విశాఖ ఉక్కుతో కేంద్రం పరిహాసం

ఇటీవల కాలంలో మొత్తం తెలుగు రాష్ట్రాలను రెండు వివాదాలు కుదిపేశాయి. అందు లో ఒకటి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడం. రెండవది ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు లేదా పాలక పార్టీలూ మొదలెట్టిన వృథా వివాదాన్ని ఆపడం. ఇందులో మొదటిది ఇరు రాష్ట్రాల సుహృద్భావానికి, ఉమ్మడి వారసత్వానికి ప్రతీకగా నిలిస్తే రెండవది రాజకీయ పార్టీల సంకుచితత్వానికి అవాంఛనీయ వ్యూహాలకు అద్దం పట్టింది. వాస్తవానికి మొదటి సమస్యపై కూడా రెండో సమస్య తరహాలోనే స్పందనలు రాకపోలేదు. కాని ఇరు రాష్ట్రాలకు శూన్యహస్తమే చూపిస్తున్న మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు విషయంలోనూ క్రూర పరిహాసమే చేసింది. ఈ స్వల్వ వ్యవధిలోనే ఇరు రాష్ట్రాలనూ పాలిస్తున్న గతంలో పాలించిన పెద్ద పార్టీలకు మర్చిపోలేని పాఠాలు నేర్పించి తన ఆధిక్యతనూ ఏకపక్ష బాధ్యతా రాహిత్యాన్ని తనే వెల్లడిరచుకుంది.
ఆగిన గత ప్రయత్నాలు
2021 అక్టోబరు ప్రాంతంలో కేంద్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లేదా రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను వంద శాతం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. దీన్ని ఎవరికి ఎంతకు కట్టబెడతారనే దానిపైనా చాలా కథనాలు వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా భ్రష్టుపట్టిన అదానీ సామ్రాజ్యంలో ఉక్కు ఫ్యాక్టరీని కలిపేస్తారనే వార్తలు వచ్చాయి. ఇంకా దక్షిణ కొరియా కంపెనీ పోస్కో, టాటా వంటి పేర్లన్నీ కూడా వినిపించాయి. 1966లో తెలుగు ప్రజల పోరాటాలు, కమ్యూనిస్టు ఎంఎ ల్‌ఎల రాజీనామాలు, యువత ప్రాణార్పణలతో ఆవిర్భవించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నాడు మార్మోగిన నినాదం. ఇందుకోసం తాము కూడా పోరాడామని తెలంగాణ ప్రభుత్వం అంటున్న మాట కూడా నిజమే. దానికి భూమిని సమకూర్చడం కోసం వేలమంది నిర్వాసితుల య్యారు. ఇప్పటికీ వారిలో అనేకులకు సరైన పరి హారం దొరికింది లేదు. ఆ ఫ్యాక్టరీని ప్రారంభించ డానికి చాలాకాలం పట్టినా ప్రజలు ఓపికగా నిరీక్షించారు. దాన్ని జయప్రదంగా నడిపించడంలో కార్మిక వర్గం ముఖ్యపాత్ర వహించింది. అనేక త్యాగాలు చేసింది. అనతి కాలంలోనే విశాఖ ఉక్కు ప్రపంచ చిత్ర పటంలో చోటు సంపాదించగలి గింది. పెట్టిన పెట్టుబడికి మించి లాభాలు అందిం చింది. అయితే దాని పురోగమనానికి చేయి కలపక పోగా కేంద్రం సైంధవ పాత్ర పోషించింది. సుదీర్ఘ సముద్ర తీరం, నిపుణులైన కార్మిక ఉద్యోగ అధికార బృందంతో మంచి విజయాలు సాధించే ఈ ఫ్యాక్ట రీకి ఇనుప గనులు కేటాయించకుండా తొండి చేసింది. దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగు తున్నా రాష్ట్రంలో పాలకపార్టీలేవీ కేంద్రంలో తాము వున్నప్పుడు కూడా మార్పు తెచ్చింది లేదు. పైగా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ సంకేతాలివ్వడం, కార్మిక సంఘాల నిరసనతో వెనక్కు తగ్గడం జరుగు తూ వచ్చింది. విస్తరణకు నిధులివ్వకపోగాఉత్పత్తిని కుదించడం, కావాలని నష్టాల పాలు చేయ డం వాటి వ్యూహంగా అర్థమైంది. సరళీకరణతో ఈ ధోరణి మరింత ముదిరింది. అయినా కార్మిక సంఘాల ఐక్య ప్రతిఘటన కారణంగా కేంద్రం ఆ పని చేయలేకపోయింది. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి.
మోడీ సర్కారు ఏకపక్ష దాడి
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల ఉపసంహరణ అనే ప్రక్రియను పెద్ద ఆర్భాటంగా సాగించడం, అదానీ వంటి ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం నిత్యకృత్యమైంది. అయినా మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే విశాఖకు ఎసరుపెట్టే చర్యలు తీసుకున్న కేంద్రం మలి దఫా గద్దెక్కాక నేరుగా దాడి తీవ్రం చేసింది. వంద శాతం ప్రైవేటీకరణ చేయనున్నట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వాజ్‌పేయి హయాం లోనే ఇలాంటి ప్రతిపాదన వస్తే తాము అడ్డుకున్నా మని చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుం టారు. కానీ మోడీ ప్రభుత్వంలో దీర్ఘకాలం పాటు భాగస్వామిగా వున్న ఆ పార్టీ నేతలు ఈ విషయమై సంకేతాలు వస్తున్నా నిరోధించే తీవ్ర ప్రయత్నమేదీ చేయలేదు. ఇప్పుడున్న వైసిపి జగన్‌ ప్రభుత్వం కూడా ముందస్తుగా అడ్డుకోకపోగా ప్రకటన వచ్చాక కూడా నీళ్లు నములుతూ కూర్చుంది. ప్రైవేటీకరణ తరహాలో వాటాలు విడుదల చేయాలని, భూములు అమ్మి అప్పులు కట్టాలనీ ముఖ్యమంత్రి మొదట్లోనే విడ్డూరమైన ప్రతిపాదనలతో లేఖ రాశారు. మరో వైపున కార్మిక సంఘాలు, వామపక్షాలు నిశితంగా వ్యతిరేకించడమే గాక సమరశీల పోరాటం మొదలె ట్టాయి. ఆ దశలో విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి తాము గట్టిగా మాట్లాడతామంటూ వారితో నమ్మబలికారు గాని ఆ దిశలో జరిగింది శూన్యం. టిడిపి,వైసిపి ఒకరినొకరు విమర్శించుకోవడమే తప్ప కేంద్రంపై ఏకోన్ముఖ పోరాటానికి సిద్ధం కాలేదు. బిజెపి ఎ.పినాయకులు రకరకాల మాటలతో గంద రగోళం పెంచడమేగాక ప్రైవేటీకరణ వల్ల ఉద్యో గాలకేమీ ముప్పు రాదని సమర్థన ఎత్తుకున్నారు. రామతీర్థం వంటి మతపరమైన అంశాలతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. బిజెపి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కేంద్రంతో మాట్లాడుతున్నానంటూనే రాష్ట్రానిదే తప్పని వింత వాదన తెచ్చారు. అఖిల పక్షాన్ని తీసుకువెళ్లడానికి జగన్‌ సిద్ధం కాకపోవడం వల్లనే ఇదంతా జరిగిం దన్నారు. ఈవిధంగా మూడు పార్టీలు అవకాశవాద రాజకీయాలు అనుసరించడం బిజెపికి కొమ్ములు తెచ్చింది. కార్మిక సంఘాలు మాత్రం ఎవరి విధా నం ఎలా వున్నా అందరినీ కలుపుకొని లక్ష్యం సాధించడమే తమ మార్గమంటూ అందరికీ సహకారం అందించారు. మరో వంకన ఫ్యాక్టరీ స్థాపనకు దారితీసిన పరిస్థితులు మొదటి నుంచి కేంద్రం సాగించిన నయవంచన, లెక్కల టక్కుటమారం బహిర్గతం చేయడం ద్వారా గొప్ప సైద్ధాంతిక పోరాటం కూడా చేశాయి. స్వంత ప్రత్యేక గనులు (క్యాప్టివ్‌ మైన్స్‌) కేటాయించక పోవడం వెనక గల దుష్ట తంత్రం ఏమిటో, నష్టాలు ఎందుకు వచ్చాయో తెలియజెప్పాయి. ఈ చర్చ మొదలైన తర్వాత కూడా జరిగిన గనుల కేటాయిం పు సమయంలో ఒరిస్సా లోని గనుల కోసం ఒత్తిడి తెచ్చాయి. విశాఖ యాజమాన్యం కూడా వేలం పాటలో పాల్గొంది.కాని కేంద్రం కావాలని ప్రైవే టు కంపెనీలకే ప్రాధాన్యతనిచ్చింది.విశాఖ ఉక్కు అభ్యర్థనను పట్టించుకోలేదు.
మోడీ మొండి చేయి!
కార్మిక సంఘాల పోరాటం తీవ్రమైన కొద్దీ తమ నిర్ణయంలో మార్పు లేదని చెప్పడం పనిగా పెట్టుకుంది. ఇందుకోసం లీగల్‌,అసెస్‌ మెంట్‌,బిడ్డింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. మొదట్లో అదానీ,టాటా,దక్షిణ కొరియాకు చెందిన పోస్కో వంటి కంపెనీలు తీసుకోవచ్చనే కథలు వినిపించాయి. వ్యూహాత్మకంగానే టాటాల పేరు తెచ్చినట్టు కూడా చెప్పారు. కొద్ది మాసాల కిందట ప్రధాని మోడీ విశాఖ వచ్చినప్పుడు పాల్గొన్న బహి రంగసభ వేదికపై ముఖ్యమంత్రి జగన్‌ మొక్కుబడిగా విశాఖ ఉక్కు ప్రస్తావన తెచ్చారే గాని గట్టిగా మాట్లాడిరది లేదు. ఆయన స్పందన అంతకన్నా లేదు. అప్పుడే ప్రధానితో స్వల్ప సమావేశం జరిపిన పవన్‌ కళ్యాణ్‌ కూడా మంచిరోజులు వస్తాయని చెప్పడం తప్ప దీనిపై సాధించింది లేదు. కాకపోతే ఈ లోగా అదానీ బండారం బయిటపడిపోయింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి గనక కొంతకాలం కొత్త ఎత్తులతో కాలక్షేపం చేయొచ్చని బిజెపి వర్గాలు వెల్లడిరచాయి.
బిడ్ల ప్రహసనం, గడువు పెంపు
మొదటి నుంచి ఈప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్న కెసిఆర్‌ ఈ దశలో రంగంలోకి దిగి అమ్మకమే జరిగేట్టయితే తాము కూడా వేలంలో పాల్గొని కొనుగోలు చేస్తామనడంతో కొత్త వివాదం మొదలైంది. తెలంగాణ సర్కారు చూపిన పాటి తెగువ కూడా జగన్‌ ఎందుకు చూపడం లేదనే ప్రశ్న వచ్చింది.అత్యుత్సాహవంతులైన వైసిపి మంత్రులు బిఆర్‌ఎస్‌పై దాడి చేసేవరకూ వెళ్లారు. అయితే అక్కడ అమ్మకమే లేదని ఆసక్తి వ్యక్తీకరణ పేరిట వర్కింగ్‌ పెట్టుబడిని మాత్రమే ఆహ్వానిస్తు న్నారని ఎ.పి సర్కారు సలహాదారు సజ్జల రామ కృషా ్ణరెడ్డి సమర్థించారు. తాము విశాఖ ఉక్కు కొనుగోలు చేయడం కోసమనిగాక అక్కడ పరిస్థితిని, అవకాశాలను అధ్యయనం చేయడం కోసం అధికా రుల బృందాన్ని పంపుతామని కెటిఆర్‌ ప్రకటిం చారు. ఇది విశాఖ ఉక్కుపై జగన్‌ ప్రభుత్వ స్పంద నా రాహిత్యానికి సవాలేనని అందరూ భావించారు. కార్మిక సంఘాలూ ఆహ్వానించాయి. ఈదశలో సందర్శనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే తాము ఇప్పుడు ప్రైవేటీ కరణ కోసం గాక నిర్వహణ సామర్థ్యం పెంచే పెట్టుబడి కోసమే ప్రయత్నిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు. దీన్నిబట్టి తమవల్లనే కేంద్రం వెనక్కు తగ్గిందని, ఇది తెలంగాణ దెబ్బ అని కెటి ఆర్‌తో సహా బిఆర్‌ఎస్‌ నాయకులు నిన్న మధ్యా హ్నానికి హడావుడి మొదలెట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు అంతగా తొందరపడకపోగా సాయంత్రం సమావేశంలో అదే కేంద్ర మంత్రిని స్పష్టత కోసం నిలదీశారు. దాంతో తానేమీ చెప్పలేనని ఆయన గొంతు మార్చారు. ప్రజాశక్తిలో నిన్న ఉదయమే కేంద్రం వంచన అంటూ పతాక శీర్షిక వచ్చింది. దాంతో సూటిగా తాము ప్రైవేటీ కరణకే కట్టుబడి వున్నట్టు కేంద్రం మొండి వైఖరిని పునరుద్ఘాటించింది. దాంతో ఒకప్రహసనం ముగి సింది. ఈ రోజు తెలంగాణ లేదా సింగరేణి తర పున బిడ్‌ దాఖలు కాలేదని సమాచారం. ఆ గడు వును మరో ఐదు రోజులు పొడగించినట్టు చెబుతు న్నారు. విశాఖ నుంచి మళ్లీ లోక్‌సభకు పోటీ చేస్తానని ప్రకటించిన సిబిఐ మాజీ జె.డి లక్ష్మీనారా యణ కూడా బిడ్‌ వేసి క్లౌడ్‌ఫండిరగ్‌తో ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఇవేవీ కూడా సమస్యకు అసలైన పరిష్కారాలు కావు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల చొరవతో మరో సమైక్య ఉద్యమం జరిపి దాన్ని ప్రభుత్వరంగంలోనే కొనసాగించేలా కేంద్రం మెడ వంచాల్సిందే. అందుకు భిన్నంగా ఎ.పి ప్రాంతీయ పార్టీలు తమ మెడలు వంచి మోడీకి వంత పాడుతుండటం దారుణం.20వ తేదీ తర్వాత కూడా ఈ పరిస్థి తిలో మార్పు ఆశించలేము. పైగా విశాఖ ఉక్కు సమర్థత పెంచడానికి వర్కింగ్‌ పెట్టుబడి సమకూ ర్చడం మరింత పటిష్టం చేసి ప్రైవేటు కార్పొరేట్‌కు కట్టబెట్టే కుట్రమాత్రమే.
వివాదాలు హానికరం
విశాఖ ఉక్కు అమ్మకంలో సాంకేతి కంగా తెలంగాణ సర్కారు లేదా సింగరేణి వారు పాల్గొనవచ్చునా, నిబంధనల మేరకు అందుకు కేంద్రం అనుమతినిస్తుందా అనేది ఇంకా అస్పష్టమే. అందుకు ఆటంకం కలిగించే నిబంధనలు కొన్ని వున్నాయి. అయితే విశాఖ ఉక్కును కాపాడుకో వడం కోసం ఇరు రాష్ట్రాల ప్రజల బలీయమైన ఆకాంక్షకు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిందే. ఇలాంటి సమయంలో తెలం గాణ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు వాటిపై ఎ.పి మంత్రుల ప్రతిసవాళ్లు వివాదానికి దారితీయ డం దురదృష్టకరం.ఎనిమిదేళ్ల కిందటే విడిపోయి ఇంకా విభజన సమస్యలు కూడా పరిష్కారం గాని రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర వ్యతిరేక భావాలకు ఆస్కారం ఇవ్వడం సరైంది కాదు. బిఆర్‌ఎస్‌, వైసిపి లు పార్టీలుగా వాదించుకోవచ్చు గాని సోదర రాష్ట్రా లుగా సవాళ్లు, ప్రతి సవాళ్లతో రెచ్చగొట్టుకోవడం ఉభయులకూ శ్రేయస్కరం కాదు. తమ తమ పథకాలను ఎవరైనా కీర్తించుకోవచ్చు గాని అంతిమ తీర్పరులు ప్రజలే. (ప్రజాశక్తి సౌజన్యంతో..)

