పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల భ్రమ

పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందితే మొదట్లో కార్మికులు నష్టపోయినా, ఆ తర్వాత వారూ ప్రయోజనం పొందుతారన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా ఒకానొక ప్రత్యేక, చారిత్రిక పరిస్థితుల్లో యూరప్‌ ఖండంలోని కార్మికుల స్థితిగతులు పైన వివరించిన విధంగా మెరుగు పడడం సంభవించిందే తప్ప అదేదో పెట్టుబడి దారీ అభివృద్ధి క్రమంలో జరిగినది కాదు. పెట్టుబడిదారీ విధానం మొదలైన తొలి కాలం లో అది నిరుద్యోగాన్ని పెంచుతుందని, దాని వలన పేదరికం పెరుగుతుందని…కాని, మొదట్లో కలిగిన ఈ నష్టాన్ని ఆ తర్వాత అది అభివృద్ధి చెందుతున్న కాలంలో పూడ్చివేస్తుందని చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. మొదట్లో ఉపాధి పోగొట్టుకున్నవారంతా ఆ తర్వాత కాలంలో ఉద్యోగాలు పొంది కార్మికులుగా తిరిగి పనుల్లో చేరుతారని, నిరుద్యోగం తగ్గడంతో వేతనాలు పెరగడం ప్రారంభమౌతుందని, వేతనాలు పెరుగుతున్న కొద్దీ కార్మికుల ఉత్పాదకత కూడా పెరుగు తుందని వారు భావిస్తారు. గత చరిత్ర అనుభవాలు కూడా ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నట్టు పైకి చూస్తే అనిపిస్తుంది కూడా. మార్క్సిస్టు చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌బామ్‌ అంచనా ప్రకారం పారిశ్రా మిక పెట్టుబడిదారీ విధానం మొదలైన తర్వాత బ్రిటన్‌ లో నిరుద్యోగం పెరిగింది. కాని 19వ శతాబ్దపు నడిమి కాలం నాటికల్లా పరిస్థితులు మెరుగుపడ్డాయి. కార్మిక వర్గానికి అనుకూలంగా మారాయి. ఈ విధమైన దృక్పథం ఉంటే పెట్టుబడిదారీ విధానానికి పరివర్తన చెందే సమయంలో ఎన్ని కష్టాలు కలిగినా, ఆ తర్వాత పెట్టుబడిదారీ విధానం వలన కార్మికులకు కూడా ప్రయోజనాలు ఉంటాయి అన్న నిర్ధారణకి వస్తాం.ఈ విధమైన అవగాహన మొత్తంగానే తప్పు. పెట్టుబడిదారీ విధానం తాను తొలుత కార్మికవర్గానికి కలిగించిన నష్టాన్ని ఆ తర్వాత కాలంలో పూడ్చి వారికి మెరుగైన పరిస్థితులు కల్పిస్తుంది అని భావించడానికి ఎటువంటి సిద్ధాంత ప్రాతి పదికా లేదు. కార్మికుల స్థితిగతులలో తర్వాత కాలంలో కనిపించిన మెరుగుదలకు, పెట్టుబడి దారీ విధానపు సహజ సద్యోజనిత స్వభావానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఇంగ్లీషు ఆర్థిక శాస్త్రవేత్త డేవిడ్‌ రికార్డో పరిశ్రమల్లో యంత్రా లను వినియోగించడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఈ విధమైన వాదన ముందుకు తెచ్చాడు. మొదట్లో యంత్రాల వలన కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి కష్టాలపాలౌతారని, కాని ఆ తర్వాత లాభాలరేటు పెరిగి పెట్టుబడి ఎక్కువగా పోగుబడుతుందని, దానితో మరిన్ని ఎక్కువ పరిశ్రమలు వస్తాయని, వాటిలో గతంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారందరికీ మళ్ళీ ఉపాధి లభించడమేగాక వారి స్థితిగతులు బాగా మెరుగు పడతాయని రికార్డో ప్రతిపాదించాడు. కార్మికుల జనాభా మరీ ఎక్కువగా పెరిగిపోకుండా ఉండేవిధంగా వాళ్ళు తమను తాము నియంత్రించుకుంటే వారి వేతనాలు పెంచుకోవచ్చునని కూడా ఆయన చెప్పాడు. రికార్డో వాదనలో రెండు లోపాలు ఉన్నాయి. పరిశ్రమల్లో యంత్రాలను ప్రవేశపెట్టడం అనేది ఒకే ఒక్కమారు జరిగే ప్రక్రియగా ఆయన అభివర్ణించాడు. కాని వాస్తవంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో కొత్త కొత్త యంత్రాలను, నూతన ఉత్పత్తి ప్రక్రి యలను ప్రవేశపెట్టడం అనేది నిత్యం జరుగుతూనే వుంటుంది. యంత్రాలను మొదట ప్రవేశపెట్టినప్పుడు పెట్టుబడిదారుల లాభాల రేటు పెరగడం అనేది జరిగినా, వారి వద్ద పెట్టుబడి ఎక్కువగా పోగుబడినా, దాని ఫలితంగా అంతకు ముందు కోల్పోయిన ఉద్యోగాలన్నీ మళ్ళీ రావడం అనేది ఎన్నటికీ జరగదు. ఎందుకంటే ఈ లోపునే మళ్ళీ కొత్త యంత్రాలను ప్రవేశపెట్టడం అనేది జరిగిపోతూ వుంటుంది. అందుచేత ఈ విషయాన్ని నిరంతరం మారుతూ వుండే క్రమంలోనే చూడాలి. పరిశ్రమల్లో పెట్టే పెట్టుబడి వృద్ధి చెందే రేటు ‘జి’ అనుకుందాం. అప్పుడు ఉత్పత్తి వృద్ధిరేటు కూడా ‘జి’ యే ఉంటుంది (ఒకవేళ సాంకేతిక పరిజ్ఞానం పెంచడం కోసం అదనపు పెట్టుబడి పెట్టినా, దాని వలన శ్రామికులకు చెల్లించే వేతనాలు ఆ మేరకు తగ్గుతాయే కాని ఉత్పత్తి అయ్యే సంపదలో వృద్ధిరేటు మాత్రం పెట్టుబడిలో వృద్ధిరేటు ఎంత ఉంటుందో, అదే మోతాదులో ఉంటుంది). శ్రామిక ఉత్పాదకత వృద్ధిరేటు ‘పి’ అనుకుందాం. అప్పుడు అదనపు కార్మికుల అవసరం పెరిగే రేటు జి-పి ఉం టుంది. కార్మికుల జనాభా పెరిగే రేటు ‘ఎన్‌’ అనుకుంటే జి-పి కన్నా ఎన్‌ తక్కువ ఉన్నప్పుడే నిరుద్యోగం తగ్గుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలోజి-పి విలువ ఎన్‌ ను దాటి ఉండేట్టు చూసే ఏర్పాటు ఏదీ లేదు. కార్మికుల ఉత్పా దకత పెరుగుతూ మరోవైపు నిరుద్యోగం రేటు కూడా పెరుగుతూ వుంటే (అప్పుడు వేతనాల రేటు కనీస స్థాయిలోనే ఎప్పుడూ ఉండిపో తుంది) లాభాల రేటు పెరుగుతూ పోతుంది. దానివలన అదనపు పెట్టుబడి పోగుబడుతుంది. దానిని వినియోగించినప్పుడు కొత్త ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు నిరుద్యోగం పడిపోతుంది.- రికార్డోను సమర్ధించేవారి వాదన ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే రికార్డో వాదనలోని రెండో సమస్య ముందుకొస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి అయే సరుకులకు డిమాండు ఎప్పుడూ పెరుగుతూనే వుంటుంది అని రికార్డో భావించాడు. అందువలన ఉత్పత్తి పెరిగితే దాని ఫలితంగా లాభాలు పెరుగుతాయని, దానివలన అదనపు పెట్టుబడి పోగుబడు తుందని, ఈ ప్రక్రియకు ఎటువంటి ఆటంకమూ ఉండదని అతను భావించాడు. ‘’సరుకులు ఎంత ఎక్కువగా మార్కెట్‌ లోకి వస్తే అంత ఎక్కువ డిమాండ్‌ వాటికి ఉంటుంది’’ అన్న సూత్రాన్ని అతను విశ్వసించాడు. కాని లాభాలు రావాలంటే ఎక్కువ సరుకులు ఉత్పత్తి చేసినంత మాత్రాన సరిపోదు. అవన్నీ అమ్ముడు పోయినప్పుడే వాస్తవంగా పెట్టుబడిదారుడికి లాభం పోగుపడుతుంది. ఉత్పత్తి అయిన సరుకులన్నీ అమ్ముడుపోవాలంటే అది కొనుగోలు శక్తిని బట్టి ఉంటుంది. కొనుగోలుశక్తి వేతనాల రేటుని బట్టి ఉంటుంది. మరి వీలైనంత తక్కువ స్థాయిలో వేతనాలను ఉంచాలని పెట్టుబడి దారులు నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మార్కెట్‌ లో డిమాండ్‌ నిరంతరం పెరగడానికి గ్యారంటీ ఏమిటి? అందుచేత సాంకేతిక పరి జ్ఞానం పెరిగి దాని ఫలితంగా నిరుద్యోగం పెరిగితే, ఆ విధంగా ఉద్యోగాలను పోగొట్టు కున్నవారిని తిరిగి ఉద్యోగాలలో పెట్టుకోడానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎటువంటి ఏర్పాటూ లేదు. అందుచేత పెట్టుబడిదారీ విధానం ప్రారంభదినాల్లో కార్మికులకు నష్టం కలిగిం చినా, తర్వాత అది పుంజుకున్నాక కార్మికులకు మేలు జరుగుతుందన్న రికార్డో వాదనకు ఎటువంటి సైద్ధాంతిక ప్రాతిపదికా లేదు.కాని వాస్తవ చరిత్ర చూస్తే సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడం జరిగాక అక్కడి కార్మికుల స్థితి గతులు మెరుగుపడ్డాయి. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? యూరప్‌ ఖండం లోని కార్మి కులు చాలా భారీ సంఖ్యలో ‘’కొత్త ప్రపంచానికి’’ (అంటే అమెరికా ఖండానికి) వలసలు పోయారు. ఈ వలసలు మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యేదాకా (1914) కొనసాగాయి. 19వ శతాబ్దంలో నెపోలియన్‌ యుద్ధం నాటినుండి మొదటి ప్రపంచయుద్ధం దాకా మధ్య కాలంలో దాదాపు 5కోట్ల మంది యూరోపియన్‌ కార్మికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు వలసలు పోయారని ఆర్థికవేత్త ఆర్థర్‌ లూయిస్‌ అంచనా వేశాడు. ఈ వలసలు ‘’అధిక వేతన’’వలసలు. అంటే ఆ కార్మికులు అంతవరకూ ఉండిన స్వస్థలాల్లోనూ, అదే విధంగా వాళ్ళు వలసలు పోయిన కొత్త ప్రదేశాల్లోనూ వేతనాలు అధికస్థాయిలో ఉన్నా యి. ఇదే కాలంలో ‘’అల్ప వేతన’’ వలసలు కూడా మరోవైపు కొనసాగాయి. ఈ రెండో తరహా కార్మిక వలసలు ఉష్ణ, సమశీతోష్ణ ప్రదేశాలైన ఇండియా, చైనా వంటి దేశాల నుండి ఫిజీ, మారిషస్‌, వెస్ట్‌ ఇండీస్‌, తూర్పు ఆఫ్రికా, నైరుతి అమెరికా వంటి ఉష్ణ, సమశీ తోష్ణ ప్రదేశాలకు జరిగాయి. ఇక్కడ ఆ కార్మి కుల స్వంత దేశాలలోనూ, వాళ్ళు వలసలు వచ్చిన దేశాల్లోనూ వేతనాల స్థాయి తక్కువగానే ఉంది. ఈ కార్మికులను శ్వేతజాతి కార్మికులు వలసలు వచ్చిన ప్రదేశాలకు రానివ్వలేదు (ఇప్పటికీ కోరుకున్న వారందరినీ అక్కడికి వలసలు రానివ్వడం లేదు). ఇలా ఒకవైపు అధిక వేతన వలసలు, మరోవైపు అల్పవేతన వలసలు ఎందుకు జరిగాయి? దీనికి లూయిస్‌ చెప్పిన సమాధానం ఏమిటంటే, ఆ కాలంలో బ్రిటన్‌ లో వ్యవసాయ విప్లవం జరిగి, తక్కిన యూరప్‌కంతటికీ విస్తరించింది అని, దాని వలన గ్రామీణ కార్మికులకు యూరప్‌ లో ఆదాయాలు బాగా పెరిగాయని అతను అన్నాడు. కాని ఆ విధమైన వ్యవసాయ విప్లవం ఏదీ బ్రిటన్‌ లో జరిగిన దాఖలాలు లేవు. మరి అసలు కారణం ఏమిటి? అధిక వేతన వలసల విషయంలో జరిగినదేమంటే యూరప్‌ నుండి వలసలు పోయినవారు అమెరికా, ఆస్ట్రేలియా తదితర ప్రదేశాలలోని స్థానికులను వారి వారి భూముల నుండి తరిమివేసి ఆక్రమించుకుని వ్యవసాయదారులుగా స్థిరపడి అధిక ఆదాయాలు ఆర్జించసాగారు. మరోవైపు యూరప్‌ లో కార్మికవర్గం సంఖ్య వలసల కారణంగా తగ్గిపోయింది. అందుచేత ఇక్కడ కూడా కార్మికుల వేతనాలను పెంచక తప్పలేదు. ఒక శీతల దేశం నుండి మరొక శీతల దేశానికి జరిగిన వలసలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1820 నుండి 1915 మధ్య బ్రిటన్‌ లో ఎంత మేరకు జనాభా పెరిగిందో, అందులో సగం మేరకు అక్కడి నుండి వలసలు పోయారు. ఇటువంటి స్థాయిలోనే మన దేశంలో కూడా వలసలు జరిగివుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివకూ దాదాపు 50 కోట్ల మంది వలసలు పోయివుండాలి (యూరప్‌ లో జరిగిన వలసల ప్రభావం ఎంత బలంగా ఉండిరదో బోధపడడానికి ఈ పోలిక చూపడం జరిగింది.). ఆ విధంగా ఇతర దేశాలకు తరలిపోవడానికి యూరోపియన్‌ కార్మికులకు లభించిన అవకాశాలు వారి స్థితిగతులు బాగా మెరుగుపడడానికి దోహదం చేశాయే తప్ప పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి క్రమంలో స్వత:సిద్ధంగా కార్మికుల స్థితి గతులను మెరుగుపరిచే ఏర్పాటు అంటూ ఏదీ లేదు. ఇలా వేరే దేశాలకు పోయి అక్కడి స్థానికులను వెళ్ళగొట్టి వారి భూములను ఆక్రమించుకునే అవకాశం సామ్రాజ్యవాద దురాక్రమణ స్వభావం నుంచి వచ్చింది.సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా సంపన్న దేశాలలోని కార్మికుల స్థితిగతులు మెరుగుపడే అవకాశం వచ్చింది. ఇది కేవలం స్థానికుల నుండి భూములను లాక్కోవడం ద్వారా మాత్రమే కాదు. సంపన్న దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులకు డిమాండ్‌ కల్పించడానికి, తద్వారా సంపన్న దేశాలలో అదనపు ఉద్యోగాలు కల్పించడానికి సామ్రాజ్యవాదులు తాము ఆక్రమించుకున్న వలసలలో చేతివృత్తిదారులను, చిన్న తరహా ఉత్పత్తిదారులను భారీ స్థాయిలో దెబ్బ తీశారు. అంటే ఒకవిధంగా సామ్రాజ్యవాదం సంపన్న దేశాలలోని నిరుద్యోగాన్ని వలస దేశాలలోకి ఎగుమతిచేసిందన్నమాట. ఆ వలస దేశాలకు తమ తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోగలిగిన సత్తా లేదు. అవన్నీ సంపన్న దేశాల ఆధీనంలోనే ఉండేవి. అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందితే మొదట్లో కార్మికులు నష్టపోయినా, ఆ తర్వాత వారూ ప్రయోజనం పొందుతారన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా ఒకానొక ప్రత్యేక, చారిత్రిక పరిస్థితుల్లో యూరప్‌ ఖండంలోని కార్మికుల స్థితిగతులు పైన వివరించిన విధంగా మెరుగుపడడం సంభవించిందే తప్ప అదేదో పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో జరిగినది కాదు. దీనిని బట్టి యూరప్‌ ఖండంలోని కార్మికులు సామ్రాజ్యవాద దోపిడీ పట్ల మెతకగా ఉంటారన్న అభిప్రాయానికి రాకూడదు. సామ్రాజ్యవాద దోపిడీ విధానం నడిచే తీరు ఇలానే ఉంటుంది. వ్యాసకర్త : సీనియర్‌ పాత్రీకేయులు(ప్రజాశక్తి సౌజన్యంతో..)

ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకం గొంతు నులమొద్దు

ఈ పథకంలో ఈ ఏడాది సగటు పనిదినాల సంఖ్య కేవలం 47 మాత్రమే. కనీసం ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించింది అందులో సగం కూడా లేదు. ప్రాణాంతకంగా మారిన ఈ ఆంక్షలకు తోడు, తక్కువ వేతనాలు. అది కూడా సమయానికి సరిగా అందని వేతనాలు, డిజిటల్‌ అడ్డంకులు, సరిపడా పని దినాలు లేకపోవడం…ఇవన్నీ కలిసి ఈ పథకం కింద పని దొరకబుచ్చుకుంటున్న కుటుంబాల సంఖ్య తగ్గిపోవడానికి దారితీసింది. – (ఉదయ్‌భాష్కర్‌ రెడ్డి)
మోడీ ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పటి నుండి గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌) గొంతు నులిమేందుకు ఏదో రకంగా ప్రయత్నిస్తూనే వుంది. ఆర్థిక వ్యవస్థ మరింత ‘సమర్ధవంతంగా’, ‘ఉత్పాదకంగా’ పని చేసేలా మార్గనిర్దేశనం చేయాలంటే ప్రైవేటు రంగాన్ని అనుమతించాలని, అందుకుగాను ప్రభుత్వ వ్యయంలో కోత పెట్టాలని నయా ఉదారవాద సిద్ధాంతం పేర్కొంటున్నది. దీనికి కట్టుబడిన మోడీ ప్రభుత్వం క్రమం తప్పకుండా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సహా వివిధ సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత పెడుతూ వస్తోంది. అంతేకాకుండా పథకాల గొంతు నులిమేందుకు ఇతర మోసపూరిత చర్యలను కూడా చేపడుతోంది.
ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ విషయానికి వస్తే, 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.73 వేల కోట్లు కేటాయింపులు జరపాలని ప్రతిపాదించబడిరది. కానీ, వాస్తవానికి రూ.89,400 కోట్లు ఖర్చు చేసి వుంటారని అంచనా. అంతకు ముందు సంవత్సరం 2021-22లో ఖర్చు పెట్టిన రూ.98,467.85 కోట్లలో దాదాపు పది శాతం తక్కువ. అయితే 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది సవరించిన అంచనా కేటాయింపులో ఏకంగా 33 శాతం కోత పెట్టారు.
ప్రభుత్వం ఈ పథకానికి కేటాయింపులు తగ్గించడం ఒక్కటే కాదు. పలురకాల కొర్రీలు పెడుతోంది. ఈ ఏడాది జనవరిలో, ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ కార్మికులు తప్పనిసరిగా అటెండెన్స్‌ (హాజరు) నమోదు చేయాలంటూ నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సర్వీస్‌ (ఎన్‌.ఎం.ఎం.ఎస్‌) పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో కార్మికులు తమ హాజరును నమోదు చేయడం కోసమే గంటల తరబడి ప్రయాస పడాల్సి వస్తోంది. హాజరు పడకపోతే, ఆ రోజుకు వారి వేతనం నష్టపోతారు కాబట్టి ఇది వారికి జీవన్మరణ సమస్యగా మారింది. పథకంలో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కొనడానికంటూ ఈ తరహా హైటెక్‌ చర్యలను కార్మికులపై బలవంతంగా రుద్దడం ప్రభుత్వ కుట్ర మినహా మరొకటి కాదు. పిడిఎస్‌ పంపిణీలో కూడా గతంలో ఇదే పద్ధతిని రుద్దారు. ప్రభుత్వ పాఠశాల టీచర్ల హాజరు విషయంలోనూ ఇలాగే చేశారు. వీటన్నిటివల్లా ప్రజలకు గందరగోళ, విచారకర పర్యవసానాలే కలుగుతున్నాయి. కనెక్టివిటీ సమస్యలతో పాటుగా ఆధార్‌ సరిపోలడం లేదని,బ్యాంక్‌ ఖాతా నెంబరు కలవడం లేదని,చేతి వేళ్ళ గుర్తులు పడడం లేదని, ఇంకా ఇలాగే అనేక సమస్యల కారణంగా పిడిఎస్‌ రేషన్‌ వేలాది మందికి అందకుండా పోయింది. ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌ కార్మికులు సైతం ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ఇటువంటి నిబంధనల కారణంగా కార్మికులు పని కోసం ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ ను ఆశ్రయించడం తగ్గిపోతున్నది.
వేతనాల్లో నిరంతరం జరుగుతున్న జాప్యం కార్మికులకు ఎదురవుతున్న మరో సమస్య. ఒకోసారి అనుమతించిన 15 రోజుల వెసులుబాటును కూడా మించి జాప్యం జరుగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో 15 అంతకుమించి రోజుల జాప్యం తర్వాత రూ.3630 కోట్ల వేతనాలు చెల్లించారు. ఇంకా రూ.1010 కోట్ల వేతనాలు పెండిరగ్‌లో వున్నాయని ప్రభుత్వ డేటా పేర్కొంటోంది. చాలా తక్కువ కూలికి పని చేసే కార్మికులకు ఈ స్థాయిలో ఇలా వేతనాలు పెండిరగ్‌లో పెట్టడమనేది ఏ మాత్రమూ సహించరాని విషయం. దీంతో వారు తరచుగా తక్షణమే డబ్బులు చేతికి అందివచ్చే పనులను ఎంచుకుంటున్నారు. ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ వేతనాల కన్నా తక్కువే వచ్చినా వారు దానికే మొగ్గు చూపుతున్నారు. ఈలోగా ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలను 2 నుండి 10 శాతం మధ్య పెంచుతున్నట్లు చాలా అట్టహాసంగా ప్రకటించింది. అంటే రోజుకు రూ.7 నుండి రూ. 26 వరకు పెరుగుతాయి. గత అనేక మాసాలుగా ద్రవ్యోల్బణం 6-8 శాతం మధ్యలో వుంది. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగా 8-10 శాతం మధ్య వుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ అధిక ద్రవ్యోల్బణం తగ్గుతుందని విశ్వసించడానికి ఒక్క కారణం కూడా కనిపించడం లేదు. ఇక కార్మికుల వేతనాల పెంపు అమలు కూడా రాబోయే ఆర్థిక సంవత్సరం నుండే. వాస్త వానికి, వ్యవసాయ కార్మికులకు అలాగే వ్యవసాయేతర కార్మికులకు ప్రస్తుతమున్న వేతనాల రేట్ల కన్నా ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ వేతనాలు చాలా తక్కువగా వున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌ పనులకు సంబంధించి సగటు దినసరి వేతనం కేవలం రూ.217.87. అదే సమయంలో పురుష వ్యవసాయ కార్మికులకు రూ.349.77 అని ఆర్‌బిఐ పేర్కొంది. అలాగే ఈ పథకంలో ఈ ఏడాది సగటు పనిదినాల సంఖ్య కేవలం 47మాత్రమే. కనీసం ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించింది అందులో సగం కూడా లేదు. ప్రాణాంతకంగా మారిన ఈ ఆంక్షలకు తోడు, తక్కువ వేతనాలు. అది కూడా సమయానికి సరిగా అందని వేతనాలు, డిజిటల్‌ అడ్డంకులు, సరిపడా పని దినాలు లేక పోవడం…ఇవన్నీ కలిసి ఈ పథకం కింద పని దొరకబుచ్చు కుంటున్న కుటుంబాల సంఖ్య తగ్గిపోవడానికి దారితీసింది.
అధికారిక సమాచారం ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద పని దొరికిన వారు 8.6 కోట్ల మంది వుండగా, గతేడాది ఈ సంఖ్య 10.6 కోట్లుగా వుంది.అంటే గతేడాది కన్నా 2 కోట్లు (దాదాపు 20శాతం) తగ్గింది. పైగా ఈ పథకంలో పని కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 1.6 కోట్ల మంది కార్మికులు తర్వాత పని లోకి వెళ్లకుండా వెనుదిరిగారు. అలాంటి వారిని పరిగణన లోకి తీసుకోకుండా వేసిన లెక్క ఇది.
తక్కువ వేతనాలు, సరిపడా పని దినాలు లేకపోయినా ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ అనేది కోట్లాదిమంది కుటుంబాలకు జీవనాధారంగా వుంది. ఈ పథకంలో ఇచ్చేది అతి తక్కువ వేతనాలే అయినప్పటికీ అవే వారికి ఎంతో విలువైనవి. ఎందుకంటే దేశంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. పైగా పెరుగుతున్న ధరలు కుటుంబాల బడ్జెట్‌ను ధ్వంసం చేస్తున్నాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభమనేది ఎడతెగకుండా వుంది. వేతనాలు, పని దినాలు పెంచుతూ, పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ, ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఇప్పుడు నెలకొంది. దీనితో పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటంగా మారిన ఆటకు అంతం పలకాలి.
ఉపాధిపై కుంటిసాకులుయూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఉపాధి హామీ పథకానికి గడచిన ఎనిమిది సంవ త్సరాలుగా ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పైగా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగిత తగ్గిందంటూ వితండవాదన చేస్తోంది. నిజానికి ఈ పథకం పనులకు గిరాకీ తగ్గి 34 నెలల కనిష్ఠానికి చేరింది. పనులకు గిరాకీ తగ్గడం వల్ల నిరుద్యోగం తగ్గినట్టేనని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వాదనలో లాజిక్‌ ఉన్న మాట నిజమే కానీ, గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగార్థులకు చేతినిండా పని దొరకుతోందా? అలా దొరికితే గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులు నగరాలు, పట్టణాలకు ఎందుకు తర లివస్తున్నారు. గతంలోకంటే పట్టణాలు, నగరాలకు గ్రామాల నుంచి వచ్చిన, ఇప్పటికీ వస్తున్న జనాభా పెరు గుతోంది. వీరంతా గ్రామాలలో పనులు దొరకకపోవ డంవల్లనే పట్టణాలు, నగరాలకు తరలివస్తున్నారు. గ్రామాల్లో హుందాగా, గౌరవంగా జీవించే యువత, ముఖ్యంగా ఉద్యోగార్థులు నగరాలు, పట్టణాలలో అమా నవీయ వృత్తులకు సైతం సిద్ధపడుతున్నారు. ఉపాథి హామీ పనులకు గిరాకీ తగ్గిందన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదు. గత ఏప్రిల్‌లో 3 కోట్ల 23 లక్షల మంది ఈ పనుల కోసం దరఖాస్తు చేసుకోగా, జూన్‌లో వారి సంఖ్య 4 కోట్ల 32 లక్షలకు చేరింది. అంతకుముందు రెండు సం వత్సరాలు కరోనా దెబ్బవల్ల ఉపాథి హామీకి గండిపడిన మాట వాస్తవమే. కరోనా తగ్గిన తర్వాత గ్రామాలలో వ్యవసాయ, చేనేత వస్తు కళా రంగాలలో పనులు పుంజు కుంటున్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగంలో పనులు పెరుగుతూండడమే ఇందుకు ఉదాహరణ. గ్రామీణ ఉపాథికి డిమాండ్‌ తగ్గిందనుకుంటే అందుకు కారణం వెంటనే బిల్లులు చెల్లించకపోవడమే. నైపుణ్యం అవసరం లేని పనులలో పనిచేసేందుకు ముందుకు వచ్చేవారికి ఒక ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పాటు పని కల్పించాలి. కానీ 2021-22 సంవత్సరంలో 60.70 రోజులు మాత్రమే పనులు కల్పించారు. నిధుల కేటా యింపును బట్టే పనుల కకేటాయింపు ఉంటుంది. అంటే నిధుల కేటాయింపు తగ్గడం వల్లనే ఇలా జరుగు తోంద న్నమాట. ఈ విషయాన్ని మరుగుపర్చి ఉపాధి కోరేవారి డిమాండ్‌ తగ్గిపోయిందంటే నమ్మడానికి ప్రజలు అంత అమాయకులా? పెద్ద పారిశ్రామికవేత్తలు చెల్లించాల్సిన బ్యాంకు రుణాల బకాయిలను వందల కోట్లలో మాఫీ చేసిన, ఇప్పటికీ చేస్తున్న ప్రభుత్వం ఉపాధి పనుల నిధులలో కోత విధించడం ముమ్మాటికీ తప్పే. పైగా ఉపాథి పనులకు గిరాకీ తగ్గిందనడం ఓ కుంటిసాకు మాత్రమే. ఉపాథి హామీ పనులకు 15 రోజుల లోపు నిధు లు విడుదల చేయాలి. కానీ అలా జరగడం లేదు. నిధుల విడుదల అనేది నిరంతర ప్రక్రియ. దానికోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రోజుల తరబడి ఢల్లి%స%లో తిష్టవేసి లాబీయింగ్‌ చేయాల్సి వస్తోంది. అలా చేసినా పూర్తిస్థాయిలో నిధులు విడుదల కావడం లేదు.
కూలీలకు ‘ఉపాధి’ కష్టాలు
పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వాలు పనులు కల్పిస్తుంది. కాని కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల్లో ఎన్‌ఎంఎంఎస్‌ నూతన సాంకేతకత యాప్‌ ప్రవేశ పెట్టడంతో ఉపాధి కూలీలకు కష్టాలు తప్పడం లేదు. వాస్తవంగా పనులు చేసిన గ్రామం నుండి వేతనదారుల పనులకు సంబంధించి కూలీల హాజరు, ఫోటో తప్పనిసరిగా ఆయా సంఘాల మెట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు యాప్‌ ద్వారా పంపించాలి. సిగల్‌ సమస్య తలెత్తడంతో పాటుగా మేట్లు కొన్ని సందర్భాల్లో తప్పుడు నివేదిక ఇవ్వడంతో ఈ యాప్‌ ద్వారా ఎన్నో గ్రామాల్లో పనులు చేస్తున్న కూలీలు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేసినప్పటికీ బ్యాంకు ఖాతాలో కూలి జమ కాలేదని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 ముందు వేతనదారులకు తాగునీటి అలవెన్స్‌, టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు అప్పటి ప్రభుత్వాలు అందించేవని, గత ఏడాది నుంచి ఎంఎంఎస్‌ యాప్‌ కొత్త విధానం రావడంతో ఉపాధి కూలీలకు పనులు వద్ద ఎటువంటి సౌకర్యాలు లేవని కూలీలు వాపోతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పనులు చేస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలు మండల, డివిజన్‌, జిల్లా కేంద్రాలకు స్పందనలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ యాప్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.. దీంతో ఉపాధి కూలి అందక వేతన దారులు లబోదిబోమం టున్నారు.
సుదీర్ఘకాల డిమాండ్‌
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి హామీ కల్పించే చట్టం చేయాలని సుదీర్ఘకాలం పాటు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. మధ్యలో పనికి ఆహార పథకం వంటి కార్యక్రమాలు కొంత మేరకు అమలు చేశారు. చివరకు కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ హయాంలో 2005లో పార్లమెంటులో చట్టం రూపొందించి 2006 నుంచి అమలు ప్రారంభించారు. ఆ సంవత్సరం ఫిబ్రవరి నుంచి దేశంలో వెనకబడిన 200 జిల్లాల్లో మొదట అమలు చేశారు. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికే కరువు సమస్యతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ కూడా బండ్లపల్లి వచ్చి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. స్థానికుల రాగి సంకటి ఆరగించి సంతృప్తి వ్యక్తం చేయడం అందరినీ ఆకట్టుకుంది.

