సామాజిక విప్లవకారిణి సావిత్రిభాయి ఫూలే

తలపై ముసుగు ధరించిన ఓ యువతి బడిలో పాఠాలు చెప్పడానికని వడివడిగా నడిచి వెళ్తోంది. ఆమెను చూసిన ఒక బ్రాహ్మణ స్త్రీ ఆగ్రహంతో అసలిదేంపని? అంటూ అవమానిస్తూ… పేడ ముద్దలు విసిరారు. కుల ప్రసక్తి లేని – ఒక బాలికల పాఠశాలను ప్రారంభించేందుకు వెళుతున్న సందర్భంగా 1851వ సంవత్స రంలో సావిత్రిబాయికి ఎదురైన అనుభవం ఇది. అయినా ఆమె భయపడలేదు. తన లక్ష్యసాధన కోసం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనడానికైనా సిద్ధపడిరది. సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి 186వ జన్మదినం సందర్భంగా జనవరి 3న ‘గూగుల్‌ ’ ఆమెకోసం ప్రత్యేకంగా నివాళి అర్పించటం ఆమెకే కాదు.. మన దేశానికే గర్వకారణం.
పశ్చిమ మహారాష్ట్రలోని సతారా జిల్లా నయ్‌గావ్‌ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో 1831 జనవరి 3వతేదీన సావిత్రీబాయి జన్మిం చారు.ఆనాటి సంప్ర దాయం ప్రకారం ఆమెకు తొమ్మిదోవ ఏటనే జ్యోతీరావుతో వివాహమైంది. భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె పూర్తి విద్యావం తురాలైంది. సామాజిక పరివర్తనను సాధిం చింది. తన భార్య జ్ఞానం కుటుంబానికే పరిమితం కారాదనీ, ప్రజలందరికీ విద్యనం దించగల శక్తిగా ఆమె అవతరించాలనీ జ్యోతీరావుపూలే ఆశించారు.1848లో జ్యోతీరావుపూలే ‘పూనే’లో తొలి బాలికా పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలకు సావితత్రీబాయి ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. ఈ పాఠశాలను నిర్వహి స్తున్నందుకు అన్ని సామాజిక వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీ బాయి దంపతులను గృహ బహిష్కారానికి గురి చేశారు.1852వ సంవత్సరంలో ‘మహిళా సేవామండల్‌’ అనే మహిళా సంఘాన్ని సావిత్రీబాయి స్థాపించారు. అనంతరం 1853లో అనాధలుగా మారుతున్న శిశువుల కోసం ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ స్థాపన శరణా లయాన్ని స్థాపించారు. దిక్కులేని స్త్రీలకు, పిల్ల లకు సావిత్రీబాయి ఇల్లే ఒక పునరావాస కేంద్రంగా మారిపోయింది. బాల్యంలోనే వైధ వ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్ల లకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవ తులైన వారికి పురుళ్లు పోసివారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకు న్నారు.యశ్వంత్‌గా నామకరణం చేసి తమ ఆశ యాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేశారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచి,క్షురకులను చైతన్యపర్చి,వితంతువులకు శిరోముండనం చేయ బోమంటూ క్షురకుల చేత1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి.తరువాత 1873 సెప్టెంబరు 24న‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక,ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావి త్రీబాయి నేతృత్వంలో నడిచేది.వివాహాలు వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపిం చారు. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తిని మించిన ధనాన్ని ఖర్చుచేస్తూ కుటుంబా లను నెడుతాయో, కుటుంబాలను ఎంతగా నాశనం చేస్తాయో తెలియజేస్తూ ఆమె రాసిన వ్యాసాలు 21వ శతాబ్ధానికి కూడా నిత్య నూతనంగానే కనపడతాయి. కరువు బారిన పడిన కుటుంబాలలోని అనాథ బాలల కోసం 52 పాఠశాలలను వాళ్లు నిర్వహించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతి రేకంగా పోరాడారు. జ్యోతీరావుపూలే.1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు.తన భర్త పూలే చితికితానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది.1897లో ప్లేగు వ్యాధి,పూణే నగరాన్ని వణికించింది. నగర మంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్‌ తోకల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.చివరికి ఆప్లేగు వ్యాధే ఆమెను మార్చి10,1897లో కబళిం చింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రి యలు జరిపించారు. ఆనాటి ప్రజల స్థితిగతు లు,అవిద్య,సాంఘిక దురాచారాలు,సతీ సహగ మనం,బాల్యవివాహలు సావిత్రీబాయిని కదిపే శాయి. వీటిని నిర్మూలించడానికి అవసరమైన చైతన్యం పెరగాలంటే విద్య అందరికి అందు బాటులోకి రావాలని విశ్వసించారామె. బాలి కల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడం మొదలెట్టారు. తద్వారా సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం కృషి చేశారు. తన దగ్గర చదువుకున్న పిల్లలు,పెద్దలు స్వేచ్ఛ కోసం స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమించారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో విద్యా వ్యాప్తికి చేపట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అక్షరాస్యతను సాధించలేక పోయినా,విద్య బలోపేతానికి ప్రభుత్వమే బాధ్యత పడిరది. కాని ప్రస్తుత సమాజంలో ఫూలే ఆశించిన లక్ష్యా లకు తూట్లు పొడుస్తున్నారు. రెండు దశాబ్దాలు గా చేపడుతున్న విద్యా సంస్కరణలు వ్యాపార వర్గాలకు లాభాలు చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలుతో పాఠశాలల మూత,క్లస్టరైజేషన్‌, మతతత్వ ధోరణులు సిలబస్‌లో జొప్పించడం,విద్యా హక్కు చట్టాలను నిర్వీర్యం చేయడం,రాష్ట్రాలవిద్యాహక్కు చట్టాలపై పెత్తనం వంటి వాటికి పూను కుంటున్నది. నేటి విద్యారంగ సంస్కరణలు బడుగు, బలహీన సామాజిక వర్గాల వారికి మరలా విద్యను దూరం చేసేవిగా ఉన్నాయి. మాతృభాషలో శూద్ర కులాల వారికి పాఠ శాలలు పెట్టించిన ఫూలే ఆశయానికి భిన్నంగా నేడు పాఠశాలలు మూసివేస్తున్నారు. వెరసి బాలికలు పెద్ద సంఖ్యలో చదువుకు దూరం అవుతున్నారు. అవిద్య, బాల్య వివాహాలపై పోరాటం,సతీ సహగమనం వంటి వాటిపై చైతన్య పరిచి, నిషేధించడం వంటివి సమా జానికి మేలు చేసిన సంఘటనలు. సామాజిక దురాచారాలను తిప్పి కొట్టాలంటే చదువే కీలకమని నిరూపించింది సావిత్రీబాయి ఫూలే. నేడు నూతన రూపాల్లో మతం,కులం, సంప్ర దాయాల పేరుతో స్త్రీలపై, బాలికలపై జరుగు తున్న దాడులు చూస్తున్నాం. దుస్తులు, హిజాబ్‌, సంప్రదాయాలు, ఆహారం పరంగా ఆంక్షలను గమనించినట్లయితే ఇవన్నీ సమాజాన్ని మను వాదం లోకి తీసుకెళ్తున్నాయి. మరలా ఇటు వంటి ఘటనలు ప్రజాస్వామ్య భారత దేశంలో పునరావృతం అవుతున్నాయంటే స్త్రీలకు వ్యతి రేకంగా నిర్ణయాలు చేస్తున్నారనే అర్థం.ఫూలే స్ఫూర్తితో ఇటువంటి విధానాలపై పోరాటాలకు సిద్ధపడాలి.సమకాలీన సమాజంలో సామాజిక అంతరాలను పెంచే విధానాలపై కళారూపాల ద్వారా చైతన్యపరచాలని,సాంస్కృతిక,జానపద అంశాలలో మహిళా టీచర్లజోక్యం పెరగాలని, మూఢ విశ్వాసాలను పారదోలడానికి జానపదాలను ఎంచుకోవాలని, సాంఘిక దురాచారాలపై నిరంతరం పోరాడాలని ఆచరణలో చూపించారు సావిత్రీ బాయి ఫూలే. కాని ప్రస్తుత బిజెపి ప్రభుత్వ విధానాలు పాఠ్యపుస్తకాలలో మతతత్వాన్ని చొప్పిస్తున్నాయి. లౌకిక, రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నాయి. బాలికా విద్య కోసం, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు, కుల మత తత్వాలకు వ్యతిరేకంగా సావిత్రీ బాయి పోరాడారు.
సామాజిక వైతాళికురాలు ప్రపంచవ్యాప్తంగా జాతి విముక్తి పోరాటాలు జరుగుతున్న రోజులవి.మన దేశం కూడా బ్రిటీష్‌ పరాయిపాలనలో ఉన్నప్పుడు ఎక్కడి కక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఉద్యమాలు ఊపందు కున్నాయి.ఆ కాలంలోనే అనేకమంది సంస్కరణల కోసం ప్రాణాలుఅర్పించారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయినిగా, సామాజిక వైతాళికురాలిగా…బాలికావిద్య కోసం,బడులు పెట్టడం కోసం సావిత్రీబాయి ఫూలే చేసినత్యాగాలు,కనబరచిన పట్టుదల మనందరికీ ఆదర్శనీయం.విద్యా వ్యవస్థపట్ల, విద్య సమాజానికి దారి చూపే తీరుపట్ల ఆమెకు ఎంతోస్పష్టత ఉంది. 1881లో లార్డ్‌ రిప్పన్‌, హంటర్‌ అధ్యక్షతన విద్యాకమిషన్‌ను నియ మించేటప్పుడు మాతృభాషలో విద్య అందిం చాలని, శూద్ర,అతిశూద్ర కులాల వారికి పాఠశాలలు పెట్టాలని,పేదరికం వలన దిగువ కులాల పిల్లలకు 12సంవత్సరాల వయసు వరకు ఉపకార వేతనం మంజూరు చేయాలని మహర్‌,మాంగ్‌ (గిరిజన తెగ) కులస్థులకు ప్రత్యేక పాఠశాలలు పెట్టాలని ప్రతిపాదనలు పెట్టారు ఫూలే. సమాన హక్కులు నినాదంతో అట్టడుగు వర్గాలవారికి బడులు పెట్టి విద్యనం దించేందుకు కృషి చేశారు. స్వాతంత్య్రం రాక మునుపు బ్రిటిష్‌ పాలకుల ఎజెండాలో, స్వాతం త్య్రం వచ్చాక మన రాజ్యాంగంలో పైఅంశాల న్నింటికీ చట్టబద్దత కల్పించాలని,సమసమాజం స్థాపించాలని సావిత్రీ బాయి ఫూలే ఆశిం చారు.ఆకృషి ఫలితమే నాటి సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బాలికల పాఠశాలలు. కాని నేటికీ విద్యాభివృద్ధికి కుల వ్యవస్థ ఆటంకంగానే ఉంది. కులతత్వాన్ని, మతత త్వాన్ని పెంచి పోషించే విధానాలను ప్రస్తుతం చూస్తున్నాము. ఇప్పటికీ బడుగు వర్గాల పిల్లలు చదువుకి దూరంగా ఉన్నారు. మొత్తం అక్షరాస్యతలో మహిళల అక్షరాస్యత 64 శాతం మాత్రమే. ఇటువంటి గణాంకాలు దేశ అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడవు. విద్యకు దూరంగా ఉండే ప్రాంతాలు, వర్గాల వారు నిరంతరం దోపిడికి గురవుతారని అనేక అంశాలు సూచిస్తున్నాయి. బాల్య వివాహాలు, అత్యా చారాలు, లైంగిక వేధింపులు, ఉపాధి, కార్మిక శక్తిలో 34 దేశాలతో పోల్చుకుంటే 24వ స్థానంలో ఉన్నాం. సరికొత్త సమస్యలు విద్యారం గంలో మొదలయ్యాయి. ఈ అవశేషా లను రూపుమాపాలంటే సావిత్రీబాయి సూచించిన సామాజిక ఉద్యమాలను నిర్మించాలి. అది మనందరి కర్తవ్యం.స్త్రీలు చదువు నేర్చుకోవడమే అరుదైన కాలంలో బాలికలకు పాఠశాలలో విద్య నేర్పడానికి తన భార్య సావిత్రిని విద్యా వంతురాలిని చేసి దేశానికి తొలి ఉపాధ్యా యురాలిని అందించారు జ్యోతిరావు ఫూలే. విద్యపై, ఉపాధ్యాయులపై, విద్యార్థులపై ఎంతో ప్రభావితం చేయగలిగిన ఆమె స్ఫూర్తిదాయక చరిత్ర మన దేశానికి ఎంతైనా అవసరం. సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ పెద్దలు ఆమె విగ్రహాలకు పూలమా లలు వేసి సరిపెట్టుకుంటే సరిపోదు. ఆమె ఆశ యాలకు కార్యరూపం ఇవ్వవలసిన బాధ్యత చేపట్టాలి. అలాగే ఆమె జయంతి రోజును జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి.-(కె.విజయగౌరి)

సబ్‌ప్లాన్‌ ఆశశ్యకత !

సమాజంలో అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్న షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందిన ప్రజానీకానికి, ఇతర ప్రజానీకానికి మధ్యనున్న అభివృద్ధి అసమాన తలను, ఈ వర్గాల ప్రజల్లోనే అంతర్గతంగా ఉన్న అసమానతలను తొలగించాలన్న లక్ష్యంతో రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు ఉప ప్రణాళికను ఆమోదించింది. అణగారిన తరగతులైన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 1980వ దశకంలోనే చట్టపరంగా తీసు కొచ్చిన ఈ సబ్‌ప్లాన్‌ విధానం నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చాక క్రమంగా నీరుగారుతూ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఉద్యమం సాగిన ఫలితంగానే ప్రభుత్వం 2013లో చట్టం చేసింది.అయితే,దాని కాలపరిమితి పదేళ్లుగా నిర్ణయించడంతో రానున్న జనవరి 24వ తేదీతో గడువు ముగుస్తుంది.
సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని కొన సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలని దళితులు, గిరిజనులు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేయవలసిరావడం విచారకరం. అట్టడుగు వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా మని చెబుతున్న ప్రభుత్వం ఇలాంటి కీలకమైన అంశంపై మీనమేషాలు లెక్కించడం మాని కార్యాచరణకు ఉపక్రమించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రంలో సబ్‌ప్లానును క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకు రావడమే పరమ తిరోగమన చర్య. అసలు ప్లానే లేకపోతే ఇక సబ్‌ప్లాన్‌ ఇంకెక్కడ అనే స్థితి తెచ్చారు. కాని దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబకడంతో బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటా యింపులు చేస్తున్నారు. కాని, అదంతా ఖర్చు చేయకుండా కోతలు పెట్టడం, ఇంకొన్ని నిధులను దారి మళ్లించడం షరా మామూలే! కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీ లిస్తున్న మోడీ సర్కారు ఎస్‌సి,ఎస్‌టిల సంక్షే మానికి కనీస కేటాయింపులను కూడా ఖర్చు చేయకపోవడం సంఘపరివార్‌ నైజానికి నిదర్శనం.కాని,కేరళలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఆరాష్ట్రంలోని ఎస్‌సి,ఎస్‌టిల జనాభాశాతం కన్నా ఎక్కువ శాతం నిధుల్ని ప్రణాళికా వ్యయంలో కేటాయించడం శ్లాఘనీయం. దేశం లో అలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకేదీ లేదు.రాష్ట్రంలో సబ్‌ప్లాను చట్టం చేయడంతో నిధుల కేటాయింపు,ఖర్చునకు కొంత గ్యారంటీ వచ్చింది. కాని,2018 నుండి రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు క్రమంగా తగ్గిస్తున్నారు. నిధుల మళ్లింపు యథేచ్ఛగా సాగిపోతోంది. జనాభా ప్రాతిపదికగా సబ్‌ప్లాన్‌ నిధులు కేటా యించాలి.ఆ ప్రకారం చూస్తే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో 20వేలకోట్ల రూపాయలు కేటాయిం చాలి కానీ అది కేవలం రూ.17,403 కోట్లు మాత్రమే. ఇందులోనూ ఎస్‌సి ఎస్‌టిల అభి వృద్ధికి ఖర్చు చేసింది సుమారు ఐదు వేలకోట్లు మాత్రమేననీ మిగతా 12వేల కోట్లను ఇతర పథకాలకు మళ్లిం చారన్న ఆరోపణ సత్య దూరం కాకపోవచ్చు. సబ్‌ప్లాన్‌ నిధులను ఆ తరగతులవారు నివసించే ప్రాంతాలుఅంటే దళిత వాడలు,గిరిజనగూడేలు,తండాల అభివృద్ధికి, ప్రత్యేకించి మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. చట్టం స్పష్టంగా చెబుతున్నా, గతంలోనూ, ఇప్పుడూ ప్రభుత్వాలు ఆ రీతిలో ఖర్చు చేయడంలేదు.రోడ్లు వేయ డానికి,సాగు నీటి ప్రాజెక్టులకూ సబ్‌ ప్లాన్‌ నిధులనే వాడేయడం దారుణం. ఎవరైనా ప్రశ్నిస్తే వారూ వాడుకుంటారు కదా అన్న ఏలినవారి సమాధానం పేదలను, సబ్‌ప్లాన్‌ చట్టాన్ని వెక్కిరించడమే! ఆయా తరగతుల అభివృద్ధికి ప్రత్యేకించి ఖర్చు చేయవలసిన నిధులను నవరత్నాల్లో భాగంగా సాధారణ పథకాలకు వెచ్చించడం ధర్మం కాదు. ప్రభుత్వ రంగాన్ని పాలకులు క్రమంగా కుదించి వేయ డంతో సామాజిక న్యాయం చతికిలపడు తోంది.ఎస్‌సి,ఎస్‌టి లకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్ల కోసం ఉద్యమించ వలసిన పరిస్థితి. అణగారిన వర్గాలపట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కనుక ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు వెచ్చించేలా సబ్‌ప్లాన్‌ చట్టం కొనసాగాల్సిందే. కేటాయిం పులు అణగారిన తరగతులవారి అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. కేటాయించిన సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లించే వీలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి న్యాయమైన డిమాండ్లతో వివిధ సామాజిక సంఘాలు, సంస్థలు విశాల ఐక్య ఉద్యమం సాగించాలి. దానికి అభివృద్ధి కాముకుల,ప్రగతిశీల శక్తుల మద్దతు తప్పక లభిస్తుంది. ప్రభుత్వాలు ప్రజా ఒత్తిడికి తలొగ్గక తప్పదు.
ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలని..
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాలానుగు ణంగా గతంతో పోలిస్తే ఈ వర్గాల ప్రజానీకం అభివృద్ధి చెందినా, ప్రధాన జీవన స్రవంతి కంటే ఇంకా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలితాలు అందాలని పన్నెండో పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. అందుకే వేగవంతమైన, సుస్థిరమైన, మరింత సమ్మిళితమైన అభివృద్ధిని సాధించడమే పన్నెండో ప్రణాళిక ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశిం చారు. రాజ్యాంగంలోని అనేక అధికరణలు అన్యాయం, అణచివేత నుంచి సమాజానికి రక్షణ కల్పిస్తున్నాయి. ఈ అధికర ణలు:46,14, 15(1),17,15(2),15 (4) (5), 16(4), 16(4ఎ), 16(4బి),335,243డి,340టి. అదేవిధంగా షెడ్యూల్డ్‌ తెగల రక్షణకు రాజ్యాం గంలో అనేక అధికరణలున్నాయి. వివిధ రాజ్యాంగ అధికరణలతోపాటు పార్లమెంట్‌ ఈ వర్గాల ప్రజల రక్షణకు అనేక చట్టాలను కూడా చేసింది.ఉదాహరణకు, 1955లో అంట రానితనంపై చట్టం రూపొందించారు. దీన్ని తర్వాతి కాలంలో (1976లో) పౌరహక్కుల రక్షణ చట్టంగా పునఃనామకరణం చేశారు. సామాజిక అణచివేతకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలపై జరుగుతున్న అత్యాచారాలను నివారిం చేందుకు 1989లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగల (అత్యాచారాల నివారణ చట్టం) వచ్చింది.
ఎస్సీ జనాభా వివరాలు
రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాల జనాభా పెరుగు తూ వస్తోంది. ఇప్పటికీ ఎస్సీ జనాభాలో అధిక భాగం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఎస్సీ జనాభా 1.06కోట్లు. మొత్తం జనాభాలో ఇది15.9శాతంగా ఉండేది.2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా మొత్తం జనా భాలో16.2 శాతానికి పెరిగింది. 2001 జనా భా లెక్కల ప్రకారంరాష్ట్రం మొత్తం మీద చూస్తే నెల్లూరు జిల్లాలో ఈ వర్గం జనసాంద్రత అత్య ధికం.ఈ జిల్లాలో మొత్తం జనాభాలో 22.5 శాతం ఉన్నారు. తర్వాతి స్థానంలో ప్రకాశం (21 శాతం), చిత్తూరు (18.7) జిల్లాలున్నాయి.
అక్షరాస్యత తీరుతెన్నులు
జనాభా లెక్కల వివరాలను పరిశీలిస్తే రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతోందని అర్థమవుతుంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో 1981లో అక్షరాస్యతా రేటు 29.9 శాతం. 2001లో ఇది 60.5 శాతానికి పెరిగింది. అదేవిధంగా ఎస్సీలలో కూడా అక్షరాస్యత పెరుగుతోంది. రాష్ట్రంలో ఎస్సీ జనాభాలో అక్షరాస్యతా రేటు 1981లో 17.7 శాతం ఉండగా, ఇది 2001లో 53.6 శాతానికి పెరిగింది. అంటే 2001 జనాభా లెక్కల ప్రకారం చూసినా మొత్తం జనాభా అక్షరాస్యతా రేటుతో పోలిస్తే ఎస్సీ ప్రజానీకంలో అక్షరాస్యతా రేటు తక్కువగా ఉంది. మానవాభివృద్ధి, సామాజికాభివృద్ధిలో కీలకాంశంగా ఉన్న అక్షరాస్యతా రేటు విషయంలో ఇతర వర్గాల ప్రజానీకానికి, ఎస్సీలకు మధ్యనున్న తేడాను అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ మహిళల్లో అక్షరాస్యతా రేటులో పెరుగుదల వేగం తక్కువగా ఉంది. ఉదాహరణకు 2001లో మొత్తం మీద చూస్తే మహిళా అక్షరాస్యతా రేటు 50.4శాతంగా ఉంటే ఎస్సీలలో మహిళా అక్షరాస్యతా రేటు 43.4 శాతంగా ఉంది. విద్యారంగంలో ప్రమాణాలకు మరో కీలక కొలమానం మధ్యలో బడి మానేసే వారి సంఖ్య. భారత విద్యావిధానంలో చూస్తే, బడిలో చేర్పించే విషయంలో దాదాపు పూర్తి స్థాయిలో విజయం సాధించాం. కానీ మధ్యలో బడి మానేసే వారి సంఖ్యను తగ్గించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాం. కొంత కాలంగా విద్యారంగ ధోరణులను పరిశీ లిస్తే ఎస్సీ బాలబాలికల్లో కూడా మధ్యలో బడి మానేసే వారి శాతం తగ్గుతోంది. కానీ, ఇప్పటికీ ఇదిచాలా అధికంగా ఉండటం ఆందోళనకరం. ఉదాహరణకు 2007-08లో ఎస్సీ బాలబాలికల విషయంలో మధ్యలో బడి మానేసే వారి శాతం ఇంకా 69 శాతంగా ఉంది. ఎస్సీ బాలురతో పోలిస్తే బాలికల్లో ఈ శాతం సహజంగానే మరింత ఎక్కువగా ఉంది. అందుకే అంబేద్కర్‌ పేర్కొన్నట్లు అణగారిన వర్గాలలోని మహిళలు రెండు రకాల వివక్షకు గురవుతారు. కులపరమైన వివక్షతో పాటు లింగ వివక్షకు కూడా బలవుతున్నారు.
జీవనోపాధి ధోరణులు
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వ్యవసాయేతర స్వయం ఉపాధిపై ఆధారపడు తున్న వారి శాతం పెరుగుతోంది. మరోవ్కెపు మొత్తం ఎస్సీ జనాభాలో వ్యవసాయం, స్వయం ఉపాధి, వ్యవసాయ కూలీలుగా ఆధారపడి జీవిస్తున్న వారి శాతం తగ్గుతోంది. అయితే ఇప్పటికీ ఎస్సీలలో 63శాతం ప్రజల జీవనో పాధి వ్యవసాయమే. ఎస్సీ ప్రజానీకం అత్యధికంగా గ్రామాల్లో జీవిస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా గడుపుతున్నారు.ఉప ప్రణాళిక అమలులో భాగంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రణాళికా కేటాయింపులలో జనాభా దామాషా ప్రాతిపదికపై ఎస్సీలకు నిధులను కేటాయి స్తున్నారు. ప్రతీ ప్రభుత్వ శాఖ తమ ప్రణాళికా కేటాయింపులలో ఇలాగే నిధులు కేటాయిస్తే ఇక్కడో సమస్య ఉంది. అత్యధిక ఎస్సీ జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో ఆ మేరకు వ్యవసా యానికి అంత ప్రాధాన్యం ఉండదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు లభిస్తున్న ప్రాధాన్యానికి, ఎస్సీ ప్రజల జీవితాల్లో ఆయా రంగాల ప్రజల జీవనాధారానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇటీవల ఆమోదించిన చట్టం అమలులో భాగంగా పథకాలు,కార్యక్ర మాలను రచించేటప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. కొంత కాలంగా రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో దాదాపు సగం మేరకు జలయజ్ఞానికి కేటాయిస్తున్నారు. అందులో భారీ నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఉంటోంది. కానీ, ఎస్సీల్లో అత్యధి కులు భూమిలేని వ్యవసాయ కూలీలు. వీరికి భూమే లేనప్పుడు భారీ ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనం పరిమితంగానే ఉంటుంది. అందుకే నిధులను వెచ్చించేందుకు ప్రణాళికలను రూపొందించేటప్పుడు ఉప ప్రణాళిక అమలు మండలి, నోడల్‌ ఏజెన్సీలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
పేదరికం తేడాలు
పేదరికాన్ని అంచనా వేసేందుకు ఇటీవల లక్డావాలా కమిటీ, టెండుల్కర్‌ కమిటీ పద్ధతులు వచ్చాయి. లక్డావాలా కమిటీ అంచనాల ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికం తగ్గుతూ వస్తోంది. అలాగే పట్టణ ప్రాంతంలో ఇదే కాలంలో ఎస్సీలలో పేదరికం 50.6 శాతం నుంచి 37.4శాతానికి తగ్గింది. టెండుల్కర్‌ కమిటీ తాజా అధికారిక అంచనాల ప్రకారం 2009-10లో గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీలలో పేదరికం 23.5శాతం ఉండగా, పట్టణ ప్రాంతంలో 17.4 శాతంగా ఉంది. లక్డావాలా కమిటీ, టెండుల్కర్‌ కమిటీల ప్రకారం గ్రామీణ, పట్టణ పేదరికం అంచ నాల్లో చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఈ ఉప ప్రణాళిక అమలును సాంకేతిక దృక్పథంతో కాకుండా సామాజిక, ఆర్థిక దృక్పథంతో పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న వేగవంతమైన మార్పులలో ఎస్సీ ప్రజానీకాన్ని కూడా భాగస్వాములను చేయాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. గిరిజనుల విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. జాతీ యాదాయంలోనే కాదు, రాష్ట్ర ఆదాయంలో కూడా అధిక భాగం సేవలరంగం నుంచే వస్తోంది. కానీ,ఈ నూతన సంపదలో ఎస్సీ, ఎస్టీ ప్రజానీకానికి సరైన భాగస్వామ్యం లేదు.అందుకే చట్టం చేయ డంతో సరిపోదు. ఆ చట్టం అమలులో నవీ నత్వం,సృజనాత్మకత కీలకమవుతాయి. ‘సబ్‌ప్లాన్‌’ కాలపరిమితి పెంచండి
దళిత, గిరిజనులకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడానికి పదేళ్ల కాలపరిమితితో 2013లో తీసుకువచ్చిన ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌చట్టం గడువు 2023 మార్చితో ముగుస్తున్నందున ఈ కాలపరిమితిని పొడిగించడానికి వీలుగా చట్ట సవరణ చేయా లని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యా ది కోరారు. ఈ మేరకు గుంటూరులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగా ర్జునను ఆయన క్యాంపు కార్యాల యంలో కలిసి వినతిపత్రం అంద జేశారు.ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమించడం వల్ల సబ్‌ ప్లాన్‌ చట్టాం2013 వచ్చిందన్నారు. అయితే సరైన నిబంధనలు లేకపోవటంవల్ల 2015 వరకూ ఈ చట్టం అమలులో పలు సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ చట్టానికి లోబడి జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తూ వచ్చాయని, మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటం వల్ల దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన ప్రాంతా లకు అపార నష్టం జరిగిందని అన్నారు. ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎస్‌సి,ఎస్‌టిలకు రక్షణ అవసరమని, అందుకోసం చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని, సబ్‌ప్లాన్‌చట్టం 2013చాప్టర్‌ 1క్లాజ్‌4ను సవరించి, కాలపరిమితిని పొడగించేందుకు రానున్న అసెంబ్లీ సమావే శాల్లోనే నిర్ణయం చేయాలని మంత్రిని కోరారు.
జిఎన్‌వి సతీష్‌

