యుద్దంతో ధ‌రాఘాత‌కం

ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు రష్యా దళాల స్వాధీనంలోకి వచ్చాయి. ప్రస్తుతం రాజధాని కీవ్‌ని వశం చేసుకునేందుకు ఉక్రెయిన్‌ దళాలతో పోరాడు తున్నారు. ఐతే, దానిని స్వాధీనం చేసుకునేందుకు రష్యాకు ఎంతో సమయం పట్టకపోవచ్చు. కానీ ఈ చర్య వల్ల రష్యాతో పాటు ప్రపంచానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ధరల పెరుగు దల ప్రపంచ దేశాలకు మోయరాని భారంగా మార నుంది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకు తలమ య్యాయి. దానికి ఇప్పుడు ఈ యుద్ధం తోడైంది. క్రూడాయిల్‌ ధరలు అనూహ్యంగా పెరిగి బ్యారెల్‌ 100 డాలర్లకు చేరింది. ఈ స్థాయికి పెరగటం గత ఎనిమిదేళ్లలో మళ్లీ ఇదే. మన దేశంపై కూడా ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మార్చి 7న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు భారీగా పెరగవచ్చంటున్నారు.
రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు జర్మనీ, అమెరికా వంటి ప్రధాన ఉత్పాదక దేశాల నుంచి చేసుకునే దిగుమతులు చాలా తక్కువ. కానీ ఈ రెండు దేశాలు అనేక ఉత్పత్తులకు ముడి పదార్థాలు సమకూరుస్తాయి. కావాల్సిన ఇందనాన్ని అందిస్తాయి. చాలా ఐరోపా దేశాలు రష్యా ఇందనంపై ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ చమురు మార్కెట్‌లో రష్యా ఆధిపత్యం నడుస్తోంది. ఇది రెండో అతిపెద్ద చమురు ఎగు మతిదారు. ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో రష్యాది మూడో స్థానం. యూరప్‌, ఆసియా దేశాలలో దాదాపు సగం దేశాలు ముడి చమురు అవసరాలకు రష్యాపై ఆధారపడ్డాయి. గ్యాస్‌ మార్కెట్‌పై రష్యా భారీ ప్రభావం చూపుతున్నందున పరిస్థితి క్లిష్టంగా మారొచ్చు. చమురు, గ్యాస్‌లో మాత్రమే కాకుండా బొగ్గు, అణుశక్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి, ముడి చమురుతో పాటు, గ్యాస్‌ ధరలు కూడా ఎప్పుడైనా ఆకాశాన్ని తాకొచ్చు. ఒకవైపు చలికాలం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడం పశ్చిమ దేశాలకు పెద్ద సమస్యగా మారింది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ- స్విఫ్ట్‌ నుంచి రష్యాను తొలగించడానికి యూరోపియన్‌ దేశాలు ఇష్టపడకపోవడానికి కారణం కూడా రష్యా దగ్గర ఉన్న ఈ గ్యాస్‌. ఐనా,ఈ యుద్ధం వల్ల జర్మన్‌ సహకారంతో రష్యా నిర్మిస్తున్న??కొత్త బాల్టిక్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పనులను నిరవధికంగా నిలిపి వేయక తప్పలేదు. మరోవైపు, కరోనా మహ మ్మారి కారణంగా గ్లోబల్‌ గ్యాస్‌ నిల్వలు పూర్తిగా తగ్గిపోవటంతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. దానికి తాజా పరిణమాలు తోడవటం వల్ల వినియోగదారులు, పరిశ్రమ లపై మోయరాని భారం పడుతుంది.చాలా సప్లయ్‌ చెయిన్లకు గ్యాస్‌ ప్రాథమిక అసవరం. కనుక గ్యాస్‌ సరఫరా నిలిచిపోతే భారీ ఆర్థిక పరిణామాలకు దారితీస్తుంది. 2021 శీతా కాంలో మొదటిసారి గ్యాస్‌ ధరలు పెరిగినపుడు ఇంధన వ్యయం భరించలేక బ్రిటన్‌లోని ఎరు వుల ఫ్యాక్టరీ మూతపడ్డాయి. ఇది కార్బన్‌ డయాక్సైడ్‌ కొరతకు దారితీసింది. వైద్య ప్రక్రియల నుంచి ఆహారం తాజాగా ఉంచడం వరకు అన్నింటికీ ఇది అవసరం. కాబటటి పెరుగుతున్న చమురు, గ్యాస్‌ ధరల వల్ల ఇలాంటి పరిణామాలకు ఆస్కారం ఉంది. మరోవైపు, ప్రస్తుతం గోధుమల ధర పదమూ డేళ్లలో అత్యధిక స్థాయికి చేరాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచుతోంది. రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు ఆసియా, మధ్యప్రాచ్య వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల ప్రధాన సరఫరాదారులు. ప్రపంచం లోని గోధుమల వ్యాపారంలో పాతిక శాతం వాటా ఈ రెండు దేశాలదే. మొక్కజొన్న అమ్మ కాలలో 20 శాతం, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో ఎగుమతుల్లో 80 శాతం వాటాను ఈ రెండు దేశాలు పంచుకుంటున్నాయి. వ్యవసాయరంగం ఇప్పటికే సంక్షోభంలో పడిరది. పలు అగ్రశ్రేణి ధాన్యం వ్యాపార సంస్థలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. తాజా పరిణమాలతో ఈ రంగం మరింత పడిపోతుంది. ఉక్రెయిన్‌-రష్యా యుధ్దం రవాణా రంగంపై కూడా గణనీయ మైన ప్రభావం చూపనుంది. ఇప్పటికే, కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ రవాణా రంగం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఈయుద్ధం ఈ రంగంలో మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా సముద్ర రవాణా,రైలు సరుకు రవాణాపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. 2011నుంచి చైనా, ఐరోపా మధ్య స్థిరమైన రైలు సరుకు రవాణా సంబంధాలు ఉన్నాయి. ఆసియా,యూరప్‌ సరుకు రవాణాలో దీని పాత్ర తక్కువే అయినా ఇటీవల ఇతర రవాణా మార్గాలకు అంతరాయం కలిగినపుడు ఇది చాలా ఆదుకుంది. దాని అవసరం ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది. ఐతే,తాజా సంక్షోభం దీనిపై తీవ్ర ప్రభావం చూపనుంది.మరోవైపు, రష్యా దండయాత్రకు ముందే ఓడ యజ మానులు నల్ల సముద్రం షిప్పింగ్‌ రూట్లను నిలిపివేశారు. నల్ల సముద్రంలో కంటైనర్‌ షిప్పింగ్‌ అనేది ప్రపంచ స్థాయిలో సాపేక్షంగా ఉత్తమ మార్కెట్‌. దీనిని రష్యా దళాలు కట్‌ చేస్తే ఉక్రెయిన్‌ ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే చాలా ఎక్కువ గా ఉన్న సరుకు రవాణా ధరలు మరింత పెరగవచ్చు.ఇది ఇలావుంటే,సైబర్‌ దాడులు ప్రపంచ సరఫరా గొలుసులను లక్ష్యంగా చేసుకో వచ్చనే ఆందోళన కూడా ఉంది. నేడు వాణి జ్యం ఎక్కువగా ఆన్‌లైన్‌ లోనే జరుగుతోంది కాబట్టి కీలకమైన షిప్పింగ్‌ లైన్‌లు, మౌళిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయి. లోహ పరిశ్రమపై కూడా ఈ యుద్ధం విశేష ప్రభావం చూప నుంది. ఎందుకంటే నికెల్‌, రాగి,ఇనుము ఉత్పత్తిలో రష్యా ,ఉక్రెయిన్‌ ప్రపంచంలోనే అగ్రగాములు. నియాన్‌, పల్లాడియం,ప్లాటినం వంటి ఇతర ముఖ్యమైన ముడి పదార్థాల ఎగుమతిలో కూడా ఇవి ముందున్నాయి. రష్యాపై ఆంక్షల భయంతో ఈ లోహాల ధరలు పెరిగాయి. పల్లాడియం విషయానికే వస్తే గత డిసెంబర్‌ నుంచి దాని ట్రేడిరగ్‌ ధర ఔన్సుకు 2,700 డాలర్లు పెరిగింది. ఆటోమోటివ్‌ ఎగ్జాస్ట్‌ సిస్టమ్స్‌, మొబైల్‌ ఫోన్లు, డెంటల్‌ ఫిల్లిం గ్‌ల వరకు ప్రతిదానిలో పల్లాడియంను ఉపయో గిస్తారు. తయారీరంగంతో పాటు నిర్మాణ రంగంలో ఉపయోగించే నికెల్‌,రాగి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అమెరికా, యూరోప్‌ , బ్రిటన్‌ ఏరోస్పేస్‌ పరిశ్రమలు కూడా రష్యా టైటానియంపై ఆధారపడి ఉన్నాయి. దాంతో,బోయింగ్‌,ఎయిర్‌బస్‌ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ప్రత్యామ్నాయ సరఫరాదారులను సంప్రదించినట్టు తెలుస్తోంది. మైక్రోచిప్‌లపై కూడా తాజా సంక్షోభం ప్రభా వం చూపనుంది. కరోనా కారణంగా గత ఏడాది మొత్తం మైక్రోచిప్‌ల కొరత వేదించింది. ఈ సంవత్సరం ఆ కొరత తీరుతుందని అంతా అనుకున్నారు. ఇంతలో యుద్దం వచ్చిపడటంతో ఆ కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఆంక్షలలో భాగంగా రష్యా మైక్రోచిప్‌ల సరఫరాను నిలిపివేస్తామని అమెరికా ప్రకటి చింది. కానీ మైక్రోచిప్‌ ఉత్పత్తిలో ముఖ్యమైన నియాన్‌, పల్లాడియం, ప్లాటినంల కీలక ఎగుమతిదారులుగా రష్యా, ఉక్రెయిన్లు ఉన్నప్పు డు అది ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న. చిప్‌ లితోగ్రఫీలో ఉపయోగించే నియాన్‌లో దాదాపు 90 శాతం రష్యా లోనే లభిస్తుంది. చిప్‌ తయారీదారుల వద్ద ప్రస్తుతం రెండు నుండి నాలుగు వారాలకు సరిపడ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్య వల్ల ఏదైనా దీర్ఘకాలిక సరఫరా అంతరాయం ఏర్పడితే అది సెమీకండక్టర్లు, వాటిపై ఆధారపడిన ఉత్పత్తు లపై తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఆందోళనలో రైతులు
రైతులు పండిరచిన ధాన్యానికి మద్దతు ధర విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రైతులకు అన్యా యం జరగకుండా చూస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రకటనలు నీటి మూటలు గానే మిగిలిపోతున్నాయి. పండిరచిన ధాన్యానికి మద్దతు ధర లభించకపోగా ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయిని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు కల్లాల్లో ఉన్న ధాన్యం ఎప్పుడు విక్రయించకుంటామోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లు, దళారులు వారి ఆదాయాన్ని చూసుకుంటున్నారే తప్ప రైతుల కష్టాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా పురుగు మందులు, ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కానీ గిట్టుబాటు ధర మాత్రం రైతులకు అందడం లేదు. పలువురు మిల్లర్లు, దళారులు మాత్రం పక్క రాష్ట్రం తెలంగాణలో ఈ ఏడాది ఎక్కువగా ధాన్యం పండిరదని, అందువల్ల గిట్టుబాటు కావడం లేదనే పుకారును సృష్టిస్తున్నారు. దీంతో ధాన్యానికి మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. ఒకవైపు వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మరోవైపు, సాధారణ ప్రజలు-కార్మికులు, రైతులు మార్కెట్‌ నుండి అధిక ధరలకు అదే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అధిక ధరల ద్వారా వసూలు చేసిన డబ్బు ఎక్కడికి పోతుంది? నిజమైన ఉత్పత్తి దారులకు, రైతులకు కాదు. కార్పొరేట్లు, పెద్ద భూస్వామ్య వర్గం ఆధిపత్యం చెలాయించే బడా వ్యాపా రులకు, రుణదాతలకు చేరుతుంది. వీరే చిన్న రైతుల నుంచి చౌక ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వారే మార్కెట్‌ను, ఉత్పత్తులను నియంత్రిస్తారు. మోడీ నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు లేకుండా విధించిన ఆకస్మిక లాక్‌డౌన్‌ ప్రజలపై అనేక రకాల కష్టాలను తెచ్చిపెట్టింది. లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. శ్రమజీవుల ఆదాయం బాగా తగ్గిపోయింది. మన దేశ సంపదను ఉత్పత్తి చేసే కోట్లాది మంది కార్మి కులు ఆకలితో కొట్టు మిట్టాడుతున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకు తున్నాయి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితమే ఇది. ఆహారం, ఇంధనం, వస్తువుల అధిక ధరలు…సరఫరా వైపు అడ్డంకులు రిటైల్‌ మరియు టోకు స్థాయి ద్రవ్యోల్బణం రేటులో ప్రతిబింబిస్తాయి. బియ్యం, వంటనూనెలు, పప్పులు, కూర గాయలు, గుడ్లు తదితర నిత్యావసర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. వంట నూనెల ధర 60శాతం వరకు పెరుగుదలను చూసింది. రైతులు తమ పంపుసెట్లు, ట్రాక్టర్లకు వినియోగించే డీజిల్‌ ధర పెరగడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. సబ్సిడీలో భారీగా కోత విధించడంతో వంటగ్యాస్‌ ధర పెరిగింది. 2019-20లో వంట గ్యాస్‌కు మొత్తం ప్రత్యక్ష నగదు సబ్సిడీ రూ.22,635 కోట్లు. ఇది ఇప్పుడు రూ.3,559 కోట్లకు (ఫిబ్రవరి 2021 వరకు) తగ్గింది. దీంతో మొత్తం భారం వినియోగదారులపైనే పడిరది. పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాలు మరి యు ఇతర పన్నుల భారీ భారం ఈ ధరల పెరుగుదలపై ప్రధానంగా ఉంది. గత మూడేళ్లలో అంటే 2018నుంచి మోడీ నేతృ త్వంలోని బిజెపి ప్రభుత్వం ఇంధన పన్నుల ద్వారా రూ.8లక్షల కోట్లు ఆర్జించింది. 2020-21లో రూ. 3.71లక్షల కోట్లు ఆర్జించింది. పైగా ఈ కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యో గాలు, ఆదాయాలను కోల్పోయారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు, వివిధ ఇన్‌పుట్‌ల ధరల పెరుగుదల నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపుతాయి. సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం లీటర్‌ పెట్రోల్‌పై రూ.33, లీటర్‌ డీజిల్‌పై రూ.32 వుంది. అనేక రాష్ట్రాల ఎన్నికలలో బిజెపికి ఎదురు దెబ్బలు తగిలిన తరువాత, ధరల పెరుగు దలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికాక, మోడీ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, లీటర్‌ డీజిల్‌పై రూ.10 కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని నామమాత్రంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇది కేవలం టోకెన్‌ తగ్గింపు మాత్రమే, ఇది ప్రజలకు పెద్దగా ఉపశమనం కలిగించదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, టీకాల కార్య క్రమానికి డబ్బులు కావాలి కాబట్టి పెట్రోలు, డీజిల్‌పై పన్నులు తగ్గించలేమని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి చేసిన వాదన అవాస్తవం. ఇది అశాస్త్రీయమైనది కూడా. అనేక ఇతర పన్ను మినహాయింపులు, రాయితీలతో పాటు కార్పొరేట్‌ పన్నులను తగ్గించడం ద్వారా మోడీ ప్రభుత్వం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీలను వెనక్కి తీసుకోవడం ద్వారా కలిగే ఆదాయ నష్టాన్ని…కార్పొరేట్‌ పన్ను రేటును 2019కి ముందు స్థాయికి పునరుద్ధరించడం ద్వారా తిరిగి పొందవచ్చు. అతి సంపన్నులపై సంపద పన్ను విధించడంద్వారా తగినంత ఆదాయాన్ని పొందవచ్చు. కానీ మోడీ ప్రభు త్వం అలాంటిదేమీ చేయడానికి సుముఖత చూపడం లేదు. ఎందుకంటే అది స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్లకు అసంతృప్తి కలిగి స్తుంది. అందుకే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా కోట్లాది మంది ప్రజలను బాధిస్తోంది. ధరల పెరుగుదలపై నియంత్రణను అమలు చేసేం దుకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. బదులుగా,నిత్యావసర వస్తువుల చట్టాన్ని నిర్వీ ర్యం చేయడానికి చర్యలు తీసుకుంది. అధిక ధరలతో సామాన్యులు అల్లాడుతుంటే కార్పొరేట్లకు సూపర్‌ లాభాలు వచ్చేలా చేయడమే దీని ఉద్దేశం. ఒకవైపు ప్రభుత్వం ధరల పెరుగుదలను సులభతరం చేసే విధానాలను అవలంబిస్తోంది. మరోవైపు, కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఉద్యోగాలు, ఆదాయాలను కోల్పోయిన కార్మికులకు, ఇతర శ్రామికులకు ఎటువంటి ఉపశమనం అందిం చడానికి నిరాకరిస్తోంది. మహమ్మారి కాలంలో పేద వర్గాల కార్మికుల వాస్తవ ఆదాయాలు బాగా తగ్గాయి. దానివల్ల, మన దేశ సంపదను సృష్టించే కోట్లాది మంది కార్మికులు, శ్రమ జీవులు నేడు ఆకలి,పేదరికం లోకి నెట్టబడ్డారు. ప్రపంచ ఆకలి సూచీలో 2020లో 94వ స్థానంలో వున్న భారత్‌ 2021లో 101వ స్థానానికి పడిపోయింది. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల కంటే దిగువన ఉంది. ఆకలి పెరిగిందంటే దేశంలో మనకు సరిపడా తిండి లేనందువల్ల కాదు. ప్రపంచ ఆకలి సూచీలో మన స్థానం పడిపోతున్నప్పుడు, దేశంలో అవసరమైన దానికంటే ఎక్కువ ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి.1సెప్టెంబర్‌ 20 21న, ఎఫ్‌.సి.ఐవద్ద 50.2మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల ధాన్యం ఉచిత పంపిణీ కోసం ఈ నిల్వలను విడుదల చేయడం వల్ల నిరుపేదల ఆహార అవసరాలు తీరుతాయి. ధరలు కూడా తగ్గుతాయి. అందుకుగాను 26.2 మిలియన్‌ టన్నులు అవసరం. ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం, ప్రముఖ ఆర్థికవేత్తల సిఫార్సుల్లో స్థిరమైన ఈ డిమాండ్‌ ఉన్నప్పటికీ, బిజెపి ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. బదులుగా, ఇథనాల్‌ ఉత్పత్తి కోసం ధాన్యాలు, చెరకును ఉపయోగించేందుకు పథకం వేసింది ! ఒకవైపు వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మరోవైపు,సాధారణ ప్రజలు-కార్మికులు, రైతులు మార్కెట్‌ నుండి అధిక ధరలకు అదే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అధిక ధరల ద్వారా వసూలు చేసిన డబ్బు ఎక్కడికి పోతుంది? నిజమైన ఉత్పత్తిదా రులకు, రైతులకు కాదు. కార్పొరేట్లు, పెద్ద భూస్వామ్య వర్గం ఆధిపత్యం చెలాయించే బడా వ్యాపారులకు, రుణదాతలకు చేరుతుంది. వీరే చిన్న రైతుల నుంచి చౌక ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వారే మార్కెట్‌ను, ఉత్పత్తులను నియంత్రిస్తారు. స్పెక్యులేటివ్‌-ఫ్యూచర్‌ ట్రేడిరగ్‌లో మునిగి పోతారు. ఇది ధరల పెరుగుదలకు మరొక ప్రధాన అంశం.ధరల పెరుగుదల ద్వారా ప్రజలపై మోయలేని భారాలు మోపడాన్ని మనం ఇక సహించలేం.
పెట్రో బాంబు!
అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు దౌడు తీస్తున్నాయి. 2014 తరువాత ముడి చమురు అత్యధిక ధర (బ్యారెల్‌ దాదాపుగా 100 డాలర్లు)కి చేరింది. ఐతే, ఏరోజుకా రోజు ధరలు పెరిగే మన దేశంలో 110 రోజుల నుండి ఒక్క పైసా ధర కూడా పెరగలేదు. బ్యారెల్‌ ధర 82 డాలర్లు ఉన్నప్పుడు మన దేశంలో చివరిసారిగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆ తరువాత నాలుగు నెలలుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగకపోవడానికి కారణం ఎన్నికల రాజకీయాలేనన్నది సర్వ విదితం. ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగియగానే దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ముడి చమురు ధర ఒక డాలరు పెరిగితే దేశంలో ఒక లీటరు పెట్రోలు, డీజల్‌పై 45 నుండి 50 పైసలు పెరుగుతుందని, ఎన్నికల కారణంగా ధరలు నియంత్రించిన గత 110 రోజుల్లో ఆయిల్‌ కంపెనీలు కోల్పోయిన మొత్తాన్ని కూడా కలుపుకుంటే ఈ పెరుగుదల 10 రూపాయల వరకు ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఈ విశ్లేషణలను నరేంద్రమోడీ ప్రభుత్వం ఖండిర చడం లేదు. దీనిని బట్టే రానున్న రోజుల్లో ధరాభారం ఖాయమనే స్పష్టమౌతోంది. అంత ర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి తాజాగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతను ఒక కారణంగా చూపుతున్నారు. ఇది ఇటీవల పరిణామం. అంతకన్నా ఆయిల్‌ ఉత్పత్తి చేసే దేశాల ధనకాంక్షే అసలు కారణం. ఉక్రెయిన్‌ మీద రష్యా యుద్ధాన్ని ప్రారంభిస్తే, అమెరికా రష్యాపై ఆంక్షలు విధిస్తుందని, అదే జరిగితే ముడిచమురు సరఫరాలో కొరత ఏర్పడు తుందన్న అంచనాల ఆధారంగా ప్రస్తుతం ధరలను పెంచుతున్నారు. తమకు యుద్ధం చేసే ఉద్దేశ్యమే లేదని, ఇప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న రష్యా ప్రకటనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే ఈ ప్రచారం సాగుతోంది. ముడి చమురు కోసం ప్రపంచం రష్యా మీదనే ఆధారపడి లేదు. పెట్రోలియం ఉత్పత్తిలోఆ దేశంది మూడవ స్థానం.అమెరికా, సౌదీ అరేబియాలు మొదటి రెండు స్థానాలో ఉన్నాయి. నిజంగానే చమురు ఉత్పత్తితో సమస్యలు ఏర్పడితే ఇతర దేశాలు తమ సరఫరాలను పెంచవచ్చు. కానీ,రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్లకు అదనంగా ఒక్క బ్యారెల్‌ను కూడా ఉత్పత్తి చేయబోమని ఒపెక్‌ దేశాలు ప్రకటించడం దేనికి నిదర్శనం? నిజానికి, బ్యారెల్‌ ధరను వంద డాలర్లకు చేర్చాలని ఈ దేశాలు ఎప్పటి నుండో డిమాండ్‌ చేస్తున్నాయి. తాజా సంక్షోభాన్ని దానికి అవకాశంగా వాడుకున్నాయి. ఇప్పుడు నెలకొన్న పరిస్థితే ధరల పెరుగుదలకు కారణమైతే యుద్ధ వాతావరణం మారి సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ధరలు తగ్గుతాయా? ప్రస్తుతం ఊహల మీద ఆధారపడి ధరలను పెంచివేసిన ఆయిల్‌ ఉత్పత్తి చేసే దేశాలు అలా తగ్గించడానికి ఒప్పుకుంటాయా? ఈ ప్రశ్నకు సమాధానమేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశానికి వస్తే అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందంలో భాగంగా అప్పటివరకు ఇరాన్‌తో ఉన్న ఒప్పందాన్ని తెగతెంపులు చేసుకున్నాం. స్థిరమైన ధరకే చమురును అమ్మడానికి, మన కరెన్సీలో చెల్లింపులను స్వీకరించడానికి సిద్ధపడినా, ఇరాన్‌తో ఒప్పందాన్ని కాలదన్నుకున్నాం. దానికి బదులు బేషరతుగా సౌదీ నుండి పెట్రో ఉత్ప త్తులను కొంటున్నాం. దీనివల్ల దేశానికి నష్టం జరుగుతుందని, ధరలు పెరుగుతాయని అప్పట్లోనే వామపక్షాలు హెచ్చరించాయి. వామపక్షాల హెచ్చరికల్లోని వాస్తవాలు పెట్రో ఉత్పత్తులతో పాటు వివిధ రంగాల్లో ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయి. అయినా పాలక వర్గాల ఆలోచనల్లో మాత్రం ఏమాత్రం మార్పు లేకపోగా అమెరికాకు మరింతగా సాగిల పడటానికే మోడీ ప్రభుత్వం సిద్ధమౌ తోంది. సామాన్యుడు చెల్లించే పెట్రో ధరల్లో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయి. ఇంత పన్నుల భారం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. మూలధరతో పన్నుల శాతం ముడిపడి ఉండ టంతో ధరలు పెరిగే కొద్ది పన్నుల రూపంలో జమ అయ్యే మొత్తం పెరుగు తుంది. అందులో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు వీలుగా పన్ను బదులు సర్‌చార్జీ లను పెంచుతూ పోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇలా ప్రజల్ని కొల్లగొట్టి దానిని రాయితీల రూపంలో కార్పొరేట్లకు దోచిపెడు తోంది. ప్రజా క్షేమం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెట్రో ధరలను నియం త్రించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దీనికోసం రాష్ట్రాలు నష్టపోకుండా పన్నుల విధానంలో అవసరమైన మార్పులు చేయాలి. ప్రజలను ధరాఘాతం నుండి ఆదుకోవాలి. లేకపోతే, దాని ప్రభావం నిత్యావసర సరుకులపై పడి సామాన్యులకు గుదిబండ అవుతుంది. రోజువారీ నిత్యా వసరాల ధరలు వాటంతటవే పెరగవు. సామాన్య ప్రజల ఖర్చుతో బడా వ్యాపార-పెద్ద భూస్వామ్య తరగతి లాభాల ఆకలిని తీర్చడానికి ప్రభుత్వమే పూనుకుంటోంది. ఇది నేటి పాల కుల నిజ స్వరూపం. ధరలు తగ్గించాలని, ప్రజలకు ఉపశమనం కల్పించాలని సిఐటియు, ఇతర కేంద్ర కార్మిక సంఘాలు పోరా డుతున్నాయి. కాబట్టి…ప్రభుత్వాన్ని మనం డిమాండ్‌ చేద్దాం. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌)ను సార్వత్రీకరించాలి. పిడిఎస్‌ కింద 14 నిత్యావసర వస్తువులను అందించాలి.
ఆహార ధాన్యాల స్పెక్యులేటివ్‌-ఫ్యూచర్‌ ట్రేడిరగ్‌పై నిషేధం విధించాలి. పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తక్షణం తగ్గించాలి.విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. ప్రభుత్వ సంస్థల ద్వారా పేదలం దరికీ ఉచిత విద్య, ఆరోగ్య సేవలు అందిం చాలి. ఆదాయ పన్ను చెల్లించని కుటుం బాలకు నెలకు రూ. 7500 అందివ్వాలి. ఆహార,ఆరోగ్య సంబంధిత సహాయాన్ని అందించాలి. నయా ఉదారవాద ఎజెండాకు కట్టుబడి…మోడీ ప్రభు త్వం కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెట్టడాన్ని కార్మిక వర్గం అనుమతించదు. శ్రమజీవులు ఉమ్మడి పోరు ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పైడిమాండ్లను సాకారం చేసుకోగలరు. రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను ఎత్తివేయాలంటూ బిజెపి ప్రభుత్వం మెడలు వంచిన చారిత్రాత్మక రైతు పోరాట విజయం నుండి మనం నేర్చుకునే పాఠం ఇది. –సైమన్‌ గునపర్తి