పాలకుల విధానాలు ప్రకృతి శాపాలు

మార్చి నెలలో రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో భారీ గాలులు, వడగళ్ల వర్షాలు రైతులను నిట్టనిలువునా ముంచాయి. చేతికి వచ్చిన పంటలు కొద్ది నిమిషాల్లోనే నేలపాలయ్యాయి. కోట్ల రూపాయల రైతుల పెట్టుబడి మట్టిలో కలిసిపోయింది. దాంతో రైతు కుటుంబాల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా ఈ వడగళ్ల వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి. ప్రకృతి వైపరీత్యాల పేరుతో తరాల నాడు రూపొందించుకున్న నిబంధనలే నేటికీ అమలవుతున్నాయి. అసాధారణ పరిస్థితుల వల్ల రైతు అసాధారణంగా నష్టపోతే ప్రభుత్వాలు చేసే సహాయం కూడా అసాధారణంగా వుండాలనే కనీస విజ్ఞతను పాలకులు పాటించడంలేదు.
రాష్ట్రంలో వడగళ్ల వానల వల్ల 3 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించారు. అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వడగళ్ల వానల వల్ల అరటి, మామిడి, బత్తాయి, పుచ్చకాయ, బొప్పాయి, టమోటా, మిరప, మొక్కజొన్న, వరి పంటలు భారీగా నష్టపోయాయి. ఇందులో ఉద్యానవన పంటలు 4,843 ఎకరాలు, ఇతర పంటలు 7,525 ఎకరాల్లో నష్టపోయినట్లు జిల్లా అధికారులు ప్రాధమిక అంచనా వేశారు. వాస్తవ పరిస్థితి ఇంతకు రెండిరతలు వుంటుంది. శ్రీసత్య సాయి, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. పొరుగున వున్న తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేసి, ఎకరాకు రూ. పది వేల నష్టపరిహారాన్ని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. మనకు మాత్రం పరిహారం ఎంత ఇస్తారో ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వడంలేదు.
పంట నష్టం అంచనా – ద్వంద్వ ప్రమాణాలు
అనంతపురర జిల్లాలో 16 మండలాల్లోని 46 గ్రామాల్లో 4,843 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నష్టపోయాయి. ఇందులో ఒక్క అరటి పంట 2,769.4 ఎకరాల్లో నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఒక ఎకరా అరటి సాగుకు కనీస పెట్టుబడి ఖర్చు రూ.లక్ష 30 వేలు అవుతుంది. ఈ లెక్కన ప్రస్తుత పంట పెట్టుబడి నష్టం రూ.36 కోట్లు. ప్రస్తుత ధర ప్రకారం దిగుబడి ఆదాయం కలిపితే సుమారు రూ.వంద కోట్లకు పైగా వుంటుంది. అయితే రూ. 6,655 కోట్లు మాత్రమే నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. పంటల పెట్టుబడి ఖర్చు ఆధారంగా ఇచ్చే బ్యాంకు రుణాలు, పంటల నష్టం ఆధారంగా ప్రభుత్వాలు లేదా ఇన్సూరెన్స్‌ కంపెనీలు చెల్లించే పరిహారాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను ప్రభుత్వాలు రూపొందించుకున్నాయి. ఉదా: అరటి పంట ఎకరా సాగుకు బ్యాంకులు ఇచ్చే రుణ సదుపాయం స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా ఎకరాకు రూ.లక్ష 25 వేలు, పంట నష్టం అంచనా మాత్రం హెక్టారు (రెండున్నర ఎకరాల)కు రూ.25 వేలు. వరి ఎకరా సాగుకు రూ. 35 వేలు ఖర్చు అవుతుంటే, పంట పూర్తిగా నష్టపోతే రూ. 8,433గా అంచనా వేశారు. కోస్తా జిల్లాలో మిర్చి పంట సాగుకు ఎకరాకు రూ.2.50 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాని ప్రభుత్వం రూపొందించుకున్న నిబంధనల ప్రకారం నామమాత్రపు పరిహారం అందేలా వుంది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో భీకర గాలులతో మామిడి కాయలు పెద్ద ఎత్తున రాలిపోయాయి. నేల రాలిన మామిడి కాయల ఆధారంగా పంట నష్టం అంచనా వేయడానికి నిబంధనలు అంగీకరించవు. ఇలాగే మొక్కజొన్న తదితర పంటల నష్టానికి, పరిహారం అందించేందకు రూపొందించుకున్న నిబంధనలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వేసిన అంచనాల విలువ మొత్తాన్ని ప్రభుత్వం అరటి రైతులకు చెల్లించిన రైతు నష్టంలో కేవలం ఆరు శాతం మాత్రమే అవుతుంది. నష్టంలో ఆరు శాతం మాత్రమే చెల్లించి రైతులను ఆదుకుంటామనే ప్రభుత్వాలు రైతు ప్రభుత్వాలు ఎలా అవుతాయి? ఉద్యానవనశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేశారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా రైతుల పేర్లు నమోదు చేస్తున్నారు. ముందస్తు కౌలు చెల్లించి, పంట పెట్టుబడి పెట్టే వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులకు…ప్రభుత్వాలు చెల్లించే నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా అందదు.
పంటల బీమా రైతులకా? కంపెనీలకా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చి బిజెపి వారు అధికారంలోకి వచ్చారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా లాంటి వాటి ద్వారా పంటల నష్టానికి పరిహారం చెల్లించడం, రైతులకు బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు భారీగా ఇవ్వడం తమ విధానంగా ప్రకటించారు. బిజెపి నేతల మాటలకు చేతలకు ఎంత వ్యత్యాసం వుంటుందో అనేక విషయాల్లో రుజువవుతూనే వుంది. వ్యవసాయ రంగంలో మరింత స్పష్టంగా బట్టబయలవుతున్నది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే…పంటల బీమా కోసం 2017-18 సంవత్సరంలో ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పి.ఎం.ఎఫ్‌.బి.వై) ద్వారా పరిహారం చెల్లిస్తామన్నారు. ఈ బీమా పథకం అమలు కోసం 13 ప్రయివేటు సంస్థలతో సహా 18 సాధారణ బీమా కంపెనీలను ప్రభుత్వం ఇందులో చేర్చుకున్నది. ఈ పథకం కింద ఖరీఫ్‌ పంటలకు ప్రీమియంలో 2 శాతం, రబీ పంటలకు 5 శాతం రైతులు చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. 2016-17 నుండి 2020-21 వరకు ప్రయివేటు బీమా కంపెనీలు ప్రీమియంగా రూ. 69,667 కోట్లు పొంది, రూ. 45,317 కోట్లు పరిహారంగా రైతులకు చెల్లించి, రూ. 24,350 కోట్ల రూపాయలు లాభపడ్డాయి. ఇందులో ఒక్క అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అత్యధికంగా రూ. 4,731 కోట్లు లాభపడిరది.
వ్యవసాయ రుణాల విధానాలను పరిశీలిద్దాం. 2019-20లో రూ.9 లక్షల కోట్లు, 2020-21లో రూ.11 లక్షల కోట్లు, 2021-22లో రూ. 16 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ప్రకటించారు. ఆచరణలో గౌతమ్‌ అదానీ లాంటి ఐదు బడా కార్పొరేట్‌ కంపెనీలు నిర్మిస్తున్న కోల్డ్‌ స్టోరేజ్‌లు, మాల్స్‌, సోలార్‌, విండ్‌ మిల్లుల విద్యుత్‌ కంపెనీలకు ఇచ్చే రుణాలను కూడా వ్యవసాయ రుణాలుగా మార్చారు. ప్రతి బ్యాంకు తన వ్యాపార ధనంలో 40 శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాలని, అందులో 18 శాతం పంట రుణాలు వుండాలని 1965లో రూపొందించుకున్న రిజర్వుబ్యాంకు విధానాన్ని 1991 వరకు అమలు చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య తరగతి ర్కెటతులకు అందాల్సిన వ్యవసాయ రుణాల్లోకి బడా కంపెనీలు జొరబడి దోచుకునేటట్లు విధానాలను మార్చారు.
కేంద్ర విధానాలపై నోరెత్తని రాష్ట్ర పాలకులు
రైతులకు తీవ్ర నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఏ మాత్రం ప్రశ్నించక పోగా, వ్యవసాయ విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు లాంటి విధానాలను అమలు చేసి రైతులపై భారాలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే మూడు నల్ల చట్టాలను పార్లమెంట్‌లో బలపరచి, వీధుల్లో రైతు ఉద్యమాలను బలపరిచే ద్వంద్వ విధానాలను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు అనుసరించాయి.
పంట నష్టపోవడం అంటే రైతు పెట్టుబడి నష్టంతో పాటు…అప్పుల భారం, ప్రజలకు ఆహార సరుకుల కొరత, ధరల పెరుగుదల వంటి అనేక రూపాల్లో దీని ప్రభావం వుంటుంది. అందుకే రైతుకు పరిహారం అందించడం సామాజిక బాధ్యత. పంటల నష్టానికి న్యాయమైన పరిహారం కోసం పోరాడాలి. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న 14.57 కోట్ల మంది రైతులు, 20 కోట్ల మంది వ్యవసాయ కూలీలను ఐదారు కార్పొరేట్‌ కంపెనీలకు బలిపెట్టే ప్రభుత్వ విధానాలను ఐక్యంగా ప్రతిఘటించడం ద్వారానే వ్యవసాయాన్ని కాపాడుకోగలం.
తెలంగాణలో గత 8 ఏండ్లలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వెనుక ప్రకృతి వైపరీత్యాలు సృష్టించిన విధ్వంసం ఉంది. విపత్తులతో నష్టాలు ఎక్కడైనా సహజమే. కొన్ని సార్లు ఈ నష్టాలను అరికట్టడం రైతులకు, ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాదు. అందుకే ఆయా దేశాల్లో ప్రభుత్వాలు రైతులను, ప్రజలను ఆదుకోవడానికి నష్టపరిహారం చెల్లిస్తాయి. లేదా బీమా పథకాలు అమలు చేస్తాయి. అమెరికా, యూరప్‌, చైనా, జపాన్‌ లాంటి దేశాల్లో కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయి. రైతులు, ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చేయాల్సిన కనీస పాలనా బాధ్యత ఇది.
మన దేశంలో జాతీయ స్థాయిలో 2005 జాతీయ విపత్తు చట్టం అమలులో ఉంది. జాతీయ ప్రకృతి వైపరీత్యాల పరిహార నిధి (ఎన్‌?డీఆర్‌ఎఫ్‌) కూడా కేంద్ర బడ్జెట్‌ లో భాగంగా ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి ఏటా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కు నిధులు అందుతాయి. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర బడ్జెట్‌ లో నిధులు కేటాయించుకొని, ప్రజలకు నష్టాలు వాటిల్లిన సందర్భాల్లో తక్షణ పరిహారం
(ఇనపుట్‌ సబ్సిడీ) అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్‌ పుట్‌ సబ్సిడీగా నిర్ణయించింది తక్కువ మొత్తమే, అయినా కనీసం ఆ పద్ధతి అమలులో ఉంది. నష్ట పోయిన రైతులకు ఎకరానికి కనీసం రూ.10 వేలు పరిహారంగా అందించాలని 2013 లోనే ‘‘హుడా కమిషన్‌’’ సిఫారసు చేసినా , తెలంగాణలో 2015 లో వచ్చిన జీవో ప్రకారం ఎకరానికి కేవలం రూ.4 వేల పరిహారం మాత్రమే నిర్ణయించారు. ఇది కూడా పంట సగటు ఉత్పత్తిలో 33 శాతం మించి నష్టపోతే మాత్రమే అందుతుంది.
కోర్టు తీర్పు ఇచ్చిన అమలు చేయక..
పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ.. రైతు స్వరాజ్య వేదిక కోర్టు తలుపులు తట్టింది. 2020 ఖరీఫ్‌ లో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2020 సెప్టెంబర్‌ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. వర్షాల వల్ల జరిగిన నష్టాలను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి 2020 అక్టోబర్‌ 15న కేంద్రానికి ఉత్తరం కూడా రాశారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా 2021 నాటికే నష్టం వివరాలతో ఫైనల్‌ రిపోర్ట్‌ కేంద్రానికి పంపింది. ఈ వ్యాజ్యంపై ఏడాది పాటు విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు 2021 సెప్టెంబర్‌ 28 న రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.3 నెలల్లో రైతులను గుర్తించి 2022 జనవరి 28 నాటికి పరిహారం అందించాలని, పంటల బీమా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు కాబట్టి, సన్న, చిన్న కారు రైతులకు బీమా పరిహారం కూడా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయకుండా, పచ్చి అబద్ధాలతో సుప్రీం కోర్టు అప్పీల్‌ కు వెళ్లింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్నది.
ప్రభుత్వమే బీమా అమలు చేయాలె..
ప్రజాస్వామిక పరిపాలన అంటే, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపా లించడం. కనీసం కోర్టు ఆదేశాలను పాటించడం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సూత్రాలను పాటించడం లేదు. ఇప్పటికే రాష్ట్ర రైతులకు జరిగిన నష్టాలను అర్థం చేసుకుని 2023 ఖరీఫ్‌ నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలి. అన్నిపంటలను, గ్రామం యూనిట్‌ గా బీమా పరిధిలోకి తీసుకు రావాలి. సన్న, చిన్నకారు రైతుల ప్రీమియం మొత్తాన్ని కానీ, లేదా ఆంధ్రప్రదేశ్‌ లాగ మొత్తం రైతుల ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. 2020 సంవత్సరానికి పంట నష్ట పరిహారం చెల్లింపు విషయంలో, సుప్రీంకోర్టులో అప్పీల్‌ ను ఉపసంహరించుకుని రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేయాలి. ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం సంభవించినా, వెంటనే నష్టపోయిన వారి వివరాలు సేకరించి,పరిహారం అందించాలి. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌ లో కూడా నిధులను కేటాయించాలి.
పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
జాతీయ స్థాయిలో అమలవుతున్న పంటల బీమా పథకాలకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం భారాన్ని భరించే విధానం ఉంది. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులు ఆటోమాటిక్‌ గా పంటల బీమా పరిధిలోకి వచ్చే వాళ్లు. 2019 వరకు రైతులు కొద్దిపాటి ప్రీమియం చెల్లిస్తే, మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. పంట నష్టం జరిగినప్పుడు బీమా పరిధిలోకి వచ్చిన రైతులకు ఎంతో కొంత బీమా పరిహారం అందేది. కానీ 2020లో కేంద్రం బీమా మార్గదర్శకాల్లో మార్పులు చేసి, తన వాటా ప్రీమియం చెల్లిం పును 30 శాతానికి పరిమితం చేసుకుంది. గత మూడేండ్లుగా రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు పంటలు నష్టపోతూనే ఉన్నారు. ప్రభుత్వం అత్యంత బాధ్యతా రహితంగా వ్యవ హరిస్తూ, కనీసం గ్రామాల వారీగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను కూడా సేకరిం చడం లేదు. నష్టపోయిన రైతుల వివరాలతో కేంద్రానికి నివేదికలు పంపి సాయం కూడా అడగడం లేదు.
వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు.- (వి.రాంభూపాల్‌)

ఓటే ఆయుధం..ఒకటై సాగుదాం!

అన్ని అంశాలు పాఠాలు చెప్తాయి. చారిత్రక అంశాలు గుణపాఠాలు నేర్పిస్తాయి’ ఇది తెలంగాణ ప్రజలను చైతన్యపరచిన మేధావి డాక్టర్‌ జయశంకర్‌ ఒక సందర్భంలో చెప్పిన, చాలా విలు వైన మాట. ఆ చరిత్ర లను అర్థం చేసుకున్న పాలకులు పాఠాలు నేర్చుకొని చిరంజీవులుగా మానవ జాతి ఉన్నన్నాళ్లూ కీర్తింపబడు తారు. ఆ విధంగా పాఠాలు నేర్చుకోక కొందరు నియం తలుగా మారి ప్రజా కంటకులుగా గుర్తింపబడు తారు. వారిని తలచుకున్నప్పుడల్లా జనాలకు ఏవగింపు తప్ప ఇంకో భావం కలగదు. అంటే వారు జీవించిలేక పోయినా సామాన్య జనాలు తిట్టుకుంటారు. ఇప్పుడు నడుస్తున్న భారత రాజకీయా ల్లో ఈ దేశ చరిత్రలోంచి నాయకులు నేర్చుకోవలసిన పాఠాలేమిటో చూద్దాం!
గత వెయ్యేండ్లలో అత్యంత అధికారం కలిగి,ఎక్కువకాలం పాలించిన మొఘ లు సామ్రాజ్య చరిత్రను గమనిస్తే ఒక విస్మయం కలిగే విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాహుల్‌ గాంధీని జైల్లో పెట్టినా, బెయిల్‌ మీద విడిచి పెట్టినా, ప్రియాంకా గాంధీ సహించి ఊరుకుంటుందా? హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? పైగా ప్రజలందరూ ప్రభుత్వాలు ఏమి చేసినా భజన చేసేవాళ్లే ఉండరు కదా! ఆలోచన పెరుగు తుంది. దానితోటే ఆవేశం కలుగుతుంది. వారికి ఉన్న ఒకే ఒక్క ఆయుధమైన ఓటుతో సరైన పాఠం చెప్తారు. అలా చేయటానికి కాంగ్రెస్‌ మీద ప్రేమ ఉండక్కరలేదు.నియంతృత్వ పోకడల పట్ల విముఖత చాలు. మొదటి పాలకుడు బాబర్‌, తర్వాత హుమాయూన్‌, అక్బర్‌,జహంగీర్‌, షాజహాన్‌లకంటే ఎక్కువ భూభాగాన్ని 55ఏండ్లు ఔరంగజేబు పాలించాడు. మరి ఆయన మరణం తర్వాత కొన్నేండ్లలోనే మొఘల్‌ సామ్రాజ్యం చిన్నాభిన్న మైంది.ఏపాలకుడూ నిల దొక్కుకోలేక పోయాడు. దీనికి చాలా బలమైన కారణాలున్నాయి.

