మతతత్వ శక్తులను ఓడిస్తేనే దేశానికి రక్ష

ఒక లౌకిక, ప్రజాస్వామిక భారతదేశం కోసం పాటుపడేవారికి, స్వాతంత్య్రపోరాట విలువలకు కట్టుబడి ఉండే వారికి ఆరెస్సెస్‌ అధినేత ఇంటర్వ్యూ ఒక బెదిరింపు అనే చెప్పాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ విధ్వంసాలు రాజ్యాంగం ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలుకాకుండా ఈ మతతత్వశక్తులు అడ్డుకుంటున్నాయి..ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఈ శక్తులు మోడీ ప్రభుత్వ అండదండలతో రాజ్యాధికారం పై అదుపు సాధించాయి. దీనికి సమాధానం ప్రత్యామ్నాయ విధానాల్లో, ప్రజా సమీకరణల్లో ఉంది. హిందూత్వ శక్తుల తాజా ఎజెండాను ఓడిరచాలంటే ప్రతిఘటనా శక్తిని పెంచుకోవడంతో బాటు, పెట్టుబడిదారీ లూటీకి వ్యతిరేకంగా ప్రజలను పెద్దయెత్తున సమీకరించాల్సిన అవసరముంది.-` బృందాకరత్‌
ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ‘’ఆర్గనైజర్‌’’, ’’పాంచజన్య’’ పత్రికల సంపాదకులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హిందూ రాజ్య స్థాపనకు సంబంధించి ఆరెస్సెస్‌ స్థాపకులు హెడ్గే వార్‌,గోల్వాల్కర్ల మాటలను బలపర్చేవిగా ఉన్నాయి. ‘’హిందుస్థాన్‌ ఒక హిందూ రాజ్యం. అభివద్ధి చెందుతున్న శక్తివంతమైన హిందూ సమాజం,హిందూరాజ్యం,భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి, ప్రపంచానికి నాయకత్వాన్ని అందిస్తుంది’’అని భగవత్‌ అన్నాడు. భారతదేశం,బ్రిటీష్‌ వలస దేశంగా ఉన్నప్పుడే ఆరెస్సెస్‌ తన ప్రణాళికను చాలా స్పష్టంగా వివరించింది. నేడు స్వాతంత్య్ర భారతదేశం సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉంది.ఆరెస్సెస్‌ అధినేత అసాధారణమైన వ్యాఖ్యలు,ఆరెస్సెస్‌ ఎన్నటికీ భారత రాజ్యాంగాన్ని అంగీకరించదనే విషయాన్ని మరోసారి తేటతెల్లం చేశాయి. నేడు ఆరెస్సెస్‌ ‘’వనరులు’’,‘’సమద్ధి’’,‘’సాధనాల’’ను కలిగి ఉంది.ఆ వనరులు ఏమిటి, ఎలా సమద్ధి గా ఉంది, ఆ సాధనాలు ఎక్కడి నుండి వస్తున్నా యని అడగడం సముచితంగా ఉంటుంది.
గోల్వాల్కర్‌ విస్తరించిన ‘’అంతర్గత శత్రువు’’
ఆ ఇంటర్వ్యూ ‘’హిందూ సమాజానికి’’ సంబం ధించిన చర్చ కోసం ఉద్దేశించినది. కానీ ఆరెస్సెస్‌ చీఫ్‌ ప్రకటించిన ‘హిందూ సమాజం’ అనే భావనకు భారత రాజ్యాంగంలో చోటు లేదు.ఆయన చెప్పేదాని ప్రకారం ‘’హిందూ సమాజం వెయ్యి సంవత్సరాలకు పైగా యుద్ధంలో ఉంటుంది కాబట్టి, యుద్ధంలో ఉండే వారు దూకుడుతనంతో ఉండడం సహజం’’.అందువల్ల స్థానిక భూస్వామ్య ఆధిపత్యవర్గాల సహాయంతో,దురాక్రమణ దారులకు,విజేతలకు మధ్య జరిగిన యుద్ధాలను, హిందూ ముస్లింలకు మధ్య జరిగిన మత యుద్ధాలుగా మార్చారు. చారిత్రక అన్యాయా లను సవరించే పేరుతో నేటి ‘’హిందువుల దూకుడుతనాన్ని’’ న్యాయమైందిగా చెపుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘’ఇది బయటి శత్రువు కాదు అంతర్గత శత్రువు. కాబట్టి హిందూ సమాజాన్ని,హిందూధర్మాన్ని,హిందూ సంస్కతిని రక్షించుకోడానికి యుద్ధం తప్పదు’’ అని అంటాడు.‘’భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు వారి విశ్వాసాలను అంటిపెట్టుకొని ఉండాలనుకుంటే, వారి పూర్వీకుల విశ్వా సాలను తిరిగి ఆచరించాలనుకుంటే, వారికె లాంటి ప్రమాదం ఉండదు, వారు భయ పడాల్సిన పని లేదు. కానీ అదే సమయంలో ముస్లింలు తమ ఆధిపత్య ప్రసంగ గర్జనలను వదిలిపెట్టాలి.ముస్లింలు భారతదేశాన్ని తిరిగి పాలించబోతున్న ‘’ఉన్నత జాతి’’అనే కథనాన్ని ముస్లింలు వదిలెయ్యాలి.వాస్తవానికి ఇక్కడ నివసించే వారంతా, వారు హిందువులైనా, కమ్యూనిస్టులైనా ఈ తర్కాన్ని వదిలి పెట్టాలని’’ఆయన అన్నాడు.ఆరెస్సెస్‌ తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టుల వలె రాజీపడని వారిపై దాడి చెయ్యడం, వారిని బెదిరించడం, భయపెట్టడమే ఆరెస్సెస్‌ తర్కం.’’ హిందూ జాతికి పూర్తిగా లోబడి ముస్లింలు భారతదేశంలో నివసించ వచ్చని’’గోల్వాల్కర్‌ అన్నాడు. భగవత్‌ ప్రకటనలు,చట్టం నుండి తప్పించుకోడానికి సవరించినప్పటికీ ఆరెస్సెస్‌ పరిశీలనలో ముస్లిం లను లొంగదీసుకోవడం, సంఫ్న్‌ పరివార్‌ నేరపూరిత దాడులను చూసీచూడనట్లుండడం, ఇవన్నీ అంతర్గత శత్రువుకు వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగించే లక్ష్యాలేనన్న మాట. ఈ యుద్ధంలో గోల్వాల్కర్‌ ముస్లింలు, కమ్యూనిస్టులు, క్రైస్తవులు శత్రువులనే నిర్వచనంటిచ్చారు. అంతటితో ఆగకుండా ఆరెస్సెస్‌ కథనాలకు అనుగుణంగా లేని హిందువులను కూడా శత్రుజాబితాలో చేర్చడం జరిగింది.అంటే ఇక్కడ నివసించే భారతీయ పౌరులు ప్రశాంతంగా జీవించాలంటే భారత రాజ్యాంగానికి అనుగుణంగా కాక ఆరెస్సెస్‌ కు అనుగుణంగా ఉండాలి. ఆరెస్సెస్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇస్లామిక్‌ ఛాందసవాదులు చెలరేగ డానికి ఊతమిస్తాయి. ఇటువంటి చర్యల ద్వారా ఆరెస్సెస్‌ తన మత విభజన వ్యూహాలను మరింతగా బలపరచుకోవాలని చూస్తోందన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం. ఒక మతతత్వం మరొక మతతత్వాన్ని బలోపేతం చేస్తుందని సిపిఐ(ఎం) పదేపదే చెప్పే విషయాన్ని భగవత్‌ ఇంటర్వ్యూ మరోసారి రుజువు చేసింది.
కుల హింసను పట్టించుకోని ఆరెస్సెస్‌
భగవత్‌ ‘’హిందూ సమాజపు’’ స్వయం నియామక ప్రతినిధిగా ‘’సమాజం’’ తరపున అనాగరికమైన వాదనలు చేస్తూ మాట్లాడతాడు. మతానికి ఎలాంటి సంబంధంలేని హిందూత్వ రాజకీయ భావనా కవచాన్ని ప్రకటించడం ఒకటైతే,ఈ దేశంలో అత్యధికంగా ఉన్న ప్రజలంతా హిందూమతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది రెండవది. కానీ మతపరంగా హిందువులైన ప్రజలు ఆరెస్సెస్‌ ఆలోచనలను సమ్మతించడం లేదు. ఆరెస్సెస్‌ నాయకునికి దళితులకు వ్యతిరేకంగా పెచ్చరిల్లుతున్న హింసాత్మక చర్యలు అసలు ఒక సమస్యగా కనిపించవు.‘’శ్రీరాముడే అన్ని జాతులను, వర్గా లను కలిపి ఉంచుతాడు’’ అనేదే కులా నికి సంబంధించిన ఏకైక ప్రస్తావన.హిందూత్వ గుర్తింపు నిర్మాణంలో జైశ్రీరామ్‌ నినాదం ఒక రాజకీయ సాధనంగా చేసుకుంటున్నది. దళితులు అగ్రవర్ణ హిందువుల చేతుల్లో వివక్షతను, హింసను, లైంగిక దాడులను ఎదుర్కొంటున్నదానిపై భగవత్‌ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు .
ఆరెస్సెస్‌ అధినేత మాటల్లో ‘’పేదరికం’’ ఊసే లేదు
భగవత్‌ ‘’శక్తివంతమైన, సంపన్న హిందూ సమాజం’’ గురించి మాట్లాడతాడు.తీవ్రమైన పోషకాహార లోపం, అత్యధిక జనం ఆకలితో అలమటిస్తున్న దేశాలలో ఒకటిగా భారతదేశం ప్రపంచ ఆకలి సూచీ లో అవమానకరమైన స్థానంలో ఉంటే ఆయన ‘’సంపన్నం’’ గురించి మాట్లాడ్డం చాలా హాస్యాస్పదంగా ఉంది. భారతదేశాన్ని ధ్వంసం చేస్తున్న సామాజిక, ఆర్థిక అసమానతలు,సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాల గురించి సంఫ్న్‌ అధినేత ఒక్కమాట కూడా మాట్లాడలేదు.ఆరెస్సెస్‌కు కార్మికులు, రైతులు అనేవర్గాలు లేవు. వారి దష్టిలో అంతా హిందూ సమాజంగా పిలువ బడే దానిలోనే దాగి ఉంటారు.కాబట్టి,ఆదానీ రోజుకు సగటున 1216 కోట్ల రూపాయలు, గ్రామీణ మహిళ రోజుకు కేవలం 250 రూపా యలు సంపాదిస్తే, ఆరెస్సెస్‌ వారిరువుర్నీ హిందూ సమాజం పేరుతో ఒకే గాటన కడుతుంది. ఆరెస్సెస్‌ సష్టించాలనుకునే ముఖ్యమైన హిందూత్వ గుర్తింపులో భాగంగా ధనికులను,పేదలను గుర్తించడానికి నిరాకరిం చడం ద్వారా ఆరెస్సెస్‌ అధినేత భారీ అసమాన తలను సమర్థిస్తున్నాడు. జనాభాలో అధిక సంఖ్యాక ప్రజల తక్కువ కొనుగోలు శక్తిని ప్రతిబింబించే అధికారిక సంఖ్యలు ఉన్నప్పటికీ, అధిక సంఖ్యాక భారతీయులు అధిక ధరలతో బాధపడుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణం అనేది ‘’వినియోగతత్వం’’ విధి అనీ, ప్రజలు అవసరానికి మించి అధికంగా కొనుగోలు చేస్తున్నందువల్లే ధరలు పెరిగిపోతున్నాయని సంఫ్న్‌ నాయకుడు అభిప్రాయపడుతున్నాడు. భారతదేశం ప్రస్తుతం మాంద్యం అంచున ఉంది.ఆఖరికి పెట్టుబడిదారీ అనుకూల ఆర్థిక వేత్తలు కూడా డిమాండ్‌ను పెంచే విధానాలతో ముందుకు పోతున్నారని, అయితే ధరల పెరుగు దలకు ప్రజలే కారణమని ఆరెస్సెస్‌ నేత నిందిస్తున్నాడు.
రాజ్యాంగేతర శక్తిగా ఆరెస్సెస్‌
ఇంటర్వ్యూలో భగవత్‌ ఆరెస్సెస్‌, దాని స్వయం సేవకులు,రాజకీయాలు, ప్రభుత్వం మధ్య ఉండే సంబంధం గురించి మాట్లాడినప్పుడు మరో అంశం బహిర్గతమైంది. ఆరెస్సెస్‌ ఒక ‘’సాంస్కతిక’’ సంస్థ అనీ, దానికి రోజువారీ రాజకీయాల్లో ఆసక్తి లేదనీ, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఇష్టం లేకపోయినప్పటికీ ప్రభుత్వ వ్యవహారాల్లో బలవంతంగా జోక్యం చేసుకుంటుందని అంగీకరిస్తూ ఆయన ఓ కట్టు కథను అల్లారు. ‘’ఇంతకు ముందున్న తేడా ఏమంటే,మా స్వయం సేవకులు అధికార స్థానాల్లో లేరనీ, రాజకీయాల్లో స్వయం సేవకులు ఏమి చేసినా వాటికి మేము బాధ్యత వహిస్తాం. స్వయం సేవకులకు శిక్షణ ఇచ్చిన సంఫ్న్‌ కే అంతిమంగా ‘’కొంత బాధ్యత’’ ఉం టుంది. అందువల్ల మా సంబంధం ఏమిటి,ఏ అంశాలను జాగ్రత్తగా కొనసాగించాలి అనే విషయాలను గురించి ఆలోచించాల్సి వస్తుం దని’’ అంటాడాయన. ఇప్పుడు ‘’తేడా’’ ఏమంటే, ప్రధానమంత్రి గతంలో ప్రచారక్‌గా పని చేశాడు.యూనియన్‌ మంత్రిమండలిలో 71% మంది మంత్రులకు ఆరెస్సెస్‌ తో సంబంధాలు ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా చాలా మంది మంత్రులకు ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలు, సంఘాలతో సంబంధాలు ఉన్నాయి. ప్రభుత్వంలోని స్వయం సేవకుల పై తన పర్యవేక్షణ ఉంటుందని ఆరెస్సెస్‌ ప్రకటిం చింది.ఆ ‘’కొంత బాధ్యత’’ అంటే అర్థమేమిటి ? ‘’ఒకవేళ ప్రజలు ఏదో ఒకటి ఆశిస్తూ, వారు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ,వాటిని మాకు తెలియజేస్తే, అప్పుడు సంబంధిత వ్యక్తుల దష్టికి తీసుకొని వెళ్ళొచ్చు, ఒకవేళ వారు స్వయం సేవకులైతే, అంతా మేమే చేసేస్తాం’’.‘’మేం చేసే’’ దానిలోని చిక్కుల్ని చూడండి. సంఫ్న్‌లో శిక్షణ పొందిన మూడిరట రెండొంతుల మంది మంత్రివర్గ సభ్యుల పర్యవేక్షణ (‘’కొంతబాధ్యత’’), విధానాలలో జోక్యం (శ్రద్ధతో కొన్ని విషయాలు), స్వయం సేవకులైన మంత్రులకు ఆరెస్సెస్‌ సిఫార్సులు (సంబంధిత వ్యక్తుల దష్టికి తీసుకొనిరావడం). రాజ్యాంగేతర శక్తి అంటే ఇదే. బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరెస్సెస్‌ చెలాయిస్తున్న అధికారం రహస్యమేమీ కాదు. దీనిని ఇప్పుడు ఆరెస్సెస్‌ అధినేతే స్వయంగా చెప్పాడు.‘’మేము మీడియాను కలుసు కునే సందర్భాల సంఖ్యను పెంచాం, ప్రజలకు సేవలందించే కార్యక్రమాలను ప్రారంభించాం. ఆశించిన ఫలితాల సాధన కోసం మేం సరైన వ్యూహంతో, సరైన సమయంలో స్పందించాల్సి ఉంటుందనీ, రానున్న రోజుల్లో ఆరెస్సెస్‌ పై పొగడ్తల జల్లు కురిపిస్తూ, దానిపై ఉన్న ద్వేషాన్ని తగ్గించే కథలను గూర్చి వింటామని’’ భగవత్‌ చెప్పాడు.
మహిళల పట్ల చిన్నచూపు
హక్కుల ఆధారిత ప్రజాస్వామిక చట్రాన్ని గుర్తించ నిరాకరించడం కూడా మహిళల గురించి చేసిన వ్యాఖ్యల్లో ప్రతిబింబిస్తుంది. ఆరెస్సెస్‌ వారి దష్టిలో మహిళ అంటే కుటుం బంలో ఒక భాగం. ‘’మహిళా విముక్తి, మహిళా సాధికారత గురించి చాలా కాలంగా మాట్లాడు తున్నారు. కానీ ఇప్పుడు పాశ్చాత్య మహిళలు, స్త్రీ పురుషులు పరస్పరం ఆధారితంగా ఉండే కుటుంబ జీవనానికి తిరిగి వస్తున్నారని’’ భగవత్‌ అంటున్నాడు. ఆరెస్సెస్‌ ఉద్దేశంలో, ఒక స్వతంత్ర మనస్తత్వం,సాధికారత,సమాన హక్కులు గల మహిళకు కుటుంబ జీవితంతో పొసగదట.ఎందుకంటే ఆరెస్సెస్‌ భావజాలం ప్రకారం, కుటుంబంలో మహిళలకు మనువాద విధానాల మార్గదర్శకత్వం ఉంటుంది కాబట్టి, హింస ఎదురైతే మహిళలు సర్దుకుపోవాల్సి ఉ ంటుంది. ఇది,ఆరెస్సెస్‌ మహిళా విభాగం ‘’రాష్ట్రీయ సేవికా సమితి’’ చేస్తున్న ప్రచారం. కానీ ఈ సమితి విఫలమైన ప్రణాళిక అని ఆరెస్సెస్‌ నేత స్దవయంగా అంగీకరించాడు. నేడు సమితికి అంత బలం లేదు.శాఖల ద్వారా నేర్చుకునే మహిళల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వారిని సేవికా సమితికి పంపకుండా నేరుగా సంఫ్న్‌ లోకి ఇముడ్చుకోవడం ఎలా అనే విషయాన్ని ఆరెస్సెస్‌ కసరత్తు చెయ్యాలని ఇప్పుడు ఆయన చెపుతున్నాడు. ద్వేషపూరిత ప్రసంగాలు,రెటచ్చగొట్టే ప్రకటనలు చేసే ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ లాంటి హిందూత్వ దళానికి చెందిన మహిళా సభ్యులు ఆరెస్సెస్‌ కు ఆదర్శంగా ఉన్నారు. పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలతో పాటు మహిళల పై పెరుగు తున్న హింస, వరకట్న మరణాలపై సంఫ్న్‌ నేత మౌనం వహిస్తున్నాడు. ఒక లౌకిక, ప్రజాస్వామిక భారతదేశం కోసం స్వాతంత్య్ర పోరాట విలువలకు కట్టుబడి ఉండే వారికి, ఆరెస్సెస్‌ అధినేత ఇంటర్వ్యూ ఒక బెదిరింపు అనే చెప్పాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ విధ్వంసాలు రాజ్యాంగం ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలుకాకుండా ఈ మతతత్వ శక్తులు అడ్డుకుంటున్నాయి..ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఈ శక్తులు మోడీ ప్రభుత్వ అండదండలతో రాజ్యాధికారం పై అదుపు సాధించాయి. దీనికి సమాధానం ప్రత్యామ్నాయ విధానాల్లో, ప్రజా సమీకరణల్లో ఉంది. హిందూత్వ ఆధునీకరణ ఎజెండాను ఓడిరచాలంటే ప్రతిఘటనా శక్తిని పెంచు కోవడంతో బాటు,పెట్టుబడిదారీ లూటీకి వ్యతిరేకంగా ప్రజలను పెద్దయెత్తున సమీకరించాల్సిన అవసరముంది. (ప్రజాశక్తి సౌజన్యంతో..)

