మత స్వేచ్ఛకు ప్రమాదం

బిజెపి ఇతర రాజకీయ పార్టీల లాంటిది కాదు. ఈ పార్టీని ఏర్పాటు చేసినది, నడుపుతున్నది… రాజ్యాం గాన్ని గుర్తించని లేదా ఆమోదించని ఆర్‌ఎస్‌ఎస్‌ అనే మత సంస్థ. ఈ సంస్థ దృష్టిలో ‘హిందూ మత విశ్వా సాలను ఆచరించని వారంతా విదేశీయులు. అందు వల్ల వీరంతా హిందూ మత జాతీయ సంస్కృతినీ, భాషనూ తమదిగా స్వీకరించి, ఆచరించాలి లేదా దేశంలో అమలవుతున్న అన్ని నీతి నియమాలకు, కట్టుబాట్లకు లోబడి వారి కృపాకటాక్షా లతో ఏ హక్కులు లేని పరాయివారిగా బతకాలి.’ ఈ వికృత సిద్ధాంతాన్ని అమలు చేయాలని తహతహలా డుతున్న పాలకులకు పరమత సహనం, మత స్వేచ్ఛ అనేవి ఏ మాత్రం గిట్టవు.
మన రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ పరిస్థితులు దిగజారాయని, ఇందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతపరమైన వివక్షాపూరిత విధానాలే కారణమని అంతర్జాతీయ మత స్వేచ్ఛ పరిస్థితులపై అమెరికన్‌ సంస్థ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడిరచింది. కర్ణాటక ఎన్నికల్లో ప్రజల తీర్పు,మహారాష్ట్రలో థాకరే ప్రభుత్వ కూల్చివేత-ఢల్లీి రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పులు, లైంగిక వేధింపులపై రెజ్లర్లు ఢల్లీిలో చేస్తున్న ఆందోళన, ఇప్పుడు మత స్వేచ్ఛపై అంతర్జాతీయ నివేదిక కేంద్రంలోని బిజెపి నేతలకు ఉక్కపోతను మరింత పెంచింది. నరేంద్ర మోడీ ఇంటా బయటా ఎదురులేని మొనగాడని, విశ్వగురువు అని, అంతర్జాతీయ శాంతిదూత అని…ఏవేవో భుజకీర్తులు తగిలించి, ఆహా ఓహో అని కీర్తించిన గోడీ మీడియా ఈ వరుస ఘటనలతో కుడితిలో పడిన ఎలుక లాగా గిజగిజలా డుతున్నది.
మత స్వేచ్ఛ నివేదికలో ఏముంది ?
అమెరికన్‌ విదేశాంగ శాఖ ఆధీనంలోని స్వతంత్ర సంస్థ ‘యునైటెడ్‌ స్టేట్స్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడమ్‌’ (యుఎస్‌స ిఐఆర్‌ఎఫ్‌) ప్రపంచంలోని వివిధ దేశాల్లో మత స్వేచ్ఛ పరిస్థితులపై ప్రతి సంవత్సరం నివేది కలు రూపొందించి అక్కడి ప్రభుత్వానికి అందచేస్తుంది. భారతదేశంలో మత అసహనం, ప్రార్థనా స్థలాలు, మైనారిటీ ప్రజల ఆస్థులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, తప్పుడు కేసులు, నిర్బంధాలు పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలిపింది. 2022లో దేశంలో జరిగిన సంఘటనలు, ప్రభుత్వ లెక్కల ఆధారంగా ఈ నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించి మత స్వేచ్ఛ అమలు విషయంలో ప్రత్యేక ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న దేశాల జాబితాలో మన దేశాన్ని చేర్చాలని అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గతంలో కూడా ఈ సంస్థ దేశంలోని మత ఉద్రిక్తతలను ప్రస్తావించింది. మత స్వేచ్ఛ విషయంలో కొనసాగుతున్న అనేక దుష్పరి ణామాలను ఈ సంవత్సరం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించడంతో పాటు, వాటి మూలాలను విశ్లేషించింది. భారత రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 25-28 ప్రకారం ప్రతి పౌరుడికి తనకు ఇష్టమొచ్చిన