ధరల మోత

దేశంలో ధరల మోత మోగుతోంది. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం ధరల భారాన్ని మోయలేక పోతున్నారు. నిత్యం పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజల్‌ ధరల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిరదిం. దీనికితోడు చమురు కంపెనీలు గ్యాస్‌ ధరలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. మే డే కానుకగా వాణిజ్య వంట గ్యాస్‌ సిలిండర్‌ బండపై 104 రూపాయలను వడ్డించింది.19 కేజీల వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులపై ఈభారం మోపింది. నెలవారీ సమీక్షలో భాగంగా,ఒకేసారి 104 రూపా యలను పెంచేసింది. దీంతో నగరం లో కమర్షియ ల్‌ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2563కు చేరింది.గతంలో దీని ధర రూ.2460గా ఉండేది. ఇక దేశ రాజధాని ఢల్లీిలో ఈ ధర రూ.102.05 పైసలు పెరగడంతో సిలిండర్‌ రూ.2355కు చేరుకుంది. అలాగే, ముంబైలో రూ.2329.50 గాను, కోల్‌కతాలో రూ.2477.50గాను, చెన్నైలో రూ.2508కు చేరుకుంది.
సామాన్యులపై పెనుభారం
ఒకటి కాదు రెండుకాదు ఏకంగా అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి%ౌౌ% ఎండలు పెరిగినట్లే ధరలు కూడా పెరిగిపోతుం డటంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. సంపాదన అంతంత మాత్రంగానే ఉండటం ధరలు పెరిగి పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కొనేదెలా, తినేదెలా అంటూ తలలు పట్టుకుంటు న్నారు.. రెక్కలు ముక్కలు చేసుకున్నా కుటుంబానికి మూడుపూటల భోజనం పెట్టే పరిస్థితులు కనిపిం చడం లేదు.. గ్యాస్‌నుండి మొదలుకుని విద్యుత్తు చార్జీలు, పెట్రో ధరలు. నిత్యవసర వస్తువుల ధర ఇలా చెప్పుకుంటూపోతే లీస్టు పెద్దదిగానే ఉం టుంది. ధరల పెంపు మధ్యతరగతి వర్గాల నడ్డి విరుస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే తమ కుటుంబానికి మూడుపూటలతిండి పెట్రో పరిస్థి తులు.. అదే ఒకరే పనిచేస్తే వారి కష్టాలు చెప్పనక్కర లేదు.
మరో కొన్నిరోజుల్లో విద్యుత్తు చార్జీల మోత..
మరో కొన్ని రోజుల్లో విద్యుత్తు చార్జీల మోతమోగనుంది. ఏప్రిల్‌ 1వ తేదీనుండి చార్జీలు పెంచుతూ విద్యుత్తు రెగ్యులరేటరీ కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఉగాదిపండగకు ముందే విద్యుత్తు చార్జీలు పెరగనున్నాయి. గృహ కనెక్షన్లకు సంబం ధించి యూనిట్‌పై 50పైసలు వాణిజ్య సంస్థలపై యూనిట్‌పై రూపాయి చొప్పున భారం మోపను న్నారు.అసలే వేసవి కాలం కావడంతో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. మధ్యతరగతి వర్గాల ప్రజలు ప్యాన్లు, కూలర్లు వినియోగిస్తుండగా ధనవంతులు మాత్రం ఏసీలు వినియోగిస్తున్నారు. ఎండలు ముదరడంతో వీటి వినియోగం పెరిగింది. అసలే ఎండకాలంలో విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వస్తాయి. దీనికితోడు పెంచిన చార్జీలు జతకా వడంతో బిల్లుల మోత మోగనుంది. పెంచిన విద్యు త్తు చార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీనుండి అమలులోకి రానుంది. ఉగాది పండగ కంటే ముందే విద్యుత్తు చార్జీలు పెరగనున్నాయి.
పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు..
