతుకులు మారడం లేదు. గిరిజనుల అభివృద్ధి కోసం కోట్లు ఖర్చు పెడుతున్నామని అధికారులు ప్రగల్భాలు పలుకుతూ లెక్కల్లో చెపుతున్నా, ఆచరణలో మాత్రం శూన్యంగానే ఉన్నది. కాసిపేట మండలంలో ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో సరైన రోడ్లు , రవాణా సౌకర్యాల్లేక గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. గిరి పుత్రులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. పారిశుధ్యం అధ్వానం ఇలా చెప్పుకుంటూ పోతే ఆదివాసీ గ్రామాల్లో అనేక సమస్యలున్నాయి. గిరిజన గ్రామాలకు కనీస వసతులు కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివాసీ గ్రామాల్లోని పిల్లలకు పోషకాహారం అందని ద్రాక్షగానే ఉంది. గిరిజనుల పిల్లల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆదివాసీల పిల్లలు పోషకాహార లోపంతో రోగాల భారిన పడుతున్నారు. మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ నామమాత్రంగానే కొనసాగుతోంది. కొలాంగూడ , లక్ష్మిపూర్‌, తిరుమలాపూర్‌ గిరిజన గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు లేకపోవడంతో పిల్లలు పోషకాహారానికి దూరమై అనారోగ్యం పాలవుతున్నారు. కొన్ని గిరిజన గ్రామాల్లో అధికారింగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి పనిచేసిన దాఖలాలు లేవు. దీంతో గిరిజనుల పిల్లలు గంజి, గట్కలతో కడుపు నింపుకుంటున్నారు.
మౌలిక సదుపాయలు శూన్యం
ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యంలేదు. కొన్ని గ్రామాలకు వెళ్లాలంటే వాగు లు, వంకలు దాటు కుంటూ వెళ్లాల్సిందే. సమస్యలతో సతమతమౌతున్న గిరిజన గ్రామాలకు కనీస సదుపాయాలు కల్పిం చడంలో ప్రభు త్వం ఏనాడు శ్రద్ధ వహిం చలేదని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వర్షాకా లంలో వాగులు పొంగి పోర్లుతుంటే ప్రమాదపు టంచున వాగులో రాకపోకలు సాగిస్తూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేక అనారోగ్యంతో ఉన్నవారికి సరైన సమయంలో వైద్యమందక మృతి చెందిన ఘటనలు చాలా ఉన్నాయి.
పౌష్టికాహారం అందని ద్రాక్షే..
సంపూర్ణ పౌష్ఠికాహారం అందించి మాతా, శిశు మరణాలు రేటు తగ్గించాలన్నది స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) లక్ష్యం. కానీ కరోనా కష్టకాలంలో లబ్ధిదారులకు నిర్దేశిత ప్రకారం సంపూర్ణ ఆహారం అంద డం లేదని క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి తెలు స్తోంది. గుడ్లు తప్ప, నూనె, పప్పు రెండు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు సక్రమంగా సరఫరా కావడం లేదు. దీంతో లబ్ధిదారులకు అరకొర గుడ్లు, పాలు నేరుగా అందించి చేతులు దులుపుకొంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు భోజనం చేసి పెట్టాల్సి ఉండగా గత రెండు నెలలుగా కరోనా నేపథ్యంలో నేరుగా నిత్యావసరాలు అందిస్తున్నారు. కానీ నూనె, పప్పులు ఇవ్వట్లేదు. పాలు కూడా అరకొరగానే ఇస్తున్నారు. అవి కూడా ఒక రకమైన వాసన వస్తోండటంతో తాగలేకపోతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.
గర్భిణుల్లో రక్తహీనత
జిల్లాలోని గిరిజన గ్రామాల్లోని లబ్ధిదారులు పౌష్ఠికాహారానికి నోచుకోక పచ్చళ్లు, చారుతో భోజనం చేయాల్సి వస్తోంది. ప్రధానంగా విశాఖ జిల్లా షెడ్యూల్‌ ప్రాంతానికి చెందిన 11 మండలాల్లోని గిరిజన గ్రామాల పిల్లలు బలవర్ధక ఆహారానికి నోచక, వ్యాధినిరోధక శక్తి లేక వ్యాధుల బారిన పడుతున్నారు. వారానికి ఒకసారి సమీపం సంతలకు వెళ్లి కూరగాయలు తెచ్చుకునే కుటుంబాలే అధికం. గర్భిణులు,బాలింతలు నడిచి వెళ్లలేక పచ్చడి,గంజి మెతుకులతో రోజులు గడుపుతున్నారు. ఫలితంగా నెలలు నిండుతున్న వారిలోనూ పిండం సరిగా ఎదగడం లేదు. రక్తహీనత బాధితులు ఎక్కువగా ఉన్నారు. కొందరికి హిమోగ్లోబిన్‌ శాతం 6-7 శాతం మాత్రమే ఉంటోంది. బాలింతల్లోనూ పట్టణా లబ్ధిదారుల్లో పరిస్థితి కాస్త పర్వాలేకున్నా.. గిరిజనుల్లో మాత్రం సుమారు 70 శాతం మంది సరైన తిండికి నోచక పిల్లలకూ సరిపడినన్ని పాలివ్వలేని పరిస్థితి దాపురించింది.
గర్భిణులు: 8,430
బాలింతలు: 9,259
0-6 ఏళ్ల పిల్లల సంఖ్య: 69,183
మినీ అంగన్‌వాడీలు: 636
జిల్లాలో అంగన్‌వాడీలు: 1,424
బాధితులు ఇలా..
అతి తీవ్ర పోషణ లోపం ఉన్నవారు (ఎస్‌ఏఎం) 2139,తీవ్ర పోషణ లోపం (ఎంఏఎం) 4,299,అతి తక్కువ బరువు (ఎస్‌యూడబ్ల్యూ) 1,334,పోషకాహార లోపం (ఎంయూడబ్ల్యూ) 6,376 వయసుకు తగిన ఎత్తులేని వారు 696
గిరిజనుల పిల్లల్లో వయసు పెరుగు తున్నప్పటికీ తగిన బరువు ఉండటం లేదు. జిల్లాలోని అన్నీప్రాజెక్టుల పరిధిలో తీవ్ర పౌష్ఠికాహారం లోపంతో బాధపడే వారు వేలాది మంది ఉన్నారు. వీళ్లకు సంపూర్ణ పౌష్ఠికాహారం అందితేనే శరీరం ఎదుగుదల ఉంటుంది. వ్యాధులు దరిచేరవు. ఉన్నతాధికారులు అవసరమైతే పౌష్ఠికాహార కేంద్రాలకు (ఎన్‌ఆర్‌సీ) తరలించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేయాల్సిన బాధ్యత ఉంది.
నెలాఖరుకల్లా సమస్య పరిష్కారం

  • సీతామహాలక్ష్మీ, ఐసీడీఎస్‌ పీడీ
    గత నెలన్నర నుంచి పప్పు, నూనెలు రాష్ట్రస్థాయి నుంచే సరఫరా కాలేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. మొన్న నూనె సరఫరా చేశారు. వెంటనే ప్రాజెక్టులకు అందజేశాం. వారు కేంద్రాలకు అందజేస్త్నేన్నారు. పప్పు కూడా ఈ నెల చివరి కల్లా వచ్చే అవకాశం ఉంది.