  1. ప్రజాభిమానం పాలకుడికి అతిముఖ్యమైన బలం అని ఔరంగజేబు గుర్తించకపోవటం. 2. ఆయన మత మౌఢ్యం,ఇతర మతాల పట్ల ద్వేషం, ఆలోచనాపరులైన ప్రజలను ఆవంశానికే శత్రువులుగా చేయటం.
  2. దేశ చరిత్ర బట్టి ఐక్యత కోసం అందరినీ సమ దృష్టితో చూడాలన్న అంశం ఔరంగజేబు గుర్తించక పోవడం.
  3. దాదాపు ఆరు దశాబ్దాలు తన పరిపాలనే ఉన్నా, అత్యాశతో యుద్ధాలు చేసి,కోశా గారం లోని ధనాన్ని ప్రజల సౌకర్యాల కోసం, దేశ ప్రగతి కోసం కాకుండా, తాను శత్రువు లనుకున్న వారిని అణచివేయటానికి ఖర్చు చేయటం.
    ఈ నాలుగు బలమైన కారణాలతో,శతాబ్దాలు పాలించినా, మొఘలు సామ్రాజ్య పతనం కేవలం ఐదు దశాబ్దాలలో జరిగిపోయింది. అంటే దేశాన్ని, ప్రజలను ప్రేమతో కాకుండా ద్వేషంతో,మౌఢ్యంతో ఎంతకాలం పాలించినా ఆ నియంతలకు ఓటమి తప్పదన్నది చారిత్రక సత్యం.
    ఇప్పుడు మన దేశాన్ని కేంద్రం నుంచి పాలిస్తున్న బీజేపీ విధానాలతో పైన చెప్పిన అంశా లు పోలిక కలిగి ఉండటం సుస్పష్టంగా కనిపి స్తుంది. రెండుసార్లు కేంద్రంలో మెజారిటీ సాధించి పరిపాలిస్తున్నా, అధినాయకులిద్దరూ కడుపు నిండా అన్నం తిని కంటినిండా నిద్రపోతున్నారా అన్నది అనుమానాస్పదమే! ఇన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏవో ఒకఎన్నికలు ప్రతిఏడాదీ, రెండేం డ్లకు జరుగుతూనే ఉంటాయి. మరి ఒక రాష్ట్రంలో గెలవగానే,ఇక తర్వాత వేరే రాష్ట్రంలో వచ్చే ఎన్ని కల సన్నాహాలతో, ప్రత్యర్థులను ఓడిరచాలనే పట్టుద లతో 24గంటలూ అదే ఆలోచనాధోరణితో, ఆచర ణతో ఉండే వీరికి మరిదేశ పరిపాలనకు సమయం చిక్కటం లేదు. మనది ప్రజాస్వామ్యం కాబట్టి,ఓట్ల ద్వారా గెలుపోటములు నిర్ణయింపబడుతాయి కాబట్టి,రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పు డు ఆలోచనలో పడుతున్నారు, తొమ్మిదేండ్ల సమ యం ఒక్క రంగాన్నైనా ఉద్ధరించటానికి సరిపోదా అని. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గతంలో దేశ ప్రజలకు ఎంత చేయాలో అంత చేయలేదన్నది కఠిన సత్యం. కానీ వారు ఈ విధంగా ప్రజా జీవి తాన్ని అతలాకుతలం చేయలేదన్నది కూడా నిజం. అక్బర్‌,షాజహాన్‌,జహంగీర్‌ కూడా పరిపాలించినా, వారు జన జీవనానికి అడ్డుపడలేదు.కాంగ్రెస్‌ ప్రభు త్వం అంతే.మరి వారి కంటే ఎక్కువ కాలం పరిపా లించిన ఔరంగజేబు ఎందుకు ప్రజాగ్రహాన్ని మూట కట్టుకున్నాడు? సరిగ్గా ప్రస్తుత ప్రధానమంత్రి ఇలాగే శృతి మించి ప్రవర్తిస్తున్నాడు. ఒక తప్పు కప్పుకో వటానికి ఇంకొకటి, ఒక సంచలనాన్ని మరుగు పరచటానికి ఇంకొకటి! ప్రజాగ్రహాన్ని మరల్చత తటానికి పుల్వామా దాడులు, ఆత్మీయ మిత్రుడి కష్టాన్ని కుంభకోణాన్ని దాచటానికి విపక్ష నాయకుడి బహిష్కరణ! నిజానికి నరేంద్ర మోదీ గారి ప్రసం గాలు ఒకసారి టీవీలల్లో ప్రసారం చేస్తే, ఆయన మంత్రులు,అనుయాయులు కాంగ్రెస్‌ నేతలని, ముఖ్యంగా నెహ్రూ కుటుంబసభ్యులని, దేశంలోని మహిళలను ఎంత అవమానించారో ప్రజలకు తెలు స్తుంది. మరి వారి మాటలను కూడా విచారించి శిక్షలు వేయాలి కదా! మాటలే కాదు, వారి అత్యా చారాలు, హత్యలకు కూడా రాజ్యాంగంలో శిక్షలే లేవు. మరి విపక్ష నాయకుడు అన్న దాంట్లో తప్పే ముంది? నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ నిన్న బయట పడ్డారు. మన ప్రధాని అదానీని రక్షిస్తూ, ఇవాళ బయటపడ్డారు. చేసే పనుల మీద సీబీఐ విచారణ వేస్తే తేలిపోతుంది కదా! అయితే, విపక్ష నాయకుడి రాజకీయ ఎన్నికల బహిష్కరణను ఇంకో కోణం నుంచి కూడా పరిశీ లించవచ్చు. ఆధునిక చరిత్రలో గుర్తుకొచ్చే ఇద్దరు నియంతల ప్రవర్తన, అనుసరిం చిన విధానాలు గమ నిస్తే వాటిలో దగ్గరి పోలికలు కనిపిస్తాయి. ఇటలీని పరిపాలించిన నియంత బెనిటో ముస్సోలినీ, జర్మనీని ఏలిన అధినేత అడాల్ఫ్‌ హిట్లర్‌ సమకాలీ కులు,29 జూలై 1883లో పుట్టిన ముస్సోలినీ తన అరాచక పాలనను 1925 నుంచి 1945 దాకా సాగించాడు. తన10వ ఏటనే స్కూలులో ఒక బాలుడిని కత్తితో పొడవటంతో మొదలైన అతడి క్రూరత్వం,ఫాసిస్టు పార్టీ పెట్టి చివరిదాకా దాష్టీకాలు సాగించాడు. అలాగే, 1883 ఏప్రిల్‌ 20న పుట్టిన అడాల్ఫ్‌ హిట్లర్‌ నాజీ పార్టీ అధినేతగా 1933 నుంచీ 1945 దాకా నియంతృత్వ పాలన సాగించాడు. లక్షల మందిని క్రూరంగా చంపిం చాడు. అయితే వీరిద్దరి ఉదాహరణల నుంచి నేర్చుకునే పాఠం ఒక్కటే. పాలితుల పట్ల ప్రేమఉండి వారిలో ఒకడిగా చరిం చి దేశానికి ప్రగతి సాధించేవాడికి ఉన్న ప్రశాంత జీవనం నియంతగా మారి,క్రూరమైన రీతుల్లో ప్రవర్తించి,ముఖ్యంగా తనను విమర్శించే వాళ్లు బతికి ఉండొద్దనే పద్ధతులు పాటించినవారికి ఉండదు. వారు పులి మీద స్వారీ చేస్తున్నట్టే! కొద్దిగా పరిస్థితి మారితే వారు సృష్టించు కున్న విధానాలే వారిని అధఃపాతా ళానికి తొక్కేస్తా యి.మహా ఘోరమైన జీవితం చూడవలసి వస్తుంది. అసహ నం,అధికారదాహం, విపక్షాల పట్ల కక్ష, విపరీత మైన వివక్ష, పక్షపాత ధోరణి ఉన్న నియం తలు చాలాకాలం మనలేరు. పదవిలో కొనసాగ లేరు. అంతేకాదు, తమ అధికార బలం, ప్రజాభి మానం తగ్గుతున్నదన్న అనుమానం కలిగిన కొద్దీ ఒకదాని మీద ఒకటి తప్పులు చేస్తారు. అవే వారిని పదవీచ్యుతులను చేసే ఆయుధాలు. ఇప్పుడు రాహుల్‌గాంధీ బహిష్కరణ,శిక్ష, ఎన్నికలకు దూరం చేయడం-ప్రధాని చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. ఇది అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చటానికి చేసిన పని కాదు. ప్రధానిలో ఒకరకమైన భయం మొదలైందన్న నిజానికి నిదర్శనం. ఎందుకంటే ఎంత బీజేపీ రెండు సార్వత్రిక ఎన్నికలు గెలిచినా, కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు ఒకటి నికరంగా దేశంలో ఉన్నది. ఇప్పుడు మోదీ భయం ప్రతిపక్షాలు తప్పిదారి కాంగ్రెస్‌తో కలిశాయంటే, బీజేపీ పని ఖతమైపోతుంది. ప్రజలు ఈ విషయం ఆలోచిం చాలి.ఇప్పుడు ఏంజరుగుతుంది?రాహుల్‌ గాంధీ ని జైల్లో పెట్టినా,బెయిల్‌ మీదవిడిచి పెట్టినా, ప్రియాంకా గాంధీ సహించి ఊరుకుంటుందా? హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? పైగా ప్రజలందరూ ప్రభుత్వాలు ఏమి చేసినా భజన చేసేవాళ్లే ఉండరు కదా! ఆలోచన పెరుగు తుంది. దానితోటే ఆవేశం కలుగుతుంది. వారికి ఉన్న ఒకే ఒక్క ఆయుధమైన ఓటుతో సరైన పాఠం చెప్తారు. అలా చేయటానికి కాంగ్రె స్‌ మీద ప్రేమ ఉండక్కరలేదు.నియంతృత్వ పోకడల పట్ల విముఖత చాలు. ఇదే జరిగిన రోజు బీజేపీ చరిత్ర ముగిసి నట్టే! ఆధునిక నియంతలు ముస్సోలినీ,హిట్లర్‌ రెండురోజుల తేడాతో జీవితం చాలించడం చారి త్రక సత్యం. మోదీ-షా ద్వయం తప్పు మీద తప్పు చేసి అధికారం కోల్పోవటం దానిని చరిత్రలో లిఖిం చటం మన కండ్ల ముందే జరుగుతుంది. – (కనకదుర్గ దంటు)

ఏది భారత జాతీయత ?

దేశంలో గత కొంత కాలంగా జాతీ యత పేరు మీద కుహనా జాతీయవాదం వెర్రి తలలు వేస్తోంది. ప్రభుత్వ ప్రాయోజిత భావజా లాన్ని వ్యతిరేకించే వారు, ప్రశ్నించేవారు దేశ ద్రోహులుగా ముద్రించబడుతున్నారు.దేశ సామా జిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న అంశాలపట్ల ప్రభుత్వ ప్రాయోజిత నిపు ణులు,మేధావుల అభిప్రాయాలకు భిన్నంగా స్వ తంత్ర అభిప్రాయాలు కలిగి ఉండటం రాజద్రో హంగా మారిపోయింది. ఈ పరిణామాలన్నింటి వెనక దండలో దారంలాగా కొనసాగుతున్న అం శం జాతీయత గురించిన చర్చ. పాలక వర్గాల అభిప్రాయాలే సర్వసాధారణంగా ప్రజాభిప్రా యాలుగా చెలామణీ అవుతాయన్న మార్క్స్‌ సూత్రీ కరణ తాజా పరిణామాల నేపథ్యంలో మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రాయోజిత ప్రసార మాధ్యమాలు (ఎంబెడెడ్‌ జర్నలిజం) ఏకశిలా సదృశమైన ఉన్మత్త హిందూత్వమే నిజమైన జాతీ యత అని నమ్మించ చూస్తున్నాయి. సమ్మిళిత సాంస్కృతిక సామాజిక పునాదులు కలిగిన భారతీ యతకు ప్రత్యామ్నాయంగా ప్రచారంలో పెడుతు న్నాయి.
నిజానికి భారతీయ జాతీయత అంటే ఏమిటన్న విషయాన్ని నిర్ధారించే కోణంలో చారి త్రక పరిశోధనలు లేకపోవటంతో పాచిపళ్ల దాసుడు పాడిరదే పాటగా మారింది. ఈ కాలం లో ఉన్మత్త హిందూత్వ శక్తులు రాజ్యాంగ పునా దులుపై సాగిస్తున్న విధ్వంసక దాడికి మరింత పదును పెట్టిన సందర్భంగా తాజాగా భారత జాతీయ అన్న భావనపై సాగుతున్న దాడిని చెప్పుకోవచ్చు.ఈ నేపథ్యంలో భారతీయత గురిం చి ప్రజాతంత్ర రాజ్యాంగం అందించిన అవగా హనకు నియంతృత్వ ధోరణులకు నిలువెత్తు నిదర్శ నం అయిన ఆరెస్సెస్‌ ముందుకు తెస్తున్న అవగా హనకు మధ్య ఉన్న విభజన రేఖను అర్థం చేసుకో లేకపోతే మరో తరం మతోన్మాదులు ప్రేరేపించే భావోద్వేగాలకు బలికాక తప్పని పరిస్థితి కనిపి స్తుంది. చారిత్రక పరిశీలన కోణం నుండి చూసిన పుడు ఆధునిక ప్రపంచ చరిత్ర, ఆధునిక జాతీయ రాజ్యాలచరిత్ర,పెట్టుబడిదారీ వ్యవస్థదాని పరిణా మ చరిత్ర విడదీయ రానంతగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. చారిత్రక పరిణామ క్రమం లో దేశం ప్రాథమికంగా భౌగోళిక యూని ట్‌గా మొదలవుతుంది. వివిధ భౌగోళిక ప్రాంతాల మధ్య నిర్దిష్టంగా స్పష్టంగా గుర్తించ గలిగిన సంస్కృతి, ఆచారవ్యవహారాలూ భాషలూ ఇతర ప్రమా ణాలుగా ఉంటాయి. అందువల్లనే ఉన్నత పాఠశాల స్థాయిలో రాజ్యం గురించిన పరిచయ పాఠ్యాం శాల్లో రాజ్యానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. ప్రభుత్వం, భాష, ప్రజలు, నిర్దిష్టమైన సరిహద్దులు అని నిర్వచించారే తప్ప మరే ప్రమాణం గురించీ ప్రస్తావించలేదు. అదేవిధంగా సాంఘిక శాస్త్రాల అధ్యయనంలో ప్రభుత్వాలు (ప్రభుత్వానికి నాయ కత్వం వహిస్తున్న వారి)అనుసరించే విధి విధా నాలు పద్ధతులు ప్రాతిపదికన రాజ్యాలను నాల్గు తరగతులుగా విభజించారు. అవి కూడా నియం తృత్వ రాజ్య వ్యవస్థలు, పోలీసు రాజ్యం, సంక్షేమ రాజ్య, సోషలిస్టు రాజ్య వ్యవస్థలుగా చెప్పుకుం టున్నాము.వీటిలో ఎక్కడా రాజ్య వ్యవస్థలను మతా ల ప్రాతిపదికన,సంకుచిత లక్ష్యాల కోసం రూ పొందించిన నిర్వచనాల ప్రాతిపదికన నిర్వచిం చలేదు.19వ శతాబ్దం ముగింపు నాటికి లౌకిక నిర్వచనం ప్రకారమే జాతీయతను నిర్దారించటం ప్రమాణంగా ఉంది. పాశ్చాత్య దేశాలన్నీ పైన చెప్పిన నాలుగు లక్షణాల ప్రాతిపదికనే సరిహద్దు లు విభజితం అయినట్టు యూరోపియన్‌ దేశాల చరిత్ర మనకు విదితం చేస్తుంది. యూరోపియన్‌ జాతీయవాదం పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణతో పాటు సంఘటితం అవుతూ వచ్చింది. దేశంలో ఉన్న అంతర్గత శతృవును గుర్తించి వారిని అస్థిత్వ పరంగా రాజకీయంగా సైద్ధాంతికంగా ఒంటరి పాటు చేసే క్రమంలో యూరోపియన్‌ జాతీయత క్రోడీకరించబడిరది. ఈ క్రమంలోనే పెట్టుబడి దారీ దేశాలు తమ మార్కెట్‌ అవసరాలు తీర్చు కునే నేపథ్యంలో వలసవాదాన్ని ఆశ్రయించటం తో జాతీయతకు సరికొత్త వ్యాఖ్యానం తెరమీదకు వచ్చింది. వర్ధమాన దేశాల్లో తెరమీదకు వచ్చిన జాతీయభావాలు బాహ్య శతృవుకు వ్యతిరేకంగా అంతర్గతంగా వైవిధ్య భరితమైన ప్రజా సమూ హాలను ఏకం చేసే క్రమంలో ముందుకొచ్చిన జాతీయత. ఈ విధంగా చూసినపుడు యూరోపి యన్‌ జాతీయ నిర్దిష్ట వర్గాలను, సామాజిక తరగ తులను,మత విశ్వాసాలను వెలివేసింది (ఎక్స్‌క్లూ జివ్‌) జాతీయత కాగా వర్ధమాన దేశాల జాతీ యత సకల సామాజిక తరగతులు, మత విశ్వాసాలు,వర్గాలను సంలీనం చేసుకునే (ఇన్‌ క్లూజివ్‌) జాతీయత అన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. యూరోపియన్‌ దేశాల్లో పెల్లుబుకిన జాతీయత ఆయా దేశాలను పదేపదే విచ్ఛిన్నం చేస్తూ పునరేకీకరణ గావిస్తూ షుమారు రెండు వందల ఏండ్ల రక్తసిక్త యూరప్‌కు తెరతీ సింది. దీనికి భిన్నంగా వర్ధమాన దేశాల్లో సంఘటి తమైన జాతీయత సుమారు వందేండ్ల వర్తమాన చరిత్రలో శాంతియుత సహజీవనానికి పునాదులు వేసింది.ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇంత దీర్ఘకా లం వర్థమాన దేశాల్లో అంతర్గత శాంతియుత పరిస్థితులు కొనసాగటం ఇదే ప్రథమమం అని చెప్పటం అతిశయోక్తి కాదు.
భారత రాజ్యాంగం, భారత జాతీయత రెండూ స్వాతంత్య్రోద్యమ పోరాట నేపథ్యంలో రాటుదేలిన వైవిధ్య భరితమైన రాజకీయ సామాజిక మేధోమధనం ఫలితం. యూరోపియన్‌ జాతీయత సంఘటితమయ్యే క్రమంలో పాలకవర్గాలు,మార్కెట్‌ కీలక పాత్ర పోషిస్తే భారత జాతీయ సంఘటితం కావటంలో ప్రజలు, ప్రజా పోరాటాలు, ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్థ అంశంగా మారిన వలసవా దానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ప్రజా పోరాటాలు కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రజా పోరాటాలు దేశ రాజకీయ వ్యవస్థ ముందు ఉంచిన ఆశలు, ఆశయాలు, లక్ష్యాల సాధనతో పాటు యూరోపి యన్‌ తరహా జాతీయతకు భిన్నంగా విలక్షణమైన సమ్మిళితమైన భారత జాతీయతను పాలకవర్గాలు అంగీకరించాల్సిన పరిస్థితి కల్పించింది. భారత రాజ్యాంగం కొన్ని మౌలిక విషయాలను ప్రత్యేకించి నిర్వచించకుండా వదిలేసింది.జాతీయత అంటే ఏమిటి?ఇండియా దట్‌ ఈజ్‌ భారత్‌ అన్న పదబం ధం అటువంటి మౌలిక విషయాల్లో ఒకటి. అంత మాత్రాన రాజ్యాంగ పరిషత్‌ ఈఅంశాలను తడమ లేదు అనుకుంటే పొరపాటు. అప్పటికే సర్వాంగీకృత అభిప్రాయాలను వ్యక్తీకరించేవిగా ఈ పదబంధాలు ఉన్నందున వాటి గురించి ప్రత్యేకంగా చర్చించ లేదు. కానీ వాటిని విపులీకరిస్తూ వివిధ అధికరణా ల్లో ప్రస్తావనలు వదిలారు.
భారత భూభాగంపై జన్మించి నివశి స్తున్న పౌరులందరు భారతీయులే అని పౌరసత్వాన్ని ధృవీకరించింది.తద్వారా భారత జాతీయత భారత దేశంలో నివశించే వారందరి ఉమ్మడి జాతీయత పర్యవసానం అని చెప్పకనే చెప్పింది. అంతేకాదు. దేశంలో నివసిస్తున్న వైవిధ్యభరితమైన సామాజిక ఆర్థిక తరగతులు,మతవిశ్వాసాలకు చెందిన వారిని గుర్తించటమే కాక వారి అస్థిత్వాన్ని రాజ్యాం గం అంగీకరించింది. అందువల్లనే అటువంటి బలహీను లైన తరగతులందరికీ అవసరమైన రక్షణలు కూడా కల్పించాలని,స్వాతంత్య్రోద్యమ పర్యవసానంగా సంఘటితమైన భారత జాతీయతను కాపాడుకోవా లంటే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న అన్ని తరగ తుల ప్రజల మనోభావాలు,ఆశలు,ఆశయాలు నెరవేర్చుకునేందుకు రాజ్యాంగం ద్వారా కనీస హామీ ఇవ్వాలని రాజ్యాంగ పరిషత్‌ నిర్ణయించింది. అందువల్ల భారత రాజ్యాంగంలో ప్రస్తావన లేని కోణాలు భారత జాతీయతలోనూ లేవు. స్వతంత్ర భారతదేశంఎన్నో వేర్పాటువాద ఉద్యమాలను తట్టు కుని అధిగమించి జాతీయ సమైక్యతా సమగ్రతలను కాపాడుకుంటూ తన ఉనికిని కొనసాగించుకుంటూ వచ్చింది.రాజ్యాంగం ఆరెస్సెస్‌ కోరుకుంటున్న మను వాద వ్యవస్థ, కుల వ్యవస్థను తిరుగులేని విధంగా దెబ్బ తీసింది.కుల వ్యత్యాసాలు,మత విశ్వాసాలతో నిమిత్తంలేకుండా రాజ్యంగం భారతదేశంలో జన్మిం చిన వారందరికీ సమాన హక్కులు,అవకా శాలు, ఓటింగ్‌ హక్కులు ప్రసాదించింది.ఇటు వంటి పరిమిత ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ స్థానంలో సార్వ త్రిక ఓటుహక్కును మొదటిగా అందరికీ అందిం చింది ఫ్రెంచి విప్లవం.ఈ విప్లవం స్ఫూర్తిగా నాటి వలస దేశాలన్నింటిలోనూ ఈ నినాదం పోరాట నినాదంగా మారింది.ఫ్రాన్స్‌,అమెరికా వంటి దేశా ల్లో సార్వత్రిక ఓటు హక్కు 1960 దశకం నాటికి గానీ చట్టబద్ధం కాని పరిస్థితుల్లో భారత రాజ్యాం గం 1947నాటికే సార్వత్రిక ఓటుహక్కును రాజ్యాం గ బద్ధం చేసింది.ఈ విధంగా సార్వత్రిక ఓటు హక్కు ఇవ్వటాన్ని నాడే ఆరెస్సెస్‌ వ్యతిరేకించింది. కుల మత ప్రాంత విద్వేషాలతో దేశాన్ని రక్తసిక్తం చేసే మనువాద సంస్కృతినే జాతీయతగా దేశం మీద రుద్దేందుకు శతాబ్ద కాలం నుంచీ ప్రయత్ని స్తూనే ఉంది.అటువంటి సంఘపరివారం స్వదేశీ ముసుగులో భారతదేశాన్ని యూరోపియన్‌ దేశాల తరహాలో ఉన్మాదపూరిత జాతీయతవైపు నెడుతున్న వాస్తవాన్ని గత ఐదేండ్లలో జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. దేశీయంగా రూపొందిన జాతీ యత పునాదులు సంఘపరివారానికి అక్కర్లేదు. విదేశీ నమూనాలో ఉన్న ఉన్మాద భరిత జాతీయతే దానికి ముద్దు. అందుకే సమీకృత, ప్రజాతంత్ర భారత జాతీయతను కాపాడేందుకు కంకణ బద్ధులైన వారంతా ఈ ఎన్నికల్లో ఉన్మాద జాతీయ వాదానికి ప్రతినిధులుగా ఉన్న బీజేపీ, దాని మిత్రు లను ఓడిరచటం జాతీయ కర్తవ్యంగా ఎంచు కోవాలి. వ్యాసకర్త : విశ్లేషకులు,సీనియర్‌ పాత్రికేయులు) – (కొండూరు వీరయ్య)