మతాన్ని స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి, ఏ మతాన్ని ఆరాధించకుండా వుండడానికి స్వేచ్ఛ వుంది. అయితే 2014లో బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి ఈ లౌకిక సూత్రాలకు, మైనారిటీల మత స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడిరదని పేర్కొంది. ఇంకా ఈ నివేదికలో ‘హిజాబ్‌,గోవధ లాంటి అంశాలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు (బిజెపి పాలిత రాష్ట్రాలు) రూపొందిస్తున్న చట్టాలు, న్యాయ స్థానాల తీర్పులు దేశంలోని ముస్లింలు, క్రైస్తవు లు,దళితులు,ఆదివాసీల మత స్వేచ్ఛను హరించివేసే విధంగా వుంటున్నాయి. విమర్శ నాత్మక గొంతులను కేంద్ర ప్రభుత్వం అణచి పెడుతున్నది. ముఖ్యంగా మతపరమైన మైనారిటీలను,వారికి అండగా నిలుస్తున్న వ్యక్తులను, సంస్థలను లక్ష్యంగా చేసుకొని వారిపై నిఘా,వేధింపులు,ఇళ్ల కూల్చివేత, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద సంవత్సరాల తరబడి నిర్బంధించడం లాంటివి పెరిగాయ’ని తెలిపింది. స్వచ్ఛంద సంస్థల కార్యక లాపాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధానాలను కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేస్తున్నదని పేర్కొంది. మత స్వేచ్ఛ కోసం కృషి చేస్తున్న అనేకమంది జర్నలిస్టులు, లాయ ర్లు, మానవ హక్కుల కార్యకర్తలు నిర్బం ధాలకు, వేధింపులకు గురవుతున్నారనే పచ్చి నిజాన్ని బయటపెట్టింది. 2019లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా జరిగిన కార్య క్రమాల్లో పాల్గొన్నారనే సాకుతో అనేక వేల మందిపై పెట్టిన వందలాది కేసులు ఇప్పటికీ పెండిరగ్‌లో వున్నాయని, 2022 వరకు 700 కేసులు నమోదు కాగా, వాటిలో కేవలం 92 కేసులు మాత్రమే విచారణ దశకు వచ్చాయని తెలిపింది. అయితే ఈ కేసులు నమోదు అయినా అనేకమంది ఎలాంటి విచారణ లేకుండా సంవత్సరాలుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో 12 రాష్ట్ర ప్రభుత్వాలు (ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, అరుణాచల్‌ ప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌,గుజరాత్‌, హర్యానా,ఉత్తరా ఖండ్‌, మధ్యప్రదేశ్‌,ఒడిషా, హిమాచల్‌ ప్రదేశ్‌,రాజస్థాన్‌,జార్ఖండ్‌) మత మార్పిడిని చట్టవిరుద్ధ నేరంగా పరిగణించే చట్టాలను రూపొందించాయని ఈ నివేదిక తెలిపింది. చట్టపరమైన మత మార్పిడికి గతంలో వున్న నిబంధనలను పూర్తిగా మార్చివేసి మత స్వేచ్ఛను అణచివేసే విధంగా ఈ రాష్ట్రాల్లో నిబంధనలను రూపొందించారు. ఈ అంశాలన్ని ట్లోనూ ఉత్తరప్రదేశ్‌ దూకుడుగా వుంది. మతాన్ని మార్చుకున్న వారికి, ఆ కార్య క్రమాన్ని నిర్వహించిన వారికి భారీగా అపరాధ రుసుములు వేయడం,జైళ్లలో నిర్బంధించడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం పెరిగిందని పేర్కొంది.