సవరణల పేరిట…. జీవవైధ్యానికి తూట్లు !

‘‘మానవ మనుగడకు బహుళ ప్రయోజనాలను అందిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణ కాపా డేవి అడవులే. అటువంటి అడవులు క్రమేపీ కనుమరుగు అవుతు న్నాయి ఇది ఒకదేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ అడవుల తరుగుదల ఏర్పడుతూ ఉంది. వీటిని కాపాడుకోలేకపోతే భూతాపం వలన ఏర్పడే ప్రమాదాన్ని ఈ సృష్టిలోగల ప్రతీజీవి అనుభవించ వలసి వస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. దీనిని దృష్టిలో ఉంచుకునే మన దేశం కూడా ఎన్నో అంతర్జాతీయ సదస్సులలో తీర్మా నాలు చేసుకుంటూ హామీలు ఇస్తూ వస్తున్నది. అయితే ఎన్ని సదస్సులు జరిగిన తీర్మానాలు చేసినా వాస్తవంలో మాత్రం భూతాపాన్ని తగ్గించి ప్రాణ వాయు వును అందించే అడవులు మాత్రం క్రమేపీ క్షీణిస్తూనే ఉన్నాయి. ఫలితంగా పర్యావర ణం కాలుష్య భరితం అవుతూ ఉంది. మానవుని స్వార్థ పూరిత చర్యలు వల్లనే ఈఅడవులు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా తరిగిపోతున్నాయి అనేది నిర్వి వాదాంశం’’
భూతాపం, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులను అడ్డుకోవడానికి సహజసిద్ధమైన అత్యుత్తమ పరిష్కారం అడవుల పరిరక్షణ.మానవ మనుగడకు బహుళ ప్రయోజనాలను అందిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణ కాపాడేవి అడవులే. అటు వంటి అడవులు క్రమేపీ కనుమరుగు అవుతు న్నాయి ఇది ఒక దేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ అడవుల తరుగు దల ఏర్పడుతూ ఉంది.వీటిని కాపాడుకోలేకపోతే భూతా పం వలన ఏర్పడే ప్రమాదాన్ని ఈసృష్టిలోగల ప్రతీ జీవి అనుభవించవలసి వస్తుందిఅనే సత్యాన్ని మనం గ్రహించాలి.దీనిని దృష్టిలో ఉంచుకునే మన దేశం కూడా ఎన్నో అంతర్జాతీయ సదస్సులలో తీర్మానాలు చేసుకుంటూ హామీలు ఇస్తూ వస్తున్నది.అయితే ఎన్ని సదస్సులు జరిగిన తీర్మానాలు చేసినా వాస్తవంలో మాత్రం భూతాపాన్ని తగ్గించి ప్రాణ వాయువును అందించే అడవులు మాత్రం క్రమేపీ క్షీణిస్తూనే ఉన్నాయి.ఫలితంగా పర్యావరణం కాలుష్య భరితం అవుతూ ఉంది.మానవుని స్వార్థపూరిత చర్యలు వల్లనే ఈఅడవులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా తరిగిపోతున్నాయి అనేది నిర్వివాదాంశం. వంట చెరకు, కలప స్మగ్లింగ్‌, చెట్ల నరికివేత, పట్టణీకరణ, ఆక్రమణ, అటవీ భూములు వ్యవసాయ భూములుగా మార్పు, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యకలాపాల వలన అరణ్యాలు నానాటికీ కుదించుకుపోతున్నాయి.బ్రిటీష్‌ వారి కాలంలోనే ఈ అటవీ పరిరక్షణకై మన దేశంలో 1927వ సంలో అటవీచట్టం పురుడు పోసుకోవడం జరి గింది.దాని కొనసాగింపుగా మనదేశంలో 1980 వ సంలో అడవుల పరిరక్షణకై పటిష్ట చట్టాన్ని రూపొందించాం. ఎట్టి పరిస్ధితులలో కూడా అడవు లను ఆటవీయేతర ఉత్పత్తి కార్యక్రమాలకు ఉపయో గించకూడదని చట్టంలో స్పష్టంగా పేర్కొ న్నాం. 1988 మరియు 1996వ సంలో ఈ చట్టానికి సవరణలు తీసుకు వచ్చి అటవీ భూముల పరిరక్షణ మరింత రక్షణ కల్పించాం. అయితే ఆస్ఫూర్తి వాస్త వంలో మాత్రం కనపడటం లేదు అనడానికి ప్రతీ ఏటా మన దేశంలో క్షీణిస్తున్న అడవులే ప్రధాన సాక్ష్యం. సవరణ చట్టంలో 1927 నాటికి వేటిని అడవులుగా నిర్వచించామో వాటినే ప్రస్తుతం అడ వులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్దారించ డానికి సిద్ధం అయ్యింది. ప్రయివేట్‌ భూముల విష యంలో నెలకొన్న అడవుల విషయంలో మినహా యింపు దిశగా ప్రభుత్వం ఆలోచనచేస్తూ ఉంది.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అటవీ ఆస్తులకు సంబం దించి ఒక కేసు విచారణలో మాత్రం అటవీ చట్టం దశ దిశ మార్చే తీర్పును ప్రకటించింది.అది ఏమి టంటే అటవీ భూమి అయినా కాకపోయినా, ప్రయివేటు భూములైనా. ఏ ప్రాజెక్టు – కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నదైనా అడవి అడవే, పైన చెప్పినవి అన్నీ కూడా సదరు చట్ట పరిధిలోకే వస్తాయి. అలాంటి ఏ భూమి వినియోగ మార్పిడికైనా అనుమతులు తప్పనిసరి అని తీర్పులో పేర్కొంది.ఈ తీర్పు ఫలితంగా భూయాజమాన్య హక్కులతో నిమిత్తం లేకుండా.. అడవులు, చెట్లు, మొక్కలు, ఇతర పచ్చదనం అభివృద్ధి పరుస్తున్న వ్యవసాయేతర కార్యకలాపాలన్నీ అటవీ చట్ట పరిధిలోకి వచ్చాయి.దీనివలన పచ్చదనం కొంత వరకు పెరిగింది అనడంలో సందేహం లేదు. పర్యావరణ వేత్తలకు ఇది శుభవార్తగా నిలిచింది. అయితే ప్రభుత్వాలకు మాత్రం ఇది మింగుడు పడని విషయంగా మారింది. ఎందుకంటే ఈ తీర్పు ద్వారా ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్ర మాలకు అటవీ అనుమతులు కానీ పర్యావరణ అనుమతులు మరింత కఠినమై అడ్డుగా నిలుస్తున్నా యి. ఈపరిస్ధితిని గమనించిన ప్రభుత్వాలు ఆ చట్టపరిధి నుండి బయట పడే మార్గాలపై అన్వేషిం చడం మొదలు పెట్టాయి.చట్టాన్ని నీరు గార్చే యజ్ఞా నికి శ్రీకారం చుట్టాయి.దీనికై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత అటవీ చట్టానికి కొత్తగా సవరణలు చేపట్టి అటవీ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు ఆరం భం అయ్యాయి.దీనిని ఆచరణలోకి తీసుకురావ డానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం 1988 అటవీ సంరక్షణ చట్టంలో కొన్ని సవరణలను చేయడానికి సిద్ధం అయ్యింది. దీనిని అమలు పరచే బాధ్యత తీసుకోవడానికి కేంద్ర పర్యావరణ, అటవీ సంరక్షణ మంత్రిత్వ శాఖ ముందుకు వచ్చింది. మారుతున్న ఆర్ధిక అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత అటవీ చట్టానికి సవరణలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఈప్రతిపాదనలో పేర్కొ న్నారు.. ఈవిషయమై కేంద్రం అటవీ చట్ట సవరణ చేయడానికి 14 అంశాలను ప్రతిపాదించారు.ఈ సవరణల ప్రధానలక్ష్యం ఇప్పటి వరకు రక్షిత అటవీ చట్టాల పరిధిలో ఉన్నభూములను ఆచట్ట పరిది óనుంచి తప్పించి అనుమతుల ఇబ్బంది లేకుండ చేసుకోవడం. ఎందుకంటే జాతీయ రహదారులు, రైల్వే రవాణా,ప్రాజెక్టులనిర్మాణం విషయంలో అటవీ చట్టపరిధిలో ఉండే భూముల నుండి మరి యు పర్యావరణ అనుమతులు రావడంచాలా క్లిష్టతరం అవుతూ ఉంది.దానితో పాటు వాటి నిర్మాణ వ్యయాలు కూడా రోజురోజుకి పెరిగి పోయి అభివృద్ధి పనులు నిలచి పోతున్నాయని ప్రభుత్వ వాదన. దానిని దృష్టిలో ఉంచుకునే ప్రభు త్వం అటవీ చట్టాన్ని నీరుగార్చే యత్నాలు మొదలు పెట్టింది.దీనికి దేశ భద్రత..దేశ రక్షణ అనే అంశాలను ముడిపెట్టి సవరణ ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం దేశ సరిహద్దులు వెంబడి అవస్ధాపన వసతులు కల్పించడానికి నిర్దేశిత ప్రాజెక్టులు చేపట్టడానికి అటవీ మరియు పర్యావరణ అనుమ తులు ఆటంకం కలిగిస్తున్నాయి ఇటువంటి వాటిలో జాప్యం అనేది సరి హద్దు దేశాల నుండి ముప్పుకు అవకాశం కలిగిస్తుంది.కనుక అటువంటి వాటి కోసం ఆ ఆభూములను చట్ట పరిధి నుండి మినహా యించాలిఅనే ప్రతిపాదన ఒకటి.దేశ భద్రత దృష్ట్యా ప్రజల నుండి రాజకీయ పక్షాల నుండి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండదని దీనిని ప్రధానంగా ప్రభుత్వం చూపించింది.
అంతర్జాతీయ సరిహద్దుల్లో దేశ భద్రత – వ్యూహాత్మక మౌలిక వసతుల కోసం అటవీ భూముల్ని బదలాయించాల్సి వస్తే అనుమతులు అక్కర్లేదు అనేది ఈ సవరణ ప్రధాన లక్ష్యం.ఇకపోతే దీనికి అనుబంధంగా రైల్వేలు,హైవే అథారిటీ, ఇతర రవాణా సంస్థలు 1980కి పూర్వం పొందిన భూముల్ని అటవీ చట్టం నుండి మినహాయించడం, ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్‌ పక్క చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాల్ని ఈ పరిధి నుంచి తప్పించటం, నివాస ఇతర ప్రాజెక్టు అవసరాలకు 250 చదరపు మీటర్లలో నిర్మాణాలు అనుమతించడం, స్థలయా జమాన్య హక్కులు బహుళ రికార్డుల్లో నమోదై అటవీ – రెవెన్యూ, ఇతర విభాగాల మధ్య వివాదం ఉంటే, సదరు ఆ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడం వంటి వాటిని సవరణలుగా ప్రతిపా దిస్తూ అటవీచట్టాన్ని నీరు గార్చడానికి రంగం సిద్ధం అయ్యింది.అంతకన్నా ముఖ్యంగా చమురు సహజవాయువు వెలికితీతలో నేడు ఆధునిక సాంకే తిక పరి జ్ఞానం ఎంతగానో లభించింది. దానిని ఉపయోగించుకుని అడవులకు నష్టం కలగకుండా అడవుల వెలుపల భూమికి రంధ్రాలు చేసి వాటి ద్వారా అడవులలో చమురు సహజ వాయువల అన్వేషణ చేసుకునే అవకాశం పొందటానికి చట్ట సవరణ అవసరంఅని ప్రభుత్వం భావిస్తూ ఉంది ప్రభుత్వం.ఇలా లభించిన భూమి అంతా అటవీ యేతర అవసరాలకు వినియోగించాలి అన్నది ప్రభుత్వ దృఢ సంకల్పం..ఒకవిధంగా చూస్తే ఈ చట్టానికి సవరణలు లేకుండానే ప్రతీ యేటా మన దేశం సమారు 13 వేల చ.కి.మీ. అటవీ భూమిని కోల్పోతోంది అని ఒక అంచనా. ప్రస్తుతం మన దేశంలో సుమారు ఆరుకోట్ల 49లక్షల హె క్టార్ల భూమి మాత్రమే అటవీ ప్రాంతం కింద ఉన్నట్లు గణాంకలు చెబుతున్నాయి.ఈ సవరణ చట్టం కానీ అమలులోనికి వస్తే మరింత అటవీ భూభాగం హరించుకు పోతుంది అనడంలో సందేహం లేదు. జాతీయ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని చట్టానికి కొన్ని సవరణలు చేసి మినహాయింపులు ఇస్తున్నాం అని ప్రభుత్వం చెబుతూ ఉన్నా ఆచరణలో ఈ సవరణలు కార్పొరేట్‌ వర్గాల వారి ప్రయోజనాలకే అన్నది వాస్తవం.ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెడు తున్న మానిటైజేషన్‌లో భాగంగా రోడ్డు, రైల్వే, అవస్ధాపన సౌకర్యాల కల్పన ఏర్పాటు అనేవి పూర్తి గా కార్పొరేట్‌ వర్గాల చేతుల్లోనికి వెడతాయి.దీనితో పాటు దేశ వ్యాప్తంగా అవస్ధాపన సౌకర్యాల కోసం లక్ష కోట్ల రూపాయలతో కేంద్రం పీ.ఎం.గతి శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఈ పనులు కూడా కార్పొరేట్‌ వర్గాల వారికే దక్కుతాయి.అయితే వీటి ఏర్పాటులో వారికి పర్యావరణ అనుమతుల ఇబ్బందులు లేకుండా చేయడానికే ప్రభుత్వం అటవీ చట్టానికి సవరణలు చేయడానికి ముందుకు వచ్చింది అని పర్యావరణవేత్తల అభిప్రాయం. ఈ సందర్భంలో ప్రస్తుత అటవీ చట్టం ద్వారా వారికి పర్యావరణ అనుమతులు పొందడం కష్టం అవు తాయి.వారికి ఇబ్బంది కలిగించకుండా సానుకూ లత కలుగ చేయటానికే ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టడానికి సిద్ధం అయ్యింది అని పర్యావరణ వేత్తల అభి ప్రాయం.కేవలం వారి ప్రయోజనాల కోసం అటవీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం సమం జసం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అటవీ చట్టాలకు ఇన్ని మినహాయింపులు ఇస్తూ కూడా అడవులను 33 శాతానికి పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు. ప్రస్తు తం మనదేశంలో ఉన్న22 శాతం అడవులు కూడా ఈ మినహాయింపుల పర్వంద్వారా మరింత అడ వుల విస్తీర్ణం అంతరించి పోవడం తధ్యం. దేశ సరిహద్దులులో అత్యంత ఆవశ్యకమైన రక్షణ భద్రత లు కోసం మినహాయింపు కోరడంలో తప్పు లేదు.వాటిని ఎవరూ అభ్యంతర పెట్టరు కూడా. అయితే ఇటువంటి దేశభద్రత అనే అంశాన్ని చూపిం చి భవిష్యత్‌లో మరెన్నో మినహా యింపులు చేసు కుంటూ పోతే రక్షిత అటవీ చట్టం నిర్వీర్యం కాక తప్పదు ఆదిశగానే ప్రభుత్వాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి కూడా. తప్ప నిసరి పరిస్ధితులలో అటవీ భూములను ఉపయోగిస్తే అదే పరిమా ణంలో అడవులు పెంచాలి అనేది చట్ట నియమం.. కానీ మనం నరుకుతూ పోవడమే తప్ప పెంచిన దాఖలాలపై శ్రద్ధ చూపడం లేదు.ఎందుకంటే ఏడు దశాబ్దాల పైగా మనం వన సంరక్షణ ధ్యేయంగా వన ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం కానీ ఈ కృషితో అటవీ విస్తీర్ణాన్ని ఏమాత్రం పెంచలేక పోయాం అనేది మాత్రం కఠిన సత్యం.ఒక విధంగా చెప్పాలంటే పచ్చదనం విషయంలో స్వచ్చంద సంస్ధలు స్దానిక ప్రభుత్వాలు ఎంతో శ్రద్ధ చూపిస్తు న్నాయి.మొత్తం మీద ఈఅటవీచట్ట సవరణ ఫలా లు అన్నీ కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేవే! కొత్త అడవుల పెంపకం పక్కన పెడితే ఇటువంటి సవర ణలు వలన ఉన్న అడవికి ముప్పు వాటిల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రతిపాదిం చిన అటవీ చట్ట సవరణలను పర్యావరణ వేత్తలు.. స్వచ్చంద సంస్ధలు పౌరులు ఖండిరచవలసిన సమయం ఆసన్నమయ్యింది.ఈ విషయమై మన మౌనంగా ఉంటే అది భావితరాల వారికి శాపంగా పరిణమిస్తుంది.(లెక్చరర్‌ ఇన్‌ ఎకనామిక్స్‌.. ఐ.పోలవరం)
పర్యావరణ చట్ట మార్పులు ఔషధ కంపెనీల కోసమా ?
జీవ వైవిధ్యచట్టానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణల పుణ్య మా అని ఎలాంటి అనుమతులు లేకుండానే పేటెంట్‌ హక్కు లు పొంది…స్థానిక గిరిజనులకు పరిహారాన్ని ఇవ్వనక్కర్లేకుండా దేశీయ కంపెనీలకేగాక విదేశీ బహుళజాతి కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఇక మీదట మన అరుదైన వృక్ష సంపదపై మాన్‌ శాంటో వంటి బహుళజాతి కంపెనీలకు పేటెంటు హక్కులు లభిస్తే బిటీ కాటన్‌ వలె మన వ్యవసాయం వారి ఆధీనంలోకి పోయే ప్రమాదం వుంది. ప్రస్తు తం అమలులో వున్న జీవ వైవిధ్య చట్టానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖా మంత్రి గత పార్లమెంటు సమావేశాల్లో కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఇవేగనక అమలు లోకి వస్తే…అరణ్య ప్రాంతాల్లో వున్న అరుదైన ఔషధ మొక్కలను,మూలికలను, గిరిజన, రైతు బాహళ్యం అనాదిగా సాగు చేసుకొనే విత్తనాలను,పంట రకాలను వినియోగించు కొనేందు కుగాను ఇకపై ఎటువంటి ప్రభుత్వ సంస్థల అను మతులు లేకుండానే ప్రైవేటు భారత, విదేశీ ఔషద కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది.
మరోవైపు ఈసవరణలను పర్యావరణవే త్తలు, శాస్త్రవేత్తలు,గిరిజన,రైతుసంఘాల ప్రతి నిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విశిష్ట లక్షణాలు కల్గిన ఔషధ మొక్కలు, విలువైన పంటల రకాలు పట్టణీకరణ, వాతావరణ మార్పులు, అక్రమ రవాణా కారణంగా ఇప్పటికీ వేగంగా అంతరించి పోతున్నాయి. వీటిలో చాలా మొక్కలు ఆయుర్వేదం, వ్యవసాయంలో ఉపయోగించాలే తప్ప మార్కెట్‌లో ఇతర ‘’వ్యాపార వస్తువులు’’గా పరిగణించరాదు. ఒకవేళ ఆవిధంగా చేసినట్లయితే, ఔషధ కంపెనీల మితిమీరిన వినియోగంతో అరుదైన వృక్ష సంపదను లాభాలకోసం కోల్పోవాల్సి వస్తుంది. దాంతో అటు పర్యావరణానికి ఇటు గిరిజనులు, రైతుల జీవనో పాధికి తీవ్రమైననష్టం వాటిల్లుతుందని వారు హెచ్చ రిస్తున్నారు.హిమాలయ,ఈశాన్య ప్రాంతాల పశ్చిమ, తూర్పు కనుమల్లోను, గుజరాత్‌ లోని అరణ్యాల్లో కొండకోనల్లో అనేకవృక్షాలు, ఎన్నో ఔషధ మొక్కలు న్నాయి. మనం తరచూ వినియోగించే క్రోసిన్‌, సింకోరా (మలేరియా) తదితర అల్లోపతి ఔషధాలు మన దేశంలోని అరుదైన చెట్ల బెరళ్లు,వేళ్లు, మూలి కల నుండి పొందిన సహజ రసాయనాల ఆధారం గా రూపొందించినవే. ఢల్లీి లోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐ.సి.ఎ.ఆర్‌) విత్తన బ్యాంకులో 96వేల బియ్యం రకాలు భద్రపర్చబడినవంటే ఆశ్చ ర్యం కలుగక మానదు. గతంలో వరిలో బంగారు తీగలు,అక్కుళ్ళు వగైరా రకాలు ఏ కిరాణా దుకా ణానికి వెళ్ళినా లభించేవి. కానీ ఈనాడు వరిలో సైతం మూడు లేక నాలుగు రకాలు మించి సాగు కావటం లేదు. అమృతపాణి, చక్రకేళి దాదాపుగా అంతరించిపోయాయి. పంటలు, వివిధ మొక్కల రకాలు తగ్గి ప్రకృతి నుండి అదృశ్యం కావటాన్నే కుంచించుకుపోతున్న‘జీవ వైవిధ్యం’గా పేర్కొం టారు. మొక్కల్లోని వైవిధ్యం మానవుని ఆరోగ్యానికే (పోషక విలువలకు) కాక పర్యావరణానికి, సృష్టిలో మనుషుల,పక్షుల,జంతువుల,మనుగడకు అత్యావ శ్యకం. అమృతపాణి అరటిపళ్లు, ‘తైమ్‌’, ‘అతిబాల’ వంటి మొక్కలు ప్రకృతి నుండి అదృశ్యమైతే ముందు తరాల వారికి కనీసం అవి మ్యూజియంలో కూడా కానరాని పరిస్థితి దాపురిస్తుంది. ఈవిలువైన సం పదను ముందు తరాల అవసరాలను సంరక్షించు కోవాలి. వీటి పరిరక్షణకు ‘’జీవ వైవిధ్య చట్టం-2002’ కొన్ని చర్యలు చేపట్టింది. వీటిని సక్రమంగా వినియోగించుకోవటానికి కేంద్రంలో ఒకసంస్థ (నేష నల్‌ బయోడైవర్సిటీ అథారిటీ) ఏర్పాటైంది. వివిధ రాష్ట్రాల్లో బయోడైవర్సిటీ బోర్డులు నిర్వహింప బడ్డాయి. ఆరు సంవత్సరాల క్రితం హైదరా బాద్‌లో జరిగిన ‘అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు’ అనేక విలువైన సూచనలు చేసింది. ఏదైనా ఔషధ సంస్థ,కంపెనీ,ఆహారశుద్ధి పరిశ్రమ, దేశీ, ఆయు ర్వేద, యునానీ వైద్యులు…అరణ్యాలు, కొండల్లోని అరుదైన మొక్కల్ని వ్యాపారరీత్యా పొందాలంటే ప్రభుత్వ బయోడైవర్సిటీ సంస్థల నుండి తప్పక అనుమతులు పొందాలి. ఈవృక్ష సంపదను, వన మూలికలను సాగు చేస్తూ, సంరక్షించే ఆ ప్రాంత గిరిజనులకు…ప్రతిఫలంగా కొంత రుసుమును చెల్లించాలి. పొందిన లాభాల్లో కొంత భాగం గిరి జనుల సంక్షేమానికి (స్థానికంగా వారికి పాఠ శాలలు,ఆస్పత్రులు వగైరా నెలకొల్పటానికి) విని యోగించాలి.అనాదిగా గిరిజనులకు వృక్ష సంప దపైనున్న జ్ఞానాన్ని పరిరక్షించాలి. ఇది మానవాళి నాగరికతలో అంతర్భాగం.దేశంలోని వివిధ అర ణ్యాలు,గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 20కోట్ల మంది గిరిజనులు,గ్రామీణ పేదలు అటవీ ఉత్ప త్తుల, వన మూలికలు, ఔషధ పంటల సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు.వామపక్షాల ఒత్తిడి మేరకు నాటి యు.పి.ఎ ప్రభుత్వం ఆదివాసి, గిరిజనులకు ఈ ఉత్పత్తులు అనుభవించటానికి గాను, పోడు తదితర భూములపై పరిమితంగానైనా కొన్ని హక్కులు కల్పించింది. ఐక్యరాజ్య సమితి నిర్వ హించిన ‘’నగోయా’’ పర్యావరణ సదస్సు సూచించిన నిబంధనావళి లోని ఆర్టికల్‌ 5 ప్రకారం అటవీ ఉత్పత్తులు, ఔషధ, అరుదైన పంట రకాల విని యోగం ద్వారా లభించే లాభాలను విధిగా గిరిజన, ఆదివాసీ, రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఈనిబంధనల కు మన పార్లమెంటు గతంలో చట్టపరంగా హక్కులు కల్పించింది.
కాగా 2016లో ఉత్తరాఖండ్‌ లోని ‘’దివ్య’’ ఆయుర్వేద కంపెనీ హిమాలయాల్లోని అడవుల నుండి పెద్దసంఖ్యలో అనేకఅరుదైన ఔషధ మొక్క లను ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా చౌర్యం చేసింది. విశేషమేమంటే దివ్య ఫార్మసీ ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్తగా మారిన వివాదాస్పద రామ్‌ దేవ్‌ బాబాకు చెందిన ఔషధ సంస్థ. ‘జీవ వైవిధ్య చట్టం-2002’ను అతిక్రమించి అరుదైన ఔషధ మొక్కలను ప్రభుత్వ సంస్థల అనుమతులు లేకుండా పరిశ్రమల్లో వినియోగించి,తద్వారా లభించిన లాభాల్లో భాగాన్ని స్థానిక గిరిజనులకు ఇవ్వడానికి నిరాకరించినందుకు ఉత్తరఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వ్యాజ్యం వేసింది. ఈఉల్లంఘనను తీవ్ర మైనదిగా పరిగణిస్తూ హైకోర్టు దివ్యఫార్మసీపై జుర్మానా విధిస్తూ ఆపరిశ్రమ నిర్వహణకు సంబం ధించి కఠినమైన షరతులు విధించింది. ఈ చర్యను జీర్ణించుకోలేని రామ్‌దేవ్‌ బాబా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి…ప్రైవేటు ఔషధ పరిశ్రమలు, ఆయుష్‌ సంస్థలు ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఔషధ మొక్కలను పొందటానికి వీలుగా…జీవ వైవిధ్య చట్టం-2002కితూట్లు పొడిచే సవరణలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఇరవై సంవత్స రాల్లో భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన వేప, పసుపు, వంగ, బాస్మతి వరి, బంగినపల్లి రకాలపై మేధోసం పత్తి హక్కులు(పేటెంట్లు) పొంది…వాటిని తస్కరిం చేందుకు ఔషధ,ఆహార బహుళజాతి విదేశీ కంపెనీలు ప్రయత్నించాయి. మన ప్రజా సంఘాలు, సంస్థలు చేసిన ఒత్తిడి మేరకు…ఈ‘జీవ వైవిధ్య చట్టం-2002’ సహకారంతో… భారత ప్రభుత్వం దీర్ఘకాలం పోరాడి ఈ సంపదను విదేశీ కంపెనీలు కాజేయకుండా రక్షించుకోగల్గింది.
జీవ వైవిధ్య చట్టానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణల పుణ్యమా అని ఎలాంటి అనుమతులు లేకుండానే పేటెంట్‌ హక్కులు పొం ది…స్థానిక గిరిజనులకు పరిహారాన్ని ఇవ్వనక్కర్లే కుండా దేశీయ కంపెనీలకేగాక విదేశీ బహుళజాతి కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఉదాహరణకు రైతులకు ఎంతో పంట నష్టం కలిగిస్తున్న అగ్గి తెగులును తట్టుకొనే వరి వంగడాలను రూపొందిం చాలంటే క్రాసింగ్‌ కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలకు తూర్పు కనుమల్లోని ఛత్తీస్‌గఢ్‌ అడవుల నుండి కొన్ని కొండజాతి వరిరకాలు అవసరం అవుతా యి. ఇక మీదట మన అరుదైన వృక్ష సంపదపై మాన్‌శాంటో వంటి బహుళజాతి కంపెనీలకు పేటెం టు హక్కులు లభిస్తే బిటీ కాటన్‌ వలె మన వ్యవసాయం వారి ఆధీనంలోకి పోయే ప్రమా దం వుంది. అందుకే దేశ ఆహార భద్రతకు, పర్యా వర ణానికి, గిరిజనుల, రైతుల ప్రయోజనాలకు హని కల్గించే ఈచట్ట సవరణలను వెనక్కి తీసు కోవాలి. పలువురు శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, జన విజ్ఞాన వేదిక ఇటీవల నిర్వహించిన అంత ర్జాల సదస్సుద్వారా పార్లమెంటరీ స్థాయీ సంఘా న్ని ఇదే కోరాయి.
(వ్యాసకర్త :డా.సోమమర్ల,ఐసిఎఆర్‌ ఎన్‌.బి.పి.జి.ఆర్‌లోప్రిన్సిపల్‌సైంటిస్ట్‌` న్యూఢల్లీి ) -రుద్రరాజు శ్రీనివాసరాజు