    పారిశుధ్యం అధ్వానం
    గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం మరీ అధ్వానంగా ఉంది. ప్రతి వర్షకాలం పారిశుధ్యలోపంతో రోగా లు ప్రబలి ప్రజలు మృతిచెందుతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో చాలా చోట్ల డ్రెయినేజీలు నిర్మించలేదు. దీంతో పాటు కాలువలో పూడికలు తీయకపోవడంతో కాలువల్లో మురికినీరు నిలిచి, దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇలా అనేక సమస్యలతో గిరిజన గ్రామాలు సతమతమ వుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
    జి.ఎన్‌.వి.సతీష్‌

లాక్‌డౌన్‌ రోజుల్లో…ఈ రాష్ట్రాల్లో మహిళలే ఆశ,శ్వాష

భారతదేశంలో లాక్‌ డౌన్‌ సమస్య తీవ్రతను తగ్గించడంలో, వీలైనంత తక్కువ సమయంలో ఉత్తమ పరిష్కారాలు చూపించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే, దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగాలకు మహిళలు అందించిన చేయూత, గొప్ప సామాజిక ప్రభావాన్ని చూపాయి.
ఈ శతాబ్దంలోనే అతి పెద్ద విపత్తును ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యం కాదు. అందరికీ అన్నీ అందించడానికి చాలా పెద్ద యంత్రాంగం కావాలి. దానికి బలమైన, వ్యవస్థీకృత పద్ధతులుండాలి.
సరిగ్గా ఆ ఖాళీనే పూరించాయి మహిళా స్వయం సహాయక బృందాలు. ఇవే కోవిడ్‌-19 కాలంలో దక్షిణ భారతంలో వెలుగు రేఖల్లా మారాయి. దాదాపు మొత్తం జనాభాకు వివిధ అవసరాలు ఒకేసారి పెద్ద ఎత్తున తీర్చాల్సి రావడం, వైద్యపరంగా దాదాపు ప్రతి కుటుంబాన్నీ సర్వే చేయాల్సిన అవసరం రావడం – ఈ రెండిటినీ సమన్వయం చేయడం సాధారణ విషయం కాదు.
కానీ, మహిళా సంఘాలు, ఆ బాధ్యతను సమర్థంగా, సత్వరంగా చేపడుతున్నాయి. భోజనం పెట్టడం దగ్గర నుంచి ఆరోగ్యం కాపాడడం వరకూ అన్ని విధాలా వారు తమ వంతు సాయం అందిస్తున్నారు.దక్షిణాదిన దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో మహిళల పాత్ర కనిపిస్తోంది. కేరళ మహిళలు ఈ విషయంలో ముందున్నారు. అక్కడ ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు సమాంతరంగా పనిచేస్తోంది కుదుంబ శ్రీ. (మలయాళంలో కుటుంబాన్ని కుదుంబ అని అంటారు).
కేరళను కాపాడుతున్న కుదుంబశ్రీ
కుదుంబశ్రీ.. ఇది అక్కడి మహిళా స్వయం సహాయక బృందాల సంస్థ. లాక్‌ డౌన్‌ తరవాత దేశమంతా పేదలు, వలస కార్మికుల ఆకలి కేకలు వినిపించాయి. కానీ కేరళ కుదుంబశ్రీ మహిళల కమ్యూనిటీ కిచెన్‌ అందరికంటే కాస్త ముందుగా వారి ఆకలి తీర్చింది.
అక్కడి స్థానిక సంస్థలతో కలపి కుదుంబ శ్రీ సంఘాలు ఈ వంటశాలలు ఏర్పాటు చేశాయి. పేదల దగ్గర నుంచి క్వారంటైన్లో ఉన్నవారి వరకూ అందరికీ భోజనం అందజేశాయి. మొత్తం 1304 కమ్యూనిటీ కిచెన్స్‌లో 1100 వంటశాలల్ని ఈ మహిళా సంస్థలే నడుపుతున్నాయి.
ఆహారం ఉచితం
కాస్త డబ్బు పెట్టగలిగిన వారి కోసం, వీటిలో 238 కిచెన్లను హోటళ్లుగా కేటాయించారు. అక్కడ 20 రూపాయలకే భోజనం దొరుకుతుంది. ఇక సరిహద్దుల్లో, లారీ డ్రైవర్లు ఎక్కువగా ఇరుక్కుపోయిన చోట, వారి కోసం 15 టేక్‌ అవే పాయింట్లు ఉన్నాయి. సాధారణ వ్యక్తులతో పాటూ గుర్తించిన 1,57,691 అనాథ కుటుంబాలకి కూడా ఆహారం అందుతోంది.
కేరళ సివిల్‌ సప్లైస్‌ శాఖ, 87 లక్షల కుటుం బాలకు ఇవ్వాల్సిన నిత్యావసరాల కిట్లను తయారు చేయడంలో వీరి సాయం అడిగింది. దానికి అదనంగా ఆ కిట్లకు కావల్సిన సంచులు కుట్టే పని కూడా వీరే తీసుకున్నారు.
ఇక అంగన్‌వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం లాక్‌ డౌన్‌లో కూడా ఆగకుండా వీరు చూస్తున్నారు.
ఇప్పటికే ఏప్రిల్‌ నెలకి సరిపడా అమృతం నూట్రిమిక్స్‌ నిల్వ పెట్టుకున్నారు. పంపిణీ కూడా జరుగుతోంది. గిరిజన ప్రాంతాలకూ ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు.
కొన్ని చోట్ల పడవల్లో సూపర్‌ మార్కెట్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వారు ఎక్కడా బయటకు రాకుండానే వారి అన్ని అవసరాలు తీర్చేలా చేశారు.
విస్తృత నెట్‌వర్క్‌, సమర్థులైన సభ్యులు, వారి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్‌ ఈ లక్షణాలే ఇక్కడ స్వయం సహాయక బృందాలపై ప్రభుత్వాలే ఆధారపడేలా చేయగలిగాయి.
కౌన్సిలింగ్‌ కోసం స్నేహిత
కేవలం భోజనం పెట్టడమే కాదు, ఆప్యాయంగా పలకరించి మంచి చెడ్డలూ చూస్తున్నారీ మహిళలు. ఇందుకోసం స్నేహిత అనే కార్యక్రమం ఉంది. దిక్కులేని (డెస్టిట్యూట్‌) కుటుంబాల్లో 1,22,920 మంది వృద్ధులే ఉన్నారు. లాక్డౌన్‌ సమయంలో వారందరినీ రోజూ పలకరించడం కుదుంబశ్రీ పనుల్లో ఒకటి. క్వారైంటన్లో ఉన్నవారినీ పలకరిస్తారు. క్వారంటైన్లో ఉన్న వారందరూ మానసికంగా ధైర్యంగా ఉండేందుకు పలకరించాలనే నియమం పెట్టుకున్నారు.
ఈ పలకరింపుల పని కోసమే 2,500 మంది ఉన్నారు. ఇంతేకాదు, ఇంట్లోనే అందరూ ఉండిపోవడంతో, బయటకు వెళ్లకపోవడంతో వచ్చే మానసిక ఒత్తిడి ఎదుర్కోవడానికీ, మహిళలు గృహహింస ఎదుర్కొంటుంటే గుర్తించడానికీ కూడా స్నేహిత కౌన్సిలింగ్‌ కార్యక్రమం పనిచేస్తోంది.
1,90,000 వాట్సాప్‌ గ్రూపులు
కుదుంబ శ్రీ చేసిన ముఖ్యమైన పనుల్లో కమ్యూనికేషన్‌ ఒకటి. బ్రేక్‌ ద చైన్‌ కాంపైన్‌ ద్వారా చేతులు కడుక్కోవడం, దూరం పాటించడం, శుభ్రత గురించి అవగాహన కల్పించడంలో చురుగ్గా వ్యవహరించారు. వాట్సప్‌ ద్వారా, అది లేని చోట ప్రత్యక్షంగా ప్రచారం, అవగాహన కల్పించారు.
