అడవులు తరిగిపోతే వర్షాలుండవు

అడవులవల్ల కోట్లసంఖ్యలో వన్యప్రాణులు,వృక్షజాతులు,కీటకాలతోపాటు మానవాళికి ప్రత్యక్షంగా..పరోక్షంగా అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి.వాతావరణ మార్పులను నివారించడమే కాకుండా జీవుల మనుగడకు అవసరమైన స్వచ్ఛమైనగాలి,నీరు,ఆహారం,ఔషధాలను అందించడంలో వనాలు విశేషపాత్ర పోషిస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ, పర్వత ప్రాంతాలకు చెందిన కోట్లాది ప్రజలు తమ ఆహారంలో భాగమైన పండు,కాయలు,గింజలు,పుట్ట గొడుగులు,తేనెవంటి వాటిలో అధికశాతం అడవుల నుంచే సేకరిస్తున్నారు.అవిపేదలకుశక్తిని,ఆహార భద్రతను అందిస్తున్నాయి.ఆహార వైవిధ్యానికి తోడ్పడుతున్నాయి.ప్రపంచఆహార,వ్యవసాయసంస్థ ఎఫఏఓ)గణాంకాల ప్రకారం అరణ్యా లలో లభించే ఆహార,ఔషధ,కలపేతర ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.5.86లక్షలకోట్ల ఆదాయం సమకూరుతోంది. అటవీ వనరుల సేకరణ ద్వారా138దేశాల్లో1.25కోట్ల మంది పూర్తిస్థాయి ఉపాధిని పొందుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా ఔషధాలకోసం వినియోగించే అటవీవృక్ష జాతులసంఖ్య యాభైవేల దాకా ఉంటుంది.భూమి మానవులకే కాదు కోట్లాది జీవరాశులకు,మొక్కలకు నిలయం.నేలపై ఏజీవి అయినా ప్రాణంతో ఉండాలంటే గాలి,నీరు,ఆహారం ముఖ్యం.మరిభూమిని నాశనం చేస్తుంటే ఈవనరులన్నీ తరిగిపోతూ ఉంటాయి.ఇప్పటికే నీరు, ఆహారం కొనుక్కుంటున్నాం.భవిష్యత్తులో గాలి కూడా కొనుక్కునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.అభివృద్ధి పేరుతో ప్రయివేటు,కార్పొరేట్శక్తులు భూమిని నాశనం చేస్తున్నాయి.దీనివల్ల వరదలు,భూకంపాలు,వాతావరణమార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.ఇప్పటికే ఓజోన్‌పొర దెబ్బతిన్నది.దీంతో తీవ్రమైనఎండలు, భారీ వర్షాలు,గడ్డకట్ట్టించేచలి.ఇవన్నీ గతదశాబ్దకాలంగా క్రమక్రమంగా వాతావరణంలో వస్తున్నమార్పులు..మనిషి జీవనంపై తీవ్రప్రభావం చూపుతున్నాయి.ఇప్పటికైనా భూమి సమస్యలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరెన్నో ప్రమాదాలను చవిచూడాల్సి వస్తుంది.మనుషులు భూతాపాన్ని,కాలుష్యాన్నిపెంచే చర్యలను నిలువరించకపోతే భూమిని కాపాడుకోవడం కష్టం.అందుకే భూమి పరిరణక్షణకోసం ప్రజల్లో అవగాహన కలిగించాలి - పద్మావతి


మానవుల చర్యలతో భూమిని అనారోగ్యానికి గురిచేయడంతో తీవ్రంగా వేడెక్కుతుంది. వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. వీటిని నివారించే దిశగా చర్యలు చేపడుతూ,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలి.ఆలక్ష్యంగా ప్రజల్లో అవగాహన పెంచాలి. అంతరించిపోతున్న జీవజాతులను కాపాడు కోవాలి. అప్పుడే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవా’నికి అర్థం ఉంటుంది.
ప్రత్యేకత!..
అమెరికాలో 1969 జనవరి 28న శాంటా బార్బరా సముద్ర తీరం చమురు తెట్టలతో నిండిపో యింది. తీరమే ఆలంబనగా బతకుతున్న వందలాది జీవజాతులు మృత్యువాతపడ్డాయి. సుమారు నాలుగు వేల పక్షులు ఆతెట్టలో చిక్కుకొని, ఎగరలేక ప్రాణా లొదిలాయి. జీవ వైవిధ్యం కొడిగట్టిన ఆనాటి సంఘ టన ఎందరినో కలిచివేసింది. యుఎస్ సెనేటర్, పర్యావరణవేత్త గేలార్డ్ నెల్సన్, హార్వర్డ్ విశ్వవిద్యా లయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన డెనిస్ హేస్‌లను ఆందోళనకు గురిచేసింది. దీంతో పర్యావర ణంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి వీరిద్దరూ 1970లో, ఏప్రిల్ 22న ఎర్త్ డేను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో 175 దేశాల నుంచి దాదాపు 20లక్షల మంది పాల్గొ న్నారు.‘పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం!’ అంటూ నినాదాలు చేశారు.ప్రతి సంవత్సరం జరిగే ఈ సదస్సు ల్లో ప్రపంచ దేశాల్లో పర్యావరణంలో వచ్చిన మార్పు లను, భూమి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి చర్చిస్తారు. ఐక్యరాజ్యసమితి చొరవతో 1990లోఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పుడు ఏటా దాదాపు 200 దేశాలలో కోటిమందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు నిర్వాహకులు తెలుపుతున్నారు.
ఈ ఏడాది థీమ్
‘అంతర్జాతీయ ఎర్త్ పరిరక్షణ’ సంస్థ ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఒక కొత్త లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంవ త్సరం ‘మన శక్తి, మన గ్రహం’ అనే థీమ్‌తో 55వ సారి నిర్వహిస్తుంది. అంటే మనశక్తితో మన భూమిని కాపాడుకుందాం అని.కంపెనీలు,ప్రభుత్వాలు, పౌరు లు..అందరూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ దిశగా చర్యలను చేపట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ప్రతి ఏడాది ఈ రోజున ర్యాలీలు, చెట్ల పెంపకానికి సంబంధించిన కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రజలు ఈరోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ భూమి పరిరక్షణకు మద్దతు తెలుపుతారు. ఈ భూమిని రక్షించడంలో తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. భూమిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మాటలతో, ప్రతిజ్ఞలతోనే కాకుండా కార్యచరణకు మన వంతుగా చేయాల్సిన కొన్ని పనులు మనం చేయాలి.చెట్లు నాటు దాం..భూమిని చల్లగా, సురక్షితంగా ఉంచుదాం !
పారిస్ ఒప్పందం నిర్లక్ష్యం
ఎర్త్ డే మొదలైన కొన్నేళ్ళకే పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. అనేక పర్యావరణ చట్టా లను తీసుకువచ్చారు.క్లీన్ ఎయిర్ యాక్ట్ లాంటి వాటిని ఏర్పాటుచేసి, వాటిని చెప్పుకోదగ్గ స్థాయిలో బలోపేతం చేశారు.లక్షలాది మొక్కలు నాటడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులకు మద్దతుగా నిలవడంతో పాటు,ప్రపంచమంతటా వాతావరణ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. జాతీయ, అంతర్జా తీయ ఎజెండాలో పర్యావరణ సమస్యలు చోటు దక్కించుకోవడానికి ఎర్త్ డే కీలకపాత్ర పోషిస్తోందని అందరూ అనుకున్నారు. కానీ ఆయా దేశాల్లో ప్రభు త్వాలు ప్రయివేటు వ్యక్తుల ప్రభావంతో పనిచేస్తు న్నాయి. ప్రకృతి చట్టాలు కఠినంగా నిర్వహించడం లేదు. విచ్చలవిడిగా భూమి వినాశకర చర్యలు చేపడుతున్నాయి. ఫలితంగా భూమి కాలుష్యకోరల్లో చిక్కుకుపోతోంది. భవిష్యత్తు ప్రమాదాన్ని గ్రహించిన పర్యావరణవేత్తలు2015లో పారిస్ సదస్సు నిర్వహిం చారు.పర్యావరణ పరిక్షణకోసం కొన్ని నియమ నిబంధనలను ప్రపంచదేశాల ముందు పెట్టాయి. వీటికి 196 దేశాలు కట్టుబడి ఉంటామని ఆమోదిం చాయి. ఇది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా కట్టుబడి ఉన్న ఒక ఒప్పందం. ఇది 2016,నవంబర్ 4న అమల్లోకి వచ్చింది. భూమికి చేసిననష్టాన్ని సరిదిద్దుకునేందుకు ఇది మంచి అవకాశం. గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా అంగీకరించిన మొదటి సందర్భమది.దీనిలో అన్నిదేశాలూ పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు,లక్ష్యాలు ఉన్నాయి. కానీ, దీనిని అమెరికాతో పాటు అనేక దేశాలు తుంగలో తొక్కుతున్నాయి.దీన్ని చూస్తూ ఊరుకుంటే మన భూమి మనకు మిగలదు. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉంది. భూమి అంటే మనం ఉంటున్న ఇల్లు, పనిప్రదేశం మాత్రమే అనుకుంటే పొరపాటు మరొకటి ఉండదు. మనచుట్టూ ఉన్న భూమిని, ప్రకృతిని నాశనం చేసే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవరైనా సరే భూమికి హాని కలిగించకూడదు అన్న సామాజిక స్పృహ అందరిలోనూ పెరగాలి.
ఎండిపోతున్న నదులు
అడవుల నరికివేత, భూమి కాలుష్యంతో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు కాకరేపుతు న్నాయి. వేడి ధాటికి ఒకవైపు అడవులు కాలి బూడిద అవుతుంటే, మరోవైపు నదులు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అమెరికాలోనూ నీటి కొరత ఏర్పడి, కొన్ని రాష్ట్రాలకు నీటి కేటాయింపులు భారీగా తగ్గించారు. విపరీతమైన వేసవి ఉష్ణోగ్రతల నడుమ జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో పుట్టిన డాన్యూబ్ నది 2022లో అడుగంటింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది వేసవిలో ఈనది ఎండిపోతుంది. ఈ నదిపైనే ఆధా రపడి జీవించే జిమినిసియా నౌకాశ్రయ కార్మికులు, రైతులు,నౌకా నిర్మాణ సిబ్బంది, రెస్టారెంట్ల యజమా నులు తదితర ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారిం ది. చాలా కుటుంబాలు వలస వెళ్లాయని అక్కడ అధికారులు తెలిపారు. వర్షాకాలంలో అప్పుడప్పుడు పడే వర్షం నీటిని ఒడిసిపట్టి ఇంట్లో అవసరాల కోసం ప్రజలు వాడుకుంటున్నారు. డాన్యూబ్ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. నది ఎండిపోవడంతో కొత్తగా కనిపిస్తున్న మట్టితో నిండిన బీచ్‌లపై పిల్లలు ఆడుకుంటున్నారు. ‘ఇటు వంటి పరిస్థితే చాలా దేశాల్లో ఇప్పుడు కనిపిస్తోందని, ప్రపంచంలో ప్రతి ఏడాది నీటి ఎద్దడి తీవ్రత అసాధా రణంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులకు మనం అలవాటుపడాల్సి ఉంటుందేమో. ప్రస్తుతం జీవనదు ల్లో నీటి మట్టం పెరుగుతున్నట్లు ఎక్కడా కనిపిం# áలేదు.గత నాలుగైదు ఏళ్లుగా వేసవిలో ఇలాంటి నీటి ఎద్దడివల్ల భూగర్భ జల వనరులు పూర్తిగా అడు గంటాయి. మరోవైపు హిమనీనదాలు కూడా వేగంగా కరిగిపోతున్నాయి. ఇది భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడికి ఓ హెచ్చరిక!’ అని జర్మనీకి చెందిన హెల్మోల్ట్జ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ (యÖఎఫ్‌జడ్)కు చెంది న కార్స్‌టెన్ రింక్ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలోనూ ఇటువంటి అనుభవాలు ఎదురవుతు న్నాయి. ఇకనైనా భూమిని కాలుష్య కోరల్లో నుంచి రక్షించుకుని, మంచినీటి వనరులైన నదులను కాపాడుకోవాలి.