ప్రమాద అంచుల్లో ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండడం ఎంతైనా అవసరం..పాలక పక్షం ఎలా గైతే ప్రజల పనుపున ఏలుబడి సాగిస్తుందని అను కుంటామో ప్రతిపక్షం అలాగే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా వ్యవహరిస్తుంది.ఈ రెండూ సజావుగా నడిస్తేనే పాలన..దానిని అనుసరించి అభివృద్ధి..ప్రజాసంక్షేమం తదితరాలు సక్రమంగా సాగుతాయి.అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం కేంద్రంలో,రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం నామ మాత్రంగా మిగిలిపోవడంతో పాలన ఏకపక్షంగా మారిపోయి ఇంచుమించు నియంతృత్వ పోకడలో ఏలుబడి సాగిపోతోంది.కేంద్రంలో ఈ తరహా పరిస్థితులు 2014 నాటి నుంచే కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొన్న 2019 ఎన్నికలలో చోటుచేసుకున్న పరిణామాలు గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరగని క్రొంగొత్త పోకడలకు తలుపులు తెరిచాయి..
మన దేశంలో జవహర్‌ లాల్‌ నెహ్రూ,లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఏలుబడి తర్వాత ఇందిరా గాంధీ శకం మొదలైన పిదప తొలిసారిగా ఏకపక్ష విధా నాలు..ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడలు ఊపిరి పోసుకున్నాయి.శాస్త్రీజీ అకాల మరణం తర్వాత పగ్గాలు అందుకున్న ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రోజుల వరకు తాను చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అనే రీతిలో ఏలుబడి సాగించారు. ప్రజల్లో తనకుగల అసాధారణమైన ఆకర్షణ కారణంగా ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం, తాను అనుకున్న రీతిలో పాలన సాగించడం ఇది వరకు పరిపాటిగా మారిపోయింది.అయితే అంతటి ఇందిరాగాంధీ కూడా ప్రతిపక్ష నాయకు లను విశ్వాసంలోకి తీసుకుని వారికి సముచిత రీతిన గౌరవం ఇస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసు కునే సందర్భాల్లో వారితో సలహా సంప్రదిం పులు జరుపుతుండే వారు..ఒకరకంగా ఎమర్జెన్సీ దేశానికి కొంతమేలుచేసింది.అదేమిటంటేఎమర్జెన్సీ చీకటి రోజుల తర్వాత దేశంలో ఏకపక్ష విజయాలకు.. ఏలుబడులకు తెరపడిరది…అత్య వసర పరిస్థితుల అనంతరం దేశంలో తొలిసారిగా కాంగ్రేసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.అటు తర్వాత కూడా కాంగ్రెస్‌ ఆధిపత్యం తగ్గి ఇతర పక్షాలు, కూటములు అధికారంలోకి రావడం మొదలైంది. ఇక రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు ఆగమనం.. స్వరాష్ట్రంలో సంచలనాల తర్వాత జాతీయ రాజకీ యాల్లోకి ప్రవేశం అనంతరం కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దిగజారింది.అప్పటినుంచి కేంద్రంలో ఏపార్టీ కైనాగాని ఇంచుమించు పరిపూర్ణ ఆధిక్యత రావ డం.. ఏకపక్షంగా ఏలుబడిసాగడం అనేరోజులు చెల్లిపోయాయి. ఇదిగో..మళ్లీ ఆపరిణామాలు కేంద్రంలో 2014ఎన్నికల నుండి మొదల య్యాయి. వరస రెండు ఎన్నికల్లో తిరుగులేని ఆధిప త్యంతో గెలిచిన భారతీయ జనతా పార్టీ దేశంలో మరో సారి ఏకపక్ష పాలనకు,ఒంటెత్తు పోకడలకు తెర ఎత్తింది. పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం..ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్నివ్యవస్థల నిర్వీర్యం,అస్మదీయులకు అవాం చిత ఉపకారాలు..రాష్ట్రాలకు కల్పించే ప్రయో జనాల విషయంలో అసమానతలు, పారద ర్శకత లోపం.. ఇలాంటి ఎన్నో కీలక అంశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ఏకపక్ష ధోరణులపై ప్రశ్నించే గొంతులు కరవయ్యాయి.. చట్టసభల్లో, బయటా కూడా నిలదీసే విపక్షాల గొంతుకలను ప్రభుత్వంలోని పెద్దలు మెజారిటీ ఇచ్చిన బలంతో పట్టించు కునే పరిస్థితి గడచిన ఏడు సంవత్సరాల కాలంలో ఏదశలోనూ కనిపించలేదు..చేసిన తప్పుల వల్లనైతె నేమి..అధికారంలోఉన్న రోజుల్లో అవలంబించిన ఇదే తరహా ఏకపక్ష ధోరణుల ఫలితం అయితేనేమి కాంగ్రెస్‌ పూర్తిగా చచ్చుబడిపోయింది.ఇక కమ్యూ నిస్టుల సంగతి సరేసరి..ఎప్పుడూ వారి పోరాటాలు సరాసరే..పార్టీల కేడర్లు,శ్రేణులు బలంగానే ఉన్నా ఏ దశలోనూ చట్టసభల్లో తగినంత బలం లేకపోవ డంతో వామపక్షాలది స్వతంత్ర భారతంలో ఆది నుంచి అరణ్యరోదనే..ప్రభుత్వాలను నిలదీసే వారి గొంతు సమ్మెలు,బందులు..ఇత్యాదులకే పరిమితం అయిపోయింది. నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కమ్యూనిస్టులు.. ఇతర రెగ్యులర్‌ ప్రతిపక్షాలతో సహా మొన్నటి వరకు దేశంలోనే మహాశక్తిగా విరాజిల్లిన కాంగ్రెస్‌ పరిస్థితి కూడా నానాటికీ తీసికట్టు అయిపోయింది..ఇక ఆంధ్రప్రదేశ్‌ సంగతి..ఇక్కడ ఏంజ రిగినా అడిగే నాథుడులేని పరిస్థితి దాపురిం చింది. ఈ రాష్ట్రం లో గతంలో అయితే కాంగ్రెస్‌, లేదంటే తెలుగు దేశం ప్రభుత్వాలు పెద్దశక్తులుగా అసెంబ్లీలో ఆవి ర్భవించి అధికారం చెలాయించిన సందర్భా ల్లో ప్రతిపక్షాల పరిస్థితి ఇప్పుడున్నట్టు లేదు.ఒకనాడు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు వెంగళరావు, చెన్నారెడ్డి.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటివారు ఎదురులేని సంఖ్యాబలంతో అధికారం చేసినా ప్రతిపక్షాలకు తగిన గౌరవం ఉండేది.అదే పరిస్థితి ఎన్టీ రామా రావు.నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా సాగింది.ప్రతిపక్షానికి దక్కే గౌరవాన్ని మొన్న టి వరకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కూడా అనుభవించిన వారే. ఇక వర్తమానానికి వస్తే.2019ఎన్నికల్లో రాష్ట్రంలోని175సీట్లకుగాను 151 సీట్లు గెలుచుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార పగ్గాలు అందుకున్న నాటి నుంచి పూర్తిగా అధికార పక్షం పెత్తనం లో ఏలుబడి సాగుతోంది. నంది అంటే నంది. తీరులో..ఏనిర్ణయం అయినా..అది ఎలాంటిదైనా మారు మాటాడే పరిస్థితి లేదు..వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వస్తూనే గత తెలుగు దేశం ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను రద్దు చేసి..కొన్ని కట్టడాలను కూల్చి వేసి గందర గోళం సృష్టించింది. పరా కాష్టగా మూడు రాజధా నుల నిర్ణయం..ఆపై ఉచి తాలు.. ఇంచు మించు రాష్ట్రప్రభుత్వం దివాలాతీసే పరిస్థితి.. వీటిపై ప్రధానప్రతిపక్షం తెలుగుదేశం ప్రశ్నిస్తూ.. నిలదీ స్తూ.. ఆందోళనలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నా సంఖ్యాబలం లేకపోవడం సైకిల్‌ పార్టీకి అతి పెద్ద మైనస్‌ పాయింట్‌!ఒక దశలో కేవలం ప్రతిపక్షం మీద దుగ్ధతో ప్రభుత్వం అకార ణంగా కౌన్సిల్‌ను కాన్సిల్‌ చేయాలని చూసినా అడిగే దిక్కు లేకుండా పోయింది.అఫ్కోర్స్‌..అది జరగ లేదు..ప్రభుత్వం ఏం చేస్తున్నా రాష్ట్రంలో ప్రతిపక్షం అడ్డుకునే పరిస్థితి ఎటూ లేకపోయినా కేంద్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాన రావడం లేదు..దీంతో వైసిపి ప్రభుత్వం ఎదురే లేని రీతిలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుం టున్న పరిస్థితి..కోర్టు కేసులను సైతం లెక్క చేయని విధం గా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అటు తర్వాత జరిగిన పంచాయతి.. మునిసి పల్‌ ఎన్నికల్లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసా గిస్తూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిం చింది..అదే రీతిలోప్రశ్నించే నాథుడే ఉండని స్థాయి లో ఏలుబడి సాగిస్తోంది.దానివల్ల రాష్ట్రంఎటు పోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది..అసలు ఇంచుమించు రెండు సంవత్సరాలకు పైగా రాష్ట్ర రాజధాని ఏదో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రాక పోగా ఉన్నవి చేజారిపోతున్న దుస్థితి.అలాగే కేంద్రం నుంచి పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులకు నిధులు తీసుకువచ్చే పరిస్థితి లేదు.అంతేకాకుండా రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కు కర్మా గారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నా అటు పార్లమెం టులో కూడా మంచి బలం ఉన్న వైసిపి అడ్డుకో లేకపోవడం విచారించదగ్గ మరో విషయం. ఇలాం టి అంశాల్లో రాష్ట్రంలోని అన్నిపార్టీలు కలిసి పోరా టాలు చేయాల్సిన అవసరం ఉంటుంది.కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు.అసలు ప్రతిపక్షాన్ని కలుపుకుపోయే ధోరణి అధికార పక్షానికి కిమ్మ న్నాస్తి..ఇక పోతే పంపిణీలపేరిట ఖజానాఖాళీ అవుతూ జీతాలు కూడా సరిగ్గా ఇచ్చుకోలేని..పెన్షన్లు సకాలంలో చెల్లించలేని దుస్థితిఏర్పడి ప్రభుత్వ ఆస్తు లు తాకట్టుపెట్టే దారుణచర్యకు సర్కారు తెగబడినా అడిగేనాథుడు లేడు..ఇది గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దయనీయ పరిస్థితి. నిజానికి మోడీ ప్రభు త్వం ప్రతిపక్ష మంటేనే లెక్కలేని విధంగా వ్యవ హరిస్తోంది. ప్రతిపక్షం లేవనెత్తే ఏ అంశాన్ని కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. తీర్మానాల అంశం లోనూ ఇదే ధోరణి. పార్లమెం టులో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే నిబం ధనలను సైతం అమలు చేయడానికి అంగీ కరిం చదు, ఖరారైన సభా కార్య క్రమాలను సస్పెండ్‌ చేసి సభ్యుడు లేదా సభ్యులు లేవనెత్తిన అంశాలను చర్చకు పెట్టే కీలకమైన అధికారాన్ని 267వ నిబంధన సభాధ్యక్షుడికి కట్టబెట్టింది.
రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో వెంకయ్య నాయుడు ఒక్కసారి కూడా ఈనిబంధన కింద చర్చకు అవకా శం ఇవ్వనేలేదు.రాజ్యసభ రికార్డుల ప్రకారం 2016 నవంబర్‌16నఈ నిబంధన ప్రకా రం రాజ్య సభలో చివరి సారిచర్చ జరిగింది. ఆగస్టు 10వ తేదికి వెంకయ్య నాయుడి పదవీకాలం ముగుస్తున్న సంగతి తెలిసిందే! ప్రతిపక్షం గొంతు ఈ స్థాయిలో నొక్కిన తరువాత ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధ మంటూ చేసే సవాళ్లకు అర్ధమేమిటి? మోడీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ స్థాయికి పడిపోయింది కాబట్టే జోక్యం చేసు కోవాలంటూ ప్రతి పక్ష పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాయాల్సి వచ్చింది. 15వ రాష్ట్రపతి గా ఎన్నికైనం దుకు శుభాకాంక్షలు తెలిపిన లేఖలోనే ఈ విష యాన్ని విపక్షాలు ప్రస్తావించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.ముర్ముఈ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ప్రజా సమస్యలు కూడా చర్చకు రాకుండా మోడీ ప్రభుత్వం వ్యవ హరిస్తున్న ఈ తీరు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఒకవ్యూహం ప్రకారం,మంద బలం తో ప్రజాస్వామ్యంపై చేస్తున్న ఈదాడిని ఐక్య పోరాటాలతోనే నిలువరించగలం.ఆ దిశలో విస్తృత ప్రజానీకాన్ని సమీకరించాలి. దీనికోసం ప్రజాస్వా మ్యవాదులు, లౌకిక,అభ్యుదయ,పురోగామి శక్తులు ఏకతాటిపై కదలాలి.ప్రజాస్వామ్య పరిరక్షణకోసం జరిగే పోరాటంలో ప్రతిఒక్కరూ భాగస్వా ముల వ్వాలి. ఇలా కేంద్రంలో,రాష్ట్రంలోఅధికార పార్టీ లుపూర్తి మెజారిటీతో ఏకపక్ష ధోరణిలో పాలన సాగిస్తుంటే ప్రజాస్వామ్యం ఉనికి ప్రమాదంలో పడుతోందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవు తున్న పరిస్దితుల్లో కొన్ని రకాలైన ప్రమాదాల అంచున మన దేశంలో వ్యవస్థలు నడుస్తున్నాయనేది నిస్సందేహం..!!-(ఇ.సురేష్‌ కుమార్‌)