చట్టబద్ధ మతాంతర వివాహాలను నిరోధిస్తూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు రూపొందించాయి. ముస్లిం యువత చేసుకునే ప్రేమ వివాహాలపై‘లవ్‌ జిహాద్‌’ పేరుతో ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసి పాలకులు, వారి అనుయాయులు మత విద్వేషాన్ని పెద్ద ఎత్తున రగిలిస్తున్నారు. మతాంతర వివాహాలను పుజారి లేదా పోలీసులు అంగీకరించడానికి లేదా అంగీకరించకుండా వుండడానికి హక్కులు కల్పిస్తూ ఏప్రిల్‌లో హర్యానా ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింది.కర్ణాటకలో రగిల్చిన హిజాబ్‌ సమస్య,గుజరాత్‌లో బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదల,ఉత్తరప్రదేశ్‌ లో దళిత మహిళలపై కొనసాగుతున్న హత్యాచారాలు, దాడుల గురించి ఈ నివేదిక పేర్కొంది. పెరుగుతున్న మత హింస ఘటనల ఆధారంగా భారత దేశంలో మత స్వేచ్ఛ ప్రమాదంలో వుందని, అందువల్ల ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో మన దేశాన్ని చేర్చాలని ఈ సంస్థ అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కేంద్ర ప్రభుత్వ స్పందన
విభిన్న మతాలకు నిలయమై, లౌకిక విధాన పునాదిపై భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆచరిస్తున్న దేశ ప్రతిష్టను కేంద్ర బిజెపి పాలకులు,వారి మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ విధంగా దిగజార్చాయి. కానీ ‘ఈ నివేదక పక్షపాతం మరియు నిందాపూర్వకమైనదని’ మన విదే శాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. తీవ్రమైన అవగాహనా లోపంతో ఈ నివేదిక తయారుచేయబడిరదని కేంద్రం ఎదురు దాడికి సిద్ధమైంది. మరి ట్రంప్‌ అధ్యక్షుడుగా వున్న కాలంలో హౌడీ మోడీ, నమస్తే ట్రంప్‌ కార్యక్రమాల మోత మోగించారు కదా! అంతెం దుకు! ప్రధాని మోడీ 2021 సెప్టెంబర్‌ నెలలో అమెరికా పర్యటన సందర్భంగా నాయకుల పరస్పర పొగడ్తలు, వచ్చే నెల 22న మరోసారి ప్రధాని అమెరికా పర్యటనకు చేస్తున్న హంగా మా చూస్తూనే వున్నాం. అంతర్జాతీయ మీడియా ప్రచార హోరులో ఊయలలూ గినప్పుడు పక్షపాతం గుర్తకు రాలేదే? ఇలాంటి నివేదికలు ప్రకటించే అమెరికా సంస్థలన్నీ గొప్పవని, అవి ఇచ్చే నివేదకలన్నీ చాలా పవిత్ర మైనవని అనుకోలేము. కాని తమను కీర్తించి నప్పుడు ఒకరకంగా, నిందించినప్పుడు మరో రకంగా స్పందించే పాలకుల తీరు ప్రజావిశ్వా సాన్ని పొందదు.దేశంలో మత స్వేచ్ఛ ఎందుకు ప్రమాదంలో పడిరది ?బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఒకటి మత రాజ్యాన్ని నిర్మించడం.అందుకోసం మత విద్వేషాన్ని నిత్యం రగల్చడం. ఇతర మతస్థుల ఆచార, సాంప్రదాయాలన్నిట్లోకి జొరబడి వాటిపై దాడి చేయడం. రెండు కార్పొరేట్‌ అనుకూల ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను,సామాజిక రిజర్వేషన్లను బలహీనపర్చడం,రాజ్యాంగ హక్కులను కాలరాయడం,రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం.గౌతమ్‌ అదానీ ఆర్థిక అరాచకాల గురించి హిండెన్‌బర్గ్‌ నివేదిక, మత స్వేచ్ఛ గురించి యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌ నివేదిక, అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు ప్రకటిస్తున్న ర్యాంకింగ్‌ లెక్కలు ఈ విధానాల ప్రతిరూపమే.