అక్షరాలకు గుడి కట్టిన సవర తెగ గిరిజనులు

‘‘శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాతృభాషను కాపాడుకునేందుకు 28 అక్షర బ్రహ్మ ఆలయాలు, మందిరాలున్నాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్షరానికి ఆలయాలు కట్టడం వెనుక ఒక ఉద్యమమే జరిగింది. అదే ‘మతార్బనోమ్‌’.మత్‌ అంటే దృష్టి,తార్‌ అంటే వెలుగు,బనోమ్‌ అంటే విస్తరించడం. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. మాతృభాష గొప్పతనం తెలిపేందుకు ప్రతి గురువారం అక్షర బ్రహ్మ ఆలయాలు,మందిరాల వద్ద భజనలు, పూజలు చేస్తాం. అక్కడే సవర భాషను నేర్పుతాం. అందుకోసం చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. గ్రామంలోని దాదాపు అందరూ మా భాష నేర్చుకుంటు న్నారు’’
ఏదైనా ఆలయానికో,మందిరానికో వెళ్తే, అక్కడ దేవుడు, దేవత విగ్రహాలు,పటాలు కనిపి స్తాయి. వారికి పూజలు,భజనలు చేయడం కనిపిస్తుంది. కానీ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చాలా ఆలయాల్లో అక్షరాలకు పూజలు చేస్తారు. వాటికి మందిరాలు కట్టి భజనలు చేస్తారు. అక్షరమంటే అంత ప్రేమ ఆ గిరిజనానికి.ఇంతకీ అక్షరానికి ఆలయం ఎందుకు? ఆ ఆలయాల ప్రత్యేకత ఏంటి?గిరిజన గ్రామాలకు వెళ్తే వింతైన ఆచారాలు, నమ్మకాలు, జంతు బలులు, గ్రామ దేవతల పూజలు ఇటువంటివే సాధారణంగా కనిపిస్తాయి.కానీ, ఇందుకు పూర్తిగా భిన్నమైన గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ అక్షరాలకు ఆలయాలు కట్టి పూజలు చేస్తారు. ఇలా ఎందుకంటే తమ మాతృభాషని రక్షించుకునేందుకు అంటారు.
అక్షర బ్రహ్మ ఆలయాలు
అక్షరాలను ప్రతిష్టించి పూజించే ఆలయాలను ‘అక్షర బ్రహ్మ’ ఆలయాలు అంటారు. పెద్ద ఆలయాలు నిర్మించేందుకు అవకాశం లేని చోట, చిన్న మందిరాలు కట్టి అక్షరాలకు పూజలు చేస్తున్నారు. ఆ ఆలయాలు, మంది రాలు అన్నీ కూడా సవర గిరిజన తెగ నిర్మించుకున్నవే. తమ మాతృభాషను కాపాడుకోవడానికి ఇలా అక్షరానికి ఆలయం కట్టడం కంటే మంచి మార్గమేముందని వాళ్లంటున్నారు. ‘‘ఏపీ, ఒడిశా ఏజెన్సీల్లో సవర తెగ ఎక్కువగా కనిపిస్తుంది. మేం మాట్లాడే సవర భాష చాలా పురాతనమైనది. కానీ దానికి లిపి లేదు. అందువల్ల మా పూర్వీకుల సంప్రదా యాలు మాకు సరైన రీతిలో చేరలేదు. దాంతో, లిఖిత రూపంలో ఉన్న ఇతర గిరిజన సంప్రదా యాలనే సవర సంప్రదాయాలుగా అనుస రించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. సవర సంప్రదా యాలను ముందు తరాల వారికి అందిం చాలంటే లిపి అవసరమని మావాళ్లు గుర్తించారు. ఒడిశాకు చెందిన సవర పండితుడు మంగయ్య గొమాంగో పన్నెండు సంవత్సరాలు కృషి చేసి 1936లో సవర భాషకు లిపి రూపం ఇచ్చారు. అదే మా మాతృభాష. ఈ లిపి ఇంటింటికి చేరాలంటే ఏం చేయాలనే ఆలోచన నుంచి పుట్టినవే అక్షర బ్రహ్మ ఆలయాలు’’ అని సవర తెగ గురువు సవర కరువయ్య తెలిపారు.
అక్షర చైతన్యం.. మాతృభాషా ఉద్యమం
గిరిజనుల్లో చైతన్యం నింపేందుకే గ్రామాల్లో ఆలయాలు నిర్మించి అందులో అక్షరాలను ప్రతిష్టించారు. అక్షరమే దైవం, దానికే మేం పూజలు చేస్తాం అంటారు గిరిజనులు. అక్షరాలకు దేవాలయాలు, మందిరాలు నిర్మించి వాటి ద్వారా సవర భాష లిపిని అందరికి నేర్పుతున్నారు. ‘‘శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాతృభాషను కాపాడుకునేందుకు 28 అక్షర బ్రహ్మ ఆలయాలు, మందిరాలున్నాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్షరానికి ఆలయాలు కట్టడం వెనుక ఒక ఉద్యమమే జరిగింది. అదే ‘మతార్బనోమ్‌’.మత్‌ అంటే దృష్టి,తార్‌ అంటే వెలుగు,బనోమ్‌ అంటే విస్తరించడం. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. మాతృభాష గొప్పతనం తెలిపేందుకు ప్రతి గురువారం అక్షర బ్రహ్మ ఆలయాలు,మందిరాల వద్ద భజనలు, పూజలు చేస్తాం. అక్కడే సవర భాషను నేర్పుతాం. అందుకోసం చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. గ్రామంలోని దాదాపు అందరూ మా భాష నేర్చుకుంటు న్నారు’’ అని అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి తిరుపతి తెలిపారు.
‘అక్షరానికి పూజలు చేస్తే దేవతలకు పూజలు చేసినట్లే’
అక్షరమంటే ముక్కోటి దేవతలతో సమానమని సవర గిరిజన సమూహాలు భావిస్తాయి. అందుకే అక్షరానికి పూజలు చేస్తే దేవత లందరికీ పూజలు చేసినట్లేనని నమ్ముతారు. దేవతా రూపంలో విగ్రహాలు లేకున్నా, అక్షర బ్రహ్మ ఆలయాల్లో పండుగలు నిర్వహిస్తారు. ‘‘ఇలా అక్షరాలకు గుడి కట్టి పూజించే సంప్ర దాయం మరెక్కడ ఉండదు. అక్షరంలోంచే త్రిమూర్తులు పుట్టుకొచ్చారని పెద్దలు చెప్తారు. ఓంకారం అక్షరమే. అందుకే ఓంకార రూపం వంటి ఆకారం మధ్యలో సవర లిపి అచ్చులు, హల్లులు ఉంచి వాటికే పూజలు చేస్తాం. మా తెగలో అక్షరానికి తప్ప వేరే దేవుడు, దేవతల విగ్రహాలకు పూజలు చేయం. ఈ లిపికి, అక్షరానికి పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్లే’’ అని నౌగడ గ్రామ అక్షర బ్రహ్మ ఆలయ గురువు సవర వెంకటరావు చెప్పారు. ‘ఆయనే మా దైవం.. అక్షరమే మా ఆయుధం’ సవర భాషకు లిపిని అందించిన సవర పండిత్‌ మంగయ్య గొమాంగో తమ ఆరాధ్య దైవమని సవర గిరిజనం చెప్తారు. మంగయ్య గొమాంగో అందించిన అక్షరాలే సవర తెగకు ఆయుధాలని, వాటి ద్వారానే చైతన్యం పొందుతున్నామని సవర గిరిజన గురువులు అంటున్నారు. ‘‘అక్షరానికి గుడి కట్టి ప్రత్యేక పూజలతో సవర లిపి ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నాం. సవర లిపికి 24 అక్షరాలు ఉంటాయి. అందులో 16 హల్లులు, 8 అచ్చులు ఉంటాయి. వీటిని రాతిపై చెక్కి దేవాలయాల్లో పెడుతున్నాం. అక్షరాలను గోడలపై చిత్రాలుగా వేసి, లేదా పటాలు కట్టి వాటికి మందిరాలు నిర్మిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలం నౌగడ, ముత్యా లు,శంభాంలలోనూ,విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం కన్నాయిగూడ, లక్కగూడల్లోనూ అక్షరబ్రహ్మ ఆలయాలు నిర్మించాం. జామిగూడ, సతివాడ, నౌగడ తదితర గ్రామాల్లో అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా కేంద్రాల పేరున ప్రచార మందిరాలు ఏర్పాటు చేసుకున్నాం’’ అని సవర గురువు, అక్షర బ్రహ్మ ప్రచారకుల సంఘం జిల్లా కోఆర్డినేటర్‌ కరువయ్య చెప్పారు. పాఠశాలల్లో తెలుగు, ఒడియాలతో పాటు సవర భాషను కూడా నేర్పించమని గిరిజన సంఘాలు ప్రభు త్వాన్ని కోరడంతో, కొన్ని పాఠశాలల్లో ఆ భాష ను చేర్చారు. ‘‘ఈ తరం పిల్లలు తమ మాతృభాషలోనే ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారు. అందుకే తెలుగు, ఇంగ్లిష్‌, ఒడియా వంటి భాషలను సవర భాష ద్వారా నేర్పుతున్నాం. మాతృభాష ద్వారా నేర్చుకుంటే ఏదైనా సులభం అవుతుంది. పైగా మా సొంత భాషను వదిలి ఇతర భాషల పట్ల మోజు పెంచుకోవడం సరైనది కాదు. ఉపాధి,ఉద్యో గాల కోసం ఏ భాషైనా నేర్చుకోవచ్చు. కానీ మా మాతృభాష బతికుండాలి కదా. అందుకే ఈ ప్రయత్నం. వలంటీర్ల సహాయంతో తరగతులు చెప్తున్నాం. అందరూ ఈ తరగతు లకు హాజరవుతున్నారు. సవర భాష అక్షరాలు, పదాలను చెప్తూ, వాటికి సమానమైన తెలుగు, ఇంగ్లిష్‌, ఒడియా పదాలు రాయడం నేర్చుకుంటున్నారు’’ అని కరువయ్య చెప్పారు.
‘వీడియోలు, స్టూడియోలు, పాఠాలు’
సవర భాషకు ప్రచారం కల్పిస్తూ వీడియోలు తయారు చేస్తున్నారు. దాని కోసం సతివాడ గిరిజన గ్రామంలో చిన్న స్టూడియో కూడా ఏర్పాటుచేసున్నారు. పాటల ద్వారా మాతృ భాషకు ప్రచారం కల్పిస్తున్నారు. స్వచ్ఛందంగా కొందరు అక్షర బ్రహ్మ మందిరాలకు వచ్చి సవర భాష నేర్పుతున్నారు. ‘‘నేను సవర భాష నేర్చుకున్నాను. నాకు తెలుగు కూడా బాగా వచ్చు. తెలుగు,ఒడియా,ఇంగ్లిష్‌ వంటి భాషల్లోని పదాలను సవర భాషలో బోధించి, అర్థాలు వివరిస్తాను. దీని ద్వారా మా మాతృ భాషను రక్షించుకోవడమే కాకుండా, ఇతర భాషల్లోని వివిధ అంశాలను మా భాష ద్వారా నేర్పడాన్ని ఆస్వాదిస్తున్నాను. మాలో అందరికీ తెలుగు వచ్చు. కానీ సవర భాష అందరికీ రాదు. అందుకే మా మాతృభాషను అందరికి నేర్పించాలనే ఉద్దేశంతోనే నేను, నాలాంటి వాళ్లు వచ్చి పాఠాలు చెప్తున్నాం’’ అని నూకా లమ్మ గూడ గ్రామానికి చెందిన సవర సుబ్బలక్ష్మీ చెప్పారు. ‘గిరిజనమే ఆదర్మం కావాలి’‘‘మాతృభాషకు మించినది ఏదీ లేదు. అది అమ్మ భాష. మాతృభాషని విస్మరిస్తే ఏ భాషైనా మనుగడ కోల్పోతుంది. ఇప్పుడు ప్రపంచంలోని చాలా భాషలు అలాంటి ప్రమాదంలో ఉన్నాయి. వాటిని కాపాడు కోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన దేశంలోని అనేక గిరిజన తెగలకు లిపి లేదు. లిపి లేని భాషకు ఎక్కువ కాలం మనుగడ ఉండదు’’ అని ఏయూ తెలుగు విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు అన్నారు. ‘‘తమ భాషను బతికించుకునేందుకు సవర గిరిజనం చేస్తున్న కృషి చాలా గొప్పది. అసలు అక్షరానికి ఆలయం కట్టడమనేదే చాలా గొప్ప ఆలోచన. ఇదే తరహాలో వారు సవర లిపిని వ్యాప్తి చేసి, సవర భాషకు మంచి గుర్తింపు తీసుకుని రావాలి. వారి స్ఫూర్తి తెలుగుతో సహా మిగతా భాషలకు ఆదర్శం కావాలి’’ అని ఆయన అన్నారు.(బీబీసీ సౌజన్యంతో) -లక్కోజు శ్రీనివాస్‌

పిల్లలు ఇక్కడ.. బడి ఎక్కడో..!

