కార్పొరేట్ విధానాలపై పెరుగుతున్న ప్రతిఘటన
ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన కార్మిక పోరాటాలు, ఆందోళనలు, నిరసనలు ఇవన్నీ సామాన్యుల సంక్షేమం కన్నా కార్పొరేట్ ప్రయోజనాలే మిన్నగా భావించే బిజెపి ప్రభుత్వం అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపించాయి. కార్మిక వర్గంలో ముఖ్యంగా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్) వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పెరుగుతున్న తీవ్రమైన అసంతృప్తిని ఈ నిరసనలు ప్రముఖంగా చాటి చెప్పాయి.
ఎన్.సి.ఆర్ లోని అనేక ఫ్యాక్టరీల్లో చాలా మంది కార్మికులు ఆర్థికంగా వెనుకబడిన గ్రామాలకు చెందిన వలస కార్మికులే.తమ జీవనోపాధులను వెతుక్కుంటూ వచ్చినవారే. అయితే వారు ఇక్కడకు వచ్చిన తర్వాత బానిస తరహా పని పరిస్థితుల్లో చిక్కుకు పోతున్నారు.బహుళ జాతి కంపెనీలు, ప్రధానమైన భారతీయ సంస్థలకు చెందిన ఫ్యాక్టరీల్లో ఎక్కువమంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తుంటారు. వీరికి మౌలికమైన కార్మిక హక్కులేవీ వర్తించవు.
కార్మిక చట్టాలు విస్తారంగా ఉల్లంఘించబడతాయి. నెలవారీ వేతనాలు రూ.10వేలు నుండి రూ.12వేలు మధ్యలో వుంటాయి. తరచుగా నిర్దేశిత కనీస వేతనాల కంటే ఇవి తక్కువగానే వుంటాయి. అనేక ఫ్యాక్టరీల్లో కార్మికులకు కార్మిక సంఘాల్లో చేరే లేదా సంప్రదించే వెసులుబాటు వుండదు, దీంతో వారికి సమిష్టి బేరసారాల శక్తి లేకుండా పోతోంది. చాలా తరచుగా వారు రోజుకు 13గంటలు పనిచేయాల్సిన పరిస్థితులు వుంటాయి. దీనికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వారి పరిస్థితిని మరింత అధ్వాన్నం చేస్తుంది. ఇక దాదాపు రెండు దశాబ్దాల క్రితం చివరిసారిగా సవరించిన కనీస వేతనాలు ఇప్పటికీ కాలం చెల్లినవిగానే మిగిలిపోయాయి. ఇఎసఐ, ప్రావిడెంట్ ఫండ్ లేదా గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాల గురించి చాలామంది కార్మికులు కనీసం వినను కూడా వినలేదు !
ఇలాంటి అమానవీయ పని పరిస్థితులన్నీ కలిసి ఒక్కసారిగా విస్తృతమైన నిరసనలు, ఆందోళనలకు దారి తీశాయి. కార్మికులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వ కార్మిక శాఖ నిష్క్రియాపరంగా వుండిపోయింది. కార్మికులు సాగించే పోరాటాలను, నిరసనలను అణచివేయడానికి బిజెపి ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగించింది.
కార్పొరేట్ ప్రయోజనాలు, కార్మికుల మధ్య జరుగు తున్న ఈఘర్షణలో సిఐటియు (దిసెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) కీలకమైన మద్దతును అందించింది. కార్మికుల కాంట్రాక్టీకరణను సిఐటియు ఎల్లప్పుడూ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చింది. కానీ, యజమానులకు మాత్రం ఉపాధి భద్రతను, కార్మికుల ప్రయోజనాలను నిరాకరిం చడానికి ఇదొక సాధ నంగా మారింది. కాంట్రాక్ట్ కార్మికులపై ఆధార పడడం ఎక్కువైన కొద్దీ యావత్ కార్మిక లోకం హక్కులకు ఎదురుదెబ్బ తగులుతుందని, కార్మికులు విభజనకు గురవుతారని ఏళ్ళ తరబడి సిఐటియు హెచ్చరిస్తూనే వచ్చింది.కాంట్రాక్ట్ కార్మికు లతో పోలిస్తే పర్మినెంట్ ఉద్యోగులు కొంత మెరుగైన పరిస్థి తులతో లబ్ది పొందుతారు.