అంతేగాక, తమ మతతత్వ విధానాలను అమలు పరచడానికి మత చిహ్నాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఉదా: గో సంరక్షణ పేరుతో 2014 నుండి దేశవ్యాపితంగా 147దాడులు జరిగాయి. ఇందులో 58 మంది హత్యగావించ బడ్డారు. కర్ణాటక ఎన్నికలకు ముందు గో రక్షణ దళాలు ఇద్దరు మైనారిటీ మతస్థులను చంపడం, ఒకరిని హింసించడం చూశాము. కేంద్ర ప్రభు త్వం 2017మేలో కేంద్రం గోవధ నిషేధాన్ని ప్రకటించింది. అన్య మత పూజా ప్రదేశాల మీద దాడులు చేయడం పెరిగింది. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా దేశంలో అనేక చోట్ల మసీదులపై దాడులు జరిగాయి. ఈ సందర్భంగానే యు.పిలో మైనా రిటీ సంస్థ నిర్వహిస్తున్న అతిపెద్ద ప్రాచీన గ్రంథాలయాన్ని తగుల బెట్టారు. మత మార్పిళ్ల సాకుతో ముఖ్యంగా క్రిస్టియన్లపై దాడులు పెరి గాయి. అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పరమత సహనమే హిందూ మతానికి జీవం అని ఒకవైపున అనుభవం చెబుతుంటే, మరో వైపున హిందూ ధర్మ సంరక్షకులు, గో సేవా దురంధరుల వేషాలు వేసుకున్న కొద్దిమందికి పరమత ద్వేషం జీవగర్ర అయింది. వీరికి కేంద్రంలోని ప్రభుత్వం అండగా నిలిచింది. బిజెపి ఇతర రాజకీయ పార్టీల లాంటిది కాదు. ఈ పార్టీని ఏర్పాటు చేసినది, నడుపు తున్నది…రాజ్యాంగాన్ని గుర్తించని లేదా ఆమోదించని ఆర్‌ఎస్‌ఎస్‌ అనే మత సంస్థ. ఈ సంస్థ దృష్టిలో ‘హిందూ మత విశ్వాసాలను ఆచరించని వారంతా విదేశీయులు. అందువల్ల వీరంతా హిందూ మత జాతీయ సంస్కృతినీ, భాషనూ తమదిగా స్వీకరించి, ఆచరించాలి లేదా దేశంలో అమలవుతున్న అన్ని నీతి నియమాలకు, కట్టుబాట్లకు లోబడి వారి కృపాకటాక్షాలతో ఏ హక్కులు లేని పరాయి వారిగా బతకాలి.’ఈ వికృత సిద్ధాంతాన్ని అమలు చేయాలని తహతహలాడుతున్న పాలకులకు పరమత సహనం,మత స్వేచ్ఛ అనేవి ఏమాత్రం గిట్టవు. వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు -(వి.రాంభూపాల్‌)

ఉపాధి హామీకి రక్షణ చట్టం` ఆవశ్యం

ఒకే ఏడాది సుమారు 6 కోట్లకు పైగా పని దినాలు తగ్గిపోయాయి. అంతే కాకుండా చట్టంలోని మౌలిక అంశాలను, కనీస సౌకర్యాలను రద్దు చేసింది. రెండు పూటలా పని చేయాలని నిర్ణ యించింది. ఎండాకాలంలో ఇస్తున్న 20శాతం నుండి 30 శాతం అలవెన్స్‌ను తొలగించింది. చివరకు గుక్కెడు మంచినీళ్ళ కోసం ఇస్తున్న డబ్బులను సైతం రద్దు చేసింది. పొమ్మనకుండా పొగబెట్టి, పేదలే ఈ పథకం వద్దనేలా కేంద్ర ప్రభుత్వం కుట్రకు పూను కున్నది. దీనికి తందాన అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా 10శాతం నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో30 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ ఇచ్చే వారు. ఒకా నొక సందర్భంగా 50 శాతం కూడా ఇచ్చారు. చట్టం ప్రారంభం అయినప్పటి నుండి వున్న ఈ అలవెన్స్‌ను ఈసంవత్సరం కేంద్ర ప్రభుత్వం కావాలనే రద్దు చేసింది.దీనివల్ల ఎర్రటి ఎండలో చేతులు బొబ్బ లెక్కే లా పని చేసినా గిట్టుబాటు కూలి రావడం లేదు. పేదలు ఈపని మానుకుంటే తప్పుడు మస్టర్లు సృష్టించి కాంట్రాక్టర్లు,దళారులకు కట్ట బెట్టేందుకు ప్రయత్ని స్తున్నారు.
