అమ్మాయి వివాహం వ‌య‌స్సు 21కి పెంపు

అమ్మాయిల కనీస వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. హిందూ వివాహ చట్టం (1955)ను అనుసరించి అమ్మాయిల కనీస వివాహ వయసు 18 సంవత్సరాలు ఉండేది. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు క్యాబినెట్‌ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయా నికి అనుగుణంగా ప్రత్యేక వివాహ చట్టం (1954), బాల్య వివాహాల నిరోధక చట్టం (2006), హిందూ వివాహ చట్టం(1955)లో కూడా తగిన సవరణలు చేయాల్సి ఉంటుంది. అమ్మాయిల వివాహ వయసును 18 సంవత్సరాలుగా 1978లో నిర్ణయించారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ నేతృత్వంలో టాస్క్‌ ఫోర్స్‌ కమి టీని నియమించింది.21 సంవత్సరాలకు పెంచా లని ఈ కమిటీ ప్రతిపాదించింది. ఇందు కోసం దేశవ్యాప్తంగా 16 యూనివర్సిటీలు,15 స్వచ్చంద సేవాసంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ కమిటీకి సమతా పార్టీమాజీఛైర్మన్‌ జయ జైట్లీ నేతృత్వం వహించారు. ఈమెతో పాటు, ఈ కమిటీ లో నీతిఆయోగ్‌సభ్యులు డాక్టర్‌ వి.కె.పాల్‌, న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు.స్కూళ్లలో లైంగిక విద్యను తప్పని సరి చేయాలని కూడా ఈ కమిటీ సూచించింది.ఈ నిర్ణయం లింగ సమానత్వాన్ని సాధించేందుకు సహకరిస్తుందని ప్రభుత్వం చెబు తోంది. అమ్మాయిలు,అబ్బాయిల వివాహ వయసు లోని అంతరాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం లింగ సమానత్వాన్ని సాధిస్తుందా?
సమాజంలో పితృస్వామ్య భావజాలాన్ని పెంచి పోషించినంత వరకూ బాలికల హోదాలో, పరిస్థి తుల్లో ఎటువంటి మార్పులు రావని స్త్రీవాద పత్రిక ‘భూమిక’సంపాదకురాలు కొండవీటి సత్యవతి అంటారు. బాలికల కనీస వివాహ వయసును ప్రభుత్వం 21సంవత్సరాలకు పెంచడంపై ఆమె ఒక వ్యాసం రాశారు. సామాజిక వాతావరణాన్ని ప్రక్షాళన చేయకుండా వివాహ వయో పరిమితిని పెంచడంలో అర్ధం లేదు. బాలికలపై చూపించే వివక్షకు మూలకారణాలను తెలుసుకోకుండా సమా నత్వాన్ని సాధించడం కష్టమని ఆమె అంటారు. ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతి స్తున్నానని అంటూ లింగ సమానత్వం సాధించ డానికి ఇదొక మెట్టు లాంటిదని ఆంధ్రయూని వర్సిటీ లా కాలేజీ విభాగాధిపతి డాక్టర్‌ సుమిత్ర అన్నారు.

ఈ నిర్ణయం బాల్య వివాహాలను ఆపుతుందా?
భారతదేశంలో 2019-20నాటికి బాల్య వివా హాలు 23% ఉన్నట్లు ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. ఇది 2015-16లో 27% ఉండేది.బాల్య వివాహాలు శిశు మరణాలకు, ప్రసూతి మరణాలకు కూడా కారణం అవుతున్నాయి.చిన్న పిల్లల పెళ్లిళ్ల గురించి చర్చ మొదలై 150 సంవత్సరాలు గడిచిపోయినా, నేటికీ ఇదొక సమస్యగానే ఉండిపోవడం విచారకరమని సత్యవతి అంటారు. ‘‘చిన్న వయసులోనే రజస్వల అవ్వడంవల్ల చురుకుగా మారే హార్మోన్ల ఒత్తిడిని అమ్మాయిలు ఎలా అధిగమిస్తారు? గ్రామాల్లో హై స్కూల్‌ అయిపోయిన తర్వాత ఎక్కడ చదివించాలనే సందేహం,ఆడపిల్లలను దూరంగా పంపించి చది వించేందుకు ఇష్టం చూపకపోవడం, అమ్మాయిలకు సురక్షిత వాతావరణం లేకపోవడం, లైంగిక వేధింపులు కూడా బాల్య వివాహాలకు దారి తీస్తున్నాయి’’ అని ఆమె అన్నారు. యుక్తవయసులో ఉన్న 51% చదువు లేని అమ్మాయిలు, ప్రాధమిక విద్యను మాత్రమే అభ్యసించిన 47%మంది అమ్మా యిలు 18సంవత్సరాలులోపే వివాహం చేసు కున్నట్లు యూఎన్‌ఎఫ్‌పీఏ ఇండియా-2020 నివేదిక చెబుతోంది. భారత్‌లో 1.5కోట్ల మంది అమ్మాయిలకు 18ఏళ్లలోపే వివాహమైందని నివేది కలో జయ చెప్పారు. అయితే ఇదివరకు 46శాతం (మొత్తం బాలికల్లో 46శాతం మంది)గా ఉండే ఈ వివాహాలు ప్రస్తుతం 27శాతానికి తగ్గాయని జయా జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గిరిజన తెగల్లో మార్పు తెస్తుందో లేదో సందేహమేనని అంటున్నారు నిర్ణయ్‌ స్వచ్చంద సంస్థకు చెందిన నిఖిని వర్మ. ఆమె తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన మహిళలు, బాలికల విద్య కోసం పని చేస్తున్నారు.‘‘గిరిజన ప్రాంతాల్లో పాటించే ఆచారాలు వారి సంస్కృతి పై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా,ఈప్రాంతాల్లో ప్రతి నిర్ణ యానికి గ్రామపెద్దపై ఆధారపడతారు. ఈ ప్రాంతా ల్లో 18 ఏళ్లురాక ముందేపెళ్లి చేసేస్తారు. ఆ విష యం గురించి ఫిర్యాదు కూడా ఎవరూ చేయరు. పెళ్లి వయసు 21లేదా25కు పెరిగినా 18 సంవత్స రాలే ఉన్నా అది గిరిజనసమాజాల్లో పెద్దగా ప్రభావం చూపించదు’’అనిఅన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్పెషల్‌ మ్యారేజ్‌ చట్టం (1954) హిందూ వివాహచట్టం(1955)ప్రకారం వివాహం చేసుకునేవారికి ఈనిర్ణయం వర్తిస్తుంది.

మహిళా సాధికారత సాధించేందుకు తోడ్పడు తుందా?
చట్టంలో మార్పులు చేసినంత మాత్రాన మహిళా సాధికారత వస్తుందని చెప్పలేం,కానీ,ఇదొక మార్పు కు నాంది పలుకుతుందని డాక్టర్‌ సుమిత్ర అంటారు.‘‘సాధికారతకు సమానత్వం తొలి మెట్టు’’. సమానత్వ భావన అనేది సామాజికంగా వచ్చే వరకూ సాధికారత సాధ్యం కాదని ఆమె అంటారు. ఆర్ధిక,రాజకీయ సమానత్వం కొంత వరకు సాధిం చాం కానీ, సామాజిక సమానత్వం ఇంకా పూర్తిగా రాలేదంటారు డాక్టర్‌ సుమిత్ర.
‘‘మహిళలు కూడా జెండర్‌ స్టీరియోటైప్స్‌ ను దాటి ఆలోచించగలగాలని అన్నారు. సమాజం ఒక పరి ణామం చెందుతున్న దశలో ఉంది.చట్టంతో పాటు సామాజిక దృక్పధం కూడా మారాలి. కానీ, మార్పు సాకారమయ్యేందుకు చాలా సమయం పడుతుంది’’ అని అన్నారు.అమ్మాయిల వివాహ వయసును పెంచ డం ద్వారా వారి విద్య ఉద్యోగావకాశాలు పెరిగితే, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని సుమిత్ర అన్నారు.

అమలు చేయడంలో ఉన్న సవాళ్లేంటి?
అమ్మాయిల వివాహ వయసును పెంచడం ద్వారా పిల్లలు,మహిళలపై మాత్రమే కాకుండా కుటుం బం,ఆర్ధిక,సామాజిక పరిస్థితులపై ప్రభావం చూపి ిస్తుందని టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ అభిప్రాయపడిరది. కొన్ని వెనుకబడిన వర్గాల్లో 70% బాల్య వివాహాలు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. చదువును ఆపేసిన పిల్లల్లో 3నుంచి4రెట్లు మందికి పెళ్లిళ్లు చేసే అవకాశముందని లేదా వారి వివా హం నిశ్చయం అయిపోయి ఉంటుందని ఇంట ర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ విమెన్‌ నిర్వహిం చిన అధ్యయనం పేర్కొంది. గ్రామీణ,గిరిజన ప్రాం తాల్లో నాటుకుపోయిన నమ్మకాలు, ఆచారాలను ఆపమని చెప్పడం చాలా కష్టమని అంటారు నిఖిని వర్మ.‘‘అదిలాబాద్‌ జిల్లాలోజరిగే నాగోబా జాతర లో వధూవరులను ఎంపిక చేసుకుంటారు. మాకు దేముడు చూపించిన మనువు అని అంటూ ఉంటారు. అటువంటి వారిని18లేదా21 సంవత్స రాల వరకూ పెళ్లి చేయకుండా ఆపమని ఒప్పించ డం చాలా కష్టమైన పని’’అని అంటారు నిఖిని. లోహారా గ్రామంలో బాల్య వివాహాలను ఆపేం దుకు పిల్లల తల్లితండ్రులను ఒప్పించడం చాలా కష్టంగా మారినట్లు వివరించారు.
పెంపు ద్వారా లింగ సమానత్వం సాధ్యమా…? ప్రపంచంలో జరిగే బాల్యవివాహాల్లో మూడవ వంతు మనదేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఆడపిల్లలు అంటే ‘’ఆళ్ళ’’ పిల్లలే అని దురభిప్రాయం మన కుటుంబాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది. అందు చేతనే పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేందుకు సన్నాహాలు చేస్తు న్నారు. రాజస్థాన్‌ ఈవిషయంలో దేశంలోనే మొద టి స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా నేటికీ 47 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయి అని ఐక్య రాజ్యసమితి బాలలనిధి తెలియజేస్తున్నది. చదువు కున్న వారు కూడా బాల్యవివాహాలు జరిపించడం బాధాకరమైన విషయం. మగ పిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువఅనే భావం నేటికీ అనేక కుటుం బాల్లో కనపడుతోంది. ఈరకమైన ఆలోచనలు మార్చుకోవాలి.‘’లింగ సమానత్వం’’ దిశగా ప్రయా ణం చేయాలి. మత విశ్వాసాలను, మూఢ విశ్వా సాలను, ఆచారాలను పక్కన పెట్టాలి. అందరూ సమానమే అనే భావన రావాలి. స్త్రీని దైవంగా కొలిచే ఈ దేశం నిరంతరం మహిళల వేదింపు లకు నిలయంగా ఎందుకు ఉంటుందో ఆలోచన చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చా త్య దేశాల్లో గొప్పలుగా చెప్పుకొంటున్న మనం, ఈరోజున మన దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులకు ఏమి సంజాయిషీ ఇస్తాం…?ఆకలి బాధలు, ఆక్రందనలు, వివక్షత, పేదరికం, అవిద్య, అక్రమ రవాణా,అఘాయిత్యాలు,ఆత్మహత్యలు,యాసిడ్‌ దాడులు,పరువు హత్యలు,వరకట్న వేదింపులు, వ్యభిచారకూపాలు, అవహేళనలు, గృహహింసలు, లైంగిక దోపిడీ,ర్యాగింగ్‌,రేప్‌లకు నిలయంగా ఉన్న ఈదేశంలో సగౌరవంగా స్త్రీబతికేది ఎప్పు డు…? ఆలోచన చేయాలి.అందుకే ‘’ఒకదేశ అభి వృద్ధి,ఆ దేశ మహిళా అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది’’ అంటారు అంబేద్కర్‌. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. కానీ అంతమాత్రానికే దేశంలో మహి ళలకు రక్షణ, భధ్రత, సమానత్వం కలుగుతుందా?. పురుషులుతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తారా?. దేశాభివృద్ధికి తిరుగులేని శక్తిగా నిలబడుతారా? దిశయాప్‌,షీ టీం,మహిళా పోలీస్‌ స్టేషన్లు, నిర్భయ చట్టం ఉన్నా, అనునిత్యం దేశంలో ఏదో ఒకచోట మహిళల ఆక్రందనలు ఎందుకు వినిపిస్తున్నాయో గుర్తెరగాలి.
ఇటీవలి కాలంలో దేశంలో లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు, మహిళలు 1020 పైబడి నమోదు కావడం శుభ పరిణామంగా భావించాలి. భ్రూణ హత్యలు తగ్గాయి.అయితే అదే సమయంలో అఘాయిత్యాలు, గృహహింస రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ కరోనా కాలంలో మరింత ఎక్కువయినాయి. చట్టాలు ఎన్నిఉన్నా సమాజంలో మహిళలపై చిన్న చూపు,వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈ విషయా లపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. -జి.ఎన్‌.వి.సతీష్‌