ప్రజాస్వామ్యం బలహీనపడుతుందా?

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడు తోందని స్వీడన్‌కు చెందిన వీ-డెమ్‌ ఇన్‌స్టి ట్యూట్‌ ఒక నివేదికలో పేర్కొంది. భారత్‌తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని ఈ నివేదిక చెప్తోంది. స్వీడన్‌లోని గూటెన్‌బర్గ్‌ విశ్వవిద్యా లయానికి అనుబంధంగా వీ-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పనిచేస్తోంది.‘ఉదారవాద ప్రజా స్వామ్య సూచీ’ (లిబరల్‌ డెమొక్రసీ ఇండెక్స్‌) పేరుతో మొత్తం179 దేశాలకు ఈ సంస్థ ర్యాంకులు ఇచ్చింది. ఇందులో భారత్‌ 90వస్థానంలో నిలవగా,డెన్మార్క్‌ మొదటి స్థానం పొందింది. భారత్‌ పొరుగు దేశాలైన శ్రీలంక 70వ స్థానంలో, నేపాల్‌ 72వ స్థానంలో, పాకిస్తాన్‌ 126 స్థానంలో, బంగ్లాదేశ్‌ 154వ స్థానంలో నిలిచాయి. మోదీ ప్రభుత్వ పాలనలో మీడియా, పౌర సమాజం, ప్రతిపక్షాలకు స్థానం సన్నగిల్లు తుండటంతో భారతదేశం ప్రజాస్వామ్య హోదాను కోల్పోయే దిశలో ఉందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలను, స్థానిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని దీన్ని తయారుచేసినట్లు వీ-డెమ్‌ ప్రతినిధులు తెలిపారు. సంక్లిష్టమైన డాటా ఆధారంగా ఈ రిపోర్ట్‌ తయారు చేశామని, అందువల్ల ఇది, మిగతా రిపోర్టుల కన్నా భిన్నమైందని తెలిపారు.
ప్రజాస్వామ్యం అంటే…
‘‘ప్రజాస్వామ్యానికి ఎనిమిది లక్షణాలు ఉండాలి. అవి…భావ ప్రకటన స్వేచ్ఛ, లౌకికవాదం (సెక్యులరిజం), మత జోక్యం లేని ప్రభుత్వం, గణతంత్ర వ్యవస్థ, చట్టం ముందు అందరికీ సమానత్వం, ప్రాథమిక హక్కులు, ఓటు హక్కు’’ ఉండాలని ప్రసార భారతి మాజీ ఛైర్మన్‌ ఎ.సూర్య ప్రకాశ్‌ అన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుందని ఆయన అన్నారు.‘‘ప్రతి దేశంలోనూ ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. మొత్తం తప్పును మోదీ ప్రభుత్వంపై మోపుతున్నారంటే, వాళ్లకి మన రాజ్యాంగం అర్థం కాలేదనే అనుకోవాలి. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాల్లో సగం వాటిలో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో 42 పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కూటమే! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో సహా పలు దేశాల నేతలు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశంసిస్తున్నారు’’ సూర్య ప్రకాశ్‌ అన్నారు. ‘‘భారత్‌లో తగ్గిపోతున్న ప్రజాస్వామ్య విలువలు, ముఖ్యంగా ఉదారవాదం క్షీణిస్తున్న పరిస్థితిని చాలావరకూ వీ-డెమ్‌ నివేదిక తెలియజేస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వతంత్రకు ముప్పు, భిన్నాభిప్రాయాలను అణచివేయడం లాంటి విషయాల్లో ప్రభుత్వ అసహనం కనిపి స్తోంది’’ అని అబ్జర్వర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రజాస్వామ్య నిపుణులు నిరంజన్‌ సాహూ అన్నారు. ‘‘భారత్‌లో మీడియాకు స్థానం తగ్గిపోతోందని ఈ నివేదికలో తెలిపారు. గత ఎనిమిది, పదేళ్లల్లో మన దేశంలో ఏం జరిగిందనే వీళ్లకు తెలీదు. ‘రిజిస్టార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌’ ప్రతి సంవత్సరమూ కొన్ని గణాంకాలను విడుదల చేస్తుంది. వీటి ప్రకారం 2014లో దినపత్రికల సర్క్యులేషన్‌ 14 కోట్లు ఉండగా, 2018కి అది 24 కోట్లకు పెరిగింది. దేశంలో ఉన్న 800 టీవీ ఛానళ్లలో 200 న్యూస్‌ ఛానల్స్‌ ఉన్నాయి. ఐదేళ్లల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు 15 కోట్ల నుంచీ 57 కోట్లకు పెరిగాయి. నియంతృత్వమే ఉంటే మీడియా ఇంతలా ఎలా విస్తరిస్తుంది? రోజూ టీవీ ఛానళ్లల్లో అనేకరకాల చర్చలు జరుగు తుంటాయి. ఒకరోజంతా సోషల్‌ మీడియాలో మోదీని దూషిస్తూ ఉన్న హాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవ్వడం గమనించాను. మీడియా స్వేచ్ఛ లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి?’’ అని సూర్య ప్రకాశ్‌ అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్రవంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ట్వీట్ల ఆధారంగా అరెస్టులు జరిగాయి. కానీ దానికి మోదీ బాధ్యులు ఎలా అవుతారు? రాష్ట్రాల్లో న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని తెలీదా?’’ అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపమా?
‘‘ఒకప్పుడు భారతదేశంలో ప్రభుత్వ ఒత్తిడికి లొంగని న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం ఉండేవి. వీటి పనితీరు ప్రపంచ దేశాల ప్రశంసలు పొందింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ సంస్థలన్నిటినీ ప్రభుత్వానికి అనుగుణంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్యకర్తలను, ప్రతిపక్ష నాయకులను నెలల తరబడి, బెయిల్‌ కూడా ఇవ్వకుండా నిర్బంధంలో ఉంచుతున్నారు. వీటన్నింటినీ చూస్తూ న్యాయ వ్యవస్థ ముఖం తిప్పుకుంటోంది. ఇలాంటి చర్యలకు జవాబు దారీతనం ఉండేలా చూసే యంత్రాంగం మాయమైపోయింది’’ అని నిరజంన్‌ సాహూ అన్నారు. ‘‘మత రాజకీయలకు పెద్ద పీట వేశారు. సోషల్‌ మీడియా ద్వారా మత రాజకీయలు ఎక్కువగా నడుస్తున్నాయి. దీనివల్ల పాలక వర్గం రాజకీయ లబ్ధి పొందుతోంది. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛకు ప్రతికూలత ఏర్పడుతోంది. దేశంలో రాజకీయ వాతావరణం విషపూరితం అవుతోంది. మైనారిటీలను, ప్రతిపక్ష నాయకులను విలన్లుగానూ, దేశ ద్రోహులుగానూ చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ఆయన అభిప్రా యపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితిపై ఇంతకుమునుపు కూడా కొన్ని నివేదికలు వచ్చాయి. వీ-డెమ్‌ ఒక్కటే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మరి కొన్ని సంస్థలు కూడా ఇలాంటి నివేదికలను సమర్పించాయి.
అమెరికాకు చెందిన ‘ఫ్రీడం హౌస్‌’ సంస్థ 2019 ఘటనల ఆధారంగా విడుదల చేసిన నివేదిక… ‘‘మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, భిన్నత్వానికి భంగం కలుగుతోంది. ఇలా అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కువకాలం మనుగడ సాగించలేదు’’ అని పేర్కొంది.2017లో సివికస్‌ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో…. ‘‘భారతదేశంలో పౌర సమాజం స్థానం క్షీణిస్తోంది. 2014లో మోదీ ప్రభుత్వం పాలనలోకి వచ్చినప్పటినుంచీ ప్రజాస్వామ్యం నాణ్యత తగ్గుతోంది. ప్రతిపక్షాల స్థానం సన్నగిల్లుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినవారిని లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయి’’ అని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఇలాగే ఉందా?
జీ-20లోని అన్ని ప్రధాన దేశాలూ, అన్ని రంగాల్లోనూ నియంతృత్వ పోకడలను కనబరు స్తున్నాయని..భారత్‌, అమెరికా, టర్కీ, బ్రెజిల్‌ వంటి దేశాలలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని వీ-డెమ్‌ నివేదికలో పేర్కొన్నారు. ‘‘భారతదేశంలో కనిపిస్తున్న నియంతృత్వం, ప్రపంచంలో కొనసాగుతున్న నియంతృత్వంలో భాగమే. ప్రపంచ మార్గాన్నే భారతదేశం కూడా అనుసరిస్తోంది. ఈ ధోరణి కొనసాగితే ప్రపం చంలో 80 శాతం దేశాలు నితంతృత్వ దేశాలుగా మారే అవకాశాలున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం’’ అని వీ డెమ్‌ అధ్యక్షులు స్టాఫన్‌ లిండ్బర్గ్‌ అభిప్రాయపడ్డారు.‘‘దీనికి కారణం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే లోపాలున్నాయని అనుకునే అవకాశం ఉంది. అది మరింత ప్రమాదకరం. పోలాండ్‌, టర్కీ, భారత్‌, బ్రెజిల్‌, హంగేరీ, అమెరికా వంటి దేశాలలో నియంతృత్వ పోకడలు పెరుగుతున్నాయన్న విషయంలో సందేహం లేదు. అయితే ఈ ధోరణి గత దశాబ్దాలలో కూడా ఉందనే చెప్పాలి’’ అని నిరంజన్‌ సాహూ అభిప్రాయపడ్డారు.
‘‘నియంతలు రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యంలోని అన్ని నిబంధనలను ఉపయోగించి అధికారంలోకి వస్తారు. అధికారంలో ఎక్కువకాలం కొనసాగడానికి చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు’’ అని లిండ్బర్గ్‌ అన్నారు.ఇందుకు టర్కీని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్‌ పార్లమెంటును ఉపయోగించి రెండుసార్లు రాజ్యంగాన్ని మార్చివేశారు. ‘‘కరోనా మహమ్మారి కాలంలో భారతదేశంలో కొన్ని ప్రజాస్వామిక విలువలు దెబ్బతిన్నాయన్నది వాస్తవమే. కొన్ని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ తప్పుదారి పట్టింది. కొన్ని అకారణ అరెస్టులు జరిగాయి. అయితే, ప్రజాస్వామ్య మూలాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయలేదు’’ అని సూర్య ప్రకాశ్‌ అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యం అనేది గ్రీకు పదం, ‘‘డెమోస్‌’’ నుండి వచ్చింది, అంటే ప్రజలు. ప్రజాస్వా మ్యంలో, శాసనసభ్యులు మరియు ప్రభుత్వంపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నవారు ప్రజలే. ప్రపంచంలోని వివిధ ప్రజాస్వామ్యాలకు సూక్ష్మ నైపుణ్యాలు వర్తింపజేసినప్పటికీ, కొన్ని సూత్రాలు మరియు పద్ధతులు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఇతర ప్రభుత్వాల నుండి వేరు చేస్తాయి.
ా ప్రజాస్వామ్యం అంటే అధికారం మరియు పౌర బాధ్యతను పౌరులందరూ నేరుగా లేదా వారి స్వేచ్ఛగా ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా వినియోగించుకునే ప్రభుత్వం.
ా ప్రజాస్వామ్యం అనేది మానవ స్వేచ్ఛను రక్షించే సూత్రాలు మరియు అభ్యాసాల సమితిబీ అది స్వేచ్ఛ యొక్క సంస్థాగతీకరణ.
ా వ్యక్తిగత మరియు మైనారిటీ హక్కులతో పాటు మెజారిటీ పాలన సూత్రాలపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అన్ని ప్రజాస్వామ్యాలు, మెజారిటీ ఇష్టాన్ని గౌరవిస్తూ, వ్యక్తులు మరియు మైనారిటీ సమూహాల ప్రాథమిక హక్కులను ఉత్సాహంగా పరిరక్షిస్తాయి.
ా ప్రజాస్వామ్యాలు సర్వశక్తిమంతమైన కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తాయి మరియు ప్రాంతీయ మరియు స్థానిక స్థాయిలకు ప్రభుత్వాన్ని వికేంద్రీకరిస్తాయి, స్థానిక ప్రభుత్వం ప్రజలకు వీలైనంత అందుబాటులో మరియు ప్రతిస్పందించేదిగా ఉండాలి.
ా వాక్‌ స్వాతంత్య్రం మరియు మతం వంటి ప్రాథమిక మానవ హక్కులను పరిరక్షిం చడం వారి ప్రధాన విధుల్లో ఒకటి అని ప్రజాస్వామ్యాలు అర్థం చేసుకున్నాయి. చట్టం ప్రకారం సమాన రక్షణ హక్కు, సమాజం యొక్క రాజకీయ,ఆర్థిక మరియు సాంస్కృతిక జీవితంలో పూర్తిగా నిర్వహించడానికి మరియు పాల్గొనడానికి అవకాశం.
ా ప్రజాస్వామ్యాలు పౌరులందరికీ బహిరంగంగా ఉచిత మరియు న్యాయమైన ఎన్నికలను నిర్వహిస్తాయి. ా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నియంతలు లేదా ఒకే పార్టీ వెనుక దాక్కున్న ముఖద్వారాలు కావు, కానీ ప్రజల మద్దతు కోసం ప్రామాణికమైన పోటీలు.
ా ప్రజాస్వామ్యం ప్రభుత్వాలను చట్ట పాలనకు లోబడి చేస్తుంది మరియు పౌరులందరికీ చట్టం క్రింద సమాన రక్షణ లభించేలా మరియు వారి హక్కులు న్యాయ వ్యవస్థ ద్వారా రక్షించబడుతున్నాయని నిర్ధారిస్తుంది.
ా ప్రజాస్వామ్యాలు విభిన్నమైనవి, ప్రతి దేశం యొక్క ప్రత్యేక రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రజాస్వామ్యాలు ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటాయి, ఏకరీతి పద్ధతులపై కాదు.
ా ప్రజాస్వామ్యంలో పౌరులకు హక్కులు మాత్రమే కాదు, వారి హక్కులు మరియు స్వేచ్ఛలను రక్షించే రాజకీయ వ్యవస్థలో పాల్గొనే బాధ్యత కూడా వారికి ఉంది.
ా ప్రజాస్వామ్య సమాజాలు సహనం, సహకారం మరియు రాజీ విలువలకు కట్టుబడి ఉంటాయి. ఏకాభిప్రాయానికి రాజీ అవసరమని ప్రజాస్వామ్యాలు గుర్తించాయి మరియు అది ఎల్లప్పుడూ సాధించబడకపోవచ్చు. మహాత్మా గాంధీ మాటలలో, ‘‘అసహనం అనేది హింస యొక్క ఒక రూపం మరియు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక అడ్డంకి.’’
ప్రజాస్వామ్యం ద్వారా పొందిన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోంది. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం ‘గోప్యత నిర్వీర్యం..అణచివేత..నిఘా..’ అనే ఫార్ములాను అనుసరిస్తోంది. ఓ వైపు రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తూనే..ప్రజా ఉద్యమాలను అణచి వేస్తోంది. నిర్బంధాలను అమలు చేస్తోంది. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన చట్టసభలు, ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థ, న్యాయ వ్యవస్థతోపాటు మీడియాపై నిఘా పెట్టి.. ఎవరైనా తమకు అనుకూలంగా లేనట్టు తేలితే వారిని ముప్పు తిప్పలు పెడుతోంది. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి పారదర్శకంగా ఉండాల్సిన విధానాల పట్ల గోప్యతను పాటిస్తోంది. 2014లో అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి కాషాయ పార్టీ పాటిస్తున్న విధానాలను చూస్తే ఇది స్పష్టమవుతోంది.-(మహమ్మద్‌ ఆరిఫ్‌/జుబేర్‌ అహ్మద్‌)