మళ్లీ గెలిస్తే రాజ్యాంగానికి ముప్పే

ఈ సంక్లిష్ట, సంక్షుభిత సమయంలో భారత అత్యున్నత న్యాయస్థానం పాత్ర అత్యంత కీలకమైనది. రాబోయే కాలంలో న్యాయవ్యవస్థ అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. న్యాయవ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి తలెత్తితే మనదేశంలో ప్రజాస్వామ్యం పని ముగిసినట్లేనని మనం భావించాలి.
భారత రాజ్యాంగం మత తటస్థతను,మత సమానత్వాన్ని బోధిస్తుంది. కానీ ఇవ్వాళ.. ఈ రెండూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి.బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? అనేది ఆలోచించాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ముఖ్యంగా మోదీ హయాం మొదలైన తర్వాత ముస్లింలను భయభ్రాంతులను చేస్తూ జరుగుతున్న దాడులు ఆకస్మిక ఘటనలు కావు’ అని చెబుతున్నారు ప్రొఫెసర్‌ అశుతోష్‌ వర్షిణీ. ఈ అత్యంత ప్రమాదకర ధోరణిని భారతీయులు అడ్డుకోకపోతే, మోదీ మూడోసారి ప్రధాని పదవిని చేపడితే భారత రాజ్యాంగం ఉనికికే భంగం వాటిల్లే పెను ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు.హార్వర్డ్‌, మిషిగన్‌ విశ్వవిద్యాలయాల మాజీ అధ్యాపకుడిగా ఆయన పని చేశారు. ప్రస్తుతం అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీలో రాజనీతిశాస్త్ర అధ్యాప కుడిగా పని చేశారు.‘ది వైర్‌’ వ్యవస్థాపక ఎడిటర్‌ సిద్ధార్థ భాటియాతో జరిపిన సంభాషణలో అశుతోష్‌ పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఈమధ్య కాలంలో దేశంలో అనేక చోట్ల మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా ముస్లింలపై దాడులు పెరిగిపోయాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువ. ఈ హింసా కాండ, దాడులు జరుగుతున్నప్పుడు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహి స్తున్నది. ఢల్లీి జహంగీర్‌పురాలో శ్రీరామనవమి సందర్భంగా కత్తులు, కటారులు గాల్లో తిప్పు తూ, పిస్తోళ్లు పేలుస్తూ మసీదుల ముందు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. పట్టపగలు ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగటం గమనార్హం.
దేశంలో మత ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది.1950ల నుంచి 1995 దాకా దేశంలో 1,180 మతపరమైన అల్లర్లు జరిగాయి. సుమారు 7,173 మంది చనిపోయారు. సుమారు ఎందుకంటే..మత ఘర్షణల్లో చనిపోయిన వారి లెక్క ఎప్పుడూ సరిగ్గా ఉండదు. అధికారిక లెక్క ఒకటి ఉంటే, వాస్తవసంఖ్య భిన్నంగా ఉంటుంది. మతఘర్ష ణలు చోటుచేసుకున్న చోట పోలీసుల తటస్థ తపై అనుమానాలు ఉంటున్నాయి. మరో పరిణామం ఏమంటే..ఈ ఘర్షణలు కొత్త రూపం తీసుకోవటం. మతఘర్షణలు వ్యవస్థీకృత కార్యక్రమంగా మారుతున్నాయి. 1984లో ఢల్లీిలో జరిగిన సిక్కుల ఊచకోత, 2002లో గుజరాత్‌లో ముస్లింల హత్యాకాండ వీటికి ఉదాహరణ. ఈ రెండిరటిలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా బాధ్యతల నుంచి దూరం జరిగిన తీరు కనిపిస్తుంది. అదింకా పెరిగిపోయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీ సులు, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతలు మరిచి మతఘర్షణల్లో పూర్తిగా ఒక వర్గానికే కొమ్ముకాసింది. కొన్ని చోట్ల ప్రభుత్వ యంత్రాం గమే ముస్లిం వ్యతిరేకతలో భాగస్వామ్యం కావ టం ఒక కొత్త పరిణామం.ఇదే ఇప్పుడు పెద్ద సమస్య. ఉదాహరణకు..కర్ణాటకలో ‘హిజాబ్‌’ అంశాన్ని చూడవచ్చు. హిందూ దేవాలయాల ముందు ముస్లింలు దుకాణాలు నిర్వహించ వద్దంటూ వారి జీవన ఆర్థిక హక్కుపై దాడి చేసి దాన్ని దూరం చేశారు. వీటన్నింటిపై కేంద్రం ఏమీ మాట్లాడదు. ఇదింకా ముందుకు పోయి,ఢల్లీిలో సిక్కులు దుకాణాలు నిర్వహించ వద్దని,వారి దుకాణాల్లో ఎవరూ కొనుగోళ్లు చేయవద్దని శాసించే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. 1984 ఢల్లీి అల్లర్ల సమయంలో నేను ప్రత్యక్షంగా చూశాను.సిక్కులపై దాడులు రాజ్యం అండతోనే జరిగాయి.కానీ అప్పుడు రాజ్యం.. ట్యాక్సీలను సిక్కులు నడుపరాదని అనలేదు. అలాగే సిక్కులు హిందూ దేవాల యాల ముందు మిఠాయిలు,పూలు అమ్మరాదని హుకుం జారీ చేయలేదు.సిక్కులు తలపాగా లాగా ధరించే ‘పగిడి’ని హిజాబ్‌లాగా వివాదం చేయలేదు. 1984కు ఇప్పటికీ గుణాత్మక మార్పు ఇదే. ఇప్పుడు జరుగుతున్న వాటిని గమనిస్తుంటే..ఈ పరిణామాలన్నీ రాబోయే ప్రమాదానికి సంకేతాలు. హిజాబ్‌ను వద్దని అన్నవాళ్లు సిక్కుల పగిడిని కూడా వద్దంటారా? బొట్టు పెట్టుకోవటాన్నీ, కొన్ని విద్యాసంస్థల్లో ధోతి కట్టుకోవటాన్ని కూడా తప్పుపట్టి నియం త్రిస్తారా? భారత రాజ్యాంగం మత తటస్థతను, మత సమానత్వాన్ని బోధిస్తుంది. కానీ ఇవ్వాళ.. ఈ రెండూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడు కోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు ఎందుకు ఎక్కువ జరుగు తున్నాయి? అనేది ఆలోచించాలి. హిందూ జాతీయవాదం తొలి నుంచీ తాత్వికం గానే కొన్ని ప్రజా సమూ హాలను జాతి వ్యతిరేక మైనవిగా ప్రకటించింది. ఆ ప్రజలు ఇక్కడే పుట్టినా,వారి పవిత్ర స్థలాలు భారత్‌లో లేవు కాబట్టి, వారి జాతీయత ఈ దేశానికి చెందినది కాదంటున్నారు. దేశంలో 14 శాతం ఉన్న ముస్లింలు, 2శాతం ఉన్న క్రిస్టి యన్లను పరాయివారుగా ప్రకటిస్తున్నారు. వాటిక న్‌ను, మక్కాను పవిత్రస్థలంగా భావించేవారు నిజమైన భారతీయులు కాదంటున్నారు. మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ‘1200 ఏండ్ల బానిసత్వం వీడిరది’ అని వ్యాఖ్యానించారు. దేశంలో 1920ల్లోనే హిందు త్వానికి పురుడు పోసిన వారు కూడా ఆ కాలం లో సరిగ్గా ఇదే మాట చెప్పటం గమనార్హం. ఈ క్రమంలోంచే..శతాబ్దాల కిందట హిందు వులపై ముస్లిం రాజుల దాడికి ప్రతీకారంగా ఇప్పుడు వారిపై దాడి చేయాలనే వాదాన్ని అమలు చేస్తున్నారు.1947లో మతం పునాదిగా రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత భారత్‌ లో హిందువులే ప్రధానమని, మిగతావారు ద్వితీయ శ్రేణికి చెందుతారని వారు అంటు న్నారు. హిందూత్వవాదులు,బీజేపీ నేతలు విశ్వసించేది ఏమంటే..కొన్ని వర్గాల వారిని అణచివేత ద్వారానే అదుపులో పెట్టగలమని. వీరి సిద్ధాంతకర్తలు కూడా ‘ముస్లింలకు సామాన్యుల భాష అర్థం కాదు. వారికి బలప్రయోగం ద్వారానే ఏదైనా అర్థం చేయించగలం. చరిత్ర ఇదే చెప్తున్నది’ అని ఆనాడే అన్నారు. అలాగే..‘వారు (ముస్లింలు) ఆనాడు బలప్రయోగం ద్వారానే మనలను ఓడిరచి ఆధిపత్యం సాధించారు. ఇప్పుడు హిందువులకు సమయం వచ్చింది. వారిని ఆ విధంగానే నియంత్రించి ఆధిపత్యం సాధిం చాల’ని ప్రబోధించారు. సరిగ్గా దాన్నే ఇప్పుడు బీజేపీ, హిందూత్వ వాదులు అమలు చేస్తు న్నారు. కాబట్టి వీటిని ఏదో కాకతాళీయంగా జరిగిన, జరుగుతున్న ఘటనలుగా చూడవద్దు. వీటిని ప్రయత్నపూర్వకంగా, పద్ధతి ప్రకారంగా జరుగుతున్న దాడులుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హిందుత్వవాదులు కొత్తదశలోకి ప్రవేశించారు. దేశంలోని హిందువులు ప్రథమ శ్రేణి పౌరులని, మిగతావారిని ద్వితీయ శ్రేణిగా చెప్తున్నారు. రాజ్యాంగపరంగా అంబేద్కర్‌ చెప్పిన వాటిని కూడా తిరస్కరిస్తున్నారు. మనుషులంతా సమానం అన్నదాన్నే కాదు, మతాలన్నీ సమానమే అనటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. హిందూత్వం పేరుతో రాజ్యాంగాన్నే గుర్తించనివారు..రాజ్యాంగాన్ని అమలుచేసే అధిపతులుగా మారారు. ఎన్నికల ద్వారా పార్లమెంటు, అసెంబ్లీల్లో మెజారిటీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇన్నాళ్లూ ఏ రాజ్యాంగ విలువల పునాదులపై మన ప్రజాస్వామ్యం మనగలిగిందో, ఆ రాజ్యాం గం పైనే దాడికి దిగుతున్నారు. బీజేపీ విజయం రాజ్యాంగ పరమైన సమస్య మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య సంక్షోభానికీ అది కారణమవు తుంది. దేశంలో 11రాష్ట్రాలు ఇప్పటికీ వారి ఆధీనంలో లేవు. అందులో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఉన్నాయి. యూపీలో రెండోసారి అధికారాన్ని నిలుపుకొన్నా, గతంలో మాదిరిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించటం అంత సులువు కాదు. అయితే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కొనగలవా? పంజాబ్‌, బెంగాల్‌, మహారాష్ట్ర, బీహార్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే రాజకీయ శక్తి ఏది? అన్నది ప్రధానమైనది. అలాగే, బీజేపీని ఎదు ర్కోబోయే రాజకీయశక్తికి ఎవరు నేతృత్వం వహించాలి అన్నది క్లిష్టమైనది. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి 19శాతం ఓటు బ్యాంకుఉన్నది. మిగతా పార్టీలన్నీ రెండు, మూడు శాతం ఓట్లే కలిగి ఉన్నాయి. తృణముల్‌ కాంగ్రెస్‌ 3.3 శాతం,డీఎంకే 2.7శాతం,ఆమ్‌ ఆద్మీ పార్టీ 2 శాతం ఓట్లు కలిగి ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిస్తేనే బీజేపీని నిలువరించే శక్తి సమకూరు తుంది. ఒకవేళ మూడోసారి మోదీ అధికా రంలోకి వస్తే..రాజ్యాంగం ఉనికే ప్రశ్నార్థక మవుతుంది. 2024లో మోదీ గెలుపుతో ఆ ప్రమాదం పొంచి ఉందనటంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఇక్కడే మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. నేను ఒక రాజనీతి శాస్త్రవేత్తగా, రాజకీయ పరిశీల కుడిగా.. మెజారిటీ వర్గం రాజకీయ ఆధిపత్యం సాధిస్తే సంభవించే పరిణామాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. శ్రీలంక, మలేషి యా గురించి తెలుసుకోవాలి. సింహళీయుల ఆధిపత్యం గల రాజ్యంగా శ్రీలంక అవతరిం చింది. ఆ దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు లేవు. ద్వితీయ పౌరులుగా పరిగణిం చబడిన తమిళులపై తీవ్ర వివక్ష, అణచివేత కొనసాగాయి. ఫలితంగా తమిళులు తిరగ బడ్డారు. 20ఏండ్ల పాటు శ్రీలంక అంతర్యు ద్ధంలో మునిగి పోవాల్సి వచ్చింది. అదే మలేషియా ఒక మెజారిటీ వర్గం ఆధిపత్యం వహించే విధంగా ఏర్పడలేదు.అక్కడ మైనా రిటీలుగా ఉన్న చైనీయులను ద్వితీయశ్రేణి పౌరులుగా చూడలేదు. జాతి సమానత్వం పాటించారు. దీంతో అక్కడ జాతిపరమైన పోరాటాలు ప్రజ్వరిల్లలేదు. దీన్నిబట్టి, మెజారిటీవాద ఆధిపత్య రాజకీయాధికారం దీర్ఘకాలంలో తీవ్రమైన అంతర్యుద్ధాలకు, హింసకు కారణమవుతుందని అర్థమవుతున్నది. అణచివేత కారణంగా ఒకవేళ భారతీయ ముస్లింలు ద్వితీయశ్రేణితో రాజీపడితే.. అది కనిష్ఠ స్థాయి ప్రమాదాన్నే తెచ్చిపెడుతుంది. కానీ, వారు అణచివేతను ధిక్కరించి సంఘ టితమైతే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. శ్రీలంకను తలపిస్తాయి. దేశంలో ముస్లింలంతా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై లేరు. మూలమూలలా విస్తరించి ఉన్నారు. భౌగోళికం గా అనేక దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్న భారత్‌లో ముస్లింలలో అలజడి,అసంతృప్తి ఊహించని ఫలితాలకు దారితీస్తుంది.ఇక్కడే ఇజ్రాయిల్‌, పాకిస్థాన్‌ గురించి కూడా చెప్పు కోవాలి. ఈ దేశాల్లో మైనారిటీ వర్గాలకు సమాన స్థాయి, గౌరవం ఇవ్వలేదు. తమను తాము యూదు, ముస్లిం దేశాలుగా అవి ప్రకటించుకున్నాయి. కానీ, భారతదేశం తననుతాను ఒక మతదేశంగా కాకుండా లౌకికదేశంగా ప్రకటించుకుంది. దేశంలో అన్ని మతాలకు సమాన హక్కులు ఉంటాయని రాజ్యాంగం హామీ ఇచ్చింది. కాబట్టి మైనారిటీ వర్గాల రక్షణ, భద్రత అనేది ప్రభుత్వం పైనున్న రాజ్యాంగ పరమైన బాధ్యత. ఇప్పటిదాకా పౌరుల హక్కుల రక్షణకు మన రాజ్యాంగం హామీగా నిలిచింది. అందుకే దేశవాసులకు ఇప్పటికీ రాజ్యాంగంపై ఎనలేని విశ్వాసం ఉన్నది. ఈ మధ్యన కార్యనిర్వాహక, రాజకీయ వర్గాల ఆధిపత్యంలో న్యాయవ్యవస్థను నిష్క్రియా పరత్వం చేసే ప్రయత్నం జరుగుతున్నది. నా వ్యక్తిగత ఆలోచనాదృక్పథం చెబుతున్న దేమంటే.. న్యాయవ్యవస్థ ఎన్ని సమస్యలు ఎదురైనా సానుకూల శక్తుల దన్నుతో అది నిలబడుతుంది. అలాంటి శక్తులను పక్కకు జరిపి 1975,76 లోలాగా రాజ్యాంగాన్ని అతిక్రమించటం అంత సులువు కాకపోవచ్చు. అయితే రాజ్యాంగ విధ్వంసం ఎంతదాకా పోతుంది, ఏమవుతుందన్నది ఆందోళన కలిగించేదే. అన్ని విషయాలూ`గిరిగీసినట్లుగా జరుగకపోవచ్చు. అయితే ఆశావహ దృక్పథం ఎప్పుడూ అస్పష్టం,బలహీనం కాబోదు. మన దేశం ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ వచ్చింది. గత 70 ఏండ్లుగా ప్రజాస్వామ్య దివిటీగా ప్రపంచంలో వెలుగొందుతున్నది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఖ్యాతి గాంచింది. కొన్ని శక్తుల అవాంతరాలతో ఇంతటి ఘనచరిత్ర మసకబారుతుందా,దారి తప్పుతుందా? ప్రఖ్యాత అంతర్జాతీయ ‘ప్రజా స్వామ్య అధ్యయన సంస్థలు’ ఫ్రీడం హౌజ్‌,వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌-స్వీడన్‌..భారత్‌లో దిగజారిన ప్రజాస్వామ్యం పరిస్థితులను తెలియజెప్పాయి. ప్రస్తుతం భారత్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం రాజ్యాంగ ప్రజాస్వామ్యంతో తీవ్రంగా ఘర్షణ పడుతున్న పరిస్థితి నెలకొన్నది.విస్తృతార్థంలో చెప్పుకోవాలంటే.. ఎన్నికలే ప్రజాస్వామ్యం కాదు. రెండు ఎన్నికల మధ్య కాలంలో జరిగే సామాజిక ఆచరణే ప్రజాస్వామ్యం.ఆ ఐదేండ్ల కాలంలో రాజ్యాంగ నియమాలను ప్రభుత్వం ఎలా అమలు చేసిందన్నదే ప్రజాస్వామ్యం. కాబట్టి, మనది చైతన్యవంతమైన ప్రజాస్వా మ్యమని అనలేం. మనది చైతన్యవంతమైన ఎన్నికల ప్రజాస్వామ్యం మాత్రమే. కానీ, రాజ్యాంగ ప్రజాస్వామ్యం మాత్రం రోజు రోజుకీ బలహీనపడుతున్నది.
‘పౌరులకు హక్కుల కన్నా విధులు ముఖ్యం’ అని ఆ మధ్య ప్రధాని మోదీ ప్రకటించారు. గతంలో హిందూత్వ సిద్ధాంతకర్తలు కూడా..‘హక్కులు దేశాన్ని బలహీనపరుస్తాయి. బాధ్యతలు బలోపే తం చేస్తాయి’ అనే అన్నారు. వాస్తవానికి దీంట్లో ఉన్న అసలు విషయం ఏమిటంటే.. ప్రజలకు హక్కులు లేకుండా చేయటం.దాని గురించి ప్రశ్నించనివ్వకుండా నోరు నొక్కటం.మోదీ కూడా ప్రజల హక్కులను అణచివేస్తూనే, తాను ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొం టున్నారు. ఇదంతా హిందూత్వ భావజాల కార్యాచరణలో భాగమేనని అర్థం చేసుకోవాలి. మనం పేపర్లు చదువుతాం.టీవీ చూస్తాం. వాట్సాప్‌ సరేసరి. వీటి ప్రభావం చాలా పెద్దది. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా స్పందిస్తున్నాం. మనదేశంలో మన చుట్టూ జరుగుతున్న వాటిపై కూడా భారతీయులు సరిjైున విధంగా స్పందిస్తారనే ఆశ, నమ్మకం నాకున్నది. గతంలో ఈ దేశ ప్రజానీకం దాటి వచ్చిన అవరోధాలను బట్టి, నేడు కూడా వారు విజయం సాధిస్తారనే విశ్వాసం నాకు న్నది’.ఈ సంక్లిష్ట, సంక్షుభిత సమయంలో భారత అత్యున్నత న్యాయస్థానం పాత్ర అత్యంత కీలకమైనది. రాబోయే కాలంలో న్యాయవ్యవస్థ అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి తలెత్తితే మనదేశంలో ప్రజాస్వామ్యం పని ముగిసినట్లేనని మనం భావించాలి.- వాసకర్త : ప్రముఖ పాత్రికేయులు,రాజకీయ విశ్లేషకులు (నమస్తే తెలంగాణ సౌజన్యంతో..)- (అశుతోష్‌ వర్షిణీ)