ప్రభావాలెన్నో..
ప్రపంచవ్యాప్తంగా 90శాతం అడవుల నష్టానికి వ్యవసాయ విస్తరణే కారణమవుతోంది.అటవీయేతర కార్యకలాపాలు కోసం ఆమెజాన్ అడవులు నిర్మూల నకు గురవుతున్నాయి.పశువుల పెంపకం 70శాతం నష్టానికి కారణమవుతోంది.అటవీ నష్టం వల్ల ఆమో జాన్ అడవుల్లో జీవైవిధ్యం దెబ్బతింటోంది.స్థానిక వాతావరణ మార్పులతోపాటు ప్రపంచ శీతోష్టస్థితిలో మార్పులకూ దారితీస్తోంది.ఒక ప్రాంతంలో అడవు లకు నష్టం వాటిల్లితే స్థానికంగా తీవ్ర దుష్ప్రభావం పడటమే కాకుండా,ఇతర ప్రాంతాల్లో సైతం దుష్ఫ రిణామాలు చోటుచేసుకుంటాయని పరిశోధ కులు చెబుతున్నారు.దక్షిణ అమెరికాలోని వర్షార ణ్యాలు అమెరికా వర్షపాతం ప్రభావం చూపుతాయని ఆగ్నేయాసియా అడవులు ఆగ్నేయ ఐరోపా,చైనాల వర్షపాత సరళిని ప్రభావితం చేస్తాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.అడవులకు నష్టం వాటిల్లడం వల్ల స్థాణికంగా,ప్రాంతీయంగా ఉష్ణోగ్రత,వర్షపాతాల మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది.
భూమి పరిరక్షణ
ఇప్పటికే భూమికి చాలా నష్టం జరిగింది. దాని ఫలితం ప్రత్యేక్షంగా చూస్తున్నాం. ఇకనైనా ప్రజలు ఏకతాటిపైకి వచ్చి జీవవైవిధ్యం, భూగ్రహాన్ని రక్షించే చర్యలను ప్రారంభించాల్సిన అవసరాన్ని ఈ సంవ త్సరం థీమ్ నొక్కి చెబుతుంది. శీతోష్ణస్థితి మార్పులు ఇకపై సుదూర విషయం కాదు.. వరదలు, అగ్నిప్ర మాదాలు పెరుగుతున్నందున పరిస్థితిని సమీక్షించడం,తదనుగుణంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించాలన్న లక్ష్యం పెట్టుకున్నా.. ఇప్పుడు 3డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడెక్కు తుంది. ఇది పారిస్ ఒప్పందం లక్ష్యం కంటే రెండు రెట్లు అధికమని ఇటీవల ఐపీసీసీ నివేదిక అప్రమత్తం చేసింది.ఈ మార్పులు భూమిపై ఉన్న మానవుల, జీవరాశుల ఉనికిని దుర్భరంగా మారుస్తాయని ఆందో ళన వ్యక్తం చేసింది. కాబట్టి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమిని నాశనం చేసే పర్యావరణ పరిరక్షణ వ్యతిరేక విధానాలను పాలకులు విడనాడాలి.భూమి పరిరక్షణ అంటే భూమిని, దాని సహజ వనరులను సంరక్షించడం, దెబ్బతినకుండా కాపాడడం. భూమిని పరిరక్షించడం ద్వారా భూమిని, జీవరాశులను కాపాడగలం. భవిష్యత్ తరాలకు సురక్షితమైన భూమిని అందించగలం. సమస్త జీవకోటి భారాన్ని మోసే భూమి పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలి. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యక రమైన భూమిని అందించాలంటే.. భూమిని కాపాడు కునే బాధ్యత మనందరి చేతుల్లోనే ఉంది.
క్లీన్ కేరళ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా భూమిని నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై కేరళ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇళ్లు, పరిశ్రమల నుంచి చెత్తచెదా రంతో పాటు ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ చేపట్టారు. ఇందు కోసం స్థానిక అధికారుల చేత ప్రజలకు అవగాహన కల్పించారు. చాలా తక్కువ సమయంలో సమిష్టికృషితో క్లీన్ కేరళ ద్వారా 61,664 టన్నులకు పైగా ప్లాస్టిక్ తోళ్లు, బ్యాగులు, చెప్పులు వ్యర్థాలను సేకరించి,ప్రాసెస్ చేశారు. అంతే కాదు 89లక్షలకు పైగా ఇళ్ల నుంచి పనికిరాని బట్ట లను, చెత్తను సేకరించి, రీసైక్లింగ్ పద్ధతిలో తిరిగి ఉపయోగించేలా మారుస్తున్నారు.. ఇది దేశానికే మార్గదర్శకం.
ప్లాస్టిక్ భూతం
భూమిని కలుషితం చేసే వాటిలో ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమైనది. ప్లాస్టిక్‌లో బిస్‌ఫినాల్-ఏ, థాలేట్స్, డయాక్సిన్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్), పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పీసీబీస్), స్టైరిన్ మోనోమర్, నానిల్ఫెనాల్ వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి భూమిని,నీటిని, గాలిని కలుషితం చేస్తూ అత్యంత ప్రమాదకరంగా మారుస్తాయి. భూసారం పెరగకుండా ప్లాస్టిక్ అడ్డుపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్లోరినేటెడ్ ప్లాస్టిక్‌తో మట్టిలో విషరసాయనాలు చేరుతున్నాయి. అవి భూగర్భ జలాల్లో కలిసి మానవాళికి, ప్రాణకోటికి హాని చేస్తున్నాయి. ఏటా పెద్దసంఖ్యలో పక్షులు, చేపలు, జంతువులు ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నాయని నిపుణుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతరించి పోతున్న ప్రాణుల్లో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్ వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు. అంతేకాదు.. మనం తినే జలచరాల్లో మైక్రో ప్లాస్టిక్, నానో ఫైబర్ వ్యర్థాలనూ కనుగొన్నారు. ఇంత ప్రమాదమని తెలిసినా ప్రభుత్వాలు కొన్ని ప్రయివేటు కంపెనీలకు ప్లాస్టిక్ తయారీకి అనుమతులు ఇస్తున్నాయి. బహి రంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను మండించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండువేల లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తవుతోంది. ఇది 60 లక్షల మంది మరణాలకు కారణమవుతున్నట్టు అంచనా. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు వస్తున్నాయి. ప్లాస్టిక్ పాలిమర్ అవశేషాలతో క్యాన్సర్, ఎండోక్రైన్ గ్రంథిó దెబ్బతినడం, చర్మవ్యాధులు సోకుతున్నాయి. ప్లాస్టిక్ వల్ల భూమికి ఎంత నష్టం ఉందో, మానవాళికీ అంతే ప్రమాదం.
దీన్ని ఎర్త్ డే నిర్వాహకులు సీరియస్‌గా తీసుకున్నారు. 2040 నాటికల్లా అన్నిరకాల ప్లాస్టిక్ ఉత్పత్తులను 60 శాతం తగ్గించాలని కోరారు. దీనికి యÖకె సహ 50కు పైగా దేశాలు మద్దతునిచ్చాయి. సాధ్యమైనంత మేరకు అందరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వాడుకునేందుకు ప్రభుత్వాలు కాటన్, నారా సంచులను, వస్తువులను ఉత్పత్తి చేయాలి.. అందుబాటులో ఉంచాలి. అప్పుడే భూమిని ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడుకోగలం. ప్రమాదంలో అడవులు భూమిలో అధికవేడి తీవ్రతరం కాకుండా ఉండాలంటే అడవులు, మొక్కల పెంపకం, వాటి సంరక్షణ చేపట్టాలి. కానీ ప్రభుత్వాల అంతులేని నిర్లక్ష్యంతో అటవీ వనరులు, జీవవైవిధ్యం విధ్వం సానికి గురవుతున్నాయి. పరిశ్రమలు, గనుల తవ్వ కాలు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో సాగుతున్న అడవు ల కోతను నియంత్రించాలనే లక్ష్యంతో ‘అటవీ సంరక్షణ చట్టం-1980’ ని అమలులోకి తీసుకొచ్చా రు. ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ, కొత్తగా అటవీ సంరక్షణ చట్టానికి సవరణ చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. గిరిజనులకు ఉపాధి అయిన అడవులను ఆక్రమించడంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టు లకు అటవీ భూములను కేటాయిస్తున్నారు.
‘అటవీ పరిరక్షణ చట్టం సవరణ బిల్లు-2023’ ద్వారా అటవీ భూములను అనేక అటవీయేతర ప్రయోజనాల కోసం స్వేచ్ఛగా బదలాయించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది గిరిజనులకే కాదు.. దేశప్రజలకే ప్రమాదకరం. జాతీయ భద్రత, ఇతర వ్యూహాత్మక అవసరాల కోసం దేశ సరిహద్దుల్లో వంద కిలోమీటర్ల లోపు అటవీ భూముల బదలాయింపునకు స్వేచ్ఛ కల్పించారు. దీంతో కార్పొరేట్ వ్యక్తులు పెద్ద పెద్ద వృక్షాలను, అడవులను విచక్షణారహితంగా కూల్చి వేస్తున్నారు. పచ్చని అడవులు అంతరించిపో తున్నాయి. ఫలితంగా వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తాయి. సవరణలు చేసిన కొత్త చట్టంలో ఈశాన్యంతో పాటు ఉత్తరాఖండ్, ఇతర రాష్ట్రాల్లో విలువైన జీవవైవిధ్య సంపద ఉన్న అడవులపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో పశ్చిమ, తూర్పుకనుమల్లో అత్యంత దట్టమైన అటవీ ప్రదేశా లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
అడవులు తరిగిపోతే వర్షాలు ఉండవు. గిరిజనులకు ఉపాధి ఉండదు. జీవకోటికి కావాల్సిన ఆహారం, గాలి, నీరు దొరకవు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొత్తగా ప్రవేశపెట్టిన సవరణ చట్టాలను రద్దు చేయాలి. మన అడవులను మనమే కాపాడు కోవాలి. అడవులను పరిరక్షించుకుంటే భూమిని కొంతమేరకు కాపాడుకోగలం.భూమి పరిరక్షణ ద్వారా సహజవనరుల లభ్యతా పెరుగుతుంది. అడవుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రపంచ బ్యాంక్ సాయంతో రెండు దశాబ్దాల క్రితం పలు కార్యక్రమాలు చేపట్టారు.వాటిలో ఉమ్మడి అటవీ యాజమాన్యం,సామాజిక అటవీ యాజమాన్యం వంటి పథకాలు మంచి ఫలితాలను ఇచ్చాయి.వాటి కింద పెంచిన అడవుల నుంచి వచ్చే ఉత్పత్తులు,కలప దిగుబడిపై ఆదాయాన్ని స్థానిక ప్రజలకే కేటాయిస్తా మన్న హామీ మాత్రం అనేక రాష్ట్రాల్లో అమలుకు నోచుకోలేదు.