ధరల మోత

దేశంలో ధరల మోత మోగుతోంది. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం ధరల భారాన్ని మోయలేక పోతున్నారు. నిత్యం పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజల్‌ ధరల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిరదిం. దీనికితోడు చమురు కంపెనీలు గ్యాస్‌ ధరలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. మే డే కానుకగా వాణిజ్య వంట గ్యాస్‌ సిలిండర్‌ బండపై 104 రూపాయలను వడ్డించింది.19 కేజీల వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులపై ఈభారం మోపింది. నెలవారీ సమీక్షలో భాగంగా,ఒకేసారి 104 రూపా యలను పెంచేసింది. దీంతో నగరం లో కమర్షియ ల్‌ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2563కు చేరింది.గతంలో దీని ధర రూ.2460గా ఉండేది. ఇక దేశ రాజధాని ఢల్లీిలో ఈ ధర రూ.102.05 పైసలు పెరగడంతో సిలిండర్‌ రూ.2355కు చేరుకుంది. అలాగే, ముంబైలో రూ.2329.50 గాను, కోల్‌కతాలో రూ.2477.50గాను, చెన్నైలో రూ.2508కు చేరుకుంది.
సామాన్యులపై పెనుభారం
ఒకటి కాదు రెండుకాదు ఏకంగా అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి%ౌౌ% ఎండలు పెరిగినట్లే ధరలు కూడా పెరిగిపోతుం డటంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. సంపాదన అంతంత మాత్రంగానే ఉండటం ధరలు పెరిగి పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కొనేదెలా, తినేదెలా అంటూ తలలు పట్టుకుంటు న్నారు.. రెక్కలు ముక్కలు చేసుకున్నా కుటుంబానికి మూడుపూటల భోజనం పెట్టే పరిస్థితులు కనిపిం చడం లేదు.. గ్యాస్‌నుండి మొదలుకుని విద్యుత్తు చార్జీలు, పెట్రో ధరలు. నిత్యవసర వస్తువుల ధర ఇలా చెప్పుకుంటూపోతే లీస్టు పెద్దదిగానే ఉం టుంది. ధరల పెంపు మధ్యతరగతి వర్గాల నడ్డి విరుస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే తమ కుటుంబానికి మూడుపూటలతిండి పెట్రో పరిస్థి తులు.. అదే ఒకరే పనిచేస్తే వారి కష్టాలు చెప్పనక్కర లేదు.
మరో కొన్నిరోజుల్లో విద్యుత్తు చార్జీల మోత..
మరో కొన్ని రోజుల్లో విద్యుత్తు చార్జీల మోతమోగనుంది. ఏప్రిల్‌ 1వ తేదీనుండి చార్జీలు పెంచుతూ విద్యుత్తు రెగ్యులరేటరీ కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఉగాదిపండగకు ముందే విద్యుత్తు చార్జీలు పెరగనున్నాయి. గృహ కనెక్షన్లకు సంబం ధించి యూనిట్‌పై 50పైసలు వాణిజ్య సంస్థలపై యూనిట్‌పై రూపాయి చొప్పున భారం మోపను న్నారు.అసలే వేసవి కాలం కావడంతో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. మధ్యతరగతి వర్గాల ప్రజలు ప్యాన్లు, కూలర్లు వినియోగిస్తుండగా ధనవంతులు మాత్రం ఏసీలు వినియోగిస్తున్నారు. ఎండలు ముదరడంతో వీటి వినియోగం పెరిగింది. అసలే ఎండకాలంలో విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వస్తాయి. దీనికితోడు పెంచిన చార్జీలు జతకా వడంతో బిల్లుల మోత మోగనుంది. పెంచిన విద్యు త్తు చార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీనుండి అమలులోకి రానుంది. ఉగాది పండగ కంటే ముందే విద్యుత్తు చార్జీలు పెరగనున్నాయి.
పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు..
నాలుగుమాసాలపాటు పెట్రో ధరలు పెరగలేదు. అందరూ హమ్మయ్యా అని ఊపిరిపీల్చు కున్నారు.దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యం లో పెట్రో ధరలు పెంచలేదనే విమర్శలు ఎదుర్కొం టోంది కేంద్రం. ఎన్నికల ప్రక్రియ ముగియగానే వరుసబెట్టి పెట్రో ధరలు పెంచుతోంది. ఏడురోజు లుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏడురోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.4 పైనే భారం పడుతోంది. తాజాగా సోమవారం రోజు లీటర్‌ పెట్రోల్‌పై 50 పైసలు వడ్డించారు. డీజిల్‌పై 35 పైసల భారం మోపారు. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌కు రూ.112.71కిచేరగా డీజిల్‌ లీటర్‌కు రూ. 99. 07 చేరింది. పెట్రోధరలు ఇలాగే పెరిగితే మాత్రం రెండుమూడురోజుల్లో డీజిల్‌ధరలు సెంచరీ దాటి పోయే పరిస్థితులు నెలకొన్నాయి. సామా న్యులపై పెట్రో భారంఎక్కువగా కనిపిస్తోంది. నేడు అందరి వద్ద ద్విచక్రవాహనాలు ఉన్నాయి. మధ్యతరగతి వర్గాల ప్రజలు కూడా కార్లు వినియోగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాత కార్ల కొనుగోలు ఎక్కువగా జరిగింది. ద్విచక్ర వాహనం డబ్బులకు పాత కారు రావడంతో చాలామంది కార్లు కొనుగోలు చేశారు. వీరందరిపై భారం పడుతోంది. గతంలో మాది రిగా రోజురోజుకు పెట్రో వడ్డన చేస్తుండటంతో మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆందోళన చెందు తున్నారు. ఇదేమి భారమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఏడురోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రేకు పడుతుందనే నమ్మ కంతో ప్రజలున్నా ఇప్పట్లో సాధ్యమయ్యే అవకా శాలు లేవనే ప్రచారం కూడా సాగుతోంది.
నిత్యవసర వస్తువుల ధరల పెంపు..
నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పప్పులు నూనె ధరలు ఒక్క సారిగా పెరిగిపోయాయి. ఎక్కువగా వినియోగించే వస్తువుల ధరలు పెరిగిపోవడంతో వెనకా ముందుచూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నూనె ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో నూనెప్యాకెట్‌ రూ.210 దాటిపోయింది. విడతల వారీగా కాకుండా ఒకేసారి ధర పెరగడంతో ఇబ్బందిపడాల్సిన పరిస్థి తులు నెలకొన్నాయి. గ్యాస్‌ ధరలతోపాటు నూనె ధరలు కూడా పెరిగిపోవడంతో మహిళలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. నూనె ధరలే కాకుండా ఇతర నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగిపో యాయి. కరోనా సీజన్‌ ప్రారంభమైన తరువాత నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. పెరుగుతూ పోతున్నాయి తప్పిస్తే ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల ధరలు మరింతగా పెరిగి పోయాయి. నూనె ధరలు సలసల మరుగుతుం డటంతో వెనకాముందు చూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యవసర వస్తువుల ధరలతోపాటు చికెన్‌ ధరలు కూడా పెరిగిపో యాయి. వేసవి కాలంలో చికెన్‌ ధర రూ.200 లోపే ఉండేది.. ప్రస్తుతం రూ.280నుండి రూ. 300 వరకు ధర పలుకుతోంది.
ఆర్టీసీ బాదుడే బాదుడు
నాలుగేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. కనీస చార్జీని రూ.5 నుంచి రూ.10కు చేశారు. గతంలో కనీస చార్జీని రూపాయి లోపు పెంచేవారు. చిల్లర సమస్య లేకుండా ఉం డేందుకు కనీస చార్జీని రెట్టింపు చేశామని చెప్పిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఉదాహరణకు గన్నవరం నుంచి విజయవాడ వచ్చే పల్లె వెలుగు బస్సులో 2019లో చార్జీ రూ.20 ఉండేది. ఇప్పుడు రూ.35 కు పెంచారు. సిటీ ఆర్డినరీ బస్సులో 2019లో రూ.25గా ఉన్న చార్జీని రూ.40కు పెంచారు. ఇలాజనాల జేబుల్లో నుంచి అదనంగా రూ.1500 కోట్లు లాగేస్తున్నారు.
ఇసుకలోనూ దోపిడీ
గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇచ్చింది. వాహనాల అద్దె ఖర్చు మాత్రం భరిం చాల్సి వచ్చేది. ఇప్పుడు ఇసుకను కోట్లు కొల్లగొట్టే వ్యాపారంగా మార్చేశారు. ప్రస్తుతం ఇసుక రేటు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. పల్నాడు జిల్లా సర్సరావుపేటలో టన్ను ఇసుక ధర రూ.800 వరకు ఉంది. రవాణా ఖర్చులు అదనం. వైసీపీ పెద్దలు జిల్లా వారీగా కాంట్రాక్టుకు ఇచ్చి దోచుకుం టున్నారనే ఆరోపణలున్నాయి.
పప్పు, పంచదార కట్‌
కేరళ ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా14రకాల నిత్యావసరాలను పంపిణీ చేస్తోం ది.ఉప్పు,పప్పు,చింతపండు,మిరపకా యలు కూడా ఇస్తోంది. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం పండ గొస్తే రేషన్‌ దుకాణాల ద్వారా నెయ్యి, బెల్లం సహా 14 రకాల వస్తువులు పంపిణీ చేసేది. జగన్‌ సర్కార్‌ వచ్చాక పరిస్థితి మారిపోయింది. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ను కేవలం అప్పుల కోసం వాడు కుంది. పేదలకు చౌకధరకు బియ్యం, ఇతర వస్తు వులు అందించడానికి ప్రభుత్వం ఏటా ఆ కార్పొ రేషన్‌కు రూ.3,000 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాది కూడా సబ్సిడీ సొమ్ము ఇవ్వలేదు.పైగా కార్పొరేషన్‌కు గ్యారెంటీ ఇచ్చి, ఆస్తులు తాకట్టు పెట్టి వేల కోట్ల రుణం తీసుకుంది. ఇప్పుడు దాని ద్వారా అప్పులు చేసే అవకాశం లేకపోవడంతో పూర్తిగా వది లేసింది. రేషన్‌లో ఇచ్చే పప్పు, పంచదారను 75 శాతం మేర జగన్‌ ప్రభుత్వం ఆపేసింది. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలు, కార్మికులతో పాటు చిరుద్యోగులు, మధ్యతరగతి వర్గాల వారికి ధరలు భారంగా మారాయి. నలుగురు సభ్యులున్న చిన్న కుటుంబానికి పాలు, పెరుగు, కిరణా సరుకులు, కూరగాయలు, బియ్యం తదితర నిత్యావసరాలకు గతంలో నాలుగేళ్ల క్రితం రూ.6 వేలు ఖర్చు కాగా.. ఇప్పుడు రూ.10 వేలు దాటిపో తోంది. రూ.500పెట్టి కూరగాయలు కొంటే వారం రోజులు కూడా రావడం లేదని జనం వాపోతు న్నారు. ఇక వంట గ్యాస్‌, ఇంటి అద్దె తదితరాలు కలిపితేఖర్చు తడిసి మోపెడవుతోంది. గృహ అవస రాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్‌ సిలిండరు ధరరూ.1200కు చేరువైంది.దీంతో నెలవారీ ఇంటి బడ్జెట్‌ను తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
దేశంలోనూ ఇదే పరిస్థితులు
ఈ ధరాభారం మోయలేక సామా న్యుల నడ్డి విరుగుతున్నది. అసలు ధరలు ఆకాశాన్ని ఎందుకు అంటుతున్నాయన్నది మీ మధురస్వరం నుండి వినాలన్న సామాన్యుల ఎదురు చూపులు ఫలించేదెన్నడు? సంవత్సరానికి ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రజల ఖాతాల్లోకి వేస్తామన్న రూ.1.5 లక్షలు, వ్యవసాయాన్ని రెండిరతల లాభం వచ్చేటట్లు చేస్తానన్న ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదంటే ఈ మాటలు మీ మనుసులో నుండి వచ్చినవి కావా ? దేశాన్ని విశ్వగురువును చేస్తానన్నారే! అలాంటిది ప్రపంచ ఆహార సూచిక లో 101వ స్థానానికి చేరి జనం పెడుతున్న ఆకలి కేకలు, పెరిగిపోతున్న నిరుద్యోగం,దేశం వంద లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన వైనం… ఇవేవీ మీ మనసులోని మాటల జాబితాలో స్థానం సంపా దించుకోలేదే ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్‌ కీ బాత్‌ (మనసులో మాట) కార్యక్రమం ఈ ఏప్రిల్‌ 30 నాటికి 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుం టుంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ నాయకు డూ ఇలాంటి గొప్ప ప్రయోగం చేయలేదని బిజెపి అనుకూల మీడియా,ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల మేధా వులు కీర్తి ప్రవచనాలు చేస్తున్నారు. టి.వి చర్చల్లో పాల్గొంటున్న పాలక అనుకూల పారాయణులు యథాశక్తి తమ పాండిత్యం ప్రదర్శిస్తున్నారు. నిజంగానే ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు తన మనసులోని మాట చెబుతున్నారా అనే సందేహం ప్రతి భారతీయుడిలో (అదానీ, అంబానీ లాంటి వారు మినహా) కలుగుతుంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా మీడియా సమావేశం జరపలేదు కాబట్టి. ఎన్నికల ముందు చెప్పింది, నేడు చేస్తున్నది వేరు కాబట్టి. తొమ్మిదేళ్ల నాడు చెప్పినదానికి, చేసినదానికి పొంతన లేదు కాబట్టి. ప్రధాని మనసులో మాటను ప్రజలు వినడం కాదు, దేశ ప్రజల మనసులో మాటను ప్రధాని వినాలి.
బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో విజయదశమి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత వుంది. ఆ రోజున ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సరిగ్గా అలాంటి విజయదశమి నాడు 2014 అక్టోబర్‌ 3న ‘ప్రధాని మనసులోని మాట’ కార్యక్రమాన్ని మోడీ ప్రారం భించారు. అంటే ఇది పక్కాగా ఆర్‌ఎస్‌ఎస్‌ మనసు లో నుండి పుట్టిన కార్యక్రమం. ఇప్పటి వరకు ప్రధాని మాట్లాడిన 99 ఎపిసోడ్‌లలో అనేక చిన్న చిన్న విషయాలను కూడా మహా నాటకీయంగా చెప్పారు.కర్ణాటకలో సులగిట్టి నరసమ్మ మంత్ర సానిగా ఎందరో గర్భిణీలకు సేవలందించిన విషయం గురించి ప్రధాని మన్‌ కి బాత్‌లో చెబు తుంటే… పేదలకేమో మంత్రసానులు, సంప న్నులకు కార్పొరేటు ఆసుపత్రులు అన్న మీ నీతి అర్థంకాలేదు. విజయనగరం జిల్లాలోని ద్వార పూడి పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రులకు రాత్రిపూట చదువు చెబుతున్న విషయం చెబుతుంటే నూతన విద్యావిధానం పేరుతో అత్యధికమంది పేదలను చదువులకు దూరం చేసే ఎత్తుగడ మీ మనసులో వుందని అనుకోలేదు. న్యూజిలాండ్‌లో ఎంపీగా ఎన్నికైన గౌరవ్‌ శర్మ అనే ప్రవాస భారతీయుడు సంస్కృతం లో ప్రమాణ స్వీకారం చేసిన విషయం పలుకు తుంటే రానున్న రోజుల్లో ప్రాచీనకాలం నాటి వేదాధ్యయనం తప్పనిసరి చేస్తారని గుర్తించలేక పోయాము. ఆసియాలో తొలి మహిళా లోకో పైలట్‌ సురేఖ యాదవ్‌ గురించి చెప్పినప్పుడు గుజరాత్‌లో బిల్కిస్‌ బానో, ఉన్నావోలో మైనర్‌ అమ్మాయి, ఢల్లీి నగరంలో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచా రాల గురించి ఎందుకు మాట్లాడలేదన్న భారతీ యుల సందేహాలను మీ నూరవ మన్‌ కి బాత్‌ లో తీరుస్తారని ఆశించవచ్చా!- (వి.రాంభూపాల్‌)

చట్టాల అమలు సక్కగా లేక..

