సాతంత్య్ర దినం..అమరుల త్యాగఫలం

‘‘ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు నేడు స్వేచ్ఛా వాయువులు పీలు స్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకు వచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్య్రం కోసం జరిగిన అనేక ఉద్యమా లనన్నిటినీ కలిపి‘‘భారత స్వాతంత్య్రోద్యమం’’గా చెబుతున్నారు. అనేక సాయుధ పోరా టాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్య్రోద్యమంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్‌, ఇతర వలసపాల కుల పాలనను అంత మొందం చటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయ పక్షాలు ఉద్యమించాయి ’’
16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్‌లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్‌లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్‌ గా ఆవిర్భవించింది. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌, (లాల్‌ బాల్‌ పాల్‌) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకు వచ్చా యి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారత స్వాతంత్ర యోధులు ప్రారంభించిన గదర్‌ పార్టీ సహ కారంతో జరిగిన సంఘటిత భారతసిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు. జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్‌ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల లో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్‌ మహాత్మాగాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటా లను అవలంబించారు. సుభాష్‌ చంద్ర బోస్‌ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్ధిక స్వాతంత్రా నికై పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచయుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధ ృతరూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరుతో భారత జాతీయసైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. మహాత్మా గాంధీ నాయక త్వంలోని 1947 ఆగష్టు 15న భారత దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించింది.1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటివరకూ బ్రిటీష్‌ వారి పాక్షిక పాలలోనే సాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వా మ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్బవింపజేసింది.
స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిన మహిళల స్పూర్తి !
బ్రిటీష్‌ వారి బానిన సంకెళ్లను తెంచి భరత మాత దాస్య విముక్తి కోసం జరిగిన స్వతంత్ర పోరాటంలో ఎందరో మహిళలు స్ఫూర్తిదాయ కంగా పాల్గొన్నారు. ఈ చారిత్రక ఉద్యమంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా అద్భుతమైన సాహసాలను ప్రదర్శించారు. మహిళలు బయటికి రావడమే అరుదైన అలనాటి కాలంలో భరతమాత దాస్య సంకెళ్లను తెంచేందుకు స్వతంత్ర పోరాటటం చేస్తూ ఆఉద్యమానికి ఎందరో మహిళలు ఊపిరిగా నిలిచారు. అలనాటి మహిళలలో ప్రధమ వరసలో నిలిచే మహిళా మణి సరోజినీ నాయుడు తమ ప్రసంగాలతో, పాటలతో నాటకాలతో కవి తలతో ఆమె తనదైన రీతిలో స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని రగిలించారు. దేశమాతకోసం స్వతంత్య్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. భయం అంటే ఏమిటో తెలియని స్వాతంత్య్ర సమరయోధు రాలు దుర్గాభాయి దేశ్‌ ముఖ్‌. మహిళా సాధికారత కోసం పాటుపడిన సామాజిక కార్యకర్తగా ఆమె పేరుపొందారు. ముఖ్యంగా సుభాష్‌ చంద్రభోస్‌ చేసిన స్వాతంత్ర పోరాటంలో ఆయనకు అత్యంత సన్నిహితు రాలిగా మెలిగిన కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ భారత స్వతంత్ర పోరాటంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ తరఫున కదంతొక్కిన వీర వనిత. అభినవ రaాన్సీ లక్ష్మీబాయిగా పేరుతెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్‌ గురించి అనేక నవలలు సినిమాలు కూడ వచ్చాయి. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలోని రaాన్సీరాణి రెజిమెంట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలిమహిళగా లక్ష్మీ సెహగల్‌ చరిత్రలో నిలిచిపోయారు. ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి అర్థాంగి అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన చైతన్యశీలి కస్తూరిబా గాంధీ. మహాత్మా గాంధీతో సమానంగా అంతేకాదు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్భా గాంధీ. ఇక వీరితో పాటు అరుణ అసఫ్‌ అలీ స్వాతంత్రో ద్యమంలో నిర్వహించన పాత్ర గురించి చెప్పుకోవాలి. గాంధీ నమ్మకాన్ని పొంది అనేక ఉద్యమాలకు ఆమె నాయకత్వం వహించారు. అలనాటి హిందూ స్త్రీలతో సమానంగా అనేక మంది ముస్లిం మహిళలు కూడ భారత స్వాతం త్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారిలో అవధ్‌ రాణి బేగం హజరత్‌ను అగ్రగామిగా చెప్పుకుని తీరాలి. అలనాటి ముస్లిం మహిళామణుల త్యామయ పోరాట కూడా చరిత్రకు సంబంధిం చిన సమాచారాన్ని బ్రిటీష్‌ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే ఆనాటి కాలంలో హిందు మహిళలతో సమానంగా ముస్లిం వీరనారీమణుల ఎలాంటి త్యాగాలు చేసారో అర్ధం అవుతుంది. వీరందరితో పాటు వయస్సులో చాల చిన్న అయినా శ్రీమతి ఇందిరాగాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా అలనాటి బ్రిటీష్‌ పోలీసు లాఠీ దెబ్బలను లెక్కచేయకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళా స్పూర్తికి ఆదర్శంగా నిలిచారు. ఈవిధంగా ఎందరో మహిళా మణుల త్యాగ నిరతితో వచ్చిన స్వాతంత్రాన్ని నేడు అనుభవిస్తున్న అనేకమంది చదువుకున్న మహిళలు కూడ అలనాటి స్వాతంత్రోధ్యమంలో పాల్గొన్న అనేకమంది మహిళల పేర్లు కూడా వారికి తెలియదు అన్నది వాస్తవం..