మతోన్మాదుల విష కౌగిలిలో రాజ్యాంగం

ఆర్టికల్‌ 29 ప్రకారం మైనారిటీ మతానికి చెందిన పౌరులు తమ మతానికి చెందిన ఆరాధన పద్ధతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు స్వేచ్ఛగా ఆచరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కు అమలు అనేది నేడు పెద్ద సవాలుగా మారింది. మన రాజ్యాంగంలో పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. కానీ రాజ్యానికి (ప్రభుత్వానికి) మతం లేదు. ఉండదు కూడా. ఎందుకంటే అది లౌకిక రాజ్యం. మతం పేరుతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే ప్రస్తుతం మతమే రాజకీయం అయింది. ప్రతి విషయాన్ని మత కోణంలో చూడడం పెరిగిపోయింది.` మహమ్మద్‌ అబ్బాస్‌ దేశంలో లౌకిక,ప్రజాస్వామిక విలువలకు మతో న్మాద ప్రమాదం తీవ్రంగా పరిణ మించింది. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులపై దాడి తీవ్రమైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14దేశ పౌరులం దరు సమానులే అని ఉద్ఘాటిస్తుంటే, ఆర్టికల్‌ 15 మతం,కులం, జాతి,లింగం,పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏ పౌరుని పట్ల వివక్ష చూప రాదని,అలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టరీత్యా నేరం అని స్పష్టం చేసింది. కానీ బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించు కుంటున్న తస్లీమ్‌ బేగ్‌ను బజరంగ్‌ దళ్‌ మూక లు చుట్టు ముట్టి ‘జై శ్రీరామ్‌’ అనాలని, తన మైనర్‌ కూతురు సమక్షంలోనే తీవ్రంగా కొట్టారు. పోలీసు స్టేషన్‌లో కేసు పెడితే నిందితులను మూడు రోజులలో వదిలేశారు. వారు బయటికి వచ్చి హిందూ ఏరియాలోకి వస్తే చంపేస్తామని బహిరంగంగా హెచ్చరిం చారు. మధ్యప్రదేశ్‌ దివాస్‌ జిల్లాలో సైకిల్‌పై తిరిగి బిస్కెట్లు అమ్ముకునే జాయెద్‌ ఖాన్‌ అనే వ్యక్తిని ఆధార్‌ కార్డు చూపించమని కొట్టారు. గ్రామాలలో తిరిగి బిస్కెట్లు అమ్మితే చంపే స్తామని బెదిరించారు. అలాగే చిత్తు కాగితాలు, పాత ఇనుప సామానులను కొనుగోలు చేసే మరో వీధి వ్యాపారిని ఇదే రకంగా కట్టేసి కొట్టారు. ఇప్పు డు వీరు బయటికి రావాలంటే భయంతో వణికి పోతున్నారు. దాడి చేసినవారి పై పోలీస్‌ కేసులు లేవు, కేవలం మందలించి వదిలేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ బోర్లి ప్రాంతంలో గర్బాహ అనే గ్రామంలోకి హిందూయేతరులు రావడాన్ని నిషేధిస్తూ వి.హెచ్‌.పిబోర్డులు ఏర్పాటు చేసింది. ద్వారకా ప్రాంతంలో హజ్‌ భవన్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్‌ ధర్నా నిర్వహించి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలన్ని స్పష్టం చేస్తున్నదేమిటంటే చట్టం అందరికీ సమానం కాదని,మతం పేరుతో విచక్షణ చూపించినా, దాడులు చేసినా చట్టం ఏమీ అనదు అనే సందేశాన్ని ఇస్తున్నాయి.ఆర్టికల్‌ 21 ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పిం చింది. హర్యానా నోజిల్లా కేర్‌ ఖలీల్‌ గ్రామంలో ఆసిఫ్‌ ఖాన్‌ అనే 27సంవత్సరాల యువకుడిని అకారణంగా మతోన్మాదుల గుంపు దారుణంగా హత్య చేయడంతోపాటు, గ్రామంలో ముల్లాల నందరిని వదిలిపెట్టం అని హెచ్చరించింది. గతంలో కూడా గో రక్షణ దళాల పేరుతో పెహ్లూ ఖాన్‌,అఖ్లాక్‌ లాంటి అనేక మందిని అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేసారు. ఉపాధి అవకాశాలను కూడా దెబ్బ తీశారు. ఇవన్నీ రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును హరించేవే. ఆర్టికల్‌ 23 సెక్షన్‌ (2)ప్రకారం రాజ్యం (ప్రభుత్వం) మతం,కులం,జాతి,లింగం,పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏమనిషి పట్ల వివక్ష చూపరాదు. కానీ అఖ్లాక్‌ హత్య కేసులో నిందితులకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. విద్వేష ప్రకటనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌,బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ కు చెందిన నాయకులపై ఎలాంటి కేసులు పెట్టడం లేదు. త్రిపురలో మైనారిటీలపై వి.హెచ్‌.పి దాడులకు పాల్పడి ఆస్తులను,ఇళ్ళను,ప్రార్థనాస్థలాలను ధ్వంసం చేసి నిప్పంటించినా వారిపై కేసులు పెట్టలేదు. కానీ మైనారిటీలపై జరిగిన మత హింసను విచారించడానికి వెళ్లిన నిజనిర్థారణ బృందంపై దేశ ద్రోహం కింద కేసులు పెట్టారు. హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని వది లేసి,బాధితులను పరామర్శించిన వారిపై కేసులు పెట్టడం అంటే మతోన్మాద దాడులను ప్రోత్సహించడమే కదా ! ఆర్టికల్‌ 25 సెక్షన్‌ (1) ప్రకారం దేశ పౌరులందరికీ మత స్వేచ్ఛ ఇవ్వబడిరది. పౌరులు తమకు నచ్చిన మతాన్ని, ఆరాధన పద్ధతులను స్వేచ్ఛగా ఆచరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. ఏమతంపై విశ్వాసం ప్రకటించకుండా స్వతంత్రంగా ఉండే హక్కు కూడా పౌరులకు ఇవ్వబడిరది. ఎవరిపైనా బలవంతంగా విశ్వాసాలను,నమ్మకాలను రుద్దరాదని రాసుకున్నాం. అయితే మానవ హక్కుల సంఘాల నివేదిక ప్రకారం 2021లో సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి అంటే 9 నెలల కాలంలోనే క్రైస్తవ ప్రార్థనా సమావేశాలపై 300 దాడులు జరిగాయి. ప్రార్థనల్లో పాల్గొన్న వారిని తీవ్రంగా కొట్టారు. దాడులకు గురైన వారంతా దళితులు, గిరిజనులు. బలవంతపు మత మార్పిడులు అనే పేరుతో దళితులకు,గిరిజను లకు రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కును హరిస్తున్నారు. కులం పేరుతో, అంటరానితనం పేరుతో అణిచివేసినప్పటికీ వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలనేది వారి ఉద్దేశ్యం. అందుకే దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శుక్రవారం రోజున ముస్లింలు ప్రార్థనలు చేయకుండా రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పేరుతో…హర్యానా రాష్ట్రం గుర్గావ్‌ లోని ఎనిమిది ప్రాంతాలలో అడ్డుకు న్నారు. ఈ రకంగా దేశంలో మైనార్టీలకు ఉన్న మత స్వేచ్ఛను, ఆరాధన స్వేచ్ఛను కాలరాశారు. చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారాన్ని దుర్విని యోగం చేస్తూ, దాడులకు దిగుతున్నారు. ఈ దాడులపై ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరించిన పరిస్థితి లేదు. ఆర్టికల్‌ 29 ప్రకారం మైనారిటీ మతానికి చెందిన పౌరులు తమ మతానికి చెందిన ఆరాధన పద్ధతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు స్వేచ్ఛగా ఆచరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కు అమలు అనేది నేడు పెద్ద సవాలుగా మారింది. మన రాజ్యాంగంలో పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. కానీ రాజ్యానికి (ప్రభుత్వానికి) మతం లేదు ఉండదు కూడా. ఎందుకంటే అది లౌకిక రాజ్యం. మతం పేరుతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే ప్రస్తుతం మతమే రాజకీయం అయింది. ప్రతి విషయాన్ని మత కోణంలో చూడడం పెరిగిపోయింది. టి 20వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓడితే దానికి ముస్లిం కాబట్టి బౌలర్‌ షమీని బాధ్యుడిని చేసి మతం పేరుతో దుర్మార్గంగా ట్రోల్‌ చేశారు. బౌలర్‌ షమీపై మతం పేరుతో దాడి చేయడాన్ని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వ్యతిరేకించినందుకు ఆయన ఏడాది వయసున్న కూతురిపై అత్యాచారం చేస్తామని బెదిరింపులకు దిగారు. అలా బెదిరింపులకు దిగింది తెలంగాణకు చెందిన ఉన్నత విద్యావం తుడు కావడం మనం రాష్ట్రానికే అవమానం. అంతేకాదు. తెలంగాణలో విస్తరిస్తున్న మతో న్మాద విష సంస్కృతికి ఇది నిదర్శనం. అసోం రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుని జీవిస్తున్న రెండు గ్రామాల ప్రజలు కేవలం ముస్లింలు అయినందువలన వారిపైన పారామిలటరీ దళాలను ప్రయోగించి, కాల్పులు జరిపి భూముల నుండి బలవంతంగా తొలగిం చారు. ఆ కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపో యారు. చనిపోయిన వ్యక్తి శవంపై మీడియా ఫొటోగ్రాఫర్‌ ఎగిరి గంతులు వేయడం కొంత మందిలో పెరుగుతున్న విద్వేష మానసిక స్థాయికి పరాకాష్ట. ఈ దారుణాన్ని చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. అంతర్జాతీయ మీడియా ‘డాన్సింగ్‌ ఆన్‌ డెడ్‌ బాడీ’ పేరుతో సంపాదకీయం రాసి దేశంలో పెరుగుతున్న మత ఉన్మాదపు సంస్కృతిని నిరసించింది. గుజరాత్‌లో రోడ్డు పక్కన మాంసాహార పదా ర్థాల అమ్మకాలను నిషేధించారు. వీధి వ్యాపా రం చేస్తూ జీవించేవారిలో మైనారిటీలు, దళితు లు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నిషేధం మతోన్మాద కుట్ర తప్ప మరొకటి కాదు. కేరళలో హలాల్‌ పేరుతో రెస్టారెంట్లో వ్యాపారాన్ని దెబ్బతీయడం కోసం బిజెపి పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపింది. చివరికి అయ్యప్ప స్వామి ప్రసాదం తయారు చేయడానికి వాడే బెల్లంపై కూడా హలాల్‌ పేరుతో వివాదం సృష్టించి అభాసుపాలైంది.ఇలా రోజూ ఏదో పేరుతో మత విద్వేషాలు, వివాదాలు సృష్టిం చడం, ప్రచారం చేయడం తప్ప మనుషుల గురించి,వారి విద్య, ఉద్యోగా లు,ఆరోగ్యం, వైద్యం,ఉపాధి, జీవన సౌకర్యాల మెరుగుదల గురించి ఏరోజు కూడా పట్టించు కునే పరిస్థితి లేదు. ఒకవైపు అంబానీ,అదానీ లాంటి కార్పొరేట్‌ శక్తులు పాలకుల అండతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోతుంటే, మరోవైపు దేశంలో నిష్ట దరిద్రుల సంఖ్య 6 కోట్ల నుండి 13.5 కోట్లకు పెరిగింది.ప్రజా సమస్యలు చర్చ లోకి రాకుండా పక్కా ప్రణాళిక ప్రకారం విద్వేష రాజకీయాలు, విద్వేష ప్రకటనలు చేస్తూ సంఘ పరివార్‌ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రజల వాస్తవ సమస్యలు చర్చ లోకి రావాలి. అలా జరగాలంటే దేశంలో శాంతియుత, సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడాలి. లౌకిక, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ జరగాలి. రాజకీయాల నుండి మతాన్ని విడదీయాలి. బెంగాల్‌,త్రిపుర రాష్ట్రా లలో అధికారంలో ఉన్నప్పుడు మార్క్సిస్టు పార్టీ ఆ పనిని విజయవంతంగా చేసింది. అందుకే బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న 35 సంవత్సరాల కాలంలో మత కలహా లు జరగలేదు. బాబ్రీ విధ్వంసం తర్వాత దేశమంతా మత కలహాలతో అట్టుడికి పోయిన ప్పటికీ బెంగాల్‌లో ఆనాటి లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం ఎలాంటి మత కలహాలు జరగకుండా సమర్థ వంతంగా కట్టడి చేయగలిగింది. దేశంలోనే అత్యధిక మంది స్వయం సేవకులు ఉన్న కేరళలో సైతం సిపిఐ(ఎం) నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మతోన్మాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. త్రిపురలో కూడా సిపిఐ(ఎం) అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్క మత ఘర్షణ గాని, మత విద్వేష దాడులు గాని జరిగిన దాఖలాలు లేవు. మార్క్సిస్టులు బలహీనపడిన తరువాతే బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాలలో మతోన్మాదం బుసలు కొడుతోంది. ఇది వర్తమాన చరిత్ర మనకు నేర్పిన గుణపాఠం. దేశంలో మతోన్మాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే లౌకిక, ప్రజాస్వామిక విలువలను నిక్కచ్చిగా అమలు చేయగలిగే సైద్ధాంతిక పునాది కలిగిన వామపక్ష శక్తులు బలపడాల్సిన అవసరం ఉంది.
వ్యాసకర్త : సీపీఐఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (నవతెలంగాణ సౌజన్యంతో)

ఆకలి కేకలు తప్పడం లేదా..!!

అభివృద్ధింటే అద్దంలా మెరిసే రోడ్డు..ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలుకాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈభూమ్మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాళీ కడుపుతోనే నిద్రపోతుండటం కలవరపెట్టే అంశం. కోవిడ్‌ మహమ్మారి ఈ పరిస్థితులను మరింత జఠిలం చేయగా..పేదరికం,ఆకలి విషయాల్లో భారత్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. పోషకాహార లోపం..చిక్కిపోయిన పిల్లలు(ఎత్తుకు తగ్గ బరువులేని ఐదేళ్లలోపు పిల్లలు),ఎదుగుదలలేని పిల్లలు(వయస్సుకు తగ్గ ఎత్తులేని ఐదేళ్లలోపు పిల్లలు),పిల్లల మరణాలు(ఐదేళ్లలోపు పిల్ల మర ణాల రేటు)వంటి నాలుగు పారామీటర్స్‌ను ఉప యోగించి గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనే సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. దీని ప్రకారం భారత్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో అర్ధం చేసుకో వచ్చు.తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొం టున్న ఐదేళ్లలోపు పిల్లలసంఖ్యలో మొత్తం 116దేశాల్లో భారత దేశం టాప్‌ ర్యాంక్‌లో ఉంది’’

పెరిగిన ఆదాయాన్ని,సంపదను నేరుగా ప్రజలకు మళ్ళించడం ద్వారా వారి జీవన ప్రమా ణాల్ని పెంచేందుకు ప్రభుత్వాలు తాపత్రయ పడు తున్నాయి. తద్వారా భారత్‌లో తీవ్ర ఆర్థిక వ్యత్యా సాలపై ఉన్న అపప్రదను పోగొట్టేందుకు ప్రయత్ని స్తున్నాయి. బ్రిటీష్‌ పాలనా కాలం నుంచి భారత్‌కు పేద దేశమన్న పేరు అంతర్జాతీయంగా నెలకొంది. సొంత పాలన ఏర్పడ్డాక దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక నీలి విప్లవాలొచ్చాయి. అనూహ్యంగా సంపద పెరిగింది. ఐటీ రంగం అందుబాటులో కొచ్చాక భారత్‌ దానిపై ఆధిపత్యం సాధించింది. ప్రపంచానికే భారత్‌ ఐటీ కేంద్రంగా రూపుదిద్దు కుంది. మౌలిక సదుపాయాల కల్పనా రంగం లోనూ భారతీయ నిపుణులు ప్రపంచ స్థాయి ప్రమా ణాల్ని సాధించారు. వీరంతా దేశ సంపద పెరిగేం దుకు తోడ్పడ్డారు. అయినప్పటికీ ప్రపంచంలో భారత్‌కున్న పేద దేశమన్న పేరు పోవడంలేదు. సంపద పెరగడమే కాదు..దాన్ని సక్రమంగా పంపి ణీ చేయగలిగినప్పుడే ఈ దేశం పేదరికం నుంచి బయటపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమాన గౌరవం పొందగలుగుతుంది. అందు కోసమే ఇప్పుడు ప్రభుత్వాలు తాపత్రయ పడుతు న్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.. Read more

పీసా చట్టం`గిరిజనులకు వరం

రెండున్నర దశాబ్దాల క్రితం పీసా చట్టం కోసం దేశవ్యాప్తంగా గిరిజనులు పోరాడారు. ముఖ్యంగా ప్రముఖ విశ్రాంతి ఐఏఎస్‌ అధికారులు స్వర్గీయ బీడీ శర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా వంటి గిరిజనతెగల స్పూర్తిదాతల సహకారం కూడా మరవలేనిది.73వ రాజ్యాంగ సవరణలో 1991లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా నేతృత్వంలోని ఓకమిటీని నియమించింది. కమిటి సీపార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. ఈచట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటు హక్కు కలిగి ఉన్న నివాసితు లంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు. వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వనరులు,అటవీ సంపదపై యాజ మాన్యహక్కులు కలిగి ఉంటారు.ఆ వనరులను స్వీయ అవసరాల కోసం వినియోగించు కుంటూ,గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు. ఆయా గ్రామాల్లో ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు,వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ, నష్టపరిహారం పంపిణీ,గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులు, సామాజిక,ఆర్ధిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన,ఉప ప్రణాళిక నిధుల ఖర్చుకు సైతం గ్రామసభల అనుమతి తీసుకోవాలి. అంతేకాదు ప్రభుత్వం సంక్షేమపథకాల్లో లబ్దిదారుల గుర్తింపు,చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ,నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించబడ్డాయి.

ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటు హక్కు కలిగి ఉన్న నివాసితు లంతా గ్రామసభ పరిధిలోకి తీసుకొచ్చిన పీసా చట్టం వచ్చి 25 ఏళ్లు పూర్తియింది. అయినా సరే నేటికీ చట్టం లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అమలు పర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను గ్రామాల సమగ్ర అభివృద్ధి, గ్రామీణుల సాధికారత కోసం గ్రామ పంచాయతీలకు మార్గనిర్దేశం చేయ డంలో ప్రభుత్వ వ్యవస్థలు దీర్ఘకాలంగా విఫలమవుతూనే ఉన్నాయి. కొండ, కోనల్లోని ఆదివాసుల సంప్రదాయ గ్రామసభలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ఉద్దేశించిన పంచాయతీరాజ్‌- షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం (పీసా చట్టం-1996) అమలులోకి వచ్చి పాతికేళ్లయింది. ఆదివాసుల జీవనోపాధుల మెరుగుదల, అటవీ హక్కుల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి తదితర కీలక అంశాల్లో వారికి స్వయంపాలన హక్కులు కల్పించే పీసా చట్టం స్ఫూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయనే చెప్పాలి. గ్రామసభల స్ఫూర్తికి తూట్లుపంచాయతీ రాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకే రీతిన అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతో పాటు, వారి మద్దతు సంఘాలు పెద్దయెత్తున ఉద్యమించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం దిలీప్‌సింగ్‌ భూరియా ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవరణతో 1992లో అమలులోకి వచ్చిన పంచాయతీ రాజ్‌ చట్టంపై ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులతో పార్లమెంటు 1996లో పీసా చట్టాన్ని (పంచాయతీ రాజ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాల విస్తరణ చట్టం) ఆమోదించింది. దాంతో ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్ర బిందువుగా మార్చారు. రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు జాబితాలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌,రaార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌,మహారాష్ట్ర,కర్ణాటక, కేరళ, బిహార్‌లలోని షెడ్యూలు ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది. దాని ప్రకారం నోటిఫై చేసిన గ్రామసభలకు ఆ ప్రాంతంలోని సహజ వనరులపై పూర్తి యాజమాన్య హక్కులు ఉంటాయి.జల, అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షించుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి. విద్యా, వైద్య కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నష్ట పరిహార పంపిణీ, గనుల తవ్వకాలకు అవసరమైన లీజుల మంజూరుకు గ్రామసభల అనుమతి తప్పనిసరి. ఆవాసాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనబీ గిరిజనాభివృద్ధి ఉప ప్రణాళిక నిధులను ఖర్చు చేసేందుకు తప్పనిసరిగా గ్రామసభల పాత్ర ఉండాలి. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ తదితర విషయాల్లో గ్రామసభలకు పూర్తి అధికారాలు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం విడుదలయ్యే జమా ఖర్చుల ధ్రువపత్రాలను అధికారులు గ్రామసభల నుంచి తీసు కోవాలి.అమలులో అశ్రద్ధమహోన్నత లక్ష్యాలతో అమలులోకి తెచ్చిన పీసా చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు అంతులేని అశ్రద్ధ కనబరుస్తున్నాయి. చట్ట నియమాల రూప కల్పనలో ఏళ్ల తరబడి కాలయాపనవల్ల అసలు లక్ష్యం పూర్తిగా నీరుగారింది. తెలుగు రాష్ట్రా లకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1996లో చట్టం అమలులోకి వచ్చిన 15ఏళ్ల అనంతరం అంటే 2011లో సంబంధిత నియమ నిబంధనలు రూపొం దించింది. ఆ నియమాలు వచ్చిన రెండేళ్ల తరవాత 2013లో గిరిజన సంక్షేమ శాఖ- జిల్లా, మండల, పంచాయతీల వారీగా గ్రామసభలను గుర్తించి, జాబితాను ‘నోటిఫై’ చేసింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ‘పీసా’ అమలు ద్వారా గిరిజన ప్రాంతాల్లో గ్రామసభలకు హక్కులు వర్తింపజేసే ప్రయత్నమే జరగలేదు.పాతికేళ్లయినా..చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లు అవుతున్నా ఛత్తీస్‌గఢ్‌, రaార?ండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటివరకు చట్ట నిబంధనలను రూపొందించుకోలేదు. గుజరాత్‌లో అక్కడి అయిదో షెడ్యూలు ప్రాంతాల్లోనూ పంచాయతీ రాజ్‌ చట్టాన్ని అమలుచేస్తున్నారు. ‘పీసా’ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని అన్వయించుకోవడంతో దాని అమలు తీరే మారిపోయే దుస్థితి దాపురించింది. షెడ్యూలు ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టుకోసం భూసేకరణకు ముందు గ్రామసభలను సంప్రదించాలి. ఆ ప్రాజెక్టువల్ల ప్రభావితమయ్యేవారికి నష్ట పరిహారం, పునరావాసం కల్పించాలని కేంద్ర చట్టం చెబుతోంది. ఆ నిబంధనను అనేక రాష్ట్రాలు తమ ఇష్టానుసారం అన్వయించుకుని గ్రామ సభల హక్కులను నిర్వీర్యం చేశాయి. గనుల లీజులు, నీటిపారుదల నిర్వహణ,అటవీ ఉత్పత్తుల యాజమాన్యం… ఇలా అనేక అంశాల్లో కేంద్ర చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు శాసనాల్లో మార్పులు తీసుకువచ్చి గ్రామసభల ఉనికినే అపహాస్యం చేస్తున్నాయి.హక్కులతోనే వికాసందేశంలో అత్యంత వెనకబడిన జిల్లాలన్నీ దాదాపుగా ఆదివాసీ ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లోనే వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉంది. అందుబాటులోని వనరులపై హక్కులు కల్పించి, వారికి గ్రామసభల స్థాయిలో పరిపాలన సామర్థ్యం పెంచి, పారదర్శకంగా నిధుల వ్యయం, సంక్షేమ ఫలాల పంపిణీ జరిగినప్పుడు గిరిజన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ పరిపాలన, కట్టుబాట్లు, భౌగోళిక, సామాజిక పరిస్థితులు క్లిష్టంగాను, భిన్నంగాను ఉంటాయి. ప్రధాన స్రవంతి చట్టాలను యథావిధిగా అమలు చేయడంతో ఆదివాసీ ప్రాంతాల పరిస్థితి దశాబ్దాలుగా గందరగోళంగా తయారైంది. గ్రామసభలను విస్మరించడం ఆదివాసుల్లో అసంతృప్తికి, అశాంతికి దారితీస్తుందని ఇప్పటికే అనేక ఉన్నతస్థాయి కమిటీలు కేంద్రానికి నివేదించాయి. గిరిజన ప్రాంతాల పాలనలో ఎదురయ్యే సవాళ్లపై కేంద్ర పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ సాయంతో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌’ అధ్యయనంబీ రెండో పాలన సంస్కరణల కమిషన్‌, ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్య అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీబీ భూ పరాయీకరణ, నిర్వాసితుల సమస్య, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవ చంద్ర కమిటీలు- ‘పీసా’ను పటిష్ఠంగా అమలు చేస్తేనే, ఆదివాసుల స్వయంపాలన సాధ్యమని తేల్చిచెప్పాయి.నిర్వీర్యమవుతున్న రాజ్యాంగ రక్షణ కవచాలుపీసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పేర్కొన్న నిబంధనల అమలుకు రాష్ట్రాల్లో ఇప్పటికీ వ్యవస్థాగత యంత్రాంగమే సిద్ధం కాలేదు. దీంతో రాజ్యాంగ రక్షణ కవచాలు కాస్తా చేవ తగ్గి నిర్వీర్యం అవుతున్నాయి. పీసాతో సహా ఇతర గిరిజన రక్షణ చట్టాలు, సంబంధిత నిబంధనలపై శిక్షణ, అవగాహన పెంచే బాధ్యత, అమలు తీరును పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రాల్లోని గిరిజన సంస్కృతి, పరిశోధన, శిక్షణ సంస్థలు సరిపడా సిబ్బంది, తగిన నిధులు లేక సతమతమవుతున్నాయి. పీసా చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంలోనైనా గిరిజనుల అభిమతాన్ని గౌరవించాలి. కొత్తగా కొలువుతీరిన తెలుగు రాష్ట్రాల పంచాయతీ పాలకవర్గాలతో గిరిజన ఆవాసాల్లో గ్రామీణ సభల కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయాలి. మరోవంక రాష్ట్రాలకు తగినన్ని వనరులను సమకూర్చి పీసా అమలుకు వాటిని సిద్ధం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది!

గ్రామసభ, విధులు…

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మొదటి గ్రామసభ నిర్వహించడానికి డిప్యూటీ తహశీల్దార్‌ హోదాగల అధికారిని నియమించాలి. గ్రామసభ సమావేశానికి సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తాడు. సర్పంచ్‌ లేనప్పుడు గ్రామపెద్ద అధ్యక్షత వహించవచ్చు. మెజార్టీ గ్రామసభ్యుల్లో 1/3వంతు తక్కువ కాకుండా కనీసం 50శాతం మంది ఎస్టీ సభ్యులు హాజరైతేనే కోరంగా పరిగణిస్తారు. మెజార్టీ గ్రామసభ్యులు చేతులెత్తి ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు. వీరికి ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది. ఏడాదికి రెండు సార్లు గ్రామసభ నిర్వహించాలి.గ్రామసభ అనంతరం నిర్ణయాలను నిర్వహణాధికారి చదివి, వినిపించి సభ్యుల ఆమోదం పొందాలి. సభ్యుల సంతకాలు విధిగా తీసుకోవాలి. ఈ తీర్మాణాలను నాలుగు వారాల్లోపు గ్రామసభ కార్యదర్శి సంబంధిత ప్రభుత్వ శాఖలకు, సంస్థలకు పంపాల్సి ఉంటుంది. వ్యవసాయ ఉత్పాధక ప్రణాళికలు, ఉమ్మడి భూముల జాబితా, ఇంటి స్థిరాస్తుల యాజమా న్యాల బదలాయింపులు, పంచాయతీ లెక్కల ఆడిట్‌ నివేధికలు, చౌకధర దుకాణం, అంగన వాడీ, సబ్‌సెంటర్‌, పాఠశాలల పనితీరు, సంక్షేమ హాస్టళ్ళ పనితీరు, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్‌ సౌకర్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామసభ జోక్యం చేసుకోవచ్చు.

భూసేకరణ, గిరిజన భూమి అన్యాక్రాంతం

ఏదైనా చట్టం కింద ప్రభుత్వం,సంబంధిత అధికారి భూసేకరణ ప్రతిపా దించినట్లైతే గ్రామసభ ద్వారానే జరగాలి. ప్రతిపాదిత భూసేకరణ, కొత్తగా స్థిరపడిన ప్రజలు, సమాజంపై చూపే ప్రభావం, ఉద్యోగవకా శాల పై గ్రామసభ పరిశీలన చేసి వాస్తవాలను పరిశీలించి భూసేకరణకు సిఫారసు చేయాలి. దీని ద్వారా నిర్వాసిత వ్యక్తుల పునరావాస ప్రణాళిక విషయంలో మండల ప్రజాపరిషత్‌ సిఫారసు చేయాలి. అట్టి మండల పరిషత్‌ సిఫారసులను భూసేకరణ అధికారి పరిగణలోకి తీసుకోవాలి. అంగీకరించని పక్షంలో మరోసారి పరిశీలన కోసం భూసేకరణ అధికారికి పంపాలి. రెండో సారి సంప్రదింపుల అనం తరం మండల ప్రజాపరిషత్‌ సిఫారసులకు వ్యతిరేకంగా ఉత్తర్వులను భూసేకరణ అధికారి జారీ చేసినట్లైతే అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలి.

ఖనిజాల వెలికితీత అనుమతులు, మద్యపాన నిషేద అమలు, క్రమబద్దీకరణ, అమ్మకాలపై ఆంక్షలు విధించ డం, మండల పరిషత్‌ అధికారాలు, నిధులు, ఎక్సైజ్‌శాఖ కింద మద్యం దుకాణాలు తెరవడానికి లైసెన్స్‌ పొందడం వంటి వాటన్నింటికీ ఈ పీసా చట్టం వర్తిస్తుంది. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన భూమి అన్యాక్రాంతం కాబడితే చట్టబ ద్దంగా తిరిగి స్వాదీనం చేసుకోవడం, గిరిజనులతో చేసే వడ్డీ వ్యాపారంపై నియంత్రణ అధికారం పూర్తిగా ఈ పీసా చట్టం పరిధిలోకే వస్తాయి. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం, విక్రయాలు ఉదా:- వెదురు, బీడీ ఆకుల మినహా చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, జిసిసికి ఉన్న హక్కులు గ్రామసభకు లోబడే ఉంటాయి.

వారపు సంతల నిర్వహణ..

షెడ్యూల్‌ ప్రాంతంలో గ్రామసంత లు నిర్వహించడానికి గ్రామ పంచాయతీ యే మార్కెట్‌ కమిటీగా ఉంటుంది. వారం వారం జరిగే సంతల్లో ఆ మార్కెట్‌ కమిటీ గా ఆయా గ్రామపంచాయతీలు విధులు నిర్వహిస్తాయి. స్థానిక గిరిజనులకే లైసెన్సు లు మంజూరు చేయాలి. మార్కెడ్‌యార్డుల నిర్వహణ, పోషణ, లావాదేవీలు, తాత్కాలి క నిలుపుదల, మూసివే యడం, ప్రారంభిం చడం, క్రమబద్దీకరించడం కమిటీలకు అధికారం ఉంటుంది. గ్రామపంచా యతీల ద్వారా అన్ని విద్యా సంస్థల పరిపాలన నివేధికలను కోరే అధికారం మండల పరిషత్‌కు ఉంటుంది. మండల పరిషత్‌ పరిధిలోగల అన్ని విద్యా సంస్థల బడ్జెట్‌ను మే 31 నాటికే ఆమోదించాలి. సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో విద్యార్థు లకు ఆహార సరఫరా, ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణ ను చట్టం కింద పర్యవేక్షించాలి. పంచాయ తీరాజ్‌ సంస్థలు తమ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలు, సంస్థలకు మద్ధతును, అంగన్‌వాడీ బడ్జెట్‌ను, జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ పథకం అమలు, పరిరక్షణ బాధ్యత చట్టం పరిధిలోనే ఉంటాయి..

పీసా పరిధిలోకి వచ్చే చట్టాలివే…

పీసా చట్టం పరిధిలోకి ఈ క్రింది చట్టాలు వస్తాయి. గనులు, ఖనిజాల (క్రమబద్దీకరణ, అభివృద్ధి) చట్టం 1957. ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత భూబదలాయింపు క్రమబద్దీకరణ నిబంధనలు 1959, షెడ్యూల్డ్‌ ప్రాంత వడ్డీవ్యాపార నిబంధనలు 1960, వ్యవసాయ ఉత్పత్తుల పశుగణన చట్టం 1966, అటవీచట్టం 1967, ఎక్సైజ్‌ చట్టం 1968, గిరిజన రుణవిమోచన రెగ్యులేషన్‌ చట్టం 1970, వాణిజ్య క్రమబద్దీకరణ నిబంధనలు 1979, అటవీ సంరక్షణ చట్టం 1980, విద్యాచట్టం 1982, సాగునీటి వ్యవస్థల నిర్వహణ చట్టం 1997, పంచాయతీరాజ్‌ సవరణ చట్టం 1998, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 చట్టాలు అమల్లో పీసా చట్టం ద్వారా గ్రామసభలు నిర్వహించి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.- గునపర్తి సైమన్‌

పీసా చట్టానికి 25 ఏళ్లు

మహోన్నత లక్ష్యఆలతో అమలులోకి తెచ్చిన పీసా చట్టం (పంచాయితీరాజ్‌షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం1996) అమలులోకి వచ్చి పాతికేళ్లయింది. ఆదివాసుల జీవనోపాధుల మెరుగుదల,అటవీ హక్కుల కల్పన,మౌళిక వసతుల అభివృద్ధి తద తర కీలక అంశాల్లో వారికి స్వయంపాలన హక్కులు కల్పించే పీసా చట్టంస్పూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్ధం చేసు కోలేకపాయాయనే చెప్పాలి.పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకే రీతిన అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతోపాటు,వారి మద్దతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. దాంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవ రణతో 1992లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టంపై ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులతో పార్లమెంటు 1996లో పీసా చట్టాన్ని(పంచాయితీరాజ్‌ షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం)ఆమోదించింది. దాంతో ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన,సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్రబిదువుగా మార్చారు.

Read more

ద‌ఢ పుట్టిస్తున్న ఒమిక్రాన్‌-వ‌ణికుతున్న ప్ర‌పంచ‌దేశాలు

కరోనా వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌ అన్నారు. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ అంటు న్నారు. మరి ఇంది ప్రాణాం తకమా? కాదా?..అంటే కాదు అంటు న్నారు సౌత్‌ ఆఫ్రికన్‌ డాక్టర్‌. ఒమిక్రాన్‌ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన సౌత్‌ ఆఫ్రికన్‌ డాక్టర్‌ ఏంజెలిక్‌ కొయెట్జి తన దగ్గరకి ట్రీట్మెంట్‌కి వచ్చిన పేషెంట్స్‌ త్వరగా కోలుకున్నారు అని చెప్పారు. గత కొద్ది రోజులుగా దాదాపు 30 పేషెంట్స్‌ను చూడగా వారిలో తీవ్రమైన కోవిడ్‌ లక్షణాలు ఏమి కనిపించ లేదన్నారు. వీరెవరూ హాస్పిటల్‌?లో చేరకుండానే డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ లక్షణాలు
అందరు యువకులు అయినా బాగా అలసట కనిపించిందని ఏంజెలిక్‌ కొయెట్జి చెప్పారు. దానితో పాటు కొంచెం గొంతులో గరగర, పొడి దగ్గు, కండరాల నొప్పులతో తన దగ్గరకు వచ్చారని వివరించారు. ఎక్కువ మంది పేషెంట్లలో స్మెల్‌ రుచి పోలేదని అన్నారు. కొద్ది మందిలోనే హై టెంపరేచర్‌ కనిపించిందని పేర్కొన్నారు. తీవ్రమైన లక్షణాలు చూపించే ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ అని ఏంజెలిక్‌ కొయెట్జి వెల్లడిరచారు.