ఇంతకీ కుదుంబశ్రీ కింద ఎన్ని వాట్సప్‌ గ్రూపులున్నాయో తెలుసా? అక్షరాలా లక్షా 90 వేలు. అవును. వాటిలో 22 లక్షల 50 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ కోవిడ్‌ గురించి స్పష్టమైన సమాచారం ఎప్పటికప్పుడు చేరిపోతూ వచ్చింది. ఇంగ్లీషు, మలయాళ భాషలో రూపొందించిన పోస్టర్లను వ్యాప్తి చేశారు.
ఎలా సాధ్యపడిరది?
నిజానికి మహిళా స్వయం సహాయక బృందాల ఉద్యమం దేశమంతా ఉంది. కానీ కొన్ని చోట్లే బాగా విజయవంతమయ్యింది. కొన్ని చోట్లే సామాజికంగా -ఆర్థికంగా ప్రభావం చూపగలిగింది. దక్షిణ భారతంలో ఈ సంఘాల ప్రభావం గ్రామీణ పేదరికాన్ని తగ్గించడంలో స్పష్టంగా కనిపించిందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.
కేరళ వంటి చోట్ల ఈ సంఘాలు మరింత శక్తివంతంగా, సంపన్నంగా ఎదిగాయి. ఈ కుదుంబశ్రీలను తెలుగు రాష్ట్రాల్లోని డ్వాక్రాతో దీన్ని పోల్చవచ్చు.
కేరళలో 90లలో ఈ ఉద్యమం మొదలైంది. 2019 మార్చి నాటికి అక్కడ మొత్తం 2,91,507 స్వయం సహాయక బృందాలున్నాయి. వాటిపైన 19,489 ప్రాంతీయ అభివృద్ధి సంఘాలు, మరో 1064 కమ్యూనిటీ అభివృద్ధి సంఘాలు ఉన్నాయి.
వీటిలో 43 లక్షల 93 వేల 579 మంది మహిళలు సభ్యులుగా ఉన్నవారు. ఏ మహిళ అయినా ఇందులో చేరవచ్చు, కాకపోతే ఇంటికి ఒక్కరు మాత్రమే చేరాలి.
సమగ్ర ఆర్థిక,సామాజిక,మహిళా సాధికారిత ఈ సంస్థ లక్ష్యం. సూక్ష్మ రుణాలు, సూక్ష్మ వ్యాపారాలు, ఉమ్మడి సాగు, జంతువుల పెంపకం, మార్కెట్‌ అభివృద్ధి, వాల్యూ చైన్‌ ఆధారిత వ్యవహారాలు వంటివన్నీ ఆర్థిక కార్యకలాపాల కిందకు వస్తాయి.
ఆశ్రయ (దిక్కులేని వారికి సాయం చేయడం), బాలసభ (పిల్లల కోసం),బడ్స్‌ (ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్య కోసం), ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రాజెక్టులు ఇవన్నీ సామాజిక కార్యక్రమాల కిందకు వస్తాయి. ఇక మహిళల కోసం కార్యక్రమాల గురించి చెప్పక్కర్లేదు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ కుటుంబశ్రీలు చేస్తున్నాయి.
వీళ్లు చేస్తున్న ప్రతీ కార్యక్రమమూ ప్రత్యేకమే. పదుల సంఖ్యలో ఇలాంటి కార్యక్రమాలు వీరు చేపడతున్నారు. వీటి వల్ల ఎందరో మహిళలు తాము ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. వ్యాపారవేత్తలుగా కొందరు ఎదిగారు. స్వయం ఉపాధి కొందరు పొందారు.
కేరళ తరువాత స్థానంలో మిగిలన దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఈ సంఘాలు బలంగానే ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుల్లో ఈ సంఘాలు ఎందరో మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. స్వయం ఉపాధి పొందడానికి సహాయపడ్డాయి. వారి ఉత్పత్తు లను అమ్ముకోవడానికి వేదిక కల్పించాయి. అలాగే కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేశాయి. పరోక్షంగా పేదరిక నిర్మూలనకు సహాయ పడ్డాయి.(బీబీసీ సౌజన్యంతో…)
బళ్ల సతీశ్బీ

పల్లె..పల్లెకూ విస్తరిస్తున్న రైతు ఉద్యమం

జనవరి 26 తర్వాత ‘ఇకరైతు ఉద్యమం పని అయిపోయినట్టే’ నని మోడీ భక్తు ప్రచారం చేసుకున్నారు. కాని మరోసారి వారి ప్రచారం వొట్టి బూటకమని తేలిపోయింది. బిజెపి ప్రభుత్వం, దాని భజనబృందం ఆశించినట్టు రైతు ఉద్యమం బహీ నపడలేదు సరికదా మరింత బంగా, మరింత లోతుగా, మరింత దేశవ్యాప్త విస్తృతితో ముందుకు సాగుతోంది. మార్చి6వ తేదీన 100వరోజుకు చేరిన ఉద్యమం ఢల్లీి సరిహద్దుల్లో సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌, షాజహాన్‌పూర్‌, పాల్వాల్‌ ప్రాంతా వద్ద భారీగా తరలివచ్చిన రైతుతో శాంతియు తంగా ధర్నాు నిర్వహించి విజయం సాధించే వరకూ విశ్రమించేది లేదంటూ విస్పష్టంగా తన దృఢ దీక్షను మరోమారు ప్రకటించింది. ఉద్యమానికి నాుగు నెలు పూర్తవుతున్న సందర్భంగా మార్చి 26న దేశవ్యాప్త బంద్‌కు సమాయత్తం అవుతోంది. బంద్‌కు అన్ని వైపు నుండీ మద్దతు మ్లెవెత్తు తోంది. ఉద్యమాన్ని మరింత బంగా కొనసాగిం చాంటే దేశంలోని మారుమూ గ్రామాకు విస్తరించాని ఉద్యమనేతు భావించారు. పం జాబ్‌,హర్యానా,రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌,బీహార్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని గ్రామీణప్రాంతాల్లో గ్రామీణ సమ్మేళనాు పెద్ద ఎత్తున నిర్వహించారు. మహా రాష్ట్రనుండి,కర్ణాటక నుండి రైతు యాత్రు సాగుతు న్నాయి. తాజాగా గుజరాత్‌లోనూ ఈ సమ్మేళనాు మొదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి రైతుఉద్యమ వేదికు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్త ప్రచారానికి పూనుకున్నాయి. తమిళ నాడు,కేరళ ఎన్నికలో రైతు ఉద్యమం ఒక ప్రధాన ప్రచారాంశం అయింది.
బపడుతున్న కార్మిక – కర్షక ఐక్యత
ఒకవైపు పోరాటంలో నిమగమైఉన్నా రైతు ఉద్యమ కాయి దేశంలో జరుగుతున్న కార్మికు, ఉద్యోగు పోరాటాకు తాము కూడాతోడు నివాని భావిం చారు. మార్చి 15న ప్రైవేటీకరణ వ్యతిరేక దినాన్ని పాటించాన్న కేంద్ర కార్మిక సంఘా పిుపుకు రైతు ఉద్యమం మద్దతు ప్రకటించింది. ఆ రోజున దేశ వ్యాప్తంగా రైతాంగం,కార్మికు ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు,వ్యవసాయం కార్పొరే టీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాు నిర్వహించారు. పెట్రో ధర పెరుగుదను కూడా వారు నిరసిం చారు.మార్చి15,16తేదీల్లో జరిగిన బ్యాంకు ఉద్యోగు సమ్మెకు,17న జరిగిన సాధారణ బీమా ఉద్యోగు సమ్మెకు,18న జరిగిన జీవిత బీమా ఉద్యోగు సమ్మెకు రైతు ఉద్యమం సంఫీుభావం తెలిపింది. ఉమ్మడిగా రాబోయే కాంలోనూ ఉద్యమాు చేపట్టాన్న నిర్ణయానికి కార్మిక, కర్షక ఉద్యమ నేతు వచ్చారు.