ప్లాస్టిక్‌ భూతం..అంతానికి పంతం

పర్యావరణానికి వ్యర్ధాలు పెద్ద సమస్యగా మారింది. మహాసముద్రాలు,నదుల నుండి..చిన్న చెరువుల సహా చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. దీంతో పర్యావరణానికి భారీ నష్టం కలుగుతుంది. వ్యర్థాల ఉత్పత్తి, వ్యాప్తికి అనేక కారణా లున్నాయి. ఈ వ్యర్ధాలను ఎదుర్కోవడానికి ప్రకృతి ప్రేమికులు, ప్రభుత్వాలు అనేక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తు న్నారు. కానీ ఇప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు దక్కలేదు. విస్తృతంగా వ్యర్థాలు పర్యావరణంలో కలిసిపోతున్నాయి.వ్యర్థాలు చాలా రకా లుగా ఉన్నాయి.వీటిని గుర్తిం చడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఏ రకమైన వ్యర్థాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి ..ఏవి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా కష్టం. వ్యర్థాలను గుర్తించేందుకు వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాడేస్తాం..పడేస్తాం…ఇలావాడేస్తూ పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్‌ సంచిని చెత్త బుట్ట పాలు చేసినా రోజుకి వందకోట్లపైమాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి.మట్టిలో, నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో,గుట్టల్లో, ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి.ఆవ్యర్థం కొండలా పేరుకుపోయి,కొండచిలువలా మానవ జాతిని మింగేస్తోంది.సౌలభ్యంగా ఉందని, చవగ్గా వస్తోందని, మహా తేలికని,మడత పెట్టుకోవచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టాల సంగతే పట్టించుకోకుండా మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పో టనం కన్నా పెను ఉత్పాతంలా గుండెల మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది. రోజూ అన్ని అవసరాల కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్‌ సంచి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వం సమైంది. మన అవసరాలను తీర్చుకునే క్రమం లో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించ డమనే ఆలోచన మనకుండాలి.పర్యావరణానికి భంగం కలుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాలకు అందించే దృష్టితో,సమ కాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించు కోవాలి.జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉద యం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవస రాల కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌ బ్రష్‌లు,వాటర్‌ బాటిల్స్‌,టిఫిన్‌ బాక్స్‌లు,ప్లేట్లు,గ్లాసులు, షాంపులు, పాలు, వంట నూనె ప్యాకెట్లు, తలనూనె,ఔషధాల డబ్బాలు, పిల్లల పాలసీసాలు..ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే.ఆశ్చర్యమే మంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిట ల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తం భద్రపర చే సంచులు,ఇంజక్షన్‌సీసాలు,సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే.పర్యావరణం, ప్రజా రోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరి స్తున్నా,ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహన ఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూఅదుపు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం.
ప్లాస్టిక్‌ ఎలా హానికరం?
ప్లాస్టిక్‌లో కృత్రిమ రంగులు, రసాయనాలు, పిడ్‌మెంట్లు, ప్లాస్టిసైజర్లు, ఇతర మూలకాలు వినియోగిస్తారు. ఇవి రకరకాల క్యాన్సర్‌ కారకాలు. ఈ ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహార పదార్థాలు ప్యాకింగ్‌ చేసినపుడు ఇందులో ఉండే కాల్షియం,సీసం వంటి ధాతువులు ఆహారంలో చేరి ప్రజల ఆనారోగ్యానికి కారణమవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తులను బయట పారేయడంవల్ల చాలా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి.ఈ ప్లాస్టిక్‌ వస్తువులను పశువులు తింటే వాటికి ప్రాణహాని కలుగుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పశువుల జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత 50 ఏళ్ళలో 20 రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరిగింది. కాని ఇందులో 5 శాతం మాత్రమే రీసైకిల్‌ జరుగుతున్నది. ప్యాకింగ్‌ రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40 శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్‌ అయ్యే ఖర్చులో 50 కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాలుగా మారుతున్నాయి. ఏటా 80లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నాయి.2030 నాటికి సముద్రాలలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు రెట్టింపు అయి 2050 నాటికి నాలుగింతలు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికలు చెబుతున్నాయి. 2025 నాటికి 1టన్ను సముద్ర చేపలకు 3 టన్నుల ప్లాస్టిక్‌ పేరుకుపోతుందని ఈ సర్వే చెబుతున్నది.
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..
అధిక ప్లాస్టిక్‌ వినియోగం వల్ల మగవారిలో బిపి,షుగర్‌,శ్వాస,గుండెపోటు వ్యాధులు పెరుగు తున్నాయని, ఆడవారిలో మెనోపాజ్‌, థైరాయిడ్‌, షుగర్‌, గర్భకోశవ్యాధులు పెరుగు తున్నాయని వైద్యులంటున్నారు. జీవక్రియల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడ్‌ఈస్టర్‌’ అనే రసాయనం తీవ్రప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్‌ అనేది ‘’కాక్‌ టెయిల్‌ ఆఫ్‌ కెమికల్స్‌’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లో భారలోహాలు, క్రిమిసంహారిణిలు, పెస్టిసైడ్స్‌, పాలిసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బ న్‌లు (పిఎహెచ్‌లు) పాలీక్లోరినేటెడ్‌ బైఫినాల్స్‌ (పిహెచ్‌బిలు) మిధనల్‌, సైక్లోహెక్సేన్‌,హెప్టేన్‌ల లాంటి సాల్వెంట్‌లుబీ పోటాషియం పర్‌సల్ఫేట్‌, బెంజాయిల్‌ పెరాక్సైడ్‌ లతో పాటు ట్రైబ్యూ టాల్టిన్‌,జింకాక్సైడ్‌,కాపర్‌క్లోరైడ్‌ లాంటి ఉత్ప్రేర కాలుబీ బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డంట్స్‌ (పియం డిఇ) పాలేట్స్‌, సీసం సంయోగాలు, పాలిక్లోరి నేటెడ్‌ బిస్పినాల్స్‌(పిసిబిలు), బిస్పినాల్‌ లాంటి రసాయనాలు ప్లాస్టిక్‌లో ఉంటాయి. ఇవి అంత స్రావీ వ్యవస్థపై వినాళగ్రంథుల స్రవనాలపై దుష్పలితాలు చూపుతాయి. ఈ రసాయనాలన్నీ సముద్ర జీవరాశులపై, మానవుల శ్వాస కోశంపై, చర్మంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి.ఒకటన్ను పాలథిన్‌ సంచులు తయారు చేయాలంటే 11బ్యారెళ్ళ చమురు అవసరం అవుతుంది.ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాలథిన్‌ కూడా ఓ కార ణమే.పాలథిన్‌ సంచి సగటు జీవిత కాలం 5 నిమిషాలకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం. గ్రామాలలోని వీధులనుండి మొదలు మహానగరాల వరకు ఇపుడు సిమెంట్‌ రోడ్లేస్తున్నారు. కాంక్రిట్‌ జంగిల్స్‌ను తలపించే నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయకుండా అడ్డుకుం టాయి. నగరాలలో 2సెం.మీవర్షం పడితే చాలు అక్కడ నీళ్ళు నిల్వ ఉంటున్నాయి. మురుగు నీటి వ్యవస్థలు స్థంబించిపోతున్నాయి. వీటికి ముఖ్య కారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే. పైపుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇతర చెత్త పేరుకుపోయి అవి మూసుకుపోతున్నాయి. దీంతో రోడ్లు జలమయ మవుతున్నాయి.ట్రాఫిక్‌ సమస్యలేర్పడుతున్నాయి. ఓ మోస్తరు నగరాలలో కిలోమీటర్ల కొద్దీ, మహా నగరాలలో వందల కిలోమీటర్ల మేర నాలా లుంటాయి.ఈనాలాల చుట్టు పక్కల నివాసం ఉండే ప్రజలంతా,ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలను ఈ నాలాల్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్‌ సంచులు భారీ స్థాయిలో పేరుకుపోయి నాలాలు మూసుకుపోతున్నాయి.ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీసే యంత్రాంగం సరిపోను లేకపోవడంవల్ల కుంటలు, చెరువుల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి.ప్లాస్టిక్‌ సంచుల్లో నిల్వ ఉంచి వాడే ఆహారంవల్ల వ్యాధులు వస్తున్నాయి. ఇండ్లల్లో, కార్యాల యాల్లో, బేకరీలలో,హోటళ్ళలో ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు వాడు తుంటారు. ప్లాస్టిక్‌ పాత్రల్లో ఆహారంపెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవల్ల పదార్థాలు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్ర లోని ‘’బిస్‌పినాల్‌’ పదార్థంకరిగి ఆహారంతో కలసిపోతుంది. ఇలా క్యాన్సర్‌,ఉదరకోశ వ్యాధు లకు అంకురార్పణ జరుగుతుంది. అందుకే ఓవెన్‌లలో ప్లాస్టిక్‌ పాత్రల బదులు బోరోసి లికేట్‌,గ్లాస్‌,సిలికోవ్‌తో తయారై అధిక ఉష్ణో గ్రతను తట్టుకోగల పాత్రలు వాడడం మంచిది.
ప్లాస్టిక్‌ వాడకాన్ని ఎలా తగ్గించొచ్చు
పెండ్లి,ఇతర విందుల్లో ప్లాస్టిక్‌ పళ్ళాలు, గ్లాసు లు నీటి ప్యాకెట్లను వినియోగించే బదులు విస్తరాకులు,అరటిఆకులు,కాగితంతో చేసిన గ్లాసులు వాడటం మంచిది. ప్లాస్టిక్‌ సంచులు వాడని హోటళ్ళను,కర్రీ సెంటర్లను ప్రస్తుతం మనం ఎక్కడా చూడలేము.టిఫిన్‌ నుంచి పచ్చడి,సాంబారు,కర్రీ అన్నీటిని ప్లాస్టిక్‌ సంచుల్లో కట్టి అందిస్తారు. ఇది మానుకోవాలి. సాంబారు రసం,కూరల కోసం ఇంటి నుంచి లోహపు డబ్బాలు తీసుకెళ్ళడం మంచిది లేకుంటే లోహపు డబ్బాల ధరను డిపాజిట్‌గా పెట్టుకొని హోటల్‌ యాజమానులు తినుబండారాలను స్టీలు డబ్బాలలో సరఫరా చేయాలి. వాటిల్లో తీసుకెళ్ళి వినియోగదారుడు డబ్బా తిరిగి ఇచ్చిన వెంటనే డిపాజిట్‌ వెనక్కి ఇచ్చేయొచ్చు.వాడి పడేసే ప్లాస్టిక్‌ పెన్నుల వల్ల కూడా పర్యావర ణానికి ముప్పు పొంచిఉంది.ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పెన్నుల వినియోగం భారీ స్థాయిలో ఉంది.ఇందుకు విరుగుడుగా ఇపుడు మార్కెట్లో పర్యావరణ హితమైన పెన్నులు అమ్ముతున్నారు.ఈపెన్నులు వినియోగించిన తర్వాత భూమిలో నాటితే మొక్క వచ్చే వీలుగా వీటిని తయారుచేశారు. ఇందుకు పెన్ను చివరన ఒక విత్తనం పెడుతున్నారు. ఇంకు అయి పోయాక దీనిని తిప్పి భూమిలో నాటితే కొన్ని రోజులకు మొక్కలు వస్తాయి. ఇది స్పూర్తివంతమైన, పెద్దలకు, పిల్లలకు ఆసక్తికరమైన పని.
ప్రత్యామ్నాయాలు ఆచరించాలి
ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా ప్లాస్టిక్‌ వినియోగంపై ఎవరికి వారుగా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలి. పండ్లు, కూరగాయలు,కిరాణ షాపులో సామాన్లు కొనేపుడు ప్లాస్టిక్‌ సంచీలు అడుగ కుండా ఇంటి నుంచి బట్ట,జ్యూట్‌ సంచులు తీసుకెల్లడం ఉత్తమం.చికెన్‌,మటన్‌ అమ్మే వ్యాపారస్తులు చాలా మంది 40మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులు వాడుతున్నారు. వాటిల్లో తెచ్చుకునేకంటే ఇంటి నుండి ఒక స్టీలు డబ్బా తీసుకెళ్ళడం మంచిది. మంచినీటి కోసం కార్యాలయాల్లో ఒకపుడు గాజు,స్టీలు,గ్లాసులు వాడేవారు.ఇపుడు ప్లాస్టిక్‌ సీసాల్లో తెచ్చిపెడు తున్నారు.ఈ పద్ధతి సరికాదు.టీలు,కాఫీలు గాజు,స్టీలు,పింగాణీపాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్లరసాలు తాగడానికి కాగితం గ్లాసులే వాడాలి. ఇండ్లల్లో ఆకు కూరగాయాలను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి. పాలు,పెరుగులను ప్లాస్టిక్‌ కవర్లలో విక్రయి స్తుంటారు.ఏరోజుపాలు ఆ రోజు తెచ్చుకుని పాల ప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా,పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాత నిల్వచేసుకోవాలి. వ్యాపారస్తులు 40 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ సంచులు వాడకుండా అధికారులు మొక్కుబడి తనిఖీలు కాకుండా కఠినంగా వ్యవహరించాలి.ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాలు ఆరోగ్యసమస్యలు,పర్యావరణ హాని తదితర అంశాలపై గ్రామాలు,పట్టణాలు, నగరాల్లో, కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యూత్‌క్లబ్‌ల సభ్యులను,కాలనీ కమిటీలను ప్రోత్సహించాలి.అధికారులు ప్రజల మధ్య సమన్వయం, సహకారం ఉంటేనే ప్లాస్టిక్‌ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకో గలం.పాలకులు, ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ సంచుల స్థానంలో ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు జౌళి సంచులు తయారీ పరిశ్రమలపై దృష్టి సారించాలి. ఇందుకోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలి. సబ్సిడీలిచ్చి ఆకర్షించాలి. చెత్తకుండి ఉన్నదే చెత్తవేయడానికి మళ్ళీ అందులో పాలిథిన్‌ కవరు ఎందుకు?డబ్బాఖాళీ చేసాక ఓసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. గుడ్డసంచి వాడితే,వారానికి ఆరు,నెలకు 24, సంవత్సరానికి 280 ఓజీవితకాలంలో కనీసం 22వేల పాలిథిన్‌ కవర్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించిన వాళ్ళం అవుతాం.‘నోపాలిథిన్‌ హేజ్‌’ అని మనింటికి మనమే ధృవపత్రం ఇచ్చుకోవాలి.నిజానికి పాలిథిన్‌ దుష్ప్రవాల నుంచి తప్పించుకోవడానికి నిషేధాలు సరిపోవు. నిజాయితీ కావాలి.జనభాగస్వామ్యం అవసరం.– ` సైమన్‌ గునపర్తి