కార్పొరేట్ విధానాలపై పెరుగుతున్న ప్రతిఘటన

ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన కార్మిక పోరాటాలు, ఆందోళనలు, నిరసనలు ఇవన్నీ సామాన్యుల సంక్షేమం కన్నా కార్పొరేట్ ప్రయోజనాలే మిన్నగా భావించే బిజెపి ప్రభుత్వం అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపించాయి. కార్మిక వర్గంలో ముఖ్యంగా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్) వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పెరుగుతున్న తీవ్రమైన అసంతృప్తిని ఈ నిరసనలు ప్రముఖంగా చాటి చెప్పాయి.
ఎన్.సి.ఆర్ లోని అనేక ఫ్యాక్టరీల్లో చాలా మంది కార్మికులు ఆర్థికంగా వెనుకబడిన గ్రామాలకు చెందిన వలస కార్మికులే.తమ జీవనోపాధులను వెతుక్కుంటూ వచ్చినవారే. అయితే వారు ఇక్కడకు వచ్చిన తర్వాత బానిస తరహా పని పరిస్థితుల్లో చిక్కుకు పోతున్నారు.బహుళ జాతి కంపెనీలు, ప్రధానమైన భారతీయ సంస్థలకు చెందిన ఫ్యాక్టరీల్లో ఎక్కువమంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తుంటారు. వీరికి మౌలికమైన కార్మిక హక్కులేవీ వర్తించవు.
కార్మిక చట్టాలు విస్తారంగా ఉల్లంఘించబడతాయి. నెలవారీ వేతనాలు రూ.10వేలు నుండి రూ.12వేలు మధ్యలో వుంటాయి. తరచుగా నిర్దేశిత కనీస వేతనాల కంటే ఇవి తక్కువగానే వుంటాయి. అనేక ఫ్యాక్టరీల్లో కార్మికులకు కార్మిక సంఘాల్లో చేరే లేదా సంప్రదించే వెసులుబాటు వుండదు, దీంతో వారికి సమిష్టి బేరసారాల శక్తి లేకుండా పోతోంది. చాలా తరచుగా వారు రోజుకు 13గంటలు పనిచేయాల్సిన పరిస్థితులు వుంటాయి. దీనికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వారి పరిస్థితిని మరింత అధ్వాన్నం చేస్తుంది. ఇక దాదాపు రెండు దశాబ్దాల క్రితం చివరిసారిగా సవరించిన కనీస వేతనాలు ఇప్పటికీ కాలం చెల్లినవిగానే మిగిలిపోయాయి. ఇఎసఐ, ప్రావిడెంట్ ఫండ్ లేదా గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాల గురించి చాలామంది కార్మికులు కనీసం వినను కూడా వినలేదు !
ఇలాంటి అమానవీయ పని పరిస్థితులన్నీ కలిసి ఒక్కసారిగా విస్తృతమైన నిరసనలు, ఆందోళనలకు దారి తీశాయి. కార్మికులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వ కార్మిక శాఖ నిష్క్రియాపరంగా వుండిపోయింది. కార్మికులు సాగించే పోరాటాలను, నిరసనలను అణచివేయడానికి బిజెపి ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగించింది.
కార్పొరేట్ ప్రయోజనాలు, కార్మికుల మధ్య జరుగు తున్న ఈఘర్షణలో సిఐటియు (దిసెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) కీలకమైన మద్దతును అందించింది. కార్మికుల కాంట్రాక్టీకరణను సిఐటియు ఎల్లప్పుడూ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చింది. కానీ, యజమానులకు మాత్రం ఉపాధి భద్రతను, కార్మికుల ప్రయోజనాలను నిరాకరిం చడానికి ఇదొక సాధ నంగా మారింది. కాంట్రాక్ట్ కార్మికులపై ఆధార పడడం ఎక్కువైన కొద్దీ యావత్ కార్మిక లోకం హక్కులకు ఎదురుదెబ్బ తగులుతుందని, కార్మికులు విభజనకు గురవుతారని ఏళ్ళ తరబడి సిఐటియు హెచ్చరిస్తూనే వచ్చింది.కాంట్రాక్ట్ కార్మికు లతో పోలిస్తే పర్మినెంట్ ఉద్యోగులు కొంత మెరుగైన పరిస్థి తులతో లబ్ది పొందుతారు.అదే సమయంలో కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం దాడులను ఎదుర్కొం టూనే వుంటారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్‌లను సిఐటియు తీవ్రంగా వ్యతిరేకి స్తోంది. చాలా చట్టాలు అమల్లో వున్నప్పటికీ పాలక వర్గాల మద్దతు కలిగిన బహుళజాతి కంపెనీలు, భారత కార్పొరేట్ సంస్థలు కార్మికులను దోపిడీ చేస్తూనే వున్నాయి. లేబర్ కోడ్‌లను తీసుకురావడంతో, ఇక కార్పొరేట్ సంస్థలు కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేయడం మరింత ఉధృతమైంది. తద్వారా కార్మికులు మరింత దోపిడీకి గురవుతున్నారు.కార్మికుల భద్రతను, బేరాసారాల శక్తిని పణంగా పెట్టి యజమానులకు వెసులుబాటును పెంపొందిం చడం ద్వారా లేబర్ కోడ్‌లు ప్రధానంగా కార్పొ రేట్ ప్రయోజనాలనే నెరవేరుస్తున్నాయని సిఐటియు భావిస్తోంది.ఈ లేబర్ కోడ్‌లను పూర్తిగా రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది.ఆస్థానంలో పటిష్టమైన రక్షణాత్మక చట్టాన్ని పునరుద్ధరించాలని కోరింది.కాంట్రాక్టు కార్మికులు,స్కీమ్ వర్కర్లతో సహా మొత్తంగా కార్మికులందరికీ కనీస వేతనాలకు హామీ కల్పించా లన్నది ప్రస్తుతం సాగుతున్న కార్మిక పోరాటాల్లో సిఐటియు కీలక డిమాండ్‌గా వుంది. ప్రతి ఒక్క కార్మికుడు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు,ఆహారం,నివాసం,విద్య,ఆరోగ్య సంరక్షణ వంటి మౌలిక అవసరాలు తీరేందుకు సరిపడా వేతనాన్ని అందుకోవాలని సిఐటియు కోరుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం,ఖర్చులకు అనుగుణంగా కనీస వేతనాలను క్రమం తప్ప కుండా సవరించాలని,ఈ రక్షణను అన్ని కేటగిరీల కార్మికులకు ఎలాంటి మినహాయింపు లేకుండా వర్తింపు చేయాలని సిఐటియు పదే పదే పిలుపిస్తోంది.ఎక్కడ నిరసనలు జరిగినా సిఐటి యు అనుబంధ సంఘాలు, కిసాన్ సభ, డివై ఎఫఐ, ఎసఎఫఐ కార్యకర్తలు, సభ్యులందరూ నిరసనలకు దిగిన కార్మికులకు తోడ్పాటునంది స్తుంటారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి, ఇతర నేతల జోక్యం కార్మిక శక్తి మనోధైర్యాన్ని పెంపొందించింది.ఫిబ్రవరి 12న పిలుపు ఇచ్చిన జాతీయ సమ్మె ప్రాంతాల వారీగా కార్మికులందరినీ సమీకరించి, సమాయత్తపరిచింది. సమ్మె సందర్భంగా ఇచ్చిన నినాదాలు అనేకమందికి స్ఫూర్తినిచ్చాయి. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను అలాగే మతోన్మాద ధోరణులతో కార్మిక వర్గం ఐక్యతను బలహీనపరిచే ప్రయత్నాలను బట్టబయలు చేయడానికి దోహదపడ్డాయి.సంఘీభావాన్ని ప్రదర్శించాలంటూ సిఐటియు ఇచ్చిన పిలుపునకు అత్యధికంగా స్పందన లభించింది. అనేక రాష్ట్రాల్లో కార్మికులు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమం కార్మిక వర్గం ఐక్యతను ప్రదర్శించింది. కొత్త రకమైన దిశా నిర్దేశాన్ని అందించింది. ఉత్తర భారతంలో కార్మికులు సాగిస్తున్న పోరాటాలు ఒక ప్రాథమిక వాస్తవాన్ని నొక్కి చెప్పాయి. సమైక్యతే కార్మిక శక్తి యొక్క అత్యంత గొప్ప బలం. సంఘటితం అయినపుడు,ఏ శక్తి కూడా వారి గళాన్ని నిలువరించలేదు. ఈ నిరసనలు, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా నిరంతరంగా సాగుతున్న ప్రతిఘటనను చూపించాయి. దీనితో పాటుగా కార్మిక వ్యతిరేక చట్టాల పట్ల గల దృఢమైన వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఇది ప్రభుత్వాలపై, యజమానులపై వాస్తవ ఒత్తిడిని తీసుకురాగలుగుతుంది.మరింత మెరుగైన వేతనాలు, మౌలిక హక్కుల సాధన కోసం జరుపుతున్న పోరు క్రమంగా గౌరవం, న్యాయం, మరింత మెరుగైన భవితవ్యం కోసం సాగించే విస్తృత పోరాటంగా రూపుదాల్చింది. ఈ పోరాటంలో సిఐటియు దృఢమైన స్తంభంగా నిలిచింది. కార్మికులందరినీ సమీకరిస్తోంది. కార్మిక విధానాలను అస్థిరపరిచే, కార్మిక సంఘాల కార్యకలాపాలను అణచివేసే లక్ష్యం కలిగిన విధానాలకు వ్యతిరేకంగా స్పష్టమైన దిశా నిర్దేశాన్ని అందిస్తోంది.ముందున్న మార్గం అనేక సవాళ్ళతో కూడుకున్నదే, అయితే, స్థిరమైన, సమైక్య కార్యాచరణతో పాతుకుపోయిన అన్యాయాన్ని సవాలు చేయవచ్చని ఉత్తర భారతంలో కార్మికులు ప్రదర్శించిన కృత నిశ్చయం రుజువు చేసింది. దోపిడీతో కూడిన కాంట్రాక్టీకరణకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేయడం, కొత్త లేబర్ కోడ్‌లను తిరస్కరించడం, సార్వత్రిక కనీస వేతనాల కోసం పట్టుబట్టడం ద్వారా కార్మిక వర్గం తక్షణ ఉపశమనం కావాలని కోరడమే కాదు, మొత్తంగా దేశంలోని కార్మిక సంబంధాల భవిష్యత్‌ను కూడా పునర్నిర్మిస్తోంది. ఈ పరిణామాలన్నీ కార్మిక హక్కుల పునరుద్ఘాట నకు సంకేతం. ఇటువంటి ఉద్యమాలు విజయ వంతం కావడమనేది ప్రాంతాలవారీగా,రంగాల వారీగా కార్మికులు కొనసాగించే ఐక్యత, సంఘటితమవడంపై ఆధారపడి వుంటుంది.ఈ పోరాటం ఉధృత రూపాన్ని సంతరించుకుం టున్నందున సమిష్టి కార్యాచరణతో అర్ధవంతమైన మార్పును తీసుకురావచ్చన్న ఆశను కలిగిస్తోంది. అలాగే కొద్దిమంది కార్పొరేట్ల కన్నా పెద్ద సంఖ్యలోని కార్మిక లోకానికి ఆర్థిక పురోభివృద్ధి ప్రయోజనాలు అందేలా చూడాలని హామీ కల్పిస్తోంది.సంక్షోభ కాలంలో ప్రజల మీద ఫాసిస్టు పాలకుల నిర్బంధం పెరగడమే కాదు, ప్రజలు ఉవ్వెత్తున తిరగబడి చరిత్ర తిరగరాసే అవకాశం కూడ పెరుగుతుంది. ఆకలి నుంచి ఉక్రోశం, అణచివేత నుంచి ప్రతిఘటన పెరుగుతుంది. మార్పులు తీవ్రమైన వేగంతో సంభవిస్తాయి. అభ్యుదయ శక్తులు సంక్షోభ కారణాలను, స్వరూపాన్ని సక్రమంగా అవగతం చేసుకుని స్ఫూర్తితో జోక్యం చేసుకోవల్సిన సమయం ఇది. అన్ని విధాలుగా విఫలమైన పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను, దోపిడీ లేని సమసమాజాన్ని నిర్మించుకునే దిశగా ప్రజాతంత్ర ఉద్యమం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. దుష్ట మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు ఈ ‘హిందూత్వ’ అంతం ప్రజా ప్రతిఘటనలో ఉంది. అంతిమంగా పై చేయి సాధించేది అదే. 2022 నాటికి దేశ జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి రంగం వాటాను 25 శాతానికి పెంచే విధంగా మేక్ ఇన్ ఇండియా పథకాన్ని 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25 శాతానికి చేరే సంగతి అటుంచి మోడీ ఏలుబడిలోకి వచ్చేనాటికి ఉన్న 16.3 శాతం కాస్తా 2020-21 నాటికి 14.3 శాతానికి దిగజారింది. మేకిన్ ఇండియా పథకాన్ని ఉపాధి పెంపుదల, విదేశాలకు వస్తు ఎగుమతులు, మన దిగుమతులు తగ్గించే లక్ష్యంతో ప్రకటించారు. మన దిగుమతుల బిల్లు తగ్గిన దాఖలాలుగానీ, ఎగుమతులు పెరిగిన అనవాలు గానీ కనిపించటం లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం నెరవేర్చకపోగా రైతాంగానికి ఎసరు పెట్టి వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు దుర్మార్గమైన మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి అబాసుపాలైన విషయం తెలిసిందే. మద్దతు ధరకు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చిన మోడీ కాలయాపన చేస్తూ మీన మేషాలు లెక్కిస్తున్నాడు.- జి ఎన్ వి సతీష్ 

పది తర్వాత ఏమి చేయాలని ఆలోచిస్తున్నారా..?

విద్యార్థి దశలో పదోతరగతి అత్యంత కీలక మైంది.ఇటీవలే పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి.తదనంతరం ఏకోర్సు చదవాలనే ఆలోచ నలు అనేక మందిలో మొదలయ్యాయి.చక్కగా ఆలోచించి సరైననిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుంది.విద్యార్థులు తమశక్తి సామర్థ్యాలు,అభిరుచులకు అనుగుణంగా కోర్సులను ఎంచుకోవాలని విద్యానిపుణులు సూచిస్తున్నారు.ఇంటర్మీడియట్ విద్యలో చేరేందుకు ప్రభుత్వ పరంగా ఏఏ కళాశాలలు,కోర్సులు అందుబాటులో ఉన్నాయనే వివరాలు మీకోసం.- జి.ఆనంద్ సునీల్ కుమార్ 