ధర్మ యుద్ధం – ప్రజందరి పోరాటం
ఇప్పుడు రైతు పోరాడుతున్నది కేవం ఆ న్ల వ్యవసాయ చట్టా రద్దు కోసం మాత్రమే కాదు. వాళ్ళు దేశంలో విపరీతంగా పెరిగిపోయిన సం పద అసమానత మీద పోరాడుతున్నారు. రాజకీ యాలో ప్రజ మధ్య చీలికు తెచ్చే శక్తుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రైతాంగఆత్మ హత్య మీద, ఆదాయాల్లో ఉన్న అసమానత మీద,కార్పొరేట్ల గుత్తాధిపత్యం మీద…వాళ్ళిప్పుడు పోరాడుతున్నారు. వ్యవసాయంలో స్త్రీు పోషించే పాత్రకు తగిన గుర్తింపు కోసం పోరాడుతున్నారు. సమాజం లోని అన్ని తరగతు ప్రజ సమస్యపై వారు పోరాడుతున్నారు. ఇదొక ధర్మయుద్ధం అని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతు ప్రకటించారు. ఖాప్‌ పంచాయితీు కావు..
కులా వారీగా ప్రజలో వేలాది సంవత్సరాుగా ఉన్న చీలికను ముందుకు తెచ్చి రైతు ఉద్యమాన్ని చీలికు,పేలికు చేయాని బిజెపి పన్నిన కుట్రను రైతు గ్రహించారు. ఒకచోట అది కేవం‘జాట్‌’ఉద్యమంగా ఉందని, ఇంకొక చోట ‘షెకావత్‌’ ఉద్యమమే తప్ప ఇంకె వరూ లేరని,మరోచోట ఇది కేవం ‘మీనా’ ఉద్యమమేనని-ఇలా బిజెపి నాయకు తప్పుడు ప్రచారం చేశారు. మొదట్లో ఖాప్‌ పంచాయితీ ద్వారా రైతును కదిలించే ప్రయత్నాు జరిగా యి. కాని కేవం ఒక కులానికి చెందిన వారిని మాత్రమే కదిలించడంతో విజయం రాదని, అన్ని కులా వారిని కలిపే సమీకరణు అవసరమని రైతు నేతు గుర్తించారు. అందుకే ఇప్పుడు ప్రతీ చోటా మహా పంచాయితీు నిర్వహిస్తున్నారు. వాటి లోఅన్ని కులావారినీ కదిలించి ఐక్యపరుస్తున్నారు. హిందూ-ముస్లిం-క్రైస్తవ-సిఖ్‌ ఐక్యతను ప్రబోధి స్తున్నారు. దళితును సాదరంగా స్వాగతిస్తున్నారు. అన్ని తరగతు శ్రామిక ప్రజనూ సమీకరించే ‘’కిసాన్‌-మజ్దూర్‌ ఏక్తా జిందాబాద్‌’’నినాదం ఇప్పు డు ఉద్యమ నినాదంగా మారింది. ‘’మోడీ ప్రభుత్వం పెట్టిన బారికేడ్లను తొగించి ఢల్లీి నిరసనను కొనసాగిస్తున్నాం, నీటి ఫిరంగును, బాష్పవాయు గోళాను తిప్పికొట్టాం. అలాగే ఇప్పుడు మన మధ్య ఐక్యతకు అడ్డుగోడల్లా ఉన్న కు, మత విభేదానూ తొగిద్దాం.’’అని కిసాన్‌ నేతు పిుపిచ్చారు. ‘’దళి తు ఇళ్ళల్లో ఛోటూరామ్‌ ఫోటోు పెట్టండి. అగ్రవర్ణా వారి ఇళ్ళల్లో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఫోటోు పెట్టండి.’’ అని నేతు విజ్ఞప్తి చేశారు. హిందువుకు, ముస్లింకు మధ్య మత విభేదా చిచ్చురగిల్చి గత రెండు తడవ ఎన్నికలో బ్ధి పొందిన బిజెపి నేతకు ఇప్పుడు వారివారి నియో జక వర్గాలోనే బహిష్కరణు, నిరసను ఎదురవుతున్నాయి. ముజఫర్‌నగర్‌ నుంచి ఎం.పిగా ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి కూడా చేపట్టిన సంజీవ్‌ బ్యాన్‌ తన నియోజకవర్గ రైతును ‘’చైత న్యవంతుల్ని’’ చేద్దామని వెళ్ళి వారి నిరసన వేడికి తట్టుకోలేక వెనుదిరగవసి వచ్చింది. అక్కడ గతం లో పరస్పరం వైరంతో వ్యవహరించిన హిందు వు, ముస్లిరు ఇప్పుడు ఐక్యమై మంత్రిని వెళ్ళ గొట్టారు. తన కు,మత విద్వేష రాజకీయాతో రైతు ఉద్యమంలో చీలికు సృష్టించాని బిజెపి చేసిన, చేస్తున్న కుట్రను సమైక్య రైతు ఉద్యమం విజయవంతంగా తిప్పికొడుతోంది.
వెల్లివిరుస్తున్న సౌహార్ద్రత
తన పొంలో వేసిన చెరుకు పంట కోతకు రావ డంతో….పోరాట కేంద్రం నుండి వెనక్కి వెళ్ళి కోతు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు రాజన్‌ జావలా అనే రైతు. అతను ఆచెరుకునంతా పోరా ట కేంద్రానికి తీసుకువచ్చి అక్కడ ఉన్నవారందరికీ చెరుకురసం సరఫరా చేస్తున్నాడు. ఆవిధంగా చేస్తున్నవారింకా చాలామంది ఉన్నారని అతడు తెలిపాడు. ఇంటింటికీ తిరిగి పాు సేకరించి పోరాట కేంద్రాకు తెచ్చి అక్కడ ఉద్యమకారుకు టీ కాచి ఇస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక గ్రామాల్లో ఉండిపోయినవారు ఉద్యమ కేంద్రావద్ద ఉన్నవారి పొలాల్లో కోతకు, నాట్లకు సహకరిస్తున్నారు. రాజస్థాన్‌-హర్యానా సరిహద్దులో భరత్‌పూర్‌ వద్ద మహా పంచాయితీ జరపడానికి 25,000 మంది పట్టే స్థం అవసర మైంది. ఏపుగా ఎదిగిన గోధుమ పంట ఉన్నా, ఆ పొలాను సభ కోసం చదును చేసి స్వచ్ఛందం గా ఇవ్వడానికి రైతు ముందుకొచ్చారు. ‘వ్యవ సాయ పనుూ ఆగవు, ఉద్యమమూ ఆగదు’ అంటున్నారు రైతు.
నిర్బంధాకు భయపడేది లేదు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాు రైతు ఉద్యమకారుపై కేసు పెడుతున్నాయి. ఇప్పటికి 100 మందికి పైగా జైళ్ళలో ఉన్నారు. రైతు నాయకు పైనే 35 కేసు ఇప్పటి వరకూ బనాయించారు. శాంతియుతంగాఆందోళన సాగితే అందుకెటువంటి అభ్యంతరమూ ఉండబోదని సుప్రీం కోర్టు మొదట్లోనే స్పష్టం చేసింది. కాని రాష్ట్ర ప్రభుత్వాు అందుకు విరుద్ధంగా నిర్బంధానికి పూనుకుంటున్నాయి. అయితే ‘ఈ నిర్బంధాు మా ఉద్యమాన్ని ఎంతమాత్రమూ నిరోధించలేవు’ అని రైతు ఉద్యమకాయి ప్రకటిస్తున్నారు.