Read more

72 ఏండ్ల రాజ్యాంగ‌మే మ‌న సార‌ధి

‘ప్రపంచ చరిత్రలో ఈ సమయంలో రూపొందించ బడిన రాజ్యాంగంలో కొత్త అంశం ఏదైనా ఉందా అని అడుగవచ్చు.మొదటి రాత రాజ్యాంగ రూపొందించి నేటికి ఒకవందకంటే ఎక్కువ సంవత్సరాలు గడిచాయి. ఈసంప్రదాయాన్ని అనేక రాజ్యాలు పాటించి తమతమ రాజ్యాంగాలను రాత లోకి తెచ్చాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అనేక రాజ్యాం గాల్లో ప్రధాన నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి.చేసిన కొత్త విషయమే మిటంటే మనంరూపొందించిన రాజ్యాం గంలో వివిధ రాజ్యాంగాల్లోని లోపాలను సవరించి అవి మన దేశ అవసరాలకు అనుగుణంగా మార్చు కోగలిగాం.’అలా అంబేద్కర్‌ కృషితో నేడు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.                                                        భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా...
ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగం గొప్పవిశిష్టత స్థానాన్ని సంతరించు కుంది. 1948, జనవరి నెలలో రాజ్యాంగం తొలిముసాయిదా ప్రతి విడుదలైంది. ఆముసాయిదాకు వివిధ వర్గాల నుంచి,ప్రజల నుంచి7,635 సవరణలు వచ్చాయి. వాటిలో 2,473 సవరణలపై ఉపసం ఘం చర్చిం చింది.1949,నవంబర్‌ 26న నూతన రాజ్యాం గాన్ని, రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. తొలి రాజ్యాంగ ప్రతిపై 1949 నవంబర్‌ 24న 284 మంది రాజ్యాంగపరిషత్‌ సభ్యులు సంతకాలు చేశారు. అలా నవంబర్‌ 26ను రాజ్యాంగ దినోత్స వంగా పరిగణిస్తున్నారు. 1950జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
కొందరు న్యాయమూర్తులు, భారత రాజ్యాంగ ఆర్టికల్స్‌ను తమకు తోచినవిధంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, అమలుజరుపకుండా వచ్చారు. దాంతో భారత రాజ్యాంగంలో 15(4),16(4),31బి,9వ షెడ్యూల్‌ వంటివి చేర్చి సుప్రీంకోర్టు పరిధిలోకి రాకుండా ఆయా చట్టాల,శాసనాల రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది.అలా 9వషెడ్యూల్లో285ఆయా రాష్ట్రాల, కేంద్రాల చట్టాలను చేర్చడం జరిగింది. జవాబుదా రీతనం లేని సుప్రీంకోర్టు అపరిమిత అధికారాలను జవాబుదారీగా ఉండేవిధంగా మలుచుకోవాలి. అందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృతాధికారాలు ఇచ్చిన ఆర్టికల్స్‌ను తొలిగించాలి.1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత గణతంత్ర రాజ్యాంగం 1949, నవంబర్‌ 26న రాజ్యాంగ పరిషత్‌చే ఆమోదించబడిరది.70 ఏండ్లుగా భారత రాజ్యాంగం అనేక ఆటుపోట్లకు గురై మార్పు చేర్పులతో సుస్థిరంగా కొనసాగుతున్నది. భారత రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఒకే విలువ,ఒకే ఓటు..ప్రాదేశిక నియోజకవర్గాలు,చట్టసభలు, పరి పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ అనేవి మౌలికాం శాలు.భారత రాజ్యాంగం ఒకఉత్కృష్టమైన గ్రంథం. దీని రచనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వాళ్లంతా మహనీయులు. స్వాతంత్య్ర ఉద్యమంలో కలలుగన్న భవిష్యత్‌ స్వప్నాలను సాకారం చేయ డానికి భారత రాజ్యాంగం ఒక ప్రతీకగా రూపొం దింది. రాజ్యాంగనిర్మాణం వెనుక శతాబ్దాల చరిత్ర, పరిణామం ఉన్నది.1948,జనవరినెలలో రాజ్యాం గం తొలి ముసాయిదా ప్రతి విడుదలైంది. ఆ ముసాయిదాకు వివిధవర్గాల నుంచి, ప్రజల నుంచి 7,635 సవరణలు వచ్చాయి. వాటిలో 2,473 సవరణలపై ఉపసంఘం చర్చించింది.1949, నవంబర్‌ 26న నూతన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. తొలి రాజ్యాంగ ప్రతిపై 1949 నవంబర్‌ 24న 284 మంది రాజ్యాంగ పరిషత్‌ సభ్యులు సంతకాలు చేశారు. అలా నవం బర్‌ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పరిగణిస్తున్నారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ పరిణా మం: 1919 భారత ప్రభుత్వ చట్టం మాంటేంగ్‌ చేవ్‌ ఫర్డ్‌ అనే పేరుతో అనేక సంస్కరణలకు దారి తీసింది. ఈచట్టంద్వారా ఆంగ్లేయులు మన దేశంలో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టారు. ఈచట్టం ద్వారా శాసనసభ నిర్మాణంలో ఎక్కువ ప్రజా ప్రాతినిధ్యానికి అవకాశం ఏర్పడిరది. తొలిసారిగా కేంద్రంలో ద్విసభా విధానం అమల్లో కి వచ్చింది. దిగువసభను లెజిస్లేటివ్‌ అసెంబ్లీ అని ఎగువ సభను కౌన్సిలర్‌ స్టేట్స్‌ అని పిలిచేవారు.1919 నాటి చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి బ్రిటిషు ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొం దించింది. దీనికితోడు కొన్ని ఇతర కారణాలు కూడా 1935చట్టానికి దోహదం చేశాయి. స్వరాజ్య వాదుల ఉద్యమాలు సైమన్‌ కమిషన్‌ నివేదిక పరిణామాలు నెహ్రూ నివేదిక, జిల్లా నివేదిక, గాంధీ ఆధ్వర్యంలో జరిగినశాసనోల్లంఘన ఉద్య మం, రౌండ్‌టేబుల్‌ సమావేశాల వంటివి ఈ చట్టం చేయడానికి దారి తీసిన కొన్ని ముఖ్యమైన అంశాలు. 1933లోబ్రిటిష్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం 1935 భారత ప్రభుత్వ చట్టానికి మూలా ధారం. అప్పటి బ్రిటిష్‌ ప్రధానిరావ్న్‌సేవ్న్‌కో డొనాల్డ్‌ 1932 ఆగస్టు 4న జారీ చేసిన కమ్యూనల్‌ అవార్డు పరిణామం కూడా ఈచట్టానికి కారణంగా భావిం చవచ్చు. ముస్లిం, ముస్లిమేతరులకు ప్రత్యేక నియో జకవర్గాలను కేటాయించారు. ఆక్రమంలో కమ్యూ నల్‌ అవార్డు పునా ఒప్పందంగామారి ఎస్సీ,ఎస్టీ లకు రిజర్వేషన్లు కొనసాగుతూ వస్తున్నాయి. 19 35లో భారత రాజ్యంగచట్టం రూపొందించ బడిరది. ఎన్నికలు జరిగాయి. 1946లో భారత రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడిరది. నాటి రాజ్యాంగ పరిషత్‌లో నేటి బంగ్లాదేశ్‌,పాకిస్థాన్‌ భూ భాగాలకు చెందినవారూ ఉన్నారు. 
1947ఆగస్టు29నాడు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చైర్మన్‌గా ఎన్నుకోబడినారు. ఈకమిటీలో ఏడుగురు సభ్యులున్నారు. వారు..డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌,ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌,అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్‌,డాక్టర్‌ కె.ఎన్‌.మున్షి,సయ్యద్‌ మహ్మద్‌,ఎన్‌.మాధవరావు(బి.ఎల్‌.మిట్టల్‌) రాజీ నామా చేయగా ఇతను నియమించబడ్డారు.టి.టి.కృష్ణమాచారి(1948లోడి.పి.ఖైతాన్‌ మర ణించిన తర్వాత ఇతడు నియమించబడినారు. ఫెడరలిజం సమానత్వం ప్రాతినిధ్యం: 1.ప్రజా ప్రాతినిధ్యం, 2.ప్రాదేశిక నియోజకవర్గాలవారీగా ప్రాతినిధ్యం,3.పార్టిసిపేటింగ్‌ ప్రజాస్వా మ్యం, 4.రిప్రెజెంటేటివ్‌ ప్రజాస్వామ్యం,5.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనాశాఖలు, 6.న్యాయవ్యవస్థ,7.పత్రికాస్వేచ్ఛా, భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా, పత్రికలు. అందువల్ల ప్రజాస్వామ్యంలో మూలస్తం భాలైన మూడిరటిలో ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే దేశం ఒక సమాఖ్యగా కొనసాగుతుంది. దీన్ని సరిగ్గా ఆచరిస్తే స్వేచ్ఛా సమానత్వం, అందరికీ సమానావకాశాలు అందించే ఫెడరలిజం, కేంద్రీ కృత పరిపాలన చక్కగా ఏకకా లంలో కొనసాగుతాయి. ప్రస్తుతం చట్టసభలకు ప్రాదేశిక నియోజకవర్గాలుగా ప్రతినిధులున్నారు. పరిపాలనా యంత్రాంగంలో కూడా ఐఏఎస్‌ మొదలుకొని నాన్‌ గెజిటెడ్‌ అధికారి దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రాదేశిక నియోజకవర్గాల ప్రకారం ఉద్యోగులు,అధికారులు ఎన్నికయ్యే వ్యవస్థ ను అమలు జరుపుకోవాలి. న్యాయవ్యవస్థలో కూడా ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఇండియన్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌ ద్వారా ఎంపిక జరుగాలి. అలాగే ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా పారిశ్రా మికీకరణ,అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాలి. పరి పానాధికారం యంత్రాంగంతో నియామకాలు, న్యాయవ్యవస్థలో నియామకాలు, ప్రాదేశిక నియోజక వర్గాలవారీగా జరుగడం అవసరం. నీట్‌ పరీక్ష వలె అఖిల భారతస్థాయిలో పరీక్షలు నిర్వహించి, స్థానికత ఆధారంగా నియామకాలు,ఎంపిక చేయా  కొందరు న్యాయమూర్తులు,భారత రాజ్యాంగ ఆర్టికల్స్‌ను తమకు తోచినవిధంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, అమలుజరుప కుండా వచ్చారు. దాంతో భారత రాజ్యాంగంలో 15(4),16(4),31బి,9వ షెడ్యూల్‌ వంటివి చేర్చి సుప్రీంకోర్టు పరిధిలోకి రాకుండా ఆయా చట్టాల, శాసనాల రక్షణచర్యలు చేపట్టడం జరిగింది. అలా9వషెడ్యూల్లో 285 ఆయారాష్ట్రాల,కేంద్రాల చట్టా లను చేర్చడం జరిగింది. జవాబుదారీతనం లేని సుప్రీంకోర్టు అపరిమిత అధికారాలను జవాబు దారీగా ఉండేవిధంగా మలుచుకోవాలి. అందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృతాధికారాలు ఇచ్చిన ఆర్టి కల్స్‌ను తొలిగించాలి. ఉత్కృష్టమైన ఈభారత రాజ్యాంగ పరిరక్షణ భారత పౌరులందరి కర్తవ్యం.భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బి.ఆర్‌.అంబే ద్కర్‌ రాజ్యాంగం గురించి ఇలా అంటారు. ‘ప్రపం చ చరిత్రలో ఈ సమయంలో రూపొందించ బడిన రాజ్యాంగంలో కొత్తఅంశం ఏదైనాఉందా అని అడుగవచ్చు.మొదటి రాత రాజ్యాంగం రూపొం దించి నేటికి ఒక వందకంటే ఎక్కువ సంవ త్సరాలు గడిచాయి. ఈ సంప్రదాయాన్ని అనేక రాజ్యాలు పాటించి తమతమ రాజ్యాంగాలను రాత లోకి తెచ్చాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అనేక రాజ్యాంగాల్లో ప్రధాన నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి. చేసిన కొత్త విషయమే మిటంటే మనం రూపొందించిన రాజ్యాంగంలో వివిధ రాజ్యాంగాల్లోని లోపాలను సవరించి అవి మన దేశ అవసరాలకు అనుగుణంగా మార్చు కోగలిగాం.’అలా అంబేద్కర్‌ కృషితో నేడు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.                                             రాజ్యాంగమే సుప్రీం
విభిన్న జాతులు,సంస్కృతులు, ప్రాం తాలు, మతాలు,కులాలు,భాషలసంక్లిష్ట సమాజం భారత దేశం. ఏదో ఒకఅంశంలో ఎపుడూ కేంద్రం తో రాష్ట్రాలు ఏదో ఒక ఘర్షణకు దిగుతుంటాయి. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, రాష్ట్రాలు ఎదురుతిరిగేందుకు అవకాశం లేకుండా రాజ్యాంగంలోనే పకడ్బందీ ఆంక్షలు కూడా పొందుపరిచారు. ముందుగా రాష్టప్రతి, గవర్నర్‌ అనుమతి లేకున్నా శాసనం చెల్లుబాటు అయ్యే అవకాశం అధికరణం 255లో ఉంది.. అంతే కాదు అధికరణం 256లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు, 257లో రాష్ట్రాలపై కేంద్రం నియం త్రణ గురించి కూడా ఉంది. జీఎస్‌టీ అమలు చేయాలని అప్పట్లో కేంద్రం నిర్ణయిస్తే చాలా రాష్ట్రాలు తొలుత వ్యతిరేకించాయి, తర్వాత అన్ని రాష్ట్రాలు గాడిలో పడ్డాయంటే దానికి కారణం రాజ్యాంగంలో సంలీనంగా ఉన్న ఆదేశ సూత్రాలే ననేది సుస్పష్టం. స్వాతంత్య్రాన్ని సాధించి, ప్రజా స్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇతర ప్రజాస్వామిక దేశాలను అనుసరించి మన నాయకులు, పాలకులు దేశానికి చక్కని రాజ్యాం గాన్ని రూపొందించారు. రాజ్యాంగం దేశానికి వౌలిక శాసనం. ప్రభుత్వానికి మూలచట్టం. అందు కే రాజ్యాంగ నిర్మాతలు ఆచర ణాత్మకమైన, సలక్షణ మైన రాజ్యాంగాన్ని నిర్మించ డమే ధ్యేయంగా పెట్టు కుని ప్రపంచంలోని ప్రజా స్వామిక రాజ్యాంగాలను అన్నింటినీ అధ్యయనంచేసి వాటిలో మన దేశ పరిస్థితుకు సరిపడే అంశాలను జోడిరచి వాటిని మన రాజ్యాంగంలో తగిన చోట పొందుపరిచారు.
అనేక దేశాల సంప్రదాయాలు