ప్రభుత్వాలు ప్రజలకు చట్ట బద్ధ పాలన అందించడమంటే ఏంటి? రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, పరిపాలనకు మార్గదర్శకంగా రూపొందించిన ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్య భావనకు ప్రాతిపదికలు. వీటి ఆధారంగా చట్ట సభల్లో ఆమోదించే చట్టాలు, ప్రభుత్వాలు ఎప్పటి కప్పుడు విడుదల చేసే జీవోలు, వాటి అమ లుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన, ప్రభుత్వాలు అందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌ లో కేటాయించడం, ఆయా శాఖల మెరుగైన పని తీరుకు మానవ వనరులను, మౌలిక సదుపాయాలను సమకూర్చడం- ఇవన్నీ సుపరిపాలన కిందకు వస్తాయి. పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా, సమా జంలో ప్రజలందరినీ సమానంగా చూసే వైఖరిని పాలకులు కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యనిర్వాహక సిబ్బంది పథకాల అమలులో అవినీతికి, లంచగొండితనానికి పాల్పడకుండా పారదర్శకత కలిగి ఉండటం వల్ల ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ సాధారణ సూత్రాలను ఇప్పుడు తెలంగాణాలో ఆశించడం ఎంతో కష్టమైపోయింది.
పరిపాలనా వికేంద్రీకరణ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఆచరణలో పరిపాలన అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కేంద్రీకృతమై పోయింది. రాష్ట్ర సచివాలయం, వివిధ స్థాయిల్లో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రమై పోయి కేవలం ‘ప్రగతి భవన్‌’ మాత్రమే పరిపాలనా కేంద్రంగా మిగిలింది. ఈ లక్షణం మెజారిటీ రాష్ట్రాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో కూడా కనిపి స్తున్నది. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ పరిపాలనా ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. రాజ్యాంగం 7వ షెడ్యూల్‌ లో నిర్దేశించిన కేంద్ర, రాష్ట్రాల మధ్య బాధ్యతల, హక్కుల విభజనకు కూడా వ్యతిరేకం. స్థానిక సంస్థలకు విస్తృత అధికారాలను కట్టబెట్టిన 73,74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకం. షెడ్యూల్‌ ప్రాంతాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన షెడ్యూల్‌ 5కు వ్యతిరేకం. ఆదివాసీల గ్రామ సభలకు అత్యున్నత అధికారాలను ఇచ్చిన పీసా, అటవీ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.
ఆహార భద్రతా చట్టం
పార్లమెంట్‌లో,రాష్ట్ర అసెంబ్లీ లోనూ ఆమోదించిన చట్టాలకు విలువ లేకుండా పోయింది. చట్టాలు ఆమోదించాక కూడా వాటి అమలుకు మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం, నిర్ధిష్ట కాలపరిమితి విధించకపోవడం చూస్తున్నాం. ఫలితంగా వీటి అమలు వల్ల లబ్ధిదారులుగా ఉండాల్సిన ప్రజలు హక్కులు అందక,ఆర్థికంగా కూడా నష్ట పోతున్నారు. దేశ పార్లమెంటు ఆమోదిం చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం,విద్యా హక్కు చట్టం,ఆహార భద్రతా చట్టం ఇందుకు పెద్ద ఉదా హరణలు. ఆహార భద్రతా చట్టం ప్రకారం,ఆహార ధాన్యాల పంపిణీని కేవలం బియ్యం, గోధుమలకే పరి మితం చేసి, ఫుడ్‌ బాస్కెట్‌ విస్తరించడం లేదు. చిరు ధాన్యాలను కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ లో చేర్చాలని చట్టం నిర్దేశిస్తున్నా, తెలంగాణ రాష్ట్రం దాన్ని అమలు చేస్తలేదు. ఫలితంగా ప్రజలకు పౌష్టిక ఆహారం అందడం లేదు. దీంతో జొన్న,కొర్ర,రాగి సహా చిరుధాన్యాలు పండిరచే రైతులకు కనీస మద్ధతు ధరలు దొరకట్లేదు. ఆహార భద్రతా చట్టం రాష్ట్ర నియమాల ప్రకారం అంత్యోదయ అన్న యోజన కార్డులు జారీ చేయక పోవడంతో, అర్హులం దరికీ 35 కిలోల బియ్యం అందడం లేదు.
అటవీ హక్కుల చట్టం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం జాబ్‌ కార్డ్‌ పొందిన ప్రతి కుటుంబానికి100 రోజుల పని హక్కుగా కల్పించాలి. కానీ ఇప్పటికీ ఒక్కో కుటుంబ సగటు పని దినాలు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 50కి మించడం లేదు. అంటే మిగిలిన 50 రోజుల వేతనాన్ని( రోజుకు రూ.175 సగటు వేతనం అనుకున్నా, ఏడాదికి రూ.8,750 ) ఒక్కో కుటుంబం నష్ట పోతున్నది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన గత 17 ఏండ్లలో ప్రతి సంవత్సరం గ్రామీణ నిరుపేద కుటుంబాలకు ఇలాంటి ఆర్థిక నష్టమే జరుగుతున్నది. 2005 అటవీ హక్కుల చట్టం అమలు తీరు కూడా ఇలాగే ఉంది. 2005 డిసెంబర్‌13 నాటికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలకు, 75 ఏండ్లకు పైగా అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీయేతరులకు ఈ చట్టం ప్రకారం వ్యక్తిగత, సాముదాయక పట్టాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ చట్టం చేసి 17 ఏండ్లు గడుస్తున్నా లక్షలాది ఆదివాసీ కుటుంబాలకు ఇంకా అటవీ హక్కుల పట్టాలు జారీ చేయలేదు. ఉదాహరణకు తెలంగాణలో ఒక ఆదివాసీ కుటుంబం 4 ఎకరాలు సాగు చేసుకుంటుంటే, రైతు బంధు పథకం కింద ఆ కుటుంబానికి సీజన్‌ కు రూ. 20,000 పెట్టుబడి సాయం అందాలి. అంటే 2018 ఖరీఫ్‌ నుంచి 2022-2023 రబీ నాటికి10 సీజన్లకు ఆ కుటుంబానికి రూ.2,00,000 రైతు బంధు సాయం అందకుండా పోయిందన్నమాట. ఒక ఆదివాసీ కుటుంబానికి ఇది చాలా పెద్ద మొత్తం. వడ్డీ లేని పంట రుణాలు, సబ్సిడీ విత్తన పథకాలు, పంటల బీమా, ఇన్‌ పుట్‌ సబ్సిడీలు, ప్రభుత్వాలు సేకరించే పంటలకు కనీస మద్దతు ధరలు ఈ కుటుంబానికి అందకపోవడం వల్ల జరిగే నష్టాన్ని కలిపి లెక్కవేస్తే, పోడు వ్యవసాయం చేసే ఆదివాసీ కుటుంబాలు పట్టాలు అందక ఎంత నష్ట పోతున్నాయో అర్థం అవుతుంది.
రుణ విముక్తి చట్టం అమలు చేయక
తెలంగాణా రాష్ట్రంలో 1973 భూ సంస్కరణల చట్టం అమలై ఉంటే, గ్రామీణ పేద కుటుంబాలకు సాగు భూమి హక్కుగా దక్కేది. ఆ కుటుంబాల ఆర్థిక స్థితి కూడా మెరుగయ్యేది. కౌలు రైతులకు కౌలు ధరల భారం తగ్గేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి అందించే అన్నిసహాయ పథకాలు అంది ఉండేవి. ఈ చట్టం అమలు కాకపోవడం వల్ల, ఆ కుటుంబాలకు జరిగిన ఆర్థిక నష్టం లెక్క వేస్తే, తప్పకుండా అది లక్షల్లోనే ఉం టుంది. రాష్ట్రంలో 93 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకు పోయాయని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తాజా నివేదిక స్పష్టం చేసింది. 2016 లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన వ్యవసాయ కుటుంబాల రుణ విముక్తి చట్టాన్ని, చట్టం స్ఫూర్తితో రుణ విముక్తి కమిషన్‌ కు రిటైర్డ్‌ న్యాయమూర్తిని చైర్మన్‌ గా, పూర్తి స్థాయిలో అయిదుగురు సభ్యులను నియమించి స్వతంత్రంగా పని చేయనిస్తే, వ్యవసాయ కుటుంబాలకు ఎంతో కొంత రుణాల భారం నుంచి విముక్తి లభించేది. కానీ మన ముఖ్యమంత్రి చట్ట సవరణ చేసి తన పార్టీ నాయకులతో కమిషన్‌ ను నియమించడం వల్ల, కమిషన్‌ స్వతంత్రంగా పని చేయలేక పోతున్నది. ఫలితంగా రుణాల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఏ ప్రయోజనమూ లేకుండా పోయింది. ఇవన్నీ స్పష్టం చేస్తున్న అంశం ఒక్కటే. ప్రభుత్వాల పని తీరు ప్రజాస్వామికంగా ఉండాలి. చట్టాలు, జీవో లు సరిగా అమలవ్వాలి. అప్పుడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగం.
విద్యాహక్కు చట్టం ఎక్కడ?
2010 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం అమలు తీరు కూడా రాష్ట్రంలో నాసి రకంగా ఉన్నది. తల్లిదం డ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆకాంక్షతో ప్రైవేట్‌ స్కూళ్లకు లక్షలు ఖర్చు పెట్టి పంపిస్తున్నారు. ఇద్దరు పిల్లలున్న ఒక కుటుంబం ఏడాదికి సగటున రూ. 60 వేల చొప్పున పిల్లల చదువుపై ఖర్చు పెడుతుందనుకున్నా, ఈ పదేండ్లలో కనీసం ఆ కుటుంబం చదువుపై రూ.6 లక్షలు ఖర్చుపెట్టిందన్న మాట. నిజంగా విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు పడి ఉంటే, రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుం బాలన్నీ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకే పంపే వారు. సర్కారు బడుల్లో టీచర్ల రిక్రూట్‌?మెంట్‌?చేపట్టి, వాటిల్లో సౌలత్‌?లు కల్పించి, మధ్యాహ్న భోజనం సరిగా అమలు చేసి, తమిళనాడు తరహాలో ఉదయం పూట పిల్లలకు బ్రేక్‌ ఫాస్ట్‌ లాంటి పథకం అమలు చేసి ఉంటే, పేద, మధ్యతరగతి కుటుం బాలపై ఆర్థిక భారం బాగా తగ్గి ఉండేది. — వ్యాసకర్త : రైతు స్వరాజ్య వేదిక