ఉద్యమానికి బాసటగా ప్రత్యామ్నాయ మీడియా
ప్రింట్‌ మీడియాతో సహా ప్రధాన స్రవంతి మీడియా రైతు ఉద్యమ వార్తకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రభుత్వ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత భిస్తోంది. అయితే, ఒకకొత్త తరం యువ జర్నలి స్టు ముందుకొచ్చారు. నిరసన వార్తను, నాయ కు ప్రసంగాను, ఇంట ర్వ్యూను చిన్న చిన్న వీడియోుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఇంటర్నెట్‌లో వాటికి విశేష ప్రాచు ర్యం భిస్తోంది. వాటిని చూసేవారు, లైక్‌ చేసేవారు క్షల్లో ఉన్నారు. ఆన్‌లైన్‌ న్యూస్‌ మీడియా కూడా రైతు ఉద్యమాన్ని బాగా ప్రచారం చేస్తోంది. నేడు భారతదేశ రైతాంగ ఉద్యమం అంతర్జాతీయంగా ప్రచారం పొందింది. బ్రిటన్‌లో క్ష మంది పౌరు ు పాల్గొన్న సంతకా ఉద్యమం కలిగించిన ఒత్తిడి తో బ్రిటన్‌ పార్లమెంటు ఒకరోజు భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమం మీద చర్చించింది. చర్చలో పాల్గొన్న ఎంపీందరూ మోడీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అమెరికా,కెనడా,ఫ్రాన్స్‌ తది తర దేశాలో మన రైతు ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది.
‘’నా ఆఖరి కోర్కెను తీర్చండి’’
48 ఏళ్ళ రాజ్‌బీర్‌సింగ్‌ హర్యానాలోని హిస్సార్‌ కు చెందినరైతు. తన రెండెకరా పొంలో వరి, గోధుమ పండిస్తాడు. భార్య,ఇద్దరు ప్లిు ఉన్నారు. వందరోజులైనా మోడీ ప్రభుత్వం రైతు డిమాం డ్లను అంగీకరించకపోవడంతో నిరాశ చెంది ఆ రోజునే ఉరి వేసుకుని చనిపోయాడు. తన సూసైడ్‌ నోట్‌లో‘’చనిపోతున్ననా ఆఖరి కోర్కెను నెరవేర్చండి. ఆ మూడు వ్యవసాయ చట్టానూ రద్దు చేయండి’’ అని రాశాడు.ఢల్లీి సరిహద్దుల్లో ఆత్మహత్యకు ప్పా డిన ఎనిమిదో రైతు రాజ్‌బీర్‌. ఇప్పటివరకూ ఈ ఉద్యమంలో280 మంది రైతు అమరుయ్యారు.
దేశం కోసం పోరాడాను..ఇదా నాకిచ్చే బహు మానం?
82ఏళ్ళ గురుముఖ్‌సింగ్‌ పంజాబ్‌ లోని ఫతేపూర్‌ సాహిబ్‌ గ్రామానికి చెందిన రైతు. 22 సంవత్స రాు ఆర్మీలో ఉన్నాడు. 1962 ఇండో-చైనా యుద్ధంలో,1965 ఇండో-పాకిస్థాన్‌ యుద్ధంలో, 1971 బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలో పాల్గొన్నాడు. 1984లో పదవీ విరమణ చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. మొన్న జనవరి 26న ఢల్లీి వద్ద జరిగిన అ్లర్లతో ఎటువంటి సంబంధమూ లేక పోయినా (నిజానికి ఆఅ్లర్లు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగం) గురుముఖ్‌సింగ్‌ను నిర్బం ధించి 16రోజు జైులో ఉంచారు. ప్రస్తుతం బెయిల్‌ మీద విడుద అయ్యాడు. కాని ఆ తప్పుడు కేసు ఇంకా ఉంది. ‘’నేను దేశంకోసం మూడు యుద్ధాల్లో పోరాడాను. నాకు ఆర్మీలో ఎంతో గౌర వం ఇచ్చారు. నాకు10 పతకాు వచ్చాయి. కాని ఇప్పుడు మోడీప్రభుత్వం నన్ను ఉగ్రవాది నంటోంది. నా జీవితపు చివరి రోజుల్లో ఇదేనా నాకు దక్కింది? ఈ అవమానాన్ని నేనెలా భరించ గను?’’ అని గురుముఖ్‌ వాపోతున్నాడు. అతడి ప్రశ్నకు మోడీ-షా వద్ద సమాధానం ఉందా?
ఎన్నికలో ఓడిరచి బుద్ధి చెప్పండి – నేత పిుపు
అయిదు రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికు జరగనున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా నేతు ఆ రాష్ట్రాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌,అసోంరాష్ట్రా పర్యటన పూర్త యింది. ఆరాష్ట్రాలో బిజెపిని ఓడిరచి బుద్ధి చెప్పా ని రైతుకు, ప్రజకు ఉద్బోధిస్తున్నారు.
భద్రతా దళాు మోహరించే ఉన్నాయి
జనవరి26న రైతు ట్రాక్టర్‌ ర్యాలీ, ఘర్షణ తరువాత సింఘు, టిక్రీ సరిహద్దు దగ్గర భారీగా భద్రతా దళాను మోహరించారు. ఇప్పుడు ఈరెండు బోర్డర్లకూ వెళ్లడం అంత సుభం కాదు. ఎక్కడికక్కడ పోలీసు, పారా మిటరీ దళాు కాపలా కాస్తున్నారు. భద్రతా దళాకు, రైతుకు మధ్య పెద్ద పెద్దరాళ్లు,ముళ్లకంపు పెట్టారు. సింఘు సరిహద్దుకు వెళ్లే వాహనాను గురు తేజ్‌ బహదూర్‌ స్మారకస్థలానికి రెండుకిలోమీటర్ల ముందే పోలీసు ఆపేస్తారు. అక్కడినుంచీ నడుచు కుంటూ రైతు ఉన్న చోటికి వెళ్లాలి.
వేసవి సన్నాహాు
దిల్లీలో ఎండు పెరుగుతున్నాయి. ఉదయం11గంటు దాటాక ఎండ తీవ్రమవు తోంది. వేసవిలో ఉద్యమం ఎలా కొనసాగిస్తారని వారిని అడిగాం. ‘‘వెదురు గడ్డితో పైకప్పు వేసు కుంటాం. అది కొంత చ్లగా ఉంటుంది. ఫ్లాన్లు, కూర్లు అవసరమైతే ఏసీు కూడా ఏర్పాటు చేస్తాం’’ అని రైతు చెప్పారు. ఇప్పటికే కొన్ని గుడారాల్లో ఏసీు, కూర్లు అమర్చారు. ‘‘వేసవి లోనే రైతు పంటు పండిస్తారు. ఎండల్లోనే పోలాల్లో పని చేస్తాం. ఈ వేడి మమ్మల్నేం చేస్తుం ది?’’ అని హర్దీప్‌ అన్నారు. ఆపక్కనే మంజీత్‌ సింగ్‌ అనే రైతు కొందరు కార్మికు సహాయంతో వెదురు,గడ్డి,తాటాకుతో పైకప్పు సిద్ధం చేయిస్తు న్నారు.‘‘శీతాకాలాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు వేసవికి సిద్ధపడుతున్నాం. ఈ పైకప్పుపై టర్పాలిన్‌ వేస్తాం. వర్షాలొచ్చినా నీరు కారకుండా ఉంటుంది. వీటిని తయారు చేయడానికి సుమారురూ.25మే ఖర్చవు తుంది. అందుకే మేము మూడు గ్రామాకు కలిపి ఒక టెంట్‌ వెయ్యాని నిర్ణయించుకున్నాం. అందరూ తలా ఒకచెయ్యి వేస్తున్నారు. ఈ టెంట్‌లో కూర్లూ, ఏసీు కూడా పెడతాం’’అని మంజీత్‌ సింగ్‌ తెలిపారు.‘‘ఉద్యమం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ప్రభుత్వం మొండి వైఖరి అవంబిస్తోంది. మా ఏర్పాట్లు మేము చేసుకోవసిందే. దీన్ని ఎంత కామైనా కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.
