ప్ర‌కృతితోనా మ‌న‌వాళి వికృత క్రీడా

‘‘ కొవిడ్‌ మహమ్మారిని పక్కనపెడితే ప్రపంచ దేశాలకు పెను సవాల్‌?గా మారిన సమస్య భూతాపం. ఈసమస్యకు మూలం కూడా మానవుడి చర్యలే. అభివృద్ధి వర్సెస్‌ భూతా పం – అనే ఈ క్రూరమైన సందిగ్ధం వల్ల మనం ‘గ్రీన్‌హౌస్‌’ వాయువుల విడుదలను తగ్గించ లేకపోతున్నాం.ఈ తరుణంలో మన అందు బాటులో ఉన్న సాంకేతిక విజ్ఞానాన్ని, వనరుల్ని సరైన రీతిలో ఉపయోగిస్తేనే భూతా పాన్ని ఎదుర్కొని తిరిగి సాధారణ స్థితికి రాగలం. ’’ – డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌
మహమ్మారి నుంచి మానవాళి గ్రహించాల్సిన మరో పెద్ద పాఠం భూతాపాన్ని (గ్లోబల్‌ వార్మింగ్‌) అత్యవసర సమస్యగా సమష్టిగా ఎదుర్కోవడం! భూతాపం ప్రస్తుతం మానవ మనుగడకు ప్రమాదకరంగా పరిణమించిందని శాస్త్రీయ ఆధారాలన్నీ తేల్చి చెబుతున్నాయి. ‘గ్రీన్‌హౌస్‌’ వాయువులను ఇక ముందు నియంత్రించగలిగినా కూడా, భూమ్మీద ఇప్పటికే జరిగిన నష్టంవల్ల సరాసరి ఉష్ణోగ్రతలు సుమారు రెండు డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుతాయి. బొగ్గుపులుసు వాయువు,మీథేన్‌, ఇతర ఉద్గారాల విడుదలను ఆపకపోతే ఉఉఉఉష్ణోగ్రతల పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉం టుంది. రెండు డిగ్రీల సెల్సియస్‌ చాలా స్వల్పమే కదా అనిపించవచ్చు. కానీ రెండు డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదలతో చోటు చేసుకునే మార్పు- మంచు యుగానికి, ఎడారీకరణకు మధ్య తేడాగా మారవచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కల్లోలం సృష్టిస్తున్నాయి. హిమనదాలను కరిగిస్తున్నాయి. సైబీరియా, గ్రీన్‌లాండ్‌ వంటి శీతల ప్రదేశాలలో మంచును కరిగిస్తున్నాయి. భారత్‌లో గంగా, ఉపఖండంలోని ఇండస్‌ వంటి హిమనదాలు ఎండిపోతుండటం, ఆర్కిటిక్‌ మహా సముద్రం కరుగుతుండటం, అంటార్కిటికాలో మంచు ఫలకం కరగడం, సముద్ర మట్టాలు పెరగడం, తీర, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడం, ద్వీపదేశాలు మునిగిపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న పరిణామాలు.పలు దేశాల్లో అటవీ కార్చిచ్చులు, భారత్‌ వంటి ఉష్ణ మండల దేశాల్లో ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయిలో ఉండటం, పెనుతుపానులు, టైఫూన్లు వంటి అసాధారణ, అనూహ్య వాతావరణ పోకడలు మనిషికి సవాలు విసురుతున్నాయి. ఎడారీకరణ, దోమలు, ఇతర వ్యాధికారక కీటకాల వ్యాప్తి, మహమ్మారులు విజృంభిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా గుర్తించని అనేక భయోత్పాతాలకు కారణమవు తున్నాయి.ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టిమానవాళి మనుగడకు ప్రమాదకరమైన భూతాపానికి మూలం మానవుడి చర్యలే. అభివృద్ధి వర్సెస్‌ భూతాపం- అనే ఈ క్రూరమైన సందిగ్ధం వల్ల మనం ‘గ్రీన్‌హౌస్‌’ వాయువుల విడుదలను తగ్గించలేకపోతున్నాం. తలసరి ఇంధన వాడకం పెద్దయెత్తున ఉన్నది సంపన్న దేశాల్లో, వృద్ధికోసం తంటాలు పడుతున్న పేద దేశాలకు ఇంధనం వాడొద్దని, ఉత్పత్తిని నిలిపివేయాలని చెప్పడం హాస్యాస్పదం. ఇప్పుడు పునరుత్పాదక ఇంధనాన్ని పుష్కలంగా, చౌకగా- దీర్ఘకాలిక ప్రాతిపదికనైతే శిలాజ ఇంధనాల కంటే చౌకగా- చేయగలిగేలా సాంకేతిక విజ్ఞానం పరిణతి సాధించడం సంతోషకరమైన విషయం.మాంసం ఉత్పత్తిలో కర్బన ఉద్గారాల్ని తగ్గించే సాంకేతికతా మనకుంది. వరి ఉత్పత్తి లో మెరుగైన పద్ధతులు, ప్రత్యామ్నాయ ఆహారాలు ‘గ్రీన్‌హౌస్‌’ వాయువుల్ని ఇంకా తగ్గిస్తాయి. ‘కణాల కల్చర్‌’ ద్వారా మాంసం ఉత్పత్తికి సింగపూర్‌ అనుమతులిచ్చింది. అటువంటి టెక్నాలజీలవల్ల ఇక వధించేందుకు జంతువుల్ని పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రపంచ మార్కెట్ల డిమాండుకు తగ్గ మాంసాన్ని రాబోయే 10-20 ఏళ్లలో కొత్త టెక్నాలజీతో తయారు చేయవచ్చు.మనకు ఇప్పటికే సౌర విద్యుత్తు, బ్యాటరీ స్టోరేజీ టెక్నాలజీ, విద్యుత్‌ కార్లు, ఇంధన పొదుపు పరికరాలు, బయో మాస్‌ను ఇంధనంగా మార్చే సెల్యులోజిక్‌ ఎంజైములు, ఇతర అద్భుత సాంకేతికతలు చవకగా అందుబాటులో ఉన్నాయి. ఉత్పత్తిని, ఆర్థిక వృద్ధిని, ఉద్యోగాల్ని కోల్పోకుండానే వచ్చే 20ఏళ్లలో శిలాజ ఇంధనాల మీద ఆధార పడాల్సిన అవసరం నుంచి పూర్తిగా బయటపడే సామర్థ్యం ఈవేళ మానవాళికి ఉంది.కొత్త ఇంధన వ్యవస్థల్ని నిర్మించి, నిర్వహించే క్రమంలో కోట్ల సంఖ్యలో నూతన ఉద్యోగాల్ని సృష్టించవచ్చు. ఇందుకు ప్రతి దేశంలో, ప్రపంచ స్థాయిలోనూ భారీగా ప్రయత్నం కావాలి. ప్రస్తుత శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్‌ గ్రిడ్లనుంచి పునరుత్పాదక ఇంధన గ్రిడ్‌లకు మరలడానికి సుమారు 15-20 లక్షల డాలర్లు అవసరమవుతాయి. ప్రస్తుత విద్యుత్‌ ప్లాంట్లను మూసివేస్తే, వాటి వ్యయాన్ని ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పరిహారం కట్టాల్సి ఉంటుంది.పాత పెట్రోల్‌ బంక్‌ స్థానంలో విద్యుత్‌ కార్ల బ్యాటరీలను రీఛార్జి చేసే సౌర విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు రావాలి. ప్రస్తుత కేంద్రీకృత గ్రిడ్‌ స్థానంలో వికేంద్రీకరించిన పంపిణీ వ్యవస్థలు ఏర్పడాలి. పగలు సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే, ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాన్ని నిరంతర విద్యుత్‌ అవసరాల కోసం భారీస్థాయిలో నెలకొల్పాలి. ఈ పరివర్తన (ట్రాన్సిషన్‌) కోసం తక్కువ ఖర్చుతో సమర్థంగా పనిచేసే టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ పరివర్తన జరగాలంటే మనకు భారీ వనరులు కావాలి. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ తమ ఆర్థిక వ్యవస్థల ఉద్దీపనకు, ఆర్థిక కార్యకలాపాలు లేక కుదేలైన కార్మికులను, సంస్థలను ఆదుకునేందుకు సుమారు 15లక్షల డాలర్ల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించాయి. ఈ మొత్తాన్ని కేవలం ఏడాది కాలంలో సమకూర్చగలిగాయి.శిలాజ ఇంధన గ్రిడ్ల నుంచి పునరుత్పాదక గ్రిడ్లకు మరలేందుకు మనకు కావలసిందల్లా 15 లక్షల డాలర్లు- అంటే కొవిడ్‌ ఉద్దీపనకు ఏడాది కాలంలో వినియోగించిన మొత్తాన్ని 10-15 ఏళ్ల కాలంలో వినియోగించడం. వృద్ధి, ఉపాధి, నాణ్యమైన జీవితంతో పర్యావరణహిత ఆర్థిక వ్యవస్థల్ని నిర్మించడానికి కావలసిన సాంకేతికత, వనరులు ప్రపంచానికి ఉన్నాయి. మనకు కావలసిందల్లా రాజకీయ సంకల్పం, ఆర్థిక, వ్యాపార సృజనాత్మకత, ప్రపంచ దేశాల మధ్య సహకారం! బెంబేలెత్తిస్తున్న భూతాపం ఒకవిధంగా మొత్తం మానవాళికి కొవిడ్‌ ఒక మేలుకొలుపు. అసమానతలు తగ్గించడానికి, అందరికీ అవకాశాల్ని అందించడానికి, అభివృద్ధిని పెంచడానికి, పేదరికాన్ని అంతం చేయడానికి- నాణ్యమైన, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ఒక ఆరోగ్య రక్షణ వ్యవస్థ, నైపుణ్యాలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, ఉద్యోగాల కల్పన, సమ్మిశ్రిత వృద్ధి ఎంత కీలకమన్నది అన్ని దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు ఇది గుర్తుచేసింది.ఇది కేవలం ఒక ఆర్థికపరమైన అవసరం కాదు, స్థిరత్వానికి కావలసిన ఓ రాజకీయ అనివార్యత. సామరస్యత, సంతోషాలకు కావలసిన ఓ సామాజిక అనివార్యత. భవిష్యత్తులో తలెత్తే అవకాశమున్న మరింత ప్రమాదకర, విధ్వంస కారక మహమ్మారుల్ని నిరోధించడానికి మనం ప్రకృతి సమతౌల్యాన్ని పునరుద్ధరించాలి. వన్యప్రాణుల్ని ఆహారంగా వినియోగించడానికి స్వస్తి చెప్పాలి. అడవుల నరికివేతను ముఖ్యంగా ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాల్లో ఆపుచేయాలి. చివరిగా భూతాపాన్ని ఎదుర్కొని తిరిగి సాధారణ స్థితికి మళ్లించడానికి- తద్వారా మన పిల్లలు, మొత్తం మానవాళి భవిష్యత్తును పరిరక్షించడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞానాన్ని, వనరుల్ని సరైన రీతిలో ఉపయోగించాలి.
వాతావరణ మార్పు అంటే ఏమిటి? భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
గ్లోబల్‌ వార్మింగ్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిక
గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెనువిపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలి తంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతు న్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి.
వాతావరణ మార్పు అంటే..
భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా, తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌ హౌజ్‌ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి.ఫలితంగా వాతావరణం, భూ ఉపరితంల వేడెక్కు తున్నాయి. ఈ ఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో 30 డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమయ్యేది.అయితే,ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయం వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం), వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌ హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభావవంతమైంది నీటి ఆవిరి. కానీ, అది వాతావరణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రామికీకరణ కన్నా ముందు ఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవ నరులు దాన్ని పీల్చుకోగలవు.శిలాజ ఇంధనా లను మండిరచడం వల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ ను పీల్చుకునే అడవులను నరికి, కాల్చేయడం వల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ ఎక్కువవుతోంది.1750లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి. గత 8 లక్షల ఏళ్లలో వాతావర ణంలో ఈ స్థాయిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఎప్పుడూ లేదు. మనుషుల చర్యల వల్ల మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ లాంటి ఇతర గ్రీన్‌ హౌజ్‌ వాయు వులు కూడా వెలువడుతున్నాయి. అయితే, కార్బన్‌ డై ఆక్సైడ్‌ అంతటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందునాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20 ఏళ్లు.. గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఆర్కిటిక్‌ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌పై పరుచుకున్న మంచు కూడా కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో కరుగుతోంది. పశ్చిమ అంటార్కిటికా పై ఉన్న మంచు ద్రవ్యరాశి కూడా తగ్గుతోంది. తూర్పు అంటార్కిటికాలోనూ ఈ పరిణామం మొదలవ్వొచ్చని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. పంటలు, జంతువులపైనా వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. మొక్కల్లో పూలు పూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. జంతువులు వలస వెళ్తున్నాయి.
ఉష్ణోగ్రత ఎంత పెరగవచ్చు?
భూ ఉపరితల ఉష్ణోగ్రత 1850తో పోల్చితే 21వ శతాబ్దం చివరినాటికి 1.5 డిగ్రీ సెల్సి యస్‌ పెరగొచ్చు. చాలా వరకూ అంచ నాలు ఇదే సూచిస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితులే ఇకపైనా కొనసాగితే పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీ సెల్సియస్‌లు కూడా ఉండొచ్చని డబ్ల్యూఎంఓ అంటోంది.
ఉష్ణోగ్రతలో 2 డిగ్రీ సెల్సియస్‌ల పెరుగుదల ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌లకు కట్టడి చేసుకోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు, నాయకులు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీసెల్సియస్‌లకు అదుపు చేయాలంటే సమాజం అన్ని విధాలుగా త్వరితగతిన మారాల్సి ఉంటుందని ఇంటర్‌ గవర్న్‌మెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపీసీసీ) నివేదిక అభిప్రాయపడిరది. చైనా నుంచే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా,యురోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు ఉన్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే, వీటిలో ఉద్గారాలు చాలా ఎక్కువ. ఇప్పటికిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గించుకున్నా, వాతా వరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుదన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహార ఉత్పత్తి పైనా తీవ్ర ప్రభావం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు.భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది.
వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచుపడుతుంది. తీరాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో వేసవుల్లో కరవు ముప్పు ఎక్కువవుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు.పరిస్థితులకు అంత త్వరగా అలవాటుపడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడం వల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు.వాతావరణ మార్పులపై స్పందించడమే ఈ శతాబ్దంలో మానవాళికి అతిపెద్ద సవాలు కాబోతోంది. (- రచయిత: (ప్రజాస్వామ్య పీఠం(ఎఫ్‌.డీ.ఆర్‌), లోక్‌సత్తా వ్యవస్థాపకులు)

-డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌

సంప‌ద శాపం

వాతావరణం నుండి కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసివేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఇప్పుడు మొత్తం మానవాళి యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి అవసరం. చక్రవర్తిలా జీవించాలనుకునే వారిచే ఎందుకు బంధించబడాలి? విమానయానం యొక్క వాతావరణ ప్రభావాలను మనం విస్మరించమని తరచుగా ప్రయాణించే వారు తరచుగా చెబుతారు. ఎందుకంటే అవి ‘‘కొన్ని శాతం మాత్రమే’’. కానీ అవి సాపేక్షంగా తక్కువగా ఉండటానికి ఏకైక కారణం..ఎగురుతున్నది చాలా కేంద్రీకృతమై ఉంది. అత్యంత సంపన్నుల గ్రీన్‌హౌస్‌ వాయుఉద్గారాలకు ఎగిరే కారణమవుతుంది. అందుకే అత్యంత సంపన్నులైన ఒకశాతం ప్రపంచంలోని విమానయాన ఉద్గారాలలో దాదాపు సగం మందిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారిలాగే జీవించినట్లయితే, వాతావరణ పతనానికి అన్ని కారణాలలో విమానయానం అతిపెద్దది.
‘‘ అత్యంత ధనవంతుల భారీ పర్యావరణ ప్రభావాలను మనం ఎందుకు సహిస్తాం? ధనవంతుల పట్ల మక్కువ చూపడం వల్ల మనలో చాలా లోపాలు ఏర్పడతాయి. లాబీయిస్టుల (లాభదాయకమైన ప్రైవేట్‌ ప్రయోజనాలతో రాజకీయ నాయకులతో సహా) ప్రజా స్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రభుత్వాలు అను మతించిన విధానం, కార్పొరేషన్లు, ఒలిగార్చ్‌లు, భూస్వా ములు తమ కార్మికులు, అద్దెదారులను నొక్కేసేం దుకు అనుమతించే నియంత్రణ సడలింపు మహమ్మారి సమ యంలో లాభదాయకత కోసం అనుమతించే వాతా వరణం ప్రైవేటీకరణ వైపు నిరంతర డ్రైవ్‌తో ఆరోగ్యం, విద్య,ఇతర ప్రజాసేవలక్షీణత. ఇవన్నీ ఒకేపరిస్థితి లక్ష ణాలు. మన కష్టతరమైన పరిస్థితు లకు కూడా ఇది వర్తి స్తుంది.! ’’

మన జీవిత-సహాయక వ్యవస్థలను నాశనం చేయడం. మనమందరం ఆధారపడిన గ్రహాల స్థలంలో సింహభాగాన్ని చాలా ధనవంతులు తమకు తాముగా గర్విస్తారు. మన ఉమ్మడి ప్రయోజనాలపై ఈ దాడిని ఎందుకు సహిస్తు న్నామో అర్థం చేసుకోవడం కష్టం. ప్రపంచం లోని అత్యంత ధనవంతులైన ఒక శాతం మంది (సంవత్సరానికి సగటున 172,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు) ప్రపంచం లోని 15శాతం కార్బన్‌ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్నారు. పేద 50శాతం కంటే రెట్టింపు ప్రభావం. సగటున, వారు ప్రతిసంవత్సరం ఒకవ్యక్తికి 70 టన్ను లకు పైగా కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేస్తారు. మనంగ్లోబల్‌ హీటింగ్‌లో 1.5శాతం సెల్సియస్‌ మించకుండా ఉంటే మనం ప్రతి ఒక్కరూ విడుదల చేయగలిగిన దానికంటే 30 రెట్లు ఎక్కువ. ప్రపంచంలోని మధ్యతరగతి ఉద్గా రాలు వచ్చే దశాబ్దంలో బాగా తగ్గుతాయని అంచనా వేయబడినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థల సాధారణ డీకార్బనైజేషన్‌ కారణంగా,అత్యంత సంపన్నులు ఉత్పత్తి చేసే మొత్తం ఏమాత్రం తగ్గదు. మరో మాటలో చెప్పాలంటే..వారు దీనికి బాధ్యత వహిస్తారు. మొత్తం శాతం సెల్సియస్‌ 2లో ఇంకా ఎక్కువ వాటా. మంచి ప్రపంచ పౌరులుగా మారడం అంటే వారి కార్బన్‌ వినియోగాన్ని సగటున 97శాతం తగ్గించడం. జనాభాలో 90శాతం మంది కార్బన్‌ను ఉత్పత్తి చేయకపోయినా,రాబోయే తొమ్మిదేళ్లలో ధనవంతులైన 10శాతం (సగటున 55,000 కంటే ఎక్కువ సంపాదిస్తు న్నవారు) ఊహించిన ఉద్గారాలు దాదాపు మొత్తం ప్రపంచ బడ్జెట్‌ను ఉపయోగిస్తాయి. పర్యావరణ ప్రభావంలో అసమానత దేశం యొక్క అసమానతకు అద్దం పడుతుంది. సంపన్న దేశాలకు చెందిన సంపన్న ప్రజలు తమ నిందను చైనాకు లేదా ఇతర వ్యక్తుల జననాలకు మార్చడానికి చాలా ఆసక్తిని కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు. కొన్నిసార్లు వారు తమ స్వంత ప్రభావాలకు హాజరయ్యే ముందు ఏదైనా ప్రయత్నిస్తారని అనిపిస్తుంది. 20మంది బిలియనీర్ల జీవనశైలిని ఇటీవల విశ్లేషణలో ప్రతిఒక్కరు సగటున 8,000 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేశారని కనుగొన్నారు. 1.5శాతం సెల్సియస్‌ కంటే ఎక్కువ వేడి చేయడానికి కట్టుబడి ఉన్న ప్రపంచంలో వారి సరసమైన వాటా 3,500 రెట్లు.ప్రధాన కారణాలు వారి జెట్‌లు,పడవలు. కొంతమంది బిలియనీర్ల బోట్‌ల వలె శాశ్వత స్టాండ్‌బైలో ఉంచబడిన సూపర్‌యాచ్‌ మాత్రమే సంవత్సరానికి 7,000 టన్నుల శాతం సెల్సియస్‌ 2ని ఉత్పత్తి చేస్తుంది.వాతావరణ ఛాంపి యన్‌గా తనను తాను నిలబెట్టుకున్న బిల్‌ గేట్స్‌కు పడవ లేదు. అయినప్పటికీ,అతను మంచి ప్రపంచపౌరుల కంటే 3,000 రెట్లు పెద్ద పాదముద్రను కలిగి ఉన్నాడు. ఎక్కువగా అతని జెట్‌లు,హెలికాప్టర్‌ల సేకరణ ఫలి తంగా. అతను ‘గ్రీన్‌ ఏవియేషన్‌ ఇంధనం కొనుగోలు’ అనిపేర్కొన్నాడు. కానీ అలాంటిదేమీ లేదు. జెట్‌లకోసం జీవ ఇంధనాలు,విస్తృతంగా అమలు చేయబడితే,పర్యావరణ విపత్తును ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఒకే విమానానికి శక్తినివ్వడానికి చాలా మొక్కల పదార్థం అవసరం. దీని అర్థం పంటలు లేదా తోటలు తప్పనిసరిగా ఆహారఉత్పత్తి లేదా అడవి పర్యా వరణ వ్యవస్థలను స్థానభ్రంశం చేయాలి. ఇతర ‘‘గ్రీన్‌’’ ఏవియేషన్‌ ఇంధనాలు ప్రస్తుతం అందు బాటులో లేవు.గేట్స్‌ కార్బన్‌ ఆఫ్‌సెట్‌లను కొను గోలు చేయడం ద్వారా అటువంటి వైరుధ్యా లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాతావరణం నుండి కార్బన్‌ డయాక్సైడ్‌ను తీసివేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఇప్పుడు మొత్తం మానవాళి యొక్క ప్రభా వాన్ని తగ్గించడానికి అవసరం. చక్రవ ర్తిలా జీవించాలనుకునే వారిచే ఎందుకు బంధించబడాలి? విమానయానం యొక్క వాతావరణ ప్రభావాలను మనం విస్మరించమని తరచుగా ప్రయాణించే వారు తరచుగా చెబుతారు. ఎందుకంటే అవి ‘‘కొన్ని శాతం మాత్రమే’’. కానీ అవి సాపేక్షంగా తక్కువగా ఉండటానికి ఏకైక కారణం..ఎగురుతున్నది చాలా కేంద్రీకృతమై ఉంది. అత్యంత సంపన్నుల గ్రీన్‌హౌస్‌ వాయుఉద్గారాలకు ఎగిరే కారణమవు తుంది. అందుకే అత్యంత సంపన్నులైన ఒకశాతం ప్రపంచంలోని విమానయాన ఉద్గారా లలో దాదాపు సగం మందిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారిలాగే జీవించి నట్లయితే, వాతావరణ పతనానికి అన్ని కారణాలలో విమానయానం అతిపెద్దది. కానీ వారి కర్బన దురాశకు పరిమితులు లేవు. కొంతమంది అత్యంత సంపన్నులు ఇప్పుడు అంతరిక్షంలోకి ప్రయాణించాలని ఆశిస్తున్నారు. అంటే వారు ప్రతి ఒక్కరు10 నిమిషాల్లో 30మంది సగటు మానవులు విడుదల చేసే కార్బన్‌ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తారని అర్థం. చాలా ధనవంతులు సంపద సృష్టికర్తలుగా చెప్పుకుంటారు. కానీ పర్యావరణ పరంగా,అవి సంపదను సృష్టించవు. వారు అందరి నుండి తీసుకుంటారు. ఎక్కువ డబ్బున్నవాడు ఇప్పుడు ప్రతిదీ కొనుగోలు చేస్తున్నాడు. ఈలోపాలను పరిష్కరించే సమావేశాలకు కూడా యాక్సెస్‌. కొన్ని ఖాతాల ప్రకారం, కాఫ్‌`26 అన్ని వాతావరణ శిఖరాలలో అత్యంత ప్రత్యేక మైనది. పేద దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు బైజాంటైన్‌ వీసా అవసరాలు,కోవిడ్‌ వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెస్తామనే విరుద్ధమైన వాగ్దా నాలు,స్థానిక ధరలను పరిమితం చేయడంలో లేదా గదులను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వ వైఫల్యాలకు కృతజ్ఞతలు. వసతి కోసం పిచ్చి ఖర్చుల,క్రూరమైన కలయికతో అడ్డుకు న్నారు. పేద దేశాల నుండి ప్రతినిధులు ఈ గోడలను స్కేల్‌ చేయగలిగినప్పటికీ,వారు తరచుగా చర్చల ప్రాంతాల నుండి మినహా యించబడతారు అందువల్ల చర్చలను ప్రభా వితం చేయలేరు. దీనికి విరుద్ధంగా,500 కంటే ఎక్కువ శిలాజ ఇంధన లాబీయిస్ట్‌లకు యాక్సెస్‌ మంజూరు చేయబడిరది. ఇది ఇప్పటికే వాతా వరణ విధ్వంసం కారణంగా దెబ్బతిన్న ఎని మిది దేశాల సంయుక్త ప్రతినిధుల కంటే ఎక్కువ. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, మొజాంబిక్‌,మయన్మార్‌,హైతీ,ప్యూర్టోరికో, బహామాస్‌. నేరస్తులు విన్నవించారు. బాధితు లను మినహాయించారు. తరచుగా కోట్‌ చేయబడిన సిద్ధాంతం ఉంది.పెట్టుబడిదారీ విధానం అంతం కంటే ప్రపంచ ముగింపును ఊహించడం సులభం. పెట్టుబడిదారీ విధానమే ఊహించడం కష్టంగా ఉండడమే కారణం. చాలా మంది వ్యక్తులు దానిని నిర్వ చించడానికి కష్టపడతారు.దాని ఛాంపియన్‌లు సాధారణంగా దాని నిజమైన స్వభావాన్ని మరుగుపరచడంలో విజయం సాధించారు. కాబట్టి సులభంగా గ్రహించగలిగేదాన్ని ఊహిం చడం ద్వారా ప్రారంభిద్దాం. కేంద్రీకృత సంపద ముగింపు మన మనుగడ దానిపైనే ఆధారపడి ఉంటుంది.అన్ని పర్యావరణ చర్యలలో ముఖ్యమై నది సంపద పన్ను అని నేను నమ్ముతున్నాను. దైహిక పర్యావరణ పతనాన్ని నివారించడం అంటే విపరీతమైన సంపదను అంతరించి పోయేలా చేయడం గ్రహం భరించలేనిది మొత్తం మానవాళి కాదు. ఇది అల్ట్రా రిచ్‌.
జార్జ్‌ మోన్‌బియోట్‌