ఆదివాసీల బతుకులు ఆగమైతున్నయ్‌

అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీలు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. అటవీ భూము లు,సహజ వనరులపై ఆధారపడి జీవించే గిరిజనులకు మేలు చేయాల్సిన పాలకులు.. వారిని ఇంకింత భయభ్రాం తులకు గురి చేస్తున్నారు. అడవిలో మొక్కలు నాటే నెపంతో.. భూములు గుంజుకోవడం, పంటలు ధ్వంసం చేయడం, నివాసాలు ఖాళీ చేయిస్తూ.. వారి హక్కులను కాలరాస్తున్నారు. తమకు అన్యాయం చేయొద్దని ప్రశ్నించే ఆదివాసీలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అడవి బిడ్డల హక్కుల రక్షణకు గతంలో ఎన్నో చట్టాలు వచ్చినా అవేవీ అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆదివాసీల హక్కులను కాపాడాలి.
ప్రపంచవ్యాప్తంగా90దేశాల్లో దాదాపు 40కోట్ల ఆదివాసీల జనాభా ఉంది. ఏడు వేలకు పైగా భాషలు, 5 వేలకు పైగా విభిన్న సంస్కృతులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రకృతితో పెనవేసు కున్న పర్యావరణహిత సాంప్రదాయాలు ఆదివాసీ జీవనశైలిలో అంతర్భాగం.ప్రపంచవ్యాప్తంగా ఆది వాసీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతు న్నారు. అటవీ భూములు, సహజ వనరులే వీరికి జీవనాధా రం. ఐక్యరాజ్యసమితి క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచాలు ఏర్పాటు చేశాయి.కానీ అవి వారి హక్కులను పూర్తి స్థాయిలో కాపాడటం లేదు.అభివృద్ధి,ఇతర అవస రాల పేరుతో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వాలు, అధికారులు లాక్కోవడం పరిపాటిగా మారుతోంది. సహజ వనరులు కోల్పో వడంవల్ల వారి ఉనికి ప్రమాదంలో పడటంతో ఆదివాసీ కుటుంబాలు ఉపాధి,విద్య,ఆర్థిక అవసరా ల కోసం నగరాలకు వలస పోతున్నాయి. నగర జీవనంలో వీరికికనీస పౌరసేవలు అందడం లేదు. ఇండియాలో 2011జనాభా లెక్కల ప్రకారం దేశం లో8.6శాతం అంటే10.42కోట్లఆదివాసీలు ఉన్నారు. ఇందులో 461 రకాల ఆదివాసి తెగలు ఉన్నాయి. వీరిలో 90 శాతం గిరిపుత్రులు అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం,వేట,అటవీ ఉత్ప త్తులపై ఆధారపడి జీవిస్తున్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు కొత్త పథకాలు అమలు చేస్తున్నా వారి పరిస్థితిలో మార్పు రావడం లేదు. అత్యంత వెనక బడిన ఆదివాసీ తెగలు(పీటీజీ) నివసించే ప్రాంతా ల్లో రహదారులు కూడా లేవు. మంచినీరు, ఆరోగ్య సేవలు, విద్య తదితర సౌకర్యాలకు దూరంగా వారు దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు.
చట్టాలు ఉన్నా..
గతంలో ఆదివాసీల హక్కులపై అనేక పోరాటాలు వచ్చాయి. వీటి ఫలితంగానే ప్రభుత్వం1/70 పీసా చట్టం చేసింది.ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2005 లో అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం..షెడ్యూల్డ్‌ తెగలు, తరతరాలుగా అడవిలో నివసిస్తున్న సంప్రదాయక అటవీ వాసు లకు అటవీ భూములపై హక్కులు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అటవీ చట్టం1967 ప్రకా రం.. సెక్షన్‌ 4 ప్రకటించే నాటికి ఉన్న హక్కులు గుర్తించబడతాయి. భారత అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం..2005 డిసెంబర్‌ 13 వరకు ఆక్రమణలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కు లు ఉంటాయి. ఇతర సంప్రదాయక అటవీ వాసులు అయితే 13డిసెంబర్‌ 2005 ముందు మూడు తరాలు అంటే 75 ఏళ్లు అదే అడవిలో నివసిస్తూ జీవిస్తున్న వారికి హక్కులు సంక్రమిస్తాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన షెడ్యూలు తెగలైతే ఆతేదీ నాటికి నివసిస్తే చాలు. వ్యక్తులకు సమాజానికి ఇలాంటి అటవీ హక్కులు ఏ మేరకు ఉన్నాయో నిర్ణయించే ప్రక్రియ ప్రారంభించే అధికారం గ్రామసభలకు మాత్రమే ఉంటుంది.అటవీ హక్కులు పొందా లంటే 13 డిసెంబర్‌ 2005 నాటికి భూమి ఆక్ర మణలో ఉన్నట్టు చూపాలి. ప్రభుత్వ డాక్యుమెంట్లు గానీ, ప్రభుత్వ రికార్డులు గానీ, ఏదైనా సెటిల్‌ మెంట్‌,మ్యాపు,గూగుల్‌ మ్యాపు,వర్కింగ్‌ ప్లానులు, అటవీ ఎంక్వయిరీ రిపోర్టు లాంటిది ఆధా రాలు గా చెల్లుతాయి.రేషన్‌ కార్డు,ఓటర్‌ ఐడీ కార్డు, ఇంటి పన్ను రసీదు,ఇంటి నివాస సర్టిఫికెట్‌, కోర్టు ఆర్డర్‌, సర్వేరిపోర్టు,సంస్థానాలు ఇచ్చిన సర్టిఫికెట్లు, వంశ వృక్షాలు గ్రామ పెద్దల స్టేట్‌?మెంట్‌?ఇలా అన్ని ఆధారాలుగా చూపవచ్చు. అటవీ హక్కుల చట్టం 2005-06 ప్రకారం ప్రతిఆదివాసి కుటుం బానికీ పది ఎకరాల పట్టా ఇవ్వాలి. ఆ ప్రకారం రాష్ట్రం లో1.78లక్షల ఎకరాలు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత చట్టాలను అమలు చేయ కుండా పక్కన పెట్టేశారు. పైగా ఆర్వో/ఎస్‌ఆర్‌ చట్టాలు ఇచ్చిన భూములను సైతం ప్రస్తుతం లాక్కుంటున్న పరిస్థితి నెలకొంది. వందలాది ఆది వాసీల మీద అక్రమ కేసులు నమోదవుతున్నాయి.
ప్రభుత్వ నియంతృత్వం..
గిరిజనులు సాగుచేస్తున్న భూమిపై ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. అటవీ అధికా రులు,ప్రభుత్వం ఆదివాసీల పోడు భూములపై యుద్ధం ప్రకటించారు. వారిని భూముల నుంచి వెళ్లగొట్టడానికి కందకాలు తవ్వుతున్నారు. పచ్చని పంటలను ధ్వంసం చేస్తున్నారు.ఆపేద బతు కులపై యుద్ధం చేస్తూ ప్రభుత్వం హరితహారం పేరుమీద మొక్కలు నాటుతోంది. తమ భూముల్లో మొక్కలు పెట్టి జీవనాధారం నాశనం చేయొద్దంటూ ఆదివాసీ బిడ్డలు ఫారెస్ట్‌ఆఫీసర్ల కాళ్లు మొక్కుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం తమను అడ్డుకుం టున్నారన్న నెపంతో గిరిజనుల మీదకేసులు పెడు తున్నారు.తెలంగాణలోభద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,మహబూబాబాద్‌,ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ఆఫీసర్ల వేధింపులు తట్టుకో లేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 31 లక్షల75వేల మంది ఆదివాసీలు ఉన్నారు. ఆదివా సీల్లో ఉపతెగలు చాలా ఉన్నాయి. గత పాలకులతో పాటు ఇప్పుడు ఉన్న పాలకులు వాళ్లను సాటి మనుషులుగా చూడకపోవడం మాట అటుంచితే.. వారి వనరులు దోచుకోవడం, ఆవాసాలను, భూము లను లాక్కోవడం దారుణం.
హరితహారం పేరుతో..
పట్టాల కోసం ఆదివాసీలు అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో వారు సాగు చేస్తున్న భూమి లో మొక్కలు నాటిస్తోంది. రాష్ట్రంలో 33 శాతం అడవి పెంచాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.240కోట్లతో మొక్కలకు శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్యం మంచిదే అయినా..ఈహరితహారం ఆదివాసీలపై యుద్ధంలా మారుతోంది. ఫారెస్టు అధికారులు అత్యుత్సాహంతో గిరిజనులపై దాడులు చేస్తున్నారు.కందకాలు తీస్తు న్నారు. ఇక పంటలు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వందలాది ఆదివాసీలపై కేసులు నమో దయ్యాయి. కొందరిని అరెస్టు కూడా చేశారు. మహి ళలు,వృద్ధులు అని చూడకుండా వారిపై దాడులు చేస్తున్నారు.గుండాల మండలం జగ్గయ్య గూడెంలో ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో అధికా రులు దాడులు చేశారు. సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే అటవీశాఖ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదివాసీ చట్టాలు నిర్వీర్యం అవుతున్నాయి. పోలీసులు, కోర్టుల గురిం చి స్పష్టంగా తెలియని ఆదివాసీలు భయంతో వంద లాది ఎకరాలు భూములు కోల్పోతున్నారు. టీఆర్‌ ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని గతంలో చెప్పా రు. ఇంతవరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకో లేదు. ఆదివాసీల భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు, ధరణి వెబ్‌ సైట్‌లో నిషేధిత జాబితాలో ఉన్న28లక్షల ఎకరాలను అందులోంచి తీసేయాలి. లేదంటే రాష్ట్రం కోసం కొట్లాడిన ఆదివాసీలు, గిరిజ నులు మరో జల్‌,జంగల్‌, జమీన్‌ పోరాటానికి సిద్ధమవుతారు.
ఆ చట్టాలతో ఆదివాసులకు అన్యాయం
వ్యవసాయం నేడు ఆదివాసి జీవనాధారాలలో అతి ముఖ్యమైన భాగమైంది. ప్రకృతితో సహజీవనం చేస్తూ, సామూహిక జీవన విధానాలపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులు మార్కెట్‌ ప్రేరేపిత పంటల వైపు ఆకర్షితులవుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం గురించి చర్చించుకునే ముందు ఆదివాసీల రక్షణ కోసం తెచ్చిన చట్టాలకు సంబం ధించి జరిగిన ఉల్లంఘనలను పరిశీలిం చటం అవసరం. భారత రాజ్యాంగంలోని 244వ అధికర ణంలోని ఐదవ షెడ్యూల్‌ను‘రాజ్యాంగంలో రాజ్యాంగం’గా వర్ణిస్తుంటారు. షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తించిన ప్రాంతంలో ఆదివాసులు గిరిజనేతరుల నుంచి,వడ్డీ వ్యాపారం నుంచి దోపిడీకి గురి కాకూ డదని, ఆదివాసి జ్ఞానం,సంస్కృతి,పాలనావ్యవస్థ లపై ఆధారపడి అభివృద్ధి పథకాలు ఉండాలని, షెడ్యూల్‌ ప్రాంత సంరక్షకులుగా రాష్ట్ర గవర్నర్‌ వ్యవహరిస్తారని, రాష్ట్ర,కేంద్రప్రభుత్వ చట్టాలు ఐదో షెడ్యూల్‌ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటేనే అమలు జరపాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. చట్టా ల రూపకల్పనలో రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు ఆర్టికల్‌ 14,ఎలాంటి వివక్షకు గురికాకుండా కాపాడే ఆర్టికల్‌ 15(4), ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధిని ఆకాంక్షించే ఆర్టికల్‌ 19(1)(జి), గౌరవంతో జీవించేహక్కు ఆర్టికల్‌ 21లను పరిగ ణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో భూములు లీజుకు తీసుకోవడానికి కాని, కొనడానికి కాని, అమ్మే హక్కు కానిలేవని భూపరాయీకరణ నిరోధక చట్టం1/70స్పష్టం చేస్తోంది. ప్రతి ఆదివాసి సమూ హానికి తమ గ్రామ పరిధిలోని సహజవనరులను పాలించే శక్తి గ్రామసభలకు ఉందని స్పష్టం చేసిన పీసా చట్టం 1996లో వచ్చింది. గ్రామంలో జరిగే ఎలాంటి అభివృద్ధి పథకానికైనా గ్రామసభల అను మతి కావాలి. వడ్డీ వ్యాపారాన్ని కట్టడి చేయటంలో గ్రామసభలకు అధికారం ఉంది. అలాగే తమ గ్రామ సంప్రదాయ సరిహద్దులలోని సహజ వన రుల (లఘు ఖనిజాలు,చిన్న నీటి వనరులతో సహా) నిర్వహణ, రక్షణ, యాజమాన్యం, వినియోగంలో గ్రామసభలకే అధికారం ఉందని ఈ చట్టం చెబుతు న్నది. గుర్తించిన అటవీ భూములలో డిసెంబర్‌ 2005కన్నా ముందునుంచి నివసిస్తున్న, సాగు చేస్తున్న ఆదివాసులకు, అడవిపై ఆధారపడి జీవి స్తున్నవారికి, ఆవాసాలు ఏర్పరచుకున్న పివిటిజిలకు ఉన్న హక్కులు గుర్తించి, దఖలు చేయాలని పేర్కొం టున్న అటవీహక్కుల గుర్తింపు చట్టం 2006లో అమలులోకి వచ్చింది. వ్యక్తిగత హక్కులు, అటవీ వనరులపై సామూహిక హక్కులు, ఆవాసాలపై పివిటిజిలకు హక్కులు, వాటి నిర్వహణ, యాజ మాన్యం,వినియోగం గ్రామసభ అధీనంలో ఉంటా యని ఈ చట్టం చెబుతున్నది. భూములు, అటవీ భూములను ఇతర ప్రాజెక్టులకు మరలించాలన్నా గ్రామసభల అనుమతి తప్పనిసరి అని ఈ చట్టాలు చెబుతున్నాయి. ఇంత పకడ్బందీగా రాజ్యాంగ రక్షణలతో ఉన్నా షెడ్యూల్‌ ప్రాంతంలోని ఈ అం శాలను కొత్త వ్యవసాయ చట్టాలు పట్టించు కున్నా యా?ఈ కొత్త చట్టాలు దేశంలోని అన్ని ప్రాంతా లకు సంబంధించినవి కాబట్టి వీటి ప్రభావం షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఎలా ఉంటుందో పరిశీలిం చటం అవసరం.గత 30 సంవత్సరాలుగా ఆదివా సులు తిండి కొరకు ఎంతో కొంత పంటలు పండిర చుకుంటున్నారు. మార్కెట్‌ డిమాండ్లకు అనుగు ణంగా వాణిజ్య పంటలను పండిరచే రైతులుగా వాళ్లు మార్కెట్‌ చట్రంలో ఇరుక్కున్నారు. అడవుల పెంపకం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిం చేది లేదా వాతావరణ మార్పులకు పరిష్కారం అనే కర్బన ఉద్గారాల అమ్మకాల మార్కెట్‌ కూడా అంతర్జాతీయంగా 2000 సంవత్సరం నుంచి మొద లైంది. ఉదాహరణకు బయోడీజిల్‌ తోటల పెంప కం చేపట్టిన ఆదిలాబాద్‌ జిల్లా పవర్‌గూడా సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుతో ప్రపంచబ్యాంకు కర్బన వ్యాపార ఒప్పందాలను 2003లో చేసుకోవటం గమనార్హం. భూమి నీరు, అడవి, గాలి వ్యాపారానికి సరుకులుగా మారుతున్న క్రమం మనం గమని స్తున్నాం. ఈ మధ్య రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పడి పంటలు, ఫలసాయాల సేకరణ, శుద్ధి, ప్యాకింగ్‌, అమ్మకాలు జరుగుతున్నాయి. ఆదివాసి ప్రాంతా లలో ప్రభుత్వం ఇటీవల సేంద్రియ పద్ధతిలో ఆహారపంటల ఉత్పత్తిని జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవ సాయం పేరుతో ప్రారంభించింది.మార్కెట్ల డిమాం డ్‌కు అనుగుణంగా వాణిజ్య పంటలైనా, సేంద్రియ పంటలైనా పండిరచే రైతులుగా ఆదివాసీలు మారుతున్న పరిణామం ఇది.పెట్టుబడిదారీ విధానా లు ఆదివాసి జీవితాలను సంక్షోభాలకు గురిచే స్తుంటే మరో పక్కన ప్రాజెక్టులు, గనులు, పరిశ్రమ లు,అభయారణ్యాలు, జాతీయ పార్కులు, హైవేలతో ఆదివాసులునిరంతరం నిర్వాసితులు అవుతున్నారు. బోయ,వాల్మీకి,లంబలంబాడీ,ఐతా లంబాడీ తది తర కులాలనూ ఎస్టీజాబితాలో కలపాలనే ఉద్దేశ్యం లో జస్టిస్‌ చెల్లప్ప కమిషన్‌ వేశారు. దాని మూలం గా ఆదివాసీల మనుగడ అతి దారుణంగా ప్రశ్నార్థక మౌతుంది.ఇదిరాజ్యాంగ విరుద్ధం. ఎస్టీ జాబితాలో కలపాలన్నా,తీసివేయాలన్నా రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం కావాలి. వలసవాద రిజర్వేషన్లు రాజ్యాం గ విరుద్ధం. ఇప్పటికీ ఎస్టీలో లంబాడీ, యనాదులు, ఎరుకుల కులాలను 1976లో (ఇందిరాగాంధీ) కాంగ్రెస్‌ ప్రభుత్వం కలిపింది. దీని పర్యవసానం 95శాతం ఉద్యోగాలు లంబాడీలు దోచుకున్నారు. ఆదివాసీల పరిస్థితి అన్నీవున్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా వుంది. అందుకే జస్టిస్‌ చెల్లప్ప కమిషన్‌ రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా పోరాడుతున్నాయి.స్వాతంత్య్రమొచ్చి 68 సంవత్స రాలు కావస్తున్నా ఆదివాసీ ఐఎఎస్‌, ఐపిఎస్‌ లేడు అంటే మన ప్రజాస్వామిక వ్యవస్థ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఏ ప్రజాస్వామిక హక్కులు గురించి తెరాస అప్పుడు మాట్లాడిరదో, అదే పౌర హక్కుల ఉల్లంఘన, అదే ప్రజాస్వామిక ఉల్లంఘన నేడు పకడ్బందీగా జరుగుతున్నది.ఆదివాసీ సమా జంపై ఇంతపెద్ద ఎత్తున విధ్వంసం,హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే తెలంగాణ బుద్దిజీవులు, మేధావులు ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు.ఆదివాసీ సమాజంపై కళాకారులు, రచయి తలు, మేధావులు ఇప్పుడు నిశబ్దంగా ఎందుకు వుంటున్నారు. ఈబూర్జువా పాలకవర్గానికి మేధావు లందరూ సరెండర్‌ ఎందుకు అవుతున్నారు. నామి నేట్‌ పదవుల కోసం, కార్పొరేట్‌ పదవుల కోసం, రాజ్యాంగబద్ద పదవుల కోసం, ఎమ్మెల్సీల కోసం ఈ బుద్ధి జీవులు ఎందుకంత తహతహలాడు తున్నారు. ప్రజల పక్షం, పీడిత వర్గాల కోసం, ఆదివాసీ సమాజం కోసం నిలబడాల్సిన మేథావులు ఈ వ్యవస్థకూ, ఈ సమాజానికి ‘’అధికారం’’ కోసం తహతహలాడుతున్నారు. ప్రజాస్వామ్యం అనే ముసు గులో మైనార్టీలకూ విలువ లేకుండా పోతున్నది. నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం అవతరణ వారోత్సవాల జరుపుకుంటే ఆదివాసీలు ఆర్తనా దాలతో మరో సమరానికి సిద్ధమౌతున్నారు. సామా జిక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారు. నవతె లంగాణలో బంగారు తెలంగాణ కోసం ఆదివాసీ లనూ బలిచేయడం అత్యంత దారుణం. అభివృద్ధి కోసం ఆదిమతెగలనూ అంతం చేయడం మహా పాపం. నిజమైన సామాజిక తెలంగాణ కోసం ఆదివాసీ,అణగారినవర్గాల పౌర ప్రజతంత్ర హక్కుల కొరకూ మరో పోరాటం చేయాల్సిన సమ యం ఆసన్నమైనది. ఆదివాసీల ఆర్తనాదాలు పట్టించుకోకపోతే ఈ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం. – జిఎన్‌వి సతీష్‌

మారుతున్న ఉపాధి సంబంధాలు

సంపద సృష్టికర్తలు కార్మికులు అని, ఉత్పత్తి సంబంధాలన్నీ కార్మికులకు ఉత్పాదక శక్తులకు ఉంటాయని ప్రపంచవ్యాప్త పరిశోధనాత్మక నిర్ధార ణలు అనేక దశాబ్దాలుగా ప్రజా బహుళ్యంల్లో ఉన్నవి. కానీ పెట్టుబడి ప్రభావం పెరిగిన తర్వాత సంపద సృష్టికర్తలు కార్మికులు కాదు పెట్టుబడు దారులే అంటూ స్వయానా ప్రధానమంత్రి లాంటి వ్యక్తులే ప్రకటిస్తుంటే, కార్మికుల పాత్రను నామమాత్రం చేస్తూ సమాజం ఒక విపరీత ధోరణిని తీసుకుంటున్నది. అ ఈ రకమైన ప్రకటన ద్వారా కార్మికులను ద్వితీయ శ్రేణికి తోసి వేయడమే కాకుండా డబ్బు మాత్రమే సమకూర్చిన పెట్టుబడిదారులకు పెద్దపీట వేయడం జరుగుతుంది.
ఇలా జరగడానికి ప్రధాన కారణం రాజకీయాలను, ప్రభుత్వాల ఏర్పాటును పెట్టుబడిదారులు శాసించగల స్థాయికి చేరుకోవడమే. అయితే ఇలాంటి భావనలు దారి తీయడానికి మరో కారణమేమంటే ఒకప్పుడు ఉత్పత్తి ఒకచోట ఒక కర్మాగా రంలో లేదా ఒక కాంప్లెక్స్‌లో ఉండే అనేక కర్మ గారాలలో వర్కర్లందరూ కలిసి ఉత్పత్తి చేసేవారు అందుచేత పిరియాడికల్‌గా బయ టకు వస్తున్న ఉత్పత్తి ఎంతో అందరికీ కనిపించేది.మారిన పరిస్థితులలో ఒక వినియోగ వస్తువుకు సంబంధించిన ఉత్పత్తి ఒకచోట జరగడం లేదు. ఒకే రకమైన నైపుణ్యం గల వ్యక్తుల ద్వారా కాకుండా వివిధ నైపుణ్యం గల వ్యక్తుల ద్వారా,వివిధ ప్రదేశాలలో వివిధ రకాల విడిభాగాలన్నీ వేరువేరుగా ఉత్పత్తి చేయబడి, అంతిమ వినియోగ వస్తువు మరోచోట తయారవుతుంది. దీని ద్వారా జరిగిన మార్పు ఏమంటే,ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వర్కర్లు ఒకే చోట,ఒకే సమయానికి, ఒకే సారూప్యతతో పని చేసే అవకాశం లేకపోవడం వల్ల ఎవ్వరూ ఐక్యతగా ఏర్పడి యాజమాన్యాన్ని నిలదీసే పరిస్థితి లేకుండా పోయింది. అనగా ఉపాధిదారులు క్రమం తప్పకుండా ఒకేచోట పని చేసే అవ కాశం లేకపోవడంవల్ల సంఘటిత పడే అవకా శాన్ని కోల్పోయి యాజమాన్యాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇక మరో రకమైన మార్పు ఏమంటే వర్క్‌ ఫ్రం హోం అనే కాన్సెప్ట్‌ మొదలైన తర్వాత ఉద్యోగులు ఎవరూ ఆఫీసు లకు వెళ్లవలసిన అవసరం లేకుండా పోయి, కేవలము కంప్యూటర్ల ద్వారా కమ్యూని కేషన్లు తీసుకొని,నెట్‌ బ్యాంకుల ద్వారా జీతభ త్యాలు స్వీకరించి,తమకు కేటాయించిన పనిని పూర్తి చేయడం వలన ఉద్యోగికి యజమానికి సంబంధాలలో విపరీతమైన మార్పులు వచ్చాయి. అనేక సందర్భాలలో నెలలు సంవత్సరాలు ఒక కంపెనీకి సేవలు అందించిన ఉద్యోగులు చాలామంది, యజమాని పేరు తప్ప భౌతికంగా వారిని చూసిన పరిస్థితులే లేవు. అనేక మంది వుద్యోగులు తమకు నష్టం జరగనంతవరకు యాజమాన్యాన్ని తెలుసుకోవాలన్న ఊసే ఎత్తడం లేదు.ఒక దేశంలో ఉన్న వ్యక్తి వేరొక దేశంలోని కంపెనీకి సేవలు అందించడం, పారితోషికాన్ని తీసుకోవడం చక చక జరిగిపోతున్నాయి. దీనివల్ల నైపుణ్యానికి తగిన ప్రతిఫలం వస్తుందని సదరు ఉద్యోగి భావిస్తూ ఉండవచ్చు కానీ అటువంటి పనికి విపరీతమైన పోటీ ఉద్యోగికి కనిపించ కుండానే సృష్టించి, ఎక్కువ నైపుణ్యం గల వారికి తక్కువ చెల్లిస్తూ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ఎంతోమంది పెట్టు బడిదారులు మోసం చేస్తున్న సంగతి గుర్తించే అవకాశం లేకుండా ఉన్నది. ఇలాంటి పని విధానంలో మహిళలని ఎక్కువగా విని యోగించుకుంటారు. వర్క్‌ ఫ్రం హోం కొంతమేర మహిళలకు అనుకూలంగా ఉండడం వలన మరియు బీరమడే శక్తి తక్కువగా ఉండడం వలన మరియు సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉండటం వలన మహిళలు ఏమాత్రం నైపుణ్యానికి తగిన ప్రతిఫలం కోసం బేరమాడకుండా ఇలాంటి ఉపాధికి ఒకరకంగా బలౌతున్నారు. అందుచేత మారుతున్న పని పద్ధతులలో మహిళలు సమిధలవుతున్నారు. ఉపాధి కాంట్రాక్టీకరణ నుండి జాబు కాంట్రాక్టీకరణ అనే పద్దతులకు పరిస్తితి ఇప్పుడు మారింది. అనగా ఒక ఉద్యోగిని నిర్ణిత పనికి కాంట్రాక్టు పద్ధతిన నియమించుకునే వ్యవస్థను నూతన ఆర్థిక విధానాల మొదలైన తర్వాత చూసాము. ఇప్పుడు ఉద్యోగిని నియమించుకోకుండా అలాంటి వ్యక్తులకు పనిలో కొంత భాగాన్ని కాంట్రాక్టుకు ఇచ్చి పని చేయించుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుచేతనే శ్రమకు, శ్రామికుడికి గతంలో వున్నంత విలు8వ గుర్తింపు ఇప్పుడు లేవు. సెమీ సంఘటిత రంగంగా భావింపబడుతున్న నైపుణ్యాలతో పని జరిగే చోట కూడా శ్రామికునికి ప్రాధాన్యత కరువైంది.నూతన ఆర్థిక విధానాల అనం తరం శ్రమ దోపిడి ఎక్కువౌతది, శ్రామికులు కూడా వస్తువులుగా వాడబడతారు అని వాదించిన అభ్యుదయ వాదనను చాలా మంది నమ్మలేదు. అంతే కాకుండా అవకాశాలు మెరుగౌతాయని వాధించి, ప్రపంచీకరణలో భాగంగా విస్తరిం చిన అవకాశాలను చూపించి ఎద్దేవా కూడా చేశారు. ముప్పైఏళ్ళ తర్వాత గానీ దాని విశపూరిత ఫలితాలు అర్థమౌతున్నాయి. అసంఘటిత రంగంలో మొదటి నుంచీ మహిళలకు ద్వితీయ శ్రేణి గుర్తింపే. ఎందుకంటే భౌతిక శక్తి తక్కువగా వుండటం వల్ల తక్కువ ప్రాధాన్యతనిస్తూ తక్కువ చెల్లిస్తారు. ఈ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతూనే వున్నది. అయితే సంఘ్హటితమై పోరాడిన చోట ఫలితాలు మెరుగైన మాట కూడా వాస్తవమే. అయితే వలస కార్మికుల తాకిడి పెరిగిన తరువాత స్థానిక మహిళా కార్మికులకు ఉపాధి కరువైన మాట వాస్తవం. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు, తాలూకా మండల స్థాయిల్లోని నూనె, రైస్‌, నూలు వంటి ఇండస్ట్రీలలో ఈ ఇతర రాష్ట్ర వలస కార్మికులను కుటుంబాలతో సహా తెచ్చుకుని పెట్టుకోవడం వల్ల తక్కువ పారితోషికానికి పని గంటలతో నిమిత్తం లేకుండా ఎక్కువ పని చేయించుకుని దోపిడీ చేస్తున్నారు. కుటుంభం మొత్తాన్ని పనిలో పెట్టుకోవడం వల్ల మహిళల శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వటం లేదు. అయితే ఈ నియా మకాలు కూడా ఒక సబ్‌ కాంట్రాక్ట్‌ పద్దతిన యజమానికి వర్కరుకు మధ్యన ఒక దళారీ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. ఏరకమైన రాతపూర్వక ఒప్పందాలూ వుండవు.ఫ్యాక్టరీ యాజమాన్యంతో సహా కుటుంబ యజమాని దాష్టీకానికి అబలలు బలౌతున్నారు. అంతే కాకుండా స్థానికులైతే సంఘటితమౌతారని, ప్రమాదాలకు నష్టపరిహారమడుగుతారనీ మరియు సంఘాలు-రాజకీయాలు కలుగజేసు కుంటారని కూడా ఈ యాజమా న్యాలు భావిస్తున్నాయి. గత్యంతరం లేని కారణంగా స్థానికులు మరో ప్రాంతానికి వెళ్ళి ఇదే రకమైన దోపిడికి గురౌతున్నారు. సిఐటియు అగ్ర నాయకులు ఎస్‌. వీరయ్యగారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ చుట్టుపక్కల గల పారిశ్రామిక వాడల్లో జరిపిన పాద యాత్ర సందర్భంగా ఈ వాస్తవాలు అనేకం బయట పడ్డాయి. వలస కార్మికులపై సమగ్ర విధానం ప్రభుత్వాలు పాటించకపోవడం వల్ల ఈ దుస్థితి దాపు రిస్తుంది. ఇక సంఘటిత రంగంలోని మహిళలు, ముఖ్యంగా కుటుంబభారం పైబడిన వారిని టార్గెట్‌గా చేసుకుని కంపెనీల సతాయింపులుంటున్నవి. ప్రస్తుత మాంద్య పరిస్తితుల్లో అత్యధిక పారితోషికాన్ని పొందు తున్న వారిని మొదటగా తొలగించి వారి స్థానాల్లో అవసరం మేరకే కొత్తవారిని నియమించుకుంటున్నారు. సహజంగా కొత్తవారు తక్కువ జీతానికి అందుబాటులో వుంటారుగా! గత ఆరు నెలల కాలంలో ప్రైవేటు ఉపాధి కోల్పోయిన కారణంగా ఆత్మహత్యలు పెరిగి పోయాయని ఎన్‌.సి.ఆత్‌.బి తెలిపింది. రిపబ్లిక్‌ డే ఉపన్యాసంలో గవర్నర్‌ తమిళిసై తెలంగాణా సర్కారుపై అక్కసుతోనే చెప్పి9నప్పటికీ ఆత్మహత్యల్లో పెరుగుదల వుండటానికి కారణం అసంబద్దమైన తొలగింపులే. అయితే భాజపా అధికారంలో ఉన్న కర్నాటకా,మహారాష్ట్రల్లోనూ మరింత ఎక్కువగా ఈ ఆత్మహత్యలుండటం పాలనతో పాటు వైపరీత్యపు పెట్టుబాడిదారి వ్యవస్థ లోపాలకు అద్దం పడుతుంది.ఎక్కువె క్కువ ప్యాకేజీలతో,విపరీత పోటితత్వంతో ఈ అనిశ్చితితో(ప్రికేరియస్‌) కూడిన వ్యవస్థను బలపరుస్తున్నది కూడా నైపుణ్యంగల యువతనే. అయితే కొంత కాలం గడిచాక,బాధ్యతలు పెరిగాక గాని దీనిలో లోపాలనూ,సంఘ్హటిత ఐక్యతనూ వారు గుర్తించటం లేదు. కాంట్రాక్టు వ్యవస్థలో 27 రకాలున్నాయంటే దోపిడి కోసం దాని తీవ్రత చూడండి. వ్యక్తిని నియమించు కోకుండా పని(జాబ్‌)లోని కొంత భాగానిఇకి మాత్రమే అంగీకారానికి రావడంతో వివిధ రకాల విడిభాగాల పనికి దళారీ వ్యవస్థ పెరిగి వుద్యోగికీ యజమానికీ సంబంధాలు ఏర్పడే అవసరమే లేదు.ఉదాహరణకు మొబైల్‌కు సంబంధించిన విడిబాగాల ఉత్పత్తిలో ఈ పద్దతి కళ్ళకు కట్టిన సత్యం.పది పదేహేను దేశాల్లో ఉత్పత్తౌతున్న విడిబాగాలన్నీ కలిపితే ఒక సెల్‌ఫోని తయారౌతుంది. అలాంటప్పుడు ఆప్పిల్‌, వన్‌ప్లస్‌ వంటి కంపేనీల వుద్యోగులను ప్రత్యేకంగా గుర్తించే అవకాశమే లేదు. నియామ కాలు తొలగింపుల్లో పాటించవలసిన ప్రభు త్వాల నిభందనలను తప్పించుకునేందుకు దళారీ వ్యవస్థ కంపెనీలకు బాగా ఉపకరి స్తుంది. గత్యంతరం లేక నిరుద్యోగులు వారిని ఆశ్రయించాల్సి రావడం, దళారీల కమీషన్‌ పోగా మిగిలిందే తీసుకోవాల్సి రావడం తప్పని పర్స్థితిగా ఏర్పడిరది.ఈ క్రమంలో విదేశాల్లో విద్యాభ్యసించిన యువత ముఖ్యంగా మహిళలు తమ బ్యాంకు ఋణాల తీర్చే క్రమంలో ఇలాంటి దోపిడీలకు బాగా గురౌతున్నారు. వెరసి- కాంట్రాక్టీకరణ, ఔట్‌?సోర్సింగ్‌, ప్యాకేగీ వర్క్‌…వంటి పని విధానాలతో ఉద్యోగీ యజ మానీ మధ్య ఉపాధి సంబంధాలు కనీస స్థాయిలో వున్నవి. పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడికి ఇవి మరింత దోహద పడుతున్నవి. ప్రపంచీకరణను ఎదుర్కునేందుకు పోరాటాలనూ ప్రపంచీకరించినట్లుగానే కార్మికుల ఐక్యతకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిందే.
సంస్కరణతో ఇబ్బంది
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా కేంద్ర ప్రభు త్వం తీసు కొచ్చిన సంస్కరణలు కూలీలకు ఇబ్బందిగా మారుతున్నాయి. గతంలో ఉపాధి కూలీలకు వేసవి భృతి లభిస్తుండగా సంస్కరణతో వేసవి భృతికి చెక్‌ పడిరది.ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్‌ఫర్‌మెటిక్స్‌ సెంటర్‌) ద్వారా ఉపాధి పనుల్లో పూర్తి పారదర్శకత కోసం నేషనల్‌ మోబైల్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్‌) యాప్‌ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మే 21న ప్రారం భించగా, రాష్ట్రంలో ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అధికారులు అమలు చేస్తున్నారు. తాజాగా రెండు పూటల పనిదినాలు అమలు చేయాలని ఆ దేశాలు రావడంతో ఉదయం 7నుంచి 11గంటల వరకు ఉపాధి కూలీలు పనిచేసే ఫొటో, మళ్లీ మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు కూలీలు పనిచేసే ఫొటోను విధిగా మేటీలు, పంచాయతీ కార్య దర్శులు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది కూలీలు పనులకు వచ్చారనే విషయాన్ని మేటీలు ఉదయం, మధ్యాహ్నం మస్టర్లలో నమోదు చేయాలి. కాగా ఈ వెబ్‌సైట్‌ లో కూలీలు పనిచేసే చోట 20మందికి పైబడి ఉంటేనే ఫొటో అప్‌లోడ్‌ అవుతోంది. ఫొటోతో పాటు హాజరైన కూ లీల పేర్లు, పనుల వివరా లు సమగ్రంగా క్రోడికరిం చాల్సి ఉండ డంతో ఉపాధి కూలీల అక్రమాలకు చెక్‌ పడే అవకాశ ముంది. వేసవి దృష్యా మధ్యాహ్నం పనిచేస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని అందుకు మినహాయింపు కల్పించాలని కూలీలు కోరుతు న్నారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 1,02,328 జాబ్‌ కార్డులు ఉండగా అందులో 32,101 యాక్టివ్‌ కార్డులు ఉన్నాయి. మొత్తం 280 గ్రామ పంచాయతీలకు గాను ఈనెల 19న 21,319 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. ప్రతీ గ్రామ పంచా యతీలో 76మంది కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. రోజు కూలి రూ.257 పడాల్సి ఉండగా గరిష్ఠంగా జిల్లాలో మాగనూర్‌, నర్వ మండలాల్లో రూ.174, కనిష్ఠంగా మక్తల్‌ మండలంలో రూ.119 కూలి పడుతోంది. వేసవి అలెవెన్స్‌ 30శాతం రాయి తీ కూడా తొలగింపుతో కూలీల సంఖ్య కూడా తగ్గి గిట్టుబాటు కావడం లేదని వెంటనే వేసవి అలెవె న్సును పునరుద్ధరించాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు.దినసరి కూలి రూ.200 తగ్గకుండా ఉండేలా ఎంపీడీవోలు,ఎంపీవోలు, ఏపీవోలు,ఈసీలు,కార్యదర్శులు,టీఏలు, మేటీలు క్షేత్రస్థాయిలో కూలీలకు మార్కౌట్‌ ఇచ్చి పనులు జరిగేలా చూడాలని డీఆర్డీ వో గోపాల్‌నాయక్‌ తాజాగా నిర్వహించిన టెలీకా న్ఫరెన్స్‌లో దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం రోజుకూలి రూ. 257గా నిర్దేశించింది. కృష్ణ మండలంలో రోజుకూలి రూ.125, ధన్వాడలో రూ.127, పేటలో రూ.135,కోస్గిలో రూ.138, మద్దూర్‌లో రూ.167,దా మరగిద్దలో రూ.151,మరికల్‌లో రూ.155,ఊట్కూర్‌లో రూ.156,మాగనూర్‌,నర్వలో అధికంగా రూ.174కూలి పడుతోంది. గ్రామ పంచాయతీ స్థా యిలో నారాయణపేట మండలంలో 28 గ్రామ పంచాయతీలకు 3020 కూలీలు పనులు చేయగా రోజు కూలి రమారమిగా రూ.107 గరిష్ఠంగా ఉండగా అత్యల్పంగా మాగనూర్‌లో 16 పంచాయతీ లకు 819మంది కూలీలు పనుల్లో పాల్గొనగా రమారమి రూ.51 కూలి కనిష్ఠంగా పడుతోంది. -జి.తిరుపతియ్య