ఏక పౌరసత్వాన్ని, పార్లమెంటరీ విధా నాన్ని,స్పీకర్‌ పదవిని బ్రిటన్‌ నుండి,ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్షాధికారం అమెరికా రాజ్యాంగం నుండి, ఆదేశిక సూత్రాలు, రాష్టప్రతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభ సభ్యుల వివరా లను ఐర్లాండ్‌ నుండి, ప్రాథమిక విధులను రష్యా నుండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలను కెనడా నుండి, అత్యవసర పరిస్థితిని వైమర్‌(జర్మనీ)నుండి ఉమ్మడి జాబితా,పీఠికలో వాడినభాషను ఆస్ట్రేలియా నుండి, గణతంత్ర వ్యవస్థను ఫ్రాన్స్‌నుండి దత్తత తీసు కున్నారు.
ప్రవేశికే హృదయం
రాజ్యాంగం తొలి పుటలోనే ప్రస్తావన ఉంటుంది.‘‘భారతదేశ ప్రజలైన మేము..1949 సంవత్సరం నవంబర్‌ 26వ తేదీన ఈభారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకుని మాకు మేమే సమర్పించుకుంటున్నాం…ఈ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక ప్రజా స్వామిక గణతంత్రంగా ప్రకటిస్తున్నాం, భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కింది సౌలభ్యాలను కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది- సామా జిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ,నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటే స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, సమాన హోదా, సమాన అవకాశాలు, ప్రజలందరిలో దేశ సమైక్య తను, అఖండతాభావాన్ని , సోదర భావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం కొసం ఈ రాజ్యాం గాన్ని సమర్పించుకుంటున్నాం’’ అని పేర్కొని ఉంటుంది. మొత్తం రాజ్యాంగాన్ని రంగరించి, వడపోస్తే వచ్చే వ్యాఖ్యలివి. ఇందులో అర్థం మొత్తం ఉంది.
నందాలాల్‌ బోస్‌ స్వీయ లిఖిత గ్రంథం
రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత రాజ్యాంగాన్ని ప్రజలు తమకు తామే సమర్పించు కున్న దరిమిలా విశ్వభారతిలోని శాంతినికేతన్‌ కళాకారులు ప్రముఖ చిత్రకారుడు నందాలాల్‌ బోస్‌ నేతృత్వంలో చక్కనిరాతప్రతిని సిద్ధంచేశారు. రాష్ట ప్రతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, ప్రధాన జవహర్‌ లాల్‌ నెహ్రూ మొదలైన ఆనాటి నేతలు ఆ ప్రతిపై తమ చేతిరాతతో సంతకాలు చేశారు.
ఘనకీర్తి
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ, విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగానికి ఉన్న ఘనకీర్తి అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఖ్యాతి చెందిన భారత్‌లో భారీ సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొని, తమకు నచ్చిన నేతనే ఎన్నుకునే మహద్భాగ్యం ఈ రాజ్యాంగంతోనే వచ్చింది. రాజ్యాంగం దేశానికి వౌలిక శాసనం, ప్రభుత్వానికి మూల చట్టం.
వ్యక్తుల్లో ఆదర్శాలుండాలి
రాజ్యాంగ లక్ష్యాల ప్రాశస్త్యం అనేది దానిని అమలుచేసే పాలనావ్యవస్థల మీద, అంటే అమలుచేసే మనుష్యుల మీద ఆధారపడి ఉం టుంది. ఈవిషయాన్ని డాక్టర్‌ అంబేద్కర్‌, పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ, డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ అనేక మార్లు నొక్కి వక్కాణించారు. ఈ నూతన రాజ్యాం గం కింద పరిస్థితులు వక్రమార్గం తొక్కాయంటే ఆ అపరాధం రాజ్యాంగానిది కాదు, రాజ్యాంగాన్ని అమలుచేసే వ్యక్తుల వల్ల మాత్రమేనని అంబేద్కర్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే అది నవనవోన్మేషంగా ఉండాలి. దేశ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా వొదిగేదిగా ఉండా లి. సరళంగా ఉండాలి. మార్పులకు సిద్ధంగా ఉండాలి. సమాజ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాజ్యాంగం కూడా మారాలి. తగిన మార్పులకు సిద్ధంగా ఉండాలని ఆనాడే అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్ణయసభ సమాపక సమావేశంలో సభాధ్యక్షుడు డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ప్రసం గిస్తూ ‘‘రాజ్యాంగం అనేది ఎలాఉన్నా..అది దేశాన్ని పాలించే వ్యక్తులపై, దాన్ని పాలించే తీరుతెన్నులపై ప్రజల సంక్షేమం ఆధారపడి ఉంటుంది. ఇందుకు ఆ వ్యక్తులు నిజాయితీపరులై ఉండాలి.. వారికి దేశ ప్రయోజనాలు తప్ప మరో యావఉండరాదు’’ అని రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. భారతదేశానికి దివ్యమైన భవిష్యత్‌ను అందించేందుకు, రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను సాక్షాత్కారం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆదిశలోనే ప్రభుత్వాలు కదలాలనీ,కదులు తాయని..సగటు భారతీయుడి ఆశ.
రాజ్యాంగం ఆసక్తికర సంగతులు
1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగాన్ని రాసేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.
మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు రూ.64 లక్షలు ఖర్చు చేశారు.
రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947లో ముసాయిదా కమిటీ ఏర్పడిరది. దీనికి అంబేడ్కర్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంట్లో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రధాన కమిటీతో పాటు, కొన్నిఉప కమిటీలు ఏర్పడ్డాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనదే.
రాజ్యాంగాన్ని చేతి రాతతోనే రాశారు. ప్రేమ్‌ బిహారీ నారాయణ్‌ రాయ్‌జాదా..ఇటాలిక్‌ కాలిగ్రఫీ స్టైల్‌లో రాశారు. ప్రతి పేజీనీ కొందరు కళాకారులు అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో చేతిరాతతో రాశారు.
‘భారత దేశ ప్రజలమైన మేము’ అనే ప్రవేశికతో మొదలయ్యే మన రాజ్యాంగం.. అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లు,22 భాగాలుగా ఉంది.
రాజ్యాంగం మూల ప్రతులను దిల్లీలో ఉన్న పార్లమెంటు భవనంలోని గ్రంథాలయంలో చూడొచ్చు. వీటిని హీలియం వాయువు నింపిన పెట్టెలో భద్రపరిచారు.
మన రాజ్యాంగాన్ని ‘బ్యాగ్‌ ఆఫ్‌ బారోయింగ్స్‌’ అని సరదాగా అంటారు. జపాన్‌, ఐర్లాండ్‌ ఇంగ్లండ్‌, యూఎస్‌ఏ, ఫ్రాన్స్‌.. లాంటి దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాల్ని తీసుకున్నాం కాబట్టే ఆ విధంగా పిలుస్తారు. రాజ్యాంగం రాయడం 1949 నవంబరు 26వ తేదీ నాటికి పూర్తయ్యింది. ఈ తేదీనే మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకొంటాం. మరో రెండు నెలల తర్వాత అంటే..1950, జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
ఏడు దశాబ్దాల రాజ్యాంగం… అందించిన ప్రజాస్వామ్యం
వందకోట్ల మందికి ఆమోద యోగ్యంగా వుండే పాలనా వ్యవస్థను రూపొందించడం అంత సులభం కాదు.అంతేకాదు..దారిద్య్ర రేఖకు దిగువన వున్న వారిని జనజీవన స్రవంతిలో కలపడానికి కొన్ని చట్టాలు,వాటికి కొన్ని సవరణలూ తప్ప నిసరి..భారత దేశ స్థితి గతులను సమున్నతంగా మార్చేసిన కొన్నికీలక చట్టాలు,వారి సవరణల నొకసారి చూద్దాం..ఈ70ఏళ్లలో కాలానికను గుణంగా మనం ఎన్నో చట్టాలను రూపొందిం చుకున్నాం.. ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని సవరించు కున్నాం. కొన్ని చట్టాలు దేశ గతినే మలుపు తిప్పితే..మరికొన్ని వివాదాస్పదం కూడా అయ్యా యి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 15 నెలలకే మొదటి సవరణ జరిగింది. ఈసవరణద్వారా భూ సంస్కరణలకు ఎలాంటి సవాళ్లు ఎదురు కాకుండా దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ లో చేర్చారు. దీంతో రాష్ట్రప్రభుత్వాలు చేసిన ఎన్నో భూ చట్టాలకు ఇది రక్షణ కవచంలా నిలి చింది.ఒకటే బాణం..ఒకటే భార్య..ఇది శ్రీరాముడి విధా నమే కాదు..కోట్లాది భారతీయుల మనోగతం కూడా..హిందూ సంప్రదాయం..హిందూ సంస్కృతి సంప్ర దాయాలను కాపాడుకోవడానికి 1955లో హిందూ వివాహ చట్టాన్ని రూపొందించారు. ఈచట్టం ద్వారా బహుభార్యాత్వం రద్ద వడమే కా కుండా..మహిళల రక్షణకోసం విడాకుల భావ నను కూడా ప్రవేశపెట్టారు.ఇక 1986లోవచ్చిన ముస్లిం మహిళ విడాకు హక్కుల రక్షణ చట్టాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. దేశంలో అప్పట్లో తలెత్తిన మత హింసకు ఈచట్టమే దోహదం చేసిం దని కొందరు కారాలు మిరియాలు నూరితే.. ముస్లిం ఛాంద సవాదుల్ని సంతృప్తి పరచడం కోసమే దానిని తెచ్చి నట్టు మరికొందరు మండిపడ్డారు. ఇక సామాజిక రుగ్మతైన అంటరానితనాన్ని తరిమి వేయడానికి మన ప్రభుత్వానికి అయిదేళ్లు పెట్టింది. అంటరాని తనాన్ని నేరంగా ప్రకటిస్తూ 1955లో చట్టాన్ని చేశారు. దేశంలోభాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం అప్పట్లో ఊపందుకుంది. దీంతో 1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా దేశాన్ని 14 రాష్ట్రాలు,7కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిం చారు. తెలుగు, మళయాళీ, కన్నడీ గులకు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ప్రపం చంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.ప్రపంచంలో మరెక్క డాలేనన్ని రాజకీయ పార్టీ లున్న దేశం కూడా మనదే..1980వ దశకం భారత రాజకీ యాల్లో అనారోగ్యకర ధోరణులకు బీజం పడిన సమయం..అధికార కాంక్షకు తోడు ఆయారాం,గయారాం సంస్కృతి పెచ్చరిల్లిన తరుణమూ అదే..దీని నియం త్రణ కోసమే ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది.ఆమ్‌ఆద్మీ..ఈనినాదంతో అధికారం లోకొచ్చిన..యుపి ఏగ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా చేసి నిరుద్యోగాన్ని,ఆకలి కేకలను రూపుమాపాలని తలపెట్టింది. అన్నదే తడవుగా రాజ్యాంగ సవరణ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసింది. గ్రామీణ భారతావని రూపు రేఖలను సమున్నతంగా మార్చేసిన చట్టమది. సామా న్యుడి చేతిలో వజ్రా యుధం సమాచార హక్కు చట్టం..ప్రభుత్వ పాలనపై ఇదో డేగ కళ్ల పహారా.. అవినీతి, రెడ్‌ టేపి జం వేళ్లూనిన మన సమాజంలో తప్పు చేసిన అధికారి ఎంత పెద్ద వాడైనా నిలదీసే హక్కుని ఈచట్టం కల్పిస్తోంది.అంతేనా గతి తప్పి నడు చుకునే అధికారులపై కొరడా రaళిపిం చడానికీ ఈ చట్టం ఉపయోగపడు తోంది.
రాజ్యాంగమే రాచబాట
భారతీయ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే రాచబాటని సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి పేర్కొన్నారు.72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ పట్నంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎండాడ ఎస్సీకాలనీ,జిల్లా పరిషత్‌,ఉన్నత పాఠశాలల్లో విద్యార్ధులకు రాజ్యాంగం`విలువలు అనే అంశంపై మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోకెల్లా ఎంతో విశిష్టతను సంతరించుకుందని పేర్కొన్నారు. విద్యార్ధులంతా సమానత్వభావన కలిగి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆశయాలు,వారి సిద్దాంతాలను స్పూర్తిగా తీసుకుని విద్యావంతులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.న్యాయ,సాంఘిక,ఆర్థిక,రాజకీయ, స్వేచ్ఛా భావన,భావప్రకటన,నమ్మకం,విశ్వాసం,గౌరవం,సమానత్వం,అవకాశాలను పెంచుట.. సౌభ్రాతృ త్వం,వ్యక్తి హోదా,జాతిఐక్యత, సమగ్రతను పెంపొందించుటే రాజ్యంగం ఉద్దేశమని సూచించారు. దీన్ని గౌరవించడం మన అందరి కర్తవ్యమని పిలుపు నిచ్చారు.అంబేద్కర్‌ చెప్పినట్లుగా దేశం అభివృద్ధి చెందడ మంటే,అద్దాల మేడలు,రంగుల గోడలు కాదు..పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధిని పేర్కొన్నారని గుర్తిచేశారు.స్వయం పాలనాధికారాన్ని దక్కించుకున్న ఇండియాలోని అన్ని మతాలు,తెగలు,దళితులు,గిరిజనులు,వెనుకబడిన కులాల తదితర వర్గాలకు సైతం న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా రాజ్యంగాన్ని రూపొందించాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వంపై పడిరది. ప్రభుత్వ విధివిధానాలు,శాసనసభల రూపకల్పనతోపాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగాన్ని లిఖించారని విద్యార్థులకు వివరించారు.-గునపర్తి సైమన్‌