అదే సమయంలో కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం దాడులను ఎదుర్కొం టూనే వుంటారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లను సిఐటియు తీవ్రంగా వ్యతిరేకి స్తోంది. చాలా చట్టాలు అమల్లో వున్నప్పటికీ పాలక వర్గాల మద్దతు కలిగిన బహుళజాతి కంపెనీలు, భారత కార్పొరేట్ సంస్థలు కార్మికులను దోపిడీ చేస్తూనే వున్నాయి. లేబర్ కోడ్లను తీసుకురావడంతో, ఇక కార్పొరేట్ సంస్థలు కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేయడం మరింత ఉధృతమైంది. తద్వారా కార్మికులు మరింత దోపిడీకి గురవుతున్నారు.కార్మికుల భద్రతను, బేరాసారాల శక్తిని పణంగా పెట్టి యజమానులకు వెసులుబాటును పెంపొందిం చడం ద్వారా లేబర్ కోడ్లు ప్రధానంగా కార్పొ రేట్ ప్రయోజనాలనే నెరవేరుస్తున్నాయని సిఐటియు భావిస్తోంది.ఈ లేబర్ కోడ్లను పూర్తిగా రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది.ఆస్థానంలో పటిష్టమైన రక్షణాత్మక చట్టాన్ని పునరుద్ధరించాలని కోరింది.కాంట్రాక్టు కార్మికులు,స్కీమ్ వర్కర్లతో సహా మొత్తంగా కార్మికులందరికీ కనీస వేతనాలకు హామీ కల్పించా లన్నది ప్రస్తుతం సాగుతున్న కార్మిక పోరాటాల్లో సిఐటియు కీలక డిమాండ్‌గా వుంది. ప్రతి ఒక్క కార్మికుడు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు,ఆహారం,నివాసం,విద్య,ఆరోగ్య సంరక్షణ వంటి మౌలిక అవసరాలు తీరేందుకు సరిపడా వేతనాన్ని అందుకోవాలని సిఐటియు కోరుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం,ఖర్చులకు అనుగుణంగా కనీస వేతనాలను క్రమం తప్ప కుండా సవరించాలని,ఈ రక్షణను అన్ని కేటగిరీల కార్మికులకు ఎలాంటి మినహాయింపు లేకుండా వర్తింపు చేయాలని సిఐటియు పదే పదే పిలుపిస్తోంది.ఎక్కడ నిరసనలు జరిగినా సిఐటి యు అనుబంధ సంఘాలు, కిసాన్ సభ, డివై ఎఫఐ, ఎసఎఫఐ కార్యకర్తలు, సభ్యులందరూ నిరసనలకు దిగిన కార్మికులకు తోడ్పాటునంది స్తుంటారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి, ఇతర నేతల జోక్యం కార్మిక శక్తి మనోధైర్యాన్ని పెంపొందించింది.ఫిబ్రవరి 12న పిలుపు ఇచ్చిన జాతీయ సమ్మె ప్రాంతాల వారీగా కార్మికులందరినీ సమీకరించి, సమాయత్తపరిచింది. సమ్మె సందర్భంగా ఇచ్చిన నినాదాలు అనేకమందికి స్ఫూర్తినిచ్చాయి. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను అలాగే మతోన్మాద ధోరణులతో కార్మిక వర్గం ఐక్యతను బలహీనపరిచే ప్రయత్నాలను బట్టబయలు చేయడానికి దోహదపడ్డాయి.సంఘీభావాన్ని ప్రదర్శించాలంటూ సిఐటియు ఇచ్చిన పిలుపునకు అత్యధికంగా స్పందన లభించింది. అనేక రాష్ట్రాల్లో కార్మికులు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమం కార్మిక వర్గం ఐక్యతను ప్రదర్శించింది. కొత్త రకమైన దిశా నిర్దేశాన్ని అందించింది. ఉత్తర భారతంలో కార్మికులు సాగిస్తున్న పోరాటాలు ఒక ప్రాథమిక వాస్తవాన్ని నొక్కి చెప్పాయి. సమైక్యతే కార్మిక శక్తి యొక్క అత్యంత గొప్ప బలం. సంఘటితం అయినపుడు,ఏ శక్తి కూడా వారి గళాన్ని నిలువరించలేదు. ఈ నిరసనలు, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా నిరంతరంగా సాగుతున్న ప్రతిఘటనను చూపించాయి. దీనితో పాటుగా కార్మిక వ్యతిరేక చట్టాల పట్ల గల దృఢమైన వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఇది ప్రభుత్వాలపై, యజమానులపై వాస్తవ ఒత్తిడిని తీసుకురాగలుగుతుంది.