నిర్మలమ్మ బడ్జెట్‌(20232024) ఆశల ఆవిరి

75 ఏండ్లు పూర్తయిన స్వతంత్ర భారత తొలి బడ్జెటును నేను ప్రవేశ పెడుతున్నా’ అని గొప్పగా చెప్పిన విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ కేటాయింపులకు వచ్చేసరికి పెదవి దాట లేదు. ప్రధానితో సహా మంత్రులం దరూ మాట మాటకు బల్లలు ఎట్ల రిథమ్‌ వచ్చేలా చర చాలని పార్లమెంట్‌ సాక్షిగా ప్రాక్టీస్‌ చేశారు. అధికార పార్టీ ఎంపీలైతే మోదీ నామాన్ని పోటీపడి స్మరించుకు న్నారు. ఇటు నిర్మలా సీతారామన్‌ కూడా అమృత్‌ కాల్‌, ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌, ప్రధానమంత్రి వికాస్‌ యోజన లాంటి పేర్లను జోడిరచి విన సొంపైన కవితలుగా కార్యక్రమాలను వల్లె వేశారు.
సప్తఋషిపేరుతో1)సమ్మిళిత అభి వృద్ధి 2)చిట్టచివరి వ్యక్తుల వరకు ఫలాలు అందడం 3)మౌలిక వసతుల కల్పన 4) పెట్టు బడులకు ప్రోత్సాహం(5)సంభావ్యతలు 6)హరి తవృద్ధి7) యువతకు చేయూతలను ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్ని కలను దృష్టిలో పెట్టుకొని ఆరాష్ట్రానికి బడ్జెట్‌ కటాయింపులు చేయడం గమనించదగ్గ విష యం.బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనకు ఏవిధమైన రోడ్‌ మ్యాప్‌లేదు.ఏకలవ్య స్కూల్స్‌ లో మాత్రం 38,800 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న10లక్షల ఉద్యోగాలను ఎప్పుడుభర్తీ చేస్తారో చెప్పలేదు. వీటి కోసం కొన్నికోట్ల మంది యువతీ యువకులు ఎదురు చూస్తున్నారు. అమె జాన్‌, మైక్రో సాఫ్ట్‌ లాంటిసంస్థలు కూడా ఉద్యోగులను తీసి వేస్తున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎలాం టి నిధులు కేటాయించకపోవటం దురుదృష్ట కరం. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో రూ.75వేల కోట్లు ప్రకటించారు. అది కేవలం 100 నగరాలకు మాత్రమే. కానీ గ్రామీణ సడక్‌ పథకానికి కేటాయిం పులు పెరగలేదు. ఎస్టీల సంక్షేమాన్ని మరిచి 3 కోట్ల ఎస్టీ కుటుంబాలకు కేవలం 15 వేలకోట్లు మాత్రమే కేటాయించారు. చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.స్కూళ్ళ నిర్మాణానికి ఖర్చు పెట్ట రు కానీ ఎంతో ఖర్చుతోకూడుకున్న డిజిటల్‌ లైబ్రరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారట. రాష్ట్రాలకువడ్డీ లేనిరు ణాలు మరో ఏడాదిపాటు ఇస్తామన్నారు. దీనికి బడ్జెట్‌లో రూ.13.7లక్షల కోట్లు కేటాయించారు. తిరిగి చెల్లించడానికి దీనికి 50ఏండ్ల వ్యవధి ఇస్తుం డగాబీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ఈ కేటా యింపులు ఉండటం గమనార్హం. నిర్మలమ్మ మాట్లాడుతూ9ఏండ్లలో తలసరి ఆదాయం రెట్టింప య్యిందన్నారు. అదే సమయంలో చైనా తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగింది. ఇటు తెలం గాణలో మూడు రెట్లు పెరిగింది. అలాగే కేవలం 23 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్న అదాని గ్రూప్‌ సంపద విలువ ఈకాలంలో దాదాపు 125రెట్లు పెరిగింది.నిర్మలా సీతారా మన్‌ బడ్జెట్‌ పునాదులపై దేశ నిర్మాణం చేపట్టేం దుకు ఈ వార్షిక బడ్జెట్‌ దోహదపడుతుందని చెప్పారు. కానీ వారిమాటలు తప్ప చేతలు ఆశా జనకంగా లేవు. దేశంలో వ్యవసాయ కూలీల స్థితిగతులు మార్చిన గ్రామీణఉపాధి హామీ పథ కానికి నిధులు పెంచలేదు.ఎంతో కాలంగా ఈ పథకాన్నివ్యవసాయానికి అనుసంధానం చేయా లని,అర్బన్‌ ప్రాంతంలో కూడ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకు రావాలని కోరుతున్నా పట్టించుకోలేదు.ప్రస్తుత బడ్జెట్లో వ్యవసాయ రుణ లక్ష్యం రూ.20లక్షలకోట్లు.ఈ రంగంలో జీవనం సాగిస్తున్న56శాతం జనాభాకు ఇది ఏ మూలకు సరిపోదు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం ప్రేరణగా కిసాన్‌ సమ్మాన్‌ యోజ నను తీసుకొచ్చింది కేంద్రం. ఇప్పుడు మత్స్యకా రుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని అనుకరించింది. మత్స్య సంపద పెంపుదలకు, మత్స్యకారులు చేపలు అమ్ముకునేందుకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, మార్కెట్‌ విస్తరణ కోసం రూ.6000 కోట్లు పెట్టుబడు లు పెట్టనున్నట్లు ప్రకటించింది. చేనేతరంగాన్ని ఆత్మనిర్భర్‌ కిందఅభివృద్ధి చేస్తా మని చెప్పటం చేనేత కార్మికులకు కొంతఉపశ మనం.అలాగే తెలంగాణ ప్రభుత్వం హార్టికల్చర్‌, హరితహారానికి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఇవ్వ నున్నది.నాణ్యమైన, ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్క లను ప్రోత్సహించడం కోసం రూ. 2,200 కోట్లు కేటాయించింది. సిరి అన్నం పథకం ద్వారా చిరుధా న్యాలను రైతులకు అందించడం మంచి పరిణా మం. తెలంగాణలో సఫలమైన గురుకుల విద్యాల యాలను ఆదర్శంగా తీసుకొని ఏకలవ్య పాఠశాల లను పెద్ద మొత్తంలో ప్రోత్సహించడం, అలాగే ఇంటింటికి నల్లా నీళ్లనిచ్చే మిషన్‌ భగీరథ లాంటి స్కీంలను కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ క్రింద దేశ వ్యాప్తంగా అమలు చెయ్యడం మంచి పరిమాణమే కానీ, తెలంగాణ కృషిని గుర్తించి, గౌరవించాలన్న కృతజ్ఞతను మాత్రం చూపలేదు.
మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకీకరణ,పెట్టుబడుల ఉపసంహరణలో చాలా తొందరగా నిర్ణయాలు తీసుకొంటున్నది. ప్రతి ఏడాది రూ.50 వేల కోట్లకు తక్కువ కాకుండా కేంద్రఖజానాను మాత్రం నింపు కొంటున్నది. తనఅనుకూల కార్పొరేట్ల కడుపు నిం పటం కోసం ఈసారిరూ.51వేల కోట్లను సమీకరిం చాలన్న లక్ష్యాన్ని నిర్ధారించుకున్నది. అందులో భాగంగా షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ,స్టీల్‌ లిమిటెడ్‌,బి.ఇ.యం.ఎల్‌., హెచ్‌. ఎల్‌.ఎల్‌. లిఫ్కర్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీఐ బ్యాంక్‌, వైజాగ్‌ స్టీల్‌ అమ్మకానికి నిర్ణయం తీసుకోవడం దేశప్రజలకు తీరని అన్యా యం.
ప్రస్తావన లేని వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ
రాష్ట్ర విభజన చట్టం హామీల్లో భాగం గా వెను బడిన జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున కేటాయించాల్సింది.ఉత్తరాంధ్రలోని విశాఖ, విజ యనగరం,శ్రీకాకుళం జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు ఈ నిధులు కేటా యించాల్సి ఉంది. 2015 నుంచి 2018 వరకు ప్రతి ఏడాది రూ.50 కోట్లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఆ నిధులను ఆపేసింది. తాజా బడ్జెట్‌లోనూ దాని ప్రస్తావన లేదు.
అన్నదాతలకు ఆశాభంగం
జిల్లాలో 3.90లక్షల మంది రైతులు ఖరీఫ్‌,రబీ సీజన్‌లో కలిపి 6లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తమకు రాయితీలు ప్రకటిస్తుందని భావించిన అన్నదాతలకు భంగపాటే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సబ్సిడీలపై ఎదురుచూసిన రైతాంగం ఆశలపై నీళ్లు చల్లింది.పంటల మద్దతు ధరకు సంబం ధించి స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు ప్రస్తావనే లేదు. ప్రతి ఏడాది రైతులకు అందిస్తున్న రుణాల అంశం తప్ప గిట్టుబాటు గ్యారంటీ చట్టంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దేశవ్యాప్తంగా సేం ద్రీయ విధానాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రకటిం చింది. చిరు ధాన్యాలకు ప్రోత్సాహం, వినియోగం పెంచుతామని బడ్జెట్‌లో పొందుపరిచింది. జిల్లాలో ప్రస్తుతం 25ఎకరాల్లో చిరు ధాన్యాలను సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పంటల విస్తీర్ణం మరింత పెరగనుంది.
పిఎసిఎస్‌లపై పెత్తనం కోసమేనా?
రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాథమిక వ్యవ సాయ పరపతి సంఘాలపై పెత్తనం సాగించేలా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో ప్రస్తావన తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పిఎసిఎస్‌లను మ్యాపింగ్‌ చేయనున్నామని పేర్కొంది. పిఎసిఎస్‌లకు నూతన బైలాస్‌ రూపొందించి వాటిని బహుళార్థక సంఘా లుగా తయారు చేస్తామని చెప్తోంది.
పిఎం పివిటిజి మిషన్‌తో ఒనగూరేనా?
ఆదిమ తెగ గిరిజన కుటుంబాల్లో (పివిటిజి) సామా జిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రధాన మంత్రి పివిటిజి మిషన్‌ను ప్రారంభిస్తామని బడ్జెట్‌లో పేర్కొంది.మిషన్‌ ద్వారా గిరిజన ఆవాసా ల్లో గృహ నిర్మాణాలు, రక్షిత మంచినీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, రహదారి సౌకర్యం, పౌష్టికా హారం వంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్తోంది.
వినపడని రైల్వే కూత
రైల్వే బడ్జెట్‌ అనగానే కొన్ని నెలల ముందు నుంచీ అంతా ఆసక్తిగా ఎదురుచూసేవారు. మన ప్రాం తానికి ఏమైనా కొత్త రైళ్లు వేస్తున్నారా?,గతంలో ఇచ్చిన మోడల్‌ స్టేషన్ల హామీకి కార్యరూపం దాలుస్తుందా? రైళ్లకు అదనపు హాల్ట్‌లు కల్పిస్తున్నారా అసలు ఏం ప్రకటిస్తారోనని ప్రజలు ఉత్కంఠగా చూశారు. ముఖ్యంగా విశాఖ రైల్వేజోన్‌పై ఏదైనా ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రైల్వేపరంగా జిల్లాకు మొండి చేయి చూపింది. కొత్త రైళ్లు లేకపోగా జిల్లా మీదుగా వెళ్తూ ఆగకుండా వెళ్తున్న రైళ్లకు హాల్ట్‌లు కూడా దక్కలేదు.రైళ్ల పొడిగింపు, స్టేషన్ల అభివృద్ధి ప్రస్తావ నే లేదు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసం గాన్ని వీక్షించిన తర్వాత ఆ వివరాలేవీ కనిపించక పోవడంతో తీవ్ర నిరాశ చెందారు. జిల్లాలో రైల్వే లైన్ల అభివృద్ధి మినహా కొత్త ప్రాజెక్టులు, రైళ్ల ప్రకటన లేకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరాశ చెం దారు.
వేతనజీవులకు నిరాశే
పన్నుల విషయంలో ఈ ఏడాది బడ్జెట్‌లోనూ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఆదాయపు పన్ను పరిమితినిరూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షలకు పెంచినట్లే పెంచిన కేంద్ర ప్రభుత్వం, వారికి ఇప్పటి వరకు కొన్ని సౌకర్యాలపై కల్పిస్తున్న మినహాయింపు లపై కోత పెట్టింది.పాతవిధానంలో ఉన్న హెచ్‌ ఆర్‌ఎ, సిపిఎస్‌, 80సి,80డి,ఇళ్ల రుణాలపై అంది స్తున్న మినహాయింపులను ఆపేసింది. దీంతో వేతన జీవులు బడ్జెట్‌పై తీవ్రఅసంతృప్తిని వ్యక్తం చేస్తు న్నారు.
ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ : సిఐటియు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కార్మికులు, రైతులు, శ్రమ జీవులు,సామాన్య ప్రజలకు నిరాశనే మిగిల్చిందని సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు,పి.తేజేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ధరల నియంత్రణ, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఈ బడ్జెట్‌ సహాయపడదని తెలిపారు. ప్రయివేటు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న బడ్జెట్‌ను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసిడిఎస్‌, మధ్యాహ్న భోజనం, జాతీయ ఆరోగ్యమిషన్‌,జాతీయ విద్యామిషన్‌, జాతీయ జీవనోపాధుల మిషన్లను కేటాయింపులు పెంచ లేదని పేర్కొన్నారు. ఉపాధి హామీకి కేటాయింపుల్లో కోత పెట్టిందని తెలిపారు. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి పెద్దఎత్తున నిధులను కేటాయించి సంక్షేమ పథకాలను కార్మికులందరికీ అమలు చెయ్యాలన్న కోర్కెనూ పట్టించుకోలేదని విమర్శిం చారు. ఇపిఎస్‌ పెన్షనర్ల కనీస పెన్షన్‌ పెంచాలని లక్షలాది మంది వద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు చేస్తున్న ఆందోళనలు కూడా మోడీ చెవికి ఎక్కలేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లోనూ రూ.61 వేల కోట్ల మేర ప్రభుత్వ సంస్థలను అమ్మాలని ప్రతిపాదిం చిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల పేరుతో బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం, బ్యాంకింగ్‌ కంపెనీల చట్టం, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టాలకు సవరణలు చేస్తామని చెప్తూ ప్రభుత్వరంగ బ్యాం కులు, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రయివేటీకరణకు దారులు తెరిచిందని విమర్శించారు.రోడ్లు, రైళ్లు, విద్యుత్‌, టూరిజం తదితర రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించిందని తెలిపారు. ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఊసే లేదు ఈబడ్జెట్‌లో.గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు. రాష్ట్రంలోని నేతన్నలకు జీఎస్టీ రాయితీలు కానీ, ప్రత్యేక ప్రోత్సాహకాలుగానీ ఇవ్వలేదు. తెలంగా ణకు ఒక్కటంటే ఒక్కటి కూడా పారిశ్రామికవాడను ఇవ్వలేదు. మరోవైపు, బడ్జెట్‌లో రైతులకు సంబం ధించిన కేటాయింపుల్లో భారీగా కోతపెట్టారు. ఎరు వుల సబ్సిడీలు తగ్గించడంతోపాటు గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లోకోత పెట్టారు. ఆహార సబ్సిడీలు తగ్గించారు. కేంద్ర ఆర్థికసంఘం సిఫార్సుల అమలు ఊసే లేదు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు ఉద్యోగులను భ్రమ ల్లో పెట్టేలా ఉన్నాయి తప్ప ఆశాజనకంగా లేవు. పన్నుల భారం నుంచి సామాన్యులకు లభించిన ఉపశమనం ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా భ్రమలబడ్జెట్‌. పేదల వ్యతిరేక బడ్జెట్‌. తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జెట్‌.ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కోత విధించింది.గత బడ్జెట్‌లోరూ.89,400 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.60వేలకోట్లకు కుదిం చింది. తద్వారా ఉపాధి హామీ కూలీల ఉసురు తీసే చర్యలకు పాల్పడిరది. పేదల ఆహార భద్రత కు గతేడాది రూ.2,87,194 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,97,350 కోట్లకు తగ్గించింది.ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ.. బడ్జెట్‌ లో మాత్రం దాని గురించి ఏమీ ప్రస్తావించక పోవటం శోచనీయం. గతంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్‌ కాలే జీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు నర్సింగ్‌ కాలేజీలను ఆప్రాంతాలకే ఇస్తున్నట్లు ప్రకటించింది.అంటే తెలంగాణకు నర్సింగ్‌ కాలేజీల విషయంలోనూ మొండి చేయి చూపి మరోసారి తీవ్ర అన్యాయం చేసింది. ప్రస్తుత బడ్జెట్‌లో,మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగ నున్న కర్ణాటకలోని కరువు, వెనుకబడ్డ ప్రాంతాల అభి వృద్ధి కోసం రూ.5,300కోట్లను కేటాయిం చింది.అదే సమయంలో విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా తెలంగాణకు వెనుకబడ్డ ప్రాంతా ల నిధిగా మూడేండ్ల నుంచి హక్కుగా రావాల్సిన రూ.1350కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. ఇది పక్షపాత వైఖరి కాక మరెమిటి? పీఎం కిసాన్‌ నిధి కోసం గతేడాది రూ.68వేల కోట్లు కేటాయించగా,ఈసారి60వేలకోట్లకు తగ్గించ డంతో పాటు లబ్ధి పొందే రైతుల సంఖ్యను సైతం కుదించింది. గతంలో కిసాన్‌ నిధితో11.27 కోట్ల మంది రైతులు లబ్ధి పొందగా, ఇప్పుడు ఆ రైతుల సంఖ్యను 8.99కోట్లకు తగ్గించింది.మరోవైపు రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీలో రూ.50,120 కోట్ల కోత విధించింది. రైతులు పండిరచే పత్తిని కొను గోలుచేసి మద్ధతుధర కల్పించేందుకు కాటన్‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియాకు గతంలో రూ.9243 కోట్లు కేటాయిస్తే ఈసారి బడ్జెట్‌లో కేవలం ఒకలక్ష రూపా యలే కేటాయించారు. ఇది రైతులకు నష్టం చేయ డంతోపాటు కాటన్‌ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసే కుట్ర. ఇక రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు గతేడాది బడ్జెట్లో రూ.10,433 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.3,283కోట్లు కోత విధించి రూ.7, 150 కోట్లకు తగ్గించింది. దీన్ని బట్టి కేంద్రానికి రైతుల మీదున్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతున్నది. మరోవైపు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తేనే, 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం అనుమతిస్తామని షరతు పెట్టింది.అంటే బోరు బాయిల కాడ మీటర్లు పెట్టి, రైతుల ఇంటికి బిల్లు పంపించాలని చెప్పకనే చెప్పిం ది.