రాణి వేలు నచియార్‌
బ్రిటిష్‌ వారిపై మొదటి పోరాటంగా మనం చెప్పుకునే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే అయిదు దశాబ్దాల ముందే బ్రిటిష్‌ వారిని ధిక్కరించి నిలబడిన ధీర వనితలున్నారు. 1760-1796 మధ్య కాలంలో మొట్ట మొదటగా బ్రిటిష్‌అ ధికారాన్ని ఎదిరించి పోరాడిన మహిళ, బ్రిటిష్‌ వారి నుంచి తమ రాజ్యాన్ని తాము తిరిగి దక్కించుకున్న కొద్ది మంది రాజ్యాధినేతల్లో ఒక యోధురాలిగా ఘనతకెక్కిన మహిళ రాణి వేలు నచియార్‌. తమిళనాడు లోని రామ్‌ నాడ్‌ రాజ్యంలో జనవరి 3, 1730లో మన్నార్‌ సెల్లముత్తు సేతుపతి రాజుకు జన్మించింది వేలు నచియార్‌. ఆమెకు సోదరులెవ్వరూ లేకపోవటం వల్ల రాకుమారుడిలా పెరిగింది. చిన్నతనం నుంచే అనేక రకాల ఆయుధాలను ఉపయోగించటం, గుర్రపు స్వారీ, విలువిద్యతో పాటు అనేక యుద్ధవిద్యల్ని నేటర్చుకుంది. అంతేకాక ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, ఉర్దూ లాంటి అనేక భాషల్లో ధారా ళంగా మాట్లాడగల ప్రావీణ్యం సంపాదిం చింది. వేలు నచియార్‌ భర్త శివగంగై రాజు. వారికి ఒక కూతురు. 1772లో ఆర్కోట్‌ నవాబుతో కలిసి బ్రిటిష్‌ దళాలు శివగంగైను ఆక్రమించటానికి చేసిన కళైయార్‌ కోయిల్‌ యుద్ధంలో వేలు నచియార్‌ భర్తను హత్య చేశారు. విధి లేని పరిస్థితుల్లో వేలు నచియార్‌ తన కూతురుతో కలిసి రాజ్యాన్ని వదలి పారిపోవాల్సి వచ్చింది. శివగంగైకు చెందిన మరుధు సోదరులు, మరికొంత మంది శక్తివం తమైన సన్నిహితుల సాయంతో దిండిగల్‌ లో నివసించింది. ఆ సమయంలో బ్రిటిష్‌ వారిపై పగ తీర్చుకోవాలనే ధృఢ సంకల్పంతో అనేక మందితో కలిసి సంకీర్ణ సేనలు తయారు చేసింది. 1780 లో మైసూర్‌ సుల్తాన్‌ హైదర్‌ అలీ సాయం తీసుకుని, తాను తయారు చేసుకున్న అత్యంత శక్తివంతమైన సైన్యంతో కలిసి శత ృవులపై దాడి చేసింది. అప్పట్లోనే ఆమె సైన్యంలో ప్రాణాలను ఫణంగా పెట్టిన (తమను తాము నూనెతోనో నెయ్యితోనో ముంచుకుని శత ృ ఆయుధాగారంలోకి జొరబడి తమకు తామే నిప్పంటించుకుని ప్రాణాలర్పించే) మానవ బాంబు, కుయిలీ అనే ఆమె ఉండేది. ఆయుద్ధంలో వేలు నచియార్‌ విజయం సాధించి తన రాజ్యాన్ని తాను చేజిక్కించుకుంది. ఆ రోజుల్లోనే ఆమె తన సైన్యంలో ‘‘ఉదయాళ్‌’’ అనే పేరుతో మహిళలు మాత్రమే గల బృందాన్ని తయారుచేసుకుంది. ఇప్పటికీ తమిళనాడులో జనవరి 3న రాణి వేలు నచియార్‌ జన్మదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకుంటారు.31 డిశంబర్‌, 2008 న భారత ప్రభుత్వం ఆమె శాశ్వత గుర్తుగా పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది.