కొత్త బిల్లుతో అడవులకు ముప్పు

అటవీ సంరక్షణపై ప్రస్తుతం ఉన్న నిబంధన లను మార్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ‘అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు’ను లోక్‌సభలో ఇటీవల ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు నిరసన తెలిపాయి. జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న వ్యూహాత్మక ప్రాజెక్టులకు అనుమతులను ఫాస్ట్‌ట్రాక్‌ లో అందించే పేరుతో నిబంధనలను మార్చనున్న ఈ బిల్లు వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనలో ఉంది. ఈ వివాదాస్పద బిల్లుకు సంబం ధించి ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి.
పర్యావరణ,అటవీమంత్రిత్వశాఖ నుం చి ముందస్తు అనుమతులు లేకుండా అటవీ ప్రాం తంలో అటవీయేతర కార్యకలాపాలు జరుపకుండా అటవీ సంరక్షణ చట్టం-1980 నిషేధిస్తుంది. ఈచట్టంలో మార్పులను తాజా బిల్లు ప్రతిపాది స్తున్నది. అటవీ ప్రాంతానికి చట్టం ఇస్తున్న నిర్వచ నంలో మార్పు తేవటం ద్వారా, కొన్ని ప్రాజెక్టులకు చట్టం నుంచి మినహాయింపును ఇవ్వటం ద్వారా ఈ మార్పులను బిల్లు ప్రతిపాదిస్తున్నది. దీనిపై 19 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న జేపీసీ అధ్యయనం చేయనుంది. అయితే,ఈబిల్లువల్ల అటవీసంరక్షణచట్టం బలహీన పడుతుందని నిపుణులు ఇప్పటికే ఆందోళన వెలి బుచ్చుతున్నారు. మొత్తమ్మీద అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు తీసుకొచ్చే కేంద్రం ప్రతిపాదన వివాదాస్పదమవుతున్నది.
చట్టం సుస్పష్టం
అటవీ ప్రాంతాన్ని అటవీయేతర పను ల కోసం వాడుకోవటంపై ‘అటవీ సంరక్షణ చ ట్టం-1980’ ఆంక్షలను విధించింది. 1927 నాటి భారత అటవీచట్టం ప్రకారం నోటిఫై చేసిన అడవు లకు 1996 వరకూ ఈచట్టం వర్తించింది. కానీ, ఆ ఏడాది డిసెంబరులో సుప్రీంకోర్టు టీఎన్‌ గోద వర్మన్‌ కేసులో తీర్పునిస్తూ.. నిఘంటు అర్థం ప్రకారం అడవులను పోలిఉండే అన్ని రకాల భూములకు ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొంది. యాజమాన్యంతో సంబంధం లేకుండా,ఏప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వాటికైనా ఇది వర్తిస్తుందని తెలిపింది.
అటవీ సంరక్షణ చట్టం ప్రకారం..
అటవీ ప్రాంతాలను ఉపయోగించుకునే ఏ ప్రాజెక్టుకైనా అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. అయితే, తాజాగా తీసుకొచ్చిన బిల్లు అటవీ చట్టం వర్తింపుపై ఉన్న ‘అస్పష్టతలను’ తొలగించి, 1996 కు ముందున్న స్థితిని తీసుకొస్తుందని చెబుతున్నారు. 25అక్టోబర్‌ 1980 తర్వాత రికార్డయిన డీమ్డ్‌ అడవులకు కూడా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందని అంటున్నారు.డీమ్డ్‌ అటవీ ప్రాంతాల్లో భూ విని యోగం, అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారు లను సుప్రీంకోర్టుతీర్పు నియంత్రిస్తున్నందున చట్టం లో మార్పులు అవసరం అవుతున్నాయని కేంద్ర అటవీ,పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తెలిపారు. అందుకే ఈ బిల్లును తీసుకొచ్చామన్నా రు.కానీ,పర్యావరణ నిపుణుల అభిప్రాయం వేరుగా ఉంది.
దేశంలోని అటవీ ప్రాంతాలకు
ఈ బిల్లు తీసుకొచ్చే మార్పులు విఘాతంగా మారుతాయని, ముఖ్యంగా 1850ల నుంచి 1970ల వరకు ప్రభుత్వ రికార్డుల్లో నమో దైన అడవుల విషయంలో ఈ ప్రమాదం ఉందని ‘విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ’ అనే మేధోసంస్థకు చెందిన దేబదిత్యో సిన్హా తెలిపారు. సరైన విధంగా సరిహద్దులను నిర్ణయించకపోవటం వల్ల, అవినీతి కారణంగా భారీ ఎత్తున అటవీ ప్రాంతాలు అటవీ చట్టం కింద నమోదు కాలేదని,ఈ నష్టాన్ని అక్కడి తో నిలిపివేయటానికి, మరింత నష్టం జరుగకుండా చూడటానికి సుప్రీంకోర్టు తీర్పు ఉపయోగపడిరదని పేర్కొన్నారు.
‘వ్యూహాత్మక ప్రాజెక్టులకు’ మినహాయింపులు
తాజా బిల్లు ప్రకారం..రైల్వే లైన్లు, రోడ్ల వెంబడి ఉండే అటవీ భూముల్లో 0.1హెక్టార్ల వరకు అటవీ అనుమతుల నుంచి మినహాయింపు లభిస్తుంది.నియంత్రణ రేఖకు,వాస్తవాధీన రేఖకు 100 కిలోమీటర్ల లోపు చేపట్టే ప్రాజెక్టులకు (ఉదాహరణకు రోడ్ల నిర్మాణం వంటి వాటికి) కూడా జాతీయ భద్రత కోణంలో మినహాయింపు ఉం టుంది. రక్షణశాఖకు సంబంధించిన ప్రాజెక్టులు, క్యాంపులకు 10 హెక్టార్ల వరకు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 5హెక్టార్ల వరకు మినహా యింపు ఉంటుంది. అటవీయేతర భూముల్లో ఉన్న వృక్షాల తొలగింపునకు కూడా బిల్లు మార్గం సుగమం చేస్తుంది.
విపక్షాల స్పందన
బిల్లును ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభ ఎంపీ, ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ,పర్యావరణం,అడవులపై ఏర్పాటైన స్థాయీసంఘం’ చైర్మన్‌ జైరాం రమేశ్‌ రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌కు ఒక లేఖ రాశారు. ‘ఈ బిల్లు పూర్తిగా మాస్థాయీ సంఘం పరిధిలోకి వచ్చే అంశం. ఈ బిల్లును సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటితో కలిసి సమగ్రంగా, అన్ని కోణాల్లో పరిశీలించే వాళ్లం.కానీ, కావాలనే మాకు ఆ అవకాశం ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం బిల్లును జేపీసీకి సిఫార్సు చేసింది. ప్రతిపక్ష సభ్యులే లేని జేపీసీ పూర్తిగా ఏకపక్షంగా ఉంటుందనటంలో సందేహం లేదు’ అంటూ ఆ లేఖలో నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు తేనున్న బిల్లుతో అటవీ ప్రాంతాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. తదుపరి పార్లమెంటు సమావేశాల తొలివారంలోపు జేపీసీ తన నివేదికను సమర్పిం చాలని గడువు విధించారు. అప్పటికి ఈ అంశంపై మరింత రగడ నెలకొనే అవకాశమే కనిపిస్తున్నది. రిజర్వ్‌ ఫారెస్ట్‌లలోని వన్యప్రాణుల ఆవాసాలు మరియు జీవవైవిధ్యం రక్షిత ప్రాంతాలకే పరిమితం కావు. స్థానిక సమాజాలకు పర్యావరణ మరియు జీవనోపాధి సేవలను కూడా అందజే స్తాయని గమనించడం ముఖ్యం.
విమర్శ
వర్గీకరణ అస్పష్టంగా ఉంది మరియు పర్యావరణవేత్తల ప్రకారం అడవులు మరియు వన్యప్రాణులను దెబ్బతీసే కార్యకలాపాలకు మినహాయింపు ఇవ్వవచ్చు. ప్రతిపాదిత మినహా యింపులు 2006అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘి స్తున్నాయని పేర్కొంటూ అటవీ హక్కుల సంఘాలు కూడా బిల్లును వ్యతిరేకించాయి.ఈ మినహాయిం పులు ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ ఏజెన్సీల కోసం అటవీ మళ్లింపులను సులభతరం చేస్తాయని మరియు అటవీ సంరక్షణ చట్టం మరియు అటవీ హక్కుల చట్టం రెండిరటినీ ఉల్లంఘిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
కొత్త బిల్లు అడవికి, ప్రజలకు ముప్పు
అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు (ఖీజAదీ)లోక్‌సభలో ప్రవేశపెట్టబడిరది. ఇది 1980 అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించాలని లక్ష్యంగా పెట్టు కుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం కఠినమైన మార్గదర్శకాలను అందిస్తుంది..ఏర్పాటు చేసిన విధానాల ప్రకారం, బిల్లులు స్టాండిరగ్‌ కమి టీకి పంపబడ తాయి. ప్రస్తుత సందర్భంలో,దీనిని సైన్స్‌,టెక్నాలజీ, పర్యావ రణం మరియు అడవు లపై పార్లమెంటరీ స్టాం డిరగ్‌ కమిటీకి పంపాలి.బదులుగా,ఇది సూచించ బడిరది.
నష్టాల పాలవుతున్న పేదలు
ప్రభుత్వాలు ప్రజలకు చట్టబద్ధ పాల న అందించడమంటే ఏంటి?రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, పరిపాలనకు మార్గదర్శకంగా రూపొందించిన ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్యభావనకు ప్రాతిపదికలు. వీటి ఆధా రంగా చట్ట సభల్లో ఆమోదించే చట్టాలు, ప్రభుత్వా లు ఎప్పటికప్పుడు విడుదల చేసే జీవోలు, వాటి అమలుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన, ప్రభుత్వాలు అందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌ లో కేటాయించడం, ఆయా శాఖల మెరుగైన పని తీరుకు మానవ వనరులను, మౌలిక సదుపా యాలను సమకూర్చడంఇవన్నీ సుపరిపాలన కిందకు వస్తాయి. పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా, సమాజంలో ప్రజలందరినీ సమా నంగా చూసే వైఖరిని పాలకులు కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యనిర్వాహక సిబ్బంది పథకాల అమలులో అవినీతికి, లంచగొండితనానికి పాల్పడ కుండా పారదర్శకత కలిగి ఉండటం వల్ల ప్రజల కు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ సాధారణ సూత్రాలను ఇప్పుడు తెలంగాణాలో ఆశించడం ఎంతో కష్టమైపోయింది.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన..
పరిపాలనా వికేంద్రీకరణ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఆచరణలో పరిపాలన అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కేంద్రీకృతమై పోయింది. రాష్ట్ర సచివాలయం, వివిధ స్థాయిల్లో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రమై పోయి కేవలం ‘ప్రగతి భవన్‌’ మాత్రమే పరిపా లనా కేంద్రంగా మిగిలింది. ఈ లక్షణం మెజారిటీ రాష్ట్రాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో కూడా కనిపిస్తున్నది. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ పరిపాలనా ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతి రేకం.రాజ్యాంగం 7వ షెడ్యూల్‌ లో నిర్దేశిం చిన కేంద్ర,రాష్ట్రాల మధ్య బాధ్యతల,హక్కుల విభజ నకు కూడా వ్యతిరేకం. స్థానిక సంస్థలకు విస్తృత అధికారాలను కట్టబెట్టిన 73,74రాజ్యాంగ సవర ణలకు వ్యతిరేకం. షెడ్యూల్‌ ప్రాంతాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన షెడ్యూల్‌ 5కు వ్యతిరేకం. ఆదివాసీల గ్రామ సభలకు అత్యున్నత అధికా రాలను ఇచ్చిన పీసా, అటవీ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.
అడవుల నరికివేతతో భవితకు ప్రమాదం!
అడవుల పరిరక్షణ విషయంలో ప్రపం చ దేశాల వేదికలపై భారతదేశ ప్రతినిధులు ఇచ్చే హామీలు ఆశాజనకంగా కనిపిస్తున్నా.. దశాబ్దా లుగా క్షేత్రస్థాయిలో విధానాలు, చట్టాల అమలు తీరు అందుకు విరుద్ధంగా ఉంటోంది. పాలనా వ్యవస్థలు అడవిని ఒక ఆర్థిక వనరుగా పరిగణించి పరిరక్షణ, వాణిజ్య లాభాలపై గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాలుగా వనాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం నామమాత్రం అవుతోంది.అదే రకంగా కొన్ని దశాబ్దాలుగా వేగంగా క్షీనిస్తున్న అడువులతో మానవాళి భవిత ప్రమాదంలో పడిరది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వనాలు వినాశానానికి గురవుతున్నాయని అంచనా. అడవులు క్షీణించడం మూలంగా జీవనోపాధులు,జలవనరులుతోపాటు వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తుపాన్లుఉ,భారీ వర్షాలు,వరదలు వంటి విఫత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. అడవుల పరిరక్షణకు నడుం కడుతున్నామంటూ ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నా,విధానాల అమలు మాత్రం లోపభూయిష్టంగా ఉంటోంది.
వ్యాసకర్త : సామాజిక కార్యకర్త,అటవీపరిరక్షణ నిపుణులు`న్యూఢల్లీి- (సిమ్రిన్‌ సిరుర్‌)