గురుకులాలు ఆహ్వానిస్తున్నాయ్ గురుకుల(రెసిడెన్షియల్) విద్యను ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ప్రవేశ పరీక్షల్లో (ఎంట్రన్స్ టెస్ట్) ఉత్తమ ఫలితాలను సాధించిన వారు వీటిలో చేరవచ్చు.ఆంగ్ల విద్యతో పాటు వసతి సౌకర్యం కూడా ఉంటుంది. ఈ గురు కులాల్లో రుచికరమైన భోజనాన్ని అందిస్తారు. కార్పొరేట్ కళాశాల తరహాలో ఎప్‌సెట్,నీట్ తదితర వాటి కోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తారు.
వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి
తక్కువ సమయంలో ఉపాధి అవకాశాల కోసం వృత్తివిద్యా(వొకేషనల్) కోర్సులను ఎంచుకోవటం ఉత్తమం. పదోతరగతి పాసైనవారు ఐటీఐ కాలేజీల్లో చేరవచ్చు. తమ ఆసక్తికి అనుగుణంగా కోర్సులను ఎంచుకోవచ్చు. ఐటీఐ చేసిన వారికి పరిశ్రమల్లో మంచి డిమాండ్ ఉంది. నైపుణ్యాలు ఉంటే కొలువు సంపాదించడం సులువే.
పాలిటెక్నిక్‌తో బీటెక్‌కు దగ్గరి దారి!
పాలిసెట్ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకులు సాధించినవారు పాలిటెక్నిక్ కోర్సులో చేరాలి.3 ఏళ్ల పాటు శిక్షణ తీసుకోవాలి. పూర్తిచేసిన వారు నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్‌లో చేరవచ్చు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించే అవకాశం ఉంది. మరోవైపు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు కూడా ఉన్నాయి. వ్యవసాయ రంగంపై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఇది ఇంటర్మీడియట్ విద్యతో సమానం. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి రెండేళ్లు ఉంటుంది. కోర్సు పూర్తయి నట్లయితే వ్యవసాయ విస్తరణ అధికారుల కొలువులు సాధించవచ్చు.
ఆర్జీయూకేటీ పిలుస్తోంది
పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ విద్య ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో 6ఏళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ఉంటుంది.పదోతరగతి మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణమైన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. అన్ని సామాజికవర్గాల వారికీ వీటిలో అవకాశం ఉంటుంది.
ఏకలవ్య, ఆదర్శ స్కూల్స్
ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్యనభ్యసించా లనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏకలవ్య, ఆదర్శ విద్యాలయాలు(మోడల్ స్కూల్‌లు) అందుబాటులో ఉన్నాయి. ఎంట్రన్స్ టెస్ట్‌లో మంచి ర్యాంకులు వస్తే వీటిలో చేరవచ్చు. సాధారణ ఇంటర్ చదువులతో పాటు వృత్తివిద్యా కోర్సులను కూడా ఇక్కడ బోధిస్తారు.
కేజీబీవీలు బాలికలకు వరం
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు విద్యార్థినులకు వరం లాంటివి అని చెప్పవచ్చు. ఈ కేజీబీవీల్లో ఇంటర్ విద్య కొనసాగుతోంది. ప్రవేశ పరీక్షలు లేకుండా పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులు వీటిలో చేరవచ్చు. ఎంపీసీ, బైపీసీ,సీఈసీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) వంటి కోర్సులు ఈ కేజీబీవీల్లో అందుబాటులో ఉంటాయి.
పదో తరగతి తర్వాత ఎన్నో కోర్సులు!
వీటితో వేల సంఖ్యలో కెరియర్లకు మార్గం సుగమం చేసుకోవచ్చు. ఎంపికలో మాత్రం గుంపులో గోవింద అని, అందరు అందులో చేరుతున్నారని, స్నేహితులు చెప్పారని, అమ్మానాన్నల ఆశయమని, అవకాశాలు మెండుగా ఉన్నాయని నిర్ణయానికి రాకూడదు. ఇవేవి మీకు సరైనవి కాకపోవచ్చు. వీటి ఎంపికలో మీ ముద్ర లేకోపోవడమే ఇందుకు కారణం. మీ దారి మహోన్నతం కావాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరే!.ఎవరి మార్గాన్ని వారు నిర్ణయించుకునే అవకాశం పదో తరగతి తర్వాత వస్తుంది. ఉన్న వాటిలో గమ్యాన్ని చేర్చేదాన్ని ఎంచుకోవడమే ప్రధానం. ఇందుకు స్వీయ సామర్థ్యాలే కొలమానం. ప్రతి విద్యార్థీ ఎవరికి వారే ప్రత్యేకం. అందువల్ల నైపుణ్యాలు, ఆసక్తులు గుర్తించి, సరైన కోర్సు ఎంచుకుంటే మేటి భవిష్యత్తు దిశగా మొదటి అడుగు పడినట్లే!
నిర్ణయం మీదే
మీ గురించి మీకంటే ఎక్కువగా మరెవరికీ తెలీదు. స్వీయ సమీక్షే కీలకం. ఇందుకోసం మీ సామర్థ్యం, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోండి. మీ బలహీనతలేమిటో గుర్తించి, వాటి ప్రకారం పది తర్వాత ఉన్న కోర్సుల జాబితాలో కొన్నింటిని వదిలేయండి. మిగిలినవాటిలో మీకు సరిపోయేది ఏదో ఎంచుకోవాలి. ఈ క్రమంలో సమగ్రత కొరవడకుండా చూసుకోండి. పది తర్వాత ఉన్న అన్ని కోర్సులు, మార్గాలపైనా అవగాహన పెంచుకోవాలి.
సరిపోయేవి ఎంచుకోవాలి
పది తరగతి పూర్తిచేసుకున్న వారికోసం ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమాలు,ఐటీఐ, వొకేషనల్ కోర్సులు,ఉద్యోగాలు, ప్రత్యేక డిప్లొమాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రాధాన్యం ఉన్నవే. అయితే మీకు సరిపోయేవి ఏవో మీరే గుర్తించాలి. ఉన్న వాటిలో ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల బాగా ఆలోచించి,విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవాలి.
సబ్జెక్టు రాదని మరో కోర్సు వద్దు
మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీ,సైన్స్‌పై ఆసక్తి లేక సీఈసీ ఇలా వేరే కోర్సులు తీసుకుంటే రాణించలేరు.ఎందుకంటే బైపీసీ తీసుకోవడానికి మ్యాథ్స్ రాకపోవడం కారణం కాకూడదు. సైన్స్ అంశాల్లో పట్టు లేదు, అందుకే ఆర్ట్స్ కోర్సుల్లో చేరాలని నిర్ణయించుకోవద్దు. ఏఅంశాల్లో ప్రావీణ్యం ఉందో గుర్తించి,సంబంధిత కోర్సులు ఎంచుకోవాలి. ఒక సబ్జెక్టులో ఆసక్తి, ప్రావీణ్యం లేదనే కారణంతో ఇంకో కోర్సు ఎంచుకోవద్దు. అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయానికి రావాలి.
ఎవరికోసం కోర్సులు వద్దు
చదువులో రాణించలేని ఎక్కువమంది విద్యార్థులు చెప్పే ప్రధాన కారణం ఫలానా వాళ్ల ఒత్తిడితో ఇష్టం లేకుండా ఈకోర్సులో చేరి నష్టపోయానని అంటారు. అందువల్ల తెలిసినవాళ్లు, బంధువులు సూచించారనో,స్నేహితులతో కలిసి ఉండొచ్చనో, ఎక్కవ డబ్బులు సంపాదించవచ్చనో, సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చనో, ఎక్కువ మంది చేరుతు న్నారనో ఇలాంటి కారణాలతో కోర్సు, గ్రూపులను ఎంచుకోవద్దు. చేరిన కోర్సులో రాణించాల్సిన బాధ్యత మీదేనని మర్చిపోవద్దు. అందుకే ఎవరి భవిష్యత్తుని వాళ్లే నిర్ణయించుకుని కెరియర్ సౌధాన్ని నిర్మించుకోవాలి. పిల్లల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు వారికి సరిపోయే కోర్సులను ఎంపిక చేయాలి. వ్యక్తిగత ఆశయాలను రుద్దితే భవిష్యత్తులో ఇద్దరికీ సమస్యే. కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడితో అనుకోని పరిణామాలూ ఎదుర్కోవాల్సి రావచ్చు. పిల్లలపై వ్యక్తిగత ఆశయా లను రుద్దకూడదు. ఆసక్తి లేకుండా, తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే చదవాల్సి వస్తే వాళ్లు ఒత్తడికి గురవుతారు.
ఈ షార్ట్ టర్మ్‌కోర్సులు నేర్చుకుంటే సూపర్ బెనిఫిట్స్! :
సాంకేతిక నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ సేవలు కలయికగా రూపొం దించిన కోర్సు ఇది. హైదరా బాద్, విజయవాడ ల్లోని గవర్నమెంట్ డెంటల్ మెడికల్ ఎడ్యు¹ ¿షన్‌తో పాటు పలు ప్రైవేటు దంత వైద్య కాలేజీలు రెండేళ్ల కోర్సును అంది స్తున్నాయి. డెంటల్ ప్రోథెస్టిక్స్,అసిస్ట్ డెంటిస్ట్, ల్యాబ్ పరికరాల నిర్వహణ లాంటి నైపుణ్యాలను శిక్షణలో భాగంగా నేర్పుతారు. కోర్సు పూర్తి చేసిన వారికి డెంటల్ ల్యాబ్‌లు, క్లినిక్‌ల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇందులో అనుభవం గడించి, విద్యార్హత పెంచుకుంటే సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించవచ్చనని విద్యవేత్తలు సూచిస్తున్నారు.
ఆకర్షించే స్టాక్ ట్రేడింగ్
ప్రస్తుతం అనూహ్యంగా పెరుగుతూ, అందరినీ ఆకర్షిస్తున్న రంగం స్టాక్ మార్కెట్ అప్‌స్టాక్, జెరోదా,ఫైనాన్షియల్ ట్రేడింగ్ లాంటి కొత్తతరం ట్రేడింగ్ కంపెనీల రాకతో ఆన్‌లైన్‌లో స్టాక్స్ కొనడం,అమ్మడం, పెట్టుబడి పెట్టడం ఈజీ అయిపోయింది. నేటి ట్రెండ్‌కు తగినట్లుగా యువతరానికి ట్రేడింగ్ ప్రాథమిక అంశాలు, ఫైనాన్షియల్ ప్లానింగ్, పెట్టుబడుల విశ్లేషణ నేర్పే కోర్సులు అందుబాటులో వచ్చాయి. (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మార్కెట్ (ఎనఐఎఫఎం) సంస్థతో పాటు యుడెమీ, జెరోదా వర్సిటీ లాంటి ఆన్‌లైన్ వేదికల్లోనూ స్వల్పకాల సర్టిఫికేట్ కోర్సులున్నాయి.స్టాక్ ట్రేడింగ్‌లో ప్రాథమిక అంశాల నుంచి నష్టభయం నియం త్రణ, పోర్ట్‌ఫోలియో నిర్మాణం వరకు అన్ని అంశాలు నేర్పుతారు. ఈ నైపుణ్యాలతో ఫైనాన్స్ సంస్థల్లో ఎంట్రీలెవల్ ఉద్యోగాలను అందుకోవచ్చు లేదా సొంత అవకాశాలను సృష్టించుకోవచ్చనని కెరియర్ కౌన్సెలర్లు చెబుతున్నారు.
దూసుకొస్తున్న గిగ్ ఉద్యోగాలు
నేటి యువతరాన్ని గిగ్ రంగం అమితంగా ఆకట్టుకుంటూ మంచి అవకాశాలు చూపుతోందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి టాస్క్ బేస్డ్? ఉద్యోగాలు (నిర్ణీత పని ఆధారితం). అమెజాన్ ప్లెక్స్, స్విగ్గీ, అర్బన్ కంపెనీ లాంటివన్నీ గృహోపకరణాలు, అలంకరణ సేవలు, డ్రైవింగ్, సరకు డెలివరీ, ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మత్తులో నైపుణ్యం ఉన్నవారిపైనే ఆధారపడతాయి. ఈ రంగాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి ప్రోత్సహిస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASఖ) ఉచితంగా స్వల్పకాల శిక్షణ ఇస్తున్నాయి. ప్రాథమిక ఐటీ సేవలు, మొబైల్ ఫోన్ రీపేర్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి కోర్సులు నేర్పిస్తూ గిగ్ రంగానికి పనికొచ్చేలా మారుస్తున్నాయి.

నీరు.. సమానత్వానికి ప్రవహించే దారి

తెల్లవారుజామున నాలుగు గంటలు. ఇంకా చీకటి వీడలేదు. ఒక మారుమÖల గిరిజన గ్రామంలో ఆమె నిద్ర లేచింది.ఆమె మొదటి పని- కిలో మీటర్ల దూరంలో ఉన్న నీటి బావికి పయనం. తలపై కుండ, చేతిలో పిల్లవాడు. ఈ చిత్రం భారత దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మహిళల దైనందిన జీవితం అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల మంది ప్రజలకు ఇంటి ఆవరణలో తాగునీరు అందుబాటులో లేదు. ఈ పరిస్థితిలో మÖ డింట రెండు వంతుల కుటుంబాల్లో నీటి సేకరణ బాధ్యత మహిళలదే. 53 దేశాల్లోని గణాంకాలు చెప్పేదేమిటంటే-మహిళలు, బాలికలు అందరూ కలిసి ప్రతిరోజూ నీటి కోసం కేటాయించే గంటలను లెక్కిస్తే.. 25కోట్ల గంటలు కేటాయిస్తున్నట్లు తేలింది. ఇది పురుషులు, బాలురు కేటాయించే సమయం కంటే మÖడు రెట్లు ఎక్కువ. ఇన్నేళ్ల ప్రపంచాభివృద్ధిలో నేటికీ తాగునీటికి కటకటలాడే పరిస్థితి. ఇప్పుడు వేసవి కాలం.. ఈ సమస్య మరింత జఠిలంగా మారుతుంది. మంచినీటి సమస్యఅనేది మహిళల వెత లు, అసమానతలకు అద్దంపడుతోంది.నీటి కోసం మహిళలు పడే ఈవెతలు వారిని అనేక రకాల అసమానతలకు గురిచేస్తున్నాయి.అందులో విద్యాపరమైన అసమానత ఒకటి. నీటి కోసం గంటల కొద్దీ ప్రయాణించాల్సి రావడంతో బాలికలు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలకు వెళ్లాల్సిన వాళ్ల రోజంతా నీటి వెతుకులాటలోనే గడిచిపోతోంది. ఆరోగ్యపరమైన ప్రభావం రెండోది. నీటి భారాన్ని మోస్తూ కిలోమీటర్లు నడవడం వల్ల వెన్నునొప్పి, గర్భసంబంధ సమస్యలు, ఇతర శారీరక సమస్యలు మహిళలను వెంటాడుతున్నాయి. అంతేకాదు, కలుషిత నీటి వల్ల ప్రతిరోజూ ఐదేళ్ల లోపు 1,000 మంది పిల్లలు మరణిస్తున్నారు. శరీరానికి అవసరమైనంత నీటిని తాగకపోవడం వల్ల మరెన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.-` శాంతిశ్రీ