గూడేలకు చెరగని గురుతు`బీడీ శర్మ

స్వతంత్య్ర దేశంలో ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక పరిపాలన కావాలని జీవితకాలం శ్రమించిన మహనీయుడు డా.బి.డి.శర్మ.తను బ్రహ్మణ కులంలో పుట్టినా అడవిలో తినటానికి తిండిలేక, కట్టుకోవడానికి బట్ట కరువై కేవలం అడవిపై, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే ఆదిమ తెగల పక్షాన నిలిచి ఆకలితో అలమటించే వాడికి ఆహారం దరిచేర్చి జీవించే హక్కును కల్పించడానికి కృషి చేస్తూ మానవత్వం చాటిన ఆదివాసీల ఆత్మీయ బంధువు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో 1929లో పుట్టిన బి.డి.శర్మ కష్టపడి చదివి ఐ.ఎ.ఎస్‌గా వివిధశాఖలలో పనిచేసిన ఆయనఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గా రిటైర్‌ అయ్యారు. 1996లో షెడ్యూల్డ్‌ ప్రాంతాల విస్తరణచట్టం (ఫెసా)రావటానికి, దాని నియమాలు రూపొందించిందీ శర్మనే. దిలీప్‌ సింగ్‌ భూరియా కమిటికి అసలు ఆదివాసీ ప్రాంతాలలో పెసాఅంటే ‘మావనాటే మావ సర్కార్‌’అంటే ‘మావూళ్లో మా రాజ్యం’,‘మా గూడెంలో మాపరిపాలన’ అంటే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలతో సహజీవనం చేసిన అనుభవంతో దీనిని గ్రహించారు. కనుకనే ఆదివాసీల జీవన విధానానికి, మైదాన ప్రాంతాల జీవన విధానానికి వ్యత్యా సం ఉంది. ఏజెన్సీ గూడేలలో ప్రత్యేక జీవన విధానం, ఆచార వ్యవహారాలు..సంస్కృతి సాంప్రదాయాలను విడిచి వారు బ్రతకలేరు. ఆదివాసీలకు నీరు,అడవి,భూమి(జల్‌ జంగల్‌-జమీన్‌)వారి నివాస ప్రాంతంపై స్వయం నిర్ణయం హక్కు కావాలని పరిత పించి దిలీప్‌ సింగ్‌ భూరియా కమిటికి తాను స్వయంగా రిపోర్టు తయారు చేసి, ఆదివాసి స్వయం పాలన హక్కుకై పార్ల మెంటులో ప్రయివేట్‌ బిల్లు పెట్టించి పాస్‌ చేయించటంలో బి.డి.శర్మ కృషి కీలకం. 1953 మొదటి బ్యాచ్‌లో ఐ.ఏ.ఎస్‌గా బి.డి. శర్మకు అనేక అవకాశాలు వచ్చినా తన ఉన్నతిని వెతుక్కోలేదు. సమాజ ఉన్నతికై కలగన్నారు. 1958లో బస్తర్‌ కలెక్టర్‌గా వెళ్ళిన శర్మకు నాటి బస్తర్‌ అనుభవం ఆదివాసీలను చేరదీ సింది. నాడు బస్తర్‌ నేడు7జిల్లాలుగా అంటే సూక్ష్మబీజాపూర్‌,సుక్మా,దంతెవాడ,ఉత్తర,దక్షిణ బస్తర్‌, బైలాడిల్లా,కాంకీర్లుగా విడిపోయింది. అంత పెద్ద ఆదివాసీ జిల్లాకు తొలిసారి కలెక్టర్‌ గా వెళ్ళిన శర్మకు ఆదివాసీల ఆటవిక జీవనం, కడుదారిద్య్రం స్వాగతం పలికింది. బస్తర్‌ పూర్తిగా ఆదిమతెగలు గలకొండ ప్రాంతం. ఆకలితో అలమటించే ఆదిమ తెగలకు ఆహారం, కట్టుకోవటానికి బట్టలు,గూడేలకు విద్యుత్‌ వెలుగులు లేక విషజ్వరాలతో మృత్యువు బారినపడుతున్నారు. బడిలోకి చేరే ఆదివాసీకి కనీస వైద్యం,రోడ్డు సౌకర్యం,మంచినీరు అందించి వారి అభివృద్ధికి తోడ్పాలని ఒక కలెక్టర్‌ గా కలలుగన్నాడు.అబూజ్‌ మాడ్‌ (కనిపించని కొండలు)లను సైతం కాలినడకన పగలనక రేయనక తిరిగారు. ఆదివాసీ జీవ నాన్ని చక్కదిద్దాలని అభివృద్ధి నమూనాలు తయారు చేసి, కలలుగన్న శర్మకు అభివృద్ధి స్థానంలో విధ్వంసం అనే ప్రగతి నమూనా రావడంతో కలలన్నీ నిర్వీర్యమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టటంతో పాటు ఆకలెక్టర్‌ కే అధి కారికంగా ఉక్కు పరిశ్రమ చేపట్టాలని సూచిం చింది. కలగన్నది అభివృద్ధి నమూనా ఉక్కు పరిశ్రమతో విధ్వంస నమూనాగా మారింది. ఇనుప ఖనిజం త్రవ్వకం మొదలయితే ఆదిమ తెగలు తమ అస్థిత్వాన్ని కోల్పోతారని దీని నుంచి వచ్చే విషతుల్యం వలన అనేక మంది ఆదివాసీలు రోగాల బారినపడి మృత్యువాత పడతారని,దీంతో అమాయకులైన వారి మను గడ ఇక ప్రశ్నార్ధకమేనని గ్రహించారు.ప్రభుత్వ ఏజెంట్‌గా ప్రభుత్వం తరపునే నిలబడి ఉక్కు త్రవ్వకాలు చేపట్టాలి. కానీ ఒకకలెక్టర్‌గా తన అధికారాన్ని రాజ్యాంగబద్ధ నిబంధనలతో ఇది మానవహక్కులు, నిబంధనలకు వ్యతిరేకం అని, జీవించే హక్కుకు భంగకరమని అని,ఉక్కు పరి శ్రమ అనుమతులు రద్దు చేపించాడు.రాజ్యం తననేం చేస్తుందోనని ఆలోచించకుండా అన్నిం టికీ సిద్ధపడి రాజ్యాంగబద్ధంగా మానవత్వాన్ని చాటుకున్నారు. తదుపరి బి.డి.శర్మకు జరిగిన అవమానానికి ఆదివాసీలు ఏం చేసినా తీర్చు కోలేనిది.ఉక్కు పరిశ్రమ అనుమతులు రద్దు చేశాడనే నెపంతో బి.డి.శర్మను బస్తర్‌ వీధుల్లో బిజెపి పార్టీ నాయకులు అధికారికంగా..అదీ అర్ధ నగ్నంగా చెప్పులు మెడలో వేసి ఊరేగిం చారు.ఒక కలెక్టర్‌గా తనఅధికారాలను కూడా స్వేచ్ఛగా, రాజ్యాంగబద్ధంగా ఉపయో గించుకునే హక్కు లేదని సామ్రాజ్యవాదులు కాళ్ళ కింద భారతరాజ్యాంగాన్ని తాకట్టు పెట్టే సార్వభౌమ, సార్వత్రిక, లౌకిక, గణతంత్ర అనే మాటలు విలువలు లేకుండా చేసిన,అదీ స్వయాన ప్రభు త్వమే అధి కారికంగా చేసిన దుర్మార్గపు సంఘ టన.అంత అవమానం జరిగినా బి.డి.శర్మ కృంగ లేదు. కృశించలేదు. ముఖంపై చిరు నవ్వుతో నేడు సామ్రాజ్యవాదులు వీరి కబం దహస్తాల క్రింద కుళ్ళుపట్టే రాజకీయ పెద్దలు పతనం అయి ప్రజల చేత,ప్రజల కొరకు పాలిం చబడే వ్యవస్థ ముందు భవిష్యత్‌ సమాజ రక్షణ కు చైతన్యంగా నా ఊరేగింపు నిలుస్తుందని, నేటి సమాజంలో ఆదివాసీల రక్షణకు ఇంత నిస్వార్థంగా త్యాగాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు! వాస్తవంగా బి.డి.శర్మ అబూజ్‌ మడ్‌ లో మావోయిస్టుల కంటే ముందు కాలు పెట్టాడు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా. కానీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలే అతని ఆశయానికి అడ్డు అయినవి. ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న బి.డి.శర్మ ఒక అంశాన్ని మాత్రం నిస్సం కోచంగా మాట్లాడాడు. భారత స్వాతంత్య్య్ర సంగ్రామంలో మనదేశం స్వాతంత్య్ర దేశం 1947)గా ఏర్పడిరది. భారత ప్రజల మను గడను సుస్థిరం చేసుకుంది. కానీ అప్పటి నుండి ఆదివాసిల మనుగడ ఈ దేశంలో ప్రశ్నార్థకంగా మారిందని,ఆదివాసీలు భవిష్యత్తులో విధ్వంసకర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పిన మాటలు నేటికీ నిజమవుతున్నవి. దేశ విభజన నేపథ్యంలో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న నాగా, మిజోరంలలో వున్న సంతాల్‌, గోండు ప్రాంతాలను బర్మా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఖాట్మండ్లుగా, విభజించారు.మధ్య భారతం లోని గోండులను ఒరిస్సా, చత్తీస్గఢ్‌,మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్రలుగా విభజించారు. విభజించిన అనంతరం నర్మద,సర్దార్‌ సరోవర్‌, గోదావరి పోల వరం, హీరాకుడ్‌,కంతనపల్లి లాంటి భారీ ప్రాజెక్టులను కట్టి అభివృద్ధి పేరిట ఆది వాసీలను జలసమాధి చేస్తున్నారు. పోస్కో, టాటా,మిట్టల్‌, జిందాల్లకు బాక్సైట్‌ ఎక్కు లాటరైట్‌, గ్రానైట్‌ లాంటివి కట్టబెట్టి తెగల జీవనాన్ని విధ్వంసం చేస్తున్నారు. టైగర్‌ జోన్‌ల పేరిట అడవుల నుండి గెంటేస్తున్నారు.అడవిలో స్వేచ్చగా జీవించే ఆదివాసీలను మావోయిస్టుల పేరిట ఇబ్బంది పెడుతున్నారు.1956 సైనిక అధికారాలు చట్టం లాంటివి అమలు చేసి ఈశాన్య భారతంలో పౌరులని చంపి వేర్పాటువాదులుగా ముద్ర వేస్తున్నారు. ఆదివాసి మహిళలపై పాశవిక అత్యాచారం, హత్యలను సైన్యం జరిపి ప్రజాస్వామ్య రక్షణ కోసమని ప్రకటిస్తున్నారు. ఇటువంటి దురాగతాలను బి.డి.శర్మ ముందుగానే గ్రహించి తన జీవితాన్ని ఆదివాసీల కోసం ధారపోశారు. మావో యిస్టులు బస్తర్‌ కలెక్టర్‌ వినీల్‌ కృష్ణను కిడ్నాప్‌ చేసి 18రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు,అనాటి ప్రభుత్వం తరపున మధ్యవర్తిగా.. పోలవరం లాంటి ప్రాజెక్టు అయిన ఆగకపోతుందా అనే ఆశతో మావోయిస్టులతో మాట్లాడి ఒప్పించి,కలెక్టరును విడిపించటానికి దండకారణ్యానికి బయల్దే రాడు.కానీ,ప్రభుత్వం తన నీతిలేని బుద్ధిని నిరూపించుకుంది. కలెక్టర్‌ విడుదలయ్యాక ఏకంగా పార్లమెంట్‌ బిల్లు పెట్టి 5వ షెడ్యూల్‌, 1/70,ఎల్‌.టి.ఆర్‌ లాంటి చట్టా లకు విరుద్ధం గా పోలవరంని కట్టే ప్రక్రియను చట్టబద్దంగా పూర్తి చేసుకుంది. ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ లాంటి దుర్మార్గాలను సైతం ఆపటానికి బి.డి.శర్మ చేసిన కృషి ఎనలేనిది.భారత దేశంలో బి.డి.శర్మ అనేక ఆదివాసీ ప్రాం తాలు పర్యటించి 76పుస్తకాలు రాశారు. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణాలతో బి.డి.శర్మ అనుబంధం మరువలేనిది.1996 ఆగస్టు 6న ఆదివాసి స్వయంపాలన,ఎ,బి,సి,డి వర్గీకరణ కోసం ఏర్పడ్డ ‘తుడుందెబ్బ’గూడూరులో మొదటి బహిరంగసభ ఏర్పాటు చేస్తే ప్రొ.బియ్యాల జనార్ధనరావు పిలుపు మేరకు బి.డి.శర్మ ఉద్యమ దిశా నిర్దేశాన్ని ప్రకటించారు.నిత్యం ఆదివాసీల సంక్షేమం కోసం పరితపించిన బి.డి.శర్మగారు 2015 డిసెంబర్‌ 8న కాల గమనం చెందారు.20ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో విద్యా, ఉద్యోగ, రాజకీయ చైతన్యంలో దేశ వ్యాప్తంగా విద్యా, సామా జికంగా చైతన్యమై ఆదివాసీ అభివృద్ధి సమూ నాను సుస్థిరం చేసుకున్న రోజు,ఆదివాసి స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను రక్షించుకున్న రోజు బి.డి.శర్మకు ఘనమైన నివాళి అవుతుంది.వ్యాసకర్త : – గుమ్మడి లక్ష్మీ నారాయణ,ఆదివాసీ రచయితల వేదిక, వ్యవస్థాపక కార్యదర్శి, సెల్‌ : 9491318409

మహానీయ స్వామి వివేకానంద

మహనీయ స్వామి వివేకానంద ఉన్నతమైన ఆశయాలు ఏదోఒకరోజు సర్వజనాంగీ కారాన్ని పొందుతాయి. కారణం ఆభావన, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ,ప్రతీ ఆలోచనా విధా నంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషాయాంబరాలు ధరించి,పద్మాసనస్థుల్కె, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచు కుని,అర్థనిమీనేత్రుల్కె ధ్యానమగ్నుల్కె వివేక మం తమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒక జగద్గురువు. సామాజిక సృహతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విషయాలను వివేకించటం ద్వారా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించడం, ఆ సౌధంలో చ్కెతన్యమూర్తులుగా జనులను విరాజిల్లింపచేయటం స్వామి వివేకానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంత రాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృ తమైన కొత్త విషయాలను అనుభ విస్తూ, క్రొంగొత్త శక్తుల వశీకరింపచేసు కుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివేకానంద. 1863వ సం.లో కలకత్తా నగరంలో జన్మించిన స్వామి వివేకానంద ఆరేళ్ళ ప్రాయంనుంచే అంతర్ముఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నుడ్కె ఉండేవారు.జ్యోతిర్మయ ప్రకా శంలో జీవిస్తూ చిరుప్రాయంలోనే సృజనా త్మకత, ఆత్మ ప్రతిష్ట, ఆత్మ ప్రేరణలో దివ్యదర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆచ్కెతన్యంలో విరాజిల్లే అంతర్ముఖ చ్కెతన్య స్వరూపుడు.‘‘నేను భగవంతుడిని నిన్ను చూస్తు నంత స్పష్టంగా చూశాను,మతం అనేది అను భూతి పొందవలసిన సత్యం,లోకాన్ని మనం అర్దం చేసుకోవటంకన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’’అని ప్రవచించే శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో న,కర్మ,భక్తి,యోగ మార్గాలో కానరాని మెరు గులు ఆస్వాదించి వారి వచనాలను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగచేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధరించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసం గం బాహ్యంగా ఎగసిన ఉత్సాహపు టలలోనే కాక, ఉద్వేగ ప్రవాహాలోనే కాక, నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూతన కాంతి పుంజం. దానిని గురించి ఒక్క మాటలో చెప్పటానికో, వ్రాయటానికో కుదిరేది కాదు. చికాగో ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడమే కాదు, సాక్షాత్తు భారతదేశం కూడా గర్వించేలా చేసింది. అమెరికాలో ఎగసిన ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది.‘‘నేను ఎవరిని?ఆసియా వాసినా? ఐరోపా వాసినా?అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను’’ అనేవారు స్వామి. మనుషులు ఎలా జీవించాలో స్వామి మాటల్లో…‘‘అందాన్ని పెంచుకుంటే నిన్ను కెమేరాలో బంధించి ఆనందిస్తారు అస్తిని పెంచుకుంటే నిన్ను గంధపు చెక్కలలో తగులబెడతారు పేరును పెంచుకుంటే నిన్ను సన్మాన పత్రాలతో సన్మానిస్తారు హోదాను పెంచుకుంటే నిన్ను హోర్డింగులలో నిల బెడతారు అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే నిన్ను జనం గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు’’
ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహించి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మ జ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వాన్ని దర్శించవచ్చని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి శ్రీవివేకానంద. హిందూమతాన్ని కించపరిస్తే సహించేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘ టించి హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పే వారు.జీవితంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పేవారు. ‘‘ఆహార నియంత్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియంత్రణ లేకుండా మనస్సుని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారితీస్తుంది.మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి’’ అనేవారు. ప్రేమతత్వాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదిం చేవాడు.మతం అనేది సిద్ధాంత రాద్ధాంత ములతో లేదు అదిఆచరణలే ఆధ్యాత్మికంగా పరిణతి చెందడంలో మాత్రమే వుంది అని విశ్వసించేవారు. వివేకానందను విదేశాలలో అనేకులు కుమారునిగా, సోదరునిగా భావిం చారని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆయన పరిణతి కనిపిస్తుంది. భారతదేశంలో ఇటు వంటి బాంధవ్యాలు కొత్త కాదు. విదేశాలలో ఇటువంటివి ఉత్పన్నమైనప్పుడు ఆయన వైఖరి విశిష్టత అర్థం అవుతుంది. జాతి మౌఢ్య, వర్ణ మౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసు లను దోచుకోవడం గమనార్హం. అహింసలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలకు చోటులేదు. సత్యనిష్టుని సాన్ని హిత్యంలో అసత్యం నశించిపోతుంది. అందుకే అన్ని ఎల్లలను అతిక్రమించిన స్వామి వివేకా నంద ఆత్మ్ఞనంలో సుప్రతిష్టుల్కె ఉండగా ఎలాంటి వివక్షత తలెత్తడం సాధ్యంకాదు. వివేకానంద ఆధ్యాత్మిక శక్తి గురించి విన్న విదేశీయులు ఆయనతో సన్నిహితంగా మెలగటానికి మక్కువ చూపేవారు. తాను జన్మించిన కుటుంబాన్ని పరిత్యజించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరించారు. భారతదేశం కూడా తక్కిన దేశాలతో పాటు అభివృద్ధి పొందగోరితే పేదలు, పామరులు పురోగనమం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కి వక్కాణించారు. భారతదేశపు గౌరవ మర్యాదలను విదేశాలలో ఇనుమ డిరపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పటికే ప్రచారంలోవున్న భారత వ్యతిరేకతను తొలగించటానికి నడుం బిగిం చారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామాలు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయిన ప్పటికి,ప్రతి ప్రసంగంలోనూ మన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించేవారు. మతాల మధ్య వ్యత్యాసాలు ఉండపచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికతను గుర్తించమని చెప్పేవారు. హైందవుల శాంతి కాముకత్వాన్ని తన అహింసా తత్వంతో వెల్లడిచేసేవారు. శక్తివంతమైన ఈ భారతదేశం ప్రపంచాన్ని జయిస్తుంది. అందుకే ‘‘ఓభారతమా! నీఆధ్యా త్మికతతో ప్రపంచాన్ని జయించు!’’ అంటూ స్వామి సింహనాదం చేసేవారు. ప్రశాంతత, పవిత్రత,త్యాగశీలత,సౌభ్రాతృత్వాల సందేశా లను వివరించి సహన రహిత చెవిటి చెవులలో ప్రతిధ్యనులు ఉద్భవింపచేయటంలో విజయం సాధించారు.దుస్తరమైన అద్వ్కెతాన్ని కళాత్మ కమైనదిగానూ,సజీవమైనదిగానూ వర్ణించారు. భయం కలిగించే యోగ సంప్రదాయాలను అత్యంత శాస్త్రీయంగానూ,ఆచరణ యోగ్యం గానూ వివరించే మానసిక శాస్త్రంగా వివరిం చేవారు. సత్యమనేది మతానికి ఆపాదించటం మూర్ఖత్వం అని చెప్పేవారు. విదేశాలలో ధీర గంభీరత్వంతో ఎన్నో ఆటుపోటు లను ఎదుర్కొని సత్యంవైపు అడుగులు వేసారు. మనలో నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు.‘‘మన జాతీయ ఆత్మన్యూన తాభావ జాఢ్యాన్ని వదిలించుకునేలా చేసిన వ్యక్తి వివేకానంద’’అని రాజాజీ పేర్కొన్నారు. వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి.లేఖ మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని ప్రారంభించారు. భగవదనుగ్రహం వలన పావనత సంతరించు కున్న మనస్సులో ఉద్భవించిన చింతనలే లోకాన్ని కదిలించి వేస్తాయనటంలో అతిశ యోక్తిలేదు. ‘అక్కడ సూర్యుడు ప్రకాశించ డు.చంద్రతారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు.ఇక ఈఅగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి.దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడుతున్నది.’ ‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచలను నేను క్షుణ్ణంగా చదివాను,ఆతరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచన చదవాల్సిందిగా మిమ్మల్ని కోరు కుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు,వెనుకబడ్డ వారికిసేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘అని ఉద్భో దించి భారతీయ యువతకుదిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమ యంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురి చేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేతస్వామి.తన 33ఏళ్ళ వయసులోనే మరణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాధలుగా మార్చివేశారు. మనలో ధ్కెర్యంసడలి,దౌర్భ్యం ఆవహిస్తే ‘‘నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామ కృష్ణు శిష్యుణ్ణి నేను’’అనే భావనలు మనసులో నింపుకుంటే సమస్తదౌర్భ ల్యాలు,అధ్కెర్యము మటుమాయమయుతాయి అని సర్వులకు ప్రభోదించేవారు. శ్రీవివేకానందుని జన్మదినం పురస్కరించుకుని భారతప్రభుత్వం ‘‘జాతీయ యువజనది నోత్సవం’’గా ప్రకటించింది.‘‘జనన మరణాలు సహజం,కాని నాభావనలు మావ వాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను’’ అన్న స్వామి వివేకానందుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం,సర్వదా ఆచరణీయం.- (డాక్టర్‌.దేవులపల్లి పద్మజ), వ్యాసకర్త : ప్రముఖ రచయిత్రి, విశ్వశ్రీ, సాహిత్యశ్రీ విశాఖపట్టణం,ఫోను. 9849692414