కూటి కోసం..కూలి కోసం..పనులు చేసుకుని బతు కుదామని బయల్దేరిన శ్రమజీవులు మార్గ మధ్యంలోనే ప్రమాదాల బారినపడి బలవుతు న్నారు. ఇటీవల మనరాష్ట్రంలో జరిగిన భారీ ప్రమాదాలన్నింటిలోనూ ప్రాణాలు కోల్పోయింది బడుగుజీవులే కావడం విషాదం.ఈ వారంలో మన రాష్ట్రంలో మూడు భారీ ప్రమాదాలు జరగ్గా, వాటిలో మరణించిన వారిలో 17 మంది మహిళలే కావడం విషాదం. వీటిలో రెండు ప్రమాదాల్లో మరణించిన వారంతా రెక్కాడితేగాని డొక్కాడని మహిళలు. అందువల్లే సెవెన్‌ సీటర్‌ ఆటోలో ఒక ఘటనలో 23 మంది, మరో ఘటనలో 14 మంది ప్రయాణించారు.తెలంగాణ నార్కట్‌పల్లి-మన రాష్ట్రంలోని అద్దంకిని కలిపే ఆ రహదారిలో అంతవరకూ నాలుగు రోడ్ల లైనులో వేగంగా వచ్చిన వాహనాలు సింగిల్‌లైనులోనూ అదే స్పీడులో రావ డంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. 2010లో నాలుగులైన్లరోడ్డు పూర్తయినా..వివాదాలు పరి ష్కారం కాకపోవడంతో ఆ ప్రాంతం ప్రమాదాలకు హాట్‌ స్పాట్‌గా మారింది. గత మూడేళ్లలో 12 ప్రమాదాలు ఆ ప్రాంతంలో జరిగాయంటేనే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. మిరపకాయల పని కోసం తెలంగాణ నుంచి బయల్దేరిన 23మందిలో ఆరు గురు మరణించడం, ఏడుగురు తీవ్రంగా గాయ పడటంతో ఆగిరిజన కుటుంబాల జీవనం చిన్నా భిన్నమైంది. రొయ్యల శుద్ధి పరిశ్రమలో పనిచేసి తిరిగివస్తున్న యానాం ప్రాంతానికి చెందిన ఏడు గురు మహిళలు కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమా దంలో మరణించగా, మరో ఏడుగురు తీవ్ర గాయా ల పాలయ్యారు. ప్రైవేటు ట్రావెల్‌ బస్సును క్లీనర్‌ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
రహదారులు రక్తసిక్తం కావడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలవల్ల మరణిస్తున్న వారి సంఖ్య 13 లక్షల కు పైమాటే. మరో రెండుకోట్ల నుంచి ఐదు కోట్ల మంది వరకూ తీవ్ర గాయాల పాలవు తున్నారు.ఈ గాయాలవల్ల వికలాంగులై జీవచ్ఛ వాల్లా బతుకు తున్న వారి సంఖ్యే ఎక్కువ. మృతుల సంఖ్యలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండటం, క్షతగాత్రుల సంఖ్యలో మూడోస్థానంలో ఉండ టం…మన దేశంలో రహదారుల భద్రత దుస్థితిని చాటిచెబుతోంది. 2020 లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే 69.80 శాతమని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడిరచారు. 2020లో దేశంలో 3,74,397 మంది మరణిస్తే, 2021లో 3,97,530 మంది బలయ్యారు. బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌ 40,510 మరణాలతో..10.2 శాతం, ఉత్తర ప్రదేశ్‌ 36,521 మరణాలతో.. 9.2 శాతం ప్రమాదాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏటా నాలుగు శాతం మరణాలు సంభవిస్తున్నాయి. 2021 లెక్కల ప్రకారం 16,044 మంది బలయ్యారు. రోడ్డు రవాణా, హైవేల మంత్రి త్వశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం ప్రమాదాలకు ఐదు ప్రధాన కారణాలున్నాయి. వాటిలో పరధ్యానంగా నడపటం, అత్యధిక వేగంతో నడప టం, మద్యం సేవించి నడపడం, ట్రాఫిక్‌ నిబంధ నలు పాటించకపోవడం, రహదారులు ఛిద్రమై ప్రమాదకరంగా ఉండటం.నూతన సాంకేతిక నైపు ణ్యంతో అతివేగంగా దూసుకెళ్లే వాహనాలు మార్కెట్‌లోకి వస్తుండగా, అందుకు అనుగుణంగా రహదారులు మెరుగుపడటం లేదు. దీంతో, వాహ న వేగం ఎందరి ప్రాణాలనో బలిగొంటోంది.