నాలుగుమాసాలపాటు పెట్రో ధరలు పెరగలేదు. అందరూ హమ్మయ్యా అని ఊపిరిపీల్చు కున్నారు.దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యం లో పెట్రో ధరలు పెంచలేదనే విమర్శలు ఎదుర్కొం టోంది కేంద్రం. ఎన్నికల ప్రక్రియ ముగియగానే వరుసబెట్టి పెట్రో ధరలు పెంచుతోంది. ఏడురోజు లుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏడురోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.4 పైనే భారం పడుతోంది. తాజాగా సోమవారం రోజు లీటర్‌ పెట్రోల్‌పై 50 పైసలు వడ్డించారు. డీజిల్‌పై 35 పైసల భారం మోపారు. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌కు రూ.112.71కిచేరగా డీజిల్‌ లీటర్‌కు రూ. 99. 07 చేరింది. పెట్రోధరలు ఇలాగే పెరిగితే మాత్రం రెండుమూడురోజుల్లో డీజిల్‌ధరలు సెంచరీ దాటి పోయే పరిస్థితులు నెలకొన్నాయి. సామా న్యులపై పెట్రో భారంఎక్కువగా కనిపిస్తోంది. నేడు అందరి వద్ద ద్విచక్రవాహనాలు ఉన్నాయి. మధ్యతరగతి వర్గాల ప్రజలు కూడా కార్లు వినియోగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాత కార్ల కొనుగోలు ఎక్కువగా జరిగింది. ద్విచక్ర వాహనం డబ్బులకు పాత కారు రావడంతో చాలామంది కార్లు కొనుగోలు చేశారు. వీరందరిపై భారం పడుతోంది. గతంలో మాది రిగా రోజురోజుకు పెట్రో వడ్డన చేస్తుండటంతో మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆందోళన చెందు తున్నారు. ఇదేమి భారమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఏడురోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రేకు పడుతుందనే నమ్మ కంతో ప్రజలున్నా ఇప్పట్లో సాధ్యమయ్యే అవకా శాలు లేవనే ప్రచారం కూడా సాగుతోంది.
నిత్యవసర వస్తువుల ధరల పెంపు..
నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పప్పులు నూనె ధరలు ఒక్క సారిగా పెరిగిపోయాయి. ఎక్కువగా వినియోగించే వస్తువుల ధరలు పెరిగిపోవడంతో వెనకా ముందుచూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నూనె ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో నూనెప్యాకెట్‌ రూ.210 దాటిపోయింది. విడతల వారీగా కాకుండా ఒకేసారి ధర పెరగడంతో ఇబ్బందిపడాల్సిన పరిస్థి తులు నెలకొన్నాయి. గ్యాస్‌ ధరలతోపాటు నూనె ధరలు కూడా పెరిగిపోవడంతో మహిళలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. నూనె ధరలే కాకుండా ఇతర నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగిపో యాయి. కరోనా సీజన్‌ ప్రారంభమైన తరువాత నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. పెరుగుతూ పోతున్నాయి తప్పిస్తే ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల ధరలు మరింతగా పెరిగి పోయాయి. నూనె ధరలు సలసల మరుగుతుం డటంతో వెనకాముందు చూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యవసర వస్తువుల ధరలతోపాటు చికెన్‌ ధరలు కూడా పెరిగిపో యాయి. వేసవి కాలంలో చికెన్‌ ధర రూ.200 లోపే ఉండేది.. ప్రస్తుతం రూ.280నుండి రూ. 300 వరకు ధర పలుకుతోంది.
ఆర్టీసీ బాదుడే బాదుడు
నాలుగేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. కనీస చార్జీని రూ.5 నుంచి రూ.10కు చేశారు. గతంలో కనీస చార్జీని రూపాయి లోపు పెంచేవారు. చిల్లర సమస్య లేకుండా ఉం డేందుకు కనీస చార్జీని రెట్టింపు చేశామని చెప్పిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఉదాహరణకు గన్నవరం నుంచి విజయవాడ వచ్చే పల్లె వెలుగు బస్సులో 2019లో చార్జీ రూ.20 ఉండేది. ఇప్పుడు రూ.35 కు పెంచారు. సిటీ ఆర్డినరీ బస్సులో 2019లో రూ.25గా ఉన్న చార్జీని రూ.40కు పెంచారు. ఇలాజనాల జేబుల్లో నుంచి అదనంగా రూ.1500 కోట్లు లాగేస్తున్నారు.