ఇంతకు మునుపు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో, పిల్లలు దాని బారిన పడ్డారా లేదా అనే విషయం మనకు తెలియదు కానీ,భౌతిక విద్యా బోధన విధానానికి మాత్రం ఆన్‌లైన్‌ విద్య ప్రత్యామ్నాయం కాదనే విషయం మనకు తెలుసు. పిల్లలు ముఖ్యంగా ప్రైమరీ,ప్రీప్రైమరీ చదివే చిన్నారులు…తోటి పిల్లలు,ఉపాధ్యాయులు, ఇతరుల నుంచి (హ్యూమన్‌ ఇంటరాక్షన్‌) నేర్చుకోగలగడంతో పాటు సామాజికంగా,మానసికంగా అభివృద్ధి చెంద గలరు.అయినా,పాఠశాలలు మూసివేయడం ద్వారా మనం వారి జీవితాలతో ప్రయోగాలు చేస్తున్నాం. వీటి ఫలితాలు చాలా వినాశకరంగా ఉంటున్నాయి. సెప్టెంబర్‌, 2021 సర్వే నివేదిక ప్రకారం… పిల్లల్లోచదివే,రాసేసామర్థ్యంస్థాయి బాగా తగ్గిపో యింది. సగం మంది పిల్లలు కొన్ని పదాల కంటే ఎక్కువ చదవలేక పోతున్నారు. మూడో వంతు పిల్లలు చదువుకునే క్రమంలోనే లేరు.
కోవిడ్‌-19 మన జీవితాలు తలకిందు లు కాకూ డదనే విశ్వాసం అలాగే మిగిలి పోయిం ది. డెల్టా కన్నా ఒమిక్రాన్‌ ఎక్కువగా వ్యాప్తి చెంది… తక్కువ ప్రభావం చూపుతున్నప్పటికీ…మనపై విధించిన ఆంక్షలు రోజువారీ జీవితాలపై మరొక సారి ప్రభావం చూపుతున్నాయి. ఒకవేళ రాత్రి కర్ఫ్యూలు, సరిహద్దుల్లో సోదాల లాంటి నిబంధ నలు ఇంతకు ముందున్న వేరియంట్‌ను కట్టడి చేయనట్లయితే…వేగంగా వ్యాప్తి చెందే వేరి యంట్‌ను కూడా ఆ నిబంధనలు కట్టడి చేయవనే విషయం వివేకవంతులకు స్పష్టమవ్వాలి.
లోపించిన హేతుబద్ధత
కానీ,ఇరవై నెలల పాటు పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించినప్పుడే మన హేతు బద్ధతను వదిలేశాం. రాజకీయ నాయకులకు పాఠ శాలలు ఒకతేలికైన లక్ష్యాలుగా మారాయి. పాఠ శాలల మూసివేత,కోవిడ్‌ను కట్టడి చేసే ఒక సున్ని తమైన చర్య అనీ, దాని కోసం వారేదో చేస్తున్నారనే భావనను ప్రజల్లో కలిగిస్తుంది. కానీ ఇది, హేతు బద్ధతలో, వాస్తవంలో పాదుకొనని ఒక భావోద్వేగ ప్రతిచర్య. కోవిడ్‌-19 రెండవ వేవ్‌ ముందు కూడా, చిట్ట చివరికి మూసివేసేది, మొట్ట మొదట ప్రారం భించాల్సింది పాఠశాలలేనని అనేకమంది నిపుణు లు సూచించారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకోక పోవడం వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన కాలంలో సుదీర్ఘకాలం పాటు పాఠశాలలు మూసివేసిన దేశాలలో భారత్‌ ఒకటిగా నిలిచింది. ఇదీలాగుంటే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యావిధానం గోరుచెట్టుపై రోకలపోటు చందంగా మారింది. ప్రక్షాళన కారణంగా ఎంతో మంది పేద పిల్లలకు విద్య దూరం కావడంతో దాని ప్రభావంతో తల్లిదం డ్రులకు భారంగా పరిణ మించింది. ప్రాథమిక పాఠశాలలు మూసివేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.3,4,5 తర గతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు సర్క్యులర్‌ 172 విడుదల చేసింది. వచ్చేవిద్యా సంవత్సరంనాటికి మూడు కిలోమీటర్ల లోపు వున్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యా ర్థులను ఉన్నత పాఠశాలలకు తరలించనుంది. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటర్‌ పరిధిలో వుండాలన్న విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా 1,2తరగతుల పిల్లలను అంగన్‌వాడీలకు అప్ప గించనుంది. అందుబాటు లోని ప్రాథమిక విద్యను పేదలకు అందకుండా చేస్తోంది. ప్రాథమిక పాఠ శాలలు క్రమంగా కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి స్వగ్రామమైన చిన మేరంగి హైస్కూల్‌లో2.25కిలోమీటర్ల దూరం లోవున్న అల్లువాడ, దాసరిపేట, తాళ్లడుమ్మ, చిన మేరంగి కాలనీ, చినమేరంగిలోని ఆరు ప్రాథమిక పాఠశాలలను కలిపేస్తున్నారు. ప్రాథమిక పాఠశా లలను మూసేసే పని ప్రారంభించింది. ప్రభుత్వ చర్యలవల్ల ప్రాథమిక పాఠశాలలకు పేద పిల్లలు వెళ్లలేనంత దూరం పెరుగుతుంది. 3,4,5 తరగ తుల పిల్లలు కిక్కిరిసిన రద్దీతో వాహనాలు తిరుగు తున్న రోడ్లను దాటి సురక్షితంగా పాఠశాలకు వెళ్లి రాగలారా? సాధ్యం కాదు. వెళ్లిన పిల్లలు తిరిగొచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పదు. దూరం గానున్న బడులకు పిల్లలను పంపించేందుకు తల్లి దండ్రులు భయపడితే వారే తీసుకెళ్లి తీసుకురావాలి. లేదంటే ఆటోలకు పంపించాలి. ప్రతిపేటలో పిల్ల లు బడికెళ్లి సురక్షితంగా రావడానికి వీలుగా బడు లు పెట్టారు. వయసును బట్టి పిల్లల మానసిక ఎదుగుదల,పరివర్తనలో తేడా వుంటుంది. అందు వల్ల చిన్న పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు ఒకే ఊరిలో ప్రైమరీ,హైస్కూల్‌ ఏర్పాటు చేశారు. ఆడుతూ,పాడుతూ,ఏడుస్తూ బడికివెళ్లే ఆరేళ్ల పిల్లడు,13ఏళ్లు దాటిన పిల్లలతో ఇమడలేడని గుర్తించి…అనేక కమిషన్ల సూచన ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠ శాల నెలకొల్పారు. ఇపుడా ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం ఏకపక్షంగా మూసేస్తోంది.
వ్యవసాయం, కూలి పని చేసుకునే జనం తెల్లారగానే పనిలోకి పోవాలి. రోజూ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి తీసుకు రావడం సాధ్యం కాదు. కనుక పిల్లలను ఆటోలకు పంపించాలి. అందుకు డబ్బు పెట్టాలి. ‘అమ్మఒడి’కి ఇచ్చిన డబ్బు అందుకు సరిపోవచ్చు. కుటుంబంలోని మిగతా పిల్లలకు ‘అమ్మ ఒడి’ వర్తించదు కనుక తల్లిదండ్రులు చేతి డబ్బు పెట్టుకోవాలి.లేదంటే పిల్లలను బడికి పంప డం ఆపేస్తారు.‘అమ్మ ఒడి’ శాశ్వత పథకం కాదు. ప్రభుత్వం మారితే ‘అమ్మ ఒడి’ వుండదు. ‘అమ్మ ఒడి’ లేకపోతే తల్లిదండ్రులపై చదువుల భారం పెరుగుతుంది. అధికారం లోకి రేపు ఎవరొచ్చినా మూసేసిన పాఠశాలలను తెరిపించరు. అందుకని సర్కారు బడులను సంరక్షించుకోవడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
మౌలిక సదుపాయాలు లేకుండానే….
హైస్కూళ్లకు తరలిస్తున్న 3,4,5 తరగ తుల పిల్లలకు తరగతి గదులున్నాయా? బెంచీలు, కుర్చీలున్నాయా? ఇతర మౌలిక సదుపాయాలు న్నాయా? అవేమీ లేవని అన్ని చోట్లా ఒకటే మాట. మరెందుకు ఇంత తొందర? హైస్కూళ్లలో తరగతి గదులు లేవు గనుక టీచర్లు విలీన తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి పాఠాలు చెప్పాలట? గంట గంటకు ప్రైమరీ స్కూల్‌ నుండి హైస్కూలుకు, హైస్కూల్‌ నుంచి ప్రైమరీ స్కూల్‌కు టీచర్లు పరుగులు తీయాలా? సాధ్యాసాధ్యాలపై కనీసం ఉపాధ్యాయ సంఘాలతోనైనా ప్రభుత్వం చర్చించలేదు? మేము నిర్ణయించాం. మీరు అమలు చేయండి అని విద్యాశాఖ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.
యువతకు తీరని అన్యాయం
ప్రపంచబ్యాంకు సలహాతో చంద్రబాబు ప్రారంభిం చిన విద్య ప్రైవేటీకరణను రాజశేఖ రరెడ్డి విస్తృత పరిచారు. ప్రైవేటు బిఇడి కాలేజీలకు విస్తారంగా అనుమతులు ఇచ్చి ట్రైనింగ్‌ పూర్తి చేస్తే టీచర్లు అవుతారనే భ్రమ యువతలో కల్పించారు. లక్షలకు లక్షలు ఖర్చు చేసి ట్రైనింగులు, ఆపైన కోచింగులు పూర్తిచేసి టీచర్‌ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఆశాభంగమే మిగిలింది. ప్రాథమిక పాఠశాలల మూసివేత మూలంగా ఖాళీగాఉన్న 25వేలు టీచర్‌ పోస్టులు భర్తీ చేయక పోగా మరో 75వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు తేలు స్తున్నారు. ఇపుడున్న 1:0విద్యార్థి,టీచర్‌ నిష్ప త్తిని1 :35 గా మార్చేశారు. గత రెండేళ్లు డీఎస్సీ లేదు.
ఎస్‌.సి,ఎస్‌.టి,బి.సిలుప్రభుత్వవిద్యను కాపాడుకోవాలి
వేల సంవత్సరాలపాటు భూమిపై హక్కు లేక ఆర్థిక అణచివేతకు, చదివే హక్కు లేక కుల పీడనకు గురైన ఎస్‌.సి,ఎస్‌.టి బి.సి సామా జిక తరగతుల ప్రజలు ఇప్పటికీ అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అందు బాటులో ఉండడంతో కొంతమేరకైనా చదువు కోగలుగుతున్నారు. అత్యంత వెనకబడిన తరగతుల (ఎం.బి.సి) పిల్లలు నేటికీ ప్రభుత్వ బడికి కూడా వెళ్లలేకపోతున్నారు. ఈ తరగతుల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వనిర్ణయంతో తీవ్రంగ నష్టపోతారు. ఉన్నత సామాజిక తరగతుల్లోని పేదలుకూడా నష్టపో తారు. నూతన విద్యావిధానం అమలు చేయడం అంటే ఇదే! విద్యారంగంలో తిరోగమనాన్ని నిల వరించి అందరికీ ప్రభుత్వ విద్య అందే విధంగా, విద్యా హక్కు అమలు సంపూర్ణంగా జరిగేలా విశాల ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం నేడు మన ముందుంది.పేద పిల్లలకు విద్య దూరం..తల్లిదం డ్రులకు భారంగా పరిణమించకూడదు.
విద్యకు సంబంధించిన సమస్యలు ఏదో ఒక రోజు పరిష్కారం చేస్తారనే ఒక నిరాధారమైన, అస్పష్టమైన హామీలను అంగీకరించినప్పటికీ, మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉం టున్నాయి. పాఠశాలలు మూసివేసినప్పటికీ, పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా పెరిగినట్లు బ్రిటన్‌ దేశపు నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా,‘అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియా ట్రిక్స్‌’’ పిల్లల్లో మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ‘’జాతీ య ఎమర్జెన్సీ’’గాపేర్కొంది.భారతదేశంలో, మాన సిక ఆరోగ్య సమస్యల్ని పక్కకు పెడితే, పాఠశాలల మూసివేత తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా పౌష్టికాహార లోపాలసమస్య మరింత అధ్వా న్నంగా తయారైంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరే కంగా కొన్ని దశాబ్దాలుగా సాధించిన ప్రగతి, పాఠ శాలల మూసివేత కారణంగా వెనుకపట్టు పట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం,10.1మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నారని ఒక అంచనా. పౌష్టికాహార లోపాలు, బాల కార్మికులకు సంబం ధించిన రోజువారీసమాచారం మన దగ్గర ఉండి ఉంటే, బహుశా మనం భారతదేశం లోని పిల్లల బాధల పైన దృష్టి పెట్టేవారం.అంతే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలు మూసివేసి ఉండేవాళ్ళం కాదు. ‘పిల్లలు పాఠశాలల నుండి ఇంటి దగ్గర ఉండే పెద్దలకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం ఉంద’’ని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లు అంటువ్యాధిని అడ్డుకోలేవనే విషయం తెలుసు కాబట్టి, పెద్దవారి ప్రయోజనాల కోసం, పిల్లల పాఠశాలలను మూసివేయడం అసం బద్ధమైన విషయం. పిల్లలకు శాస్త్రీయమైన పరీక్షల తర్వాత ఉపయుక్తమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేరు. ఇప్పటికీ పరిశీలనలో ఉన్న వ్యాక్సిన్‌కు…విద్యను, పాఠశా లలను ముడిపెట్టడంలో అర్థం లేదు. పిల్లలకు కోవిడ్‌-19 ఎమర్జెన్సీ లేదు కాబట్టి వారికి వ్యాక్సిన్‌ అత్యవసరం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. వాస్తవానికి, రోగి నిరోధకశక్తికి సంబంధించి ‘’నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌’’ (ఎన్‌.టి.ఎ.జి) అభిప్రాయమిది. 15-18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వ ఆమోదం, ఎన్‌.టి. ఎ.జి అభిప్రాయాన్ని సవాల్‌ చేస్తున్నది. విద్య అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. పాఠశా లలను సుదీర్ఘకాలంపాటు మూస ివేయడం ద్వారా, ఒక బలహీనమైన ప్రత్యామ్నా యానికి అవకాశం ఇవ్వడంద్వారా,మనంపిల్లల హక్కులను ఉల్లం ఘనకు గురిచేస్తున్నాం. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పిల్లల కోసం నోళ్ళు విప్పాలి. అంటు వ్యాధుల వ్యాప్తి, నియంత్రణ శాస్త్రవేత్తలు,డాక్టర్లు, విద్యావేత్తలు ధృ వీకరించినట్లు‘పిల్లలకు 2022 సంవత్సరం సంతో షంగా ఉండాలని’ కోరుతూ మనలో ఒకగ్రూప్‌ ఓప్రయత్నాన్ని ప్రారంభించింది.2022 ఆ తరు వాత కాలం కూడా పిల్లలు అన్ని విధాలా సంతోష కరమైన పాఠశాల జీవితం,సంతోషకరమైన బాల్యా న్ని పొందాలని ఆశిద్దాం. (వ్యాసకర్త ఐ.ఐ.టి ముంబైలో (‘ద హిందూ’సౌజన్యంతో )(ప్రొఫెసర్‌.భాస్కరన్‌ రామన్‌/ఎం.కృష్ణమూర్తి)

మ‌హిళా నీకో వంద‌నం..!