కిట్టూర్‌ చెన్నమ్మ
భారత పార్లమెంటు ఆవరణలో సెప్టెంబర్‌ 11, 2007 లో మన దేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ గారి చేతుల మీదుగా ఒక వీర వనిత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆమె పేరు రాణి చెన్నమ్మ. కర్నాటక రాష్ట్రంలోని కిట్టూర్‌ రాజ్యానికి రాణి. అందుకే ఆమెను కిట్టూర్‌ చెన్నమ్మ అని కూడా అంటారు. మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధుల్లో మొదటిగా చెప్పుకోదగ్గ మహిళ. అప్పటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ ప్రవేశ పెట్టిన ‘‘డాక్ట్రిన్‌ ఆఫ్‌ లాప్స్‌’’ అనే చట్టానికి వ్యతిరేకంగా పోరాడిరది. బ్రిటిష్‌ సైన్యానికి ధీటుగా గొప్ప విప్లవ దళాన్ని తయారు చేసుకుని సారధ్యం వహించిన మహిళ. బ్రిటిష్‌ వారు భారత పాలకులపై బలవంతంగా విధించే అనేక చట్టాలను పాటించలేమని బలంగా వ్యతిరేకించి అనేక పోరాటాలు చేసింది. చివరకు తన విప్లవ దళంతో కలిసి బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. చివరకు జరిగిన యుద్ధంలో ఓడిపోయి వారికి పట్టుబడిరది రాణి చెన్నమ్మ. కానీ, ఆమె చూపిన తెగువ, పట్టు వదలక తిరుగుబాటు చేసిన తీరు తరువాతి తరం స్వాతంత్య్ర సమర యోధులకు ఎనలేని స్ఫూర్తిని అందించింది. రాణి కిట్టూర్‌ చెన్నమ్మ వీరోచిత శౌర్యాన్ని గుర్తు చేసుకుంటూ నేటికీ కర్నాటక రాష్ట్రంలో అక్టోబర్‌ నెలలో బ్రిటిష్‌ వారిపై ఆమె సాధించిన మొదటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘కిట్టూరు ఉత్సవం’’ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటారు. ఆమె ధైర్యాన్ని, విప్లవ దళం సాయంతో పోరాడిన తీరు ఇప్పటికీ స్ఫూర్తిమంతమైన నాటకాలుగా, జానపద పాటలుగా, కథలు కథలుగా గానం చేయబడుతోంది. ఇండియన్‌ రైల్వేస్‌ రోజూ బెంగుళూరు నుండి కొల్హాపూర్‌ ప్రయాణించే ఒక రైలుకు ఏకంగా ‘‘రాణి చెన్నమ్మ ఎక్స్‌ ప్రెస్‌’’ అని పేరు పెట్టి ఆమెకు నీరాజనాలు అర్పించారు.
రాజ్‌ కుమారి గుప్త
రాజ్‌ కుమారి గుప్త చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆధ్వర్యం లోని తిరుగుబాటు యోధుల బృందా నికి సహకరిస్తూ ఉండేది. వారికి రహస్యంగా సందే శాలను, మారణాయుధాలను చేరవేసేది. అప్పట్లో విప్లవ దళాల మనుగడకై దోపిడీలు చేసేవారు. చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే ‘‘కాకోరీ కాన్‌ స్పైరసీ’’ గా పేరొందిన, లక్నోకి దగ్గరగా గల కాకొరీ ప్రాంతంలో చంద్ర శేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో జరిగిన ఒక రైలు దోపిడీలో ప్రముఖ పాత్ర పోషించింది రాజ్‌ కుమారి గుప్త. ఒకసారి తన దుస్తులలోదాచు కుని రహస్యంగా ఆయుధాలు చేరవేస్తుం డగా బ్రిటిష్‌ సైన్యానికి తన మూడేళ్ళ కొడుకుతో సహా పట్టుబడిరది.