ఇప్పుడు ఉద్యమ ప్రాంతం ఎలా కనిపిస్తోంది?
సింఘు,టిక్రీ సరిహద్దు దగ్గర ఉద్యమం జరుగుతున్న ప్రదేశంలో ఒకనగరం రూపు దిద్దు కుంటున్నట్లుతోస్తోంది. అక్కడ చిన్నచిన్న వ్యాపా రాు మొదయ్యాయి. టీ షర్టు, షూస్‌, చెప్పు, దుప్పట్లు, చెరకు రసం,తినుబండారాు అన్నీ అమ్ము తున్నారు. ఏసీు కూర్లతో పాటూ గుడారాల్లో టీమీ కూడా వచ్చాయి. ఉదయంపూట అక్క డంతా హడావుడిగా కనిపిస్తుంది. మధ్యాహ్నానికి జనం తగ్గుతారు. మళ్లీ సాయంత్రం కాస్త చ్ల బడ్డాక గుంపు గుంపుగా జనం కనిపిస్తున్నారు. ఎండవేళల్లో అందరూ తమతమ గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సాయంత్రం సభు, చర్చల్లో పాల్గొంటున్నారు.
మూడు నెల్లో రైతు జీవితం ఎంత మారింది?
రైతు ఎక్కడ ఉన్నా ఏదో ఒకటి పండి స్తూ ఉంటారనడానికి ఉదాహరణగా సింఘు,టిక్రీ సరిహద్దు దగ్గర తమ గుడారా ముందు పూ మొక్కు వేశారు. ఖాళీస్థలాల్లో కూరగాయు పండిరచడం ప్రారంభించారు. ‘‘ఇప్పుడు మేము ఉత్తి చేతుతో మా ఊర్లకు తిరిగి వెళ్లలేం. ఇది మా గౌరవానికి సంబంధించిన విషయంగా మారి పోయింది. ఖాళీ చేతుతో వెనక్కి వెళితే మమ్మల్ని ఎగతాళి చేస్తారు. అదిచిన్న విషయమేం కాదు’’ అని సేవాసింగ్‌ తెలిపారు.30ఏళ్ల సేవాసింగ్‌ గత మూడు నెలుగా సింఘు బోర్డర్‌ దగ్గరేఉంటు న్నారు.‘‘ఇప్పుడు మా గ్రామంలో నన్ను అంద రూ దిల్లీవాసి అంటున్నారు’’ అని సేవా సింగ్‌ చెప్పారు. ఫ్రిజ్‌,వాషింగ్‌ మిషన్‌,కూర్లతో పాటు భద్రత కోసం సీసీటీవీ కెమేరాను కూడా గుడా రాల్లో అమర్చినట్లు సేవా సింగ్‌ తెలిపారు. పంజాబ్‌ నుంచి వచ్చిన గుర్‌సేవక్‌ సింగ్‌ టిక్రీ బోర్డర్లో ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కిసాన్‌-హవేలీగా మార్చేశారు. అక్కడ పార్క్‌, ఆట స్థం, రాత్రుళ్లు పడుకునేందుకు గుడారాు ఏర్పాటు చేశారు. ‘‘ఏ ఉద్యమంలో అయితే మూడు తరా వారు (ప్లిు, మధ్య వయస్కు, వృద్ధు) పాల్గొంటారో ఆ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం మా డిమాండ్లకు త ఒగ్గాల్సిందే’’ అని గుర్‌సేవక్‌ సింగ్‌ అన్నారు
రైతు తదుపరి వ్యూహం ఏమిటి?
రైతు ఉద్యమానికి సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా నాయకత్వం వహిస్తోంది. ఇందులో వివిధ రైతు సంఘాు భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్‌లో జరగబోయే ఎన్నికను దృష్టిలో ఉంచుకుని కొందరు రైతు నాయకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
‘‘బీజేపీకి ఓటు వేయకండి’’ అని భారతీయ కిసాన్‌ సంఫ్‌ు (రాజేవాల్‌) అధ్యక్షుడు బల్వీర్‌ సింగ్‌ రాజేవాల్‌ అన్నారు. ఈ పార్టీ కార్పొరేట్ల పక్షం వహిస్తుంది. ఈ దేశాన్ని కాపాడాంటే బీజేపీని అధికారం నుంచి కిందకు దించాలి అని వారు అంటున్నారు. రైతు ఉద్యమం చూసి ప్రభుత్వం భయపడుతోందని, మూడు చట్టాను ఉపసం హరించుకోక తప్పదని రాజేవాల్‌ అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్‌ ఎన్నికు ఉద్యమంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ, మేము దాన్ని పట్టించుకోం’’ అని రైతు నాయకుడు డాక్టర్‌ దర్శన్‌ పాల్‌ చెప్పారు.
భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహాన్‌) అధ్యక్షుడు జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ మాట్లాడుతూ..‘‘100 రోజు రైతు ఉద్యమంలో మేం చాలానే సాధిం చాం. చట్టాను వాయిదా వేయడం గురించి ప్రభు త్వం మాట్లాడుతోందంటే అదిరైతు ఉద్యమం సాధించిన విజయమే’’ అని అన్నారు. ప్రభుత్వంతో అధికారిక చర్చు ముగిసినప్పటికీ, అనధికారిక చర్చు జరుగుతూనే ఉన్నాయని, మూడు చట్టాను రద్దు చేసిన తరువాత మాత్రమే రైతు ఇంటికి తిరిగి వెళతారని ఉగ్రహాన్‌ స్పష్టం చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక ప్రచారానికి సంబంధించి ఉగ్రహాన్‌ సుముఖత చూపలేదు. ‘‘ఎవరు, ఎవరికి ఓటు వెయ్యాలి అనేది మా సంస్థు చెప్పకూడదు. మేము ఓటు రాజకీయాకు దూరంగా ఉంటాం. ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని ఇక్కడినుంచీ బవంతంగా వెళ్లగొట్టొచ్చు. కానీ, అదే జరిగితే పరిణామాు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఉద్యమం 2024 వరకూ కొనసాగవచ్చు’’ అని ఉగ్రహాన్‌ తెలిపారు. మరొక రైతు నాయకుడు గుర్నాం సింగ్‌ చఢూనీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతవరకు ఈ ఉద్యమం కొనసాగితే 2024 ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ‘‘మాకు భూమి పోతే ఆకలితో చనిపోతాం. చనిపోవాల్సి వస్తే ఆందోళనల్లోనే చనిపోతాం’’ అని గుర్నాం సింగ్‌ అన్నారు.
విశ్లేషకు ఏమంటున్నారు?
‘‘రైతు ఖాళీ చేతుతో వెనక్కి వెళ్లాన్నదే ప్రభుత్వం క్ష్యం. కానీ, సమాజంలోని వివిధ వర్గా నుంచీ వారి ఉద్యమానికి భిస్తున్న మద్దతు చూస్తే ప్రభుత్వం కోరిక నెరవేరేలా లేదు’’ అని పంజాబ్‌ విశ్వవిద్యాయం రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్‌ ఖలీద్‌ మొహమ్మద్‌ అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయమై అంతర్జాతీయంగా కూడా ప్రభుత్వంపై విమర్శు వస్తున్నాయి. బ్రిటిష్‌ పార్లమెంట్‌, ఐక్యరాజ్య సమితి మానవ హక్కు కమిషన్‌ వరకూ ఉద్యమం గొంతు చేరుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది అనడానికి ఇది ఒక సూచన’’ అని ఆయన అన్నారు.