పోలవరం ఎంత దూరం?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వరంగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. పోలవారాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. పరస్పర రాజకీయ ఆరోపణలు విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. సాగు, తాగునీటి,విద్యుత్‌ ఉత్పత్తి అవసరాలతోపాటు పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును డిజైన్‌ చేసినా..అనుకోని విధంగా జరుగుతున్న ఆలస్యంతో..ఎప్పటికప్పుడు కథ మొదటికి వస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరం అనడంలో రెండోమాట లేదు.కానీ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నకు మాత్రం సమాధానాలు మారుతున్నాయి. ఇప్పటికీ చాలాసార్లు గడువులు మారాయి.కానీ..ప్రాజెక్టు మాత్రం పూర్తికాలేదు. ప్రాజెక్టు పూర్తియితే తమకు నీళ్లెప్పుడొస్తాయా అని లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. –సైమన్‌ గునపర్తి
పోలవరం ఎత్తుపై గందరగోళం
ఆంధ్ర సీమకు జీవనాడిగా అభివర్ణించే పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర బిజెపి ప్రభుత్వం పూటకోమాట చెబుతూ గందరగోళం సృష్టిస్తోంది. నిర్మాణ పనులు, నిర్వాసితుల సహాయ, పునరావాసం అడుగు ముందుకు పడని దయనీయ స్థితి ఉండగా, కేంద్రం చేస్తున్న గజిబిజితో ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. గడచిన వారం రోజుల్లో పార్ల మెంట్‌లో కేంద్ర మంత్రుల ప్రకటనలు దోబూ చులాడగా, నిధుల విషయమై తాజాగా విత్త మంత్రిత్వశాఖ రాష్ట్ర సర్కారుకు పంపిన లేఖ మరింత అయోమయంలో పడేసింది. పూర్తి చేసిన పనులకుగాను రూ.828 కోట్లు విడుదల చేస్తూ, ఇంకా ఇవ్వాల్సింది రూ.1,249 కోట్లేనని బాంబు పేల్చింది. 2013-14 ధరల ప్రకారం రూ.20 వేల కోట్ల అంచనాకే కట్టుబడి ఉన్నట్లు మరోమారు స్పష్టం చేసింది. సవరించిన సవివర ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌) మేరకు ఇంకా కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించగా ఆ ప్రస్తావన చేయ లేదు. అంతకుముందు పార్లమెంట్‌లో ఇద్దరు జలశక్తి మంత్రులు ప్రాజెక్టు ఎత్తుపై తలొక మాటా మాట్లాడారు. లోక్‌సభలో మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ జోషి సమాధానమిస్తూ తొలి దశలో ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లేనన్నారు. రాజ్యసభలో మరో మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు జవాబు చెబుతూ గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం ఎత్తు 45.72 మీటర్లుగా చెప్పు కొచ్చారు. కొత్త డిపిఆర్‌పై దాటవేశారు. విభజన చట్టం ద్వారా జాతీయ హోదా సంతరించుకున్న ప్రాజెక్టుపై కేంద్రం వ్యవహరి స్తున్న తీరు దాని బాధ్యతారాహిత్యాన్ని తెలుపుతుంది.
పోలవరాన్ని ఆది నుంచీ కేంద్రం వివాదాస్పదం చేస్తోంది. ఇరిగేషన్‌ కాంపొనెంట్‌నే భరిస్తాం నిర్వాసితుల విషయం తమకు సంబంధం లేదని భీష్మిస్తోంది. ప్రాజెక్టు అంటేనే నిర్వాసితులతో కలిపే ఉంటుంది. కేంద్రం ఈ అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాన్ని విస్మరించడం అమానవీయం. ప్రతిపాదిత ఎత్తులో ప్రాజెక్టును నిర్మిస్తే 1.06 లక్షల కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. అత్యధికులు గిరిజనులే. కాంటూరు లెక్కల్లో శాస్త్రీయత లేదనడానికి మొన్న గోదావరికి వచ్చిన వరదలే ఉదాహరణ. అంచనాలను దాటి ఎక్కువ ప్రాంతాలు కొద్దిపాటి వరదలకే మునిగాయి. పునరావాస కాలనీలు సైతం మునిగాయి. కాంటూరు లెక్కలు తప్పుల తడకలని తేలిపోయింది. ప్రభుత్వ గణాంకాల బట్టి చూసినా ఇప్పటికి 22 శాతానికే పునరావాసం పూర్తయింది. అదీ అసం పూర్తిగానే. జాతి అభివృద్ధికి తమ సర్వస్వం ధారపోసిన లక్షలాది నిర్వాసితుల పునరావాసాన్ని గాలికొదిలేయడం హేయం. పోలవరానికి కేంద్రం కల్పిస్తున్న అడ్డంకులపై నిలదీసి పోరాడి నిధులు సాధించి సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టనట్లుంటోంది. కేంద్రం వద్దకెళ్లి నిధులడుగుతున్నాం అని చెపుతు న్నారంతే. మొన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన పనులకు రూ.2,600 కోట్లు కేంద్రం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడిరచగా,కేంద్రం ఇచ్చింది రూ.828 కోట్లు మాత్రమే. కొత్త డిపిఆర్‌ ఆమోదానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు అత్యవ సరంగా రూ.15 వేల కోట్లివ్వండని అడగ్గా, కొత్త డిపిఆర్‌ను బుట్టదాఖలు చేశామని కేంద్రం లేఖ పంపింది. అలాగే 2005 అనంతరం 18 ఏళ్లు నిండిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదంది. కేంద్రం రాష్ట్రానికి ఈ విధంగా అన్యాయం చేస్తున్నా గట్టిగా ఒత్తిడి ఎందుకు చేయరో తెలీదు. నిర్వాసితుల పునరా వాసంపై తొలిదశ, మలిదశ, అని వక్ర భాష్యా లు చెపుతున్న కేంద్రానికి రాష్ట్ర సర్కారు వంత పాడటం అభ్యంతరకరం. 2017-18 ధరలకనుగుణంగా రాష్ట్రం రూ.55 వేల కోట్లకు కొత్త డిపిఆర్‌ పంపగా సాంకేతిక సలహా మండలి ఆమోదించింది. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ రూ.47 వేల కోట్లకు కుదించింది. నిర్వాసితుల పునరావాసానికే రూ.30 వేల కోట్లు కావాలి. ఈ భాగాన్ని ఎగ్గొట్టేందుకు కేంద్రం పన్నాగం పన్నుతోంది. రాష్ట్రం గమ్మునుంది. నిర్వాసి తులందరికీ పునరావాసం కల్పించాకే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న అంతర్జాతీయ నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించి ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఎన్నికల వాగ్దానం ప్రకారం రాష్ట్ర సర్కారు నిర్వాసి తులకు రూ.10 లక్షల ప్యాకేజీ ఇవ్వాలి. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం విభిన్నమైన ప్రకటనలు చేస్తూ గోదావరి నది పరీవాహకంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలను గందరగోళంలోకి నెట్టివేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయమై లోక్‌ సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరో విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో ఏది నమ్మాలో, ఏది నిజమో అన్న సందేహాలు ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. గోదావరి నదీ జలాల వివాద పరిష్కారాల ట్రి బ్యునల్‌ 1980లో ప్రకటించిన అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి నీటినిలువ సామర్థం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) ఎత్తు 45.72మీటర్లు అని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడిరచారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఎంతో తెలపాలని రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కుమార్‌ అడిగిన ప్ర శ్నకు మంత్రి లిఖితపూర్వకంగా బదులిచ్చారు. పోలవరం ఎత్తును తగ్గిస్తూన్నట్టుగా ఎపి ప్రభుత్వం నుంచి తమకు ప్రతిపాదన ఏదీ రాలేదని వెల్లడిరచారు. అంతకుముందు ఇదే సెషన్స్‌లో పోలవరం ఎత్తుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎంపి సత్యవతి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ బదులిస్తూ పోలవరం ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకే పరిమితం అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తుపై ఉభయ సభల్లో కేంద్ర మంత్రుల చేత భిన్నమైన ప్రకటనలు చేయించడం గందరగోళ పరిస్థితు లకు దారితీస్తోంది.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌,ఒడిశా రాష్ట్రాలతో ముడిపడి ఉన్న పోలవరం ప్రాజెక్టు సమస్యలో కేంద్రప్రభుత్వం చేసిన ఈ విధమైన ప్రకటనల్లో దేన్ని నమ్మాలో , ఏది నిజమో అన్న సందేహాలు పుటుకొస్తున్నా యంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని చూస్తున్నారని,దీన్ని సహించేది లేదని ఇప్పటికే ఎపిలో ప్రజాసంఘాలు కేంద్రా నికి హెచ్చరికలు చేశా యి. పోలవరం ప్రాజెక్టు లో ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేప థ్యంలో ఇప్పడు కేంద్రం పోలవరం ఎత్తుపై మరింత స్పష్టత ఇచ్చేలా ప్రకటన జారీ చేయాలని గోదావరి నది పరివాహక నిర్వాసిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పోలవరం తుది నివేదికపై సుప్రీంకు కేంద్రం లేఖ పోలవరం ముంపునకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సోమవారం సు ప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. పిటిషన్ల విచారణపై వాయిదా కోరుతూ వినతిపత్రం సమర్పించింది. పోలవరం ప్రాజెక్టుముంపు సమస్యపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. పోలవరం ప్రాజెక్టువల్ల వరద ముంపు తలెత్తుతున్నందున ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూపాలని తెలంగాణ,చత్తిగఢ్‌,ఒడిశా రాష్టాల ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటీషన్ల ్ల విచారణ నేపద్యంలో కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ లేఖ రాసింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖమంత్రి సమావేశం ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉందని, ఈ పరిస్థితుల దృష్టా మరో మూడు నెలల పాటు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని ,తుది నివేదిక అందించడానికి మరికొంత సమయం పడుతుందని కేంద్రం తెలిపింది. 2022 సెప్టెంబర్‌ 6న సుప్రీం ఇచ్చిన ఆదేశాల ప్రకారం గోదావరి నదీ పరివాహకంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే కల్పించుకుని అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇందుకు మరికొంత సమయం కావాలని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థ్ధించింది.
ఇస్తామన్న పరిహారానికి దిక్కూమొక్కు లేదు
పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం మాట మరిచారు. పెండిరగ్‌ల పరిష్కారం లేనేలేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోనే ప్రస్తుతానికి ఊళ్లను ఖాళీ చేయించి నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు కుక్కునూరు, పోలవరం, వేలేరు పాడు మండలాల్లో నిర్వాసితుల కుటుం బాలను గుర్తించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పటికే దాదాపు 13 చోట్ల పోలవరం నిర్వాసిత పునరా వాస కాలనీలకు శ్రీకారం చుట్టారు. జంగారెడ్డిగూడెం సమీపాన ఉన్న చల్లావారిగూడెంలో అత్యధికంగా ఆరు వేల కుటుంబాలకు సరిపడా 650 ఎకరాలను సేకరించి కాలనీకి శ్రీకారం చుట్టారు. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లోను ఇదే తరహాలో 2019 వరకు పునరావాస కాలనీలు కాస్తంత వేగంగానే సాగాయి. ఆ తదుపరి ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం,కామయ్యపాలెం,రాచన్న గూడెం, ఎర్రవరం,దర్పగూడెం,రౌతుగూడెం,ములగలం పల్లి, స్వర్ణవారిగూడెంలలో కాలనీల నిర్మాణాలు చేపట్టినా ఇప్పటికే ఐదు గ్రామాల్లో కాలనీలకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. తమకు చెల్లించాల్సిన పరిహారం చేతికందనిదే తాము కాలనీలకు వెళ్ళబోమని నిర్వాసితులు భీష్మించారు. ఫలితంగా రాచన్నగూడెం,ఎర్ర వరం,దర్పగూడెం,రౌతుగూడెంలలో నిర్వాసిత కుటుంబం ఒక్కటంటే ఒక్కటి రాలేదు. పోలవరం మండలం ఎల్‌ఎన్‌డి పేటలో 400 గృహాలతో కాలనీ నిర్మించగా,అక్కడ నిర్వాసిత కుటుంబాలు అనేకం వచ్చి చేరాయి. అలాగే బుట్టాయిగూడెం మండలంలో ముప్పినవారి గూడెం,దొరమామిడి,రామన్నగూడెం, రెడ్డి గణపవరం వంటి గ్రామాల్లో దాదాపు 1500 నిర్వాసితగృహాలు నిర్మించాల్సి ఉండగా,వీటిలో పది శాతం కూడా ఇళ్ళు పూర్తికాలేదు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ముప్పుతిప్పలు పడినా ఫలితం దక్కలేదు. ఏకంగా వివిధ శాఖలకు లక్ష్యాలు విధించినా కాలనీలు మాత్రం పూర్తి చేయలేకపోయారు.దీంతో ఒకవైపు నిర్వాసిత కుటుం బాల్లో అసంతృప్తి గూడు కట్టుకునే ఉంది. పోలవరం నిర్వాసితుల్లో గిరిజన కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద 6లక్షల 86 వేలు,గిరిజనేతరులకైతే ఒక్కొ కుటుంబానికి 6లక్షల 36వేలు చెల్లించాల్సి ఉంది. వీటిలో చాలా కుటుంబాలకు పూర్తి పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నివేదికల పేరిట అధికారులు తాత్సారం చేస్తే ఆర్థిక వైఫల్యంతో ప్రభుత్వం మరో జాప్యం చేసింది.
మూడేళ్లయినా మాట నిలబెట్టుకోలేదు
తాము అధికారంలోకి వస్తే పోలవరం నిర్వాసిత కుటుంబాలన్నింటికీ పది లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించిన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికి మూడేళ్లుగా అధికారం వెరగబెడుతున్నా మాటెందుకు నిలుపుకోలేదని పోలవరం నిర్వాసితులు నేరుగానే ప్రశ్నిస్తు న్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిధిలోకి వచ్చే గ్రామాలన్నింటిలోనూ ఒక్కొ కుటుంబానికి 2006 నుంచి ఇప్పటిదాకా వివిధ రూపాల్లో పరిహార ప్రకటన, అందచేత దిగుతూ వచ్చారు. 2019కు ముందే జగన్మో హన్‌ రెడ్డి అప్పటికే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద గిరిజన, గిరిజనేతర కుటుంబాలన్నింటికీ పది లక్షలకు తగ్గకుండా పరిహారం అందచేసి తీరుతామని ఎన్నికల ప్రచార సభల్లో జగన్మోహన్‌ రెడ్డి పదేపదే హామీలు ఇచ్చారు. ఈ మేరకు ఆయా నిర్వాసిత కుటుంబాల నుంచి ఒత్తిడి పెరగడంతో గతేడాది జూన్‌ 30వ తేదీన జీవోఆర్‌టి-224 జారీ చేస్తూ ఒక్కొ కుటుంబానికి పది లక్షలు చొప్పున పరిహారం అందించేందుకు 550 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో నిర్వాసిత కుటుంబాలు సంబరాల్లో మునిగి తేలాయి. కాని ఏడాది కావస్తున్నా జీవో 224 అమలుకే నోచుకోలేదు. ఇదిగో అదిగో అంటూ కాల యాపన చేశారు. కాని తాజాగా పోల వరం ప్రాజెక్టు పరిధిలో 41.15 కాంటూరు పరిధిలో ఉన్న గ్రామాలన్నిం టినీ పూర్తిగా ఖాళీ చేయిం చడమే కాకుండా ఏవైతే కుటుంబాలు నిర్వాసిత కాలనీలకు చేరుకుంటాయో ఆ కుటుంబాలకు మాత్రమే ఇప్పటికే ఇచ్చిన ఆర్‌ఆర్‌ ప్యాకేజీతో పాటు మిగతా మొత్తం కలిపి పది లక్షలు చెల్లిస్తామంటూ ఇప్పుడు కొత్త మెలిక పెట్టారు. దీనిపైనే నిర్వాసితుల్లో ఆగ్రహం, అసంతృప్తి పెల్లుబికుతోంది. ఎన్నికల ముందు చెప్పిందేమిటి, ఇప్పుడు చేసేదేమి టంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.ఇప్పటికే కుక్కునూరు,వేలేరుపాడు మండలాల్లో దాదాపు నిర్వాసిత కుటుంబాలన్నింటికీ ముందస్తు ప్యాకేజీ ప్రకారం వరుసగా 6 లక్షల86 వేలు,6లక్షల 36 వేలు చెల్లిస్తూ వచ్చారు. అంతేతప్ప మిగతా మొత్తాన్ని చెల్లించడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తాము నిర్వాసిత కాలనీలకు వెళ్ళబోమని, తమకు చెల్లించాల్సిన మొత్తం చేతికందిన తరువాతే పిల్లాపాపలతో కాలనీలకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలనీలు ఎక్కడికక్కడ బోసిపోయి కనిపిస్తు న్నాయి. దీనికితోడు మౌలిక వసతుల కల్పన లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ సౌకర్యం పూర్తిగా కల్పించకపోయినా కొన్నిచోట్ల మరుగుదొడ్ల నిర్మాణం సాగకపోయినా ఊరు నుంచి పదేపదే పొమ్మనడం ఏమిటంటూ నిలదీస్తున్నారు.
ఉన్న ఇల్లు సంగతేంటి
పరిహారం మాట అటుంచి తాము ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్ళకు 2017లోనే నష్టపరి హారం అంచనా కట్టారు. ఒక్కొక్క ఇంటికి దాదాపు రెండు నుంచి పది లక్షల వరకు ఆపైబడి కూడా ఇంకా చెల్లించాల్సి ఉంది. కాని అదేమీ ఇప్పుడు మాట వరుసకైనా నోరెత్తకుండా వ్యవహరించడాన్ని నిర్వాసితులు తప్పుపడు తున్నారు. ఎన్నో ఏళ్ళుగా కాపురం చేసిన ఇళ్ళకు లెక్కకైతే కట్టారుకాని, పరిహారం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం కాపురాలు ఉంటున్న వారంతా అక్కడి నుంచి ఖాళీ చేస్తేనే తప్ప పరిహారం ఇవ్వడం సాధ్యంకాదని తెగేసి చెబుతున్నారు.కాలనీలకు వెళ్ళాలంటే ముందుగా పరిహారం చెల్లించాలని నిర్వాసితులు..లేదులేదు మీరు ఊరు నుంచి కాలనీలకు వెళ్తేనే పరి హారం ఇస్తామంటూ అధికారులు పట్టుపడుతున్నారు.
ఆర్థిక శాఖ అంగీకరిస్తేనే…
పోలవరం నిర్మాణం కోసం అంచనా వ్యయాన్ని రూ.47,725 కోట్లకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి ఆమోదం లభించింది.అది జరిగి రెండేళ్లు పూర్తయింది. అయినాగానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేరుతో కొర్రీలు వేస్తున్నారు. పీపీఏ ఆమోదం తెలిపి కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలి. జలశక్తి శాఖ సిఫార్సుల మేరకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దానికి ససేమీరా అనడంతో ఈ వ్యవహారం పెండిరగులో పడిరది. ప్రస్తుతం కేంద్రం నాబార్డు ద్వారా ఇస్తున్న నిధులతో పనులు సాగుతున్నాయి. కేవలం ఇరిగేషన్‌ కాంపోనెంట్‌కు మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుబడు తోంది. 2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోలేదు. అంతే కాకుండా, అప్పటివరకూ ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీనివల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది.‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో సెక్షన్‌-90లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. భూ సేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు తిరస్కరించడం ప్రాజెక్టుకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది’’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఏ నీటి ప్రాజెక్టులోనైనా రెండు రకాల భాగాలు ఉంటాయి. ఒకటి ఇరిగేషన్‌ కాగా, రెండోది విద్యుత్‌ ఉత్పత్తి. తాగునీరు అనేది ఇరిగేషన్‌లోనే ఒక అంతర్భాగం. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో నైనా ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. కానీ పోలవరంలో దానికి భిన్నంగా కేవలం ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ మాత్రమే అనడం సమజసం కాదు. ప్రాజెక్టు పూర్తి ఆలస్యం అయితే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంచనాలు సవరించేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను’’ అంటూ ఏపీ సీఎం నేరుగా ప్రధానికి విన్నవించారు.
‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు’
‘‘పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం పూర్తి చేస్తుందనే నమ్మకం లేదు.రివర్స్‌ టెండరింగ్‌ అంటూ అన్నీ రివర్స్‌లో నడుపుతోంది. 2024లోగా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టు పూర్తి చేయకుండా డెడ్‌ స్టోరేజ్‌ నుంచి నీటిని లిఫ్ట్‌ చేయాలనే ప్రతిపాదనలు చేయడం సరికాదు. దానివల్ల గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతుంది. అలాంటి ప్రతిపాదనను మేము వ్యతిరేకిస్తున్నాం. పోలవరం నిర్వాసితుల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’’ అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత పితాని సత్యన్నారాయణ. మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనులను జగన్‌ ప్రభుత్వం ఒక్క శాతం కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయిందని విమర్శించారు. ఏడాది క్రితం పోలవరం పనులను కవరేజ్‌ చేసిన సమయంతో పోలిస్తే, ప్రస్తుతం స్పిల్‌ వే అందుబాటులోకి రావడంతో పోలవరం స్పిల్‌ చానెల్‌ ద్వారానే గోదావరి ప్రవాహం సాగుతోంది. మొన్నటి వరదల సమయంలో 22 లక్షల క్యూసెక్కుల పైబడిన గోదావరి నీటిని ధవళేశ్వరం బ్యారేజ్‌ వైపు దిగువకు వదిలారు. దానికి అనుగుణంగా అప్రోచ్‌ చానెల్‌ సహా అన్నింటినీ ఈ కాలంలో సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది.