ఉన్నత విద్యకు దూరమౌతున్నదళిత,బహుజన విద్యార్థులు

2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా వివిధ యÖనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలలో పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయ అర్హత పరీక్ష (నెట్) నిర్వహించాలనడం యÖనివ ర్సిటీల స్వయం ప్రతిపత్తిని ధ్వంసం చేయడమే. ఆయా వర్శిటీలు సొం తంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష స్థానంలో నెట్‌ను నిర్వహిం చాలంటూ దళిత, బహుజన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కులోన్మాద కుట్రలను విద్యార్థి లోకం తిప్పి కొట్టాలి.- (ఎం.వి.బాబు)
మార్చి 13వతేదీన న్యూఢిల్లీలో యÖని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ యÖనివర్సి టీలు సొంతంగా నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష స్థానంలో జాతీయస్థాయిలో ఏక పరీక్ష (నెట్) ను ప్రవేశపెట్టారు. ఈ నూతన పరీక్ష విధా నంలో నెట్‌ను మÖడు కేటగిరీలుగా విభజించారు. అందు లోని 1వకేటగిరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెం ట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత ఇచ్చారు. 2వ కేటగిరిలో ఫెలోషిప్ ఇవ్వకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికే అర్హత ఇచ్చారు. ఇక 3వ కేటగిరిలో ఫెలోషిప్ గాని, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత ఇవ్వకుండా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు మాత్రమే అర్హత ఇచ్చారు. దాన్ని కూడా ఏడాదికే పరిమితం చేశారు. నెట్ పరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండటంతో దక్షిణ భారతదేశ విద్యార్థులు పరీక్షల్లో అధిక మార్కులు సాధించలేరు. దీంతో కేటగిరి-1లో వీరు ఫెలోషిప్ పొందలేరు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కూడా కోల్పోతారు. వివిధ యÖనివర్సిటీల్లో ఏటా పీహెచ్‌డీ ఖాళీలు భర్తీ చేసేందుకు తప్పనిసరి గా పరీక్షలు నిర్వహించాలనే విధానం లేకపోవడం వల్ల యÖజీ నెట్‌లోని 3వ కేటగిరి సాధించినప్ప టికీ విద్యార్థులు ఏడాది కాల పరిమితి నిబంధన వల్ల కనీసం అడ్మిషన్ కూడా పొందలేని పరిస్థితి ఏర్పడనున్నది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు,రాష్ట్ర భాషలు, మాతృభాషలలో చదువుకున్న విద్యార్థులు, పేద, దళిత, బహుజన విద్యార్థులు పట్టణాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో ఇంగ్లీష్ భాషలో చదివే విద్యార్థులకు పోటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడు తున్నది. అనేక కష్టనష్టాలు, అణచివేతకు, అవమా నాలకు గురై పీజీ వరకు చదువుకున్న దళిత, బహుజన విద్యార్థులు ఈనిర్ణయంతో ఉన్నత విద్యా సంస్థల నుంచి గెంటివేయబడుతారనేది నూటికి నూరుపాళ్లు వాస్తవం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బహిర్గతం చేసిన యÖజీసీ సంస్థ విద్యార్థుల ఆందోళనలను ఎలక్షన్ కోడ్ పేరుతో అణచివేసే ఉద్దేశంతోనే చేసింది. కొత్త విద్యా విధానం-2020 అమలులో భాగం గానే ఈ ఏకపరీక్ష విధానాన్ని ప్రవేశపెడుతున్నా మని ఈసందర్భంగా ప్రకటించిన యÖజీసీ తొందరలోనే తన అస్తిత్వాన్ని కోల్పోయి రద్దయ్యే పరిస్థితి కూడా ఉన్నది. కొత్త విద్యా విధానంలోనే యÖజీసీని రద్దు చేయాలని, ఆస్థానంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచఈసీఐ) ఏర్పాటు చేయాలని ఉంది.గత కొన్నేండ్లుగా ఎంతో మంది పేదవిద్యార్థులకు ఉపకార వేతనాలు అందించిన యÖజీసీని కూడా కనుమరుగు చేసే పరిస్థితి నేడు నెలకొన్నది.ఈ దేశ పాలకులు అనుస రించిన విధానాలతో ఇప్పటికే భారత విద్యా విధా నంలో కొందరికే విద్య అనే పరిస్థితికి నెట్టివేయ బడింది. విద్య కాషాsTÖకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణతో పూర్తి కేంద్రీకరణకు పూను కున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ పదేండ్ల కాలంలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. ఏక పరీక్ష విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోరాడేందుకు విద్యార్థులు ముందుకురావాలి.పీజీపూర్తి చేసి ఎంఫిల్, పీహెచ్ ఎ ప్రవేశాలు పొందిన మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక వెసులుబాటులేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈఆటంకాన్ని తొలగించడానికి 2009 లో అప్పటి యÖపీఏ ప్రభుత్వం ‘మౌలానా అబుల్ కలాంఆజాద్ జాతీయ ఫెలోషిప్ణపేరిట ఉపకార వేతనాలను ప్రవేశ పెట్టింది. వీటితో లబ్ధిపొందు తున్నవారు ఇతర ఉపకార వేతనాలు కూడాఅందు కుంటున్నారనే నెపంతో మోదీ ప్రభుత్వంవీటిని ఈ మధ్య రద్దు చేసేసింది. దేశానికి తొలివిద్యా శాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముస్లిం కావడం, అల్పసంఖ్యాక వర్గాలలో సహజంగా ముస్లింలే అధికంగా ఉంటారు కనకే మోదీ ప్రభుత్వం వీటిని రద్దు చేసినట్టుకనిపిస్తోంది.దేశ జనాభాలో 14. 2శాతం మంది ముస్లింలు ఉంటే,కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చేరే ముస్లిం విద్యార్థులు 5.5శాతం మాత్రమే ఉన్నారు.దేశజనాభా లో 16.5శాతం ఉన్న షెడ్యూల్డ్ కులాల వారిలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారు 14.7శాతం ఉన్నారు. 2019లో ఉన్నత విద్య గురించి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
అదే కారణమా?..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం2018-19లో మౌలానా ఆజాద్ పేరిట నెలకొల్పిన ఉపకార వేత నాలలో1000మంది వినియోగించుకుంటే అందు లో 733 మంది ముస్లింలే కావడం సహజంగానే మోదీ సర్కారుకు అభ్యంతరకరమై ఉండొచ్చు.ఈ ఉపకార వేతనాలను రద్దు చేసినందుకు విద్యా సంస్థల లోపల,వెలుపల తీవ్ర నిరసన వ్యక్తం అవు తోంది. ప్రభుత్వ నిర్ణయం అల్పసంఖ్యాక వర్గాల, ముఖ్యంగా ముస్లింల విద్యావకాశాలను దెబ్బ తీయడానికేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పని గట్టుకుని బీజేపీ ప్రభుత్వం ఈనిర్ణయం తీసు కుందని నిర్ధారణకు రావడానికి ప్రత్యేక పరిశోధన అనవసరం.12వ తేదీన వందలాది మంది విద్యా ర్థులు దిల్లీలో నిరసనకు దిగారు. పోలీసులు వారం దరినీ స్టేషను తీసుకెళ్లి కొన్ని గంటల తరవాత వదిలేశారు. రాజ్య సభలో కాంగ్రెస్ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, బహుజన సమాజ్ పార్టీకి చెందిన డానీష్ అలీ, మజ్లిస్కు చెందిన ఇంతియాజ్ జలీల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అల్పసంఖ్యాక వర్గాలవారి వెనుకబాటు తనాన్ని రూపుమాపడానికి 2005లో అప్పటి యÖపీఏ ప్రభుత్వం దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమÖర్తిగా పనిచేసిన రాజీందర్ సచార్ నేతృత్వంలో ఓకమిటీ ఏర్పాటు చేసింది.ఈ కమిటీ 2006లో సమర్పించిన నివేదికలో ముస్లింలు సామాజికంగా,విద్యాపరంగా, ఆర్థికంగా ఇతర మతాలవారితో పోలిస్తే బాగా వెనుకబడి ఉన్నారని తేలింది. కొందరు ముస్లింల పరిస్థితి దళితుల కన్నా హీనంగా ఉందని సచార్ కమిటీ పేర్కొంది. మైనారిటీల పరిస్థితి అధ్వానం 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 20 యేండ్లకు పైబడినవారిలో ఏడు శాతం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ముస్లింలలో నాలుగు శాతం మాత్రమే ఉన్నారని సచార్ కమిటీ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అవకాశాలు తక్కువగా ఉన్న ఇతర వర్గాలవారితో పోల్చి చూసినా ముస్లింల పరిస్థితి అధ్వానంగా ఉందనివివరించింది.ఆ కమి టీ సిఫారసుల పర్యవసానంగానే మౌలానా ఆజాద్ జాతీయ ఉపకార వేతనాల పథకం అమలులోకి వచ్చింది.ఇది ముస్లింలకేకాక అల్పసంఖ్యాక మతా లవారందరికీ వర్తిస్తుంది. మైనారిటీ విద్యార్థులు ఒకటికన్నా ఎక్కువ ఉపకార వేతనాలు అందు కుంటున్నందున మౌలానా ఆజాద్ పథకాన్ని రద్దు చేస్తున్నామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటిం చారు.విద్యార్థులకు వివిధ పథకాల కింద ప్రయో జనం పొందే అవకాశంఉన్నా ఒక ఉపకార వేత నం మాత్రమే అందిస్తున్నారు. మౌలానా ఆజాద్ పథకాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నది పీహెచఎ పరిశోధక విద్యార్థులే. వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే, ఇది ప్రతిభ ఉన్నవారికే వర్తిస్తుంది. మౌలానా ఆజాద్‌పథకం రద్దు చేశారు గనక ఇతర మైనారిటీ వర్గాలవారు పరిశోధనలు కొనసాగించే అవకాశం మందగిస్తుంది.
పరిశోధన మీద ఆసక్తి ఉన్నవారికి ఉపకార వేతనాలు అందితే ఉద్యోగావ కాశాలను కూడా వదులుకుని ఉన్నత విద్య కొనసా గించగలుగు తారు.లేకపోతే ఉన్నత విద్య కొన సాగించ గలుగుతారు. లేకపోతే ఉన్నత విద్య ఆర్థిక స్థోమత ఉన్నవారికే పరిమితం అవుతుంది. క్రమక్రమంగా అమలు చేసిమౌలానా ఆజాద్ పథకం రద్దుచేయక ముందుకూడా యÖజీసీ ఈ పథకం కింద దరఖా స్తులు ఆహ్వానించడాన్ని తగ్గించింది.ఈ పథకం కింద ఆఖరుసారి దరఖా స్తులు ఆహ్వానించింది 2018లోనే. 2020 మార్చి లోక్సభలో ప్రశ్న అడిగితే అప్పటి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖార్ అబ్బాస్ నఖ్వీ ‘మార్గదర్శకాలు ఖరారు చేస్తున్నాం్ణఅని చెప్పి తప్పించుకున్నారు.‘జాతినిర్మాణం్ణ ‘జాతీయ భద్రత్ణ పేర పౌరసత్వ సవరణచట్టం (సీఏఏ) లాంటి వాటి ద్వారా ఇదివరకే ముస్లింలను అణగదొక్కడం కొనసాగుతూనే ఉంది. విద్యారంగంలో, ముఖ్యం గా ఉన్నత విద్యారంగంలో అనేక కారణాలతో ముస్లింలు ఇప్పటికే షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల వారికన్నా ఎక్కువగా వెనుకబడి పోయారు. అలాంటప్పుడు ఉన్న పథకాలను కూడా రద్దు చేస్తుంటే ముస్లిం వెనుకబాటుతనం మరింత పెరు గక తప్పదు.2.76శాతం మంది ముస్లింలే ఉన్నత విద్యఅభ్యసించగలుగుతున్నారు. ఇప్పటికే పరాయి వారుగా మారిపోయిన వారిని మిగతా సమాజా నికి మరింత దూరంచేసే కుట్ర జరగడం దురదృష్ట కరం.
సంక్షోభంలో వసతి గృహాలు
‘సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం, శిధిలావస్థలో ఉన్న భవనాలు అనేక చోట్ల దర్శన మిచ్చాయి. సిబ్బంది లేకపోవడంతో అధ్యా పకులే అన్ని పనులు చేయాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే 30 రూపాయలలో గ్యాస్, మ్యాన్ పవర్ కోసం 8 రూపాయలు ఖర్చవుతున్నాయి. మిగిలిన 22 రూపాయలతో టిఫిన్,లంచ్,స్నాక్స్, డిన్నర్, రెండు సార్లు టీ,వారానికి రెండుసార్లు నాన్ వెజ్,ఐదు రోజులు ఎగ్ ఇవ్వాలి.ఇది సాధ్యం కాక నిర్వాహకులు తక్కువ రేటు ఉన్న కూరగాయలతో చేసిన కూరలు,నీళ్లపప్పు,పురుగుల అన్నం పెడుతు న్నారు.పరిశుభ్రత లేనికిచెన్,రాత్రి మిగిలిన పదా ర్థాలు పొద్దున వాడుతున్నారు.
ఇప్పటికైనా ప్రభు త్వం సంక్షేమహాస్టళ్లలో సమÖల మార్పులు చేయాలి.్ణ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఆర్థిక వెనుకబాటు కారణంగా విద్యకు దూరం కాకూడదనే ఉన్నత ఆలోచనతో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు నిర్లక్ష్యానికి గురవు తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వాటిని నరకకూ పాలుగా మారుస్తోంది. గ్రామీణ విద్యార్థుల బంగా రు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన సాంఘిక సంక్షేమ,గిరిజన సంక్షేమ, గురుకుల, మైనా రిటీ వసతి గృహాలు సంక్షేమానికి దూరమై సంక్షో భంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనం. స్వరా ష్ట్రంలో విద్యా రంగానికి పెద్దపీట వేస్తారని కేజీ నుంచి పీజీ వరకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తారని తెలంగాణ సమాజం ఆశించినా అది కార్యరూపం దాల్చకపోగా, మరింత నిర్వీర్య మైంది. పాఠశాల నుంచి యÖనివర్సిటీ స్థాయి వరకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందక, కనీస మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వసతిగృహలకు ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడం, వార్డెన్, వంట మనుషులు,ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టక పోవడం,సరైన సమయంలో దుప్పట్లు,బట్టలు ఇతర వస్తువులు అందించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
హామీని విస్మరించి..
కేజీ టూ పీజీ మిషన్లో భాగంగా దళిత, గిరిజన, బహుజన విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించడానికి గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటనలు గుప్పించారు. ప్రచార అర్బాటాలతో గురుకులాల ఏర్పాటు చేశారు. వాటి అభివృద్ధిని మాత్రం అటకెక్కించారు. సరిపడా నిధులను కేటాయించలేదు. పక్కా భవనాలు నిర్మిం చలేదు. ఖాయిలా పడిన ఇంజనీరింగ్ కళాశాలు, ఇతర కళాశాల భవనాలను కోట్ల రూపాయలతో అద్దెకు తీసుకుని గురుకులాలను నడిపిస్తున్నారు. హైదరాబాద్ మహా నగరంలో సరూర్ నగర్, ఇతర అనేక ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో నిర్వహి స్తున్నారంటే పరిస్థితి గురుకులాలు ఎలా ఉందో అవగతమవు తుంది.అద్దెచెల్లింపులలోనూ ఎలాంటి ప్రామాణికత, నియమ నిబంధనలు లేకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేమి, సిబ్బంది తప్పిదాలు, నాణ్యతలేని, గడువు ముగిసిన సరుకులతో తయారు చేసిన ఆహారం విషపూరితం కావడం వంటి ఘట నలు జరిగి విద్యా ర్థులు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులలో చేరుతు న్నారు. అయినా ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించడం లేదు.
ఇప్పటికీ దొడ్డు బియ్యమే..
వసతిగృహాలతో పాటు,పాఠశాల మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి మనువడు తినే భోజనానికి సమంగా హాస్టల్ విద్యార్థుల భోజనం ఉంటుందని ఊకదంపుడుఉపన్యాసలిచ్చారు. కొద్ది రోజులే సన్న బియ్యం పంపించి, తరువాత పురుగులతో కూడినముక్క పట్టిన దొడ్డు బియ్యమే సరఫరా చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆదిలాబాద్ సరూర్నగర్,సిదిపేట,వరంగల్. నిర్మల్,గద్వాల సహా పలు జిల్లాలలో కలుషిత నీరు తాగలేమని,పురుగులతో కూడిన భోజనం తినలే మని బాలికలు రోదిస్తూ రోడ్లపైకి వచ్చారు. జగి త్యాల, సిద్ధిపేట, భూపాలపల్లి సహా పలు హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.గౌలిదొడ్డి గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, బాసర ట్రిపుల్ ఐటీ సహా పలు వసతిగృహాల భవనాల పెచ్చులూడి విద్యార్థు లకు గాయాలవ్వడం, ఉస్మానియా యÖనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ కిచెన్లో పాము కాటుతో సిబ్బంది మృతి చెందడం, ఆలేరు మైనారిటీ హాస్టల్లో విద్యార్థి నులపై లైంగిక వేధింపులు ఇలా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. హాస్టల్స్ అంటేనే విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందే పరిస్థితి దాపురించింది.
ఎందుకీ నిర్లక్ష్యం?…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2,500 గురుకుల సంక్షేమ వసతి గృహాలలో ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న పేద విద్యార్థుల విషయంలో ప్రభు త్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందనేది అంతు చిక్కనిప్రశ్న.ఈ నేపథ్యంలో ఏబీవీపీ బృం దం వసతిగృహాల సందర్శించింది. సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం,శిధిలావస్థలో ఉన్న భవనాలు అనేకచోట్ల దర్శనమిచ్చాయి. సిబ్బంది లేకపోవడంతో అధ్యాపకులే అన్ని పనులు చేయాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే 30రూపా యలలో గ్యాస్, మ్యాన్ పవర్ కోసం 8 రూపాయలు ఖర్చవుతున్నాయి.మిగిలిన 22 రూపాయలతో టిఫిన్,లంచ్,స్నాక్స్, డిన్నర్, రెండు సార్లు టీ,వారానికి రెండుసార్లు నాన్ వెజ్, ఐదు రోజులుఎగ్ ఇవ్వాలి. ఇది సాధ్యం కాక నిర్వాహ కులు తక్కువ రేటు ఉన్న కూరగాయలతో చేసిన కూరలు, నీళ్ల పప్పు, పురుగుల అన్నం పెడుతు న్నారు. పరిశుభ్రత లేని కిచెన్, రాత్రి మిగిలిన పదార్థాలు పొద్దున వాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సమÖల మార్పులు చేయాలి. ఖాళీగా ఉన్న సిబ్బంది నియా మకాలు చేపట్టాలి. తగిన వసతుల కోసం సరిపడా నిధులు కేటాయించాలి.శానిటరీ అధికారులు నిత్యం పర్య వేక్షించాలి.పక్కా భవనాలు నిర్మించాలి.మెస్ చార్జీలు పెంచాలి.
`(వ్యాసకర్త: పీడీఎసఎఫ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు)