వేలంబస

ఉత్తరాంధ్ర పలుకులు.. జీవితాలు,భిన్న సంస్కృతులు, సామాజిక అసమ తౌల్యాలు, సమతమమతలను వడపోసిన విఖ్యాత కథారచయిత చింతకింద శ్రీనివాసరావుకు బాగా తలుసు. తెలుసు అనేకంటే వాటిని ఆయన గాఢంగా పరిశీలిస్తారని చెప్పవచ్చు. అటువంటి అక్షర కృషిలో భాగంగానే ‘‘వేలంబస’’ అని కథ అందించారు. దీని రచనా కాలం 2019 కాగా 2020 జనవరి 12 ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో తొలిసారి ప్రచురించబడిరది.
తూర్పు కనుమల్లో తిరుగాడే అడవి బిడ్డలకు ఉండే ఆచారాలు అలవాట్లు, ఆధునికులకు అబ్బురం కలిగించే విషయా లు,అందులో దాగి ఉండే ఆత్మీయతలు ఐక మత్యాలు అందరికీ ఆదర్శనియాలే…! విశాఖపట్నంకు చెందిన డాక్టర్‌ చింతకింది శ్రీనివాస రావు. తనదైన పత్రికా రచన వృత్తి రీత్యా పాత్రికేయులు. ఉత్తరాంధ్ర జిల్లాలోని గిరిజనులతో మమేకమై వారితో దగ్గరగా జీవించిన వ్యక్తి, ఆదివాసుల జీవన చిత్రాలు అంటేనే పోరా టాలు,మోస పోవడం,ఉద్యమాల్లో బలి కావడం,వంటి విష యాలే ఎక్కువగా గుర్తుకు వచ్చి ఆకథాంశాలతోనే తెలుగు గిరిజనకథ విస్తరించింది. అందుకు భిన్నంగా వారి సంస్కృతి,సాంప్రదాయాలు, కథావస్తువు లుగా వెలు వడుతున్న కథల రాశి. అటు వంటి భావి అవసరా లను గుర్తించి కథలు రాసే అతి కొద్ది మంది రచయి తల్లో శ్రీనివాసరావు ఒకరు. తను రాసిన వన జీవుల కథల సంఖ్య తక్కువే అయినా సూక్ష్మ పరిశీలన గుణం చక్కని సంభాషణ శైలితో పాఠకులను తన కథవెంట పరవశంతో నడి పించే సృజన కారుడు ఆయన. అటువంటి అక్షర కృషిలో భాగంగానే ‘‘వేలంబస’’ అని కథ అందించారు. దీని రచనా కాలం 2019 కాగా 2020 జనవరి 12 ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో తొలిసారి ప్రచురించబడిరది. తాను 40 సంవ త్సరాల క్రితం ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు నేటికీ అరణ్యవాసుల జీవి తాల్లో సజీవంగా కనిపించడం సాంప్రదా యాల పట్ల వారు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అర్థమవుతుంది,అందుకే ఈరచయిత తన కథావస్తువుగా ఆవిష యాన్ని ఎంపిక చేసుకుని ‘‘వేలంబస’’ కథ అందించారు. ఇక కథ విషయాని కొస్తే జంబారి,గుమ్మీలుఅనే ఇద్దరు గిరిజన ‘‘చెలిమి గాళ్ళు’’అడవికి వేటకు వెళ్ళడంతో ప్రారంభమైన ఈ కథ ఆసాంతం అడవిలోనే సాగుతుంది, ఏకఅంశం,ఏకకాలం, అనే రెండు గుణాలు ఇందులో నిండుగా ఉండి కథానిక లక్షణాలు కనిపిస్తాయి. మొత్తం కథ అంతా ఇద్దరి సంభాషణతో నడిపిం చడం,అది పాఠకులకు ఆసక్తిని కలిగిస్తూ కడదాకా కథను చదివింపచేయడం దీనిలోని విశేషాలు. కథలోని సంభాష ణలు తూర్పు మన్యం ప్రాంత గిరిజన యాస,పలుకుబడితో,కూడి ఉండటంతో పాటు,అచ్చమైన అటవీ వాతావరణం అడుగడుగునా కనిపిస్తుంది.అంతేకాదు అడవిబిడ్డలు చేసే వేటరకాలు,తొలకరి ఆరంభానికి ముందు ప్రతి గిరిజన గూడెంలో జరిగే వేటకు సంబంధిం చిన,’’ఇటిం పండుగ’’ విశేషాలు రచయిత ఇందులో సందర్భాలు గుణంగా వివరిస్తారు. ఈకథ కూడా ‘‘ఇటిం పం డుగ’’ నేపథ్యంలో కొనసాగుతుంది. విశాఖ మన్యంలోని గిరిబిడ్డలు ప్రతి ఏటా ఏప్రిల్‌,మే,నెలల్లో వేటకు సంబంధించిన ఈ పండుగ ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. ప్రతి గిరిజన యువ కుడు పొద్దున్నే అడవికి వెళ్లి సాయంత్రం గూడెం చేరుకునే వేళకు, సొంతంగా చేసే ‘‘ఒబ్బిడి’’ వేట ద్వారా గాని, సామూహికంగా చేసే ‘‘సోపు’’ వేటద్వారా గాని అడవి జంతువులను వేటాడి తెచ్చి,
‘‘వేలంబస’’ అనే పేరు గల ఊరి బయట ఖాళీస్థలంలో ఉంచాలి. అలా లక్ష్యంలోగా ఒక్క జంతువునైనా వేటాడి తీసుకురాక పోతే ఆగూడెం లోని వరసైన యువ తులంతా …ఒట్టి చేతులతో వచ్చిన యువకులపై పేడనీళ్లు, రంగునీళ్లు, మామూలు నీళ్ళు,పోసి సరాగాలు హాస్యా లు ఆడతారు.ఈ పండుగనే కొన్ని ప్రాంతాల్లో ‘‘ఇటుకల పండుగ ‘‘అంటారు ఆనేపథ్యంలోనే ‘‘వేలంబస’’ కథ కొన సాగింది.ఇటుకల పండుగ నాడు అడవి జంతువుల వేటకు బయలుదేరుతారు జంబారి,గుమ్మీలు,అనే గిరిజన మిత్ర ద్వయం. అడవి తల్లి దయతోనే తమకు వేట జరిగి ఏదో ఒక జంతువు పక్షి దొరుకుతుందని తద్వారా గూడెంలో ఆడవారి ముందు పరువు దక్కించు కోవచ్చు అనే లక్ష్యంతో కొండ బాటన నడుస్తుంటారు. వేటలో జంభారి కాస్త చురుకైన వాడు, గుమ్మిలే మందకొడి, తను అడివంతా పొద్దుటి నుంచి తిరిగిన….ఎక్కడ ఏ జంతువు,పక్షి, చిక్కలేదు.మధ్యాహ్నం వస్తుండడంతో సాయంత్రం ‘వేలంబస’లో ఆడవాళ్లు చేసే వెక్కిరింతలు,అవమానాలు, గుర్తు కొచ్చి గుండెలు జల్లుమన్నాయి ఇద్దరికీ, దిప్ప (ఆనపబుర్ర)లో తెచ్చుకున్న చోడి అంబలి తాగి దాహం,ఆకలి,తీర్చుకుని మళ్ళీ వేట ప్రయత్నం మొదలు పెడ తారు.కిందటి రోజు గింజలు పోసి పెట్టిన ఉచ్చులో ఏమైనా పడ్డ ఏమో అన్న ఆశ కొద్ది అటువైపు వెడతారు. మూడో కం టికి తెలియకుండా గుర్తులు నాటిన, దగ్గరకు వెళ్లారు అక్కడి దృశ్యం చూసిన మిత్రద్వ యం ఆనందానికి హద్దులు లేకుండా అయ్యింది.వారు ఉంచిన ఉచ్చులో కుందేలు చిక్కుకొని ఉంది. వెంటనే లాఘవంగ దాన్ని తీసి సంచిలో వేసి, జాంబకు ఇచ్చి అంతకుముందే కోరింగ పొదలో పరిచిన వల వైపు కదిలారు ఇద్దరు.అదృష్టం వెంటవెంటనే మంది వచ్చినట్టు ఆ వలలో మరో రెండు కుందేళ్ళు చిక్కుకుని కనిపించడంతో వారి ఆనందం అడి వంత అయింది, కానీ అక్కడ వేట జరిగింది ‘జంబారి’ ఉచ్చులు,వలలు,వల్లే…!!మిగిలింది గుమ్మీలు వేట,అతను పెట్టిన ఉచ్చుల వైపు నెమ్మదిగా కదిలారు, కానీ అక్కడ వారి కళ్ళకు నిరాశే కనిపించింది.పెట్టిన ఉచ్చులు పెట్టినట్టే ఉన్నాయి. వేసిన దుం పలు వేసినట్టే ఉన్నాయి. గుమ్మీలు గుండె జారింది. బాధతో బావురుమన్నాడు అది చూసిన’’జంబారి’’ కళ్ళు చెమ్మగిల్లాయి.ఆ క్షణాన జంబారిలో అడవిబిడ్డల ఉండే సహజ గుణం సహకారం అనే మాటల ముందుకు వచ్చింది, వేటలో వారికుండే రెండు పద్ధతులు గుర్తు చేశాడు, ఇప్పుడు మనం చేసిన వేట నేను ఒక్కడినే చేసిన ‘ఒబ్బిడి’వేట కాదు,మనం సమానంగా పంచుకునే ‘‘సోపువేట’’ అన్నాడు ఆత్మీయంగా…అలా పంచుకున్న ఆనం దం తోడుతో గూడెం బాట పట్టి సాయం త్రం గూడెం బయట ఏర్పాటుచేసిన వేటలో తెచ్చిన జంతువులు, పక్షులు ప్రదర్శించే ‘‘వేలంబస’’కు చేరుకున్నారు. మిత్రులిద్దరూ వారి ఫలితాలను ప్రదర్శిం చబడే ముందు ఇద్దరు కలిసి చేసిన వేట అని చెప్పడం కన్నా ఇద్దరం వేరువేరుగా వేటాడి తెచ్చాము, అంటే ఆవిజయం తాలూకు అభినందనలు ఎవరికి వారుగా అందుకోవచ్చు, అనే స్వార్థం నిండిన ఆలోచన రావడంతో, కానుగ చెట్టు కింద కూర్చుని ఆనందంతో కలిసి వచ్చిన నిర్లక్ష్యం సాయంగా, నాలుగు కుందేళ్ళను రెండు గోనె సంచుల్లో సర్దబో తుండగా ..అవకాశం కోసం ఎదురు చూస్తున్న అవి ఒక్కొక్కటిగా గోనె సంచు ల బందీఖానా నుండి బయటపడతాయి. ఊహించని సంఘటన తో మిత్రులిద్దరూ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.మానవ ప్రయత్నంగా వెతికారు కూడా,, చేతికం దిన వేట చేజారి పోయిందన్న బాధ ఒకవైపు, కాగా…వేట పడలేదు అంటే కలిగే అవమానం దూషణల కన్నా పడ్డ వేట తన్నుకుపోయింది అంటే మరింత అవమానం కూడా…!! వేట జరగలేదన్న భయం బాధతో పాటు దొరికిన వేట సమానంగా పంచుకోలేక పోయాము అని బాధ మరోవైపు ఆవహించాయి. చివరికి వేట జరగలేదు అని మాత్రమే నిర్ధారించు కుని అందుకుగాను జరిగే అవమా నాలకు,అవహేళనకు సిద్ధపడ్డ ‘‘చెల్లిమ య్యలు’’ ఇద్దరూ ‘‘వేలంబస’’ వైపు తమకు జరగబోయే హేళనలు తలుచు కుంటూ నడిచారు.
ఇలా ముగిసిన ఈ కథలో కేవలం గిరిజన సంస్కృతి, సాంప్ర దాయాలు, మాత్రమే తీసుకుని కథ రాశారు అంటే పొరపాటే…!! దీనిలో అడవిబిడ్డల సాంప్రదాయాలను గౌరవి స్తూనే మానవులందరికీ ప్రస్తుతం అత్యవ సరమైన మానవసంబంధాల గురించి, అంతర్వాహినిగా రచయిత ఇందులో వ్యక్తపరిచారు. భాషా నానుడులు సంపూ ర్ణంగా స్థానికతకు దగ్గరగా ఉండేటట్లు తీసుకుని నిర్ణయం, కథ మొత్తానికి నిండుదనాన్ని ఇచ్చి రచయితలోని, ప్రతిభ,పరిశీలన,తేటతెల్లం అవుతాయి. కథ పేరు కూడా ఆసక్తిని సముచి తత్వాన్ని కలిగిస్తుంది. ఇలాఅన్ని విధాల ఉన్న తత్వం కలిగిన ఈకథ, కొత్త కథకులకు నిజంగా దారి దీపమే…!!!
-డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు , ఫోను: 77298 83223

భారీ వ‌ర్షాల‌కు జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌లం

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో వరద తీవ్ర నష్టం కలిగించింది.బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురిసిన కుండ పోతకు వాగులు, నదులు పోటెత్తి ఊళ్లు, పట్టణాలను ముంచేశాయి. జలాశయాలు, చెరువుల కట్టలు తెగాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నీట మునిగింది. బస్సులు నీటిలో కొట్టుకుపో యాయి. స్వర్ణముఖి ఒడ్డున ఓ ఇల్లు నిలువునా కుంగి నదిలో కలిసిపోయింది. తిరుమల కొండలలో కుంభవృష్టి కురవడంతో ఘాట్‌ రోడ్డులో రాకపోకలకు ఆటంకమేర్ప డిరది. వర్షాలు వరదలకు రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. మొత్తం18 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికా రులు తెలిపారు. 50 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. రేణిగుంట-గుంతకల్‌ రైలు మార్గంలో కిలోమీటరు మేర రెండు ట్రాక్‌లు కొట్టుకు పోయాయి. అనంతపురం జిల్లా కదిరిలో మూడంతుస్తుల భవనం వర్షాలకు నాని కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు, ఒక వృద్ధురాలు మరణించారు.
ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో రాయలసీమలోని కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లాలోనూ విలయం సృష్టించింది. భారీ వర్షాలకు పెన్నా, దాని ఉపనదులన్నీ పొంగిపొర్లాయి. ఆనకట్టలు తెగిపోయాయి. గ్రామాల మీదకు ఒక్కసారిగా జలప్రళయం మాదిరి ఎగిసిపడడంతో నేటికీ పలు గ్రామాలు కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. 18వ తేదీ సాయంత్రం నుంచే..ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ 16.2021,22వ తేదీవరకు వర్షాలు కురుశాయి. వర్షాన్ని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌ సరిహద్దుల్లో వాయుగుండం తీరం దాటు తుందని హెచ్చరించింది. ఆ క్రమంలోనే 17వ తేదీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. తిరుమలలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీటీడీ అధికారికంగా వెల్లడిరచింది.వర్షాల ప్రభావంతో 18వ తేదీకి తిరుమల అల్లకల్లోలంగా మారింది. తిరుపతి వరద నీటిలో చిక్కుకుంది. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కూడా వర్ష తాకిడి తీవ్రంగా కనిపించింది. చెరువులన్నీ నిండుకుండలయ్యాయి. వాగులు పొంగిపొర్లాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహించాయి. తిరుమల ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా దిగువన పింఛా నదీకి వరదనీరు భారీ స్థాయిలో చేరింది. 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చే పింఛాడ్యామ్‌కి ఒక్కసారిగా 4లక్షల క్యూసెక్కుల వరకూ వరద జలాలు రావడంతో కట్ట తెగిపోయింది.18వ తేదీ చీకటి పడిన తర్వాత పింఛా డ్యామ్‌ కట్ట కొట్టుకుపోయింది. ఈ నీరు, బాహుదా నుంచి వచ్చిన నీటితో కలిసి చెయ్యేరు నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఫలితంగా అన్నమయ్య డ్యామ్‌ ప్రమాదంలో చిక్కుకుంది.
అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకు పోయింది..
1976లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేసి..ఎన్టీఆర్‌ హయంలో పూర్తిచేసిన అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు, రాజంపేట పట్టణం సహా సమీప గ్రామాలకు తాగునీరు అందు తోంది. ఈడ్యామ్‌ నిర్వహణ లోపాలపై పలు ఫిర్యాదులున్నాయి. ఇప్పుడు పింఛా డ్యామ్‌ నుంచి వచ్చిపడిన వరద ప్రవాహంతో ఒక్క సారిగా 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లోని అన్నమయ్య ప్రాజెక్ట్‌ తట్టుకునే స్థితిలో లేదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి,కడప జిల్లా ప్రత్యేక అధికారిగా వరద సహాయక చర్యల కోసం వెళ్లిన శశి భూషణ్‌ కుమార్‌ తెలిపారు. ‘‘సహజంగా 2లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా ప్రాజెక్టు డిజైన్‌ చేశారు. కానీ దానికి దాదాపు రెట్టింపు స్థాయిలో వరద వచ్చింది. అప్పటికే గేట్లు ఎత్తి నీటిని తరలించే ప్రయత్నం చేశాం. కానీ కట్ట పై నుంచి ప్రవాహం సాగింది. చివరకు 19వ తేదీ ఉదయం 5.30 గంటలు దాటిన తర్వాత కట్ట తెగిపోయింది. దిగువన గ్రామాల్లోకి వరద ప్రవాహం ఒక్కసారిగా వెళ్లింది. ముందుగానే హెచ్చరికలు చేయడం వల్ల ప్రాణనష్టం తగ్గింది. కానీ నందలూరు, రాజంపేట మండ లాల్లో 9 గ్రామాలు జలమయమయ్యాయి’’ అని ఆయన వివరించారు.చాలా మంది ప్రాణ భయంతో పరుగులు తీశారు. కొండలపైకి ఎక్కి తలదాచుకున్నారు. అందులో కొందరు వరద ప్రవా హంలో కొట్టుకుపోగా, మిగిలిన వారు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కళ్లెదురుగానే కొట్టుకుపోయారు
‘మా ఆయనకు చెవుడు. ఎంత చెప్పినా వినబడలేదు. వరద వచ్చేస్తుందని మాకు ఎవరో ఫోన్‌ చేశారు. ఆలోగానే నీరు వాకిట్లోకి వచ్చేసింది. కొండపైకి వెళ్లాలంటే మాకు ఓపిక లేదు. అరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా గానీ ఇలాంటి భయంకర దృశ్యాలు చూడలేదు. మిద్దె పైకి ఎక్కి తలదాచుకున్నాం. చుట్టూ వరద నీరు. అలలు అలలుగా ఎగిసిపడేది. ఏం జరుగుతుందో తెలియదు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. మూడు,నాలుగు గంటల తర్వాత శాంతించింది. మా కళ్లెదురుగానే కొందరు నీటిలో కొట్టుకుపోయారు. మా బంధువులిద్దరి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’’ అంటూ పులపుత్తూరు గ్రామానికి చెందిన ఎం నాగమణి బీబీసీకి తెలిపారు.సమీపంలోని గుం డ్లూరు శివాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ శివాలయ పుజారి కుటుంబం ఆచూకీ కూడా ఇప్పటి వరకూ దొరకలేదు. ఇంకా అనేక మంది గల్లంతయినట్టు చెబుతున్నారు. చెయ్యేరు వరదల మూలంగా మరణించిన వారిలో 12 మంది మృతదేహాలు లభ్యమయినట్టు అధికా రులు ప్రకటించారు. మరో 15 మంది వరకూ ఆచూకీ దొరకాలని చెబుతున్నారు.
గల్లంతయిన వారి సంఖ్య ఎక్కువే
అన్నమయ్య ప్రాజెక్టు దిగువన వరదల్లో గల్లంతయిన వారి సంఖ్యపై అనేక రకాల ప్రచారాలు సోషల్‌ మీడియాలో సాగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వారి సంఖ్య 15గా నిర్ధరిం చింది. తమ వాళ్లు కనిపించడం లేదంటూ ఎక్కడికక్కడ స్థానికులు చెబుతున్న సంఖ్యతో పోల్చితే ఇది సగం కంటే తక్కువే.‘‘ప్రభుత్వం చెప్పిన సంఖ్యకు, మా ఊరిలో కనిపించకుండా పోయిన వారి సంఖ్యకు సంబంధం లేదు. మా సొంత మేనత్త, ఆమె భర్త కనిపించడం లేదు. ఇంట్లో సామాను కోసం అని కొంత ఆలస్యం చేశారు. మేం కేకలు వేస్తున్నా వారు తొందరగా బయటపడలేదు. దాంతో ఇప్పుడు వారి ఆచూకీ లేదు. మా గ్రామంలోనే ఎస్సీ కాలనీలో ముగ్గురు కనిపించడం లేదు. రాజుల పేటకు చెందిన నలుగురు కనిపించడం లేదు. ఒక్క మా ఊరిలోనే 10 మంది. మందపల్లిలో ఆరు, గుండ్లూరులో 10 ఇలా ఇప్పటికే మా ప్రాం తంలో 26 మంది గల్లంతయ్యారు. ప్రభుత్వం మాత్రం తక్కువగా చెబుతోంది’’ అని పులపు త్తూరుకి చెందిన ఎం.నాగిరెడ్డి తెలిపారు.
నెల్లూరులో కకావికలం
ఎగువన కురిసన వర్షాలతో పెన్నా నది పోటెత్తింది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించింది. నెల్లూరు నగరం, కోవూరు నియోజకవర్గం సహా పలు ప్రాంతాలను జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి కారణమైంది. 20వ తేదీ తెల్లవారుజాము నుంచి నెల్లూరులో వరద తాకిడి తీవ్రంగా కనిపించింది. అంతకు ముందే గూడురు వద్ద జాతీయ రహ దారిపై నీరు చేరింది. కావలి, సూళ్లూరుపేట పరిసరా ల్లో లక్షల ఎకరాల పంట నీటమునిగింది. పొలాలు చెరువులను తలపించాయి.చివరకు 20వ తేదీ రాత్రి నెల్లూరు వద్ద ఎన్‌హెచ్‌-16కి కూడా గండిపడిరది. కోవూరు సమీపంలో కూడా కృష్ణపట్నం,బళ్లారిరోడ్డు పైకి వరద ప్రవాహం చేరడం, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకపోవడంతో తీవ్రంగా వరద తాకిడి కొనసాగుతోంది.ఎగువన సోమశిల శాంతించి నప్పటికీ మైలవరం డ్యామ్‌తో పాటుగా, పెన్నార్‌ నుంచి ప్రవాహం కొనసాగుతోంది. దాని కారణంగా పెన్నా నదికి వరద 21 వ తేదీ రాత్రి వరకూ కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు భావిస్తున్నారు.18 మంది మృతి, 3,500 పశువులు మృతిభారీ వర్షాలు, వరదల మూలంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో 18 మంది మరణించినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నట్టు ప్రకటించారు. వేల పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. సుమారు 3,500 పశువులు మృతి చెందినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 28 కుంటలు, చెరువులు, కాలువలు తెగిపోయాయని విపత్తుల నిర్వహణశాఖ వెల్లడిరచింది.
తిరుపతిపై జలఖడ్గం..
తిరుమల తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో తిరుమల గిరులన్నీ జలపాతాల్లా మారాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా వరద నీరే. వరద వెళ్లే కాలువలు చిన్నగా ఉండడం.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో.. కాలనీలన్నీ నదుల్లా మారిపోయాయి. వాహనాలు, జంతువులు కళ్ల ముందే కొట్టుకుపోయాయి. ఇళ్లలోని సామానులు కాగితపు పడవల్లా నీటితో తేలియాడుతూ వెళ్లిపోయాయి. తిరుమల, తిరుపతిలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యాలను చూడలేదని స్థానికులు తెలిపారు. కనివినీ ఎరుగని రీతితో వరద ముంచెత్తిందని వాపోతున్నారు. ఇంతటి ప్రకృతి విపత్తును ఊహించలేదని చెబుతున్నారు.టీటీడీకి 4కోట్లకు పైగా నష్టం..30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’ నవంబరు 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్‌ డ్యామ్‌లు పొంగి పొర్లి..కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచేశాయని ఆయన తెలిపారు.