ఆదివాసులు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు

భారతదేశ మూలనివాసులు ఆది వాసులు వారి అభివృద్ధి స్వాతంత్య్రానికి పూర్వ ము,తర్వాత కూడా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.ఈస్టు ఇండియా కంపనీ,బ్రిటీషు పాలకులు,నిజాంప్రభుత్వము,కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు ప్రవేశపెట్టిన చట్టాలు చేపట్టిన పథకాలతో వారు ఆశించినంత అభివృద్ధి జరుగలేదు. హైద రాబాదు రాష్ట్రంలో నిజాం ప్రభుత్వంపై జోడే ఘాట్‌ కేంద్రముగా 1940 సం॥లో కుమ్రంభీము నాయకత్వాన ప్రకృతి సంపదలైన (జల్‌,జంగల్‌, జమీన్‌)నీళ్లు,అడవి,భూమిపైహక్కులు, అధికారము కొరకై గోండుల తిరుగుబాటు జరిగింది.ఈ సం ఘటనలో నిజాం సర్కారుకు భీమ్‌ వర్గానికి మధ్య జోడేఘాట్‌లో భీకర పోరాటం జరిగింది. దీనిలో కుమ్రం భీమ్‌ మరణించాడు.
ఆదిలాబాద్‌ అడవులలో నివసిస్తున్న ఆదివాసుల అశాంతికిగల కారణాలను అధ్య యనము చేయటానికి నిజాం ప్రభుత్వము ప్రముఖ మానవ పరిణామశాస్త్రవేత్తను నియమిం చింది. ఆదివాసులు మరియు ఇతర వెనుక బడిన తరగతుల వారి అభివృద్ధి కొరకు సలహాదా రుగా మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఆంత్రోపా లజీ డిపార్టుమెంటుకు ఆచార్యులుగా కూడా నియమించింది. ప్రొ.హైమండార్ఫ్‌ తన భార్య బెట్టి ఎలిజబెత్‌తో కలసి క్షేత్రస్థాయిలో పర్యటిం చారు.మొదట నల్లమల అడవులలో నివ సిస్తున్న చెంచుల గురించి, భద్రాచలం ప్రాంతం లోని కోయలు,కొండరెడ్ల గురించి మరియు ఆదిలా బాదులోని గోండుల గురించి విస్తృతమైన పరిశో ధనలు చేసారు. అంతేకాకుండా ఈశాన్య భారత ప్రాంతములో నివసిస్తున్న కొనియాక్‌ నాగాలు, అపతానీల గురించి కూడా అనేక పరిశో ధనలు చేశాడు. ఆదివాసుల అశాంతికి గల కారణా లలో ముఖ్యముగా వారికి సాగుభూమిపై అటవీ సంపద మీద హక్కులు కోల్పోవడం, ఆదివాసేతర భూస్వా ములు క్రింది స్థాయి అధికారుల దోపిడి, దౌర్జా న్యాలు పెరిగిపోవడం వారి తిరుగుబాటుకు కార ణాలుగా గుర్తించాడు. నిజాం ప్రభుత్వము గోండుల ఆర్థిక సామాజిక పరిస్థితులను మెరుగు పర్చటం ద్వారా వారిఅశాంతిని కొంతవరకు దూరం చెయ్యవచ్చని భావించింది. ప్రొ.హైమం డార్ఫ్‌ దంపతులు తమ కార్యక్షేత్రాన్ని ఆదివాసి గ్రామమైన మార్లవాయి కేంద్రముగా ఎంచుకు న్నారు. ప్రధా నంగా విద్య పరిపాలన పరమైన సూచనలతో నిజాం ప్రభుత్వానికి నాలుగు నివేది కలు సమర్పిం చాడు. గోండులు తమ ఆదిమ జీవనవిధా నం నుండి బయట పడటా నికే కాక భూదాహం గల ఆదిపత్య కులాలవారి నుండి తమనుతాము రక్షిం చుకోవడానికి మార్గా లను,అధికారులతో వ్యవహ రించడంలో తమ భూముల అక్రమ బదిలీలను అడ్డుకోలేక పోవడం వారినిరాశక్తతకు ప్రధాన కారణం వారి నిరక్షరా స్యతగా గుర్తించారు.వారికి ప్రభుత్వ చట్టా లు, నిబంధనలు తెలియకపోవడం వలన దురు ద్ధేశపూరితులైన ఆదివాసేతరులు, అవినీతిపరులైన క్రింది స్థాయి ప్రభుత్వ సిబ్బంది చేతిలో మోస పోవాల్సి ఉంటుంది. కాబట్టి గోం డుల పరిస్థితిలో మార్పుకు అక్షరాస్యతను పెంచు కోవడమే మొదటి మెట్టుగా భావించారు.
గోండు విద్యాప్రణాళిక రూపొం దించి 1943 వ సం॥లో మార్లవాయి,గిన్నెధారి కేంద్రాలుగా శిక్షణ పాఠశాలలను ప్రారంభిం చారు.ఈ ప్రణాళిక ప్రధాన ఉద్ధేశ్యం ఆదివాసు లకు చదువు నేర్పేందుకు ఆదివాసీ యువకులని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం.గోండు భాషలో వ్రాయడం,చదవడమేకాక రెవెన్యూ,అటవీ శాఖల నిబంధనల గురించి వాటి పనివిధానంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక స్కూళ్లను కూడా నెలకొల్పారు. ఈ విద్యా కార్యక్రమాలలో వృత్తి శిక్షణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన,రోజూవారి జీవితానికి అవసరమయ్యే ఇతర విషయాలను కూడా భోదించేవారు. ప్రొ.హైమండార్ఫ్‌ దంప తులు చేపట్టిన మరోముఖ్య కార్యక్రమం భూ పంపి ణీ,ఆదివాసుల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కు రెవెన్యూశాఖలోనే సాంఘిక సంక్షేమ సంస్థను నెలకొల్పి అక్కడి ఉద్యోగులకు స్వయంగా తానే ఉస్మానియా యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చేవారు. 1946 నాటికి ‘‘నోటిఫైట్‌’’ ఆదివాసీ ప్రాంతాలను సాధారణ పరిపాలనాశాఖ నుండి వేరుచేసి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఆయనే ‘‘మోజాం హుసేన్‌’’ ూజూవషఱaశ్రీ ుతీఱపవం ూటటఱషవతీ. భూపంపిణీ కార్యక్రమ పథకంలో కీలకపాత్ర పోషించారు.1948 నాటికి ఆదిలాబాద్‌ గోండు లు,కొలాంలకు ఒకలక్ష అరవైవేల (1.60 లక్షలు) ఎకరాల భూములకు ‘లావాణి’ పట్టాల రూపంలో పంచిపెట్టారు.వాటిని ఇప్పటికి ప్రొ. హైమండార్ఫ్‌ పట్టాలుగా పేర్కొంటారు. ఇంతేకాకుండా సం॥రా నికి ఒకసారి పుష్యమాసంలో ఆదివాసుల సంప్ర దాయబద్దముగా నిర్వహించే నాగోబా జాతరలో ఆదివాసుల సమస్యలను పరిష్కరించే వేదికగా జిల్లా అధికారుల సమక్షంలో ‘‘ప్రజాదర్బార్‌’’ ను కూడా ఏర్పాటుచేసాడు. నిజాంసర్కారుపై భారత ప్రభుత్వం తీసుకున్న పోలీసు చర్యఫలితముగా హైదరాబాద్‌ రాష్ట్రంలోని నిజాం సంస్థానం భారత దేశంలో విలీనం కావడం, కొన్నేళ్ల తర్వా త 1956లోతెలంగాణా ప్రాంతాన్ని మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్రంలో కల్పడంవలన నిజాం ప్రభు త్వానికి అంతవరకుప్రొ.హైమండార్ఫ్‌ రూపొం దిచిన ప్రణాళికలు ఆయన చేపట్టిన సామాజిక, ఆర్థిక అభివృద్ధి పథ కాలు అమలుకు నోచుకో కుండా అస్తవ్యస్తమై పోయినాయి.ఈ పరిణామాల కారణంగా తెలం గాణ,కోస్తాంధ్రలోని ఆదివాసీ ప్రాంతాల గిరిజ నులు విచ్చలవిడిగా దోపిడి పీడనలకు గురైనారు. సొంతగడ్డపై నిలువ నీడ లేకుండా అడవి లోతట్టు ప్రాంతానికి తరిమి వేయబడ్డారు. ఫలితముగా ఆదివాసీ ప్రాంత ప్రజలు కమ్యూనిస్టు పార్టీల నాయ కత్వంలో‘‘దున్నేవాడిదేభూమి’’నినాదంతో ప్రారం భమై సాయుధ పోరాటాలవైపుకు ఆకర్షితులైనారు.
ఆదిలాబాద్‌ నుండి శ్రీకాకుళం వరకు విస్తరించి ఉన్న (ఎజెన్సీ) మన్యప్రాంత గిరిపుత్రు లలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా వారి అభివృద్ధి ని ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వాలపై అసంతృప్తి పెరిగింది. శ్రీకాకుళంలోని మొండెంఖల్‌ నుండి ఆదిలాబాద్‌లోని ఇంద్రవెళ్ళివరకు నక్సల్‌బరి ఉద్యమాలు అడవిలో ఊపందుకున్నాయి. గోండు గూడాలలో వారి సంప్రదాయ వాయిద్యమైన ‘‘తుడుం’’ మోగింది. తమ హక్కుల సాధన కొరకు, దోపిడి పీడనల విముక్తి కొరకు ఆదివాసులు చైతన్య వంతులైనారు.పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ అనుబంధ ‘‘గిరిజ న రైతు కూలి సంఘం’’ ఆధ్వర్యంలో 20ఏప్రిల్‌, 1981న ఇంద్రవెళ్ళి సంతలో సభ నిర్వహిస్తే ప్రభు త్వం దానిని అడ్డుకొని నిరాయుధులైన వందల మంది అమాయక గోండులపై కాల్పులు జరిపి మరో జలియన్‌ వాలా భాగ్‌ను సృష్ఠించింది. ఈ మారణకాండ దేశవ్యాప్తంగా ప్రకంపనలురేపింది.
భారతీయ ఆదివాసులు మాట్లాడే భాషలు, వారి సామాజిక వ్యవస్థ, సంస్కృతి, నివాస ప్రాంతాలు, జీవనశైలి, ఆదివాసేతర సమాజాల కంటే భిన్నముగా ఉండటం వలన వారు నివసించే ప్రాంతాల పరిపాలన కొరకు మానవ పరిణామ శాస్త్రవేత్తల పరిశోధన గ్రంథాలు, సూచనలు, నివేది కలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేకమైన పరిపాలన వ్యవస్థను తయారు చేయడం జరిగింది. బ్రిటీషు ప్రభుత్వము1917 సం॥లోనే ఆదివాసులు అధిక ముగా నివసించే ప్రాంతాలను నోటిఫైడ్‌ షెడ్యూలు ప్రాంతాలుగా గుర్తించింది. వారి సామాజిక, సాం స్కృతిక,ఆర్థిక అభివృద్ధికై భారత ప్రభుత్వము ఈశా న్య భారత ప్రాంతములో నివసించే ఆదివాసుల కొరకు స్వయం ప్రతిపత్తిగల జిల్లా కౌన్సిల్లను ఏర్పా టు చేసింది.మధ్య భారతప్రాంత ఆదివాసుల కొరకు వారి భూముల రక్షణకై ప్రత్యేకించి భూ బదలాయిం పు నిరోధక చట్టం వడ్డీ వ్యాపారుల నిరోధక చట్టం ప్రవేశపెట్టింది.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ముందుచూపుతో భారతీయ ఆదివాసుల అభివృద్ధికై ప్రత్యేక పరిపాలన వ్యవస్థ కొరకు ఈశాన్య భారతప్రాంత రాష్ట్రాలకు ఆరవ (6)షెడ్యూలు మరియు మధ్య భారత ప్రాంత రాష్ట్రా ల్లా ఆదివాసులకు అయిదవ(5)షెడ్యూలును భారత రాజ్యాంగంలో పొందుపర్చారు. భారతదేశ మొదటి ప్రధాని శ్రీ పండిత్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ కూడా ఈ ప్రాంతఆదివాసి ప్రజల అభివృద్ధి కొరకై ప్రత్యే కమైన‘‘పంచశీలసూత్రాలను’’ప్రవేశపెట్టారు.ఈశాన్య భారతములో కొంతవరకు ప్రగతి జరిగినప్పటికీ మధ్య భారత ప్రాంతములోని ఆదివాసులకు ఆశించి నంత ప్రగతి ఏమాత్రము కూడా జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలాకాలము వరకు గిరిజన అభి వృద్ధి కార్యక్రమాలు సాంఘిక సాంక్షేమశాఖలో భాగంగానే కొనసాగాయి. 1974 సం॥లో ఆదివా సులు అధికముగా ఉన్న తొమ్మిది (9) జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన కొరకు జి.ఓ.నెం.856సాంఘిక సాంక్షేమశాఖ తేది. 29. 10.1974ద్వార ‘‘సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ’’ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన సాంక్షేమశాఖకు ఆసిఫా బాద్‌ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నుకోబడిన గోండులలో ప్రథమ పట్టభదృడుశ్రీ కోట్నాక భీమ్‌రావు గిరిజన సాంక్షేమశాఖా మంత్రి గా నియమితులైనారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొమ్మిది (9) సమీకృత గిరిజనాభి వృద్ధి సంస్థలఏర్పాటు చేసింది. సమీకృత గిరిజనా భివృద్ధి సంస్థ లకు స్థాయి సీనియర్‌ IAS అధికారి నాయకత్వాన ఆ సంస్థ పరిదిలోని ప్రభుత్వ శాఖలన్నింటిని సమన్వయపరుస్తూ ఏకీ కృత పరిపాలన చెయ్యవలసి ఉంటుంది. సంబంధిత జిల్లా కలెక్టర్లు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలకు జష్ట్రaఱతీఎaఅ లుగా వ్యవహరిస్తారు. ప్రతిమూడు(3) నెలలకొకసారి ఈసంస్థలు అక్కడి ఆదివాసుల సామాజిక,ఆర్థిక అభివృద్ధి కొరకు చేపట్టిన పథకాల ప్రగతిని సమీక్షించుటకు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టరు మరియు గిరిజన సాంక్షేమ శాఖామా త్యుల అధ్యక్షతన గవర్నింగ్‌ బాడీ సమావేశము నిర్వహించాలి. దురుదుష్టవశాత్తు చాలాకాలము వరకు ఈసంస్థల వ్యవస్థలంతాకూడా కొన్ని జిల్లా లలో జిల్లా కలెక్టర్ల కార్యాలయాలలో బంధీలై దీర్ఘానిద్రావస్థలో మునిగిపోయినది.
అంతేకాకుండ సాధారణముగా మైదాన ప్రాంతాలోల సరిగ్గా పనిచెయ్యని, అసమర్థులైన అధికారులను, సిబ్బందిని ఆదివాసీ ప్రాంతాలకు తరచుగా నియమిస్తారు. ఇందులో మొదటి రకం మొదటి నియామకం రెండోరకం పదోన్నతి, మూ డోరకం శిక్షించుటకు వీరు ఆదివాసుల సమస్యలను పట్టించుకోరు. అర్థం కూడా కావు. చుట్టపుచూపుగా వచ్చి విధులు నిర్వహిస్తారు. బదిలీల కొరకై రాజ కీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటారు. రవాణా సౌకర్యాలు, స్థానికంగా ఉండటానికి కనీస వసతి కూడాలేని ప్రాంతాలలో ఆదివాసుల భాష వారి జీవనశైలి తెలియని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ద్వారా ఆదివాసులకు ఒరిగేది ఏమి లేదు. పైగా వీళ్ళంతా వేతనంతో పాటు ఏజెన్సీ ప్రాంత అలవె న్సులు కూడ పొందుతుంటారు. 1981ఏప్రిల్‌ 20 సోమవారం ఇంద్రవెళ్లి సంతలో గోండులపై జరిగిన కాల్పుల సంఘటన తర్వాత భారతదేశానికి మళ్ళీ వచ్చిన ప్రొ॥హైమండార్ఫ్‌ దంపతులు ఆదివాసి గ్రామాలను విస్తృతంగా పర్యటించారు. ఇక్కడి ఆదివాసుల స్థితిగతులను పరిశీలించినప్పుడు తమకు1940 నాటి పరిణామాలే గుర్తుకు వస్తు న్నాయని ఆవేదన వ్యక్త పర్చారు. తాము నిజాం ప్రభుత్వ కాలములో ప్రవేషపెట్టిన పథకాలను ఆదివాసుల భూములను పరిరక్షించే చట్టాలను వారి కొరకు ప్రస్తుత ప్రభుత్వాలు చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయకపోవటమే ముఖ్యమైన కారణాలుగా పేర్కొన్నాడు. ఆదివాసుల అశాంతికి గల వివిధ కారణాలను తెల్పుతూ వారి అభివృద్ధి కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్ట వలసిన పథకాలపై పలు సూచనలు చేస్తూ ప్రభు త్వానికి తన నివేదిక సమర్పించాడు. ప్రొ॥ హైమం డార్ఫ్‌ దంపతుల సూచనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఆదివాసుల అభివృద్ధికై పలు సంస్కరణలు చేపట్టింది.ఆదివాసులు ఎదుర్కొం టున్న సమస్యలపై అవగాహన కల్గి వారిపై అపార మైన సానుభూతి,చిత్తశుద్ధి గల అధికారులను ఉట్నూర్‌ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో నియ మించారు.1975 సం॥లోనే ఏర్పాటై ఉట్నూర్‌ కేంద్రంగా పని చేయవలసిన సంస్థ జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్‌ కార్యాలయము నుండి పని చేస్తుం డటం కొత్తగా నియమించబడిన అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