నిండైన సహచర్యంతో నేనూ సైతం

అర్థ శతాబ్ద కాలం పాటు అడవి బిడ్డలతో మమేకమై జీవించి వారి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన అత్యున్నత అధికారి అనుభవాల నిధి ‘గిరిజనాభివృద్ధికి నేను సైతం’పుస్తకం రచయిత డాక్టర్‌ వి.ఎన్‌.వి.కె.శాస్త్రి రాసిన ఈ పుస్తకం బహుముఖ ప్రయోజనకారి అనడంలో అతిశ యం లేదు. బాహ్యంగా చూడటానికి ఒక అధికారి స్వీయ అనుభవాలు పొందుపరిచిన సాధారణ పుస్తకమే అన్నట్టు కనిపించిన, ఇందులోని ప్రతి విషయం భావి పరిశోధకులకు విలువైన సమాచార దిక్సూచి. అంతేకాక గిరిజనులు అభివృద్ధికి పాటుపడాలి అనుకునే వారికి మంచి మార్గదర్శి కూడా.. ప్రస్తుతం మనం చూస్తున్న పలు గిరిజన చట్టాల నేపథ్యం గురించి తెలుసుకోవాలి అంటే విధిగా నేను సైతం చదవాల్సిందే. ఎంతో విలువైన గిరిజన సమాచారం గల ఈ పుస్తకాన్ని గిరిజన పోరాట యోధుడు ‘కుంజా బొజ్జి’ గారికి అంకి తం ఇవ్వడంలో రచయిత శాస్త్రి గారి విశాల హృదయం ఎంతటిదో అర్థమవుతుంది.
స్థానిక గిరిజనులే ఉపాధ్యాయులు,గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేక సొసైటీలు,జీవో నంబరు 3 కొట్టివేత పర్యవ సానాలు, మొదలైన ప్రధాన వ్యాసాల సమా హారంగా ప్రచురించబడిన ఈ ‘…నేను సైతం’ పుస్తకం చదువుతుంటే ఒక మేధావి స్వీయ చరిత్ర చదువుతున్న మధురానుభూతి కలుగుతుంది. ప్రారంభం అంతా డాక్టర్‌ శాస్త్రి గారు గిరిజన సంక్షేమానికి వచ్చిన తీరే ఆసక్తిగా సాగిపోయి పాఠకుల కళ్ళు అక్షరాల వెంట పరుగులు పెడతాయి.‘మానవ శాస్త్రం’ అనబడే ‘ఆంత్రోపాలజీ’ విద్యార్థి పరిశోధక విద్యార్థిగా గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థలో చేరి తనకు ఇష్టమైన రంగంలో కష్టం లేకుండా మునుముందుకు దూసుకుపోయి మూలాలనుంచి విషయ సేకరణ చేయడం ఈ రచనలో మనకు అడుగడుగునా ఆగుపిస్తుంది. శాస్త్రి గారు తన అర్థ శతాబ్ది ఉద్యోగ ప్రస్థానం లో తను చూసిన క్షేత్రస్థాయి విషయాలను క్రోడీకరిస్తూ ఇప్పటికే 9 పుస్తకాలు రాశారు, ప్రస్తుతం జరుగుతున్న గిరిజన అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు నేపథ్యంగా ‘…నేను సైతం’ వ్యాస సంపుటి రాయడం జరిగింది. 1968 70 సం: మధ్య కాలంలో ఆంథ్రో పాలజీ విభాగంలో రెండేళ్లపాటు పరిశోధక విద్యార్థిగా, అనంతరం1970-1971మధ్య పరిశోధన సహాయకుడిగా సేవలు అందించారు, అనంతరం 1971నుంచి 2005 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖలోని గిరిజన సంస్కృతి పరిశోధనా శిక్షణా సంస్థలో పని చేశారు. ఈ ఉద్యోగ ప్రస్థానంలోనే ఏటూరు నాగారం, ఉట్నూర్‌, శ్రీశైలంలో ఐటిడిఎల ప్రాజెక్ట్‌ అధికారిగా సేవలు అందించారు,అలా ఆయన ఆసక్తి, ఉద్యోగరీత్యా ఆదివాసులతో సహచర్యం చేసే భాగ్యం కలిగింది అలా సంగ్రహించిన అనుభవ సారంతో రాయడం వల్ల ఈ పుస్తకానికి మరింత ప్రామాణికత, ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆధునిక కాలంలో పరిశోధన చేయాలి అంటే అంత కష్టం కాదు..కానీ 1968 ప్రాంతంలో పరిశోధన చేయాలంటే గొప్ప సాహసంతో కూడుకున్న పనే..!! అలాంటి సాహసాన్ని సునాయాసంగా చేసి డాక్టరేట్‌ సాధించారు శాస్త్రిగారు.వీరి అనుభవాలద్వారా వ్రాసిన ఈ వ్యాసం సంపుటి ద్వారా గిరిజనులు వారి జీవన విధానాల్లో అంచలంచెలుగా వచ్చిన మార్పులు కనిపిస్తాయి.
అడవి బిడ్డల జీవన సరళిలో వచ్చిన ఈ మార్పు కు ప్రధాన కారణం వారి చదువే అని స్పష్టం చేశారు రచయిత. నేను సైతం వ్యాస సంపుటిలో మొత్తం 11 వ్యాసాలు వేటికవే భిన్నమైన సమాచారం కలిగి ఉన్నాయి,గిరిజన సంక్షేమానికి ఎలాగ వచ్చాను మొదలు జీవో నెంబరు 3కొట్టివేత పర్యవ సానాలు, వరకు ఈ వ్యాసావళి కొనసాగింది.
1986 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక గిరిజన యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏర్పాటు చేసిన వైనం దాని నేపథ్యం. 1986 87 సంవత్సరంలో పదవ తరగతి అర్హతతో గిరిజన యువతకు స్థానికత ఆధారంగా అందించిన ఉపాధ్యాయ ఉద్యోగాల ద్వారా గిరిజన యువతలో వచ్చిన సామాజిక,ఆర్థిక,మార్పులు పర్యవసానాలు డాక్టర్‌ శాస్త్రి అక్షర బద్దం చేసిన వైనం ఆసక్తిగా సాగుతుంది.
ఏ ఉద్యోగైన తన ఉద్యోగ ప్రస్థానంలో విజయం సాధించాలి అంటే ముందు సమైత విషయం మీద ఆసక్తి ఆపైన తన చదువుకు సంబంధించిన ఉద్యోగం అయినప్పుడు దానిని ఇష్టంతో విసెషష్క్ప్డతతో ప్రామాణిక బద్ధంగా పూర్తి చేయగలరు.అచ్చంగా శాస్త్రిగారి ఉద్యోగ ప్రస్థానం ఆ విధంగా సాగింది కనుక తన ఉద్యోగ జీవితంలో గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు రచించి అమలు అయ్యేటట్టు కృషి చేయగలిగారు ఇది అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శనీయం. భారత రాజ్యాంగంలో గిరిజ అభివృద్ధికి ఎన్నో ప్రత్యేక వ్యవస్థషసౌకర్యాలు కల్పించిన, అధికార వ్యవస్థలో మాత్రం అడుగడుగున వ్యతిరేకత కనిపిస్తుంది, అందుకు అధికార ఘనంలోనే వ్యతిరేకత తదితర విషయాలు గిరిజనులకు జరుగుతున్న నష్టం గురించి కూడా శాస్త్రి గారు ఇందులో నిర్మొహమాటంగా వివరించారు . చివరిగా ‘జీవో నెంబర్‌ 3 కొట్టివేత పర్యవసనాలు’ గురించి వివరిస్తూ అది రాక ముందు గల జీవో నెంబర్‌ 275 / 1986 ఉంది దీని ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100% ఉపాధ్యాయ పోస్టులు స్థానిక గిరిజనులకు రిజర్వ్‌ చేయబడ్డాయి దానిని ట్రిబ్యునల్‌ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుని దొడ్డి దారిన జీవో నెంబర్‌ 3/2000 జారీ చేసినట్టు సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు తాను భావిస్తు న్నట్టు రచయిత అభిప్రాయం వ్యక్తం చేశారు, చిత్రంగా ఈ రెండు జీవోలు వెలువడే సమయంలో అప్పటి ప్రభుత్వ సెక్రటరీలకు డాక్టర్‌ శాస్త్రి సహాయకుడిగా ఉండటం ఒక విశేషం. ఇలాంటి ప్రామాణిక స్వాను భావిక విషయాలు ఎన్నో ఈ పుస్తకంలో మనకు అడుగడుగున అగుపిస్తాయి, అచ్చంగా గిరిజనుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసే స్వచ్ఛంద సంస్థలు, సంఘాలతో పాటు గిరిజన సామాజిక వర్గాలపై పరిశోధన చేసే వారికి ఈ ‘…నేను సైతం’ పుస్తకం ఒక దారి దీపం లాంటిది.
50 సంవత్సరాల పూర్వం నాటి గిరిజన గ్రామాలు, అప్పటి గిరిజనుల వెనుకబాటు తను, అందుకు ప్రభుత్వాలు చేసిన కృషి, అధికార గణం అలసత్వం, తదితర ఎన్నో విషయాలు నిర్మొహమాటంగా నిజమైన రచయిత దృష్టి కోణంతో ఈ పుస్తకం వ్రాశారు రచయిత ‘డాక్టర్‌ వట్టిపల్లి కృష్ణశాస్త్రి’. ఈ గిరిజన సమాచార దర్శని ప్రతి విద్యావేత్త విధిగా చదవదగ్గన్న పుస్తకం అనడంలో ఎలాంటి అతిశయం లేదు. –డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