ఆదివాసీల కీర్తి…పోరాటాల‌కు స్పూర్తి

ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వ్యక్తి, బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ’’స్వయం పాలన’’ నినాదంతో సమరశంఖం పూరించిన ఆదివాసీల తొలి బాణం శ్రీ భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి ప్రణామాలు. స్వతంత్ర భారతావనిలో గిరిజనులకు ఇంత గౌరవం దక్కడ ఇదే తొలిసారి’
‘‘ గిరిజనులు.. ప్రకృతి ఒడిలో జీవనం సాగి స్తూ.. సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడు కుంటూ  వస్తున్నారు.దేశ స్వాతంత్య్ర సమరంలో బిర్సాముండా.. నిజాంకు వ్యతిరేకంగా జల్‌`జంగిల్‌`జమీన్‌ అన్న నినాదంతో కొమరం భీం లాంటి ఎంతోమంది గిరిజన యోధులు పోరాటాలు చేశారు. అలాంటివారికి సమున్నత స్థానం కల్పించాలని కేంద్రప్రభుత్వం ఏటా నవంబరు 15న భగవాన్‌ బిర్సాముండా పేరిట (15న జనజాతి) గిరిజన గౌరవ దినోత్సవాన్ని నిర్వహించేందు కు సంకల్పించింది. మొట్టమొదటి సారిగా  షెడ్యూల్‌ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశంవ్యాప్తంగా ఉన్న తొమ్మిది షెడ్యూల్‌ రాష్ట్రాల్లో అంరగంగ వైభంగా జరిగింది.’ఆదివాసీ హక్కుల కోసం ఆంగ్లేయుల పాలనను ఎదరించిన బిర్సాముండా జయంతి రోజునే ఏటా గిరిజన గౌరవ దిరోత్సవం నిర్వహించా లని ప్రభుత్వం నిర్ణయించింది. రaార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన బిర్సాముండా ఆదివాసీ ముద్దుబిడ్డగా కీర్తి గడిరచారు.చరిత్రలో సమున్నత స్థానం కల్పించేందుకు ఆయన జయింతిని ఉత్సహంగా నిర్వహించారు.
భావితరాలకు తెలిసేలా
గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,వారి జీవన విధానాలు, వినియోగించిన వస్తవులు,లిపి, సాహిత్యం, తదితర సమాచారాన్ని వరంగల్‌ హంటల్‌ రోడ్డులోని గిరిజన విజ్ఞాన పీఠంలో నిక్షిప్తం చేశారు. పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ విద్యార్ధులు విజ్ఞానపీఠంలో గిరిజనుల జీవనశైలిపై పరిశోధనలు చేస్తుంటారు. భావితరాలకు గిరిజనుల సంస్కృతిని తెలిపేందుకు ఇదెంతో ఉపయోగపడుతుంది. విశాఖ జిల్లా అరకు,మేడారంలో ఉన్న గితరిజన మ్యూజియంలు గిరిజనులు పూర్వం నుంచి నేటి వరకు వినియోగిస్తున్న వస్తువులెన్నో అందులో పొందుపర్చారు.కళాఖండాలు,అంతరించిపోతున్న కళాకృతులు,ఇతర వస్తువుల సేకరించిపెట్టారు. సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. విదేశాల నుంచి సైతం వచ్చి వనదేవతలను దర్శించుకుంటారు.
ప్రకృతి ఆరాధకులు
పూజించే దేవతకు రంగు,రూపం,ఆకారం అంటూ ఏవీ ఉండకుండా ప్రకృతి మాతనే ఆదిశక్తి స్వరూపిణిగా భావిస్తారు. ప్రకృతి ఒడిలో సహజసిద్దంగా పుట్టి పెరిగిన చెట్లను,చెట్టు కొయ్యలను,బండరాళ్లను దేవతల ప్రతిరూపాలుగా భావించి పూజించడం ఆనవాయితీ.ఆలయాలు నిర్మించకుండానే కొలుస్తారు. ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలతో ఆదివాసీల్లో సుమారు 35వరకు తెగలుంటాయి. వర్షాకాలం ప్రారంభంలో మొదటిసారిగా వచ్చేది విత్తనాల పండు. విత్తనాలు వేసే ముందు వాటిని దేవతా మూర్తుల ముందు ఉంచి పూజలు నిర్వహి స్తారు. దేవుడి అనుమతితో పంట వేసినట్లు భావిస్తారు. దీంతో అధిక దిగుబడులు వస్తా యనేది నమ్మకం. పెద్దల పండుగ నాడు గ్రామ పెద్దల సమక్షంలో కొత్తగా పెళ్లైన జంటలను కలుపుకుంటారు.
వన వీరులను స్మరిస్తూ..
బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆయన జయంతిని ప్రతి ఏటా ‘జనజాతీయ గౌరవ్‌ దివస్‌’గా నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి అయిన నవంబర్‌ 15ను ఇక నుంచి ఏటా ‘జనజాతీయ గౌరవ్‌ దివస్‌?’గా జరుపుకో నున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బిర్సా ముండా స్మారకార్థం రaార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను మోదీ ఆవిష్కరించారు.‘‘ఆజాదీకా అమృత్‌ మహోత్స వాలు జరుగుతోన్న ఈ సమయంలో గిరిజన యోధుల సాహసాలు, సంప్రదా యాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. గిరిజ నుల కష్టసుఖాలను నేను దగ్గరుండి చూశాను. వారి జీవనవిధానం, అవసరాలు అన్నీ నాకు తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. బిర్సా ముండా జయంతి సందర్భంగా చారిత్రక నిర్ణయం తీసు కున్నాం. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో జరిగిన జన జాతీయ గౌరవ్‌ దివస్‌ మహాసమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. బిర్స ముండాకు నివాళులర్పించారు. ‘‘ నేడు దేశం మొదటి జనజాతీయ గౌరవ్‌ దివస్‌ జరుపుకుంటున్నాం.స్వాంతంత్య్రం తర్వాత తొలిసారి గిరిజనుల కళ, సంప్రదా యాలు, స్వాతంత్య్రంలో వారి పాత్రకు తగిన గౌరవం లభించింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో తెలంగణా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హజరై బిర్సాముండాకి నివాళులర్పించారు. బ్రిటిష్‌ వలసవాదం,దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు, బెంగాల్‌ ప్రెసిడెన్సీ (ప్రస్తుత రaార్ఖండ్‌) ప్రాంతానికి చెందిన బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్‌ 15ను జన జాతీయ గౌరవ్‌ దివస్‌గా పాటించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం నిర్ణయించగా, అఖిల భారత వనవాసి కల్యాణ పరిషత్‌ తెలంగాణ శాఖ ఇదివరకే ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జనజాతి గౌరవ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ఆత్మీయ అతిథిగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు సోయం బాపురావు పాల్గొననున్నారు. జాతీయ నాయకుడిగా బిర్సాముండాకు గుర్తింపు గిరిజన యోధుడు బిర్సాముండాను జాతీయ నాయ కుడిగా ప్రభుత్వం గుర్తించిందని.. ఎస్టీలకు ఇది గర్వకారణమని పేర్కొన్నారు.
కేంద్రం మరియు రాష్ట్రాలు‘‘వాక్‌ ది టాక్‌’’ చేయాలి!
ఉమ్మడి ఏపీలో గిరిజన సంక్షేమ శాఖ మాజీ కమిషనర్‌ ఇఏఎస్‌శర్మ నవంబర్‌ 15, 2021న జనజాతీయ గౌరవ్‌ దివస్‌ కార్యక్ర మంపై ఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్త రాన్ని యథా విధిగా తెలుగు అనువాదంలో ప్రధాన మంత్రి ప్రియమైన శ్రీ మోదీ..నవంబర్‌ 15న జరిగే మొట్టమొదటి జనజాతీయ గౌరవ్‌ దివస్‌కు మీరు నాయకత్వం వహిస్తారని నాకు అర్థమైంది. సంవత్సరం, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా. భారత జనాభాలో 8శాతం కంటే ఎక్కువ ఉన్న ఆదివాసీలు దీనిని స్వాగతిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటు న్నాను, కేంద్రం మరియు రాష్ట్రాలు రాజ్యాంగంలోని ఐదవ మరియు ఆరవ షెడ్యూల్‌ ప్రకారం తమకు లభించే హక్కులను ఇకపై పూర్తిగా గౌరవిస్తాయని ఆత్రుతగా ఆశిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాతలు చాలా విస్తృతమైన మరియు అత్యంత జ్ఞానోదయమైన చర్చల తర్వాత స్పృహతో ప్రవేశపెట్టిన ఐదవ షెడ్యూల్‌లోని పారా5,షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు వర్తించే ప్రతి చట్టాన్ని సమీక్షించడానికి మరియు తీసుకురావడానికి కేంద్రం మరియు రాష్ట్రాలను అనుమతించే ఒక ప్రత్యేక నిబంధన. వారు ఆదివాసీల ప్రయోజ నాలకు అనుగుణంగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్‌ ప్రత్యేక ప్రతిపత్తిని ఆమోదించి ఏడు దశాబ్దాలు గడిచినా, నేరస్థులకు సంబంధించిన చట్టాలు,ఆదివాసీల జీవితాలను విమర్శనాత్మకంగా ప్రభావితం చేసే చట్టాలను సమీక్షించి వాటిని మార్చేందుకు కేంద్రం లేదా రాష్ట్రాలు పట్టించుకోలేదు. పౌర న్యాయవ్యవస్థలు,మైనింగ్‌ కార్యకలాపాలకు సంబంధించిన చట్టాలు, అటవీచట్టాలు, భూమి మరియు ఇతర వనరులపై ఆదివాసీల ఊహాజనిత హక్కులను పరి రక్షించే చట్టాలు మొదలైనవి.ఉదాహరణకు, జాతీయ అటవీ విధానం లేదా అటవీ (సంరక్షణ) చట్టానికి ఇటీవల మీ ప్రభుత్వం ప్రతిపా దించిన సవరణలు,ఆదివాసీల గురించి ప్రస్తావించ వద్దు, ఆదివాసీల జీవితాలు సహజీవనంగా ఉన్నప్పటికీ, వారికి ఏది సరిపోతుందో తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు. అవి విమర్శనాత్మకంగా ఆధారపడిన అడవులతో ముడిపడి ఉన్నాయి. రెండు కేంద్ర చట్టాలు ఉన్నాయి, అవి పంచా యితీలు (షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 (క్లుప్తంగా ూజుూA అని పిలు స్తారు) మరియు షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం,2006 (క్లుప్తంగా అటవీ హక్కుల చట్టం (ఖీRA),ఇది వారి జీవి తాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లు మరియు కార్యక లాపాలపై నిర్ణయం తీసుకోవడంలో స్థానిక ఆదివాసీ గ్రామసభలకు తుది నిర్ణయం తీసుకునే అధికారం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం జిల్లాలోని షెడ్యూల్డ్‌ ఏరియాలో ఖనిజా భివృద్ధికి సంబంధించిన సుప్రసిద్ధ సమతా కేసులో, 1997జూలై 11న, ఒకటి వెలువ రించిన రెండు మైలురాయి తీర్పులలో భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ వైఖరిని అస్పష్టంగా పునరు ద్ఘాటించింది. రెండవది ఏప్రిల్‌ 18, 2013న రాష్ట్రంలోని కలహండి/రాయగడ జిల్లాల్లోని వేదాంత కంపెనీకి ఒడిశా ప్రభుత్వం మం జూరు చేసిన మైనింగ్‌ లీజుపై.ఈ రెండు కేసుల్లోనూ,సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ఆదివాసీ గ్రామసభలను విస్మరించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నించాయి, అత్యున్నత న్యాయస్థానం ఇది ఆమోదయోగ్యం కాదు. ఛత్తీస్‌గఢ్‌, రaార్ఖండ్‌,ఒడిశా మొదలైన షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో ఉన్న పెద్ద సంఖ్యలో ఖనిజాలు మరియు బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్రం ఏకపక్ష నిర్ణయం విషయం లో ూజుూA, ఖీRA రెండిరటినీ పూర్తిగా ఉల్లం ఘించిన ఇటీవలి ఉదాహరణ.వేలానికి ముందు ఏ సమయంలోనైనా, కేంద్రం మరియు రాష్ట్రాలు స్థానిక గ్రామసభలను ఈ ప్రతిపాద నను వివరంగా చర్చించడానికి మరియు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అనుమతిం చలేదు,అయినప్పటికీ దాని నుండి ఉత్పన్నమ య్యే మైనింగ్‌ కార్యకలాపాలు వారి నివాసాలను మరియు వారి జీవితాలను కోలుకోలేని విధంగా విఘాతం కలిగిస్తాయి. వాస్తవానికి, వేలం వేయ డానికి వీలుగా ఖనిజాభివృద్ధి చట్టాలకు గతం లో అనేక సుదూర సవరణలను కేంద్రం ప్రవేశపెట్టినప్పుడు, అది ఒక్కసారి కూడా ప్రయత్నించని ఆదివాసీల అభిప్రాయాలను ముందుగానే కోరింది! ఐదవ షెడ్యూల్‌లోని 5వ పేరాలోని స్ఫూర్తికి అనుగుణంగా,అటవీ మరియు ఖనిజాభివృద్ధి చట్టాలను సవరించ డానికి ప్రతిపాదించే ముందు, కేంద్రం మరియు రాష్ట్రాలు ఆదివాసీ గ్రామసభలు, ఎన్నికైన ఆదివాసీ శాసనసభ్యులు మరియు ఆదివాసీ సంఘాలను సంప్రదించి ఉండాలి. ప్రతిపాదిత చట్టాలు ఆదివాసీ ప్రయోజనాలను సమర్థించేలా చూసేందుకు. బదులుగా, కేంద్రం ఏకపక్షంగా ముందుకు సాగాలని ఎంచుకుంది! షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమీషన్‌ (చీజూు) రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 338A ప్రకారం షెడ్యూల్డ్‌ తెగ లకు సంబంధించిన అన్ని విధాన విషయా లపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి మరియు వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి రూపొం దించబడిన ఒక ప్రముఖ సంస్థ. ఆఆర్టికల్‌ క్లాజ్‌ (9) ప్రకారం యూనియన్‌ మరియు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘‘షెడ్యూల్డ్‌ తెగలను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధాన విషయాలపై కమిషన్‌ను సంప్రదించాలి’’. పైన పేర్కొన్న చట్టబద్ధమైన సవరణలను ప్రవేశపెడుతున్నప్పుడు, నాకు తెలిసినంతవరకు,చీజూుతో ఇంత విస్తృతమైన ముందస్తు సంప్రదింపులు జరగలేదు. జనజా తీయ గౌరవ్‌ దివస్‌ వేడుకల్లో భాగంగా,శతా బ్దానికి పైగా తన కమ్యూనిటీ హక్కుల కోసం పోరాడిన గొప్ప ఆదివాసీ నాయకుడి జ్ఞాపకార్థం మీరు రాంచీలో బిర్సా ముండా ఫ్రీడమ్‌ ఫైటర్‌ మ్యూజియాన్ని ప్రారంభించ బోతున్నారని నేను అర్థం చేసుకున్నాను. బిర్సా ముండా నేతృత్వం లోని చోటానాగ్‌పూర్‌లో జరిగిన ఆదివాసీ ఉద్య మాలు, ఎనిమిది దశాబ్దాల క్రితం కొమరం భీం నేతృత్వంలో తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా లో జరిగిన తిరుగుబాటు,శతాబ్దానికి పైగా ముర్ము వర్గం నేతృత్వంలోని సంతాల్‌ తిరుగు బాటు చట్టబద్ధమైన ముసుగులో జరిగింది. ఆదివాసీల హక్కులు,ఆ కాలంలో పూర్వపు పాలకవర్గం ద్వారా తుంగలో తొక్కివే యబడిరది. వారి జ్ఞాపకాలను గౌరవించా లంటే,ఆరోజుల్లో ఆదివాసీలు తిరుగుబాటుకు దారితీసిన పరిస్థి తులను అర్థం చేసుకోవడం మరియు ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆదివాసీ సంఘాలను మరియు వారి హక్కులను గౌరవించేలా చూసు కోవడం కంటే సరైన మార్గం మరొకటి ఉండ దు. తప్పులు.జన్‌ జాతీయ గౌరవ్‌ దివస్‌ దేశం లోని ఆదివాసీల హక్కులను పూర్తి స్థాయిలో గుర్తించడానికి నాంది పలుకుతుందని మరియు కేంద్రం మరియు రాష్ట్రాలు కలిసి ూజుూA,ఖీRA రెండిర టినీ పూర్తిగా అమలు చేయాలని సంకల్పిస్తా యని నేను ఆశిస్తున్నాను మరియు విశ్వసిస్తు న్నాను. ఆదివాసీ జీవితాలను ప్రభావితం చేసే విధానాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోవ డంలో. ఆదివాసీల జీవి తాలను ప్రభావితం చేసే దేశం లోని అన్ని ముఖ్యమైన చట్టాలను సమీక్షిం చి,షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు వర్తించేంత వరకు వాటిని ఆది వాసీల ప్రయోజనాలకు అనుగు ణంగా మార్చా లని కేంద్రం మరియు రాష్ట్రాలు రెండూ కూడా సంకల్పించు కుంటాయని నేను ఆశిస్తున్నాను.దేశ నిర్మాణంలో ఆదివాసీలను సమాన భాగస్వాములుగా కేంద్రం,రాష్ట్రాలు గుర్తించాలి. దేశంలో ఎన్నుకో బడిన అన్ని ప్రభుత్వాలు ఆదివాసీలకు తమ రాజ్యాంగ పరమైన బాధ్యత లను గ్రహించి, నెరవేర్చడానికి జనజాతీయ గౌరవ్‌ దివస్‌ను రిమైండర్‌గా మార్చడంలో మీరు ముందుం టారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆది వాసీల రాజ్యాంగ హక్కులకు తగిన గుర్తింపును కల్పించడంలో విఫల మైతే, దేశం మొత్తం భవిష్యత్తు శ్రేయస్సుకు మేలు జరగదు.-గునపర్తి సైమన్‌