ఆమె..శక్తి స్వరూపిణి. సృష్టికి మూలం. ఆది అంతానికి సంధానకర్త. కుటుంబానికి సారథి. బాంధవ్యాలకు వారథి. రెప్పల మాటున కన్నీటి చుక్కలు దాచుకుని కుటుంబంపై పన్నీటిని చల్లేందుకు ప్రయత్నించే ప్రేమమయి. ఆమె త్యాగం అజరామరం. ఇంటా, బయట వివక్ష, వేధింపులే బహుమానంగా ఇస్తున్నా అంతులేని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. అదే ఆమె స్థైర్యానికి చిహ్నం. మహిళ జన్మనే కాదు.. జీవితాన్నిస్తుంది. అవసరమనుకుంటే జీవిత భారాన్ని మోస్తుంది. తాను పస్తులుండి బిడ్డల కడుపు నింపుతుంది. ఒక్కటేమిటి భారం మోసేది..బాధ్యతలు పంచుకునేది.. త్యాగానికి సిద్ధపడేది.. ఒక్క మహిళ మాత్రమే. అంతటి మాతృమూర్తిని చిన్నచూపు చూడటమా..? ఇది ఒకప్పటి మాట. ఆంక్షల చట్రాన్ని చీల్చుకుని అవకాశాల్లో క్షేత్రంలో విజయం కోసం పోరాడుతోంది నేటి మహిళ. ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అని దూసుకు పోతున్న మహిళలు ఇప్పుడు యుద్ధక్షేత్రం లోనూ శత్రువుతో తలపడేందుకు సిద్ధమం టున్నారు. నింగి,నేల,నీరు..ఎక్కడైనా మేమున్నామని తమ శక్తియుక్తులు చాటు కుంటున్నారు. ఇలా అమ్మగా, అక్కగా, జీవన సహచరిగా బహుముఖ రూపంలో.. లాలనలోనూ, పాలనలోనూ, ఆటల్లోనూ, పాటల్లోనూ, శ్రమైక జీవన యానంలోనూ, అవనిలోనూ, అంతరిక్షంలోనూ ఆమె చెరగని సంతకం లిఖించుకుంటోంది. మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అందిస్తున్న కథనం.
అన్నింటా ఆమె..
ఆకాశంలో సగం..అవకాశం సగం.. ఇది పాత నినాదం. అన్నింటా మేము.. కాదు కాదు అన్నిటా మేమే.. ఇదీ ఈనాటి మహిళల తాజా గళం. పట్టుదల,క్రమశిక్షణ పెట్టుబడిగా నేటి మహిళ ఓర్పు, నేర్పు, తెగువతో రాణిస్తోంది. ఇంటిని చక్కదిద్దే తత్వవేత్తగా,ఉద్యోగం చేసే మేటి వనితగా,చట్టసభల్లో సంస్కర్తగా పురుషులకు ధీటుగా ముందుకెళ్తోంది. ఒడిదుడుకుల్లో వెనుకంజ వేయకుండా అద్వితీయంగా అడుగులేస్తోంది. జిల్లాలోని పలువురు మహిళలు పేదరికాన్ని పట్టుదలగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో ఎదురొడ్డి విజయం సాధిస్తున్నారు. కన్నీటి కష్టంలోనూ,కడుపు తరుక్కుపోయే విషాదంలోనూ ధీర వనితగా ప్రశంసలు అందుకుంటున్నారు. మరికొందరు పేద కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఉద్యోగ బాధ్యతలు చూస్తూనే కుటుంబాన్ని అద్వితీయంగా సాకుతున్నారు. ఇంకొందరు వ్యాపార రంగంలోనూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో నేటి మహిళలు అడుగు పెట్టని చోటులేదు. సాధించని విజయం లేదు.ఒకప్పుడు మహిళలంటే వంటిల్లు..సంప్రదాయాలు, కట్టుబాట్లకు మధ్య గడిపే జీవితమే జీవితం. ఇవాళ దాని అర్థమే మారిపోయింది. తమకున్న ఓర్పుని,సహనాన్ని పెట్టుబడిగా పెట్టి మరీ సాధించుకున్న విజయాలకు ప్రతినిధిగా నేటి మహిళ నిలుస్తోంది.
గృహిణి నుంచి పాలకురాలిగా..
సూర్యోదయానికి ముందే స్త్రి విధి నిర్వహణ ఆరంభమవుతుంది.ఆమెకు అతిపెద్ద బాధ్యత పిల్లల పెంపకం.పిల్లలను బడికి పంపడం తొలి విధి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్యారేజీ ఉండదనో,స్కూలు బస్సు పోతుందనో భయం. పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే మిగిలిన పనులు చక్కబెట్టాలి. అందుకే సైకాలజిస్టులు గృహిణి పాత్రకంటే ఉద్యోగ జీవితం మేలు అంటారు. సాధారణ గృహిణి నుంచి ప్రభు త్వాలను నడిపించగల సామర్థ్యం ఉన్న శక్తిగా మహిళ ఎదిగింది. రాజకీయాలు,క్రీడలు, పాలనా..ఇలా ముఖ్యమైన అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు ఏ మాత్రం తీసుపోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇది నాణానికి ఒకైపు. మరోవైపు వివక్ష, అడుగడుగునా ఇబ్బందులు ఉన్నాయి. స్త్రి విలాస వస్తువు కొందరికి,ఇంటి యంత్రం మరికొందరికి. ఆమె అభిప్రాయానికి విలువ లేదు. ఆమె సూచన పట్టించుకునే వారు లేరు. ఆమె ఇష్టాఇష్టాలకు గౌరవం దక్కదు. అయినా వెరవని ధైర్యంతో ముందుకు సాగుతోంది మహిళ. బయట మాట పక్కన పెడితే ఇంట్లో కూడా గౌరవాన్ని ఆశించే చాలామంది మహిళలకు నిరాశే మిగులుతోంది. బాల్యం నుంచే స్త్రి ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. చిన్నప్పుడు ఆడపిల్ల ఆనే వివక్ష, యవ్వనంలో ఆకతాయిలు, పోకిరీల సమస్య, ఉద్యోగ జీవితంలో లైంగిక వేధింపులు, పెళ్లాయాక్కైనా ఆమె జీవితానికి ఆసరా లభిస్తుం దనుకుంటే అక్కడా ఇబ్బందులు పడేవారే అధికం.అత్తింటి ఆరళ్లు, భర్త వరకట్న వేధిం పులు.. ఇలా ఎన్నో సమస్యలు వెన్నంటే నడుస్తుంటాయి. ఇంటిల్లిపాదికి బండెడు చాకిరీ చేసినా సమయానికి అల్పాహారం తీసుకునే పరిస్థితి కూడా చాలామందికి ఉండదు. దీంతో అనారోగ్య సమస్యలు వెన్నంటే ఉంటాయి. కనీసం మధ్యాహ్నమైనా సమయానికి తింటుందా అంటే ఆ అవకాశం కూడా ఉండటం లేదు. ఇంటిపని, ఆఫీస్‌ పని చేసుకునే మహిళలు తమకు తెలియకుండానే ఓ రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. దాదాపు 80శాతం మంది మహిళలది ఇదే పరిస్థితి అన్నది నిపుణుల మాట. ఈ మహిళల హక్కుల కోసం వందేళ్ల క్రితం జరిపిన పోరాటం సాక్షిగా మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న మొదలైంది.1911లో మహిళలు రగిల్చిన స్ఫూర్తి ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది. నేటి స్త్రీ చదువుల్లో,ఉద్యోగాల్లో ముందుండి. ఏ రంగంలోనైనా నేను సైతం అంటున్న స్త్రీని సమాజం ఇప్పటికీ ఆమె వ్యక్తిత్వాన్ని, ఇష్టా ఇష్టాలను అభిప్రాయాలను గుర్తించడం లేదు.అనంతర పరిణామాల్లో భాగంగా 1975లో యుఎన్‌ఒ స్త్రీల సమస్యలను చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఏదేశానికీ, ఏ జాతికి చెందిన స్త్రీ అయినా సమానంగానే అణిచివేతకు గురవుతున్న స్త్రీల సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలని ఆ సమావేశం పేర్కొంది. అప్పటి నుంచి 1975లోనే మార్చి 8వ తేదీని అంతర్జా తీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.
ఆరోగ్యమూ అంతంత మాత్రమే..
పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఎన్నో పనులు, మరెన్నో బాధ్యతలు..! క్షణం తీరికలేని ఈ నిత్య సమరం ముందు ఆమె తన ఆరోగ్యాన్ని పణంగా పెడుతోంది. మహిళలు పనుల్లో పడిపోతున్నారని,ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అనేక సర్వేల్లో తేలింది. అనారో గ్యానికి గురైనప్పుడే మాత్రమే రెగ్యులర్‌ చెకప ్‌లకు వెళుతున్నట్టు 63శాతం మంది మహిళలు అంటున్నారు.16మంది మాత్రమే రెగ్యులర్‌ చెకప్‌లకు వెళ్తున్నట్లు తెలిసింది.71 శాతం మహిళలు ఏడాదిలో ఒకటిరెండుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్నా కేవలం 39శాతం మంది మహిళలకు మాత్రమే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంలో మగవారితో పోల్చుకుంటే కీళ్ల నొప్పులు,రక్తహీనత,హార్మోన్ల అసమతుల్యత క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు మహిళల్లో ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతు న్నారని ఒక నివేదిక తేల్చి చెప్పింది.
మహిళల స్థితిగతులు ఇలా
వ్యవసాయేతర ఉపాధిలో మహిళలు 20 శాతమే.పట్టణ శ్రామిక శక్తిలో మహిళలు 33.9 శాతం,గ్రామాల్లో 49.9శాతం ఉన్నారు.
ఆడపిల్లను భారంగానే చూస్తున్నారు
ఆడపిల్ల పుడితే గుండెల మీద భారంగానే నేటికీ భావిస్తున్నారు. ఈ వివక్షే ఆడపిల్లకు కొనిచ్చే బొమ్మల దగ్గర నుంచి చదివించి పెళ్లిళ్లు చేసే వరకు కొనసాగుతోంది. ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే చిన్నవాడైన తమ్ముడిని తోడు తీసుకుని వెళ్లమంటారు. అప్పటి నుంచే నువ్వు బయటకి వెళితే భద్రత ఉండదని నేర్పిస్తారు. అలా ఒక ముందడుగు వేస్తే… రెండు అడుగులు వెనక్కి లాగుతారు తల్లిదండ్రులు. ఇంటి పనుల్లో సాయం చేయ మని కూతురిని అడుగుతారు. కానీ కొడుకును అడుగరు. ఇలాంటి ఎన్నో వివక్ష మూలాలు ప్రతి ఇంట్లో..ప్రతి బిడ్డా పురిటికందుగా ఉన్నప్పటి నుంచే మొదలవుతాయి. ఇక మంచి చెడులను విడమర్చి అర్థం చేసుకునే అవకాశం కూడ లేకుండా పోయింది దీంతో. తల్లి దండ్రు లు ఆడపిల్లలను ఒకే చట్రంలో బంధిస్తున్నారు.
భయపెడుతున్న గణాంకాలు
సాంకేతికంగా ఎంత అభివద్ధి చెందినప్పటికీ బాలికల, మహిళలు పట్ల వివక్ష పెరుగుతూనే ఉందని పలు సంస్థలు చేసిన సర్వేలు చెబుతు న్నాయి. 2011జనాభా లెక్కల ప్రకారం. ఆరేళ్ల లోపు చిన్నారుల్లో ప్రతి వెయ్యిమంది మగ పిల్ల లకు కేవలం 914మందే ఆడపిల్లలు ఉన్నారు. 2001లో ఆరేళ్లలోపు మగ,ఆడపిల్లల నిష్పత్తి 1000:943 ఉండగా,పదేళ్ల అనంతరం ఆడ పిల్లల సంఖ్య మరింతగా దిగజారడం ఆందోళ నకర పరిణామం.2015 సెప్టెంబరు నాటికీ వెయ్యి మంది పురుషులకు 943 మంది ఆడపిల్లలున్నారు. అంతే కాదు, మహిళలపై జరుగుతున్న హింస కూడా పెరిగింది. ప్రత్యక్షం గా మహిళలు అన్ని రంగాల్లో ముందు న్నా సమానత్వం మాత్రం పూర్తిగా లభించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు భద్రత కరువయ్యింది. అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చట్టసభల్లో సమానత్వం ఉందని చెబుతున్నా ‘పేరుకే పెత్తనం’ అనే చందంగా వ్యవస్థ సాగుతోంది.
రాజకీయంగా రాణింపు
మహిళలు రాజకీయంగా సమాన అవకాశాలను పొందుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లా ల నుంచి శాసనసభ, పార్లమెంటుకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ/మండల/గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 564 మహిళా సర్పంచ్‌లు, 6117 మహిళా వార్డు మెంబర్లుగా గెలిచి గ్రామీణా భివృద్దిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి విద్యావంతులైన యువతలు చొరవ చూపి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు.
ఆర్థిక సాధికారత.. మహిళకు భద్రత
మన దేశంలో మహిళలు ఆర్థిక సాధికారత విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నారు. విభిన్న రంగాల్లో మహిళలు ఎంతగానో పురోగమిం చినా ఆర్థిక సాధికారతలో మాత్రం వెనుక బడిపోవడానికి కుటుంబ కట్టుబాట్లు, తల్లిదం డ్రుల ఆలోచనా ధోరణులు,మహిళలు స్వయం గా విధించుకునే పరిమితులు కారణమని చెప్పవచ్చు. పని ప్రదేశాల్లో మహిళలకు పురుషులతో పోల్చితే తక్కువ వేతనాలు అందు తున్నాయి. ఆర్థికపరమైన అంశాలపై అవగా హన లేకపోవడం, కుటుంబ బాధ్యతలు, వివాహపరమైన అవరోధాలు మహిళలు ఆర్థికంగా పురోగమించకుండా అడ్డు తగులు తున్నాయి. చట్టాల్లో కూడా వారి పట్ల వివక్ష అధికంగా ఉంది. ఈ అవరోధాలన్నీ దాటు కుంటూ వారు ఆర్థిక సాధికారత సాధించడం ఎలాగంటే.. ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యం భారత మహిళలు ఆర్థిక బాధ్యతలు చేపట్టేం దుకు విముఖంగా ఉంటారు. దీనివల్ల వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కూడా పురుషులదే పైచేయిగా మారుతుంది. ఉద్యోగా లు చేస్తున్న మహిళలు కూడా తమ ఆర్థిక వ్యవహారాల నిర్వహణను భర్తకు అప్పగిస్తుం టారు. దీంతో ఆర్థికపరమైన అంశాలపై అవగాహన తక్కువగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. పురుషులతో పోల్చితే మహిళల సగటు జీవిత కాలం అధికంగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం 60 ఏళ్లు నిండే సమ యానికి పురుషుల సగటు జీవిత కాలం 77.2 సంవత్సరాలుంటే మహిళలకు 78.6 సంవత్స రాలుంది. అంటే పురుషులతో పోల్చితే మహిళలే సగటున ఎక్కువ కాలం జీవిస్తు న్నారన్న మాట. 2011 జనాభా లెక్కల ప్రకారం అవివాహితలు,విడాకులు తీసుకు న్నవారు, భర్త లేని వారు, ఒంటరి మహిళల సంఖ్య 7.4 కోట్లుంది.ఇలాంటి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఆర్థిక అక్షరాస్యత ఎంతైనా అవసరం. పొదుపు పెరగాలిపురుషులతో పోల్చితే మహిళలు అందుకునే వేతనాలు తక్కువగా ఉండడం పరిపాటి. సమాన హోదాలో పనిచేస్తున్నప్పటికీ వారు తక్కువ వేతనాలు పొందుతున్నారు. దీనికి తోడు మహిళలు ఆర్థిక వ్యవహారాలు సమర్థవం తంగా నిర్వహించలేరనే అపోహ కూడా సమాజంలో ఉంది. మహిళల సగటు జీవిత కాలం అధికంగా ఉంటున్న తరుణంలో సొంతంగానే ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టు కోగల నైపుణ్యాలు సాధించడం,దీర్ఘకాలిక పొదుపుపై దృష్టి పెట్టడం అవశ్యం. వేతనాలు తక్కువ ఉన్నందు వల్ల పురుషుల కన్నా అధికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది. మహిళలు ఉద్యోగం చేసే కాలపరిమితి పురుషులతో పోల్చితే తక్కువ. మాతృత్వపు సెలవులతోపాటు కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం పాలైతే వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు దీర్ఘకాలిక సెలవులు తీసుకోవడం వంటివి తప్పనిసరి.
భద్రత ప్రధానంకుటుంబ సంక్షేమంతో పాటు తమ సొంత భద్రతకు మహిళలు ప్రాధాన్యం ఇవ్వాలి. తమ పిల్లల భవిష్యత్‌ కోసం పొదుపు చేయడంతో పాటు తమ రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. ఇందుకు విభిన్న పొదుపు సాధనాలను ఎంచుకోవడంతో పాటు వయసుల వారీగా కేటాయింపులు చేసుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న మహిళలు తమ కోసం పొదుపు చేసుకునే మొత్తంలో 70 శాతం ఈక్విటీకి, 30 శాతం డెట్‌కు కేటాయించుకోవచ్చు. వీటిలో ఈక్విటీ ఫండ్లతో పాటు ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ వంటి రక్షిత సాధనాలపైనా దృష్టి పెట్టాలి. పొదుపు ఒక్కటే కాదు.. ఏదైనా ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఆదుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల పాటు కుటుంబ ఖర్చులను తట్టుకోగల అత్యవసర నిధి సమకూర్చుకోవాలి. అంతేకాకుండా వార్షిక వేతనానికి 7 నుంచి 10 రెట్లు అధికంగా బీమా రక్షణ పొందాలి. జీవిత బీమాతోపాటు ఆరోగ్య రక్షణ ప్లాన్లు, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్లపై దృష్టి పెట్టాలి. ఒకేసారి ఇంత భారీ మొత్తం ఇన్వెస్ట్‌ చేయడానికి తటపటాయించే ఆస్కారం ఉంది.
అత్తమామల కోసం పెట్టే పెట్టుబడిలో కొంత మొత్తాన్ని ఆరోగ్య బీమాకు కేటాయించాలి. వయసు పెరిగే కొద్ది అనారోగ్యాల రిస్క్‌ అధికంగా ఉంటుంది. ఆ రిస్క్‌ను తట్టు కోవాలంటే అత్తమామలకు బీమా ఉండి తీరాలి. అలాగే పిల్లల కోసం పెట్టుబడి పెట్టే తరుణంలో 18 ఏళ్లు నిండే సమయానికి వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండే నాటికి ఉన్నత విద్యాభ్యాసం, వివాహం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దీర్ఘకాలిక క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (సిప్‌)ను అనుసరించాలి.
నేరాలు…చట్టాలు…శిక్షలు…
ా సెక్షన్‌ 228-ఎ – లైంగిక దాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు,ఫొటో,వివరాలు ప్రచురించ కూడదు.
ా సెక్షన్‌ 354 – మహిళ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, కనుసైగ చేసినా నేరమే.
ా సెక్షన్‌ 376 – వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్‌ కింద కేసు నమోదు అవుతుంది.
ా సెక్షన్‌ 509 – మహిళలతో అవమానకరంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకరమైన వస్తువులను ప్రదర్శించినా శిక్షకు అర్హులు.
ా సెక్షన్‌ 294 – మహిళలు రోడ్డుపైన నడుస్తున్నా, బస్టాపుల్లో వేచిఉన్నా, అసభ్యకరమైన పాటలు పాడుతూ, శబ్దాలు చేసి ఇబ్బంది పెడితే ఈ సెక్షన్‌ ప్రకారం 3 నెలలు శిక్ష పడుతుంది.
18 ఏళ్లలోపు బాలికను వ్యభిచార వృత్తిలోకి దించితే సెక్షన్‌ 373 ప్రకారం పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్న బృందంలో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడి జరిగితే ఆ బృందంలోని ప్రతి వ్యక్తీ నేరస్తుడే. సెక్షన్‌ 376-బి కింద అందరికీ శిక్ష పడుతుంది. అత్యాచారం..ఐపీసీ 375 ప్రకారం ఏడేళ్లు జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు. అవమానపరిచి దాడి చేస్తే ఐపీసీ 354 ప్రకారం 5నుంచి 7వరకు జైలు శిక్ష పడు తుంది. పెళ్లయినా కానట్లు మోసగించిన పురుషులకు ఐపీసీ 496 ప్రకారం 7ఏళ్లు జైలు,జరిమానా తప్పదు. ఇలాంటి ఎన్నో కఠినమైన చట్టాలు,శిక్షణలు ఉన్నా మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు,వేధింపులు ఆగకపోవడం శోచనీయం. – సైమన్‌ గునపర్తి

విశాఖ తీరంలో సాహ‌స విన్యాసాలు

‘‘ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్లో భాగంగా విశాఖ సాగర తీరంలో 12వ ఫ్లీట్‌ రివ్యూ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో పయనించారు. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షించారు. భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ కు గౌరవ వందనం చేశాయి. 60 యుద్ధ నౌకలతో పాటు సబ్‌ మెరైన్స్‌, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంటున్నాయి. ఫ్లీట్‌ రివ్యూలో నేవీ చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నౌకా దళ తీర పెట్రోలింగ్‌ నౌక ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో రాష్ట్రపతి కోవింద్‌ బంగాళాఖాతంలో నాలుగు నిలువు వరుసలలో లంగరు వేసిన 44 నౌకలను దాటుకుని గౌరవ వందనం స్వీకరించారు ’’
ప్రశాతంగా కనిపించే విశాఖ సాగర తీరం భయంకర శబ్ధాలతో దద్దరిల్లింది.. యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు పరిస్థితి చూసుంది. దూరం నుంచి చూసేవారికి ఏదో జరుగు తోందనే భయం వేస్తుందేమో..కానీ అక్కడ జరిగింది మాత్రం అద్భుత విన్యాశాలు.. భారత నౌకాదళ యుద్ధ విన్యాసాలు తెలిసేలతో ప్రత్యేక ప్రదర్శనలు సాగాయి. మిలాన్‌ ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ లో భాగంగా Iచీూవిశాఖ నౌకను జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్‌.జగన్‌. నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్‌ వేలా జలాం తర్గామిని ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ జలంతర్గామిలో ప్రత్యేకలను సీఎం జగన్‌, భారతి దంపతులు ఆసక్తిగా తిలకించారు. నేవీ సిబ్బంది నుంచి గౌరవ వం దనం స్వీకరించారు. ఐఎన్‌ఎస్‌ విశాఖ నౌక పశ్చిమ నౌకాదళంలో సేవలం దించనుంది. విశాఖ బీచ్‌లో ఫిబ్రవరి 27న మిలాన్‌ 2022 కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గోన్నారు.6000 అడుగుల ఎత్తులో 6గురు ఆకాశంలో త్రివర్ణ పతకంతో విన్యాసాలు చేశారు. యుద్ధ విమానాలు గర్జనల, నావికా సిబ్బంది యుద్ధ విన్యాసాలు, నావికదళ సిబ్బంది రీస్క్యు ఆపరేషన్‌, ప్రమాదంలో ఉన్నవా రిని రక్షించే సాహసాలు, యుద్ద విమానాలు చక్కర్లు, సముద్రంలో బాంబుల మోతాతో ఆ సాగర తీరం దద్దరిల్లింది.యుద్ధనౌకల అత్యంత వేగవంతమైన విన్యాసాలు,మెరైన్‌ కమాండోల బహుముఖ కార్యకలాపాలు,యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్‌ విన్యాసాలు వీక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇలా వివిధ రకాల విమానాలు, వైమానిక శక్తి ప్రదర్శనలు ప్రపంచ దేశాల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని ప్రతిబిం బించాయి. తరువాత మిలాన్‌ ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను ప్రారంభించారు. గంటన్నర పాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్‌ స్వయంగా సమీక్షించారు. తూర్పునౌకాదళం వేదికగా ఈ మిలాన్‌ విన్యాసాలు మార్చి 4 వరకూ జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్‌..ఐఎన్‌ఎస్‌ మీద డాల్ఫిన్‌ లైట్‌హౌస్‌, డాల్ఫిన్‌ నోస్‌, కృష్ణజింకను ముద్రించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ది సిటీ ఆఫ్‌ డెస్టినీ అని అన్నారు. సిటీ పరేడ్‌లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం జగన్‌ తెలిపారు. ఇది చాలా అరుదైన వేడుక.. విన్యాసాల పండగ అని కొనియాడారు. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో ఐఎన్‌ఎస్‌ విశాఖ చేరిందని తెలిపారు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న అందరికీ సీఎం జగన్‌ అభినందనలు తెలియజేశారు. విశాఖపట్నంలో మిలాన్‌-2022 నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించ దగ్గ రోజు అని అన్నారు. భవిష్యత్తులో విశాఖ మరిన్ని అంతర్జాతీయ వేడుకలకు వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నేవీ ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ (పీఎఫ్‌ఆర్‌)2022 కార్యక్రమాన్ని ఫిబ్రవరి 21న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌,రాష్ట్ర గవర్నర్‌ ఆంప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌లు హజరూ సుమిత్రి నౌక నుంచి ఫ్లీట్‌ రివ్యూను ప్రారం భించారు. ఫ్లీట్‌ రివ్యూ ద్వారా మరోసారి భారత నౌకాదళం తమ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించింది. భారత తూర్పు నావికాదళం శక్తి సామర్ధ్యాలు మరోసారి తెలిసి వచ్చేలా విన్యాసాలు సాగాయి. విశాఖ సాగర తీరంలో సాగిన సాహస విన్యాసాలు ఆంధ్యంతం అబ్బురపరిచేలా సాగాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 27న జరిగిన మిలాన్‌2022 ఉత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హజరై ఐఎన్‌ఎస్‌ విశాఖను జాతికి అంకితం చేశారు. ఫిబ్రవరి 21న జరిగిన రాష్ట్రపతి కార్యక్రమంలో నావికా దళాలు త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌కు ఘనంగా గౌరవ వందనం చేశాయి. పీఎఫ్‌ఆర్‌-22లో భాగంగా నౌకాదళానికి చెందిన రెండు నౌకాద ళాలను,యుద్ధనౌకలు, కోస్ట్‌ గార్డ్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌తో కూడిన 60 నౌకలు,10 వేల మంది సిబ్బందితో కూడిన జలాం తర్గాములకు సంబంధించిన నౌకాదళ శక్తి సామర్ధ్యాలను రివ్యూ చేశారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చి75 సంవత్స రాలు పూర్తవుతున్న దశలో జరిగిన ఫ్లీట్‌ రివ్యూ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకు తగ్గట్టుగానే విన్యాసాలు అద్భుతం అనేలా సాగాయి. ఈ రివ్యూను చూసేందుకు జనం కూడా భారీగానే తరలి వచ్చారు. ఫ్లీట్‌ రివ్యూ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ…‘‘కోవిడ్‌-19’’ మహ మ్మారి సమయంలో నేవీ పాత్రను కొని యాడారు. స్నేహపూర్వక దేశాలకు వైద్య సహాయం అందించారన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించి సేవను ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. భారత నౌకా దళం నిరంతర నిఘా,సంఘటనలపై సత్వర ప్రతిస్పందన, అలుపెరగని ప్రయత్నాలు సముద్రాల భద్రతను కాపాడుకోవడంలో అత్యంత విజయవంతమైందని రాష్ట్రపతి చెప్పారు. ప్రపపంచ దేశాలన్నింటికీ పోటీ ఇచ్చేలా మన బలగాలు పెరగడం సంతోషించే పరిణమమన్నారు. సాయుధ దళాల సుప్రీం కమాండర్‌ మాట్లాడుతూ..రాష్ట్రపతికి మొదట ధన్యవాదాలు తెలిపారు. తూర్పు నావికా దళంలో నౌకలు,విమానాలు,జలాంతర్గాముల అద్భుతమైన కవాతు ప్రదర్శించాయి అన్నారు. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేం దుకు భారత నౌకాదళం సన్నద్ధతను కూడా ఈ కవాతు ప్రదర్శించింది అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం హిందూ మహా సముద్ర ప్రాంతంలోనే జరుగుతోందని మన వాణిజ్యం,ఇంధన అవసరాలలో గణనీయమై భాగం మహాసముద్రాల ద్వారానే తీరుతుందని కోవింద్‌ స్పష్టం చేశారు. భారత నావికాదళ నౌకలు,జలాంతర్గాములు,విమానాలు,మన సముద్ర శక్తికి సంబంధించిన ఇతర అంశాల సంసిద్ధతను సమీక్షిస్తున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నాని చెప్పారు. భారత నావికాదళం మరింత స్వావలంబనగా మారుతోందని అన్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ చొరవలో ముందంజలో ఉందని గుర్తు చేశారు. భారత దేశం అణు జలాంతర్గాములను నిర్మించడం చాలా గర్వించదగ్గ విషయంగా రాష్ట్రపతి కోవింద్‌ పేర్కొన్నారు. 1971 యుద్ధ సమయం లో విశాఖపట్నం నగరం సహకారం మరువ లేనిది అన్నారు. అంతర్జాతీయ కార్యక్ర మాలకు విశాఖ వేదికగా నిలుస్తోంది.
ప్రెసిటెండ్స్‌ ఫ్లీట్‌ అంటే ఏంటి?
ప్రపంచ దేశాలు ప్రెసిటెండ్స్‌ ఫ్లీట్‌ రివ్యూ నిర్వహించడాన్ని ఒక సంప్రదాయంగా భావి స్తాయి. ముందస్తుగా ఎంచుకొన్న చోట నౌకాద ళానికి చెందిన యుద్ధ నౌకలను ప్రదర్శిస్తారు. దేశ రక్షణలో నౌకాదళం పాత్ర,సాధించిన అభివృద్ధిని చాటడంటో భాగంగా ఫ్లీట్‌ను నిర్వహిస్తారు. రాష్ట్రపతి పదవీకాలం ముగిసే సరికి కనీసం ఒక్కసారి అయినా ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ నిర్వహిస్తారు. రిపబ్లిక్‌ డే రోజున నిర్వ హించే సైనిక ప్రదర్శన మొదటిదని,ఆ తరహాలో చేపట్టే రెండో కార్యక్రమం ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ అని నేవీ అధికారులు వివరించారు. ఇండియాలో మొట్టమొదటి సైనిక, ఆయుధ ప్రదర్శనను 18వ శతాబ్దంలో మరాఠా రాజులు నిర్వహించారు. తీరప్రాంతంలోని కోటరత్నగిరిలో అప్పటి సర్కీల్‌ కన్హోజీ అంగ్రీ నేతృత్వంలో గురబ్స్‌,గల్లివట్స్‌గా పేర్కొనే సైనికుల ప్రదర్శన జరిగింది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 11సార్లు ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ నిర్వహించారు. అందులో రెండు ఇంటర్నేషనల్‌ ఫ్లీట్స్‌ ఉన్నాయి. 2001,2016లో అంతర్జాతీయ స్థాయి ఫ్లీట్స్‌ను ఇండి యన్‌ నేవీ చేపట్టింది. ప్రస్తుతం విశాఖ పట్నంలో రెండోసారి ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ నిర్వహి స్తున్నారు.2016లో కూడా విశాఖలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ జరగ్గా అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం హాజరయ్యారు. ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌లో నౌకలను చూసి రాష్ట్రపతి ఇచ్చే ప్రశంసలు విశ్వాసాన్ని పెంపొందిస్తాయని, దేశరక్షణలో ఇండియన్‌ నేవీ పాత్రను సత్తాను ప్రదర్శన చాటుతుందని నేవీ అధికారులు తెలిపారు.2020లో అండ మాన్‌ నికోబార్‌ దీవుల్లో జరగాల్సిన ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిరది.
ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌లో ప్రత్యేకతలు
‘ఇండియన్‌ నేవీ- 75 ఇయర్స్‌ ఇన్‌ ది సర్వీస్‌ ఆప్‌ ది నేషన్‌’ అనే నినాదంతో ప్రస్తుతం ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ జరుగుతోంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవు తున్న సందర్భంగా ఈ ఫ్లీట్‌ను ప్రత్యేకంగా జరుపుతున్నారు. ప్రదర్శనలో 60 నౌకలు, సబ్‌ మెరైన్స్‌, 50 ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ పాల్గొంటాయని అధికారులు పేర్కొన్నారు. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కోస్టుగార్డ్‌కు చెందిన నౌకలు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీకి చెందిన సబ్‌మెరైన్స్‌ కూడా ఫ్లీట్‌లో పాల్గొన్నాయి.
రాష్ట్రపతి పర్యాటన ఇలా జరిగింది..
నౌకల ప్రదర్శన,ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ విన్యాసాలు ఉం టాయి. కార్యక్రమం అనంతరం ప్రత్యేక కవర్‌, పోస్టల్‌ స్టాంప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విడుదల చేశారు. ప్రత్యే కంగా సిద్ధం చేసిన ప్రెసిడెన్షియల్‌ యాచ్‌ ద్వారా మ్యారిటైమ్‌ ఆర్గనైజేషన్స్‌కు చెందిన నౌకలు,యుద్ధ నౌకలు., సబ్‌మెరైన్స్‌ను రాష్ట్రపతి పరిశీలించారు యాచ్‌ లో ప్రయాణిస్తూ ఆయా నౌకల్లోని అధికారుల గౌరవవందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. గాల్లో ఎగురుతూ సెల్యూట్‌ చేసే వంటి విన్యాశా లను ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ చేశాయి. ఇండియన్‌ నేవీకి చెందిన ఏవియేషన్‌ వింగ్‌ ఆధ్వర్యంలో 50 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ కనువిందు చేశాయి. ఐఎన్‌ఎస్‌ విశాఖను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌
ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధంతో భయానక వాతావరణం కనిపిస్తోంది. సేమ్‌ అలాంటి యుద్ధ వాతావరణమే విశాఖలోనూ కనిపించింది. అయితే ఇదంతా కేవలం విన్యాసాలు మాత్రమే.. భారత నౌకాదళం శక్తి తెలిసేలా అద్భుతమైన విన్యాసాలు చేశారు. మరోవైపు ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్‌ విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్‌.జగన్‌. తర్వాత జలాంతర్గామిలో సిఎం జగన్‌ దంపతుల సందర్శించి అలరించి విన్యాసాలు వీక్షించారు. వేగంగా కదిలే నౌకలు, గగనతలంపై భారీ శబ్ధాలను చేసు కుంటూ రెప్పపాటు క్షణంలో మాయ మవుతూ ఉండే ఫ్లై పాక్‌,యుద్ధ విమానాల విన్యాసాలతో ఒక్కసారిగా యుద్ధవా తావరణం కనిపిం చింది. సముద్ర జలాల్లో ఎవరైనా చిక్కుకుంటే వారిని పై నుంచి వెళ్లే విమానాలు,అక్కడ నుంచి నీటిపైకి వేసే లావుపాటి తాళ్లు,నిచ్చెనల నుంచి మెరైన్‌ కమోండోలు (మార్కోస్‌), సైలర్లు దిగి వారిని కాపాడే ప్రక్రియ అత్యంత గగుర్పాటుకు గురి చేసింది. సుమారు 60 నౌకలు, జలాంత ర్గాములు,55 యుద్ధ విమానాలు బంగాళా ఖాతంలో సందడి చేశాయి. 44యుద్ద నౌకలు 4వరుసలుగా కొలువు దీరగా వాటి మధ్యనుంచి ఐఎన్‌ఎస్‌ సుమిత్ర (Iచీూ ూబఎఱ్‌తీa) నౌక ముందుకు సాగింది. – గునపర్తి సైమన్‌