ఇసుకలోనూ దోపిడీ
గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇచ్చింది. వాహనాల అద్దె ఖర్చు మాత్రం భరిం చాల్సి వచ్చేది. ఇప్పుడు ఇసుకను కోట్లు కొల్లగొట్టే వ్యాపారంగా మార్చేశారు. ప్రస్తుతం ఇసుక రేటు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. పల్నాడు జిల్లా సర్సరావుపేటలో టన్ను ఇసుక ధర రూ.800 వరకు ఉంది. రవాణా ఖర్చులు అదనం. వైసీపీ పెద్దలు జిల్లా వారీగా కాంట్రాక్టుకు ఇచ్చి దోచుకుం టున్నారనే ఆరోపణలున్నాయి.
పప్పు, పంచదార కట్‌
కేరళ ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా14రకాల నిత్యావసరాలను పంపిణీ చేస్తోం ది.ఉప్పు,పప్పు,చింతపండు,మిరపకా యలు కూడా ఇస్తోంది. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం పండ గొస్తే రేషన్‌ దుకాణాల ద్వారా నెయ్యి, బెల్లం సహా 14 రకాల వస్తువులు పంపిణీ చేసేది. జగన్‌ సర్కార్‌ వచ్చాక పరిస్థితి మారిపోయింది. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ను కేవలం అప్పుల కోసం వాడు కుంది. పేదలకు చౌకధరకు బియ్యం, ఇతర వస్తు వులు అందించడానికి ప్రభుత్వం ఏటా ఆ కార్పొ రేషన్‌కు రూ.3,000 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాది కూడా సబ్సిడీ సొమ్ము ఇవ్వలేదు.పైగా కార్పొరేషన్‌కు గ్యారెంటీ ఇచ్చి, ఆస్తులు తాకట్టు పెట్టి వేల కోట్ల రుణం తీసుకుంది. ఇప్పుడు దాని ద్వారా అప్పులు చేసే అవకాశం లేకపోవడంతో పూర్తిగా వది లేసింది. రేషన్‌లో ఇచ్చే పప్పు, పంచదారను 75 శాతం మేర జగన్‌ ప్రభుత్వం ఆపేసింది. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలు, కార్మికులతో పాటు చిరుద్యోగులు, మధ్యతరగతి వర్గాల వారికి ధరలు భారంగా మారాయి. నలుగురు సభ్యులున్న చిన్న కుటుంబానికి పాలు, పెరుగు, కిరణా సరుకులు, కూరగాయలు, బియ్యం తదితర నిత్యావసరాలకు గతంలో నాలుగేళ్ల క్రితం రూ.6 వేలు ఖర్చు కాగా.. ఇప్పుడు రూ.10 వేలు దాటిపో తోంది. రూ.500పెట్టి కూరగాయలు కొంటే వారం రోజులు కూడా రావడం లేదని జనం వాపోతు న్నారు. ఇక వంట గ్యాస్‌, ఇంటి అద్దె తదితరాలు కలిపితేఖర్చు తడిసి మోపెడవుతోంది. గృహ అవస రాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్‌ సిలిండరు ధరరూ.1200కు చేరువైంది.దీంతో నెలవారీ ఇంటి బడ్జెట్‌ను తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
దేశంలోనూ ఇదే పరిస్థితులు
ఈ ధరాభారం మోయలేక సామా న్యుల నడ్డి విరుగుతున్నది. అసలు ధరలు ఆకాశాన్ని ఎందుకు అంటుతున్నాయన్నది మీ మధురస్వరం నుండి వినాలన్న సామాన్యుల ఎదురు చూపులు ఫలించేదెన్నడు? సంవత్సరానికి ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రజల ఖాతాల్లోకి వేస్తామన్న రూ.1.5 లక్షలు, వ్యవసాయాన్ని రెండిరతల లాభం వచ్చేటట్లు చేస్తానన్న ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదంటే ఈ మాటలు మీ మనుసులో నుండి వచ్చినవి కావా ? దేశాన్ని విశ్వగురువును చేస్తానన్నారే! అలాంటిది ప్రపంచ ఆహార సూచిక లో 101వ స్థానానికి చేరి జనం పెడుతున్న ఆకలి కేకలు, పెరిగిపోతున్న