కొఠియా గ్రామాల వివాదంపై ఆంధ్ర‌-ఒడిశా జాయింట్ క‌మిటీ

ఒక ఓటరు...ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తే అది నేరం. అలావేస్తే ఆ రెండు ఓట్లూ చెల్లవు.కానీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న 34 గ్రామాలకు చెందిన దాదాపు 4 వేల మంది ఓటర్లు అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తారు. అది ఒక రాష్ట్రంలో కాదు.... రెండు రాష్ట్రాల్లో.అలా ఓట్లు వేయడం కోసమే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రెండూ రాష్ట్రాలు వీరికి పోటీ పడి ఓటు హక్కుతో పాటు అనేక పథకాలు అందిస్తున్నాయి. దీంతో ఇక్కడ గిరిజనులకు రెండు రేషన్‌ కార్డులు, రెండు పింఛన్‌ కార్డులు, రెండు ఓటరు కార్డులు...ఇలా అన్నీ రెండేసి ఉంటాయి. అలాగే రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను వీరు ఎన్నుకుంటారు. ఈ గ్రామాల కథేంటి? వీటిపై రెండు రాష్ట్రాలకూ ఇంత ప్రేమ దేనికి? అనే అంశాలపై సమగ్ర కథనం.!                                                                                                                        సర్వేతో మొదలైన సమస్య…
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాల మధ్య ఉండే షెడ్యూల్‌ ప్రాంతంలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు.ఇక్కడ దాదాపు 15 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో 3,902 మంది ఓటర్లు. వీరు ఇటు ఆంధ్రాలోనూ,అటు ఒడిశాలో ఓటు హక్కును కలిగి ఉంటారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అవతరించి నప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామా లు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. 1968లో సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి.అప్పటి నుంచి ముందుకు కదలని కొటియా కేసుపై 2000లో సుప్రీం కోర్టు ఓప్రతిపాదన చేసింది. దాని ప్రకారం కొటియా సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల సమ్మతితో జైపూర్‌ జిల్లా జడ్జి అధ్యక్ష తన ఆరుగురు సభ్యుల కమిటీని వేసింది. అందు లో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు,న్యాయ వాదులు ఉన్నారు. కొటియా విషయంలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనలు, కోర్టులో వాదనలు చేసింది. అయినా విషయం కొలిక్కి రాలేదు. తర్వాత 2006లో ఈ సమస్యని పార్ల మెంటులో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచిం చింది.
ఇప్పటికీ ఈ పంచాయితీ తేలలేదు.
కొటియా గ్రామాలుగా ఉన్న 21 గ్రామలు… మరికొన్ని గ్రామాలుగా విడిపోయి వాటి సంఖ్య ప్రస్తుతం 34కి చేరిందని కొటియా కమిటీలో ఏపీ తరపున స్పెషల్‌ కౌన్సిల్‌గా పని చేసిన విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రాజు బీబీసీతో చెప్పారు. ‘1942లో పరిపాలనా సౌలభ్యం కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. దానికోసం 1942లో సర్వే జరిపించింది. ఆ క్రమంలో ఏపీ,ఒడిశా, మధ్య ప్రదేశ్‌,బిహార్‌ రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయిం చేందుకు గిల్‌.జి అనే సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు కార్యాలయ అధికారి సర్వే నిర్వహిం చారు. ఇందులో ఏపీ,ఒడిశా సరిహద్దుల్లోని 101 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని ఇరు రాష్ట్రాల్లో విలీనం చేయగా…కొటియా పంచాయతీ పరిధిలో 21 గ్రూపు గ్రామాల సంగతి తేల్చ లేదు. అప్పట్నుంచి ఈ గ్రామాలు తమవంటే తమవని ఒడిశా, ఆంధ్రా పట్టుబడుతున్నాయి. ఈ గ్రామాల వివాదంపై రెండు రాష్ట్రాలు 1968లో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే…కోర్టు స్టేటస్‌ కో విధించింది. దీంతో ఇప్పటికీ పరి ష్కారం లభించలేదు. అసలు కొటియా గ్రామాల సమస్యపై అవగాహన ఉన్నవారు కూడా లేరు. ఏపీ తరపున ఈ సమస్యపై పని చేసిన ఆర్జేడీ చనిపోయారు. కాకినాడకు చెందిన మరో సర్వే యర్‌ చలపతిరావు రిటైర్డ్‌ అయి పోయారు. ప్రస్తుతానికి ఈ సమస్యపై అవగాహన ఉండి పని చేసిన వారిలో నేను,చలపతి రావు మాత్రమే ఉన్నాం’’ అని ఆయన తెలిపారు.
పథకాలు ఆంధ్రా…పనులు ఒడిశా…
గత ఏడాది ఫిబ్రవరిలో ఒడిశా స్థానిక ఎన్ని కల్లో ఓటేసిన ఈ గిరిజనం..ఇప్పుడు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును విని యోగించుకున్నారు.కొటియా,కురిటిభద్ర, మడ కార్‌,డోలియాంబ తదితర గ్రామలు ఒడిశాకు….నేరేళ్లవలస,ఎగువశెంబి, దిగు వశెంబి,ధూళిభద్ర,మూలతాడివలస,పగులు చెన్నేరు,పట్టుచెన్నేరులు,సొలిపిగుడ,శిఖపరువు గ్రామాలు ఏపీ భూభాగానికి సమీపంలో ఉంటా యి. మిగతావి రెండు సరిహద్దులకి దాదాపు సమాన దూరంలో ఉంటాయి.దీంతో ఏ రాష్ట్రా నికి సమీపంగా ఉన్న గ్రామాలపై ఆరాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందులో ఒడిశారాష్ట్రానిదే పైచేయిగా కనిపిస్తోంది.ఎందుకంటే రోడ్లు వేయడంతోపాటు అనేక కార్యాలయాలు ఆ రాష్ట్రం నిర్మిస్తోంది.ఎక్కడ చూసినా ఒడిశా కార్యాలయాలు,ఒరియా భాషలోని బోర్డులే కనిపిస్తున్నాయి తప్పా…తెలుగు భాషలో అరుదు గా బోర్డులు కనిపిస్తాయి. అయితే రెండు రాష్ట్రా ల ఫలాలను అందుకుంటున్న కొటియా గ్రామా ల గిరిజనం అభివృద్ధి కోసం ఒడిశా ప్రభు త్వాన్ని, సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వా న్ని నమ్ముకుంటున్నారు.‘‘మమ్మల్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాగా చూసుకుంటున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం పథకాల ద్వారా మాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం ద్వారా తక్కువ వస్తున్నాయి. కానీ ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేయించింది. గత ఏడాది వరకు మా గ్రామాలకు ఎక్కడికి వెళ్లాలన్నా రాళ్లు రప్పులు తేలిన దారుల్లోనే వెళ్లేవాళ్లం. ఇప్పుడు కొత్త తారు రోడ్లపై వెళ్తున్నాం. అలాగే ఒడిశా మాకు ఇళ్లు కూడా కట్టించింది. మాకు రెండు ప్రభు త్వాలు కావాలి. రెండు ప్రభుత్వాలు అందించే పథకాలు కావాలి. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయిస్తే…వాళ్లు ఏరాష్ట్రంలో ఉండమంటే అక్కడే ఉంటాం. అప్పటి వరకూ మాత్రం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మేం ఓటేస్తాం’’ అని కొటియా గ్రామాల్లో ఒకటైన పట్టుచెన్నూరు నివాసి బుట్రూ చెప్పారు.వివాదస్పద కొటియాలో రాజకీయాలు ఇప్పటివరకు రెండు రాష్ట్రాల సమస్యగా ప్రభుత్వాల మధ్య నలుగుతున్న సమస్యలోకి రాజకీయాలు చేరాయి. ఎన్నికల సమయం కావడంతో రాజకీయ నాయకులు ఈ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. కొటియా గ్రామాల్లో ఒడిశా బీజేపీ నాయకులు పర్యట నలు చేస్తున్నారు. ఆంధ్రా ప్రభుత్వం నిర్వహించ నున్న పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవద్దని కొటియా వాసులకి ఒడిశా బీజేపీ నాయకత్వం సూచించింది. అలాగే అయా ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తనది కాని ప్రాంతంపై పట్టుసాధించేందుకు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇది ముమ్మాటికి తప్పు. ఇప్పుటికే ఒడిశా సరిహద్దులోని అనేక ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌ ఆక్రమించుకుంది. ఇది పూర్తిగా ఒడిశా ఇంటిలిజెన్స్‌ విభాగం వైఫల్యం. ఒడిశా ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి… కేంద్రం తో మాట్లాడి భూభాగాన్ని కాపాడుకోవాలి. ఇప్పటీకే ఒడిశా సుప్రీంకోర్టులో కేసు వేసిందని తెలిసింది. ఈ ప్రాంతాలను ఒడిశా సాధించే వరకు పోరాటం ఆపకూడదు. దీనికి పూర్తిగా సహకరిస్తుంది’’ అని బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు.మరో వైపు కొటియా పంచాయతీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచా యతీ ఎన్నికలను ఆపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 10వ తేదిన (2021)హైకోర్టులో పిల్‌ నమోదైంది. భారత్‌ బికాస్‌ పరిషత్‌ అనే స్వంచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ పిల్‌ వేశారు.
కొటియాపై ప్రేమకు ఖనిజాలే కారణమా…?
కేసులు, క్షేత్రస్థాయి పర్యటనలు, రాజకీయాలు ఎలా ఉన్నా…అసలు ఈ ప్రాంతంపై ఇరు రాష్ట్రాలకు ఇంత ప్రేమ ఎందుకు?గిరి శిఖర ప్రాంతంలో ఎవ్వరికి పట్టనట్లు ఉండే ఈ కొటి యా గ్రామాల్లో వందల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు పోటీపడి మరీ రెండు రాష్ట్రాల ప్రభు త్వాలు అభివృద్ధి పనులు చేస్తున్నాయి?ఈ ప్రాం తంలో విలువైన ఖనిజాలు ఉన్నాయని…వాటిని దక్కించుకోవాంటే ముందుగా ఇక్కడి గిరిజనుల మనస్సుని గెల్చుకోవాలని… అందుకే ప్రభుత్వా లు పోటీపడి మరి పథకాలు ఇస్తూ పనులు చేస్తున్నాయని వామపక్షనాయకులు అంటున్నారు. ‘‘ఇక్కడ చాలా రోజులుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో సాకుతో కొండలు తవ్వడం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇక్కడ రహ స్యంగా ఖనిజ అన్వేషణ జరుగుతుందనే అనిపిస్తుంది. అయితే ఏదో ఒక రూపంలో ప్రజలకు మంచి జరగడం శుభపరిణామమే… కాకపోతే ఈ వివాదాన్ని త్వరగా తేల్చుకోక పోతే… ప్రస్తుతానికి గిరిజనులకి బాగున్నా… భవిష్యత్తులో సమ్యలు వచ్చే అవకాశం ఉంది’’ అని స్థానిక వామపక్ష నాయకులు కిల్లి సురేశ్‌ చెప్పారు. కొటియా గ్రామాల పరిధిలో ఖనిజ సంపద అనే మాట అందరి నోటా వినిపిస్తూనే ఉంది. అసలు నిజంగా ఇక్కడ ఖనిజాలు ఉన్నాయా అనే విషయంపై ఏయూ జియాలజీ విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వెంకటేశ్వరావు వెల్లడిరచారు. ‘‘తూర్పు కనుమల్లో చాలా చోట్ల ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా బాక్సైట్‌ వంటి ఖనిజాలు విస్తరంగా ఉన్నాయి. మనం ఒప్పు కున్నా…లేకున్నా…ఖనిజాలను తవ్వడానికి ఏ ప్రభుత్వమూ సంకోచించదు. విలువైన ఖనిజా లున్న ప్రాంతాలను తమ పరిధిలోకి తెచ్చుకో వాలనే చూస్తాయి. కొటియా గ్రామాల పరిధి లోని కొండల్లో కూడా విలువైన ఖనిజాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తూర్పు కనుమల్లోని ఈ బెల్ట్‌లో మాంగనీసు, ఇనుము,లైమ్‌ కంకర,క్వార్జ్‌,గ్రానెట్కట్‌, రంగు రాళ్లు వంటి ఖనిజ సంపద ఉంది. వీటితో పాటు జల,జంతుసంపద కూడా అపారం. వీటిని కాపాడుకోవాలి. అసలు తూర్పు కనుమల్ని బయోడైవర్సీటి హాట్‌ స్పాట్‌గా గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని ప్రొఫెసర్‌ వెంకటేశ్వరావు చెప్పారు.
ఏపీ వేసిన రోడ్లపైనే ఒడిశా రోడ్లు వేస్తోంది’
మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలం నుంచి నేటి వరకు ఏపీ రాష్ట్రానికి సంబంధించి భౌగోళికంగా ఎన్నెన్నో మార్పులొచ్చాయి. కానీ కొటియా గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయనే వివాదం మాత్రం ఇంకా తేలలేదు. ఏపీ ప్రభు త్వం కొటియా గ్రామాల విషయంలో పోరాటం చేయడం లేదని…అలాగే అక్కడ ఏపీ ముద్ర వేసే కార్యక్రమాలు ఎక్కువగా జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వీటి గురించి స్థానిక ఎమ్మేల్యే రాజన్నదొర తెలిపారు. ‘‘వివాదస్పద కొటియా గ్రామాలు విజయనగరం జిల్లా సాలూరు మండలంలోకి కొటియా ప్రాంతాలు వస్తాయి. బ్రిటిష్‌ హయంలో ఈ ప్రాంతాలు మద్రాస్‌ ప్రెసిడెన్సీ పరిధిలో ఉండేవి. అప్పట్లోనే ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాంతాలు తమవని వాదించేది. అయితే దీనిని మద్రాస్‌ ప్రెడిడెన్సీ ఖండిస్తూ ఉండేది. బ్రిటిష్‌ హయాం నుంచి ఈ గ్రామాలను సాలూరు మండల పరిధి భూ భాగంలో చూపించారు. 1942లో జరిగిన గిల్‌ సర్వే ప్రకారం కూడా అదే వర్తిస్తుంది. గతంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి కొటియా గ్రామాల సమస్యను తీసుకువెళ్లాం. ఇరు రాష్ట్రాలను సమన్వయపరిచి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరాం. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు నిర్వహించవద్దని బీజేపీతో పాటు ఒడిశాలోని కొన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ అక్కడ ఏపీ ప్రభుత్వం తరపున ఎన్నికలు జరగడం ఇదేమి కొత్త కాదు. నేను పుట్టక ముందు నుంచి ఆ ప్రాంతంలో ఏపీ గవర్నమెంట్‌ ఎన్నికలు నిర్వహిస్తోంది. దీనికి సుప్రీం కోర్టు లేదా పార్లమెంట్‌ పరిష్కారం చూపాలి. ఒడిశా మేం అభివృద్ధి చేశామని చెప్పుకోవడం కోసం….ఏపీ ప్రభుత్వం వేసిన రోడ్లపై మళ్లీ రోడ్లు వేసి మేమే వేశాం అని చెప్పుకుంటోంది. నిజానికి అక్కడున్న అపారమైన ఖనిజ సంపదను కొల్లకొట్టేందుకే ఒడిశా ఈ డ్రామాలు ఆడుతోంది’’ అని సాలూరు ఎమ్మేల్యే పీడిక రాజన్నదొర చెప్పారు.
‘కొటియా అభివృద్ధే లక్ష్యం’
‘‘ప్రస్తుతం కొటియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. అంతా సజావుగా ఉంది. అధికారులు నిరంతరం గ్రామాలకు వెళ్లి సమస్యలను తెలుసు కుంటున్నారు. ‘‘కొటియా భౌగోళికంగా ఒడిశాకే చెందుతుంది.కోరాపూట్‌ జిల్లాలో భాగమే కొటియా గ్రామాలు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్‌కు ఎటువంటి హక్కులూ లేవు. 1951 లోనే ఒడిశా ఇక్కడ అసెంబ్లీ, పార్ల మెంట్‌ ఎన్నికలు నిర్వహించింది. 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ కొటియా మాది అనడం హాస్యా స్పదం. దీనిపై ఇటీవలే సుప్రీం కోర్టుని ఆశ్రయించాం. ఇప్పటీకే కొటియా గ్రామాల్లో చాలా అభివృధ్ది చేసి చూపించాం. కొటియా గ్రామాల అభివృద్ధి,అక్కడి గిరిజనుల బాగోగుల కోసం కొటియా ప్రాంతంలో ఒడిశా అభివృద్ది పనులు నిరంతరం సాగుతూనే ఉంటాయి ‘‘అని ఒడిశా రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు డిప్యూటీ చైర్మెన్‌ సంజయ్‌ దాస్‌ వర్మ మీడియాతో చెప్పారు. తమ రాష్ట్రానికి చెందిన పంచా యతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహి స్తోందని, అందులో మూడు పంచాయతీల పేర్లు మార్చారని ఒడిశా ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌ ధర్మాసనం ఏపీ తరఫు న్యాయవాదికి పిటిషన్‌ కాపీ అందించాలని సూచించింది.
ఆంధ్రాలోనే ఉంటాం
కొటియాలో టెన్షన్‌కి తెరదించారు. ఏపీ అధికారుల కృషి ఫలించింది. 50ఏళ్లుగా నెలకొన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వివాదాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అక్కడి గిరిజనులు ఆకర్షితులయ్యారు. తాము ఏపీ పౌరుల మేనంటూ నినాదాలు చేశారు. ఒడిశా అధికా రులు, పోలీసులపై తిరగబడ్డారు. అక్కడి రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డులను విసిరి కొట్టారు. విజయనగరంజిల్లా అధికారుల విశేష కృషి కారణంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కొటియా విలేజ్‌ గ్రూప్‌ గ్రామ ప్రజ లకు చేరువయ్యాయి. ప్రభుత్వ పథకాలపై మొదటి నుంచి అధికారులు వారికి అవగాహన కల్పించారు. ఈ మేరకు సాలూరు వీూA పీడిక రాజన్న దొరను కలిసి ఏపీలోనే కొనసాగు తామని అంగీకారపత్రం ఇచ్చారు. ఒడిశాతో తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొటియా ప్రజలను ఎమ్మెల్యే రాజన్నదొర అభినందించారు.ఈ నేపథ్యంలో స్థానిక గిరిజనుల ధైర్యసాహసాలకు ముగ్థులైన విజయనగరంజిల్లా కలెక్టర్‌..కొటియా గ్రూప్‌ ప్రజలను కలెక్టరేట్‌కి పిలిపించారు. కలెక్టరేట్‌లో వారిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పథ కాలు వారికి మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ విషయంలోనే గిరిజనులు, ఒడిశా అధికారులు మధ్య వివాదం తలెత్తింది. పెద్దయెత్తున పోలీసులు కొటియా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలుగు బోర్డులు పెడుతున్న గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఒడిశా పోలీసులు, అధి కారుల ఓవరాక్షన్‌పై స్థానిక గిరిజనులు తిరగ బడ్డారు. పగలుచెన్నూరు, డోలియాంబల దగ్గర ఒడిశా పోలీసులతో బాహాబాహీకి సిద్ధమ వ్వడంతో యుద్ధ వాతావరణం కనిపించింది.
ఏపీలోనే ఉంటామని కొఠియా గ్రామాల తీర్మానాలు
ముఖ్యంగా కొఠియా గ్రామాల్లో సమస్యపై పరిష్కారంపై ఫోకస్‌ చేయనున్నారు. ఇటీవల పరిణామాలు, వివాదం వివరాలను అధికా రులు తాజాగా సీఎం జగన్‌కు తెలియ చేశారు. 21 గ్రామాలకుగానూ 16 గ్రామాలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఉంటామని తీర్మానాలు చేసినట్లు విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారి వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించినట్లు అధికారులు పేర్కొ న్నారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతానికి పైగా గిరిజనులేనని, వారికి సేవలు అందిం చే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సరిహద్దు భూ సమస్యలను పరిష్కారానికి వినతి..!! ఆంధ్ర`ఒడిశా సరిహద్దు గ్రామాలైన కొల్లాపుట్టుపంచాయితీని చత్తీష్‌ఘర్‌ రాష్ట్ర పీసా చట్టం గ్రూప్‌ చైర్‌పర్సన్‌ రవి పర్యటన రెబ్బాప్రగడ రవి పర్యటించారు.ఇక్కడ సమస్యపై గిరిజనులు చైర్‌పర్సన్‌ రవికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు.విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం కొల్లాపుటు గ్రామ పంచాయితీలో సరిహద్దు అంశంపై గ్రామసభలో తీర్మానించిన అంశాలను ఆయనకు స్థానిక గిరిజనులు అందజేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు అంశంపై అధికారులు దృష్టికి తీసుకెళ్లడంపై చర్చించడం జరిగిందని,డెక్కపారు,బొడ్లమామిడి,నిట్టమామిడి,కొల్లాపుట్టు గ్రామ రెవెన్యూ,అటవీ హక్కుల పట్ట భూములు కొల్లాపుట్టు గ్రామ పంచాయితీకి చెందినవి అంటూ పలు అంశాలను గ్రామసభ తీర్మాణంలో తీర్మాణించారు.అలాగే ఒడిశావాసులు ఆక్రమించిన భూములను ఇప్పించాలని కోరారు.-శ్రీ‌నివాస్‌