మరింత మెరుగైన వేతనాలు, మౌలిక హక్కుల సాధన కోసం జరుపుతున్న పోరు క్రమంగా గౌరవం, న్యాయం, మరింత మెరుగైన భవితవ్యం కోసం సాగించే విస్తృత పోరాటంగా రూపుదాల్చింది. ఈ పోరాటంలో సిఐటియు దృఢమైన స్తంభంగా నిలిచింది. కార్మికులందరినీ సమీకరిస్తోంది. కార్మిక విధానాలను అస్థిరపరిచే, కార్మిక సంఘాల కార్యకలాపాలను అణచివేసే లక్ష్యం కలిగిన విధానాలకు వ్యతిరేకంగా స్పష్టమైన దిశా నిర్దేశాన్ని అందిస్తోంది.ముందున్న మార్గం అనేక సవాళ్ళతో కూడుకున్నదే, అయితే, స్థిరమైన, సమైక్య కార్యాచరణతో పాతుకుపోయిన అన్యాయాన్ని సవాలు చేయవచ్చని ఉత్తర భారతంలో కార్మికులు ప్రదర్శించిన కృత నిశ్చయం రుజువు చేసింది. దోపిడీతో కూడిన కాంట్రాక్టీకరణకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేయడం, కొత్త లేబర్ కోడ్లను తిరస్కరించడం, సార్వత్రిక కనీస వేతనాల కోసం పట్టుబట్టడం ద్వారా కార్మిక వర్గం తక్షణ ఉపశమనం కావాలని కోరడమే కాదు, మొత్తంగా దేశంలోని కార్మిక సంబంధాల భవిష్యత్‌ను కూడా పునర్నిర్మిస్తోంది. ఈ పరిణామాలన్నీ కార్మిక హక్కుల పునరుద్ఘాట నకు సంకేతం. ఇటువంటి ఉద్యమాలు విజయ వంతం కావడమనేది ప్రాంతాలవారీగా,రంగాల వారీగా కార్మికులు కొనసాగించే ఐక్యత, సంఘటితమవడంపై ఆధారపడి వుంటుంది.ఈ పోరాటం ఉధృత రూపాన్ని సంతరించుకుం టున్నందున సమిష్టి కార్యాచరణతో అర్ధవంతమైన మార్పును తీసుకురావచ్చన్న ఆశను కలిగిస్తోంది. అలాగే కొద్దిమంది కార్పొరేట్ల కన్నా పెద్ద సంఖ్యలోని కార్మిక లోకానికి ఆర్థిక పురోభివృద్ధి ప్రయోజనాలు అందేలా చూడాలని హామీ కల్పిస్తోంది.సంక్షోభ కాలంలో ప్రజల మీద ఫాసిస్టు పాలకుల నిర్బంధం పెరగడమే కాదు, ప్రజలు ఉవ్వెత్తున తిరగబడి చరిత్ర తిరగరాసే అవకాశం కూడ పెరుగుతుంది. ఆకలి నుంచి ఉక్రోశం, అణచివేత నుంచి ప్రతిఘటన పెరుగుతుంది. మార్పులు తీవ్రమైన వేగంతో సంభవిస్తాయి. అభ్యుదయ శక్తులు సంక్షోభ కారణాలను, స్వరూపాన్ని సక్రమంగా అవగతం చేసుకుని స్ఫూర్తితో జోక్యం చేసుకోవల్సిన సమయం ఇది. అన్ని విధాలుగా విఫలమైన పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను, దోపిడీ లేని సమసమాజాన్ని నిర్మించుకునే దిశగా ప్రజాతంత్ర ఉద్యమం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. దుష్ట మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు ఈ ‘హిందూత్వ’ అంతం ప్రజా ప్రతిఘటనలో ఉంది. అంతిమంగా పై చేయి సాధించేది అదే. 2022 నాటికి దేశ జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి రంగం వాటాను 25 శాతానికి పెంచే విధంగా మేక్ ఇన్ ఇండియా పథకాన్ని 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25 శాతానికి చేరే సంగతి అటుంచి మోడీ ఏలుబడిలోకి వచ్చేనాటికి ఉన్న 16.3 శాతం కాస్తా 2020-21 నాటికి 14.3 శాతానికి దిగజారింది. మేకిన్ ఇండియా పథకాన్ని ఉపాధి పెంపుదల, విదేశాలకు వస్తు ఎగుమతులు, మన దిగుమతులు తగ్గించే లక్ష్యంతో ప్రకటించారు. మన దిగుమతుల బిల్లు తగ్గిన దాఖలాలుగానీ, ఎగుమతులు పెరిగిన అనవాలు గానీ కనిపించటం లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం నెరవేర్చకపోగా రైతాంగానికి ఎసరు పెట్టి వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు దుర్మార్గమైన మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి అబాసుపాలైన విషయం తెలిసిందే. మద్దతు ధరకు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చిన మోడీ కాలయాపన చేస్తూ మీన మేషాలు లెక్కిస్తున్నాడు.- జి ఎన్ వి సతీష్