లిబేగం హజ్రత్‌ మహల్‌
లక్నోలోని అతిపెద్ద ప్రాంతం అవధ్‌ ని ఏలిన రాణి బేగం హజ్రత్‌ మహల్‌. అందాల సౌందర్య రాశి, అత్యంత విలాస వంతంగా జీవితం గడిపిన ఆమె, బ్రిటిష్‌ వారిపై వ్యతిరేకంగా జరిపిన యుద్ధంలో తాను ప్రత్యక్ష్యంగా యుద్ధరంగంలో నిలబడి తన సైన్యంలో ధైర్యం నింపుతూ పోరాడిరది. ఎప్పటికప్పుడు తన శక్తి మేరకు ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడిరది బేగం హజ్రత్‌ మహల్‌. మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధులలో ఒకరైన నానా సాహెబ్‌ వంటి వారితో కలిసి పని చేసింది. బలవంతంగా తన రాజ్యాన్ని బ్రిటిష్‌ వారు చేజిక్కించుకోగా రిక్తహస్తాలతో, నేపాల్‌ ప్రధాని పిలుపునందుకుని నేపాల్‌ చేరుకుని మనుగడ సాగించాల్సి వచ్చింది. చివరకు ఊరూ పేరూ లేకుండా 1879లో ఖాట్మండులో మరణించింది. అనంతరం ఆమె సాహస పోరాట పటిమకు గుర్తుగా భారత ప్రభుత్వం మే 10, 1984లో బేగం హజ్రత్‌ మహల్‌ ఫోటో ముద్రించిన పోస్టల్‌ స్టాంప్‌ ను విడుదల చేసింది.
రాణి అవంతి బాయి
1831-1858 మధ్య కాలంలోని మరో మొదటి తరం స్వతంత్ర యోధురాలు రాణి అవంతి బాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం అప్పట్లో విధించిన చట్టాలకు అనుగుణంగా, వాటికి తలవంచే అందరు రాజుల్లాగే, తాను కూడా ‘‘వారసులు లేని వారు తమ రాజ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించి భరణం తీసుకోవాలన్న ఆదేశాల’’ ను పాటిస్తూ తన రాజ్యాన్ని అప్పగించి, వారిచ్చే భరణంతో బ్రతకాల్సి వచ్చింది. అది నచ్చని ఆమె రహస్యంగా బృందాలను తయారు చేసి, బ్రిటిష్‌ వారి అరాచకాలను, ఆక ృత్యాలను వారి ద్వారా బహిరంగ పరిచింది. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్‌ దళాలకు వ్యతిరేకంగా ధృఢంగా పోరాడి అనేక ప్రాంతాలలో విజయం చేజిక్కించుకుంది. కానీ ఆ విజయాలు ఎంతో కాలం నిలవలేదు. దీర్ఘకాలం పోరాడిన తరువాత తన అధికారాన్ని కోల్పోయింది. ఐనా ధైర్యం కోల్పోక, సర్వశక్తులూ ఒడ్డి, మరలా సైన్యాన్ని సమీకరించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు బ్రిటిష్‌ సైన్యం చేతికి చిక్కి చావటం ఇష్టంలేక తన కత్తితో తానే పొడుచుకుని సంహరించుకుని ప్రాణ త్యాగం చేసిన ధీరోదాత్త రాణి అవంతీ బాయి.ఇక రaాన్సీ లక్ష్మీబాయి వీరోచిత గాథ చాలావరకు ప్రజలందరికీ చేరువయ్యిందే.
పార్వతి గిరి
పశ్చిమ ఒరిస్సా ప్రాంతంలో మరో మదర్‌ థెరెస్సాగా పేరొందిన మహిళ పార్వతి గిరి. 16 ఏళ్ళ చిన్న వయస్సు లోనే స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితురాలై అనేక పోరాటాలలో ముందుండి నడిచింది. ప్రత్యేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ప్రముఖ పాత్ర పోషించింది. అందుకామె రెండేళ్ళ జైలు జీవితం కూడా గడిపింది. స్వాతంత్య్రం తదుపరి తన జీవితాన్నంతా ప్రజా సేవకు అంకితం చేసిన మహోన్నత మహిళ పార్వతి గిరి.