1982 ఫిబ్రవరి నెలలో ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీఎమ్‌.వెంకటపూర్ణ చంద్రశేఖర శాస్త్రి, IAూ గారు,గోండు తెగనుండి మొదటిగ్రూప్‌`1అధికారిమడావి తుకారాంసహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్‌) గారుఆదిలాబాద్‌ జిల్లా కేంద్రము నుండి పనిచేస్తున్న IుణA సంస్థ కార్యాలయాన్ని అరవై (60) కి.మీ. దూరములో గల గిరిజన బాలుర వసతి గృహము ఉట్నూరుకి మార్చేశారు. ఈ సంస్థలో పని చేయటానికి ఆశక్తి గల సిబ్బంది అందరూకూడా ఉట్నూరులోనే ఉండి పనిచేయవలసిందిగా ఆదేశాలుజారీ చేసారు. ఆది వాసులంటే అపారమైన ప్రేమాభిమానాలు, అంకితభావముగల అధికారి శాస్త్రీ గారు రాత్రిం బగళ్ళు గోండుగూడాలలో పర్యటించి వారి సాధక బాదకాలను అర్థం చేసుకుంటూ అనతి కాలంలోనే గోండు భాష నేర్చుకున్నారు. సహాయ ప్రాజెక్టు అధికారి శ్రీ మడావి తుకారాం గారి సహకారంతో IుణA లో చిత్తశుద్దిగల అధికారుల బృందాన్ని కూడ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వం పై ఆదివాసులకు గల అసంతృప్తిని తొలగించుటకు వారికి ప్రభు త్వంపై నమ్మకాన్ని కల్గించటానికి ఎనలేని కృషి చేసారు. మారుమూల ఆదివాసి గ్రామాల నుండి చదువుకున్న స్థానిక గోండు యువకులను ఎంపిక చేసి IుణA సంస్థకు ఆదివాసులకు మధ్య సంధాన కర్తలుగా పనిచేయటానికి ఇరవై (20)మందిని Gశీఅస పఱశ్రీశ్రీaస్త్రవ ఔవశ్రీటaతీవ ూటటఱషవతీం (Gపఔూ) లుగా నియమించారు. ఆదిమ గిరిజనాభివృద్ధి సలహా సంఘం Aపశీతీఱస్త్రఱఅaశ్రీ ుతీఱపవం ఔవశ్రీటaతీవ Aసఙఱంశీతీవ జశీఎఎఱ్‌్‌వవ (AుఔAజ) ఏర్పాటు చేసి దానికి మాజీ గిరిజన సంక్షేమ శాఖామాత్యులు శ్రీ కొట్నాక భీమ్‌రావ్‌ను జష్ట్రaఱతీఎaఅ గా నియ మించారు. ఆదివాసుల విప్లవ జ్యోతి అమరవీరుడు కుమ్రం భీమ్‌ వర్ధంతి సభను ఆయన వీరమరణం పొందిన జోడేఘాట్‌లో 1983 సం॥ నుండి ప్రతి సంవత్సరము ఆశ్వాయుజ మాసం పున్నమి రోజున ప్రభుత్వ పరంగా IుణA ఆధ్వర్యంలో సభ నిర్వహిం చడం మొదలైనది. గోండుల సామాజిక, సాంస్కృ తిక,సాంప్రదాయ సంస్థలైన‘‘రాయ్‌సెంటర్ల’’ వ్యవస్థ ను పునరుద్దరించే కార్యక్రమాలను చేపట్టారు. రాయ్‌ సెంటర్లసభలు,సమావేశాలు ఏర్పాటు చేసి పరి పాలనలో భాగస్వాములను చేస్తూ ఆదివాసీ గ్రామా ల అభివృద్ధికి ఎటువంటి పథకాలు అవస రమో వారి సలహాలు,సూచనలను పరిగణలోనికి తీసు కోవడం మొదలుపెట్టారు.ఒక సంవత్సర కాలంలోనే ప్రాజెక్టు అధికారి శాస్త్రిగారి ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం, గిరిజన సహకార సంస్థ ూబప-జశీశ్రీశ్రీవష్‌శీతీ, ూజూవషఱaశ్రీ ణవజూబ్‌వ జశీశ్రీశ్రీవష్‌శీతీ కార్యాలయాలతో పాటు అక్కడ పనిచేసే అధికారు లకు,ఇతర సిబ్బందికి కూడా నివాస గృహాల నిర్మా ణము పూర్తి చేసారు.ఫారెస్టు, పోలీసు, ఇతర అన్నీ ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఉట్నూర్‌లో వెలి సాయి. కుమ్రం భీమ్‌ కాంప్లెక్సు నిర్మాణం పూర్తి కావడంతో ఉట్నూర్‌ పట్టణం యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయినవి.ఉట్నూరు నుండి ఇందన్‌ పల్లి వరకు జన్నారంను కలుపుతూ రోడ్డు మార్గం ఏర్పాటు అయినది. ప్రాజెక్టు అధికారి శాస్త్రి గారు పరిపాలన సౌలభ్యం కొరకు తాలుకా వారిగా సెక్టోరల్‌ అధికారుల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రతి సెక్టారుకు IుణA పరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులను నియమించారు. వారిద్వారా ఆది వాసులు ఎదుర్కొంటున్న తాత్కాలిక,దీర్ఘకాలిక సమస్యలను విశ్లేషిస్తూ ఐటిడిఏ చేపట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలుపరుస్తూ, వాటి వర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించారు. శాస్త్రిగారిఐటిడిఏ దళంలోని ముఖ్యమైన సభ్యులు. మూడు సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేశారు. ఆదివాసులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ద టానికి గిరి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టారు. ఇరవై (20) మంది బడి ఈడు పిల్లలున్న ఆదివాసి గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పా టు చేసారు. మాద్యమిక, ఉన్నత పాఠశాల విద్యకై నూట ముప్పై మూడు (133) ఆశ్రమ పాఠశాలలు, ఏడు (7)వసతిగృహాలు, బాలికల కొరకై ప్రత్యేకించి నలభై ఎనిమిది (48) ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసారు.ఈ పాఠశాలల పర్యవేక్షణ కొరకు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి,సహాయ గిరిజనాభివృద్ధి అధి కారులు,ప్రత్యేక విద్యాశాఖాధికారి కూడా నియమించబడ్డారు. చాలా వెనుకబడిన కొలాం తెగవారి కొరకు నియమించి ఆసిఫాబాదు కేంద్రంగా ప్రత్యేక పాఠశాలను పది (10) శాటిలైట్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేసారు. ఆదివాసుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఆదివాసి గ్రామంలో స్థానిక ఆదివాసి మహిళను ఎంపిక చేసి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గానియమించారు. వారికి ఆరోగ్య సూత్రాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకుఐటిడిఏ పరిదిలోని ముప్పై ఒకటి (31)ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు,నూట ఎనభై ఆరు (186) ఆరోగ్య ఉపకేంద్రాలు, ఆరు (6) సామాజిక ఆసుపత్రులను పర్యవేక్షణ కొరకు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా మలేరియా నియంత్రణ ఆధికారిని కూడా నియమించారు. ఆదివాసుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చటానికై వ్యవసాయం, పాడి పరిశ్రమ,పట్టు పరిశ్రమ,పండ్లతోటల పెంప కం కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. చెన్నూర్‌, భీమారం,బెల్లంపల్లి,జంబుగామ్‌,బెజ్జూరు, ఆసిఫాబాద్‌, ఇచ్చోడ మరియు ఉట్నూరులో స్థానిక ఆదివాసి యువతీ యువకులను ప్రోత్సహించి, మామిడి మొక్కల నర్సరీల పెంపకంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసారు. ప్రతిశాఖ నుండి అధికారులను నియమించి వాటిని పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టారు. ఒక సంవత్సర కాలంలోనే ప్రాజెక్టు అధికారి శాస్త్రిగారి ఆధ్వర్యంలో ఐటిడిఏ ప్రధాన కార్యాలయం,గిరిజన సహకార సంస్థ కార్యాలయాలతోపాటు అక్కడ పనిచేసే అధికా రులకు, ఇతర సిబ్బందికి కూడా నివాస గృహాల నిర్మాణము పూర్తి చేసారు. ఫారెస్టు, పోలీసు, ఇతర అన్నీ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉట్నూర్‌లో వెలిసాయి. కుమ్రం భీమ్‌కాంప్లెక్సు నిర్మాణం పూర్తి కావడంతో ఉట్నూర్‌ పట్టణం రూపు ంఖలు పూర్తిగా మారిపోయినవి. ఉట్నూరు నుండి ఇందన్‌పల్లి వరకు జన్నారంను కలుపుతూ రోడ్డు మార్గం ఏర్పాటు అయినది.ప్రాజెక్టు అధికారి శాస్త్రి గారు పరిపాలన సౌలభ్యం కొరకు తాలుకా వారిగా సెక్టోరల్‌ అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సెక్టారుకు ఐటిడిఏపరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులను నియమించారు. వారి ద్వారా ఆదివాసులు ఎదుర్కొంటున్న తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యలను విశ్లేషిస్తూ ఐటిడిఏచేపట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలుపరుస్తూ, వాటి వర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించారు.
ఆదివాసులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దటానికి గిరి విద్యా వ్యవస్థలో అనేక సంస్కర ణలు చేపట్టారు. ఇరవై (20) మంది బడి ఈడు పిల్లలున్న ఆదివాసిగ్రామాలలో ప్రాథమిక పాఠ శాలలు ఏర్పాటు చేసారు.మాద్యమిక,ఉన్నత పాఠశాల విద్యకై నూట ముప్పై మూడు (133) ఆశ్రమ పాఠశాలలు,ఏడు (7) వసతి గృహాలు, బాలికల కొరకై ప్రత్యేకించి నలభై ఎనిమిది (48) ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసారు. నియ మించబడ్డారు. చాలా వెనుకబడిన కొలాం తెగ వారి కొరకు నియమించి ఆసిఫాబాదు కేంద్రం గా ప్రత్యేక పాఠశాలను పది (10)శాటిలైట్‌ సెంట ర్లను కూడా ఏర్పాటు చేసారు. ఆదివాసుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలలోభాగంగా ప్రతి ఆది వాసి గ్రామంలో స్థానికఆదివాసి మహిళను ఎంపిక చేసి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గా నియమించారు. వారికి ఆరోగ్య సూత్రాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం, సీజనల్‌ వ్యాధుల నియం త్రణకు ఐటిడిఏ పరిదిలోని ముప్పై ఒకటి (31) ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు,నూట ఎనభై ఆరు (186) ఆరోగ్య ఉపకేంద్రాలు,ఆరు(6) సామాజిక ఆసుపత్రులను పర్యవేక్షణ కొరకు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జిల్లా మలేరియా నియంత్రణ ఆధికారిని కూడా నియమించారు. ఆదివాసుల ఆర్థిక పరిస్థితులను మెరు గుపర్చటానికై వ్యవసాయం, పాడి పరిశ్రమ,పట్టుపరిశ్రమ,పండ్లతోటల పెం పకం కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. చెన్నూ ర్‌,భీమారం,బెల్లంపల్లి,జంబుగామ్‌, బెజ్జూరు, ఆసిఫాబాద్‌,ఇచ్చోడ మరియు ఉట్నూరు లో స్థానిక ఆదివాసి యువతీ యువకులను ప్రోత్సహించి, మామిడి మొక్కల నర్సరీల పెంపకంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసారు.ప్రతిశాఖ నుండి అధికారులను నియమించి వాటిని పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో సమగ్రగిరిజనాభివృద్ధి (ఐటిడిఏ) సంస్థ లు ఆదివాసుల అభివృద్ధి కొరకు చేపట్టిన పథకాలు కొంతమేర పురోగతి సాధించాయని చెప్పవచ్చును. అల్లంపల్లి ఎదురు కాల్పుల సంఘటన తర్వాత ఉట్నూరు ఐటిడిఏసంస్థ గిరిజనుల కొరకు గిరి జనులే ఉపాధ్యా యులుగా నెలకు వెయ్యి (1000/-) రూపాయల గౌరవవేతనంతో ఒక వెయ్యి (1000) మంది స్థానిక యువతీ యువకులను ఎంపిక చేసి గిరిజన విద్యావికాస కేంద్రాలను 1987సం.లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయ నైపుణ్యా లతో సంబంధము లేకుండా కనీస విద్యాఅర్హత పదవ తరగతి చదివితే చాలు, ఈ యువత విద్యతోపాటు ఆయా గ్రామాల అభి వృద్ధికి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంధాన కర్తలుగా పాటుపడ్తారనే సదాశయముతో ప్రభుత్వం వీరిని నియమిం చింది.గిరిజన యువతకు ఉపాధి కల్పిం చటం, వారిని నక్సలైట్ల కార్యక్రమాల నుండి దూరం చేసి ప్రభుత్వంపై నమ్మకము కల్పిం చటం ప్రభుత్వం యొక్క ప్రధాన ఆశయం. గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగముగా ముఖ్య మంత్రి చీ.ు.రామారావుగారు ప్రతిఇంటికి నాల్గు వేలు చొప్పున పదివేల (10, 000) సెమిపర్మనెంట్‌ ఇండ్లు మంజూరు చేసారు. మారుమూల కొండప్రాంత గిరిజనులకు ఇంటికి వెయ్యి (1000)చొప్పున బెంగళూరు గూన ఐటిడిఏ సెక్టొరల్‌ అధికారులద్వార పంపిణి చేసారు. ఈఇండ్ల నిర్మాణములో చాలాచోట్ల గిరిజ నులకు, ఫారెస్టు అధికారులకు మధ్య తగాదాలు, ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.
గిరిజనులు భూమి సాగు చేసుకోవ డానికి ఎడ్ల జతల పంపిణీ కార్యక్రమం, వ్యవసా య బావుల నిర్మాణకార్యక్రమాలు కూడా ముమ్మరంగా చేపట్టారు. ఈ అబి óవృద్ధి కార్యక్రమా లన్ని ఒక దశాబ్దకాలము పాటు నిర్విరామంగా కొనసాగాయి.ఇందులో ఎక్కువశాతం ప్రక్క రాష్ట్ర మైన మహారాష్ట్రలో దీ.జ.లుగా ఉన్న లంబా డాలు వలసవచ్చి ఇక్కడి స్థానిక గిరిజ నులు పొందవలసిన ప్రభుత్వ పథకాలను వీరు పొందు తున్నారు.విద్యా, వైద్యము, ఉపాది నియ మకాలను వీరే దక్కించుకుంటున్నారు. స్థానిక ఆది వాసుల భూములను కూడా కాజేయటంతో వలస లంబా డీలకు,స్థానిక గోండులకు మధ్య తీవ్ర ఘర్ష ణలు మొదలై పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా మారాయి. వ్యాసకర్త : డాక్టర్‌. తొడసం చందూ,విశ్రాంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
సెల్‌ : 9440902142,