అవునూ వారే స్వయంగా రోడేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం ఓ చిన్న చీమలపాడు పంచాయితీలో జీలుగులోవ గిరిజనగ్రామం. ఇది కొండ శిఖరంపై ఉంటుంది. ఇక్కడ పది కుటుంబాలు. మాడుగుల నియోజకవర్గం అవురువాడ పంచాయతీ కొండ శిఖర గ్రామమైన పశువులు బంద గ్రామంలో 7 కుటుంబాలవారు 38 మంది జనాభా కలిగిన కొందు ఆదివాసి గిరిజనులు కొండ శిఖర్‌ గ్రామం పై జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని రోడ్డు మార్గం నుండి వెళితే రెండు రోజుల సమయం పడుతుంది. బైకు రాకపోకల కోసం రోడ్డు ఏర్పాటు చేసుకుంటే మంచిదని గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మానం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ని సంప్రదించి తమకు ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని, రోడ్డు పనులు చేసుకుంటామని వేడుకున్నారు. చాలాసార్లు కలెక్టర్‌ చుట్టూ తిరిగి బతిమాలారు. నర్సీపట్నం ఆర్డిఓ గిరిజన గ్రామాన్ని సంద ర్శించి వారికి ఉపాధి కార్డులు ఇస్తామని చెప్పారు. కార్డులు ఇచ్చినట్టు రిపోర్టులో రాసుకున్నారే తప్ప ఇంతవరకూ ఎవ్వరికీ ఉపాధి హామీ కార్డులేవీ అందలేదు. కనీసం పాదం పని కూడా ఇవ్వలేదు. ఎంత విన్న వించుకున్నా.. అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో గిరిజనులంతా నడుం బిగించారు. వారే సొంతంగా గత 15 రోజుల నుండి శ్రమదానంతో రోడ్డు నిర్మాణం చేసు కుంటున్నారు. అధికారులు గిరిజన ఉత్స వాల పేరు మీద, టూరిజం అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు తప్ప తమ గిరిజన గ్రామాలకు కనీసం నడవడానికి తోవలేని పరిస్థితి ఉందని గుర్తించడం లేదంటూ గిరిజనులు వాపోయారు. ఈ మధ్య కాలంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ గర్భిణీ స్త్రీలను డోలిలో తీసుకురావడానికి వీల్లేదని అన్నారు. మండల అధికారి బృందం వచ్చి గిరిజనుల గ్రామాన్ని సందర్శించారు. రోడ్డు మార్గం దగ్గరగా ఉందని..కొర్ర సంధ్య (20) గర్భిణీ స్త్రీ అమ్మగారి ఊరైన ఎదురిపల్లి వెళ్ళి పోయింది. కానీ ఈ గిరిజన గ్రామంలో ఎవ రికైనా అనారోగ్యం వస్తే, ఇతర నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా శనివారం పెట్టే సంతనాడు మాత్రమే వెళ్ళాలి మిగతా సమ యాల్లో వెళ్లాలంటే కనీసం 15 కిలోమీటర్లు కాలి నడకన కొత్తకోటకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కలిసి తమ కోసం తామే నడుం బిగించారు. పలుగూ పారలు పట్టుకున్నారు. నిర్విరామంగా 15 రోజులు కష్టపడుతూ రోడ్డు మార్గాన్ని సరిచేసు కుంటున్నారు. 3 నెలల్లోపు ఈ రోడ్డు నిర్మా ణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో తీర్మానం చేసుకున్నారు. ఇప్పటికైనా అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ తమ గ్రామానికి ఉపాధి పథకం ద్వారా రోడ్డును మంజూరు చేయాలని ఆ గిరిజనులు కోరుతున్నారు. తమకు ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ని వేడుకుంటున్నారు.-జిఎన్‌వి సతీష్‌

మహా విశాఖ మధ్యలో ఓ అడవి..
మహానగరం మధ్యలో

అభయారణ్యం… అందులో రహస్య గిరిజన గ్రామం…విశాఖ నగరం అద్దాల మేడలు, ఆకాశాన్నితాకుతున్నట్లు ఉండే భవనాలతో కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయింది. అయితే ఇదే నగరం నడిబొడ్డున ఓ గిరిజన గ్రామం కూడా ఉంది. అది కూడా దట్టమైన అడవి మధ్యలో.విశాఖ మహానగరంలో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. అసలు నగరంలో అడవి ఎలా ఉంది? ఆ అడవిలో ఊరు ఎందుకుంది?-
గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని 98 వార్డులలో 25 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో 350 మంది జనాభాతో శంభువా నిపాలెం ఉంది. ఇది ఒక గిరిజన గ్రామం. మన్నెందొర అనే గిరిజనం ఇక్కడ ఐదు తరాలుగా ఉంటున్నారు. కంబాలకొండ అభయారణ్యం మధ్యలో ఉన్న ఈ గిరిజన గ్రామం…జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది.
చెక్‌ పోస్టు పడతాది…
జీవీఎంసీ విస్తీర్ణం దాదాపు 680 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎటువంటి అడ్డుకులు ఉండవు. అయితే శంభు వానిపాలెం వెళ్లాలన్నా… వెళ్లిన తరువాత బయటకు రావాలన్నా కూడా చెక్‌ పోస్టు తనిఖీలు ఎదుర్కోవాల్సిందే. పీఎం పాలెం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్తే అక్కడొక చెక్‌ పోస్టు కనిపిస్తుంది. శంభువానిపాలెం వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల ముందే అటవీశాఖ చెక్‌ పోస్టు ఏర్పాటు చేసింది. గ్రామస్థుల రాకపోకలపై కూడా నిఘా ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి అక్కడ నివాసం ఉండేవాళ్లు తప్ప ఇంకెవరు వెళ్లలేరు. దీంతో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. ‘‘మా గ్రామం ఎప్పుడు పుట్టిందో మాకు తెలియదు. మేం మన్నెందొర గిరిజనులం. ఐదు తరాలుగా మా తెగ ఇక్కడే ఉంటున్నట్లు మా పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న వాళ్లంతా ఇక్కడ పుట్టినవాళ్లమే. ఎన్నికల సమయంలో తప్ప, మా గ్రామానికి అధికారులు, రాజకీయ నాయకులు పెద్దగా ఎవరు రారు. అసలు మేం ఇక్కడ ఉంటున్నట్లు చాలా మందికి తెలియదనే అనుకుంటున్నాం’’ అని చెప్పారు శంభువానిపాలేనికి చెందిన సీతారాం.
‘‘మాకు ఏ అవసరమున్నా…దగ్గర్లోని హనుమంతవాక, మధురవాడ, పోతిన మల్లయ్యపాలెం వెళ్తుంటాం. మేం గ్రామం బయలకు వెళ్లాలన్నా…తిరిగి లోపలికి రావా లన్ని చెక్‌ పోస్టులో వివరాలు చెప్పాలి. మా గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఎవరూ ఉండరు. అలాగే మా గ్రామంపై నుంచి రాకపోకలు చేసేందుకు కూడా అవకాశం లేదు. అడవిలో ఉన్నాం మేం’’ అంటూ ఆయన మాట్లాడుతుండగానే, ‘రాముడు’ అని కేక వినిపించింది. ఫోన్‌ సిగ్నల్‌ వచ్చినట్లుందంటూ నీటి ట్యాంక్‌ వైపు పరుగు తీశారు సీతారాం.
బేసిక్‌ మోడల్‌ ఫోన్‌… వాటర్‌ ట్యాంక్‌
శంభువానిపాలెంలో జీవీఎంసీ నిర్మించిన ఎత్తైన నీటి ట్యాంక్‌ ఉంది. ఈ ట్యాంక్‌ పై ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు కచ్చితంగా కనిపిస్తుంటారు. చేతిలో బేసిక్‌ మోడల్‌ ఫోన్‌ పట్టుకుని…దాని వైపు తదేకంగా చూస్తూ ఉంటారు…ఫోన్‌లో సిగ్నల్‌ కనిపించగానే వారి ముఖంలో ఆనందం కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ సెల్‌ ఫోన్‌ సిగ్నలే ఉండదు. సిగ్నల్‌ రావాలంటే నీటి ట్యాంక్‌ ఎక్కాల్సిందే.
‘‘మా ఊర్లో సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఉండదు. అడవి మధ్యలో ఉండటం…అటవీశాఖధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో సెల్‌ టవర్లు వేయలేదు. అయితే మధురవాడ,పీఎం పాలెం, జూ పార్కు పరిసరాల్లో ఉన్న టవర్ల నుంచి వచ్చే సిగ్నలో…ఏమో…బేసిక్‌ మోడల్‌ సెల్‌ ఫోన్లకు అప్పుడప్పుడ సిగ్నల్‌ వస్తుంది. అది కూడా వాటర్‌ ట్యాంక్‌, ఎత్తైన మేడలు ఎక్కితేనే. దాంతో మా ఊర్లో ఫోన్లు మాట్లాడాలి అనుకునే వారంతా ఈ ట్యాంకులు, మేడలపైనే కనిపి స్తారు. ఇప్పుడంతా ఆన్‌ లైన్‌ చదువులు వచ్చినా…సెల్‌ ఫోన్‌ పని చేయకపోవడంతో మా పిల్లలకు అది కూడా వీలుకావడం లేదు’’ అని ఫోన్‌ మాట్లాడేందుకు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన పరశురాం చెప్పారు.
ఇది మరో ప్రపంచం
శంభువానిపాలెం జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది. అక్కడికి వెళ్లాంటే ఫారెస్ట్‌ సిబ్బంది అనుమతి తప్పనిసరి.‘‘మా గ్రామం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది 7,200 హెక్టార్లున్న కంబాల కొండ అభయారణ్యంలో ఉంది. నగరంలోకి అడవి వచ్చిందా…? అడవే నగరంగా మారిందా…? తెలియదు కానీ… మేం నగరానికి చెందిన గిరిజనుల్లా జీవిస్తున్నాం. కంబాలకొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోనే సెక్యూరిటీ గార్డులుగా, స్వీపర్‌లుగా మాలో కొందరికి పనులు ఇచ్చారు. మిగతా వారు ఊర్లో మేకలు కాసుకుని జీవనం సాగిస్తుంటారు’’ అని కంబాల కొండలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న శంభువానిపాలెం నివాసి ఒకరు చెప్పారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌ వాడీ కేంద్రం తప్పితే ఇక్కడ ప్రభుత్వానికి సంబం ధించిన ఏ భవనమూ లేదు. ఆసుపత్రి లేదు. వైద్యం కోసం ఐదారు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సిగ్నల్‌ సమస్య కారణంగా రేషన్‌ కూడా ఊరి బయట సిగ్నల్‌ ఉన్న చోటుకి వెళ్లి తీసుకుంటాం. మా ఊరు రావడానికి కూడా మా బంధువులు ఇష్టపడరు. వస్తే వారికి ప్రపంచంతో సంబం ధాలు కట్‌ అయిపోతాయి. ఎందుకంటే శంభు వానిపాలెం మరో ప్రపంచం’’ అని ఆయన అన్నారు.
కొండ జమీందార్లు… సేవకులు
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని 11మండలాల్లో అనేక గిరిజన తెగలున్నాయి. అయితే విశాఖ నగర పరిధిలో గిరిజన తెగలు ఉండటం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడంటే నగరం కానీ…ఒకప్పుడు విశాఖ అంటే 50 శాతం అడవే. కొన్ని తెగల గిరిజనులు వ్యాపారం కోసం లేదా విడిది కోసం కూడా… వారు ఉండే ప్రాంతాలకు దూరంగా వచ్చేవారని ఏయూ చరిత్ర విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు. ‘‘జమీందార్ల కాలంలో మైదాన జమీందార్లు, కొండ జమీందార్లు అని ఉండేవారు. గిరిజన తెగల్లో ఉండే పెద్ద తెగలను కొండ జమీందార్లు అనేవారు. వీరు కొండల్లో దొరికే ఉత్పత్తులతో వ్యాపారం చేసేందుకు మైదాన ప్రాంతాలకు వస్తుండేవారు. అలా వచ్చిన వీరు కొందరు మైదాన ప్రాంతాలకు సమీపంగా ఉండే అటవీ ప్రాంతాల్లోనే తాత్కలిక నివాసాలు ఏర్పాటు చేసుకునే వారు. అలా కొందరు మైదాన ప్రాంతాల్లోనే స్థిరపడిపోయారు’’ అని ఆయన వివరించారు. ‘‘కొన్ని గిరిజన తెగల్లో వాళ్లు మైదాన ప్రాంతంలో ఉండే జమీందార్లకు సేవకులుగా ఉండేందుకు వచ్చేవారు. వారు వ్యవసాయం అటవీ ఉత్పత్తుల సేకరణకు వీలుంటుందని స్థానిక అటవీ ప్రాంతాల్లోనే నివాసం ఏర్పాటు చేసుకునేవారు. తరాలు గడుస్తున్న కొద్దీ వారు మైదాన ప్రాంతాల ప్రజలతో కలిసిపోయారు. విశాఖ ఒకప్పుడు పెద్ద వ్యాపార కేంద్రం, అలాగే ఎక్కువ అడవులున్న ప్రాంతం కావడంతో శంభు వానిపాలెం గిరిజనులు అలా వచ్చినవారై ఉంటారు’’ సూర్యనారాయణ తెలిపారు.
ప్రవేశం నిషిద్ధం
శంభువానిపాలెం వెళ్లాలంటే చెక్‌ పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి…ఊరిలోని ఎవరైనా తెలిసినవారు ‘మావాళ్లే’ అని చెప్తే అన్ని వివరాలు తీసుకుని లోపలికి అనుమతిస్తారు. థింసా బృందం కూడా అటవీ శాఖ అనుమతితో శంభువానిపాలెంలోకి ప్రవేశించింది. చెక్‌ పోస్టు నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత శంభువానిపాలెం గ్రామం కనిపిస్తుంది. గ్రామంలోకి వెళ్తుండగానే తుమ్మిగెడ్డ రిజర్వాయర్‌ కనిపిస్తుంది. అది దాటు తుండగా…సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ కట్‌ అయి పోతుంది. జీవీఎంసీ పరిధిలో ఉండటంతో చెక్‌ పోస్టు నుంచి గ్రామం వరకూ తారురోడ్డు వేశారు.
‘‘శంభువానిపాలెంలోకి ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే ఇది కంబాలకొండ అభయా రణ్యంలో ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇది పూర్తిగా అటవీశాఖ అధ్వర్యంలో ఉంది. శంభువానిపాలెంలో అటవీశాఖ తరపున బేస్‌ క్యాంపు కూడా ఏర్పాటు చేశాం. అభయారణ్య ప్రాంతంలో ఇది ఉండటంతో…ఇక్కడ చేపలు పట్టడం, వన్యప్రాణులను వేటాడటం, తుపాకీ ఉప యోగించడం,చెట్లు తగలబెట్టడం,చెత్త వేయడం,మద్యం తాగడం,రిజర్వాయర్‌లో ఈతకొట్టడం వంటి పనులు చేయకూడదు. అది వన్యప్రాణి చట్టం సెక్షన్‌ 51 ప్రకారం నేరం. నగరపరిధిలో ఉన్న ప్రత్యేకమైన గ్రామం ఇది’’ అని విశాఖపట్నం ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ అనంత్‌ శంకర్‌ చెప్పారు. – గునపర్తి సైమన్‌

1 2