మనమే నంబర్‌ వన్‌..రెండో స్థానానికి చైనా

ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్‌.ఈ లెక్కలు, సర్వేల మాట వినగానే సందేహాలు వెల్లువెత్తుతాయి. ఈ లెక్కలూ, సర్వేలూ చెప్పని కొన్ని అంశాలు ఉంటాయి. అవి జనాభా పెరుగుదలలోని అసమతౌల్య ధోరణులు. దానితో వచ్చే ప్రమాదాలు. మతం పేరుతో దేశాలు ఏర్పడిన చరిత్ర ప్రపంచంలో ఉంది. జనాభా పెరుగుదల వరమా? శాపమా? జనాభాతో మనం అతి పెద్ద మార్కెట్‌గా అవతరించామా? కొత్త సమస్యలు ఏమిటి? ఆహార భద్రత ఎలా? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో అసమతౌల్యంతో వచ్చే ప్రమాదాల గురించి కూడా చర్చించాలి. కచ్చితంగా జనాభా మీద స్పష్టమైన విధానం రావాలి. అది అందరూ ఆమోదించేదై ఉండాలి.యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ తాజా సమాచారం ప్రకారం జనాభా పరంగా మనదేశం మొట్టమొదటిసారి చైనాను వెనక్కి నెట్టేసింది. దీని ప్రకారం ప్రస్తుత మనదేశ జనాభా 142.86కోట్లు. చైనా జనాభా ప్రస్తుతం 142.57 కోట్లు! ఇప్పుడు ప్రపం చంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదని ప్రశ్నిస్తే ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన చైనాకు బదులు ఇక ఇండియా అని చెప్పాలి. 1950లో మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి (యు.ఎన్‌.) ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాను తయారుచేసింది. అప్పటి నుంచి యు.ఎన్‌.ఎప్పుడు ఈ జాబితా విడుదల చేసినా, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశా లలో ప్రథమ స్థానం చైనాదే. ఇప్పుడు మనదేశం చైనాను తోసిరాజని ముందుకు దూసుకెళ్లింది. భారత్‌లో జననాల రేటు ఇటీవలి సంవత్సరాల్లో బాగా తగ్గినప్పటికీ, ‘పని చేసే వయసున్న వారు’ మొత్తం జనాభాలో 75% ఉండటం సానుకూలాంశం. భారత్‌లోని ఈ శ్రామిక సంభావ్య శక్తి ద్వారా రానున్న కాలంలో, ఇప్పటికే చైనా పడుతున్న ఇబ్బం దులను తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలే ఎక్కువ. అయితే ఇక్కడ శ్రామిక జనాభా అధికంగా ఉండటం అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. పెరుగుతున్న వీరి జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే అది ప్రతికూలాంశంగా మారడం తథ్యం.
ఫలితమిచ్చిన కుటుంబ నియంత్రణ
1901లో భారత జనాభా 23 కోట్లు. 1951 వరకు ఈ జనాభా పెరుగుదల చాలా నిదా నంగా సాగింది. తర్వాతి ఐదు దశాబ్దాల కాలంలో మూడు రెట్లు పెరిగి 2001 నాటికి మనదేశ జనాభా 102 కోట్లకు ప్రస్తుతం 1.4 బిలియన్లకు చేరుకుంది. యు.ఎన్‌. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ అఫైర్స్‌ అంచనా ప్రకారం 2030 నాటికి 1.5 బిలియన్‌, 2050 నాటికి 1.64 బిలియన్లకు మనదేశ జనాభా చేరుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారత జనాభా దాదాపు 350 మిలియన్లు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ప్రభుత్వం 1952లో మొట్టమొదటిసారి కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టింది. అప్పట్లో సగటున ఒక స్త్రీ ఆరుగురు సంతానాన్ని కలిగి ఉండేది. అప్పటి నుంచి వరుసగా వచ్చిన ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల ఇప్పటికి ‘‘ఇద్దరి’’కి పరిమితం చేయగలిగింది. దేశంలో కుటుంబ నియంత్రణ అమలుకు ప్రపంచ బ్యాంకు అప్పట్లో 66 మిలియన్‌ డాలర్లు రుణ సహాయం చేసింది. 1950 నుంచి 1990 వరకు దేశ ఆర్థిక ప్రగతి సగటున 4%గా కొనసాగింది. 1990ల్లో పి.వి. నరసింహారావు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమాని దేశ ప్రగతి 5.5% తర్వాత 2000 సంవత్సరం నుంచి సగటున దేశ వృద్ధిరేటు 7.7శాతం నమోదు చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి జనాభాపై విధానకర్తల అభిప్రాయంలో మార్పు రావడం మొదలైంది. 15-64 సంవత్సరాల మధ్య వయస్కులను ‘పనిచేసే’ వారిగా పరిగణిస్తూ, వీరిని ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా పేర్కొంటూ వచ్చారు. దీన్నే ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’గా వ్యవహరి స్తున్నారు. ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే ప్రపంచంలోని వివిధ దేశాలు అభివృద్ధి చెందింది కేవలం ఈ ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’ వల్లనేనన్న సత్యం వెల్లడవు తుంది. 1990 నుంచి భారత్‌ కూడా దీనివల్ల సానుకూల ఫలితాలు పొందింది.
భయపెడుతున్న నిరుద్యోగం
అధికారిక గణాంకాల ప్రకారం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2.7శాతంగా ఉన్న నిరుద్యోగం, 2017-18 నాటికి 6.1శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వార్షిక సమాచారం ప్రకారం 2021-22లో ఇది 4.1శాతానికి తగ్గడం కొద్దిగా ఉపశమనం కలిగించినా, సెంటర్‌ ఫర్‌ మానిటర్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం గత మార్చిలో దేశలో నిరుద్యోగరేటు 7.8శాతంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అధికారిక అంచనాల ప్రకారం ఏటా దేశంలో ఐదు మిలియన్ల మంది శ్రామిక మార్కెట్‌లోకి కొత్తగా చేరుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో 18-35 మధ్య వయస్కులు 600 మిలియన్ల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 65%. వీరిలో వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచడంలోనే ఆర్థిక ప్రగతితో పాటు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ముడిపడివుంది.
స్థిరీకరణ దశకు జనాభా
జనాభా శాస్త్రవేత్తల ప్రకారం సగటున స్త్రీల ‘మొత్తం గర్భధారణ రేటు’ (టోటల్‌ ఫెర్టిలిటీ రేట్‌- టీఎఫ్‌ఆర్‌)2.1గా నమోదైనప్పుడు ఒక దేశ జనాభా స్థిరంగా ఉంటుంది. అంటే ఇందులో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల సంఖ్యను స్థిరంగా ఉంచడాన్ని, 0.1 పిల్లల్లో సంభావ్య మరణాలను సూచిస్తుంది. దీన్నే యు.ఎన్‌. పాపులేషన్‌ డివిజన్‌ ‘రీప్లేస్‌మెంట్‌-లెవెల్‌ ఫెర్టిలిటీ’ అని వ్యవహరిస్తుంది. ఇంతకూ చెప్పొచ్చేదే మంటే భారత్‌ ఈ టీఎఫ్‌ఆర్‌కు అత్యంత సమీపానికి చేరుకుంది. అంటే జనాభా స్థిరీకరణ దశకు చేరుకున్నదని అర్థం. మనదేశం లోని చాలా రాష్ట్రాల్లో ఈ టీఎఫ్‌ఆర్‌ రేటు 2.1 కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ప్రముఖ డెమోగ్రాఫర్‌, సామాజిక శాస్త్రవేత్త షిరీన్‌ జెజీభోయ్‌ ప్రకారం భారత్‌లో మొత్తం 28 రాష్ట్రాల్లో 17,9 కేంద్రపాలిత ప్రాంతాల్లో 8 ‘రీప్లేస్‌మెంట్‌ దశ’కు చేరుకున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఒకవేళ మనదేశం జనాభా స్థిరీకరణ దశకు చేరుకోకపోతే జనాభా ఎంతలా పెరిగిపోయేదో ఊహిస్తేనే ఒళ్లు జలద రిస్తుంది. దేశంలో జనాభా పెరుగుదలరేటు క్రమంగా తగ్గడమే ఈ స్థిరీకరణకు కారణం. ఉదాహరణకు 1972 నుంచి 1983 మధ్యకాలంలో వార్షిక జనాభా పెరుగుదల రేటు 2.3%గా ఉండేది. 2011నాటికి ఇది 1.37 శాతానికి, 2017లో 0.98%కి 2023లో 0.81%కు పడిపోయింది. ఇదిలావుండగా సి.ఐ.ఎ. వరల్డ్‌ ఫ్యాక్ట్‌బుక్‌ జనాభా గణాంకాల అంచనా ప్రకారం 2022లో మనదేశ జనాభా వృద్ధి రేటు 0.67% మాత్రమే. ఇక మనకున్న మరో సానుకూలాంశం డిపెండెన్సీ రేటు కేవలం 0.4శాతం. దశాబ్దకాలం క్రితం మనదేశంలో చిన్నపిల్లల జనాభా అత్యధికంగా నమోదుకాగా ఇప్పుడది పడిపోతుండటం గమనార్హం. 1951 లో దేశ జనాభాలో హిందువుల జనాభా 84.1% కాగా ముస్లింలు 2.3% మాత్రమే. అదే 2011 నాటికి హిందువుల జనాభా 79.80%కు తగ్గి, ముస్లింల జనాభా 14.23%కు పెరగడం గమనార్హం. అంటే హిందూ జనాభా వృద్ధిరేటు 16.8% (2001- 2011 మధ్యకాలంలో) కాగా ఇదే కాలంలో ముస్లింల వృద్ధిరేటు 24.6%. మిగిలిన మతాల జనాభావృద్ధి గమనించదగ్గ స్థాయిలో లేదు. 1991-2001 మధ్యకాలంలో ముస్లిం జనాభా వృద్ధిరేటు 29.52%గా ఉండగా 24.6%కు పడిపోయింది. అదేవిధంగా హిందువుల జనాభా వృద్ధిరేటు 19.92% నుంచి 16.8%కు పడిపోవడం గమనార్హం.- (జమలాపురపు విఠల్‌రావు/సుంకవల్లి సత్తిరాజు)

భద్రచలం మన్నెంకతలు

తెలుగు సాహిత్యంలో గిరిజన సాహిత్య విభాగం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అటువంటి ప్రత్యేక స్థానం గల గిరిజన సాహిత్యాన్ని కథలు, కవితలు, వ్యాసాలు, పరిశోధనలతో ఎందరో మేధావులుసు సంపన్నం చేశారు. అటువంటి రచయితల్లో ఒక కథా రచయిత, ఆయన సాధారణ రచయిత మాత్రమే కాదు..పోటీ పరీక్షల్లో తెలుగు సాహిత్యం ప్రధాన అంశంగా తీసు కుని విజయం సాధించి ఐ.ఏ.ఎస్‌ అధికారి అయిన అపరమేధావి.. ఆయనే ‘‘అంగలకుర్తి విద్యాసాగర్‌’’ ఆయన ఉద్యోగ జీవనంలో భాగంగా ఐ.టి.డి.ఎ.ప్రాజెక్ట్‌ అధికారిగా 1988 – 1990 మధ్యకాలంలో రెండు సంవత్సరాల పాటు భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో పాల్వంచ కేంద్రంగా పనిచేశారు. స్వతహాగా సాహితి పిపాసి అయిన విద్యాసాగర్‌కు సృజనాత్మకత కూడా అలవడిరది రెండేళ్ల పాటు నిత్యం అడవుల్లోని ఆదివాసులతో మమేకమై తిరిగారు. వారి జీవితాలను దగ్గరగా గమనించారు. అలా కలిగిన అనుభవం సాయంగా 20 కథలు రాశారు. కొన్ని కథలుగా అనిపించవు అయినా కథను చదువుతున్న అనుభూతి కలుగుతుంది. ఆ అనుభవాల అనుభూతులను ‘‘భద్రాచలం మన్నెంకతలు’’ పేరుతో ప్రచురించారు. ఆధునిక తెలుగు కథ సాహిత్యంలో అత్యంత పాఠ కాదరణ పొందిన గిరిజన కథలుగా వీటిని చెప్పవచ్చు. ఈ కథా సమూహంలోని కథలన్ని గిరిజన జీవితాల మధ్యే తిరుగాడుతాయి. ప్రతికథ రచయిత అనుభవించిన ఒకవ్యధగా చెప్పవచ్చు. ఆ రెండేళ్ల కాలంలో విద్యాసాగర్‌ గారు చేసిన క్షేత్ర పర్యటనలు, గిరిజనాభివృద్దికోసం ప్రభుత్వాలు,అధికారులు,చేస్తున్న కృషి క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టి చూపించడంలో రచయిత సఫలీకృతులయ్యారు.
కొన్ని ఆశయాలు ఆశలు నెరవేరకుండానే ఆయన బదిలీ అయి వెళ్లిపోయిన, తర్వాత కాలంలో అవి కార్యరూపం దాల్చడం వంటివి గమనిస్తే గొప్ప పనులు ఏనాటికైనా లక్ష్యాలు సాధిస్తాయనే నమ్మకం ఈకథలు చదవడం వల్ల కలుగుతుంది.
ఈ కథల్లో రచయిత తాను ప్రభుత్వ అధి కారిని అన్న భావన ఎక్కడ చూపించరు. అంతటా మానవతావాదంనిండి ఉంటుంది. అందుకే ఒక్కోచోట గిరిజన అభివృద్ధి పనుల్లో ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను కూడా ఎత్తిచూపుతారు.
‘‘నామొకంమల్లొచ్చింది సారు’’ కథలో అడవుల్లోని క్రూర మృగాల బారిన పడి గిరిజనులు అనుభవిస్తున్న హృదయ విదారక బాధలను రచయిత ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ ఆసుపత్రులు అవలంబిస్తున్న అలసత్వం గురించి నిర్మొహమాటంగా రచయిత ఇందులో చెప్పారు. అంతేకాక గిరిజనులకు పుట్టిన భూమి మీద ఉండే మమకారం కూడా అంతర్లీనంగా చెబుతు,అడవి బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లోనూ పుట్టిన ప్రాంతాలు విడిచిపోవడానికి ఇష్టపడరు. అందునా కన్న భూమి మీదే కన్నుమూయాలనే తత్వం వారి సొంతం.ఇక గిరిజన యువత చదువులకు ఎలా దూరం అవుతున్నారు? ఉన్నత చదువులు ఎందుకు చదవలేక పోతున్నారు? వాటి పరిస్థితులను అనుసరించి వ్రాసిన కత ‘‘ఇవి కూడా జరిగి ఉంటే…’’ దీనిలో గిరిజన గుడాలు వెనుకబాటుకు కారణాలు అన్వేషించిన రచయిత తన ఆలోచనలు కార్యరూపం దాల్చకుండానే కార్య స్థానం నుంచి బదిలీ అయిపోయిన అవినేటి కాలంలో అమలు కావడం, ముఖ్య ప్రణాళికలోని ప్రామాణికతను స్పష్టం చేస్తుంది.గిరిజన వివాహం వ్యవస్థను తెలుపుతూ… ‘‘మనిషిని మనిషి వంచించ నంతవరకు మనిషిని మనిషి హింసించనంత వరకు ఏఆచారము ఏ నమ్మకము తప్పు కాదు’’ అనే విలువైన సందేశాన్ని అందిస్తూ… , బిడియం,భయం,అనే లక్షణాలు గల అడవి బిడ్డల్లో సరైన అవగాహన,శిక్షణలు కల్పించడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఆవిష్కరించబడతాయి.
అనే సత్యాన్ని కూడా చెబుతారు రచయిత ‘‘ఇద్దరుండాల సారు’’ కథ ద్వారా ….. అదేవిధంగా సొంత భూముల్లో గిరిజనులు కూలీలుగా మారుతున్న వైనం వివరించే ‘‘ప్రశ్నల శర్మగారు’’ కథ,. మూడు దశాబ్దాల క్రితం గోదావరి వరదలు, వానాకాలం సమయంలో గిరిజన గుడాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రయాణ ఇక్కట్లు, వరదల బాధలు,గురించి వివరించడంతోపాటు నాటి అధికారులు అంకితభావంతో పడ్డ పాట్లు గురించి హృదయ విదారకంగా చెప్పిన కథ ‘‘ఆకాశ వాణి నందిగామ! రోడ్డు మీద లాంచి!!’’ తమ సొంత అడవుల్లో పరాయి బ్రతుకులు బతుకుతున్న గిరిజనుల వింత పరిస్థితిని వివరించే కథ ‘‘శాపలు దాగితే సెరువెండు ద్దాసారు?!’’ నిజంగా అధికారుల అనాలోచిత చర్యలకు చెంపపెట్టు లాంటిదిఈ కత. గిరిజన జీవన విధానాలు మార్పు కోసం ప్రభుత్వాలు అధికారులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న పరిణామాల గురించి వ్యాస కథనంగా చెప్పిన’’ ప్రొఫెసర్‌ హేమండార్ప్‌’’ కత.దీని ద్వారా ఖమ్మం జిల్లాకు డార్ప్‌కు గల అనుబంధం అవగతం అవుతుంది. వెనుకబడిన గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో అవలంబించాల్సిన ఆచరణాత్మక క్రియల గురించి మార్గదర్శనం చేసే మంచి కథ ‘‘చీకటి మండలం’’ ఇలా ప్రతి కథ విద్యాసాగర్‌ గారి అనుభవాల దొంతరల గుండా, గిరిజన స్థితిగతుల మీదుగా,మూడు దశాబ్దాల క్రితం భద్రాచలం మన్యంలోని గిరిజన గ్రామాల దుస్థితికి అద్దం పడుతుంది. ప్రతి కథలో కాలం, ఆనాటి మనుషులు,గ్రామాల పేర్లు, యదాలాపంగా నమోదు చేశారు రచయిత, ఒకానొక సందర్భంలో విద్యాసాగర్‌ గారి ‘‘స్వీయకథ’’గా అనిపిస్తుంది ఈ కథ సంపుటి, కారణం ప్రతి కథకు రచయిత ఒక పాత్ర కావడమే..!
కథల పేర్లు కూడా విచిత్రంగా ఆసక్తికరంగా ఉండి పాఠకులను కథల్లోకి ఆహ్వానిస్తాయి, అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి చెట్టు కింద ఆఫీసు, కొండకు కట్టెలు మోయమంటారా సారు?, కూసున్నకొమ్మ కొట్టుకుంటామా సారు??, మొదలైన కథలు.
ఇక కథల్లో వాడిన భాష కూడా పాత్రో చితంగా స్థానిక గిరిజనుల భాష ఉపయో గించడం అభినందనీయం,రచయిత విద్యాసాగర్‌ గారు పుట్టిన ప్రకాశం జిల్లా యాస అక్కడక్కడ వున్న, తెలుగు భాష మీద, సృజనాత్మకత పట్ల ఆయనకు గల పట్టు ప్రతి చోటా కనిపిస్తుంది.ప్రతి కథలో రచయిత గొంతు, అడవి బిడ్డల ఆవేదన స్వరాలు మేళవించబడి వినిపిస్తాయి. 1990 సం:లో రాసిన ఈ ‘‘భద్రాచలం మన్నెంకతలు’’ తెలుగు కథా సాహిత్యపు గిరిజన కథా విభాగంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ప్రామాణిక కథలుగా చెప్పవచ్చును. అనుభవాలకు కథల రూపం ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలి అనుకునే వారితో పాటు, కథా ప్రియులంతా తప్పక చదివి తీరాల్సిన కథా సంపుటి ఇది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