బీజేపీలో కూడా అంతర్గతంగా ఈ ఉద్యమం గురించి గొంతు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతుఉద్యమంపై త్వరలోనే ఒక నిర్ణయానికి రావసి ఉంటుందని విశ్లేషకు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక ఫలితాు రైతుఉద్యమ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉందని పంజాబ్‌ విశ్వవిద్యాయం ప్రొఫెసర్‌ హర్జేశ్వర్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, రైతు ఉత్తి చేతుతో వెనక్కి వెళ్లే అవకా శమే లేదని, మూడు చట్టాు, ఎంఎస్‌పీకి చట్ట పరమైన హామీ ఎలా ఇవ్వాన్నది నిర్ణయించు కోవాల్సినది ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
( వ్యాసకర్త : సీనియర్‌ పాత్రీకేయు) -కార్తికేయ

ఎవ‌రి క‌న్న బిడ్డ‌రా..ఎక్కి ఎక్కి ఏడ్చింది!

ఇట్లొచ్చిండ్రు, అట్ల బొయిండ్రు.. రెండొందలు సంపాదించిండ్రు.. ‘కూలోన్ని మేపేటందుకే ఉంది ఈ పథకం. కూలోడు ఒక్కడన్నా మాట ఇంటుండా! మన చుట్టూ కూలోడు తిరగుతలేడు! మనమే కూలోడి చుట్టూ తిరుగుతున్నం!’ ‘అసలెందుకు ఈ చట్టం? పీకి పారెయ్యక!’ పాపం! తమ కష్టాల‌కీ, నష్టాల‌కీ అసు కారకులెవరో తొసుకోలేని రైతు సోదయి గ్రామీణ ధనిక వర్గానికి తోడై వెళ్ళగక్కే ఆక్రోశాలు ఇవి. ‘’ఎక్కడ గిట్టుబాటవుతుందండీ కూలి! ఎండా కాం టాంకర్లలో నీళ్ళు తీసుకుపోయి తడిపితేగాని గడ్డపార దిగడం లేదు. ఊరికి ఆమడ దూరంలో చెరువులోకి నడిచిపోయేసరికి సగం ఓపిక సచ్చిపోద్ది. ఇంకోపని దొరక్క కరువు పనిలో కుదురుకున్నాం.’’ ఇదీ కూలీ ఘోష. ఏది వాస్తవం! ఏది అపవాదు! మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం… అనేక పోరాటా తరువాత ఈ చట్టం మెగు చూసింది. ‘పనైనా చూపాలి! తిండైనా పెట్టాలి!’ ఈ నినాదం ఎన్ని సభు, సమావేశాల్లో మరెన్ని ప్రదర్శనల్లో మార్మోగిందో లెక్కించలేం.. ఈ పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణ ఫలితమే ఈ ఉపాధి హామీ చట్టం. ఇదేదో యూపీఏ ప్రభుత్వం అప్పనంగా చేతిలో పెట్టిన పథకం అనుకుంటే పొరపాటే. అయితే గడచిన కాంలో పథకం అము ఎలా ఉంది. చూద్దాం…
‘కరువు పనలు’ అని జనం నోళ్ళలో నానే ‘ఉపాధి పనలు’ మండు వేసవిలోనే జరుగుతాయి. ఉన్న మారాజు ఏసీలు, కూల‌ర్లు, అధమం ఫ్యాను పెట్టుకొని సేద తీరే రోజుల్లో… గ్రామీణ శ్రామికులు పని కోసం వెంపర్లాడుతూ… పుగు, పారా, తట్ట చేత పట్టుకొని, దాహార్తికి ప్లాస్టిక్‌ డబ్బాల్లో నీళ్ళు పట్టుకొని బయల్దేరతారు. అదే ఆడవాళ్ళయితే ఉదయాన్నే ఇంటెడు చాకిరీ చేసుకొని ఊరికి ఆమడ దూరంలో ఉన్న చెరువు, కుంటు, క్వాల్లో మట్టి తవ్వి కట్టు పోయడానికి బయల్దేరతారు.


ఈ కార్మికలు ప్రధాన సమస్య వేతనం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రెండు తొగు రాష్ట్ర ప్రభుత్వాు ఉపాధి హామీ పనుకు రూ.237గా రోజు వేతనం నిర్ణయించాయి. అది కూడా 8గంటు పని దినం, ఎండాకాం అత్యధిక కేరీు, ఒంట్లో శక్తి ఖర్చయ్యే శారీరక శ్రమకు ఇవే ప్రభుత్వాు వ్యవసాయ కార్మికు వేతనాు నిర్ణయించేటప్పుడు దుక్కి దున్నడానికి 5గంటు పని దినంగాను, ఇతర వ్యవసాయ పనుకు 6గంటు పని దినంగాను నిర్ణయించాయి. గతంలో మహిళా కార్మికు నాట్లు, కోత పనుకు ఉదయం 9-10 గంట మధ్య పోయి సాయంత్రం 5గంటకు తిరిగి వచ్చేవారు. శారీరక శ్రమతో కూడిన కరువు పను చేసి బతకడం తప్ప వేరే మార్గంలేని గ్రామీణ పేద ఆరోగ్య పరిస్థితి, దేహదారుఢ్యం, ఒంట్లో సత్తువ ఇవి ఏ కొంచెమైనా అధినేత, అధికార్ల మెదళ్ళలో ఉన్నాయో లేదో తెలియదు. ఉపాధి పనుకు 8గంటు పనిదినం నిర్ణయించేశారు. నిర్ణయం చేసే ముందు ఏ ఒక్క అధికారి, అధినేత అయినా శ్రామికుడు, శ్రామికురాలితో చర్చించారా! అది జరగని పని కదా! అసు చర్చించాని అనుకోవడమే మన వెర్రిబాగుతనమేమో! ఓట్ల కోసం జనం దగ్గరికి పోయే నాయకు, జనానికి సంబంధించిన నిర్ణయాు చేసేటప్పుడు ఎందుకు జనం దగ్గరికి పోరో?
రోజు వేతనం మరీ అన్యాయంగా నిర్ణయించారు. నైపుణ్యంలేని కార్మికుకు జిల్లా కలెక్టరు రోజు వేతనం నిర్ణయిస్తారు. ఆ లెక్కన విశాఖపట్నంజిల్లాలో రూ.439 నిర్ణయించారు. ప్రతి జిల్లాలో అలాగే ఉంటుంది. కానీ ఉపాధి పథకం కార్మికుకు రెండు తొగు రాష్ట్రాల్లో రూ.237 నిర్ణయించారు. ఇదేనా పేదను ఉద్ధరించే తీరు. ఈ పథకం ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనయి, నీటి వనయి పెరిగాయని అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కూడా. చెరువు, పశువు కుంటు, పంట కాుమ, చెక్‌ డ్యామ్‌ు, పొలా మధ్య బోదు, మురుగు క్వాల్లో పూడికతీత వంటి పను వ్ల నీటి వనయి పెరుగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో ట్రెంచీు తవ్వి నీటి వనరు భ్యత పెంచుతున్నారు. సామాజిక అడవు పెంపకం ఒక ముఖ్యమైన పని. తెంగాణ, రాయసీమ జిల్లాల్లో రైతు పొలాల్లో కంప చెట్లు కొట్టి మొదళ్ళతో సహా తవ్వి పారేస్తున్నారు. పడావుగా ఉన్న రైతు భూము సాగులోకి వచ్చి పత్తి వంటి వ్యాపార పంటు పండిస్తున్నారు. రైతు భూము మివ పెరిగింది. ఎంత చేసినా ఉపాధి పథకానికి కేటాయించిన డబ్బు ‘పే పిండి చందమే’. ప్రజాధనం వధా చెయ్యడమే అని గగ్గోు ఎందుకు? కుక్కని చంపాంటే అది పిచ్చిదని ముద్ర వెయ్యాలి. కాబట్టి జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన వేతనం రూ.439 కన్నా దిగ్గోసి అందులో దాదాపు సగం వేతనం రూ.237 నిర్ణయించి, ఇక చాల్లే! నోరుమూసుకుని పని చెయ్యండి అన్న సంకేతాలి స్తున్నారు. పోనీ అదయినా అమవుతోందా! చూద్దాం!