పోల‌వ‌రంపై పాత‌పాటే!

పోలవరం ప్రాజెక్టుపై ఎప్పటి కప్పుడు పరిశీలిస్తామని చెబుతున్న కేంద్రం తాజాగా దక్షి ణాది రాష్ట్రాల మండలి సదస్సు సందర్భంగా కూడా ఆపాత పాటనే వినిపించింది. 2017లో చెప్పినట్లుగానే 100 శాతం నిధులను భరిస్తామని మాత్రమే చెప్పిన కేంద్రం సహాయ పునరావాసం, తాజా అంచనాలపై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. ఎస్‌జెడ్‌సి సదస్సు సందర్భంగా నవంబర్‌ 8,10వ తేదీల్లో రాష్ట్రానికి రాసిన రెండు లేఖల్లోనూ స్పష్ట మైన వివరాలు చెప్పకపోవడం గమనార్హం. 8వ తేదీన రాసిన లేఖలో 2014కు తరువాత జాతీయ హోదా పొంది,అనంతరం జరిగిన పనుల్లో మొత్తం100 శాతం తామే భరిస్తామని చెప్పిన విషయాన్నికూడా ఆ లేఖలో పునరుద్ఘాటించింది. అయితే, ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ విలువను మాత్రమే భరించనున్నట్లు పేర్కొంది. అరటేప్రాజెక్టుకు సంబం ధిరచి సహాయ పునరావాసం పనులకు నిధులివ్వ డానికి సానుకూలంగా లేనట్టేనని రాష్ట్ర అధికా రులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాజా గా పెరిగిన పనుల అంచనా, కొత్త డిజైన్లపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పైగా 2017-18 ధరల మేరకు కొత్త అంచనా రూ.47,725 కోట్లుకు సంబంధించిన ప్రతిపాదనలు ‘ఇన్‌ ప్రోగ్రెస్‌’గా ఉన్నట్లు లేఖలో పేర్కొన్న కేంద్రం, దాని వాస్తవిక పరిస్థితి ఏమిటన్నది స్పష్టం చేయక పోవడం గమనార్హం. ఇక10వ తేదీన రాసిన మరో లేఖలో కూడా ఆర్ధిక పరమైన అంశాలపై పాత పాటే పాడింది. జాతీయ హౌదా ప్రకటిరచిన తరువాత ఇప్పటివరకు 13,226 కోట్ల రూపాయలు ఖర్చు జరిగిరదని, అరదులో ఇప్పటికే రూ.11, 600 కోట్లు రీయింబర్స్‌ చేసామని వివరించింది. మరో రూ.302 కోట్లు బిల్లులు ఆర్ధిక శాఖ వద్ద ఉన్నాయని పేర్కొంది. మిగిలిన రూ.605 కోట్ల విలువైన బిల్లులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దనే పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. 2013-14ధరల మేరకు మారిన అంచనా 20,398 కోట్లు గా చెప్పిన కేంద్రం 2014కు ముందు జరిగిన వ్యయం తీసివేయగా మిగిలింది రూ.15,667 కోట్లుగా గతంలోనే అరగీకరించింది. ఈ నిధులను మాత్రమే ఇస్తామని చెప్పడంతో కొత్త అంచనాలపై ఆశలు గల్లంతవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ లేఖలు రాష్ట్ర ఆర్ధికశాఖ, నీటిపారుదల శాఖల్లో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. స్పష్టమైన హామీలు రాకపోవడంవల్ల మరోసారి హస్తిన యాత్ర చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.పోలవరానికి తిలోదకాలే!!
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం రోజుకో నాటకమాడుతోంది.తుది అంచనా వ్యయాన్ని ఆమో దించకుండా దాగుడుమూత లాడుతోంది. దీని కంతటికీ ప్రస్తుత సీఎంజగన్మోహన్‌రెడ్డి నిర్వా కమే కారణం.చేసిన పాపం ఆయన్ను ఇప్పుడు కట్టి కడుపు తోంది. ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని రూ.55, 548.87 కోట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణ యించినప్పుడు..వేలకోట్లు దోచుకోవడానికే అంచ నాలు పెంచారని నాటి విపక్ష నేతగా ఉన్న జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.ఎన్‌జీటీ, సుప్రీంకోర్టుల్లో కేసులు వేయిం చారు.నిజం తెలిసీ పోలవరం చంద్రబాబుకు ఏటీ ఎంలా మారిందని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచా రంలో ఆరోపించారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్‌.. నాడు చంద్రబాబు రూపొందించిన తుది అంచనా వ్యయాన్నే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.కానీ కేంద్ర జలశక్తి శాఖ నియమించిన కమిటీ రూ.47,725.25 కోట్లకు దానిని కుదించింది. తర్వాత ఈ వ్యవహారం కేంద్ర ఆర్థిక శాఖను చేరింది.ప్రాజెక్టులో సాగునీటి కాంపోనెంట్‌కే నిధులస్తామని మెలిక పెట్టింది. సాగునీటి అవసరాలకు సంబంధించిన వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని అంది.ఆ తర్వాత 2017లో కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన రూ.20,398 కోట్ల తుది అంచనాకే కట్టుబడి ఉంటామని పేర్కొంది. దానిప్రకారమే రాష్ట్రప్రభుత్వాన్ని ఒప్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సూచిం చింది. పీపీఏ అత్యవసర భేటీలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. 2013-14 అంచనా ధరలకు ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో చెప్పాలని నిలదీశారు.అది సాధ్యం కాదని కేంద్ర జలసంఘం అధికారులు కూడా స్పష్టం చేశారు. దీనిపై ఆర్థిక శాఖ నిర్ణయం కోసం రాష్ట్రప్రభుత్వం ఎదురుచూస్తోంది.కానీ కేంద్రం నిధులివ్వదని మాత్రం అర్థమైంది. అందుకే ప్రాజెక్టు ఎత్తును కుదించాలని దాదాపు నిర్ణయించినట్లు తెలిసింది.
సాధికారికంగా బలి..
ఆంధ్రుల జల-జీవ నాడిగా తెరపైకి వచ్చిన పోలవరం ప్రాజెక్టును ‘బలి’ చేసే ప్రక్రియ సాధికారికంగానే మొదలైంది. కేంద్రం నుంచి పోరాడి నిధులు సాధించడం పక్కనపెట్టి..నీటి నిల్వ ఎత్తును తగ్గించడంపైనే జగన్‌ సర్కారు దృష్టి పెట్టింది. ప్రాజెక్టులో నీటిని 45.72 మీటర్ల ఎత్తు వరకు నిల్వ చేయాలన్నది తొలి ప్రతిపాదన. దీని ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ.55వేల కోట్లు! కానీ,2013-14 అంచనా వ్యయానికే కట్టు బడి ఉంటామని..20వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్ర ఆర్థికశాఖ తేల్చి చెప్పింది.దీంతో.. పరిహారం ఖర్చును తగ్గించుకునేలా నీటి నిల్వను 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తమైంది. అదే జరిగితే..అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి.సాగునీటి రంగంపై ఆమధ్య సమీక్ష జరిపిన జగన్‌..పోలవరంలో నీటిని41.15 మీటర్ల ఎత్తువద్ద నిల్వచేస్తే భూసేకరణకు ఎంత వ్యయం అవుతుందో పూర్తిస్థాయి సమాచారం తీసుకురా వాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితులు, సహాయ పునరావాసం వంటి అంశాలనూ తెలియ జేయాలన్నారు. వెరసి..ప్రాజెక్టు ఎత్తు కుదింపుపై స్పష్టమైన సంకేతాలు పంపారు. 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేపట్టాలంటే భూసేకరణ, సహాయ పునరావాసానికి రూ.3500కోట్ల అవసర మవుతాయని సహాయ పునరావాస కమిషనర్‌ చెప్పారు.దీనికోసం నెలకు రూ.300 కోట్లు చొప్పున విడుదల చేయాలని సీఎంవో కార్యదర్శి ధనుంజ యరెడ్డిని జగన్‌ ఆదేశించారు.ఇక నిర్మాణ పనులకు రూ.1000 కోట్లు కావాలని ప్రాజెక్టు సీఈ సుధాకర బాబు కోరారు.దీంతో మొత్తంగా రూ.5000 కోట్లు అవసరమవుతాయని,ఈ మొత్తాన్ని ప్రతినెలా విడ తల వారీగా మంజూరు చేస్తామని జగన్‌ తెలి పారు. పోలవరంలో నీటి నిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేస్తే భూసేకరణ,పునరావాసానికి రూ.3 500 కోట్లు అవసరమవుతాయి. 69,688.38 ఎకరాల భూసేకరణ అవసరం.ఇందులో 68, 087.88 ఎకరాలు ఇప్పటికే సేకరించి నందున.. మరో1600.50 ఎకరాలు సేకరిస్తే సరిపోతుంది. భూసేకరణతో20,870మంది నిర్వాసితులవు తారు. వారిలో ఇప్పటికే 3110 మందికి పరిహారం చెల్లించినందున..మరో 17,760 మందికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విశాఖ పారిశ్రా మిక, తాగునీటి అవసరాల కోసం పోలవరం నుంచి పైపులైన్‌ వేసే విషయంపై ప్రతిపాదనలు తేవాలని సీఎం ఆదేశించారు.నిజానికి విశాఖ వరకు ప్రధాన కాలువ ఎప్పుడో పూర్తయింది.ఇప్పుడు కొత్తగా పైపులైన్‌ అవసరమేంటి? అంటే ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని నిర్ణయించినట్లే కదా! 41 మీటర్లకే పరిమితమైతే అదిబహుళార్థ సాధక ప్రాజెక్టు కాదు..సాధారణ బ్యారేజీగా మిగిలిపోతుంది.
కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయమే కీలకం !
పోలవరం అంచనాలపై ఢల్లీిలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావతతో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పి.అనిల్‌ కుమార్‌, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి తదితరులు భేటీ అయ్యారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ భేటీలో పాల్గొం టారని సీఎంవో లీకులిచ్చింది.అయితే అలాంటి కార్యక్రమమే ఖరారు కాలేదు. కేవలం షెకావతను కలిశారు. కేంద్ర జల సంఘం సిఫారసు చేసిన అంచనా వ్యయం రూ.47725.74 కోట్లకు ఆమోదం తెలపాలని ఆయన్ను కోరారు.అయితే కేంద్ర ఆర్థిక శాఖే నిర్ణయం తీసుకోవాలని ఆయన తేల్చేశారు.ఈ సమావేశం ఎలాంటి ఫలితాలూ ఇవ్వలేదు. ఈ భేటీ తర్వాత మంత్రులు బుగ్గన, అనిల్‌ విలేకరులతో మాట్లాడారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై అవలంబించిన విధానాలపై మోదీ సర్కారుకు దురభిప్రాయం ఉందని..జగన్‌ పగ్గాలు చేపట్టాక కేంద్ర వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. ప్రాజెక్టుకు నిధుల విషయంలో ఉదారత చూపుతోందని అన్నారు.అదే నిజమైతే 20.398 కోట్లే ఇస్తానని ఎలా చెబుతుంది? చంద్రబాబు సీఎంగా ఉండగా..ఇంత మొత్తమే ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన రూపొందించిన 55 వేల కోట్ల తుది అంచనాలకు సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదముద్ర వేసిందని రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.పైగా వైసీపీ నంబర్‌ టూ విజయసాయిరెడ్డి ప్రాజెక్టులో అవినీతిపై రాజ్యసభలో ప్రశ్నించినప్పుడు ఆ అవకాశమే లేదని ఇదే షెకావత పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పారు.పైగా టీడీపీ వ్యయం చేసిన నిధులు రూ.8,500 కోట్లను కేంద్రం రీయింబర్స్‌మెంట్‌ చేసిందని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తం నుంచే జగన్‌ సర్కారుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1,850 కోట్లు..తాజాగా 2,234.288 కోట్లు విడుదల చేసింది.జగన్‌ ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తానికి సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క బిల్లు కూడా రీయింబర్స్‌ కాలేదు.ఈ బిల్లులు ఇంకా పీపీఏ వద్దే ఉన్నాయి.ఇంకా కేంద్రానికి పంపనేలేదు.ఎందుకంటే చేసిన పనులకు, పెట్టిన బిల్లులకు పొంతన లేదు. 55 వేల కోట్ల అంచనాలను ఆమోదించిన టీఏసీ..ఇంజనీరింగ్‌ అధికారుల బృందమే తప్ప కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదని ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అడ్డగోలుగా వాదించింది. ఇప్పుడు అదే టీఏసీ నిర్ధారణ మేరకే రూ.55,548.87 కోట్ల అంచనా వ్యయానికి అంగీకరించాలని..కనీసం సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకైనా ఆమోదం తెలపాలంటూ..ప్రధాని మోదీని, అమితషా, నిర్మలా సీతారామన్‌, షెకావతలను ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా అభ్యర్థిస్తున్నారు.ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే..ఒక్క భూసేకరణకే రూ.28 వేల కోట్లు వ్యయమవుతాయని ఇప్పుడు చెబుతున్నారు.చంద్రబాబు చెప్పినప్పుడు అవినీతి ఆరోపణలు గుప్పించారు.అయితే..గతంలో వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నందునే..ఎన్నికల ప్రచారం మోదీ నోట పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ‘ఏటీఎం’గా మారిందన్న ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే సత్తా లేక ఇప్పటికే ప్రత్యేక హోదాను అటకెక్కించిన జగన్‌..ఇప్పుడు పోలవరానికి మూతబండ వేసే దిశగా అడుగులు వేస్తున్నారు.రాష్ట్రానికి తీరని అన్యాయం చేయబోతున్నారు.రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఇలాంటి అనర్థాలే సంభవిస్తాయని జగన్‌ గుర్తెరగాలి.కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలను అన్వేషించాలి.అంతేతప్ప తన మంత్రులతో చంద్రబాబును నాలుగు బూతులు తిట్టించి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు క్షమించరన్న సంగతి తెలుసుకోవాలని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
పోలవరంపై కేంద్రం ఉపేక్ష, ముంపు గ్రామాలకు శిక్ష..
ఏపీ విభజన చట్టంలో జాతీయ ప్రాజె క్టుగా ఘనంగా ప్రకటించబడిన పోలవరం కేంద్రం వివక్షతో సమస్యాత్మకంగా నడుస్తుంటే జరిగిన మేరకు పనులు కూడా ప్రజల పాలిట ప్రాణాంతక మవుతున్నాయి. పెరిగిన వ్యయాన్ని లెక్కలోకి తీసు కోకపోవడం ఒకట్కెతే ప్రాథమిక సూత్రమైన సహాయ పునరావాస కార్యక్రమాలకు బాధ్యత లేదని దులి పేసుకోవడం కేంద్రం చేస్తున్న దారుణం. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పునరావాస పనులు సరిగ్గా జరగలేదని తాము అధికారంలోకి రాగానే పటిష్టంగా ఆదుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ పదేపదే ప్రకటించారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రధాని మోడీనే పోలవరం నిర్మాణం అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. తర్వాత ఆయన మళ్లీ ప్రధాని అయ్యారు, జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు గాని పోలవరం వెతలు మాత్రం తీరలేదు.. సరికదా తీవ్రమానవ సంక్షోభంగా మారుతు న్నాయి. కఫర్‌డాం ఘనంగా కట్టేసిన కారణంగా వర్షాలు పెద్దగా కురవకపోయినా సరే నీళ్లు ముం చేస్తున్నాయి.
ఫలితం లేని వినతులు
నిర్మాణ వ్యయం మాత్రమే అది కూడా 2014 నాటిలెక్కల ప్రకారం 22 వేల కోట్లు అది కూడా ముందు రాష్ట్రం ఖర్చు చేసిన తర్వాత మాత్రమే తాము విడుదల చేస్తామని కేంద్రం చాలా సార్లు ప్రకటించింది. ఏ ప్రాజెక్టు కట్టినా ముందు పునరావస కల్పన జీవనోపాధి పునరుద్ధరణ జరిగాకే జరగాలని సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాలు అనేక సార్లు చెప్పి వున్నాయి. ఈ అంశంపై కేంద్రంలోని మోడీ సర్కారు కావాలనే వంకరటింకరవాదనలతోచేతులు దులిపేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియా ప్రియత్వం వహిస్తున్నది. అడపాదడ వినతులతో సరిపెడుతున్నది. గత నెలలోనే ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ఢల్లీికి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. కేంద్రం నుంచి ఈ విషయంలో రావలసిన సహాయం రావడం లేదనేది వాస్తవం. ప్రజలకు చెప్పి ప్రతిపక్షాలను కలుపుకొని వొత్తిడి పెట్టె బదులు టిడిపి, వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో మునిగి తేలుతున్నాయి. 55 వేల కోట్లకు పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపును తాము ఆమోదింప చేసుకుంటే ఈప్రభుత్వ హయాంలో వెనక్కు పోయిం దని టిడిపి చాలా కాలం విమర్శించింది. అయితే తర్వాత జల్‌శక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పిపిఎ)ఈపెరిగిన ఖర్చుకు ఒప్పుకున్నట్టు అది తమ విజయమైనట్టు వైసీపీనేతలు చెప్పుకున్నారు. అందులో భాగంగా కొన్ని వందలకోట్లు విడుదల చేస్తే అదో ఘనతగా చూపించుకున్నారు. అసలు సమస్యగా వున్న పునరావాసం దాటేస్తున్నారు. ప్రచారార్భాటంతో పర్యటనలకు వెళ్లి ప్రతిపక్షంపై సవాళ్లు విసిరే మంత్రులు అనిల్‌కుమార్‌ వంటివారు దీనిపై మాట్లాడకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి అంతా అయిపోయినట్టే అభినయిస్తారు.
9 గ్రామాలకే దిక్కులేదు,అన్నీఖాళీ అయితే?
ఈప్రాజెక్టు నిర్మాణం, నీటినిల్వ ప్రవా హం కారణంగా 275 గ్రామాలలో 1,07లక్షల కుటుంబాలు నిర్వాసితమవుతాయి. లక్షాముప్పై వేల ఎకరాలు మునిగిపోతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలు, తూర్పుగోదావరిజిల్లాలో పోలవరం, దేవీపట్నం,అంగలూరు, వరరామచంద్రాపురం (విఆర్‌పురం) చింతూరు, ఏటపాక, కూనవరం మండలాలు మునిగిపోతాయి.ఇందులో దేవీ పట్నం పోలవరం మినహా మిగిలిన మండలాలన్ని తెలం గాణ నుంచి బదలాయించబడినవే.కఫర్‌డ్యాం ఎత్తు పెంచాలనీ,వీల్కెతే దానిద్వారా ముందే నీళ్లు ఇవ్వా లని ఉత్సాహపడిన సర్కార్లు ఫలితంగా సంభ వించే ముంపుబాధితుల గోడు మాత్రం పట్టించు కోలేదు. అరకొర పునరావాసం కల్పించింది మాత్రం కేవలం 9 గ్రామాలలో 3300 కుటుంబా లకు మాత్రమే. ఇది మూడు శాతం కూడా కాదు. విద్యుత్‌ పనుల కోసం మరో 60 గ్రామాలవారిని బలవంతాన అక్కడినుంచి తొలగించినంత పని చేశారు. ఇక 41.15 కాంటూరు పరిధిలోకి వచ్చే 90 గ్రామాలు ఖాళీ చేయించాలని ప్రభుత్వం వత్తిడి చేస్తున్నది. ఇప్పుడు నిల్వ చేసిన నీటిని వదలడానికి స్పిల్‌వే గేట్లు ఉపయోగిస్తున్నారు. రేపు ఆగేట్లు మూ సేస్తే మొత్తంవూళ్లూ మునిగిపోతాయి. 2013 భూసేకరణ చట్టంప్రకారం భూమికి భూమిఉపాధి కల్పించాలి. కాని గిరిజనుల పోడు భూము లకు పట్టాలు లేవనే సాకుతో పరిహారమే ఎగవేశారు, ఇదిగాక 39సదుపాయాలతో ప్రత్యామ్నాయ గృహనిర్మాణం ప్రభుత్వాల నిర్మాణ సంస్థలబాధ్యత. చంద్రబాబు ఎకరాకు 1.25 లక్షల చొప్పున ఇచ్చిన ప్యాకేజీ సరిపోదని తామువస్తే 10లక్షలు ఇచ్చి పంపిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు, ఇప్పటికీ సమీక్షలలో చెబుతుంటారుగాని ఇచ్చింది లేదు.
నిబంధనల ఉల్లంఘన, అర్హులకు అన్యాయం
ఇక అర్హుల విషయమే చూస్తే గతంలో అనర్హులను చేర్చడం వల్ల దాన్నిసాకుగా చూపి బాధితులకు కూడా అన్యాయం చేశారు పాలకులు. వాస్తవానికి ఆ సంఖ్య పెరుగుతున్నది. 2017ను కొలబద్దగా తీసుకుని 18ఏళ్లు పైబడినవారు 1.25 లక్షల మంది వున్నారని లెక్కవేశారు. 2021 నాటికి పూర్తికాని పనులతో ఆ సంఖ్య 5లక్షలు దాటింది. నిర్వాసితులకోసం కట్టిన కాలనీలు లోపభూయిష్టం గా ఎలాంటి వసతులు లేకుండా కాస్తవానకే కారుతూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి, ఏకంగా 30లక్షల ఇళ్లు కట్టి పండుగ చేస్తానంటున్న సర్కారు ముంపు ప్రాంతాల్లో ఎందుకుకట్టడం లేదు? గిరిజనులకు షెడ్యూలు ప్రాంతాలలోనే పునరావాసం కల్పించాలి గాని నాన్‌షెడ్యూల్‌ ప్రాంతాలకు తరలించి తంతు పూర్తి చేయడం మరో రాజ్యాంగ విరుద్ధ చర్య. ఇక్కడ దాదాపు 60 శాతం గిరిజనులే. ఇవన్నీగాక మానవ హక్కుల సమస్యలు కూడా వున్నాయి. ఉదాహరణకు ముంపు వచ్చేలోగా సరుకులు తీసుకు పోవడానికి టేకూరు వాడపల్లి తూటూరు వంటి గ్రామాల నుంచి ఏలూరు వచ్చిన ప్రజలను తిరిగి వారి గ్రామాలకు పోనీకుండా పోలీసులు అడ్డు కోవడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇటీవల అఖిల పక్ష నాయకులు ఆ గ్రామాలలో పరిశీలనకు వెళ్లినప్పుడు నిర్వాసితులు చెప్పిన వాస్తవాలు హృద యవిదారకంగావున్నాయి. వాటిపై విజయ వాడలో దీక్షలకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ నిర్బంధించి రాకుండాచేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పుండు మీద కారం రాసింది. కేంద్రంజాతీయ ప్రా జెక్టు అంటూనే పోలవరం నిర్మాణ నిధులు పునరా వాస వ్యయం విడుదల చేయకపోవడం బాధ్యతా రాహి త్యమే. వ్యవసాయం నిలిచిపోయిపంటలూ పనులు లేక ఆప్రజలు గోడుపెడుమంటున్న నేపథ్యం మరింత దారుణంగా వుంది. కేంద్రంతో పోరాడి 33వేలకోట్ల నిధులు తక్షణం రాబట్టి కనీసవసతు లతో కాలనీలు నిర్మించి వారిని తరలించకపోతే తీవ్ర అసంతృప్తికి గురి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ప్రత్యేకహోదాకు ఎగనామం. లోటు భర్తీకి మంగళం..రాజధానికి రిక్తహస్తం.. విశాఖ ఉక్కు బేరం..వంటి కేంద్ర చర్యలు రాష్ట్ర ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి, ఏ ఒక్క అంశంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలనే ధోరణి మోడీ సర్కారులో లేకున్నా గట్టిగా అడిగే చేవ జగన్‌ సర్కారుకూ వుండటం లేదు. ప్రజల బాధలు విని సత్వర సహాయం పునరావాసం కల్పించడం కేంద్ర రాష్ట్రాల బాధ్యత.లేకుంటే వారి నిరసన అని వార్యం.
-జిఎన్‌వి సతీష్‌