వాతావరణ మార్పులు బియ్యాన్ని విషపూరితంగా మారుస్తున్నాయా?

విశ్వవ్యాప్తంగా వరి వందల కోట్ల మంది ప్రజలకు నిత్యం కడుపునింపే అమృతం.ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్ని చిరుతిళ్లు ఇతర చల్లని పానీయాలు తాగినా కాస్తంత వరి అన్నంతో భోజనం చేస్తేనే కడుపు నిండిన సంతృప్తికర భావన కలుగుతుంది.జీవకోటి ప్రాణాలు నిలుపు తున్న వరిలో ఇప్పుడు అత్యంత విషపూరిత ఆర్సెనిక్ మÖలకం స్థాయిలు ఎక్కువ అవుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి. ఈ చేదు నిజాన్ని ఓఅధ్యయాన సంస్థ బయటపెట్టింది.యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు,అడవుల దహనం,శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి.
ఇప్పడీ వాతావరణ మార్పుల విషపరిణామాలు వరిపంటలపై పడుతున్నాయని స్పష్టం చేసింది. వాతా వరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి,కార్బన్‌డయాక్సైడ్,కర్బన్ ఉద్గారాల స్థాయిలు పెరగడంతో వాటికారణంగా పొల్లాల్లో మట్టి,నీటి నుంచి ఆర్సెనిక్ మÖలకం అత్యధికంగా వరిధాన్యంలోకి చేరుతున్నాయని పేర్కోంది. విషాల రారాజుగా పేరొందిన ఆర్సెనిక్ పాళ్లు వరిలో పెరిగితే ఆరోగ్యంపై దాని దురష్పభావాలు దారుణంగా ఉంటాయి. ఆర్సెనిక్‌స్థాయి పెరిగిన వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటే చర్మ,ఊపరితిత్తుల సంబంధిత క్యాన్సర్లతోపాటు ఎన్నో రకాల తీవ్ర ఆరోగ్య సమస్యలు మనిషిని చుట్టుముట్టడం ఖాయమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.మానవ శరీరంలో రక్తసరఫరా,రోగ నిరోధక వ్యవస్థలు,కాలేయం,మÖత్రపిండాలు, మÖత్రాశయం,చర్మం,ప్రొస్టేట్ గ్రంథి వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
హృద్రోగ సమస్యలతోపాటు మధుమేహవ్యాధి ప్రబలే ప్రమాదముంది. గర్భిణీల్లో పిండం సరిగా ఎదగక పోవడం,అకాలమరణాలు సంభవించే ముప్పు ఉంది.వాతావరణమార్పుల కారణంగా వాతావరణంలోని వెలు వడుతున్న అధిక కర్బన్ ఉద్గారాలు,ఉష్ణోగ్రతల పెరుగుదలతో అమృతాహారం కాస్తా విషాహారంగా మారుతున్న వైనాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం చేసిన ఈఅధ్యయనం ఫలితాలు ‘లాన్సెట్ ప్లానిటరీ హెల్త’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.బియ్యంలో ఆర్సెనిక్ విషపూరితత ఒక సాధారణ సమస్య.ఇది శిశువులక,పెద్దలకు కూడా హానికరం.ఆర్సెనిక్ అనేది ఒక విషపూరిత రసాయన మÖలకం,ఇది సహజంగా మట్టినీటిలో ఉంటుంది.బియ్యంసాగులో ఈ ఆర్సెనిక్ మట్టినీటి నుండి గ్రహించబడుతుంది, ఫలితంగా బియ్యం విషపూరితం అవుతుంది.ఈఆర్సెనిక్ యొక్క అధిక స్థాయిలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు, ముఖ్యంగా క్యాన్సర్ మరియు గుండెవ్యాధులకు దారితీసి ఆరోగ్య ప్రభావాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ సమస్య కొత్తది కాదు, కానీ వాతావరణమార్పులు ఎంతగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయో అది కష్టంగా కనిపించే కోణాల్లో కూడా ఉండొచ్చని ఈఅధ్యయనం మళ్ళీ గుర్తుచేస్తుంది.అంతర్జాతీయ ఆహార భద్రత సంస్థలు ఇప్పటికీ బియ్యంలో ఆర్సెనిక్ పరిమితులపై కఠినమైన నిబంధనలు విధించలేదు.ఉదాహరణకు, అమెరికాలోని ఖీణA (ఖీశీశీd aఅd ణతీuస్త్ర Adఎఱఅఱstతీatఱశీఅ) బియ్యం మరియు బియ్యం-ఆధారిత ఆహారాలలో ఆర్సెనిక్ స్థాయిల కోసం బలవంతపు ప్రమాణాలు ఇంకా విధించలేదు.తక్కువ ఆర్సెనిక్‌ను శోషించే కొత్త బియ్యపు రకాల అభివృద్ధి,సాగు పద్ధతుల మార్పు ద్వారా ఆర్సెనిక్ తగ్గించడం,ఆరోగ్యవంతమైన వంట విధానాలు మరియు ఇతర ధాన్యాల వినియోగంపై ప్రజల అవగాహన పెంపొందించాలని పరిశోధకుల సూచిస్తున్నారు.
ఆర్సెనిక్‌కు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి.వాటిలో క్యాన్సర్,గుండెజబ్బులు మరియు నరాల నష్టాలు (న్యూరాలాజికల్ డ్యామేజ్) ఉంటాయి.గ్లోబల్ ఉష్ణోగ్రతలు మరియు కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగేకొద్దీ,బియ్యంలో ఆర్సెనిక్ కూడా పెరగవచ్చు, ఇది ముఖ్యంగా ఆసియా దేశాలలో ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉంది.ది లాన్సెట్ ప్లానటరీ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం..వాతావరణ మార్పుల కారణంగా బియ్యం విషపూరితమవుతోంది.కాగా,ఆసియాలో బియ్యం ఎక్కువగా తినే ఏడువ దేశాలలో (భారతదేశం,బంగ్లాదేశ్,చైనా,వియత్నాం,ఇండోనేషియా,మయన్మార్,ఫిలిప్పీన్స్) వ్యక్తి ప్రతి రోజు బియ్యం వినియోగ డేటాను ఉపయోగించి,భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య ప్రమాదాలను అంచనా వేశారు.ఇలాంటి ప్రమాద ఘటికల నుంచి విముక్తి చెందాలంటే అంతర్జాతీయంగా దూసుకువస్తున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా వ్యవహరించి పర్యవరణ పరిరక్షణకు తోడ్పడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్,

నిర్జీవమవుతున్న కుటుంబ వ్యవస్థ

సామాజిక వ్యవస్థగా కుటుంబాల పాత్ర అత్యంత ప్రధానమైనది.మానవుల ప్రాథమిక అవసరాలను తీర్చ డంతో పాటుగా, సమస్యల్లో వ్యక్తులకు కుటుంబం అండగా ఉంటూ వారి అభివృద్ధికి చోదక శక్తిగా పని చేస్తోంది. ప్రాథమిక సామాజీకరణ ఏజెంట్గా సమాజ కట్టుబాట్లకు అనుగుణంగా మానవుడి సామాజిక, సాంస్కృతిక జీవన విధానాన్ని కుటుంబాలు ప్రభావితం చేస్తాయి. కరోనా విపత్తు మానవుని మనుగడలో కుటుం బాల పాత్ర ఎంతటి కీలకమైనదో మరొక్కసారి స్పష్టంగా సమాజానికి అర్థం అయ్యేలా చేసింది.కానీ, కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా కుటుంబ వ్యవస్థ క్రమంగా తన పటు త్వాన్ని కోల్పోతుంది. పాశ్చాత్య ధోరణుల ప్రభావం సమాజం మీద తీవ్రంగా పడింది.అది కుటుంబ వ్య వస్థలో మార్పులకు కూడా కారణమైంది. మొదట కేవలం నగరాలకే పరిమితమైన విచ్ఛిన్న కుటుంబాలు నేడు గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు సైతం విస్తరిం చాయి. ఇందుకు జీవన విధానంలో వస్తున్న మార్పులు ప్రధాన కారణం.