ఈ నిబంధన వల్ల మన రాష్ట్రానికి మరో రూ.6 వేల కోట్లు రాకుండా పోతాయి. మైనారిటీల సంక్షే మానికి గతంలో రూ.5,020 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.3,097 కోట్లకు కుదించింది. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు కచ్చితంగా విడుదల చేయాలి. కానీవాటిలో కూడా కేంద్రం కోత విధించి గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేసింది. పట్టణ స్థానిక సంస్థలకు 2022-23లో రూ.22, 908 కోట్లు ప్రతిపాదించి, సవరించిన పద్దుల ప్రకారం దాన్ని రూ.15,026 కోట్లకు కుదించింది. గ్రామీణ స్థానిక సంస్థలకు 2022-23లో రూ.46, 513 కోట్లు ప్రతిపాదించగా, దాన్ని రూ.41 వేల కోట్లకు కుదించారు. ఈ చర్యలు పట్టణ, గ్రామీణ సంస్థలను చిన్నచూపు చూడటంలో భాగమనే భావించాలి.అదే విధంగా ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపులో కూడా రూ.4,297 కోట్ల కోత విధించారు. 2023-24 బడ్జెట్‌లో నికర అప్పులు రూ.17,86,816 కోట్లుగా ప్రతిపాదించిన కేంద్రం అందులో సింహభాగం అంటే రూ.8,69,855 కోట్లు రెవెన్యూ లోటును భర్తీ చేయడానికే ప్రతిపాదించారు. అప్పులను క్యాపి టల్‌ ఎక్స్‌పెండీచర్‌ కోసం కాకుండా, 48.7శాతా న్ని రోజువారీ ఖర్చులకోసం ప్రతిపాదించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది.1979-80 నుంచి కేంద్రంలో రెవెన్యూ లోటు క్రమంగా పెరుగుతున్నది. 1979-80లో రూ.694 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా, 2022-23 సవరించిన అంచనాల ప్రకారం రూ.11, 10,546 కోట్లకు పెరిగింది. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి విరుద్ధం. రాష్ట్రాలు ఆనిబంధనలను పాటి స్తున్నాయి. కేంద్రం మాత్రం పాటించటం లేదు. దీనివల్ల దేశ ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. బాగా పని చేసే రాష్ట్రాలపై కూడా ఎఫ్‌ఆర్‌ బీఎం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ వాటికి నిధులు లేకుండా చేస్తున్న కేంద్రం, తాను మాత్రం ఎప్పటికప్పుడు ఆ నిబంధనలను ఉల్లంఘి స్తున్నది. తద్వారా తన చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది.2022-23లో కేంద్రం మొత్తం పన్నుల వసూలు రూ.33,68,858 కోట్లు కాగా, ఇందులో రాష్ట్రాల వాటా రూ.10,21,488 కోట్లుగా అంచనా వేశారు.అదే సమయంలో కేంద్రం వసూలు చేసే మొత్తం పన్నుల ఆదాయంలో 30.4 శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నది. నిజానికి, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాలి. కానీ కేంద్రం సెస్సులు, సర్‌ ఛార్జీల విధింపుతో రాష్ట్రాలకు అందుతున్నది 30 శాతం మాత్రమే. దీంతో రాష్ట్రాలు రెండు రకాలుగా నష్టపోతున్నాయి.ఈ విధంగా కేంద్ర బడ్జెట్‌ ఉద్యోగుల, రైతుల, సామాన్య పౌరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్నది. తొలి నుంచీ తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షనే ఈసారీ కేంద్రం కొనసాగించింది.
భ్రమాపూరిత బడ్జెట్‌..
మన దేశానికి కావాల్సిన విజన్‌.. బడ్జెట్‌-2023లో లేదు. ఇంకా చెప్పాలంటే అతుకుల బొంతలాగా ఉంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు తాము ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ ఇదన్న వాస్తవాన్ని ఆర్థికమంత్రి విస్మరించారు. అంతేకాదు ద్రవ్యోల్బణం, అభివృద్ధి లేమి, నిరుద్యోగం కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సాధారణ ప్రజలను, ఆర్థికరం గంలో నెలకొన్న కఠిన వాస్తవాలను కూడా ఆవిడ పట్టించుకోలేదు. ఆర్థికరంగం నిరాశాజనక పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా.. ఏడు ప్రాధామ్యాలను ఈ బడ్జెట్‌ ప్రాతిపదికగా చేసుకున్న ట్లు కనిపిస్తున్నది. అవి..సమీకృత అభివృద్ధి, చిట్టచివరి లబ్ధిదారునికీ ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్య వినియోగం, పర్యావరణ అనుకూల అభివృద్ధి,యువశక్తిజి, ఆర్థికరంగం. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అనేది బహిరంగసభల్లో నినాదాలకే పరిమితమైంది తప్ప ఆచరణలో లేదు. దేశంలో28రాష్ట్రాలు,8 కేంద్ర పాలితప్రాంతాలున్నాయి. వీటిలో చాలావరకు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మూడు దశా బ్దాల వ్యవధిలో ఏర్పాటయ్యాయి. ప్రతీ రాష్ట్రం తనదైన అభివృద్ధి దశలో, నమూనాలో ఉంది. కాబట్టి ప్రతీ రాష్ట్రానికి తనదైన ప్రణాళిక అవసరం. ఇంత వైవిధ్యం ఉన్న మన దేశంలో అన్నింటికీ ఒక్కటే అన్న సిద్ధాంతం పనికిరాదు. ఈ ఏడాది బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంగానీ, ఆర్థిక మంత్రిగానీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఎటువంటి చర్చలు జరుపలేదు. పారి శ్రామికవేత్తలను,ఇతర భాగస్వామ్యపక్షాలను మా త్రం వారు సంప్రదించారు. నిజంగానే ఇది ‘అమృ తకాలం’ అయితే, సమ్మిళిత అభివృద్ధి కోసం బడ్జెట్‌ పూర్వ చర్చల్లో రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా కేంద్రప్రభుత్వం సంప్రదించి ఉండాల్సింది. ఎందుకంటే వాస్తవ కార్యాచరణ, ఫలితాలు రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లోనే ఉన్నాయి కాబట్టి.
బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు, మత్స్యరంగానికి కేంద్రం కొన్ని పథకా లను ప్రకటించింది. అయితే, ఈ రంగాల్లో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఉత్పాదకతను రెట్టింపు చేసిన తెలంగాణ ప్రభుత్వం కృషిని గుర్తిం చటం మాత్రం ఆర్థికమంత్రి మర్చిపోయారు. సహకార రంగం కింద ‘ప్రాథమిక వ్యవసాయ సంఘాల’ కంప్యూటరీకరణను మంత్రి ప్రతిపాదిం చారు. తెలంగాణ ప్రభుత్వం చాలా కాలం కిందటే ఈపని పూర్తి చేసిందన్నది ఈ సందర్భంగా గమనిం చాల్సిన అంశం. అదీగాక సహకార రంగం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అటువంట ప్పుడు కేంద్రప్రభుత్వం దీనిపై బడ్జెట్‌లో ఎందుకు ప్రతిపాదనలు చేసిందన్నది అర్థం కాని విషయం. చిట్టచివరి లబ్ధిదారునికీ ప్రభుత్వ సేవలు: గిరిజన విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయులను నియ మిస్తామని బడ్జెట్‌ ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12శాతం మంది గిరిజనులు ఉన్నప్పటికీ.. కేంద్రం ఒక్క ఏకలవ్య పాఠశాలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఈ స్కూళ్లను కేటాయించాలి. తెలంగాణలో కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాల యాలు, నవోదయ విద్యాలయాలు కేటాయించాలని కోరితే వాటినీ ఇప్పటి వరకూ ఇవ్వలేదు.మౌలిక సదుపాయాలు,పెట్టుబడులు,పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు కేటాయింపులు పెంచుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు తగిన నిధులను కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్య యాన్ని ఈ కేటాయింపుల నుంచి చెల్లించే (రీయిం బర్స్‌ చేసే) అంశాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి. యువశక్తి: ఉద్యోగ కల్పనకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం, యువతలో నైపుణ్యాల పెంపు దల, అప్రెంటిషిప్‌లకు ట్కస్టెపెండ్‌ చెల్లింపు వంటి చర్యలు అమలులోకి వస్తే మంచిదే. కానీ, ఇప్పటి వరకూ ఏ మేరకు అమలు అయ్యాయి అన్నదే అసలు ప్రశ్న.సాధారణ పౌరుల సంక్షేమం, అభి వృద్ధే లక్ష్యంగా జవాబుదారీతనంతో, పారద ర్శకంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయటం కోసం పలు దీర్ఘకాలిక చర్యలను ప్రకటించారు. దీంట్లో భాగంగా కృత్రిమ మేధోరంగంలో (ఆర్టిఫీ షియల్‌ ఇంటెలిజెన్స్‌) ఏర్పాటుచేయ తలపెట్టిన మూడు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లలో ఒకదానిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయమని కేంద్రప్రభు త్వాన్ని కోరుతున్నాం. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ఎదురవుతున్న పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవ టానికి ప్రకటించిన చర్యలను బాధ్యతాయుత రాష్ట్రంగా తెలంగాణ స్వాగతిస్తున్నది. ఇదే సంద ర్భంలో, ఈ రంగంలో తెలంగాణ జరిపిన కృషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హరితహారం కింద గత ఏడేండ్లలో 240కోట్ల మొక్కలను నాట డం జరిగింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 28 శాతం నుంచి 33 శాతానికి పెరిగింది.ఈ రంగా నికి ప్రతిపాదించిన పలు అంశాలు దీర్ఘకాలిక మైనవి. వీటిని ఏ విధంగా అమలు చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. సమాఖ్య స్ఫూర్తిని కేంద్రప్రభుత్వం ప్రదర్శించలేదు. బడ్జెట్‌ రూపకల్పనలో రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపలేదు. 7 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. కానీ, రాష్ట్రాల పాత్ర లేకుండా దీనిని సాధించటం ఎలా సాధ్యమవుతుంది?ఈ విధంగా కేంద్ర బడ్జెట్‌ వాస్తవాలను విస్మరించిన కసరత్తుగానే నిలిచి పోయింది.
-(డాక్టర్‌ బైరి నిరంజన్‌/బి.వినోద్‌కుమార్‌)

సమక్క సారలమ్మ పూర్వ చరిత్ర

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు కారకులైన సమ్మక్క సారక్కలు గిరిజన వీర వనితలుగా పూజలు అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే! కానీ వారి పుట్టుక జీవనం మనుగడకు సంబంధించిన చారిత్రక ఆధారాలు శూన్యం. కేవలం పుక్కిట పురాణంలా, జానపదుల శైలిలో మౌఖిక సాహిత్యమై గిరిజనుల శాసనాలుగా చెప్పబడే ‘‘పడిగె కథలు’’ ద్వారా మాత్రమే మనకు సమ్మక్క సారక్కల సమాచారం అరకొరగా లభ్యం అవుతుంది. ఇలాంటి సందీప్తి సమయంలో మేడారం గ్రామంకు సమీపానగల కామారం గిరిజన గ్రామానికి చెందిన గిరిజన యువకుడు పరిశోధక విద్యార్థి బీరసం ఉండాల యూత్‌ నిర్వాకుడు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు నిత్యసంచారి అయినా మైపతి అరుణ్‌ కుమార్‌ రాసిన ‘‘సమ్మక్క సారలమ్మ పూర్వ చరిత్ర’’ పుస్తకం, అరుణ్‌ తనదైన పరిశోధకుశ శైలిలో తన క్షేత్ర పర్యటల ద్వారా స్థానిక పెద్దల ద్వారా తెలుసుకున్న విలువైన చారిత్రక సమాచారాల సమ్మేళనంగా దీన్ని వ్రాశాడు.ఈ క్షేత్ర పర్యటనల సమాహారం గతంలో గల సమ్మక్క చరిత్రకు నూతనత్వం ఆపాదిస్తుంది, ఇక ఈ పూర్వ చరిత్ర విశేషాల్లోకివెళితే……!! ఇప్పటివరకు మనకు తెలిసిన సమ్మక్క సారక్క కథకు పూర్తి భిన్నంగా వాస్తవానికి కాస్త చేరువులో చెప్పబడిరది ఈ పూర్వ చరిత్ర, పరిశోధకరచయిత మైపతి అరుణ్‌ కుమార్‌ ఈ చరిత్ర వివరణ కోసం కేవలం ‘‘పడిగలు’’ మీదే ఆధారపడకుండా దానికి ఆధారంగా స్థానికులచే చెప్పబడే వ్యక్తులు, నివసించే ప్రాంతాలకు, వెళ్లి అక్కడి వారి అనుభవాలు సేకరించి ఈ కథనానికి మరింత ప్రామాణికత చేకూర్చారు. ప్రస్తుతం చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్ర పరిధిలో గల బీజాపూర్‌ జిల్లాలోని అత్యంత దట్టమైన అడవిలో గల కాన్కనార్‌ గిరిజన గ్రామం వెళ్లి అక్కడి గ్రామస్తులను, పూజారులను సంప్రదించి సమ్మక్క వంశ పూర్వ చరిత్రను తెలుసుకు న్నారు మైపతి అరుణ్‌ పరిశోధక బృందం. ఈ క్రమంలో గోండ్వాన రాజ్య విస్తరణలో గిరిజనుల పాత్ర చెబుతూ సింధు నాగరి కతకు పూర్వమే గోండ్వానా రాజ్య నాగరికత వెళ్లి విరిసిందని పడగలపై గల అనేక ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేశారు అరుణ్‌. ‘‘సమ్మక్క’’ కోయత్తూర్‌ సమాజంలో ఐదవ గట్టుకు చెందిన ‘‘రాయి బండాని రాజు ‘‘ వంశానికి చెందిన ఆడబిడ్డగా ‘‘బాండానిరాజు’’ పడిగలోని చిత్రలిపి విశ్లేషణ ద్వారా వివరించారు, ‘‘రాయి బండాన్నిరాజు’’కు చందంబోయి రాలు, కనకంబోయి రాలు,అని ఇద్దరు భార్యలు. గోండ్వాన రాజ్యపు రాజైన ‘‘బేరంబోయిన రాజు’’కు ఏడుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, ఆఇద్దరు కూతుళ్లే చందం బోయిరాలు,కనకం బోయిరాలు,వీరు ఇద్దరు ఇష్టపడి రాయి బండాన్ని రాజును పెళ్ళాడ తారు,కానీ పెద్ద భార్యకు సంతానం కలగలేదు శివపార్వతులను పూజించగా వారి వరప్ర సాదంగా అడవిలో మాఘ పౌర్ణమి రోజున బండాని రాజుకు అతని పెద్ద భార్య చందం బోయిరాలకు కంక వనములో ఒక పసిపాప కనిపిస్తుంది అది శివపార్వతుల ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకువస్తారు ఆ పాపే సమ్మక్క. అంతకుముందే గర్భవతి అయిన చిన్న భార్య కనకం బోయిన రాలు, రెండు రోజుల తర్వాత ఆడపిల్లను ప్రసవిస్తుంది ఆమెకు నాగులమ్మ అనే పేరు పెట్టుకుంటారు. ఐదవ గట్టుకు చెందిన ‘‘బండాని’’ వంశములో తొలిచూరు ఆడబిడ్డ సమ్మక్క, కోయ సాంప్రదాయం ప్రకారం మొదటి ఆడబిడ్డను వేల్పుగా కొలుస్తారు అందుకే సమ్మక్క ఇలవేల్పుగా దేవర అయింది. సమ్మక్క- నాగులమ్మలు పెరిగి పెద్దయ్యాక అదే గోండ్వాన రాజ్యంలో గల బీజాపూర్‌ దగ్గరి కొత్తపల్లి గ్రామానికి చెందిన నాలుగవ గట్టువాడైన ‘‘పగిడిద్ద రాజు’’కు పెద్ద కూతురైన సమ్మక్క నిచ్చి పెళ్లి నిశ్చయించుకుంటాడు రాయిబండని రాజు, తన ఇద్దరు భార్యలు, చిన్న కూతురు నాగులమ్మతో కలిసి అతడిని చూసి వచ్చి నిర్ణయం చెప్తాడు సమ్మక్కకు. కానీ చెల్లెలు మాయమాటలు నమ్మి పగిడిద్ద రాజు వికార రూపం కలవాడు అనుకోని ఆ పెళ్ళికి ఇష్టపడదు సమ్మక్క. ఆడిన మాట తప్పకుండా అన్న ముహూర్తానికి తన చిన్న కూతురు నాగులమ్మ తో పైడిద్దరాజు పెళ్లి నిశ్చయించి మాఘ పౌర్ణమి ముందే తన కుటుంబం చుట్టాలతో కలిసి వెళ్లి..నాటి మధ్యప్రదేశ్‌ లోని కొత్తపల్లి గ్రామ సమీపాన గల ‘‘పాలెం’’ గ్రామంలో మండపం కట్టించి పెళ్లికి ఏర్పాటు చేసుకుంటాడు బండాని రాజు, అక్కడి చెరువును ‘‘కాముని చెరువు’’ అంటారు ఇవి ఇప్పటికీ ఉన్నాయి.తీరా పెళ్లి సమయంలో సమ్మక్క అందగాడైన పైగిడిద్ద రాజును చూసి తన చెల్లెలు నాగులమ్మ చేసిన మోసానికి ఆగ్రహించి పెళ్లి మండపంలోనే చెల్లిపై దాడి చేసింది, ఆ పెనుగులాటలో సమ్మక్క చేతికడెం పగిడిద్దరాజు కంటికి తగిలి కన్ను కోల్పోయాడు, ఇక చేసేదేమీ లేక తను అక్కా చెల్లెలు ఇద్దరిని అదే మండపంలో పెళ్లాడుతాడు. కానీ చివరికి చెల్లెలు పోరు పడలేక తన పుట్టింటికి వచ్చేసింది చంద్రవంశీయుల సమ్మక్క.తల వారితో ఉండి పోయి ఆ ఇంటి ఇలవేల్పుగా మిగిలిపోయింది, అలా చందా వంశీయులు అనేక తరాలుగా సమ్మక్క ను అనంతరం ఆమె వస్తువులను, పూజించుకుంటూ వారి వారి జీవితాలు సాగించుకుంటున్న క్రమంలో ప్రకృతి వైపరీత్యాలు కరువు కాటకాలతో చందా వంశీలు కుటుంబాలుగా విడిపోయి దూర ప్రాంతాలకు, బ్రతుకు తెరువు కోసం వలస పోయారు. అలా వలస వచ్చిన వారిలో ఒక చందా కుటుంబం వారు పడమరదేశంలోని అడవిలో బాయక్క అనే ఆమె పేరుతో ఒక గూడెం నిర్మించుకొని ‘‘బయ్యక్కపేట’’అని పేరు పెట్టుకున్నారు, ఆ గ్రామం ప్రస్తుతం మేడారం సమీపంలో ఉంది. బయ్యక్కపేట చందా వంశీలే మొదట రెండేళ్ళ కోసారి మాఘ పున్నమికి ‘‘సమ్మక్క జాతర’’ చేసేవారు, కానీ కాలక్రమంలో కరువు కాటకాలలో డబ్బులు లేక పక్క గూడెం అయిన మేడారం గిరిజను లకు జాతర బాధ్యతలు అప్పగించారు, అలా మేడారంకు సమ్మక్క జాతర ప్రవేశించింది. అంటూ చిత్రలిపి ఆధారంగా సమ్మక్క సారలమ్మ పూర్వ చరిత్ర పుస్తక రూపం చేశారు మైపతి అరుణ్‌ కుమార్‌. ఈ చరిత్రకు అంతర్గతంగా గోండ్వానా రాజ్య ఆనవాళ్ళ గురించి ప్రాంతాలవారీగా ఆధారాలు చూపుతూ సింధు నాగరికతకు పూర్వమే ఆదివాసుల ‘‘గోండ్వానా నాగరికత’’ ఉన్నదనే విషయం చరిత్రకారులు విస్మరించారని ఆదివాసులపై ఆర్యులు చేసిన అణిచివేతకు ఇదొక ఉదాహరణ అంటారు అరుణ్‌ కుమార్‌. అంతేకాక ఈ పరిశీలన గ్రంథంలో కాకతీయ రాజ్యం కూడా గోండులదే అన్న తన వాదాన్ని వినిపిస్తారు. ఆనాడు గూండాను చరిత్రను భూస్థాపితం చేసినట్టే ఇప్పుడు మేడారం చరిత్రను సమ్మక్క సారక్కల చరిత్రను తప్పుదారి పట్టించి హిందూ తత్వాన్ని ఆపాదించి అసలైన గిరిజన సంస్కృతిని మటుమాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ తన ఆవేదన వ్యక్తపరిచాడు అరుణ్‌ ఈ పుస్తకంలో. దీని ద్వారా పరిశోధకులు ముందుకు వచ్చి సందిగ్ధ భరితమైన ఈచరిత్రను సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది,గిరిజన పరిశోధకులు, చరిత్ర ప్రేమికుల తో పాటు అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
పుస్తకం : సమ్మక్క సారమ్మ పూర్వ చరిత్ర, పేజీలు : 174, వెల : 300/- రూ, రచన : మైపతి అరుణ్‌ కుమార్‌, సెల్‌ : 9441966756. సమీక్ష : డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.