భోగేశ్వరి ఫుకనాని
మధ్య అస్సాం ప్రాంతానికి చెందిన భోగేశ్వరి ఫుకనాని 60 ఏళ్ళ వయస్సులో ప్రాణాలను ఫణంగా పెట్టి అమరత్వం పొందిన సాహస మహిళగా ప్రసిద్ధి చెందిన వ ృద్ధ యోధురాలు. ఒక సాధారణ గృహిణి ఐన భోగేశ్వరి స్వాతం త్య్ర పోరాటం పట్ల ఆకర్షితురాలై తాను స్వయం గా ఉద్యమంలో పాల్గొనటమే కాక తన ఆరుగురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కూడా పాల్గొనేలా చేసింది. ‘‘భర్భుజ్‌ ’’ అనే పేరుతో చేపట్టిన తిరుగుబాటు కార్యక్రమంలో పాల్గొన్న భోగేశ్వరిని అమానవీయ రీతిలో కాల్చి చంపింది బ్రిటిష్‌ సైన్యం.
కనకలత బారువా
అస్సాంకే చెందిన మరో మహిళ కనకలత బారువా. ఆమెను బీర్బల అని కూడా పిలిచే వారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో ‘‘మ ృత్యు వాహిని’’ అనే సేనలో ప్రాణాలను ఫణంగా పెట్టే దళంలో పని చేసింది. సెప్టెం బర్‌ 20, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ బృందం చేపట్టిన, జాతీయ జెండా ధరించి సాగే మార్చ్‌ లో ముందుండి సాగి బ్రిటిష్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టు కుంది కనకలత బారువా.
మాతంగిని హజ్రా
అంతగా ప్రాచుర్యం పొందని వీర వనిత. క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిం చింది. తన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రజలలో జాతీయతా భావాన్ని అత్యంత వేగంగా వ్యాప్తి చేసింది. ఉద్యమ కాంక్షను రగిలించింది. ఇది గ్రహించిన బ్రిటిష్‌ ప్రభు త్వం ఆమెను ఐంతమొందించాలని ఎదురు చూసాయి. జాతీయ జెండా ధరించి ఉద్యమ పథంలో నడుస్తున్న ఆమెను షూట్‌ చేసారు. తూటా తగిలినా, ధైర్యం కోల్పోక, జెండా విడు వక.. ముందుకు నడుస్తూనే, ‘‘వందే మాతరం’’ అంటూనే నేలకొరిగింది మాతంగిని హజ్రా.
అరుణ అసఫ్‌ అలీ
భారత దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ అందుకున్న అరుదైన స్వాతంత్య్ర సమర యోధురాలు అరుణ అసఫ్‌ అలీ. ఉన్నత విద్యా వంతురాలు. 1942 క్విట్‌ ఇండియాఉద్యమ సమయంలో, ముంబైలోని గవాలియా ట్యాంక్‌ మైదానంలో బ్రిటిష్‌ సైన్యం చూస్తుం డగా జాతీ య జెండా ఎగుర వేసిన ధైర్యం ఆమె సొంతం. తన పోరాటాల ఫలితంగా ఎన్నోసార్లు జైలు జీవితం గడిపింది. తీహార్‌ జైల్లో బంధించి నపుడు ఆమె చేపట్టిన నిరాహార దీక్ష స్వాతంత్య్ర పోరాట చరిత్రలో నిలిచిపోయింది.
దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌
చిన్నతనం నుంచే స్వతంత్ర భావాలు గల మరో తెలుగు మహిళ దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌. గాంధీ బోధనలకు ఆకర్షితురాలై ఆభరాణాలు విడిచి ఖాదీ ధరించింది. సత్యాగ్రహంలో పాల్గొని మూడుసార్లు జైలుపాలైంది. తరువాత ఉన్నత విద్యనభ్యసించి న్యాయశాస్త్రంలో పట్టా పొం దింది. స్వాతంత్య్రానంతరం ప్లానింగ్‌ కమీషన్‌ సభ్యురాలిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, కేంద్రంలో ఆర్థిక మంత్రిగా పలు కీలక పద వులు నిర్వహించిన తెలుగు మహిళ దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌. ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగా లు చేసిన వారు, తెగువ, ధైర్య సాహసాలు చూపిన మహిళలు. చరిత్రలో నిలిచిన వారు, వెలుగులోకి రాని వారు అనేక మంది. ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మనం వారందరినీ తలచుకుందాం. అపురూపమైన భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను భావి తరాలకు తెలియ జేసే ప్రయత్నం చేద్దాం. Saiman Gunaparthi