నిరుద్యోగం,దేశం వంద లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన వైనం… ఇవేవీ మీ మనసులోని మాటల జాబితాలో స్థానం సంపా దించుకోలేదే ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్‌ కీ బాత్‌ (మనసులో మాట) కార్యక్రమం ఈ ఏప్రిల్‌ 30 నాటికి 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుం టుంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ నాయకు డూ ఇలాంటి గొప్ప ప్రయోగం చేయలేదని బిజెపి అనుకూల మీడియా,ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల మేధా వులు కీర్తి ప్రవచనాలు చేస్తున్నారు. టి.వి చర్చల్లో పాల్గొంటున్న పాలక అనుకూల పారాయణులు యథాశక్తి తమ పాండిత్యం ప్రదర్శిస్తున్నారు. నిజంగానే ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు తన మనసులోని మాట చెబుతున్నారా అనే సందేహం ప్రతి భారతీయుడిలో (అదానీ, అంబానీ లాంటి వారు మినహా) కలుగుతుంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా మీడియా సమావేశం జరపలేదు కాబట్టి. ఎన్నికల ముందు చెప్పింది, నేడు చేస్తున్నది వేరు కాబట్టి. తొమ్మిదేళ్ల నాడు చెప్పినదానికి, చేసినదానికి పొంతన లేదు కాబట్టి. ప్రధాని మనసులో మాటను ప్రజలు వినడం కాదు, దేశ ప్రజల మనసులో మాటను ప్రధాని వినాలి.
బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో విజయదశమి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత వుంది. ఆ రోజున ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సరిగ్గా అలాంటి విజయదశమి నాడు 2014 అక్టోబర్‌ 3న ‘ప్రధాని మనసులోని మాట’ కార్యక్రమాన్ని మోడీ ప్రారం భించారు. అంటే ఇది పక్కాగా ఆర్‌ఎస్‌ఎస్‌ మనసు లో నుండి పుట్టిన కార్యక్రమం. ఇప్పటి వరకు ప్రధాని మాట్లాడిన 99 ఎపిసోడ్‌లలో అనేక చిన్న చిన్న విషయాలను కూడా మహా నాటకీయంగా చెప్పారు.కర్ణాటకలో సులగిట్టి నరసమ్మ మంత్ర సానిగా ఎందరో గర్భిణీలకు సేవలందించిన విషయం గురించి ప్రధాని మన్‌ కి బాత్‌లో చెబు తుంటే… పేదలకేమో మంత్రసానులు, సంప న్నులకు కార్పొరేటు ఆసుపత్రులు అన్న మీ నీతి అర్థంకాలేదు. విజయనగరం జిల్లాలోని ద్వార పూడి పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రులకు రాత్రిపూట చదువు చెబుతున్న విషయం చెబుతుంటే నూతన విద్యావిధానం పేరుతో అత్యధికమంది పేదలను చదువులకు దూరం చేసే ఎత్తుగడ మీ మనసులో వుందని అనుకోలేదు. న్యూజిలాండ్‌లో ఎంపీగా ఎన్నికైన గౌరవ్‌ శర్మ అనే ప్రవాస భారతీయుడు సంస్కృతం లో ప్రమాణ స్వీకారం చేసిన విషయం పలుకు తుంటే రానున్న రోజుల్లో ప్రాచీనకాలం నాటి వేదాధ్యయనం తప్పనిసరి చేస్తారని గుర్తించలేక పోయాము. ఆసియాలో తొలి మహిళా లోకో పైలట్‌ సురేఖ యాదవ్‌ గురించి చెప్పినప్పుడు గుజరాత్‌లో బిల్కిస్‌ బానో, ఉన్నావోలో మైనర్‌ అమ్మాయి, ఢల్లీి నగరంలో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచా రాల గురించి ఎందుకు మాట్లాడలేదన్న భారతీ యుల సందేహాలను మీ నూరవ మన్‌ కి బాత్‌ లో తీరుస్తారని ఆశించవచ్చా!- (వి.రాంభూపాల్‌)