వాతావరణ మార్పులు బియ్యాన్ని విషపూరితంగా మారుస్తున్నాయా?

విశ్వవ్యాప్తంగా వరి వందల కోట్ల మంది ప్రజలకు నిత్యం కడుపునింపే అమృతం.ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్ని చిరుతిళ్లు ఇతర చల్లని పానీయాలు తాగినా కాస్తంత వరి అన్నంతో భోజనం చేస్తేనే కడుపు నిండిన సంతృప్తికర భావన కలుగుతుంది.జీవకోటి ప్రాణాలు నిలుపు తున్న వరిలో ఇప్పుడు అత్యంత విషపూరిత ఆర్సెనిక్ మÖలకం స్థాయిలు ఎక్కువ అవుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి. ఈ చేదు నిజాన్ని ఓఅధ్యయాన సంస్థ బయటపెట్టింది.యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు,అడవుల దహనం,శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి.
ఇప్పడీ వాతావరణ మార్పుల విషపరిణామాలు వరిపంటలపై పడుతున్నాయని స్పష్టం చేసింది. వాతా వరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి,కార్బన్‌డయాక్సైడ్,కర్బన్ ఉద్గారాల స్థాయిలు పెరగడంతో వాటికారణంగా పొల్లాల్లో మట్టి,నీటి నుంచి ఆర్సెనిక్ మÖలకం అత్యధికంగా వరిధాన్యంలోకి చేరుతున్నాయని పేర్కోంది. విషాల రారాజుగా పేరొందిన ఆర్సెనిక్ పాళ్లు వరిలో పెరిగితే ఆరోగ్యంపై దాని దురష్పభావాలు దారుణంగా ఉంటాయి. ఆర్సెనిక్‌స్థాయి పెరిగిన వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటే చర్మ,ఊపరితిత్తుల సంబంధిత క్యాన్సర్లతోపాటు ఎన్నో రకాల తీవ్ర ఆరోగ్య సమస్యలు మనిషిని చుట్టుముట్టడం ఖాయమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.మానవ శరీరంలో రక్తసరఫరా,రోగ నిరోధక వ్యవస్థలు,కాలేయం,మÖత్రపిండాలు, మÖత్రాశయం,చర్మం,ప్రొస్టేట్ గ్రంథి వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
హృద్రోగ సమస్యలతోపాటు మధుమేహవ్యాధి ప్రబలే ప్రమాదముంది. గర్భిణీల్లో పిండం సరిగా ఎదగక పోవడం,అకాలమరణాలు సంభవించే ముప్పు ఉంది.వాతావరణమార్పుల కారణంగా వాతావరణంలోని వెలు వడుతున్న అధిక కర్బన్ ఉద్గారాలు,ఉష్ణోగ్రతల పెరుగుదలతో అమృతాహారం కాస్తా విషాహారంగా మారుతున్న వైనాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం చేసిన ఈఅధ్యయనం ఫలితాలు ‘లాన్సెట్ ప్లానిటరీ హెల్త’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.బియ్యంలో ఆర్సెనిక్ విషపూరితత ఒక సాధారణ సమస్య.ఇది శిశువులక,పెద్దలకు కూడా హానికరం.ఆర్సెనిక్ అనేది ఒక విషపూరిత రసాయన మÖలకం,ఇది సహజంగా మట్టినీటిలో ఉంటుంది.బియ్యంసాగులో ఈ ఆర్సెనిక్ మట్టినీటి నుండి గ్రహించబడుతుంది, ఫలితంగా బియ్యం విషపూరితం అవుతుంది.ఈఆర్సెనిక్ యొక్క అధిక స్థాయిలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు, ముఖ్యంగా క్యాన్సర్ మరియు గుండెవ్యాధులకు దారితీసి ఆరోగ్య ప్రభావాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ సమస్య కొత్తది కాదు, కానీ వాతావరణమార్పులు ఎంతగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయో అది కష్టంగా కనిపించే కోణాల్లో కూడా ఉండొచ్చని ఈఅధ్యయనం మళ్ళీ గుర్తుచేస్తుంది.అంతర్జాతీయ ఆహార భద్రత సంస్థలు ఇప్పటికీ బియ్యంలో ఆర్సెనిక్ పరిమితులపై కఠినమైన నిబంధనలు విధించలేదు.ఉదాహరణకు, అమెరికాలోని ఖీణA (ఖీశీశీd aఅd ణతీuస్త్ర Adఎఱఅఱstతీatఱశీఅ) బియ్యం మరియు బియ్యం-ఆధారిత ఆహారాలలో ఆర్సెనిక్ స్థాయిల కోసం బలవంతపు ప్రమాణాలు ఇంకా విధించలేదు.తక్కువ ఆర్సెనిక్‌ను శోషించే కొత్త బియ్యపు రకాల అభివృద్ధి,సాగు పద్ధతుల మార్పు ద్వారా ఆర్సెనిక్ తగ్గించడం,ఆరోగ్యవంతమైన వంట విధానాలు మరియు ఇతర ధాన్యాల వినియోగంపై ప్రజల అవగాహన పెంపొందించాలని పరిశోధకుల సూచిస్తున్నారు.
ఆర్సెనిక్‌కు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి.వాటిలో క్యాన్సర్,గుండెజబ్బులు మరియు నరాల నష్టాలు (న్యూరాలాజికల్ డ్యామేజ్) ఉంటాయి.గ్లోబల్ ఉష్ణోగ్రతలు మరియు కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగేకొద్దీ,బియ్యంలో ఆర్సెనిక్ కూడా పెరగవచ్చు, ఇది ముఖ్యంగా ఆసియా దేశాలలో ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉంది.ది లాన్సెట్ ప్లానటరీ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం..వాతావరణ మార్పుల కారణంగా బియ్యం విషపూరితమవుతోంది.కాగా,ఆసియాలో బియ్యం ఎక్కువగా తినే ఏడువ దేశాలలో (భారతదేశం,బంగ్లాదేశ్,చైనా,వియత్నాం,ఇండోనేషియా,మయన్మార్,ఫిలిప్పీన్స్) వ్యక్తి ప్రతి రోజు బియ్యం వినియోగ డేటాను ఉపయోగించి,భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య ప్రమాదాలను అంచనా వేశారు.ఇలాంటి ప్రమాద ఘటికల నుంచి విముక్తి చెందాలంటే అంతర్జాతీయంగా దూసుకువస్తున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా వ్యవహరించి పర్యవరణ పరిరక్షణకు తోడ్పడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్,