బాల్యం అంద‌మైన జ్ఞాప‌కం

పాపం పుణ్యం ప్రపంచ మార్గం/ కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలూ/ ఏమీ ఎరుగని పూవుల్లారా/ ఆకసమున హరివిల్లు విరిస్తే/ అవి మీకే అని ఆనందించే/ కూనల్లారా’ అంటూ బాలలను ముద్దు చేస్తాడు మహాకవి శ్రీశ్రీ. కష్టసుఖాలు ఎన్నున్నా సంపూర్ణ ఆరోగ్యంతో… విజ్ఞానవంతులు కావాలి బాలలు. వారు దేశ భవితకు వనరులు…వారధులు… ఆశాదీపాలు.వారి శ్రేయస్సే దేశాభివృద్ధికి మూలం. అందుకే అంటారు…‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని. బాల్యాన్ని ఆనందంగా…ఆరోగ్యవంతంగా అనుభవించడం ప్రతి చిన్నారి జన్మహక్కు. ఎవరికై నా బాల్యం ఒక అందమైన జ్ఞాపకం. ‘స్వచ్ఛ మైన పువ్వులు/విచ్చుకున్నబంధాలు/పెంచుకున్న అను బంధాలు/చిన్ననాటి జ్ఞాపకాలు’అనిఓకవి అంటాడు. మనిషి వ్యక్తిత్వం బాల్యాన్ని పెనవేసుకునే వికసి స్తుంది. మనిషిగా ఎంత ఎదిగినా…బాల్యపు జ్ఞాప కాలు…అనుభవాలు అప్పుడప్పుడు తట్టి లేపుతూనే వుంటాయి. అమ్మ లాలిపాట, గోరుముద్దలు, నాన్న మురిపెం,అమ్మమ్మ,నానమ్మ,తాతయ్యల గారా బాలు…అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అత్తామామల ప్రేమానురాగాల మధ్య బాల్యం ఆనందంగా గడిచిపోతుంది.అందమైన జ్ఞాపకంగా మిగిలి పోతుంది. తిరిగిరాని బాల్యాన్ని తలచుకొని ‘నా సర్వస్వం నీకిచ్చేస్తా… నా బాల్యం నాకు ఇచ్చెరు’ అంటాడు సినారె. బాల్యం అంటే…రంగురంగుల అనుభూతులే కాదు… మింగుడుపడని విషాదాలూ వుంటాయి.తన ప్రమేయం లేకపోయినా అనుభ వించక తప్పని కష్టాలూ వుంటాయి.
చిట్టిచిట్టి చేతుల చిన్నారులు బాల కార్మికుల వుతున్నారు. ఆడిపాడాల్సిన వయస్సులో నాలుగు గోడల మధ్య బందీ అవుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో విజ్ఞానవంతులు కావాల్సిన పిల్లలకు తగిన ఆదాయాలు లేక తల్లిదండ్రులు పౌష్టికాహారం అందించలేకపోతున్నారు. గర్భస్థ శిశువు నుండే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తక్కువ బరువుతో పుట్టడం,అంగవైకల్యంతో పుట్టడం వంటి కారణాల వల్ల వీరు మిగతా పిల్లలతో సమానంగా వుండలేకపోతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాలు, వయసుకు తగిన బరువు లేకపోవటం, శిశు మరణాల రేటు వంటి అంశాలను పరిగణ నలోకి తీసుకున్న ‘ప్రపంచ ఆకలి సూచీ-2021’ లో…107 దేశాలతో పోల్చితే మన దేశం 94వ స్థానంలో వుంది. దేశంలోని ప్రజల ఆదాయం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలను లెక్క తీసు కుంటే… ‘ప్రపంచ ఆహార భద్రత సూచీ-2021’లో 113 దేశాలతో కూడిన ఈజాబితాలో మనం 71వ స్థానంలో వున్నాం. చిన్నతనంలో ఎదుర్కొనే సమ స్యలు పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విద్య,ఆరోగ్యం,గృహవసతి,పోషకా హారం,పారిశుధ్యం,నీరు అందుబాటులో లేని పిల్లల సంఖ్య 120కోట్లు ఉండగా,కోవిడ్‌ కారణంగా మరో 15కోట్ల మంది అదనంగా యునిసెఫ్‌ అధ్య యనం వెల్లడిరచింది. బాలల జనాభా అత్యధి కంగా గల భారత్‌లో కూడా దీనిప్రభావం భారీ గానే వుంటుందని ఈ నివేదిక నొక్కి చెబుతోంది.
అమ్మమ్మ, నానమ్మ ఇళ్లల్లో ఆటపాటల మధ్య సాగిపోయే బాల్యం…నేడు ఒంటరిపాలైంది. కుం చించుకుపోయిన కుటుంబ వ్యవస్థలో…ఇరుకు ఇళ్ళలో..పలకరింపులు కూడా మరిచి, ప్రపంచీ కరణ వలలో చిక్కుకుపోయిన తర్వాత అందమైన బాల్యం,బాల్య స్నేహాల బంధమెక్కడిది? ప్రభుత్వాలు రుద్దిన ఆర్థిక భారాలతో భార్యాభర్తలిద్దరూ ఉద్యో గాలు చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్ప డిరది. పిల్లల మంచిచెడ్డలు చూడడమూ కష్టతర మౌతోంది. ఏబిడ్డకైనా తల్లి తొలి గురువు. తల్లిదం డ్రులతో పాటు పెద్దలు నేర్పిన నీతి,బాధ్యతలు మంచి పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడ తాయి. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాలు కనీస మౌలిక వసతులను కల్పించాలి. ఆహ్లాదకరమైన వాతావరణం…మౌలిక వసతులు కల్పించడం మన బాధ్యత. ‘బాల బాలికలందరికీ ప్రభుత్వ పాఠ శాలల్లో ఉచితంగా చదువు నేర్పాలి. బాలబాలికలు పని చేసే పద్ధతిని నిర్మూలించాలి. అలాంటి ఒక సుహృద్భావ వాతావరణంలో పిల్లలు ఎదగాలి. ‘మీదే మీదే సమస్త విశ్వం/మీరే లోకపు భాగ్య విధాతలు/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చే నాళ్ల విభాప్రభాతములు’ అంటాడు శ్రీశ్రీ. చిన్నారుల మోమున హాసం మెరిసినప్పుడే నిజమైన ‘బాలల దినోత్సవం’.
బాలల హక్కులపై సమత అవగాహన సదస్సులు
బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా సమత ఆధ్వర్యంలో పలు గిరిజన గ్రామాలు,పాఠశాలల్లోని విద్యార్ధులకు అవగాహన సదస్సలు నిర్వహించింది. బాలల హక్కుల వారోత్సవాలపై యూనిసెఫ్‌ నవంబరు 14 నుంచి 20వరకు వారోత్సవాలు నిర్వహించడానికి పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా సమత సరుగుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల,రామన్నపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించింది. ఈసందర్భంగా గోడపత్రికలను స్థానిక ఉపాధ్యాయులు,సరుగుడు పంచాయితీ సర్పంచ్‌, గిరిమిత్ర సొసైటీ అధ్యక్షుడు బండి గంగ రాజు, సమత డైరెక్టర్‌ విక్కీ,కో`ఆర్డినేటర్లు కె.సతీష్‌, జి.సైమన్‌లతో కలసి సరుగుడు యూపీ స్కూల్‌ ప్రదానోపాధ్యాయుడు డి.సుబ్రహ్మణ్యే శ్వరరావు కలసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యా ర్ధినీ, విద్యార్థులు బాలల హక్కులపట్ల భారత రాజ్యాంగం బాలలకు కల్పించిన హక్కులపై వారి కున్న అనుభవాలను లఘునాటికల ద్వారా ప్రదర్శిం చారు. అనంతరం విద్యార్థులు ప్లకార్డులతో బాలల హక్కుల పరిరక్షిద్దాం..పిల్లల హక్కులను భాగస్వా మ్యం కల్పిద్దాం..నేటిబాలలే..రేపటి పౌరులు, పరిసరాల పరిశుభ్రత మన హక్కు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని సమత డైరెక్టర్‌ విక్కీ,సత్తీష్‌ కుమార్‌ పిల్లలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,విధులపై వివరిం చారు.
కందుకూరి సతీష్‌ కుమార్‌

ఆ గాలిలోనే గ‌ర‌ళం

దేశ రాజధాని నగరంఢిల్లీ మరోసారి వణికిపోతోంది. వాయ కాలుష్యం అమాంతంగా పెరిగిపోయింది. వాయ నాణ్యత దారుణంగా క్షీణిస్తుండటంతో ఆందోళన రేగుతోంది.ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి కారణమేంటంటే.. దేశ రాజధానికి ఉన్న ఒకే ఒక పెను సమస్య వాయు కాలుష్యం. ప్రతియేటా అక్టోబర్‌-నవంబర్‌-డిసెంబర్‌ వస్తే చాలు కాలుష్యం మరింతగా పెరిగిపోతుంటుంది. ఢిల్లీలో హఠాత్తుగా కాలుష్యం రేటు 14శాతంగా నమోదై ఆందోళన కల్గించింది. ఇంత పెద్దమొత్తంలో కాలుష్యం నమోదవడం కలవరం రేపుతోంది. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం కలిగినా.. మళ్లీ గాలి నాణ్యత క్షీణించడం ప్రారంభమైందని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సూచించింది. పంట వ్యర్ధాల్ని ప్రతియేటా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో రైతులు అక్కడే పొలాల్లో తగల బెడుతుంటారు. ఇదంతా ఢిల్లీ సరిహద్దు లోని హర్యానా, రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరుగు తుంటుంది. ఆ పొగంతాఢిల్లీను కమ్మేస్తుం టుంది. ఒక్కసారిగా 14శాతం కాలుష్య రేటుకు కారణం కూడా పంటవ్యర్ధాల్ని తగలబెట్టడ మేనని తెలిసింది. ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అందించిన డేటా ప్రకారం పంజాబ్‌లో గత రెండ్రోజుల్లోనే 1089 పంట వ్యర్ధాల్ని తగలబెట్టారు. అదే విధంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాల్లో 1789 పంటవ్యర్ధాల్ని కాల్చారు. పొరుగు రాష్ట్రాల ప్రభావంతోనే ఢల్లీిలో వాయు కాలుష్యం(ణవశ్రీష్ట్రఱ Aఱతీ ూశీశ్రీశ్రీబ్‌ఱశీఅ) పెరుగు తోంది. పదిరోజుల్లో జరిగిన సంఘటనల కంటే రెండ్రోజుల్లో నమోదైన పంట వ్యర్ధరాల తాలూకు పొగ ఎక్కువగా ఉందని డేటా చెబుతోంది. సాధారణంగా అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో వరికోతలుంటాయి. ఆ తరువాత గోధుమ, బంగాళాదుంప సాగు చేస్తారు. పంట అవశేషాల్ని త్వరగా తొలగించే ప్రక్రియలో భాగంగా రైతులు వ్యర్ధాలకు నిప్పు పెడుతుంటారు. ఢిల్లీఎన్‌సీఆర్‌(ణవశ్రీష్ట్రఱ చీజR) పరిధిలో వాయు కాలుష్యం పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా ఉంటోంది.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య వారంలో 22 శాతం నుంచి 44శాతానికి పెరిగింది. అయితే ఈ ప్రాంతంలోని ప్రజలు కాలుష్యం తగ్గించడానికి మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు. తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ లోకల్‌ సర్కిల్స్‌ సర్వే ప్రకారం.. రెండో వారంలో వాయు కాలుష్యం అధికంగా పెరిగింది. ప్రజల పరిస్థితి మరింత దిగజారింది.86 శాతం ఢిల్లీ-ఎన్‌సిసిఆర్‌ కుటుంబాలలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు విషపూరిత గాలి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 56 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిలో గొంతునొప్పి, కఫం, గొంతు బొంగురుపోవడం, కళ్ల మంటలు వంటి సమస్యలు ఉన్నాయి. ఈ సర్వేలో ఢిల్లీ, గుర్గావ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌లకు చెందిన 25000 మందికి పైగా ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ నగరాల్లో గాలి నాణ్యత సూచిక 300-1000 మధ్య ఉంది. సర్వే ప్రకారం..’’ గత రెండు వారాల్లో డాక్టర్‌ లేదా ఆసుపత్రిని సందర్శించే వారి శాతం రెండిరతలు పెరిగింది. సహాయం కోరే కుటుంబాలు 22 శాతం నుంచి 44 శాతానికి పెరిగాయి.
ప్రపంచంలోనే టాప్‌ పొల్యూటెడ్‌ సిటీ ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి పండుగ తర్వాత నుంచి పరిస్థితి మరింత దిగజారుతూ వస్తున్నది. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నా మాస్క్‌ పెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురవుతున్నది. శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచి.. చెత్త రికార్డును మూట గట్టుకున్నది. ఈ జాబితాలో ముంబై, కోల్‌కతా కూడా చేరాయి.స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్‌ గ్రూప్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (IూA)ని తాజా జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్‌ గాలి నాణ్యత, కాలుష్యాన్ని పర్యవేక్షిస్తుంటుంది. టాప్‌-10 జాబితాలో పాకిస్థాన్‌లోని లాహోర్‌, చైనాలోని చెంగు నగరాలున్నాయి. దేశ రాజ ధానిలో నెలకొన్న ఈ దుస్థితికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పాటు పంజాబ్‌, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యర్థాల విషయంలో రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నది. అలాగే యూపీలోని బులంద్‌షహర్‌, హాపూర్‌, నోయిడా, మీరట్‌, ఘజియాబాద్‌లోనూ ఏక్యూఐ 400కు పెరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌, ఉదయపూర్‌, అజ్మీర్‌, పుష్కర్‌ సహా 15 జిల్లాల్లో కాలుష్యం పెరిగింది. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు నష్టం సీపీసీబీ ప్రకారం.. ఢిల్లీలోగాలిలో పీఎం2.5 స్థాయి శుక్రవారం అర్ధరాత్రి 300 మార్క్‌ను దాటింది. సాయంత్రం 4 గంటలకు క్యూబిక్‌ మీటర్‌కు 381 మైక్రోగ్రాములు. గాలి నాణ్యంగా ఉండా లంటే పీఎం 2.5 స్థాయి క్యూబిక్‌ మీటరుకు 60 మైక్రోగ్రాములుండాలి. ప్రస్తుతం ఆరు రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉన్నది. పెరుగుతున్న వాయు కాలుష్యం ఊపరితిత్తుల క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరి స్తున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ప్రాణవాయువే… ప్రాణాంతకం
ప్రాణవాయువే…ప్రాణాంతకంగా మారితే అంతకన్నా ఘోరం ఉంటుందా? కాలుష్యం దెబ్బకు గాలి నాణ్యత గణనీయంగా పడి పోయిందనే కారణంతో ఏకంగా దేశరాజ ధానిలో కొద్ది రోజులు లాక్డౌన్‌ పెట్టే ఆలోచన చేస్తున్నారంటే ఇంకేమనాలి? దట్టంగా కమ్మేసిన వాయు కాలుష్యం… యమునా నదిని నింపేసిన విషపు నురగలతో జల కాలుష్యం…గత పది రోజుల్లో రెండున్నర వేలకు పైగా కొత్త డెంగ్యూ కేసులు…ఉన్నట్టుండి పెరుగుతున్న కోవిడ్‌ కేసులు -ఇలా ఢల్లీిలో పరిస్థితులు దయనీయం అనిపిస్తున్నాయి. సోమవారం సుప్రీమ్‌ కోర్టు వేసిన మొట్టికాయలను బట్టి చూస్తే, ఏయేటి కాయేడు పెరుగుతున్న కాలుష్య సమస్యపై దృష్టి పెట్టని పాలకుల నిర్లక్ష్యం వెక్కిరిస్తోంది. చలి పెరిగేవేళ, ప్రధానంగా కొయ్యకాళ్ళు కాల్చే అక్టోబర్‌ చివర నుంచి నవంబర్‌ వరకు ఒక పక్క వాతావరణం, మరోపక్క ఇతర కాలుష్యా లు కలగలిసి ఢల్లీిలో ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ఏడెనిమిదేళ్ళుగా ఇది చర్చనీ యాంశమే. ఈ ఏడాది పంటకోతలు ఆలస్యమై, అక్టోబర్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఆశలు రేపింది. కానీ,నవంబర్‌ మొదట్లో దీపావళి టపాసులు,పక్క రాష్ట్రాలలో పెరిగిన పంట వ్యర్థాల మంటలు తోడై,ఈ నెలలో తొలి పది రోజులూ ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థా యికి చేరింది. గాలి గరళంలా మారడంతో నవంబర్‌ 13న సుప్రీమ్‌ కోర్టు కొరడా జుళిపిం చింది. ఢిల్లీ సర్కారు అత్యవసరంగా సమా వేశమై, కరోనా తర్వాత మొన్నామధ్యే తెరిచిన స్కూళ్ళను సైతం మూసేసి, నిర్మాణ కార్యక లాపాలకు బ్రేక్‌ ప్రకటించింది. లాక్డౌన్‌కు కూడా సిద్ధమైంది. ప్రపంచ కాలుష్య నగరాల్లో ముందు వరుసలో ఉన్న ఢల్లీిలో ఏడాది పొడుగూతా ‘వాయు నాణ్యత సూచి’ (ఏక్యూఐ) ఆందోళనకరమే. సగటున గంటకో చెట్టు నరికివేతకు గురవుతోందని లెక్కిస్తున్న ఢల్లీిలో దుమ్ము ధూళి,పరిశ్రమలు, వాహనాల లాంటి అనేక కాలుష్య కారణాలున్నాయి. కేవలం 3 వేల చిల్లర ప్రభుత్వ బస్సులే నడుస్తున్నాయనీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనలో గత ఏడేళ్ళలో కొత్త బస్సుల ఊసే లేదనీ ప్రతిపక్ష ఆరోపణ. ఏమైనా,ఢిల్లీలో ప్రైవేట్‌ వాహనాల సంఖ్య యథేచ్ఛగా పెరుగుతోంది. ఇక, పంటపొలాల మంటలు చుట్టుపక్కలి హర్యానా,పంజాబ్‌ మీదుగా రాజధాని దాకా వ్యాపిస్తున్న సమస్య. ఢిల్లీ హైకోర్టు, సుప్రీమ్‌ కోర్టు కొన్నేళ్ళుగా పంజాబ్‌ సహా అనేక ఉత్తరాది రాష్ట్రాలను కాలుష్యంపై హెచ్చరిస్తూనే వస్తున్నాయి. ఫలితం లేదు. యమునా నది శుద్ధీకరణకు రూ. 4 వేల పైగా కోట్లు పాలకులు ఖర్చు పెట్టారంటున్నా, జరిగిందేమిటో నురగ రూపంలో కనిపిస్తోంది. ప్రభుత్వాలు మాత్రం సమస్యను వదిలేసి, రైతుల తప్పును ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తుండడమే విచారకరం. నిజానికి, పంట కోసేశాక, మిగిలిన వరి దుబ్బులనే ఇలా కాలుస్తున్నా రనుకోవడం తప్పు. పత్తి, చెరకు, కాయధాన్యాలు, గోదుమలు – ఇలా అనేక పంటలకు పంజాబ్‌, హర్యానాల్లో ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. అందుకే, ఉత్తర భారతంలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా ఉంది. రైతుల వైపు నుంచి చూస్తే, కొయ్యకాళ్ళను వెంటనే తొలగిస్తే కానీ, తరువాతి పంట వేసుకోలేరు. అందుకు తగిన యంత్ర సామగ్రి అందుబాటులో లేకపోవడంతో, కాలుష్యమని తెలిసినా సరే కాల్చడమే మార్గమవుతోంది. ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. వాయు ఉద్గారాలు లేకుండా, పంట వ్యర్థాలను ఇంధనంగా, ఎరువుగా మార్చే చౌకైన, పోర్టబుల్‌ యంత్రాన్ని రూపొందించి, అవార్డందుకున్న ‘తకచర్‌’ సంస్థ లాంటి వాటి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. తాజా పర్యావరణ సదస్సు ‘కాప్‌-26’లో ప్రపంచ పరిరక్షణకు వాగ్దానాలు చేసిన మన ప్రభుత్వం, అంతకన్నా ముందుగా మన ‘జాతీయ రాజధాని ప్రాంతం’ (ఎన్సీఆర్‌)పై దృష్టి పెట్టడం అవసరం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటికి రెండు మన నగరాలే కాబట్టి, నివారణ చర్యల్లో చైనా లాంటి దేశాల అనుభ వాలను ఆదర్శంగా తీసుకోవాలి. విద్య మొదలు ఆర్థిక వ్యవస్థ దాకా అన్నీ స్తంభించే లాక్డౌన్‌ లాంటివి తాత్కాలిక ఉపశమనమే తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు కాలేవు. అందుకే, ఇప్పటికైనా ఉత్తరాది రాష్ట్రాల పాలకులను ఒకచోట చేర్చి, కాలుష్యంపై ప్రణాళిక రూపకల్పనకు కేంద్రం చొరవ తీసుకోవాలి. కాలుష్యానికి కారణం వ్యవసాయ వ్యర్థాలా, వాహనాలా, పారిశ్రామిక ఉద్గారాలా అనే రాజకీయ చర్చ, పరస్పర రాజకీయ నిందారోపణలు మాని, పనిలోకి దిగడం మంచిది. ఎందుకంటే, ఈ అసాధారణ వాతావరణ ఎమర్జెన్సీ వేళ అసాధారణ రీతిలో స్పందించడమే అత్యవసరం. మీనమేషాలు లెక్కిస్తే…మొదటికే మోసం!
ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. స్థానిక పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా అక్కడ ప్రతి శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. ప్రతి ఏటా దీపావళి పటాసులవల్ల కూడా వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్నది. ప్రస్తుతం ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రతపై ఓ సోషల్‌ మీడియా సంస్థ అధ్యయనం చేసింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలపై కాలుష్యం ప్రభావం పడిరదని తెలిపింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలవాళ్లు ఒకటి లేదా అంత కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడు తున్నారని వెల్లడిరచింది. సర్వే సంస్థ ఢిల్లీ, గుర్గావ్‌,నోయిడా,ఘజియాబాద్‌,ఫరీదాబాద్‌ లలో మొత్తం 34,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 66శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. 16 శాతం మంది గొంతు సమస్య లేదా దగ్గు లేదా రెండిరటితో బాధపడు తున్నారు. మరో 16 శాతం మంది ముక్కు కారడం, కండ్ల మంట సమస్యతో సతమత మవుతున్నారు. ఇంకో 16 శాతం మంది తాము శ్వాస సంబంధ సమస్య తో బాధపడు తున్నామని చెప్పారు.కేవలం 20 శాతం మంది మాత్రమే తమపై కాలుష్యం ప్రభావం లేదని తెలిపారు. ఇంకో 24శాతం మంది పైన పేర్కొన్న అన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరో 8 శాతం మంది కనీసం రెండు రకాల అనారోగ్య సమస్య లతో బాధపడుతున్నారు. ఇదిలావుంటే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేవలం 28 శాతం మంది మాత్రమే ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ ఉపయో గించాలనుకుంటున్నారని,61శాతం మంది ప్రస్తుతం పరిస్థితిని తట్టుకునేందుకు యాంటీ పొల్యూషన్‌ మాస్కులను వినిగియోగిస్తున్నారని సర్వే సంస్థ తెలిపింది.

