నీరు.. సమానత్వానికి ప్రవహించే దారి

తెల్లవారుజామున నాలుగు గంటలు. ఇంకా చీకటి వీడలేదు. ఒక మారుమÖల గిరిజన గ్రామంలో ఆమె నిద్ర లేచింది.ఆమె మొదటి పని- కిలో మీటర్ల దూరంలో ఉన్న నీటి బావికి పయనం. తలపై కుండ, చేతిలో పిల్లవాడు. ఈ చిత్రం భారత దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మహిళల దైనందిన జీవితం అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల మంది ప్రజలకు ఇంటి ఆవరణలో తాగునీరు అందుబాటులో లేదు. ఈ పరిస్థితిలో మÖ డింట రెండు వంతుల కుటుంబాల్లో నీటి సేకరణ బాధ్యత మహిళలదే. 53 దేశాల్లోని గణాంకాలు చెప్పేదేమిటంటే-మహిళలు, బాలికలు అందరూ కలిసి ప్రతిరోజూ నీటి కోసం కేటాయించే గంటలను లెక్కిస్తే.. 25కోట్ల గంటలు కేటాయిస్తున్నట్లు తేలింది. ఇది పురుషులు, బాలురు కేటాయించే సమయం కంటే మÖడు రెట్లు ఎక్కువ. ఇన్నేళ్ల ప్రపంచాభివృద్ధిలో నేటికీ తాగునీటికి కటకటలాడే పరిస్థితి. ఇప్పుడు వేసవి కాలం.. ఈ సమస్య మరింత జఠిలంగా మారుతుంది. మంచినీటి సమస్యఅనేది మహిళల వెత లు, అసమానతలకు అద్దంపడుతోంది.నీటి కోసం మహిళలు పడే ఈవెతలు వారిని అనేక రకాల అసమానతలకు గురిచేస్తున్నాయి.అందులో విద్యాపరమైన అసమానత ఒకటి. నీటి కోసం గంటల కొద్దీ ప్రయాణించాల్సి రావడంతో బాలికలు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలకు వెళ్లాల్సిన వాళ్ల రోజంతా నీటి వెతుకులాటలోనే గడిచిపోతోంది. ఆరోగ్యపరమైన ప్రభావం రెండోది. నీటి భారాన్ని మోస్తూ కిలోమీటర్లు నడవడం వల్ల వెన్నునొప్పి, గర్భసంబంధ సమస్యలు, ఇతర శారీరక సమస్యలు మహిళలను వెంటాడుతున్నాయి. అంతేకాదు, కలుషిత నీటి వల్ల ప్రతిరోజూ ఐదేళ్ల లోపు 1,000 మంది పిల్లలు మరణిస్తున్నారు. శరీరానికి అవసరమైనంత నీటిని తాగకపోవడం వల్ల మరెన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.-` శాంతిశ్రీ