హైడ్రోప్రాజెక్టుపై గిరిజనం తిరుగుబాటు

జనాలను రక్షించేవాడని షిర్డిసాయికి పేరు. కానీ.. అక్కడ షిర్డిసాయి మాత్రం గిరిజనుల గుండెపై బాణం సంధిస్తు న్నాడు. వేలాది జనాలను రోడ్డున పడేస్తున్నాడు. వందల ఎకరాలు నేలమట్టం చేయి స్తున్నాడు. ప్రకృతిఒడిలో పెరిగిన పంటలను ధ్వం సం చేయిస్తున్నాడు.షిర్డిసాయి తలచుకోవడం.. కేంద్రం తలవంచటం చకచకా జరిగి పోయాయి. మరి అనుగ్రహించాల్సిన షిర్డిసాయినే ఆగ్రహిస్తే, వాళ్ల బతుకులేం కాను? నోరు లేని గిరిజనం, తమ గోడు ఎవరికి వినిపించాలి? కొత్తగా వచ్చే ప్రాజెక్టు వల్ల ఊళ్లు వదిలి వెళ్లేవారికి దిక్కెవరు? షిర్డిసాయి అంత పని చేస్తాడని ఊహించని ఆ అమాయకులను ఆదుకు నేదెవరు? అసలు ఎవరీ షిర్డీ సాయి? పల్లెపై ఎందుకు పగ పట్టారు? ఇదీ ఇప్పుడు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం యర్రవరంలో గిరిజనగోస. దీన బాంధవుడు షిర్డీసాయి ఏమిటి? ఆదివాసీలను రోడ్డుపాలు చేయడమేమిటను కుంటు న్నారా? పేరులో కొంత గందరగోళం ఉన్నప్పటికీ, కంపెనీ మాత్రం షిర్డీసాయినే! ఆయన పేరు పెట్టుకున్న ఆ కంపెనీ ఇనుపపాదాల కింద, ఇప్పుడు వేలాది గిరిజనుల జీవితాలు నలిగి నాశనం కానున్నాయి. సర్కారే సదరు కంపెనీకి సలాము కొడుతున్నందున, గత్యంతరం లేని గిరిజనం పిడికిలి బిగించింది. షిర్డిసాయి కంపెనీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు మాకొద్దంటూ, మన్యంవీరులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సర్కారుకు వ్యతిరేకంగా, చింతపల్లి ఏజెన్సీ బంద్‌తో తమ తడాఖా చూపించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింత పల్లి మండలం,గొందిపాకలు పంచాయతీ లోని ఎర్రవరం గ్రామంలో..షిర్డీ సాయి ఎలక్ట్రికల్‌ కంపె నీకి సర్కారు ధారాదత్తం చేసిన హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌, కొండకోనల నడుమ ప్రశాంతంగా ఉండే గిరిజ నుల గూడేల జీవితాల్లో చిచ్చుపెట్టింది.ఎర్రవరం పరిధిలోని హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటాన్నిగిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మాణం రద్దు చేయాలని రోడ్డెక్కారు.పంటలు, ఫలాలు పండి స్తూ జీవిసిస్తున్నామని..పవర్‌ ప్రాజెక్టు వస్తే జీవనా ధారం పోతుందని ఆవేదన వ్యక్తం చేసున్నారు. తమకు న్యాయం చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.జనవరి 8నవిశాఖపట్నంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావవేశం ఏర్పాటు చేశారు.చింతపల్లి,అరకు,ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల వద్ద ఆల్‌పార్టీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నిరసనలు చేపట్టారు.ఆంధ్రప్రదేశ్‌ కాశ్మీర్‌ గా ప్రసిద్ధి చెందిన లంబసింగి వద్ద ఆదివా సీలు తెల్లవారుజామున గుమిగూడి రాస్తారోకో నిర్వహిం చారు.కనీసం నాలుగు గంటలపాటు వారు తమ ఆందోళనను కొనసాగించారు.అనంతరం మండల కేంద్రానికి తరలివెళ్లిన ఆందోళనకారులు హనుమాన్‌ జంక్షన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నాకు దిగారు. సమావేశంలో గిరిజన సంఘం అఖిల భారత కార్యవర్గ సభ్యుడు పి.అప్పల నరస మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోనూ గిరిజన వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఆరోపించారు. మరియు రాష్ట్రం. యర్రవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు కేంద్రం అట వీ,పర్యావరణ అనుమతులు ఇచ్చింది. దాని ఆధా రంగా రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టును షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌కు అప్పగించింది, ’’అని అప్పల నరస అన్నారు మరియు ఏజెన్సీ ప్రాంతాలలో సహజ వనరులను దోపిడీ చేయ డానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చర్యలను పలుచన చేస్తోందని ఆరోపించారు.రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సమత కోఆర్డినేటర్లు కందుకూరి సతీష్‌కుమార్‌,గునపర్తి సైమన్‌సీపీఎం అనంతగిరి జెడ్‌పీటీసీ దిసరి గంగరాజు పాల్గొన్నారు. బంద్‌ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాల్గోని మాట్లాడుతూ గిరిజనుల ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఉంటుందని, గిరిజనుల రక్షణ కోసం పార్టీ ఉమ్మడిగా ఆందోళన చేపడుతుందని ప్రకటించారు.
ప్రాజెక్టు లక్ష్యం ఇదీ..
యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును, ఒక్కొక్కటి 300 మెగా వాట్లసామర్థ్యంతో,నాలుగు యూనిట్లు ప్రారంభిం చాలన్నది లక్ష్యం.తాండవ రిజర్వా యర్‌లో కలిసే పిట్ట ఒరుకుగెడ్డపై,రెండు రిజర్వా యర్లు నిర్మించాల న్నది ఒకప్రతిపా దన. యర్ర వరం ఎగువడ్యాం నుంచిగానుగుల దిగువ ప్రాం తంలోని దిగువ డ్యాం వరకూ సొరంగం తవ్వి, మధ్యలో జలవిద్యు దుత్పత్తి యూనిట్‌ ఏర్పాటు చేయాలన్నది మరో ప్రతిపాదన.ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం5,400 కోట్లుగా అంచనా వేశారు. నిజానికి 2020లో చింతపల్లి మండలంలో బాక్సైట్‌ తవ్వ కాల ఆలోచ నకు నాటిసీఎం వైఎస్‌ బీజంవేశారు. దానిని నక్స లైట్లు సహా, అన్ని రాజకీయపార్టీలూ వ్యతిరేకిం చాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం,జీఓ 97నురద్దు చేస్తూ మరో జీఓ ఇచ్చిం ది.దానితో మన్యంలో మంటలు చల్లారాయి. జగన్‌ సీఎంఅయిన తర్వాత, బాబు సర్కారు ఇచ్చిన జీవోనురద్దు చేసింది. ఫలితంగా పులివెం దులకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రిసిటీ కంపెనీ తెరపైకి వచ్చింది. ప్రైవేట్‌ కంపెనీ ఏజన్సీతో సర్వే చేయించడం,ఆ వెంటనే డీపీఆర్‌ సిద్ధం చేయిం చడం,ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ,పర్యావరణశాఖ అనుమతికోసం ఢల్లీికి పంపించడం,ప్రాజెక్టును అదానీ కంపెనీకి అప్పగిం చేందుకు అంగీ కారం,2021 డిసెంబర్‌ 21న కేంద్రం అనుమ తులు జారీ చేయడం యుద్ధప్రాతి పదికన జరిగి పోయాయి. ఆతర్వాత దానిని షిర్డీ సాయి ఎలక్ట్రి కల్‌ కంపెనీకి అప్పగిస్తూ,జగన్‌ సర్కా రు మంత్రి వర్గం తీర్మానిచింది.షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీ పాలకపార్టీకి,ఆత్మబంధువులన్న ఆరోపణ ల నేప థ్యంలో..ఆ కంపెనీకి ప్రాజెక్టు ధారాదత్తం చేసిన వైనం విమర్శలకు గురవు తోంది.ప్రాజెక్టును షిర్డీసాయి ఎలక్ట్రి కల్‌ కంపెనీకి కట్టబెట్టే అత్యుత్సా హంలో..నిబంధ నలకు నీళ్లొదిరారన్న ఆరోపణ లు వెల్లువెత్తుతు న్నాయి. విచిత్రంగా నిబంధనలు నిశితంగా పరిశీ లించిన తర్వాతనే, ఏ ప్రాజెక్టున యినా ఆమోదించే కేంద్రం ప్రభుత్వం కూడా.. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు చకచకా అనుమతి ఇచ్చిందంటే, ‘షిర్డీసాయి మహత్యం’ఏస్థాయిలో పనిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అటు హైడ్రో ప్రాజెక్టు ఏర్పాటు పై గిరిజనం ఆందోళన చేస్తుంటే..ఇటు బీజేపీ వారికి మద్దతు నివ్వక పోగా,కేంద్రంలోనిబీజేపీ సర్కారు అనుమ తులన్నీ ఆగమేఘాలపై జారీ చేయ డాన్ని గిరిజను లు మండిపడుతున్నారు. ఫలితంగా ఈవివా దంలో బీజేపీఅడ్డంగా ఇరుక్కుపోయినట్ట యింది. ఇక తమ జీవనాధారమైన పంటపొలాలు ధ్వంస మయి, జీవితాలు రోడ్డునపడటంపై గిరిజనం గగ్గోలు పెడుతోంది. సర్కారు నిర్ణయానికి వ్యతిరే కంగా చింతపల్లి ఏజెన్సీ ఏరియాను బంద్‌ ప్రకటిం చగా,అనూహ్య స్పందన లభించింది. ఆదివాసీలు మూకుమ్మడిగా రోడ్డెక్కి, సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పారు.ప్రాజెక్టును కట్టనిచ్చేది లేదని హెచ్చ రించారు. మా జీవితాలు హరించే హక్కు ప్రభుత్వా నికి ఎవరిచ్చారని గర్జించారు. షిర్డీసాయి కంపెనీకి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలంటూ గళమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణంవల్ల తాము అనాధలమవు తామ ని ఆందోళన వ్యక్తం చేశారు. షిర్టీసాయి కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్టు వల్ల..చింతపల్లి,కొయ్యూరు మండ లాల్లోని 2500ఎకరాలు నేలమట్టమవుతాయి. ఆరకంగా నాలుగు పంచాయతీలోని ఆదివాసీలు రోడ్డునపడతారన్నమాట. దాదాపు 20 వేల మంది ఆదివాసీలు,32 గిరిజన గ్రామాలు ప్రాజెక్టు కోసం పూర్తి స్థాయిలో ఖాళీ చేసి, మూటా ముల్లె సర్దుకుని పోవాల్సిందే. అదొక్కటే కాదు..కొన్ని దశాబ్దాల నుంచి,తాత ముత్తాతల కాలం నుంచీ సాగుచేసు కుంటున్న పంటలు కూడా ప్రాజెక్టుకు బలవుతా యన్నది గిరిజనుల ఆందోళన. 600ఎకరాల్లో గిరిజ నులు సాగుచేస్తున్న జామ,అనాస,మల తోటలు నేలకూలనున్నాయి. 1500 ఎకరాల్లో సాగుచేస్తున్న మిరియాలు, కాఫీ తోటలు నేలమట్టం కానున్నాయి. మొత్తంగా అక్కడ ఇక పచ్చని చెట్లు, పంటపొలాలు మాయమవుతాయన్నమాట.
రాజ్యాంగానికి తూట్లు
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 244(1) ద్వారా ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులు కల్పించారు. వారికి రక్షణగా భూబదలాయింపు చట్టాలుచేశారు. వాటినీ జగన్‌ సర్కారు భేఖారుచేస్తోంది. ఆదివాసీల సంప దను ఆస్మదీయులకు అడ్డదారుల్లో దోచి పెట్టాలని చూస్తోంది. గిరిజనప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మిం చాలంటే ప్రభావిత ప్రాంతాల్లో మొదట గ్రామసభను నిర్వహించి,వాటి ఆమెదంతోనే అనుమతులు ఇవ్వాలన్న నిబంధనను జగనన ప్రభుత్వం తుంగ లో తొక్కేసింది.ముఖ్యమంత్రి,మంత్రులు సచివా లయంలో కూర్చునే..షిర్డీసాయి సంస్దకు పీఎస్పీ ప్రాజెక్టుని కేటాయించేశారు. అది ఆచరణలోకి వస్తే ఏజెన్సీలోని కొయ్యూరు,చింతపల్లి,గూడెంకొత్తవీథి మండలాల్లోని కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందిని గిరిజనులు మూడు వేల ఎక రాల భూములు కోల్పోతారని గిరిజన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చట్టాలను తుంగలోకి తొక్కి గిరిజనుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ చర్యలను నిరిసిస్తూ స్థానికలు ఆందోళనలు చేపడుతున్నారు. ముంపు ప్రభావిత మండలాల్లో బంద్‌లు,నిరసనలు,ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
తాండవ జలాశయంపై ప్రభావం
ఎర్రవరంలో నిర్మించనున్న పీఎస్‌పీతో అనకాపల్లి,తూర్పుగోదావరి జిల్లాలో ఆయకట్టు కలిగిన తాండవ జలాశయంపై ప్రభావం పడు నుంది.కొయ్యూరు,చింతపల్లి మీదుగా జలాశయం లోకి ప్రవహించే నీటి వనరులపై ఈ పీఎస్‌పీని నిర్మించబోతున్నారు.0.4టీఎంసీల సామార్ద్యంతో ఎగువు,దిగువన రెండు రిజర్వాయర్లు నిర్మించి, విద్యుదుత్పిత్తి చేయనున్నారు.దీనివల్ల జలాశయం లోకి వచ్చే0.4టీఎంసీల నీరు తగ్గిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికార్లులు అంటున్నారు. సుమారు 4వేలఎకరాలకు సాగునీరు ప్రశ్నార్ధ కంగా కానుంది.
చట్టం ఉల్లంఘన
ఐదో షెడ్యూల్‌ పరిథిలోని ఆదివాసీ గ్రామాల్లో భూములను గిరిజనేతరులకు బదలా యించడానికి వీల్లేదు.క్రయవిక్రయాలు పూర్తిగా గిరిజనుల మధ్యే జరగాలని 1/70చట్టం చెబుతోం ది.1995లో అనంతగిరి మండలంలో కాస్సైట్‌ గనుల వివాదంపై సమతా స్వచ్చంధ సంస్థ సుప్రీం కోర్టు ఆశ్రయించినప్పుడు షెడ్యూల్‌ ఏరియాలో ప్రభుతాన్ని కూడా గిరిజనేతరురాలిగానే భావిం చాల్సి వస్తుందని స్పష్టంగా పేర్కోంది. అయినా జగన్‌ ప్రభుత్వానిక లెక్కేలేదు. గిరిజన ప్రాంతంలో చేపట్టే కార్యాకలాపాలకు గ్రామసభల ఆమోదం తప్పనిసరి.సభలో సమగ్రంగా చర్చ జరిగిన తర్వాత వారి ఆమోదం ఉంటేనే ముందుకెళ్లాలని పీసా చట్టం చెబుతోంది.ఒడిశాలోని నియాంగిరి కొండ ను బాక్సైట్‌ కోసం వేదాంత గ్రూప్‌నకు కేటాయించి నప్పుడు సుప్రీంకోర్టు ఇదేవిషయాన్ని స్పష్టం చేసింది. అక్కడ గ్రామసభ నిర్వహించకుండా స్థానిక ప్రజాప్రతినిధి సంతకంతో అనుమతి చూపించడాన్ని తప్పపట్టింది.ఆకేటాయింపు రద్దుకు సిఫార్సు చేసింది.కానీ ఆవేవీ వైకాపా ప్రభుత్వం చెవికెక్కవు.
ఆదివాసీల ఆగ్రహ జ్వాల
ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు(పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు) నిర్మాణానికి ఏపీ కేబినెట్‌ ఆమో దం తెలపడంపై గిరిజన సంఘాల నాయకులు, మండిపడుతున్నారు.గిరిజనులు వ్యతిరేకిస్తున్న ప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వైఎ స్సార్‌ కడప జిల్లా వైసీపీ నేతకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీకి నామినేషన్‌ పద్ధతిలో 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యర్రవరం పీఎస్‌పీ నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్టు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం గిరిజన సంఘం నాయకులు అదానీ దిష్టి బొమ్మను దహనం చేసి హైడ్రో పవర్‌ ప్రాజె క్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బాక్సైట్‌ తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేసి యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును అడ్డుకుంటామని, వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరిం చారు.
కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు
ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మా ణానికి కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులను ఇది వరకే మంజూరు చేసింది.యర్రవరంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఓ ప్రైవేటు ఏజెన్సీ2020 జనవరి22 నుంచి 25వరకు సర్వే చేపట్టి ప్రాథమిక డీపీఆర్‌ సిద్ధం చేసింది. పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు 2021 డిసెంబరు 21న మంజూరయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవస రమైన కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరుకావడంతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు(పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు) నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదంతో షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీకి అప్ప గించింది.
ముంపునకు గురికానున్న 32 గ్రామాలు
హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణంవల్ల 32గిరిజన గ్రామాలు ముంపునకు గురికాను న్నాయి. దీంతో ఈ ప్రాంత గిరిజనులను గ్రామాల నుంచి ఖాళీ చేయించాల్సి వుంది. ప్రధానంగా కొయ్యూరు మండలంపి.మాకవరం పంచాయతీకి చెందిన గానుగుల,రామచంద్రపురం,రామరాజుపాలెం, దిబ్బలూరు,వెలగలపాలెం పంచాయతీలో కిత్తాబు, చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ పరిధిలోవంట్లమామిడి,తాటిబంద,రాసపనస, ఎర్ర వరం,గాగులబంద,బొర్రమామిడి,పొర్లుబంద, రోలుగుంట,దంపులగుంట,వేనం,తాడపాలెం, పోతురాజుగుమ్మల,చీమలపాడు,సమగిరి,రాస పనస,తోటమామిడి,గొడుగుమామిడి,ఎర్రబొమ్మలు పంచాయతీ ఎర్రాబెల్లి,తప్పలమామిడి,జీడు మామి డితోపాటు మరో ఏడు ఆవాస గ్రామాలు ముంపు నకు గురికానున్నాయి.
అడవులను అదానీకి కట్టబెడతారా !
జల విద్యుత్‌ ప్రాజక్టువల్ల 4800 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని రాష్ట్ర ప్రభు త్వం చెబుతున్నది వాస్తవం కాదు. సీలేరు, మాచ్‌ ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టులో కేవలం 5వందల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. అందులో స్థానిక గిరిజనులు నామమాత్రమే. ప్రభు త్వ సంస్థలోనే అంతంతమాత్రపు ఉపాధి ఉన్నప్పుడు ప్రైవేటు అదానీ కంపెనీలో నాణ్యమైన టెక్నికల్‌ ఉద్యోగాలు పొందగలమా అనేది ప్రశ్న. జోలపుట్‌ డ్యాం,మాచ్‌ఖండ్‌ పవర్‌ప్రాజెక్టు నిర్మాణం 1955 లో జరిగినప్పుడు సుమారు 250 గ్రామాల ప్రజలు నిర్వాసితులైతే వారిని ఆదుకునేవారే కరవయ్యారు.
ఉపాధి పేరుతో మోసం
జల విద్యుత్‌ ప్రాజక్టువల్ల 4800 మం దికి ఉద్యోగావకాశాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది వాస్తవం కాదు. సీలేరు, మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టులో కేవలం 5 వందల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. అందులో స్థానిక గిరిజనులు నామమాత్రమే. ప్రభుత్వ సంస్థ లోనే అంతంతమాత్రపు ఉపాధి ఉన్నప్పుడు ప్రైవేటు అదానీ కంపెనీలో నాణ్యమైన టెక్నికల్‌ ఉద్యోగాలు పొందగలమా అనేదిప్రశ్న.జోలపుట్‌ డ్యాం, మాచ్‌ ఖండ్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం 1955లో జరిగిన ప్పుడు సుమారు 250 గ్రామాల ప్రజలు నిర్వాసితు లైతే వారిని ఆదుకునేవారే కరవయ్యారు. ఇప్పుడు మాత్రం ‘కేవలం 10 కుటుంబాలున్న 25 మంది జనాభాగల కొయ్యూరు మండలంలోని చిన్నయ్య కొండ అనే ఊరు మాత్రమే మునుగుతుంది. అందు లో కేవలం 22హెక్టార్ల ప్రైవేటు భూమి నష్టపోతు న్నారు.279 హెక్టార్ల భూమి అవసరం కాగా అందులో 257హెక్టార్ల అటవీభూమి ఉంద’ని ప్రభు త్వ సంస్థ ఎన్‌.ఆర్‌.ఇ.డి.సి.ఏ.పి చెప్పడం మోసం. అధిక సంఖ్యలో అడవిపై ఆధారపడి జీవిస్తున్న చుట్టుపక్కల నిర్వాసిత గ్రామాల ప్రజల వివరాలను పూర్తిగా దాస్తున్నది. రాష్ట్ర క్యాబినెట్‌ సత్య సాయి గ్రీన్‌ ఎనర్జీని అదానీ కంపెనీకి అప్పగిం చడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీ ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంత సహజ వనరులు ఆదివాసీలకు చెందాలని, ఆదివాసీ ప్రాంతంలో అదానీ ప్రవేటు సంస్థల ప్రవేశాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ…చింతపల్లి, జి.కె వీధి,కొయ్యూరు మండలంలో గిరిజనసంఘం నాయకత్వంలో మిగతా గిరిజన సంఘాలు, ప్రతి పక్ష పార్టీల ఆధ్వర్యంలో డిసెంబర్‌ 14న మూడు మండలాల్లో బంద్‌ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.
సహజ వనరులున్నా వెనకబాటే
అడవుల విస్తీర్ణంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా రాష్ట్రంలోకెల్లా మొదట స్థానంలో ఉంది.అయితే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేటికీ గిరిజన గ్రామాలలో వైద్యం కోసం డోలీ మోతలు కొనసాగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి లేక మైదాన ప్రాంతంలో వలసలు వెళుతున్నారు. రక్త హీనతతో గిరిజన బాలింతలు,చిన్నపిల్లల మర ణాలు సర్వసాధారణంగా ఉన్నాయి. అక్షరాస్యత చాలా తక్కువ.సహజ వనరులు పుష్కలంగాఉన్న ప్పటికీ గిరిజనప్రజలు పేదరికంతో ఉన్నారు. పాడేరు ఏజెన్సీలో సుమారు 5 లక్షల కోట్ల రూపా యల విలువైన 515 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ మైనింగ్‌ వనరులు పుష్కలంగా ఉన్నాయి.చైనా క్లే, గ్రానైట్‌, లేటరైట్‌,రంగురాళ్ళు,క్వార్ట్డ్జ్‌, లైమ్‌ స్టోన్‌ తదితర సహజ వనరులతో లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదనిలయంగా ఉంది. ప్రపం చంలోనే అత్యంత రుచికరమైన ఆర్గానిక్‌ కాఫీ పంట పండే దట్టమైన అడవులు, సుగంధ ద్రవ్యా లు, పసుపు, పిప్పళ్లు, అల్లం, మిరియాల పంటలకు అనువైన ప్రాంతం.జీడి,అటవీ ఉత్పత్తులు, వనమూ లికలు,రాజ్మా విస్తారంగా దొరికే తూర్పు కనుమల అటవీ ప్రాంతమిది. ఇంకోవైపు దేశంలోనే అత్యంత ఎక్కువ మంది గిరిజనులను నిరాశ్రయులను చేసిన పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం. ఈ జిల్లాలో గిరిజనులు 82.67శాతం.రాజ్యాంగంలోని 5వషె డ్యూల్‌ ప్రాంతంలోని గిరి జన ప్రాంత హక్కులు, విద్య,వైద్యం,ఉపాధిని …గిరిజన సలహా మండలి, రాష్ట్ర గవర్నర్‌,దేశ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కాపా డాల్సి వుంది. ఆదివాసీల హక్కులు, సహజ వనరు లు,అటవీ భూముల రక్షణ చూడాల్సి ఉంది. కానీ దేశ విదేశీ బహుళజాతి సంస్థల ఒత్తిడితో కేంద్రం లోని బీజేపీ,రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌లో భాగంగా 2024 వరకు ఆదివాసీ అడ వులను అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించడానికి పూనుకున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీప్రాంతంలోని అడవు లు, భూములలో ప్రైవేటు కంపె నీల ప్రవేశంపై నిషేధం ఉన్నది. ఐదవ షెడ్యూల్‌ ప్రాంత అడవుల్లో బడా బహుళజాతి కంపెనీలు సులభంగా ప్రవేశిం చడానికి వీలుగా పర్యావరణ అటవీ సంరక్షణ చట్టం-1980ను సవరించి మరింత సులభతరం చేసింది. అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టం-1980 ప్రకారం అటవీ ప్రాంతంలోని భూములను అటవీయేతర కార్యక్రమాలకు కేటాయించరాదు. మైనింగ్‌,భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీ భూము లు కేటాయించరాదు. ప్రభుత్వ ప్రాజెక్టు అయితే 70శాతం గ్రామ సభలో ఆమోదం పొందడం తప్పనిసరి. ప్రైవేటు కంపెనీలకు 80శాతం గ్రామ సభ ఆమో దం పొందడం తప్పనిసరి. అయితే ఇప్పుడు సవరిం చిన నిబంధనల ప్రకారం ఎటు వంటి ఆమోదం పొందనవసరం లేదు.
చట్టవిరుద్దంగా వెళుతున్నారు..!
క్షేత్రస్థాయిలో పరిస్థితు లను అధ్యయనం చేయకుండా ఎక్కడో కూర్చుని నిర్ణ యాలు తీసు కోవడం తపుని విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి ఇ.ఎ.ఎస్‌.శర్మ సీఎంజగన్‌కు లేఖ రాశారు. లేఖసా రాంశం ఇలాఉంది.రాష్ట్ర ప్రభు త్వం, పార్వతీపురం మాన్యం జిల్లాలో రెండు ప్రాజెక్టులు,అంటే కురుకుట్టి దగ్గర 1,200హైడ్రోపంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌, కర్రి వలస దగ్గర 1,000హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌, మరియు AూR జిల్లాలో ఎర్రవరం దగ్గర ఇంకొక 1,200వీఔ హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌,ఆదానీ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయిం చడం,ఆప్రాంతాల్లో అమలులో ఉన్న పీసా,అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించడం అవుతుంది.ఆ రెండు చట్టాల కింద,ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టు లకు అనుమతులు ఇచ్చే ముందు, అక్కడి గ్రామ సభలను సంప్రదించి, వారి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. గ్రామసభల అనుమతి తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ప్రాజెక్టుల మీద,ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారంలేదు.ఇదే విష యాన్ని,సుప్రీం కోర్టువారు,ఒరిస్సాలో కలాహండి ,రాయగడ జిల్లాలలో,అక్కడిప్రభుత్వం, గ్రామ సభల అనుమతి లేకుండా,వేదాంత కంపెనీకి బాక్సైట్‌ మైనింగ్‌ అనుమతి ఇవ్వడంచట్టవిరుద్ధమని, 20 13,ఏప్రిల్‌18నఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పాటించవలసిఉంది. సుప్రీం కోర్టువారి ఆదేశాల ప్రకారం,అక్కడ పద కొండు గ్రామాలలో గ్రామసభలు ఆమైనింగ్‌ ప్రాజె క్టును చర్చించి,తిరస్కరించడము వలన, ప్రాజెక్టు రద్దయింది. ఇదే కాకుండా, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో, ప్రైవేటు కంపెనీలకు ప్రాజెక్టులు ఇవ్వడం, అక్కడ భూములను లీజ్‌ తీసుకునే అనుమతులు ఇవ్వడం, అక్కడ వర్తించే ల్యాండ్‌ ట్రాన్స్ఫర్‌ చట్టాన్ని ఉల్లంఘిం చడం అవుతుంది.సుప్రీంకోర్టువారు,అప్పటి విశాఖ పట్నం జిల్లా షెడ్యూల్డ్‌ ప్రాంతంలో, అనంతగిరి మండలంలో,ఒక ప్రైవేటు కంపెనీ కి ఇచ్చిన నిర్ణ యాన్ని 1997లో సమతా కేసులో రద్దు చేశారు. ఆకారణంగా,ఈమూడుహైడ్రో ప్రాజేక్ట్‌ లను అదానీ కంపెనీకి ఇవ్వడం చెల్లదని మీరు గుర్తించాలి. రాజ్యాంగంలో 5వషెడ్యూల్‌ పారా4కింద రాష్ట్రం లో ఏర్పాటు చేయబడిన ట్రైబల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ (ుతీఱపaశ్రీ Aసఙఱంశీతీవ జశీబఅషఱశ్రీ),ఇటువంటి ప్రాజె క్టుల మీద చర్చించవలసినది.రాష్ట్రప్రభుత్వం ుAజ వారి అభిప్రాయాలు తీసుకోకుండా ఈ ప్రాజె క్టుల మీద నిర్ణయం తీసుకోవడం, రాజ్యాంగాన్ని ధిక్కరిం చినట్లు అవుతుంది.షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజ నుల జీవితాలమీద,వారి సంప్రదాయం మీద ప్రభా వం కలిగించే పెద్ద ప్రాజెక్టులు పెట్టే విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం,రాజ్యాంగం338A(9)కింద జాతీ య స్థాయి ట్రైబల్‌ కమీషన్‌ (చీa్‌ఱశీఅaశ్రీ జశీఎఎఱంంఱశీఅ టశీతీ ్‌ష్ట్రవ ూషష్ట్రవసబశ్రీవస ుతీఱపవం- చీజూు) అభిప్రాయాన్ని ముందే తీసుకోవాలి. మీ ప్రభుత్వంచీజూుతో ఎటువంటి సంప్రదింపులు జరిపినట్లు కనిపించడం లేదు. మీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను అదానీ కంపెనీకి, ఎటువంటి పోటీ లేకుండా,ఇవ్వడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ‘‘జాతీయహైడ్రోఎలక్ట్రిక్‌ విధానం’’ ప్రకారం, పోటీ లేకుండా హైడ్రోప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం చెల్లదు. ఈ మూడు ప్రాజెక్టు వలన,గిరిజన ప్రాంతాల్లో వారి జీవితా లకు, సాంస్కృతికి నష్టం కలిగే అవకాశాలు ఉన్నా యి. వారు ఆధారపడే జలవనరులకు అంతరా యం కలుగు తుంది. అటవీహక్కుల చట్టం క్రింద, వారికి అక్కడ అటవీ సంపద మీదఉన్న హక్కులకు అంత రాయం కలుగుతుంది. ఇన్ని విధాలుగా గిరిజన ప్రజలకు నష్టాలు కలిగే అవకాశాలున్నా, వారితో, వారి గ్రామసభలతో ముందుగా సంప్రదిం చకుం డా, ఇటువంటిపెద్ద ప్రాజెక్ట్‌ల మీద ఏకపాక్షి కంగా నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హైడ్రో ఎలక్ట్రిక్‌ విధానాన్ని ఉల్లంఘిస్తూ, ప్రాజెక్టులను అదానీకంపెనీకి పోటీ లేకుండా ఇవ్వ డం సబబు కాదు. ఈవిషయాలమీద, నేను ఎన్నో సార్లు మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి లేఖలు రాసినా,వారు స్పందించలేదు. నా లేఖల నకళ్ళను జతపరుస్తున్నాను ఈవిషయాలను దృష్టిలో పెట్టు కుని, మీ ప్రభుత్వం తత్‌ క్షణం, ఈ మూడు ప్రాజెక్టు లను రద్దు చేయాలని నా విజ్ఞప్తి. గిరిజన ప్రాంతా లలో అమలులోఉన్న చట్టాలను, గిరిజనుల హక్కు లను గౌరవిస్తూ మీ ప్రభుత్వం ఆలస్యం చేయకుం డా ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటారని విశ్వసిస్తు న్నాను ఆలేఖలో వివరించారు.-(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆదివాసీ సంస్కృతికి అద్దం