యురేనియంతో గిరిజనుల ప్రాణ సంకటం

రెండు తెలుగు రాష్ట్రాలకు ఊపిరితిత్తులుగా భావిస్తోన్న నల్లమల అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన యురేనియం తవ్వకాల ప్రతిపాదనలను నిరసిస్తూ తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయట్లేదు. యురేనియం తవ్వకాలపై ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ పరిధిలో రహస్యంగా సర్వే నిర్వహిస్తోందనే సమాచారం గుప్పుమంది. దావానలంలా వ్యాపించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న అణు ఇంధన సంస్థ ఉద్యోగులు కొందరు నల్లమల అడవుల్లో రహస్యంగా సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయినట్లు సమాచారం. కొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ పరిధిలోని మన్ననూర్‌ సమీపంలో అటవీ శాఖకు చెందిన క్యాంప్‌ ఆఫీస్‌ లో మకాం వేశారని, గుట్టు చప్పుడు కాకుండా సర్వే నిర్వహిస్తున్నారనే కలకలం పుట్టిస్తున్నాయి.
యురేనియం రేడియో యాక్టివిటి ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యాలకు అత్యంత ప్రమా దం ఏర్పడు తుందని, పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని పెద్ద ఎత్తున ఆందోళనలు సాగు తున్నాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సర్వే ప్రారంభించాలని కేంద్రం అనుమ తులు ఇవ్వ డంతో ప్రజా సంఘాలు, ప్రజలు, స్వచ్ఛందంగా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. యురేనియం తవ్వకాలు జరిగి నప్పుడు వెలువడే ‘డస్ట్‌’80 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది.డస్ట్‌ పడిన ప్రాంతమంతా విషపూరి తమవుతుంది. నల్లమలలోని చెంచుల ఉనికికి అత్యంత ప్రమా దం ఏర్పడుతుంది. యురేనియం తవ్వకాలు ప్రారంభిస్తే చెంచులను ఆ ప్రాంతం నుంచి తరలించాలి. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును తొలగించాలి. సాగర్‌ నీళ్ళు వ్యవ సాయానికి గానీ, తాగడానికి గానీ ఉపయోగపడవు. ఇంత ప్రమాద కరమైన యురేనియం తవ్వకాలను కార్పొరేట్ల లాభా ల కోసం బీజేపీ ప్రభుత్వం చేపట్టాలని చూస్తున్నది.
యురేనియంతో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి తేలి కవుతుందని చెప్తూ తవ్వకాలకు కేంద్రం అను మతు లిచ్చింది. రష్యాలోని చెర్నోబిల్‌, జపాన్‌లోని పుకుషీ మాలో యురేనియం విద్యుత్‌ కేంద్రాలు పేలి పోవ డంతో వేలమంది మరణించడమేకాక,నేటికి ఆరేడి యో ధార్మిక శక్తి ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు చెప్తున్నారు. ఆ భయంతో భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలో యురేని యం తవ్వకాలను ఆపాలని ఆందోళనలు సాగుతు న్నా యి.1896లోహెన్రీ బెకరల్‌ రెడియో ధార్మిక శక్తి 92వ మూలకాన్ని కనుగొన్నాడు.చదరపు అడుగు యురేనియం500 కేజీలబరువు ఉంటుంది. న్యూక్లి యర్‌ ఎనర్జీ ద్వారా అణుబాంబులు తయారు చేసిన ఆమెరి కా జపాన్‌లోని హిరోషిమా, నాగసా కిలపై వేసింది.ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ రేడియో ధార్మిక శక్తి ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. యురేనియం తో విద్యుత్‌ శక్తి ఉత్పత్తి చేయవచ్చు. 10లక్షల కిలోల బొగ్గుతో ఉత్ప త్తి అయ్యే విద్యుత్‌ అరకిలో యురేనియంతో తయారు చేయవచ్చు. బొగ్గు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి వ్యయంతో కూడు కున్న పని అని యురేనియంతో ఉత్పత్తిని ప్రారంభించారు. మొదట ఈనిక్షేపాలు మేఘాలయ,ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ లోని దట్టమైన అడవుల కింద ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం భారత దేశంలో 7 కేంద్రాల్లో 22రియాక్టర్లు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయి.1950లో యురేనియం గనులను ఏర్పాటు చేశారు.1967లో జాదూ గూడలో గని ప్రారంభించారు.యురేనియంద్వారా విద్యుత్‌ఉత్పత్తి జరిగే ప్రక్రియలో యురేనియం శుద్ధి అవుతుంది.శుద్ధి అయిన యురేనియంను పైపుల ద్వారా బోరు బావిలోకి పంపిస్తారు.వాస్తవానికి ఈ శుద్ధి అయిన యురేనియంతో అణుబాంబులు తయారు చేయవచ్చు.ఇక్కడ అణుబాంబులు తయా రుచేసే లక్ష్యం లేనందున శుద్ధి అయిన యురేని యాన్ని బావుల్లోకి పంపిస్తున్నారు.తటస్థీకరణ చర్యకు సున్నపురాయిని కూడా దానితోపాటు పంపాలి. యురే నియం భూమికి చాలా లోతులో ఉంటుంది. 1960లో వెయ్యి అడుగులలోతు వరకు బోర్లు వేసి తీశారు. అయినా తగినంత ఉత్పత్తి రాక పోవడంతో1990లో ఎన్‌ఎస్‌జీ దేశాల నుంచి (కజకస్తాన్‌,కెనడా,రష్యా) దిగుమతు లు చేసుకు న్నారు.ఈ దిగుమతులకు అమెరికా, ఐక్య రాజ్య సమితి అడ్డుపడ్డాయి. ఎన్‌జీఓ సంఘాలు యురేనియంవల్ల ప్రమాదాలు ఉన్నట్లు నివేదిక ఇచ్చా యి. పిల్లలు పుట్టకపోవడం,ఋతుక్రమం సరిగ్గా లేకపోవడం,క్యాన్సర్‌,చర్మ వ్యాధులు తదితర ప్రమా దాలు ఉన్నట్లు తెలిపారు. దీన్ని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ వారు కూడా పరిశీలించారు. ఆలోపాలు యురేనియంవల్ల కాదని తప్పుడు సమాచారం ఇచ్చారు. రేడియేషన్‌ వస్తుంది కానీ దాన్ని బయటకు సోకకుండా జాగ్రత్త తీసు కుంటున్నామని తెలిపారు. 1998లో ప్రధాని వాజపేయి జాదూగూడ కాక వేరే ఎక్కడైన యురేనియం లభ్యత ఉందా అని పరిశీలించారు. ఈస్థితిలో ప్లూటోనియాన్ని కనుగొ న్నారు. ప్లూటోనియంతో తయారు చేసిన అణు బాంబును పోక్రాన్‌లో పరీక్షించారు.చివరకు 2002లో చంద్రబాబు అనుమతితో జరిపిన అన్వే షణలో కడప జిల్లా తుమ్మలపల్లి,గుంటూరు జిల్లా కోపూరులోని 2,300 ఎకరాల్లో నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు.1.40లక్షల టన్నులు తుమ్మల పల్లి లో,2500 టన్నులు కోపూరులోనూ బయటకు తీశారు.2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. యుసీ ఐఎల్‌ దృష్టి ఇప్పు డు నల్లమలపై పడిరది. ఇక్కడ యురేనియం తవ్వకాల వల్ల కృష్ణానది కలుషితం అవుతుందని ప్రచారం సాగుతున్నది.ప్రస్తుతం దేశంలో మరో 7అణు రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి యురేనియం కావాలి. అందుకు దిగుమతులపై ఆధారపడాలి.లేదా స్వదేశంలో ఉత్పత్తి చేయాలి. విద్యుత్‌ ఉత్ప త్తి కేంద్రం తయార వ్వడానికి ఐదారు సంవత్సరాలు పడుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చు కూ డా ప్రస్తుతం లభించే ధరకన్న ఎక్కువగానే ఉంటుంది. తక్కువ యురేని యంతో ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి జరిగి నప్పటికీ యురేనియం తవ్వకానికి అయ్యే పెట్టుబడి ఎక్కువ గానే ఉంటుంది. రేడియో ధార్మిక శక్తి బయటికి వెళ్ళకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త జరిగినా రేడియో యాక్టివిటి కిరణాలు అత్యంత ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇప్పటికే భారత దేశంలో 3దశాబ్దాల క్రితం భోపాల్‌లో ‘మిక్‌’ గ్యాస్‌ లీక్‌వల్ల 2వేలమంది ప్రాణాలు కోల్పోయా రు. నేటికి అక్కడ వాతావరణం బాగు పడలేదు. కానీ కేంద్రం అవేవీ పట్టించు కోవడం లేదు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో రక్షణ లేకుండా యురేనియంతవ్వకాలు,విని యోగం చేయడం తీవ్ర ప్రమాదకరం.
ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి.
దాదాపు 60ఏళ్ల వయసున్న చిగుర్ల ఐతయ్య చెంచు తెగ పెద్దమనిషి. నల్లమల అడవు ల్లోని కుడిచింత బయలు గ్రామంలో,ఆర్డీఎఫ్‌ ట్రస్టు వారు తనకు కట్టిచ్చిన చిన్న ఇంటి ముందు నులక మంచం మీద కూర్చుని వచ్చేపోయే బండ్లను చూస్తు న్నారు. ఎదురుగా ఉన్న కంకర రోడ్డు మీద దుమ్ము రేపుకొంటూ పెద్ద పెద్ద కార్లు మల్లెలతీర్థం వైపు వెళుతున్నాయి. శ్రీశైలం-హైదరాబాద్‌ దారిలో కొంత కాలం తరువాత ఆ ఊరు, ఆ మల్లెలతీర్థం, తమ అడవి, తమ వ్యవసాయం,పర్యటకుల సందడి..ఇవన్నీ ఉంటాయో ఉండవో అన్న బెంగ ఆయనలో ఉంది. కారణం-తమ అడవిలో యురే నియం తవ్వుతారన్న వార్తలేనని స్థానికులు వాపోయారు.
మేమెక్కడికీ పోం.
(యురేనియంను) తవ్వనీయం. తవ్వనీ యం. తవ్వనిస్తే మేం భంగపడిపోతాం. యురే నియం తవ్వితే ఊళ్లు నాశనమైపోతాయి. అందుకే తవ్వద్దు. తవ్వితే దాని విష పదార్థం కొట్టి భంగం అయిపోతాం’’ అని స్థానికుడు ఐతయ్య అన్నారు. ‘‘మేం మొదట్లో వాళ్లు తవ్వుకుని పోతారులే అనుకున్నాం. కానీ అది తవ్వితే విషం గాల్లో వచ్చి మనకు పారుతుంది అని చెప్పారు. మనుషులు బతకరు అన్నారు. అట్లైతే అసలే వద్దు. మనం చావనీకి అదెందుకు తవ్వాలి?’’ అని ప్రశ్నించా రాయన.కుడిచింత బయలు గ్రామం కానీ, మల్లెల తీర్థం కానీ ప్రస్తుతం ప్రతిపాదించిన యురేనియం సర్వే బోర్లు వేసే ప్రాంతంలో లేవు. అయినా వారి లో అంత బెంగ ఉండటానికి కారణం, పక్క ఊరు తవ్వినప్పుడు తమ ఊరినీ- తమ అడవినీ వదలి పెట్టరేమోననే ఆలోచన.పక్క ఊరిలో తవ్విన యురే నియం వల్ల తామూ ప్రమాదంలో పడతామేమోననే భయమూ ఉంది. యురేనియం సర్వే పరిధిలో లేని గ్రామంలోని పరిస్థితి ఇది. సర్వే చేసే ప్రాంతా ల్లోనైతే నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. ‘‘మీకు పునరావాసం కల్పించి,యురేనియంతవ్వితే సమ్మ తమేనా’’ అనే ప్రశ్నకు స్థానికులు ఆసక్తికర సమా ధానం ఇచ్చారు.‘‘పునరావాసానికి కూడా ఒప్పు కోం. మొత్తం మండలం అంతా మాట్లాడి చెప్పాలి. ఒప్పుకుంటే రూపాయల కట్ట ఇస్తారు. హైదరాబాద్‌ వెళ్తా. ఆ డబ్బులు మూడ్రోజులుంటాయి. తెల్లారి అవి ఎట్లా పోతాయో, మా బతుకులు ఎట్లా పోతా యో తెలీదు. అందుకే ఇదే భూమి,ఇదే ఆస్తి ఉం డాలి మాకు’’అంటూ ఐతయ్య అనే అసామి తెలి పారు. ‘‘యురేనియం తవ్వితే కృష్ణా నది కలుషి తమై, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఆ నదిపై ఆధార పడ్డ ప్రాంతమంతా ఇబ్బంది పడుతుంది. పునరా వాసాలు ఎక్కడా సరిగా జరగలేదు.70వేల మం దిని ఎక్కడకు తీసుకువెళ్తారు? ఆదిమజాతి చెంచు లను అడవికి దూరం చేస్తే చనిపోతారు. పెద్దపు లులను ఎక్కడ పెంచుతారు? వన్యమృగాలను ఏం చేస్తారు? పర్యావరణాన్ని ఎక్కడ నుంచి తెస్తారు? ఇక్కడ యురేనియం తీస్తారు.అయిపోతుంది. మరొక చోట తీస్తారు. అయిపోతుంది. ఇలా దేశమంతా కాలుష్యం చేయడం ఎందుకు? దాని బదులు గాలి, సూర్యుడి నుంచి వచ్చే కరెంటు వాడుకోవచ్చు కదా’’ అంటూ యురేనియం మైనింగ్‌ వ్యతి రేక ఆందోళన లకు కె.నాజరయ్య నాయకత్వం వహిస్తున్న ప్రశ్నిం చారు.-(సారంపల్లి మల్లారెడ్డి)

మైనింగ్‌ తవ్వదు..!