తెలంగాణ గట్టుమీద పోలవరం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకులు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన ‘కోమాకుల సీతారాములు’’ కథా రచన ‘ తెలంగాణ గట్టు మీద పోలవరం ’ కథా చదవండి..! – సంపాదకులు
సీతారాములు కథల్లో పోరాట చైతన్యం కనిపిస్తుంది… బహుముఖీనమైన కళాసేవతో సీతారాములు రాసిన అనేక కథల్లో ఇది ఒకటి.‘‘బహుళార్థక పోలవరం ప్రాజెక్టు’’ నిర్మాణంలో మార్పులు తేవాలనే లక్ష్యంతో ‘‘ముంపు మండ లాలపోరాటం’’ మొదలైన తరుణంలో సామాజిక స్పృహ నిలువెల్ల పులుముకున్న ఉద్యమ రచయిత సీతా రాములు. ఆ స్వానుభవానికి అక్షర రూపమే ఈ కథ. ఇది ఏదో పోరాట కథనం అనుకుంటే పొరపాటే.. చక్కటి ఒక భిన్నమైన కథ రచనా కాలం 2015. .
కేవలం ఉద్యోగ వృత్తితో కాలం గడపకుండా, సంపూర్ణ సామాజిక స్పృహతో తన చేరువలోని అడవిబిడ్డల వికాసమే లక్ష్యంగా కృషి చేసిన సామాజిక కార్యకర్త రచయిత ‘కోమాకుల సీతారాములు’ మానుకోట జన్మస్థలం గల వీరు సుమారు పుష్కర కాలం పాటు భద్రాచలం మన్యం ప్రాంతంలో విద్యార్థి ఆవాస కేంద్రాల పర్యవేక్షకుడిగా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ,.. ఇక్కడి గిరిజనులతో మమేకమై ఎందరో గిరిజన విద్యార్థులకు దారి దీపం అయ్యారు. గాయకుడిగా,రచయితగా,నటుడిగా,శిక్షణా ధ్యక్షుడుగా,బహుముఖీనమైన కళాసేవ చేసిన సీతారాములు రాసిన అనేక కథల్లో ఒకటి ‘‘తెలంగాణ గట్టుమీద పోలవరం’’.దీని రచనా కాలం 2015 సంవత్సరం.ఊహించిన విధంగా అందివచ్చిన తెలంగాణ రాష్ట్రం యావత్తు, ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న వేళ.. భౌగోళికంగా రాష్ట్రంలో అంతర్భాగమైన భద్రాచలం మన్నెసీమకు కుడిచేయి వంటి ‘పోలవరం ముంపు ప్రాంతమండలాలు’ పాలకులముందుచూపు..,వ్యూహాలతో..స్వార్థ ఒప్పందాలతో అక్కడే నివాసం ఉంటున్న గిరిజ నులను బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంతో అక్కడి అన్ని వర్గాలప్రజల్లో ఆందో ళనతో కూడిన విషాదఛాయలు అలుము కున్నాయి. ఈ ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపవద్దని అంతేకాక అధిక నష్టదాయకమైన ‘‘బహుళార్థక పోలవరం ప్రాజెక్టు’’ నిర్మాణంలో మార్పులు తేవాలనే లక్ష్యంతో ‘‘ముంపు మండ లాలపోరాటం’’ మొదలైంది. సామాజిక స్పృహ నిలువెల్ల పులుముకున్న ఉద్యమ రచయిత సీతా రాములు ముంపుమండలాపోరులో కీలక పాత్ర పోషించారు.ఆ స్వానుభవానికి అక్షర రూపమే ఈ ‘తెలంగాణ గట్టుమీద పోలవరం’ కథని ఇది ఏదో పోరాట కథనం అనుకుంటే పొరపాటే…!! రచయితకు ఉండే సాధారణ ఆశావాదం.. అందమైన అడవిబిడ్డల జీవనవిధానం,సుందరమైన గోదావరి అడవి అందాలు,అంతర్గతంగా అభివర్ణిస్తూ…. మరో పక్క అడవిబిడ్డల జీవన విధానంతో కూడిన వారి పోరాటగాథను రచయిత హృద్యంగాచెప్పే ప్రయత్నం చేశారు. కారు మబ్బుల సాక్షిగా చిరుజల్లుల్లో తడుస్తూ ‘‘కోడేరు’’ గిరిజన గ్రామ స్తులంతా సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకొనె భూమిపండుగ కోలాహలంతో ఈ కథ మొదలవుతుంది. ‘రాములమ్మ’అనే గిరిజన యువతి ఈకథలో ప్రధాన పాత్రగా అగు పిస్తుంది. అనుచరులుగా రాజన్న,కొమ్మారెడ్డితో పాటు కథా రచయిత కూడా ఈకథలో అతిధి పాత్రగా దర్శనమిస్తాడు. ఇక కథ విషయానికి వస్తే ఎంతో ఆనందంగా కొమ్ము,డోలు,నృత్యా లతో భూమిపండగ చేసుకుంటున్న ఆగూడెం గిరిజనులకు పిడుగులాంటి వార్త చెబుతాడు రాజన్న. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంవల్ల తెలంగాణ ప్రజలంతా ఆనందోత్సవాలతో తేలి ఆడుతుండగా….ఆ రాష్ట్రంలో భాగమైన మన్య సీమ లోని గిరిజన గ్రామాలకు నిరుత్సాహంతో కూడిన,బాధ కలిగించే వార్త చెప్పడం ఈ కథ ప్రారంభంలోని ఎత్తుగడ.
కానీ ఎత్తుగడలో ఎలాంటి ఉత్కంఠత గాని, సందేహాలు గాని, లేకుండా అసలు విషయం వెంటనే వెల్లడిరచి రచయితే స్వయంగా ఒక పాత్ర ధరించి కథలో ప్రవేశించడంతో విష యం శక్తి సన్నగిల్లిన,కథనంతో కాస్త కష్టపడి కథను చివరికంటూ చదివింప చేసే ప్రయత్నం జరిగింది. కథలోని తొలి పాత్ర అయిన రాము లమ్మ, డిగ్రీ వరకూ చదువుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా ఆదివాసీ యువతి,తాను చదువుకున్న చదువు ద్వారా లభించిన విజ్ఞానం, విషయ పరిజ్ఞానం ద్వారా తనప్రాంత గిరిజ నుల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు అయిన ఏడు మండలాల ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతంలో కలుపుతున్నట్లు వెలువడ్డ టీవీ వార్తలు గురించి రాజన్న ద్వారా విన్న రాములమ్మ, వెంటనే తనకు గతంలో తెలిసిన విజ్ఞానం సాయంతో గూడెం ప్రజలనంతా… ఒకచోటకు చేర్చి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లోని లొసుగులు గురించి చెబుతుంది.తాను చదువుకునే సమయంలో సీతారాములు సార్‌ (కథా రచయిత) చేసిన ఉపన్యాసాల సారాంశం గుర్తుచేసుకుని,గతంలో గిరిజన సమాజాల్లో సమ్మక్క సారక్క,హైమన్డార్ఫ్‌,సీతారామరాజు, గంటందొర,కొమరంభీమ్‌ వంటి వారు చేసిన పోరాటాలు,త్యాగాలు, చైతన్యపుకృషి, గురించి వివరిస్తుంది రాములమ్మ. అలా ఆమె చెప్పిన మాటల ద్వారా రానున్న కష్టకాలం తలుచు కుంటూ భవిష్యత్‌ కార్యాచరణ గుర్తు చేసు కుంటూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోతారు. పూర్వం దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఒక హైదరాబాద్‌ సంస్థాన ప్రాంత ప్రజలు మాత్రం నిరుత్సా హంగా ఎలా ఉండిపోయారో ,ఇప్పుడు అదే పరిస్థితి ఈపోలవరం ముంపు ప్రాంత గిరిజన గ్రామాలది. తెలంగాణ వచ్చిన సంతోషం కన్నా తెలంగాణ ప్రాంతం నుంచి గెంటివేయ బడ్డామన్న బాధ ఈప్రాంతవాసులకు ఎక్కు వైంది.తిరిగి పోలవరం వ్యతిరేక ఉద్యమం మొదలైంది.సీతారాములు సార్‌ పాత్ర మళ్ళీ ప్రారంభమైంది,ఏడు మండలాలకు చెందిన యువ కార్యకర్తలకు కార్యాచరణ చేయడం కోసం,ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంకు వెళ్ళిన సీతారాములు అనేక లెక్కలు,చారిత్రక విశేషా లతో కూడిన సుదీర్ఘ ప్రసంగం చేయడంతో కథ అంతా వ్యాసపుముసుగు వేసుకుని నడుస్తుంది. కథలో రూపం మారిన పాఠకులకు విసుగు రాకుండా చదివింప చేయడంలో రచయిత పడ్డ శ్రమ చివరికి ఫలించిందనే చెప్పాలి.ఈ పోల వరం ముంపు పోరాట ఉద్యమంకు నూతన పంథాలో, గిరిజనుల సంప్రదాయ సంస్కృతి ఆయుధాల సాక్షిగా ఉద్యమ నిర్మాణం జరిగి పోతుంది.‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాం తం’ దిగ్బంధం లక్ష్యంగా కార్యాచరణ సాగు తోంది.‘పోలవరం ఆపండి ఆదివాసులను కాపాడండి’ అనే నినాదాలతో అడవి అంత మారుమోగుతుంది, భారత ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాటం చేయాలని అక్కడి గిరిజ నులంత తీర్మానం చేసుకున్నారు. అందుకు అన్ని ప్రాంతాల ప్రజలు,ఉద్యోగులు,సంఘాల వారు తమ మద్దతు తెలుపుతారు,‘పోలవరం దిగ్బం ధం’ చేసే రోజు ఖరారు అయ్యింది. పోలవరం ముంపు ప్రాంతపు గిరిజనులు చేసే పోరాటానికి అన్ని ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు,లారీలు, లాంచీ లు,పడవలు, ఇలా రకరకాల ప్రయాణ సాధ నాల ద్వారా నిర్బంధ ప్రాంతానికి జనాలను చేరవేయడానికి, నాయకులు ఎవరికి వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ వరకు కథ వాస్తవానికి దగ్గరగా భూతకాలంలో నడిచింది. చివరిలో రచయిత తన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ ఒక గొప్ప ఆశయం చాటుతూ కథను ముగిస్తారు. కథ చివరి ఘట్టం అంతా అడవి బిడ్డలు చేసిన పోరాట రూపం, దానికి సహచరులు అంతా తెలిపిన సంఫీు భావం,అక్కడ వారు రహదారులను దిగ్బంధం చేసినతీరు,వంటావార్పులుతో నిరసన తెలిపిన వైనం తదితరాలు కళ్లకు కట్టినట్లు అభివర్ణిం చడంలో రచయిత స్వయంగా చేసిన ఉద్యమాల అనుభవాలు వ్యక్త పరిచారు.ఈ పోలవరం పోరులో అడవి బిడ్డలు ఉపయోగించిన వస్తు వులు,ఎండుగుబ్బ,పూరిదికట్ట,బొంగుది కర్ర , టేకుది సిర్ర,డోలు మొదలైన వాటి గురించి వివ రించడంలో రచయితకు గల పరిసరాల అవగా హన ఎంత పటిష్టంగా ఉందో అర్థం వుతుంది. ఉద్యమంలో వారు చేసిన నినాదాలు,పాడిన పాటలు,ఆడిన ఆటలు, మొదలైనవి చూస్తే ఈ అడవి బిడ్డలలోని ఆత్మస్థైర్యం,కష్టాలను ఎదు ర్కొనే ధైర్యం,ఎంతో ఆదర్శంగా చిత్రిం చడంలో రచయిత సీతారాములు కృషి నెరవేరింది అని పిస్తుంది.‘పోలవరం కడితే అందులో జల సమాధిఅయ్యి చనిపోయే దానికంటే.. ఇప్పుడే ఇక్కడే పోరాడి చనిపోతాం భావితరాలైనా ఈప్రాంతాన్ని కాపాడుకుంటారు’ అనే భావన గిరిజన యువతి రాములమ్మ నుంచి చెప్పిస్తాడు రచయిత.పోరాటాలు ఏవైనా తక్షణ ఫలితాలు అందించక పోయినా భావితరంలో రావాల్సిన మార్పులకు బీజాలుగా తప్పక మారుతాయి.. అన్న చారిత్రక ఆలోచనలు నిజమే కదా అని పిస్తుంది. ఇక కథ చివర్లో ఉద్యమకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ వాతావ రణం చూపిస్తూ ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’ అన్న సుమతీశతక కర్త బద్దెన వాక్కుకు నిజం చేస్తూ.., గిరిజనుల ఐక్యత, తెగింపు, వారికి లభించిన సంఫీుభావంతో పోలీసులు వెనకడుగు వేయ టం,రాష్ట్రపతి ప్రధాని,జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించడానికి ముందుకు రావడం జరుగు తుంది. వారు కోరుకున్నట్టుగా 7మండలాలు తెలంగాణ భూభాగంలోని కొనసాగించడానికి ఒప్పుకోవడం తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి కూడా పునరాలోచన చేస్తా మని హామీ ఇవ్వడంతో,మనిషిని మాటను, సం పూర్ణంగా నమ్మే గిరిజనులు శాంతించివారు చేస్తున్న పోరాటం ఆపి ఎవరి ఇళ్లకు వారువెళ్లి రాబోయే బంగారు తెలంగాణ సమాజాన్ని తలచుకుంటూ నిద్రలోకి జారుకుంటారు.అంటూ రచయిత తన ఆశాభావాన్ని రంగరించి తనదైన క్రాంతదర్శనంతో కథను సుఖాంతం చేయ డంతో పాఠకులు సంతృప్తి చెందుతారు.ఈకథ లో గిరిజనజీవితాల్లో అంతర్భాగంగా అగుపించే ‘పోరుబాట’ను వివరిస్తూనే వారివారి సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ, ఒక వార్తా కథనాన్ని అందమైన కథగా తీర్చిదిద్ది తెలుగు కథా సాహిత్యానికి ఒక ‘గిరిజన కథ’అందించిన సీతారాములు కృషి లెక్కించదగిన అభినందిం చాల్సినది. (వచ్చే మాసం ఎస్‌.బాలసుధాకర్‌ మౌళి కథా విశ్లేషణ ‘‘థింసా దారిలో’’…. మీకోసం)

నెరవేరని జాతీయ కనీస వేతన వ్యధ…!