డి.వెంకటక్ష్మి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి గ్రామవాసి. ఆమె పేస్లిప్పు ప్రకారం 6రోజు పని చేసింది. ఆరు రోజుకు రూ.428 వేతనం ఇచ్చారు. పేస్లిప్పులో ‘పని చేసిన దినము -6’ అని… మర కింద…’ పని దినము -2’ అని రాశారు. పని చేసిన దినము అంటే ఏంటి? పని దినము అంటే ఏంటి? అధికార్లనడిగితే వచ్చిన జవాబు ఏమంటే ‘’క్యూబిక్‌ మీటరుకు రూ.237 ఇస్తాం. క్యూబిక్‌ మీటరు ఒక్క రోజులో తవ్వుతారా…10 రోజుల్లో తవ్వుతారా అనేది కూలీ ఇష్టం. మీరు ఎన్ని రోజు పని చేసినా క్యూబిక్‌ మీటరు రూ.237 లెక్కన మాత్రమే ఇస్తాం. అంటే ఒక క్యూబిక్‌ మీటరు తవ్వకానికి మూడు రోజు శ్రమ అవసరమయితే, ఈ మూడు రోజుకు కలిపి రూ.237 మాత్రమే ఇస్తాం’’ ఇది అధికార్ల జవాబు. మరి ఆ లెక్కన రోజుకు రూ.80 కూడా గిట్టుబాటు కాదు కదా! అన్న మన ప్రశ్నకు మనమే జవాబు చెప్పుకోవాలి. అది అధికార్లకు, ప్రభుత్వానికి సంబంధంలేని వ్యవహారం అని మనం అనుకోవాలి. మర వెంకటక్ష్మి విషయానికి వద్దాం. ఆమె ‘పేస్లిప్పు’ ప్రకారం 6రోజు పనికి రూ.428 ఇచ్చారు. ఆదివారం శెవుదినంతో కుపుకుంటే 7రోజు పనికి గాను రూ.428. ఒక్క రోజు పనికి అక్షరాలా రూ.61.14 పైసు. బోధపడిరది కదా! రోజుకు రూ.60, రూ.70 కూలి పడుతోందని ఉపాధి కార్మికు మొత్తుకోడానికి గ కారణాలివి.
ఇప్పటి ప్రభుత్వం వారి లెక్కకే వద్దాం. వెంకటక్ష్మికి పని చేసిన దినము ‘6’ అయినా క్యూబిక్‌ మీటర్ల లెక్కన పని దినము ‘2’ అని లెక్కగట్టి రూ.428 చేతిలో పెట్టారు. అంటే ప్రభుత్వం వారి లెక్కన రూ.214 రోజు వేతనం చెల్లించారు. మరి ప్రకటించిన రూ.237 కూడ ఎందుకు ఇవ్వలేదు? మరో ఉదాహరణ. తోక క్ష్మి జాబ్‌ కార్డు ప్రకారం 45రోజు పని చేసిన దినాకు మొత్తం రూ.6,918 వేతనం ముట్టింది. 45రోజుతో భాగిస్తే రోజు కూలి రూ.153.73 పైసు. తోక భాస్కర్‌ జాబ్‌ కార్డ్‌ ప్రకారం 34రోజు పనికి రూ.5,149 ముట్టింది. అంటే ఒక్క రోజు వేతనం రూ.151.44 పైసు. ఇక్కడ ఆదివారం వేతనంలో కూడిన సెవు దినంగా ప్రకటించి లెక్కిస్తే వేతనం ఇంకా తగ్గిపోతుంది. తెంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌ ప్రకారమే ప్రభుత్వం చెల్లించిన వేతనం రూ.169.30
ఇప్పుడాలోచించి చెప్పండి ? ఇట్టెల్లి, అట్టొచ్చి రూ.200 తెచ్చుకునేది నిజమా? గ్రామీణ పేద పట్ల ఎందుకీ అపవాదు. ఎందుకీ కక్ష. సోషల్‌ ఆడిట్టు మరో ‘సిత్రం’. చెరువు, కుంటు వగైరా మట్టి పని చేసిన సంవత్సరానికి గాని సోషల్‌ ఆడిట్‌ బందం పరిశీలించదు. ఫలితంగా రెండు నష్టాు ఉన్నాయి. వేసవిలో తవ్వకం పని పూర్తయితే జూలై నుంచి పడే వర్షా వ్ల వర్షపు నీళ్ళకు కొట్టుకు వచ్చిన మట్టి చేరుతుంది కదా! మరి చేసిన పను అంచనా ఎలా కడతారు? కాబట్టి టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తాము ఎక్కడ సోషల్‌ ఆడిట్‌ అధికార్ల ఆగ్రహాకు గురువుతామోనని భావించి ఉపాధి కార్మికుతో అదనంగా పని చేయిస్తారు. కార్మికు శ్రమకు మివలేదు కదా! తిలాపాపం తలా పిడికెడు అంటే ఇదే. రెండవ నష్టం పని దినాు. సోషల్‌ ఆడిట్‌ బృందం ఫ్డీు తనిఖీ చేసే వరకు మరలా ఆ పని చేపట్టడానికి లేదు. గ్రామంలో సరాసరి 45రోజు కన్న ఎక్కువ పని కల్పించలేదు. మిగిలిన 155రోజుకు నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటే అదీ లేదు. పథకం అములో కీకపాత్ర పోషించే మేట్ల వ్యవస్థను తెంగాణ ప్రభుత్వం మొత్తానికే తొక్కిపెట్టింది. మొత్తం కార్మికులో సామాజిక పొందిక చూస్తే…దళితు, గిరిజను 40శాతం, మహిళు 59శాతం ఉన్నారు. అనగా జనాభాలో దళితు, గిరిజను, మహిళ శాతం కన్నా ఉపాధి కార్మికుల్లో వారి సంఖ్య ఎక్కువ ఉంది. సమాజంలో వెనక్కి నెట్టివేయబడ్డ వర్గాలే ఉపాధి కార్మికుల్లో అత్యధికుండగా వారి ఉద్ధరణ పేరుతో అటు ప్రభుత్వం మరోసారి మోసగిస్తోంది. ఇటు సమాజం మరోసారి తన అక్కసు వెళ్ళగక్కుతోంది. గ్రామీణ శ్రామికును సంఘటితం చేసే సంఘాకు కొదవ లేదు. అయినా ఉపాధి హామీ కార్మికు గతి ఇలా ఉంది. కారణం వారు అట్టడుగు భాగంలో ఉండి గొంతు మూగబోయిన గ్రామీణ పేదు కావడమే. ‘’ఎవరుకన్న బిడ్డరా! ఎక్కిఎక్కి ఏడ్చింది’’ అన్నట్టయింది వారి పరిస్థితి.
(వ్యాసకర్త – ఎస్.పుణ్య‌వ‌తి, ‘ఐద్వా’ జాతీయ కోశాధికారి, నవతెంగాణ సౌజన్యంతో)

1 7 8 9 10 11