తమ పంటపొలాలు నాశనమై పోతు న్నాయి..పర్యావరణానికిహాని కలిగించడంత పాటు గిరిజన ప్రజల ప్రశాంత వాతావర ణాన్ని దెబ్బతీ సేలా ఉన్న అక్రమ మైనింగ్‌ లీజులను శాశ్వతంగా రద్దు చేసి రక్షణ కల్పించాలని మైనింగ్‌ ప్రభావిత ప్రాంత గిరిజనులు డిమాండ్‌ చేశారు.మైనింగ్‌ తవ్వకాల కోసం ప్రజాభిప్రా యసేకరణకు వచ్చిన ఉన్నతాధికార బృందాన్ని చుట్టు ముట్టారు.వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమకు నష్టం కలిగి స్తున్న మైనింగ్‌లు మాకొద్దు అంటూ వ్యతిరేకించారు. మైనింగ్‌ తవ్వొద్దు..మా పొట్టలు కొట్టొద్దు అంటూ అధికారులను నిలదీశారు.అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు.మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులకు వాలసి పంచాయతీ గిరిజ నులు ముక్తకంఠంతో మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సైమన్‌ గునపర్తి అల్లూరి సీతారామరాజు జిల్లా అనం తగిరి మండలంలో వాలసీ పంచాయితీ పరిధి కరకవలస,రాళ్లగరువు వద్ద సర్వే నెంబర్లు 29,33, 34,35లలోదురియ రుక్మిణీ,రొబ్బ శంకర్‌ల పేర్లతో ఉన్న 124ఎకరాల్లో జరుగుతున్న కాల్సైట్‌ మైనింగ్‌ లీజులపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు జిల్లాజాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీని వాస్‌,కాలుష్యనియంత్రణ మండలిబోర్డ్‌, ఎపిఎండిసి అధికార్లు నిమ్మలపాడు బుధవారం విచ్చేశారు. అధికార బృందాన్ని మైనింగ్‌ ప్రభావిత గిరిజన గ్రామాలైన వాలాసి పంచాయతీ నిమ్మలపాడు, తూభూర్తి, కరకవలస,రాళ్లవలస గిరిజనప్రజలు, సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి రెబ్బా ప్రగడ, అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు, ప్రజాప్రతి నిధులు అడ్డుకున్నారు. అక్రమ బినామీ మైనింగ్‌ తవ్వకాలకు ఇచ్చిన లీజులను రద్దు చేయలని ముక్త కంఠంతో నినాదించారు.గిరిజనులకు నష్టం కలిగిస్తున్న మైనింగ్‌లు మాకొద్దు అంటూ వ్యతిరేకిం చారు.2006 నుండి 2023 వరకు 18సంవత్స రాల నుంచి బినామీలీజులతో అక్రమ మైనింగ్‌ తవ్వకాలు చేపట్టి అమాయక గిరిజనుల వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు.ఇతర ప్రాంతా లకు చెందిన కొంతమంది బడాబాబులు, కొంత మంది ప్రభుత్వ పెద్దల అండదండలతో మైనింగ్‌ మాఫీయా చెలరేగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనచట్టాలు,హక్కులను తుంగలో తొక్కి తమ పంటపొలాల్లో నిక్షేప్తమైన గనులు, ఖనిజా లను తరలించుకు పోతున్నారని,మా అభిప్రాయా లను గౌరవించి అక్రమ మైనింగ్‌లు శాస్వతంగా రద్ధుచేయలని కోరారు.తర్వాత నిమ్మలపాడు గ్రామంలో ప్రారంభమైన ర్యాలీ కరకవలస, రాళ్ల గెడ్డలో ఏర్పాటు చేసిన సభా వేధిక వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
అధికారులను అడ్డుకున్న గిరిజనులు
ప్రజాభిప్రాసేకరణ చేపట్టేందుకు విచ్చే సినఅధికార బృందాన్ని స్థానిక గిరిజనులు, సమత సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రబ్బ ప్రగాడ రవి,సిపిఎం జెడ్పిటిసి దీసరి గంగరాజులు అడ్డుకుని అధికా రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్‌,ఖనిజ సంపద కాలు ష్య నియంత్రణ అధ్యక్షతన ఏపీఎం డిసి అధికారుల బృందం మైనింగ్‌ ప్రభావిత గిరిజన గ్రామాలైన నిమ్మలపాడు,రాళ్లగరువు గ్రామం మైనింగ్‌ ప్రదేశం వద్ద ప్రజాభిప్రాసేకరణ నిర్వహిం చారు. ఈసభలో కూడా గిరిజనులుఅధికార బృందాన్ని నిలదీశారు. స్థానిక సర్పంచ్‌తో సహా మైనింగ్‌ తవ్వకాలకు వ్యతి రేకంగా ఆందోళన చేపట్టా రు.ఆందోళన అనం తరం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ప్రజా ప్రతిని ధులు,గిరిజనులకు ఎటువంటి సమాచారం ఎందు కు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎటువంటి ప్రజాభిప్రా సేకరణ లేకుండా గత 18సంవత్సరాలుగా మైనిం గ్‌ జరపడం సరికాదని, దీంతో తమ పంట పొలా లు కాలుష్యంతో దెబ్బతిం టున్నాయని,పలు రోగు లతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అక్రమంగా తవ్వకాలు జరిపిన మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలిం చాలని అధికారులను చుట్టుముట్టి నిలదీశారు. దీంతో జేసీ శివశ్రీనివాస్‌,ఖనిజ సంపద కాలుష్య నియంత్రణ,స్థానికతహాసిల్దార్‌,ఏపీఎండీసీ అధికా రులను ప్రజాప్రతి నిధులు,మైనింగ్‌ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. అనం తరం సభావేదికకు వచ్చిన అధికారులు గిరిజన ప్రజలు,స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వేరువేరుగా అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు.
సభలో సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి మాట్లాడుతూ 1995 నుంచి ఈ ప్రాంతంలో సమత చేపడు తున్న వనరుల పరిరక్షణ ఉద్యమాన్ని అధికారులకు వివరించారు. నిమ్మలపాడు కాల్‌ సైట్‌ మైనింగ్‌ తవ్వకాలు నిర్వహించేందుకు టాటా,బిర్లా అప్పట్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదిరించు కుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన సమత సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగిందని గుర్తుచేశారు. తమకు అనుకూలంగా 1997లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో టాటా, బిర్లా సంస్థలు వెనుక్కు వెళ్లి పోయారని తెలిపారు. ఇదే గతి నేడు ఏపీఎండిసికు కూడా పడుతుం దన్నారు. ఐదో షెడ్యూల్‌ ఏరి యాలో గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు,పంచాయితీ రాజ్‌ విస్తీర్ణ చట్టం(పీసా) అనుమతులు లేకుండా ఇష్టం రాజ్యంగా మైనింగ్‌ తవ్వకాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకునేది లేద న్నారు. తర్వాత అనంతగిరి మండల జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లా డుతూ,వాలసి పంచా యతీ తూభుర్తి. కరకవలస, రాళ్లగెడ్డ గ్రామాలకు అనుకొనున్న కాల్‌సైట్‌ మైనింగ్‌ 2006 సంవత్సరం నుంచి బినామీదారులతో తవ్వ కాలు జరుపుతు న్నారన్నారు. బినామీ దారులైన దురియా రుక్మిణి, రొబ్బ శంకరరావులు మైనింగ్‌ కొల్లగొట్టి దోచుకు న్నారని విమర్శించారు. గ్రామ అభివద్ధి, పనిచేసిన రైతులకు కనీస కూలి చెల్లించ కుండా కోట్ల రూపాయలు మైనింగ్‌ మాఫియా దోచుకుందన్నారు. మైనింగ్‌ యాక్ట్‌ ప్రకారం గ్రామ పంచాయతీకి రాయల్టీ చెల్లించాల్సి ఉందన్నారు. ఏపీఎండిసి పేరుతో బినామీ వ్యవస్థను పెట్టి మై నింగ్‌ తవ్వకాలు జరితే చూస్తూ ఊరుకునేది లేదని, గిరిజనుల పక్షాన అంటూ న్యాయం జరిగే వరకూ తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరిం చారు. పూర్తిగా మైనింగ్‌ లీజులనురద్దు చేసి గిరిజన భూములు గిరిజనులకు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌ సాంబె సన్యాసిరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ,ప్రజలకు నష్టానికి గురి చేసే మైనింగ్‌ తవ్వకాలకు వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన ఉంటానన్నారు. ఇప్పటికైనా మా అభిప్రా యాలను గౌరవించి అక్రమ మైనింగ్‌ లీజులు, తవ్వకాలను శాస్వతంగా రద్ధుచేెయలని కోరారు
అనంతరం గిరిజనుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌ మాట్లాడారు.గిరిజనులు వెల్లడిరచిన వారి మనో భావాలు,అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మైనింగ్‌ తవ్వకాలను పరిశీలించి ప్రభుత్వానికి,అధికారులకు తెలియపరచాలని ఆయన ఆదేశించారు ఈకార్యక్రమంలో ఖనిజ సంపద కాలుష్య నియంత్రణ ఇంజనీరింగ్‌ అధికారి. సుదర్శన్‌,తహసిల్దార్‌ రామభాయి,సమత డైరెక్టర్‌ సుశాంత్‌ ప్రాణగ్రహి,కందుకూరి సతీష్‌ కుమార్‌, సిపిఎం టోకూరు సర్పంచ్‌ కె.మొసియా,మండల కార్యదర్శి ఎస్‌.నాగులు,వాలసి మాజీ సర్పంచ్‌ ధర్మన్న, గురుమూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు.

చరిత్ర పాఠాల తొలగింపు

జాతి నిర్మాణానికి విలువలు కలిగిన విద్యార్థు లను తయారు చేయడమే విద్యావ్యవస్థ లక్ష్యం. కాని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) జాతిలక్ష్యాలకు, రాజ్యాంగ సూత్రాలకు భిన్నం గా నిర్ణయాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే క్లస్టరైజేషన్‌, డిజిటలైజేషన్‌, విలీన ప్రక్రియలు, వృత్తి విద్యా కోర్సులలో ఎన్‌ఇపి అమలు వలన ఎటువంటి దుష్ఫరిణామాలను చవిచూస్తున్నామో అనుభవాలు రుజువు చేస్తున్నాయి. ఇదిలావుండగా సిలబస్‌లో, పాఠ్యాంశాలలో కూడా కేంద్రం జోక్యం పెరుగుతున్నది. తాజాగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబం ధించి పన్నెండవ తరగతి పాఠ్యపుస్తకాలలో చరిత్రకు సంబంధించిన చాప్టర్లను తొలగించారు.
భావి పౌరులకు దేశచరిత్ర తెలియ కూడదనే సరిగ్గా కోవిడ్‌ విపత్తు సమయంలో, వ్యవస్థ లేవీ పని చేయలేని విపత్కాల పరిస్థితులతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఇపి అమలుకు పూనుకుంది. విద్యా సంస్థలు కోల్పోయిన పనిదినాలను దృష్టిలో పెట్టు కుని విద్యార్థులపై భారం తగ్గించాలని 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ఎన్‌సిఇఆర్‌టి కూడా సూచిం చింది. ‘వేటిని తొలగించాలి? ఎవరి అభిప్రాయా లు తీసుకోవాలనే ప్రక్రియగాని, పారదర్శకతగాని లేదు.2021లోని సిలబస్‌ను తగ్గించేటపుడు విద్యా ర్థులపై భారాన్ని తగ్గించే విధంగా లేదు. పాలకుల భావజాల వ్యాప్తికి అడ్డంకిగా వున్న పాఠ్యాంశాలను తొలగించారు.కోవిడ్‌ విపత్తును అవకాశంగా మలు చుకుని, వారి ఎజెండా అమలుకు పూనుకున్నది. ఎన్‌ఇపి ముసాయిదాను విడుదల చేసినపుడు అది అమలైతే ఎటువంటి ప్రమాదాలు వస్తాయని ఊహించామో అవి నేడు విద్యారంగంలో జరిగి పోతున్నాయి.
నాడు తొలగించిన వాటిలో ముఖ్యమైనవి
లౌకికవాదం, ప్రజాస్వామ్యం,హక్కు లు,పౌరసత్వం,ఉద్యమాలు,జాతీయవాదం,ప్రాంతీ య అవసరాలు,స్థానిక సంస్థలు,ప్రభుత్వాలు,ఆహార భద్రత,పర్యావరణం,పంచవర్ష ప్రణాళికలు ఇతర దేశాలతో సంబంధాలు,అలీన విధానం,పర్యావ రణం,సహజవనరులు,భిన్నత్వంలో ఏకత్వం వంటి అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలను తొల గించారు.ఇవన్నీ మనదేశచరిత్ర,వారసత్వ సంపదకు సంబంధించిన అంశాలు. ఒక్క మాటలో చెప్పా లంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు, రాజ్యాంగ లక్ష్యాల సాధన, దేశ చరిత్రను పూర్తిగా కనుమరుగు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కాలంలో పాలకుల వైఫల్యాలకు సంబంధించిన ప్రపంచీకరణ విధానా లు,లింగ వివక్ష, పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటివి తొలగించారు.
నేడు తొలగిస్తున్న పాఠ్యాంశాలు …
ఎన్‌ఇపి అమలు నేపథ్యంలో ఎన్‌సిఇ ఆర్‌టి రూపొందించిన కొత్త పుస్తకాలలో మహాత్మా గాంధీకి సంబంధించిన పలు పాఠ్యాంశాలను తొలగించారు. ప్రధానంగా తొలగించిన అంశా లివి.

థీమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ పార్ట్‌-2 (16వ,17వ శతాబ్దాలకు సంబంధించినది)

 1. పదకొండవ తరగతిలో సెంట్రల్‌ ఇస్లామిక్‌ ల్యాండ్స్‌, సంస్కృతుల ఘర్షణ
 2. పన్నెండవ తరగతి పౌరశాస్త్రంలో స్వాతంత్య్రం నుండి భారత రాజకీ యాలలో ప్రసిద్ధ ఉద్యమాల వరకు
 3. పన్నెండవ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకం నుంచి గాంధీజీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ పై విధించిన నిషేధానికి సంబంధిం చిన కొన్ని పేరాలనూ, అలాగే హిందూ-ముస్లిం ఐక్యతకు గాంధీ చేపట్టిన కృషికి సంబంధించిన కొన్ని పేరాలను కూడా తొలగించారు.
 4. గతేడాది కర్ణాటక పాఠ్యపుస్త కాలతో ప్రముఖస్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ పాఠ్యాంశాన్ని తొలగించారు.
 5. సంఘసం స్కర్తలు పెరియార్‌, నారాయణ గురు,బసవడు వంటి ప్రముఖుల పాఠాలను తొలగించారు.
 6. పాఠ్యాంశాలే కాదు. సిబిఎస్‌ఇ సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలలో ‘గుజరాత్‌లో ముస్లింలపై దాడులు ఎవరు చేశారు?’ వంటి ప్రశ్నలు దేనికి సంకేతాలు?
  జాతీయోద్యమ స్ఫూర్తి అవసరం లేదా?
  జాతీయోద్యమ కాలంలోలౌకిక, ప్రజా స్వామ్యం,సార్వత్రిక విద్యకు డిమాండ్‌ పెరిగింది. కులమతాలకు అతీతంగా జాతిని ఐక్యం చేసే విద్య ను కోరుకున్నారు. సామాజిక దురాచారాలకు వ్యతి రేకంగా సంఘ సంస్కరణల ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉద్యమాలు సామాజిక మార్పులుకు దారితీశాయి.ఈ క్రమంలో ప్రగతిశీల శక్తులు, సం ఘాలు,వ్యక్తులు,సంస్కర్తలు ఏకమై బ్రిటిష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడిన మన దేశ చరిత్ర మన బాలలకు, భావి పౌరులకు అవస రం లేదా?
  ప్రాణాలకు వెరవకుండా భగత్‌సింగ్‌ చేసిన అద్భుతమైన పోరాటం,త్యాగం దేశ ప్రజ లను కదిలించింది.క్విట్‌ ఇండియా, సహాయ నిరా కరణ ఉద్యమం వంటివి లక్షోపలక్షలుగా యువ తను,లాయర్లను,ప్రజలను, విద్యార్థులను జాతీయో ద్యమం లోకి ఆకర్షించాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశవిభజనకు కుట్ర పన్నిన ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి మతసంస్థల చర్యలను అంగీకరించని గాంధీజీ మత సామరస్యం కోసం హిందూ-ముస్లిం భాయిభాయి అంటూ విస్తృతంగా పర్యటించాడు. ఇవి నచ్చని హిందూత్వ శశ్తులకు ప్రతినిధి అయిన గాడ్సే…మహాత్ముడిని హత్య చేశాడు.
  మత రాజ్యం కోసం అవసరమైన ప్రయ త్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్య కాషాయీ కరణలో భాగంగా ఉద్దేశ పూర్వకంగానే ఎన్‌ఇపి ద్వారా గాంధీజీకి సంబంధించిన చరిత్ర ఘట్టాలను తొలగిస్తున్నది.ఎన్‌ఇపి అమలు కాకముందు పరిస్థితికి, అమలవుతున్న తరువాత పరిస్థితికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది.- (కె.విజయ గౌరీ/కె.శేషగిరి)
1 2