-జి.ఎన్‌.వి.సతీష్‌

రైతు గెలిచాడు

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది నుంచి రైతులు చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. దేశంలో తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉం దన్న ప్రధాని…. వ్యవసాయ బడ్జెట్‌ ను ఐదు రెట్లు పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నట్లు ప్రధాని వెల్లడిరచారు. ‘గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం.. పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం.. క్రాప్‌ లోన్‌ను రెండిరతలు చేశాం.. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం.. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం.. చిన్న,సన్నకారు రైతులకు మేలు చేసేం దుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం’ అన్నారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించ లేకపోయాం. ఈచట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. మూడు సాగు చట్టాలను రద్దుచేస్తున్నట్టు మోదీ సంచలన ప్రకటన. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ గతేడాది నవంబరు 26 నుంచి రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
నవంబర్‌ 19న(శుక్రవారం) జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటిం చారు. సిక్కులకు అత్యంత పవిత్రమైన రోజున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మోదీ పేర్కొ న్నారు. అయితే,కొత్త సాగు చట్టాల వల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుందని మోదీ అంతకు ముందు వ్యాఖ్యానించారు. రైతులకు మేలు జరిగేలా ఈ చట్టాలను తీసుకొచ్చినా.. అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. ఈ మూడు చట్టాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో పూర్తిచేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నవంబర్‌ నెలాఖరు నుంచి జరిగే పార్లమెంట్‌ సమా వేశాల్లోనే ప్రకటన చేస్తామని తెలిపారు. అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని వెల్లడిరచారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఐదు రెట్లు పెంచామని తెలిపారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషిచేశామని పేర్కొన్నారు. 22 కోట్ల భూసార కార్డులను పంపిణికి చర్యలు చేపట్టా మని,ఫసల్‌ బీమా యోజనను మరింత బలో పేతం చేస్తామని వివరించారు. రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ‘గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం..పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం..క్రాప్‌ లోన్‌ను రెండిరతలు చేశాం.. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం.. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం.. చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం’ అన్నారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించ లేకపోయాం. ఈచట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. అయితే రైతుల్లో ఒక వర్గం మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిం చింది. చట్టాలలో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమయ్యాం. వ్యవసాయ చట్టాల అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది’ అని పేర్కొన్నారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతేడాది నవంబరు 26నుంచి ఢల్లీి శివార్లలో రహదారులను దిగ్బంధం చేశారు. ఏడాదిగా రోడ్లపైనే తిష్ట వేసి..అక్కడే తిండి,అక్కడే నిద్ర. కొంత మంది తమ కుటుంబాలతో పాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు.
రైతు విజయం
కేంద్ర మూడు నూతన సాగు చట్టాల రద్దు నిర్ణయం రైతు పోరాట ఘన విజయం. స్వాతంత్య్ర భారతాన సల్పిన ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపూర్వ ఘట్టం. నల్ల చట్టాల రద్దు కోరుతూ సంవత్సర కాలంగా ఢల్లీి సరిహద్దుల్లో లక్షలాది రైతులు బైఠాయించి ఆందోళనలు నిర్వహిస్తున్నా మొండిగా వ్యవహరించింది మోడీ సర్కారు. ఆందోళన చేస్తున్న అన్నదాతలపై పాశవిక నిర్బంధాలకు, కిరాతక దాడులకు ఒడిగట్టింది. రోజు రోజుకూ ఆసేతు హిమాచలం రైతు ఉద్యమం సంఘటితమవుతున్నదని గ్రహించిన మీదట ఇక తలవంచక తప్పదని భావించి స్వయంగా ప్రధాని రంగంలోకి దిగి మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. బిజెపి ఏమి చేసినా దాని వెనుక కచ్చితంగా రాజకీయ ప్రయోజనం ఉండి తీరుతుంది. ఏడాదిగా అప్రతిహతంగా సాగిస్తున్న రైతు ఆందోళనను చిన్న చూపు చూసిన బిజెపి, రైతాంగంలో, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను ఇటీవలి ఉప ఎన్నికల్లో చవి చూసింది. లఖింపూర్‌ ఖేరి మారణకాండ, కోర్టు మందలింపులు బిజెపిని ఇంటా బయటా రోడ్డుకీడ్చాయి. ఇప్పటికీ వెనక్కి రాకపోతే త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో పార్టీ పుట్టి మునగడం ఖాయమని తలచి చట్టాల రద్దుకు ఉపక్రమించిందనేది బహిరంగ రహస్యం. చట్టాల రద్దుపై జాతి నుద్దేశించి చేసిన ప్రకటనలోనూ ప్రధాని తన మాటల గారడీని వదిలిపెట్టలేదు. రైతుల సంక్షేమం కోసమే చట్టాలను తెచ్చినప్పటికీ, కొన్ని వర్గాల రైతులకు సర్ది చెప్పలేకపోయామని పేర్కొని, అసలు చట్టాల్లో తప్పేమీ లేదంటూ నల్ల చట్టాలను తెల్లగా మార్చే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛా మార్కెట్‌ కోసం ఎఎంసి రద్దు, కాంట్రాక్టు సేద్యం, నిత్యావసరాల నిల్వలపై పరిమితుల ఎత్తివేతకు ఉద్దేశించిన చట్టాలు కార్పొరేట్ల విచ్చలవిడి దోపిడీకి ఊతం ఇచ్చేవి. ఇప్పటి వరకు కొన్ని పంటలకు ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను హరించేవి. ఈ నేపథ్యంలో చట్టాలు చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసమన్న ప్రధాని వాక్కు నయ వంచన. రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థలో వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోని అంశం. రాష్ట్రాలను పట్టించుకోకుండా, రైతులతో సంప్రదించకుండా ఏకపక్షంగా చట్టాలు చేశారు. ఈ వాస్తవాలను మోడీ తన ప్రకటనలో ప్రస్తావించకుండా దాచారు. వినాశకర చట్టాలు తెచ్చినందుకు ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పలేదు. తెచ్చిన చట్టాలను అమలు చేయనందుకు కార్పొరేట్లకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతానికి చట్టాలను రద్దు చేసినా, ఇంకా వాటి ముప్పు తొలగి పోలేదని ప్రధాని మాటల్లో స్ఫురిస్తోంది.రైతులు కేవలం మూడు సాగు చట్టాల రద్దు కోసమే ఉద్యమం చేయడం లేదు. అన్ని పంటలకూ ఎంఎస్‌పి ని చట్టబద్ధ హక్కు చేయాలంటున్నారు. ప్రధాని ప్రకటనలో ఎక్కడా ఎంఎస్‌పి ప్రస్తావన లేదు. విద్యుత్‌ సవరణల చట్టం రైతులకు హానికరం. ఆ సవరణలను సైతం రద్దు చేయాలని రైతులు అడుగుతున్నారు. మూడు చట్టాల రద్దు ప్రధాని ప్రకటనతోనే జరగదు. పార్లమెంట్‌ ఆమోదిం చిన చట్టాలను రద్దు చేయాలంటే తిరిగి పార్లమెంట్‌లోనే చేయాలి. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు ప్రధాని. అప్పటి వరకు వేచి చూస్తామన్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నిర్ణయం సముచితమైనది. ఉద్యమ ప్రధాన డిమాండ్‌ ఎంఎస్‌పికి చట్టబద్ధత మీదా తేల్చుకోవాలన్న ఎస్‌కెఎం యోచన సరైనది. నలభై రైతు సంఘాలు కలగలిసిన ఎస్‌కెఎం నాయకత్వంలోని ఉద్యమం, ఆ పోరాటానికి అందుతున్న విశాల మద్దతు బృహత్తరమైనది. అంతటి ఒత్తిడి ఫలితంగానే విధి లేక కేంద్రం చట్టాల రద్దుకు దిగొచ్చింది. తమ ఉద్యమం తమ కోసమే కాదని, ప్రజలందరి కోసమని రైతులు నినదిస్తున్నారు. కార్మిక కర్షక ఐక్యత కూడా ఈ సందర్భంలో వెల్లివిరిసింది. కార్పొ రేట్లకు, వాటి అనుకూల ప్రభుత్వాలకు రైతు ఉద్యమం సింహస్వప్నంగా నిలిచింది. సుదీర్ఘ పోరాటంలో 750 మంది అమరులు కావడం మామూలు విషయం కాదు. మహత్తర రైతు ఉద్యమం అభినందనీయమైనది. ఇక్కడితో ఆగకుండా వ్యవసాయ, రైతు రక్షణకు మరింత ఉధృతంగా సంఘటిత ఉద్యమం కొనసాగితేనే అసలైన లక్ష్యం సిద్ధిస్తుంది.
తొలుత కేబినెట్‌ ముందుకు.. దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం తెలిసిందే.దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్త చట్టాలను ఉపసంహరించుకునే ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. నవంబర్‌ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశంలో మూడు నూతన సాగు చట్టాల రద్దు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.
కొత్త చట్టాల రద్దు ఇలా..
గత ఏడాది ఇదే సమయంలో నూతన సాగు చట్టాలను ఆమెదించింది కేంద్రం. రైతులకు మేలు చేసేందుకే ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే కొంత మంది రైతులు మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నారు. దిల్లీ సరిహద్దుల్లో పలు మార్లు ఈ నిరసనల్లో హింస కూడా చెలరేగింది. ఈ పరిణామా లన్నింటి నేపథ్యంలో ఇటీవల గురునానక్‌ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. రైతులు ఉద్యమం వీడి ఇళ్లకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా రైతులకు క్షమాపణ కూడా చెప్పారు.అయితే సాగు చట్టాలు సన్నకారు రైతులను ఆదుకునేందుకే తెచ్చామని..కానీ అందరికీ దీనిని అర్థమయ్యేలా వివరించలేకపోయామని మోదీ పేర్కొన్నారు. మోదీ సర్కార్‌ సాగు చట్టాలపై వెనక్కి తగ్గడాన్ని విపక్షాలు.. ప్రముఖులు అందరూ స్వాగతిం చారు.
సాగు చట్టాల రద్దు ప్రక్రియ ఇలా..
సాగు చట్టాలను రద్దు చేసే ప్రక్రియ.. కూడా చట్టాలు ఆమలులోకి వచ్చిన విధంగానే ఉంటుంది. అంటే.. ఏదైనా చట్టం కావాలంటే పార్లమెంట్‌?లో అందుకు సంబంధఇంచి బిల్లు ప్రవేశ పెట్టాలి. దానికి పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే చట్టంగా మారుతుంది. ఏదైనా చట్టాన్ని రద్దు చేయాలన్నా ఇదే ప్రక్రియ ఉంటుంది.
క్షమాపణ చెప్పిన ప్రధాని
2014లో తన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని.. వారి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. రైతుల కష్టాలు తనకు తెలుసు కాబట్టి వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చానని చెప్పారు.వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచామని.. ఏటా రూ.1.25 లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి వెచ్చిస్తున్నాం, రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు తీసుకున్నామని మోదీ చెప్పారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని రైతులందరికీ క్షమాపణ చెప్పారు. ‘ప్రభుత్వం ఈరోజే వ్యవసాయానికి సంబధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే జీరో బడ్జెట్‌ వ్యవసాయం, అంటే సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, క్రాప్‌ పాటర్న్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో మార్చడానికి, ఎంఎస్‌పీని మరింత ప్రభావంగా, పారద ర్శకంగా మార్చడానికి, ఇలాంటి అన్ని విషయా లపై భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిదులు, రైతులు ఉంటారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు ఉంటారు’.