ఆర్టీఐ స్పూర్తికి తూట్లు

పౌరులే అసలైన పాలకులని, ప్రభుత్వానికి వారే యజమానులని సమాచార హక్కు చట్టం ఉద్గాటిస్తోంది. వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి అవసరమైన సమాచారాన్నే ప్రజలు నిక్కచ్చిగా పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితి మారాల్సిందే. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)2005 అక్టోబరు 12న విజయదశిమి నాడు అమలులోకి వచ్చింది. భారత ప్రజాస్వామ్యం మరింత పరిణతి చెందుతుందని ఈ చట్టం ఆశలు రేకెత్తించింది. లోపభూయిష్ట భారత ప్రజాస్వామ్యం నిజమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా ఎదగడానికి సమాచార హక్కు చట్టం(సహ)చట్టం తోడ్పడుతుందని చాలామంది ఆశించారు. `– సైమన్‌ గునపర్తి
సమాచార హక్కు చట్టానికి అధికార యంత్రాంగం తూట్లు
‘హమార పైసా హమారా హిసాబ్‌’ అంటూ రాజస్థాన్‌ లో పురుడు పోసుకున్న నినాదం మహోద్యమమై సమాచార హక్కు చట్టంగా రూపాంతరం చెంది ప్రస్తుతం దేశవ్యాప్తమైంది. పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనంను పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గదర్శిగా నిలిచింది. గ్రామ పంచాయతీ మొదలుకొని పార్లమెంట్‌ వరకు ఒక్క దరఖాస్తుతో కావాల్సిన సమాచారం పొందే హక్కును కల్పించింది. కానీ అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం, సమాచార కమిషన్‌ చట్టాన్ని చట్టబండలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. పెండిరగ్‌ దరఖాస్తులు, అప్పీళ్లు, ఫిర్యాదులతో సామాన్యుడికి సమాచారం అందడం గగనంగా మారింది. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం సవరణలతో సహ చట్టానికి తూట్లు పొడుస్తుంటే మరోపక్క సమాచార కమిషన్‌ ఉదాసీన వైఖరి వల్ల చట్ట స్ఫూర్తికి భంగం వాటిల్లుతున్నది.
సవరణలతో బలహీనపరిచే యత్నం
ప్రభుత్వ పనితీరు సామర్థ్యాన్ని మరింత పెంచడం ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి 2005 అక్టోబర్‌ 12 నుంచి సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు ఇస్తే ప్రజా సమాచార అధికారులు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకొని సెక్షన్‌ 7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటే 48 గంటల్లో సమాచారం ఇవ్వాలని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైతే ఆ శాఖలోని సీనియర్‌ అధికారులకు మొదటి అప్పీల్‌ చేస్తారు. అక్కడ కూడా స్పందన లేకపోతే సమాచార కమిషన్‌ కు రెండో అప్పీలు చేసుకుని సమాచారం పొందవచ్చు.
జవాబుదారీతనం పెంచాలి
సహ చట్టం అమలుకు కొత్తగా సమాచార కమిషన్లను నెలకొల్పారు.సమాచారం గురించి పౌరులకు,అధికారులకు మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను ఈ కమిషన్లకే అప్పగించారు. మినహాయింపులు ప్రకటించిన పది విభాగాల సమాచారాన్ని తప్ప మిగతాదాన్ని ప్రభుత్వం పౌరులతో పంచుకోవలసిందేనని చట్టం చెబుతోంది. పౌరుడు కోరిన సమాచారాన్ని 30రోజుల్లో అందించాలని పేర్కొంది. సమాచారాన్ని అందించడంలో చేసిన జాప్యానికిగాను ప్రభుత్వ ఉద్యోగికి రోజుకు రూ.250చొప్పున జరిమానా విధించవచ్చు. ఆ మొత్తం జరిమానా రూ.25వేలు మించకూడదు.దీన్ని సంబంధిత ఉద్యోగి జీతం నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది. ఆర్టీఐ చట్టం గురించి ప్రజల్లో అవగాహణ పెరగడం తో మొదట్లో దాన్ని ఉత్సాహంగా ఉపయో గించుకున్నారు.అయితే,అధికారంలో ఉన్నవారి నుంచి మాత్రం వ్యతిరేకత పెరిగింది.ఎక్కువగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులనే సమాచార కమిషనర్లుగా నియమిస్తున్నందువల్ల వారు సమాచారాన్ని అందించడానికి మొండికేసే ఉద్యోగులకు జరిమానా విధించడానికీ మొగ్గు చూపడం లేదనే విమర్శలున్నాయి. సమాచార కమిషనర్ల నియామకంలోనూ పారదర్శకత కరవైంది. వారి అలసత్వంవల్ల సహాచట్టం సరిగ్గా పౌరుల ప్రాథమిక హక్కులను గౌరవించాలనే స్పృహ వారిలో కనబడటం లేదు. అందుకే నిర్ణయాలు తీసుకోవడంలో ఏళ్ల తరబడి ఆలస్యం చేస్తున్నారు. సహచట్టం పకడ్బందీగా అమలు కావడానికి కొన్ని రకాల పద్దతులు పాటించాలి. సమాచార కమిషనర్ల నియామకానికి నిర్ధిష్ట అర్హతలు,అనుభవాలను ప్రమాణాలుగా నిర్ణయించి,వాటిని కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. ప్రభు త్వం పరిష్కరిస్తున్న కేసుల సంఖ్య ఏడాదికి సగటున రెండువేల లోపుగానే ఉంటోంది. ఒక్కో కమిషనర్‌ ఆరువేలదాకా,వీలైతే అంతకన్నా ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. కేసులను 90రోజుల్లోగా పరిష్కరించాలనే నిర్ధిష్ట పరిమితుల్నీ విధిం చాలి.ప్రతి కమిషనర్‌ పనితీరును ఆరు నెలలకు ఒకసారి సమీక్షించాలి. తదుపరి రెండేళ్లలో సమాచారం కోసం అందే దరఖాస్తులు,వాటి పరిష్కారం గురించి అంచనా వేయాలి.దాన్ని వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి నెలా అందుకుముందు నెలలో కమిషనర్‌ పనితీరు గురించి వెల్లడిచేయాలి. అవసరాన్ని బట్టి ఎందరు సమాచార కమిషనర్లను నియ మించవలసిందీ ప్రభుత్వం ఆరునెలల ముందే ప్రకటించాలి. ఈ పదువులకు ప్రముఖులు నుంచీ దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఇతరులు నామినేట్‌ చేసినవారినీ పరిశీలించి ఎంపిక చేయవచ్చు.అందుబాటులో ఉన్న సమాచార కమిషనర్‌ పదవులకు మూడురెట్లు ఎక్కువ పేర్లతో జాబితాను రూపొందించే పనిని యూపీఎస్సీ సభ్యులతో ఏర్పాటయ్యే కమిటీకి అప్పగించాలి. లేక మరేదైనా పద్దతినీ అనుసరించవచ్చు. ఆజాబితా నుంచి ఎవరిని ఎందుకు ఎంపిక చేసిందీ స్పష్టంగా వివరిం చాలి. పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో సంబంధిత అన్వేషణ కమిటీ బహిరంగంగా ముఖాముఖి నిర్వహించాలి. పౌరులు,మాధ్యమాల అభిప్రాయాలనూ స్వీకరించాలి. తర్వాత అందుబాటులో ఉన్న సమాచార కమిషన్‌ పదవులకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేయాలి. ప్రధానమంత్రి/ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రితో కూడిన కమిటీ ఈ జాబితా నుంచి తుది నియామకాలు జరపాలి. సమాచార కమిషనర్లలో సగం మంది వయస్సు 60ఏళ్లకన్నా తక్కువ ఉండాలి. సమాచార హక్కు అమలుకు పాటుపడుతున్న ఉద్యమాకారులలో అరునలైన వారిని కమిషనర్లుగా నియమించాలి. సమాచార కమిషనర్ల ఎంపికను పారదర్శక ప్రక్రియను పాటించి,వారు తమ విధులను పకడ్బంధిగా నెరవేర్చలా నిరంతరం ఒత్తిడి తెస్తూ జవాబు దారీతనం పెంచినట్లుయితే సహచట్టం నుంచి మెరుగైన ఫలితాలను సాధించగలుగుతాం. అలాంటి ప్రక్రియనే ఇతర అనేక కమిషన్లకూ వర్తింపచేయవచ్చు.
సరైన ఫలితాలు శూన్యం
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పనితీరును తనికీ చేసి,పొరపాటు జరిగితే సరిదిద్ది సమతూకం సాధించే బాధ్యత సంబంధిత కమిషన్లపై ఉంది. ప్రస్తుతం పలు కమిషన్లు ఆశించిన స్థాయిలో విధులను నిర్వహించడం లేదు. చాలా కమిషన్లు సీనియర్‌ పౌరుల క్లబ్బుల్లా తయారయ్యాయి. పనిలేకుండా పదివిని, దాంతోపాటు వచ్చే సౌకర్యాలు,పారితోషకాలను అనుభవించే మార్గాలుగా మారాయి. నేడు మానవ హక్కుల కమిషన్‌,మహిళా కమిషన్‌, లోకాయుక్త వంటి కమిషన్లు ఉన్నా..వాటి నుంచి ఆశించిన ఫలితాలు లభించడం లేదు. సము చిత అర్హతలున్న వ్యక్తులను కమిషన్లుగా నియమిస్తూ,వారి పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ సమాచార కమిషన్లను సమర్ధంగా పనిచేయించడంపై దృష్టి కేంద్రీకరించాలి.
సమీక్ష అవసరం
పౌర సమాజం సైతం సమాచార కమిషనర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేయాలి. వారి నిర్ణయాలను ప్రతినెలా పారదర్శకంగా సమీక్షించాలి. ప్రతి కమిషనర్‌ పనితీరుపై మూడు నెలలకు ఒకసారి మూల్యాంకన పత్రాన్ని ప్రచురించాలి. సమాచార కమిషనర్ల నిర్ణయా లను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ మూల్యాం కన పత్రాన్ని రూపొందించే పనిని న్యాయ కళాశాల విద్యార్ధులకు అప్పగించ వచ్చు.
జీవోలు ఇచ్చి వెనక్కి తగ్గిన సర్కారు
తెలంగాణ ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో విడుదల చేసిన మెమో నంబర్‌ 3476 ప్రకారం సహ చట్టం కింద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులకు సమాచారం ఇవ్వాలంటే సదరు ప్రజా సమాచార అధికారి వారి ప్రభుత్వ విభాగానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హైకోర్టు ఆ ఉత్తర్వు లను నిలిపివేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం వివరణ కోరడంతో ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేసి వాటి స్థానంలో నవంబర్‌12 న అంతర్గత ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రకా రం కోరిన సమాచారం తన వద్ద పూర్తిగా లేదని ప్రజా సమాచార అధికారి భావిస్తే ఉన్నతాధికారుల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ రెండు ఉత్తర్వుల్లో కొన్ని పదాలు మారినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం ఒకటే అన్నది స్పష్టమవుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వమైనా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ఆర్థిక వనరు లను,నిధుల వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు జీవోలను దాస్తూ పారదర్శకతకు తిలోదకాలు ఇస్తున్నది. అలాగే సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్ర సమాచార కమిషన్‌ లో11 నుంచి-12 మంది సమాచార కమిషనర్లు పనిచేయాలి. కానీ మన రాష్ట్ర కమిషన్‌ లో ప్రస్తుతం కేవలం ఆరుగురు సమాచార కమిషనర్లు మాత్రమే ఉన్నారు. మిగతా కమిషనర్లను నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు.
పనితీరు సరిగా లేక..
2017 సెప్టెంబర్‌లో కొత్తగా తెలంగాణ సమాచార కమిషన్‌ ఏర్పాటైంది. బదిలీ అయిన పిటిషన్లు 6,825 కలుపుకొని మొత్తం38 వేల పిటిషన్లు కమిషన్‌?కు అందగా ఇప్పటివరకు 31 వేల పిటిషన్లను పరిష్కరించామని కమిషన్‌ చెబుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో లెక్కలు మరోలా ఉన్నాయి. కొందరు సమాచార కమిష నర్ల షోకాజ్‌ నోటీసులు, జరిమానాల విషయం చూస్తే అర్థమవుతుంది. 2017 సెప్టెంబర్‌ నుంచి జూన్‌ 2022 వరకు సమాచార కమిషన్‌ 27,877 కేసుల్లో 753 కేసులకు సంబంధించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. వాటిలో కేవలం 38 మంది ప్రజా సమాచార అధికారులపై రూ.1,13,000 జరిమానాలు మాత్రమే విధించారు. ఒక్క కేసులో కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అప్పీళ్లు, ఫిర్యాదులు పరిష్కరించడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుందని ‘సతార్కు నాగరిక్‌ సంఘటన్‌’ నిరుడు అక్టోబర్‌ నెలలో విడుదల చేసిన తన నివేదికలో స్పష్టం చేసింది. కమిషన్‌ ఏర్పడిన ఈ ఐదేండ్లలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయిలో సమాచార కమిషన్‌ ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. చట్టం అమలుకు సంబంధించి కమిషన్‌ ఏటా వార్షిక నివేదిక విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం కేసులు, పరిష్కరించినవి ,పెండిరగ్‌లో ఉన్నవి, జరిమానాలు విధించినవి, క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయాలను ప్రస్తావించాలి. కానీ కమిషన్‌ ఏర్పడిన ఐదేండ్ల లో ఒక్కసారి కూడా వార్షిక నివేదికను విడుదల చేయలేదు.
స్వచ్ఛంద సమాచార వెల్లడి ఎక్కడ?
సమాచార హక్కు చట్టంలో సెక్షన్‌ 4(1)బి చట్టానికి గుండెకాయ వంటిది. ఇందులో 17 అంశాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల వివరాలు వారి విధులు, నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఆ కార్యాలయానికి వస్తున్న నిధులు, వాటి ఖర్చు వివరాలు వీటన్నిటిని సంబంధిత ప్రభుత్వ యంత్రాంగమే స్వచ్ఛందంగా ప్రజలకు తెలియజేయాలనేది నిబంధన. రాష్ట్రంలో దాఖలవుతున్న దరఖాస్తులు 60 శాతం ఈ సెక్షన్‌ పరిధిలో సమాచారం కోరుతూ వస్తున్నవే. కానీ చాలా ప్రభుత్వ కార్యాల యాల్లో అయిదారేండ్ల కిందటి పాత సమాచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ శాఖలను ప్రశ్నించాల్సిన సమాచార కమిషన్‌ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. ప్రజా సమాచార అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ కార్యాలయ సమాచారాన్ని సరైన విధంగా డిజిటలైజ్‌ చేయలేకపోతున్నారు.అన్ని ప్రభుత్వ విభాగాలు తమ బడ్జెట్‌లో ఒకశాతాన్ని డిజిటలైజేషన్‌తో పాటు,సమాచారం మెరుగ్గా నిర్వహించడానికి వ్యయం చేయాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దాన్నెవరూ పట్టించుకోవడం లేదు.జాగృత జన వాహిని పిడికిలి బిగించకుంటే సమాచార హక్కుకు గ్రహణం తథ్యమని యూఎఫ్‌ఆర్టీఐ రాష్ట్ర కో కన్వీనర్‌ అంకం నరేష్‌ అభిప్రాయపడ్డారు.
సహ చట్టాన్ని నీరుగారుస్తున్నారు – నార్నె వెంకట సుబ్బయ్య
ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకు,అందుబాటులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు తెలియచెప్పేం దుకు, పౌరులకున్న హక్కును చట్టబద్దం చేసేందుకు సమాచార హక్కు (సహ) చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసం పెద్ద పోరాటమే జరిగింది. ఈ చట్టం రాకముందు ఆఫిస్‌కి వెళ్ళి బల్ల మీద చెయ్యి పెట్టడానికి కూడా వుండేది కాదు. ఈ చట్టం వచ్చిన తరు వాత ఖచ్చితంగా అడిగిన సమాచారం ఇవ్వా ల్సిన అవసరం వచ్చింది. పౌరునికి చదువు రాకపోయినా వారు కోరినవిధంగా అధికారులే ఫిర్యాదు రాసి అప్లికేషన్‌ పూర్తిచేసి పెట్టాలి. ఒకవేళ ఫిర్యాదులో అచ్చుతప్పులు దొర్లినా, భాషా పరిజ్ఞానం లేకపోయినా విషయం అర్ధమైతే చాలు. సమచారం ఇవ్వాలి.అలాంటి చట్టం వున్నప్పటికీ ఈరోజు అధికారులు కావల సిన సమాచారం ఇవ్వకుండా తప్పించు కుంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. కొంతమంది అధికారులు కావాలని, ‘మీరు అడిగింది సెక్షను 8.1లోకో రెండు లోకో వస్తుంది కనుక సమాధానం ఇవ్వం’ అంటూ తప్పించుకుంటున్నారు. దేశ రక్షణకు సంబంధించినది అయితే ఇవ్వకూడదు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన అవి నీతి గురించి మీరేం చర్యలు చేపట్టారు,సదరు పని జరగకపోవటానికి కారణాలు తెలపండి అనడిగితే అవి చెప్పటానికి ఇష్టంలేక ‘దీనికి సమాధానం మా కార్యాలయంలో లేదు. మా పరిధి లోకి రాదు’ అని తిప్పి పంపుతున్నారు. వారి దగ్గర లేకపోతే ఎవరి దగ్గరవుందో, వారికి ఫిర్యాదు పంపి, ఐదు రోజులలోపు ఆ సమాచారం ఫిర్యాదుదారునికి తెలపాలి. అంతేగాని ఇవ్వకుండా వుండకూడదు. దీనికంతటికి కారణం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన ఆర్‌టిఐ కమిషన్‌ వారు సరైన చర్యలు తీసుకోకపోవటం. దీంతో అధి కారులు తప్పుడు సమాచారం ఇచ్చి సహ కార్య కర్తలను నిరుత్సాహ పరుస్తూ, చట్టాన్ని నీరుగారు స్తున్నారు. కనుక ఇకనైనా చట్టాన్ని, అందులోని సెక్షన్లను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకొని జరిమానా విధించాలి. అప్పుడే సహ చట్టం బతుకుతుంది.