ఉమ్మడి కుటుంబాల్లో ప్రేమానురాగాలు
కుటుంబ సంబంధాలు ‘మేం, మా అనే భావన నుంచి నేను,నాఅనే భావనకు’ వచ్చాయి.గతంలో ఉమ్మడి కుటుంబాలలో కనిపించినసాన్నిహిత్యం, ప్రేమాను రాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయత ప్రస్తుత విచ్ఛిన్న కుటుంబాలలో కనబడటం లేదు. దీంతో కుటుంబ వ్యవస్థ క్రమంగా నిర్జీవమవుతున్నది. మానవ మను గడలో, మెరుగైన సమాజ నిర్మాణంలో కుటుంబాల పాత్రను గ్రహించిన ఐక్యరాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏటా మే15నఅంతర్జాతీయ కుటుంబాల దినోత్సవంగా జరుపుతోంది.
ఆధునిక సమాజంలో కుటుంబ సభ్యుల మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. వయో వృద్ధుల ఆత్మహత్యలు, ఆస్తి తగాదాలతో ర సంబంధీ కులపైనే దాడులు చేయడం, కన్న వారు చనిపోతే కనీసం ఖననం చేయడానికి కూడా రాకపోవడం, రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన పాఠశాల స్థాయి పిల్లల్లో మాదక ద్రవ్యాల వినియోగం వంటి ఘటనలు చూస్తూంటే ఆధునిక సమాజంలో కుటుంబ సభ్యుల మధ్య ఎంతటి అగాధం ఏర్పడిందో స్పష్టంగా అర్థం అవుతుంది.కారల్ మార్క్స్ మానవ సంబంధాల గురిం చి ప్రస్తావిస్తూ ‘మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే’ అన్నారు.
ఇవాళ ఆర్థికపరమైన అంశాలకు ఉన్న విలువ,మానవ సంబంధాలకు ఉన్నట్టు కనిపించడం లేదు.కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు అన్నీ ఆర్థికపరమైన అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇవి కుటుంబాలలో అశాంతికి,కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
వయోవృద్ధుల సంరక్షణ నైతిక బాధ్యత
ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్య లలో వయోవృద్ధుల సంక్షేమం అతి ప్రధాన సమస్యగా మారింది.ఇవాళ సమాజంలో వయోవృద్ధులు ఆనం దంగా జీవించే పరిస్థితులు కనిపించడం లేదు. వృద్ధా ప్యం సమీపిస్తున్న కొద్దీ మానవులలో మానసిక ఆందో ళనలు మొదలవుతున్నాయి. ఇందుకు కుటుంబ సభ్యు లు వయో వృద్ధులను భారంగా భావించడం ప్రధాన కారణం వయోవృద్ధుల సంరక్షణ కుటుంబ’ వ్యవస్థ నైతిక బాధ్యత, కానీ, నేడుకుటుంబాలు ఆ బాధ్యత నుంచి సులభంగా తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జీవితాంతం కుటుంబ అభివృద్ధి కోసం కష్టపడి చివరి దశలో కుటుంబాలతో కలిసి సంతోషంగా ఉందా మనుకుంటున్న వృద్ధులకు ఆ అవకాశమే ఇవ్వడం లేదు. వారి కనీస అవసరాలను కూడా తీర్చకుండా, ప్రతి చిన్న విషయానికి చీదరించుకోవడంతో వృద్ధులు తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. కొందరు వారి బాగోగులు చూసుకోలేమని వృద్ధాశ్ర మాలలో వదిలేస్తున్నారు.
ఇది వారిని మానసికంగా మరింతగా కుంగ దీస్తున్నది.ఇటువంటిపరిస్థితుల్లో కుటుంబాలకు తాము భారం అవుతున్నామని కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అమానవీయ ప్రవర్తనతో కుటుంబ వ్యవస్థ పతనమవుతున్నది. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు మాత్రమే మానవత్వం పరిఢవిల్లుతుంది. సమాజంలో అసాంఘిక, అమావీయ ఘటనలు తగ్గు తాయి.కాలానుగుణంగా అన్ని వ్యవస్థల్లో మార్పులు రావడం అనేది అనివార్యం. అయితే ఆమార్పు భవిష్య త్తులో ఆవ్యవస్థ బలోపేతానికి తోడ్పడేదిగా ఉండాలి తప్పితే నిర్వీర్యం చేసేదిగా ఉండకూడదు. దానిని ప్రతి ఒక్కర గ్రహించాల్సిన అవసరం ఉంది. కుటుంబం ఒక విశిష్ట సంస్థ.వివిధ పరిస్థితులు, సందర్భాఆలకు అనుగుణంగా అది వ్యక్తిగతమైందిగా లేదా ప్రజలకు సంబంధించిందిగా మారుతూ ఉంటుంది.వ్యక్తి జీవితంలో అధిక భాగం దీంతోనే గడుస్తుంది.అన్ని రకాల మానవ సమÖహాల్లో అతి ప్రధానమైన ప్రాథమిక సమÖహమే కుటుంబం. మానవ సామాజిక జీవితానికి పునాది ఈవ్యవస్థ. వివాహంలాగే కుటుంబ వ్యవస్థ విశ్వజనీన మైంది. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు. వ్యక్తి,సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సాంఘీక సమÖహం.ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు.కుటుంబం ఒక కేంద్ర బిందువు.దీన్ని చుట్టూనే మొత్తం జీవితం తిరుగుతూ ఉంటుంది.
వ్యక్తులు దినచర్యను కుటుంబ సభ్యులతో ప్రారంభిస్తారు.సమాజాల్లోని సాంస్కృతిక వైరుధ్యాల కారణంగా కుటుంబ సంబంధాలు కూడా వివిధ రూపాల్లో ఉన్నాయి.సాధారణంగా దంపతులు,వారి పిల్లలు కలసి జీవిస్తే దాన్ని కుటుంబంగా పిలుస్తుం టారు.ఆదిమ సమాజాల కుటుంబం కూడా ఇదే రకంగా ఉంటుంది.అయితే 19వశతాబ్దం తొలి రోజుల్లో ఆదిమ సమాజాల్లో కుటుంబవ్యవస్థ ఉందా అన్న చర్చ బలంగా వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికైనా సగటు మానవునిఆలోచనల్లో మార్పులు వచ్చి కుటుంబ ప్రాధాన్యతను, కుటుంబాల్లో తమ బాధ్యతను గుర్తించాలి. అప్పుడే నిర్జీవమవుతున్న కుటుంబ వ్యవస్థ తిరిగి జీవం పోసుకుంటుంది. లేక పోతే భవిష్యత్లో కుటుంబ వ్యవస్థ పూర్తిగా కనుమ రుగయ్యే ప్రమాదం ఉంది. అది మానవ జాతి మనుగ డకే ప్రమాదంగా మారుతుంది.
కుటుంబ వ్యవస్థ -పరివర్తన
మానవ సమాజంలో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ,సమాజ నిర్మాణంలో ఒక ప్రాథమిక యÖనిట్. మానవ సంబంధాల నిర్మాణం, పరస్పర ఆధారం,ప్రాథమిక,ద్వితీయ అవసరాలు తీర్చుకోవడం, తన అవసరాలు తీర్చుకోవడంతోపాటు ఇతరుల అవసరాలు తీరుస్తూ, ప్రేమ,వాత్సల్యం, తదానుభూతి వంటి మానసిక అవసరాలు,కూడు, గుడ్డ,విద్య,సామాజీకరణ వంటి భౌతిక,భౌతికేతర అవ సరాలు పరస్పరం నిర్ధారణ అయిన,అనుమతి పొం దిన విలువలు,కట్టుబాట్ల ద్వారా తీర్చుకోవడం అనేది కుటుంబ జీవనం నుంచి లేదా కుటుంబ వ్యవస్థ నుంచి ప్రారంభమవుతుంది. కుటుంబం శాశ్వతం, విశ్వవ్యాప్తం కానీ ఆయా సంస్కృతులను బట్టి కుటుంబ నిర్మాణం,విధులు వేర్వేరుగా ఉండవచ్చు. కానీ కుటుం బం అనే ప్రాథమిక సామాజిక సంస్థ సమాజంలో వచ్చిన మార్పులను బట్టి మార్పులకు లోనవుతుంది. ప్రస్తుతకాలంలో ఈ మార్పులు అనివార్యమయ్యాయి. అయితే కుటుంబ నిర్మాణంలో, ప్రకార్యాల్లో వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయి, వాటి రుణాత్మక, ధనాత్మక పర్యవసానాలు ఎలా ఉన్నాయి, ఆయా మార్పులకు దారితీసిన కారణాలు వంటి అనేక అంశాలపై అభ్య ర్థులు అవగాహన పెంచుకోవాలి.
ఆర్ధిక ప్రకార్యం : కుటుంబానికి సుఖాన్ని ఇచ్చేవి ఆస్తిపాస్తులు.పూర్వకాలంలో కుటుంబం తనకు కావాల్సిన వివిధ వస్తువులు ఉత్పత్తి చేసి వినియో గించుకునేది.భారతీయ సమిష్టి కుటుంబంలో వ్యక్తులంతా కలిసి పనిచేసి పరస్పర సహకారంతో ఆనందాన్ని పంచుకునేవారు.
ధార్మిక ప్రకార్యం : సభ్యులకు మత సంబంధమైన శిక్షణ కుటుంబం ఇస్తుంది.పెద్దల నుంచి పిల్లలు సద్గుణాలు నేర్చుకోవడానికి,మత సంబంధమైన శిక్షణ అవసరం.దైవారాధన,యజ్ఞయాగాదులు,మత ఉపదేశాలు మొదలైనవి పూర్వం ఎక్కువగా ఉడేవి.నేడు లౌకిక రాజ్యం కావడంతో వ్యక్తుల్లో మత భావాల గాఢత తగ్గింది.నాడు కుటుంబాల్లో ప్రార్ధనా సమావేశాలు నిత్యం సంప్రదాయంగా జరిగేవి.ప్రస్తు తం అవి చాలా వరకు తగ్గిపోయాయి.
విద్యా ప్రకార్యం : ఒకప్పుడు పిల్లలకు విద్యాబోధన కుటుంబాల్లోనే అధికంగా జరిగేది.పిల్లలకు వ్యక్తిగత శిక్షణ ఇచ్చే అవకాశం ఎక్కువగా తల్లికే ఉండేది.కానీ నేడు విద్యాసంస్థలను ప్రభుత్వం,ఇతర సంస్థలు ఏర్పాటు చేయడంతో ఈ బాధ్యత కుటుంబానికి చాలా వరకు తగ్గిపోయింది.నాటి వృత్తుల కులం మీద ఆధారపడటంతో వృత్తి శిక్షణ కుటుంబ సభ్యులకు అవసరమైయ్యేది.ఇప్పుడు ఆబాధ్యతను అనేక సాం స్కృతిక,వైజ్ఞానిక,విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి.
ఆరోగ్య ప్రకార్యం :పూర్వం ఆరోగ్య,వైద్య సంబంధమైన విధులను కుటుంబం నిర్వహించేది.సభ్యుల అనా రోగ్యం,ఇతర అస్వస్థతలను నివారించే బాధ్యత కుటుంబంపై ఉండేది.కానీ నేడు ఆస్పత్రులు,ఆరోగ్య సదుపాయాలు అధికం కావడంతో ఆ విధులను ఆయా సంస్థలు నిర్వహిస్తున్నాయి.అప్పట్లో సభ్యులకు వినోదావకాశాలను కుటుంబమే కల్పించేది.నేడు ఆవిధులను చలన చిత్రాలు,క్లబ్బులు,క్రీడా సంఘాలు మొదలైనవి నిర్వహిస్తున్నాయి.
నిర్వహణ:ప్రతి కుటుంబం కొంత ఆర్ధిక ఉపాధితో ఉంటుంది.కుటుంబంలో సభ్యులను పోషించడానికి భార్యభర్తలు కృషి చేస్తూ,వీలైన సౌకర్యాలు కల్పించి తమ సంతానాన్ని పెంచి పెద్ద చేస్తారు.
సంక్రమణ : తల్లిదండ్రుల అనంతరం వారి ఆర్ధిక, సామాజిక ీVAదా పిల్లలకు సంక్రమిస్తుంది. వారు తమ కుటుంబ స్థాయికి అనుగుణంగా సమాజంలో స్థానం పొందుతారు.
కుటుంబ వ్యవస్థ ప్రధాన లక్షణాలు
మానవజాతి క్రమాభివృద్ధిలో అన్ని దశల్లోనూ కుటుం బం ఉంటుంది.ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబానికి చెంది ఉంటాడు.పక్షలు,జంతువుల సమాజాల్లో కూడా కుటుంబాలు ఉన్నాయనేందుకు ఆధారాలున్నాయి. కుటుంబ సంస్తలో ప్రధాన లక్షణం స్త్రీ,పురుష సాంగత్యం. జీవిత భాగస్వాములైన భార్యబకర్తలిద్దరూ అనుబంధంతో జీవితకాలమంతా కలసి ఉండవచ్చు. లేదా కారణాంతరాల వల్ల పరిమిత కాలం వరకే దంపతులుగా ఉండవచ్చు.ప్రతి కుటుం బానికి గుర్తు పట్టడానికి వీలుగా దానికి ఒక పేరు ఉంటుంది.కలిగే సంతానానికి పేర్లు పెట్టడం కూడా ఒక పద్దతిని అనుసరించి జరుగుతుంది.పిల్లలకు పేర్లు పెట్టడంలో తల్లిదండ్రులు,మత,రాజకీయ నమ్మకాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వంశపారంపర్యాన్ని గణనలోకి తీసుకునే విషయంలో కూడా తేడాలు న్నాయి. కొన్నిచోట్ల మాతృవంశీయ విధానం ఉంటే, మరికొన్ని చోట్ల పితృవంశీయ విధానం ఉంటుంది.భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి కుటుంబానికి ఆర్ధిక వన రులంటాయి.భూవసతి, వ్యాపారం/ఉద్యోగం ఉం టాయి.ఆర్ధిక స్థితిగతుల్లో కుటుంబాల మధ్య తేడాలు ఉంటాయి. ప్రతి కుటుం బానికి విశ్రాంతి తీసుకోవ డానికి,నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి, పిల్లలు,పెద్దలు నివసించడానికి ఒక నివాసం అవసరం.మానవుడి భౌతికావసరాలు, సుఖాలు,కోరికలు లాంటివాటిపై కుటుంబం ఆధార పడి ఉంటుంది.స్త్రీ పురుషుల సంగమం,సంతానాన్ని పొందడం,ప్రేమతో పెంచడం, భార్యభర్తలు ప్రేమతో గడపడం,ఆర్ధిక,సామాజిక పరంగా రక్షణ కల్పించు కోవడం మొదలైనవన్నీ కుటుంబ వ్యవస్థలో ప్రధానం.వ్యక్తులను,వారి ప్రవర్తన లను కుటుంబం ప్రభావితం చేస్తుంది.నాగరిక సమాజసంస్థలన్నీంట్లో కుటుంబ పరిమాణంలో చిన్నది.కుటుంబం తన సభ్యులను వివిధదశల్లో నియంత్రిస్తుంది.ప్రవర్తన నేర్పుతుంది.పిల్లలను నియం త్రించడమే కాకుండా తల్లిదండ్రులను కూడా హద్దులో ఉంచుతుంది.తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే విధంగా చేస్తుంది.– (వి.శంకరరావు)