మరోవైపు… రోజురోజుకూ ఉపాధి మార్గాలు కుంచించుకుపోవడం,ఉపాధి హామీకి సైతం సవాలక్ష కొర్రీలు ఉండటం…తదితర కారణాలవల్ల దూర ప్రాంతానికైనా వెళ్లి పనులు చేసేవారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో పెరుగు తోంది.రోజూ పనులు దొరక్కపోవడంతో కుటుం బం గడవడం కష్టమవుతోంది. దీంతో, భర్తలకు చేదోడువాదోడుగా ఉండేందుకు మహిళలు సైతం పనులకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే అధిక ఛార్జీలు భరించలేక ఆటోల్లో కిక్కిరిసి ప్రయా ణిస్తూ జీవితాలను బలిపెట్టుకుంటున్నారు. ‘బేటీ బచావో.. బేటీ పఢావో..’ అని నినాదమిచ్చిన మోడీ ప్రభుత్వం గానీ, అక్కచెల్లమ్మలు అంటూ నిత్యం జపం చేసే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గానీ ఉపాధి,ఉద్యోగ కల్పనకు శ్రద్ధపెట్టింది లేదు. దీంతో, రొయ్యల శుద్ది లాంటి కష్టమైన పనులు చేస్తూ… ఎటువంటి భద్రత లేని ప్రయాణం చేస్తూ బలవు తున్న వ్యవసాయ కార్మికులు, మహిళలు రాష్ట్రంలో పెరుగుతున్నారు.ప్రమాదాలు జరిగినప్పుడు నష్టప రిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుం డా ప్రమాదాల నివారణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లు చిత్తశుద్ధితో కృషి చేయాలి. మృతుల కుటుంబా లను, క్షతగాత్రులను ఆదుకునేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.- (వి.వెంకటేశ్వర్లు)

ఒరిశా రైలు ప్రమాదానికి బాధ్యులెవరు?

దేశంలో మనుషుల ప్రాణాలంటే ప్రభుత్వాలకు లెక్కలేదు.రైలు,రోడ్డు,ఆకాశమార్గాల్లో ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల భద్రత పరిరక్షణ చేపట్టడంలేదు. మానవ తప్పిదం కారణంగా ఒడిశా బాలేశ్వర్‌ రైలు ప్రమాదదుర్ఘటనలో దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపింది.గూడ్స్‌,ట్రైన్‌ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశించిందని,మూడు రైళ్ల ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు.ఇది మొత్తం ఎలక్ట్రికల్‌ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ తప్పిదాలు వల్లనే ఇంత ఘోరం జరిగిందని అధికారులు తేలిగ్గా చెప్పడం వారి భాద్యతారాహిత్యానికి, భద్రతచర్యల లోపాలకు నిదర్శనం.
రైలు ప్రమాద దుర్ఘాటనలో తన ఇద్దరు సోదరులను కోల్పోయిన ఒరిశా వాసి మనోజ్‌ దాస్‌ సోషల్‌ మీడియాలో తన ఆవేదన వ్యక్తపరిచారు.‘‘ఈ రకమైన తప్పిదాలు రైల్వేశాఖలో చాలావరకు జరుగుతున్నాయి. మొత్తం సంఘటనలో చాలా తప్పించుకోదగిన తప్పులు ఉన్నాయి. దీంట్లో ఎవరినీ నిందించడం లేదు కానీ మన దేశంలోని సో కాల్డ్‌ సిస్టమ్‌ యొక్క అజాగ్రత్త కారణంగా దేశంలో బహుజనుల సమస్యల పట్ల అజ్ఞానం,ఉదాసీనత స్పష్టంగా కన్పిస్తోంది. విషాదానికి దారితీసిన కొన్ని ‘‘సాంకేతిక లోపాలు’’ ఇక్కడ ఉన్నాయి.వీటిలో ఏవీ పూర్తిగా యాదృచ్ఛికంగా కనిపించవు.
ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుకారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ అనేది సిగ్నల్‌లను సరికాని క్రమంలో మార్చకుండా నిరోధించడానికి ఒక భద్రతా చర్య. మార్గం సురక్షితమని నిరూపించబడినంత వరకు ఇది రైలును కొనసాగించడానికి అనుమతించదు. ఇనుప ఖనిజంతో కూడిన గూడ్స్‌ రైలు అప్పటికే ఆగిపోతున్న లూప్‌ లైన్‌ గుండా వెళ్లడానికి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు మొదట గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వబడిరది.ఈ మార్గంలో ఇలాంటి సిగ్నలింగ్‌ వైఫల్యాలు కొత్త కాదు.కానీ అన్ని తెలిసిన గతంలో ఈ వైఫల్యాల నుండి నేర్చుకోవడానికి నిరాకరించారు.
దాదాపు 1400మంది ప్రయాణికులతో యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌ సమ యం కంటే 3గంటలు ఆలస్యంగా బయలుదేరింది.సరైన సమయంలో,సాయంత్రం4గంటలకు బాలాసోర్‌ గుండా వెళితే,ఢీకొనడాన్ని సులభంగా నివారించవచ్చు.ఆలస్యానికి హంతకులు కాకపోతే మరెవరు బాధ్యులు?ప్రాణాలతో బయటపడిన కొద్దిమందితో ఫోన్‌లో మాట్లాడి,చాలా మంది రైళ్లలో కూర్చున్న వారి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకున్నారు.72సిట్టింగ్‌ కెపాసిటీ ఉన్న జనరల్‌ బోగీల్లో రెండు రైళ్లలోఒక్కొక్కరికి 200మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఘర్షణ జరిగినప్పుడు నిలబడి ఉన్నారు.ఈ రైళ్ల రద్దీకి జవాబుదారీ ఎవరు? అవును,ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోని నాటి ప్రభుత్వమే..నా సోదరుల మృతిపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు కూడా..వాస్తవాలను దాచిపెడుతున్న పెయిడ్‌ మీడియా.తమరాజకీయ నాయకుల ముఖాన్ని కాపాడండి. కానీ దేశంలోని మతిమరుపు పౌరులమైన మనమే ఈసంఘటనను మరచిపోయి ప్రశ్నించడాన్ని జాతీయ వ్యతిరేకతగా పరిగణిస్తాము.’’అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్నచిన్న భద్రత లోపాలు కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.ఉదాహరణకు హెల్మేట్‌,సీటుబెల్టు,పెట్టుకొని ప్రయాణించక పోవడం ప్రమాదాలకు మరో కారణం.రహదారిపై ప్రయా ణించేటప్పుడు లైప్ట్‌ సైడ్‌ వెళ్లాల్సిన వాహనచోదకులు రైట్‌సైడ్‌ వెళ్తూ ప్రమాదాలకు గురవు తున్నా రు.దీంతోపాటు అతివేగం నియంత్రణ లేకపోవడం.వాహనాలను ఓవర్‌ టేక్‌ చేస్తూ అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాదాలకు పిలుపులుగా మారుతున్నాయి.ఇవన్నీ యాధృచ్ఛకంగా జరుగుతున్న చిన్నచిన్న భద్రత లోపాలే.దేశంలో భద్రతకు ప్రధమ ప్రాధాన్యతమివ్వడం లేదు. రోడ్డు,రైలు మార్గాల భద్రతపట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.అతివేగం,మానవ తప్పిదాల వల్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ భద్రతను పాటించాలి.- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

1 2