ప్రాంతీయ అసమానతలు` పరిణామాలు

ప్రాంతీయ అసమానతలు,ప్రాంతీయ వాదం విడదీయ లేని కవల పిల్లలు.నాయకులు తమ రాజకీయ ఉనికి లేక అవసరార్థం ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించుతూ మరోవైపు ప్రజ ల్లో తలెత్తుతున్న అసంతృప్తిని భావోద్వేగాలకు ఉపయోగించు కొంటున్నారు.అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగడా నికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్రాధినేత లూ ఇందుకు తీసిపోలేదు. దేశంలో తరచుగా రాష్ట్రాధినేతలు ఇతర అభివద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రం పురోగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు అవసరమని కేంద్రా న్ని కోరుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా… అదే రాష్ట్రానికి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లా లతో సమానంగా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఒక్కపైసా అదనంగా విదల్చక పోవడమే నేటి విషాదం.
మనదేశంలో కొన్ని రాష్ట్రాలు అభి వృద్ధి చెందితే మరికొన్ని వెనకబడి వున్నాయి. ఒకే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది మరికొన్ని వెనకబడిఉన్నాయి.భారతదేశ అభి వృద్ధి సమైక్యతకు మూలాధారం సంతులిత ప్రాం తీయాభివృద్ధి. అందుకే ప్రణాళిక రూపకర్తలు ప్రణాళికాలక్ష్యాల్లో సంతులిత ప్రాంతీయాభి వృద్ధిని ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు.
కారణాలు..
సహజసిద్ధ అంశాలు
చారిత్రక అంశాలు
సహజ వనరులు
ప్రభుత్వ విధానం
కేంద్ర ప్రభుత్వ మూలధన పెట్టుబడి
ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర
పాలనా వ్యవస్థ
హరిత విప్లవం
అసమానతలు-కొలమానాలు
1) రాష్ట్ర తలసరి ఆదాయం 2) పేదరిక స్థాయి 3) మానవ అభివృద్ధి సూచిక 4) పారిశ్రామిక-ఉద్యోగిత 5) సహజ వనరుల లభ్యత, నీటి పారుదల సౌకర్యాలు 6)పట్టణీకరణ,7) విద్యు చ్ఛక్తి వినియోగం 8) బ్యాంకు డిపాజిట్లు
పారిశ్రామికాభివృద్ధి-ఉద్యోగిత మన దేశంలో పారిశ్రామికాభివృద్ధిలో తీవ్రమైన అసమానతలున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం తర్వాత పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. పారిశ్రామిక స్థిర మూలధనంలో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర,గుజరాత్‌ల్లో 34. 60%,పశ్చిమబెంగాల్‌24.65%అనగా 59.25% కలిగి ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు 63.03% ఉద్యోగిత,63.95%పారిశ్రామి కోత్ప త్తి కలిగిఉండటం తీవ్రమైన అసమానత లను తెలియజేస్తుంది. సహజ వనరుల లభ్యత,నీటి పారుదల సౌకర్యాలు పంజాబ్‌,హర్యానామొదలైనరాష్ట్రాల్లో నీటి పారుదల సౌకర్యాలు,సహజ వనరులు ఎక్కువ గా అందు బాటులో ఉండటం వలన వ్యవసా యం అభివృద్ధి చెందింది.ఆంధ్రప్రదేశ్‌,ఉత్తరప్ర దేశ్‌ల్లో కొన్ని ప్రాం తాల్లో కూడా వ్యవసాయం అభివృద్ధి చెందింది.
పట్టణీకరణ
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పట్టణీ కరణ జరిగి పట్టణ జనాభా ఎక్కువగా ఉంటు న్నది.జాతీయస్థాయిపట్టణ జనాభా31.2% కాగాతమిళనాడు(48.4%),మహరాష్ట్ర(45. 2%),గుజరాత్‌(42.6%),కర్ణాటక (38. 6%), పంజాబ్‌ (37.5%)మొదలైన రాష్ట్రాల్లో పట్టణ జనాభా ఎక్కువగా ఉంది.బీహార్‌ (11.3%), అసోం(14.1%)ఒడిశా (16.7%), ఉత్తరప్రదేశ్‌ (22.3%) వంటి రాష్ట్రాల్లో పట్టణజనాభా తక్కువ గా ఉంది.
విద్యుచ్ఛక్తి వినియోగం
తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం ప్రాం తీయ అసమానతలను తెలియ జేస్తుంది. 2009-10 గణాంకాల ప్రకారం జాతీయ స్థాయి తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం121.2కిలో వాట్లుకాగా ఢల్లీి 508.8,పంజాబ్‌257.3,తమిళనాడు 208.5కిలో వాట్లు ఉండగా బీహార్‌లో20.5,ఉత్తరప్రదేశ్‌ 83.4,మధ్యపదేశ్‌73.4కిలోవాట్లు మాత్రమేఉంది.
వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు
జాతీయస్థాయిలో తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు 2011మార్చి నాటికి రూ. 33,174వుండగాఢల్లీి రూ.2,85,400, మహ రాష్ట్ర రూ.82,380 కలిగి ఉండగా బీహార్‌ రూ. 9,667,అసోంరూ.16,393 తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు కలిగి ఉన్నాయి.
ప్రాంతీయ అసమానతలు -ప్రణాళికలు
దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులు మళ్లించడానికి వీలుగా ఆప్రాంతాల్లో సంస్థలు స్థాపించే పెట్టు బడిదారులకు తగిన ప్రోత్సాహకాలను కల్పించ డమే గాకుండా అవస్థాపనా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం,నీటివసతి,నైపుణ్యంగల శ్రామి కుల లభ్యత మొదలైన సౌకర్యాలను అందు బాటులోనికి తేవలసి ఉంటుంది. ఇందుకు ప్రభు త్వం అనేక కార్యక్రమాలను చేపట్టాలి. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతల గురించిన ప్రస్తాన లేనప్పటికీ,రెండో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాంతీయ అసమానతల తగ్గింపు అవస రాన్ని గుర్తించినారు. ఇందులో వెనుకబడిన ప్రాం తాల్లో పెట్టుబడులు కొనసాగించి సంతులిత ప్రాంతీయాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. మూడో పంచవర్ష ప్రణాలికలో సంతులిత ప్రాంతీ యాభివృద్ధి కొరకు 9 వఅధ్యాయాన్ని ప్రత్యేకంగా పేర్కొనారు.నాలుగో పంచవర్ష ప్రణాళికలో గ్రామీ ణ పేదలకు ప్రయోజనం చేకూర్చడానికి వీలుగా మొద లైన కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు.ఐదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగిం చడం కోసం నాలుగో పంచవర్ష ప్రణాళిక లోని కార్యక్రమాలని కొనసాగించినారు. ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగించ డానికి సమగ్ర విధానాన్ని రూపొందించారు. ఇం దులో భాగంగా ప్రాంతీయ ప్రణాళికలు,ఉప ప్రణాళి కలను అమలుచేసి జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానం చేశారు. ఏడో పంచ వర్ష ప్రణాళికలో ప్రాంతీయ అభివృద్ధి స్థాయికి రెండు అంశాలను గుర్తించినారు.1)వ్యవసాయ ఉత్పా దకత,మానవ వనరుల సామర్థ్యం పెంపు2) ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించడం. వీటికి అనుగుణంగా కార్యక్రమాలను రూపకల్పన చేయ డం.ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రణాళికా వ్యూహం సూచనాత్మక ప్రణాళికకు (Iఅసఱషa్‌ఱఙవ ూశ్రీaఅఅఱఅస్త్ర) మారడం మూలాన ప్రాం తీయ అసమానతల తగ్గింపునకు చూపే చొరవ తగ్గిన ప్పటికీ దీని కొరకు కొన్ని ప్రత్యేక కార్యక్రమా లను అమలు చేశారు. తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో ప్రాంతీయ అసమా నతలను తొలగించడానికి ప్రయివేటు పెట్టుబడులు దోహదపడలేదని కనుక తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ పెట్టుబడుల అవసరమని పేర్కొన్నారు. పదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయాభివృద్ధి కోసం రాష్ట్రాలవారీగా వృద్ధి లక్ష్యాలను నిర్ణయిం చారు.పదకొండో పంచవర్ష ప్రణాళికలో వెనుక బడిన ప్రాంతాల కొరకు ఏర్పాటు చేశారు. పన్నెండో పంచవర్ష ప్రణాళికలో నిధుల వినియోగం కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొం దించారు.పారిశ్రామికంగా అభివృద్ధి చెందని ప్రాం తాల్లో,వ్యవసాయం,దాని అనుబంధ పరిశ్ర మలలో, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కార్యక్ర మాల్లో నిధులను వినియోగించాలని పేర్కొన్నారు.
వెనుకబడిన ప్రాంతాలు – అసమానతలు!
ప్రాంతీయ అసమానతలు,ప్రాంతీయ వాదం విడదీయ లేని కవల పిల్లలు.నాయకులు తమ రాజకీయ ఉనికి లేక అవసరార్థం ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించుతూ మరోవైపు ప్రజ ల్లో తలెత్తుతున్న అసంతృప్తిని భావోద్వేగాలకుఉప యోగించుకొంటున్నారు.అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగడా నికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్రాధినేత లూ ఇందుకు తీసిపోలేదు. దేశంలో తరచుగా రాష్ట్రాధినేతలు ఇతర అభివద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రం పురోగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు అవసరమని కేంద్రా న్ని కోరుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా… అదే రాష్ట్రానికి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లా లతో సమానంగా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఒక్కపైసా అదనంగా విదల్చక పోవడమే నేటి విషాదం.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46(3)లో రాయలసీమ ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పొందు పర్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2014ఫిబ్రవరి 20వ తేదీ రాజ్య సభలో మాట్లాడుతూ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లా లకు బోలంగీర్‌ కలహండి తరహాలో ప్రత్యేక ప్యాకే జీ ఇస్తామన్నారు.కాగామధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌లో వ్యాపించివున్న బుందేల్‌ ఖండ్‌ తరహాలో ఈప్యాకేజీ వుంటుందన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభు త్వం రూ.24,350 కోట్లతో ప్రతిపాదన లు కేంద్రా నికి పంపితే ముష్టిగా జిల్లాకు రూ.50 కోట్లుచొప్పున మూడేళ్లు ఇచ్చి తర్వాత ఎగ్గొట్టారు. ఇప్పటికీ సవా లక్ష కొర్రీలు వేస్తున్నారు. విభజన చట్టం సెక్షన్‌ 94 (3)మేరకు వెనుక బడిన జిల్లాల్లో భౌతిక సామాజిక వనరులు అభివృద్ధి చేయాలి.ఈచట్ట బద్దహక్కులు హుష్‌ కాకి అయ్యాయి.ఇక ప్రత్యేక హోదా వుండనే వుంది. నాణేనికి ఇది ఒకవైపు అయితే మరో వైపు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల ఫలితంగా ప్రజల్లో నివురు గప్పిన నిప్పులాగా వున్న అసంతృప్తిని కొందరు నేతలు తమ రాజకీయ అవసరార్థం ఉపయోగించు కొంటున్నారు. వాస్తవంలో ఆయా వెనుకబడిన ప్రాంతాల భౌతిక పరిస్థితులు ప్రజల అవసరాలు వీటితో పాటు వారి వాంఛలు ఆధారం చేసుకొని ప్రత్యేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయా లి.కాని ఆదిశగా చర్యలు లేక పోవడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు గాని రాయలసీమలో కొందరు నేతలే కాకుం డా ప్రత్యేకిం చి ఒకసెక్షన్‌ యువత వేర్పాటు వాదం తెర మీదకు తెస్తున్నది. ఉత్తరాంధ్రలో విస్తారమైన సముద్ర తీరం వున్నందున పైగా విశాఖలో నౌకాదళం కేంద్రం వున్నందున మిగతా జిల్లాలతో పోల్చుకొంటే విశాఖ జిల్లా కొంత మెరుగ్గా వుంది. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా వున్నప్పుడే వైయస్‌ రాజశేఖర రెడ్డి హ యాంలోఉత్తరాంధ్ర సుజల స్రవంతిరూపుద్దు కున్నది. ఈ పథకం అమలు జరిగితే ఉత్తరాంధ్రలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు 30లక్షల మందికి తాగునీటి వసతి ఏర్పడుతుంది. విజయ నగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు శ్రీకాకుళం జిల్లాలో0.85లక్షల ఎకరాలకు సాగునీరు అందు తుంది. ఈ మూడేళ్ల కాలంలో ఎప్పుడైనా మంత్రు లు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావులు ఈ పథకం అమలు జరగలేదని మంత్రి పదవులకు రాజీనామాకు సిద్ధమై వుంటే వీరి చిత్తశుద్ధి శంకించ లేము. కాని భావోద్వేగాలతో ప్రజల్ని రెచ్చగొట్టేం దుకు మంత్రి పదవులు త్యాగం చేస్తామంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి అనుసం ధానం ఏళ్ల కొద్దీ ఎందుకు నానుతుంది? వంశధా రపై నెరెడి బ్యారేజీ నిర్మాణంగుర్తు వుందా? వ్యవ సాయంపై ఆధారపడే లక్షలాది మంది ఉత్తరాంధ్ర రైతులకు సాగునీరు కావాలా?ఇవేవీ లేకుండా పరిపాలన రాజధాని కావాలా?పోలవరం ప్రాజెక్టు నుండి విశాఖ తాగునీటికి23.99 టియం సిలు నీరు కేటాయించారు. పోలవరం గాలిలో దీప మైంది!
రాయలసీమ పరిస్థితి మరీ దుర్భరంగా వుంది.ఈ ప్రాంతంలో విస్తారమైన బీడు భూములు న్నాయి. ఎక్కువ భాగం వర్షాధార పంటలైనందున మొత్తంగా నీళ్లు,నీళ్లు అని ప్రజలు తుదకు తాగు నీటికి తపిస్తుంటారు. ఈ ఏడు విస్తారంగా వర్షాలు పడ్డాయి. కాని గ్రామాల్లో ఉపాధి లేక గ్రామాలకు గ్రామాల ప్రజలు వలసలు పోతున్నారు. మరీ దారుణమేమంటే కెసి కెనాల్‌ కింద ఆయకట్టులో పెట్టిన పంటలకు నీళ్లు అందే అవకాశం లేదని నేడు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాటికే హంద్రీనీవా కింద కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం లో పంటలు ఎండిపోయాయి.
బచావత్‌ ట్రిబ్యునల్‌ కెసి కెనాల్‌కు తుంగభద్ర నుండి39.9టియంసిలు నీరు కేటాయిం చినది. దురదృష్టం ఏమంటే దశాబ్దాలు గడుస్తున్నా 2.65 లక్షల ఎకరాలు ఆయకట్టుగల కెసి కెనాల్‌ కు 1.25 టియంసిలు సామర్థ్యం గల సుంకేసుల బ్యారేజీ తప్ప నీళ్లు నిల్వ చేసే వసతి లేదు.2.965 టియంసిలు నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అలగ నూరు రిజర్వాయర్‌ లో నీరు నిల్వ చేసే అవకాశం లేక పశువుల మేత పొరంబోకుగా వుంది. బచా వత్‌ ట్రిబ్యునల్‌గాని బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గాని సుంకేసులబ్యారేజీ నుండి(21ం10) టియం సిల నీరు మాత్రమే శ్రీశైలం జలాశయం చేరు తుందని తేల్చారు. కాని ఏటా వందల టియంసిలు కలుస్తున్నాయి. ట్రిబ్యునల్‌ కేటాయింపులు అరకొరగా వున్నా చట్టబద్దతగల నీళ్లువర్షపు నీరునిల్వ చేసుకొనే ఏర్పాట్లు జరిగి వుంటే రాయలసీమలో కొంతలో కొంత నీటి కొరత తీరేది.కెసి కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన గుండ్రేవుల రిజర్వాయర్‌ హుళక్కి అయింది. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం న్యాయ రాజధాని రెండు పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి రాయలసీమను కోనసీమ చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం కోర్టు వివాదంలో చిక్కుకున్నది. న్యాయ రాజధాని కాదు కదా తుదకు కృష్ణ యాజ మాన్య బోర్డు కార్యాలయం గతి లేకపోయింది. ఈ మధ్య సీమ రైతులు రోడెక్కి సిద్దేశ్వరం కోసం పోరాటం మొదలు పెట్టారు. దురదృష్టమేమంటే రాయలసీమలో చిన్న కాలువ తవ్వాలన్నా తెలం గాణ ఇంజనీరింగ్‌ చీఫ్‌ యాజమాన్యం బోర్డుకు రేఖరాసి అడ్డుకొంటున్నారు. ఇరువురు ముఖ్య మంత్రులు బాగానే వున్నా (చంద్రబాబుతో పోల్చితే) రెండు రాష్ట్రాల మధ్యగల అంతర్‌ రాష్ట్ర జల వివాదాలు సామరస్యంగా పరిష్కారానికి కృషి జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోం ది. కాగా గత ప్రభుత్వం ఏంచేసింది అనేది పక్కన పెడితే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మూడేళ్ల కాలం లో సాగునీటి రంగంలో 19 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిందంటే ఇందులో వెనుక బడిన ప్రాం తాల భాగం అతి స్వల్పమే. రాష్ట్రంలో వెనుకబడిన ఈ రెండు ప్రాంతాల్లో పరిస్థితులు దుర్భరంగా వున్నాయి. ప్రాంతీయ అసమానతలు నెలకొన్నాయి. అవేవీ పట్టించుకోకుండా పరిష్కార మార్గాలు చూడ కుండా పాలకులు కాలం వెళ్లదీస్తే కుదరదు. -వ్యాసకర్త : విశ్రాంత పాత్రికేయులు- (వి.శంకరయ్య)

ఎస్టీలను అధికారికంగా గుర్తించిన ఆర్టికల్‌ ఏదీ?

దేశంలో ఎస్టీలు ఆర్థికంగా దోపిడీకి గురైన వర్గం. అందువల్ల వీరి సంక్షేమంలో ఆర్థిక పరమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుం ది.2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా…షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం.సమాజం విసిరే సవాళ్లను అధిగమించడానికిగాను ప్రభుత్వం అవలంబించే విధానాన్ని సామాజిక విధానం అంటారు. ప్రభుత్వాల అంతిమ లక్ష్యం అణగారిన వర్గాల అభ్యున్నతి. అందువల్ల ప్రభుత్వాలు అణగారిన వర్గాల కోసం ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలుచేస్తున్నాయి. చారిత్రకంగా పరిశీలిస్తే యూరప్‌లో సంభవించిన పారిశ్రామిక, ఫ్రెంచ్‌ విప్లవం,అమెరికాలో ఏర్పడిన మహా ఆర్థిక మాంద్యం ఫలితంగా దేశ ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వాలు బలమైన శక్తిగా అవతరించాయి. ప్రభుత్వాలు ఆర్థిక లక్ష్యాలతోపాటు సామాజిక న్యాయం,సమానత్వం, సాధికారత వంటి సామాజిక లక్ష్యాలను రూపొందించుకొని అమలుచేస్తున్నాయి. 1834లో ఇంగ్లండ్‌లో రూపొందించిన పూర్‌ లా సంక్షేమ యంత్రాంగానికి ఆధారంగా నిలిచింది. ఐరోపాలో ఉదయించిన సంక్షేమ రాజ్య భావన క్రమంగా భారత్‌తో సహా అన్ని దేశాలకు విస్తరించింది. 1950వ దశాబ్దంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ప్రాంతాల్లో ఏర్పడిన తృతీయ ప్రపంచ దేశాలు సంక్షేమ రాజ్యాన్ని నిర్మించుకున్నాయి. ఇందులో భారతదేశం కూడా ఒకటి కావడం విశేషం. దేశంలో సంక్షేమ యంత్రాంగానికి మూలం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలుషెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం భారతీయ సామాజిక చరిత్రలో సామాజిక దోపిడీకి గురైన షెడ్యూల్డ్‌ కులాలను స్వాతంత్య్రానంతరం సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రక్షించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో 16.6 శాతం జనాభాను కలిగి ఉన్న షెడ్యూల్డ్‌ కులాలను 1108 రకాల పేర్లతో పిలుస్తున్నారు. భారత ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమాన్ని మూడు మార్గాల ద్వారా కొనసాగిస్తున్నది.