తెలుగు సాహితి చరిత్రలో కథాపక్రియ సదా వన్నె తరగని మకుటం లాంటిది,తెలుగు సమా జపు జీవిత చిత్రణ కథల్లో అగుపిస్తుంది. మానవ జీవితాల మనుగడకు అద్దంపట్టే కథా ప్రక్రియనే తన సామాజిక వర్గపు సంస్కృతి సాంప్రదాయాలను బాహ్య ప్రపంచానికి అందిం చడానికి సాధనంగా చేసుకుంది పాల్వంచకు చెందిన ‘‘పద్దం అనసూయ’’ కోయ సామాజిక వర్గానికి చెందిన సాంప్రదాయాలనే తన కథా వస్తువులుగా తీసుకుని వ్రాసిన ఆమె కథలు, రాశి కన్నా వాసిలో ముందు నిలుస్తాయి. వాస్తవంగా తనకు రచనా రంగంలో అంతగా అనుభవంగానీ, ప్రవేశం కానీ లేవు, అయినా తనలోని భావాలను పదుగురితో పంచు కోవాలనే తపన తనను రచయిత్రిగా తయారు చేసింది. దానికి తోడు తన చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన జానపద కథల ప్రభావం కూడా బాగా పనిచేసింది.తన మాతృభాష అయిన కోయ భాషతోపాటు వృత్తి భాష అయినా తెలుగులో కూడా మనసుతో చదివిన అనసూయ జీవిత లక్ష్యం లిపిలేని తన మాతృభాష కోయ భాషను, తెలుగు లిపి సాయంతో దేశవ్యాప్తం చేయడమే. !! అందులో భాగంగానే తన సామాజిక వర్గపు భాషతో పాటు సాంస్కృతి సాంప్రదాయాలను అక్షరీకరించి భద్రపరిచి భావితరాలకు అందించడమే దీక్షగా పని చేస్తున్నారు. అందులో భాగంగానే 2019లో ఆమె ‘‘చప్పుడు’’ అనే పేరుతో కోయ కథా సంపుటి వెలువరించారు. అంతేగాక తొలి గిరిజన కథారచయత్రిగా కూడా తెలుగు కథ సాహిత్యంలో స్థానం సంపాదించారు. ఈ కథ సంపుటిలో కథలు 2009-2011సంవత్సరాలు మధ్య వ్రాయబడినవి, సాధారణంగా గిరిజన కథలు అనగానే పోరాటాలు,మోసాలు,దగాలు, రాజకీ యాలు,వగైరా వగైరాలు,కథా వస్తువులుగా ఉంటాయి,కానీ ‘‘పద్దం అనసూయ’’ వ్రాసిన కథలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక వైపు తమ గిరిజన సామాజిక వర్గ సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తే, మరో వైపు తనదైన గిరిజన స్త్రీ మానసిక వేదన లను మిళితం చేసినట్టు కనిపిస్తుంది. అనసూయ స్వతహాగా గిరిజన సామాజిక వర్గంకు చెందినవారు. నిత్యం తన సామాజిక వర్గపు స్త్రీలతో కలిసిమెలిసి జీవించిన వ్యక్తివారి భావాలను అను భవాలను బాధలను దగ్గరగా చూసిన స్వానుభవంగల మనిషి,సాధారణ సమాజపు స్త్రీవాదులచూపుకు, గిరిజన సామాజిక వర్గపు ఈ ఆడ బిడ్డ స్త్రీవా దపు దృష్టికి పూర్తి వైవిధ్యం కనిపి స్తుంది. తెలుగు సాహిత్యపు స్త్రీవాదాన్ని అనసూ య దిగుమతి చేసుకోలేదు కానీ‘‘గిరిజన మహిళల జీవితంలోని కష్టాలు’’అందరికీ తెలియాలి అని మాత్రం పూర్తిగా నమ్మింది. ప్రామాణిక కథా సిద్ధాంతాలు, పత్రికలవారి ‘‘నిర్దేశిత వలయ సూత్రాలు’’ తనకు తెలిసి ఉం డవు దరిమిలా ఆమె కథల్లో సంబంధిత కొలతలు కనిపించక పోవచ్చు,కానీ తనలోని ఆవేదనలను వ్యక్తీకరిం చు కోవడానికి రచయిత్రి పడ్డ శ్రమకు తోడు తనదైన భాష,తనకు మాత్రమే సొంతమైన కథన శైలి, వెరసి పాఠకు లకులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ కథల రచన కొనసాగింది. కథలశైలి ఎంత చిత్రమో! వాటి వస్తువు కూడా అంతే విచిత్రం గా ఉంది. ఈ సంపుటిలోని ప్రతి కథకు నేపథ్యం‘‘చావు’’, మనిషికి మరణం ఒక పోరా టం ప్రతి జీవన పోరాటం ఒక విప్లవంఅనే అర్థ సూత్రానికి కట్టుబడి ఈ కథలు రాశారు. కథలోని వస్తువు కన్నా వస్తువుకు నేపథ్యాలైన సంస్కృతి, సంప్ర దాయాల వెంటే ఆమెకథా ప్రయాణం సాగింది. ఈ కథలన్నీ గిరిజనస్త్రీని ముఖ్యపాత్రగా చేశాయి చావు సందర్భంగా బ్రతకు పోరాటం వివరిం చిన కథలు. మరణించిన గిరిజన మహిళల బతు కులను అక్షరీకరించిన ‘సమయ ప్రవా హికలు’ ఈ కథలు.‘కాకమ్మ’కథ మొదలు ‘మూగబోయిన శబ్దం’ వరకు సాగిన ఈ‘‘చప్పుడు’’ కథల పయనంలో పాఠకులకు సరికొత్త అను భూతి సంతృప్తి కలుగుతాయి అనడంలో నిండు నిజం దాగి ఉంది.‘కాకమ్మ’కథలో ప్రధాన పాత్ర ‘కాకమ్మ’ రచయిత్రి జ్ఞాపకాల సాయంతో గిరిజన సమాజం,సంస్కృతి,భాష, కలగలుపుకుని చక్కగా సాగుతుంది.కాకమ్మ వయసు పైబడిన వృద్ధ గిరిజనస్త్రీ,తన చిన్నతనం నుంచి తమ కుటుంబం బాగుకోసం ఎంతోకృషి చేసింది, తనకు తనదైనసంస్కృతి సాంప్రదాయాలంటే ప్రాణం.వాటిని పరిరక్షించుకోవడమే తన ధ్యేయం, కానీ తన వారసులు ఆధునికత పేరుతో సంస్కృతి సాంప్రదాయాలు పాటించ కుండా ఎవరిస్వార్థం కోసం వారు కట్టు తప్పి ముందుకు కదిలిపోయిన ప్రతి సంఘటనలు కాకమ్మ మనసును గాయపరుస్తాయి.కూతురు వేరే కులం వ్యక్తినిపెళ్లి చేసుకోవడం,కొడుకు తన పెళ్లి గిరిజన ఆచారం ప్రకారం చేయడం అనాగరికంగా భావించడం, మొదలైన సంఘ టనలతో కలత చెందిన కాకమ్మ చివరికి తన చావునైనా తనవాళ్లు తమపద్ధతిలో చేస్తారో చేయరో అని ఆవేదనపడి తానే తన కర్మకాం డలు గిరిజన సాంప్రదాయం ప్రకారం చేయ డానికి కావలసిన సరుకులు అన్నీ ముందు గానే సమకూర్చుకొని పాత భోషణం పెట్టెలో దాచి దాని తాళం చెవి తన వారికి అందించి, తన ప్రాణం తన ఇంట్లోనే పోవాలనే చివరి కోరికతో కన్నుమూస్తుంది కాకమ్మ. సంస్కృతి సంప్రదా యాల పరిరక్షణలో గిరిజన స్త్రీ పడే ఆవేదనకు ఈ కథ అద్దం పడుతుంది, రెండవ కథ సంపుటి శీర్షికఅయిన ‘చప్పుడు’ కథలో గిరిజన గూడెంకు చెందిన ‘పోతప్ప’ బ్రతుకు తెరువు కోసం భార్య ‘సుంకులు’తోకలిసి పాల్వంచ పట్ట ణం పోయి బ్రతుకు తుంటాడు. పట్టణం పోయిన తమ గిరిజన పద్ధతులు మానుకోలేదు ఆకోయ దంపతులు. దురదృష్టవ శాత్తు పోతప్ప భార్య సుంకులు చనిపోతుంది. ఆమె కర్మకాం డలు గిరిజన ఆచారం ప్రకారం చేయడానికి సిద్ధమే తగిన ఏర్పాట్లు చేసుకుం టాడు.14వ రోజు రాత్రిడోలి వాళ్ళడోలి వాయిద్యాల సాయంతో రాత్రి అంతా శబ్దాలు చేస్తూ ‘పూర్భం’ చెప్పి యాస పోసి చనిపోయిన వ్యక్తి ఆత్మను సాగనంపినప్పుడే గిరిజనుల ఆచార ప్రకారం కర్మ జరిగినట్టు. పోతప్ప తన భార్య కర్మకాండలు చేస్తున్న తీరు ఆడోలు వాయిద్యాల హోరుకు పట్టణంలోని ఆధునిక గిరిజనేతరులు అడ్డు తగలడం వారిని ఎదిరించి సింహంలా ఎదురు తిరిగి తనభార్య కర్మకాండ తమదైన పద్ధతిలో డోలు చప్పుళ్ళతో పోతప్ప పూర్తి చేయడం ఈ కథలో ఇతివృత్తం. ఎంతఎత్తుకు ఎదిగిన మన పూర్వ ఆచారాల పునాదిని వదల కూడదని సత్యాన్ని చాటింది ఈ ‘చప్పుడు’ కథ. స్వార్థం నీడలో ఆధునిక సమాజం ఎంతగా పాడైపోయినా గిరిజన సామాజిక వర్గంలో ఎప్పటికీ ప్రేమలు, ఆత్మీయతలు, ప్రవహిస్తూనే ఉంటాయి అని చాటి చెప్పిన కథ ‘ముసిలి’. తనకోసం మాత్రమే కాదు తన జాతి కోసం, గోత్రంకోసం,ఇంటి కోసం,కాకుండా తన ఊరి బాగు కోసం ఆలోచించి కష్టపడి కన్నుమూసిన ముసిలి చావును ఆఊరి వాళ్ళంతా ఓపండ గల చేయడం ఈ కథలో విశేషం.పరుల కోసం పాటుపడ్డ వారు చనిపోయి కూడా జీవిస్తారు అనే మంచి సందేశం ఇచ్చింది ఈ కథ.గతం వర్తమానాల మధ్య రెండు తరాల,రెండు మతాల,మధ్య ప్రస్తుతం అడవి బిడ్డల ఊగిసలాటను దృశ్యమానం చేసిన చివరి కథ ‘‘మూగబోయిన శబ్దం’’ ఇద్దరు కొడుకులు గల ‘‘పెద్దయ్య’’కు పెద్ద కొడుకు చనిపోవడంతో ఆ కర్మకాండల కోసం గూడెం గూడెం తిరిగి బంధువులకు కబుర్లు చెప్పుకొని అందరినీ పిలుచుకుంటాడు, కానీ మతం మారిన చిన్నకొడుకు తన అన్నకు కర్మకాండ తను మారిన కొత్త మతం ప్రకారం జరిపించడం చూసి ‘శిలువ బరువు’ భారం భరించలేక శోకసముద్రం గుండెల్లో దాచుకున్న పెద్దయ్య మానసిక స్థితి, గిరిజన సంప్రదాయాలను కమ్మేస్తున్న అన్యమత మేఘాలవల్ల పొంచి ఉన్న ప్రమాదపు హెచ్చరికలు రచయిత్రి ఈకథ ద్వారా అందించారు. కథల్లోని వాక్య నిర్మాణం, జాతీయాలు,సామెతలు,పలుకు బళ్ళు,అలం కారాలు,అన్ని అచ్చమైన అడవి బిడ్డల సాంప్ర దాయ వాతావరణంతో చూపించడం రచయి త్రికి అడవిబిడ్డలకు గల అనుబంధాన్ని తేట తెల్లచేస్తుంది. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

భాషా పితామహుడుగా రిషి రాజ్‌పాటిల్‌

కేంబ్రిడ్జ్‌లోని భారతీయ విద్యార్థి 2,500ఏళ్ల నాటి సంస్కృత పజిల్‌ను పరిష్కరించాడు.27 ఏళ్ల రిషి అతుల్‌ రాజ్‌పోపట్‌, సుమారు రెండున్నర వేల సంవత్సరాల నాటి ప్రాచీన సంస్కృత భాషలో మాస్టర్‌ అయిన సంస్కృత భాషా మాస్టర్‌ పాణిని రాసిన వచనాన్ని డీకోడ్‌ చేసినట్లు నివేదించ బడిరది. కేంబ్రిడ్జ్‌ లోని సెయింట్‌ జాన్స్‌ కాలేజ్‌ లోని ఆసియన్‌, మిడిల్‌ ఈస్టర్న్‌ స్టడీస్‌ ఫ్యాకల్టీలో పీహెచ్‌డీ విద్యార్థి రిషి రాజ్‌పోపట్‌. 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు..భారతీయ విద్యార్థి పరిష్కారించడం అందరూ సంతోషించాల్సిన విషయం.- రెబ్బాప్రగడ రవి
మలివేద కాలంలో..ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే తొలిభాషా పితామహుడిగా పేరొందిన సంస్కృత పండితుడు పాణిని రాసిన‘అష్టాధ్యాయి’ వ్యాకరణ గ్రంథంలోని ధాతు నియమాల(మెటా రూల్స్‌)ను ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకు న్నారా?పాణిని వ్యాకరణంపై తొలిసారిగా భాష్యం రాసిన కాత్యాయనుడు కొన్నినిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడంవల్ల..అదే సంప్ర దాయం కొనసాగిందా?ఈప్రశ్నలకు కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృతంపై పీహెచ్‌డీ చేస్తున్న 27 ఏళ్ల భారత విద్యార్థి రిషిరాజ్‌ పోపట్‌ అవునని చెబుతున్నారు. క్రీ.పూ.4-5శతాబ్దాల మధ్యకాలంలో భారత వాయవ్యం(ప్రస్తుతం పాక్‌-అఫ్ఘానిస్థాన్‌ల మధ్య ప్రాంతం)లో పాణిని నివసించాడనడానికి ఆధారాలున్నాయి. సంస్కృతంపై ఆయన రాసిన ‘అష్టాధ్యాయి’ లోని వ్యాకరణ సూత్రాలు నేటికీ కొనసాగుతున్నాయి.‘‘అష్టాధ్యాయిని ఇంత కాలం మన పండితులు సరిగ్గాఅర్థం చేసుకోలేదు. ఆయన రాసిన ఎనిమిది అధ్యాయాల వ్యాకరణ పుస్తకంలో 4,000 నిబంధనలున్నాయి. పదాలను అర్థం చేసుకోవడం,కొత్తపదాల సృష్టి, విశేష ణాలు,విభక్తుల ప్రాధాన్యం.. ఇలా పలు అంశాలను ఈ నిబంధనలు స్పృశిస్తున్నాయి.గడిచిన 2,500 ఏళ్లుగా మన వాళ్లు ఈ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకుని,వివరణలు ఇచ్చారు’’అని రిషి రాజ్‌పోపట్‌ వ్యాఖ్యానించారు. ‘పాణిని బోధించిన మెటారూల్‌ ప్రకారం..సమాన ప్రాముఖ్యం కలిగిన రెండు సూత్రాల మధ్య వైరుధ్యం ఏర్పడితే..వ్యాకరణ క్రమంలో వచ్చే తర్వాతి సూత్రం వర్తిస్తుందని ఇప్పటి వరకూ పండితులు భావించారు. ఈనిబంధన వ్యాకరణకోణం నుంచి తప్పుడు ఫలితాలను ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది. పదానికి ఇరువైపులా వర్తించే నియమాల గురించి చెప్పడమే పాణిని ఉద్దేశం.పాఠకుడు కుడివైపు నియమాన్ని ఎంచుకోవాలన్నది ఆయన అభిప్రాయం.అష్టాధ్యాయిలోని 1.4.2 నిబం ధన(విప్రతిశేధే పరం కార్యం)ను అర్థం చేసుకుంటే ఈ విషయం తెలుస్తుంది’’ అనిరాజ్‌పోపట్‌ వాదించారు.ప్రాథమిక శబ్దాల నుంచి నూతన పదాలు, వాక్యాలను రూపొం దించడానికి అవసరమైన నిబంధనలను పాణిని తన ‘అష్టాధ్యాయి’లో చక్కగా వివరించారని పేర్కొన్నారు. పాణిని అల్గారిథమ్‌ను సరిగ్గా అర్థం చేసుకుని,కంప్యూటర్‌ప్రోగ్రామ్‌ను రూపొందిస్తే..సంస్కృతం నుంచి ఇతరభాషల తర్జుమా కూడా సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మరో రెండున్నరేళ్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. రాజ్‌పోపట్‌ పరిశోధనకు గైడ్‌(మార్గనిర్దేశకుడు)గా ఉన్న విన్సెంజో వెర్జియాని కూడా ఈకృషిపట్ల అభినందనలు తెలిపారు.శతాబ్దాలుగా ఎందరో పండితులు పరిష్కరించలేని సమస్యకు రాజ్‌పోపట్‌ మార్గ దర్శకుడయ్యారని, ఈపరిశోధనతో మరింత మంది సంస్కృత భాషపై ఆసక్తిచూపుతారని అభిప్రాయపడ్డారు.