సుదీర్ఘ రైతు ఉద్యమంలో కీలక నేతలు ..
358 రోజుల అలుపెరగని రైతుల పోరాటం .. మోడీ ప్రభుత్వం దిగి వచ్చేలా చేసింది. రైతులకు క్షమాపణ చెబుతూ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకుంటున్నామని ప్రధాని ప్రకటించేలా చేసింది. వణుకు పుట్టించే చలి, వేసవిగాలులు, తుఫానులు వేటికీ వారు వెనుకంజ వేయలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలతో వ్యవసాయాన్ని కార్పోరేట్లకు అప్పగించేది లేదంటూ ప్రతినబూనారు. మాజీ సైనికుడు, వైద్యుడు, ఎన్నికల సర్వే అధికారి, జాత్‌ నేత, మహిళా హక్కుల కార్యకర్త ఇలా కొందరు రైతుల నిరసనను ఏడాది పాటు కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. కొందరి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. ఈ ఉద్యమంలో పాల్గన్న ప్రతి రైతు ఒక నాయకుడే. ఇది భారత్‌లో ప్రజా ఉద్యమాలను పునర్నిర్వచించింది. భవిష్యత్‌ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. వారి నాయకత్వంతో రైతుల మధ్య రాజకీయ విభజనను తగ్గించడంలో సహాయపడిరది. పంజాబ్‌,హర్యానా,ఉత్తర ప్రదేశ్‌ నుండి రైతులు ఉమ్మడి వేదికపై సమావేశమై సుదీర్ఘ కాలం పోరాడేందుకు మార్గం సుగమం చేసింది.
మహిళల పాత్ర
ఈ నిరసనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కీలకంగా మారింది. ఉద్యమంలో మహిళల గొంతును వినిపించేలా చేయడంలో హరీందర్‌ బిందు, జస్బీర్‌ కౌర్‌ నట్‌లు ముందంజలో ఉన్నారు. ప్రత్యేక మరుగుదొడ్లు వంటి వసతులు లేనప్పటికీ ట్రాక్టర్లు నడిపారు. విప్లవ గీతాలు పాడారు. జాతీయ రహదా రులను తమ నివాసాలుగా మార్చు కున్నారు. పితృస్వామ్య సమాజం, పురుష ఆధిక్య సమాజంలో పలువురు సామాజిక శాస్త్రవేత్తలు మహిళా మేల్కోల్పును చూశారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) ఏక్తా ఉగ్రహాన్‌ మహిళా విభాగం ఇన్‌చార్జ్‌ హరీందర్‌ బిందు పంజాబ్‌లోని మారుమూల గ్రామాల నుండి మహిళలను ఉద్యమంలో నిమగం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆమె స్వయంగా నిరసన ప్రాంతంలోనే నెలల తరబడి ఉన్నారు. నిరసనలో చేరేలా పలువురు మహిళలను ప్రోత్సహించారు. పంజాబ్‌ వ్యవసాయ సంస్థలలో మహిళల భాగస్వామ్యాన్ని చూసి, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలోని తమ సహచరులు కూడా మహిళలను నిరసనలోకి తీసుకువచ్చేలా ప్రేరణ పొందారని, ఇది గొప్ప విజయమని ఆమె హరీందర్‌ అన్నారు. పంజాబ్‌లోని ప్రముఖ మహిళా రైతు నేతల్లో ఒకరైన జస్బీర్‌ కౌర్‌ తిక్రీ సరిహద్దుల్లోని నిరసనలో మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించారు. పంజాబ్‌ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులుగా జస్బీర్‌ వ్యవహరిస్తున్నారు. కాలేజీ రోజుల్లో దళిత హక్కుల కార్యకర్తగా పనిచేసిన ఆమె వ్యవసాయ రంగంలో మహిళల దుస్థితిని చూసి పోరాటం దిశగా వారిని నడిపించేందుకు నడుం బిగించారు.ఆమె కుమార్తె నవకిరణ్‌ నట్‌ కూడా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రైతు ఉద్యమాన్ని గురించి వివరించిన వార్తాపత్రిక ట్రాలీటైమ్స్‌ వ్యవస్థాపక సభ్యులలో నవకిరణ్‌ కూడాఉన్నారు. గతేడాది నుండి వీరిద్దరూ నిరసన ప్రాంతంలోనే ఎక్కువ సమయం గడిపారు.
డా. దర్శన్‌ పాల్‌
సంయుక్త కిసాన్‌ మోర్చా కింద వివిధ రైతు సంఘాలను ఏకం చేసి సైద్ధాంతిక రూపాన్ని అందించిన దర్శన్‌ పాల్‌ వైద్యుడని చాలా మందికి తెలియదు. పంజాబ్‌ సివిల్‌ మెడికల్‌ సర్వీస్‌లో అనస్థీషియా విభాగంలో పనిచేసే ఆయన 2000 సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2016లో క్రాంతికారి కిసాన్‌ యూనియన్‌లో చేరడానికి ముందు రైతు సంఘాల కార్యకలాపాలలో పాల్గొన్నారు. అనంతరం ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఉద్యమంలో పాల్గనడమే కాకుండా నిరసన ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందేందుకు కృషి చేశారు. రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వాలని మొదటి నుండి ఆయన పోరాటం చేశారు. 2020 జూన్‌లో కేంద్రం వ్యవసాయ ఆర్డినెన్స్‌లకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించిన రైతు సంఘాల్లో ఆయనది కూడా ఒకటి. ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఎఐకెఎస్‌సిసి)లో సభ్యులు కూడా. పంజాబ్‌ నుండి ఉద్యమాన్ని ఢల్లీి వరకు తీసుకెళ్లడంలో పాల్‌ ముఖ్యపాత్ర పోషించారు. ఆయన ప్రేరణతోనే ఎఐకెఎస్‌సిసి సభ్యులు యుపి,రాజస్తాన్‌,కర్ణాటక, మహారాష్ట్ర నుండి రైతులను ఢల్లీి సరిహద్దులకు తీసుకువచ్చేందుకు కృషి చేశారు.
రాకేష్‌ తికాయత్‌
పశ్చిమ యుపికి చెందిన జాత్‌ నేత రాకేష్‌ తికాయత్‌ వ్యవసాయ ఉద్యమాన్ని పునరు ద్ధరించడంలో కీలకంగా వ్యవహరించారు. పంజాబ్‌,హర్యానా నుండి రైతు నిరసనను ఢల్లీికి మారినప్పటికీ కొన్ని నెలల పాటు తికాయత్‌ పేరు వినిపించలేదని రాజకీయవిశ్లేషకుడు అశుతోష్‌ కుమార్‌ తెలిపారు. రిపబ్లిక్‌ డే రోజున జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీ అనంతరం రైతుల నిరసన విఫలమవుతుందనుకున్న సమయంలో తికాయత్‌ ముందుకు వచ్చారు. ఆయన ఉద్వేగ భరితమైన ప్రసంగాలు రైతులను ఉత్తేజ పరిచాయి. అనంతరం నిరసన మరింత బలంగా మారింది. తికాయత్‌ తండ్రి మొహీందర్‌ తికాయత్‌ కూడా వ్యవసాయ నేత అని, 1980లో కేంద్ర ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారని అశుతోష్‌ తెలిపారు. నిరసనలో కుల, మత విభజనలను తలెత్తకుండా ఉండేందుకు పలు మహా పంచాయత్‌లను నిర్వహించారు.
బల్బీర్‌ సింగ్‌ రేజ్వాల్‌
పంజాబ్‌ నుండి ఢల్లీికి ఉద్యమాన్ని తీసుకెళ్ల డంలో కీలకంగా వ్యవహరించిన మరో నేత బల్బీర్‌సింగ్‌ రేజ్వాల్‌. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)లో ప్రముఖంగా వ్యవ హరించారు. అనంతరం భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు)ని ఏర్పాటు చేసి రైతు ఉద్యమాన్ని బలోపేతం చేశారు. వివిధ సమస్యలపై పంజాబ్‌లోని రైతులను ఐక్యం చేసిన అనుభవం ఉద్యమంలో రైతులను సమీకరించడంలో ప్రముఖంగా నిలిచింది. వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టి నప్పటినుండి బల్బీర్‌ సింగ్‌ ట్రాక్టర్‌ ర్యాలీలు చేపడుతూ నిరసన తెలిపారు. అనంతరం ఢల్లీి సరిహద్దులోనూ ఉద్యమాన్ని నడిపించారు.
జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌
మాజీ సైనికుడైన జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ పదవీ విరమణ అనంతరం వ్యవసాయం ప్రారంభించారు. 2002లో బికెయు (ఏక్తా ఉగ్రహాన్‌) స్వంత శాఖను ఏర్పాటు చేసుకు న్నారు. పంజాబ్‌లోని మాల్వా ప్రాం తంలో రైతుల ఉద్యమం సుమారు ఏడాది పాటు కొన సాగేలా చర్యలు చేపట్టారు. చిన్న, సన్నకారు రైతులతో ఉన్నప్పటికీ.. రైతు సంఘాల్లో అతి పెద్ద సభ్యత్వాన్ని కలిగి ఉందని మాజీ ప్రొఫెసర్‌ మంజిత్‌ సింగ్‌ తెలిపారు.
యోగేంద్ర యాదవ్‌
ఉద్యమ ప్రతినిధి యోగేంద్రయాదవ్‌ అనడంలో అసత్యం లేదనేలా ఉద్యమంలో యోగేందర్‌ పాలుపంచుకున్నారు. ఎన్నికల సర్వే అధికారి, కార్యకర్త అయిన యోగేంద్ర ఉద్యమాన్ని గురించి ఆంగ్లంలో అందరికీ చేరువయ్యేలా చేశారు. యోగేంద్ర యాదవ్‌ ఇంటర్వ్యూలు నిరసనలను ప్రపంచప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లాయి. నిరసనలపై అసత్యాలు ప్రచారం చేసినప్పుడల్లా మీడియా సమావేశాల ద్వారా ఎస్‌కెఎం వైఖరిని స్పష్టం చేశారు. (‘ది వైర్‌’ సౌజన్యంతో)
-గునపర్తి సైమన్‌

పర్యావరణానికి ప్రాణాధారం కాప్‌-26

భూమిపై జీవజాలం ఉనికికి ప్రమాదకారిగా మారిన వాతావరణమార్పులపై ప్రపంచదేశాలు మరోసారి దృష్టి సారించాయి. స్కాట్‌లాండ్‌ గ్లాస్గో నగరంలో కాన్ఫిరెన్స్‌ ఆఫ్‌ ద పార్టీస్‌(కాప్‌26) సదస్సు ఈ ఏడాది నవంబరులో జరిగింది. పన్నెండు రోజుల (నవంబర్‌ 1నుంచి 12తేదీల మధ్య ) పాటు జరిగిన సదస్సులో 197 దేశాలు పాల్గొన్నాయి. ప్రతిఏటా197దేశాల నుంచి 25వేల మంది ప్రతినిధులు హజరయ్యారు.వాతావరణమార్పులపై యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) ఆధ్వర్యంలో జరిగే కన్వెన్షన్‌ ఇది. పర్యావరణంపై మానవకార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమేలక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం,ప్రతి భూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.1994 మార్చి 21న తొలి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సమావేశాలు జరగ్గా,ఈ ఏడాది జరిగింది26వది.గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతలు 1.5 సెల్సియస్‌ పెరుగుతున్నాయి.ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతే భూమికి తిరిగి బాగు చేసుకోలేని ప్రమాదాన్ని సృష్టిస్తాయి. ఈసమ్మిట్‌లో కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు,వ్యూహాలుసరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అన్నది చర్చించు కోవడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశారు. పెట్రోలు,డీజిల్‌,బొగ్గు వంటి శిలాజఇంధనాలను మండిరచడంవల్ల భూమి నానాటికీ వేడెక్కుతోంది.వాతావరణ మార్పులతో ముడిపడిన తీవ్ర వడగాల్పులు,వరదలు,కార్చిచ్చు వంటి విఫత్తుల తీవ్రత పెరుగుతోంది.గడిచిన దశాబ్దం..అత్యంత ఉష్ణమయంగా రికార్డులకెక్కింది.ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల కట్టడికి తక్షణ చర్యలు అవసరమన్న నిపుణుల అభిప్రాయానికి ప్రపంచ నేతలు హజరయ్యారు. కాఫ్‌26 అన్ని వాతావరణ శిఖరాలలో అత్యంత ప్రత్యేకమైనది.సమ్మిట్‌లో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) గుర్తించిన ప్రణాళికలను అమలు చేశామని యూకే ప్రభుత్వం చెప్పింది.

Read more

వనవాసి నవల

1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ‘ అరణ్యక్’ పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి ‘వనవాసి’ అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి నవల మొదటి ఐదు భాగాలు ఇప్పుడు పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది.ఈ నవల మొత్తం వంద భాగాలుగా హర్షణీయంలో పాడ్కాస్ట్ చెయ్యబడుతుంది రాబోయే మూడు నెలలలో.తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశవ్యాప్తంగా వున్న పర్యావరణం సమస్యలు , అటవీ ప్రాంత ప్రజల సమస్యలు, వాటిపై పని చేస్తున్న పర్యావరణ కార్యకర్తల, ప్రముఖులతో హర్షణీయం జరిపిన సంభాషణలు కూడా ఈ రూపకంలో భాగంగా ప్రసారం చేయబడతాయి. https://player.captivate.fm/collection/ae7d492e-4bb1-47bb-b1a2-0642b7ed4461

1 50 51 52 53 54 75