గడ్డు కాలం

పెరుగుతున్న నిత్యావసర ధరలతో రాష్ట్రప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఆదాయం పెరగడం లేదు కాని బియ్యం,నూనెలు,పప్పులు,కూరగాయలు ఇలా..అన్నింటి ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతుండటంతో జీతం సరిపోక..కుటుంబ బడ్జెట్ దాటిపోయి ఎలా సర్దుబాటు చేయాలో తెలియక మధ్యతరగతివారు,పేదలు సతమత మవుతున్నారు. వీటికి తోడు వైద్య ఖర్చులు విపరీతమై ఇబ్బంది పడుతు న్నారు.ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం అదుపులోకి తెచ్చామని ప్రకటనలు చేస్తున్నా మార్కెట్‌లో ఆపరిస్థితి కనపడటం లేదు.నిత్యావసరాల సరకుల ధరలు పెరగడమే తప్ప దిగి రావడం లేదు.అటు కంపెనీలు..ఇటు స్థానికంగా వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి.సీజన్‌ను బట్టీ ఆయా సరకులను కొందరు వ్యాపారులు క్షేత్రస్తాయిలో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.పైగా వ్యాపారులంతా ఒకేతాటిపై ఉంటుం డటంతో వారు చెప్పిన ధరలే అమలువుతున్నాయి. మార్కె ట్‌లో ధరల హెచ్చుతగ్గులపై జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రతి మÖడు నెలలకొమారు ధరల నియంత్రణ కమిటీ సమా వేశాలు జరపాల్సి ఉన్నా ఆ ఊసే మరిచారు.దీంతో వ్యాపా రులు ఆడిందే ఆటగా మారింది.
ఆచితూచి ఖర్చు..
ఎంత సాధారణ కుటుంబమైనా అద్దె ఇంట్లో పట్టణాల్లో నెలకుకే రూ.25వేల వరకు ఖర్చు వస్తుండగా..వైద్యం లాంటి అత్యవసరాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది.ఇటీవల కాలంలో జ్వరాలతో ఒక్కో కుటుంబానికి రూ.వేలలో ఖర్చవుతోంది.ఇక పిల్లల తినుబండారాలు,ఆహ్లాదం కోసం నెలకు ఓ సినిమాకు వెళ్లడం,నాన్‌వెజ్,ప్రయాణ ఖర్చులు లెక్కేస్తే మరో రూ.3నుంచి రూ.5వేల వరకు ఖర్చు వస్తుంది.దీంతో తమ బడ్జెట్‌కు ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా ఖర్చు పెడదామనుకున్నా సాధ్యం కావడం లేదు.
పెంపుతో భారమిలా..
గడిచిన ఏడాది కాలంగా అన్ని సరకుల ధరలు పెరిగి ప్రజలపై అదనపు భారం పడుతోంది.ముఖ్యంగా నూనెల ధరలు విపరీతమయ్యాయి.గృహ,వాణిజ్య అవసరాల కోసం ప్రతి నెల 3500మెట్రిక్ టన్నుల నూనె వినియోగం ఉంటుంది.వీటి కోసం వినియో గదారులు ఏడాది కిందట రూ.39కోట్లు వెచ్చించగా.. పెరిగిన ధరలకనుగుణంగా ప్రస్తుతం రూ.46`50 కోట్ల వరకు ఖర్చువుతోంది.కూరగాయల విషయంలో జిల్లాలో పంటల సాగు తగ్గింది.దిగుమతి భారం వల్ల ధరలు పెరిగి గతేడాదితో పోలిస్తే జిల్లా వాసులు రోజుకు రూ.2కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తోం ది.ఈనేపధ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నె ముకగా నిలిచిన మధ్యతరగతి నేడు కొనుగోలు తగ్గించుకుంటు న్నది. గత అనేక దశాబ్దాలుగా ప్రభుత్వ విధాన నిర్ణ యాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఈవర్గం నేడు ఆప్రభు త్వాల విధానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. పెరుగుతున్న ఖర్చులు-తరుగుతున్న ఆదాయాలతో ఆందోళన చెందుతున్నది. తమ గురించి, తమ పిల్లల భవిష్యత్ గురించి వేదనకు గురౌతున్నది. తమ దగ్గర వున్న కొద్దిపాటి డబ్బును ఖర్చు చేయడానికి భయ పడుతున్నది.వీటన్నిటి ప్రభావం రియల్ ఎస్టేట్ వ్యాపారం, సరుకులు, వాహనాల కొనుగోలు రూపాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరగతితో శక్తికి మించి అప్పులు చేయించి లాభపడిన వ్యాపార సంస్థ లు నేడువ్యాపార లావాదేవీలు తగ్గిపోయాయని గగ్గోలు పెడుతున్నాయి.ఈ స్థితి నుండి తమను పాల కులు బయట వేస్తారనే విశ్వాసం కోల్పోయి, అతీత శక్తులను ఆరాధించడం పెరిగింది. గత మÖడు దశా బ్దాల్లో ప్రపంచీకరణ విధానాలతో వేగంగా విస్తరించిన మధ్య తరగతి నేడు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీ య పరిస్థితుల వల్ల తీవ్ర ఆందోళనకు గురౌతున్నది. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా ప్రకారం, రాబోయే పది సంవత్సరాల్లో మన దేశంలో మధ్యతరగతి కుటుంబాలు రెట్టింపు అవుతాయి.2024లో 35 కోట్లుగా వున్న ఈ తరగతి 2034 నాటికి 69 కోట్లకు పెరుగుతుందని తెలిపింది. అందుకే దేశాభివృద్ధిలో ఈ తరగతి వినిమయం చాలా కీలకమవుతుంది. కార్పొరేట్ వ్యాపార సంస్థలు వీరిని ఆకర్షించి వ్యాపా రాన్ని పెంచుకోవడానికి, ఊహల పల్లకిలో పెట్టి పాల కులు లాభపడడానికి, అసత్యాలు, అర్ధసత్యాలతో సంచలనాత్మక ప్రసారాలతో రేటింగ్ పెంచుకోవడా నికి మీడియా నిత్యం అనేక ప్రయత్నాలు చేస్తుంటుం ది. తమ అభివృద్ధికి అమెరికా డాలర్లను కొలమా నంగా భావించే కొద్దిమంది మధ్యతరగతి వారు తమ పిల్లల భవిష్యత్ గురించి నేడు ట్రంప్ విధానాలతో భయాందోళన చెందుతున్నారు.దేశంలో 11 సంవత్స రాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్ల ఉద్యోగ భద్రత లేకపోవడం, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ధరలు పెరగడంతో మధ్యతరగతి ఖర్చు చేయడానికి భయపడుతుంది.తమ ఆదా యం లో ఎక్కువ భాగం అప్పుల వడ్డీలు, ఇఎంఐ లు చెల్లించ డానికే సరిపోయే స్థితికి చేరింది. గత 25 సంవత్స రాల్లో వస్తువుల వాడకం, గృహ నిర్మాణం ద్వారా విస్తరించిన వినిమయ మార్కెట్ నేడు మందగించింది. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని మొత్తం కుటుంబాల్లో 67 శాతం మంది వ్యక్తిగత రుణాలు తీసుకున్నారని, వీరిలో 53 శాతం మంది 30 ఏళ్ళ లోపు వారని తెలిపింది. ఇందులో అత్యధికులు ఐటి ఉద్యోగులు. వీరే నయా మధ్య తరగతివారు. రేపు లేదన్నట్లు ఖర్చు చేయగల ఖరీదైన వినిమయదారులు. రిజర్వుబ్యాంకు రిపోర్టు ప్రకారం 2018లో మధ్యతరగతి వారు తమ ఆదాయంలో 30.4 శాతం అప్పుల చెల్లింపులకు ఖర్చు చేస్తుండగా, నేడు సుమారు 41శాతం ఖర్చు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున అప్పుల చెల్లింపులు వుండడంతో కొత్త సరుకులను కొనడం పట్ల ఆసక్తి చూపడంలేదు. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా ఉంది. తయారీ రంగం విస్తరించకపోవడం,కొత్త ఉపాధి అవకాశాలు తగ్గడం,మధ్యతరహా వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ లాంటి రంగాలు కష్టాల్లో కూరుకుపోయాయి. హిందుస్తాన్ యÖనిలీవర్, నెస్లే ఇండియా సంస్థలు పట్టణాల్లో కొనుగోలు తమ అంచనాల కంటే ఎక్కువ గా తగ్గిందని ప్రకటించాయి.దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ పట్టణాల్లో తమ అమ్మకాలు 2శాతం తగ్గాయని ప్రకటించింది. ఈ సంవత్సరం జనవరి నుండి,ద్విచక్ర వాహనాల అమ్మ కాలు 9శాతం తగ్గాయి. మోటార్ సైకిల్ అమ్మకాలు 13శాతం, మోపెడ్ అమ్మకాలు 18 శాతం తగ్గాయి. నెస్లే ఇండియా ప్రతినిధి సురేష్ నారాయణన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమ్మకాలు మందగించడం వెనుక ‘తగ్గుతున్న మధ్యతరగతి’ ఒకముఖ్య కారణంగా చెప్పారు.‘ఒకప్పుడు రెండంకెలుగా ఉన్న ఆహార, పానీ యాల రంగంలో వృద్ధి ఇప్పుడు 1.5నుండి 2 శా తానికి పడిపోయింది’అని ఆయన పేర్కొన్నారు. నెలకు రూ.40,000 నుండి రూ.55,000 వరకు సంపాదిం చే వారు ఒక్కొక్కరు 5-6రకాల రుణాలు రూ.6 లక్షల నుండి రూ.30లక్షల వరకు తీసుకుంటున్నట్లు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నివేదిక తెలిపింది. వీరు పొందుతున్న ఆదాయంలో సుమారు 50 శాతం పైగా వడ్డీల చెల్లింపులకే సరిపోతుందట! దిగువ మధ్య తరగతి తమ దగ్గర వున్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం పెరిగింది. ఈ తరహా రుణాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 71శాతం పెరిగాయి. అంతకు ముందు సంవత్స రంలో 17శాతం పెరిగాయి.మార్చి 2020లో అప్పు ల్లో వున్న కుటుంబాలు దేశ జాతీయోత్పత్తిలో 35 శాతం వుండగా, జూన్ 2024 నాటికి 43 శాతానికి పెరిగాయని రిజర్వుబ్యాంకు తెలిపింది. ఒకవైపు మధ్యతరగతి వాస్తవ పరిస్థితి దిగజారుతుంటే దేశ తలసరి ఆదాయం 2,841డాలర్లు (సుమారు రూ. 2,52,000)కు చేరుకుందని, 2047 నాటికి రూ.15 లక్షలకు చేరుకుంటుందని ప్రధాని ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్ ప్రకటిస్తున్నారు.– జీ ఎన్ వి సతీష్ 

1 2