సంఘ‌టిత పోరాట‌మే ప‌రిష్కారం కాఫ్‌-26

కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ద పార్టీస్‌(కాప్‌`26) సదస్సు ఈ ఏడాది నవంబరులో స్కాట్లాండ్‌లో జరిగింది. ప్రతిఏటా 197దేశాలను ఒకచోట చేర్చే సదస్సు ఇది. వాతావరణ మార్పులు, దాని ద్వారా ఏర్పడే సమస్యల గురించి ఈసదస్సు ప్రధానంగా చర్చిం చింది. ఇది వాతావరణ మార్పుల పై యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) ఆధ్వ ర్యంలో జరిగిన కన్వెన్షన్‌.పర్యావరణంపై మానవ కార్యక లాపాల ప్రభా వాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతి దేశం, ప్రతిభూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.1994 మార్చి 21న తొలి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సమావేశాలు జరగ్గా, ఈ ఏడాది జరగబోయేది 26వది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో నవంబర్‌ 1 నుంచి 12 తేదీల మధ్య ఈసదస్సు జరిగింది.కాప్‌ 26 ప్రాధాన్యత
కాప్‌ 26 సదస్సు 2015లో పారిస్‌ వాతావరణ ఒప్పందంపై సంతకాల తర్వాత, అది ఏం సాధిం చింది, ఎక్కడ విఫలమైంది అని చర్చించే మొదటి శిఖరాగ్ర సమావేశం.పారిస్‌ ఒప్పందం ప్రాథమి కంగా వాతావరణ విపత్తును నివారించడానికి మనుషులు అమలు చేయాలనుకున్న వ్యూహం. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతలు1.5సెల్సియస్‌ పెరుగు తున్నాయి.ఈ ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతే భూమికి తిరిగి బాగు చేసుకోలేని ప్రమాదాన్ని సృష్టి స్తాయి. ఏదైనా ఒక ప్రణాళికను ప్రకటించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి.కాప్‌సదస్సుల ఉద్దేశం కూడా అదే. కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అన్నది చర్చించు కోవడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశారు.
కరోనా మహమ్మారి వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి?
మహమ్మారి కారణంగా పర్యావరణ పరిరక్షణ చర్య లకు తీవ్ర ఆటంకం కలిగింది. శిఖరాగ్ర సదస్సును ఒక ఏడాదివాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు, మహమ్మారి అనంతర ఆర్థిక స్థితి మెరుగు పరుచు కోవడంలో భాగంగా కొత్త నిర్ణయాలు తీసుకునేలా కోవిడ్‌ అవకాశం కల్పించింది.ఉదాహరణకు… మనం నిజంగా ఇన్ని ప్రయాణాలు చేయాలా,ఇంటి దగ్గరఉండి పనిచేస్తే సరిపోదా,ఇది కర్బన ఉద్గారా లను తగ్గిస్తుంది కదా,పట్టణీకరణను తగ్గించడానికి అవకాశం ఉందా?లాంటి ఆలోచనలకు దారి తీసింది.
గతంలో ట్రంప్‌ రద్దు చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని తాను కొనసాగిస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. వాతావరణ అనుకూల విధానాలు అవలంబించడంవల్ల ఆర్ధిక పరంగా కూడా ఎంతో మంచిదని ఆయన భావి స్తున్నారు. ఈసారి కాప్‌లో కూడా పర్యావరణానికి సంబంధించి సరికొత్త, సాహసోపేతమైన దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించారు.వాతావరణ మార్పులకు కారణమయ్యే దేశాలలో మొదటి వరసలో పేద దేశాలే ఉన్నాయి. మరోవైపు పెరుగుతున్న సముద్ర మట్టాలు ద్వీపాలను నెమ్మదిగా ముంచెత్తుతున్నాయి. ఇటు కరువు,వేడిగాలులు పంటలను దెబ్బ తీస్తు న్నాయి. ప్రస్తుత కాప్‌26 సదస్సులో వందకు పైగా దేశాలు కొన్ని డిమాండ్లు పెట్టాయి. పర్యా వరణ సమస్యలపై చర్యలకు నిధులు,ఈ చర్యలు తీసుకున్నందుకు కలిగిన నష్టాలకు పరిహారం,తమ ఆర్థిక స్థితిగతులు బాగుపడటానికి సహకారం,ధనిక దేశాలన్నీ 2020 నాటికి 100 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.75వేల కోట్ల ఇస్తామని హామీ ఇచ్చాయి. కానీ ఇప్పటి వరకు అందులో సుమారు 80శాతం మాత్రమే ఇవ్వగలిగాయి.వీటిలో ఎక్కువ భాగం రుణాలే తప్ప గ్రాంట్లు కాదు.ఈ సదస్సులో చర్చకు వస్తుందనుకుంటున్న మరో అంశం క్లైమేట్‌ ఫైనాన్స్‌. కార్బన్‌ మార్కెట్లు, కార్బన్‌ క్రెడిట్‌ల వ్యవ స్థను అమలు చేయడానికి సరైన మార్గం వెతకాల్సిన అవసరం ఉంది. కాలుష్య కారకాలను ఎక్కువగా విడుదల చేసే వారు గ్రీనర్‌ ఎకానమీలకు కార్బన్‌ క్రెడిట్‌ లను ఇచ్చే విధానం ఇది. పేద దేశాలకు సాయం అందించాలి చూడటానికి ఎంతో బాగుంది. కానీ, ధనిక దేశాలు తాము చెల్లిస్తున్నాం కాబట్టి,ఇష్టారాజ్యంగా కాలు ష్యాలను విడుదల చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మరొక ఉదాహరణ...ఒకఅడవిని నాశనం చేసి నందువల్ల ఏర్పడిన ఉద్గారాల కోసం ఒకదేశం ఎంత చెల్లించాలో ఎవరు నిర్ణయిస్తారు? ఒకవేళ గ్లాస్గో శిఖరాగ్ర సమావేశం పైన పేర్కొన్న అన్నింటికీ ఒప్పుకున్నప్పటికీ, మనం నిర్దేశించుకున్న హరిత లక్ష్యాలకు‘కాలపరిమితులు’అవసరం. ఈ సమస్య లకు పరిష్కారం చాలా సులభం అని అనుకుం టారు. కానీ అదినిజం కాదు. క్లైమేట్‌ ఛేంజ్‌ పై సాహసోపేత చర్యలు చేపట్టాం., ప్రధాని మోదీ వెల్లడి. ఇది నిరంతర ప్రక్రియ.వాతావరణ కాలుష్య నివారణకు ఇండియా పలు సాహసోపేత చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. క్లైమేట్‌ ఛేంజ్‌ అన్నది పెనుసవాల్‌ అని,అయితే క్లీన్‌ ఎనర్జీ ఎన్వి రాన్‌ మెంట్‌ సాధించాలన్న లక్ష్యంతో ఇండియా వివిధ చర్యలకు శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. ఇందుకోసం అంతర్జాతీయ సౌరకూట మిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తమ దేశం సమర్థించిందని ప్రధాని మోడీ చెప్పారు. వాతా వరణ కాలుష్యం వల్ల తలెత్తే విపరీత పరిణా మాల కారణంగా మానవ మనుగడ ప్రమాదంలో పడుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే దీని మార్పు కోసం పటిష్టమైన చర్యలు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. హరిత విప్లవ సాధన కోసం భారత, అమెరికా దేశాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ఇందుకు తాను,అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌..2030 నాటికల్లా ఇండియా-యూఎస్‌ క్లైమేట్‌ అండ్‌ క్లీన్‌ ఎనర్జీకి సంబంధించిన లక్ష్య సాధన కోసం అజెండాను రూపొందించామని వెల్లడిరచారు. పలు ఇతర దేశాల్లోని కార్బన్‌ కాలు ష్యం కన్నా ఇండియాలో ఈకాలుష్యం 60 శాతాని కన్నా తక్కువగా ఉందని మోదీ చెప్పారు. దశాబ్దాల తరబడి కాలుష్య నివారణకుకృషి జరగాలని సూచిం చిన ఆయన ఈ సందర్భంగా స్వామి వివేకానందను గుర్తుచేశారు. క్లైమేట్‌ ఛేంజ్‌ పై 40దేశాల ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో వర్చ్యువల్‌గా ప్రధాని పాల్గొ న్నారు. ఈ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌,బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, బ్రిటిష్‌ పీఎం బోరిస్‌ జాన్సన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, బ్రెజిల్‌అధ్యక్షుడు జైర్‌ బొల్సనారో తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు దేశాధినేతలంతా కృషి చేయాలని తీర్మానించారు. గ్లోబల్‌ హైబ్రిడ్‌ సమ్మిట్‌ద్వారా భారతదేశాన్ని స్వచ్చ Ûమైన శక్తి దిశగా నడిపేందుకు వేదికగా ఈ సమా వేశం నిలవనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIూ) ఛైర్మన్‌,మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ శిఖరాగ్ర సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొనడం విశేషం. ఈ శిఖరాగ్ర సమావేశాలను ూనణ ఛాంబర్‌,చీIుI ఆయోగ్‌, పర్యావరణ మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక పరిశోధన విభాగం, (జూIR),సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.శిఖరాగ్రసమావేశంలో, భారతదేశ హైడ్రో జన్‌ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాయి. కాప్‌26 వాతావరణ సదస్సుతో పెరిగిన కాలుష్యం
వాతావరణ మార్పుపై ప్రపంచ శిఖరాగ్ర సమా వేశాన్ని మీరు నిర్వహించబోతున్నట్లయితే, దాన్ని సాధ్యమైనంత కాలుష్యరహితంగా నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఈ ఈవెంట్‌ని ‘‘కార్బన్‌ న్యూట్రల్‌’’గా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని యూకే ప్రభుత్వం చెప్పింది. కానీ,మాడ్రిడ్‌లో జరిగిన మునుపటి శిఖరాగ్ర సమావేశం కంటే రెట్టింపును మించి ఉద్గారాలు గ్లాస్గో శిఖరాగ్ర సమావేశ నిర్వ హణ సమయంలో జరిగాయని ఓకొత్త నివేదిక తెలిపింది.ఎక్కువ మంది ప్రతినిధులు,ఎక్కువ ఉద్గారాలు కాప్‌26సమావేశ సమయంలో విడు దల అయిన మొత్తం కార్బన్‌ ఉద్గారాలు 1,02,500 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌కు సమానంగా ఉండను న్నాయని యూకే ప్రభుత్వానికి అందిన ప్రాథమిక అంచనా నివేదిక ద్వారా తెలిసింది. ఇది దాదాపు 10,000 యూకేగృహాల నుండి ఒక ఏడాది మొత్తం వచ్చే ఉద్గారాలకు సమానం. 2019లో మాడ్రిడ్‌లో జరిగినచివరి వాతావరణ శిఖరాగ్ర సమావే శంలో జరిగిన ఉద్గారాలతో పోల్చితే కాప్‌26 సమావేశా నికి అయిన ఉద్గారాలు రెట్టింపు. 2019లో మాడ్రిడ్‌లో జరిగిన సదస్సులో27,000 మంది పాల్గొనగా, కోవిడ్‌ మహమ్మారి ఉన్నప్పటికీ, గ్లాస్గో ఈ సమావేశానికి 39,000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని యూకే ప్రభుత్వం తెలిపింది.
అంతర్జాతీయ విమానాలు,ప్రైవేట్‌ జెట్‌లు
నివేదిక ప్రకారం కాప్‌`26 ఉద్గారాలలో 60% అంతర్జాతీయ విమానాల ద్వారానే వచ్చినట్లు అంచనా వేశారు.విమానాల నుండి వచ్చే ఉద్గారా లను నియంత్రించడానికి,హాజరయ్యే వారు సాధ్య మైతే రోడ్డుమార్గంద్వారా ప్రయాణించాలని కోరారు. అయినా, చాలా మంది ప్రపంచ నాయకులు ప్రైవేట్‌ జెట్‌ విమానాల్లో వచ్చారు.
అంతేకాకుండా వారి సొంత కాన్వాయ్‌ వాహనాలను, హెలీకాప్టర్‌లను తీసుకురావడానికి ప్రత్యేకంగా కార్గో విమానాలను వాడారు. నవంబర్‌ 1 వరకు గ్లాస్గో చుట్టుపక్కల ప్రాంతాలకు నాలుగురోజుల్లో ప్రైవేట్‌ జెట్‌లు లేదా వీఐపీ విమానాలు అన్నీ కలుపుకుని మొత్తం 76 విమా నాలు వచ్చాయని ఏవియేషన్‌ అనలిటిక్స్‌ కంపెనీ సిరియమ్‌ రియాలిటీ చెక్‌తో చెప్పింది. సమ్మిట్‌లో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించ డానికి యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఖచీఖీజజజ) గుర్తించిన ప్రణాళికలను అమలు చేశామని యూకే ప్రభుత్వం చెప్పింది. వీటిలో పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయో గించడం,చెట్ల పెంపకం వంటివి ఉన్నాయి. కార్బన్‌ న్యూట్రాలిటీపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణం ూAూ2060కి అనుగుణంగా నిర్వహించిన మొదటి కాప్‌ ఇదే అని యూకే ప్రభు త్వం చెప్పింది. ఇటీవల కార్న్‌వాల్‌లో జరిగిన మూడు రోజుల జీ7సమ్మిట్‌లో 20,000 టన్నుల కార్భన్‌డయాక్సైడ్‌కి సమానమైన ఉద్గారాలు విడు దల అయినా ఇది కూడా ‘‘కార్బన్‌ న్యూట్రల్‌’’గా గుర్తింపు పొందింది.(బీబీసీ సౌజన్యంతో)
-రవీంద్రనాథ్‌ కె 
1 49 50 51 52 53 75