పార్లమెంట్‌లో పాస్‌ అయిన వేతనాల కోడ్‌ ప్రకారం కనీస వేతన నిర్ణయం కోసం కనీస వేతనాల సలహా బోర్డుల సలహాలు తీసుకోవాలి. అంతిమంగా సదరు ప్రభుత్వాలు కనీస వేతనాన్ని ఖరారు చేయడానికి… కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వేతనాల కోడ్‌ నిబంధనల ప్రకారం… 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, సుప్రీంకోర్టు తీర్పులను ప్రాతిపదికగా తీసుకోవాలి. కాని తాను పాస్‌ చేసిన ఈ చట్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
జాతీయ కనీస వేతనం తిరిగి చర్చనీయాం శమైంది. మోడీ ప్రభుత్వం 2017లో పార్లమెంట్‌ లో వేతనాల కోడ్‌ బిల్లు ప్రవేశపెట్టిన తరువాత జాతీయ కనీస వేతన సిఫార్సు కోసం ‘వి.వి.గిరి జాతీయ కార్మిక సంస్థ’కు చెందిన డాక్టర్‌ సత్పతి అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. అనేక పరిమితులతో ఆ కమిటి చేసిన కొద్దిపాటి సిఫార్సులను కూడా ఆమోదించకుండా ఏకపక్షంగా జాతీయ కనీస వేత నాన్ని రోజుకు రూ.176గా నిర్ణయించింది. దేశ మంతా ఈ నిర్ణయంపై గగ్గోలు పెట్టిన తరువాత దాన్ని రూ.2 పెంచి రూ.178 చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వేతనాల కోడ్‌ నిబంధనలను ప్రతిపాదించిన తదుపరి ఇప్పుడు కొత్తగా జాతీయ కనీస వేతనంపైనే కాకుండా కేంద్ర మరియు రాష్ట్రాల లేబర్‌ కమిషనర్లు నిర్ణయించే కనీస వేతనంపై కూడా సిఫార్సులు చెయ్యమని గణాంక శాస్త్రజ్ఞుడు ఎస్‌.పిముఖర్జీ అధ్యక్షతన కమిటీ వేసింది.దాంతో జాతీయ కనీస వేతనం మరోసారి చర్చకు వచ్చింది.
ఈ ఏడాది మార్చి 28,29 తేదీల్లో కార్మిక సంఘాలు మరియు స్వతంత్ర ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు చేయబోయే రెండు రోజుల అఖిల భారత సమ్మె కోర్కెలలో నెలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలనేది ప్రధానమైనది. జాతీయ కనీస వేతనం అయినా,కనీస వేతనం అయినా ఒకటిగానే ఉండాలి. వాటి నిర్ణయానికి ప్రామాణి కాలు ఒకటిగానే ఉండాలి. కాని మోడీ ప్రభుత్వం వేతనాల కోడ్‌ ప్రతిపాదిత నిబంధనలలో కనీస వేతన నిర్ణయానికి 1957లో జరిగిన 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, 1992 సుప్రీంకోర్టు తీర్పులను ప్రామాణికాలుగా తీసుకోవాలని చేర్చింది. జాతీయ కనీస వేతనానికి మాత్రం ఈ ప్రామాణికాలు పెట్టలేదు. వేతనాల కోడ్‌ లోనూ, దాని నిబంధనలలోనూ కొత్తగా జాతీయ కనీస వేతనాన్ని చేర్చింది. ఇంతకు ముందటి కనీస వేతన చట్టంలో ఇది భాగంగా లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దానికి చట్టబద్ధత తెచ్చింది.పైగా జాతీ య కనీస వేతనానికి తక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు మరియు ప్రైవేటు యాజమాన్యాలు కనీస వేతనాన్ని నిర్ణయించగూడదని చేర్చింది (జాతీయ కనీస వేతనం రూ.178 గానే వుంది).
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ పే కమిషన్‌ భారత కార్మిక మహాసభ సిఫార్సులు మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ.18 వేలను కనీస వేతనంగా సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. చదువులు, ఆరోగ్య అవసరాలు, వినోదం, పండగలు పబ్బాలు, భవి ష్యత్‌ అవసరాల కోసం కనీస వేతనంలో 25 శాతం ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును 15 శాతా నికి తగ్గించింది. 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులలోని అద్దెకోసం సంబంధించిన ప్రామాణి కాన్ని కూడా తీసుకోకుండా, దాన్ని నెలకు 18 వేలుగా చేసింది. ఈ సిఫార్సును కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తిరస్కరించి తమకు 2015 ధరలలో నెలకు రూ.26 వేలు కనీస వేతనంగా ఇవ్వాలని కొంత కాలంపాటు ఆందోళన చేసినా మోడీ ప్రభు త్వం రూ.18 వేలనే ఖరారు చేసింది. ఆ ప్రకారం చూసినా ఇప్పటి ధరల్లో కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
2017లో మోడీ ప్రభుత్వం జాతీయ కనీస వేతనంపై వేసిన కమిటీ 2011-2012 జాతీయ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) తాలుకా వినిమయ ఖర్చులను,ప్లానింగ్‌ కమిషన్‌ పేదరిక రేఖను నిర్ణయించటానికి తీసుకున్న ఆహార కేలరీల లెక్కను పరిగణనలోకి తీసుకొని జాతీయ స్థాయిలో కనీస వేతనాన్ని రోజుకు రూ.375, నెలకు రూ.9750 గా సిఫార్సు చేసింది. భారత కార్మిక మహాసభ సిఫార్సు చేసిన 2700 కేలరీల ఆహారాన్ని 2400కు తగ్గించింది. దీనికి నేషనల్‌ శాంపిల్‌ సర్వేను ప్రాతి పదికగా తీసుకుంది. పేదరిక రేఖ మాత్రమే ఈ కమిటీకి ప్రాతిపదిక అయ్యింది. ఆర్థిక వెనుకబాటు తనం వల్ల వినిమయాన్ని తగ్గించుకుంటే దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంది. అదనంగా పట్ట ణాలలో ఇంటి అద్దెకు రూ.1430 ఇవ్వాలన్నది. పల్లెటూళ్లల్లో అత్యధిక మంది సొంత ఇళ్లల్లో ఉంటారని సర్వేలో తేలినందున వారికి ఇంటి అద్దెను సిఫార్సు చెయ్యలేదు. ప్రత్యామ్నాయంగా దేశంలో ఉన్న రాష్ట్రాలను 5 జోన్లుగా విభజించి 5 రకాల వేతనాలను తక్కువ స్థాయిలో రోజుకు రూ.341, నెలకు రూ.8878 గా,అధిక స్థాయిలో రోజుకు రూ.446,నెలకు రూ.11610లను సిఫార్సు చేసిం ది. కార్మికులు, వారి కుటుంబాల కనీస అవస రాల కోసం ఈ వేతనాలు సరిపోతాయని వాటిని చట్టబద్దం చెయ్యవచ్చని చెప్పింది. మోడీ ప్రభుత్వం అతి తక్కువగా ఉన్న ఈవేతనాలను కూడా ఆమోదించకుండా జాతీయ కనీస వేతనాన్ని రోజుకి రూ.178,నెలకు రూ.4628గా నిర్ణయించి ప్రకటించింది. ఈ జాతీయ కనీస వేతనం ఎలా వచ్చింది, ఎక్కడ ప్రారంభమయ్యింది, ఇప్పటికీ రూ.178గానే ఎందుకు వుందనేది తెలుసుకుంటే దేశంలోని పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ అసలు రూపం బయటపడుతుంది.1991లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు గ్రామీణ కార్మికుల వేతనంపై వేసిన కమిటీ చేసిన సిఫార్సులు అత్యంత కార్మిక వ్యతిరేకమైనవిగా ఉన్నాయి. 1979-80 ధరల్లో నేషనల్‌ శాంపిల్‌ సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీల ఆహారానికి (పేదరిక స్థాయి) గాను ఒక్కో వ్యక్తి వినిమయ ఖర్చు సరాసరిన నెలకు రూ.76. ఆ సమయంలో వ్యవసాయ కార్మికుల వినిమయ సూచి పాయింట్లు 360 ఉన్నాయి.దీనిని 1990 అక్టోబర్‌లో తాజా పరిచి అప్పటి వినిమయ సూచి 804 పాయింట్ల దగ్గర నెలకు రూ. 170గా కమిటీ తేల్చింది (360 నుండి 804పాయింట్లు 223.33 శాతానికి పెరిగాయి కాబట్టి రూ. 76 లను కూడా 223.33 శాతానికి పెంచి రూ.170 చేసింది.ఒక్కో పాయిం ట్‌ ప్రాతినిధ్యం వహించే రూపాయలలో ఉండే ధరల పెరుగుదలను లెక్కలోకి తీసుకోలేదు. ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతోంది).కుటుంబానికి ముగ్గురు గా లెక్కించి కుటుంబం మొత్తానికి నెలకు రూ.510, సంవత్సరానికి రూ.6120గా లెక్కేసింది. సర్వే ప్రకారం కుటుంబంలో 1.89 మంది పనిలో ఉన్నారని చెప్పి రూ.6120లను1.89 మందికి పంచి రూ.3238.09గా చేసింది. కాని సంవత్స రంలో 159 రోజులే పనులు దొరుకుతున్నందున ఆ వచ్చిన మొత్తాన్ని 159తో భాగించి రోజుకు రూ.20.37 లుగా తేల్చింది. దీన్ని రౌండ్‌ ఫిగర్‌గా మార్చిన తరువాత వచ్చిన రూ.20లను, 1996లో అప్పటి వినిమయ సూచి ప్రకారం రూ.35 చేశారు. ప్రతి రెండు సంవత్సరాలకీ దీన్ని మార్చుతూ 2017లో రోజుకు రూ.176గాప్రకటించారు. 2017లో ఇదే సమయంలో వ్యవసాయ కార్మికుల (క్యాజువల్‌ లేబర్‌) కనీస వేతనం లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం ప్రకారం రూ.244.25 పైసలు ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర లేబర్‌ కమిషనర్‌ జారీ చేసే జీవో లలో వ్యవసాయేతర పనులకు ఇండెక్స్‌లో ప్రతి పాయింట్‌కు ఎక్కువ ఎంప్లారుమెంట్లలో రూ.6.55 పైసలు విడిఎ వస్తోంది. కాని గ్రామీణ కార్మికుల వేతనాల కోసం నియమించిన కమిటీ పెరిగిన పాయింట్లను మాత్రమే పరిగణన లోకి తీసుకొని పాయింట్లలో పెరిగిన శాతాన్ని బట్టి మాత్రమే రోజు వేతనాన్ని పెంచటాన్ని సిఫార్సు చేసింది. దీని వలన జాతీయ కనీస వేతనంలో ఎటువంటి ఎదుగుదల లేకుండా గొర్రె తోక లాగ ఉండిపోయింది. ఈవేతనం ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఆచరణయోగ్యంగా కనపడిరది. 2017లో జాతీయ కనీస వేతనంపై వేసిన కమిటీ చేసిన సిఫార్సు రోజుకు రూ.375లను కూడా కాదనిరూ.176 లనే ఖరారు చేసింది. పైగా దీనికి ఇప్పుడు చట్టబద్దత తెచ్చింది.
తాజాగా కార్మిక సంఘాలు నెలకు రూ.26, 000 కనీస వేతనాన్ని డిమాండ్‌ చేస్తున్న పరిస్థి తులలో…మోడీ ప్రభుత్వం మోసపూరితంగా… జాతీయ కనీస వేతనం మరియు లేబర్‌ కమిషనర్లు నిర్ణయించే కనీస వేతనం పైన కూడా సిఫార్సు చెయ్యమని ఎస్‌.పిముఖర్జీ అధ్యక్షతన కమిటీ వేసింది. పార్లమెంట్‌లో పాస్‌ అయిన వేతనాల కోడ్‌ ప్రకారం కనీస వేతన నిర్ణయం కోసం కనీస వేతనాల సలహా బోర్డుల సలహాలు తీసుకోవాలి. అంతిమంగా సదరు ప్రభుత్వాలు కనీస వేతనాన్ని ఖరారు చేయడానికి… కేంద్ర ప్రభుత్వం ప్రతి పాదించిన వేతనాల కోడ్‌ నిబంధనల ప్రకారం… 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, సుప్రీంకోర్టు తీర్పులను ప్రాతిపదికగా తీసుకోవాలి. కాని తాను పాస్‌ చేసిన ఈ చట్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, కార్మికులు పోరాడి నెలకు రూ.26,000 కనీస వేతనంగా సాధించుకోవాలి. పేదరికంలో ఉన్న కార్మికులను పేదరికంలోనే ఉంచేలా రోజు వేతనాన్నిరూ.176గానిర్ణయించటాన్ని తిప్పికొట్టాలి.
వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు- (పి.అజయ కుమార్‌)

చిన్న జిల్లాలు సామాజిక పరివర్తన సాధనాలు

‘‘స్మాల్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’’ అని ఎప్పుడో అన్నాడు సుప్రసిద్ధ ఆంగ్ల కవి ఇయఫ్‌.స్కుమాచెర్‌. అఅనుభూతి ఆచరణలోకి వచ్చింది తెలంగాణాలో అదీ దశరా పర్వదినాన. ఇరవైనొక్క కొత్త జిల్లాల ఆవిర్భావంతో వాడవాడలా,పల్లె పల్లెన,పట్టణాల్లో వెల్లివిరిసిన ఆనందోత్సవాలు చూసి తరించాల్సిందే తప్ప వర్ణశక్యం కాదు.అదిలాబాద్‌, మెదక్‌ వంటి పెద్ద జిల్లాల్లో-వైశాల్యం దృష్ట్యా-జిల్లా అధికారిగా పనిచేసిన అనుభవంతో ఈపరిణామాన్ని ఆహ్వా నించే వాళ్ళలో నేనొకడిని. మారుమూల ప్రాం తాలైన బెజ్జూరు,దహెగాం,తిర్యాణి మండలాల నుండి జిల్లాకేంద్రమైన అదిలాబాద్‌ చేరుకోవా లన్నా, అలాగే జగదేవ్‌పూర్‌,దుబ్బాక నుండి సంగా రెడ్డి (మెదక్‌ జిల్లా కేంద్రం) రావాలన్నా సామాన్య ప్రజానీకం పడే బాధలు అనుభవిస్తే తప్ప అర్థం కావు. అవి అలివి కాని ఇక్కట్లు. అందుకే అనుకుం టాను నానివాసం (క్యాంపు ఆఫీసు) ముందు ప్రొద్దు న్నే ధరఖాస్తుదార్లు వేచివుండడం చూసి మనసు కరిగి పోయేది. అంతకు క్రితం రోజంతా బస్సులో ప్రయాణించి, దూరా భారాలు ఓర్చి,రాత్రికి కలెక్టరేటు ఆరు బయట ప్రదేశంలో తలదాచు కుని ప్రొద్దున్నే జిల్లాఅధికార్ల సందర్శనార్థం ఎదురుచూసే ఈ అభాగ్య జీవులకష్టాలు ఎపుడు గట్టెక్కుతాయా అని ఆక్రోశించేవాణ్ణి. అయినాపని పూర్తవుతుందన్న నమ్మకం లేదు. పదిగంటలు దాటిందంటే దౌరా (టూరు)కు పోవటమో, మీటింగుల్లో మునిగి పోవ టమో జరిగితే, అధికార్లు అందుబాటులో లేకపోతే, మరొకరోజు జిల్లాహెడ్‌ క్వార్టరులోఉండాల్సి వచ్చే ది. అదృష్టవశాత్తు పెద్దగా రద్దీలేని సంగారెడ్డి, అదిలాబాద్‌ లాంటి పట్టణాల్లో, ఆఫీసుల ఆవరణ లోనే మకాం. వీళ్ల కోసం దేవాలయ ప్రాంగణాల్లో వున్నట్లు సత్రాలు ఏర్పటు చేస్తే బాగుం టుదేమో అన్న ఆలోచన కూడా మెదిలేది. ప్రత్యామ్నా యంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, రెసిడెన్షియల్‌ స్కూళ్ళ ఆవరణలో వాళ్ళకు ఆశ్రయం కల్పించేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగేది. ఇప్పుడు ఆబాధలు తప్పినట్లే.
చిన్న జిల్లాల ఏర్పాటుతో తెలంగాణా ప్రభుత్వం ప్రజానీకానికి ఎంతో వెసులుబాటు కల్పిం చింది. దూరాలు దగ్గరయ్యాయి కదా అని అలస త్వంతో జిల్లా అధికార్లు ప్రజానీకానికి అందుబాటు లో లేకపోయినా,వారి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేసినా,హెడ్‌ క్వార్టర్‌ లో మకాం లేకపోయి నా,చిన్నజిల్లాలకు,పెద్దజిల్లాలకు అట్టే తేడా వుండ దు. సగటు మనిషి ఆశలు ఆడియాసలు కాకుండా చూసుకోవడం అధికార్ల బాధ్యత.
జాతీయ సగటుకు మూడు రెట్లు విస్తీర్ణం
జాతీయ స్థాయిలో జిల్లాల సగటు విస్తీర్ణం4000 చదరపుకిలోమీటర్లు వుంటే తెలంగాణలో 11,000 చ.కి.మీ.వుండేది గతంలో.జనాభా రీత్యా చూసినా, జాతీయ సగటుకు రెట్టింపు జనసాంద్రత వుండేది. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో నలభైశాతం వున్న పంజాబు,హర్యానా,రాష్ట్రాల్లో నలభై, యాభై జిల్లాలు ఉండడం ఈదిశగా గమనార్హం.చిన్నజిల్లాల సంఖ్యా పరంగా చూస్తే, జాతీయ స్థాయిలో తెలంగాణాది 9వ స్థానం.జనాభా రీత్యా,12వ స్థానంలో వుంది. ఈ లెక్కన చూస్తే, 31జిల్లాల తెలంగాణ రాష్ట్రం సముచితమే అనిపిస్తుంది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కూడా. ఎన్ని జిల్లాలు వుండాలి? ఆ జిల్లా ప్రధాన కార్యాలయాలు ఎక్కడ పెట్టాలి? రెవెన్యూ డివిజన్లు, మండలాలుఎన్ని?అన్న విశ్లేషణ ఎడ తెగని తర్కం.అదినిరంతర ప్రక్రియ.విధాన నిర్ణ యాల్ని పాలకులవిజ్ఞతకు వదిలేసి,అధికార్లు, ఉద్యోగులు జిల్లాల పునర్విభజానంతరం ఉద్యమ స్ఫూర్తితో,ఈ మార్పులు చేర్పులు ప్రజోపయోగం కోసమే కానీతమకోసం కాదన్న వాస్తవాన్ని గ్రహించి, చిన్న జిల్లాల ఏర్పాటు ఉద్దేశ్యం నెరవేరేలాగున పని చేయటం తక్షణ కర్తవ్యం.
బూజుపట్టిన బ్రిటిష్‌ కాలంనాటి వ్యవస్థ
ప్రస్తుతం మనదేశంలో వేళ్ళూనుకున్న పాలనా వ్యవస్థ బ్రిటీషు వారి కాలంలో రూపొందింది. ఒకవిధంగా చెప్పాలంటే శిస్తువసూలు వ్యవస్థ అది .దానికి కాల దోషం పట్టటం సహజం. 1984లో మొదలైన గ్రామ పరిపాలనా, మండలీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలు నేటికి చిన్నజిల్లాల ఏర్పాటు తో రూపాంతరం చెందటం ఆహ్వానించదగ్గ పరిణా మం.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పునర్వ వ్యస్థీకరణ పాలన. గ్రామాలు పాలనా వ్యవస్థ ఆయు వుపట్టులు. పునాది రాళ్ళ. గ్రామపాలన ప్రాచీన కాలం నుండి గ్రామాధికారులు చూస్తుండేవారు. వంశపారంపర్య గ్రామాధి కార్ల వ్యవస్థ రద్దై ముప్పై ఏళ్ళుదాటినా,పటిష్టమైన, ప్రత్యా మ్నాయ గ్రామపా లనాయంత్రాంగం లేదు. ఉదా హరణకు మాలీ పటేళ్ళ వ్యవస్థ. మద్రాసు ప్రెసిడెన్సీ పాలనకు భిన్నంగా,తెలంగాణా ప్రాంతంలో పోలీస్‌ పటేల్‌ (గ్రామమునసబ్‌),పట్వారీ(గ్రామకరణం), మాలీ పటేల్‌ గ్రామాధికార్లుగా వుండేవారు. మాలీ పటేళ్ళ అజమాయిషీలో గ్రామీణ సాగు నీటి వనరులుగ్రా మస్థులు సమష్టి కృషితో నిర్వహింపబడేవి.
సుపరిపాలన దృష్ట్యా వ్యవస్థలో మార్పులు
సుపరిపాలన దృష్ట్యా, ఇప్పటివరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు, మండల వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి,కానీ గ్రామాల పునర్వ వ్యవస్థీకరణ అలాగే వుండిపోయింది. ఇప్పటికీ ఎంతో పెద్ద రెవెన్యూ గ్రామాలు, వాటికి అనుబం ధంగా మజరాలు (హమ్లెట్లు) డిపాపులేటెడ్‌ మరి యు ఫారెస్టు గ్రామాల శివార్లు అలాగే వుండిపో యాయి. భూకమతాల సంఖ్య, విస్తీర్ణం దృష్ట్యా, పట్టేదార్ల వారిగా చిన్న చిన్న రెవెన్యూ గ్రామాలుగా విడగొడితే పాలనా సౌలభ్యం, పర్యవేక్షణ పటిష్టం కావటానికి వీలుపడుతుంది. గ్రామస్థాయిలో సర్వే సిబ్బంది నియామకం తెలంగాణా జిల్లాలో తక్షణా వసరం. మరీ ముఖ్యంగా రెవెన్యూ, ఫారెస్టు తగా దాల దృష్ట్యా. మజల్ని ప్రత్యేక రెవెన్యూ గ్రామాలుగా నోటిఫై చేయాల్సిన అవసరం పరిశీలనా యోగ్యం, సమాంతరంగా (పంచాయితీలవిభజన కూడా సబబుగా వుంటుంది. మేజర్‌,మైనర్‌,నోటిఫైడ్‌ అన్న బేధంలేకుండా,పరిపాలనకు అనువుగాచిన్న పంచా యితీల్ని ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసి, వాటికి మిగులు నిధులు,విధులు,తగినంత మంది సిబ్బం దిని సమకూరుస్తే సమగ్ర గ్రామీణాభివృద్ధి చేకూరు తుంది. జనాభా సాంధ్రత, పంచాయితీ విస్తీర్ణం ప్రామాణీకలుగా,చిన్న చిన్న పరిపాలనా సౌలభ్య యూనిట్లు ఈ దిశలో ఎంతో అవసరం. షెడ్యూలు కులాలు,తెగలు అవాసముంటున్న పల్లెల్ని, తండా ల్ని ప్రత్యేక గ్రామపంచాయితీలుగా ప్రకటిస్తే, పంక్తి లో చివరి వ్యక్తి వరకూ అభివృద్ధి ఫలాలు చేరాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లే. ఇప్పటికే ఈదిశలో తెలంగాణా ప్రభుత్వం చొరవతీసికోవటం ఆహ్వా నించదగ్గ పరిణామం.
అట్టడుగు ప్రజల అభివృద్ధికి వీలు
చిన్న జిల్లాలు సామాజిక పరివర్తనకు సాధనాలు కావాలి. గతంలో తెలంగాణా ప్రాంతంలో నెల కొన్న అనిశ్చిత,సాంఘిక,ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, చిన్న జిల్లాలు బడుగు, బలహీన వర్గాల ప్రయో జనాలు కాపాడటంలో అట్టడుగు ప్రజల బాగోగుల పట్ల శ్రద్ద వహించటానికి వీలవుతుంది కూడా. తనను కాపాడే ప్రభుత్వ యంత్రాంగం తన చెంతనే వుందన్న భరోసా సామాన్యుడికి ఎంతో ఊరట నిస్తుంది.అదే వరవడిని జిల్లాలో కొనసాగిస్తే మం చిది. అలాగే జిల్లా అధికార్లందరూ కేంద్ర కార్యాల యాల్లో వుండే పని చేయాల్సిన అగత్యమూ లేదు. వారి పర్యవేక్షణ, నిపుణత ఏఏమండలాల్లో కావల్సి వస్తుందో, ఆ సామీప్యంలోనే వారి హెడ్‌క్వార్టర్‌ వుంటే మంచిది. ప్రయాస, దుబారా ఖర్చులు వుం డవు. అవసరమైతే రెండు మూడు జిల్లాలకు కలిపి ఒకే అధికారిని నియమించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తే బాగు. క్షేత్రస్థాయి అనుభవం బట్టి, నేను జిల్లా అధికారిగావున్న రోజుల్లో కొన్ని శాఖల జిల్లా అధికార్ల ముఖాలు కూడా చూసివుండను. ఉదాహ రణకు, కమర్షియల్‌ ట్యాక్స్‌,రిజిస్ట్రేషన్‌, మైనింగ్‌, జియాలజి,దేవాదాయశాఖ,నీటివనరులశాఖ ప్రత్యేక డివిజన్ల అధికార్ల వునికే జనానికి ఎరుకే వుండదు.
మెరికల్లాంటి గ్రూప్‌1,2 అధికారులు
సిబ్బంది కొరత,నిపుణత లోపించటం వంటి పలు కులు పాలనావ్యవస్థలోపరిపాటి.ఎప్పుడూ వుండేదే. అవసరం వున్న శాఖల్లో సిబ్బంది కరువు. అవగా హన లేని సంస్థల్లో పనిలేక యాతన పడేవాళ్ళు ఎందరో.మరీ ముఖ్యంగా జిల్లా, డివిజన్ల స్థాయిల్లో, పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌ద్వారానియామకమైన సిబ్బం ది, అధికార్లు మెరికల్లాంటివారు. అఖిల భారతీయ సర్వీసు అధికార్లకు ఏమాత్రం తీసిపోరు కొన్ని సంద ర్భాల్లో.మరీ ముఖ్యంగా గ్రూప్‌-1,2సర్వీసు అధి కార్లు. రిక్రూట్‌ అయినప్పటినుండి అదేశాఖలో మగ్గిపోవాల్సినదుస్థితి.అలాగాకుండా ఓపదేళ్ళు ఆయాశాఖల్లో పనిచేసి నిపుణతను సంతరించుకున్న తరువాత జనరల్‌ పూల్‌లోకి లాక్కొని వారి సేవలు అన్ని శాఖలకు విస్తరింపచేస్తే మంచిది. ఆ క్రమంలోనే స్టేట్‌ ఆడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసుకు చెందిన వారిగా పరిగణించి (గతంలో హైద్రాబాద్‌ సివిల్‌ సర్వీసు, ఆంధ్రప్రదేశ్‌ ఆడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసు ల్లాగా), వాళ్ళ నుండే ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌ వంటి అఖిల భారతీయ సర్వీసులోకి ఎంపిక జరిగేలా చూడాలి. దీంతో ఒక సర్వీసు గొప్పది. మరొక సర్వీసు చిన్నది అన్న భావన తాజాగా పోతుంది.
పాలనా పద్ధతులు మారాలి
చిన్న జిల్లాల ఏర్పాటుతో పాటు పాలనా పరమైన పద్ధతులు, సంప్రదాయాలు, మ్యాన్యువల్స్‌ మార్చా ల్సిన అవసరం ప్రభుత్వం ఈపాటికే గుర్తించి వుం టుంది. ఏప్రతిపాదనలు వచ్చినా,ఏదరఖాస్తు వచ్చినా రొటీన్‌ గా ‘తగుచర్య నిమిత్తం’, పరిశీల నార్థం (ప్లీజ్‌ ఎగ్జామిన్‌) అని అంటూ విలువైన సమయాన్ని,శక్తి యుక్తుల్ని వృధా చేయరాదు. అలాగే కిందిస్థాయి నుండి నివేదికలు కోరటం కూడా తప్పే. ఉదాహరణకు ఏదరఖాస్తు దారుడైనా క్రింది స్థాయిలో పని కావటం లేదని ఫిర్యాదు చేస్తే, నా పైనా,నాపని తీరు పట్లపై అధికార్లకు కంప్లైంట్‌ చేస్తావా అని కక్షకట్టిన సందర్భాలు ఎవరివల్ల తన పని కావటం లేదో,అదే అధికారికి ఆపిర్యాదును తగు చర్య నిమిత్తం పంపటమో, నివేదిక కోరటం లో ఔన్నత్యం లేదు. ఇలాంటి సందర్భాల్లో దరఖాస్తు దారు సంబంధిత అధికార్లను సంప్ర దించినపుడు, ‘‘నన్ను కాదని పై అధికార్ల దగ్గరికి పోయావు కదా! అక్కడే నీ పని చేయించుకోపో’’ అంటూ వ్యంగంగా వ్యవహరించటం కూడా కద్దు. ఈఅడ్మినిస్ట్రేటివ్‌ పద్ధతులు అవమానీయం.ఆక్షేపణీయం.
విప్లవాత్మక సంస్థాగత మార్పులు అవసరం
తెలంగాణాలో పట్టణాల సంఖ్య అతి తక్కువ అని మనకు తెలిసిందే. ఇప్పటికే నలభై శాతం జనాభా పట్టణాల్లో నగరాల్లో నివాసమున్నట్లుగా గణాం కాలు సూచిస్తున్నాయి. రాబోయే పది సంవత్సరాల్లో జనసాంధ్రత యాభైశాతానికి మించిపోయే అంచ నాలు. ఉదాహరణకు 38ఏళ్ళ క్రితం(1978)లో ఏర్పాటైన కొత్త జిల్లా రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ వలయంగా, నాడు 6లక్షల జనాభాతో,6అసెంబ్లీ నియోజక వర్గాలతో ప్రారం భమైన జిల్లానేడు 14అసెంబ్లీ నియోజక వర్గాలతో 52లక్షలజనాభాతో మరో మహనగరానికి తెరలే పింది. అలాగే ఇప్పుడు ఏర్పాటైన కొత్త మండల, డివిజన్‌,జిల్లాకేంద్రాలురాబోయే రోజుల్లో పట్టణా కృతుల్ని సంతరించుకునే అవకాశం వుంది.
ఈ గ్రోత్‌ సెంటర్ల క్రమబద్దీకరణకు ఇప్పటి నుండే పునాదులు వెయ్యాలి. ప్రణాళికలు తయారు చేసు కోవాలి. ఈ దిశలో టౌన్‌ మరియు కంట్రీ ప్లానింగు శాఖను అన్ని గ్రామ,మండల,జిల్లా కేంద్రాల పరిధి లో విస్తరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈశాఖ రియల్‌ ఎస్టేటు, డెవల పర్లకే కాకుండ, సామాన్యప్రజానీకానికి ఉపయోగ పడేలా రూపాం తరం చెందాలి. ఈశాఖ ఆధ్వ ర్యంలో ప్రణాళిక బద్దమైన నమూనాలకు లోబడి, గ్రామ, మునిసిపల్‌, పట్టణాభివృద్ధి సంస్థలు మాస్టర్‌ ప్లాన్లు సవరించు కోవవాలి. గతంలో ఈ నమూ నాలు కాగితాలకే పరిమితం కావటం కద్దు. ఈది శలో విప్లవాత్మ కమైన సంస్థాగత మార్పులు అవ సరం. లేదంటే భవిష్యత్తులో వగచాల్సి వస్తుంది. ఇపుడు జంటనగ రాలు ఎదుర్కొంటున్న రుగ్మతులు అధిగమించాల్సిన అవసరం పట్టణీకరణ దిశలో ఎంతైనా వుంది.
తెలంగాణ జిల్లాలు పసికూనలు
రెండున్నర ఏళ్ళు కూడా నిండని పసికూనలు తెలం గాణా కొత్త జిల్లాలు. ముప్పై ఒక్క చేతులతో (జిల్లాల సంఖ్యాపరంగా) పొదివి పట్టుకొని, ఉద్యమ స్ఫూర్తి తో సాధించుకున్న రాష్ట్రాన్ని, సవరించుకుని సాదు కోవాల్సిన తరుణమిది అంటూ ప్రభుత్వాది నేత పలు సందర్భాల్లో గుర్తు చేయటం గమనార్హం. ఇటీవలే సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) వెల్లడిరచిన మానవ వనరుల అభివృద్ధి సూచికలు (హెచ్‌.డి.ఐ)గుర్తించి రాష్ట్రప్రభుత్వ పని తీరును మెరుగు పర్చాల్సి వుంటుంది. గతంలో వున్న పదిజిల్లాలో,ఏడు జిల్లాలు పారిశ్ర మీకరణలో శరవేగంగా ముందుకు దూసుకుపోతు న్నాయి. వ్యవసాయపరంగా మూడుజిల్లాలు ముందుడగులో వున్నాయి. అక్షరాస్యత,అరోగ్య పోషణాపరంగా ఇంకా సాధించాల్సింది ఎంతైనా వుంది.
ఐటీ చిరునామా రంగారెడ్డి జిల్లా
విభజించిన జిల్లాలపరంగా చూస్తే, ఐ.టి.రంగా నికి రంగారెడ్డి జిల్లా చిరునామా. పారిశ్రామికంగా మేడ్చెల్‌, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు పెద్దపీట వేయాల్సి వుంటుంది. విత్తన క్షేత్రంగా కరీంనగర్‌, సాగునీటిపరంగా ఖమ్మం నేతన్నల జిల్లాగా సిరి సిల్ల,అడవుల జిల్లాగా అదిలాబాద్‌,సాంస్కృతిక వార సత్వ జిల్లాలుగా వరంగల్‌,యాదాద్రి,భద్రాద్రి, జగి త్యాల జిల్లాలు మచ్చుకుకొన్ని. సాంస్కృతిక వారసత్వ పరంగా కూడా తెలంగాణాకు ప్రత్యేకం కృష్ణా, గోదావరి లాంటి పవిత్ర నదీమ తల్లుల నట్టనడుమ మైదాన ప్రాంతంగా ఆవరించిన గడ్డ, పాలపిట్ట, తంగేడు చెట్టు జింక ప్రభుత్వ చిహ్నలు ఈ ప్రాంతపు ఆచార, వ్యవహారాలకు ప్రతిబింబం. బతుకునే దేవతగా చేసి పూజించే పుణ్య భూమి. అదే బతు కమ్మ వేడుక.తెలంగాణాకే ప్రత్యేక ఆకర్షణ.
రచయిత: – డా.దాసరి శ్రీనివాసులు ఐ.ఎ.యస్‌., సంచారి ఉద్యమ కార్యకర్త.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-26 కొత్త జిల్లాలు

పాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని, కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన జిల్లాల విభజనలో హేతుబద్ధతలేదు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల విభజన చేయాలి. భౌగోళిక, ప్రాంతీయ సమతూకం పాటించకుండా కేవలం రాజకీయ ప్రయోజ నాలు,స్వార్థంతో విభజన చేపట్టడం సబబు కాదు.రాజకీయ స్వార్థంతో కాకుండా ప్రజల అవసరాల ఆధారంగా జిల్లాల విభజన జరగాల్సిన అవశ్యకత ఉంది.
జిల్లాల విభజనలో హేతుబద్ధత కరువు ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక చిత్ర పటం మరొకసారి మారి పోతోంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాబినెట్‌ ఆమోదించిన వెంటనే దీని పనులు శరవేగంగా సాగుతు న్నాయి. నూతన జిల్లా కేంద్రాలయాల్లో ఆఫీసులు,స్థలాలు,ఉద్యోగుల విభజన వంటి పనులు జరుగుతున్నాయి. ఉగాదినాటికి కొత్త జిల్లాలో పాలన కొనసాగాలని ప్రభుత్వం భావి స్తోంది. జిల్లా కార్యాలయాలు ప్రజల సమీ పానికి వస్తాయనేది చిన్న జిల్లాల ఏర్పాటును సమర్థించుకుంటూ ప్రచారమవు తున్న సిద్ధాం తం. దీనివల్ల పాలనాపరమయిన ప్రయోజనాలు చాలా ఉన్నాయని అంగీకరిస్తూనే ఈ ఆశయం నెరవేరే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు తీసుకువచ్చిన పరిపాలనలో గుణా త్మక మార్పేమి లేకపోవ డాన్ని చాలా మంది ఉదహరిస్తున్నారు. ఇప్పు డున్న జిల్లాల సరిహ ద్దులు చెరిపేసి ప్రజలకు అనుకూల మయిన కొత్త సరిహద్దులను సృష్టించడం వల్ల పాలన మెరుగుపడుతుందని, ఆయా ప్రాంతాల అభి వృద్ది సుగమం అవు తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. ఇది కేవలం భ్రమ అని,రాజకీయలబ్ది కోసమే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కొన్ని జిల్లాల ఏర్పాటును చూస్తే అర్థమవుతుందని చాలా మేధావులు, రాజకీయ నాయకులు చెప్పారు.
ప్రజల ముంగిట పాలన
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని పాలనా వికేంద్రీకరణగా,ప్రజల ముంగిటికి పాలన తీసుకెళ్లడంగా,పాలనా సంస్కరణగా ప్రభు త్వాలు పిలుస్తున్నాయి. ప్రజల ముంగిటికి పాలన అనేమాట 1986లో మొదట వినిపిం చింది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సరిగ్గా ఈ నినాదంతోనే ఒక శతా బ్దానికిపైగా చరిత్ర ఉన్న విశాల తాలూకాలను విడదీసి మండళ్లను ఏర్పాటు చేశారు. తాహ శీల్దార్‌ పదవికి ఉన్న హోదాను,హంగును తీసే శారు.‘పవర్‌ ఫుల్‌’ తాహశీల్దార్‌ని మండల రెవిన్యూ అధికారిగా మార్చి జనం మధ్యకు తీసుకువచ్చారు. అయితే, తర్వాత సంస్కరణలు ఆగిపోయాయి. జిల్లాను సంస్కరించే పని ఎవరూ చేయలేదు. ఇప్పుడు,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విభజన తర్వాత,ఎప్పుడో బ్రిటిష్‌ కాలం లో ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దులను చెరి పేసి చిన్న జిల్లాలను సృష్టించి కలెక్టర్‌ పదవిని కూడా జనం మధ్యకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది.ఇది సుపరిపాలనకు దారితీ స్తుందా? లేక పాలనా వ్యవస్థని ఇంకా బలహీ నం చేసి ముఖ్యమంత్రులను ఇంకా శక్తివం తులను చేస్తుందా అనేది ప్రశ్న.కలెక్టర్‌,ఎస్పీల గ్లామర్‌ తగ్గుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లా లను సృష్టించడంతో జిల్లా కలెక్టర్‌ అధికార విస్తృతి,దర్పం తగ్గిపోతాయి. కలెక్టర్లు ఇపుడు డివిజన్‌ హెడ్‌ క్వార్టర్‌ కంటే చిన్న ఊర్లలో కూర్చోవలసి వస్తుంది. ఇదే పరిస్థితి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కి కూడా ఎదురవు తుంది. ఉదాహరణకు కడప జిల్లాను విడదీసి రాయచోటి జిల్లాను సృష్టించారు. ఇది డివిజినల్‌ హెడ్‌ క్వార్టర్‌ కూడా కాదు. ఇప్పుడు ఈఊరి లో కలెక్టర్‌ ఆఫీస్‌ వస్తుంది. ఎప్పుడో గాని కన్పించని కలెక్టర్‌ని,జిల్లా ఎస్‌పీని ఈఊరి ప్రజ లు రోజూ చూస్తారు. వారితో పాటు జాయింట్‌ కలెక్టర్‌, ఎందరో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఆ చిన్న ఊర్లో రోజూ తారసప డతారు. ఇలా కొత్త జిల్లాలు ఒక వినూత్న పాలనానుభవాన్ని తీసుకువస్తున్నాయి. ‘సాధార ణంగా ప్రజల్లో ‘అబ్బో కలెక్టర్‌ ఆఫీస్‌ చాలా దూరం, కలెక్టర్‌ని కలుసుకోవడం చాలా కష్టం,’ అనే భయభావం ఉంటుంది. దీని వల్లే సాధా రణ ప్రజలకు ఈ ఆఫీసుల్లోకి వెళ్లేందుకు ఒక మధ్యవర్తి జోక్యంగాని,రాజకీయ నాయకుడి సాయంగాని అవసరమయింది,ఊరికి దూరం, ఉన్నతాధికారి అంటే ఉన్న భయభావం చిన్న జిల్లాల ఏర్పాటుతో పోయే అవకాశం ఉంది’’ ‘‘అంటే చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల పైరవీ కారుల అవసరం తగ్గే వీలుంది. అదే సమ యంలో చిన్న జిల్లాల అధికారులకు పెద్ద జిల్లాల నాటి హుంగు ఆర్భాటాలు తగ్గిపో తాయి. ఇది ఆశించదగ్గ పరిణామం’’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యుడు ప్రొఫెసర్‌ శ్రీనివాసులు అన్నారు. ఇలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన మరొక విశ్రాంత ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించారు.‘‘1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు9జిల్లాలుండేవి.ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక 1970 ఫిబ్రవరి 1న గుంటూరు,నెల్లూరు,కర్నూలు జిల్లాలోని కొన్ని తాలూకాలను కలిపి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. ఆపైన 1979 జూన్‌ 1న విజయ నగరం జిల్లా ఏర్పడిరది. అప్పటి నుంచి ఇప్పటి దాకా జనాభా పెరుగూతూ వచ్చింది. తెలం గాణ నుంచి కొన్ని మండలాలు కలవడంతో తూర్పుగోదావరి జిల్లా విస్తీర్ణం పెరిగింది. ఈ కారణాలతో కొత్తగా చిన్న జిల్లాలను సృష్టిం చడం ఒక ఆహ్వానించదగ్గ సంస్కరణ. ముఖ్యం గా గిరిజన ప్రాంతాలకు సంబంధించి కొంత మేలు జరుగుతుంది’’‘‘ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్టణం నుంచి తూర్పుగోదావరి జిల్లా జంగారెడి గూడెందాకా 500 కి.మీ పరిధి గిరిజన ప్రాంతం ఒకే ఎంపీ కింద ఉండేది. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు రెండు జిల్లాలుగా మార్చారు. జిల్లాల పరిమాణం బాగా కుంచించుకుపోతుంది. ఇదొక మంచి ప్రయోగం’’ అని ప్రొఫెసర్‌ చలం అన్నారు.
చిన్న జిల్లాల పెద్ద ఆశయం నెరువేరుతుందా?
ఆశయపరంగా చిన్న జిల్లాలను సృష్టించడం చాలా మంచి నిర్ణయం అనే విషయంలో పార్టీలతో నిమిత్తం లేకుండా అందరిలో ఏకాభిప్రాయం ఉంది. అయితే, ఈ ఆశయం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థల్లో నెరవేరుతుందా అనే దాని మీద అందరిలో అనుమానా లున్నాయి. ప్రజలకు పరిపాలన చేరువ కావడం అంటే ఏమిటి?జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని 250 కి.మీ దూరం నుంచి 100కి.మీ దూరా నికి మార్చినందున పరిపాలన దగ్గరవుతుందా? పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏమిటి? చిన్న జిల్లా ఏర్పాటు పాలనా వికేంద్రీకరణ అవుతుందా?ఈ ప్రశ్నలకు ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిన తెలంగాణలో సమా ధానం దొరకడం లేదు. రేపు ఆంధ్రలో కూడా ఇదే పరిస్థతి వస్తుంది. జిల్లాలొస్తాయి గాని, ఆశయాలు నెరవేరుతాయన్న గ్యారంటీ లేదు.1986లో తెలుగుదేశం ప్రభుత్వం ‘ప్రజల వద్దకు పాలన’అని నినాదమీయడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అప్పటికి స్మార్ట్‌ఫోన్లు లేవు. ఇంటర్నెట్‌ లేదు. మీ-సేవా కేంద్రాలు, ఇ-సేవా కేంద్రాలు లేవు.ఏదయినా సర్టిఫికేట్‌, రిజస్ట్రేషన్‌, దరఖాస్తు అవసరమయితే, ఎపుడొస్తుందో తెలియని ఆర్టీసీ ఎర్రబస్సును నమ్ముకుని తాలూకా కేంద్రానికి, జిల్లా కేంద్రా నికి వెళ్లాల్సి వచ్చేది. ఆర్టీసి బస్సు అంటే ‘రాదు, తెలియదు, చెప్పలేము’ అని నవ్వులాటగా ఉండే రోజులవి. అపుడు జిల్లా కార్యాలయానికి రావాలంటే చాలా కష్టమయ్యేది. ఇపుడా పరిస్థితి లేదు. ఒకవైపు ప్రభుత్వ కార్యాల యాలకు ప్రజలు రానవసరమేలేకుండా ఆన్‌లైన్‌ సేవలు వచ్చాయి. చాలా చోట్ల ప్రజలను కార్యాలయాల్లోకి రానీయడం లేదు. మీ-సేవా కేంద్రాలు వచ్చాయి. ఇ-సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచే దరఖాస్తు చేసు కోవచ్చు. అంతేకాదు, కొన్ని రకాలసేవలను ప్రజలు స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించి పొందుతు న్నారు. వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ పాఠశా లలు,ఆన్‌లైన్‌ వైద్యం, జూమ్‌ మీటింగులు అందుబాటులోకి వచ్చాయి. అధార్‌ కార్యాల యానికి వెళ్లకుండా ఆధార్‌ కార్డు వస్తున్నది. ఇలాగే ఇన్‌కంటాక్స్‌ ఆఫీస్‌ ముఖం చూడకుండా పాన్‌ కార్డు వస్తూ ఉంది. ఇలాంటపుడు ప్రజలు ఇంకా ప్రభుత్వకార్యాలయాలకు రావడం ఎందుకు? కొత్త జిల్లాలు ఎందుకు? కాకపోతే, ఎప్పుడో ప్రారంభమయిన ఉపప్రాం తీయ జిల్లా డిమాండ్లు ఇప్పటికీ ఉన్నాయి. భావోద్వేగం సృష్టిస్తున్నాయి. అందువల్ల కొత్త జిల్లా ఏర్పాటు కూడా, కొత్త రాష్ట్రం ఏర్పాటు లాగా రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడయితే, కొత్త జిల్లా ఏర్పాటు కేంద్రంలో ‘రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ’ తీసుకువస్తుంది.ప్రజల భావోద్వేగాలను వాడుకునేందుకు తప్ప కొత్త జిల్లాలు అదనపు ప్రయోజనం తీసుకువచ్చే అవకాశం లేదని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ‘కొత్త జిల్లాల సృష్టి అవసరమే. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు వెనక ఉన్న ఉన్నతాశయం నెరవేర్చే వనరులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా?’’ అని ఆయన ప్రశ్నించారు.‘‘ఆంధ్రప్రదేశ్‌లో ముందు చూపు లేకుండా ప్రారంభించిన అనేక పథకాలు విఫలమయ్యాయి. ప్రభుత్వం మీద ఆర్థిక భారం మోపాయి. ఉదాహరణకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బిసి)లను తెరిచారు. మూసే శారు. ఇపుడు ఉద్యోగస్థులకు జీతాలు కూడా చెల్లించే స్థితి లేదు. వాళ్ళకి పిఆర్‌సి అమలుచేయకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం చూస్తోంది. ఇలాంటపుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి దానికి కావలసిన భవనాలు, ఇతర వసతులు సమకూర్చుకు నేందుకు వ్యయం తడిసి మోపెడవుతుంది. ఈ నిధులెక్కడి నుంచి తెస్తారు?’’ ‘‘మొదట ప్రభుత్వం అనవసర వ్యయం తగ్గించి, రాబడి పెంచుకుని,కొత్త జిల్లాల గురించి ఆలోచిం చాల్సి ఉంది. అయితే, జగన్‌ ప్రభుత్వానికి ప్రజాసౌలభ్యం కంటే రాజకీయ సౌలభ్యం ముఖ్యం. ఏదో ఒక కొత్త నిర్ణయం ప్రకటించి, అసలు సమస్య నుంచి ప్రజల దృష్టి పక్కకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. కొత్త జిల్లాలందుకే తప్ప, పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకెళ్లడం కాదు’’ అని అంటు న్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు హేతుబద్ధత లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది పాలన వికేంద్రీకరణ కోసం అని, పరిపాలనను ప్రజలకు చేరువచేయడం అనే ప్రభుత్వం ప్రకటిస్తున్నా, చాలా చోట్లా అది ఆశయాన్ని దెబ్బతీసింది. ఇలాంటపుడు కొత్త జిల్లాలు కొత్త సమస్య తీసుకువస్తాయని రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్‌ ఇఎఎస్‌ శర్మ అన్నారు. ఆలోచించదగ్గ రెండు అంశాలను ఆయన పేర్కొన్నారు.1) కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల కొన్ని గిరిజన గ్రామాలకు జిల్లా హెడ్‌ క్వార్టర్లు దూరమవు తున్నాయి. ఉదాహరణకు, విశాఖపట్నం జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు నుండి అరకు కొత్త జిల్లా కేంద్రానికి రావాలంటే అక్కడి గ్రామస్థులు 5 నుండి 7 గంటలు ప్రయాణిం చవలసి ఉంది. దూరాలను తగ్గించకపోగా దాన్ని పెంచే విధంగా ఉండే పునర్వ్యవస్థీకరణ వల్ల ఉపయోగం ఉండదు. 2) కొత్త జిల్లాల కారణంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో హెడ్‌ క్వార్టర్‌ లో జన సాంద్రత పెరగడం, గిరిజనేతరులు పెద్ద ఎత్తున రావడం వలన అక్కడ గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు భంగం కలుగు తుంది. అది కాకుండా భూ బదలాయింపు నిషేధ చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు గిరిజనుల భూములను ఆక్రమించే ప్రమాదం ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఈ విషయం మీద ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ, గిరిజన గ్రామాలకు రాజ్యాంగం నుంచి సంక్రమించిన అధికారాలివ్వకుండా కొత్త జిల్లాలను సృష్టించి వికేంద్రీకరణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నిం చారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 1986లో షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ఆనుకుని, గిరిజనులు అధికంగా నివసిస్తున్న 800కు పైగా గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపిం చింది. కేంద్రం ఆ ప్రతిపాదనకు సూత్రప్రా యంగా అనుమతి తెలిపింది. ‘‘మండలాల వారీగా ఆ గ్రామాల లిస్టులను పంపించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత, ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటివి 500కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి తెలుగు రాష్ట్రాలు రెండు ఆ విష యంలో కేంద్రానికి ఇంతవరకు జవాబు ఇవ్వ కుండా ఆలస్యం చేస్తూవస్తున్నాయి. దీని వలన గిరిజనులకు అపారమైన నష్టం కలిగింది. ఈ గ్రామాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి ఉండవలసింది’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 50శాతం గిరిజన జనాభా ఉన్న మండలాలను షెడ్యూల్‌ 5లో చేర్చాలి. ‘‘ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో సరవకోట, పాతపట్నం, మెళియపుట్టి మండలాలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని గిరిజన జిల్లాలో చేర్చాలి లేదా జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఇలాగే,73వ, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అధికారాలను పంచాయతీలకు బదలాయించాలి. ఇదింత వరకు జరగలేదు. పాలన వికేంద్రీకరణ నిజం కావాలంటే అధికారాల వికేంద్రీకరణ జరిగి తీరాలి. అపుడే కొత్త జిల్లాల ఏర్పాటు ఆశయం నెరవేరుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -జి.ఎన్‌.వి.సతీష్‌

1 2