  1. రాజ్యాంగ రక్షణలు
  2. విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు
  3. ఆర్థిక సహాయం అందించడం
    రాజ్యాంగ రక్షణలు
    ఆర్టికల్‌-14: చట్టం ముందు అందరూ సమానులే. సమన్యాయ పాలన అంటే షెడ్యూల్డ్‌ కులాలపరంగా సమాజం, ప్రభు త్వం సామాజిక సమానత్వం, భాగస్వామ్యం కల్పించాలి. ఆర్టికల్‌-15(4): ప్రభుత్వ అవకాశాలపరంగా ముఖ్యంగా సామాజిక, విద్య, ఆర్థికాంశాల పరంగా షెడ్యూల్డ్‌ కులాలకు ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించవచ్చు. ఆర్టికల్‌-16 (4): ఉద్యోగాలు, ఇతర సర్వీసులలో షెడ్యూల్డ్‌ కులాలకు సరైన భాగస్వామ్యం లేనప్పుడు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు.
    ఆర్టికల్‌-17: అంటరానితనం నిషేధం
    ఆర్టికల్‌-23: వెట్టిచాకిరీ, కట్టు బానిసత్వం, జోగిని, దేవదాసీ మనుషుల అక్రమ రవాణా నిషేధం
    ఆర్టికల్‌-24: బాలకార్మిక వ్యవస్థ నిషేధం
    ఆర్టికల్‌-46: షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర బలహీనవర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఆర్టికల్‌-330: లోక్‌సభలో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్‌ ఆర్టికల్‌-332: శాసనసభల్లో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్‌ ఆర్టికల్‌-338: ఎస్సీ,ఎస్టీల రాజ్యాంగ రక్షణల అమలుతీరును, వారి సంక్షేమాన్ని సమీక్షించేందుకుగాను ప్రత్యేక కమిషన్ల ఏర్పాటు్ఆర్టికల్‌-341: 1950లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల గుర్తింపు
    షెడ్యూల్డ్‌ కులాలకు విద్య,ఉపాధిపరంగా రిజర్వేషన్లను కల్పించటం,వారి విద్యా భివృద్ధికి ఉపకారవేతనాలు,హాస్టల్‌ వసతులు,పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణను అందిస్తున్నారు.
    ఎస్సీలకు ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో ఆరో పంచవర్ష ప్రణాళికలో స్పెషల్‌ కంటెంట్‌ ప్లాన్‌ను ప్రారంభించారు. చిన్న,సన్నకారు దళిత రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఆదాయ మార్గాలను పెంచుతారు.
    ఎస్సీలకు ఆర్థిక సహాయాన్ని అందించి వారు స్వయం ఉపాధిమార్గాలను ఎంచుకొనే ఉద్దేశంతో 1989లో జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.
    ప్రస్తుతం ఎస్సీలకు సంబంధించిన పరిపాలన,యంత్రాంగం సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్నది.
    స్వాతంత్య్రానంతరం భారతదేశంలో సంక్షేమ కార్యక్రమా లు 1952 నుంచి 1985 వరకు హోంశాఖ ఆధ్వర్యంలో కొనసాగాయి.
    1985లో సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు.
    1998లో దాని పేరును సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వ శాఖగా మార్చారు.
    గిరిజన సంక్షేమం
    దేశంలో ఎస్టీలు ఆర్థికంగా దోపిడీకి గురైన వర్గం. అందువల్ల వీరి సంక్షేమంలో ఆర్థికప రమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. 2011జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా 8.6 శాతం.
    -దేశంలో అధికారికంగా 744 తెగలను గుర్తించారు. వీటిలో భిల్లులు,గోండ్‌, సంతాల్‌ తెగలకు చెందినవారు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నారు. దేశంలో ఎస్టీల సంక్షేమానికి మూడు మార్గాలను అవలం బిస్తున్నారు.
  4. రాజ్యాంగ రక్షణలు
  5. విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు
  6. ఆర్థిక సహాయం అందించడం
    । ఎస్సీల సంక్షేమానికి సంబంధించిరాజ్యాంగ రక్షణలోని 17,341 ఆర్టికల్స్‌ తప్ప మిగ తావి ఎస్టీలకూ రక్షణగాఉంటాయి.
    । ఆర్టికల్‌-19(5): గిరిజనుల ఆస్తుల రక్షణ
    । ఆర్టికల్‌-164: జార్ఖండ్‌, ఒడిశా, మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమానికి సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
    । ఆర్టికల్‌-244: ప్రత్యేక ప్రాంతాల పరి పాలన కోసం5,6 షెడ్యూళ్లను ఏర్పాటు చేశారు.
    । ఆరో షెడ్యూల్‌ ప్రకారం అసోం, మేఘాలయ,మిజోరం,త్రిపుర రాష్ట్రాల్లో గిరిజన పరిపాలన వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఆరో షెడ్యూల్‌లోని రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అంశాలను ఐదో షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
    । ఐదో షెడ్యూల్‌ పరిపాలనను గవర్నర్‌ నియంత్రణలో ఉంచుతుంది.
    । ఆర్టికల్‌-342: షెడ్యూల్డ్‌ తెగలను అధికారికంగా గుర్తించారు.
    । 1999లో కేంద్రంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు.
    । ఐదో ప్రణాళికలో గిరిజన ఉప ప్రణాళికను రూపొందించారు.
    । గిరిజన ఉప ప్రణాళిక ప్రకారం గిరిజన ప్రాంతాల పరిపాలన,అభివృద్ధికి నాలుగు మార్గాలను ఎంచుకున్నారు.
    । నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉన్న మొత్తం జనాభాలో గిరిజన జనాభా 50శాతం. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 194.
    । 10 వేలు లేదా అంతకంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో మాడా ప్రాజెక్టులనుఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 259.
    । 5 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో గిరిజన జనాభా 50శాతంపైబడి ఉన్న ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య-82
    । గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన తెగలను గుర్తించి వాటిని అభివృద్ధి చెందించే ఉద్దేశంతో ప్రాచీన గిరిజన సముదాయ ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రస్తుతం వీటి సంఖ్య 75.
    । గిరిజనులకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థ ఉన్నందువల్ల వాటిస్థానంలో స్థానిక ప్రభు త్వాలను ఏర్పాటుచేసే ఉద్దే శంతో 1996లో పెసా (ూaఅషష్ట్రa వa్‌ష్ట్రఱ జుఞ్‌వఅంఱశీఅ ూషష్ట్రవసబశ్రీవస Aష్‌)ను రూపొందించారు.
    । గిరిజనుల అటవీ ఉత్పత్తులకు సరైన ధర, మార్కెటింగ్‌ సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 1987లో గిరిజన సహకార మార్కెటింగ్‌ అభివృద్ధి సమాఖ్యను ఏర్పాటుచేశారు.
    । ఎస్టీలకు ఆర్థిక సహాయాన్ని అందించి స్వయం ఉపాధి ద్వారా వారి ఆదాయమార్గాలను పెంచే లక్ష్యంతో 2001లో జాతీయ షెడ్యూల్డ్‌ తెగల ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.
    వెనుకబడిన తరగతుల సంక్షేమం
    । భారతీయ సామాజిక నిర్మాణంలో అగ్ర వర్ణాలకు, అస్పృశ్యులకు మధ్యస్థంగా ఉన్న మధ్య తరగతి వర్గాలను వెనుకబడిన తరగతులుగా గుర్తిస్తారు.
    । ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలు కూడా ప్రాచీన కాలం నుంచి సామాజికంగా, ఆర్థికంగా దోపిడీకి గురయ్యారు.
    । భారత రాజ్యాంగ రూపకల్పన దశలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని వీరికోసం ప్రత్యేకంగా రాజ్యాంగ నిబంధనలను రూపొందించారు.
    । రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 340లో వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన చర్యలను
    । సమీక్షించేందుకుగాను రాష్ట్రపతి ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది.
    । దీని ప్రకారం జాతీయస్థాయిలో రెండు కమిషన్లను ఏర్పాటుచేశారు.
    । 1.1953లో కాకా సాహెబ్‌ కాలేల్కర్‌ కమిషన్‌
    । 2.1978లో బీపీ మండల్‌ కమిషన్‌
    । కాలేల్కర్‌ కమిషన్‌: ఇది 1953 జనవరిలో ఏర్పాటయ్యింది.
    । కమిషన్‌ ప్రధాన విధి ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర వర్గాలకు చెందిన ప్రజల విద్యాపరమైన, సామాజికపరమైన వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రమాణాలను నిర్ణయించడం.
    । వీటి ఆధారంగా వెనుకబడిన తరగతుల జాబితాను గుర్తించడం
    । ఈ కమిషన్‌ సామాజిక అంతస్తు, కుల క్రమశ్రేణి ఆధారంగా 2700 కులాలతో కూడిన జాబితాను తయారుచేసి 1955లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
    । ఈ కమిషన్‌ మహిళలను కూడా బీసీలుగా గుర్తించింది.
    । ఈ కమిషన్‌ తన నివేదికను 1956లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే వివిధ కారణాల వల్ల ఇది ఆమోదం పొందలేదు. -జిఎన్‌వి సతీష్‌

రాజ్యాంగమే సర్వోన్నతం

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 73 ఏళ్లు పూర్తయి, 74వ సంవ త్సరంలోకి అడుగు పెడుతున్నది. ఈ సమ యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నవారు, రాజ్యాంగ పదవులలో ఉన్న ఉపరాష్ట్రపతి, గవర్నర్లు వంటి వారు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపం,లక్ష్యాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు.2014లో నరేంద్రమోడీ అధికా రంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు, మూడు వ్యవసాయ చట్టాలు, జాతీయ విద్యావిధానం-2020 మొదలైనవన్నీ రాజ్యాంగవిరుద్ధమే. రాష్ట్రాలతో సంప్రదిం చటంగానీ,చర్చించటంగాని చేయకుం డానే ఈ విధానాలను అమలు చేయటం, చట్టాలు చేయటం వంటి వాటికి కేంద్రం పాల్పడిరది. ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. ప్రాథమిక హక్కులలో ప్రధానమైన స్వాతంత్య్రపు హక్కును హరిస్తూ ‘భావప్రకట నా స్వేచ్ఛ’ను అణచివేస్తున్నది. అనేకమందిని ‘ఉపా’ చట్టం కింద అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఢల్లీిలో గల జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ,ఢల్లీియూనివర్శిటీల్లో జరుగు తున్న సంఘటనలు రాజ్యాంగ హక్కుల హరణ కు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ నేపథ్యంలో సర్వోన్న తమైన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రజాస్వామ్య శక్తులపై ఉన్నది.
ఇటీవల జైపూర్‌లో జరిగిన83వ అఖి ల భారత స్పీకర్ల సమావేశంలో ఉపరాష్ట్రపతి జగ దీప్‌ ధన్‌కర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజ లు ఎన్నుకున్న పార్లమెంట్‌ ఆధిక్యత కలిగి ఉం డాలని,పార్లమెంటరీ సార్వభౌమాధికారం ఉండా లని వాదన చేశారు.ఇదిరాజ్యాంగ సూత్రాలకు పూర్తి విరుద్ధం. ఆధునిక ప్రజాస్వామ్యాలు ప్రారంభ మైన తరువాత ఫ్రెంచ్‌ న్యాయ నిపుణుడు మాంటెస్క్యూ ‘ది స్పిరిట్‌ ఆఫ్‌ లాస్‌’అనే గ్రంథాన్ని రాశారు. ప్రభు త్వ అంగాలైన శాసన వ్యవస్థ (లెజిస్లేచర్‌), కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్‌), న్యాయ వ్యవస్థ (జ్యుడిషియరీ)-మూడు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయించరాదని, ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని విజయ వంతంచేయాలని దానిలో చెప్పారు. అమెరికా రాజ్యాంగంలో మాంటిస్క్యూ ప్రతిపాదించిన ‘అధి కార పృథక్కరణ’ సిద్ధాంతాన్ని ‘చెక్స్‌ అండ్‌ బాలె న్సస్‌’పేరుతో అమలు చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు డాపపఅంబేద్కర్‌ నాయకత్వాన రాజ్యాం గంలో ప్రభుత్వ అంగాలు మూడిరటి మధ్య ఆధిప త్యం ఉండరాదని భావించారు. ఈమూడు వ్యవస్థలు తాను విధించిన పరిధిలోనే పనిచేయాలని రాజ్యాం గం స్పష్టం చేసింది.కేంద్ర న్యాయశాఖా మంత్రి తో సహా అనేకమంది అధికార పార్టీ ప్రముఖు లు న్యాయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవా లనే వాదనలు చేస్తున్నారు.
న్యాయ సమీక్షాధికారం
అమెరికన్‌ సుప్రీంకోర్టు 1803లో తొలిసారిగా మాడిసన్‌ వర్సెస్‌ మార్బరీ కేసులో తొలిసారిగా న్యాయవ్యవస్థకు న్యాయ సమీక్షాది óకారం ఉందని ప్రకటించింది. న్యాయ సమీక్షాధి కారాన్ని ‘జ్యుడిషియల్‌ రివ్యూ’ అంటారు. న్యాయ సమీక్షాధికారం అనగా ‘పార్లమెంట్‌ చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా (అల్ట్రా వైర్స్‌) ఉంటే అవి చెల్లవు (నల్‌ అండ్‌ వాయిడ్‌) అని ప్రకటించటం. న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ పరిరక్షణకు, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు తోడ్పడుతుంది. భారత రాజ్యాంగంలో 13వ నిబంధన భారత న్యాయ వ్యవస్థకుగల న్యాయ సమీక్షాధికారాన్ని వివరిం చింది.గత73ఏళ్లలో పార్లమెంట్‌ చేసిన అనేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను భారత సుప్రీం కోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించు కొని కొట్టివేసింది.1952లో వి.జి.రావు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసులో సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ పతంజలి శాస్త్రి ‘న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం తమపై పెట్టిన బాధ్యతను న్యాయస్థానాలు నెరవేర్చడమే తప్ప పార్ల మెంట్‌పై తమదే పైచేయి అని నిరూపించు కోవడానికి కాదని స్పష్టం చేశారు.న్యాయ సమీక్షాధికారంలో భాగంగా జస్టిస్‌ వి.ఆర్‌. కృష్ణయ్యర్‌, జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి, జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి, జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ మొదలైన న్యాయమూర్తులు అత్యున్నతమైన తీర్పులు ఇచ్చారు.
కేశవానంద భారతి కేసు-మౌలిక స్వరూపం
2023 జనవరి 7వ తేదీన రాజ్యసభ సమావేశాలలోను, ఇటీవల జైపూర్‌లో జరిగిన 83వ భారత శాసనసభల స్పీకర్ల సమావేశంలోను ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌…భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంపై కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 1973లో ఇచ్చిన తీర్పుతో తాను ఏకభ వించడంలేదని విపరీత వాదన చేశారు. పార్లమెం ట్‌ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు, హైకోర్టులు సమీక్షించి ఆచట్టాలనురద్దుచేస్తే ప్రజాభిప్రా యాన్ని, పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని తిరస్కరించి నట్లని ఆయన భాష్యం చెప్పారు.
పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరణచేసే అధికారం లేదని 1967లో గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.దీనికి భిన్నంగా 1973లో కేశవా నంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు…రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చ కుండా సవరణ చేయవచ్చని తీర్పు చెప్పినది. ఈ తీర్పు 368వనిబంధన కింద రాజ్యాంగాన్ని సవరిం చడానికి పార్లమెంట్‌కు గల అధికారాలపై పరిమితి విధించింది.పార్లమెంట్‌లో మెజారిటీ ఉందనే కార ణంతో నిరంకుశంగా రాజ్యాంగాన్ని సవరించే ధోర ణిని అరికట్టడానికి, కీలక రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి ఈ తీర్పు దోహద పడుతుందని ఆనాడు న్యాయ నిపుణులు,రాజకీయ పార్టీలు హర్షం వెలిబుచ్చాయి.
కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో(1973)సుప్రీంకోర్టు తీర్పు చారిత్రా త్మకమైనది.ఆ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ‘మౌలిక స్వరూపాన్ని’ (బేసిక్‌ స్ట్రక్చర్‌) వివరించింది. కేసును విచారించటానికి 13 మంది న్యాయమూర్తు లతో ధర్మాసనం ఏర్పడి విచారణ చేసింది. జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌, జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా, జస్టిస్‌ ఎ.ఎన్‌.రే,జస్టిస్‌ సిక్రి,జస్టిస్‌ గ్రోవర్‌వంటి ఉద్దండులు ధర్మాసనంలో ఉన్నారు.రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని మార్చే, సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు లేదని తీర్పు చెప్పారు.రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని నిర్వచించారు. రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం, న్యాయ సమీక్షాధికారం, లౌకిక విధానం, ప్రాథమిక హక్కులు మొదలైనవాటిని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధి కారం ఉన్నది కాని రాజ్యాంగ మౌలిక స్వభావా నికి భంగం కలగని విధంగా మాత్రమే పార్లమెంట్‌ తన అధికారాన్ని వినియోగించాలని ఈకేసు ద్వారా నిర్ధారణ జరిగింది. 1980లో సుప్రీంకోర్టు మినర్వా మిల్స్‌ కేసులో ప్రాథమిక హక్కులు,ఆదేశిక సూత్రాల మధ్య సమతౌల్యత ఉండాలని స్పష్టంగా పేర్కొన్నది. ఇటీవలఉపరాష్ట్రపతితో సహా అనేక మంది బి.జె.పి నాయకులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిరాక రించి,పార్లమెంట్‌ ఆధిక్యత ఉండాలని ప్రచారం చేయటం పూర్తి రాజ్యాంగ విరుద్ధం.
రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్లు
భారతరాజ్యాంగం పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని ప్రవేశపెట్టింది.దీని ప్రకారం కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వానగల మంత్రి మండలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వానగల మంత్రి మండలి నిజమైన అధికారాలు కలిగి ఉంటాయి. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ నామ మాత్ర అధిపతులుగా ఉంటారు. రాజ్యాంగంలో 163వ నిబంధన ప్రకారం మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్‌ వ్యవహరించాలి. కాని కొన్ని సమ యాల్లో గవర్నర్లు కేంద్రానికి,రాష్ట్రాలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించకుండా,కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో రామ్‌లాల్‌,కుముద్‌ బెన్‌జోషి వంటి గవర్నర్లు ఎన్నో వివాదాలు సృష్టించారు.రాష్ట్ర ప్రభు త్వానికి ఇబ్బందులు కల్పించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ హయాంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో గవర్నర్లు ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇటీవల తమిళనాడు గవర్నర్‌ రవి, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న తీరు ఎన్నో విమర్శలకు గురైంది.గతంలో కొన్ని కమిటీలు గవ ర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని సిఫార్సులు చేయగా, కేంద్ర-రాష్ట్రసంబంధాలపై నియమించిన సర్కారి యా కమిషన్‌…గవర్నర్ల పనితీరుపై కొన్ని పరిమితు లు ఉండాలని కొన్ని సూచనలు చేసినది. పార్లమెం టరీ విధానం కొనసాగుతున్న భారత దేశంలో గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి.
రాజ్యాంగం ఉన్నతమైనది
పార్లమెంట్‌లో పాలక పార్టీలకు మెజారిటీ వస్తూ, పోతూ ఉంటుంది.రాజ్యాంగం,దానిస్ఫూర్తి, రాజ్యాంగ విలువలు శాశ్వతంగా ఉంటాయి. పార్ల మెంటు, ప్రభుత్వం,న్యాయ వ్యవస్థ వీటన్నిటి ఉని కికి రాజ్యాంగమే మూలాధారం.ఈ మూడు వ్య వస్థలు తమ,తమ పరిధిలో పనిచేయాలని రాజ్యాం గం స్పష్టం చేసినది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం గత తొమ్మి దేళ్లుగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు చేస్తున్నది. సమాఖ్య విధానం లో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు విభజిం చబడి ఉంటాయి.రాజ్యాంగ 7వషెడ్యూల్‌లో కేంద్ర జాబితా,రాష్ట్ర జాబితా,ఉమ్మడి జాబితా లుగా అధికార విభజన జరిగింది. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండగా రాష్ట్రాలతో సంప్రదించ కుం డానే కేంద్రం మూడు వ్యవసాయచట్టాలు చేయటం తో లక్షలాదిమంది రైతులు సుమారు 400 రోజుల పాటు ఉద్యమం చేయడంతో ఆచట్టాలు ఉపసం హరించుకోక తప్పలేదు. ఇది రైతాంగ ఉద్యమం ఉమ్మడిగా సాధించిన ఘనవిజయం. అలాగే విద్య ఉమ్మడి జాబితాలో ఉండగా,రాష్ట్రాలతో చర్చించ కుండానే కరోనా సమయంలో కేంద్రం జాతీయ విద్యావిధానం-2020 ఏకపక్షంగా ప్రకటించింది. అందువలన తమిళనాడు, కేరళ వంటి ప్రభుత్వాలు దీనిని అమలు చేయటానికి నిరాకరించాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేయకుండా ఉండటానికి కేంద్రం ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో పేర్కొన్న లౌకిక వాదాన్ని,భిన్నత్వాన్ని,బహుళత్వాన్ని దెబ్బతీసి ప్రజల మధ్య మతపరమైన విభజన తేవటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారతరాజ్యాంగ లక్ష్యా లు,విలువలను కాపాడుకోవటానికి రాజ్యాంగ మౌ లిక స్వరూపాన్ని సంరక్షించుకోవటానికి ప్రజాస్వామ్య వాదులు, అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు, ప్రజాసంఘాలు,దళిత,గిరిజన,వెనుకబడిన తరగ తుల సంఘాలు… అందరూ కృషి చేయ వలసిన అవసరాన్ని గణతంత్ర దినోత్సవం గుర్తు చేస్తున్నది. – కె.ఎస్‌.లక్ష్మణరావు

1 2