రిజర్వేషన్ల విధానంలో కొత్త పోకడలు

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు రిజర్వేషన్ల పరిధిని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మునుపున్న షెడ్యూల్ద్‌ కులాల (ఎస్‌.సి.), షెడ్యూల్డు తరగతుల (ఎస్‌.టి.) జాబితాలో కొత్త వర్గాలను చేరు స్తున్నాయి. ఇలా విస్తరించడానికి ఆర్థిక వెనుకబాటు తనాన్ని కారణంగా చూపుతున్నాయి. ఆర్థిక వెనుక బాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేటట్టయితే అంతకనా వెనుకబడి ఉన్న సామాజిక వర్గాలను విస్మరించినట్టు అవుతుంది. లేవనెత్తవలసిన ప్రశ్న ఏమిటంటే 10 శాతం, 13 శాతం కులాలకు ఎందుకు పరిమితం చేయాలి. ఈ సూత్రం ద్వారా ప్రభుత్వాలు ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గాల ప్రాతిపదికగా రిజర్వేషన్ల గురించి ఆలోచిస్తాయి. కొత్త రిజర్వేషన్ల విధానంలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. ఇలాంటి రాజకీయాలవల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మైనారిటీలు ఓటర్లుగా అంత ఆకర్షణీ యంగా కనిపించక పోవచ్చు.
కొత్త రిజర్వేషన్ల విధానంతో మరో సమస్య కూడా ఉంది.ఈ పద్ధతి రాజ్యాంగ నిర్మా తల దృష్టిలో ఉన్న ‘‘పురోగమన’’ అంశాన్ని గమ నంలో ఉంచుకోదు. షెడ్యూల్డ్‌ జాబితాలో ఉన్న వారికి అవకాశాలు కలిగించడంలో ఉన్న ఇబ్బం దిని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ల విధానాన్ని రూపొందించారు. ఈ కార ణంవల్లే మన దేశంలో అమెరికాలోఉన్న సాను కూల చర్య పద్ధతి కాకుండా రిజర్వేషన్‌ పద్ధతి అనుసరించారు.ఇది మొదట్లో అవకాశాలు కల్పిం చడానికి ఉద్దేశించింది. దీనివల్ల ఫలితం ఉండా లనుకున్నారు. సానుకూల చర్యవల్ల నిర్దిష్ట ఫలితం ఉంటుందన్న నమ్మకం లేదు.కొత్త రిజర్వేషన్ల విధా నంవల్ల సామాజికంగా వెనుకబడిన కులాల వారికి ప్రాతినిధ్యం అన్న సూత్రం మరుగున పడవచ్చు. ఎంపిక చేసే వారు, పోటీ పడే వారు ఒక సామాజిక నేపథ్యానికి చెందినవారు కావచ్చు. అలాంటప్పుడు ఎంపిక చేసే వారు నియామకాలు చేసేటప్పుడు మరింత నైరూప్య ప్రమాణాలను పాటిస్తారా? లేదా అగ్రవర్ణాలలో ఉప కులాలను దృష్టిలో ఉంచు కుంటారా? కొత్త విధానంవల్ల అయినా, మునుపటి విధానంవల్ల అయినా లబ్ధి పొందే వారు ప్రభుత్వ రంగానికే పరిమితం అవుతారు. అందువల్ల ప్రై వేటు రంగంలో అవకాశం ఉండదు. ప్రైవేటు రంగం రిజర్వేషన్ల పరిధికి దూరంగానే ఉండిపో తుంది.అందువల్ల రిజర్వేషన్లు వర్తించే వారు ప్రభు త్వ ఉద్యోగాల మీదే ఆధారపడాలి. అయితే నిర్దిష్ట కులం దృష్టితో చూసినప్పుడు సిద్ధాంత రీత్యా కోటా విధానాన్ని విస్తరించినందువల్ల ఫలితం ఉండ వచ్చు. అగ్ర కులాల వారికి, దళితులు కాని వారికి, వెనుకబడిన తరగతులకు చెందని వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చు. ఈ పద్ధతివల్ల అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కొందరిని వదిలివేయడానికి అవకాశం ఉంటుంది. ఉన్న అవకాశాలను పోటీ తత్వంతో రిజర్వేషన్ల ద్వారా అందుకోవాలంటే ఎస్‌.సి.,ఎస్‌.టి.ల విష యంలో జరిగినట్టు అంతర్గతతేడాలకు దారి తీస్తుం ది.దీనివల్ల కులచైతన్యాన్ని వదిలి వ్యక్తులుగా నిల బడే వీలుంటుందని వాదించే వారూ ఉంటారు. వ్యక్తులుగా నిలబడితే కులం ప్రాతిపదికగా కాకుం డా సత్తా ఆధారంగా నిలబడే అవకాశం ఉంటుం దనే వారూ ఉన్నారు. కుల చైతన్యం నుంచి బయ టపడి కులప్రాతిపదిక మీదఉన్న సామాజిక నైతిక తను అంతం చేసే వీలుంటుంది. అంటే వ్యక్తులు ఆధునిక విధానాల ఆధారంగా పోటీ పడతారు.ఇది అమాతం జరిగిపోదు. ఆధునికత విసిరే సవాళ్లను ఎదుర్కోలేనప్పుడు కులం మీద ఆధారపడే పరిస్థితి రావచ్చు. మరో వేపున న్యాయాన్ని విస్తరించడం అంటే రిజర్వేషన్ల వల్ల లభ్ది పొందుతున్నారనే మచ్చ రూపు మాపే అవకాశం కూడా ఉంటుంది. అలాం టప్పుడు సామాజిక న్యాయం,దళితులు అన్న మాట లను ఒకసారి ఒకఅర్థంలో మరోసారి మరో అర్థం లో వాడతాయి. కొత్త కోటా విధానం వచ్చే లోపల రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు సామాజిక న్యాయం అన్న పదానికి పెడార్థం తీస్తారు.ఈపదాన్ని దళి తులను ఉద్దేశించి వాడే అలవాటు ఉంది. కొత్త కోటా విధానం సామాజిక న్యాయాన్ని సమానత్వ దృష్టితో చూడడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే సామాజిక న్యాయం అన్న భావన సర్వజనామోదం పొందుతుంది. దళితులు, ఆదివాసుల విషయంలో లాగా సామాజిక న్యాయాన్ని చులకన భావంతో చూసే వీలుండదు. సమానత్వం అన్న భావన బల హీనంగా ఉన్న సామాజిక సంబంధాలను పటి ష్ఠంచేస్తాయి.
ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించిన 103వరాజ్యాంగ సవ రణచట్ట బద్ధమేనని అయిదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజ్యాంగ సవరణను సమర్ధిస్తూ ముగ్గురు, వ్యతిరేకిస్తూ ఇద్దరు న్యాయమూర్తులు విభజన తీర్పు చెప్పడంతో చర్చనీ యాంశమైంది. రిజర్వేషన్ల నిర్ణయానికి ఆర్థిక కొల బద్దను వినియోగించడం న్యాయ సమ్మతమేనన్న విషయంలో న్యాయమూర్తులందరూ ఏకీభావం వ్యక్తంజేశారు. కానీ ఇద్దరు న్యాయమూర్తులు ఇతర అంశాల ప్రాతిపదికన రాజ్యాంగ సవరణ న్యాయ బద్ధతను తిరస్కరించారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక వివాదాన్ని పరిష్కరిస్తూ మరికొన్ని వివాదాలకు తెర లేపుతున్నదని తనఆందోళనను వ్యక్తంజేస్తూనే ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లను సమర్ధిస్తూ ఇచ్చిన తీర్పు ను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆహ్వా నించింది. ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కొంత శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ విషయా లలో ఇవ్వాలని సిపిఐ(ఎం)చాలాకాలం నుండి చెప్తున్నది. బీహార్‌లో కర్పూరీ ఠాకూర్‌ ప్రభుత్వం 1978లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 6శా తం రిజర్వేషన్లు కల్పించినపుడు సిపిఐ(ఎం) సమ ర్ధించింది. అదే వైఖరికి అనుగుణంగా పార్లమెం టులో 103వ రాజ్యాంగ సవరణను సమర్ధించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పును కూడా ఆహ్వానించింది.సిపిఐ(ఎం) మూడు అంశాల ప్రాతి పదికగా ఇ.డబ్య్లు.ఎస్‌ రిజర్వేషన్లను సమర్ధిస్తున్నది. మొదటిది, సామాజిక, విద్యా విషయక, సాంస్కృతిక, ఆర్థిక వెనకబాటుతనాలను అవినాభావ సంబంధంగల అంశాలుగా పరిగణిం చాలి. అవి పరస్పరం ప్రభావం జేయగల, ప్రభావి తం కాగల అంశాలు. అందువలన రిజర్వేషన్లను నిర్ణయించేటప్పుడు, అమలు చేసేటపుడు, అఫర్మేటివ్‌ యాక్షన్‌ కార్యక్రమాలను తీసుకునేప్పుడు ఆర్థిక అంశాన్ని విస్మరించడం ఆయా తరగతులలో నిజ మైన అర్హులకు అన్యాయం చేస్తుంది. మన దేశంలో సామాజిక ఆర్థిక అణచివేతకు మూలంగా కుల వ్యవస్థ ఉన్నందున సామాజిక అంశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానర్ధం ఇతర అంశాలకు ముఖ్యంగా ఆర్థిక అంశాన్ని విస్మరించమని కాదు. అలావిస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది. రెండ వది,రిజర్వేషన్ల పరిధిలోకిరాని తరగతులలో అత్య ధికులు ఆర్థికంగా వెనకబడినవారున్నారు. పెట్టు బడిదారీ విధానం దేశంలో విస్తరించేకొలదీ వీరి సంఖ్య పెరుగుతున్నది. వారి పరిస్థితి దుర్భరం అవుతున్నది. ఈ తరగతులలోని యువకులకు విద్యా ఉద్యోగాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. తమ దుస్థితికి ఇతరులకు రిజర్వేషన్లు ఉండడం, లేక తమకు లేకపోవడమేనన్న అపోహలకు గురవు తున్నారు.పాలకవర్గాలు,వారి మీడియా ఈ అపోహ లను పెంచు తున్నాయి. పర్యవసానంగా రిజర్వేషన్‌ వ్యతిరేక భావనలురోజురోజుకీ తీవ్రమవుతు న్నాయి. ఈ మానసిక స్థితి రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమాల ద్వారా గతంలో వెల్లడవడం చూశాము. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు పూనుకున్నపుడు, రిజర్వేషన్లు లేని తరగతుల లోని పేద, మధ్య తరగతి ప్రజలను రెచ్చగొట్టి పాలకవర్గాలు రిజర్వే షన్‌ వ్యతిరేక ఉద్యమాన్ని ఉసిగొల్పాయి. రిజర్వేష న్లను తొలగించాలనే స్వార్థపర శక్తులకు (వెస్టెడ్‌ ఇంటరెస్ట్స్‌కు) అవకాశం లేకుండా ఆర్థికంగా వెనక బడిన తరగతులలో రిజర్వేషన్‌ విధానానికి సాను కూలత సాధించాలంటే వారికి కూడా కొంత రిజ ర్వేషన్‌ కల్పించడం అవసరం. లేనియెడల రిజర్వే షన్లకే ప్రమాదం వస్తుంది. మూడవది, సమసమాజ సాధనలో పీడిత వర్గాల ఐక్యత కు ఎంతో ప్రాధా న్యత ఉంది. కార్మికులు, ఉద్యోగుల్లో రిజర్వే షన్‌ అంశం విభేదాలను, విభజనను సృష్టిస్తున్న సంద ర్భంలో దాన్ని అధిగమించి వర్గ ఐక్యతను సాధించా లంటే ప్రస్తుత రిజర్వేషన్‌ పరిధిలోకి రాని తరగతు లకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా సామాజిక విభజన వలన ఏర్పడే అనైక్యత ను కొంతవరకు నిరోధించే అవకాశం ఉంది. విధానపరమైన అంశంతోపాటు, రిజర్వేషన్ల పట్ల సానుకూల వాతావరణం ఏర్పర్చడానికి, వర్గ ఐక్య తను బలపర్చుకోవడానికి ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లను కల్పించడం అవ సరం అన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం. కొంత మంది రిజర్వేషన్లకు ఆర్థిక కొలబద్దను ప్రాతిపది కగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాం గంలో సామాజిక విద్యా విషయక వెనకబాటు తనాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోవాలని ఉంది తప్ప ఆర్థిక వెనకబాటుతనం గురించి ప్రస్తా వన లేదని, అందువలన ఇ.డబ్ల్యు.ఎస్‌కు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదని వాదిస్తున్నారు. ఈ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక న్యాయాన్ని అందించడం కూడా రాజ్యాంగ లక్ష్యమని, అందులో భాగంగా ఆర్థికంగా వెనకబడిన తరగతులకు రిజ ర్వేషన్లు ఇవ్వడం న్యాయమేనని కోర్టు అభిప్రా యపడిరది.ఇ.డబ్ల్యు.ఎస్‌తరగతులను ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయవచ్చు గదా, రిజర్వేషన్ల అవసరమేమిటని ఇంకో వాదన ఉంది. ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక తరగతులకు కూడా ఇతర సంక్షేమ కార్యక్రమాలు జమిలిగా అమలవుతున్నాయి. అలా అయినపుడు సామాజిక తరగతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా ఇ.డబ్లు.ఎస్‌ తరగతులకు రిజర్వేషన్లు అమలుజేయడాన్ని వ్యతిరేకించడంలో ఔచిత్యం కన్పించదు. రిజర్వేషన్లనేవి సామాజిక అంశానికి వర్తిస్తాయి తప్ప ఆర్థికఅంశానికి విస్తరించడం అంటే రిజర్వేషన్‌ స్వభావానికే విరుద్ధం అనే వాదన కూడా ఉంది. ఇతర దేశాల అనుభవాలు, మన దేశంలో రిజర్వేషన్లు పరిణామం చెందిన తీరు చూస్తే ఈ వాదన నిలబడదు. రిజర్వేషన్లు ఆయా దేశాల పరిస్థితులను బట్టి,అవసరాలను బట్టి అమల య్యాయి. మలేషియాలో మెజారిటీ మలే జాతి ఆర్థిక వెనకబాటుతనం రిజర్వేషన్‌కు ప్రాతిపదికగా ఉంది. అమెరికాలో మూలవాసి అమెరికన్ల కోసం కొన్ని ప్రాంతాలను రిజర్వేషన్లుగా ప్రకటించారు. ఇక్కడ ప్రదేశం రిజర్వేషన్‌గా ఉంది.విద్యా ఉద్యో గాలలో మన లాగా కోటా పద్ధతి కాకుండా, న్యాయ వ్యవస్థ ద్వారా అమలు సాధ్యంగాని నిర్ణీత లక్ష్యాల ద్వారా వైవిధ్యాన్ని సాధించే పద్ధతులలో అఫర్మేటివ్‌ యాక్షన్‌ అమలవుతున్నది. ఐర్లండ్‌ రిజర్వేషన్లకు మత ప్రాతిపదిక ఉన్నది.
మన దేశంలో రిజర్వేషన్‌ విధానం పరి ణామం చూసినా, సామాజిక అంశంతోపాటు అనేక ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకు న్నట్టు విదితమవుతుంది. బ్రిటిష్‌ వలస పాలకులు తమ విభజించు పాలించు విధానంలో భాగంగా 1909లో మత ప్రాతిపదికగా ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు.బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల ప్రభావంతో కొన్ని సంస్థానాలలో 20వ శతాబ్దం ప్రారంభంలో(ట్రావన్‌కోర్‌,బరోడా వగైరా) బ్రాహ్మణేతరులకు ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత రిజర్వేషన్లు కల్పించారు.1921లో మద్రాస్‌ ప్రెసి డెన్సీలో జస్టిస్‌ పార్టీ బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు అమలుచేసింది.ఈరిజర్వేషన్లు ప్రధానంగా జమీం దార్లు,భూస్వాములు బలంగాఉన్న శూద్రకులాలకు ఉద్దేశించబడ్డాయి.అస్పృస్యతకు గురవుతున్న షెడ్యూ ల్డ్‌ కులాలకు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నిర్విరామ ఆందోళన,కృషి ఫలితంగా మొదటి సారి గా1935లో ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చా యి.స్వాతంత్య్రం వచ్చిన తర్వాతగానీ షెడ్యూ ల్డ్‌ తెగలకు రిజర్వేషన్లు కల్పించబడలేదు. షెడ్యూల్డ్‌ తెగలలో కుల వ్యవస్థ, అస్పృశ్యత లేకపోయినా సాంస్కృతిక, విద్య, ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.అప్పుడు కూడా వెనక బడిన కులాల అభివృద్ధి విషయం రాష్ట్రాలకు వదిలి వేయబడిరది.వర్ణ వ్యవస్థ లోని సామాజిక అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కులాలన్నీ రిజర్వే షన్లకు అర్హులు. ఈ అంశాన్నిబట్టే అనేక ఆధిపత్య శూద్రకులాలు బి.సిజాబితాలో చేర్చబడి రిజర్వే షన్లు అనుభవిస్తున్నాయి. ఇంకాఅనేక కులాలు అటు వంటి డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నాయి. కానీ వర్ణ వ్యవస్థలో సామాజికంగా అగ్రవర్ణాల కన్నా దిగువస్థాయిగా పరిగణించబడే శూద్ర కులా లన్నీ ఒకే మోస్తరుగా వెనకబడిలేవు.వాటిల్లో కొన్ని గ్రామీ ణ సమాజంలో ఆధిపత్యం వహిస్తున్నాయి. స్వాతం త్య్రానంతరం ఈ కులాల్లో ధనాఢ్య వర్గాలు అభివృ ద్ధి అయ్యాయి. ఈ తరగతులలోని నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్‌ ప్రయోజనం అందాలంటే ఆర్థిక కొలబద్దను వినియోగించడం తప్ప మార్గం లేదు. అందుకే బిసి తరగతులకు క్రీమీలేయర్‌ను మినహాయిస్తూ ఆర్థిక పరిమితి విధించబడిరది.
సామాజిక అంశాన్ని రిజర్వేషన్లకు ఏకైక కొలబద్దగా ఉంచాలనేవారు సామాజిక వెనకబాటు తనం అన్ని కులాలకు, తరగతులకు ఏకరూపంగా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. సామా జిక పీడన అసలైన రూపం అస్పృశ్యత, అంటరాని తనం. ఇది దళితులకు మిగతా అందరికీ మధ్య ఉన్న సామాజిక అగాధం.దళితులు ఎదుర్కొం టున్న సామాజిక దుస్థితికి, ఇతరులు ఎదుర్కొనే సామాజిక వెనకబాటుతనానికి పోలిక లేదు. అలాగే సేవాకులాలకు మిగిలిన శూద్రకులాలకు, ముఖ్యం గా వ్యవసాయ కులాలకు మధ్య ఉండే సామాజిక వ్యత్యాసం అనేక రూపాలలో కొట్టొచ్చినట్లు కనపడు తుంది. చాలా సందర్భాలలో శూద్ర కులాలలోని ఆధిపత్య కులాలు సామాజిక వివక్ష పాటింపులో ముందుంటున్న స్థితిచూస్తున్నాం.అగ్రకులాల్లో సైతం ఉపశాఖల మధ్య సామాజిక తారతమ్యాలు,హోదా వ్యత్యాసాలు ఉంటున్నాయి. అందుకే కుల వ్యవస్థను డాక్టర్‌ అంబేద్కర్‌ నిచ్చెన మెట్లతో పోల్చారు. వైవిధ్య రూపాలలో కొనసాగుతున్న సామాజిక వివక్షపై పోరాడాలంటే అందరికీ ఒకే కొలబద్దలు సరిపోవు. దేశంలో ప్రస్తుతం సామాజిక బృందాలపై ఆధార పడిన వర్టికల్‌ రిజర్వేషన్లతో పాటు, ఇతర అంశా లను పరిగణనలోకి తీసుకున్న సమాంతర రిజర్వే షన్లు కూడా అమలవుతున్నాయి.మహిళలు, విక లాంగులు, క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులు, వెనకబడిన ప్రాంతాలు, స్థానికులు-స్థానికేతరులు వగైరా రిజర్వేషన్లుకూడా అమలవుతున్నాయి. రిజర్వే షన్ల వర్తింపునకు సామాజిక అంశంతో పాటు అనేక అంశాలను పరిగణిస్తున్నారన్నది గమనించ వచ్చు. అందుకే ఈ సమస్యపట్ల ఒక సమగ్ర దృక్పథం అవసరం.
ఇ.డబ్యూ.ఎస్‌.రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముం దుకు వచ్చిన మరికొన్ని వివాదాలను పరిశీలించాలి. ‘ఆర్థిక కొలబద్ద’సమంజసత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మెజారిటీతో ఏకీభవిస్తూనే,10 శాతం ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ 50శాతం పరి మితిని దాటుతున్నందున అది న్యాయబద్ధం కాదని ఇద్దరు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ అభిప్రా యాన్ని తిరస్కరిస్తూ మెజారిటీ తీర్పు 50శాతం పరిమితి అనుల్లంఘనీయమైనదేమీ కాదని కొట్టి పారేసింది.ఈవ్యాఖ్యానం1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు విధించిన పరిమితిని వివా దాస్పదం జేసింది.సిపిఐ(ఎం)తో పాటు అనేక ఇతర శక్తులు50శాతం సీలింగును తొలగించాలని, అప్పు డే రిజర్వేషన్లకు అర్హులైన ఇతర తరగ తులను ఆ పరిధిలోకి తీసుకురావచ్చని వాదిస్తూ వస్తున్నాయి. తీర్పు ఈ వాదనలను బలపరుస్తున్నది. మండల్‌ కమిషన్‌ సిఫార్సులు అమలయినప్పుడు ఓబిసి రిజర్వేషన్లు 27శాతంగా నిర్ణయించడానికి 50శాతం పరిమితి తప్ప వేరే కొలబద్దేమీ లేదు. ఇప్పుడు 50శాతం పరిమితి అనుల్లంఘనీయం కానప్పుడు ఓబిసిలకు, ఎస్‌సి, ఎస్‌టిల వలే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అవస రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓబిసి జనాభా నిష్పత్తిని నిర్ణయించేందుకు సరైన లెక్కలు ప్రస్తుతం లేవు. ఉజ్జాయింపుగా లెక్క వేయ డానికి బ్రిటిష్‌వారు నిర్వహించిన 1931సెన్సస్‌ వివరాలను వినియోగించుకుంటున్నారు.ఈ సమా చార లేమిని సరిజేసేందుకు అందరూ కోరుతు న్నట్లుగా జనగణన సందర్భంగా ఎస్‌సి, ఎస్‌టితో పాటు అన్ని కులాల గణన చేయడం అవసరం. అప్పుడే కొన్ని వివాదాలు సక్రమంగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం ఈవిషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ధర్మాసనం10శాతం ఇ. డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ను వర్తింపజేసిన తీరు కూడా వివాదాస్పదం అయింది. ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ ఇప్పటివరకు రిజర్వేషన్‌ అనుభవించని తరగతులకు (నాన్‌ రిజర్వుడ్‌ కేటగిరీకి) మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. అంటే ఈ పది శాతానికి ఎస్‌సి,ఎస్‌టి,బిసిలోని పేదలను అనర్హులను చేయడం ద్వారా ఇంతకుముందు ఉన్న50శాతంలో పోటీపడే అవకాశాన్ని 40 శాతానికి కుదించినట్లయింది. 10శాతం ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ను జనరల్‌ కేటగిరీగా భావించి దానికి అన్ని తరగతులలోని పేదలను అర్హులుగా చేయడంద్వారా లోపాన్ని సరి దిద్దాల్సి ఉంది. లేనియెడల ఎస్‌సి,ఎస్‌టి,బిసి పేదలు గతంలోఉన్న సౌకర్యాన్నికోల్పోతారు. అంతే కాక ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లు10శాతం ఉండాలని ఏకొలబద్ద ప్రకారం నిర్ణయించారన్న విమర్శకు తావు లేకుండా పోతుంది.ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వే షన్లకు అర్హత నిర్ణయించేందుకు ప్రభుత్వం ప్రతి పాదించిన ఆర్థిక పరిమితి, మంచి చెడుల జోలికి సుప్రీంకోర్టు పోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన 8 లక్షల రూపాయల ఆదాయం, ఐదెకరాల భూమి, వెయ్యి అడుగుల ఇల్లు, వంద గజాల స్థలం పరిమితి సంపన్నులను కూడా రిజర్వేషన్లకు అర్హులను చేస్తున్నది. నిరుపేదలు మాత్రమే అర్హులయ్యే పద్ధతి లో ఆర్థిక పరిమితిని తిరిగి నిర్ణయించకపోతే ఇ. డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్ల లక్ష్యం పూర్తిగా దెబ్బతిం టుంది.ఈ వివాదాస్పద అంశాలన్నింటినీ పరిష్క రించి అమలు చేయకపోతే వివాదాలు అనంతంగా కొనసాగుతూనే ఉంటాయి. ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి జస్టిస్‌ దారువాలా రిజర్వేషన్ల విధా నాన్ని సమీక్షించాలన్న అభిప్రాయాన్ని వెల్లడిరచారు. ఇటువంటి వాదన కోర్టు బయట అనేకమంది వివిధ సందర్భాలలో గతంనుండి వ్యక్తంచేస్తున్నారు. ఆర్‌ఎ స్‌ఎస్‌ అధినేత గతంలో బహిరంగంగానే ఈ అం శాన్ని ప్రస్తావించారు. క్రమేణా కొన్ని తరగతులలో, మీడియాలో రిజర్వేషన్‌ వ్యతిరేక ధోరణి ప్రబలు తుందనడానికి ఇదొక నిదర్శనం. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన మొదటి నాలుగు దశాబ్దాలలో ప్రభుత్వ రంగం విస్తరించి,పాలనా వ్యవస్థ పెరిగింది. దీని మూలంగా రిజర్వేషన్ల వలన విద్యా, వైద్య, ప్రజా ప్రాతినిధ్య రంగాలలోకి కొన్ని కుటుంబాలు అభి వృద్ధి కావడానికి తోడ్పడిరది. కానీ అత్యధికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. గత నాలుగు దశాబ్దా లలో వచ్చిన విధాన మార్పులతో ఉన్న పరిమిత రిజర్వేషన్‌ సౌకర్యం కూడా నిరుపయోగం అవు తున్నది. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, యాంత్రీ కరణ మూలంగా విద్య, వైద్యం, ఉపాధి రంగా లలో రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడంలేదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి పాలక వర్గాలు,కార్పొరేట్లు సుముఖంగా లేవు. ఇటు వంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ను ప్రవేశ పెట్టడంతోపాటు,వాటిని విస్తరించి పటిష్టం గా అమలుచేయడం అవసరం. మన దేశంలో రిజర్వేషన్‌ అవసరం తీరిపోయిందని అనుకోవడం తప్పు. పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగినంత కాలం రిజర్వేషన్‌ అవసరం తీరిపోదు. ఈ పరిమిత సదు పాయాన్ని కొనసాగిస్తూనే రిజర్వేషన్లు అవసరం లేని సమసమాజ స్థాపనకు సాగిపోవాలి.వ్యాసకర్త : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు,(ప్రజాశక్తి సౌజన్యంతో..)

1 2